ramayapatnam port
-
బాబు ‘ప్రైవేటు’ మమకారానికి.. 3 పోర్టులు బలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడంలో మరెవరికీ సాధ్యం కాని రికార్డులను నెలకొల్పిన సీఎం చంద్రబాబు ఈ దఫా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మూడు ప్రధాన పోర్టులపై కన్నేశారు. వీటిని ప్రైవేటు పరం చేసేందుకు శర వేగంగా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఒక్కో రంగాన్ని ప్రైవేట్ పరం చేసి సీఎం చంద్రబాబు చేతులు దులుపుకొంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతున్న తరుణంలో వాటిని తన వారికి అప్పగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. 65 శాతానికి పైగా పనులు పూర్తయిన రామాయపట్నం పోర్టును, 50 శాతానికి పైగా పనులు జరిగిన మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు పిలవడం అధికార, పారిశ్రామిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అంతిమంగా ఇది న్యాయ వివాదాలకు దారి తీసి పోర్టుల నిర్మాణాలు నిలిచిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు పోర్టుల నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిధులను కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సమకూర్చింది. వివిధ బ్యాంకుల, ఆర్ధిక సంస్థల నుంచి రుణాలు తీసుకొని ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేసిన తర్వాతే పనులు ప్రారంభించారు. కాబట్టి ఇప్పుడు ఈ పోర్టుల నిర్మాణ పనులు కొనసాగించడానికి నిధుల కొరత కూడా లేదు. నిర్మాణ పనులు దాదాపు సగానికిపైగా పూర్తయి వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న తరుణంలో అసంబద్ధంగా ప్రైవేటీకరణ చేయడంలో ఎటువంటి ప్రజా ప్రయోజనాలు లేవని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే పోర్టులను ప్రైవేటీకరణ చేస్తున్నారంటే దీని వెనుక ఏదో కుంభకోణం ఉండవచ్చని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో మత్స్యకారులకు మేలు జరిగేలా, లక్షల మందికి ఉపాధి కల్పించి వలసలను నివారించేలా, మత్స్య సంపదను పెంపొందించే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన 10 ఫిషింగ్ హార్బర్లను సైతం ప్రైవేటుకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. వాణిజ్యం, ఉపాధికి ఊతమిచ్చేలా రాష్ట్రానికి ఉన్న విస్తారమైన సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధి, ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తొలిదశలో రూ.13వేల కోట్లకు పైగా వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణాన్ని గత ప్రభుత్వమే చేపట్టింది. కాకినాడ గేట్‌వే పోర్టు నిర్మాణాన్ని పీపీపీ విధానంలో చేపట్టింది. ఇవి అందుబాటులోకి రావడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తాయి. భారీ సంఖ్యలో యువతకు ఉపాధి కూడా లభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో నిర్మిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం ఉండదన్న ఉద్దేశంతో గత సర్కారు ల్యాండ్‌లార్డ్ మోడల్లో పోర్టుల నిర్మాణం చేపట్టింది. ప్రతి పోర్టుకు ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసి రుణాలు తీసుకొని వేగంగా పనులు చేపట్టింది. న్యాయ వివాదాలతో ఆగిపోయే ప్రమాదం..! ఇప్పటికే మూడు పోర్టు పనులను మూడు సంస్థలు చేస్తుండగా.. కొత్తగా తిరిగి నిర్మాణ పనుల కోసం మారిటైమ్ బోర్డు ఈవోఐ పిలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ టెండర్ల గురించి తమతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, ఓపక్క తాము పనులు చేస్తుండగా మళ్లీ టెండర్లు ఎందుకు పిలిచారో అర్థం కావడంలేదని కాంట్రాక్టు సంస్థలు వాపోతున్నాయి. నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకుండానే అప్‌గ్రెడేషన్, పోర్టు మోడర్నైజేషన్ అంటూ టెండర్లు ఎలా పిలుస్తారని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను ఎక్కడివక్కడ నిలిపేసి మొత్తం మూడు పోర్టులను ప్రైవేటు పార్టీలకు అప్పగించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఈ వ్యవహారాలను దగ్గర నుంచి గమనిస్తున్న అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పనులు చేస్తున్న సంస్థలను బెదిరించడానికి టెండరు నోటీసు ఇచ్చినట్లుగా ఉందని మరో సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలుచోట్ల భూసేకరణ వివాదాలు నడుస్తున్నాయని, పోర్టులు ప్రైవేటు పరమైతే ఇవి మరింత జటిలమై న్యాయపరమైన చిక్కులతో నిర్మాణాలు ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య నుంచి వివరణ తీసుకోవడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. గతంలో పీపీపీ విధానంలో నిర్మించిన గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం సొంతంగా పనులు చేపట్టిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్టనర్íÙప్ (పీ 4) పేరుతో అన్నింటినీ ప్రైవేటుపరం చేస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిషింగ్ హార్బర్లు ఫిషింగ్ హార్బర్లు కూడా.. మన మత్స్యకారులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లకూడదనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,500 కోట్లతో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ పది హార్బర్లు అందుబాటులోకి వస్తే 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు 4.5 లక్షల టన్నుల అదనపు మత్స్య సంపదను పెంచుకునే వెసులుబాటు కలుగుతుంది. వీటిలో ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు పూర్తి కాగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. పోర్టుల నిర్మాణం, నిర్వహణ కోసం బిడ్లు ఆహ్వానిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన టెండర్ మిగిలిన హార్బర్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మొత్తం పది పిషింగ్ హార్బర్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి నిర్వహించేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ కూటమి ప్రభుత్వం తాజాగా టెండర్లను పిలిచింది.ఒకేసారి 3 పోర్టులు చరిత్రలో తొలిసారిప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 3 పోర్టుల నిర్మాణాన్ని చేపట్టడం దేశ చరిత్రలో తొలిసారి. ఈ ఘనతను గత వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించింది. రామాయపట్నం పోర్టు పనులను అరబిందో, మచిలీపట్నం పోర్టును మెగా, మూలపేట పోర్టు నిర్మాణ పనులను విశ్వసముద్ర సంస్థలు దక్కించుకున్నాయి. రామాయపట్నం పోర్టులో బల్క్ కార్గో బెర్తు పనులు 100 శాతం పూర్తయ్యాయి. కేంద్రం నుంచి అనుమతులు వస్తే బెర్త్ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించవచ్చు. ఈ దశలో చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడిచి ప్రైవేటుకు లబ్ధి చేకూర్చేందుకు సన్నద్ధమైంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను నిర్మించి అభివృద్ధి చేసి నిర్వహించడంపై ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్ల (ఈవోఐ)ను ఆహ్వానిస్తూ ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లను పిలిచింది. నవంబర్ 4లోగా బిడ్లు దాఖలు చేయాలని టెండర్ నోటీసులో పేర్కొంది. -
తీరంలో లంగరు... భవిష్యత్తు బంగరు
సాగరమంటేనే జలనిధి...అపార మత్స్య సంపదకు పెన్నిధి... సాగర తీరాన వెలసిన రాజధానులు ఆయా రాష్ట్రాలకు ఆర్థిక సుసంపన్నతను సమకూర్చాయి..మత్స్యకారుల జీవనప్రమాణాలను పెంచాయి...వారి జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపాయి..పరిశ్రమల స్థాపనకు పునాదులు వేశాయి...ఆయా రాష్ట్రాల ఆర్థిక రూపురేఖలను మార్చేశాయి...ఈ ఆలోచనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశాఖపట్నాన్ని పాలనారాజధానిగా చేయాలన్న గొప్ప సంకల్పానికి ప్రేరేపించింది...ఇప్పటిదాకా మనం గొప్పగా చెప్పడానికి విశాఖపట్నంలోని పోర్టు ఒక్కటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రంగంలో కనిపిస్తోంది... దేశంలోనే సుదీర్ఘ తీరమున్న రెండో రాష్ట్రంగా గుర్తింపు పొందీ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు చాలా అవకాశమున్నా ...పాలించడం చేతకాని పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలన వల్ల వాటి ఏర్పాటు సాధ్యం కాలేదు...సీఎంగా జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ఆలోచించడం వల్లే ఈ రోజు నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు్ల రాష్ట్రానికి అపార సంపదనివ్వబోతున్నాయి...మత్స్యకారుల ఆర్థిక స్తోమతను పెంచబోతున్నాయి...మరెన్నో పరిశ్రమల స్థాపనకు ఈ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు వేదికలు కాబోతున్నాయి... రాష్ట్ర పురోగమనానికి ఇలాంటి ఆలోచన ఉన్న నేతలు ఉంటేనే నలుచెరగులా ప్రగతి లంగరు వేస్తుంది... సీఎం జగన్ రూపంలో రాష్ట్రానికి బంగరు భవిష్యత్తు అద్దుకుంటోంది. – చంద్రశేఖర్ మైలవరపు, సాక్షి, అమరావతి పది ఫిషింగ్ హార్బర్లు...రాష్ట్రంలోని మత్స్యకారుల సుదీర్ఘ కల సాకారమవుతోంది. ఇంతకాలం వలస కూలీలుగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లే మత్స్యకారులు ఇప్పుడు అధునాతన మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకుని చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మత్స్యకారులకు ప్రయోజనం కలి్పంచే విధంగా పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేవన్న విషయాన్ని మత్స్యకారులు ఆయన దృష్టికి తెచ్చారు.రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందంటూ మత్స్యకారులు వాపోయారు. తాను ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలోని వీరికి స్థానికంగానే ఉపాధి కల్పించే విధంగా ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హమీ మేరకు రూ.3,66.07 కోట్లతో రెండు దశల్లో పది ఫిషింగ్ హార్బర్లను, రూ.126.91 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దేశాన్ని సుసంపన్నం చేయడంలో జలధి ప్రాధాన్యం ఎనలేనిదని చైనా, సింగపూర్ వంటి దేశాలు ఏనాడో గుర్తించాయి. ఈ సత్యాన్ని గుర్తించే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను పరుగులు పెట్టించడంలో పోర్టులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అత్యంత రద్డీ ఉండే ఓడరేవుగా సింగపూర్ అగ్రస్థానంలో ఉండగా , టాప్ 15 పోర్టుల్లో 8కి పైగా పోర్టులు ఒక్క చైనాలోనే ఉన్నాయి. మన దేశంలో చెన్నై, కోల్‌కతా, ముంబైలు మెట్రోపాలిటన్ నగరాలుగా మారడంలో పోర్టులు కీలకపాత్ర పోషించాయనడంలో సందేహం లేదు.దేశంలోనే రెండో అత్యంత పొడవైన 974 కి.మీ సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త మహానగరాలుగా సృష్టించుకునే అవకాశమున్నప్పటికీ, ఆ దిశగా 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏరోజూ పట్టించుకోలేదు. అసలు ఆ ఆలోచనే ఆయనకు లేదు. 2019లో ఎన్నికల ముందు ఎటువంటి అనుమతులు లేకుండా కేవలం ప్రచారం కోసం టెంకాయలు కొట్టి చేతులు దులిపేసుకున్నాడాయన. దీనికి భిన్నంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు... ప్రతీ 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు (మినీ పోర్టు)లు, ఫిష్‌ల్యాండ్ సెంటర్లను జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టులతో పాటు పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టి రికార్డు సృష్టించింది. వీటికోసం సుమారు రూ.25,000 కోట్ల వ్యయం చేస్తుండటం అద్భుతం. రూ.3,736.14 కోట్ల వ్యయంతో రామాయపట్నం, రూ.5,155.73 కోట్లతో మచిలీపట్నం, రూ.4,361.91 కోట్లతో మూలపేట పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండగా, పీపీపీ విధానంలో కాకినాడ సెజ్‌లో గేట్‌వే పోర్టును రూ.2,123.43 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు.రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కేంద్ర కస్టమ్స్ శాఖ నుంచి అనుమతులు రాగానే తొలి నౌకను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ, గంగవరం, కాకినాడ యాంకరేజ్, కాకినాడ, రవ్వ క్యాప్టివ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టులు ఉండగా, 2025 నాటికి రాష్ట్రంలో పోర్టుల సంఖ్యను 10కి పెంచాలని జగన్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.వాణిజ్య ఎగుమతుల్లో 5వ స్థానంలో రాష్ట్రం... వాణిజ్య ఎగుమతులను పెంచడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే విధంగా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. 2019లో దేశ వాణిజ్య ఎగుమతుల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఐదేళ్లలో తీసుకున్న చర్యలతో ఐదో స్థానానికి చేరింది. 2019లో కేవలం రూ.90,000 కోట్లుగా ఉన్న వాణిజ్య ఎగుమతుల విలువ 2023–24 నాటికి రూ.1.60 లక్షల కోట్లకు పెరిగిందిపోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులు... పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కలా పారిశ్రామిక ప్రగతిని విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. కేవలం పోర్టులను నిర్మించడమే కాకుండా పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల వద్ద భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి సంబంధించి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని వేశారు.ఈ క్రమంలో తొలుత అందుబాటులోకి వస్తున్న పోర్టుకు సమీపంలో సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కుతో పాటు తెట్టు వద్ద కార్గో ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. తొలి దశలో 4,850 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయనుండగా, దీనికోసం గుడ్లూరు మండలం చేవూరులో 1312.58 ఎకరాలు, రావూరులో 951.77 ఎకరాల భూ సేకరణకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిషింగ్ హార్బర్ల వద్ద ప్రాసెసింగ్ యూనిట్లు... ఫిషింగ్ హార్బర్ల సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రగతి ఫలితంగా ప్రస్తుతం 150 మిలియన్ టన్నులుగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల సామర్థ్యం 300 మిలియన్ టన్నులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పోర్టుల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి లభించనుండటంతో పాటు వ్యాట్, జీఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరనుంది. రామాయపట్నం సమీపానే ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు.... రామాయపట్నం పోర్టు సమీపంలో ఇండోసోల్ రూ.25,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న భారీ సోలార్ ఉపకరణాల తయారీ యూనిట్ తొలి దశ పనులను పూర్తి చేసుకుని ఈ మధ్యే ఉత్పత్తిని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవాలని సీఎం జగన్ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 2030 నాటికి 10 శాతం మార్కెట్ వాటాతో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యానికి అనుగుణంగా పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఫిషింగ్ హార్బరు లేకపోవడం వల్ల బోట్లను ఒడ్డుకు చేర్చడం చాలా కష్టమయ్యేది. అమావాస్య, పౌర్ణమి సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ సమయంలో ఈ ఇబ్బంది మరింత అధికంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో బోట్లు తీరానికి తగలడం వల్ల పగిలిపోయేవి. ఇప్పుడు మచిలీపట్నంలో అత్యాధునిక వసతులతో హార్బర్ నిర్మిస్తుండటంతో బోట్లను సురక్షితంగా నిలబెట్టుకోవచ్చు. –పైకం ఆంజనేయులు, ఫైబర్ బోట్ల యజమానుల సంఘం, మచిలీపట్నంనిన్నటిదాకా కూలీలం... ఇకపై యజమానులవుతాం.రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో నెల్లూ రు, ప్రకాశం జిల్లా తీరప్రాంత మత్స్యకారులు ఇన్నాళ్లూ చెన్నై, మంగళూరు ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా పనిచేసుకునేవాళ్లం. ఇప్పుడు ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు వస్తుండటంతో అత్యాధునిక మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకుని యజమానులుగా మారే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కలి్పంచింది. ఫిషింగ్ హార్బరు, దీనికి అనుబంధంగా వచ్చే పరిశ్రమల వల్ల ఒక్క జువ్వలదిన్నెలోనే 15,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. తుపాన్లు వచ్చినా తట్టుకునే విధంగా జువ్వలదిన్నె హార్బర్‌ను నిర్మిస్తున్నారు. – కొండూరు అనిల్ బాబు, చైర్మన్, ఏపీ ఫిషరీస్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్కాఫ్) మినీపోర్టు స్థాయిలో నిర్మాణం ఇప్పటి వరకు బోట్లు నిలపడానికే సరైన సదుపాయాల్లేక ఐదారుచోట్ల ఆపేలా నానా అవస్థలు పడుతుండేవాళ్లం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తే మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలపడం నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు...ఇలా అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి.దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన 50,000 మత్స్యకార ప్రజలకు ప్రయోజనం లభిస్తుంది. ఈ స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. –ఎన్. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్, ఉప్పాడ రామాయపట్నం► ప్రాజెక్టు వ్యయంరూ.3,736.14 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం 34.04 ఎంఎంటీపీఏ ►పూర్తిస్థాయి సామర్థ్యం138.54 టన్నులు ►తొలి దశలో బెర్తులు నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 80,00 డీడబ్ల్యూటీపనులు ప్రారంభించిన తేదీ జూన్ 24, 2022 కార్యకలాపాల ప్రారంభం జనవరి, 2024 మచిలీపట్నం ►ప్రాజెక్టు వ్యయం రూ.5,156 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం 35 ఎంఎంటీపీఏ►పూర్తిస్థాయి సామర్థ్యం 116 టన్నులు ►తొలి దశలో బెర్తులు నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 80,00 డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ ఏప్రిల్ 21, 2023 కార్యకలాపాల ప్రారంభం అక్టోబర్, 2025 మూలపేట ►ప్రాజెక్టు వ్యయం : రూ.4,361.91 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం23.50 ఎంఎంటీపీఏ ►పూర్తిస్థాయి సామర్థ్యం: 83.30 టన్నులు ► తొలి దశలో బెర్తులు: నాలుగు రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం1,20,000డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ ఏప్రిల్ 18, 2023 కార్యకలాపాల ప్రారంభం అక్టోబర్, 2025 కాకినాడ గేట్ వే►ప్రాజెక్టు వ్యయం : రూ.2,123.43 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం16 ఎంఎంటీపీఏ► తొలి దశలో బెర్తులు: నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి క్రాఫ్ట్ బెర్త్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 1,20,000 డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ నవంబర్ 20, 2021 కార్యకలాపాల ప్రారంభం నవంబర్, 2024 -
ఆపరేషన్స్ కి సిద్ధమైన రామాయపట్నం ఓడరేవు
-
రామాయపట్నం పోర్టు రెడీ
-
సీఎం జగన్ సరికొత్త రికార్డ్.. ఏపీ చరిత్రలోనే..
ఏపీలో అభివృద్దే లేనట్లు విషం చిమ్ముతున్న వారికి ఇది సమాధానం. ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి మీడియా ఒక్కసారి వీటిని తిలకిస్తే ఏపీలో ప్రగతి జరుగుతుంది, లేనిది తెలుస్తుంది. కావలి సమీపంలోని రామాయపట్నం, జువ్వలదిన్నె గ్రామాల వద్దకు వెళ్లి వీరు చూస్తే కుళ్లు కుంటారేమో! లేకపోతే అందులోనూ ఏదో ఒకటి వక్రీకరించి పెడబొబ్బలు పెడతారేమో తెలియదు. రామాయపట్నం వద్ద కొత్త ఓడరేవు నిర్మాణం వేగంగా సాగుతోంది. జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ దాదాపు పూర్తి అయింది. ప్రస్తుతం ఐదు పోర్టులు ఉండగా, కొత్తగా నాలుగు ఓడరేవులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. కేవలం ఓడరేవులకే పదహారువేల కోట్ల రూపాయల వ్యయం చేస్తున్నారు. గత 70ఏళ్లలో ఏపీ చరిత్రలో ఇన్ని ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఒకేసారి ఎప్పుడూ జరగలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకుని తీర ప్రాంతంపై దృష్టి పెట్టారు. తీరం వెంబడి కార్యకలాపాలు చేపడితే ఏపీలో గ్రోత్ పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఇన్నేళ్లుగా ఏపీకి 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నా, తగు అభివృద్ది జరగడం లేదని రాసేవారం. ఇప్పుడు మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలతో ఆ పరిస్థితి మారుతోంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టుల నిర్మాణం చేపట్టారు. కాకినాడ పోర్టు తప్ప మిగిలిన వాటిని ప్రైవేటు రంగంలో సిద్దం చేస్తున్నారు. వారు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నట్లు కనిపించింది. బందరు పోర్టు నిర్మాణం కూడా చురుకుగా సాగుతోంది. కాకినాడ పోర్టు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టారు. కొత్త ఓడరేవులకు అనుసంధానంగా పరిశ్రమలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటివల్ల లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కొద్ది రోజుల క్రితం రామాయపట్నం ఓడరేవు నిర్మాణాన్ని, అలాగే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులను పరిశీలించడానికి నేను వెళ్లాను. ఫిషింగ్ హార్బర్ 95 శాతం పూర్తి అయిందని అధికారవర్గాలు తెలిపాయి. చివరి దశలో కొంత ఆర్దిక సమస్యలు ఎదురైనట్లు చెబుతున్నారు. అవి లేకుంటే ఈ పాటికి ఆపరేషన్లోకి వచ్చేది. వేలాది బోట్లు అక్కడ నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళుతుండేవి. ఇప్పటికే పలు బోట్లు అక్కడ తవ్విన బారీ చానల్ ద్వారా సముద్రంలోకి తేలికగా వెళుతున్నాయి. వారు మత్స్య సంపదను తెచ్చి అమ్మకానికి పెడుతున్నారు. మత్స్యకారులు, వ్యాపారుల సదుపాయార్దం పలు భవనాలు, స్టాక్ యార్డులు, ఇతర సదుపాయాల నిర్మాణం పూర్తి అయిపోయింది. దీనిని బహుశా కొద్ది నెలల్లోనే ఆరంభించే అవకాశం ఉంది. రామాయపట్నంలో నాన్ మేజర్ ఓడరేవు నిర్మాణం సాగుతున్న తీరును అక్కడ ఉన్న నిర్మాణ సంస్థ అధికారులు వివరించారు. రామాయపట్నం పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ దీనిని నిర్మిస్తోంది. దీని తరపున నవయుగ, అరవిందో సంస్థలు సంయుక్తంగా ఈ నిర్మాణం చేపట్టాయి. అరవిందో సంస్థ జనరల్ మేనేజర్ పెరుమాళ్, టెక్నికల్ హెడ్ సుధాకర్ రావు తదితరులు ఒక ప్రజెంటేషన్ ద్వారా పోర్టు ప్రగతిని వివరించారు. రామాయపట్నం పోర్టుకు ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే అది జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో, ప్రధాన రైల్వే మార్గంలో తెట్టు రైల్వే స్టేషన్ నుంచి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంత దగ్గరగా రవాణా సదుపాయాలు ఉన్న అతి కొద్ది పోర్టులలో ఇది ఒకటి అవుతుంది. జాతీయ రహదారిని కలపడానికి పోర్టు నుంచి ఆరు లైన్ల రోడ్డును వేస్తున్నారు. అలాగే రైల్వే లైన్ నిర్మాణం కూడా చేస్తారు. రామాయపట్నం పోర్టు వద్ద పరిశ్రమలు, ఎగుమతి వ్యాపారం నిమిత్తం సుమారు నాలుగువేల ఎకరాల భూమి కూడా గుర్తించారు. పోర్టుకోసం 850 ఎకరాల భూమి సేకరించారు. ఈ పోర్టు పనులు వేగంగా జరుగుతుండటంతో అక్కడి ప్రజలు సంతోషపడుతున్నారు. ఒక్కసారిగా తమ భూముల విలువలు పెరిగాయని వారు చెబుతున్నారు. కొన్ని పరిశ్రమలు తమకు అవసరమైన భూమిని కొనుగోలు చేస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఎన్టీఆర్, కర్నూలు, తెలంగాణలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ ,హైదరాబాద్‌లకు చెందిన వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఈ ఓడరేవు సదుపాయాలను వాడుకోగలుగుతారు. మహారాష్ట్ర, కర్నాటకలోని కొన్ని ప్రాంతాలకు కూడా ఈ రేవు ఉపయోగపడుతుంది. మొదటి దశలో 34 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణాకు ప్లాన్ చేశారు. తుది దశలో 138 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయవచ్చు. మొత్తం నాలుగు బెర్తులు నిర్మాణం చేస్తున్నారు. వీటిలో ఒకటి ఈ డిసెంబర్లో పూర్తి అవుతుందని, తొలి సరుకుల నౌక వస్తుందని నిర్మాణ సంస్థలవారు తెలిపారు. ఈ పోర్టు మొదటి దశ నిర్మాణానికి రూ.3,736 కోట్లకు పాలన అనుమతి మంజూరు కాగా, అంతర్గత బెంచ్ మార్క్ అంచనా రూ.2,647 కోట్లుగా ఉంది. ఈ బెర్తులలో రెంటిని ఇప్పటికే జేఎస్‌డబ్ల్యు, ఇండోసోల్ కంపెనీలకే ప్రత్యేకంగా కేటాయించారు. ఈ ఓడరేవులో కీలకమైన ఉత్తర, దక్షిణ బ్రేక్ వాటర్ పనులు చాలావరకు జరిగాయి. సముద్రంలోకి దక్షిణ బ్రేక్ వాటర్ 3700 మీటర్లు, ఉత్తర బ్రేక్ వాటర్ 1350 మీటర్లు ఉంటుంది. ఓడలు రావడానికి అనువుగా చానల్ తవ్వకం జోరుగా సాగుతోంది. అక్కడ నుంచి డ్రెడ్జర్ ద్వారా తీసిన మెటీరియల్‌ను పర్యావరణం దెబ్బతినకుండా సముద్రంలో నిర్ణీత దూరంలో పడవేస్తున్నారు. దక్షిణ బ్రేక్ వాటర్ వైపు 60 లక్షల మెట్రిక్ టన్నుల మెటీరియల్ తీయాల్సి ఉండగా, ఇప్పటికే 43 లక్షల మెట్రిక్ టన్నుల మెటీరియల్ తీశారు. నార్త్ బ్రేక్ వాటర్ వైపు 83 శాతం మెటీరియల్ తొలగింపు పూర్తి అయింది. అప్రోచ్ ఛానల్, ఓడలు తిరగడానికి వీలుగా 500 మీటర్ల టర్నింగ్ సర్కిల్ తయారు చేస్తున్నారు. ఒకసారి ఈ ఓడరేవు ఆపరేషన్లోకి వచ్చిందంటే దక్షిణ కోస్తాకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటికే అక్కడ కృష్ణపట్నం పోర్టు ఉండగా, ఇప్పుడు రామాయపట్నం రేవు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ముఖ చిత్రం మారిపోతుంది. తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు ఈ అభివృద్దిని ప్రొజెక్టు చేయలేవు కనుక వారి నుంచి ప్రత్యేకంగా ఆశించలేం. పైగా అసలు ఏమీ అభివృద్ది జరగడం లేదని ప్రచారం చేస్తుంటాయి. వారి భయాలను అర్థం చేసుకోవచ్చు. కానీ, ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలు ప్రస్తుతం తెలుగుదేశం కోసమే పనిచేస్తూ, ఈ అభివృద్దిని చూడడానికి ససేమిరా అంటున్నాయి. అవి కళ్లున్న కబోదులుగా మారాయి. అయినా ఇవి పూర్తి అయిన రోజున వీరు ఎంత మభ్యపెట్టాలనుకున్నా, వాస్తవ ప్రగతి ప్రజలకు అర్ధం అవుతుంది. ఎంతమంది ఇబ్బంది పెట్టినా, వ్యతిరేక ప్రచారం చేసినా ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి అభివృద్దిని మరింత చేయాలని ఆకాంక్షిద్దాం. కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
జనవరిలో రామాయపట్నం పోర్టు ప్రారంభం
సాక్షి, అమరావతి: పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని ఇందులో భాగంగా వచ్చే 4 నెలల్లో ఒక పోర్టును, నాలుగు ఫిషింగ్ హర్బర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో, ఏపీఐఐసీ వీసీ, ఎండీ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. రామాయపట్నం పోర్టులో కార్గో బెర్త్ పనుల్ని డిసెంబర్ నాటికి పూర్తిచేసి జనవరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా సుమారు రూ.20 వేలకోట్లతో నాలుగు పోర్టులు (రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ సెజ్ పోర్టు), 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆయన గురువారం నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం ఫిషింగ్ హర్బర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తొలిదశలో నిర్మాణం చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను ఈ ఏడాదిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. తొలుత జువ్వలదిన్నె, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లను ప్రారంభిస్తామన్నారు. నాలుగు పోర్టులతో పాటు వాటి పక్కనే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన చెప్పారు. -
డిసెంబర్‌కు రెడీ!
సాక్షి, అమరావతి: రామాయపట్నం పోర్టును డిసెంబర్‌కి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకనుగుణంగా పటిష్టమైన ప్రణాళికతో పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. రూ.3,736 కోట్లతో 850.79 ఎకరాల వీస్తీర్ణంలో ఏడాదికి 34.04 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రామాయపట్నం తొలి దశ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. రూ.2,634.65 కోట్ల విలువైన పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్‌ను నవయుగ–అరబిందో భాగస్వామ్య కంపెనీ చేపట్టింది. జూన్, 2022లో నిర్మాణ పనులు ప్రారంభించిన ఈ సంస్థ తొలి దశలో డిసెంబర్‌కి బల్క్ కార్గో బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం 4 బెర్తులు నిర్మిస్తుండగా అందులో 2 మల్టిపర్పస్ బెర్తులు జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా, ఒక మల్టీపర్సస్ బెర్తు ఇండోసోల్ క్యాపిటివ్ (సొంత) అవసరాలకు ప్రభుత్వం కేటాయించింది. బల్క్ కార్గో హ్యాండిల్ చేసే నాలుగో బెర్త్‌ను ఏపీ మారిటైమ్ బోర్డు నిర్వహించనుంది. పోర్టు నిర్మాణంలో కీలకమైన బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు పూర్తి కావడంతో పాటు నార్త్ బ్రేక్ వాటర్‌ను ఆనుకొని బల్క్ కార్గో బెర్త్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీనికి అదనంగా సముద్రపు ఒడ్డుపై (ఆఫ్‌షోర్) అవసరమైన కస్టమ్స్, సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేషన్ పనులతో పాటు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను చేపట్టింది. డిసెంబర్‌కి పోర్టులో వాణిజ్య పరంగా కార్యకలాపాలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారని, దీనికనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు రామాయపట్నం పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ పి.ప్రతాప్ ‘సాక్షి’కి తెలిపారు. బెర్తుల నిర్మాణంలో కీలకమైన అప్రోచ్ టెస్టెల్ నిర్మాణ పనులు 80% పూర్తయ్యాయని, పోర్టు నిర్వహణకు అవసరమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ లేఖ రాయడంతో పాటు కస్టమ్స్ కార్యకలాపాల కోసం 27.88 ఎకరాలను కేటాయించినట్లు చెప్పారు. కస్టమ్స్ నిబంధనలు అనుసరించి సరుకు నిర్వహణ చేపట్టడం, రామాయపట్నం పోర్టును ఇమ్మిగ్రేషన్ ల్యాండింగ్ పాయింటింగ్ ప్రకటించడం వంటి దానికోసం కేంద్ర సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. పోర్టు నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులు నవంబర్‌లోగా తీసుకువస్తామని తెలిపారు. మౌలిక వసతుల కల్పన పోర్టు నిర్మాణంతో పాటు పోర్టుకు అవసరమైన రహదారి, రైలు మార్గం, నీటి వసతి వంటివాటిపై ఏపీ మారిటైమ్ బోర్డు వేగంగా అడుగులు వేస్తోంది. జాతీయ రహదారి నుంచి రామాయపట్నం పోర్టును అనుసంధానిస్తూ 4 లైన్ల రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 5.5 కి.మీ పొడవైన రహదారి మార్గాన్ని కొత్తగా అభివృద్ధి చేస్తున్నారు. 5 కి.మీ రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి రైల్వేతో చర్చిస్తున్నారు. పోర్టు నిర్వహణకు అవసరమైన నీటిని కావలి వాటర్ ట్యాంక్ నుంచి వినియోగించుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. -
వడి వడిగా నీలివిప్లవం దిశగా..!
ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన సహజ వనరు లకు నిలయం. ప్రపంచంలోని చిన్న దేశాలైన సింగపూర్, మలేసియా, మారి షస్, ఐరోపా దేశాలు గొప్పగా అభి వృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఆ దేశాల్లో ఉన్న సహజ వనరులను సక్రమంగా ఉపయోగించుకోవడమే. ఆయా దేశాల స్థూల ఉత్పత్తిలో(జీడీపీ) దాదాపు 35 శాతం ఈ వనరుల ద్వారానే వస్తుంది. అలాంటి గొప్ప అవకాశం మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. 2019లో అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి మన సముద్ర తీర వనరులను వినియోగించుకొని నీలి విప్లవం సృష్టించడానికి శ్రీకారం చుట్టారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ అతి పెద్ద తీర రేఖ కలిగిన రాష్ట్రం. ఎన్నో పోర్టులను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. దీన్ని గమ నించే జగన్ ప్రభుత్వం చిన్న మధ్య తరహా పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ‘ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల విధానం 2022– 2027’ ప్రకారం అద్భుతమైన మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతీ తీర రేఖ కలిగిన జిల్లాలో ఎగుమతుల హబ్‌ని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర పరిశ్రమల విధానాల్లో సైతం ‘బ్లూ ఎకానమీ’కి సంబంధించిన అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో సైతం బ్లూ ఎకానమీ పెట్టుబడులపై ప్రధానంగా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం రామాయపట్నం పోర్టు అభివృద్ధికి సహక రిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చిన్న మధ్య తరహా పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తోంది. మేఘవరం పోర్టు (శ్రీకాకుళం), కాయప్ట్సీన్ పోర్టు (కాకినాడ), ముళ్లపేట పోర్టు (మచిలీపట్టణం), నిజాంపట్నం, వాడరేవు లాంటి పోర్టులను రూ. 30,000 కోట్లతో నిర్మిస్తుంది. వీటి ద్వారా దాదాపు 100 మిలియన్ డాలర్ల ఎగుమతుల వ్యాపారం జరగబోతోంది. కడపలోని ఉక్కు, యురేనియం; నెల్లూరులో మైకా; కోస్తా జిల్లాల నుండి అరటి, కొబ్బరి, పంచదార, పండ్లు లాంటి భారీ ఆదాయాన్ని సమకూర్చే వాటిని మన రాష్ట్రం నుండే ఎగుమతి చేయొచ్చు. కేంద్రం నిర్మిస్తున్న పారిశ్రామిక కారిడార్లలో మన రాష్ట్రంగుండా మూడు వెళ్తున్నాయి. అందులో ముఖ్యమైంది విశాఖపట్నం – చెన్నై పారిశ్రామిక కారిడార్. ఈ చిన్న మధ్య తరహా పోర్టుల అభివృద్ధి వలన విదేశీ పెట్టుబడులు పెరిగి రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. దేశంలో ఏపీ చేపల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. బ్లూ ఎకానమీలో చేపల ఉత్పత్తి, ఎగుమతులు చాలా కీలకం. కేవలం చేపల ఉత్పత్తే కాకుండా దానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. ఐరోపా దేశాల తరహాలో ఫిషింగ్ లాండింగ్ కేంద్రాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. 6 ఫిషింగ్ హార్బర్లతో వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా అభివృద్ధి చేస్తుంది. దేశంలోనే మొదటిసారిగా ౖ‘వెఎస్సాఆర్ మత్స్యకార భరోసా’ ద్వారా ప్రతి కుటుంబానికీ మత్స్యకారులు ఎవరైనా మరణిస్తే 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్రంలో అద్భుతమైన ఖనిజ సంపద ఉంది. బ్లూ ఎకానమీలో సముద్రపు ఖనిజాల వెలికితీత చాలా ముఖ్యమైన లక్ష్యం. కృష్ణ – గోదావరి బేసిన్‌లోని సహజ వాయువు, విశాఖపట్నంలో పాలి మెటాలిక్ నొడ్యూల్స్ వెలికితీతకు మంచి అవకాశాలు ఉన్నాయి. మడ అడవుల అభివృద్ధి, సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చడం వంటి విధానాలు కూడా బ్లూ ఎకానమీలో ప్రధానం. రాష్ట్రంలో పగడపు దిబ్బలు ఉన్నాయి. అరుదైన లోహాలు సము ద్రాల్లో లభ్యం అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చక్కటి ప్రణాళికలను రూపొందిస్తోంది. విద్యారంగంలో సైతం బ్లూ ఎకానమీ ద్వారా మెరైన్ ఇంజ నీరింగ్, షిప్ బిల్డింగ్, ఆఫ్ షోర్ ఇంజనీరింగ్ వంటి కోర్సులకు అధిక అవకాశం ఉంది. ఫిషింగ్ విశ్వ విద్యాలయం పూర్తయినవెంటనే ఈ రంగాల్లో విద్య అవకాశాలు విరివిగా వస్తాయి. రాష్ట్రం కర్కట రేఖ మీద ఉన్నందున మంచి సూర్యరశ్మి సముద్రంపై లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన విద్యుత్తును సముద్రాల్లో తయారు చేయాలని సంకల్పించింది. కేంద్రం ఇటీవల లక్షద్వీప్‌లో సముద్ర ఉష్ణ శక్తి ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. అదే తరహాలో మన రాష్ట్రంలో 3 సముద్రపు ఉష్ణ శక్తిప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ విధంగా బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కగా ముందుకు సాగుతోంది. వచ్చే 2030–2035 నాటికి ప్రభుత్వం తీసుకున్న విధానాల వలన రాష్ట్రంలో బ్లూ ఎకానమీ ద్వారా 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సుస్థిరత్వం సాధ్యం అవుతుందనేది ఒక అంచనా. - కన్నోజు శ్రీహర్ష, వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు -
అదిగదిగో రామాయపట్నం పోర్ట్ 851 ఎకరాల్లో కళ్ళు చెదిరేలా నిర్మాణం
-
పారిశ్రామిక నగరాల సరసన.. మూడేళ్లలో 13 భారీ పరిశ్రమలు
సాక్షి, నెల్లూరు: ఎందరో నాయకులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, కళాకారుల జన్మస్థలమైన ఉమ్మడి నెల్లూరు జిల్లా.. భవిష్యత్‌లో పెద్ద పారిశ్రామిక నగరాల సరసన చేరేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. తద్వారా భారీగా పెట్టుబడులు రావడంతోపాటు స్థానికులకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్న జిల్లా గతంలోనే ఎన్నో పరిశ్రమలకు నిలయంగా ఉండేది. ఇప్పటికే అభివృద్ధి చెందిన నాయుడుపేట, గూడూరు, తడ తదితరాలతోపాటు రామాయపట్నం పోర్టు జిల్లాకు అందివచ్చిన అవకాశంగా నిలిచింది. ఈ ప్రాంతాన్ని పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా మార్చేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. తాజాగా క్రిస్ సిటీకి గ్రీన్‌సిగ్నల్ రావడంతో మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన చేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో.. చెన్నై– విశాఖ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. గూడూరు నియోజకవర్గంలోని కోట, చిల్లకూరు మండలాల్లోని తీర ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా వేలమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (నిబ్బిక్), రాష్ట్ర పభుత్వ పరిధిలో ఉన్న ఏపీఐఐసీ సంయుక్త భాగస్వామ్యంతో ఇక్కడ సకల సదుపాయాలు సమకూర్చి పరిశ్రమలకు కేటాయిస్తారు. రానున్న మూడేళ్లలో సరికొత్త పారిశ్రామిక నగరం క్రిస్ సిటీ అందుబాటులోకి రానుంది. అందులో రూ.37,500 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రానున్నాయని అంచనా వేస్తున్నారు. టెక్స్టైల్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, ఎంఎస్ఎంఈ రంగాల పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. తొలివిడతలో ఇప్పటికే 2,500 ఎకరాలకు గానూ 2,091 ఎకరాల భూసేకరణ చేశారు. 36 నెలల కాలవ్యవధిలో మౌలిక వసతులు కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ 50 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అందుకోసం 2022 మే 10వ తేదీన పర్యావరణ అనుమతులు లభించాయి. కండలేరు ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా అనుమతులు సైతం పూర్తయ్యాయి. ►కొడవలూరు మండలం బొడ్డువారిపాళెంలో నాల్కో–మిథానీ సంయుక్త సంస్థ ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్ ఆధ్వర్యంలో అల్యూ మినియం పరిశ్రమ 110 ఎకరాల్లో ఏర్పాటు కానుంది. అందుకు రూ.6 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. ఇప్పటికే భూ సేకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇది ఏర్పాటైతే 2 వేల మందికి ప్రత్యక్షంగా, మరో పదివేల మందికి పరోక్షంగా ఉపాధి ఉంటుంది. ►సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం క్రిబ్కో ఎరువుల కర్మాగారాన్ని 290 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. రూ.2 వేల కోట్లతో నెలకొల్పి రెండువేల మందికి ఉపాధి కల్పించనున్నారు. శరవేగంగా రామాయపట్నం పోర్టు పనులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రస్తుతం జెట్స్పీడ్తో సాగుతున్నాయి. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రావూరు పంచాయతీ పరిధిలోని మొండివారిపాళెం, ఆవులవారిపాళెం, సాలిపేట పంచాయతీ పరిధిలోని కర్లపాళెం గ్రామాల పరిధిలో ఉన్న సముద్ర తీర ప్రాంతం వద్ద పోర్టు నిర్మాణానికి 850 ఎకరాల భూములను సేకరించి కేటాయించారు. రూ.3,736 కోట్ల ఖర్చుతో చేపట్టిన మొదటిదశలో నాలుగు బెర్తుల నిర్మిస్తారు. ప్రస్తుతం నార్త్, సౌత్ బ్రేక్‌వాటర్ ఫీడర్ల నిర్మాణ పనులతోపాటు, బెర్తు నిర్మాణ ప్రాంతంలో సముద్ర లోతును పెంచే డ్రెజ్జింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం నాలుగు బెర్తులు నిర్మించి 25 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేయాలన్న లక్ష్యంతో మొదటిదశ పనులు చేపట్టారు. అనంతర క్రమంలో దీన్ని పది బెర్తులకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. మొదటి దశ పనులు పూర్తయితే 3 నుంచి 4 వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా పెద్దఎత్తున అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెట్టు వద్ద రైల్వేస్టేషన్ ఉండడంతోపాటు, చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి పోర్టు సమీపం నుంచే వెళ్తుంది. పోర్టుకు అనుబంధంగా తెట్టు వద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రతిపాదించారు. దీనికి గానూ జాతీయ రహదారిపై ఉన్న తెట్టు జంక్షన్ నుంచి గుడ్లూరు వైపు వెళ్లే మార్గంలో తెట్టు–శాంతినగర్ మధ్యలో 2,024 ఎకరాల భూములను పరిశీలిస్తున్నారు. మరోవైపు గుడ్లూరు మండలంలోని రావూరు, చేవూరు గ్రామాల పరిధిలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దాదాపు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో సోలార్ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమను ఇక్కడ నెలకొల్పనున్నారు. మూడేళ్లలో 13 భారీ పరిశ్రమలు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు మరింతగా ప్రోత్సాహం అందించారు. పరిశ్రమల శాఖామంత్రిగా దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి చొరవతో గత మూడేళ్లలోనే 13 భారీ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. రూ.1,806.72 కోట్లతో ఏర్పాటైన వీటిలో సుమారు 1,780 మంది ఉపాధి పొందుతున్నారు. ఇంకా 2,568 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు రూ.1,785.54 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటై 18,031 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. జిల్లాలో అపార అవకాశాలు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అపార అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఎందరో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. గత మూడేళ్లలోనే మెగా, భారీ ప్రాజెక్టు లు ఏర్పాటు చేసి వేలాదిమందికి ఉపాధి కల్పించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మిథానీ, క్రిబ్కో వంటి భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. పోర్టుల పరిధిలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నాం. – జి.ప్రసాద్, పరిశ్రమల శాఖ జీఎం, నెల్లూరు వైఎస్సార్ హయాంలోనే శ్రీకారం ఆసియాలోని అతి పెద్దదైన కృష్ణపట్నం ఓడరేవును 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించారు. 14 బెర్తులతో ఏర్పాటైన ఈ పోర్టు 2014–15లోనే రూ.1,800 కోట్ల వార్షికాదాయం ఆర్జించింది. ఆ పోర్టుకు అనుబంధంగా ఏడు పామాయిల్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. బొగ్గు దిగుమతి అవకాశాలు మెరుగవడంతో ఏపీ జెన్కో పవర్ ప్లాంట్లను రెండు దశలుగా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సుమారు 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుకు అవకాశం రావటంతో తడ మండలం మాంబట్టు, ఉమ్మడి నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య శ్రీసిటీ, నాయుడుపేట వద్ద మేనకూరు సెజ్‌లను అప్పట్లోనే ఏర్పాటు చేశారు. శ్రీసిటీలో 300 పరిశ్రమలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం సుమారు లక్షమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో లక్షమందికి పైగా ఉపాధి పొందుతున్నారు. మాంబట్టు సెజ్‌లో 20 పరిశ్రమల వరకు ఏర్పాటు చేయగా పదివేల మంది ప్రత్యక్షంగా, మరో 15 వేల మంది పరోక్షంగా, మేనకూరు సెజ్‌లో 29 పరిశ్రమలు ఏర్పాటుకాగా దాదాపు 15 వేల మంది ప్రత్యక్షంగా, 10 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. -
రాష్ట్రానికి మణిహారం రామాయపట్నం పోర్టు
గుడ్లూరు(పీఎస్ఆర్ నెల్లూరు): అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టు రాష్ట్రానికే మణి హారం అవుతుందని కలెక్టరు కేవీఎన్ చక్రధర్‌బాబు అన్నారు. మండలంలోని రామాయపట్నం పోర్టు భూ నిర్వాసితులకు పునరావాస సహాయ కార్యక్రమాల్లో భాగంగా తెట్టు–రామాయపట్నం గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్మిస్తున్న గృహాలకు శనివారం కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి, జేసీ కూర్మనాథ్, సబ్ కలెక్టర్ శోభికతో కలిసి కలెక్టర్ భూమి పూజలు చేశారు. అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోర్టు ఏర్పాటుకు భూములిచ్చిన కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండి మెరుగైన పునరావాస వసతులు కల్పిస్తామన్నారు. రామాయపట్నం పోర్టు వ్యవసాయ, మైనింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు అనుకూలంగా ఉండడమే కాక నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు విరివిగా లభిస్తాయన్నారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ముడి సరుకులను ఈ పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులు చేయవచ్చన్నారు. జిల్లాలో ఒక వైపు కృష్ణపట్నం మరో వైపు రామాపట్నం పోర్టు ఏర్పాటుతో పారిశ్రామికంగా జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందన్నారు. పోర్టు కోసం భూములు ఇచ్చిన మొండివారిపాళెం, ఆవుల వారిపాళెం, కర్లపాళెం గ్రామాల ప్రజల సహకారం మరువలేనిదన్నారు. ఈ మూడు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ఆర్‌అండ్‌అర్ ప్యాకేజీ, నష్ట పరిహారం అందిస్తున్నామన్నారు. ముందుగా మొండివారిపాళెం వారికి 111 గృహాలు మంజూరయ్యాయని, అందురూ ఇళ్లు నిర్మించుకుని త్వరగా గృహ ప్రవేశాలు చేయాలన్నారు. 2023 డిసెంబర్ నాటికి మొదటి దశ పూర్తి 850 ఎకరాల్లో చేపట్టిన పోర్టు నిర్మాణ పనులు మొదటి దశ 2023 డిసెంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి చెప్పారు. పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన ప్రజలు గొప్పదార్శకులని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం మాదిరిగా శంకుస్థాపనతో సరి పెట్టకుండా ముందుగానే అన్ని రకాల అనుమతులు, నిధులు సమకూర్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జూలై 20న భూమి చేశారని అప్పటి నుంచి అరబిందో కంపెనీ, మారిటైం బోర్డులు ఆధ్వర్వంలో పనులు నిర్విరామంగా జరుగుతున్నాయన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ప్రలోభాలకు గురి చేసినా నీతి నిజాయితీ ఉన్న మత్స్యకారులు వాటిని తిరస్కరించి ప్రభుత్వంపై నమ్మకంతో పోర్టుకు ఈ ప్రాంత సమగ్రాభావృద్ధికి తమ భూములను అందించారన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టరు, సబ్ కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని నాలుగు నెలల వ్యవధిలోనే ఆర్అండ్ఆర్ కాలనీకి భూసేకరణ ప్రకియ వేగంగా చేపట్టాన్నారు. శంకుస్థాపన, ప్యాకేజీలు ఇచ్చి ఈ ప్రాంత ప్రజలకు నచ్చినట్లు గృహాలు నిర్మించుకునేలా సంపూర్ణ స్వేచ్ఛను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. జేసీ కూర్మనాథ్ మాట్లాడుతూ అత్యంత వేగంగా రామాయపట్నం పోర్టు పునరావాస ప్రక్రియను చేపట్టామని గతంలో ఎక్కడా కూడా ఇంత వేగంగా చేపట్టిన దాఖలాలు లేవన్నారు. అనంతరం మొండివారిపాళెంకు చెందిన 111 కుటుంబాలకు రూ.22.49 కోట్లు నష్ట పరిహార చెక్కులు, ఇంటి నివేశ స్థలాల చెక్కులు కలెక్టర్, ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. కాలనీలో రామాలయ నిర్మాణానికి కాపులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రామాయపట్నం పోర్టు ఎంపీ ప్రతాప్‌రెడ్డి, లైజనింగ్ ఆఫీసర్ ఐ.వెంకటేశ్వరరెడ్డి, అరబిందో సంస్థ ప్రతినిధి భీముడు, జనరల్ మేనేజరు ఎంఎల్ నరసింహారావు, ఎంపీపీ పులి రమేష్, జెడ్పీటీసీ కొర్శిపాటి బాపిరెడ్డి, తహసీల్దార్లు లావణ్య, సీతారామయ్య, సర్పంచ్‌లు గంగమ్మ, రమణయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, గ్రామ కాపు పోలయ్య, అధికారులు, నిర్వాసిత గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
రామాయపట్నం 'రయ్.. రయ్'
రామాయపట్నం పోర్టు నుంచి చంద్రశేఖర్ మైలవరపు, సాక్షి ప్రతినిధి: ఎక్కడైనా ఓ అభివృద్ధి పథకం కోసమో.. లేక ప్రాజెక్టు కోసమో ప్రభుత్వం భూ సేకరణకు దిగిందంటే ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు పెల్లుబుకుతుంటాయి. అయితే రామాయపట్నం పోర్టు నిర్మాణం విషయంలో మాత్రం అందుకు విరుద్దంగా స్థానికులే ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. పరిహారం, పునరావాసం విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న మానవతా దృక్ఫథ విధానం వల్లే స్థానిక గ్రామాల నుంచి పూర్తి మద్దతు వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ పోర్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. జూలై 20న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఒక్క రోజు కూడా విరామం లేకుండా రేయింబవళ్లు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పైలాన్ ఆవిష్కరించి వెళ్లిపోయిందని, అయితే ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన రోజు నుంచే పనులు ప్రారంభించిందని ప్రశంసిస్తున్నారు. రామాయపట్నం పోర్టు రాక వల్ల తమ ప్రాంతం అభివృద్ధి కానుండటంతో సంతోషంగా తమ గ్రామాలను ఖాళీ చేయడానికి గ్రామస్తులు ముందుకు వస్తున్నారు. భూ సేకరణ దగ్గర నుంచి పునరావాస ప్యాకేజీ వరకు ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరించిందని, దీంతో గ్రామాలను ఖాళీ చేయడానికి అంగీకరిస్తున్నామని మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం గ్రామస్తులు ‘సాక్షి’కి వివరించారు. ప్రభుత్వం పోర్టు కోసం 850 ఎకరాలు సేకరించి, నష్ట పరిహారం కింద రూ.89 కోట్లు చెల్లించింది. ఇప్పుడు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో మూడు గ్రామాలను ఖాళీ చేయించడంపై దృష్టి సారించింది. మూడు గ్రామాలకు తోడు సమీపంలోని సాలిపేట గ్రామం వద్ద ఉన్న 25 కుటుంబాలతో కలిపి మొత్తం 594 కుటుంబాలను ఖాళీ చేయించనున్నారు. తొలి దశలో మొండివారిపాలెం, ఆవులవారిపాలెంకు చెందిన 220 కుటుంబాలకు మంగళవారం నుంచి పరిహారం చెక్కుల పంపిణీ ప్రారంభించనున్నారు. పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.9.96 లక్షలు, 5 సెంట్ల భూమిని ఇవ్వనుంది. ఒక కుటుంబంలో 18 ఏళ్లు నిండిన ఆడ లేదా మగ పిల్లలు ఉన్నా, లేక పెద్ద వయసుఉన్న తల్లిదండ్రులు ఉన్నా.. వారిని వేరే కుటుంబాలుగా లెక్కించి పరిహారం అందించడాన్ని గ్రామస్తులు స్వాగతిస్తున్నారు. ఈ విధంగా 594 ఇళ్లకు గాను సుమారు 675 కుటుంబాలుగా పరిగణించి, పునరావాస ప్యాకేజీ అందిస్తున్నారు. ఇంటి విస్తీర్ణం ప్రకారం విలువ లెక్కించి మార్కెట్ విలువ కంటే రెట్టింపు పరిహారం ఇస్తున్నారు. పునరావాస ప్యాకేజీ కింద రూ.160 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. సర్కారు పెద్ద మనసు.. ► తాజాగా 3 గ్రామాలకు చెందిన 594 ఇళ్లు ఖాళీ చేయిస్తున్న అధికారులు ► వీరికి తెట్టుగ్రామం వద్ద 23 ఎకరాల్లో 675 ప్లాట్ల కేటాయింపు ► మేజర్ పిల్లలు, వృద్ధులు ఉంటే వేరే కుటుంబంగా పరిగణన ► రూ.19 కోట్లతో పాఠశాల, ఆస్పత్రి, రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పన ► ఒక్కో కుటుంబానికి రూ.9.96 లక్షలు చొప్పున పునరావాస ప్యాకేజీ ► ఇప్పుడున్న ఇంటి విస్తీర్ణం విలువ మదింపు చేసి రెట్టింపు పరిహారం 23 ఎకరాల్లో పునరావాస గ్రామ నిర్మాణం రామాయపట్నం పోర్టుకు సమీపంలోని తెంటు గ్రామం వద్ద ప్రభుత్వం 23 ఎకరాల్లో పునరావాస గ్రామాన్ని అభివృద్ధి చేస్తోంది. ప్రతి కుటుంబానికి 5 సెంట్ల భూమి చొప్పున 675 మందికి కేటాయిస్తూ.. ఇందుకు అనుగుణంగా రహదారులు, విద్యుత్, తాగునీరు, మురుగు నీటి సరఫరా వంటి మౌలిక సౌకర్యాలు కల్పిస్తోంది. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాల, వైద్యశాల, కమ్యూనిటీ భవనాలు వంటి అన్ని సదుపాయాలు ఉండేలా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోంది. కేవలం మౌలిక వసతుల కల్పనకే రూ.19 కోట్లు వ్యయం చేస్తోంది. ఇప్పటికే 23 ఎకరాలను చదును చేసి, ప్లాట్లుగా విభజించే కార్యక్రమం మొదలు పెట్టారు. గ్రామస్తులు తామే ఇంటిని నిర్మించుకుంటామని చెప్పడంతో ఆ విధంగా పునరావాస ప్యాకేజీ అందిస్తున్నామని, రెండు గ్రామాల ప్రజలు దీనికి అంగీకరిస్తూ సంతకాలు చేసినట్లు రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. రూ.3,600 కోట్లతో పోర్టు అభివృద్ధి సుమారు రూ.3,600 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు తొలి దశలో నాలుగు బెర్తుల నిర్మాణానికి సంబంధించి రూ.2,634 కోట్ల విలువైన పనుల కోసం అరబిందో నవయుగ గ్రూపు భాగస్వామ్య కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఇందులో ఒకటి కేవలం బొగ్గు దిగుమతికి సంబంధించిన కోల్ బెర్తు కాగా, మిగతా మూడు మల్టీమోడల్ బెర్తులు. ఇప్పటికే 850 ఎకరాల భూమిలోని చెరువులను పూడ్చి చదును చేయడంతో పాటు, పోర్టులో కీలకమైన బ్రేక్ వాటర్ పనులు చేపట్టారు. ఉత్తర, దక్షిణాలకు చెందిన బ్రేక్ వాటర్ పనులు అర కిలోమీటరు పైగానే పూర్తయ్యాయి. త్వరలో డ్రెడ్జింగ్‌తో పాటు, భవన నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టు ఆథారిత పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా కొత్తగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వం వలే శంకుస్థాపనలకు పరిమితం కాకుండా, రామాయపట్నం పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పోర్టుకు ఆనుకొనే రూ.43,000 కోట్లతో ఇండోసోల్ భారీ సోలార్ విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. త్వరలోనే మచిలీపట్నం, భావనపాడు పోర్టు పనులు కూడా ప్రారంభిస్తాం. – గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ మంత్రి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి తొలిషిప్ నిర్దేశిత లక్ష్యం కంటే ముందుగానే పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2023 డిసెంబర్ నాటికి తొలి ఓడను రామాయపట్నం పోర్టుకు తీసుకొస్తాం. తొలి దశలో నాలుగు బెర్తులకు అదనంగా మరో క్యాపిటివ్ బెర్త్ నిర్మాణం కోసం చర్చలు జరుగుతున్నాయి. వర్షాకాలం ముగియడంతో పనుల్లో వేగం మరింత పెంచుతాం. – ప్రతాప్ రెడ్డి, ఎండీ, రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ గత ప్రభుత్వం సర్వే కూడా చేయలేదు గత ప్రభుత్వం ఎన్నికల ముందు రామాయపట్నం పోర్టు పైలాన్ ఆవిష్కరించి వెళ్లిపోయింది. ఏ ఒక్క అనుమతి రాలేదు. సర్వే కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం పర్యావరణ అనుమతులతో సహా అన్ని తెచ్చి, భూ పరిహారం ఇచ్చిన తర్వాత పనులు ప్రారంభించింది. గత మూడు నెలలుగా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అనేక మంది స్థానికులకు ఉపాధి లభిస్తోంది. పోర్టు ప్రారంభమైన తర్వాత విద్యార్హతలను బట్టి 50 శాతం ఉద్యోగాలు స్థానిక గ్రామ ప్రజలకే ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ బాగా ఇవ్వడం వల్లే గ్రామాన్ని ఖాళీ చేయడానికి అంగీకరించాం. – కొల్లూరి సుధాకర్, స్థానిక రైతు, మొండివారిపాలెం కొంచెం బాధ.. అంతకంటే ఎక్కువ సంతోషం నాలుగు తరాలుగా ఇక్కడే ఉంటున్నా. గతంలో తుపాను సమయంలో ఇండ్లు కూలిపోతే రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారు. అటువంటి గ్రామాన్ని ఖాళీ చేయాలంటే కొంచెం బాధగా ఉన్నప్పటికీ, ఈ పోర్టు వల్ల అందరం అభివృద్ధి చెందుతామని రెట్టింపు ఆనందంగా ఉన్నాం. చివరి రోజు గ్రామస్తులందరం రాములోరి సంబరం చేసుకొని కళశం తీసుకొని తెంటు గ్రామానికి వెళ్లిపోతాం. – పోలయ్య, గ్రామపెద్ద, మొండివారిపాలెం -
భూమి పూజ చేసిన ప్రాంతాన్ని పాలతో శుద్ధి చేసిన గ్రామస్తులు
-
CM YS Jagan: పోర్టులతో విస్తృత ఉపాధి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వల్ల ఆయా ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు తొలి దశ నిర్మాణ పనులకు బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. అటు వైపు చెన్నై, ఇటు వైపు విశాఖపట్నం, మరో వైపు ముంబై, కోల్‌కతా.. ఇలా ఏ నగరమైనా పెద్ద నగరంగా, మహా నగరంగా ఎదిగిందంటే.. అక్కడ పోర్టు ఉండడమే కారణం అని అన్నారు. దీన్ని దేవుడు ఇచ్చిన వరంగా భావించాలని, పోర్టు రావడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని.. తద్వారా ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయన్నారు. జల రవాణా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఎగుమతి, దిగుమతులు వేగవంతం అవుతాయని చెప్పారు. తద్వారా రాష్ట్రానికి పలు విధాలా మేలు జరగడమే కాకుండా.. ఆయా ప్రాంతాల రూపురేఖలు మారతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ►రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చినా, అందులో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఏకంగా చట్టమే తీసుకొచ్చిన ప్రభుత్వం మనది. దీని ఆధారంగా పోర్టులు కానీ, దీనికి అనుసంధానంగా వచ్చిన పరిశ్రమలు కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే అన్ని పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఈ ప్రాంతం వారికి మేలు జరగడంతో పాటు రాష్ట్రానికి కూడా ఊతం వస్తుంది. ►రాష్ట్రంలో కృష్ణపట్నం, కాకినాడలో 3, విశాఖపట్నం, గంగవరం ప్రాంతాల్లో పోర్టులు ఉన్నాయి. వీటిలో విశాఖపట్నం పోర్టు 70 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగి ఉంటే, మిగిలిన పోర్టుల కెపాసిటీ 158 మిలియన్ టన్నులు. రామాయపట్నం పోర్టు నమూనాను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కొత్తగా 4 పోర్టులు.. 9 ఫిషింగ్ హార్బర్లు ►స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు కేవలం 6 పోర్టులుంటే.. మనం ఏకంగా మరో 4 పోర్టులను అదనంగా నిర్మించబోతున్నాం. అంటే ఈ ఐదేళ్లలో మరో 4 పోర్టులు.. భావనపాడు, కాకినాడ గేట్‌వే పోర్టు, మచిలీపట్నం, రామాయపట్నం రానున్నాయి. వీటి ద్వారా మరో 100 మిలియన్ టన్నుల కెపాసిటీ వస్తుంది. ►ఈ నాలుగు పోర్టులతో పాటు రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు.. బుడగట్లపాలెం, పూడిమడక, ఉప్పాడ, బియ్యపుతిప్ప, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కొత్తపట్నం, జువ్వలదిన్నె నిర్మాణం జరుగుతోంది. పోర్టులకు సంబధించిన నిర్మాణ పనులు ఈ రోజు నుంచి వేగవంతం అవుతున్నాయి. మరో రెండు నెలల తిరక్కమునుపే మిగిలిన పోర్టులకు కూడా భూమి పూజ చేసి పనులు వేగవంతం చేస్తాం. లక్ష మంది గంగపుత్రులకు ఉపాధి ►రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, పోర్టు కానీ కనిపించేలా రాష్ట్రంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. 9 ఫిషింగ్ హార్బర్లు పూర్తయితే.. వీటి ద్వారా లక్ష మంది మత్స్యకార కుటుంబాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గుజరాత్ వంటి ప్రాంతాలకో, మరెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ►కాకినాడ, మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల్లో నేరుగా ఒక్కో దాంట్లో కనీసం 3 – 4 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. మొత్తంగా లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలకు నాంది పలుకుతున్నాం. నాడు అంతా మోసం.. ►2019 ఏప్రిల్‌లో ఎన్నికలకు ముందు.. ఫిబ్రవరిలో అప్పటి పాలకుడు చంద్రబాబు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశారు. డీపీఆర్, భూసేకరణ లేకుండా ప్రజలను మోసం చేయాడానికి ఆ రోజు టెంకాయ కొట్టిపోయారు. ఐదేళ్ల పాటు ఏమీ చేయకుండా, ఎన్నికలకు రెండు నెలల ముందు శంకుస్థాపన అంటే ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడమే. ఇంతకన్నా అన్యాయం, మోసం ఎక్కడైనా ఉంటుందా? ►రుణ మాఫీ అంటూ రైతులు, అక్కచెల్లెమ్మలను.. ఉద్యోగాలంటూ చదువుకుంటున్న పిల్లలనూ మోసం చేశారు. ఏకంగా ప్రాంతాలను కూడా మోసం చేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ రూ.3,743 కోట్లతో రామాయపట్నం ►రామాయపట్నం పోర్టు కోసం 850 ఎకరాల భూమి సేకరించి, రూ.3,743 కోట్లతో పనులకు ఇవాళ భూమి పూజ చేస్తున్నాం. ఈ పోర్టు ద్వారా 4 బెర్తులు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. మరో 6 బెర్తుల నిర్మాణానికి ఇదే ఇన్ఫ్రాస్చ్రక్టర్ సరిపోతుంది. ఒక్కోదానికి రూ.200 కోట్ల పెట్టుబడి పెడితే మిగిలిన ఆరు బెర్తులు కూడా అందుబాటులోకి వస్తాయి. ►ఇప్పుడు నిర్మిస్తున్న 4 బెర్తుల ద్వారా 25 మిలియ¯న్ టన్నుల కార్గో రవాణా చేసే సామర్థ్యం లభిస్తుంది. మరో రూ.1200 కోట్లు పెట్టుబడి పెడితే.. ఏకంగా 50 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేయవచ్చు. మన పిల్లలకు మంచి రోజులు ►ఈ ప్రాంతంలో పోర్టు రావడానికి సహకరించిన మొండివానిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం, రావూరు, చేవూరు, సాలిపేట గ్రామస్తులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఈ అడుగులు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. రాబోయే దశాబ్ద కాలంలో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి. మన పిల్లలందరూ ఎక్కడికెక్కడికో వెళ్లి ఉద్యోగాలు వెదుక్కునే అవకాశం లేకుండా.. మన గ్రామాల నుంచే హోం టు వర్క్ రీతిలో పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. ►ఈ పోర్టుకు అనుసంధానంగా ఒక పారిశ్రామిక కారిడార్ కూడా వస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ అభివృద్ధి కనిపిస్తుందని కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చే అవకాశాలు పెరుగుతాయని అన్నారు. పక్కనే ఉన్న కావలి నియోజకవర్గంలో రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇండస్ట్రియల్ కారిడార్ నెలకొల్పాలని అడిగారు. అది మంచి ఆలోచనే. రాబోయే రోజుల్లో ఇందుకు సంబంధించి అడుగులు ముందుకు వేస్తాం. రామాయపట్నం పోర్టు భూమిపూజ సందర్భంగా ముఖ్యమంత్రి బహిరంగసభకు హాజరైన నిర్వాసితులు, మత్స్యకారులు, ప్రజలు ►మంచి పోర్టు వచ్చి ఇక్కడ పరిస్థితులు మారుతున్నప్పుడు.. కందుకూరు పట్టణం పెద్ద హబ్‌గా తయారవుతుంది. అందువల్ల బైపాస్ రోడ్డు కోసం 6.2 కిలోమీటర్ల మేర భూసేకరణ చేయాలని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కోరారు. భూసేకరణ కోసం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నాం. కందుకూరు మున్సిపాల్టీ అభివృద్ధి కోసం కూడా సహకరిస్తాం. ►రాళ్లపాడు ఎడమ కాలువ విస్తరణకు సంబంధించి 8,500 ఎకరాలకు నీళ్లందించే పనుల కోసం మరో రూ.27 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఉలవపాడు మండలంలోని కారేడులో పీహెచ్‌సీకి శాశ్వత భవనం మంజూరు చేస్తున్నాం. ►ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీదా మస్తాన్‌రావు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మానుగుంట మహీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి, డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి, మధుసూదన్ యాదవ్, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జెడ్పీ చైర్పర్సన్లు బూచేపల్లి వెంకాయమ్మ, ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికల వలవన్, డీఐజీ త్రివిక్రమ్ వర్మ, రామాయపట్నం పోర్టు అథారిటీ ఎండీ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చరిత్రాత్మకం ఈ రోజు ఒక చరిత్రాత్మక రోజు. 974 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని వినియోగించుకుని రాష్ట్రానికి ఆర్థిక పురోగతి తీసుకురావాలని, మారిటైమ్ బోర్డు ద్వారా రూ.15 వేల కోట్లు ఖర్చు పెట్టాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఇదివరకు ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు నిర్మిస్తున్నారు. తద్వారా పారిశ్రామిక రంగం మరింత బలోపేతం అయ్యేలా అడుగులు పడుతున్నాయి. అదే చంద్రబాబు హయాంలో హడావుడి తప్ప ఏమీ ఉండదు. నాలుగు ఇటుకలు, ఒక తాపీ మేస్త్రిని తీసుకెళ్లి ఎక్కడపడితే అక్కడ శంకుస్థాపనలు చేశారు. తర్వాత వాటిని మరిచిపోయారు. ఏ ప్రాజెక్టు అయినా సీఎం జగన్ అన్ని అనుమతులతో ముందుకు వెళతారు. - గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మా కల నెరవేరిందన్నా.. అన్నా.. పోర్టు అనేది మాకందరికీ ఒక కల. ఎప్పటి నుంచో పోర్టు వస్తుందన్నారు కానీ రాలేదు. ఈ రోజు అది సాకారం అవుతోంది. ఇక్కడ 75 శాతం స్థానికులకే ఉద్యోగావకాశాలు ఇస్తామన్నందుకు చాలా సంతోషంగా ఉంది. పోర్టుకు మా భూమి ఒక ఎకరా ఇచ్చాం. దానికి రూ.15 లక్షలు ఇచ్చారు. మీకు ఎంతో రుణపడి ఉంటామన్నా. మేమంతా మత్స్యకార కుటుంబాలకు చెందిన వాళ్లం. మమ్మల్ని మీరు ఎన్నో పథకాల ద్వారా అన్ని విధాలా ఆదుకుంటున్నారు. మీరు పది కాలాల పాటు సీఎంగా ఉండాలి. - సుజాత, మెండివారిపాలెం ఈ ప్రాంతంలో పెద్ద పండుగ ఈ రోజు ఈ ప్రాంతానికి పెద్ద పండుగ. పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేసిన మీకు (సీఎం) మత్స్యకారుల తరఫున ధన్యవాదాలు. మా కష్టం గుర్తించి, మాకు అన్నీ అందేలా చేస్తున్నారు. ఇప్పుడు స్పాట్లోనే డీజిల్ సబ్సిడీ ఇస్తున్నారు. వేట సమయంలో మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రామాయపట్నం పోర్టు నిర్మిస్తున్నారు. ఎన్నో పథకాల ద్వారా అందరినీ ఆదుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతలు. - ఆవల జయరామ్, ఉలవపాడు -
కల సాకారం దిశగా.. రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ భూమిపూజ (ఫొటోలు)
-
రామాయపట్నం పోర్టుతో ఎంతో ప్రయోజనం ఉంది
-
పోర్టు రావడం సంతోషంగా ఉంది : నిర్వాసితులు
-
సీఎం జగన్ మాకు అన్నలా అండగా ఉన్నారు
-
రామాయపట్నం పోర్టుతో ఎంతో మేలు: సీఎం జగన్
సాక్షి, నెల్లూరు/ప్రకాశం: రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. బుధవారం పోర్టు పూజా కార్యక్రమం, శంకుస్థాపనల సందర్భంగా నిర్వాసితులను ఉద్దేశించి ప్రసంగించారు ఆయన. రామాయపట్నం పోర్టు రావడం వల్ల ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. రవాణా ఖర్చుకూడా గణనీయంగా తగ్గుతుంది. పోర్టు వల్ల రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రత్యక్షంగా వేల మందికి.. పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలకు, లోన్లు ఇచ్చిన బ్యాంకులకు వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేశారు సీఎం జగన్. పోర్టులో 75 శాతం స్థానికులే ఉద్యోగాలని మరోమారు వేదిక నుంచి స్పష్టం చేసిన సీఎం జగన్.. ఆ చట్టం తెచ్చిన ప్రభుత్వం తమదేనని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆరు పోర్టులు కాకుండా మరో నాలుగు పోర్టులు తేబోతున్నామని, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, నాలుగు పోర్టుల పనులు వేగవంతం చేశామని అన్నారు. త్వరలోనే మిగతా వాటికి భూమి పూజ చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వానిది మోసమే! ఐదు సంవత్సరాలు ఏం చేయకుండా.. సరిగ్గా ఎన్నికల ముందు వచ్చి టెంకాయ కొట్టి శంకుస్థాపన అని చంద్రబాబు ప్రకటించుకున్నారు. ఇదెంత అన్యాయమని ప్రశ్నించారు సీఎం జగన్. ఎలాంటి అనుమతులు లేకుండానే గత ప్రభుత్వం పోర్టుకు శంకుస్థాపన పేరిట ప్రజలను మభ్యపెట్టింది. భూ సేకరణ, డీపీఆర్ లేకుండానే శంకుస్థాపన హడావిడి చేసిందని, కానీ, తమ ప్రభుత్వం అన్ని క్లియరెన్స్‌లతో పక్కాగా ముందుకు సాగుతోందని.. ప్రజలు ఇది గమనించాలని సీఎం జగన్ కోరారు. -
పోర్టు మా కల.. జగనన్నకు కృతజ్ఞతలు
సాక్షి, నెల్లూరు: ప్రగతి తీరంగా రామాయపట్నం పోర్టును తీర్చిదిద్దుతుండడంపై నెల్లూరు, ప్రకాశం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూమి పూజ, శంకుస్థాపన పనుల ప్రారంభంతో తమ కల నెరవేరనుందని చెప్తున్నారు. ఈ సందర్భంగా.. నిర్వాసితులు సైతం ఉద్యోగాల కల్పన, ప్రాంతం బాగుపడుతుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. పోర్టు అనేది మా కలగా ఉండేది. ఎన్నో రోజుల నుంచి చెప్తా ఉన్నారు. కానీ, మీ ప్రభుత్వంలో అది నిజం కావడం సంతోషంగా ఉందన్నా. 70 శాతం ఉద్యోగాల కల్పన హామీపై సంతోషం అన్నా. ఎకరం భూమిని ఇచ్చాం. ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో సంతోషంగా ఉన్నాం. మత్స్యకార భరోసా, వడ్డీలేని రుణాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. సంక్షేమ పథకాలు అందిస్తున్న మీరే పది కాలాల పాటు సీఎంగా ఉండాలన్నా.. -సీఎం జగన్‌ను ఉద్దేశించి నిర్వాసితురాలు సుజాత, మొండివారిపాలెం గ్రామం పోర్టు రావడం సంతోషంగా ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో ఒక పండుగ జరుగుతోంది. రామాయపట్నం పోర్టు ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ.. మా కల. మా కలను నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. మత్స్యకారులకు నేరుగా అకౌంట్లోకి సంక్షేమ నిధులు వేస్తున్నారు. డీజిల్ విషయంలోనూ సానుకూలంగా స్పందించారు అని ఆవాల జయరాం అనే నిర్వాసితుడు పేర్కొన్నాడు. -
రామాయపట్నం పోర్టుకి సీఎం జగన్ భూమిపూజ
-
రామాయపట్నం చేరుకున్నసీఎం జగన్
-
40వేల మందికి ఉపాధికల్పనే లక్ష్యంగా నిర్మాణం
-
సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోర్టు ఏరియాలో భారీ బందోబస్తు
-
రామాయపట్నం పోర్టుతో యువతకు ఉపాధి: సీఎం జగన్
నెల్లూరు రామాయపట్నం పోర్ట్ భూమి పూజ కార్యక్రమం అప్డేట్స్ 13:10PM ► రామాయపట్నం పర్యటన ముగించుకొని తాడేపల్లి బయలు దేరిన సీఎం వైఎస్ జగన్. 12:40PM ► స్థానిక ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి చేసిన విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్. హామీలను నెరవేరుస్తానని వెల్లడి. 12:38PM ► పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలకు, లోన్లు ఇచ్చిన బ్యాంకులకు కృతజ్ఞతలు: సీఎం జగన్. 12:33PM ► రామాయపట్నం పోర్టు రావడం వల్ల ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది: సీఎం జగన్ ► రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది: సీఎం జగన్ ► ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. రవాణా ఖర్చుకూడా గణనీయంగా తగ్గుతుంది. ► ప్రత్యక్షంగా వేల మందికి.. పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. 12:10PM పోర్టు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన నిర్వాసితులు. పోర్టు కలను నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. 12:00PM చంద్రబాబు వేసింది పోర్టు పునాదా?: మంత్రి గుడివాడ దేశంలోనే రెండో అతిపెద్ద తీరం కలిగిన రాష్ట్రం మనది.. రామాయపట్నం పోర్టు భూమి పూజ.. చరిత్రలో నిలిచిపోయే రోజు అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు గతంలో చంద్రబాబు హయాంలో శంకుస్థాపన అంటూ డ్రామాలాడారు. అదసలు పునాదా? అని ప్రశ్నించారు. అనుమతులు లేకున్నా చేసిన పనిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ అధినేతకు చురకలు అంటించారు మంత్రి గుడివాడ. సీఎం జగన్ సారథ్యంలో.. ప్రజల సంక్షేమంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతోందని పేర్కొన్నారు. 11:47AM గ్రామస్తులకు హృదయపూర్వక వందనాలు ► కందుకూరు నిజయోకవర్గ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది అని స్థానిక ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి అభివర్ణించారు. దశాబ్ద కాలంగా మాటలతో, శిలాఫలకాలతో కాలం గడిపిన నేతలను చూశాం. ఇప్పుడు.. ఆ కలను నిజం చేసే నాయకుడిని చూస్తున్నాం అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు. పోర్టు మాత్రమే కాకుండా.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా తరలి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం, చేవూరు, రావూరు, సాల్పేట గ్రామస్తులకు హృదయ పూర్వక వందనాలు తెలియజేశారు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి. నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం చేకూర్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారంటూ ఆయన మరోమారు స్పష్టం చేశారు. 11:35AM ► రామాయపట్నం పోర్ట్ కార్యక్రమం వేదికగా.. ఏపీ మారిటైం విజన్ స్టేట్మెంట్ను ఆవిష్కరించిన సీఎం జగన్. భవిష్యత్ తరాలకు ఉద్యోగాల వంటిదని అధికారుల వర్ణన. 11:21AM ► రామాయపట్నం ఓడరేవుపై స్పెషల్ ఏవీ ప్రదర్శన.. పలు విశేషాలు. 11:18AM ► రామాయపట్నం స్కూల్ పిల్లలతో కలిసి వందేమాతర గీతాలాపనలో సీఎం జగన్, ఇతరులు పాల్గొన్నారు. అనంతరం పిల్లలతో ఫొటో దిగారు. ► కేవలం ఏపీకి మాత్రమే కాదు.. పక్కనున్న రాష్ట్రాలకు.. మొత్తం దేశం అభివృద్ధికి ఉపయోగపడనుంది. ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు వ్యాపార, వాణిజ్య సేవలు సులభతరం కానున్నాయి. 11:16AM ► జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించిన సీఎం జగన్. ► మంత్రులు, స్థానిక నేతలు, అధికారులతో కలిసి పోర్టు ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించిన సీఎం జగన్. 36 నెలల్లోనే తొలిదశ పనులు ► రామాయపట్నం పోర్టు తొలిదశ పనులను 36 నెలల్లోనే పూర్తి చేయిచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ► ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు హైవేకి కేవలం నాలుగున్న కిలోమీటర్ల దూరంలోనే పోర్టు. 11:06AM ► ప్రగతి తీరంగా.. రామాయపట్నం పోర్టు పనుల ప్రారంభంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల వాసుల కల నెరవేరనుంది. 10:53AM ► రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్ రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. 10:30AM ► నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు హెలిప్యాడ్‌కు చేరుకొన్న సీఎం వైఎస్ జగన్. స్వాగతం పలికిన మంత్రులు ,ఎమ్మెల్యేలు, అధికారులు. 9:43 AM ► రామాయపట్నం పోర్టు భూమి పూజ కార్యక్రమం కోసం తాడేపల్లి నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్. సీఎం వెంట మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు ఉన్నారు. ► రామాయపట్నం పోర్టుతో ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు రానుంది. ► సహాయ, పునరావాసానికి రూ. 175.04 కోట్ల వ్యయం భరించనుంది ప్రభుత్వం. ► రెండు దశల్లో రూ.10,640 కోట్లతో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి రామాయపట్నం చేరుకుంటారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించి.. మధ్యాహ్నాం తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. ► పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. రెండు దశల్లో 19 బెర్త్‌లతో.. రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన కీలక పర్యావరణ అనుమతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే తెచ్చింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏరియా అనుమతులతో పాటు అటవీ అనుమతులను కూడా సాధించింది. ► రామాయపట్నం ఓడ రేవును మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్‌లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. తొలిదశలో నాలుగు బెర్త్‌లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచింది. ► రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి. ► ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి. రామాయపట్నం పోర్టుతో ప్రయోజనాలు ► వెనకబడ్డ ప్రాంతంలో అభివృద్ధికి ఊతం కానుంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో పోర్టు నిర్మాణం జరగనుంది. ► పోర్టు తొలిదశ పనులు 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 3736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు చేపట్టనున్నారు. ► రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైం బోర్డు కింద ప్రాజెక్టును రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించనుంది. ► తొలిదశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం. ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతి. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం ► రెండో దశలో 138.54 మిలియన్ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం. ► ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ, రవాణా సేవల్లో కీలకం కానున్న రామాయపట్నం పోర్టు. ► తెలంగాణ, ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సుభతరం. ► రూ.3500 కోట్లతో మొత్తంగా 9 షిఫింగ్ హార్బర్ల నిర్మాణం. ► ఫేజ్–1లో 4 హార్బర్ల నిర్మాణం.జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలిదశలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. ► రెండో దశ కింద మొత్తం 5 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. బుడగట్ల పాలెం, పూడిమడక, బియ్యపు తిప్ప, వాడరేవు, కొత్తపట్నంల్లో రెండోదశలో షిఫింగ్ హార్బర్ల విస్తృతంగా ఉపాధి అవకాశాలు. పెరగనున్న ఆర్థికవ్యవస్థ. ► వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ► చంద్రబాబు ఉత్తుత్తి పునాది రాయి గత ఎన్నికలకు ముందు 2019 జనవరి 9వ తేదీన భూ సేకరణ చేయకుండా, పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రామాయపట్నం పోర్టుకు ఉత్తుత్తి పునాది రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. కానీ, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఓడరేవులను చేపట్టడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ► ఓడరేవుల నిర్మాణం ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రామాయపట్నానికి అవసరమైన 255.34 ఎకరాల సేకరణను ప్రభుత్వం చేపట్టింది. మరోపక్క ఓడరేవు నిర్మాణంతో నిర్వాసితులయ్యే పరిసర గ్రామాల ప్రజలకు సహాయ, పునరావాస చర్యలను ప్రారంభించి రూ.175.04 కోట్లు వ్యయం చేస్తోంది. ► రామాయపట్నం ఓడ రేవు కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఓడరేవుకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేయడంతో పాటు కీలకమైన పర్యావరణ, అటవీ అనుమతులన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే సాధించింది. అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భూమి పూజ చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. -
అభివృద్ధి, విభజన హామీలపై రాజీలేని పోరాటం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల అభివృద్ధి, విభజన హామీలపై రాజీలేని పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న రామాయపట్నం పోర్టుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనుండటం శుభపరిణామమన్నారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, వంగా గీత, బెల్లాన చంద్రశేఖర్, పోచ బ్రహ్మానందరెడ్డి మీడియాతో మాట్లాడారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. 14 పోర్టులు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, దీంట్లో భాగంగానే రామాయపట్నం పోర్టుకి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలో దుగరాజుపట్నం పోర్టును పొందుపరిచినా, ఆ పోర్టు నిర్మాణానికి ఆలస్యం జరుగుతున్న పరిస్థితుల్లో రామాయపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని అనేకమార్లు పార్లమెంటు లోపల, బయట కోరామని గుర్తుచేశారు. చివరికి కేంద్రం చేపట్టకపోయినా రామాయపట్నం పోర్టు కూడా ఆలస్యం అవుతున్నందున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం.. దీన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టారని చెప్పారు. త్వరలోనే మచిలీపట్నం పోర్టు కూడా వస్తుందని చెప్పారు. ప్రతిపాదనలు ఆమోదించాలి ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ఏపీలో ఎయిర్ పోర్టులు, రోడ్లు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు కోసం తమ పార్టీ ఎంపీలంతా పార్లమెంటులో గళం వినిపిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్‌గడ్కరీ చేసిన 38 ఫ్లైఓవర్ల వాగ్దానాన్ని త్వరగా నెరవేర్చాలన్నారు. సింహాచలం, అంతర్వేది, అన్నవరం దేవాలయాలను టూరిజం పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని కోరామన్నారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని, విభజన తర్వాత రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండు చేస్తున్నామన్నారు. గోదావరి వరదలకు పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు లింకు పెడుతూ రాజకీయ కామెంట్లు చేయడం సరికాదన్నారు. జూలైలో గోదావరికి ఈ స్థాయి వరదలు ఎప్పుడూ రాలేదని తెలిపారు. ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ జాతీయ ప్రాజెక్టు పోలవరానికి సంబంధించి ఏ నిర్ణయమైనా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్రం సమన్వయంతోనే జరుగుతుందని చెప్పారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులు అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలికవసతులు, సేవలకు సంబంధించి అన్నిరంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషిచేస్తున్నారని చెప్పారు. 9 ఫిషింగ్ హార్బర్ల ద్వారా మత్స్యసంపద పెంచడంతోపాటు ఉపాధి అవకాశాలు పెంచుతున్నామన్నారు. వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మరో 13 వైద్య కళాశాలలకు కూడా త్వరితగతిన అనుమతులివ్వాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి, చొరవతో రాష్ట్రంలో సంక్షేమంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయని చెప్పారు. -
రామాయపట్నం పోర్టుకు భూమి పూజ.. సీఎం జగన్ పర్యటన వివరాలిలా..
సాక్షి, అమరావతి: గత సర్కారు పునాది రాయికే పరిమితం చేసిన రామాయపట్నం ఓడ రేవును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శరవేగంగా సాకారం చేస్తోంది. ఓడరేవుకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేయడంతో పాటు కీలకమైన పర్యావరణ, అటవీ అనుమతులన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే సాధించింది. అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భూమి పూజ చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలోసీఎం ప్రసంగించనున్నారు. ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి. యువతకు భారీగా ఉపాధి లక్ష్యంతో.. గత ఎన్నికలకు ముందు 2019 జనవరి 9వ తేదీన భూ సేకరణ చేయకుండా, పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రామాయపట్నం పోర్టుకు ఉత్తుత్తి పునాది రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఓడరేవులను చేపట్టడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఓడరేవుల నిర్మాణం ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రామాయపట్నానికి అవసరమైన 255.34 ఎకరాల సేకరణను ప్రభుత్వం చేపట్టింది. మరోపక్క ఓడరేవు నిర్మాణంతో నిర్వాసితులయ్యే పరిసర గ్రామాల ప్రజలకు సహాయ, పునరావాస చర్యలను ప్రారంభించి రూ.175.04 కోట్లు వ్యయం చేస్తోంది. రెండు దశల్లో 19 బెర్త్‌లతో.. రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన కీలక పర్యావరణ అనుమతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే తెచ్చింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏరియా అనుమతులతో పాటు అటవీ అనుమతులను కూడా సాధించింది. రామాయపట్నం ఓడ రేవును మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్‌లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. తొలిదశలో నాలుగు బెర్త్‌లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచింది. రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి. 40,000 మందికి ఉపాధి రెండో దశలో రూ.6,904 కోట్లు వ్యయం కానుంది. మొదటి దశలో 24.91 మిలియన్ టన్నులు, రెండో దశలో 113.63 మిలియన్ టన్నుల కార్గోతో కలిపి మొత్తం 138.54 మిలియన్ టన్నుల కార్గో సామర్థ్యం అందుబాటులోకి రానుంది. పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 40,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. నేడు సీఎం పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40 గంటలకు రామాయపట్నం చేరుకుంటారు. 11.00 నుంచి 12.30 గంటల వరకు రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడి నుంచి తిరిగి బయలుదేరి 2 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు. -
రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించనున్న సీఎం జగన్
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రామాయపట్నం పోర్ట్ పనులను ప్రారంభించనున్నారు. సీఎం రాక తో తీర ప్రాంతం పోర్ట్ ఏరియా లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు పోర్ట్ ఏరియా లో హెలికాప్టర్ లో ల్యాండ్ కానుంది. ముందుగా సముద్రుడికి పూజ చేయనున్న సీఎం జగన్ ఆ తర్వాత పోర్ట్ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం పోర్ట్ నిర్వాసితులు , రైతులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ►వెనకబడ్డ ప్రాంతంలో అభివృద్ధికి ఊతం కానుంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో పోర్టు నిర్మాణం జరగనుంది. ►పోర్టు తొలిదశ పనులు 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 3736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు చేపట్టనున్నారు. ►రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైం బోర్డు కింద ప్రాజెక్టును రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించనుంది. ►తొలిదశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం. ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతి. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం ►రెండో దశలో 138.54 మిలియన్ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం. ►ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ, రవాణా సేవల్లో కీలకం కానున్న రామాయపట్నం పోర్టు. ►తెలంగాణ, ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సుభతరం. ►రూ.3500 కోట్లతో మొత్తంగా 9 షిఫింగ్ హార్బర్ల నిర్మాణం. ►ఫేజ్–1లో 4 హార్బర్ల నిర్మాణం.జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలిదశలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. ►రెండో దశ కింద మొత్తం 5 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. బుడగట్ల పాలెం, పూడిమడక, బియ్యపు తిప్ప, వాడరేవు, కొత్తపట్నంల్లో రెండోదశలో షిఫింగ్ హార్బర్ల విస్తృతంగా ఉపాధి అవకాశాలు. పెరగనున్న ఆర్థికవ్యవస్థ. ►దాదాపు 85వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. -
సింహపురి సిగలో మరో మణిహారం
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికలకు ముందు హడావుడి శంకుస్థాపనకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పరిమితం కాగా, చిత్తశుద్ధితో నిర్మాణ పనులు చేపట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అవసరమైన భూసేకరణ పూర్తయింది. ఈనెల 20న పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం సింహపురి ఉన్నతికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంది. విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తూనే పారిశ్రామికాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు నిర్మాణం చేయనున్నారు. ఉదయగిరిలో మేకపాటి గౌతమ్‌రెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చింది. జిల్లా ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి తగినట్లుగా జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇదివరకే అదానీ కృష్ణపట్నం పోర్టు సమీçపంలో క్రిస్ సిటీకి కేంద్ర పర్యావరణ అనుమతులు వచ్చాయి. మరోవైపు బయో ఇథనాల్ ప్లాంట్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదించింది. ఎగుమతులకు తగినట్లుగా.. రాష్ట్రానికి విశాల సముద్ర తీరం ఉంది. మునపటి రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు జిల్లాల నుంచి సిమెంట్, ఐరన్, పొగాకు ఇంకా పలురకాల ఖనిజాలు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి. బొగ్గు, ఎరువులు తదితరాల దిగుమతి జరుగుతోంది. ఈ వ్యవహారమంతా ప్రస్తుతం అదానీ కృష్ణపట్న ం పోర్టు ద్వారా కొనసాగుతోంది. తదుపరి చెన్నై ఓడరేవు అందుబాటులో ఉంది. ఉత్పత్తుల ఎగుమతులకు కృష్ణపట్నం ఓడరేవు సామర్థ్యం సాధ్యపడకపోవడంతో రామాయపట్నం పోర్టు తెరపైకి వచ్చింది. 25 మిలియన్ టన్నుల సామర్థ్యంలో రూ.10,640 కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టనున్నారు. మొత్తం 19 బెర్తులు కట్టనున్నారు. తొలివిడతలో ఒకటి కోల్, రెండు బెర్తులు కంటైనర్లు, ఒక బెర్త్ మల్టీపర్పస్ కోసం నిర్మించదలిచారు. పోర్టుకు అనుబంధంగా ఏపీఐఐసీ పరిధిలో భూసేకరణ చేస్తున్నారు. అందులో అనుబంధ పరిశ్రమలు రానున్నాయి. ఎంతో ప్రాధాన్యం కలిగిన రామాయపట్నం పోర్టు నిర్మాణం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల హామీగా మిగిలిపోవడం మినహా కార్యరూపం దాల్చలేదు. గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి హోదాలో హడావుడిగా శంకుస్థాపన చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఎలాంటి పరిపాలన అనుమతులు ఇవ్వలేదు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పోర్టు నిర్మాణానికి సంబంధించి రూ.3,736 కోట్లకు పరిపాలనా అనుమతులిచ్చింది. పోర్టుకు అవసరమైన 803 ఎకరాలను సేకరించారు. ఈనెల 20వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పెద్దఎత్తున ఉద్యోగాలు చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద 11,095 ఎకరాల్లో రూ.5,783.84 కోట్లతో క్రిస్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుతో టెక్స్టైల్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, ఎంఎస్ఎంఈ రంగాల పరిశ్రమలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులో వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దక్కనుంది. తొలిదశ కోసం పర్యావరణ అనుమతులు, కండలేరు ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా అనుమతులు పూర్తయ్యాయి. అలాగే సర్వేపల్లి వద్ద కృషక్ భారతి కో–ఆపరేటీవ్ లిమిటెడ్ (క్రిబ్కో) పరిధిలో రూ.560 కోట్లతో బయో ఇథనాల్ ప్లాంట్ చేపట్టనున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. కష్టాలు తొలగిపోతాయి రామాయట్నం పోర్టు నిర్మిస్తే అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఇది శుభపరిణామం. జిల్లాలో ఏర్పాటవుతున్న పరిశ్రమలతో యువత వారి అర్హతకు తగ్గట్లుగా ఉపాధి పొందుతారు. పారిశ్రామికాభివృద్ధితో కష్టాలు తొలగిపోతాయి. – వంశీ, నవాబుపేట యువతకు మంచిరోజులు జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం. ఇప్పటికే అనేక పరిశ్రమలు నెల్లూరుకు వచ్చాయి. మరిన్ని ఏర్పాటుతో యువతకు బాగా ఉద్యోగాలొస్తాయి. వారికి మంచి రోజులొచ్చాయి. – అరవ యాకుబ్, స్టౌన్‌హౌస్‌పేట -
20న రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన
గుడ్లూరు: రామాయపట్నం పోర్టు పనులకు ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేస్తారని పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్.కరికాల వలవన్ తెలిపారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని మొండివారిపాలెం వద్ద రామాయపట్నం పోర్టు శంకుస్థాపనకు సీఎం రానున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబుతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. పోర్టు ప్రతిపాదిత ప్రాంతం వద్ద ఏర్పాటు చేస్తున్న పైలాన్, హెలిప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. భద్రతా ఏర్పాట్లపై డీఎస్పీ శ్రీనివాసరావుతో చర్చించారు. కరికాల వలవన్ మాట్లాడుతూ రామాయపట్నం పోర్టుకు సంబంధించి భూసేకరణ పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. పోర్టు ఏర్పాటుతో రెండు జిల్లాలు అభివృద్ధి చెందడమే కాకుండా పరిశ్రమల ఏర్పాటు వల్ల వేలాది మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం మొదటిస్థానంలో నిలిచిందని తెలిపారు. 3 పోర్టులు, 9 షిప్పింగ్ హార్బర్లు, మల్టీ మోడల్ పార్కులు, వివిధ రకాల పరిశ్రమల నిర్మాణాలు ఏ రాష్ట్రంలోనూ జరగడం లేదన్నారు. కలెక్టర్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ.. 2013 చట్టం ప్రకారం మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం గ్రామాల్లో నిర్వాసితులవుతున్న 600 కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ నష్టపరిహారం అందజేస్తుందన్నారు. పోర్టు నిర్మాణానికి మూడు గ్రామాల ప్రజలు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. మారిటైం బోర్డు నుంచి రవీంథ్రనాథ్రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆర్.కూర్మనాథ్, ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణమోహన్, డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి, కందుకూరు ఆర్డీవో సుబ్బారెడ్డి, పోర్టు లైజనింగ్ అధికారి ఐవీ రెడ్డి, విద్యుత్ శాఖ ఈఈ వీరయ్య, డీఎస్పీ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘రామాయపట్నాన్ని మేజర్ పోర్టుగా అభివృద్ధి చేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ : రామాయపట్నం పోర్టును మేజర్ పోర్టుగా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి మనసుఖ్ మాండవీయని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్ర ఓడరేవులు, పోర్టులశాఖ సహాయ మంత్రి మనసుఖ్ మాండవీయను మంత్రి గౌతమ్ రెడ్డి గురువారం కలిశారు. ఆయన వెంట రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా కూడా ఉన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ఇచ్చిన హామీలను మంత్రి మేకపాటి వివరించారు. నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి 50 శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అదే విధంగా సాగరమాల కింద ఆగిపోయిన ప్రాజెక్టులకు వెంటనే నిధులు ఇస్తామన్నట్లు తెలిపారు. భీమిలి, కాకినాడలో ప్యాసింజర్ జెట్టీలకు ప్రారంభం చేస్తామన్నారని, మేడ్టెక్ జోన్ల ఎమ్ఆర్ఏ సెంటర్ ప్రారంభోత్సవానికి వస్తానని చెప్పినట్లు తెలిపారు. మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అంచనా వ్యయంలో 50 శాతం రామాయపట్నం మేజర్ పోర్ట్‌గా తీసుకోవాలని కోరారని, దానికి పారిశ్రామిక భూమి కూడా ఉన్నట్లు తెలిపారు. పోర్టు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఉండాలని ప్రధాని సైతం అన్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దాన్ని ఎస్‌ఈజెడ్‌గా మారుస్తారన్నారు. ఫిసిబిలిటి స్టడీ ఆధారంగా భావనపాడు, రామాయపట్నంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పినట్లు తెలిపారు. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దీనికి వంద శాతం నిధులు సమకూరుస్తుందని భరోసా ఇచ్చారని వివరించారు. -
రామాయపట్నం: చకచకా అడుగులు
-
చిరకాల స్వప్నం.. త్వరలోనే సాకారం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లా సముద్ర తీరంలో రామాయపట్నం వద్ద నౌకాశ్రయం నిర్మించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా పనులు ప్రారంభించనుంది. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ఆహా్వనించేందుకు, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు జ్యుడీషియల్ రివ్యూకు కూడా పంపించింది. తొలిదశలో మూడు బెర్తులతో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంతో జిల్లా ప్రజల్లో రెట్టించిన ఆనందం నెలకొంది. 36 నెలల్లో పనులు పూర్తి చేసే దిశగా అడుగులు: రామాయపట్నం పోర్టు పనులను 36 నెలల్లోనే పనులు పూర్తి చేయాలన్న దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు ఈ నెలలోనే బిడ్డింగ్ విధానాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. తొలి దశలో మూడు బెర్తులతో పనులు ప్రారంభించేలా విధివిధానాలను రూపొందిస్తున్నారు. అందుకుగాను ప్రాజెక్టు వ్యయ అంచనా విలువ రూ.2,169.62 కోట్లుగా నిర్ణయించారు. అందుకోసం అంతర్జాతీయ స్థాయి టెండర్లను ఆహ్వానిస్తున్నారు. పోర్టు నిర్మాణాల్లో అనుభవమున్న బడా కాంట్రాక్టర్లను టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు రూపొందించారు. రివర్స్ టెండర్ ద్వారానే కాంట్రాక్టును కట్టబెట్టేలా ఇప్పటికే నిర్ణయించారు. పోర్టుకు తొలి దశలో మూడు బెర్తులను 900 మీటర్ల పొడవుతో 34.5 మీటర్ల లోతు ఉండేలా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ... రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలంటూ సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి గతంలో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కోరిన విషయం తెలిసిందే. వై.ఎస్.జగన్ నిర్ణయం పట్ల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అనుకున్న ప్రకారం పోర్టు నిర్మాణం జరిగితే జిల్లా రూపురేఖలే మారనున్నాయి. జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మరింత మెరుగవుతాయి. వెనుకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం చేపట్టాలనే నిర్ణయం వల్ల జిల్లా అభివృద్ధికి రెడ్‌కార్పెట్ పరిచినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఎదురుచూస్తున్న జిల్లా ప్రజానీకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయం వరంగా మారింది. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు పోర్టు నిర్మాణంపై మోసం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. 2014లో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు జిల్లా అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా జిల్లాకు తీసుకురాని దుర్భర పరిస్థితి. రామాయపట్నం పోర్టు ఏర్పాటు కోసం జిల్లాకు చెందిన అనేక మంది ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టినా గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల ముందు మాత్రం ఓట్ల కోసం రామాయపట్నంలో మినీ పోర్టు ఏర్పాటు పేరుతో 2019 జనవరి 9వ తేదీన భూమి పూజ చేసి మరో మోసానికి తెరతీసిన వైనం అందరికీ తెలిసిందే. 2012లోనే అనుకూలమని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పోర్టు నిర్మాణానికి రామాయపట్నం అనుకూలంగా ఉంటుందని 2012 ఆగస్టు 22వ తేదీన కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ స్టేక్ హోల్డర్స్‌తో సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ తరువాత 2012 సెప్టెంబర్ 2న అప్పటి ప్రభుత్వం రామాయపట్నం ప్రాంతం ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రానికి అనువైనదని పేర్కొంటూ కేంద్రానికి లేఖ రాసింది. 2013 ఏప్రిల్ 15న కేబినెట్ కమిటీకి కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ ఒక నోట్ సమరి్పంచింది. ఆ నోట్ ద్వారా రామాయపట్నం అనుకూల ప్రదేశమని ఆర్ధిక, రక్షణ, హోం, రవాణా, రైల్వే మంత్రిత్వ శాఖలకు సమాచారం అందించారు. అయితే ఆ తరువాత అనూహ్యంగా దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగే సమయంలోనూ దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు అంశం విభజన చట్టంలో చేర్చారు. దీంతో అప్పటి నుంచి జిల్లాలో రామాయపట్నం పోర్టు ఏర్పాటు కోరుతూ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోర్టు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకుంటున్నారు. పోర్టు ఏర్పాటుకు అనుకూలాంశాలు ఇవీ.. జిల్లాలోని ఉలవపాడు– గుడ్లూరు మండలాల పరిధిలో రామాయపట్నం ఉంది. ఇక్కడ ‘సీఫ్రంట్’ సుమారుగా 7.5 కి.మీ తీరం పొడవున అతి దగ్గరలో సుమారు 10 మీటర్ల లోతు ఉండటం పోర్టు నిర్మాణానికి అనుకూలాంశంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మడ అడవులు అడ్డంకిగా లేని సముద్ర తీరం ఇక్కడ అందుబాటులో ఉండటం కూడా కలిసొచ్చే అంశం. సముద్ర తీరానికి అతి చేరువలో రవాణాకు అనుకూలంగా రైల్వేలైన్, 16వ నంబర్ జాతీయ రహదారి ఉండటం వల్ల పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులకు అనుకూలంగా ఉంటుంది. దీనికితోడు రామాయపట్నం ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించిన అసైన్డ్ భూములు, రిజర్వ్ ఫారెస్ట్ భూములు అధికంగా అందుబాటులో ఉండటంతో స్థల సేకరణలో ఇబ్బందులు లేవు. జిల్లాలోని దొనకొండ ప్రాంతంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్న తరుణంలో పోర్టు నిర్మాణం జరిగితే పారిశ్రామికవేత్తలకు జల రవాణా కూడా అత్యంత చేరువలో ఉంటుంది. దీని వల్ల జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. -
రామాయపట్నంపై జపాన్ సంస్థల ఆసక్తి
సాక్షి, అమరావతి: రామాయట్నం పోర్టుతో సహా మొత్తం పది కీలక రంగాలలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున పెట్టుబడులకు పెట్టేందుకు జపాన్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలోని తన కార్యాలయంలో జపాన్ సంస్థలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. జపాన్‌కు చెందిన బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ (జేబీఐసీ), జపాన్ ప్రీమియర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ), ప్రీమియర్ జపాన్ డెవలప్మెంట్ ఏజెన్సీ, కునియమి ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ సంస్థలు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో సహకరించేందుకు సుముఖంగా ఉన్నట్లు మంత్రి వివరించారు. జపాన్ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న రంగాలు.. ► రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం, ఓడరేవుల ద్వారా రవాణా, పోర్టు ఆధారిత క్లస్టర్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ క్లస్టర్ల అభివృద్ధిలో జపాన్ సంస్థల భాగస్వామ్యం. ► సోలార్ విద్యుత్ పార్కుల ఏర్పాటు, ఆక్వాకల్చర్ అభివృద్ధి, ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ల ఏర్పాటులో పెట్టుబడులకు సంసిద్ధత. ► ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ మేనేజ్మెంట్తో భాగస్వామ్యం, పట్టణాల పునరుద్ధరణ, అభివృద్ధిలో తోడ్పాటు. ► విశాఖ కేంద్రంగా పెవిలియన్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సంసిద్ధం. విశాఖలో ఏర్పాటు చేయనున్న స్కిల్ సెంటర్, ఐటీ, పారిశ్రామిక క్లస్టర్లు, పోర్టులు, మౌలిక వసతుల కల్పన, విశాఖను ఐటీ హబ్‌గా మార్చేలా నైపుణ్య కేంద్రం ఏర్పాటుకు సహకారం. ► అంతర్జాతీయ మార్కెట్ల స్థాయిలో జేబీఐసీ (జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్) క్రెడిట్ రేటింగ్‌తో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి. పరిశీలనలో ఉన్న మరికొన్ని ప్రాజెక్టులు (ప్రాథమిక దశ) ► రామాయపట్నం పోర్టు ద్వారా సరుకు రవాణా, పోర్టు కేంద్రంగా ఇండస్ట్రియల్ క్లస్టర్ అభివృద్ధి. ► విశాఖపట్నం సమీపంలోని నక్కపల్లి ఇండస్ట్రియల్ నోడ్ ► 10 వేల మెగావాట్ల సామర్థ్యమున్న సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ► విశాఖపట్నం అభివృద్ధి, మౌలిక వసతులు, స్థిరాస్తి రంగానికి సహకారం. ► వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎంవో అదనపు ప్రత్యేక సీఎస్ పీవీ రమేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తదితరులు పాల్గొన్నారు. జపాన్‌కు చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మరో 4 కొత్త ఓడరేవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో 4 ఓడరేవులు(పోర్టులు) అందుబాటులోకి రానున్నాయి. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మించడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడంతో పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ఈ పనుల ప్రక్రియను వేగవంతం చేసింది. కాకినాడ సెజ్‌లో జీఎంఆర్ సంస్థ నిర్మించ తలపెట్టిన మరో ఓడరేవులో ఆదానీ గ్రూపునకు 49 శాతం వాటా విక్రయించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఆ పోర్టు నిర్మాణ పనులు ఇక వేగవంతం కానున్నాయి. ఇప్పటికే మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు సంబంధించి ‘రైట్స్’ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు ఇచ్చిందని, వీటిని క్షుణ్నంగా పరిశీలించి, త్వరలో గ్లోబల్ టెండర్లు పిలవనున్నట్లు పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ తెలిపారు. మచిలీపట్నం పోర్టుకు పర్యావరణ అనుమతులు లభించాయని, రామాయపట్నం పోర్టుకు ఈ అనుమతులు రావాల్సి ఉందన్నారు. భావనపాడు పోర్టు నిర్మాణానికి కొత్తగా డీపీఆర్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణానికి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేసినట్లు కరికాల వలవన్ వెల్లడించారు. - మచిలీపట్నం పోర్టును 26 బెర్తులతో 253.20 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నిర్మించేలా డీపీఆర్ సిద్ధం చేశారు. మొత్తం ఆరు దశల్లో చేపట్టే ఈ పోర్టు నిర్మాణానికి రూ.11,924 కోట్లు అవసరమని అంచనా. గతంలో ఈ పోర్టు నిర్మాణ బాధ్యతలను నవయుగ సంస్థకు కేటాయించగా.. ఆ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకొని, భూమిని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రేవు నిర్మాణానికి సంబంధించి ఇంకా 1,000 ఎకరాలను సేకరించాల్సి ఉంది. - రామాయపట్నం పోర్టు నిర్మాణానికి రూ.10,009 కోట్లు అవసరమని రైట్స్ సంస్థ అంచనా వేసింది. మొత్తం 16 బెర్తులతో 138.54 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఈ ఓడరేవును మూడు దశల్లో నిర్మించనున్నారు. ఈ ఓడ రేవు నిర్మాణానికి 3,634.34 ఎకరాల భూమి అవసరం కాగా, ప్రభుత్వం చేతిలో 542 ఎకరాలు ఉన్నాయి. ఇంకా 3,093 ఎకరాలను సేకరించాల్సి ఉంది. - శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు అందుబాటులో ఉండేలా భావనపాడు ఓడరేవు నిర్మించనున్నారు. ఐదు బెర్తులతో 31.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఈ పోర్టును నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.3,000 కోట్లు అవసరమని అంచనా. గతంలో ఈ పోర్టు నిర్మాణానికి టెండర్లు పిలవగా ఆదానీ గ్రూపు దక్కించుకుంది. ఇప్పుడు ఈ ఓడరేవును ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించడంతో తాజాగా డీపీఆర్ రూపొందించనున్నారు. -
కృష్టపట్నం పోర్టుకు ప్రత్యేక పరిమితులు రద్దు
సాక్షి, అమరావతి : కృష్ణపట్నం పోర్టుకున్న ప్రత్యేక పరిమితులను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రామాయపట్నం పోర్టు ప్రతిపాదనకు అవరోదాలు తొలిగినట్లే కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణపట్నం పోర్టుకు విశేష అధికారాలు కట్టబెట్టారు. పోర్టు పరిధిలోని 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్తగా ఎటువంటి పోర్టు నిర్మాణం చేపట్టకూడదని వారు చేసుకున్న ఒప్పందంలో ప్రధాన క్లాజుగా ఉంది. దీంతో అక్కడ వేరే పోర్టులు ఏర్పాటు కాకుండా కృష్టపట్నం పోర్టు కంపెనీకి బాబు ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది.తాజాగా ఒప్పందంలో ఉన్న క్లాజును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొనడంతో రామాయపట్నం పోర్టుకు అవరోదాలు తొలగిపోనున్నాయి. -
పోర్టుల నిర్మాణం: కేంద్ర నిధులు తెచ్చుకునేలా చర్యలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న పోర్టులు, కొత్త పోర్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో సీఎం జగన్ సమీక్షించారు. దుగ్గజరాజపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, నక్కపల్లి, కళింగపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణంపై ప్రణాళికల తయారు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మొదటి దఫాలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని, మచిలీపట్నం పోర్టును వీలైనంత వేగంగా కట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ పోర్టుకు ఇప్పటికే భూమి అందుబాటులో ఉందని, ఇక, మిగిలిన పోర్టులకు అవసరమైన భూమిని వెంటనే సేకరించుకోవాలని సూచించారు. వచ్చే జూన్ నాటికి మచిలీపట్నం పోర్టుకు, రామాయపట్నం పోర్టుకు ఫైనాన్షియల్ క్లోజర్ ప్రక్రియలను పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. వచ్చే మే-జూన్ నాటికి ఈ రెండు పోర్టులకూ శంకుస్థాపన చేయాలన్నారు. విభజన చట్టం ప్రకారం పోర్టును నిర్మించి ఇస్తానని కేంద్రం చెప్పిందని, ఆ మేరకు నిధులను కేంద్రం నుంచి తెచ్చుకునేలా చర్యలు చేపట్టాలని వివరించారు. ఈ సందర్భంగా అధికారులతో జరిగిన చర్చలో ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం వైఎస్ జగన్ వివరించారు. ‘ఎవరైనా మీ ప్రాధాన్యతలు ఏంటని అడిగితే నా తొలి ప్రాధాన్యత నవరత్నాలు, నాడు-నేడు కార్యక్రమం అని చెప్తా. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం.. ప్రతి ఏటా ఆరు లక్షల ఇళ్లు నిర్మించడం రెండో ప్రాధాన్యత అంశం. రాయలసీమ ప్రాజెక్టులకు జలాలు వెళ్తున్న కాల్వల విస్తరణ చేపట్టడం మూడో ప్రాధాన్యత అంశం’ అని సీఎం తెలిపారు. పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టడం, పోలవరం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ అక్కడనుంచి బనకచర్లకు గోదావరి జలాలు తరలించడం, ప్రతి జిల్లాకు తాగునీటిని అందించాలన్న వాటర్ గ్రిడ్ చేపట్టడం.. ఇవి తన ఇతర వరుస ప్రాధాన్యత అంశాలని, ఈ కార్యక్రమాల వల్ల అత్యధిక ప్రజలు ఆధారపడ్డ వ్యవసారంగంలో స్థిరత్వం ఉంటుందని, అలాగే కరవు ప్రాంతాలకు ఊరట లభిస్తుందని వివరించారు. నవరత్నాలు కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలకు భరోసా లభిస్తుందని చెప్పారు. విద్యుత్ సంస్కరణల అంశంపై కూడా ఈ సమావేశంలో సీఎం జగన్ చర్చించారు. ప్రతి ఏటా విద్యుత్ సబ్సిడీల రూపంలో సుమారు రూ.10 వేల కోట్లు ట్రాన్స్‌కోకు చెల్లిస్తున్నామని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వమే 12వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు ఇస్తే సరిపోతుందని తెలిపారు. సుమారు రూ. 35-37వేల కోట్ల ఖర్చుతో 12వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. అంటే మూడు, నాలుగు సంవత్సరాల్లో ట్రాన్స్‌కోకు ఇస్తున్న సబ్సిడీ డబ్బుతో 12వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, ఈ దిశగా ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. -
రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని వెంటనే చేపట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: రామాయపట్నంలో భారీ పోర్టు నిర్మాణ పనులను సత్వరమే ప్రారంభించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. విభజన చట్టం ప్రకారం కేంద్రసాయంతో నిర్మించాల్సిన దుగరాజపట్నంలో పోర్టుకు లాభదాయకత లేదని తేలిన తర్వాత ప్రత్యామ్నాయంగా ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మేజర్ పోర్టు నిర్మాణానికి అనుమతులు సాధించడానికి బదులుగా గత ప్రభుత్వం రామాయపట్నంలో సొంతంగానే నాన్‌మేజర్ పోర్టు నిర్మించాలని నిర్ణయించిందన్నారు. కానీ నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉందని, రామాయపట్నంలో నాన్మేజర్పోర్టు స్థానంలో కేంద్ర ప్రభుత్వం హామీ మేరకు మేజర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే పోర్టు నిర్మాణ బాధ్యతలను చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలులోకి వచ్చి ఇప్పటికే ఐదేళ్లు పూర్తయినా రామాయపట్నం పోర్టు నిర్మాణం హామీని నెరవేర్చాలంటూ ఇప్పటికీ తాము పార్లమెంటులో గొంతెత్తి అరవవలసి రావడం దురదృష్టకరమన్నారు. ఆడిట్ పూర్తయిన తర్వాతే పోలవరానికి నిధులు పోలవరం ప్రాజెక్ట్‌పై వెచ్చించిన వ్యయం రీయింబర్స్మెంట్ విషయంలో రూ.3,222.75 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితోపాటు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన నిర్మాణ వ్యయం అంచనాలను ఆమోదించే అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందా? అని సోమవారం ప్రశ్నోత్తరాల్లో వి.విజయసాయిరెడ్డి కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ను ప్రశ్నించారు. దీనికి మంత్రి జవాబిస్తూ పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించడానికి ముందు చేసిన రూ.5 వేల కోట్ల ఖర్చుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఆడిట్ జరుపుతోందని, ఇప్పటి వరకు రూ.3 వేల కోట్ల మేరకు ఆడిట్ పూర్తయినందున అందులో కొంత మొత్తం విడుదల చేసే అంశం ప్రస్తుతానికి ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. ఇదే అంశంలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన రాతపూర్వక ప్రశ్నకు జలశక్తి మంత్రి రతన్‌లాల్ కటారియా సమాధానం ఇచ్చారు. 31.03.2014 నాటికి అయిన వ్యయం రూ.5,135.87కు సంబంధించి ఆడిట్ నివేదికలు సమర్పించాలని 2018 జూలై, 2019 మే, 2019 జూలై నెలల్లో అడిగామన్నారు. ఇప్పటి వరకు రూ.3,777.44 కోట్ల మేర ఆడిటింగ్ పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని వివరించారు. కేంద్ర ఆర్థిక శాఖ మధ్యంతర చర్యగా రూ.1,850 కోట్ల మేర ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేందుకు ఈ శాఖకు అనుమతి ఇచ్చిందని వివరించారు. కాగా, 26.11.2019న ఆర్థిక శాఖ ఒక లేఖ రాసిందని, దీని ప్రకారం గతంలో ఇచ్చిన షరతుల (ఆడిట్ నివేదిక సమర్పణ)ను సంతృప్తి పరచనంతవరకు తదుపరి నిధుల విడుదల ఉండదని మంత్రి పేర్కొన్నారు. ఏపీ మొత్తం అప్పులు రూ.3.41 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 2019–20 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.3,41,270 కోట్లుగా ఉందని, 2018–19 సవరించిన అంచనాల ప్రకారం ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.3,06,010 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అలాగే తెలంగాణ అప్పులు 2018–19 చివరినాటికి సవరించిన అంచనాల ప్రకారం రూ.1.44 లక్షల కోట్లుగా ఉందని, 2019–20 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.1.68 లక్షల కోట్లుగా ఉందని వివరించారు. -
‘రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని చేపట్టండి’
సాక్షి, న్యూఢిల్లీ : రామాయపట్నంలో భారీ పోర్టు నిర్మాణం పనులను సత్వరమే ప్రారంభించాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి. విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం దుగరాజపట్నంలో మేజర్ పోర్టు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలి. అయితే దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం లాభదాయకం కాదని తేలిన తర్వాత ప్రత్యామ్నాయంగా ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు. రామాయపట్నం పోర్టు అంతర్జాతీయ నౌకా రవాణాకు అనువైనదిగా గుర్తింపు పొందినట్లు ఆయన తెలిపారు. బంగాళాఖాతం తీరం హద్దుగా ఉన్న దేశాలలో నౌకాశ్రాయల నిర్మాణంపై ఇటీవల జరిగిన బిమ్స్టెక్ అంతర్జాతీయ సదస్సు సైతం రామాయపట్నం పోర్టు ఆవశ్యకతను ప్రసావించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. బిమ్స్టెక్ దేశాల మధ్య జరిగే వాణిజ్య లావాదేవీలపై రామాయపట్నం పోర్టు ప్రభావం గురించి ఈ సదస్సులో చర్చ జరిగినట్లు చెప్పారు. ఈ పోర్టును కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మేజర్ పోర్టు నిర్మాణానికి అనుమతులు సాధించడానికి బదులుగా గత ప్రభుత్వం రామాయపట్నంలో సొంతంగానే నాన్-మేజర్ పోర్టు నిర్మించాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు. కానీ నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. రామాయపట్నంలో నాన్-మేజర్ పోర్టు స్థానంలో కేంద్ర ప్రభుత్వం హామీ మేరకు మేజర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే పోర్టు నిర్మాణ బాధ్యతలను చేపట్టి త్వరితిగతిన పూర్తి చేస్తుందని అన్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని ఆయన అన్నారు. మేజర్ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రామాయపట్నంలో 3 వేల ఎకరాల భూమిని గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలులోకి వచ్చి ఇప్పటికే అయిదేళ్ళు పూర్తయినా రామాయపట్నం పోర్టు నిర్మాణం హామీని నెరవేర్చమంటూ ఇప్పటికీ మేము పార్లమెంటులో గొంతెత్తి అరవవలసి రావడం దురదృష్టకరమని అన్నారు. పోర్టు ప్రాజెక్ట్ ప్రక్రియను చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన దాని నిర్మాణం పూర్తి చేసేందుకు వీలుగా నిధులు మంజూరు చేయవలసిందిగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
‘ఏపీలో పెట్టుబుడులకు అదానీ గ్రూప్ సిద్ధంగానే ఉంది’
సాక్షి, విశాఖపట్నం : రామాయపట్నం పోర్టును జాతీయ పోర్టుగా అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. గురువారం విశాఖలో బిమ్స్టెక్ అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో బంగాళాఖాతం సముద్ర పరిధిలో ఉన్న ఏడు దేశాలు పాల్గొని.. పోర్టులలో ఎగుమతులు, దిగుమతులు, అభివృద్ధదిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ విభజన చట్టం ప్రకారం దుగరాజపట్నాన్ని ఎంపిక చేశారని, ఈ ప్రాంతంల్లో పోర్టు నిర్మాణానికి అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఏపీలో పెట్టుబడులకు అదానీ గ్రూపు సిద్ధంగానే ఉందని, దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుందన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల పెట్టుబుడులు పెట్టడానికి వచ్చే సంస్థలకు భూములు లేకుండా ఉన్నాయని మండిపడ్డారు. అందుకే ఎంత పెట్టుబుడులు పెట్టబోతున్నారో పూర్తి సమగ్ర నివేదిక అడుగుతున్నామని, అందుకు తగిన విధంగా ప్రభుత్వ నుంచి భూకేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రిలయన్స్ సంస్థకు కేటాయింపుల్లో సరిగా వ్యవహరించలేదని, అలాగే తిరుపతి వివాదాలున్న భూములను రిలయన్స్‌కు కేటాయించిందని ఆరోపించారు. ఇటీవల తాము ఇచ్చిన నోటీసులతో ఈ వ్యవహారాలన్నీ బయటపడ్డాయని, రిలయన్స్తోపాటు ఈ తరహా వివాదాలలో కేటాయించిన సంస్థలకు ప్రత్యామ్నాయ భూములు కేటాయింపులపై పరిళీలన చేస్తున్నామని తెలిపారు. పారిశ్రామికవేత్తలతో, ఔత్సాహికులతో చర్చించి తమ ప్రభుత్వం ఇండస్ట్రీ పాలసీ ప్రకటించబోతున్నామని, ఈ బడ్జెట్ సమావేశాలకు కొత్త పాలసీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
‘రామాయపట్నం పోర్టుకు ఏపీ ప్రభుత్వం సానుకూలం’
సాక్షి, ప్రకాశం : గత టీడీపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లాపై కక్ష సాధించిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీల్ నరసింహారావు విమర్శించారు. శుక్రవారం రామాయపట్నం పోర్టు ఏరియాను పరిశీలించిన జీవీఎల్.. పోర్టు వల్ల జరిగే మంచి చెడుల గురించి గ్రామస్తులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అన్ని అనుకూలంగా ఉన్నా గత టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించలేదని మండిపడ్డారు. పోర్టుపై కేంద్ర ప్రభుత్వం లేఖ రాసినా.. టీడీపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని చెప్పారు. రామాయపట్నం పోర్టుకు సహజ అనుకూలతలు ఉన్నాయని వివరించారు. కానీ ప్రస్తుతం ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోర్టుకు సానుకూలంగా ఉందన్నారు. పోర్టు కోసం తాను కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దీనిపై అవసరమైతే ప్రధానితో కూడా మాట్లాడతానని పేర్కొన్నారు. -
ప్రకాశానికి స‘పోర్టు’
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రామాయపట్నం పోర్టు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి, రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలంటూ కోరారు. జగన్ నిర్ణయం పట్ల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అనుకున్న ప్రకారం రామాయపట్నం పోర్టు నిర్మాణం జరిగితే జిల్లా రూపురేఖలే మారనున్నాయి. జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మరింత మెరుగవుతాయి. వెనుకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం చేపట్టాలనే నిర్ణయం వల్ల జిల్లా అభివృద్ధికి రెడ్ కార్పెట్ పరిచినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఎదురుచూస్తున్న జిల్లా ప్రజానీకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయం వరంగా మారింది. బాబు హయాంలో మోసాలతో కాలక్షేపం.. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు పోర్టు నిర్మాణంపై మోసం చేస్తూ వచ్చింది. 2014లో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు జిల్లా అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా జిల్లాకు తీసుకురాని దుర్భర పరిస్థితి. రామాయపట్నం పోర్టు ఏర్పాటు కోసం జిల్లాకు చెందిన అనేక మంది ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టినా గత ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల ముందు మాత్రం ఓట్ల కోసం రామాయపట్నంలో మినీ పోర్టు ఏర్పాటు పేరుతో 2019 జనవరి 9వ తేదీన భూమిపూజ చేసి మరో మోసానికి తెరతీసిన వైనం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండు నెలల కూడా గడవకముందే రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం ప్రధాని మోదీని నేరుగా కలిసి కోరడంపై జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రామాయపట్నం పోర్టుకు అనువు.. పోర్టు నిర్మాణానికి రామాయపట్నం అనుకూలంగా ఉంటుందని 2012 ఆగస్టు 22వ తేదీన కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ స్టేక్‌హోల్డర్స్‌తో సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ తరువాత 2012 సెప్టెంబర్ 2న అప్పటి ప్రభుత్వం రామాయపట్నం ప్రాంతం ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రానికి అణువైనదని పేర్కొంటూ కేంద్రానికి లేఖ రాసింది. 2013 ఏప్రిల్ 15న కేబినెట్ కమిటీకి కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ ఒక నోట్ సమర్పించింది. ఆ నోట్ ద్వారా రామాయపట్నం అనుకూల ప్రదేశమని ఆర్ధిక, రక్షణ, హోమ్, రవాణా, రైల్వే మంత్రిత్వ శాఖలకు సమాచారం అందించారు. క్యాబినెట్ కమిటీకి రాష్ట్ర విభజన చట్టంలో నెల్లూరు జిల్లా దుగరాజపట్నం పోర్టు నిర్మాణం చేపట్టాలని పొందుపర్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత అనూహ్యంగా దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగే సమయంలోనూ దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు అంశం విభజన చట్టంలో చేర్చారు. దీంతో అప్పటి నుంచి జిల్లాలో రామాయపట్నం పోర్టు ఏర్పాటు కోరుతూ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి.ప్రకాశం జిల్లా ప్రజల ఆశలు చిగురించేలా మంగళవారం సీఎం జగన్ రామాయపట్నం పోర్టు ఏర్పాటు అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించారు. దీంతో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల్లో ఆనందోత్సాహాల్లో ఉన్నారు. దశాబ్దాల కల నెరవేరుతుందనే ఆశలు సజీవంగా ఉన్నాయి. జిల్లా అభివృద్ధి జగన్‌కే సాధ్యం జిల్లా అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి వలనే సాధ్యమనే విషయం మరోసారి రుజువైంది. రామాయపట్నం పోర్టు నిర్మించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని కోరడం ద్వారా జిల్లాపై ఆయనకున్న ప్రేమ అర్ధమవుతుంది. జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు పోర్టు సాధన సమితి ఆయన్ను కలిసి పోర్టు నిర్మాణ విషయాన్ని వివరించాం. అప్పట్లో పోర్టు విషయంలో సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడవకముందే పోర్టు నిర్మాణంపై దృష్టి సారించడం హర్షణీయం. – మారెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విబాగం జిల్లా అధ్యక్షుడు -
రా‘మాయ’పట్నమేనా..!
సాక్షి, ఉలవపాడు: రామాయపట్నం పోర్టు.. జిల్లా వాసుల కల.. కానీ ఈ కలను నెరవేర్చడం సంగతి పక్కనపెడితే రాజకీయ అవసరాల కోసం ప్రజలను అయోమయంకు గురిచేసిన విషయం ఏదైనా ఉంది అంటే అది ఈ పోర్టుకు సంబంధించిన నిర్ణయాలే. ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. గత ప్రభుత్వం ఎన్నికలు వస్తున్నాయని తెలిసి జనవరి 9న హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం పోర్టు నిర్మిస్తుంది అంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ చేశారు. రెండు నెలల్లో పోర్టు పనులు ప్రారంభం అవుతాయి అని ఆ రోజు బహిరంగ సభలో చెప్పారు. ఆ తరువాత ఆ విషయమే పట్టించుకున్న దాఖలాలు లేవు. అసలు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అనే అనుమానం కూడా ప్రజల్లో బలంగా ఉంది. ఎన్నికల సమయంలో బాబు చేసిన ఈ భూమిపూజ ప్రభుత్వ అనుమతులతో జరిగిందా లేక పబ్లిసిటీ కోసం చేశారా అనే అయోమయంలో జిల్లా ప్రజలున్నారు. రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు గత పదేళ్లుగా అధికార, ప్రజాప్రతినిధుల ప్రకటనలు ప్రజలను అయోమయానికి గురి చేస్తూనే ఉన్నాయి. రెండు నెలల్లో పనులు ప్రారంభం అవుతాయి అని గత ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో నేటి వరకు ఆ ఊసేలేదు. కనీసం రెవెన్యూ అధికారులు సర్వే కూడా ప్రారంభించలేదు. సర్వే లేకుండా, భూ సేకరణచేయకుండా, పరిహారం గురించి నిర్ణయం తీసుకోకుండా గత ప్రభుత్వం ఎన్నికల వేళ హడావుడిగా భూమిపూజ చేసింది తప్ప పనులు చేయాలన్న ఉద్దేశమే లేదని ప్రజలకు అర్థమైపోయింది. కానీ పోర్టు నిర్మాణం అయోమయాలకు గురి చేస్తున్న పరిస్థితుల్లో నిజం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ఈ శాసన సభ సమావేశాల్లో రామాయపట్నం పోర్టుపై ప్రశ్నించనున్నారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియచేసి నియోజకవర్గ అభివృద్ధికి పోర్టు ఆవశ్యకతపై మాట్లాడనున్నారు. 2012 జనవరి నుంచి పోర్టు కోసం పరిశీలనలు జరుగుతూనే ఉన్నాయి. పోర్టు నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక బృందంను పరిశీలనకు పంపింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మహీధరరెడ్డి, నాటి కలెక్టర్ కాంతీలాల్ దండే వారికి పరిస్థితిని వివరించారు. వారు ఈ ప్రాంతం అనువుగా ఉందని కూడా తెలిపారు. కానీ తదనంతర పరిణామాలు ప్రకాశం జిల్లా వాసులను ఇబ్బందులకు గురిచేశాయి. దుగ్గరాజుపట్నంకు తరలింపు, తరువాత అక్కడ అనుమతులు లేక నిలుపుదల, ఇక్కడ చిన్నపోర్టు అని ప్రకటన, రాష్ట్రం లేఖ ఇవ్వలేదని కేంద్రం చెప్పడం, కేంద్రం ఇవ్వలేదని రాష్ట్రమే నిర్మిస్తుందని భూమి పూజ చేయడం.. ఇలా అంతా అయోమయంగా నడిచింది. అనుమతులు ఉండే భూమి పూజ చేశారా...? ఈ ఏడాది జనవరి 9న గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేసింది. కానీ ఈ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పోర్టు నిర్మించాలంటే ముందుగా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నుంచి అనుమతులు రావాలి. ఈ పోర్టు పరిధిలో అటవీశాఖ భూమి ఉంది కాబట్టి అటవీశాఖ నుంచి అనుమతులు రావాలి. ప్రారంభ సమయానికి ఇలాంటి అనుమతులు ఏమీ లేకుండానే భూమి పూజ చేసినట్లు సమాచారం. రామాయపట్నం పోర్టు కు కేంద్రం సుముఖతగా ఉన్నా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇవ్వకుండా తామే భూమి పూజ చేసి నిర్మిస్తున్నామని ప్రకటించారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేసిన ఈ ప్రక్రియ వలన ఉపయోగం ఉందా అనే ఆలోచనలో ప్రజలున్నారు. -
నిర్లక్ష్యపు రేవు
సాక్షి, ఒంగోలు సిటీ: జిల్లాలో వాడరేవు రాజకీయ రంగు పులుముకుంది. అభివృద్ధి గురించి పాలకులు దృష్టి పెట్టలేదు. వివిధ కోణాల నుంచి సాధ్యాసాధ్యాలను విస్మరించారు. ఎన్నికలు కొద్ది రోజుల్లో రాబోతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు రామాయపట్నం వాడరేవు పనులకు శంకుస్థాపన చేశారు. ముందు పెద్ద పోర్టు అన్నారు. తర్వాత ఇక్కడ మినీపోర్టు చాలన్నారు. దీర్ఘకాలం నుంచి జిల్లాలో వాడరేవు సాధ్యాసాధ్యాలపై నాయకుల్లో అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. చిత్తశుద్ధి ఉంటే ఏనాడో ఇక్కడ వాడరేవు వచ్చి ఉండేదని, నాటి తరం వారు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాకు రవాణా మార్గాలు మెరుగ్గా ఉన్నా వాడరేవు అభివృద్ధిపై అంతగా దృష్టి పెట్టలేకపోయారన్న విమర్శలున్నాయి. ఈ పాపం పాలకులదే. ఇది నేపథ్యం... సుమారు 600 మైళ్లు పొడవునా శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వరకు సముద్ర తీరం ఉంది. కానీ తీరాన ఎక్కువ చీలికలు లేకపోవడంతో మంచి రేవులు ఎక్కువగా ఏర్పడటానికి వీల్లేకుండా పోయింది. కాలగమనంలో కళింగ పట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, యానాం, నర్సాపూర్, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, మోటుపల్లి, కొత్తపట్నం, కృష్ణపట్నం వంటి వాటిలో కొన్ని వెలిశాయి. కొత్తపట్నం వాన్‌పిక్ ఇంకా రూపుదాల్చలేదు. రామాయపట్నం కాంగ్రెస్ హయాంలో రెండో దశ వరకు ప్రతిపాదనలపై పరిశీలించారు. చివరకు రామాయపట్నం మినీపోర్టు కిందకు మారింది. ఇక్కడ కొన్నింటికే గుర్తింపు.. ప్రభుత్వ అజమాయిషీలోని రేవుల విషయానికి వస్తే కళింగపట్నం, భీమునిపట్నం, కాకినాడ, నర్సాపూర్, మచిలీపట్నం, వాడరేవు, కృష్ణపట్నం రేవులు వస్తాయి. వీటిలో కాకినాడ, మచిలీపట్నం మధ్యతరహా రేవులుగాను, మిగిలినవి చిన్నతరహా రేవులుగాను ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం రేవుల అభివృద్ధి విషయంలో మాత్రమే కొంత శ్రద్ధ వహించారు. మిగిలిన రేవులు పేరుకు మాత్రమే. పనులు నిర్వహించడానికి ఎలాంటి వసతులు లేవు. ఒకప్పుడు విదేశ వ్యాపారాన్ని విస్తృతంగా సాగించిన ఈ రేవులు కోస్తా ప్రాంతం వెంట విజయవాడ, చెన్నైల మధ్య బకింగ్‌హాం కాలువ రైలు మార్గాల నిర్మాణం జరిగిన తర్వాత తీర రవాణా వాటి నుంచి పోటీకి తట్టుకోలేకపోయింది. ఇప్పుడు రూ.1400 కోట్ల వ్యయంతో బకింగ్‌హాం కాలువను అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన చేయడం గమనార్హం. హడావుడిగా శంకుస్థాపన రామాయపట్నం పోర్టు అభివృద్ధి ప్రతిపాదన దీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్నా దీనిని ఇప్పుడు ఈ ఎన్నికలకు హడావుడి చేసి రాజకీయం చేశారన్న విమర్శలు ఉన్నాయి. తగిన సర్వే లేకుండా మినీపోర్టుకు శంకుస్థాపన చేయడం గమనార్హం. యూపీఏ చైర్మన్‌గా సోనియాగాంధీ రామాయపట్నం వద్ద రేవు అభివృద్ధిపై అధికారుల బృందం ద్వారా పరిశీలన చేయించారు. పోర్టు సాధ్యాసాధ్యాలపై ఇంకా పూర్తి నివేదికలు రాకముందే..హడావుడి చేసి రామాయపట్నం శంకుస్థాపనలో రాజకీయ ప్రయోజనాలు తప్ప జిల్లా ప్రజలకు ఉపయోగపడేది అంతగా లేదన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. రామాయపట్నం విషయంలో సమగ్ర సర్వే, ఇప్పటి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ముందుకు పోతే మేలైన ఫలితాలు ఉంటాయన్నది నిపుణుల అభిప్రాయం. వాడరేవు కథ చీరాలకు దగ్గరలో ఐదు మైళ్ల దూరంలో వాడరేవు ఉంది. 1892–93 మధ్యకాలంలో 1949 వరకు సవరించిన బంగాళాఖాతం తీరంలో రామాయపట్నం నుంచి నర్సాపూర్ వరకు సూచించే సర్వే చార్టులో దీనిని ఈపూరుపాలెంగా గుర్తించారు. ఆ రోజుల్లో చిన్న పల్లెగా ఉన్న రేవు రెవెన్యూ వ్యవహారాలకు ఈపూరుపాలెం శివార్లలో ఉండడం గమనార్హం. ఈ రేవు నుంచి విదేశాలకు కోస్తా రవాణా చురుకుగా ఈ శతాబ్దం ఆరంభంలో జరిగినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. రేవుకు ఉన్న సామర్ధ్యాన్ని గుర్తించి 1933లో తూర్పు తీర వర్తక కంపెనీ ఈస్ట్‌కోస్టల్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో ఒక సంస్థ రిజిస్టర్ చేశారు. రేవు అభివృద్ధి విషయంలో అప్పటి మద్రాసు ప్రభుత్వం గట్టిగా కృషి చేసింది. 1944లో యుద్ధ అనంతరం పునర్నిర్మాణ పథకాల కింద అప్పటి మద్రాసు ప్రభుత్వం దాదాపు 1200 మైళ్ల పొడవునా విస్తరించి ఉన్న తీర రేఖలోని రేవుల అభివృద్ధి విషయమై పరిశీలించాల్సిందిగా ప్రెసిడెన్సి పోర్టు ఆఫీసర్‌ను ఆదేశించినట్లుగా ఉంది. పెద్దనౌకలను నిలపడానికి అవసరమైన రేఖ తీరానికి 1.2 మైళ్ల దూరంలో ఉందని కనుగొన్నారు. దీని నిర్మాణానికి సిఫార్సు చేశారు. ఇక్కడి నుంచి వర్తకం పెరిగితే మద్రాసు నష్టపోతుందని ప్రెసిడెన్సి పోర్టు ఆఫీసర్ అప్పట్లో తన నివేదికలో సూచించారు. దీంతో అప్పట్లో మద్రాసు ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. 1949లో వాడరేవులోని ప్రభుత్వ రేవు కస్టమ్స్ కార్యాలయాన్ని మూసివేశారు. 1957లో ఏర్పడిన వాడరేవు పోర్టు అభివృద్ధి కమిటీ వారి అవిరళ కృషి వల్ల భారత ప్రభుత్వం ఈ రేవును జనవరి ఒకటి 1959న విదేశ వర్తకానికి అనుమతించింది. ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయం వాడరేవులో తిరిగి పని చేయడం మొదలైంది. 1960లో రూ.3.5 లక్షల వ్యయంతో హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించారు. సర్వే నివేదికలో ఈ రేవు నౌకా రవాణాకు అన్ని విధాలుగా తగిందని పేర్కొన్నారు. ఈ సిఫార్సు తర్వాత సరిహద్దు స్తంభాలు మాష్ట్ను నిర్మించారు. ఎగుమతిదారులు సమ్మతించారు. గుంటూరులో జరిగిన సదస్సులో వాడరేవును నిర్మించి అభివృద్ధి చేయమని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వ చిన్నరేవుల ప్రత్యేకాధికారి ఐజీ ధాకో 1959లో వాడరేవును సందర్శించి నిర్మించడానికి అనువైన స్థలాన్ని నిర్ణయించారు. 1963లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిన్న రేవులు అభివృద్ధి సంఘం సమావేశంలో వాడరేవు నిర్మాణం గురించి ఏకగ్రీవంగా తీర్మానించారు. చతుర్ధ పంచ వర్ష ప్రణాళికలో పీర్ నిర్మాణానికి రూ.60 లక్షలు నిధులు కేటాయించారు. వాడరేవు రాష్ట్ర తీరరేఖకు దాదాపు మధ్యలో ఉన్నందున ఆంధ్రా, కోస్తా, రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. ఈ రేవు నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లా నుంచి సాలుకు లక్ష టన్నులకు తక్కువ ట్రాఫిక్ ఉండవని అంచనా వేశారు. రోడ్డు, రైలు మార్గాలు అమరి ఉన్నాయి. ఇప్పటికి ఐఎల్టీడీ కంపెనీ వరకు ఉన్న బ్రాంచి రైలు మార్గాన్ని సుమారు నాలుగు మైళ్లు పొడిగిస్తే రేవును చీరాల స్టేషన్‌తో కలిపే వీలుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని దిగుమతులను చాలా వరకు చెన్నై నౌకాశ్రయం నిర్వహిస్తోంది. చెన్నై రేవుకు ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించాలంటే వాడరేవు అభివృద్ధి వల్లే సాధ్యపడుతుంది. -
రామాయపట్నం పోర్టుకు స్టిక్కర్ సినిమా
సాక్షి, కావలి: ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లుగానే ఎన్నికల కోసం చంద్రబాబు రామాయపట్నం పోర్టుకు స్టిక్కర్ సినిమా చూపించారు. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నంలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ.25 వేల కోట్లతో భారీ పోర్టు కమ్ షిప్ యార్డు నిర్మాణానికి కేంద్రం ముందుకు వచ్చింది. అయితే ఈ పోర్టును ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా పోర్టు నిర్మాణానికి ఆమోదం లేఖ ఇవ్వకుండా ముఖం చాటేసింది. ఎన్నికలు సమీపించడంతో పోర్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తడంతో చివరాకరుకు ‘స్టిక్కర్ సినిమా’ చూపించారు. రామాయపట్నం సముద్ర తీరం భౌగోళికంగా ప్రకాశం జిల్లాలో ఉన్నా.. మొట్టమొదటగా జిల్లాలోని కావలి, ఉదయగిరి నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో రామాయపట్నం పోర్టు నిర్మాణం ఈ ప్రాంత ప్రజల్లో సెంట్‌మెంట్‌గా మారింది. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన పోర్టు విషయంలో స్వలాభం కోసం పాకులాడిన చంద్రబాబు ఎన్డీఏతో తెగతెంపులు చేసుకున్నాక.. కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టేస్తూ రామాయపట్నం పోర్ట్ నిర్మించడానికి ఇష్టపడటం లేదని చంద్రబాబు విమర్శలు చేస్తూ, గత సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేట్ రంగం సహకారంతో పోర్టు నిర్మిస్తుందని ప్రకటించారు. దీంతో బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్ర కావలిలో హంగామా చేశారు. అదే నెల 20వ తేదీ రామయపట్నంలో టీడీపీ నాయకులు కృతజ్ఞతల సభ పెట్టి చంద్రబాబుకు ప్రజలు రుణపడి ఉన్నారంటూ ఉపన్యాసాలిచ్చారు. సీన్ కట్ చేస్తే.. ఈ ఏడాది జనవరి 9వ తేదీ చంద్రబాబు రామాయపట్నంకు హెలికాప్టర్లో వచ్చి పోర్టును నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. భారీ హంగామాతో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు రాయికి అంటించిన స్టిక్కర్ శిలాఫలకానికి ముసుగు తొలగించి స్టిక్కర్ సినిమా ప్రజలకు చూపించి రామాయపట్నం పోర్ట్ నిర్మించేందుకు శంకుస్థాపన చేసినట్లుగా ప్రకటించారు. రూ.4,500 కోట్లతో పోర్టు నిర్మాణం మాత్రం వచ్చే ఏడాది మొదలు పెడుతామని చంద్రబాబు చెప్పారు. అసలు ఏడాది తర్వాత నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి ఇప్పుడు శంకుస్థాపన ఏమిటని అప్పడే కార్యక్రమంలో పాల్గొన టీడీపీ నాయకులే పెదవి విరిచారు. చంద్రబాబు ప్రజలకు చూపించిన స్టికర్‌ను ఎన్నికల్లో ప్రజలకు చూపించి మభ్యపెట్టాలని టీడీపీ నాయకులు పెద్ద స్కెచ్‌లే వేశారు. అయితే చంద్రబాబు స్టికర్ చినిగిపోయి, గాలికి ఎగిరి పోయింది. అసలు శంకుస్థాపన వివరాలు తెలియజేసే స్టిక్కర్ రామయపట్నం వద్ద లేకపోవడంతో టీడీపీ నాయకులు తలలు పట్టుకొంటున్నారు. ఇన్ని వేల కోట్లతో చేపట్టే పోర్టు నిర్మాణానికి కనీసం శాశ్వతంగా ఉండే శిలాఫలకాన్ని కాకుండా చినిగిపోయే స్టిక్కర్‌తో శంకుస్థాపన సినిమా చూపించడం చూస్తే ‘ఇది ఎన్నికల సినిమా’అని అర్థమవుతోంది. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామో రామో.. తెలియదు.. శిలాఫలకమైతే శాశ్వతంగా ఉంటుంది. దీన్ని టీడీపీ వైఫల్య ప్రాజెక్ట్‌గా ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయని ముందుస్తు ఆలోచనతో స్టిక్కర్లతో శంకుస్థాపన చేశారని స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేపర్ మిల్లుకు స్టిక్కర్ శిలాఫలకం ఇది ఇలా ఉంటే రూ.24,500 కోట్లతో రామాయపట్నంలో పేపర్ మిల్లును నిర్మిస్తున్నట్లు, అందులో 18 వేలు మందికి ఉద్యోగాలు ఇస్తారని చంద్రబాబు అదే రోజు శంకుస్థాపన చేశారు. అక్కడ కూడా స్టిక్కర్ సినిమానే చూపించారు. ఆ స్టిక్కర్ మాత్రం కొంచెం చినిగి ఇంకా గోడకు అంటుకొని ఉంది. ఈ పేపర్ మిల్లు నిర్మాణ పనులు కూడా మొదలే కాలేదు. కేంద్ర ప్రభుత్వం భారీ ఓడ రేవు, నౌకా నిర్మాణ కేంద్రం నిర్మించడానికి సిద్ధపడితే, దానికి అంగీకరించకుండా బుల్లి పోర్టు నిర్మిస్తామని చంద్రబాబు, మంత్రులు నారాయణ, ద్దా రాఘవరావు, టీడీపీ నేతలు బీద రవిచంద్ర, బీద మస్తాన్‌రావు శంకుస్థాపన కోసం వాడిన స్టిక్కరే లేకపోవడంతో తాము ప్రజలకు ఏ మొహం పెట్టుకొని పోర్టు ప్రస్తావన చెప్పాలని టీడీపీ నాయకులు బిక్కమోహం పెట్టుకొని కర్మరా బాబు అంటూ నిట్టూర్చుతున్నారు. రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేశారు. అభివృద్ధి పనులు మాత్రం బాహుబలి సినిమా సెట్టింగ్‌లను మించి గ్రాఫిక్ చిత్రాల్లో కనిపిస్తున్నాయి. ఎన్నికల కోసం చంద్రబాబు శాశ్వత శిలాఫలకాలకు బదులు.. స్టిక్కర్లతో జనానికి సినిమా చూపిస్తున్నారు. – నరేంద్ర మోదీ, భారత ప్రధాని గుంటూరు బహిరంగ సభలో వ్యాఖ్యలు నిన్ను నమ్మలేము బాబు ఏడేళ్లుగా రామాయపట్నంలో భారీ పోర్ట్‌ను, ఓడలు తయారు చేసే కర్మాగారాన్ని, మరమ్మతులు చేసే పరిశ్రమ స్థాపిస్తారని చెబుతుంటే వింటూనే ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం నిర్మించడానికి రెడీగా ఉన్నా, చంద్రబాబు ఎందుకు సరే అనలేదో ఇప్పటికీ అర్థం కావడం లేదు. పోనీ చంద్రబాబు కట్టేదా అంటే.. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటారు. ఇప్పడేమో శంకుస్థాపన చేసి, సంవత్సరం తర్వాత నిర్మాణ మొదలు పెడతామన్నారు. ఇవన్నీ ఎలా నమ్మాలి. ఈ పోర్టు నిర్మించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. శాశ్వత శిలాఫలకం బదులు స్టిక్కర్ శిలాఫలకం వేయడంలో చంద్రబాబు చిత్తశుద్ధి తేటతెల్లమవుతోంది. అందుకే నిన్ను నమ్మలేము బాబు. – బొగ్గవరపు వెంకటేశ్వర్లు, కావలి చంద్రబాబు అన్యాయం చేశారు రామాయపట్నం పోర్టు విసయంలో మొదటి నుంచి కూడా చంద్రబాబు ది మోసపూరితమైన వైఖరినే అవలంబిస్తున్నారు. అందుకే ఎన్నికలు దగ్గరుకు వచ్చేనప్పుడు శంకుస్థాపన అంటూ హడావుడి చేశారు. టీడీపీ నాయకులు అయితే పోర్టు కట్టేసి ఓడలు కూడా వచ్చేనట్లుగా గ్రాఫిక్స్ సినిమా చూపించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్మించే ఓడరేవులకే వాణిజ్య పరంగా అంతర్జాయ మార్కెట్లో ప్రాధాన్యత ఉంటుంది. యువకులకు ఉద్యోగాలు వస్తాయి. కానీ చంద్రబాబు పోర్టు విషయంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాకు ప్రజలకు అన్యాయం చేశారు. కేంద్ర ప్రభుత్వం పోర్టు నిర్మిస్తానంటే పట్టించుకోని చంద్రబాబు ఎన్నికల సమయంలో స్టిక్కర్లతో జనాన్ని మోసం చేశాడు. – షేక్ నాయబ్ రసూల్, కావలి -
రామాయపట్నం పోర్టును కావలనే మైనర్ పోర్టుగా మారుస్తున్నారు
-
మేజరు కాదు మైనరే..
అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నరేళ్లు రామాయపట్నం పోర్టు విషయంలో కాలక్షేపం చేసిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల వేళ సరికొత్త నాటకానికి తెరతీసింది. మినీపోర్టు పేరుతో ఇటు నెల్లూరు, అటు ప్రకాశం జిల్లా వాసులను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ భారీ ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రాలకు అనుకూలమైన వాతావరణం ఉందని నిపుణుల కమిటీ పేర్కొంది. పోర్టు నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం ముందుకు వచ్చింది. మరి ఎవరికి లబ్ధి చేకూర్చేందుకో చంద్రబాబు రూ.17,615 కోట్లు కాదని, రూ. 4,500 కోట్లతో మినీపోర్టు నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఇంత హడావుడిగా 11వ తేదీన జీఓ విడుదల చేయడం వెనుక భారీ కుట్రదాగి ఉందని, ప్రైవేట్ సంస్థలకు మేలు చేసేలా బాబు సర్కార్ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా టీడీపీ ప్రభుత్వం తీరుగా ఉందని రాజకీయవర్గాలు మండి పడుతున్నాయి. పోర్టు ఏర్పాటు కోసం వైఎస్సార్ సీపీ నేతలు నాలుగేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. నెల్లూరు, కావలి: కేంద్ర ప్రభుత్వం 2011లో దేశంలో తూర్పు సముద్ర తీరప్రాంతమైన బంగాళాఖాతం ఒడ్డున రెండు భారీ ఓడరేవులను నిర్మించాలని నిర్ణయించింది. అందులో ఒకటి పశ్చిమ బెంగాల్, మరొకటి మన రాష్ట్రానికి కేటాయించింది. రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా నక్కపల్లి, ప్రకాశం జిల్లా రామాయపట్నం, నెల్లూరు జిల్లా దుగరాజపట్నం తీర ప్రాంతాలను పరిశీలించిన నిపుణులు కమిటీ చివరకు రామాయపట్నం తీరం భారీ పోర్టు కమ్ షిప్ యార్డుకు అన్ని రకాలుగా సానుకూలమని నివేదికలు ఇచ్చారు. ఈ క్రమంలో 2012 సెప్టెంబర్‌లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రామాయపట్నంలో పోర్టు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అయితే అప్పటి తిరుపతి ఎంపీ చింతామోహన్ లాబీయింగ్ చేసి దుగరాజపట్నంలో పోర్టు ఏర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో యూపీఏ సర్కార్ 2013 మేలో దుగరాజపట్నంలోనే పోర్టు నిర్మిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత కిరణ్ సర్కార్ పట్టించుకోకపోవడంతో ఆ నిర్ణయం ప్రకటనకే పరిమతమైంది. తర్వాత వచ్చిన చంద్రబాబు సర్కార్ దాదాపు సంవత్సరం పాటు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2015 జూలైలో కేంద్ర నౌకాయానశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్లో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించాల్సిన ఈ భారీ పోర్టుకు మొత్తం రూ.17,615 కోట్లు ఖర్చు అవుతుందని, తొలి విడతలో రూ.6,091 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవని, ఇక తాము మాత్రం చేయగలిగింది ఏముందని స్పష్టంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌లో భారీ ఓడరేవుకు సర్వే చేసిన నిపుణుల బృందం చెన్నై ఐఐటీకి చెందిన సముద్ర నిపుణుల బృందం రాష్ట్రంలోని నక్కపల్లి, రామాయపట్నం, దుగరాజుపట్నంను సర్వే చేసింది. రామాయపట్నంలో రెండు నెలలు పాటు మకాం వేసి సర్వే చేశారు. సముద్రంలో కొంత లోపలికి వెళ్లి అక్కడి నుంచి మూడు కిలో మీటర్లు వరకు కావలి వైపు ఉన్న తీరం వైపుగా సర్వే చేశారు. ఆ సర్వేలో అన్ని విధాలుగా రామాయపట్నం తీరమే పోర్టు నిర్మాణానికి సాంకేతికంగా అనువైనదిగా నివేదిక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. రైట్స్ అనే సంస్థ కూడా ఇదే అభిప్రాయంతో కూడిన నివేదికను ప్రభుత్వాలకు అందించింది. రామాయపట్నం తీరంలో సముద్రం 20 మీటర్ల లోతు కలిగి ఉండటం బాగా కలిసొచ్చే అంశంగా నిపుణులు తేల్చారు. ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక సర్వే సంస్థ కూడా రామాయపట్నమే అన్ని విధాలుగా లాభదాయకమని, భద్రత పరంగా క్షేమమని తేల్చేసింది. ఇన్ని అనుకూలతలు ఉన్న రామాయపట్నంలో పోర్టు కమ్ షిప్ యార్డ్ నిర్మాణానికి అధికార టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లున్నర ఏళ్లుగా నోరెత్తడానికి సాహసించలేకపోయారు. గేమ్ ఆడిన చంద్రబాబు ప్రభుత్వం పశ్చిమబెంగాల్లో నిర్మిస్తున్న పోర్టులో 74 శాతం కేంద్రం వాటా కాగా 26 శాతం ఆ రాష్ట్ర ప్రభుత్వానిది. ఇందుకు విరుద్ధంగా ఉండేలా చంద్రబాబు సర్కార్ ఓ పథకాన్ని వేసింది. కేంద్ర పాలసీనీ మార్చేలా సిద్ధమైంది. పోర్టుకు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, పరిహారం, పునరావాసం, మౌలిక వసతులు అభివృద్ధి తదితర అన్నింటికి లెక్కలు కట్టి నిధులను కేంద్రం ప్రభుత్వం నుంచి తీసుకు రావాలనుకుంది. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు వాటాదారుడుని తీసుకొచ్చి ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కల్పించాలని స్కెచ్ వేసింది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన లాబీయింగ్‌ను కేంద్ర ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. ఇది ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం చివరిగా ఈ ఏడాది మే 4వ తేదీ దుగరాజపట్నం బదులుగా మరో ప్రాంతాన్ని సూచించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇలాంటి లేఖలు అప్పటికే మూడు రాసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. దీంతో మే 12వ తేదీన ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనిపై రాష్ట్ర అధికారులు ఏమీ తేల్చకుండా కేంద్రంపై వదిలేశారు. ఎక్కడ నిర్మించాలో మీరే చెప్పండని నిర్ణయం కేంద్రం కోర్టులో వేసి కాలక్షేపం చేసింది. రామాయపట్నంలో భారీ ఓడ రేవు, నౌకా నిర్మాణ కేంద్రాన్ని నిర్మించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయకుండా అటకెక్కించారు. హడావుడి నిర్ణయం వెనుక మినీపోర్టు నిర్ణయం వెనుక ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు మేలు చేసే విధంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక పథకం ప్రకారం పోర్టు నిర్మాణాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలన్న కుట్రదాగి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. సమీపంలో ఉన్న కృష్ణపట్టణం పోర్టుకు మేలు చేసేలా ఉందని నిపుణులు అంటున్నారు. అసలు బుల్లి పోర్టుకు సంబంధించి రామాయపట్నంలో నిర్మాణ పనులు ఇప్పుడు ప్రారంభిస్తే కనీసం మొదటి జెట్టీ (ఓడలు వచ్చే ఆగే ప్లాట్‌ఫాం) అందుబాటులోకి వచ్చే సరికి మూడేళ్లు పడుతుంది. చంద్రబాబు ప్రభుత్వం కొత్త జీఓ లోనే బుల్లి పోర్టు నిర్మాణానికి నిధులు, నిర్మాణం తదితర అంశాలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అధికారులు ఎంత వేగంగా పనులు చేసినా ప్రతిపాదనలు రూపొందించాలంటే కనీసం మూడు నెలల నుంచి నాలుగు నెలల పడుతుంది. ఈలోగా ఎన్నికల సమయం వచ్చేస్తుంది. దీంతో శాశ్వతంగా పోర్టుకు ప్రతిపాదనలు సమాధి చేసేందుకు జరిగిన కుట్రగా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా బుల్లిపోర్టు నిర్మిస్తామంటూ ఎంచక్కా ప్రచారం చేసుకునేందుకు స్థానిక నేతలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 21న ‘థ్యాంక్స్ టు చంద్రబాబు’ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజలను మోసం చేసేందుకు హడావుడి చేస్తున్నారు. స్థానిక నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
నాలుగేళ్ల తర్వాత ప్రత్యేకహోదా గుర్తొచ్చిందా?
-
పోర్టు కోసం పెరుగుతున్న ఒత్తిడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి అనుకూలతలు లేవని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అనుకూలత పెరిగింది. రామాయపట్నంలో పోర్టు నిర్మిస్తామని అధికార పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తే సమీపంలోని రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్రం అంగీకరించదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఇన్నాళ్లు మౌనం దాల్చింది. కేంద్ర ప్రభుత్వం దుగ్గిరాజపట్నం పోర్టు నిర్మాణానికి అనుకూలతలు లేవని తాజాగా తేల్చిచెప్పింది. ప్రత్యామ్నాయంగా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్రం అంగీకరించే అవకాశముంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రామాయపట్నం పోర్టు కోసం వైఎస్సార్ సీపీ, వామపక్షాలు ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాలరెడ్డి ఆధ్వర్యంలో రామాయపట్నం పోర్టు కోసం కావలి నుంచి రామాయపట్నం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వైఎస్సార్ సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు వామపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. అధికారంలో ఉన్న టీడీపీ రామాయపట్నం పోర్టు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరుతున్నారు. రామాయపట్నమే పోర్టుకు అనుకూలత: ► కేంద్ర ప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ పోర్టు కమ్ షిప్‌యార్డు నిర్మాణానికి రామాయపట్నం తీరం అనువైనదిగా ఇప్పటికే నివేదికనిచ్చింది. ► ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోర్టు కోసం అవసరమైన మేర ప్రభుత్వ భూములున్నాయి. ► ఇక్కడ సముద్రం సహజంగానే లోతుగా ఉంది. కాబట్టి షిప్‌యార్డు నిర్మాణానికి డ్రెడ్జింగ్ (ఇసుక తవ్వి బయటకు పోయడం) అవసరం ఉండదు. ► కేంద్ర నౌకాయాన శాఖలోని ఆర్థిక–రవాణా విభాగానికి చెందిన ఉన్నత స్థాయి అధికారి బీఎం అరోరా నేతృత్వంలోని కమిటీ రామాయపట్నం తీరం ఎగుమతులు, దిగుమతులకు అనుకూలమని నివేదిక ఇచ్చింది. ► గ్రానైట్, ఆక్వా ఉత్పత్తులను విదేశాలకు భారీ స్థాయిలో ఎగుమతి చేయవచ్చు. దుబాయ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ తరహాలో ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు చైనా, సింగపూర్ దేశాల కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. ► రామాయపట్నం తీరం నుంచి జాతీయ రహదారి, రైలు మార్గం రెండూ తీరానికి కేవలం 5 కి.మీ. లోపే ఉన్నాయి. ► రామాయపట్నంలో ప్రతిపాదించింది కేవలం పోర్టు నిర్మాణమే కాదు. షిప్ బిల్డింగ్ యూనిట్, షిప్ బ్రేకింగ్ యూనిట్ (డిస్‌మాల్టిల్), నేషనల్ మ్యానుఫాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ జోన్. ఇవన్నీ వస్తే ఉద్యోగాల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ► రామాయపట్నం పోర్టు వస్తే గ్రానైట్, పత్తి, పొగాకు, ఆక్వా ఉత్పత్తులు, ఇనుప ఖనిజాల ఎగుమతులకు మరింత అనుకూలం. దుగ్గిరాజపట్నంలో పోర్టు ఏర్పాటుకు అడ్డంకులు: ► అక్కడ షిప్‌యార్డు నిర్మిస్తే సమీపంలోనే ఉన్న పులికాట్ సరస్సుకు ముంపు వాటిల్లుతుంది. పర్యావరణ సమస్యలు ఎదురవుతాయి. ► ఖండాతరాల నుంచి విహారానికి వచ్చే పక్షులు ముఖం చాటేస్తే నేలపట్టుకు ఉన్న అంతర్జాతీయ ఖ్యాతి కనుమరుగవుతుంది. ► షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం ఉన్నందున దేశ రక్షణ, ఆంతరంగిక భద్రత దృష్ట్యా అక్కడ షిప్‌యార్డు నిర్మాణం మంచిది కాదు. ► దుగ్గిరాజపట్నం పోర్టు నిర్మిస్తే ఇప్పటికే ఉన్న కృష్ణపట్నం పోర్టు, దక్షిణాన కట్టుపల్లి, ఇన్నురు, చెన్నై పోర్టులు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ► దుగ్గిరాజపట్నం తీరం జాతీయ రహదారికి, రైలు మార్గానికి చేరువలో లేనందున తీరాన్ని కలుపుతూ 50 కి.మీ. మేర రోడ్డు వేయాలి. అందు కోసం మళ్లీ ప్రైవేట్ భూములనే సేకరించాలి. ► ప్రభుత్వం కేటాయించిన డబ్బు దుగ్గిరాజపట్నంలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న ల్యాండ్‌ను మార్కెట్ ధరకి కొనడానికే చాలదు. మరీ షిప్‌యార్డును ఎలా నిర్మిస్తారు...? ఇప్పటికీ నిర్మిస్తారు...? దుగ్గిరాజపట్నం ఏరియా కృష్ణపట్నం పోర్టు అథారిటీ ఎకనామిక్ జోన్ పరిధిలో ఉన్నందున వారు అంగీకరించే పరిస్థితి లేదు. -
రామాయపట్నం వైపే కేంద్రం మొగ్గు..!
కావలి: నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో అనూహ్యమైన అభివృద్ధి, అపారమైన ఉపాధి, ఉద్యోగావకాశాలు కలిగే రామాయపట్నం తీరం వద్ద భారీ ఓడ రేవు, నౌకాశ్రయాన్ని నిర్మించేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. మూడేళ్ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి సత్ఫలితాలు రానున్న సంకేతాలు ఉన్నాయి. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్లమెంట్లో పోర్ట్ కమ్ షిప్ యార్డ్ నిర్మాణ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు నిలదీశారు. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్‌గడ్కరీని కలిసి దీనిపై విజ్ఞాపనలను అందజేశారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నేరుగా దీనిపై సత్వరమే చర్యలు తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకోవాలని నితిన్ గడ్కరీకి లేఖలు రాశారు. కావలి మాజీ ఎమ్మెల్యే, వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ సలహా కమిటీ సభ్యుడు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ముందడుగేసి రామాయపట్నం పోర్ట్ కమ్ షిప్ యార్డ్ సాధన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పలు రకాల కార్యక్రమాలు నిర్వహించి దీని ఆవశ్యతను ప్రజలకు తెలియజేస్తూ, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చేసింది. ఈ క్రమంలో పోర్ట్ కమ్ షిప్ యార్డ్ కమిటీ చైర్మన్‌గా వంటేరు వేణుగోపాల్‌రెడ్డి సారథ్యంలో కావలి నుంచి రామాయపట్నం వరకు 25 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. 2016 సెప్టెంబర్ మూడున నిర్వహించిన పాదయాత్రలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. ‘దుగరాజపట్నం’పై ఆది నుంచి గందరగోళం కేంద్ర ప్రభుత్వం 2011లో దేశంలో బంగాళాఖాతం ఒడ్డున రెండు భారీ ఓడరేవులను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో సాగర్ సముద్ర తీరాన్ని ఆ రాష్ట్రం ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అదే ఏడాదిలో భారీ ఓడరేవు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మాత్రం విశాఖపట్నం జిల్లా నక్కపల్లి, ప్రకాశం జిల్లా రామాయపట్నం, నెల్లూరు జిల్లా దుగరాజుపట్నం తీర ప్రాంతాలను ఆయా ప్రాంత నాయకులు తెరపైకి తీసుకొ చ్చారు. దీంతో భారీ ఓడరేవు నిర్మాణా నికి ప్రదేశం ఎంపికలో వివాదం తత్తిం ది. దీనిపై నిపుణుల కమిటీ రామాయపట్నం తీరం భారీ పోర్టు కమ్ షిప్ యార్డుకు అన్ని రకాలుగా సానుకూలమని నివేదికలిచ్చింది. ఈ క్రమంలో 2012 సెప్టెంబర్‌లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రామాయపట్నంలో పోర్టు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అయితే కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఓ లేఖను అప్పటి కేంద్ర ప్రభుత్వానికి అందజేయడంతో బ్రేక్ పడింది. అప్పటి నుంచి ఆ వ్యవహారం మరుగున పడిపోయింది. షార్ అభ్యంతరాలు 2015 జూలైలో కేంద్ర నౌకాయానశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్లో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించాల్సిన ఈ భారీ పోర్టుకు రూ.17,615 కోట్లు ఖర్చవుతుందని, తొలి విడతలో రూ.6,091 కోట్లను ఖర్చు పెట్టాలని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యల్లేవని ప్రకటించారు. అయితే 2017లో కేంద్ర ప్రభుత్వం దుగరాజపట్నంలో పోర్టు కమ్ షిప్‌యార్డ్ నిర్మాణం కుదరదని, షార్ అభ్యంతరాలు పెడుతోందని కేంద్ర ప్రభుత్వం తేల్చింది. మరో ప్రత్యామ్నాయ ప్రదేశం చూపాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిపుణులు అందజేసిన నివేదికలను ప్రాతిపదికగా చేసుకొని రామాయపట్నం వద్ద పోర్ట్ కమ్ షిప్ యార్డ్ నిర్మాణానికి ఆమోదిస్తూ కేంద్రానికి లేఖ రాయడమే మిగిలి ఉంది. మరోవైపు భారీ నౌకాశ్రయాన్ని నిర్మిస్తామని.. ప్రదేశాన్ని చూపమని కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రామాయపట్నంలో పోర్టు నిర్మిస్తే, దానికి సమీపంలో ఉన్న కావలి పట్టణానికి మహర్దశ పట్టనుంది. -
పోర్టు కోసం పోరు
కావలి: జిల్లాలో వెనుకబడిన కావలి, ఉదయగిరి నియోజకవర్గాలతోపాటు ప్రకాశం జిల్లా ప్రజలను ఊరిస్తున్న పోర్టు కమ్ షిప్ యార్డు సాధనకు కావలి కేంద్రంగా పోరాటాలకు రంగం సిద్ధమవుతోంది. పోర్టు కమ్ షిప్ యార్డు ఏర్పాటుకు రామాయపట్నం ప్రాంతం అనుకూలమని నిపుణుల కమిటీ తేల్చింది. అయితే, 2011 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీరువల్ల పోర్టు నిర్మాణం నేటికీ కార్యరూపం దాల్చ లేదు. ఇక్కడ పోర్టు నెలకొల్ప డానికి గల అవకాశాలు, వనరులపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైట్స్ సంస్థ ప్రతి నిధులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. నెల్లూరు–ప్రకాశం జిల్లాల నడుమ కావలి తీరానికి అతి సమీపంలో గల రామాయపట్నం అన్నివిధాలా అనుకూలంగా ఉన్నట్టు తేల్చి ప్రభుత్వానికి నివేదించారు. ఆ ప్రతిపాదనలు నేటికీ కార్యరూపం దాల్చకపోవడంతో పోర్టు సాధన దిశగా పోరుబాట పట్టేం దుకు కార్యచరణ సిద్ధమవుతోంది. ప్రతిపాదనలు ఇలా.. దేశంలోని తూర్పు సముద్ర తీరప్రాంతంలో రెండు భారీ ఓడరేవులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం 2001లో విధాన నిర్ణయం తీసుకుంది. వస్తువుల ఎగుమతి, దిగుమతులతోపాటు ఓడల తయారీ, మరమ్మతులకు అనువుగా పశ్చిమ బెంగాల్లో ఒకటి, మన రాష్ట్రంలో ఒకటి చొప్పున పోర్టు కమ్ షిప్‌యార్డు నిర్మించేందుకు తలపెట్టింంది. పశ్చిమ బెంగాల్ మాత్రం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సాగర్ తీరం ఇందుకు అనువుగా ఉంటుందని వెనువెంటనే సిఫార్సులు పంపించింది. అదే సంవత్సరంలో భారీ ఓడరేవు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభమయ్యాయి. మన రాష్ట్రానికి వస్తే విశాఖపట్నం జిల్లా నక్కపల్లి, ప్రకాశం జిల్లా రామాయట్నం, నెల్లూరు జిల్లా దుగరాజపట్నం తీర ప్రాంతాల్లో దీనిని ఏర్పాటు చేయాలంటూ ఆయా ప్రాంతాల నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో భారీ ఓడరేవు నిర్మాణానికి ప్రదేశం ఎంపిక విషయంలో వివాదం తలెత్తింది. దీనిపై నిపుణులు కమిటీ వివిధ ప్రాంతాలను పరిశీలించి రామాయపట్నం తీరం దీనికి అనుకూలంగా ఉందని తేల్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో 2012 సెప్టెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి రామాయపట్నంలో పోర్టు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఎంపీ మెలికతో.. అప్పట్లో తిరుపతి ఎంపీగా ఉన్న చింతా మోహన్ దుగరాజుపట్నంలో ఓడరేవు నిర్మించాలంటూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ సమర్పించారు. ఉత్తర భారతానికి చెందిన కొందరు ఎంపీలతో సంతకాలు చేయించి మరీ అర్జీ ఇవ్వడంతోపాటు తనకు గల పరిచయాలతో లాబీయింగ్ చేయించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దుగరాజుపట్నంలో భారీ ఓడరేవు నిర్మిస్తామని 2013 మే నెలలో ప్రకటించింది. రామాయపట్నంలో నిర్మించాలని సూచిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమర్పించిన లేఖను బుట్టదాఖలు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రామాయపట్నంలో పోర్టు నిర్మాణ ప్రతిపాదన అటకెక్కింది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో మొత్తానికి పోర్టు నిర్మాణ ప్రతిపాదన మరుగున పడింది. 2015 జూలైలో కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్లో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాల్సిన ఈ భారీ పోర్టుకు రూ.17,615 కోట్లు ఖర్చవుతుందని ప్రకటించారు. తొలి విడతలో రూ.6,091 కోట్లు వెచ్చించాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవని, అందువల్ల ఈ విషయంలో తాము ఏమీ చేయలేకపోతున్నామని స్పష్టంగా ప్రకటించారు. రామాయపట్నం ప్రత్యేకతలివీ జాతీయ రహదారి, రైల్వేట్రాక్‌లకు కేవలం ఐదు కిలోమీ టర్ల సమీపంలోనే రామాయపట్నం ఉంది. సాగరమాల పథకం కింద అభివృద్ధి చేస్తున్న బకింగ్‌హాం కెనాల్ కూ డా దీనికి అందుబాటులో ఉంది. రామాయటపట్నంకు సమీపంలో కావలి పట్టణం ఉండటం కలిసొచ్చే అంశం. ఎంపీ మేకపాటి ప్రస్తావనతో.. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ పోర్టు సాధన కోసం వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. పోర్టులు, ట్రాన్స్‌పోర్టు స్టాండింగ్ కమిటీలో ఆయన సభ్యులుగా ఉండటంతో మూడేళ్లుగా తన నియోజకవర్గ పరిధిలో ఉన్న రామాయపట్నంలోనూ పోర్టు నిర్మించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర, ప్రత్యుత్తరాలు లేకపోయినా నేరుగా కేంద్ర ప్రభుత్వమే దీనిపై ఒక స్పష్టత వచ్చేందుకు తన మార్గాన తాను చేసుకోవాల్సిన పనిని చక్కబెట్టుకునేలా చేస్తున్నారు. పోరాటాలకు కార్యాచరణ ప్రణాళిక పోర్టును సాధిస్తేనే కావలి, ఉదయగిరి నియోజకవర్గాలతోపాటు కావలిని ఆనుకుని ఉన్న ప్రకాశం జిల్లాలోని ప్రజల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పోర్టు ఏర్పాటే శరణ్యమనే ఆలో చన ఇక్కడి ప్రజల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో పోరుబాట పట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కూడా ఈ అంశంపై చాలా పట్టుదలగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహా మండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డితో కలిసి పోరాటాలు సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. -
‘రామయపట్నం’ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి
-
‘రామయపట్నం’ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి
ఒంగోలు : ప్రకాశం జిల్లాలోని రామయపట్నం పోర్టు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని ఆపార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మేజర్ పోర్టు ఏర్పాటు చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామయపట్నం పోర్టు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం కోలుకుంటుందని, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వల్లే హోదా ఆలస్యం అవుతుందన్నారు. -
స్వలాభాపేక్షే
► జిల్లా అభివృద్ధి గాలికి... ► జనం బాధలు పట్టించుకోని టీడీపీ నేతలు ► బాబు ఇచ్చిన హామీలకే బడ్జెట్లో నిధులు కరువు ► వెలిగొండకు మొక్కుబడి విదిలింపులు ► రామాయపట్నం పోర్టు,నిమ్జ్ ఊసే మరిచిన బాబు ► వందలాది హామీలు గాలికి.. ► నోరు మెదపని జిల్లా నేతలు జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీకి తాజా బడ్జెట్లో చంద్రబాబు నిధులు కేటాయించకపోయినా జిల్లా అధికార పార్టీ నేతలు నోరు మెదపడం లేదు. వెలిగొండ పూర్తి చేసేది మేమే... అదిగో నిమ్జ్... ఇదిగో దొనకొండ... కనుచూపు మేరలో రామాయపట్నం పోర్టు, లక్షల కోట్ల పెట్టుబడులు,లక్షలాది మందికి ఉద్యోగాలు... అంటూ ఇన్నాళ్లు ఊదరగొట్టిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు మౌనం దాల్చారు. జిల్లాకు సంబంధించిన ఏ ఒక్క అభివృద్ధి పనికి చంద్రబాబు నిధులు కేటాయించకపోయినా ఇక్కడి టీడీపీ నేతలు బాబును అడిగే పరిస్థితి లేదు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లేకపోవడంతో జిల్లా అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. కనీసం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి గుక్కెడు నీళ్లయినా ఇస్తారనుకుంటే ఆ ప్రాజెక్టుకు కూడా మెయింటెనెన్స్ ఖర్చులు తప్ప పనులు ముందుకు సాగేందుకు నిధులివ్వలేదు. అయినా అధికార పార్టీ నేతలు నోరు మెదపకపోవడంపై జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ క్షేత్రస్థాయి కేడర్ సైతం జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల తీరును తప్పుబడుతున్నారు. నేతలు స్వలాభాపేక్షతో సొంత పనుల కోసం పాకులాడటం తప్ప జిల్లా అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నాటి నుంచి నేటి వరకు జిల్లాకు సంబంధించి చంద్రబాబు వందలాది హామీలిచ్చారు. ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. మూడేళ్ల పాలన ముగుస్తున్నా... ప్రాజెక్టు పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. తాజా బడ్జెట్లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించటంలో ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ఈ ప్రాజెక్టు పైనే జిల్లా వాసులు ఆశలు పెట్టుకొని ఉన్నారు. తాగు, సాగునీరు అందించేందుకు ఏకైక మార్గం వెలిగొండ ప్రాజెక్టు. కానీ నిధుల్లేకపోవడంతో ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇక జిల్లాను పారిశ్రామికంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి పదే పదే చెబుతూ వస్తున్నారు. కనిగిరిలో దాదాపు లక్ష కోట్లతో నిమ్జ్ ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ బాబు పలుమార్లు ప్రకటించారు. ఆయన మాటలు చూసి జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం నిమ్్జను పూర్తి చేసినంతగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికీ భూసేకరణ కూడా పూర్తి కాలేదు. తాజా బడ్జెట్లో నిమ్స్ కు నిధుల కేటాయింపుల్లేవు. చంద్రబాబు దాని ఊసే మరిచారు. దొనకొండ పారిశ్రామికవాడదీ ఇదే పరిస్థితి. ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయని, ఉద్యోగాలు లభిస్తున్నాయని ప్రభుత్వం ప్రచారం చేసింది. మూడేళ్ల పాలనలో దొనకొండకు ఏ ఒక్క పరిశ్రమ తరలిరాలేదు, వస్తుందన్న ఆశ కూడా లేదు. రామాయపట్నం పోర్టు సంగతిని అధికార పార్టీ నేతలు దాదాపు పక్కనపెట్టారు. ఆది నుంచి జిల్లా అభివృద్ధి కోసం రామాయపట్నం పోర్టును నిర్మించాలన్న డిమాండ్ ఉంది. కానీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం నెల్లూరు జిల్లాలోని దుగరాజుపట్నం పోర్టుకే ప్రాధాన్యతనిచ్చారు. అయితే ఇటీవల దుగరాజుపట్నం పోర్టు నిర్మాణానికి ప్రతికూలతలు ఎదురయ్యాయి. అక్కడ పోర్టు నిర్మాణం సరికాదంటూ కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఈ దశలో గట్టిగా ప్రయత్నిస్తే రామాయపట్నం పోర్టు వచ్చే అవకాశం ఉంది. కానీ తాజా బడ్జెట్లో బాబు పోర్టు ఊసే ఎత్తలేదు. పోర్టు ఉంటేనే పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దాని సంగతి ఆటకెక్కించింది. ► జిల్లాలో తీరప్రాంతంతో పాటు కర్నూలు, కడపను కలిపే ప్రధాన రహదారులను రూ.50 వేల కోట్లతో నిర్మించనున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అవి ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ► హైదరాబాద్ స్థాయిలో ఒంగోలులో శిల్పారామం అన్నారు. దాని ఊసే లేదు. వెటర్నరీ యూనివర్సిటీ, మైనింగ్ యూనివర్సిటీ ఇస్తామని ఇచ్చిన హామీ ఇచ్చినా బడ్జెట్లో దాని ప్రస్తావన లేదు. ►తాళ్లూరు మండలంలో మొగలిగుండాల రిజర్వాయర్ పూర్తి చేసి తాళ్లూరు, మద్దిపాడు, అద్దంకి, చీమకుర్తిలకు దీని ద్వారా తాగు, సాగు నీరు ఇచ్చే ప్రతిపాదనను సర్కారు పట్టించుకోలేదు. ► బల్లికురవలోని భవనాశి రిజర్వాయర్, యర్రం చినపోలిరెడ్డి రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా నిధుల కేటాయింపుల్లేవు. ► గిద్దలూరు పట్టణానికి దూపాడు ప్రాజెక్టు నుంచి రూ.350 కోట్లతో పనులు పూర్తి చేసి నీళ్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నల్లమల అడవుల్లోని బైరేనిగుండాలు ద్వారా గిద్దలూరు పరిధిలోని 14 గ్రామాలకు నీళ్లిస్తామన్నారు. దాని సంగతీ పట్టించుకోలేదు. ► సోమశిల ఉత్తర కాలువ రాళ్లపాడు ప్రాజెక్టు వరకు తవ్వాల్సి ఉంది. తద్వారా ప్రాజెక్టు రాళ్లపాడుకు నీళ్లిస్తామన్నారు. రామాయపట్నం పోర్టు, రాళ్లపాడు ఎడమ కాలువ పొడిగింపు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా నిధులివ్వలేదు. కొండపిలోని సంగమేశ్వరం ప్రాజెక్టును రూ.50.50 కోట్లతో పూర్తి చేసి తద్వారా 9,500 ఎకరాలకు సాగు నీరు, 4 మండలాల పరిధిలో తాగునీరు అందిస్తామన్నారు. కానీ నిధుల కేటాయింపుల్లేవు. ఇవి కాకుండా జిల్లావ్యాప్తంగా రోడ్లు, తాగునీటి పథకాలు, చిన్న పరిశ్రమలు అంటూ అటు ప్రభుత్వం, జిల్లా అధికార పార్టీ నేతలు వందలాది హామీలు గుప్పించారు. కానీ ఏ ఒక్కదానికీ బడ్జెట్లో సర్కారు పైసా నిధులు కేటాయించలేదు. అయినా జిల్లా నేతలు ఏ మాత్రం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా వ్యక్తిగత స్వార్థాన్ని పక్కనపెట్టి టీడీపీ నేతలు జిల్లా అభివృద్ధికి నిధుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. -
రామయపట్నం పోర్టు ఏర్పాటు చేయండి’
న్యూఢిల్లీ: ప్రకాశం జిల్లా రామాయపట్నం ప్రాంతంలో పోర్టు ఏర్పాటుచేసేందుకు అన్ని అనుకూలతలు ఉన్నందున త్వరితగతిన చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. గురువారం ఆయన లోక్‌సభ జీరో అవర్‌లో ప్రసంగించారు. ‘ఏపీలో తూర్పు కోస్తా తీరంలో రెండో కేంద్ర ప్రాజెక్టుగా దుగరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని చేపట్టేందుకు కేంద్ర మంత్రివర్గం 2013లో నిర్ణయించింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో దీనికి యోగ్యత అధ్యయనం పూర్తిచేయాలన్న నిబంధనను కేంద్రం పొందుపరిచింది. ఏఈకామ్ అనే కన్సల్టెన్సీ ఈ యోగ్యత అధ్యయనం పూర్తిచేసి దుగరాజపట్నం పోర్టుకు అనుకూలత లేదని తేల్చింది. విశాఖ పోర్టు ట్రస్టు కూడా ఇదే అంశాన్ని తేల్చింది. చివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుగరాజపట్నంపై ముందుకు వెళ్లలేమన్న నిర్ణయానికి వచ్చింది. దుగరాజపట్నం ఆలస్యమవుతున్నందున ప్రధాని ఇచ్చిన హామీ మేరకు ఇదే ప్రాంతానికి 50 కి.మీ. దూరంలో ఉన్న రామాయపట్నం వద్ద పీపీపీ పోర్టును ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. చైనా, సింగపూర్ తదితర దేశాలు రామాయపట్నం వద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ పోర్టు ఏర్పాటుచేస్తే వెనకబడిన ప్రకాశం జిల్లాకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లవుతుంది. పోర్టుతో పాటు బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రకాశం జిల్లా అభివృద్ధికి మౌలిక వసతులు ఏర్పాటుచేసినట్లవుతుంది. తగినంత భూమి ఉన్నందున ప్రయివేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా లేదు. నౌకాయాన మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతస్థాయి కమిటీ ఎగుమతులు, దిగుమతులకు రామాయపట్నం తగిన ప్రాంతంగా ఉంటుందని నివేదిక ఇచ్చింది. షిప్‌యార్డ్‌గా, పోర్టుగా రామాయపట్నం ఉత్తమ ప్రాంతంగా నిలుస్తుందని కేంద్ర సాంకేతిక నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. సముద్రం లోతుగా ఉన్నందున ఇక్కడ డ్రెడ్జింగ్ కూడా అవసరం లేదు. ఐదు కి.మీ. దూరంలోనే రైలు, రోడ్డు నెట్వర్క్ ఉంది. అందువల్ల త్వరితగతిన రామాయపట్నం పోర్టును ఏర్పాటుచేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు. -
రామాయపట్నం పోర్టు నిర్మించాలి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కోరిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కావలి: రామాయపట్నంలో పోర్టు, షిప్‌యార్డు నిర్మించాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడును కోరారు. బుధవారం వెంకయ్యనాయుడు కార్యాలయంలో కలిసి కావలి నియోజకవర్గం అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్యే చర్చించే సమయంలో మొన్నటి వరకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఉండి ప్రస్తుతం వెంకయ్యనాయుడు పీఎస్‌గా విధులు నిర్వహిస్తున్న జానకి అక్కడే ఉండి ఎమ్మెల్యే చెబుతున్న విషయాలకు మద్దతుగా మంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం పథకమైన అమృత్‌కు సంబంధించి కావలి మున్సిపాల్టీకి నిధులు మంజూరు, అవి సద్వినియోగం పట్టణ ప్రజలకు మేలైన సౌకర్యాలు కల్పించే విషయమై ఎమ్మెల్యే మంత్రితో చర్చించారు. పోర్టు నిర్మిస్తే కావలి తోపాటు నెల్లూరు,ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, దగదర్తి వద్ద వున్న కిసాన్ సెజ్‌లో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సెజ్‌లో స్థానికులకు కాకుండా ఇతర రాష్ట్రాల ఉపాధి కల్పిస్తుండటంతో స్థానికులు అసంతృప్తిగా ఉన్నారని వివరించారు. జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు, కావలి మున్సిపాల్టీలో నిధులు దుర్వినియోగంపై విచారణ జరపాలని కోరారు. ఈ విషయాలపై పీఎస్ జానకి ని పరిశీలించాలని మంత్రి ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. -
రామాయపట్నం పోర్టు కోసం YSRCP పోరుబాట
-
స'పోర్టు' ఇస్తారా..
రామాయపట్నం పోర్టు సాధన కోసం పోరుబాట నేడు వైఎస్సార్ సీపీ ‘పోర్టు సాధన యాత్ర’ అందరూ కలసి వస్తేనే పోర్టు సాధ్యం ఉలవపాడు: రామాయపట్నం పోర్టు సాధించాలి.. ఇది అన్ని పార్టీల నాయకుల గుండెల్లో ఉంది. కానీ అందరూ కలిసి ప్రయత్నించకపోవడం వల్లే పోర్టు రాలేదు. రామాయపట్నంలో పోర్టు నిర్మించినా ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలోనూ ఎక్కువగా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే రామాయపట్నం నుంచి మండల కేంద్రమైన ఉలవపాడుకు 19 కి.మీ ఉండగా..అంతే దూరంలో నెల్లూరు జిల్లా కావలి వస్తుంది. అందుకే ఎక్కువ శాతం అభివృద్ధి కావలిలో ఉంటుందని ఆ ప్రాంత నాయకులు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం రామాయపట్నం పోర్టు సాధన పాదయూత్ర చేపట్టారు. గతంలో సీపీఐ నాయకుడు నారాయణ కూడా వచ్చి పోర్టు కోసం పోరాటం చేస్తామని ప్రకటించి వెళ్లారు. వీరితో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పాదయూత్రతోనైనా అందరూ ఒకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అనువైన ప్రాంతం అని నివేదికలు ఇచ్చినా... రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అనువైన ప్రాంతం అని గతంలోనే కేంద్రం నుంచి వచ్చిన కలైమణి బృందం తేల్చింది. అప్పటి కలెక్టర్ కాంతిలాల్ దండే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూముల వివరాలు కూడా తెలియజేశారు. మొత్తం సుమారు 5,200 ఎకరాలు అందజేయనున్నట్లు తెలిపారు. అప్పట్లో ఢిల్లీలో ఉన్న లాబీయింగ్ కారణంగా చిత్తూరు కు చెందిన నాయకుడు దుగరాజపట్నంకు పోర్టు తరలించారు. అది అనువైన ప్రాంతం కాకపోయినా ఇప్పుడు మారిన ప్రభుత్వం కూడా అదే పాత పాట పాడుతోంది. రామాయపట్నం పోర్టు కోసం వైఎస్సార్ సీపీ పోరాటం రామాయపట్నం పోర్టు ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. తద్వారా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తారుు. ఈ ప్రాంతంలో ఉన్న ఖనిజంతో పాటు పొగాకు, పత్తి తదితర ఉత్పత్తులు సైతం తక్కువ రవాణా ఖర్చుతో ఎగుమతులు జరుగుతారుు. రామాయపట్నం పోర్టు అన్నింటికీ అనుకూలం. రామాయపట్నం పోర్టును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి నిపుణుల కమిటీలు సైతం చెప్పారుు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరం రామాయపట్నం పోర్టు కోసం ఇటీవల పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి విన్నవించాం. ప్రభుత్వం దుగరాజపట్నం పోర్టు నిర్మించాలని నిర్ణయించినందున ప్రైవేట్ పోర్టు మోడ్‌లో నిర్మించే ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి కసరత్తు చేయాలని ప్రధాని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినా ఇంత వరకు చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం భూములు సేకరించడం, వాటిని అమ్ముకోవడంతోనే సరిపోతోంది. రామాయపట్నం పోర్టు నిర్మాణమైతే కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా పరిధిలోని కావలి, ఉదయగిరి ప్రాంతాలు సైతం అభివృద్ధి చెందుతారుు. కృష్ణపట్నం పోర్టు ఆనుకొని మరో పోర్టు ను నిర్మించటం సరైంది కాదు. ఇది నిబంధనలకు విరుద్ధం. కొందరు నేతల వ్యక్తిగత స్వార్థంతో దుగరాజపట్నం పోర్టు నిర్మాణం కోసం పట్టుపడుతున్నారు. రామాయపట్నం పోర్టు కోసం రాజకీయాలకతీతంగా జిల్లాలోని అన్ని పార్టీల నేతలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. వైఎస్సార్సీపీ పోర్టు కోసం ఉద్యమిస్తోంది. ప్రజలు ఈ ఉద్యమానికి మద్దతు పలకాలి. - ఒంగోలు ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి రామాయపట్నం పోర్టు నిర్మించాల్సిందే... కేంద్ర ప్రభుత్వం జిల్లా పరిధిలోని రామాయపట్నం పోర్టు నిర్మించాలి. ప్రకాశం జిల్లా పరిధిలో 102 కి.మీ. మేర సముద్రతీర ప్రాంతం ఉంది. పోర్టుకు రామాయపట్నమే అనుకూలం. పోర్టు నిర్మిస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తారుు. తద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. దీని వల్ల వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తారుు. రామాయపట్నం పోర్టు ఎగుమతులకు అనుకూలం. ఇక్కడ పోర్టు నిర్మించడం వల్ల ప్రకాశం జిల్లాతో పాటు అటు నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతారుు. ఎగుమతులు మరింతగా పెరుగుతారుు. తీరప్రాంతం సైతం పెద్ద ఎత్తున అభివృద్ధి సాధిస్తుంది. రామాయపట్నం పోర్టు కరువు ప్రాంతం అభివృద్ధికి దోహదపడుతుంది. దుగరాజపట్నం పోర్టుకు అనుకూలం కాదు. ఇప్పటికే అక్కడ పోర్టును షార్‌తో పాటు పర్యావరణ అధికారులు సైతం వ్యతిరేకిస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు ఇప్పటికే ఉన్నందున దుగరాజపట్నం పోర్టు నిర్మాణం సరైంది కాదు. కొందరు స్వార్థం కోసమే దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సిద్ధపడాలి. రామాయపట్నం పోర్టు కోసం వైఎస్సార్సీపీ పోరాటం చే స్తోంది. ఈ ఉద్యమంలో పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలి. - వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి -
'రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలి'
నెల్లూరు : దుగ్గరాజుపట్నం పోర్టుతోపాటు రామాయపట్నం పోర్టును కూడా ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని రామాయపట్నంలో పోర్టుతోపాటు షిప్ యార్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. కావలి నుంచి రామాయపట్నం వరకు సాగిన ఈ పాదయాత్రలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు కాకాని గోవర్థన్‌రెడ్డి, రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
రామాయపట్నం పోర్ట్ సాధనే లక్ష్యం
కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి నెల్లూరు(వేదాయపాళెం) : కావలి నియోజకవర్గంలో రామయ్యపట్నం పోర్ట్ సాధించడమే తమ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. నెల్లూరు మాగుంటలేవుట్‌లోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో పోర్టు ఏర్పాటుచేస్తామని చెప్పారని, అయితే ఆచరణలో మాత్రం ముందుకు సాగడంలేదన్నారు. కావలి చెన్నాయపాళెం వద్ద అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం విచారకరమన్నారు. బోగోలు వద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకురావాలన్నారు. త్వరలో నెల్లూరు, ఒంగోలు ఎంపీలైన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలలో చర్చించి పోర్టు సాధనకు కమిటీ వేసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 24న పాదయాత్ర కావలి మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాయకులు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పోర్టు సాధన కోసం సెప్టెంబర్ 24న కావలి నుంచి రామయ్యపట్నం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో పోర్టు మంజూరుకాకుండా అప్పటి తిరుపతి ఎంపీ చింతామోహన్ 60 మంది ఎంపీలతో సంతకాలు చేయించి దుగ్గరాజుపట్నం పోర్టు మంజూరుకు తోడ్పడ్డారని తెలిపారు. దుగ్గరాజుపట్నం కంటే రామయ్యపట్నం పోర్టు ఏర్పాటుకు అన్నివిధాలా అనుకూలమన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి, జిల్లా అధికారప్రతినిధి పందిటి కామరాజు, రైల్వే కమిటీ సభ్యుడు కామయ్య, కావలి ఎస్సీ సెల్ అధ్యక్షుడు పరసు మాల్యాద్రి, కౌన్సిలర్లు సూరె మోహన్‌రెడ్డి, మందా శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. -
రామాయపట్నం పోర్ట్ సాధనే లక్ష్యం
కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి నెల్లూరు(వేదాయపాళెం) : కావలి నియోజకవర్గంలో రామయ్యపట్నం పోర్ట్ సాధించడమే తమ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. నెల్లూరు మాగుంటలేవుట్‌లోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో పోర్టు ఏర్పాటుచేస్తామని చెప్పారని, అయితే ఆచరణలో మాత్రం ముందుకు సాగడంలేదన్నారు. కావలి చెన్నాయపాళెం వద్ద అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం విచారకరమన్నారు. బోగోలు వద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకురావాలన్నారు. త్వరలో నెల్లూరు, ఒంగోలు ఎంపీలైన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలలో చర్చించి పోర్టు సాధనకు కమిటీ వేసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 24న పాదయాత్ర కావలి మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాయకులు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పోర్టు సాధన కోసం సెప్టెంబర్ 24న కావలి నుంచి రామయ్యపట్నం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో పోర్టు మంజూరుకాకుండా అప్పటి తిరుపతి ఎంపీ చింతామోహన్ 60 మంది ఎంపీలతో సంతకాలు చేయించి దుగ్గరాజుపట్నం పోర్టు మంజూరుకు తోడ్పడ్డారని తెలిపారు. దుగ్గరాజుపట్నం కంటే రామయ్యపట్నం పోర్టు ఏర్పాటుకు అన్నివిధాలా అనుకూలమన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి, జిల్లా అధికారప్రతినిధి పందిటి కామరాజు, రైల్వే కమిటీ సభ్యుడు కామయ్య, కావలి ఎస్సీ సెల్ అధ్యక్షుడు పరసు మాల్యాద్రి, కౌన్సిలర్లు సూరె మోహన్‌రెడ్డి, మందా శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. -
రామాయపట్నం పోర్ట్ సాధనే లక్ష్యం
కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి నెల్లూరు(వేదాయపాళెం) : కావలి నియోజకవర్గంలో రామయ్యపట్నం పోర్ట్ సాధించడమే తమ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. నెల్లూరు మాగుంటలేవుట్‌లోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో పోర్టు ఏర్పాటుచేస్తామని చెప్పారని, అయితే ఆచరణలో మాత్రం ముందుకు సాగడంలేదన్నారు. కావలి చెన్నాయపాళెం వద్ద అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం విచారకరమన్నారు. బోగోలు వద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకురావాలన్నారు. త్వరలో నెల్లూరు, ఒంగోలు ఎంపీలైన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలలో చర్చించి పోర్టు సాధనకు కమిటీ వేసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 24న పాదయాత్ర కావలి మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాయకులు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పోర్టు సాధన కోసం సెప్టెంబర్ 24న కావలి నుంచి రామయ్యపట్నం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో పోర్టు మంజూరుకాకుండా అప్పటి తిరుపతి ఎంపీ చింతామోహన్ 60 మంది ఎంపీలతో సంతకాలు చేయించి దుగ్గరాజుపట్నం పోర్టు మంజూరుకు తోడ్పడ్డారని తెలిపారు. దుగ్గరాజుపట్నం కంటే రామయ్యపట్నం పోర్టు ఏర్పాటుకు అన్నివిధాలా అనుకూలమన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి, జిల్లా అధికారప్రతినిధి పందిటి కామరాజు, రైల్వే కమిటీ సభ్యుడు కామయ్య, కావలి ఎస్సీ సెల్ అధ్యక్షుడు పరసు మాల్యాద్రి, కౌన్సిలర్లు సూరె మోహన్‌రెడ్డి, మందా శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. -
అనుకున్నదే అయింది...!
►నివేదిక బుట్టదాఖలు ►ప్రకాశం జిల్లాకు అన్యాయం ►మొక్కుబడి ప్రకటన ►శివరామకృష్ణన్ సూచనలకు మంగళం ►స్మార్ట్ సిటీగా ఒంగోలు ►విమానాశ్రయం, రామాయపట్నం పోర్టు ► పారిశ్రామిక వాడగా దొనకొండ ►పైవన్నీ కేంద్రం చేయాల్సిందే ►తన ఖాతాలో వేసుకొని హామీలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అనుకున్నదే అయింది. మొదటి నుంచి ప్రకాశం జిల్లా రాజధానిగా చేయడానికి ఇష్టపడని చంద్రబాబు ఈ జిల్లాపై తన సవతిప్రేమను మరోసారి చూపించారు. మిగిలిన జిల్లాలకు పెద్ద ఎత్తున వరాలు ప్రకటించిన చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లాపై చిన్నచూపు చూశారు. దొనకొండ - మార్టూరు - వినుకొండ మధ్య రాజధానికి అనుకూలమని ఇక్కడ భూసేకరణకు పెద్దగా ఖర్చు కాదని, వ్యవసాయేతర భూములున్నాయని శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుంగలో తొక్కారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అసెంబ్లీలో గురువారం ప్రకటించారు. ఈ ప్రకటన పట్ల జిల్లా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికార పక్షానికి చెందిన ఐదుగురు శాసనసభ్యులు ఉండి కూడా దీన్ని కనీసం వ్యతిరేకించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా జిల్లా మంత్రిని ఈ విషయంలో ముఖ్యమంత్రి పొగిడిన తీరును కూడా వారు తప్పు పడుతున్నారు. జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారని, అందుకే రాజధాని బదులుగా పారిశ్రామిక అభివృద్ధి చేయాలంటూ కోరారని ముఖ్యమంత్రి ప్రకటించడం ద్వారా జిల్లాలోని తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు కూడా ప్రకాశం జిల్లా రాజధాని కావడం ఇష్టం లేదని చెప్పకనే చెప్పారు. జిల్లాలో ఎయిర్‌పోర్టు, రామాయపట్నం పోర్టు అభివృద్ధి, కనిగిరిలో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల జోన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎయిర్‌పోర్టు, రామాయపట్నం పోర్టులను అభివృద్ధి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. అయినా ఇవి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. ఒకపక్క కేంద్రం దుగరాజపట్నం పోర్టు అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో ప్రకటించింది. అటువంటప్పుడు దగ్గరలోనే రామాయపట్నం పోర్టును కేంద్రం ఏ విధంగా అంగీకరిస్తుందనే విషయంపై స్పష్టత లేదు. ఒంగోలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని, ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.జిల్లాలో ముఖ్యమైన వెలుగొండ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కూడా సాధ్యమయ్యేట్టు కనిపించడంలేదు. ఒకపక్కన ఆర్థికలోటు ఉన్న బడ్జెట్లో ఏ కేటాయింపులూ చేయకుండా ప్రస్తుతం ప్రకటించిన ప్రాజెక్టులు ఏ విధంగా చేస్తారనేదానిపై స్పష్టత లేకుండా హామీలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని రాజకీయపార్టీల నేతలు విమర్శిస్తున్నారు. -
జిల్లాకు మళ్లీ అన్యాయమే
ఒంగోలు : రైల్వే బడ్జెట్లోనే కాదు... కేంద్ర ఆర్థిక బడ్జెట్లోనూ జిల్లాకు అన్యాయమే జరిగిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జిల్లాకు సంబంధించి స్పష్టమైన ప్రతిపాదన ఒక్కటీ బడ్జెట్లో లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పన్నుల్లోనూ, ఎక్సయిజ్ సుంకాల్లోనూ మినహాయింపు ఇచ్చాం... ధరలు దిగివస్తాయంటూ చెబుతున్నా ఎవరూ నమ్మడం లేదు. హ ఈ నెల 8వ తేదీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. జిల్లాకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి ప్రతిపాదన అందులో కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక బడ్జెట్‌పై అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందులో ప్రధానమైనది రామాయపట్నం పోర్టు. అయితే కాకినాడ పోర్టును అభివృద్ధి చేస్తాం. కృష్ణపట్నం పోర్టుతోపాటు స్మార్ట్ సిటీనీ అభివృద్ధి చేస్తామంటూ బడ్జెట్లో పొందుపరిచారు. జిల్లాకు మంజూరైన రామాయపట్నం పోర్టును చివరి క్షణంలో నెల్లూరు జిల్లా దుగ్గరాజపట్నానికి తరలిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో ఆ పార్టీ నేతలే స్వయంగా సొంత పార్టీ ప్రజాప్రతినిధులపై ధ్వజమెత్తారు. దానిని ఎలాగైనా తిరిగి జిల్లాకు తీసుకురావాల్సిందే అంటూ టీడీపీ, బీజేపీలు నిలదీశాయి. ప్రస్తుతం అధికారం మారింది. అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్ నేడు అడ్రస్ లేకుండా పోయింది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎలాగైనా మరలా రామాయపట్నం పోర్టు మంజూరు చేయిస్తారని అన్ని రాజకీయ పార్టీలు భావించాయి. అందుకు తగ్గట్లుగానే తెలుగుదేశం, బీజేపీ నేతలు పోటీపడి మరీ ప్రకటనలు గుప్పించారు. తాజా బడ్జెట్లో దాని ఊసేలేకుండా పోయింది. మన నాయకులవి కోతలే గాని విశ్వసించదగ్గ మాటలు కాదంటూ జనం ఈసడించుకుంటున్నారు. రాష్ట్రం విడిపోకముందే ఒంగోలు రాజధాని అవుతుందని ప్రచారం మొదలైంది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు మధ్యలో అందరికీ అందుబాటులో ఉండే జిల్లా ఒంగోలు తప్పనిసరిగా రాజధాని అవుతుందంటూ మీడియా ద్వారా రాజకీయ నాయకులు సైతం జోరుగా ప్రచారం సాగించారు. ధడేల్మని పడుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊతమిచ్చేందుకు అవసరమైన హంగామా అంతా చేశారు. రాజధాని రావాల్సిందే అంటూ నినాదాలు చేసిన నేతలు ఇటీవల కాస్త సెలైంట్ అయ్యారు. ఒంగోలులో రాజధాని నిర్మాణం సాధ్యం కాదంటూ ప్రకటనలు చేయడంతోపాటు వెనుకబడిన జిల్లా అభివృద్ధి కోసం విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థలు అనేకం తీసుకొస్తామంటూ హామీలు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎయిమ్స్(ఆల్ ఇండియా మెడికల్ సెన్సైస్) ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా జిల్లాలో ఏర్పాటుచేస్తామని ఎక్కడా ప్రకటించలేదు. ఎయిమ్స్ ఏర్పాటు చేయాలంటే సమీపంలో ఎయిర్‌పోర్టు తప్పనిసరి అంటూ వాదన లేవనెత్తారు. అదే జరిగితే ఈ బడ్జెట్లో ఒంగోలు సమీపంలో కొత్త ఎయిర్‌పోర్టు ఊసే కనిపించలేదు. దీంతో ఎయిమ్స్ కూడా జిల్లాలో లేనట్లే అనే భావన వ్యక్తం అవుతోంది. ఐఐటీ కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టం చేయలేదు. మరో వైపు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామంటున్నా జిల్లాలో దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇక అగ్రికల్చరల్ యూనివర్శిటీని ఇప్పటికే లాంఫాంకు కేటాయించారు. ఒక్కొక్కటిగా పథకాలన్నీ పక్క జిల్లాలకు తరలిపోతుంటే మన జిల్లా ఏవిధంగా అభివృద్ధి చెందుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ తెరపైకి రామాయపట్నం పోర్టు
ఒంగోలు: రాజకీయ కారణాల నేపథ్యంలో ప్రకాశం జిల్లా నుంచి చేజారిపోయిందనుకున్న రామాయపట్నం పోర్టు తాజాగా తెరమీదికొచ్చింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పులికాట్ సరస్సు గుర్తింపు రద్దుకు వన్యప్రాణి, పర్యావరణ శాఖలు అభ్యంతరం పెట్టడం దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి ప్రతికూలతగా మారింది. ఈ నేపథ్యంలో రామాయపట్నం పోర్టుకు సంబంధించి వనరులు, అనుకూలతలపై కేంద్రం సమాలోచనలు చేస్తోందనే సమాచారం జిల్లా ప్రజల్లో ఆశల్ని చిగురింపజేస్తోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీ ఓడరేవును మంజూరు చేసింది. పోర్టు నిర్మాణానికి అవసరమైన ప్రదేశం కోసం సుదీర్ఘ పరిశీలన చేసింది. వాటిల్లో ప్రధానంగా ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మండలంలో రామాయపట్నం, నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజపట్నం ప్రాంతాల మధ్య తీవ్ర పోటీ తలెత్తింది. రెండు ప్రాంతాల్లో భూముల లభ్యత, అనుకూలతలు, ప్రతికూలాంశాలను పరిశీలించిన అప్పటి అధికారులు రామాయపట్నంలోనే పోర్టు నిర్మాణానికి అవసరమైన అన్ని వసతులున్నట్టు తేల్చారు. దీనికి అనుగుణంగా నివేదికను తయారు చేసి కేంద్రానికి సమర్పించారు. రామాయపట్నంలో పోర్టు నిర్మాణం దాదాపు ఖాయమైనట్లేనని అంతా భావించారు. కేంద్ర మంత్రివర్గం సైతం ఇక్కడ పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, అప్పట్లో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా నెల్లూరు జిల్లా నేతలు కేంద్రం వద్ద చేసిన లాబీయింగ్‌తో పోర్టు దుగ్గరాజపట్నానికి తరలిపోయింది. అక్కడ పోర్టు నిర్మాణానికి సంబంధించి రూ.8 వేల కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్రంప్రకటించింది. కానీ పులికాట్ సరస్సు ఏరియాలో ఉండడం, ‘షార్’ నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం తదితర అంశాలతో అక్కడ పోర్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పులికాట్ సరస్సుకు పక్షుల రక్షితకేంద్రంగా ఉన్న గుర్తింపును రద్దుచేయడానికి వణ్యప్రాణి సంరక్షణ శాఖ ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించే దాఖలాలు కనిపించడం లేదు. వనరులు అపారం జిల్లాకు వరంగా మారనున్న పోర్టు నిర్మాణానికి అవసరమైన అన్ని వనరులు రామాయపట్నంలో కేంద్రీకృతమై ఉన్నాయి. భారీ అసైన్డ్ భూములు ఈ ప్రాంతంలో ఉండటంతో పాటు, సమీప గ్రామాల మత్య్సకార ప్రజలు తమ భూములు ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్నారు. రామాయపట్నానికి దగ్గరలోనే నేషనల్ హైవే ఉంది. గతంలో ఇక్కడ పర్యటించిన నిపుణుల బృందం పోర్టు నిర్మాణానికి రామాయపట్నాన్నే ఎంపిక చేసింది. దీంతో పోర్టు తిరిగి వస్తుందనే ఆశలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లోపించడం, కేంద్రంతో పోరాడి పోర్టును సాధించగలిగే బలమైన నాయకుడు ఇక్కడ లేకపోవడమే పోర్టు తరలిపోవడానికి కారణమైందనే వాదన ఉంది. ప్రస్తుతం కేంద్రంలో ప్రభుత్వం మారడం, దుగ్గరాజపట్నంలో పోర్టు నిర్మాణానికి ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈసారైనా ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి పోర్టును సాధిస్తారా లేదా అనేది వేచిచూడాలి. -
మళ్లీ తెరపైకి రామాయపట్నం పోర్టు
{పకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం కోసం ప్రయత్నాలు 2,135 ఎకరాల భూసేకరణ కోసం కసరత్తు పోర్టుకు కేంద్రం సానుకూలత ఒంగోలు: రామాయపట్నం పోర్టు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు సమీపంలో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి గతంలో ప్రతిపాదనలు రాగా, వాటిని రద్దుచేసి దీనికి బదులుగా దుగ్గరాజుపట్నం పోర్టు నిర్మాణానికి గత యూపీఏ ప్రభుత్వం 2013 మే 9న ప్రతిపాదనలు మార్చింది. అయితే అప్పటి నుంచి ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఆ పోర్టు నిర్మాణానికి పలు పర్యావరణ సంస్థలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. పోర్టు నిర్మాణం వల్ల అక్కడి విదేశీ పక్షుల విడిది, పులికాట్ సరస్సు కలుషితమవుతాయని ఈ సంస్థలు పేర్కొంటున్నాయి. 40 వేల మంది జాలర్లు జీవనాధారం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దుగ్గరాజుపట్నం పోర్టును భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ కూడా వ్యతిరేకిస్తోంది. దీంతో రామాయపట్నంలోనే పోర్టు నిర్మాణం చేపట్టాలని ప్రకాశం జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో రామాయపట్నం పోర్టు సాధన సమితి కూడా ఏర్పడింది. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన కేంద్ర బృందం రామాయపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే జిల్లా నుంచి పొగాకు, గ్రానైట్, ఉప్పు, పత్తి, జీడిపప్పు లాంటి వస్తువులు జిల్లా నుంచి ఎగుమతి చేసే అవకాశాలున్నాయి. పోర్టు నిర్మించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పరిశీలనా బృందం నెల రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని సందర్శించింది. పోర్టు నిర్మాణానికి గతంలో 5 వేల ఎకరాలు కావాల్సి ఉంటుందన్న ప్రతిపాదనను మారుస్తూ, 2,135 ఎకరాల స్థలంలోనే పోర్టు నిర్మించే అవకాశాలపై అధ్యయనం చేసినట్లు తెలిసింది. ఇందులో 1,200 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించాల్సి ఉంది. దీనికిగాను గత ప్రభుత్వం రూ.420 కోట్లను కేటాయించినట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో ఉన్న ఎనిమిది కాలనీలను తొలగించాలి. ఇందులో నివసిస్తున్న 2,200 మందికి ప్రత్యామ్నాయం చూపించాలి. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి దాదాపు రూ.8 వేల కోట్లు అవుతుందని అంచనా. రోజూ 30 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఆరు బెర్తులతో నిర్మాణం చేపట్టి, ఫిషింగ్ హార్బర్‌ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు ఉండగా, దుగ్గరాజుపట్నం పోర్టు అవసరం అక్కడ ఉండదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం చేపట్టడం వల్ల సరుకుల రవాణా కూడా సులభతరమవుతుందని ఆలోచిస్తున్నారు. దీనిపై రామాయపట్నం పోర్టు సాధన సమితి సభ్యులు త్వరలోనే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కలవనున్నారు. కాకతీయుల కాలంలోనే పోర్టు ప్రకాశం జిల్లాలో కాకతీయుల కాలంలోనే పోర్టు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. చిన గంజాం సమీపంలోని మోటుపల్లి వద్ద ఆనాటి ఓడరేవు శిథిలాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. అప్పట్లో మోసలపురంగా పిలిచే ఈ ప్రాంతంలో సముద్ర తీరం వంపుగా ఉండటంతో ఓడలు ఆగడానికి వీలుగా ఉందని ఈ ప్రాంతాన్ని ఓడరేవుగా ఉపయోగించుకున్నారు. కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి ఈ ప్రాంతంలో పర్యటించినట్లు మెకంజీ తన పరిశోధనా గ్రంథంలో ఉటంకించారు. ఆయనతో పాటు పలువురు గ్రీకు నావికులు కూడా ఈ ఓడరేవు గురించి పేర్కొన్నారు. ఇక్కడ ఓడరేవుకు గుర్తుగా మూడు ఆలయాలను కూడా నిర్మించారట. ప్రస్తుతం వీరభద్రస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవీ శిథిలావస్థలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో పోర్టు నిర్మాణం చేపట్టేందుకుగాను స్థల సేకరణ చేపట్టాలని వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భావించారు. అయితే ఆయన మరణంతో ఆ ప్రాజెక్టు కనుమరుగైంది. రామాయపట్నంలో కానీ, మోటుపల్లిలో కానీ ఓడరేవు నిర్మాణం చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. -
సస్యశ్యామలం చేస్తా
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు పరోక్ష రాజకీయాల్లో పని చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వై.వి. సుబ్బారెడ్డి, ఆ పార్టీ తరఫున ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో స్థానిక ఎంపీలు లేకపోవడంతో, జిల్లా అభివృద్ధి జరగలేదని అంటున్నారు. స్థానికుడిగా ఒంగోలు పరిస్థితి తనకు తెలుసని, ఆ దిశగా నగరాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధిపై తన విజన్‌ను ‘సాక్షి ప్రతినిధి’తో పంచుకున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై తన విజన్‌ను ‘సాక్షి ప్రతినిధి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి ఒంగోలు నియోజకవర్గాన్ని గత 15-20 సంవత్సరాలుగా ఇక్కడి పార్లమెంటు సభ్యులు పట్టించుకోలేదు. గత 15 రోజులుగా జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నా. పశ్చిమ ప్రాంతాల్లోని ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. వేరే జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి పోటీ చేసిన వారు గెలిచి తమ వ్యాపారాలు చూసుకోవడానికి సరిపోతోంది. మా ప్రభుత్వం వచ్చాక జిల్లాలో ముందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి. అంతేకాక ఫ్లోరైడ్ సమస్యతో అనారోగ్యానికి గురవుతున్నారు. కనీసం ఆసుపత్రి సౌకర్యం కూడా లేదు. వీటిపై ప్రధానంగా ఫోకస్ చేస్తాను. వెలిగొండ పూర్తి చేస్తాం.. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత జిల్లాను సస్యశ్యామలం చేయడానికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తారు. వైఎస్ కన్న కలలు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తి చేస్తారు. వైఎస్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును జగన్ ప్రారంభిస్తారు. ఒంగోలుకు కోస్టల్ కారిడార్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు అడ్డగోలుగా విభజించారు. సీమాంధ్ర అభివృద్ధి జరగాలంటే, కేంద్రం, రాష్ట్రంలోను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన భూమిక పోషించాల్సి ఉంది. సీమాంద్ర అభివృద్ధికి కోస్టల్ కారిడార్ ఉన్న ప్రకాశం జిల్లా అత్యంత ప్రధానం కానుంది. ప్రకాశం జిల్లా ఇటు రాయలసీమ, అటు కోస్తా జిల్లాలకు మధ్యలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి, రాజధానిని ప్రకాశం జిల్లాకు తెచ్చుకోవడానికి కృషి చేద్దాం. రాజధాని ఎక్కడైనా ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేద్దాం. పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య తీర్చుకుందాం. పశ్చిమ ప్రాంతంలో వ్యవసాయేతర పరిశ్రమలు స్థాపిద్దాం. అలాగే టమాటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం. రైల్వేస్టేషన్ అభివృద్ధికి కృషి ఒంగోలులో రెల్వే స్టేషన్‌తో పాటు, రైల్వే లైన్లను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా నడికుడి-కాళహస్తి రైలు మార్గం చాలా అవసరం. అప్పట్లో రాజశేఖరరెడ్డి కేంద్రంతో కొట్లాడి నిధులు కేటాయించారు. అయితే ఆ ప్రాజెక్టు ముందుకు పోవడానికి మన నాయకులు పట్టించుకోలేదు. ముఖ్యంగా మన ఎంపీగా గెలిచిన వాళ్లు పట్టించుకోలేదు. సీమాంధ్ర అభివృద్ధికి నడికుడి రైల్వే లైన్ దోహద పడుతుంది. ఒంగోలు రైల్వేస్టేషన్ అభివృద్ధి జరగలేదు. ఇంకా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగడం లేదు. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వెళ్లాలంటే విజయవాడ, నెల్లూరు వెళ్లి ఎక్కాల్సి వస్తోందని కొంత మంది ఆర్యవైశ్యులు నా దృష్టికి తెచ్చారు. నేను వారికి వాగ్దానం చేశాను. రైల్వే స్టేషన్ అభివృద్ధే కాకుండా, ప్రధాన రైళ్లు ఆగేవిధ ంగా చర్యలు తీసుకుంటానని చెప్పాను. పోర్టును తెస్తాం రామాయపట్నం పోర్టును నెల్లూరు జిల్లా తీసుకు వెళ్లాడు అక్కడి ఎంపీ చింతా మోహన్, ఇక్కడి ఎంపీ కూడా నెల్లూరు వాస్తవ్యుడు కావడంతో, ఆయన దానిని వదిలేశారు. దానిని కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగ సమస్య తీరి పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, తిరిగి రామాయపట్నానికే పోర్టు తెచ్చుకు నేలా కృషి చేస్తాను. -
పోర్టు మనకేనా?
రాజ్యసభలో రామాయపట్నం పోర్టు ప్రస్తావన పోర్టు అవసరాన్ని వివరించిన వెంక య్యనాయుడు అంగీకరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం పోర్టు వస్తే జిల్లాకు మహర్దశే సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లా వాసుల చిరకాల కోరిక తీరేందుకు అవకాశాలు మెరుగుపడుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రామాయపట్నం పోర్టు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశం రాజ్యసభలో గురువారం చర్చకు వచ్చింది. బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సీమాంధ్రకు ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా రామాయపట్నం పోర్టును నిర్మించాలని డిమాండ్ చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే జిల్లాకు మహర్దశ పట్టినట్లే. రామాయపట్నం పోర్టు ఏర్పడితే జిల్లాలో నేషనల్ మ్యాన్‌ప్యాక్చరింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ జోన్ (ఎన్‌ఎంఐజెడ్)కు కూడా మోక్షం కలిగే అవకాశం ఉంది. పోర్టు నిర్మాణానికి గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో పోర్టు నిర్మించాలని భావించారు. దీనికిగాను రాష్ట్ర ప్రభుత్వం 11 శాతం నిధులు ఇచ్చేందుకు కూడా అంగీకరించింది. జిల్లాలో నిర్మించే పోర్టు తమిళనాడులోని ఎన్నూరు పోర్టు తరహాలో ఉండేలా చ ర్యలు తీసుకోవాలని భావించారు. ఈ ప్రాజెక్టు భాగస్వామ్యానికి నేషనల్ మినరల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్, విశాఖపట్నం పోర్టు, ఇఫ్కో ఫెర్టిలైజర్స్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. పోర్టుతో పాటు షిప్ యార్డును కూడా నిర్మించేందుకు ప్రతిపాదనలు చేపట్టారు. నెలకు 30 మిలియన్ టన్నుల కార్గొ రవాణా చే సేందుకు అనువుగా ఆరు బెర్త్‌లతో పోర్టు నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. షిప్ బిల్డింగ్ కారిడార్, పిషింగ్ హార్బర్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోర్టు నిర్మాణానికి ఐదు వేల ఎకరాల స్థలాన్ని మార్కు చేశారు. వీటిలో 1200 ఎకరాలు ప్రైవేటు భూములు, 2200 ఎకరాల్లో ఉన్న ఎనిమిది గ్రామాలను సేకరించేందుకు 420 కోట్ల రూపాయలు కూడా కేటాయించారు. ఇన్ని జరిగాక పర్యావరణ విభాగం నుంచి అనుమతి లభించలేదు. దీంతో రామయపట్నానికి బదులు నెల్లూరు జిల్లా దుగ్గరాజు పట్నంకు పోర్టు వెళ్లింది. ఈ వ్యవహారంలో కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రామాయపట్నం పోర్టుపై జిల్లా వాసుల్లో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.