
సాక్షి, ప్రకాశం : గత టీడీపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లాపై కక్ష సాధించిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీల్ నరసింహారావు విమర్శించారు. శుక్రవారం రామాయపట్నం పోర్టు ఏరియాను పరిశీలించిన జీవీఎల్.. పోర్టు వల్ల జరిగే మంచి చెడుల గురించి గ్రామస్తులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అన్ని అనుకూలంగా ఉన్నా గత టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించలేదని మండిపడ్డారు. పోర్టుపై కేంద్ర ప్రభుత్వం లేఖ రాసినా.. టీడీపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని చెప్పారు. రామాయపట్నం పోర్టుకు సహజ అనుకూలతలు ఉన్నాయని వివరించారు. కానీ ప్రస్తుతం ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోర్టుకు సానుకూలంగా ఉందన్నారు. పోర్టు కోసం తాను కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దీనిపై అవసరమైతే ప్రధానితో కూడా మాట్లాడతానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment