GVL Narasimha Rao
-
ఎంపీ సీటు కోసం GVL వదలని పట్టు.. బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి..
-
పురందేశ్వరికి కొత్త ట్విస్ట్.. రూట్ మార్చిన జీవీఎల్!
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమిలో కొత్త ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ దక్కని కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమకు టికెట్ దక్కించుకునేందుకు వీలున్న మార్గాలన్నింటినీ వెతుకుతూ పార్టీలకు షాకిస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి బీజేపీ ఎంపీ, సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు కూడా చేరారు. కాగా, విశాఖ పార్లమెంట్ స్థానం విషయంలో జీవీఎల్ పట్టువిడవటం లేదు. ఎలాగైనా విశాఖ నుంచి పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే, ఇప్పటికే విశాఖ సీటును టీడీపీ నేత భరత్‌కు ఇచ్చినప్పటికీ జీవీఎల్ మాత్రం ఇంకా ఆశలు వదులుకోలేదు. ఈ క్రమంలో తనకే టికెట్ దక్కేలా లాబీయింగ్‌కు దిగారు. తాజాగా, ఉత్తరాది నేతలో జీవీఎల్ మంతనాలు ప్రారంభించారు. అలాగే, ఉత్తరాది వ్యాపారులతో కూడా జీవీఎల్ సమావేశమయ్యారు. జీవీఎల్.. రూట్ మార్చి ఉత్తరాది నేతలతో చర్చించి బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. విశాఖ సీటు తనకే దక్కేలా వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు.. జీవీఎల్‌కు మద్దతుగా జన జాగరణ సమితి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో జీవీఎల్‌కు మద్దతుగా బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డాను కూడా కలవడంతో విషయం మరోసారి చర్చకు వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రచారంలో భాగంగా జీవీఎల్ షాకిలిస్తున్నారు. టీడీపీ నేత భరత్ ప్రచారానికి జీవీఎల్ దూరంగా ఉంటున్నారనే చర్చ నడుస్తోంది. టీడీపీ కార్యక్రమాలకు కూడా జీవీఎల్ వెళ్లడం లేదు. అంతేకాకుండా పురంధేశ్వరి, చంద్రబాబు తీరుపై జీవీఎల్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. -
బాబు బంధువును టెన్షన్ పెడుతున్న బీజేపీ నేత
సాక్షి, విశాఖపట్నం: విశాఖ లోక్‌సభ స్థానం విషయంలో టీడీపీ–బీజేపీ మధ్య పొత్తు పొసగడం లేదు. ఈ స్థానంపై బీజేపీ నేతలు పట్టువీడడంలేదు. సీటు కచ్చితంగా మార్చాలని.. లేకుంటే స్నేహపూర్వక పోటీకి సిద్ధమని చెబుతున్నారు. ఈ ఎంపీ సీటును ఆశించి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మూడేళ్లుగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆఖరి నిమిషం వరకు కూటమి పొత్తులో ఈ సీటు తనకే దక్కుతుందని ఎంతో ధీమాగా ఉన్నారు. అయితే అనూహ్యంగా లోకేష్ తోడల్లుడు, నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు అయిన భరత్‌కు టీడీపీ తరఫున కేటాయించారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని జీవీఎల్, ఆయన అనుచర వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుతో పాటు ఆయన వదిన, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిలు ఏకమై జీవీఎల్‌కు కాకుండా భరత్‌కు టికెట్ దక్కేలా చక్రం తిప్పారన్న భావనలో వీరున్నారు. విశాఖ బీజేపీలో బలంగా ఉన్న ఒక వర్గం కూటమిలో టీడీపీ అభ్యర్థి భరత్‌ను మార్చి ఆ స్థానంలో జీవీఎల్‌కు కేటాయించాలని కొన్నాళ్లుగా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విశాఖ బీజేపీ కార్యాలయం ఆవరణలో వీరు సమావేశమయ్యారు. భరత్‌ను మార్పు చేసి జీవీఎల్‌కు ఇవ్వని పక్షంలో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి ఆయన స్నేహపూర్వక పోటీకి అనుమతించాలని తమ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా లేఖ రాశారు. మార్చకపోతే సహకరించలేం.. రెండు రోజుల క్రితం బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు వంశీయాదవ్, పార్టీ గాజువాక కనీ్వనర్ కరణంరెడ్డి నర్సింగరావు, మరికొందరు నాయకులు, విశాఖలో ఉంటున్న ఉత్తరాదికి చెందిన 20 మందికి పైగా ముఖ్య నాయకులు తాడోపేడో తేల్చుకోవడానికి ఢిల్లీకి పయనమై వెళ్లారు. వీరంతా శనివారం బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ పునియాను కలిశారు. విశాఖలో బీజేపీకి పట్టుందని, గతంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పార్టీ అభ్యర్థులే గెలుపొందారని సతీష్‌కు వివరించారు. జీవీఎల్ విశాఖలో ఉంటూ పార్టీ బలోపేతానికి మూడేళ్లుగా కృషి చేస్తున్నారని, బీజేపీ గెలిచే విశాఖ లోక్‌సభ సీటును గెలుపు అవకాశాల్లేని టీడీపీకి కేటాయించడం పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశ, నిస్పృహలతో పాటు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీ కోసం పాటు పడుతున్న జీవీఎల్‌కు కాకుండా ఆమె బంధువైన భరత్‌కు సీటు ఇప్పించుకున్నారని స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థి భరత్‌ను మార్చి ఆ స్థానంలో బీజీపీ అభ్యర్థి జీవీఎల్‌కు ఇస్తే గెలుపు తేలికవుతుందని సతీష్‌కు చెప్పారు. లేనిపక్షంలో కూటమి టీడీపీ అభ్యర్థి గెలుపునకు తాము సహకరించబోమని స్పష్టం చేసినట్టు తెలిసింది. వీరి విజ్ఞప్తిని సావధానంగా విన్న సతీష్.. ఈ విషయాన్ని జాతీయ అధ్యక్షుడు నడ్డా దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.విశాఖ లోక్‌సభ సీటుపై తగ్గేదే లే అంటున్న బీజేపీ నాయకుల తీరుతో టీడీపీ అభ్యరి్థతో పాటు ఆ పార్టీ నాయకుల్లోనూ కలవరం రేకెత్తుతోంది. ఇప్పటికే పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భరత్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. తమతో బీజేపీ శ్రేణులు కలిసి రావడం ప్రశ్నార్థకమేనని తేలడంతో టీడీపీ నాయకుల్లో ఆందోళన నెలకొంది. -
Visakha: కూటమిలో పోస్టర్ల కలకలం
విశాఖపట్నం, సాక్షి: అభ్యర్థుల్ని ప్రకటించినా.. కూటమిలో గొడవలు మాత్రం సర్దుమణగడం లేదు. మరికొన్ని చోట్ల అభ్యర్థుల్ని మార్చాల్సిందేననే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ జాబితాలో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం కూడా ఉంది. కూటమిలో భాగంగా విశాఖ ఎంపీ సీటు బీజేపీకి వెళ్తుందనే ప్రచారం మొదట్లో బాగా వినిపించింది. మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమనే భావించారంతా. కానీ, చంద్రబాబు పాచికతో ఈ సీటు టీడీపీకి వెళ్లింది. నారా లోకేష్ తన తోడల్లుడు భరత్‌కు సీటు ఇప్పించారు. దీంతో జీవీఎల్ నొచ్చుకున్నారు. అయినా విశాఖకు తన సేవలు అందిస్తానంటూ ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. అయితే ఈలోపు విశాఖలో పోస్టర్ల కలకలం రేగింది. జీవీఎల్‌కు సీటు కేటాయించాలంటూ జన జాగరణ సమితి పేరిట ఆంధ్రా యూనివర్సిటీ గేటుకు పోస్టర్లు అంటించారు. టీడీపీ-జనసేన-బీజేపీ తరఫు ఉమ్మడి అభ్యర్థి భరత్ విశాఖ కోసం ఏం చేశాడని.. జీవీఎల్ కనీసం పార్లమెంట్లో గళం వినిపించారని ఆ పోస్టర్ల సారాంశం. జీవీఎల్‌కు టికెట్ కేటాయించకపోవడం అన్యాయమని రాసి ఉంది అందులో. దీంతో కూటమిలో ఈ పోస్టర్లపై చర్చ జోరందుకుంది. -
ఎంపీ సీట్ పై జీవీఎల్ కామెంట్స్
-
పురంధేశ్వరి రాజకీయ క్రీడ.. బీజేపీ సీనియర్‌కు షాక్!
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి పొత్తుల్లో భాగంగా అసలు బీజేపీ నేతలకు బిగ్ షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా సీట్ల కేటాయింపులో బీజేపీ సీనియర్ నేత జీవీఎల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు, పురంధేశ్వరి ఆడుతున్న ‘ఫ్యామిలీ’ రాజకీయ క్రీడలో జీవీఎల్‌కు నిరాశే ఎదురైంది. కాగా, ఏపీ కూటమిలో సీట్ల కేటాయింపుల్లో భాగంగా చంద్రబాబు, పురంధేశ్వరి ప్లానే వర్క్ అవుట్ అవుతోంది. చంద్రబాబు సూచనలనే పురంధేశ్వరి కూడా అమలు చేస్తున్నారు. చంద్రబాబు మాటను తూచా తప్పకుండా పురంధేశ్వరి అమలు చేస్తున్నారు. స్థానిక ఒరిజినల్ బీజేపీ నేతల మాటలను రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో, వారికి భంగపాటే ఎదురవుతోంది. తాజాగా మరోసారి పురంధేశ్వరి తన పంతం నెగ్గించుకున్నారు. బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహరావును కాదని విశాఖ సీటును టీడీపీ ఇచ్చేందుకే అంగీకరించారు పురంధేశ్వరి. అయితే, ఈరోజు టీడీపీ పార్లమెంట్ స్థానాలకు గాను చంద్రబాబు 13 మంది అభ్యర్థుల బాబితాను విడుదల చేశారు. ఇందులో భాగంగా విశాఖ ఎంపీ స్థానాన్ని బాలకృష్ణ అల్లుడు భరత్‌కు కేటాయించారు. ముందు నుంచీ విశాఖ సీటు తనకే వస్తుందనే నమ్మకంతో నిన్నటి వరకు జీవీఎల్ ప్రచారం కూడా చేసుకున్నారు. ఎన్నికల కోసం ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగారు. కానీ, ఊహించని విధంగా చంద్రబాబు రాజకీయ క్రీడలో జీవీఎల్‌కు నిరాశే ఎదురైంది. ఇక, జీవీఎల్‌కు సీటు ఇవ్వకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురంధేశ్వరి వల్లే విశాఖ సీటు టీడీపీ వెళ్లిందని ఆరోపిస్తున్నారు. ఏలూరు స్ధానంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ నేత గారపాటి చౌదరికి నిరాశే ఎదురైంది. ఏలూరు ఎంపీ స్ధానాన్ని యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్‌కి ఇచ్చిన చంద్రబాబు. అలాగే, హిందూపూర్ స్ధానం కోసం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి ఆశలు గల్లంతే అయ్యాయి. హిందూపూర్ పార్లమెంట్ స్ధానాన్ని పరిపూర్ణానందస్వామికి ఇవ్వాలని ఆర్ ఎస్ఎస్, వీహెచ్‌పీ విజ్ణప్తులని చంద్రబాబు పట్టించుకోలేదు. హిందూపూర్ స్ధానంలో టీడీపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే బీకే పార్దసారధిని ప్రకటించారు. టీడీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఇదే.. -
విశాఖ ఎంపీ సీటుపై వదిన–మరిది డ్రామా!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఎంపీ సీటు విషయంలో అటు టీడీపీ ఇటు బీజేపీ పెద్ద డ్రామానే నడిపిస్తున్నాయి. పొత్తులు కడుతూనే వెనకాల నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు పోటీచేయాలో నిర్ణయిస్తూ చక్రం తిప్పుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి తమ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని బీజేపీ నేతలు వాపోతున్నారు. అలాగే, విశాఖ ఎంపీ సీటు కోసం గత రెండేళ్లుగా పనిచేస్తున్న జీవీఎల్‌కు చెక్‌పెడుతూ పూర్వాశ్రమంలో టీడీపీలో పనిచేసిన సీఎం రమేష్‌కు ఆ స్థానం కేటాయించేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పట్టుబట్టడం ఆ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. మరోవైపు.. చంద్రబాబు కుటుంబానికే చెందిన భరత్ కాస్తా తనకు సీటు ఇవ్వకపోతే ఏమైనా చేసుకుంటానని.. దానికి మీదే బాధ్యత అని హెచ్చరించడంతో సీఎం రమేష్‌కు అనకాపల్లి సీటును కేటాయించేలా పురందేశ్వరి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించి అప్పట్లో తనకు అనుకూలంగా ఉన్న వారికే ఇప్పుడు బీజేపీ సీట్లను కేటాయించేలా చక్రం తిప్పడంలో వదినకు మరిది (చంద్రబాబు) కూడా మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. తనకు విశాఖ ఎంపీ సీటు కేటాయించకపోతే ఏ అఘాయిత్యానికి పాల్పడినా అందుకు మీరే బాధ్యులవుతారంటూ టీడీపీ నేత, లోకేశ్ తోడల్లుడు భరత్ స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో అనకాపల్లి ఎంపీ సీటును సీఎం రమేష్‌కు కేటాయించేందుకు వీలుగా.. అందుకు జనసేన త్యాగం చేసేలా వదిన, మరిది చక్రం తిప్పుతున్నట్లు బీజేపీ శ్రేణులే అనుమానిస్తున్నాయి. మరోవైపు.. జనసేన నేతలు కూడా తమ పార్టీకి మొదట్లో ఇచ్చిన అరకొర సీట్లను సైతం అధినేత పవన్ వదలుకోవడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మళ్లీ పాత రోజులే! మరోవైపు.. బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గతంలో పార్టీలో ఉన్న ఒక వృద్ధ నేత రాజకీయాలకు దూరంగా ఉండడంతో రాష్ట్రంలో బీజేపీ స్వయంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని భావించామని.. కానీ, ఇప్పుడు పురందేశ్వరి రూపంలో మళ్లీ పార్టీని బొందలో పెట్టే కార్యక్రమం నడుస్తోందని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగానే పార్టీ కార్యాలయంలో వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా వలస నేతలకు సీట్లను కేటాయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పేందుకు కొద్దిమంది సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలను అలాంటి వారికి అప్పగిస్తే తిరిగి పార్టీని నామరూపాలు లేకుండా చేస్తారనే విషయాన్ని వివరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు వీరు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు లేఖ కూడా రాశారు. జీవీఎల్‌కు పురందేశ్వరి చెక్! ఇక విశాఖపట్నం ఎంపీ సీటు కోసం రెండేళ్లుగా జీవీఎల్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇక్కడ పలు కార్యక్రమాలు చేపట్టారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం తన వంతు యత్నించారు. స్థానికంగా ఆయా వర్గాల్లో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణపై కేంద్రం ముందడుగులు వేస్తుంటే.. కార్మికుల్లో వ్యతిరేకత రాకుండా వారితో చర్చలు జరిపి.. మధ్యేమార్గాలను సూచించాలంటూ సమావేశాలను నిర్వహించారు. ఈ పరిస్థితుల్లో జీవీఎల్‌కు సీటు రాకుండా పురందేశ్వరి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. వెనుకనుండి కథ మొత్తం చంద్రబాబు నడిపించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు జీవీఎల్ వైజాగ్‌లో ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా తమ అనుకూల మీడియాలో రాకుండా టీడీపీ నేతలు జాగ్రత్తపడ్డారు. అంతేకాక.. జీవీఎల్‌కు వ్యతిరేకంగా కథనాలను కూడా ప్రచురించారు. ఇప్పుడు ఏకంగా సీటు రాకుండా చేయడంతో జీవీఎల్ వర్గం కూడా మండిపడుతోంది. -
ఎంపీ రిక్షా తొక్కిండు
-
‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయింది’
విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. నరసింహారావు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే నడపాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ముడిసరుకు ఇచ్చేందుకు ఎన్ఎండీసీ సిద్ధంగా ఉందని ఎంపీ జీవీఎల్ తెలిపారు. అదే సమయంలో విశాఖ నుంచి వారణాసి ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. ‘విశాఖ నుంచి వారణాసికి ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. చాలా సందర్బాల్లో రైల్వే మంత్రిని కలిసి రైలు ఏర్పాటు చేయాలని కోరాం. రైల్వే బోర్డు నుంచి వారణాసికి ఎక్స్‌ప్రెస్ రైలు నడిపేందుకు ఆమోదం వచ్చింది. వారానికి రెండు రోజులు నడిపేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో దీన్ని రోజువారి రైలుగా నడిపే అవకాశం ఉంది. విజయదశమి లోపు ప్రారంభించాలని కోరాం’ అని తెలిపారు. చదవండి: ‘జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా?’ -
ఏపీ బీజేపీలో టికెట్ వార్.. సీనియర్ల మధ్య సీటు పోటీ!
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో బీజేపీ ఇద్దరు సీనియర్ల మధ్య టికెట్ వార్ నడుస్తోందా?. బీజేపీ హైకమాండ్ అక్కడ ఎవరికి టికెట్ ఇస్తుంది? అనే చర్చ కార్యకర్తలను టెన్షన్‌కు గురిచేస్తోంది. ఒకవైపు, తమ నేతను కార్యకర్తలు హైలైట్ చేస్తుండగా.. మరొకరికి గతంలో అక్కడి నుంచి గెలిచిన రికార్డు ఉంది. దీంతో, టికెట్ ఎవరికి ఇస్తారనేది కమలం పార్టీలో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ వారద్దరూ ఎవరంటే.. విశాఖపట్నం నుంచి ఇద్దరు బీజేపీ సీనియర్ల మధ్య టికెట్ వార్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొన్నాళ్లుగా విశాఖలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జీవీఎల్ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో ఆయన అభిమానులు బర్త్ డే వేడుకలను ఘనంగా ప్లాన్ చేశారు. విశాఖ సిటీ మొత్తం "GVL 4 VIZAG" పోస్టర్లు అంటించారు. విశాఖ అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్నట్లుగా అభిమానులు అందులో పోస్టర్లలో పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఇటీవల జీవీఎల్ కూడా విశాఖ అభివృద్ధిపైనే మాట్లాడుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో విశాఖలో టికెట్ ఆయన టికెట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఏపీ బీజేపీకి కొత్తగా ప్రెసిడెంట్‌గా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు. పురంధేశ్వరి విశాఖ నుంచి పోటీకి పట్టుదలగా ఉన్నారు. గతంలో పురంధేశ్వరి విశాఖ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈనేపథ్యంలో ఆమె కూడా విశాఖ సీటు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ హై కమాండ్ కి విశాఖ సీటు అగ్ని పరీక్షగా మారుతుందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో, ఎవరిని సీటు వరిస్తుందోనన్న సస్పెన్స్ చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి: ప్రజలను గందరగోళానికి గురిచేయవద్దు.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదు: సజ్జల -
మేము తగ్గాము అంతే... ఓడిపోలేదు 28 ఎంపీ సీట్లు మావే
-
రాష్ట్రంలో రాజకీయ వేట మొదలైంది
సాక్షి, విశాఖపట్నం: రాబోయే ఎన్నికలకు రాష్ట్రంలో రాజకీయ వేట మొదలైందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తున్నారని చెప్పారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ పాలనపై పలు పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అందుకే ‘పార్టీల అసత్య ప్రచారం.. కేంద్ర సహకారం’ పేరుతో తమ పార్టీ ఇటీవల పుస్తకాన్ని ముద్రించిందని.. దీనిని అప్డేట్ చేసి త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ఈ పుస్తకంతో ఇంటింటికీ వెళ్లి వాస్తవాలను వివరిస్తామన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులకు కూడా ఈ పుస్తకంలో సమాధానం దొరుకుతుందన్నారు. విశాఖలో భూ కుంభకోణాలపై గత టీడీపీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వాలు వేసిన సిట్ నివేదికలను బహిర్గతం చేయాలన్నారు. వైఎస్సార్సీపీతో సహా ఏ పార్టీకి కూడా బీజేపీ అండగా లేదని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ లేదా సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలి్సన అవసరముందన్నారు. దీనిపై ఎవరైనా కోర్టుకెళ్లి విచారణకు అభ్యర్థించవచ్చని.. ఇందులో కేంద్రం గానీ, బీజేపీ గానీ జోక్యం చేసుకోబోదన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ.. మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. సమావేశంలో బీజేపీ నాయకుడు మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీతో పవన్ పొత్తు అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం : జీవీఎల్
-
టీడీపీతో పవన్ కల్యాణ్ పొత్తు అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం
సాక్షి, విశాఖపట్నం: టీడీపీతో పవన్ కల్యాణ్ పొత్తు అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. పొత్తుపై తమ అధిష్టానమే అంతిమ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రస్తుతానికి బీజేపీ, జనసేన మాత్రం కలిసే ఉన్నాయని తెలిపారు. కర్ణాటకలో బీజేపీ ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలపై ఉండవని పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో ఫలితాలు మరొక రాష్ట్రంలో ప్రభావం చూపించవన్నారు. చదవండి: పవన్ శ్వాస, ధ్యాస బాబే -
ఫలితాలపై జీవీఎల్ రియాక్షన్
-
కాశీకి తెలుగు ప్రజలకు మధ్య ప్రాచీన సంబంధం ఉంది: మోదీ
లక్నో: శనివారం సాయంత్రం కాశీలో తెలుగు సంగమం - గంగా పుష్కర ఆరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ కాశీ తెలుగు సమితి గౌరవాధ్యక్షులు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నేతృత్వం వహించారు. కాశీ తెలుగు సంగమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. 'కాశీకి తెలుగు ప్రజలకు మధ్య ప్రాచీన సంబంధం ఉంది. ఏపీ, తెలంగాణ భక్తులు అత్యంత ఆరాధన భావంతో ఉంటారు. తెలంగ్ స్వామిని కాశీలో నడుస్తున్న మహాశివుడు గా అభివర్ణిస్తారు. జిడ్డు కృష్ణమూర్తినీ ప్రజలు గుర్తుంచుకున్నారు. వేములవాడను దక్షిణ కాశీగా అభివర్ణిస్తారు. కాశీ మజిలీ కథలు తెలుగు ప్రజలతో మమేకమై ఉన్నాయి. ఇదంతా తరతరాలుగా భారత వారసత్వం. కాశీని ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. వారణాసి - బెనారస్ మధ్య రోప్ వే నిర్మిస్తున్నాం. ఏపీలో ఏటి కొప్పాక బొమ్మలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. గంగా పుష్కరాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు' అని మోదీ పేర్కొన్నారు. ఈ కర్యక్రమంలో నిర్వహించినవి.. ► ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం. ► వేద పండితుల ఆశీర్వచనం, వేదపారాయణం, స్త్రోత్ర పారాయణం. ► మానస సరోవర్ ఘాట్ వద్ద గంగా నదీ ఆరాధన, గంగా హారతి. చదవండి: సోలో సెయిలింగ్ రేస్‌లో చరిత్ర సృష్టించిన భారత ఇండియన్ నేవీ ఆఫీసర్ -
ఎన్నారైలు విదేశాల్లోనే ఓటు వేయొచ్చు.. వారి కోసం ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్
ప్రవాస భారతీయ (ఎన్నారై) ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీబీపీఎస్)ను అమలు చేసే ప్రతిపాదన పరిశీలనలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు సమాధానమిస్తూ.. 1 జనవరి 2023 నాటికి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 20A ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న 1,15,696 మంది భారతీయ పౌరులు భారతీయ ఓటర్ల జాబితాలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నారై ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయడానికి ఎన్నికల ప్రవర్తన నియమాలు 1961ను సవరించే ప్రతిపాదనను భారత ఎన్నికల సంఘం చేపట్టిందని న్యాయ మంత్రి కిరణ్ రిజీజు తెలిపారు. ప్రతిపాదన అమలులో ఉన్న లాజిస్టికల్ సవాళ్లను పరిష్కరించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఈ విషయం చర్చిస్తున్నట్లు చెప్పారు. విదేశీ ఓటర్లు వ్యక్తిగతంగా లేదా ప్రాక్సీ (నామినేటెడ్ ఓటరు) ద్వారా ఓటు వేయడానికి వీలుగా ప్రజాప్రాతినిధ్య (సవరణ) బిల్లు, 2018 పేరుతో భారత ఎన్నికల సంఘం సిఫార్సు చేసిన బిల్లును ఆగస్టు 9, 2018న లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదించినట్లు న్యాయ మంత్రి తెలిపారు. అయితే 16వ లోక్‌సభ రద్దు కారణంగా ఈ బిల్లు కూడా రద్దయిందని పేర్కొన్నారు. -
నాటు నాటు పాటకు ఆస్కార్.. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ ప్రశంసలు
న్యూఢిల్లీ: ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు రాజ్యసభలో ప్రస్తావించారు. నాటు నాటుకు ఆస్కార్ దక్కడం తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపుగా అభివర్ణించారు. దీనిపై మంగళవారం రాజసభలో జీవీఎల్ మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డులు భారతీయ సినిమాకు ముఖ్యంగా తెలుగువారికి ఒక చారిత్రాత్మక గుర్తింపు అని అన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం వాస్తవానికి తెలుగు చిత్రం.. ఆస్కార్ అవార్డు పొందిన ‘నాటు నాటు’ పాట తెలుగు పాట అని రాజ్యసభ సభ్యులందరికీ గుర్తు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా విజయం ఒక్కటి మాత్రమే కాదని, దాని దర్శకుడు రాజమౌళి బాహుబలి లాంటి చిత్రాన్ని కూడా తెరకెక్కించారని, ఇది అంతర్జాతీయ విజయాన్ని సాధించిందని ఎంపీ జీవీఎల్ అన్నారు. రాజ్యసభలో నామినేటెడ్ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి రచయిత అని ప్రశంసించిన ఎంపీ జీవీఎల్.. ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. -
పెట్టుబడుల కోసం సీఎం జగన్‌ది మంచి ప్రయత్నం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) నిర్వహించడం ద్వారా పెట్టుబడులను ఆకట్టుకోవడానికి కృషి చేశారన్నారు. సోమవారం ఆయన విశాఖలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాలు (ఎంవోయూలు) వాస్తవరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడ్డారు. జీఐఎస్ నిర్వహణ భేష్: విష్ణుకుమార్‌రాజు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను గొప్పగా నిర్వహించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు విలేకరుల సమావేశంలో కొనియాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన ఈ సదస్సులో రూ.13 లక్షల కోట్లకు పైగా విలువైన ఎంవోయూలు కుదుర్చుకోవడం, అంబానీ, కరణ్ అదానీ, జిందాల్ వంటి అతిరథులు పాల్గొనడం గొప్ప విషయమని చెప్పారు. రాష్ట్రానికి ఇంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చారంటే మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే వేళ రాజకీయ విమర్శలు సరికాదని చెప్పారు. విశాఖలో రోడ్ల అభివృద్ధి, నగర సుందరీకరణ అభినందనీయమన్నారు. -
జీవీఎల్‌కు పురందేశ్వరి కౌంటర్
-
బీజేపీ ఎంపీ జీవీఎల్‌కు పురంధేశ్వరి కౌంటర్
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్, వైఎస్సార్ పేర్ల విషయంలో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు. ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులంటూ ట్వీట్ చేశారు. ఒకరు రూ.2కే కిలోబియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు ఇస్తే మరొకరు ఫీజు రీఎంబర్స్మెంట్, 108, ఆరోగ్యశ్రీ వంటి సేవలు అందించారని చెప్పారు. ఎన్డీఆర్, వైఎస్సార్ పేదలకు నిజమైన సంక్షేమం అందించారని కొనియాడారు. ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులు — Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) February 17, 2023 చదవండి: 'టీడీపీ స్కెచ్.. నీ పంట దున్నెయ్ లీడర్ని చేస్తాం' -
మాటకు మాట
-
Kanna Lakshminarayana vs GVL Narasimha Rao: మాటకు మాట
-
సోము వీర్రాజుపై కన్నా వ్యాఖ్యలు సముచితం కాదు: జీవీఎల్
-
కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా.. జీవీఎల్ రియాక్షన్ ఇదే
సాక్షి, అమరావతి: కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పందించారు. కన్నాకు బీజేపీ సముచిత స్థానం కల్పిందన్నారు. సోము వీర్రాజుపై ఆయన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కన్నా వ్యాఖ్యలు చేశారన్నారు. ‘‘అధిష్టానం చెప్పిన విధంగానే సోము వీర్రాజు నడుస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఏ నిర్ణయాలు తీసుకోలేదు. ఎంపీగా నా బాధ్యతకు లోబడే నేను పని చేశా’’ అని జీవీఎల్ పేర్కొన్నారు. కాగా, బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. మీడియా సమావేశంలో తన రాజీనామాను ప్రకటించిన కన్నా.. సోము వీర్రాజుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర బీజేపీలో పరిణామాలు కలచివేస్తున్నాయని, సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత పార్టీ పరిస్థితులు మారాయని ఫైర్ అయ్యారు. పార్టీలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. సోము వీర్రాజు వైఖరితోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కన్నా తెలిపారు. జీవీఎల్‌పై కూడా లక్ష్మీనారాయణ పరోక్ష విమర్శలు చేశారు. ఓవర్ నైట్ నేత కావాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. చదవండి: టీడీపీలో కల్లోలం.. కొనసాగుతున్న రాజీనామాల పర్వం