సాక్షి, విజయవాడ: ఏపీలో జరిగే ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 29న రాజమండ్రి, ఏప్రిల్ 1న కర్నూలుల్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాల్గొంటారని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ముఖ్యమైన జాతీయ నాయకులు రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని చెప్పారు. ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోను పీయూష్ గోయల్ విడుదల చేస్తారని తెలిపారు. ఏపీలో ఎన్నికలు ధన మయమైయ్యాయి.. దీనిపై రేపు ఎన్నికల కమిషన్ను కలిసి టీడీపీ ధన రాజకీయాలు పై ఫిర్యాదు చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి రూ. 100 నుంచి 150 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు రూ. 30 కోట్లు, మంత్రులు వందల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏపీ ఎన్నికల్లో 6 వేలు కోట్లు ఖర్చు చేయడానికి సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు. బాబు ధన ప్రవాహానికి ఎన్నికల సంఘం అడ్డుకట్టు వేయాలి అన్నారు. సీఎం చంద్రబాబు మాటలనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రిపీట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కళ్యాణ్ గా మారారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు మాటలు వింటే పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్ అంధకారం చేసుకున్నట్లేనని అన్నారు. తెలంగాణ పాకిస్థాన్ అయితే చంద్రబాబు కుటుంబం, పవన్ కళ్యాణ్ కుటుంబం హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారో చెప్పాలన్నారు. ఆంధ్ర ప్రజలపై తెలంగాణలో దాడులు చేస్తున్నారని ఏపీ ప్రజలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొని తప్పు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment