సాక్షి, ఢిల్లీ : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్‌లో ఉన్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు విమర్శించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జీవీఎల్ ఆదివారం న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పుడు ఈవీఎంను తప్పుబడుతున్న చంద్రబాబు....2014 ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు.
అధికారులను బదిలీ చేస్తే చంద్రబాబు ఎందుకు యాగీ చేస్తున్నారని జీవీఎల్ ప్రశ్నించారు. ఏపీలో మూడు కోట్లమంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. వారికి రాని అనుమానం చంద్రబాబుకు మాత్రమే ఎందుకు వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ బాక్సులు గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఓ పరిపక్వత గల రాజకీయ నాయకుడు అలా ప్రవర్తించరాదని, చంద్రబాబు నలభై ఏళ్ల అనుభవం ఎందుకని ప్రశ్నించారు. ఆయనలో ఆ హుందాతనం కనిపించకపోగా, చౌకబారుతనం కనిపించిందని జీవీఎల్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment