Electronic Voting Machine (EVM)
-
జమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్
-
Supreme Court of India: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించడానికి తీసుకున్న చర్యలను వివరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఎన్నికల విధానంలో పవిత్రత ఉండాలని, ఎటువంటి అనుమానాలు, అపోహలకు ఆస్కారం ఉండొద్దని పేర్కొంది. ఎన్నికల వ్యవస్థలో ఓటర్ల సంతృప్తి, విశ్వాసం అనేవి చాలా ముఖ్యమని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) నమోదైన ఓట్లను వీవీ ప్యాట్ స్లిప్పులతో క్రాస్–వెరిఫికేషన్ చేయాలని కోరుతూ అసోసియేసన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఏడీఆర్ తరపున సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై అనుమానాలు వ్యక్తం చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. అన్నింటికీ అనుమానించవద్దని సూచించింది. పిటిషన్లపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. -
అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎం వాడరు!
ఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు ఎన్నికల కోసం ఎన్నో సంస్కరణలు, మార్పులు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉంటాయి కూడా. ఇందులో ఈవీఎంల వాడకం అనేది టెక్నాలజీతో ముడిపడిన అంశం. ఎన్నికలొచ్చిన ప్రతీసారి చర్చనీయాంశంగా(రాజకీయ విమర్శలకు సైతం వేదిక) మారుతుంటుంది కూడా. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పుడు ఈవీఎంలనే ఉపయోగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. మరి.. రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఈవీఎంలు ఎందుకు వాడటం లేదు?. బ్యాలెట్ పేపర్ విధానంతోనే రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు జరుగుతుందసలు?.. ముందుగా ఈవీఎం టెక్నాలజీ సంగతి చూద్దాం. ఈవీఎంలలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు.. దాని పక్కనే సంబంధిత బటన్ ఉంటుంది. ఓటర్లు నచ్చిన అభ్యర్థి బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఉన్న సాఫ్ట్ వేర్ ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనే విషయాన్ని కౌంటింగ్ రోజున క్షణాల్లో చూపించేస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల విషయానికి వచ్చేసరికి... దీని పోలింగ్ విధానం అలగ్ ఉంటుంది. ఈవీఎంలు ఎంత మాత్రం సరిపోవు. ఎందుకంటే.. ఓటు వేసే వారికి కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలనే నిబంధన ఇక్కడ వర్తించదు. ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులకు తమ ఛాయిస్ ఆధారంగా ప్రిఫరెన్సియల్ ఓట్లు వేసే ఛాన్స్ ఉంది. ప్రాధాన్యతల ఆధారంగా, వారి ఇష్టానుసారం ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటర్లు ఓటేయొచ్చు. చివరికి.. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఓట్లు పడ్డాయనే ఆధారంగా విజేతను ప్రకటిస్తారు!. బ్యాలెట్ పేపర్లోని కాలమ్ 2 లో ఓటర్ ఇష్టాన్ని బట్టి ఒకటి.. రెండు.. మూడు.. ఇలా ఎంతమందికైనా ఓటు వేయవచ్చు. అందువల్లే రాష్ట్రపతి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తారు. మరి ఈవీఎంలలో కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది కదా. ఈ కారణంగానే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడం లేదు. -
‘ఈవీఎంల్లో గోల్మాల్ ’
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలు మోసపూరితమైనవని, ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంల్లో 30 శాతం ఈవీఎంల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పనిచేయని ఈవీఎంల స్ధానంలో మార్చిన ఈవీఎంలను ఏ ఒక్కరూ పరీక్షించలేదని అన్నారు. ఆ ఈవీఎంల్లో మాక్ పోలింగ్ కూడా నిర్వహించకపోవడంతో ఈవీఎంల్లో ఓట్లు ముందస్తుంగా నిక్షిప్తం కాలేదని చెప్పేందుకు ఆధారాలు ఏంటని ఆమె ప్రశ్నించారు. తాము ఈసీని కలిసి పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను వాడాలని కోరతామని దీదీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్ పత్రాలను ప్రవేశపెట్టాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. బెంగాల్‌ను గుజరాత్‌గా మార్చాలనే ప్రయత్నాలను నిలువరిస్తామని, ఈ ఎన్నికలు మోసపూరిత ఎన్నికలని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. -
మాతో పెట్టుకుంటే మసే
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తమతో ఎవరైనా పెట్టుకుంటే నాశనమైపోతారని హెచ్చరించారు. రంజాన్(ఈద్–ఉల్–ఫితర్) సందర్భంగా కోల్‌కతాలోని రెడ్ రోడ్డులో ప్రార్థనలకు హాజరైన 25,000 మందికిపైగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..‘మాతో ఎవరైనా పెట్టుకుంటే నాశనమైపోతారు.. ఇకపై ఇదే మా నినాదం. బీజేపీ మతాన్ని రాజకీయం చేస్తోంది. హిందువులు త్యాగానికి ప్రతీకలు. ముస్లింలు ఇమాన్(సత్యప్రియత)కు, క్రైస్తవులు ప్రేమకు, సిక్కులు బలిదానానికి ప్రతీకలు. మనమంతా ప్రేమించే భారతదేశం ఇదే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించుకుంటాం’ అని మమత తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ.. ‘ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. కొన్నిసార్లు సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కిరణాల తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ కొంతసేపటికే అది తగ్గిపోతుంది. ఈవీఎంల సాయంతో వాళ్లు(బీజేపీ) ఎంతత్వరగా అధికారంలోకి వచ్చారో, అంతేత్వరగా తెరమరుగైపోతారు’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముస్లింలకు బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి, సీఎం మమత రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. -
ఆ నోటా ఈ నోటా
ఈవీఎంలో ఒక ఆప్షన్ ఉంటుంది. అదే నోటా... పైన తెలిపిన ఎవ్వరికీ నేను ఓటు వేయడం లేదు (నన్–ఆఫ్–ది ఎబవ్) అని తేల్చి చెప్పడమే ఈ నోటా అర్థం. 2014లో నోటా ఓట్ శాతం ఎంత ఉందో... 2019లోనూ ఆ శాతం దాదాపు అదే విధంగా ఉండడం ఇక్కడ గమనార్హం. ఎన్నికల సంఘం వెబ్సైట్ అందించిన గణాంకాల ప్రకారం... సంబంధిత అంశాన్ని క్లుప్తంగా చూస్తే... ► 2019లో పోలైన మొత్తం ఓట్లలో నోటా శాతం 1.04% . 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ శాతం 1.08% . లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే 2019లో అత్యధిక ఓట్లశాతం నమోదయిన సంగతి తెలిసిందే. ► ఈ నోటారాష్ట్రాల వారీగా చూస్తే, నోటా శాతాల్లో తీవ్ర వ్యత్యాసం ఉండడం మరో విశేషం. అస్సాం, బిహార్లలో అత్యధికంగా 2.08% నోటా ఓటు నమోదయ్యింది. సిక్కింలో ఈ శాతం 0.65 శాతంగా ఉంది. ► ఈ నోటాపీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఒక కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన ఒక తీర్పు నేపథ్యంలో దేశంలో నోటా విధానం ఆరంభమైంది. ► ఈ నోటాఛత్తీస్గఢ్, మిజోరం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో నోటా వినియోగం ప్రారంభమైంది. అప్పట్లో ఆయా రాష్ట్రాల్లో నోటా ఓటు 1.85 శాతంగా ఉంది. -
ఇండియన్ ఈవీఎంల ట్యాంపరింగ్ కష్టం
వాషింగ్టన్: భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం చాలా కష్టమని ప్రముఖ అమెరికన్ నిపుణుడు గెల్బ్ పేర్కొన్నారు. ఈ ఈవీఎంలు ఆఫ్‌లైన్‌లో పనిచేయడం వల్ల స్వతంత్ర యూనిట్లుగా ఉంటాయని తెలిపారు. ‘భారత్‌లో వాడుతున్న ఈవీఎంలలో ఉపయోగించిన సాంకేతికత నమ్మదగినదని నేను చేసిన అధ్యయనంలో స్పష్టమైంది. ఏ టెక్నాలజీ నిర్దిష్టమైనది కాదు. కానీ భారత్‌లో వాడుతున్న ఈవీఎంలు ఆఫ్‌లైన్‌లో పనిచేస్తున్నాయి. అందుకే వాటిని నేరుగా మాత్రమే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది. మరో విధంగా చేయలేం’అని పేర్కొన్నారు. ఇండియాలో ఉపయోగిస్తున్న ఈవీఎంలను మాస్ ట్యాంపరింగ్ చేయడం కష్టమని తాను చేసిన పరిశోధనల్లో తేలిందని గెల్బ్ పేర్కొన్నారు. ఇది కేవలం ఒక స్వతంత్ర ఎలక్ట్రానిక్ పరికరమని, ఇతర దేశాల్లో ఓటు వేసే విధానాలకు ఇది భిన్నంగా ఉంటుందని గెల్బ్ అన్నా రు. ఈవీఎంలను పరిశీలించకుండా, ఒక సమన్వయ ప్రాతిపదిక లేకుండా ట్యాంపరింగ్ చేయడం కష్టమన్నారు. అంతేకాకుండా వీవీప్యాట్ల వల్ల ఎన్నికల్లో విశ్వసనీయత, వాస్తవికత ఉంటుందన్నారు. -
జనాదేశం శిరోధార్యం
ఈసారి సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం జరిగినంత భీకరంగా, అనాగరికంగా, అరాచకంగా, అడ్డ గోలుగా మునుపెన్నడూ జరగలేదు. ప్రజల సమస్యలపైన చర్చించకుండా, ఐదేళ్ళలో ప్రభుత్వ సాఫల్యవైఫల్యాలను సమీక్షించకుండా మతంపైనా, కులంపైనా, పాకిస్తాన్‌పైనా, సరిహద్దు యుద్ధం పైనా, రఫేల్ యుద్ధవిమానాలపైనా ఆరోపణలూ, ప్రత్యారోపణలతో ప్రచారపర్వం ప్రచండ మారుతం వలె సాగింది. రాజకీయ ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకున్నాయి. నైతిక విలువలు పాతాళానికి దిగజారాయి. ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌లు సర్వశక్తులూ ఒడ్డి చావోరేవో అన్న విధంగా ప్రచారం చేశాయి. ఈ ఎన్నికలను అధ్యక్ష తరహా ఎన్నికలుగా మార్చడంలో బీజేపీ విజయం సాధించింది. ప్రధాని నరేంద్రమోదీకి అనుకూలమా, వ్యతిరేకమా అన్నట్టు ఒక రెఫ రెండం మాదిరి జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడి కానున్నాయి. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 11న జరిగితే ఏడవ, తుది దశ పోలింగ్ మే 19న నిర్వహించారు. ఫలితాల కోసం 42 రోజుల నిరీక్షణ నేటితో ముగుస్తున్నది. ఎగ్జిట్‌పోల్స్ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో వెల్లడించినప్పటికీ ఓట్లు లెక్కపెట్టేవరకూ ఓటమిని అంగీకరించేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు. యుద్ధంలో, ప్రేమలో ఏదైనా చెల్లుబాటు అవుతుందంటారు. ఎన్నికల పోరాటంలోనూ మాటల ఈటెలు ప్రత్యర్థులను వేధించడం సహజం. ఒక వైపు ఎన్నికల సంఘం, మరో వైపు సర్వో న్నత న్యాయస్థానం హద్దులు చూపుతున్నప్పటికీ ఎన్నికల పూనకంలో నాయకులు సకల మర్యాద లనూ మంటగలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పైన 22 ప్రతిపక్షాలు దాడి చేయడం, సుప్రీంకోర్టు హితవు చెప్పినా వినకుండా ఎన్నికల సంఘానికి పదేపదే వినతిపత్రాలను సమర్పించడం ప్రహసనసదృశంగా సాగింది. ఓడినవారూ, ఓడిపోతామని భయపడేవారు మాత్రమే ఈవీఎంలను తప్పుపడతారనీ, విజేతలు ఈవీఎంల గురించి ఫిర్యాదు చేయరని అనడానికీ ఢిల్లీలో మొన్నటి వరకూ జరిగిన రభసే కారణం. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్స్ (స్లిప్పుల)ను కూడా లెక్కించాలంటూ ప్రతిపక్షాలు చేసిన వాదనను సుప్రీంకోర్టు, ఈసీ తిరస్కరించాయి. 2014లో ఇదే ఈవీఎంల పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. నిరుడు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో గెలుపొంది ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఈవీఎంలపైన ఫిర్యాదు చేయలేదు. ఈసారి ఓటమి అనివార్యమని ముందే తెలుసుకున్న చంద్రబాబు అదే పనిగా జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఈవీఎంలను ఒక భయంకర సమ స్యగా భూతద్దంలో చూపించి హడావుడి చేశారు. ఓడిపోతామని ముందే తెలుసుకున్నవారు ఈవీ ఎంలతోపాటు ఎగ్జిట్‌పోల్స్‌ని కూడా విశ్వసించరు. గెలిచినప్పుడు ఈవీఎంలను ఒప్పుకుంటూ, ఓడినప్పుడు వాటిని తప్పుపడుతూ మాట్లాడే రాజకీయ నాయకుల అభిప్రాయాలకు విలువ ఇవ్వ నక్కరలేదు. 50 శాతం వీవీప్యాట్స్‌ను లెక్కించాలంటూ అర్థం లేని డిమాండ్లు పెట్టిన ప్రతిపక్షాల ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించడం ముమ్మాటికీ సమంజసమే. ఎన్నికల సంఘంలో ముగ్గురు సభ్యులు ఉంటారనీ, ముగ్గురికీ సమానాధికారాలు ఉంటాయనీ, మెజారిటీ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలనీ రాజ్యాంగంలోని 324 అధికరణలోని రెండో క్లాజ్ స్పష్టం చేస్తున్నది. ఈ ఎన్నికలలో ఎన్నికల సంఘం సభ్యులకు కొన్ని అంశాలపైన ఏకాభిప్రాయం లేదని వెల్లడైంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో మోదీ నియమావళికి విరుద్ధంగా మాట్లాడా రంటూ కాంగ్రెస్‌పార్టీ చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ప్రధానికి ‘క్లీన్చిట్’ ఇవ్వడాన్ని ఎన్నికల కమిష నర్ అశోక్ లావాసా వ్యతిరేకించారు. తన అభ్యంతరాలను నమోదు చేయాలనీ, బహిర్గతం చేయా లని లావాసా పట్టుపడుతున్నారు. బహిర్గతం చేయనవసరం లేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా అనడం వివాదాస్పదమైంది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించవలసిన ఎన్నికల సంఘం దాపరికం పాటించడంలో అర్థం లేదు. నియమావళిని ఉల్లంఘించిన రాజకీయ నేతలు ఒకటి, రెండు, మూడు రోజులపాటు ప్రచారంలో పాల్గొనరాదంటూ ఎన్నికల సంఘం శిక్షాత్మక చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమం. ఇందుకు సుప్రీంకోర్టు దన్ను ఉంది. ఎన్నికల సంఘం క్రమంగా రూపుదిద్దుకుంటున్న సంస్థ. నిష్పక్షపాతంగా, న్యాయంగా, ధర్మంగా ఎన్నికలు నిర్వహించడమే కాకుండా సూత్రబద్ధంగా నిర్వహిస్తున్నట్టు ప్రజలకు విశ్వాసం కలిగించడమే ఈ సంఘం కర్తవ్యం. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రధానమైనది. ఈ వ్యవస్థపైన ప్రజలు విశ్వాసం కోల్పోతే భారత ప్రజాస్వామ్య దుర్గం బీటలువారుతుంది. ఎన్నికల ప్రచారంలో పెడ ధోరణులు ప్రబలి మతసామరస్యానికీ, సౌభ్రాతృత్వానికీ, సంస్కారానికీ భంగం కలిగే విధంగా రాజకీయ నాయకుల ప్రసంగాలు సాగాయి. ఎన్నికలలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా గెలుపోటములను సమభావంతో స్వీకరించాలనీ, ఆటలో అరటి పండుగా పరిగణించాలనీ, ఎన్నికలలో పాల్గొనడమే ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమనే స్ఫూర్తితో వ్యవహరించాలనీ అందరూ గ్రహిం చాలి. రాజీవ్‌గాంధీ అత్యంత అవినీతిపరుడుగా తనువు చాలించాడు అని ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తిన మోదీ రాజీవ్ 27వ వర్ధంతి సందర్భంగా మాజీ ప్రధానికి నివాళులు చెప్పడం సంస్కారం అనిపించుకుంటుంది. కానీ, కాస్త కృతకంగా కూడా కనిపిస్తుంది. అందుకే ఉన్నత పదవులలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలి. దివంగత నాయకులపైన ఆరోపణలు చేయడం సరికాదు. ఎన్నికల ప్రక్రియ ఆఖరి ఘట్టంలో ప్రవేశించిన కారణంగా ఎన్నికల ప్రచారంలో సృష్టిం చిన విభేదాలను తొలగించడానికీ, అగాధాలను పూడ్చడానికీ రాజకీయ పార్టీలన్నీ శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి. భారతదేశ సమైక్యతకూ, సమగ్రతకూ భంగం కలిగించే ధోరణులను విడ నాడాలి. వైషమ్యాలకు స్వస్తి చెప్పాలి. ప్రజలతీర్పును అన్ని పార్టీలూ శిరసావహించాలి. ప్రజలు నిర్దేశించిన పాత్రను రాజకీయ నాయకులు వినమ్రంగా పోషించాలి. -
‘ఓటమి నైరాశ్యంతోనే ఈవీఎంలపై వివాదం’
సాక్షి, న్యూఢిల్లీ : ఓటమి తప్పదనే నిరాశతోనే విపక్షాలు వీవీప్యాట్లపై రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి, ఎల్జేపీ చీఫ్ రాం విలాస్ పాశ్వాన్ అన్నారు. ఈవీఎంలపై విపక్షాలు గగ్గోలు పెట్టడం వారి ఓటమికి సంకేతమని ఎద్దేవా చేశారు. ఓటమికి చేరువైనప్పుడు విపక్షాలు ఈవీఎంలపై ఫిర్యాదు చేస్తాయని తాను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. ఈవీఎంలను వ్యతిరేకిస్తున్న వారు ఎన్నికలను అర్ధ, అంగబలం శాసించే పాత రోజులకు దేశాన్నితీసుకువెళుతున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఇప్పటికే ఈవీఎం, వీవీప్యాటర్లపై విస్పష్ట ఉత్తర్వులు ఇచ్చినా ఓటమి భయంతో విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని పాశ్వాన్ మండిపడ్డారు. విపక్షాలు గెలిస్తే ఈవీఎంలు సరిగా పనిచేసినట్టు, ఓడిపోతే మాత్రం ఈవీఎంలను తారుమారు చేసినట్టు గగ్గోలు పెట్టే వైఖరి రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య ప్రక్రియకు చేటు అని వ్యాఖ్యానించారు. కాగా ఎన్డీయే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ కేంద్ర మంత్రిగా ముందుకొస్తారని ఆయన సంకేతాలు పంపారు. చిరాగ్ పాశ్వాన్‌కు కేంద్ర మంత్రి కాగల సామర్ధ్యాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఏపీలో మధ్యాహ్నం 2గంటలకు తొలి ఫలితం!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వెలువడే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లపై ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ ట్రెండ్ తెలిసిపోతుందని, రేపు అర్థరాత్రికి మొత్తం ఫలితాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీ ప్యాట్లు లెక్కిస్తామని, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కౌంటింగ్ తర్వాత రీ పోలింగ్ జరిగే అవకాశం చాలా తక్కువ అని ద్వివేది అభిప్రాయపడ్డారు. కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, పాదర్శకంగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుందని ద్వివేది తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. 36 కేంద్రాల్లో 350 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశామని, అసెంబ్లీ, లోక్‌సభకు వేర్వేరుగా పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. అలాగే అసెంబ్లీ, లోక్‌సభకు వేర్వేరుగా లాటరీలు తీసి వీవీ ప్యాట్లు లెక్కిస్తామన్నారు. ఫలితాలను సరిచూసుకోవడానికి వీవీ ప్యాట్ల స్లిప్పులు ఉపయోగించనున్నట్లు ద్వివేది తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని, 100 మీటర్ల దూరం నుంచి వాహనాలకు అనుమతి లేదని, సుమారు 25వేలమంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సువిధ యాప్,ఈసీఐ వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని ద్వివేది తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఓట్లను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ గురువారం నిర్వహించి ఫలితాలను వెనువెంటనే వెల్లడించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలు ఎక్కడ ఫలితాలను తారుమారు చేస్తాయేమో అన్న ఆందోళన ప్రతిపక్ష పార్టీలను పట్టుకు పీకుతోంది. ఆ పార్టీలు గత కొన్నేళ్లుగా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. వాటిని పాలకపక్షం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందంటూ గొడవ చేస్తూనే ఉన్నాయి. అసలు ట్యాంపరింగ్ అంటే ఏమిటీ? అందుకు నిజంగా అవకాశాలు ఉన్నాయా? ఉంటే అవి ఎలాంటివి? వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఈవీఎంలు అంటే ఏమిటీ ? అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈవీఎంలు అంటే... భారత పార్లమెంట్‌కు, రాష్ట్ర అసెంబ్లీలకు గతంలో బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరిగేవి. అది సుదీర్ఘమైన ప్రహసనం. ఓట్లు లెక్కించి పూర్తి ఫలితాలు ప్రకటించేందుకు రెండు రోజులు కూడా పట్టేది. మందీ మార్బలంతో పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకొని రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం కూడా ఉండేది. ఆ ఎన్నికల ప్రక్రియ స్థానంలో ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)లు వచ్చాయి. ఇందులో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగాన్ని ‘కంట్రోల్ యునిట్’గా వ్యవహరిస్తారు. ఈ యునిట్ ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి వద్ద ఉంటుంది. ఈ యునిట్ ప్రతి ఓటును లెక్కించి తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఇది కరెంట్ఫై ఆధారపడకుండా బ్యాటరీపైనే నడుస్తుంది. ఇక రెండో విభాగాన్ని ‘బ్యాలెటింగ్ యునిట్’ అంటారు. వీటిపై అభ్యర్థుల పేర్లు, వారి పార్టీ గుర్తులుగల బటన్లతో ఓ ప్యానెల్ ఉంటుంది. ఈసారి అభ్యర్థుల ఫొటోలను కూడా ఏర్పాటు చేశారు. ఈవీఎం ప్యానల్పైనున్న బటన్‌ను నొక్కి ఓటు వేయడం మూడవ విభాగం. ఓటరు ఏదైనా బటన్‌ను నొక్కినప్పుడు ఆ బటన్పైనున్న అభ్యర్థి పేరిట ఓటు పడుతుంది. ఇప్పుడు ఓటరు తానేసిన ఓటు ఎవరికి పడిందో తెలుసుకునేందుకు వీలుగా ‘వీవీపీఏటీఎం’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఓటరు బటన్‌ను నొక్కగానే దానికి అనుసంధానించిన మరో యంత్రం స్క్రీన్ మీద ఆ ఓటు ఎవరికి పడిందో తెలియజేసే ఓ కాగితం ఏడు సెకడ్లపాటు కనిపిస్తుంది. ఆ తర్వాత అది యంత్రం లోపలి బాక్సులో పడిపోతుంది. ఈ మరో యంత్రాన్నే ‘వోటర్ వెరీఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ మెషీన్ (వీవీపీఏటీఎం)’ అని వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత తనిఖీ చేసినప్పుడు ఈవీఎం మొదటి యునిట్‌లో నిక్షిప్తమైన డేటాతో వీవీపీఏటీఎంలో పడిన స్లిప్పులతో సరిపోవాలి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చా? ఓటింగ్ జరిగినప్పుడు ఈవీఎంలో నిక్షిప్తమైన డేటాను తారుమారు లేదా తలకిందులు చేయడాన్ని ట్యాంపరింగ్‌గా పేర్కొనవచ్చు. అంటే ఓడిపోయిన అభ్యర్థిని గెలిచినట్లుగా, గెలిచిన అభ్యర్థిని ఓడిపోయినట్లుగా చూపడం. ఈవీఎంలకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం. ఇంటర్నెట్ ద్వారా డేటాను తారుమారు చేసే అవకాశం ఉంటుంది కనుకనే ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేయలేదు. అయినా ట్యాంపరింగ్ చేయాలంటే పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి భౌతికంగా ఈవీఎంలను చేతుల్లోకి తీసుకొని అనుకూలంగా ట్యాంపర్ చేయవచ్చు. అసలు ఓటరుకు బదులు ఇతరులు బటన్ నొక్కి ఓటు వేయవచ్చు. ఎన్నికల సిబ్బంది, సీసీటీవీ కెమేరాలు, వివిధ పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లో ఉంటారు కనుక అలా చేయడం అసాధ్యం. ఆ తర్వాత పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను సీల్చేసి గట్టి సెక్యూరిటీ మధ్య వాటిని నిల్వచేసే ‘స్ట్రాంగ్ రూమ్’లకు పంపిస్తారు. మరి ఎలా ట్యాంపర్ చేయవచ్చు? ఈవీఎంలను తరలించే క్రమంలోగానీ, వాటిని స్ట్రాంగ్ రూముల్లో నిల్వ చేసినప్పుడుగానీ వాటిని తస్కరించి వాటి స్థానంలో ముందుగా ట్యాంపరింగ్ చేసిన ఈవీఎంలను ఏర్పాటు చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయవచ్చు. స్ట్రాంగ్ రూమ్‌లకు తీసుకెళ్లే ఈవీఎంలకు నెంబర్లు, దానికి ఎన్నికల అధికారుల సంతకాలతో కూడిన సీలింగ్ ఉంటుంది. ఓట్లను లెక్కించే సమయంలో వాటిని పరిగణలోకి తీసుకుంటారు. అక్రమాలకు పాల్పడాలంటే సంతకాల ఫోర్జరీ, సీల్ సరిపోవాలి. పైగా పోలింగ్ కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూమ్ వరకు గట్టి భద్రత మధ్య వాటిని తరలించడమే కాకుండా అడుగడుగున వాటిపై నిఘా ఉంటుంది. ఈ విషయంలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల కమిషన్ నియమించిన ‘మైక్రో’ పరిశీలకులు సహా పలు రకాల పరిశీలకులు, వీడియో గ్రాఫర్లు తోడుగా ఉంటారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద అభ్యర్థి తాలూకు వ్యక్తి ఒకరు 24 గంటలపాటు కాపలా ఉండేందుకు కూడా ఎన్నికల కమిషన్ అవకాశం కల్పిస్తోంది. కనుక అదంతా ఈజీ కాదు. పాలకపక్షాలకు అవకాశం ఉంటుందా? స్ట్రాంగ్‌రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను మార్చే అవకాశం పాలకపక్షాలకు ఉంటుందనేది అన్ని ప్రతిపక్షాల ఆరోపణ. పాలకపక్షం తలచుకుంటే ముందస్తు ప్రణాళికతో ఈవీఎంల నెంబర్లను, ఎన్నికల అధికారులు సూచించే కోడ్లను ముందే తెలుసుకోవచ్చు. అప్పుడు భద్రతా సిబ్బందిని, పలు అభ్యర్థుల నిఘాపరులను ప్రలోభపెట్టి ఈవీఎంలను తారుమారు చేయవచ్చు. అందుకు ఎన్నికల కమిషన్, పోలింగ్ నిర్వహించే ప్రభుత్వ సిబ్బంది, పార్టీల ఏజెంట్లు కుమ్మక్కు కావాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యం. అన్నింటికన్నా ముఖ్యం ఎన్నికలను తారుమారు చేయాలనుకునే వ్యక్తుల వద్ద ఈవీఎంలు ఉండాలి. వాటిని సాధించడం కూడా అంత సులభం కాదు. ఈవీఎంల తయారు చేసే చోటే జరగవచ్చా? ఈవీఎంలను తయారు చేసే చోటే వాటిని ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశం ఉంది. ఒకరికి ఓటు వేసేందుకు బటన్‌ను నొక్కితే మరొకరికి వెళుతుందంటూ ప్రత్యక్షంగా ఈవీఎంలను సవాల్ చేసినవాళ్లు ఉన్నారు. దేశంలో రెండు ప్రభుత్వరంగ సంస్థలు (ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్) మాత్రమే వీటిని తయారు చేస్తున్నాయి. వాటిని తయారు చేస్తున్న ఇంజనీర్లను పట్టుకొని తయారీలోనే ట్యాంపరింగ్ చేయవచ్చు. వాళ్లు తయారు చేసిన ఈవీఎంలు దేశంలో ఏ ప్రాంతానికి వెళతాయో వారికే కాదు. కంపెనీ యజమానులకు కూడా తెలిసే అవకాశం లేదు. నామినేషన్ల గట్టం పూర్తయ్యే వరకు ఏ నియోజకవర్గంలో ఎవరు, ఎంత మంది నిలబడతారో తెలియదు. అలాంటప్పుడు ముందుగా ట్యాంపరింగ్ చేయడం కూడా సాధ్యం కాదు. వీడియోల్లో కనిపించే ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లోకి వెళ్లాల్సిన ఈవీఎంలు దారితప్పాయంటూ మనం పలు వీడియోలను సాక్షంగా చూస్తుంటాం. ఆ ఈవీఎంలు అత్యవసరం కోసం అందుబాటులో ఉంచిన అదనపు లేదా మొరాయించిన ఈవీఎంలని ఎన్నికల కమిషన్ వర్గాలే స్పష్టం చేశాయి. ఎన్నికల మార్గదర్శక సూత్రాల ప్రకారం అదనపు లేదా మొరాయించిన ఈవీఎంలను కూడా గట్టి భద్రత మధ్య స్ట్రాంగ్ రూముల్లోకి తరలించాలి. ఈ విషయంలో ఈసీ వర్గాలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయో అర్థం కాదు. ఈవీఎంలను మార్చడం సాధ్యం కాదు కనుక వాటిని ఎత్తుకు పోవచ్చు. యూపీ, బీహార్, పంజాబ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో దాదాపు రెండు లక్షల ఈవీఎంలు గల్లంతయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాటిలో నిజానిజాలను ఈసీ వర్గాలే తేల్చాలి. వీవీపీటీఎం పద్ధతే మంచిది ఈవీఎంలలో ఓట్లతోపాటు వీవీపీటీఎంలను లెక్కించడం ద్వారా అవకతవకలను సులభంగానే కనిపెట్టవచ్చు. ప్రతి నియోజకవర్గంలో ఒక్క పోలింగ్ కేంద్రానికి మాత్రమే దీన్ని పరిమితం చేస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొనగా, సుప్రీం కోర్టు ఆ సంఖ్యను ఐదింటికి పెంచింది. ఈ సంఖ్యను 33 నుంచి 50 వరకు పెంచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
‘నేను ఓడితే ఈవీఎంలు టాంపరైనట్లే’
లక్నో: ఈ ఎన్నికల్లో తాను మూడు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించకపోతే ఈవీఎంల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లేనని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రాంపూర్ లోక్‌సభ అభ్యర్థి అజంఖాన్ అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా తనకే మద్దతుగా నిలిచారని, భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తాన ఓడిపోతే దానికి కారణం ఈవీఎంల టాంపరింగేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితాలకు ఆయన ఒక్కరోజు ముందు ఈయన ఈవ్యాఖ్యల చేశారు. కాగా వీవీప్యాట్లు,ఈవీఎంలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు ఇదివరకే తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈవీఎంలను టాపరింగ్ చేయడం అసాధ్యమని ఈసీ తేల్చిచెప్పింది. కాగా తాము ఓడిపోతే దానికి ఈవీంలే కారణమంటూ ఇటీవల బీస్పీకి చెందిన పలువురు అభ్యర్థులు కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈవీఎంలపై అజంఖాన్ చేసిన వ్యాఖ్యలను యూపీ బీజేపీ శాఖ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిప్డడారు. కాగా ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అజంఖాన్ ఇప్పటికే ఈసీ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. రాంపూర్‌లో బీజేపీ నుంచి పోటీచేస్తున్న జయప్రదపై పలుమార్లు నోరుజారి వివాదాస్పదంగా నిలిచారు. -
‘100% వీవీప్యాట్’ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఓట్లు లెక్కింపులో దేశమంతటా వంద శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించి, వాటిని ఈవీఎంలతో సరిపోల్చాలని కోరుతూ వచ్చిన ప్రజాహిత వ్యాజ్యం(పిల్)ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎం ఆర్ షాల ధర్మాసనం తాజాగా గుర్తుచేసింది. చెన్నైకి చెందిన ‘టెక్4ఆల్’ అనే సంస్థ ఈ పిటిషన్ వేసింది. సీజేఐ ఇచ్చిన ఆదేశాలను తాము మార్చలేమనీ, ఈ పిటిషన్ వేయడం అర్థంలేని పని అని సుప్రీంకోర్టు పేర్కొంది. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా ఈసీకి ఆదేశాలివ్వాలంటూ 21 ప్రతిపక్ష పార్టీలు పిటిషన్ వేయగా, మే 7న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అందుకు నిరాకరించడం తెలిసిందే. ఈవీఎంల ద్వారా మోసం సాధ్యం కాదు ఈవీఎంల ద్వారా మోసం చేయడం, వాటిని ట్యాంపర్ చేయడం పూర్తిగా అసాధ్యమని ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రణవీర్ సింగ్ చెప్పారు. ఈవీఎంలు పారదర్శకమైనవని ఆయన పేర్కొన్నారు. ‘ఈవీఎంల డిజైన్ దృఢంగా ఉంటుంది. వాటిని ట్యాంపర్ చేయడం, హ్యాక్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే వాటికి బయటి నెట్‌వర్క్‌తో కనెక్టివిటీ ఉండదు. ఈవీఎంలకు ఇంటర్నెట్, వైఫై, బ్లూటూత్ వంటివి ఏవీ ఉండవు. కేవలం ప్రోగ్రామింగ్ చిప్ మాత్రమే ఉంటుంది. ప్రోగ్రామ్‌ను ఎవరైనా మార్చాలని చూస్తే ఈవీఎం తీవ్రంగా వైబ్రేట్ అయ్యి, స్విచ్ఛాఫ్ అయ్యి ఇక పనిచేయకుండా పోతుంది’ అని సింగ్ వివరించారు. ‘పరిశీలకుల’ పిటిషన్ విచారణకు నో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బెంగాల్లో ఎన్నికల పరిశీలకులుగా ఇద్దరు పదవీ విరమణ పొందిన ప్రభుత్వం ఉద్యోగుల నియామకాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ల్లో కేంద్ర పోలీస్ పరిశీలకుడిగా వివేక్ దుబేను, అలాగే పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక పరిశీలకుడిగా అజయ్ నాయక్‌లను నియమించారు. వారిద్దరినీ చట్ట విరుద్ధంగా నియమించారని, దీంతో ఎన్నికల సమయంలో కొన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశముందని పిటిషన్ పేర్కొంది. ‘ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆర్టికల్ 32 ప్రకారం ఈ పిటిషన్‌పై మేం ఎలాంటి విచారణ చేపట్టలేం’ అని కోర్టు పేర్కొంది. -
ఈవీఎంలపై ఫిర్యాదులకు ఈసీ హెల్ప్‌లైన్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలపై వచ్చే ఫిర్యాదులపై స్పందించేందుకు 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్‌రూమ్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో ఉపయోగించిన అసలైన ఈవీఎంల స్థానంలో కొత్త వాటిని స్ట్రాంగ్ రూమ్‌ల్లో పెట్టి, వాటిలోని ఓట్లనే లెక్కించనున్నారన్న ఆరోపణలు రావడం, అవన్నీ అవాస్తవాలేనని ఈసీ మంగళవారం కొట్టిపారేయడం తెలిసిందే. అయితే స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఈవీఎంలను భద్రపరిచిన తీరు, స్ట్రాంగ్ రూమ్‌లకు కల్పించిన భద్రత, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద తమ ఏజెంట్లను నియమించేందుకు అభ్యర్థులకు అనుమతి, ఆ పరిసరాలపై సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెట్టడం, ఈవీఎంల తరలింపు సహా ఈవీఎంలకు సంబంధించిన ఏ సమస్యలపైనైనా ఫిర్యాదులు చేయవచ్చని ఈసీ వెల్లడించింది. ఈ ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఐదు లైన్లతో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామనీ, ఫిర్యాదుదారులు 011–23052123 నంబర్‌కు ఫోన్ చేసి తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని ఈసీ తెలిపింది. -
ఊహాగానాలకు ఈసీ తెరదించాలి
లక్నో, న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపునకు మరో రెండురోజులు కూడా సమయంలేని నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు మంగళవారం రాజకీయంగా దుమారం సృష్టించాయి. దీనిపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల తీర్పు తారుమారు వార్తలు తనను ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు యంత్రాల (ఈవీఎంలు)ను చుట్టుముట్టిన ఊహాగానాలన్నిటికీ తెరదించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పైనే ఉందని ఆయన చెప్పారు. తమ అధీనంలో ఉన్న ఈవీఎంలకు రక్షణ, భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందన్నారు. కాంగ్రెస్ మాజీ దిగ్గజ నేత కూడా అయిన ప్రణబ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రజా తీర్పు చాలా పవిత్రమైనదని, అది ఏ అతి చిన్న సందేహానికీ తావివ్వనంత ఉన్నతంగా ఉండాలని అన్నారు. ఎన్నికలు సమర్ధంగా నిర్వహించినందుకు ఈసీని ప్రణబ్ సోమవారం అభినందించిన సంగతి తెలిసిందే. విపక్షాల ఆందోళన ఈవీఎంల తరలింపు, ట్యాంపరింగ్ ఆరోపణల సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం నిరసన ప్రదర్శనలకు దారితీసింది. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంల తరలింపు ఫిర్యాదుల పరిష్కారం దిశగా ఈసీ తక్షణమే సరైన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాలు ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించడాన్ని బీజేపీ ఖండించింది. మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేలా ఓటర్లు తీర్పు ఇచ్చిన పక్షంలో, ఓటమిని హుందాగా అంగీకరించాలని కోరింది. ఘాటుగా స్పందించిన ఈసీ పోలింగ్ సందర్భంగా ఉపయోగించిన ఈవీఎంల స్థానంలో వేరే ఈవీఎంలను ఉంచుతున్నారనే ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించింది. అవన్నీ తప్పుడు, పనికిమాలిన, నిరాధార ఆరోపణలుగా పేర్కొంది. ఏడు విడతల్లో వినియోగించిన ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూముల్లో అత్యంత భద్రంగా ఉన్నాయని తెలిపింది. టీవీలు, సోషల్ మీడియాల్లో చూపిస్తున్న దృశ్యాలకు, పోలింగ్ సందర్భంగా వినియోగించిన ఈవీఎంలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అధికారం చేపట్టనుందని దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఈసీతో ముగిసిన విపక్ష నేతల భేటీ
-
ఈసీతో విపక్ష నేతల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)తో 22 విపక్ష పార్టీలు మంగళవారం సమావేశమయ్యాయి. కౌంటింగ్‌కు ముందుగా ఈవీఎంల్లో పోలైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చాలని కోరాయి. ఒక్కో నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిపులను ముందుగా లెక్కించి అవి సరిపోలితే, మిగిలిన అన్ని కేంద్రాల్లో కేవలం ఈవీఎంలను లెక్కించి గెలుపోటములను నిర్ధారించవచ్చని సూచించాయి. ఈవీఎంలోని ఓట్ల సంఖ్యకు, వీవీప్యాట్ స్లిప్పుల సంఖ్యకు తేడా ఉంటే ఆ నియోజకవర్గంలోని మిగిలిన అన్ని పోలింగ్ కేంద్రాల్లోని అన్ని ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పులను పూర్తిగా లెక్కించాలని విపక్ష నేతలు ఈసీకి సమర్పించిన వినతి పత్రంలో కోరారు. సంక్లిష్ట సందర్భాల్లో రిటర్నింగ్ అధికారి ఎలా వ్యవహరించాలో ఈసీ గైడ్‌లైన్స్ ఇవ్వాలని కోరారు. ముందుగా వీవీప్యాట్లు లెక్కించిన తర్వాతే ఫలితం ప్రకటించాలని అన్నారు. ఫామ్ 17సీని కౌంటింగ్ ఏజెంట్లు, లెక్కింపు కేంద్రంలోకి తీసుకువెళ్లేందుకు అనుమతించాలని, రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా చర్యలు తీసుకోరాదని కోరారు. కౌంటింగ్ ప్రక్రియలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలను నిలువరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని, తగిన భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఈసీతో ముగిసిన విపక్ష నేతల భేటీ -
‘ఈవీఎంలపై ఈసీ మౌనం’
సాక్షి, న్యూఢిల్లీ : ఈవీఎంల అక్రమాలపై స్పష్టమైన ఆధారాలున్నా ఈసీ మౌనంగా వ్యవహరించడం ఆవేదన కలిగిస్తోందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈవీఎంలపై పలు సందేహాలు వెల్లడవుతున్నా ఈసీ వివరణ ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈవీఎంలను మేనేజ్ చేయడం తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ను వ్యూహాత్మకంగా వెల్లడించడం చూస్తుంటే మరో బాలాకోట్ తతంగాన్ని నడిపిస్తున్నట్టు కనిపిస్తోందని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా సార్వత్రిక సమరంలో బీజేపీ గెలుపొంది మళ్లీ అధికారంలోకి వచ్చినా మంచి కోసం ప్రజలు జరిపే పోరాటం ఆగరాదని అన్నారు. బీజేపీ గెలుపు ఓటములతో ప్రపంచంఆగిపోదని, వ్యవస్ధలను నిర్వీర్యం చేయడం, సమగ్రతను దెబ్బతీయడం వంటి విపరిణామాలకు వ్యతిరేకంగా సమాజం, జర్నలిస్టులు నిబద్ధతతోనిలబడి పోరాటం కొనసాగించాలని ఆమె ఆకాంక్షించారు. -
వందశాతం వీవీప్యాట్లు లెక్కింపు: సుప్రీంలో చుక్కెదురు
సాక్షి,న్యూఢిల్లీ: 100శాతం వీవీప్యాట్లు లెక్కించాలన్న డిమాండ్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వందశాతం వీవీప్యాట్లను లెక్కించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. టెక్నోపర్ ఆప్ అనే సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని వెకేషణ్ బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, ఇది న్యూసెన్స్ పిటిషన్ అని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఎన్డీయేతర 21 విపక్ష పార్టీల నాయకులు మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీప్యాట్లనే మొదట లెక్కించి తర్వాత ఈవీఎంలను లెక్కించాలని.. ఈవీఎం, వీవీప్యాట్లలో నమోదైన ఓట్ల మధ్య తేడాలుంటే నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని ఈసీని కోరనున్నట్లు తెలుస్తోంది. కాగా వీవీప్యాట్ల అంశంపై సుప్రీంకోర్టులో ప్రతిపక్ష పార్టీలకు ఇదివరకే ఎదురుదెబ్బ తగిలిన విషయంతెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 50 శాతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంల) ఫలితాలతో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ స్లిప్(వీవీప్యాట్)లను సరిపోల్చాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఇదివరకే తోసిపుచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏవేని 5 పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ ఏప్రిల్ 8వ తేదీన తాము వెలువరించిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని ఇదివరకే సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. -
వీవీ ప్యాట్లన్నీ లెక్కించాలి
సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) ఫ్రీక్వెన్సీ మార్చే అవకాశం ఉందని అన్నిచోట్లా చెబుతున్నారని, తాను ఢిల్లీ వెళితే దీనిపైనే చర్చిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన సోమవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈవీఎంలు, సెల్ఫోన్లు తయారు చేసే ప్రోగ్రామర్ ఒక్కరేనని, వారి కంట్రోల్లోనే అంతా జరుగుతుందని చెప్పారు. కారు స్టార్ట్ చేసినట్లు, ఏసీ, టీవీలను రిమోట్‌తో ఆన్ చేసినట్లు ఈవీఎంలను కూడా మానిటర్ చేసే అవకాశం ఉందన్నారు. వీవీ ప్యాట్ల ప్రింటర్లను మార్చే అవకాశం ఉంటుందని అంటున్నారని, ఉన్న ఈవీఎంలను మార్చివేసి కొత్త ఈవీఎంలను పెడుతున్నారని చెబుతున్నారని, ఇవన్నీ ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. వీవీ ప్యాట్‌లన్నింటినీ లెక్కించాలని, వీవీ ప్యాట్ స్లిప్ తీసుకుని, తమ ఓటు తాము వేసిన వారికే పడిందో లేదో ఓటరు చూసుకుని, ఒక బాక్సులో వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో అన్ని పార్టీలు ఈవీఎంలను కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నాయన్నారు. చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే... వీవీ ప్యాట్లు పెట్టించింది నేనే... ‘‘తమకు 300 ఎంపీ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు అంటున్నారు. సర్వేలన్నీ వారికి 300 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈవీఎంలలో ఏదో జరుగుతోందనే అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల లెక్కల్లో తేడా వస్తే ఏం చేయాలి? తేడా వచ్చిన చోట మిగిలిన వీవీ ప్యాట్‌లన్నింటినీ లెక్కించాలని 23 రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలు ఎన్నికల సంఘం విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేశాయి. ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర్నుంచి ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌లో ధ్యానం చేసి పోలింగ్‌ను ప్రభావితం చేసే వరకూ చాలా అంశాలున్నాయి. రాష్ట్రంలో అవసరమైనప్పుడు కేంద్ర బలగాలను పంపలేదు, ఇప్పుడు పంపుతున్నారు. అన్ని పార్టీలను ఏకంచేసి, వీవీ ప్యాట్లు పెట్టించిందని నేనే. వాటిపై మాజీ సీఈసీ ఖురేషీకి నేనే ఐడియా ఇచ్చా. వీవీ ప్యాట్ల లెక్కింపుపై మా పోరాటం కొనసాగుతుంది. తమ ఓటు తాము అనుకున్న వారికే పడిందో లేదో అనే అనుమానం ప్రజలకు ఉండకూడదు. ఈ సమస్యకు పరిష్కారం లభించేదాకా పోరాడుతాం. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘంలోనే లుకలుకలు తలెత్తాయి. రూ.9 వేల కోట్ల ఖర్చుతో వీవీప్యాట్లు పెట్టారు. అంత లగ్జరీ అవసరమా? ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 33 ఏళ్లుగా సర్వేలు చేస్తున్నా.. సర్వేలు చేయడం ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది. నేను 33 సంవత్సరాల నుంచి సర్వేలు చేస్తున్నా. ఈ ఎన్నికల్లో నూటికి వెయ్యి శాతం గెలిచేది తెలుగుదేశం పార్టీయే. ఎలాంటి అనుమానం అవసరం లేదు. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందపడిపోతున్నారు, అప్పుడే మంత్రివర్గం కూడా తయారు చేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను గతంలో వన్‌సైడ్‌గా ఇచ్చారు, ఇప్పుడు మిశ్రమంగా ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ చూసి భయపడొద్దు ఉండవల్లి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి భయపడవద్దని చెప్పారు. మన ప్రభుత్వమే వస్తుందని అన్నారు. 18 నుంచి 20 ఎంపీ స్థానాల్లో గెలుస్తున్నామని, 110 అసెంబ్లీ స్థానాలతో మొదలై 120–130 వరకూ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైండ్‌గేమ్‌తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల అక్రమాలపై మంగళవారం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రపతిని కలుస్తామన్నారు. -
కౌంటింగ్‌లో ఫారం –17సీ ...ఇదే కీలకం
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఫారం–17సీ పార్ట్–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్, పరిశీలకులు, సహాయ పరిశీలకులకు దీనిపై అవగాహన ఉండాలి. కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం –17సీ లో పొందు పరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూడాలి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గం నంబరు, పోలింగ్ కేంద్రం పేరు, ఆ పోలింగ్ కేంద్రం వినియోగించిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ల గుర్తింపు నంబర్లను ఫారం–17సీలో నమోదు చేస్తారు. ఆ పోలింగ్ కేంద్రం పరిధిలోనే ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల సంఖ్య (ఫారం–17ఏ లో నమోదు చేసిన వివరాలు), పోలింగ్ కేంద్రంలోకి వచ్చాక ఓటు వేయడానికి నిరాకరించి వెళ్లి పోయిన వారు, ఓటు వేసేందుకు పీఓ అనుమతించని వారిసంఖ్య, ఓటింగ్ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫారం–17సీలో ఉంటాయి. టెండరు బ్యాలెట్లు, సరఫరా చేసిన పేపరు సీల్ సీరియల్ నంబర్లు, సీల్, ఎన్ని పేపర్లు సీల్‌కు వినియోగించారు? వినియోగించని పేపర్ సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్ అధికారికి వెళ్లాయి? పాడైన పేపర్ సీళ్ల సీరియల్ నంబర్లు వంటి వివరాలు ఇందులో ఉంటాయి. కౌంటింగ్‌లో ఫారం –17సి ఏజెంట్లకు ఎంతో ఉపయోగపడుతుంది. నమోదైన ఓట్లలో తేడా వస్తే.... కౌంటింగ్ సమయంలో టేబుల్ వద్దకు కంట్రోల్ యూనిట్‌తోపాటు ఫారం–17 సీ, పార్ట్–1 తప్పనిసరిగా తీసుకొస్తారు. ఆయా అభ్యర్థులకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు అంతా ఫారం–17సీలో ఉన్న వివరాలను రాసుకోవాలి. కంట్రోల్ యూనిట్ డిస్ప్లే సెక్షన్లో చూపిన పోలైన మొత్తం ఓట్లు, ఫారం–17 సీలో నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉండాలి. క్లరికల్ తప్పిదం, మరే కారణం వల్ల కానీ కంట్రోల యూనిట్, ఫారం –17సీ, ఓట్ల సంఖ్యలో తేడాలు వస్తే అది వివాదాస్పదంగా మారుతుంది. అలాంటి కంట్రోల్ యూనిట్లు పక్కన ఉంచి సమాచారాన్ని రిటర్నింగ్ అధికారి ఎన్నికల కమిషన్‌కు పంపుతారు. కంట్రోల్ యూనిట్ టేబుల్ పైకి రాగానే ఏజెంట్ల పరిశీలనకు ఉంచుతారు. ఆ కంట్రోల్ యూనిట్ ఏ పోలింగ్ కేంద్రానికి చెందిందో ఏజెంట్లు నిర్ధారించుకోవాలి. ట్యాంపరింగ్ జరిగితే...... కంట్రోల్ యూనిట్ టేబుల్‌పైకి రాగానే అభ్యర్థి సీలింగ్ సెక్షన్ సక్రమంగా ఉందో లేదో కౌంటింగ్ ఏజెంట్లు, పరిశీలకులు చూసుకోవాలి. రిజల్ట్ సెక్షన్‌పై ఉన్న స్ట్రిప్ సీల్ గ్రీన్ పేపర్ సీల్ సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి. సీరియల్ నంబర్లు ఫారం–17సీ లో నమోదు చేసినవే ఉండాలి. కంట్రోల్ యూనిట్ పేపర్ సీళ్లు, అడ్రస్ ట్యాగ్ల ట్యాంపరింగ్ జరిగాయని గుర్తిస్తే పరిశీలకులు ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారి, అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లాలి. ట్యాంపరింగ్ జరగని కంట్రోల్ యూనిట్లను మాత్రమే కౌంటింగ్ నిర్వహించాలి. వరుస క్రమంలో లెక్కింపు..... కౌంటింగ్ ఒక రౌండ్ పూర్తి అయిన వెంటనే అందులోని రెండు కంట్రోల్ యూనిట్లను జనరల్ అబ్జర్వర్ తన టేబుల్ వద్దకు తెప్పించుకుంటారు. అదనపు కౌంటింగ్ పరిశీలకులతో ఓట్లు లెక్కిస్తారు. కంట్రోల్ యూనిట్‌లోని ఓట్ల సంఖ్యకు ఫారం –17సీ, పార్ట్–2లో కౌంటింగ్ సూపర్వైజర్ నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే పరిశీలకుడిని కౌంటింగ్ నుంచి తప్పిస్తారు. ఆ పరిశీలకుడు తనిఖీ చేసిన మిగిలిన కంట్రోల్ యూనిట్లన్నింటినీ జనరల్ అబ్జర్వర్ మరోసారి లెక్కిస్తారు. వివరాలు తప్పుగా నమోదు చేసిన కౌంటింగ్ పరిశీలకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. అసాధారణంగా ఇరువురు అభ్యర్థులకు కౌంటింగ్‌లో ఓట్లు సమానంగా వస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రిటర్నింగ్ అధికారి లాటరీ ద్వారా ఫలితాన్ని ప్రకటిస్తారు. ఆ లాటరీలో ఎవరు గెలుపొందితే వారినే విజేతగా ప్రకటిస్తారు. -
‘ముందు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలి’
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ముందు ఈవీఎంలను కాకుండా వీవీ ప్యాట్లను లెక్కించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో సోమవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. న్యాయవాది యలమంజుల బాలాజీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఒకవేళ వీవీ ప్యాట్లకు, ఈవీఎంలకు మధ్య తేడాలుంటే, ఈ అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్లను లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై మంగళవారం ఉదయం న్యాయమూర్తులు జస్టిస్ జి.శ్యాంప్రసాద్, జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం విచారించనున్నది. కాగా కనీసం యాభై శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాలన్న విపక్షాల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిటిషనర్ అన్నీ వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న అభ్యర్థనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుందా అనే దానిపై వేచి చూడాల్సిందే. -
మరో 96 గంటలే..
సాక్షి, అమరావతి: సుదీర్ఘ నిరీక్షణకు మరో 96 గంటల్లో తెరపడనుంది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరిగాయి. ఈ నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాలు రావడానికి మిగిలింది ఇక నాలుగు రోజులే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకం తేలడానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఓటరు దేవుడి ఆగ్రహానికి, అనుగ్రహానికి గురైంది ఎవరో తెలిసిపోనుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ ఆదివారం జరగనుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం 6 గంటలకు వెలవడనున్నాయి. ఈ ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు, అసలు ఫలితాలకు మధ్య లంకె కుదిరేనా? అని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలు టీవీ చానళ్లు, సర్వే ఏజెన్సీలు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరచడం ఖాయమని పలు జాతీయ టీవీ చానళ్లు, సర్వే సంస్థలు వెల్లడించాయి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడంతోపాటు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించబోతున్నారని ఇప్పటికే జాతీయ పత్రికలు, చానళ్లు విశ్లేషించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగిసే వరకు అంటే సాయంత్రం 6 గంటల దాకా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడిపై నిషేధం ఉంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బహిర్గతం చేయడానికి జాతీయ చానళ్లు, సర్వే సంస్థలు ఏర్పాట్లు చేసుకున్నాయి. అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కొంత స్పష్టత వస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఓటమి భయంతో చంద్రబాబు గగ్గోలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం తప్పదని సర్వేల్లో తేటతెల్లమైంది. పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీన కూడా అదే వాతావరణం నెలకొంది. పోలింగ్ ముగిసిన తరువాత పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాము ఘనవిజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తన ఓటమిని ఊహించి, ఈవీఎంలపై గగ్గోలు ప్రారంభించారు. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే రాష్ట్రంలో 30 శాతం మేర ఈవీఎంలు పనిచేయడం లేదని ఆరోపించారు. చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకుని, ఓటు వేసినట్లు వేలికి ఉన్న సిరా గుర్తును మీడియాకు చూపిస్తూ ఫోజులు ఇచ్చారు. సాయంత్రం అయ్యే సరికి తన ఓటు ఎవరికి పడిందో తెలియడం లేదని చెప్పారు. పోలింగ్ ముగిసిన తరువాత కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని చంద్రబాబు దుర్భాషలాడారు. పలు ఆరోపణలు చేశారు. ఆ మరుసటి రోజు ఢిల్లీ వెళ్లి, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈవీఎంలు, వీవీప్యాట్లు సరిగ్గా పని చేయలేదంటూ ఫిర్యాదు చేశారు. ఈవీఎంలపై నమ్మకం లేదు, బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రతిరోజూ పాత పాటే పాడారు. ఓటమి భయంతోనే చంద్రబాబు అనవసర రాద్థాంతం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘చిలక’ జోస్యంపై జనం అనాసక్తి సీఎం చంద్రబాబు గూటిలోని చిలక ‘లగడపాటి’ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించి, బొక్కబోర్లాపడ్డారు. పోలింగ్ పూర్తయిన తరువాత సర్వే ఏజెన్సీలు టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ప్రకటించగా, లగడపాటి మాత్రం మహా కూటమి గెలుపు తథ్యమని తేల్చిచెప్పారు. తీరా ఫలితాలను చూస్తే లగడపాటి చిలక జోస్యం వాస్తవానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. దీంతో లగడపాటి సర్వేలపై ప్రజలు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. చంద్రబాబుకు లాభం చేకూర్చడానికే లగడపాటి దొంగ సర్వేలు నిర్వహిస్తున్నారన్న అభిప్రాయం జనంలో నాటుకుపోయింది. -
ఓట్ల లెక్కింపులో బాధ్యతగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బాధ్యతగా వ్యవహరించాలని కౌంటింగ్ ఏజెంట్లకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. శనివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సికింద్రా బాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కౌంటింగ్ ఏజెంట్లు, కార్పొరేటర్లతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఏజెంట్లు ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 6.30 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు, వీవీ ప్యాట్ల లెక్కింపుల్లో ఎలాంటి సందేహాలు వచ్చినా... అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్ల బాధ్యతల గురించి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ అవగాహన కల్పించారు. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, జనార్దన్‌రెడ్డి, ప్రభాకర్, స్టీఫెన్ సన్, పార్లమెంట్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కౌంటింగ్‌లో ఫారం–17సీ కీలకం
సాక్షి, కడప సెవెన్‌రోడ్స్ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఫారం–17సి పార్ట్–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్, సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు దీనిపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం–17సిలో పొందుపరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూడాలి.పార్లమెంటు/అసెంబ్లీ నియోజకవర్గ నెంబరు, పోలింగ్ కేంద్రం పేరు, ఆ పోలింగ్ కేంద్రంలో వినియోగించిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెటింగ్ యూనిట్ల ఐడెంటిఫికేషన్ నెంబర్లను ఫారం–17సిలో నమోదు చేస్తారు. ఆ పోలింగ్ కేంద్ర పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల సంఖ్య (ఫారం–17ఏలో నమోదు చేసిన వివరాలు), పోలింగ్ కేంద్రంలోకి వచ్చాక ఓటు వేయకుండా నిరాకరించి వెళ్లిపోయిన వారు, ఓటేసేందుకు పీఓ అనుమతించని వారి సంఖ్య, ఓటింగ్ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫారం–17సీలో ఉంటాయి. అలాగే టెండర్డ్ బ్యాలెట్లు, సరఫరా చేసిన పేపరు సీళ్ల సీరియల్ నెంబర్లు, ఎన్ని పేపర్ సీళ్లు వినియోగించారు? వినియోగించని పేపరు సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్ అధికారికి వెళ్లాయి? డ్యామేజ్ అయిన పేపరు సీళ్ల సీరియల్ నెంబర్లు వంటి వివరాలు ఇందులో ఉంటాయి. కౌంటింగ్‌లో ఫారం–17సి ఏజెంట్లకు ఎంతో ఉపయోగపడుతుంది. నమోదైన ఓట్లలో తేడా వస్తే..?! కౌంటింగ్ సమయంలో టేబుల్ వద్దకు కంట్రోల్ యూనిట్‌తోపాటు ఫారం–17సీ పార్ట్–1 తప్పనిసరిగా తీసుకు వస్తారు. ఆయా అభ్యర్థులకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లంతా ఫారం–17సిలో ఉన్న వివరాలను రాసుకోవాలి. కంట్రోల్ యూనిట్ డిస్ప్లే సెక్షన్లో చూపిన పోలైన మొత్తం ఓట్లు, ఫారం–17సిలో నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉండాలి. క్లరికల్ తప్పిదం, మరే కారణం వల్లగానీ కంట్రోల్ యూనిట్, ఫారం–17సి ఓట్ల సంఖ్యలో తేడాలు వస్తే అది వివాదాస్పదంగా మారుతుంది. అలాంటి కంట్రోల్ యూనిట్లు ప్రక్కన ఉంచి సమాచారాన్ని రిటర్నింగ్ అధికారి ఎన్నికల కమిషన్‌కు పంపుతారు. కంట్రోల్ యూనిట్ టేబుల్‌పైకి రాగానే ఏజెంట్ల పరిశీలనకు ఉంచుతారు. ఆ కంట్రోల్ యూనిట్ ఏ పోలింగ్ కేంద్రానికి చెందినదో ఏజెంట్లు నిర్దారించుకోవాలి. ట్యాంపరింగ్ జరిగితే... కంట్రోల్ యూనిట్ టేబుల్‌పైకి రాగానే క్యాం డిడేట్ సెక్షన్ సీలింగ్ సక్రమంగా ఉందో లేదో కౌంటింగ్ ఏజెంట్లు, సూపర్వైజర్లు చూసుకోవాలి. రిజల్ట్ సెక్షన్‌పై ఉన్న స్ట్రిప్ట్ సీలు, గ్రీన్ పేపరు సీలు సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి. సీరియల్ నెంబర్లు ఫారం–17సిలో నమోదు చేసినవే ఉండాలి.కంట్రోల్ యూనిట్, పేపరు సీళ్లు, అడ్రస్ ట్యాగులు ట్యాంపరింగ్ జరిగాయని గుర్తిస్తే సూపర్వైజర్లు ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారి, అబ్జర్వర్ల దృష్టికి తీసుకు వెళ్లాలి. ట్యాంపరింగ్ జరగని సీయూలను మాత్రమే కౌంటింగ్ నిర్వహించాలి. ర్యాండమ్‌గా కౌంటింగ్ కౌంటింగ్ ఒక రౌండ్ పూర్తయిన వెంటనే అందులోని రెండు కంట్రోల్ యూనిట్లను జనరల్ అబ్జర్వర్ తన టేబుల్ వద్దకు తెప్పించుకుంటారు. అదనపు కౌంటింగ్ సూపర్వైజర్తో ఓట్ల లెక్కింపు చేయిస్తారు. కంట్రోల్ యూనిట్‌లోని ఓట్ల సంఖ్యకు, ఫారం–17సీ పార్ట్–2లో కౌంటింగ్ సూపర్వైజర్ నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే సూపర్వైజర్ను కౌంటింగ్ నుంచి తప్పిస్తారు. ఆ సూపర్వైజర్ తనిఖీ చేసిన మిగతా కంట్రోల్ యూనిట్లలన్నింటినీ జనరల్ అబ్జర్వర్ మరోసారి లెక్కింపజేస్తారు. వివరాలు తప్పులు నమోదు చేసిన కౌంటింగ్ సూపర్వైజర్పై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.అసాధారణంగా ఇరువురు అభ్యర్థులకు కౌంటింగ్‌లో ఓట్లు సమానంగా వస్తే ఏం చేయాలనే సందేహం రావడం సహజం. అలాంటి సందర్బం ఎదురైనపుడు ప్రజాప్రతినిద్య చట్టం ప్రకారం రిటర్నింగ్ అధికారి లాటరీ ద్వారా ఫలితాలను ప్రకటిస్తారు. లాటరీలో ఎవరు గెలుపొందితే వారిని విజేతగా ప్రకటిస్తారు. -
తొలి ఫలితం విశాఖ దక్షిణానిదే
సాక్షి, విశాఖపట్నం : మరో ఆరు రోజుల్లో చేపట్టనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఆర్వోలు, ఏఆర్వోలు, సూపర్వైజర్లు, ఇతర కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విశాఖలో మూడు లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు అత్యల్పంగా 17 రౌండ్లు, అత్యధికంగా 23రౌండ్ల వరకు సాగనుంది. తొలి రౌండ్ ఫలితం లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన అరగంటలోనే వెల్లడికానుంది. 12 గంటలకు తొలి ఫలితం వెల్లడికానుంది. పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లతోపాటు రౌండ్ల వారీగా ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 1.30గంటలకల్లా పూర్తి కానుంది. వీవీ ప్యాట్ల స్లిప్‌ల కౌంటింగ్ పూర్తయితేకానీ అధికారికంగా ఫలితాలు వెల్లడించకున్నప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంటకే దాదాపు అన్ని నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. తొలిసారి రౌండ్ల వారీగా ఫలితాలను సువిధ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. దీంతో ఏ అభ్యర్థికి ఏ రౌండ్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయో పోర్టల్ ద్వారా క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు కలుగనుంది. తొలి ఫలితం విశాఖ దక్షిణానిదే బూత్‌ల సంఖ్యా పరంగా చూసినా, పోలైన ఓట్ల పరంగా చూసినా తొలి ఫలితం విశాఖ దక్షిణానిదే. ఈ నియోజకవర్గ పరిధిలో 236 పోలింగ్ బూత్‌లున్నాయి. పైగా జిల్లాలో అత్యల్ప ఓట్లు నమోదైన రెండో నియోజకవర్గం కూడా ఇదే. 2,09,186 ఓట్లకు గానూ 1,27,909 ఓట్లు పోలయ్యాయి. రౌండ్‌కు 14 ఈవీఎంలలో కౌంటింగ్ సాగనుండడంతో 17 రౌండ్లలోనే ఈ నియోజకవర్గ ఫలితం వెల్లడికానుంది. విశాఖ దక్షిణం తర్వాత కొద్ది నిముషాల తేడాలో రెండో ఫలితంగా విశాఖ పశ్చిమం వెల్లడికానుంది. ఈ నియోజకవర్గ పరిధిలో 237 పోలింగ్ బూత్‌లే ఉన్నప్పటికీ పోలైనవి 1,37,499 ఓట్లు కావడంతో దక్షిణం తర్వాత కొద్ది నిముషాల వ్యవధిలోనే పశ్చిమ ఫలితం వెల్లడవుతుంది. భీమిలి, పాడేరుల్లో 23 రౌండ్ల కౌంటింగ్ పోలైన ఓట్లను బట్టి చూస్తే ఆ తర్వాత వరుసగా పాడేరు, అరుకు, మాడుగుల, అరుకు, అనకాపల్లి, యలమంచలి, విశాఖ తూర్పు, విశాఖ ఉత్తరం, చోడవరం, పాయకరావుపేట, పెందుర్తి, గాజువాక, భీమిలి నియోజకవర్గాల వారీగా ఫలితాలు వెల్లడికావాల్సి ఉన్నప్పటికీ పోలింగ్ బూత్‌ల వారీగా చూస్తే మాత్రం మాడుగుల, విశాఖ పశ్చిమం, చోడవరం, యలమంచలి, అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖ ఉత్తరం, విశాఖ తూర్పు, పెందుర్తి, అరుకు, పాడేరు, చివరగా భీమిలి నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. భీమిలి, పాడేరుల్లో 23 రౌండ్ల వరకు కౌంటింగ్ సాగనుంది. తొలి రౌండ్‌కు అరగంట సమయం పడుతుంది. ఇక ఆ తర్వాత ప్రతి రౌండ్‌కు 20 నిముషాలకు మించి సమయం పట్టే అవకాశాలు లేవు. ఏజెంట్లతో ప్రమాణంతో మొదలు.. 23వ తేదీ ఉదయం 7.55 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. తొలుత నియోజకవర్గాల వారీగా ఆర్వోలు సరిగ్గా 7.55 గంటలకు కౌంటింగ్ ప్రక్రియపై ఈసీ నియమ నిబంధనలను వివరిస్తూ ఏజెంట్లతో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. తొలుత సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపునకు శ్రీకారం చుడతారు. వీటి లెక్కింపు పూర్తయినా అవకపోయినా సరిగ్గా 8.30గంటలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెడతారు. లోక్‌సభ, అసెంబ్లీల వారీగా ఈవీఎంలను వేర్వేరుగా రెండు స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపర్చారు. కౌంటింగ్ కోసం కూడా అదే విధంగా ప్రతి నియోజకవర్గానికి రెండు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. సీరియల్ ప్రకారం పోలింగ్ బూత్‌ల వారీగా అసెంబ్లీ, లోక్‌సభ ఈవీఎంలను వేర్వేరుగా రౌండ్‌కు 14 చొప్పున బయటకు తీసుకొస్తారు. అసెంబ్లీ ఈవీఎంలను అసెంబ్లీ కౌంటింగ్ హాలుకు, లోక్‌సభ ఈవీఎంలను లోక్‌సభ కౌంటింగ్ హాలుకు తీసుకెళ్తారు. 8.30 గంటలకు తొలి రౌండ్ కౌంటింగ్‌కు శ్రీకారం చుడతారు. 14 టేబుల్స్‌లో కౌంటింగ్ పూర్తి కాగానే టేబలేషన్ (ఈవీఎంల వారీగా పోలైన ఓట్లను ఓ చార్ట్‌లో రౌండ్ల వారీగా కూడే విధానం) చేస్తారు. ఆ తర్వాత రౌండ్ల వారీగా వివరాలను ఈసీకి పంపడంతో పాటు సువిధ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. అలా చేసిన తర్వాతే రౌండ్ ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తారు. ఆ తర్వాత మళ్లీ రెండో రౌండ్‌కు సంబంధించిన ఈవీఎంలను కౌంటింగ్ హాలుకు తీసుకొస్తారు. ఇలా రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. తుది రౌండ్కొచ్చేసరికి సమాంతరంగా సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తికావాల్సి ఉంటుంది. ఒక వేళ పోలైన ఓట్ల సంఖ్యను బట్టి వాటి లెక్కింపు ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని భావిస్తే తుది రౌండ్‌ను ఆపుతారు. సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది రౌండ్ ఫలితాలకు పోస్టల్, సర్వీస్ ఓట్లను కలిపి తుది ఫలితాలను నిర్ణయిస్తారు. మైక్రో అబ్జర్వర్కే సెల్‌ఫోన్ లోక్‌సభ ఓట్లను కౌంటింగ్ చేసే హాలులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లకు 14 మంది ఏజెంట్లు ఉంటారు. ఇక లోక్‌సభ ఆర్వో టేబుల్ పక్కనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం రెండు, సర్వీస్ ఓట్ల లెక్కింపు కోసం రెండు టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. వీటి వద్ద ఒక్కో టేబుల్‌కు ఒక్కో ఏజెంట్ ఉంటారు. అలాగే అభ్యర్థితో పాటు జనరల్ ఏజెంట్‌గా మరొకరుంటారు. ఇక అసెంబ్లీ కౌంటింగ్ హాలులో మాత్రం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. 14 టేబుల్స్‌కు 14 మంది ఏజెంట్లు ఉంటారు. అసెంబ్లీ ఆర్వో పక్కనే పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు కోసం చెరో టేబుల్ ఏర్పాటు చేస్తారు. ఆయా టేబుల్స్ వద్ద ఒక్కో ఏజెంట్ ఉంటారు. ఇక్కడ కూడా అభ్యర్థితో పాటు ఓ జనరల్ ఏజెంట్ ఉంటారు. అభ్యర్థితో సహా ఏజెంట్లు ఎవ్వరూ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిగ్ పరికరాలను కౌంటింగ్ హాలులోకి తీసుకెళ్లడానికి వీల్లేదు. అలాగే కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్‌కు మాత్రమే సెల్‌ఫోన్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక విధుల్లో ఉన్న ఇతర కౌంటింగ్ అధికారులు, సిబ్బంది ఎవరిని సంప్రదించాలన్నా హ్యాండ్సెట్ల ద్వారానే మాట్లాడాల్సి ఉంటుంది. -
టివీ9 భారత్ వర్ష్‌కు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్
-
విపక్షాలకు సుప్రీం కోర్టు షాక్
-
50% వీవీప్యాట్ల లెక్కింపు కుదరదు
సాక్షి, న్యూఢిల్లీ: వీవీప్యాట్ల అంశంపై సుప్రీంకోర్టులో ప్రతిపక్ష పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 50 శాతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంల) ఫలితాలతో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ స్లిప్(వీవీప్యాట్)లను సరిపోల్చాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏవేని 5 పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ ఏప్రిల్ 8వ తేదీన తాము వెలువరించిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ అంశంపై 21 ప్రతిపక్షాల రివ్యూ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్లు ఏఎం సింఘ్వి, కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ‘ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్‌కు బదులు ఏవైనా ఐదు బూత్‌లలో ఈవీఎంల ఫలితాలతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ ఏప్రిల్ 8వ తేదీన న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇది మొత్తం ఫలితాలలో కేవలం 2 శాతం మాత్రమే. దీనివల్ల ఉపయోగం లేదు. అందుకే కనీసం 50 శాతం ఫలితాలతో సరిపోల్చాలని మేం అడుగుతున్నాం. దీనిని 33 శాతం లేదా కనీసం 25 శాతం పెంచినా మాకు సంతోషమే. దీనివల్ల ఈసీ వ్యవస్థపై కేవలం రాజకీయ పార్టీలకే కాదు, ఓటర్లలోనూ ఆమోదయోగ్యతతోపాటు, విశ్వాసం పెరుగుతుంది’ అని పేర్కొన్నారు. ‘ఒకవేళ, 5 పోలింగ్ బూత్‌లలో ఎలాంటి తేడాలు కనిపించకుంటే ఏం చేస్తారు? దీనిపై ఎలాంటి మార్గదర్శకాలు లేవు’ అని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో గతంలో జరిగిన విచారణ సందర్భంగా న్యాయస్థానాన్ని ఈసీ తప్పుదోవ పట్టించిందని వారు పేర్కొనగా.. ప్రస్తుత వాదనలు కేవలం రివ్యూ పిటిషన్‌పై మాత్రమేనంటూ ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 8వ తేదీనాటి తీర్పును సమీక్షించటానికి సిద్ధంగా లేమని తేల్చింది. ఈ బెంచ్ ఒక్క నిమిషంలో తీర్పు ముగించింది. వాదనలప్పుడు ప్రతిపక్ష నేతలు ఫరూక్ అబ్దుల్లా, డి.రాజా, చంద్రబాబు నాయుడు కోర్టు హాల్లోనే ఉన్నారు. ఎన్నికల సంఘాన్ని కలిసిన విపక్ష నేతలు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక నియోజకవర్గానికి కేవలం 5 శాతం వీవీ ప్యాట్లు కాకుండా కనీసం 15 లేదా 25 శాతం లెక్కించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని 21 విపక్షాలు కోరాయి. కాంగ్రెస్ నుంచి అభిషేక్ సింఘ్వీ, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్, ఏపీ సీఎం చంద్రబాబు, సీపీఐ ఎంపీ డి. రాజా సహా పలు పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను కలిశారు. ఐదు శాతం వీవీప్యాట్ల లెక్కింపుపై గతంలో ఇచ్చిన తీర్పు సమీక్షకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలతో 15 లేదా 25 శాతం వీవీప్యాట్లు లెక్కించేలా ఆదేశాలు ఇవ్వవచ్చని పార్టీలు పేర్కొన్నాయి. అలాగే ఓట్ల లెక్కింపు సందర్భంగా నియోజకవర్గాల వారీగా ఈవీఎంలలో పోలైన ఓట్లకు వీవీప్యాట్లలోని ఓట్లకు తేడాలోచ్చిన చోట మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని కోరారు. ఈవీఎంలతో సమాంతరంగా వీవీప్యాట్లను లెక్కించా లని విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పుల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపరిచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఓట్ల లెక్కింపు అనంతరం అభ్యర్థి రీకౌంటింగ్ కోరితే మళ్లీ లెక్కించాలని ఈసీని కోరినట్టు కూడా ఆ నేతలు మీడియాకు తెలిపారు. -
చంద్రబాబు భయంతోనే ఈవీఎంలపై నెపం నెడుతున్నారు
-
‘ఓటమికి కారణాలు వెతుకుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ విచ్చిన్నం అవుతుందనే భయంతోనే చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై నెపం నెడుతున్నారని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఓటమి కారణాలను వెతుకుతున్నారని, 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది ఈవీఎంలతోనే అని ఆయన గుర్తుచేశారు. మంగళవారం నాగిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలింగ్ సరళి చూసి భయపడ్డ చంద్రబాబు.. ఓటు వేసిన గంటకే నా ఓటు ఎటుపోయిందో అంటూ మాట్లాడారని పేర్కొన్నారు. ఈవీఎంలే ఫైనలని.. వీవీప్యాట్లని ట్రయల్‌గా తీసుకున్నారని నాగిరెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికల సంఘం, సీఎస్‌పై లేనిపోని ఆరోపణలకు చేస్తున్నారని మండిపడ్డారు. విజయంలేకపోతే పార్టీని నడపలేమనే భయంతో చంద్రబాబు ఉన్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లు ప్రజలతో గడిపారని.. నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడారని స్పష్టం చేశారు. -
‘ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు’
సాక్షి, అమరావతి: ఫొని తుపాన్ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ వెసులుబాటు కావాలంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఏ ప్రతిపాదనలు వచ్చినా సీఈసీ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కోడ్ వెసులుబాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం సీఈసీకే ఉంటుందని పేర్కొన్నారు. సీఈసీ ఇచ్చే ఆదేశాలను తాము అమలు చేస్తామని అన్నారు. తుపాన్ వల్ల స్ట్రాంగ్ రూమ్‌ల్లోని ఈవీఎంలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని వెల్లడించారు. తుపాన్ ప్రభావిత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఈవీఎంల విషయంలో అప్రమత్తంగా ఉండమని కలెక్టర్లను ఆదేశించినట్టు చెప్పారు. -
వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారిలా!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి.. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీల (స్లిప్పులు) లెక్కింపు విషయంలో ఈసీ మార్గదర్శకాలను జారీచేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారమే చీటీలను వెలికి తీసి అభ్యర్థుల వారీ పోలైన ఓట్లను లెక్కిస్తారు. 2014 ఎన్నికల్లో వీవీప్యాట్ యంత్రాలను వాడలేదు. ఈవీఎం యంత్రాల పనితీరుపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. ఈసీ కొత్తగా వీవీప్యాట్ యంత్రాలను ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టింది. తొలుత పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గానికి ఒక పోలింగ్ బూత్‌ను ఎంపికచేసి, అక్కడ ఉపయోగించిన వీవీప్యాట్ యంత్రంలోని చీటీలను లెక్కించాలని భావించారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు బూత్‌లోని వీవీప్యాట్లను లెక్కించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆయా యంత్రాల్లోని చీటీలను వెలికి తీసి, లెక్కింపు వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులపై లెక్కింపు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. లెక్కింపు ఇలా... ఎంపిక చేసిన వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీలు, దానికి అనుసంధానమై ఉన్న బ్యాలెట్ యూనిట్లో ఉన్న ఓట్ల సంఖ్యతో సరిచూస్తారు. పోలింగ్ కేంద్రాల వారీ ఉన్న ఓట్లు, పోలైన ఓట్లు వంటి వివరాలతో రూపొందించిన ‘ఫారం–17ఏ’తో సరిపోల్చుతారు. అంతా సరిగ్గా ఉన్న తర్వాత వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను ఏజెంట్ల సమక్షంలో బయటకు తీస్తారు. వీటిని అభ్యర్థుల వారీగా వేరుచేస్తారు. తదుపరి 25 చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. అభ్యర్థుల వారీ విడదీసి, లెక్కింపు పూర్తి చేయడానికి 2 గంటలకుపైగా పట్టే అవకాశం ఉంది. అయిదు యంత్రాల్లోని స్లిప్పులను మాత్రమే లెక్కించాల్సి ఉన్నందున సమాంతరంగా అన్నీ ఒకేసారి ప్రారంభిస్తారు. ఈవీఎం ఓట్లను లెక్కించే టేబుల్‌నే దీనికి వినియోగిస్తారు. చీటీలను మాత్రం ట్రేలో వేసి అభ్యర్థుల వారీ వేరుచేయనున్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక... లోక్‌సభ నియోజవర్గానికి సంబంధించి రాండమ్‌గా 35 వీవీప్యాట్ మెషీన్లను (అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్ మెషీన్ల చొప్పున) ఎంపికచేసి లెక్కిస్తారు. ఇదంతా అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో రిటర్నింగ్ అధికారి నిర్వహిస్తారు. లాటరీలో వచ్చిన నెంబర్ల వారీ యంత్రాలను వెలికి తీసి వాటిల్లో ఉన్న చీటీలను లెక్కించనున్నారు. లెక్కింపు ప్రక్రియ మొదలవగానే తొలుత పోస్టల్ బ్యాలెట్లను, సర్వీసు ఓట్లను గణిస్తారు. తదుపరి ఈవీఎం యంత్రాల్లో పోలైన ఓట్లను గణిస్తారు. చివరిగా వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీల లెక్కింపు ఆరంభిస్తారు. ఇదంతా పూర్తయ్యాక విజేత పేరును అధికారికంగా ప్రకటిస్తారు. వీవీప్యాట్ యంత్రాల్లో చీటీల లెక్కింపు ఆరంభం కాకమునుపే రౌండ్ల వారీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను వెల్లడించనున్నారు. వచ్చే నెలలో లెక్కింపు సిబ్బందికి ఈ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారిలా.. .
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి.. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన వీవీప్యాట్ యం త్రాల్లో ఉన్న చీటీల (స్లిప్పులు) లెక్కింపు విషయంలో ఈసీ మార్గదర్శకాలను జారీచేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారమే చీటీలను వెలికి తీసి అభ్యర్థుల వారీ పోలైన ఓట్లను లెక్కిస్తారు. 2014 ఎన్నికల్లో వీవీప్యాట్ యంత్రాలను వాడలేదు. ఈవీఎం యంత్రాల పనితీరుపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. ఈసీ కొత్తగా వీవీప్యాట్ యంత్రాలను ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టింది. తొలుత పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గానికి ఒక పోలింగ్ బూత్‌ను ఎంపికచేసి, అక్కడ వినియోగించిన వీవీప్యాట్ యం త్రంలోని చీటీలను లెక్కించాలని భావించారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెగ్మెంట్‌కు లెక్కించే వీవీప్యాట్ సంఖ్యను పెంచాలని నిర్ణయిం చారు. ఈ మేరకు ఆయా యంత్రాల్లోని చీటీలను వెలికి తీసి, లెక్కింపు వరకు తీసుకోవాల్సిన జాగ్ర త్తలు, అనుసరించాల్సిన పద్ధతులపై లెక్కింపు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. లెక్కింపు ఇలా... ఎంపిక చేసిన వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీలు, దానికి అనుసంధానమై ఉన్న బ్యాలెట్ యూనిట్లో ఉన్న ఓట్ల సంఖ్యతో సరిచూస్తారు. పోలింగ్ కేంద్రాల వారీ ఉన్న ఓట్లు, పోలైన ఓట్లు వంటి వివరాలతో రూపొందించిన ‘ఫారం–17ఏ’తో సరిపోల్చుతారు. అంతా సరిగ్గా ఉన్న తర్వాత వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను ఏజెంట్ల సమక్షంలో బయటకు తీస్తారు. వీటిని అభ్యర్థుల వారీగా వేరుచేస్తారు. తదుపరి 25 చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. అభ్యర్థుల వారీ విడదీసి, లెక్కింపు పూర్తి చేయడానికి 2 గంటలకుపైగా పట్టే అవకాశం ఉంది. అయిదు యంత్రాల్లోని స్లిప్పులను మాత్రమే లెక్కించాల్సి ఉన్నందున సమాంతరంగా అన్నీ ఒకేసారి ప్రారంభిస్తారు. ఈవీఎం ఓట్లను లెక్కించే టేబుల్‌నే దీనికి వినియోగిస్తారు. చీటీలను మాత్రం ట్రేలో వేసి అభ్యర్థుల వారీ వేరుచేయనున్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక... లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి రాండమ్‌గా 35 వీవీప్యాట్ మెషీన్లను (అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్ మెషీన్ల చొప్పున) ఎంపికచేసి లెక్కిస్తారు. ఇదంతా అభ్యర్థులు/వారి ఏజెంట్ల సమక్షంలో రిటర్నింగ్ అధికారి నిర్వహిస్తారు. లాటరీలో వచ్చిన నెంబర్ల వారీ యంత్రాలను వెలికి తీసి వాటిల్లో ఉన్న చీటీలను లెక్కించనున్నారు. లెక్కింపు ప్రక్రియ మొదలవగానే తొలుత పోస్టల్ బ్యాలెట్లను గణిస్తారు. తదుపరి ఈవీఎం యంత్రాల్లో పోలైన ఓట్లను గణిస్తారు. చివరిగా వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీల లెక్కింపు ఆరంభిస్తారు. ఇదంతా పూర్తయ్యాక విజేత పేరును అధికారికంగా ప్రకటిస్తారు. వీవీప్యాట్ యంత్రాల్లో చీటీల లెక్కింపు ఆరంభం కాకమునుపే రౌండ్ల వారీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను వెల్లడించనున్నారు. వచ్చే నెలలో లెక్కింపు సిబ్బందికి ఈ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. -
ఈవీఎం.. ఆ..భయం!
న్నికల యజ్ఞం ముగిసింది. ప్రజాతీర్పు ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైంది. ఆ తీర్పు వెల్లడి కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఎన్నడూ లేనంత సుదీర్ఘంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల క్రతువు జరుగుతుండటం.. మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యాకే.. అంటే మే 23న ఓట్ల లెక్కింపునకు ముహూర్తం నిర్ణయం.. మొదటి దశలోనే రాష్ట్రంలో పోలింగ్ జరిగిపోవడం వంటి కారణాలతో ఏకంగా 43 రోజులపాటు ప్రజాతీర్పును తమలో దాచుకున్న ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడాల్సిన పరిస్థితి. అందుకు అనుగుణంగానే ఎన్నికల కమిషన్ ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాండ్ రూములకు మెజిస్టీరియల్ అధికారాలుండే తహసీల్దార్ల నేతృత్వంలో రౌండ్ ది క్లాక్ భద్రత ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఆ మేరకు దాదాపు అన్ని జిల్లాల్లో ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు తహసీల్దార్ల పర్యవేక్షణలో భద్రత ఏర్పాటు చేశారు.కానీ విశాఖ జిల్లాలో మాత్రం ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో తహసీల్దార్‌ను మాత్రమే నియమించారు. వారికి సహాయకులుగా ముగ్గురు చొప్పున డీటీలను ఇచ్చారు. వారు కూడా సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని సాక్షి పరిశీలనలో వెల్లడైంది. స్ట్రాంగ్ రూములున్న ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో పరిస్థితి చూస్తే.. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన ఈవీఎంలు కొన్ని ఆరుబయట కనిపించాయి. భద్రతను పర్యవేక్షించాల్సిన రెవెన్యూ అధికారులు గానీ.. కొన్ని నియోజకవర్గా స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా సిబ్బంది జాడ గానీ కనిపించలేదు. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్–కౌంటింగ్ మధ్య 43 రోజుల సుదీర్ఘ విరామం రావడంతో.. అంతవరకు స్ట్రాంగ్ రూముల్లో ఉండే ఈవీఎంల భద్రతకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు విశాఖ జిల్లాలో సక్రమంగా అమలు కావడం లేదు. ఈవీఎంల భద్రతపై సాక్షి పరిశీలన జరిపినప్పుడు ఎన్నికల అధికారుల పర్యవేక్షన, భద్రత లోపాలు స్పష్టంగా కనిపించాయి. పోస్టల్, సర్వీస్ బ్యాలెట్ల జారీలోనే కాదు.. ఈవీఎంల భద్రత విషయంలోనూ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్న విమర్శలు జోరందుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశామని జిల్లా అధికారులు గొప్పలు చెప్పుకొంటున్నప్పటికీ.. నేటికీ సగం మందికి కూడా అందని పరిస్థితి నెలకొంది. పైగా పోస్టల్ బ్యాలెట్లు అందిన వారిలో చాలామందికి లోక్‌సభ తప్ప అసెంబ్లీ బ్యాలెట్లు పంపడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున విన్పిస్తున్నాయి. ఈ తరుణంలో కొత్తగా ఈవీఎంల భద్రతలోని డొల్లతనం అధికారుల ఉదాసీనతను బయటపెడుతోంది. విశాఖలో మాత్రం డిప్యూటీ తహసీల్దార్లతో సరి విశాఖ జిల్లాలో మూడు లోక్‌సభ స్థానాలతో పాటు 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మ«ధ్య ఏయూ ఇంజినీరింగ్ కళాశాలకు తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో తహసీల్దార్‌నే ఇన్చార్జిగా నియమించారు. వీరికి సహాయకులుగా ముగ్గురు చొప్పున డిప్యూటీ తహసీల్దార్ల(డీటీ)ను నియమించారు. దీంతో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద విధి నిర్వహణను డీటీలకు అప్పగించి తహసీల్దార్లు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కనీసం రోజుకోసారైనా స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలిస్తున్నారా? అంటే.. లేదనే సమాధానం వస్తోంది. పోనీ డీటీలైనా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఉంటున్నారా? అంటే అదీ లేదని ‘సాక్షి’ పరిశీలనలో స్పష్టమైంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల వద్ద పరిస్థితిని ‘సాక్షి’ బృందం పరిశీలించినప్పుడు రెవెన్యూ అధికారులు అటువైపు వెళ్లిన దాఖలాలు కన్పించలేదు. పర్యవేక్షణాధికారుల గురించి ఇంజినీరింగ్ కళాశాల సిబ్బందిని ఆరా తీస్తే.. రెవెన్యూ అధికారులు కాదు కదా.. కనీసం సిబ్బంది కూడా రావడం లేదని ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసులే 24 గంటలూ ఉంటున్నారని చెప్పుకొచ్చారు. పైగా కొన్ని నియోజకవర్గాల ఈవీఎంలు ఆరు బయటే పెట్టినట్టుగా కన్పిస్తోంది. వీటిని మరో 25 రోజుల పాటు ఈవీఎంలు కంటికిరెప్పలా కాపాడాల్సి ఉంది. భద్రత, పర్యవేక్షణ ఇలా ఉంటే.. ఎదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఈవీఎంల భద్రత, పర్య వేక్షణపై ప్రత్యేకదృష్టి సారించాలని ప్రధాన పార్టీల అభ్యర్థులు కోరుతున్నారు. స్ట్రాంగ్ రూముల భద్రతకు ఇవీ గైడ్‌లైన్స్ ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతకు ఎన్నికల కమిషన్ స్పష్టమైన గైడ్‌లైన్స్ జారీ చేసింది. 24 గంటలూ పర్యవేక్షించేలా మేజిస్టీరియల్ అధికారాలు ఉన్న తహసీల్దార్లను నియమించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తహసీల్దార్లు.. ఆ పైస్థాయి అధికారులకే భద్రత పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలని స్పష్టంగా సూచిం చింది. కిందస్థాయి అధికారులెవరూ ఉండడానికి వీల్లేదని స్పష్టంగా పేర్కొంది. తహసీల్దార్ స్థాయి అధికారులైతేనే స్ట్రాంగ్ రూముల వద్ద ఎవరైనా అపరిచితులు సంచరించినా, ఏవైనా అనుకొని ఘటనలు జరిగినా.. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి చూడకుండా తమకున్న మేజిస్టీరియల్ అధికారాలతో అక్కడికక్కడే.. వెనువెంటనే తగిన చర్యలు చేపట్టే అవకాశముంటుందన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఈ గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాలకు తూట్లు స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా సిబ్బందితో కలసి పర్యవేక్షించేందుకు మేజిస్ట్రేట్ హోదా కల్గిన తహసీల్దార్లను నియమించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కానీ మన జిల్లాలో మాత్రం డిప్యూటీ తహసీల్దార్లను నియమించారు. తహసీల్దార్లు స్ట్రాంగ్ రూంల పరిశీలనకు అసలు వెళ్లడం లేదు. డిప్యూటీ తహసీల్దార్లే పర్యవేక్షిస్తున్నారు. ఇది ఎన్నికల కమిషన్ ఆదేశాలకు తూట్లు పొడవడమే.– కాండ్రేగుల వెంకటరమణ, అధ్యక్షుడు జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య తహసీల్దార్లు, ఆర్వోలు పరిశీలిస్తున్నారు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతను పర్యవేక్షించేందుకు గెజిటెడ్ హోదా కల్గిన డిప్యూటీ తహసీల్దార్లను నియమించడం వాస్తవమే. అయితే తహసీల్దార్లు, ఆర్వోలు రోజూ మూడు పూటలుగా వెళ్లి తమ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూంలను పరిశీలిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే ఈ నియామకాలు జరిగాయి. భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడడం లేదు. రౌండ్ ది క్లాక్ భద్రతను పర్యవేక్షిస్తున్నాం. – ఆర్.గున్నయ్య, జిల్లా రెవెన్యూ అధికారి -
అవన్నీ పుకార్లే, నమ్మొద్దు: ద్వివేది
సాక్షి, అమరావతి: స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై ఎలాంటి సందేహాలు వద్దని, ఈవీఎంలను భద్రపరిచిన గదుల్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలను భద్రపరిచిన ప్రదేశాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందన్నారు. రాజకీయా పార్టీలు, తమ ఏజెంట్లను స్ట్రాంగ్ రూమ్ సమీపంలోని కంట్రోల్ రూమ్‌లలో ఉంచవచ్చని తెలిపారు. అలాగే ఈవీఎంలను భద్రపరిచిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండదన్నారు. అపోహలకు తావివ్వకుండా ఉండేలా భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్లపై వచ్చినవి పుకార్లు మాత్రమేనని ద్వివేది కొట్టిపారేశారు. స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయని, పుకార్లను ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దివ్వేది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ద్వివేదిని కలిసిన మేరుగ నాగార్జున కాగా అంతకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ....సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. వేమూరు నియోజకవర్గంలో అకృత్యాలు, దాడులపై చర్యలు తీసుకోకపోగా బాధితులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. టీడీపీ రౌడీలపై పెట్టిన కేసుల్లో పురోగతి లేదని, పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మేరుగ నాగార్జున తెలిపారు. బాధ్యులను వదిలేసి బాధితులను వేధిస్తున్నారని అన్నారు. దళితులపైనా, అండగా నిలిచిన ఇతర కులస్తులపైనా పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని సీఈవో దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం మేరుగ నాగార్జున మాట్లాడుతూ టీడీపీ నేతలు, పోలీసులు సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నికల కమిషన్నే సవాల్ చేస్తున్న టీడీపీ నేతలు గ్రామాల్లో నియంతల్లా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రక్రియతోపాటు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న చంద్రబాబు అండ్ కో పై ఎన్నికల కమిషన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులని చెప్పుచేతల్లో పెట్టుకుని టీడీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. వ్యవస్థను తన జేబు సంస్థగా మార్చుకున్న చంద్రబాబు పరిపాలన కొనసాగిస్తున్నారని మేరుగ నాగార్జున మండిపడ్డారు. -
ఈవీఎంలను హ్యాక్ చేయలేం!
సాక్షి, హైదరాబాద్: ఈవీఎంలను హ్యాకింగ్/ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఐటీ నిపుణుడు సందీప్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు కావాలనే పనికట్టుకుని ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం)ను డీ–కోడ్ చేయడం కష్టతరమని, వీటిలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్‌ను ఇన్స్టాల్ చేయలేరని సందీప్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వివిధ దశల్లో ఈవీఎంల సెక్యూరిటీని పరిశీలించిన తర్వాతే వినియోగిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ‘కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ముఖ్యమైన వ్యక్తులు.. అభద్రతాభావంతో ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేనో ఎంబేడెడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా క్రిప్టాలజీ, ఎన్క్రిప్టింగ్ మీద 15ఏళ్లుగా పనిచేస్తున్నాను. నా అనుభవం ద్వారా తెలుసుకున్న వాస్తవాలను యావదాంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ప్రభుత్వ పెద్దలు ఆరోపణలు చేస్తున్నట్లుగా ఓ ఈవీఎంను ట్యాంపర్ చేయాలంటే దానికి హార్డ్‌వేర్, కమ్యూనికేషన్ రేడియోస్, సపోర్టింగ్ సాఫ్ట్వేర్ కీలకం. ఒకవేళ ఈవీఎంని నెట్వర్క్ వీడియోస్‌తో అనుసంధానం చేయాలంటే చాలా ఖరీదైన పని. ఈవీఎంలలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయలేరు. ఒకసారి ఫర్మ్‌వేర్ కంపైల్ చేసిన తర్వాత ఈవీఎంపైన ఫ్లాష్చేస్తే.. రెండోసారి రీ–ఫ్లాష్చేసే అవకాశం ఉండదు. అదే విధంగా బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ యూనిట్ మధ్య జరిగే కమ్యూనికేషన్ ప్రొపరేటరీ సెక్యూర్ ప్రొటోకాల్ ద్వారానే జరుగుతుంది. ఏజెంట్ సమక్షంలో సమక్షంలో బ్యాటరీ స్విచాఫ్ చేస్తారు. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కట్ అయిపోతుంది. దీంతో అటోమెటిక్‌గా ఈవీఎంలో మెమరీ అలాగే ఉన్నప్పటికీ.. బయటి వారు యాక్సెస్ చేసేందుకు వీలుండదు. ఈవీఎంలను హ్యాక్ చేయాలని ప్రయత్నించి చాలా మంది విఫలమయ్యారు’అని సందీప్ రెడ్డి వెల్లడించారు. మన ఈవీఎంలను చాలా దేశాల్లో వినియోగిస్తున్నారని.. కానీ కావాలనే కొందరు మన దేశంలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి వారిపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఓ హ్యాకర్ ఈవీఎంలను హ్యాక్ చేస్తానంటూ సవాల్ విసిరి భంగపడ్డారని సందీప్ తెలిపారు. ఈ ఏడాది కూడా సయ్యద్ షుజా అనే వ్యక్తి యూకే నుంచి ఈవీఎంలను హాక్ చేస్తానని, గతంలో తాను ఈసీఐఎల్‌లో పనిచేస్తున్న సమయంలో హ్యాకింగ్ చేశానని చెప్పుకున్నారు. దీంతో మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్, మరికొందరు మీడియా, రాజకీయ ప్రముఖులు లండన్ వెళ్లొచ్చారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అవాస్తవమని వారు తెలుసుకున్న విషయాన్ని కూడా సందీప్ రెడ్డి గుర్తుచేశారు. వీవీప్యాట్‌కు, బ్యాలెట్ యూనిట్‌కు మధ్య మార్పు జరిగే సమయంలో ట్యాంపర్ (మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్) జరుగుతుందంటూ కొందరు చేస్తున్న వాదన అర్థరహితం అన్నారు. ఏపీ ఎన్నికల సమయంలో 36 చోట్ల ఈవీఎంలు మోరాయించాయని.. అది కూడా ఆపరేటర్ అసమర్థత ద్వారానే జరిగిందన్నారు. ఇందులో ఈవీఎంల తప్పిదమేమీ లేదన్నారు. -
బాబుకు తన ప్లాన్ ఫెయిలైందని అర్థమైంది...
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసు తీగ లాగితే డొంకంతా కదులుతోందని, ఏపీ తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారమే కాకుండా పంజాబ్ పౌరుల సమాచారం కూడా దొంగలించారని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢచార సంస్థ కంటే ప్రమాదకరంగా రహస్య సమాచార దోపిడీ జరిగిందని అన్నారు. మే 23 తర్వాత డేటా దొంగలంతా కటకటాల వెనక్కే అని వ్యాఖ్యానించారు. ఓవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కోట్లలో బిల్లుల చెల్లింపులు చేస్తున్న అధికారులు సీఎస్ పునేఠాలాగే ఇబ్బంది పడతారని విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం స్పందించి చంద్రబాబును కట్టడి చేయాలని, ఆపద్ధర్మ సిఎం చేసిన బదిలీలను రద్దు చేయాలని ఆయన కోరారు. నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, ప్రైవేట్ యూనివర్సిటీల సిబ్బందిని ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఈసీ అడ్డుకున్నప్పుడే చంద్రబాబుకు తన ప్లాన్ ఫెయిలైందని అర్థమైందన్నారు. ఆ తర్వాత తాను నియమించుకున్న ఆర్వోల మీద భారం వేశారని, అయితే ప్రజా తీర్పు మరోలా ఉండటంతో ఇప్పుడు ఈవీఎంలను బదనాం చేస్తున్నారని దుయ్యబట్టారు.’ అని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. ‘కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీయడానికి వెళ్లాడట. చంద్రబాబులాగా. ఇక్కడ ఈగల మోతను తప్పించుకోవడానికి రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేస్తున్నారు. చిత్రమేమిటంటే ఆయన స్నేహితులెవరూ స్పెషల్ స్టేటస్ ఊసే ఎత్తరు. ఈయన గాబరా పడ్డట్టు ఈవీఎంల పైనా మాట్లాడరు.’ అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు. -
పోలింగ్ శాతం ఎలా పెరిగింది?
జగిత్యాల: నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలపై పలు అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. గంటలోపే 14 శాతం పోలింగ్ ఎలా పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్‌లోని ఓ హోటల్లో ఈవీఎంను పట్టుకున్నారని వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరిగిన రోజునే ఈవీఎంలను తరలించాల్సింది పోయి 15వ తేదీ రాత్రి తరలించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. జగిత్యాల, నిజామాబాద్ కలెక్టర్లు ప్రభుత్వాలకు తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌కుమార్ ఓడిపోలేదని వ్యాఖ్యా నించారు. లక్ష్మణ్‌కుమార్ ఓడిపోవడంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, ‘ప్రజాగొంతుకైన కలానికి సంకెళ్లా?’ అనే పోస్టర్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం జగిత్యాల కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మకు వినతిపత్రాలు అందించారు. -
ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం: సందీప్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఈవీఎంలను హ్యాకింగ్ లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఐటీ నిపుణుడు సందీప్ రెడ్డి తెలిపారు. కొందరు కావాలనే పనికట్టుకుని ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను డీ కోడ్ చేయడం కష్టతరమని సందీప్ రెడ్డి స్పష్టం చేశారు. ఈవీఎం మిషన్లలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్‌ను ఇన్‌స్ట్రాల్ చేయలేరని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వివిధ దశల్లో పరిశీలించిన తర్వాతే ఈవీఎంలను వినియోగిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సందీప్ రెడ్డి మాట్లాడుతూ... ‘గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తున్నటువంటి కీలక పెద్దలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై అభద్రతా భావంతో దుష్ప్రచారం చేస్తున్నారు. తాను ఒక ఎంబేడెడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా క్రిప్టాలజీ, ఎన్క్రిప్టింగ్ మీద గత 15 సంవత్సరాలుగా పని చేస్తూ ఉన్న వ్యక్తిగా వాస్తవాలను యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి చెప్పాలనుకుంటున్నాను. ప్రభుత్వ పెద్దల ఆరోపణలు చేస్తున్నట్లు ఒక ఈవీఎంను ట్యాంపర్ చేయాలంటే దానికి హార్డ్‌వేర్, కమ్యూనికేషన్ రేడియోస్, సపోర్టింగ్ సాఫ్ట్వేర్ కీలకం. ఒకవేళ ఈవీఎంని నెట్వర్క్ వీడియోస్‌తో బిల్డ్ చేయాలంటే చాలా ఖరీదయిన పని’ అని అన్నారు. పూర్తి వీడియో... -
ఈవీఎంలను హ్యాకింగ్ లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం
-
నిర్లక్ష్యమా..పెద్దల డైరెక్షనా?
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన ఎన్నికలను 2014లో కంటే సమర్థవంతంగా నిర్వహించినప్పటికీ తప్పుడు ప్రచారం కొనసాగుతుండటం వెనుక ఉన్న శక్తులపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రాథమికంగా వెల్లడైంది. ప్రధానంగా మూడు జిల్లాల అధికారులు ఉద్దేశ పూర్వకంగా విధుల నిర్వహణలో అలసత్వం వహించినట్లు తేలింది. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వస్తే సరి చేయడం కోసం బెంగళూరు నుంచి 600 మంది సాంకేతిక నిపుణులను రప్పించి, ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున కేటాయించినా వారిని ఉపయోగించుకోనట్లు తేలింది. కనీసం వీరికి రూట్ మ్యాప్‌లు కూడా ఇవ్వలేదన్న విషయంలో తెలియడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందువల్లే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగిందని భావిస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 37, ప్రకాశంలో 25, గుంటూరు జిల్లాలో 21 చోట్ల రాత్రి తొమ్మిది దాటాక కూడా పోలింగ్ జరిగినట్లు గుర్తించారు. ఈవీఎంల మొరాయింపుపై అనుమానం అన్ని జిల్లాలో సక్రమంగా పనిచేసిన ఈవీఎంలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనే మాటిమాటికి మొరాయించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల ఆరేడు సార్లు ఈవీఎంలు మార్చడం వెనుక ఉద్దేశపూర్వక కుట్ర ఏమైనా దాగి ఉందా అనే విషయంపై ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారిస్తోంది. ఉదాహరణకు కృష్ణా జిల్లా తీసుకుంటే మైలవరం నియోజకవర్గంలో అర్ధరాత్రి దాటినా పోలింగ్ జరగడం, నూజివీడు నియోజకవర్గంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా వినియోగించని ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి మార్చడం, పెనమలూరు నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఈవీఎంలను చాలా ఆలస్యంగా స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చడం.. ఇలా ఒకే జిల్లా నుంచి పలు ఫిర్యాదులు వస్తుండటంపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్దేశ పూర్వకంగా తప్పులు చేసిన అధికారులపై ఎఫ్ఐఆర్లను నమోదు చేయడానికి కూడా వెనుకాడమని ద్వివేది హెచ్చరించారు. సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత కూడా పోలింగ్ జరగడానికి గల కారణాలు రాత పూర్వకంగా ఇవ్వాలని 13 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని చోట్ల ఏర్పాట్లు సరిగా చేయకపోవడానికి గల కారణాలను కూడా తెలియజేయాలన్నారు. రాజంలో మైనర్లు ఓటు వేసిన ఘటనల్లో వెంటనే నివేదికలు పంపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పోలింగ్ మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఈవీఎంలను ఆర్వో అప్పగించలేదన్న విషయమై కలెక్టర్‌ను నివేదిక కోరామని, అయితే అలాంటిదేమీ లేదని కలెక్టర్ నివేదిక ఇచ్చారని ద్వివేది చెప్పారు. చర్యలు మొదలు పెట్టిన ఈసీ ఈవీఎంల భద్రత విషయంలో కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఎలక్షన్ కమిషన్ చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 12 మంది అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు దివ్వేది తెలిపారు. ఇప్పటికే నూజివీడు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తహసీల్దారు పి.తేజేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. కృష్ణా యూనివర్సిటీ భవనంలో భద్రపరిచిన నూజివీడు నియోజకవర్గ రిజర్వు ఈవీఎంల తరలింపుపై అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్న నూజివీడు తహసీల్దార్ తేజేశ్వరరావుకు ఎన్నికల అధికారులు కొద్ది రోజుల క్రితమే షోకాజ్ నోటీసు జారీ చేశారు. స్ట్రాంగ్ రూంలలో ఉన్న ఈవీఎంలను కదలించకూడదని ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ వీటిని ఎందుకు తరలించారనే విషయమై ఉన్నతాధికారులు విస్తృత విచారణ చేపట్టారు. అర్ధరాత్రి ఈవీఎంల తరలింపు వివాదం, ఈవీఎం స్ట్రాంగ్ రూంలో అనధికారిక వ్యక్తుల ప్రవేశంపై మరో ఇద్దరు అధికారులపై చర్యలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. ఐదు చోట్ల రీపోలింగ్‌కు అవకాశం గూంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 94వ పోలింగ్ కేంద్రం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో ఉన్న 244వ పోలింగ్ కేంద్రం, నెల్లూరు అసెంబ్లీ పరిధిలోని ఇసుకపల్లిలో గల 41వ పోలింగ్ కేంద్రం, సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్పలోని 197వ కేంద్రం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని 247వ పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని సీఈసీకి సిఫారసు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది. -
ఒకటి ఓకే.. రెండు, మూడు అయితే కరెంట్ షాకే
రాయ్‌పూర్ : రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు ఒక్క రోజు ముందు ఛత్తీస్గడ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి కావాసి లఖ్మా వివాదస్పద వ్యాఖ్యలు చేసి ఎన్నికల సంఘంతో నోటీసులు ఇప్పించుకున్నారు. ఈవీఎంలో మొదటి బటన్ మాత్రమే నొక్కాలని, రెండో, మూడో బటన్ నొక్కితే కరెంట్ షాక్ తగులుతుందని ఓటర్లను భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మంత్రి కావాసి లఖ్మా బుధవారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కావాసి లఖ్మా ..‘రాష్ట్ర ఓటర్లంతా ఈవీఎంలపై ఉన్న మొదటి బటన్ మాత్రమే నొక్కాలి( మొదటి బటన్ కాంగ్రెస్ పార్టీ గుర్తు) అలా కాదని రెండో బటనో లేదా మూడో బటనో నొక్కితే కరెంట్ షాక్ తగులుతుంది. అందరు జాగ్రత్తగా మొదటి బటన్ నొక్కండి’ అని ఓటర్లకు సూచించారు. కాగా కావాసి మాటలు ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా ఉందని, అది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కావాసికి నోటీసులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా రెండో దశ లోక్‌సభ ఎన్నికలు ఈ నెల 18న జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో రేపు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయి. -
‘పోలింగ్’ అవకతవకలు: ఆ అధికారులపై వేటు
-
స్ట్రాంగ్‌రూమ్ భద్రతపై వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, కృష్ణా : మచిలీపట్నంలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ భద్రతపై రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. న్యాయవాదుల బృందంతో జిల్లా ఏఎస్పీ,ఆర్డీవోను కలిసి వైఎస్సార్సీసీ నేతలు మెమోరాండంను సమర్పించారు. అనుమతులు లేకుండా స్ట్రాంగ్‌రూమ్‌లోకి ఇతరులు ప్రవేశిస్తున్నారని మండిపడ్డారు. అధికారులే అనుకూల న్యూస్ చానెల్ రిపోర్టర్లను వీడియో గ్రాఫర్ పేరుతో స్ట్రాంగ్‌రూమ్‌కు తీసుకువెళ్లడంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంలకు కల్పించే భద్రత ఇదేనా అని అధికారులను ప్రశ్నించారు. స్ట్రాంగ్ రూమ్‌లకు వీడియో కవరేజ్ పేరుతో టీడీపీ నేతలు చెప్పిన వారికే బాధ్యతలు అప్పగించడం విస్మయం కల్గిస్తోందని మండిపడ్డారు. స్ట్రాంగ్ రూమ్ పుటేజ్ బయటకు వచ్చినా.. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో కలెక్టర్ చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా అధికారుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ సిలార్ దాదా పేర్కొన్నారు. -
‘పోలింగ్’ అవకతవకలు: ఆ అధికారులపై వేటు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైన అధికారులపై విచారణ కొనసాగుతోంది. నెల్లూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో జరిగిన నాలుగు ఘటనల్లో అవకతవకలపై సంబంధిత ఎన్నికల సిబ్బందిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఈ ఘటనలపై మూడు జిల్లాల కలెక్టర్ల నుంచి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నారు. పోలింగ్ తర్వాత తలెత్తిన వివాదాల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వోల)పై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి ద్వివేది సిఫారసు చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ద్వివేది తాజాగా మంగళవారం హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా స్ట్రాంగ్ రూములకు తరలించిన పోలింగ్ నాటి ఈవీఎంలను కదిలించొద్దని, రిజర్వ్ ఈవీఎంలను తరలించాల్సి వస్తే ముందస్తు అనుమతితో, అందరి సమక్షంలోనే తరలించాలని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత పెంచాలని కోరాయని, భద్రత పెంపు సాధ్యాసాధ్యాలపై డీజీపీని వివరణ కోరామని తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఘటనకు బాధ్యులెవరో విచారణలో తేలుతుందని తెలిపారు. ఈ వ్యవహారంలో వాస్తవంగా ఏం జరిగిందో మీడియా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. -
రాత్రిపూట ఆటోలో ఈవీఎంల తరలింపు
సాక్షి, జగిత్యాల: జిల్లాలో రాత్రిపూట ఆటోలో ఈవీఎంల తరలింపు కలకలం రేపింది. సోమవారం రాత్రి జగిత్యాల తహసీల్దార్ కార్యాలయం వద్దకు ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఈవీఎంలను తీసుకువచ్చారు. వీటిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే దానిపై ఆటో డ్రైవర్ పొంతనలేని సమాధానాలు చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈవీఎంలు తరలిస్తున్న సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈవీఎంలను ఆటోలో తరలించడం గమనించిన కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకుని వారిని ప్రశ్నించారు. అంతేకాకుండా అక్కడ జరుగుతున్న దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవి డెమో ఈవీఎంలు అని ఆటో డ్రైవర్‌తో పాటు అక్కడున్న మరో వ్యక్తి చెబుతున్నారు. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఆటోలో ఈవీఎంలు..జగిత్యాలలో కలకలం
-
ఎందుకు ఈ యాగీ?
-
ఈసీవి డ్రామాలు
సాక్షి, అమరావతి: పేపర్ బ్యాలెట్‌కు ఉన్న సౌలభ్యాన్ని చూడకుండా ఈవీఎంల విషయంలో ఈసీ ఎందుకు ఇన్ని డ్రామాలాడుతోందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. మీరే డిక్టేటర్ అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలను మీరే నియమించుకోండని విమర్శించారు. ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద ప్రజావేదిక హాలులో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్‌ను బీజేపీ పంపిస్తే ఈసీ చదివిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సారి ఎన్నికలను గతంలో కంటే విరుద్ధంగా ఎందుకు ముందుగా పెట్టారంటే సమాధానం లేదన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో అధికారులను బదిలీ చేసి భయబ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. వీవీ ప్యాట్స్ విషయంలో లెక్కింపు కుదరదనడానికి ద్వివేది ఏమైనా ఎక్స్ఫర్టా? ఆయన నిన్నటి వరకు నా దగ్గర పని చేయలేదా? అని వ్యాఖ్యానించారు. టెక్నాలజీని ప్రమోట్ చేసింది తానేనని, సాంకేతిక వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చానని చెప్పారు. ఈవీఎంలను మేనేజ్ చేయడం చాలా సులువని అన్నారు. 191 దేశాలకుగాను 18 దేశాలు మాత్రమే ఈవీఎంలు వాడుతున్నాయన్నారు. జర్మనీ, నేదర్లాండ్, ఐర్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం గతంలో వాడి ఇప్పుడు వెనక్కు వచ్చాయన్నారు. ప్రపంచంలో ఈవీఎంల వినియోగం తీరుపై ఈ సందర్భంగా ఆయన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2009 నుంచి ఈవీఎంలకు వ్యతిరేకంగా టీడీపీ పోరాటం చేస్తోందన్నారు. పోలింగ్ రోజునే అవకతవకలు జరుగుతూంటే ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగడం ఏమిటని, ఎన్నికల సంఘం ఎక్కడ సజావుగా ఎన్నికలు జరిపిందని ప్రశ్నించారు. ఈవీఎం యంత్రాలను ఎప్పటికప్పుడు సక్రమంగా సమీక్షించే సరైన వ్యవస్థ లేదన్నారు. నా ఓటు ఎవరికి పడిందో? వీవీ ప్యాట్లలోను ఓటు ఎవరికి వేశామనేది ఏడు సెకన్లు కన్పించాల్సి ఉండగా, మూడు సెకన్లు కూడా కనిపించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఓటు ఎవరికి వెళ్లిందో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎన్నికలకు ముందుగానే తమకు ఈవీఎంలపై అనుమానాలున్నాయని చెప్పామని చంద్రబాబు అన్నారు. ఎన్నికలకు ముందు బ్యాలెట్ అంటే సమయం సరిపోదన్నారని, అందువల్ల 100 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని డిమాండ్ చేశామన్నారు. కనీసం 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించడానికి వీరికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. వీవీ ప్యాట్ స్లిప్‌లు కౌంట్ చేయనప్పుడు వాటికి రూ.9 వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని అడిగారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత తీసుకు రావడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు తీసేస్తే సారీ అనే ఒక్క పదంతో ఈసీ తేల్చేసిందన్నారు. అసలు ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణ విధానంపై అందరికీ స్పష్టత ఉండాలని, ఎన్నికల సంఘం ముందు అనేక అంశాలు వివరించామని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగేలా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఇందుకు ఐక్య కార్యాచరణ చేపడతామని ప్రకటించారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా 23 రాజకీయ పార్టీలు జాయింట్ పిటిషన్ వేశాయని చెప్పారు. వీవీ ప్యాట్ల లెక్కింపునకు ఆరు రోజులు పడుతుందని ఈసీ సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్నారు. వీవీ ప్యాట్ల లెక్కింపునకు ఆరు రోజులు ఎందుకు పడుతుందని, ఈ విధానంపై సుప్రీంకోర్టుకు కొత్త పిటిషన్ (రివ్యూ పిటిషిన్) వేస్తామన్నారు. 150 సీట్లకు పైగా గెలుస్తాం.. ఈవీఎంలపై తాను మాట్లాడుతుంటే తాము ఓడిపోతామనే అనుమానాలు రేపుతున్నారని చంద్రబాబు అన్నారు. ‘గెలుపు విషయంలో నేను భయపడటమేంటి? మేమెందుకు ఓడిపోతాం? ఎలా ఓడిపోతాం? ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అర్ధరాత్రి వరకు ఉండి ఒక స్ఫూర్తితో ఓటేశారు. ఎవరెన్ని మాట్లాడుతున్నా అండర్ కరెంట్ చూడబోతున్నారు. 150కి పైగా సీట్లలో మేమే గెలుస్తాం. మోదీ ఎన్నికల్లో డబ్బు పంచి గెలవాలనుకుంటున్నారు. హెలికాఫ్టర్‌లో డబ్బులు తీసుకుపోతున్నారు. మోడల్ కోడ్ మోదీకి వర్తించదా? మొత్తం వ్యవస్థను మోదీ భ్రష్ట్రు పట్టించారు. నేరస్తులకు ఆయన చౌకీదారు. పెద్ద నోట్లు రద్దు చేసి మళ్లీ రూ.2 వేలు తేవడం ద్వారా వ్యవస్థను అస్తవ్యస్థం చేశారు. రాఫెల్ విషయంలో సుప్రీంకోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు’ అన్నారు. పాకిస్తాన్‌పై దాడుల విషయంలో కూడా మోదీ ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. -
ఆత్మకూరు వీవీ ప్యాట్ స్లిప్‌లపై సీఈ ఆగ్రహం
-
ద్వివేది ఆగ్రహం
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు దొరికిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఆ స్లిప్పులు పోలింగ్ నాటివి కాదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా కృష్ణా జిల్లా నూజివీడులో వాడని ఈవీఎంల తరలించిన వ్యవహారంపై స్పందించిన ద్వివేది.. ఈ రెండు వ్యవహారాల్లోనూ అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలను ఈవీఎంల కమిషనింగ్ సెంటర్‌గా మాత్రమే వినియోగించామని, ఆత్మకూరు ఆర్డీవో ఆధీనంలో ఉన్న ఈ కమిషనింగ్ సెంటర్లో బ్యాలెట్ పత్రాలు పెట్టిన తర్వాత చెక్ చేశారని, పోలింగ్‌కు ముందే ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన ఈవీఎంలలో వెయ్యి ఓట్లను బెల్ ఇంజినీర్లు పోల్ చేశారని, ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాత వాటిని పోలింగ్ కేంద్రాలకు తరలించారని తెలిపారు. ఎవరో ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా ఈవీఎంలు కమిషనింగ్ చేసిన సమయంలో వచ్చిన వీవీప్యాట్ స్లిప్పులను బయట పారేశారని, వీవీ ప్యాట్ స్లిప్పుల విషయంలో ఆత్మకూరు ఎన్నికల ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన ఉద్యోగులపై క్రిమినల్ కేసు పెట్టి తక్షణం అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్‌ను సీఈఓ ద్వివేది ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో జరిగే తప్పులకు రిటర్నింగ్ అధికారులే బాధ్యులవుతారని హెచ్చరించారు. ఆ ఈవీఎంల తరలింపుపైనా ఆగ్రహం.. స్ట్రాంగ్ రూమ్ నుంచి వాడని ఈవీఎంలను తరలించడంపై సీఈఓ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. నూజివీడు సబ్ కలెక్టర్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) వెంటనే ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో దాదాపు గంటన్నరపాటు ఈవీఎంల తరలింపుపై నుజువీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కృష్ణా జిల్లా జేసీ మిషా సింగ్ వివరణ ఇచ్చారు. వినియోగించని, రిజర్వ్ చేసిన ఈవీఎంలను మాత్రమే తరలించామని వారు తెలిపారు. పోలింగ్ కేంద్రాలనుంచి ఈవీఎంలు రాకముందే.. వినియోగించని ఈవీఎంలను ఎందుకు తరలించలేదని ద్వివేది నిలదీశారు. ఈ విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పొరపాట్లు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఈవీఎంలపై 42 పార్టీల సంతృప్తి : ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ : ఎలక్ర్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై వస్తున్న ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది.2017, మే 20న ఈవీఎంల ఛాలెంజ్‌కు రావాలని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తే కేవలం రెండు పార్టీలు సీపీఎం, ఎన్సీపీ మాత్రమే ముందుకొచ్చాయని పేర్కొంది. ఈ రెండు పార్టీలు ఈవీఎంలను పరీక్షించి వాటి పనితీరు పట్ల పూర్తి సంతృప్తి ప్రకటించాయని తెలిపింది. ఇక అదే ఏడాది మే 12న 42 పార్టీలు ఈవీఎంలను పరిశీలించి పలు సందేహాలను నివృత్తి చేసుకున్నాయని వెల్లడించింది. భవిష్యత్‌లో వీవీప్యాట్లతో అనుసంధానించిన ఈవీఎంలతో ఎన్నికలు జరుపుతామని పార్టీలకు ముందుగానే సమాచారం ఇచ్చామని, ఈవీఎంలను హ్యాక్ చేయలేరని ఉత్తరాఖండ్ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిన విషయాన్ని ఈసీ గుర్తుచేసింది. గత 67 ఏళ్లుగా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని, మరింత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఈసీ స్పష్టం చేసింది. -
దొరికిన వీవీ ప్యాట్ స్లిప్పులు.. కలకలం!
సాక్షి, నెల్లూరు : ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో ఈవీంఎలకు అమర్చిన వీవీ ప్యాట్ స్లిప్పులు దొరకడం కలకలం రేపింది. ఎన్నికల్లో ఏ పార్టీ గుర్తుకు ఓటు వేశారో ఓటరకు తెలిపేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మేషిన్ల (ఈవీఎంల)కు వీవీ ప్యాట్లు అమర్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో దాదాపు 200 వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికాయి. ఈ స్లిప్పులను ఆత్మకూరు రిటర్నింగ్ అధికారి సోమవారం పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంల వినియోగానికి సంబంధించిన శిక్షణ ఇచ్చినప్పుడు వాడిన స్లిప్పులు ఇవని రిటర్నింగ్ అధికారి తెలిపారు. నిబంధనల ప్రకారం శిక్షణ ఇచ్చినప్పుడు వాడిన వీవీ ప్యాట్ స్లిప్పులను కూడా భద్రపరచాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికిన ఘటనపై అధికారులను వివరణ కోరతామని కలెక్టర్ స్పష్టం చేశారు. -
ఈ బాబుకు ఏమైంది?
సాక్షి, అమరావతి: టెక్నాలజీయే తాను.. తానే టెక్నాలజీ.. అని చెప్పిన నోటితో ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెట్ కావాలంటూ రాద్ధాంతం చేయడం.. తన ఓటు తనకే పడిందో లేదో తెలియడం లేదని అనుమానాలు వ్యక్తం చేయడం.. ప్రతిపక్ష పార్టీల నేతలు, అధికారులపై నోరు పారేసుకోవడం.. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకు ఏమో అయిందని సాధారణ ప్రజలు, సొంత పార్టీ నేతల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మాట్లాడే ప్రతి మాటలో అభద్రత, అసహనంతో పాటు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం చూస్తుంటే ఓటమిని ముందే గ్రహించి.. దాన్ని జీర్ణించుకోలేక గ్రౌండ్‌ను సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు, ఢిల్లీ వెళ్లి చేస్తున్న హడావుడి అంతా ఓటమిని అంచనా వేసిన నాయకుడు చేసే చేష్టలని చెబుతున్నారు. ఈవీఎంలను మొదట ఎందుకు వ్యతిరేకించలేదు? ఈవీఎంలపై చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఈవీఎంల మీద నమ్మకం లేదని, ప్రజాస్వామ్యాన్ని మిషన్ల చేతిలో పెడతారా? అని ప్రశ్నిస్తున్న చంద్రబాబు గత ఎన్నికల్లో వాటి ద్వారానే గెలిచిన విషయాన్ని ఎందుకు గమనంలోకి తీసుకోవడంలేదనే ప్రశ్న అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. 2014లో ఆయన అధికారంలోకి వచ్చాక జరిగిన నంద్యాల ఉప ఎన్నికలోనూ ఈవీఎంలే వాడారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థే గెలిచారు. అంతకు ముందు 1999లో గ్రేటర్ హైదరాబాద్‌లో ఈవీఎంలతో నిర్వహించిన ఎన్నికల్లోనూ టీడీపీ గెలుపొందింది. అప్పటి నుంచి ఈవీఎంలతోనే దేశమంతా ఎన్నికలు జరుగుతున్నాయి. 2004, 2009 ఎన్నికలూ ఈవీఎంలతోనే జరిగాయి. అప్పుడు వాటిని వ్యతిరేకించని చంద్రబాబు హఠాత్తుగా ఈ ఎన్నికల్లోనే కొత్తపల్లవి అందుకోవడానికి రాజకీయ అంశాలే కారణమని చెబుతున్నారు. అంతా టెక్నాలజీ అంటూ.. ఈవీఎంలు వద్దంటే ఎలా? టెక్నాలజీ లేకపోతే బతుకులే లేవని, దాంట్లో తాను లబ్ధ ప్రతిష్టుడినని చెప్పుకునే చంద్రబాబు ఈవీఎంలను వ్యతిరేకించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 11వ తేదీన ఏపీలో జరిగిన పోలింగ్‌లో 30 శాతం ఈవీఎంలు పనిచేయ లేదని చంద్రబాబు చేసిన ఆరోపణపై ఎన్నికల ప్రధాన అధికారి వెంటనే వివరణ ఇచ్చారు. అయినా ఈ విషయాన్ని రచ్చ చేయాలని నిర్ణయించుకున్న ఆయన అదేపనిగా విమర్శలు చేస్తూనే ఉండటంపై టీడీపీ నాయకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావడంలేదని, లేనిపోని సమస్యలు సృష్టిస్తూ తనంతట తాను అందరిలో పలుచన అయిపోతున్నారని వాపోతున్నారు. ఈవీఎంలపై లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించేందుకు నేర చరిత్ర ఉన్న వేమూరి హరి ప్రసాద్‌ను పంపడాన్ని ఎన్నికల కమిషన్ ఒప్పుకోకపోవడం కచ్చితంగా పార్టీకి ఇబ్బంది కలిగించే విషయమేనని ఆందోళన చెందుతున్నారు. టీడీపీకి ఓటేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడుతుందని, తన ఓటు టీడీపీకే పడిందో లేదో తెలియడం లేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు స్వపక్షీయులకు సైతం ఆశ్చర్యం కలిగించాయంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఈ స్థాయి నేలబారు విమర్శలు చేస్తారని పార్టీ నాయకులు, శ్రేణులతో సహా ఎవరూ ఊహించలేదని సీనియర్ రాజకీయ నేతలు సైతం అశ్చర్యపోతున్నారు. అధికార యంత్రాంగంపై అభాండాలేమిటి? ఎన్నికల కమిషన్ నియమించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చంద్రబాబు.. కోవర్టుగా అభివర్ణించడంపై అధికార వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు ఆయన నడిపిన ప్రభుత్వంలోనే పని చేసిన ఒక ఉన్నతాధికారిపై అంత దారుణమైన అభాండం వేయడం ఏమిటని సొంత పార్టీలోనే అసంతృప్తి నెలకొంది. నియమితులైన అధికారులంతా చంద్రబాబు ప్రభుత్వంలో పని చేస్తున్న వారే. ఎన్నికల కమిషన్ నేతృత్వంలో పని చేసిన అధికార యంత్రాంగమంతా ప్రభుత్వంలో మొన్నటివరకూ ఆయన కనుసన్నల్లోనే పని చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదారుగురు అధికారులను బదిలీ చేస్తే మిగిలిన యంత్రాంగంమంతా కోవర్టులైపోయినట్లు చంద్రబాబు మాట్లాడడం సరికాదనే భావన సొంత పార్టీలోనే వినిపిస్తోంది. విపరీత ప్రవర్తన ఆయన మానసిక స్థితిని తెలుపుతోందా! చంద్రబాబు ఎందుకు ఇలా వింతగా, విపరీతంగా ప్రవర్తిస్తున్నారనే దానిపై రకరకాల అనుమానాలు సొంత పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఆయనకు మానసికంగా ఏమో అయిందేమోనని అంతర్గత సంభాషణల్లో ముఖ్య నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ‘మా బాస్ ఉన్నట్లుండి తీవ్ర స్థాయిలో మమ్మల్ని కోప్పడుతున్నారు. ఎందుకు అలా అన్నారు.. ఏం తప్పు చేశామని పరిశీలించుకుంటే మాకు ఏమీ కనిపించడంలేదు. ఇదే విషయాన్ని మరో నేత వద్ద ప్రస్తావించినా, ఆయన మాటలు ఇప్పుడేమీ పట్టించుకోవద్దు. ఎన్నికల్లో మన పరిస్థితి మనకు అర్థమైపోతుంది కదా... మరి పార్టీకి బాస్ అయిన ఆయన మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి’అని ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించడం పరిశీలనాంశం. తానే సర్వస్వం అయినట్లు, ఆంధ్ర రాష్ట్రం అంటే తాను, టీడీపీ అని రకరకాలుగా చేస్తున్న చిత్రీకరణలపైనా విస్మయం వ్యక్తమవుతోంది. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఆయన ఇలా ప్రవరిస్తున్నారనే ప్రచారం అన్ని వర్గాలతో పాటు ఉన్నతాధికారుల చర్చల్లోనూ జరుగుతుండటం గమనార్హం. ఎన్నికలు ఫార్స్ అని, కమిషన్ చేతగానిదని చెప్పడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విచక్షణ కోల్పోయి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, కంట్రోల్లో లేని హావభావాలు ఆయన మానసిక స్థితి సరిగా లేదని తేటతెల్లం చేస్తున్నాయని మానసిక నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. -
నేతల భవిత భద్రం!
మహబూబ్‌నగర్ క్రైం: పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తమ తీర్పు తెలపగా.. ఈవీఎంలలో నేతల భవిత భద్రంగా ఉంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 12మంది అభ్యర్థులు బరిలో ఉండటం తెలిసిన విషయమే. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలన్నింటినీ ఇప్పుడు జిల్లా కేంద్రంలోని జేపీఎన్సీఈ కళాశాల భవనాల్లో ఉంచారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఈవీంలు, వీవీప్యాట్లు స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఇక అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లో దాగి ఉంది. మే 23న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. అంటే సరిగ్గా 38రోజుల సమయం ఉంది. ఇన్ని రోజులు అభ్యర్థులు ఓపిక పట్టక తస్పదు. ఇప్పుడు అందరి చూపు జేపీఎన్‌ఈఎస్ కళాశాల వైపే ఉంది. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు మహబూబ్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చిన ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. భవనంలోని కింది అంతస్తులో మూడు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూంలు, పైన అంతస్తులో నాలుగు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక స్ట్రాంగ్ రూం, ఒక ఓట్ల లెక్కింపు గదిని ఏర్పాటు చేశారు. అధికారులు, అభ్యర్థులు కూర్చునేందుకు, అలాగే మీడియా పాయింట్‌కు వేర్వేరు గదులను కేటాయించారు. నిఘా నేత్రాలతో పర్యవేక్షణ భవనం లోపల ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలో ఇతర విలువైన ఎన్నికల సామాగ్రి ఉన్నందున నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండు అంతస్తుల్లోని స్ట్రాంగ్ రూంలు, గదులు తలుపులకు, హాళ్లలో, విధులు నిర్వహించే పోలీసుల గదుల వద్ద, భవనం, బయట కెమెరాలు బిగించారు. ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన గదులు, హాల్లో కనీసం కలిపి దాదాపు 30వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భవనం బయట, లోపల అన్ని గదులు సీసీ కెమెరాల నిఘా నేత్రంలో నిక్షిప్తమవుతున్నాయి. బందోబస్తు నిర్వహించే పోలీసులు అప్రమత్తంగా ఉండేందుకు ఇవి దోహదపడటమే కాకుండా ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పని చేస్తాయి. భవనం లోపల, పైన ఆరుబయట ప్రాంగణం మొత్తంలో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. పారామిలటరీ పోలీసుల ఆధీనంలో.. జేపీఎన్‌ఈఎస్ భవనాన్ని సీఆర్పీఎఫ్(సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్), పారామిలటరీ పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 40మంది సీఆర్పీఎఫ్, 20మంది జిల్లా పోలీసులు నిత్యం ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. భవనం లోపల పారామిలటరీ పోలీసులే ఉంటారు. సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ అనుమతి లేనిదే ఎవరినీ లోనికి పంపరు. జిల్లా లోకల్ పోలీసులను కూడా లోనికి అనుమతించారు. స్ట్రాంగ్ రూంల వద్ద బందోబస్తు నిర్వహించే సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసి డ్యూటీ వేస్తారు. భవనం లోనికి వెళ్లే ప్రధాన ద్వారంతో పాటు పక్కన, వెనుక ఉన్న గేట్ల వద్ద బందోబస్తు పెట్టారు. ఉన్నతాధికారుల అనుమతితో పని నిమిత్తమై వచ్చే ఆర్వో, ఏఆర్వోలను అప్పుడప్పుడూ అధికారులకు లోపలికి వెళ్లడానికి మాత్రం అవకాశం కల్పిస్తారు. అలాగే భవనం చుట్టూ పోలీసులు పికెటింగ్‌లు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. భవనం వద్ద బందోబస్తుపై లోకల్ పోలీసులకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచనలు చేశారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ ప్రాంగణంలోనికి రానివ్వద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. -
ఈవీఎం భద్రతలో బయటపడ్డ డొల్లతనం
-
ఈవీఎం విజువల్స్.. కలెక్టర్ ఆగ్రహం
కృష్ణా జిల్లా: మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణా యూనివర్శిటీలో శనివారం అర్ధరాత్రి ఈవీఎంల తరలింపులో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై ఓ న్యూస్ చానల్లో ప్రచారం కావటంతో పాటు, ఓ దినపత్రికలో కూడా వార్త ప్రచురితమైంది. దీనిపై రాజకీయ పార్టీల నాయకులు, జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం... నూజివీడు నియోజకవర్గానికి చెందిన పోలింగ్ ప్రక్రియకు ఉపయోగించిన ఈవీఎంలతో పాటు, రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలను కూడా స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఉపయోగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన అనంతరం రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలను మచిలీపట్నంలోని మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోదాముకు తరలించారు. ఈ సంఘటనపై న్యూస్ చానల్, దినపత్రికలో స్ట్రాంగ్ రూంలను తెరిచి ఈవీఎంలను తరలించినట్లు ప్రచురితమైంది. దీనిపై ఆదివారం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్‌తో పాటు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు జిల్లా అధికారులు స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీల్లో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలను మాత్రమే స్ట్రాంగ్ రూంకు తరలించటం జరిగిందన్నారు. అది కూడా నూజివీడు నియోజకవర్గ రాజకీయ పార్టీ నాయకుల సమ్మతితోనే తరలించటం జరిగిందన్నారు. అయితే ఓ న్యూస్ చానల్లో ప్రసారం అయిన వీడియోను ఆ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వెంట ఉన్న వీడియో గ్రాఫర్ ద్వారా లీకైనట్లుగా భావిస్తున్నామన్నారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణతో పాటు, సీసీ కెమోరాల పుటేజీలను కూడా సేకరించి సంబంధిత వ్యక్తిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఆ దృశ్యాలను సదరు మీడియా ఛానల్లో ప్రసారం కూడా చేశారు. -
ఓటమి భయంతోనే చంద్రబాబు ఈసీపై ఆరోపణలు : జీవీఎల్
-
టీడీపీ బాక్సులు గల్లంతు కావడం ఖాయం
సాక్షి, ఢిల్లీ : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్లో ఉన్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు విమర్శించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జీవీఎల్ ఆదివారం న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పుడు ఈవీఎంను తప్పుబడుతున్న చంద్రబాబు....2014 ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు. అధికారులను బదిలీ చేస్తే చంద్రబాబు ఎందుకు యాగీ చేస్తున్నారని జీవీఎల్ ప్రశ్నించారు. ఏపీలో మూడు కోట్లమంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. వారికి రాని అనుమానం చంద్రబాబుకు మాత్రమే ఎందుకు వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ బాక్సులు గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఓ పరిపక్వత గల రాజకీయ నాయకుడు అలా ప్రవర్తించరాదని, చంద్రబాబు నలభై ఏళ్ల అనుభవం ఎందుకని ప్రశ్నించారు. ఆయనలో ఆ హుందాతనం కనిపించకపోగా, చౌకబారుతనం కనిపించిందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. -
రు‘బాబు’పై విస్మయం!
సాక్షి, చిత్తూరు: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు నిర్వహించడం కత్తిమీద సామే. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహిస్తోంది. కచ్చితత్వం కోసం ఎంత కఠిన నిర్ణయాలనైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఎన్ని రాజకీయాలు ఎదురొస్తున్నా స్వతంత్రతను కాపాడుకుంటూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతోంది. అలాంటి ఎన్నికల సంఘంపై చంద్రబాబు నాయుడు ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారు. పెరిగిన ఓటింగ్ తమకే లాభమని ఒకసారి.. ఓటింగ్ తగ్గించేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని మరోసారి.. ఈవీఎంలు సరిగ్గా పనిచేయనీకుండా చేసి వైఎస్సార్సీపీకి లాభం చేకూరేలా ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తోందని ఇంకో సారి మాట్లాడుతుండడంపై పలువురు మేధావులు ఆక్షేపిస్తున్నారు. పసుపు కుంకుమ ద్వారా మహిళల ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. అయితే ట్రెండ్ మాత్రం టీడీపీకి అనుకూలంగా లేకపోవడంతో చంద్రబాబు నాయుడు పరనిందలు మొదలు పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. డ్వాక్రా మహిళలను దారుణంగా మోసం చేయడం వల్లే ఘోరపరాభవం ఎదురవుతోందని టీడీపీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. మొరాయించిన ఈవీఎంలు 0.3 శాతమే జిల్లా వ్యాప్తంగా 13వేల ఈవీఎంలు ఓటింగ్ కోసం ఉపయోగించారు. వీటిలో కేవలం 0.3 శాతం ఈవీఎంలు మాత్రమే మొరాయించాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని పదేపదే ప్రెస్మీట్లో చెప్పారు. బాబు ఆదేశంతోనే టీడీపీ నాయకులు ఎన్నికల్లో గొడవలు సృష్టించారు. కొన్నిచోట్ల దాడులకు కూడా తెగబడ్డారు. ఇవన్నీ పోలింగ్‌ను తగ్గించేందుకు చేసిన కుట్రలే. అయినా జనం దేనికీ వెరవకుండా ఓటింగ్‌లో పాల్గొన్నారు. 80 శాతం పోలింగ్ నమోదు కావడమే దీనికి నిదర్శనం. ఈవీఎంలు సరిగా పనిచేయకపోతే పోలింగ్ ఎక్కువ శాతం ఎందుకు నమోదవుతుందని తటస్థులు ప్రశ్నిస్తున్నారు. ఓటమి భయంతోనే డ్రామాలా? ఐదేళ్ల అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని తెలిసే చంద్రబాబు నాయుడు ఈసీపై యుద్ధం అనే డ్రామాలాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పెరిగిన ఓటింగ్ శాతంపై విద్యావేత్తలు, మేధావులు ప్రశంసిస్తున్నారు. అయితే బాధ్యతగా మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎన్నికలను ఫార్సుగా చూపిస్తున్నారు. ఇది ప్రజాతీర్పును, ఎన్నికల వ్యవస్థను అవమానపరచడమే అని ప్రభుత్వ అధికారులు సైతం తేల్చి చెబుతున్నారు. అరాచక పాలనపై ఓటర్లు దండెత్తడంతోనే ఆయన ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు. వైఫల్యాలను అంగీకరించి ఉంటే హుందాగా ఉండేదని వారు అంటున్నారు. 2014లో టాంపరింగ్‌తోనే గెలిచారా? ఈవీఎంలను టాంపరింగ్ చేశారని చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలపై ప్రజలు భగ్గుమంటున్నారు. మరి 2014లో ఈవీఎంలను టాంపరింగ్ చేసి చంద్రబాబు గెలిచారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హైటెక్ బాబుకు ఈవీఎంల పనితీరు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. బాబు వైఖరిపై రాజకీయ వర్గాల్లోనూ తీవ్రంగా చర్చ జరుగుతోంది. ‘మన ఈవీఎంలను ఇతర దేశాల్లో కూడా వినియోగిస్తున్నారు. వీటిల్లో తప్పు ఉంటే ఎందుకు వాడుకుంటారు’ అని వారు చర్చించుకుంటున్నారు. ప్రజలు తిరస్కరించినట్లు స్పష్టమైన ట్రెండ్ ఉండబట్టే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. బాబుకు బుద్ధి చెప్పడానికే ప్రజలు ఓటెత్తారని వారు చెప్పుకుంటున్నారు. 2014 కంటే జిల్లాలో దాదాపు 2 శాతం పోలింగ్ ఎక్కువ నమోదైంది. -
బాబూ ఇదేనా మీ అనుభవం?
-
ఆ నిందితుడు చంద్రబాబు సన్నిహితుడే!
ఆంధ్రప్రదేశ్‌లో మూడు కోట్ల మందికి పైగా ఓటేశారు. వారంతా వీవీ ప్యాట్‌లో తమ ఓటు పడిన గుర్తును నిర్ధారణ చేసుకున్నారు. ఆ తర్వాత సంతృప్తితో బయటకు వచ్చారు. తాము బటన్ నొక్కిన గుర్తు కాకుండా మరో గుర్తు వీవీ ప్యాట్‌లో కనిపించి ఉంటే అక్కడే ఫిర్యాదు చేసేవారు. కానీ మూడు కోట్లకు పైగా ఓటర్లలో ఒక్కరి నుంచి కూడా ఒక్క ఫిర్యాదు రాలేదు. ఎన్నికల కమిషన్ వైఫల్యంతో రాష్ట్ర ప్రజలంతా తెల్లవారుజాము దాకా ఓటేయడానికి నిరీక్షించాల్సి వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. కానీ రాష్ట్రంలోని 46 వేల పోలింగ్ బూత్‌లలో రాత్రి 8 గంటల తర్వాత పోలింగ్ కొనసాగిన బూత్‌ల సంఖ్య 200 పైచిలుకు మాత్రమే. దొంగా దొంగా అని దొంగే అరచినట్టు.. వంద ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థ యాత్రకు వెళ్లినట్లు.. ప్రజాస్వామ్య వ్యవస్థల పని తీరుపై చంద్రబాబు మొగసాల కెక్కడం వింతగా,రోతగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ దొడ్లో కట్టేసుకున్న పెద్దమనిషి బహురూప వేషంపై విమర్శల జడి కురిసింది. ట్యాంపరింగ్ దొంగ బాబు సన్నిహితుడే ఈవీఎంల ట్యాంపరింగ్‌పై చంద్రబాబు మాటలు చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి పాడు పనులు అన్నట్లున్నాయి. ఎందుకంటే ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడిన వారితో సన్నిహిత సంబంధాలున్నది ఆయనకే. దశాబ్దం క్రితం ఎన్నికల సంఘం నుంచి ఈవీఎంను దొంగలించి ట్యాంపరింగ్‌కు పాల్పడిన నేరంంలో వేమూరి హరిప్రసాద్ మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇతను, ఇతని సోదరుడు రవికుమార్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. ప్రస్తుతం టీడీపీ సోషల్ మీడియా విభాగం ఇన్చార్జ్గా కూడా వ్యవహరిస్తున్నారు. వారి సంస్థకే చంద్రబాబు దాదాపు రూ.2 వేల కోట్ల ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టును కట్టబెట్టారు. ఆ సోదరుల సంస్థకే గన్నవరం వద్ద 100 ఎకరాలను కారుచౌకగా కేటాయించడం గమనార్హం. ఎన్ఆర్టీ సంస్థ పేరిట రాజధాని అమరావతిలో కూడా 5 ఎకరాల భూమిని కేటాయించారు. కాగా ఈవీఎంలపై సందేహాల నివృత్తి కోసం పంపించే బృందం నుంచి హరి ప్రసాద్‌ను తొలగించాలని సీఈసీ ఆదేశిస్తూ ఝలక్ ఇవ్వడం గమనార్హం. తప్పు చేసిన ప్రతిసారీ ఢిల్లీకెళ్లి యాగీ రాష్ట్రంలో చంద్రబాబు తప్పు చేసి దొరికిన ప్రతి సందర్భంలోనూ ఢిల్లీకి వెళ్లి యాగీ చేశారు. రాష్ట్ర విభజనకు తానే లేఖ ఇచ్చి.. తర్వాత ఆయనే వెళ్లి వద్దంటూ నిరాహార దీక్ష చేశారు.. ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు.. వెంటనే ఢిల్లీకి వెళ్లి వ్యవస్థలను మేనేజ్ చేసేపనిలో పడ్డారు. కేంద్రానికి మద్దతు ఉపసంహరించానంటారు.. చీకట్లో వెళ్లి బీజేపీ నాయకులతో మంతనాలు సాగించారు. ఇప్పుడు కూడా అయిదేళ్లూ అరాచకాలు చేశారు.. చివరి నిమిషంలో ఈవీఎంలమీద, ఈసీ చేసిన ట్రాన్స్ఫర్లమీద నేరం నెడుతున్నారు. మరోవైపు తనకు 130 సీట్లు వస్తాయంటున్నారు. టీచర్లు పోలింగ్ కేంద్రాల్లో ఉంటే తనకు నష్టం అని భావించిన చంద్రబాబు.. ఎన్నికల విధుల్లో ప్రైవేట్, ఇతర ఉద్యోగులను భారీగా నియమించారు. అనుభవం లేని ఉద్యోగులను నియమించడం వల్లే ఈవీఎంలు మొరాయించాయని తెలుస్తోంది. ఈ విషయంపై కూడా విచారణ జరపాలి. ఓటమి ఖాయమవడంతో చంద్రబాబు ఫ్రస్టేషన్ చూస్తుంటే.. దేశం వదిలి కుటుంబంతో సింగపూర్లోనో, మలేషియాలోనో సెటిల్ అవుతారనిపిస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు ఉన్న 3.13 కోట్ల మంది ఓట్లు వేశాక.. తాము ఓటేసిన అభ్యర్థి పేరు, గుర్తు వీవీ ప్యాట్లోని తెల్ల కాగితంపై స్పష్టంగా కనిపించడం చూసి సంతృప్తి చెందారు. తాము ఏ గుర్తుకు ఓటు వేశామో ఆ గుర్తుకే ఓటు పడిందని నిర్ధారించుకున్నాక పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చారు. తమ ఓటు హక్కును సజావుగా, సులువుగా సద్వినియోగం చేసుకున్నామన్న సంతోషంతో ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు, సన్నిహితులకు.. పోలింగ్ ఎలా సక్రమంగా, సులువుగా జరిగిందో వివరించి చెప్పారు. దాంతో అంత వరకు కాస్త బద్దకించిన వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెంటనే పోలింగ్ బూత్‌లకు వెళ్లి సజావుగా ఓటేశారు. అలా ఒకరు.. ఇద్దరు కాదు.. రాష్ట్రంలో 3.13 కోట్ల మంది నిర్భయంగా, సక్రమంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఒక్కరు కూడా తమ ఓటు ఎవరికి పడిందో తమకు తెలియలేదని ఫిర్యాదు చేయలేదు. ఈవీఎంలతోగానీ, వీవీప్యాట్లతోగానీ ఇబ్బంది ఏర్పడిందని ఒక్కరు కూడా ఆరోపించనే లేదు. అందరిదీ ఒకదారైతే.. చంద్రబాబుది మరోదారి రాష్ట్రంలో 80 శాతం మంది ఓటర్లుకు రాని సందేహం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం ఎందుకు వచ్చిందోనని జనం ఆశ్చర్యపోతున్నారు. తానేసిన ఓటు ఎవరికి పడిందో తనకే తెలియలేదని ఆయన దిగజారుడు ఆరోపణలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో ఈవీఎంలతోపాటు వోటర్ వెరిఫెరబుల్ పేపర్ ఆడిట్ ట్రోల్ (వీవీప్యాట్)లను వినియోగించారు. ఈవీఎంలో బటన్ నొక్కగానే ఓటు పొందిన అభ్యర్థి పేరు, గుర్తు ఆ వీవీ ప్యాట్‌లో ఓటర్లందరికీ కనిపించాయి. తమ ఓటు ఎవరికి పడిందో తెలీలేదని నిరక్ష్యరాస్యులు, వయోవృద్ధులు కూడా సందేహం వ్యక్తం చేయలేదు. కానీ చంద్రబాబుకు మాత్రం తన ఓటు ఎవరికి పడిందో కూడా తెలీదట. మరి ఓటు ఎవరికి పడిందో తెలియకపోతే ఆయన వెంటనే ఆ పోలింగ్ బూత్‌లో అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఫిర్యాదు చేసి ఉంటే అధికారులు వెంటనే స్పందించే వారు కదా.. రాష్ట్రంలో 3.13 కోట్ల మంది సవ్యంగా ఓటేశారు. వారిలో టీడీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు. కానీ ఒక్కరు కూడా తమ ఓటు ఎవరికి పడిందో అన్న సందేహం వ్యక్తం చేయలేదు. నిజంగా ఎవరికి ఓటు పడిందో తెలియకపోతే రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అలజడులు జరిగేవి. అలా జరగలేదంటే తాము ఎవరికి అయితే అనుకున్నామో వారికే తమ ఓట్లు పడ్డాయని రాష్ట్రంలోని ఓటర్లందరికీ తెలిసిందన్నది సుస్పష్టం. ఈవీఎంలపై 80 శాతం మందికి పూర్తి నమ్మకం రాష్ట్రంలో గురువారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 79.60 శాతం మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. అంటే మొత్తం 3.13 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యంలో తమ బాధ్యతను నిర్వర్తించారు. 2014 ఎన్నికల్లో 78.41 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకంటే ఈసారి 1.23 శాతం ఎక్కువగా ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో 46,120 పోలింగ్ బూత్‌లలో ఎన్నికలు నిర్వహించారు. అందు కోసం రికార్డు స్థాయిలో 92 వేల ఈవీఎంఎలను వినియోగించారు. గురువారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓపిగ్గా క్యూలలో నిలబడి మరీ క్రమశిక్షణతో పోలింగ్ బూత్‌లలోకి వచ్చారు. ఈవీఎంల వద్దకు వెళ్లి తమకు నచ్చిన పార్టీకి ఓటేశారు. తాము వేసిన వారికే ఓటు పడిందో లేదా వీవీ ప్యాట్లలో నిర్ధారించుకుని సంతృప్తితో బయటకు వచ్చారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఓటరు కూడా పోలింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. ఎన్నికల సంఘం ఇంత పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించబట్టే రికార్డు స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 సాధారణ ఎన్నికల ప్రక్రియలో తొలి దశలో దేశంలో 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో గురువారం ఎన్నికలు నిర్వహించింది. దేశంలో దాదాపు 14 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా ఏపీ, బెంగాల్‌లలోనే 80 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా ఈవీఎంల పని తీరుపట్ల దాదాపు సంతృప్తి వ్యక్తమైంది. ఓటమి ఖాయమని తెలిసే బాబు చిందులు ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని తేలడంతోనే చంద్రబాబు నానా రభస చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించనుందని కొంత కాలంగా జాతీయ సర్వేలు స్పష్టం చేస్తుండటంతో చంద్రబాబులో గుబులు పట్టుకుంది. దాంతో ఎన్నికల్లో అక్రమాలకు చంద్రబాబు పన్నాగం పన్నారు. కానీ ఆయన అక్రమాలకు వత్తాసు పలికే అప్పటి ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లా ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. టీడీపీకి వత్తాసు పలుకుతున్న ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌ను కూడా పోలింగ్‌కు ముందు రోజు బదిలీ చేసింది. తమ కుతంత్రాలను ఎన్నికల సంఘం అడ్డుకోవడంతో చంద్రబాబు తట్టుకోలేకపోయారు. హడావుడిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వద్దకు నేరుగా వెళ్లి ఆయన్ని నిలదీయడం అందర్నీ విస్మయపరిచింది. అప్పటి నుంచి చంద్రబాబు అపరిచితుడి మాదిరిగా పూటకో రీతిలో చెలరేగిపోతున్నారు. అమరావతి, హస్తినలో నిస్సిగ్గుగా అబద్ధాలు పోలింగ్ రోజు గురువారం ఉదయం 10 గంటల్లోపే పోలింగ్ ట్రెండ్ వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు చంద్రబాబుకు నివేదించాయి. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు ఎన్నికల సంఘంపై విమర్శలు చేస్తూ నానా హడావుడి చేశారు. ఆయన ఉండవల్లిలోని పోలింగ్ బూత్‌కు వెళ్లి సజావుగా ఓటేసి బయటకు వచ్చారు. ఆ పోలింగ్ బూత్‌లో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కానీ, అసౌకర్యంకానీ కలగలేదు. కానీ బయటకు రాగానే ఎన్నికల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా 30 శాతం ఈవీఎంలు పని చేయడం లేదని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రీపోలింగ్‌కు డిమాండ్ చేశారు. ఏ గుర్తుకు ఓటేసినా ఫ్యాన్‌కు పడుతోంది.. కమలం గుర్తుకు పడుతోంది.. అంటూ నిస్సిగ్గుగా అసత్య ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లింది. పోలింగ్ జరిగిన మర్నాడు అంటే శుక్రవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘంపై చిందులు తొక్కారు. శనివారం ఏకంగా ఢిల్లీ వెళ్లి మరీ రభస చేయడం అందర్నీ విస్మయ పరిచింది. చంద్రబాబు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరాతో శనివారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై అహేతుకమైన, ఊహాజనితమైన ఆరోపణలు చేశారు. తాము నిబంధనల మేరకే ఎన్నికలు నిర్వహించామని అరోరా స్పష్టం చేసినట్లు తెలిసింది. దాంతో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అదేరీతిలో నిస్సిగ్గుగా అసత్య ఆరోపణలు చేశారు. 0.03% మొరాయిస్తే 30% అన్న చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో సాంకేతిక కారణాలతో ఈవీఎంలు మొరాయించడం చాలా తక్కువగానే జరిగింది. సాధారణంగా ఏ ఎలక్ట్రానిక్ మేషిన్లు అయినా సాంకేతిక సమస్యలతో మొదట్లో 5 శాతం వరకు మొరాయిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ ఎన్నికల్లో కేవలం 0.03 శాతం ఈవీఎంలే మొదట కాస్త మొరాయించాయి. మొత్తం 92 వేల ఈవీఎంలలో కేవలం 400 ఈవీఎంలు మాత్రమే మొరాయించాయి. అది కూడా ముందురోజు నిర్వహించిన మాక్ పోలింగ్ డాటా తొలగించక పోవడంతోనే సాంకేతిక సమస్య ఏర్పడింది. సంబంధిత ఇంజినీర్లు వెంటనే వచ్చి వాటిని సరిచేయడంతో పోలింగ్ సజావుగా సాగింది. చంద్రబాబు మాత్రం ఏకంగా 30 శాతం ఈవీఎంలు మొరాయించాయని చెబుతూ అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేయడం విస్మయ పరిచింది. అందుకే ఆయన డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. 6 గంటల తర్వాత పోలింగ్ కేవలం 228 బూత్‌లలోనే రాష్ట్రంలో 46 వేల పోలింగ్ బూత్‌లలో కేవలం 228 బూత్‌లలోనే సాయంత్రం 6 గంటల తరువాత పోలింగ్ కొనసాగింది. అది కూడా ఎండ తీవ్రతతో ఆ బూత్‌లలో ఓటర్లు మధ్యాహ్నం ఓట్లు వేయడానికి రాలేదు. సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్న వారందరినీ ఓటింగ్‌ను అనుమతించాలి. కాగా, పోలింగ్ చివరి దశలో అక్రమాలకు టీడీపీ మరింత బరితెగించడంతోనే ఆలస్యమైంది. ఉదాహరణకు గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడు వద్ద సాయంత్రం 7 గంటల తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన వర్గీయులను క్యూలైన్లలోకి పంపించారు. వారికి ఓటువేసే అవకాశం కల్పించకూడదని, పోలింగ్ ముగించాలని డిమాండ్ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ఆయన అనుచరులపై ఎమ్మెల్యే వంశీ తన అనుచరులతో దాడికి దిగారు కూడా. కానీ అందుకు విరుద్ధంగా చంద్రబాబు ఏకంగా 30 శాతం పోలింగ్‌బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది. 2014 ఎన్నికల్లోనూ ఈవీఎంలే దేశంలో 2004 నుంచి ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2014 ఎన్నికలు కూడా ఈవీఎంల ద్వారానే నిర్వహించారు. అప్పుడు ఆయన ఈవీఎంల మీద సందేహం వ్యక్తం చేయనే లేదు. అప్పట్లో వీవీ ప్యాట్లు లేవు. ప్రస్తుతం వీవీ ప్యాట్లు కూడా ఏర్పాటు చేయడంతో తాము వేసిన ఓటు ఎవరికి పడిందో ఓటర్లకు కచ్చితంగా తెలుస్తోంది. ఇక 2016లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో ఈవీఎంలే వినియోగించారు. అప్పుడు అక్కడ టీడీపీ ఘన విజయం సాధించింది. అప్పుడు కూడా ఆయన ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేయలేదు. 2014 నుంచి 2018వరకు కేంద్రంలో బీజేపీతో కలిసి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఏనాడు ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించనే లేదు. అయితే ఇప్పుడు మాత్రం.. అదీ పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు వద్దు.. మళ్లీ పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేయడం గమనార్హం. కంప్యూటర్లు నేనే తెచ్చాను.. సెల్ఫోన్లు నేనే తెచ్చాను.. టెక్నాలజీ నేనే తెచ్చాను.. అంటూ హైటెక్ సీఎంగా చెప్పుకునే చంద్రబాబు మళ్లీ పేపర్ బ్యాలెట్ తేవాలని అనడం విడ్డూరమని జనం నవ్వుకుంటున్నారు. బాబుకు దక్కని మద్దతు ఎన్నికల సంఘం, ఈవీఎంలపై అసంబద్ధ ఆరోపణలు చేసిన చంద్రబాబు జాతీయ స్థాయిలో ఎలాంటి మద్దతు కూడగట్టలేకపోయారు. ఆయన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం కూడా తోసిపుచ్చినట్లు సమాచారం. తాము నిబంధనల మేరకు సజావుగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా స్పష్టం చేశారని తెలిసింది. దాంతో చంద్రబాబు అసహనంగా బయటకు వచ్చేశారు. ఇరత పార్టీల నుంచి చంద్రబాబుకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌తోసహా పలు బీజేపీయేతర పార్టీలు ఆయన వాదనను సమర్థించేందుకు సుముఖత చూపలేదు. ఈవీఎంల ద్వారానే ఇటీవల రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే ఆ పార్టీ చంద్రబాబుకు ఈ విషయంలో మద్దతు ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. ఢిల్లీలో తనకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడంతో చంద్రబాబు డీలా పడ్డారు. దాంతో మరో రోజు ఢిల్లీలో ఉండి కాస్త హడావుడి చేయాలని భావిస్తున్నారు. ఈసీ ఛాలెంజ్‌ను ఎందుకు స్వీకరించలేదు? ఈవీఎంలు ట్యాంపర్ చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెట్టడాన్ని ఢిల్లీలోని అధికార వర్గాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత కొందరు ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేశారు. అప్పటి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నదీం జైదీ తీవ్రంగా స్పందించారు.ఎవరైనా ఈవీఎంలు ట్యాంపర్ చేయండి చూస్తాం అని ఆయన 2017 మేలో రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు. గడువులోగా టీడీపీతోపాటు ఏ పార్టీ కూడా ఆ సవాల్‌ను స్వీరించనే లేదు. అప్పుడు సవాల్‌కు స్పందించని చంద్రబాబు ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ చేస్తున్నారు.. చిప్పే కదా మేనేజ్ చేసేస్తున్నారని అసంబద్ధ ఆరోపణలు చేయడాన్ని ఎన్నికల సంఘం అధికారులు తప్పుబడుతున్నారు. చంద్రబాబు మాటలు హాస్యాస్పదం నలభై ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు తాను వేసిన ఓటు ఎవరికి పడిందో తెలియడం లేదని చెప్పడం చూస్తున్న ప్రజలు నవ్వుకుంటున్నారు. నేను ఎవరికి ఓటు వేశానో ఆయన పేరు, ఎన్నికల గుర్తు డిస్ప్లేలో కనిపించాయి. ఓటు వేశాక డిస్ప్లేలో మనం ఎవరికి ఓటు వేశామో వీవీప్యాట్‌లో కనిపిస్తుంది. నేను ఓటు వేసిన సమయంలో గమనించి సంతృప్తి చెందా. – రామకృష్ణమరాజు, విజయపురం, చిత్తూరు జిల్లా మేమంతా స్వేచ్ఛగా ఓటు వేశాం.. బాబుకి చాదస్తం ఎక్కువైనట్లుగా ఉంది. అందుకే ఎన్నికల కమిషన్‌పై నిందలు మోపుతున్నారు. మేమంతా స్వేచ్ఛగా ఓటు వేశాం. నేను ఎవరికి ఓటు వేశానో ఆయన పేరు, ఎన్నికల గుర్తు డిస్ప్లేలో కనిపించాయి. నేను దీనిని గమనించా. ఓటు వేశాక కొన్నిసెకన్ల పాటు మనం ఎవరికి ఓటు వేశామో వీవీప్యాట్ డిస్ప్లేలో కనిపిస్తుంది. – రాజశేఖర్, గ్రామదట్ల, రాయదుర్గం మండలం, అనంతపురం పేరు, గుర్తు డిస్ప్లేలో కనిపించాయి రాష్ట్రంలో అవినీతి పాలనతో విసుగు చెందారు. రాష్ట్రాభివృద్ధి కోసం పొరాడే వ్యక్తిని కోరుకుంటున్నారు. నేను ఎవరికి ఓటు వేశానో పేరు, ఎన్నికల గుర్తు డిస్ప్లేలో కనిపించాయి. ఓటు వేశాక కొద్ది సమయం డిస్ప్లేలో మనం ఎవరికి ఓటు వేశామో వీవీప్యాట్‌లో కనిపిస్తోంది. నేను ఓటు వేసిన సమయంలో ఈ విషయం స్పష్టమయ్యింది. – సిరాజిన్బేగం, పులివెందుల ఓటు వేసినప్పుడు కనిపిస్తుంది చంద్రబాబునాయుడుకు తన సొంత ఇంటెలిజెన్స్ బృందం ఓటమి తప్పదని హెచ్చరించడంతో ఆయన గుండెలు గుబిల్లుమంటున్నాయి. నేను ఎవరికి ఓటు వేశానో ఆయన పేరు, ఎన్నికల గుర్తు డిస్ప్లేలో కనిపించాయి. ఓటు వేశాక కొన్ని సెకన్ల సమయం డిస్ప్లేలో మనం ఎవరికి ఓటు వేశామో వీవీప్యాట్‌లో కనిపిస్తుంది. నేను ఓటు వేసిన సమయంలో ఆ విషయాన్ని గుర్తించాను. – గర్నెపూడి వెంకటేశ్వరావు, అమృతలూరు భూతద్దంలో చూడాల్సిన పనిలేదు ఈవీఎంల్లో నేను వేసిన ఓటు వీవీ ప్యాడ్‌ల్లో గుర్తు కనిపించింది. నేను ఎవరికి ఓటు వేశానో ఆయన పేరు, ఎన్నికల గుర్తు డిస్ప్లేలో కనిపించాయి. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. – అట్టాడ హేమసుందర్, రెడ్‌క్రాస్ సొసైటీ మాజీ చైర్మన్, విజయనగరం ఈవీఎంలలో మోసం ఉండదు.. మనం ఓటు ఎవరికి వేశామో సెకన్లలోపు తెలియడం ఆనందాన్నిచ్చింది. ఈవీఎం మిషన్లలో తారుమారు చేయడం అనేది జరగదని నేను నమ్ముతున్నాను. ఇందులో మోసం జరిగే అవకాశమే ఉండదు. అనవసర రాద్ధాంతం చేయడమేనని అనుకుంటున్నా. – సాయిన రమాగౌతమి, పాతూరు, బీడీఎస్ స్టూడెంట్, పశ్చిమగోదావరి జిల్లా గత ఎన్నికలూ ఈవీఎంలతోనే .. గత ఎన్నికల్లోనూ ఈవీఎంలపైనే ఓటింగ్ జరిగింది. అపుడు అందరూ ఓటమిని, విజయాన్ని అంగీకరించారు. అప్పటి కన్నా ఇపుడు వీవీప్యాట్ మెషీన్ సంతృప్తికరంగా ఉంది. మనం వేసిన ఓటు ఏ గుర్తుకు పడిందీ కనిపించడం బాగుంది. – బేతా నూకరాజు, సీనియర్ సిటిజన్,రిటైర్డ్ ఉపాధ్యాయుడు, కొత్తకోట, విశాఖ జిల్లా నాకు కనిపించాయి.. కంప్యూటర్లను నేనే తెచ్చా, సెల్ఫోన్లను నేనే పరిచయం చేశానని నిత్యం చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఈవీఎంలు పనికి మాలినవి అని మాట్లాడుతుండటం వింతగా ఉంది. నేను ఎవరికి ఓటు వేశానో ఆయన పేరు, ఎన్నికల గుర్తు డిస్ప్లేలో కనిపించాయి. – షేక్ నాయబ్ రసూల్, కావలి వీవీ ప్యాట్‌లో సరి చూసుకున్నా.. ఓటమి భయంతో చంద్రబాబు ఈసీని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఓటు వేసి, వీవీ ప్యాట్‌లో సరిచూసుకున్నాను. అంతా సక్రమంగానే ఉంది. –పి.వైకుంఠరావు, న్యాయవాది, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా నాకు స్పష్టంగా కనిపించాయి.. నేను ఏ పార్టీకి ఓటు వేశానో చూసుకున్నా. అభ్యర్థి ఫొటో, పేరు, పార్టీ గుర్తు స్పష్టంగా కనిపించాయి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎందుకు కనిపించలేదో! –జి సోమన్న యాదవ్, తడకనపల్లె, కర్నూలు జిల్లా వీవీ ప్యాట్‌లో నేను నొక్కిన గుర్తు కనబడింది మొదట ఈవీఎంలో నాకు నచ్చిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తు పక్కన ఉన్న బటన్ నొక్కా. తరువాత పక్కన ఏర్పాటు చేసిన వీవీప్యాట్‌లో నేను నొక్కిన గుర్తు కనబడిందా లేదా అని పరిశీలించుకున్నాను. – జెట్టి చంద్రశేఖరరెడ్డి, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్, సింగరాయకొండ బీప్ శబ్దం కూడా వచ్చింది చంద్రబాబు ఓటమి భయంతో ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తున్నారు. ఈవీఎంలో ఏ గుర్తుపై ఓటు వేశామో వీవీ ప్యాట్‌లో ఎవరికి ఓటు పడిందో కూడా స్పష్టంగా కనిపించింది. గుర్తుపై నొక్కినప్పుడు బీప్ శబ్దం కూడా వచ్చింది. వీవీ ప్యాట్లు సరిగా పనిచేయలేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. – పమిడిపల్లి నానాజీ, ఏడిద, మండపేట మండలం, తూర్పు గోదావరి జిల్లా అందరికీ అర్థమయ్యేలా.. గతంలో ఈవీఎం ద్వారా ఎన్నికల్లో ఓటు వేసినట్లు బీప్ శబ్ధం గుర్తించి సంతృప్తి చెందాం. ఇప్పుడు మాత్రం ఈవీఎంలతోపాటు వీవీప్యాట్ కూడా అదనంగా జతచేయడంతో అభ్యర్థి ఫొటో, పార్టీ గుర్తును చూడగలుగుతున్నాం. ఎవరికి ఓటు వేశామనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ ఈ సారి ఎన్నికలను చాలా పారదర్శకంగా, పగడ్భందీగా నిర్వహించింది.. – జోజిమేరి, చిరువ్యాపారి ఆనందపురం,ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా -
ఈవీఎంల పనితీరును తప్పుపట్టడం సరికాదు
-
స్ట్రాంగ్ రూంలకు పటిష్ట భద్రత
నర్సాపూర్: ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. నర్సాపూర్‌లోని స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచి.. గదులకు సీలు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఈవీఎంలు, వీవీప్యాట్లను నర్సాపూర్‌లోని బీవీరాజు ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చినట్లు చెప్పారు. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన ఈవీఎంలను పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచామన్నారు. సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఈవీఎంలు, వీవీప్యాట్లను పట్టణంలోని అల్లూరి సీతరామరాజు గిరిజన గురుకుల విద్యాలయంలోని స్ట్రాంగ్ రూంలలో నిక్షిప్తం చేసినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్యారా మిలిటరీ బలగాలతో గట్టి భద్రత కల్పించినట్లు పేర్కొన్నారు. ఒక్కో స్ట్రాంగ్ రూం వద్ద ఒక సెక్షన్ ప్యారామిలిటరీ బలగాలు భద్రతగా ఉంటాయని, ఆయుధాలు కలిగిన ఇద్దరు జవాన్లు నిరంతరం పహారా కాస్తారని కలెక్టర్ వెల్లడించారు. స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేసిన భవనాల బయట స్థానిక పోలీసులు ఉంటారన్నారు. ఎన్నికల అబ్జర్వర్ సంజయ్‌మీనా పర్యవేక్షణలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సూచించిన ఆయా పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలకు సీలు వేసినట్లు చెప్పారు. ఆయా పార్టీల అభ్యర్థులు సూచించిన ప్రతినిధులు స్ట్రాంగ్ రూంలను చూడాలని భావిస్తే స్ట్రాంగ్ రూంలు ఉన్న భవనంలోని ఒక గదిలో సీసీ కెమెరాల మానిటర్ ఏర్పాటు చేశామని, మానిటర్లో భద్రత చర్యలను చూసుకునే వీలుంటుందన్నారు. దగ్గరుండి సీలు వేయించిన కలెక్టర్, అబ్జర్వర్.. ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలకు ఎన్నికల అబ్జర్వర్ సంజయ్‌మీనా, కలెక్టర్ ధర్మారెడ్డి దగ్గరుండి పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీలు వేయించారు. సీలు వేసే సమయంలో కలెక్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గురుకుల విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం వద్ద కరెంటు వైర్లను సరి చేయించాలని సూచించారు. ఎస్పీ చందనా దీప్తి స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత, ఇతర అంశాలపై కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి ఎన్నికల అబ్జర్వర్ సంజయ్మీనాతో చర్చించారు. ఇదిలాఉండగా స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేసిన భవనాల వద్ద ముందస్తు జాగ్రత్తగా ఒక్కో ఫైరింజన్‌ను అందుబాటులో ఉంచారు. పార్టీ ప్రతినిధులకు పత్రాలు అందజేత.. మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల వివరాలు, వినియోగించిన ఈవీఎంల వివరాలు, పోలైన ఓట్ల వివరాలతో కూడిన పత్రాలను అధికారులు శుక్రవారం పోటీలో ఉన్న అభ్యర్థులు సూచించిన ఆయా పార్టీల ప్రతినిధులకు అందజేశారు. స్ట్రాంగ్ రూంలకు సీలు వేసే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి నియమించిన ప్రతినిధులు మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ నియమించిన ఆ పార్టీ ప్రతినిధులు ఆంజనేయులుగౌడ్, మల్లేష్ ఉన్నారు. -
ధీమా అందరిది.. విజయం ఎవరిదో!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ స్థానంలో గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అంచనాల్లో వారు నిమగ్నమయ్యారు. ఒక పక్క మునుపెన్నడూ లేని విధంగా తగ్గిన పోలింగ్ శాతం దడ పుట్టిస్తున్నా.. గెలుపుపై అందరూ నమ్మకం పెట్టుకున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు చాలా మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. కనీసం 50 శాతం మార్క్‌ను కూడా అధిగమించలేదు. గ్రామీణ ఓటర్లలో మాత్రం చైతన్యం వెల్లివిరిసింది. గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం తగ్గినప్పటికీ పట్టణ ప్రాంతాల కంటే ఎక్కువగానే నమోదైంది. రెండింటి మధ్యే.. చేవెళ్ల స్థానానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ జరిగినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాలు టీఆర్ఎస్కు సానుకూలంగా ఉండగా.. ఇంకొన్ని కాంగ్రెస్‌కు అండగా నిలిచినట్లు క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి అవగతమవుతోంది. ఒకటి రెండు సెగ్మెంట్లలో బీజీపీ కూడా అధిక ఓట్లను తన ఖాతాలో వేసుకున్నట్లు అంచనా. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో చూస్తే చేవెళ్లలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. 71.05 శాతం పోలైన ఓట్లలో కాంగ్రెస్‌ది పైచేయి ఉన్నట్లు తెలుస్తోంది. రైతులు, నిరుద్యోగ ఓటర్లను కాంగ్రెస్ బాగా ఆకర్షించినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పూర్తిగా పట్టణ ప్రాంతమైన శేరిలింగంపల్లిలో పోలింగ్ శాతం గణనీయంగా పడిపోయింది. ఇక్కడ 41.80 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడి ఓటర్లలో అత్యధికులు సెటిలర్లే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వీరు టీఆర్ఎస్ వైపు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ వలస ఓటర్లందరూ ఓటేసేందుకు తమ సొంత ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. ఇక మిగిలిన వారిలో అత్యధికులు స్థానికులు. వీరిలో అధిక ఓటర్లు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు అంచనా. రాజేంద్రనగర్ సెగ్మెంట్లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నువ్వా నేనా అన్న రీతిలో పోరు నడిచినట్లు తెలుస్తోంది. ఇక్కడి సెటిలర్లలో చాలామంది తమ సొంత స్థలాలకు వెళ్లారు. ఇందులో దాదాపు టీఆర్ఎస్ సానుకూల ఓటర్లే ఎక్కువగా ఉంటారని రాజకీయ విశ్లేషకుల భావన. దీంతో టీఆర్ఎస్కు కొంతమేర గండి పడినట్లు తెలుస్తోంది. ఈ లోటును ముస్లిం ఓటర్లు భర్తీ చేసినట్లు వెల్లడవుతోంది. బహిరంగంగానే ఎంఐఎం.. టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం వల్ల వారి ఓట్లన్నీ కారు గుర్తు వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. సగం పట్టణ, మిగిలిన సగభాగం గ్రామీణంగా ఉన్న మహేశ్వరంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడినట్లు స్పష్టమవుతోంది. పట్టణ ప్రాంతవాసులు బీజీపీ పట్ల మొగ్గుచూపినట్లు ఆయా వర్గాలను బట్టి తెలుస్తోంది. పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ రీతిలో ఓట్లు దక్కడం, తాజాగా లోక్‌సభ ఎన్నికలకు రెండురోజుల ముందు ఆ పార్టీ చీఫ్ అమిత్‌షా సభ కొంత ప్రభావం పడినట్లు కనబడుతోంది. ఇక పల్లె ప్రాంతాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అనే రీతిలో ఓట్లను రాబట్టుకున్నట్లు వెల్లడవుతున్నాయి. వికారాబాద్‌లో కారు, హస్తం మధ్యం రసవత్తర పోరు నడిచినట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే వెంట నడిచేందుకు మొగ్గుచూపని నేతలు ప్రచారానికి పెద్దగా ఆసక్తి చూపనట్లు చర్చ జరుగుతోంది. దీని కారణంగా ఓట్లు హస్తం వైపు మళ్లినట్లు తెలుస్తోంది. పరిగి నియోజకవర్గంలో కారు జోరు కొనసాగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సెగ్మెంట్‌పై పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించి విస్తృత ప్రచారం చేసినట్లు క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. ఫలితంగా అధిక శాతం ఓటర్లు కారు వైపు ఉన్నట్లు వెల్లడవుతోంది. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్‌కు ఓట్లు దక్కినట్లు తెలుస్తోంది. తాండూరులో కాంగ్రెస్ గాలి వీచినట్లు వెల్లడవుతోంది. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. పైగా కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడు కావడంతో కొండా గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా హస్తానికి అధిక ఓట్లు పడినట్లు స్పష్టమవుతోంది. గ్రామీణంలో ‘స్థానికత’ అస్త్రం చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల స్థానికత అంశం బాగా పనిచేసినట్లు ఆయా వర్గాల ఓటర్లు చెబుతున్నారు. స్థానిక అభ్యర్థి అయితే తమకు అందుబాటులో ఉంటారని వారు భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక అభ్యర్థి అంశం.. ఓట్లు సాధించేందుకు కొంత అస్త్రంగా పనిచేసి ఉండొచ్చని అంచనా. ఇదే జరిగితే కాంగ్రెస్ అభ్యర్థికి కలిసిరావొచ్చు. -
భవితవ్యం భద్రం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. లోక్‌సభ పరిధిలో 11,37,231 మంది ఓట్లు వేయగా.. బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరి అంచనాల్లో వారు నిమగ్నమయ్యారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 67.9 శాతం ఓటింగ్ జరిగినట్లు తొలుత అధికారులు ప్రకటించగా.. 5గంటల తర్వాత కూడా అనేక మంది ఓటర్లు క్యూలో నిల్చోవడం.. వారంతా ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఓటింగ్ శాతం 75.16కు చేరింది. పోలింగ్ సరళినిబట్టి ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి.. తమకెన్ని ఓట్లు వస్తాయని లెక్కలేసుకుంటున్నారు. ఖమ్మం లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వాటి పరిధిలో 15,13,094 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 7,39,600 మంది, 7,73,428 మంది మహిళలు, 66 మంది ఇతరులు ఉన్నారు. వీరిలో 11,37,231 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 5,59,387 మంది పురుషులు, 5,77,812 మంది మహిళలు, 32 మంది ఇతరులు ఉన్నారు. దీంతో మొత్తం పోలింగ్ 75.16 శాతం జరిగినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఉదయం సమయంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో మొదట పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం వరకు ఓటర్లు చాలా తక్కువ మంది పోలింగ్ బూత్‌లకు వచ్చారు. అయితే ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం తర్వాత ఓటర్లు బూత్‌ల వద్దకు చేరుకున్నారు. దీంతో పోలింగ్ సమయం దాటిన తర్వాత కూడా ఓటు వేసేందుకు వచ్చిన వారు మిగిలిపోవడంతో అప్పటి వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈవీఎంలలోనే.. ఖమ్మం లోక్‌సభ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలు, వీవీ ప్యాట్లను తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. ఇక్కడ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి దశలో కేంద్ర బలగాలు, రెండో దశలో రాష్ట్రస్థాయి బలగాలు, మూడో దశలో జిల్లాస్థాయి బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. మే 23వ తేదీ వరకు స్ట్రాంగ్‌రూమ్‌లలో అభ్యర్థుల భవిష్యత్ నిక్షిప్తమై ఉంటుంది. అప్పటి వరకు అభ్యర్థుల తరఫున కూడా బందోబస్తు నిర్వహించే అవకాశం కూడా కల్పించారు. ఈసారి ఎన్నికల నిర్వహణకు, ఫలితాల ప్రకటనకు దాదాపు 40 రోజుల గడువు ఉంది. అంచనాల్లో పార్టీలు.. ఎన్నికలు ముగియడంతో వివిధ పార్టీల నాయకులు, అభ్యర్థులు అంచనాల్లో మునిగిపోయారు. పోలింగ్ సరళి ఎలా నమోదైంది.. తమ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఎక్కడ ఉంటుంది.. ఎక్కడ ఓట్లు పడలేదనే దానిపై లెక్కలు వేయడంలో అభ్యర్థులు లీనమయ్యారు. ఫలితాల వెల్లడికి ఎక్కువ రోజులు గడువు ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠతో కూడిన ఆందోళన నెలకొంది. అయితే విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలతోపాటు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, జనసేన అభ్యర్థులు పోలింగ్ సరళినిబట్టి తమకు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందనే దానిపై అంచనాలకు వస్తున్నారు. పాలేరులో అత్యధికంగా పోలింగ్.. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 75.16 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాలేరు నియోజకవర్గంలో అత్యధికంగా 82.87 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 2,16,622 మంది ఓటర్లు ఉండగా.. 1,79,518 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత మధిర నియోజకవర్గంలో 81.40 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 2,10,358 మంది ఓటర్లు ఉండగా.. 1,71,232 మంది ఓటు వేశారు. వైరాలో 79.15 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 1,83,286 మంది ఓటర్లు ఉండగా.. 1,45,077 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సత్తుపల్లిలో 77.84 శాతం ఓటింగ్ జరిగింది. ఇక్కడ మొత్తం 2,30,426 మంది ఓటర్లు ఉండగా.. 1,79,353 మంది ఓటు వేశారు. అశ్వారావుపేటలో 77.72 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 1,50,205 మంది ఓటర్లు ఉండగా.. 1,16,735 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో 66.77 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 2,28,597 మంది ఓటర్లు ఉండగా.. 1,52,641 మంది ఓటర్లు ఓటు వేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 65.63 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 2,93,600 మంది ఓటర్లు ఉండగా.. 1,92,675 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలను తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో గల స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ శుక్రవారం పరిశీలించారు. స్ట్రాంగ్‌రూమ్‌ను దగ్గరుండి సీల్ చేయించారు. అలాగే ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కూడా సందర్శించారు. స్ట్రాంగ్‌రూమ్‌కు సీల్ వేస్తున్న దృశ్యం -
పోలింగ్ తగ్గెన్.. ఓటింగ్ ముగిసెన్
సాక్షి, జగిత్యాల: లోక్‌సభ సమరం ముగిసింది. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో 70.04 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం భారీగా తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో 77.61 శాతం నమోదైంది. జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 62.53శాతం నమోదైంది. జగిత్యాల నియోజకవర్గంలో 69.20 శాతం, కోరుట్ల నియోజకవర్గంలో 68.85శాతం ఓటింగ్ నమోదైంది. ఎండ తీవ్రంగా ఉండడంతో మధ్యాహ్నం వరకే చాలా కేంద్రాలు బోసిపోయి కనిపించాయి. కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. తగ్గిన ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 77.61 శాతం పోలింగ్ నమోదుకాగా ప్రస్తుతం 70.04 శాతానికి పరిమితమైంది. ధర్మపురి నియోజకవర్గంలో అసెంబ్లీలో 78.02శాతం ఓటింగ్ జరిగితే ఈసారి 62.53, కోరుట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో 75.45 శాతం, లోక్‌సభ ఎన్నికల్లో 68.85, జగిత్యాలలో 79.35 శాతం నుంచి 69.20 శాతానికి పడిపోయింది. తగ్గిన ఓటింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుందనే చర్చ ఆసక్తిగా మారింది. మొరాయించిన ఈవీఎంలు జిల్లాలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మాక్‌పోలింగ్ నిర్వహణ జాప్యం కావడంతో పోలింగ్ సైతం ఆలస్యంగా ప్రారంభమైంది. రాయికల్ మండలం మూటపల్లి, మైతాపూర్ బూత్ నంబరు 46, పెగడపల్లిలోని 262 పోలింగ్‌కేంద్రంలో, సారంగాపూర్తోపాటు కోనాపూర్ గ్రామాల్లో 9 గంటలకు పోలింగ్ మొదలైంది. కోరుట్ల మండలం పైడిమడుగులో 114 పోలింగ్‌కేంద్రం, కోరుట్లలోని 181 ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. మల్లాపూర్తోపాటు రాఘవపేటలోని 84 పోలింగ్‌కేంద్రంలో, మల్లాపూర్ మండలం వెంకట్రావ్‌పేటలోని 59 పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు సీజ్ చేశారు. జగిత్యాల మండలం ధరూర్‌లో గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. జిల్లా కేంద్రంలోని 164 పోలింగ్‌కేంద్రంలో ఈవీఎంలు పనిచేయక 9 గంటల తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. లింగంపేటలో, మెట్‌పల్లిలోని 196 కేంద్రంతోపాటు కోరుట్లలోని కల్లూరు 141 కేంద్రాల్లో ఉదయం 9 గంటల తర్వాత పోలింగ్ మొదలైంది. జగిత్యాలలోని కొత్తవాడలో ప్రభుత్వ బాలికల పాఠశాల, జగిత్యాల మండలం కల్లెడ, పొరండ్ల గ్రామాల్లో పోలింగ్ ముగింపు సమయంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ జాప్యమైంది. కేంద్రాలు సందర్శించిన అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని బీట్‌బజార్ 192 పోలింగ్ కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత సందర్శించారు. గొల్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ సందర్శించారు. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలు స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరాయి. పటిష్ట బందోబస్తు మధ్య ఈవీఎంలను ఎన్నికల అధికారులు జిల్లా కేంద్రంలోని వీఆర్కే కళాశాలకు తరలించారు. ఓటింగ్ ముగియడంతో నిజామాబాద్ స్థానం నుంచి బరిలో ఉన్న 185 మంది అభ్యర్థుల భవితవ్యం ఇప్పు డు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఈ ఎన్నికపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజా తీర్పు మే 23న వెలువడనుంది. -
ఈవీఎంలలో దాగిన భవితవ్యం
సాక్షి, మహబూబాబాద్: లోక్‌సభ ఎన్నికలు గురువారం ముగియటంతో అందరి దృష్టి ఫలితాలపై పడింది. ఈవీఎంలలో ఎంపీ అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. మే 23వ తేదీ గురువారం రోజున కౌంటింగ్ జరగనుంది. ఫలితాల పై అభ్యర్థులతో పాటు ప్రజల్లో కూడా ఉత్కంరత నెలకొంది. గెలుపు ఎవరిని వరిస్తుందో అంచనాలకు అందడం లేదు. ఓటింగ్ శాతం అనూహ్యంగా తగ్గటంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. మానుకోట పార్లమెంట్ నియోజకవర్గంలోని పోలింగ్ 1737 కేంద్రాల్లో జరిగింది. సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం, వీవీప్యాట్)లను పోలింగ్ కేంద్రాల నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అలాగే సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాల పైనే చర్చ జరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ ఎంపీ అభ్యర్థులు పోలింగ్ సరళిని విశ్లేషించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు గతంలోలాగా కాకుండా వేరువేరుగా రావటంతో, పోలింగ్ శాతం తగ్గవచ్చని రాజకీయ పార్టీలు అంచనా వేశాయి. అంచనాలకు అనుగుణంగా పోలింగ్ శాతం గతంలో కంటే తగ్గింది. దీంతో ఓటింగ్ ప్రభావాన్ని విశ్లేషించుకునేందుకు ఎంపీ అభ్యర్థులు పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్ల లెక్కలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రేపు, ఎల్లుండి ప్రధాన పార్టీల రాజకీయ పార్టీల అభ్యర్థులు పార్టీ ముఖ్యనాయకులు, బూత్ కన్వీనర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు. ఈ సమావేశంలో ఓటింగ్ తీరు తెనులతోపాటు పార్టీ విజయావకాశాలను ఎంపీ అభ్యర్థులు విశ్లేషించుకోనున్నారు. -
ఆగుతూ.. సాగుతూ పోలింగ్
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలకు పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. చెదురు ముదురు టనలు మినహా పోలింగ్ సజావుగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. అధికారులు సమస్యాత్మకంగా గుర్తించిన జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 4గంటలకే ముగియగా.. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అరగంట నుంచి గంట ఆలస్యం పోలింగ్ ప్రారంభం సమయంలో వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో అక్కడక్కడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) మొరాయించడంతో అరగంట నుంచి గంటన్నర ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. దీంతో చాలాచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. అయితే, నిర్ణీత సమయం లోగా కేంద్రాలకు వచ్చిన వారందరూ ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. కాగా వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో జరిగిన పోలింగ్ వివరాలను గురువారం రాత్రి అధికారులు వెల్లడించారు. వరంగల్ లోక్‌సభ పరిధిలో 60.41 శాతం, మహబూబాబాద్‌లో 64.46 శాతంగా నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల పేరిట విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కాగా, గత ఎన్నికలతో పోలిస్తే ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ పోలింగ్ శాతం భారీగా తగ్గడం గమనార్హం. మందకొడిగా ప్రారంభమై.. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో అన్ని చోట్లా ఉదయం ఏడు గంటలకు మందకొడిగా మొదలైన పోలింగ్ 9 గంటల తర్వాత పుంజుకుంది. చాలాచోట్ల ఈవీ ఎంలు మొరాయించడం కారణంగా ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ముగిసే సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న ఉన్నవారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. సమస్యాత్మక నియోజకవర్గం భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 4 గంటలే కాగా, మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడా రాత్రి వరకు పోలింగ్ కొ నసాగించారు. సాయంత్రం 5 గంటల వరకు వరంగల్ పార్లమెంట్ పరి«ధిలో 60.41 శాతం, మహబూబాబాద్ పరిధిలో 64.46 శాతంగా పోలింగ్ నమోదైనట్లు రాత్రి 10.30 గంటలకు ఆయా జిల్లాల రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. మొరాయించిన ఈవీఎంలు అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు ఆలస్యం జరిగినా... మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అధికారులు ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఓటర్లకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం కంఠాత్మకూరు, చిల్పూరు మండలం మల్కాపూర్, హసన్‌పర్తి మండలం మడిపెల్లి, వరంగల్ 27వ డివిజన్ ఏవీవీ కళాశాల పోలింగ్ బూత్ 87, పర్వతగిరి మండలం చింతనెక్కొండలో 238, ఆత్మకూరులో 105 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు చాలాసేపు మొరాయించాయి. మహబూబాబాద్ లోక్‌సభ పరిధి నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం కొనపురం బూత్ నెంబర్ 195, బొజేరువులో 221 పోలింగ్ కేంద్రాల్లోను ఈవీఎంలు మొరాయించాయి. వీటితో పాటు చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించగా.. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు పరిస్థితులను చక్కదిద్ది పోలింగ్ సజావుగా సాగేలా చూశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆయా జిల్లాల పోలీసు కమీషనర్లు, ఎస్పీలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, తదితర ప్రాంతాల్లోని సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక పోలీసు బలగాలు పహారా కాశాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని ప్రాంతాలు, సమస్యాత్మక గ్రామాల్లో గస్తీ బందాలు, స్రైకింగ్ ఫోర్సు, పోలీసుల పహారా పెంచారు. ఓటేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఎస్పీలు గురువారం తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున, కుమారుడు, కూతురు, కోడలుతో కలిసి వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన సతీమణి ఉషా దయాకర్ పర్వతగిరిలో ఓటేశారు. ఇక రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఆయన కుమారుడు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్ వారి స్వగ్రామం హుజూరాబాద్ మండలం సింగాపురంలో ఓటు వేశారు. హన్మకొండ టీచర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కుటుంబసభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.బొల్లికుంటలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్, కుటుంబ సభ్యులు, నక్కలగుట్ట వాటర్‌ట్యాంక్ బూత్‌లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కుటుంబసభ్యులు, వడ్డెపల్లి ప్రభుత్వ పాథమిక పాఠశాలలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, కుటుంబసభ్యులు, వరంగల్ పెరుకవాడలో తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ కుటుంబీకులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ట్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, జాయింట్ కలెక్టర్ దయానంద్, హన్మకొండలో వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత, జులైవాడలోని ఎస్టీ హాస్టల్ పోలింగ్ బూత్‌లో టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు ఓటు వేశారు. గణనీయంగా తగ్గుదల 2014 సాధారణ ఎన్నికల పోలింగ్‌తో పోలిస్తే ఈసారి గణనీయంగా తగ్గింది. వరంగల్ లోక్‌సభ పరి«ధిలో 2014లో 76.56 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 63.08 శాతానికే పరిమితమైంది. అంటే 13.48 శాతం పోలింగ్ తగ్గినట్లు. అదే విధంగా మహబూబాబాద్ లోక్‌సభకు 2014లో 82.81 శాతం పోలింగ్ జరగగా, ఈసారి 13.70 శాతం తగ్గి 69.11 శాతానికే పరిమితమైంది. కాగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో తొలుత పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఆ తర్వాత క్రమంగా పుంజుకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ తీరును ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఎన్నికల పరిశీలకులు వీణా ప్రదాన్, అమిత్‌కుమార్ సింగ్‌లు పలు కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రశాంత్ జీవన్ పాటిల్, శివలింగయ్య, కలెక్టర్లు హరిత, వినయ్‌కృష్ణారెడ్డి, వాసం వెంకటేశ్వర్లులు పోలింగ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. -
మందకొడిగా సాగిన ఓటింగ్ ప్రక్రియ
సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన పోలింగ్ (2019 సార్వత్రిక ఎన్నికలకు సబంధించి) తొలుత మందకొడిగా ప్రారంభమైంది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహించారు. దీంతో ఓటర్లు అక్కడక్కడ కొంత తడపడ్డారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉదయం నుంచి సాయింత్రం వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు పూర్థి స్థాయిలో వసతులు కల్పించలేకపోయారు. ఎండ ఎక్కువగా ఉన్నందున ఓటర్లు ఇబ్బందిపడ్డారు. కొంతమంది ఇళ్లకు వెళ్లి సాయంత్రం వచ్చి ఓటు వేశారు. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడం, వీవీప్యాట్లు పనిచేయకపోవడం వంటి సమస్యలతో ఓటర్లు విసిగి ఇళ్లకు వెళ్లిపోయారు. అధికార పార్టీ ఆగడాలు పలుచోట్లు అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు వివాదాలకు దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని గుర్తించిన చోట ఘర్షణలకు తెరలేపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు సంయమనం పాటించి ఓటింగ్‌కు సహకరించారు. పలుచోట్ల ఆలస్యంగా ప్రారంభం ప్రారంభంలో ఓటింగ్ చాలా మందకొడిగా సాగింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చినా అక్కడ ఓటింగ్ యంత్రాలు ఇబ్బంది పెట్టడంతో చాలామంది ఓటు వేయకుండానే వెనుదిరిగారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. జిల్లాలో సుమారుగా 357 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటలకు ఇరత మిషన్లు సమకూర్చడం జరిగినా, అప్పటికే ఎండలు ప్రారంభం కావడంతో ప్రధానంగా వృద్ధులు, మహిళలు ఓటు వేసేందుకు రాలేదు. పది నుంచి మూడు గంటల వరకు తక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సరళి ఇలా.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 11 గంటల వరకు కేవలం 19.78 శాతం మాత్రమే నమోదు అయింది. పది గంటల నుంచి పలుచోట్ల ఈవీఎంలు పనిచేయడంతో ఒంటి గంటకు 37.92 శాతానికి చేరింది. మూడు గంటలకు 52.11 శాతానికి చేరింది. నాలుగు గంటలకు 59.18 శాతం 5 గంటలకు 63.77 శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం ఆరు గంటల తర్వాత జిల్లాలో 186 కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. రాత్రి ఎనిమిది గంటల వరకు 45 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. -
ప్రకాశంలో ఓటెత్తిన జనం
ఊరు వాడా కదిలొచ్చింది. ప్రజా చైతన్యం ఓటెత్తింది. పూటకో మాట, రోజుకో వేషం వేసే వంచన రాజకీయానికి..అవినీతి, అక్రమాలతో జనాన్ని దోచుకుని నిరంకుశ పాలన సాగించిన నేతల దాష్టీకానికి చరమగీతం పాడేందుకు ముందుకొచ్చింది. దగాపడిన బడుగు జీవుల తలరాతను మార్చే నేత కోసం.. మార్పు కోసం.. విశ్వసనీయతకు పట్టం కట్టేందుకు జనం తరలివచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, యువత ఓపిగ్గా గంటల తరబడి క్యూలలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాక్షి, ఒంగోలు సిటీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గురువారం జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తారు. స్వచ్ఛందంగా ఓటు వేసుకోవడానికి కేంద్రాల వద్ద బారులుతీరారు. ఈవీఎంల ఓటింగ్ సజావుగా సాగింది. అక్కడక్కడా చెరుదుమదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ వినయ్‌చంద్, బాపట్ల రిటర్నింగ్ అధికారి ఎస్.నాగలక్ష్మిలు పోలింగ్ సజావుగా జరిగేలా పర్యవేక్షించారు. వీరు మధ్యలో కొన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి లైవ్ టెలికాస్ట్ అనుసంధానం కావడంతో జిల్లా ఎన్నికల అధికారి మీడియా సెంటర్ నుంచి పరిశీలించారు. అక్కడికక్కడే సంబంధిత రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోటెత్తిన ఓటర్లు జిల్లాలో మొత్తం 26,32,407 మంది ఓటర్లు ఉన్నారు. 3269 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్‌ను ప్రారంభించారు. ఏజెంట్లు, అధికారులు ఉదయం మాక్‌పోలింగ్‌లో పాల్గొన్నారు. సుమారు 300 పోలింగ్ కేంద్రాల్లో మాక్‌పోలింగ్ సమయంలోనే సమస్యలు వచ్చాయి. కొన్ని కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు మరి కొన్ని కేంద్రాల్లో 9 గంటలకు కొలిక్కి వచ్చాయి. ఒంగోలు కేంద్రంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద మాక్ పోలింగ్ మూడు గంటల ఆలస్యంగా మొదలైంది. అప్పటి దాకా ఓటర్లు ఓపికగా వేచి ఉన్నారు. జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం - 85.82 శాతం నియోజకవర్గం నమోదైన పోలింగ్ శాతం వై పాలెం 86.4 చీరాల 83.98 మార్కాపురం 85.31 దర్శి 90.54 కొండపి 83.29 పర్చూరు 87.28 గిద్దలూరు 82.22 ఎస్.ఎన్.పాడు 85.7 కనిగిరి 82.51 ఒంగోలు 82.09 కందుకూరు 89.66 అద్దంకి 90.06 మొరాయించిన ఈవీఎంలు పోలింగ్ మొదలు కావడంతోనే ఈవీఎంలు మొరాయించాయి. జిల్లా వ్యాప్తంగా 154 పోలింగ్ కేంద్రాల్లో ఈ సమస్య వచ్చింది. కొన్ని కేంద్రాల్లో వెంటనే ఈవీఎంలను పునరుద్ధరించారు. ఒంగోలు కేంద్రంలోని బండ్లమిట్ట కేంద్రంలో ఈవీఎంలు పని చేయకపోవడంతో వెంటనే వేరొక ఈవీఎంలను తెప్పించారు. వాటిని అనుసంధానం చేసిన తర్వాత పీవో తడబాటుతో తప్పులు చేయడంతో 138 పోలింగ్ కేంద్రంలో రెండు గంటల పాటు పోలింగ్ నిలిచింది. ఓటర్లలో అసహనం ఎదురై సిబ్బందిపై తిరగబడ్డారు. పోలీసులు కల్పించుకోవడంతో గొడవ సద్దుమణిగింది. జిల్లా వ్యాప్తంగా మొరాయించిన ఈవీఎంలు పోలింగ్ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన ఈవీఎం యంత్రాలు చాలా చోట్ల మొరాయించాయి. దీంతో రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఒంగోలు రామ్‌నగర్ రెండోలైన్లోని 167 పోలింగ్ బూత్‌లో ఉదయం 9 గంటల వరకు ఈవీఎంలు పనిచేయలేదు. ఇక్కడే ఓటు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి చాలా సేపు ఓటు వేసేందుకు వేచి చూడాల్సి వచ్చింది. ఉదయం 6 గంటల నుంచే క్యూలైన్లో నిలుచున్న ఓటర్లు ఈవీఎంలు పనిచేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యర్రగొండపాలెం పోలింగ్‌బూత్ నెం 59 నర్సాయపాలెంలో ఉదయం 9.30 గంటల వరకు ఈవీఎంలు పనిచేయలేదు. త్రిపురాంతకం పోలింగ్‌బూత్ నెం. 122లోనూ ఇదే పరిస్థితి. గిద్దలూరు నియోజకవర్గంలో దద్దవాడ పోలింగ్ బూత్ నం. 251, 252లలో ఉదయం 9.30 గంటల వరకు ఈవీఎంలు పనిచేయలేదు. కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం గంగపాలెం పోలింగ్ బూత్ నం.51లో రెండు గంటల పాటు ఈవీఎంలు పనిచేయలేదు. సంతనూతలపాడు నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నెం. 204 ఉప్పలపాడులో ఈవీఎంలు పనిచేయలేదు. ఇవే కాకుండా జిల్లా వ్యాప్తంగా వందకు పైగా పోలింగ్ బూత్‌ల్లో ఉదయం రెండు గంటల పాటు ఈవీఎంలు పనిచేయలేదు. మిగిలిన చోట్ల సైతం ఈవీఎంలు తరుచూ ఆగిపోతూ ఓటర్లను ఇబ్బందులకు గురి చేశారు. క్రమంగా పెరిగిన ఓటింగ్ శాతం: గత ఎన్నికల్లో 84 శాతం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో దానికన్నా ఎక్కువగా పోలింగ్ జరిగింది. పోలింగ్ ఆలస్యంగా మొదలైనా జిల్లాలో ఓటింగ్ నెమ్మదిగా ఊపందుకుంది. మొదటి రెండు గంటల వ్యవధిలో జిల్లా సరాసరి పోలింగ్ శాతం 9 గంటలకు 7.96గా నమోదైంది. 11 గంటలకు 22 శాతం, ఒంటి గంటలకు 41.48 శాతం, 3 గంటలకు 56.47 శాతం, 5 గంటలకు 63.36 శాతం నమోదైంది. 6 గంటల వరకు క్యూలో ఉన్న వారు పూర్తిగా ఓటేసేవరకు పోలింగ్ కొనసాగింది. మీడియా కేంద్రం నుంచి పర్యవేక్షణ ఒంగోలు ప్రకాశం భవన్‌లోని మీడియా కేంద్రం నుంచి జిల్లా ఎన్నికల అధికారి వినయ్‌చంద్, బాపట్ల ఆర్వో ఎస్.నాగలక్ష్మి పర్యవేక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 95 ఫిర్యాదులు హెల్ప్ లైన్, ఫిర్యాదుల విభాగానికి అందాయి. వీటిలో మొదటి రెండు మూడు గంటల వరకు ఈవీఎంల సమస్య, ఆ తర్వాత పోలింగ్ అక్రమాలు, సాయంత్రం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తల దురాగతాలపై ఫిర్యాదులు అందాయి. వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. మర్రిపూడి మండలం శివరాయునిపేటలో టీడీపీ ఏజెంటు వేము రమేష్‌కు పీవో మాల్యాద్రి పోలింగ్ సమయంలో సహకరిస్తున్నట్లుగా జిల్లా ఎన్నికల అధికారి మానిటరింగ్‌లో చూశారు. స్వయంగా ఆయనే గుర్తించినందున పీవోపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వేరొక పీవోకు విధులను కేటాయించారు. వైఎస్సార్ సీపీదే విజయం మీడియాతో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈవీఎం రాజకీయాన్ని చేయాలన్న కుట్రతో ఉన్నారని అన్నారు. ప్రజలు సైకిల్‌కు ఓటు వేస్తుంటే టెక్నికల్‌గా ఫ్యాను గుర్తుకు పడ్తున్నాయని చెప్పడం ఆయన అవివేకమని అన్నారు. వైఎస్సార్ సీపీకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. జిల్లాలోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలుపు సాధిస్తారని అన్నారు. ముగిసిన పోలింగ్ పర్వం ఒంగోలు అర్బన్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం సజావుగా ముగిసింది. సాయంత్రం 6గంటలకు క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అనుమతించారు. గత ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 84.25 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో గత ఎన్నికలతో పోలిస్తే ఓటర్లు దాదాపు ఒకటిన్నర లక్ష మంది పెరిగారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లు కొన్నిచోట్ల రాత్రి 11 గంటల తరువాత కూడా ఓటు వేశారు. మొత్తం పోలింగ్ ముగిసే సరికి 85.82 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా అధికారులు వెల్లడించారు. సరైన శిక్షణ లేకనే.. పోలింగ్ సమయంలో అనుసరించాల్సిన అంశాలపై సరైన శిక్షణ లేనందు వల్ల సిబ్బంది తడబడ్డారు. పీవోలు ఓటర్ల సహనాన్ని పరీక్షించారు. ఉదయం ఏడు గంటలకల్లా పోలింగ్ కేంద్రాలకు వచ్చేశారు. అప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కొన్ని కేంద్రాల్లో మాక్ పోలింగ్ పూర్తి కాకపోవడంతో ఓటర్లు గంటల కొద్ది నిల్చుండిపోయారు. పోలింగ్ సిబ్బందికి సరైన అవగాహన లేక మాక్‌పోలింగ్ చేసిన తర్వాత ఈవీఎం ఫార్మెట్లను ఒక సారికి బదులు రెండు పర్యాయాలు, ఇలా పలురకాల తప్పులు చేయడం వల్ల తిరిగి సీలు వేసిన ఈవీఎంలకు సీలు తొలగించి మొదటి నుంచి ఈవీఎంను సిద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలింగ్ రెండు నుంచి మూడు గంటల ఆలస్యంగా మొదలైంది ఓటు హక్కు ఉపయోగించుకున్న అభ్యర్థులు ♦ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన సతీమణి బాలినేని శచీదేవి, తనయుడు బాలినేని ప్రణీత్రెడ్డిలతో కలిసి లాయరుపేట వద్ద ఉన్న ఎస్ఎస్ఎన్ జూనియర్ కాలేజీలో తమ ఓటు వేశారు. ♦ ఒంగోలు వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులురెడ్డి తన కుటుంబ సభ్యులతో రాంనగర్ రెండో లైనులోని మున్సిపల్ హైస్కూలులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ♦ ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గద్దలగుంట పోలేరమ్మ దేవస్థానం వీధిలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ♦ తెలుగుదేశం అభ్యర్ధి శిద్దా రాఘవరావు తన కుటుంబ సభ్యులతో ఒంగోలు ఎస్ఎస్ఎన్ జూనియర్ కళాశాల పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ♦ తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్ధి దామచర్ల జనార్దన్ ఒంగోలు రాంనగర్ హైస్కూలులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ♦ జనసేన పార్లమెంట్ అభ్యర్థి బెల్లంకొండ సాయిబాబా కంభం మండలం తురిమెళ్లలో ఓటు వేశారు. ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి రియాజ్ ఒంగోలులో ఓటు వేశారు. ♦ కలెక్టర్ వినయ్‌చంద్ డీఆర్ఆర్ఎం పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జేసీ ఎస్.నాగలక్ష్మి ఈ కేంద్రంలోనే ఓటు వేశారు. -
స్టాంగ్ రూంల వద్ద ఆర్మీతో భద్రత కల్పించాలి: గూడూరు
సాక్షి, హైదరాబాద్: ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద ఆర్మీ లేదా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కౌంటింగ్‌కు మరో 42 రోజుల గడువున్న నేపథ్యంలో ఈవీఎంలు ఎలాంటి ట్యాంపరింగ్‌కు గురికాకుండా భద్రంగా ఉండేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి గురువారం ఓ ప్రకటనలో కోరారు. స్ట్రాంగ్ రూంలలోకి స్థానిక పోలీసులకు ప్రవేశం కల్పించవద్దని, భద్రతను సమన్వయం చేసే బాధ్యత మాత్రమే వారికి అప్పగించాలన్నారు. హైసెక్యూరిటీ జామర్లను స్ట్రాంగ్‌రూంల వద్ద ఏర్పాటు చేయాలని, ఎన్నికల ప్రక్రియ నిర్వహించిన అన్ని పోలింగ్ బూత్‌లు, స్ట్రాంగ్ రూంల సీసీటీవీ ఫుటేజీని భద్రపర్చాలన్నారు. ఈ ఎన్నికల్లో ఉపయోగించని ఈవీఎంలను ఇతర రాష్ట్రాలకు తరలించాలని, లేదంటే సీజ్ చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరు, ట్యాంపరింగ్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చినందున ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ కేడర్‌తో స్ట్రాంగ్‌రూంల వద్ద విజిలెన్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ కేడర్ అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే టీపీసీసీ నాయకత్వానికి తెలియపర్చాలని కోరారు. -
ఏపీలో రీపోలింగ్‌పై నేడు నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోసున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాల్సిన ఆవశ్యకతపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీనిపై ఎన్నికల సంఘం పరిశీలకులు శుక్రవారం ఉదయం పరిశీలిస్తారని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సం ఘం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా గురువారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ఏపీలో పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయని, హింసాత్మక సంఘటనల్లో ఒకరు మృతి చెందారని తెలిపారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు దేశవ్యాప్తంగా 15 నమోదవ్వ గా.. అందులో 6 ఏపీలో అయ్యాయన్నారు. వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామ న్నారు. ఏపీలో కొన్నిచోట్ల ఈవీఎంల రీప్లేస్మెంట్ చేయడానికి కొంత సమయం పట్టినట్టు చెప్పారు. ఏపీలో 0.98 శాతం బ్యాలెట్ యూనిట్లను, 1.04 శాతం కంట్రోల్ యూనిట్లను, 1.6 శాతం వీవీ ప్యాట్లను రీప్లేస్ చేసినట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల పరిశీలకులు పోలింగ్ స్టేషన్లవారీగా పరిశీలన జరిపి రీపోలింగ్ ఆవశ్యకతపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారని వివరించారు. దాన్నిబట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరగగా, ప్రారంభంలో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మొత్తంగా 70 శాతం వరకు పోలింగ్ నమోదైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మండుటెండలను కూడా లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారుల తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే నగరంలోని సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో పోలింగ్ మందకొడిగా సాగింది. 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి బూత్‌లో 12 ఈవీఎంలను వినియోగించారు. తెలంగాణ వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా.. నిజామాబాద్‌లో 6 గంటల వరకు కొనసాగింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల యత్రాంగం ఊపిరి పీల్చుకుంది. -
‘ఈవీఎంలో కాంగ్రెస్ బటన్ పనిచేయడం లేదు’
శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మరో ఐదేళ్ల పాటు తమ భవిష్యత్తును నిర్ణయించే నేతలను ఎన్నుకునేందుకు ప్రజలంతా పోలింగ్ సెంటర్ల ముందు బారులు తీరారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఈవీఎంలు మోరాయించడంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈవీఎంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు బటన్ పని చేయడం లేదని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో కాంగ్రెస్ బటన్ పని చేయలేదని ఆయన తెలిపారు. ఈ క్రమంలో స్థానిక మీడియాలో ప్రసారం అయిన వార్తను ఆయన తన ట్వీటర్లో షేర్ చేశారు. Congress symbol button not working in Poonch polling stations ||Mangnar ... https://t.co/g9f6q4Phw4 via @YouTube — Omar Abdullah (@OmarAbdullah) April 11, 2019 ఈ సంఘటన షాపూర్ పోలింగ్ స్టేషన్లో చోటు చేసుకుంది. వీడియోలో పోలింగ్ అధికారి ఈ విషయంపై స్పందిస్తూ.. ‘ఈవీఎంలోని 4వ నంబర్ హస్తం గుర్తు బటన్ పని చేయడం లేదు. ఈ కారణంగా పోలింగ్‌కు ఆలస్యం అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. బటన్ పని చేయకపోవడానికి గల కారణాలు తెలియదు’ అని పేర్కొన్నారు. అయితే పలు నియోజకవర్గాల్లో ఇదే సమస్య తలెత్తిందని ఓటర్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో పూంచ్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన జుగల్ కిషోర్ విజయం సాధించాడు. ఈ సారి ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. -
ఈవీఎంలో లోపాలు.. ఈసీ కీలక ప్రకటన
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పోలింగ్‌కు సంబంధించిన దుష్ప్రచారాలను నమ్మొద్దని కోరింది. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలైన్లో వేచి ఉన్నారని, దీంతో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఓటర్లు ఎటువంటి పుకార్లు నమ్మవద్దని, ఈవీఎంలలో సాంకేతిక లోపాలను సాంకేతిక సిబ్బంది పరిష్కరించారని తెలిపారు. సక్రమంగా కనెక్షన్లు ఇవ్వకపోవడంవల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు. ప్రతి ఓటరూ తప్పనిసరిగా ఓటు వేయాలని, సాయంత్రం ఆరుగంటల వరకు క్యూలైన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని ద్వివేది తెలిపారు. పలుచోట్ల ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయని, ఆ సమస్యలను చాలావరకు సరిదిద్దామని, అన్నిచోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నందున.. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌లకు తరలివచ్చి ఓటు వేయాలని ఈసీ విజ్ఞప్తి చేసింది. ఈవీఎంలలో తలెత్తిన సాంకేతిక సమస్యలను ఎక్కడిక్కడ అధిగమించడానికి ఈసీ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం 45,900 ఈవీఎంలు వినియోగిస్తున్నారు. ఇందులోని కేవలం 362 ఈవీఎంలలోనే స్వల్ప సాంకేతిక సమస్యలు తలెత్తాయి. లోపాలు తలెత్తిన 310 ఈవీఎంలను అధికారులు అప్పటికప్పుడు సరిచేశారు. 52 చోట్ల సాంకేతికంగా సమస్యలు తలెత్తిన ఈవీఎంలను మార్చామని, ప్రజలు ఏమాత్రం సంకోచించకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ ఓటర్లను కోరింది. -
వెల్లువెత్తిన చైతన్యం.. ఓటరుకు వందనం!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఉయదం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్దసంఖ్యలో బారులు తీరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రజలు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఉత్సాహం కనబరుస్తున్నారు. మధ్యాహ్నం సమయానికి ఎండ తీవ్రత పెరిగే అవకాశముండటంతో ఉదయాన్నే ఓటు వేసేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడం.. ఓటింగ్‌పై ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని చాటుతోంది. కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపు.. ఓటు వేసేందుకు, ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహం కనబరుస్తున్నా.. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లకు తిప్పలు తప్పడం లేదు. ఉదయం 9.30 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు.. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం హుస్సేన్‌పురం పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు బూత్ నంబర్ 197లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం పనిచేయడం లేదు. ఇదే జిల్లాలోని చింతలపూడిలో 153 బూత్‌లో ఈవీఎం లు పనిచేయకపోవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. జిల్లాలోని పాలకొల్లు మండలం వెలివెలి గ్రామంలోని 161వ పోలింగ్ బూత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం పనిచేయడం లేదు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈవీఎంలు పనిచేయడం లేదు. తాడేపల్లిలోని 10 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ బూగ్ నంబర్లు 20,24,26, 39,27, 51, 54, 69 లో ఈవీఎంలు పనిచేయడం పనిచేయడం లేదు. శృంగవరపుకోట నియోజకవర్గం, కొత్తవలస మండలం లో 214, 210 పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించాయి. విజయనగరం జిల్లా సీతాపురం మండలం గెడ్లలుపిలోని 105 పోలింగ్ బూత్‌లో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. ఇక, శ్రీకాకుళం జిల్లాలో పెద్ద సంఖ్యలో ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈవీఎంలు మొరాయించడంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో 51 పోలింగ్ కేంద్రాల్లో, పాతపట్నంలో 72, టెక్కలిలో 49 పోలింగ్ బూత్‌ల్లో పోలింగ్ నిలిచిపోయింది. -
ఓటర్లతో కలిసి ఆర్కే ధర్నా
సాక్షి, గుంటూరు : ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మంగళగిరి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రారంభమై రెండున్నర గంటలు అయినా ఇంకా పలు బూత్ ల్లో పోలింగ్ ప్రారంభం కాకపోవటం పై అసహనం వ్యక్తం చేసారు. అనేక మంది ఓటర్లు చాలా సేపు నిరీక్షించి తిరిగి వెనక్కు మళ్ళుతున్నారు. ఈవీఎంలు పనిచేయకపోవడంపై ఆర్కే ఎన్నికల అధికారులను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అధికారుల తీరుకు నిరసనగా ఆర్కే ధర్నాకు దిగారు. నియోజకవర్గంలోని దాదాపు 60 ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కొని చోట్ల ఇప్పటి వరకు పోలింగ్ మొదలు కాలేదన్నారు. ఎండకు తట్టుకోలేక ముందుగానే ఓటు వేద్దామని వచ్చిన ఓటర్లు ఈవీఎంలు పనిచేయకోవడంతో వెనుతిరిగి పోతున్నారన్నారు. మాక్ పోలింగ్ సమయంలో పనిచేసిన ఈవీఎంలు ఇప్పుడు పనిచేయకకోవడం పట్ల అనుమానాలు ఉన్నాయన్నారు. వైఎస్సా సీపీకి ఓట్లు పడే చోట ఈవీఎంలు పనిచేయకుండా చేశారని ఆరోపించారు. లోకేష్ ఓడిపోతారనే ఉద్దేశ్యంతోనే ఈవీఎంలు పనిచేయకుండా చేస్తున్నారనే అనుమానం ఉందన్నారు. అధికారుల తీరు పై ఆర్కే తో పాటుగా ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండకు తట్టుకోలేక ఉదయాన్నే ఓటు వేద్దామని వస్తే ఇప్పటి వరకు బయటటే నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేయడానికి వస్తే ఈవీఎంలు పనిచేయడం లేదంటే ఎలా అని ప్రశ్నించారు. -
యంత్రంలో ఓటు మంత్రం
సాక్షి, నరసరావుపేట : ఎన్నికల సమరంలో పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అందులోనూ గతంలో మాదిరి బ్యాలెట్ ఓటింగ్ కాకుండా.. ఈవీఎం, వీవీప్యాట్ల ద్వారా ఓటు వేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిలో ఓటు ఏలా వేయాలో తెలుసుకుందాం. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశం మీరు పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్లేసరికి ప్రిసైడింగ్ అధికారి మీ బ్యాలెట్‌ను సిద్ధంగా ఉంచుతారు. ఓటు వేయడం ఇలా బ్యాలెట్ యూనిట్(ఈవీఎం)పైన మీకు నచ్చిన అభ్యర్థి పేరు, ఫొటో, గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు(బ్లూ) బటన్‌ను గట్టిగా నొక్కాలి. సిగ్నల్ : ఓటు వేసినప్పుడు మీరు ఎంచుకున్న అభ్యర్థి పేరు, గుర్తుకు ఎదురుగా ఎర్రలైట్ వెలుగుతుంది. ప్రింట్‌ను చూడండి ప్రింటర్– మీరు ఎన్నుకున్న అభ్యర్థి సీరియల్ నంబర్, పేరు, ఫొటో, గుర్తుతో ఓ బ్యాలెట్ స్లిప్ ప్రింట్‌ను వీవీప్యాట్‌లో చూడవచ్చు. గమనించాల్సిన విషయం ఒక వేళ మీకు బ్యాలెట్ స్లిప్ కనిపించకపోయినా, బీప్ శద్ధం గట్టిగా వినిపించకపోయినా ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించవచ్చు. ఓటు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటేయొచ్చు! ఓటర్ జాబితా సవరణతో కొత్తగా ఓటర్‌గా నమోదైన వారికి సైతం ఇటీవల గుర్తింపు కార్డులు వచ్చాయి. అయితే ప్రస్తుత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండీ గుర్తింపు కార్డు లేదని బాధపడుతున్నారా! ఇప్పుడు ఆ చింత అవసరం లేదు. ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇవి ఉంటే సరి.. డ్రైవింగ్ లైసెన్సు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఆధార్‌కార్డు, ఫొటోతో ఉన్న బ్యాంక్ పాస్‌పుస్తకం, పోస్టాఫీసులు జారీ చేసిన ఫొటోతో ఉన్న పాస్‌బుక్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, పింఛన్‌కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు .. ఇలా వీటిల్లో ఏదో ఒక దానిని చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. చాలెంజ్ ఓటు.. ఏప్రిల్ 11 2019ఓటరు గుర్తింపు విషయంలో అధికారులకు సందేహం కలిగినా, ఏజెంట్లు అభ్యంతరం చెప్పినా సదరు ఓటర్ తన గుర్తింపును చాలెంజ్ చేసి రుజువు చేసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతని పేరు తప్పు చెబుతున్నాడని ఏజెంట్ అభ్యంతరం చెబితే ఓటర్ను.. ఏజెంట్‌ను ప్రిసైడింగ్ అధికారి వద్దకు పంపుతారు. అభ్యంతరం చెప్పిన ఏజెంట్ నుంచి రూ. 2 చాలెంజ్ ఫీజుగా తీసుకుంటారు. అప్పుడు ఓటర్ వద్ద ఉన్న ఇతర గుర్తింపు వివరాలు అధికారులు పరిశీలిస్తారు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే బీఎల్ఓను పిలిచి అతడు స్థానిక ఓటరా కాదా అనే విషయం.. పేరు, తండ్రి పేరు లాంటి వివరాలు తెలుసుకుంటారు. అతడు స్థానిక ఓటరై, జాబితాలో ఉన్న పేరు వాస్తవం అయితే వయన్సు, తండ్రి పేరు, చిరునామా లాంటి విషయాల్లో తేడా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఏజెంట్, ఓటరు ఇద్దరిలో ఎవరి వాదన సరైందని తేలితే వారిని వదిలి మిగతా వారికి ప్రిసైడింగ్ అధికారి మొదటిసారి హెచ్చరిక జారీ చేస్తారు. లేదా ఏజెంట్‌ను, ఓటరును పోలీసులకు అప్పగించవచ్చు. -
విజయవాడలో మందకొడిగా పోలింగ్
సాక్షి, విజయవాడ : ఈవీఎంలు మొరాయించడం వల్ల విజయవాడలోని పలు పోలింగ్ బూత్‌లలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. పలు చోట్ల ఓటర్లు పోలింగ్ లైన్లలో బారులు తీశారు. ఓటు వేయడానికి వచ్చిన వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఎలక్షన్ కమిషన్ చెప్పినదానికి, చేసేదానికి సంబంధం లేదంటూ ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. బూత్లకి ఓటర్ స్లిప్పులను ఇవ్వడానికి కూడా అధికారులు రాలేదు. నగర వ్యాప్తంగా పోలీసు కొరత కూడా ఉంది. ఒక్కో పోలింగ్ స్టేషన్లో కేవలం ఇద్దరు పోలీసులు మాత్రమే ఉన్నారు. ఏ బూత్‌లో ఓటు వేయాలో చెప్పడానికి సిబ్బంది అందుబాటులో లేకపోవడం గమనార్హం. -
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, కామారెడ్డి: పార్లమెంటు ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 101 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. వాటిని వెబ్‌కాస్టింగ్ చేస్తున్నాం. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు’ అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ అన్నారు. ఈ నెల 11న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ను ‘సాక్షి’ ఇంట ర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేని విధంగా పక్కా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేశామన్నారు. జిల్లాలో 16,091 మంది దివ్యాంగులు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 16,091 మంది దివ్యాంగులైన ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వివరించారు. వీరిలో 2,690 మంది చూపులేనివారున్నారని, వారికి బ్రెయిలీ లిపితో కూడిన బోర్డులు ఉంటాయని, వాటి ఆధారంగా ఓటు వేస్తారని తెలిపారు. 2,059 మంది మూగవారు, 9,905 మంది నడవలేని వారు ఉన్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి గాను 535 వీల్ చైర్లు ఏర్పా టు చేశామని పేర్కొన్నారు. జుక్కల్‌లో 163, ఎల్లారెడ్డిలో 130, కామారెడ్డిలో 242 వీల్చైర్లను ఉంచామన్నారు. దివ్యాంగులతో పాటు వృద్ధులను పోలింగ్ కేంద్రాల కు తరలించడానికి కావాల్సిన రవాణా ఏర్పాట్లు కూడా చేసినట్టు కలెక్టర్ చెప్పారు. 2,426 మందికి ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్లు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఓటర్లుగా ఉండి, ఎన్నికల విధుల్లో ఉన్న 2,426 మంది పోలింగ్ సిబ్బంది, అధి కారులకు ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్టు తెలిపారు. వారు డ్యూటీ చేసే స్థలంలోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు 289 మంది పోస్టల్ బ్యాలె ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలి జిల్లాలోని 786 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు నీడతో పాటు నీటి సౌకర్యం కల్పిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే తాగడానికి నీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఎండలు మండిపోతున్నందున పోలింగ్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అరగంటకోసారి నీళ్లు తాగడం ద్వారా వేడి నుంచి కొంత రక్షణ పొందవచ్చన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారులు, సిబ్బందికి తెలిపామన్నారు. పోలింగ్ సిబ్బందికి తెల్లని టోపీలు అందజేస్తున్నట్టు కలెక్టర్ వివరించారు. జిల్లాలో 6,28,418 మంది ఓటర్లు.. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6,28,418 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 2,30,076 మంది ఓటర్లు, ఎల్లారెడ్డిలో 269 పోలింగ్ కేంద్రాల్లో 2,09,567 మంది ఓటర్లు, జుక్కల్‌లో 255 పోలింగ్ కేంద్రాల్లో 1,88,775 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం ఓట్లలో 3,04,384 మంది పురుషులు, 3,23,990 మంది మహిళలు, 44 మంది ఇతరులు ఉన్నారని వివరించారు. మొత్తం 786 పోలింగ్ కేంద్రాల్లో ఒకే పోలింగ్ కేంద్రం ఉన్న పోలింగ్స్టేషన్లు 287 ఉన్నాయని, రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్న స్టేషన్లు 131, మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నవి 43 ఉన్నాయని పేర్కొన్నారు. నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉన్నవి నాలుగు ఉన్నాయన్నారు. ఈవీఎంలు సిద్ధం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలను ఇప్పటికే సిద్ధం చేసి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు పంపించామన్నారు. 943 కంట్రోల్యూనిట్లు, 948 బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయన్నారు. అవసరానికి మించి సిద్ధంగా ఉంచామని తెలిపారు. 1,022 వీవీ ప్యాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, సిబ్బంది 3,770 మందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. వారిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు తరలించడానికి గాను 34 స్థలాలను గుర్తించామని, అక్కడి నుంచి రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ఎన్నికలు ముగిసిన తరువాత కూడా వారిని అక్కడే వదిలివేయడం జరుగుతుందన్నారు. -
ఇకనైనా శంకలు తీరేనా?
ఈవీఎంల పనితీరుపై సందేహం వ్యక్తం చేస్తున్న 21 రాజకీయ పక్షాలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అయిదు ఈవీఎంలలో పడిన ఓట్లను వాటికి అనుసంధానించే ప్రింటర్(వీవీప్యాట్)లలో వెలువడే రశీదులతో సరిపోల్చాలని సోమవారం సర్వో న్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో సగటున ఏడు అసెంబ్లీ స్థానాలుంటాయి గనుక 35 ఈవీఎంలను వాటికుండే వీవీ ప్యాట్లతో అధికారులు పోల్చి చూడవ లసి ఉంటుంది. ప్రతి స్థానంలోనూ కనీసం 50 శాతం వీవీ ప్యాట్ రశీదులను లెక్కించాలన్న పార్టీల అభ్యర్థననూ, ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో వీవీ ప్యాట్ యంత్రాన్ని ఎంపిక చేసి లెక్కించే ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తే సరిపోతుందన్న ఎన్నికల సంఘం వాదననూ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగడం ఎంత ముఖ్యమో... అలా జరిగాయన్న అభిప్రాయం పౌరులకు కలగటం కూడా అంతే అవసరం. ఎందుకంటే విశ్వసనీయత ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రదం. అన్ని వ్యవస్థలూ సక్రమంగా, పారదర్శకంగా పనిచేస్తున్నాయన్న అభిప్రాయం బలపడితేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. కనుక తాజా తీర్పును స్వాగతించదగ్గది. బ్యాలెట్ పత్రాల విధానం వదిలి ఈవీఎంలను ప్రవేశపెట్టిన నాటినుంచీ వాటిపై ఏదో మేరకు శంకలున్నాయి. ఇవి పౌరుల్లో కంటే పార్టీల్లోనే అధికం. అలాగని ఈ పార్టీలను– ఈవీఎంలను శంకించే పార్టీలు, వాటిని విశ్వసించే పార్టీలు అని విభజించడం సాధ్యం కాదు. నెగ్గితే తమ ఘనత, ఓడితే ఈవీఎంల దోషమని చెప్పడం చాలా రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. ఎన్నికల ఫలి తాలు వెలువడి జాతకం తలకిందులైన వెంటనే అధికార పక్షం ‘టాంపరింగ్’ చేసిందని, అలా జరగ కపోతే తాము బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించేవారమని పరాజితులు చెబుతారు. కంప్యూటర్ల దగ్గర నుంచి సెల్ ఫోన్ల వరకూ అన్నిటికీ తానే ఆద్యుడినని తరచు చెప్పుకునే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటమిపాలై అధికారానికి దూరమైనప్పుడల్లా ఈవీ ఎంలనే దోషిగా చూపారు. 2004, 2009 ఎన్నికల్లో రెండుసార్లూ ఆయన ఈవీఎంల వల్లనే ఓడానని రాద్ధాంతం చేశారు. ఆయా సంవత్సరాల్లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంలో ఓడినప్పుడు కూడా ఆయన ఆక్రోశం అదే విధంగా కొనసాగింది. తీరా 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు మాత్రం ఆయన గారు మౌనంగా ఉండిపోయారు. చంద్రబాబు మాత్రమే కాదు... ఓడిన రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజే పీలు గతంలో ఈ మాదిరి ఆరోపణలే చేశాయి. 2012లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో అధికార అకాలీ దళ్ విజయం సాధిస్తే ఈవీఎంల సోర్స్ కోడ్‌ను హ్యాకర్ల ద్వారా ఆ పార్టీ మార్చేయడం వల్లే ఓడి పోయామని కాంగ్రెస్ ఆరోపించింది. కానీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు మాత్రం ఆ పార్టీ ఈవీఎంల విషయంలో మౌనంగా ఉండిపోయింది. విచిత్రమేమంటే ఆరోపణ చేసిన పార్టీలు ఏ సందర్భంలోనూ వాటిని నిరూపించడానికి ప్రయత్నించలేదు. తమ వాదనకు మద్దతుగా కనీసం ఒక్క ఉదంతాన్నయినా చూపలేదు. అయినా రాజకీయ పార్టీల్లో ఈవీఎంలపై శంక ఉంటున్నది కనుక వీవీ ప్యాట్లను తీసుకురావాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అంత క్రితం ఎంపిక చేసిన కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే వీటిని వినియోగించిన సంఘం 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో వీవీ ప్యాట్లను అమర్చింది. 2017 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో వీటిని పూర్తిస్థాయిలో ఉపయోగించడం ప్రారంభించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తొలిసారి మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లోనూ వీటిని వినియోగిస్తున్నారు. ఈవీఎంలో తాను వేసిన ఓటు ఎంపిక చేసుకున్న అభ్యర్థికే పడిందని ఓటరు నిర్ధారించుకోవడా నికి వీవీ ప్యాట్‌లో వెలువడే రశీదు ఉపయోగపడుతుంది. అందులో వెలువడే రశీదు ఏడు సెకన్ల పాటు కనబడి దానికి అమర్చి ఉన్న బాక్స్‌లో పడే ఏర్పాటుంది. వీవీ ప్యాట్లు ఉపయోగించిన ఏ కేంద్రంలోనూ తాము ఒకరికి ఓటేస్తే వేరే వారికి వేసినట్టు రికార్డయిందని ఏ ఓటరూ ఇంతవరకూ ఫిర్యాదు చేయనప్పటికీ రాజకీయ పార్టీలు ఈవీఎంలపై ఆరోపణలు చేయడం మానుకోలేదు. 2017లో అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ ఈవీఎంలలో లోపాలున్నాయని నిరూపిం చమని పార్టీలకు సవాలు విసిరారు. ఇది గెలుపోటములను నిర్ణయించడానికి కాక ఉన్న వ్యవస్థను పటిష్టం చేయడం కోసమేనని ఆయన చెప్పారు. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ ఆ అవకాశాన్ని విని యోగించుకోలేదు. అలాగని ఈవీఎంలపై ఆరోపణలు మానుకోలేదు. మొన్న జనవరిలో అమెరి కాలో ముసుగు ధరించి కూర్చుని స్కైప్ ద్వారా లండన్‌లోని పాత్రికేయులతో మాట్లాడిన సయ్యద్ షుజా అనే వ్యక్తి ఈవీఎంలపై ఆరోపణలు చేశాడు. ఈవీఎంల విశ్వసనీయత గురించి మరెవరూ భవిష్యత్తులో ఆరోపణలు చేయకూడదనుకుంటే వీవీ ప్యాట్ రశీదులను లెక్కించి, ఆ సంఖ్య ఈవీ ఎంలో పోలైన ఓట్ల సంఖ్యతో సరిపోయిందని నిరూపించడం ఒక్కటే మార్గం. దానివల్ల ఫలితాల ప్రకటన ఆలస్యమవుతుందన్న ఈసీ వాదన వాస్తవమే అయినా ఆరోపణలకు ఫుల్స్టాప్ పడాలంటే వేరే మార్గం లేదు. ఈ అంశంలో ఈసీని కూడా తప్పుబట్టాలి. అది ఇంతవరకూ నియోజక వర్గానికి ఒక్కో ఈవీఎం–వీవీ ప్యాట్లను మాత్రమే తీసుకుని లెక్కేస్తోంది. శాస్త్రీయ పద్ధతిలో తగిన శాంపి ల్ను తీసుకోవాలని అది అనుకోలేదు. అలాగే పూర్తి స్థాయిలో వీవీ ప్యాట్లు ఉపయోగించిన 2017 మొదలుకొని నేటివరకూ లెక్కించిన మేరకైనా ఈవీఎం–వీవీ ప్యాట్ల మధ్య లెక్క సరిపోయిందో లేదో అధికారికంగా ఎప్పుడూ చెప్పలేదు. ఆ పని చేసి ఉంటే ఆరోపణలు చేసేవారి నోళ్లు మూత పడేవి. ఆ సంగతలా ఉంచి లెక్కింపులో వీవీ ప్యాట్ రశీదులకూ, పోలైన ఓట్లకూ పొంతన లేని స్థితి ఏర్పడిన పక్షంలో ఏం చేయాలన్న విషయంలో స్పష్టత లేదు. మొత్తానికి వచ్చే నెల 23న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడయ్యాకైనా ఈవీఎంలపై రేగుతున్న దుమారం చల్లారాలని ఆశిద్దాం. -
నిజామాబాద్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ ఎన్నకలపై స్టే ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. తొలివిడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 11న నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీంతో నిజామాబాద్ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు తొలగింది. తదుపరి విచారణ న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పోలింగ్‌ను వాయిదా వేయాలని, పేపర్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ ఎన్నికల బరిలో నిలిచిన 16మంది రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. గుర్తుల కేటాయింపు ప్రక్రియ నిబంధనల మేరకు జరగలేదని, ప్రధాన పార్టీల అభ్యర్థులు మూడు నెలల నుంచి ప్రచారం నిర్వహించుకుంటున్నారని, తమకు ప్రచారం నిర్వహించుకునేందుకు సమయం లేకుండా పోయిందని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నిజామాబాద్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నిజామాబాద్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల బరిలో 185మంది అభ్యర్థులు ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీ నేతలతో పాటు స్వతంత్రులు పెద్దసంఖ్యలో పోటీ చేయడంతో ఎం-3 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఈవీఎంల చెకింగ్, ర్యాండమైజేషన్ పూర్తి చేసిన ఎన్నికల అధికారులు...వాటిని ఆదివారమే అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించారు. అయితే అక్కడ నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించడమే అధికారులకు సవాల్‌గా మారింది. గత ఎన్నికల వేళ 200 వాహనాల్లో పోలింగ్ సామాగ్రిని తరలించగా, ఈసారి ఆ సంఖ్య రెట్టింపు కానుంది. -
ప్రజల్ని మోసగించేందుకే ఈవీఎంలు
సాక్షి, కాకినాడ సిటీ: రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకుకే ప్రధాని నరేంద్ర మోదీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) వాడుతున్నారని హైటెక్ సీఎంగా పేరొందిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. కాకినాడ కల్పనా సెంటర్లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని 21 జాతీయ పార్టీలు సంతకాలు చేసి ఇస్తే మోదీ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు అధికారులను బదిలీలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల్లో ఓట్లు వేసేటప్పుడు తెలుగు తమ్ముళ్లు జాగ్రత్త వహించాలన్నారు. మోదీ, కేసీఆర్‌లు రాష్ట్ర ప్రజలను మోసం చేసి అరవయ్యేళ్ల అభివృద్ధిని లాక్కొని కట్టుబట్టలతో మనల్ని బయటకు నెట్టారని అన్నారు. మోదీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.లక్ష కోట్లు ఇవ్వకుండా కేసీఆర్ ఇబ్బంది పెట్టారని, ట్యాంకుబండ్‌పై తెలుగుతల్లి విగ్రహాన్ని, తెలుగు కవుల విగ్రహాలను కూల్చివేసి తెలుగు ప్రజలను అవమానించారని అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలని, నిరుద్యోగ భృతి రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతానని చెప్పారు. ఇంటర్ విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఇస్తానని ప్రకటించారు. ఈ బహిరంగ సభలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పాల్గొన్నారు. నిరాశగా చంద్రబాబు రోడ్‌షో కాకినాడ రూరల్: చంద్రబాబునాయుడు కాకినాడ రూరల్ అచ్చంపేట మీదుగా కాకినాడ వరకూ ఆదివారం నిర్వహించిన రోడ్‌షో నిరాశను మిగిల్చింది. ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారని ఊహించిన తెలుగు తమ్ముళ్లకు ఆశించిన జనం రాకపోవడంతో షాక్ తగిలింది. రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్‌కు దీటుగా కాకినాడను అభివృద్ధి చేస్తానని చెప్పారు. తెలంగాణలో రూ.వెయ్యి పింఛను ఇస్తున్న తరుణంలో రూ.2 వేల పింఛను ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందన్నారు. పసుపు – కుంకుమ చెక్కులు మారతాయా అని వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారని, ఇప్పుడు లబ్ధిదారులందరికీ డబ్బు అందడంతో ఏంచేయాలో తెలియక తికమకపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఈవీఎంలు 12.. అభ్యర్థులు 185
సాక్షి, జగిత్యాల: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ ప్రాంతంలోని పసుపు రైతులు లోక్‌సభ బరిలో అత్యధిక సంఖ్యలో నిలబడి వారి సమస్యలపై చర్చ జరిగేలా చేశారు. ప్రధాన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలతో కలుపుకొని 185 మంది అభ్యర్థులు నిజామాబాద్ బరిలో ఉన్నారు. దీంతో ఎన్నికల సంఘం ఇక్కడి ఎన్నికలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుంది. దేశంలోనే తొలిసారిగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు ఎన్నికలకు ఎం–3 తరహా ఈవీఎంలను వినియోగించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేసేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు. ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని ఓల్డ్హైస్కూల్ ప్రాంగణంలో మోడల్ పోలింగ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్టర్ నిఖిల్‌కుమార్ బృందం గురువారం సందర్శించింది. దేశంలోనే మొదలు..! తమ సమస్యల పరిష్కారం కోసం పసుపు రైతులు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ నుంచి ప్రధాన అభ్యర్థులతోపాటు ఏకంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికల నిర్వహణ క్లిష్టతరంగా మారింది. మొదట బ్యాలెట్ పేపరుతో ఎన్నికలు నిర్వహిస్తారని.. వాయిదా వేస్తారనే చర్చలు జరిగాయి. ఎన్నికల సంఘం మాత్రం బ్యాలెట్ పేపర్ కాకుండా ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం గతంలో వినియోగించిన ఎం–2 రకం ఈవీఎంలను కాకుండా ఎం–3 తరహా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో ఒక్క ఈవీఎంకు బదులుగా ఒకే పోలింగ్‌కేంద్రంలో 12 ఈవీఎంల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. 12 ఈవీఎంల్లో 185 అభ్యర్థుల పేర్లు, ఫొటోలు, గుర్తులతోపాటు చివరన నోటాకు స్థానం కల్పించనున్నారు. ‘ఎం–3’ ఈవీఎంల వినియోగం నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎన్నికలకు ఎం–3 రకం ఈవీఎంలను వినియోగించాలని ఈసీ నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 785 పోలింగ్‌కేంద్రాలు ఉండగా.. నిజామాబాద్ పార్లమెంట్లో భాగమైన జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 516 పోలింగ్‌కేంద్రాలు ఉన్నాయి. ఆయా పోలింగ్‌కేంద్రాల్లో ఒక ఈవీఎంకు బదులుగా 12 ఈవీఎంలను వినియోగించనున్నారు. దీంతో మొత్తం 6,192 ఈవీఎంలు అవసరంకానున్నాయి. ఇందుకు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లను ఎన్నికల సంఘం ఇప్పటికే సమకూర్చింది. దేశ చరిత్రలో ఏ ఎన్నికల్లోనూ ఈ తరహా ఈవీఎంలను వినియోగించలేదు. టెక్నికల్ సిబ్బందితో విధులు ప్రత్యేకమైన ఈవీఎంలలో నోటాతో సహా 185 అభ్యర్థుల పేర్లు నిక్షిప్తమై ఉంటాయి. ఓటు వేసిన తర్వాత ఓటరు వేసిన ఓటును చెక్ చేసుకునేందుకు వీలుండే వీవీప్యాట్‌ను 12 ఈవీఎంలకు అనుసంధానం చేయనున్నారు. ఓటరు తాము వేసిన ఓటు ఏ అభ్యర్థికి పడిందన్నది 7 సెకన్లపాటు వీవీప్యాట్ మిషన్‌లో కనిపించనుంది. ఎం – 3 రకం ఈవీఎంల నిర్వహణకు ఈ ఎన్నికల్లో సుశిక్షితులైన టెక్నికల్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. మోడల్ పోలింగ్‌కేంద్రం 12 ఈవీఎంలలో ఎన్నికలు నిర్వహించనుండడంతో ఓటుహక్కు వినియోగించుకోవడంలో ఓటర్ల అవగాహన కోసం ఎన్నికల అధికారులు జిల్లాకేంద్రంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఎం–3 ఈవీఎంలను మూడు టేబుళ్లపై ‘యూ’ ఆకారంలో ఏర్పాటు చేయనున్నారు. 12 ఈవీఎంలతోపాటు వీవీప్యాట్ మిషన్‌ను టేబుల్‌పై ఏర్పాటు చేయనున్నారు. అన్ని ఈవీఎంలకు వీవీప్యాట్ మిషన్‌తో అనుసంధానం ఉంటుంది. పోలింగ్‌రోజు వరకు మోడల్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు అవగాహన కల్పించనున్నారు. పోలింగ్ రోజున అన్ని పోలింగ్ కేంద్రాల ముందు ఈవీఎంల నమూనా, అభ్యర్థుల జాబితాతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించనున్నారు. -
వీవీ ప్యాట్‌లో తప్పు చూపితే ?
సాక్షి, అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా వీవీప్యాట్లను (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) వినియోగిస్తున్నారు. ఈవీఎంలో ఓటరు తాను వేసిన గుర్తుకే ఓటు పడిందా లేదా అనే అనుమానం వచ్చినప్పుడు వీవీప్యాట్ ద్వారా పరిశీలించుకోచ్చు. తాను వేసిన గుర్తు ఒకటైతే వీవీప్యాట్‌లో మరో గుర్తుకు పడినట్లు తప్పు ప్రింట్ చూపిస్తే దానిని రాంగ్ ప్రింట్ ఆఫ్ వీవీప్యాట్ పేపర్ స్లిప్ అంటారు. ఇలాంటి సందర్భంలో పీఓలు ఏం చేయాలని అనేదానిపై ఓటరు అవగాహన కలిగి ఉండాలి. తప్పు ప్రింట్ చూపెడితే.. ప్రిసైడింగ్ అధికారి రూల్ 49ఎంఏ ప్రకారం చర్యలు తీసుకోవాలి. హ్యాండ్ బుక్‌లోని ఆనెక్సర్–15 ప్రకారం ఫిర్యాదు చేసిన ఓటరు వద్ద డిక్లరేషన్‌ను ప్రిసైడింగ్ అధికారి తీసుకోవాలి. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో 17 ఎలో ఓటరు వివరాలు మరోసారి ఎంటర్ చేయాలి. కంట్రోల్ యూనిట్ నుంచి ఓటును విడుదల చేయాలి. ఏజెంట్ల సమక్షంలో ప్రిసైడింగ్ అధికారి వీవీప్యాట్‌లో వచ్చిన స్లిప్‌ను పరిశీలించాలి. ఓటరు ఫిర్యాదు నిజమని తేలితే... ప్రిసైడింగ్ అధికారి పోలింగ్‌ను ఆపేసి రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి. ఓటరు ఫిర్యాదు తప్పని తేలితే 17 ఎలో ఆ ఓటరు రెండోసారి రాసిన వివరాలు రిమార్క్ కాలమ్‌లో ఓటరు చేసిన ఫిర్యాదు తప్పని రాయాలి. 17 సి అనగా పోలైన ఓట్ల వివరాలు తెలిపే ఫారంలోని మొదటి భాగంలో (పార్ట్–1) ఆ వివరాలు నమోదు చేయాలి. ఈవీఎంలు, వీవీప్యాట్లు పనిచేయకపోతే .. పోలింగ్ సమయంలో ఈవీఎంలు, వీవీప్యాట్లు పనిచేయకపోతే.. వాటి స్థానంలో రిజర్వ్‌లోని వాటిని ఏర్పాటు చేయాలి. కొత్త ఈవీఎం, వీవీప్యాట్‌లో మళ్లీ మాక్‌పోల్ నిర్వíßహించాలి. డిక్లరేషన్ రాయాలి (సింగిల్ ఓటు) ర్క్డ్ ఓటరు వస్తే... ప్రిసైడింగ్ అధికారి వద్ద ఓటరు జాబితాకు సంబంధించి వర్కింగ్ కాపీలు, మార్క్డ్ కాపీలు ఉంటాయి. అందులో ఆబ్సెంట్, షిప్టెడ్, డెత్ (ఏఎస్డీ) జాబితాలో ఉన్న ఓటర్లను మార్క్ చేసి ఉంటారు. మార్క్డ్ ఓటరు ఓటు వేయడానికి వస్తే ప్రిసైడింగ్ అధికారి ఆ ఓటరు తెచ్చిన గుర్తింపుతో ఓటరు జాబితాలోని వివరాలను సరిచూడాలి. నిజమైతే 17ఎలో ఆ ఓటరు సంతకంతో పాటు వేలిముద్ర తీసుకోవాలి. ఓటు వేసేందుకు అనుమతించాలి. ఏఎస్డీ జాబితా నుంచి ఓటు వేసిన వారి వివరాలతో ఒక రికార్డు తయారు చేయాలి. -
ఈసీ కూడా ఓటర్ల విశ్వాసాన్ని పొందాలి!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో ఓడి పోయిన ప్రతి అభ్యర్థి నెపాన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మషిన్లపైకి నెట్టడం నేడు ఫ్యాషన్ అయింది. అది సరే, ఓటర్లను విశ్వాసంలోకి తీసుకోకుండా ఓటింగ్ యంత్రాలను అదే పనిగా విమర్శించడం ఎక్కువైతే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్లనే నమ్మకం లేకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది. అలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఎన్నికల కమిషన్ మరింత పారదర్శకంగా, మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంది. ఈసారి ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ‘ఓటింగ్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)’ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్నికల షెడ్యూల్‌తోపాటు మార్చి 13వ తేదీన ఎన్నికల కమిషన్ ప్రకటించినప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లే అనిపించింది. ఈ వీవీపీఏటీని అంశం ఎప్పటి నుంచో సుప్రీం కోర్టులో నలుగుతోంది. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాలకు మరో భద్రతా వలయం ఉండాలనే ప్రతిపాదనను సుప్రీం కోర్టు ముందు ఎన్నికల కమిషన్ వ్యతిరేకిస్తూ వస్తోంది. వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశమే లేదంటూ వాదిస్తూ వస్తోంది. సుప్రీం కోర్టులో సోమవారం ఈ అంశం విచారణకు వచ్చినప్పుడు కూడా ఎన్నికల కమిషన్ అంతే మొండిగా వాదించింది. అన్ని పోలింగ్ బూత్‌ల్లో వీవీపీఏటీ వ్యవస్థను ఏర్పాటు చేయగలరా? అన్న సూచనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్క పోలింగ్ కేంద్రంలో మాత్రమే ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, అలాంటి పోలింగ్ కేంద్రంలో ఎలాంటి తేడా రానప్పుడు మిగతా పోలింగ్ కేంద్రాల్లో తేడా రానట్లేనని వాదించింది. వీవీపీఏటీ వ్యవస్థను మరింత విస్తరించేది, లేనిది తెలియజేస్తూ ఓ లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ను సుప్రీం కోర్టు ఆదేశిస్తూ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది. మళ్లీ బ్యాలెట్ పత్రాల ఓటింగ్‌కు వెళ్లాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో విశ్వసనీయతను పెంచేందుకు వీవీపీఏటీ వ్యవస్థను ప్రతి బూతుకు ప్రతి మిషన్‌కు విస్తరించాల్సిన అవసరం ఉంది. అత్యాధునిక టెక్నాలజీ యుగంలోనూ యుగంలోను ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరుగకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడమే కాదు, నిజంగా ట్యాంపరింగ్ జరగలేదని ప్రజలు విశ్వసించే విధంగా ఉండాలి. -
ఓటర్లు ఎక్కువ.. సమయం తక్కువ!
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిసారీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఓట్ల శాతం పెంపునకు విసృత్త ప్రచారం చేస్తూంటుంది. ఓటర్లను చైతన్యపర్చడానికి అవగాహన కార్యక్రమాలతో పాటు వివిధ రకాల ప్రకటనలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూంటుంది. అయినా ఎన్నికల సంఘం అనుకున్న స్థాయిలో ఓట్ల శాతం పెరగడం లేదు. మరోవైపు ఓటింగ్ టైం మేనేజ్మెంట్ను పరిశీలించగా ఓటరు శాతం పెరగడానికి చేస్తున్న ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఓటింగ్ టైం ప్రకారం పోలింగ్ బూత్‌లో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారని, వారికి సమయం సరిపోదని తెలుస్తోంది. ఒక ఓటరు ఓటు వేయడానికి కనీసం రెండు నిమిషాలు అనుకున్న గంటకు 60 ఓట్లు పడతాయి. పది గంటల్లో 600 ఓట్లు పడే అవకాశం ఉంది. ఒకవేళ క్రమం తప్పకుండా ఓట్లు వేసినా మరో 100– 150 మందికి ఓటు వేసే అవకాశం దక్కుతుంది. ఇలా దాదాపు 750 మందికి పది గంటల్లో ఓటు వినియోగించే అవకాశం దక్కవచ్చు. ఎందు కంటే గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని నియోజకవర్గాల పోలింగ్‌బూత్‌ల్లో 900 నుంచి 1200 వందల వరకు ఓటర్లు ఉన్నారు. పోలింగ్ బూత్‌ల పరిస్థితి ఇదీ.. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందుకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ బూత్‌ల్లో పోలింగ్ మేనేజ్మెంట్ సక్రమంగా ఉన్నా మిగతా నియోజకవర్గాల్లో పోలింగ్ మేనేజ్మెంట్ దారుణంగా ఉంది. ఎన్నికల నిర్వహణా అధికారులు ఏ లెక్క ప్రకారం పోలింగ్ బూత్‌లో 1200 వరకు అత్యధికంగా ఓటర్లు ఉండవచ్చని నిర్ధారించారో తెలియండంలేదు. ఓటింగ్ సమయం పది గంటలు ఉంది. ప్రతి ఓటరుకు పట్టే సమయం నిముషం అనుకున్న గంటకు 60 ఓట్లు పడతాయని, పది గంటల్లో కేవలం 600 ఓట్లు మాత్రమే పడతాయి. ఈ ఎన్నికల నుంచి వీవీ ప్యాట్ కూడా ఉంది. ఇందులో అభ్యర్థి గుర్తును చూసే అవకాశం ఉంది. దీంతో సమయం మరింత పట్టవచ్చు. 10 గంటలు కేవలం 600 మందే.. ఒక ఓటరు ఓటు వేయడానికి తన ఓటరు కార్డు తీసుకొని పోలింగ్ కేంద్రానికి వస్తే అతడికి నాలుగు రకాల ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆయా పార్టీల అభ్యర్థుల ఓటు నిర్ధారణ అనంతరం ప్రిసైడింగ్, అసిస్టెంట్, పోలింగ్ అధికారులు తదుపరి ప్రక్రియ కొనసాగిస్తారు. ఓటరు లిస్టులో సదరు వ్యక్తి ఓటు ఉన్నట్లు గుర్తిస్తారు. ఓటరు వేలిపై ఇంక్ పెడతారు. అధికారి బ్యాలెట్ రిలీజ్ చేస్తారు. ఓటరు ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్లి బటన్ నొక్కుతాడు. అనంతరం వీవీ ప్యాట్‌లో ఏ గుర్తుకు ఓటు వేశారో అది ఏడు సెకన్ల వరకు కనబడుతుంది. ఇలా ఒక ఓటరు ఓటు వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేసినా కనీసం ఒక్క నిమిషం సేపు పడుతుంది. ఒక పోలింగ్ బూత్‌లో 1200 వరకు ఓట్లు పోలింగ్ సమయం 10 గంటల వ్యవధి ఉంది. పది గంటల్లో కేవలం ప్రతి ఓటరు రెండు నిమిషాల సమయం కేటాయించినా కేవలం 600 మందికే ఓటు వేసే అవకాశం ఉంది. అయితే పలు పోలింగ్ బూత్‌లో 1200 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కనీసం 50 లేదా 60 శాతం ఓటింగ్ అయినా 600 నుంచి 720 మంది ఓట్లు వేయడానికి అవకాశం ఉండదు. ఓటింగ్ వేసే సమయం పది గంటలు ఇందులో 600 ఓట్లు పడతాయి. అదే ఓటరు వేసే ఓటింగ్ ప్రక్రియ చూస్తే కనీసం రెండు నిమిషాలైనా సరిపోదని ఎన్నిక అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలోని ప్రతి పోలింగ్ బూత్‌లో ఎక్కువగా 1200 ఓట్లు, తక్కువగా 900 వరకు ఉన్నాయి. ఎన్నికల ఐటీ విభాగం పోలింగ్ బూత్‌లో అత్యధికంగా 1200 వరకు ఓటర్లు ఉండవచ్చని నిర్ధారించారు. ఏ లెక్క ప్రకారం 1200 లేదా అందులో సగం అంటే 50 శాతం 600 మంది పది గంటల్లో ఓటు ఏలా వేస్తారో వారికే తెలియాలి. అంతుచిక్కని ఎన్నికల సమయం ఓటింగ్ శాతం పెంచాలని ఎన్నికల సంఘం ప్రచారం చేస్తున్నా.. ప్రతి ఓటింగ్ బూత్‌లో 900– 1200 మంది వరకు ఓట్లు నమోదై ఉన్నాయి. అధికారులు చెబుతున్న ప్రకారం ప్రతి ఓటరుకు కనీసం రెండు నిమిషాలు అవుతుందని చెప్పినా.. ఓటింగ్ శాతం 50– 60 శాతం ఓటింగ్ అయినా సమయం ఎలా సరిపోతుందో అంతుపట్టడంలేదు. పొంతన లేని సమాధానాలు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల సమయానికి పోలింగ్ బూత్‌లో నమోదయిన ఓటరు జాబితా ప్రకారం 30– 40 శాతం ఓటింగ్‌కు సమయం సరిపోయే విధంగా ఉంది. ఈ విషయంలో ఎన్నికల అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు ఈవీఎం టైమ్ నిర్ధారణ ఓటరు లిస్టులో ఉన్న ఓటర్ల సంఖ్య ఇరు విభాగాలకు తెలియదు. దీంతో ఇలాంటి విషయం గురించి ఎన్నికల సంఘానికి తెలియవని, పోలింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. కొత్త ఓటర్లు 56,000 నగరంలో ఓటరు చైతన్యం పెరుగుతోంది. రాష్ట్రంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక, లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు 60వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 15వ తేదీలోపు హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఇది. ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకుంటేనే లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశముంటుందని అధికారులు, మీడియా విస్తృతంగా ప్రచార కార్యక్రమా లు నిర్వహించిన నేపథ్యంలో స్వల్ప వ్యవధిలోనే 60వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన అధికారులు వీరిలో 56వేల మందికిపైగా అర్హులని గుర్తించారు. వచ్చే నెల 11న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో వీరంతా ఓటేయనున్నారు. అందిన దరఖాస్తుల్లో దాదాపు 200 దరఖాస్తుల్ని మాత్రం అధికారులు పరిశీలించాల్సి ఉంది. కొత్తగా పేరు నమోదు కోసం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సగటున 3వేల నుంచి 4వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. గతం లో మాదిరే అత్యధికంగా జూబ్లీహిల్స్ నుంచి 5,784 మంది కొత్తగా ఓటరు జాబితాలో పేరు కోసం దర ఖాస్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ నుం చి 5,747 మంది, అంబర్‌పేట నుంచి 5,269 మంది దరఖాస్తు చేసుకున్నారు. చార్మినార్ నుంచి 1934 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. -
ఈవీఎం వయస్సు 36 ఏళ్లు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం) పుట్టి 36 ఏళ్లు అవుతోంది. ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలకు ప్రత్యామ్నాయంగా ఈ యంత్రాలను ప్రవేశ పెట్టింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవీఎంల పుట్టుకతో వాటి నిర్వహణ లోపాలు, సందేహాలతో కొంత కాలం కొట్టుమిట్టాడి ఆ తర్వాత నిలదొక్కుకుంది. అప్పటి నుంచి అనేక ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగిస్తున్నారు. మొదటి సారి కేరళ రాష్ట్రం పరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 19 మే 1982లో ఈవీఎంలను వినియోగించారు. ఆ తర్వాత 1982, 83లో జరిగిన ఉపఎన్నికల్లో దేశవ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో వీటిని వాడారు. ఈవీఎంలను ఉపయోగించవద్దని 1984, మే 5వ తేదీన సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంల వాడకాన్ని 1988 డిసెంబర్లో కేంద్రం సెక్షన్ 61 ఏ ద్వారా ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేర్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 61 ఏ సవరణ 1989 మార్చి 15న అమల్లోకి తేవడంతో ఆ తర్వాత సుప్రీం కూడా సమర్థించింది. జనవరి 1990లో ఎన్నికల సంస్కరణల కమిటీ(ఈఆర్సీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే ఏడాది ఏప్రిల్‌లో ఈవీఎంల వాడకాన్ని సాంకేతిక నిపుణుల కమిటీ సమర్థించింది. ఎన్నికల సవరణను 1992 మార్చి 24న ఎన్నికల నియమావళి 1961ని ప్రభుత్వం అధీకృతం చేసింది. ఈవీఎంల వాడకానికి 1998లో ప్రజామోదం లభించింది. వివిధ రాష్ట్రాల్లో 1999, 2004 సంవత్సరాల్లో వివిధ శాసనసభల ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వినియోగించారు. లోక్‌సభకు 2004–14 మధ్య జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు ఈవీఎంలను వినియోగించారు. వీవీ ప్యాట్ల వినియోగాన్ని 2013 ఆగస్టు 14న ఈవీఎంలకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. నాగాలాండ్ రాష్ట్రంలోని నాక్సెన్ అసెంబ్లీ నియోజకవర్గానికి 2013 సెప్టెంబర్ 4న వీవీ ప్యాట్లను మొదటిసారిగా వినియోగించారు. 2013 అక్టోబర్ 8న దశలవారీగా వీవీ ప్యాట్లను వినియోగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దశల వారీగా 2013 నుంచి వీవీ ప్యాట్లను ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. 2017 ఏప్రిల్‌లో రూ. 3,173.47 కోట్లతో 16.15 లక్షల వీవీ ప్యాట్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో కూడా వీవీ ప్యాట్లను వినియోగించేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు పూర్తి చేసింది. -
సీజ్ చేసిన ఈవీఎంలను వాడుకోండి
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సీజ్ చేసిన ఆలేరు, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల ఈవీఎంలను ఉపయోగించుకునేందుకు హైకోర్టు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలేరు నియోజకవర్గం నుంచి గొంగిడి సునీత ఎన్నికను సవాలు చేస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన సతీష్‌కుమార్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేశారు. సునీత తన ఎన్నికల అఫిడవిట్లో తన పేరు మీద, తన భర్త పేరు మీద ఉన్న పలు ఆస్తుల వివరాలను దాచిపెట్టారని పేర్కొన్నారు. ఆమె భర్తకు యాదగిరి మండలం పరిధిలో పెద్ద ఎత్తున ఉన్న ఆస్తుల వివరాలనూ చెప్పలేదన్నారు. కుమార్తె పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడించలేదన్నారు. ఆమె తన అఫిడవిట్లో ఆస్తుల పూర్తి వివరాలు, వాటి మార్కెట్ ధరలనూ వివరించలేదని తెలిపారు. అందువల్ల ఆమె నామినేషన్ తాలూకు రికార్డులన్నింటినీ పరిశీలించి, నామినేషన్‌ను చెల్లనిదిగా ప్రకటించాలని కోరారు. ఇదిలా ఉంటే నాగర్ కర్నూలు నుంచి మర్రి జనార్దన్‌రెడ్డి ఎన్నికను సవాలు చేస్తూ నాగం జనార్దన్‌రెడ్డి ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో మర్రి పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన ఎన్నికను రద్దు చేసి, నాగర్ కర్నూలు నుంచి తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని కోర్టును కోరారు. రెండు వ్యాజ్యాలపై న్యాయ మూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ విచారణ జరుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీజ్ చేసిన ఈవీఎంలను రానున్న పార్లమెంటు ఎన్నికలకు ఉపయోగించుకునేందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఈసీ 2 అనుబంధ పిటిషన్లు వేసింది. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ షమీమ్ అక్తర్ శుక్రవారం విచారణ జరిపారు. సతీష్‌కుమార్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, గొంగిడి సునీత నామినేషన్ దాఖలుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని, ఈవీఎంలపై అభ్యంతరాలు లేవని, వాటిని వినియోగించుకునేందుకు తమకు ఇబ్బంది లేదని కోర్టుకు వివరించారు. అలాగే నాగం జనార్దన్‌రెడ్డి తరఫు న్యాయవాది కూడా ఇదే విషయం చెప్పారు. -
‘ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యం’
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ర్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వాడకాన్ని మాజీ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా సమర్ధించారు. ఇతర యంత్రాలతో వాటిని హ్యాక్ చేయడం కానీ, తారుమారు చేయడం కానీ సాధ్యపడదని స్పష్టం చేశారు. ఈవీఎంలు సీనియర్ ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఉంటాయని, అవకతవకలకు పాల్పడే అవకాశం ఉండబోదని పేర్కొన్నారు. ఈవీఎంలు సమర్ధవంతమైన యంత్రాలనీ వాటిని నిర్వీర్యం చేసే అవకాశాలు లేవని తాను బలంగా నమ్ముతానని చావ్లా పేర్కొన్నారు. ఈవీఎం కేవలం రెండు మూడు విధులను నిర్వర్తించే డెస్క్‌టాప్ కాలిక్యులేటర్ వంటిదని, దీన్ని హ్యాక్ చేయలేరని తాను రాసిన పుస్తకం ’ఎవిరి ఓట్ కౌంట్స్’ ఆవిష్కరణ సభలో మాట్లాడుతూ చావ్లా చెప్పారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఈవీఎం చిప్స్‌లను ఎవరైనా ఎలాగైనా మార్చేస్తారని తాను అనుకోవడం లేదని అన్నారు. ఇతర యంత్రాలను ఉపయోగిస్తూ ఏ ఒక్కరూ ఈవీఎం చిప్స్‌లను మార్చలేరని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఈవీఎంకూ వీవీప్యాట్లను అమర్చుతుండటంతో మొత్తం ఈవీఎం వ్యవస్థ మరింత జవాబుదారీగా మారుతుందని చెప్పారు. -
ఈవీఎంలపై అవగాహన
మెదక్ అర్బన్ : శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ గురువారం నుంచి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే మొదటి విడత ఈవీఎంల తనిఖీలు పూర్తయినట్లు వివరించారు. ఈవీఎంలను తనిఖీ చేసే విధానం, సీల్ చేసే విధానాన్ని జాయింట్ కలెక్టర్, ఆయా రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో వివరించినట్లు తెలిపారు. ప్రతి ఈవీఎంను తనిఖీ చేసి, శుభ్రం చేసిన తర్వాత అది సరిగ్గా పని చేస్తున్నట్లయితేనే వాటిని వినియోగిస్తామన్నారు. ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయులు, పట్టభ«ద్రుల ఓట్ల తుది విడత రూపొందించడం జరిగిందన్నారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు పట్టభద్రులు 7,473 మంది, ఉపాధ్యాయులు 1,120 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రతి మండల కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారని... ఈవీఎంలో అన్ని సరిగ్గా పని చేస్తున్నాయనే నిర్ధారణకు వచ్చిన తర్వాతనే పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈవీఎంలలో డిజిటల్ క్లాక్ ద్వారా ఏ ఓటు ఎన్ని గంటల సమయంలో పోలైన విషయం కూడా స్పష్టంగా తెలుస్తుందని కలెక్టర్ వివరించారు. ఈవీఎంలను తనిఖీ చేసిన సమయంలో సరిగ్గా పని చేయని 22 కంట్రోల్ యూనిట్లు, 3 బ్యాలెట్ యూనిట్లు, 50 వీవీ ప్యాట్లను తిరిగి వెనక్కి పంపడం జరుగుతుందన్నారు. ఈవీఎంల పనితీరు, ఓటు వేసే విధానం గూర్చి జిల్లాలోని అన్ని మండలాల్లో, గ్రామాల్లో ప్రజలకు అవగాహన నిర్వహించడం జరుగుతుందన్నారు. 1950 నంబర్లో తెలుసుకోవచ్చు.. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారని.. నామినేషన్ల ప్రక్రియ తదితరాలు కలెక్టరేట్లో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఓటరు నమోదు ప్రక్రియ కార్యక్రమం నిర్వహించగా మంచి స్పందన వచ్చిందని ఇందులో 21 వేలకు పైగా నూతనంగా ఓటర్లుగా నమోదు జరిగిందన్నారు. వాటిలో మెదక్ నియోజకవర్గంలో 11,391, నర్సాపూర్ నియోజకవర్గంలో 10,090 నూతనంగా ఓటర్లు నమోదు ప్రక్రియ జరిగిందని కలెక్టర్ వివరించారు. మెదక్ నియోజకవర్గంలో మూడు వేల పైచిలుకు, నర్సాపూర్ నియోజకవర్గంలో 1,200 ఓట్లు తొలగింపులు, మార్పులు, చేర్పులు చేయడం జరిగిందన్నారు. ఈనెల 22న తుది ఓటరు జాబితాను ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. అలాగే ఓటరు జాబితాను ప్రతి గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద అతికించడం జరుగుతుందన్నారు. అలాగే గ్రామాల్లో నివాసం ఉండకుండా ఇతర ప్రాంతాలకు బతుకుదెరువు నిమిత్తం వలసవెళ్ళిన వారు, ఉద్యోగ రీత్యా వెళ్ళిన వారు తమ పేరు ఓటరు జాబితాలో ఉందా ? లేదా అనే విషయాన్ని 1950 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. నామినేషన్ల చివరి తేదీకి పది రోజుల ముందు వరకు ఓటరు నమోదుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ ధర్మారెడ్డి వివరించారు. ఎన్నికల కమిషన్ ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల పాఠశాల (చునావ్ పాఠశాల) అని ఏర్పాటు చేసిందని... దీని ముఖ్య ఉద్దేశం ఎన్నికలపై అవగాహన, జరిగే తీరు, ఓటరు పాత్రపై అందరికి అవగాహన కల్పించడం అని తెలిపారు. ఈ పాఠశాలలను ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభించడం జరుగుతుందన్నారు. దీనికి బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) కో–ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రతి నెల మొదటి శనివారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని వివరాలను తెలియజేస్తారని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరు, సీల్ చేసిన విధానం, ఓట్ల లెక్కింపు చేసే ప్రక్రియను కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో ఎన్నికల సిబ్బంది నజీర్ అహ్మద్, రవికుమార్, అధికారులు రాజిరెడ్డి, శైలేశ్వర్‌రెడ్డి, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఈవీఎంల వినియోగంపై అవగాహన
కర్నూలు(అగ్రికల్చర్): ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటు హక్కు వినియోగం, వీవీ ప్యాట్లతో ఉపయోగాలపై జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఇందుకు సంబంధించి ఆదివారం కర్నూలు శివారు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ వివిధ అంశాలను వివరించారు. ఈవీఎం, వీవీ ప్యాట్లను శిక్షణ నిమిత్తం రెవెన్యూ డివిజన్‌కు 10 ప్రకారం పంపిణీ చేశారు. వీవీ ప్యాట్లు, బ్యాలెట్ , కంట్రోల్ యూనిట్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో ర్యాండమ్‌గా గోదాము నుంచి తీయించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈవీఎంల ద్వారా ఓటు ఎలా వేయాలి, వీవీప్యాట్ ద్వారా ఓటు సరిగా పడిందా లేదా ఏ విధంగా సరిచూసుకోవాలి తదితర అంశాలపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్లకు పది ప్రకారం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ప్రతినిధులు వీటిపై అవగాహన కల్పిస్తారన్నారు. శిక్షణ జరుగుతున్న సమయాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తనిఖీలు చేసుకోవచ్చన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి, డీఆర్వోవెంకటేశం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించండి కర్నూలు(అగ్రికల్చర్): నియోజకవర్గాల వారీగా తీవ్ర సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, వాటి లోకేషన్లు గుర్తించి బందోబస్తు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఈఆర్వోలు, డీఎస్పీలు, తహసీల్దార్లను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలపై ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా చెక్‌పోస్టుల ఏర్పాటుపై సూచనలు ఇచ్చారు. జిల్లాలో 3,780 పోలింగ్ కేంద్రాలుండగా 2,180 లొకేషన్లున్నాయని, వీటిలో సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ లొకేషన్లు, పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంగా పని చేయాలన్నారు. సమస్యాత్మక లొకేషన్లను బట్టి పోలీసు బందోబస్తు ప్లాన్ సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో నగదు, మద్యం ప్రమేయాన్ని నివారించేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి, అడిషనల్ ఎస్పీ మాధవరెడ్డి, డీఆర్ఓ వెంకటేశం, పలువురు డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని టీపీసీసీ నేతలు ఆరోపించారు. దాదాపు 20 నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. శనివారం సచివాలయంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలు విలేకరులతో మాట్లాడారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వికారాబాద్‌లో కోర్టు పరిధిలో ఉన్న 25 స్ట్రాంగ్ రూంలోని ఈవీ ఎంలను అధికారులు తెరిచారని, దీనిపై ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఇక్కడ సీఈవోకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. మనిషి తప్పు చేస్తాడు కానీ మిషన్లు కాదన్నారు. ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఇక్కడ వచ్చి ప్రచారం చేసినా తాను గెలిచేవాడినని.. ఇక్కడ ఓడిపోవడం బాధ కలి గించిందన్నారు. 518 ఓట్లు ఉంటే 555 అని ఈవీఎంలలో చూపిస్తుందని, దీనిపై సీఈవోకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. అక్కడ మళ్లీ రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తీరు బాధాకరమన్నారు. ఈవీఎంల మీద నమ్మకం లేకే వీవీప్యాట్లను తెచ్చినా న్యాయం జరగడంలేదని పేర్కొన్నారు. రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం, పరిగి ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
ఈవీఎం ఫలితాలను వీవీప్యాట్లతో పోల్చాలి
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాల ప్రకటనకు ముందుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం)ల ద్వారా వెల్లడైన ఫలితాలను ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్స్(వీవీప్యాట్లు)లతో సరిపోల్చాలని ప్రతిపక్షాలు కోరాయి. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ)ని కలిసి వినతిపత్రం ఇచ్చాయి. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఫలితాలను వీవీ ప్యాట్లతో పోల్చి చూడాలనీ, సగం ఈవీఎంల ఫలితాలనైనా వీవీప్యాట్లతో సరిపోల్చి చూశాకే ఫలితాలను వెల్లడించాలని నేతలు కోరారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థికి, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి 5 శాతం కంటే తక్కువగా ఓట్ల తేడా ఉన్న సందర్భాల్లో కూడా ఆ నియోజకవర్గంలోని అన్ని ఈవీఎంలను వీవీప్యాట్లతో పూర్తిగా సరిచూసిన తర్వాతే ఫలితం ప్రకటించాలన్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, తెలంగాణలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని తేలినట్లు వివరించారు. ఈసీని కలిసిన నేతల్లో కాంగ్రెస్‌కు చెందిన గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ, చంద్రబాబు నాయుడు(టీడీపీ), మజీద్ మెమన్(ఎన్సీపీ), డెరెక్ ఒ బ్రియాన్(టీఎంసీ), ఫరూఖ్ అబ్దుల్లా(ఎన్సీ) తదితరులున్నారు. సాధ్యమైతే చేస్తాం:ఈసీ ప్రతిపక్షాలు పేర్కొన్న అంశాలకు సంబంధించి కోర్టు తీర్పులను, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్ అశోక్ లావాసా తెలిపారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థికి, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి 5 శాతం ఓట్ల తేడా ఉన్నప్పుడు ఈవీఎంలతోపాటు వీవీప్యాట్లను పరిశీలించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. -
4న ఈసీతో విపక్షాల భేటీ
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) వినియోగంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యాయి. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ..‘లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై విస్తృతంగా చర్చించాం. అలాగే దేశంలో నిరుద్యోగిత, వ్యవసాయం, రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలపై దాడిపై మరింత లోతుగా చర్చించేందుకు అన్నిపక్షాలు అంగీకరించాయి. ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ నెల 4న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుసుకుని తమ అభ్యంతరాలు, ఆందోళనల్ని తెలియజేస్తాయి’ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శరద్ పవార్(ఎన్సీపీ), ఒమర్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్), రామ్‌గోపాల్ యాదవ్(సమాజ్‌వాదీ పార్టీ), సతీశ్‌చంద్ర మిశ్రా(బీఎస్పీ), కనిమొళి(డీఎంకే), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ), డి.రాజా(సీపీఐ), టీకే రంగరాజన్(సీపీఎం), జయంత్ చౌదరి(ఆర్జేడీ)తో పాటు కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ పాల్గొన్నారు. -
ఈవీఎంలు, వీవీప్యాట్లలో ఓట్ల తేడాలెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఎన్నికల అనంతరం ఓట్ల శాతాన్ని లెక్కిం చేందుకు ఎన్నికల సంఘానికి రెండు రోజుల సమయం ఎందుకు పట్టింది? ఈవీఎంలలో, వీవీ ప్యాట్లలో ఓట్ల తేడాలెందుకొచ్చాయన్న అనుమా నాలు నివృత్తి చేయాలన్నారు. ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో జరిగిన పంచా యతీ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాల్సిన ప్రతిపక్షాలు పుంజుకున్నాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలను నివృత్తి చేస్తే తన సర్వే ఫలితాలు తప్పని క్షమాపణలు కోరు తా నన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను వెల్లడించిన ఫలితాలకు భిన్నంగా ఫలితాలు రావడం ఆశ్చర్యం కలిగించిందని, దీనికి గల కారణాలు బేరీజు వేసు కొని పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఫలితాలతో పాటు వెల్లడిస్తానని చెప్పారు. ఇక నుంచి తాను ఎన్ని కలకు ముందే సర్వే ఫలితాలను వెల్లడించబోనని చెప్పారు. కొన్నేళ్లుగా సర్వే ఫలితాలు చెబుతున్నానని, ఎన్నడూ తప్పు చెప్పలేదన్నారు. బెట్టింగులు చేసేవా డినైతే తనకు కావాల్సిన వారికి అనుకూలంగా చెప్పు కొనే వాడినన్నారు. ఇటీవల ఏపీ సీఎం చంద్ర బాబును కలిసి చర్చించిన విషయాలు బయటకు చెప్పుకొనేవైతే లోపల కూర్చొని ఎందుకు మాట్లాడు కుంటామని ప్రశ్నించారు. బయటకు చెప్పుకొనే విషయాలు కాదు కాబట్టే లోపల కూర్చొని మాట్లా డుకున్నామని, లేదంటే మీడియా ముందుకొచ్చే మాట్లాడుకొనేవారమని చెప్పారు. తాను ఏ పార్టీకీ చెందిన వ్యక్తి కాదని, ఎంతో మందిని కలుస్తుం టానని, అలాగే బాబును కలిశానని చెప్పారు. బాబు అండ్ కో మళ్లీ దొంగ ఎత్తులు ఈవీఎంలు, వీవీప్యాట్లపై లగడపాటి అను మానాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉందని తెలంగాణ బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పార్టీలు ఈవీఎంలను, వీవీ ప్యాట్లను ట్యాపరింగ్ చేసే అవకాశం ఉంటే ఇటీ వల మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయానికి చేరువగా ఉన్న చంద్రబాబు, ఆయన కోటరీ, ఎల్లో మీడియా దొంగ సర్వేలు, ఇతర ఎత్తుగడలతో ప్రజలను మభ్యపెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఓటమి గండం నుంచి గట్టె క్కేందుకు బాబు పడరాని పాట్లు పడుతున్నారు. హడావుడిగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. దొంగ సర్వేలతో ప్రజలను ఏమార్చేం దుకు యత్నిçస్తున్నారు. లగడపాటి, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణలతో అర్ధరాత్రి వరకు తన నివాసంలో మంతనాలు సాగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా లగడపాటిని బాబు తెరపైకి తీసుకొచ్చారు. ముందుగా తెలం గాణలో ఇండిపెండెంట్లు ఎక్కువ మంది గెలుస్తా రని చెప్పిన లగడపాటి పోలింగ్‌కు ముందు రోజు కూటమిదే విజయమన్నారు. కానీ, కూటమికి పరాభవం తప్పలేదు. ఇప్పుడు కూడా అవే ఎత్తుగడలతో బాబు ఏపీ ప్రజలను మభ్యపెట్టేలా వ్యూహాలు పన్నుతున్నారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం
హైదరాబాద్: ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయ డం అసాధ్యమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) రజత్‌కుమార్ స్పష్టంచేశారు. సాంకేతికంగా ఎంతో కట్టుదిట్టమైన భద్రతతో ఈవీఎంలను రూపొందించారన్నారు. అణుబాంబు వేసినా ఈవీఎంలు భద్రంగా ఉంటా యని తెలిపారు. బుధవారం హోటల్ టూరిజం ప్లాజాలో ఎన్నికల ప్రక్రియ విధానంపై ‘రేడియో జాకీలకు’అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రజత్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు రేడియో కార్యక్రమాలను ఆదరిస్తున్నారని, దీంతో రేడియో జాకీలుగా విధులు నిర్వహిస్తున్నవారు ఓటర్లను చైతన్యపరిచి ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకుని, ఓటుహక్కు ను వినియోగించుకునేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా ఎలా నమోదు కావాలి.. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాల్లో తప్పులు ఉంటే వాటిని ఎలా సరిచేసుకోవాలి వంటి పలు అంశాలపై ఓటర్లకు అవగాహన కల్పించాలని కోరారు. అర్బన్‌లో పోలింగ్ తక్కువ.. హైదరాబాద్‌లో పోలింగ్ శాతం తగ్గిందని, దానిని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రజత్ కుమార్ చెప్పారు. నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో 76 శాతం పోలింగ్ నమోదు అయిందని, తెలంగాణలో మాత్రం 73.4 శాతమే నమోదు అయిందన్నారు. అర్బన్ ప్రాంతాల్లోనూ పోలింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవడం తమ బాధ్యతగా భావించాలన్నారు. అనంతరం జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ముషారఫ్ ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరును రేడియో జాకీలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీఈఓలు అమ్రపాలి, రవికిరణ్ పాల్గొన్నారు. -
‘ఈవీఎంల భద్రత నిరూపించడానికి సిద్ధం’
సాక్షి, హైదరాబాద్ : ఈవీఎంల సెక్యూరిటీని నిరూపించటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. 1982 నుంచే ఈవీఎంలను వాడుతున్నామన్నారు. ఈవీఎంలపై వస్తున్న ఆరోణల గురించి కేంద్రం ఇప్పటికే క్లారిటీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈవీఎంల గురించి కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల పట్ల తానేమీ స్పందించనన్నారు రజత్ కుమార్. ప్రస్తుతం తాము పార్లమెంట్ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఓటర్ల కోసం 1950 హెల్ప్‌లైన్‌ను లాంచ్ చేశామని తెలిపారు. ఓటర్లకు ఎటువంటి అనుమానాలున్న 1950కి కాల్ చేయవచ్చన్నారు. ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాపై కూడా ఆంక్షలుంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం గురించి ఇప్పటికే సోషల్ మీడియా హెడ్స్‌తో మాట్లాడినట్లు తెలిపారు. -
ఈవీఎం.. దుమారం!
-
మళ్లీ బ్యాలెట్‌కు నో
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) విశ్వసనీయతపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా స్పందించారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలె ట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న కొన్ని రాజకీయ పక్షాల డిమాండ్‌కు తలొగ్గబోమని స్పష్టం చేశారు. మళ్లీ బ్యాలెట్ బాక్సులను వినియోగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈవీఎంలను కొందరు ఫుట్బాల్లా ఆడుకుంటున్నారనీ, వాటి పనితీరుపై ఉద్దేశపూర్వకంగానే బురద చల్లుతున్నారని మండిపడ్డారు. బ్యాలెట్‌తో సిబ్బందికి నరకమే.. ఢిల్లీలో గురువారం జరిగిన ‘మేకింగ్ అవర్ ఎలక్షన్స్ ఇన్‌క్లూజివ్ అండ్ యాక్సెసబుల్’ అనే కార్యక్రమంలో అరోరా మాట్లాడుతూ.. ‘నేను ఒక విషయాన్ని స్పష్టం చేయదలచుకున్నాను. ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లో కూడా మేం బ్యాలెట్ పేపర్ల విధానానికి మొగ్గుచూపబోం. మనుషుల సాయంతో బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లడం, కౌంటింగ్‌లో తీవ్రమైన ఆలస్యం.. ఇదంతా పోలింగ్ సిబ్బందికి నరకంలా ఉంటుంది. రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి విమర్శలు, సలహాలు స్వీకరించేందుకు సిద్ధం గా ఉన్నాం. ఇదే సమయంలో బెదిరింపులు, ఒత్తిడి, విజ్ఞప్తులకు తలొగ్గి ఈవీఎంలను వదిలి బ్యాలెట్ విధానానికి మళ్లే ప్రసక్తే లేదు. మనం ఈవీఎంలను ఫుట్‌బాల్‌గా ఎందుకు మార్చేశాం? వాటిపై ఉద్దేశపూర్వకంగా బురదచల్లే కార్యక్రమం కొనసాగుతోంది’ అని తెలిపారు. ఒకే ఫలితం రావాలి కదా.. ఈవీఎంల సమర్థతపై స్పందిస్తూ..‘2014 లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్నిరోజులకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, మిజోరంతో పాటు తాజాగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్.. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఎన్నికల ఫలితాలు నమోదయ్యాయి. నిజంగా ఈవీఎంలలో సమస్య ఉంటే ఇక్కడంతా ఒకేరకమైన ఫలితాలు రావాలి కదా. ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్)లో రూపొందిస్తారు. వీటిని హ్యాక్ లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం. ఇటీవల రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1.76 లక్షల పోలింగ్ కేంద్రాల్లో కేవలం ఆరంటే ఆరు చోట్ల మాత్రమే ఈవీఎంల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయంలో అలసత్వం చూపకుండా మేం వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దాం’ అని అరోరా వెల్లడించారు. ఇక వీవీప్యాట్ యంత్రాలకు సంబంధించి చిన్నచిన్న ఘటనలు నమోదయ్యాయని అంగీకరించారు. వీవీప్యాట్ యంత్రాల వినియోగం విషయంలో ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నామనీ, ఈ తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. ‘బ్యాలెట్’తోనే ఎన్నికలు జరపండి త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈవీఎంల సమర్థతపై తలెత్తిన వివాదంతో మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే నీలినీడలు కమ్ముకున్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాల కోసం సాంకేతికను దుర్వినియోగం చేస్తున్నారనీ, ఇందులో తమకు ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. విద్యావంతులైన ప్రజలు ఈవీఎంలకు వ్యతిరేకంగా గొంతు విప్పాలన్నారు. హ్యాకర్ సయిద్ షుజా చేసిన ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్‌చేశారు. -
ఈవీఎంల హ్యాకింగ్‌పై సాక్ష్యాల్లేని ఆరోపణలు
ఎన్నికలలో రిగ్గింగ్ చేయ డంవల్లనే కొన్నిపార్టీలకు సుడిగాలి విజయాలు సాధ్యమవుతున్నాయని ఏదో ఒక మూల అనుమానం చాలామందికి వస్తూనే ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) వచ్చిన తరువాత ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేకుండా పోతున్నారు. ఎంపీ సుబ్రమణ్యస్వామితో కలిసి హైదరాబాద్‌కు చెందిన వి.వి.రావు ఈవీఎం లోపాలపై ఉద్యమం నిర్మించే కార్యక్రమం చేపట్టారు. వీరి కృషి వల్లే వీవీప్యాట్ (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) ప్రవేశ పెట్టారనీ అంటారు.ఎన్నికల మోసాలను పేపర్ ఆడిట్ ట్రయల్ ద్వారా అరికట్టవచ్చుననీ అంటున్నారు. కాగితం లేని ఈవీఎంల కన్నా పరీక్షించే ఆస్కారం ఉన్న వీవీప్యాట్ ఈవీఎంలు చాలావరకు నయం. ఇదివరకు ఓట్ల సంఖ్యలో తేడా వస్తే మళ్లీ ఓట్లను లెక్కించే వీలుండేది. కానీ సైబర్ డబ్బాలలో ‘స్టోర్డ్ ఓట్లు’ అంటే పడి ఉన్న ఓట్లను ఎన్నిసారు లెక్కించినా ప్రయోజనం లేదు. కనుక ఈవీఎంను సైబర్ మాయల పేటిక అని అనుకోవచ్చు. మీట నొక్కితే ఏం జరుగుతుందో ఎవరికీ కనిపించదు. వీవీప్యాట్ ఉంటే మామూలుగా ఓట్లను మళ్లీ మళ్లీ లెక్కించినట్టే వీటిని కూడా లెక్కించవచ్చు అన్నారు గానీ, ఇటీవలి తెలంగాణ ఎన్ని కల్లో మళ్లీ లెక్కించమని అడిగితే ఎన్నికల సంఘం కుదరదని చెప్పేసింది. ఎవరో కావాలని కుట్ర చేయకపోయినా, చెడిపోయినందుకు కూడా యంత్రం సరిగ్గా పనిచేయకపోవచ్చు. అందువల్ల కొందరు గెలవచ్చు మరికొందరు ఘోరంగా ఓడిపోనూవచ్చు. ఈ అనుమానాస్పదమైన వాతావరణంలో లండన్‌లో ఒకాయన తాను సయ్యద్ షుజా, సైబర్ నిపుణుడినని చెప్పుకుంటూ ఈవీఎంల లోగుట్టు విప్పి చూపిస్తానని సవాలు విసిరి జర్నలిస్టుల సమావేశం ఏర్పాటు చేశాడు. కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ప్రత్యేకంగా లండన్ వెళ్లి విలేకరులకు వీడియో ప్రదర్శన నిర్వహించే వేదిక మీద కూర్చున్నారు. షుజా లండన్ రాలేదు. కాలిఫోర్నియా నుంచి వీడియో సమావేశంలో పాల్గొన్నాడు. సగం ముఖం దాచుకుని అంతగా వెలుగు లేని మసకమసక గదిలో కూచుని షుజా చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. కానీ తన ప్రదర్శనలో విఫలమైనాడని పత్రికలు వెల్లడించాయి. షుజా ఆరోపణల తీవ్రత ఎంత గాఢంగా ఉందంటే దేన్ని నమ్మాలో తెలియక జనం గందరగోళంలో పడతారు. షుజా లేవనెత్తిన సంచలన భయానక ఆరోపణలు కొన్ని: 1. బీజేపీ ప్రభంజనం వీచిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగింది. 2. ఈవీఎం టాంపరింగ్ వల్ల కాంగ్రెస్ 201 సీట్లను కోల్పోయింది. 3. మోదీ కేబినెట్లో చేరిన గోపీనాథ్ ముండేకు 2014 రిగ్గింగ్ ఏ విధంగా జరిగిందో తెలుసు. అందుకే మంత్రి అయిన కొద్దిరోజులకే చని పోయాడు. ఈ రహస్యం తెలుసుకనుకనే ఆయన్ను చంపేశారు. 4. ముండే మరణ ఘటనపైన ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి ప్రయత్నించినందుకే ఎన్ఐఏ ఆఫీసర్ తాంజిల్ అహ్మద్‌ను చంపేశారు. 5. కాంగ్రెస్ లీడర్ కపిల్ సిబల్ 2014 ఎన్నికలలో బీజేపీని గెలిపించేందుకు రిగ్గింగ్ చేయమని అడిగారు. 6. 2015 లో ఢిల్లీ ఎన్నికలలో ఈవీఎం రిగ్గింగ్‌ను షుజా అనుచరులు నిరోధించడం వల్లనే ఆప్ పార్టీ 70లో 67 స్థానాలను గెలిచింది. 7. మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఛత్తీస్‌గఢ్ ఎన్నికలలో బీజేపీ రిగ్గింగ్ ప్రయత్నాలను షుజా నిరోధించడం వల్లనే ఆ రాష్ట్రాలలో బీజేపీ గెలవలేకపోయింది. 8. బీజేపీ ఈవీఎం హాక్ చేయడానికి రిలయన్స్ కమ్యూనికేషన్ వారు సహకరించారు. 9. గౌరీ లంకేశ్ ఈ రిగ్గింగ్ కథనాన్ని ప్రచురించడానికి సిద్ధపడ్డారు. ఈ విషయమై ఆర్టీఐ కూడా వేశారు. అందుకే హత్యకు గురయ్యారు. ఇందులో ఏ ఆరోపణలకు కూడా షుజా సాక్ష్యాలు చూపలేదు. షుజా మిగిలిన ఆరోపణలకు రుజువులు ఇచ్చినా ఇవ్వలేకపోయినా, కనీసం హాకింగ్ సాధ్యమని రుజువు చేస్తారనుకున్నారు. అక్కడా షుజా విఫలమైపోయారు. తాను పనిచేశానని ఆయన చెప్పుకున్న సంస్థలలో ఏ సంస్థా దాన్ని ధ్రువీకరించలేదు. ఎన్నికల సంఘం వెంటనే ఈ ఆరోపణలు ఖండించింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించింది. ఎన్నికల సంఘం చేతులు కలపడం వల్లనే రిగ్గింగ్ సాధ్యమైందని ఆరోపణ చేసినందున వారు అధికారికంగా ఖండించడం సమంజసమే అనిపించినా, అసలు రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందా లేదా అని ప్రజలకు విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ ఆరోపణల్లో లవలేశమైనా నిజం ఉండొచ్చునని అనుమానించే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత, ఈవీఎం ద్వారా ఎన్నికల ప్రజాస్వామ్యం మీద విశ్వాసం కలిగించే బాధ్యత ఎన్నికల సంఘం మీదే ఉంది. వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర మాజీ సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
బ్యాలెట్‌తో ఎన్నికలు జరిపే ప్రసక్తే లేదు
-
ఓటింగ్ యంత్రాలను రద్దు చేయాలని మాయవతి డిమాండ్
-
ట్యాంపరింగ్ చేసే గెలిచావా బాబూ?
సాక్షి, హైదరాబాద్: ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు ట్యాంపరింగ్ చేసే అధికారంలోకి వచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. అదే నిజమైతే కాంగ్రెస్‌తో కలిసి ఆరోపణలు చేస్తున్న బాబు ఒక్క క్షణం కూడా సీఎం పదవిలో ఉండటానికి వీల్లేదని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా ఈవీఎంల ట్యాంపరింగ్, 11 మందిని కాల్చి చంపించినట్లు చేసిన సయ్యద్ షుజా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ చేసిన ఆరోపణలపై బుధవారం కిషన్‌రెడ్డి స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత కపిల్ సిబల్, సయ్యద్ షుజాలపై డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ రామచంద్రరావుతో కలిసి డీజీపీని కలిశారు. రాజకీయ దురుద్దేశంతోనే కుట్రపూరితంగా రాహుల్ గాంధీ, సిబల్, షుజా ఈ ఆరోపణలు చేశారని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కపిల్ సిబల్ సమక్షంలోనే షుజా మాట్లాడారని.. ఈవీఎంలలో లోపాలుంటే రుజువు చేయాలని సవాల్ చేశారు. అక్కడ కూడా ట్యాంపరింగేనా?: దత్తాత్రేయ ఈవీఎంలపై కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మానుకోవాలన్నారు. ప్రజలంతా మోడీవైపే చూస్తున్నారన్నారు. 10% రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. గవర్నర్ ప్రసంగంలో ఆ అంశం లేకపోవడం భాధాకారమన్నారు. ఏపీలో చంద్రబాబు కాపులకు ఇస్తానన్న 5% రిజర్వేషన్లు బీజేపీ పుణ్యమేనన్నారు. -
‘నాపై కేసు ఎందుకు పెట్టలేదు’
సాక్షి, హైదరాబాద్ : గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాను హత్యా రాజకీయాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని అన్నారు. ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్, భారత హ్యాకర్ సయ్యద్ షుజాలపై డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కుట్రపూరితంగా రాహుల్ గాంధీ, సిబల్, షుజా ఈ ఆరోపణలు చేశారని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సమక్షంలోనే షుజా మాట్లాడారని, ఈవీఎంల్లో లోపాలు ఉంటే రుజువు చేయాలని ఆయన సవాల్ చేశారు. కాకిరెడ్డి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 11 మందిని హత్య చేయిస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.చనిపోయిన వాళ్లపై మిస్సింగ్ కేసులు ఎక్కడ నమోదయ్యాయో, షుజా చెప్తున్న గెస్ట్ హౌజ్ ఎక్కడెక్కడ ఉందో తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం వల్లే బీజేపీ 2014 లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని భారత హ్యాకర్ సయ్యద్ షుజా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో గొడవ జరగడంతో బీజేపీ నేత కిషన్ రెడ్డి తమపై గన్ మెన్లతో కాల్పులు జరిపించారనీ, ఈ ఘటనలో 11 మంది చనిపోయారని ఆరోపించారు. 2014 మే13 తెల్లవారుజామున 13 మందితో గెస్ట్‌హౌస్‌కు వెళ్లామని సుజా తెలిపారు. అక్కడే ఉన్న కిషన్ రెడ్డి.. తమను చంపేయమంటూ గన్మెన్లకు ఆదేశించారని చెప్పారు. వాళ్లు జరిపిన కాల్పుల్లో తమ వాళ్లు 11 మంది చనిపోయారని సయ్యద్ షుజా వెల్లడించారు. మృతుల్లో సమావేశం నిర్వహించిన కమల్‌రావు కూడా ఉన్నారని, తాను తప్పించుకుని అమెరికా వెళ్లిపోయానని సుజా తెలిపారు. ఆ తర్వాత వాటిని మతకలహాల మరణాలుగా మార్చారని ఆరోపించారు. ఇది చదవండి : 2014లో రిగ్గింగ్ జరిగింది! -
ఈవీఎంలపై దుమారం
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వాటికి మరింత విశ్వసనీయత పెంచేలా... రాజకీయ పార్టీలు జవాబుదారీతనం అలవర్చుకునేలా... చట్టసభలు రాజ్యాంగ నిబంధనలను గౌరవించేలా చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలన్న చర్చ జరగడానికి బదులు వేరే అంశాలు రంగం మీదికొస్తు న్నాయి. అమెరికాలో ముసుగు ధరించి కూర్చుని సామాజిక మాధ్యమం స్కైప్ ద్వారా సోమవారం లండన్‌లో మీడియాతో మాట్లాడిన సయ్యద్ షుజా లేవనెత్తిన ఈవీఎంల అంశం అటువంటిదే. ఎన్ని కల సీజన్ వచ్చినప్పుడల్లా ఈ వివాదం తెరపైకి రావడం మన దేశంలో రివాజుగా మారింది. కాక పోతే సయ్యద్ షుజా ఈసారి మసాలా అద్దాడు. అందులో రోడ్డు ప్రమాదాలు, పోలీసు ఎన్కౌంటర్లు, గుర్తు తెలియని వ్యక్తులు చేసిన హత్యలు ఉన్నాయి. తాను అలా బలికా కుండా ఉండటానికి భారత్ నుంచి పారిపోయి వచ్చానని కూడా చెప్పాడు. సయ్యద్ షుజాను చూస్తే దేశంలోని ఇతర రాష్ట్రాలవారి మాటెలా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాలవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్ఫురణకొస్తారు. హైదరాబాద్‌ను కట్టించింది తానే నని, సెల్ఫోన్లు తన ఘనతేనని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించింది తానేనని బాబు అవకాశం దొరికినప్పుడల్లా చెబుతూనే ఉంటారు. ఈవీఎంలను ‘ట్యాంపర్’ చేయవచ్చునని ఎవరికైనా అనుమానం ఏర్పడినా, దాన్ని నిరూపి స్తామని ముందుకొచ్చినా వారిని తప్పుబట్టాల్సిన పనిలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలక మని భావించే ఎన్నికలు సందేహాతీతంగా ఉండాలని, ప్రజల తీర్పు వమ్ముకాకుండా పక డ్బందీ ఏర్పాట్లుండాలని పౌరులంతా కోరుకుంటారు. అందువల్లే పౌర సమాజ సంఘాలు, రాజ కీయ పక్షాలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేసినప్పుడల్లా ఎన్నికల సంఘం(ఈసీ) స్పందించి వివరణనిస్తూనే ఉంది. అలాగే పోలింగ్‌కు ముందు ఈవీఎంలను ప్రతి దశలోనూ తనిఖీ చేసుకునేందుకు, వాటి పనితీరును పరీక్షించేందుకు పార్టీల ప్రతినిధులకు అవకాశమిస్తున్నారు. ఈవీ ఎంలను ప్రభుత్వ రంగ సంస్థలైన బెంగళూరులోని బెల్, హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ ఉత్పత్తి చేస్తు న్నాయి. వాటిల్లో వినియోగించే సాఫ్ట్వేర్ పోగ్రాం కోడ్‌ను ఆ సంస్థలే రూపొందించాయి. దానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా కల్పించామని చెబుతున్నాయి. ఈవీఎంలలో వాడే సెమీ కండ క్టర్ మైక్రోచిప్‌ల ఉత్పత్తి ఇక్కడ లేకపోవడం వల్ల వాటి కోసం విదేశీ ఉత్పత్తిదారులను ఆశ్రయించ వలసి వస్తున్నదని ఈసీ గతంలో వివరించింది. ఇందువల్ల ఇదంతా బయటకు పోయే అవకాశమున్న దని ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదని, సాఫ్ట్వేర్ ప్రోగ్రాం కోడ్‌ను మెషీన్ కోడ్‌గా మార్చి పంపుతాం గనుక దాన్ని ఇతరులు చదవడం(రీడ్) లేదా నకలు తీయడం అసాధ్య మని ఈసీ వివరి స్తోంది. ఈవీఎంలకు వైఫై, బ్లూ టూత్ వగైరాలను అనుసంధానించడం కుదరని పని అని చెబు తోంది. ఈసీ వివరణతో సంతృప్తి చెందాల్సిన పని లేదు. ఎందుకంటే సాంకేతికత రోజురోజుకూ అభి వృద్ధి చెందుతోంది. అది బహుముఖాలుగా విస్తరిస్తోంది. దాన్ని అనేకులు అంది పుచ్చుకుని తమ సృజనాత్మకతను చాటుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఎవరికైనా ఈవీఎంలపై కొత్త అనుమానాలు తలెత్తితే వాటిని సైతం ఈసీ ముందు ఉంచవచ్చు. అయితే అందుకు కొన్ని పద్ధతులుంటాయి. వాటిని కాదని అడ్డదార్లు తొక్కితే చివరకు అలాంటివారే నవ్వులపాలవుతారు. 2010లో ఈవీఎంలను ఎలా ‘ట్యాంపర్’ చేయవచ్చునో ‘ప్రయోగాత్మకం’గా నిరూపిస్తానని ఒక వ్యక్తి బయల్దేరినప్పుడు అప్పటికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అతనికి మద్దతు పలికి, ఢిల్లీకి తీసుకెళ్లి దాన్నొక జాతీయ వివాదంగా మార్చడానికి ప్రయత్నించారు. చిత్రమేమంటే బీజేపీ, వామపక్షాలు కూడా చంద్రబాబుకు అప్పుడు మద్దతు పలికారు. తీరా హరిప్రసాద్ ఉపయోగించిన ఈవీఎం ముంబై కలక్టరేట్ నుంచి మాయమైన చోరీ సొత్తని అక్కడి పోలీసులు తేల్చారు. అప్పట్లో ఆయన్ను అరెస్టు చేశారు. మన దేశంలో ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ అందుకు దారితీసిన పరిస్థితులపై ఆత్మవిమర్శ చేసుకోవడం కంటే ముందు ఈవీఎంలను తప్పుబట్టడం అలవాటైంది. అవే పార్టీలు విజయం సాధించినప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోతాయి. ఎన్నికలు జరిగాక ఆరోపించడంకాక ముందే అలా చెబితే, దాన్ని నిరూపించడానికి పూనుకుంటే వేరుగా ఉంటుంది. కానీ ఏ పార్టీ కూడా ఆ పని చేయదు. 2004 ఎన్నికల సమయంలో తాను అధికారంలో ఉండటం వల్ల అప్పట్లో చంద్రబాబు ఈవీఎంలపై ఎలాంటి ఆరోపణలూ చేయలేదు. 2009 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పుడు ఆయన ఈవీ ఎంలలో మోసం జరిగిందని గగ్గోలు పెట్టారు. అనంతరకాలంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈవీ ఎంలకు ప్రింటర్(వీవీప్యాట్)లను అనుసంధానించడం కూడా మొదలైంది. షుజా తాను ఏకరువు పెట్టిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపడంలో విఫలమయ్యాడు. ఈవీఎంల సంగతలా ఉంచి అతని పేరు, ఊరు కూడా నిజమో కాదో చెప్పలేని స్థితి ఉంది. తాను ఈసీఐఎల్ మాజీ ఉద్యోగినని అతగాడు చెబుతుంటే, అలాంటివారెవరూ ఎప్పుడూ పనిచేయలేదని సంస్థ నిర్వాహకులు, సిబ్బంది కూడా చెబుతున్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే దుర్మరణం, గౌరీ లంకేష్ హత్య కూడా అతను ఈవీఎంలతో ముడిపెట్టాడు. హైదరాబాద్‌లో తన బృందం సభ్యుల్ని పోలీసులు కాల్చిచంపడం వల్ల భయపడి భారత్ విడిచి వచ్చానంటున్నాడు. ఇందులో ఏ ఉదం తానికీ తగిన ఆధారాలు షుజా చూపలేకపోయాడు. ఇలాంటి వ్యక్తి మాటలకు విలువిచ్చి కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్ తదితర పక్షాలు ఈవీఎంలపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. దానికి బదులు తాము విశ్వసనీయులని భావించే నిపుణుల ద్వారా మరోసారి ఈవీఎంలనూ, వీవీప్యాట్లను పరీక్షించడానికి అవకాశమివ్వమని ఈసీని ఆ పార్టీలు కోరడం ఉత్తమం. ఇప్పుడు విపక్షాల తీరును తప్పుబడుతున్న బీజేపీ తాను విపక్షంలో ఉన్నప్పుడు ఇదే తీరున ఈవీఎంలపై సందేహం వ్యక్తం చేసిన సంగతిని గుర్తుతెచ్చుకోవాలి. -
ఈవీఎం ట్యాంపరింగ్: సయ్యద్ షుజాపై పోలీసులకి ఈసీ ఫిర్యాదు
-
2014 ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాకయ్యాయి
-
సంచలన ఆరోపణలు చేసిన భారతీయ హ్యాకర్!
లండన్/న్యూఢిల్లీ: అమెరికాలో తలదాచుకుంటున్న భారతీయ హ్యాకర్ ఒకరు సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) హ్యాక్ చేయడం ద్వారానే బీజేపీ విజయం సాధించిందని సయిద్ షుజా అనే హ్యాకర్ బాంబు పేల్చారు. ఇందుకు టెలికాం సంస్థ రిలయన్స్ జియో సహకరించిందని తెలిపారు. జియో రూపొందించిన మిలటరీ గ్రేడ్ లో–ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ను తన బృందం అడ్డుకోకుంటే ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీనే విజయం సాధించేదని వెల్లడించారు. 2014 నాటికి జియో తన సేవలను ప్రారంభించకపోవడం గమనార్హం. ఈవీఎంల హ్యాకింగ్‌లో కేవలం బీజేపీనే కాకుండా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్కూ ప్రమేయం ఉందని షూజా ఆరోపించారు. తన బృందంలో కొందరిని హత్య చేయడంతో 2014లోనే తాను భారత్ విడిచి పారిపోయానన్నారు. లండన్‌లో సోమవారం స్కైప్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో ముసుగు ధరించి షుజా మాట్లాడారు. అయితే తన ఆరోపణలకు తగిన సాక్ష్యాలను ఆయన చూపలేదు. లండన్ మీడియా సమావేశంలో షుజా మాట్లాడుతూ.. ‘నేను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో 2009–14 మధ్య పనిచేశాను. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను నా బృందమే డిజైన్ చేసింది. కొత్త ఈవీఎంలను హ్యాక్ చేయగలమా? ఎలా చేయగలం? అన్న విషయాన్ని పరిశీలించాలని ఈసీఐఎల్ మమ్మల్ని కోరింది. ఈసీఐఎల్, బీఈఎల్ రూపొందించే ఈవీఎం లను హ్యాక్ చేయగలం. రిలయన్స్ జియో అందించిన ఓ మాడ్యులేటర్ ద్వారా మిలటరీ గ్రేడ్ లోఫ్రీక్వెన్సీ తరంగాలతో బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేసింది. తద్వారా 2014 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టే బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండేను లోక్‌సభ ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే చంపేశారు. 2014 ఎన్నికల తర్వాత నా బృందానికి చెందిన కొందర్ని చంపేశారు. నాపై కూడా దాడి జరిగినప్పటికీ తప్పించుకోగలిగాను’ అని తెలిపారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం: ఈసీ హ్యాకర్ షుజా ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఖండించింది. బీఈఎల్, ఈసీఐఎల్ రూపొందించే ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్ చేయలేరని స్పష్టం చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను రూపొందిస్తామనీ, సాంకేతిక కమిటీ సమక్షంలో నిబంధనల మేరకు ఈ యంత్రాలను కఠినమైన పరీక్షలకు లోనుచేస్తామని వెల్లడించింది. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ డిమాండ్ చేశారు. అది హ్యాకింగ్ హర్రర్ షో: బీజేపీ లండన్‌లో జరిగిన మీడియా సమావేశాన్ని కాంగ్రెస్ నిర్వహించిన ‘హ్యాకింగ్ హర్రర్ షో’గా బీజేపీ అభివర్ణించింది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి కారణాలను ఆ పార్టీ వెతుక్కుంటోందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించారు. కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఈ కార్యక్రమానికి వెళ్లడం యాదృచ్ఛికం కాదనీ, సోనియా, రాహుల్ ఆయన్ను పంపారని దుయ్యబట్టారు. ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్ చేయలేరనీ, దేశవ్యతిరేక శక్తులు కాంగ్రెస్ పార్టీ బుర్రను హ్యాక్ చేశారని చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్‌లోనూ ప్రాబల్యం ఉందనీ, అలాంటివారు లండన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏమంత పెద్దవిషయం కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యూపీఏ పదేళ్ల హయాంలో ఎన్నికలన్నీ ఈవీఎంల ద్వారానే జరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. -
ఈవీఎంలపై అనుమానం అక్కర్లేదు
చంఢీగఢ్: ఈవీఎంల (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్)పై ఎటువంటి అనుమానం అక్కర్లేదని, వాటి పనితీరును అత్యంత సాంకేతిక పరిజ్ఞానం గల నిపుణులతో పర్యవేక్షిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎమ్ఈఆర్)నూతన విద్యా సంవత్సర ప్రారంభోత్సవ సమావేశంలో ‘ముందుకు సాగడానికి అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై మాట్లాడారు. ఈవీఎం వ్యవస్థ పనితీరుపై అసలు సందేహ పడాల్సిన అవసరమే లేదని ఆయన స్పష్టం చేశారు. పలు రాజకీయ పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ సీఈసీపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అరోరా ఈమేరకు వ్యాఖ్యానించారు. ‘ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిందేమిటంటే ఏ యంత్రమైనా పాడవుతుంది. కానీ పాడవడానికి, సరిగా పనిచేయకపోవడానికి మధ్య తేడా ఉంది. మీరు ఒక కారు కొన్నారు అనుకోండి అది ఓ వారం లోపు పనిచేయకపోవచ్చు’అని ఉదహరించారు. ఇవేమీ పట్టించుకోకుండా ప్రజలు ఇష్టమొచ్చినట్లు ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను విశ్వసనీయతతో, నిష్పాక్షికతతో, నైతికతతో నిర్వహించడానికి మాకు సాధ్యమైనంత వరకు పనిచేస్తామని వెల్లడించారు. పీజీఐఎమ్ఈఆర్ 2018లో దేశంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో 2వ ర్యాంకు సాధించినందుకు అభినందించారు. సమావేశంలో పీజీఐఎమ్ఈఆర్ డైరెక్టర్ జగత్ రామ్, కాలేజీ ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ ఎన్నికలు: కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో టీ బీజేపీ నేతలు గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్షలమంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తొలగించిందని, అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవిధంగానే ఈ ప్రక్రియ జరిగిందని బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మజ్లిస్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య పెరిగిందని, అదే బీజేపీ ప్రాబల్యమున్న చోట్ల ఓట్లసంఖ్య తగ్గడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. ఓటర్ల తొలగింపు విషయంలో పొరపాట్లు దొర్లాయని, అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని అంగీకరిస్తూ.. రాష్ట్ర ఎన్నికల అధికారి క్షమాపణలు కూడా కోరారని, ఓటర్ల జాబితా విషయమై జరిగిన అక్రమాలకు ఇదే నిదర్శనమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. తాము లేవనెత్తిన అంశాలను పరిశీలించి.. తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ తమకు హామీ ఇచ్చినట్టు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఎన్నికల ఓటర్ల నమోదు, తొలగింపు అంశంలో జరుగుతున్న అవకతవకలను బీజేపీ ఎప్పటికప్పుడు లేవనెత్తుతూనే వచ్చిందని, సాంకేతికత విషయంలో ఎదురయ్యే లోపాలను సరి చేయాలన్నదే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ తరహాలో ఈవీఎంలపై తమకు అనుకూలమైన సందర్భంలో ఒకలాగా, వ్యతిరేకంగా ఫలితాలు వచ్చిన సందర్భంలో మరోలాగా తాము మాట్లాడబోమని ఆయన చెప్పారు. -
‘ఈవీఎంలపై డౌట్స్.. కేటీఆర్‌కు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్పై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో జరిగిన తాజా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలు సంపత్ కుమార్, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్‌లు గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురైనట్టు ఆరోపించారు. కేటీఆర్‌కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. పొంతన లేని ఫలితాలు వచ్చాయి ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. పోలింగ్ సరళిని దగ్గరుండి గమనించినట్టు తెలిపారు. ప్రచారం అప్పటికీ.. పోలింగ్ డే రోజుకి ఏ మాత్రం పొంతన లేని ఫలితాలు వచ్చాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలు కలిసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్టు అనుమానం ఉందన్నారు. 2009 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు కేసీఆర్ అప్పట్లో చెప్పినట్టు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, కవిత వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్లతో పాటు ఫోన్ నంబర్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపితే అందుకు కావాల్సిన ఆధారాలు తానే ఇస్తానని అన్నారు. కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్దమైతే వాస్తవాలను నిరూపిస్తానని తెలిపారు. 2014లో తాము ఓడిపోయినప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయలేదని గుర్తుచేశారు. ఎగ్ న్యాక్ కంపెనీకి తెలంగాణ ప్రజల ఓట్లను పంపించి ట్యాప్ చేశారని ఆరోపించారు. రజత్ కుమార్‌కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు పునాది లాంటివని అన్నారు. రాజ్యంగ బద్దమైన ఎన్నికలకు టీఆర్ఎస్ తూట్లు పొడించదని విమర్శించారు. ఎన్నికల కమిషన్ పాలక వర్గానికి పాలేరులా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పు జరగలేదని సుప్రీం కోర్టు, హైకోర్టులలో చెప్పిన తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్.. 22 లక్షల ఓట్లను తీసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రజత్ కుమార్‌కు లై డిటెక్టర్ టెస్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వారికి కావాల్సిన వారిని గెలిపించుకుని మిగతా వారిని ఓడించారని ఆరోపించారు. ఈవీఎంలు మోరాయించిన అధికారులు పట్టించుకోలేదని అన్నారు. కౌటింగ్ ఫామ్‌లో ఓ లెక్క.. చివరగా తమకిచ్చిన పేపర్లలో వేరే లెక్కలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన చోట జామర్లు పెట్టమంటే ఎన్నికల అధికారులు నిరాకరించారని తెలిపారు. తెలంగాణను అసెంబ్లీగా చేసుకుని పోరాడుతాం అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ప్రజా క్షేత్రంలో ఫెయిల్ అయ్యామని కాంగ్రెస్ కాళ్లు పట్టుకుంటే తామే టీఆర్ఎస్కు అధికారం ఇచ్చే వాళ్లమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోల్ అయిన ఓట్ల కంటే 1056 ఓట్లు ఎక్కువ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చిన్న తమ్ముడని.. ఆయన పేరు కేడీఆర్ అని విమర్శించారు. 19 ఈవీఎంలను రీ కౌంటింగ్ పెట్టాలని కోరిన ఎన్నికల అధికారులు వినలేదని తెలిపారు. ప్రజలు మా వైపు ఉన్నారని.. ఈవీఎంలు టీఆర్ఎస్ వైపు ఉన్నాయని వ్యాఖ్యానించారు. భారతదేశంలోనే అతి ఖరీదయిన ట్యాంపరింగ్ తెలంగాణ ఎన్నికల్లో జరిగిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని పేర్కొన్నారు. తెలంగాణను అసెంబ్లీలాగా చేసుకుని తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. -
‘ఐ విల్ ఓట్.. బికాస్ ఐ లవ్ నిర్మల్’ ప్రచార సెల్ఫి బోర్డు
సాక్షి, నిర్మల్: ఎప్పటిలాగే ఇప్పుడూ ఓటేసిండ్రు. కానీ.. ఈసారి గత రికార్డులు బద్దలు కొట్టేసిండ్రు. ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలుస్తారో.. మరో రెండు రోజుల తర్వాత తెలుస్తుంది. కానీ.. జిల్లాలో శుక్రవారం నమోదైన పోలింగ్ శాతంతో ఓటరన్న మా త్రం గెలిసిండు. అంతేకాదు.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించిండు. జిల్లా అధికారు లు పడ్డ శ్రమకు తగ్గట్లుగా ఫలితం వచ్చింది. జిల్లాలో ఈసారి ఎన్నికల్లో 80శాతానికిపైగా పోలింగ్ నమోదు కావడం విశేషం. గత ఎన్నికల్లో 74శాతం మాత్రమే నమోదైంది. నాలుగున్నరేళ్ల తరువాత జరిగిన జిల్లా ఓటర్లు అధికారుల అంచనాలకు దగ్గరగా వచ్చారు. ఈ సారి 90శాతం ఓటింగ్ లక్ష్యంగా అధికారులు పనిచేశారు. ఈ క్రమంలో గత ఎన్నికలను మించి ఓటింగ్ శాతం నమోదైంది. స్వచ్ఛందంగా వచ్చి... పొద్దున 7గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఏ పార్టీ అభ్యర్థులు, నాయకులు చెబితేనో తాము రాలేదని.. తమ హక్కును వినియోగించుకునేందుకే వచ్చామని అధిక సంఖ్యలో ఓటర్లు పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఈ సారి ఎన్నికల్లో ఓటర్ల తీరు మారినట్లు కనిపించింది. సామాజిక మాధ్యమాలు, మీడియా, అధికారులు చేసిన ప్రచారం ప్రభావం చూపించింది. అధిక శాతం ఓటర్లు స్వచ్ఛందంగానే వచ్చి ఓటు వేసి వెళ్లారు. ఈవీఎంలు మొరాయించినా.. క్యూ లైన్లు భారీగా ఉన్నా.. గంటల పాటు ఓపికతో నిల్చుని ఓటు వేశారు. సాధారణ ఓటర్లతో పాటు దివ్యాం గ ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం గమనార్హం. ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలకు వారిని తీసుకురావడానికి ప్రత్యేకంగా వాహన సౌకర్యాన్ని, వీల్చైర్లను ఏర్పాటు చేసింది. కొంతమంది దివ్యాంగులు వీటిని ఉపయోగించుకున్నారు. చాలామంది స్వతహాగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి వెళ్లారు. పల్లెలు ఆదర్శం.. ప్రజాస్వామ్యం కలిపించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడంలో పల్లె ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. పట్టణ ప్రాంతాల కంటే జిల్లాలోని పల్లెలలోనే పోలింగ్ శాతం అధికంగా నమోదైంది. పలు గ్రామాల్లో 95శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. దాదాపు ప్రతీ గ్రామంలో 75శాతానికిపైగా పోలింగ్ నమోదు కావడం విశేషం. పట్టణాల్లో మాత్రం చాలా పోలింగ్స్టేషన్లలో గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది. కానీ చాలా పోలింగ్స్టేషన్లలో 70శాతంలోపు పోలింగ్ కావడం కనిపించింది. ఇక ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం, పెంబి, దస్తురాబాద్, ఖానాపూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, జన్నారం, సిరికొండ, నిర్మల్ నియోజకవర్గంలోని మామడ, దిలావర్పూర్, నర్సాపూర్(జి), ముథోల్ నియోజకవర్గంలోని కుభీర్, తానూర్ తదితర మండలాల్లో ఇబ్బందికమైన పరిస్థితులను దాటుకోని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సాయంత్రం వరకు వరసల్లో నిల్చుని ఓటు వేసి వెళ్లారు. లేచింది మహిళాలోకం.. స్త్రీ,పురుష జనాభా నిష్పత్తి అధికంగా గల జిల్లాగా పేరున్న నిర్మల్‌లో ఎన్నికల్లోనూ మహిళాలోకం ఓటెత్తింది. ఉదయం 7గంటల నుంచి సాయం త్రం 5గంటల వరకు జిల్లాలోని ఏ పోలింగ్ స్టేషన్ల్లో చూసిన మహిళ ఓటర్లే ఎక్కువగా కనిపించారు. ఓపికగా వచ్చి గంటల పాటు వేచి ఉండి మరీ మహిళామణులు ఓట్లు వేసి వెళ్లారు. నిర్మల్ నియోజకవర్గంలో మొత్తం మహిళ ఓటర్లు 1,14,178 మంది ఉండగా 95,375మంది మహిళలు ఓట్లు వేశారు. అలాగే ముథోల్ నియోజకవర్గంలో మొత్తం 1,10,705మంది ఓటర్లు ఉండగా శుక్రవారం 94,027మంది ఓటర్లు వేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో మొత్తం మహిళ ఓటర్లు 94,944 ఉండగా 79,836మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా మొత్తంలో 3,19,827 మహిళ ఓటర్లు ఉండగా, 2,69,238 మంది ఓటు వేశారు. జిల్లాలో భైంసా, నిర్మల్, ఖానాపూర్‌లో ప్రత్యేకంగా పూర్తిగా మహిళ సిబ్బందితో మోడల్ పోలింగ్ కేంద్రాలనూ ఏర్పాటు చేశారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధుల కోసం అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. శ్రమకు తగ్గ ఫలితం... గత మూడు నెలలుగా జిల్లా అధికారులు చేసిన కృషికి తగ్గట్లుగా పోలింగ్ శాతం నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంతి, జిల్లా సహాయ ఎన్నికల అధికారి, జేసీ భాస్కర్‌రావుతో పాటు రిటర్నింగ్ అధికారులు, వివిధ స్థాయిల అధికారులు, సిబ్బంది నిర్విరామంగా శ్రమించారు. మూడు నెలలుగా ఓటర్ల నమోదు, పరిశీలన, జాబితాలను విడుదల, మళ్లీ ఓటర్ల నమోదుకు అవకాశం, వీటిపై అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. అలాగే ఈవీఎంలు, వీవీ ప్యా ట్లపై పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఓటర్లకు అవగాహన కల్పించారు. పల్లె ఓటర్లకు అర్థమయ్యేలా సాంస్కృతిక బృందాల ద్వారా కళాజాత కార్యక్రమాలనూ చేపట్టారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్, జేసీ, ఎస్పీ, వివిధ శాఖల ఉన్నతాధికారులందరూ పాల్గొని రన్ ఫర్ ఓట్, వాక్ ఫర్ ఓట్ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలో ‘ఐ విల్ ఓట్.. బికాస్ ఐ లవ్ నిర్మల్’ అనే ప్రచార సెల్ఫీ బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కలెక్టర్ ప్రశాంతి, జేసీ భాస్కర్‌రావు ఈ సారి జిల్లాలో ఓటింగ్ శాతం 90కి పెంచాలన్న లక్ష్యంతో పనిచేశారు. వీరితో పాటు ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి కావడానికి ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ క్రమంలో సమష్టి కృషితో 80.52 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడంలో సఫలమయ్యారు. గల్లంతు కావడంతోనే... జిల్లాలో అధికారులు నిర్ణయించుకున్న 90శాతం లక్ష్యాన్ని చేరుకునే అవకాశం కూడా ఉండింది. కా నీ.. వందలాది ఓట్లు గల్లంతు కావడమే ఈ లక్ష్యా న్ని చేరుకోలేకపోవడానికి కారణమైంది. నిర్మల్, ఖానాపూర్, ముథోల్ మూడు నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో ఓట్లు జాబితాల్లో నుంచి గల్లంతయ్యాయి. ఇందులో ప్రతీ ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు వేసే ఓటర్లవే ఉండటం గమనార్హం. 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్ల పేర్లే కనిపించకుండా పోయాయి. ప్రధానంగా పట్టణాలైన నిర్మల్, భైంసాలో వందల సంఖ్యలో ఓట్లు కనిపించలేదు. ఖానాపూర్ నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో కూడా గల్లంతయ్యాయి. ఆ యా చోట్ల సంబంధిత ఓటర్లు రెవెన్యూ అధికారు ల వద్దకు వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పో యింది. తమ వద్ద గత ఎన్నికల్లో ఇచ్చిన ఓటర్ కా ర్డు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో ఓటు లేకపోవడం ఏంటని చాలా మంది ప్రశ్నించారు. ఎలాగూ జాబితాలో ఉంటుంది కదా.. అన్న నమ్మకంతో పోలిం గ్ కేంద్రాలకు వెళ్తే ఓటు లేకపోవడం విస్మయం కలిగించిందని వారు వాపోయారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సైతం చర్చించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది లోపాలతోనే చాలా వరకు ఓట్లు గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. -
ఈవీఎంలలో.. అభ్యర్థుల భవిత!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ముందస్తు ఎన్నికలు ఖరారయ్యాక సరిగ్గా మూడు నెలలకు జరిగిన ఎన్నికల్లో ఎవరి భవితవ్యం ఏమిటో ఈ నెల 11వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తేలిపోనుంది. అప్పటి దాకా ఆయా పార్టీల అభ్యర్థుల భవిష్యత్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎంలు) భద్రంగా నిక్షిప్తమైంది. సెప్టెంబరు 6వ తేదీన ప్రభుత్వం రద్దు కావడం, అదే రోజు టీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించడంతో ఖరారైపోయిన ముందస్తు ఎన్నికలు ఒక విధంగా అన్ని రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్ష పెట్టాయి. గత నెల 12వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి శుక్రవారం జరిగిన పోలింగ్ దాకా జిల్లాలో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మరోవైపు ఆయా పార్టీల నాయకత్వాలు సైతం రీపోలింగ్ లేకపోవడం, ఎలాంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలు పూర్తి కావడంతో ఆనందంగా ఉన్నాయి. ఇప్పుడు వారి దృష్టంతా 11వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలపైనే కేంద్రీ కృతమైంది. మరో వైపు పోలింగ్ సరళిని బేరీజు వేసుకుని, బూత్ కమిటీల ద్వారా తెప్పించుకున్న సమాచారం మేరకు తమ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది..? ఎంత మెజారిటీతో గెలిచే వీలుంది..? ఏ వర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యి ఉంటాయి.. అన్న లెక్కలు ముందేసుకుని సమీకరణలు చేయడంలో మునిగిపోయారు. మిర్యాలగూడ, మునుగోడు వంటి నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ స్టేషన్లలో శుక్రవారం రాత్రి వరకూ పోలింగ్ జరగడం, వివిధ కారణాల వల్ల పోలింగ్ శాతం, పోలైన ఓట్ల వివరాలు సరిగా అందలేదు. శనివారం మధ్యాహ్నానికి పూర్తి వివరాలు తెప్పించుకున్న అధికారులు జిల్లాలో, ఆయా నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలతో తుది నివేదికలు తయారు చేశారు. జిల్లాలో 86.82శాతం పోలింగ్ నమోదు జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు మొత్తం గా 86.82శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇది గత ఎన్నికలతో పోలిస్తే 8.5శాతం ఎక్కువ కావడం గమనార్హం. మొత్తం 12,94,880ఓట్లకు గాను శుక్రవారం జరిగిన పోలింగ్‌లో 11,24,202ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గాల వారీగా చూసినప్పుడు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ కంగా 91.07శాతం పోలింగ్ నమోదు కాగా, అతి తక్కువగా నల్లగొండ నియోజకవర్గంలో 84.13శాతం ఓట్లు పోలయ్యాయి. మరోవైపు 87.42శాతం మంది పురుషులు తమ ఓటు హ క్కు వినియోగించుకోగా, 86.23శాతం మంది మ హిళలు ఓట్లేశారు.7.55శాతం మంది ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
మనం అలా..గెలుస్తున్నం!
సాక్షి, పెద్దపల్లి : ‘ఆ మండలంలో మనకు లీడ్ వస్తది...ఈ మండలంలో కొంత పోతది...ఫలానా డివిజన్ మనకే మొగ్గుంది...ఈ డివిజన్లో ప్రత్యర్థికే ఎక్కువ ఓట్లంటున్నరు...మొత్తానికి తక్కువోట్లతోనైనా మనమే బయటపడుతాం’ అంటూ అభ్యర్థులు, వారి అనుచరులు లెక్కలేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జిల్లాలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ అనంతరం ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రమైన సెంటినరీకాలనీలోని జేఎన్టీయూకు తరలించారు. ఎవరి లెక్కలు వారివే... పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు, అనుచరులు గెలుపోటములపై లెక్కలేస్తున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ ఉత్కంఠగా ఉంది. జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం మూడు నియోజకవర్గాల్లోనూ పోటాపోటీగా ఎన్నికలు సాగాయి. ఫలితాలపై ఊహించడం మినహా, గత ఎన్నికల తరహాలో అంచనాలు వేయడం సాధ్యపడడం లేదు. ఒక్క నియోజకవర్గంలోనే ఒక్కో పార్టీకి ఒక్కో ప్రాంతం అనుకూలంగా కనిపిస్తుండడంతో ఫలితం పక్కాగా చెప్పే పరిస్థితి కనిపించలేదు. పెద్దపల్లిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు దాసరి మనోహర్‌రెడ్డి, చింతకుంట విజయరమణారావుల నడుమ పోటీ హోరాహోరీగా సాగింది. నియోజకవర్గంలోనే అధిక ఓట్లున్న పెద్దపల్లి పట్టణం, మండలం అభ్యర్థి భవితవ్యాన్ని తేల్చనున్నాయి. ఇక మంథనిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పుట్ట మధులు నువ్వా నేనా అన్నట్లుగానే పోటీపడుతున్నారు. తూర్పు మండలాలు ఒక పార్టీకి అనుకూలంగా, ఇతర మండలాలు మరో పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఎవరైనా స్వల్ప మెజార్టీతోనే గెలుస్తారని ఆయా పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. రామగుండంలో ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్, టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ, కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్ఠాకూర్ల నడుమ పోరు ఉత్కంఠగా కొనసాగింది. ఇక్కడ యైటింక్లైయిన్కాలనీ ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓటేసిన ప్రముఖులు పోలింగ్ సందర్భంగా అభ్యర్థులు, అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి అల్లమరాజు శ్రీదేవసేన గోదావరిఖనిలో, జాయింట్ కలెక్టర్ వనజాదేవి పెద్దపల్లిలో ఓటు వేశారు. పెద్దపల్లి పట్టణంలోని మిషన్ హైస్కూల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఎలిగేడు మండలం శివపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయరమణారావులు ఓటు వేశారు. ధర్మపురి టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గోదావరిఖని, రామగుండం టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ గౌతమినగర్, ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్ తిలక్‌నగర్, కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్‌రాజ్‌ఠాకూర్ రామగుండంలో, బీజేపీ అభ్యర్థి బల్మూరి వనీత గోదావరిఖనిలో ఓటువేశారు. మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాటారం మండలం ధన్వాడలో, టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు మంథనిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా పోలింగ్ అనంతరం ఈవీఎంలను రామగిరి మండలం సెంటినరీకాలనీలోని జేఎన్టీయూ భవనంలోకి తరలించి, భద్రపరిచారు. స్ట్రాంగ్‌రూం వద్ద గట్టిపోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 11న జేఎన్టీయూ భవనంలోనే ఓట్ల లెక్కింపు జరగనుంది. -
ఈవీఎంలు జాగ్రత్త!
న్యూఢిల్లీ: రాజస్తాన్, తెలంగాణల్లో హోరాహోరీ పోరు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఈ రెండు రాష్ట్రాల పార్టీ నేతలు ఈవీఎంల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘మధ్యప్రదేశ్‌లో ఈవీఎంలు వింతగా ప్రవర్తిస్తున్నాయి. కొన్ని ఈవీఎంలు స్కూల్ బస్సును ఎత్తుకెళ్తే మరికొన్ని రెండు రోజులపాటు కనిపించకుండాపోయాయి. ఇంకాకొన్ని ఓ హోటల్లో తాగుతూ కనిపించాయి. మోదీ హయాంలో ఈవీఎంలకు అతీంద్రియ శక్తులుంటాయి’అంటూ వ్యంగ్యంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. నవంబర్ 28వ తేదీన మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయిన 48 గంటల తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంకు చేరాయన్న వార్తలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అయితే, ఆ ఈవీఎంలు అదనంగా ఉంచినవే తప్ప పోలింగ్‌కు వాడినవి కాదని ఈసీ పేర్కొంది. స్ట్రాంగ్ రూంలలోని ఈవీఎంలకు తాము కల్పించిన మూడంచెల భద్రతపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసిందని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా తెలిపారు. -
పోలింగ్ అవాంతరాలు; ఓటర్ల అసహనం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోలింగ్‌లో ఇబ్బందులు తప్పడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఫలితంగా చాలా కోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పలుచోట్ల ఉదయం 9 గంటల వరకు కూడా పోలింగ్ ప్రారంభం కాలేదు. పోలింగ్ కేంద్రాల్లో వెలుతురు సరిగా లేకపోవండంతో ఎవరికి ఓటు వేస్తున్నామో తెలియకుండా ఉందని పలుచోట్ల ఓటర్లు ఫిర్యాదు చేశారు. తమ ఓట్లు గల్లంతయ్యాయని కొన్నిచోట్ల ఓటర్లు ఆందోళనకు దిగారు. జాబితాలో ఏజెంట్లు, అధికారుల పేర్లు లేకపోవడం పలుచోట్ల గందరోళ పరిస్థితులు తలెత్తాయి. సాంకేతిక సమస్యలతో గంటల తరబడి వరుసలో నిలబడిరావడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 220 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించినట్టు ప్రాథమిక సమాచారం. ► మెదక్ జిల్లా రెగోడ్ మండలంలోని జగిరీయల్ గ్రామంలో 20 పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరయించడంతో పోలింగ్ ఆగిపోయింది. ► పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శాంతినగర్ ప్రజా పాఠశాలలో ఓట్లు గల్లంతు కావడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ► నిజామాబాద్ డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామంలో 104, 105, 106 పోలింగ్ కేంద్రాల్లో 20 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ►నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో, పాలిటెక్నిక్ కళాశాల పోలింగ్ కేంద్రాల్లో గంట ఆలస్యంగా జరుగుతున్న పోలింగ్ ► సిద్దిపేట నియోజకవర్గం పోలింగ్ స్టేషన్లో కనపడని మహాకూటమి, బీజేపీ పోలింగ్ ఏజెంట్లు ►కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలంలోని తలోడి గ్రామంలో 154 బూత్ సిబ్బందికి అవగాహన లేక ఉదయం తొమ్మిది గంటల వరకు పోలింగ్ ప్రారంభం కాలేదు. ఆసిఫాబాద్ మండలం ఎల్లరం, బెజ్జూరు మండల కేంద్రంలోని 188 పోలింగ్ కేంద్రం, మొర్లీగుడలో ఈవీఎంలు మొరకాయించడంతో 9 గంట వరకు పోలింగ్ ప్రారంభం కాలేదు. ► భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలో నిజాంపేట, కంబాలపల్లి, లచ్చగూడెం, సత్యనారాయణపురం ఇంకా పలు చోట్ల ఈవీఎంలు మొరాయింపు ► జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లోని పలు పోలింగ్ సెంటర్లలో విద్యుత్ సరిగా లేక ఇబ్బంది పడుతున్నఓటర్లు ► రాజన్న సిరిసిల్ల కొనారావుపేట్ మండలం నాగారంలో మొరాయిస్తున్న ఈవీఎం ► జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని నందగిరిలో మొరాయించిన ఈవీఎం ► కొమురంభీం జిల్లా తిర్యాణి మండల కేంద్రంలోని 131వ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో గంట అలస్యంగా పోలింగ్ మొదలైంది. పోలింగ్ సమయాన్ని గంట పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ►చంద్రాయణ గుట్ట, కుత్భుల్లాపూర్‌లో ఓట్లలో అవకతవకలు జరిగాయయని ఓటర్లు ఆందోళన చేపట్టారు. ఎలక్షన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తమకు ఓటరు స్లిప్పులు, ఐడీ కార్డులు అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అందరూ ఓటేయాలి: జిల్లా ఎన్నికల అధికారి లోకేశ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఈనెల ఏడో తేదీన జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి డీఎస్ లోకేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఉజ్వల భవిష్యత్ కావాలంటే అందరూ పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్లోని కోర్టు హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 27.86 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. 1,345 ప్రాంతాల్లో మొత్తం 3,092 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఒకే ప్రాంతంలో రెండు మూడు పోలింగ్ కేంద్రాలు ఉంటే.. ఓటర్లకు తమ పోలింగ్ సెంటర్ వివరాలు తెలిపేందుకు గైడ్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. మొత్తం 527 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఈ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ తీరును పూర్తిగా వీడియో చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే అదనపు బలగాలను కూడా మోహరిస్తున్నట్లు చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు బిగించి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. 14 వేల మంది సిబ్బందిని నియమించి శిక్షణ ఇచ్చామన్నారు. ఏడో తేదీన ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సాయంత్రం 5 గంటలలోపు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని, ఆ తర్వాత వచ్చే వారిని లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. గత ఎన్నికల వరకు పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదైందన్నారు. ఈసారి రెండు ప్రాంతాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు విస్తృత చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. తాగునీరు, షామియానాలు ఏర్పాటు చేస్తామన్నారు. 46 వేల మంది దివ్యాంగ ఓటర్లు పోలింగ్‌లో పాల్గొంటారని, వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. 20 శాతం అదనంగా ఈవీఎంలు... ఈవీఎం, కంట్రోల్ యూనిట్లు సరిపడా ఉన్నాయని తెలిపారు. అదనంగా 20 శాతం ఈవీఎంలను నిల్వ ఉంచామని, గురువారం ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. సామగ్రిని అధికారులకు పంపిణీ చేసేందుకు ప్రతి సెగ్మెంట్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ పూర్తయ్యాక తిరగి సామగ్రిని ఇవే కేంద్రాల వద్ద అప్పగిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పొల్గొంటున్న అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ విధానంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ తీరును పరిశీలించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. 677 కేసులు నమోదు... ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 677 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.3.30 కోట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. అలాగే 29 వేల లీటర్ల మద్యం కూడా సీజ్ అయిందన్నారు. 80 బెల్ట్ షాపులను మూసివేశామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరీష్ పాల్గొన్నారు. ఓటరు ఐడీ తప్పనిసరి కాదు.. ఓటు వేయడానికి ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరి కాదని లోకేశ్‌కుమార్ చెప్పారు. ఓటరు జాబితాలో పేరుండి.. ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒకటి ఉంటే సరిపోతుందన్నారు. దీన్ని పోలింగ్ స్టేషన్లో అధికారులకు చూపించాలన్నారు. కాకపోతే, ఓటర్ కార్డు ఉంటే పోలింగ్ ప్రక్రియ వేగవంతం అవతుందన్నారు. ఇంటింటికీ ఓటరు స్లిప్పులను అందజేస్తున్నామని చెప్పారు. ‘నా ఓటు’ యాప్ ద్వారా తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చన్నారు. -
స్ర్టాంగ్ రూంలో పనిచేయని సీసీటీవీలు
భోపాల్ : ఉత్కంఠభరితంగా సాగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అందరి చూపూ డిసెంబర్ 11న జరిగే కౌంటింగ్ వైపు మళ్లింది. ఈవీఎంల భద్రతపై విపక్ష కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తుండగా, వీటిని భద్రపరిచిన స్ర్టాంగ్ రూంలో గంటపాటు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం కలకలం రేపింది. విద్యుత్ సరఫరా చాలాసేపు నిలిచిపోవడంతో శుక్రవారం స్ర్టాంగ్‌రూంలో అమర్చిన సీసీటీవీలు పనిచేయలేదని ఈసీ వర్గాలు అంగీకరించాయి. ఓటింగ్ యంత్రాలు సురక్షితంగా ఉంచేందుకు జనరేటర్లు, ఇన్వర్టర్లను తెప్పించామని ఈసీ పేర్కొంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ర్టాంగ్ రూం వద్ద పెద్దసంఖ్యలో పోలీస్ బలగాలను నియోగించామని తెలిపింది. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ సత్నాలోని స్ర్టాంగ్ రూంలోకి ఓ వ్యక్తి కార్టన్‌ను తీసుకువెళుతున్న వీడియో వైరల్‌గా మారడంతో కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు స్ర్టాంగ్ రూం వెలుపల ఆందోళన చేపట్టారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగ్గా ఈనెల 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
ఈ సారి కొత్తగా..
సాక్షి, దమ్మపేట: ఈసారి శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం కొన్ని మార్పులు చేసింది. కొన్ని ప్రత్యేక సౌకర్యాలను జోడించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తోంది. అభ్యర్థుల ఫొటోలు ఓటర్లు అభ్యర్థిని గుర్తించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)పై పోటీలో ఉన్న అభ్యర్థుల ఫొటోలను ఏర్పాటు చేస్తున్నారు. 2014 ఎన్నికల వరకు ఈ విధానం లేదు. త్వరలో జరగనున్న ఎన్నికలకు ఎన్నికల సంఘం ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఓటు సరిచూసుకోవచ్చు ఈవీఎంల పనితీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ సారి ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్)లను వినియోగిస్తున్నారు. దీంతో మనం ఎవరికి ఓటు వేశామో తెలుసుకోవచ్చు. 7 సెకన్ల పాటు వీవీ ప్యాట్‌లో కనిపిస్తుంది. సీ–విజిల్ యాప్ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయడానికి సీ–విజిల్ యాప్ ఉపయోగపడుతుంది. ఉల్లంఘనకు సంబంధించి వీడియోలు, ఫొటోలు జిల్లా ఎన్నికల అధికారికి అక్కడ నుంచి ఎన్నికల సంఘానికి పంపవచ్చు. -
ఏర్పాట్లు ముమ్మరం
భైంసా(ముథోల్): అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలు పక్కాగా అమలు పరుస్తున్నారు. ఈమేరకు జిల్లా ఎన్నికల అధికారి సంబంధిత అధికారులు, సిబ్బందితో ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తయి ప్రస్తుతం ప్రచారపర్వం ఊపందుకుంది. ప్రత్యేక బృందాలు అభ్యర్థుల ప్రచారం, ఖర్చులపై నిఘా పెంచాయి. పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యేదాకా అధికారులు, సిబ్బందే కీలకం. ఇప్పటికే వారంతా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. కీలకమైన రెవెన్యూ.. ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ అధికారులదే ప్రధాన పాత్ర. నియోజకవర్గస్థాయిలో ఆర్డీవో ఎ న్నికల రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయా శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎన్నికల సంఘానికి జవాబుదారీగా ఈయనే ఉంటారు. రాష్ట్రంలో అసెంబ్లీ రద్దుకుముందే పనులు ప్రారంభించారు. ఓటరు నమోదు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వసతుల కల్పన, స్క్వాడ్ల ఏర్పాటు, ఎన్నికల నియ మావళి ఈ అధికారులే అమలు చేస్తున్నారు. తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, బీఎల్ఓలు వారికి కేటాయించిన విధులు నిర్వహిస్తున్నారు. ఆర్ఓ నేతృత్వంలోని నాలుగు బృందాలు విధిగా పని చేస్తున్నాయి. పోలింగ్‌కు వారం ముందే ఓటర్లకు పోల్చీటీలు అందించాలని వీరు నిర్ణయించారు. దృష్టి సారించిన పోలీసులు.. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శశిధర్‌రాజు వెల్లడించారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి నిఘా పెంచారు. ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్నారు. చాలా గ్రామాల్లో గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మద్యం, డబ్బు రవాణాను అడ్డుకుంటున్నారు. రాజకీయ సభలు నిర్వహించే ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. టెక్నాలజీ వినియోగం... ఈ ఎన్నికల్లో టెక్నాలజీ వినియోగం పెరిగింది. ఎన్నికల అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా ఐటీ విభాగం ఏర్పాటు చేశారు. నిపుణుల బృందం టెక్నాలజీ వినియోగంపై దృష్టి సారించింది. ఎన్నికల సంఘం సువిధ, సీవిజిల్, సమాధాన్ యాప్‌లను వినియోగిస్తున్నారు. పోటీచేసే అభ్యర్థుల నామినేషన్‌తో పాటు అన్ని వివరాలను ఆన్లైన్లో అనుసంధానం చేస్తున్నారు. ఎన్నికల రోజు వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షించడం, కౌంటింగ్ వివరాలు ఎన్నికల సంఘానికి చేరవేసే వరకు ఐటీ విభాగమే కీలకం కానుంది. ఒక్కో నియోజకవర్గంలో ఇందుకు సంబంధించి 20 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు... ఎన్నికలు అంటేనే అందరికి మద్యం గుర్తుకువస్తుంది. ఈ క్రమంలో అక్రమ మద్యం విక్రయాలు అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే బెల్టుషాపులు మూసి వేయించారు. విక్రయాలపై నియంత్రణ విధించారు. మద్యం దుకాణాల నిర్వాహకులకు సంబంధించి నిబంధనలకు అనుగుణంగా ఆదేశాలు జారీచేశారు. ఎక్సైజ్ బృందాలు అనుమానిత ప్రాంతాల్లో సోదాలు కూడా చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే కౌంటింగ్... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండేవి. అప్పట్లో ఎన్నికల కౌంటింగ్ ఆదిలాబాద్‌లోనే జరిగేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త జిల్లాలు సైతం ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ నాలుగు జిల్లాలైంది. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలైన నిర్మల్, ముథోల్, ఖానాపూర్ కౌంటింగ్‌ను జిల్లాకేంద్రంలోనే చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధ్యాయుల పాత్ర... ఎన్నికలు సమగ్రంగా నిర్వహించేందుకు ప్రతి సారి ఉపాధ్యాయులనే అధిక సంఖ్యలో తీసు కుంటారు. పోలింగ్ అధికారి, ఏపీఓ ఇలా ఎం దులోనైనా ఉపాధ్యాయులే ఎక్కువగా కనిపిస్తారు. ఎన్నికల విధులకు సంబంధించిన ఉ ద్యోగుల జాబితాను విద్యాశాఖ రూపొంది స్తుంది. త్వరలోనే వీరికి ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈవీఎంలు, వీవీప్యాడ్లపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్యసేవల్లో ఏఎన్ఎంలు... పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలకు వెళ్లే అధికారులు, సిబ్బంది అనారోగ్యానికి గురైతే సేవలు అందించేందుకు ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచారు. వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలకు ఆదేశాలు జారీచేసింది. ఆయా కేంద్రాల వద్ద ఈ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించింది. పోలింగ్ రోజున ఓటర్లు, సిబ్బంది అనారోగ్యానికి గురైతే ప్రాథమిక చికిత్స అందించనున్నారు. ఈ కేంద్రాల వద్ద అవసరమయ్యే మందులు కూడా అందుబాటులో ఉంచనున్నారు. గ్రామ అధికారులే... నిర్మల్ జిల్లావ్యాప్తంగా గ్రామాలే అధికంగా ఉన్నాయి. అన్ని గ్రామాల్లోనూ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ తదితర వసతుల కల్పనను గ్రామస్థాయి అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఆరు పోలింగ్ కేంద్రాలకు కలిపి ఒక సెక్టోరియల్ అధికారిని నియమించారు. ఆయా కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలపై దృష్టి సారించారు. వీఆర్ఓలు, బీఎల్ఓలు అక్కడి పరిస్థితులను తెలుసుకుని గ్రామ కార్యదర్శులతో కలిసి ఏర్పాట్లను చూస్తున్నారు. సర్వం సిద్ధం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికారులు ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి చేరిన ఎన్నికల సామగ్రిని నిమోజకవర్గాల వారీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు, అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయాలకు పంపిణీ చేసే చర్యలను చేపడుతున్నారు. స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన ఈవీఎంలు కలెక్టరేట్లో ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్న సిబ్బంది ఇందులో భాగంగా మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఓటరు నమోదు పత్రాలను బూత్‌ల వారీగా సిద్ధం చేసి ఆయా మండలాలకు పంపిస్తున్నారు. అలాగే బ్యాలెట్ పత్రాలను సైతం సిద్ధం చేశారు. అధికారులు ఎన్నికల ఏర్పాట్ల పనుల్లో బిజీగా మారిపోతున్నారు. -
1400 మంది ఓటర్లు ఎందుకంటే..
సాక్షి, జనగామ: ఎన్నికల ప్రక్రియలో చాలా విషయాలు తెలుసుకోవాలి. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ ఇలా ఒకదానికి ఒకటి అనుసంధానంగా పనిచేస్తాయి. ఇందులో ఈవీఎం పాత్ర ప్రధానం. ప్రతి పోలింగ్‌కేంద్రంలో గరిష్టంగా 1400 మంది ఓటర్లు మాత్రమే ఉంటారు. అలా ఎందుకు సంఖ్యను పరిమితం చేస్తారంటే... ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఈవీఎంలకు అనుసంధానించి ఉండే వీవీ ప్యాట్‌లో థర్మల్ కాగితం పొందుపరుస్తున్నారు. ఈ కాగితం 1500 స్లిప్పులను మాత్రమే ముద్రించగలుగుతుంది. 22.5 ఓల్ట్స్ బ్యాటరీతో పనిచేసే వీవీ ప్యాట్‌లో ఓటరు ఎవరికి ఓటు వేసింది.. తెలుసుకునే స్లిప్ డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇందులో వంద వరకు కాగితపు స్లిప్పులు పోలింగ్ రోజున మాక్ పోలింగ్ ప్రక్రియలోనే ఖర్చవుతాయి. అందుకే గరిష్టంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో 1400 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా అధికారులు ఏర్పాట్లుచేశారు. -
ఓటర్లకు ఫొటో స్లిప్పులు
సిరిసిల్ల : పోలింగ్ శాతం పెంచేందుకు, బోగస్ ఓటర్లను అరికట్టేందుకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈసారి ఓటరు చిత్రపటంతో కూడిన పోల్స్లిప్పు(చీట్టీ)లను పంపిణీ చేస్తోంది. గతంలో ఎన్నికల్లో అభ్యర్థులు మాత్రమే పోల్‌చిట్టీలు పంపిణీ చేసేవారు. తర్వాత ఎన్నికల అధికారులు పోల్‌చిట్టీలు అందించారు. తొలిసారి ఓటరు ఫొటోలు ముద్రించిన పోల్ స్లిప్పులను అందిస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడంతోపాటు, ఎలాంటి తడబాటు లేకుండా ఓటర్లు ఆ స్లిప్పుతో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ముద్రణలో ఫొటోస్లిప్పులు.. జిల్లాలోని 506 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన ఫొటో ఓటరు స్లిప్పులను ఎన్నికల అధికారులు ముద్రిస్తున్నారు. ఇప్పటికే తుది ఓటరు జాబితా వెల్లడించిన ఎన్నికల అధికారులు.. ఎన్నికల నిర్వహణలో ఎంతోకీలకమైన ఓటరు ఫొటో స్లిప్పులను ముద్రిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 4,08,769 మంది ఓటర్లకు స్లిప్పులను అందించేందుకు ఏ ర్పాట్లు చేస్తున్నారు. బూత్ లెవల్ అధికారులు(బీఎల్వో)ల ద్వారా క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రా ల వారీగా ఫొటో ఓటరు గుర్తింపు స్లిప్పులను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ స్లిప్పు ఉంటే చాలు.. ఓటరు నేరుగా పోలింగ్ కేం ద్రానికి వెళ్లి ఓటు వేయవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు వంటి ఇతర ఫొటో గుర్తింపు కార్డులు అవసరం లేదు. ఈఫొటో ఓటరు గుర్తిం పు కార్డులో ఓటరు జాబితాలో క్రమసంఖ్య, పో లింగ్ స్టేషన్ నంబరు, ఓటరు ఫొటో ఉండడంతో ఓటు వేసేందుకు నేరుగా అవకాశం ఉంటుంది. బీఎల్వోలు అందించిన ఈ స్లిప్పు తప్పిపోతే.. మళ్లీ పాతపద్ధతిలోనే ఓటరు గుర్తింపు కార్డుతోనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయవచ్చు. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం తొలిసారిగా కొత్తగా ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణికి శ్రీకారం చుట్టింది. బ్యాలెట్లో అభ్యర్థుల గుర్తులు.. ఫొటోలు గతఎన్నికలకు భిన్నంగా ఈసారి ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులతోపాటు, అభ్యర్థుల ఫొటోలను కొత్తగా ముద్రిస్తున్నారు. ఇందుకు అవసరమైన బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రి ప్రింటింగ్ చేయించేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో 506 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సిరిసిల్లలో 13 మంది, వేములవాడలో 15 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వేములవాడలో మరో అభ్యర్థి బరిలో ఉంటే.. అంటే 16 మంది ఉండి ఉంటే.. ఈవీఎంలపై నోటాకు చోటు ఉండకపోయేది. కానీ ఒక్క అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి ఈవీఎంలపై 16 గుర్తులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వేములవాడలో 15 మంది అభ్యర్థులు, నోటాతో కలిపితే 16 అవుతుంది. దీంతో అదనపు ఈవీఎంల ఏర్పాటు లేకుండానే ఒకే ఈవీఎం ఏర్పాటుకు అవకాశం ఏర్పడింది. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు అవసరమైన ఎన్నికల సామగ్రిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మొదటిదశ ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తికాగా.. బ్యాలెట్ పత్రాలు వచ్చిన తర్వాత మరోసారి సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫొటో స్లిప్పులతో ప్రయోజనం ఓటర్లకు ఫొటో స్లిప్పులు ఇవ్వడం ద్వారా బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయి. ఓటరు ఇంటికే స్లిప్పు చేరుతుంది. దానిపై ఫొటో, ఓటరు సంఖ్య ఉంటుంది. ఎలాంటి గందరగోళం లేకుండా నేరుగా వెళ్లి ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ఫొటో ఉంటుంది కాబట్టి ఎన్నికల సిబ్బంది సులభంగా గుర్తు పడతారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు ఈ స్లిప్పులు దోహదపడతాయి. – టి.శ్రీనివాస్‌రావు, సిరిసిల్ల ఆర్డీవో -
హంగులు.. ఆర్భాటాలు
సాక్షి, కల్వకుర్తి టౌన్ : చట్టసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధానంలో ఓటింగ్ ప్రధానమైంది. మారుతున్న కాలానికి అణుగుణంగా ఓటింగ్ విధానంలోనూ మార్పు సంతరించుకుంది. ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నూతన ఒరవడికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు ఉపయోగించగా ఇటీవల కాలంలో ఈవీఎంలు వినియోగాన్ని ఎన్నికల సంఘం పెంచింది. ఈసారి ఎన్నికల్లో ఓటు కచ్చితత్వాన్ని ఓటరు తెలుసుకునేలా నూతనంగా వీవీ ప్యాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) యంత్రాలను ఎన్నికల సంఘం తెలంగాణలో వినయోగిస్తోంది. 1950లో ఎన్నికల సంఘం ఏర్పాటు దేశంలో ఎన్నికలు సజావుగా, నిష్పపక్షపాతంగా నిర్వహించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ద సంస్ధ భారత ఎన్నికల సంఘాన్ని 1950 జనవరి 25వ తేదీన ఏర్పాటుచేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాతీయ ఎన్నికల కమిషన్‌లో భాగమే. రాజకీయ పార్టీ గుర్తింపు, రద్దు, ఎన్నికల ప్రణాళిక, ప్రవర్తనా నియామవళి రూపకల్పన, ఓటరు జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ అంతా ఎన్నికల సంఘం ఆధీనంలో ఉంటుంది. ఈ మేరకు దేశంలో మొదటి సారిగా ఎన్నికలు 1951వ సంవత్సరంలో జరగగా ప్రజలు ఓటు వేసేందుకు బ్యాలెట్ విధానం అమలులో ఉండేది. ముద్రించిన బ్యాలెట్ పేపరుపై ఏ అభ్యర్ధిని ఎన్నుకుంటామో ఆ అభ్యర్థి గుర్తుపై ముద్ర వేసి బ్యాలెట్ బాక్స్‌లో వేసేవారు. ఆ తర్వాత నూతన సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా 2004 నుంచి ఈవీఎంలు అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగంపై ఆరోపణలు రావటంతో ప్రస్తుతం రాబోయే ఎన్నికలలో ఈవీఎంలతో పాటుగా వీవీ ప్యాట్లను వినియోగిస్తోంది. రిగ్గింగ్‌కు చెల్లిన కాలం భారతదేశంలో మొదటిసారి నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులను వినియోగించారు. ఈ విధానంలో అభ్యర్ధుల పేర్లు, పార్టీ గుర్తుతో ముద్రించిన పేపర్లు వాడేవారు. వాటిపై ఓటరుకు వచ్చిన అభ్యర్థి గుర్తు వద్ద స్టాంప్ చేసి ఆ బ్యాలెట్ పేపరును బ్యాలెట్ బాక్సులో వేసేవారు. ఓటింగ్ పక్రియ పూర్తయిన అనంతరం పేపర్ల(ఓట్ల)లెక్కింపు ఉండేది. ఈ విధానంలో రిగ్గింగ్‌కు ఎక్కువ అవకాశం ఉండేది. దొంగ ఓట్లు ఎక్కువగా పోలయ్యేవి. 1999 ఎన్నికలలో బ్యాలెట్ పత్రాల ముద్రణకు 7,700 టన్నుల కాగితం వాడారు. ఈవీఎంలు 2004 తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో అన్ని చోట్ల ఓటింగ్ కోసం బ్యాలెట్ బాక్స్‌ల స్ధానంలో ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లు అమలులోకి వచ్చాయి. అంతకుముందు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈవీఎంలను ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఇక్కడ ఈ విధానం అమలు సఫలం కావటంతో 2004 నుంచి అన్ని చోట్ల ఈవీఎం ఓటింగ్ విధానం అమలులోకి వచ్చింది. దీని వలన బ్యాలెట్ పత్రాల ముద్రణ వలన జరిగే కాగితం వాడకం అరికట్టినట్లయ్యంది. ఈవీఎంలను భారత్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వరంగ సంస్ధలు తయారు చేశాయి. విద్యుత్ సరఫరా వ్యవస్ధ లేని చోట కూడా బ్యాటరీ సాయంతో పనిచేసే విధంగా వీటిని రూపొందించారు. ఒక్కో ఈవీఎంలో 1400 లోపు మంది ఓటర్లు ఓట్లు వేయొచ్చు. పోటీలో 64 మంది కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలను వాడతారు. లేనిపక్షంలో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తారు. వీవీ ప్యాట్లు రాష్ట్రంలో వచ్చే నెల 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. ఈవీఎంలతో పాటుగగా వీవీప్యాట్ యంత్రాలను ఉపయోగించునున్నారు. ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ జరుగుతోందని.. ఏ పార్టీకి ఓటు వేసిన అధికార పార్టీకే పడుతోందని కొన్ని రాజీకయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నాయి. దీంతో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లను వినయోగింలోకి తీసుకొస్తున్నారు. ఈ యంత్రం ద్వారా అభ్యర్థి ఎవరికి ఓటు వేశారో ఏడు సెకన్ల పాటు డిస్ప్లే కనిపిస్తుంది. మారుతున్న ప్రచార సరళి ఎన్నికల్లో అభ్యర్ధులు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారం నిర్వహిస్తుంటారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయటం, గోడలపై రాతలతో మొదలు పార్టీ కండువాలు, టోపీలు, జెండాలు, కరపత్రాలు, వాహనాలకు మైక్సెట్లతో ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. గతంలో గోడలపై రాతలు ఎక్కువగా కనిపించేవి. దీంతో పెయింటింగ్ కళాకారులకు చేతినిండా పని ఉండేది. సత్తు రేకుపై అభ్యర్థి పేరు గుర్తుతో అచ్చువేయించి, వాటిని గోడలపై అచ్చువేయటం ద్వారా పెయింటింగ్ చేయించాల్సిన అవసరం ఉండేది కాదు. పార్టీ కార్యాలయం భవనంపై తమ పార్టీ గుర్తులను ఏర్పాటు చేసి దానికి లైటింగ్ ఏర్పాటు చేసేవారు. పార్టీ చెండాలు పట్టుకొని అభ్యర్ధుల వెంట పార్టీ కార్యకర్తలు తిరగేవారు. నేటి సాంకేతిక యుగంలో ఫ్లెక్సీలు రాకతో పెయింటింగ్, లైటింగ్ కళాకారులకు వారికి పనిలేకుండా పోయింది. డిజిటల్ ప్రచారం ఇప్పుడంతా డిజిటల్ హవా నడుస్తోంది. రాజకీయ పార్టీల నాయకులు సైతం ప్రచారానికి టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్లను వేదికగా చేసుకుని ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. మెసేజ్‌లు, వాట్సాప్, వాయిస్ కాల్స్ ద్వారా ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు. వాల్ పెయింటింగ్‌ల స్థానంలో ఫ్లెక్సీలు వచ్చాయి. గతంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసేందుకు ఫ్లైవుడ్ వాడేవారు. దీనిపై అభ్యర్ధుల,నాయకుల బొమ్మలు వేసేవారు. ఇందుకు కొన్ని రోజుల సమయం పట్టేది. ప్రస్తుతం ఫ్లెక్సీలు అందుబాటులోకి రావటంతో ఎంత పెద్ద కటౌట్ అయినా క్షణాల్లో రెడీ అవుతోంది. -
ఈవీఎంలపై పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం..
సాక్షి, న్యూఢిల్లీ : ఈవీఎంల స్ధానంలో తిరిగి బ్యాలెట్ పేపర్లను ఉపయోగించే విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్న రాజకీయ పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. సాంకేతిక లోపాలు, ట్యాంపరింగ్‌కు అవకాశాలున్న క్రమంలో ఈవీఎంల వాడకాన్ని ఆయా రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈవీఎంల వాడకాన్ని నిలిపివేసి, తిరిగి బ్యాలెట్ విధానాన్ని అమలుపరచాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్ధానం గురువారం కొట్టివేసింది. ప్రతి యంత్రాన్ని సద్వినియోగం చేయవచ్చని, అలాగే దుర్వినియోగం కూడా చేయవచ్చని పిటిషనర్‌తో పేర్కొంది. గతంలోనే బ్యాలెట్ పత్రాలను మళ్లి ప్రవేశపెట్టాలన్న పిటిషన్లను కోర్టు కొట్టివేసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈవీఎంలపై అనుమానాలున్నాయని, ఓటర్లలో విశ్వాసం కలిగించాలని కోరిన పిటిషనర్ వాదనలతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. కాగా ఈవీఎంల వాడకాన్ని వ్యతిరేకిస్తూ న్యాయభూమి అనే ఎన్జీవో ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. -
ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు..!
సాక్షి, భువనగిరి : ముందస్తు శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లు, గుర్తుల్లో గందరగోళానికి ఎన్నికల సంఘం చెక్‌పెట్టింది. ఈవీఎంలలో అభ్యర్థి ఫొటో చూసి ఓటు వేసే అవకాశం కల్పించింది. ఈవీఎంలో అభ్యర్థి పేరు గుర్తుతో పాటు 25 సెంటీమీటర్ల పొడవుతో ఫొటో ఉంటుంది. అభ్యర్థి 3 నెలల క్రితం దిగిన తాజా ఫొటోను బ్యాలెట్ పత్రాల్లో ముద్రించనున్నారు. నోటా వద్ద మాత్రం క్రాస్ గుర్తు ఉంటుంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో నోటా ఉన్నా దానికి ప్రత్యేకంగా గుర్తు కేటాయించలేదు. గతంలో స్వతంత్రులుగా బరిలోకి దిగిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఒకే గుర్తు కేటాయించడంతో కొందరు ఓటర్లు తికమక పడి ఎంపీ ఓటు ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే ఓటు ఎంపీకి వేయడంతో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓటర్లు గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు పోటీ చేసే అభ్యర్థులు తాజా స్టాంప్ సైజు కలర్ ఫొటోను నామినేషన్ వేసే స మయంలో రిటర్నింగ్ అధికారికి ఇవ్వవలసి ఉంటుంది. -
‘పోస్టల్ బ్యాలెట్’ వచ్చేశాయ్..
ఆదిలాబాద్‌అర్బన్: ఎన్నికల సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాలకు అవసరమైన సిబ్బందిని ఆదిలా బాద్ నుంచే నియమిస్తుండడం తెలిసిందే. దీంతో పోస్టల్ బ్యాలెట్ పేపర్లను కూడా ఇక్కడికే తెప్పించారు. కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ(సీపీవో) కార్యాలయంలో ఉన్న స్ట్రాంగ్ రూంలో భద్రపర్చారు. పోలింగ్‌కు నాలుగైదు రోజుల ముందు ఆయా జిల్లాలకు వీటిని పంపిణీ చేస్తారు. ఆయా జిల్లాలకు చేరిన పోస్టల్ బ్యాలెట్లను అక్కడి అధికారులు నియోజకవర్గాల వారీగా సరఫరా చేస్తారు. జిల్లాల్లో పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోలింగ్ రోజు లేదా ఒక రోజు ముందు సదరు కలెక్టర్ నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఆ ఉత్తర్వులతోపాటు పోస్టల్ బ్యాలెట్‌ను సిబ్బంది చేతికి ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందు కోసం ఆయా రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. కాగా, 2014 ఎన్నికల్లో అవగాహన లేకపోవడమో.. బాధ్య తారాహిత్యమో తెలియదు కానీ వినియోగించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో సుమారు 25 శాతం తిరస్కరణకు గురయ్యాయి. వినియోగించేది వీరే.. సాధారణ ఎన్నికల్లో సుమారు ఐదు రకాల వ్యక్తులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల సిబ్బంది, సర్వీసు ఓటర్లు, ప్రత్యేక ఓటర్లు, నోటిఫైడ్ ఓటర్లు, నివారణ, నిర్బంధ ఓటర్లు ఈ విధానం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే పరిపాలన సిబ్బంది, పోలీసు సిబ్బంది, డ్రైవర్లు, క్లీనర్లు, సెక్టార్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు, సూక్ష్మ పరిశీలకులు, వీడియో గ్రాఫర్ లేదా ఫొటోగ్రాఫర్లు, వెబ్ కాస్టింగ్ నిర్వహణ సిబ్బంది, తదితర వారు ఈ విధానం ద్వారా ఓటు వేయవచ్చు. సర్వీసు ఓటర్లు ప్రోక్సీ ఓటింగ్‌ను ఎంపిక చేసుకోకుండా మినహాయించుకున్న సాయుధ రక్షక భటులు, ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు సాయుధ బలగాలు సెక్షన్–60 ఆర్పీ యాక్టు 1950, సాయుధ బలగాల సభ్యులను సెక్షన్–46 ఆర్పీ యాక్టు 1950 ప్రకారం సర్వీసు ఓటర్లుగా పరిగణిస్తారు. వీరితోపాటు విదేశాల్లో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులూ పోస్టల్ విధానం ద్వారా ఓటేయొచ్చు. ప్రత్యేక ఓటర్లు రాష్ట్రపతి కార్యాలయంలో పని చేస్తున్న వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయొచ్చు. ప్రధాన ఎన్నికల సంఘం ప్రకటించిన నోటిఫైడ్ ఓటర్లు కూడా ఈ విధానంలో ఓటు వినియోగించుకోవచ్చు. నివారణ(ప్రివెంటివ్), నిర్బంధం(డిటెన్షన్)లో ఉన్న ఓటర్లు ఈ విధానం ద్వారా హక్కును వినియోగించుకోవచ్చు. వీరితోపాటు సర్వీసు ఓటర్ల, ప్రత్యేక ఓటర్ల సతీమణులు కూడా ఈ విధానం ద్వారా తమ హక్కును వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు 90 వేల పోస్టల్ బ్యాలెట్లు.. ఉమ్మడి జిల్లా పరిధిలో పది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల నిర్వహణకు 15 వేల మంది సిబ్బంది అవసరమని అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే 13 వేల మంది జాబితా సిద్ధం కాగా, మరో 2 వేల మంది వివరాల సేకరణలో ఉన్నారు. నాలుగు జిల్లాలకు సరిపడా బ్యాలెట్ పేపర్లను తెప్పించారు. మూడు రంగుల్లో 90 వేల పోస్టల్ బ్యాలెట్లు ఆదిలాబాద్‌కు వచ్చాయి. నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు, సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా 9 వేల చొప్పున కేటాయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్‌కు ముందే పోస్టల్ బ్యాలెట్లు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బ్యాలెట్ పత్రాలను ఓట్ల లెక్కింపు(డిసెంబర్ 11)లోపే అందజేయాలి. పోస్టల్ బ్యాలెట్‌కు వినియోగించే ఫారాలు.. ∙ఫారం–12 పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసే పత్రం ∙ఫారం–13ఏ ఓటరు ధ్రువీకరణ పత్రం ∙ఫారం–13బీ పోస్టల్ బ్యాలెట్ పెట్టాల్సిన లోపలి కవరు ∙ఫారం–13సీ వెలుపలి కవరు, రిటర్భింగ్ అధికారి తిరిగి పంపాల్సిన కవరు(ఇదే కవర్లో ఫారం–13బి పోస్టల్ బ్యాలెట్ లోపలి కవరు, ఫారం–13ఏ ఓటరు డిక్లరేషన్ పెట్టాలి.) ∙ఫారం 13–డి ఓటరుకు సూచనలు, సలహాలు ఉంటాయి. అధికారులు నియామక ఉత్తర్వులతోపాటు ఫారం–12 దరఖాస్తు పత్రం ఇస్తే.. అందులో పూర్తి వివరాలు నింపి రిటర్నింగ్ అధికారి మొదటి శిక్షణ సులభతర కేంద్రం(ఫెసిలిటేషన్ సెంటర్)లో సమర్పించాలి. సదరు సిబ్బంది అదే రిటర్నింగ్ అధికారి పరిధిలో ఉంటే వెంటనే పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. ఆ ఆర్వో పరిధిలో లేకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా సంబంధిత రిటర్నింగ్ అధికారికి పంపిస్తారు. ఆ పోస్టల్ బ్యాలెట్‌ను పూర్తి వివరాలతో నింపి సరైన పత్రాలు జత చేసి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఉన్న డ్రాప్ బాక్సులో వేయాలి. లేదా సంబంధిత ఆర్వోకు నిర్ధిష్ట సమయంలో చేరేటట్లు పోస్ట్ ద్వారా పంపించవచ్చు. తక్కువ మంది ఉపయోగించడానికి కొన్ని కారణాలు.. ∙ఆర్వో దగ్గర నుంచి పోస్టల్ బ్యాలెట్‌ను తీసుకోవడంపై ఆసక్తి చూపించకపోవడం. ∙ఎన్నికల విధి నిర్వహణ ఉత్తర్వులతోపాటు ఫారం–12ను సరైన సమయంలో సమర్పించకపోవడం. ∙సరైన ఎలక్ట్రోరల్ రోల్‌లోని పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్‌ను నమోదు చేయకపోవడం. ∙ఎన్నికల సమయంలో పని చేసే సిబ్బందికి సరైన సమయంలో డ్యూటీ ఆర్డర్స్ అందకపోవడం. ∙ఫారం–12లో సరైనా చిరునామా ఇవ్వకపోవడం. ∙తీసుకున్న బ్యాలెట్ పేపర్‌ను నిర్ణీత సమయంలోగా ఆర్వోకు పంపకపోవడం. ఓట్ల లెక్కింపులో తిరస్కరణకు కారణాలు.. ∙డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోవడం. ∙డిక్లరేషన్‌లో బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ రాయకపోవడం. ∙గజిటెడ్ అధికారితో సర్టిఫైడ్ చేయించకపోవడం. ∙ఓటు వేసిన పోస్టల్ బ్యాలెట్‌ను కవరులో పెట్టకపోవడం. ∙పోస్టల్ బ్యాలెట్‌ను, డిక్లరేషన్‌ను ఓకే కవరులో పెట్టడం. ∙ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు మార్కు చేయడం. ∙ఏ అభ్యర్థికి మార్కు చేయకపోవడం. ∙ఏ అభ్యర్థికి చెందకుండా పైన లేదా కింద(అనుమానాస్పదంగా) మార్కు చేయడం -
బ్యాలెట్ టు ఈవీఎం
సాక్షి, వనపర్తి : దేశంలో 1952 నుంచి ఎన్నికల విధానం అమల్లోకి వచ్చింది. మొదట్లో బ్యాలెట్ పేపర్లు, సిరా, స్వస్తిక్ గుర్తు తదితర సామాగ్రిని ఎన్నికల కోసం ఉపయోగించేవారు. మూడు దశాబ్దాల ఈ పద్ధతినే అవలంభించిన అధికారులు 36 ఏళ్ల క్రితం ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం)లను వాడుకలోకి తీసుకువచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం మొదటిసారిగా ఈవీఎంలను దేశంలోనే.. అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళ రాష్ట్రంలోని పరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1982లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించింది. ఆ తర్వాత వెంటనే 1982–83లో పది నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించారు. కొన్ని కారణాలతో 1984లో సుప్రీం కోర్టు ఈవీఎంలను ఉపయోగించరాదని ఆదేశించింది. అనంతరం ప్రభు త్వం చేసిన సవరణలతో సుప్రీం కోర్టు ఈవీఎంల వాడకాన్ని సమర్దిం చింది. 1990లో అప్పటి ప్రభుత్వం ఎన్నికల సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది. సాంకేతిక నిఫుణుల సూ చన మేరకు ఈ కమిటీ ఈవీఎంల వాడకాన్ని సిఫారసు చేసింది. ఇక 1998లో ఈవీఎం వాడకానికి ప్రజామోదం లభించింది. 1999 తర్వాత పలు రాష్ట్రా ల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఈవీఎం లు ఉపయోగించారు. గడిచిన మూడు లోక్‌సభ ఎన్నికలను పూర్తిగా ఈవీఎంలతోనే నిర్వహించారు. కాలానుగుణంగా ఈవీ ఎంల్లో మార్పులు తీసుకొస్తున్న అధికారులు ఈసారి వీటికి వీవీ ప్యాట్లను జత చేశారు. -
మన అభ్యర్థి గుర్తుకు ఓటు పడిందా? లేదా?
సాక్షి,కల్వకుర్తి: పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిబంధనలు అమలు చేయడంలో ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు) కీలకపాత్ర వహించాలని ఎన్నికల రిట ర్నింగ్ అధికారి, ఆర్డీఓ రాజేశ్‌కుమార్ సూచిం చారు. గురువారం పట్టణంలోని భ్రమరాంబిక బీఈడీ కళాశాలలో పీఓలకు, ఏపీఓలకు రెండు విడతలుగా శిక్షణ ఇచ్చారు. ఉదయం, సాయంత్రం ఇచ్చిన శిక్షణలో ఎన్నికల నియమావళి, ఈవీ ఎంల వినియోగం, వీవీ ప్యాట్లపై శిక్షణ ఇచ్చా రు. ఆర్డీఓ మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ఎన్నికలు కీలకమని, అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు ఓటు హక్కు వజ్రాయుధంగా మారుతుందన్నారు. గతంలో ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతి కొనసాగేదని, ఈ ఎన్నికల్లో నూతనంగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నామన్నారు. అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అడుగు ముందుకేసిందన్నారు. వేసిన ఓటు అనుకున్న అభ్యర్థి గుర్తుకు పడిందా? లేదా? అని వెంటనే చూసుకునేందుకు వీలుగా వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ అడిట్ ట్రయల్) యంత్రాలను పరిచయం చేస్తున్నామన్నారు. వీటి వినియోగంపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించామన్నారు. పోలింగ్ బూత్‌కు హాజరయ్యే ఓటర్లకు ఈవీఎంపై ఎలాంటి ఇబ్బందులు ఉండరాదని సూచించారు. ఏమైనా సమస్య తలెత్తితే పోలింగ్ అధికారి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. ఓటు వేసే విధానంపై.. ఓటరు పోలింగ్ కంపార్టుమెంట్లోకి వెళ్లగానే ప్రిసైడింగ్ అధికారి పక్కన ఉన్న చిత్రంలో చూపిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో బ్యాలెట్‌ను సిద్ధంగా ఉంచుతామని ఆర్డీఓ పేర్కొన్నారు. బ్యాలెట్ యూనిట్‌పైన క్రమసంఖ్య అభ్యర్థి పేరు పక్కన గుర్తులు ఉంటాయన్నారు. వీటిలో నచ్చిన అభ్యర్థి గుర్తుపై ఓటు వేయడానికి పక్కనే నీలిరంగు బటన్ ఉంటుందని, బటన్ నొక్కగానే ఎర్రలైట్ వెలుగుతుందని, ఎంచుకున్న అభ్యర్థికి ఓటు పడుతుందన్నారు. అలాగే కంట్రోల్ యూని ట్ యంత్రం ఈవీఎంలకు అనుసంధానం చేసి ఉంటుందని ఈ యంత్రాన్ని పోలింగ్ అధికారులు మాత్రమే ఉపయోగించేందుకు వీలు ఉంటుందన్నారు. యంత్రాలపై స్క్రీన్ ఏర్పాటు చేసి ఉంటుందని, ఓటింగ్ సంబంధించిన వివరాలు ఈ యంత్రంలో నమోదు అవుతాయన్నారు. వీవీ ప్యాట్‌పై.. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల పని తీరుపై సందేహాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని ఆర్డీఓ తెలిపా రు. ఓటర్లు ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని చూసుకునేందుకు ఈసారి ఎన్నికల సంఘం వీవీ ప్యాట్లను ఏర్పాటు చేసిందన్నారు. ఈవీఎంలో ఓటరు ఓటు వేయగానే అభ్యర్థికి పడిందా.. లేదా అనే విషయం వీవీప్యాట్‌లో కనిపిస్తుందని తెలిపారు. వీవీప్యాట్ యంత్రంలో ఓటరు ఎంచుకున్న అభ్యర్థి సీరియల్ నంబర్, గుర్తు, పేరు ఒక బ్యాలెట్ స్లిప్ మీద కనిపిస్తుందని తెలిపారు. ఈ బ్యాలెట్ స్లిప్ ఏడు సెకండ్ల పాటు కనిపించి ఆ తర్వాత కట్ అయ్యి ప్రింటర్ డ్రాప్ బాక్స్‌లో పడుతుందన్నారు. మొత్తం 700మందికి పైగా వీవీ ప్యాట్ల శిక్షణకు హాజరయ్యారు. దాదాపు 30మంది శిక్షణకు గైర్హాజరయ్యారు. గతంలో శిక్షణ తీసుకున్న అధికారులే పీఓలకు, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో కల్వకుర్తి తహసీల్దార్ గోపాల్‌తో పాటు నియోజకవర్గంలోని వెల్దండ, ఆమన్‌గల్, తలకొండపల్లి, మాడ్గుల తహసీల్దార్లు హాజరయ్యారు. -
ఎన్నికలకు ‘ఆర్టీసీ’ సిద్ధం..!
సాక్షి,మిర్యాలగూడ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉంటూ నిత్యం సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడంలో ముందుండే ఆర్టీసీ సంస్థ ఎన్నికల రూపంలో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను ఈ ఎన్నికల్లో రీజియన్‌కు రూ.32లక్షలకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి 364 ఆర్టీసీ బస్సులతో పాటు 7డీజీటీ(ఆర్టీసీ గూడ్స్)లను ఈ ఎన్నికల్లో రెండు రోజుల పాటు సేవలు అందించనున్నాయి. అందుకుగాను ఒక్కొక్క బస్సుకు రూ.21వేల చొప్పున ఎన్నికల కమిషన్ ఆర్టీసీ సంస్థకు అద్దే రూపంలో చెల్లించనున్నది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ఎన్నికల నిర్వహణకు ఆర్టీసీ బస్సులను అన్నీ విధాలుగా అధికారులు సిద్ధం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, పోలీసులు, ఈవీఎంలను తరలించేందుకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తోంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఆర్టీసీ అధికారులకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలనుఆర్టీసీ రీజినల్‌కు పంపించిన విషయం విధితమేఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఆర్టీసీ బస్సులను సన్నద్ధం చేయాలని ఇప్పటికే ఆర్ఎంకు అందించిన లేఖలో పేర్కొనడంతో ఆయన ఆదేశాల మేరకు ఎన్నికలకు అవసరమైన ఆర్టీసీ బస్సులను రీజియన్‌లోని కోదాడ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, నల్లగొండ, నార్కట్‌పల్లి, యాదగరిగుట్ట డీపోలలో అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే పొలింగ్ సిబ్బందిని మొదలుకుని పోలీస్ యంత్రాంగం, ఈవీఎంల తరలింపు తదితర రవాణా సౌకర్యాలకు ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తున్నారు. ఎన్నికలు సమర్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేపట్టింది. అందులో ప్రధానంగా ఈవీఎంల తరలింపు ఎంతో భద్రతతో కూడిన పని కావడంతో డీపో గ్యారేజీ ట్రాన్స్‌ఫోర్ట్(గూడ్స్)బస్సులో ఈవీఎంలను తరలించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.మరో వైపు ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది ఆయా పోలింగ్ బూత్‌లకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు డిపోలలోని బస్సులను ఎన్నికల నిర్వహణకు పంపించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 364 బస్సులు : ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, కోదాడ, యాదాద్రి భునవగిరి, నల్లగొండ, సూర్యాపేట, నార్కట్‌పల్లి డిపోలకు చెందిన 364 ఆర్టీసీ బస్సులతో పాటు 7 డీజీటీ బస్సులను ఈ ఎన్నికలకు ఆర్టీసీ బస్సులు అవసరమని ఎన్నికల కమిషన్ కోరింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు డీపోల్లో సుమారు 800 ఆర్టీసీ బస్సులు ఉండగా అందులో సగానికి పైగా ఎన్నికల నిర్వహణ కోసమే తరలించనున్నారు. ప్రధానంగా డిసెంబరు 6, 7వ తేదీల్లో ఆర్టీసీ బస్సులను ఎన్నికల అధికారులు ఉపయోగించనున్నారు. అయితే నల్లగొండ జిల్లాలో 150 ఆర్టీసీ బస్సులతో పాటు 4డీజీటీ బస్సులు, సూర్యాపేట జిల్లాలోని 150 ఆర్టీసీ బస్సులు రెండు డీజీటీ బస్సులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 64 ఆర్టీసీ బస్సులు ఒక డీజీటీ బస్సును ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సులు తక్కువగా ఉన్నందున నల్లగొండ జిల్లా నుంచి కొన్నింటిని తరలి స్తున్నారు. ఏడు డిపోలు కలిసి 364 ఆర్టీసీ బస్సులు ఎన్ని కల విధుల్లో ఉంటాయి. రెండు రోజుల పాటు ఎన్ని కల వి«ధుల్లో ఉన్నంతరం ఎన్నికలు ముగియగా నే తిరిగి ఏ బస్సులు ఆ డిపోలకు వెళ్లిపోనున్నాయి. ఆర్టీసీకి చేకూరనున్న భారీ ఆదాయం : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్టీసీ సంస్థ అదనపు ఆదాయాన్ని చేకూర్చుకొనున్నది. నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీకి అసెంబ్లీ ఎన్నికలు కొంత వరకు లాభాన్ని చేకురుస్తుంది.ఎన్నికలకు ఉపయోగించే ఆర్టీసీ బస్సులకు ఒక్కదానికి 21వేయి రూపాయలను ఆర్టీసీ సంస్థకు ఎన్నికల అధికారులు చెల్లించనున్నది. ఈ లెక్కన చూస్తే 364 ఆర్టీసీ బస్సులకు రెండు రోజులకు గాను రూ.1.52కోట్ల వరకు ఆదాయం చేకూరే అవకాశం ఉంది. ఈవీఎంలను తరలించేందుకు ఏర్పాటు చేసే డీజీటీ బస్సులకు మరో రెండు లక్షల 10వేల రూపాయల వరకు ఆదాయం రానున్నది. అన్నీ ఖర్చులు పోను ఒక్కో ఆర్టీసీ బస్సుకు రూ.4 నుంచి 5వేల వరకు మిగులుబాటు ఉండవచ్చని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆర్టీసీ బస్సులను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బస్సులను ఉపయోగిస్తే ఆ సమయంలో ఒక్కో బస్సుకు కేవలం రూ.14వేల చొప్పున చెల్లించారు. కానీ ప్రస్తుతం పెరిగిన డీజిల్, ఇతర నిర్వహణ ఖర్చులతో ఈ సారి ఒక్కో బస్సుకు రూ.21వెయ్యి వరకు చెల్లించేందుకు ఎన్నికల కమిషన్ ముందుకు వచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో రెండు రోజులకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో సంస్థ నిర్వహణ ఖర్చులు పోను 25లక్షల రూపాయల వరకు మిగిలే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నల్లగొండ రీజియన్‌లో గత ఎప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ సంస్థ ఆరు కోట్ల రూపాయల వరకు నష్టాల్లో ఉందని అంటున్నారు. కాగా బహిరంగం సభలకు కూడా ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో కొంత మేరకు ఆదాయం పెరుగనున్నది. డిసెంబరు 6, 7 తేదీల్లో ఇక్కట్లు : అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండటంతో డిసెంబరు 6, 7వ తేదీల నల్లగొండ రీజియన్‌లో పరిధిలో ఆర్టీసీ బస్సులు ఎన్నికల్లో భాగంగా తగ్గనున్నాయి. 7వ తేదీన ఎన్నికలు అయినందున ఒక రోజు ముందుగానే ఆర్టీసీ బస్సులో సిబ్బందిని, ఈవీఎంలను తరలించేందుకు రెండు రోజుల పాటు బస్సులను ఉపయోగించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో 364 ఆర్టీసీ బస్సులు సగానికి పైగా తగ్గుతుండటంతో ప్రధాన రూట్లు అయిన మిర్యాలగూడ నుంచి దేవరకొండ, కోదాడ, నల్లగొండ, సూర్యాపేట తదితర ప్రాంతాలకు బస్సులు తగ్గనున్నాయి. ఈ రెండు రోజులు ఆయా ప్రాంతాలకు సుమారు 10 ఆర్టీసీ బస్సులను మాత్రమే పంపించనున్నారు. అదే విధంగా డిసెంబరు మొదటి వారంలో కూడా పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా అధికంగా ఉన్నందున ఆ బస్సులను ఎన్నికలకు తరలించడంతో ఆ రెండు రోజుల పాటు ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంది. ప్రత్యేక చర్యలు తీసుకుంటాం: ఎన్నికల నిర్వహణకు ఆర్టీసీ బస్సులను వినియోగించడం వలన కొంత వరకు ఆర్టీసీ బస్సులు తగ్గినప్పటికి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలను చేపడతాం. బస్సులను స్పెషల్ ఆపరేషన్‌ను చేయించి ఇబ్బందులు రాకుండా చర్యలను తీ సుకుంటాం. కాగా డిసెంబరు 6, 7వ తేదీల్లో 48 గంటల పాటు ఆర్టీసీ సంస్థకు ప్రయాణికులు సహకరిం చాలి. – సుధాకర్‌రావు, ఆర్టీసీ డీఎం, మిర్యాలగూడ -
సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి
సాక్షి,బిచ్కుంద (నిజామాబాద్): పోలింగ్ నిర్వహణపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండి పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. బుధవారం బిచ్కుంద డిగ్రీ కళాశాలలో పోలింగ్ నిర్వహణ అధికారులకు అం దిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాక్ పోలింగ్, వీవీ ప్యా ట్లు, బ్యాలెట్ యూనిట్లు సీల్ చేయడం , పోలింగ్ సమయ పాలన తదితర అంశాలపై సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలి చిన్న చిన్న పొరపాట్లతో పెద్ద సమస్యలు ఏర్పడతాయి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలు ప్రీసైడింగ్ అధికారులు పాటించాలని ఆదేశించారు. శిక్షణ తరగతులలో సూచించిన విధంగా వీవీ ప్యాడ్, ఈవీఎంలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లాలో గత నెల రోజుల నుంచి మాక్ పోలింగ్‌తో ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోలింగ్ బూత్‌లలో అన్ని యంత్రాలను సక్రమంగా బిగించాలని, మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు రాకుండా చూడాలని సూచించారు. ఓటు వేయడానికి బూత్‌లలో వికలాంగులకు ర్యాంపులు, వీల్చేర్, వాహన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఆరు మండలాల అధికారులు పాల్గొన్నారు. తప్పులు దొర్లకుండా చూడాలి మద్నూర్(జుక్కల్): రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తప్పులు దొర్లకుండా చూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ పత్రాల స్వీకరణ, స్ట్రాంగ్ రూంను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పారదర్శకత కోసమే ఎన్నికల కమిషన్ వీవీప్యాట్ల విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో 740 పోలింగ్ స్టేషన్లకు 740 బీఎల్వోలు, 74 సూపర్వైజర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట రిటర్నింగ్ అధికారి రాజేశ్వర్, తహసీల్దార్ రవీంధర్, అధికారులు ఉన్నారు. -
ఓటు యెట్లెస్తరు సారు.!
సాక్షి,ఇందూరు: వీవీప్యాట్ పనితీరు, ఈవీఎం ద్వారా ఓటు ఎలా వేయాలనే దానిపై కలెక్టరే ట్లో ఏర్పాటు చేసిన అవగాహన కేంద్రానికి మంచి స్పందన లభిస్తోంది. సోమవా రం గ్రామీణ ప్రాంతానికి చెందిన కొంత మంది మహిళలు ఇక్కడకు వచ్చి ‘ఓటు యెట్లెస్తరో సూపియ్యూ సారు’ అని ఓటు వేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. నీ ఓటు విలువ తెలుసుకో! సాక్షి,కామారెడ్డి అర్బన్: శాసనసభ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో ఓటు హక్కుపై ఎన్నికల సంఘం ఇప్పటికే విస్తృత ప్రచారం చేపట్టింది. మరోవైపు, సోషల్ మీడియా లో సామాజిక కార్యక్తలు ఒకే ఒక్క ఓటు విలువ ఎంతో తెలుసా? అంటూ అవగాహన కల్పిస్తున్నారు. ఆ ఓటు విలువను ఇలా వివరిస్తున్నారు. 1999లో ఒకే ఒక్క ఓటు దేశ భవిష్యత్తునే మార్చేసింది. వాజ్‌పేయ్ కేవలం ఒక ఓటు తేడాతో ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. లోక్‌సభలో 270 మంది సభ్యులు ఉంటే బీజేపీ ప్రభు త్వం నిలబడేది. కానీ, 269 ఓట్లు రావడంతో వాజ్‌పేయి ప్రభుత్వం 13 నెలలకే పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు థామన్ జాఫర్సన్, జాన్ ఆడమ్స్, రూథర్ ఫర్డ్ కేవలం ఒక ఓటు మెజారిటీతో అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఒక్క ఓటుతో జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్ నాజీ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఒకే ఒక్క ఓటుతో మొదటి కింగ్ జేమ్స్ ఇంగ్లాండ్ రాజయ్యాడు. 2004లో కర్ణాటక ఎన్నికల్లో సంతేమారేహళ్లీ (ఎస్సీ రిజర్వుడు) నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి ఏఆర్ కృష్ణమూర్తి కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయారు. కృష్ణమూర్తి కారు డ్రైవర్ ఆ రోజు ఓటు వేయలేదు. రాజస్థాన్‌లో 2008 ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు సీపీ జోషి ఒక్క ఓటు తేడాతో ఓటమి చెందారు. అ ఎన్నికల్లో జోషి కుటుంబ సభ్యులు తల్లి, భార్య, కారు డ్రైవర్ ఓటు వేయలేదు. వారు ముగ్గురు ఓటేసి ఉంటే జోషి గెలుపొందే వారు. -
ఓటు యంత్రం.. అవగాహన మంత్రం
సాక్షి, కల్వకుర్తి టౌన్ : ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుకు ఉన్న ప్రాధాన్యం ప్రతీ ఒక్కరికి తెలిసేలా అధికార యంత్రాం గం ఊరురా విసృత్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒకవైపు రాజకీయ నాయకులు తమకే ఓటు వేయాలని ప్రచారం చేస్తుండగా, మరోవైపు అధికారులు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈవీఎం ద్వారా ఓటు వేసిన తర్వాత ఎవరికీ ఓటు పడిందో తెలుసుకునేలా కొత్తగా ఈసారి ఎన్నికల్లో వీవీ ప్యాట్ యంత్రాలను ఎన్నికల కమిషన్ వినియోగిస్తోంది. రెవెన్యూ అధికారులు, బీఎల్ఓలు గ్రామగ్రామాన ఈవీఎం, వీవీప్యాట్లపై ప్రచారం చేస్తున్నారు. కేవలం గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోని అన్ని బూత్‌ల పరిధిలో ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రదేశాల వద్ద అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు, తహసీల్దార్లు ఎంపీడీఓలు, బూత్ స్థాయి అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఏకేపీ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ఈవీఎం, వీవీ ప్యాట్లపై ప్రయోగాత్మకంగా ప్రదర్శనతో అవగాహన కల్పిస్తున్నారు. ఎలా ఓటు వేయాలి.. ఎవరికి ఓటు వేశామన్నది వీవీ ప్యాట్ల ద్వారా ఎలా తెలుస్తుందో ప్రత్యక్షంగా వివరిస్తున్నారు. ఓటు ఎవరికి వేశాం?! ఈసారి ఎన్నికల సంఘం కొత్తగా వీవీ ప్యాట్ యంత్రాలను ప్రవేశపెట్టింది. ఓటు వేసిన తర్వాత ప్రక్కనే ఉన్న వీవీ ప్యాట్‌లో ఏడు సెకన్ల పాటు వేసిన గుర్తు అందులో కనిపిస్తుంది. దీంతో ఓటరు సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు వీవీ ప్యాట్లు ఉపయోగపడుతాయని అన్ని వర్గాల ప్రజలు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో అవగాహన కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలో అన్నిల పోలింగ్‌బూత్ వద్ద ఈవీఎం, వీవీ ప్యాట్ యంత్రాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఈవీఎం, వీవీ ప్యాట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే, వారి నుండి స్పందన కూడా బాగుంది. ప్రతీ బూత్ వద్ద బీఎల్ఓలు, ఆయా బూత్‌ల అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన కార్యక్రమంపై ప్రజల నుండి వస్తున్న స్పందనతో ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. – రాఘవేందర్, కల్వకుర్తి ఎన్నికల డీటీ ప్రతిఎన్నికల్లో ఓటు వేస్తున్నా.. నేను గత ఎన్నికలతో పాటుగా అంతకుముందు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నా. పాత రోజుల్లో ఓటుకు చాలా విలువ ఉండేది. ప్రస్తుతం చాలా మంది ఓటుకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. మొన్నటి వరకు ఈవీఎం యంత్రంలో ఓటు వేశా, ఇప్పుడు కొత్తగా వీవీ ప్యాట్‌లో ఓటు వేసిన గుర్తు ఏడు సెకన్ల పాటు చూసుకునే అవకాశం బాగుంది. – రాజేష్‌కుమార్, కల్వకుర్తి వీవీ ప్యాట్ యంత్రంతో పారదర్శకత ఈసారి ఎన్నికల్లో ఈవీఎంతో పాటుగా మనం ఎవరికి ఓటు వేశామో తెలుసుకునే విధంగా వీవీప్యాట్ యంత్రాలను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టడం శుభపరిణామం. దీనితో గతంలో ఓటరు ఎవరికి ఓటు వేశాడో తెలియకపోయేది. ఈసారి వీవీ ప్యాట్ యంత్రం ద్వారా ఓటరు ఎవరికి ఓటు వేశారో చూసుకోవచ్చు. దీంతో ఎన్నికల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుంది. – భీమయ్య, కల్వకుర్తి -
ఈవీఎంలు తరలిస్తుండగా..ఏకే47 మిస్సింగ్
సాక్షి, విజయనగరం : ఈవీఎంలు తరలిస్తున్న భద్రతాసిబ్బందికి చెందిన ఏకే47 తుపాకిని గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన విజయనగరంలో కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల నిమిత్తమై ఒడిశాకి ఈవీఎంలను లారీలో తరలిస్తున్నారు. శనివారం వేకువజామున నాతవలస టోల్గేట్ వద్దకి లారీ చేరుకుంది. భద్రతాసిబ్బంది విశ్రాంతి కోసమని టోల్గేట్ దాటి కొంచెం ముందుకు వెళ్లి హైవే పక్కన లారిని ఆపారు. సిబ్బంది విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు వచ్చి ఏకే 47 తుపాకిని దొంగిలించారు. ఆ తుపాకి అభిమన్యు సహూ అనే భద్రతా సిబ్బందిదిగా గుర్తించారు. దీంతో భద్రతా దళాలు బోగాపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఏఎస్సీ ఆధ్యర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
ఎన్నికలు : ఈవీఎంల హ్యాకింగ్‌పై షాకింగ్ రిపోర్టు
చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్తాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల హాడావుడి ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో వీవీపీఏటీ ఆధారిత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరోవైపు 2019 సార్వత్రిక ఎన్నికలకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో విస్తు గొలిపే బీబీసీ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. దేశీయ ఈవీఎంలను హ్యాక్ చేసే మార్గాన్ని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ సైంటిస్ట్‌లు కనుగొన్నట్టు రిపోర్టు చేసింది. మొబైల్ టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ఎన్నికల ఫలితాలను యూఎస్ యూనివర్సిటీ సైటింస్ట్‌లు తారుమారు చేయొచ్చని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా బీబీసీ న్యూస్ రిపోర్టు ఆన్లైన్లో పోస్ట్ చేసింది. మిషన్లలో వెనుక డిస్ప్లే ఎలా ఉంటుందో అచ్చం అదే మాదిరి డిస్ప్లే బోర్డును రూపొందించినట్టు ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రాజెక్ట్‌లో భాగమైన ప్రొఫెసర్ జే అలెక్స్ హాల్డ్రర్మ్యాన్ చెప్పారు. ఈ డిస్ప్లే బోర్డు, మిషన్ చూపించే మొత్తం ఓట్లను కొల్లగొట్టి, వాటి స్థానంలో వేరేవి చూపించేలా రూపొందించామన్నారు. అదేవిధంగా ఈవీఎంలకు మైక్రోప్రాసెసర్లను కూడా మిచిగాన్ యూనివర్సిటీ రీసెర్చర్లు జత చేసి చూపించారు. దీని ద్వారా ఓటింగ్‌కు, ఓట్ల కౌంటింగ్‌కు మధ్య ఫలితాలను తారుమారు చేయొచ్చని బీబీసీకి తెలిపారు. భారత్ ఈవీఎంలను ప్రపంచంలో అత్యంత ట్యాంపర్ప్రూఫ్ ఓటింగ్ మిషన్లుగా వర్ణించారు. ఈ డివైజ్‌లో ఉన్న సాఫ్ట్వేర్ అసలు ట్యాంపర్ చేయడానికి ఉండదు. ప్రజలు వేసే ఓట్లను, దాని కోసమే ప్రత్యేకంగా రూపొందించే కంప్యూటర్ చిప్స్‌లో స్టోర్ చేస్తారు. దీంతో ట్యాంపర్ చేయడం చాలా కష్టతరమవుతుంది. కానీ భారత ఎన్నికల కమిషన్ వాడే ఈవీఎంలను కూడా హ్యాక్ చేసే అవకాశముందని మిచిగాన్ యూనివర్సిటీ సైంటిస్ట్‌లు తేల్చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో, ఎన్నికల కమిషన్ ఇప్పటికే రాష్ట్రాలకు కావాల్సిన ఈవీఎంలు, వీవీపీఏటీ లను కేటాయిస్తోంది. -
అపోహలకు తావులేదు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రానున్న ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలు అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు పారదర్శకంగా పని చేస్తాయని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. ఈవీఎంల ప్రాథమిక పరిశీలన పూర్తయిన సందర్భంగా సోమవారం నగరం లోని వినాయక్‌నగర్‌లో గల ఈవీఎం గోదాములో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పించారు. భారత ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ ఈ ఈవీఎంలను కొత్తగా సిద్ధం చేసిందని, వీటిలో ఎటువంటి అనుమానాలకు, అపోహలకు తావు లేదన్నారు. వీటికి ఎటువంటి ఇంటర్నెట్ సౌకర్యం లేనందున, వేరే చోట నుంచి నడిపే అవకాశం లేదన్నారు. ఏ నంబరు ఈవీఎం ఎక్కడికి వెళ్తుందో, వాటి ర్యాండమైజేషన్ వరకు తెలియదని, ఏ అభ్యర్ధి పేరు ఏ క్రమ సంఖ్యలో వస్తుందో ముందస్తుగా అంచనా వేయలేమన్నారు. ట్యాంపరింగ్‌కు ఎట్టిపరిస్థితుల్లో అవకాశం లేదని వివరించారు. రాజకీయ పార్టీల ద్వారా ప్రజలకు వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈవీఎంలకు వీవీ ప్యాట్ల సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. దీనిలో ఏ అభ్యర్థికి, ఏ గుర్తుకు ఓటు వేశామో ఆ ఓటరుకు ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుందని చెప్పారు. ప్రతి బ్యాలెట్ యూనిట్లో 16 బటన్లు ఉంటాయని, ఒక బటన్ నోటా ఉంటుందన్నారు. పోటీలు ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకుంటే ఓటరు 16వ బటన్ నోటా నొక్కవచ్చన్నారు. 15 మందికంటే ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉంటే మరో బ్యాలెట్ యూనిట్ ఉపయోగిస్తారన్నారు. వీటి ప్రథమస్థాయి చెకింగ్‌లో సిబ్బంది, ఇంజనీర్లు, అధికారులు చాలా కష్టపడి కొద్ది రోజుల్లోనే పూర్తి చేసినందుకు కలెక్టర్ వారిని అభినందించారు. కార్యక్రమంలో డీఆర్ఓ అంజయ్య, రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
ఈవీఎంలు.. ఎలాంటి ఆందోళన అవసరం లేదు!
సాక్షి, హైదరాబాద్ : ఈవీఎంలలో సాంకేతిక వినియోగంపై రాజకీయ పార్టీలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే 85 శాతంపైగా ఈవీఎంల తనిఖీ పూర్తయిందని, ఈ నెల 4లోగా అన్ని జిల్లాల్లో తనిఖీలు పూర్తవుతాయని వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలతోపాటు కొత్తగా వీవీపాట్ యంత్రాలను వినియోగిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర స్థాయి మాక్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన రజత్ కుమార్.. ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు తెలిపారు. వీవీప్యాట్ యంత్రాల పనితీరు, సాంకేతిక సమస్యలు-పరిష్కారాలను వివరించారు. దేశంలో ఎంతో నమ్మకమైన బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ వంటి సంస్థలు వీవీప్యాట్ లను తయారు చేశాయని, ఎన్నికల్లో వినియోగించే సాంకేతికతపై తమకు పూర్తి విశ్వాసం ఉందని రజత్ కుమార్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 10 మొబైల్ వాహనాల ద్వారా వీవీపాట్ యంత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్ అనే ప్రత్యేక యాప్ ను రూపొందించిందని, ఎన్నికల సమయంలో ప్రజలు అందులో అక్రమాలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. -
ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా.. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధం అవుతోంది. ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్‌తోపాటు అధికార యంత్రాంగం బిజీబిజీగా ఉంది. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఇదేపనిలో తలమునకలవుతున్నారు. ఒకపక్క ఓటరు నమోదు ప్రక్రియ, జాబితా ప్రకటన ప్రక్రియ వేగవంతంగా చేస్తూనే.. మిగతా పనులన్నీ చక్కబెడుతున్నారు. జిల్లాకు వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పరిశీలన, మాక్ పోలింగ్, రాజకీయ పార్టీలతో అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జేసీ జీవీ శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో బెంగళూర్ నుంచి వచ్చిన 20 మంది ఇంజినీర్లు వీటి పనితీరును వివరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇదివరకు ఉన్న 13,221 బ్యాలెట్ యూనిట్లు, 8,636 కంట్రోల్ యూనిట్లను అధికారులు తిరిగి పంపించారు. ప్రస్తుతం జిల్లాలో 1,142 పోలింగ్ కేంద్రాలు ఉండగా 1,830 బ్యాలెట్ యూనిట్లు, 1,430 కంట్రోల్ యూనిట్లు బెంగళూర్‌లోని బీఎల్ కంపెనీ నుంచి తెప్పించారు. కొత్తగా 1,540 వరకు వీవీ ప్యాట్స్ ప్రవేశపెట్టారు. జేసీ శ్యాంప్రసాద్‌లాల్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంల ప్రాథమిక పరిశీలన కార్యక్రమం వారంరోజులు సాగుతోంది. వివిధ రాజకీ య పార్టీల సమక్షంలో బీఎల్ కంపెనీకి చెందిన 20 మంది ఇంజినీర్లు ఏ విధంగా పనిచేస్తాయో ఆదివారం కూడా వివరించా రు. కీప్యాడ్లు, డిస్ప్లే బోర్డులు, లైటింగ్, సౌండ్ సిస్టం పనితీరును పరిశీలిస్తున్నారు. ఈవీఎంను పరిశీలించిన కలెక్టర్... ఎన్నికల సంఘం జిల్లాకు బెంగళూర్ నుంచి పంపించిన ఈవీఎంలను అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం పంపించిన అన్ని ఈవీ ఎంలను ముందుగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటిస్థాయి తనిఖీని చేస్తున్నట్లు తెలిపారు. తర్వాత ఈవీఎంలు అన్నిసరిగా పని చేస్తున్నది లేనిది రాజకీయ నాయకుల సమక్షంలోనే ఇంజినీర్లు తనిఖీ చేస్తారన్నారు. అనంతరం కొత్తగా ఈవీఎంలకు వీవీ ప్యాట్స్‌ల పనితీరును కూడా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో వివరిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీల నేతల సమక్షంలో మాక్‌పోలింగ్: సర్పరాజ్ అహ్మద్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం జిల్లాకు పంపిన ఈవీఎంలతో మాక్‌పోల్ నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్ వెనుక గల ఈవీఎంల గోదాములో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోవారు ఎంచుకున్న ఈవీఎంలతో ఓట్లు వేయించి మాక్‌పోల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంలతోపాటు ఈసారి కొత్తగా వీవీ ప్యాట్లను కూడా పంపించిందని తెలిపారు. వేసిన ఓటును అదే అభ్యర్థికి పడింది.. లేనిది వి.వి ప్యాట్ స్కీన్‌పై చూడవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ ఈవీఎంలపై ఓట్లు వేసి ఓట్లు సరిగా పడుతున్నాయా..? లేదా..? అని రాజకీయ పార్టీల అభ్యర్థులకు చూపించారు. అదే విధంగా రాజకీయ పార్టీల అభ్యర్థులను కూడా మాక్‌పోల్‌లో పాల్గొని ఓట్లు వేసి ఈవీఎంల పనితీరును పరిశీలించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, జిల్లా రెవెన్యూ అధికారి భిక్షనాయక్, మెప్మా పీడీ పవన్‌కుమార్, జిల్లా కోశాధికారి కార్యాలయం ఉప సంచాలకులు శ్రీనివాస్, కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ఈవీఎంలపై అనుమానాలు
హసన్‌పర్తి: ఎన్నికల కోసం వచ్చిన ఈవీఎంలలో టాంపరింగ్ జరిగేలా సాఫ్ట్వేర్ అమర్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమారంలో శుక్రవారం జరిగిన మేధావుల ఫోరం సదస్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటికే కొన్ని జిల్లా కేంద్రాలకు ఈవీఎంలు చేరాయని, వాటిని చెక్ చేయించే బాధ్యత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిదేనని చెప్పారు. ప్రతి ఈవీఎం బటన్‌ను 50 సార్లు నొక్కాలని, అప్పుడు ఈవీఎంలు టాంపరింగ్ చేశారా.. లేదా అనే విషయాలు బహిర్గతమవుతాయని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాం గ్రెస్ నాయకులు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈవీఎంల పరిశీలన కోసం అవసరమైతే జిల్లా కాంగ్రెస్ నుంచి అథరైజేషన్ లెటర్ ఇవ్వాలన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే అభ్యర్థి ఎంపిక కార్యకర్తల అభిప్రాయం మేరకే అభ్యర్థి ఎంపిక జరుగుతుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. గెలిచే వారికి టికెట్లు ఇస్తామన్నారు. పొత్తులపై ఇతర పార్టీలతో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే రేషన్ డీలర్లకు కమీషన్, గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చారు. రైతు బంధు పథకం యథావిధిగా కొనసాగిస్తామని ఉత్త మ్ స్పష్టం చేశారు. రైతులకు పంట భీమా పథకాన్ని వర్తింపజేయడం కాకుండా అందుకు సంబంధించిన ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. -
ఈ ఏడాదే అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు
-
ఈ ఏడాదే ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ రద్దయిన నేపథ్యంలో ఈ ఏడాదే (2018) అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. వచ్చే నెల 4వ తేదీలోగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను, 8వ తేదీన ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తామన్నారు. మిగతా రాష్ట్రాల్లో మూడు నెలల సమయంలో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తారని, కాని ఇక్కడ అకస్మాత్తుగా రాష్ట్ర శాసనసభ రద్దు కావడంతో అతి తక్కువ సమయంలో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందితే ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికల తేదీలపై పత్రికల్లో వస్తున్న వివిధ కథనాల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని పునరుద్ఘాటించారు. సచివాలయంలో గురువారం ఎలక్షన్ మీడియా సెల్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 10 నుంచి చేపట్టిన ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమం కింద కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 25తో గడువు ముగిసిపోగా, ఈ వ్యవధిలో 13,15,234 దరఖాస్తులు, అభ్యంతరాలొచ్చాయన్నారు.రోజుకు లక్ష చొప్పున దరఖాస్తులొచ్చాయని, ఈ విషయంలో మంచి స్పందన లభించిందని సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు చేపట్టిన సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9వ తేదీ నాటికి 15,43,520 దరఖాస్తులు, అభ్యంతరాలొచ్చాయన్నారు. మొత్తం కలిపి దరఖాస్తులు, అభ్యంతరాల సంఖ్య 28,58,754కు పెరిగిందని, అందులో ఇప్పటి వరకు 12,04,654 దరఖాస్తులను స్వీకరించామని, 1,64,996 దరఖాస్తులను తిరస్కరించామని వివరించారు. మిగిలిన 14,89,104 దరఖాస్తులను షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 4లోగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈఆర్వో నెట్ సాఫ్ట్వేర్ ఆధారంగా 2,61,327 డూప్లికేట్ ఓటర్లను గుర్తించామని, క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత వాటిని తొలగిస్తామని చెప్పారు. 2,68,365 మంది చనిపోయిన ఓటర్లను గుర్తించామని, పరిశీలన అనంతరం ఇప్పటివరకు 77,499 మంది ఓటర్లను తొలగించామని అన్నారు. తక్కువ సమయమిచ్చినా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్లకు రజత్ కుమార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. తీరిన ముంపు మండలాల సమస్య.. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో భద్రాద్రి జిల్లా నుంచి ఏపీలో విలీనమైన ఏడు ముంపు మండలాల డీలిమిటేషన్ సమస్య తీరిపోయిందని రజత్ కుమార్ వెల్లడించారు. ఈ మండలాలకు సంబంధించిన 1,22,335 మంది ఓటర్లను 2015లోనే ఏపీలోని రెండు శాసనసభ నియోజకవర్గాలకు బదిలీ చేశామన్నారు. ఈ మేరకు ఏపీలోని ఈ రెండు శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకు ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ముంపు మండలాల సమస్య పూర్తిగా పరిష్కారమైందన్నారు. రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరపాలని గతంలో చేసిన ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించిందని, మళ్లీ కొత్త ప్రతిపాదనలేవీ చేయలేదని స్పష్టంచేశారు. ఈవీఎంలు వచ్చేశాయి.. ఈవీఎంల సంసిద్ధతపై పరిశీలన చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి అరుణ్ శర్మ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని రజత్ కుమార్ పేర్కొన్నారు. వచ్చే నెల 4 నాటికి ఈవీఎంలను ఎన్నికలకు సిద్ధం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు వచ్చాయని అదనపు ఎన్నికల ప్రధాన అధికారి జ్యోతి బుద్ధప్రకాశ్ తెలిపారు. వీవీపాట్ యూనిట్లు 76 శాతం వచ్చాయన్నారు. ఈవీఎంల ప్రథమ స్థాయి పరీక్ష (ఎఫ్ఎల్సీ)లను గురువారం అన్ని జిల్లాల్లో ప్రారంభించామన్నారు. తొలిసారిగా వినియోగిస్తున్న వీవీపాట్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. -
ముందస్తు నజర్
సాక్షి, మెదక్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ శాంతి భద్రతలపై దృష్టి సారించింది. ఎన్నికల్లో పోలీసుశాఖది కీలక పాత్ర. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ ఇప్పటి నుంచే సిద్ధం అవుతోంది. ఎస్పీ చందనాదీప్తి నేతృత్వంలో ప్రత్యేక అధికారుల బృందం ఎన్నికల బందోబస్తుకు ప్రణాళికను రెడీ చేస్తోంది. ఎన్నికల దృష్ట్యా పోలీసుశాఖ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కోసం వినియోగించే ఈవీఎంలు జిల్లాలోని గోదాములకు చేరింది మొదలు పోలీసుల భద్రతా చర్యలు ప్రారంభమవుతాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు భద్రంగా చేర్చడం, ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవడం, పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్ రూంలకు చేర్చే వరకు పోలీసుల అవసరమైన భద్రత కల్పిస్తారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తమవుతున్నారు. జిల్లాలో మెదక్, తూప్రాన్ రెండు పోలీసు సబ్డివిజన్ల పరిధిలో 20 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. వాటిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. వీరితోపాటు ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక పోలీసు దళాలు పాల్గొంటాయి. ఎన్నికల్లో ఎంత మంది పోలీసు అధికారులు, సిబ్బంది అవసరం అవుతారో పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. రాబోయే అంసెబ్లీ ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 538 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో భద్రతపరంగా అతి సమస్యాత్మక, సమస్యాత్మక, ప్రశాంతమైన పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించారు. ఇందులో 107 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 145 సమస్యాత్మక కేంద్రాలు, 286 పోలింగ్ కేంద్రాలు ప్రశాంతమైనవిగా గుర్తించారు. హవేళిఘణాపూర్ మండలంలో 10, శివ్వంపేటలో 10 పెద్దశంకరంపేటలో 11, టేక్మాల్‌లో 7, కొల్చారంలో 7 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పెద్దశంకరంపేటలో 14, శివ్వంపేటలో 14, కోల్చారంలో 11 ఉన్నట్లు గుర్తించారు. ఎన్నికల సమయంలో అతి సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసు శాఖ నిఘా ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. రౌడీషీటర్ల, పాత నేరస్తులపై నజర్ ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా ప్రారంభించారు. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 46 కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన వారితోపాటు గత ఎన్నికల్లో బైండోవర్ అయిన వారికి పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల నేపథ్యంలో ఆయుధాలు కలిగిన ఉన్నవారికి పోలీసుశాఖ వాటిని తమకు అప్పగించాలని నోటీసులు జారీ చేస్తోంది. పోలీసు అధికారుల సమాచారం మేరకు మెదక్ జిల్లాలో గన్ లైసెన్స్ ఉన్న వారు 20 మంది ఉన్నారు. వీరి వద్ద 29 ఆయుధాలు ఉన్నాయి. వీరందరికీ ఆయుధాలు డిపాజిట్ చేయాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటి వరకు 8 మంది ఆయుధాలను సంబంధిత పోలీస్టేషన్లలో డిపాజిట్ చేశారు. మిగితా వారు త్వరలో ఆయుధాలు డిపాజిట్ చేయనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. -
కొత్త ఈవీఎంలు వచ్చేశాయ్..
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముందనే ప్రచారం నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నుండి జిల్లాకు మంగళవారం కొత్తగా ఈవీఎం లు, వీవీ ప్యాట్లు చేరుకున్నాయి. బెంగళూరు నుండి ప్రత్యేక కంటైనర్లలో వచ్చిన వీటిని జిల్లా కేంద్రంలోని గోదాంకు చేర్చా రు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల నాయ కుల సమక్షంలో వీటిని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పరిశీలనలో గోదాంల్లో భద్రపరిచారు. జిల్లాకు మొత్తం 1,770 ఈవీ ఎంలు, వీవీ ప్యాట్లు చేరుకున్నాయి. ప్రత్యేకంగా సీల్ చేసిన బాక్సుల్లో వచ్చిన ఈవీఎం, వీవీ ప్యాట్లను భద్రపరిచిన గోదాంల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షిస్తా మని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ రాజకీయ పార్టీల నాయకులకు తెలిపారు. ఈ సందర్భంగా నాయకుల సమక్షంలో ఓ బాక్స్‌ను తెరిచి కొత్త ఈవీఎం, వీవీ ప్యాట్ పనితీరును వివరించారు. రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఎన్నికల కమిషన్ నుండి జిల్లాకు కొత్తగా ఈవీఎంలు, వీవీ ప్యాట్లు వచ్చిన సందర్బంగా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటుచేశారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా వచ్చిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై రాజకీయ పార్టీలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటర్ జాబితాలు ఓసారి పరిశీలించడంతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు చొరవ చూపాలని కోరారు. 18 ఏళ్లు నిండిన అందరూ ఓటరుగా నమోదయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 25 లోపు నమోదు చేయాలని సూచించారు. అక్టోబర్ 8వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందని వివరించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ట్రెయినీ ఐఏఎస్ మిలింద్ బాప్నా, డీఆర్వో వెంకటేశ్వర్లు, నారాయణపేట ఆర్డీఓ శ్రీనివాసులు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు రంగారావు, ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ హాదీ, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు బెక్కెం జనార్దన్, బీజేపీ నాయకుడు అంజయ్యతో పాటు సీపీఐ, సీపీఐ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కాల్‌సెంటర్ పరిశీలన ఎన్నికల ఏర్పాట్లలో బాగంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తున్న కాల్‌సెంటర్‌ను కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పరిశీలించారు. కాల్సెంటర్లో ఏర్పాటుచేసిన 08542–241165 నంబర్‌కు ఎవరైనా ఫోన్ చేసి తమ వివరాలను చెబితే ఓటరు జాబితాలో పేరు ఉందా, లేదా పరిశీలించి చెబుతారు. ఈ మేరకు కాల్‌సెంటర్‌ను పని విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. బీఎస్ఎన్ఎల్ నుంచి బుధవారం నుండి 4జీ కనెక్షన్ తీసుకోవాలని అధికారులకు సూచించారు. -
ఈవీఎం ఎక్చేంజ్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మ రం చేసింది. ఇప్పటికే ఓటరు జాబితాల సవరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన అధికారులు.. ఇప్పు డు ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లపైనా దృష్టి సారించారు. ప్రస్తుతం ఉన్న పాత ఈవీఎంల స్థానంలో కొత్తవాటిని తెప్పించాలని నిర్ణయించారు. ఇప్పుడున్న ఈవీఎంల టెక్నాలజీ వీవీపీఏటీ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రాయల్)కి సపోర్టు చేయదు. దీంతో వీవీపీఏటీ యూనిట్లకు సపోర్టు చేసేలా అప్డేటెడ్ ఈవీఎంలను తెప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈసీఐఎల్, బీఈఎల్‌లకు 3,400 ఈవీంలు ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల సంఘం ప్రత్యేక గోదాములు నిజామాబాద్‌లో ఉన్నాయి. గత ఎ న్నికల్లో పోలింగ్ కోసం వినియోగించిన ఈవీఎం లను ఇందులో భద్రపరిచారు. మొత్తం 20,826 ఈవీఎంలు ఉన్నాయి. వీటిలో కొన్ని హైదరాబాద్‌కు చెందిన ఈసీఐఎల్ సంస్థ తయారు చేసినవి కాగా, మరికొన్ని బెంగుళురులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలకు చెందినవి ఉన్నాయి. వీవీపీఏటీ యూనిట్లకు సపోర్టు చేయని వీటి స్థానంలో వీవీపీఏటీ యూనిట్లకు అనుసంధానించేలా అప్డేటెడ్ ఈవీఎంలను తెప్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే సుమారు 3,400 ఈవీఎంలను ఆయా సంస్థలకు పంపారు. మిగిలినవి కూడా విడతల వారీగా పంపుతున్నారు. ఈ ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాలకు వీవీపీఏటీ యూనిట్లు సపోర్టు చేయగల అప్డేటెడ్ ఈవీఎంలను తెప్పిస్తున్నారు.ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 2,142 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. వీటికి అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది. పార్టీల అభ్యంతరాల నేపథ్యంలో.. ఈవీఎంలో ఏ గుర్తు మీట నొక్కినా ఒకే అభ్యర్థికి ఓటు పడుతుందనే అపోహ.. ఈవీఎంల పనితీరుపై పలు రాజకీయ పార్టీల అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల సం ఘం ఈ ఎన్నికల్లో వీవీపీఏటీ యూనిట్లను వినియోగించాలని నిర్ణయించింది. ఓటరు ఏ గుర్తుకు ఓటు వేశారనేది ఈ వీవీపీఏటీ యూనిట్లలో నిక్షిప్తం అవుతుంది. ఓటరుకు తన ఓటు ఏ గుర్తుకు వేశామనేది ఈ యూ నిట్‌లో కనిపిస్తుంది. ఓటు వేసిన అనంతరం 7 సెకన్ల వరకు ఈ సమాచారం ఓటరు అం దుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతే పోలింగ్ అధి కారులను అడిగి కూడా తన ఓటు ఏ గుర్తుకు పడిందనేది ఈ యూనిట్ల ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఆయా వీవీపీఏటీ యూనిట్లలో పోలింగ్‌కు సంబంధించిన సమాచారం ఐదేళ్ల వరకు నిక్షిప్తంగా ఉం టుందని అధికారులు పేర్కొంటున్నారు. -
ఏర్పాట్లు ముమ్మరం
సాక్షి,మెదక్: జిల్లాలో ముందస్తు ఎన్నికల ఏర్పాట్లు వేగం పుంజుకుంటున్నాయి. తుది ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఈవీఎంల సమకూర్చుకోవటం తదితర అంశాలపై అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ ధర్మారెడ్డి సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం రెవెన్యూ అధికారులు జిల్లా డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ప్రకటించారు. ఈ జాబితా ఆధారంగా ఓటర్ల సవరణ పూర్తి చేయనున్నారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఈనెల 14, 15 తేదీల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి గ్రామాల వారీగా ప్రచార కార్యక్రమాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. సోమవారం ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాను అనుసరించి మెదక్ నియోజకవర్గంలో 1,82,464 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 88,404 మంది పురుషులు, 94,055 మహిళలు, ఐదుగురు ఇతరులున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మొత్తం 1,88,909 ఓటర్లు ఉండగా వీరిలో 93,703 పురుషులు, 95,201 మహిళా ఓటర్లు, ఐదుగురు ఇతరులున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లదే పైచేయి. ఓటర్ల సవరణ అక్టోబర్ 6వ తేదీ వరకు పూర్తి కానుంది. ఆ తర్వాత తుది ఓటరు జాబితా వచ్చేనెల 8న ప్రచురించనున్నారు. ఓటరు జాబితా సవరణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మొదలైన ఫైళ్ల తరలింపు.. ఎన్నికలు నవంబర్‌లో ఉండవచ్చని తెలుస్తుండటంతో అధికారుల పనితీరులో వేగం పెరిగింది. ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపైనా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. 2014 అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగాయి. దీంతో ఎన్నికల నిర్వహణ సమాచారం మొత్తం సంగారెడ్డి కలెక్టరేట్లోనే ఉంది. సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి 2014 ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొత్తం సమాచారం, ముఖ్య ఫైళ్లను మెదక్‌కు తీసుకువస్తున్నారు. అధికారుల సమాచారం మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 509 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 261, మెదక్ నియోజకవర్గంలో 248 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది. అయితే రాబోయే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగనున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో 509 పోలింగ్ కేంద్రాలు ఉండగా త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్య 29 పెరిగి ఆ సంఖ్య 538కి చేరుకోనుంది. 17వ తేదీ నుంచి అవగాహన ఈ ఎన్నికల్లో వీవీ పాట్ ఈవీఎంలు వాడనున్నారు. ఈవీఎంల వాడకంపై కొన్ని పార్టీలు అభ్యంతరం వెలిబుచ్చుతున్న నేపథ్యంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వీవీ పాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) ఈవీఎంలు వాడాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీవీ పాట్ ఈవీఎంలో ఓటరు ఏ పార్టీ, ఏ అభ్యర్థి ఓటు వేసింది అన్న వివరాలతో ఓటింగ్ స్లిప్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన స్లిప్‌ను ఓటరు ఏడు సెకండ్లపాటు డిస్ప్లేలో చూడవచ్చు. బెంగుళూరులోని బీహెచ్ఈఎల్ నుంచి 600 వరకు వీవీపాట్ ఈవీఎంలు జిల్లాకు రానున్నట్లు తెలుస్తోంది. మొదటి విడతగా 20 వీవీ పాట్ ఈవీఎంలు ఈనెల 17న జిల్లాకు వస్తున్నాయి. వీటితో అన్ని మండలాల్లో ఓటర్లు ఎదుట ప్రదర్శించనున్నారు. ఓటర్లకు వీవీ పాట్ ఈవీఎంల పనితీరు వివరించి వాటి పనితీరును ప్రత్యక్షంగా చూపనున్నారు. -
ఈవీఎంలు వద్దు..మళ్లీ బ్యాలెట్లే కావాలి!
-
మళ్లీ బ్యాలెట్‌కే వెళ్దాం!
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం)ల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేస్తూ.. భవిష్యత్తులో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈవీఎంలతోపాటు వాటికి అనుసంధానించే వీవీప్యాట్ (ఓటు ధ్రువీకరణ యంత్రాల)ల్లో లోపాలపై అభ్యంతరాలు తెలిపాయి. అలాగే ఓటరు జాబితాలో నకిలీల్ని నివారించేందుకు ఓటర్లను ఆధార్‌తో అనుసంధానించాలని ఈసీకి సూచించాయి. ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది ప్రథమార్థంలో లోక్‌సభ ఎన్నికలున్న నేపథ్యంలో అన్ని పార్టీలతో సోమవారం ఈసీ సమావేశం నిర్వహించింది. ఈ అఖిలపక్ష భేటీలో బీజేపీ మినహా మిగతా ఆరు జాతీయ పార్టీలు, పలు ప్రాంతీయ పార్టీలు మళ్లీ పాత పద్ధతిలో బ్యాలెట్ విధానంతోనే దేశంలో ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని నొక్కిచెప్పాయి. ఈవీఎంలపై లేవనెత్తిన సందేహాలకు ప్రతిపక్ష పార్టీలు సంతృప్తి చెందేలా సమాధానం ఇస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. బ్యాలెట్ పద్ధతికి మళ్లడమంటే పోలింగ్ బూత్‌ల ఆక్రమణల్ని స్వాగతించినట్లేనని సీఈసీ ఓపీ రావత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘కొన్ని పార్టీలు మళ్లీ బ్యాలెట్ విధానానికి వెళ్లాలని కోరడం మంచిది కాదు. అదే సమయంలో ఈవీఎంలతో కొన్ని సమస్యలున్నాయని, వీవీపాట్ల స్లిప్‌ల లెక్క విషయంలో లోపాలున్నాయని మా దృష్టికి తీసుకొచ్చాయి. మేం వాటిపై దృష్టిపెడతాం’ అని ఆయన చెప్పారు. 70% పార్టీలది బ్యాలెట్ బాటే: కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఈసీ అన్ని పార్టీల అభిప్రాయాల్ని వినడం సంప్రదాయంగా వస్తోంది. ఆ నేపథ్యంలో నిర్వహించిన ఈ భేటీలో నిజానికి ఈవీఎంల ట్యాంపరింగ్, వీవీప్యాట్‌ల్లో సాంకేతిక లోపాలు అజెండా కాకపోయినా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం వాటినే ప్రధానంగా ప్రస్తావించాయి. ఈవీఎంల్ని ట్యాంప రింగ్ చేస్తున్నారని, పేపర్ బ్యాలెట్లకు మళ్లాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఎన్సీపీ, ఆమ్ఆద్మీ, జనతాదళ్(ఎస్), సీపీఐ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్ తదితర పార్టీలు తమ వాణిని గట్టిగా వినిపించాయి. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ‘నాల్గింట మూడొంతు పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్, సాంకేతిక లోపాల్ని ప్రస్తావించాయి. ఈ విషయంలో బీజేపీ ఒంటరైంది. 70 శాతం రాజకీయ పార్టీలు పాత విధానంలోనే ఎన్నికలు జరపాలని ఈసీని కోరాయి’ అని చెప్పారు. ‘ఒకవేళ పేపర్ బ్యాలెట్‌కు ఈసీ మొగ్గు చూపనిపక్షంలో.. ఓటింగ్ విశ్వసనీయత కోసం కనీసం 30 శాతం పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలకు పేపర్ ట్రయల్ యంత్రాల్ని ఏర్పాటు చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఈసీ గుర్తింపు పొందిన ఏడు జాతీయ, 51 ప్రాంతీయ పార్టీల్ని ఈసీ ఆహ్వానించగా.. మొత్తం 41 పార్టీలు మాత్రమే హాజరయ్యాయి. రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చులకు పరిమితి విధించడాన్ని భేటీలో బీజేపీ వ్యతిరేకించింది. దానికి బదులు మరింత పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలంది. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంపై తాము సానుకూలంగా ఉన్నామని తెలిపింది. ఆధార్‌తో అనుసంధానించాలి ఎన్నికల్లో అక్రమాల్ని నిరోధించేందుకు జాబితాలోని ఓటర్లను వారి ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేయాలని బీజేపీ సహా పలు పార్టీలు ఈసీని కోరాయి. ‘ఓటర్లతో ఆధార్‌ను అనుసంధానించాలని రాజకీయ పార్టీలు ఈసీకి సూచించాయి. 10 పార్టీలు ఈ అంశాన్ని లేవనెత్తాయి’ అని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్షరక్రమంలో ఓటర్ల జాబితాను రూపొందిస్తే.. నకిలీల్ని తొలగించేందుకు అవకాశముంటుందని సమావేశంలో బీజేపీ సూచించింది. కాగా ఆగస్టు 2015లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో.. ఓటరు జాబితాతో ఆధార్ అనుసంధాన ప్రక్రియను బ్రేక్ పడింది. 1982లో తొలి ఈవీఎం ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఈవీఎంల్ని హ్యాక్ చేయాలంటూ గతేడాది జూన్‌లో పార్టీల్ని ఈసీ ఆహ్వానించగా.. కేవలం రెండు పార్టీలు మాత్రమే ఆ సవాలు స్వీకరించాయి. చివరికి ఆ రెండూ కూడా ఈవీఎంల హ్యాకింగ్ సవాలుకు గైర్హాజరయ్యాయి. 1982లో కేరళలో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారి ఈవీఎంల్ని ఉపయోగించారు. వాటి వాడకంపై అప్పటికి ఎలాంటి చట్టం లేకపోవడంతో ఆ ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈవీఎంల్ని వినియోగించేందుకు వీలుగా 1989లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించినా.. 1998 వరకూ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దాదాపు అన్ని ఎన్నికల్లో ఈవీఎంల వైఫల్య రేటు 0.7 శాతంగా ఉంటోంది. -
ఈవీఎంలు ఎక్కడ రిపేరు చేస్తున్నారు?
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం)లను ఎక్కడ రిపేరు చేయిస్తున్నారో తెలుపాలని ప్రతిపక్షపార్టీలు, జాతీయ ఎన్నికల కమిషన్‌ను నిలదీశాయి. సోమవారం ఎన్నికల కమిషన్ నిర్వహించిన సీఈసీ సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్‌ను ప్రశ్నించారు. ప్రతిసారీ ఓట్లన్నీ ఒకే పార్టీకి ఎలా వెళ్తున్నాయని, వాటి రిపేరు చేసే సంస్థ పేరు, అడ్రస్ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నిరోజుల ఈవీఎంలను ఉపయోగిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ మినహా కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, మాయవతి బహుజన సమజ్వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్‌లతో సుమారు 51 పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించడం వల్ల ప్రజల తీర్పు వెలవడటం లేదన్నారు. ‘చాలా సందర్భాల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు. ఏ పార్టీకి ఓటేసిన ఒకే పార్టీకి ఓట్లు వెళ్లాయి. ఈవీఎంలను ఎవరు రిపేరు చేస్తారు? ఎన్ని రోజుల ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు? అనే విషయం మాకు తెలియాలి. అలాగే ఓటరు రశీదు పరికరాలు (వీవీ ప్యాట్లు) ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నాం.’అని తెలిపారు. తృణముల్ కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ.. మాకు ఈవీఎంలపై నమ్మకం లేదని, బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలకు ‘వీవీ ప్యాట్’ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ అడిట్ ట్రైయిల్) అనుసంధానించి ప్రతి ఓటరు పేపర్ రశీదుతో ఒక శాతం ఓట్లను క్రాస్ చెక్ చేస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు 30 శాతం ఓట్లను క్రాస్‌చెక్ చేయాలని సూచించాయి. దేశంలో జరిగిన గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి మెజార్టీ రావడాన్ని ప్రతిపక్షపార్టీలు సందేహించాయి. ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే బీజేపీ అధికారం దక్కించుకుందని ఆరోపించాయి. అలాంటిదేం జరిగలేదని ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చినప్పటికి వారు నమ్మలేదు.