దొరికిన వీవీ ప్యాట్‌ స్లిప్పులు.. కలకలం! | VV Pat Slips Found in Athmakuru | Sakshi
Sakshi News home page

దొరికిన వీవీ ప్యాట్‌ స్లిప్పులు.. కలకలం!

Published Mon, Apr 15 2019 5:12 PM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

VV Pat Slips Found in Athmakuru - Sakshi

సాక్షి, నెల్లూరు : ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో ఈవీంఎలకు అమర్చిన వీవీ ప్యాట్‌ స్లిప్పులు దొరకడం కలకలం రేపింది. ఎన్నికల్లో ఏ పార్టీ గుర్తుకు ఓటు వేశారో ఓటరకు తెలిపేందుకు వీలుగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మేషిన్ల (ఈవీఎంల)కు వీవీ ప్యాట్లు అమర్చిన సంగతి తెలిసిందే.  ప్రభుత్వ పాఠశాల ఆవరణలో దాదాపు 200 వీవీ ప్యాట్‌ స్లిప్పులు దొరికాయి. ఈ స్లిప్పులను ఆత్మకూరు రిటర్నింగ్‌ అధికారి సోమవారం పరిశీలించారు. పోలింగ్‌ సిబ్బందికి ఈవీఎంల వినియోగానికి సంబంధించిన శిక్షణ ఇచ్చినప్పుడు వాడిన స్లిప్పులు ఇవని రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. నిబంధనల ప్రకారం శిక్షణ ఇచ్చినప్పుడు వాడిన వీవీ ప్యాట్‌ స్లిప్పులను కూడా భద్రపరచాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో వీవీ ప్యాట్‌ స్లిప్పులు దొరికిన ఘటనపై అధికారులను వివరణ కోరతామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement