atmakur
-
మల్లన్న భక్తులకు తప్పని నడక కష్టాలు
మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తోంది. శ్రీశైలం (Srisailam) మల్లన్న దర్శనానికి భక్తులు కాలినడకన బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. వందలు కాదు.. వేలు కాదు.. లక్షలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని ఏటా దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ఇప్పటికే శివ మాల ధరించిన భక్తులు తమ దీక్షా కాలాన్ని పూర్తి చేసుకుని నిష్టాగరిష్టులై స్వామి దర్శనానికి వేచి ఉన్నారు. ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు జరగనున్న శివరాత్రి (MahaShivratri) ఉత్సవాలకు ఏర్పాట్లు చేసిన దేవస్థానం, దేవదాయశాఖ అధికారులు పాదయాత్ర భక్తులను మాత్రం విస్మరించినట్లున్నారు. జంగిల్ క్లియరెన్స్, తాగు నీటి ఏర్పాట్లను మొదలే పెట్టకపోవడంతో పాదయాత్ర భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివయ్యా.. నీ చెంతకు చేరే దారేదయ్యా అంటూ లోలోనే మదన పడుతున్నారు.శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లాలనుకునే భక్తుల్లో చాలా మంది వెంకటాపురం మీదుగా ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. ఆత్మకూరు నుంచి వెంకటాపురం మీదుగా శ్రీశైలానికి 45 కిలోమీటర్ల దూరం అవుతుంది. 41 రోజులు కఠోర దీక్షలో ఉంటూ, శివనామస్మరణ చేస్తూ, నేలపై నిద్రించి అనునిత్యం శివ నామాన్ని జపించే శివమాలధారులు చివరిగా ఆ శివయ్యను చేరుకునేక్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 20 రోజులకు పైగా భక్తుల రద్దీ కొనసాగే ఈ ఈ 45 కిలోమీట్ల నడక దారిలో జంగిల్ క్లియరెన్స్‌ను ఇటు శ్రీశైలం దేవస్థానం గానీ.. అటు అటవీశాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. బొబ్బలెక్కిన కాళ్లకు... గుళక రాళ్లు మరింత అడ్డంకి వెంకటాపురం గ్రామం నుంచి కాస్త దూరం వెళ్లగానే నాగలూటి క్షేత్రం చేరుకుంటారు. ఈక్రమంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చిన్న దారి, గుబురుగా పెరిగిన చెట్ట కొమ్మలు, రాలిపడిన ఆకుల కింద ముళ్లు భక్తులకు ఇబ్బందిగా మారనున్నాయి. అక్కడ వీరభద్రస్వామిని దర్శించుకుని ఎగువగట్టుకు వెళ్లేక్రమంలో ప్రతి ఐదు లేదా పది నిమిషాలకోసారి మల్లన్నా.. నీ దర్శనం ఎప్పుడంటూ నడవలేక ఆగిపోయే పరిస్థితులున్నాయి. అతికష్టమైనా మెట్లు ఎక్కే భక్తులకు. చెత్తచెదారం కాళ్లకు గుచ్చుకుంటే మాత్రం భరించలేదు. ఎలాగో కష్టపడి గట్టు దిగిన భక్తులకు పెచ్చెరువుకు చేరుకోవడం సులభమే. కానీ సాదులమఠం, సీతమ్మబావి, భీమునికొలను చేరే క్రమంలోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భీముని కొలనులోయలో పడే ప్రమాదముందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అతి కష్టంపై ఒకరి చేయి మరొకరు పట్టుకుని మరో చేత్తో కొండ గట్టును పట్టుకుని ఒక్కొక్కరుగా ముందుకుసాగాల్సిన దుస్థితి ఉంది. భీముని కొలను దిగగానే కైలాస ద్వారానికి వెళ్లే మెట్ల మార్గం మరో ఛాలెంజ్. ఆ తర్వాత కైలాస ద్వారం నుంచి హఠటకేశ్వరం క్షేత్రం చేరే సమయంలోనూ దారి అస్తవ్యస్తంగా ఉంది. ఇలా 45 కిలోమీటర్ల ప్రయాణంలో భక్తుల పాదాలకు గుచ్చుకునే పదునైన కొండరాళ్లు తీవ్ర అంతరాయంగా మారుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి నడిచి రావడంతో అప్పటికే బొబ్బలెక్కిన కాళ్లకు వెదురుబొంగులు, పదునై ఎర్రరాళ్ల కొస వల్ల మరింత కష్టంగా మారుతున్నాయి. శ్రీశైలం దేవస్థానం, అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 32 ఏళ్లకు పైగా శివమాలధారణ ప్రారంభమైనప్పటి నుంచి నడకమార్గం ఎప్పుడూ శుభ్రం చేయకపోవడమే అందుకు నిదర్శనం. శ్రీశైలం దేవస్థానం అధికారులు తూతూ మంత్రంగా నిధులిస్తుండటంతో ఫారెస్టు అధికారులు కూడా అంతే రీతిలో పనులు చేసి చేతులు దులుపేసుకుంటున్నారు. కేవలం నాగలూటి క్షేత్రం వద్ద ఉన్న రెండు కోనేరులను శుభ్రం చేయడం, నాగలూటి వరకు అక్కడక్కడా వెదురుబొంగులు తొలగించడం మినహా.. రహదారి విశాలంగా చేయడం కానీ, నడక దారి భక్తుల కాళ్లకు గుచ్చుకోకుండా రాళ్లను తొలగించడం కానీ చేసిన దాఖలు లేదు. కాగా తాము నిధులిస్తున్నా.. అటవీ శాఖ దేనికి ఖర్చు చేస్తుందో చెప్పడం లేదని దేవస్థానం అధికారులు ఆరోపిస్తున్నారు. దారి పొడవునా జంగిల్ క్లియరెన్స్ చేయాలి శ్రీశైలం క్షేత్రానికి వెంకటాపురం నుంచి పాదయాత్ర కొనసాగించే భక్తులకు ఇబ్బంది లేకుండా కనీసం దారిలో గుచ్చుకునే రాళ్లనైనా తొలగించేందుకు అటవీశాఖ, శ్రీశైలం దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏటా భక్తుల కోసం నామమాత్రంగా కొన్ని పనులు చేసి చేతులు దులుపుకోవడం సరికాదు. తప్పనిసరిగా రహదారి వెంట ఇరువైపులా కంప చెట్లను, వెదురుబొంగులను, మొనదేలిన రాళ్లను తొలగించాలి. – విశ్వంభర మద్దుల రమణారెడ్డి, శివస్వామి, ఆత్మకూరు తాగు నీరు ఏర్పాటు చేయాలి యేటేటా శ్రీశైలం మహా క్షేత్రానికి లక్షలాదిగా తరలివెళ్లే శివస్వాములు, భక్తులకు తప్పనిసరిగా అధికారులు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇప్పటికే నాగలూటి చెంచుగూడెం, పెచ్చెరువు, నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రం వద్ద బోర్లు చెడిపోయాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయడమేగాకుండా ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక చోట తాగునీరు ఏర్పాటు చేయాలి. సాదుల మఠం, సీతమ్మబావి, భీమునికొలను వరకు భక్తులకు నీటి సౌకర్యం కల్పించాలి. – సంజీవరెడ్డి, శివస్వామి, సిద్ధపల్లి గ్రామం -
నన్నారి @ నల్లమల
ఆత్మకూరు: నల్లమల అంటేనే వృక్ష సంపదకు ప్రసిద్ధి. వివిధ వృక్ష జాతులు, ఔషధ మొక్కలకు పెట్టింది పేరు. అలాంటి ఈ అభయారణ్యంలో గిరిజనులకు ఎంతగానో ఉపాధినిస్తున్న నన్నారి (షరబత్) మొక్కలు కనుమరుగవుతున్నాయి. గిరిజనులు ప్రధానంగా నన్నారి, కుంకుడు, చింతపండు, ఇతర జిగురు లాంటి ఫల సేకరణ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. అయితే నల్లమల అరణ్య పరిధిలో ఒకప్పుడు నన్నారి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ విస్తారంగా కనిపించేవి. గిరిజనులు వాటిని సేకరించి, విక్రయించగా వచ్చిన సొమ్ముతో జీవనోపాధి పొందేవారు. ప్రస్తుతం నల్లమలలో వీటి ఉనికికి ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం గిరిజనులు గూడెం దాటి సుదూర ప్రాంతాలకు వెళ్లి నన్నారి తీగజాతి మొక్కను గుర్తించి, భూమిలో ఉన్న వేర్లను పెకిలించి తీసుకురావాల్సి వస్తోంది. ఎక్కువగా వేసవి సమీపించే ముందు గిరిజనులు నన్నారి వేర్ల సేకరణపై దృష్టి పెడతారు. కిలోల చొప్పున వాటిని విక్రయిస్తారు. వీటితో తయారైన నన్నారి పానీయాన్ని కొన్ని ప్రాంతాల్లో షర్బత్‌గా, మరికొన్ని ప్రాంతాల్లో సుగంధపాలుగా పిలుస్తారు. నన్నారి వేర్లు రెండు రకాలు. నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. నల్లమల పరిధిలో నల్ల రంగులో ఉన్నాయి. కేరళ, కర్ణాటకలోని మైసూరు, ఇతర రాష్ట్రాల్లో తెలుపు రంగులో దొరుకుతాయి. అయితే నల్లమలలో దొరికే వాటికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నన్నారి చాలా రుచికరంగా ఉంటుంది. పోషక పదార్థాలు కూడా ఎక్కువే. అందువల్ల ఇక్కడి నన్నారి వేర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. పెంపకానికి కేంద్రం ప్రోత్సాహం నల్లమల అటవీ పరిధిలో అంతరిస్తున్న నన్నారి మొక్కలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నన్నారి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది. నల్లమల పరిధిలో నన్నారి మొక్కల జాతి అంతరిస్తోందన్న విషయం రాష్ట్రపతి దృష్టికి వెళ్లడంతో.. ఈ పంటను ఎలాగైనా కాపాడాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి వందన యోజన అనే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వార శ్రీశైలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో తొలిసారిగా నన్నారి మొక్కల పెంపకానికి ఐటీడీఏ అధికారులు సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి, ఆత్మకూరు గ్రామాల్లో గిరిజనుల ఆధ్వర్యంలో నన్నారి మొక్కల పెంపకాన్ని (నర్సరీ) ప్రారంభించారు. మొక్క నాటిన రెండేళ్లలో భూమిలోకి వేర్లు బలంగా దిగుతాయి. ఆ తర్వాత వాటిని బయటకు పెకలించి, శుభ్రం చేసి విక్రయిస్తారు. కిలో నన్నారి వేర్లను ఉడికించడం ద్వారా 25 లీటర్ల నన్నారిని తయారు చేయవచ్చు. లీటర్ రూ.130 నుంచి రూ.200 చొప్పున మార్కెట్లో డిమాండ్ ఉంది. ఒక లీటర్ నన్నారికి.. సోడా లేదా నీరు, కాస్త నిమ్మరసం కలపడం ద్వారా 20 గ్లాసుల పానీయం తయారవుతుంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనుల నుంచి నన్నారి వేర్లను సేకరించి, రాష్ట్రంలోని వైజాగ్, ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.షుగర్ ఫ్రీ నన్నారి నన్నారి అంటేనే రుచికి ప్రతీక. పిల్లలైనా, పెద్దలైనా నన్నారికి దాసోహమే. అలాంటి నన్నారిని చూసిన షుగర్ పేషెంట్లు ఎలాగైనా సరే తాగాలని ఉబలాట పడతారు. అయితే గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుందని కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతుంటారు. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా సేవించేలా ఐటీడీఏ ఆధ్వర్యంలో నన్నారి తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఇప్పటికే ఆత్మకూరు ప్రాంతంలోని చెంచు, గిరిజనులకు శిక్షణ సైతం ఇచ్చారు. మొక్కల నర్సరీ కూడా ప్రారంభించారు. ఒక్కొక్క గ్రూపు నందు 30 మంది చొప్పున చెంచు గిరిజనులు ఉండేలా గ్రూపులను ఏర్పాటు చేశారు. నల్లమల నన్నారి ఉపయోగాలు వేసవిలో దాహార్తి తీరుతుంది. శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది. మూత్ర సంబంధ సమస్యలకు మందుగా పని చేస్తుంది. వ్యాధి నిరోధకత పెంచుతుంది. హోర్మోన్ల సమతుల్యతను పెంపొందిస్తుంది. జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగేలా చేస్తుంది. శరీర బరువు నియంత్రణలో ఉండేలా ఉపకరిస్తుంది.నన్నారి పెంపకం వల్ల ఆర్థికంగా లబ్ధిఎండాకాలం వ నన్నారి గడ్డల కోసం పారా, పలుగు పట్టుకుని కొండల్లోకి వెళ్లాలి. ఆ మొక్క కనిపించేంత వరకు వెతికి, వెతికి కొండల వెంబడి తిరగాలి. మొక్క కనిపించకపోతే ఇంటికి రావాలి. ఆ మొక్క కనిపిస్తే గడ్డలను తీసుకుని రావాలి. ఇందుకు కొండలో తిరిగేందుకు కూడా పొద్దు పోతుంది. ప్రస్తుతం మొక్కలను ప్రభుత్వం గూడేల్లోనే ఏర్పాటు చేయడంతో మాకు కొండల వెంట తిరిగే ఇబ్బంది ఉండదు. ఆ గడ్డలను అమ్ముకుని జీవనం సాగిస్తాం. గడ్డలు ఎక్కువగా వస్తే ఆర్థికంగా ఎదుగుతాం. -శివలింగమ్మ, చెంచు మహిళ, ఎర్రమఠం గూడెంతిరిగే కష్టం తప్పుతుందిఐటీడీఏ ఆధ్వర్యంలో మా గూడేల్లో నన్నారి నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గడ్డలను అమ్ముకుని బతికే అవకాశం పెరుగుతుంది. తద్వారా మాకు ఎంతగానో ఆరి్థకంగా ఉపయోగం ఉంటుంది. లేదంటే కొండల వెంట తిరిగి వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ నడచి వెతకాల్సి ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం ముగిసిన తర్వాత ఈ గడ్డల కోసం ఎంతో దూరం వెళ్లే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం గూడెం దగ్గరలోనే నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులకు జీవనోపాధి లభిస్తుంది. – ఈదమ్మ, బైర్లూటీ గూడెం -
లంచం ఇవ్వలేదని విద్యుత్ సరఫరా నిలిపివేత
ఆత్మకూర్(ఎస్): లంచం ఇవ్వలేదని తన పొలానికి విద్యుత్ లైన్మెన్ కరెంట్ లైన్ కట్ చేశాడని ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన రైతు బొల్లం వీరమల్లు ఆరోపించాడు. కందగట్ల, తిమ్మాపురం గ్రామాల మధ్య గల సోలార్ కంపెనీ సమీపంలో తనకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉందని, ఇటీవల కురిసిన వర్షాలకు తన వ్యవసాయ భూమి వద్ద రెండు విద్యుత్ స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా మారడంతో సరిచేయాలని గ్రామ లైన్మెన్ వెంకటయ్యను కోరినట్లు వీరమల్లు తెలిపాడు. ఈ మేరకు ఈ నెల 14వ తేదీన సిబ్బందితో సహా లైన్మెన్ వెంకటయ్య వచ్చి విద్యుత్ స్తంభాలను సరిచేసి రూ.10వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని బాధిత రైతు ఆరోపించాడు. అంత ఇవ్వలేనని బతిమిలాడడంతో మరుసటి రోజు ఇవ్వాలని గడువు పెట్టాడని, అప్పటికీ ఇవ్వకపోవడంతో ఈ నెల 15వ తేదీన తన పొలానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో శుక్రవారం ఏఈ గౌతమ్‌కు రాతపూర్వకకంగా ఫిర్యాదు చేసినట్లు వీరమల్లు తెలిపాడు. ఈ విషయమై ఆత్మకూర్(ఎస్) మండల ఏఈ గౌతమ్‌ను వివరణ కోరగా.. విచారణ చేసి లైన్మెన్పై చర్యలు తీసుకుంటానన్నారు. విద్యుత్ సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు ఇవ్వవద్దన్నారు. అవసరమైతే ప్రభుత్వానికి చెల్లించే లావాదేవీలను డీడీల రూపంలో మాత్రమే తీసుకుంటామని వెల్లడించారు. -
పింఛన్ హామీ తప్పెన్
దివ్యాంగులకు పెంచిన పింఛన్ రూ.6 వేలతో పాటు మూడు నెలలకు రూ.3 వేల చొప్పున బకాయి మొత్తం రూ.9 వేలు కలిపి రూ.15 వేలు చెల్లిస్తాం. – జూన్ 30న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం పింఛన్లపై మాట తప్పింది. గత మూడు నెలల బకాయిలతో కలిపి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. అయితే వృద్ధాప్యం, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ల బకాయిలు ఇచ్చిన చంద్రబాబు.. దివ్యాంగుల బకాయిలు ఎగనామం పెట్టారని దివ్యాంగులు వాపోతున్నారు. ఆత్మకూరులోని టెక్కేవీధికి చెందిన, రెండు దశాబ్దాలుగా మంచానికే పరిమితమైన దివ్యాంగురాలు షేక్ షాహీనా (32)కు కేవలం రూ.6 వేలు మాత్రమే చెల్లించారు. ఆమెకు మందులకే నెలకు రూ.7 వేలకు పైగా అవుతోందని ఆమె తల్లిదండ్రులు రజియా, అహమ్మద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని బోయలచిరివెళ్లకు చెందిన మరో దివ్యాంగురాలు రమాదేవి మంచానికే పరిమితమైంది. ఏళ్ల తరబడి ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న ఆమెకు నెలకు మందులకే రూ.5 వేలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ఆమె తండ్రి రాఘవయ్య తెలిపారు. దివ్యాంగుల్లో ఆశలు రేకెత్తించి, ఇచ్చిన మాట తప్పిన కూటమి ప్రభుత్వం పింఛన్ పంపిణీ సమయంలో వారి చేతిలో రూ.6 వేలు మాత్రమే పెట్టడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు మంచానికి పరిమితమైన వారికి, డయాలసిస్ బాధితులకు సైతం పెంచిన మొత్తం బకాయిలు చెల్లించలేదని, బాబుకు మాట తప్పడం పరిపాటేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బాబును నమ్మి మోసపోయామని పలువురు బాధితులు వాపోతున్నారు. -
మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
హైదరాబాద్ కు చెందిన యువకుడిని కిడ్నాప్ చేసిన దుండగులు
-
అడవి ఒడిలోకి.. పులి పిల్లలు
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో రెండునెలల క్రితం తల్లి నుంచి వేరుపడి దొరికిన పులి పిల్లల్ని తిరిగి అడవిలో వదిలేందుకు రాష్ట్ర అటవీ శాఖ భారీ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూపార్క్‌లో ఆ నాలుగు పులి పిల్లల్ని ఉంచి సంరక్షిస్తున్నారు. ఎన్టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) మార్గదర్శకాల ప్రకారం.. ప్రస్తుతం వాటికి ఆహారం అందించడంతోపాటు శిక్షణ ఇస్తున్నారు. వాటిని ఏడాదిన్నరలోపు తిరిగి అడవిలోకి పంపాల్సి వుంది. దీనికిముందు వాటిని అడవిలో సహజంగా జీవించే పులుల్లా తయారుచేసేందుకు అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. ఇలా అడవి నుంచి బయటకు వచ్చిన పులి పిల్లల్ని తిరిగి అడవిలోకి పంపిన అనుభవం ఉన్న మధ్యప్రదేశ్‌లోని కన్హా, బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వులను తిరుపతి జూ క్యూరేటర్ సెల్వం, ఎన్ఎస్టీఆర్ (నాగార్జున్‌సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు) ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ మరికొందరు అధికారుల బృందం పరిశీలించి వచ్చింది. కన్హా రిజర్వులో 36 హెక్టార్లు, బాంధవ్‌గఢ్ రిజర్వులో 26 హెక్టార్లలో ఇన్‌సిటు ఎన్క్లోజర్లు ఏర్పాటుచేసి తప్పిపోయి దొరికిన పులి పిల్లలకు శిక్షణ ఇచ్చారు. ఆత్మకూరు ప్రాంతంలోని నల్లమల అడవిలోనే ఇలాంటి ఎన్‌క్లోజర్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఎన్‌క్లోజర్ ఎలా వేశారు, ఎలా నిర్వహించారు, ఎంత ఖర్చయింది, అలాంటి ఎన్క్లోజర్ను ఇక్కడ ఏర్పాటుచేయడానికి ఏం చేయాలనే దానిపై ఈ బృందం ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనుంది. దాన్నిబట్టి త్వరలో ఎన్‌క్లోజర్ ఏర్పాటుచేయనున్నారు. 50 జంతువుల్ని వేటాడి తింటేనే పూర్తిగా అడవిలోకి.. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో వంద హెక్టార్లలో నాలుగు పులి పిల్లల కోసం ఇన్‌సిటు ఎన్‌క్లోజర్ ఏర్పాటుచేయనున్నారు. నీటి వసతి బాగా ఉండి, వేటాడేందుకు అనువైన జంతువులున్న చోటును అన్వేషిస్తున్నారు. ఆ చోటును గుర్తించిన తర్వాత అక్కడ ఎన్‌క్లోజర్ ఏర్పాటుచేసి 2, 3 నెలల్లో వాటిని అందులోకి వదిలిపెట్టాలని భావిస్తున్నారు. ఎన్క్లోజర్ను మూడు భాగాలుగా ఏర్పాటుచేయాలని చూస్తున్నారు. మొదట నర్సరీ ఎన్‌క్లోజర్‌లో ఉంచి చిన్న జంతువుల్ని వేటాడే అవకాశం కల్పించాలని, ఆ తర్వాత దశల్లో చిన్న, పెద్ద ఎన్క్లోజర్లలో కొద్దిగా పెద్ద జంతువుల్ని వేటాడేలా చేయాలనేది ప్రణాళిక. అదే సమయంలో అడవిలో ఎలుగుబంట్లు, ఇతర జంతువుల బారిన అవి పడకుండా కూడా జాగ్రత్త తీసుకోవాల్సి వుంటుంది. పులి పిల్లలు ఏడాదిన్నరలో ఈ ఎన్క్లోజర్లలో కనీసం 50 జంతువుల్ని చంపి తింటే వాటికి వేట వచ్చినట్లు నిర్ధారించుకుని అడవిలోకి వదిలేస్తారు. జంతువుల్ని చంపలేకపోతే వాటిని తిరిగి జూకి తరలిస్తారు. సాధారణంగా ఈ వేటను తల్లి పులులు పిల్లలకి నేర్పుతాయి. కానీ, ఆ పనిని ఇప్పుడు అటవీ శాఖ చేస్తోంది. ఈ పనిని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వులో విజయవంతంగా చేయడంతో అక్కడికెళ్లి అధ్యయనం చేశారు. అక్కడిలాగే నల్లమలలో ఇన్‌సిటు ఎన్క్లోజర్లు తయారుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చయ్యే పరిస్థితి ఉండడంతో అందుకోసం ఓ దాతను ఒప్పించారు. ఈ ఖర్చును భరించేందుకు ఆ దాత ముందుకు రావడంతో త్వరలో ఎస్వీ జూపార్క్‌లో పెరుగుతున్న పులి పిల్లలు నల్లమలలో ఇన్‌సిటు ఎన్‌క్లోజర్‌లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. జూపార్క్‌లోని నాలుగు ఆడ పులి పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయి. మూడు కేజీల బరువు ఉన్నప్పుడు దొరికిన వాటి బరువు ఇప్పుడు 14–15 కేజీలకు పెరిగినట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు. అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం పులి పిల్లల్ని తిరిగి అడవిలోకి పంపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. త్వరలో ఇన్‌సిటు ఎన్‌క్లోజర్ ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అందులో పులి పిల్లలు వేటాడితే అడవిలో వదులుతాం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతోపాటు మనం ఇంతకుముందు ఎప్పుడూ చేయని పని. అందుకే అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. – మధుసూదన్‌రెడ్డి, పీసీసీఎఫ్, ఏపీ అటవీ శాఖ -
ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు అద్భుతం
-
గుండెపోటుతో ఆత్మకూరు సీఐ మృతి
సాక్షి, ఆత్మకూరు(శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): ఆత్మకూరు సీఐ మల్లి నాగేశ్వరరావు (48) గుండెపోటుతో మృతి చెందారు. ఆరు నెలల క్రితమే అమరావతి నుంచి బదిలీపై వచ్చి ఆత్మకూరు సీఐగా బాధ్యతలు చేపట్టారు. విధుల్లో భాగంగా సోమవారం మర్రిపాడు మండలానికి ఓ కేసు విషయమై వెళ్లి విచారణ చేసి వచ్చారు. మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసిన అనంతరం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ప్రాథమిక చికిత్స అనంతరం నెల్లూరుకు తరలించే క్రమంలో ఆయన మృతి చెందారు. -
నంద్యాల: పులి కూనలపై కొనసాగుతున్న ఉత్కంఠ
సాక్షి, నంద్యాల జిల్లా: ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం గ్రామంలో పెద్ద పులి కూనల లభ్యమైన ఘటనలో ఉత్కంఠ కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన నాలుగు పులి కూనల్లో... రెండు పులి కూనల ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెస్క్యూ టీమ్ సిబ్బంది పులికూనలను ఆడవిలో వదిలిన కానీ, అక్కడి నుంచి అవి కదలడం లేదు పులికూనలకు పాలు తాగించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నం చేసింది. నాలుగు పులి కూనలను తిరుపతి జూకు తరలించే యోచనలో అటవీ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా పులి కూనలు డీహైడ్రేషన్‌కు గురికావడంతో బైర్లుటి వైల్డ్ లైఫ్ ఆసుపత్రికి అధికారులు తరలించారు. పులి కూనల తల్లీ(పెద్దపులి) ఆచూకీ తెలుసుకునేందుకు ఇన్ఫ్రారెడ్(ట్రాప్) కెమెరాలను టైగర్ ట్రాకర్లు పరిశీలిస్తున్నారు. చదవండి: రాప్తాడులో టీడీపీ కాకిగోల.. సాక్ష్యం ఇదిగో -
ఏపీ విద్యార్థికి రూ.1.2 కోట్ల ప్యాకేజీతో ‘ఇంటెల్’లో ఉద్యోగం
ఆత్మకూరు రూరల్(నెల్లూరు జిల్లా): ఆత్మకూరు యువకుడికి యునైటెడ్ స్టేట్స్ ఇంటెల్ సంస్థలో వార్షిక ప్యాకేజీ రూ.1.2 కోట్లతో కొలువు దక్కింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాతజంగాలపల్లికి చెందిన ఈగా మురళీమనోహర్‌రెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వెంకట సాయికృష్ణారెడ్డి ఖరక్‌పూర్ ఐఐటీలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఈ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఐఐటీ చివరి సంవత్సరం చదువుతున్న సాయికృష్ణారెడ్డి వచ్చే మే నెలలో ఈ కోర్సు పూర్తి చేసుకుని, ఆగస్టులో యూఎస్‌కు వెళ్లి ఉద్యోగంలో చేరనున్నారు. ఈ సందర్భంగా మురళీమనోహర్‌రెడ్డి, లక్ష్మీదేవి దంపతులు మాట్లాడుతూ కాయకష్టం చేసి రైతులుగా తాము సంపాదించిన సొమ్మంతా బిడ్డల భవిష్యత్ కోసమే వెచ్చిస్తున్నామని, వారు ఉన్నత స్థాయిలో ఉండడం కంటే తమకు వేరే కోరికలు లేవని భావోద్వేగానికి గురయ్యారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు -
ప్రేమజంటపై దాడి కేసులో పురోగతి
అనంతపురం శ్రీకంఠంసర్కిల్/ఆత్మకూరు: ప్రేమజంటపై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆత్మకూరు మండలం పంపనూరు సిటీ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ప్రేమికులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సీరియస్‌గా పరిగణించారు. దీనిని సవాలుగా తీసుకుని ఛేదించాలని దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులును ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పంపనూరు సమీపంలోని వడ్డుపల్లి మిట్ట వద్ద ప్రేమికులపై దాడి చేసిన ముఠా ఆనవాళ్లను 24 గంటల్లోపే పసిగట్టారు. ప్రాథమికంగా సేకరించిన ఆధారాల మేరకు అనంతపురం నగరానికి చెందిన అల్లరి మూకలే దాడులకు కారణంగా గుర్తించారు. అనంతరం వారు అపహరించిన సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ క్రమంలోనే నగరంలోని రాజీవ్ కాలనీ, హెచ్చెల్సీ కాలనీకి చెందిన ఇద్దరితో పాటు కంబదూరుకు చెందిన ఓ యువకుడిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఏకాంతం మాటున ప్రమాదం ప్రేమ జంటలకు పంపనూరు సమీపంలోని సిటీ పార్క్ కేంద్రంగా మారింది. ఏకాంతం కోసం సిటీ పార్క్‌లోని పొదలను ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నెల 23న సిటీ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ ప్రేమజంటపై గుర్తు తెలియని యువకులు దాడిచేసి మూడు సెల్ఫోన్లు, రెండు తులాల బంగారు నగలు అపహరించుకెళ్లిన విషయం విదితమే. ఇది మొదటి సారి ఏమీ కాదు! గతంలో ఎన్నో సార్లు ప్రేమజంటలను టార్గెట్ చేసి నగదు, విలువైన వస్తువులు అపహరించుకెళ్లారు. సిటీ పార్క్‌లో విహరిస్తూ ఎక్కువగా కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు జంటగా సిటీ పార్క్‌కు వస్తున్నారు. వీరిలో కొందరు మైనర్లు ఉండడం గమనార్హం. కాలేజీకి డుమ్మా కొట్టి పుస్తకాల బ్యాగు పక్కన పడేసి సిటీ పార్క్‌లో చక్కర్లు కొడుతూ ఏకాంతం కోసం గుట్టల్లోని పొదల మాటుకు వెళుతున్నారు. ఇదే అవకాశంగా కొందరు యువకులు వారిని బెదిరించి లూటీ చేస్తున్నారు. చైతన్యం రావాలి ప్రేమజంటపై దాడి చేసిన వారిని పట్టుకు తీరుతాం. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టి సారించాం. సిటీ పార్క్ ప్రాంతంలో పోలీసుల పహారా పెంచుతున్నాం. కాకపోతే ప్రజల్లో చైతన్యం రావాలి. ఘటన జరిగిన వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి విషయాన్ని పోలీసులకు చేరవేయాలి. ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. – ఆర్ల శ్రీనివాసులు, దిశ డీఎస్పీ యువత జాగ్రత్తగా ఉండాలి పంపనూరు సిటీ పార్కుకు ఎక్కువగా యువత వస్తుంటారు. కనుచూపు మేర అటవీ ప్రాంతం ఉండడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. యూనిఫాంతో జంటగా వచ్చే విద్యార్థులను, మైనర్లను అటవీ ప్రాంతంలోకి అనుమతించకుండా చర్యలు తీసుకుంటాం. – ఎస్ఐ శ్రీనివాసులు, ఆత్మకూరు (చదవండి: శాస్త్రీయ పద్ధతులతో సమగర దర్యాప్తు) -
Atmakur: కొత్త సొబగులద్దుకున్న వైఎస్సార్ స్మృతివనం
ఆత్మకూరు రూరల్(కర్నూలు జిల్లా): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం కొత్త అందాలను సంతరించుకుంది. ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామ శివార్లలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఒక అద్భుత పచ్చందాల పార్క్‌గా గుర్తింపు పొందింది. దశాబ్దం కిందట ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ థీమ్ ప్రాజెక్ట్ నిధుల కొరతతో అభివృద్ధికి నోచుకోలేక పోయింది. 2019లో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో స్మృతి వనానికి మహర్దశ వచ్చింది. ఆరునెలల క్రితం ప్రభుత్వం రూ. 2 కోట్లు విడుదల చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టింది. ఆయా పనులన్నీ ప్రస్తుతం పూర్తి కావడంతో స్మృతివనం కొత్త సొబగులద్దుకుంది. ఆరుబయలు ఆడిటోరియం... పచ్చదనాల ల్యాండ్‌స్కేప్ చిన్నపాటి శుభకార్యాలు జరుపుకునేందుకు వీలుగా స్మృతివనంలో పచ్చటి కార్పెట్ గ్రాస్‌తో పరుచుకున్న తిన్నెలను ఏర్పాటు చేశారు. వాటి మీద కూర్చుని కార్యక్రమం తిలకించే విధంగా మినీ వేదిక ఏర్పాటు చేశారు. దీని వెనుక ఒక తెర కూడా ఉండడంతో ఏవైనా రికార్డు చేసిన వీడియోలు, సినిమాలు ప్రదర్శించుకోవచ్చు. అలాగే ఈ ల్యాండ్ స్కేప్ మధ్యలో రెండు గ్రానైట్ శిలా మండపాలు కూడా నిర్మించారు. అక్కడక్కడా గ్రానైట్‌తో ఏర్పాటైన అరుగులు పర్యాటకులు సేదతీరడానికి అనువుగా ఉన్నాయి. కనువిందుగా పర్యావరణ విజ్ఞాన కేంద్రం పర్యావరణంపై పర్యాటకులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్మృతివనంలో పర్యావరణ విజ్ఞానకేంద్రానికి శ్రీకారం చుట్టారు. అయితే, నిధుల కొరతతో దశాబ్ద కాలంగా ఆగిపోయిన ఈ పనులు ఇటీవలే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. జీవకళలొలుకుతున్న పులిప్రతిమలు పర్యావరణ విజ్ఞాన కేంద్రం ముంగిట ఏర్పాటు చేసిన చిరుత పులుల ప్రతిమలు నిజం చిరుతలను చూస్తున్న అనుభూతిని కలిగిస్తున్నాయి. చెట్టుపై ఎక్కి కూర్చున్నట్లుగా వీటిని ఏర్పాటు చేశారు. అలాగే పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో సహజ వాతావరణంలో రాజసంగా నిలుచున్న పెద్దపులి ప్రతిమ వీక్షకులను సంభ్రమాశ్చ్యర్యాలకు గురి చేస్తోంది. అంతే కాకుండా విజ్ఞాన కేంద్రపు గోడలకు వేలాడదీసిన కొన్ని వన్యప్రాణుల చిత్రపటాలు చూడ ముచ్చటగొల్పుతున్నాయి. ఈ చిత్రపటాలన్నీ కూడా చేయితిరిగిన చిత్రకారులతో గీయించ బడిన కళాఖండాలు కావడం విశేషం. పిల్లను మోస్తున్న ఎలుగుబంటి, బరక భూములపై పరుగెత్తుతున్న బట్టమేక పక్షి, గడ్డిమైదానంలో కూర్చున్న కణితి, గాల్లో ఎగిరిపోతున్న కృష్ణ జింకల సమూహం, హనీబాడ్జర్ల చిత్రపటాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. రాతిపై జీవజాలం... వైఎస్ఆర్ స్మృతివనంలో ఉన్న పాదచర మార్గాలలో రాతి స్తంభాలపై పలు వన్యప్రాణులు, పక్షులు, సరీసృపాల శిల్పాలను చెక్కించి ఉంచారు. వీటికి సహజ వర్ణాలతో తీర్చిదిద్దడంతో ప్రత్యక్షంగా వాటిని చూస్తున్న అనుభూతి కలుగుతోంది. అదే విధంగా అడవుల్లో ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో తీసిన వన్యప్రాణుల చిత్రాలను ఫ్లెక్సీలుగా తీర్చి దిద్ది పలుచోట్ల ఉంచారు. ఇవి కూడా చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. (క్లిక్: గుడ్లగూబలు దూరం.. అసలు విషయం ఏంటంటే?) -
సీతాకోక చిలుక ‘పడగ విప్పడం’ ఎప్పుడైనా చూశారా?
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మునిసిపల్ పరిధి ముస్తాపురం సమీపంలోని తోటల్లో ఓ వింతైన సీతాకోక చిలుక కనిపించింది. వాయీజ్ అనే వ్యక్తి సమీపంలోని ఓ చెట్టుపై దీనిని చూసి మొదట కంగారు పడ్డాడు. ఆ తర్వాత తేరుకుని దానిని గమనించాడు. దూరం నుంచి చూస్తే అది నాగుపాము పడగను పోలి ఉంది. రెక్కలు విప్పితే దాని శరీరంపై వింతైన కళ్లు మాదిరి ఉన్నాయి. – ఆత్మకూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) -
అధ్వాన్నంగా ఆత్మకూరు - జూరాల ప్రాజెక్ట్ రహదారి
-
Tiger Mating Season: ఏకాంతమైతేనే 'సై'ఆట
ఆత్మకూరు రూరల్: జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు శ్రీశైలం అటవీ రేంజ్ పరిధిలోని ఇష్టకామేశ్వరి పుణ్యక్షేత్రానికి భక్తుల రాకపోకలను తాత్కాలికంగా అటవీ శాఖ నిలిపేసింది. ఇష్టకామేశ్వరి క్షేత్రం ఒక్కటే కాదు.. అన్ని పర్యావరణ పర్యాటక కేంద్రాలనూ ఈ మూడు నెలలు మూసివేశారు. ఇది పెద్ద పులుల సంతానోత్పత్తి సమయం(బ్రీడింగ్ పీరియడ్) అయినందున వాటికి ఏకాంతం కల్పించడమే ఈ ఆంక్షలకు కారణమని అటవీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పెద్దపులి ఎంతో సిగ్గరి మనస్థత్వం కలిగినది. ఎంతో ఠీవీగా రాజసంతో నడిచే పెద్దపులి తన సంగమ సమయంలో మాత్రం పూర్తిగా ఏకాంతాన్ని కోరుకుంటుంది. అడవిలో ఏ చిన్న అలజడి రేగినా పులులు సంగమంలో పాల్గొనవు. అయితే తరుచూ అడవుల్లో మానవ సంచారం కారణంగా పెద్ద పులుల్లో సంగమించడం తగ్గిపోయి గర్భధారణ అవకాశాలు పడిపోతున్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీసీఏ(నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) 2015లో పులుల అభయారణ్యాలున్న రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు రుతుపవనాల సమయమైన జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు అభయారణ్యాల్లో మానవ సంచారాన్ని అదుపు చేసే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఈ ఏడాది జూన్ 1 నుంచి ఈ నిషేధాజ్ఞలను ఎన్ఎస్టీఆర్(నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్), జీబీఎం(గుండ్ల బ్రహ్మేశ్వరం) అభయారణ్యాల పరిధిలో అటవీ శాఖ అమలు చేస్తోంది. దీంతో అభయారణ్యాల పరిధిలోని అన్ని ఎకో టూరిజం రిసార్ట్లు, జంగల్ సఫారీలు, పుణ్యక్షేత్రాలను మూసివేశారు. అవసరం అనుకుంటే ఈ నిషేధాజ్ఞలను మరో రెండు నెలలు కూడా పొడిగించే అవకాశాలున్నాయి. తల్లి తలపైకెక్కిన పులి కూనలు ఆ సమయంలో మనుషుల పైనా దాడి చేసే అవకాశం పులులు సంతానోత్పత్తి సమయాల్లో చాలా ఆవేశపూరితంగా ఉంటాయి. సంగమం సమయంలో ఆవేశంతో మనుషులపై దాడులకు పాల్పడతాయి. అందుకే పులుల సంతానోత్పత్తి కాలంలో నల్లమలలోని అన్ని పర్యాటక, పుణ్యక్షేత్రాలను తాత్కాలికంగా మూసివేయించాం. – అలెన్ చోంగ్ టెరాన్, డీఎఫ్‌వో, ఆత్మకూరు డివిజన్, నంద్యాల జిల్లా -
Bypoll Results 2022: ముగిసిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ
-
ఆత్మకూర్ బైపోల్.. 62 శాతం పోలింగ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలు
-
ఆత్మకూరులో పోలింగ్ ప్రశాంతం
-
ఆత్మకూరు ఉపఎన్నికల్లో ముగిసిన ప్రచారం
-
నెల్లూరు ఉప ఎన్నిక.. ముగిసిన ప్రచార పర్వం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. దీంతో నియోజకవర్గంలో మైకులు మూగబోయాయి. 23న జరగనున్న పోలింగ్‌పై అధికారులు దృష్టిపెట్టారు. ఈ మేరకు ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి హరేంద్రియ ప్రసాద్ ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక ఎన్నికల విధుల్లో 1300 మంది సిబ్బంది పాల్గొననున్నారు. 279 పోలింగ్ బూత్‌లను అధికారులను ఏర్పాటు చేయనున్నారు. 123 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. 123 స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. -
అత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీకి భంగపాటు తప్పదు: కాకాణి
-
అత్మకూరులో తన ప్రసంగంతో దుమ్ములేపిన అంబటి
-
ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపుతాం
ఆత్మకూరు: మూడేళ్లుగా కులమతాలకు అతీతంగా పారదర్శకంగా లక్షలాది కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వాదంతో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న మేకపాటి విక్రమ్‌రెడ్డిని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని, దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి కలలు కన్న అభివృద్ధికి కృషి చేస్తామని పలువురు మంత్రులు అన్నారు. ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక మరో రెండు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో సోమవారం పార్టీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, చెల్లుబోయిన వేణుగోపాల్‌కృష్ణ, జోగి రమేష్, రాజ్య సభ్యుడు బీద మస్తాన్‌రావు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన భారీ ర్యాలీతో పట్టణం జనసంద్రమైంది. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు జెండాలు చేతబట్టి వేలాదిగా పాల్గొనడంతో రోడ్లు కిక్కిరిశాయి. బంగ్లా సెంటర్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా ఎల్‌ఆర్‌పల్లి, జేఆర్‌పేట, సోమశిల రోడ్ సెంటర్, బస్టాండ్, వైశ్య బజారు మీదుగా సత్రం సెంటర్ వరకు సాగింది. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రజల సమస్యలను అతి తక్కువ కాలంలో దగ్గరగా పరిశీలించారని, వాటి పరిష్కారానికి, అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారన్నారు. ప్రజలు ఇప్పటికే పార్టీ గుర్తు ఫ్యాన్‌కు వేసేందుకు స్థిర నిర్ణయం తీసుకున్నారని మెజార్టీ లక్షకుపైగా సాధించేందుకు తాము ప్రచారంలో పాల్గొంటున్నామన్నారు. మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డి లేనిలోటు తీర్చేలా విక్రమ్‌రెడ్డి పని చేస్తారని ఆ కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలతో అనుబంధం ఉందని, మచ్చలేని రాజకీయాలు చేస్తున్న వారిని ఆదరించి అభిమానించాలన్నారు. ప్రతిపక్షాలు దిమ్మ తిరిగేలా భారీ మెజార్టీని అందివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి మంచి తనం చూసి ఆయన సోదరుడిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ మైనార్టీలతో పాటు బీసీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్‌తో పాటు అన్ని వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్, రాజకీయంగా పదవులు అందించిన ఘనత వైఎస్సార్ కుటుంబానికే దక్కుతుందన్నారు. అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు తనకు కొత్త అయినా పైనుంచి దీవిస్తున్న అన్న ఆశీర్వాదాలు, ప్రజల అభిమానం, ముఖ్యమంత్రి, మంత్రుల అండదండలు, సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపుతానన్నారు. గత నెల రోజులుగా చేస్తున్న ప్రచారంలో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం, సంతృప్తి కనిపిస్తున్నాయని, అమలు అవుతున్న నవరత్నాల పథకాలే శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసులురెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ద్వారకానాథ్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్సీ బల్లి కల్యాణచక్రవర్తి, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ జి వెంకట రమణమ్మ, వైస్ చైర్మన్లు డాక్టర్ కేవీ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, షేక్ సర్ధార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, రూరల్ అధ్యక్షుడు జితేంద్రనాగ్‌రెడ్డి, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.