
అ'ధర'హో..
వరుస పంట నష్టాలతో కుదేలవుతున్న రైతులు ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై దృష్టి సారిస్తున్నారు.
ఆత్మకూరు : వరుస పంట నష్టాలతో కుదేలవుతున్న రైతులు ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా పొట్టేళ్ల పెంపకం చేపట్టి లాభాలు గడిస్తున్నారు. ఆత్మకూరు మండలానికి చెందిన కొందరు రైతులు ఐదు నెలల క్రితం చిందనూరు జాతికి చెందిన పొట్టేళ్లను రూ. పదివేలతో కొనుగోలు చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు.
ప్రస్తుతం మాల పున్నమి, బక్రీద్ పండుగలు రానుండడంతో ఈ పొట్టేళ్లకు డిమాండ్ పెరిగింది. ఆత్మకూరుకు చెందిన రమేష్ పెంచిన రెండు పొట్టేళ్లు రూ. లక్షకు అమ్ముడు పోగా, సన్నప్పయ్యకు చెందిన పొట్టేళ్లు ఒక్కొక్కటి రూ. 60 వేలకు పైబడి ధర పలుకుతున్నాయి.