
సాక్షి, నంద్యాల జిల్లా: ఆత్మకూరు పట్టణంలో డయేరియా కలకలం రేపుతోంది. కలుషిత నీరు తాగి ఆత్మకూరు పట్టణంలో మరో వ్యక్తి మృతి చెందాడు. ఇప్పటికే ఆత్మకూరు నీలితొట్టి వీధిలో కలుషిత నీరు తాగిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
శనివారం రామచంద్రనాయక్ అనే వ్యక్తి కలుషిత నీరు తాగడంతో వాంతులు, విరే చనాలు కావడంతో కర్నూలు ఆసుపత్రికి బంధువులు తరలించారు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక అతడు చెందాడు. కలుషిత నీరు ఘటనలో ఇప్పటికి ముగ్గురు బలి కాగా, మరికొంతమంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Comments
Please login to add a commentAdd a comment