diarrhea
-
నంద్యాలలో డయేరియాతో ముగ్గురు మృతి
-
ఆత్మకూరులో డయేరియా కలకలం.. ముగ్గురి మృతి
సాక్షి, నంద్యాల జిల్లా: ఆత్మకూరు పట్టణంలో డయేరియా కలకలం రేపుతోంది. కలుషిత నీరు తాగి ఆత్మకూరు పట్టణంలో మరో వ్యక్తి మృతి చెందాడు. ఇప్పటికే ఆత్మకూరు నీలితొట్టి వీధిలో కలుషిత నీరు తాగిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.శనివారం రామచంద్రనాయక్ అనే వ్యక్తి కలుషిత నీరు తాగడంతో వాంతులు, విరే చనాలు కావడంతో కర్నూలు ఆసుపత్రికి బంధువులు తరలించారు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక అతడు చెందాడు. కలుషిత నీరు ఘటనలో ఇప్పటికి ముగ్గురు బలి కాగా, మరికొంతమంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
విశాఖజిల్లా జబ్బార్ తోటలో డయేరియా కలకలం
-
డయేరియా బాధితులకు అండగా YSRCP
-
కూటమి ప్రభుత్వంపై YSRCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్
-
సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ తీరు సిగ్గు చేటు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సాక్షి,అమరావతి : ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. శాసన మండలి చర్చలో ‘డయేరియాపై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది. 15ఏళ్లలో ఎప్పుడు లేని మరణాలు సంభవించాయి’అని చిరునవ్వుతో మంత్రి సత్యకుమార్ యాదవ్ వెకిలిగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.శాసన మండలి సమావేశాల సందర్భంగా డయేరియా మరణాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. ‘‘సభలో డయేరియాపై ఆరోగ్యశాఖ మంత్రి సమాధానం బాధాకరం. మృతులపై ఎంతటి అభిమానం ఉందో మంత్రి నిర్లక్ష్య సమాధానమే చెబుతోంది.మంత్రి సత్యకుమార్ యాదవ్ వెకిలిగా మాట్లాడటం సిగ్గుచేటు. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. గత 30 ఏళ్లలో గుర్లలో ఎన్నడూ డయేరియా మరణాలు సంభవించలేదు. సెప్టెంబర్ 20న మొదటి కేసు నమోదైంది. అక్టోబర్ 12వ తేదీ నాటికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 19న వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేసే వరకు ప్రభుత్వంలో చలనం రాలేదు.చదవండి: డయేరియా మరణాలపై నవ్వుతూ హేళనగా మాట్లాడిన ఏపీ మంత్రి 20 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వాసుపత్రి ఉంది. పక్క జిల్లాలో కేజీహెచ్ ఉంది. కానీ స్కూల్ బల్లలపై వైద్యం అందించారు. స్కూల్ బల్లలపై డయేరియా బాధితులకు వైద్యం అందించినందుకు ప్రభుత్వం సిగ్గు పడాలి. మృతుల సంఖ్యను తగ్గించడం పైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. డయేరియా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా చేయలేదు. ఒక్కో డయేరియా బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వైఎస్ జగన్ వెళ్లే వరకూ జిల్లా ఇంఛార్జి మంత్రి వంగలపూడి అనిత..ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా వెళ్లలేదు. మృతులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
Diarrhea: వందల మందిని వణికిస్తున్న డయేరియా
-
డయేరియా మరణాలపై నవ్వుతూ మాట్లాడిన ఏపీ మంత్రి
అమరావతి, సాక్షి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. డయేరియా మరణాలపై చర్చ సందర్భంగా ఆయన నవ్వుతూ.. మండలి సభ్యులను హేళన చేసేలా మాట్లాడారు. డయేరియా మరణాలపై శాసనమండలి చర్చలో భాగంగా తొలుత వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స మాట్లాడారు. అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా మాట్లాడే క్రమంలో మంత్రి సత్యకుమార్ నోరు జారారు. ‘‘డయేరియా పై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది. 15 ఏళ్లలో ఎప్పుడు లేని మరణాలు వచ్చాయి’’ అని చిరునవ్వుతో మాట్లాడారాయన.వెంటనే బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మంత్రి వ్యక్తిగతంగా మాట్లాడటం మంచిది కాదు. ఆయనకు పైశాచిక ఆనందం ఉంటే ఉండొచ్చు. కానీ ప్రజలకు, సభలో సమాధానం చెప్పినప్పుడు బాధ్యత గా వ్యవహరించాలి’’ అని అన్నారాయన. అనంతరం.. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ వైఎస్సార్సీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. -
మరో ఆరుగురికి డయేరియా
నరసరావుపేట: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో డయేరియా మరింత ప్రబలుతోంది. కేసులు పెరుగుతున్నాయి. కాలనీలో శనివారం మరో ఆరుగురికి డయేరియా సోకింది. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు ఈ కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతిచెందారు. 17 మంది ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో కొంతమంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇళ్లకు వెళ్లారు. శనివారం కూడా ఆరుగురికి డయేరియా సోకటం ఆందోళన కలిగిస్తోంది. కాలనీలో తమ్మిశెట్టి మాధవి, దేవళ్ల రాకేష్, తమ్మిశెట్టి అశోక్, తమ్మిశెట్టి శ్రీనివాసరావు, కొట్రా అన్నమ్మ, మరొకరు శనివారం వాంతులు, విరేచనాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. కాలనీలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాల్లో ప్రాథమిక చికిత్స చేసిన తరువాత మెరుగైన వైద్యం కోసం సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలకు తరలిస్తున్నారు.ప్రస్తుతం వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతున్న వారిలో కొట్రా అన్నమ్మ ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. తాగునీటి బోరులో నీరు కలుషితమవడంతో అంజనాపురం కాలనీ వాసులు ఈ నెల 22 నుంచి డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి వ్యాధి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
డయేరియా ఉంది..కానీ మరణాలకు కారణం కాదు..
సాక్షి, నరసరావుపేట/దాచేపల్లి: ప్రజాసమస్యలు వెలుగులోకి రాకుండా ఏదోవిధంగా మాయచేయాలనే కూటమి సర్కారు పెద్దల ప్రయత్నాలు దారుణంగా మారాయి. మరణాలకు కారణాలను కూడా మార్చి చెప్పి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. డయేరియా ప్రబలి ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తుంటే నివారణ చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా అబద్ధాలతో మోసం చేయాలని చూస్తోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి నగరపంచాయతీ అంజనాపురం కాలనీలో డయేరియాతో బుధవారం రాత్రి ఇద్దరు మరణించారు. పదుల సంఖ్యలో ఆస్పత్రుల పాలయ్యారు. ఈ కాలనీలో ఇద్దరు డయేరియాతో మరణించలేదని శుక్రవారం అక్కడ పర్యటించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పడం అందరినీ ఆశ్చర్య పరిచింది. కాలనీలో మరణించిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ అనే యువకుడు కూల్‌డ్రింక్ తాగి వికటించి మరణించాడని, వృద్ధుడు చినవీరయ్య కిడ్నీ సమస్యతో బాధపడి చనిపోయాడని మంత్రి చెప్పారు. మరోవైపు అంజనాపురం కాలనీలో కలుషిత తాగునీటి కారణంగా డయేరియా ప్రబలిందన్నారు. 17 కేసులు నమోదయ్యాయని చెప్పారు. డయేరియా కారణంగానే ఇద్దరు మరణించారని గురువారం గుర్తించిన అధికారులు.. శుక్రవారం మంత్రి మాట మార్చడంతో అవాక్కయ్యారు. వాంతులు, విరేచనాలతోనే చనిపోయాడు..రోజూ కాలేజీకి వెళ్లే తమ కుమారుడికి అనారోగ్యం ఏమీ లేదని, వాంతులు, విరేచనాలతోనే చనిపోయాడని మృతుడు వెంకటేశ్వర్లు తల్లిదండ్రులు కృష్ణంరాజు, శివకుమారి చెప్పారు. తమ బిడ్డ కూల్‌డ్రింక్ తాగి చనిపోయాడని మంత్రి సత్యకుమార్ చెప్పడం దారుణమని వారు శుక్రవారం మీడియా ముందు అవేదన వ్యక్తం చేశారు. వాంతులు, విరేచనాలతో చనిపోతే కూల్‌డ్రింక్ తాగి చనిపోయాడని ఏలా చెబుతారని ప్రశ్నించారు. తమ ఇంటికి వచ్చి తమతో మాట్లాడకుండానే ఈ విధంగా అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. తమ కుమారుడు బుధవారం రాత్రి 9 గంటలకు వాంతులతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించామని, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విరేచనాలు కావటంతో నీరసించి కాళ్లు పట్టుకుపోయాయని చెప్పారు. నారాయణపురం ఆస్పత్రి నుంచి పిడుగురాళ్ల తీసుకెళితే ఆస్పత్రిలో చేర్చుకోలేదని, అక్కడినుంచి నరసరావుపేట వెళుతుండగా తమ కుమారుడు చనిపోయాడని కన్నీటితో తెలిపారు. కేవలం వాంతులు, విరేచనాల కారణంగానే తమ బిడ్డను పొగొట్టుకున్నామన్నారు. చికిత్సకి సంబంధించిన పేపర్లను తీసుకెళ్లిన అధికారులు వాటిని తిరిగి ఇవ్వలేదని తెలిపారు. చనిపోయిన తమ బిడ్డపై నిందలు వేయవద్దని, న్యాయం చేయాలని వారు వేడుకున్నారు. ఇల్లు ఇస్తామని ఆశపెడుతున్నారు.. తన కుమారుడి చావును ప్రభుత్వం తప్పుదోవపట్టించి ఇంటిని నిర్మించి ఇస్తామని ఆశపెడుతున్నారని, తన బిడ్డ చావుకు న్యాయం కావాలని మీడియా ముందు కృష్ణంరాజు వాపోయిన వీడియో వైరల్ అవుతోంది. మృతుల ఇళ్లకు వెళ్లని మంత్రి ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, అరవింద్‌బాబుతో కలిసి కాలనీలో పర్యటించిన మంత్రి మృతుల ఇళ్లకు మాత్రం వెళ్లలేదు. ప్రభుత్వ వైఫల్యంపై బాధిత కుటుంబాల వారు ప్రశ్నిస్తారనే భయంతోనే వారి ఇళ్లకు వెళ్లలేదని తెలిసింది. మరణాలకు కారణాల గురించి తమను అడక్కుండానే మంత్రి ఇష్టం వచ్చినట్లు మీడియాతో వ్యాఖ్యానించి వెళ్లిపోయారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. కలుషితమైన బోరుని పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.గత ప్రభుత్వ పాపాలే తమకు శాపాలుగా మారాయన్నారు. జగన్ తన సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నట్లుగా డయేరియా మరణాలు సంభవించలేదని చెప్పారు. గత ఐదేళ్లలో 10,30,575 మంది అతిసారం బారినపడగా గత ప్రభుత్వంలో ఒక్కరు కూడా బాధితులను పరామర్శించలేదన్నారు. విజయనగరం జిల్లా గుర్లలో అతిసారవ్యాధి వ్యాప్తి చెందితే తాము ఒక్క మరణం కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. -
డయేరియా మరణాల పాపం ప్రభుత్వానిదే, ఏపీలో మైన్స్, వైన్స్ దోపిడీ
-
పల్నాడులో మరోసారి డయేరియా మృత్యు ఘంటికలు
సాక్షి, నరసరావుపేట, దాచేపల్లి: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో డయేరియా వేగంగా విస్తరిస్తోంది. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 14 మందిని బలితీసుకున్న అతిసారం.. ఇప్పుడు పల్నాడు జిల్లాలోనూ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దాచేపల్లి మండలంలో బుధవారం వ్యాధి ప్రబలి, ఇద్దరు చనిపోగా, 14 మంది ఆస్పత్రుల పాలయ్యారు. జూలై నెలలోనే పల్నాడు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి మండలాల్లో డయేరియా కేసులు నమోదై, పలువురు మరణించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పుడు దాచేపల్లి మండలంలో మరోసారి వ్యాధి విజృంభించింది. దాచేపల్లి పంచాయతీ అంజనాపురంలో బుధవారం నుంచి వాంతులు, విరేచనాలతో అనేక మంది ఆస్పత్రులపాలయ్యారు. వీరిలో బండారు చిన్న వీరయ్య(58), తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ (21) బుధవారం రాత్రి మృతి చెందారు. వీరిలో చిన్న వీరయ్య మంగళవారం నుంచే వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వెంకటేశ్వర్లు బుధవారం మధ్యాహ్నం వ్యాధి బారిన పడ్డారు. కుటుంబ సభ్యులు స్థానికంగా చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా దారి మధ్యలోనే చనిపోయాడు. తాగు నీరు కలుషితం అవడంవల్లే..తారు నీరు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాప్తి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అంజనాపురం కాలనీ ప్రజలకు తాగు నీరు అందించే బోరు సమీపంలో సెప్టిక్ ట్యాంక్ నీళ్లు, మురికి కాలువల్లోని నీరు చేరటం వల్లే కలుషితమైనట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు గ్రామంలో పారిశుధ్యం నిర్వహణ కూడా అధ్వానంగా ఉంది. మురికి కాలువల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్‌బాబు గురువారం అంజనాపురం కాలనీలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. సురక్షితమైన తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. కా>గా, అంజనాపురంలో డయేరియాతో ఇద్దరు మృతికి కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశం సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లాలో అతిసారంపై సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. దాచేపల్లిలో పరిస్థితి, ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలను కలెక్టర్ సీఎంకు వివరించారు. ఆ ప్రాంతంలో సాధారణ స్థితి వచ్చేంతవరకు నిత్యం పర్యవేక్షించాలని సీఎం సూచించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. జూలైలో వ్యాధి ప్రబలినా సరైన చర్యలు చేపట్టని సర్కారు జూలై నెలలోనే జిల్లాలో అతిసారం వ్యాధి వ్యాప్తి చెందిందని, అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు వ్యాపించి ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు. ఆ నెలలో దాచేపల్లి మండలం కేసానుపల్లిలో డయేరియాకు వంగూరి నాగమ్మ అనే మహిళ మృతి చెందగా, మరో 30 మంది ఆస్పత్రి పాలయ్యారు. అదే సమయంలో పిడుగురాళ్ల, కారంపూడి మండలాల్లోనూ పదుల సంఖ్యలో డయేరియా బారినపడ్డారు. 9 మంది మృత్యువాత పడ్డారు. అప్పట్లో మంత్రి నారాయణ ఒకరోజు హడావుడి చేసి వెళ్లిపోయారు. తాగునీరు కలుషితమవడం, పారిశుధ్య నిర్వహణ సరిగాలేకపోవడమే డయేరియాకు కారణమని నిర్ధారణకు వచ్చారు. అయినా, రక్షిత నీరు అందించడానికి, పారిశుద్ద్యం మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీంతో మరోసారి జిల్లాలో డయేరియా వ్యాప్తి చెందింది. -
ప్రభుత్వం సిగ్గుపడాలి: వైఎస్ జగన్
గుర్ల మండలంలో డయేరియాతో 345 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో అంత కంటే ఎక్కువగా దాదాపు 450 మంది చికిత్స పొందారు. ఇప్పటికీ విజయనగరం జిల్లాలోని గరివిడి, గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో డయేరియా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇంకా 62 మంది చికిత్స పొందుతున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితి ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోగా ఏం చేస్తోంది? ఏదైనా ఇష్యూ జరిగితే దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి.. ఎలా కవరప్ చేయాలి.. అది అసలు జరగనట్లు ఎలా చూపించాలి.. అన్న దిక్కుమాలిన ఆలోచన చేస్తోంది. అందుకు ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తలదించుకోవాలి. – వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ పాలనలో గ్రామ స్వరాజ్యం సాకారమైతే, కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే పరిస్థితులు ఎంత దారుణంగా మారాయనేదానికి ‘గుర్ల’ డయేరియా ఘటనే నిదర్శనమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. బాధ్యత మరచి దాన్ని కప్పిపుచ్చుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండటం సిగ్గు చేటని మండిపడ్డారు. కనీసం తాగునీటి క్లోరినేషన్ కూడా చేయని ఫలితంగా డయేరియా విజృంభించి విజయనగరం జిల్లా గుర్లలో 14 మంది చనిపోయిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. గురువారం ఆయన మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.మృతికి దారితీసిన పరిస్థితులను, ఇతరత్రా అన్ని వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని అభయమిచ్చారు. ప్రభుత్వం నుంచి పైసా సాయం కూడా అందలేదన్న వారి ఆవేదన విని చలించిపోయారు. వైఎస్సార్సీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. ‘వైఎస్సార్సీపీ పాలనలో గ్రామాల్లో నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్స్ కనిపించేవి. అక్కడే రోజంతా, వారంలో ఏడు రోజుల పాటు అక్కడే నివాసం ఉండే సీహెచ్‌ఓలు కనిపించే వారు. వారికి అనుసంధానంగా ఏఎన్ఎంలు, వారికి రిపోర్ట్ చేస్తూ ఆశ వర్కర్లు కనిపించే వారు. విలేజ్ క్లినిక్స్‌తో పాటు ఒక పటిష్టమైన వ్యవస్థ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నడిచేది. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్స్‌ను అనుసంధానం చేసి, పీహెచ్‌సీల్లో డాక్టర్ల సంఖ్యను పెంచి, ప్రతి గ్రామానికి 15 రోజులకు ఒకసారి డాక్టర్లు వచ్చే వ్యవస్థ ఉండేది. అదే గ్రామంలో నాడు–నేడుతో బాగు పడిన స్కూళ్లలో పిల్లలు నవ్వుతూ కనిపించే వారు. రైతన్నలను చేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రాలు కనిపించేవి. చక్కగా ఈ–క్రాపింగ్ జరిగేది. రైతులకు ఉచిత పంటల బీమా అందేది. సకాలంలో పెట్టుబడి సహాయం అందేది. సచివాలయంలో వెంటనే పనులు చేసిపెట్టే ఉద్యోగులు కనిపించే వారు. ఈ రోజు అవేవీ కనిపించడం లేదు. ఆ గ్రామ స్వరాజ్యం ఎంతో దయనీయంగా తయారైందని చెప్పడానికి గుర్ల గ్రామం ఒక ఉదాహరణ’ అని మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. జగన్ ట్వీట్ చేస్తే వెలుగులోకి.. గుర్లలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 14 మంది చనిపోయిన పరిస్థితి. తాగు నీరు బాగోలేక డయేరియా వచ్చి మృతి చెందారు. ఇందుకు సంబంధించి జగన్ అనే వ్యక్తి అక్టోబర్ 19న ట్వీట్ చేస్తే తప్ప ఇక్కడ 14 మంది చనిపోయారని ప్రభుత్వం చెప్పని పరిస్థితి. సెపె్టంబర్ 20వ తేదీన, అంటే 35 రోజుల కిందట ఇదే మండలంలోని పెనుబర్తిలో ఒక వ్యక్తి చనిపోయాడు. అలా తొలి డయేరియా కేసు నమోదైంది. అయినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఎవరూ స్పందించని దుస్థితి. అక్టోబర్ 12 వచ్చే సరికి డయేరియా మరింత విజృంభించింది. గుర్ల, కోట గండ్రేడు, గోషాడ, నాగళ్లవలస గ్రామాల్లో ఉధృతంగా ప్రబలింది. ఏకంగా 14 మంది చనిపోయారు. అక్టోబర్ 19న నేను ట్వీట్ చేస్తే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అయినా ప్రభుత్వం కదిలిందా.. అంటే లేదు. తప్పుడు లెక్కలతో మాయ చేసే ప్రయత్నం గుర్లలో డయేరియాతో కేవలం ఒకరే చనిపోయారని జిల్లా కలెక్టర్ చెబుతారు. మంత్రులు, అధికారులు అదే ప్రయత్నం చేశారు. ఎవరూ డయేరియాతో చనిపోలేదని చెప్పే కార్యక్రమం చేశారు. తీరా అక్టోబర్ 24 వచ్చే సరికి 14 మంది చనిపోయారని తేలింది. ఇష్యూ పెద్దది కావడంతో సీఎం చంద్రబాబు కూడా ఒప్పుకోక తప్పలేదు. ఇక్కడ డయేరియాతో ఎనిమిది మంది చనిపోయారని చెప్పారు. ఇక్కడికి వచ్చిన డిప్యూటీ సీఎం 10 మంది చనిపోయారని చెప్పారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు కనీసం క్షమాపణ చెప్పి జరిగిన తప్పును సరిదిద్ద లేదు. సమీపంలో చంపావతి నది ఉంది. దాంట్లో నీళ్లు దారుణ పరిస్థితిలో ఉన్నాయి. ఈ నది నీటితో నడిచే సమగ్ర సురక్షిత మంచినీటి సరఫరా (సీపీడబ్ల్యూఎస్) పథకానికి సంబంధించి చంద్రబాబు వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ రెన్యూవల్ చేయలేదు. దాని ఫిల్టర్లు మార్చారా.. లేదా? కనీసం క్లోరినేషన్ జరిగిందా.. లేదా? అన్నది కూడా పట్టించుకోలేదు. స్థానికంగా సచివాలయం సిబ్బంది సహాయ, సహకారంతో శానిటేషన్ చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించారు ⇒ ఇక్కడి గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలను బాగు పరచకపోగా, సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసేశారు. వైద్య శాఖలో జీరో వెకెన్సీ పాలసీ మేము తీసుకొస్తే, దాన్నీ రద్దు చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు మార్చి నెల నుంచి కట్టడం లేదు. దాంతో దాదాపు రూ.1,800 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పోలేని పరిస్థితి. ⇒ ఆరోగ్యశ్రీని నీరుగార్చింది. గతంలో కేవలం వెయ్యి ప్రొసీజర్లకు మాత్రమే పథకాన్ని పరిమితం చేస్తే, మా ప్రభుత్వం వచ్చాక 3,300 ప్రొసీజర్లకు తీసుకుపోయాం. రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసే ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీతో పాటు ఆరోగ్య ఆసరానూ çపూర్తిగా నీరుగార్చిన పరిస్థితి కనిపిస్తోంది. ⇒ మెరుగైన వైద్యం అందేలా మా ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టింది. వాటిలో ఐదు కాలేజీలను గత ఏడాది ప్రారంభించాం. మిగిలిన 12 మెడికల్ కాలేజీల్లో పూర్తి చేసి, వాటిని కూడా నడపాల్సిన ప్రభుత్వం.. వాటిలో 5 కాలేజీల్లో సీట్లు మంజూరైతే కూడా, వాటిని నిర్వహించలేమని లేఖ రాసింది. ఆ తర్వాత ఈ 12 మెడికల్ కాలేజీలతో పాటు, గత ఏడాది మొదలైన 5 మెడికల్ కాలేజీలు...మొత్తం 17 మెడికల్ కాలేజీలను తమకు అనుకూలమైన వారికి అమ్మేయడానికి, స్కామ్ వైపు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మేము విపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ తరఫున బాధితులను ఆదుకుంటాం. డయేరియాతో చనిపోయిన 14 మంది కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆరి్థక సాయం చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్న మేమే సాయం చేయడానికి ముందుకు వచ్చాం. అధికారంలో ఉన్న మీకు (చంద్రబాబు) మరింత బాధ్యత ఉంటుంది. మరి మీరు ఎంత ఇవ్వబోతున్నారో చెప్పండని సూటిగా ప్రశి్నస్తున్నాం. – వైఎస్ జగన్జగన్ గుంటూరుకు వస్తున్నాడు.. గుర్లకు వస్తున్నాడు.. అనే సరికి మళ్లీ టాపిక్ డైవర్ట్. మా చెల్లెలు, మా అమ్మ ఫొటోలు పెడతారు. అయ్యా చంద్రబాబూ.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా.. ఈనాడు.. టీవీ5.. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు ఏం లేవా? ఇవన్నీ ఘర్ ఘర్కీ కహానీలు. ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటిని మీ స్వార్థం కోసం పెద్దవి చేసి, నిజాలను వక్రీకరించి చూపడం మానుకుని ప్రజల మీద ధ్యాస పెట్టండి. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలని చంద్రబాబుకు చెబుతున్నా. మీడియా ముసుగులో చంద్రబాబును మోస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పాటు దత్తపుత్రుడిని కూడా అడుగుతున్నా. – వైఎస్ జగన్మెరుగైన చికిత్స చేయించ లేదు ⇒ గుర్ల మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం కేవలం 17 కి.మీ దూరంలో ఉంది. మరి ఇక్కడి వారిని ఎందుకు విజయనగరం తీసుకెళ్లలేకపోయారు? ఇక్కడి నుంచి విశాఖపట్నం 80 కి.మీ దూరంలో ఉంది. పది అంబులెన్సులు ఏర్పాటు చేసి డయేరియా బారినపడిన వారిని మెరుగైన చికిత్స కోసం అక్కడికి ఎందుకు తరలించ లేదు? అలా రోగులను తరలించకపోవడంతో గుర్లలో 9 మంది, మండలంలో 14 మంది చనిపోయారు. ⇒ మన ప్రభుత్వంలో నాడు–నేడు మనబడి కార్యక్రమంలో బాగు చేసిన స్కూళ్లలో డయేరియా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేశారు. బెంచీలపై వారిని పడుకోబెట్టారు. అంటే స్కూళ్లలో వైద్యం చేసే పరిస్థితి. ఒకవేళ మా ప్రభుత్వ హయాంలో ఇలా స్కూళ్లు బాగు చేసి ఉండకపోతే పరిస్థితి ఏమిటి? ఇక్కడ మా ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీ (విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ) కూడా వచ్చింది. ⇒ డయేరియా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ఇదే విషయం వారంతా చెప్పారు. సహాయం చేయకపోగా డయేరియాతో చనిపోయారని చెప్పొద్దన్నారు. అలా చెబితే గ్రామంలో భయాందోళన ఏర్పడుతుందని, గుండెపోటుతో చనిపోయారని చెప్పండని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ప్రభుత్వం అలా చెప్పమని చెబుతోంది అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఆలోచించాలని కోరుతున్నా.డైవర్షన్ పాలిటిక్సే చంద్రబాబు రాజకీయం ⇒ ప్రతి అడుగులో ఈ ప్రభుత్వం డైవర్షన్న్పాలిటిక్స్ చేస్తోంది. ఏదైనా ఇష్యూ వస్తే దానిని డైవర్ట్ చేసేలా అడుగులు వేస్తోంది. ఈ ప్రభుత్వం తీరుపై మేము ఢిల్లీలో ధర్నా చేస్తే, ఆ రోజు మదనపల్లెలో ఏదో అగ్ని ప్రమాదం జరిగితే ఏకంగా హెలికాప్టర్లో డీజీపీని, అధికారులను పంపింది. అదే ఇక్కడ (గుర్లలో) 14 మంది చనిపోతే హెలికాప్టర్ కాదు కదా.. కనీసం మంత్రులు వచ్చి బాధిత కుటుంబాలను పలకరించలేదు. ⇒ ఈ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైంది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్.. సెవెన్.. అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి.. చిన్న పిల్లలు కనబడితే నీకు రూ.15 వేలు అని, ఆ పిల్లల తల్లులు కనబడితే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లో పిల్లల పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, ఇంకా ఆ ఇంట్లో 20 ఏళ్ల వయసున్న వారు కనబడితే నీకు రూ.36 వేలు అని, ఆ ఇంట్లో ఎవరైనా కండువా వేసుకున్న రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు అని చెప్పి నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు ప్రజలు ఇవన్నీ నిలదీస్తారని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. తిరుపతి లడ్డూపై దుష్ప్రచారం చేశారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి దాంట్లోనూ డైవర్షన్. అదే చంద్రబాబు రాజకీయం. ⇒ జగన్ గుంటూరుకు వస్తున్నాడు.. గుర్లకు వస్తున్నాడనే సరికి మళ్లీ టాపిక్ డైవర్ట్. మా చెల్లెలు, అమ్మ ఫొటో పెడతారు. అయ్యా చంద్రబాబూ.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా.. ఈనాడు.. టీవీ5.. దత్తపుత్రా.. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు ఏం లేవా? మీ స్వార్థం కోసం నిజాలను వక్రీకరించడం మానుకుని ఇకనైనా ప్రజల మీద ధ్యాస పెట్టండి. ⇒ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్కచెల్లెమ్మల జీవితాలు చెల్లాచెదురవుతున్నాయి. చిన్న పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయి. శాంతి భద్రతలు కుదేలైపోయాయి. ప్రభుత్వం మాది అని చెప్పి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు విచ్చలవిడిగా అక్కచెల్లెమ్మలు, చిన్న పిల్లల మీద దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా బాధితులకు క్షమాపణలు చెప్పి, వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాలి. ఈ ప్రభుత్వానికి ఇకనైనా బుద్ధి రావాలని దేవుడిని ప్రారి్థస్తున్నా. బాధ దిగినట్లు అనిపించింది నా భర్త చింతపల్లి అప్పారావు ఇంటికి చేదోడు వాదోడుగా ఉండేవారు. డయేరియాతో మృతి చెందారు. దుఃఖాన్ని దిగమింగుతూ బాధతో గడుపుతున్నాం. ప్రభుత్వం తరఫున వచ్చిన వారంతా ఏదో చెప్పి వెళ్లిపోయారు. వైఎస్ జగన్ మాత్రం మా దగ్గరకే వచ్చి, ఇక్కడే కూర్చుని నా భర్త మృతికి కారణాలు వివరంగా అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందిందా.. అని ఆరాతీశారు. బాధ పడవద్దని, మా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఆయన మాటతో బాధ దిగినట్లు అనిపించింది. – చింతపల్లి అప్పయ్యమ్మ, గుర్లఎంతో ధైర్యం వచ్చిందిఏం జరిగిందని ప్రతీ విషయాన్ని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి మమ్మల్ని అడిగారు. మా మామయ్య సారిక పెంటయ్య ఎలా చనిపోయాడో జరిగిందంతా చెప్పాను. ఆస్పత్రిలో వైద్యం, ఊర్లో తాగునీటి ఇబ్బందుల గురించి అడిగారు. ఆ సమస్యలన్నీ పరిష్కరించేలా చేస్తామన్నారు. మా కుటుంబానికి భరోసా ఇచ్చారు. అధైర్య పడవద్దన్నారు. కష్టాలు తీర్చే నాయకుడు మా దగ్గరికే రావడం మాకు ఎంతో ధైర్యం ఇచ్చింది. – సారిక హైమావతి, గుర్లనేనున్నానని ధైర్యం చెప్పారు...డయేరియా మా ఇంట్లో ఇద్దరిని పొట్టనబెట్టుకుంది. నా భార్య కలిశెట్టి సీతమ్మ చనిపోయింది. ఆమె అకాల మరణాన్ని తట్టుకోలేక నా పెద్ద కొడుకు రవి మనోవేదనతో రెండు రోజులకే చనిపోయాడు. నాకు దిక్కుతోచని పరిస్థితి. చాలా బాధలో ఉన్న సమయంలో జగన్మోహన్రెడ్డి పరామర్శించడంతో కొంత బాధ తగ్గింది. ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతామని ధైర్యం చెప్పడం ఊరట కలిగించింది. – కలిశెట్టి సత్యారావు, గుర్ల -
నా కుటుంబం గురించి తర్వాత.. ముందు రాష్ట్రాన్ని కాపాడండి
-
గుర్ల గ్రామంలో అడుగుపెట్టిన జగన్..
-
నేను చూసుకుంటా చెల్లి! జగన్ భరోసా..
-
జగన్‌తో గుర్ల డయేరియా బాధితులు
-
సెప్టెంబర్‌లోనే డయేరియా మృత్యు ఘంటికలు
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో సెప్టెంబరు నెలలోనే డయేరియా మృత్యు ఘంటికలు మోగాయి. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో వ్యాధి తీవ్రస్థాయిలో ప్రబలింది. 14 మందిని బలి తీసుకుంది.కలుషిత నీరు కారణంగా పలువురు వాంతులు, విరేచనాలతో గత నెలలోనే అనేకమంది ఆస్పత్రులకు వచ్చారు. గత నెల మూడో వారంలోనే మండలంలోని పెనుబర్తి గ్రామంలో డయేరియాకు ఒకరు మృతి చెందారు. ఈ విషయం పత్రికలు, మీడియాలోనూ వచ్చింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్‌లో కూడా డయేరియా ఔట్‌బ్రేక్ ట్రెండ్ కనిపించింది. డయేరియా వ్యాప్తిపై అధ్యయనానికి, నివారణ చర్యల కోసం ఇటీవల వైద్య శాఖ నియమించిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్ (ఆర్ఆర్టీ) కూడా ఇదే విషయాన్ని నిర్ధారించినట్లు తెలిసింది. ప్రభుత్వం అప్పట్లోనే స్పందించి, వ్యాధి నివారణ చర్యలు చేపట్టి ఉంటే వ్యాధి ఇంతగా ప్రబలి ఉండేది కాదు. ఈ నెల 15 తర్వాత కేసులు విపరీతంగా పెరగడం, మరణాలు ఎక్కువ అవడంతో ప్రభుత్వ యంత్రాంగం గుర్లపై దృష్టి సారించింది. అప్పటికే నష్టం తీవ్రమైంది. ఇప్పటికీ ప్రభుత్వం బాధితులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించలేకపోతోంది.తాగునీరు కలుషితమవడమే కారణంగుర్ల మండలంలో తాగు నీరు కలుషితమైన కారణంగానే డయేరియా ప్రబలినట్లు ఆర్ఆర్టీ నివేదించిందని బుధవారం వైద్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో సేకరించిన 44 నీటి నమూనాలలో 31 నమూనాల్లో కోలిఫాం ఉన్నట్లు తేలింది. 57 మల నమూనాలను పరీక్షించగా భూతల, భూగర్భ జలాలు కలుషితమైనట్లు తేలింది. నీటి వనరు అయిన చంపా నదిలో దహన సంస్కారాలు, జాతరలు, పండుగలు మొదలైన మతపరమైన కార్యకలాపాలు చేస్తున్నారని కమిటీ గమనించింది. చంపా నది వెంబడి ఉన్న ప్రాంతాల నుంచి ఎక్కువ డయేరియా కేసులు నమోదయ్యాయి. వ్యాధుల వ్యాప్తి నివారణకు అవసరమైన క్లోరినేషన్ పేలవంగా ఉంది. నీటి నమూనాలలో క్లోరిన్ అవశేషాలేమీ లేకపోవడంపై బృందం ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తాగు నీటి ప్రధాన వనరైన చంపా నది నీటిని తరచుగా క్లోరినేషన్ చేయాలని, నీటి సరఫరా పైపుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, మరమ్మతులు చేయాలని కమిటీ సూచించింది. డ్రైనేజీ గుండా నీటి పైపులు వెళ్లకుండా చూడాలని సిఫార్సు చేసింది. విజయనగరం జిల్లా భౌగోళిక, వాతావరణ పరిస్థితులు సంక్రమణ వ్యాధుల వ్యాప్తికి అనుకూలంగా ఉన్నందున తరచూ నీరు, ఇతర నమూనాల పరీక్షలకు వీలుగా రీజినల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది’ అని వైద్య శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. -
కలరాతో 15 మంది చనిపోవడం ఈ జిల్లాలో ఎప్పుడు జరగలేదు
-
డయేరియా మరణాలపై సీఎం,డిప్యూటీ సీఎం రాజకీయాలా?.. బొత్స ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యం, మానవ తప్పిదమే కారణమని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని శాసన మండలి విపక్ష నేత, బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. డయేరియాతో మృతి చెందిన 16 మందికి వెంటనే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, బాధిత గ్రామాలను తక్షణమే రెడ్ జోన్‌గా ప్రకటించి, యుద్ధ ప్రాతిపదికన పరిస్థితులన్నీ చక్కదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు.డయేరియా మృతులపై ప్రభుత్వం గందరగోళ లెక్కలు చెబుతోందన్న మండలి విపక్షనేత, మరణాల సంఖ్యతో సీఎం, డిప్యూటీ సీఎం రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. జిల్లా కలెక్టర్ లెక్క మేరకు ఒక్కరు చనిపోగా, చంద్రబాబు లెక్క 8 మంది అని, పవన్‌కళ్యాణ్ లెక్క 10 మంది అని తెలిపారు. ఎందుకీ గందరగోళం? ఎందుకింత అస్పష్టత? అన్న బొత్స, పాలన చేతకాక, అధికారులపై పట్టు లేకనేనా? అని గట్టిగా నిలదీశారు.రుషికొండ నిర్మాణలపై పవన్‌కు బొత్స సవాల్గుర్ల పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, రుషికొండ ఎందుకెళ్లారని.. రుషికొండ భవనాలకు, డయేరియా వ్యాప్తికి ఏమిటి సంబంధం అని మండలి విపక్షనేత ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే పవన్‌కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని, రుషికొండ నిర్మాణాలపై అనుమానాలు ఉంటే, నిరభ్యరంతంగా విచారణ చేయించుకోవచ్చని స్పష్టం చేశారు.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై షర్మిల అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న బొత్స, నాడు ఆ మొత్తం పిల్లల తల్లుల ఖాతాల్లో వేసేందుకు (డీబీటీ) ప్రభుత్వం సిద్ధమైతే, కోడ్ పేరుతో కోర్డును ఆశ్రయించింది ఇప్పటి పాలకులే అన్న విషయం షర్మిలకు తెలియదా? అని చురకలంటించారు.ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదా?గుర్ల మండంలో కలుషిత నీటి సరఫరాకు కూటమి ప్రభుత్వం రకరకాల కారణాలు చెబుతోందన్న మండలి విపక్షనేత.. 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయక నిర్వహణ లోపం అని ఒకసారి, ఫిల్టర్ పాయింట్స్ మార్చలేదని మరోసారి చెబుతూ, ఆ మరణాలపైనా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని గుర్తు చేశారు. డయేరియా వ్యాప్తి చెందిన ఆ ఏడెనిమిది గ్రామాల్లో వెంటనే ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేయడంతో పాటు, మెడికల్ క్యాంప్‌లు నిర్వహించి పరిస్థితులు చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు తలెత్తకుండా ఏ చర్యలు తీసుకోబోతున్నారో సీఎం చెప్పాలని కోరారు. డబ్బుల వసూళ్లకు కక్కుర్తిపడి నీటి సరఫరా పర్యవేక్షణను పూర్తిగా వదిలేశారన్న మండలి విపక్షనేత.. కూటమి నేతలు, అధికారులు వస్తే, నాలుగు నెలలుగా అక్కడి దారుణస్థితిని చూపిస్తానని సవాల్ చేశారు.మేం అడుగుతున్నదేంటి? మీరు చెప్పే సమాధానం ఏంటి?డయేరియా మరణాలపై తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. పవన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ఈరోజు రుషికొండలో పర్యటించి, అక్కడి భవనాల కోసం రూ.500 కోట్లు ఖర్చు చేశామంటూ విమర్శిస్తున్నారని బొత్స గుర్తు చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే, హైదరాబాద్‌లో సీఎం ఇల్లు, క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తే, ఆ తర్వాత వచ్చిన వారు అక్కడి నుంచే పాలించారని ప్రస్తావించారు. అదే తరహాలో విశాఖ రుషికొండపై గత ప్రభుత్వ హయాంలో సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తే తప్పేమిటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. -
డయేరియా కేసులు కారణం ఇదే.. పద్ధతి మార్చుకోవాలి
-
ఎట్టకేలకు కదలిక
సాక్షి, అమరావతి/గుర్ల: విజయనగరం జిల్లా గుర్ల డయేరియా ఘటనలపై ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ నెల 13న డయేరియా వ్యాప్తి మొదలై 470 మందికిపైగా దీని బారినపడగా.. వారిలో శనివారం నాటికి 11 మంది మరణించారు. తాజాగా ఆదివారం మరో ఐదు కేసులు నమోదు కాగా, ఎన్.పాపారావు(62) మృత్యువాతపడ్డారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు సర్కారు ఏమాత్రం చలనం లేనట్టుగా వ్యవహరించింది. బాధితులను ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యసేవలు అందించడంలో విఫలమైంది. బాధితులకు ప్రభుత్వ పాఠశాలలోని బల్లలపై పడుకోబెట్టి సెలైన్ ఎక్కిస్తూ, చికిత్స చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఓ పక్క ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సైతం బాధితుల పక్షాన నిలిచారు. దీంతో ఆదివారం హుటాహుటిన సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్‌తో విచారణకు ఆదేశించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ సిరి సైతం ఆదివారం డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ గుర్ల పర్యటనకు సిద్ధమయ్యారు. కాగా.. డయేరియా ప్రబలి పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వైద్య శాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ అలక్ష్యాన్ని ఎండగడుతూ నాలుగు రోజులుగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. రోగులకు అవసరమైన బెడ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. గ్రామంలోని జెడ్పీ హైసూ్కల్లో చికిత్స పొందుతూ కోలుకున్న వారిని ఇళ్లకు పంపించేశారు. మిగిలిన బాధితులను గుర్ల పీహెచ్‌సీకి తరలించారు. పీహెచ్సీలో అదనంగా 8 బెడ్లు, సెలైన్ స్టాండ్లు ఏర్పాటు చేసినట్టు గుర్ల పీహెచ్సీ వైద్యాధికారి చెన్నయ్ తెలిపారు. మరణాలు లేవంటూ బుకాయింపు గుర్లలో డయేరియా మరణ మృదంగం సృష్టిస్తుంటే ప్రభుత్వం మాత్రం అక్కడ ఏమీ జరగనట్టుగానే వారం రోజులపాటు వ్యవహరించింది. 470 మందికిపైగా డయేరియా బారినపడినట్టు స్థానికులు చెబుతున్నారు. తమ వాళ్లు డయేరియాతోనే మృతి చెందారని 12 మంది కుటుంబాల వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం డయేరియా కారణంగా ఇప్పటివరకు ఒక్కరు మాత్రమే మరణించినట్టు ఆదివారం ప్రకటించింది. ప్రతిపక్షం బాధితుల పక్షాన నిలవడంతో చేసేదేమీ లేక ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించిందని విజయనగరం జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు.నేడు పవన్‌కళ్యాణ్ పర్యటన గుర్లలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సోమవారం పర్యటిస్తారని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అతిసారం ప్రబలిన ప్రాంతాల్లో ఆయన పర్యటించి, అక్కడి పరిస్థితులపై సమీక్షిస్తారని పేర్కొంది.నీటి కాలుష్యమే కారణం: వైద్యశాఖ గుర్లలో డయేరియా ప్రబలడానికి నీటి కాలుష్యమే ప్రధాన కారణమని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదివారం తెలిపారు. తాగునీటి నమూనాలను ప్రయోగశాలకు పంపగా.. కలుíÙతమైనట్టు తేలిందని పేర్కొన్నారు. స్థానిక వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, డయేరియా వ్యాప్తికి కారణాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. ఆ ప్రాంతంలో ప్రజలు బహిరంగ మల విసర్జన చేయడంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, ఈ నెల 13న ఒక కేసుతో ప్రారంభమై 18వ తేదీ వరకూ వరుసగా కేసులు నమోదైనట్టు తెలిపారు. మరణాల సంఖ్యపై వివిధ రకాల వార్తలొస్తున్నాయని, వాస్తవంగా డయేరియాతో ఒక్కరే మరణించగా, ఏడుగురు ఇతర వ్యాధులతో మరణించారని వివరించారు. -
అతిసార మరణాలపై వైఎస్ జగన్ హెచ్చరికలు.. దిగొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో అతిసార (డయేరియా) మరణాలపై వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరికలతో చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చింది. అతిసార కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అతిసార మరణాలు సంభవించిన విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించనున్నారు.గత వారం రోజులుగా విజయనగరం జిల్లా గుర్లలో అతిసార ప్రబులుతుందని, కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయని సాక్షి మీడియా పలు కథనాల్ని వెలుగులోకి తెచ్చింది. ఎప్పటికప్పుడు అతిసార వ్యాధి తీవ్రతను గుర్తిస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహంఅయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. వారం రోజులుగా మరణాలు లేవంటూ జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు బుకాయించారు. అయితే ఈ ఘటనపై వైఎస్ జగన్.. చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, ఇందుకు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ఘటనలో 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా ఏపీ ప్రభుత్వం నిద్ర వీడడంలేదని మండిపడ్డారు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నాయని, అయినా సరే స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణమని అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ తరుణంలో వైఎస్ జగన్ హెచ్చరికలతో చంద్రబాబు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అతిసార కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసింది.బాధితులకు వైఎస్సార్సీపీ నేతల పరామర్శగుర్లలో అతిసారాతో మరణాలు సంభవించడం, భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో వైఎస్సార్సీపీ నేతలు బాధితులకు బాసటగా నిలిచారు. గుర్లలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావులు పర్యటించి బాధితుల్ని పరామర్శించారు. వ్యాధి గ్రస్తులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని సూచించారు.ఆదివారం గుర్లలో పర్యటించిన అనంతరం ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అతిసారాతో విజయనగరం జిల్లాలో 16 మంది మృతి చెందారన్నారు. ఇవి సహజ మరణాలు కాదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఇంత మంది చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అవి సహజ మరణాలు కాదు.. ప్రభుత్వ నిర్లక్ష్యం: బొత్స
సాక్షి, విజయనగరం: జిల్లాలో డయేరియా తీవ్రత తగ్గడం లేదు. ఇవాళ మరో ఇద్దరు డయేరియా బారినపడ్డారు. ఆసుపత్రిలోనే ఇంకా 145 మంది బాధితులు ఉన్నారు. వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. గుర్లలో అప్రకటిత బంద్ కొనసాగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలతో గుర్ల వైద్య శిబిరంలో 3 బెడ్లను ఏర్పాటు చేశారు. వైద్య శిబిరం ఖాళీ చేసి రోగులు లేరంటూ అధికారులు చూపిస్తున్నారు.డయేరియా బాధితులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడూతూ, డయేరియాతో జిల్లాలో 16 మంది మృతి చెందారన్నారు. ఇవి సహజ మరణాలు కాదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఇంత మంది చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదు. కొత్త ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది. గ్రామాల్లో పారిశుధ్యం అధ్వాన్నం గా ఉంది. తాగునీరు సరఫరా బాగులేకే డయేరియా వ్యాప్తి అయింది’’ అని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: సర్కారుకు నిర్లక్ష్యపు సుస్తీ 'ఈ రోగానికి మందేదీ'? -
సర్కారుకు నిర్లక్ష్యపు సుస్తీ 'ఈ రోగానికి మందేదీ'?
ప్రభుత్వ నిర్లక్ష్యానికి తల్లీ కొడుకు మృతివిజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి చెందిన కలిశెట్టి సీతమ్మ ఇటీవల డయేరియాతో మృతి చెందింది. ఆమె మృతితో కొడుకు రవి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవి అప్పటి నుంచి విధులకు వెళ్లకుండా ఊరి బయటే ఉండిపోయాడు. అక్కడే మృతిచెందాడు.రాష్ట్రంలో నాలుగు నెలలుగా అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఏ ప్రభుత్వ ఆస్పత్రిని తీసుకున్నా దయనీయ పరిస్థితి కనిపిస్తోంది. విలేజ్ క్లినిక్‌లకు దిక్కు లేకుండా పోయింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టకు తిలోదకాలిచ్చింది. 104 వ్యవస్థనూ నిర్వీర్యం చేసింది. పీహెచ్‌సీల్లో అక్కర్లేదంటూ స్పెషలిస్ట్ వైద్యులనూ తొలగించింది. చాలా చోట్ల వైద్యులు, వైద్య సిబ్బంది స్పందించాల్సిన రీతిలో స్పందించడం లేదు. మందుల కొరత వేధిస్తోంది. ఏ చిన్న మందు కావాలన్నా బయటకు రాసిస్తున్నారు. ఇక పరీక్షల సంగతి అయితే మాట్లాడుకోక పోవడమే మంచిది. కొంచెం క్రిటికల్ కేసు వస్తే చాలు.. రెఫర్ చేయడమే పరిపాటిగా మారింది. ఇదేంటయ్యా.. అని అడిగితే ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండని సీరియస్ అవుతున్నారు. నాలుగవ తరగతి సిబ్బందిపై నియంత్రణ కరువైంది. ఏ అర్ధరాత్రుళ్లో ఎవరికైనా సీరియస్ అయితే దేవుడే దిక్కు అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఫీవర్ సర్వే ఊసే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్పత్రుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రజారోగ్యాన్ని దీన స్థితికి తీసుకొచ్చింది.బడి బల్లలే బెడ్లు... కిటికీలే సెలైన్ స్టాండ్లు సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో జూన్ నుంచి ప్రజలు జ్వరాలతో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రులపాలవుతున్నారు. పెద్ద ఎత్తున డయేరియా కేసులు వెలుగు చూశాయి. తాజాగా విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా పంజా విసిరింది. 450 మందికిపైగా డయేరియా బారిన పడగా, వారిలో 11 మంది మృత్యువాతపడ్డారు. వెంటనే బాధితులకు మెరుగైన వైద్య సేవలు కల్పించి ప్రాణనష్టం జరగకుండా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్యం అందక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే అక్కడా ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద సక్రమంగా ఉచిత వైద్యం లభించడం లేదు. ఆరోగ్యశ్రీ స్థానంలో బీమా ప్రవేశపెట్టాలని నిర్ణయించిన చంద్రబాబు ఆ పథకాన్ని ఇప్పటికే గాలికి వదిలేశారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో గ్రామాల్లో బీపీ, సుగర్ ఇతర జబ్బులతో బాధపడే వారికి క్రమం తప్పకుండా వైద్యం అందేది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి ఇంటి వద్దకే వెళ్లి వైద్యం అందించే వారు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఏమైందో ఎవరికీ తెలియదు. అసలు 104 వ్యవస్థ పని చేస్తోందా? లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పీహెచ్‌సీల్లో ఉన్న 150 మంది స్పెషలిస్ట్ వైద్యులనూ తొలగించి కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని దూరం చేసింది. భయం గుప్పెట్లో గిరిజనం గిరిజన ప్రాంతాల్లోని ప్రజలను డెంగీ, మలేరియా, విష జ్వరాలు, ఇతర వ్యాధులు చుట్టుముట్టాయి. ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఏ ఇంట్లో చూసినా ఒకరిద్దరు వ్యాధులతో బాధపడుతున్నారు. పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో మందులు, పరీక్షలు సక్రమంగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఇంట్లో ఒకరికి విష జ్వరం వస్తే వైద్యానికి కనీసం రూ.5 వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. ఈ ఏడాది జూలై నుంచి మూడు నెలల వ్యవధిలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఐదుగురు విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారినపడి మృతి చెందారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోయింది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను గాలికి వదిలేయడంతో పాటు, తాగునీటిని సరిగా శుద్ధి చేయకపోవడంతో జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60కి పైగా డయేరియా ప్రబలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభణ మొదలైంది. జగ్గయ్యపేట, వత్సవాయి ప్రాంతాల్లో 107 మంది డయేరియా బారినపడటంతో ఆరుగురు మృతి చెందారు. తిరుపతి జిల్లా కాట్రపల్లిలో డయేరియాతో రెండేళ్ల చిన్నారి, జూలైలో కర్నూలు జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిని మృత్యువు కబళించింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కలుషిత నీటి సరఫరా కారణంగా 250 మంది డయేరియా బారినపడ్డారు. వారిలో ఏడుగురు మరణించారు. ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ఇక్కట్లు జన్యు సంబంధమైన హీమోఫీలియా బాధితులకు మందులు సరిగా దొరకడం లేదు. వ్యాధిగ్రస్తుల్లో రక్తస్రావాన్ని నియంత్రించడానికి యాంటి హీమోఫీలియా ఫ్యాక్టర్ ఇంజెక్షన్లను చికిత్సల్లో వినియోగిస్తారు. ఫ్యాక్టర్ 7, 8, 9 ఇలా వివిధ రకాల ఇంజెక్షన్లు అవసరం ఉండగా, చాలా వరకు జీజీహెచ్‌లలో ఇవి లేవని తెలుస్తోంది. అలాగే రోగ నిరోధకత బాగా తక్కువగా ఉండే క్యాన్సర్, న్యూరో, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం వాడే ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు కూడా అన్ని జీజీహెచ్‌లలో లేవు. కేసులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్థానికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ వ్యాధులకు చికిత్సల్లో వినియోగించే అన్ని రకాల యాంటిబయోటిక్స్ సీడీసీ (సెంట్రల్ డ్రగ్ స్టోర్)లో ఉండటం లేదు. వైరల్ జ్వరాలకు వాడే ఎమాక్సిలిన్, మలేరియా చికిత్సకు అవసరమైన ఆర్టిసినేట్ ఇంజెక్షన్ చాలా ఆస్పత్రులకు సరఫరా కావడం లేదు. చర్మ సంబంధిత వ్యాధిగ్రస్తులకు పలు రకాల క్రీములు ఆస్పత్రుల్లో లేకపోవడంతో బయటకు రాస్తున్నారు. డీ అడిక్షన్ సెంటర్లలో మందులు సరిపడా లేవు. పెరిగిపోతున్న ఖాళీలు ⇒ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జీరో వేకెన్సీ పాలసీని అమలు చేసింది. ఇందులో భాగంగా ఆస్పత్రుల్లో ఏర్పడిన, కొత్తగా మంజూరైన పోస్టులను ఎప్పటికప్పుడే భర్తీ చేస్తూ వచ్చారు. ఇలా ఐదేళ్లలో 54 వేల పోస్టులు ఒక్క వైద్య శాఖలోనే భర్తీ చేశారు. ⇒ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జీరో వెకెన్సీ పాలసీకి బ్రేక్ వేసింది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పారా మెడికల్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ నియామకాల కోసం డిస్టిక్ సెలక్షన్ కమిటీలు 2 వేలకుపైగా పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు విడుదల చేశాయి. నియామక ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఈ నోటిఫికేషన్లను రద్దు చేశారు.⇒ ఓ వైపు ఆస్పత్రుల్లో ఎఫ్ఎన్వో, ఎంఎన్‌వో ఇతర వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉంటే, ఆ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. ఇక సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ వైద్య పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. గతంలో గిరిజన, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో సైతం స్పెషలిస్ట్ వైద్యుల కోసం పలు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, వైద్యులు అడిగినంత వేతనాలు ఇచ్చి మరీ పోస్టులు భర్తీ చేశారు. ⇒ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక సెకండరీ హెల్త్‌లోని గిరిజన, మారుమూల ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ల కొరత ఉన్నప్పటికీ ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. గత ప్రభుత్వంలో ఉద్యోగాల్లో చేరిన వారు సైతం వెళ్లిపోవడం, ఇటీవల కాలంలో పదవీ విరమణలు, పదోన్నతుల అనంతరం డీఎంఈ ఆస్పత్రుల్లో 500కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. అదే విధంగా 900కుపైగా సీనియర్ రెసిడెంట్, 250కి పైగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోలేదు. మరోవైపు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం కోసం మన విద్యార్థులకు అన్యాయం చేసింది. ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయేలా చేసింది.అత్యవసర మందులూ బయటే⇒ 2019కి ముందు చిన్నారిని ఎలుకలు పీక్కుతిన్న దీనస్థితికి ప్రభుత్వాస్పత్రులు మళ్లీ దిగజారుతున్నాయా.. అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాలను పీకల వరకూ తాగించి ఆరోగ్యాలను గుల్ల చేయడంపై పెట్టిన శ్రద్ధ.. ప్రజారోగ్య పరిరక్షణపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టలేదని మండిపడుతున్నారు. గ్రామాల్లోని విలేజ్ క్లినిక్‌ల నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని ఆస్పత్రులను మందుల కొరత వేధిస్తోంది. ⇒ జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు ఉంచాలని వైద్య శాఖ నిర్ణయించింది. 372 మేర సర్జికల్స్, వ్యాధి నిర్ధారణ కిట్లు కూడా ఉండాలి. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలోని బోధనాస్పత్రులన్నింటినీ మందులు, సర్జికల్స్ కొరత వేధిస్తోంది. గురువారం (17వ తేదీ) అన్ని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్లు అందరూ మందుల కొరత అంశాన్ని ప్రధానంగా లేవనెత్తినట్లు తెలిసింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో ఎసెన్షియల్ డ్రగ్స్ అన్నీ అందుబాటులో ఉండటం లేదని, లేని మందులను స్థానికంగా కొనుగోలు చేసుకోవాలని మంత్రి కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. స్థానికంగా కొనుగోలు చేయడానికి నిధులు ఎక్కడ ఉన్నాయని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. అంటే దీని అర్థం రోగులను బయట తెచ్చుకోమని చెప్పడమే. ⇒ ల్యాబ్‌లలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి సరిపడా రసాయనాలు అందుబాటులో ఉండటం లేదు. పాడైన పరికరాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. కూటమి పాలనలో ప్రభుత్వాస్పత్రుల్లో మార్చురీల్లోని శవాలకు కూడా భద్రత లేకుండాపోయింది. ఏలూరు ఆస్పత్రిలో అనాథ మృతదేహాలు మాయమైన ఘటన వెలుగు చూసింది. పారిశుధ్య నిర్వహణను గాలికి వదిలేయడంతో డయేరియా విలయతాండవం చేస్తోంది. ఈ నిర్లక్ష్యం.. గర్భిణికి ఎంతకష్టం..పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఎల్.అగ్రహారానికి చెందిన గర్భిణి యర్రా శకుంతల జ్వరంతో బాధ పడుతుండటంతో ఆమె తల్లి కంటిపాటి ధనలక్ష్మి మంగళవారం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతుండగానే శనివారం ఉదయం ఆరు గంటలకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. తన కుమార్తెకు పురిటినొప్పులు వస్తున్నాయని ధనలక్ష్మి నర్సులకు చెప్పగా వారు పట్టించుకోలేదు. ఈలోగా శకుంతల బాత్రూమ్కు వెళ్లగా, అక్కడే తీవ్ర రక్తస్రావమై కడుపులోని బిడ్డ తల బయటకు వచ్చింది. ప్రాణాపాయ పరిస్థితుల్లోకి శకుంతల వెళ్లిపోయింది. ఇది గమనించిన తల్లి.. గట్టిగా కేకలు వేయగా, శిక్షణలో ఉన్న నర్సులు వచ్చి.. గర్భిణిని డెలివరీ రూమ్‌కు కాకుండా ప్రసూతి వార్డుకు తరలించారు. మంచంపై పడుకోబెట్టగా ఆ మంచంపైనే శకుంతల ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తీరిగ్గా నర్సులు శకుంతలను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి మాయ తొలగించి, కుట్లు వేశారు. నర్సింగ్ విద్యార్ధినులు సకాలంలో పట్టించుకోకపోయి ఉంటే గర్భిణి ప్రాణాలకే ముప్పు వచ్చేది. ఆస్పత్రిలో శకుంతల పడిన నరకయాతనను చూసిన వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లెదుటే అంత జరుగుతున్నా, సిబ్బంది చీమ కుట్టినట్లు కూడా స్పందించక పోవడం దారుణమని మండిపడ్డారు. ఎంతలో ఎంత మార్పు అంటూ నిట్టూర్చారు. కాగా, ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ ఏవీఆర్ఎస్ తాతారావు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.పట్టించుకోరా అంటే.. బయటికి పొమ్మన్నారు విధుల్లో ఉన్న నర్సుల వల్లే నా బిడ్డకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు నా బిడ్డ ప్రాణాలతో దక్కింది. పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న నా కూతురిని పట్టించుకోకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించగా.. బయటకు పొమ్మంటూ దుర్భాషలాడారు. ఆస్పత్రిలో మూడురోజుల నుంచి నా కుమార్తె నొప్పులతో బాధపడుతోందని, పరీక్షించమని వేడుకున్నా ఒక్క నర్సు కూడా పట్టించుకోలేదు. డాక్టరు వస్తారు.. సమాచారం ఇస్తాం... అంటూ మమ్మల్ని పంపేశారు. ఆస్పత్రిలో సిబ్బంది గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – ధనలక్ష్మి, గర్భిణి శకుంతల తల్లి, ఎల్.అగ్రహారం, తాడేపల్లిగూడెం మండలం -
పేదల ప్రాణాలతో చెలగాటమాడటం తగదు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పేద ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడటం సరికాదని వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి అప్పలరాజు డయేరియా విజృంభించిన విజయనగరం జిల్లాలోని గుర్ల మండల కేంద్రంలో పర్యటించి, బాధితులను పరామర్శించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారం రోజులుగా ఒకే ఊరిలో 450 మంది అతిసారం బారినపడి బాధపతున్నారని, వారిలో 11 మంది చనిపోయినా ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా పేదలు మృతి చెందారన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ వైద్య వ్యవస్థను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది అప్పగించారని... కానీ చంద్రబాబు ప్రభుత్వం డయేరియా బాధితులకు వైద్యం కూడా అందించలేని దుస్థితిలో ఉందన్నారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల బెంచీలు, కుర్చీలపై రోగులను పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారంటేనే ప్రభుత్వం తీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. కనీసం రోగులకు బెడ్ కూడా వేయకపోవడం బాధాకరమని అన్నారు. వైఎస్ జగన్ పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు–నేడు’ అభివృద్ధి పనుల వల్లే ఇప్పుడీ బెంచీలు, విద్యుత్తు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, ఇతరత్రా సదుపాయాలు కలిగాయని, ఒకవేళ గుర్ల పాఠశాలను ఇలా తీర్చిదిద్ది ఉండకపోతే ఇప్పుడు రోగులను నేలపై పడుకోబెట్టి వైద్యం చేసేవారా...? అని ప్రశ్నించారు. పరిసర ప్రాంతాల్లోని పీహెచ్‌సీల నుంచి బెడ్స్ తీసుకొచ్చి వేయించడం కూడా తెలియదా..? అని మండిపడ్డారు. ఇవేవీ చేయలేనప్పుడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఎందుకొచ్చారని, ఫొటోలు తీయించుకోవడానికా అని నిలదీశారు.సీఎం చంద్రబాబు మద్యం మత్తు, ఇసుక మాఫియా నుంచి బయిటకొచ్చి పేదల గురించి పట్టించుకోవాలని అన్నారు. ఆకస్మిక తనిఖీల పేరుతో వైజాగ్ వచ్చిన మంత్రి నారా లోకేశ్ పక్కనేవున్న గుర్ల మండలంలో వందల మంది కష్టంలో ఉంటే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పారిశుద్ధ్యం, రక్షిత నీటి విభాగం శాఖల పూర్తి వైఫల్యానికి నిదర్శనమే గుర్ల విషాదమన్నారు. ఆ రెండు శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. వందలాది ప్రజలు డయేరియాతో అల్లాడుతుంటే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏదైనా గ్రామంలో జ్వరాలు వస్తే తక్షణమే ఫీవర్ సర్వే చేయించి కారణాలు తెలుసుకుని నిరోధించే చర్యలు చేపట్టే వారమని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివసరావు చెప్పారు. ఇప్పుడీ ప్రభుత్వం డయేరియా రోగులను స్కూల్ పిల్లల బెంచీలపై పడుకోబెట్టి కర్రలు కట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించే దౌర్భాగ్య స్థితిలో ఉందన్నారు. ఇప్పటికైనా స్పందించి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
డయేరియా గుప్పెట్లో విజయనగరం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని ఐదు గ్రామాల్లో గురువారం సాయంత్రానికి 450 మందికిపైగా డయేరియా బారిన పడ్డారు. శుక్రవారం కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. చాలామందికి ఇళ్ల వద్దనే వైద్యం అందిస్తున్నారు. వాంతులు, విరేచనాలు అధికంగా అవుతున్నవారిని గుర్ల జెడ్పీ హైసూ్కల్లో వైద్యశిబిరానికి, గుర్ల పీహెచ్సీ, చీపురుపల్లి, నెలిమర్ల సీహెచ్‌సీలకు తరలించి చికిత్స చేస్తున్నారు. అవసరమైనవారిని విజయనగరంలోని సర్వజన ఆస్పత్రి, గోషాస్పత్రి, విశాఖలోని కేజీహెచ్లకి తరలిస్తున్నారు. గురువారం నాటికి డయేరియా బారిన పడి ఏడుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం గుర్ల గ్రామానికి చెందిన పతివాడ సూరమ్మ (68) ఇంటివద్దే చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి సీతమ్మ డయేరియాతో ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర మనోవేదనకు గురై గుర్ల గ్రామానికే చెందిన కలిశెట్టి రవి (28) మృతిచెందాడు. ప్రైవేట్ బోర్లపైకి నెపంమండలంలో గత శనివారం నుంచి డయేరియా పంజా విసురుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరించింది. విజయనగరం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం అలా ముఖం చూపించి వెళ్లిపోయారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ వచ్చి గుర్లలో పరిస్థితిపై ఆరా తీశారు. కలెక్టరు, ఇతర అధికారులు రెండు, మూడు రోజులుగా వచ్చి వెళుతున్నారు. చంపావతి నది నుంచి వస్తున్న తాగునీటి వల్లే డయేరియా విజృంభించిందనే సందేహంతో ఆ నీటి నమూనాలకు పరీక్షలు చేయించిన ఆర్డబ్ల్యూఎస్ (రక్షిత మంచినీటి విభాగం) అధికారులు.. ఆ నీటివల్ల సమస్య లేదని తేలిందని చెబుతున్నారు. గ్రామస్తులు మరుగుదొడ్ల వ్యర్థాలను నేరుగా డ్రైనేజీల్లోకి వదిలేయడం వల్ల అలా భూమిలో ఇంకి ప్రైవేటు బోర్లలోకి వస్తున్న నీటిని వినియోగించడం వల్లే డయేరియా వచ్చి ఉండవచ్చని జిల్లా ఉన్నతాధికారులు కొత్త భాష్యం చెబుతున్నారు.ఇంకెన్ని చూడాలో... » గుర్లకు చెందిన మామిడిపాక ప్రవీణ్‌కుమార్‌కు ఈ నెల 16న వివాహం జరిగింది. అప్పటికే డయేరియా లక్షణాలు అధికమవడంతో విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. » గుర్ల గ్రామానికి చెందిన కలిశెట్టి సీతమ్మ డయేరియాతో మృతి చెందింది. ఆమె మృతితో కొడుకు రవి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవి విధులకు వెళ్లకుండా అప్పటి నుంచి ఊరి బయటే ఉండిపోయాడు. అక్కడే శుక్రవారం మృతిచెందాడు. -
డయేరియా డేంజర్ బెల్స్..
-
విజయనగరం జిల్లాలో డయేరియా డేంజర్ బెల్స్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా విజృంభిస్తోంది. మండల కేంద్రమైన గుర్లకు చెందిన బోడసింగి రాములమ్మ (67), కోటగండ్రేడు గ్రామానికి చెందిన మరడాన అప్పలనర్సయ్యమ్మ (57) గురువారం డయేరియాతో మృతి చెందారు. దీంతో గత ఐదు రోజుల్లో డయేరియాతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. రాములమ్మకు రెండ్రోజుల క్రితమే డయేరియా సోకింది. ఆమెకు గుర్లలోని వైద్య శిబిరంలో చికిత్స అందించడంతో రోగం తగ్గిపోయిందని బుధవారం ఆమెను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు. గురువారం ఉదయం మళ్లీ వాంతులు, విరేచనాలు అవ్వడంతో ఆమె పరిస్థితి విషమించింది. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు సిద్ధమవుతుండగానే మృతి చెందింది. అప్పలనర్సయ్యమ్మకు కూడా మూడు రోజుల క్రితమే డయేరియా సోకింది. ఆమెకు తొలుత గుర్ల పీహెచ్సీలో వైద్యం అందించారు. తర్వాత విజయనగరం జిల్లా సర్వజన ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్‌కు అక్కడి వైద్యులు రిఫర్ చేశారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. గుర్ల మండల కేంద్రంలో ఇప్పటికే 300 మంది ఈ రోగం బారినపడ్డారు. గురువారం కొత్తగా మరో 20 కేసులు నమోదయ్యాయి. గుర్లలోని జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ పద్మావతి సందర్శించారు. పాఠశాలలో బెంచీలపైనే 50 మంది రోగులను పడుకోబెట్టి వైద్యసేవలు అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని విజయనగరం జిల్లా సర్వజన ఆస్పత్రికి, విశాఖలోని కేజీహెచ్‌కు పంపిస్తున్నారు. -
ముందు జాగ్రత్తే మందు!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం వర్షాకాలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికున్ గున్యా వంటి వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. అతిసార (డయేరియా) వ్యాధి కూడా ఎక్కువగానే ఉంది. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో గత రెండు, మూడు నెలల నుంచి వైరల్ జ్వరాలతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందీ వీటి బారినపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. కాగా ఇప్పుడు భారీ వర్షాలకు వరదలు కూడా తోడయ్యాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంత ప్రజలను వ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజలు వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముంపు నేపథ్యంలో తాగునీరు కలుíÙతమై అతిసార (డయేరియా), కలరా, టైఫాయిడ్, చర్మ సంబంధిత వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు. తాగే నీరు, ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకూ శుద్ధి చేసిన (ఆర్వో) నీటినే తాగాలని చెబుతున్నారు. లేకుంటే పంపు నీటిని కాచి చల్లార్చి తాగాలని పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమల బెడద తీవ్రంగా ఉంటుందని.. ఈ నేపథ్యంలో ఇంట్లో, ఆరు బయట పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.వైద్య నిపుణుల జాగ్రత్తలు ఇవే.. » నీటిని నిల్వ చేసే పాత్రలు శుభ్రపరచి, వాటిపై మూతలు ఉంచాలి. »తాజా కాయగూరలు, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. »నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోకూడదు. » తినడానికి ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. »రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్లు శుద్ధమైన నీటిని తాగాలి. »తడిచిన బట్టలతో ఎక్కువసేపు ఉండకూడదు. »శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించడంతో పాటు మాస్క్ పెట్టుకోవాలి. »దోమల నుంచి రక్షణ కోసం దోమ తెరలు వినియోగించాలి. »గర్భిణులు, చిన్న పిల్లలు తప్పనిసరిగా దోమతెరల రక్షణలో నిద్రించాలి. » నాలుగైదు రోజులపాటు జ్వరం ఉంటే వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి. డెంగీ వచ్చినప్పుడు నాలుగైదు రోజులు జ్వర లక్షణాలు ఉంటాయి. ప్లేట్లెట్స్ పడిపోవడం సంభవిస్తుంది.వైద్యులను సంప్రదించకుండా యాంటీబయోటిక్స్ వినియోగం వద్దు.. జ్వరం, ఒళ్లు, కీళ్ల నొప్పులు మొదలు కాగానే చాలామంది వైద్యులను సంప్రదించకుండా మందుల షాపుల్లో వాళ్లిచ్చే మందులు వాడుతుంటారు. ఇలా చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి సమస్యలకు ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్ వంటి యాంటీబయోటిక్స్‌ను మందుల షాపుల వాళ్లు ఇచ్చేస్తున్నారు.జలుబు, ఫ్లూ వంటి వాటికి ఇవి పనిచేయవని వైద్యులు చెబుతున్నారు. అవసరం లేకుండా ఈ మందులను వాడితే కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యాధులతో పోరాడే మంచి బ్యాక్టీరియా శరీరంలో ఉంటుంది. యాంటీబయోటిక్స్ విచ్చలవిడి వాడకంతో మంచి బ్యాక్టీరియాపై ప్రభావం పడుతుంది. దీంతో పాటు జీర్ణకోశ, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇన్ఫెక్షన్ సంభవిస్తే మందులు కూడా పనిచేయని పరిస్థితులు వస్తాయి. జ్వరం మొదలుకాగానే ఆందోళన వద్దువిష జ్వర బాధితులు యాంటీబయోటిక్స్ వాడాల్సిన అవసరం లేదు.. సాధారణ చికిత్సలతోనే నయమవుతుంది. బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక సమస్యలు లేనివారు మూడు రోజులు ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గడానికి పారాసెటమాల్ వేసుకోవాలి. ముక్కు, కళ్లు కారడం, జలుబు వంటివి ఉంటే సిట్రిజెన్ వేసుకుంటే సరిపోతుంది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించినా జ్వరం, ఇతర సమస్యలు తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, జ్వరాల వైద్య నిపుణులు, గుంటూరు అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడొద్దు చిన్న పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం వస్తే కంగారు పడొద్దు. మందుల దుకాణాల్లో వాళ్లిచ్చిన యాంటీబయోటిక్స్‌ను అనవసరంగా వాడొద్దు. పారాసిటమాల్, దగ్గు సిరప్‌లను రెండు రోజులు వాడి చూడాలి. అయినప్పటికీ సమస్య తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. నిల్వ ఉన్న నీటిలో పిల్లలు ఆడకుండా చూడాలి. కలుíÙత నీటిలో పిల్లలు సంచరిస్తే చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. విరేచనాలయ్యే పిల్లలకు మసాలా ఆహారం పెట్టొద్దు. బాలింతలు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ విఠల్ రావు, పిల్లల వైద్య నిపుణుడు, విజయవాడ పరిశుభ్రత పాటించాలి వరదల నేపథ్యంలో ఇంట్లో, వాష్ రూముల్లో చేరిన బురదను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో జలుబు, దగ్గు, జ్వర బాధితులుంటే వారు ఒక గదికి పరిమితం కావడం ఉత్తమం. మాస్క్ ధరించాలి. ఎక్కడపడితే అక్కడ నీరు తాగొద్దు. వీలైనంత వరకూ నీరు, తిండి విషయంలో పరిశుభ్రత పాటించాలి. – డాక్టర్ రఘు, సూపరింటెండెంట్, గుంటూరు -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో డయేరియా
-
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో విజృంభిస్తున్న డయేరియా
-
ప్రబలిన డయేరియా
-
తిరుపతి రుయా ఆసుపత్రిలో విషాదం
-
డేంజర్ డయేరియా
-
రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమవుతున్న డయేరియా
సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/గూడూరు రూరల్ (తిరుపతి జిల్లా): కలుషిత నీరు, లోపించిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో డయేరియా ముప్పు నానాటికీ అధికమవుతున్నది. జూన్ ఒకటో తేదీ నుంచి 22వ తేదీ మధ్య వివిధ జిల్లాల్లో ఏకంగా 20 డయేరియా ఘటనలు చోటు చేసుకున్నాయి. 634 కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మృత్యువాత పడినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వైద్య శాఖ లెక్కల ప్రకారం కాకినాడ జిల్లా ఎ.వి.నాగారం పీహెచ్సీ పరిధిలో 86 కేసులు నమోదవ్వగా ఒకరు మృతి చెందగా, ఇదే జిల్లాలోని వేటపాలెం పీహెచ్సీ పరిధిలో 32 కేసులు ఒక మరణం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో 79 కేసులు, ఒక మరణం సంభవించింది. తాజాగా మంగళవారం నాటికి పట్టణంతో పాటు జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లో మరో 11 మంది వాంతులు, విరేచనాలతో ప్రభుత్వాస్పత్రిలో చేరారు. జగ్గయ్యపేట పట్టణంలో డయేరియా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో.. మంగళవారం మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ (రాజమండ్రి) నాగ నరసింహారావు పారిశుద్ధ్య నిర్వహణపై స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు సచివాలయాల్లో సిబ్బందికి డ్రెస్ కోడ్ లేకపోవడంతో ఒకరోజు వేతనం కట్ చేయాలని మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వరరావును ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రికి డయేరియా కేసులు వస్తుండడంతో డీఎంహెచ్‌వో సుహాసిని పర్యవేక్షిస్తూ.. అవసరమైతే మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడకు తరలిస్తున్నారు. అలాగే మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరులోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ధ్యాన్‌చంద్ మంగళవారం ఆకస్మికంగా పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సంబంధిత అధికారులను హెచ్చరించారు. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా డయేరియా బారినపడిన వ్యక్తులు, మృతుల సంఖ్య అనధికారికంగా ఇంకా అధికంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరడంతో వివిధ శాఖల అధికారులు మంచి పోస్టింగ్‌లు తెచ్చుకోవడం, ఇప్పటికే ఉన్న పోస్టింగ్‌ల్లో కొనసాగేలా పెద్దలను ప్రసన్నం చేసుకునే పనుల్లో పడ్డారు. దీంతో క్షేత్రస్థాయిలో పాలన గాడి తప్పింది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపిస్తున్నది. తొలకరి నేపథ్యంలో నదులు, చెరువులు, బావుల్లోని నీరు కలుషితమై అతిసార వ్యాప్తి చోటు చేసుకుంటున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పూర్తిస్థాయిలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రణాళికతో అడుగులు వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
అదుపులోకిరాని డయేరియా
సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/దాచేపల్లి: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. ఐదు రోజులుగా దీనికి సంబంధించిన కేసులు ప్రభుత్వాస్పత్రికి వస్తూనే ఉన్నాయి. తాజాగా.. సోమవారం జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది వాంతులు, విరేచనాలతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో చేరారు. అలాగే, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఓ వృద్ధురాలు కూడా అతిసార బారినపడి మరణించింది. 79 కేసులు నమోదు.. జగ్గయ్యపేట ప్రాంతంలో ఈనెల 19–24 వరకు మొత్తం 79 డయేరియా కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్ఓ సుహాసిని తెలిపారు. పట్టణంలో 30, మండలంలో 27, వత్సవాయి మండలంలో 22 కేసులు వచ్చాయని తెలిపారు. ఇందులో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో 67 మందికి చికిత్స అందించగా మరో 12 మంది ఖమ్మం, కోదాడ, తదితర ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఇక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న 67 మందిలో 33 మందిని డిశ్చార్జ్ చేయగా మెరుగైన వైద్య నిమిత్తం 10 మందిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 24 మంది జగ్గయ్యపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె చెప్పారు.మరోవైపు.. అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు సుహాసిని తెలిపారు. డయేరియాను అదుపు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా వ్యక్తిగత శుభ్రత, వైద్యాధికారుల సలహాలు, సూచనలు పాటించాలని ఆమె కోరారు. అలాగే, అతిసార వ్యాపించిన గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో 24 గంటల వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డీసీకే నాయక్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ హరీష్, విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు అరీనా, స్థానిక వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న పారిశుధ్య పనులు.. మరోవైపు.. జగ్గయ్యపేట మండలంలోని బూదవాడ, గండ్రాయి గ్రామాల్లో పంచాయతీ అధికారులు ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. మంచినీటి ట్యాంకులు శుభ్రంచేయడంతో పాటు క్లోరినేషన్ చేస్తున్నారు. డ్రెయిన్లలో పూడికతీత, మురుగునీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి బ్లీచింగ్, దోమల వ్యాప్తిని నిరోధించే మందులను పిచికారీ చేస్తున్నారు. దీంతోపాటు.. డయేరియా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు.తాజాగా 11 కేసులు నమోదు.. జగ్గయ్యపేట మండలంలో సోమవారం వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న 11 మందిని గుర్తించినట్లు వైద్యాధికారి అనిల్‌కుమార్ తెలిపారు. వీరంతా బూదవాడ, ముక్త్యాల, రావిరాల.. వత్సవాయి మండలం మంగొల్లు, వేములనర్వ, పెద్దమోదుగపల్లి.. పట్టణంలోని సీతారాంపురం, చెరువుబజార్‌కు చెందిన వారు. గండ్రాయిలో ఆర్డబ్ల్యూఎస్ డీఈ రమణ తాగునీటి ట్యాంకులను పరిశీలించారు. అతిసారతో వృద్ధురాలు మృతి.. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వంగూరి నాగమ్మ (62) అతిసార బారినపడి చికిత్స పొందుతూ సోమవారం మృత్యువాత పడింది. ఈ గ్రామంలో అతిసార బారినపడి 16 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల కిందట నాగమ్మ కూడా ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేరింది. వాంతులు, విరేచనాలు అదుపులోకి రాకపోవడంతోపాటు కిడ్నీల సమస్య తలెత్తింది. దీంతో ఆమెను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి ఆదివారం తరలించగా.. చికిత్స పొందుతూ మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు.డయేరియా ప్రబలుతుంటే ఏం చేస్తున్నారు?: మంత్రి సత్యకుమార్ ఈ నేపథ్యంలో.. సోమవారం మంత్రి సత్యకుమార్ యాదవ్ డయేరియాతో పాటు సీజనల్ వ్యాధులు, కీటక జనిత వ్యాధులపై ఏపీ సచివాలయం నుంచి డీఎంహెచ్ఓలు, డీసీహెచ్‌ఎస్‌లు, జీజీహెచ్ సూపరింటెండెంట్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. డయారియా కేసులు పెరుగుతుంటే క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. 27 ఏళ్ల యువకుడు డయేరియాతో చనిపోతే ఏం సమాధానం చెప్తారని ప్రశి్నంచారు. ఈ పరిస్థితి చూసి సిగ్గుపడాలన్నారు. మున్ముందు వైద్యశాఖను ప్రక్షాళన చేసేలా చర్యలుంటాయన్నారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. సమీక్షలో వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ లక్షీషా, డీఎంఈ డాక్టర్ నరసింహం పాల్గొన్నారు. -
భయం గుప్పెట్లో జగ్గయ్యపేట
సాక్షి ప్రతినిధి, విజయవాడ/లబ్బిపేట/జగ్గయ్యపేట : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో డయేరియా (అతిసార) విస్తరిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతానికి చెందిన ఆరుగురు ఈ కారణంతో మృత్యువాత పడడంతో జగ్గయ్యపేట పట్టణంతో పాటు, పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనతో వణికిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 డయేరియా కేసులు నమోదుకాగా, ఒక్క జగ్గయ్యపేట నియోజకవర్గంలోనే అధికారికంగా 58 కేసులు నమోదయ్యాయి. కొందరు బాధితులు ఖమ్మం, విజయవాడ, జగ్గయ్యపేట ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందుతుండడంతో ఇవి అధికార లెక్కల్లోకి రావటంలేదు. ఇక్కడ ఇప్పటికే ఆరుగురు మృతిచెందినప్పటికీ ఇద్దరు మాత్రమే మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. మరోవైపు.. ఆదివారం ఒక్కరోజే జగ్గయ్యపేట, వత్సవాయి మండలాలకు చెందిన11 మంది వాంతులు, విరేచనాలతో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఇప్పటికే 32 మంది చికిత్స పొందుతుండగా 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైద్య, ఆరోగ్యశాఖ జాప్యం..జగ్గయ్యపేట పట్టణంతో పాటు, షేర్ మహమ్మద్‌పేట, మక్కపేట, చిల్లకల్లు, బూదవాడ, అనుమంచిపల్లి, గండ్రాయిల్లో డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మృత్యువాత పడిన వారు కూడా ఈ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. నిజానికి.. వైద్య, ఆరోగ్యశాఖ ఈ నెల 20నే డయేరియా కేసులను గుర్తించినా అదుపు చేయడంలో జాప్యం జరిగింది. ఆ తర్వాత అప్రమత్తమై ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసింది. కానీ, అధికారుల హడావిడి తప్ప క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కరువయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నీరు కలుషితం.. లోపించిన పారిశుధ్యం..ఇదిలా ఉంటే.. డయేరియా సోకుతున్న గ్రామాల్లో నీరు కలుషితమైనట్లు వైద్యశాఖ అధికారులు గుర్తించారు. అలాగే, పారిశుధ్యం కూడా అస్తవ్యస్థంగా ఉందని.. నీటిని సరఫరా చేసే రక్షిత మంచినీటి ట్యాంకులు కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా లోపించింది. ఉదా.. షేర్‌హమ్మద్‌పేట చెరువు ఒడ్డునే తాగునీటి బావి ఉంది. అక్కడ బావి పక్కనే చెత్త చెదారం పేరుకుపోయి ఉంది. పైగా ఆ బావిపైన మెస్ కూడా లేకపోవడంతో నీరు పూర్తిగా కలుషితమవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే, అనుమంచిపల్లి, గండ్రాయి, బూదవాడ ప్రాంతాల్లోని పారిశుధ్యం పరిస్థితి కూడా ఇంతే. మక్కపేట ప్రాంతంలో తాగునీటిని ఫిల్టర్ చేయకుండానే సరఫరా చేస్తున్నట్లు సమాచారం.ప్రత్యేక బృందాల ఏర్పాటు..ఇక డయేరియా సోకుతున్న గ్రామాల్లో శానిటేషన్ మెరుగుదలకు వైద్య, ఆరోగ్యశాఖ 40 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 45 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. మరోవైపు.. జగ్గయ్యపేట ప్రాంతాన్ని ఆదివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించి బాధితులను పరామర్శించారు. ఆయా శాఖాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు అప్రమత్తంగా ఉండడంలేదని, అలసత్వం వహిస్తున్నారని.. అలాంటి వారిని ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. గ్రామాల్లో ఇంటింటి సర్వేచేయాలని, వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు, కమిషనర్ వెంకటేశ్వర్, జేసీ సంపత్‌కుమార్, ఆర్డీఓలు రవీందర్, మాధవి, డీఎంహెచ్ఓ సుహాసిని, వైద్యారోగ్య శాఖ అడిషనల్ ఏడీ సుబ్రహ్మణ్యశ్రీ, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు.217 చోట్ల నీరు కలుషితం రాష్ట్రవ్యాప్తంగా 168 డయేరియా కేసులు నమోదయ్యాయని.. ఇందులో ఒక్క జగ్గయ్యపేటలోనే 58 కేసులున్నాయని మంత్రి చెప్పారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటరీ చానళ్లను శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీల వల్ల తాగునీటిలో డ్రెయినేజీ మురుగు కలవడం ఇందుకు కారణమన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బుధవారం గ్రామీణ ప్రాంతాల్లో నీటి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ఇప్పటికే 30 వేలకు పైగా నీటి వనరులు నమూనాలు పరీక్షించగా 217 ప్రాంతాల్లో నీరు కలుషితమైనట్లు అధికారులు గుర్తించారన్నారు. -
డయేరియాతో ఆరుగురు మృత్యువాత
జగ్గయ్యపేట/జూపాడుబంగ్లా/సామర్లకోట: రాష్ట్రంలో డయేరియా విజృంభిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో డయేరియా బారినపడి నలుగురు, నంద్యాల జిల్లాలో ఒకరు, కాకినాడ జిల్లాలో మరొకరు మృత్యువాతపడ్డారు. మూడు జిల్లాల్లోనూ 85 మందికి పైగా బాధితులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని ఇండోర్ స్టేడియం సమీపంలో ఉంటున్న ఉమ్యినేని రంగయ్య (60), జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన తురక మంగతాయారు (55), బూదవాడ గ్రామానికి చెందిన గుగులోతు జమ్మా (60), వేదాద్రి గ్రామానికి చెందిన పసుమర్తి సత్యవతి (75) వాంతులు, విరోచనాలతో జగ్గయ్యపేట, విజయవాడ ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో 19 మంది డయేరియా బాధితులకు వైద్యసిబ్బంది చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. నంద్యాల జిల్లాలో.. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతులపాడు శివారు చాబోలులో శుక్రవారం 30 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారిలో కొంతమంది నందికొట్కూరు, కర్నూలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం మరో నలుగురు వాంతులు, విరేచనాలతో నీరసించిపోయారు. వారిలో నడిపి నాగన్న (45) అనే వ్యక్తిని నందికొట్కూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించగా.. కొద్దిసేపటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.డయేరియా బాధితుల్లో రంగమ్మ, మరియమ్మ పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని తాగునీటి ట్యాంకులో కొంగపడి చనిపోయి దుర్వాసన వస్తున్నా సిబ్బంది పట్టించుకోలేదని, అందువల్లే డయేరియా ప్రబలిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటుచేసినా, సరైన చికిత్స అందించకపోవటం వల్లే తన అన్న నాగన్న చనిపోయాడని ఆయన తమ్ముడు చిన్ననాగన్న కన్నీటి పర్యంతమయ్యారు. అదనపు జిల్లా వైద్యాధికారిణి శారదాబాయి మాత్రం నడిపినాగన్నకు చికిత్స అందించామని, ఆయన డయేరియాతో కాకుండా గుండెపోటుతో మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నామని తెలిపారు. మరోవైపు నడిపినాగన్న మృతికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని జూపాడుబంగ్లా తహసీల్దార్ కార్యాలయం ఎదుట కేజే రోడ్డు పక్కన మృతదేహంతో ప్రజాసంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేíÙయో చెల్లించాలని డిమాండ్ చేశారు.వేట్లపాలెంలో మహిళ మృతి కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని జొన్నలదొడ్డి ప్రాంతంలో డయేరియా వ్యాపించింది. గ్రామంలో ఈ నెల 19న డయేరియా కేసు గుర్తించారు. అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోకపోవడంతో బాధితుల సంఖ్య 36కు పెరిగింది. ఆరుగురిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో కొమ్మోజు సత్యవేణి (42) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కాకినాడ ఆర్డీవో ఇట్ల కిషోర్, డీఎంహెచ్‌వో జె.నరసింహ నాయక్, డీపీవో సౌజన్య శనివారం వేట్లపాలెంలో పర్యటించారు. జొన్నలదొడ్డి, వేట్లపాలెం పీహెచ్సీలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. -
వాళ్ళవి సహజ మరణాలే
-
ఆస్ట్రేలియాలో 'షెగెలోసిస్ వ్యాధి' కలకలం!వందలాది మందికిపైగా..
ఆస్ట్రేలియా షెగెలోసిస్ వ్యాధి(షిగెల్లా బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధి) తీవ్ర కలకలం రేపుతుంది. ఆస్ట్రేలియాలోని స్టేట్ విక్టోరియాలో ఎసోటెరిక్ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. దీనికి హాజరైన ప్రజలలో కొంతమంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ ఫెస్టివల్ డోనాల్డ్‌లో మార్చి8 నుంచి మార్చి12వ తేది వరకు జరిగింది. ఆ ఫెస్టివల్‌కి హాజరైన వారిలో దాదాపు 230 మంది దాక షిగెలోసిస్కి సంబంధించిన జీర్ణశయాంతర పేగు సంబంధిత లక్షణాలను ఎదుర్కొన్నారు. దీంతో ఆస్ట్రేలియా ఆరోగ్య అధికారులు ఆ ఫెస్టివల్‌కి హజరైన వారలో ఇంకెవరికైనా అలాంటి లక్షణాలు తలెత్తితే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ వ్యాధి అతిసారం మాదిరిగా జ్వరం, వికారం, వాంతులు, పొత్తికడుపు తిమ్మిరి వంటి గ్యాస్ట్రో లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులే ఈ వ్యాధికి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఎక్కుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అదీగాక ఎక్కువ మందికి ఈ వ్యాధి వ్యాపించడంతో ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, సలహదారులు చెప్పేంత వరకు ఆయా బాధితలు ఎలాంటి విధులకు హాజరుకాకుడదని హెచ్చరించింది. యాంటీ బయాటిక్స్ మందులతో ఈ వ్యాధిని అదుపులోకి తీసుకురావొచ్చుగానీ కేసులు పెరిగితే మాత్రం ఈ వ్యాధి వ్యాప్తి సవాలుగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఏంటీ షెగెలోసిస్ వ్యాధి.. ఈ బ్యాక్టీరియా పేరు షింగెల్లా. ఇది సోకడాన్ని షింగెల్లోసిస్ అంటారు. ఇది సోకితే విరేచనాలు (డయేరియా), జ్వరం, కడుపు నొప్పి వస్తాయి. ఇవి కొన్ని రోజులపాటూ ఉంటాయి. చికిత్సలో యాంటీబయోటిక్స్‌ని వాడుతారు. ఇవి వ్యాధి వ్యాప్తిని తగ్గించగలవు. షింగెల్లా బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరికి రకరకాల మార్గాల్లో వ్యాపించగలదు. ఆల్రెడీ సోకిన వ్యక్తికి డయేరియా తగ్గి నయం అయిపోయినా… ఆ వ్యక్తి నుంచి ఈ బ్యాక్టీరియా ఇతరులకు సోకగలదు. అలాగే ఈ వ్యాధి కలుషిత ఆహారం లేదా లైంగిక సంబంధం ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా పారిశుద్ధ్యం సరిగా లేని ప్రాంతాల్లో నివసించడం లేదా ప్రయాణించడం, పురుషులతో శృంగారంలో పాల్గొనే పురుషులకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నివారణ: తరచుగా చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. మంచి పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత తోపాటు ఆహార పరిశుభ్రతను పాటించాలి ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సలహాల మేరకు తీసుకోవాలి. ఈ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట కేవలం పరిశుభ్రంగా ఉండటమే కీలకం (చదవండి: ఇదేం వ్యాధి.. సోఫా ఫోమ్, ఫోటో ఫ్రేమ్ గ్లాస్లు తినేస్తోంది..) -
డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం
నగరంపాలెం: డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. 24/7 వైద్యులను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 8341396104కు ఫోన్ చేయొచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్లో ఆదివారం మేయర్ కావటి మనోహర్ నాయుడు, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, నగర కమిషనర్ కీర్తి చేకూరి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌తో కలిసి మంత్రి మాట్లాడారు. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డయేరియా వచ్చిందని.. గుంటూరు నగరంలో పది ప్రాంతాల్లో అది తలెత్తిందని గుర్తుచేశారు. నాడు 2,400 మంది డయేరియాతో బాధపడ్డారని.. అందులో 24 మంది మృతి చెందారని తెలిపారు. శనివారం గుంటూరుతోపాటు ఇతర ప్రాంతాల నుంచి 32 మంది వాంతులు, విరేచనాలతో జీజీహెచ్‌కు వచ్చారన్నారు. వీరందరికి వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. దీంతో ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారని, మిగతావారు సోమవారం నాటికి డిశ్చార్జ్ అవుతారని వివరించారు. ఘటనపై జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారని తెలిపారు. బాధితుల నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపించామన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రభావిత ప్రాంతాల్లో సర్వే.. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటా సర్వే చేయిస్తున్నామని విడదల రజిని వెల్లడించారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యులు వెంటనే వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో తాగునీటిని రోస్టర్ విధానంలో సరఫరా చేస్తున్నారని తెలిపారు. శారదా కాలనీలో మూడు షిఫ్ట్‌లలో వైద్యులు, ఐదుగురు సిబ్బందిని 24/7 అందుబాటులో ఉంచామన్నారు. కాగా, ఇటీవల కృష్ణానదిలోకి పులిచింతల నుంచి కొత్త నీరు వస్తోందని ప్రజలకు 15 రోజుల కిందటే కమిషనర్ తెలియజేశారన్నారు. కొళాయిల నుంచి వచ్చే తాగునీటిని వేడి చేసుకుని తాగాలని సూచించారని తెలిపారు. -
టాడ్లర్స్ డయేరియా.. చంటి పిల్లల్లో నీళ్ల విరేచనాలు
పోరాడే వయసు పిల్లలు... అంటే ఆర్నెల్ల వయసు నుంచి రెండు, మూడేళ్ల లోపు పిల్లల్ని టాడ్లర్స్ అంటారు. ఆ వయసు పిల్లల్లో వచ్చే నీళ్లవిరేచనాల్ని ‘టాడ్లర్స్ డయేరియా అంటారు. ఈ కండిషన్ చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఇలాంటి పిల్లలకు ఇచ్చే ఆహారంలో కాస్తంత పీచుపదార్థాల మోతాదులు తగ్గించాలి. వాళ్లు తాగే ΄పాలలో తీపిదనం ఎక్కువవుతున్నందున ఇలా జరిగే అవకాశముంది. అందుకే పాలలో (జ్యూస్‌ల వంటి వాటిల్లోనూ) చక్కెరని కొంతకలం పాటు మానేయాలి. పాలు తాగే పిల్లలకు పూర్తిగా తల్లి పాలే ఇవ్వాలి. ఇలాంటి పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడం, జింక్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, విటమిన్–ఏ పదార్థాలు ఉండే ఆహారాలు ఇవ్వాలి. అప్పటికీ తగ్గకపోతే వారికి రొటావైరస్ వల్లగానీ లేదా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా అవుతుందేమోనని అనుమానించి, వైద్యనిపుణులకు చూపించాలి. అప్పుడు వారి విరేచనాల సమస్యకు తగిన కారణాన్ని కనుగొని, అందుకు అనుగుణంగా డాక్టర్లు చికిత్స అందిస్తారు. -
హైదరాబాద్‌లో వణుకు పుట్టిస్తున్న డెంగీ.. పెరుగుతున్న డయేరియా
సాక్షి, హైదరాబాద్: బస్తీకి సుస్తీ చేసింది. మారిన వాతావరణ పరిస్థితులకు తోడు ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సిటిజన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తగ్గినట్లే తగ్గిన కరోనా వైరస్ సహా డెంగీ జ్వరాలు మళ్లీ చాపకింది నీరులా విస్తరిస్తూ ప్రజారోగ్యానికి సవాల్ విసురుతున్నాయి. ఇంట్లో ఒకరి తర్వాత మరొకరు జ్వరంతో మంచం పడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణం చల్లబడటంతో పాటు తరచూ వర్షంలో తడుస్తుండటంతో శ్వాసకోశ సమస్యలు కూడా రెట్టింపయ్యాయి. నీటితో పాటు ఆహారం కూడా కలుషితమై అనేక మంది వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, డిఫ్తీరియా (కంఠసర్పి) బారిన పడుతున్నారు. ఫలితంగానల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సహా ఏరియా ఆస్పత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలకు రోగులు క్యూ కడుతున్నారు. డెంగీ జ్వరాలు డేంజర్.. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. ఇంటి ఆవరణలోని పూల కుండీలే కాదు ఇంటిపై ఉన్న ఖాళీ డబ్బాలు, టైర్లు, ఇంటికి అటు ఇటుగా ఖాళీగా ఉన్న ప్రదేశా ల్లో తాగిపడేసిన కొబ్బరి బోండాల్లో వర్షపు నీరు చేరడం, రోజుల తరబడి నిల్వ ఉండటం వల్ల దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా సంపన్నులు ఎక్కువగా నివసించే గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, కూకట్పల్లి సహా శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలసిన గెజిటెట్ కమ్యూనిటీలు, విల్లాల్లో ఎక్కువ కేసులు నమోదువుతున్నాయి. వీటిలో ముఖ్యంగా డెంగీ కారక ఈడిస్ ఈజిప్టే దోమలు వృద్ధి చెంది మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోయిన చిన్నారులు, మహిళలు, వృద్ధులపై దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 200పైగా డెంగీ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 61 కేసులు, మేడ్చల్ జిల్లాలో 42 డెంగీ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు ఉన్నట్లు అంచనా. చదవండి: తస్మాత్ జాగ్రత్త.. కాల్ చేసి ]401]తో కలిపి డయల్ చేయాలని చెబుతున్నారా.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రోజుకు సగటున 250– 260, రంగారెడ్డి జిల్లాలో 50 నుంచి 60, మేడ్చల్ జిల్లాలో30 నుంచి 40 కేసులు నమోదుతున్నాయి. కరోనా వైరస్ సోకిన వారిలోనే కాదు సాధారణ జ్వరపీడితుల్లోనూ లక్షణాలు ఒకే విధంగా ఉండటం వైరస్ గుర్తింపు, చికిత్స కష్టంగా మారింది. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వాంతులు.. విరేచనాలు నగరానికి కృష్ణా, గోదావరితో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుంచి నీరు సరఫరా అవుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆయా ప్రాజెక్టులకు వరద నీరు చేరుతోంది. కలషిత నీరు నదుల్లోకి చేరుతుండటం, సరిగా ఫిల్టర్ చేయకుండా పంపింగ్ చేస్తుండటంతో ఈ నీటిని తాగిన బస్తీవాసులు వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ జ్వరాల బారినపడుతున్నారు. ప్రస్తుతం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వస్తున్న రోగుల్లో ఎక్కువ శాతం వీరే ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్పుడే వండిన తాజా ఆహారానికి బదులు నిల్వ చేసిన ఆహార పదార్థాలు తినడంతో అనారోగ్యం పాలవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో కాచి వడపోసిన నీరు తాగడం, అప్పుడే వండిన తాజా ఆహారం తీసుకోవడం, ముక్కుకు మాస్క్‌లు ధరించడం, చేతులను తరచూ శానిటైజర్లతో శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
డయేరియానా? ఇలా చేసి చూడండి!
ఈ సీజన్లో నీళ్ల విరేచనాలు అయే అవకాశాలు ఎక్కువ. వాటికి మందులు తీసుకునేకంటే ఈ కింది తేలికపాటి చిట్కాలు పాటిస్తే సరి... డయేరియాతో బాధపడేవారు తీసుకోవాల్సిన ఆహారంలో అరటిపండు ఒకటి. అరటి పండులో ఉండే పొటాషియం అరుగుదలకి సహకరిస్తుంది. ఇందులో ఉండే పిండిపదార్థం పెద్దపేగులో నుండి నీరు, ఉప్పుని గ్రహిస్తుంది. ఫలితంగా మలం గట్టిపడుతుంది. ఇంకా ఈ పండులో ఉండే ఫైబర్ మోషన్ మామూలుగా అయేలా చేస్తుంది. పెరుగు పెరుగు తేలికగా ఉంటుంది. సులువుగా అరుగుతుంది. ఇందులో ఉండే ప్రోబయాటిక్ మంచి బ్యాక్టీరియాని విడుదల చేస్తుంది. ఫలితంగా అరుగుదల బాగుండి పేగుల కదలికలు ఫ్రీగా మారతాయి. యాపిల్ చెక్కు తీసిన యాపిల్స్ ఈ సమస్యకి బాగా హెల్ప్ చేస్తాయి. యాపిల్స్ ని స్ట్యూ చేసి కూడా తీసుకోవచ్చు. కొబ్బరి నీరు కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం, సోడియం వంటి ఎలెక్ట్రొలైట్స్ శరీరంలోని ఖనిజలవణాలను భర్తీ చేస్తాయి. నీళ్ల విరేచనాల ద్వారా నష్టపోయిన నీటి శాతాన్ని కొబ్బరినీరు పూరిస్తాయి. జీలకర్ర నీరు ఒక గిన్నెలో ఒక కప్పు నీరు పోసి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మరిగించండి. తరువాత కొద్ది నిమిషాలు సిమ్ లో ఉంచండి. చల్లారిన తరువాత వడకట్టి తాగేయండి. ఇది ఇరిటేట్ అయి ఉన్న బవెల్స్ని చల్లబరుస్తుంది. బాడీని రీ హైడ్రేట్ చేస్తుంది. మజ్జిగ మజ్జిగ జీర్ణవ్యవస్థను చక్కబరుస్తుంది. మంచి బ్యాక్టీరియాని పెంచి చెడు బ్యాక్టీరియాని బయటకు పంపేస్తుంది. అయితే, మజ్జిగా తాజాగా ఉండాలి, ఏ మాత్రం పులుపు ఉండకూడదు. రుచికి చిటికెడు ఉప్పు కూడా కలుపుకోవచ్చు. మునగాకు కొద్దిగా మునగాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకోండి. ఇలా రోజుకి ఒకసారి మించి తీసుకోకూడదు. మునగాకు అరుగుదల సమస్యలను తేలిగ్గా పరిష్కరిస్తుంది. కిచిడీ పెసర పప్పుతో చేసే కిచిడీ పొట్టకి తేలికగా ఉంటుంది. త్వరగా అరుగుతుంది. కావాల్సిన శక్తిని ఇస్తుంది. ఉడికించిన బంగాళదుంపలు ఉడికించిన బంగాళదుంపమీద కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తినడం వల్ల విటమిన్ సీ, బీ6 ని భర్తీ అవుతుంది. ఏం తీసుకోకూడదు..? ∙పాలు, పన్నీర్, చీజ్, బటర్ పూర్తిగా ఎవాయిడ్ చేయండి. ప్రాసెస్డ్ ఫుడ్, బేక్డ్ ఫుడ్, షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోకూడదు. ∙కాఫీ, టీ తగ్గించగలిగితే మంచిది. ∙వేపుళ్ళు తీసుకోరాదు. మీగడతో కూడిన ఆహారం మానితే మంచిది. ∙పండ్ల రసాలు కూడా మంచివి కావు. ∙బ్రకోలీ, క్యాబేజ్, ఉల్లిపాయ, కాలీ ఫ్లవర్ వంటివి తినకూడదు. ∙ఆల్కహాల్‌కి దూరంగా ఉండాలి. -
Health Tips: ప్రయాణాల్లో డయేరియాతో జాగ్రత్త.. ఇవి పాటిస్తే మేలు!
తరచూ ప్రయాణాలు చేసేవారు రకరకాల ప్రదేశాల్లో ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా ప్రయాణ సమయాల్లో వారు ఆహారం తీసుకునే ప్రదేశాలూ, అక్కడ దొరికే పదార్థాలూ అంత పరిశుభ్రంగా ఉండకపోవచ్చు. దాంతో ట్రావెలర్స్ డయేరియా వచ్చే అవకాశాలు ఎక్కువ. నిత్యం ప్రయాణాల్లో ఉండేవారికి ఈ ముప్పు ఎక్కువ. కానీ వేసవి సెలవుల్లో పిల్లలు ఏ బంధువుల ఇంటికో వెళ్లేప్పుడు ఒకసారి ప్రయాణం, మరోసారి తిరుగు ప్రయాణంలో వచ్చే ప్రమాదాన్ని ట్రావెలర్స్ డయేరియాతో పోల్చలేనప్పటికీ... జర్నీ సమయంలో విరేచనాలు ఎప్పుడూ చాలా ఇబ్బంది పెడతాయి. అందుకే అది ట్రావెలర్స్ డయేరియా అయినా, లేదా సాధారణ విరేచనాలే అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు. పాటించాల్సినవి.. 👉🏾ప్రయాణాల్లో దొరికే ఆహారం, నీరు కలుషితమయ్యేందుకు అవకాశాలెక్కువ. అందుకే సాధ్యమైనంతవరకు ఇంట్లో చేసిన పదార్థాలే ప్రయాణంలోనూ తినేలా ప్లాన్ చేసుకుని దానిని అమలు చేయాలి. 👉🏾అలాగే కాచి, చల్లార్చిన నీళ్లను ఇంటినుంచే తీసుకుని, ప్రయాణమంతా వాటినే వాడటం మంచిది. లేదా తప్పనప్పుడు నమ్మకమైన బ్రాండ్‌కు చెందిన ప్యాకేజ్డ్ నీళ్ల బాటిల్‌ను తీసుకోవాలి. 👉🏾ట్రావెలర్స్ డయేరియాను నివారించేందుకు ప్రయాణికులు తాము ఎప్పుడూ తీసుకునే సురక్షితమైన, నమ్మకమైన చోటనే ఆహారం తీసుకోవాలి. 👉🏾తినడానికి ముందుగా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. 👉🏾ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తినేయాలి. 👉🏾ఒకవేళ విరేచనాలు అవుతున్నప్పుడు దేహం ద్రవాలనూ, లవణాలను కోల్పోకుండా నమ్మకమైన ఓఆర్ఎస్ (ఓరల్ రీ–హైడ్రేషన్ సొల్యూషన్)ప్యాక్‌ను తీసుకోవాలి. 👉🏾మరీ ఆగకుండా విరేచనాలు అవుతున్నప్పుడు ప్రయాణానికి బ్రేక్ ఇచ్చి... ఆసుపత్రిలో సెలైన్ తీసుకోవడం లాంటి చికిత్సతో పాటు డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడాలి. పరిస్థితి పూర్తిగా చక్కబడ్డాకే మళ్లీ ప్రయాణం కొనసాగించాలి. చదవండి 👉🏾: Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి! -
మారేడు జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్‌ల వల్ల..
Summer Drink- Maredu Juice: మారేడు జ్యూస్ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరానికి చల్లదనంతోపాటు ఫ్రెష్‌నెస్ ఇస్తుంది. ఈ జ్యూస్‌లోని టానిన్, పెక్టిన్లు డయేరియాను తరిమికొట్టడంలో ప్రముఖ పాత్రపోషిస్తాయి. విటమిన్ సీ, క్యాల్షియం, పీచుపదార్థం, ప్రోటీన్, ఐరన్లు పుష్కలంగా ఉండి, జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి. వేసవిలో వెంటనే దాహార్తి తీరాలంటే మారేడు జ్యూస్ చక్కగా పనిచేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇలా సింపుల్‌గా ఇంట్లోనే ఈ సమ్మర్ డ్రింక్‌ను తయారుచేసుకోండి. మారేడు జ్యూస్ తయారీకి కావలసిన పదార్థాలు: పండిన మారేడు – ఒకటి, పంచదార లేదా బెల్లం – రుచికి సరిపడా, దాల్చిన చెక్కపొడి – పావు టీస్పూను, జాజికాయ పొడి – పావు టీస్పూను, చల్లటి నీళ్లు – జ్యూస్‌కు సరిపడా. మారేడు జ్యూస్ తయారీ ఇలా: ►ముందుగా మారేడు పండును పగులకొట్టి లోపలి గుజ్జును వేరుచేయాలి. ►తీసిన గుజ్జునుంచి విత్తనాలు, పీచు వేరుచేసి, జ్యూస్‌ను పిండుకోవాలి. ►జ్యూస్‌ను వడగట్టి రుచికి సరిపడా పంచదార లేదా బెల్లం వేయాలి. ►దీనిలో చల్లటి నీళ్లు పోసి పంచదార కరిగేంత వరకు తిప్పుకోవాలి. ►చివరిగా దాల్చిన చెక్క, జాజికాయ పొడి వేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి👉🏾Palmyra Palm: వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
‘డయేరియా’ బాధ్యులపై సస్పెన్షన్ వేటు
కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు, ఆదోనిలోని అరుంజ్యోతి నగర్లో తాగునీరు కలుషితమవుతున్నా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి డయేరియా ప్రబలడానికి కారణమైన నలుగురు ఉద్యోగులను జిల్లా కలెక్టర్ వీరపాండియన్ శనివారం సస్పెండ్ చేశారు. మరో నలుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాణ్యం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బి.పవన్‌కుమార్, గోరుకల్లు పంచాయతీ సెక్రటరీ జి.విజయభాస్కర్, ఆదోని మునిసిపాలిటీ వాటర్ సప్లై ఏఈ టి.రాజశేఖరరెడ్డి, వాటర్ సప్లై టర్న్ కాక్ ఎం.ఈరన్నలను సస్పెండ్ చేశారు. అలాగే పాణ్యం ఈవోఆర్డీ కె.భాస్కరరావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఎన్.ఉమాకాంత్‌రెడ్డి, ఆదోని మునిసిపాలిటీ వాటర్ సప్లై డీఈవో జి.సురేష్, వాటర్ సప్లై ఈఈ ఎ.సత్యనారాయణలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విచారణ కమిటీల నియామకం డయేరియా ప్రబలడానికి కారణాల అన్వేషణ, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం కోసం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ విచారణ కమిటీలను నియమించారు. ఆదోనిలోని అరుంజ్యోతి నగర్లో విచారణ కోసం ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి నేతృత్వంలో అనంతపురం జిల్లా పబ్లిక్ హెల్త్ ఎస్ఈ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి, కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ ఎస్ఈ సురేంద్రబాబుతో కమిటీ వేశారు. గోరుకల్లులో విచారణ కోసం నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి నేతృత్వంలో కర్నూలు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విద్యాసాగర్, డీపీవో కేఎల్ ప్రభాకరరావు సభ్యులుగా కమిటీని నియమించారు. -
ఆదిలాబాద్ జిల్లా లో డయేరియా కలకలం
-
అంటువ్యాధులు పరార్
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలతో అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోల్చితే జూన్, జూలై, ఆగస్టులో మలేరియా కేసులు సగానికి పైగా తగ్గగా డెంగీ, డయేరియా 10–20 శాతానికే పరిమితమైనట్లు పంచాయతీరాజ్ శాఖ పరిశీలనలో తేలింది. 13 వేల పంచాయతీల్లో పారిశుధ్య పనులు.. ► ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనూ, అంతకు ముందు వేసవిలోనూ రాష్ట్రంలోని 13,322 గ్రామ పంచాయతీల పరిధిలో పంచాయతీరాజ్ శాఖ సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టింది. ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిత్యం క్లోరినేషన్, పూడికతీత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం లాంటి చర్యలు పెద్ద ఎత్తున చేపట్టారు. ► మండలానికి రెండు గ్రామాల చొప్పున 1,320 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా మనం – మన పరిశుభ్రత పేరుతో చెత్త సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నామమాత్రంగా డెంగీ కేసులు... ► గత ఏడాది జూన్, జూలై, ఆగస్టులో గ్రామీణ ప్రాంతాల్లో 1,163 మలేరియా కేసులు నమోదు కాగా ఈసారి ఇదే కాలంలో కేవలం 601 మాత్రమే నమోదైనట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. డెంగీ కేసులు గత ఏడాది మూడు నెలల్లో 944 కేసులు నమోదు కాగాఈసారి అదే వ్యవధిలో 24 మాత్రమే గుర్తించారు. ► గత ఏడాది 1,11,685 డయేరియా కేసులు మూడు నెలల్లో నమోదు కాగా, ఈ ఏడాది అదే వ్యవధిలో 20,355 మాత్రమే నమోదయ్యాయి. గతేడాది 9,528 టైఫాయిడ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 355 కేసులే నమోదయ్యాయి. -
మెట్టవలసపై డయేరియా పంజా
శ్రీకాకుళం, జి.సిగడాం: మండలం మెట్టవలస గ్రామంలో డయేరియా పంజా విరిసిరింది. ఒకేసారి 52 మందికి వ్యాధి వ్యాపించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో తోండ్రోతు వైకుంఠం, తోండ్రోతు కన్నారావు, పరశురాం, ఎడ్ల స్వాతి, శ్రావణి, లాభాన పావని, పైల సత్యవతి, చందక విమల, అప్పలరాజుల, భాగ్యలక్ష్మితోపాటు మరో 42 మంది డయేరియా బారిన పడ్డారు. వీరికి స్థానిక వైద్యాధికారి పొన్నాడ హరితశ్రీ వైద్యం అందించారు. భాగ్యలక్ష్మి అనే మహిళ పరిస్థితి విషమించడంతో రాజాం ఆస్పత్రికి తరలించారు. అధికారుల సందర్శన గ్రామంలో డయేరియా ప్రబలిందని తెలుసుకున్న జిల్లా అదనపు వైద్యాధికారి బగాది జగన్నాథరావు, డీపీఓ బి.రవికుమార్‌తో పాటు తహసీల్దార్ మందుల లావణ్య, ఎంపీడీఓ కె.శ్రీనివాసరావు గ్రామాన్ని సందర్శించారు. తాగునీరు కలుషితం కావడం వల్ల వ్యాధి ప్రబలి ఉండవచ్చని తెలిపారు. గ్రామంలో 52 మందికి డయేరియా వచ్చినా అధికారులు ఎందుకు గోప్యత పాటించారో తెలీడం లేదు. రెండురోజులుగా గ్రామంలో బాధితుల సంఖ్య పెరుగుతున్నా బయటకు సమాచారం తెలియనీయలేదు. -
ఆదరం..అతిసారం కలకలం
కేవీబీపురం మండలం ఆదరం పంచాయతీ పరిధిలోని గిరిజన, దళిత కాలనీల్లో అతిసారం విజృంభించింది. ఇప్పటికే 27 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం రాత్రి మరో ముగ్గుర్ని ఆస్పత్రికి తరలించారు. వీరంతా శ్రీకాళహస్తి, తిరుపతిలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య లోపం, తాగు నీటి కలుషితం వల్లే అతిసారం ప్రబలినట్టు డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కూడా జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. పదుల సంఖ్యలో ఆస్పత్రులపాలవడం స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. -
తినగానే ఈ సమస్యలు ఎందుకిలా?
నా వయసు 45 ఏళ్లు. భోజనం పూర్తికాగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కడుపులో మెలిపెట్టినట్లుగా నొప్పి వస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే ►జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ►దీర్ఘకాల జ్వరాలు ►మానసిక ఆందోళన ►కుంగుబాటు ►ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ►జన్యుపరమైన కారణలు ►చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు: ►పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ►ఒత్తిడిని నివారించుకోవాలి ►పొగతాగడం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ►రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. హోమియోలో చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
'డై' యేరియా!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో డయేరియా (నీళ్ల విరేచనాలు) చాపకింది నీరులా విస్తరిస్తోంది. కలుషిత నీరు, ఆహారం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏటా 3.5లక్షల మంది డయేరియా బారినపడుతుండగా... సగానికిపైగా కేసులు గ్రేటర్ పరిధిలోనే నమోదువుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 2018లో 71,918 డయేరియా కేసులు నమోదు కాగా... ఈ ఏడాది ఇప్పటి వరకు 41,441 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైనవి మాత్రమే. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య రెట్టింపు స్థాయిలోనే ఉంటుందని వైద్యవర్గాలే పేర్కొంటున్నాయి. సీజన్ వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడుఆయా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు తెలియజేయాలనే నిబంధన ఉన్నప్పటికీ... నగరంలోని ఏ ఒక్క ఆస్పత్రి కూడాదీన్ని పట్టించుకోవడం లేదు. ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాల్లో 13 శాతం డయేరియాతోనే సంభవిస్తున్నట్లు సమాచారం. డయేరియాకు అనేక రకాల సూక్ష్మక్రిములు కారణమవుతున్నప్పటికీ... రోటావైరస్ ద్వారా సోకే డయేరియా అత్యంత ప్రమాదకరమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నా రు. నీళ్ల విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి, వాం తులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరిన 40 శాతం కేసులకు ఈ రోటావైరస్నే ప్రధాన కార ణమని ఇప్పటికే వైద్యుల పరిశీలనలో తేలింది. కలుషిత ఆహారంతో... నగరంలో చాలా వరకు వాటర్ బోర్డు సరఫరా చేసే మంచినీటిపైనే ఆధారపడుతుంటారు. పాతబస్తీ సహా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి పైపులైన్ల ద్వారానే నీరు సరఫరా అవుతోంది. మంచినీటి సరఫరా లైన్ల పక్కనే డ్రైనేజీ నీరు కూడా పారుతోంది. పైపులకు లీకేజీలు ఏర్పడి చుట్టూ నీరు నిల్వ ఉండడం, డ్రైనేజీ నీరు పైపుల్లోకి చేరడం వల్ల మంచినీరు కలుషితమవుతోంది. ఈ నీరు తాగిన బస్తీవాసులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీనికి తోడు ఇంట్లో వంట చేసుకునే ఓపిక లేక చాలా మంది ఫాస్ట్‌ఫుడ్డు సెంటర్లు, హోటళ్లపై ఆధారపడుతున్నారు. కొన్ని హోటళ్లు రాత్రి మిగిలిపోయిన వంటలను ఉదయం వడ్డిస్తున్నాయి. వంటశాలలు శుభ్రంగా లేకపోవడం, ఆహారపదార్థాలపై ఈగలు, దోమలు వాలడం, చల్లారిన ఆహార పదార్థాలనే మళ్లీ వేడి చేసి వడ్డిస్తున్నారు. ఈ కలుషిత ఆహారం తినడం వల్ల కూడా డయేరియా వ్యాపిస్తోంది. తాజా ఆహారానికి బదులు నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 1200 మంది రోగులు వస్తే వారిలో 150 నుంచి 200 మంది కలుషిత ఆహార బాధితులే ఉంటున్నారు. చిన్నారులకు టీకాలు... డయేరియాను రూపుమాపేందుకు ప్రభుత్వం కొత్తగా రోటావ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 96 దేశాల్లో ఇది అమలవుతోంది. దేశంలో తొలిసారిగా జాతీయ రోగ నిరోధక టీకాల కార్యక్రమంలో దీన్ని ప్రవేశపెట్టింది. గత పది రోజుల నుంచి హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులకు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. సెప్టెంబర్ 5 నుంచి అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 6, 10, 14 వారాల శిశువులకు 2.5 ఎంఎల్ చొప్పున ఈ వ్యాక్సిన్ వేయనున్నారు. నగరంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రతి బుధ, శనివారాల్లోనూ ఈ టీకాలను వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. జాగ్రత్తలు అవసరం... కలుషిత ఆహారం, అపరిశుభ్ర నీటితో డయేరియా వస్తుంది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లోనే ఎక్కువగా వ్యాపిస్తుంది. వైరస్ కడుపులోకి చేరిన మూడు రోజుల తర్వాత ప్రతాపం చూపుతుంది. నీళ్ల విరేచనాలు, వాంతులు, జ్వరం, కడుపునొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఒంట్లోని నీరు, లవణాల శాతం తగ్గి నీరసంతో స్పృహ తప్పుతుంటారు. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. కాళ్లు, చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి భారి నుంచి కాపాడుకోవచ్చు.– డాక్టర్ రమేశ్ దంపూరి, చిన్న పిల్లల వైద్యనిపుణుడు, నిలోఫర్ -
పెరుగుతున్న అతిసార కేసులు
-
యానల్ ఫిషర్ సమస్య తగ్గుతుందా?
నా వయసు 36 ఏళ్లు. నేను గత కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట, మలంలో రక్తం కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్‌తో బాధపడుతున్నట్లు చెప్పారు. హోమియో మందులతో నాకు పూర్తిగా నయం అవుతుందా? దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఈ యానల్ ఫిషర్స్ బారిన పడే అవకాశం ఎక్కువ. ముందుగా ఫిషర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఈ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల ఇది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన తర్వాత గానీ తీవ్రమైన నొప్పిని, రక్తస్రావాన్ని కలగజేస్తుంది. కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం, తరచూ విరేచనాలు, పేగులకు ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధులు (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్), ప్రసవ సమయంలో పెద్దపేగు చివరి భాగం... పురీషనాళానికి (రెక్టమ్‌కు) రక్తప్రసరణ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా ఫిషర్స్ సమస్యను హోమియో మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. సంపూర్ణంగా చికిత్స అందించడం ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే వాటిని తగ్గించి, అవి మళ్లీ తిరగబెట్టకుండా చేయవచ్చు. మీరు అనుభవజ్ఞులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ లక్షణాలను వివరించి తగిన చికిత్స తీసుకోండి. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ గ్యాస్ట్రిక్ అల్సర్ తగ్గుతుందా? నా వయసు 34 ఏళ్లు. ఇటీవల కడుపులో మంట, వికారంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి, అల్సర్ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణశయంలో ఆల్సర్లు పెరుగుతాయి. కారణాలు: ►బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ►హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ►మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ►మద్యపానం, పొగతాగడం ►వేళకు ఆహారం తీసుకోకపోవడం ►కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. లక్షణాలు: ►కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ►ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ►తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు ►కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ►ఉండటం, ఆకలి తగ్గడం ►నోటిలో నీళ్లు ఊరడం. నివారణ జాగ్రత్తలు: ►పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ►మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి ►కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి కంటినిండా నిద్రపోవాలి ►మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి ►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. చికిత్స: గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ పొలుసుల్లా రాలుతున్నాయి..! నా వయసు 39 ఏళ్లు. ఆరు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎంతోమంది డాక్టర్లకు చూపించాను. ప్రయోజనం కనిపించడం లేదు. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. హోమియో మందులతో తగ్గుతుందా? మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్‌గా తెలుస్తోంది. ఇందులో చర్మంపై మచ్చలు లేదా బొబ్బల్లా ఏర్పడి, అవి పొలుసులుగా ఊడిపోతోంది. సోరియాసిస్ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసు వారికైనా రావచ్చు. లక్షణాలు: ►చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది. ►కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి. ►తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టూ రాలిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగా లేకపోవడంతో మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటీవలి వ్యాధి ట్రెండ్: ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. చికిత్స: ముందుగా రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సోరియాసిస్ సమస్యకు సమూలమైన చికిత్స అందించడం హోమియో ప్రక్రియలో సాధ్యమే. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
వణికిస్తున్న డయేరియా
విశాఖపట్నం, కోటవురట్ల(పాయకరావుపేట): గొట్టివాడ గ్రామాన్ని డయేరియా వణికిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన పలువురు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. గ్రామంలో 25 మంది వరకు డయేరియా బారిన పడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్థానిక సీహెచ్‌సీలో పది మంది రోగులు చికిత్స పొందుతుండగా నర్సీపట్నం, తుని, అనకాపల్లి, విశాఖలో ప్రైవేటు ఆస్పత్రుల్లో మరికొంత మంది చేరారు. రెండు రోజులుగా డయేరియా విజృంభిస్తుండగా రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. గొట్టివాడతో పాటు పక్క గ్రామాల్లో కూడా డయేరియాతో పలువురు బాధపడుతున్నారు. తాగునీరు కలుషితం కావడం వల్లే రోగుల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది. సీహెచ్‌సీలో గొట్టివాడలోని ఒకే కుటుంబానికి చెందిన సుంకర అప్పలనాయుడు, నూకరత్నం, చంద్రశేఖర్, ప్రవల్లిక చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు బాలెం గోవిందమ్మ, బండి లక్ష్మి, సమ్మంగి నూకరత్నం, రాజుపేటకు చెందిన మొల్ల నాగేశ్వరరావు చికిత్స పొందుతున్నారు. రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఆర్.ఎస్.సీతారామరాజు సీహెచ్‌సీకి వెళ్లి రోగులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని, గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి డయేరియాను అదుపులోకి తీసుకురావాలని కోరారు. -
తొండంగిలో డయేరియా!
తూర్పుగోదావరి, తొండంగి (తుని): గ్రామంలోని పలువురు విరేచనాలతో బాధపడుతూ తొండంగి పీహెచ్సీలో చేరారు. దీంతో గ్రామంలో డయేరియా జాడలున్నట్టు స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. బీసీ కాలనీ, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు విరేచనాలతో గ్రామంలోని పీహెచ్సీలో వైద్యం పొందుతున్నారు. ఒక్కసారిగా ఎక్కువమంది వీటితో బాధపడుతుండడంతో తహసీల్దార్ ఎస్.అప్పారావు, ఎంపీడీవో జీఎస్ఎన్ మూర్తి కలిసి ఆస్పత్రిలో రోగులను పరామర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై వైద్యురాలు పావనీని ఆరా తీశారు. రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సుమారు 20 మంది వరకూ ఆస్పత్రిలో చేరడంతో çగ్రామంలోని పంచాయతీ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి ట్యాంకులను, వాటర్‌ను పరిశీలించాలని పంచాయతీ అధికారులు ఆదేశించారు. తాగునీటిని క్లోరినేషన్, ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిస్థితులపై నివేదించాలన్నారు. గ్రామంలో తాగునీరు, ఆహారపదార్థాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారం చేయాలన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య లోపంతోపాటు రక్షిత మంచినీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.దీనిపై సమగ్రమైన విచారణ జరిపి, పారిశుద్ధ్యం మెరుగుపరచడంతోపాటు రక్షిత తాగునీటిని సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కేరళకు మరో ముప్పు పొంచి ఉందా?
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలం అవుతున్న కేరళకు మరో ముప్పు పొంచిఉందా? వరద తాకిడి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో అక్కడ అంటువ్యాధులు విజృంభించే అవకాశం ఉందా? అంటే వైద్య నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఉన్న మందులు నీళ్లలో కొట్టుకుపోయిన నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలితే నిలువరించడం చాలా కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కలరా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కేరళ ప్రజలు ఇప్పటికే చికున్‌గన్యా, డెంగ్యూ వాధులతో అల్లాడుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కాగా తమ రాష్ట్రానికి అత్యవసర మందుల్ని అందించి ఆదుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, ప్రైవేటు ఆసుపత్రులకు కేరళ లేఖ రాసింది. జ్వరం, డయేరియా మందులు పంపండి కేరళలోని 481 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 137 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 19 డిస్పెన్సరీల్లో మందులు నిండుకున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సదానందన్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా జ్వరం, దగ్గు, జలుబు, డయేరియా, హైపర్‌టెన్షన్ వంటి రోగాలకు అవసరమైన మందుల్ని అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రైవేటు ఆసుపత్రులకు విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం వెంటనే స్పందించింది. విజయన్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేరళకు కావాల్సిన అన్నిరకాల మందుల్ని వైమానిక మార్గం ద్వారా పంపిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోజ్ ఝలానీ తెలిపారు. అలాగే ప్రజలకు సాయం అందించేందుకు వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు కేరళ ప్రభుత్వం పిలుపు మేరకు మెడిట్రినా ఆసుపత్రి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపులకు తమ వైద్యులను, మందులతో పంపుతున్నట్లు మెడిట్రినా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈవో పీఎన్ మంజు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరదల కారణంగా మందులు దెబ్బతినడంతో వైద్యులు రోగులకు ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. దీంతో చాలా ప్రైవేటు ఆస్పత్రుల్లో భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. కొచ్చిలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఏఐఎంఎస్) ఔట్ పేషంట్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ విషయమై అమృత ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ సంజీవ్ సింగ్ మాట్లాడుతూ..‘వైద్యులు, ఇతర సిబ్బంది ఆసుపత్రికి రాలేకపోతున్నారు. మా ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్ వరదనీటితో నిండిపోయింది. ఇప్పుడు ఆసుపత్రిలో 900 మంది రోగులు చికిత్స పొందుతుండగా, వీరిలో 150 మంది ఐసీయూలో ఉన్నారు. ఆసుపత్రిలో విద్యుత్, మంచినీటి సరఫరాను కొనసాగించేందుకు మేమంతా పోరాడుతున్నాం. అదనంగా మరో 300 మందిని ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందజేస్తున్నాం. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది’ అని తెలిపారు. -
కుమరాంలో డయేరియాతో మహిళ మృతి..!
గరివిడి(చీపురుపల్లి) : గరివిడి మండలం కుమరాం గ్రామంలో మంగళవారం వేకువజామున తీవ్రమైన వాంతులు, విరేచనాలతో బీంపల్లి కనకమ్మ (43) అనే మహిళ మృతి చెందారు. డయేరియా సోకిన కారణంగానే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పినట్లు ఆమె భర్త రాముడు పేర్కొన్నారు. ప్రతీ ఇంటిలోనూ జ్వర పీడితులు.. వారం రోజులుగా గ్రామంలో జ్వరాలు తిష్ఠ వేశాయని, ప్రతీ ఇంటిలోనూ జ్వర పీడితులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అందరూ చీపురుపల్లి సీహెచ్‌సీకి, ప్రైవేటు ఆస్పత్రులకు తిరుగుతున్నారని, పట్టించుకోవాల్సిన వైద్యాధికారుల జాడ కానరావడం లేదని స్థానికులు చెబుతున్నారు. నాలుగేళ్లుగా కానరాని పారిశుద్ధ్య పనులు.. కుమరాంలో నాలుగేళ్లుగా ఒక్కసారి కూడా పారిశుద్ధ్య పనులను సంబంధిత అధికారులు చేయించ లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక సర్పంచ్ బి.రాములమ్మ వయసు పైబడడం, పైపెచ్చు అప్పట్లో దళిత రిజర్వేషన్ కావడంతో ఆమెను అధికార పార్టీ నాయకులు సర్పంచ్‌ను చేశారు. అక్కడి ఉప సర్పంచ్ జంపాన రవిరాజు పంచాయతీ వ్యవహారాలు అన్ని నడిపిస్తారని, నిధులు, కాంట్రాక్ట్ పనులు అన్ని ఆయన చూసుకుంటారని స్థానికులు చెబుతున్నారు. డబ్బులు వచ్చే పనులు అయితే చేయిస్తారు తప్ప ప్రజలకు అవసరమైన పారిశుద్ధ్య పనులు వంటివి అసలు పట్టించుకోరని, అసలు నాలుగేళ్లుగా పారిశుద్ధ్య పనులు చేయలేదంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇదేమని అడిగితే సర్పంచ్‌ను అడగమంటున్నారు.. పారిశుద్ధ్య పనులు ఎందుకు చేపట్టడం లేదని స్థానికులు ఉప సర్పంచ్‌ను అడిగితే తాను సర్పంచ్‌ను కాదని, మీరు వెళ్లి సర్పంచ్‌నే అడగాలని ఆమె మీద నెపం నెట్టివేస్తారని చెబుతున్నారు. సర్పంచ్‌కు కనీసం చదువు రాదు. పంచాయతీ పనుల్లో అనుభవం లేదు. ఇలాంటి నాయకులను ఎన్నుకుని తాము అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా ప్రజలు జ్వరాలతో అవస్థలు పడుతుంటే కనీసం ఏఎన్ఎం కూడా గ్రామానికి రాలేదని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలుగజేసుకుని తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని, లేకుంటే మరిన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఉందని స్థానికులు కోరుతున్నారు. -
డయేరియా మృతులకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలి
పిడుగురాళ్ల: డయేరియాతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ.5లక్షల నష్ట పరిహారం ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురుజాల నియోజక వర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని పిల్లలగడ్డలో గురువారం డయేరియాతో చికిత్స పొందుతూ మృతి చెందిన షేక్ మందుల మహబు(72) మృతదేహన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుమారుడు జానీబాషాను ఓదార్చారు. మహేష్ రెడ్డి మాట్లాడుతూ పిడుగురాళ్ల పట్టణంలో ప్రజలకు కనీసం తాగునీరు అందించలేని దుస్థితిలో పాలన నడుస్తోందని విమర్శించారు. తాగునీరు కలుషితమవుతున్నా స్పందించని పాలకుల తీరును ఎండగట్టారు. వారం రోజులుగా డయేరియాతో పజలు మంచానపడుతుంటే పట్టించుకున్న నాథుడే లేడని విమర్శించారు. ఇటు వంటి మరణాలను ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలన్నారు. ఇటీవల డయేరియాతో బాధపడుతూ మృతి చెందిన షేక్. మస్తాన్‌బీ కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, మైనార్టీ నాయకులు షేక్ సైదావలి, జానీబాబు, గనీ, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
బ్యాక్టీరియా వల్లే డయేరియా
మిరియాల (కారంపూడి): మండలంలోని మిరియాల గ్రామంలో ప్రబలిన డయేరియాకు నీటిలో ఉన్న బ్యాక్టీరియానే ప్రధాన కారణమని గుంటూరులోని రీజినల్ ల్యాబ్æ నుంచి శుక్రవారం రిపోర్టులు వచ్చాయి. దీంతో డీటీసీవో డాక్టర్ రమేష్ శుక్రవారం గ్రామంలో పర్యటించారు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు, డాక్టర్లు ఎస్. ప్రియాంక, సిబ్బందితో గ్రామంలో ఆయన సమావేశమయ్యారు. బోర్లు, రక్షిత నీటి ట్యాంకుల నీటిలో బ్యాక్టీరియా ఉందని రిపోర్టు వచ్చిందని, నివారణ చర్యలపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. డ్రెయినేజీలో ఉన్న నీటి పైపులను మార్చాలని, శిథిలమైన పైపుల స్థానంలో కొత్తవి వేయాలని, ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలని, శానిటేషన్‌ను ఇంకా మెరుగుపర్చాలని, తర్వాత గ్రామస్తులకు హెల్త్ ఎడ్యుకేషన్‌పై పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. ఇప్పటికే ట్యాంకులు శుభ్రం చేయించామని, గ్రామంలో ఉన్న బోర్లను ఫ్లషింగ్ చేయిస్తున్నామని, పైపులు కొత్తవి రాగానే మెయిన్ లైన్ మొత్తం మారుస్తామని ఆర్డబ్ల్యూఎస్ డీఈ వెంకటేశ్వర్లు వివరించారు. డ్రెయినేజిలో ఉన్న పైపులను తీసివేసి పాత పైపుల స్థానంలో కొత్తవి వేయడానికి నాలుగైదు రోజులు పడుతుందన్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిని కూడా క్లోరినేషన్ చేయాలని, ముఖ్యంగా ఇళ్లలో ఉన్న బోరు నీటిని కాచి చల్లార్చిన తర్వాతనే తాగాలని సూచించారు. అలా చేయక పోవడం వల్లే కొత్త కేసులు వస్తున్నాయని అధికారులు చెప్పారు. పరిశుభ్రతపై గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించాలని వైద్య అధికారులకు డాక్టర్ రమేష్ సూచించారు. ఈ పనులన్నీ పూర్తి చేసి వ్యాధిని పూర్తిగా అదుపులోకి తీసుకురావాలని ఆయన కోరారు. మరో మూడు కేసులు నమోదు.. గ్రామంలో శుక్రవారం మరో మూడు డయేరియా కేసులు నమోదయ్యాయని వైద్య శిబిరం నిర్వహిస్తున్న డాక్టర్ ప్రియాంక తెలిపారు. వారి పరిస్థితి అదుపులోనే ఉందని, గ్రామంలోనే చికిత్స అందిస్తున్నామన్నారు. గ్రామంలో చికిత్స పొందుతున్న వారు చాలా వరకు కోలుకున్నారని తెలిపారు. ఇదిలా ఉంటే నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దారెడ్డి కరుణాకరరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆయనకు కిడ్నీ వ్యాధి కూడా ఉండడంతో డయాలసిస్ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. అలాగే మరో రోగి బత్తుల పున్నయ్యకు కూడా కిడ్నీ సమస్య ఉండడంతో నరసరావుపేట మహాత్మాగాం«ధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారి ఆరోగ్యం మెరుగవుతోందని డాక్టర్లు తెలిపారు. కొనసాగుతున్న నివారణ చర్యలు గ్రామంలో శుక్రవారం నాటికి మూడు ఓవర్ హెడ్ ట్యాంకు క్లీనింగ్ పనులు పూర్తయ్యాయని ఏఈ రత్నబాబు తెలిపారు.మూడు బోర్లు ప్లషింగ్ చేశామని మరో నాలుగు చేయాల్సి ఉందని, కొత్త పైపులైన్ వేయడానికి పైపులకు ఆర్డర్ ఇచ్చామని ఐదు రోజుల్లో పనులు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కొనసాగుతోందని, బోర్లు, బావుల్లో నీటిని ఎవరు తాగవద్దని సూచించారు. -
35కు పెరిగిన డయేరియా బాధితులు
కారంపూడి: మండలంలోని మిరియాల గ్రామంలో డయేరియా బాధితుల సంఖ్య 35కు పెరిగింది. ఆదివారం వరకు 18 మంది వ్యాధి బారిన పడి వాంతులు విరోచనాలతో మంచం పట్టి చికిత్సపొందుతుండగా, సోమవారం నాటికి కొత్తగా మరో 17 కేసులు నమోదయ్యాయి. వారిలో ఏడుగురికి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. వీరిలో అలవాల సంధ్యారాణి, కెంటిల్లి సత్యవాణి, ఎం.లక్ష్మిలకు గ్రామంలోనే కారంపూడి పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. నరసారావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతున్న మేకల అఖిల్, కొండా చలమయ్యల పరిస్ధితి మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. బత్తుల అరుణ, శ్రీలక్ష్మికి ఇంకా వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. పరిస్థితి అదుపులోనే ఉందని డాక్టర్ లక్ష్మీశ్రావణి తెలిపారు. ఇదిలా ఉంటే ఒక వీధికే పరిమితమైన వ్యాధి ప్రస్తుతం గ్రామం మొత్తం విస్తరించింది. అడిషనల్ డీఎంహెచ్ఓ రెడ్డి శ్యామల సోమవారం గ్రామంలోని వైద్య సేవలను పరిశీలించారు. డ్రైనేజిలో ఉన్న మంచి నీటి పైపు లైన్ లీకు కావడం వల్లే వ్యాధి ప్రబలిందని, ముందుగా డ్రైనేజిలో ఉన్న పైపులను తీసి వేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు. గురజాల ఆర్డీవో మురళి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తహసీల్దార్ సాయిప్రసాద్, ఎంపీడీవో హీరాలాల్ ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ అధికారులు గ్రామాన్ని సందర్శించి తగిన తక్షణ చర్యలు చేపడుతున్నారు. జిల్లా అంటువ్యాధుల నివారణ శాఖ అధికారులు కూడా సోమవారం గ్రామంలో పర్యటించి నీటి శాంపిల్స్ సేకరించారు. -
34 గ్రామాల నీటిలో బ్యాక్టీరియా
సాక్షి, అమరావతి బ్యూరో: నగరంలో డయేరియా వ్యాధికి గురై 30 మందికిపై మృత్యువాత పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తహసీల్దార్, ఎంపీడీవో, పంచాయతీ విస్తరణాధికారులతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు ఏర్పడ్డారు. ఏప్రిల్ 10, 11, 12 తేదీలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 3124 శాంపిల్స్ సేకరించారు. హైడ్రోజన్ సల్ఫైడ్ వైల్ ద్వారా నీటి నమూనాలను పరిక్షించారు. అందులో 34 శాంపిల్స్ సురక్షితం కాదని గుర్తించారు. ఈ నీటిలో బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం నీటిని సూపర్ క్లోరినేషన్ చేశారు. పెదకూరపాడు, వినుకొండ, వెల్దుర్తి, మాచవరం, కారంపూడి మండలాలలో ఈ సమస్య ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 177 గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతుందని, రూ.10.23 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. నీటి సమస్య రానివ్వం గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాం. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. కొన్ని గ్రామాల్లో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ట్యాంకర్ల సంఖ్యను పెంచుతున్నాం. పైపులైన్లకు మరమ్మతులు చేపడుతున్నాం.– భాను వీరప్రసాద్, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్, గుంటూరు -
పైడూరుపాడులో డయేరియా
విజయవాడ రూరల్(మైలవరం): విజయవాడ మండలంలోని పైడూరుపాడులో శుక్రవారం డయేరియా విజృంభించింది. 24 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరిని విజయవాడ వైద్యశాలకు తరలించారు. వివరాలు.. తాగునీటిని సరఫరా చేసే పైపులైన్ లీక్ కావడంతో కలుషిత నీటిని తాగడంతో గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. తొలుత ఒకరికి విరోచనాలు కావడంతో డయేరియాగా గుర్తించారు. దీంతో ఇళ్లల్లో తాగునీటిని తాగడం నిలిపివేశారు. అనారోగ్యానికి గురైన వారిలో బోయినపల్లి వెంకటేశ్వరావు, వేముల నారాయణ, వేముల శ్రీన్‌సూర్య, పగడాల నారాయణ, çమామిళ్ళ పల్లిసుభద్ర, శైలజ, రావు రంగమ్మ, రమాదేవి, మాధవి, బోయినపల్లి పార్వతి, వేముల లక్ష్మీకుమారి, వేములరాణి, మరో 12 మంది ఉన్నారు. అందులో బోయనపల్లి పద్మావతి(58)ని విజయవాడ వైద్యశాలకు తరలించారు. వైద్యశిబిరం.. డయేరియా కేసులు నమోదు కావడంతో కొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్యశిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ పద్మావతి వైద్యసేవలందించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు బాధితులకు పంపిణీ చేశారు. నమూనాలను సేకరిస్తున్నట్లు వైద్యురాలు తెలిపారు. పైపులైన్ లీకులతో అవస్థలు.. మైలవరం ప్రాజెక్టు నుంచి పైడూరుపాడు గ్రామానికి తాగునీరు సరఫరా చేస్తున్నారు. కృష్ణానది నీరు మైలవరం వచ్చి అక్కడ నుంచి పైపులైను ద్వారా గ్రామంలోని ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను నింపుతారు. కుళాయిల ద్వారా తాగునీటిని పంచాయతీ సరఫరా చేస్తోంది. సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన పైపు లైనుపై భాగంలోడ్రెయినేజీ కాల్వ ఉండటంతో తాగునీటి పైపులైను లీక్ కావడంతో వాటిని తాగిన పడమర బజారుల్లోని ప్రజలు డయేరియా బారిన పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామాన్ని తహసీల్దార్ రవీంద్ర, ఎంపీడీఓ కె.అనూరాధ, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ గోపాలకృష్ణ, గ్రామసర్పంచి కోటేశ్వరమ్మ, ఎంపీటీసీ సభ్యుడు సీతారామయ్య ,మాజీ సర్పంచి రంగినేనినరేంద్ర, ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మంత్రి దేవినేని ఉమా ఆరా డయేరియా ప్రభావంతో 24 మంది అస్వçస్థతకు గురైన సమాచారం అందిన వెంటనే రాష్ట్ర జలవనరులశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అధికారులను గ్రామానికి పంపారు. మెరుగైన వైద్యసదుపాయలు అందించాలని అధికారులను ఆదేశించారు. డయేరియా విషయంపై ఆర్డబ్ల్యూ ఎస్ డీఈ సామిని ‘సాక్షి’ వివరణ కోరగా తాగునీటిని పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. వచ్చిన తరువాత నీటి వలన వచ్చిందా లేదా అనే విషయం తెలుస్తోందన్నారు. డయేరియా అదుపులోనే ఉంది గ్రామంలో కలుషిత నీరు తాగడంవలన విరేచనాలు అయ్యాయి. పడమర బజారులోని 24 మంది అస్వస్ధతకు గురయ్యారు. వైద్యాధికారులు గ్రామంలో 552 గృహాలను పరిశీలించారు.– రవీంద్ర, తహసీల్దార్ -
అదుపులోకి రాని డయేరియా
బలిజిపేట:మండలంలోని పెదపెంకిలో డయేరియా వ్యాధి అదుపులోకి రాకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వైద్యసేవలు అందకపోవడంతో బాధితులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడం వల్లే డయేరియా ప్రబలిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో గ్రామానికి చెందిన 50 మంది డయేరియా భారిన పడ్డారు. ప్రస్తుతం ఐదు సంవత్సరాల చిన్నారి రామ్శెట్టి లక్ష్మణ్, పచ్చిపులుసు మోహనరావు, తదితరులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ బలిజిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే చీకటి రమణమ్మతో పాటు మరో ఇద్దరు ప్రైవేట్ హాస్పటల్లో వైద్యం పొంది ఇళ్లకు చేరుకున్నారు. ఆర్. లక్ష్మి అనే మహిళకు వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టకపోవడంతో విజయనగరంలోని ఆస్పత్రికి.. కె.అశ్విని అనే చిన్నారిని బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. వీరే కాకుండా కవ్వాడ మమత, సింగారపు శివ గ్రామంలోనే చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఇంతమంది డయేరియా భారిన పడడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. క్షీణించిన పారిశుద్ధ్యం గ్రామంలో ఏ వీధిలో చూసినా కాలువల్లో మురుగు పేరుకుపోవడంతో పాటు ఎక్కడబడితే అక్కడే చెత్త,చెదారాలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈగలు, దోమలు వృద్ధి చెంది అంటురోగాలు ప్రబలుతున్నాయి. వీధి కుళాయిలు కూడా కాలువల పక్కనే ఉండడంతో తాగునీరు కలుషితమవుతోందని గ్రామస్తులు వాపోతున్నారు. కానరాని వైద్యసేవలు గ్రామంలో డయేరియా ప్రబలినా వైద్యసిబ్బంది ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కొత్తపల్లెలో అతిసార కలకలం!
గిద్దలూరు:నగర పంచాయతీలోని కొత్తపల్లె గ్రామంలో రోజురోజుకూ అతిసార విజృంభిస్తూ కలకలం రేపుతోంది. బుధవారం 45 మందికి పైగా అతిసార సోకడంతో వైద్యశాలకు పరుగులు తీశారు. అందిన వివరాల మేరకు సోమవారం గ్రామంలో జరిగిన శ్రీరామనవమి సందర్భంగా భక్తులు అందరూ వారి గృహాల్లోనే బెల్లం పానకం తయారు చేసుకున్నారు. ఆ పానకంను ఆలయం వద్ద ఏర్పాటు చేసిన డ్రమ్ముల్లో కలిపి అందరూ కలిసి పూజలు చేసిన అనంతరం ప్రజలకు పంచిపెట్టారు. అదే రోజు సాయంత్రం ఒకరిద్దరికి వాంతులు, విరేచనాలు కావడంతో పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్సలు చేయించుకుని వెళ్లారు. మంగళవారం ఒక్కొక్కరికి పెరుగుతూ ఎనిమిది మందికి చేరింది. ఇలా మూడోరోజు అతిసార బాధితులు 45 మందికి చేరారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు, నంద్యాలల్లోని వైద్యశాలలకు తరలించారు. వీరిలో బలగాని కేశమ్మను కర్నూలు, చంద్రకళ, త్రివేణి, మరో బాలుడిని నంద్యాలకు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. గిద్దలూరు వైద్యశాలలో మరో 10 మంది.. అతిసార వ్యాధితో ప్రజలకు వాంతులు, విరేచనాలు ఎక్కువయ్యాయి. మండలంలోని క్రిష్ణంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులు రెండు రోజులుగా వైద్యశిబిరం ఏర్పాటు చేసినా ప్రయోజనం కనిపించకపోవడంతో కొందరిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 30 మందికి పైగా స్థానికంగానే చికిత్సలు పొంది కాస్త ఉపశమనం కనిపించడంతో ఉండిపోయారు. పట్టణంలోని పలు ప్రైవేటు వైద్యశాలల్లో మరికొందరు చికిత్సలు పొందుతున్నారు. అతిసార సోకిన వారిలో పోతల శ్రీనివాసులు, బలగాని చైతన్య, సునీత, కమతం రమేష్, పాలుగుళ్ల రామనారాయణరెడ్డి, కుక్కా లింగమ్మ, బోగాని స్వప్న, మారుడి సాయిచరణ్‌రెడ్డి, పి.సావిత్రి, గోలం లక్ష్మీదేవి, తాటిచర్ల అంకమ్మలు మూడో రోజు అస్వస్థతకు గురికాగా, మంగళవారం నుంచి జానా క్రిష్టఫర్, చక్కా కోటయ్య, అండ్రా ఆనందరావు, కాతా దీపిక, జానా మౌనిక, బందెల స్వేత, బి.చిన్నసుబ్బయ్యలు వైద్యం పొందుతున్నారు. కలుషిత నీటి వలనే అతిసార... గ్రామానికి తాగునీటి అవసరాలు తీర్చేందుకు సమీపంలో ఉన్న కుంటలో బోరు తవ్వించి పైపుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామం ఎత్తు పల్లాలుగా ఉండటం వల్ల వీధులన్నింటికీ నీరు ఎక్కాలన్న ఉద్దేశ్యంతో వాల్వ్‌లు ఏర్పాటు చేశారు. వాల్వ్‌ల ద్వారా లీకైన నీరు పక్కనే గుంతగా ఏర్పడి మురుగు తయారైంది. విద్యుత్ సరఫరా లేని సమయంలో మోటారు పనిచేయనప్పుడు వాల్వ్ పక్కనే ఉన్న మురుగునీరంతా పైపుల్లో చేరి తిరిగి నీరు వదిలినప్పుడు కుళాయిలకు చేరుతోంది. ఆ నీటిని పానకంలో కలపడం, పానకం తీయగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ కారకాలు పెరిగి అతిసార కలిగించాయని గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామాన్ని సందర్శించిన ఆర్డీఓ పంచల కిషోర్, నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమూర్తి, తహశీల్దారు పి.కాదర్వలిలు వాల్వ్‌లను పూడ్పించి పైపులు అమర్చారు. బ్లీచింగ్, సున్నం చల్లించి శుభ్రం చేశారు. క్రిష్ణంశెట్టిపల్లె, రాజుపాలెం పీహెచ్సీ వైద్యాధికారులు ఎం.రమీజాభాను, కే.శ్రీలక్షీ, పీపీ యూనిట్ వైద్యులు సాయిప్రశాంతి, వైద్య, ఆరోగ్య సిబ్బంది గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. రోగులకు నాయకుల పరామర్శనగర పంచాయతీలోని కొత్తపల్లెలో అతిసార వ్యాధితో బాధపడుతూ చికిత్సలు పొందుతున్న రోగులను వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయికల్పనారెడ్డిలు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మెరుగైన వైద్యం కోసం తమ సహాయసహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సలు పొందుతున్న వారిని పరామర్శించారు. అక్కడి వైద్యాధికారి డాక్టర్ సూరిబాబుతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు టీడీపీ నాయకులు రోగులను పరామర్శించారు. డాక్టర్ బి.వి.రంగారావు, కమిషనర్ కృష్ణమూర్తి, తహశీల్దారు కాదర్‌వలి, శానిటరీ ఇన్స్పెక్టర్ వీరబ్రహ్మం, వీఆర్వో శ్రీనివాసరెడ్డిలు గ్రామంలో పర్యటించారు. -
ఇంకా వీడని భయం
గుంటూరు మెడికల్: నగర ప్రజలు డయేరియా పేరు చెబితే వణికిపోతున్నారు. రోజుకో కొత్త కేసు నమోదవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం నాటికి డయేరియా మహమ్మారి విజృంభించి 20 రోజులు గడిచింది. ఇదే రోజు మరో 13 మంది వైద్య చికిత్స కోసం జీజీహెచ్‌లో చేరడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ నెల 3న 21మంది బాధితులు జీజీహెచ్‌లో చేరగా.. 5వ తేదీ నుంచి మరణాలు సంభవించండం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రోజుకో కేసు.. ఈ 20 రోజుల్లో డయేరియాతో 20 మంది మృతిచెందగా.. 2వేల మంది బాధితులు చికిత్స పొందారు. శుక్రవారం నాటికి గుంటూరు జీజీహెచ్‌లో మొత్తం 40 మందికి వివిధ వార్డుల్లో వైద్య సేవలు అందుతున్నాయి. డయేరియా కేసులు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆనందపేట, బారాఇమాంపంజా ప్రాంతాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో.. డయేరియా వల్ల కిడ్నీ సమస్య తలెత్తి గుంటూరు రమేష్ హాస్పిటల్లో మొత్తం 25 మంది చేరగా.. ప్రస్తుతం 12 మంది ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. ఈ నెల 15న ఈ ఆస్పత్రిలో ప్రభుత్వ ఖర్చుతో చికిత్స పొందుతున్న సింగంపల్లి నూకరాజు, టి.గంగా భవానీలను జీజీహెచ్ వైద్యులు అత్యుత్సాహంతో జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఇద్దరూ చనిపోవడంతో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున జీజీహెచ్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ మరణాలు జీజీహెచ్‌కు పెద్ద మచ్చగా మిగిలాయి. భయం.. భయం.. ఈ నెల 3న గుంటూరు తూర్పులో కేవలం మూడు ప్రాంతాల్లో ప్రారంభమైన డయేరియా కేసులు.. నేడు నగరం అంతా వ్యాపించాయి. కార్పొరేష్ కుళాయి నీరు, మినరల్ వాటర్ ప్లాంట్స్ నీరు సైతం కలుషితం అయినట్లు అధికారులు నిర్ధారించారు. ఫలితంగా మినరల్ వాటర్ తాగాలన్నా ప్రజలు జంకుతున్నారు. నగరంలోని పాతగుంటూరు, ఆనందపేట, పొన్నూరు రోడ్డు, సంగడిగుంట, బారాఇమాంపంజా, చంద్రబాబునాయుడు కాలనీ, గాంధీనగర్, బాలాజీనగర్, ఇందిరప్రియదర్శిని కాలనీ, గుంటూరువారితోట, రాజాగారితోట, చౌత్రాసెంటర్, నల్లచెరువు, పొత్తూరివారితోట, హుస్సేన్ నగర్, మంగళదాస్‌నగర్, శారదాకాలనీ, బుచ్చయ్యతోట, లాలాపేట, విద్యానగర్, గుజ్జనగుండ్ల, పట్టాభిపురం, సంపత్‌నగర్, అలీనగర్, కంకరగుంట ప్రాంతాల్లో ఎక్కవ మంది డయేరియా బారిన పడ్డారు. ఆరు రోజులుగావాంతులు, విరేచనాలు.. వసంతరాయపురం 1వ లైనుకు చెందిన తమ్మినేని మహేష్ ఆరు రోజులుగా వాంతులు, విరోచనాలతో బాధపడుతూ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్సపొందుతున్నారు. వ్యాధి అదుపులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ కాలనీ సాయిబాబా గుడి ప్రాంతానికి ఆదిపూడి సలోమి రెండు రోజులుగా డయేరియాతో బాధపడుతున్నారు. గుంటూరు ప్రాంతానికి చెందిన 23 మంది, జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన 16 మంది జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. -
‘డై’యేరియాకు అడ్డుకట్ట
నగరంపాలెం: నగర ప్రజలకు సౌకర్యాల కల్పనలో ఒత్తిడిలకు లోనుకాకుండా కచ్చితంగా వ్యవహరించి అభివృద్ధి పనుల్ని ముందుకు తీసుకువెళతానని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ బాలాజీరావ్ లఠ్కర్ తెలిపారు. గురువారం బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నగర ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకునేలా వచ్చే ఒత్తిడుల్ని సహించేది లేదన్నారు. భవిష్యత్‌లో డయేరియా పునరావృత్తం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తూర్పు నియోజకవర్గంలో డయేరియా ప్రబలడానికి శిథిలమైన పాత పైపులైన్లుతో పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సైడు కాల్వల్లో మురుగునీరు సక్రమంగా ప్రవహించక పోవడం, కాల్వల్లో నుంచి మంచినీటి కుళాయిలు ఉండటం తదితర కారణాలుగా పేర్కొన్నారు. పట్టణ ప్రజలు కూడా పరిశుభ్రతను పాటిస్తూ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఇప్పటికే నగరంలో డయేరియా కేసులూ పూర్తిస్థాయిలో తగ్గాయని, అయినా ముందస్తుగా మెడికల్ క్యాంపులు, సంచార వాహనాల ద్వారా వైద్యసేవలు కొనసాగిస్తున్నామని తెలిపారు. బాధిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య స్పషల్ డ్రైవ్ బాధిత ప్రాంతాల్లోని అన్ని డివిజన్లలో ఇతర మున్సిపాల్టీల నుంచి కమిషనర్లను, సిబ్బందిని నియమించి ఐదు రోజులుగా పారిశుద్ధ్యం డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పైపులు, సైడు కాల్వల్లో పూర్తిస్థాయిలో పూడిక తీసి మురుగునీరు సక్రమంగా ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆనందపేట, బారాఇమాంమ్ పంజా, ముఫ్తీ స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో శిథిలమైన పాత పైపుల స్థానంలో మొదటి విడతగా 23 కి.మీ పైపులైన్లను పది రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మిగతా ప్రాంతాల్లో 45రోజుల్లో మరో 80 నుంచి 90 కి.మీ పైపులైన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. నగరంలోని అన్ని డివిజన్లలో మురుగునీటి కాల్వల నుంచి వెళుతున్న మంచినీటి పైపులైన్లును పక్కకు మార్చుతున్నామని చెప్పారు. నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న హెడ్ వాటర్‌వర్క్స్‌తో పాటు అన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు మంచినీటికి క్లోరిన్, బాక్టీరియా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతాలైన ఆనందపేట, బారాఇమాంమ్ పంజాలోని కొన్ని ప్రాంతాల్లోనే మార్చి 5,6 తేదీల్లో ఈకోలీ బ్యాక్టీరియా ఉన్నట్లు తెలిందన్నారు. ప్రస్తుతం బాధిత ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పరీక్షలలో బాక్టీరియాపై పాజిటివ్ రిపోర్ట్సు రాలేదని తెలిపారు. నగరాభివృద్ధికి కృషి నవ్యాంధ్ర రాజధానిలో భాగమైన నగరాభివృద్ధికి నిధులు మంజూరులో ముఖ్యమంత్రి చం ద్రబాబునాయుడు, పురపాలకశాఖ మంత్రి పి. నారాయణ సానుకూలంగా ఉన్నారన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగేలా రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో సమగ్ర మంచినీటి పథకం పనుల్ని నెలరోజుల్లో పూర్తి చేసి, ప్రస్తుతం నగరానికి వస్తు న్న 90 ఎంఎల్డీ నీటితో పాటు అదనంగా మరో 45 ఎంఎల్డీ నీటిని తీసుకురానున్నామని తెలిపారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న యూజీడీ పనులపై పూర్తిస్థాయిలో మానిటరింగ్ చేసి నాణ్యతలోపాలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నగరంలో 900 కి.మీ పొడవు ఉన్న రహదారుల్లో యూజీడీ వల్ల 400 కి.మీ వరకు తవ్వడం వల్ల దుమ్మూ, ధూళీ వ్యాపించిందన్నా రు. ప్రధాన రహదారుల్లో యూజీడీ పనుల్ని వేగవంతంగా పూర్తిచేసి పునరుద్ధరణ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవినీతి, ఆక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని లఠ్కర్ హెచ్చరించారు. కమిషనర్‌కు అభినందనలు నూతన కమిషనర్ శ్రీకేష్ లఠ్కర్‌ను తూర్పునియోజకవర్గం ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, అదనపు కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, డీసీలు ఏసుదాసు, శ్రీనివాసులు, సెక్రటరీ వసంతలక్ష్మి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలి పారు. సిటీ ప్లానర్ చక్రపాణి, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ చిన్నపరెడ్డి, మేనేజరు వెంకటరామయ్య, మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు పి. నమ్రత్ కుమార్, మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జాన్‌బాబు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్యశాఖ అధికారులు కలసి అభినందనలు తెలిపారు. -
ఎస్కే పాలెంలో డయేరియా!
పెరిశేపల్లి (పామర్రు) : మండల పరిధిలోని పెరిశేపల్లి గ్రామ శివారు ప్రాంతమైన సబ్ధర్‌ఖాన్ పాలెంలో మూడు రోజులుగా డయేరియా వ్యాధి లక్షణాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆదివారం రాత్రి గ్రామానికి దగ్గరలో జుఝవరం ఎస్సీ కాలనీలో ఉంటున్న నిల్వ కూలీలు ఎస్కే పాలెంలోని బావి నీరు తాగటం కారణంగా ముగ్గురికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లారు. అలాగే, సోమవారం ఎస్కే పాలెంలోని ప్రజలు అదే బావి నీటిని తాగడంతో కొందరు అనారోగ్యానికి గురయ్యారు. గ్రామానికి చెందిన జె దినేష్, జె సౌజన్య, కె కళ్యాణి, వీ ఉషారాణి, కె రామ్‌చరణ్‌లకు వాంతులు, విరేచనాలు కావడంతో పామర్రులో ఓ ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. అక్కడి ఫీజులకు భయపడి స్థానికంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు గ్రామ ప్రముఖుడు వీరిని తరలించారు. వీరిలో ఉషారాణిని మెరుగైన వైద్యం కోసం గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బుధవారం వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి మొర్ల సరస్వతి, సిరిపురపు సత్యనారాయణ, మొర్ల పైడమ్మలతో పాటు మరో ముగ్గురికి విరేచనాలు అవ్వడం గుర్తించి వారిని కూడా పామర్రులో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అందరూ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో జె దినేష్ అనే చిన్నారిని మంగళవారం వైద్యశాలలో చేర్పించి సాయంత్రం తగ్గిపోయిందని ఇంటికి పంపించారు. అయితే, బుధవారం ఉదయం మరలా విరేచనాలు అవ్వడంతో తిరిగి వైద్యశాలకు తరలించారు. కాగా, పామర్రులోని మరో ప్రయివేటు వైద్యశాలలో కొందరు బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కప్పి పుచ్చిన స్థానిక నేతలు మూడు రోజులుగా గ్రామస్తులు డయేరియాతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని బయటకు పొక్కనీయకుండా అధికార పార్టీ నేతలు కప్పిపుచ్చారు. ఏఎన్ఎంలు, ఆశాల ద్వారా మందు బిళ్లలను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయిస్తున్నారు. కలుషిత తాగునీటి విషయాన్ని ఫుడ్ పాయిజన్‌గా ప్రచారం చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయితే ఓ ఇంటికే పరిమితం అవుతుంది. కానీ, ఇక్కడ గ్రామంలో చాలామంది అనారోగ్యానికి గురయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నారా లోకేష్ దత్తత గ్రామంలో కూడా.. వారం రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ దత్తత గ్రామమైన నిమ్మకూరులోని ఓ రైతు శ్రీకాకుళం నుంచి నిల్వ కూలీలను తీసుకువచ్చారు. వీరిలో కొందరు గ్రామంలో నిర్వహించిన ఓ వివాహ వేడుకలలో వాడుకోగా మిగిలిన ఆహారాన్ని నిల్వ ఉంచి తిన్న కారణంగా ఫుడ్ పాయిజనింగ్‌కు గురై అనారోగ్యం పాలయ్యారు. హుటాహుటిన ఆ రైతు కూలీలను మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. వారిని అక్కడి నుంచి నిమ్మకూరు రాకుండా శ్రీకాకుళం పంపించి వేసి విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారని సమాచారం. నీటి శాంపుల్స్ సేకరణ తాగునీటికి వినియోగించే బావి నీటిని సేకరించి పరీక్షల నిమిత్తం పంపించామని వైద్యురాలు ఆర్ఎన్ జ్యోత్న్స తెలిపారు. రిపోర్టులు వస్తే కాని ఏ విషయమూ నిర్ధారించలేమన్నారు. నిమ్మకూరు పీహెచ్సీ వైద్యురాలు పద్మజ, పీçహెచ్ఎన్ ఇందిరాకుమారి, ఏఎన్ఎం ధనలక్ష్మి గ్రామంలో వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామంలో తహసీల్దార్ పర్యటన పెరిశేపల్లి (పామర్రు) : గ్రామ శివారు ప్రాంతమైన ఎస్కే పాలెంలో బుధవారం తహసీల్దార్ ఎం. పద్మకుమారి పర్యటించారు. గ్రామంలో వైద్య సిబ్బందితోపాటు ఇంటింటికి తిరిగి అక్కడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో వ్యవసాయ పనుల నిమిత్తం పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి అనారోగ్యం రావడంతో పామర్రు పీహెచ్సీలో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇదే పరిస్థితి ఎస్కే పాలెంలోని మరి కొందరికి ఏర్పడిందని, వారికి కూడా వైద్య సేవలు అందుతున్నాయని, పరిస్థితి అదుపులో ఉన్నదని తెలిపారు. ఎవరికి ప్రాణహాని లేదని పేర్కొన్నారు. గ్రామంలోని నూతి నీటిని పరీక్షలకు పంపగా ఏమీ లేదని రిపోర్టు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
వణుకుతున్న గుంటూరు ప్రజలు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో డయేరియాతో చికిత్స పొందుతున్న ఆలీనగర్ మూడవ లైన్ ప్రియంక గార్డెన్ ప్రాంతానికి చెందిన షేక్ ఇస్మాయేల్(52) సోమవారం మృతి చెందాడు. దీంతో డయేరియా మరణాలు 20కి చేరకున్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. జీజీహెచ్ అధికారులు అధికారికంగా ఎనిమిది డయేరియా మరణాలుగా, మరో ఎనిమిది అనుమానిత మరణాలుగా తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం మరణాలు 24 ఉన్నాయి. గుంటూరు రమేష్ హాస్పటల్లో బాధితులు 13 మంది సోమవారం నాటికి చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండి వెంటిలేటర్‌పై ఉన్నారు. కిడ్నీ సమస్య తలెత్తి ఒకరు డయాలసిస్ చేయించుకుంటున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో 40 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. డయేరియా పేరు చెబితే హడల్ గుంటూరు తూర్పులో ఈనెల 3న మూడు ప్రాంతాల్లో ప్రారంభమైన డయేరియా నేడు నగరం అంతా విస్తరించటంతో ప్రజలు హడలిపోతున్నారు. కార్పొరేషన్ కుళాయి నీరు, మినరల్ వాటర్ ప్లాంట్స్ నీరు సైతం కలుషితం అయినట్లు నిర్ధారణ జరిగింది. దీంతో మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చుకున్న నీరు సైతం తాగాలన్నా భయపడిపోతున్నారు. అదుపులోకి రాని వాంతులు, విరోచనాలు రెండు వారాలు దాటినా డయేరియా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ఆనంద్‌పేట మూడోలైన్‌కు చెందిన షేక్ అల్లాబక్షు రెండు రోజులుగా వాంతులు, విరోచనాలతో బాధపడుతూ సోమవారం చికిత్స కోసం జీజీహెచ్‌కు వచ్చాడు. వారం రోజుల కిందట అల్లుడు ఇర్ఫాన్ కూడా డయేరియా బారిన పడి చికిత్స పొందినట్లు ఆయన తెలిపారు. వట్టిచెరుకూరు మండలం అనంతరవరప్పాడు గ్రామానికి చెందిన ముదిగంట పార్వతి, వినుకొండకు చెందిన యోహాను, బారాఇమామ్పంజా సెంటర్‌కు చెందిన ఇబ్సమ్, పాత గుంటూరుకు చెందిన పొట్లూరి నాగరాజుతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 15 మంది సోమవారం డయేరియాతో బాధపడుతూ జీజీహెచ్‌లో చేరారు. -
డయేరియా మరణాలపై రాజకీయమా?
ఆమె ఏడు నెలల గర్భిణి.. కడపులో బిడ్డ కాళ్లతో తన్నుతున్నాడంటూ భర్తకు చెప్పి మురిసిపోయేది.. ఇప్పటికే బాబు ఉన్నందున పాప పుట్టాలని ఆ దంపతులు ఇద్దరూ కలలుకనేవారు. ఆ కలలను డయేరియా మహమ్మారి కల్లలు చేస్తూ భర్త ప్రాణాలను బలితీసుకుంది. ఆ గర్భిణికి తీరని కష్టాన్ని మిగిల్చింది. తండ్రి చనిపోయిన విషయం తెలియని మూడేళ్ల కుమారుడు అమ్మా.. నాన్న ఎప్పుడు నిద్రలేస్తాడంటూ వచ్చీ్చరాని మాట లతో పదే పదే ప్రశ్నిస్తుంటే ఏమని సమాధానం చెప్పాలో తెలియక గుండెలుఅవిసేలా రోదిస్తోంది. గుంటూరు ఈస్ట్: నగరంలోని ఆర్‌అగ్రహారం నిమ్మలపేటకు చెందిన పల్లపు రత్తయ్య (38) తోపుడు బండ్లపై పండ్లు అమ్ముకుని జీవనం సాగిస్తుంటాడు. రత్తయ్య గురువారం వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతిచెందాడు. రత్తయ్య భార్య లక్ష్మి ఏడు నెలల గర్భిణి. ఆ దంపతులకు మూడేళ్ల కుమారుడు బాలాజీ ఉన్నాడు. రత్తయ్యకు సరైన వైద్యం చేయని కారణంగానే మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. డయేరియాకు గురడవానికి ముందు వరకు రత్తయ్య ఆరోగ్యంగా ఉన్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. పండ్లు విక్రయించి వచ్చే రోజువారీ సంపాదనతోనే కుటుంబాన్నిపోషించే రత్తయ్య మృతితో భార్య లక్ష్మి భవిష్యత్తు అంధకారంలో పడింది. తండ్రి చనిపోయిన విషయం తెలియని కుమారుడు అమాయకంగా నాన్న ఎప్పుడు నిద్రలేస్తాడు అంటూ అడగడంతో ఏ సమాధానం చెప్పాలో లక్ష్మి పొగిలిపొగిలి ఏడుస్తోంది. లక్ష్మి విలపిస్తున్న తీరుతో కడుపులో బిడ్డకు ఏమవుతుందోనని బంధువులు ఆందోళన చెందుతున్నారు. రత్తయ్య మృతితో తమకు దిక్కెవరంటూ అతని తల్లి తిరుపతమ్మ కన్నీరుమున్నీరైంది. ఆనందపేట 8వ లైన్‌కు చెందిన పఠాన్ ఫాతిమూన్ (67) డయేరియాతో గురువారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
‘నోటికొచ్చినట్టు మాట్లాడితే.. నేనూ మాట్లాడతా’
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో అతిసారంతో చనిపోయిన కుటుంబాలను శుక్రవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. డయేరియా బాధితులతో పాటు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా ఆయన కలిశారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ.. ‘తాగునీరు కలుషితం కావడంతో 14 మంది చనిపోతే మున్సిపల్ కమిషనర్ పట్టించుకోలేదు. చనిపోయిన ప్రాణాలు తీసుకురాలేం.. ఈ ఘటనకు బాధ్యులెవరు? ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు స్వార్థం కోసమే పని చేశాయి. అభివృద్ధి..అభివృద్ది అంటున్నారు, కానీ త్రాగునీరు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఆస్పత్రిలో రోగులకు సరైన బెడ్లు కేటాయించలేదు. అతిసారంతో 14 ఏళ్ల షేక్ ఫరూక్‌కు నూరేళ్లు నిండటం కలిచి వేసింది. ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ పటంలో ఏమని చూపిస్తారు. రాజధానికి కూతవేటు దూరంలో గుంటూరు ఉంది. ఈ ఘటనపై ఐఏఎస్‌తో కమిటీ వేయలేదు. ప్రజా ప్రతినిధులకు ఈ సమస్య పట్టడం లేదా? గుంటూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు పెట్టలేదు.. కనీసం ఎన్నికలు పెడితే కార్పోరేటర్లకు సమస్య చెప్పుకునేవారు. ప్రజలు ఎక్స్‌గ్రేషియా వైపు చూడరు.. పరిహారం ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకోవడం మంచి పద్దతి కాదు. కల్తీలకు గుంటూరు అడ్డాగా మారింది. కారంలో రంపపు పొడి కలుపుతారని విన్నాను. తప్పు చేసిన వారికి శిక్షపడాల్సిందే.. తప్పుచేసిన వారిని నిలదీయండి. ఏపీ ప్రభుత్వం 48 గంటల్లో స్పదించకపోతే బంద్‌కు పిలుపునిస్తాం.. అవసరమైతే దీక్షకు కూర్చుంటాం. 20 మంది ప్రజా ప్రతినిధులు చనిపోతే ఎలా ఉంటుంది.. మీ ఇంట్లో వాళ్లు చనిపోతే ఇలాగే స్పందిస్తారా. సమాజం డ్రైనేజీలా కుళ్లి పోయింది. అసెంబ్లీలో ఈ అంశంపై తూతూ మంత్రంగా చర్చించారు. ప్రజా సమస్యలకు తుంగలో తొక్కే హక్కు ఎవరికీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు నాకూ ఉంది. నోటికొచ్చినట్టు మాట్లాడితే నేనూ బలంగా మాట్లాడాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదాపై ఏపార్టీకి స్పష్టత లేదు’ అని అన్నారు. -
గుంటూరులో విస్తరించిన డయేరియా
గుంటూరు నగర వాసులను వణికిస్తున్న డయేరియా ఆరోరోజూ అదుపులోకి రాలేదు. ఆస్పత్రులకు రోగుల రాక కొనసాగుతూనే ఉంది. తాజాగా పశ్చిమ నియోజకవర్గంలో సైతం డయేరియా కేసులు నమోదవటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో అదనంగా మరో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. గుంటూరుమెడికల్: రాజధాని నగరం గుంటూరులో ఆరోరోజు కూడా డయేరియా పూర్తిగా అదుపులోకి రాలేదు. పైగా నిన్నటివరకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మాత్రమే ఉన్న డయేరియా శుక్రవారం పశ్చిమ నియోజకవర్గంలో సైతం కొన్ని ప్రాంతాల్లో కేసులు నమోదు కావడం గమనార్హం. వాంతులు, విరోచనాలతో ఆస్పత్రిలో చికిత్స కోసం వస్తున్న బాధితుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో నగర ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌కు వస్తున్న రోగుల సంఖ్య ఏ మాత్రం తగ్గకపోవడంతో వైద్యులు కూడా తలలు పట్టుకుంటున్నారు. పెరిగిన డయేరియా కేసులు... ఈనెల 3 న గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పాతగుంటూరు, ఆనందపేట, సంగడిగుంట, చిన్నబజారు, చౌత్రాసెంటర్, ఎల్బీ నగర్, లాంచెస్టర్ రోడ్డు, వడ్డెర కాలనీ, బాలాజీనగర్, ఐపీడీ కాలనీ ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదయ్యాయి. గత ఆరు రోజులుగా ఈ ప్రాంతాల్లో ప్రజలు వెయ్యికి పైగా డయేరియాతో ఆస్పత్రిలో చికిత్స పొందగా 10 మంది డయేరియాతో చనిపోయారు. 20 మంది వరకు కిడ్నీ ఫెయిల్యూర్స్‌తో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం డయేరియా మృతి కేసు నమోదవకపోవడంతో డయేరియా తగ్గుముఖం పట్టినట్టు అధికారులు భావించారు. కాని గురువారం రాత్రి నుంచి మళ్లీ డయేరియా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం మొదలైంది. తూర్పు నుంచి పశ్చిమకు పాకిన డయేరియా తూర్పు నియోజకవర్గంలో వారం రోజులుగా ఉన్న ప్రాంతాలే కాకుండా గురువారం రాత్రి నూతన ప్రాంతాల్లో సైతం డయేరియా కేసులు నమోదు అవడంతో వైద్యులు, ప్రజలు భయాందోళâ¶నలు చెందుతున్నారు. వల్లూరివారితోట, శారదాకాలనీ, నల్లచెరువు, నెహ్రూనగర్, హుస్సేన్ నగర్, కొత్తపేట,లాలాపేట, రామిరెడ్డితోట తదితర ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదయ్యాయి. పశ్చిమ నియోజకవర్గంలోని గుజ్జనగుళ్ళ, మల్లికార్జునపేట, కేవీపీ కాలనీ, చంద్రబాబునాయుడు కాలనీ, నల్లచెరువు తదితర ప్రాంతాల ప్రజలు డయేరియాతో బాధపడుతూ చికిత్స కోసం జీజీహెచ్‌కు వచ్చారు. తాడికొండ, లాం, పెదకాకాని ఇతర గ్రామాల్లో సైతం డయేరియాతో బాధపడుతూ చికిత్స కోసం పలువురు జీజీహెచ్‌కు వచ్చారు. కేవలం ఒక్క గుంటూరు జీజీహెచ్‌లోనే గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ఓపీ వైద్య విభాగంలో 56 మంది, ఇన్‌పేషేంట్ విభాగంలో 36 మంది అడ్మిట్ అయ్యారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ విభాగంలో 42 మంది, ఇన్‌పేషేంట్ విభాగంలో 32 మంది చికిత్స పొందారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపీ విభాగంలో 30 మంది, ఇన్‌పేషేంట్ విభాగంలో 25 మంది చికిత్స పొందారు. అదనంగా వార్డులు ఏర్పాటు జీజీహెచ్‌లో డయేరియా కేసులు పెరుగుతూ ఉండడంతో శుక్రవారం అదనంగా ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. జీజీహెచ్‌లో శుక్రవారం 250 మందికి పైగా డయేరియా బాధితులు అడ్మిష¯Œన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. వీరిలో పిల్లలు 56 మంది ఉండడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జీజీహెచ్‌లో మంచినీరు తాగాలంటే భయం ఆస్పత్రిలో వారం రోజులుగా డయేరియా బాధితులు చికిత్స పొందుతూ ఉండడంతో ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది ఆస్పత్రిలో మంచినీరు తాగాలంటే భయపడిపోతున్నారు. శుక్రవారం ఆస్పత్రిలో డయేరియా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు తెప్పించినా డయేరియా భయంతో వాటిని ముట్టుకోకుండా పక్కన పడేశారు. ఇంటి వద్ద నుంచి కాచి తెచ్చుకున్న నీటినే వైద్య సిబ్బంది తాగుతున్నారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు కాచి చల్లార్చిన నీటినే తాగించడం చాలా ఉత్తమమని వైద్యనిపుణులు చెబుతున్నారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణ... డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో వైద్యాధికారులు ఆస్పత్రిలో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, ఆర్‌ఎంఓలు డాక్టర్ ఆదినారాయణ, డాక్టర్ రమేష్, నర్సింగ్ సూపరింటెండెంట్ పుష్పావతి, పలువురు సీనియర్ వైద్యులు డయేరియా బాధితులు ఉన్న వార్డులపై ప్రత్యేక దృష్టి సారించారు. జూనియర్ వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, నర్సింగ్ సిబ్బందిని పలు వార్డుల నుంచి డిప్యూటేషన్‌పై డయేరియా వార్డులకు కేటాయించి సత్వరమే వైద్యసేవలను అందేలా చూస్తున్నారు. సెక్యూరిటీ గార్డులు సైతం అంబులెన్స్‌ల్లో, ఆటోల్లో వచ్చిన డయేరియా బాధితులను సకాలంలో వార్డులకు చేర్చి వారికి మెరుగైన వైద్యసేవలను అందించేందుకు కృషి చేస్తున్నారు. డయేరియా రోగులకు మినరల్ వాటర్ బాటిళ్లను సైతం ఆస్పత్రి అధికారులు అందజేశారు. నన్నపనేని పరామర్శ... రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి శుక్రవారం జీజీహెచ్‌లో డయేరియా బాధితులను పరామర్శించారు. రోగులకు ఆస్పత్రి సిబ్బంది అందిస్తున్న వైద్యసేవలను అభినందించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వాటర్ ట్యాంకుల ద్వారా తాగేందుకు, వంట చేసుకునేందుకు ప్రజలకు నీటిని తక్షణమే అందించాలని కోరారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలను పరిశుభ్రం చేసి వ్యాధులు రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. -
అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి
గుంటూరు ఈస్ట్: గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పొన్నూరు రోడ్డు, బారాఇమాంపంజా సెంటర్లో వారం రోజులుగా నీటి సమస్య, డయేరియాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు శుక్రవారం రాస్తారోకోకు దిగారు. ఈ నిరసనకు వైఎస్సార్ సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యకు కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈస్ట్ డీఎస్పీ కండె శ్రీనివాసులు, పాతగుంటూరు ఎస్‌హెచ్‌వో బాలమురళీకృష్ణలు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని రాస్తారోకో విరమింపచేసేందుకు ప్రయత్నించారు. నిరసనకారులు ర్యాలీగా పాత గుంటూరు పోలీసు స్టేషన్‌కు చేరుకుని అక్కడ రోడ్డుపై బైఠాయించారు. సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నినదించారు. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు షేక్ చాంద్‌బాషా, షేక్ సమీవుల్లా, కాంగ్రెస్ నాయకులు షేక్ బాజీ, స్థానిక నాయకులు మహమ్మద్ షరీఫ్, ఫిరోజ్, హమీద్ మాట్లాడుతూ శనివారం కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ముస్లిం మైనార్టీలు ఉన్న ప్రాంతంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితోనే వేలాది మంది ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారని, కొంత మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించి అభివృద్ధి మరించిందని ఆరోపించారు. ఈప్రాంతాల్లో నిరుపేదలు ఎక్కువగా నివాసం ఉంటున్నారని, అనారోగ్యబారిన పడి ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం మృతిచెందిన కుటుంబాలకు రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి పూర్తి స్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
సర్కారీ హత్యలే!
సాక్షి,అమరావతిబ్యూరో: గుంటూరు నగరంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా డయేరియా వ్యాధితో పది మంది చనిపోయారని, ఇవి నిస్సందేహంగా సర్కారీ హత్యలేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా సమన్వయకర్త, పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం పరామర్శించింది. అనంతరం కలెక్టర్‌ను కలిసి డయేరియా వ్యాధి ప్రబలడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఐదు రోజుల నుంచి రోగులు మరణిస్తుంటే యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఉండే ఈ ప్రాంతంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో అత్యవసర విభాగంలో చిన్నారిని ఎలుకలు కొరి కన ఘటన, సెల్‌ఫోన్ వెలుగులో శస్త్ర చికిత్సలు చేసిన ఉదంతంతోపాటు కిడ్నీ రాకెట్ కూడా వెలుగు చూడడం సిగ్గుచేటన్నారు. కల్తీలకు కూడా జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. డయేరియా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూజీడీ కాంట్రాక్టు ఏజెన్సీ నుంచి మరో రూ.10 లక్షలు ఇప్పించడంతోపాటు, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన రోగుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలన్నారు. ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాధి ప్రబలి ఐదు రోజులు గడిచినా అందుకుగల కారణాలపై అధికారులకు స్పష్టత లేకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ తరఫున రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం గుంటూరు నగరంలో డయేరియాతో పది మంది చనిపోయారన్న వార్త తెలియగానే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్జగన్మోహన్రెడ్డి చలించిపోయారని, వెంటనే తమను వెళ్లి బాధితులను పరామర్శించాలని సూచించారని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఘటనకు గల కారణాలను ఉన్నతాధికారులతో చర్చించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధినేత సూచించినట్టు చెప్పారు. మృతుల కుటుంబాల వారికి పార్టీ పరంగా రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని చెప్పారన్నారు. సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకట రమణ, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు పార్లమెంటు సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు కిలారి రోశయ్య, ఆతుకూరి ఆంజనేయులు, వినుకొండ, పెదకూరపాడు, తెనాలి, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, కావటి మనోహర్‌నాయుడు, అన్నాబత్తుని శివకుమార్, కత్తెర సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలు పోతుంటే ఏం చేస్తున్నారు? గుంటూరు వెస్ట్: ‘కార్పొరేషన్ సిబ్బంది, ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంచినీటి పైపులైన్లు లీకేజీ అయి కలుషిత మంచినీరు తాగడంవల్ల ఐదు రోజుల నుంచి 9 మంది చనిపోయారు. వందల మంది చికిత్స పొదుతున్నారు.. కలెక్టర్‌గారూ అసలు ఏం జరుగుతుంది?’ అంటూ కలెక్టర్‌ను వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. పార్టీ అగ్రనాయకులంతా గురువారం కలెక్టరేట్ కలెక్టర్ కోన శశిధర్‌ను కలిసి మరణాలపై తమ అనుమానాలను వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇన్ని రోజులు గడుస్తున్నా, ఇంత యంత్రాంగం అందుబాటులో ఉన్నా ఎందుకు సమస్య అర్థం కాలేదని ప్రశ్నించారు. కలెక్టర్ స్పందిస్తూ సమస్యను అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఆరు వార్డుల్లో ప్రజలు మరణించారని, అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఇంకా ప్రారంభించలేదని, డ్రైనేజీ నీరు కలవడానికి అవకాశం లేదని వివరించారు. వీలైనంత వరకు సమస్యలున్న ప్రాంతాల్లో పైపు లైన్లు మారుస్తున్నామని తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. -
అతిసార బాధితులకు వైఎస్ఆర్సీపీ చేయూత
సాక్షి, గుంటూరు : మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసిన కలుషిత నీటితో గుంటూరు నగరంలో అతిసారం ప్రబలించి.. వ్యాధి బారినపడి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అతిసార బాధితులకు వైఎస్ఆర్సీపీ చేయూతనిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీమంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. మృతుల కుటుంబాలకు యాభై వేల రుపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటన గురించి తెలిసి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చాలా కలత చెందారని పేర్కొన్నారు. జగన్ బాధితులను పరామర్శించమని మమల్ని పంపించారని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే అతిసార ప్రబలిందని బొత్స సత్యనారాయణ అన్నారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ నేతలు ఉమ్మారెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, గోపి రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
గుంటూరులో ఘోరకలి ; ఇప్పటికి 8మంది మృతి
సాక్షి, గుంటూరు : పాలకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నది. మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసిన కలుషిత నీటితో గుంటూరు నగరంలో అతిసారం ప్రబలింది. వ్యాధి బారినపడి ఇప్పటిదాకా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికిపైగా ఆస్పత్రుల్లో చేరారు. చికిత్స పొందుతున్నవారిలో ఐదారుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అతిసార విజృంభణతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ : అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల వల్లే మంచినీరు కలుషితమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో బుధ, గురువారాల్లో నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి(జీజీహెచ్)లో మెడికల్ ఎమర్జన్సీ ప్రకటించినట్లు ఆస్పత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు తెలిపారు. చనిపోయినవారి పేర్లను ఫాతిమూన్, బీబీజాన్, సబీనా, గోపీ, వెంకట్రావు, పద్మావతి, బాలకోటిరెడ్డి, సామ్రాజ్యంలుగా అధికారులు పేర్కొన్నారు. మంత్రుల నిలదీత : అతిసార బాధితులను పరామర్శించేందుకు జీజీహెచ్‌కు వచ్చిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, మేకా ఆనందబాబులకు చుక్కెదురైంది. జనం ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడంలేదంటూ మంత్రులపై మండిపడ్డ జనం.. ఆస్పత్రి ప్రధాన ధ్వారం వద్ద బైఠాయింపునకు దిగారు. వైఎస్సార్సీపీ నేతలు అప్పిరెడ్డి, గులామ్, రసైల్‌లు ఆందోళనకు నేతృత్వం వహించారు. మంత్రుల రాక సందర్భంగా జీజీహెచ్ వద్ద భారీగా పోలీసులను మోహరించడం గమనార్హం. -
డయేరియా అలజడి
గుంటూరు మెడికల్/గుంటూరు ఈస్ట్: గుంటూరు నగరంలో డయేరియా వ్యాధి విజృంభిస్తోంది. మూడు రోజుల్లో 200 మంది వ్యాధిపీడితులుగా మారి ఆస్పత్రుల్లో చేరారు. ఇప్పటికే ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో నగరంలో తీవ్ర అలజడి రేగింది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే డయేరియా ఒక్కసారిగా విజృంభించడానికి కారణాలు తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తొలుత కలుషిత నీటి వల్లే వాంతులు, విరేచనాలతో రోగులు ఆస్పత్రులకు చేరుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు సుమారు 600 శాంపిళ్లు సేకరించి నీటి పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షల్లో నీరు కలుషితమైనట్లు తేలలేదు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు మాట్లాడుతూ డయేరియా విజృంభణకు కలుషిత నీరు లేదా ఆహారం విషతుల్యంగా మారడమా అనేది తేలాల్సి ఉందన్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం పర్యటిం చారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో డీఎంహెచ్ఓ డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ నేతృత్వంలో పది వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. నర్సింగ్ కళాశాల విద్యార్థులతో డోర్ టూ డోర్ సర్వే చేయించి, బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. నగరంలో ఒక్కరోజు పాటు నీటి సరఫరా నిలిపివేసి, శాంపిళ్లు తీసిన అనంతరం పూర్తి స్థాయిలో క్లోరినేషన్ చేసి తిరిగి నీరు విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యేక అంబులెన్సులను ఏర్పాటు చేసి డయేరియా బాధితులను ఆసుపత్రులకు తరలించేలా చర్యలు చేపట్టారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లోనే నేరుగా ప్రత్యేక శిబి రాలు ఏర్పాటు చేసి చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ, కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. 200 మంది బాధితులు.. ముగ్గురు మృతి నగరంలో డయేరియా బారినపడి ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. గుంటూరు జీజీహెచ్, జ్వరాల ఆస్పత్రిలో సుమారు వంద మంది వరకు చికిత్స పొందుతున్నారు. మిగతా వారంతా ప్రథమ చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. జ్వరాల ఆస్పత్రిలో బెడ్లు లేకపోవడంతో వైద్యులు నేలపైనే రోగులకు చికిత్స చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య ఇలా ఉంటే, ప్రైవేటు ఆస్పత్రులకు ఎంత మంది వెళ్తున్నారనేది లెక్క తేలాల్సి ఉంది. జీజీహెచ్‌లో మెడికల్ ఎమర్జెన్సీ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మంగళవారం మెడికల్ ఎమర్జన్సీ ప్రకటించినట్లు ఆస్పత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు తెలిపారు. మూడు రోజులుగా ఆస్పత్రికి డయేరియా బాధితులు వస్తున్నారని, మంగళవారం ఒక్కరోజే 60 మందికి పైగా బాధితులు రావటంతో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు వెల్లడించారు. ఆస్పత్రిలో డయేరియా బాధితుల కోసం మంగళవారం 20 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటుచేశారు. బాధితులకు వైద్యసేవలను అందించేందుకు స్టాఫ్ నర్సులు, పీజీ వైద్యులు, సీనియర్ రెసిడెంట్లు, ఆర్‌ఎంఓలు, జూనియర్ డాక్టర్లను నియమించారు. డ్యూటీ లేని వారిని సైతం విధులకు హాజరుకావాలని సూపరింటెండెంట్ ఆదేశించారు. బాధితులకు ఆస్పత్రి అధికారులు మినరల్ వాటర్ బాటిళ్లు ఇచ్చి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కలుపుకొని తాగాలని సూచించారు. భయందోళనలో నగర ప్రజలు గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పది డివిజ న్లలో ఒక్కసారిగా డయేరియా విజృంభించడంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీటి వల్లే వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారంటూ రోగుల బంధువులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయా ప్రాంతాల్లో 600 శాంపిళ్లు తీసి మరీ నీటి పరీక్షలు చేశామని, నీటిలో తేడా ఉన్నట్లు కని పించలేదని నగరపాలకసంస్థ అధికారులు చెబుతున్నారు. పాతగుంటూరు, ఆనందపేట, వినోభానగర్, సంగడిగుంట వంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ పరిస్థితి నెలకొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం కావడంతో బాధితుల్లో అధికశాతం మంది చికెన్, మటన్ తిన్నట్లు చెబుతున్నారు. నిల్వ ఉన్న మాంసం తినడం వల్ల ఇలా జరిగి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఇంత పెద్ద ఎత్తున్న డయేరియా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని వైద్యులు చెబుతున్నారు. గుంటూరు నగరంలో డయేరియా విజృంభించడంతో నగర వాసులకు కంటిపై కునుకులేకుండా పోయింది. వ్యాధి ప్రబలడానికి కారణం ఏమిటో తెలియకపోవడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. -
అతిసారమా.. అలెర్ట్ అవ్వండి!
సాక్షి, తెలంగాణ డెస్క్: డయేరియాను నియంత్రించడంలో ఎంతో ప్రగతి సాధించినా.. వైద్య ప్రమాణాలు చాలా వరకు మెరుగుపడినా.. ఇప్పటికీ దేశంలో చిన్నారుల మరణాలకు డయేరియా ఒక ప్రధాన కారణమట. వివిధ వ్యాధులతో ఏటా మరణిస్తున్న ఐదేళ్లలోపు చిన్నారుల్లో డయేరియా మృతులు రెండో స్థానంలో ఉన్నారట. 2015లో దేశంలో ప్రతి రోజూ సుమారు 321 మంది చిన్నారులు డయేరియాతో మరణించారట. ఈ ఏడాది మేలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెలువరించిన ఫ్యాక్ట్ షీట్(వాస్తవపత్రం) ఈ విషయాలను వెల్లడించింది. పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీరుతో డయేరియాను చాలా వరకూ నియంత్రించవచ్చు. కానీ మౌలిక వసతులైన వీటిని ప్రజలకు అందించడంలో భారత్ ఇంకా వెనుకబడే ఉంది. కలుషిత నీటి వల్లే.. కలుషిత నీరు, అపరిశుభ్రత కారణంగా బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల సాయంతో డయేరియా వ్యాపిస్తోంది. డీహైడ్రేషన్(నిర్జలీకరణం), పోషకాహారలోపం, విరేచనాల వల్ల కూడా డయేరియా విస్తరిస్తోంది. 2015లో ప్రపంచవ్యాప్తంగా డయేరియాతో 5,25,000 చిన్నారులు మరణించినట్టు డబ్ల్యూహెచ్‌వో ఫ్యాక్ట్‌షీట్ వెల్లడించింది. పోషకాహార లోపం, వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం మొదలైన కారణాల్లో 132 దేశాల్లో భారత్ 114వ స్థానంలో ఉందని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డయేరియా ఎక్కువసార్లు రావడం వల్ల దీర్ఘకాలంలో చిన్నారుల ఎదుగుదల, సామర్థ్యం, వ్యాధి నిరోధకశక్తిపై ప్రభావం చూపుతోందని, దీనికి పేదరికం కూడా ఒక కారణమని నిపుణులు చెపుతున్నారు. వోఆర్ఎస్తో చెక్ పెట్టొచ్చు సాధారణమైన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ (వోఆర్ఎస్), జింక్ ట్యాబ్లెట్లతో డయేరియాను నియంత్రించవచ్చని డబ్ల్యూహెచ్‌వో ఫ్యాక్ట్‌షీట్ స్పష్టం చేస్తోంది. వోఆర్ఎస్ అంటే స్వచ్ఛమైన నీరు, ఉప్పు, చక్కెర మిశ్రమం. ఇది శరీరంలో కోల్పోయిన నీటిని, ఎలక్ట్రోలైట్స్‌ను భర్తీ చేస్తుంది. జింక్ మాత్రలు డయేరియా ప్రభావిత కాలాన్ని 25 శాతం తగ్గిస్తాయి. వైద్య ప్రమాణాలు పెరిగినా ఇప్పటికీ డయేరియా మరణాలు ఎక్కువే డబ్ల్యూహెచ్‌వో ఫ్యాక్ట్‌షీట్‌లో వెల్లడి ప్రపంచవ్యాప్తంగా 2015లో ఐదేళ్లలోపు చిన్నారుల మృతి 5,25,000 భారత్‌లో ప్రతి రోజూ మృత్యువాత పడుతున్న చిన్నారులు 321 -
విజృంభిస్తున్న డయేరియా
► రోజురోజుకు పెరుగుతున్న కేసులు ► కిటకిటలాడుతున్న ఆస్పత్రులు ► గ్రామాలు, పట్టణాల్లో లోపించిన పారిశుధ్యం పట్టించుకోని అధికారులు ఆసిఫాబాద్: జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. గత వారం రోజులుగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో పదుల సంఖ్యలో డయేరియా, విషజ్వరాలతో రోగులు చికిత్స పొందుతున్నారు. వారం రోజుల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో 63 మంది డయేరియా చికిత్స పొందగా, మలేరియా, టైఫాయిడ్‌తో పలువురు చికిత్స పొందారు. వీరితోపాటు ప్రతీరోజు సుమారు 400 నుంచి 500 వరకు ఔట్ పేషెంట్లు నమోదవుతున్నారు. వారం రోజుల్లో మండలంలోని ఆర్‌ఆర్‌కాలనీకి చెందిన పాపయ్య, మోతుగూడకు చెందిన అనిత, కొసరకు చెందిన సునీత, చిర్రకుంటకు చెందిన మోహన్, తారకరామానగర్‌కు చెందిన సునీత, రాకేశ్, జన్కాపూర్‌కు చెందిన రోహిణి, గుడిసెల కాశమ్మ, లచ్చయ్య, మజీద్వాడికి చెందిన లక్ష్మి, బజార్‌వాడికి చెందిన భారతి, గొల్లగూడకు చెందిన విజయ, సందీప్‌నగర్‌కు చెందిన ఎల్లవ్వ, హడ్కోకాలనీకి చెందిన శివకృష రెబ్బెన మండలం ఖైర్‌గాంకు చెందిన రంగమ్మ, రాంపూర్‌కు చెందిన రేణుకతోపాటు పలువురు డయేరియా, మలేరియా చికిత్స పొందగా, ఆదివారం మండలంలోని సందీప్‌నగర్‌కు చెందిన లత, జన్కాపూర్‌కు చెందిన తారుబాయి, బెస్తవాడకు చెందిన మారుతి, రెబ్బెన మండలం ఖైర్‌గాంకు చెందిన అంజలి డయేరియాతో ఆస్పత్రిలో చేరారు. వీరితోపాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వందలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో డయేరియా, జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. లోపిస్తున్న పారిశుధ్యం జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లోని 173 గ్రామపంచాయతీలకు ఇటీవల 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.24.32 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల్లో 60 శాతం పారిశుధ్యం, తాగునీటి అవసరాలకు ఖర్చు చేయనున్నారు. గ్రామపంచాయతీలకు రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు లేకపోవడంతోపాటు ఉన్న సిబ్బందికి అదనపు బాధ్యతలు ఇవ్వడంతో పంచాయతీ పాలన పడకేసింది. జిల్లా కేంద్రంలోనే ఎక్కడ చేసినా చెత్తాచెదారం దర్శనమిస్తోంది. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా గ్రామీణ, పల్లె ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో చెత్తా చెదారం నిండిపోయింది. అందులో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమలు పెరిగి జ్వరాల పాలవుతున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలు, పల్లెల్లో ప్రజలు తాగునీటి కోసం పాట్లు పడుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి సరఫరాపై నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంతో ఏటా వర్షాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా కేంద్రంలోనే రోజుల తరబడి నల్లాల ద్వారా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో, తాగునీటికోసం చేతి పంపులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు వ్యాధుల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
అతిసార కేసులు లేవు
► వ్యక్తిగత పరిశుభ్రత లోపమే అస్వస్థతకు కారణం ► జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశాంక్ జోగిపేట(అందోలు): అతిసార కేసులు లేవని జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశాంక్ చెప్పారు. జోగిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 65 మంది అతిసారంతో చికిత్స పొందుతున్నట్లు వచ్చిన ఓ దినపత్రిక(సాక్షికాదు)లో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించారు. ఆదివారం ఆసుపత్రిని సందర్శించారు. జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశాంక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరిశీలించారు. రోగులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారని సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణను ప్రశ్నించారు. అక్కడ ఇద్దరు... ఇక్కడ ఒకరు అంటూ 9 మందిని చూపించారు. 65 మంది ఎక్కడ ఉన్నారని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. ఒక్కో సెలైన్ బాటిల్ ఎక్కించుకొని వెళ్లిపోతున్నారని డాక్టర్ చెప్పడంతో అడిషనల్ డీఎంహెచ్ఓ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకే గ్రామానికి చెందినవారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. 24 గ్రామాలకు చెందినవారు ఒకరిద్దరు చొప్పున ఉన్నారని డాక్టర్ అధికారికి వివరించారు. అనంతరం జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశాంక్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇందులో అతిసారం కేసులు ఏమీ లేవన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత లోపించడంతో అస్వస్థతకు గురవుతున్నారని స్పష్టం చేశారు. అతిసారం అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. తాలెల్మ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ నృపేన్ చక్రవర్తి, హెచ్ఈఓ విజయ్‌కుమార్, సిబ్బంది నర్సింలు, శంకర్లు ఆయన వెంట ఉన్నారు. -
జూపాడుబంగ్లాలో అతిసారం
-30మందికి పైగా అస్వస్థత -గ్రామంలో పర్యటించిన జిల్లా వైద్యాధికారిణి మీనాక్షిమహాదేవన్ -తాగునీటి కలుషితంపై ఆరా జూపాడుబంగ్లా: మండలకేంద్రం జూపాడుబంగ్లాలో అతిసారం ప్రబలింది. కలుషిత తాగునీటి సరఫరాతో గ్రామంలోని నీలిపల్లెపేట, సిద్దేశ్వరంపేట, సంతగేట్‌కాలనీ, కాసానగర్, క్వార్టర్స్ తదితర ప్రాంతాలకు చెందిన 30 మంది సోమవారం ఉదయం వాంతులు, విరేచనలు చేసుకున్నారు. గ్రామంలోని ముస్లిం కాలనీలో ఉండే ఓవర్‌హెడ్ ట్యాంకును సరిగ్గా శుభ్రం చేయకపోవడమే ఈపరిస్థితికి కారణమని గ్రామస్తులు వాపోతున్నారు. దీనికితోడు చాలా రోజులుగా నీలిపల్లెపేట కాలనీలో మురుగునీటి కాల్వలు శుభ్రం చేయడం లేదు. కాలువ గుండా ఉన్న తాగునీటి పైపులు లీకై నీరు కలుషితమై ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ కాలనీలో ఐదురోజుల క్రితం ఒకరిద్దరు అతిసారం బారిన పడ్డారు. సోమవారం ఒక్కసారిగా పదుల సంఖ్యలో అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం వచ్చిన వారితో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కిటికిటలాడింది. డాక్టర్ రంగారెడ్డి బాధితులకు సెలెన్‌బాటిళ్లు ఎక్కించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్సకోసం 108లో నందికొట్కూరుకు తరలించారు. అతిసారం ప్రబలిన విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారిణి మీనాక్షిమహాదేవన్ జూపాడుబంగ్లా ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. తర్వాత గ్రామానికెళ్లి సమస్యపై ఆరాతీశారు. తాగునీటి ట్యాంకును శుభ్రం చేయకపోవటంతోనే అతిసారం ప్రబలినట్లు వైద్యాధికారిణి తెలిపారు. తాగునీటి కలుషితంపై డీఈ ఆరా: గ్రామంలో తాగునీటి కలుషితంతో వాంతులు, విరేచనాలు ప్రబలిన విషయాన్ని తెలుసుకున్న తాగునీటిశాఖ డీఈ రవికుమార్‌రెడ్డి, ఏఈ మహమ్మద్‌హుసేన్, ఈఓపీఆర్డీ మహమ్మద్‌హనీఫ్ ముస్లిం కాలనీలోని తాగునీటి ట్యాంకును పరిశీలించారు. వెంటనే శుభ్రం చేయించారు. ఇదిలా ఉంటే నీటిని పరీక్ష చేయగా తాగునీరు కలుషితం కాలేదని తేలిందని డీఈ చెప్పడం గమనార్హం. -
అ..అంటే అతిసార ఆ.. అంటే ఆస్పత్రి
► 4 నెలల్లో 19,094 కేసులు నమోదు ► రోజురోజుకూ పెరుగుతున్నబాధితుల సంఖ్య ► నగరాలు, పట్టణాల్లోనే రోగులు ఎక్కువ ► నీరు కలుషితం కావడం వల్లే ఈ దుస్థితి ‘అ.. అంటే అమరావతి. ఆ.. అంటే ఆరోగ్యం...’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. కానీ వాస్తవంగా ‘అ.. అంటే అనారోగ్యం, ఆ.. అంటే ఆస్పత్రి...’ అన్నట్లుగా ఉంది రాజధాని జిల్లాల్లో వాస్తవ పరిస్థితి. ఒకవైపు కాలుష్యం పెరగడం వల్ల గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతోంది. ప్రమాదకర స్థాయిలో విషవాయువులను పీల్చుకుని ప్రజలు గుండె, ఊపిరితిత్తులు, మెదడు, నరాల సంబంధ వ్యాధుల బారినపడుతున్నారు. మరోవైపు ప్రాణాంతక స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. తాజాగా అతిసార వ్యాధి విజృంభిస్తోంది. రెండు జిల్లాల్లోనూ నాలుగు నెలల్లో 19,094 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు మున్సిపాలిటీలు, గ్రామాల్లో కలుషిత నీరు తాగడం వల్ల ఎక్కువ మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. వాంతులు, విరేచనాల కారణంగా నీరసించి కదల్లేక, మెదల్లేక మంచాలకే పరిమితమవుతున్నారు. సాక్షి, అమరావతి: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో డయేరియా చాపకింద నీరులా ప్రబలుతోంది. విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లోనూ వ్యాధి బారినపడుతున్నారు. గడచిన నాలుగు నెలలుగా గుంటూరు జిల్లాలో 11,345, కృష్ణా జిల్లాలో 7,749 డయేరియా కేసులు నమోదయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ గణాంకాలు కేవలం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన వారి వివరాలు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో మరో 30వేల మందికి పైగా చికిత్స పొందుతుంటారని అంచనా. మండుతున్న ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ, డయేరియా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కలుషిత నీటి వల్లే... రాజధాని ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కృష్ణా జిల్లాలో గత ఏడాది కంటే ఈ సంవత్సరం భూగర్భ జలాలు 3.5 అడుగుల మేర తగ్గినట్లు అంచనా. రక్షిత మంచినీరు కూడా అందుబాటులో లేదు. పెరుగుతున్న ఎండల వల్ల నీటి కొరత తీవ్రమవుతోంది. కొన్నిచోట్ల చిన్నచిన్న దిగుడు బావులు, చెలమలు, కుంటల్లో నీరు ఇంకిపోయి కలుషితమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ట్యాంకర్ల ద్వారా కూడా అందుబాటులో ఉన్న కలుషిత నీటినే సరఫరా చేస్తున్నారు. పశ్చిమ కృష్ణాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లాలో 125 తాగు నీటి చెరువులు ఉండగా, వాటిలో 78 పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయి. మిగిలిన చెరువుల్లో అరకొర నీరు ఉన్నప్పటికీ కలుషితమై తాగేందుకు పనికిరాకుండా పోయింది. అదే సమయంలో రెండు జిల్లాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పులకు జనం గొంతు తడారిపతోంది. ఒంట్లో తేమ శాతం తగ్గిపోతుంది. దీంతో నీరు తాగి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో కలుషిత నీరు తాగి డయేరియా బారిన పడుతున్నారు. వాంతులు, విరేచనాలతో నీరసించి మంచాలకే పరిమితమవుతున్నారు. విజయవాడలో అయితే భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో కలుషితమయ్యాయి. కృష్ణా నుంచి నీటిని సరఫరా చేసే మూడు కాలువల్లో వ్యర్థపదార్థాలు, మురుగునీరు కలిపేయడం వల్ల తాగునీరు కలుషితమవుతోంది. -
జిల్లాకు జ్వరం
నాలుగు రోజుల్లోనే 89 మందికి.. రోగులతో ఆస్పత్రులు కిటకిట 200 గ్రామాల్ని చుట్టుముట్టిన వ్యాధులు 60 మందికి డయేరియా నిర్ధారణ లో జ్వరం, కీళ్లు, ఒళ్లనొప్పుల కేసులు 999 మళ్లీ జ్వరాలు విజృంభించాయి. జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. లోపిస్తున్న పారిశుధ్యం.. వాతావరణంలో వచ్చిన మార్పులతో జిల్లాలో అనేక చోట్ల విష జ్వరాలు విలయ తాండవం చేస్తున్నాయి. ఒళ్లు.. కీళ్ల నొప్పుల బాధలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన వారం రోజుల్లో జ్వరాలు సోకి నలుగురు చనిపోయారు. ఇంకా చాలా మంది జ్వరాలతో బాధపడుతున్నారు. సాక్షి, మంచిర్యాల : జిల్లాలో జ్వరాల ధాటికి వందలాది మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు, ఆస్పత్రుల్లో వందలాది మంది చికిత్స పొందుతున్నారు. మరోపక్క.. వరదలతో పైప్‌లైన్ లీకేజీలు ఏర్పడి.. తాగునీరు కలుషితమవుతోంది. ఆ నీటిని తాగిన ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. మరోపక్క.. లోపించిన పారిశుధ్యం ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది. తాగునీటి సరఫరాలో క్లోరినేషన్ లేక చాలా ప్రాంతాల్లో ప్రజ లు కలుషిత నీరే తాగుతున్నారు. ఫలితంగా డయేరియా విజృంభిస్తోంది. వర్షాకాలం వ్యా ధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ముందస్తు జాగ్రత్తగా గ్రామ పంచాయతీల్లో ఫాగింగ్, క్లోరినేషన్, పారిశుద్ద్య కార్యక్రమాలు చేపట్టాల్సిన పంచాయత్‌రాజ్ శాఖ విఫలమైంది. దీంతో చాలా గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. ఫలితంగా వ్యాధులు చాపకింద నీరులా ప్రబలుతున్నాయి. ఇటీవల కురి సిన వర్షాలకు జిల్లాల్లో సుమారు రెండొందల పంచాయతీలను వ్యాధులు చుట్టుముట్టాయి. దడపుట్టిస్తున్న వ్యాధులు వైద్యశాఖ రికార్డుల ప్రకారం.. గడిచిన నాలు గు రోజుల్లో 89 మందికి విషజ్వరాలు సోకా యి. 60 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఒళ్ల.. కీళ్ల నొప్పులు.. లో ఫీవర్ కేసులు 999 నమోదయ్యాయి. అనధికారంగా జ్వరపీడితుల సంఖ్య 3 వేలకు పైనే ఉంటుంది. ఈ నెల 20న జన్నారం మండలం నాయకపుగూడకు చెందిన లక్ష్మీ (24) బాలింత జ్వరంతో చనిపోయింది. 21న నేరడిగొండ మండలం బోరిగాం పంచాయతీ పరిధిలోని గుత్పాల గ్రామంలో మండాడి జింగుబాపు (19) అతిసారతో చని పోగా.. 30 మంది అస్వస్థతకు గురయ్యారు. 25న ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్‌కు చెందిన మెస్రం అన్వంతిబాయి(18) జ్వరం సోకి ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయింది. 26న జైపూర్ మండలం భీమారంకు చెందిన బూక్య లలిత(35) జ్వరంతో చనిపోయింది. అలాగే ఈ నెల 21న కౌటాల మండలం బాబాపూర్ను జ్వరాలు చుట్టుముట్టాయి. వైద్యశాఖ అక్కడ శిబిరం నిర్వహించినా.. బాబాపూర్ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ప్రస్తుతం వేమనపల్లి మండల కేంద్రంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పది మంది విద్యార్థులు విషజ్వరాలతో బాధపడుతున్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలందించారు. అప్రమత్తమైన అధికారులు కురుస్తోన్న వర్షాలతో విషజ్వరాలు, డయేరియా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీజనల్ వ్యాధులు ఎక్కడ ప్రబలినా.. వెంటనే అక్కడికి వెళ్లి శిబిరాలు నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ.. 13 మంది వైద్యులు.. 53 పారామెడికల్ సిబ్బందితో 23 వైద్య బృందాల్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ బృందాలు జిల్లాలో 25 సమస్యాత్మక ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాయి. కలెక్టర్ జగన్మోహన్, ఐటీడీఏ పీవో కర్ణన్, డీఎంహెచ్‌వో జలపతినాయక్ ప్రతీరోజు జిల్లాలో వ్యాధులపై సమీక్షిస్తున్నారు. జిల్లాలో ఏ ప్రాంతంలో ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే ఆ బృందాలు స్పందించాలని డీఎంహెచ్‌వో జలపతినాయక్ సంబంధిత బృంద సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క.. పల్లెల్లో విజృంభిస్తోన్న విషజ్వరాలపై పంచాయత్‌రాజ్ శాఖ స్పందించింది. ఇటీవల కురిసిన వర్షాలకు అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకుంటోంది. మురికికాలువలు.. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ సున్నంతో కలిపి చల్లాలని పంచాయతీ కార్యదర్శులు సిబ్బందిని ఆదేశించినట్లు డీపీవో పోచయ్య తెలిపారు. తాగే నీటిలో క్లోరినేషన్, పైప్‌లైన్ లీకేజీలుంటే వెంటనే మరమ్మతులు చేసుకోవాలని పేర్కొన్నారు. పదిహేను రోజులకోసారి ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌ను క్లోరినేషన్ చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణ, చెత్త తొలగింపు కోసం అవసరమైతే ప్రత్యేకంగా కార్మికులను నియమించుకోవాలన్నారు. డ్రెరుునేజీ నీళ్లు బయటికి ప్రవహించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు డీపీవో తెలిపారు. ఈవోపీఆర్డీలు, డీఎల్పీవోలు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో జరుగుతోన్న పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. మూడు రోజులుగా జ్వరం ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు టేకం పోతయ్య. పక్కడ బెడ్‌పై ఉన్నది అతడి చిన్నారి కూతురు అయ్యుబాయి(3). మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వీరిది ఆసిఫాబాద్ మండలంలోని మాలన్గోంది గ్రామం. ఈ ఊరిలో మరికొంద రు కూడా జ్వరాలతో బాధపడుతున్నారు. సార్లు వైద్య శిబిరాలు నిర్వహించి, వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
కొనసాగుతున్న అత్యవసర వైద్యశిబిరం
దుర్కి(బీర్కూర్) : మండలంలోని దుర్కిలో డయేరియా ప్రబలడంతో ఆరు రోజుల నుంచి గ్రామ చావిడిలో అత్యవసర వైద్యశిబిరం కొనసాగుతోంది. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై శిబిరానికి వచ్చిన వారికి వైద్యం అందిస్తున్నారు. గ్రామ వీఆర్వో అంజు, సర్పంచ్ మోహన్, కార్యదర్శి యాదగిరిలు అందుబాటులో ఉంటూ సమన్వయ పరుస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆదివారం వ్యాధి ప్రబలిన ఎస్సీకాలనీవాసులకు డీ ఫ్లోరైడ్ నీటిని ట్యాంకర్లో తెప్పించి సరఫరా చేశారు. బీర్కూర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిలీప్‌కుమార్, సూపర్వైజర్ కృష్ణవేణిలు, ఏఎన్ఎం ఉమ, ఆస్మాబేగం, ఆశ కార్యకర్తలు వైద్యచికిత్సలు అందించారు. పలువురిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి రెఫర్ చేశారు. -
పుష్కరాలకు ‘డయేరియా’ ముప్పు!
* మూడో రోజులు 604 కేసుల గుర్తింపు * రోజురోజుకు పెరుగుతున్న వైనం * అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు గుంటూరు మెడికల్: మీరు కుటుంబ సభ్యులతో కలిసి పుష్కరాలకు వెళ్తున్నారా... అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే పుణ్యం కోసం వెళ్లే పుష్కరాల్లో రోగాలు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని వైద్యాధికారులు అధికారికంగా అందజేసిన పుష్కరాల వైద్యశిబిరాల్లో వైద్యం చేయించుకున్న రోగుల వివరాల్లో స్పష్టంగా ధ్రువీకరిస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏదైనా అనారోగ్యం వస్తే ఉచితంగా వైద్యసేవలను అందించేందుకు ఏర్పాటుచేసినన వైద్యశిబిరాల్లో 12వ తేదీ నుంచి 14 వరకు 26,887 మంది వైద్యసేవలను వినియోగించుకున్నారు. నమోదవుతున్న కేసులు ఇవే.. జ్వరాలతో బాధపడుతున్నవారు తొలిరోజు 123 మంది రెండోరోజు 300 మంది, మూడోరోజు ఆదివారం 359 మంది వైద్యసేవలను పొందారు. వివిధ రకాల అలర్జీలతో బాధపడేవారు శుక్రవారం 342 మంది, శనివారం 745 మంది, ఆదివారం 985 మంది, ఆస్తమాతో బాధపడేవారు మూడు రోజులు వరుసగా 118 మంది, 177 మంది, 215 మంది వైద్యసేవలు వినియోగించుకున్నారు. శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తొలిరోజు 943 మంది, రెండోరోజు 1774 మంది, మూడోరోజు 1478 మంది, చెవి, ముక్కు, గొంతు, కంటి సమస్యలతో బాధపడేవారు శుక్రవారం 190 మంది, శనివారం 365 మంది, ఆదివారం 604 మంది చికిత్స చేయించుకున్నారు. పెరిగిన డయేరియా కేసులు.. డయేరియా కేసులు తొలిరోజు 52, రెండోరోజు 104 , మూడోరోజు 604 నమోదయ్యాయి. రోజు రోజుకు డయేరియా కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. క్లోరినేషన్ సక్రమంగా చేయకపోతే నీటి కాలుష్యంతో రోజురోజుకు డయేరియా కేసులు పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు త్వరితగతిన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. పలు ఘాట్లలో నీటిని పరిశుభ్రం చేసేందుకు వినియోగించే క్లోరినేషన్ ప్రక్రియ నత్తనడకన జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోయినా, భక్తులు అప్రమత్తంగా లేకపోయినా వ్యాధులు ప్రభలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఫుడ్, వాటర్ శాంపిల్స్‌కు ఆదేశించాం... పుష్కరాల్లో డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ఫుడ్, వాటర్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే భక్తులు తాగాలి. ఆహారం ఎక్కడపడితే అక్కడ తినకుండా నిర్దేశిత ఆహార విక్రయ కేంద్రాల్లోనే తినాలి. అన్ని రకాల వ్యాధులకు 24 గంటలు వైద్యసేవలను అందించేందుకు వైద్యశిబిరాలను ఏర్పాటుచేశాం. - డీఎంహెచ్‌వో డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి -
వ్యాధుల పంజా!
బీర్కూరు మండలం దుర్కి గ్రామంలో డయేరియా జడలు విప్పింది. పది రోజులుగా గ్రామస్తులను మంచానికే పరిమితం చేస్తోంది. ఈ 24 గంటల వ్యవధిలో దుర్కిలోనే ఇద్దరు మృత్యువాత పడ్డారు. గతేడాది ఇదే సీజన్లో ఇక్కడి ప్రజలు జ్వరం బారిన పడినా ఇంత ప్రభావం చూపలేదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు చేపట్టాల్సిన వైద్య ఆరోగ్యశాఖ మిన్నకుండిపోయింది. అంతా అయిపోయాకా అత్యవసర వైద్య సేవల పేరిట శిబిరం ఏర్పటు చేశారు. మెుక్కుబడిగా నిర్వహించడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జ్వరబాధితులను నేలపై పడుకోబెట్టి వైద్యం చేయడంపై విమర్శలకు దారితీస్తోంది. కాగా ఇప్పటికే ఈ గ్రామంలో అతిసారతో ఇద్దరు మృతి చెందగా.. కనీసం ఇంటికొక్కరు చొప్పున జ్వర బాధితులు ఉన్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మొన్న బోధన్‌లోని శక్కర్‌నగర్‌లో డిప్తీరియా(కంఠసర్పి) సోకి ఫాతిమా(9) అనే బాలిక.. నిన్న బీర్కూరు మండలం దుర్కిలో మాపురం గంగవ్వ(50) అతిసారతో.. శుక్రవారం అదే గ్రామంలో మురళి(24) అనే మరో యువకుడు మృత్యువాత పడ్డారు. ఇలా పక్షం రోజుల వ్యవధిలో జిల్లాలో ఏడుగురు మృతి చెందగా.. రెండు నెలల్లో 21 మందికిపైగా వివిధ రకాల వ్యాధులతో తనువు చాలించారు. జూలైలో డెంగీతో ఇద్దరు మృతి చెందారు. నవీపేట, బోధన్, మాచారెడ్డి, దోమకొండ, డిచ్పల్లి, వర్ని, బాన్సువాడ మండలాల్లో మొదలైన సీజనల్ వ్యాధులుఅంటువ్యాధులు ఇప్పుడు జిల్లా అంతటా తాకాయి. 25 రోజుల వ్యవధిలోనే నిజామాబాద్ జిల్లాలో డెంగీ ప్రభావం తీవ్రరూపం దాల్చింది. రోజు రోజుకు జిల్లాలోని ఆయా చోట్ల డెంగీ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. డెంగీకి తోడు డిఫ్తీరియ కూడ నాలుగేళ్ల తర్వాత నలుగురిని బలిగొంది. ఇటీవలే కోరలు చాసిన అతిసార ప్రస్తుతం పల్లె ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుంది. దుర్కిలో 24 గంటల్లో ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. అత్యవసర వైద్యశిబిరం ఏర్పాటు చేసినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ముప్పెట దాడి.. జిల్లాలో ఈ ఏడాది ప్రైవేట్ ఆస్పత్రులు, ఇతర చోట్లలో డయేరియా బాధితులను తీసుకుంటే 200లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇంకా వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్న పల్లెలు, తండాలలో కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్యశాఖ చెబుతోంది. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు కేవలం 51 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గతేడాది బోధన్‌లో పూర్తి స్థాయిలో డెంగీ వైరస్ వ్యాప్తి చెందింది. వర్ని మండలం మోస్రా, మోర్తాడ్, డిచ్పల్లి, బీర్కూరు, దోమకొండ, మాచారెడ్డి, నవీపేట, రెంజల్ ప్రాంతాల్లో పలువురు డెంగీతో ఆస్పత్రి పాలయ్యారు. అంతేకాకుండా బోధన్‌లోని రాకాసిపేటలోని క్రిస్టియన్ కాలనీలో సుమారు 400 మంది జ్వరపీడితులు నమోదయ్యారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్తలు చేపట్టాల్సిన వైద్య ఆరోగ్యశాఖ నిద్రావస్థకు చేరింది. ఈ సారి డెంగీ ప్రభావం అంతగా లేనప్పటికీ.. బోధన్ ఏరియాలో నాలుగేళ్ల తర్వాత డిప్తీరియా ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. తాజాగా డయేరియా(అతిసార) అందరిని హడలెత్తిస్తుంది. ఒకేసారి జిల్లాపై అతిసార, సీజనల్ వ్యాధులు ముప్పెట దాడి చేస్తుండటంతో సామాన్యుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. పారిశుధ్యంపై చిత్తశుద్ధి ఏది? డెంగీ, మలేరియా తదితర వైరల్ ఫీవర్స్ బారిన పడి మృతి చెందిన సంఘటనలకు ప్రధాన కారణం పారిశుధ్యమేనని చెప్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నిధులున్నా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పారిశుధ్యంపై దృష్టి సారించడం లేదు. గ్రామ పంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్యం కోసం తదితర అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన 13వ ఆర్థిక సంఘం నిధులపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫలితంగా నిజామాబాద్ నగరపాలక సంస్థ, బోధన్, ఆర్మూరు, కామారెడ్డి మున్సిపాలిటీలతోపాటు జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో పారిశుధ్యం రోజు రోజుకు పేరుకుపోతున్నది. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలుంటే అందులో 27 మేజర్ గ్రామ పంచాయతీలుండగా వివిధ పద్దుల కింద వచ్చిన నిధులను సద్వినియోగం చేయలేకపోతున్నారు. జిల్లాలోని దోమల నియంత్రణకు ప్రత్యేకమైన వ్యవస్థ లేదు. ఉన్న వైద్య సిబ్బందికే నియంత్రణ పనులు అప్పజెప్పారు. వాస్తవానికి ప్రతి గ్రామ పంచాయతీలో ఫాగింగ్ యంత్రాలు లార్వా నియంత్రణ మిషన్లు ఉండాలి. దీనికిగాను ప్రతి గ్రామ పంచాయతీకి దోమల నియంత్రణ మందులను సరఫరా చేస్తు ప్రతి వారం రోజులకు ఒకసారి దోమల నివారణ కొరకు గ్రామంలో మురికికాల్వలు, నీటినిల్వ ప్రాంతాల్లో మందులు చల్లడం, స్ప్రేలు చేపట్టడం జరుగాలి. కానీ.. ఈ విధానం ఎక్కడ కొనసాగడం లేదు. దోమల నివారణకు శానిటేషన్ సిబ్బంది నివారణ మందులు చల్లేందుకు మరో సిబ్బంది బృందాలుగా అందుబాటులో ఉండాలి. వీరు కూడా అందుబాటులో లేరు. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)కు ప్రతి మూడునెలలకోసారి రూ.10 వేల చొప్పున కేవలం క్లోరినేషన్, పారిశుధ్యం కోసమే విడుదల చేస్తుండగా.. గతేడాది 20 పీహెచ్సీలలో నిధులను ఖర్చు చేయక వాపసు వెల్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జిల్లాలో అతిసార, సీజనల్వ్యాధులు విజంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
డయేరియాతో మహిళ మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం దుర్కి గ్రామంలో డయేరియాతో గంగవ్వ (50) అనే మహిళ గురువారం మృతి చెందింది. గ్రామంలో డయేరియా ప్రబలింది. దీంతో సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారులు గ్రామంలో మూడు రోజులు వైద్యశిబిరం నిర్వహించారు.అయితే గంగవ్వ ఈ రోజు మరణించింది. దాంతో బోధన్ ఆర్డీవో సుధాకర్ రెడ్డి గురువారం దుర్కి గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులకు అందుతున్నసేవలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. -
అతిసారంతో 41 మందికి అస్వస్థత
దుర్కి (బీర్కూర్) : నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలంలోని దుర్కి గ్రామంలో డయేరియా ప్రబలింది. మంగళవారం గ్రామానికి చెందిన సుమారు 41మంది దళితులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఏఎన్ఎం ఇచ్చిన సమాచారంతో బీర్కూర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిలిప్‌కుమార్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని అత్యవసర వైద్యశిబిరం నిర్వహించారు. అస్వస్థతకు గురైన వారిని గ్రామ చావిడి, సబ్సెంటర్లలో పరీక్షించి ప్రత్యేక చికిత్సలు అందించారు. గ్రామంలో డయేరియా వ్యాపిస్తోందని తెలుసుకున్న జిల్లా మలేరియా అధికారి లక్ష్మయ్య, జిల్లా స్పెషల్ డాక్టర్ రాజేష్‌లు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
వణికిస్తున్న అతిసార
ధారూరు: అతిసార, డయేరియా జనాన్ని వణికిస్తున్నాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ధారూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంగళవారం మూడు డయేరియా కేసులు వచ్చాయి. స్టేషన్ధారూరుకు చెందిన నసీమాబేగం(28), దోర్నాల్తండాకు చెందిన చంద్రిబాయి(40), ధారూరుకు చెదిన మంజుల(25) డయేరియాతో ఆస్పత్రిలో చేరారు. తరిగోపుల గ్రామానికి చెందిన ముగ్గురు, అంపల్లికి చెందిన ఒకరికి అతిసార సోకగా వారంతా ధారూరులో డాక్టర్ లేరంటూ వికారాబాద్, తాండూర్‌కు వెళ్లి వైద్యం చేయించుకున్నారు. -
మంచం పట్టిన పల్లెలు
♦ పారిశుద్ధ్యం అధ్వానం ♦ జిల్లా ఆస్పత్రిలో పెరుగుతున్న డయేరియా కేసులు ♦ ఇప్పటికే ఇద్దరు చిన్నారుల మృతి తాండూరు రూరల్: పల్లెలు మంచం పట్టాయి. ఎక్కడ.. ఏ ఇంట్లో చూసినా మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాల మూలుగులే వినిపిస్తున్నాయి. నెల రోజులుగా తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో అతిసార, డయేరియా వంటి రోగాలతో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజు ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి 40-60 డయేరియా కేసులు వస్తున్నాయి. ఓపీలో 100 కేసులు నమోదవుతున్నాయని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో వారం రోజుల నుంచి ఇద్దరు చిన్నారులు అతిసారతో మృతి చెందారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మండలంలోని జినుగుర్తి పీహెచ్సీలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి వస్తున్నారు. వైద్యం కోసం అవస్థలు పడుతున్నారు. లోపించిన పారిశుద్ధ్యం.. వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. అక్కడక్కడా తాగునీటి పైప్‌లైన్ లీకేజీలు ఉన్నా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కరన్‌కోట్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ, లేబర్ కాలనీల్లోని మురుగు కాల్వల్లో పేరుకుపోయిన మురుగును తొలగించలేదని ఆయా కాలనీవాసులు వాపోతున్నారు. ఉద్దండపూర్ అనుబంధ గ్రామమైన గుండ్లమడుగు తండాలో రోడ్డుపై మురుగునీరు పారుతోంది. జడిపిస్తున్న డయేరియా.. జిల్లా ఆస్పత్రిలో రోజురొజుకూ డయేరియా కేసుల నమోదు పెరుగుతోంది. గతనెల 25న 42, 26న 53, 27న 53, 28న 46, 29న 48, 30న 52 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు డయేరియా బారిన పడి బాధపడుతున్నారు. అయితే జబ్బులతో ఆస్పత్రికి వస్తే ఇక్కడా పరిసరాలు ఆపరిశుభ్రంగానే ఉన్నాయని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
గిరిజన గూడాల్లో ప్రబలుతున్న అతిసారం
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా గిరిజన గూడాల్లో అతిసారం మహమ్మరి ప్రబలుతోంది. జిల్లాలోని హుకుంపేట మండలం అడ్డుమండకు చెందిన యువకుడు అతిసారం బారిన పడి పాడేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే రెండు రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందింది. ఈ మధ్య కాలంలో నిమ్మలపాడులో అతిసారంతో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలో సుమారు 20 మంది గిరిజనులు అతిసారం బారిన పడి బాధపడుతున్నారు. -
80 మందికి డయేరియా
ఆస్పత్రిలో చేరిక వైద్య సిబ్బందిపై బాధితుల ఫిర్యాదు దోమకొండ : మండలకేంద్రంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన 80 మంది మంగళవారం డయేరియాతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. దోమకొం డకు చెందిన గంగామణి, భూదవ్వ, శోభ, శంకర్, మణెమ్మ, రాజశేఖర్, లక్ష్మి, మోహిన్‌పాషా, సనాపి లక్ష్మి, నవీన్, అనురాధ, సరస్వతి, సుజాత, కిషన్‌తో పాటు భిక్కనూరు మండలం కాచాపూర్‌కు చెందిన పద్మ, లింగుపల్లి, తాడ్వాయి, సంఘమేశ్వర్, కోనాపూర్, అంచనూరు, ఇస్సానగర్, అయ్యవారి పల్లెకు చెందిన మరికొందరు వాంతులు విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. ఉద యం వచ్చిన డ్యూటీ డాక్టర్ మధ్యా హ్నం వెళ్లిపోగా వైద్యులు ఎవరూ లేకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు, బంధువుల కు భోజనం ఇవ్వలేదని సిబ్బంది తీరును ప్రశ్నించారు. పరామర్శించిన ప్రజాప్రతినిధులు.. పలువురి అస్వస్థత విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ సభ్యుడు గండ్ర మధుసూదన్‌రావ్ ఆస్పత్రికి చేరుకుని వారిని పరామర్శించారు. ఆ సమయంలో వైద్యులు లేకపోవడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున్‌కు ఫోన్‌చేసి మాట్లాడారు. డ్యూటీ డాక్టర్ అక్కడికి చేరుకుని వైద్యం అందించారు. కాగా తమకు సరైన వైద్యం అందించడం లేద ని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు భోజనం పెట్టలేదని జెడ్పీటీ సీ సభ్యుడికి వివరించారు. ఆస్పత్రిలో క్లీనింగ్ చేయడానికి సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన వైద్యం అందించాలని వారికి సూచించా రు. ఆయనతో పాటు సర్పంచ్ శారద, వార్డుసభ్యులు శ్రీకాంత్, శ్రీనివాస్, రమేశ్, అబ్బయ్య, తదితరులు ఉన్నారు. -
డయేరియాతో పాఠశాల విద్యార్థిని మృతి
నార్నూర్ (ఆదిలాబాద్) : జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ముకాడె జ్యోతి(7) డయేరియాతో సోమవారం మృతిచెందింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కెరమెరి మండలం కరంజీవాడ గ్రామానికి చెందిన గిరిజన దంపతులు దుర్పతబాయి, చంపత్రావుల కూతురు జ్యోతి ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. అయితే ఆమెకు శనివారం రాత్రి వాంతులు, విరేచనాలు అయ్యాయి. తగ్గకపోవడంతో ఆదివారం ఉదయం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లి వైద్యం అందించగా.. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. శనివారం రాత్రి వైద్యం అందించి ఉంటే పాప బతికేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతిచెందిందని ఆరోపించారు. పాఠశాల వద్ద విద్యార్థిని బంధువులు ఆందోళనకు దిగారు. -
అదుపులోకి రాని వాంతులు, విరేచనాలు
ఆస్పత్రి పాలవుతున్న పెద్దేముల్ ప్రజలు పట్టించుకోని అధికారులు పెద్దేముల్: మండలంలో వాంతులు విరేచనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆరుగురు వ్యక్తులు వాంతులు, విరేచనాలకు గురై బుధవారం ఆస్పత్రి పాలయ్యారు. పెద్దేముల్ గ్రామానికి చెందిన ఉప్పరి మాణెమ్మ (35), బ్యాగరి పార్వతమ్మ (45), నూర్జహాన్ (20), తలారి నర్సమ్మ (50), నర్కీన్ (20)తో పాటు గోపాల్పూర్ గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ (28) వాంతులు విరేచనాలతో పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ప్రతీరోజు సుమారు ఏడెనిమిది మంది వరకు ఆస్పత్రికి చికిత్స కోసం వస్తున్నారని వైద్య సిబ్బంది తెలిపారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
తగ్గని డయేరియా
మూడో రోజు మరో 40 మంది ఆస్పత్రుల్లో చేరిక అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బెల్లంపల్లి : బెల్లంపల్లిలో డయేరియా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. మూడో రోజు శుక్రవారం కూడా బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. వాంతులు, విరేచనాలతో ప్రజలు సతమతమవుతున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతిఖని, సుభాష్‌నగర్, 65 డీప్ ఏరియా, 85 డీప్ ఏరియా, నం.2 ఇంక్లైన్, బెల్లంపల్లిబస్తీలలో డయేరియా బాధితులు పదుల సంఖ్యలో ఉండగా మరికొన్ని బస్తీల్లోనూ ఒకరిద్దరు వాంతులు, విరేచనాలతో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గడిచిన రెండు రోజుల్లో సుమారు 100 మంది వరకు బాధితులు ఆస్పత్రుల్లో చేరగా, శుక్రవారం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో 20 మంది, సింగరేణి ఏరియా ఆస్పత్రిలో 20 మంది చొప్పున చేరారు. ప్రభుత్వాస్పత్రిలో పడకలు పూర్తిగా నిండిపోవడంతో వైద్యం కోసం వచ్చే రోగులకు వరండాలో బెంచీలు, నేలపై కార్పేట్ వేసి చికిత్స చేస్తున్నారు. సింగరేణిలో పని చేస్తున్న కార్మికుల కుటుంబ సభ్యులకు ఏరియా ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. మరికొందరు రోగులు ఇళ్ల వద్దనే ఆర్ఎంపీలతో చికిత్స చేయించుకుంటున్నారు. అప్రమత్తమైన అధికారులు బెల్లంపల్లిలో డయేరియా ప్రబలడంతో వెంటనే వైద్య ఆరోగ్య శాఖ, సింగరేణి అధికారులు అప్రమత్తమయ్యారు. డీఎంఅండ్‌హెచ్‌వో జలపతి నాయక్ హుటాహుటిన బెల్లంపల్లికి చేరుకొని రోగులను పరామర్శించారు. తాండూర్, తాళ్లగురిజాల, నెన్నెల తదితర ప్రాంతాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిని బెల్లంపల్లికి రప్పించి వైద్యం అందిస్తున్నారు. డీఎంఅండ్‌హెచ్‌వో పర్యవేక్షణలో బెల్లంపల్లి క్లస్టర్ ఇన్చార్జి కరుణాకర్, ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి చంద్రమౌళి ఇతర వైద్యులు రోగులను పరీక్షించారు. తాగునీరు కలుషితం కావడం వల్లనే డయేరియా ప్రబలినట్లు డీఎంఅండ్‌హెచ్‌వో జలపతి నాయక్ స్పష్టం చేశారు. పలువురి పరామర్శ డయేరియాతో ఆస్పత్రిలో చేరిన రోగులను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, తహశీల్దార్ కె.శ్యామలాదేవి, మందమర్రి ఏరియా జీఎం రాఘవులు వేర్వేరుగా వెళ్లి పరామర్శించారు. ఆస్పత్రిలో చేరిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. -
చికిత్సకు ముందే 40 వేలు కట్టాలన్నారు
యశోద ఆసుపత్రిపై ఎంపీ ఎం.ఎ.ఖాన్ ఫిర్యాదు సాక్షి, న్యూఢిల్లీ: డయేరియాతో బాధపడుతున్న తన భార్యను యశోద ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స ప్రారంభించకుండానే రూ.40 వేలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేసినట్లు రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ.ఖాన్ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు, రాజ్యసభ చైర్మన్‌కు, పిటిషన్ల కమిటీకి ఫిర్యాదు చేశారు. గత నెల 18న మలక్‌పేటలోని యశోదకి తన భార్య ఉన్నీసా బేగంను చికిత్స కోసం తీసుకె ళ్లానని, చికిత్సకు ముందే రూ.40 వేలు డిపాజిట్ చేయాలంటూ పట్టుపట్టారని పేర్కొన్నారు. ‘‘ఆ రోజు ఉదయం ఢిల్లీలో విరేచనాలకు మందులు తీసుకున్న లతీఫ్ ఉన్నీసాతో సహా అదే రోజు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నాం. సాయంత్రం కూడా తగ్గకపోవడంతో ఆసుపత్రికి వెళ్లాం. అప్పటికి వారం క్రితమే చేయించుకున్న అన్ని వైద్య పరీక్షలనూ చూపించాం. బాగా నీరసించినందున ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించాలని కోరాం. డిపాజిట్‌గా రూ.40 వేలు చెల్లించాలన్నారు. నేను రాజ్యసభ సభ్యుడినని, నాకు, నా భార్యకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) కార్డు కూడా ఉందన్నా వినలేదు. కొంత నగదు చెల్లించాకే వారు వైద్యం ప్రారంభించారు. మొత్తానికి కనీసం ఒకరోజు కూడా పూర్తి కాకుండానే రూ.25,016 బిల్లును చెల్లించాక డిశ్చార్జి చేశారు. ఎంపీకే ఈ పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఈ ఆసుపత్రిపై కఠిన చర్య తీసుకోవాలి’’ అని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. -
వేసవిలో పొంచిన వ్యాధుల ముప్పు
♦ కలుషిత నీటితో డయేరియా, అతిసారం, టైఫాయిడ్ ♦ ఇప్పటికే ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్య ♦ జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్యం తప్పదంటున్న వైద్యులు సాక్షి, హైదరాబాద్: భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కూలీలు, వ్యాపారులు, ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో అనేకచోట్ల 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండలో తిరిగేవారికి వాంతులు, విరేచనాలు, హైఫీవర్, చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్, బీపీ పెరగడం, కిడ్నీ, గుండె వంటి ఫెయిల్యూర్, కోమాలోకి వెళ్లడం వంటివి సంభవిస్తాయని వైద్యులు అంటున్నారు. వేసవిలో నీటిఎద్దడి కారణంగా నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువని, నిల్వ ఉంచిన ఆహారపదార్థాల్లో చేరిన బ్యాక్టీరియా స్వల్ప కాలంలోనే తమ సంఖ్యను రెట్టింపు చేసుకుంటుందని హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రతతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న రోగులసంఖ్య పెరిగిందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ ప్లూయీడ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో వడదెబ్బ బాధితులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. తక్షణమే వైద్య చికిత్స రోజుకు ఐదారుసార్ల కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు రావడం, వాంతులు, వికారం, మెలిపెట్టినట్లుగా కడుపునొప్పి ఉండటం, 101 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ జ్వరం ఉండం, ఐదారు గంటలుగా మూత్రవిసర్జన నిలిచిపోవడం, చర్మం పొడిబారి, లాగితే సాగిపోతుండటం, బాగా నీరసించిపోవడం, నాలుక తడారిపోవడం, ఏడ్చినా కన్నీరు రానప్పుడు... ఇవన్నీ ఒంట్లోంచి నీరు గణనీయంగా తగ్గిపోయిందని గుర్తించే లక్షణాలు. అలాగే పిల్లల శరీరంపై దద్దుర్లు రావడం, నుదురు వేడిగా ఉండటం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాలి. ఐవీ ప్లూయీడ్స్ అందుబాటులో ఉంచాలి నాలుగైదు గంటలు ఎండల్లో తిరిగితే వడదెబ్బ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బతో ఆసుపత్రులకు వచ్చేవారికి అవసరమైన ఐవీ ప్లూయీడ్స్ను ఇవ్వాలి. వీటిని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ విరివిగా అందుబాటులో ఉంచాలి. ఎండ నుంచి ఇంటికి రాగానే ఏమాత్రం నీరసంగా ఉన్నా ఒక గ్లాసుడు నీటిలో నాలుగు టీస్పూన్ల ఉప్పుతో నిమ్మకాయ రసం తాగాలి. మజ్జిగ, కొబ్బరిబొండాలు తాగించాలి. ఎక్కువ వడదెబ్బ తగిలితే చంకలు, మెడ భాగాల్లో ఐస్ ప్యాక్స్ పెట్టాలి. సాధారణ జిమ్‌లలో అతిగా ఎక్సర్సైజ్లు చేయకూడదు. - డాక్టర్ హరిచరణ్, సీనియర్ జనరల్సర్జన్,సన్‌షైన్ ఆసుపత్రి, సికింద్రాబాద్ -
చిన్నారుల మరణాలపై సీరియస్
ఇక నుంచి ఐదేళ్ల లోపు పిల్లలు మరణిస్తే వైద్యుల విచారణ డీఎంహెచ్‌వో ద్వారా కలెక్టర్‌కు నివేదిక మరణాల నివారణకు కలెక్టర్ ప్రణాళిక డయోరియా నుంచి కాపాడేందుకు టీకాలు చిన్న పిల్లల మరణాలు పెరిగిపోవడంతో వాటిని నిలువరించేందుకు ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇక నుంచి జిల్లాలో ఎక్కడైనా ఐదేళ్ల లోపు చిన్నారులు మరణిస్తే దానిపై సమగ్ర విచారణ చేస్తారు. సంబంధింత పీహెచ్సీ వైద్యులు లేదా డిప్యూటీ డీఎంహెచ్‌వో స్థాయి అధికారి నేరుగా చిన్నారి ఇంటికి వెళ్లి కారణాలు తెలుసుకుంటారు. నివేదికను డీఎంహెచ్‌వో ద్వారా కలెక్టర్‌కు పంపిస్తారు. కొయ్యూరు: ఇంతవరకు ఏడాదిలోపు బిడ్డ మరణిస్తేనే వైద్యాధికారులు విచారణ చేసి నివేదికను కలెక్టర్‌కు అందజేసేవారు. అయితే వివిధ కారణాలతో ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు పెరిగిపోతున్నాయి. దీంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ప్రతి చిన్నారి మరణంపై విచారణ చేయనున్నారు. ఈ నెల నుంచి సంభవించే ప్రతి మృతిపైనా విచారణ తప్పనిసరిగా ఉంటుంది. ఏఎన్ఎంల ద్వారా సమాచారం తెలుసుకున్న వైద్యులు నేరుగా బిడ్డ ఇంటికి వెళ్లి విచారిస్తారు. మరణానికి కారణాలు ఏమిటో తెలుసుకుంటారు. ఆ నివేదికను డీఎంహెచ్‌వోకు అందజేస్తారు. దానిని తరువాత కలెక్టర్‌కు పంపిస్తారు. మరణాల నివారణ చర్యలను కలెక్టర్ సూచిస్తారు. లేదా కొత్తగా ప్రణాళికను రూపకల్పన చేస్తారు. జిల్లాలో ప్రస్తుతానికి ప్రతి వెయ్యి మందిలో 38 వరకు శిశు మరణాలుంటున్నాయి. దానిని తగ్గించేందుకు చర్యలకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి ప్రసవం అయిన తరువాత బిడ్డకు పాలు పట్టినప్పుడు భుజంపై వేసుకుని కొద్దిసేపు ఉంచాలి. అలా ఉంచకపోవడంతో తాగిన పాలు నేరుగా ఊపిరితిత్తులలోకి వెళ్లి శ్వాస ఆడనీయకుండా చేస్తాయి. దీంతో బిడ్డ ఊపిరి ఆడక మరణిస్తున్న కేసులు మన్యంలో ఎక్కువగా ఉంటున్నాయి. రోటా వైరస్‌కు టీకా మందు చిన్నారుల ప్రాణాలు తోడేస్తున్న వ్యాధుల్లో డయేరియా ఒకటి. దీని ప్రభావాన్ని చాలా వరకు తగ్గించేందుకు వీలుగా రోటా వైరస్ నివారణకు ఈ నెల నుంచి టీకా మందును వేయేనున్నారు. దీని మూలంగా విరేచనాలతో మరణించేవారి సంఖ్య తగ్గుతుంది. బిడ్డకు ఆరు, పది,14 వారాల్లో చుక్కలు వేస్తారు. ఏటా దేశంలో డయేరియాతో లక్షా 20వేల మంది మరణిస్తున్నారని నర్సీపట్నం డిప్యూటీ డీఎంహెచ్‌వో సుజాత చెప్పారు. 4.5 లక్షల మంది విరేచనాలతో బాధపడుతున్నారన్నారు. దీనిని తగ్గించేందుకు వీలుగా టీకాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. బిడ్డ ప్రాణాలు కాపాడొచ్చు రోటా వైరస్‌ను నిలువరించేందుకు ప్రస్తుతం అమలులోకి రాబోతున్న టీకాల మందు చిన్నారుల ప్రాణాలను రక్షిస్తుంది. దీని మూలంగా విరేచనాల ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. బిడ్డ ప్రాణాలకు రక్షణ ఉంటుంది. ఈ నెల నుంచి దీనిని అమలు చేయనున్నారు - ఎండీ అహ్మద్, చిన్న పిల్లల వైద్యనిపుణుడు, రాజేంద్రపాలెం -
డయేరియాతో 30 మంది ఆస్పత్రిపాలు
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చిన్నదోర్జలో డయేరియా విజృంభించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు గ్రామానికి చెందిన సుమారు 30 మంది అస్వస్థతకు గురికాగా వారిని మూడు అంబులెన్సుల్లో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు ఉన్నాయి. ఊట నీరుని తాగునీరుగా వినియోగిస్తున్నారు. ఇది కలుషితం కావడం వల్లే డయేరియాకు దారితీసిందని సమాచారం. -
వేరికోస్ వెయిన్స్ చికిత్స విషయంలో నిర్లక్ష్యం వద్దు
ఆయుర్వేద కౌన్సెలింగ్ మా బాబుకు ఆర్నెల్లు. గత రెండు నెలలుగా విరేచనాలు అవుతున్నాయి. పలచగా కొంచెం కొంచెం ప్రతి రెండు గంటలకీ ఒకసారి వెళ్తున్నాడు. మలం ఆకుపచ్చరంగులో ఉంటోంది. ఎన్ని మందులు వాడినా, తాత్కాలిక ఉపశమనమే. ఆయుర్వేదంలో పరిష్కారం సూచించగలరు. - విశాల, నిజామాబాద్ శరీరంలోని ద్రవధాతువులు మలంతో ఎక్కువసార్లు గానీ లేదా అధిక ప్రమాణంలో గానీ బయటకు పోవడాన్ని ఆయుర్వేద పరిభాషలో ‘అతిసారం/అతీసారం’ అంటారు. దీనికి గల కారణాలలో పిల్లలకు, పెద్దలకు కొంచెం తేడా ఉంటుంది. కారణాలను బట్టి ఇతర అనుబంధ లక్షణాలలో కూడా మార్పు ఉంటుంది. ప్రధానంగా తల్లిపాలు తాగుతున్న శిశువులలో తల్లికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరం, విరేచనాలు, దగ్గు వంటి లక్షణాలుంటే, అవి పాలు తాగే శిశువులకూ సంక్రమిస్తాయి. అలాగే తల్లి ఆహారంలో ఉప్పు, పులుపు, కారం, మసాలాలు ఎక్కువగా తినడం, మానసిక ఉద్వేగాలకు లోనై విచారం, ఆందోళన, దుఃఖం వంటి లక్షణాలతో బాధపడినప్పుడుగానీ, ఇతర జీర్ణకోశ వ్యాధులు సోకినప్పుడు గానీ, కొన్ని రకాల మందులు వాడినప్పుడుగానీ ఆ ప్రభావం శిశువు మీద పడి ‘అతిసారం’ రావచ్చు. తల్లికి సంబంధించిన కారణాలలో... శిశువునకు ఇచ్చే పాల స్వభావం, ఇతర ఆహారాలు, వాటి కల్తీలు, కొన్ని రకాల మందులు ప్రధానంగా ఉంటాయి. మామూలుగా అయ్యే విరేచనాల సంఖ్య కంటే ఎంత పరిమాణం పోతోంది, ఎంత పల్చగా ఉంది, రంగు ఎలా ఉంది అన్నదాన్ని బట్టి శిశువు శరీరం ‘నష్టద్రవానికి’ (డీహైడ్రేషన్‌కు) గురైందో తెలుస్తుంది. అదేవిధంగా వాంతులు, జ్వరం కూడా ఉంటే ఇన్ఫెక్షన్ ఉందని అర్థం చేసుకోవాలి. శిశువు పాలు తాగుతున్నా లేదా వయసుని బట్టి ఇచ్చే మెత్తని ద్రవఘనాహారం సక్రమంగా తీసుకుంటున్నా పరిస్థితి అంత తీవ్రంగా లేదన్నమాట. అతిసారంలో శిశువుకు ఆకలి కొంతవరకు మందగిస్తుంది. చికిత్స: తల్లి ఆహారం సాత్వికంగా, బలకరంగా ఉండాలి. మసాలాలు, కారం తగ్గించాలి. అల్లం, వెల్లుల్లి మితంగా ప్రతినిత్యం సేవించాలి. తగినంత నిద్రపోతుండాలి. మానసికంగా ఉల్లాసంగా, సంతోషంగా ఉండాలి. శిశువునకు వాడే బట్టలు, ఇతర వస్త్రాలు అత్యంత పరిశుభ్రంగా ఉండాలి. ఔషధాలు: 1. కర్పూర రస మాత్రలు : ఒకటి ఉదయం, ఒకటి రాత్రి తేనెతో... రెండు రోజులకంటే ఎక్కువ వాడవద్దు. 2. ప్రవాళపిష్ఠి, జహర్మొహర్పిష్ఠి (భస్మాలు): ఒక్కొక్కటి రెండేసి చిటికెలు (100 మి.గ్రా.) తేనెతో రెండుపూటలా. ఇది ఒక సంవత్సరం వయసు వరకు నిత్యం వాడుకోవచ్చు. దీనివల్ల శిశువుకు ఆకలిపెరగడం, ఎముకలకు, గుండెకు బలం కలుగుతుంది. నీరసం తగ్గుతుంది. మలం ఆకుపచ్చ రంగునుంచి ప్రాకృతవర్ణానికి మారుతుంది. గృహవైద్యం: ‘వాము’ని కషాయంగా కాచి పిల్లల్లో అయితే పావు చెంచా నుంచి అరచెంచా, పెద్దల్లో ఒకటి రెండు చెంచాలు తాగిస్తే అతిసారం వెంటనే తగ్గుతుంది. శరీరద్రవాంశాలు మెరుగుపడటానికి కొబ్బరినీళ్లు తాగించవచ్చు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్‌నగర్, హైదరాబాద్ వాస్క్యులర్ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నేను ఒక పరిశ్రమలో పనిచేస్తున్నాను. మోకాలి కింది భాగం నుంచి పాదాల వరకు ఉన్న రక్తనాళాలు ఉబ్బినట్లుగా కనిపిస్తున్నాయి. అవి ఎర్రటి, నీలం రంగులో ఉన్నాయి. వాటి వల్ల నాకు బాధ లేదు కానీ, ఎబ్బెట్టుగా, ఇబ్బందికరంగా ఉన్నాయి. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరు. - ప్రశాంత్, నెల్లూరు మనిషి శరీరానికంతటికీ గుండె, రక్తనాళాల ద్వారా రక్తాన్ని సరఫరా చేస్తుంది. మళ్లీ అవే రక్తనాళాల ద్వారా రక్తం గుండెకు చేరుతుంది. అయితే మిగతా భాగాల విషయంలో ఎలా ఉన్నప్పటికీ కాళ్ల విషయానికి వస్తే భూమి ఆకర్షణ శక్తి వల్ల ఈ రక్తప్రసరణ ప్రక్రియ కాస్త ఆలస్యమవుతుంది. అంతేకాకుండా వయసు పైబడటం, కుటుంబ నేపథ్యం, స్థూలకాయం, కూర్చొని పనిచేయటం, అదేపనిగా నిలబడి పనిచేయడం, బరువైన వృత్తిపనులు చేయడంతో జరిగినప్పుడు రక్తప్రసరణ ఆలస్యం అవుతుంది. మహిళల్లో గర్భధారణ, హార్మోన్ల ప్రభావం వంటి అంశాలు రక్తప్రసరణ ఆలస్యమయ్యేలా చేయవచ్చు. శరీరంలో ఏ భాగానికైనా ఈ సమస్య ఏర్పడవచ్చు. కానీ సాధారణంగా మోకాలి కింది భాగం నుంచి పాదాల వరకు ఇది ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు మీ కాలి దగ్గర ఒక ఎత్తయిన దిండు వేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీ కాలి రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడినా లేదా రక్తనాళాలు ఉబ్బి గుండెకు చేరాల్సిన రక్తసరఫరాను అవి అడ్డుకుంటుంటే అప్పుడు మీరు ‘వేరికోస్ వెయిన్స్’ అనే కండిషన్ బారిన పడ్డట్లు చెప్పవచ్చు. మీరు మీ డాక్టర్‌ను సంప్రదిస్తే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తారు. ఒకవేళ మీరు ‘వేరికోస్ వెయిన్స్’ బారిన పడ్డా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన వివరాల ప్రకారం మీ సమస్య మొదటి దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆధునిక వైద్య చికిత్స ద్వారా మీ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు. సర్జరీ వంటి ప్రక్రియలకు ఖర్చు చేయడం అనవసరం అనే అభిప్రాయంతో మీ సమస్య తీవ్రతను పెంచుకోవద్దు. అలాగే నొప్పి, దురద, వాపులాంటివి లేవనుకొని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోండి. డాక్టర్ దేవేందర్ సింగ్ సీనియర్ వాస్క్యులార్ సర్జన్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు 14 ఏళ్లు. ఏడాది కిందటినుంచి ఒంటిమీద, ముఖం మీద చాలా మచ్చలు వస్తున్నాయి. ఈ మచ్చలు పోవడానికి ఏం చేయాలి? - రవళి, నిజామాబాద్ మీ పాపకు ఉన్న కండిషన్ నీవస్ అంటారు. దీన్ని వైద్యపరిభాషలో మల్టిపుల్ నీవస్ అనీ, సాధారణ పరిభాషలో చర్మంపై రంగుమచ్చలు (కలర్డ్ స్పాట్స్ ఆన్ ద స్కిన్) అంటారు. ఇవి రెండు రకాలు. మొదటిది అపాయకరం కానివీ, చాలా సాధారణంగా కనిపించే మచ్చలు. రెండోది హానికరంగా మారే మెలిగ్నెంట్ మచ్చ. ఒంటిపై మచ్చలు పుట్టుకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు 10 నుంచి 30 ఏళ్ల మధ్య రావచ్చు. నీవస్ చర్మానికి రంగునిచ్చే కణాల వల్ల వస్తుంది. ఇది శరీరంలో ఎక్కడైనా (అరచేతుల్లో, అరికాళ్లలో, గోళ్లమీద కూడా) రావచ్చు. సూర్యకాంతికి ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం, కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలున్న సందర్భాల్లో ఇది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. ఇది పుట్టుక నుంచి ఉండటంతో పాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది. వారికి ఈ మచ్చలతో పాటు జన్యుపరమైన అబ్నార్మాలిటీస్ చూస్తుంటాం. అలాంటి వాళ్లకు ముఖ ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లోపాలు కనిపిస్తాయి. మీ పాపకు ఉన్న కండిషన్‌తో పైన చెప్పినవాటికి సంబంధం లేదు. మీ పాపది హానికరం కాని సాధారణ నీవస్ కావచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే... కొన్ని నీవస్‌లు క్రమంగా క్యాన్సర్ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒంటిపై మీ పాపలా మచ్చలు ఉన్నవారు రెగ్యులర్‌గా డెర్మటాలజిస్ట్‌లతో ఫాలో అప్‌లో ఉండటం మంచిది. అది ఎలాంటి మచ్చ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాలు గమనిస్తూ ఉండటం మంచిది. ఏ- అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవంలో ఏదైనా మార్పు ఉందా?, బీ- అంటే బార్డర్... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా?, సీ- అంటే కలర్... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందా?, డీ- అంటే డయామీటర్... అంటే మచ్చ వ్యాసం (పరిమాణం) పెరుగుతోందా? ఈ నాలుగు మార్పుల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్ విజయనగర్ కాలనీ హైదరాబాద్ -
అతిసారతో 20 మందికి అస్వస్థత
అనకాపల్లి : విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొండుపాలెం గ్రామవాసులు ఉన్నట్టుండి అస్వస్థత పాలయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి పెద్దలు, పిల్లల్లో అతిసార లక్షణాలు బయటపడ్డాయి. వాంతులు, విరేచనాలతో తీవ్రంగా బాధపడుతున్న ముగ్గురు చిన్నారులను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 15 నుంచి 20 మందిని సబ్బవరం ఆస్పత్రికి తరలించారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంతమంది అస్వస్థతకు గురవ్వడంతో గ్రామంలో పరిస్థితి అయోమయంగా ఉంది. -
పాలకొల్లులో తీవ్రమౌతున్న డయేరియా
పాలకొల్లు అర్బన్ : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో డయేరియా వ్యాధి తీవ్ర రూపం దాలుస్తోంది. శనివారం పట్టణంలోని పెద్దపేట, 16వ వార్డు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. అంతకు ముందు రెండు రోజుల్లో సుమారు 100 మంది వరకు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వీరే కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కొంత మంది బాధితులు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కాగా, ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్.విజయగౌరి శనివారం పరామర్శించారు. మంచి నీరు కలుషితం కావడమే దీనికి కారణంగా స్థానికులు చెబుతున్నారు. -
నెల్లిమర్లలో విజృంభిస్తున్నడయేరియా
నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతిలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటికే నెల్లిమర్ల, జరగాపుపేటకు చెందిన సుమారు 200 మంది డయేరియా బారిన పడగా.. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో 27 మంది చికిత్స పొందుతున్నారు. ఇంత జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. -
బంట్వారంలో పెరిగిన డయేరియా కేసులు
రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలంలో డయేరియా ప్రబలింది. బొపునారం గ్రామంలో డయేరియాతో గురువారం ఆశన్న(70)చనిపోగా, మరో ఇరవై మంది బాధితులు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో కలుషిత నీరు తాగటం వల్లే డయేరియా ప్రబలిందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది స్థానికంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. -
గ్రామంలో అదుపులోకి వచ్చిన అతిసారం
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం నాగరాజపేటలో అతిసారం వ్యాధి అదుపులోకి వచ్చింది. వారం రోజుల వ్యవధిలో సుమారు 60 మంది అతిసారం బారిన పడి అస్వస్థతకు గురికాగా, ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. మంగళవారం కూడా నలుగురు అతిసారం బారినపడినట్టు సమాచారం. గ్రామంలోని నీటి నమూనాలను ప్రయోగశాలకు పంపారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో కృపావరం పర్యవేక్షణలో డాక్టర్ అరుణారావు వైద్య సేవలు అందిస్తున్నారు. -
నాగరాజుపేటలో ప్రబలిన డయేరియా
పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు రూరల్ పంచాయతీ పరిధిలోని నాగరాజుపేట గ్రామంలో డయేరియా ప్రబలింది. వారం రోజులుగా సుమారు 70 మంది గ్రామస్తులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి వైద్య సహాయం అందకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రుల బాట పట్టారు. నీరు కలుషితం కావడం వల్లే డయేరియా ప్రబలిందని వైద్యులు తెలిపారు. -
అతిసారతో 75 మందికి అస్వస్థత
తాండూరు : రంగారెడ్డి జిల్లా తాండూరు మండల పరిధిలోని గొల్లచెరువు గ్రామంలో అతిసార ప్రబలింది. గ్రామంలోని 75 మంది అతిసార బారిన పడ్డారు. దీంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో రోగులకు సరిపడ మంచాలు లేక ఓ మంచంపై ఇద్దరు రోగులను పడుకోపెట్టి వైద్యం అందిస్తున్నారు. దాంతో రోగులు తీవ్ర అసౌక్యం చెందుతున్నారు. అతిసార ప్రబలినా ... అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో... రోగుల కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. -
ప్రబలిన అతిసార
25 మంది బాలికలకు అస్వస్థత షాద్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో అతిసార వ్యాధి ప్రబలింది. దీంతో అక్కడ ఉండే 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం నుంచి నేటికే 25 మంది అస్వస్థతకు గురైతే.. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వారికి అతిసార సోకినట్లు నిర్ధరించారు. ఆస్పత్రిలో చేరిన వారిలో 10 మంది టాబ్లెట్లు, ఇంజక్షన్లు తీసుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. 15 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్టల్లో ఆహారం, మంచినీరు కలుషితం కావటం వల్లే అతిసార వ్యాపించిందని వైద్యులు తెలిపారు. హాస్టల్లోని 170 మందిలో 25 మంది విద్యార్థినులు ఆస్వస్థతకు గురికావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెంది మిగతా వారిని ఇంటికి తీసుకు పోతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
డయేరియాతోనే 13 శాతం శిశు మరణాలు
దోమ/పరిగి : ఐదేళ్ల లోపు శిశువులు, చిన్నపిల్లల మరణాల్లో 13 శాతం డయేరియా (నీళ్ల విరేచనాలు) వల్లే సంభవిస్తున్నాయని జిల్లా శిశు ఆరోగ్య, వ్యాధి నిరోధక టీకాల అధికారి (జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి) నిర్మల్ కుమార్ పేర్కొన్నారు. నీళ్ల విరేచనాలు కావడానికి గల కారణాలు, నివారణ మార్గాలపై ఆయన దోమ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా పరిగి ఆస్పత్రిలో నిర్వహిస్తున్న ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నీళ్ల విరేచనాల వల్ల శరీరంలో నీరు, లవణాల శాతం గణనీయంగా తగ్గిపోయి ప్రాణాంతక పరిస్థితి తలెత్తుతుందన్నారు. దీనిని అరికట్టడం సులభమని, తగు జా గ్రత్తలతో ఇంటి వద్దే చికిత్స అందించే వీలుందన్నారు. విరేచనాల బారిన పడే చిన్నారులకు తల్లిపాలతో పాటు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తా గించాలని సూచించారు. జింక్ మాత్రలు వేయ డం ద్వారా విరేచనాలను నియంత్రించే వీలుం టుందన్నారు. పిల్లలు నలతగా, సుస్తీగా ఉండి తల్లి పాలను తాగకపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడడం లాంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుడి వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు. పక్షోత్సవాల్లో భాగంగా మొదటి వారం గ్రామాల్లో వైద్య బృందం పర్యటించి ఐదేళ్లలోపు పిల్లలున్న ఇళ్లలో ఓఆర్ఎస్ ప్యాకె ట్లు, జింకు మాత్రలు అందజేస్తామని తెలిపా రు. రెండో వారంలో తల్లులు పిల్లలకు పాలు పట్టే విధానం ఇతర జాగ్రత్తలపై శిక్షణ ఇస్తామన్నారు. పై కార్యక్రమాల్లో పీహెచ్సీ వైద్యాధికారి టీ కృష్ణ, గణాంకాధికారి కృష్ణ, సామాజిక ఆరోగ్య అధికారి కే బాలరాజు, ఆరోగ్య విస్తరణ అధికారి వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పురంధర దాస్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. -
శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా: ఒకరి మృతి
- ఇద్దరి పరిస్థితి విషమం సాలూరు: శ్రీకాకుళం జిల్లాలో డయేరియా ప్రభలుతోంది. జి.సిగడాం మండలం పెనసాం గ్రామంలో సోమవారం డయేరియాతో ఒకరు మృతి చెందారు. పలువురు ఆస్పత్రి పాలయ్యారు. పలువురు ఆస్పత్రి పాలయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డైయేరియా!
ప్రబలుతున్న అతిసార ఇప్పటికే ఒకరి మృతి వందల్లో బాధితులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టని అధికారులు గుంతకల్లు మండలం నల్లదాసరిపల్లికి చెందిన రమాదేవి అలియాస్ రామక్క (28) బతుకుదెరువు కోసం 20 రోజుల క్రితం భర్త శ్రీనివాసులు, కుమార్తె సుజితతో కలిసి పామిడికి వలస వచ్చింది. నాగలకట్ట వీధిలో ఉంటూ కూలి పనులు చేసేది. ఈ నెల 15న వాంతులు, విరేచనాలు అధికం కావడంతో కుటుంబ సభ్యులు అక్కడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందింది. ఆమె కుమార్తెకు కూడా అతిసార సోకడంతో చికిత్స తీసుకుంది. అనంతపురం మెడికల్ : జిల్లాలో అతిసార (డయేరియా) ప్రబలుతోంది. గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈగల బెడద కూడా ఎక్కువైంది. వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టకపోవడంతో ప్రజలు అతిసార బారిన పడుతున్నారు. ఎవరైనా చనిపోతే తప్పా అధికార యంత్రాంగం ముందుకు కదలడం లేదు. ఒక్క అనంతపురం సర్వజనాస్పత్రిలోనే ఈ నెల ఒకటి నుంచి శనివారం వరకు 339 మంది అతిసార బాధితులు చేరారు. వీరిలో 156 మంది పురుషులు, 183 మంది మహిళలు ఉన్నారు. పామిడికి చెందిన కేసులు అధికంగా నమోదవుతున్నట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఈ నెల 15 నుంచి 20 మధ్య పామిడి, ఆ పరిసర గ్రామాలకు చెందిన పర్వీన్, కదిరమ్మ, ఓబుళమ్మ, ఖాజావలి, హనుమంతరెడ్డి, శ్రావణి సర్వజనాస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం పామిడి మండలం దేవరపల్లికి చెందిన సుమలత (22) చికిత్స తీసుకుంటోంది. పీహెచ్‌సీల్లో అందని వైద్యం అతిసార సోకగానే బాధితులు వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీలు)కు వెళ్తున్నారు. అక్కడ సరైన వైద్యం అందడం లేదు. రోగి పరిస్థితి ఆందోళనకరంగా లేనప్పటికీ ‘మనకెందుకొచ్చిందిలే’ అని వైద్యులు ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ముందు జాగ్రత్తలతో నివారణ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అతిసార బారిన పడకుండా ఉండవచ్చు. ముఖ్యంగా క్లోరిన్ కలిపిన నీరు సరఫరా అవుతోందా, లేదా పరిశీలించాలి. గ్రామాల్లోని వాటర్ ట్యాంకుల్లో సరిగ్గా బ్లీచింగ్ అవుతోందా అన్న విషయం పరిశీలించాలి. ఏదైనా లోపముంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఇళ్లలో నిల్వ ఉంచుకోవాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. అతిసార లక్షణాలు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, దాహం, నోరు ఎండిపోవడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం. కారణాలు కలుషిత నీరు, ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అతిసార సోకుతుంది. నిల్వవున్న ఆహార పదార్థాలు తినడం మంచిది కాదు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత లోపించినా కూడా అతిసార సోకే ప్రమాదముంది. ‘అనంత’లోనూ పెరుగుతున్న బాధితులు అతిసార అనంతపురం నగరంలోనూ ప్రబలుతోంది. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెబుతున్న ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పట్టించుకోకపోవడంతో ఏ డివిజన్లో చూసినా చెత్తాచెదారమే దర్శనమిస్తోంది. ఫలితంగా రోగాలు ప్రబలుతున్నాయి. రాంనగర్‌కు చెందిన బాషా, రామ్మోహన్, నాగలక్ష్మి రెండ్రోజుల క్రితం అతిసారతో సర్వజనాస్పత్రిలో చేరారు. ఆదివారం ఉదయం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వెనుకభాగంలోని మటన్‌మార్కెట్ వద్ద నివాసముంటున్న భారతి (35) కూడా ఆస్పత్రిలో చేరింది. పరిశుభ్రత ముఖ్యం అతిసార ప్రబలకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఈగలు వాలకుండా వంట పాత్రలపై మూతపెట్టాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి. మురికినీరు నిల్వ ఉండకుండా చూడాలి. పరిసరాల్లో చెత్తకుప్పలు వేయరాదు. - డాక్టర్ శివకుమార్, ఏడీఆర్ఎం, అనంతపురం సర్వజనాస్పత్రి అధికారులను అప్రమత్తం చేశాం వ్యాధులు ప్రబలకుండాచర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశాం. అతిసారపై ప్రజలను అప్రమత్తం చేయడానికి కరపత్రాలు పంపిణీ చేస్తాం. కళాజాతాలు నిర్వహిస్తాం. హెల్త్ ఎడ్యుకేటర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. అన్ని ఆస్పత్రుల్లో మందులు సిద్ధంగా ఉన్నాయి. - వెంకటరమణ, అడిషనల్ డీఎంహెచ్ఓ. -
గ్రామంలో అతిసార : ఒకరు మృతి
శాంతిపురం (చిత్తూరు) : చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరు గ్రామంలో అతిసార ప్రబలి ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దూరు గ్రామంలోని మంచినీటి పథకం ద్వారా సరఫరా అయ్యే నీరు సోమవారం కలుషితం కావటంతో స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరారు. కాగా కనకమ్మ(80) అనే మహిళ పరిస్థితి విషమించి మంగళవారం మధ్యాహ్నం చనిపోగా మునెప్ప(55) ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. -
చిత్తూరు జిల్లాలో అతిసార ప్రబలి ఒకరు మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం 24 పెద్దూరు గ్రామంలో అతిసార ప్రబలి ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలోని మంచినీటి పథకం నుంచి సరఫరా అయ్యే నీరు సోమవారం కలుషితం కావడంతో స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. దాంతో గత రాత్రి దాదాపు 15 మంది ఆసుపత్రుల్లో చేరారు. మంగళవారం మధ్యాహ్నం కనకమ్మ ( 80) పరిస్థితి విషమించి చనిపోయింది. మరో వ్యక్తి మునెస్ప (55) ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
అతిసారంతో 50 మందికి అస్వస్థత
ఓర్వకల్లు : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని గట్టుపాడు గ్రామంలో అతిసారం బారిన పడి 50 మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు కారణంగా వాంతులు, విరేచనాలు అవుతుండడంతో బాధితులను మంగళవారం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డయేరియాతో 23 మందికి అస్వస్థత
చిత్తూరు: చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని రెండు గ్రామాల్లో డయేరియా ప్రబలింది. ఈ రెండు గ్రామాలకు చెందిన 23 మంది విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో సోమవారం ఉదయం సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయించారు. వీరిలో18 మందికి చికిత్స చేసి పంపించగా, ఇంకా ఐదుగురు చికిత్స పొందుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఎండవేడిమికి తోడు కలుషిత నీరు తాగడం వల్లే వారు అస్వస్థత పాలైనట్టు పేర్కొన్నారు. -
అతిసారతో 100 మందికి అస్వస్థత
పాణ్యం : కర్నూలు జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లి గ్రామంలో అతిసార వ్యాధి ప్రబలింది. గత మూడు రోజుల నుంచి ఎండలు తీవ్రంగా ఉండటంతో ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు అస్వస్థతకు గురయ్యారు. దీనికి తోడు గ్రామానికి సరఫరా అయ్యే నీరు కలుషితం కావటంతో దాదాపు 100 మంది మంచానపడ్డారని తెలిసింది. గ్రామవాసులు పెద్ద సంఖ్యలో వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడటంతో అధికారులు గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. -
ఆదిలాబాద్ జిల్లాలో ప్రబలిన అతిసారం
వాంకడి (ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా వాంకడి మండలంలోని బండకాస గ్రామంలో అతిసారం ప్రబలి 13 మంది అస్వస్తతకు గురయ్యారు. గ్రామంలో ఆదివారం సాయంత్రం నుంచి కొంతమంది ప్రజలు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. వీరిని పరీక్షించిన స్థానిక వైద్యులు అతిసారం ప్రబలిందని నిర్ధారించారు. వీరందరిని వాంకడి మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. -
డయేరియాతో గిరిజన బాలిక మృతి
దాకరాయి(రాజవొమ్మంగి) : రాజవొమ్మంగి మండలం శరభవరం పంచాయతీ దాకరాయి గ్రామం సమీపంలో ‘కోదు ’ ఆదివాసీల తండాకు చెందిన ఓ ఆరేళ్ల బాలిక డయేరియాతో సోమవారం మరణించింది. కొండపోడు చేస్తూ జీవనం సాగిస్తున్న బార్సో, ఆనంద్‌ల కుమార్తె మువ్వల సాయి ఆదివారం సాయంత్రం నుంచి విరేచనాలతో బాధపడి నీరసించింది. ఆస్పత్రికి తీసుకు వెళదామనుకునే లోపే సోమవారం ఉదయం మరణించిందని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ పెద్దకుమారుడు భీమరాజు కూడా విరేచనాలతో బాధపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వీరుకాక గ్రామంలో మరికొంత మంది కడుపునొప్పి, ఇతర రుగ్మతలతో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ గ్రామం మారుమూలన ఉండడం వల్ల సకాలంలో వైద్యం అందించే ఆస్కారం లేకపోయిందని, అందువల్లే బాలిక మరణించిందని స్థానికులు చెబుతున్నారు. -
భీమవరంలో భయం భయం
భీమవరం (కూనవరం): భీమవరంలో అతిసారం విజృంభించింది. ఇప్పటికే ఓ విద్యార్థి మృతిచెందాడు. మరో 20మంది అస్వస్థులయ్యూరు. దీంతో, ఈ గ్రామస్తులు భయంతో వణుకుతున్నారు. ఈ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి మునిగెల మధు(22) మూడు రోజుల కిందట అతిసారంతో అస్వస్థుడయ్యూడు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందినప్పటకీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రిలో కుటుంబీకులు చేర్పించారు. హైదరాబాద్ తీసుకెళ్లాలని అక్కడి వైద్యుడు సూచించారు. చేతిలో తగినంత డబ్బు లేకపోవడంతో మధును అతని కుటుంబీకులు మంగళవారం రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి వేళ తీవ్రమైన వాంతులతో అతడు మృతిచెందాడు. మధు నివాసముంటున్న వీధికే చెందిన గంధ ం నాగమ్మ, గంధం అలివేలు, ముదుగొండ విజయ్‌కుమార్, ముదుగొండ రమాదేవి, ముదుగొండ రమ్య, నక్క వెంకటరమణ, బట్టా రాములమ్మ, నోముల సీతారామమ్మ, మందా అలివేలి మంగ, నోముల అలివేలు, నోముల సాయికృష్ణ, నోముల దేవి, గంధం సత్యనారాయణ, నందికొండ రాంబాబు, నందికొండ రాధిక, మునిగెల పుష్పావతి, బట్టా ప్రవీణ్, బట్టా శ్రీదేవి, శైలజ కూడా వాంతులు, విరేచనాలతో అస్వస్థులయ్యూరు. వీరంతా స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బట్టా నవీన్‌ను భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. వైద్య శిబిరం ఏర్పాటు అతిసారం సోకిన వీధిలో వైద్య శిబిరాన్ని కూనవరం వైద్యాధికారి డాక్టర్ అమరేంద్ర ఏర్పాటు చేశారు. ఇంటింటికీ వెళ్లి దాదాపు 40మందిని వైద్య సిబ్బంది పరీక్షించారు. జ్వరంతో బాధపడుతున్న ఏడుగురి నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఆహారం విషతుల్యం కారణంగానే అతిసారం ప్రబలినట్టుగా భావిస్తున్నట్టు వైద్యాధికారి డాక్టర్ అమరేంద్ర చెప్పారు. ఈ గ్రామాన్ని ఎంపీడీఓ అన్నపూర్ణ సందర్శించారు. పారిశుధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. -
వణికిస్తున్న డయేరియా
అనంతగిరి : మండలంలోని పలు గ్రామాల్లో డయేరియా, మలేరియాతో గిరిజనులు బాధపడుతున్నారు. భీమవరం, అనంతగిరి, లుంగపర్తి, పినకోట పీహెచ్‌సీల్లో రోజూ పదుల సంఖ్యలో గిరిజనులు జ్వరాలు, వాంతులు, విరేచనాలతో చేరుతున్నారు. శనివారం గుమ్మకోటకు చెందిన ఇద్దరు, టోకురు నుంచి ఒకరు వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురవ్వగా 108 సిబ్బందికి ఇబ్బందిగా మారింది. దీంతో తొలుత టోకురు నుంచి బాధితుణ్ణి ఎస్.కోట.ఆస్పత్రికి చేర్చారు. తర్వాత అదే గ్రామం నుంచి మరో బాధితురాలు అస్వస్థతకు గురవ్వగా, 108 అందుబాటులో లేక, డోలీ మోతతో తరలించారు. అప్పటికి అంబులెన్స గుమ్మకోటకు చేరుకొని మరో ఇద్దరు డయేరియా బాధితులను ఎస్‌కోట ఆస్పత్రికి తీసుకెళ్లింది. గ్రామాల్లో వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉండడంలేదని, ఇకనైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. -
అతిసార
బాధితులు 2.48 లక్షల మంది చిన్నారులు అప్రమత్తమైన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆగస్టు 9 వరకు జాగృతి కార్యక్రమం ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ సిరప్‌ల వితరణ సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో అతిసార విజృభిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడిన చిన్నారులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 2,48,142 మంది చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జాగృతి కార్యక్రమాలను సోమవారం ప్రారంభించింది. ఇవి వచ్చే నెల తొమ్మిది వరకూ కొనసాగుతాయి. ఇందులో భాగంగా ఆశాకార్యకర్తలు ఇంటింటికి తిరిగి అతిసారాకు గురైన చిన్నారులను గుర్తించి వైద్య సేవలు అందిస్తారు. అంతే కాకుండా ఓఆర్ఎస్ పాకెట్లను, జింక్ సిరప్‌ను ఉచితంగా అందజేస్తారు. ఇందుకోసం ఇప్పటికే 40,35,370 ఓఆర్ఎస్ (ఓరల్ రీ హైడ్రేషన్ సాల్ట్) పాకెట్లను, 4,55,070 జింక్ సిరప్ బాటిళ్లను సిద్ధం చేసిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వాటిని రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేసింది. అంతేకాక అవసరమైతే మరిన్ని ఓఆర్ఎస్, జింక్ సిరప్‌ల బాటిళ్లను వితరణ చేయడానికి బఫర్‌స్టాక్‌ను కూడా అందుబాటులో ఉంచుకుంది. రాష్ట్ర విద్యాశాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారుల సహాయంతో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో అతిసార విషయమై వీధి నాటకాలు, చిత్రాల ప్రదర్శన తదితర వాటి ద్వారా జాగృతి కార్యక్రమాలు నిర్వహించనుంది. కాగా, అపరిశుభ్రమైన ఆహారం తినడం వల్లే పిల్లలు అతిసార బారిన పడుతున్నారని వైద్యలు పేర్కొంటున్నారు. అందువల్ల వీధుల్లో విక్రయించే తినుబండారాలకు పిల్లలను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా అతిసారపై ప్రజల్లో జాగృతి కల్పించడానికి ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వైద్యులు కూడా ముందుకు రావాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో కోరింది. ఒకే ప్రాంతం నుంచి ఎక్కువ అతిసారా కేసులు ఆస్పత్రికి వస్తే.. వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యాధికారికి తప్పక తెలియజేయాలని పేర్కొంది. -
బంగాళ దుంప తింటే బీపీ తగ్గుతుందా?
రూట్ ఫ్యాక్ట్స్ అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్లు రోజూ ఒక మీడియం సైజు ఉడికించిన బంగాళదుంపను తింటుంటే రక్తపోటు అదుపులోకి వస్తుంది. డయేరియాతో బాధపడుతున్నప్పుడు ఆహారంలో ఉడికించిన బంగాళదుంప తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మితిమీరి తింటే అదే విరేచనాలకు కారణం అవుతుంది కూడా. బంగాళదుంపలో క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించే శక్తి ఉంటుంది. బంగాళదుంపలో బీ కాంప్లెక్స్, సి విటమిన్లతోపాటు ఖనిజలవణాలు, కొద్ది మోతాదులో పీచు, కెరటినాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు శరీరం లోపలి అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పెంచుతాయి. కాబట్టి స్థూలకాయులు, షుగర్ ఉన్నవారు బంగాళదుంప చాలా పరిమితంగా తీసుకోవడమే మంచిది. పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. -
వైద్య,ఆరోగ్య సేవలు అన్ని గ్రామాలకు చేరాలి
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు అన్ని గ్రామాలలోను ప్రత్యేక వైద్యశిబిరాలు ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్ పాడేరు: ఏజన్సీలోని ఎపిడమిక్ సీజన్‌ను సమర్ధంగా ఎదుర్కోవాలని, గిరిజనులకు వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఐటీడీఏ పీఓ వి.వినయ్‌చంద్ హెచ్చరించారు. ఏజెన్సీలోని 36 ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలు, సీజనల్ వ్యాధుల తీవ్రతపై శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారులు, ఎస్పీహెచ్ఓలు, వైద్యఅధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రత్యేకాధికారులంతా ఎపిడమిక్ సీజన్ ముగిసేంత వరకు వైద్య ఆరోగ్య కార్యక్రమాలను అనుక్షణం సమీక్షించాలని ఈ సందర్భంగా పీవో ఆదేశించారు. మలేరియా, డయేరియా, వైరల్ జ్వరాలు, క్షయవ్యాధి నివారణకు చేపడుతున్న వైద్య ఆరోగ్య కార్యక్రమాలన్నీ అన్ని గ్రామాలకు చేరాలని సూచించారు. ఎక్కడ అనారోగ్య సమస్యలు ఉన్నా వెంటనే వైద్యాధికారి, ఇతర సిబ్బంది ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించాలన్నారు. అన్ని గ్రామాల్లోను దోమల నివారణ మందును స్ప్రేయింగ్ చేయాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, ఆశ కార్యకర్తల వద్ద పూర్తిస్థాయిలో మందుల నిల్వలు ఉండాలని, ఎస్పీహెచ్ఓలు కూడా ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి వైద్యసిబ్బంది పనితీరును సమీక్షించాలని ఆదేశించారు. ఎక్కడ అనారోగ్య సమస్యలతో గిరిజనులు మృతి చెందినా సంబంధిత వైద్యసిబ్బందిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. మరణాలకు సంబంధించి రోజువారీ నివేదికను తమకు అందజేయాలన్నారు. ప్రతి పంచాయతీకి రూ. 4 లక్షల మేరకు నిధులు అందుబాటులో ఉన్నాయని తద్వారా పారిశుధ్యం, తాగునీటి వనరుల క్లోరినేషన్ పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో పాడేరు ఆర్డీఓ రాజకుమారి, ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు, గిరిజన సంక్షేమ డీడీ బి.మల్లికాార్జునరెడ్డి, ఈఈ ఎంఆర్జీ నాయుడు, పీహెచ్ఓ చిట్టిబాబు, పీఏఓ భాగ్యలక్ష్మి, డీఎంఓ ప్రసాదరావు, ఇన్చార్జి ఏడీఎంహెచ్ఓ డాక్టర్ లీలాప్రసాద్, అన్ని క్లష్టర్ల ఎస్పీహెచ్ఓలు, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
ఎపిడమిక్‌ను ఎదుర్కొంటాం
డయేరియా బాధితులకు మెరుగైన సేవలు అన్ని పీహెచ్‌సీలకు అంబులెన్స్‌లు, డాక్టర్లు వైద్య సేవల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ పాడేరురూరల్, న్యూస్‌లైన్ : ఏజెన్సీలో ఎపిడమిక్ తీవ్రతను ఎదుర్కొని నియంత్రిస్తామని పాడేరు ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ తెలిపారు. ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో చేరిన డయేరియా బాధితులను శుక్రవారం పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి వైద్యులకు సూచించారు. అన్ని వార్డుల్లోకి వెళ్లి సేవల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డయేరియా ప్రబలిన రవ్వలమామిడి, గిడ్డివలస, గొల్లమామిడి గ్రామాలతో పాటు మన్యంలోని అన్ని గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సమస్య తలేత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 36 పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత లేకుండా చూస్తామన్నారు. అంబులెన్స్‌లను ఏర్పాటు చేసామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి రోగులను తరలించేందుకు 1200 పల్లకీలను సిద్ధం చేసినట్టు చెప్పారు. ఈ సేవలన్నీ సోమవారం నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. ఎపిడమిక్ ముగిసేంతవరకు పాడేరు, అరుకు ప్రాంతీయ ఆస్పత్రుల్లో డిప్యుటేషన్‌పై మైదాన ప్రాంతాల నుంచి వైద్యులను నియమిస్తామన్నారు. పీహెచ్సీ అభివద్ధి నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని సూచించారు. అవి చాలకుంటే ఐటీడీఏ నుంచి అదనంగా కేటాయిస్తామన్నారు. గ్రామాల్లో వైద్య సేవల పర్యవేక్షణకు డీడీ స్థాయి అధికారులను మండలానికొకరిని నియమిస్తామన్నారు. ఇప్పటికే 1200 గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేపట్టామని, మిగిలిన గ్రామాల్లోనూ నెలాఖరుకు పూర్తి చేయనున్నట్టు తెలిపారు. గ్రామ స్థాయిలో విస్తృత వైద్య సేవలకు ఆశ కార్యకర్తలకు తరచూ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆయన వెంట ఏడీఎంహెచ్‌వో డాక్టర్ లీలాప్రసాద్, ఎస్పీహెచ్వో డాక్టర్ విశ్వేశ్వరరావు, ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులు శ్రీనివాసరావు, కష్ణారావు ఉన్నారు. -
వ్యాధుల ముసురు
మన్యంపై ముప్పేట దాడి ఇంటింటా రోగులు ఆస్పత్రుల్లో చాలని వసతులు ఇంటిల్లిపాదికీ ఒకే బెడ్‌పై వైద్య సేవలు మన్యం మంచమెక్కింది.. ముసురుకున్న వ్యాధులతో సతమతమవుతోంది. ఒక్కసారిగా వ్యాధులు విజృంభించడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మునుపటి కథ పునరావృతమవుతోంది. వాతావరణ మార్పులు, మంచినీటికైనా దిక్కులేని పరిస్థితులు, గిరిజనుల్లో కొరవడ్డ జాగ్రత్తలు.. ఇలా అనేకానేక కారణాలు సమస్యను జటిలం చేస్తున్నాయి. మన్యవాసులను భయపెడుతున్నాయి. ఇంటింటా వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో వైద్యం కష్టమవుతోంది. వైద్యుల సంఖ్య తక్కువగా ఉన్న ఆస్పత్రుల్లో పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఒకే బెడ్‌పై కుటుంబం అంతటికీ చికిత్స చేస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయంటే పరిస్థితి అర్ధమవుతుంది. పాడేరురూరల్, న్యూస్‌లైన్: మళ్లీ మన్యంలో ఆందోళనకర వాతావరణం కనిపిస్తోంది. వ్యాధుల విజృంభణతో నానాటికీ పరిస్థితి దిగజారుతోంది. వాతావరణ మార్పులకు ఇతర సమస్యలు తోడు కావడంతో ఏజెన్సీ వ్యాధుల సుడిగుండంలో విలవిలలాడుతోంది. ప్రతి గ్రామంలో వ్యాధిగ్రస్తుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతూ ఉండడంతో పాడేరులోని ప్రాంతీయ ఆస్పత్రిలో వార్డులన్నీ రోగులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు హుకుంపేట మండలంలోని రవ్వలమామిడి, గొల్లమామిడి, గిడ్డివలస గ్రామాల నుంచి డయేరియా బారిన పడి ఒకే సారి సుమారు 50 మందికి పైగా బాధితులు గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి రావటంతో రద్దీ మరిత పెరిగింది. స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో 60 మంచాలు మాత్రమే ఉన్నాయి. వైద్య చికిత్సలు పొందుతున్న రోగుల సంఖ్య 150 మందికి పై మాటే. దీంతో మంచాలు సర్దలేక వైద్య సిబ్బంది సతమతమవుతున్నారు. ఇంటిల్లిపాదినీ ఒకే మంచంపై పడుకోబెట్టి వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. ఆస్పత్రిలో సౌకర్యాలు పెంచాలని రోగులు కోరుతున్నారు. పెరుగుతున్న జ్వరాలు తమ గ్రామంలో జ్వరాల తీవ్రత నానాటికీ ఎక్కువవుతోందని, వైద్య శాఖ అధికారులు స్పందించి తక్షణమే వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కించూరు పంచాయతీ సర్పంచ్ అడపా పురుషోత్తంనాయుడు కోరారు. గ్రామానికి చెందిన కనీసం 20 మంది విష జ్వరాలు, ఇతర వ్యాధుల బారిన పడి వైద్య సేవల కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే తమ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరారు. గన్నేరుపుట్టును వీడని డయేరియా హుకుంపేట: మండలంలోని గన్నేరుపుట్టు పంచాయతీని డయేరియా వీడడం లేదు. ఈ వ్యాధి లక్షణాలతో పంచాయతీ పరిధిలోని గవ్వలమామిడి, శంపంగిపుట్టు, పొర్లు గ్రామాల్లో 46 మంది గురువారం అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఇదే పంచాయతీలోని గడ్డివలస గ్రామంలో మరో 36 మంది ఇదే లక్షణాలతో నీరసించిపోవడాన్ని శుక్రవారం అధికారులు గుర్తించారు. 108లో పాడేరు సీహెచ్‌సీకి ఎకాయెకిన తరలించారు. వరుసగా ఒక్కో గ్రామంలో డయేరియా ప్రబలడంతో గ్రామాల్లోని గిరిజనులు హడలెత్తిపోతున్నారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ ఏపీవో నాయుడు, ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్, ఎస్పీహెచ్వోలు గ్రామాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీవో నాయుడు మాట్లాడుతూ విషాహరమే ఇందుకు కారణంగా అనుమానిస్తున్నామన్నారు. -
వీటిని ఎందుకు నిషేధించారంటే..!
నిషేధిత మందులు జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ అనారోగ్యాలు వస్తే మందుల దుకాణానికి వెళ్లి తెలిసిన మందులేవో వేసుకోవడం పరిపాటి. కానీ వాటిల్లో కొన్ని నిషేధించిన మందులని చాలామందికి తెలియకపోవచ్చు. నిషేధించినప్పటికీ దుకాణాల్లో దొరుకుతున్న కొన్ని మందుల వివరాలు, వాటిని నిషేధించడానికి కారణాలు ఇవి. జలుబు, దగ్గును తగ్గించే ఫెనిల్ప్రోపనోలమైన్ వాడకం వల్ల దీర్ఘకాలంలో పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. నొప్పి నివారణి అనాల్జిన్ వల్ల, వాపులకు వాడే ఆక్సిఫెన్బుటాజోన్ వల్ల ఎముకల్లోని మూలుగు బలహీనపడుతుంది. జ్వరం, ఒళ్లు నొప్పులకు వాడే నిమెసులైడ్ కారణంగా కాలేయం దెబ్బతింటుంది. ఎసిడిటీ, మలబద్దకం తగ్గడానికి వాడే సిసాప్రైడ్ వాడడం వల్ల గుండె పనితీరు క్రమం తప్పుతుంది(ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్). ఒత్తిడిని తగ్గించే డ్రోపెరిడోల్ వల్ల కూడా గుండె పనితీరులో ఒడుదొడుకులు వస్తాయి. డయేరియాను తగ్గించే ఫురాజోలిడోన్, గాయాలకు రాసే పూతమందు (యాంటీబ్యాక్టీరియల్ క్రీమ్) నైట్రోఫురాజోన్ వల్ల క్యాన్సర్ ముప్పు ఉంటుంది, క్వినిడోస్లార్ వల్ల కంటి చూపు మందగించే ప్రమాదం ఉంటుంది.నులిపురుగులు తగ్గడానికి వాడే పైపరేజైన్తో నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. -
రాష్ట్రానికి జ్వరమొచ్చింది
* మూడు నెలల్లో 8.7 లక్షల మంది జ్వరబాధితులు.. వీరిలో 3.59 లక్షలు టైఫాయిడ్ రోగులే * కామెర్లు, డయేరియా ప్రభావమూ ఎక్కువే * ఇవి ప్రభుత్వాస్పత్రుల లెక్కలే.. * ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 3 లక్షల కేసులు * ఎన్నికలు, విభజన పనుల్లో అధికారులు సాక్షి, హైదరాబాద్: ఎండవేడిమి పెరగడంతో రాష్ట్రం జబ్బుల బారిన పడుతోంది. ఎక్కడ చూసినా జ్వరపీడితులే. గత పదేళ్లలో ఎప్పుడూ లేనంతమంది ఇప్పుడు జ్వరాల బారిన పడుతున్నట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన గణాంకాలు చెబుతున్నాయి. అధికారులంతా ఎన్నికలు, రాష్ట్ర విభజన విధుల్లో నిమగ్నమవడంతో ప్రజారోగ్యం గురించి ఎవరూ పట్టించుకోవడంలేదు. గ్రామాల్లో క్లోరినేషన్, శానిటేషన్ పనులతో పాటు, ఆస్పత్రుల్లో వసతులు, ముందు జాగ్రత్త పనులను అధికారులు విస్మరించారు. దీంతో సీజనల్ వ్యాధులు ప్రబలాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి గత నెల 31 వరకు మూడు నెలల్లో ప్రభుత్వాస్పత్రులకు 8.70 లక్షల మందికి పైగా జ్వరపీడితులు వైద్యం కోసం వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 3 లక్షల కేసులు నమోదై ఉండవచ్చని అధికారులు అంటున్నారు. చిత్తూరు, ఆదిలాబాద్, కర్నూలు, నల్లగొండ జిల్లాల్లో ఎక్కువగా జ్వర పీడితులు వస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో నమోదు చేసుకున్న జ్వర పీడితుల్లో టైఫాయిడ్ బాధితులే 3.59 లక్షల మంది ఉన్నారు. వైరల్ హెపటైటిస్ (కామెర్లు) కూడా ఎప్పుడూ లేనంతగా నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వేసవిలో సర్వసాధారణంగా వచ్చే డయేరియా (విరేచనాలు) కేసులూ ఎక్కువయ్యాయి. అయితే, బాధితులు లక్షల్లో వస్తున్నా, ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు నామమాత్రంగానే ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో కలిసి 60 వేల పడకలు కూడా లేవు. జ్వరాలకు కారణాలివే.. - వేసవిలో నీటిలో మలమూత్రాలు కలుషితమవుతుంటాయి. వీటివల్ల టెఫాయిడ్, ఇతర జ్వరాలు వస్తాయి. అందుకే క్లోరిన్ వేసిన నీటినే తాగాలి. - వేసవిలో గాలి కలుషితమై వైరస్ అభివృద్ధి తీవ్రంగా ఉండటంవల్ల వైరల్ జ్వరాలు ఎక్కువగా వస్తాయి. ఉదాహరణకు జ్వరబాధితుడు తుమ్మడం వల్ల ఆ తుంపర గాలిలో కలిసి ఇతరులకు సోకుతుంది. ఇలాంటి వారిని ఐదు రోజుల పాటు ఇంట్లోనే ఉంచి సాధారణ వైద్యం చేస్తే సరిపోతుంది. - డయేరియా కూడా కలుషిత నీరు వల్లనే వస్తుంది. అందుకే ప్రతి వెయ్యి లీటర్ల నీటిలో కనీసం 3 గ్రాముల క్లోరిన్ కలపాలి. డయేరియా బాధితులను వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి. - కామెర్లు కూడా కలుషిత నీటి వల్లే వస్తాయి. అందుకే కాచి చల్లార్చిన నీరు తాగాలి. కామెర్లు సోకినప్పుడు చికిత్స అందించి, త్వరగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. -
సూరీడుకు చిర్రెత్తుతోంది..!
జడ్చర్ల టౌన్, న్యూస్‌లైన్: మార్చి నెలలోనే ఎండలు మండుతుండటంతో డయేరియాతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవని వైద్యు లు సూచిస్తున్నారు. గురువారం రోజు పగ టి ఉష్ణోగ్రతలు ఏకంగా 40.33డిగ్రీలకు చేరింది. గతేడాది ఏప్రిల్ మాసంలో ఇవి నమోదయ్యాయి. అదే విధంగా రాత్రి వేళ ఉక్కబోత పెరగటంతో చిన్నారులు, వృద్ధులు అవస్థలపాలవుతున్నారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఉండే అభ్యర్థులు, రాజకీయ నేతలు మినహాపల్లెల్లో పగటిపూట పూర్తిగా నిశబ్దవాతావరణం నెలకొంది. పట్టణం, పల్లె తేడా లేకుండా ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. కిటకిటలాడుతున్న ఆస్పత్రులు... ఎండలు పెరగటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. గంగాపూర్‌పీహెచ్‌సీలో గత కొద్దిరోజులు గా ఓపికి వచ్చే వారి సంఖ్య పెరిగింది. బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వాంతులు, విరేచనాలతో చికిత్సకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మార్చి మూడో వారం నుంచి రోజూ 15మందికి తగ్గకుండా ఇన్‌పేషెం ట్లుగా చేరుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి... ఎండలు మండుతుండటంతో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. ఆ ప్రకారం వదులుగా ఉన్న కాటన్‌దుస్తులు ధరించాలి. చిన్నపిల్లలకు కనీసం రెండు పర్యాయాలు గోరువెచ్చటి నీటితో స్నానం చేయించటం, ఎండలో తిరగకుండా చూడాలి. డీహైడ్రేషన్ అయితే ఎలక్ట్రాల్ పౌడర్ తాపాలి. గర్భిణిల్లో మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. వారు ప్రతి అరగంటకోమారు గ్లాసునీటిని తాగాలి. బైక్‌పై వెళ్లేవారు తప్పనిసరిగా క్యాప్ ధరించటంతోపాటు తరచూ నిలిచినీళ్లు తాగు తూ వెళ్లాలి. కొబ్బరి నీళ్లు తాగటం అందరికి శ్రేయస్కరం. -
కొండకరకాంలో డయేరియా
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : కొండకొరకాంలో డయేరియా విజృంభించిం ది. గ్రామానికి చెందిన 13 మంది రోగులు డయేరియా లక్షణాలతో బాధపడుతూ శుక్రవారం ఉదయం కేం ద్రాస్పత్రిలో చేరారు. రోగులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. వీరిలో నలుగురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులందరికీ డయేరియా సోకడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన కిలారి పాపయ్యకు గురువారం రాత్రి పది గంటలకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. అక్కడకు కొద్ది నిమిషాల్లోనే మిగిలిన వారందరూ వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. రాత్రంతా ఇబ్బందిపడిన వీరు మరుచటి రోజు ఉదయం 108 వాహనంలో ఏరియా ఆస్పత్రిలో చేరా రు. రోగులు కిలారి పాపయ్య(80), కిలారి కృష్ణ (65) , కిలారి వెంకన్న (37), కిలారి లక్ష్మన్న( 28), కిలారి రమణ(25), కిలారి శశికళ( 25), కిలారి సత్యవమ్మ( 60), కిలారి సత్యవతి(20), కిలారి భార్గవ్( 6), కిలారి భాగ్యశ్రీ(7), చైతన్య (4), తరుణ్కీర్తి(ఏడాదిన్నర)లకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. భయమేసింది ముందుగా మా నాన్న పాపయ్య వాం తులు, విరేచనాలతో బాధపడ్డాడు. అక్కడకు ఐదు నిమిషాలు తర్వాత కుటుంబ సభ్యులందరం వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డాం. ఏమి జరిగిందో తెలియక భయమేసింది. మరుచటి రోజు ఉదయం గ్రామస్తుల సహకారంతో ఆస్పత్రిలో చేరాం. - కిలారి వెంకన్న, డయేరియా రోగి కలుషిత ఆహారమే కారణం కలుషిత నీరు లేదా కలుషిత ఆహారం తీసుకోవడం వేల్ల డయేరియా సోకి ఉంటుంది. అందరికీ ఒకేసారి డయేరియా సోకడంతో భయపడ్డారు. వీరందరికీ వైద్యసేవలు అందుతున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉంది. - డాక్టర్ సత్యశేఖర్, జనరల్ సర్జన్, కేంద్రాస్పత్రి -
ఇరిటెబుల్ బవెల్ సిండ్రోమ్
కొంతమందిలో పెద్ద పేగుల్లో అసాధారణ కదలికల వలన మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. ఇలా బాధించే సమస్యే ఇరిటెబుల్ బవెల్ సిండ్రోమ్. ఈ సిండ్రోమ్‌లో ఒకసారి మలబద్దకం వస్తుంది, మరోసారి నీళ్ల విరేచనాలతో మలవిసర్జనం అవుతుంది. కడుపులో పట్టేసినట్లు నొప్పి ఉండి, దైనందిన కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తుంది. ఈ సిండ్రోమ్ వలన తరచు వాష్‌రూమ్‌కి వెళ్లి రావలసి వస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. శుభకార్యాలప్పుడు, ప్రయాణాలలో వీరికి చాలా ఇబ్బందిగా ఉండి ఆత్మన్యూనతకు లోనవుతారు. ఈ సమస్య కోసం చేయించే పరీక్షలు దాదాపు నార్మల్‌గా రావటం విశేషం. కారణాలు: ఐఆకి ప్రత్యేక కారణమంటూ ఇప్పటివరకు తేలలేదు. కాని ఇదివరకు జీర్ణవ్యవస్థకు ఇన్ఫెక్షన్స్ వచ్చినవారిలో, పెద్ద పేగు ఇన్ఫెక్షన్లకు గురైనవారిలో ఆరింతలు అధికంగా ఐఆ వచ్చే అవకాశం ఉంటుంది మెదడు నుండి పెద్ద పేగులకు వచ్చే సంకేతాలలో అసాధారణ మార్పుల వల్ల కొందరిలో ఆహారం కారణంగా పెద్ద పేగులలోని కండరాలు అసాధారణంగా స్పందించటం వల్ల మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన, గాబరా, టెన్షన్ వలన మెదడు నుండి పెద్ద పేగులకి అసాధారణ సంకేతాలు వెళ్లి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు: మలవిసర్జన సమయంలో పొత్తికడుపులో నొప్పి కొన్నిసార్లు మలబద్దకం, లేదా నీళ్లవిరేచనం లాంటి విసర్జన మల విసర్జన సాఫీగా జరగనట్లు ఉంటుంది. మళ్లీ మళ్లీ టాయిలెట్‌కు వెళ్లాలని అనిపిస్తుంది కడుపులో గ్యాస్ నిండిపోవడం, నొప్పి రావడం - మల విసర్జనం చేస్తే హాయిగా ఉండటం. ఉదయం లేవగానే త్వరగా విసర్జనానికి వెళ్లాల్సి రావడం, ఎక్కువగా ప్రయాణాలు చేసినప్పుడు, ప్రయాణానికి ముందు, ఇంటినుండి బయటకు వెళ్లేముందు టాయిలెట్‌కి వెళ్లాల్సి రావడం తినగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం...దాంతో తినాలంటే భయం కొన్నిరకాల పదార్థాలను తీసుకోగానే, విరేచనాలు అయిపోవడం తరచుగా నీళ్లవిరేచనాలు అవడం అజీర్తి, కడుపులో గ్యాస్ నిండిపోవడం తలనొప్పి, ఒళ్లు నొప్పులు వ్యాధి నిర్ధారణ: మల పరీక్ష చేయటం ద్వారా బ్యాక్టీరియా, అమీబిక్ సిస్ట్లు ఉన్నాయేమో తెలుస్తుంది. అలాగే జీర్ణం కాని ఆహార పదార్థాలు వస్తున్నాయా అనేది తెలుస్తుంది. దీనిద్వారా సిలియాక్ డిసీజ్, మాల్ అబ్జార్ప్షన్ ఉందా అనేవి తెలుస్తాయి. ఇఆ్క ఉఐఖ లివర్ ఫంక్షన్ టెస్ట్ ్ఖఎ అబ్డమెన్ కొలనోస్కోపీ పరీక్ష ద్వారా పెద్దపేగుల్లో ఇన్ఫెక్షన్లు తెలుసుకోవచ్చు. క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ జబ్బులు ఉన్నాయా లేదా తెలుస్తుంది. జాగ్రత్తలు: ఎక్కువ మసాలాలు, కారంగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు ఎక్కువగా జీర్ణాశయాన్ని ప్రేరేపించే పదార్థాలు, కొవ్వు పదార్థాలు తీసుకోకూడదు పాలు, పాలపదార్థాలు తక్కువగా తీసుకోవాలి ఏ ఆహారం తీసుకుంటే సమస్య అధికమవుతుందో గ్రహించి, వాటికి దూరంగా ఉండాలి అతి చల్లని లేదా అతి వేడి పదార్థాలు తీసుకోకూడదు కాఫీ, ఆల్కహాల్, ధూమపానం మానేయాలి ఆహార పదార్థాల ద్వారా ఇన్ఫెక్షన్స్ సోకకుండా, శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. బయటి ఆహారం తీసుకోకూడదు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. టాయిలెట్‌కి వెళ్లివచ్చిన తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి మలబద్దకంతో కూడిన ఐఆ ఉంటే, ఎక్కువగా పళ్లు, పీచు పదార్థాలు, ఎక్కువ నీరు తీసుకోవాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానంతో పాటు రోజూ వ్యాయామం చేయాలి. హోమియో వైద్యం: హోమియోలో మానసిక ఒత్తిడిని తగ్గించి, పేగుల్లోని అసాధారణ కదలికలను నియంత్రించే మందులు ఇస్తారు. వ్యక్తి శారీరక, మానసిక లక్షణాలను అనుసరించి మందులు ఇస్తారు. తద్వారా ఈ వ్యాధిని శాశ్వతంగా నివారించవచ్చు. కొన్ని మందులు ఐఆకి ఉపకరిస్తాయి. అర్జెంటినమ్ నైట్రికమ్: తీవ్రమైన ఆందోళన, గాబరా ఎక్కువగా ఉండటం, బయటికి వెళ్లేముందు మలవిసర్జనకి వెళ్లాలని అనిపించటం. ఎక్కువ తీపి పదార్థాలు ఇష్టపడతారు. పదిమందిలోకి వెళ్లాలంటే గాబరా పడతారు. నక్స్‌వామికా: విపరీతమైన కోపం, చిరాకు ఉంటుంది. ఎక్కువగా మసాలా, టీ, ఆల్కహాల్‌ని ఇష్టపడతారు. మలబద్దకం ఉంటుంది. టాయిలెట్‌కి వెళ్లినప్పుడు మలం వచ్చినట్లుండి రాకపోవడం ముఖ్యలక్షణం. ఆర్సెనిక్ ఆల్బమ్: ఏదైనా బయటి ఆహార పదార్థాలు తినగానే విరేచనాలు అవుతాయి. ఇవేకాకుండా పల్సటిల్లా, అల్ సోకట్రినా, లైకోపోడియం మందులు ఉపకరిస్తాయి. -
అశ్వాపురంపాడులో డయేరియా
పినపాక, న్యూస్‌లైన్: వలస ఆదివాసీ గ్రామమైన అశ్వాపురంపాడులో ఆదివారం వలస గొత్తికోయలు డయేరియాతో 10 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కరకగూడెం పంచాయతీ మోతె గ్రామంలో నివసిస్తున్న వలస గొత్తికోయల గ్రామం అశ్వాపురంపాడులో తాగునీరు కలుషితం కావడంతో 10 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. మడకం రాజయ్య, మడకం ఐతమ్మ, కొవ్వాసీ సునీత, మడివి ఉంగయ్య, కొవ్వాసీ బాలకృష్ణ, కొవ్వాసీ నందయ్య తదితరులు అస్వస్థతు గురయ్యారు. దీంతో స్థానికులు వారిని 108 ద్వారా పినపాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో కొవ్వాసి నందయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పినపాక ప్రభుత్వం వైద్యాధికారి సుధీర్‌నాయక్ మాట్లాడుతూ కలుషిత నీరు తాగడం వల్లే వారు డయేరియాతో అస్వస్థతు గురయ్యారని అన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి : సీపీఎం వలస గొత్తికోయాల గ్రామం అశ్వాపురంపాడులో ప్రభుత్వం వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి నిమ్మల వెంకన్న డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు వైద్యులు శిబిరం నిర్వహించాలని ఆయన కోరారు. అదే విధంగా గ్రామంలో వలస గిరిజనులు తోగు నీరు తాగుతున్నారని, వారి కోసం బోరు ఏర్పాటు చేయాలని అన్నారు. -
పంజా విసిరిన అతిసార
కౌడిపల్లి, న్యూస్‌లైన్: మండలపరిధిలోని భుజిరంపేట పీర్యతండాలో అతిసారం పంజా విసిరింది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి చెందిగా, మరో అయిదుగురు అస్వస్థతకు గురయ్యారు. పీర్యతండాకు చెందిన అజ్మీరగమ్ని(65) వాంతులు విరోచనాలు కావడంతో శనివారం మృతి చెందింది. అంత్యక్రియలకు మనంతాయపల్లి తండాకు చెందిన ఆమె కూతురు బుజ్జి, అల్లుడు బిల్యనాయక్ మనుమరాలు అఖిల(7) వచ్చారు. కాగా అఖిలకు అదేరోజు నుంచి వాంతులు విరోచనాలు కావడంతో ఆదివారం ఉదయం చికిత్స నిమిత్తం కౌడిపల్లికి వచ్చారు. అక్కడి నుంచి మెదక్ తర లిస్తుండగా మృతి చెందింది. సోమవారం అఖిల తండ్రికి సైతం వాంతులు విరోచనాలు అయ్యాయి. దీంతో అతణ్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతోపాటు అదేతండాకు చెందిన పెంట్యానాయక్, జీవుల, రూప్సింగ్, సోని వాంతులు విరోచనాలతో అస్వస్తతకు గురయ్యారు. పెంట్యానాయక్, రూప్సింగ్, జీవుల మెదక్ ఆసుసత్రిలో చికిత్సపొందుతున్నారు. కాగా పెంట్యానాయక్ పరిస్థితి విషమంగా ఉండటంతో నీమ్స్‌కు తరలించారు. తండాలో బోరునీరు కలుషితం కావడంవల్లే అతిసారం ప్రబలినట్టు స్థానికులు తెలిపారు. -
డెంగీతో డేంజర్
మేడ్చల్, శామీర్‌పేట్, న్యూస్‌లైన్: విష జ్వరాలతో మేడ్చల్ నియోజక వర్గం మంచం పట్టింది. డె ంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రజలను వణికిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపంతో వ్యాధులు విజృంభిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జనం రోగాల బారిన పడకుండా ముందస్తు చర్యలకు ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 10 వేల చొప్పున విడుదల చేస్తున్నట్లు అధికారులు గొప్పలు చెప్పారు గాని ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి రోగాలకు కారణమవుతోంది. వణికిస్తున్న విషజ్వరాలు.. ఇటీవల కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం ఏర్పడింది. మురుగు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో దోమలు, ఈగలు విజృంభించి జనం రోగాల బారినపడుతున్నారు. ఇటీవల లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన చిన్నారి వాణి డెంగీ వ్యాధి సోకి మృత్యువాత పడింది. మండలంలోని కేశవరం గ్రామానికి చెందిన నలుగురు, తుర్కపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు, అనంతారానికి చెందిన ఇద్దరికి ఇటీవల డెంగీ వ్యాధి సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొంది వేలకు వేలు ఖర్చు పెట్టుకున్నారు. తాజాగా ఉప్పరిపల్లికి చెందిన చిన్నారి వెంకటేష్, అనిత దంపతుల చిన్నారి మౌనిక(6)కకు డెంగీ సోకి శనివారం మృత్యువాత పడిన విషయం తెలిసిందే. బాబాగూడకు చెందిన ఓ చిన్నారి డెంగీ వ్యాధితో నగరంలోని నిలోఫర్‌లో చికిత్స పొందింది. గతేడాది మేడ్చల్ మండలంలో డెంగీ సోకి 20 మంది మృతిచెందారు. నిమ్మకు నీరెత్తిన అధికారులు.. వర్షాకాలంలో ప్రజలకు పారిశుద్ధ్యం, పరిసరాల శుభ్రత, తాగునీటిపై అవగాహన కల్పించాల్సిన అధికారులు పత్తా లేరు. జనం రోగాల బారినపడి చస్తున్నా కూడా పట్టించుకోరా..? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెంగీ ఇలా వ్యాపిస్తోంది.. ఏడీస్ అనే దోమ కాటుతో డెంగీ వ్యాపిస్తుంది. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఉండే దోమల వల్ల వ్యాధి వ్యాపిస్తుంది. డెంగీ తీవ్ర జ్వరంతో ప్రారంభమవుతుంది. సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స చేయించుకోకుంటే ప్రాణాలను బలితీసుకుంటుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. డెంగీ వ్యాధి నాలుగు రకాలు. వాటిలో హిమారైజిక్ రకం ప్రాణాంతకమైంది. వ్యాధి వైరస్ మనిషి రక్త కణాలను తయారు చేసే కణాలను నాశనం చేసి మృత్యువుకు కారణమవుతుంది. డెంగీకి సంబంధించిన పరీక్షలు నగరంలోని నారాయణగూడలో ప్రభుత్వ ఆస్పత్రి ల్యాబ్‌లో నిర్వహిస్తారు. తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో కుట్టిన దోమలతో డెంగీ వ్యాపించే అవకాశం ఎక్కువ. ప్రజలకు సందేహాలు ఉంటే ఆయా ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించాలి. -డాక్టర్ పుష్ప, శామీర్‌పేట్ పీహెచ్సీ ఇన్చార్జి -
పంజా విసిరిన అతిసార
మోమిన్‌పేట, న్యూస్‌లైన్: అతిసార మరోమారు పంజా విసిరింది. మోమిన్‌పేట మండల పరిధిలోని రెండు గ్రామాల్లో ఇద్దరిని బలితీసుకుంది. మొత్తం మండలంలోని తొమ్మిది గ్రామాల్లో పదుల సంఖ్యలో జనం అతిసార బారిన పడి చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల నుంచి వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. చంద్రాయన్పల్లి, కాసులబాదు, మోమిన్‌పేట, మొరంగపల్లి, వెల్చాల్, రాంనాథ్గుడుపల్లి, మల్‌రెడ్డిగూడెం, గోవిందాపూర్, ఏన్కతల గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రాంనాథ్‌గుడుపల్లిలో చాకలి సత్యమ్మ(55) శుక్రవారం రాత్రి వాంతులు, విరేచనాల బారిన పడగా శనివారం ఉదయం కుటుంబసభ్యులు ఆమెను శనివారం ఉదయం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించేలోపే సత్యమ్మ మృతి చెందింది. సత్యమ్మకు ఉన్న ఒక్క కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు . తల్లి మరణవార్తవిని హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని విలపించాడు. అదేవిధంగా మండలంలోని ఏన్కతల గ్రామానికి చెందిన మ్యాతరి సురేష్(28)కు సైతం శుక్రవారం సాయంత్రం వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. వెంటనే కుటుంబీకులు మోమిన్‌పేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి చేర్చారు. వైద్యాధికారి సాయిబాబ రాత్రి 10గంటల వరకు వైద్యంచేసి సంగారెడ్డిలోని ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. అయితే కుటుంబీకులు అక్కడికి తరలించేందుకు విముఖత చూపి తిరిగి ఇంటికే తీసుకెళ్లారు. అయితే అర్ధరాత్రి సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సంగారెడ్డికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం చనిపోయాడు. సురేష్‌కు భార్య సుమలత ఉన్నారు. -
మర్రిపాడులో ప్రబలిన డయేరియా
మర్రిపాడు (సరుబుజ్జిలి), న్యూస్‌లైన్ : మండలంలోని షళంత్రి పంచాయతీ మర్రిపాడులో డయేరియా ప్రబలింది. రెండు రోజుల నుంచి 11 మంది చిన్నారులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. కొల్ల హాసిని, మజ్జి భరణి, కొమ్ము వివేకానంద, ఇప్పిలి కీర్తన, ఇప్పిలి ధనుష్, కొల్ల రుషేంద్ర, కందుల భార్గవి తదితరులు అతిసారతో బాధపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అతిసార బాధితుల్లో 11 నెలల నుంచి ఐదేళ్ల బాలబాలికలు ఉన్నారు. కలుషితమైన బోరు నీరే కారణం గ్రామంలో బోరు నీరు కలుషితం కావడంతో తరచూ వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామానికి చెందిన కొల్ల శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య లోపంతో పాటు ఏఎన్ఎం హెడ్‌క్వార్టర్స్‌లో నివసించకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. అత్యవసర పరిస్థితిలో కూడా సాధారణమాత్రలు అందించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ప్రైవేట్ వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నామని చెప్పారు. పారిశుద్ధ్యం మెరుగు చేయాలని, గ్రామంలో అతిసార బాధితులకు వైద్యసేవలందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లావేటిపాలెంలో వైద్యశిబిరం ఏర్పాటు లావేరు: మండలంలోని లావేటిపాలెం గ్రామంలో శనివారం లావేరు పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. లావేటిపాలెం గ్రామానికి చెందిన భైరి జయప్రకాష్ డెంగీ జ్వరంతో బాధపడుతున్నట్లు ప్రైవేట్ వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ‘లావేటిపాలెంలో బాలునికి డెంగీ’ శీర్షికన శనివారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురిమైంది. దీనికి స్పందించిన లావేరు పీహెచ్సీ వైద్యాధికారిణి భారతీకుమారి దేవి, రణస్థలం క్లస్టర్ ఎస్పీహెచ్వో ఎంపీవీ నాయక్ గ్రామంలో పర్యటించారు. లావేటిపాలెం గ్రామంలో శనివారం వైద్యశిబిరం ఏర్పాటు చేసి 67 మందికి డాక్టర్ భారతీకుమారి దేవి వైద్యసేవలందించారు. ఇంటింటా వెళ్లి జ్వర పీడితుల వివరాలను సేకరించారు. లావేటిపాలెంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంపై రణస్థలం క్లస్టర్ ఎస్పీహెచ్వో ఎంపీవీ నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రణస్థలం క్లస్టర్ సీహెచ్‌వో రాజగోపాలరావు, హెల్త్ సూపర్వైజర్ రమణమూర్తి, హెచ్వీ హేమకుమారి, హెల్త్ సూపర్వైజర్ పీవీ రమణమూర్తి, ఏఎన్ఎంలు ఆర్.రమణమ్మ, జి.త్రివేణి, ఎస్.భవానీ, సరోజిని, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
పాలమూరులో ప్రబలిన అతిసార
పాలమూరు జిల్లా వ్యాప్తంగా అతిసార విజృంభించింది. దాంతో నర్వ మండలం పాతర్చేడ్లో శుక్రవారం ఒకరు మృతి చెందారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలాగే మక్తల్ మండలం చిట్యాలలో కూడా అతిసార ప్రబలింది. దీంతో 70 ఆసుపత్రి పాలు అయ్యారు. వారందరిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వారి పట్ల ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు నిమ్మకునిరెత్తినట్లు వ్యహరిస్తుండటంతో రోగులు తీవ్ర వేదన చెందుతున్నారు. అయితే జిల్లాకు ఉన్నతాధికారుల కానీ వైద్యాధికారులు అతిసార ప్రబలిన ప్రాంతాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో స్థానికులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పాలమూరులో ప్రబలిన అతిసార
పాలమూరు జిల్లా వ్యాప్తంగా అతిసార విజృంభించింది. దాంతో నర్వ మండలం పాతర్చేడ్లో శుక్రవారం ఒకరు మృతి చెందారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలాగే మక్తల్ మండలం చిట్యాలలో కూడా అతిసార ప్రబలింది. దీంతో 70 ఆసుపత్రి పాలు అయ్యారు. వారందరిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వారి పట్ల ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు నిమ్మకునిరెత్తినట్లు వ్యహరిస్తుండటంతో రోగులు తీవ్ర వేదన చెందుతున్నారు. అయితే జిల్లాకు ఉన్నతాధికారుల కానీ వైద్యాధికారులు అతిసార ప్రబలిన ప్రాంతాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో స్థానికులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మంచం పట్టిన చిట్యాల
మక్తల్ రూరల్, న్యూస్‌లైన్: మండలంలోని చిట్యాల గ్రామస్తులు అతిసారవ్యాధి బారినపడి అల్లాడుతున్నారు. ఆది వారం వాకిటి లింగప్ప(40) అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గు రై మృతిచెందాడు. గ్రామంలో కూలీనాలి పనులు చేసుకునే ఆయన రెండురోజుల క్రితం వాంతులు, విరేచనాలు చేసుకున్నాడు. ఆస్పత్రికి చూపించినా ఫలితం లేకపోయింది. చివరికి ఆరోగ్య పరిస్థితి విషమించడతో కనుమూశాడు. ఇదిలాఉండగా మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన రేణమ్మ, మంజుల, రాములమ్మ, కి ష్టప్ప, ఆదెమ్మ, లింగమ్మ, కిష్టప్పలతో పాటు మరికొందరు అనారోగ్యానికి గురికావడంతో మక్తల్ ప్రభుత్వ, పలు ప్రై వేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో తా త్కాలిక వైద్యశిబిరం ఏర్పాటుచేసినా అక్కడికి వెళ్లేందుకు బాధితులు ఆసక్తి చూపడం లేదు. గ్రామంలో సరఫరా అయ్యే తాగునీరు కలుషితం కావడం, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడంతోనే అతిసార ప్రబలిందని వైద్యులు గుర్తించారు. గ్రామంలో తాగునీటి సరఫరా బంద్ కావడంతో వ్యవసాయబోరుబావుల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. అతిసార ప్రబలినప్పటి నుంచి ఇప్పటివరకు అధికారులు వారిపైపు కన్నెత్తిచూడకపోవడం గమనార్హం. ఇదిలాఉండగా నెలరోజుల క్రితం మండలంలోని యర్సన్‌పల్లి గ్రామంలో అతిసార బారినపడి 40మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యసిబ్బంది ఒక్కో సెలైన్ బాటిల్ ఎక్కించి, నాలుగు మాత్రలు ఇచ్చి పంపించేశారు.