ప్రతీకాత్మక చిత్రం
తరచూ ప్రయాణాలు చేసేవారు రకరకాల ప్రదేశాల్లో ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా ప్రయాణ సమయాల్లో వారు ఆహారం తీసుకునే ప్రదేశాలూ, అక్కడ దొరికే పదార్థాలూ అంత పరిశుభ్రంగా ఉండకపోవచ్చు. దాంతో ట్రావెలర్స్ డయేరియా వచ్చే అవకాశాలు ఎక్కువ. నిత్యం ప్రయాణాల్లో ఉండేవారికి ఈ ముప్పు ఎక్కువ.
కానీ వేసవి సెలవుల్లో పిల్లలు ఏ బంధువుల ఇంటికో వెళ్లేప్పుడు ఒకసారి ప్రయాణం, మరోసారి తిరుగు ప్రయాణంలో వచ్చే ప్రమాదాన్ని ట్రావెలర్స్ డయేరియాతో పోల్చలేనప్పటికీ... జర్నీ సమయంలో విరేచనాలు ఎప్పుడూ చాలా ఇబ్బంది పెడతాయి. అందుకే అది ట్రావెలర్స్ డయేరియా అయినా, లేదా సాధారణ విరేచనాలే అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు.
పాటించాల్సినవి..
👉🏾ప్రయాణాల్లో దొరికే ఆహారం, నీరు కలుషితమయ్యేందుకు అవకాశాలెక్కువ. అందుకే సాధ్యమైనంతవరకు ఇంట్లో చేసిన పదార్థాలే ప్రయాణంలోనూ తినేలా ప్లాన్ చేసుకుని దానిని అమలు చేయాలి.
👉🏾అలాగే కాచి, చల్లార్చిన నీళ్లను ఇంటినుంచే తీసుకుని, ప్రయాణమంతా వాటినే వాడటం మంచిది. లేదా తప్పనప్పుడు నమ్మకమైన బ్రాండ్‌కు చెందిన ప్యాకేజ్‌డ్ నీళ్ల బాటిల్‌ను తీసుకోవాలి.
👉🏾ట్రావెలర్స్ డయేరియాను నివారించేందుకు ప్రయాణికులు తాము ఎప్పుడూ తీసుకునే సురక్షితమైన, నమ్మకమైన చోటనే ఆహారం తీసుకోవాలి.
👉🏾తినడానికి ముందుగా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి.
👉🏾ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తినేయాలి.
👉🏾ఒకవేళ విరేచనాలు అవుతున్నప్పుడు దేహం ద్రవాలనూ, లవణాలను కోల్పోకుండా నమ్మకమైన ఓఆర్‌ఎస్ (ఓరల్ రీ–హైడ్రేషన్ సొల్యూషన్)ప్యాక్‌ను తీసుకోవాలి.
👉🏾మరీ ఆగకుండా విరేచనాలు అవుతున్నప్పుడు ప్రయాణానికి బ్రేక్ ఇచ్చి... ఆసుపత్రిలో సెలైన్ తీసుకోవడం లాంటి చికిత్సతో పాటు డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడాలి. పరిస్థితి పూర్తిగా చక్కబడ్డాకే మళ్లీ ప్రయాణం కొనసాగించాలి.
చదవండి 👉🏾: Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి!
Comments
Please login to add a commentAdd a comment