Health Tips
-
ఎక్కువ ఆయుర్దాయం కావాలా? జపనీయుల టాప్ సీక్రెట్స్ ఇవే!
జపనీయుల దీర్ఘాయువు వెనక... స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం వంటి కారణాల వల్ల అనుకున్నంత కాలం జీవించలేకపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం జపాన్? ప్రజలు మాత్రం ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయంతో ఎక్కువకాలం పాటు జీవిస్తున్నారు. అందుకు కారణాలేమిటో తెలుసుకుందాం.. మనం కూడా వారిని అనుసరిద్దాం.డబ్ల్యుహెచ్. ఓ. అంచనాల మేరకు... జపాన్ ప్రజల సగటు ఆయుర్దాయం 83.7 సంవత్సరాలు (మహిళలకు 86.8 సంవత్సరాలు పురుషులకు 80.5 సంవత్సరాలు)గా ఉంది. జపాన్ ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, సంస్కృతి, జెనెటిక్స్? దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఇకిగై (సంతోషంతో జీవించడం): జపనీయులు ‘ఇకిగై’ అనే సిద్ధాంతంతో సంతోషంగా జీవిస్తారు. ఆనందంతో జీవించాలని ఈ పురాతన తత్వశాస్త్రం బోధిస్తుంది. అంతేకాక, ఎందుకు జీవిస్తున్నామనే దానిపై స్పష్టతతో జీవితానికి లక్ష్యాన్ని ఏర్పర్చుకోవడం, ఇతరులకు సహాయం చేయడం, సమతుల ఆహారాన్ని తీసుకోవడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రేమతో కలిసి ఉండటం వంటి అంశాలు వారి ఆయుష్షును పెంచుతాయి. హరా హాచ్ బన్ మి. ఇది జపాన్‌లో ఒక సామెత. అంటే తగిన మోతాదులోనే ఆహారం తినాలని అర్థం. కడుపులో 80 శాతం నిండినంత వరకు మాత్రమే తింటే దీర్ఘాయువు కలిగి ఉంటామని జపనీయుల నమ్మకం. అంతేకాదు, పెద్ద పళ్లెంలో కాకుండా చిన్న చిన్న ప్లేట్లలో లేదా బౌల్స్‌లో నెమ్మదిగా తినడానికి ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి తింటారు. భోజనం చేసేటప్పుడు టీవీ, సెల్ ఫోన్ వంటి వాటికి దూరంగా ఉంటారు. కింద కూర్చునే తింటారు. సమతుల ఆహారం: జపనీస్ ఆహారం లో పండ్లు, ఒమేగా ఫాటీ ఆమ్లాలు అధికం గా ఉండే చేపలు, బియ్యం, తృణధాన్యాలు, టోఫు, సోయా, మిసో, ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారు. ఇవన్నీ తక్కువ కొవ్వులు, చక్కెరలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. తద్వారా కాన్సర్, గుండె జబ్బుల నుంచి బయట పడొచ్చు. ఈ ఆహారం కారణంగానే జపాన్‌లో ఊబకాయం రేటు చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు.హెర్బల్ టీ: జపనీస్ ప్రజలు టీ తాగడాన్ని ఇష్టపడతారు. అది వారి సంస్కృతిలో భాగంగా భావిస్తారు. జపాన్ ద్వీప సమూహంలో మాచా టీ చాలా ప్రాచుర్యం పొందింది. టీ తయారీలో ఉపయోగించే టీ ఆకులు అధిక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు కాన్సర్‌తో పోరాడే శక్తినిస్తాయి. కాలి నడకకు ప్రాధాన్యం: జపాన్ ప్రజలు ఒకేచోట కూర్చుని పని చేసే జీవన శైలిని అంతగా ఇష్టపడరు. యువకుల నుంచి వృద్ధుల వరకు అంతా నడవడానికే ఇష్టపడతారు. విద్యార్థులు, ఉద్యోగులు సమీపంలోని రైల్వే స్టేషన్‌కు నడవడం లేదా సైక్లింగ్? చేయడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ వారి ఆయుర్ధాయం పెరగ డానికి దోహదం చేస్తాయి.జీన్స్ ఇవి వారు ధరించే జీన్స్ కాదు.. జపనీస్‌లో సహజసిద్ధంగా ఉండే జన్యువులు. ఇవే వారి ఆయుష్షును పెంచుతున్నాయి. టైప్ 2 డయాబెటిస్, స్ట్రోక్స్, గుండెపోటు, సెరెబ్రోవాస్కులర్, హృదయ సంబంధ వ్యాధులలను నిరోధించడానికి ఈ జన్యువులు సహాయపడతాయి.వృద్ధుల సంరక్షణ: ఇతర దేశాలలా జపాన్ ప్రజలు వయసు పైబడిన తమ కుటుంబ సభ్యులను ఓల్డ్? ఏజ్?హోమ్‌లకు పంపించరు. కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతను చూసుకోవడం అక్కడి వారి సాంప్రదాయం. వృద్ధాప్యంలో కుటుంబంతో కలిసి జీవిస్తే మానసికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, సంతోషంగా జీవిస్తారని అక్కడి వారి నమ్మకం. చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?ఆరోగ్య సంరక్షణ: జపాన్‌లో అనారోగ్యాలను నివారించి, ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యతనిచ్చే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉంది. క్రమం తప్పకుండా తనిఖీలు చేయడం, వ్యాధులను ముందుగానే గుర్తించడం మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.సామాజిక నిర్మాణం: బలమైన సామాజిక సంబంధాలు, సమాజ మద్దతు మెరుగైన మానసిక ఆరోగ్యానికి, ఒత్తిడి స్థాయులను తగ్గించడానికి దారితీస్తుంది, ఇవి దీర్ఘాయువుకు ముఖ్యమైనవి.చదవండి: ఇక్కడ జిమ్‌లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!చూశారుగా...పైన చెప్పుకున్న వాటిలో ఒక్క జన్యుపరమైన కారణాలు తప్ప మిగతావన్నీ మనం సులువుగా అనుసరించదగ్గవే. వీలయిన వాటిని వీలయినంత వరకు అనుసరించి ఆయురారోగ్యాలతో హాయిగా ఉందాం. దీర్ఘాయుష్మాన్ భవ! -
యూట్యూబ్ సలహా ప్రమాదం కావచ్చు...
ఉదయాన్నే రాగి సంగటి తినమంటారొకరు. తింటే డేంజరంటారొకరు. వేపాకులను తినేయండి అని ఒకరు. రావి ఆకుల జ్యూస్ అని ఒకరు. ఇటీవల ఆరోగ్యం మీద అందరికీ ఆసక్తి పెరిగింది. దానికి తగ్గట్టు యూట్యూబ్‌లో చిట్కాల వీడియోలు పెరిగాయి. అర్హతలు ఉన్నవారూ లేనివారూ చెప్పేది వింటే ప్రొణం మీదకు రావచ్చు.కేరళలోని కన్నూరులో ఓ 18 ఏళ్ల యువతి బరువు తగ్గడానికి కేవలం వేడినీళ్లు తాగుతూ అవయవాలు దెబ్బ తిని మరణించింది. పిల్లలను హెచ్చరించే మనం జాగ్రత్త పడాల్సిన సమయం ఇది.ఆరోగ్య ప్రచారం మంచికోసం కాకుండా సబ్స్ట్రయిబర్ల కోసం, వ్యూస్ కోసం సాగడం నేటి విషాదం. ఎలాంటి టిప్స్ చెప్పిస్తే వీడియోలు వైరల్ అవుతాయో చూస్తున్నారో తప్పితే చెబుతున్న విషయాలు ఎవరికి, ఎంతవరకు అవసరమో ఎవరికి కీడు చేస్తాయో చెప్పడం లేదు. ఆహార విధానాలు కూడా ఎప్పటికప్పుడు కొత్త సిద్ధాంతాలు లేవనెత్తుతూ అయోమయానికి గురి చేయడం నేడు చూస్తున్నాం. కోడిగుడ్డు పచ్చసొన కొందరు వద్దు అంటే కొందరు అదే మంచిది అంటారు. ఇలాంటి అయోమయం మధ్యలో ప్రత్యామ్నాయ ఆహార ప్రచారకర్తలు ముందుకు వచ్చి తాము నమ్మిన విధానాలను ప్రచారం చేస్తున్నారు. వీరు చేస్తున్న వీడియోలకు శాస్త్రీయ నిర్థారణ ఏమిటి అన్నది ఎవరూ చూడటం లేదు. అలాగే చురుగ్గా, ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ‘సన్నగా’ కనిపించడం అవసరం అనుకుంటున్నారు చాలామంది. సన్నగా అవడం అందరి శరీరతత్వాలకు సరిపడుతుందో లేదో వైద్య సలహా తీసుకోవడం లేదు. వీడియోలు చూసి బరువు తగ్గేందుకు ప్రయత్నించిప్రొణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కేరళలో జరిగిన ఉదంతం ఈ విషయంలో హెచ్చరిక చేస్తోంది.50 కిలోల నుంచి 24 కిలోలకుకన్నూరు జిల్లా కలూరుపరయకు చెందిన 18 ఏళ్ల ఫస్ట్ ఇయర్ డిగ్రీ అమ్మాయి శ్రీనంద బరువు తగ్గిపోయి మాట్లాడలేని స్థితికి చేరుకోగా తల్లిదండ్రులు ఆమెను తలస్సెరి కోఆపరేటివ్ హాస్పిటల్‌కు తీసుకు వచ్చారు. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ ప్రభు మాట్లాడుతూ ‘ఆమె బరువు 24 కేజీలు ఉంది. బి.పి. 70, ఆక్సిజన్ లెవల్ 70, బ్లడ్‌షుగర్ 45.. సోడియం, పొటాషియం లెవల్స్ పూర్తిగా పడిపోయాయి. ఆమె ఆరు నెలలుగా ఆహారం తినకుండా దాచేస్తోంది. మూడునెలలుగా యూట్యూబర్‌ను నమ్మి హాట్ వాటర్ మాత్రమే తీసుకుంటోంది. 50 కిలోల నుంచి మూడునెలల్లో 24 కిలోలకు వచ్చేసింది. ఇది ఆహారాన్ని నిరాకరించే ‘అనొరెక్సియా’ అనే మానసిక స్థితి. తల్లిదండ్రులు ఆ విషయాన్ని కనిపెట్టలేకపోయారు. ఇలాంటి వారిని ముందే గుర్తించి మానసిక వైద్యం చేయించాలి’ అన్నారు. ‘రోజుల తరబడి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు’ అని ఆయన తెలిపారు.బాడీ షేమింగ్, వీడియోలుఇటీవల కాలంలో బాడీ షేమింగ్ వల్ల టీనేజర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు దేశప్రధాని మన దేశంలో ఊబకాయం పెరిగిపోతోందని ఆందోళన చెందుతోంటే, అందుకు కారణాలను అర్థం చేసుకోకుండా ఊబకాయులను బాడీ షేమింగ్ చేస్తున్నారు కొందరు. టీనేజ్‌లో ఉన్న పిల్లలు సన్నబడాలని హటాత్తుగా బరువు తగ్గితే అది అవయవాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి వారిని ఆకర్షించేలా యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలు ఉంటున్నాయి. ‘ఇలా చేస్తే వెంటనే బరువు తగ్గుతారు’ అనే వీడియోలు నమ్మవద్దని పిల్లలకు చె΄్పాల్సిన అవసరం ఉంది.గుడ్డిగా నమ్మవద్దుఅలోపతిలోగాని ఆయుర్వేదంలోగాని లేదా ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లోగాని కచ్చితమైన నిపుణులను కలిసి పూర్తిగా కేస్ హిస్టరీ చెప్పి సన్నబడటానికి లేదా బరువు తగ్గడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పచ్చి ఆకుకూరల, కాయగూరల జ్యూసులు తాగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. నిపుణుల సలహా తప్పనిసరిబరువు తగ్గడం అనేది మానసిక వైకల్యంగా మారే స్థితికి కొంతమంది చేరుకోవడం బాధాకరం. ఇలాంటి వారు యూట్యూబ్, ఇన్‌స్టా తదితర ప్లాట్‌ఫామ్స్‌లో తెలిసీ తెలియక చెప్పే సలహాలు నమ్మి నష్టపోతున్నారు. కేరళలో చనిపోయిన అమ్మాయి ఆరు నెలలు ‘హాట్‌వాటర్’ థెరపీ చేసింది. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ ఇద్దరూ ఒకే విధంగా బరువు తగ్గరు. అందుకు వయసు, శరీరతత్త్వం, జన్యుపద్ధతి, జీవన విధానం... ప్రభావం చూపుతాయి. బరువు తగ్గించాలంటే ఎక్స్‌పర్ట్‌లు వ్యక్తిగతంగా వివరాలు తీసుకుని, మెడికల్ హిస్టరీ తెలుసుకొని, ఎటువంటి ఆహారం తీసుకోవాలో, వద్దో సూచిస్తారు. క్వాలిఫైడ్ డైటిషియన్స్ను వ్యక్తిగతంగా కలిసి డైట్ పాటించాలి తప్ప ఎవరూ ఇన్ఫ్లూయెన్సర్లు చెప్పే విధానాలకు దిగవద్దు.– డా.వాణి కత్తి, ఫుడ్‌సైన్స్ ఎక్స్పర్ట్ -
కివిపండుని తొక్కతో సహా తింటున్నారా..?
కివి విదేశీ పండైనా..మనకి మార్కెట్లలో అందుబాటులోనే ఉంది. దీన్ని చైనీస్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. చాలామంది ఇష్టంగా తింటారు కూడా. అయితే ఈ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అన్నీ లాభాలనందించే ఈ పండుని తొక్కతో తినొచ్చా..? ఏ సమయంలో తింటే మంచిది వంటి వాటి గురించి తెలుసుకుందామా..!రుచిలో తియ్యగా, పుల్లగా ఉంటుంది. అందుకే చాలామంది దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే తియ్యగా, పుల్లగా ఉండే ఈ కివీ వివిధ వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా ఈ పండుని తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఈ కివి పండుని తీసుకోవండ కలిగే లాభాలేంటంటే..ఆరోగ్య ప్రయోజనాలు..కివి పండులో విలువైన ఫైబర్, విటమిన్లు ఉంటాయి. ఉబ్బరం తగ్గిస్తుంది గట్ బ్యాక్టీరియాకు ఉపయోగపడుతుంది సెరటోనిస్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి హాయిగా నిద్రపడుతుంది ∙బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది ∙రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒమేగా ఫ్యాటీ అమ్లాల వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. ఎముకలు దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది మల బద్దకం సమస్య లేకుండా చేస్తుంది. కివీలో ఉండే ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి ఉపకరిస్తుంది ∙శరీరం కోల్పోయిన నీటిని అందించడంలో కివీలోని విటమిన్లు సి, ఇ, పొటాషియం... ఉపయోగపడతాయి. ఏ సమయంలో తినాలి కివి తినడానికి సరైన సమయం ఉదయం. కివిలో పుష్కలంగా పోషకాలు ఉన్నాయి. కివి ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. పుల్లటి పండ్లను ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ సమస్యలు వస్తాయి కాబట్టి ఖాళీ కడుపుతో తినకుండా కాస్త బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత తినడం మంచిది.ఎలా తింటే మంచిదంటే..కివీ పండ్లతో ప్రయోజనాలోన్నో. దీని తొక్కను తీసి పారేస్తుం టాం. కానీ అందులో చాలా విషయం ఉంది. తొక్కు వెనుక యాంటీ ఆక్సిడెంట్లు పూర్తి పీచు పదార్థంతో నిండిన గుజ్జు ఉంటుంది. మొక్కజొన్నను మినహా యిస్తే.. కంటి చూపును కాపాడే లుటియిన్ పదార్థ్ధం ఏ ఇతర పండు, కూరగాయాల్లో కూడా ఇందులో ఉన్నంత ఉండదు. రోజుకు రెండు నుంచి మూడు కివీలు తిన్నవారిలో శరీరం లోపల రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గినట్లు నార్వేలో గుర్తించారు. (చదవండి: బీట్రూట్ని మజ్జిగతో కలిపి ఎందుకు తీసుకోవాలంటే..!) -
National Dentists Day : రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేయాలి?
నిజామాబాద్ నాగారం: మానవ శరీరంలో ఉన్న అవయవాలు సమర్థవంతంగా పనిచేసేందుకు శక్తినిచ్చేది దంతాలు. ఆహారాన్ని నమిలి మింగడానికి దోహదప డతాయి. అందుకే నోరు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందని దంత వైద్యులు చెబుతుంటారు. నోటి శుభ్రతపై నిర్లక్ష్యం వహించొద్దని సూచిస్తున్నారు. నేడు జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఉదయం, సాయంత్రం సరిగా బ్రష్ చేసుకోకపోవడంతో నోట్లో ఆహారం చేరి బ్యాక్టీరియా తయారవుతుంది. దీంతో పుప్పిపళ్ల సమస్య ఉత్పన్నమవుతుంది. ఇదే కాకుండా నోరు శుభ్రంగా లేకపోతే రోగాలు దరి చేరుతాయని వైద్యులు చెబుతున్నారు. దంతాల శుభ్రతలో జాగ్రత్తలు.. ●దంతాలను ఆరోగ్యంగా ఉంచేందుకు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. ● ఏదైనా తిన్న తర్వాత నోటిని నీటితో కడగాలి. దీంతో పంటిలో చిక్కుకున్న ఆహారం బయటకు పోతుంది. ● ప్రతి ఆరు నెలలకోసారి దంత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ● మన్నికై న టూత్ పేస్ట్, టూత్ బ్రష్‌లను వాడాలి. ● చాక్లెట్లు, చిప్స్, తీపి పదార్థాలు తినొద్దు. ప్రతి సంవత్సరం మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో దంతవైద్యులు మరియు వారు అందించే ముఖ్యమైన పాత్రను గుర్తించేందుకు జాతీయ దంతవైద్యుల దినోత్సవంగా మార్చి 6న పాటిస్తారు. జాతీయ దంతవైద్యుల దినోత్సవ చరిత్ర 20వ శతాబ్దం నాటిది, దీనిని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ (ADA) అధికారికంగా మొదలు పెట్టింది. దంతవైద్యంలో మైలురాళ్లను స్మరించుకోవడానికి ఈ రోజును పాటిస్తారు. ఉదాహరణకు, 1840లో డాక్టర్ హోరేస్ వెల్స్ మొదటిసారిగా అనస్థీషియాను ఉపయోగించారు. దంతవైద్యులు దంత సమస్యలను నయం చేయడమే కాకుండా నోటి అనారోగ్యానికి సంబంధించిన సంక్లిష్ట ఆరోగ్య సమస్యలను కూడా గుర్తిస్తారు. -
కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుంది రాగులా? పాలా?
శరీరానికి కాల్షియం అనేక రోజువారీ పనులు చేసేందుకు ఉపకరిస్తుంది. అందువల్ల మన డైట్లో కాల్షియంని చేర్చుకోవడం ముఖ్యం. జున్ను, బొప్పాయి, మల్బరీ, లిచీ, కివి, బచ్చలికూర, బ్రకోలీలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యంగా కూడా ఉంటారు. పాలు, రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుందంటే...పాలు, రాగులు రెండూ ఒకదానికి మించి లాభాలని అందిస్తాయి. ఉదాహరణకి..100 మి.లీ పాలు తాగితే 110 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. అదే 100 గ్రాముల రాగులని తీసుకుంటే, దాదాపు 350 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థని ఆరోగ్యంగా ఉంచితే, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత ఉన్నవారికి రాగులు మంచిది. రాగుల్లో ఉండే పొటాషియం వంటి ఇతర పోషకాలు మొత్తం శరీర ఆరోగ్యానికి సాయపడతాయి. పాలలో పోషకాలతో పాటు ఉండే ఎలక్ట్రోలైట్స్ బాడీని హైడ్రేట్ చేస్తాయి. రాగులు షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ని నియంత్రిస్తుంది కాబట్టి, మీ అవసరాలని బట్టి ఏది మంచిదో నిర్ణయించుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!రాగులు, ఆరోగ్య ప్రయోజనాలుభారతదేశంలోని చాలా ప్రాంతాలలో రాగిగా ప్రసిద్ధి చెందిన ఫింగర్ మిల్లెట్ అతి ముఖ్యమైన చిరుధాన్యాలలో ఒకటి ప్రధాన ఆహారంగా పరిగణించబడుతుంది. ఇది సులభంగా జీర్ణం అవుతుంది కాబట్టి దీనిని తరచుగా శిశువులకు , వృద్ధులకు ఆహారంగా ఇవ్వవచ్చు. రాగులలో ప్రోటీన్ ,ఫైబర్స్ వంటి స్థూల పోషకాలతో పాటు, కాల్షియం, మెగ్నీషియం, మెథియోనిన్, లైసిన్, అమైనో ఆమ్లాలు ఉన్నాయి. సంతృప్తిగా ,కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు ఉంచుతుంది.ట్రిప్టోఫాన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుందిగ్లూటెన్ రహితం కాబట్టి గ్లూటెన్ అసహనం ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది.తక్కువ కొవ్వును కలిగి ఉంటుంది , అసంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది.కాల్షియం మూలమైన రాగులు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయిమొలకెత్తిన రాగులు విటమిన్ బి 12 అవసరాలను తీరుస్తాయి.శీతాకాలంలో ఇది బెస్ట్ ఫుడ్. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.ఇది మలబద్దకానికి సహాయపడుతుంది.ఎవరు తీసుకోకూడదుమూత్రపిండాల్లో రాళ్ళు, తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం వంటి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు లేదా డయాలసిస్ చేయించుకుంటున్నవారురాగులలో పొటాషియం అధికంగా ఉంటుంది కనుక హైపర్కలేమియా లేదా సీరం పొటాషియం స్థాయిలు పెరిగినవారు. అలాగే రాగులు రాత్రి పూట తినకుండా ఉండటం మంచిది.ఇదీ చదవండి : ఇలాంటి పీడ కలలు మీకూ వచ్చాయా? అర్థం, అనర్థాలేమిటి? -
కాలుష్యం కాటేస్తది.. చెవి, ముక్కు, గొంతు జాగ్రత్త!
ఇటీవల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముక్కు ఆరోగ్య సంరక్షణ చాలా కీలకంగా మారుతోంది. అంతేకాదు.. ఈమధ్యకాలంలో శబ్దకాలుష్యం కూడా అనూహ్యంగా పెరిగి పోతోంది. వాహనాల పెరుగుదల వల్ల శబ్ద, వాయు కాలుష్యాలు... ఈ రెండూ ఏకకాలంలో పెరిగి రెండు జ్ఞానేంద్రియాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఇక ఈ ముక్కు, చెవులు రెండూ గొంతుతో అనుసంధానమై ఉంటాయి. ఈ నేపథ్యంలో చెవులు,ముక్కు, గొంతు ఆరోగ్య పరిరక్షణ ఎంతో కీలకం. అందుకే వాటి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను తెలుసుకోవడం తప్పనిసరి. ముక్కు చెవులనూ, అలాగే తలను మిగతా దేహంతో అనుసంధానం చేసే కీలక అవయవ భాగమే మెడ. వీటన్నింటి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకు పాటించాల్సిన కొన్ని సూచనలివి... చెవుల సంరక్షణ కోసం... ∙పెద్ద పెద్ద చప్పుళ్ల నుంచీ, శబ్దకాలుష్యం నుంచి చెవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇయర్ ఫోన్స్‌తో మొబైల్ వాడేటప్పుడు, కంప్యూటర్ను ఉపయోగిస్తూ హెడ్‌ఫోన్స్ పెట్టుకున్న సమయంలో పెద్దగా వాల్యుమ్ పెట్టుకోకుండా చెవికి తగినంత వాల్యుమ్‌తో జాగ్రత్తగా చెవులను కాపాడుకోవాలి. ∙పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే చోట్లలో / పనిప్రదేశాలలో ఇయర్ ప్లగ్స్ వాడుకోవాలి.చెవుల్లో హోరు శబ్దాలు గానీ, ట్రాన్స్ఫార్మర్ దగ్గరి గుయ్‌మనే శబ్దాలుగాని వినిపిస్తుంటే అది టినైటస్ అనే సమస్య కావచ్చని భావిస్తూ సర్టిఫైడ్ ఆడియాలజిస్ట్ దగ్గర వినికిడి పరీక్షలు చేయించుకోవాలి. ∙చెవులు వినబడుతుంటేనే చిన్నారులు మాటలు నేర్చుకునేది. అందుకే చిన్నారి పుట్టగానే ఆ పిల్లలకు వెంటనే వినికిడి పరీక్షలు చేయించాలి. ఇలా పరీక్షించి చికిత్స చేయిస్తే... అటు వినికిడి సమస్యనూ, ఇటు మాటలు రాక΄ోవడాన్నీ ఏకకాలంలో అరికట్టవచ్చు. కాక్లియర్ ఇం΄్లాంట్స్ వంటి చికిత్సలతో మాటలూ, వినికిడీ వచ్చేలా చేయవచ్చు సైనస్ ఇన్ఫెక్షన్లూ, సమస్యల నుంచి కాపాడుకోవడానికి... ఒక్కోసారి చేతుల్లో ఉండే హానికరమైన సూక్ష్మజీవులు ఏదైనా తింటున్న సమయంలో గొంతులోకి వెళ్లి అక్కణ్నుంచి ముక్కు, నోరు, గొంతు ద్వారా (ఒక్కోసారి కళ్ల నుంచి కూడా) లోనికి ప్రవేశించి ముక్కు, నోరు, గొంతు, కళ్ల ఇన్ఫెక్షన్లతో పాటు సైనసైటిస్ వంటి సమస్యలకూ కారణమవుతాయి. కానీ చేతులు శుభ్రంగా కడుక్కుంటూ మంచి హ్యాండ్ హైజీన్‌ను పాటించడం మేలు. అందుకే కేవలం చేతులు శుభ్రంగా కడుక్కోవడం (హ్యాండ్ వాష్)తో ఎన్నో సమస్యలను నివారించవచ్చునని గుర్తుంచుకోవాలికొన్ని అలర్జీ సమస్యలను, మనకు సరిపడని అలర్జెన్స్ వల్ల ముక్కు, గొంతు, కళ్ల అలర్జీలూ, సైనస్ సమస్యలతో ΄ాటు ఊపిరితిత్తులకు సంబంధించిన మరికొన్ని రుగ్మతలూ రావచ్చు. అందుకే మనకు సరిపడని వాటికి దూరంగా ఉండాలి వేడినీటితో ఆవిరిపట్టడం అనే ఓ చిట్కాతో ముక్కు, గొంతు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఈ జాగ్రత్తలతోపాటు మంచి సమతులాహారం, విటమిన్–సి సమృద్ధిగా ఉండే నిమ్మజాతి పండ్లైన నారింజ, బత్తాయి వంటివి వాడటం, జింక్ మోతాదులు ఎక్కువగా ఉండే నట్స్, గింజధాన్యాలు, పప్పుధాన్యాలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు నివారితమవుతాయి. ఈ జాగ్రత్తలతోపాటు మసాలాలు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల గొంతులో ఇరిటేషన్లు, యాసిడ్ గొంతులోకి వచ్చి గొంతు మండటం అనే సమస్యలు నివారితమవుతాయి. ఇక వీటితోపాటు ఈ చలి సీజన్లో మరింత చల్లటి గాలికీ, నీటికి దూరంగా ఉండటం, కాలుష్యానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తవహించడం వంటి జాగ్రత్తలు మేలు చేస్తాయనే అంశాన్ని గ్రహించాలి. గొంతు ఆరోగ్యం (థ్రోట్ హైజీన్) కోసంస్మోకింగ్, మద్యం అలవాటు మానుకుంటే కేవలం గొంతు ఆరోగ్యం మాత్రమే కాదు... మొత్తం దేహం ఆరోగ్యమంతా బాగుంటుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలూ, జబ్బులూ, రుగ్మతలూ నివారితమవుతాయి. గొంతు ఆరోగ్యం కోసం గొంతును శుభ్రంగా ఉంచుకోవడం మేలు చేస్తుంది. ఇందుకు గోరువెచ్చని నీటిలో కాస్తంత ఉప్పు వేసుకుని పుక్కిలించడం ఓ మంచి ఇంటి చిట్కా. దీనివల్ల గొంతుకు వచ్చే అనేక ఇన్ఫెక్షన్లూ, ఇన్ఫ్లమేషన్లూ, సోర్ థ్రోట్ వంటి సమస్యలు దూరం కావడమే కాకుండా అనేక రకాల గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. ఇది చాలా సులువైన, నమ్మకమైన, ప్రభావపూర్వకమైన చిట్కా ∙ఇక నీళ్లు ఎక్కువగా తాగుతుండటమనేది ఇటు గొంతుతోపాటు పూర్తి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతూ అనేక సమస్యల నుంచి రక్షణ కల్పించే అంశం. (భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!)ముక్కు ఆరోగ్యం కోసం...ముక్కు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మనందరి మొదటి ప్రాధాన్యత. అన్ని అవయవాలనుంచి తేమను లాగేసినట్టే... ముక్కు నుంచి కూడా తేమను లాగేస్తుంది ఈ సీజన్. అందుకే ముక్కు తాలూకు తేమ బాగానే నిర్వహితమయ్యేలా చూసుకోవాలి ∙ఈ సీజన్లో బాగా నీళ్లు తాగుతూ ఉంటే అది ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్‌ను ΄పొడిబారకుండా తేమగా ఉండేలా చూడటంతో పాటు... మిగతా దేహమంతా బాగా హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకునేందుకు ఉపయోగపడుతుంది.ముక్కులు బిగదీసుకుపోయే తత్త్వం ఉన్నవారు (ఇది ఈ సీజన్లో మరీ ఎక్కువ) సెలైన్ నేసల్ స్ప్రేలు వాడటం వల్ల ముక్కు ఆరోగ్యం బాగుంటుంది. ఇక చీదే సమయంలో బలంగా చీదడం సరికాదు. ఒక్కోసారి దీంతో ముక్కులోని అతి సన్నటి రక్తనాళాలు (క్యాపిల్లరీస్) చెదిరి రక్తస్రావం కూడా అయ్యే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: మహిళలకు ఫ్రీ బస్సా? ఇదెక్కడి న్యాయం అంటూ ట్వీట్ : ఇచ్చిపడేసిన నెటిజనులు -
వేడి నీళ్లతో ఫేస్ వాష్ చేసుకుంటే.. ఏమవుతుందో తెలుసా?
వేడి నీళ్లతో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. అలసట తీరుతుంది. ముఖ్యంగా చలికాలంలో వేడి నీటి (Hot water) స్నానం ఇంకా ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే దుమ్ము ధూళితో నిండిపోయిన ముఖాన్ని (Face) వేడినీళ్లతో కడుక్కుంటే ప్రశాంతంగా ఉంటుంది. అయితే వేడి వేడి నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉందట. ఇది వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందట. వేడి నీరు మీ చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఏం చేయాలి? ఈ కథనంలో తెలుసుకుందాం.వేడి-నీరు అకాల వృద్ధాప్యం వేడి నీరు ప్రశాంతంగా అనిపించినప్పటికీ, ముఖ చర్మంపై తీరని ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు చర్మ వ్యాధి నిపుణులు. ఎలా అంటే.. మన శరీరంలోని మిగిలిన భాగాలతో పోలిస్తే ముఖం చర్మం భిన్నంగా ఉంటుంది. చాలా సున్నితంగా, చిన్న కేశనాళికలతో నిండి ఉంటుంది. ఉష్ణోగ్రత వంటి బాహ్య కారకాలకు తొందరగా ప్రభావితయ్యే ఉండే రంధ్రాలతో నిండి ఉంటుంది. వేడి నీరు అప్పటికపుడు ఊరటనిచ్చినా ఆ తరువాత అనేక సమస్యలను కలిగిస్తుంది అంటున్నారు.వేడి నీళ్లు ముఖంపై ఉండే సూక్ష్మకేశనాళికలకు హాని కలిగిస్తుంది. ఇరిటేషన్, చర్మం ఎర్రబారడం లాంటి సమస్యలు రావచ్చు. సున్నితమైన చర్మం లేదా రోసేసియా వంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది.నేచురల్ ఆయిల్స్‌కు నష్టంవేడి నీటి వలన ముఖంపై ఉండే సహజ నూనెలకు హాని కలుగుతుంది. ఇవి సెబమ్‌ను ఉత్పత్తి చేసి, తేమను కాపాడుతుంది. మృదువుగా ఉంచుతుంది. కానీ వేడి నీరు ఈ నూనెలకు నష్టం కలిగించి మృదుత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. ముఖం మీద చర్మం తొందరగా ముడతలు పడేలా చేస్తుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తి మందగిస్తుంది. దీంతో చర్మం సహజత్వాన్ని కోల్పోయి, ముడతలు తొందరగా వస్తాయి. ఫలితంగా వయసుకుమించి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. వయసు పెరుగుతున్న కొద్దీ కొల్లాజెన్,ఎలాస్టిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అతినీలలోహిత (UV) కిరణాలు కొల్లాజెన్ ఎలాస్టిన్‌ను విచ్ఛిన్నం చేస్తాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులు వంటి సూర్యరశ్మికి గురయ్యే ప్రదేశాలలో, ఎండలేకపోయినా కూడా చర్మాన్ని రక్షించు కునేందుకు సన్ స్క్రీన్ వాడాలి. ముఖాన్ని ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. అలాగే మొహాన్ని పదే పదే కడగడం వల్ల మెరుపు తగ్గిపోతుంది.కెమికల్స్‌తో కూడిన సబ్బులు, హానికరమైన రసాయన బ్యూటీ ప్రాడక్ట్స్‌ను అస్సలు వాడకూడదు.అలాగే అధిక కార్బోహైడ్రేట్లు, ముఖ్యంగా శుద్ధి చేసిన పిండి పదార్థాలు ,చక్కెరలు, గ్లైకేషన్ అనే ప్రక్రియకు దారితీయవచ్చు. కొల్లాజెన్‌ను దెబ్బతీసి, తొందరగా ముసలి తనం వచ్చేలా చేస్తుంది. అందుకే పిండి పదార్ధాలను తగ్గించి, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలి.మెరిసే చర్మం కోసం హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి.ఎలాంటి మచ్చలు లేకుండా, మెరిసిపోతూ, ప్రకాశవంతమైన కాంప్లెక్షన్ రావాలంటే శుభ్రంగా తినాలి. విటమిన్లు అధికంగా ఉండే ఆహారం, ముఖ్యంగా విటమిన్ సి, ఆకుకూరలు, సోయా, చిక్కుళ్ళు, చేపలు, చికెన్ తాజా పండ్లు తీసుకోవాలి. అవసరమైతే చర్మ ఆరోగ్యానికి, ముఖ్యంగా బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే సప్లిమెంట్లను తీసుకోవాలి. -
చలికాలంతో జాగ్రత్త.. ఆరోగ్యం, ప్రమాదాలు నుంచి రక్షణ కోసం.. (ఫొటోలు)
-
భవిష్యత్తులో తగ్గొచ్చా?
మా కజిన్‌కి 26 ఏళ్లు. బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది. కీమో వల్ల భవిష్యత్తులో ఫర్టిలిటీ చాన్సెస్ తగ్గొచ్చు అంటున్నారు. తనకి వేరే ఆప్షన్ ఏదైనా ఉందా? – పద్మజ, వెస్ట్గోదావరిక్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చాయి. అలాగే ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసే కొత్త పద్ధతులు కూడా చాలా వచ్చాయి. కీమో రేడియేషన్‌తో అండాశయాలు దెబ్బతింటే భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయి. కొన్ని ట్రీట్మెంట్స్ వల్ల అండాశయాలు చాలా వేగంగా దెబ్బతింటాయి. అందుకే క్యాన్సర్ ట్రీట్మెంట్కి ముందే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలి. వీటి గురించి ఆంకో ఫర్టిలిటీ క్లినిక్స్‌లో డిస్కస్ చేస్తారు. ఒవేరియన్ కార్టెక్స్ అంటే అండాశయ బాహ్యపొరలో అపరిపక్వ అండాలు ఉంటాయి. ఇవి నెమ్మదిగా డెవలప్ అయ్యి పరిపక్వ అండాలుగా, మంత్లీ సైకిల్లో విడుదలవుతాయి. కాబట్టి ఒవేరియన్ లేయర్‌ని డామేజ్ చేసే ట్రీట్మెంట్ తీసుకునే ముందు మల్టీ డిసిప్లినరీ టీమ్ డిస్కషన్‌తో.. ఈ ఒవేరియన్ టిష్యూని ప్రిజర్వ్ చేస్తారు. మత్తు మందు ఇచ్చి కీ హోల్ (లాపరోస్కోపీ) సర్జరీ ద్వారా ఒవేరియన్ టిష్యూని తీసి క్రయోప్రిజర్వ్ చేస్తారు. ఇందులో ఒక ఓవరీని లేదా ఒవేరియన్ టిష్యూ బయాప్సీస్ని తీసి ఫ్రీజ్ అండ్ ప్రిజర్వ్ చేస్తారు. మైనస్ 170 డిగ్రీ సెంటీగ్రేడ్ అల్ట్రా లో టెంపరేచర్లో ఉంచుతారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తయిన తరువాత లేదా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ సమయంలో ఈ టిష్యూను తిరిగి ఇంప్లాంట్ చేస్తారు. కొన్ని నెలల తరువాత ఈ టిష్యూ బాడీలో నార్మల్ ఫంక్షన్‌లోకి వచ్చి.. మంత్లీ సైకిల్స్, ఎగ్ డెవలప్మెంట్కి సిద్ధమవుతుంది. ఇది గత పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రుల్లో ప్రాక్టీస్‌లో ఉంది. దీనిద్వారా ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిన కేసులూ ఉన్నాయి. మీ కజిన్‌ని ఒకసారి కౌన్సెలింగ్ సెషన్‌కి అటెండ్ అవమనండి. విషయం వివరంగా తెలుస్తుంది. నేనిప్పుడు ప్రెగ్నెంట్‌ని. రెండవ నెల. ఇంతకుముందు ప్రెగ్నెన్సీ రైట్ సైడ్ ట్యూబ్‌లో వచ్చింది. దాంతో రైట్ ట్యూబ్ తీసేశారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ట్యూబ్‌లో ఉందని చెప్పారు. మెడికల్ ట్రీట్మెంట్తో ఏమైనా మేనేజ్ చేయవచ్చా?– అపర్ణ, నిర్మల్సహజంగా గర్భం దాల్చడానికి ఫాలోపియన్ ట్యూబ్స్ అవసరం. మీకు లెఫ్ట్ సైడ్ ట్యూబ్ మాత్రమే ఉంది కాబట్టి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (ట్యూబ్‌లో వచ్చే ప్రెగ్నెన్సీ)ని మెడికల్‌గా మేనేజ్ చేయడం అవసరం. కానీ దీనికి మీరు డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. డాక్టర్ మీ కండిషన్, సిట్యుయేషన్, ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ, మీకు లివర్, కిడ్నీ టెస్ట్స్, Beta hcg టెస్ట్స్ చేసి, మెడికల్ మెథడ్ ట్రై చేయొచ్చా అని చెప్తారు. అందరికీ ఈ ట్రీట్మెంట్ పనిచేయకపోవచ్చు.Methotrexate అనే డ్రగ్ ద్వారా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ మెడిసిన్ వాడాలంటే మీకు పెయిన్ గానీ, బ్లీడింగ్ గానీ ఉండకూడదు. ట్యూబ్ రప్చర్ కాకుండా ఉందనే విషయం స్కాన్‌లో కన్ఫర్మ్ కావాలి. Beta hcg తక్కువ లెవెల్స్‌లో ఉండాలి. మీరు ఫాలో అప్‌కి రావటానికి రెడీగా ఉండాలి. ఆసుపత్రి దగ్గరలో ఉండాలి. ఇది ఇంజెక్షన్ ద్వారా ఫస్ట్ డోస్ ఇచ్చి, మూడురోజులకొకసారి Beta hcg లెవెల్స్ తగ్గుతున్నాయా అని చెక్ చేస్తారు. తగ్గుతోంది అంటే మెడిసిన్ పనిచేస్తోంది అని అర్థం. రెండు మూడు వారాలు కొంత పెయిన్, స్పాటింగ్ ఉండొచ్చు. నొప్పి తీవ్రంగా ఉంటే సర్జరీ చెయ్యాలి. పారాసిటమాల్ లాంటి మాత్రలు వాడొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్ ఎమోషనల్‌గా కూడా సవాలుగా మారొచ్చు. అందుకే కౌన్సెలింగ్ సహాయమూ తీసుకోవాలి. ఈ మెడిసిన్‌తో నాలుగు నుంచి ఆరు వారాల సమయంలో ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ దానంతట అది కరిగిపోతుంది. ఒకవేళ రెండో వారంలో ఏ మార్పులూ కనిపించకపోతే లాపరోస్కాపిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిన తరువాత కనీసం మూడు వారాల వరకు ఆగి, మళ్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ∙ -
కంటిచూపు మెరుగుపడాలంటే...సూపర్ ఫుడ్స్ ఇవే!
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనేది అందరికి తెలుసు. పిల్లల ఉంచి పెద్దలదాకా కంటి వ్యాధులు ,దృష్టి లోపాలు చాలా సాధారణగా మారిపోయాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2.2 బిలియన్లకు పైగా ప్రజలు ఏదో ఒక రకమైన దృష్టి లోపం లేదా అంధత్వంతో బాధపడుతున్నారు. అయితే చాలా వరకు కంటి సమస్యల్ని చక్కటి ఆహారం, ముందస్తు ఆరోగ్య పరీక్షలతో నివారించు కోవచ్చు. అలాగే కొన్ని జాగ్రత్తలను కూడా పాటించాల్సి ఉంటుంది అలాంటి సూపర్ ఫుడ్స్, జాగ్రత్తలేమిటో చూద్దాం!చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా చాలామంది కంటిచూపు సమస్యలతో బాధ పడుతున్నారు. చిన్న వయసులోనే కళ్ల జోడు సాయం లేనిదే కాలం గడవని పరిస్థితి. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి ఆహారం తీసుకోవాలి. క్యారెట్లో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో తగినంత విటమిన్ ఏ కూడా ఉంటుంది.బచ్చలికూరలో లుటిన్,జియాక్సంతిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హానికరమైన యూవీ కిరణాలు, ఫ్రీ రాడికల్స్ నుండి కళ్ళను కాపాడతాయి. సాల్మన్ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతాయి. కళ్ళు పొడిబారకుండా కాపాడతాయి.బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. వాపును తగ్గించి, ఆరోగ్యకరమైన,చక్కటి దృష్టిని అందించేలా తోడ్పడతాయి.స్వీట్ పొటాటోలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది, ఇది రాత్రి దృష్టిని పెంచడంలో సహాయపడుతుంది. కళ్లు పొడిరకుండా కాపాడుతంది. బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. ఇది వయస్సు సంబంధిత సమస్యలనుంచిరక్షిస్తుంది. గుడ్డు సొనలో లుటిన్ ,జియాక్సంతిన్ బాగా లభిస్తుంది. ఇది కాంతి నష్టంతో పోరాడేలా కళ్ళ సామర్థ్యాన్ని పెంచుతుంది. నారింజలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటిశుక్లబాధలనుంచి కాపాడుతుంది. జాగ్రత్తలుకళ్ళ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పౌష్టిక ఆహారాలను తీసుకోవాలి.విటమిన్ సీ లభించే పండ్లు, కూరగాయలు,ఆకు కూరలు ఎక్కువగా తినటం కూడా కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఎక్కువసేపు లాప్టాప్ ముందు, మొబైల్ ఫోన్లను చూస్తూ ఉండేవారి కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది అనేది గమనించాలి. అలాగే చలికాలంలో చలిగాలులకు కళ్లకు నష్టం ఏర్పడే అవకాశం ఉంది. చలిగాలలు, దుమ్ము ధూళినుంచి కళ్లను కాపాడుకోవాలి. -
ఎలాన్ మస్క్ తల్లి మాయే హెల్త్ టిప్స్: 14 మంది పిల్లలకు నానమ్మగా..!
ఎలన్ మస్క్ పేరు చెప్పగానే అందరికి టెక్నాలజీని శాసిస్తున్న వ్యక్తి గుర్తుకొస్తాడు. ఎంత అత్యున్నత స్థాయిలో ఉన్నా కూడా.. ఓ కొడుకుగా తల్లి మాట వినాల్సిందే. ఇక్కడ మస్క్ కూడా తన తల్లి మాయే ఆహార నియమాలకు కట్టుబడి ఉంటాడట. అంతేకాదు ఆమె తన 14 మంది మనవళ్లు, మనవరాళ్లు కోసం కూడా కొన్ని ఆహార నియమాలను కూడా రూపొందించిందట. అవి వాళ్లంతా తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందేనట. ఇక మస్క్ తల్లి మాయే ఏడు పదుల వయసులో కూడా ఎంతో ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటారు. మాయే మాజీ మోడల్, డైటీషయన్ కూడా. ఆమె ఆహారం విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా నోటిలో పెట్టుకునే వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నొక్కి చెబుతున్నారు. అంతేగాదు యువతరం చక్కటి ఆరోగ్య కోసం ఎలాంటి పోషకాహార నియామాలు పాటించాలో కూడా వివరించారు. అవేంటో చూద్దామా..!.76 ఏళ్ల మాయే మస్క్ ఈ వయసులో కూడా ఎంతో అందంగా, చురుకుగా ఉంటారు. ఆమె గత 40 ఏళ్లుగా డైటీషియన్‌కి సంబంధించి ఓ ప్రైవేట్ సంస్థను కూడా నడుపుతోంది. ఆమె తరుచుగా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు చెబుతుంటారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్యూలో తన హెల్త్ సీక్రెట్‌ని వివరిస్తూ.. ఈనాటి యువతరం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సవివరంగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్తో బాధపడుతున్న వ్యక్తులు తప్పనిసరిగా డైట్‌ని మార్చి ఆరోగ్యకరమైన వాటిని తీసుకునేలా ప్రయత్నించాలని అంటారు మాయే. అప్పుడు బ్లడ్‌లో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలో మెరుగైన మార్పులు కనిపించడమే గాక చికిత్స ఖర్చులు కూడా ఆదా అవుతాయని అంటారామె. అలాగే తాను 14 మంది పిల్లలకు నానమ్మగా ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో ఎలాంటి రాజీకి తావివ్వనని అన్నారు. ముఖ్యంగా చిప్స్, కుక్కీలకు తన ఇంట్లో స్థానం ఉండదంటారు. చక్కెర, సోడియంతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్రమాదకరమైన దుష్ప్రభావాలను కలుగజేస్తాయని నొక్కిచెప్పారు. తన మనవళ్లు, మనవరాళ్లను అవి తినే విషయంలో తాను చాలా స్ట్రిక్‌గా ఉంటానన్నారు. జంక్‌ఫుడ్‌కి ఎడిక్ట్ అయ్యేలా చేసేవే అవేనని అంటారు మాయే. చిన్నారులు ఒక్కసారి తినే ప్రయత్నం చేస్తే దాన్ని కంట్రోల్ చేసుకోలేరు అందువల్లే ముందే వాళ్ల దరిదాపుల్లోకి వాటిని రానీయకూడదంటారామె. వాటికి బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఇవ్వమని సూచిస్తున్నారు మాయే. అవేంటంటే..పండ్లుకూరగాయలుపెరుగుపాలుతృణధాన్యాలు గోధుమ రొట్టె తదితరాలు..ఇక అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం..చిప్స్, కుక్కీలు విపరీతమైన ఉప్పు, చక్కెరతో ఉంటాయి. వీటిని తినడం వల్ల దంత క్షయం, చెడు కొలెస్ట్రాల్, టైప్2 డయాబెటిస్, కేన్సర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి, ఒబెసిటీ తదితర అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. వీటిని సరదాగా ఒక్కసారి చిన్నారులకు అలవాటు చేస్తే వాటి రుచికి ఆటోమెటిక్ మళ్లీ తినాలను కోరిక వారిలో బలంగా పెరుగుతుందని అన్నారు. ఒకరకంగా వారి మెదడు కూడా తెలియకుండా వాటికి బానిసయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఆదిలోనే వాటిని దరిచేరనీయకుండా చూస్తే ఆరోగ్యవంతంగా పెరుగుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: -
రికవరీ లేట్ అవుతుందా?
నాకు మూడవ నెల. నోట్లో అల్సర్స్ ఉన్నాయి. మెడ భాగంలో కూడా గడ్డలు వచ్చిపోతున్నాయి. నా భర్తకు కూడా ఇలానే వస్తున్నాయి. మందులు వాడాక తగ్గాయి. ఇప్పుడు బేబీకి ఏమైనా రిస్క్ ఉంటుందా?నళినీ రాణి, మాధవరంమీరు చెప్పిన దానిని బట్టి ఇది రిపీటెడ్ ఇన్ఫెక్షన్లా ఉంది. నోట్లో, వెజైనా ఏరియాలో అల్సర్స్ రావడం, మీ ఆయనకు కూడా రావడం చాలా వరకు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్లో ఉంటుంది. వెంటనే తగిన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది. నిర్లక్ష్యం చేస్తే తల్లి నుంచి బిడ్డకు సోకే ప్రమాదం ఉంటుంది. చికిత్స తీసుకోకుంటే బిడ్డ మీద తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయి. ఏ లక్షణాలూ లేకుండా, కొంతమందికి మూడు నెలల తర్వాతే ఇన్ఫెక్షన్ ఉందని తెలుస్తుంది. అందుకే ఇలా అల్సర్స్ రావడంతోనే వీడీఆర్ఎల్ టెస్ట్ చెయ్యాలి. రొటీన్ టెస్టుల్లో భాగంగానే గర్భవతికి కూడా ఈ టెస్ట్ చేస్తున్నారు. కండోమ్స్ వాడటంతో ఈ ఇన్ఫెక్షన్ని దూరం చెయ్యవచ్చు. మీరు వెంటనే దగ్గరలోని గైనకాలజిస్ట్‌ని కలవండి. కొన్ని రక్తపరీక్షలు, కొన్నిసార్లు ఈ అల్సర్స్ నుంచి స్వాబ్ టెస్ట్, వెజైనా స్వాబ్ టెస్ట్ చేస్తారు. గర్భిణులకు ఈ పరీక్షలు 3, 7, 9 నెలల్లో చేసి, చికిత్స ఇచ్చిన తరువాత నయమైందా లేదా అని చెక్ చెయ్యాలి. పెన్సిలిన్ ఇంజక్షన్‌తో ఈ ఇన్ఫెక్షన్ బాగా నయమవుతుంది. వీడీఆర్ఎల్ టెస్ట్ పాజిటివ్ ఉన్నవారిలో టీపీపీఏ, టీపీహెచ్ఏ చెయ్యాలి. ఒకవేళ ఆ టెస్ట్‌లో ఏమీ తెలియకపోతే చికిత్స చేసి, రెండు మూడు వారాల తరువాత పరీక్షల కోసం మళ్లీ శాంపిల్స్ పంపించాలి. సిఫిలిస్ ఇన్ఫెక్షన్ తొలిదశలో వస్తే ఫీటల్ మెడిసిన్ నిపుణులతో గర్భస్థ శిశువుకు స్కానింగ్ చేయించాలి. 5,7వ నెలలో చేసే ఈ స్కానింగ్‌లో ఇన్ఫెక్షన్ వల్ల బిడ్డలో ఏమైనా మార్పులు ఉన్నాయా అని చెక్ చేస్తారు. అల్సర్స్ వెజైనల్ ఏరియాలో మానకుండా ఉంటే 9వ నెలలో మళ్లీ టెస్ట్ చేసి, సిజేరియన్‌కు రికమండ్ చేస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ చేయవచ్చు. బ్రెస్ట్ మీద మానని పుండ్లు లేకపోతే డైరెక్ట్ ఫీడింగ్‌కి అనుమతి ఇస్తారు. పిల్లల డాక్టర్‌కి కూడా ముందుగానే ఈ టెస్ట్ రిజల్ట్ చెప్పాలి. శిశువుకు కూడా 3వ నెలలో, ఏడాదిన్నర వయసులో పరీక్షలు చేస్తారు.నాకు డేకేర్‌లో హిస్టరోస్కోపీ అనే ప్రొసీజర్ ప్లాన్ చేశారు. గర్భసంచిలో చిన్న గడ్డ ఉందని చెప్పారు. డైరెక్ట్‌గా కాకుండా ఇలాంటి ప్రొసీజర్‌తో రికవరీ లేట్ అవుతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– గాయత్రి, వరంగల్హిస్టరోస్కోపీ ప్రొసీజర్‌లో చిన్న కెమెరా ద్వారా గర్భసంచిని, లోపలి పొరను స్పష్టంగా చూసి, ఉన్న సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ. డైరెక్ట్‌గా డీ అండ్ సీ లాంటి వాటిలో సమస్య మూలం మిస్ అయ్యే చాన్స్ ఎక్కువ. పైగా బ్లీడింగ్ కూడా ఎక్కువగా అవుతుంది. హిస్టరోస్కోపీలో చాలా చిన్న పల్చటి పరికరంతో ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. త్వరగా కోలుకోవడం కూడా జరుగుతుంది. హిస్టరోస్కోపీ పూర్తయ్యాక అదే రోజు డిశ్చార్జ్ చేస్తారు. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. కొన్ని రోజులు స్పాటింగ్లాగ ఉండవచ్చు. కొంతమందికి వెజైనా పెయిన్ ఉండవచ్చు. రెండురోజులు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ప్రొసీజర్ తరువాత రొటీన్ పనులను రెండు రోజుల్లో మొదలుపెట్టుకోవచ్చు. ప్రతిరోజూ షవర్‌బాత్ చెయ్యాలి. బయట స్విమ్మింగ్ పూల్స్ రెండు వారాల వరకు వాడకూడదు. ఒకవేళ మీకు ఈ ప్రక్రియలో ‘పాలిపెక్టమీ’ చేసినట్లయితే, రెండు వారాల తరువాత రిపోర్ట్స్‌తో డాక్టర్ని సంప్రదించాలి. తర్వాత ట్రీట్మెంట్, కేర్ అప్పుడు చెబుతారు. ఈ ప్రొసీజర్ తరువాత మీకు వెజైనల్ డిశ్చార్జ్, దుర్వాసన, జ్వరం, వెజైనల్ పెయిన్, హెవీ బ్లీడింగ్ ఉంటే మాత్రం వెంటనే మీ డాక్టర్‌ను కలవండి. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
గౌట్ సమస్యతో బాధపడుతున్నారా? ఇవిగో ఆహార నియమాలు!
కీళ్ల మధ్య యూరిక్ యాసిడ్ రాయిగా ఏర్పడి... అందులోనూ ముఖ్యంగా బొటనవేలి ఎముకల మధ్యగానీ, మోకాలి దగ్గర గానీ రాపిడి కలిగిస్తూ ఎంతో నొప్పిని, ఇబ్బందినీ కలిగించే వ్యాధి గౌట్. గౌట్‌ను నివారించేవి లేదా వచ్చాక అనుసరించాల్సిన ఆహార నియమాలివి... మాంసాహారం ముఖ్యంగా వేటమాంసం (రెడ్‌మీట్), పోర్క్, సీ ఫుడ్స్ లాంటి ఎక్కువ క్యాలరీలు ఇచ్చే ఆహారం (హై క్యాలరీ డైట్) బాగా తగ్గించాలి. మద్యం, మాంసాహారంలో ఉండే ప్యూరిన్స్ అనే వ్యర్థ పదార్థాల వల్ల గౌట్ వస్తుంది కాబట్టి మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. స్వీట్స్, సాఫ్ట్‌డ్రింక్స్, ఆలూ ( పొటాటోస్), ఐస్క్రీమ్స్లోని కొన్ని పదార్థాల వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. పాలు, మజ్జిగ వంటి డైరీ ఉత్పాదనలు రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లను తగ్గిస్తాయి. కాబట్టి అవి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సీ సమృద్ధిగా ఉండే పండ్లు కూరగాయలు యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి. చెర్రీ పండ్లు కూడా యూరిక్ యాసిడ్ మోతాదులను నియంత్రించేందుకు బాగా ఉపయోగపడతాయి. పొట్టు తీయని బియ్యం (బ్రౌన్ రైస్), ఓట్స్ గౌట్ నివారణకు బాగా పనిచేస్తాయి. ఆకుపచ్చరంగులో ఉండి యాంటీ ఆక్సిడెంట్స్‌ను కలిగి ఉండే వెజిటబుల్స్ (ముఖ్యంగా బ్రాకలీ వంటివి) తీసుకోవడం వల్ల అవి గౌట్‌ను సమర్థంగా నివారించగలవు. కొంతమంది పిల్లల్లో అరచేతులు, అరికాళ్లలో దురదలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా వచ్చి తగ్గి΄ోవడం అన్నది చాలా మామూలు విషయమే. అయితే అలా కాకుండా మరికొంతమంది పిల్లల్లోనైతే అరచేతులు లేదా అరికాళ్లలో విపరీతంగా దురద రావడంతో పాటు అక్కడి చర్మం పొరలుగా ఊడి΄ోతుంటుంది. ఇది అంత ఆరోగ్యకరమైన విషయం కాదు. ఇలా జరగడానికి చాలా అంశాలు కారణమవుతుంటాయి. -
అది మీ తప్పు కాదు, మనసుకూ జబ్బులొస్తాయ్!
నా వయస్సు 33 సం‘‘లు. నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. కానీ ఒక ఏడాది నుంచి పూర్తిగా మానేశాను. మాంసాహారం అంటే జంతువధ అని, వాటిని చంపడం, రక్తపాతం లాంటి దృశ్యాలు నా మనసులోకి పదే పదే రావడం వాటిని తప్పించడానికి నేను తరచు చేతులు కడగడం ఇల్లంతా శుభ్రం చేయడం, భర్తను పిల్లలను అనవసరంగా కోపగించుకోవడం వల్ల ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడంలేదు. దయచేసి మీరేదైనా మార్గం చెప్పండి! – ఎ. పార్వతి,హైదరాబాద్జంతువధ గురించి ఆలోచించి, మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మంచిదే. అయితే మీ ఇంట్లో మాంసాహారం వండినప్పుడు, జంతువధ, రక్తపాతం లాంటి దృశ్యాలు మీ మదిలో మెదిలి, వీటి నుండి బయట పడేందుకు, చేతులు అతిగా కడగడం, ఇంటిని శుభ్రం చేయడం, ఇదంతా పాపంగా భావిస్తూ, ప్రార్థనలు చేస్తూ, మనోవేదనకు గురి కావడం... ఇవన్నీ ‘ఓసీడీ’ అనే ఒక మానసిక వ్యాధి లక్షణాలు. మెదడులోని కొన్ని రసాయనిక పదార్థాల సమతుల్యం లో తేడాలొచ్చినప్పుడు కొందరికి ఇలాంటి మానసిక రుగ్మత వస్తుంది. ఇదేదో మీ బలహీనత గానీ, తప్పు గానీ కానే కాదు. అలా అని మీరు బాధపడవద్దు.శరీరానికి జబ్బు చేసినట్లే మనసుకు కూడా జబ్బులొస్తాయని గుర్తించండి. ఈ ఒ.సి.డి జబ్బును పూర్తిగా నయం చేసేందుకు మంచి ఔషధాలున్నాయి. వాటితోపాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ అనే ప్రత్యేక కౌన్సెలింగ్, ‘ఆర్.టి.ఎమ్.ఎస్’అనే ప్రత్యేక అధునాతన పరికరాలతో చికిత్స చేసి, మీ బాధ నుంచి మిమ్మల్ని పూర్తిగా విముక్తులను చేయవచ్చు. మీకు దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌ను వెంటనే కలవండి. ఆల్ ది బెస్ట్.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు,సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
హీరోయిన్ శ్రుతి హాసన్ మెంటల్ హెల్త్ టిప్స్
-
మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!
టాలీవుడ్ నటి, గాయని శృతి హాసన్ విలక్షణ నటుడు కమల హాసన్ కూమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి విమర్శకుల ప్రశంసలందుకుంది. ఒకానొక సందర్భంలో శృతి తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకోవాలంటే మొదటగా ఏం చేయాలో తెలుసా అంటూ తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది. అవేంటంటే..అందరూ మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడేందుకే జంకుతారు. ఇది ముందు పక్కన పెట్టాయాలంటోంది శృతి. ఈ పరిస్థితిని అందరూ ఏదోఒక సందర్భంలో ఎదుర్కొనే సాధారణ పరిస్థితిగా పరిగణించాలి. అప్పుడే దీనిగురించి బహిరంగంగా మాట్లాడి స్వాంతన పొందే ప్రయత్నం చేయగలుగుతాం, బయటపడే మార్గాలను అన్వేషించగలుగుతామని చెబుతోంది. నిజానికి మానసికంగా బాధపడుతున్నాను అంటూ.. వెంటనే థెరపిస్టు లేదా కౌన్సలర్ లేదా సైక్రియాట్రిస్ట్ వద్దకు వెళ్లిపోతారు. కానీ అవేమి అవసరం లేదంటోంది శృతి. మన చుట్టు ఉన్నవాళ్లతో లేదా మనకిష్టమైన వ్యక్తులను ఆత్మీయంగా పలకరించడం, వారితో కాసేపు గడపడం వంటివి చేస్తే చాలు మానసిక స్థితి కుదుటపడుతుందని నమ్మకంగా చెబుతోంది. అందుకు ఉదాహారణగా.. మనం ఏదైన జ్వరం రాగానే ఏం చేస్తాం చెప్పండి అంటోంది. మొదటగా.. ఏదైనా ట్యాబ్లెట్ తీసుకుని వేసుకుని చూస్తారు. తగ్గలేదు అనగానే వైద్యుడిని సంప్రదించే యత్నం చేస్తారు. అలానే దీని విషయంలో కూడా మనంతట మనంగా ఈ మానసిక సమస్యను నయం చేసుకునే యత్నం చేయాలి. అవన్నీ ఫలించని పక్షంలో థెరఫిస్టులను ఆశ్రయించడం మంచిదని చెబుతోంది. అలాగే కొందరూ మెంటల్ స్ట్రెస్ తగ్గేందుకు సినిమాలకు వెళ్లతారు. ఓ మంచి ఫీల్‌తో హ్యాపీగా ఉండేలా చేసుకుంటారు. ఇది కూడా మంచి పద్ధతే అయినా ఒక్కోసారి ఇది కూడా వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదని అంటోంది శృతి. చేయాల్సినవి..మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అనిపించగానే దాన్ని పెనుభూతంలా, పెద్ద సమస్యలా చూడొద్దుఆ వ్యాధి మిమ్మల్ని తక్కువగా చేసి చూపించేది కాదు.నలుగురితో కలుపుగోలుగా మెలిగే ప్రయత్నం లేదా మాట్లాడటం వంటివి చేయండి. అలాగే మీ వ్యక్తిగత లేదా ప్రియమైన వ్యక్తులతో సమస్యను వివరించి బయటపడేలా మద్దతు తీసుకోండి. దీంతోపాటు మానసిక ఆరోగ్య నిపుణలను సంప్రదించి..ఏం చేస్తే బెటర్ అనేది కూలంకషంగా తెలుసుకుని బయటపడే ప్రయంత్నం చేయండి.నిజానికి మానసికి ఆరోగ్య మొత్తం ఆరోగ్య శ్రేయస్సు ఆధారపడి ఉంటుంది. ఇది బాగుంటేనే ఏ పనైనా సునాయాసంగా చేయగలం. అందరిలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకునేలా జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోగలుగుతాం అని చెబుతోంది శృతి.(చదవండి: ఆ వృద్ధుడు ఒకప్పుడు ఇంజనీర్..నేడు వీధుల్లో చెత్త ఏరుకుంటూ..!) -
తమలపాకుతో బోలెడన్ని లాభాలు, కానీ ఇవి తెలుసుకోవాల్సిందే!
తమలపాకులు అనగానే ఆధ్మాత్మిక భావన కలుగుతుంది. తమలపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సిలు తమలపాకుల్లో పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుంది.భారతదేశ సంస్కృతిలో తమలపాకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో తమలపాకుల వాడకం క్రీ.పూ 400 నాటిది. పురాతన కాలంనుంచి ఆయుర్వేద ఔషధాల్లో తమలపాకుల పాత్ర ఉంది.తమలపాకు పైపెరేసి కుటుంబానికి చెందినది. తమలపాకులో తమిళంలో వెతలై, తెలుగులో తమలపాకు, హిందీలో పాన్ కా పఠా అని పిలుస్తారు. తమలపాకును విందు భోజనాల తరువాత తాంబూలంలో వాడతారు అనుకుంటే పొరబాటే. తమలపాకును మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకులో కార్డియోవాస్కులర్ , యాంటీ-డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ/ఇమ్యునోమోడ్యులేటరీ, యాంటీ- అల్సర్, హెపాటో-ప్రొటెక్టివ్ , యాంటీ ఇన్ఫెక్టివ్ వంటి వివిధ లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు దీన్ని కామోద్దీపనకు పనికివస్తుందని కూడా భావిస్తారు.తమలపాకులోని పోషక విలువలుశుభకార్యం వచ్చిందంటే.. తప్పకుండా తమలపాకులు ఉండాల్సిందే. తమలపాకులను దేవుడికి సమర్పించడం మంచిదని, ఇతరులకు అందించినా శుభం జరుగుతుందని మన భారతీయులు భావిస్తారు. తమలపాకులో తగిన మొత్తంలో అవసరమైన పోషకాలు ఉంటాయి , 100 గ్రాముల తమలపాకులో ఈ పోషకాలు ఉంటాయి.అయోడిన్ 1.3 గ్రాములు, పొటాషియం 1.1-4.6 మైక్రోగ్రాములువిటమిన్ ఎ 1.9-2.9 మైక్రోగ్రాములు, విటమిన్ బి 1 13-0 మైక్రోగ్రాములువిటమిన్ B2 1.9-30 మైక్రోగ్రాములు, నికోటినిక్ యాసిడ్ 0.63-0.89 మైక్రోగ్రాములు తమలపాకు ప్రయోజనాలుతమలపాకును నమలడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. తమలపాకులను నేరుగా నమిలి తినవచ్చు. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. తమలపాకులను యాంటీ ఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌గా పరిగణిస్తారు. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి, తమలపాకులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగితే పేగు ఆరోగ్యానికి మంచిది.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తమలపాకులో కార్మినేటివ్, యాంటీ ఫ్లాట్యులెన్స్ వంటి లక్షణాలు ఉన్నాయి.ఇవి జీర్ణశయాంతర సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలను గ్రహించడానికి ప్రేగులను ప్రేరేపిస్తాయి.శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు , ఛాతీలో ఇబ్బంది, ఉబ్బసం లక్షణాలను ఉపశమనానికి , నయం చేయడానికి ఉపయోగిస్తారు . తమలపాకుకు ఆవాల నూనె రాసి ఛాతీపై ఉంచి కొద్దిసేపు అలాగే ఉంచితే చాతీలో ఇబ్బంది తగ్గుతుంది. తమలపాకు పేస్ట్‌ను చూర్ణం రాస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి తక్షణ ఉపశమనం కలిగుతుంది.జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడానికి నిప్పుల మీద తమలపాకును వేడిచేసి, దాన్ని పసిపిల్లలకు గుండెలమీద కాస్తారు. రెండుచుక్కల తమలపాకు రసాన్ని తేనెలో రంగరించి పిల్లలకు నెమ్మదిగా పడితే (వేలితే నాకించాలి) దగ్గు తగ్గుతుందని పెద్దలు చెబుతారు. ఆర్థరైటిస్ వల్ల కీళ్ల భాగంలో వచ్చే వాపుపై తమలపాకుని కాసేపు ఉంచితే ఉపశమనం లభిస్తుంది. కాల్షియం లోపం ఉన్నవాళ్లు తమలపాకుల్లో సున్నం కలిపి తింటే మేలు. విటమిన్ సీ అధికంగా కలిగి ఉండే తమలపాకులు తింటే రోగనిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు.ఎక్కవగా తినకూడదా?రోజుకు 5 నుంచి 10 తమలపాకులను దీర్ఘకాలం తీసుకుంటే, డ్రగ్స్ లాగా బానిసలవుతారని ఒక అధ్యయనంలో తేలింది. అలాగే అధిక రక్తపోటుతో బాధపడేవారు వ్యక్తులు తాంబూలం సేవించేపటుడు జాగ్రత్తగా ఉండాలి. తాంబూలానికి పొగాకును కలిపి తింటే ‘సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్’ లాంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తమలపాకులు ఎప్పుడూ కూడా లేతగా తాజాగా ఉన్న వాటిని మాత్రమే తినాలి. కొంతమందికి తాంబూలంలో వాడే వక్కతో, సున్నంతో గొంతు పట్టేయడం లాంటి ఇబ్బంది వస్తుంది. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. తాంబూల సేవనం మితిమీరితే నోటి, దంత, సమస్యలు వస్తాయి.తాంబూలం సేవించేప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి ?తాంబులం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి. ఎందుకంటే తొడిమను తినడం వ్యాధికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు, చివరలు తుంచిన తర్వాతే తాంబులం వేసుకోవడం ఆరోగ్యప్రదం. అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుద్ధిని మందగింప చేస్తాయి. అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి తొడిమలు, చివరలు తుంచివేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక. అంతేకాదు తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉందని భావిస్తారు. కాబట్టి సంతానంకోసం ప్రయత్నించేవారు తొడిమ తొలగించి వాడుకోవాలి. అయితే ఈ అభ్యంతరాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.ఏదైనా మితంగా ఉండటమే మంచిది. -
Health Tips: హెల్త్ టిప్స్
👉ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడదు. ఎక్కువ సేపు నమలడం ద్వారా ముఖంలోని కండరాలు శ్రమిస్తాయి. చర్మపు మెటబాలిజమ్ మెరుగవుతుంది. కాబట్టి ముడతలు పడవు.👉బెల్లంలో మిరియాల పోడి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని నిద్రించే ముందు తీసుకుంటే జలుబు తగ్గుతుంది.👉ఒక గ్లాసు మంచినీరు, ఐదు లేక ఆరు మిరియాలు, ఒక వెల్లుల్లి రెబ్బ, చితక్కొట్టిన అల్లం ముక్క ఒకటి, చిన్న బెల్లం ముక్క ఇవన్నీ వేసి నీరు సగం అయ్యేంత వరకు కాచండి. వేడిగా ఉండగానే తాగండి. దీనిని సేవించడం వల్ల దగ్గు, జలుబు, గొంతు గరగర వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.👉బాదం పప్పు, గసగసాలు కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది. 👉బొప్పాయి కాయను కానీ, ఆకుని కానీ మెత్తగా కాటుకలా నూరి ఆ ముద్దని అరికాళ్ళ ఆనెల మీద పెట్టి, కట్టుకడితే అవి మెత్తబడతాయి.👉మజ్జిగలో కొంచెం పసుపు, కాస్త ఉప్పు కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి. -
కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి!
శరీరం బరువు ఉండాల్సినంతే ఉన్నప్పటికీ పొట్ట పెద్దగా ముందుకు వచ్చి కనిపిస్తుంటే అది కాస్తంత ప్రమాదకరమైన కండిషన్ అని గుర్తుంచుకోవాలి. ఇదెంత ప్రమాదకరం, పొట్టను ఏ మేరకు తగ్గించుకోవాలి అనే విషయాలు ఓ టేప్ సహాయంతో తెలుసుకోవచ్చు. ఇలా కొలిచే సమయంలో పొట్టను బొడ్డుకు ఒక అంగుళంపైనే కొలవాలి. ఆ కొలతకూ, పిరుదుల కొలతకు నిష్పత్తిని లెక్కగట్టాలి. అంటే నడుము కొలతని హిప్ కొలతతో భాగించాలి. అదెప్పుడూ ఒకటి కంటే తక్కువగానే (అంటే జీరో పాయింట్ డెసిమల్స్‌లో) వస్తుంది. సాధారణంగా నడుము కొలత, హిప్స్ భాగం కొలత కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. సాధారణంగా మహిళల్లో ఈ కొలత విలువ 0.85 కంటే తక్కువగా ఉండాలి. పురుషులకు ఇది 0.9 కంటే తక్కువగా రావాలి. ఈ నిష్పత్తినే డబ్ల్యూహెచ్ఆర్ (వేయిస్ట్ బై హిప్ రేషియో) అంటారు. పైన పేర్కొన్న ప్రామాణిక కొలతల కంటే ఎక్కువగా వస్తే ... అంటే... ఈ రేషియో విలువ... మహిళల్లో 0.86 కంటే ఎక్కువగానూ, పురుషులలో 0.95 కంటే ఎక్కువగా ఉంటే అది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తుంచుకోవాలి. అలా కొలతలు ఎక్కువగా ఉన్నాయంటే వారికి ‘అబ్డామినల్ ఒబేసిటీ’ ఉందనడానికి అదో సూచన. దీన్నే సెంట్రల్ ఒబేసిటీ అని కూడా అంటారు. (స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!)ఇలా అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒబేసిటీ ఉన్నవారికి గుండెసమస్యలు / గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ నిష్పత్తి (వేయిస్ట్ బై హిప్ రేషియో) ఉండాల్సిన ప్రామాణిక విలువల కన్నా ఎక్కువగా ఉన్నవారు వాకింగ్ లేదా శరీరానికి మరీ ఎక్కువ శ్రమ కలిగించని వ్యాయామాలతో పొట్ట చుట్టుకొలతను (పొట్టని) తగ్గించుకోవడమన్నది గుండెకూ, ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. ఇదీ చదవండి: పెళ్లైన ఇన్నాళ్లకు, ఇంటిపేరు మార్చుకున్న అలియా -
విటమిన్ బీ12 లోపమా? ఈ ఆహారం తీసుకోండి!
ఆరోగ్యకరమైన జీవనం కోసం పోషకాలు,విటమిన్లు, ఖనిజాలు ఇలా చాలా అసవరం. వీటిల్లో ఏది లోపించినా ఏదో శారీరక ఇబ్బందులు తప్పవు. అలాంటి వాటిల్లో విటమిన్ బీ 12. ఇది ఎర్రరక్త కణాల వృద్దికి, నాడీ వ్యవస్థకు చాలా తోడ్పాటునిస్తుంది. ఆహారం ద్వారానే మనం బీ12 విటమిన్ తీసుకోవాల్సి ఉంటుందని అనేది గమనించాలి. మరి బీ 12 లోపంతో వచ్చే అనర్థాలు, లభించే ఆహారం గురించి తెలుసుకుందాం.వయసులో ఉన్నవారితో పోలిస్తే సాధారణంగా వయస్సుపైబడినవారు, స్త్రీలు, శాకాహారుల్లో విటమిన్ బీ 12 లోపం ఎక్కువగా కనిపిస్తుంది. భారతీయుల్లో సుమారు 47 శాతం మందిలో విటమిన్ బీ12 లోపంతో బాధపడుతున్నట్టు అంచనా. శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై ఇది ప్రభావం చూపిస్తుంది.విటమిన్ కాలేయంలో ఐదేళ్లపాటు నిల్వ ఉంటుంది. ఈ నిల్వలు తగ్గినప్పుడు బీ 12 లోపంకనిపిస్తుంది. లక్షణాలు రక్తహీనత, నీరసం అలసట, నిరాశ, నిస్సహాయత, గుండె దడ, నరాల సమస్యలు , ఒత్తిడిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా చర్మం పాలిపోయినట్లు ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తల తిరగడం, తలనొప్పి, ఇన్ఫెక్షన్లు, నోరు పొడిబారడం, అతిసారం, మలబద్దకం, ఆకలి లేకపోవడం,జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత తగ్గడం, డిప్రెషన్, చిరాకు ఇవన్నీ బీ 12 లోపం వల్ల కావచ్చు. బోలు ఎముకల వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది.విటమిన్ బీ12 లేకపోవడం వల్ల వచ్చే అరుదైన పరిస్థితి ఆప్టిక్ న్యూరోపతి సంభవిస్తుంది. కంటి నుండి మెదడుకు దృశ్యమాన సమాచారాన్ని ప్రసారం చేసే ఆప్టిక్ నరం దెబ్బతింటుంది. ఇది క్రమంగా చూపు కోల్పోయేలా చేస్తుంది. చర్మంపై హైపపర్ పిగ్మంటేషన్ (డార్క్ స్పాట్స్) కనిపిస్తాయి. బీ 12 ఎక్కువైనా, బొల్లి ,నోటి పూతల, తామర, మొటిమలు లాంటి లక్షణాలు కనిస్తాయి. (ప్రపంచ ప్రఖ్యాత బాడీ బిల్డర్ గుండెపోటుతో కన్నుమూత)బీ12 లభించే ఆహారంచేపలు, రొయ్యలు, మాంసం, శనగలు, బాదం పప్పు, పుట్ట గొడుగులు, జీడిపప్పు, అల్లం, ఉల్లిపాయ, ప్రాన్స్ , మాంసం, గుడ్లలో విటమిన్ బీ 12 లభిస్తుంది. శాకాహారులు తృణధాన్యాలు పోషక ఈస్ట్ వంటి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ఇంకా చీజ్, పాల ఉత్పత్తులు,సోయా ,బియ్యంలో కూడా ఇది లభిస్తుంది. వైద్యుల సలహా మేరకు ‘విటమిన్ బీ12 సప్లిమెంట్లు తీసుకోవచ్చు.ఇదీ చదవండి : ఓనం అంటే సంబరం సరదా, సాధ్య! -
కీళ్ల నొప్పులకు కారణాలనేకం, కానీ అశ్రద్ధ పనికి రాదు!
40-50 ఏళ్ల వయసు దాటిన తరువాత స్త్రీ పురుషుల్లో కనిపించే ప్రధాన సమస్య కీళ్ల నొప్పులు. వయసుతోపాటు వచ్చేదేలే అని నిర్లక్ష్యం పనికి రాదు. తగిన వ్యాయామం, ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మరోవైపు కొన్నిప్రత్యేక కారణాల రీత్యా యువతలో కూడా కీళ్ళ సమస్య కనిపించవచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఈ కీళ్ల నొప్పులకు, కారణాలు, తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. కీళ్ల నొప్పులకు కారణాలుఆర్థరైటిస్ (ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్)గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు (సెప్టిక్ ఆర్థరైటిస్) గంటల తరబడి ఒకే చోట కూర్చుండి పోవడం, వ్యాయామం లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ (లూపస్, ఫైబ్రోమైయాల్జియా)కూర్చోవడం, లేదా నిలబడే తీరు సరిగ్గా లేకోవడం, లేదా బయోమెకానిక్స్వయస్సు-సంబంధిత దుస్తులు మరియు కన్నీటిమధుమేహం, థైరాయిడ్ లాంటి వ్యాధులుఅలాగే ఊబకాయం, సరైన జీవనశైలి, పేలవమైన భంగిమ, క్రీడలలో ఎక్కువగా పాల్గొనడం, కీళ్ల గాయాలు, జన్యుపరమైన కారణాలు, పుట్టుకతో వచ్చే పరిస్థితుల కారణంగా చిన్న వయసులో కూడా కీళ్ల నొప్పులు రావచ్చు. ఒక్కోసారి కేన్సర్‌లాంటి జబ్బులున్నపుడు కూడా కీళ్ల నొప్పులొస్తాయి.వైద్యుడిని ఎప్పుడు సందర్శించాలి?కీళ్ల నొప్పులకారణాన్ని గుర్తించి, తేలికపాటి వ్యాయామం, ఆహారంలో మార్పులతో చాలావరకు ఉపశమనం పొందవచ్చు. కానీ నొప్పి తీవ్రంగా ఉన్నపుడు, వాచినపుడు, నడవడంకష్టంగా మారినపుడు, అలాగే కీళ్ల నొప్పులతో మాటు జ్వరం వస్తే మాత్రం కచ్చితంగా వైద్యుణ్ని సంప్రదించాలి. ఎక్స్‌రే లాంటి కొన్ని పరీక్షల అనంతరం వ్యాధి నిర్ధారణ తగిన చికిత్స పొందవచ్చు.కీళ్ల నొప్పులకు ఉపశమనమిచ్చే ఆహారంఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు / చేప నూనెలునట్స్ అండ్ విడ్స్బ్రాసికా కూరగాయలు, కాయధాన్యాలు, బీన్స్పండ్లు, ఆలివ్ నూనె, వెల్లుల్లి , దంప కూరగాయలు, తృణధాన్యాలుకీళ్ల నొప్పులకు ఏ ఆహారాలు చెడ్డవి?ఉప్పు, చక్కెరపదార్థాలు,ప్రాసెస్ చేసిన ఆహారం, రెడ్‌మీట్,మద్యంగ్లూటెన్ ఆహారాలుఅధిక ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొన్నిరకాల నూనెలు ఇదీ చదవండి: నటి భాగ్యశ్రీ వ్యాయామాలతో భుజాల నొప్పులు మాయం!సమంత రోజు ఎలా గడుస్తుందంటే...??? -
అద్దె ఇల్లు.. ఆరుబయటనే శవం
ఇబ్రహీంపట్నం: మూఢనమ్మకాలు ఇప్పటికీ ప్రజల మెదళ్లను శాసిస్తూనే ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ ఆ ఇంటి పరిసరాల్లోనే ఆడుకుంటూ ఉన్న ఆ బాలుడు.. మాయదారి వరద కారణంగా విషజ్వరానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబం అద్దెకుంటున్న ఇంటి యజమాని ఆ బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్నాడు. దీంతో బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు చేసేది లేక జాతీయ రహదారి పక్కనే ఓ టెంటు వేసి ఆ బాలుడి మృతదేహాన్ని ఉంచాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రసాద్‌నగర్‌లో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. విషజ్వరంతో.. కూలి చేసుకునే పాలపర్తి రాజేష్, రూతు దంపతులకు ఇద్దరు కుమారులు. జెడ్పీ పాఠశాలలో పెద్ద కుమారుడు ఏడో తరగతి, చిన్న కుమారుడు జాన్ వెస్లీ(12) ఆరో తరగతి చదువుతున్నాడు. ఇటీవల కాలంలో ప్రసాద్‌నగర్ వరద ముంపునకు గురికావడంతో పారిశుద్ధ్యలేమి, కలుషిత తాగునీరు, అందుబాటులో లేని వైద్య సదుపాయం వల్ల కొద్ది రోజుల క్రితం బాలుడు జాన్‌వెస్లీ జ్వరం బారిన పడ్డాడు. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడితో వైద్యం చేయించారు. మరలా కడుపులో నొప్పి రావడంతో రెండురోజుల క్రితం మరో ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. వారు మెడికల్ టెస్ట్‌లు రాయగా.. తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేక చేయించలేదు. దీంతో కడుపులో నొప్పి భరించలేక బాలుడు మృత్యువాత పడ్డాడని తల్లిదంద్రులు చెబుతున్నారు. మంటగలసిన మానవత్వం.. వారు ఉంటున్నది అద్దె ఇల్లు కావడంతో ఆ యజమాని బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని చెప్పారు. దీంతో 65వ నంబర్ జాతీయ రహదారి పక్కనే టెంట్‌వేసి బంధువుల కడసారి చూపుకోసం ఉంచారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ బాలుడి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అరి్పంచారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
వర్షాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? జాగ్రత్తలు!
వర్షాకాలం వచ్చిదంటే చాలా మందికి కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కండరాలు పట్టేసినట్టు అనిపిస్తాయి. వర్షాకాలంలోని తేమకు కీళ్లనొప్పులకు సంబంధం ఉంటుంది. వానాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.వానల రోజులు కొంతమంది ఆహ్లాదాన్ని పంచితే మరికొంతమందికి, ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి ఆందోళన మోసుకొస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో వారికి నొప్పులతో రోజువారీ పనులను కొనసాగించడం, ఒక్కోసారి కాలు కదపడం కూడా కష్టం అనిపిస్తుంది. మారుతున్న వాతావరణానికి, కీళ్ల నొప్పులకు సంబంధం ఉంది అంటున్నారు నిపుణులు. చల్లని వాతావరణం, తేమ స్థాయిలలో మార్పులు, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల కారణంగా కీళ్ల నొప్పులు, కండరాలు దృఢత్వంలో తేడాలు, తిమ్మిర్లు గాయం నొప్పి కనిపిస్తాయి. గాలిలోని అధిక తేమ స్థాయిలు రక్తాన్ని చిక్కగా చేస్తాయి. రక్తపోటును పెంచుతాయి.ఎముకలకు కీలకమైన డీ విటమిన్ కూడా ఈ సీజన్లో సరిగ్గా అందదు. వర్షాకాలంలో నీరు ఎక్కువగా తాగకపోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అలాగే ఈ కాలంలో కీళ్ల చుట్టూ ఉండే ప్లూయడ్ పలచబడుతుంది. దీనివల్ల కూడా నొప్పి వస్తుంది. ఈ కారణాల రీత్యా కీళ్ల నొప్పులు పెరుగు తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలువిటమిన్ డీ, బీ 12 లభించే ఆహారాలు తీసుకోవాలి. అవసరమైతే ఈ సప్లిమెంట్స్ తీసుకోవాలి.విటమిన్ ఇ నొప్పి , వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.గింజలు, అవకాడో, బెర్రీలు, ఆకు కూరలు, గింజలు, చేపలు ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం చాలా అవసరం. అవిసె గింజలు,నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, పనీర్, గుడ్లు తీసుకోవాలి. మోకాళ్లు, ఇతర కీళ్ళపై సురక్షితమైన ఆయిల్‌తో సున్నితంగా మసాజ్ చేసుకోవచ్చు. వేడి నీటి, హీట్బ్యాగ్తో కాపడం పెట్టుకోవచ్చు.కండరాలకు వ్యాయామం ఒక వరం. మార్నింగ్ వాక్, లెగ్, కండరాలను సాగదీసేలా వ్యాయామాలు, యోగా, సైక్లింగ్ చేయడం వంటివి చేయడం మర్చిపోకూడదు. అలాగని మరీ ఎక్కువ చేయకూడదు. ఎలాంటి వ్యాయామాలు చేయాలనే దానికోసం వైద్య నిపుణుడు, ఫిజియో థెరపిస్ట్‌ను సంప్రదించడం మంచిది -
బరువు తగ్గాలనుకుంటున్నారా? వాముతో ఇలా ట్రై చేయండి!
మారుతున్న ఆధునిక జీవన శైలి, ఆహార అలవాట్లు చాలామందిలో ఊబకాయానికి దారితీస్తున్నాయి. క్రమం తప్పని వ్యాయామం, కొన్ని ఆహార నియమాలతో బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. బాడీ మాస్ ఇండెక్స్‌ను లెక్కించుకుని మన వయసు, ఎత్తుకు తగ్గట్టుగా బరువు ఉండేలా జాగ్రత్త పడాలి. అయితే ఊబకాయంతో బాధపడేవారికి వెయిట్ లాస్ జర్నీ అంత సులువు కాదు. అయితే మన ఇంట్లో సులువుగా లభించే వస్తువులతో ఎలాంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువును తగ్గించుకునే చిట్కా గురించి తెలుసుకుందాం.వాముతోలాభం:ప్రాచీన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదంలో వాముకు అధిక ప్రాధాన్యత ఉంది. వామును సంస్కృతంలో ఉగ్రగంధ అంటారు. ప్రధానంగా వాము (అజ్వైన్)ను జీర్ణ సమస్యలకు ఎక్కువగా వాడతారు. వామును తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిక్ అనే పదార్థం విడుదలవుతుందని.. దీని వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుందంటారు నిపుణులు.అలాగే ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వాము తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారట. దీన్ని వేడి నీటిలో కలిపి తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వును కరుగుతంది. అలాగే ఒక టీస్పూన్ వామును ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయం ఒక టీస్పూన్ తేనె వేసి ఖాళీ కడుపుతో తాగినా ఫలితం ఉంటుంది. అర గ్లాసు వాము నీటిని తాగితే రుతుక్రమంలో వచ్చే ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది.వాము తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ సమస్యను కూడా అధిగమించవచ్చు.వాంతులు, వికారం వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.వాము, కరివేపాకులు, ఎండు ద్రాక్ష, చక్కెరను ఓ కప్పు నీటిలో మరిగించి తాగే తెల్లజుట్టులో మార్పు కనిపిస్తుంది. అంతేనా జంతికలు, చక్రాలు చేసుకునేటపుడు ఆ పిండిలో కాసింత వాము జోడిస్తే, రుచి, వాసనతో పాటు అరుగుదలకు కూడా మంచిది. నోట్: అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే అని గమనించండి. ఏదైనా అనారోగ్య సమస్ యవస్తే వైద్యులను సంప్రదించడం మేలు. -
పిల్లలు మట్టి, సుద్ద తింటున్నారా? కారణాలేంటో తెలుసా? చిన్ని చిట్కాలు
పుట్టబోయే బిడ్డ కడుపున పడింది మొదలు తల్లిదండ్రులకు బిడ్డలపై ఆపేక్ష మొదలవుతుంది. ఇక బోసి నవ్వులు నవ్వుతూ, పారాడుతూ, బుల్లి బుల్లిఅడుగులూ వేస్తూ, ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతోంటే ఆ మురిపమే వేరు. ఏ చిన్ని అనారోగ్యం వచ్చినా ఆందోళనే. పసిబిడ్డలను ఎదుగుతున్న క్రమంలో కంటికి రెప్పలా చూసుకోవాలి. వయసు తగ్గట్టుగా ఎదుగుతున్నారా లేదా అని తనిఖీ చేసుకోవడంతో పాటు, సమయానికి టీకాలు వేయించాలి. అలాగే వారి ఆరోగ్యం పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కొంతమంది పిల్లలు మట్టి, బలపాలు, సబ్బు, పేపర్లు, సుద్ద లేదా గోడ గోళ్లతో గీరి తింటారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? తిట్టి, కొట్టి దండించడం కాకుండా అసలు ఎలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వైద్యులను సంప్రదించాలి. పిల్లలు మట్టిని ఎందుకు తింటారు? ఈ బురద తినే అలవాటు లేదా అలాంటి ఇతర తినకూడని వస్తువులను తినే అలవాటు రెండేళ్లకు మించి కొనసాగితే, శిశువు పికా అనే రుగ్మతతో బాధపడుతూ ఉండవచ్చు. ఎందుకు అలా తింటారుపోషకాహార లోపం, జింక్, కాల్షియం ,ఇనుము మొదలైన మూలకాల లోపంకుటుంబలో నిర్లక్ష్యం/ అశాంతి వాతావరణంఆటిజం , మేధో వైకల్యం, ఇతర అభివృద్ధి సమస్యలు. ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) లేదా స్కిజోఫ్రెనియా వంటి మానసిక ఆరోగ్య సమస్యలుసుద్ద, బలపం, సున్నం, లాంటి వాటిని తినడం వల్ల పిల్లలు అనీమియా వస్తుంది. మరింత బలహీనంగా తయారవుతారు. కడుపులో పురుగులు, నొప్పులు, ఇన్ఫెక్షన్లు లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏం చేయాలి?పిల్లల వైద్యుల సలహా ప్రకారం పిల్లలకు తగిన ఆహారం ఇస్తే ఈ సమస్యలు దూరమవుతాయి. అలాగే ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్, ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా లభించే అరటి పండ్లను తినిపించాలి. కాల్షియం లోపిస్తే పిల్లలకు బీన్స్, ఆకుపచ్చ కూరగాయలను తినిపించడం ద్వారా కాల్షియం లోపాన్ని దూరం చేయవచ్చు. పిల్లల్లో అభద్రత తొలగించేలా, వారితో మరింత సన్నిహితంగా మెలగాలి. వారి పట్ల ప్రేమను మరింత ఎక్కువ పంచాలి. పిల్లల అలవాటు, ఆరోగ్య ఆధారంగా వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. మినరల్, ఐరన్, కాల్షియం సప్లిమెంటేషన్‌తో పాటు డీవార్మ్ మందులను సిఫారసు చేస్తారు. కొంతమందిలో ప్రవర్తనా లేదా మానసిక చికిత్స కూడా అవసరం కావచ్చు. సమస్య ఏంటి అనేది వైద్య నిపుణుడు నిర్ధారిస్తారు. -
Beauty Tips: మీ ముఖంపై బ్లాక్‌హెడ్స్ తొలగించాలంటే..??
ముఖాన్ని కళావిహీనం చేసే సమస్యల్లో బ్లాక్‌హెడ్స్ మహా మొండివి. గడ్డం, ముక్కు, నుదురు సహా ముఖం మీద పలు భాగాల్లో కనిపించే ఈ బ్లాక్‌హెడ్స్ తొలగించడమంటే .. కాస్త నొప్పితో కూడిన పనే. అయితే చిత్రంలోని ఈ మెషిన్.. హై–డెఫినిషన్ పిక్సెల్ 20గీ మాగ్నిఫికేషన్ టెక్నాలజీతో ఎలాంటి నొప్పి లేకుండా బ్లాక్‌హెడ్స్‌ను తొలగించి ముఖాన్ని నీట్‌గా మారుస్తుంది.ఈ డివైస్‌లో మొత్తం ఐదు లెవెల్స్ ఉంటాయి. దీని పైన.. వాక్యూమ్ హెడ్స్‌ని బిగించే భాగంలో చిన్న కెమెరా ఉంటుంది. ఈ డివైస్‌ని స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకుంటే, చర్మాన్ని స్కాన్ చేసి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యిందో, ఎక్కడెక్కడ బ్లాక్‌హెడ్స్ ఉన్నాయో చూపెడుతుంది. కింది భాగంలో హీటింగ్ మసాజర్ హెడ్ ఉంటుంది. దీన్ని వినియోగించడం చాలా తేలిక. మొదటి లెవెల్ ఆప్షన్‌తో.. చర్మపు తీరుతెన్నులను పరిశీలించుకోవచ్చు.రెండో లెవల్ ఆప్షన్‌తో సెన్సిటివ్ స్కిన్‌కి, మూడో లెవెల్ ఆప్షన్‌తో జిడ్డు చర్మానికి, నాల్గవ లెవెల్ ఆప్షన్‌తో మరింత జిడ్డు చర్మానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఐదవ లెవెల్ ఆప్షన్‌తో మొండి రంధ్రాలకు సైతం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో 3 సెకన్ల కంటే ఎక్కువసేపు ఒకే స్థలంలో క్లీన్ చేయకూడదు. దీని ధర 169 డాలర్లు. అంటే 14,036 రూపాయలు.ఇవి చదవండి: ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా.. -
తరచూ ఇన్ఫెక్షన్.. ప్రమాదం కాదా?
నాకిప్పుడు నలభై ఏళ్లు. ఏడాదికి 3–4 సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తోంది. అన్నన్నిసార్లు యాంటీబయాటిక్స్ వాడితే ప్రమాదం కాదా? ఇలా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – పేరు, ఊరు వివరాలు రాయలేదు.మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సర్వసాధారణం. యూరినరీ ఓపెనింగ్ అంటే యురేత్రా అనేది.. మోషన్ ఓపెనింగ్ అంటే మలద్వారానికి దగ్గరగా ఉండటం వల్ల బ్యాక్టీరియా ఈజీగా వెజైనా,యురేత్రా, బ్లాడర్‌లోకి ప్రవేశిస్తుంది. మహిళల్లో యురేత్రా షార్ట్‌గా ఉండటం వల్ల మరింత త్వరగా బ్యాక్టీరియా బ్లాడర్‌లోకి వెళ్తుంది. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, అర్జెన్సీ ఫీలవడం, మూత్రంలో మంట, దుర్వాసన వేయడం, మూత్రంలో రక్తం ఆనవాళ్లు వంటివి ఉన్నాయంటే యూరిన్ ఇన్ఫెక్షన్ మొదలైందని అర్థం.ఆడవాళ్లలో 40–50 ఏళ్ల మధ్య ఎక్కువసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే చాన్సెస్ ఉంటాయి. దీనికి ఈస్ట్రజన్ హార్మోన్ లోపం ఒక కారణం. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారిలో యూరినరీ ట్రాక్ట్‌లో బ్లాక్స్‌తో కూడా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతుంటారు. రోగనిరోధక శక్తి తక్కువున్నవారిలోనూ యూరిన్ ఇన్ఫెక్షన్ చాన్సెస్ పెరుగుతాయి. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకున్నవారిలోనూ బ్యాక్టీరియా రెండింతలయ్యే చాన్సెస్ ఎక్కువై తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు.కొన్ని సింపుల్ మెథడ్స్‌తో ఈ ఇన్ఫెక్షన్ని నివారించవచ్చు. యూరిన్, మోషన్ పాస్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో ముందు నుంచి వెనక్కి క్లీన్ చేసుకోవాలి. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవద్దు. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల మంచినీరు తాగాలి. కాఫీ, సుగర్ లోడెడ్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. టైట్ ఇన్నర్‌వేర్స్, డ్రాయర్స్ అవాయిడ్ చేయాలి. కాటన్ లోదుస్తులనే వాడాలి. స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్, సబ్బులను వెజైనా ప్రాంతంలో వాడకూడదు. స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ఎక్కువసార్లు వాడటం వల్ల అవి పనిచేయడం మానేస్తాయి.అందుకే యూరిన్ కల్చర్, సెన్సిటివిటీ టెస్ట్ చేసి ఏయే యాంటీబయాటిక్స్ సెన్సిటివిటీ ఉందో చూసి అది వాడటం మంచిది. కొంతమందికి రికరెంట్ ఇన్ఫెక్షన్ వస్తూంటే ఏ మెడిసిన్ లేదా ప్రివెంటివ్ మెథడ్ పనిచేయనప్పుడు యూరాలజిస్ట్ కన్సల్టేషన్తో ప్రొఫిలాక్టిక్ లో డోస్ యాంటీబయాటిక్స్ని ఇస్తారు. ఏ ప్రాబ్లమ్ వల్ల తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతున్నారో కనిపెట్టడం కొంతమందిలో సాధ్యమవుతుంది.అంటే సుదీర్ఘ ప్రయాణాలు, లైంగిక సంపర్కం వంటివాటితో యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇలాంటి వారికి ఒక డోస్ యాంటీబయాటిక్ టాబ్లెట్‌ని ఇస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని చెక్ చెయ్యాలి. మెనోపాజ్ వయసులో ఈస్ట్రజన్ క్రీమ్‌తో కూడా ఇన్ఫెక్షన్ని నివారించవచ్చు. ఆరునెలల కాలంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్స్ ఉన్నా.. ఏడాదిలో మూడుసార్లు ఇన్ఫెక్షన్స్ ఉన్నా దానిని రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్ అంటారు. తొలిదశలోనే గుర్తిస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించవచ్చు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ఇవి చదవండి: బుల్లీయింగ్‌ను నిర్లక్ష్యం చేయొద్దు.. -
Health Tips: నిద్రపోయేముందు ఇలా చేశారో.. మీ ఆరోగ్యం?
నిద్రపోయేముందు నీళ్లు తాగి పడుకునే అలవాటు అందరికీ ఉన్నప్పటికీ దానిపై అశ్రద్ధ చూపేవారే ఎక్కువగా కనిపిస్తుంటారు. అలా చేయడం అనరోగ్యాలకు దారి తీస్తుంది. అలాగే నిద్రకు ఉపకరించే ముందు మీరు తాగే గ్లాసు నీళ్లలో వీటిని కలిపితే ఎంతో మేలు..ఇలా చేయండి..రాత్రి పడుకునేముందు గ్లాసు నీళ్లలో టీస్పూను మెంతులు వేసి నానపెట్టాలి. ఉదయం పరగడుపున ఈ నీళ్లను తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కీళ్లనొప్పులనుంచి ఉపశమనం కలగడంతోపాటు, శరీర బరువు అదుపులో ఉంటుంది. రోజూ మెంతుల నీళ్లు తాగడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.రాత్రి పూట నిద్రకు ముందు ఒక గ్లాస్ చల్లని పాలను తాగాలి. పాలను బాగా మరిగించి అనంతరం వాటిని చల్లార్చి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. దీంతో పాలు చల్లగా మారుతాయి. అనంతరం వాటిని నిద్రకు ముందు తాగాలి. ఇలా మూడు రోజుల పాటు వరుసగా చేస్తే ఎసిడిటీ తగ్గిపోతుంది.రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం అనంతరం కాసిని సోంపు గింజలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. ఇలా చేస్తుంటే జీర్ణ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. ముఖ్యంగా కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.ఇవి చదవండి: నోటి దుర్వాసన.. ఈ వ్యాధులకు సంకేతమని తెలుసా? -
నోటి దుర్వాసన.. ఈ వ్యాధులకు సంకేతమని తెలుసా?
ఎవరైనా సరే, నోటిని సరిగా శుభ్రం చేయకపోతే దుర్వాసన రావడం సహజం.. అయితే చిగుళ్ల వాపు లేదా దంత సంబంధమైన వ్యాధులు ఏమీ లేకుండా... సక్రమంగా బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి నుంచి వాసన వస్తుంటే, దానిని అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదని, కొన్ని రకాల ఇతర వ్యాధులకు సంకేతంగా భావించి దాని గురించి శ్రద్ధ వహించమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.నోటి దుర్వాసన అనేది ఆహారపు అలవాట్లు, నోటి పరిశుభ్రతపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, దంతవైద్యులు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలని, భోజనం తర్వాత నోటిలో నీళ్లు పోసుకుని పుక్కిలించి నోటిని శుభ్రం చేయమని చెబుతుంటారు. ఇవి పాటించిన తర్వాత కూడా మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటే, అది శరీరంలో ఇప్పుడిప్పుడే తొంగి చూస్తున్న కొన్ని వ్యాధులకు సంకేతం కావచ్చు.కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు..సైనసైటిస్, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. దీనితోపాటు, ఈ ఇన్ఫెక్షన్లు సంభవించినప్పుడు, శ్వాసకోశంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని కారణంగా వాసన కలిగించే మూలకాలు ఏర్పడి ఇవి గాలి వదిలినప్పుడు దుర్వాసన వచ్చేలా చేస్తాయి.జీర్ణ సమస్యలు..కడుపులో ఉండే ఆమ్లాలు అన్నవాహికలోకి ప్రవహించినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ సంభవిస్తుంది. దీనివల్ల నోటిలో పుల్లని తేన్పులతోపాటు వాసన కూడా వస్తుంటుంది.కిడ్నీవ్యాధులు..మూత్రపిండాలనేవి శరీరంలోని మలినాలను వడపోసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి. మూత్రపిండాల పనితీరు మందగించినప్పుడు అవి వాటి పని సక్రమంగా చేయలేక శరీరంలో వ్యర్థాలు పేరుకుని పోతాయి. ఈ విధంగా రక్తంలో చేరిన వ్యర్థాల వల్ల వారు ఊపిరి పీల్చి వదిలేటప్పుడు ఒక విధమైన దుర్వాసన వెలువడుతుంటుంది.బీపీ, షుగర్..మధుమేహం ఉన్నవారిలో ఇది చాలా సాధారణ సమస్య.. ఎందుకంటే వారి శ్వాసలో ఎక్కువ కీటోన్లు ఉంటాయి. ఇవి ఒకవిధమైన చెడు శ్వాసను వెలువరిస్తుంటాయి. అదేవిధంగా దీర్ఘకాలికంగా బీపీ ఉన్న వారు వాడే కొన్ని రకాల మందులు కూడా నోటి దుర్వాసనకు కారణం కావచ్చు.కాలేయ సంబంధ వ్యాధులు..లివర్ సిర్రోసిస్ లేదా ఫ్యాటీ లివర్ వంటి కాలేయ సమస్యల వల్ల శరీరంలోని వ్యర్థాల నిర్వహణ సరిగా జరగదు. అందువల్ల కాలేయంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది.అందువల్ల నోటి దుర్వాసన ఉన్నప్పుడు దంత వైద్యుని సంప్రదించి, వారు సూచించిన మౌత్వాష్లను, ఇతర విధాలైన మౌత్ ఫ్రెష్నర్లను ఉపయోగించినా కూడా నోటి దుర్వాసన వదలకపోతుంటే మాత్రం అది ఇతర వ్యాధులకు సూచనగా భావించి ఫ్యామిలీ వైద్యుని సంప్రదించి వారి సూచన మేరకు తగిన పరీక్షలు చేయించుకుని మందులు వాడాల్సి ఉంటుంది.ఇవి చదవండి: ఇంటి శుభ్రతకై.. ఇలా చేస్తున్నారా? జాగ్రత్త! -
తేలిగ్గా చేయగలిగే సింపుల్ ఎక్సర్సైజ్.. ఏంటో తెలుసా?
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కోసం ఎవరి పద్ధతులు వారికి ఉంటాయి. కొందరు రకరకాల ఎక్సర్సైజులు చేస్తే, పొట్టను మాడ్చుకుంటారు కొందరు. వాకింగ్, జాగింగ్ వంటి వాటితో ప్రారంభించి, చిన్న చిన్న బరువులు మోయడం... ఆ తర్వాత వాటన్నింటినీ అనుసరించలేక నీరస పడిపోతుంటారు ఇంకొందరు. అయితే అలా కాకుండా తేలిగ్గా చేయగలిగే సింపుల్ ఎక్సర్సైజ్ ఒకటుంది. అదేమంటే మెట్లెక్కడం... నిజమే! మెట్లెక్కడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మెట్లెకెక్కినట్లే! అయితే దానికీ ఓ పద్ధతుంటుంది మరి.నడవటం, పరుగెత్తటం, సైకిల్ తొక్కటం, ఈదటం లాంటి మిగతా వ్యాయామాలే కాదు, రోజూ మెట్లెక్కటం, దిగటం వల్ల కూడా శరీరం ఆరోగ్యవంతంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సాధారణంగా నేలమీద నడుస్తున్నప్పటి కంటే మెట్లెక్కుతూ పైకి వెళ్ళటం, కిందకు దిగటం మూలంగా కండరాలు బలపడతాయి. తొడలు, కాలి పిక్కలు పటిష్టంగా తయారవుతాయి. కండరాలు బలంగా ఉంటే నిటారుగా, మంచి ఫిటెనెస్ తో ఉన్నట్లుగా కనిపిస్తారు.శరీరాకృతి పట్ల శ్రద్ధ ఉండి రోజూ ఎక్సర్ సైజులు చేసేవాళ్ళు, వాటితో΄ాటు మెట్లెక్కటాన్ని కూడా అలవాటు చేసుకుంటే రోజు రోజుకూ శరీరాకృతిలో వచ్చే మార్పులను చూసి మనకే ఆశ్చర్యం వేస్తుంది.ఇలా అలవాటు చేసుకోవాలి!కింద నుంచి 8 మెట్ల దాకాఎన్నుకుని ఆ 8 మెట్లనూ పైకి ఎక్కటం, కిందికి దిగటం, మళ్ళీ ఎక్కటం, దిగటం అలా అలిసిపోయేదాకా చేయాలి. లేదా ఒక అంతస్తు పైదాకా ఎక్కుతూ దిగుతూ ఉండాలి. మెట్లను పైకి ఎక్కుతున్నప్పుడు చేతుల్ని రిలాక్స్‌గా పక్కలకు వదిలేయాలి. మోచేతుల్ని మాత్రం కొద్దిగా వంచాలి. బాగాప్రాక్టీస్ అయాక మోచేతుల్ని ఇంకా వంచవచ్చు. ఇలా చేయటం వల్ల మోకాళ్ళను ఎత్తి ఎత్తి వేయటానికి అనువుగా ఉంటుంది. అయితే ఎన్ని మెట్లెక్కినా, మరునాటికి కాళ్ళపిక్కల్లో పోట్లు, నొప్పులు వంటివి ఉండకూడదు. అలా ఉన్నాయంటే మీరు శక్తికి మించి మెట్లెక్కుతూ దిగుతున్నారన్న మాట.మెట్లు ఎక్కుతూ దిగుతూ వున్నప్పుడు ΄ాదాలు జారకుండా ఉండటానికి సౌకర్యంగా ఉండే షూస్ వాడాలి.మిగతా ఎక్సర్ సైజులతో ΄ాటు రెండు మూడు అంతస్తుల మెట్లను ఇలా ఎక్కుతూ దిగితే మీ శరీరం వెచ్చదనానికి చేరుకుంటుంది.తర్వాత శరీరం మామూలు స్థితికి వచ్చి కూల్ డౌన్ కావటానికి అనువుగా రిలాక్స్ అవుతూ కొద్దిసేపు నడవాలి. ఇందుకు సుమారు మూడు నుంచి 10 నిముషాల సమయం పడుతుంది.మిగతా ఏ ఎక్సర్ సైజులూ చేయనివారు ఈ మెట్లెక్కే ఎక్సర్ సైజును వారానికి కనీసం రెండుసార్లన్నా చేయాలి. తడవకు 20 నిముషాలకు తగ్గకుండా. ఆ తర్వాత పైన చెప్పిన నడక ఎక్సరసైజును తిరిగి చేయాలి.దీనిని ఒక సాధనగా చేసుకోవాలంటే మొదటి రెండువారాలలో 2 అంతస్తుల దాకా మెల్లగా ఎక్కుతూ దిగాలి. మూడోవారం వచ్చేసరికి 3 అంతస్తులు... ఇలా అయిదు అంతస్తుల దాకా అలుపు లేకుండా ఎక్కి, దిగగలిగేలా సాధన చేయాలి.ఇవి చదవండి: వారి చేతుల్లో.. వ్యర్థాలు కూడా బొమ్మలవుతాయి.. -
కాఫీ, టీలకు బ్రేక్: ఇలా ట్రై చేద్దామా..!
ఉదయం లేవగానే ఓ కప్పు వేడి వేడి కాఫీగానీ, టీగానీ పడకపోతే కాలకృత్యాల దగ్గర్నించి ఏ పని కాదు చాలామందికి. ఖాళీ కడుపుతో ఇలాంటి వాటివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. నిజానికి ఉదయం బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. తద్వారా రోజు చురుకుగా ఉండటానికికావాల్సిన పోషకాలు అందుతాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం.కాఫీ, టీ అయినా అదొక సెంటిమెంట్‌లాగా మనకి అలవాటు అయిపోయింది. కానీ మంచి ఆరోగ్యం కోసం మంచి డైట్ ,కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకోవాలి.టీ లేదా కాఫీ ఉదయం పూట టీ, కాఫీలు అలవాటు మానలేని వారు చక్కెరను బాగా తగ్గించేస్తే బెటర్. మధుమేహ వ్యాధిగ్రస్తులు పూర్తిగా మానేయాలి. తాజా పండ్లను, పళ్లతో చేసిన రసాన్ని తీసుకోవచ్చు. క్యారెట్, కీరా, యాపిల్, బీట్రూట్ లాంటివాటితో జ్యూస్ చేసుకోవచ్చు. అయితే ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ జోలికి వెళ్లవద్దు. వీటిల్లో ఫైబర్ ఉండదు,పైగా అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. జింజర్ టీ, హెర్బల్ టీపొద్దున్నే గోరు వెచ్చని నీళ్లు తాగాలి. అలాగే గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కూడా కలుపు కోవచ్చు. ఇందులోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అల్లం, తులసి, పుదీనా ఆకులు, తేనెతో చేసిన హెర్బల్. జింజర్ టీతాగవచ్చు. కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లలో అవసరమైన పోషకాలు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు లభిస్తాయి., అలాగే ఫ్రీ-రాడికల్‌తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. షుగర్ లెవల్స్‌ను బట్టి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది.కాఫీ, టీలు రోజులో రెండుసార్లు తీసుకోవడం పెద్ద ప్రమాదం ఏమీకాదు. అయితే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారం తరువాత తీసుకుంటే మంచిది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు చక్కెర వాడకంలో జాగ్రత్త పడాలి. తాగకూడనివిసోడా, కార్బోనేటేడ్ పానీయాలు వీటిల్లో అధిక మొత్తంలో చక్కెర, కెఫిన్ కలిసి ఉంటాయి. ఇంకా వీటిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యలను కలిగిస్తుంది. ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక మొత్తంలో కెఫిన్, షుగర్ ఉంటాయి. ఉదయాన్నే వీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీని కారణంగా రోజంతా శక్తి లేకపోవడం అలసటగా అనిపిస్తుంది. ఇది కాకుండా ఎనర్జీ డ్రింక్స్ గుండె వేగాన్ని, రక్తపోటును పెంచుతాయనేది గమనించాలి. -
అందం ఆరోగ్యం కలగలిపిన సిరి : కలబంద
Aloe Vera Juice: కలబంద రసం ప్రతిరోజు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?ప్రస్తుత కాలంలో కలబంద పేరువినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అలోయి జాతికి చెందిన ఇది ఉష్ణమండలంలో విస్తారంగా పెరుగుతుంది. అలోవెరా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది కూడా చాలామందికి తెలుసు. అందంనుంచి ఆరోగ్యం దాకా కలబందతోలాభాల గురించి తెలుసుకుందాం.చర్మం, దంత, నోటి , జీర్ణ ఆరోగ్యానికి అలాగే బ్లడ్ షుగర్ లాంటి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సన్‌బర్న్ చికిత్సకు ఉపయోగడతాయి. చర్మం, జుట్టు అందాన్ని కాపాడుతుంది. అందుకే అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌లో దీన్ని విరివిగా వాడతారు. దీంట్లో ఇంట్లోనే పెంచుకోవడం కూడా చాలా సులువు.కలబందలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. కలబందలో విటమిన్ ఏ, సీ, ఇ , బి-కాంప్లెక్స్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, అమైనో ఆమ్లాలు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఎంజైమ్‌లు, ఫైబర్లు జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కాలిన గాయాలు , అటోపిక్ డెర్మటైటిస్ (1 ట్రస్టెడ్ సోర్స్, 2 ట్రస్టెడ్ సోర్స్) వంటి ఇతర చర్మ రుగ్మతలకు చికిత్సగా పని చేస్తుంది.కలబంద రసం ఆరోగ్య ప్రయోజనాలుఆహారాన్ని జీర్ణం చేస్తుంది. కొవ్వు నిల్వను నిరోధిస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. షుగర్ బోర్డర్లో ఉన్నవారు, ప్రీ డయాబెటిక్ రోగులకు కూడా ఈ కలబంద రసం బాగా పని చేస్తుంది.కలబంద పొట్టను శుభ్రపరుస్తుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కలబంద రసం తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కలబంద రసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల చర్మం గ్లో పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య కూడా దూరమవుతుంది. నోటి దుర్వాసనను తగ్గించడంలో పాటు చిగుళ్ళు, దంతాలను శుభ్రంగా ఉంచడంలో అలోవెరా రసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. -
మౌత్ అల్సర్ నుంచి ఉపశమనానికై.. ఇలా చేయండి!
కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ వాడటం, కొన్ని రకాల వ్యాధులతో బాధపడటం వల్ల నోటిలో పుళ్లు ఏర్పడుతుంటాయి. కొందరికి ఊరికినే కూడా అప్పుడప్పుడు నోటిపూత వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఏమైనా తాగినా, తిన్నా చాలా బాధగా ఉంటుంది. మౌత్ అల్సర్స్ నుంచి ఉపశమనం పొందడానికి తేనె చక్కటి మార్గం. నోట్లో కణజాలాలు చిట్లిపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది కాబట్టి.. తేనెను పూయడం వలన కొత్త కణజాలాలు తిరిగి ఏర్పడడానికి ఇది దోహదం చేస్తుంది. తేనెలో పసుపు కలిపి పేస్ట్ లా చేసుకుని రాసినప్పుడు కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది.మొక్కజొన్న కంకి ఒలిచేటప్పుడు వచ్చే సిల్క్ దారాల్లాంటి కార్న్ సిల్క్‌ను వృథాగా పడేస్తారు. కానీ అవి కిడ్నీ రాళ్లను బయటకు పంపడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. వాటిని నీటిలో ఉడికించి చల్లారాక వడగట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో కొత్తగా రాళ్లు ఏర్పడవు. ఇది మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో కార్న్ హెయిర్ ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లను తరచూ తాగడం, కొబ్బరి నూనెను పూయడం, అలానే ఎండు కొబ్బరిని తినడం వల్ల కూడా నోటిపూత తగ్గుతుంది. ఎందుంకటే కొబ్బరి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఫలితం గా నోటిపూత త్వరగా మాని΄ోతుంది.పాలపదార్ధాలైన నెయ్యి, మజ్జిగ వంటి పదార్ధాలు కూడా నోటిపూత నుంచి ఉపశమనం కల్పిస్తాయి. ఎక్కడైతే నోటిపూత గాయాలున్నాయో అక్కడ నేయి రాయడం, రోజుకు రెండుమూడుసార్లు గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఎంతో ఉపశమనం గా ఉంటుంది.తులసి ఆకులు కూడా నోటిపూతకు మంచి ఔషధం. రోజుకు నాలుగైదు సార్లు తులసాకులు నమలడం వల్ల నోటిపూత తొందరగా తగ్గి΄ోతుంది.చిన్న ఐస్ ముక్కతో పుండు ఉన్న చోట మర్దనా చేయడం, లవంగం నమలడం కూడా నోటిపూతను తగ్గిస్తాయి.ఇవి చదవండి: Beauty Tips: కాలానుగుణంగా.. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..? -
Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
ప్రస్తుత ఆహార అలవాట్లు, జీవన శైలి మార్పులు కారణంగా చాలామంది చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో అధిక బరువు. అధిక బరువు అనేక ఆరోగ్యసమస్యలకు మూలం. అందుకే బరువు తగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇవ్నీ కావు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేస్తున్నారు. వీటితోపాటు కొన్ని రకాల సింపుల్ చిట్కాలతో వెయిట్ లాస్ కావచ్చు అని నిపుణులు అంటున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి. ఎండు ద్రాక్ష నీరు ఎంతో మేలు చేస్తుంది. ఈ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఎండు ద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని, ద్రాక్షతోకలిపి తీసుకోవడంతో వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నమ్ముతారు. ప్రధానంగా ఎండుద్రాక్షలో ఉండే పోషకాలు , యాంటీఆక్సిడెంట్లు అందుతాయి.ఎండు ద్రాక్ష వాటర్, ప్రయోజనాలు శరీరంలోని మలినాలు బయటకు వెళ్తాయి. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. శరీరం ఫ్రీ రాడికల్సతో పోరాడే శక్తినిస్తుంది. బరువు పెరగడం, నిద్రలేమి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.మెరుగైన జీర్ణక్రియ: ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికలను మెరుగుపర్చి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. తద్వారా జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి: విటమిన్ సీ, బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఫినాలిక్ సమ్మేళనాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. రక్తపోటు,గుండెపోటు: బీపీ, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎండుద్రాక్షలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది సోడియం స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే డైటరీ ఫైబర్ పాలీఫెనాల్స్‌ను కూడా ఇందులో లభిస్తాయి.చర్మ,నోటి సమస్యలు : ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. రక్తహీనతకు ఇది చాలామంది. ఎండుద్రాక్షలో కాల్షియం, బోరాన్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చర్మ ఆరోగ్యానికి కీలకమైన విటమమిన్ ఏ, ఈ ఇందులో లభిస్తాయి. రెగ్యులర్‌గా వీటిని తీసుకుంటే ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. వృద్ధాప్య ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ కావిటీస్ , చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే నోటి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి.ఈ ఎండు ద్రాక్ష నీటిలో పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఉన్న ద్రవాల స్థాయిలను అందుపులో ఉంచుతాయి. ముఖ్యంగా ఈ వేసవిలో చెమట కారణంగా కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుంది. -
నిద్రలేమి ముప్పు : హైదరాబాద్ న్యూరాలజిస్ట్ కీలక పోస్ట్ వైరల్
మానవ శరీరం సక్రమంగా పనిచేయాలంటే నిద్ర అవసరం. రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నా, మరుసటి రోజుగా చురుగా పనులు చేసుకోవాలన్నా నిద్ర చాలా అవసరం.రనిద్ర తక్కువైతే ఎన్నో రోగాలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర లేమి కారణంగా ఏకాగ్రత లోపించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. తాజాగా హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ మరికొన్ని కీలక విషయాలను ప్రకటించారు. దీంతో ఆయన పోస్ట్ వైరల్‌గా మారింది.తగినంత నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే చాలా అధ్యయనాలు తేల్చాయి. రోజులో కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. అనేక అధ్యయనాలు నిద్ర లేమి వల్ల బరువు పెరగడం, ఆకలి లేకపోవడం, ఏకాగ్రత తగ్గడం, పనితీరులో మార్పు ,హార్మోన్ల లోపాలు వంటి అనేక రుగ్మతలకు దారి తీస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు , మానసిక రుగ్మతలు అలాగే కొన్ని సందర్భాల్లో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. కానీ పెద్దలలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర పోవడం లేదు. ఇది మానవ శరీరంపై, మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చాలా మంది న్యూరాలజిస్టులు, నిపుణులు నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో డా. సుధీర్ కుమార్ కూడా మరో కీలక విషయాన్ని వెల్లడించారు.If you lose just one hour of sleep, it could take 4 days to recover from that. Sleep deprivation can cause various symptoms, such as headache, poor focus and attention, increased irritability, poor judgement, poor decision making and increased sleepiness. #sleep #HealthyHabits— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) May 21, 2024కేవలం ఒక గంట నిద్రకోల్పోతే కోలుకోవడానికి నాలుగు రోజులు పడుతుందని సుధీర్ కుమార్ పేర్కొన్నారు. నిద్రలేమితో తలనొప్పి, కంటి చూపులో లోపం, చికాకు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంలో సమస్యలొస్తాయని ఆయన తన ఎక్స్‌లో వెల్లడించారు. అధిక ఒత్తిడి ,పేలవమైన జీవనశైలి అలవాట్ల కారణంగా నిద్రలో సమస్యలొస్తాయని ఆయన వివరించారు. అంతేకాదు ఏ వయసులో ఎంత సమయం నిద్ర పోవాలి అనేది కూడా ఆయన స్పష్టం చేశారు.వయసుల వారీగా సగటు రోజువారీ నిద్ర, నవజాత శిశువులు (3 నెలల వరకు): 14 నుండి 17 గంటలు నిద్రపోవాలి. శిశువులు (4 నుండి 12 నెలల వయస్సు): 12 నుండి 16 గంటలు నిద్రపోవాలి.చిన్నపిల్లలు (1 నుండి అయిదేళ్ల వయస్సు): 10 నుండి 14 గంటల వరకు, పాఠశాల వయస్సులో ఉన్న పిల్లలు (6 -12 సంవత్సరాలు): 8 నుండి 10 గంటల నిద్ర.అలాగే రాత్రిపూట 7-9 గంటలు ఒకేసారి నిద్రపోవడం సరైనది, ఉత్తమమైంది. ఒక వేళ రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే అతను/ఆమె పగటిపూట నిద్రపోవడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవచ్చుఅని సుధీర్ కుమార్ తెలిపారు -
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
సాధారణంగా ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తీసుకోవాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. అలాంటి వాటిలో ఒకటివేసవిలో ఎక్కువగా లభించే పుచ్చకాయ. సాధారణంగా పుచ్చకాయ కోసి తినే సమయంలో వాటి గింజలను పారేస్తుంటారు. నిజానికి పుచ్చకాయ గింజల్లోని గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఈసారి గింజల్ని అపురూపంగా చూసుకుంటారు. పుచ్చకాయ గింజల వలన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి!పుచ్చకాయ అద్భుతమైన హైడ్రేటింగ్ ఫ్రూట్. ఇందులో 92శాతం నీరే ఉంటుంది. ఇంకా ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి అలాగేదీని గింజలు వివిధ రకాల పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు, జింక్, మెగ్నీషియం, పొటాషియం మొదలైన సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. పుచ్చకాయ గింజలు రోగనిరోధక శక్తిని,గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ గింజల్లోని మిథనాలిక్ సారం అల్సర్లకు వ్యతిరేకంగా అద్భుతంగా పని చేస్తుందని ఎలుకలపై చేసిన అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.తక్కువ కేలరీలుపుచ్చకాయ గింజల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. 4 గ్రాముల బరువున్న కొన్ని విత్తనాలలో 23 కేలరీలు మాత్రమే ఉంటాయి.మెగ్నీషియంజీవక్రియ కార్యకలాపాలకు అవసరమైన పోషకం మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహిస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, మన శరీరానికి ప్రతిరోజూ 420 గ్రాముల మెగ్నీషియం అవసరం.జింక్ఇందులోని జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియ, కణాల పెరుగుదలలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇనుముఇనుము ఎక్కువగా లభిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, ఒక వ్యక్తికి రోజువారీ 18 mg ఇనుము అవసరం. మంచి కొవ్వులుగుడ్ కొలెస్ట్రాల్(మంచి కొవ్వు) మోనోఅన్‌శాచురేటెడ్ , పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్‌ను నివారించడానికి ఉపయోగపడుతుంది . కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నాలుగు గ్రాముల పుచ్చకాయ గింజలు 0.3 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను , 1.1 గ్రాముల పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి. -
బరువు తగ్గాలని రైస్‌కి దూరంగా ఉంటున్నారా? ఫిట్నెస్ కోచ్ ఏమంటున్నారంటే..
బరువు తగ్గేందుకు రకరకాల డైట్లు ఫాలో అవుతాం. ముఖ్యంగా రైస్‌ని దూరంగా ఉంచుతారు. ఎక్కువగా పండ్లు, చిరుధాన్యాల మీద ఆధారపడుతుంటారు. ఒక్కోసారి నచ్చిన కూర ఉన్న కూడా బరువు విషయం గుర్తించి భారంగా దూరం పెట్టేస్తాం రైస్‌ని. ఇంతకి రైస్ వల్లే బరువు పెరిగిపోతామా? దీనిపై ఫిట్నెస్ కోచ్‌లు ఏమంటున్నారంటే..చాలామంది బరువు విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. అన్నంతో బరువు ముడిపడి ఉందని నమ్ముతుంటారు. అందువల్ల అన్నం తినడం తగ్గించేస్తుంటారు. ముఖ్యంగా బరువు తగ్గే యత్నంలో అన్నంకి దూరంగా ఉంటారు. అయితే ఇది ఎంతమాత్ర నిజం కాదని తేల్చి చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ సిమ్రాన్. బరువు తగ్గడంలో రైస్‌ని హాయిగా తింటూనే ఎలా నియంత్రించవచ్చో వివరించారు. ఎలాంటి చింత లేకుండా హాయిగా రైస్‌ని ఆస్వాదిస్తూ తినొచ్చని చెబుతున్నారు. అందుకోసం చేయాల్సింది ఏంటో వెల్లడించారు. భోజనం తినడానికి కనీసం 10 నుంచి 12 నిమిషాల ముందు ఒక గ్లాస్ నీటిని హాయిగా తీసుకోండి. తర్వాత మంచి సలాడ్ కొద్దిగా తీసుకోండి. ఆ తర్వాత నచ్చిన భోజనం హాయిగా తినండి. ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ తినండి. అలాగే పెరుగు అన్నం కూడా స్కిప్ చెయ్యొద్దు మంచిగా లాగించేయండని చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ సిమ్రాన్. అంతేగాదు అన్నం తినడం వల్ల మధుమేహం రాదని, కేవలం అతిగా తినటం వల్ల వస్తుందని చెప్పారు. అలాగే యాక్టివ్‌గా ఉండేందుకు యత్నించండి, సమతుల్య ఆహారం బాగా తినండి, కాస్త కామన్ సెన్స్‌తో వ్యవహరిస్తూ నెట్టింట్లో చెప్పే ప్రతి చిట్కాను ఫాలో అవ్వకండి అని చెబుతున్నారు. అన్న తినడం వల్ల బరువు పెరుగుతాం అనే భావనను వదిలించుకోండి. శరీరం హెల్తీగా ఉండాలంటే మనస్ఫూర్తిగా అన్నం తినాలనే విషయాన్ని గ్రహించండి. (చదవండి: కొత్త హెయిర్ స్టైల్లో విరాట్ కోహ్లీ..వావ్!అంటూ ఫ్యాన్స్ కితాబు!) -
జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
జామపండుకు పేదల ఆపిల్ అని పేరు. అయితే పండే కాదు... ఆకుల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒకటి రెండు జామాకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి హెర్బల్ టీ మాదిరిగా తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే చాలు... ఈ కింది ప్రయోజనాలు కలుగుతాయి.ముఖం మీద ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది అధిక బరువును తగ్గించడంలో జామ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. స్త్రీలు నెలసరి సమయంలో కడుపు నొప్పి, ఒళ్లు నొప్పులతో సతమతం అవుతుంటారు. అలాంటి వారికి జామ ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. నొప్పులను తగ్గిస్తాయి.కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో జామ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్ ముప్పు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.యాంటీ స్ట్రెస్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి మంచిది. జామ ఆకులు శరీర మెటబాలిజంను పెంచి కొవ్వును కరిగిస్తాయి. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. -
కొత్తిమీరతో అద్భుత ప్రయోజనాలు, వారికి తప్ప
వంటల్లో విరివిగా ఉపయోగించే మంచి హెర్బ్ కొత్తిమీర. అలాగే పురాతన కాలంనుంచీ వాడుకలో ఉన్నదిధనియాలు. ధనియాలు, కొత్తిమీర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది. కొత్తిమీర వినియోగంతో వచ్చే లాభాలు, బరువు తగ్గడానికి పని చేసే ఒక మంచి చిట్కా గురించి తెలుసుకుందాం. మీకు తెలుసా?కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవాలని అమ్మమ్మల నుంచి విన్నాం. కొత్తిమీర ఆకులలో ముఖ్యమైన నూనెలు యాంటీమైక్రోబయల్, ఫంగల్ లక్షణాలను కలిగి ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. ఇంకా విటమిన్ ఏ సీ, కెరోటినాయిడ్లు, పుష్కలం. ఈ పోషకాలతో పాటు డైటరీ ఫైబర్, ఐరన్, మాంగనీస్, కాల్షియం, విటమిన్ కె, ఫాస్పరస్ మొదలైన అనేక పోషకాలు ఉంటాయి. ఇంకా చాలా సంతృప్త కొవ్వు, 11 ముఖ్యమైన నూనెలు లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.కొత్తిమీర ఆరోగ్య ప్రయోజనాలుకొన్ని అధ్యయనాల ఆధారంగా, కొత్తిమీర ఆకులను తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఆందోళల సమస్యలు తగ్తుతాయి. విటమిన్ ఏ, సీ, ఈవిటమిన్ ఇ కారణంగా కళ్లకు చాలా మంచిది. కొత్తిమీర రోజువారీ వినియోగిస్తే వయసు కారణంగా వచ్చే మచ్చలకు మంచి చిట్కా. రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది. ఐరన్ తీసుకోవడంలో బాడీగా బాగా సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయికొత్తిమీరలోని ఆకుపచ్చ రంగు యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్ పనితీరును మెరుగుపరుస్తుంది. కొత్తిమీర కలిపిన నీటిని రోజూ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న వ్యక్తికి మేలు జరుగుతుంది. ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. కొత్తిమీర గ్లైసెమిక్ ఇండెక్స్ 33 మాత్రమే. ఇది చాలా తక్కువ. అటువంటి పరిస్థితిలో, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి కొత్తిమీర శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించి, ఇన్సులిన్ మొత్తాన్ని పెంచుతుంది. బ్లడ్ షుగర్ తక్కువగా ఉంటే కొత్తిమీర నీళ్లు తాగకండి. ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్నేటి జీవనశైలిలో, ప్రతి మూడవ వ్యక్తి అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. కొత్తిమీర ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ,హెచ్‌డిఎల్ (మంచి) కొలెస్ట్రాల్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఎముకల ఆరోగ్యానికి కొత్తిమీర ఆకులు కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ లాంటి ఖనిజాలు పుష్కలం కొత్తిమీరలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంక్షన్ ఆర్థరైటిస్ సంబంధిత నొప్పి నుండి ఎముకలను రక్షిస్తుంది.గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోకొత్తిమీరలో మంచి ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు నొప్పి, విరేచనాలు, ప్రేగు కదలికలు, గ్యాస్ లేదా వికారం వంటి వివిధ జీర్ణ సమస్యలకు కూడా పని చేస్తుంది. చర్మ ఆరోగ్యంఐరన్, విటమిన్ ఇ , విటమిన్ ఎ యొక్క పవర్‌హౌస్‌గా ఉండటం వల్ల ఇది చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. కొత్తిమీర అదనపు నూనెను పీల్చుకునే సామర్థ్యం కారణంగా జిడ్డు చర్మానికి నివారణగా కూడా పనిచేస్తుంది. యాంటీమైక్రోబయల్, యాంటిసెప్టిక్ ,యాంటీ ఫంగల్ ఏజెంట్ చర్మాన్ని చల్లబరుస్తుంది.గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందిశరీరంలోని అదనపు నీరు, సోడియంను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బరువు తగ్గాలంటే అంతేకాదు అధిక బరువుతో బాధపడే వారికి కొత్తిమీర నీరు మంచి వైద్యం అని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలోని పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు నియంత్రణలో సహాయ పడుతుంది. కొత్తిమీరలోని పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు కొవ్వును కరిగించడంలో సహాయ పడతాయి. థైరాయిడ్ సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది. కొత్తిమీర ఆకులు, కాండం యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. దీన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. కొత్తిమీర గింజలలో ఉండే థైమోల్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.జాగ్రత్తలుకొత్తిమీర, ధనియా వాటర్ రక్తపోటును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. లోబీపీ ఉన్నవారు అపమ్రత్తంగా ఉండాలి. దీనిని హైపోగ్లైసీమియా అని కూడా పిలుస్తారు. దీని వల్ల ఆందోళన, దడ, చెమట , ఆకలిలాంటి సమస్యలొస్తాయి. ఏదైనా మితంగా, వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. -
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
మొలకెత్తిన గింజధాన్యాలను తినడం వలనఅనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలన్నా, మంచి పోషకాలు అందాలన్నా మొలకలు తినాల్సి ఉంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. మొలకలతో వచ్చే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసు కుందాం.గర్భిణీ స్త్రీలకుశరీరానికి విటమిన్ సి, ఫైబర్ , జింక్, ఇనుము, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి. మొలకలలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఈ ఆహారం చాలా అవసరం. ఆహారంలోని ఫోలేట్ సరైన పోషకాలను పిండానికి అందేలా సహాయపడుతుంది. పిల్లల మంచి మెదడు అభివృద్ధికి మంచిది . ఇంకా మలబద్ధకం , పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారిస్తాయి.విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదల ఉండేలా చేస్తుంది. జుట్టు రాలడం, తొందరగా జుట్టు మెరిసిపోవడం తగ్గుతుంది. రక్త ప్రసరణ పెరిగి, జుట్టును బలోపేతం చేసి పెరుగుదలకు సహాయపడుతుంది. మొలకలలో విటమిన్ ఏ అధిక సంఖ్యలో ఉంటుంది. ఇది కంటిశుక్లం రేచీకటి నివారణలోనూ మొత్తం కంటి ఆరోగ్యానికి మంచిది.శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మాస్కులర్ డిజెనరేషన్ సమస్యకు బాగా పనిచేస్తుంది. శాఖాహారులు మొలకలను తీసుకున్నప్పుడు ప్రోటీన్ అందుతుంది. వీటిల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ మంచి కొలెస్ట్రాల్‌ని పెంచడంలో సహాయ పడతాయి.మొలకలలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది మెరుగైన స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. వీర్యకణాల కదలికలు కూడా చురుగ్గా ఉంటాయి.మొలకల్లో విటమిన్ B లభిస్తుంది. ఇది చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. చర్మ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. సాధారణ జలుబు, ఆస్తమా నివారణలో సాయపడతాయి.సైడ్-ఎఫెక్ట్స్ & అలర్జీలుతక్కువ నాణ్యత గల మొలకలను ఉపయోగించినప్పుడు మొలకలు శరీరంలో సాల్మొనెల్లా, ఇ కోలి బ్యాక్టీరియా , వైరస్ దాడికి కారణమవుతాయని తెలుస్తోంది. ఒక్కోసారి, జ్వరం అతిసారం బారిన పడ్డారు . కొంతమందికి కడుపు తిమ్మిరి ఏర్పడింది. మొలకలు సరియైన పద్ధతిలో రాకపోతే హానికరమైన బ్యాక్టీరియా పుడుతుంది.నోట్: ఇది అవగాహన కోసం అనేది గమనించగలరు. ఏదైనా మితంగా తింటే మంచిది. మొలకలు తిన్నపుడు ఏదైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తేం వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
ఎండాకాలంలో ఎండలు, వర్షాకాలంలో వర్షాలు ప్రకృతి సహజం. అందుకే సీజన్‌కు తగ్గట్టుగా మన జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా చెమట రూపంలో నీరు ఎక్కువ నష్టపోతాం కాబట్టి, నీరు ఎక్కువగా లభించే పండ్లు కూరగాయలు తీసుకోవాలి. ఈ క్రమంలో సమ్మర్లో కీరదోసకాయను తీసుకోవడం వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం. నిజానికి కీరదోస ఏ సీజన్లో తీసుకున్నా మంచిదే. ఇందులో పోషకాలు అనేక లాభాలను అందిస్తాయి. వేసవిలో అయితే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దోసకాయలు కేలరీలు తక్కువ. విటమిన్లు , ఖనిజాలు ఎక్కువ. కరిగే ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.కీరదోసతో లాభాలుహైడ్రేషన్ & డిటాక్సిఫికేషన్ కోసం మంచిదిరక్తపోటును నియంత్రిస్తుందిజీర్ణక్రియకు మంచిదిబ్లడ్ షుగర్ తగ్గిస్తుందిబరువు తగ్గడంలో ఉపయోగపడుతుందిమెరుగైన చర్మం కోసంకళ్లకు సాంత్వన చేకూరుస్తుందికేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందివడదెబ్బతో పాటు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇందులో 95 శాతం నీటితోపాటు, పొటాషియం,మెగ్నీషియం లభిస్తాయి. సోడియం లోపం ఉన్నవారు ఆహారంలో ఈ కీర దోసకాయని తీసుకుంటే మంచిది. పొట్టుతో కీర దోసకాయ తినడం వల్ల గరిష్టంగా పోషకాలు అందుతాయి.ఫ్లేవనాయిడ్లు ,టానిన్లతో సహా యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి ,దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సాయపడుతుంది. మధుమేహం వల్ల వచ్చే సమస్యలను నివారించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. కీర దోసకాయలోని పెక్టిన్ పేగు కదలికలను బాగు పరుస్తుంది. తద్వారా మలబద్దకాన్ని కూడా తగ్గించుకోవచ్చు. -
పొట్ట తగ్గాలంటే.. జిమ్‌కే వెళ్లాలా? ఏంటి?
నేటి ఆధునిక శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. దీనికితోడు జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి కారణంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడానికి ఉపవాసాలున్నా, జిమ్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతున్న వారిని చూస్తూ ఉంటాం. అలాగే ఏం తిన్నా ఇక్కడికే.. అంటూ హీరోయిన్ సమంతా తరహాలో అద్దముందు నిలబడి డైలాగులుకొట్టే అమ్మాయిలు కూడా చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో జిమ్‌కెళ్లకుండానే, ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో, ఊబకాయం, బెల్లీ ఫ్యాట్, ఫ్యాటీ బటక్స్ సమస్యకు చెప్పవచ్చు.గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే గండమే!గంటల తరబడి టీవీలకు అతుక్కు పోకూడదు. పనిలో పడి అలాగే 8 నుంచి 10 గంటల పాటు కూర్చుని పని చేయకూడదు. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోతోంది. అలాగే కడుపు ఉబ్బరం వస్తుంది. కాబట్టి ప్రతి గంటకు 5 నిమిషాలు విరామం తీసుకోవాలి. మెట్లు ఎక్కడం, గుంజీలు తీయడం లాంటివి చేయాలి. దీంతో అవయవాలకు రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది క్రమం తప్పకుండా వ్యాయామంఉదయం, సాయంత్రం లేదా మీకు వీలైన సమయంలో వేగంగా నడవడం, జాగింగ్, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ తప్పకుండా చేయాలి. స్నేహితులతో కలిసి మీకు నచ్చిన గేమ్స్ (క్రికెట్, టెన్నిస్, కబడ్డీ,ఇ తర) అవయవాలు పూర్తిగా కదిలేలా ఆడండి. శరీరమంతా చెమట పట్టేదాకా శ్రమిస్తే బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటికి పోతాయి.ఎముకలు, కండరాలు బలతంతా తయారవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అతి ముఖ్యమైన డీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.తగినన్ని నీళ్లు, కంటినిండా నిద్ర: వ్యాయామం చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. ఇది ఆకలిని తగ్గిస్తుంది , బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. నీటిని తాగడం వల్ల పొట్ట, పొత్తికడుపు కొవ్వు తగ్గుతుంది. చక్కటి నిద్ర కూడా మన బరువును ప్రభావితం చేస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం.ఫైబర్ రిచ్ ఫుడ్స్: శరీర బరువు నియంత్రణలో ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. బరువు పెరగడం గురించి ఆందోళన మానేసి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి, ఈ రకమైన ఆహారాన్ని తినడం వల్ల మీ కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది. అలాగే రాత్రి 7 గంటల లోపు డిన్నర్ కంప్లీట్ చేయాలి. బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.ఇంకా: ఒకేసారి కడుపు నిండా.. ఇక చాలురా బాబూ అనేంతగా తినవద్దు. అలాగే మైదాతో తయారుచేసిన పదార్థాలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మద్యం, ధూమమానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. పొట్ట, పిరుదులు, పిక్కలు, భుజాలు లాంటి ప్రదేశాల్లో కొవ్వును కరిగించుకునేందుకు నిపుణుల సలహా మేరకు కొన్ని స్పాట్ రిడక్షన్ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. యోగాలో కూడా ఇందుకోసం మంచి ఆసనాలు ఉన్నాయి. వాటినా ప్రాక్టీస్ చేయవచ్చు. నిజంగా వీటిని చిత్తశుద్ధిగా ఆచరిస్తే వారంలో బరువు తగ్గడం ఖాయం.నోట్: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు. ఏదైనా అనారోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
మధుమేహం ఒక తీవ్రమైన వ్యాధి. జీవన శైలి మార్పులు,క్రమం తప్పని వ్యాయామం, ఆహార నియమాలు దీనికి పరిష్కారం. ఒకసారి మధుమేహం బారిన పడితే జీవితాంతం జాగ్రత్తలు తీసుకోవల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్రమైన సమస్యలు తప్పవు.మధుమేహం వచ్చిందని భయపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. మధుమేహాన్ని నియంత్రించాలంటే తప్పనిసరిగా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం.కొద్దిపాటి నడక, యోగాఉదయాన్నే లేదా రాత్రి నడక, యోగా, ధ్యానం చాలా అవసరం. ముఖ్యంగా డయాబెటిక్ సమస్య ఉన్నవారు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రకుపక్రమించకూడదు. కనీసం పది, ఇరవై నిమిషాలు నడక,వజ్రాసనం వంటి యోగాసనాలను అలవాటు చేసుకోవాలి. దీని బరువు అదుపులో ఉంటుంది. తద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం అనేది షుగర్ లెవల్స్ ఎలివేట్ కావడానికి ముఖ్యం కారణం. కాబట్టి తిన్న తర్వాత కనీస శారీరక శ్రమ చాలా అవసరంస్వీట్లకు, కొన్ని రకాల పండ్లుమామిడికాయ, పనస, అరటి లాంటి పండ్లకు చాలా దూరంగా ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క జామకాయ తప్ప ఏదీ తినకూడదు.. తిన్నా.. చాలాపరిమితంగా తీసుకోవాలి. షుగర్ ఎక్కువగా ఉండే స్వీట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. రాత్రి సమయంలో స్వీట్లు తినకపోవడం మంచిది. మంచి నిద్ర, నీళ్లు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటే రాత్రి నిద్ర కూడా పడుతుంది. డయాబెటిక్ రోగులు కనీసం 8 గంటలు నిద్రపోవాలి.అలాగే రాత్రి భోజనం చేసిన 1 గంట తర్వాత మీరు కనీసం 2 గ్లాసుల నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధించవచ్చు.రాత్రిపూట మొబైల్ స్క్రీన్లకు ఎంత దూరంగా ఉంటే మంచింది. రాత్రి పడుకుని టీవీ, మొబైల్ చూడటం వల్ల, మెడ నొప్పులు, తలనొప్పి వస్తాయి. మద్యపానం, ధూమపానం పూర్తిగా నిషేధించాలి. ఎప్పటికపుడు పరీక్షలు, వైద్యుల సలహాలుఒకసారి మన శరీరంలోకి మధుమేహం ఎంటర్ అయిందంటే అదొక హెచ్చరికలాగా భావించాలి. రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకుంటూ, వైద్యుల సలహా మేరకు మందులను వాడుతూ ఉండాలి.నోట్: డయాబెటిక్ వచ్చిందని భయపడకుండా, తగిన జాగ్రత్తలు పాటించాలి. వ్యాయామం, ఆహార నియంత్రణ లాంటి జీవన శైలి మార్పులు ఆరోగ్య జీవనానికి పునాది. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. పూర్తి సమాచారం, సందేహాలకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. -
Health Tips: ఈ చిట్కాలతో.. మీ ఆరోగ్యం నిలకడగా..
ప్రతీరోజూ.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతో ఉంది. వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంచాలంటే ఎన్నో విధానాలు, జాగ్రత్తలు పాటించక తప్పదు. మరి ఈ టిప్స్‌తో మీ ఆరోగ్యం మీ చేతిలోనే.. మరి అవేంటో చూద్దాం.కిస్మిస్లలో జింక్, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. రాత్రిపూట కొన్ని కిస్మిస్లను తిని గోరువెచ్చటి నీరు తాగితే మరుసటి రోజు ఉదయం విరేచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. దీంతో పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. అలా కాకపోతే రాత్రి పూట కిస్మిస్లను నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం కూడా తినవచ్చు. ఎలా తిన్నా సమస్య నుంచి బయట పడతారు.బాదంపప్పులో ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. అందువల్ల బాదంపప్పును రోజూ తింటే పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇందుకు గాను బాదంపప్పును రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే వాటిని పొట్టు తీసి తినాలి. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవడంతో΄ాటు మలబద్దకం తగ్గుతుంది. పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు.జామపండ్లలో విటమిన్లు, మినరల్స్ అనేకం ఉంటాయి. ఇవి దంతాలు, చిగుళ్ల సమస్యలు, జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. జామ పండ్లను తినడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం ఉండదు. అలాగే పైల్స్ కూడా తగ్గిపోతాయి. రోజూ రాత్రి భోజనం చేసిన తరువాత నిద్రకు ముందు ఒక జామ పండును తింటే ఈ ప్రయోజనం కలుగుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.రోజూ పరగడుపునే మూడు లేదా నాలుగు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పెనంపై వేసి వేయించి వాటిని అలాగే తినాలి. నేరుగా తినలేం అనుకుంటే తేనెతో కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం నుంచి బయట పడతారు. మలబద్దకం తగ్గి పైల్స్ నుంచి విముక్తి పొందవచ్చు.జీర్ణ సమస్యలను తగ్గించడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ రాత్రి భోజనం అనంతరం చిన్న బెల్లం ముక్కను చప్పరిస్తూ తినాలి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. క్రమం తప్పకుండా రోజూ రాత్రి బెల్లం తింటే పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు.ఇవి చదవండి: Summer Special - ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త! -
Black Salt Benefits : బ్లాక్ సాల్ట్‌తో ఇన్ని లాభాలా?
కోవిడ్-19 సంక్షోభం తరువాతఅందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. పోషకాహారంపై దృష్టి పెడుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి బ్లాక్ సాల్ట్ లేదా నల్ల ఉప్పు. నల్ల ఉప్పుతో ఎలాంటి ప్రయోజ నాలున్నాయో తెలుసుకుందాంఉప్పులేని వంటిల్లు లేదు. కానీ మనం రెగ్యులర్‌గా వాడే తెల్ల ఉప్పుతో కంటే కూడా బ్లాక్ సాల్ట్ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు కలిగిన బ్లాక్‌సాల్ట్ ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. ఇది రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో సహాయపడే ఈ నల్ల ఉప్పు చాలాబాగా పనిచేస్తుంది. అలాగే నల్ల ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికే కాదు చర్మానికి, జుట్టుకు కూడా మంచిది. నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని చాలా మందికి తెలియదు.ఎసిడిటీ, మెరుగైన జీర్ణక్రియ తరచుగా గ్యాస్ ,అసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి నల్ల ఉప్పు నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిదని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. నల్ల ఉప్పును సరైన పరిమాణంలో తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. బ్లాక్ సాల్ట్ చాట్ లేదా సలాడ్ అయినా వాటి రుచిని పెంచుతుంది. ఇది అనేక యాంటీఆక్సిడెంట్లు కలిగిన పోషకాల నిధి.గుండె ఆరోగ్యానికి చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి కూడా దీని వినియోగం చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మితిమీరి ఎలాంటిది తీసుకున్నా హానికరం కాబట్టి, దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.బరువు తగ్గడానికినల్ల ఉప్పులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి ప్రభావవంతంగా ఉంటుంది.సలాడ్, పానీయం వంటి మొదలైన వాటిల్లో నల్ల ఉప్పును వేసుకుంటే మంచిది.నోటి ఆరోగ్యం గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు వేసి నిద్రించే ముందు పుక్కిలిస్తే దంతాలు బలపడతాయి. దీంతో పంటి నొప్పి, కుహరం సమస్యలు కూడా నయం అవుతాయి. చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన సమస్యను కూడా వదిలించుకోవచ్చు.చర్మ సమస్యలు నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. అందుకే నల్ల ఉప్పును జుట్టుకు, చర్మానికి మంచిది. సబ్బులూ, టూత్ పేస్ట్ ల తయారీలోనూ వాడుతుంటారు. నోట్: ఇది కేవలం సమాచారంగా మాత్రమే అని గమనించగలరు. బీపీ రోగులు ఉప్పును ఎంత పరిమితంగా వాడితే అంత మంచిది. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
దాల్చిన చెక్కతో ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ నిజంగా తగ్గుతుందా?
సకల రోగాలకు మూలం ఒబెసిటీ. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువుంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే అధిక బరువును తగ్గించుకునేందుకు చాలామంది నానా కష్టాలు పడుతూ ఉంటారు. జీవనశైలి మార్పులు, ఆహారఅలవాట్లుమార్చుకోవడంతోపాటు, కొన్ని ప్రత్యేక పదార్థాలను కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో బాగా వినిపిస్తున్నది దాల్చిన చెక్క. శరీరంలో కొవ్వును కరిగించడానికి దాల్చిన చెక్క నీరు, కషాయం, టీ బాగా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుందని నమ్ముతారు. దాల్చిన చెక్క ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్కుసరిగ్గా పనిచేసేలా చేస్తుంది. కొన్ని అధ్యయనాలు దాల్చినచెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కూడా సూచిస్తున్నాయి.దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ముఖ్యంగా దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీంలోని మలినాలను బయటకు పంపుతాయి. దాల్చిన నీరు తాగడం వల్ల శరీరం మెటబాలిజం పెరుగుతుంది. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కగా పని చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం దాల్చిన చెక్క నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గొచ్చు.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ త్వరగా కరుతుంది. ఫలితంగా స్థూలకాయం, అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఈ వాటర్ తాగడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.దాల్చిన చెక్కలో అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు వాపు తగ్గించడం ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ, వార్మ్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఇన్ఫెక్షన్లను నిర్వహించడంలోసహాయపడుతుంది. గవద జ్వరం వంటి అలర్జీ సమస్యల నివారణలో దాల్చిన చెక్క ఉపయోగ పడుతుంది. పురుషులలో అంగస్తంభన సమస్యతోపాటు, స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు పని చేస్తుంది. నోట్: అందరికీ ఈ చిట్కా మనచేస్తుందని చెప్పలేం. కానీ కచ్చితంగా కొన్ని ప్రయోజనాలు న్నాయి. అయితే ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రమం తప్పని, వ్యాయామం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయిని మాత్రం మర్చిపోకూడదు. -
Beauty Tips: పసుపుతో పింక్ లిప్స్..
ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాగానీ, కొన్ని సమస్యలు మనకు తెలియకుండానే పెద్ద తలనొప్పిగా మారుతాయి. వాటినుంచి ఎలా తప్పుకొవాల్లో కూడా తెలీక ఇబ్బంది పడుతుంటాం. మరి ఈ సమస్యల నుంచి ఉపశమనం లభించాలంటే ఇలా ప్రయత్నం చేసి చూడండి.. ఇలా చేయండి.. పాలలో చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి పావుగంట మర్దన చేయాలి. రాత్రంతా అలానే ఉంచుకుని ఉదయం నీటితో కడిగేయాలి. రోజూ రాత్రిపూట క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల పెదవులు గులాబి రంగులోకి మారతాయి. చిటికెడు పసుపులో మూడు చుక్కల నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే కడిగేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల పెదవులపై ఏర్పడిన మచ్చలు పోతాయి. హెయిర్ కలర్గానీ హెన్నాగానీ జుట్టుకు పెట్టే ముందుకు చెవులు, నుదురుకు పెట్రోలియం జెల్లిని రాయాలి. తరువాత హెన్నా పెట్టుకోవాలి. చెవులు, నుదురు ్రపాంతంలో హెన్నా పడ్డప్పటికీ నీటితో కడిగితే ఇట్టే పోతుంది. పెట్రోలియం జెల్లి లానే ఆలివ్ ఆయిల్‌ను కూడా డైకు ముందు చెవులు, నుదురు, మెడకు అప్లై చేసి మర్దన చేయాలి. తరువాత డై పడినా నీటితో కడిగితే పోతుంది. ఇవి చదవండి: Kitchen Tips: ఈ చిన్న చిన్న పదార్థాలతో ఇబ్బందా? అయితే ఇలా చేయండి! -
గులాబీ రేకులతో స్వీట్ : బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు
గులాబీ పువ్వులు సౌందర్య పోషణ ఉత్పత్తుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. గులాబీ రేకులతో తయారు చేసిన గుల్కంద్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆయుర్వేదం చెబుతోంది.గుల్కంద్ అనే పదం గుల్ నుండి వచ్చింది. దీని అర్థం పెర్షియన్ భాషలో 'పువ్వు' అరబిక్‌లో 'కంద్' అంటే 'తీపి'. ముఖ్యంగా ఈ వేసవిలో గులాబీ రేకుల జామ్ లేదా గుల్కంద్ వల్ల ఒంటికి చలవ చేస్తుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఫిట్‌గా ఉంచే అద్భుతమైన టానిక్‌లా పనిచేసే గుల్కంద్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు.. లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన గులాబీ రేకులు వెడల్పుమూత ఉన్న గాజు సీసా, లేదా జార్ యాలకులు గులాబీ రేకులను బాగా ఎండబెట్టాలి. ఎండిన వాటిని ఒక గాజు సీసాలో వేసి, దానికి కొద్దిగా చక్కెర, యాలకుల పొడి కలుపుకోవాలి. గాజు సీసాను ప్రతిరోజూ దాదాపు ఏడు గంటలపాటు ఎండలో ఉంచాలి. మళ్లీ రాత్రికి చెక్క స్పూన్‌తో లేదా తడిలేని గరిటెతో బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా దాదాపు నెల రోజుల పాటు ఇలా చేయాలి. దీంతో జామ్‌లాగా ఇది తయారవుతుంది. దీన్ని పలు రకాల స్వీట్లలో వాడతారు. అలాగే ఫ్రూడ్ సలాడ్లలో వాడవచ్చు. కాస్త చల్లటి పాలు తీసుకుని అందులో ఒక చెంచా గుల్కంద్ వేసి తాగవచ్చు. అలాగే దీన్ని నేరుగా లేదా తమలపాకులతో కూడా తినవచ్చు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఈ గులాబీ గుల్కంద్ ఆయుర్వేద ప్రకారం పిత్త దోషాలకు చాలా మంచిది. వేడిని పుట్టిస్తుంది. చల్లగా ఉండేలాగా కూడా పనిచేస్తుంది దద్దుర్లు, నొప్పులు ,నొప్పులు వంటి వేడి-సంబంధిత లక్షణాలను తగ్గిస్తుంది , అరికాళ్ళు అరచేతులలో ఏవైనా మంటలను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇది కాలక్రమేణా కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అందుకే దీన్ని తాంబూలంలో కూడా ఎక్కువగా వాడతారు. రక్తహీనతను నివారిస్తుంది, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి ఇది చాలా మంచిది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది కప్పు పాలలో వేసి రాత్రిపూట తాగితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది చర్మం త్వరగా ముడతలు పడకుండా నివారిస్తుంది. మొటిమల మచ్చలను కూడా తగ్గిస్తుంది. గుల్కంద్ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తీవ్రమైన అల్సర్లు, మలబద్ధకం, గుండె మంట సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. వేసవిలో గుల్కంద్ వాడటం వల్ల వడదెబ్బ, ముక్కు కారటం, తలతిరగడం వంటివి నివారించవచ్చు. బహిష్టు సమయంలో అధిక రక్తస్రావానికి గుల్కంద్ మంచిది. ముఖ్యంగా పీసీఓడీతో బాధపడుతున్న వారికి ఇది చాలా మంచిది. థైరాయిడ్‌తో బాధపడేవారు కూడా ఈ జామ్ని చక్కగా తీసుకోవచ్చు -
గురక సమస్య అంతింత కాదయా! లైట్ తీసుకుంటే డేంజరే!
గురక సమస్యను చాలామంది దీన్ని తేలిగ్గా తీసుకుంటారుగానీ, నిజానికి ఇది తీవ్రమైన స్లీప్ డిజార్డర్. గురకపెట్టేవారికి దాని ఇబ్బందులు పెద్దగా తెలియక పోవచ్చు. కానీ పక్కనున్న వారికి అదో పెద్ద సమస్య. అసలు అంతపెద్దగా గురక పెడుతున్నామనేది కూడావారికి తెలియదు. వినేవాళ్లకు మాత్రమే తెలుస్తుంది గురక శబ్దం ఎంత బిగ్గరగా ఉందో. అసలు గురక ఎందుకు వస్తుంది? గురక ఇచ్చే వార్నింగ్ బెల్స్ ఏంటి? తెలుసుకుందాం. నోటితోగాలి పీల్చుకోవడం, శ్వాసలో ఇబ్బంది ద్వారా నిద్రలో శ్వాస పీల్చుకునేటప్పుడు వచ్చే శబ్ధం.కొంత మందికి ఈ శబ్దం చిన్నగా గురక వస్తే మరి కొంత మందికి చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎక్కువగాఅలసిపోయినపుడు, అలర్జీలు, మద్యం సేవించడం, స్థూలకాయం ఉన్నవాళ్లకి గురక వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా గురక పెడతారు. అయితే ఈ గురక రోజూ వస్తోంటే మాత్రం అప్రమత్తం కావాల్సిందే. దీర్ఘకాలిక గురక స్లీప్ అప్నియా కు దారి తీస్తుంది. ఈ స్లీప్ అప్నియా రెండు రకాలు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA): గొంతు కండరాలు రిలాక్స్ అవుతూ ఊపిరితిత్తులలోకి గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇది పెద్ద వయసువారిలోనూ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారిలో చాలా కామన్. అలాగే టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ సమస్య ఉన్న పిల్లలోలనూ , ఊబకాయం, మద్యం, ధూమపానం అలవాటు, మత్తుమందులు లేదా ట్రాంక్విలైజర్లనువాడేవారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. గుండెకు రక్తప్రసరణ గుండె ఆగిపోవడం, అధిక రక్తపోటు ,టైప్ 2 మధుమేహం వంటివి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ప్రమాదాన్ని పెంచే కొన్ని పరిస్థితులు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, హార్మోన్ల రుగ్మతలు, ముందస్తు స్ట్రోక్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. సెంట్రల్ స్లీప్ అప్నియా (CSA), ఇది శ్వాసను నియంత్రించే కండరాలకు మెదడు సరైన సంకేతాలను పంపనప్పుడు సంభవిస్తుంది. పెద్ద,మధ్య వయస్కులు , వృద్ధులకు సెంట్రల్ స్లీప్ అప్నియా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.సెంట్రల్ స్లీప్ అప్నియా స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. గుండె లోపాలు. రక్తప్రసరణ గుండె ఆగిపోయేప్రమాదాన్ని పెంచుతుంది.నార్కోటిక్ నొప్పి మందులను, ఓపియాయిడ్ ముఖ్యంగా మెథడోన్ వంటి దీర్ఘం కాలం తీసుకుంటే సెంట్రల్ స్లీప్ అప్నియా ప్రమాదాన్ని పెంచుతాయి. గురక సమస్యలు: సాధారణంగా గురక పెడుతూ నిద్రపోయే వారిలో రక్తం గడ్డకట్టడం, వయసు పెరిగే కొద్దీ వారి మెదడు శక్తిని వేగంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. శరీరానికి రాత్రి పూట అందాల్సిన ఆక్సిజన్ అందదు శరీర అవయవాల పనీతిరుకి ఆటంకం కలిగించొచ్చు. కొన్ని సందర్భాలలో తీవ్రంగా కణాల నష్టాన్ని కలిగిస్తుంది. ఆక్సిజన్ సరిగా అందక పోవడం వల్ల మెదడులో కణాల పనీతీరును కూడా ప్రభావితం చేస్తుంది. జ్ఞాపకశక్తి మందగిస్తుంది. గురకతో మధ్యలో లేవడం వల్ల నిద్రకు భంగం ఏర్పడుతుంది. దీంతోపగటి పూట బద్ధకంగా, నిస్తేజంగా ఉండటమే కాదు, నిద్ర వస్తుంది. దీని వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు వస్తాయి. గురక సమస్యతో బాధపడుతుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. నోట్. ఇది అవగాహనకు సంబంధించిన సమాచారం మాత్రమే. గురక సమస్యగా ఎక్కువగా బాధిస్తోంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఊబకాయులైతే బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. రోజూ యోగా ప్రాణాయామం లాంటివి చేయడం మంచిది. -
వందేళ్లనాటి కాను(టు)క ఇది : ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
ఇంట్లో పసిపాప వస్తోంది అంటే చాలు అమ్మమ్మ, నానమ్మల హడావిడి మొదలవుతుంది. పొత్తిళ్లలో బిడ్డకు కావాల్సిన మెత్తటి బట్టలు సేకరించడం, పాపాయికి సౌకర్యంగా ఉండేలా పాత చీరలతో చేసిన బొంతలు తయారీ మొదలు, కాటుక, ఆముదం లాంటివి సిద్ధం చేసుకునేందుకు రడీ అయిపోయేవారు. సహజంగాఇంట్లోనే కాటుకునే తయారుచేసుకునే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పత్తి దారంతో కొద్దిగా వామ్ము గింజలు వేసి వత్తి తయారు చేసిన దాన్ని ఆవ నూనెలో ముంచి మట్టి ప్రమిదలో దీపం వెలిగించింది. దానిపై వెడల్పాటి మూతను పెట్టింది. వత్తి మొత్తం కాలి ఆ మసి అంతా పళ్లానికి అంటుకుంది. ఈ మసిని తీసి కాజల్( కాటుక)గా తయారు చేసింది. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఆముదం, నూలు బట్ట సహాయంతో తమ నాన్నమ్మ, అమ్మమ్మ ఇలానే చేసేది అంటూ నెటిజన్లు గుర్తు చేసు కున్నారు. ఇందులో కెమికల్స్ ఉండవు. పైగా చిన్నపిల్లలకు కంటికి శీతలం కూడా అని వ్యాఖ్యానించారు.సహజమైన పదార్థాలతో ఇంట్లో తయారు చేసుకున్న కాటుక అయితే అందమైన అమ్మాయి కళ్ళు మరింత విశాలంగా బ్రైట్‌గా, బ్యూటీఫుల్‌గా మెరిసి పోతాయి. కళ్ళకి కాటుక పెట్టుకోవడం వల్ల కంటిలోని ఎర్రటి చారలు తొలగిపోతాయి. పైగా కాటుక పెట్టుకోవడం వల్ల దుమ్ము, ధూళి కణాలు కళ్ళలో పడకుండా ఉంటుంది. Did you know this 100 years old technique of Kajal making? Ingredients: Cotton, Ajwain, Mustard Oil and Ghee… pic.twitter.com/K6rF6yRcal — Aparajite | ಅಪರಾಜಿತೆ (@amshilparaghu) April 15, 2024 నోట్: చాలావరకు డాక్టర్లు శిశువులకు కాటుక పెట్టవద్దని చెబుతారు. ఎందుకంటే రసాయనాలతో తయారు చేసిన కాటుకల వల్ల కంటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుందనేది గమనించ గలరు. -
తొందరపడి లిప్ లాక్ చేస్తున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసా?
ఇరువురు మనుషులు కలుసుకున్నపుడు చక్కని చిరునవ్వు, కరచాలనం, ఆత్మీయం ఆలింగనం ఇది సర్వ సాధారణం. మరికొన్ని చోట్ల ముద్దుగా బుగ్గలమీద చిన్న ముద్దుపెట్టుకోవడం ఒక అలవాటు. చిన్నారులను చూసినపుడు అందరమూ ముద్దు చేస్తాం. ఎదుటివారి పట్ల తమ ప్రేమను తెలియజెప్పేందుకు ఇలా చేస్తుంటాం. అదే ప్రేమికుల మధ్య ఈ ముద్దుల బంధం ఇంకొంచెం..మధురంగా ఉంటుంది. అయితే సినిమా కల్చర్ అనండీ..పాశ్చాత్య నాగరికత అనండీ.. ప్రేమికులతో పాటూ ఇతరులు కూడా లిప్ టూ లిప్ కిస్సులు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇలా ముద్దులు పెట్టుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. లిప్ టూ లిప్ ముద్దుల వల్ల లాభాల మాటేమో గానీ.. సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉన్నాయంటున్నారు నిపుణులు. చిన్నపిలల్ల్ని ఇలా ముద్దు పెట్టుకోవడం చాలా అనర్థం. తీవ్ర అనారోగ్యం, ఫ్లూ, వైరస్ల బారిన పడిన వారితో అయితే చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ♦ ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటివి ఇతర అంటు వ్యాధులు త్వరగా వచ్చే అవకాశాలున్నాయి. ♦ ఈ రకం ముద్దుల వల్ల మోనోన్యూక్లియోసిస్, మెనింజైటిస్ వంటి వైరస్‌లను వ్యాపింపజేస్తుంది. మోనో వైరస్ కారణంగా కొందరిలో ఆరు నెలల పాటు విపరీతమైన అలసట వంటి లక్షణాలుంటాయి. ♦ మెనింజైటిస్, మెదడు వాపు వ్యాధిలు కూడా వ్యాప్తిస్తాయి. ♦ క్లామిడియా గనేరియా వంటి లైంగిక సమస్యలు కూడా రావచ్చు. లైంగిక వ్యాధులు కూడా చాలా తొందరగా వ్యాప్తిస్తాయి. ♦ స్వీడిష్ సర్వే ప్రకారం, అలెర్జీ ఉన్న వారిని ముద్దుపెట్టుకునే 12 శాతం మందికి అలెర్జీ త్వరగా సోకుతుంది. దురద, వాపు వంటి సమస్యలతో బాధ పడేవారు కూడా లిప్ టూ లిప్ కిస్సులకు దూరంగా ఉండాలి. ♦ పంటి, చిగుళ్ల సమస్యలు కూడా వచ్చే అవకాశాలన్నాయంటే నమ్ముతారా? తీవ్ర చిగుళ్ల సమస్యలు కూడా తలెత్తవచ్చు. ♦ న్యూమోనియా వంటి బ్యాక్టీరి కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చివరిగా మరోమాట ఇలాంటి వేవీ గమనించకుండా తొందరపడితే దద్దుర్లు, ముఖం వాపు, శ్వాస ఆడకపోవడం, ఒక్కోసారి వాంతులు కూడా సంభవించవచ్చు. -
వేసవిలో మజ్జిగ తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
వేసవి కాలంలో ఎండల ప్రతాపాన్ని తట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మధ్యాహ్నం ఎండలో సాధారణంగా బయటికి రాకుండా ఉండటంమంచిది. అలాగే ఎక్కువ నీళ్లు తాగాలి. వేసవి తాపం నుండి సేదదీరేందుకు చల్లని పానీయాలను తీసుకోవాలి. ఈ విషయంలో మజ్జిగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పైగా కాస్త చవగా అందరికీ అందుబాటులో ఉండేది కూడా. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలను ఓ సారి చూద్దాం! ► అద్భుతమైన ఆరోగ్య , సౌందర్య ప్రయోజనాల గని మజ్జిగ. వేసవిలో చల్లచల్లగా మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. అధిక ఉష్ణంనుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటారు. ► పల్చటి మజ్జిగలో నిమ్మకాయ,కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, కాస్తంత కొత్తమీర, పుదీనా కలుపుకుని తాగితే మరీ మంచిది. రుచికీ రుచీ తగులుతుంది. వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. ► మజ్జిగ వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలతో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ► ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణసమస్యలు పోతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. సౌందర్య పోషణలో ►చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. వేసవిలో వేధించే చెమట పొక్కుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ►మజ్జిగలో పెద్ద మొత్తంలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ (AHA) చర్మాన్ని మృదువుగా , ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది, చర్మంపై నల్ల మచ్చలు , టాన్డ్ ప్యాచ్‌లకు సహజ పరిష్కారంగా పనిచేస్తుంది. ► కాల్షియం లోపం ఉన్న వారు మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. ఫలితంగా ఎముకలు, దంతాలు ధృడంగా మారుతాయి. ► కాల్షియం, విటమిన్స్ , ఇతరపోషక విలువల కారణంగా మజ్జిక కొన్ని రకాల జబ్బులను నివారిస్తుంది. -
లోటస్ సీడ్స్ : అస్సలు తక్కువ అంచనా వేయొద్దు!
లోటస్ లేదా తామర అనేది నెలంబో జాతికి చెందిన మొక్క. దీని గింజలను లోటస్ సీడ్స్, తామర గింజలు, మఖానా (ఫాక్స్‌నట్స్) అంటారు. సుమారు 7000 సంవత్సరాలుగా దీన్ని పూజల్లోనే ఔషధంగా కూడా ఉపయోగ పడుతోంది. ఒక విధంగా బాదం, జీడిపప్పు , ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు. ఎండ బెట్టిన తామర గింజలను మంచి పోషకాహారం, ఔషధంగా వినియోగిస్తున్నారు. ఒకటి తెల్ల, రెండు గోధుమ రంగులో ఉన్న లోటస్ విత్తనాలు భారతదేశం, జపాన్ , చైనాలలో విస్తృతంగా సాగవుతున్నాయి.లోటస్ ఫుడ్‌ను ఆహారంగా చైనా ఆమోదించింది. లోటస్ గింజలు తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో నిండి ఉంటాయి. తామర గింజల వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం ♦ నిద్రలేమి, జ్వరం ,హృదయ సంబంధ వ్యాధులతో సహా వివిధ వ్యాధుల చికిత్సకు సాంప్రదాయకంగా తామర గింజలను ఉపయోగిస్తారు. ♦ లోటస్ గింజలు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటిట్యూమర్ ఎఫెక్ట్‌లతో సహా వివిధ ఔషధ కార్యకలాపాలను కలిగి ఉంటాయి. ♦ విరేచనాలు ,విరేచనాలు వంటి జీర్ణశయాంతర రుగ్మతలకు చికిత్స చేయడానికి సాంప్రదాయ వైద్యంలో తామర గింజలు వాడతారు. ♦ సంతానోత్పత్తి , లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సాంప్రదాయ వైద్యంలో తామర గింజలు వాడతారు. ♦ మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను మాడ్యులేట్ చేసే యాంటీ-డిప్రెసెంట్ లక్షణాలున్నాయి. ♦ ఆయుర్వేదం ప్రకారం మధుమేహం ఇతర వ్యాధుల నుండి రక్షిస్తుంది. అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించగలదు. ♦ తేలికగా బరువు తగ్గాలనుకునే వారు లోటస్ సీడ్స్‌ను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ♦ తామర పువ్వు వేర్లలో అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ♦ విటమిన్ సి, ఐరన్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ,ఐరన్ ఫైబర్ కూడా అధిక మోతాదులో లభిస్తాయి. ♦ 100 గ్రాముల మఖానాలో, 9.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ♦ లోటస్ సీడ్స్ లేదా ఫాక్స్ నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. సో ఇది యాంటి ఏజింగ్ ఎలిమెంట్‌గా పనిచేస్తుంది. ♦ తామర గింజల్లో కెంప్ఫెరోల్ అనే సహజ సమ్మేళనం ఆర్థరైటిస్ రుమాటిజం రోగుల్లో వాపులను నివారిస్తుంది. కీళ్లనొప్పులతో బాధపడే రోగులకు ఇది మంచిది. ♦ గ్లూటెన్ రహిత పదార్తాలకు ప్రత్యామ్నాయంగా మఖానాను తినవచ్చు. -
కొలెస్ట్రాల్ నియంత్రణలోకి రావడం లేదా? ఇలా ట్రై చేయండి!
ఊబకాయం, లేదా ఒబెసిటీ అనేక రోగాలకు మూలం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తు తాయి. అందుకే వయసు, ఎత్తుకు తగ్గట్టు బరువును, కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడం చాలా అవసరం. అయితే వెయిట్ లాజ్ జర్నీ అనుకున్నంత ఈజీకాదు. దీనికి పట్టుదల, జీవన శైలి మార్పులు, తగిన వ్యాయామం తప్పనిసరి. ఈ క్రమంలో చెడు కొలెస్ట్రాల్‌కి చెక్ చెప్పే కొన్ని సహజమైన జ్యూసెస్ గురించి తెలుసుకుందాం. కరివేపాకు: ప్రతి వంటలోనూ కరివేపాకును ఉపయోగించడం మనకు బాగా అలవాటు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కరివేపాకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్పెరగడానికి దోహదపడతాయి. ప్రతిరోజూ కరివేపాకు రాసం తాగడం వల్లన కొలెస్ట్రాల్ నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రసం తయారుచేసుకునే ముందు, ఆకులను శుభ్రంగా కడగాలి. చీడపీడలు లేని ఆకులను తీసుకోవాలి. కొత్తిమీర: వంటలకు మంచి రుచిని, సువాసనను అందించడంలో కొత్తిమీర తరువాతే ఏదైనా. ఆహారం రుచిని మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్యను నయం చేసుకోవచ్చు. కొత్తిమీర ఆకులను సలాడ్‌లో చేర్చుకోవచ్చు. కొత్తిమీర రసం రక్త వృద్ధికి బాగా పనిచేస్తుంది. నేరేడు ఆకులు : మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో నేరేడు పళ్లు, గింజలు బాగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో కూడా ఇది బేషుగ్గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్ ఆంథోసైనిన్ వంటి లక్షణాలు వీటిల్లో మెండుగా ఉన్నాయి. ఇదిసిరల్లోపేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి పని చేస్తుంది. జామున్ ఆకులను శుభ్రంగా ఎండ బెట్టి పొడి రూపంలో తీసుకోవచ్చు. లేదా టీ లేదా డికాషన్ తయారు చేసి రోజుకు 1-2 సార్లు త్రాగవచ్చు. మెంతి ఆకులు: మెంతి కూరలో చాలా ఔషధ గుణాలున్నాయి. ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మెంతి ఆకులను తినవచ్చు. జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ఊబకాయం లాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. తులసి ఆకులు : తులసి పవిత్రమైందిగా భావిస్తాం. దీని ఆకులు, జలుబు, గొంతు నొప్పినివారణలో బాగా పనిచేస్తుంది. అలాఏగ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో తులసి ఆకులు చాలా ప్రయోజనకరం. జీవక్రియ ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులను శుభ్రంగా కడిగి తింటే నోటికి, ఒంటికి కూడా చాలా మంచిది. అలోవెరా: కలబందప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌందర్యపోషణలో, ఆరోగ్య రక్షణలోనూ ఇది చక్కటి ఔషధం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అలోవెరా గుజ్జును తీసుకుంటే కొలెస్ట్రాల్ మాయమైపోతుంది. శరీరంలోని ఇతర అనారోగ్యాలకు కూడా ఇది దివ్యౌషధం. పైన పేర్కొన్న వాటి అన్నింటిలో కావాలంటే కొత్తిగా తేనెను యాడ్ చేసుకోవచ్చు. నోట్: ఈ సూచనలు అన్నీ అవగాహన కోసం మాత్రమే. వైద్యులు, ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
Ugadi 2024: ఉగాది పచ్చడి ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
#Ugadi 2024 తెలుగువారి తొలి పండుగ ఉగాది అంటేనే ఆనందం. ఉత్సాహం. కొత్తకు నాంది అనే సంబరం. ముఖ్యంగా ఉగాది అనగానే తీపి, చేదు, లాంటి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి అందరికీ గుర్తొస్తుంది. ప్రతి పదార్ధం జీవితంలోని విభిన్న అనుభవాలకు గుర్తుగా అమృతం లాంటి జీవితాన్ని ఆస్వాదించే కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఉగాది పచ్చడికి అంత ప్రాధాన్యత. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్తగా ఆరంభించ డానికి ఇది శుభతరుణమని భావిస్తారు. ఉగాదికి పులిహోర, బొబ్బట్లు, పూర్ణం బూరెలతోపాటు ఉగాది పచ్చడి చేయడం అనవాయితీ. అయితే ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చడి ఇలా.. పచ్చి మామిడికాయ – ఒకటి (మీడియం సైజు) వేప పువ్వు – టేబుల్ స్పూన్ (తొడిమలు ఒలిచినది) కొత్త చింతపండు – నిమ్మకాయంత (రసం చిక్కగా తీసుకోవాలి) బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు ఉప్పు – పావు టీ స్పూన్ మిరియాలు లేదా మిరియాల పొడి అర టీ స్పూన్ లేదా రెండు చిన్న పచ్చిమిర్చి తయారీ: పచ్చి మామిడి కాయను శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండా సన్నగా ముక్కలు తరగాలి. ఇందులో వేప పువ్వు, చింతపండు రసం, బెల్లం తురుము, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలపాలి. షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ. రుచి కోసం టేబుల్ స్పూన్ కొబ్బరి కోరు, ఒక అరటి పండు గుజ్జు కూడా కలుపుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ ఉగాది పచ్చడి.స్పూన్‌తో అరచేతిలో వేసుకుని తినేటట్లు చిక్కగా ఉంటుంది. తెలంగాణలో తెలంగాణలో ఇదే మోతాదులో తీసుకున్న దినుసులను ఒక పెద్ద పాత్రలో వేసి ముప్పావు వంతు నీటిని పోసి కలపాలి. గ్లాసులో పోసి తాగేటట్లు జారుడుగా ఉంటుంది. పిల్లలు మెచ్చేలా..! ఉగాది పచ్చడి ప్రాశస్త్యాన్ని పిల్లలకు చెబుతూనే , వారికి నచ్చే విధంగా ఉగాది పచ్చడిని ఫ్రూట్ సలాడ్‌లా కూడా చేసుకోవచ్చు. ఉగాది పచ్చడిలో వేసే ఆరు రకాల పదార్థాలతో సంప్రదాయ బద్ధంగా ఉగాది పచ్చడిని చేసుకొని, అందులోనే అరటిపండు, యాపిల్, ద్రాక్ష చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కలుపుకోవచ్చు. దీనికి కొద్దిగా తేనెను కూడా యాడ్ చేసుకుంటే మరీ జారుగా కాకుండా, చక్కగా స్పూన్‌తో తినేలా ఫ్రూట్ సలాడ్‌లా భలేగా ఉంటుంది. పిల్లలు కూడా ఇంట్రస్టింగ్‌గా తింటారు. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మన అందరి జీవితాల్లో శాంతిని, సుఖ సంతోషాలను కలగ చేయాలని, అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుందాం.! -
Ugadi 2024 అచ్చంగా ఆరు : జీవితానికి ఎన్నో లాభాలు
త్వరలో ఉగాది వస్తోంది. ఆరు రుచులున్న ఉగాది పచ్చడిని ఈ రోజు తప్పనిసరిగా సేవించడం ఈ పండగ ఆచారం. ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి సేవిస్తే ఆయా రుచుల్లాగే సంవత్సరమంతా మనకు ఆయా ఫలాలు అందుతాయని, అలా రకరకాల అనుభవాలూ, అనుభూతులను ఆస్వాదించడమే జీవితమని పెద్దలు చెబుతారు. అయితే అలా కేవలం ఉగాది నాడు మాత్రమే కాదు, వీలయితే ప్రతిరోజూ ఆరు రుచుల ఆహారాలను తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఏయే రుచులు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. 1. తీపి శరీరంలోని వాత, పిత్త దోషాలను ఈ రుచి సమం చేస్తుంది. తీపి పదార్థాలను తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, శరీరం దృఢంగా మారుతుంది. శక్తి అందుతుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. అయితే వీటిని చాలా తక్కువగా తినాలి. లేదంటే శరీరంలో కఫ దోషం పెరుగుతుంది. ఫలితంగా అధిక బరువు, స్థూలకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి. కనుక ఈ రుచి ఉన్న ఆహారాలను నిత్యం తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగాఉండవచ్చు . 2. పులుపు వాత దోషాలను పులుపు తగ్గిస్తుంది. పులుపు రుచి ఉన్న ఆహారాలను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. నిమ్మ, చింతకాయ వంటి పులుపు ఉన్న ఆహారాలను నిత్యం పరిమితంగా తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. కనక పులుపు ఆహారాలను కూడా తక్కువగా తీసుకోవాలి. 3. ఉప్పు ఉప్పు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల వాత దోషం తగ్గుతుంది. ఉప్పు అధికమైతే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. ఉప్పు ఉన్న ఆహారాల వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. కణాలు శుభ్రమవుతాయి. ఉప్పు ఉన్న పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. 4. కారం కారపు రుచి గల ఆహారాలను తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఆకలి వేస్తుంది. కణాలు శుభ్రమవుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. కఫ దోషం తగ్గుతుంది. కారం ఎక్కువైతే పిత్తదోషం పెరుగుతుంది. అందువల్ల కారాన్ని నిత్యం తక్కువగానే తీసుకోవాలి. 5. చేదు చేదుగా ఉన్న పదార్థాలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. పిత్త, కఫ దోషాలు తగ్గుతాయి. చేదుగా ఉన్న పదార్థాలను నిత్యం కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకున్నా పెద్దగా సమస్యలు ఉత్పన్నం కావు. 6. వగరు వగరు ఉన్న పదార్థాలను కూడా నిత్యం తినాలి. కానీ వీటిని తక్కువగా తీసుకోవాలి. లేదంటే జీర్ణాశయంలో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక పిత్త దోషం ఉన్న వారికి ఈ రుచి ఉన్న పదార్థాలు ఎంతగానో మేలు చేస్తాయి. పచ్చి అరటి పండ్లు, క్రాన్ బెర్రీలు, గ్రీన్ బీన్స్ వంటివి ఈ రుచి ఉన్న పదార్థాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే భోజనం చేసేటప్పుడు ఒకేసారి ఆరు రుచులు కలిసిన పదార్థాలను తినాల్సిన పనిలేదు. రోజులో మొత్తంగా చూసుకుంటే ఈ ఆరు రుచులు ఉన్న పదార్థాలను తిన్నామా లేదో అని చెక్ చేసుకుంటే చాలు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో ఈ ఆరు రుచుల నుంచి ఏవైనా రెండు రుచులు కలిగిన ఆహారాలను ఎంచుకుని తింటే చాలు. అంటే ఉదయం చేదు, కారం, మధ్యాహ్నం తీపి, వగరు, రాత్రి పులుపు, ఉప్పు.. ఇలా రెండేసి రుచులు ఉండేలా ఆహారాలను తీసుకుంటే చాలు. ఇవే తినాలని ఏమీ లేదు. ఎవరికి నచ్చినట్లు వారు ఆహారాలను ఎంచుకుని ఆరు రుచులు కవర్ అయ్యేలా చూసుకుంటే చాలు. -
త్వరగా బిడ్డ పుట్టాలంటే.. ఈ ఆహారం ట్రై చేయండి!
మన అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో పెళ్లి అయిన ఏడాదిలోపు బిడ్డ కడుపున పడాలని కోరుకునేవారు. సాధారణంగా అలా జరిగేది కూడా. కానీ మారిన పరిస్థితులు, ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చాలామందిలో సంతానోత్పత్తి పెద్ద సమస్యగా మారింది. లైఫ్‌స్టయిల్, చేస్తున్న ఉద్యోగాలు తదితర కారణాల రీత్యా పిల్లలు పుట్టడం ఆలస్యమవుతోంది. అయితే చక్కటి లైంగిక జీవితంతోపాటు, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టడం అవసరం. కొన్ని ఆహారాలు సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం.. తల్లి కావాలనుకునే మహిళలకు పోషకాలు, ఫోలిక్‌యాసిడ్,ఫోలేట్, కాల్షియం ఐరన్ పుష్కలంగా కావాలి. శరీరంలో ఐరన్ లోపం సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఆకు కూరలు తినడం వల్ల పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. పాలకూర, తోటకూర, బచ్చలికూర, బ్రోకలీ, బోక్ చోయ్, కొత్తిమీర ఎక్కువగా తీసుకోవాలి. వీటిని ఆలివ్ నూనెలో వేయించుకుని, సైడ్ డిష్‌గా తినండి లేదా సూప్‌లు, సలాడ్లు, క్యాస్రోల్స్ మరియు ఆమ్లెట్లలో యాడ్ చేసుకోవాలి. కాల్షియం పునరుత్పత్తి వ్యవస్థ సజావుగా పని చేసేలా చేస్తుంది. వేగంగా గర్భం దాల్చడానికి కూడా సహాయపడుతుంది. అలాగే పుట్టబోయే బిడ్డకు అవసరమైన కాల్షియం నిల్వలు పెరుగుతాయి. సంతానోత్పత్తి స్థాయిని పెంచడానికి, మహిళలు తమ ఆహారంలో ఆకుకూరలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ "బి", ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది స్త్రీల సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, విటమిన్ "సి" సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. బీన్స్‌లో లీన్ ప్రొటీన్ అండ్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మహిళల సంతానోత్పత్తిని పెంచుతుంది. శరీరంలో ఐరన్ లోపం సంతానోత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ బీ6 ఇందులో తగినంత పరిమాణంల ఉంటాయి.సంతానోత్పత్తి హార్మోన్లను పెంచడంలో అరటిపండు కీలక పాత్ర పోషిస్తుంది. డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ త్వరగా గర్భం దాల్చడానికి తోడ్పడతాయి. విటమిన్ "సి" పుష్కలంగా ఉండే పండ్లను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు, సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. నోట్: పిల్లలు పుట్టాలంటే దంపతుల ఆరోగ్యం చాలా ముఖ్యం. పీరియడ్ సైకిల్‌ను, ఓవులేషన్ పీరియడ్‌ను సరిగ్గా అర్థం చేసుకోని ఆ సమయానికి శారీరక కలయిక చాలా కీలకం. ఒక వేళపిల్లలు పుట్టడం లేట్ అయితే.. నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. మహిళలైతే గర్భసంచిలో, ఫాలోపియన్ ట్యూబ్స్‌లో అడ్డంకులను గైనకాలజిస్ట్ అంచనా వేస్తారు. పురుషుల్లో అయితే వీర్య కణాలు, వాటి కదలికలు, సామర్థ్య పరీక్షలుంటాయి. అలాగే సహజంగా పిల్లలు కలగరు అని తెలిసినా ఆందోళన అనవసరం. ఇపుడు అనేక ఆధునిక సాంకేతికలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు మనం పెద్ద మనసు చేసుకోవాలేగానీ ఆదరించే ఆమ్మానాన్నల కోసం అనాథ పసి బిడ్డలు చాలామంది వేచి ఉన్నారనేది గుర్తుంచుకోవాలి! -
ఎల్లో అలర్ట్: ఈ పనులు అస్సలు చేయకండి!
వేసవి కాలం అన్నాక ఎండలు సాధారణమే కదా అని లైట్ తీసుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. మండే ఎండలు, తీవ్రమైన ఉష్ట్రోగ్రతలనుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. తెలంగాణాలో ఉష్ణోగ్రతలు 43°Cకి పెరగడంతో తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణ విభాగం-హైదరాబాద్ (IMD-H) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నేడు రేపు వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వేసవి తాపానికి తట్టుకొని నిలబడే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. ఈ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. Serious heat continues for 7th straight day 🔥🥵 More 3days to suffer, later we will move into pre monsoon rains, respite from heat from Apr 7 From Apr 6 itself storms will start, North, Central TG to get good storms in coming week 🌧️ One spell ahead in HYD during April 6-9 🌧️ pic.twitter.com/7KXOjnGQof — Telangana Weatherman (@balaji25_t) April 4, 2024 కనీస జాగ్రత్తలు వాతావరణానికి తగ్గట్టుగానే సహజం మన బాడీకూడా రియాక్ట్ అవుతుంది. ఎండకు దాహం వేస్తుంది. చల్లదనాన్ని కోరుకుంటుంది. కానీ వేసవిలో దాహం వేయకపోయినా, వీలైనంత వరకు నీరు తాగుతూ ఉండాలి. ఏ కాస్త అనారోగ్యంగా అనిపించినా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS)ని తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్ళు, చెరుకు రసంలో సహజ ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటాయి కనుక శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. ప్రత్యేకించి ఎండకు బాగా అలసి పోయినప్పుడు బాగా పనిచేస్తుంది. అలాగే ఉప్పు కలిపి నిమ్మరసం, మజ్జిగ/లస్సీ, పండ్ల రసాలు తీసుకోవాలి. ఇంట్లోనే తయారుచేసిన పానీయాలైతే ఇంకా మంచిది. తొందరగా వంట ముఖ్యంగా ఈ వేసవికాలంలో వంట ఎంత తొందరగా పూర్తి చేసుకొని అంత తొందరగా బయటపడితే మంచిది. లేదంటే ఆ వేడికి, ఉక్క బోతకు చెప్పలేనంత నీరసం వస్తుంది. దాదాపు 10 గంటలలోపు వంట ఇంటి నుంచి బయపడాలి. బాగా వెంటిలేషన్ ,చల్లని ప్రదేశాలలో ఉండండి. సాధ్యమైనంతవరకు ఎండకు బయటికి వెళ్లకుండా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు. మరీ తప్పనిసరి అయితే తప్ప బయటికి రావద్దు. ఒక వేళ వెళితే ఉదయం 12 గంటల లోపు, సాయంత్రం 4 గంటల తరువాత బైటి పనులకు సమయాన్ని కేటాయించుకోవాలి. ఎండలో బయటి వెళ్లి..తిరిగి వచ్చిన వెంటనే హడావిడిగా నీళ్లు తాగవద్దు.. కాస్త నెమ్మదించి, మెల్లిగా నీటిని తాగండి. అలాగే మరీ చల్లని నీళ్లను కూడా తాగకూడదు. ఆహారం పుచ్చకాయ, తర్బూజ నారింజ, ద్రాక్ష, పైనాపిల్ లాంటి పండ్లతోపాటు, నీరు ఎక్కువగా ఉండే అన్ని రకాల ఆకు కూరలు, దోసకాయ, బీరకాయ, సొరకాయ, గుమ్మడి, టమాటా లాంటి కూరగాయలు తీసుకోవాలి. వేపుళ్లు, మసాలాల వాడకాన్ని కూడా తగ్గించాలి. పగటిపూట కిటికీలు , కర్టెన్లను మూసి వేయాలి. రాత్రికి చల్ల గాలికి తెరిచి పెట్టండి. దోమలు రాకుండా దోమలు తెరలు తప్పనిసరి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు మర్చిపోకూడదు. సన్నని వదులుగా ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది. ఎండనుంచి కాపాడుకునేలా తలను టవల్ , స్కార్ప్, టోపీ, చున్నీతో కప్పుకోవాలి. ఈ పనులు మానుకోండి ♦ ముఖ్యంగా మధ్యాహ్నం 12:00 నుండి 03:00 గంటల మధ్య ఎండలో బయటికి రావద్దు. ♦ ఎండ ఎక్కువ ఉన్న సమయంలో బాగా ఎక్కువ కష్టపడవద్దు. కాసేపు నీడ పట్టున ఉండి విశ్రంతి తీసుకోండి. ♦ చెప్పులు, గొడుగు లేకుండా బయటకు వెళ్లవద్దు. ♦ ఆల్కహాల్, టీ, కాఫీ , కార్బోనేటేడ్ శీతల పానీయాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. ♦ ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని, మాంసాహారాన్ని మితంగా వాడండి. నిల్వ ఉన్న ఆహారాన్ని అస్సలు తినకూడదు ♦ పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను, పెంపుడు జంతువులను వదిలి వెళ్లవద్దు. ఇలా చేయడం వేడికి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అప్రమత్తత విపరీతమైన తలనొప్పి, జ్వరం, నీరసం, వాంతులు, విరోచనలు, గందరగోళం, మూర్చ, కోమా లాంటి సమస్యలను కనిపిస్తే వెంటనే సమయంలోని వైద్యులను సంప్రదించండి. ఎవరు మరింత అప్రమత్తంగా ఉండాలి ఆరుబయట పనిచేసే వ్యక్తులు; గర్భిణీ స్త్రీలు; మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు; శారీరకంగా అనారోగ్యం ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు,వృద్ధులను కుటుంబ సభ్యులు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. -
అరటి పండు, పాలు కలిపితే అద్భుతం.. కానీ వీళ్లు జాగ్రత్త..!
అరటి పండు మంచి బలవర్ధకమైన ఆహారం. ముఖ్యంగా ఎదిగే ప్లిలలకు, తొందరగా శక్తిని పుంజుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. పాలుపౌష్టికాహారం. మరి అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈరెండూ కలిపి తీసుకోవడం వల్ల ఏమైనా నష్టాలున్నాయా అన్నది కూడా ప్రశ్న. ఈ మిల్క్ షేక్నుఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోకూడదు.. ఒకసారి చూద్దాం. వేసవి కాలం వచ్చిందంటే..పిల్లలకు ఆటవిడుపు. పరీక్షలు అయిపోయిన తరువాత ఇంట్లోనే ఉంటారు. ఏదో ఒకటి వెరైటీగా చేసిపెట్టమని అడుగుతూ ఉంటారు. సాయంత్రం అయితే చాలు ‘‘ఠండా..ఠండాగా కావాలి’’ అంటూ ప్రాణం తీస్తారు. ఈ క్రమంలో సులభంగా చేసుకోగలిగేది బనానా మిల్క్ షేక్ లేదా బనానా మిల్క్ స్మూతీ. రెండు బాగా పండిన అరటిపండ్లు, కప్పు పాలు వేసి మిక్సీలో వేసి, జ్యూస్ చేయాలి. దీనికి ఓ రెండు ఐస్‌ముక్కలు, కాస్తంత హార్లిక్స్.. డ్రైఫ్రూట్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్లకి పైన బాదం జీడిపప్పు అలంకరించి ఇస్తే సరిపోతుంది. ఇష్టంగా తాగుతారు. మంచిపౌష్టికాహారం అందుతుంది. అరటిపండు, పాలతో కలిపిన జ్యూస్ పొటాషియం, డైటరీ ఫైబర్, కాల్షియం, ప్రోటీన్లతో నిండి ఉంటుంది. మిల్క్ ప్రొటీన్ కంటెంట్ పుష్కలంగా ఉన్నందున, ఎముకల ఆరోగ్యానికి చాలామంచిది. ఒక సాధారణ సైజు అరటిపండు 105 కేలరీలను అందిస్తుంది . అలాగు ఒక కప్పు పాల ద్వారా 150 కేలరీలు లభిస్తాయి. అంటే దాదాపు ఒక రోజుకు ఒక మనిషికి ఇవి సరిపోతాయి. బరువు పెరగాలనుకునేవారికి చాలా మంచిది. పాలలో బరువు పెరగడానికి అవసరమైన ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు కండరాలు, ఎముకలను బలిష్టం చేస్తాయి. అరటిపండు , మిల్క్ డైట్‌తో బరువు పెరగాలనుకుంటే, బనానా మిల్క్ స్మూతీకి ప్రోటీన్-రిచ్ ఐటమ్‌లను యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫ్లాక్స్ సీడ్స్, నట్స్, ప్రొటీన్ పౌడర్లు, చియా సీడ్స్ ఉన్నాయి. ఇంకా కోకో పౌడర్ లేదా చాక్లెట్ సిరప్ కూడా కలుపుకోవచ్చు. అలాగే బరువుతగ్గాలనకునేవారికి ఇది మంచిటిప్. పొట్టనిండినట్టుగా ఉండి తొందరగా ఆకలి వేయదు. అయితే ఆయుర్వేద ఆహార సూత్రాల ప్రకారం పాల, అరటిపండ్లు కలపితే విరుద్ధమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. పాలు, అరటిపండ్లు కలిపి తినడం ఆస్తమా రోగులకు అస్సలు మంచిది కాదని చెబుతోంది. ఎందుకంటే రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శ్లేష్మం, దగ్గు, ఆస్తమా సమస్యలు తీవ్రమవుతాయి. ఎవరు దూరంగా ఉండాలి? ♦ అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తినకుండా ఉండటమే మంచిది. అలర్జీ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లు, పాలకు కూడా దూరంగా ఉండాలి. ♦ సైనసైటిస్‌తో బాధపడేవారు పాలు లేదా అరటిపండ్లు కలిపి తీసుకుంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. శరీరంలో టాక్సిన్ ఉత్పత్తిని పెంచుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ♦ పాలు, అరటిపండ్లు కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రాకుండా ఉండేందుకు రోజువారీ ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. సమస్య ఉన్నవాళ్లు అరటిపళ్లు,పాలను విడివిడిగా తీసుకోవచ్చు. -
వెల్లుల్లితో మొటిమలు మటుమాయం? నిపుణులు ఏమంటున్నారు?
వెల్లుల్లి గురించి దాదాపు తెలియని వారుండరు. మరో విధంగా చెప్పాలంటే వెల్లుల్లి లేని మసాలా వంట ఉండదు. కొంతమందికి వెల్లుల్లి వానస నచ్చనప్పటికీ, అల్లంవెల్లుల్లి మిశ్రమం వేసిన తరువాత ఏ రెసిపీ అయినా రుచి రెట్టింపు అవ్వడమేకాదు వాసన కూడా ఘుమ ఘమ లాడాల్సిందే. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే సౌందర్య పోషణగా కూడా పనిచేస్తుందంటారు. మరి ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని: ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల, మధుమేహం, బీపీ నియంత్రణలో ఉంటాయి. శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది.అందేకాదు ఇది చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి మంచి ఉపశమనంగా పనిచేస్తుంది.వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది.వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఖాళీ కడుపుతో నాలుగు వెల్లుల్లి రెబ్బలు తినటం వల్ల మధుమేహాన్ని నయం చేస్తుంది. అలాగే రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే బరువు తగ్గవచ్చట. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతారు. కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మ్యాజిక్ క్యూర్పచ్చి వెల్లుల్లి మోటిమలకు మ్యాజిక్ క్యూర్‌గా పనిచేస్తుందని ఇటీవల ఒక .బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్‌స్టా వీడియో వైరల్ అయిందితన 'రాత్రిపూట చర్మ సంరక్షణ దినచర్య'లో భాగంగా పచ్చి వెల్లుల్లి రెబ్బను తీసుకొని నేరుగా తీసుకుంది. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం చాలా మొండి సిస్టిక్ మొటిమలకు కూడాపనిచేస్తుందని కొంతమంది పేర్కొన్నారు. కొంతమంది కూడా సానుకూలంగా స్పందించగా మరికొందరు మాత్రం తమ సమస్యమరింత ఎక్కువైందని కమెంట్ చేయడం గమనార్హం.నిపుణుల మాట► వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ , క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి.► వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ మొటిమలకుకారణమైన బ్యాక్టీరియాను (ప్రొపియోనిబాక్టీరియం) నిరోధిస్తుంది► రక్త ప్రసరణను మెరుగుపరిచే లక్షణంగా కారణంగా, సేబాషియస్ గ్రంధి, వెంట్రుకల కుదుళ్లలో అనేక అడ్డుపడే పదార్థాలు క్లియర్ అవుతాయి.►వెల్లుల్లిలో జింక్,ఇతర విటమిన్లు ,ఖనిజాలు కూడా ఉన్నాయి. జింక్ మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.►వెల్లుల్లిలోని థియోసల్ఫేట్లు (సల్ఫర్ సమ్మేళనం) యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.నోట్ : ఇది పలువురు నిపుణుల, రిపోర్టులు ఆధారిత కథనం మాత్రమే. ఈ చిట్కాలు కొందరిలో ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య తలెత్తినా వైద్యులను సంప్రదించడం మేలు. -
సమ్మర్ : ఈ జాగ్రత్తలు మర్చిపోతున్నారా?
ఏప్రిల్ మాసంలోకి ఎంటరై పోయాం. మండే ఎండలకు సిద్ధం కావాలి. రాబోయే రోజుల్లో వేసవి తాపం గురించి వాతావరణ నిపుణులు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వసవిలోత తాపానికి తట్టుకొని నిలబడే ఆహారాన్ని తీసుకుంటూ,దానికి తగినట్టుగా జీవన శైలిని మార్చుకోవాలి.ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేలా, బాడీ చల్లగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. వేసవిలో మాంసాహారాన్ని తగ్గించుకుంటే మంచింది. దీనికి బదులుగా తేలికగా జీర్ణమయ్యే తాజా కూరగాయలను ఎక్కువగా తినాలి.తాజా కూరలు, పళ్లుకూరగాయల్లో అన్ని రకాల ఆకు కూరలతోపాటు, దోసకాయ, కీరా, బీరకాయ, గుమ్మడి, టమాటా, బెండ, లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక ఫ్రూట్స్‌లో పుచ్చకాయ, జామ, పైనాపిల్, దానిమ్మ, ఇతర సిట్రస్ పండ్లు కొవ్వు పదార్ధాలను విచ్ఛిన్నం చేస్తాయి, జీర్ణక్రియకు సహాయ పడతాయి. అలాగే బాడీకి చల్లదనాన్నిస్తాయి. నిమ్మ, పుదీనా - చల్లదానికి నిమ్మ పుదీనా చాలా మంచిది. ఈరెండూ కలిస్తే ఏ పానీయమైనా రిఫ్రెష్ అయిపోతుంది. కొబ్బరి నీళ్ళు,మజ్జిగ : వేసవిలో ఎంత నీరు తాగితే అంత మంచిది. కొబ్బరి నీళ్లు సహజ ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ప్రత్యేకించి ఎండకు బాగా అలసిపోయినప్పుడు బాగా పనిచేస్తుంది.ఉల్లిపాయలు - ఉల్లిపాయలు చలవగా చాగాబాగా పని చేస్తాయి. వడదెబ్బ నుంచి ఉల్లిపాయలు కాపాడతాయని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే దీన్ని పచ్చిగా, రైతా, సలాడ్లు , చట్నీలలో వాడుకోవచ్చు.వేడిని పెంచే కొన్ని ఆహార పదార్థాలు వేరుశెనగ , క్యారెట్లు, గుడ్లు, మాంసాహారం లాంటి వాటిల్లో పోషకాలు అధికం కాబట్టి జీర్ణం కావడం లేటవుతుంది. వీటికి శరీరంలో వేడిని పెంచే శక్తి ఉందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అల్లం, వెల్లుల్లి, ఇతర మసారా దినుసులను బాగా తగ్గించాలి. యాంటీ ఆక్సిడెంట్లులో పుష్కలంగా ఉండే అల్లం, వెల్లుల్లి, శరీరంలో వేడిని పెంచుతాయి. గుండెమంట, అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలున్నవారు ఈ వేసవిలో జాగ్రత్తగా ఉంటే బెటర్. వేసవి వచ్చింది కదా అని పచ్చళ్లు తెగ తినేయకూడదు. కొత్త ఆవకాయ లాంటి పచ్చళ్లను మితంగా తీసుకోవాలి.ఇతర జాగ్రత్తలుమరీ అవసరం అయితే ఎండకు వెళ్లకుండా ఉండాలి. ఉదయం 12 తరువాత బయటికి వెళ్లవద్దు. సాయంత్రం పనులను 4 గంటల తరువాత ప్లాన్ చేసుకోవాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. గొడుగు, స్కార్ఫ్, తలపై కప్పుకోవాలి. లేదా టోపీ పెట్టుకోవాలి. వ్యాయామం చేసే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి.వెంట నీళ్ల బాటిల్ తీసుకుపోవాలి. ఒకవేళ ఎండకు వెళ్లి వచ్చిన తరువాత బాగా నలతగా, అలసటా అనిపించినా అప్రమత్తం కావాలి. తలనొప్పి, వాంతులు, విరోచనాలు లాంటి సమస్యలొస్తే.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలు, పెద్దల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. -
సమ్మర్ : ఈ జాగ్రత్తలు మర్చిపోతున్నారా?
ఏప్రిల్ మాసంలోకి ఎంటరై పోయాం. మండే ఎండలకు సిద్ధం కావాలి. రాబోయే రోజుల్లో వేసవి తాపం గురించి వాతావరణ నిపుణులు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వసవిలోత తాపానికి తట్టుకొని నిలబడే ఆహారాన్ని తీసుకుంటూ,దానికి తగినట్టుగా జీవన శైలిని మార్చుకోవాలి. ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేలా, బాడీ చల్లగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. వేసవిలో మాంసాహారాన్ని తగ్గించుకుంటే మంచింది. దీనికి బదులుగా తేలికగా జీర్ణమయ్యే తాజా కూరగాయలను ఎక్కువగా తినాలి. తాజా కూరలు, పళ్లు కూరగాయల్లో అన్ని రకాల ఆకు కూరలతోపాటు, దోసకాయ, కీరా, బీరకాయ, గుమ్మడి, టమాటా, బెండ, లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక ఫ్రూట్స్‌లో పుచ్చకాయ, జామ, పైనాపిల్, దానిమ్మ, ఇతర సిట్రస్ పండ్లు కొవ్వు పదార్ధాలను విచ్ఛిన్నం చేస్తాయి, జీర్ణక్రియకు సహాయ పడతాయి. అలాగే బాడీకి చల్లదనాన్నిస్తాయి. నిమ్మ, పుదీనా - చల్లదానికి నిమ్మ పుదీనా చాలా మంచిది. ఈరెండూ కలిస్తే ఏ పానీయమైనా రిఫ్రెష్ అయిపోతుంది. కొబ్బరి నీళ్ళు,మజ్జిగ : వేసవిలో ఎంత నీరు తాగితే అంత మంచిది. కొబ్బరి నీళ్లు సహజ ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ప్రత్యేకించి ఎండకు బాగా అలసిపోయినప్పుడు బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు - ఉల్లిపాయలు చలవగా చాగాబాగా పని చేస్తాయి. వడదెబ్బ నుంచి ఉల్లిపాయలు కాపాడతాయని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే దీన్ని పచ్చిగా, రైతా, సలాడ్లు , చట్నీలలో వాడుకోవచ్చు. వేడిని పెంచే కొన్ని ఆహార పదార్థాలు వేరుశెనగ , క్యారెట్లు, గుడ్లు, మాంసాహారం లాంటి వాటిల్లో పోషకాలు అధికం కాబట్టి జీర్ణం కావడం లేటవుతుంది. వీటికి శరీరంలో వేడిని పెంచే శక్తి ఉందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అల్లం, వెల్లుల్లి, ఇతర మసారా దినుసులను బాగా తగ్గించాలి. యాంటీ ఆక్సిడెంట్లులో పుష్కలంగా ఉండే అల్లం, వెల్లుల్లి, శరీరంలో వేడిని పెంచుతాయి. గుండెమంట, అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలున్నవారు ఈ వేసవిలో జాగ్రత్తగా ఉంటే బెటర్. వేసవి వచ్చింది కదా అని పచ్చళ్లు తెగ తినేయకూడదు. కొత్త ఆవకాయ లాంటి పచ్చళ్లను మితంగా తీసుకోవాలి. ఇతర జాగ్రత్తలు మరీ అవసరం అయితే ఎండకు వెళ్లకుండా ఉండాలి. ఉదయం 12 తరువాత బయటికి వెళ్లవద్దు. సాయంత్రం పనులను 4 గంటల తరువాత ప్లాన్ చేసుకోవాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. గొడుగు, స్కార్ఫ్, తలపై కప్పుకోవాలి. లేదా టోపీ పెట్టుకోవాలి. వ్యాయామం చేసే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వెంట నీళ్ల బాటిల్ తీసుకుపోవాలి. ఒకవేళ ఎండకు వెళ్లి వచ్చిన తరువాత బాగా నలతగా, అలసటా అనిపించినా అప్రమత్తం కావాలి. తలనొప్పి, వాంతులు, విరోచనాలు లాంటి సమస్యలొస్తే.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలు, పెద్దల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. -
సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు!
వేసవి ఎండలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎండల్ని తట్టుకునేలా మన జీవన శైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా మన శరీరానికి చల్లదనాన్ని, పోషకాలు అందించే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాంటి వాటిలో ప్రధానమైంది ఫర్మెంటెడ్ రైస్, లేదా పులియ బెట్టిన పెరుగున్నం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఒకసారి చూద్దాం.! పులియబెట్టినపెరుగన్నంతో ప్రయోజనాలు వేసవిలో పెరుగు అన్నం లేదా రాత్రంతా పెరుగులో పులియబెట్టిన అన్నం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో విటమిన్ సితో పాటు ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి పెరుగు అన్నంలోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తాయి. గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది ప్రయోజన కరంగా ఉంటుంది. కడుపులో చికాకు, అజీర్ణం లాంటి సమస్యలనుంచి ఉపశమనం కలుగుతుంది. కడుపులో కూలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఇది త్వరగా, సౌకర్యవంతంగా జీర్ణమవుతుంది. కాల్షియం, బీ12 విటమిన్ డీ, ప్రోటీన్‌తో సహా అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఎదుగుతున్న పిల్లల్లో బలమైన ఎముకలు ,దంతాలకు కాల్షియం చాలా అవసరం. పిల్లలు ఇది అలవాటు చేస్తే విటమిన్ డి కాల్షియం శోషణలో సహాయపడుతుంది. ఈ పెరుగు అన్నం ఎలా చేసుకోవాలి ప్రోబయాటిక్ పెరుగు అన్నం చేయడం చాలా సులభం. వండిన అన్నాన్ని కొంచెం వేడిగా ఉండగానే ఒక గిన్నె (మట్టి పాత్ర అయితే ఇంకా మంచిది) లోకి తీసుకోవాలి. ఇందులో పాలు పోసి తోడు పెట్టాలి. ఇష్టం ఉన్నవాళ్లు ఇందులో ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయానికి అదనపు పోషకాలతో చక్కగా పులిసి ఉంటుంది. దీన్ని తాలింపు వేసుకొని, కొద్దిగా కొత్తిమీర చల్లుకుని తినవచ్చు. టిప్: పచ్చిమిర్చి వేయకుండా నల్లద్రాక్ష, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు లాంటివి వేసి చక్కగా గార్నిష్ చేసి ఇస్లే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతేకాదు బోలెడన్ని పోషకాలు కూడా లభిస్తాయి. -
హెల్త్: నిద్రలేమి సమస్యా? అయితే ఇలా చేయండి!
ఆరోగ్యంగా ఉండటానికి సరైన తిండి, శరీరానికి తగిన వ్యాయామాలతో పాటు కంటినిండా నిద్ర కూడా అంతే అవసరం. అయితే కొంతమంది జీవన శైలి, మానసిక ఒత్తిడి కారణంగా సరిగా నిద్రపోవడం లేదు. అటువంటి వారు నిద్రమాత్రలకు బదులు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని పండ్లు తీసుకుంటే సరిపోతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా శరీరాన్ని రక్షించుకోవచ్చు. అరటి పండు.. నిద్రలేమితో బాధపడుతున్న వారు పడుకునే సమయంలో అరటిపండును తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో ఉండే గుణాలు శరీరంలోని ఒత్తిడిని సులభంగా తగ్గించి నిద్రను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈరోజు అరటి పండ్లతోపాటు చెర్రీలను కూడా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కొంతమంది తరచుగా నిద్ర పోయినట్లే పోయి మేల్కొంటారు. అయితే ఇలాంటివారు చెర్రీస్తో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రసాన్ని తాగడం వల్ల చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. నిద్రను మెరుగుపరిచేందుకు పైనాపిల్ జ్యూస్ ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి నిద్రలేని సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకోవాలి. పైనాపిల్‌లో మెలటోనిన్, విటమిన్ సి, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు దీనితో జ్యూస్‌ని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కివీ పండ్లు.. ద్ర సమస్యలతో బాధపడేవారు కివి పండ్లను కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే గుణాలు కూడా నిద్ర స్థాయులను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. యాపిల్.. యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ యాపిల్ తింటే వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. రాత్రి పూట తినడానికి యాపిల్ అనేది బెస్ట్ స్నాక్‌గా చెపొ్పచ్చు. రాత్రి ఆకలి వేస్తే ఎలాంటి సందేహం లేకుండా యాపిల్ తినండి. ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. నిద్ర అనేది బాగా పడుతుంది. బొప్పాయి.. బొప్పాయిలో విటమిన్ సి, ఇ, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు హాయిగా నిద్ర పోయేలా చేస్తాయి. నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు రాత్రి పూట బొప్పాయి తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇవి చదవండి: Summer Season: డీ హైడ్రేషన్‌తో ఇబ్బందా? నివారించండి ఇలా.. -
వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!
వేసవిలో బాడీని చల్లగా చేసే గోండ్ కటీరా గురించి విన్నారా? ఇది ఎడిబుల్ గమ్. దీని వలన ఆనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎముకలను బలంగా ఉంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శక్తిని పెంచుతుంది. గోండ్ కటీరా మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందామా..! గోండ్ కటీరా అనేది తినగలిగే గమ్. ఇది కిరాణా షాపుల్లో, ఆన్లైన్లో కూడా దొరుకు తుంది. వేసవిలో చల్లదనం కోసం దీన్ని తాగితే, చాలా లాభాలున్నాయి. గోధుమ బంక లేదా బాదాం బంక అనే పేర్లతో ప్రసిద్ధి. దీన్ని ఆస్ట్రాగాలస్ ప్రొపింకస్ అనే నాచు రకం మొక్కల వేర్ల నుంచి సేకరిస్తారు. ఇది పౌడర్ లేదా క్యాండీ రూపంలో లభిస్తుంది. గోండ్ కటీరా జ్యూస్ ముందుగా ఈ గమ్‌ను కొద్దిగా తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. దీంతో ఇది ఒక జెల్లాగా తయారవుతుంది. దీన్ని ఒక గ్లాస్లో తీసుకోవాలి. ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు, కొద్దిగా తరగిన పుదీనా వేసుకోండి. ఇక చివరగా కాస్తంత నిమ్మరసం కలుపుకొని, గ్లాసు నిండా నీళ్లు పోసుకొని చక్కగా తాగెయ్యడమే. కావాలంటే ఒకటి రెండు ఐస్‌క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. దీని పౌడర్‌ను పాలలో కలుపుకొని తాగటం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. గోండ్ కటీరా ఆరోగ్య ప్రయోజనాలు: ఆయుర్వేద వైద్యంలో దీన్ని విస్తృత ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. జిగురు లాంటి పదార్ధమైన గోండ్ కటిరా రుచికరమైంది ఇది అనేక పోషకాలతో నిండి ఉంది. అందుకే పంజాబ్‌లో రుచికరమైన గోండ్కే లడ్డూ, పిన్నియాన్ బాగా పాపులర్. ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువ. అందుకే ప్రేగు కదలికలను సులభంచేసి మలబద్ధకానికి మంచి ఉపశమనంగా పని చేస్తుంది. ఇందులో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో ప్రయోజనకరమైన సప్లిమెంట్‌గా పనిచేస్తుంది. తల్లి, పిండం ఇద్దరికీ ఆరోగ్యకర మైన ఎముకల అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాదు గర్భధారణ సమయంలో రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పోషకాలు అధికం కాబట్టి బాలింతల్లో పాలను వృద్ధి చేస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల మిశ్రమమైన ఇది శక్తిని పెంచుతుంది పునరుత్పత్తి ఆరోగ్యానికి మంచిది. పురుషులలో కొన్ని పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. మహిళల్లో పీరియడ్ సమస్యలకూ మంచింది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఇందులోని కరిగే ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ. అందుకే కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల పనితీరును మెరుగు పరుస్తుంది. -
రణపాలతో ఆరోగ్య ప్రయోజనాలు : పేరులోనే ఉంది అంతా!
ప్రకృతిలో వెదికి పట్టుకోవాలనే గానీ ఎన్నో ఔషధ మొక్కల నిలయం. సౌందర్య పోషణ దగ్గర్నించి, దీర్ఘకాల రోగా వలరు ఉన్నో ఔషధ గుణాలున్న మొక్కలు మన చుట్టూనే ఉన్నాయి. అలాంటి వాటిలో రణపాల ఒకటి. వాస్తవానికి రణపాల అలంకరణ మొక్కగా భావిస్తాం. కానీ ఆరోగ్య ప్రయోజనాలు కూడాచాలానే ఉన్నా యంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 వ్యాధులను నయం చేయగల శక్తి రణపాల మొక్కకి ఉంది. రణపాల శాస్త్రీయ నామం Bryophyllum pinnatum. దీని ఆకులు కాస్త మందంగా ఉంటాయి. రుచి కొద్దిగా వగరు, పులుపు సమ్మిళితంగా ఉంటుంది. ఆకు నాటడం ద్వారానే మరో మొక్కను అభివృద్ది చేసుకోవచ్చు. అంటే ఇంటి ఆవరణలో సులభంగా పెంచుకోవచ్చన్నమాట. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్ తోపాటు అనాఫీలాక్టిక్ గుణాలు రణపాలలో అధికంగా ఉన్నాయి రణపాల ప్రయోజనాలు ♦ ఆకు తినడం ద్వారా గానీ, కషాయం తయారు చేసి తీసుకోవడం ద్వారా, ఆకు పేస్ట్‌ను కట్టు కట్టడం ద్వారా గానీ చాల ఉపయోగాలను పొందవచ్చు. ♦ అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ♦ డయాబెటిస్ ని క్రమబద్దీకరిస్తుంది. ♦ కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ ఆకులను తింటే రక్తంలోని క్రియాటిన్ లెవల్స్ తగ్గుతాయి. ♦ జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్దకం సమస్యలను తగ్గించుకోవచ్చు ♦ ఆకులని వేడిచేసి గాయాలపై పెడితే గాయాలు త్వరగా మానుతాయి ♦ ఆకులని నూరి దాన్ని తలపై పట్టులా వేస్తే తల నొప్పి తగ్గుతుంది. ♦ రోజు ఈ ఆకుల్ని తినడం ద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల వెంట్రుకలు రావడం ఆగుతుందట ♦ ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ లక్షణాలు జలుబు, దగ్గు, విరేచనాలను నయం చేస్తాయి. ♦ మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన వారు తీసుకుంటే మంచిది. ♦ రణపాల ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలు తగ్గుతాయి. ♦ కామెర్లతో బాధపడేవారు రోజూ ఉదయం, సాయంత్రం ఈ ఆకుల రసాన్ని తీసుకుంటే వ్యాధి నయం అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. నోట్: ఈ చిట్కాలను పాటించేటపుడు, రెగ్యులర్‌గా సంప్రదించే డాక్టర్, ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. -
హెల్త్: ఏంటీ అలసటగా ఉందా..? బహుశా ఇలా చేస్తున్నారా..!?
మనలో చాలా మంది పొద్దున్నే నిద్ర లేవడానికి ఫోన్లో రెండు మూడు అలారాలను సెట్ చేస్తారు. కానీ, వాటిని కట్ చేసి మళ్లీ పడుకుంటారు. ప్రతిరోజూ ఇలాగే జరుగుతుంటుంది. ఆ తర్వాత తమని తాము తిట్టుకుంటూ ఉంటారు. శరీరానికి తగినంత విశ్రాంతి లభించక ఇలా అవుతోందా? లేక నిజంగానే బద్ధకంగా ఉంటుందా? బద్ధకానికి, విశ్రాంతికి విభజనరేఖ ఏమిటి? ఉత్సాహకరమైన ఉదయాన్ని ప్రారంభించడానికి నిద్ర మంచం మీద నుండి లేవడం అనే కష్టం నుంచి బయటపడటానికి సులువైన టెక్నిక్స్ కొన్నిటిని తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు అలారం సెట్ చేసి పెట్టుకుంటారు. ఉదయాన్నే ఆ అలారం మోగగానే మెలకువ వచ్చినా, లేవకుండా అలారం ఆఫ్ చేసి మళ్లీ పడుకుంటారు. నిద్ర రాకపోయినా అలాగే పడక నుంచి బయటకు రాకుండా ఉంటారు. దీంతో నిద్ర పోకపోయినా అలాగే పడుకోవడం వల్ల సమయం వృథా అవుతుందని నమ్ముతారు. అయితే విశ్రాంతి కోసం కొంత సమయాన్ని బద్ధకంగా గడిపినా ఫర్వాలేదు. కానీ, విశ్రాంతి కోసం పనిని పక్కన పెట్టడం వల్ల ఇబ్బందుల్లో పడవచ్చు. స్క్రీన్.. కలిగించే ఒత్తిడి చాలా మంది బెడ్ మీద ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడటం, మెయిల్స్ లేదా సోషల్ మీడియా వార్తలు చూడటం చేస్తుంటారు. దీనివల్ల కొంత సమయం బాగానే గడిచిపోతుందని అనిపించవచ్చు. విశ్రాంతి పొందుతున్నాం అనే భావన కూడా కలగవచ్చు. కానీ ఎక్కువసేపు పడుకుని స్క్రీన్‌ని, అందులోని సమాచారాన్ని చూడటం వల్ల బ్రెయిన్ ఒక విధమైన అసౌకర్యానికి, ఒత్తిడికి లోనవుతుంది. ఉదయం లేస్తూనే ఫోన్ తీసుకొని వచ్చిన నోటిఫికేషన్లు, మెసేజ్‌లు చూసే అలవాటును వదులుకోవాలి. మీతో మీరు.. రోజువారీ దినచర్యను ఎలాప్రారంభించాలో తెలుసుకోవడం మనందరికీ చాలా ముఖ్యం. మంచం మీద నుంచి లేచి, బయటకు వచ్చిన వెంటనే ఒత్తిడిని పెంచే పనులను ప్రారంభించవద్దు. ఉదయం నిద్రలేచిన వెంటనే మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకోవాలి. ఈ సమయంలో ప్రశాంతతను కలిగించే సంగీతాన్ని వింటూ సులభంగా చేయదగిన పనులను ఎంచుకోవాలి. ఈ విధానం వల్ల ఆ రోజు మొత్తంలో చేయదగిన పనులను చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. అరగంట లోపు ఓకే! ఉదయం నిద్రలేచిన తర్వాత కాసేపు అలాగే పడుకోవడం దినచర్యలో భాగమైతే ప్రతిరోజూ చేయవచ్చు. నిద్రలేచిన తర్వాత ఎంతసేపు మంచం మీద పడుకోవాలో నిర్ణీత నియమాలు లేవు. అయితే, 15 నుంచి 30 నిమిషాల తర్వాత బెడ్‌ను వదిలేయడం మంచిది. శరీరం మాట వినాలి విశ్రాంతి నిద్రకు ప్రత్యామ్నాయం కాదు. కానీ, కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత మంచిగా అనిపిస్తే అది నిద్రతో సమానంగా లేకపోయినా కచ్చితమైన ప్రయోజనాలను పొందవచ్చు. విశ్రాంతి అవసరమైతే శరీరం మాట వినిపించుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి అనిపించినప్పుడు దానిని పాటించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి బాగుంటుంది. కొంతమంది వారాంతాల్లో రోజంతా మంచం పైనే బద్ధకంగా దొర్లుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏ పనీ చేయలేకపోయాం అనే అపరాధ భావనకు లోనవుతారు. దీనివల్ల కొన్ని ముఖ్యమైన పనులు పూర్తికాక కొత్త చిక్కులు ఎదురయే ప్రమాదం ఉంది. అందువల్ల నిద్రపోవాలి అని అనిపించిన ప్పుడు నిద్ర పోవడమే మంచిది. మంచి నిద్ర కోసం.. రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా, తిరిగి ఉదయం నిద్రలేచేలా స్థిరమైన షెడ్యూల్‌ని పాటించాలి. వారాంతాల్లో కూడా ఇదే నియమాన్ని పాటించాలి. నిద్రపోయే ముందు వేడినీటి స్నానం, ధ్యానం, పుస్తకం చదవడం, సంగీతం వినడం ప్రయోజనకరం. నిద్రపోయే ముందు మొబైల్‌ను దూరంగా ఉంచాలి. సోషల్ మీడియాను చూడటం పూర్తిగా మానుకోవాలి. త్వరగా జీర్ణం కాని ఆహారం, కెఫిన్, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. ఇవి చదవండి: వేగంగా బరువు తగ్గేందుకు సింపుల్ చిట్కాలివిగో! -
సమ్మర్లో వేడి నీళ్ల స్నానమా? ఈ సర్ప్రైజింగ్ విషయాలు తెలుసా?
ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా స్నానం చేయడం దాదాపు అందరికీ అలవాటు. కొందరు వేడి నీటితో, మరికొందరు చల్లటి నీటితో స్నానం చేస్తారు. కానీ వేడి నీటి ( మరీ వేడి నీళ్లు కాదు) స్నానంతో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాస్తవానికి సీజన్ ఏదైనా వామ్ వాటర్‌తో స్నానంతో శరీరం, మనస్సు సేద తీరుతాయి. మరి వేడి నీటి స్నానంతో ఇంకా ఎలాంటి ప్రయో జనాలున్నాయో చెక్ చేద్దామా? చలికాలంలో వేడి స్నానం చేయడం కామన్. కానీ వేసవిలో కూడా వేడి నీటి స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదే. అన్ని సీజన్లలో వేడి స్నానం చేయడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గుండెజబ్బులు, అధిక బీపీ ఉన్న వారు కొంచెం అప్రతమత్తంగా ఉండాలి. కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది రోజంతా పనిచేసి అలిసిపోయిన శరీరానికి, కండరాలకు వేడి నీటి స్నానం హాయినిస్తుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు. కీళ్లకు ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడిని తగ్గించడంలోసహాయపడుతుంది ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి చాలా కామన్ అయిపోయింది. అందువల్ల, మనస్సు ప్రశాంతంగా, పూర్తిగా రిలాక్స్‌గా ఉండాలంటే వేడి స్నానం ఉత్తమం. ఇందులో ఎప్సమ్ లవణాలు, మంచి సువాసన గల నూనెలు కూడా ఉపయోగించవచ్చు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల వల్ల చర్మ రంధ్రాలు తెరుచు కుంటాయి .పేరుకుపోయిన మురికి, శరీరం శుభ్రపడి, బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తుంది. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అందరికీ ఆరోగ్యకరమైన చర్మాన్నే కోరుకుంటారు. ఇందుకోసం కొంతమంది సౌందర్య సాధనాలు ఆశ్రయిస్తారు. కానీ, రోజువారీ వేడి స్నానంలో రహస్యాన్ని మర్చిపోకూడదు. వేడినీరు చర్మాన్ని హైడ్రేట్ చేసి, చర్మ కణాలలో ఆక్సిజన్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. ఫలితంగా మృదువైన స్కిన్ సొంతమవుతుంది. ఏర్పడుతుంది. రక్త ప్రసరణకు: శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అన్ని శరీర భాగాల సరైన పనితీరు సరైన రక్తప్రసరణచాలా అవసరం. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఇది కీలకం. మంచి నిద్రకు: వేడి నిటి షవర్ కండరాల ఒత్తిడిని తగ్గిస్తుందని ముందే చెప్పుకున్నాం కదా. దీని ఫలితంగా ప్రశాంతమైన మెదడు మెలటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. జుట్టుకు: జుట్టుకు చాలా ప్రయోజనకరం. స్కాల్ప్ లోని సూక్ష్మ రంధ్రాలు ఓపెన్ అయ్యి, తేమ లోపలికి వెళ్లేలా చేస్తుంది. స్కాల్ప్‌ను శుభ్రనడుతుంది. బాగా హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలకే కాదు, చుండ్రు లాంటి నిరోధానికి కూడా కీలకం. ఇక శీతాకాలంలో అయితే జలుబు , ఫ్లూ బారిన పడటం చాలా సాధారణం. అందుకే వేడి షవర్ తలనొప్పి, ముక్కు దిబ్బడ, జలుబుకి మంచి ఉపశమనం. టిప్: ఎప్సమ్ లవణాలు, 10 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్,అర కప్పు బేకింగ్ సోడా కలుపుకొని వారానికి ఒకసారి 20 నిమిషాలు, హాట్ బాత్ టబ్‌లో కూర్చోండి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. ఒత్తిడి సంబంధిత హార్మోన్లను తగ్గిస్తుంది, శరీర pH స్థాయిలను సమతుల్యం చేస్తుంది. -
కొబ్బరి బోండాం నీళ్లు, ఈ లెక్క తెలుసా మీకు!
వేసవి వచ్చిందంటే దాహార్తికి ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లే. కాస్త ఖరీదు ఎక్కువనిపించినా , కార్బోహైడ్రేట్లు, ముఖ్యమైన పోషకాలతో సహజంగా లభించే కొబ్బరి బోండాలు చాలా ఉత్తమం. ఇంకా మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ పోషకాలు పుష్కలంగా వీటిల్లో లభిస్తాయి. అయితే మనం కొబ్బరి బోండాలో నీరు ఎంత ఉంది అనేది ఎలా గుర్తుపట్టాలి? ఒకసారి పరిశీలిద్దాం. వామ్మో.. ఎండ సుర్రుమంటోంది.. దాహం.. కాస్త నీళ్లు ఎక్కువ ఉన్న బోండాం ఇవ్వు బాబు అనగానే.. కొబ్బరి బోండాలు అమ్యే వ్యక్తి ఏం చేస్తాడు? గుర్తుందా? కాయమీద కొట్టి చూస్తాడు.. లేదంటే కాయను పట్టుకొని ఊపి చూస్తాడు కదా. అంతే సింపుల్. దాదాపు మనం కూడా అలాగే చెక్ చేసుకోవచ్చు. అలాగే సాధారణంగా కొబ్బరికాయ గుండ్రంగా, పెద్దగా ఉంటే అందులో నీరు ఎక్కువగా ఉంటుంది.ఆకుపచ్చ రంగులో కాకుండా, ముదురు గోధుమ రంగులో ఉండే(ఇపుడు మార్కెట్లో లభిస్తున్న బెంగళూరు కాదు) ముదిరిన లేదా పండు కొబ్బరికాయలో నీరు తక్కువగా ఉంటుంది. కొబ్బరికాయను తీసి బాగా కదిలించినపుడు కూడా నీటి శబ్దం వినిపిస్తే .. సో అది కూడా తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్లలో కొంచెం తీపి పుల్లని వగరు రుచి ఉంటుంది. త్వరగా పుల్లగా మారిపోతోంది. కాబట్టి తెరిచిన తర్వాత దానిని ఫ్రిజ్‌లో ఉంచి 24 గంటలలోపు తినాలి. అలాగే కొబ్బరి గుజ్జు సాంద్రతను కొలవడానికి టర్బిడిమీటర్ను ఉపయోగిస్తారట.ట్రాన్స్మిషన్ స్పెక్ట్రోఫోటోమీటర్గా, ‘‘విస్తా’’తో కొబ్బరినీళ్లను కొలుస్తారట. మరో విషయం ఏమిటంటే, ఇపుడు కొబ్బరి బొండాలుగా కాకుండా బాటిళ్లతో అమ్ముతున్నారు కాబట్టి వాటిని తీసుకోవచ్చు. లేదా దుకాణ దారుడి వద్ద మనమే బోండాలు కొట్టించుకుని, బాటిల్లో నింపుకోవచ్చు. అయితే ఈ నీళ్లను సాధ్యమైనంత తొందరగా సేవించాలి. లేదంటే పోషకాలు నష్టపోతాం. నిల్వ ఉండటం, పులిసిపోవడం వల్ల ఏదైనా అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. నోట్: కొబ్బరి నీళ్ల రుచి, సాంద్రత, ఎంత ఉన్నాయి, అలాగే గుజ్జు , టేస్ట్ తదితర అంశాలన్నీ ఆయా రకాలను బట్టి ఉంటుంది. -
బూడిద గుమ్మడితో ఇన్ని లాభాలా? కానీ వీళ్లు మాత్రం జాగ్రత్త!
ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నపేరు బూడిద గుమ్మడికాయ. వడియాలకోసమో, లేక గుమ్మానికి దిష్టికోసమో, స్వీట్‌కోసమే వినియోగించే గుమ్మడికాయ అనుకుంటే పొరబాటే. శరీరంలోని వ్యర్ధాలను తొలగించేందుకు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. పరగడుపున దీని జ్యూస్ తాగితే.. సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. దీన్నే వింటర్‌మిలన్ అనీ, సంస్కృతంలో కుష్మాండ , బృహత్ఫల, ఘృణావాస, గ్రామ్యకర్కటి, కర్కారు అని కూడా అంటారు. ఇది ఆరిజన్ ఎక్కడ అనేదానిపై స్పష్టత లేనప్పటికీ జపాన్, ఇండోనేషియా, చైనా లేదా ఇండో-మలేషియాలో పుట్టిందని ఊహిస్తున్నారు. అపారమైన ఔషధ గుణాలకు గుమ్మడికాయ ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేద పానీయంగా భావించే గుమ్మడికాయ జ్యూస్‌తో ప్రస్తుతం, పొట్ట సమస్యలు, కాలేయ సమస్యలు , చర్మ సమస్యల చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది. చాలా మందికి రుచి నచ్చకపోవచ్చు, కానీ సప్లిమెంట్లు ఇతర ఆహార పదార్థాలలో లేని ఔషధ విలువలు ఇందులో చాలా ఉన్నాయి. గుమ్మడికాయ జ్యూస్ రూపంలో తీసుకుంటే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. చాలా సహజంగా శక్తినిచ్చే ఆహారాలలో ఒకటి ఇందులోని బయో యాక్టీవ్ న్యూట్రియంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం ఇస్తుందని నమ్మకం. బూడిద గుమ్మడికాయలో 96 శాతం నీరు ఉంటుంది. 4 శాతంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, కాల్షియమ్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్ , కాపర్, నియాసిన్, థయామిన్, రిబోఫ్లావిన్ విటమిన్ బి1, బి 2, బి3, బి5, బి6, విటమిన్ సీ ఉంటాయి. బూడిద గుమ్మడికాయ ప్రోబయోటిక్ అంటే కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది.జీర్ణక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యలను తగ్గిస్తుంది శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. లివర్ పని తీరును మెరుగు పరుస్తుంది బూడిద గుమ్మడికాయ రసంలో యాంజియోలైటిక్ లక్షణాలున్నాయి. ఇది నాడీ వ్యవస్థకుమంచిది. డిప్రెషన్, ఆందోళనతో బాధపడేవారికి చాలా మంచిది. మూర్ఛవ్యాధితో బాధపడేవారికి కూడా మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ బూడిద గుమ్మడికాయ జ్యూస్. కేలరీలు , కార్బోహైడ్రేట్లు తక్కువ, జీరో ఫాట్ లక్షణాలు పైగా ఫైబర్ ఎక్కువ. మధుమేహం ఉన్న వారికి మంచిది. ఉబకాయాన్ని నిరోధిస్తుంది కాబట్టి గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.గుమ్మడికాయలో విటమిన్ B3 అధికం. శక్తినిస్తుంది. రక్తంలో గ్లూకోజ్లెవెల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి , సౌందర్యానికి మేలు చేస్తుంది. యాంటి ఏజింగ్‌గా పనిచేస్తుంది. ఫ్లవనాయిడ్స్ ఉన్నందున యాంటీ కేన్సర్‌గా పని చేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి పెంపొందిస్తుంది. ఎవరు తాగకూడదు ఈ ప్రపంచంలో ప్రతిదానికీ లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. దీర్ఘంకాలం తీసుకుంటే లోహ మూలకాలు పేరుకు పోతాయి. జ్వరంతో బాధపడుతున్నవారు, చలువ గుణం కలిగి ఉన్నందున జలుబుతో బాధపడుతున్న వారు తినకూడదు. బ్రోన్కైటిస్ ,ఆస్తమా పేషంట్లు దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా గర్భిణి స్త్రీలు వైద్యుల సలహా మేరకే దీన్ని తీసుకోవాలి. మితంగా తీసుకున్నంతవరకే ఏ ఆహారమైనా ఔషధంగా పనిచేస్తుంది. ‘అతి సర్వత్రా వర్జయేత్’ దీన్ని మర్చిపోకూడదు. -
ఆపిల్ సైడర్ వెనిగర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మస్ట్!
బరువు తగ్గడం నుంచి చర్మం, జుట్టు సంరక్షణ దాకా ఆపిల్ సైడర్ వెనిగర్ ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పచ్చళ్లు, మెరినేడ్స్ లాంటి వాటిల్లో కూడా విరివిగా వాడతారు. అయితే దీనిని తరచుగా ఉపయోగించడం మంచిదేనా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఆపిల్ సైడర్ వెనిగర్(ACV) ఆపిల్ జ్యూస్ ఈస్ట్‌తో కలిపి పులియబెట్టి తయారు చేస్తారు. ఎక్కువగా డ్రెస్సింగ్, మెరినేడ్స్, పచ్చళ్ళలో వాడతారు. యాపిల్ సైడర్ వెనిగర్‌లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. చర్మం, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తారు.అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల దుష్ర్పభావాలు కూడా ఉన్నాయి. ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై దద్దుర్లు, చికాకు కలుగుతాయి. అందుకే దీని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఈస్ట్ ఆపిల్‌లోని చక్కెరను ఆల్కహాల్‌గా మారుస్తుంది. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి సమస్యలొస్తాయి. అలాగే గ్యాస్ట్రోపరేసిస్‌తో బాధపడేవారిలో కడుపులోని నరాలు సరిగ్గా పనిచేయవు. గ్యాస్ట్రోపరేసిస్ (గుండెల్లో మంట, ఉబ్బరం వికారం) లక్షణాలు, టైప్-1డయాబెటీస్, ఇన్సులిన్ తీసుకునేవారిలో జీర్ణం ఆలస్యమవుతుంది కొన్ని మూత్రవిసర్జన మందులు, మధుమేహం మందులు, డిగోక్సిన్ ఇన్సులిన్-స్టిమ్యులేటింగ్ మందులు వాడేవారికి ఆపిల్ సైడర్ వెనిగర్‌తో రియాక్షన్ రావచ్చు. సుదీర్ఘ కాలం పాటు దీన్ని తీసుకుంటే బ్లడ్‌లో పొటాషియం స్థాయిలు ప్రభావితవుతాయి. తద్వారా ఎముకల బలహీనత రావచ్చు. దీంట్లోని ఎసిడిక్ యాసిడ్ మూలంగా పళ్ల ఎనామిల్ పాడయ్యే అవకాశం. పిల్లల్లో గొంతుమంట వచ్చే అవకాశం. తలపై ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఆపిల్ సైడర్ వెనిగర్( తరచుగా వాడటం వల్ల నల్లటి జుట్టు వాడిపోతుంది స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ పెరగవచ్చు. ఈ నేపథ్యంలో చర్మం లేదా జుట్టుకు వాడేటపుడు మోతాదు నియంత్రణ పాటించాలి. ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ కంటే ఎక్కువ ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించ కూడదు. రోజుకు గరిష్టంగా 2 టేబుల్ స్పూన్లు (30 ఎంఎల్) మించ కూడదు. దీనికి అలర్జీలు సాధారణంగా రావు. ఒకవేళ వస్తే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. -
టేస్టీగా ఉన్నాయని పిల్లలకు చిప్స్ అలవాటు చేస్తున్నారా?
వేసవి వచ్చిందంటే పిల్లలకు ఆటవిడుపు. రోజంతా ఏదో ఒకటి తినాలని ఆశపడుతూ ఉంటారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇష్టపడి తినే స్నాక్స్‌లో చిప్స్ ఒకటి. మన నోటికి నచ్చే చాలా ఆహారాలు, శరీరానికి హాని చేస్తాయి. ముఖ్యంగా కరకరలాడే చిప్స్ గుండెకు చెక్ పెడతాయి. ముఖ్యంగా పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలకుదారి తీస్తాయి. రకరకాల రంగుల కవర్స్‌తో ఆకర్షణీయంగా ప్యాక్ చేసిన చిప్స్‌ను చిన్నారులు ఎంతో ఇష్టపడి తింటుంటారు. అయితే చిప్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలిస్తే మాత్రం ఇకపై వాటిని తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. చిప్స్ తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం ♦ చిప్స్‌లో ఎక్కువ కాల నిల్వ ఉంచేందుకు ఇందులో సోడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు. సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించే నూనె కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ♦ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు చిప్స్‌లో సోడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు.సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించే నూనె కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని చిప్స్ క్రమంగా దెబ్బతీస్తాయి. ♦ చిప్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ధమనుల్లో రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీంతో ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ♦ శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పెరగడానికి గల కారణాలలో చిప్స్ ముఖ్య కారణం. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో ఊబకాయానికి చిప్స్ కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ♦ చిప్స్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఒక్కసారిగా బరువు పెరుగుతుంది. చిప్స్‌లో ఫైబర్ కంటెంట్ అనేది అస్సలు ఉండదు. దీంతో చిన్నారుల్లో ఇది మలబద్ధకానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మరెన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ♦ చిప్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. వంధ్యత్వానికి దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరుగుతారు. కడుపులో గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలకు చిప్స్ కారణమవుతుందని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి బలహీన పడి వైరస్లు, బ్యాక్టీరియా దాడులు పెరుగుతాయని చెబుతున్నారు. నోట్: పిల్లలకు జంక్ ఫుడ్ ఇచ్చే విషయంలో పెద్దలు ఒకటి రెండు ఆలోచించాల్సిందే. చిరుతిండ్లకోసం సాధ్యమైనంతవరకు ఇంట్లో తయారు చేసిన పిండి వంటలు వాడటం బెటర్. ముఖ్యంగా బెల్లంతో చేసిన పల్లీ, నువ్వుల ఉండలు. మినుములు,మిల్లెట్స్‌తో చేసిన తీపి లడ్డూలు, జంతికలు లాంటివి ఇంకా మంచిది. వీటితోపాటు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలతో చేసిన వంటకాలు, పచ్చి కూరగాయలతో చేసిన సలాడ్స్ వంటివి అలవాటు చేయడం మంచిది. -
ఇంగువతో ఇన్ని లాభాలా? బరువును తగ్గించే మ్యాజిక్ డ్రింక్
అసాఫెటిడా, హింగ్ లేదా ఇంగువగా ప్రసిద్ధి చెందింది. రుచి , ఘాటైన వాసనతో ఉండే భారతీయ వంటకాల్లో వాడే కీలకమైన సుగంధ ద్రవ్యం. పూర్వకాలం నుంచే భారతీయులు సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగించేవారు. ఇంగువను ప్రతిరోజు వంటకాలలో ఉపయోగిస్తే శరీరానికి మంచిదని ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు గురించి తెలుసుకుందాం. సాంబారు, పప్పు, పులుసుకూరలు, పచ్చడి తాలింపులలో మాత్రమే వాడుతారు అనుకుంటే పొరపాటే. మంచి వాసన, రుచితోపాటు, ఇంగువ అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. ఇంగువ ఆరోగ్య ప్రయోజనాలు బరువు తగ్గడానికిమ్యాజిక్ డ్రింక్: ఇంగువ నీరు తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. ఇంగువలో ఫైబర్, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఐరన్, కాల్షియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇంగువ నీరు మ్యాజిక్‌లా పనిచేస్తుందని చెబుతారు. ♦జీర్ణక్రియనుమెరుగుపరుస్తుంది గ్యాస్, ఉబ్బరం, అపానవాయువు వంటి కడుపు రుగ్మతల నివారణలో ఉపయోగపడుతుంది. కడుపు పూత,కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడేవారు ఇంగువ వాడి, దీన్ని అధిగమించవచ్చు. ఛాతీపై పూయడం వల్ల ఆస్తమా, కోరింత దగ్గు, ఊపిరితిత్తుల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. ♦ యాంటీవైరల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న కారణంగా ఇది ఉబ్బసం, బ్రోన్కైటిస్, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. ♦ ఇంగువ సహజ యాంటిడిప్రెసెంట్.ఒత్తిడి ,ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడేవారికి ఇంగువ మంచి మందు. ♦లైంగిక సమస్యలకు: నపుంసకత్వ సమస్యలలో బాధపడుతున్న పురుషులకు ఇది బాగా సహాయపడుతుంది. అకాల స్కలన సమస్యకు కూడా బాగా పనిచేస్తుందని అని నిపుణులు చెబుతున్నారు. స్త్రీ,పురుషుల్లో లైంగిక వాంఛను గణనీయంగా పెంచుతుందట కేన్సర్ ప్రమాదం: కేన్సర్ కణితి, పరిమాణాన్ని తగ్గించడంలో ఇంగువ బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. కేన్సర్ వ్యాప్తిని అరికడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కేన్సర్ కణాలతో పోరాడుతాయి. ♦ఊపిరితిత్తులు, కాలేయం ,మూత్రపిండాలలో మెటాస్టాసిస్ నివారణలో పనిచేస్తుంది. మెదడులోని రక్త నాళాలలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయ పడుతుంది. తలనొప్పిని తగ్గిస్తుంది. ♦ యాంటీ ఏజింగ్: చర్మం ముడతలు, కళ్ల క్రింద నల్లటి వలయాలు ముఖంపై ముడతలను కూడా తొలగిస్తుంది. ఇందులోని టైరోసిన్ నిస్తేజమైన చర్మానికి మెరుపునిస్తుంది. ♦ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది కీళ్ల నొప్పి, వాపు తగ్గించే అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ,రిలాక్సింగ్ లక్షణాలను కలిగి ఇంగులో ఉన్నాయి. ♦ పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి లేదా తిమ్మిరితో బాధపడుతుంటే ఇంగువ దివ్యవౌషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే మూలకాలు బహిష్టు సమయంలో నొప్పిని తగ్గించడంతో పాటు ఇతర సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ♦ పంటి నొప్పికి కూడా ఇంగువ మంచి ఫలితాలనిస్తుంది.ఇంగువలో నొప్పి నివారణ గుణాలు అలాగే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పి తగ్గించి ఉపశమనాన్ని అందిస్తాయి. -
మధుమేహం : ఈ సూపర్ ఫుడ్‌తో చెక్ చెప్పొచ్చు!
ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య అందరిలోనూ కనిపిస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య నానాటికి పెరిగి పోతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మధుమేహం విషయంలో, రక్తంలో చక్కెర స్థాయులను సాధారణంగా ఉండేలా చూసుకోవడం మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయి తగ్గించుకోవడానికి కొన్ని సూపర్‌ఫుడ్‌ల సహాయం తీసుకోవచ్చు. అవేంటో చూద్దామా... దాల్చిన చెక్క: రక్త ప్రవాహంలో చక్కెర కదలికను పెంచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. సొరకాయ: సొరకాయలో 92శాతం నీరు, 8శాతం ఫైబర్ ఉంటుంది. దీనిలో గ్లూకోజ్, చక్కెర సంబంధిత సమ్మేళనాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు అద్భుతమైన కూరగాయగా పరిగణిస్తారు. కాకరకాయ: రుచికి చేదుగా ఉండే కాకరకాయలో పాలీపెప్టైడ్–పి ఉంటుంది. ఇది ఇన్సులిన్ లాంటి హైపోగ్లైసిమిక్ ప్రొటీన్. ఇది కణాలలోకి గ్లూకోజ్‌ని తీసుకురావడంలో సహాయపడుతుంది. మెంతులు: ఇవి ఫైబర్, ఇతర రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. శరీరంలోని కార్బోహైడ్రేట్లు, చక్కెరను గ్రహించడంలో సహాయపడతాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర సాధారణంగా ఉంటుంది. ఆకు కూరలు: ఈ కూరగాయలలో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఎ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి. జొన్నలు, రాగులు: జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలలో డయాబెటిస్‌ను నియంత్రించే కారకాలు ఉంటాయి. రాగి జావ, జొన్న రవ్వతో చేసిన ఉప్మా, జొన్న రొట్టెలు, రాగి జావ, రాగి రొట్టెలు తీసుకోవడం డయాబెటిక్స్‌కు చాలా మంచిది. -
వేసవి తాపం : మజ్జిగ చేసే మేలు గురించి తెలుసా!
వేసవి కాలం వచ్చేసింది. వాతావరణంలో వచ్చే మార్పులతో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ వేసవి తాపానికి అల్లాడవలసిందే. అయితే కూల్డ్రింకులు, ఇతర శీతల పానీయాలకు బదులుగా వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం కొబ్బరి బొండాలు, చెరుకు రసం, పళ్లరసాలు, మజ్జిగ లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తే మంచింది. వడదెబ్బ తగలకుండా, శరీరం డీ-హైడ్రేషన్ కాకుండా ఉండేందుకు ఇవి చాలా అవసరం. ముఖ్యంగా చవగా, ఈజీగా లభించే మజ్జిగ తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలున్నాయని అంటున్నారు పోషకాహార నిపుణులు. మజ్జిగను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.. వేసవికాలంలో రోజూ రెండుసార్లు మజ్జిగ తాగడం వలన ఆరోగ్యానికి మంచిది. అయితే కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో, వాటిని ఎలా పుచ్చుకోవాలో చూద్దాం... మజ్జిగలో వేయించిన జీలకర్ర పొడి కలుపుకుని తాగడం వలన వేసవి తాపం నుంచి ఉపశమనం కలుగుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది. అంతేకాదు రోజూ మజ్జిగను తాగడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మజ్జిగలో కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు కలిపి తీసుకోవడం వలన దాహార్తి తీరుతుంది. గ్లాసు పల్చటి మజ్జిగలో చిటికడు సొంఠి, చిటికడు సైంధవ లవణం కలుపుకుని తాగితే వేసవి నుంచి ఉపశమనం కలుగుతుంది. మజ్జిగలో ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం, దబ్బాకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి సేవించడం వలన దాహార్తి తీరడమే కాదు.. శక్తి కూడా చేకూరుతుంది. వేసవి వేడికి తిన్న ఆహారం అరగక ఒక్కోసారి వాంతులు అవుతుంటాయి. అలాంటప్పుడు చిటికడు జాజికాయ పొడిని మజ్జిగలో కలుపుకుని సేవించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మజ్జిగలో విటమిన్ బి12, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఉంటాయి. ఇవి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మజ్జిగ ఆరోగ్యకరమైన పానీయం. కనుక వేసవిలో కూల్ డ్రింక్స్ కంటే ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ రెండుసార్లు మజ్జిగను తీసుకోండి. -
కలబందతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో: సౌందర్యానికి కూడా
కలబందలేదా అలోవెరా ప్రతీ ఇంట్లో సర్వ సాధారణంగా ఉంటోంది. ఒకవిధంగా చెప్పాలంటే తులసి మొక్కకు ఇచ్చినంత ప్రాధాన్యతను కలబందకు కూడా ఇస్తున్నారంటూ అతిశయోక్తి కాదు. అందం నుంచి ఆరోగ్యం వరకు కలబంద ప్రయోజనాలు, వాడకం ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి బాగా పనిచేస్తుంది. ఇంకా ఆయుర్వేద మందుల్లోను సౌందర్య ఉత్పత్తుల్లోనూ, దీన్ని విరివిగా వాడతారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం కలబందలో విటమిన్ ఏ , సీ, ఈ, బీ1, బీ2, బీ3, బీ6,బీ 12 లాంటి విటమిన్లతోపాటు ఫోలిక్ యాసిడ్, 18 రకాల అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఇంకా కాల్షియం, క్రోమియం, సెలెనియం, మెగ్నీషియం, జింక్, సోడియం, ఇనుము, పొటాసియం, కాపర్, మాంగనీస్ వంటి దాదాపు ఇరవై మినరల్స్ ఉంటాయి. కలబంద లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బయొటిక్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. అలోవెరా జెల్ పౌడర్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.ప్రీడయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో కలబంద సప్లిమెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించ గలదు. ఇది ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్‌ని తగ్గిస్తుంది. కలబందలో లాటెక్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది మలబద్ధకానికి మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. కలబంద దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కలబందతో చేసిన మైత్ వాష్ వినియోగం ద్వారా చిగుళ్ల రక్తస్రావాన్ని తగ్గించవచ్చు. అలోవెరా కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇది చర్మం తొందరగా సాగిపోకుండా నివారిస్తుంది. కలబందలో మ్యూకోపాలిసాకరైడ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంలోని తేమను కాపాడతాయి. కలబంద గుజ్జును రాసుకుంటే, జుట్టు మెత్తగా, మెరిసేటట్టు మారుతుంది. జుట్టు తెగిపోవడాన్ని అరికడుతుంది. చక్కగా, ఒత్తుగా ఎదిగేలా తోడ్పడుతుంది. మాయిశ్చరైజర్ల నుండి ఫేస్ మాస్క్‌ల వరకు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఇది చాలా కీలకం. దీనిలోని మాయిశ్చరైజింగ్, యాంటీ ఏజింగ్ లక్షణాలే దీనికి కారణం. అలోవెరా జెల్ కాలిన గాయాలకు చాలా ఉపశమనం ఇస్తుంది. గాయాలు, మచ్చలు తొందరగా మానేలా చేస్తుంది. సన్‌బర్న్ ఇన్ఫ్లమేషన్ను కూడా తగ్గిస్తుంది. కలబంద రెమ్మ పైన ఉండే తోలును తీసేసి అందులో తెల్లగా ఉన్న గుజ్జును తీసుకొని ఒక పాత్రలో వేయాలి ఇది ఒగరు ఒగరుగా, పుల్లగా కొన్ని చిరు చేదుగా కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం సుగర్ లేదా కొద్దిగా తేనె వేయాలి. దీన్ని మిక్సీలో వేసుకొని కలపాలి.అలా కలిపిన తర్వాత పూర్తిగా నీరు మాదిరిగా తయారవుతుంది. దీన్ని ఉదయాన్నే తాగవచ్చు. తేనె కలిపిన ఈ మిశ్రమాన్ని ముఖానికి, చర్మానికి కూడా అప్లయ్ చేసుకోవచ్చు. పెరటి మొక్కల పోషణలో కూడా కలబంద గుజ్జు, తోలు బాగా ఉపయోగ పడతాయి. ఇన్ని ప్రయోజనాలున్న కలబంద లక్షల్లో ఆదాయ తెచ్చిపెట్టే పంటగా కూడా మారిపోవడం గమనార్హం. -
చింతగింజల మ్యాజిక్ తెలుసా? పురుషులకు మరీ ప్రయోజనం!
చింత గింజలు అంటే చింతపండు వాడుకుని, పులుసు తీసుకున్న తరువాత తీసిపారేసే వేస్ట్ గింజలనుకునేరు. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చింతపండు గింజల్లో ఉండే ప్రోటీన్లోయాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయని, చికున్ గున్యా కోసం యాంటీవైరల్ మందులను అభివృద్ధి చేయడానికి సమర్థ వంతంగా ఉపయోగించవచ్చని నిపుణుల మాట. దీంతో పాటు వివిధ ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో తెలియాంటే..ఈ కథనాన్ని చదవాల్సిందే..! చింత చెట్టును భారత దేశపు ఖర్జూర చెట్టు అంటారు. గతంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బయోటెక్నాలజీ విభాగానికి చెందిన రూర్కీ ప్రొఫెసర్లు చింతగింజలపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలు ఎల్సెవియర్ జర్నల్, వైరాలజీలో ప్రచురించబడ్డాయి కూడా. దీని ప్రకారం మధుమేహ నిర్వహణలో ఉపయోగ పడతాయి. చింత గింజల పొడితో దంత సమస్యలను దూరం చేసుకోవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చింతగింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం: చింతపండు గింజలు ప్యాంక్రియాస్‌ను రక్షిస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పరిమాణాన్ని పెంచుతుంది.చింతపండు గింజల నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించుకోవచ్చు. దంతాలకు మేలు చేస్తుంది: చింతపండు గింజల పొడితో చిగుళ్ళు ,దంతాలను తోముకుంటే మంచిది. ఎక్కువగా పొగ త్రాగే వారికి. శీతల పానీయాలు, ధూమపానం వల్ల పళ్లు గారపట్టిపోతాయి. ఇందుకోసం చింత గింజలను పొడి చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి రోజూ దంతాలను తోముకోవాలి. దీంతో దంతాలు తెల్లగా మారడంతోపాటు దంతాలపై ఉండే గార, పాచి వదిలిపోతుంది. జీర్ణక్రియ: చింతపండు గింజల రసం అజీర్ణాన్ని నయం చేయడానికి, పిత్తానికి సహజ నివారణగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా, ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఇది కొలెస్ట్రాల్‌ను మరింత తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారణలో: యాంటీ బాక్టీరియల్ లక్షణాలుతో చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవచ్చు. అంతేకాకుండా, ఇది పేగు , మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుండి కూడా కాపాడుతుంది. గుండెకూ మంచిదే: చింతపండు విత్తనాలలో పొటాషియం ఉంటుంది. పొటాషియం బీపీని తగ్గిస్తుంది. రక్తపోటు, ఇతర హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్ల నివారణలో: చింత గింజల్లో యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ గింజల పొడిలో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని గాయాలు, పుండ్లపై రాసుకోవచ్చు. అలాగే మంగు మచ్చల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చింత గింజలను పొడిలా తయారుచేసి, ఆ పొడిలో తేనె కలిపి మచ్చల ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. చింతగింజల పొడిని రోజూ ఓ అర టీస్పూన్ మేర రోజుకు రెండు సార్లు నీటితో కలిపి తీసుకోవాలి. పాలు లేదా నెయ్యిని కూడా వాడొచ్చు. దీనివల్ల మోకాళ్ల నొప్పులు దూరమవుతాయి. వీర్యకణాల వృద్ధిలో ఆవుపాలు, చింతగింజల పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల పురుషుల్లో వచ్చే లైంగిక సమస్యలు తగ్గుతాయి. వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. ఇలా నోట్: చిట్కాలు అందరికీ ఒకేలా పనిచేస్తాయన్న గ్యారంటీ లేదు. నిపుణులతో సంప్రదించి చింతగింజల పొడిని వాడుకోవాలి. దీని ప్రయోజనానలు వైద్యుడిని సంప్రదించి నిర్ధారించుకోండి. -
వంట దినుసులే కదా అని తేలిగ్గా తీసుకోకండి!
మన వంట గదే ఔషధాల నిలయం. మనకు తెలియకుండానే మన పూర్వీకులు, పెద్ద వాళ్లు అలవాటు చేసిన, చెప్పిన పద్దతుల ద్వారా కొన్ని ఆరోగ్యకరమైన దినుసులు, మసాలాలను వాడుతుంటాం. ముఖ్యంగా పసుపు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు ఇలా ప్రతిదీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే! ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉండటంతో పాటు, వాడాల్సిన పద్దతిలో వీటిని వాడితే అదనపు రుచిని అందిస్తాయి. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. అలాంటి వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. పసుపు: అనేక యాంటి బయోటిక్ గుణాలు, పోషకాలు ఇందులో ఉన్నాయి. అందుకే ప్రతీ కూరలోనూ చిటికెడు పసుపు వేయడం మన భారతీయులకు అలవాటు. పసుపులో ఉండే కర్కుమిన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ మంటను తగ్గిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలైన వాటి నుంచి కాపాడుతుంది. జలుబు చేసినపుడు పసుపు ఆవిరిపట్టడం, పసుపు,పాలు తాగడం, గాయాలకు పూయడం లాంటివి కూడా మంచిదే. అల్లం: రోజువారీ వినియోగంలో అల్లం పాత్ర చాలా పెద్దదే. అల్లంలో ఉండే జింజెరాల్ అనే సమ్మేళనం శ్వాసకోశ మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థకు మేలు జరుగుతుంది. శ్లేష్మం తగ్గించడంలో సాయపడుతుంది. శ్వాస ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లంతో శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్ని టీలో అల్లం కలుపుకుని తింటే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా సరే లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్‌లా చేసుకుని తాగినా మంచిదే. వెల్లుల్లి: వెల్లుల్లి వంటలకు రుచి, వాసనను అందిచడమే కాకుండా జీర్ణ ప్రక్రియను సులభ తరం చేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీటితోపాటు వెల్లుల్లి రెబ్బను తింటే,జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు శరీర బరువు కూడా తగ్గించేందుకు దోహద పడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బీలు వ్యాధులకు నివారణలో పని చేస్తాయి. ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది. అలోసిన్-సల్ఫర్ సమ్మేళనం వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఒరేగానో: వంటకాల్లో ఉపయోగించే ఒరేగానో హెర్బ్, యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంది. దగ్గు, ఆస్తమా, బ్రోన్కైటిస్, శ్వాసకోశ వాపు, క్షయవ్యాధి నివారణకు సహాయపడుతుంది. రుమాటిజం, తిమ్మిరి, మైగ్రేన్లు, ఉబ్బరం, ఆకలి లేకపోవడం, విరేచనాలు, కామెర్లు , వంటి ఇతర కాలేయ వ్యాధులకు ఒరేగానోను ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో పాలీ ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. జలుబు, దగ్గు మొదలైన బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే సమస్యల నుంచి రక్షించడంలో సాయపడుతుంది. -
హోలీ..హోలీరే : నేచురల్ కలర్స్, గులాల్ తయారు చేసుకోండిలా!
#Holi 2024:హోలీ అంటేనే రంగుల పండుగ. చిన్నా పెద్దా అంతా రంగుల్లో మునిగి తేలే పండుగ. వసంతకాల వేడుక. పల్లె పట్నం అంతా ఎల్లలు దాటేలా సంబరాలు చేసుకుంటారు. చెడుపై మంచి విజయానికి చిహ్నంగా, రాధాకృష్ణుల ప్రేమకు ప్రతిరూపంగా ఆలయాలుముంగిళ్లు, వాకిళ్లు రంగులతో తడిసి మురిసే సంబరం. ఇంట్లోనే సహజంగా హోలీ రంగులు వసంతం ఆగమనానికి సూచిక హోలీ. ఒకప్పుడు ప్రకృతి ప్రసాదించిన పువ్వులు, ఆకులతో తయారుచేసుకున్న రంగులతో పండుగ జరుపుకునే వారు. కాలక్రమంలో హోలీ ప్రజాదరణ పెరిగింది. సహజ రంగుల స్థానాన్ని రసాయన ఆధారిత సింథటిక్ రంగులు ఆక్రమించేశాయి. సహజ రంగులతో పోలిస్తే చౌకగా ఉంటాయి, కానీ ఆరోగ్యానికి , పర్యావరణానికి హానికరమైనవి, చర్మానికి, ఆరోగ్యానికి మంచిదని కాదని తెలిసినా జాగ్రత్త పడటం లేదు. దీనికి తోడు సహజ రంగులను ఎలా తయారు చేసుకోవాలో తెలియక చాలామంది వీటిని వినియోగిస్తున్నారు. రానున్న హోలీ సందర్భంగా మార్కెట్లో లభించే అసహజ రంగులకు బదులుగా ఇంట్లోనే సహజ రంగులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే పింక్ గులాల్ ఇలా పింక్ గులాల్ కోసం 1-2 మీడియం బీట్రూట్లను తీసుకోవాలి. వాటిని చక్కగాతురుముకోవాలి, దీన్ని ఒక కప్పు నీళ్లుపోసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ ద్రావణాన్ని వడకట్టుకోవాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలుపుకోవచ్చు. దీనికి మొక్కజొన్న పిండి లేదా టాల్కమ్ పౌడర్ని కలుపుకోవచ్చు. పొడిగా కావాలనుకుంటే మైక్రోవేవ్‌లో వేడి చేయండి. దీన్ని బాగా కలపినా లేదా మళ్లీ గ్రైండ్ చేసినా పింక్ గులాల్ రడీ. రెడ్ కలర్ గులాల్ గులాల్ ను ఇంట్లో తయారు చేసుకోవాలంటే గులాబీ రేకులను తీసుకుని నీటిలో గంటసేపు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. పొడిగా కావాలంటే ఎండబెట్టండి లేదా మీరు మైక్రోవేవ్లోపుంచి డ్రైగా చేసుకోవచ్చు. ఎండబెట్టిన కొన్ని ఎరుపు మందార పువ్వులను తీసుకోండి. వాటిని మెత్తగా పొడి చేయండి. దీనికి కొద్దిగా బియ్యం పిండిని కలుపుకోవచ్చు. ఎర్ర చందనం కలిపిన నీళ్లు ఎర్ర రంగులోకి మారి భలే ఆకర్షణీయంగా ఉంటుంది. దానిమ్మ తొక్కలను నీటిలో ఉడకబెట్టి వాటర్ కలర్ వాడుకోవచ్చు.( కానీ ఈ నీళ్ళ మరకలు ఒక పట్టాన పోవు) పసుపు పసుపు పొడి ఇంట్లోనే పసుపు రంగును తయారు చేసకోవచ్చు. పసుపు రంగులో ఉండే శనగపిండి, పసుపు మిశ్రమంతో ఒక కలర్ సింపుల్‌గా రడీ అయిపోతుంది. దీని వల్ల ఎలాంటి నష్టం రాదు. పైగా పసుపు, శనగ పిండి సున్ని పిండిలాగా కూడా ఉపయోగపడుతుంది. వీటినే నీటిలో కలిపే తడి రంగును తయారు చేసుకోవచ్చు. అంతేకాదు పసుపు బంతి పువ్వులను తీసుకొని నీటిలో మరగించినా చక్కటి కలర్ వస్తుంది. గ్రీన్ కలర్: ఇంట్లో చాలా సులభంగా లభించే గోరింటాకు పొడితో గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. అప్పుటి కప్పుడు కడిగేసుకుంటాం కాబట్టి పెద్దగా పండదు. అలాగే ఎండ బెట్టిన గోరింట పొడిని నీటిలో కలపి ఈ వాటర్‌ను వాడుకోవచ్చు. ఇంకా పుదీనీ, బచ్చలికూర లాంటి ఆకుకూరలు వేప, తులసి లాంటి ఆకులను నీటిలో ఉడకబెట్టడం ద్వారా కూడా ఆకుపచ్చ రంగును తయారు చేసుకోవచ్చు. మెరూన్ మెరూన్, లేదా లేత పర్పుల్ రంగును సులభంగా తయారు చేయడానికి బీట్రూట్ రసాన్ని మించింది లేదు. బీట్రూట్ను మెత్తగా దంచుకొని, లేదా మిక్సీలో వేసి ఆ ముద్దను నీటిని రాత్రంతా నానబెట్టండి. దీన్ని చక్కగా వడకట్టుకొని వాడుకోవచ్చు. బ్లూ కలర్: అపరాజిత నీలి రంగు మందారం రేకుల నుండి ఇంట్లోనే చాలా సులభంగా బ్లూ కలర్ తయారు చేసుకోవచ్చు. అంతేకాదు నీలి రంగు అపరాజిత లేధా శంఖం పువ్వులు కూడా బ్లూ కలర్‌కి బాగా ఉపయోగపడతాయి. పూల రేకులను ఎండబెట్టి, దాని నుండి పొడిని తయారు చేయండి. పొడిలో కాస్త బియ్యం పిండిని కలుపుకోవచ్చు. ఈ పూలను నీళ్లలో నానబెట్టి, ఆ నీళ్లను కూడా వాడుకోవచ్చు. ఆరెంజ్: ఎండిన నారింజ తొక్కలను ఉపయోగించి నిమిషాల్లో ఆరెంజ్రంగును తయారు చేయవచ్చు. తొక్కల్ని ఎండబెట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత మొక్కజొన్న పిండి, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. నోట్: వీటితోపాటు, మీకు తెలిసిన, మీ అమ్మమ్మ, బామ్మలను అడిగి తెలుసుకుని మరీ అనేక సహజ రంగులకు తయారు చేసుకోవచ్చు. సహజ రంగులనే వాడదాం. మన ఆరోగ్యాన్ని , ప్రకృతిని కాపాడుకుందాం!! -
గుండె ‘లయ’ తప్పితే..ముప్పే! ఈ లక్షణాలు గమనించండి!
ఒకపుడు గుండెపోటు అంటే.. మధుమేహం ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి, వయసు మీద పడిన వారికి, ఊబకాయ ఉన్నవారికి మాత్రమే వస్తుంది అని అనుకునే వాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో గుండె పోటు తీరు మారింది. మాకు రాదులే అని అనుకోడానికి లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండానే ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. మరీ ముఖ్యంగా జిమ్ చేస్తున్నవారు, ఎక్కువ కసరత్తు చేస్తున్న వారు కూడా ఎంతోమంది చిన్న వయసులోనే గుండెపోటుతో ప్రాణాలను కోల్పో తున్నారు. అసలు గుండె పోటు ఎందుకు వస్తుంది? గుండె పోటు వచ్చే ముందు మన శరీరం అసలు సంకేతాలు పంపిస్తుందా? ఈ కథనంలో చూద్దాం. జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడిన వారిలో గుండె వ్యాధుల ప్రమాదం ఎక్కువ. అయితే ఇటీవలి కాలంలో అసలు అనారోగ్య సమస్యలేకపోయినా కూడా హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. గుండెపోటు గుండె కండరానికి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలలో కొవ్వు కాని గడ్డలు కాని ఏర్పడడం వల్ల రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడితే గుండె పోటు వస్తుంది. సాధారణంగా గుండె (కరోనరీ) ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ ,ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల అడ్డంకులు(బ్లాక్స్) ఏర్పడతాయి. రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వీటికి సరైన సమయంలో చికిత్స అవసరం. అలాగే బాడీలో విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిన వారు కూడా గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు వాస్తవానికి కొంతమందిలో తేలికపాటి లక్షణాలు ఉంటాయి. మరికొందరికి తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, కానీ చాలామంది వాటిని గుర్తించడంలో వైఫల్యంతోనే ముప్పు ముంచుకొస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి లక్షణాలు గుర్తించి, ప్రాథమిక చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పే అవకాశం చాలా ఉందిలో ఉంటుందని అంటున్నారు. ►గుండెల్లో మంట లేదా అజీర్ణం ►గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం ►ఛాతీలో నొప్పి, గుండె లయలో మార్పులు ►శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ►తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ►తొందరగా అలసిపోవడం, అంటే కొద్దిగా నడిస్తేనే నీరసం ► నాలుగు మెట్టు ఎక్కంగానే ఆయాసం ఇలాంటి లక్షణాలున్నపుడు వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ► మరి కొందరిలో ముందు దవడ, మెడ, జీర్ణాశయం పై భాగంలో నొప్పిగా ఉంటుంది. ► ఒకటి లేదా రెండు రోజులకు మించి ఎడం చెయ్యి లేదా రెండు చేతులలో అకారణంగా నొప్పి, వికారం, వాంతి వచ్చినట్టు ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి లక్షణాలు లేకపోయినా ఎవరు జాగ్రత్త పడాలి ►అధిక బరువు వున్నా, హైబీపీ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నా, ధూమపానం అలవాటు ఉన్న వారంతా గుండె పోటు ప్రమాదం పట్ల అవగాహనతో ఉండాలి. ► అలాగే ఎక్కువ ఒత్తిడి ఉండే ఉద్యోగాలు చేసేవారిలోనూ గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అనేది గమనించాలి. ►ముఖ్యంగా మధ్య వయసులో స్త్రీల కన్నా మగవారికి గుండెపోటువచ్చే ప్రమాదం ఎక్కువని నిపుణులు చెబుతన్నారు. ► మెనోపాజ్ దశలో మహిళల్లో ఈస్ట్రెజెన్ స్థాయి తగ్గిపోతుంది. అప్పుడు వారిలో గుండె పోటు ముప్పు పెరుగుతుంది. అయితే 65 ఏళ్ల తర్వాత పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువ గుండె పోటు వస్తున్నట్టు పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురిలోనూ అలసత్వం ఎంతమాత్రం మంచిది కాదు. ►మరీ ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చిన చరిత్ర ఉన్నా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వంశపారంపర్యంగా ఈ గుండె వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. పై లక్షణాలున్నవారందరికీ గుండెజబ్బు వచ్చేసినట్టు కాదు. కానీ లక్షణాలు కనిపించగానే రోగ నిర్ధరణ అనేది చాలా కీలకం. క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారంపై శ్రద్దతో పాటు ఏ చిన్న అనుమానం వచ్చినా అజాగ్రత్త చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
పిగ్మెంటేషన్ లేదా మంగు మచ్చలు.. ఇంట్లోనే ఇలా తగ్గించుకోవచ్చు!
వేసవికాలంలో ప్రధానంగా వేధించే సమస్య ముఖం మీద నల్లని లేదా గోధుమ రంగు మచ్చలు. వయసు పెరిగే కొద్దీ ఇవి మరింత బాధిస్తాయి. ఈ మచ్చలను మంగు మచ్చలు లేదా పిగ్మెంటేషన్ అంటారు. నుదురికి ఇరువైపులా, బుగ్గలు, ముక్కుకు ఇరువైపులా అందహీనంగా కనిపిస్తాయి. వీటి నివారణకు లేజర్ చికిత్సలు, మార్కెట్లో దొరికే క్రీమ్‌లకంటే ఇంట్లోనే చేసుకోగలిగిన పరిష్కారాలు మంచి ఫలితాన్నిస్తాయి. అసలు మంగు మచ్చలు ఎందుకు వస్తాయి? వయస్సుతోపాటు చర్మంపై పడే ప్రతికూలతల వల్ల ఈ మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. హరోన్ల సమతుల్యత లోపం వల్ల, మరికొందరికి వంశపారంపర్యంగా కూడా ఈ మచ్చలు రావచ్చు. అయితే వీటిని శారీరకమైన బాధలేవీ ఉండవు. శరీరంలో మెలనిన్ ఎక్కువగా తయారైతే.. ‘హైపర్ పిగ్మెంటేషన్’కు దారి తీస్తుంది. సూర్య కిరణాల్లోని అతినీలలోహిత కిరణాలు చర్మానికి హాని చేసి, ఆ సమయంలో మెలనిన్ ఎక్కువై మంగు మచ్చలు తయారవుతాయి. జీవక్రియ సమస్యలు, పోషకాహార లోపం, అధిక ఉష్ణోగ్రత, కాలుష్యం,అనుధార్మికత, ఔషధాల వల్ల కూడా ఇవి ఏర్పడతాయి. బంగాళ దుంప: బంగాళ దుంపల తురుమును పలచని గుడ్డలో వేసి రసం తీసుకోవాలి. ఒక కాటన్ ప్యాడ్‌ను గానీ, దూదిని గానీ ఈ రసంలో ముంచి మచ్చలపై పూయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తుంటే తప్పకుండా మచ్చలు తొలగిపోతాయి. టమోటా: గింజలు తొలగించిన టమోటా గుజ్జుకు, కొద్దిగా తేనె కలిపి మచ్చలకు అప్లయ్ చేయాలి. 20 నిమిషాలు ఉంచి ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి మార్పు మీకే తెలుస్తుంది. టమోటా, ముల్తానా మట్టి: టమోటా రసంలో కాస్త గంధం పొడిని కలపండి. ఆ మిశ్రమంలో ముల్తాని మట్టిని కలిపి పేస్టులా చేయండి. అనంతరం ఆ పేస్టును ముఖంపై ఉన్న మచ్చలపై రాయండి. 20 నుంచి 30 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగాలి. వారంలో రెండుస్లారు ఇలా చేస్తే మంచు మచ్చలు క్రమంగా తగ్గి పోతాయి. కలబంద: సహజసిద్ధమైన కలబంద గుజ్జు చాలా రకాల చర్మ సమస్యలకు పరిష్కారం. క్రమం తప్పకుండా కలబంద గుజ్జున రాస్తే మంగు మచ్చలు మాటుమాయం. నిమ్మ, రోజ్‌వాటర్: ఒక గిన్నెలో రోజ్ వాటర్, నిమ్మరసం, కీరదోస రసం, తేనె వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి బాగా పట్టించి, 15, 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. రోజ్ వాటర్ లేని పక్షంలో నిమ్మరసాన్ని వాడుకోవచ్చు. పసుపు: పసుపు, గేదె పాలు, ఎర్ర చందనం కలిపి ముఖానికి రాసుకుంటే సత్ఫలితాలు కనిపిస్తాయి. తాజా గేదె నెయ్యి మంగు మచ్చలపై రాస్తే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. -
ఓవర్ థింకింగ్ నుంచి తప్పించే ఏడు జపనీస్ టెక్నిక్స్...
మనసు కోతిలాంటిది. ఎప్పుడూ ఒకచోట కుదురుగా ఉండదు. ఈ క్షణం ఒక అంశం గురించి ఆలోచిస్తుంటే, మరుక్షణం మరో అంశంపైకి గెంతుతుంది. కొందరు ఒకే విషయం గురించి అతిగా ఆలోచిస్తూ బాధపడుతుంటారు. సకల మానవ దు:ఖానికి కారణమైన మనసును నియంత్రించడం కోసం అనాదిగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. యోగ: చిత్తవృత్తి నిరోధక: అనే సూత్రంతోనే పతంజలి యోగసూత్రాలు మొదలవుతాయి. అష్టాంగమార్గం ద్వారానే దు:ఖాన్ని తప్పించుకోగలమని బౌద్ధం బోధిస్తుంది. జపాన్ లోని బౌద్ధులు కూడా మనసును నియంత్రించుకోవడం గురించి అన్వేషించి ఏడు టెక్నిక్స్ అందించారు. సైకాలజీ అనేది పుట్టకముందే, వేల సంవత్సరాల కిందటే మొదలైన ఈ టెక్నిక్స్ ను ఇప్పటికీ అక్కడ చాలామంది ఉపయోగిస్తున్నారు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. 1. షోగనై: మీ కంట్రోల్ లో ఉన్న విషయాల గురించి, మీ కంట్రోల్ లేని విషయాల గురించి బాధపడకూడదు. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదా. సింపుల్. మీ కంట్రోల్ లో ఉన్న విషయాల గురించి బాధపడటం ఎందుకు? వాటిని ప్రయత్నించి సాధించాలి. మీ కంట్రోల్ లేని విషయాల గురించి ఎంత ఆలోచించినా, ఎంత ప్రయత్నించినా అర్థం లేదు కదా. ఈ వైఖరిని అనుసరిస్తే అనవసర ఆలోచనలు మీ మనసులోకి రానే రావు. మీజీవితంలో కష్టాలూ రావు. వచ్చినా... మీ కంట్రోల్ లో ఉన్నదైతే పరిష్కరించుకుంటారు, లేనిదైతే వదిలేసి ముందుకు సాగవచ్చు. 2. షిరిన్-యోకు: బిజీ బిజీ జీవితంతో విసిగిపోయినప్పుడు.. ‘‘అబ్బ, ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్తే ప్రాణానికి హాయిగా ఉంటుందబ్బా’’ అని అనుకుని ఉంటారుగా. అంతదూరం వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న ప్రకృతితో మమేకం అవ్వండి. పచ్చదనంలో సమయం గడపండి. అతిగా ఆలోచించకుండా ఉండటానికి ఇది ఉత్తమమైన మార్గం. మీ మనసును శాంతపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. 3. నేన్ బుత్సు: అతిగా ఆలోచించడం నుంచి మనసును మళ్లించడానికి సులువైన మార్గం జపం. అంటే మీరు విశ్వసించే, మీకు నచ్చిన పదాన్ని జపించండి. ఏ పని చేస్తున్నా దానిపైనే ధ్యాస నిలపండి. దానివల్ల ఇతర అంశాల గురించే ఆలోచించే అవకాశం తగ్గుతుంది, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. 4. జాజెన్: ఇది జెన్ బౌద్ధమతంలో విస్తృతంగా అభ్యసించే ధ్యానం యొక్క రూపం. చాలా సులువైన విధానం. మీ ఆలోచనలను మీరు ఎలాంటి జడ్జ్ మెంట్ లేకుండా పరిశీలించడం. అంటే ఒక సాక్షిలా ఆలోచనలను పరిశీలించడం. ఎప్పుడైతే మీరు ఆలోచనలకు స్పందించకుండా, విశ్లేషించకుండా ఉంటారో అప్పుడవి ఆటోమేటిక్ గా తగ్గుతాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. 5. గమాన్: జీవితం సుఖదుఖాల, విజయాపజయాల మిశ్రమం. ఒక్కోసారి అనుకోని తీరులో కష్టం ఎదురవ్వవచ్చు. అప్పుడు కుంగిపోకూడదు. నాకే ఎందుకిలా జరిగిందంటూ ఆలోచిస్తూ ఉండిపోకూడదు. ఆలోచనల వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని, అడుగు వేసినప్పుడే ఫలితాలు వస్తాయని గుర్తించి.. ముందడుగు వేయాలి. 6. వాబీ-సాబీ: జీవితంలో అన్నీ తాత్కాలికమేననీ, ఏదీ శాశ్వతం పరిపూర్ణం కావని గుర్తించమని చెప్పే జపనీస్ టెక్నిక్ ఇది. ఎప్పడైతే ఈ విషయాన్ని అంగీకరిస్తారో, అప్పడు పర్ ఫెక్ట్ గా ఉండాలనే ఒత్తిడి నుంచి మీరు తప్పించుకోగలరు. అప్పుడు అతిగా ఆలోచించడం నుంచి మీరు తప్పించుకోగలరు, ప్రశాంతంగా ఉండగలరు. 7. ఇకబెనా: ఇది పువ్వులను అందంగా అమర్చే ఆసక్తికరమైన టెక్నిక్. మీరు పువ్వులను అమర్చేటప్పుడు మీ ధ్యాస మొత్తం వాటిపైనే ఉండాలి. వాటిపై శ్రద్ధ నిలపడం ద్వారా మీ మనసు అందాన్ని సృష్టించడంలో మునిగిపోతుంది. అతిగా ఆలోచించడం నుంచి తప్పించుకుని ప్రశాంతంగా ఉండగలరు. దీన్నే ఫ్లో స్టేట్ అంటారు. మరెందుకు ఆలస్యం వీటిలో మీకు నచ్చిన టెక్నిక్ ఉపయోగించి ఓవర్ థింకింగ్ నుంచి తప్పించుకోండి. అయితే ఇవి మానసిక సమస్యలున్నవారికి కాదని, సైకోథెరపీకి ప్రత్యామ్నాయం కాదనే ఎరుకతో ఉండండి. ఈ ప్రయత్నాలేవీ మీ ఓవర్ థింకింగ్ ను ఆపలేకపోతే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లోని కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ ద్వారా మీ ఓవర్ థింకింగ్ ను తప్పించుకునేందుకు సహాయపడగలరు. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
అలర్జీని ఎలా వదిలించుకోవాలి..?
ఒక్కోసారి మనం బాస్‌తో, సహోద్యోగులతో, స్నేహితులతోనో మాట్లాడే సమయంలో లేదా ఏమయినా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు తల దురద పెడుతుంటుంది. ఆ సమయంలో కలిగే ఇబ్బంది ఇంతా అంతా కాదు. తల దురదకు కేవలం పేలు లేదా చుండ్రు వంటివి మాత్రమే కాదు, అలర్జీ కూడా కారణం కావచ్చు. అలర్జీ అనేది కేవలం శరీరంపై దద్దుర్ల రూపేణా మాత్రమే వస్తుందనుకోవడానికి వీలు లేదు. తలలో కూడా వస్తుంది. ముందుగా ఈ దురద ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే దాన్ని నివారించడం సులభమవుతుంది. కొన్ని రకాల క్రిముల వల్ల, కొంతమందికి సాధారణంగానే అరచేతులు, అరికాళ్లలో ఎక్కువ చెమట పడుతుంది. ఎప్పటికప్పుడు చెమటను తుడుచుకుంటూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. కొంతమంది ఎక్కువగా నీటిలో నానుతూ పనిచేస్తుంటారు. నీటిలో అదేపనిగా నానడం కూడా అలర్జీకి కారణమవుతుంది. కొన్ని సార్లు డిటర్జెంట్లు కూడా కొంతమందిలో అలర్జీకి కారణమవుతాయి. అదేవిధంగా కొన్ని రకాలైన నూనెలు, ఎరువులు, ఇంధనాలతో కూడా ఈ సమస్య వస్తుంది. పరిష్కారాలు: ఇలా ఇబ్బంది పెట్టే తల దురద నుంచి తప్పించుకోవటానికి మిరియాలు బాగా ఉపయోగపడుతాయి. అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ పాలతో కలిపి బాగా నూరాలి. తర్వాత కొద్దిగా నీళ్లలో ఉడికించి పేస్టు మాదిరిగా చేసి దాన్ని ఆరబెట్టి కొద్దిగా వేడి ఉండగానే తలకు రుద్దాలి. అరగంట తర్వాత శీకాయ పొడితో తలస్నానం చేయాలి. ఈవిధంగా వారానికి మూడు, నాలుగు సార్లు చేస్తే తల దురద పూర్తిగా పోతుంది. ఆహారం ద్వారా: ఉప్పు, పులుపు, కారం తక్కువగా ఉండే, బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు అధికంగా ఉండే తాజా పళ్ళు, గ్రీన్ సలాడ్లను తీసుకోవడం మంచిది. మంచినీరు బాగా తాగడం, తగినంత వ్యాయామం, ధ్యానం చేయడం ద్వారా కూడా దురదలను తగ్గించుకోవచ్చు. దురద, దద్దుర్లు నిరోధించేందుకు మరికొన్ని జాగ్రత్తలు: దురద సమస్య ఎక్కువగా ఉంటే ముందు జాగ్రత్తగా తీపి పదార్ధాలను తినటం తగ్గించాలి. శరీరాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి: మనం వంటికి రుద్దుకునే సబ్బు లేదా తలకు రాసుకునే నూనె, మనం వాడే స్ప్రే లేదా కొత్త మోడల్ దుస్తులకు ఉపయోగించే మెటీరియల్ కూడా మన చర్మానికి సరిపడకపోవచ్చు. అందువల్ల ఉన్నట్టుండి దురదలు వస్తుంటే, మన అలవాట్లలో కొత్తగా వచ్చిన మార్పేమిటో తెలుసుకుని దానినుంచి దూరంగా ఉండటం ఉత్తమం. ఇవి చదవండి: 90 శాతం యువతుల్లో ఇప్పటికీ ఆ లోపం, బెస్ట్ ఫుడ్ ఇదిగో! -
90 శాతం యువతుల్లో ఇప్పటికీ ఆ లోపం, బెస్ట్ ఫుడ్ ఇదిగో!
మహిళల్లో, యువతుల్లో ఐరన్ లోపం సమస్య ఆందోళన రేపుతోంది.కానీ దీని గురించిపెద్దగా పట్టించుకోరు. తాజా లెక్కల ప్రకారం 90శాతం యువతులు ఇప్పటికీ ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. నేషనల్ టెక్నికల్ హెడ్, చీఫ్ పాథాలజిస్ట్ అపోలో డయాగ్నోస్టిక్స్ డాక్టర్ రాజేష్ బెంద్రే ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించారు. సమతులం ఆహారం, సప్లిమెంట్లపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాసెస్ చేసిన ఆహారాలపై ఎక్కువగా ఆధారపడటం దీనికి ఒక కారణమన్నారు. ఐరన్‌తో కూడిన ఆహార వనరులు, ఆహార అవసరాలపై అవగాహన లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని డాక్టర్ పేర్కొన్నారు. ఐరన్ లోపం, లక్షణాలు ► ఐరన్ తగ్గితే పెరిగే పిల్లల్లో పెరుగుదల లోపాలు కనిపిస్తాయి. అనీమియా వస్తుంది. ► తలనొప్పి, విపరీతమైన నీరసం, అలసట, ఏకాగ్రత కుదరక పోవడం, నెలసరి క్రమం తప్పడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది గర్భిణీలు కూడా ఇనుము లోపంతో బాధపడుతున్నారు. ►దాదాపు 50-60 శాతం మంది గర్భిణీ స్త్రీలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ► ఐరన్ లోపం పిండం ఎదుగుదలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రసవ సమయంలో ఏదైనా అనుకోని సమస్యలొస్తే ఇబ్బంది అవుతుంది. ► హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోయి, రక్తహీనత, బలహీనత, శ్వాస ఆడకపోవడం, చర్మం పాలిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి ఐరన్ లోపం అనేది అనేక రోగాలకు పెట్టు. శరీరంలోని అన్ని కణజాలాలకు రక్తం ద్వారా ఆక్సిజన్‌తో పాటు ఇతర పోషకాలు రక్తం ద్వారా అందుతాయి. ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు ఆక్సీజన్ ను రక్తం ద్వారా శరీరానికి అందిస్తాయి. అందుకే ఐరన్ పుష్కలంగా ఉండాలంటే సప్లిమెంట్లతో పాటు, పల్లీలు బెల్లం, బెల్లంతో చేసిన పదార్థాలు, బచ్చలికూర, కొత్తిమీర పప్పులు వంటి ఐరన్-రిచ్ ఫుడ్స్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బచ్చలి కూర బచ్చలి కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. చిక్కుళ్లు: చిక్కుడు జాతి గింజల్లో బీన్స్, బఠానీల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం మాత్రమే కాదు ఇతర పోషకాలు, ఫైబర్ కూడా అధికం. గుమ్మడి గింజల్లో ఐరన్ మాత్రమే కాదు విటమిన్ కె, జింక్, మాంగనీస్ కూడా ఉంటాయి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గిస్తుంది. బ్రకోలి: బ్రకోలిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఇందులోని విటమిన్ సీ ఐరన్ ఎక్కువ గ్రహించేందుకు సహాయపడుతుంది. కాలీఫ్లవర్, క్యాబెజీ వంటి క్రూసీఫెరస్ కుటుంబానికి చెందిన అన్ని కాయగూరలు మన ఆహారంలో చేర్చుకోవాలి. టోఫూ: సోయా నుంచి తయారు చేసే పన్నీర్ టోఫు. ఇందులో నియాసిన్, సెలీనియం వంటి పోషకాలే కాదు విటమిన్ బి12 కూడా పుష్కలంగా ఉంటుంది ఇంకా. థయామిన్, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం లాంటి పోషకాలు, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. చేపలు: చేపల్లో ఐరన్‌తోపాటు ఒమెగా 3 ఫాటీ ఆసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు చురుకుగా ఉండేందుకు ,మెరుగైన రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు దోహదపడతాయి. నట్స్ అండ్ ఫ్రూట్స్: బాదం, శనగలు జీడిపప్పు, అలాగే జామ, అరటి పండ్లను తీసుకోవాలి. -
భానుడి భగ భగ: ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
మార్చి మాసం ముగియుకుండానే భానుడి భగ భగలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో మండే ఎండలు, వేడిగాలులు తట్టుకొని నిలబడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే వేసవిలో వడ దెబ్బ ప్రమాదం పెరుగుతుంది. మరి వడదెబ్బ, ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎండలు రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో పిల్లా పెద్దా అంతా అప్రతమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా, నీరు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాదు బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి రక్షణ లేకుండా వెళ్లవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగాలి. వీటితోపాటు రకరకాల ద్రవపదార్థాలు, పానీయాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యాన్నిచ్చే వివిధరకాల తాజా పండ్ల రసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పెరుగు, మజ్జిగ, సీజనల్ పండ్లు, ద్రాక్ష, బొప్పాయి వంటివి ఈ సీజన్లో తీసుకోవడం మేలు చేస్తుంది. అతిగా ఆహారం తీసుకోవడం హానికరం. నీటిని ఎక్కువగా వాడాలి.దాహంగా ఉంది కదా అని రసాయన సహిత కూల్ డ్రింక్స్, శుభ్రమైన ఐస్ వాడని డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ తినకూడదు. ఫాస్ట్ ఫుడ్, బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బులతో బాధపడేవారు, శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఎండలోకి వెళ్లకుండా చూడాలి. తప్పదు అనుకుంటే, ఎండను తట్టుకునేలా తలపై టోపీ లేదా గొడుగు వాడాలి. బార్లీని నీటిలో నాన బెట్టి మరిగించి తయారు చేసిన నీళ్లు తాగితే వడదెబ్బ తగలదు. ఉల్లి పాయ రసం తాగితే వడదెబ్బ తగలకుడా చేస్తుంది. దీనితో పాటు, ఉల్లిపాయ రసాన్ని అరికాళ్ళపై పూయడం కూడా మంచిదే. చెమటలు పట్టేటప్పుడు చల్లటి నీరు ఎక్కువగా తాగడం ప్రమాదకరం. అలాగే ఎండలోంచి లోపలికి వచ్చిన వెంటనే గట గటా చల్లని నీళ్లు తాగకూడదు. ఒకవేళ ఏదైనా అనారోగ్యంగా అనిపించినా, వాంతులు, కళ్లు తిరగడం, తలనొప్పి, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపించినా, వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. తక్షణమే చికిత్స తీసుకోవాలి. -
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ వాటర్ ట్రై చేయండి!
బరువు తగ్గాలనుకునేవారు రకరకాల పద్దతులను ప్రయత్నిస్తూ ఉంటారు. జీవన శైలి మార్పులతోపాటు, కొన్ని ఆహారనియమాలతో అధిక బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. వాటిల్లో ఒకటి ఓక్రా (బెండకాయ లేదా లేడీస్ ఫింగర్ ) వాటర్. పరగడుపున బెండ కాయ నీళ్లు తాగడం వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయని పెద్దలు చెబుతారు. బరువు తగ్గడానికి, రక్తపోటు నియంత్రణలో బెండకాయ ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బెండకాయలో కేన్సర్ నిరోధక లక్షణాలున్నాయి. ముఖ్యంగా పేగు కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వినియోగం, సమయం వ్యక్తిగత ప్రాధాన్యతలు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుందనేది గమనించాలి. ఓక్రా వాటర్ అంటే ఏమిటి? బెండకాయ కూర, వేపుడు, పులుసు ఇలా రకరకాల వంట గురించి తెలుసు.కానీ చాలామంది ఓక్రా వాటర్, దాని ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదు. ఓక్రా నీటిని తయారు చేయడం సులభం. 24 గంటలు లేదా రాత్రిపూట నీటిలో నానబెట్టడం ద్వారా తయారు చేయవచ్చు. శుభ్రంగా కడిగిన నాలుగు బెండకాయలను ముక్కలుగా కోసం రాత్రంతా నీటిలో ఉంచాలి. దీని మొత్తం వల్ల పోషకాలు నీటిలోకి చేరతాయి. ఉదయాన్ని ఈ నీటిని సేవించడం వల్ల లభించే పోషకాలు, విటమిన్లు ఇలా ఉంటాయి. పోషకాలు, విటమిన్లు కేలరీలు: 31 కిలో కేలరీలు ప్రోటీన్: 2 గ్రాములు కొవ్వు: 0.2 గ్రాములు పిండి పదార్థాలు: 7 గ్రాములు ఫైబర్: 3 గ్రాములు మాంగనీస్: రోజువారీ విలువలో 33శాతం (DV) విటమిన్ సి: రోజువారీ విలువలో 24శాతం చర్మ సౌందర్యం చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్ సి, పొటాషియం, ఫోలియేట్ వంటి విటమిన్లు ,యు మినరల్స్‌తో నిండిన ఓక్రా వాటర్ సహజ చర్మ టానిక్‌గా పనిచేస్తుంది, ఆరోగ్యకరమైన , ప్రకాశవంతమైన ఛాయను అందిస్తుంది. యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. ముఖ్యంగా, ఓక్రాలో ముఖ్యంగా మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది, రక్తంలో చక్కెర నియంత్రణకు ఇది కీలకమైన ఖనిజం. అదనంగా, ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది , రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్త్రీ,పురుషుల్లో లిబిడో(శృంగారేచ్ఛ)ను పెంచడంలో దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని నమ్ముతారు. -
బీట్రూట్- మిల్క్ ప్యాక్: మచ్చలు మాయం, గ్లోయింగ్ స్కిన్
ఎండాకాలంలో ముఖం, చర్మం సూర్యరశ్మికి గురికావడం వల్ల చాలా సమస్యలొస్తాయి.మొటిమలు ఎక్కువగా వస్తాయి. చర్మం నల్లబడుతుంది. సూర్యరశ్మికి ఎక్కువగా తిరగడం వల్ల చర్మ రంగు మారుతుంది. ఈ సమస్యని దూరం చేయాలంటే బీట్రూట్ క్రీమ్, ప్యాక్ హెల్ప్ చాలా సహాయ పడుతుంది. బీట్ రూట్ క్రీమ్ తొక్కతీసిన అరకప్పు బీట్రూట్ ముక్కలను గిన్నెలో వేసి అరగ్లాసు నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆపేసి బీట్రూట్ ముక్కల్లో టీస్పూను సోంపు వేసి పది నిమిషాలు నానబెట్టాలి. పది నిమిషాల తరువాత బీట్రూట్ ముక్కల్లో ఉన్న నీటిని వడగట్టి తీసుకోవాలి. ఈ నీటిలో టీస్పూను రోజ్ వాటర్, రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి. వారం రోజులపాటు నిల్వ ఉండే ఈ క్రీమ్‌ను రోజూ ఉదయం పూట రాసుకుంటే.. ముఖం మీద మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పట్టి ప్రకాశవంతముగా కనిపిస్తుంది. బీట్రూట్ ఫేస్ ప్యాక్ స్కిన్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేసి చర్మ రంగుని మెరుగ్గా చేస్తుంది. బీట్రూట్ తొక్క తీసేసి ముక్కలుగా కోయాలి. ఈ ముక్కలకు పాలు కలిపి గ్రైండ్ చేయాలి. దీనిని ముఖానికి ప్యాక్‌లా అప్లయ్ చేయాలి. అలా మెడమీద కూడా రాసుకోవాలి. 15 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ దూరమవుతాయి. మురికిని దూరం చేసి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. పాలు కలుపుతాం కాబట్టి, చర్మం మృదువుగా, మెరుస్తుంటుంది. చర్మ సమస్యల్ని దూరం చేసి టోన్ చేయడంలో బీట్రూట్ హెల్ప్ చేస్తుంది. బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే బీట్రూట్లో నేచురల్ కలర్ ఉంటుంది. ఇందులోని బీటా లైన్ ఫెయిర్ స్కిన్‌టోన్‌ని అందిస్తుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి చర్మంలోని సమస్యల్ని దూరం చేసి ముడతలు పడకుండా చేస్తుంది. -
విటమిన్ ‘ఏ’ లోపిస్తే ...అంత ప్రమాదమా..!
ఆరోగ్యంగా జీవించాలంటే విటమిన్లు, పోషకాలు చాలా అవసరం. శరీరంలోని అనేక ప్రక్రియలకు విటమిన్ ‘ఏ’ చాలా అవసరం. రెటినోల్, రెటీనా రెటినోయిక్ యాసిడ్ సమ్మేళనం ఈ విటమిన్. అందుకే దీన్ని రెటినోల్ అని కూడా పిలుస్తారు. ఇది కొవ్వులో కరిగే పోషకం. మాంసం, చికెన్, చేపలు , పాలు, ఇతర మాంసాహారంలో ఇది లభిస్తుంది. ఏ విటమిన్ తో వచ్చే లాభాలు, లోపిస్తే నష్టాలు గురించి తెలుసుకుందాం. కెరోటినాయిడ్స్, ఆల్ఫా-కెరోటిన్, బీటా-కెరోటిన్ , బీటా-క్రిప్టోక్సంతిన్ విటమిన్ ఏలో పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తి, సంతానోత్పత్తి, చక్కటి దృష్టికి ఇవి చాలా కీలకం అంతేకాదు చర్మ ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. నిపుణుల అభిప్రాయ ప్రకారం ఏ మిటమిన్ లోపిస్తే శరీర పనితీరు దెబ్బతినడమే కాదు, అంధత్వం నుండి వంధ్యత్వం వరకు చాలా సమస్యలు పొంచి ఉన్నాయి. ఊపిరితిత్తులు, కణజాలాలు, చర్మం, గుండె, రోగనిరోధక వ్యవస్థ సమస్యలకు కూడా దారితీస్తుంది ఇక కాలేయ రుగ్మతలు, అవసరమైన విటమిన్లను గ్రహించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీసే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. విటమిన్ ‘ఎ’ లోపిస్తే మొటిమలు పొడి చర్మం, కళ్ళు పొడిబారడం వంధ్యత్వం, గర్భ ధారణలో సమస్యలు గొంతు, ఛాతీ ఇన్ఫెక్షన్లు లాభాలు రేచీకటి, వయసు సంబంధిత సమస్యలనుంచి రక్షిస్తుంది. కొన్ని రకాల కేన్సర్ల బారిన పడకుండా కాపాడుతుంది. మొటిమలు, నల్లటి మచ్చలు రాకుండా చూస్తుంది. ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డీతో పాటు, ఎముకల పెరుగుదలకు విటమిన్ ఏ కూడా చాలా అవసరం. ఎముకల బలానికి విటమిన్ఏ కూడా చాలా అవసరం. నోట్: విటమిన్ ఏ ఎక్కువైనా కూడా చాలా ప్రమాదం. విటమిన్ ఏ ఎక్కువైతే హైపర్ విటమినోసిస్ A కి దారి తీస్తుంది. సప్లిమెంట్లతో పోలిస్తే విటమిన్ ఏ సహజంగా లభించే ఆహారాలు (పాలు,గుడ్డు, కేరట్, చేపలు లాంటివి) మేలు. ఏదైనా వైద్యుల పర్యవేక్షణ అవసరం. -
వేసవి కాలంలో చలవ చేయాలంటే ఈ పప్పులు ఉత్తమం
ఎండలు ముదురుతున్నాయి. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు చెమటలు విసిగిస్తాయి. దీంతో శ్రద్ధగా వంట చేయాలంటే చాలా కష్టం. ఎంత తొందరగా పని ముగించుకుని వంటింట్లోంచి బైటపడదామా అని పిస్తుంది. అందుకే దీని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే చమటరూపంలో ఎక్కువ నీరు పోవడం వల్ల, దాహంఎక్కువ కావడం వల్ల, శరీరం తొందరగా వేడెక్కుతుంది. మరి శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచడంతోపాటు పోషకాలు అందించే కొన్ని పప్పులు గురించి తెలుసుకుందామా! వేసవి కాలంలో మనం తీసుకునే ఆహారం పై కూడా శ్రద్ధ పెట్టాలి. పెసరపప్పు, శనగ పప్పు, మినపప్పు, సోయా, బఠానీ లాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. పెసరపప్పు మిగిలిన అన్ని పప్పులతో పోలిస్తే కొద్దిగా భిన్నంగా ఉంటుది. ఎక్కువ చలవ చేస్తుంది. పెసరపప్పు: వేసవికాలంలో ముందుగా గుర్తొచ్చేది పెసరప్పు చేసుకొనే పెసరకట్టు. తేలిగ్గా జీర్ణం అయ్యేలా.. అల్లం, పచ్చిమర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలతో.. కమ్మ కమ్మగా ఉండేలా దీన్ని చేసుకోవచ్చు. అలాగే పెసర పప్పు-మెంతికూర, బీరకాయ-పెసరపప్పు, పొట్లకాయ-పెసరపప్పు ఇలా రకరకాల కాంబినేషన్స్‌లో దీన్ని తీసుకోవచ్చు. ఈ పప్పులో ప్రోటీన్, విటమిన్ ఎ, బి, సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం లభిస్తాయి. ఫైబర్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.అలాగే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. కాయధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వేసవిలో పెసరపప్పు చలవచేస్తుందని గర్భధారణ సమయంలో కూడా దీన్ని భేషుగ్గా తినవచ్చని ఆహార నిపుణులు చెబుతారు.. మినపప్పు: ఇది వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. విటమిన్లు, మినరల్స్ ,ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మంచి ఐరన్ లభిస్తుంది. కడుపు, చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పోపులు, పచ్చళ్లలో వాడటంతోపాటు, ఇడ్లీ, దోస, వడ లాంటి వంటకాలను తయారు చేసుకోవచ్చు. సోయాబీన్: వేసవిలో సోయాబీన్ పప్పు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా స్థిరంగా ఉంటుంది. ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, శక్తి, కాల్షియం, పొటాషియం అందుతాయి. మినపప్పు ఆహారంలో చేర్చుకుంటే రక్తపోటు ,కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. ఎముకలు ధృఢంగా ఉంటాయి. శనగ పప్పు: ఇదిజీర్ణం కావడం కష్టమని, శరీరంలో వేడి పెంచుతుందని వేసవిలో చాలా మంది దీన్ని తినరు. కానీ వేసవిలో ఈ పప్పు తింటే మేలు జరుగుతుంది. ఫైబర్, ఐరన్, మెగ్నీషియం , కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల వేసవిలో కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. నానపెట్టిన శనగలని అల్పాహారంగా చేసి పిల్లలకి పెడితే చాలా మంచిది. అయితే తిన్న తర్వాత ఎక్కువ నీరు త్రాగాలి. నోట్. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టు పప్పుల్లో కూడా కల్లీ ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కల్తీని జాగ్రత్తగా గమనిస్తూ శ్రేష్ఠమైన పప్పులను ఎంచుకోవాలి. -
కెమికల్ స్ట్రెయిట్నెర్లతో పనిలేకుండానే.. మీ జుట్టు హెల్దీగా, షైనీగా!
ఆధునిక కాలంలో స్టయిలింగ్‌కు, సౌందర్యానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పండగొచ్చినా, ఫంక్షనొచ్చినా బ్యుటీషియన్లకోసం పరుగులు పెడతారు చాలామంది. ముఖ్యంగా గజిబిజిగా ఉన్న జుట్టును, షైనీగా, స్ట్రెయిట్‌గా చేసుకోవడంపెద్ద టాస్క్. హీట్ లేదా కెమికల్ స్ట్రెయిట్నెర్లను ఉపయోగించకుండా స్ట్రెయిట్నింగ్ కోసం ఇవిగో టిప్స్ . బ్లో డ్రైయర్, హీట్ స్టైలింగ్ టూల్స్, కెమికల్ ట్రీట్మెంట్లు మన కేశాలను డ్యామేజ్ చేస్తాయి. అందుకే సహజ పద్ధతుల ద్వారా జుట్టును స్ట్రెయిట్ చేసుకోవచ్చు. స్ట్రెయిట్నర్ ద్వారా పదే పదే జుట్టును వేడికి గురి చేస్తే తొందరగా ఊడిపోతుంది. సహజమైన షైనింగ్‌ను కోల్పోయి పొడి బారుతుంది. అందుకే జుట్టును సహజంగా స్ట్రెయిట్ చేసే పద్ధతులు చూద్దాం. జెంటిల్ క్లెన్సింగ్: రాత్రి పూటే సహజమైన నూనెను జుట్టంతా పట్టించి, ఉదయాన్నే రసాయనాలు లేని షాంపూతో స్నానం చేసి వెంట్రుకలను మృదువుగా ఉంందుకు తేలికపాటి కండీషనర్‌ని వాడాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే జుట్టుగా మృదువుగా మెరుస్తూ చెప్పినట్టు వింటుంది. జుట్టు తడిగా ఉన్నపుడే పళ్లు వెడల్పుగా ఉండే దంతాల దువ్వెనతో సుత్తిమెత్తగా దువ్వుతూ చిక్కు తీయాలి. సహజంగా గాలికి ఆరనివ్వండి. లేదంటే ఫ్యాన్ ముందు మెల్లిగా దువ్వుతూ, బ్రషింగ్ చేసినా పరవాలేదు. చివర్ల నుండి ప్రారంభించి మూలాల వరకు దువ్వాలి. దీంతో జుట్టు ఎక్కువగా రాలదు. స్ట్రయిట్‌గా వస్తుంది. అలాగే జుట్టుకు కొద్దిగా స్మూతింగ్ సీరమ్ అప్లై చేయండి. లేదంటే కొద్దిగా ఆర్గాన్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా సిలికాన్ వంటి పదార్థాలనూ వాడవచ్చు. పాలు , తేనె: పాలలో ప్రొటీన్లు ఉంటాయి, ఇవి జుట్టును బలోపేతం చేయడంతోపాటు చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. తేనెలో తేమను కాసాడే సహజమైన హ్యూమెక్టెంట్ ఉంటుంది. ఒక కప్పు పాలలో రెండు టేబుల్ స్పూన్ల తేనె బాగా కలిసే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు మొదళ్ల నుండి చివరి వరకు బాగా పట్టించాలి. దీన్ని 1-2 గంటలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో జుట్టును వాష్ చేసుకోవాలి. రోలర్ దువ్వెనతో మంచిగా దువ్వు కోవాలి. దీంతో జుట్టు మెత్తగా షైనింగ్‌గా ఉంటుంది. అరటి-ఆలివ్ ఆయిల్ మాస్క్: అరటిపండులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.ఆలివ్ ఆయిల్ తేమను అందిస్తుంది. అరటిపండులో, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెతో మెత్తగా ఉండలు లేకుండా గుజ్జుగా చేసుకోవాలి. దీన్ని జుట్టుకు బాగా పట్టించాలి. అనంతరం జుట్టును షవర్ క్యాప్‌తో కప్పి 30 నుంచి 60 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆపై షాంపూతో వాష్ చేసి, కండీషనర్ అప్లయ్ చేయాలి. స్ట్రయిట్‌గా సిల్కీగా జుట్టు మెరిసిపోతుంది. గుడ్డు- ఆలివ్ ఆయిల్ మాస్క్: గుడ్లలో ప్రోటీన్లు ,పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ జుట్టుకు తేమను అందిస్తుంది. ఒకటి లేదా రెండు గుడ్లను (వాసన పడని వారు పచ్చసొనను తీసివేయాలి) కొట్టి, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట, లేదా గంటసేపు మాస్క్ వేసి ఉంచుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మీరు నమ్మలేనంత మృదువుగా వెంట్రుకలు తయారవుతాయి. అలోవెరా జెల్ మాస్క్: సౌందర్య పోషణలో అలోవెరాకున్న ప్రాముఖ్యతే వేరు. అలోవెరా జెల్ జుట్టును స్ట్రెయిట్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సహజమైన జెల్‌ను తీసి జుట్టుకు అప్లై చేసి, 30-60 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఆ తరువాత కండిషనర్ తప్పకుండా అప్లయ్ చేయాలి. -
కూల్ డ్రింక్స్ అతిగా సేవిస్తే.. ఎంత ముప్పో తెలుసా? చివరికి...!
నేటి కాలంలో సీజన్‌తో సంబంధం లేకుండా కూల్‌డ్రింక్స్ ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇక వేసవిలో అయితే కూల్ డ్రింక్స్ వినియోగం గురించి చెప్ప నక్కర లేదు. క్షణం కూడా ఆలోచించకుండా పసిపిల్లలకు కూడా తాగిస్తున్నారు. తాగిన ఆ కాసేపు రుచిగా, హాయిగా అనిపించినా, శీతల పానీయాల వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలున్నాయో తెలిస్తే షాకవుతారు. అతిగా కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి నిపుణుల హెచ్చరికల్ని ఒకసారి గమనించండి! నలుగురు కలిసిన చోట, పార్టీల్లోనూ, శుభకార్యాల్లోనూ కూల్‌డ్రింక్స్ ఒక స్టేటస్‌గా సింబల్‌గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. చివరకు ఇది ఒక అలవాటుగా మారిపోయి ఫ్రిజ్‌లలో స్టోర్ చేసుకొని మరీ లాగించేస్తున్నారు. కొందరైతే కూల్ డ్రింక్ తాగితే తప్ప తిన్నది అరగడం లేదు అనే స్థాయికి వచ్చేశారు. ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం శీతల పానీయాలు జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కడుపు సమస్యలు తలెత్తుతాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది అజీర్ణం, వాంతులు ..ఇలా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు: శీతల పానీయాలు, సోడాల్లో వినియోగించే శుద్ధిచేసిన చక్కెర (ఒక్కో బాటిల్లో దాదాపు 10 టీ స్పూన్ల వరకు) అధికంగా ఉంటుంది. కేలరీలు, కెఫిన్ మోతాదు కూడా ఎక్కువే. వీటి ద్వారా పెద్ద మొత్తంలో ఫ్రక్టోజ్ తీసుకోవడంతో లెప్టిన్ హార్మోన్ ప్రభావితమవుతుంది. తద్వారా వేగంగా బరువు పెరుగుతారు. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు మూలం. డయాబెటిక్: రక్తపోటు ముప్పు పెరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఇది మరింత ప్రమాదాన్ని చేకూరుస్తుంది. శీతల పానీయాలలో ఉండే ఫ్రక్టోజ్, రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ప్రధాన కార్బోహైడ్రేట్ అని గుర్తించాలి. ఫ్యాటీ లీవర్: శుద్ధి చేసిన చక్కెరలో ఉండే ప్రధానమైనవి. గ్లూకోజ్ ఫ్రక్టోజ్. శరీర కణాలు గ్లూకోజ్‌ను సులభంగా జీర్ణం చేస్తాయి. కానీ ఫ్రక్టోజ్‌ను అరిగించే పని మాత్రం కాలేయానిదే. కూల్ డ్రింక్స్ఎక్కువైతే ఫ్రక్టోజ్ ఓవర్‌లోడ్‌కు దారితీస్తుంది. కాలేయం ఈ ఫ్రక్టోజ్‌ను కొవ్వుగా మారుస్తుంది. దీంతో లీవర్ సమస్యలొస్తాయి. గుండె, కీళ్ల, సమస్యలు: శీతల పానీయాలు ఎక్కువైతే గుండె ఆరోగ్యంపై ప్రభావితమవుతుంది. అలాగే వీటిల్లోని మితిమీరిన కెఫిన్ నరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ అధికమై గౌట్ , కీళ్లలో వాపు లేదా నొప్పి వస్తాయి. ఇది నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది. పంటి సమస్యలు: సోడాల్లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ దీర్ఘకాలంలో పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. ఇవి చక్కెరతో కలిపినప్పుడు, ఈ ఆమ్లాలు నోటిలో బ్యాక్టీరియాకి కారణమవుతాయి. వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ శీతల పానీయాలు తాగే వ్యక్తుల్లో ప్యాంక్రియాటిక్ కేన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు రెండు రెట్టు పెరుగుతుంది. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో ఎండోమెట్రియల్ కేన్సర్ వచ్చే ప్రమాదం. శీతల పానీయాలు క్రమం తప్పకుండా తాగే వ్యక్తుల జ్ఞాపకశక్తి ప్రభావితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మానవశరీరంపై చాలా హానికరమైన ప్రభావాన్ని చూపే శీతల పానీయాలకు బానిసలైన వారు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటు పడాలి. -
కామెర్ల వ్యాధి రకాలు: లివర్ని కాపాడే బెస్ట్ ఫుడ్ ఇదిగో!
మన బాడీలో పవర్ హౌస్ లివర్. లివర్ పనితీరు దెబ్బ తింటే అనే అనారోగ్యాల బారిన పడతాం. కాలేయం దెబ్బతింటే వచ్చే కామెర్ల వ్యాధి నాలుగు రకాలుగా ఉంటుంది. రక్త పరీక్ష ద్వారా మాత్రం ఈ వ్యాధిని నిర్ణయిస్తారు. వ్యాధి నిర్దారణ ఆధారంగా చికిత్స ఉంటుంది. ప్రీహెపాటిక్: రక్తంలో బిలిరుబిన్ స్థాయి పెరిగితే, దానిని ప్రీహెపాటిక్ కామెర్లు అంటారు. హెపాటిక్ : కాలేయం బిలిరుబిన్ను ఉత్పత్తి చేయలేకపోతే దానిని హెపాటిక్ కామెర్లు అంటారు. పోస్ట్థెపాటిక్: బిలిరుబిన్ పేరుకుపోవడం, శరీరం తొలగించలేకపోవడాన్ని పోస్ట్థెపాటిక్ కామెర్లు అంటారు. అబ్స్ట్రక్టివ్:.పాంక్రియాటిక్ వాహిక మూసుకుపోయినపుడు వచ్చిన కామెర్లను అబ్స్ట్రక్టివ్ కామెర్లుగా పిలుస్తారు. నవజాత శిశువులు కూడా జాండిస్ బారిన పడతారు. దీనికి ‘ఫోటోథెరపీ’ ట్రీట్మెంట్ ద్వారా నయం చేస్తారు లివర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు లివర్ ఆరోగ్యాన్ని సరైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రందించాలి. టీ: బ్లాక్ టీ, గ్రీన్ టీ తీసుకుంటే మంచిది. ముఖ్యంగా గ్రీన్ టీని తీసుకోవడం వల్ల లివర్‌కి బాగా హెల్ప్ అవుతుంది. అలానే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది లివర్ ఫ్యాట్ కూడా కరుగుతుంది. రోజూ ఒక కప్పు కాఫీ తీసుకున్నా మంచిదే. టోఫు : సోయాతో తయాయ్యే టోఫు కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సోయా బీన్స్‌తో సొయా నట్స్ వంటివి కూడా తీసుకోవచ్చు. పండ్లు : ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ ఆరెంజ్, ద్రాక్ష వంటివి తీసుకుంటే లివర్ ఆరోగ్యం బాగుంటుంది. లివర్‌లో కొవ్వు పేరుకుపోకుండా విటమిన్ సి హెల్ప్ చేస్తుంది. క్రాన్బెర్రీ, బ్లూబెర్రీ వంటివి కూడా తీసుకోవచ్చు. ఓట్స్ , నట్స్: యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.ఇంకా బీన్స్, గింజలు వంటివి కూడా తీసుకో వచ్చు. విటమిన్-ఇ సమృద్ధిగా నట్స్‌తో ఇంఫ్లమేషన్ తగ్గుతుంది. కూరగాయలు : బ్రోకలీ, కాలీఫ్లవర్, పాలకూర కూరలతో లివర్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా నాన్-ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య నుండి కూడా బయట పడొచ్చు. పాలకూర వంటి వాటిలో గ్లూటాతియోన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నోట్: లక్షణాలు చూసి బయపడిపోకుండా, వైద్యులను సంప్రదించి, రక్త, మూత్రం, తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షల ఆధారంగా చికిత్స తీసుకోవాలి. సమతులం ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మద్య పానం, ధూమపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. -
డైరెక్టర్ని పొట్టన పెట్టుకున్న జాండిస్? ఎందుకు వస్తుంది? లక్షణాలు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ అకాలమరణం విషాదాన్ని నింపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన పచ్చకామెర్లు వ్యాధితో చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది. లక్షణాలు ఏంటి? ఇది ప్రాణాంతకమేనా తదితర వివరాలను తెలుసుకుందాం. పచ్చకామెర్లు సరైన సమయంలో చికిత్స తీసుకోనట్టయితే ఇది కూడా ప్రాణాంతక వ్యాధి. తొలి దశలోనే గుర్తించక పోతే నష్టం తీవ్రంగా ఉంటుంది. మన శరీరంలోని లివర్ లేదా కాలేయం చాలా పనులను నిర్వరిస్తుంది. వైరస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఆల్కహాల్ లేదా మాదకద్రవ్యాల వినియోగం, తదితర కారణాల చేత కాలేయం సరిగ్గా పని చేయనప్పుడు జాండిస్ వ్యాధి వస్తుంది. ఎసిటమైనోఫెన్, పెన్సిలిన్, గర్భనిరోధక మాత్రలు , స్టెరాయిడ్స్ వంటి మందులు కూడా కాలేయ వ్యాధికి కారణం కావచ్చు. ఈ కామెర్లు నవజాత శిశువులు మొదలు ఎవరికైనా రావచ్చు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. కామెర్లలో నాలుగు రకాలు ఉన్నాయి. ప్రధానంగా రక్తంలోని బిలిరుబిన్ను ఉత్పత్తి పెరిగిపోతోంది. ఫలితంగా కళ్లు, గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి. లక్షణాలు ♦ బరువు తగ్గడం, ఆకలి తగ్గుతుంది. మత్తుగా ఉండటం, ♦ శరీరం పసుపు పచ్చ కలర్లోకి మారిపోతుంది. కళ్ళు , మూత్రం కూడా పసుపు రంగులోకి మారతాయి. ♦ కడుపులో మంట ,కడుపు నొప్పి ♦ ముఖ్యంగా పక్కటెముకల దిగువ భాగంలో బాగా నొప్పి , వికారం వాంతి వచ్చినట్టు ఉంటుంది. ♦ చలి, జ్వరం ♦ రక్తపు వాంతులు మద్యపానం, ఇతర కారణలు కొన్ని ఇతర కారణాలతోపాటు అతిగా మద్యం సేవించే వారిలో కాలేయం దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి. పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు కూడా కామెర్లు వచ్చేందుకు దారి తీస్తాయి. కాలేయం నుంచి పేగుల్లోకి పైత్య రసాన్ని తీసుకుని వెళ్లే కాలేయ వాహికలో రాళ్లు, నిర్మాణపరమైన లోపాలు, కేన్సర్ సోకినా కామెర్లకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు కామెర్ల వ్యాధిని నిర్లక్ష్యంచేస్తే రక్తపు వాంతులతోపాటు, రోగి కోమాలోకి వెళ్లి చనిపోయేప్రమాదం కూడా ఉంది. అందుకే అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం నోట్: సమతుల ఆహారాన్ని తీసుకుంటూ, మద్యపానం, ధూమపానం, గుట్కా లాంటి చెడు అటవాట్లకు దూరంగా ఉండాలి. ఆరోగ్య పరిస్థితిని, లక్షణాలను ఎప్పటికపుడు గమనించుకుంటూ ఉండాలి. వ్యాయామం, మెడిటేషన్ వంటి వాటికి సమయంకేటాయించాలి. ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తితే నిర్లక్ష్యం చేయకుండా, సమస్య ఏదైనా వైద్యుల ద్వారా నిర్ధరించుకుని సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. -
చిట్టి..చిట్టి మినప వడియాలు.. ఎన్ని లాభాలో..!
వేసవి కాలం వచ్చిందంటే వడియాలు, అప్పడాలు, ఆవకాయ తదితర పచ్చళ్ళ సందడి షురూ అవుతుంది. వీటిని సంవత్సరం మొత్తానికి సరిపోయేలా తయారు చేసుకోవడంలో గృహిణులు చాలా బిజీగా ఉంటారు. ముఖ్యంగా గుమ్మడి వడియాలు పిండి వడియాలు, మినప,పెసర వడియాలు, సగ్గుబియ్యం వడియాలు ఇలా ఈ జాబితాలో చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతి సులువుగా తయారు చేసుకునే చిట్టి మినప వడియాలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..! చిట్టి చిట్టి మినప వడియాలు తయారీకి కావాల్సినవి అరకిలో మినపప్పు (తొక్కతో ఉన్నదైతే వడియాలు గుల్లగా వస్తాయి) పచ్చిమిరపకాయలు బాగా కారం ఉండేవి 10 కొద్దిగా ఉప్పు, జీలకర్ర, కొద్దిగా అల్లం తయారీ ముందు రోజు రాత్రి నాన బెట్టి ఉంచుకున్న మినప పప్పును శుభ్రంగా కడిగి గ్రౌండర్లోగానీ, రోటిలోగానీ మెత్తగా రుబ్బు కోవాలి. ఎక్కువ జారుగా కాకుండా, గట్టి ఉండేలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇందులో ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి కారం కలిపిన తరువాత మరింత జారుగా అయిపోతుంది పిండి. ఇలా మెత్తగా రుబ్బి పెట్టుకున్న పిండిలో ముందుగానే దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి కారం కలుపుకోవాలి. ఆ తరువాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి(ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు) బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని శుభ్రమైన తడి గుడ్డపై గానీ, ప్లాస్టిక్ కవరైగానీ వేసుకుని ఎండబెట్టుకోవాలి. చక్కగా గల గల మనేలా డేలా ఎర్రటి ఎండలో రెండు మూడు రోజులు ఉంచాలి. వీటిని గుడ్డనుంచి తీసిన తరువాత ఒక బేసిన్లో వేసుకుని మరోసారి ఎండలో పెట్టాలి. పచ్చి లేకుండా బాగా ఎండాయో లేదో చెక్ చేసుకొని వీటిని తడిలేని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ చిట్టి వడియాలు కూరగాయల ధరలు మండిపోతున్న సమయంలో బాగా ఉపయోగపడతాయి. ఉల్లిపాయలతో కలిపి ఇగురు కూరలా చేసుకోవచ్చు. చాలా కూరగాయలతో కలిపి వండుకోవచ్చు. పులుసు కూరల్లో వాడుకోవచ్చు. సైడ్ డిష్‌గా కూడా భలే ఉంటాయి. మినప పప్పులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. దీంతో పిల్లలకు, పెద్దవాళ్లతోపాటు అందరికీ మంచిది. మినప పప్పు లోని ఫోలిక్ యాసిడ్ శరీరంలో కొత్త కణాలను, ముఖ్యంగా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కి సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా వుంటుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచిది -
వీకెండ్ స్పెషల్: ఈ టిప్స్ ఎపుడైనా ట్రై చేశారా..?
వీకెండ్ వచ్చిందంటే లేట్‌గా నిద్ర లేవడం, లేజీగా ఉండటం, ఎక్కువ ఫుడ్ లాగించేయడంకాకుండా, రోజంతా సరదాగా సంతోషంగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. స్నేహితులు, సన్నిహితులతో ఉత్సాహంగా గడపాలి. దీంతో రాబోయే వారమంతా చురుగ్గా ఉండే శక్తి వస్తుంది. పచ్చని ప్రకృతిలో ఎంజాయ్ చేయాలి. కాలుష్యానికి తావులేని పార్క్‌లకు వెళితే, మంచి ఆక్సిజన్ లభిస్తుంది. మన చుట్టుపక్కల చిన్నపిల్లలతో గడిపినా, కలిసి పెయింటింగ్ వేసినా, ఆటలాడినా భలే ఉత్సాహం వస్తుంది. అలాగే రాబోయే వారమంతా యాక్టివ్‌గా ఉండేలా కొన్ని ఆరోగ్య చిట్కాలు ఇవిగో.. ♦ వేసవి కాలం వచ్చేసింది.. ఫ్రిజ్ నీరు కంటే కుండ వాటర్ బెటర్. మరీ ఎక్కువ చల్లని పదార్థాలు, డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ♦ పిల్లలకు ఇంట్లో తయారు చేసిన ఐస్ క్రీ పెడితేమంచిది. ఎక్కువ నీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి. ♦ నడక, యోగా లాంటి వ్యాయామాలు, అలాగే బ్మాడ్మింటన్ లాంటి ఔటర్ గేమ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ♦ రోజూ నిద్రపోయే ముందు నానబెట్టిన బాదం, డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే ఆరోగ్యకరమైన కొవ్వులు ,ఇతర పోషకాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ , డైటరీ ఫైబర్ కూడా అధికం. ♦ కొన్ని ఎండు ద్రాక్ష కొన్ని ధనియాలు నీరు పోసి మరిగించి చల్లార్చి ఆ కషాయాన్ని ఉదయం, సాయంకాలం తాగాలి. కీళ్ల వాపులు తగ్గి పోతాయి. ♦ రొటీన్‌కి టీ కి బదులుగా అల్లం టీ తాగితే మంచి ఉత్సాహం వస్తుంది. అలాగే దంత సమస్యలు ఉన్నవారు.. నోటి దుర్వాసనతో బాధపడుతున్న వారు.. అల్లాన్ని ఎండబెట్టి పొడి చేసి దాంట్లో కాస్త నీరు కలిపి పేస్ట్‌లా చేసి దానితో పళ్లు తోముకుంటే చిగుళ్లు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. ♦ సీజనల్ వ్యాధులను తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. కాస్త అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని పూటకు ఒక కప్పు మోతాదులో తాగుతుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ♦ అల్లం , కీరా, నిమ్మకాయ రసం కలిపిన మిశ్రమాన్ని ప్రతి రోజు ఉదయం పూట తాగాలి. నొప్పులు, వాపులు తగ్గి పోతాయి. -
ఈస్ట్రోజెన్ - అద్భుతమైన ఫుడ్స్
#EstrogenandFood ఈస్ట్రోజెన్ మన శరీర పనితీరులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలోని జీవ క్రియలకు ఈస్ట్రోజన్ చాలా అవసరం. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం ఈస్ట్రోజన్ మహిళలలో నెలసరి, పునరుత్పత్తి వ్యవస్థ, లైంగిక కోరికను ప్రభావితం చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, కొల్లాజెన్ ఉత్పత్తిలో, ఎముకలు, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ సాయ పడుతుంది. జీవితకాలంలో ఈస్ట్రోజెన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు సాధారణం అయితే, ఈ స్థాయిల్లో తీవ్ర అసమతుల్యత వస్తే మొత్తం ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితంచేస్తుంది. శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గితే నెలసరి క్రమం తప్పడం, వివాహిత మహిళల్లో గర్భాధారణ లాంటి సమస్యలొస్తాయని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ హెచ్చరించింది.ఈస్ట్రోజెన్ తగ్గితే ఏమవుతుంది. శరీరంలో తగినంత ఈస్ట్రోజెన్ లేకపోతేచాలా సమస్యలొస్తాయి. అలాగే మెనోపాజ్ సమయంలో , అండాశయాల శస్త్రచికిత్స తొలగింపు తర్వాత ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గి పోతుందని ఎండోక్రైన్ సొసైటీ తెలిపింది. వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు, యోని పొడిబారడం, నిద్రలేమి , మైగ్రేన్ లాంటి సమస్యలు ఈస్ట్రోజెన్ తగ్గిందనడానికి సంకేతం. దీనికి సాధారణంగా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవచ్చు. అయితే దీన్ని దీర్ఘకాలంకొనసాగించలేం. అందుకే ఈస్ట్రోజెన్ అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల సహజంగా ఈ స్థాయిలను పెంచుకోవచ్చు.ఈస్ట్రోజెన్ లభించే ఆహారాలు► పాలు, గుడ్లు వంటి జంతు ఆధారిత ఉత్పత్తులు మన ఆహారంలో చేర్చుకుంటే ఈస్ట్రోజెన్ ఉత్పత్తి పెరుగుతంది. అయితే ఈ ఆహారాలను మితంగా తీసుకోవడం మంచిది.► అవిసె గింజలు , గోధుమ గింజలు, సోయాబీన్స్ ఉత్పత్తులు తీసుకోవాలి.► ఖర్జూరం, ప్రూనే, ఆప్రికాట్లు వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఫైటోఈస్ట్రోజెన్లు పుష్కలంగా ఉంటాయి. ► ఈస్ట్రోజెన్-రిచ్ ఫుడ్స్ కోసం చూస్తున్నట్లయితే నువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇతర ముఖ్యమైన పోషకాలతో పాటు ఫైటోఈస్ట్రోజెన్లలో కూడా లభ్యం.5 ఈస్ట్రోజెన్ లోపం కారణంగా ఎముకల సమస్యలతో బాధపడేవారికి వెల్లుల్లి బెస్ట్.►బ్రోకలీ , క్యాబేజీ, బచ్చలికూర వంటి ఆకులు మందంగా ఉండే ముదురు రంగు ఆకుకూరలు►ప్రముఖ డైటీషియన్ డానా కాన్లీ ప్రకారం ఒమేగా-త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభించే అవిసె గింజల్లో అత్యధిక ఫైటోఈస్ట్రోజెన్ కంటెంట్ ఉంది.►రాస్ బెర్రీస్, క్రాన్ బెర్రీస్, స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లతోపాటు, ఫైటోఈస్ట్రోజెన్లు కూడా ఉన్నాయి.నోట్: ఈస్ట్రోజెన్ లభించే ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీ 2017 అధ్యయనం ప్రకారం ఈస్ట్రోజెన్‌ను ఎండోక్రైన్ డిస్రప్టర్గా పరిగణిస్తారు. ఈ ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల వంధ్యత్వం ఈస్ట్రోజెన్-సెన్సిటివ్ అవయవాలలో కేన్సర్ ముఖ్యంగా రొమ్ము , గర్బాశయ, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. -
ఉల్లితో కలిగే ప్రయోజనాలు..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని చిన్నప్పటి నుంచి విన్నదే. అయితే, దానివల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే మాత్రం మనమే మరొకరికి చెబుతాం ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని... ఇంతకీ ఉల్లి ఏం మేలు చేస్తుందో, ఎలా చేస్తుందో తెలుసుకుందాం. మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లి శరీరానికి మంచిచేసే ఎన్నో పోషకాలనిస్తుందని పరిశోధనలలో వెల్లడైంది. పచ్చిఉల్లిని ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ అదుపులో ఉంటుందని పరిశోధనల్లో తెలిసింది. అంతేకాదు, ఉల్లిని తినడం వల్ల ఎలాంటి దుష్పలితాలూ ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గి, హార్ట్స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయి. ఉల్లిగడ్డను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. ఉల్లిపాయను గుజ్జుగా చేసి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్‌తో కలిపి తింటూ ఉంటే జీర్ణసంబంధిత సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను రోజూ ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది. పచ్చి ఉల్లిగడ్డ తినడం వల్ల బీపీ, హార్ట్ అటాక్, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు రావు. రాత్రి పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయ తింటే, వేసవిలో వడదెబ్బ ముప్పు తప్పుతుంది. దీనితోపాటు, పచ్చి ఉల్లిపాయలో వేసవి వేడి నుండి రక్షించే గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో ఉన్న విషాన్ని తొలగిస్తుంది. నిద్రకు ముందు పచ్చి ఉల్లిపాయ తినడం నిద్రలేమిని దూరం చేస్తుంది. జలుబు, కఫంలో ఉల్లిపాయ చాలా మేలు చేస్తుంది. ఉల్లి రసం, తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి త్వరగా తగ్గుతాయి. ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ సీ, కాల్షియం నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉల్లి అనేకరకాల క్యాన్సర్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. దీనితోపాటు, ఉల్లిపాయ తినడం వల్ల కడుపు, పెద్దప్రేగు, రొమ్ము, ఊపిరితిత్తులు ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలైనవి తగ్గుతాయి. ఉల్లి కీళ్లకు, గుండెకు మేలు చేస్తుంది. ఉల్లిగడ్డలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, డయేరియాల నుంచి కాపాడే ఆహారంలో ఉల్లిదే అగ్రస్థానం.. ఉల్లిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. పచ్చిఉల్లిపాయను రోజు తింటే ఎముకల బలహీనతను అధిగమించవచ్చు. ఉల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు సంబంధ సమస్యల్ని దూరం చేస్తాయి. ఉల్లి రసాన్ని మాడుకు పట్టించడం వల్ల జుట్టు రాలడంతోపాటు చుండ్రు సమస్యలు తగ్గుతాయి. జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. జుట్టు పెరుగుతుంది. మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉల్లి మంచి ఔషదం. ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజూ ఉదయం తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. తేనెటీగలు లేదా తేలు కుట్టినప్పుడు ఉల్లి రసాన్ని రాస్తే సత్వర ఉపశమనం ఉంటుంది. ఇవి చదవండి: శ్రామికలోక శక్తిమంతులు. -
కీళ్ల నొప్పులను తొలగించే చిట్కాలు మీకోసం...
నేటి కాలంలో 30 ఏళ్లు దాటితే చాలు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతున్నాయి. ఈ పరిస్థితిలో వాటిని ఎదుర్కోవటానికి చాలామంది చాలా చిట్కాలు పాటిస్తున్నారు. కానీ ఎటువంటి ఫలితాలు ఉండటం లేదు. కానీ ఆహారంలో ఈ మూడు పండ్లను చేర్చుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఆ పండ్లేమిటంటే... నారింజ: రోజూ నారింజను తినడం వల్ల శరీరంలో నీటి కొరత తీరుతుంది. ఇందులో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్లనొప్పులని తగ్గించడంలో సహాయపడుతుంది. ద్రాక్ష: వీలయినంత వరకు ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా అనేకరకాల వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. చిన్నప్పటినుంచి పిల్లలకి ద్రాక్షపండ్లను తినిపించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పుచ్చకాయ: వేసవి కాలంలో పుచ్చకాయ తినడం అన్ని విధాల శ్రేయస్కరం. దీనివల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. తక్షణ శక్తి లభిస్తుంది. దీనిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఎండాకాలం బయటికి వెళ్లే ముందు లేదా బయటి నుంచి వచ్చిన తర్వాత పుచ్చకాయ తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు కీళ్లనొప్పులని తగ్గిస్తాయి. ఇవి చదవండి: మిమ్మల్ని మీరే పట్టించుకోవాలీ..! -
మిమ్మల్ని మీరే పట్టించుకోవాలీ..!
కుటుంబ సభ్యులందరికీ కావలసిన వాటిని అమర్చడంలో పడి మహిళలు తమ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించరు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదని అందరికీ తెలిసిందే. అందువల్ల ముందే మేలుకొనడం అవసరం. నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు జరుపుకునే ఉంటారు. అయితే అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మహిళలు తమ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టి సమయం కేటాయించడం. తమ వయసుకు తగ్గ పోషకాహారం తీసుకోవడం. అనారోగ్య సమస్యలను దాచిపెట్టకుండా తగిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే...మీ కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి.. ఐరన్ ఉండే ఆహారం... మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన దానిలో ఐరన్ మొదటి స్థానంలో ఉంది. గర్భధారణ సమయంలో స్త్రీలకు ఐరన్ చాలా అవసరం. శరీరంలో ఐరన్ పరిమాణం తగ్గిపోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల నీరసం, అలసట, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల మీ ఆహారంలో మాంసకృత్తులు, చికెన్, సీఫుడ్, బీన్స్, కాయధాన్యాలు, బచ్చలి కూర, బ్రోకలీ, బీట్రూట్, దానిమ్మ, ఖర్జూరం, తృణధాన్యాలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. విటమిన్ ఎ తప్పనిసరి... మహిళలకు అవసరమైన విటమిన్ల జాబితాలో విటమిన్ ఎ ద్వితీయ స్థానంలో ఉంది. ఇది మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్. ఆహారంలో విటమిన్ ఎ అధికంగా ఉండే ఆకుకూరలు, అరటి పండ్లు వంటివి తీసుకోవాలి. విటమిన్ బి 12.. విటమిన్ బి 12 అనేది జీవక్రియ కార్యకలాపాలను పెంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది, మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందువల్ల బీ 12 సమృద్ధిగా ఉండే మాంసం, చేపలు, గుడ్లు తీసుకోవాలి. శాకాహారులు ΄÷ట్టు తియ్యని వేరసెనగపప్పు, సెనగలు, దంపుడు బియ్యం, వెన్న తియ్యని పాలు (జంతువుల నుంచి వచ్చిన పాలు) వంటివి తీసుకోవాలి. కాల్షియం... మహిళలు వయస్సు పెరిగేకొద్దీ, ఎముక సంబంధిత ఆరోగ్య సమస్యలను తరచు ఎదుర్కొంటారు. అందువల్ల, ఎముకల ఆరోగ్యానికి మహిళలు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. ఇందుకోసం పాలు, గుడ్డు, నువ్వులు వంటివి తీసుకోవాలి. విటమిన్ డి... ఈ జాబితాలో విటమిన్ డి తర్వాతి స్థానంలో ఉంది. విటమిన్ డి మన శరీరం కాల్షియాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలు, దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది. మెగ్నీషియం... మెగ్నీషియం కూడా స్త్రీలకు కావలసిన అతి ముఖ్యమైన పోషకం. కండరాల బలం ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. మహిళలు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ పరీక్షలు అవసరం.. భారతదేశంలో మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు.. ఎన్నో గణాంకాలు స్త్రీలల్లో ఐరన్ లోపం ఉంది అని చెబుతున్నాయి. కనీసం 10 శాతం కూడా హిమోగ్లోబిన్ ఉండటం లేదు. ఈ పరిస్థితిని ఇలానే నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ముఖ్యంగా ఇది బ్లడ్ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. అందువల్ల అత్యవసరమైన సీబీపీ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్, విటమిన్ పరీక్షలు, కాల్షియం, కొలెస్ట్రాల్, ఐరన్ వంటి పరీక్షలను చేయించుకోవడం అవసరం. ఇవి చదవండి: సమాజాన్ని అద్దంలో చూపించాను -
రోజుకు ఒక్క అరగంట చాలు, ఫలితాలు మాత్రం!
నడక అన్ని వయసుల వారికి సరిపడే చక్కటి వ్యాయామం. క్రమ తప్పకుండా వాకింగ్ చేస్తే ఫిట్‌గా ఉండటమేకాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండుగా ఉన్నాయి. రోగ నిరోధకశక్తి బలపడి, మంచి ఆయుర్దాయానికి సాయపడుతుంది. నడక వల్ల ప్రయోజనాలు ♦ నడకతో శరీరంలోని కొవ్వు నిల్వలు కలుగుతాయి. క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే ఊబకాయం కూడా నెమ్మదిగా కరుగుతుంది. ♦ రోజంతా మనసు హాయిగా, తేలిగ్గా ఉంటుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగి జలుబు లేదా ఫ్లూ ప్రమాదం తగ్గుతుంది. ♦ రోజుకు కనీసం 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులు నడవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని దాదాపు 19 శాతం తగ్గించవచ్చు. రోజూ వాకింగ్ దూరాన్ని పెంచుకుంటే ఫలితాలు ఇంకా బావుంటాయి. ♦ రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది ♦ తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ♦ అల్పాహారం, భోజనం , రాత్రి భోజనం తర్వాత ఇలా రోజుకు మూడుసార్లు వాకింగ్ చేస్తే మంచిది. ♦ కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నడక కాళ్ళ కండరాలను బలోపేతం చేస్తుంది ♦ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి కూడా చిన్నపాటి నడక ప్రయోజనాలను అందిస్తుంది. ♦ ముఖ్యంగా ఆరుబయట నడిచినపుడు సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయని పరిశోధకులు గుర్తించారు. నోట్: వాకింగ్‌కోసం ఉపయోగించే స్థలాలు, లేదా పార్క్‌లు ఎంచుకోవాలి. వాకింగ్‌కు అనువుగా దృఢమైన బూట్లు ధరించాలి. వదులుగా, సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తే మంచిది. నడకకు ముందు పుష్కలంగా నీరు తాగితే బెటర్. ఇది మన బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. మరీ ఎండలో కాకుండా, ఎండ తక్కువగా ఉన్నపుడు, నీడ ప్రదేశంలో వాకింగ్ చేయాలి. -
అంజీర్ పండ్లే కాదు.. ఆకులతో కూడా బోలెడన్ని ప్రయోజనాలు
అంజీర పండ్లను తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలున్నాయి. వీటినే అత్తి పండ్లు అని కూడా అంటారు. ఈ పండ్లలో విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కూడా. వీటిని పచ్చిగానూ, డ్రై ఫ్రూట్స్‌గానూ కూడా వాడతారు. ఈ పండ్లతో పాటు వీటి ఆకులు కూడా అద్భుత పోషకాల గని అని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం. అంజీర పండ్లలలాగానే ఆకుల్లో కూడా పొటాషియం, సోడియం, ఫాస్పొరిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ఆకుల కషాయాలు, టీ, రసం, ఎండు ఆకులతో పొడి రూపంలో వివిధ అనారోగ్య సమస్య చికిత్సలో వినియోగించవచ్చు. అంజీర్ పండ్లే కాదు, ఆకులతో చేసిన కషాయం, రసం, టీ చాలా రకాలుగా మేలు చేస్తుంది. డయాబెటిక్ ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనంలో అంజీర్ ఆకు రసం హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని కలిగి ఉందని తేలింది. అంజీర ఆకులలో అపారమైన యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. హైపర్గ్లైకేమియా (రక్తంలో శాశ్వతంగా అధిక స్థాయి గ్లూకోజ్),హైపోగ్లైసీమియా (తక్కువ గ్లూకోజ్ లెవల్స్) ఈ రెండు పరిస్థితుల్లోనూ పనిచేసి, గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకువస్తుందని తేలింది. వీటి రసం ద్వారా సహజ పద్ధతిలో కూడా శరీరంలో ఇన్సులిన్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంజీర్ ఆకుల్లోని ఔషధ గుణాలు మలబద్ధక సమస్యలు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంజీర్ ఆకులతో టీ వీటి ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ నీటిని వడపోసుకుని, కావాలనుకుంటే రుచికి కొద్దిగా తెనె కలుపుకుని టీలా వేడిగా తీసుకోవాలి. ఎండబెట్టి పొడి చేసుకుని అంజీర ఆకులను శుభ్రంగా కడిగి, ఎండబెట్టి పొడి చేసి నిల్వం ఉంచుకోవచ్చు. దీనిని అవసరమైనపుడు,నీటిలో వేసుకుని టీ లాగా మరిగించి తీసుకోవచ్చు. ఈ పొడి ఎముకలకు మంచి బలాన్ని చేకూరుస్తాయి వీటిల్లో పుష్కలంగా లభించే పొటాషియం, కాల్షియంతో ఎముకల సాంద్రతను బలోపితం చేసేందుకు కూడా వాడవచ్చు. అంజీర ఆకుల్లోని ఒమేగా 3 ఒమేగా 6 లక్షణాలు గుండె సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. ఈ ఆకుల కషాయం లేదా టీతో గుండె జబ్బులతో ఇబ్బంది పడే వారికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ అంజీర ఆకులలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ అధిక కొలెస్ట్రాలను కరిగిస్తుంది. నోటి బాక్టీరియాతో బాధపడేవారు అంజీర్‌ను సహజ యాంటీ బాక్టీరియల్ ఏజెంట్‌గా ఉపయోగించ వచ్చు. అంజీర్ ఆకు రసం యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. టీబీ నివారణలో అంజీర్ ఆకుల రసం మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ (క్షయవ్యాధి బ్యాక్టీరియా)కు వ్యతిరేకంగా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. ఈ కారణంగానే మలేషియాలో క్షయవ్యాధి నివారణచికిత్సలో వాడతారు. -
నల్లేరా..మజాకా...! ఈ అద్భుత ప్రయోజనాలు తెలుసా?
ప్రకృతిని ఆధునీకులు సరిగ్గా పట్టించుకోరు కానీ.. ప్రతి మొక్కలోనూ ఎన్నో విలువైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అలాటి వాటిల్లో నల్లేరు కూడా ఒకటి. తీగ జాతికి చెందిన దీన్నే వజ్రవల్లి, అస్థి సంహారక, అస్థి సంధని, అస్థి సంధాన అని కూడా పిలుస్తారు. నల్లేరు లాభాలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.! పట్టణ వాసులతో పోలిస్తే గ్రామీణ వాసులకు చాలా వరకు వీటిపై అవగాహన ఉంటుంది. గుబురు పొదల్లో, డొంకల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ఈ కాడల్ని పాదుల మధ్య అక్కడడక్కడ వేస్తారు. తొండలు, ఉడతలు కూరగాయల పిందెల్ని కొరికేయకుండా ఇలాంటి జాగ్రత్త తీసుకుంటారు. ఎందుకంటే దీని కోసినా, కొరికినా దురద వస్తుంది. నల్లేరుతో వంటలు అలా కూరగాయల పాదులపై వేసిన కాడలే.. వాటంతట అవే క్రమేపీ విస్తరించి అల్లుకుపోతాయి. ఇది వంట ఇంటిలోకి కూడా చేరింది. అయితే నల్లేరును కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే దురద రాదు. నల్లేరు తీగలోని లేత కణుపులు కోసి వాటి నారను తీసి పచ్చడి, పప్పు, కూర చేసుకుంటారు. దీనిని కాడలతో పులుసు పచ్చడి చేసుకొని చాలా ప్రాంతంలో తింటారు. వీటి కాడల్ని శుభ్రం చేసి నీడలో ఎండబెట్టి దంచి పొడిగా చేసుకుని భద్రపరచుకొని, వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే నడుము నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. ఒకవంతు నల్లేరు గుజ్జుకు మూడు రెట్లు బియ్యం కలిపి తగినన్ని నీరు పోసి మెత్తగా నూరుకోవాలి. దీనిని రొట్టెలా తయారు చేసుకుని తింటే కొండ నాలుక రావడం, కోరింత దగ్గు తగ్గుతుంది. ఔషధ గుణాలు ఆస్థియో పోరోసిస్ ,ఎముకలు గుల్ల బారడం , ఎముకలు విరగడం లాంటి సమస్యలకు చక్కని ఔషధం నల్లేరు. నల్లేరులో కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సీ, కాల్షియమ్, సెలీనియమ్, క్రోమియం, విటమిన్ బి, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. నల్లేరు ఎముకల దృఢత్వాన్ని పెంచటమే కాకుండా ప్రక్కన వుండే కండరాల కూడా శక్తినిస్తుంది. ఎముకలు సులభంగా అతుక్కుంటాయి. దీనిలో నొప్పి నివారణ గుణాలు అధికంగా ఉన్నాయి. ఆస్ప్రిన్ మాత్రకి సమానంగా ఉండే ఇందులోని ఔషధగుణం నొప్పి నివారణకు బాగా ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడతారు. నల్లేరులో యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. నల్లేరు రసంతో రక్తహీనత నుంచి కాపాడుకోవచ్చు. మహిళల్లో మెనోపాజ్ లక్షణాల్లోముఖ్యమైన ఎముకల బలహీనత చాలా ముఖ్యంది చెబుతారు. నల్లేరులో పీచు అధికంగా ఉండటం వలన పైల్స్ సమస్యను తగ్గిస్తుంది. నల్లేరు రసంలో నెయ్యి, పంచదార కలిపి తాగితే పీరియడ్స్‌కు సంబంధించిన దోషాలు తొలగిపోతాయట. అంతేకాదు ప్లాస్టిక్ నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. -
మాష్టారు..పొగమానేయండి! లేదంటే మీరు డైమండ్ డక్కే!
ధూమపానం అనేది శతాబ్దాలుగా సమాజాన్ని పీడిస్తున్న పెద్ద దురలవాటు. పొగరాయుళ్లు పొగ తాగవద్దని ఎంత చెప్పినా వినరు. ఆ అలవాటు, ఒక ఎడిక్షన్‌లా మారిపోయి, ప్రాణం మీదికి వచ్చేదాకా తెచ్చుకుంటారు. గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, వంధ్యత్వం ఆఖరికి కేన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బులొస్తాయని తెలిసి కూడా ఈ దురలవాటును మానుకునేందుకు చాలామంది ఇష్టపడరు. పరిస్థితి చేయి దాటిన తరువాత ఏం చేసినా ఫలితం ఉండదనే సత్యాన్ని గమనించరు. అంతేకాదు ధూమపానం చేయకపోయినా పాగతాగేవారి ద్వారా ఆ పొగను పీల్చడం వల్ల సన్నిహిత కుటుంబ సభ్యులు, చుట్టూ ఉన్నవారు కూడా అనారోగ్యం బారిన పడతారు. వీరినే ప్యాసివ్ స్మోకర్లు అంటారు. ఈ సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్ కారణంగా ఉబ్బసం, బ్రోన్కైటిస్ , న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధుల బారిన పడతారు. లైంగిక సామర్థ్యంపై దెబ్బ ధూమపానం కారణంగా పురుషుల పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యం దెబ్బతింటుంది. శుక్రకణాల సంఖ్య, వాటి చురుకుదనం తగ్గి పోతుంది. చివరికి వంధ్యత్వానికి దారితీస్తుంది. ధూమపానం పురుషాంగానికి రక్త ప్రవాహం నిలిచిపోతుంది. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. స్త్రీలలో అయితే సంతానోత్పత్తి తగ్గిపోవడం, గర్భస్రావం, నెలలు నిండకుండానే ప్రసవం ,శిశువుల్లో తక్కువ బరువు పుట్టడం లాంటి ప్రమాదాలుంటాయి. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో ధూమపానం పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు , అభివృద్ధి లోపాల ప్రమాదాన్ని పెంచుతుంది. తాజాగా డా. శ్రీకాంత్ మిరియాల ఇదే విషయాన్ని తనదైన స్టయిల్లో పొగబాబులకు అర్థమయ్యేలా ట్విటర్లో షేర్ చేశారు. ఆ వివరాలు... డాక్టర్ గారూ కష్టంగా ఉందండి. ఎంత కష్టం? చాలా? ఏం చేసినా? లేదు సార్, అస్సలు నిలబడట్లేదా? కొంచెమే, కానీ అది సరిపోవట్లేదు. అయ్యో? మీరే ఏదో ఒకటి చెయ్యాలి, నా కాపురం నిలబెట్టాలి. సరే, డాప్లర్ పరీక్ష అని ఉంటది, అది చేసుకుని రా! ఇదిగో సార్ రిపోర్టు. అక్కడికి రక్తం… pic.twitter.com/Sfgd2ss0Ba — Srikanth Miryala (@miryalasrikanth) March 4, 2024 (క్రికెట్లో డైమండ్ డక్ అంటే ఒక ఆటగాడు ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండా, ఒక్కపరుగూ చేయకుండా, ఔట్ కావడం) -
మెడ పట్టేసిందా?ఈ చిట్కాలు పాలో అవ్వండి!
మెడ ఎందుకు పట్టేస్తుందో, భరించలేని నొప్పి ఎందుకు వస్తుందో ఒక్కోసారి సరిగ్గా గుర్తించలేం. రోజంతా టీవీ చూడటం, ల్యాప్‌టాప్, కంప్యూటర్లు వాడకం, గంటల తరబడి స్మార్ట్ ఫోన్‌ను చూస్తూ ఉండటంవల్లగానీ, వ్యాయామం చేస్తున్నప్పుడు గానీ, రాత్రిపూట నిద్ర పోయేటపుడు భంగిమలో తేడా తదితర కారణాలతో మెడ నొప్పి బాధిస్తుంది. ♦ నిద్ర లేచిన తర్వాత మీకు మెడ నొప్పిగా అనిపిస్తే.. నొప్పి ప్రభావిత ప్రాంతాల్లో ఐస్ ప్యాక్ లేదే చల్లని నీటిలో నింపిన క్లాత్ ను వేసి అద్దాలి. అలా చేయడం వల్ల మెడ కండరాల వాపు తగ్గుతుంది. దీంతోపాటు హీట్ ప్యాక్ ను ఉపయోగించవచ్చు. ఇది కూడా మెడ కండరాల నొప్పిని తగ్గిస్తుంది. ♦ మెడ నొప్పిగా ఉన్న వాళ్లు చేతులతో మెడను నెమ్మదిగా మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల కండరాలు సర్దుకొని నొప్పి తగ్గే అవకాశం ఉంది. ♦ మసాజ్ చేసే సమయంలో కొబ్బరి లేదా నువ్వుల నూనె ఉపయోగిస్తే మేలు జరుగుతోంది. మెడ నొప్పిని నివారించేందుకు మీరు రాత్రిళ్లు బోర్లా పడుకోకుండా ఉంటే చాలు. ♦ కొన్ని రకాల యోగా ద్వారా కూడా మెడనొప్పిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా క్లాక్ వైజ్,యాంటి క్లాక్‌వైజ్ దిశలో మెడను మెల్లిగా సున్నాలాగా చుడుతూ చేసే వ్యాయామం మంచి ఫలితాలనిస్తుంది. ♦ మొబైల్ ఫోన్ల వల్ల వచ్చే నొప్పిని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారు. దీనికి ఆక్యుపంక్చర్ థెరపీ ద్వారా ఉపశమనం పొందవచ్చు. చాలా సందర్భాలలో, నొప్పికి కారణం తెలియదు. దానికదే మెల్లిగా నెమ్మదిస్తుంది. కొన్నిసార్లు ఇది వారం లేదా రెండు వారాల్లో తగ్గుతుంది. చిట్కాలతో కూడా మెడనొప్పి తగ్గకుండా వేధిస్తూ ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి. సరైన చికిత్స తీసుకోవాలి. మూడు నెలల కంటే ఎక్కువ కాలంపాటు వేధించే మెడ నొప్పికి అంతర్లీనంగా మరికొన్ని కారణాలు కూడా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
ఫాస్టింగ్‌తో బరువు తగ్గడానికి మించిన ఆరోగ్య ప్రయోజనాలు!
బరువు తగ్గాలి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉపవాసం. తర తరాలుగా భారతీయుల్లో ఉపవాసం కొత్తేమీకాదు. బరువు తగ్గాల నుకునే వారు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే వారు ఫాస్టింగ్ చేయడం కూడా చాలా కామన్. అయితే ఎక్కువ కాలం మన దేహాన్ని పస్తు పెట్టడం వల్ల వెయిట్‌లాస్ కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటోంది తాజా అధ్యయనం. ఆ వివరాలు మీకోసం. ఉపవాసంతో శరీరంలో ఏమి జరుగుతుంది? ఉపవాస సమయంలో, మన శరీరం దాని ఇంధన మూలాన్ని స్వీకరిస్తుంది. సులభంగా యాక్సెస్ చేసే చక్కెరల నుండి బాడీలోని నిల్వ ఉన్న కొవ్వులను వాడుకుంటుంది. అయితే ఆహారం లేకుండా ఎక్కువ కాలం పాటు ఉంటే శరీరం ఎలా స్పందిస్తుంది? ఇదే ఈ స్టడిలోని కీలక అంశం. నేచర్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లండన్‌లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం, నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్ సైన్సెస్ పరిశోధకులు 12 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై పరశోధన చేశాడు. వారు ఏడు రోజుల పాటు కేవలం నీరు మాత్రమే తీసుకునేలా చేశారు. అలా వారి రక్తంలో వివిధ ప్రోటీన్ మార్కర్ల స్థాయిలలో మార్పులను నిశితంగా పరిశీలించారు. మూడు రోజుల తర్వాతే మంచి ప్రయోజనం ఊహించినట్లుగానే తొలి రెండు, మూడు రోజుల్లో గ్లూకోజ్ నుండి కొవ్వు ప్రధాన ఇంధన వనరుగా మారడాన్ని పరిశోధకులు గమనించారు. దీంతో నిల్వ ఉన్న కొవ్వు కరుగుతూ వస్తుంది. మొత్తంగా, వాలంటీర్లు సగటున 5.7 కిలోగ్రాముల కొవ్వు ,లీన్ మాస్ రెండూ తగ్గాయి. అయితే మూడు రోజుల ఉపవాసం తర్వాత వాలంటీర్ల రక్త బయోమార్కర్లలో విభిన్న మార్పులను పరిశోధకులు గమనించారు. మొత్తం బాడీలో కూడా మార్పులొచ్చాయి. ముఖ్యంగా మెదడు కణాల నిర్మాణ ప్రోటీన్లలో మార్పులు ఆసక్తికరంగా నిలిచాయి. దీంతో మూడు రోజుల తరువాత చేసే ఉపవాసంలో మాత్రమే బరువు తగ్గడాన్ని మించి, మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఈ అధ్యయనంలో తేల్చారు. క్వీన్ మేరీస్ ప్రెసిషన్ హెల్త్ యూనివర్శిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (PHURI) డైరెక్టర్ క్లాడియా లాంగెన్‌బర్గ్ మాట్లాడుతూ, ‘తొలిసారి ఉపవాసం ద్వారా శరీరం అంతా కూడా అతి చిన్న స్థాయిలో కూడా ఏమి జరుగుతుందో చూడగలుగుతున్నామన్నామని ప్రకటించారు. సురక్షితమైన పద్ధతులో ఫాస్టింగ్ చేసినప్పుడు, బరువు తగ్గడం అనేది ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానం కూడా బరువు తగ్గడ కంటే అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అయితే చాలాకొద్దిమందిపై చేసిన తమ ప్రయోగంలో అందరిలోనూ ఫలితాలు ఒకేలా ఉన్నాయని, మరి ఎక్కువమందిపై ఈ ప్రయోగం చేసినపుడు ఫలితాలు ఎంటా ఉంటాయనేది పరిశీలించాల్సి ఉందన్నారు. -
వేసవిలో బార్లీ నీళ్లు : ప్రయోజనాలెన్నో..!
బార్లీ నీరు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడుతుంది. గట్ బాక్టీరియాను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మన ఆరోగ్యంలో గట్ బ్యాక్టీరియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బార్లీ ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల బాక్టీరాయిడ్స్ అనే గట్ బ్యాక్టీరియా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ రక్తపోటును అదుపులో ఉంచుతాయి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించేందుకు బార్లీ వాటర్ తాగవచ్చు. ⇒ ఎండల ప్రభావం పడకుండా ఉండాలన్న, వడదెబ్బ తగలకుండా ఉండాలన్న ఈ నీళ్లు తాగాల్సిందే ⇒ బార్లీ నీళ్లు తాగితే జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది. ⇒ పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. ⇒ గర్భిణులు రోజూ బార్లీనీళ్లు తాగితే మరీ మంచిది. కాళ్ల వాపు సమస్య వారి దరిచేరదు. రోజులో ఉదయం, సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు ⇒ బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. ⇒ మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి. -
నిమ్మ రసం తాగుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి!
#LemonWater Side Effects వేసవి కాలం వచ్చిందంటే నిమ్మకాయలకు గిరాకీ పెరుగుతుంది. సమ్మర్ సీజన్లో నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వేసవిలో శరీరానికి కావల్సిన నీరు అందించడంతోపాటు, జీర్ణ సమస్యలను తొలగించడం, బరువు నియంత్రణలో కూడా సాయం చేస్తుంది. కానీ నిమ్మ నీరు ఎక్కువగా తాగితే దుష్ప్రభావాలు ఉంటాయని మీకు తెలుసా? నిజానికి నిమ్మలో ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, పొటాషియం వంటి ఖనిజాలు , ఫోలేట్ వంటి పోషకాలతో తోపాటు సీ విటమిన్ అధికంగా లభిస్తుంది. నీటికి రుచిని ఇవ్వడంతో పాటు, నిమ్మ రసం చర్మానికి మెరుపు నిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ మోతాదు మించి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిమ్మరసం- సైడ్ ఎఫెక్ట్స్ ♦ గుండెల్లో మంట వస్తుంది. మోతాదు మించితే పెప్టిక్ అల్సర్ వచ్చే ప్రమాదం, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) ఉన్నవారు నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. అలాగే సిట్రస్ పండ్లు తరచుగా తీసుకొంటే మైగ్రేన్, తలనొప్పి పెరుగుతాయి. ♦ డీహైడ్రేషన్ తలెత్తే ప్రమాదం ఎక్కువే. ఎందుకంటే లెమన్ వాటరతో మూత్రం అధికమై, శరీరంలోని నీరు బయటకు పోతుంది. దీంతో ఎలక్ట్రోలైట్లు , సోడియం వంటి మూలకాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి. అతిగా సేవిస్తే పొటాషియం లోపం ఏర్పడుతుంది. ♦ విటమిన్ సీ మోతాదు ఎక్కువై, రక్తంలో ఐరన్ లెవల్స్ పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని సిట్రిక్ యాసిడ్, ఆక్సలేట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం. ♦ఎసిడిటీ వస్తుంది. ♦ ఎముకలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ♦ టాన్సిల్ సమస్య ఉన్నవారు నిమ్మరసానికి దూరంగా ఉండాలని, ఇది గొంతునొప్పి దారితీస్తుందని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది ♦ నిమ్మలోని సిట్రస్ వల్ల పళ్ల ఎనామిల్‌కు నష్టం. దంత సమస్యలు కూడా వస్తాయి -
సుష్టిగా తిన్నాక ‘కునుకు’ మంచిదే, కానీ ఈ డేంజర్ కూడా ..!
పగటిపూట అన్నం తిన్నవెంటనే కాసేపు కునుకు తీయడం చాలామందికి అలవాటు. అందులోనూ వేసవి వచ్చిందంటే కాసేపైనా నిద్రపోవాల్సిందే. అయితే ఇది మన ఆరోగ్యానికి అసలు మంచిదా? కాదా? ఎంతసేపు కునుకు తీస్తే మంచిది? పగటిపూట నిద్రపోవడం కొంతవరకూ మంచిదే. పని నుంచి కొంచెం విశ్రాంతి తీసుకోవడంతో అలసట దూర మవుతుంది. ప్రశాంతంగా, కొత్త ఉత్సాహంగా వచ్చినట్టుగా అనిపిస్తుంది.అందుకనే దీన్ని పవర్ న్యాప్ అని అంటారు. మధ్యాహ్నం నిద్ర అనేది మితిమీరితే మాత్రం హానికరమైన ప్రభావం తప్పదంటున్నారు నిపుణులు. పగటి నిద్ర పనికి చేటు అన్నట్టు ఆరోగ్యానికి కూడా ముప్పే. మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. ఇదిరాత్రిపూట నిద్రను ప్రభావితం చేస్తుంది. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం కంటే ఎక్కువ పెరుగుతుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడెమీ ఆఫ్ న్యూరాలజీ గతంలో చేసిన అధ్యయనం చెబుతోంది. అంతేకాదు మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25 శాతం ఉంటుందట. కొలెస్ట్రాల్ స్థాయిలలో ఆటంకాలు ఎక్కువ నిద్రను కోల్పోయే రూపంలో కూడా గుర్తించవచ్చని అధ్యయనంలో వెల్లడైంది. వీరికి మినహాయింపు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న వారు గరిష్ఠంగా 90 నిమిషాల పాటు నిద్రపోవచ్చట. మిగిలినవారు గరిష్ఠంగా 10 నిమిషాల నుంచి అరగంట లోపు మాత్రమే పడుకోవాలి. పగటి నిద్ర నష్టాలు ♦ ఊబకాయం ♦ రాత్రి నిద్రకు భంగం, బాడీ బయలాజికల్ సైకిల్ దెబ్బతింటుంది ♦ రాత్రి నిత్ర లేకపోతే అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బులు, ఆందోళన లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం. ♦ డిప్రెషన్ -
Pomegranate Peel Tea దానిమ్మ తొక్కల టీ, అద్భుత ప్రయోజనాలు
#PomegranatePeelTea దానిమ్మ గింజలతో మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరం అంతటా రక్త ప్రసరణను మెరుగు పరచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే రక్తహీనతతో బాధపడేవారికి దానిమ్మ గింజల జ్యూస్ బాగా ఉపయోగడపతాయి. అలాగే దానిమ్మ తొక్కలతో చేసిన టీ రెగ్యులర్‌గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి దానిమ్మ టీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దానిమ్మ తొక్కల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుతో దానిమ్మ తొక్కలతో తయారు చేసిన టీని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బాడీలోని మలినాల్ని బైటికి పంపించేందుకు, జలుబు దగ్గు, చర్మ సమస్యలు, జుట్టు రాలడానికి చికిత్స చేయడంలో సహాయపడతాయంటున్నారు నిపుణులు ఇంకా మధుమేహం, రక్తపోటు , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దానిమ్మ తొక్కల టీ తయారీ: దానిమ్మ కాయనుంచి వలిచిన తొక్కల్ని శుభ్రంగా కడిగి తొక్కలను ఎండబెట్టాలి. ఇతర సందర్భాల్లో, మైక్రోవేవ్ ఉపయోగించి వేడి చేయవచ్చు. ఆ తరువాత, పీల్స్ బాగా చూర్ణం చేయాలి. దీన్ని తడి లేని సీసాలో నిల్వ ఉంచుకోవచ్చు. ఒక కప్పు నీటినిలో టీస్పూన్ దానిమ్మ తొక్కలను వేసి బాగా మరిగించాలి. దీన్ని చక్కగా వడకట్టి, రుచికి తగినట్టుగా తేనె కలుపుకొని తాగాలి. ఈ టీని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బాడీ డీటాక్సిఫై: విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని నెగిటివ్ టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. చర్మాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. వైరల్ జ్వరం, దగ్గు, గొంతు నొప్పి , సాధారణ జలుబు నివారణలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన దంతాలు: దానిమ్మ తొక్కలతో తయారు చేసిన టీ తాగడం వల్ల చిగుళ్లు, దంత సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది: దానిమ్మ తొక్కల్లో టానిన్లుతో పేగుల్లో మంట తగ్గుతుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది. కాబోయే తల్లులకూ మేలు చివరగా, గర్భిణీ స్త్రీలకు దానిమ్మ తొక్క చాలా మంచిదట. ముఖ్యంగా గర్భధారణ ప్రారంభంలో దాని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణం పాలీఫెనోలిక్ సమ్మేళనాలు ఫోలిక్ యాసిడ్ , విటమిన్ సీ ఎదుగుతున్న పిండానికి సరైన పోషకాహారాన్ని అందిస్తుంది. గర్భిణీ స్త్రీలు జీర్ణక్రియ సమస్యలను నివారిస్తుంది. ఇంకా పిగ్మెంటేషన్, జుట్టు రాలడం సమస్య ఉన్నవారు కూడా దానిమ్మతొక్కల టీని సేవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
అరచేతిలో మీ ఆరోగ్య నేస్తం! సాక్షి లైఫ్..
సాక్షి లైఫ్.. మీ ఆరోగ్య నేస్తం.. సమగ్ర ఆరోగ్య సమాచార వేదిక.. అల్లోపతి నుంచి ఆయుర్వేదం దాకా.. ఆక్యుపంచర్ నుంచి యునానీ వరకు.. హోమియోపతి నుంచి యోగా వరకు.. అన్ని రకాల వైద్య విధానాలను గురించి ఎప్పటికప్పుడు ఆరోగ్య సమాచారం మీకోసం అందిస్తున్నాయి సాక్షిలైఫ్ www.life.sakshi.com వెబ్ సైట్, https://www.youtube.com/@life.sakshi/videos సాక్షి లైఫ్ యూట్యూబ్ ఛానెల్. సాక్షిలైఫ్ హెల్త్ ఏమేం అందిస్తుందంటే..? హెల్త్ న్యూస్ ఎప్పటికప్పుడు తాజా హెల్త్ అప్డేట్స్ తోపాటు.. ఫిజికల్ హెల్త్: దీనికి సంబంధించిన సమస్యలు వాటి పరిష్కారాలు,నివారణామార్గాలు. మెంటల్ హెల్త్: మానసిక సమస్యల నుంచి ఎలా బయటపడాలి..? అసలు అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఏమి చేయాలి..? అనేవాటి గురించి మానసిక నిపుణుల ద్వారా ప్రత్యేక ఇంటర్వ్యూలు అందుబాటులో ఉంటాయి. ఉమెన్ హెల్త్: మహిళల్లో ఎక్కువగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? అవి రాక ముందు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే అంశాలను గురించిన సమాచారం విపులంగా ఉంది. కిడ్స్ హెల్త్: చిన్నారుల్లో సీజనల్ వ్యాధులు, ముందు జాగ్రత్తలపై వైద్య నిపుణులు అందించే అద్భుతమైన సలహాలు, సూచనలు ఉన్నాయి. ఆల్టర్నేటివ్ మెడిసిన్: యునానీ , ఆయుర్వేదం, యోగా, ఆక్యుపంచర్, హోమియోపతి వంటి పలురకాల వైద్య విధానాలను గురించి టాప్ డాక్టర్స్ ద్వారా అవసరమైన ఆరోగ్య సమాచారం కోసం ఈ లింక్‌ల పై క్లిక్ చేయండి. https://www.youtube.com/@life.sakshi/videos , www.life.sakshi.com ఇవి రెండూ మీకు ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నాయి. రీసెర్చ్: పలురకాల వ్యాధుల గురించిన పరిశోధనలు, అధ్యయనాలకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది మీ సాక్షిలైఫ్. హెల్త్ టిప్స్: ఆరోగ్యంగా ఉండాలంటే ఏమీ చేయాలి..? ఏమి చేయకూడదు..? అనే అంశాలపై డాక్టర్లు ఏమంటున్నారో ఆర్టికల్స్ రూపంలో www.life.sakshi.com వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. మారుమూల గ్రామంలో ఉండే వారికిసైతం అర్థమయ్యేలా ప్రముఖ డాక్టర్ల విలువైన వైద్య సలహాలు, సూచనలను సాక్షి లైఫ్ వెబ్సైట్, యూట్యూబ్ ఛానెల్ అందిస్తున్నాయి. ప్రతి విభాగంలో ఒక్కో టాప్ డాక్టర్ల ఇంటర్వ్యూలను వీడియోల రూపంలో https://www.youtube.com/@life.sakshi/videos సాక్షి లైఫ్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందిస్తోంది. అంతేకాదు వారు అందించిన సమాచారాన్ని ఆర్టికల్స్ రూపంలో www.life.sakshi.com వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తోంది. ఇలా ఫాలో అవ్వండి.. మరింత ఆరోగ్య సమాచారం కోసం www.life.sakshi.com వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి..అలాగే https://www.youtube.com/@life.sakshi/videos యూట్యూబ్ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.. లైక్ చేయండి.. షేర్ చేయండి. ► "సాక్షి లైఫ్" గురించి ప్రముఖ వైద్యనిపుణుల మాటల్లో.. "సాక్షి లైఫ్ లో ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నారు. అదికూడా ప్రముఖ డాక్టర్ల ద్వారా అందించడం అభినందనీయం." - డా.డి. నాగేశ్వర్ రెడ్డి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ► "సమగ్రమైన ఆరోగ్య సమాచార వేదికగా సాక్షి లైఫ్‌ను తీర్చి దిద్దారు. సమాజానికి ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం." - డా. మంజుల అనగాని, ప్రముఖ గైనకాలజిస్ట్ ► "శరీరంలో గుండె ప్రధానమైన అవయవం, అది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలన్నది సాక్షి లైఫ్‌లో చాలా బాగా తెలియజేశారు." - డా. ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్ట్ ► "వైద్యరంగంలో పరిశోధనలు, వాటి విశేషాలను ,వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా సాక్షి లైఫ్‌ను తీర్చిదిద్దారు." - డా. చిన్నబాబు సుంకవల్లి, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్. ఇవి చదవండి: హెల్త్ టిప్స్: స్టవ్ వెలిగించకుండానే.. పండంటి వంటలు.. -
స్టవ్ వెలిగించకుండానే.. పండంటి వంటలు..
ఆరోగ్యంగా పెరగాలంటే రోజూ పండ్లు తినాలి. ఇది డాక్టర్ మాట.. అలాగే అమ్మ మాట కూడా. రోజూనా.. నాకు బోర్ కొడుతోంది.. పిల్లల హఠం. రోజూ తినే పండ్లనే కొత్తగా పరిచయం చేద్దాం. చేయడం సులభం... స్టవ్ వెలగాల్సిన పని లేదు. గరిట తిప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. స్ట్రాబెర్రీ విత్ క్రీమ్.. కావలసినవి: స్ట్రాబెర్రీ ముక్కలు – వంద గ్రాములు (కడిగి పలుచగా తరగాలి); మీగడ– వంద గ్రాములు; ఐసింగ్ షుగర్ లేదా మామూలు చక్కెర పొడి– 2 టేబుల్ స్పూన్లు; గార్నిష్ కోసం.. స్ట్రాబెర్రీలు – 2 టీ స్పూన్; బ్లాక్ సాల్ట్ – చిటికెడు; తయారీ: మీగడను బాగా చిలికి నాజిల్ ఉన్న ట్యూబ్‌లో వేయాలి. కోన్ అయినా ఫర్వాలేదు. అదీ లేకపోతే జంతికల గొట్టంలో స్టార్ డిజైన్ ఉన్న ప్లేట్ అమర్చి ఉపయోగించుకో వచ్చు. స్ట్రాబెర్రీ ముక్కలను గ్లాసులో పావు వంతు వేయాలి. ఆ పైన కొద్దిగా మీగడ అమర్చాలి. ఆ పైన మళ్లీ ఒక వరుస స్ట్రాబెర్రీ ముక్కలు, ఆ పైన మీగడ వేయాలి. చివరగా ఒక స్ట్రాబెర్రీ అమర్చి సర్వ్ చేయాలి. చట్పటా పొమోగ్రనేట్.. కావలసినవి: దానిమ్మ గింజలు – ముప్పావు కప్పు; చాట్ మసాలా – పావు టీ స్పూన్; ఆమ్చూర్ పౌడర్ – పావు టీ స్పూన్ (ఆమ్చూర్ పౌడర్ లేకపోతే పచ్చి మామిడి తురుము టీ స్పూన్); జీలకర్ర పొడి– పావు టీ స్పూన్; బ్లాక్ సాల్ట్ – చిటికెడు తయారీ: ఒక కప్పులో వీటన్నింటినీ వేసి స్పూన్‌తో కలిపితే చట్పటా పొమోగ్రనేట్ రెడీ. పిల్లలకు బాక్సులో పెట్టడానికి కూడా బావుంటుంది. డ్రాగన్ – కోకోనట్ స్మూతీ.. కావలసినవి: డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు – కప్పు; కొబ్బరి పాలు – కప్పు; స్వచ్ఛమైన తేనె – టేబుల్ స్పూన్; ఐస్ క్యూబ్స్ – 10 (ఇష్టమైతేనే) తయారీ: పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి పాలు తీసుకోవచ్చు లేదా రెడీమేడ్ కోకోనట్ మిల్క్ తీసుకోవచ్చు. డ్రాగన్ ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తగా బ్లెండ్ చేసి అందులో కొబ్బరి పాలు వేసి మొత్తం కలిసే వరకు బ్లెండ్ చేయాలి. పెద్ద గ్లాసులో పోసి తేనె కలిపి సర్వ్ చేయాలి. బ్లెండ్ చేసిన వెంటనే తాగేటట్లయితే తేనె కూడా అప్పుడే వేసుకోవచ్చు. డ్రాగన్ – కొబ్బరి పాల మిశ్రమాన్ని ముందుగా చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని తర్వాత తాగాలంటే తాగే ముందు తేనెను కలుపుకోవాలి. గ్రీన్ గ్రేప్ సోర్బెట్.. కావలసినవి: ఆకుపచ్చ ద్రాక్ష – 200 గ్రాములు; అల్లం తురుము – టీ స్పూన్; నిమ్మరసం– 2 టీ స్పూన్లు; చక్కెర – టీ స్పూన్ (అవసరం అనిపిస్తేనే) గార్నిష్ చేయడానికి.. పుదీన ఆకులు – 20. తయారీ: ద్రాక్షను మంచినీటితో శుభ్రం చేసి ఆ తరవాత గోరువెచ్చటి నీటిలో ఉప్పు కలిపి అందులో వేయాలి. ద్రాక్షను ఉప్పు నీటిలో 15 నిమిషాల సేపు ఉంచిన తర్వాత అందులో నుంచి తీసి మంచి నీటిలో ముంచి కడిగి నీరు కారిపోయే వరకు పక్కన పెట్టాలి. ద్రాక్ష, అల్లం, నిమ్మరసం మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. రుచి చూసి అవసరమనిపిస్తే చక్కెర వేసి మరొకసారి గ్రైండ్ చేయాలి. ఈ చిక్కటి ద్రవాన్ని ఒక పాత్రలో పోసి మూత పెట్టి ఎనిమిది గంటల పాటు ఫ్రీజర్‌లో పెట్టాలి. సర్వ్ చేసే ముందు తీసి ఫోర్క్‌తో గుచ్చి పలుకులు చేసి గ్లాసుల్లో పోసి పుదీన ఆకులతో గార్నిష్ చేయాలి. ఇవి చదవండి: అరటి పండ్లు పండిపోతున్నాయని పడేస్తున్నారా? -
Glowing Skin నిగ నిగ లాడే చర్మ కాంతికి, పాలు, అలోవెరా ఇంకా..
శీతాకాలపు గాలులు,మండే ఎండలు మన చర్మ కాంతిని పాడు చేస్తాయి. జీవరహితంగా తయారు కావడం, పొడిబారడం, ముఖంపై మొటిమలు అబ్బో.. ఈ సమస్యలు లిస్ట్ చాంతాండంత. అందుకే మాయిశ్చరైజర్లు , క్రీమ్‌లను ఆశ్రయిస్తారు చాలామంది. అలా కాకుండా ఏ కాలంలో అయినా, ఎలాంటి వాతావరణంలో అయినా సహజంగా మెరిసే చర్మాన్ని పొందడం ఎలాగో తెలుసా? కొబ్బరి నూనె.. బ్రౌన్ షుగర్ పొడిబారిన, నిస్తేజంగా ఉన్న చర్మానికి కొబ్బరి నూనె ఔషధంలా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, మెడకు రాసి, వేళ్లతో వలయాకారంలో మసాజ్ చేయాలి. మరుసటి రోజు ఉదయం ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు నూనెలో కొద్దిగా బ్రౌన్ షుగర్ వేసి, కలిపి, ముఖానికి అప్లై చేయాలి. దీని వల్ల నిస్తేజంగా ఉన్న చర్మం కాంతిమంతం అవుతుంది. అలోవెరా చర్మకాంతికి మహత్తరంగా పనిచేసే జాబితాలో మొదటి వరసలో ఉంటుంది అలోవెరా. ముడతల నివారణకు పనిచేస్తుంది. అలొవెరా ఆకునుంచి తీసిన జెల్‌ను ముఖానికి, మేనికి పట్టించి 20 నిమిషాల తర్వాత వేడినీటితో కడిగితే ΄÷డిబారడం సమస్య దరిచేరదు. పాలు నిస్తేజంగా ఉన్న చర్మానికి పాలు మెరుపును తీసుకువస్తాయి. దూదిని పాలలో ముంచి, ముఖానికి, మెడకు రాసి, ఆరిన తర్వాత కడిగేయాలి. ΄ాలు, తెనె, శనగపిండి కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని 20 నిమిషాలు తర్వాత శుభ్రపరుచుకుంటే చర్మకాంతి మెరగవుతుంది. తేనె తేనెలో ఔషధ గుణాలు ఎక్కువ. పొడి చర్మ సమస్యకు నివారిణిగా పనిచేస్తుంది. వేళ్లతో తేనెను అద్దుకొని, ముఖానికి రాసుకొని, మృదువుగా మసాజ్ చేసి ఐదు నిమిషాలు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. బొప్పాయి మృతకణాలను తొలగించడంలో బొప్పాయి ఎంతగానో సహాపడుతుంది. బొప్పాయి పండు చిన్న ముక్కను గుజ్జు చేయాలి. దీంతో తేనె వేసి కలిపి, ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. నీళ్లు ప్రతి రోజూ 8–10 గ్లాసుల నీళ్లు తాగుతుంటే చర్మంలో ఉండే హానికారకాలు తొలగిపోయి తాజాదనం లభిస్తుంది. -
హెల్త్ టిప్స్: మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
ప్రస్తుతం మనం జీవిస్తున్న శైలిలో.. ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మన శరీరంలో కూడా మార్పులు సహజమే. ఆహారపు అలవాట్ల వలన గానీ, విరామం లేకుండా శ్రమించడం వలన గానీ.. శరీరంలో బరువు పెరగడం, చర్మ సమస్యలు, గుండె జబ్బులు రావడం, రక్తపోటుతో బాధపడటం లాంటి సమస్యలను ఎదుర్కుంటున్నాం. అయితే ఇలాంటి సమస్యల నుండి బయటపడటానికి ఈ చిన్న చిన్న హెల్త్ టిప్స్ పాటించడం తప్పనిసరి. బరువును అదుపులో ఉండాలంటే.. ప్రతిరోజూ రెండు చెంచాల మెంతులు రాత్రి నానబెట్టి.. తెల్లవారు జామున ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు పొడి వేసి ఉదయం, సాయంత్రం తాగితే జలుబు త్వరగా తగ్గుతుంది. పసుపును నీటిలో కలిపి ముద్ద చేసి లేదా లేత వేపాకు గుజ్టుతో కానీ కలిపి చర్మంపై రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. బెణికినప్పుడు నొప్పికి, గాయాలకు, కీళ్లవద్ద కొంచెం వాపు, నొప్పికి సున్నం, పసుపు కలిపి తేలికగా రుద్దితే మంచి ఉపశమనం కలుగుతుంది. పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. మినపప్పు వెన్నుపూసకు బలాన్నిస్తుంది. అంతేకాదు మినపప్పులో ఉండే విటమిన్లు, ప్రోటీన్స్ శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఎముకల బలానికి ఇవి ఉపయోగపడతాయి. అందుకే వారానికి రెండుసార్లు వంటల్లో మినపప్పును చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆవాలు గుండెకు మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన విటమిన్లు అందిస్తాయి. ఇవి చదవండి: 'కంటిచూపు' ను ఈ జాగ్రత్తలతో కాపాడుకుందాం..! -
'లవంగం టీ' ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!?
భారతీయులు ఎక్కువగా వినియోగించే సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. శీతాకాలంలో చాలామందిలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల అనేకరకాల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలామంది జలుబు దగ్గు సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ లవంగాల టీని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే సుగుణాలు గొంతునొప్పి, కఫం వంటి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి.. కొంతమందిలో వాతావరణంలోని తేమ పరిమాణాలు తగ్గడం పెరగడం కారణంగా శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. దీని కారణంగా జ్వరం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే చలికాలంలో తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా లవంగాలతో తయారుచేసిన టీని తాగాల్సి ఉంటుంది. దగ్గు నుంచి ఉపశమనం.. శీతాకాలంలో చాలామందిని వేధించే సమస్యల్లో దగ్గు కూడా ఒకటి.. ఈ దగ్గు కారణంగా చాలామంది ఊపిరితిత్తుల సమస్యల బారిన కూడా పడుతున్నారు. కాబట్టి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా లవంగాలతో తయారు చేసిన టీని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరంలో కఫాన్ని తొలగించేందుకు కూడా సహాయపడతాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది.. కొంతమందిలో చలి కారణంగా సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో చాలామందిని వేధించే సమస్య జీర్ణ క్రియ మందగించడం. అయితే దీనికి కారణంగా చాలామందిలో మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు కూడా వస్తున్నాయి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా లవంగాలతో తయారు చేసిన టీని తీసుకోండి. ఇవి చదవండి: నడుము నొప్పా? సింపుల్‌గా ఇలా తగ్గించుకోండి! -
నడుము నొప్పా? సింపుల్‌గా ఇలా తగ్గించుకోండి!
నడుంనొప్పి ఉన్నవారు ఆ బాధ బయటకు చెప్పుకోలేరు. చాలా ఇబ్బంది పడుతుంటారు. తరచు పడకకే పరిమితం అయిపోవలసి వస్తుంటుంది. నొప్పి వచ్చినప్పుడల్లా సింపుల్‌గా ఒక పెయిన్ కిల్లర్‌ను వేసేసుకుంటూ ఉంటారు. అయితే ఆ మాత్ర నొప్పితోపాటు క్రమంగా మనల్నీ కిల్ చేస్తుంటుందన్న విషయాన్ని మరచిపోవద్దు. నడుంనొప్పి తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు... సింపుల్‌గా తగ్గిపోతుంది. ఆ చిట్కాలేమిటో చూద్దాం... బాగా నడుము నొప్పిగా ఉన్నవారు తగ్గించుకోవాలంటే ముందు ఒత్తిడిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వెన్నెముక కండరాలు బలోపేతం చేయడంతోపాటు, కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది. చిన్న చిన్న టిప్స్‌తో నడుం నొప్పిని తగ్గించుకోవచ్చు. పడుకునే సమయంలో వెనుక భాగంపై ఒత్తిడి పడుతుంది. నడుంనొప్పి ఎక్కువగా ఉన్నవారు మోకాళ్ళ కింద దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల, కాళ్ళు ఎత్తుగా పెట్టడం వల్ల నడుంపై ఒత్తిడి తగ్గి కాస్త రిలీఫ్ గా ఉంటుంది. సరైన శిక్షణతో వ్యాయామం.. నడుం నొప్పి నుంచి ఉపశమనం నడుంనొప్పిని తగ్గించుకోవడంలో వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక వ్యాయామం చేసే సమయంలో నడుముకు సంబంధించిన ముఖ్యమైన కండరాలపై దృష్టిసారించి సరైన శిక్షణతో వ్యాయామం చేయడం వల్ల, ముఖ్యంగా కండరాలను సాగదీసే స్ట్రెచ్ ఎక్సర్సైజులు చేయడంవల్ల ఫలితం ఉంటుంది. వెన్ను సంబంధిత గాయాల ప్రమాదాన్ని తగ్గించడంలో వ్యాయామం సహాయపడుతుంది. నడుం నొప్పి తగ్గడం కోసం వారానికి కనీసం రెండుసార్లు నడుమును బలపరిచే వ్యాయామాలను చేయండి. కాల్షియం, విటమిన్ డి.. ఎముకలు బలంగా ఉన్నప్పుడు నడుము నొప్పి వంటి సమస్యలు ఎక్కువ బాధించవు. బలహీనమైన ఎముకలు ఉన్నప్పుడు కచ్చితంగా నడుంనొప్పి ఇబ్బంది పెడుతుంది. కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా తీసుకోవడం ద్వారా వెన్నెముకలోని ఎముకలకు బలం చేకూరుతుంది. అందుకే తప్పనిసరిగా కాల్షియం, విటమిన్ డి తీసుకోవడం మర్చిపోకండి. పాలు, పెరుగు, ఆకుకూరలు, విటమిన్ సప్లిమెంట్లు వంటి వాటిలో విటమిన్ డి ఉంటుంది. చెప్పుల విషయంలో జాగ్రత్త నడుంనొప్పిని నివారించడం కోసం చెప్పుల విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఎత్తు మడమల చెప్పులు ఎక్కువగా వేసుకునే వారికి నడుంనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ మడమ ఉన్న చెప్పులను ధరించండి. ఇవి మన నడుంపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒక్క అంగుళం కంటే తక్కువ మడమ ఉంటేనే ఫలితం బాగుంటుంది. సరైన పొజిషన్.. ఆఫీసులో కూర్చున్నప్పుడు, నిలబడి ఉన్నప్పుడు సరైన భంగిమ పద్ధతులను పాటించండి. మనం కూర్చునే విధానం బట్టి కూడా నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే కూర్చున్నా, నిల్చున్నా కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి ప్రతిరోజూ గంటల తరబడి కంప్యూటర్ ముందు పని చేసేవారు మంచి కుర్చీని ఎంపిక చేసుకొని కూర్చోవాలి. లేదంటే నడుం నొప్పి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. బరువు తగ్గించుకోవడం.. నడుం నొప్పికి మరొక కారణం విపరీతమైన బరువు. ఎక్కువ బరువు ఉన్న వారిలోనూ నడుమునొప్పి విపరీతంగా వస్తుంది. బరువు తగ్గితే సహజంగానే నడుం నొప్పి నుండి కూడా కాస్త ఉపశమనం లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గటం పై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం అవసరం. ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు, చిన్న చిన్న మార్పులతో నడుం నొప్పి ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మందులతోనే నడుము నొప్పి తగ్గాలని చూడకుండా, పై చిట్కాలు పాటించి చూడండి. కచ్చితంగా విపరీతమైన బాధ నుండి కాస్తయినా ఉపశమనం పొందుతారు. ఇవి చదవండి: బిడ్డ పుట్టినట్టు, ఏడుస్తున్నట్టు కల వస్తే.. అపశకునమా! -
ఈ బ్యూటిప్స్ వాడారో.. ఇకపై ట్యాన్‌కు చెక్!
చలికాలంలో చాలా మంది తమ ముఖాలు అందంగా కనిపించేలా ప్రయత్నాలు చేస్తుంటారు. చలి తీవ్రతతో.. ముఖం నిగారింపు తగ్గడం, పెదవులు పొడిబారిపోవడం, కళ్లకింద నల్లరంగు చారలు ఏర్పడటంలాంటి సమస్యలు కనిపిస్తూంటాయి. వీటిని అధిగమించడానికి మరెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు తెలియని ఫేస్‌క్రీమ్స్ వాడి లేని సమస్యలను కొనితెచ్చుకుంటారు. మరి వీటినుండి బయటపడాలంటే ఈ చిన్న చిన్న బ్యూటిప్స్ని వాడితే చాలు. అవేంటో చూద్దాం. రోజ్ వాటర్, తేనెతో.. రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, టీస్పూను రోజ్ వాటర్ వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. చక్కగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ తగ్గుముఖం పడుతుంది. రోజ్ వాటర్ ముఖానికి సహజసిద్ధ్ద నిగారింపుని ఇస్తే, తేనె చర్మానికి తేమనందిస్తుంది. ఇంగువతో నిగారింపు.. రెండు స్పూన్ల ముల్తానీ మట్టిలో స్పూను తేనె, చిటికెడు ఇంగువ, స్పూను రోజ్‌వాటర్ వేసి చక్కగా కల΄ాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి ఇరవై నిమిషాల΄ాటు ఆరబెట్టాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ΄్యాక్‌ను వారంలో రెండుసార్లు వేయడం వల్ల మొటిమలు, నల్లమచ్చలు, ముడతలు ΄ోతాయి. చర్మం ΄÷డిబారడం తగ్గి ముఖం కాంతిమంతమవుతుంది. ఇవి కూడా చదవండి: ఏంటి? కనీసం 6 గంటలైనా నిద్ర పోవట్లేదా..! -
'పచ్చి మిరపకారా'నికి గారం చేయండి.. ఎందుకో తెలుసా?
ప్రతిరోజూ మనం వండే వంటల్లో కారం రుచి కోసం పచ్చిమిరపకాయలు వాడతాం. అయితే ఇవి రుచిని అందించడంతో పాటు ప్రమాదకర వ్యాధుల నుండి కాపాడడమే కాకుండా, చర్మ సమస్యలు రాకుండా రక్షణ కవచంలా ఉంటాయని మీకు తెలుసా? ఇలా ఒక్క చర్మ సమస్యలే కాదు,.. రక్తప్రసరణ, గుండె జబ్బులు, అల్సర్లు, వివిధ అనేక సమస్యల నుంచి కాపాడటంలో దివ్య ఔషధంగా పని చేస్తుంది. మరి వాటి గురించి తెలుసుకుందాం. పచ్చిమిరపలో ఎ,సి బి6 విటమిన్లతో పాటు ఇనుము, రాగి, పొటాషియం తక్కువ మొత్తంలో ప్రోటీన్, కార్పోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. పచ్చిమిరపలోని క్యాప్సైసిన్ అనే పదార్థం శ్లేష్మ పొరలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో అది సులువుగా బయటకు వచ్చేస్తుంది. సైనస్, జలుబుకి పచ్చిమిరప మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది. పచ్చిమిరప రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పచ్చిమిరపలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల కోతలు, గాయాలు వంటి వాటిని త్వరగా నయం చేస్తుంది. గుండె జబ్బులు, అల్సర్లు కూడా పచ్చిమిరప తీసుకోవడం వల్ల నయమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంలో సమర్థంగా పనిచేస్తుంది. డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు పచ్చి మిర్చితో చేసిన ఫుడ్ తీసుకోవడం మేలు చేస్తుంది. పచ్చిమిరపలో ఉండే విటమిన్ సి, ఇ శరీరంలో రక్తప్రసరణ పెంచడంలో సహాయపడతాయి. మొటిమల సమస్యలను కూడా నయం చేస్తుంది. ఇందులో అసలు క్యాలరీలు ఉండవు కాబట్టి బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. చాలామందిలో మూడ్ స్వింగ్స్ సమస్య ఉంటుంది. పచ్చిమిరప మెదడులోని ఎండార్ఫిన్లను బయటకు పంపేందుకు ఉపయోగపడుతుంది. దీని కారణంగా మూడ్ స్వింగ్స్ నుండి బయటపడి సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా చలికాలంలో పచ్చిమిరపకాయలు తినడం వల్ల యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఎముకలు దంతాలు, కళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు నివారించడంలో పచ్చి మిరపకాయలు ఎంతగానో సహాయపడతాయి. కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న పచ్చి మిరపకాయలను మీరు తినే ఆహారంలో ఎక్కువగా చేర్చుకోండి. ఇవి కూడా చదవండి: మడమల నొప్పితో నడవలేకున్నారా.. అయితే ఇలా చేయండి! -
మడమల నొప్పితో నడవలేకున్నారా.. అయితే ఇలా చేయండి!
చాలా మంది కాలి చీలమండల ప్రాంతంలో నొప్పితో బాధపడుతుంటారు. దీనివల్ల నడవటం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ నొప్పి రాకుండా వివిధ రకాల ఔషధాలు తీసుకుంటూ ఉంటారు. అయితే మందు ప్రభావం తగ్గిన వెంటనే, నేనున్నానంటూ మళ్లీ నొప్పి మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితులలో కొన్ని ఇంటి నివారణ చిట్కాల సహాయంతో పాదాల నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం. మడమల నొప్పులు ఏ సీజన్లో అయినా రావచ్చు కానీ ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రతరమౌతుంది. ఈ నొప్పులకు కారణాలు అనేకం. వాటిలో బరువు పెరగడం, ఎక్కువసేపు నిలబడటం, ఎత్తు మడమల బూట్లు లేదా చెప్పులు ధరించడం, శరీరంలో కాల్షియం లోపించటం వంటివి ముఖ్య కారణాలు. అల్లం మడమ నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆహారంలో అల్లాన్ని చేర్చుకోవటం మంచిది. దీనికిగాను ముందుగా రెండు కప్పుల నీళ్లలో అల్లం వేయాలి. తరువాత దానిని మరగనివ్వాలి. నీరు సగానికి తగ్గిన తర్వాత అందులో మూడు చుక్కల నిమ్మరసం, ఒక చెంచా తేనె వేసి సేవించడం వల్ల వల్ల చీలమండల నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. చేప ఆహారంలో చేపలను చేర్చుకోవడం ద్వారా నొప్పి, మడమల వాపు నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. ఇవి నొప్పి, వాపును తగ్గించడమే కాకుండా, ఎముకలను బలోపేతం చేస్తాయి. రాక్‌సాల్ట్ మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి రాతి ఉప్పును ఉపయోగించవచ్చు. ముందుగా ఒక పాత్రలో నీటిని వేడి చేసి, దానిలో రెండు మూడు చెంచాల రాక్‌సాల్ట్ వేయండి. ఆ తర్వాత, ఈ నీటిలో పాదాలను 10–15 నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల మడమ నొప్పి, వాపు ఉపశమిస్తాయి. ఐస్ క్యూబ్స్ మడమల నొప్పి సమస్య నుండి బయటపడటానికి నొప్పి ఉన్న ప్రాంతంలో రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు సార్లు ఐస్‌క్యూబ్‌లు ఉంచాలి. ఐస్ గడ్డను నేరుగా కాకుండా ఒక గుడ్డలో ఉంచి నొప్పి ఉన్న ప్రదేశంలో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. లవంగ నూనెతో మసాజ్ మడమ నొప్పి నుంచి ఉపశమనం కోసం నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగ నూనెతో సున్నితంగా మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. కండరాలకు ఉపశమనం కలుగుతుంది. పాదాలలో ఏదైనా నొప్పి అనిపిస్తే లవంగ నూనెతో మసాజ్ చేయటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. పసుపు మడమ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి పసుపు సహాయపడుతుంది. ఇది వ్యాధి నిరోధక లక్షణాలను కలిగి ఉండి వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికిగాను పసుపునీళ్లలో కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి. అలాగే పసుపు పాలు తీసుకోవచ్చు. దీనిని సేవించటం వల్ల నొప్పి, వాపు తగ్గుతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ మడమల నొప్పి. వాపు వంటి సమస్యలు ఉంటే, ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా ఉపకరిస్తుంది. కాసిని వేడినీళ్లలో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఈ నీటితో పాదాలను మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇవి చదవండి: కుకింగ్ టు కామెడీ క్వీన్స్.. -
మెడి టిప్: స్పాండిలోసిస్ పెరగకుండా జాగ్రత్తలివి..
మెడలో ఉన్న వెన్నుకు సంబంధించిన ఎముకలు అరిగి.. రాపిడికి గురైనప్పుడు వెన్నుపూసల నరాలపై ఒత్తిడి పడటం వల్ల వచ్చే నొప్పిని ‘స్పాండిలోసిస్’ అంటారు. ఈ నొప్పి తగ్గడానికీ.. అలాగే ముందు నుంచే స్పాండిలోసిస్ నివారణకూ పాటించాల్సిన జాగ్రత్తలివి.. బరువైన వస్తువులు.. అంటే నీళ్లబక్కెట్లు, సూట్‌కేసులు, బ్రీఫ్‌కేసులు, ల్యాప్‌టాప్‌లు మోయడం వంటి పనులు చేయకూడదు. తలపైన బరువులు (మూటలు, గంపలు వంటి అతి బరువైనవి) పెట్టుకోకూడదు. పడుకునే సమయంలో తలగడ కేవలం తల కింది వరకే కాకుండా భుజాల వరకూ ఉండేలా చూసుకోవాలి. దాంతో మెడకు కొంత సపోర్ట్ ఉండేలా జాగ్రత్తపడాలి. తలగడ అందుబాటులో లేకపోతే కనీసం ఒక బెడ్‌షీట్ నాలుగు ఇంచుల ఎత్తుగా ఉండేలా మడత వేసి తల కింద పెట్టుకోవాలి. దాని మీద ఓ టర్కీ టవల్‌ను రోల్ చేసినట్లుగా చుట్టి మెడకింద పెట్టుకోవాలి. మూడు నెలల నుంచి ఆర్నెల్ల వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్య ఉన్నప్పుడు తలగడ లేకుండా పడుకోవడం అన్నది సరికాదు. తలగడ ఉండటం వల్లనే తప్పనిసరిగా మెడకూ, భుజాలకు సపోర్ట్ ఉంటుంది. సమస్య రెండో దశలో ఉన్నప్పటికీ మందులతో పాటు ఇక్కడ పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటే సమస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గనివారు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. ఇవి చదవండి: చాలాసేపు కదలకుండా కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త! -
చాలాసేపు కదలకుండా కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త!
'చాలాసేపు కదలకుండా కూర్చున్నా, అలా కూర్చుని చాలాసేపు ప్రయాణాలు చేసినా కాళ్లవాపులు రావడం మామూలే. గర్భవతుల్లోనైతే ప్రసవానికి ముందు చివరి మూడు నెలల్లో (చివరి ట్రైమిస్టర్లో) కాళ్ల వాపు రావడం ఇంకా సాధారణం. గర్భవతుల్లో కాళ్ల వాపు వచ్చే ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో ‘జెస్టెషనల్ అడిమా’ అంటారు. ఇలా కాళ్లవాపులు రావడానికి కారణాలేమిటి, వాటితో వచ్చే సమస్యలూ – పరిష్కారాలపై అవగాహన కోసం ఈ కథనం.' గర్భవతుల్లో ప్రసవం ముందరి నెలల్లో కాళ్ల వాపులు రావడం.. అందునా అవి ఉదయం పూట కొద్దిగా ఉండి, క్రమంగా సాయంత్రానికి వాపులు పెరుగుతుండటం చాలామందిలో జరుగుతుంటుంది. కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల విశ్రాంతితో ఆ నొప్పులు వాటంతట అవే తగ్గిపోతాయి. దేహనిర్మాణ పరమైన (అనటామికల్) కారణం.. గర్భవతుల్లో ప్రసవానికి ముందు రోజుల్లో గర్భసంచి కుడి వైపునకు కాస్తంత ఒరుగుతుంది. కాళ్ల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకుపోయే పెద్ద రక్తనాళమైన ఇన్ఫీరియర్ వీన కేవా శరీరానికి కుడివైపునే ఉంటుంది. గర్భసంచి కుడి వైపునకు ఒరగడం వల్ల.. అది ఇన్ఫీరియర్ వీన కేవాపై ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో కాళ్ల నుంచి గుండె వైపునకు రక్తప్రవాహం సాఫీగా సాగక కాళ్లవాపులు వస్తుంటాయి. అందువల్ల గర్భవతులు విశ్రాంతిగా పక్కమీద ఒరిగినప్పుడు తమ ఎడమవైపునకు తిరిగి పడుకోవడం మంచిది. కాళ్లవాపులు వస్తుంటే దృష్టి పెట్టాల్సిన మెడికల్ సమస్యలు.. గర్భవతుల్లో కాళ్ల వాపు వస్తున్నప్పుడు ముందుగా హైబీపీ ఉందేమోనని పరీక్షించుకోవాలి. మనదేశ మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. కాళ్ల వాపులు రావడానికి ఈ అంశం కూడా ఒక ప్రధాన కారణం. కంప్లీట్ బ్లడ్ పిక్చర్/కౌంట్ (సీబీపీ/సీబీసీ) వంటి రక్తపరీక్షలు నిర్వహించినప్పుడు మహిళల్లో హిమోగ్లోబిన్ మోతాదు కనీసం 11 ఉండాలి. కొందరిలో ఇది 7 కంటే తక్కువగా ఉన్నప్పుడు కాళ్ల వాపు రావడం సాధారణం. మహిళల్లో గుండెజబ్బులు, కాలేయవ్యాధులు, కిడ్ని సమస్యలు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు కూడా కాళ్లవాపులు రావచ్చు. కాళ్లవాపు తగ్గడానికి చేయాల్సిందిదే.. మామూలుగానైతే ఈ కాళ్లవాపుల గురించి పెద్దగా ఆందోళన పడాల్సిందేమీ లేదు. వాపు ఎక్కువగా ఉంటే పక్క మీద ఒరిగి పడుకున్న గర్భవతులు మడమల కింద తలగడను పెట్టుకుని, కాళ్లను కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ ముందుగాని, డెస్క్ ముందుగాని అదేపనిగా కూర్చుని పనిచేసే వారు తమ కాళ్ల కింద ఏదైనా పీటగానీ, స్టూల్‌గాని వేసుకుని, కాళ్లు కాస్తంత ఎత్తు మీద ఉండేలా చూసుకోవాలి. ప్రతి రెండు మూడు గంటలకు ఒకమారు లేచి, కాస్తంత నడవాలి. దాంతో కాళ్ల వాపు తగ్గుతుంది. పైన పేర్కొన్న జాగ్రత్తలు ΄ాటించాక కూడా కాళ్ల వాపులు తగ్గని వారూ,.. అలాగే ఆ సమస్యతో పాటు చేతులు, ముఖంలో వాపు కనిపిస్తున్నవారూ, ఆరేడు గంటల విశ్రాంతి తర్వాత కూడా కాళ్ల వాపులు తగ్గని వారు.. తప్పనిసరిగా హైబీపీ, అనీమియాతో పాటు థైరాయిడ్ వంటి సమస్యలు ఏవైనా ఉన్నాయేమోనని డాక్టర్ల చేత పరీక్ష చేయించుకోవాలి. - డాక్టర్ రమ్యతేజ కడియాల, సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రీషియన్ ఇవి కూడా చదవండి: చలిగాలిలో వాకింగ్: ఊపిరితిత్తులు జాగ్రత్త! -
చిన్న చిన్న మార్పులు... బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు!
-
కలికాలం అంటే ఇదే..అమెరికాలో చద్దన్నంకి సూపర్ క్రేజ్
పెద్దల మాట.. సద్దన్నం మూట అంటారు. అంటే పెద్దవాళ్లు ఏం చెప్పినా మంచే చెబుతారన్నది దాని సారాంశం. ఇప్పుడంటే మనకు బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోస, వడ వంటి పదార్థాలు వచ్చాయి.. కానీ పాతకాలం రోజుల్లో అందరూ చద్దన్నమే తినేవాళ్లు. రాత్రి వండిన అన్నాన్ని ఉల్లిపాయతో కలిపి పెరుగు లేదా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినేవారు. దీన్నే చద్దన్నం అనేవారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో దీనికి మించిన సూపర్ ఫుడ్ లేదంటారు. అందుకే ఇప్పుడు మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ పల్లెటూరి బ్రేక్‌ఫాస్ట్ చద్దన్నంకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ డబ్బులిచ్చి మరీ చద్దన్నంను కొనుగోలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి చాలామందిని మళ్లీ పాతకాలం అలవాట్లవైపు తిప్పింది. ఒకప్పుడు గ్రామాల్లో అక్కడక్కడ మాత్రమే కనిపించే ఈ చద్దన్నం కల్చర్ ఇప్పుడు నగరాలకు, విదేశాలకు కూడా పాకింది. అందుకే ఇప్పుడు కొన్ని ఫైవ్‌స్టార్ హోటళ్లలోనూ చద్దన్నాన్ని ప్రత్యేకంగా వడ్డిస్తున్నాయి. ఆన్లైన్ ఆర్డర్స్లోనూ చద్దన్నం స్పెషల్ మెనూ లిస్ట్‌లో చేరిపోయింది. ఒకప్పుడు రాత్రి మిగిలిన అన్నం పొద్దున తినడం అంటే నామోషీగా ఫీల్ అయ్యేవారు. కానీ ఇందులో ఉన్న పోషక విలువలు తెలుసుకున్నాక చద్దన్నం తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాలోనూ చద్దన్నం భారీ ధరకు అమ్ముడవుతుంది. దీనికి సంబంధించిన ఓ క్రేజీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అమెరికాలోని ఓ స్టోర్‌లో చద్దన్నం దాదాపు వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారని, కలికాలం అంటే ఇదేనంటూ ఓ ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పటికే 4.2 వ్యూస్‌తో నెట్టింట హల్చల్ చేస్తుంది. దీంతో మరోసారి చద్దన్నంపై చర్చ నడుస్తుంది. ఇంతకీ న్యూట్రీషియన్స్ పరంగా చద్దన్నం తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం. ►చద్దన్నంలో ఐరన్, కాల్షియం,పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ► అల్సర్లు, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి చద్దన్నం పరమౌషధంలా పనిచేస్తుంది ► యాంగ్జయిటీని దూరం చేయడంతో చద్దన్నం కీ రోల్ పోషిస్తుంది. ► ఒంట్లో వేడిని తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ► ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకొని తింటే రక్తహీనత నుంచి బయటపడొచ్చు ► చద్దన్నం తింటే అధిక రక్తపోటు, మలబద్ధక సమస్యలు దూరమవుతాయి ► ఎదిగే పిల్లలకు చద్దన్నం మంచి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది. ► తరచూ చద్దన్నం తింటే బద్దకం, నీరసం లేకుండా ఉంటుంది. చద్దన్నం ఇలా తయారుచేయాలి? రాత్రి మిగిలిన అన్నాన్ని మట్టి పాత్రలో ఉండలు లేకుండా ఉంచుకోవాలి. దీంట్లో అన్నం మునిగేంత వరకు నీళ్లు పోయాలి. ఆ తర్వాత కొన్ని గోరువెచ్చని పాలు, పెరుగు, నాలుగైదు పచ్చి మిరపకాయలు కొంచెం ఉప్పు వేసి కలియబెట్టాలి. దీనిపై మూత పెట్టి రాత్రంతా కదలించకుండా ఉంచాలి. పెరుగు పులియడం వల్ల ఆరోగ్యానికి మేలు చేసే ప్రొబ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు అన్నంలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే రుచిగా ఉండటంతో పాటు శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి మరి. View this post on Instagram A post shared by Bigg boss telugu spy, Spy Akka (@biggbossteluguspy) -
వింటర్లో సెల్యులైటిస్తో సమస్యా..? అయితే ఇలా చేయండి!
'సెల్యులైటిస్ అనేది ఓ చర్మవ్యాధి. కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో చర్మంపై పగుళ్లు రావడం, ఎర్రబారడం, కొద్దిపాటి వాపు మంట వంటి లక్షణాలతో బాధించే ఈ వ్యాధి తాలూకు బాధలు చలికాలంలో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉన్నప్పుడు మరింత ఎక్కువవుతాయి. అసలు సెల్యులైటిస్ రావడానికి ఏయే అంశాలు కారణమవుతాయి, లక్షణాలేమిటి, చలికాలంలో ఇది ఎందుకిలా మరింత ఎక్కువగా బాధిస్తుంది వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.' చర్మం పగుళ్లుబారినట్లుగా కనిపిస్తూ, కొద్దిపాటి వాపు, ఎర్రబారడం వంటి వాటితో వ్యక్తమయ్యే ఈ వ్యాధి స్ట్రెప్టోకాకస్, స్టెఫాలోకాకస్ వంటి బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. చర్మంపై ఒకచోట వస్తే మిగతా చోట్లకు పాకుతుంది. అయితే ఇది అంటువ్యాధి కాదు. ఒకరినుంచి మరొకరికి వ్యాపించదు. ప్రేరేపించే అంశాలు.. స్ట్రెప్టోకాకస్, స్టెఫాలోకాకస్ వంటి బ్యాక్టీరియా వల్ల వచ్చినప్పటికీ... కొన్ని అంశాలు దీన్ని తీవ్రతరం చేస్తాయి. అవి.. కాళ్లు, చేతుల్లోని రక్తనాళాల్లో ఏమైనా సమస్యలతో రక్తసరఫరాలో తేడాలు, ఊబకాయం, కాళ్లవాపులు, డయాబెటిస్, మద్యం తాగే అలవాటు కారణాలతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనం కావడం. లక్షణాలు.. ఈ ఆరోగ్య సమస్యలో కనిపించే ఓ కీలకమైన అంశం ఏమిటంటే.. సాధారణంగా సెల్యులైటిస్ దేహంలోని ఒకవైపునే కనిపిస్తుండటం విశేషం. ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలివి.. ఈ వ్యాధి సోకిన ప్రాంతంలో చర్మం దురద పెడుతుండటంతో పాటు ఈ దురదలు క్రమంగా పక్కలకు వ్యాపిస్తూ ఉంటాయి. వ్యాధిసోకిన చర్మపు ప్రాంతంలో వాపు, ముట్టుకోనివ్వకపోవడం (టెండర్నెస్) నొప్పి, వేడిగా అనిపించడం జ్వరంతో పాటు అది కొందరిలో చలిజ్వరంగా వ్యక్తం కావడం సెల్యులైటిస్ వచ్చిన ప్రాంతాల్లో మచ్చలతో పాటు నీటి పొక్కుల్లా (బ్లిస్టర్స్) రావడం. కొందరిలో చర్మంపై గుంటల్లా పడుతూ, చర్మం వదులైన తోలు మాదిరిగా కనిపించడం (స్కిన్ డింప్లింగ్) చలికాలంలో బాధలు ఎందుకు పెరుగుతాయంటే.. సెల్యులైటిస్ లక్షణాలతో వచ్చే బాధలు చలికాలంలో పెరగడానికి, ఈ సీజన్లో చర్మంపై కనిపించే కొన్ని అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు.. చర్మం పొడిబారడం (డ్రైస్కిన్): ఈ సీజన్లో తేమ తగ్గడంతో చర్మం బాగా పొడిబారిపోతూ ఉండటం చాలామందికి అనుభవంలో వచ్చే విషయమే. పైగా చలిగాలులకు వెళ్లినప్పుడు మరింతగా పెరుగుతుంది. ఇలా పొడిబారిన చర్మం బ్యాక్టీరియా చేరడానికి అనువుగా ఉంటుంది. దాంతో సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఈ సీజన్లో మాయిశ్చరైజర్లతో చర్మాన్ని తేమగా ఉంచుకుంటే ఇలా పగుళ్లుబారడంతో పాటు సెల్యులైటిస్నూ నివారించవచ్చు. వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనపడటం / వ్యాధినిరోధక శక్తి తగ్గడం: చలికాలంలో మామూలుగానే వ్యాధినిరోధక వ్యవస్థ పనితీరు కాస్త మందగించే అవకాశముంది. దీనికి తోడు డయాబెటిస్ ఉండటం, మద్యం అలవాట్ల వంటివి ఉంటే అది వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత మందకొడిగా మార్చవచ్చు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో సమతులాహారం తీసుకోకపోవడం, ఆహారంలో విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు తక్కువగా ఉండటం లాంటి అంశాలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశముంది. సెల్యులైటిస్ నివారణ ఇలా... చర్మాన్ని శుభ్రంగా, తేటగా ఉంచుకోవాలి. ఘాటైన రసాయనాలతో కూడిన వాసన సబ్బులు కాకుండా, మైల్డ్ సోప్ వాడాలి. మిగతా చర్మంతో పోలిస్తే.. మేనిపై పొడిగా ఉండే భాగాలైన మోచేతులు, మోకాళ్లు వంటి చోట్ల మాయిశ్చరైజర్ వంటివి రాసి, తేమగా ఉండేలా చూసుకోవడం మంచిది. చర్మం పగుళ్లు బారి, తోలు రేగిన ప్రాంతాల్లో వాటిని గిల్లడం, లాగడం చేయకూడదు. గోళ్లు, చర్మంతో గోళ్లు ముడిపడే భాగాల్ని శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే అక్కడి నుంచి బ్యాక్టీరియా చర్మంపై దాడి చేసే అవకాశాలుంటాయి. చలికాలంలో చర్మానికి మంచి రక్షణ కలిగేలా, ఒళ్లంతా కప్పి ఉంచేలాంటి దుస్తులు వాడటం మేలు. చలిగాలులు వేగంగా తాకకుండా ఉండేలా దుస్తులు ఉండాలి. తమ వ్యక్తిగత దుస్తులు, సామగ్రిని ఇతరులతో పంచుకోకూడదు. ఇల్లు శుభ్రం చేసుకోవడం, తోటపని వంటి మన రోజువారీ కార్యక్రమాల్లో చర్మానికి ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తపడాలి. ఎక్కడైనా చర్మం తెగినా, గాయపడ్డా డాక్టర్ సలహా మేరకు తగిన యాంటీబయాటిక్ క్రీమ్స్ వంటివి రాస్తూ, గాయాలు వేగంగా తగ్గేలా జాగ్రత్త తీసుకోవాలి. పాదాల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా బాగా పొడిబారి పగుళ్లకు అవకాశం ఉండే మడమలు, అలాగే వేళ మధ్యభాగాలు తేమతో, ఆరోగ్యంగా ఉంచుకునేలా జాగ్రత్త వహించాలి. రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. వ్యాధినిరోధక వ్యవస్థ చురుగ్గా ఉండేందుకు అన్ని పోషకాలూ, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన మంచి ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకుంటూ ఉండాలి. డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, తమ జబ్బులను అదుపులో పెట్టుకునేలా క్రమం తప్పకుండా మందులు వాడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. చివరగా.. చలికాలంతో కొన్ని సౌకర్యాలున్నప్పటికీ.. దాంతోపాటు మరికొన్ని ఆరోగ్యసమస్యలనూ తీవ్రం చేసే సీజన్ అది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చర్మాన్నీ, దేహాన్నీ ఆరోగ్యంగా ఉంచుకుంటే ఈ సీజన్ నిరపాయకరంగా గడిచిపొతుంది. ఇవి చదవండి: వింటర్లో ముఖం తేటగా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి! -
ఆడవాళ్లు సబ్జా గింజలు తింటున్నారా? ఈ విషయం తెలిస్తే..
హెల్త్ టిప్స్ ►వంటిమీద ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని నూరి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకుంటే సరి, పుళ్లు తొందరగా తగ్గుతాయి. గాయాలు తొందరగా మానుతాయి. ► తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి, సమస్య తగ్గిపోవడమే కాదు.. మానసిక ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది. ► ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితముంటుంది. ► గొంతులో మంట, ఆస్తమా, జ్వరం వంటి సమస్యలకు సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తీసుకుంటే విముక్తి. ► అదేవిధంగా బీపీ అదుపులో ఉండాలన్నా సబ్జా గింజలు తీసుకుంటే మంచిది. వీటిలో ఒమెగా –3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వలన హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ►మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ ‘ఇ’ కూడా ఇందులో లభిస్తుంది.. కాసిని సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి. ►గోరింటాకు, జుత్తుకు సహజసిద్ధమైన రంగుగానే కాకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణలోనూ బాగా తోడ్పడుతుంది. వెంట్రుక కుదుళ్లను పటిష్టం చేయడం ద్వారా ఇది చుండ్రును, జుత్తు రాలడాన్ని నివారిస్తుంది. ► వేపాకు యాంటీ సెప్టిక్‌గానూ, ఇన్ సెక్టిసైడ్గానూ పనిచేస్తుంది. వేపాకు పొడిని నీళ్లల్లో కలిపి చల్లితే ఎన్నోరకాల క్రిమి కీటకాలు ఇంటికి దూరంగా వెళ్లిపోతాయి. వేపాకుల్ని నీటిలో వేసి మరిగించి స్ప్రే చేస్తే దోమల బెడద తప్పుతుంది. వేపాకు పొడిని పేస్ట్‌గా చేసి వాడితే పలు రకాల చర్మ సమస్యలు, మొటిమలు, ఎగ్జిమాల బాధలు తప్పుతాయి. ►కలబంద గుజ్జు ఒక సహజసిద్ధమైన కండీషనర్. మాయిశ్చరైజర్ కూడా. ఈ గుజ్జును చర్మం మీద, మాడు మీద రుద్దితే, చర్మ వ్యాధులు, చుండ్రు సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఈ గుజ్జుతో కాలిన గాయాలు కూడా త్వరగా మానిపోతాయి. -
మీకు తెలుసా! వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగితే ఏమౌతుందో!?
'సాధారణంగా కొందరు ఉదయం నిద్రలేచిన వెంటనే వేడినీరు తాగుతారు. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. అయితే వేడినీటిలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు మరింత మేలు జరుగుతుందని మీకు తెలుసా!?' ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇది కాకుండా, కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఎ, ఇ మొదలైనవి నెయ్యిలో లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. చర్మం ఆరోగ్యంగా... ప్రకాశవంతంగా మారుతుంది. కొవ్వు కరిగిపోతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇది వెచ్చని నీటితో లేదా ఆహారంతో ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇవి కూడా చదవండి: రక్తహీనతతో బాధ పడుతున్నారా.. అయితే ఇవి తీసుకోండి! -
అందుకే ఆడవాళ్లకు ఎక్కువగా కీళ్లనొప్పులు.. తేలిగ్గా తీసుకోవద్దు
చలికాలం వచ్చిందంటే చాలు కీళ్ల నొప్పులు,ఒంటి నొప్పులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. చాలామందికి చలికాలంలో కీళ్ల నొప్పులతో లేచి నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇక ఉదయం పూట పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. కీళ్లు గట్టి పడిపోవడం, జాయింట్లు సహకరించకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు చలికాలంలో కీళ్ల నొప్పుల నుండి, ఒంటి నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు. చలికాలంలో వాతావరణంలోని చల్లదనానికి కీళ్లమధ్యలో ఉండే మృదువైన కార్టిలేజ్ కుచించుకుపోతుంది. చర్మం, కండరాలు బిగుసుకుపోతాయి. అందుకే చాలామందికి చలికాలంలో కీళ్ల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఆడవాళ్లలో రక్తహీనత కారణంగా కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ సీజన్లో శరీరాన్ని వీలైనంత వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కీళ్ల నొప్పులను తేలిగ్గా తీసుకోకూడదు. చలికాలంలో వచ్చే సాధారణ కీళ్ల నొప్పులను తగ్గించడానికి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా భుజాలు, తొడ కండరాలు గట్టిపడే వ్యాయామాలు చేస్తే కీళ్లపై ఒత్తిడి పడదు. అలాగే గంటల తరబడి కూర్చొని పనిచేసేవాళ్లు అప్పుడప్పుడు లేచి అటు ఇటు నడుస్తుండాలి. నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కోసం వేడినీళ్ల కాపడం, మసాజ్, ఫిజియోథెరపీ వ్యాయామాలు లాంటివి ఉపయోగపడతాయి. కీళ్ల అరుగుదల, కీళ్లవాతం లాంటి సమస్యలు ఉన్నవాళ్లు చలికాలంలో డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. కీళ్లు మరీ వీక్‌గా ఉన్నవాళ్లు డాక్టర్ల సలహా మేరకు క్యాల్షియం, విటమిన్ డి మాత్రలు వేసుకోవచ్చు. ఇక వీటితో పాటు చలికాలంలో జంక్ ఫుడ్ తగ్గించి శరీరంలో వేడిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, విటమిన్–డి, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. కీళ్లను వెచ్చగా ఉంచుకునేందుకు మందపాటి బట్టలు వేసుకోవాలి. శరీరాన్ని చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి కావలసినంత అందకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. విటమిన్–డి లోపాన్ని తగ్గించుకోవడానికి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో మంచిది. సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా కాస్త కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు బాధిస్తున్న వారు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిది. నారింజ, క్యాబేజీ, బచ్చలికూర, టమోటాలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మరీ మంచిది.చలికాలంలో మనకు తెలియకుండానే తక్కువ నీటిని తీసుకుంటాం కాబటి బాడీ డీహైడ్రేషన్ కు గురవుతుంది. దానివల్ల కీళ్ల నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. అందువల్ల అది గుర్తుంచుకుని కీళ్లనొప్పులతో బాధపడేవారు శరీరం డీ హైడ్రేట్ కాకుండా తగినంత నీటిని తాగడం మంచిది. -
మాట్లాడుతూ.. పదాలతో తడబడుతున్నారా!? అయితే ఇలా చేయండి!
మాటలు ధారాళంగా మాట్లాడటం, పలకడం మనుషులకున్న గొప్ప వరం. ఈ పుడమిలో మరే జీవానికి ఈ అవకాశం లేదు. ఒకవేళ అవి గొంతు చీల్చుకుని అరిచినా, పదాలను మాత్రం పలకలేవు. కానీ మనం మాత్రం పలుకగలం. ఈ క్రమంలో కొందరు మాట్లాడటంలో, అక్షరాలు పలకడంలో ఎంతగానో తడబడుతుంటారు. నాలుక తిరగని పదాలతో లోలోనే సంకోచిస్తూంటారు. ఇకపై ఈ చిన్న ట్రిక్ వాడారో, ఇలాంటి సమస్యల నుంచి దూరం అవ్వడానికి అవకాశం ఉంది. మరదేంటో చూద్దాం! మాటలు సరిగ్గా రానివారి కోసం.. వసకొమ్ముని దంచి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని ఒక పాత్రలో పోసి ఆ చూర్ణం నిండేవరకు ఉసిరికాయల రసం పోసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టి తరువాత ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత మళ్లీ దంచి మెత్తగా తయారు చేసుకుని ఆ చూర్ణాన్ని రోజూ పూటకు మూడు గ్రాముల మోతాదుగా ఒక చెంచా తేనె కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే మాటలు తడబడే వారికి, మాటలు ముద్దగా పలికేవారికి, ఆగి ఆగి మాట్లాడేవారికి ఆ సమస్యలు తొలగి మాటలు స్పష్టంగా వస్తాయి. • లేత మర్రి ఊడలు సాన పైన అరగదీసి ఆ గంధాన్ని నాలిక పైన రాస్తున్నా మాటలు త్వరగా వస్తాయి. క్షయరోగానికి.. క్షయ.. అదేనండీ.. టీబీతో ఇబ్బంది పడేవారు అశ్వగంధ పొడిని పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు బలం చేకూరటమే కాక శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నిద్రలేమి కూడా తగ్గుతుంది. గొంతులో కఫం.. వామాకు, తులసాకు, తమలపాకుని రోజూ తింటూ ఉంటే గొంతులో కఫం తగ్గిపోతుంది. మెత్తగా దంచి జల్లించిన కరక్కాయ పొడిని తేనెలో రంగరించి రెండు పూటలా చప్పరించినా గొంతులో గరగర, శ్లేష్మం పడటం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇవి చదవండి: బచ్చలికూర ఎంత మేలో.. తెలిస్తే అస్సలు వదులుకోరు! -
ఈ సమస్యలు ఉన్నవాళ్లు కాలీఫ్లవర్ తినకూడదట.. ఎందుకో తెలుసా?
కాలీఫ్లవర్‌తో వివిధ రకాల వంటకాలు తయారు చేసుకుని చాలా మంది ఇష్టంగా తింటారు. కాలీఫ్లవర్‌లోని పోషకాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.విటమిన్ సి తో పాటు, ఫోలేట్, విటమిన్ B6, పొటాషియం, మాంగనీస్ వంటి మినరల్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. కానీ కాలీఫ్లవర్‌లో ఎన్ని పోషకాలు ఉన్నా, దీనిని అతిగా తినడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా అలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లు కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండటమే మంచిది. ►కాలీఫ్లవర్‌ను అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా వీటిని పచ్చిగా తింటే పొట్టలో గ్యాస్ సమస్య, జీర్ణక్రియ సమస్యలతో పోరాడక తప్పదు. ► కాలీఫ్లవర్‌లో ఉండే గ్లూకోసినోలేట్స్ అనే సల్ఫర్ కలిగిన రసాయనాలు కడుపులోకి ప్రవేశించినప్పుడు, అవి హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. ఇది కడుపులో వాయువును సృష్టిస్తుంది. అందువల్లనే, కాలీఫ్లవర్ తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. థైరాయిడ్ సమస్య..కాలీఫ్లవర్ వంటి కూరగాయలు గ్రంథుల పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. ► హైపోథైరాయిడిజం వంటి సమస్యలతో బాధపడేవారు కాలీఫ్లవర్ తినకపోవడం మంచిది. అలెర్జీ ప్రమాదం..కొందరికి కాలీఫ్లవర్ తినడం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి. ► థైరాయిడ్ సమస్యలతో బాధపడే వాళ్లు కాలీఫ్లవర్ తీసుకోకపోవడమే మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే కాలీఫ్లవర్‌ను తినడం వల్ల T3,T4 హార్మోన్లు పెరిగి థైరాయిడ్ సమస్యని మరింత ఎక్కువ చేస్తాయి. ► గ్యాస్ సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదు. క్యాబేజీలో పిండి పదార్థాలు ఉంటాయి. దీని వల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. ► పాలిచ్చే తల్లులు కూడా కాలీఫ్లవర్‌కు దూరంగా ఉంటే మంచిది. కాలీఫ్లవర్ అతిగా తినడం వల్ల తల్లి పాలు తాగి పిల్లలకు కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. ► కీళ్లలో నొప్పి, వాపు, యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కాలీఫ్లవర్ తినకూడదు. ఎందుకంటే ఇది సమస్యని మరింత పెంచుతుది. దీంతో కీళ్లలో వాపు, నొప్పి ఎక్కువవుతుంది. -
బచ్చలికూర ఎంత మేలో.. తెలిస్తే అస్సలు వదులుకోరు!
'మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకుకూరల్లో బచ్చలి కూర ఒకటి. కానీ, బచ్చలికూరను చాలామంది ఇష్టపడరు.. అయితే, బచ్చలికూరలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం నిజంగా బంగారమే అంటారు.' బచ్చలి కూరలో విటమిన్ ఎ, సి, ఇ, కె, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, ఐరన్, కాపర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్స్‌కు భాండాగారం. రక్తహీనతతో బాధపడే వారికి బచ్చలి కూర దివ్యౌషధంలా పని చేస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడగలరని నిపుణులు చెబుతున్నారు. హైబీపీ పేషెంట్లు బచ్చలి ఆకులను రసంగా చేసుకుని తాగుతుంటే.. రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు.. బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలికూరను తరచూ తీసుకోవటం ద్వారా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది. బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. బచ్చలి కూరలో అధికంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, నియాసిన్, సెలీనియం నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో సహా యపడతాయి. అంతేకాదు, మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్‌గా బచ్చలి కూరను తీసుకోవడం వల్ల మూత్ర విసర్జనలోని సమస్యలు తొలగిపోతాయి, పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలికూరను తింటే ఈ సమ స్యనుంచి ఉపశమనం లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇవి చదవండి: 'ఇంగువ'ని ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు! -
టిప్స్: ఇలా చేస్తే ఎక్కిళ్లు వెంటనే తగ్గిపోతాయి
►కొంతమందికి నిద్రలేవడంతోనే విపరీతంగా తుమ్ములు వస్తుంటాయి. అలాంటి వారు తులసి, పుదీనా, రెండు మిరియపు గింజలు నిమ్మరసం కలిపి కషాయం లాగా చేసుకొని రోజూ ఒక కప్పు కషాయం తీసుకుంటుంటే నెలరోజుల్లో సమస్య తీరిపోతుంది. ఇవి అందుబాటులో లేనపుడు తుమ్ములు వస్తుంటే కొత్తిమీర వాసన చూస్తూ ఉండండి . తుమ్ములు ఆగుతాయి. ఇది తాత్కాలికంగా పనిచేస్తుంది. పైన చెప్పిన కషాయం పూర్తి ఉపశమనం ఇస్తుంది. ►వామును దోరగా వేయించి మెత్తని పొడిగా నూరి ఉదయ, సాయంకాలాలు భోజనానికి అరచెంచాడు పుచ్చుకోవాలి.ఇంగువను దోరగా వేయించి, పొడి చేసుకొని పావుచెంచాడు మోతాదుగా వేడి అన్నంతో, మొదటి ముద్దతో కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు బాధించదు. ►ఎక్కిళ్ళు ఎక్కువగా వచ్చే వాళ్ళు పావుచెంచా శొంఠిపొడి, పావు చెంచా కరక్కాయ పొడి రెండింటిని ఒక కప్పు వేడినీటిలో కలిపి రెండుపూటలా సేవిస్తూ ఉంటే దగ్గు, దమ్ము, ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. -
మాంగనీస్... రక్తనాళాలు సాఫ్!
మాంగనీస్... రక్తనాళాలు సాఫ్! పళ్లపై గారపడితే... డెంటిస్ట్‌తో తీయించుకోవచ్చు! కానీ... రక్తనాళాల గోడల్లోపల గారలాంటి గట్టి పొరలు ఏర్పడితే? ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. గుండెజబ్బులు, గుండెపోటులకూ దారితీయవచ్చు. అయితే రక్తనాళాల్లోపలి ‘ప్లేక్’ను ఇకపై తేలికగానే తొలగించవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. అదెలాగో చూసేయండి... గుండెజబ్బులు వచ్చిన వారిలో రక్తం పలుచగా ఉంచేందుకు స్టాటిన్లు అనే రకం మందులు వాడుతూంటారు. రక్తనాళాల్లోని ప్లేక్‌ను ఈ మందులు కొంత వరకూ నియంత్రించగలవు. అయితే ఒకసారి ప్లేక్ ఏర్పడిన తరువాత మాత్రం ఈ స్టాటిన్ల ప్రభావం పెద్దగా ఉండదు. పేరుకుపోయిన ప్లేక్స్ను తొలగించలేవన్నమాట. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా... చైనాలోని వేర్వేరు యూనివర్శిటీల శాస్త్రవేత్తలు కలిసికట్టుగా జరిపిన పరిశోధనల్లో ఓ వినూత్న పరిష్కారం ఆవిషృ్కతమైంది. శరీరానికి అవసరమైన సాధారణ పోషకం మాంగనీస్ ఈ ప్లేక్‌ను రక్తనాళాల నుంచి తుడిచిపెట్టేయగలదని ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో స్పష్టమైంది. మాంగనీస్ మన ఆరోగ్యానికి చాలా కీలకమైంది. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు జీర్ణమయ్యేందుకు కో ఎంజైమ్‌గా ఉపయోగపడుతూంటుంది. అంతేకాకుండా.. మన నాడులు, మెదడు బాగా పనిచేయడంలోనూ కీలకపాత్ర పోషిస్తూంటుంది. కండరాలను కలిపే కణజాలం, సెక్స్ హార్మోన్లు, ఎముకలకూ చాలా అవసరం. సాధారణంగా మనం తీసుకునే ఆహారం ద్వారానే మనకు కావాల్సినంత మాంగనీస్ లభ్యమవుతూంటుంది. నట్స్, పచ్చటి ఆకు కూరలు, కొన్ని రకాల చేపలు, మిరియాలు, కాఫీ, టీ, గింజల వంటి వాటిల్లో మాంగనీస్ ఉంటుంది. శరీరంలో మాంగనీస్ తగ్గితే కండరాలు బలహీన పడతాయి. సంతానం కలగడంలో సమస్యలూ రావచ్చు. మూర్ఛ వచ్చేందుకూ అవకాశం ఉంటుంది. చైనా శాస్త్రవేత్తల తాజా పరిశోధనల కారణంగా ఇప్పుడు ఈ మాంగనీస్ రక్తనాళాల శుద్ధికీ ఉపయోగపడుతుందని స్పష్టమైంది. చైనా శాస్త్రవేత్తలు ఎలుకలకు తగిన మోతాదులో మంగనీస్ అందించి పరిశీలించగా.. వాటి రక్తనాళాల్లో ప్లేక్ ఏర్పడేందుకు కారణమైన కొవ్వుల మోతాదు గణనీయంగా తగ్గినట్లు స్పష్టమైంది. అంతేకాదు.. ఏర్పడ్డ ప్లేక్ కూడా రక్తనాళాల గోడల నుంచి విడిపోయి శుభ్రమయైనట్లు కూడా తెలిసింది. ‘‘శరీరానికి అత్యవసరమైన మూలకాల్లో మాంగనీస ఒకటి. కానీ దీన్ని ఇప్పటివరకూ పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఎంజైమ్ ఆధారిత రియాక్షన్స్‌కు ఇదెలా సాయపడుతోందో తెలుసుకోలేదు’’ అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త షావ్ వాంగ్ తెలిపారు. రక్తంలో కొవ్వుల రవాణా విషయంలో మాంగనీస్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తమ ప్రయోగాల ద్వారా వెల్లడైందని చెప్పారు. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల వంటి సంక్లిష్ట కొవ్వులకు మాంగనీస్ అతుక్కుపోగలదని, తద్వారా అక్కడి రసాయన కూర్పును మార్చేయడం ద్వారా ప్లేక్ ఏర్పడకుండా నిరోధిస్తుందని వాంగ్ తదితరులు ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో తేలింది. పరిశోధన వివరాలను లైఫ్ మెటబాలిజమ్ జర్నల్ ప్రచురణకు స్వీకరించింది. -
పాప్ కార్న్ ఆరోగ్యానికి మేలు చేస్తుందా..?
-
గట్ బ్యాక్టీరియా VS వ్యాయామం
-
వీగన్స్: కనీసం జంతువుల పాలు కూడా తాగరు..మరి ప్రోటీన్స్ ఎలాగంటే..
ప్రపంచ వ్యాప్తంగా చాలామంది వీగన్స్గా మారిపోతున్నారు. ఈమధ్య వీగన్ డైట్‌ను పాటించే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో ప్రచారం పెరగడం, ఈ కొత్త రకం డైట్ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడం, సెలబ్రిటీలు కూడా వీగన్స్గా మారిపోతుండటంతో చాలామంది ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారు. వీగన్లు పాల ఉత్పత్తులు, తేనె, తోలు, ముత్యాల వంటి వాటికి దూరంగా ఉంటారు. మొక్కల నుంచి లభించే పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. ఏటా నవంబర్ 1న వరల్డ్ వీగన్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భంగా వీగన్ డైట్ వల్ల అన్నీ ప్రయోజనాలేనా? ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అన్నది ఈ స్టోరీలో చూద్దాం. జంతువులకు హానీ చేయకుండా, శాకాహారాన్ని ప్రోత్సహిస్తూ ఈ మధ్య అందరూ వీగన్స్గా మారుతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారు.1944 నవంబర్ నెలలో ది వీగన్ సొసైటీని డొనాల్డ్ వాట్సన్ ఏర్పాటు చేశాడు. వీగన్, వీగనిజమ్ అనే పదాలు పుట్టింది కూడా అప్పుడే. వీగన్ డైట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే పూర్తిగా శాఖాహార పదార్థాలనే తీసుకోవడం. జంతు సంబంధిత ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, కేవలం వృక్ష సంబంధిత ఆహారాలను తీసుకోవడం ఈ డైట్ ముఖ్య ఉద్దేశం. ఇక వీగనిజం పాటించే వాళ్లు ముఖ్యంగా కఠినమైన ఆహార పద్దతులను పాటిస్తారు. కేవలం మొక్కల ద్వారా లభించే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. పాలపదార్థాలు గానీ, జంతువుల నుంచి వచ్చే ఏ ఆహారాన్ని తీసుకోరు. కానీ వాటికి ప్రత్యామ్నాయంగా ఆహారంలో పోషక విలువలు తగ్గకుండా జాగ్రత్తలు వహిస్తారు. పాలకు బదులుగా పల్లీలనుంచి తీసిన పాలు, కొబ్బరి, జీడిపప్పుతో చేసిన ఛీజ్ కేక్ లాంటివి తిని పోషకాహార లోపాన్ని అధిగమిస్తారు. వీగన్లు తాము వేసుకునే దుస్తుల్లోనూ జంతు సంబంధమైనవి లేకుండా కేవలం లెనిన్, కాటన్‌తో రూపొందిన దుస్తులకే ప్రాధాన్యత ఇస్తారు. చలిని తట్టుకోవడానికి మనం ధరించే కోట్లు, బెల్టులు, టోపీల తయారికి లక్షల కొద్ది మూగజీవుల్ని వధిస్తున్నారనే కారణంతోనే వీగన్లు.. ఈ దుస్తులను నిషేధిస్తున్నారు. జంతు చర్మంతో తయారవుతున్న ఉత్పత్తులకు బదులుగా కృత్రిమ నార, సోయా ఉత్పత్తులు, రీసైకిల్డ్ నైలాన్, కార్డ్ బోర్డులతో రూపొందిన దుస్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అమీర్ ఖాన్, కంగనా రనౌత్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, శ్రద్ధా కపూర్ వంటి సెలబ్రిటీలు సైతం కొన్నేళ్లుగా వీగన్స్గా మారి అలాంటి డైట్‌ను ఫాలో అవుతున్నారు. ఆ రిస్క్ తక్కువ పూర్తి శాకాహారాన్ని అనుసరించడం వల్ల చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ తరహా ఆహారాలు సంతృప్త కొవ్వులో తక్కువగా, ఫైబర్‌ను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఫ్యాట్ కంటెంట్ ఉండదు కాబట్టి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తూ బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. వీగన్ డైట్‌తో నష్టాలివే ►వీగన్ డైట్‌తో ఎన్నో లాభాలున్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వీగన్ ఫుడ్ తీసుకునేవారికి ఐరన్ సమస్యలు వచ్చే అవకాశముంది. చాలా మంది శాకాహారులు ఐరన్ లోపంతో రక్తహీనతకు గురవుతున్నారు. ► వీగన్స్‌లో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ B12 పోషకాల లోపం ఉండే అవకాశం ఉంది. చివరగా చెప్పేదేంటంటే.. వెజీటేరియన్స్ అయినా, వీగన్స్గా మారినా తమ శరీర తత్వాన్ని బట్టి డైట్‌ను ఫాలో అవ్వాలి. శృతి మించితే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. -
విటమిన్-సి ఎందుకంత అవసరం? తీసుకోకపోతే ఏమవుతుంది?
పంటి చిగుళ్లు వదులుగా అయిపోయి రక్తం వస్తుంటే దాన్ని ఆ వ్యాధిని స్కర్వి అంటాం. ఇది విటమిన్-సి లోపం వల్ల వస్తుంది. చిగుళ్ల బలానికి ఏం తినాలి? అన్నది ప్రముఖ ఆయుర్వేదిక్ నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లోనే.. విటమిన్-సి తగ్గితే ఈ రకమైన వ్యాధి వస్తుంది. నిమ్మ జాతి పండ్లైన జామ, బొప్పాయి, స్ట్రాబెర్రీ, ఉసిరి, టమాట సహా కొన్ని పండ్లు, కూరగాయల్లో విటమిన్-సి ఉంటుంది. వేడి చేసినా, ఎక్కువ కాలం నిలువ చేసినా విటమిన్-సి నశిస్తుంది. కాబట్టి తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటేనే సరైన ప్రయోజనం ఉంటుంది. మరి రోజూ ఆహారంలో విటమిన్-సి ఎంత మేరకు తీసుకోవాలి? మనం రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ సి తప్పనిసరిగా తగినంత మోతాదులో ఉండాలి. ఏ వయసు వారు ఎంత మేర తీసుకోవాలి? 0–6 నెలలు 40 మి.గ్రా(తల్లిపాల ద్వారా) తీసుకోవాలి. 7–12 నెలలు 50 మి.గ్రా 1–3 సం. 15 మి.గ్రా 4–8 సం. 25 మి.గ్రా 9–13 సం. 45మి.గ్రా 14–18సం.75 మి.గ్రా(పు) 65మి.గ్రా(స్త్రీ) 19 సం. పైన 90మి.గ్రా(పు) 75 మి.గ్రా(స్త్రీ) గర్భిణులు 85 మి.గ్రా పాలిచ్చే తల్లులు 120 మి.గ్రా ధూమపానం చేసే వారు 35మి. గ్రా అదనంగా తీసుకోవాలి. అంటే.. 1 - 2 గ్రా. రోజుకి 3 రోజులు 500 మి. గ్రా తరువాత 7 రోజులు 100 మి. గ్రా 3 నెలల వరకు తీసుకోవాలి. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం చిగుళ్ళ వ్యాధులకు కారణం శరీరంలో త్రి దోషాలు అస్తవ్యస్తం కావటం. దీని నివారణకు ►ఉత్తరేణి వేరు, లేదా,చండ్ర ,వేప, నేరేడు, మామిడి, వీటి పుల్లలలో ఏదో ఒకటి దంతధావనానికి ఉపయోగించాలి. ► ఎల్లప్పుడూ మరిగించి చల్లార్చిన నీరు మాత్రమే త్రాగాలి. ► ఎండు ద్రాక్ష, లేదా కిస్మిస్ పండ్లు (10) రాత్రి నానబెట్టి ఉదయాన్నే లేచి,ఆ నీటిని తాగి, పండ్లు తినాలి (సుమారు 2నెలలు). ► పరగడుపున ఒక చెంచా చొప్పున నల్లనువ్వులు తిని ,ఒక గ్లాసు పరిశుద్ధమైన నీరు త్రాగితే, కదిలే దంతాలు గట్టి పడును ► ఒక రాగి పాత్రలో (250ml) పరిశుద్ధమైన నీరు పోసి, ఉదయాన్నే ముందుగా 6.-పరగడుపున తాగటం ఎలాంటి వ్యాధులు దరిచేరవు. -మీ నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
ఇలా చేస్తే ఒత్తిడి మీ దరిదాపుల్లోకి కూడా రాదు, ఇల్లాలి ఆరోగ్యం కోసం..
ఇంటిని చక్కదిద్దుకోవడం మొదలుకొని పిల్లలకు చక్కని భవిష్యత్ నిర్మాణం వరకు ఇంటి ఇల్లాలు పడే తపన అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఎంతో ఒత్తిడికి గురై, మానసికంగా, శారీరకంగా బలహీనంగా మారుతుంటారు మహిళలు. ఇల్లాలి బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూనే కొన్ని అలవాట్లను దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే శరీరం ఆరోగ్యంగా... మనసుకు ఉల్లాసంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక ఆందోళనలను దూరం చేసి మనసుకు సాంత్వన నిచ్చేది మన అభిరుచులే. రోజులో కొంతసమయాన్ని ఎంతో ఇష్టమైన పనిమీద కేంద్రీకరించడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. భావోద్వేగాలు, ఒత్తిళ్లు, నిరాశలు తగ్గుముఖం పడతాయి. యోగా... ప్రపంచంలోనే పాపులర్ వ్యాయామం యోగా. మహిళలు అలవర్చుకోవాల్సిన అభిరుచిలో ఇది ప్రధానమైనది. యోగా చేయడం వల్ల ఫిట్‌గా, బలంగా తయారవడంతో పాటు ఒత్తిడి తగ్గి, సంతోషంగా ఉంటారు. శరీరంతో పాటు మానసిక పరిస్థితి మెరుగుపడి ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడేందుకు అనువుగా మనసు మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సిరామిక్స్ తయారీ... ఒత్తిడిని తగ్గించడంలో సిరామిక్స్ తయారీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రకరకాల పాత్రల తయారీ నేర్చుకోవడంపై దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. స్వయంగా అందమైన పాత్రలు రూపొందించి బహుమతిగా ఇవ్వడానికి లేదా ఇంట్లో వాడుకోవచ్చు. క్రోకరీ తయారీ సమయంలో దృష్టిమొత్తం పాత్రపై ఉండడం వల్ల మెడిటేషన్ చేసినట్లవుతుంది. ఫొటోగ్రఫీ... మంచి అలవాట్లలో ఫొటోగ్రఫీ కూడ ఒకటి. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఫోటోలు తీయవచ్చు. ఇప్పుడు ఖరీదైన కెమేరాలు కూడా అవసరం లేదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయి. మీ అభిరుచికి తగ్గట్టుగా క్లిక్‌మనిపించాలి. తీసిన ఫోటోలను క్రియేటివ్‌గా తయారు చేసి వివిధ రకాల ప్లాట్‌ఫామ్‌లపై పెట్టుకుంటే ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఈ ఫోటోగ్రఫీ వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ఉత్సాహంతో నిండుతుంది. స్విమ్మింగ్ ఈత కొట్టడం వల్ల చాలారకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. స్విమ్మింగ్ కోసం బయటకు వెళ్లడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాలతో పాటు కొత్త పరిచయాలతో ఉత్సాహం కలుగుతుంది. డ్యాన్సింగ్... నాలుగు స్టెప్పులు వేసారంటే హుషారు దానంతట అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. మ్యూజిక్కు తగ్గట్టుగా శరీరాన్ని కదిలిస్తే ఆనందం రెట్టింపు అవుతుంది. డ్యాన్స్‌తో అధిక బరువు తగ్గి, కండరాలు బలంగా మారతాయి. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఆభరణాల తయారీ జ్యూవెలరీ తయారీ అలవాటు చాలా మంచిది. దృష్టిమొత్తం డిజైన్ మీద ఉంటుంది. మనలోని సృజనాత్మకతను వెలికి తీసి సరికొత్త అభరణాలు తయారు చేసి ఎవరికైనా గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. దీనిలో మంచి నైపుణ్యం సాధిస్తే ఆదాయం కూడా వస్తుంది. ఆన్లైన్ లో కూడా నేర్చుకోవచ్చు. కుట్లు... అల్లికలు ప్రస్తుత కాలంలో మహిళలు ధరించే డ్రెస్సులు దాదాపు అన్నీ ఎంబ్రాయిడరీతోనే ఉంటున్నాయి. వీటి రేటు కూడా ఎక్కువే. స్వయంగా మీ డ్రెస్ మీద మీరే ఎంబ్రాయిడరీ చేస్తే ఖర్చూ ఉండదు. స్వయంగా డిజైన్ చేశామన్న సంతృప్తి కలుగుతుంది. సులభంగా వేయగలిగే ప్యాట్రన్ లేదా ఫ్లోరల్ డిజైన్‌తో మొదలు పెట్టి మెల్లగా ఎంబ్రాయిడరీలోని మెలకువలు నేర్చుకోవాలి. ఇందుకు ఏకాగ్రతతో΄ాటు ఓపిక కూడా కావాలి. మీరు ఎంబ్రాయిడరీ చేసిన డిజైన్ లేదా అల్లిన వస్తువు ఇతరులకు నచ్చినప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరిగి సంతోషంతో పాటు, ఆదాయమూ వస్తుంది. కుకింగ్, బేకింగ్... సరికొత్త కలెక్షన్.. దాదాపు మహిళలంతా వంటచేస్తుంటారు. అయితే రోజూ చేసే వంట కాకుండా... కొంచం కొత్తగా చేసి ఇంట్లోవాళ్లకు రుచులను వడ్డించండి. తిన్నవారు ‘ఎంత బావుందో’ అని చెప్పేమాట మీ కడుపుని నింపేస్తుంది. ఇంట్లో చేసినవి ఏవైనా ఆరోగ్యమే! అందుకే రకరకాల వంటకాలను తయారు చేయడానికి ప్రయత్నించాలి. గార్డెనింగ్... బొకేల తయారీ గార్డెనింగ్‌ను అలవాటు చేసుకుంటే.. ఒత్తిడి మీ దరిదాపుల్లోకి రాదు. సేంద్రియ కూరగాయలు, పండ్లు పండించడంతో΄ాటు, సువాసనలు వెదజల్లే పూలపరిమళాలు ఇంటి ఆవరణలో మీతో పాటు మీ కుటుంబానికీ ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఇక పూలను బొకేలుగా మార్చితే మీ నైపుణ్యాలు మెరుగుపడినట్టే. పూలను ఒకదానికి ఒకటి జత చేసే క్రమంలో మనలోని సృజనాత్మకత వెలికి వస్తుంది. మనసు ఆహ్లాదంగా మారుతుంది. అందంగా... ఆరోగ్యంగా ఒత్తిడి వల్ల ముఖసౌందర్యాన్ని గాలికి వదిలేస్తుంటారు. అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు మరింత నిస్సత్తువగా అనిపిస్తుంది. అందువల్ల మీ ముఖాన్ని మరింత కాంతిమంతంగా మార్చుకునేందుకు ఇంట్లోనే ఫేషియల్ తయారు చేసుకోవాలి. చర్మ సంరక్షణకు ఎటువంటి క్రీమ్‌లు, ఫేషియల్స్లు చేసుకోవాలో నేర్చుకుని చర్మసౌందర్యాన్ని పెంచుకోవాలి. వీటికి ఫేషియల్ యోగాను జతచేస్తే ఆందమూ ఆరోగ్యం మీ సొంతమైనట్టే. వీటిలో కనీసం కొన్నింటిని అలవరచుకున్నా మీలో పేరుకుపోయిన ఒత్తిడి, నిస్సత్తువలు నియంత్రణలోకి వచ్చి ఆనందంగా జీవించ గలుగుతారు. -
మీ బుజ్జాయికి జలుబు చేసిందా? ఇలా చేస్తే వెంటనే తగ్గుతుంది
అప్పటివరకూ ఎక్కడ ఉంటుందో తెలియదు కాని సీజన్ మారగానే ఒక్కసారిగా వచ్చి పట్టేస్తుంది జలుబు. పెద్దవాళ్లయితే ఏదో విధంగా తట్టుకుంటారు కాని పిల్లలు నీరసించిపోతారు. ఒకరి నుంచి ఒకరికి వెంటనే వ్యాపించే ఈ జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ నివారణకు చిట్కాలు. ►జలుబు, జ్వరం లక్షణాలు కనిపించగానే ఎక్కువ హానికరం కాని పారాసిటమాల్ టాబ్లెట్లు వాడవచ్చు. జలుబు పూర్తిగా దారికి వచ్చే వరకు రోజుకు మూడుసార్లు వేడి నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిటపట్టించాలి.. ►రోజులో కనీసం మూడుసార్లయినా పసుపు లేదా, అదుబాటులో ఉండే జండూబామ్ వేసుకుని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు ఉపశమనం కలుగుతుంది. ► ఈ సీజన్లో నీళ్ల నుంచి అనేక జబ్బులు వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లలు, పెద్దల దాకా అందరూ కాచి, చల్లార్చి వడపోసిన నీళ్లు మాత్రమే తాగితే మంచిది. ► జలుబు లక్షణాలను త్వరగా తగ్గించే వాటిలో ముఖ్యమైనది నిమ్మపండు.. గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు. ► మిరియాలు, వెల్లుల్లి, అల్లం వంటివి ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు, జలుబు చేసిన సమయంలో రిలీఫ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి. ► జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు ఆవనూనెకు వెల్లుల్లి కలిపి చిన్నారి ఛాతీపైనా, మెడ, వీపు భాగాల్లోనూ మసాజ్ చేయాలి. ► పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి ఆరారగా మంచినీరు తాగిస్తుండటం వల్ల కోల్పోయిన నీటి శాతం భర్తీ అయి శరీరానికి వ్యాధితో సమర్థంగా పోరాడగల శక్తి వస్తుంది. -
టీని మళ్లీ వేడి చేసి తాగుతున్నారా? డేంజర్లో పడ్డట్లే
పొద్దున లేవగానే ఓ కప్పు గరం చాయ్ గొంతు దిగందే పనిలో దిగరు చాలామంది. అది గ్రీన్ టీ అయినా లెమన్ టీ అయినా సరే ఏదో ఒక టీ గొంతులో పడాల్సిందే. పనిలో అలసిపోయినా, కాస్త సేదదీరాలాన్న ‘‘టీ తాగొద్దాం పద’’ అంటారు స్నేహితులు. ఇలా టీ అనేది దినచర్యలో భాగమైపోయింది. టీని ఫ్రెష్‌గా కాచి తాగితేనే మంచిది. పైగా ఫ్రెష్ టీ ఫ్లేవరు, రుచే వేరు. చాలామంది ఒకేసారి టీ పెట్టేసుకుని ఫాస్కులో పోసుకుని ఆరారగా తాగుతుంటారు. ఇంకొంతమంది టీ కాచి దాన్ని అలాగే ఉంచి వేడి చేసుకుని తాగుతుంటారు. కానీ అలా టీని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగటం మంచిది కాదట.. నాలుగు గంటల కంటే ఎక్కువసేపు ఉంచిన తర్వాత టీని మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాచి అలా ఉంచేసిన టీలో ఫంగస్ ఏర్పడుతుంది. బ్యాక్టీరియా కూడా డెవలప్ అవుతుంది. దీంతో రుచి కూడా మారిపోతుంది. కానీ టేస్ట్ మారింది ఏంటో అనుకుంటాం గానీ కారణం మాత్రం ఇదే. కాబట్టి టీని వేడి చేసి తాగటం మంచిది కాదు. అదే హెర్బల్ టీని అయితే మరోసారి వేడి చేసి తాగకూడదు. అలా వేడి చే చడం వల్ల దాంట్లో ఉండే పోషకాలు, ఖనిజాలు నశించిపోతాయి. అది తాగినా తాగకపోయినా ఒక్కటే. గ్రీన్ టీ అయితే వేడి చేసి తాగటం ఏమాత్రం మంచిది కాదు. టీని ఎక్కువసేపు నిల్వ ఉంచితే టానిన్ అధికంగా విడుదల అవుతుంది. ఇది టీని చేదుగా మార్చేస్తుంది. దీంతో అలా వేడి చేసిన టీ తాగితే కడుపు నొప్పి వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు అతిసారానికి దాని తీయవచ్చు. కడుపు ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇలా టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగితే మనకు తెలియకుండానే అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి టీ తాగాలనుకుంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకుని తాగితే మంచిది. రుచికి రుచి ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యమూ బాగుంటుంది. ఆరోగ్యం కోసమో ఉల్లాసం కోసమో టీ తాగాలనుకున్నప్పుడు మరిగి పోయి ఉన్న టీ తాగడం వల్ల ఉత్సాహం మాటెలా ఉన్నా, ఉన్న ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం. అటువంటి చెడు ఫలితాలు పడకుండా ఉండాలంటే ఫ్రెష్ టీ తాగడం మేలు. -
మాటిమాటికి నిద్రలేస్తున్నారా?ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సమస్య కావొచ్చు
‘ఓవర్ యాక్టివ్ బ్లాడర్’ సమస్య ఉన్నవారు మూత్రవిసర్జనకు చాలా వేగంగానూ, అత్యవసరంగా వెళ్లాల్సిరావడం, మామూలు ఫ్రీక్వెన్సీతో పోలిస్తే చాలా ఎక్కువ సార్లు బాత్రూమ్కు వెళ్లడం, మూత్రవిసర్జన ఫీలింగ్‌తో బాత్రూమ్కు వెళ్లడం కోసం రాత్రిళ్లు మాటిమాటికీ నిద్రలేవడం (నాక్ట్యూరియా), మూత్రం ఆపుకోలేకపోవడం (ఇన్‌కాంటినెన్స్) వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. వైద్యసహాయం లేకుండానే ఈ సమస్యల నివారణకు అధిగమించడానికి మార్గాలివి... ∙జీవనశైలి మార్పుల్లో భాగంగా... దేహానికి అవసరమైనన్ని నీళ్లు మాత్రమే తాగాలి. కొంత పరిశీలన, అభ్యాసం ద్వారా తమకు రోజుకు ఎంత పరిమాణంలో నీళ్లు అవసరమో తెలుసుకోవచ్చు. నీళ్లు తక్కువైనప్పుడు డీహైడ్రేషన్ వల్ల కండరాలు బిగుసుకుపోవడం (మజిల్ క్రాంప్స్) వంటివి కనిపిస్తాయి. ఈ పరిస్థితి రానంత మేర నీళ్లు తాగుతూ తమకు ఎన్ని నీళ్లు అవసరమో గుర్తించవచ్చు. ►నిద్రపోవడానికి రెండు గంటల ముందుగా నీళ్లు తాగాలి. ►పొగతాగే అలవాటు, కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కాఫీలూ, కోలాడ్రింక్స్, ఆల్కహాల్ వంటి అలవాట్లు ‘ఓవర్ యాక్టివ్ బ్లాడర్’ను ప్రేరేపిస్తాయి. పైగా ఇవన్నీ సాధారణ ఆరోగ్యానికి కూడా హానికరం కాబట్టి ఆ అలవాట్లకు దూరంగా ఉండాలి. ►కొన్ని మందులు వాడగానే మూత్రం ముదురు పసుపురంగులోనూ, తీవ్రమైన వాసనతోనూ రావచ్చు. ఇలాంటి మందుల్ని డాక్టర్ సలహా లేకుండా, తమంతట తామే (ఓవర్ ద కౌంటర్) కొని, వాడకూడదు. ఇలాంటి కొన్ని చర్యలతో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ నివారణ/నియంత్రణకు వీలవుతుంది. అయితే ఈ జాగ్రత్తల తర్వాత కూడా సమస్య తగ్గకపోతే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. -
నడుము నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి
శరీరంలో వాత మూలకం అసమతుల్యత కారణంగా స్లిప్డ్ డిస్క్ సమస్యలు రావొచ్చు. ఇది వెన్నునొప్పితో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. L4 L5 డిస్క్ సమస్యకు సర్జరీ అవసరం లేకుండా ఎలాంటి రిలీఫ్ పొందవచ్చు అన్నది ప్రముఖ ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లోనే.. నడుము నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ►అధిక బరువును తగ్గించుకోవాలి ► శారీరక శ్రమ తప్పనిసరి. ఇందుకోసం క్రమశిక్షణతో వర్కవుట్స్ చేయాలి. ► సమయపాలన, ఆహార పాలన, ఒకే సమయానికి నిద్రపోయేలా చూసుకోవాలి. ► 30ఏళ్లు పైబడిన తర్వాత ప్రతి ఏడాది తప్పనిసరిగా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ► ఎముకల దృఢత్వం, బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయా లేదా అన్నది పరీక్షలు చేయించుకోవాలి ► 40 ఏళ్లు దాటాక ప్రతి ఆర్నెళ్లకోసారి అన్ని పరీక్షలు చేయించుకుంటూనే తగిన ఆహార అలవాట్లను అలవర్చుకోవాలి. వెన్నునొప్పి నుంచి ఇలా ఉపశమనం వెన్నునొప్పికి ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా ఆయుర్వేదంలో చికిత్స ఉంది. అదెలాగంటే.. కైర్టిస్ఆయిల్: కైర్టిస్ ఆయిల్ అనేది పంచకర్మ చికిత్సపై ఆధారపడిన ఒక వినూత్న పరిశోధన సూత్రం. ఇది ఆర్థరైటిస్, సయాటికా, స్పాండిలోసిస్, ఘనీభవించిన భుజం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి, స్లిప్ డిస్క్ మరియు న్యూరోమస్కులర్ నొప్పుల నుంచి దీర్ఘకాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. మురివెన్ననూనె: నొప్పి, వాపు, దృఢత్వం, ఆర్థరైటిక్ రుగ్మతలు, కీళ్లలో ఉన్న ఇతర తీవ్రమైన,దీర్ఘకాలిక వ్యాధుల పరిస్థితిలో మురివెన్న అద్భుతమైన ఫలితాలను కలిగి ఉంది. యోగరాజ్ గుగ్గుల్: యోగరాజ్ గుగ్గుల్ అనేది కీళ్ల రుగ్మతల చికిత్సలో ఉపయోగించే ఒక ఆయుర్వేద టాబ్లెట్. ఇది దీర్ఘకాలిక మరియు తీవ్రమైన నొప్పులు, కీళ్లలో వాపు, దృఢత్వం మరియు తిమ్మిరి నుంచిఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. -
చలికాలంలో వెచ్చగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
చలికాలం వచ్చిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. చలి తీవ్రత పెరిగినప్పుడు గాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను దరిచేరనీయకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలు చాలామంది ఆకుకూరలు తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఆకుకూరల్లో ఫోలిక్ ఆమ్లం కూడా ఎక్కువే. చలికాలంలో వచ్చే వ్యాధులను నివారించడంలో ఆకుకూరలు చక్కగా పనిచేస్తాయి. ముఖ్యంగా పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల హెమోగ్లోబిన్ పెరగడానికి ఇది ఎక్కువగా దోహదపడుతుంది. కాల్షియం స్థాయి ఎక్కువగా ఉండటంతో కండరాల బలోపేతానికి తోడ్పడుతుంది. పసుపు పాలు గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపును వేసుకొని ప్రతిరోజూ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా చలికాలంలో శరీరానికి కావల్సిన వెచ్చదనాన్ని అందిస్తుంది. అజీర్ణం, జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఈ గోల్డెన్ మిల్క్‌ను తీసుకోవాల్సిందే. హెర్బల్ గ్రీన్‌టీ తులసి, అల్లం, లెమన్‌గ్రాస్‌తో చేసిన హెర్బల్ గ్రీన్ టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు రెండుసార్లు ఈ హెర్బల్ టీని తాగితే చాలా మంచిది. నెయ్యి చలికాలంలో నెయ్యి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాస్ గోరువెచ్చని పాలలో 3 స్పూన్ల నెయ్యిని కలుపుకుని తీసుకోవటం ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. నెయ్యితో రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరనియ్యవు. నువ్వులు ఈ సీజన్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెచ్చదనం కోసం నువ్వులను తీసుకోవాలి. నువ్వుల్లో వేడిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఐరన్, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ దానిమ్మలో ఎర్ర రక్తకణాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి చలికాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ వ్యాధుల నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. బెల్లం బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించడంతో పాటు శరీరంలో వేడిని పెంచుతుంది. వేరుశనగ ఇందులో విటమిన్ బీ 3, విటమిన్ ఈ వంటి కీలక పోషకాలు ఉంటాయి. మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి తినడం వల్ల గుండెకు మేలు చేస్తాయి. చర్మంలో తేమ శాతాన్ని పెంచే గుణం వేరుశనగలో ఉంటుంది. రాత్రి నానాబెట్టుకొని ఉదయాన్నే వీటిని తీసుకోవడం మంచిది. సిట్రస్ పండ్లు చలికాలంలో వీటిని తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ నారింజ, నిమ్మ, బత్తాయి, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జొన్నలు జొన్నల ద్వారా శరీరానికి పుష్కలమైన కాల్షియం అందుతుంది. దీనివల్ల కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు కూడా మాయమవుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ చలికాలంలో జొన్నతో చేసిన రొట్టెలు తింటే చాలా మంచిది. -
డెంగ్యూ జ్వరాన్ని ఎలా గుర్తించాలి?లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
ఈ మధ్యకాలంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలతో హాస్పిటల్స్‌లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. డెంగ్యూ జ్వరం ఉన్న వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. డెంగ్యూ దోమ కాటు వల్ల వస్తుంది. సాధారణంగా పగటిపూట కుట్టే దోమల వల్ల ఇది వస్తుంది. DEN -1 ,DEN-2 , DEN-3 , DEN-4 అనే నాలుగు రకాల వైరస్ల కారణంగా డెంగ్యూ జ్వరం వస్తుంది. దోమలు కుట్టిన 5-8 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ జ్వరం రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది సాధారణం కాగా, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ (ప్రమాదకరమైనది). డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఉన్నట్టుండి జ్వరం ఎక్కువగా రావడం తీవ్రమైన తలనొప్పి, కంటినొప్పి కండరాలు, కీళ్ళ నొప్పి వాంతులు అవుతున్నట్లు అనిపించడం డీహ్రైడ్రేషన్‌కు గురి కావడం పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరల్లోని హాస్పిటల్లో చూపించుకోవాలి. డెంగ్యూ వ్యాధికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అంటూ ఏదీ లేదు. కాబట్టి లక్షణాలు కనిపిస్తే సాధ్యమైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి. వ్యాధి వ్యాపించే విధానం ఏడిస్ ఈజిప్టై అనే దోమకాటు వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. పగలు కుట్టే దోమల వల్ల ఇతరులకు సంక్రమిస్తుంది. ఇంటి పరిసరాల్లో నీళ్లు ఎక్కువగా నిలిచిఉన్నా దోమలు వృద్ది చెందుతాయి. ఎయిర్ కూలర్స్, రిఫ్రిజిరేటర్లో గల డ్రిప్ ఫ్యాన్,పూలకుండీలు, టైర్లు, మూత పెట్టని నీరు నిల్వచేసే తొట్టిలు, కుండీలు, ఫౌంటెన్స్ ద్వారా దోమలు గుడ్లు పెట్టి తర్వాత ఇతరులకు వ్యాపిస్తుంది. డెంగ్యూ.. ఎలాంటి చికిత్స తీసుకోవాలి? మన రక్తంలో తెల్లకణాలు, ఎర్రకణాలతో పాటు ప్లేట్లెట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డకట్టటంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. సాధారణంగా మన రక్తంలో ఈ ప్లేట్లెట్ కణాలు 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకూ ఉంటాయి. వీటి సంఖ్య బాగా పడిపోతే రక్తస్రావం కావటానికి దారితీస్తుంది. ♦ప్లేట్లెట్లు 40 వేల వరకూ ఉంటే సాధారణంగా రక్తస్రావం కాదు. ♦ 30 వేల వరకు ఉంటే కొద్దిగా రక్తస్రావం కావొచ్చు. ♦ 20 వేలకు పడిపోతే రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. ♦ 10 వేలు మాత్రమే ఉంటే బ్లీడింగ్ విపరీతంగా అవుతుంది. కొన్నిసార్లు రక్తపరీక్షలో ప్లేట్లెట్ కణాల లెక్కింపులో తప్పులు రావొచ్చు. కాబట్టి బాగా తక్కువ సంఖ్యలో ఉన్నట్టు తేలితే మరోసారి పరీక్ష చేసి నిర్ధారించుకోవటం అవసరం. ♦ డాక్టర్లు సూచన మేరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. మంచి బలమైన, పౌష్టికాహారం తినాలి. డీహైడ్రేషన్‌కు గురి కాకుండా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. డెంగ్యూకు ఆయుర్వేదంలో చికిత్స ఇలా.. ►వేప, కషాయ, వేపనూనె, కామంచి మొక్క, ఉమ్మెత్త మొక్క సారాన్ని జ్వరం, నొప్పులు తగ్గడానికి వాడతారు. తులసీ, పుదీనా, అల్లం, యాలకులు, దాల్చిన చెక్కలతో చేసిన కషాయాన్ని జ్వరం తగ్గడానికి వాడతారు. ► ఊద రంగులో ఉండే చిలకడదుంపల కషాయం డెంగ్యూని తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. చిలకడదుంపల ఆకుల్లో డెంగ్యూని నివారించే యాంటీ ఆక్సిడైజింగ్ గుణాలు ఉన్నాయని పరిశోధకులు నిర్థారించారు. ఈ ఆకుల్లో ఉన్న సహజమైన ఫోలిఫినోలిక్ అందుకు కారణం అని తేల్చారు. ► బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి కాయ, బొప్పాయి రసంతో డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చు. దీనికోసం బొప్పాయి చెట్టు ఆకులు, కాండము లేకుండా మెత్తగా దంచి పసరు తీయాలి. తులసి నూనె: దోమలను తరిమికొట్టడానికి తులసి నూనె చాలా ప్రభావవంతమైనది. ఇది కీటక–వికర్షక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. లెమన్ గ్రాస్ ఆయిల్: దోమల నుంచి రక్షణ కోసం లెమన్ గ్రాస్ ఆయిల్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. ఈ నూనెను రాసుకుంటే కొన్ని గంటలపాటు దోమల నుంచి రక్షణ లభిస్తుంది. లావెండర్ ఆయిల్: చర్మంపై లావెండర్ ఆయిల్‌ను రాసుకుని ఆరుబయట సంచరించినా, నిద్రపోయినా దోమలు కుట్టవు. పిప్పరమింట్ స్ప్రే: కొబ్బరి నూనెలో పిప్పరమెంటు బిళ్లను కలిపి స్ప్రే బాటిల్లో నింపాలి. పిప్పరమింట్ ఆయిల్ దోమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. యూకలిప్టస్ ఆయిల్: నిమ్మకాయ,యూకలిప్టస్ నూనెను సమాన పరిమాణంలో కలపాలి. అదే నూనెలో ఆలివ్, కొబ్బరి, అవకాడో నూనె వేసి స్ప్రే బాటిల్లో నింపాలి. ఈ మిశ్రమాన్ని శరీరంపై స్ప్రే చేసుకోవడం ద్వారా దోమల బెడద నుంచి రక్షించుకోవచ్చు. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు (గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఆయుర్వేదంపై అవగాహన కల్పించడానికే. డాక్టర్ల సలహాతోనే వాటిని పాటించాలి. ) -
ప్రెగ్నెన్సీలో వచ్చిన బీపీ,షుగర్.. డెలీవరీ తర్వాత తగ్గుతాయా?
ప్రెగ్నెన్సీ టైమ్‌లో వచ్చిన బీపీ, షుగర్.. డెలివరీ తర్వాత తగ్గుతాయా? నాకు ఇప్పుడు ఆరో నెల. బీపీ, షుగర్ రెండూ వచ్చాయి. అందుకే భయంగా ఉంది. – ఎన్. శ్రీలీల, చెన్నై ప్రెగ్నెన్సీలో అధికంగా బరువు పెరిగినా, పోషకాహారం.. జీవన శైలి సరిగ్గా లేకపోయినా హార్మోన్స్, వయసు కారణంతో ఈరోజుల్లో చాలామంది గర్భిణీలకు ఆరవ నెల, ఏడవ నెల నుంచి బీపీ, సుగర్లు వస్తున్నాయి. దీనిని జెస్టేషనల్ హైపర్‌టెన్షన్, జెస్టేషనల్ డయాబెటిస్ (జీడీఎమ్)అంటాం. డెలివరీ అయిన ఆరువారాలకు జీడీఎమ్ నార్మల్ లెవెల్‌కి వస్తుంది. అందుకే డెలివరీ అయిన ఆరువారాలకు ఓజీటీటీ అనే టెస్ట్ చేస్తారు. ఇది నార్మల్‌గా ఉంటే తర్వాత డయాబెటిక్ కేర్ అవసరం లేదు. కానీ సంవత్సరానికి ఒకసారి హెచ్‌బీఏ1సీ / ఎఫ్బీఎస్ టెస్ట్‌ను చేయించుకుంటూ ఫాలో అప్‌లో ఉండాలి. జీడీఎమ్ ఉన్నవారిలో తర్వాత టైప్ 2 డయాబెటిస్ రావడానికి 40 శాతం ఎక్కువ చాన్సెస్ ఉంటాయి. బీఎమ్ఐ 30 కన్నా ఎక్కువ ఉన్నా.. మీకు ఆరవ నెలలోపు జీడీఎమ్ వచ్చినా.. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా.. డెలివరీ తరువాత అయిదేళ్లలోపు మీకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే చాన్స్ ఉంటుంది. అందుకే డెలివరీ తరువాత క్రమం తప్పకుండా ఫాలో అప్‌లో ఉండాలి. చక్కటి డైట్ కూడా ఫాలో కావాలి. - డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
చేతిలో తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతాయా? వాస్తవమిదే
మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరాలో లోపం ఏర్పడినప్పుడు తాత్కాలికంగా స్పృహ కోల్పోతారు. దీన్నే మూర్ఛపోవడం అంటారు. వైద్యభాషలో దీన్ని సాధారణంగా "పాసింగ్ అవుట్" అని సూచిస్తారు.మూర్ఛలో మూడు రకాలు ఉన్నాయి (వాసోవగల్ సింకోప్, కరోటిడ్ సైనస్ సింకోప్, సిట్యుయేషనల్ సింకోప్).వీటిలో కొన్ని ప్రాణాపాయమైనవి. మరి మన చుట్టూ ఎవరైనా మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. మూర్ఛ/ఫిట్స్ తరచూ వచ్చేవాళ్లలో కొన్ని లక్షణాలు ఉంటాయి. శరీరం వీక్ అయిపోవడం, మైకం కమ్మేయడం, "బ్లాకింగ్ అవుట్/వైటింగ్ అవుట్" కూడా అనుభవిస్తారు. అసలు మూర్ఛ రావడానికి గల సాధారణ కారణాలు ఏంటంటే.. భయం లేదా భావోద్వేగ గాయం,ఒత్తిడి. తీవ్రమైన నొప్పి,విశ్రాంతి లేకపోవడం. లోబీపీ, డీహైడ్రేషన్ మధుమేహం గుండె జబ్బు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (ఎంఫిసెమా) హైపర్వెంటిలేషన్ ఎక్కువ సేపు ఒకే భంగిమలో నిలబడటం. ప్రేగు కదలిక సమయంలో తీవ్రమైన ఒత్తిడి కొన్ని మందులు లేదా ఆల్కహాల్ తీసుకోవడం తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతాయా? అప్పటివరకు ఉల్లాసంగా గడిపిన వాళ్లు ఫిట్స్‌తో అల్లాడిపోతుంటారు. దీంతో ఏం చేయాలో తెలియక చుట్టూ ఉన్నవాళ్లు కూడా గందరగోళానికి గురవుతుంటారు. ఆ సమయంలో ఫిట్స్‌తో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి చేతిలో తాళాల గుత్తి ఉంచడం, ఇనుముతో తయారుచేసిన వస్తువులను ఉంచడం, ఉల్లిపాయ వాసన చూపించడం వంటివి చేస్తుంటారు.ఇలా చేయడం వల్ల ఫిట్స్ ఆగిపోతాయనుకుంటారు. ఐరన్ మెదడులోని అలజడిని కంట్రోల్ చేసి ఫిట్స్‌ను తగ్గిస్తుందని నమ్ముతారు. కానీ వాస్తవానికి ఇది అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. సాధారణంగానే ఫిట్స్ లేదా మూర్ఛ అనేది ఎపిసోడ్ల రూపంలో వస్తాయి. ఇవి 1-2 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండవు. ఈ సమయంలో మీరు ఏం చేసినా, చేయక పోయినా దానంతటవే ఆగిపోతాయి. దీన్ని స్టేటస్ ఎపిలెప్టికస్ అని పిలుస్తారు. ఒకవేళ ఇది ఐదు నిమిషాల కంటే ఎక్కవు సేపు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలి? ►ముందుగా చేయవలసినది భయాందోళనలకు గురికాకూడదు. పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే పాదాలను రబ్ చేస్తుండాలి. దీనివల్ల చర్మం చల్లబడకుండా ఉంటుంది. ► మూర్ఛపోయిన వ్యక్తిని వెనుకవైపు పడుకోబెట్టడం లేదా అతని/ఆమె మోకాళ్ల మధ్య తాళం వేసి కూర్చోబెట్టడం లాంటివి చేయాలి. ► ఎవరైనా కిందపడిపోతే అది ఫిట్స్ అని అనుకోకుండా ముందుగా గాయలు ఏమైనా ఉంటే చూసుకోవాలి. అప్పటికి ఆ వ్యక్తిలో కదలిక లేకపోతే వారి కాళ్లను గుండె నుంచి సుమారు 12 అంగుళాలు (30CM) పైకి లేపడం వల్ల రక్తప్రవాహం ఆగకుండా ఉంటుంది. వ్యక్తి శ్వాస తీసుకోవడం ఆపివేసినట్లయితే, వెంటనే CPR చేయండి. ► షేక్ చేయడం, అరవడం: కొన్నిసార్లు గాయం కారణంగా వ్యక్తులు సడెన్ షాక్‌కి గురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఆ వ్యక్తుల పేరు తెలిస్తే గట్టిగా వాళ్ల పేరు పిలుస్తూ తట్టండి. శరీరాన్ని షేక్ చేయడం వల్ల స్పృహను తిరిగి పొందడానికి సహాయపడుతుంది. మూర్ఛ వ్యాధిపై అవగాహన కలిగి ఉండటం ద్వారా మీరు అలాంటి వ్యక్తులను రక్షించిన వారు అవుతారు. - నవీన్ నడిమింటి ఆయుర్వేద నిపుణులు ఫోన్ -9703706660 -
మిగిలిపోయిన అన్నాన్ని మళ్లీమళ్లీ వేడి చేసి తింటున్నారా? క్యాన్సర్ వస్తుంది
ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు మొత్తం నశిస్తాయి. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి. ఎలాంటి ఆహారాలు వేడి చేసి తినడం వల్ల నష్టం ఏమిటో తెలుసుకుందాం. ►చాలామంది నాన్ వెజ్ ఫుడ్‌ని ఫ్రిజ్‌లో స్టోర్ చేసి తర్వాత వేడి చేసి తింటూ ఉంటారు. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ► చాలామంది రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఉదయం వేడి చేసి తింటారు. అలాగని ఉదయం మిగిలిన దానిని రాత్రికి వేడి చేసి తినడం మంచిదనుకోకండి. అది కూడా మంచి పద్ధతి కాదు. కొన్ని నివేదికల ప్రకారం అన్నాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే ఫుడ్ పాయిజన్ జరుగుతుందని తేలింది. ► గుడ్లని ఆమ్లెట్ వేసుకొని, ఉడకబెట్టుకొని తింటారు. కొన్నిసార్లు వీటితో కూరలు కూడా వండుతారు. గుడ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే గుడ్లు వండిన వెంటనే తినడం మంచిది. ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసిన తర్వాత తినకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ► మైక్రోవేవ్ ఓవెన్లో కాఫీని మళ్లీ వేడి చేయడం దాదాపుగా అందరూ చేస్తుంటారు. ఈ విషయం తెలిస్తే ఆ పని అస్సలు చేయరు. ఎందుకంటే కాఫీ చల్లబడినప్పుడు ఆమ్లంగా మారుతుంది. ఇది గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది. దానికంటే కాఫీని థర్మో-ఫ్లాస్క్‌లో నిల్వ చేయండి. నచ్చినప్పుడు సిప్ చేయండి. ► చికెన్‌ని రోండోసారి ఉడికిస్తే అందులో మాంసకృత్తులు నశిస్తాయి. ► పుట్టగొడుగులను వండిన వెంటనే తినాలి. ఎక్కువసేపు నిల్వ ఉంచడం, రీహీట్ చేయడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల ప్రొటీన్లు విచ్ఛిన్నమై జీర్ణసంబంధిత సమస్యలు, ఇతరత్రా అనారోగ్యాలకు దారితీయొచ్చు. ► చేపలను మళ్లీమళ్లీ వేడి చేయడం వల్ల దాని మృదుత్వం మొత్తం పోయి పొడిగా మారుతుంది. ► ఆకుపచ్చ కూరగాయలు ఆకుపచ్చ కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో నైట్రేట్ కూడా ఉంటుంది. ఇలాంటి కూరగాయలతో వండిన వంటకాలని వేడి చేసినప్పుడు అవి క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఈ తప్పు అస్సలు చేయకూడదు. -
బరువు తగ్గాలని రోజూ కూరగాయలు తింటున్నారా? ఈ విషయాలు తెలుసా?
ఈ రోజుల్లో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి కారణం శారీరక శ్రమ తగ్గించడం, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్నీ, జంక్ ఫుడ్‌నీ తీసుకోవడం, తగినంత నిద్రపోకపోవడం వంటివి. ఊబకాయం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే సరైన బరువును మెయింటెయిన్ చేయడం అవసరం. బరువు తగ్గాలంటే పొట్ట మాడ్చుకోనవసరం లేదు. కొన్ని రకాల కూరగాయలని డైట్లో చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం. బ్రకోలీ బ్రకోలీలో ఉండే కెరోటినాయిడ్ అనే మూలకం వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, కె వంటి పోషకాలు, ఫైబర్ ఉంటాయి. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల బ్రకోలీని సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. క్యాబేజీ క్యాబేజీలో విటమిన్ ఎ, బి, ఐరన్, జింక్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలకూర పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ అధిక శాతం ఉండటం వల్ల మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలి అదుపులో ఉంటుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్యాప్సికమ్ క్యాప్సికమ్‌లో పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి6, సి, ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాప్సైసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కాలీఫ్లవర్ కాలీఫ్లవర్‌లో ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. సులువుగా బరువు తగ్గుతారు. వీటన్నింటినీ తీసుకోవడంతో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సమయానికి తినడం, తగినంత నిద్రపోవడం కూడా అవసరం. -
మందులు వేసుకున్నా దగ్గు తగ్గడం లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి
హెల్త్ టిప్స్ ►నీళ్ళలో తులసి ఆకులు వేసి మరిగించి, ఆ తర్వాత మరిగిన తులసి నీటిని కాస్త చల్లార్చి తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ► కొంచెం గోరువెచ్చని నీళ్లలో కరక్కాయ పొడిని కలుపుకుని తాగినా, కరక్కాయ ముక్క బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉన్నాపొడి దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ► అర టీ స్పూన్ సొంఠి పొడి లో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకున్నా దగ్గు నుంచి రిలీఫ్ లభిస్తుంది. ► టీ స్పూన్ తేనెలో 1 టీ స్పూన్ అల్లం రసం, 1 టీ స్పూన్ దానిమ్మరసం మూడింటిని బాగా కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకి 2 లేదా మూడు సార్లు చేస్తే రిజల్ట్ మీకే తెలుస్తుంది. ► రెండు, మూడు రోజుల పాటు రెండు మిరియాల గింజలు, మెలమెల్లగా నములుతూ, ఆ రసం మింగితే దగ్గు తగ్గుతుంది. ► సీతాఫలం విత్తనాలు, ఆకులు మెత్తగా నూరి పట్టిస్తే, పేలు పోతాయి. ► అరటిపండు, తేనెతో కలిపి తీసుకంటే క్షయవ్యాధిగ్రస్తులకు మంచిది. ► నేరేడు ఆకులు నీటిలో మరిగించి, వడగట్టి, ఆ నీటిని పుక్కిలిస్తే నోటిపూతలు తగ్గుతాయి. ► వేప చెట్టు బెరడును పెనంపై బాగా కాల్చి, మెత్తగా పొడి చేయాలి. ఆ పొడికి కొద్దిగా కొబ్బరి నూనె చేర్చి, కురుపులపై రాస్తే ఉపశమనం వుంటుంది. ∙వేపాకు రసం, దానికి సమాన భాగంలో పెరుగు జోడించి, కాస్త నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది. మీకు తెలుసా? ►వంట పూర్తయిన తర్వాత అంట్లను కొందరు వంటింటి షింకులోనే అలా ఉంచేస్తుంటారు. అలా చేయకండి. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవడమో లేకపోతే బయట వేసుకోవడమో చేయండి. సింకులో గిన్నెలు పడి ఉండటం వల్ల వాటిలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రావడం ప్రారంభం అవుతుంది. వాటిని వాడటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ►సాధారణంగా చాలా మంది వంటింట్లోనే చెత్త డబ్బాను పెట్టుకుంటుంటారు. ఒకటి రెండు రోజులు గనుక అది అలాగే ఉండిపోతే సూక్ష్మ జీవులు చేరి కంపు రావడం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఏ రోజుకారోజు చెత్తను తీసివేయండి. వెసులుబాటు ఉంటే గనుక అసలు దీన్ని వంటింటి బయట వైపు ఏర్పాటు చేసుకోవడం మంచిది. -
ఎక్కువగా చెమటలు పడుతున్నాయా? గుండెపోటు రావొచ్చు!
చెమటలు పట్టడం అనేది చాలా సాధారణ విషయం.. ఎందుకంటే శరీర శ్రమ అతిగా చేయడం వల్ల అందరిలో చెమట పడుతూ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో మరింత సహజం. అయితే కొందరిలో చెమట విచ్చలవిడిగా పడుతూ ఉంటుంది. దీంతోపాటు కొందరిలో అకస్మాత్తుగా చెమటలు వస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు చాలామంది దీనిని సాధారణ సమస్యగా భావించి తేలిగ్గా తీసుకుంటున్నారు. దీని వల్ల భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలని కొని తెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా మీకు జరుగుతుంటే మాత్రం మీ ఒంటి మీద మీరు కాస్తంత శ్రద్ధ తీసుకోవాల్సిందే మరి! అకస్మాత్తుగా చెమటలు పట్టడం అనేకరకాల అనారోగ్య సమస్యలకు ముందస్తు సూచనలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని గుండెజబ్బుల లక్షణాలలో ఒకటిగా వైద్యులు భావిస్తారు. తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ముందు తరచు ఆకస్మాత్తుగా చెమటలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. మీలో ఇలాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించడం, వారి సలహా మేరకు హెల్త్చెకప్ చేయించుకోవడం మంచిదని అనుభవజ్ఞుల సలహా. అధిక చెమట ఈ వ్యాధుల లక్షణాలలో ఒకటి... అకస్మాత్తుగా చెమటలు పట్టడం గుండెపోటు మొదటి లక్షణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మహిళలకు రాత్రిపూట ఎక్కువగా చెమట పడడం వల్ల భవిష్యత్‌లో రానున్న తీవ్రసమస్యలకు సంకేతాలు. తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కూడా ఎక్కువగా చెమట పడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమందిలో మధుమేహం పెరగడం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. అకస్మాత్తుగా వచ్చే చెమటలు రాకుండా ఉండాలంటే... ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించడం. మద్యపానం అలవాటుంటే వెంటనే మానేయడం. ఆకు కూరలు, పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం. గ్రీన్ టీ తీసుకోవడం ∙రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తాగడం. డీప్ ఫ్రైలు, ఇతర నూనె పదార్థాలను తగ్గించడం. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలు చేయడం ∙పద్ధతి ప్రకారం డైట్ తీసుకోవడం అవసరం. -
కొబ్బరి మాత్రమే ఆహారం..ఈ పెద్దాయన డైట్ ప్లాన్ వింటే షాకవుతారు..
‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా..’ అంటూ వేడి అన్నంలోకి నెయ్యి, పప్పు, ఆవకాయ, అప్పడాలు ఇలా ఎన్నో రకరకాల వంటకాలను తింటుంటారు భోజన ప్రియలు. అదే ప్రతిరోజూ ప్రతిపూట ఒకే ఆహారం తినాల్సి వస్తే? ఆ బాధ వర్ణించరానిది. అలాంటిది ఒక వ్యక్తి ఎంతో ఇష్టంగా ఒకే ఆహారాన్ని గత రెండు దశాబ్దాలుగా తీసుకుంటున్నాడు. కేరళలోని కాసరగోడ్‌కు చెందిన బాలకృష్ణ పలాయి, గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కేవలం కొబ్బరి నీళ్లు, కొబ్బరి కాయలు తింటూ జీవితం సాగిస్తున్నాడు.ఎందుకంటే, అతనికి ‘గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్ (జీఈఆర్డీ). ఈ జబ్బుతో బాధపడేవారి అన్నవాహిక చివర ఉండే కండరం సరిగ్గా మూసుకోదు. దీంతో, ఏ ఆహారం తిన్నా గుండెల్లో మంట, వాంతులు, కడుపు ఉబ్బరంతో నీరసించి, ఒక్కోసారి కుప్పకూలిపోతారు కూడా. బాలకృష్ణకు కూడా ఇదే పరిస్థితి. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, తక్కువ మొత్తంలో ఆహారం తిసుకునేవాడు. కాలక్రమంలో తనకు కొబ్బరి నీళ్లతో ఏ ఇబ్బంది లేదని గ్రహించాడు. తర్వాత కొంచెం లేత కొబ్బరిని ప్రయత్నించాడు. దాంతో కూడా ఏ ఇబ్బంది లేకపోవడంతో ఇక తన ఆహారం కేవలం కొబ్బరి మాత్రమేనని నిర్ణయించుకున్నాడు. View this post on Instagram A post shared by Travel, Romance, Smiles (@shenaztreasury) కొబ్బరినీళ్లతో బోలెడు ప్రయోజనాలు ► కొబ్బరినీళ్లలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి అనేకరకాల వ్యాధులను దూరం చేస్తాయి. ► కొబ్బరినీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది. ఇది వ్యార్థాలను తొలగించి శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. ► కొబ్బరినీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ► జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపర్చడమే కాకుండా పొట్ట సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ► రోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటును నివారిస్తుంది. ► గుండెజబ్బులు, హార్ట్ ఫెయిల్యూర్ రిస్కును తగ్గించడంలో కొబ్బరినీళ్లు ముఖ్య పాత్ర వహిస్తుంది. కొబ్బరిలో ఎన్నో మినరల్స్, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి, కాబట్టి బాలకృష్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. అంతేకాదు, లోకల్ క్లబ్లో తనకెంతో ఇష్టమైన ఫుట్‌బాల్ ఆడుతూ ఫుట్‌బాల్ ప్లేయర్‌గానూ విజయాలు సాధిస్తున్నాడు. -
పరగడుపున ఉసిరి తీసుకుంటున్నారా? ఈ విషయం తెలుసా?
Health Tips: ►ఉసిరి పచ్చడి తీసుకోవడం, తేనెలో నానపెట్టిన ఉసిరిని నిత్యం పద్ధతి ప్రకారం సేవించడం ద్వారా దృష్టిలోపం తగ్గుతుంది. ఉసిరి పొడిని నిత్యం పరకడుపున తేనెతో కలిపి సేవించడం వల్ల వత్తిడి, అలసట తగ్గుతుంది. ►ఎండు ద్రాక్షలు లేదా కిస్మిస్లు వాడడం మంచిది. వీటికి చలువ చేసే గుణం వుంది. గ్లాసుడు నీళ్లలో ఎండు ద్రాక్షలు వేసి, నానపెట్టి, ఆ నీటిని తీసుకుంటే వేడి చేయకుండా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు చాలా మంచిది. ► గోధుమలు, బియ్యం, పెసలు, రాగులు, సోయాగింజ లు, జొన్నలు అరకిలో వంతున కలిపి, 50 గ్రాముల నువ్వులు, 20 గ్రాముల జీలకర్ర జోడించి, దోరగా విడివిడిగా వేయించాలి. ఆపై మరపట్టించి రొట్టెలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పిండితో జావ కూడా చేసుకోవచ్చు. ► నెలసరి నొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి, వడకట్టి, ఆ నీటిని సేవించడం వల్ల మంచి ఫలితం వుంటుంది. పుదీనా ఆకులు, ఉప్పు కలిపి నీటిలో మరిగించి, ఆ ఆవిరి పడితే గొంతు మృదువుగా మారుతుంది.