∙చెవి, ముక్కు, గొంతు సంరక్షణ
ఇటీవల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముక్కు ఆరోగ్య సంరక్షణ చాలా కీలకంగా మారుతోంది. అంతేకాదు.. ఈమధ్యకాలంలో శబ్దకాలుష్యం కూడా అనూహ్యంగా పెరిగి పోతోంది. వాహనాల పెరుగుదల వల్ల శబ్ద, వాయు కాలుష్యాలు... ఈ రెండూ ఏకకాలంలో పెరిగి రెండు జ్ఞానేంద్రియాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఇక ఈ ముక్కు, చెవులు రెండూ గొంతుతో అనుసంధానమై ఉంటాయి. ఈ నేపథ్యంలో చెవులు,ముక్కు, గొంతు ఆరోగ్య పరిరక్షణ ఎంతో కీలకం. అందుకే వాటి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను తెలుసుకోవడం తప్పనిసరి.
ముక్కు చెవులనూ, అలాగే తలను మిగతా దేహంతో అనుసంధానం చేసే కీలక అవయవ భాగమే మెడ. వీటన్నింటి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకు పాటించాల్సిన కొన్ని సూచనలివి...
చెవుల సంరక్షణ కోసం...
∙పెద్ద పెద్ద చప్పుళ్ల నుంచీ, శబ్దకాలుష్యం నుంచి చెవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇయర్ ఫోన్స్‌తో మొబైల్ వాడేటప్పుడు, కంప్యూటర్‌ను ఉపయోగిస్తూ హెడ్‌ఫోన్స్ పెట్టుకున్న సమయంలో పెద్దగా వాల్యుమ్ పెట్టుకోకుండా చెవికి తగినంత వాల్యుమ్‌తో జాగ్రత్తగా చెవులను కాపాడుకోవాలి. ∙పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే చోట్లలో / పనిప్రదేశాలలో ఇయర్ ప్లగ్స్ వాడుకోవాలి.
చెవుల్లో హోరు శబ్దాలు గానీ, ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరి గుయ్‌మనే శబ్దాలుగాని వినిపిస్తుంటే అది టినైటస్ అనే సమస్య కావచ్చని భావిస్తూ సర్టిఫైడ్ ఆడియాలజిస్ట్ దగ్గర వినికిడి పరీక్షలు చేయించుకోవాలి. ∙చెవులు వినబడుతుంటేనే చిన్నారులు మాటలు నేర్చుకునేది. అందుకే చిన్నారి పుట్టగానే ఆ పిల్లలకు వెంటనే వినికిడి పరీక్షలు చేయించాలి. ఇలా పరీక్షించి చికిత్స చేయిస్తే... అటు వినికిడి సమస్యనూ, ఇటు మాటలు రాక΄ోవడాన్నీ ఏకకాలంలో అరికట్టవచ్చు. కాక్లియర్ ఇం΄్లాంట్స్ వంటి చికిత్సలతో మాటలూ, వినికిడీ వచ్చేలా చేయవచ్చు
సైనస్ ఇన్ఫెక్షన్లూ, సమస్యల నుంచి కాపాడుకోవడానికి...
ఒక్కోసారి చేతుల్లో ఉండే హానికరమైన సూక్ష్మజీవులు ఏదైనా తింటున్న సమయంలో గొంతులోకి వెళ్లి అక్కణ్నుంచి ముక్కు, నోరు, గొంతు ద్వారా (ఒక్కోసారి కళ్ల నుంచి కూడా) లోనికి ప్రవేశించి ముక్కు, నోరు, గొంతు, కళ్ల ఇన్ఫెక్షన్లతో పాటు సైనసైటిస్ వంటి సమస్యలకూ కారణమవుతాయి. కానీ చేతులు శుభ్రంగా కడుక్కుంటూ మంచి హ్యాండ్ హైజీన్‌ను పాటించడం మేలు.
అందుకే కేవలం చేతులు శుభ్రంగా కడుక్కోవడం (హ్యాండ్ వాష్)తో ఎన్నో సమస్యలను నివారించవచ్చునని గుర్తుంచుకోవాలి
కొన్ని అలర్జీ సమస్యలను, మనకు సరిపడని అలర్జెన్స్ వల్ల ముక్కు, గొంతు, కళ్ల అలర్జీలూ, సైనస్ సమస్యలతో ΄ాటు ఊపిరితిత్తులకు సంబంధించిన మరికొన్ని రుగ్మతలూ రావచ్చు. అందుకే మనకు సరిపడని వాటికి దూరంగా ఉండాలి వేడినీటితో ఆవిరిపట్టడం అనే ఓ చిట్కాతో ముక్కు, గొంతు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఈ జాగ్రత్తలతోపాటు మంచి సమతులాహారం, విటమిన్–సి సమృద్ధిగా ఉండే నిమ్మజాతి పండ్లైన నారింజ, బత్తాయి వంటివి వాడటం, జింక్ మోతాదులు ఎక్కువగా ఉండే నట్స్, గింజధాన్యాలు, పప్పుధాన్యాలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు నివారితమవుతాయి. ఈ జాగ్రత్తలతోపాటు మసాలాలు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల గొంతులో ఇరిటేషన్లు, యాసిడ్ గొంతులోకి వచ్చి గొంతు మండటం అనే సమస్యలు నివారితమవుతాయి. ఇక వీటితోపాటు ఈ చలి సీజన్‌లో మరింత చల్లటి గాలికీ, నీటికి దూరంగా ఉండటం, కాలుష్యానికి ఎక్స్‌పోజ్ కాకుండా జాగ్రత్తవహించడం వంటి జాగ్రత్తలు మేలు చేస్తాయనే అంశాన్ని గ్రహించాలి.
గొంతు ఆరోగ్యం (థ్రోట్ హైజీన్) కోసం
స్మోకింగ్, మద్యం అలవాటు మానుకుంటే కేవలం గొంతు ఆరోగ్యం మాత్రమే కాదు... మొత్తం దేహం ఆరోగ్యమంతా బాగుంటుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలూ, జబ్బులూ, రుగ్మతలూ నివారితమవుతాయి. గొంతు ఆరోగ్యం కోసం గొంతును శుభ్రంగా ఉంచుకోవడం మేలు చేస్తుంది. ఇందుకు గోరువెచ్చని నీటిలో కాస్తంత ఉప్పు వేసుకుని పుక్కిలించడం ఓ మంచి ఇంటి చిట్కా. దీనివల్ల గొంతుకు వచ్చే అనేక ఇన్ఫెక్షన్లూ, ఇన్‌ఫ్లమేషన్లూ, సోర్ థ్రోట్ వంటి సమస్యలు దూరం కావడమే కాకుండా అనేక రకాల గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. ఇది చాలా సులువైన, నమ్మకమైన, ప్రభావపూర్వకమైన చిట్కా ∙ఇక నీళ్లు ఎక్కువగా తాగుతుండటమనేది ఇటు గొంతుతోపాటు పూర్తి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతూ అనేక సమస్యల నుంచి రక్షణ కల్పించే అంశం. (భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!)
ముక్కు ఆరోగ్యం కోసం...
ముక్కు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మనందరి మొదటి ప్రాధాన్యత. అన్ని అవయవాలనుంచి తేమను లాగేసినట్టే... ముక్కు నుంచి కూడా తేమను లాగేస్తుంది ఈ సీజన్. అందుకే ముక్కు తాలూకు తేమ బాగానే నిర్వహితమయ్యేలా చూసుకోవాలి ∙ఈ సీజన్‌లో బాగా నీళ్లు తాగుతూ ఉంటే అది ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్‌ను ΄పొడిబారకుండా తేమగా ఉండేలా చూడటంతో పాటు... మిగతా దేహమంతా బాగా హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకునేందుకు ఉపయోగపడుతుంది.
ముక్కులు బిగదీసుకుపోయే తత్త్వం ఉన్నవారు (ఇది ఈ సీజన్‌లో మరీ ఎక్కువ) సెలైన్ నేసల్ స్ప్రేలు వాడటం వల్ల ముక్కు ఆరోగ్యం బాగుంటుంది. ఇక చీదే సమయంలో బలంగా చీదడం సరికాదు. ఒక్కోసారి దీంతో ముక్కులోని అతి సన్నటి రక్తనాళాలు (క్యాపిల్లరీస్) చెదిరి రక్తస్రావం కూడా అయ్యే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: మహిళలకు ఫ్రీ బస్సా? ఇదెక్కడి న్యాయం అంటూ ట్వీట్ : ఇచ్చిపడేసిన నెటిజనులు
Comments
Please login to add a commentAdd a comment