destroying
-
కాలుష్యం కాటేస్తది.. చెవి, ముక్కు, గొంతు జాగ్రత్త!
ఇటీవల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముక్కు ఆరోగ్య సంరక్షణ చాలా కీలకంగా మారుతోంది. అంతేకాదు.. ఈమధ్యకాలంలో శబ్దకాలుష్యం కూడా అనూహ్యంగా పెరిగి పోతోంది. వాహనాల పెరుగుదల వల్ల శబ్ద, వాయు కాలుష్యాలు... ఈ రెండూ ఏకకాలంలో పెరిగి రెండు జ్ఞానేంద్రియాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఇక ఈ ముక్కు, చెవులు రెండూ గొంతుతో అనుసంధానమై ఉంటాయి. ఈ నేపథ్యంలో చెవులు,ముక్కు, గొంతు ఆరోగ్య పరిరక్షణ ఎంతో కీలకం. అందుకే వాటి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను తెలుసుకోవడం తప్పనిసరి. ముక్కు చెవులనూ, అలాగే తలను మిగతా దేహంతో అనుసంధానం చేసే కీలక అవయవ భాగమే మెడ. వీటన్నింటి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకు పాటించాల్సిన కొన్ని సూచనలివి... చెవుల సంరక్షణ కోసం... ∙పెద్ద పెద్ద చప్పుళ్ల నుంచీ, శబ్దకాలుష్యం నుంచి చెవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇయర్ ఫోన్స్‌తో మొబైల్ వాడేటప్పుడు, కంప్యూటర్ను ఉపయోగిస్తూ హెడ్‌ఫోన్స్ పెట్టుకున్న సమయంలో పెద్దగా వాల్యుమ్ పెట్టుకోకుండా చెవికి తగినంత వాల్యుమ్‌తో జాగ్రత్తగా చెవులను కాపాడుకోవాలి. ∙పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే చోట్లలో / పనిప్రదేశాలలో ఇయర్ ప్లగ్స్ వాడుకోవాలి.చెవుల్లో హోరు శబ్దాలు గానీ, ట్రాన్స్ఫార్మర్ దగ్గరి గుయ్‌మనే శబ్దాలుగాని వినిపిస్తుంటే అది టినైటస్ అనే సమస్య కావచ్చని భావిస్తూ సర్టిఫైడ్ ఆడియాలజిస్ట్ దగ్గర వినికిడి పరీక్షలు చేయించుకోవాలి. ∙చెవులు వినబడుతుంటేనే చిన్నారులు మాటలు నేర్చుకునేది. అందుకే చిన్నారి పుట్టగానే ఆ పిల్లలకు వెంటనే వినికిడి పరీక్షలు చేయించాలి. ఇలా పరీక్షించి చికిత్స చేయిస్తే... అటు వినికిడి సమస్యనూ, ఇటు మాటలు రాక΄ోవడాన్నీ ఏకకాలంలో అరికట్టవచ్చు. కాక్లియర్ ఇం΄్లాంట్స్ వంటి చికిత్సలతో మాటలూ, వినికిడీ వచ్చేలా చేయవచ్చు సైనస్ ఇన్ఫెక్షన్లూ, సమస్యల నుంచి కాపాడుకోవడానికి... ఒక్కోసారి చేతుల్లో ఉండే హానికరమైన సూక్ష్మజీవులు ఏదైనా తింటున్న సమయంలో గొంతులోకి వెళ్లి అక్కణ్నుంచి ముక్కు, నోరు, గొంతు ద్వారా (ఒక్కోసారి కళ్ల నుంచి కూడా) లోనికి ప్రవేశించి ముక్కు, నోరు, గొంతు, కళ్ల ఇన్ఫెక్షన్లతో పాటు సైనసైటిస్ వంటి సమస్యలకూ కారణమవుతాయి. కానీ చేతులు శుభ్రంగా కడుక్కుంటూ మంచి హ్యాండ్ హైజీన్‌ను పాటించడం మేలు. అందుకే కేవలం చేతులు శుభ్రంగా కడుక్కోవడం (హ్యాండ్ వాష్)తో ఎన్నో సమస్యలను నివారించవచ్చునని గుర్తుంచుకోవాలికొన్ని అలర్జీ సమస్యలను, మనకు సరిపడని అలర్జెన్స్ వల్ల ముక్కు, గొంతు, కళ్ల అలర్జీలూ, సైనస్ సమస్యలతో ΄ాటు ఊపిరితిత్తులకు సంబంధించిన మరికొన్ని రుగ్మతలూ రావచ్చు. అందుకే మనకు సరిపడని వాటికి దూరంగా ఉండాలి వేడినీటితో ఆవిరిపట్టడం అనే ఓ చిట్కాతో ముక్కు, గొంతు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఈ జాగ్రత్తలతోపాటు మంచి సమతులాహారం, విటమిన్–సి సమృద్ధిగా ఉండే నిమ్మజాతి పండ్లైన నారింజ, బత్తాయి వంటివి వాడటం, జింక్ మోతాదులు ఎక్కువగా ఉండే నట్స్, గింజధాన్యాలు, పప్పుధాన్యాలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు నివారితమవుతాయి. ఈ జాగ్రత్తలతోపాటు మసాలాలు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల గొంతులో ఇరిటేషన్లు, యాసిడ్ గొంతులోకి వచ్చి గొంతు మండటం అనే సమస్యలు నివారితమవుతాయి. ఇక వీటితోపాటు ఈ చలి సీజన్లో మరింత చల్లటి గాలికీ, నీటికి దూరంగా ఉండటం, కాలుష్యానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తవహించడం వంటి జాగ్రత్తలు మేలు చేస్తాయనే అంశాన్ని గ్రహించాలి. గొంతు ఆరోగ్యం (థ్రోట్ హైజీన్) కోసంస్మోకింగ్, మద్యం అలవాటు మానుకుంటే కేవలం గొంతు ఆరోగ్యం మాత్రమే కాదు... మొత్తం దేహం ఆరోగ్యమంతా బాగుంటుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలూ, జబ్బులూ, రుగ్మతలూ నివారితమవుతాయి. గొంతు ఆరోగ్యం కోసం గొంతును శుభ్రంగా ఉంచుకోవడం మేలు చేస్తుంది. ఇందుకు గోరువెచ్చని నీటిలో కాస్తంత ఉప్పు వేసుకుని పుక్కిలించడం ఓ మంచి ఇంటి చిట్కా. దీనివల్ల గొంతుకు వచ్చే అనేక ఇన్ఫెక్షన్లూ, ఇన్ఫ్లమేషన్లూ, సోర్ థ్రోట్ వంటి సమస్యలు దూరం కావడమే కాకుండా అనేక రకాల గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. ఇది చాలా సులువైన, నమ్మకమైన, ప్రభావపూర్వకమైన చిట్కా ∙ఇక నీళ్లు ఎక్కువగా తాగుతుండటమనేది ఇటు గొంతుతోపాటు పూర్తి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతూ అనేక సమస్యల నుంచి రక్షణ కల్పించే అంశం. (భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!)ముక్కు ఆరోగ్యం కోసం...ముక్కు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మనందరి మొదటి ప్రాధాన్యత. అన్ని అవయవాలనుంచి తేమను లాగేసినట్టే... ముక్కు నుంచి కూడా తేమను లాగేస్తుంది ఈ సీజన్. అందుకే ముక్కు తాలూకు తేమ బాగానే నిర్వహితమయ్యేలా చూసుకోవాలి ∙ఈ సీజన్లో బాగా నీళ్లు తాగుతూ ఉంటే అది ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్‌ను ΄పొడిబారకుండా తేమగా ఉండేలా చూడటంతో పాటు... మిగతా దేహమంతా బాగా హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకునేందుకు ఉపయోగపడుతుంది.ముక్కులు బిగదీసుకుపోయే తత్త్వం ఉన్నవారు (ఇది ఈ సీజన్లో మరీ ఎక్కువ) సెలైన్ నేసల్ స్ప్రేలు వాడటం వల్ల ముక్కు ఆరోగ్యం బాగుంటుంది. ఇక చీదే సమయంలో బలంగా చీదడం సరికాదు. ఒక్కోసారి దీంతో ముక్కులోని అతి సన్నటి రక్తనాళాలు (క్యాపిల్లరీస్) చెదిరి రక్తస్రావం కూడా అయ్యే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: మహిళలకు ఫ్రీ బస్సా? ఇదెక్కడి న్యాయం అంటూ ట్వీట్ : ఇచ్చిపడేసిన నెటిజనులు -
గ్రీన్ బెల్ట్ ను సైతం మింగేసి ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు
-
ఎలుకను అరెస్టు చేసిన పోలీసులు.. ఎందుకంటే..?
భోపాల్: తప్పు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేస్తారు. కానీ మధ్యప్రదేశ్‌లో పోలీసులు ఓ ఎలుకను అరెస్టు చేశారు. చిన్న బోనులో బందించి పోలీసు స్టేషన్లోనే ఓ మూలన ఉంచారు. పోలీసు గోదాంలో ఉన్న మద్యం బాటిళ్లను ఎలుకలు ఖాలీ చేసిన కారణంగా దానిని బందించినట్లు పోలీసులు చెబుతున్నారు. చింద్వారా, కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన బాటిళ్లకు సంబంధించిన ఆధారాలను న్యాయస్థానంలో సాక్షంగా చూపించాల్సి ఉంది. కానీ ఎలుకలు మద్యం బాటిళ్లను ఖాలీ చేశాయి. ఇక ఏం చేయాలో తెలియక ఎలుకలను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. చాలా ఎలుకల్లో ఒక్క ఎలుక మాత్రమే దొరికిందని తెలిపారు. మిగితావి పరారీలో ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి. పలు ప్రభుత్వ పత్రాలను కూడా ధ్వంసం చేశాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల శరీరాన్ని కొరికి తిన్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు -
అమిత్ షా సమక్షంలో 40,000 కిలోల డ్రగ్స్ ధ్వంసం
గువాహటి: మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో ఆధ్వర్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 40,000 కిలోల వివిధ రకాల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో శనివారం ధ్వంసం చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా గువాహటి నుంచి వర్చువల్‌గా డ్రగ్స్ ధ్వంసం చేసే ప్రక్రియను పర్యవేక్షించినట్లు ట్వీట్ చేసింది. అస్సాంలో 11,000 కిలోలు, అరుణాచల్ ప్రదేశ్‌లో 8,000 కిలోలు, మేఘాలయలో 4,000 కిలోలు, నాగాలాండ్‌లో 1600 కిలోలు, మణిపుర్లో 398 కిలోలు, మిజోరాంలో 1900కిలోలు, త్రిపురలో 13,500 కిలోలు పట్టుకున్నట్లు వెల్లడించింది. అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా.. డ్రగ్ అక్రమ రవాణా, జాతీయ భద్రత అంశంపై ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈశాన్య ప్రాంతంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, నియంత్రణపై సమీక్షించారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఎన్సీబీ ఆధ్వర్యంలో 75,000 కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంతకు రెండింతలు 150,000 కిలోలు ధ్వంసం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా పెద్ద విజయం.’ అని తెలిపారు షా. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఎన్సీబీ జూన్ 1 నుంచి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మత్తు పదార్థాలను పట్టుకుంటోంది. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మారుస్తామన్న మోదీ ప్రభుత్వ ఆశయానికి తగినట్లుగా డ్రగ్స్‌ను ధ్వంసం చేస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. గత జులై 30న సుమారు 82వేల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. అదే రోజు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించిన అమిత్ షా.. 31 వేల కిలోల డ్రగ్స్ ధ్వంసం చేసే ప్రక్రియను వర్చువల్‌గా పర్యవేక్షించారు. #WATCH | Union Home Minister Amit Shah conducts a meeting on Drug Trafficking and National Security in Guwahati in the presence of Assam CM Himanta Biswa Saram and Union Minister G Kishan Reddy. pic.twitter.com/yAvXXDvTsn — ANI (@ANI) October 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్ -
న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు వేర్వేరు కాదు
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు వేర్వేరు కాదని.. నాణేనికి బొమ్మాబొరుసులాంటివని జై భీమ్ రియల్ హీరో జస్టిస్ చంద్రు వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘విధ్వంసమవుతున్న ప్రజాస్వామ్య పునాదులు – పరిష్కార మార్గాలు’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. అప్పట్లో బ్రిటీష్ పాలకులకు నేరాలు జరిగిన సమయంలో నేరస్థులను పట్టుకోవడం చేతకాలేదని, సులభంగా కేసులను మూసేందుకు వీలుగా కొన్ని సామాజిక తెగలను నేరస్థ తెగలుగా గుర్తిస్తూ వచ్చారని వెల్లడించారు. ఆ మేరకు చట్టం చేశారని, స్వాతంత్య్రం వచ్చాక కూడా అది కొనసాగిందని, కమ్యూనిస్టులు చేసిన పోరాట ఫలితంగా ఆ చట్టం రద్దయిందని పేర్కొన్నారు. ఆ తెగలను డీ నోటిఫైడ్ చేసినా.. ఇప్పటికీ వారికి ప్రభుత్వాల నుంచి సాయం అందడం లేదని తెలిపారు. కమ్యూనిస్టులు చూపించే విముక్తి మార్గమే శాశ్వతమైందన్నారు. డాక్టర్ బీ.ఆర్.అంబేద్క ర్ చెప్పినట్లుగా ‘నేర్చుకో.. బోధించు.. పోరాడు’ను గుర్తుంచుకోవాలన్నారు. తాము యూనియన్లతో సంప్రదింపులు జరపమంటూ ముఖ్యమంత్రులు భీష్మించుకు కూర్చోడానికి వీల్లేదని జస్టిస్ చంద్రు చెప్పారు. లక్షలాది మంది ఉద్యోగులను తొలగించిన నాటి తమిళనాడు సీఎం జయలలిత, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ మొండికేసిన సందర్భాలను ఉటంకించారు. సెన్సార్ బోర్డులన్నీ ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యక్తులతో నిండిపోయాయన్నారు. జైభీమ్ సినిమాలో చూపించిన హింస వాస్తవంగా జరిగిన దాంట్లో 10 శాతం మాత్రమేనన్నారు. చదువుతోపాటు ధైర్యముండాలి... వ్యవస్థలో మార్పు కోసం పోరాడేందుకు చదువుకుంటేనే సరిపోదని, ధైర్యం కూడా ఉండాలని జస్టిస్ చంద్రు సూచించారు. సమ్మె చేశారనే కారణంతో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత లక్షలమంది ఉద్యోగులను తొలగిస్తే, వారంతా హైకోర్టును ఆశ్రయించారన్నారు. కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే, వారిలో ఒక్కరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ముందుకు రాలేదని తెలిపారు. జై భీమ్ సినిమాలో చూపించినట్లు రాజుకన్న భార్య పోలీసుల ప్రలోభాలకు లొంగకుండా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి న్యాయవ్యవస్థను కదిలించిందని గుర్తుచేశారు. జైభీమ్ సినిమా లోని జస్టిస్ మిశ్రా న్యాయవ్యవస్థ పనితీరును మానవీయంగా కొత్తమార్గం పట్టించారని కొనియాడారు. 1990లో చిదంబరంలో లైంగిక దాడికి గురైన మహిళ వామపక్ష పార్టీల సహకారంతో న్యాయంకోసం పోరాడగలిగిందనీ, అది మొదలు మిశ్రా అనేక కేసుల్లో బాధితులకు న్యాయం చేసేందుకు కట్టుబడ్డారని తెలిపారు. పరిహారం ఇచ్చే ప్రొవిజన్ లేకపోయినా... గౌరవనీయ పరిహారం ఇప్పించారన్నారు. భారత్‌లో మూడు గ్రామాలవ్యవస్థ ఉందని.. ఒకటి కాలనీ అని, మరొకటి షెడ్యూల్డ్ కులాల నివసించే ప్రాంతమని, మూడో నివాస ప్రాంతం ఆదివాసీలు ఉండేదని పేర్కొన్నారు. తన జీవిత చరిత్ర పుస్తకం జనవరిలో విడుదల చేయనున్నట్లు జస్టిస్ చంద్రు వివరించారు. -
దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ : నిరుపేదలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నేరుగా డబ్బు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తప్పు బట్టారు. ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పేదలకు తక్షణమే 10వేల రూపాయలు అందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలపై కరోనా చూపిన ప్రభావాలను వివరించిన ఓ వార్తా నివేదికను రాహుల్ ట్విటర్లో షేర్ చేశారు. (బ్లాక్ మార్కెటింగ్ విషయలో కఠినంగా ఉంటాం ) Govt is actively destroying our economy by refusing to give cash support to people and MSMEs. This is Demon 2.0.https://t.co/mWs1e0g3up — Rahul Gandhi (@RahulGandhi) June 6, 2020 ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల మధ్య పరిశ్రమలు గట్టెక్కాలంటే కేంద్రం ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని రాహుల్ పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రజలు, పరిశ్రమలకు నేరుగా డబ్బు అందించడాన్ని నిరాకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నేరమని రాహుల్ అభివర్ణించారు. భారత్‌లో కరోనా కట్టడి కోసం మోదీ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఎలా విఫలం అయ్యిందో గ్రాఫ్లతో సహా వివరిస్తూ ట్విటర్లో పంచుకున్నారు. దేశంలో కేసులు పెరుగుతుంటే భారీ సడలింపులు ఇవ్వడంపై ఆనాడే ప్రశ్నించిన విషయాన్ని రాహుల్ గుర్తుచేశారు. (కరోనా ఎఫెక్ట్: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం) -
వనాలు తరిగి జనాలపైకి..
వీరఘట్టం: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రైతులకు శాపంగా మారిన ఏనుగుల గుంపు సంచారం వెనుక మానవ తప్పిదాలు వెలుగు చూస్తున్నాయి. వాటి ఆవాసాలపై అక్రమార్కులు దాడులు చేస్తే అవి ప్రతిదాడులు చేస్తున్నాయి. దట్టమైన అడవుల్లో జరుగుతున్న మైనింగ్ కారణంగానే మూగ జీవాలు అభయారణ్యం నుంచి జనారణ్యంలోకి వస్తున్నాయి. ఇప్పుడు బీభత్సం సృష్టిస్తున్న ఏనుగులు గుంపుకు తోడు మరో గుంపు జిల్లా అడవుల్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా ఉండడంతో అటవీ ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలో అటవీ విస్తీర్ణం 616 చదరపు కి.మీ. ఈ అటవీ విస్తీర్ణంలో 70,350 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి భూభాగంలో 33 శాతం అడవులు ఉంటే అక్కడ సంచరించే వన్యప్రాణులకు, ప్రకృతి సంపదతోపాటు మానవాళి మనుగడకు ఎటువంటి ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మన జిల్లాలో మాత్రం అడవులు కేవలం 10 శాతం మాత్రమే ఉన్నాయి. అంటే వన్యప్రాణులు ఉండేందుకు సరైన ఆవాసాలు జిల్లా అడవుల్లో లేవని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో 11 ఏళ్లలో రెండు గుంపులుగా వచ్చిన ఏనుగులు అడవుల్లో ఉండలేక జనారణ్యంలోకి వస్తూ పంటలు నాశనం చేస్తున్నాయి. ఇదీ పరిస్ధితి... మన జిల్లాకు పక్కనే అతి సమీపంలో ఒడిశా రాష్ట్రంలోని లఖేరీ అటవీ ప్రాంతంలో అభయారణ్యం ఉంది. ఈ అభయారణ్యంలో వందల సంఖ్యలో ఏనుగుల గుంపులు ఉన్నట్లు గణాం కాలు చెబుతున్నాయి. ఈ అభయారణ్యం చు ట్టూ విలువైన గ్రానైట్ నిక్షేపాలు కూడా ఉన్నా యి. ఈ గ్రానైట్ నిల్వలను కొల్లగొట్టేందుకు అక్కడ మైనింగ్ మాఫియా చేపడుతున్న బాంబ్ బ్లాస్టింగ్ల వల్ల ఏనుగుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. చిన్న చిన్న శబ్దాలకు ఏనుగులు బెదిరిపోతాయి. బాంబు బ్లాస్టింగ్ వల్ల వచ్చే పెద్ద శబ్దాలను ఏనుగులు భరించలేవు. అందుకే భయంతో పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో అడ్డుగా వచ్చేవారని హతమారుస్తున్నాయి. వెంటాడుతున్న గజ భయం.. సిక్కోలు ప్రజలను గజ భయం వెంటాడుతోం ది. మరో ఏనుగుల గుంపు జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు పలువురు అటవీ శా ఖ అధికారులు చెబుతున్నారు. ఒడిశా రాష్ట్రంలో ని లఖేరీ అభయారణ్యం నుంచి ఈ ఏనుగుల గుంపు విజయనగరం–శ్రీకాకుళం జిల్లాల సరి హద్దు అటవీ ప్రాంతాల గుండా ప్రవేశిస్తున్నా యి. గతంలో కూడా ఇదే ప్రాంతం నుండి వచ్చి న ఏనుగుల గుంపు ఏళ్ల తరబడి కదలకుండా తిష్టవేశాయి. ఇప్పుడు మరో గుంపు రానుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఏ మాత్రం గాని మరో ఏనుగుల గుంపు వస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పదు. మరి ఈ పరస్ధితుల నుండి గట్టెక్కే మార్గం ఉందా అంటే సమాధానం ప్రశ్నార్ధకంగా మారింది. నిద్రావస్ధలో అటవీశాఖ.. అటవీశాఖ అధికారులు కృతనిశ్చయంతో ప్రయత్నిస్తే ప్రస్తుతం ఉన్న ఏనుగుల గుంపును తరలించవచ్చును. మరో ఏనుగుల గుంపు చొరబడకుండా చర్యలు తీసుకోవచ్చును. అయితే ఆ దిశగా ఆ శాఖ ప్రయత్నం చేస్తోందా అంటే సమాధానం చెప్పేవారే కరువయ్యారు. అయితే అటవీశాఖ అధికారులు ఏమైనా వ్యూహరచన చేస్తున్నారంటే అదీ లేదు. జిల్లాలో ఏనుగులు సంచరిస్తే ఎంతో మేలు అన్నట్లుగా ఈ శాఖ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఏనుగులను తరలించే చర్యల్లో భాగంగా పుష్కలంగా నిధులు ఖర్చు చేయవచ్చును. అడిగేవారుండరని ఏనుగులు అధికారులకు కామధేనువులుగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అప్రమత్తంగా ఉన్నాం.. ఐదు రోజుల క్రితం జిల్లాలో వంగర మండలంలో ప్రవేశించిన ఏనుగుల గుంపు శనివారం వీరఘట్టం మండలం నడిమికెల్లలో ప్రవేశించి కంబర పంచాయితీలోని అరిటితోటల్లో తిష్టవేశాయి. సుమారు 15 ఎకరాల్లో అరటి తోటలు నాశనమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీటిని అటవీ ప్రాంతంలోకి తరలిస్తున్నాం. అయితే అవి వెళ్లిన వెంటనే మరలా తిరిగివచ్చేస్తున్నాయి. ఒడిశా అటవీ ప్రాంతంలో వీటి ఆవాసానికి తగిన వనరులు లేకపోవడం వల్లే అవి ఈ రెండు జిల్లాలో తిష్టవేస్తున్నాయి. జిల్లాలో మంచినీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా వృక్షసంపద కూడా ఉంది. అందుచే ఏనుగులు ఇక్కడ నుండి కదలడం లేదు. మరో ఏనుగుల గుంపు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. –విఠల్‌కుమార్, అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి, వీరఘట్టం -
రాజు గారి ‘శిలా’శాసనం
మాయమవుతున్న గత పాలకుల శిలా ఫలకాలు శంకుస్థాపన రాళ్లు కనిపించకూడదట! పిఠాపురంలో నీచ సంస్కృతి రాచరికం పోయి ప్రజాస్వామ్యంలో అడుగుపెట్టినా ఆ ఛాయలు మాత్రం పిఠాపురం నియోజక వర్గంలో పోవడం లేదు. రాజుల పాలనలో యుద్ధాలు జరిగేవి. విజేతగా నిలిచిన రాజుదే ఆ రాజ్యం. అందుకే గత రాజుల ఆనవాలు కనిపించకుండా ధ్వంసం చేసేవారు. అదే పద్ధతిని ఇక్కడ అమలు చేస్తున్నారు ఈ రాజుగారు. శాశ్వతంగా తానే ఉండిపోతాననే భ్రమలో ఉన్నట్టున్నారు ఈ రాజుగారు. పాత శిలా ఫలకాలు ఒక్కొక్కటినీ పడగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నారు. పిఠాపురం: చరిత్రను చాటి చెప్పే శిలా శాసనాలను రాచరికంలో రాజులు వేయించుకునే వారు. అలాగే ప్రస్తుత కాలంలో పాలకులు తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాల జ్ఞాపకాలుగా శిలా ఫలకాలను వేయించుకుంటున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ చూసినా ఆయన పేరు తప్ప మరే ఇతర నాయకుల పేర్లు కపించకూడదనేది ఇక్కడి రాజు గారి శిలాశాసనం. రెండు, మూడేళ్ల ముందు ఒకరు శంఖుస్థాపన చేస్తారు ... పూర్తయిన తరువాత ఆ రోజుకి ఎవరు ప్రజాప్రతినిధిగా ఉంటే వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేస్తారు. ఆ సమయంలో శంఖుస్థాపన చేసినవారి పేరుతోపాటు ప్రారంభోత్సవం చేసినవారి పేరు ఉండడం సహజం. కానీ ఈయనగారు ప్రారంభించిన ఏ కార్యాలయంలోనూ తన ప్రారంభోత్సవ శిలాఫలకం తప్ప శంఖుస్థాపన శిలాఫలకం మాత్రం కనిపించకూడదనే హుకుం జారీ చేయడంతో జుత్తు పీక్కుంటున్నారు ఆయా శాఖల అధికారులు. ఈ నిరంకుశత్వ విధానాలు ఎక్కడో కాదు పిఠాపురం నియోజకవర్గంలో... ఆ నియోజకవర్గానికి శాసన సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్వీఎస్ఎన్ వర్మ జమానాలో ఈ తంతు సాగుతోంది. పద్థతిదీ... సాధారణంగా ఏ ప్రభుత్వ భవనమైనా ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేపడితే ఆ సమయంలో అధికారంలో ఉన్న పాలకులు శంఖుస్థాపన చేస్తారు. ఆ భవనాలు పూర్తయ్యాక వాటిని పాలకులు ప్రారంభోత్సవం చేస్తారు. ఆ రెండు కార్యక్రమాలకు సంబంధించి ఏ పాలకులు కార్యక్రమంలో పాల్గొన్నా రెండు శిలాఫలకాలనూ ఆ కార్యాలయంలో శాశ్వతంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయడం ఆనవాయితీ. 2014లో ఎన్నికలు జరిగే వరకు అలాగే కొనసాగింది కాని ఎన్నికల అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో దీనికి భిన్నంగా జరుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇతర నాయకులు చేసిన శంఖుస్థాపన రాళ్లు మాయమవుతుండగా కేవలం ఇప్పటి నాయకులు వేసిన ప్రారంభోత్సవ రాళ్లు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గతంలో వేసిన శంఖుస్థాపన రాళ్లను మూలన పడేయడం ...లేదా ఎక్కడ వేసిన రాళ్లను అక్కడ వదిలేయడం జరుగుతోందంటున్నారు. . తాజా ఘటనలివీ... కొత్తపల్లి మండలంలోని మండల కేంద్రమైన కొత్తపల్లి పోలీసు స్టేషన్, తహసీల్దారు కార్యాలయం, ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణాలకు ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం అప్పటి ఎమ్మెల్యే వంగా గీతా విశ్వనా«థ్ శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎట్టకేలకు ఆ భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంతలో ఎన్నికలు రావడం ఆ భవనాలను ఎన్నికల అనంతరం కొత్త పాలకులు ప్రారంభోత్సవాలు చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆ కార్యాలయాల వద్ద మాత్రం గతంలో పాలకులు చేసిన శంఖుస్థాపన రాళ్లను మూడు ముక్కలు చేసి మూలన పడేయడం గమనార్హం. గతంలో కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని గతంలో పాలకులు ప్రారంభించగా అక్కడ మాత్రం శంఖుస్థాపన ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. అదే కార్యాలయంలో ఆధునికీకరణ పనులు చేపట్టి ప్రస్తుత నాయకుల పేరుతో కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. + తాజాగా పిఠాపురం మండలంలో మంగితుర్తిలో ఒక దాత ఏర్పాటు చేసిన శిలాఫలకం తీయించేసి ఎమ్మెల్యే వర్మ ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకం ఏర్పాటు చేయించడం ఇందుకు తార్కాణం. ఈ తంతు ఆయన పదవి చేపట్టిన నాటి నుంచి జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాలం మారుతోంది ...ప్రభుత్వాలు మారుతుంటాయి ... నాయకులు తారుమారవుతుంటారు...అలా అని గత పాలకుల జ్ఞాపకాలను తుడిచేయాలనే కుటిల ఆలోచన మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ రాలేదని ... ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదని నియోజకవర్గ ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు. -
ఆక్రమణల తొలగింపులో రాజకీయ రంగు
-
టీచర్ ను మోసగించిన విద్యార్థినికి జైలు!
స్వలాభం కోసం ఓ విద్యార్థిని ఏకంగా ఉపాధ్యాయురాలినే టార్గెట్ చేసింది. అనారోగ్యం, బాధలు, కష్టాలు వంటి అనేక అసత్యాలతో నమ్మించి మోసంచేసింది. కార్న్ వాల్ కు చెందిన 22 ఏళ్ళ ఎలిసా బియాంకో.. తన ఉపాధ్యాయురాలు... 49 ఏళ్ళ సాలీ రెట్టాలక్ దయాగుణాన్నిగ్రహించి క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించింది. నకిలీ ప్రేమను చూపించి, విషాదగాధను వినిపించి మైండ్ గేమ్ ఆడుకుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు సృష్టించి వారి జీవితాలను నాశనం చేసి, చివరికి జైలుపాలయ్యింది. ఎవరో తన వెంట పడుతున్నారని, తల్లిదండ్రులు సరిగా చూడటం లేదని, క్యాన్సర్ వల్ల కేవలం మూడు నెలలే బతుకుతానని ఎన్నో అబద్ధాలు చెప్పి, రెట్టాలక్ చూపించిన జాలినే ఆయుధంగా చేసుకొని, ఏకంగా ఆమె ఇంటికే మకాం మార్చేసింది. క్యాన్సర్ చికిత్స పేరున ప్రతిరోజూ ఆస్పత్రికి దింపుతున్న రెట్టాలక్ కళ్ళుగప్పి ఓ కేఫ్ లో కూర్చొని నకిలీ బ్యాండేజ్ లు వేసుకుంటూ కాలం గడిపింది. బియాంకో వేసిన నాటకాలకు రెట్టాలక్ పడిపోయింది. అంతేకాదు ఆమె ఖర్చులకు కష్టం అవుతుందని పని కూడ ఇప్పించింది. అయితే అన్నం పెట్టిన చేతినే నరికిన చందాన.. మరో అడుగు ముందుకేసిన బియాంకో... ఓ కన్సల్టెంట్ ఫిజీషియన్ జాన్ పేరున తప్పుడు ఈ మెయిల్ అడ్రస్ తో మెయిల్స్ ఇస్తూ.. గొంతు మార్చి ఫోన్లు చేస్తూ వారిద్దరూ దగ్గరయ్యేలా చేసింది. రకరకాల నాటకాలాడుతూ బియాంకో.. రెట్టాలక్ కాపురంలో నిప్పులు పోసింది. వారి కుటుంబం విచ్ఛిన్నం అయ్యేలా చేసింది. డాక్టర్ క్యారెక్టర్ ద్వారా తన క్యాన్సర్ ముదిరినట్లు చెప్పింది. తనపై జాలి మరింత పెరిగేలా చేసుకొంది. 2013 లో తనకు రోగం ముదిరిపోయిందని, ఇదే తన ఆఖరి పుట్టిన రోజని చెప్పి... పార్టీకోసం రెట్టాలక్ దగ్గర డబ్బు కూడ గుంజింది. దీంతో బియాంకో బాధను చూడలేని రెట్టాలక్ డాక్టర్ (లవర్ జాన్) ను కలసి ట్రీట్ మెంట్ గురించి మాట్లాడదామని ప్రయాణమైంది. తీరా డాక్టర్ ను కలిసేందుకు ప్రయత్నించడంతో కారు ప్రయాణంలో ఆ క్యారెక్టరే లేదని నిజం చెప్పిన బియాంకో... ఏకంగా రెట్టాలక్ ను కారునుంచి బయటకు గెంటి చంపేందుకు ప్రయత్నించింది. దీంతో అసలు బండారం బయట పడింది. రెట్టాలక్ కోర్టుకు జరిగిన కథ వివరించడంతో బియాంకోకు రెండు సంవత్సరాల ఎనిమిది నెలల జైలు శిక్ష వేశారు. ఎలీసా బియాంకో అవసరానికో అబద్ధం చెబుతూ సాలీ రెట్టాలక్ జీవితాన్నే నాశనం చేసింది. 16 ఏళ్ళ వయసులో కార్న్ వాల్ లోని సెయింట్ ఆస్టెల్ కాలేజ్ లో ఆరోగ్య, సామాజిక సంరక్షణ కోర్సులో చేరిన బియాంకో.. 2009 లో ట్యూటర్ గా వచ్చిన సాలీ రెట్టాలక్ తో పరిచయం పెంచుకుంది. నిజానికి ఇటువంటి వింత, భయంకరమైన కేసులను ఎప్పుడూ తమ జీవితంలో చూడలేదని క్లిస్టఫర్ హార్వే క్లార్క్ సహా పలువురు న్యాయమూర్తులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. -
శిథిలావస్థలో శ్రీవారి నమూనా ఆలయం