భోపాల్: తప్పు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేస్తారు. కానీ మధ్యప్రదేశ్‌లో పోలీసులు ఓ ఎలుకను అరెస్టు చేశారు. చిన్న బోనులో బందించి పోలీసు స్టేషన్‌లోనే ఓ మూలన ఉంచారు. పోలీసు గోదాంలో ఉన్న మద్యం బాటిళ్లను ఎలుకలు ఖాలీ చేసిన కారణంగా దానిని బందించినట్లు పోలీసులు చెబుతున్నారు.
చింద్వారా, కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన బాటిళ్లకు సంబంధించిన ఆధారాలను న్యాయస్థానంలో సాక్షంగా చూపించాల్సి ఉంది. కానీ ఎలుకలు మద్యం బాటిళ్లను ఖాలీ చేశాయి. ఇక ఏం చేయాలో తెలియక ఎలుకలను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. చాలా ఎలుకల్లో ఒక్క ఎలుక మాత్రమే దొరికిందని తెలిపారు. మిగితావి పరారీలో ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.
కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి. పలు ప్రభుత్వ పత్రాలను కూడా ధ్వంసం చేశాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల శరీరాన్ని కొరికి తిన్న ఘటనలు కూడా వెలుగుచూశాయి.
ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు
Comments
Please login to add a commentAdd a comment