Liquor
-
దందాకు పచ్చజెండా .. మద్యం ప్రియులకు బాదుడు
-
ఆంధ్రప్రదేశ్‌లో ‘మద్యం మార్జిన్’ మాటున మహా దోపిడీ. ఇక మద్యం ధరలు భారీగా పెంపు. 3 కేటగిరీల మీద 10-20 శాతం ధరల పెంచుతూ ఉత్తర్వులు
-
మందు బాబులకు చంద్రబాబు షాక్
విజయవాడ: ఎన్నికలకు ముందు మద్యం ధరలు(Liquor Prices) తగ్గిస్తానంటూ ఊకదంపుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu).. ప్రభుత్వం ఏర్పాడ్డాక షాక్‌లు మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా భారీగా మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. క్వార్టర్ కు రూ. 20 వరకు ధర పెంచాలని చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని బ్రాండ్లుపైనా మద్యం ధరలు పెంచడానికి సిద్ధమైంది. కాస్ట్ లీ బ్రాండ్లపైనా ధరలు పెంచాలని నిర్ణయించింది.మద్యం షాపులకి మార్జిన్ పెంచి మందు బాబులకు నెత్తిన పెంపు పిడుగు పడేసింది. దీనిపై మందుబాబులను చంద్రబాబు ప్రభుత్వం మోసంచేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మద్యం ధరల రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఇలా మోసం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. -
తోపుడు బండిలో 92 విస్కీ క్వార్టర్ బాటిల్స్
హైదరాబాద్: రోడ్డుపై వ్యాపారం చేస్తున్న ఓ మహిళకు చెందిన తోపుడు బండిలో 92 విస్కీ క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్న సంఘటన గురువారం గచ్చిబౌలి (Gachibowli) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జేవీజీహిల్స్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న డబ్బాలో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు స్థానికులు శేరిలింగంపల్లి (Serilingampally) సర్కిల్ ఉప వైద్యాధికారి శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి వెళ్లిన ఆయన తనిఖీలు చేయగా 10 క్వార్టర్ బాటిల్స్ లభించాయి. వాటిని ధ్వంసం చేసి డబ్బాను తొలగించారు. రాజరాజేశ్వరీ కాలనీలోనూ ఇదే తరహాలో ఉదయం నుంచి మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో అక్కడికి వెళ్లిన ఆయన సోదా చేయగా, తోపుడు బండిలో ఏకంగా వివిధ కంపెనీలకు చెందిన 92 క్వార్టర్ బాటిళ్లు గుర్తించి నివ్వెరపోయారు. అంతే కాకుండా పక్కనే ఉన్న గుడిసెలో పలువురు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించి డయల్ 100 (Dial 100), గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. మద్యం విక్రయిస్తున్న మహిళతో పాటు మద్యం బాటిళ్లను పోలీసులకు అప్పగించారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మహిళపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపారు. గత కొన్ని నెలలుగా ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు పేర్కొన్నారు.చదవండి: ఆ అవయవాన్ని పునః సృష్టించారు..! -
కుట్ర బెడిసికొట్టింది
-
సీఐడీ కుట్ర విఫలం.. ఇక సిట్ కుతంత్రం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగ వేధింపులు రోజు రోజుకూ వెర్రి తలలు వేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా నిర్వహించిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానంపై అవాస్తవ ఆరోపణలతో, అక్రమ కేసులతో వేధించేందుకు అడ్డదారులు తొక్కుతోంది. ఈ వ్యవహారంపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ అక్రమ కేసుతో పన్నిన పన్నాగం బెడిసి కొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో అవినీతిపై ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయింది. దాంతో బాబు ప్రభుత్వం కొత్త కుట్రకు తెరతీసింది. తాము చెప్పింది చెప్పినట్టు చేసే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. తెర వెనుక ఉంటూ పోలీసు వ్యవస్థను నడిపిస్తున్న రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ద్వారా ఈ కుట్రను అమలు చేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. కాగా సిట్‌కు నేతృత్వం వహించనున్న రాజశేఖర్ బాబుపైనే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉండటం గమనార్హం.కొండను తవ్వి.. ఎలుకను కూడా పట్టలేని సీఐడీవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అవాస్తవ ఆరోపణలతో సీఐడీ అక్రమ కేసు కుట్ర బెడిసికొట్టింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవహారంపై సీఐడీ ద్వారా కేసు నమోదు చేసింది. వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా అవాస్తవ ఆధారాలను సృష్టించాలని, అక్రమ కేసులు బిగుసుకునేలా చేయాలని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. అక్రమ కేసుల బనాయింపులో తాము చెప్పిన లక్ష్యాలు సాధిస్తే ఆయనకు డీజీపీ పోస్టు ఇస్తామని కూడా ప్రలోభ పెట్టింది. ఈ నేపథ్యంలోనే సీఐడీ ఆరు నెలలుగా చేయని హడావుడి లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డితోసహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వాసుదేవరెడ్డిని పలుసార్లు విచారణ పేరిట వేధించారు. ఆయన్ను అక్రమంగా రోజుల తరబడి నిర్బంధించి తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారు. తాము చెప్పినట్టు చేస్తే ఢిల్లీలో కీలక పోస్టింగు ఇస్తామని, లేకపోతే అంతు చూస్తామన్న హెచ్చరికలతో సీఐడీ అధికారులు బరితెగించారు. డిస్టిలరీల్లో తనిఖీల పేరిట హడావుడి చేశారు. ఇంత చేసినప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో అక్రమాలపై ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించ లేకపోయారు. అవాస్తవ ఆధారాలతో కనికట్టు చేసేందుకు చేసిన యత్నాలు ఫలించ లేదు.సీఐడీ చీఫ్‌పై చినబాబు ఆగ్రహం రెడ్‌బుక్ రాజ్యాంగ వేధింపుల కేసులను తాము చెప్పినట్టు చేయడం లేదని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్పై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారు. చినబాబే అందరి ముందు ఆయనపై పరుష పద జాలంతో విరుచుకు పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకానొక దశలో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ను బదిలీ చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. కుట్రకు పదునుపెట్టేందుకే సిట్‌మద్యం అక్రమ కేసు పేరిట వైఎస్సార్సీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్తకుట్రకు తెరతీసింది. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యాన్నార్ విఫలమయ్యారని భావించిన ప్రభుత్వ పెద్దలు తమ అస్మదీయ అధికారి రాజశేఖర్ బాబును తెరపైకి తెచ్చారు. ఆయన నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి సిట్ వంటి ప్రత్యేక దర్యాప్తు బృందానికి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారి నేతృత్వం వహిస్తారు. అంటే డీజీపీ, సీఐడీ, ఏసీబీ తదితర విభాగాల్లోని ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. కానీ జిల్లా పోలీసు యంత్రాంగాల బాధ్యతలు నిర్వర్తించే పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు సిట్ బాధ్యతలు అప్పగించరు. ఎందుకంటే వారికి వారి జిల్లా శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యతలు చాలా ముఖ్యం. అయితే అందుకు విరుద్ధంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా ఉన్న రాజశేఖర్‌బాబును సిట్ చీఫ్‌గా నియమించడం గమనార్హం. అంటే తాము చెప్పినట్టు చేసే అధికారి, ఎంతటి అక్రమ కేసునైనా పెట్టి వేధించే అధికారికే బాధ్యతలు అప్పగించాలన్నదే ప్రభుత్వ పెద్దల ఉద్దేశమని స్పష్టమవుతోంది. రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ సిట్ తెరవెనుక పాత్ర పోషించనున్నారు. ఆయన చెప్పినట్టుగా రాజశేఖర్‌బాబు దర్యాప్తు పేరిట వేధింపులకు పాల్పడుతారన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలోనే అసలు రాజశేఖర్‌బాబు ట్రాక్ రికార్డు చర్చనీయాంశంగా మారింది. ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న విషయాన్ని పోలీసు వర్గాలే ప్రస్తావిస్తున్నాయి. మద్యం దందాతోపాటు పలు వ్యవహారాల్లో ఆయన అవినీతి బాగోతాన్ని కేస్ స్టడీలతోసహా ఉటంకిస్తున్నాయి. అసలు మద్యం వ్యవహారంపై సిట్ సంగతి తర్వాత.. అసలు సిట్‌కు నేతృత్వం వహిస్తున్న పోలీస్ అధికారుల అవినీతి బాగోతం మరోసారి బట్టబయలవుతోందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. సిట్ సభ్యులు వీరే.. సిట్ చీఫ్: ఎస్వీ రాజశేఖర బాబు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్సభ్యులు: ఎల్. సుబ్బారాయుడు, ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్ ఎస్పీ (చంద్రబాబుకు వీర విధేయ అధికారి. అందుకే తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చి తిరుపతి ఎస్పీగా నియమించారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో ప్రభుత్వ వైఫల్యం.. భక్తుల తొక్కిసలాట.. ఆరుగురు భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు. అయినా సరే ప్రభుత్వం సస్పెండ్ చేయకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగు ఇచ్చింది. ప్రస్తుతం సిట్‌లో సభ్యునిగా నియమించింది.)– కొల్లి శ్రీనివాస్, అదనపు ఎస్పీ, విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ విభాగం– ఆర్.శ్రీహరి బాబు, అదనపు ఎస్పీ, సీఐడీ– పి.శ్రీనివాస్, డీఎస్పీ, డోన్– కె.శివాజీ, సీఐ– సీహెచ్.నాగ శ్రీనివాస్, సీఐ -
అబద్ధపు వాంగ్మూలాలకు ఒత్తిళ్లు
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు సర్కారు అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ కీలక నేతలను వేధించే కుట్రలను తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా సీఐడీ వ్యవస్థను దుర్వినియోగం చేయడంతోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను రాజ్యాంగేతర శక్తిలా వాడుకుంటోంది. అక్రమంగా నమోదు చేసిన మద్యం కేసులో అధికారులపై బెదిరింపులకు పాల్పడుతోంది. రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డితోపాటు సంస్థలో గతంలో పని చేసిన సత్యప్రసాద్ నుంచి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు బరి తెగిస్తోంది. వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వారిని వేధిస్తోంది. అబద్ధపు వాంగ్మూలాలు తీసుకోండి..అక్రమ కేసులు బనాయించండి త్వరలోనే కొందరు కీలక నేతలను అరెస్ట్ చేస్తామని మంత్రి నారా లోకేశ్ ఇటీవల టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం వెనుక పక్కా కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయనేమీ ముఖ్యమంత్రి కాదు.. హోంమంత్రి కూడా కాదు. లోకేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మాత్రమే. పోలీసు శాఖ, సీఐడీ విభాగం, ఇతర దర్యాప్తు సంస్థలు ఆయన అధికారిక పరిధిలోకి రావు. అలాంటప్పుడు కొందరు వైఎస్సార్సీపీ నేతలను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన ఎలా ప్రకటించారన్నది కీలకంగా మారింది. అక్రమ కేసులు నమోదు చేసి వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేయాలని లోకేశ్ పోలీసు శాఖపై ఒత్తిడి తెస్తున్నారన్నది దీనిద్వారా స్పష్టమవుతోంది. తాము అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా వైఎస్సార్సీపీ కీలక నేతలను అక్రమ కేసుల్లో ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసు శాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఏసీబీ అదనపు డీజీ అతుల్ సింగ్ తదితరులపై లోకేశ్ చిందులు తొక్కారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ తరువాతే అక్రమ కేసుల కుట్రను సీఐడీ వేగవంతం చేసింది. సోషల్ మీడియా కార్యకర్తలపై వందల సంఖ్యలో అక్రమ కేసులు నమోదు చేసి తీవ్ర వేధింపులకు పాల్పడి అరాచకం సృష్టించింది. ఈ క్రమంలో నారా లోకేశ్ మరోసారి వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టుల గురించి సీఐడీ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డిలతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు సీఐడీకి స్పష్టం చేశారని తెలుస్తోంది. ఆ బాధ్యతను సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్తోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌కు అప్పగించినట్టు సమాచారం.నెలాఖరుకల్లా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాల్సిందే...ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్ వేధింపుల కుట్రను తీవ్రతరం చేశారు. మద్యం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి పాత్ర ఉందని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈమేరకు బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేరెడ్డి, ఆ సంస్థ మాజీ ఉద్యోగి సత్యప్రసాద్‌లను తీవ్రంగా వేధిస్తున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలను 164 సీఆర్పీసీ కింద ఈ నెలాఖరు కల్లా నమోదు చేయాల్సిందేనని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అల్టిమేటం జారీ చేశారు. అలా చేస్తే ఢిల్లీలో కీలక పోస్టింగు ఇస్తామని లేదంటే ఇప్పటికే వాసుదేవరెడ్డిపై నాలుగు అక్రమ కేసులు నమోదు చేశామని..ఇక ముందు మరిన్ని బనాయిస్తామని బెదిరిస్తున్నారు. అక్రమ కేసు నమోదు చేసి కనీసం రెండేళ్లపాటు జైలులో ఉంచుతామని ఘట్టమనేని శ్రీనివాస్ బెదిరించడం ప్రభుత్వ కుట్రలకు తార్కాణం. నెలాఖరునాటికి వారిద్దరితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించడమే లక్ష్యంగా సీఐడీ అధికారులు, ఘట్టమనేని శ్రీనివాస్ వేధింపులను తీవ్రతరం చేశారు. దీని వెనుక టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందన్నది స్పష్టం. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్‌తోపాటు యావత్ పోలీసు, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తమను బెదిరిస్తున్న తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ సిద్ధమవుతున్నారని సమాచారం. -
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో అపచారం
-
తెలంగాణలో సంక్రాంతి తర్వాత మద్యం ధరలు పెంచనున్న ప్రభుత్వం
-
తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్‌కు బీర్ల సప్లై నిలిపివేత
-
మందేసి చిందేసిన బాపట్ల ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ పీకలదాకా మద్యం తాగి చిందేశారు. కైపులో తీన్మార్ డాన్స్‌లు చేస్తూ, పార్టీ ఇచి్చన బీజేపీ నేతకు లిప్‌కిస్‌లు ఇచ్చి మరీ ఊగిపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 10న పాండురంగాపురం యాగంటి రిసార్ట్‌లో మందు పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సతీష్ అనుచరులు హాజరయ్యారు. అందరూ మద్యం తాగి తందనాలాడారు.బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సైతం ఆ పారీ్టకి హాజరయ్యారు. మద్యం మత్తులో అన్నం సతీష్ ప్రభాకర్ భీమ్లానాయక్ పాట పెట్టించుకుని డాన్స్ చేశారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సైతం సతీష్‌తో కలిసి బెల్లీడాన్స్, తీన్మార్ స్టెప్పులు వేశారు. అంతటితో ఆగకుండా సతీష్ చేతిలోని మద్యం గ్లాసు అందుకుని గటగటా తాగేశారు. ఆ తరువాత సతీష్ బుగ్గలు నిమురుతూ ముద్దులతో ముంచెత్తారు.ఎమ్మెల్యే విన్యాసాలను చూసిన అక్కడి వారు ఆయనకు కైపెక్కిందని గుసగుసలాడుకోగా.. వీడియో చూసిన జనం తాగితే తాగారు గానీ... ఎమ్మెల్యేగా ఉండి బుగ్గలు నిమరడాలు, ముద్దులు పెట్టడాలు ఏమిటంటూ చీదరించుకుంటున్నారు. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ కైపుగోల సోషల్ మీడియాల్ యమ ట్రెండింగ్‌గా మారింది. -
తప్పుడు వాంగ్మూలం ఇవ్వకుంటే ఇరికిస్తాం..!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నేతలను అక్రమ కేసులతో వేధించేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరింత బరి తెగిస్తోంది! అందుకోసం సీఐడీ విభాగాన్ని టీడీపీ అనుబంధ సంస్థగా మార్చే పన్నాగానికి పదును పెట్టింది! వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పీవీ మిథున్‌రెడ్డిపై మద్యం అక్రమ కేసులను బనాయించేందుకు కుతంత్రం పన్నుతోంది.ప్రభుత్వ ‘ముఖ్య’ నేత ఆదేశాలతో స్వయంగా సీఐడీ ఉన్నతాధికారి తన వృత్తి ధర్మానికి విరుద్ధంగా అధికారిక దాదాగిరీకి తెగబడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ క్రమంలో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో వేధింపులకు గురి చేస్తుండటం ప్రభుత్వ కుట్రకు తార్కాణం.సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పేర్లు చెబుతావా... లేదా?రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెట్టిన మొదటి అక్రమ కేసు మద్యం కేసే! జూన్ 12న టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా... వైఎస్సార్సీపీ హయాంలో బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం అక్రమాలకు పాల్పడ్డారంటూ జూన్ 24న సీఐడీ అక్రమ కేసు నమోదు చేసింది. అప్పటి బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని నిందితుడిగా చేర్చగా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పొందారు.అయితే ఆయనపై మరిన్ని అక్రమ కేసులు పెట్టేందుకు సీఐడీ ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో సీఐడీ ఉన్నతాధికారి ఒకరు వాసుదేవరెడ్డికి ఫోన్ చేశారు. తన కింది స్థాయి అధికారి ఫోన్ ద్వారా ఆయనకు కాల్ చేసి బెదిరింపులకు దిగారు. ‘మీకు ఓ కేసులో బెయిల్ వస్తే... మరో కేసు బనాయించి మరీ అరెస్ట్ చేస్తాం...! మీ సంగతి తేలుస్తాం..!’ అని బెదిరించారు. అనంతరం అసలు విషయాన్ని చెప్పేశారు! ‘మీరు ఈ కేసులో అప్రూవర్‌గా మారిపోవాలి.మద్యం వ్యవహారం అంతా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి చేశారని వాంగ్మూలం ఇవ్వాలి. వాళ్లిద్దరూ చెప్పినట్టే చేశానని 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలంలో పేర్కొనాలి..’ అని ఆదేశించారు. అలా కాదంటే లెక్కలేనన్ని కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తామన్నారు. వాస్తవాలతో పని లేదు.. చెప్పినట్లు వాంగ్మూలం ఇవ్వాలి!సీఐడీ ఉన్నతాధికారి వేధింపులతో వాసుదేవరెడ్డి ఓ వాంగ్మూలాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చారు. అయితే పారదర్శకంగా వాస్తవ విషయాలను ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పేర్లను అందులో ప్రస్తావించ లేదు. దాంతో సీఐడీ ఉన్నతాధికారి తీవ్ర ఆగ్రహంతో చిందులు తొక్కారు. ‘వాస్తవాలు ఎవరు అడిగారు...? నేను చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలి. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డే అంతా చేశారు...! వారిద్దరూ అక్రమాలకు పాల్పడ్డారని వాంగ్మూలం ఇవ్వాలి.అది వాస్తవమా... అవాస్తవమా అన్నది నాకు అనవసరం. నేను చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలి. లేకపోతే మరిన్ని కేసులు పెట్టి జైలుకు పంపుతాం’ అని బెదిరించారు. అంతేకాదు... వాసుదేవరెడ్డి సతీమణి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ‘నేను చెప్పినట్టు తప్పుడు వాంగ్మూలం ఇస్తే... ఆమె చికిత్స వ్యవహారాలను ప్రశాంతంగా పర్యవేక్షించుకోవచ్చు. లేకపోతే ఇబ్బందులు పడతావ్’ అని బెదిరించడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది.డీజీపీ పోస్టు ఎర.. అందుకే అంత బరితెగింపా...!వైఎస్సార్సీపీ ఎంపీలను అక్రమ కేసులతో వేధించేందుకు ‘ముఖ్య’ నేత బరితెగించి వ్యవహరిస్తున్నారు. తాను చెప్పినట్టుగా వారిపై అక్రమ కేసులు బనాయిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ఎర వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే డీజీ స్థాయి అధికారులు తదుపరి డీజీపీ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. అయితే అంతకంటే ఒక మెట్టు తక్కువ స్థాయిలో ఉన్న సీఐడీ ఉన్నతాధికారికి డీజీపీ పోస్టు ఆశ చూపించడం గమనార్హం.ప్రస్తుత డీజీపీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. ఆ పోస్టును ఆశిస్తున్న హరీశ్ కుమార్ గుప్తా కూడా వచ్చే ఏడాది ఆగస్టులో రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో తను చెప్పినట్టుగా ఆ ఇద్దరు విపక్ష ఎంపీలను అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ‘ముఖ్య’ నేత ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరచడమే లక్ష్యంగా ఆ ఉన్నతాధికారి బరితెగించి అక్రమాలు, వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
YSRCP ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం చేశారు
-
తాగు.. ఊగు.. జోగు... బాబు మార్కు ప్రగతి!
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విచ్చలవిడి వ్యాపారం సమాజానికి చేటు తెచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రం మొత్తమ్మీద ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ బెల్ట్‌షాపులు కనిపిస్తున్నాయని సమాచారం. ఇవి చాలవన్నట్టు వ్యాపారులు మద్యం డోర్ డెలివరీ కూడా మొదలుపెట్టారు. విజయవాడ పటమట ప్రాంతంలో ఒక షాపు యజమాని ఈ మేరకు కరపత్రాలు కూడా పంచారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంగతి ఏమోకానీ మద్యం ప్రోగ్రెస్ మాత్రం బాగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం ప్రభుత్వం డబ్బులు దండుకోవడానికి ఉపయోగపడుతూంటే.. సామాన్యుడి జేబు, ఒళ్లూ రెండూ హూనమైపోతున్నాయి. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త మద్యం విధానం ప్రజలకు మేలు చేసేదా? కీడు చేసేదా అన్న చర్చ సాగుతోంది. ప్రజలు తమకు అధికారమిస్తే మద్యం సరఫరా చేస్తామన్న ఎన్నికల హామీ ఇచ్చిన పార్టీ దేశం మొత్తమ్మీద ఒక్క తెలుగుదేశం మాత్రమే కావచ్చు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వ మద్యం విధానాన్ని తీవ్రంగా తప్పు పడుతూండేవారు. ధరలు ఎక్కువగా ఉన్నాయని, నాణ్యత లేని బ్రాండ్ల అమ్మకాలు జరుగుతున్నాయని అనేవారు. కూలీనాలీ చేసుకునే సామాన్యుడు సాయంకాలం ఒక పెగ్గు మందేసుకుంటామంటే ధరలు ఆకాశాన్ని అంటేలా చేశారని ధ్వజమెత్తేవారు. ఈ మాటలు, విమర్శలు అన్నీ ఒకప్పుడు మద్య నిషేధం కోసం ఉద్యమించిన తెలుగుదేశం పార్టీ నుంచి వస్తూండటం ఒక వైచిత్రి. ఏదైతేనేం.. బాబు గారి మాటలకు మందుబాబులు పడిపోయారు. ఎన్నికల్లో సుమారు పాతిక లక్షల మంది మందురాయుళ్లు టీడీపీ కూటమివైపు మొగ్గారని ఒక అంచనా. సామాన్యుడిని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసే, సామాజికంగానూ అనేక రకాల సమస్యలు తెచ్చిపెట్టే మద్యం జనానికి దూరంగా ఉంచాలని గత ప్రభుత్వం ఆలోచించింది. ఇందుకు తగ్గట్టుగానే జనావాసాలకు దూరంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ దుకాణాల వారు లాభాపేక్షతో పేదలను పిండుకుంటారన్న ఆలోచనతో సొంతంగా దుకాణాలు నడిపింది. నిర్ణీత వేళల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉంచేలా చేయడంతోపాటు ధరలు పెంచింది. బెల్ట్ షాపులు దాదాపుగా లేకుండా చేసింది. సామాజిక హితం కోసం చేపట్టిన ఈ చర్యలేవీ ఎల్లోమీడియాకు నచ్చలేదు. ఎప్పటికప్పుడు మద్యం విధానాన్ని విమర్శిస్తూ కథనాలు వండి వార్చేది. కానీ బెల్ట్‌షాపులున్నట్లు మాత్రం ప్రచారం చేయలేకపోయింది. ఈ వ్యతిరేక ప్రచారం ప్రభావంలో పడ్డ జనాలు జగన్‌పై వ్యతిరేకత పెంచుకుంటే.. చంద్రబాబు, పవన్, లోకేశ్ వంటివారు దానికి ఆజ్యం పోశారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని ప్రకటించారు. అయితే.. అధికారం వచ్చిన వెంటనే కూటమి నేతల వైఖరి పూర్తిగా మారిపోయింది. మద్యం ప్రియులకు ఇచ్చిన హామీలు గంగలో కలిసిపోయాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ పరమయ్యాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.రెండు లక్షలు వసూలు చేసి, లాటరీ వేసి మరీ కేటాయింపులు జరిపారు. ఈ లాటరీల ద్వారానే ప్రభుత్వానికి రూ.రెండు వేల కోట్లు వచ్చింది. కొంతమంది దుకాణాల కోసం ఎగబడి.. యాభై నుంచి వంద వరకూ దరఖాస్తులు వేసినట్లు సమాచారం. ఇలా రూ.కోటి వరకూ ఖర్చు పెట్టినా వారికి ఒకట్రెండు షాపులూ దక్కలేదు. లాటరీలో దుకాణం కేటాయింపు జరిగిన తరువాత లైసెన్స్ ఫీజు కింద కూటమి ప్రభుత్వం మళ్లీ బాదుడు మొదలుపెట్టింది. దీనికింద రూ.60 లక్షల వరకూ చెల్లించాల్సి వచ్చింది. ఇవి చాలవన్నట్లు కూటమి ఎమ్మెల్యేలకు షాపులలో వాటా లేదంటే ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. విశేషం ఏమిటంటే టీడీపీ వారే ఎక్కువ దుకాణాలు పొందినా సొంతపార్టీ వారికే లంచాలిచ్చుకోవాల్సిన పరిస్థితి. పోనీ ఇక్కడితో ఆగిందా? లేదు. ప్రభుత్వం ఎకాఎకిన మార్జిన్‌ను 20 నుంచి పది శాతానికి తగ్గించింది. షాపుల ఏర్పాటు, నిర్వహణలు అదనం. వీటన్నింటి కారణంగా మద్యం దుకాణాల ద్వారా నష్టాలే ఎక్కువ అవుతున్నాయని ఇప్పుడు దుకాణదారులు లబోదిబోమంటున్నారు. ఇది ఒక కోణం. టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటైన లిక్కర్ సిండికేట్లు మందుబాబులను పిండేస్తున్న వైనం ఇంకోటి. రాష్ట్రం నలుమూలల ఈ సిండికేట్ విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు తెరిచేసింది. కొన్నిచోట్ల ఆయా గ్రామాల నేతలే కొందరు వేలం ద్వారా బెల్ట్‌షాపులు ఇచ్చేస్తున్నారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం డి.కొత్తూరు గ్రామంలో జరిగిన బహిరంగ వేలంలో ఒక బెల్ట్ షాపు రూ.లక్ష ధర పలికిందని తెలిసింది. వైసీపీ వారు, మద్యం వ్యతిరేకులు బెల్ట్ షాపులను వ్యతిరేకించినా, టీడీపీ నేతల ఆధ్వర్యంలో వేలం పాటలు యధేచ్చగా సాగినట్లు సోషల్ మీడియా వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. తణుకు వద్ద మద్యం సీసాలు సంతలో బల్ల మీద పెట్టుకుని తండ్రులు అమ్ముతుంటే వారి పిల్లలు అక్కడే కూర్చున్న వీడియో తీవ్ర కలకలం రేపింది. పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర హోం శాఖ మంత్రి మాత్రం బెల్ట్‌షాపులు అస్సలు లేనేలేవని అంటున్నారు. ఇంకోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం ధరలు పెంచి అమ్మినా, బెల్ట్ షాపులు పెట్టినా రూ.5 లక్షల వరకూ జరిమానా అంటూ బెదరగొడుతున్నారు కానీ.. ఆచరణలో ఇది ఏమాత్రం అమలు కావడం లేదు. రిజిస్ట్రేషన్ ఫీజులు, లైసెన్స్ ఫీజులు, మామూళ్లు, దుకాణాల ఏర్పాటు, నిర్వహణ వంటి అనేక ఖర్చులు ఉండటంతో తాము నష్టాలను పూడ్చుకునేందుకు అధిక ధరలకు మద్యం అమ్మాల్సి వస్తోందని దుకాణందారులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రూ.99కే క్వార్టర్ మద్యం అందిస్తానని హామీ ఇచ్చినప్పటికీ వాస్తవానికి రూ.120 నుంచి రూ.130 వరకూ పెట్టాల్సి వస్తోందని మద్యం ప్రియులే చెబుతూండటం గమనార్హం. పైగా గత ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయని అదనంగా కొన్ని వచ్చి చేరాయని నాణ్యతలో ఏమీ తేడా లేదని వివరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని మందు తాగి మరీ చెబుతున్నారు.మద్యం అమ్మకాలు జరుగుతున్న తీరుపై ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తమవుతోంది. జనావాసాల మధ్య దుకాణాల ఏర్పాటును ప్రజలు పలుచోట్ల నిరసించారు. కానీ వారి గోడు పట్టించుకున్న వారు లేకపోయారు. గత ఏడాది మద్యం ద్వారా రూ.15 వేల కోట్ల ఆదాయం రాగా దాన్ని ఈ ఏడాది రూ.25 వేల కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం తన బడ్జెట్లోనే పేర్కొంది. మద్యం ధరలు తగ్గించామని ఒకవైపు చెబుతున్న ప్రభుత్వం ఆదాయం ఎలా పెరుగుతోందంటే మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. 201419 మధ్య కూడా చంద్రబాబు బెల్ట్ షాపులు రద్దు చేస్తున్నామని, చర్య తీసుకుంటామని పలుమార్లు చెప్పేవారు. కానీ 45 వేలకు పైగా బెల్ట్ షాపులు నడిచాయని ఒక అంచనా. అంతేకాదు. గోరుచుట్టపై రోకటిపోటు చందంగా ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి గుప్పుమంటోంది. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి తోటల పెంపకం విస్తారంగా సాగిపోతోంది. ఈ మధ్య జరిగిన పోలీసుల దాడిలో 15 ఎకరాలలో గంజాయి పెంచుతున్నట్లు గుర్తించారు. నగర ప్రాంతాలలో కూడా గంజాయి విక్రయాలు పెరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు కూటమి నేతలు చెప్పినదానికి, ఇప్పుడు జరుగుతున్నదానికి పూర్తిగా విరుద్దంగా పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారన్న ఆరోపణలు విరివిగా వినిపిస్తున్నాయి. ఏపీ సమాజం ఇదే కోరుకుంటోందా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కల్లకురిచ్చి కల్తీసారా కేసు.. మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడులో కల్లకురిచ్చి హుచ్ కల్తీసారా విషయంలో మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కల్లకురిచ్చి కల్తీసారా కేసు సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కల్తీ మద్యం వెనుక మాఫియా ఉందంటూ అన్నాడీఎంకే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం సేవించి దాదాపు 65 మంది చనిపోయారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ దారుణ ఘటన విషయంలో స్టాలిన్ సర్కార్‌ను ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో ప్రభుత్వం సీబీసీఐడీ (క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) చేత విచారణకు ఆదేశించింది. అయినప్పటికీ అసలు వాస్తవాలు బయటకు రాకపోవడంతో ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ డీ. కృష్ణకుమార్, జస్టిస్ పీబీ బాలాజీల ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలను ధర్మాసనం ఏకీభవించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. #BREAKING he Madras High Court has ordered the transfer of the investigation into the case concerning the poisoning incident in Karunapuram, Kallakkurichi district, which resulted in 66 fatalities, to the Central Bureau of Investigation (CBI). The ruling was delivered by… pic.twitter.com/e4CroLK1jH— Mahalingam Ponnusamy (@mahajournalist) November 20, 2024 -
భారీగా నగదు, బంగారం, మద్యం పట్టివేత
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్రమ డబ్బు రవాణాపై వివిధ శాఖల అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాయి. అందులో భాగంగా అక్టోబరు 20వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ముంబై, ఉప నగరాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ శాఖ, ఆదాయ పన్ను శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సంయుక్తంగా తనిఖీలు, నాకా బందీలు నిర్వహించారు. ఇందులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు, విదేశీ డాలర్లు, బంగారు, వెండి ఆభరణాలు, మద్యం పట్టుకున్నారు. అయితే ఈ సొత్తు ఎవరిది..? ఎవరికి అందజేయడానికి వెళుతున్నారనే సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. రూ.187 కోట్ల విలువైన నగదు స్వాధీనం ఎన్నికలు సమీపించడంతో వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి అక్రమంగా డబ్బు, మద్యం రవాణా కావడం పరిపాటిగా మారింది. నాకాబందీలు, తనిఖీలు నిర్వహించినప్పటికీ పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా డబ్బు, మద్యం రవాణా అవుతూనే ఉంది. అయినప్పటికీ పోలీసులు, వివిధ శాఖల అధికారులు డేగ కళ్లతో కాపుకాస్తూ కోట్లలో అక్రమ డబ్బు, డ్రగ్స్, మద్యాన్ని పట్టుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచి్చన తరువాత వివిధ శాఖల పోలీసులు, అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు ఏకంగా రూ.187.88 కోట్లు విలువచేసే సొత్తు హస్తగతం చేసుకున్నారు. ఇందులో రాష్ట్ర పోలీసు శాఖ ద్వారా రూ.75 కోట్లు, ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.60 కోట్లు, ఆదాయ పన్ను శాఖ ద్వారా రూ.11 కోట్లు, మిగతా ఎన్నికల అధికారుల ద్వారా పట్టుకున్న సొత్తు ఉంది. అలాగే అక్రమంగా మద్యం తరలిస్తున్న, విక్రయిస్తున్న వారిపై 2,637 కేసులు నమోదు చేశారు. అందుకు బాధ్యులైన 2,460 నిందితులపై చర్యలు తీసుకున్నారు.అలాగే రూ.9.61 కోట్లు విలువచేసే మద్యం నిల్వలను జప్తు చేశారు. జప్తు చేసిన మద్యంలో విదేశీ, దేశీ, నాటుసారా, తెల్లకల్లు ఉన్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు తాము ప్రయతిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అప్పర్ కమిషనర్ ప్రసాద్ సుర్వే అన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలను, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా మద్యం వినియోగించే అవకాశాలుంటాయి. దీంతో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు దాడులు, తనఖీలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రహస్య పార్టీలపై నిఘా.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పరితపిస్తున్నారు. అందుకు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. కార్యకర్తలు సహా ఓటర్లను సంతోష పెట్టేందుకు రహస్యంగా మద్యం పారీ్టలు ఇస్తున్నారు. అంతేగాకుండా ఇంటింటికి వెళ్లి మద్యం బాటిళ్లు, డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు పంచుతుంటారు. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఇలాంటి రహస్య పారీ్టలపై నిఘా వేస్తున్నారు. అందుకు 56 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న 164 మంది కార్యకర్తలను అదపపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణాకు చెక్ పేట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో 25 పరి్మనెంట్ చెక్ పోస్టులు, 26 తాత్కాలిక చెక్ పోçస్టులను ఏర్పాటు చేశారు. టోల్ నాకాల వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అహిల్యనగర్–పుణే జాతీయ రహదారిపై పార్నెర్ తాలూకా హద్దులో ఎన్నికల అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో ఓ వాహనంలో సుమారు రూ.25 కోట్లు విలువచేసే బంగారం పట్టుకున్నారు. అయితే కార్టన్ బాక్స్‌లో ప్యాకింగ్ చేసిన ఈ బంగారం ఎవరిచ్చారు..? ఎవరికిచ్చేందుకు తీసుకెళుతున్నారనే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. వాహనంలో డ్రైవర్, మరో ఇద్దరు వ్యక్తులున్నారు. అనుమానం వచ్చి వాహనాన్ని మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేయగా 45 కేజీల వెండి కడ్డీలు లభించాయి. దర్యాప్తు పూర్తయితే తప్ప పూర్తి వివరాలు బయటపడవని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో 160 చెరుకు క్రషింగ్ ఫ్యాక్టరీలు, 36 దేశీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు, 45 బీరు తయారుచేసే ఫ్యాక్టరీలు, 65 వైనరీ, 48 విదేశీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు అలాగే 216 నాటుసారా విక్రయించే షాపులు, 262 విదేశీ మద్యం విక్రయించే షాపులు, 1,734 వైన్ షాపులు, 4,155 దేశీ మద్యం విక్రయించే షాపులున్నాయి. దీంతో ఓటింగ్, కౌంటింగ్ తంతు పూర్తయ్యేంత వరకు హోల్‌సెల్, రిటైల్ మద్యం షాపులపై సీసీ టీవీ కెమరాల ద్వారా నిఘా వేయనున్నారు. ప్రభుత్వ వాహనాలనూ వదిలిపెట్టొద్దు.. ఎన్నికలకు ముందు విచ్చల విడిగా అక్రమంగా డబ్బు రవాణా జరుగుతుంది. అందుకు సొంత, అద్దె వాహనాలతోపాటు పోలీసు వ్యాన్లను కూడా వినియోగించే ప్రమాదం లేకపోలేదు. అధికార దురి్వనియోగానికి పాల్పడుతూ కొందరు నేతలు పోలీసు జీపులు, వ్యాన్లలో డబ్బు రవాణా చేసే ఆస్కారముంది. దీంతో రాష్ట్ర సరిహద్దుల్లో, నగరాలు, పట్టణాల్లో నాకాబందీలు, తనిఖీలు చేసే సమయంలో పోలీసు వాహనాలతోపాటు ప్రభుత్వ వాహనాలను కూడా తనిఖీ చేయకుండా వదిలిపెట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. -
చంద్రబాబు క్వాలిటీ మద్యమా మజాకా! చూస్తే షాకే!
-
పారిశ్రామిక మద్యంపై నియంత్రణ రాష్ట్రాలదే: సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: పారిశ్రామిక మద్యానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇండస్ట్రీయల్ ఆల్కహార్ తయారీ, అమ్మకాలను నియంత్రించే చట్టాలను చేసే అధికారం రాష్ట్రాలకు కూడా ఉంటుందని సుప్రీంకోర్టు బుధవరం తీర్పునిచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని తొలగించలేనని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలోని ఎనిమిది మంది సభ్యులు ఈ పిటిషన్‌కు మద్దతు తెలపగా.. జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం విభేదించారు. పారిశ్రామిక మద్యంపై శాసనాధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండాలని ఆమె వాదించారు. దీంతో 8:1 మెజార్టీతో సుప్రీం ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది.అయితే యూపీ స్టేట్ వర్సెస్ సింథటిక్స్ అండ్ కెమికల్స్ కేసులో పారిశ్రామిక మద్యపానాన్ని నియంత్రించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి మంజూరు చేస్తూ 1990లో ఇచ్చిన ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీం రద్దు చేసింది. సీజేఐ చంద్రచూడ్, మెజారిటీ అభిప్రాయాన్ని అందజేస్తూ.. ‘డినేచర్డ్ స్పిరిట్స్' అని పిలవబడే 'పారిశ్రామిక మద్యం'పై చట్టం చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని, ఈ అధికారాలను రాష్ట్రాల నుండి తొలగించలేమని స్పష్టం చేశారు. వారి అధికార పరిధిలో పారిశ్రామిక మద్యం ఉత్పత్తి, సరఫరాను నియంత్రించడానికి వీలుందని ఆయన పేర్కొన్నారు. -
ఇది మాఫియా సామ్రాజ్యం
రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుక, మద్యం, పేకాట క్లబ్‌ల మాఫియాలు విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయి. ఓ నియోజకవర్గంలో పరిశ్రమ ఉన్నా.. ఎవరైనా కొత్తగా స్థాపించాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరు ఏం చేయాలన్నా అడిగినంత ముడుపులు ముట్టజెప్పాల్సిందే. ఎమ్మెల్యే కింత.. ముఖ్యమంత్రికి ఇంత.. అనే రీతిలోదోచుకో పంచుకో తినుకో విధానంలో రాష్ట్రంలో మాఫియా పాలన సాగుతోంది. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఎక్కడా మచ్చుకైనా డీబీటీ కానరావడం లేదని... కన్పిస్తుందల్లా డీపీటీ (దోచుకో.. పంచుకో.. తినుకో) ఒక్కటేనని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతో పూర్తి స్థాయిలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అసమర్థ ప్రభుత్వాన్ని చంద్రబాబు నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏకంగా ఇన్ని నెలలపాటు ఓట్ ఆన్ అకౌంట్‌పై నడుస్తున్న ప్రభుత్వం బహుశా దేశంలోనే కాదు.. ప్రపంచంలోనూ మరెక్కడా ఉండదన్నారు. ఎన్నికలప్పుడు నాసిరకం లిక్కర్.. ధరలు ఎక్కువ అంటూ దుష్ప్రచారం సాగించిన చంద్రబాబు ఇప్పుడు ఓ పద్ధతి ప్రకారం మద్యం మాఫియాకు తెర లేపారని చెప్పారు. అప్పుడైనా.. ఇప్పుడైనా అవే డిస్టిలరీస్, లిక్కర్లో అవే స్పెసిఫికేషన్స్ అని గుర్తుచేశారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీస్ ఉంటే 14 కంపెనీలకు చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చారని, తాము అధికారంలో ఉండగా ఒక్క డిస్టిలరీకి కూడా కొత్తగా అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుక, మద్యం, పేకాట క్లబ్‌ల మాఫియాలు విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. ఓ నియోజకవర్గంలో పరిశ్రమ ఉన్నా.. ఎవరైనా కొత్తగా స్థాపించాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఎవరు ఏం చేయాలన్నా అడిగినంత ముడుపులు ముట్టజెప్పాల్సిందేనన్నారు. ఎమ్మెల్యే కింత.. ముఖ్యమంత్రికి ఇంత.. అనే రీతిలో దోచుకో.. పంచుకో.. తినుకో.. విధానంలో మాఫియా పాలన రాష్ట్రంలో సాగుతోందన్నారు. ఎన్నికల హామీల అమలు.. ప్రభుత్వ అవినీతిపై ఎవరూ నిలదీయకుండా.. ప్రశ్నించే స్వరం వినిపించకూడదనే లక్ష్యంతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్‌పై పెట్టిన కేసే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..» చంద్రబాబు మోడస్ ఆపరండా (ఓ పద్ధతి ప్రకారం అనుసరించే వ్యూహం) గమనిస్తే ఎన్నికలప్పుడు ఒక అబద్ధానికి రెక్కలు కడతారు. ప్రజల ఆశలతో చెలగాటాలాడుతూ అబద్ధాలు చెబుతారు. వాళ్లకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మీడియా సామ్రాజ్యంతో కలిసి గోబెల్స్ ప్రచారం చేస్తారు. » ఆయన ఏ స్థాయిలో అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారంటే.. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇంటింటికి పంపిస్తారు. వలంటీర్లకు రూ.10 వేలు జీతం అని మోసగించడంతో అది మొదలవుతుంది. మీకు రూ.పది వేలు రావాలంటే మా ప్రభుత్వం రావాలి.. మా ప్రభుత్వం రావాలంటే మేం చెప్పిన అబద్ధపు హామీలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలి అని వలంటీర్లకు చెబుతారు.» ఏ ఇంటికి వెళ్లినా సరే చిన్నపిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు! సంతోషమా..? అని అడుగుతారు. వాళ్ల అమ్మలు కనిపిస్తే నీకు రూ.18 వేలు.. సంతోషమా? అంటారు. చిన్నమ్మలు తారసపడితే నీకు రూ.18 వేలు.. పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు... ఉద్యోగం కోసం వెతుక్కుంటూ 20 ఏళ్ల పిల్లాడు బయటకొస్తే నీకు రూ.36 వేలు... కండువా వేసుకొని రైతు బయటకొస్తే నీకు రూ.20 వేలు.. సంతోషమా? అని అడుగుతారు. ఎవరినైనా సరే ఇదే మాదిరిగా మాటలు చెప్పి, ప్రజల ఆశలతో చెలగాటమాడి అధికారంలోకి రావడమే మోడస్ ఆపరండాగా మార్చుకున్నారు.» తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం క్లిçష్ట పరిస్థితుల్లో ఉంది. చేయాలన్నా నేను చేయలేకపోతున్నా..! అంటూ కొత్త మోడస్ ఆపరండా తెరపైకి తెస్తారు. అంతటితో ఆగిపోతుందా.. అంటే ఆగిపోదు. ఎన్నికల హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తారేమో? ఎవరైనా నిలదీస్తారేమో? అనే భయంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రశ్నించే స్వరం వినిపించకుండా చేయాలని ఆరాట పడుతున్నారు. వీటికి తోడు మార్పులు తీసుకొస్తున్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో స్కామ్‌లకు తెర తీస్తున్నారు. వీళ్ల మోడస్ ఆపరండా ఏమిటో ఈ ఐదు నెలలుగా సాగుతున్న ఇసుక, మద్యం మాఫియా పాలనే నిదర్శనం. -
బెడిసికొట్టిన టీడీపీ ఫేక్ ట్రిక్ చంద్రబాబును అరెస్ట్ చేసి విచారించాలి
-
రాబందుల రాజ్యంలో అరాచకాలపై బాబును చీల్చి చెండాడిన జగన్
-
ప్రతిపక్షంగానే కాదు.. ప్రజాపక్షంగా పోరుకు సిద్ధం బలంగా ఎదుగుదాం
-
అధికారంలోకి వచ్చాక బాబు మార్క్ అరాచకం
-
ఈడీ అరెస్ట్ నుండి బాబు పీఏ శ్రీనివాస్ తప్పించుకోలేరు..
-
ప్రతిపక్షంగానే కాదు.. ప్రజాపక్షంగా పోరుకు సిద్ధం బలంగా ఎదుగుదాం..
-
సొంత ఆదాయం పెంచుకుని.. ప్రభుత్వం ఆదాయం తగ్గిస్తున్నాడు
-
99 రూపాయలకే క్వార్టర్ పై వైఎస్ జగన్ సెటైర్లు
-
బాబుకు వణుకు పుట్టింది.
-
రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందబ్బా.. చంద్రబాబును ఇమిటేట్ చేసిన జగన్
-
జగన్ నోటా చంద్రబాబు మాటలు ఇది మాములు ర్యాగింగ్ కాదు
-
మద్యంపై కూటమి సర్కారు పన్నుల మోత
-
ధర్మవరంలో రెచ్చిపోయిన కూటమి మద్యం మాఫియా
-
AP: మందుబాబులకు ప్రభుత్వం షాక్ !
సాక్షి,విజయవాడ: మందుబాబులకు ఏపీ కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. మద్యం అమ్మకాలపై పన్నులు కాకుండా అదనంగా 2 శాతం సెస్ విధిస్తూ ఎక్సైజ్ శాఖ మంగళవారం(అక్టోబర్ 15) ఉత్తర్వులిచ్చింది.ఇప్పటికే కొత్త మద్యం పాలసీలో భాగంగా అన్ని రకాల మద్యంపై రౌండప్ చార్జీల పేరుతో బాదిన ప్రభుత్వం.. తాజాగా ఇప్పుడు డ్రగ్స్ నియంత్రణ సెస్ పేరుతో 2 శాతం అదనపు బాదుడుకు నిర్ణయించింది. ఈ బాదుడును తక్షణమే అమలులోకి తీసుకువస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేసింది. కాగా, కొత్త మద్యం పాలసీలో భాగంగా వైన్‌షాపులను ప్రైవేటు రిటైలర్లకు ఏపీ ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. ఇందుకోసం వారి నుంచి షాపులకు దరఖాస్తులను ఆహ్వానించి లాటరీ పద్ధతిన షాపులు కేటాయించింది.ఈ విధానం ద్వారా రానున్న ఐదేళ్లలో ఓ పక్క మద్యాన్ని ఏరులుగా పారిస్తూ ప్రజల నుంచి అటు ప్రభుత్వం ఇటు పచ్చ తమ్ముళ్లు అందినకాడికి దోచుకోనున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.ఇదీ చదవండి: తాడేపల్లిలో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు -
అధికారులు జాగ్రత్త .. జమిలి ఎన్నికలు వస్తాయ్ ..
-
లిక్కర్ పాలసీ గొప్పదే అయితే.. బెదిరింపులు ఎందుకు ?
-
అన్ని దుకాణాలు మావే!
-
బాలకృష్ణ ఇలాకాలో మద్యం షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్
-
కూటమి నేతల బెదిరింపులు
-
టెండర్ గెలిస్తే.. కమీషన్ లేదా కరెన్సీ టీడీపీ బెదిరింపులు
-
కూటమి నేతల బెదిరింపులు
-
కిడ్నపులు, బెదిరింపులతో టీడీపీ నేతలు మద్యం షాపుల దందా
-
టీడీపీ లిక్కర్ మాఫియా దెబ్బకు ప్రభుత్వానికి 2000 కోట్లు నష్టం
-
నేను డబ్బులిస్తా..టెండర్లు వెయ్యండి ప్రజలకు ఫుల్లుగా తాగించండి
-
ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి,అమరావతి: ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తులకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఈ నెల11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఈ నెల 14వ తేదీన అధికారులు మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే టీడీపీ నేతలు,లిక్కర్ సిండికేట్ల కోసం ప్రభుత్వం గడువు పెంచినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు అవుతున్నాయి. వాటాలు ఇస్తునే మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తామని లేదంటే అంతు చూస్తామంటూ సిండికేట్ల హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో వ్యాపారులు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసే సాహసం చేయడం లేదు.రాష్ట్రంలో పలు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వారు లేకపోవడం, అవి ఖాళీ ఉన్నాయి. ఈ తరుణంలో ఖజానా నింపుకునేందుకు మద్యం దుకాణాల దరఖాస్తులకు ప్రభుత్వం గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. -
లిక్కర్ సిండికేట్‌కి ఏపీ ప్రభుత్వం దాసోహం
సాక్షి,అమరావతి : లిక్కర్ సిండేకేట్కి ఏపీ ప్రభుత్వం దాసోహమైంది. సిండికేట్ జేబులు నింపేలా నిర్ణయం తీసుకుంది. చరిత్రలో ఎన్నడూ లేనంత రీటైల్ మార్జిన్ చంద్రబాబు ప్రభుత్వం పెంచింది. 2019 వరకు 10 శాతం ఉన్న రిటైలర్ మార్జిన్‌ను.. తాజాగా 20 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఐఎంఎఫ్ లిక్కర్, బీర్, ఫారెన్ లిక్కర్, వైన్లపై 20 శాతం రిటైల్ మార్జిన్ ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది.ప్రైవేట్ వ్యాపారులకు మేలు చేసేలా.. సిండికేట్ జేబులు నింపేలా సర్కార్ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతున్నది . -
మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు
పట్నా: గత కొంతకాలంగా బీహార్‌లో మద్యం అక్రమ రవాణా కేసులు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా మద్యం మాఫియా పోలీసులపై దాడికి దిగింది. బెగుసరాయ్ జిల్లాలోని లాఖో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం మద్యం మాఫియా దాడిలో లాఖో పోలీస్ స్టేషన్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ), సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)తో సహా ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. లాఖో పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అభిషేక్ కుమార్ నేతృత్వంలో పోలీసుల బృందం మద్యం స్థావరాలపై దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. బహద్పూర్ ముషారి తోలా ప్రాంతానికి వెళ్లి, దేశీ మద్యం తయారీలో నిమగ్నమైన కొంతమంది స్థానికుల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో మద్యం మాఫియా పోలీసు బృందంపై రాళ్లు రువ్వింది.ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారని తెలుసుకున్న వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపు చేశారు. గాయపడిన పోలీసులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: రూ.లక్షన్నర కోట్ల ‘మూసీ’కి లక్షల జీవితాలు బలి -
అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చేనా..?
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం (సెప్టెంబర్10) విచారించనుంది. బెయిల్ పిటిషన్‌తో పాటు అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.సుప్రీం కోర్టు విచారణలో భాగంగా కేజ్రీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించనున్నారు. ఇది చదవండి: బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సం -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఖరీదైన 415 మద్యం బాటిళ్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ : గోవా నుంచి అక్రమంగా తీసుకొస్తున్న ఖరీదైన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను ఎక్సైజ్ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. గోవా నుంచి మూడు విమానాల్లో మద్యం వస్తుందనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ వీబీ.కమలాసన్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ అదేశాలతో ఏఈఎస్ జీవన్‌కిరణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. ఎస్టీఎఫ్ సీఐలు సుబాష్ చందర్రావు, చంద్రశేఖర్, డీటీఎఫ్ సీఐ ప్రవీణ్, శంషాబాద్ ఎక్సైజ్ సీఐ దేవేందర్‌రావుతోపాటు ఎస్సైలు, సిబ్బంది కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుధవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఎయిర్పోర్ట్ అధికారుల సహకారంతో మద్యాన్ని స్వా«దీనం చేసుకున్నారు. 415 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ. 12 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, సరూర్‌నగర్ ప్రాంతాలకు చెందిన ఆర్ఎంపీలు గోవాలోని ఓ సదస్సుకు వెళ్లారు. వీరంతా తిరుగు ప్రయాణంలో మద్యం తీసుకొస్తున్నట్టు సమాచారం అందింది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చిన నేరం కింద ఎక్సైజ్ ఈఏఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో శంషాబాద్ సీఐ దేవేందర్‌రావు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ‘చంఢీగడ్’మద్యం సీజ్చండీగఢ్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా చేరిన మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ముషీరాబాద్ ఎక్సైజ్ సీఐ రామకృష్ణ ఆర్టీసీ క్రాస్‌రోడ్డు మెట్రోసేషన్ సమీపంలో రూ.3.85 లక్షల విలువ చేసే 72 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
మద్యం పాలసీ కేసు: విజయ్ నాయర్‌కు బెయిల్
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా సహాయకుడు విజయ్ నాయర్‌కు ఊరట దక్కింది. సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా ఇన్ ఛార్జ్‌గా ఉన్న విజయ్ నాయర్ మద్యం పాలసీ కేసులో 2022లో సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ కేసులో విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్‌పై సోమవారం (సెప్టెంబర్2) విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో ఇంతకుముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో బెయిల్ పొందారు.ఏంటి ఈ మద్యం పాలసీ కేసు?ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది.అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో.. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్‌సేల్ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్‌ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది.దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచి పెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు/ కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆప్ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా,కవితతో పాటు పలువురిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. -
Madhya Pradesh: తవ్వకాల్లో 35 కల్తీ మద్యం డ్రమ్ములు.. కంగుతిన్న పోలీసులు
మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఆశ్చర్యకర ఉదంతం చోటుచేసుకుంది. కరౌరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలో పోలీసులు పెద్ద మొత్తంలో విషపూరిత మద్యాన్ని (ఓవర్ ప్రూఫ్ స్పిరిట్) స్వాధీనం చేసుకున్నారు.మద్యం అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న కొందరు విషపూరితమైన మద్యాన్ని డ్రమ్ముల్లో దాచి ఉంచారు. పోలీసులు జేసీబీతో తవ్వకాలు జరపగా 35 కల్తీ మద్యం డ్రమ్ములు బయటపడ్డాయి. దీనిని చూసి పోలీసులు కంగుతిన్నారు. పోలీసులు రాకను గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ డ్రమ్ములకు పైపులైన్‌కు కనెక్షన్ ఏర్పాటుచేసి, దాని ద్వారా కల్తీ మద్యాన్ని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. దీని గురించి పోలీసులకు ఇన్ఫార్మర్ ద్వారా సమాచారం అందింది. దీంతో పోలీసులు ఒక పథకం ప్రకారం ఈ స్థావరంపై దాడి చేశారు. అనంతరం జేసీబీతో తవ్వకాలు జరిపి 35 కల్తీ మద్యం డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేనా?
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఆగస్ట్ 27 (మంగళవారం ) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే ఇదే ధర్మాసనం మద్యం కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. ఈసారి తమ నాయకురాలికి తప్పనిసరిగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, మద్యం పాలసీ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ఏప్రిల్ 15న సీబీఐ అరెస్టు చేసింది. అయితే ఈ రెండు సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణకు రానుంది. -
మద్యానికి బానిసలై అమ్మలనే చంపేశారు
గండేడ్/ మహమ్మదాబాద్/త్రిపురారం: మద్యానికి బానిసలై కన్న తల్లులనే కడతేర్చారు ఆ కుమారులు. మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో ఒకరు, తనకు విడాకులిచ్చిన యువతి మళ్లీ పెళ్లి చేసుకుంటే కుటుంబ సభ్యులు ఆ వేడుకకు వెళ్లారన్న కక్షతో మరో వ్యక్తి మద్యం మత్తులో విచక్షణ మరచి.. జన్మనిచ్చి న అమ్మలనే చంపుకున్నారు. రాడ్డుతో తలపై కొట్టి, కత్తితో గొంతుకోసి.. మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలం సల్కర్‌పేట్‌కు చెందిన వెంకటమ్మ(55), కోయిల్‌కొండ మండలం కొత్లాబాద్‌కు చెందిన టంకర రాములు పెళ్లయిన తర్వాత ముంబైకి వలస వెళ్లారు. ఈ క్రమంలో కొంతకాలం తర్వాత రాములు మృతిచెందాడు. దీంతో ఆమె కుమారుడు కృష్ణయ్యతో కలసి అక్కడే ఉంటూ మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగించేది. రెండేళ్ల క్రితం అక్కడ ఇంటిని అమ్ముకుని పుట్టినిల్లయిన సల్కర్‌పేట్‌కు చేరుకుంది. అయితే ఆమె కుమారుడు కృష్ణయ్య మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి డబ్బుల కోసం తల్లిని వేధించడంతోపాటు ఇల్లు అమ్మిన డబ్బులు ఎక్కడ పెట్టావని నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతో కోపంతో కృష్ణయ్య ఇనుపరాడ్డుతో వెంకటమ్మ తలపై కొట్టాడు. అంతటితో ఆగక కత్తి తీసుకొని గొంతుకోయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంటి కొద్దిదూరంలో పడేశాడు. ఆదివారం తెల్లవారుజామున తన మేనమామ రాములుకు ఫోన్ చేసి అమ్మ చనిపోయిందని, ఎవరో చంపేశారని చెప్పా డు. దీంతో రాములు పోలీసులకు సమాచారం అందించారు. డీఎ స్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహం పడేసిన ప్రదేశం నుంచి కొద్ది దూరం వరకు గడ్డిపై రక్తం పడి ఉండడంతో, అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇల్లు కడిగి ఉండడంతో అనుమానం వచ్చి కృష్ణయ్యను గట్టిగా నిలదీయగా డబ్బుల కోసం తానే తల్లిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తల్లిని గొంతుకోసి చంపి, కొడుకు ఆత్మహత్య నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన రావిరాల చినవీరయ్య, సాయమ్మ భార్యాభర్తలు. వీరికి శ్రీను, శివకుమార్ అనే కుమారులు, పద్మ అనే కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు శివకుమార్ తల్లిదండ్రుల వద్దే ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, శివకుమార్‌కు అక్క పద్మ కుమార్తె మేఘనతో వివాహం జరిగింది. మద్యానికి బానిసైన శివకుమార్ తరచూ భార్యతో గొడవ పడుతుండడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇటీవల వీరు విడాకులు తీసుకున్నారు. కాగా, మేఘనకు శనివారం హైదరాబాద్‌లో రెండో వివాహం జరిపించారు. ఈ పెళ్లికి తండ్రి, అన్న హాజరుకావడంతో ఆగ్రహానికి గురైన శివకు మార్ రాత్రి బాగా మద్యం సేవించి ఇంటికి వెళ్లి తల్లితో గొడవ పడ్డాడు.తర్వాత తల్లి నిద్రిస్తుండగా.. కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం భయపడి శివకుమార్ కూడా కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం చినవీరయ్య ఇంటికి తిరిగివచ్చేసరికి భార్య, కుమారుడు రక్తపుమడుగులో పడి ఉండటం గమనించాడు. వీరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఇవాళ్టి విచారణ సందర్భంగా కవిత బెయిల్ పిటిషన్‌కు సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా. ఈడీ దాఖలు చేయలేదు. దీంతో.. శుక్రవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం.ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. దీంతో.. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 20కి వాయిదా వేసింది. దీంతో ఇవాళ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.Supreme Court posts the hearing for August 27 on the plea of BRS leader K Kavitha seeking bail in corruption and money laundering cases linked to the alleged Delhi excise policy scam. pic.twitter.com/0Klk3lvDJV— ANI (@ANI) August 20, 2024మరోవైపు కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాలు ఢిల్లీకి చేరుకున్నారు.ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. అదే కేసులో ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే సీబీఐ,ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కవిత సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు..ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో విచారణను వాయిదా వేసింది. -
పుష్పను మించిపోయిన మందు స్మగ్లర్లు
-
నలభై ఏళ్లుగా మద్యానికి దూరం.. కాట్రేవ్
చౌటుప్పల్ రూరల్: ఇప్పుడు ఏ పల్లెలో చూసినా బెల్ట్ షాపుల జోరుతో మద్యం ఏరులై పారుతోంది. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కాట్రేవ్ గ్రామంలో మాత్రం మద్యం జాడే కనిపించదు. గ్రామంలో నాలుగు దశాబ్దాలుగా సంపూర్ణ మద్య నిషేధం అమలవుతోంది. అప్పట్లో గ్రామ పెద్దలు నిర్ణయించిన కట్టుబాటును ఇప్పటికీ కొనసాగిస్తూ.. తమ ప్రత్యేకతను నిలుపుకొంటున్నారు కాట్రేవ్ గ్రామ ప్రజలు. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని గ్రామాల్లోనూ కొన్నేళ్లు మద్యం విక్రయాలు, వినియోగంపై నిషేధం పెట్టుకోవడం గమనార్హం. కాట్రేవ్లో అయితే సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతోంది.గ్రామ యువత కూడా దూరమే..కాట్రేవ్ గ్రామం ఒకప్పుడు ఆరెగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. ఐదేళ్ల కింద నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. సుమారు 700కుపైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో అంతా రైతులే. రోజంతా వ్యవసాయ పనుల్లో మునిగిపోతారు. సాయంత్రానికి ఇంటికొచ్చి సేదతీరుతారే తప్ప మద్యం జోలికి వెళ్లరు. ఈ గ్రామం నుంచి బయట పట్టణాల్లో ఉద్యోగం, ఉపాధి, చదువు కోసం వెళ్లిన యవత కూడా.. ఈ గ్రామానికి ఎప్పుడూ మద్యం తీసుకురారు. ఇక్కడ వినియోగించరు. మద్య నిషేధమేకాదు.. అభివృద్ధిలోనూ కాట్రేవ్ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. పక్కనే ఉన్న దివిస్ పరిశ్రమ అందించే ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)’ నిధులతో గ్రామంలో ప్రతి వీధిలో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, ప్రతి ఇంటికి శుద్ధిచేసిన సురక్షిత నీరు అందించేలా ఏర్పాటు చేసుకున్నారు. పక్కనే ఉన్న ఆరెగూడెంలోనూ రెండు దశాబ్దాలుగా మద్యం విక్రయాలు లేవు.గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామస్తుల సహకారంతోనే కొనసాగిస్తున్నా..నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ గ్రామంలో మద్యపానం అలవాటు లేదు. 40 ఏళ్ల కింద పెద్దలు పెట్టుకున్న కట్టుబాటును.. గ్రామస్తుల సహకారంతో కొనసాగిస్తున్నాం. అభివృద్ధిలోనూ ముందుకెళ్తున్నాం.– బచ్చ రామకృష్ణ మాజీ సర్పంచ్, కాట్రేవ్ -
సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురు.. వారి వాదనలు విన్న తర్వాతే తీర్పు!
ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. మద్యం పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో తన బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత శుక్రవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్‌ను ఇవాళ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కవిత తరుఫు న్యాయవాది ముకుల్ రోహత్గి మధ్యంతర బెయిల్ కోరారు. ‘అయిదు నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారు. ఇప్పటికే చార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ కేసులో 493 మంది సాక్షులు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చారు. కవిత ఒక మహిళ.. మధ్యంతర బెయిల్ ఇవ్వండి’ అని కోరారు. కవిత తరపున వాదనలు విన్న అనంతరం.. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 20కి వాయిదా వేసింది. Supreme Court issues notice to CBI and ED on BRS leader K Kavitha's plea seeking bail in the excise policy case. pic.twitter.com/GmKe5CjgCy— ANI (@ANI) August 12, 2024గతవారం సుప్రీం కోర్టును ఆశ్రయించిన కవితఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఇవాళ (ఆగస్ట్12) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. మద్యం పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో తన బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత శుక్రవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్‌ను ఇవాళ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, హైకోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసో డియాకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది. కాగా, తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జులై 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలను పరిగణలోకి తీసుకొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆమె బెయిల్ పిటిషన్లను కొట్టేశారు. ఈ కేసులోని 50 మంది నిందితుల్లో ఉన్న ఏకైక మహిళ అని, తల్లిగా పిల్లల ఆలనాపాలనా చూసుకోవాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కవిత తరఫున చేసిన వాదనలను హైకోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు కవిత అవే అంశాల ఆధారంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసి, ఢిల్లీకి తరలించింది. ఆమె నాటి నుంచి తిహార్ జైలులో ఉన్నారు. -
ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం.. వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను ఎమ్మెల్సీ కవిత వెనక్కి తీసుకున్నారు. ఇదే పిటిషన్‌పై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ తన తరుఫున వాదించే సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో మరో రోజు విచారణ చేపట్టాలని కోరారు. కానీ అనూహ్యంగా ఈ రోజు పిటిషన్‌ను ఉప సంహరించుకున్నారు.అయితే పిటిషన్ విత్‌డ్రాలో కవిత బెయిల్ కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం సుప్రీం కోర్టును ఆశ్రయించి.. అక్కడి నుంచి బెయిల్ పొందేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.కవితకు దెబ్బ మీద దెబ్బమరోవైపు మద్యం పాలసీ కేసులో సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కావాలని కోరుతూ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ తిరస్కరించింది. విచారణ సమయంలో కవితకు బెయిల్ ఇవ్వకూడదని దర్యాప్తు సంస్థలు కోర్టులో తమ వాదనలు వినిపించాయి. ఆమె ప్రభావవంతమైన వ్యక్తి కాబట్టి సాక్ష్యాలు,సాక్ష్యుల్ని తారుమారు అయ్యే అవకాశం ఉందని, బెయిల్ ఇవ్వొద్దని తెలిపాయి. ఈ అంశాలను పరిణగలోకి తీసుకున్న కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది.చివరి అస్త్రంగా డీఫాల్ట్ బెయిల్ పిటిషన్.. అంతలోనే ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా కవితకు చుక్కెదురైంది. దీంతో న్యాయ బద్దంగా బెయిల్ పొందేందుకు రౌస్ అవెన్యూ కోర్టులో కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. సీబీఐ ఛార్జ్ షీట్లో తప్పులు ఉన్నాయని జులై 6న కవిత దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆ ఛార్జ్‌షీట్‌లో తప్పులు లేవని సీబీఐ తరుఫు లాయర్లు కోర్టులో వాదించారు. ఇప్పటికే సీబీఐ ఛార్జ్ షీట్‌ను జులై 22న పరిగణలోకి కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం విచారణ జగింది. సుప్రీం కోర్టుకు కవితవిచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేనందున విచారణ వాయిదా వేయాలని ఆమె తరఫు న్యాయవాది రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజాకు విన్నవించారు. దాంతో న్యాయమూర్తి ఈ కేసును చివరిసారి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. బుధవారం విచారణ సమయంలో వాదనలు వినిపించకపోతే పిటిషన్‌ను వెనక్కు తీసుకోవాలని న్యాయవాదికి సూచించారు. ఈ కేసు విచారణ ఇదివరకు రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో న్యాయమూర్తి ఈ వ్యాఖ్య చేశారు. ఆగస్ట్ 9కి వాయిదా వేశారు. రేపు కోర్టులో విచారణ జరగనుండగా.. అనూహ్యంగా డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. త్వరలోనే సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. -
కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా!
ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టులో విచారణ ఇవాళ జరిగింది. అయితే సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేనందున మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణను ఆగస్టు 7కు వాయిదా వేశారు. మరోవైపు ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవితకు బీఆర్ఎస్ నేతలు ధైర్యం చెప్పనున్నారు. రేపు తీహార్ జైల్లో ఉన్న కవితతో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి ములాఖత్ కానున్నారు.ములాఖత్‌లో భాగంగా కవితను కలిసి ధైర్యం చెప్పనున్న బీఆర్ఎస్ నేతలు. Delhi Excise policy case | The Rouse Avenue court adjourned the hearing on the bail plea of BRS leader K Kavitha till August 7.Counsel sought time to argue. She has sought a default bail in CBI case linked to Delhi excise policy.— ANI (@ANI) August 5, 2024 -
పోలీసుల ముసుగులో దందా
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికారం వచ్చిందో లేదో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నేతల ఆగడాలు మామూలుగా లేవు. అధికారం తమ గుప్పెట్లో ఉందనే ధైర్యం, తమ ప్రజాప్రతినిధుల అండదండలున్నాయనే బరితెగింపుతో ఆయా పార్టీల నేతలు చెలరేగిపోతూ దోపిడీలు, దౌర్జన్యాల కోసం నకిలీ పోలీసుల అవతారమెత్తుతున్నారు. నిజానికి.. రాష్ట్రంలో ప్రజలకు చెందాల్సిన ప్రతీపైసా నాటి సీఎం వైఎస్ జగన్ డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా బ్యాంకు ఖాతాల్లో పారదర్శకంగా జమ చేసేవారు. అదే సందర్భంలో తాము అమలుచేస్తున్న డీబీటీని చంద్రబాబు అండ్ కో దోచుకో, పంచుకో, తినుకోగా మార్చేస్తుందని జగన్ పదేపదే హెచ్చరించేవారు. అప్పుడు ఆయనన్నట్లుగానే ఇప్పుడు కూటమి నేతలు ఆ మాటలను నిజంచేసి చూపిస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ, జనసేన నేతలు ఒకరిని మించి మరొకరు దందాలు చేస్తున్న తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రాపురం నియోజకవర్గం మసకపల్లి గ్రామంలో తాజాగా చోటుచేసుకున్న ఇలాంటి ఘటనే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అక్కడ ఏం జరిగిందంటే..చౌకగా కొని.. ‘చీప్’గా కల్తీచేసి..పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో తక్కువ ధరకు లభించే వివిధ బ్రాండ్ల మద్యం బాటిళ్లను కొందరు కూటమి నేతలు కొనుగోలు చేసి వాటి లేబుళ్లు, బాటిళ్లు మార్చి రామచంద్రాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు దుకాణాలు, బెల్ట్ షాపుల్లో కల్తీచేసి విక్రయిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నియంత్రణలో ఉన్న ఈ అక్రమ మద్యం దందా.. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విచ్చలవిడిగా సాగుతోంది. ఈ క్రమంలో.. మంగళవారం రాత్రి పామర్రు పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరు జనసేన ద్వితీయ శ్రేణి నేతలు అరిశెట్టి మణికంఠ (అయ్యప్ప) మరొకరు యానాం మద్యాన్ని పామర్రు తరలిస్తున్నారు. విషయం తెలుసుకుని మసకపల్లి, ద్రాక్షారామ ప్రాంతానికి చెందిన టీడీపీ, జనసేన నేతలు రవ్వా భూషణం, సలాది శ్రీనివాస్ పాణింగపల్లి వద్ద మాటేశారు. అక్కడకు దగ్గర్లోనే కారు పార్కు చేశారు. అందులో నకిలీ పోలీసులు ఇద్దరిని ఖాకీ డ్రెస్సుతో కూర్చోబెట్టారు. యానాం నుంచి లిక్కర్ బాటిళ్లతో వచ్చిన జనసేన ద్వితీయశ్రేణి నేతలను అడ్డగించి, కారులో స్పెషల్ పార్టీ పోలీసులున్నారు.. మీ వ్యవహారం బయటకు పొక్కకుండా ఉండాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని తెదేపా, జనసేన నేతలు డిమాండ్ చేశారు. అందుకు వారు నిరాకరించడంతో ఇద్దరినీ కిడ్నాప్‌చేసి కారులో ఆ రాత్రి ద్రాక్షారామ తరలించారు. కనీసం రూ.2 లక్షలు ఇవ్వాలని, లేకుంటే పోలీసులు మా వెంటే ఉన్నారని, కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారు. దీంతో కేసులకు భయపడి జనసేన ద్వితీయ శ్రేణి నేతలు రూ.25 వేలు చేతిలో పెట్టి మిగిలింది తరువాత చూస్తామని చెప్పడంతో వారిని విడిచిపెట్టారు. మణికంఠ అక్కడి నుంచి బయటపడి పామర్రు వచ్చేశాక వారిపై పోలీసు ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గత రెండ్రోజులుగా పరారీలో ఉన్న ఇద్దరు కూటమి నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై పామర్రు ఎస్ఐ జానీబాషాను సంప్రదించగా ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
సాయంత్రం ఓ పెగ్గు.. ఆపై పేకాట.. ఇవేం ముచ్చట్లు!
సాధారణంగా ఎవరైనా ప్రజా ప్రతినిధి ఏదైనా సమావేశంలో పాల్గొంటే.. నాలుగు మంచి మాటలు చెబుతారు. చెడు అలవాట్లకు వెళ్లవద్దని సూచిస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన వాతావరణం నెలకొంది. అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే నిర్భీతిగా పేకాట క్లబ్ లను తెరపిస్తామని హామీ ఇస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకుంటామని కూడా ధైర్యంగా చెబుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ స్కూళ్లలో గతంలో మాదిరి చదువులపై శ్రద్ద చూపడం లేదన్న విమర్శలు వస్తుంటే, మరో వైపు పేకాట క్లబ్‌లకు శ్రీకారం చుడుతున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇలాంటి క్లబ్ లను అనుమతించలేదు.దాంతో కొందరు బడాబాబులకు కోపం వచ్చేదట. కొన్ని చోట్ల ఆఫీసర్ల క్లబ్ లు కూడా పేకాటను అనుమతించకపోవడంపై గుర్రుగా ఉండేవట. అలాంటివారంతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారని చెబుతారు. జగన్ ప్రభుత్వం ఓడిపోతోందన్న సమాచారం వస్తుండగానే.. గుంటూరు, విజయవాడ వంటి కొన్ని చోట్ల పేకాట క్లబ్ లు తెరచుకున్నాయని సమాచారం. మరి అనంతపురం వంటి చోట ఎందుకు ఆలస్యం అయిందో తెలియదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ను క్లబ్ వారు పిలిచి సమావేశం పెట్టి కార్డ్స్ ను అనుమతించాలని కోరారు. దానికి ఆయన బదులు ఇస్తూ రాష్ట్రం అంతా క్లబ్ లు తెరిపిస్తానని హామీ ఇచ్చారట. అధికారులు, ఇతర వర్గాల రిలాక్సేషన్ కోసం క్లబ్ లు ఏర్పాటు అవుతుంటాయి. వాటిలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. కుటుంబాలతో కలిసి వచ్చి ఆనందంతో పాల్గొనడం ఆనవాయితీగా ఉంటుంది. కాని అవి రాను,రాను పేకాట క్లబ్ లు గా మారిపోయాయి. కొంతమంది వేల రూపాయల డబ్బును ఈ క్లబ్ లలో కోల్పోయి అప్పుల పాలవుతుంటారు. క్లబ్ ల నిర్వహణ ఒక వ్యాపారంగా మార్చివేశారు.కల్చరల్ క్లబ్ లు కాస్త జూదశాలలుగా మార్చివేయడంలో మాఫియాల పాత్ర ఉందని అంటారు. గతంలో హైదరాబాద్ లో కొన్ని ప్రైవేటు వ్యాపార సంస్థలు క్లబ్ లను నిర్వహించి పెద్ద ఎత్తున జూదాన్ని ప్రోత్సహించేవి. తత్ఫలితంగా కొందరు లక్షలు,కోట్ల రూపాయల మేర నష్టపోయిన ఘటనలు ఉండేవి.ఈ కారణంగా కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దాంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ క్లబ్ లను నిషేధించారు. కేవలం చట్టబద్దమైన క్లబ్ లను మాత్రమే అనుమతించారు. ఏపీలో కూడా అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉండగా, జగన్ ప్రభుత్వం అలాంటివాటిని అదుపు చేసింది. కాని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రావడంతో ఇలాంటి జూదగాళ్లకు ఉత్సాహం వచ్చింది. అనంతపురం క్లబ్ లో నాలుగేళ్లుగా జూదం బంద్ అయిందని, దీనిని ఆరంభించడానికి కలెక్టర్ తో మాట్లాడానని, రాష్ట్రవ్యాప్తంగా జూదక్లబ్ ల పునరుద్దరణకు ముఖ్యమంత్రి అనుమతి కోరతామని ఆ టీడీపీ ఎమ్మెల్యే నిస్సిగ్గుగా ప్రకటించారు. పైగా ఈ ఎమ్మెల్యే గారు ఇంకో సంగతి చెప్పారు. కరోనా టైమ్ లో క్లబ్ లో పేకాట లేనందువల్ల రిటైర్డ్ ఉద్యోగులు కొందరు మరణించారని అన్నారట. ఇదెక్కడి విడ్డూరం. ఆ రోజుల్లో అసలు ఎక్కడా జనం గుమికూడవద్దని ప్రభుత్వాలు ఆంక్షలు పెడితే, క్లబ్ లు నడవకపోవడం వల్ల మరణాలు సంభవించాయని చెప్పడం వింతగానే ఉంటుంది. పేద విద్యార్ధులకు అవసరమైన పుస్తకాలు, డ్రెస్ లు వంటివి సకాలంలో అందుతున్నాయా?లేదా?వారికి స్కూల్ టీచర్లు పాఠాలు సరిగా బోధిస్తున్నారా?లేదా?అన్నవి చూడవలసిన గౌరవ ఎమ్మెల్యే పేకాట క్లబ్ ల గురించి ఆసక్తి కనబరచడం విశేషం. దీనిని బట్టి ప్రజలు ఎలాంటివారిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నది, ఎలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది అర్ధం చేసుకోవచ్చు. మరో సంగతి కూడా చెప్పాలి. ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టవలసిన ప్రభుత్వం వారికి మద్యాన్ని కావల్సినంత సరఫరా చేస్తామని నిర్భీతిగా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం లో మద్యం బాబులకు హుషారైన కబుర్లు చెప్పేవారు. ‘‘ఏం తమ్ముళ్లూ.. సాయంత్రం అయితే ఒకటి,రెండు పెగ్గులు వేసుకుంటారు. ధరలు పెంచి జగన్ ప్రభుత్వం దానిని అందుబాటులో లేకుండా చేసిందా? లేదా?. మేం అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే సరఫరా చేస్తాం’’ అంటూ హామీ ఇచ్చారు. బహుశా దేశంలో మరే రాష్ట్రంలో ఇలాంటి హామీ ఇచ్చిన నేత ఇంకొకరు ఉండరు.ఈ విషయంలో చంద్రబాబు రికార్డు నెలకొల్పి ఉంటారు. మొత్తం మీద మందుబాబుల మద్దతు బాగానే కూడగట్టుకున్నారు. సుమారు పాతికలక్షల మంది మద్యం వినియోగదార్లు కూటమికి అనుకూలంగా ఓట్లు వేశారన్నది ఒక అంచనా. జగన్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద అనేక వ్యాధులను చేర్చి ప్రజల ఆరోగ్యం కాపాడడానికి ప్రాదాన్యత ఇస్తే, చంద్రబాబు ప్రభుత్వం మద్యం సరఫరాకు ప్రాముఖ్యత ఇస్తోంది. వైఎస్సార్సీపీ టైమ్ లో ఉన్న బ్రాండ్లకు తోడు, కొన్ని కొత్త బ్రాండ్లను అయితే అందుబాటులోకి తెచ్చారు.కాని ధరలు మాత్రం తగ్గించలేదని మందుబాబులు చెబుతున్నారు. తెలంగాణతో పోల్చితే మద్యం ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయట. అయినా మందుబాబులు వాటి గురించి ఫీల్ కావడం లేదేమో తెలియదు. గత ప్రభుత్వం మద్యం షాపులను నిర్వహిస్తుంటే, తీవ్రమైన విమర్శలు గుప్పించిన టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలు ,ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే షాపులను కొనసాగిస్తుండడం విశేషం. టీడీపీకి చెందిన పలువురు ఎప్పుడు ప్రభుత్వ షాపులు ఎత్తివేస్తారా? ఎప్పుడు తాము షాపులు నడుపుకోవచ్చా?అని ఎదురు చూస్తున్నారట. కాని దానివల్ల ఏ సమస్యలు వస్తాయని భయపడుతున్నారో కాని, ఇంకా ప్రైవేటు షాపులకు ఓకే చేయలేదు. స్కూళ్లను బాగు చేయవలసిన ప్రభుత్వం పేకాట క్లబ్ లను ప్రోత్సహిస్తే.. పేదల ఆరోగ్యాన్ని కాపాడవలసిన ప్రభుత్వం మద్యాన్ని అధికంగా అందుబాటులోకి తెవడానికి ఉత్సాహపడుతోంది. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారా?అని ఎవరికైనా సందేహం రావొచ్చు. ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలను ప్రజలు వ్యతిరేకించేవరకు ఎవరు ఏమి అనుకున్నా ప్రయోజనం ఉండదని చెప్పక తప్పదు.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మద్యం పేదల వ్యసనం
సాక్షి, అమరావతి: పేదలకు మద్యపానం ఓ వ్యసనమని, శారీరక శ్రమ చేసిన తర్వాత రెండు పెగ్గులు వేసుకునేవారికి గత ప్రభుత్వం మద్యం లభించకుండా చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మద్యాన్ని అధిక ధరలకు అమ్మడంతో తెలంగాణ, కర్ణాటక ఆదాయం పెరిగిందన్నారు. తగ్గిన ఆదాయం నాటి నాయకుల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. 2019–24 మద్యం అమ్మకాలపై సీఎం చంద్రబాబు బుధవారం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసి మాట్లాడారు. గత పాలకులు మద్యపాన నిషేధంపై చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంతో బ్లాక్ మార్కెటింగ్ పెరిగిందని ఆరోపించారు. 4,380 మద్యం షాపులను 2,934కి తగ్గించి మళ్లీ ఏపీ టీడీసీ టూరిజం పేరుతో దుకాణాల సంఖ్యను 3,392కి పెంచారన్నారు. 2019లో ఉన్న 840 బార్లను అలాగే కొనసాగించారన్నారు. దీనివల్ల అక్రమ రవాణా పెరిగిందన్నారు. 2014–19లో ఏపీకి, తెలంగాణకు మద్యం ఆదాయంలో వ్యత్యాసం రూ.4,186.70 కోట్లు ఉంటే 2019–24లో ఏకంగా రూ. 42,762 కోట్లకు చేరడంతో 10 రెట్ల ఆదాయం ఏపీకి తగ్గిపోయిందన్నారు. మ ద్యం పాలసీలో వ్యత్యాసం వల్ల ఆదాయంలో తెలంగాణ ముందుందన్నారు. అన్ని వ్య యాలు పోనూ ఐదేళ్లలో ప్రభుత్వానికి రావాల్సిన రూ.18,860 కోట్ల ఆదాయం తగ్గిపోయిందన్నారు. ఇతర రాష్ట్రాలు లాభపడితే ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందన్నారు. పేదవాడు తాగే లిక్కర్ రేట్లు పెంచి 99.97 శాతం బ్రాండ్లు లేకుండా చేశారని విమర్శించారు. మద్యం అమ్మకాల్లో లిక్కర్ కేసుకు రూ.200, బీరు కేసుకు రూ.50 చొప్పున అక్రమంగా వసూలు చేశారని, 2019–24 మధ్య రూ. 3,113 కోట్లు అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. ధరలు తగ్గిస్తాం.. సీఐడీ, ఈడీతో దర్యాప్తు ఆబ్కారీ శాఖను ఒకే తాటిపైకి తెస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మద్యం ధరలు పేదలకు అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు. డిజిటల్ పేమెంట్ విధానం అమలు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అమ్మకాలపై సీబీసీఐడీ, ఈడీతో దర్యాప్తు చేయిస్తామని ప్రకటించారు. మానవీయ కోణంలో పనిచేయండిఅధికారులు రూల్స్ అనే కోణంలో పని చేయకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. బ్యారోక్రటిక్ కోణం కాకుండా మానవీయ కోణంతో పనిచేయాలని సూచించారు. బుధవారం సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సీఎం సమావేశమయ్యారు. రూ. లక్ష కోట్ల వరకు బిల్లులు, బకాయిలు ఉన్నా యన్నారు. రాయలసీమలో ఇండ్రస్టియల్ కారిడార్‌కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. రేపు ఢిల్లీకి బాబుచంద్రబాబు శుక్రవారం (రేపు) ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సముచిత స్థానం ఇచ్చారని భావిస్తున్న ఆ యన అందుకు ప్రధాని ఇతర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఢిల్లీ వెళు తున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. కాగా, సీఎం చంద్రబాబుతో బుధవారం ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందని, అక్కడి పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చూడాలని చంద్రబాబు ఆయన్ని కోరారు. -
తీహార్ జైలులో కవితతో కేటీఆర్, హరీష్‌రావు ములాఖత్
సాక్షి,న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పాటు మాజీ మంత్రి హరీష్‌రావులు ములాఖత్ అయ్యారు. అరగంట పాటు సాగిన ములాఖత్‌లో ధైర్యంగా ఉండాలని.. కేసు విషయంపై న్యాయం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో తదుపరి కార్యచరణకు సిద్ధం కాగా.. అన్నీ అంశాలపై ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే విషయంపై హరీష్ రావు, కేటీఆర్.. కవితతో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్, హరీష్ రావులు కవిత బెయిల్ కోసం ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇప్పటికే సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అంశంపై ఢిల్లీలో ప్రముఖ న్యాయవాదలతో కేటీఆర్, హరీష్ రావులు చర్చించగా.. న్యాయవాదుల సలహా మేరకు సోమవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్
సాక్షి,న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు ములాఖత్ అయ్యారు. ములాఖాత్ సందర్భంగా కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని కవితకు హరీష్ రావు సూచించారు.మద్యం పాలసీ కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రిమాండ్ మీద ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇక..ఈ కేసులో ఈడీ, సీబీఐ వేర్వేరుగా అరెస్ట్ చేయగా.. బెయిల్ కోసం ఆమె కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ కొనసాగుతోంది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఈడీ పలు అభియోగాలు మోపింది. మద్యం పాలసీలో రూ.1100 కోట్ల నేరం జరిగిందని ఈడీ పేర్కొంది. అందులో..రూ.192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ఇచ్చినట్లు చెప్పింది. అంతేకాకుండా.. 292 కోట్ల నేరంలో కవిత పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది. -
మూడు రోజుల సీబీఐ కస్టడీకి సీఎం కేజ్రీవాల్
సాక్షి,ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు సీబీఐ అడిగిన ఐదురోజుల కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మూడు రోజులు మాత్రమే అనుమతిచ్చింది.అంతేకాదు సీబీఐ మూడు రోజుల కస్టడీ సమయంలో కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, అతని లాయర్‌కు ప్రతి రోజు 30 నిమిషాల పాటు అనుమతి ఇచ్చింది.దీంతో పాటు కేజ్రీవాల్ సూచించిన మందులు, ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని అందించేందుకు కూడా కోర్టు వారికి అనుమతించింది.కాగా, లిక్కర్ మద్యం పాలసీ కేసులో మంగళవారం తీహార్ జైల్లో కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరించింది. ఈ కేసులో మరింత దర్యాప్తు చేసేందుకు కస్టడీ తీసుకునేందుకు అనుమతి కావాలని కోర్టులో ధరఖాస్తు చేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు సీబీఐకి అనుమతించింది. ఈ మేరకు జడ్జి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేశారు. పాలసీ కేసులో మరిన్ని వివరాల్ని రాబట్టేందుకు సీబీఐ అడిగిన ఐదురోజుల కస్టడీ కాకుండా మూడురోజులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మూడు రోజుల పాటు కేజ్రీవాల్ సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. -
సీబీఐ అదుపులో కేజ్రీవాల్.. బీజేపీకి ఆప్ చురకలు!
సాక్షి,న్యూఢిల్లీ : రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో నడిచిన హైడ్రామా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం పాలసీ కేసులో తమ పార్టీ అధినేతకు (కేజ్రీవాల్) సుప్రీం కోర్టులో బెయిల్ వస్తుందేమోనని బయపడిపోతుందంటూ ఎక్స్ వేదికగా స్పందించింది.లిక్కర్ మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టులో హైడ్రామా నడిచింది. మంగళవారం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. అనంతరం బుధవారం కోర్టుకు హాజరు పరిచింది. కోర్టులో విచారణ జరిగే సమయంలో కేజ్రీవాల్‌ను తమకు ఐదురోజుల పాటు కస్టడీ కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జీ అమితాబ్ రావత్ అరెస్ట్ ఆర్డర్‌ను పాస్ చేయడంతో సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు.ఈ వరుస పరిణామలపై ఆప్ స్పందించింది. ట్రయిల్ కోర్టు తనకు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంపై కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ నేడు విచారణకు రానుంది. అయితే అనూహ్యంగా ఈ కేసు విచారణకు రాకముందే ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై ఆప్ మండిపడింది. కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో బెయిల్ వస్తుందేమోనని బీజేపీకి బయపట్టుకుంది. అందుకే సీబీఐ కోర్టులో అక్రమంగా అరెస్ట్ చేసిందని ట్వీట్లో పేర్కొంది.‘నియంత క్రూరత్వం అన్ని హద్దులు దాటింది.ఈ రోజు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నందున బీజేపీ తీవ్ర భయాందోళనకు గురైంది.సీబీఐతో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయించింది’అని ట్వీట్లో ద్వజమెత్తింది. -
సీఎం స్టాలిన్ సీరియస్...
-
ఈడీ కేసీఆర్ ప్రస్తావన తేలేదు: కవిత లాయర్
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తావన తేలేదని కవిత తరపు న్యాయవాది మోహిత్‌రావు తెలిపారు. కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.ఈడీ రిపోర్టులో ఎక్కడ కూడా కేసీఆర్ పేరు రాయలేదన్నారు. బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని మాత్రమే ప్రస్తావించిందని తెలిపారు.రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులరెడ్డికి లిక్కర్ కేసులో ఉన్నవారిని పరిచయం చేశానని చెప్పినట్లు ఈడీ తెలిపిందన్నారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేశారు. -
స్వాతి మలివాల్‌పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడిపై ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు చేస్తోంది. స్వాతి మలివాల్ ఆరోపణల్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి అతిషి కొట్టి పారేశారు. ఆమె చేస్తోన్న ఆరోపణలు బీజేపీ కుట్రలో భాగమేనని ఆరోపించారు. మే 13న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ అపాయింట్మెంట్ లేకుండా సీఎం కేజ్రీవాల్ నివాసంలోకి ప్రవేశించారు. కేజ్రీవాల్ అందుబాటులో లేరు. అపాయింట్ లేకపోవడంపై సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ ఆమెను అడ్డుకున్నారు. డ్రాయింగ్ రూమ్‌లో వాదించడం ప్రారంభించింది’ అని అతిషి విలేకరుల సమావేశంలో తెలిపారు.‘అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ రావడం బీజేపీని ఉలిక్కిపడేలా చేసింది. కాబట్టే బీజేపీ ఓ కుట్ర పన్నింది. అందులో భాగంగా స్వాతి మలివాల్‌ను పావుగా వినియోగించుకుంది. మే 13 ఉదయం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పంపింది. అక్కడే ఆమె కథంతా నెరిపింది. తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఈరోజు వెలుగులోకి వచ్చిన వీడియోలో ఆమె డ్రాయింగ్ రూమ్‌లో కూర్చొని పోలీసు అధికారులను బెదిరించడం కనిపించింది. తనపై క్రూరంగా దాడి చేశారిన స్వాతి ఆరోపణలకు.. వీడియోలో కస్తున్న కనిపిస్తున్న దృశ్యాలు పూర్తి విభిన్నంగా ఉన్నాయిఆ వీడియోలో స్వాతి మలివాల్ కనిపించారు. కొట్టినట్లు వీడియో తీస్తున్నదెవరు..ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తేనే అందరికీ నిజం తెలుస్తుంది. ఆ దేవుడు అంతా చూస్తున్నాడు. ఏదో ఒకరోజు ఆ నిజం ప్రపంచానికి తెలుస్తోంది’ అని అతిషి అన్నారు.కాగా, స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అతిషి తెలిపారు. -
హైదరాబాద్: వైన్ షాపులు ‘బంద్’.. బారులు తీరిన మద్యం ప్రియులు (ఫొటోలు)
-
‘అద్భుతం కంటే తక్కువేం కాదు’.. కేజ్రీకు మద్యంతర బెయిల్‌పై
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ లభించడం అద్భుతం కంటే తక్కువ కాదు అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు.కేజ్రీవాల్‌కు మద్యంతర బెయిల్ సందర్భంగా ఆప్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. 40 రోజుల్లో మధ్యంతర బెయిల్ పొందడం అద్భుతం కంటే ఎక్కువే. సుప్రీం కోర్టు ద్వారా దేశంలో ఏమి జరిగినా మార్పు అవసరమని దేవుడి సూచనే అని ఆప్ నేతలు తెలిపారు.ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశం రాజ్యాంగపరమైన ముప్పు తెచ్చే వారికి ఎదురు దెబ్బే అవుతుందని ఆప్ నేతలు గోపాల్ రాయ్, అతిషి, భరద్వాజ్‌లు స్పష్టం చేశారు.కాగా, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రత్యర్థులను తప్పుడు కేసులతో వేధించేందుకు దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించుకుంటోందని ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. -
కవిత బెయిల్ తీర్పులపై ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై సోమవారం తీర్పురానుంది. ఉదయం తీర్పు వెలువడాల్సి ఉండగా.. మధ్యాహ్నం 12 గం. సమయానికి వాయిదా వేసింది ట్రయల్ కోర్టు.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్‌కు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు. లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్ 11న సీబీఐ కూడా పీటీ వారెంట్‌తో ఆమెను అరెస్టు చేసింది. ఈ కేసులకు సంబంధించి కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందంటూ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ కోరారు. మరోవైపు బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని, మహిళలపరమైన కొన్ని సమస్యలు ఉన్నాయని సీబీఐ కేసులో బెయిల్ కోరారు. కేవలం ఇతరుల స్టేట్మెంట్ల ఆధారంగానే కవితను అరెస్టు చేశారని.. మహిళ కాబట్టి బెయిల్‌కు అర్హురాలని ఆమె తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు ఈ రెండు బెయిల్ పిటిషన్లను దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించాయి. ఈ పిటిషన్లపై వాదనలను ఇప్పటికే పూర్తిచేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ తీర్పులను వెలువరించనున్నారు. బెయిల్ రాకుంటే వెంటనే హైకోర్టుకు.. ఒకవేళ ట్రయల్ కోర్టులో బెయిల్ నిరాకరిస్తే వెంటనే హైకోర్టుకు వెళ్లాలని కవిత న్యాయవాదులు యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. సోమవారం బెయిల్ రాకుంటే.. మంగళవారం ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చాల్సి ఉంటుంది. ఈసారి తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా, నేరుగా కోర్టులో హాజరయ్యేలా చూడాలని కవిత ఇప్పటికే కోర్టును కోరారు కూడా. -
టీడీపీ మద్యం ధ్వంసం
-
చెక్‌పోస్టులో భారీగా మద్యం పట్టివేత
తడ (తిరుపతి జిల్లా): ఎన్నికల వేళ భారీ ఎత్తున మద్యం పట్టుబడుతోంది. తాజాగా బీవీపాళెం చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద బుధవారం పెద్ద ఎత్తున మద్యం పట్టుకున్నారు. ఎస్ఈబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పుదుచ్చేరి నుంచి నెల్లూరు వైపు వెళుతున్న కేరళకు చెందిన మినీ లారీని తనిఖీ చేయగా మద్యం రవాణా బట్టబయలైంది. పట్టుకున్న లారీని బీవీపాళెం సరిహద్దు ఉమ్మడి తనిఖీ కేంద్రంలోని ఎస్ఈబీ కార్యాలయానికి తరలించి సరుకు లెక్కించారు. లారీలో మొత్తం 300 కేసుల (14,400 బాటిళ్లు) క్వార్టర్ బాటిళ్ల మద్యం ఉన్నట్టు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.7.42 లక్షలుగా ఉంటుందని తెలిపారు. దీంతోపాటు లారీ, కేరళకు చెందిన డ్రైవర్ మహ్మద్ ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ సరుకు పుదుచ్చేరిలోని బాలాజీ ఎంటర్ ప్రైజెస్, గ్లోబల్ బేవరేజెస్ పరిశ్రమ నుంచి వస్తున్న ‘ఆల్వేస్ సూపర్ స్ట్రాంగ్’ పేరుతో ఉన్న బ్రాందీ. దీనిని ఏప్రిల్ 30వ తేదీన తయారు చేసినట్టు సీల్ ఉంది. ఈ బ్రాండ్ నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ మద్యం వ్యాపారిదిగా ఎస్ఈబీ సిబ్బంది గుర్తించారు. -
భారీగా టీడీపీ మద్యం పట్టివేత
గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని మెట్లపల్లి శివారుల్లో టీడీపీ నేతలు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన గోవా మద్యం నిల్వలను ఆదివారం పోలీస్, ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన టీడీపీ నేతను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మెట్లపల్లి శివారులో గన్నవరం మాజీ సర్పంచి, టీడీపీ నేత గూడపాటి తులసీమోహన్ సోదరుడైన దుర్గాప్రసాద్‌కు చెందిన శ్రీనివాస గార్డెన్స్‌లో భారీగా మద్యం నిల్వచేసినట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వీరి ఆదేశాల మేరకు హనుమాన్‌జంక్షన్ సీఐ నరసింహమూర్తి, ఎక్సైజ్ స్క్వాడ్ ఎస్ఐ రామాంజనేయ, సెబ్ అధికారులు సంయుక్తంగా గార్డెన్స్‌లోని గెస్ట్‌హౌస్‌పై దాడిచేశారు. అక్కడ గోవా రాష్ట్రానికి చెందిన స్టీకర్స్‌తో మొత్తం 1,210 కేసుల్లో 58,032 క్వార్టర్ సీసాల మద్యం నిల్వల్ని గుర్తించి సీజ్ చేశారు. వీటివిలువ సుమారు రూ.75 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. ఆత్కూరు ఎస్ఐ పైడిబాబు కేసు నమోదు చేశారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన శ్రీనివాస గార్డెన్స్ యాజమాని, టీడీపీ నేత గూడపాటి దుర్గాప్రసాద్‌ను, వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీస్, ఎక్సైజ్ అధికారులు తెలిపారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ, నేతల్లో ఆందోళన ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు ఈ మద్యం కొనుగోలు చేసి ఇక్కడ నిల్వ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి గూడ్స్ వాహనంలో ఇక్కడికి తీసుకొచ్చి న ఈ మద్యాన్ని ఇక్కడినుంచి గ్రామాలకు పంపేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది.మద్యం పట్టుబడ్డడంతో యార్లగడ్డతో పాటు ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. అధికారులు దాడిచేసిన విషయం తెలుసుకున్న యార్లగడ్డ వర్గానికి చెందిన టీడీపీ నేతలు పొట్లూరి బసవరావు, జాస్తి శ్రీధర్‌బాబు, దొంతు చిన్నా, కేసరపల్లి ఎంపీటీసీ సభ్యుడు శొంఠి కిషోర్ గంటల వ్యవధిలోనే ఆ గ్రామానికి చేరుకున్నారు. -
FACT CHECK: కల్లు తాగిన కోతి..రామోజీ
సాక్షి, అమరావతి: కల్లు తాగిన కోతిలా చిందులు వేయడం అంటే ఏమిటో ఈనాడు రామోజీరావును చూస్తుంటే తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో టీడీపీకి మరోసారి ఘోర పరాజయం తప్పదన్న బాధతో ఆయనలో పచ్చ పైత్యం ప్రకోపిస్తోంది. ఆ ఆక్రోశంతో నిద్రపట్టని రాత్రులు గడుపుతున్న రామోజీ చిత్త చాపల్యంతో మతి స్థితమితం కోల్పోతూ మత్తు రాతలు రాస్తున్నారు. ఈనాడు పత్రిక నిండా అసత్యాలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విష ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయంటూ తాజాగా ‘తాగించారు.. తూగించారు’ శీర్షికతో కట్టుకథను అల్లారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేస్తున్నా కల్లు తాగిన కోతిలా చిందులు తొక్కారు. మద్యం విక్రయాలు తగ్గించేందుకే షాక్ కొట్టేలా ధరలు.. మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల సందర్భంగా స్పష్టంగా చెప్పారు. పేదలను మద్యం వ్యసనానికి దూరం చేసేందుకే ఆ నిర్ణయమన్నారు. అందుకే అధికారంలోకి వచ్చాక మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నునూ విధించారు. దాంతో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు.. మద్యం వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్ఈటీ పన్నుతో మద్యం రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వాస్తవాన్ని రామోజీ వక్రీకరిస్తూ రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. దాచేస్తే దాగని సత్యాలు చంద్రబాబు హయాంలో ► రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ యథేచ్ఛగా చెలరేగిపోయింది. మూడు పరి్మట్ రూమ్‌లు.. ఆరు బెల్ట్ దుకాణాలు అన్నట్టుగా మద్యం ఏరులై పారింది. ► ఉ. 10 నుంచి రాత్రి 11 వరకు విక్రయాలు. అనధికారికంగా 24 గంటలూ షాపులు. ► 4,380 మద్యం దుకాణాలకు అనుబంధంగా అంతే సంఖ్యలో పరి్మట్ రూమ్‌లకు అనుమతి. వీటికి తోడు 43 వేలకుపైగా బెల్డ్ దుకాణాలు. ► ఎమ్మార్పీ ధరల కంటే 25 శాతం వరకు అధిక ధరలకు అమ్మకాలు. ► ఏటా బార్ల సంఖ్య పెంపు. ► మొక్కుబడిగా మద్యం నాణ్యత పరీక్షలు. ఐదేళ్లలో 96,614 శాంపిల్స్ మాత్రమే సేకరణ. ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో 34.9 శాతం పురుషులు, 0.4 శాతం మహిళలకు మద్యం అలవాటు ఉంది. జగన్ హయాంలో ► మద్యం మాఫియా అరాచకాలను ఒక్క విధాన నిర్ణయంతో తుడిచిపెట్టేశారు. ► ప్రైవేటు మద్యం దుకాణాల విధానం రద్దు. ► 2019, అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం. ► మద్యం దుకాణాల వేళలు కుదింపు. ఉ.10 నుంచి రాత్రి వరకే విక్రయాలు. ► 4,380 పరి్మట్ రూమ్‌లు రద్దు. 43వేల బెల్ట్ దుకాణాలు పూర్తిగా తొలగింపు. మద్యం దుకాణాలు క్రమంగా తగ్గింపు. ప్రస్తుతం ఉన్నవి 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే. ► కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. నోటిఫికేషన్ జారీ చేసి ఈ–వేలం ప్రక్రియ ద్వారా బార్ల కేటాయింపు. ► నగదు చెల్లింపులతోపాటు డిజిటల్ చెల్లింపుల విధానం. ► మద్యం నాణ్యత పరీక్షల కోసం బెవరేజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.12.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక లేబరేటరీల ఏర్పాటు. సగటున ఏడాదికి 1,26,083 శాంపిల్స్ పరీక్ష. ► అక్రమ మద్యం అరికట్టేందుకు ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ఏర్పాటు. ► 2019–21 నాటికి ఇది పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గింది. -
పొంగుతున్న బీరు! ఎండల తీవ్రతతో పెరిగిన అమ్మకాలు
సాక్షి, హైదరబాద్: గ్రేటర్లో బీర్ల అమ్మకాలు పెరిగాయి. ప్రతీ వేసవిలో సాధారణంగానే బీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మద్యం ప్రియులు లిక్కర్‌కు బదులు చల్లటి బీర్ల వైపు మొగ్గు చూపుతారు. వేసవి తాపం నుంచి ఊరట పొందేందుకు వీటిని ఆశ్రయిస్తారు. పెరిగిన బీర్ల అమ్మకాల మేరకు ఉత్పత్తి మాత్రం పెరగడం లేదు. ప్రతిరోజూ గ్రేటర్లో 60 వేల నుంచి 80 వేల కేస్లకు పైగా బీర్లు అమ్ముడవుతున్నట్లు అంచనా. మరో 20 వేల కేస్లకు డిమాండ్ ఉన్నప్పటికీ కొరత దృష్ట్యా వినియోగదారులకు అందడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వంద కేస్ల కోసం ఆర్డర్ చేసే వైన్ షాపులకు 70 కేస్ల వరకే లభిస్తున్నట్లు వైన్‌షాపుల నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ నెలలోనే కొరత ఇలా ఉంటే మే నెలంతా బీర్ల డిమాండ్‌ను ఎదుర్కోవడం ఎలా అని వ్యాపారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల మరింత డిమాండ్.. బీర్ కంపెనీల నుంచి ప్రస్తుతం రోజుకు లక్షన్నర నుంచి 2 లక్షల కేస్ల వరకు అందుతున్నాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షన్నర నుంచి 2 లక్షల కేస్లు అమ్ముడవుతున్నట్లు అంచనా. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే సగానికి ఎక్కువగా బీర్ల విక్రయాలు జరుగుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో గ్రేటర్లో సుమారు 12 లక్షల కేస్‌లకుపైగా బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈసారి 15 లక్షల కేస్లకు పైగా డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మే నెలలో ఈ డిమాండ్ మరింత పెరగనుంది. ఈ మేరకు ఉత్పత్తి పెరగడం లేదని అధికారులు చెబుతున్నారు. ‘ఇప్పటి వరకు సాధారణ రోజుల్లోలాగే బీర్ల ఉత్పత్తి ఉంది. డిమాండ్ మేరకు పెరగలేదు. కానీ.. ఎండలు తీవ్రమయ్యే కొద్దీ ఉత్పత్తి పెంచాల్సి ఉంటుంది. ఈ మేరకు కంపెనీలు బీర్లను అందజేస్తాయా? లేదా? అనే అంశంపై సందిగ్ధత నెలకొంది’ అని ఒక అధికారి వివరించారు. మరోవైపు బీర్ల అమ్మకాలు పెరగడంతో మద్యం విక్రయాలు కొంత మేరకు తగ్గుముఖం పట్టినట్లు వైన్‌షాపుల నిర్వాహకులు చెప్పారు. బకాయిల పెండింగ్.. వినియోగదారుల డిమాండ్ మేరకు లక్షల కొద్దీ కేస్ల బీర్లను ఉత్పత్తి చేసే కంపెనీలు కొన్ని రోజులుగా ఉత్పత్తిని తగ్గించాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉండడమే ఇందుకు కారణమని వ్యాపార వర్గాలు తెలిపారు. దాదాపు రూ.4 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో 8 కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. సిబ్బంది సంఖ్యను కూడా తగ్గించారు. ఒకవైపు బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతుండగా.. మరోవైపు వీటి తయారీ సంస్థలు ఉత్పత్తులను తగ్గించడం గమనార్హం. వేసవి కారణంగా నీటి ఎద్దడి కూడా బీర్ల తయారీకి ఇబ్బందిగా మారిందని పలు కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. ‘రోజుకు లక్షన్నర నుంచి 2 లక్షల కేసుల బీర్లను ప్రస్తుతం తయారు చేస్తున్నాం. కానీ ఇదే సమయంలో గతంలో 2 లక్షల కేస్లకు పైగా కూడా ఉత్పత్తి జరిగింది. డిమాండ్ మేరకు ఉత్పత్తి పెరగాల్సి ఉండగా, వివిధ కారణాల దృష్ట్యా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది’ అని ఒక కంపెనీ నిర్వాహకుడు విస్మయం వ్యక్తం చేశారు. 40 లక్షల లీటర్ల నీళ్లు బీర్ల ఉత్పత్తికి అవసరమని, కొద్దిరోజులుగా నీటి లభ్యత తగ్గడంతోనూ బీర్ల ఉత్పత్తిపై ప్రభావం పడిందని పేర్కొన్నారు. -
జనసేన ‘కిక్కు’ దిగింది
సాక్షి, అనకాపల్లి: ఎన్నికల్లో ఏదోవిధంగా తాయిలాలతో గెలవాలని, దానికి భారీగా మద్యం అందిస్తేనే ఫలితం ఉంటుందని భావించారు. భారీగా మద్యం తీసుకొచ్చి గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టాలనే ఆలోచనతో టీడీపీ, జనసేన నేతలు దాదాపు 39,163 క్వార్టర్ బాటిళ్లు గోవా నుంచి అక్రమంగా కొనుగోలు చేశారు. దశలవారీగా మద్యాన్ని వినియోగిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా గడ్డివాములో దాచి సమావేశాలు నిర్వహించినప్పుడల్లా గుట్టు చప్పుడు కాకుండా బయటకు తీస్తున్నారు. తీరా తీగలాగితే డొంక కదిలినట్లు అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తున్న ముగ్గుర్ని పోలీసులు ప్రశ్నిస్తే బండారం బయటపడింది. అనకాపల్లి జిల్లా యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌కు మద్యం విక్రయించేందుకు అక్కడి టీడీపీ నాయకుడు కర్రి వెంకటస్వామి చేస్తున్న అక్రమ మద్యం సరఫరా గుట్టురట్టయింది. వారి నుంచి దాదాపు రూ. 50లక్షల విలువైన 7 వేల లీటర్ల గోవా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ముగ్గురు టీడీపీ నేతలు అరెస్ట్ అక్రమ మద్యం స్వా«దీనం చేసుకున్న సంఘటనపై అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ శనివారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. యలమంచిలి మండలం సోమలింగపాలెంకు చెందిన ప్రధాన నిందితుడు, టీడీపీ నేత కర్రి వెంకటస్వామి అక్రమంగా మద్యం తీసుకువచ్చి విక్రయిస్తుంటాడు. అతనికి అదే గ్రామానికి చెందిన కర్రి ధర్మతేజ, బొడ్డేటి దినేష్‌కుమార్ సహకరించారు. పది రోజుల క్రితం గోవా నుంచి సరుకు తెప్పించి, యలమంచిలి మున్సిపాలిటీ పరిధి సోమలింగంపాలెంలోని తన పశువుల పాక వద్ద గడ్డివాములో దాచిపెట్టాడు. ఈ మద్యాన్ని యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒక్కసారిగా ఇస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉందని సమావేశాలు నిర్వహించినప్పుడల్లా వెంకటస్వామి మద్యం అందించేవాడు. శనివారం మధ్యాహ్నం మునగపాక గ్రామంలో అక్రమ మద్యం రవాణా జరుగుతుందని వచ్చిన సమాచారంతో మునగపాక ఎస్సై ఆధ్వర్యంలో పోలీసు బృందం తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పద వస్తువులను పట్టుకెళుతున్నట్టు గమనించి వారి లగేజ్‌ను తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద 5 కేసుల్లో 180 మిల్లీ లీటర్లు కలిగిన 240 రాయల్ బ్లూ లిక్కర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. అంతేగాక మరికొంత మద్యాన్ని దాచిపెట్టినట్లు చెప్పడంతో గడ్డివాము వద్ద భారీ ఎత్తున దాచిన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అక్రమ మద్యం ఎవరెవరికి సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. డంపు వెనక ఎవరున్నారు, అనే విషయాలను విచారిస్తున్నామని ఎస్పీ చెప్పారు. దీని వెనుక ఎవరున్నా అరెస్టు చేస్తామన్నారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, యలమంచిలి సీఐ గఫNర్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి అనకాపల్లి జిల్లా జడ్జి వద్ద హాజరు పరిచారు. నిందితుల నుంచి రెండు బైక్‌లను స్వాదీనం చేసుకున్నారు. -
సీఎం రమేష్ సారా అక్రమాల చరిత్ర ఇది
టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఆయన నమ్మిన బంటు.. కూటమి తరఫున అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అక్రమాల బాగోతాలు అన్నీ ఇన్నీ కావు.. సీఎం రమేష్‌పై తాజాగా పోలీస్ కేసు నమోదైంది. ‘‘నా సంగతి మీకు తెలియదంటూ..’’ జీఎస్టీ తనిఖీల కోసం వెళ్లిన డీఆర్ఐ అధికారులపై గుండాయిజం ప్రదర్శించిన సీఎం రమేష్ అక్రమాల చరిత్రను పరిశీలిస్తే.. కుప్పంలో ఒకప్పుడు సీఎం రమేష్ తన తండ్రితో పాటు సారా వ్యాపారం చేశారు. రాయదుర్గం నుంచి అక్రమంగా సారా ప్యాకెట్లు తెప్పిస్తుంటే సీఎం రమేష్‌ను, ఆయన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. మరొక కేసులో సీఎం రమేష్ తండ్రిని పీడీ యాక్ట్ కింద అరెస్టు అయ్యారు. అధికారంలో ఉన్నవాళ్లను ఎలా ఆకట్టుకోవాలో సీఎం రమేష్‌కు బాగా తెలుసు. 1989–94లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసుల నుంచి బయట పడడానికి సీఎం రమేష్ ఆయన కుటుంబం కడపలో ఉన్న ఓ మంత్రి సాయం తీసుకునే వారు. చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం వెళ్లాక సీఎం రమేష్ పోట్లదుర్తి నుంచి కొంతమందిని తీసుకెళ్లి కుప్పంలో దొంగ ఓట్లు నమోదు చేయించారు. కుప్పంలో ఓటు మేనేజ్మెంట్ అంతా సీఎం రమేష్ ఆయన తీసుకెళ్లిన పోట్లదుర్తి మనుషులే చూసుకునేవాళ్లు. అప్పటి నుంచి చంద్రబాబుతో సీఎం రమేష్‌కు వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ సాన్నిహిత్యం ఏర్పడింది. ఇప్పుడు సీఎం రమేష్ రూ.వేల కోట్లకు అధిపతిగా ఉన్నాడు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్ అనకాపల్లిలో సుమారు 200 మందిని తీసుకెళ్లి జీఎస్టీ అధికారులను భయభ్రాంతులకు గురి చేశారు. వీటికి బీజేపీ ఏమి సమాధానం చెబుతుంది.? కోల్‌కత్తాలో ఈడీ అధికారులపై అక్కడి టీఎంసీ నేతలు దాడికి దిగితే ఖండించిన బీజేపీ ఇప్పుడు సీఎం రమేష్ చేసిన ఈ దౌర్జన్యానికి ఏం సమాధానం చెబుతుంది? అక్రమ సారా నుంచి రూ.3 వేల కోట్లకు ఎదిగాడు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సీఎం రమేష్ తనకు ఏం కావాలో చెప్పి చేయించుకునేవారు. అనకాపల్లిలో ప్రస్తుత ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేయడానికి ఉన్నాడు. పోట్లదుర్తి నుంచి తన మనుషులను అనకాపల్లికి తీసుకొచ్చాడు. నీతులు చెబుతున్న చంద్రబాబు... సీఎం రమేష్ ఎదుగుదలలో ఆయన పాత్ర ఎంటో చెప్పగలరా?. గతంలో విజయమ్మ పోటీ చేసినప్పుడు కడప నుంచి మనుషులను తీసుకొచ్చారని టీడీపీ వాళ్లు అసత్య ప్రచారాలు చేయించారు. ఆమె ఓటమికి కారణమయ్యారు. కడప ప్రాంతానికే చెందిన రమేష్ ఇప్పుడు అనకాపల్లిలో చేస్తున్న దౌర్జన్యానికి ఏం సమాధానం చెబుతారు. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఎంపీగా గెలిస్తే ఫారెన్ లిక్కర్ ఇస్తా: మహిళా అభ్యర్థి వినూత్న ప్రచారం
చంద్రాపూర్: ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను గెలిస్తే పేదలకు సబ్సిడీ పై బీరు, విస్కీ అందిస్తానని మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో ఓ స్వతంత్ర అభ్యర్థి చెబుతున్నారు. ఈ విచిత్ర హామీ ఇస్తున్న అభ్యర్థి పేరు వనితా రౌత్. బీరు, విస్కీలను సబ్సిడీ ధరలకు ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో బీరు బార్లు ఓపెన్ చేసి ఎంపీ నిధుల నుంచి విదేశీ మద్యంతో పాటు విదేశీ బీర్లను కూడా ఇస్తానని చెబుతోంది వనితా రౌత్. అయితే ఈ స్కీమ్ కింద తాగేవాళ్లు, అమ్మేవాళ్లు ఇద్దరికీ లైసెన్స్ ఉండాల్సిందేనన్న కండీషన్ పెడుతోంది. అత్యంత కష్టపడి పనిచేసే పేదలకు ఉన్న ఒకే ఒక విలాసం మందు తాగడమని, ఇందుకే తన ఈ వినూత్న స్కీమ్ వారికి అవసరమని సమర్థించుకుంటోంది. పేదలకు అందుబాటులో ఉండేది కేవలం దేశీయ మద్యమేనని, ఇది తాగి వారు చనిపోతున్నారని, ఇందుకే వారి కోసం విదేశీ మద్యం తెప్పించి ఇస్తానని తెలిపింది. వనిత ఎన్నికల్లో పోటీ చేయడం ఇది తొలిసారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్ నుంచి పోటీ చేయగా, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిమూర్ సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచారు. గతంలో కూడా విస్కీ, బీరు హామీ ఇచ్చినందుకు ఆమె సెక్యూరిటీ డిపాజిట్‌ను ఎన్నికల కమిషన్ జప్తు చేసింది. అయినా ఆమె మారకుండా మళ్లీ అదే హామీ ఇస్తుండటం విశేషం. ఇదీ చదవండి.. మోదీ హామీలు చైనా వస్తువుల లాంటివి -
టానిక్ వైన్ షాప్స్ సోదాల్లో సంచలన విషయాలు