చెన్నై: తమిళనాడులో కల్లకురిచ్చి హుచ్ కల్తీసారా విషయంలో మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కల్లకురిచ్చి కల్తీసారా కేసు సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కల్తీ మద్యం వెనుక మాఫియా ఉందంటూ అన్నాడీఎంకే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం సేవించి దాదాపు 65 మంది చనిపోయారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ దారుణ ఘటన విషయంలో స్టాలిన్ సర్కార్‌ను ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో ప్రభుత్వం సీబీసీఐడీ (క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) చేత విచారణకు ఆదేశించింది. అయినప్పటికీ అసలు వాస్తవాలు బయటకు రాకపోవడంతో ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ డీ. కృష్ణకుమార్, జస్టిస్ పీబీ బాలాజీల ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలను ధర్మాసనం ఏకీభవించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
#BREAKING he Madras High Court has ordered the transfer of the investigation into the case concerning the poisoning incident in Karunapuram, Kallakkurichi district, which resulted in 66 fatalities, to the Central Bureau of Investigation (CBI). The ruling was delivered by… pic.twitter.com/e4CroLK1jH
— Mahalingam Ponnusamy (@mahajournalist) November 20, 2024
Comments
Please login to add a commentAdd a comment