Madras High Court
-
‘అత్యాచారం కేసును రాజకీయం చేస్తున్నారు’
చెన్నై: తమిళనాడును కుదిపేసిన అన్నా యూనివర్సిటీ(Anna University) ఘటనపై ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్‌ను తాజాగా మద్రాస్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించింది.ఘటనను నిరసిస్తూ చెన్నై వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) భావించింది. అయితే.. పోలీసులు అందుకు అనుమతి నిరాకరించారు. దీంతో పీఎంకే హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం.. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది.మరోవైపు..ఈ కేసులో ప్రజాగ్రహం పెల్లుబిక్కడంతో సిట్‌తో దర్యాప్తు చేయించాలని మద్రాస్ హైకోర్టు ఇదివరకే ఆదేశించింది కూడా.డిసెంబర్ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్‌లో విద్యార్థిని తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగాయి. అదే సమయంలో..ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ జ్ఞానేశ్వర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా బిర్యానీ వ్యాపారి అయిన జ్ఞానేశ్వర్.. అధికార డీఎంకే యువ విభాగానికి గతంలో పని చేశాడు. దీంతో రాజకీయంగానూ దుమారం రేగింది. విద్యా సంస్థలలోనూ విద్యార్దినులకు భద్రత కరువైందన్న ఆందోళనను ప్రతిపక్షాలు వ్యక్తంచేశాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai), డీఎండీకే ప్రధాన కార్యదర్శిప్రేమలత విజయకాంత్, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు వేర్వేరు ప్రకటనలో ఈ ఘటనను ఖండించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు పలువురు డీఎంకే నేతలతో జ్ఞానేశ్వర్ దిగిన ఫొటోలను వైరల్ చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ అడుగు ముందుకు వేసి ఘటనకు నిరసనగా కొరడాతో బాదుకున్నారు. ప్రభుత్వం కదిలేవరకు చెప్పులు వేసుకోనంటూ ప్రతిన బూనారు. మరోవైపు టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ కూడా కేసులో బాధితురాలికి సత్వర న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజా మద్రాస్ హైకోర్టు రాజకీీయం చేస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం. -
ధనుశ్ - నయనతార వివాదం.. కోర్టు కీలక ఆదేశాలు!
నయనతార- కోలీవుడ్ హీరో ధనుశ్ మధ్య వివాదం కీలక మలుపు తిరిగింది. ధనుశ్ ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన సినిమాలోని ఓ క్లిప్‌ను అనుమతి లేకుండా వినియోగించారంటూ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం హీరోయిన్ నయనతారకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ నయన్‌కు నోటీసులిచ్చింది. ఈ వ్యవహరంలో మీ వైఖరి చెప్పాలంటూ నయన్ దంపతులతోపాటు నెట్‌ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశించింది. అసలేంటి వివాదం?ఇటీవల నయనతార తన ప్రేమ పెళ్లిపై రూపొందించిన డాక్యుమెంటరీని విడుదల చేసింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో రిలీజైన డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని మూడు సెకన్ల క్లిప్‌ను ఉపయోగించారు. దీంతో తన పర్మిషన్ లేకుండా తన సినిమాలోని క్లిప్‌ను వినియోగించారంటూ ధనుశ్ టీమ్ రూ.10 కోట్లకు దావా వేసింది. ఆ తర్వాత నయనతార ఈ వివాదంపై బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. -
తమిళ నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్ట్
తమిళ ఇండస్ట్రీలో రివ్యూలపై వివాదం నడుస్తోంది. సినిమా రిలీజ్ రోజే థియేటర్ల దగ్గర రివ్యూలు తీసుకుని, ఆ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల తాము భారీగా నష్టపోతున్నామని నిర్మాతల మండలి చాలారోజులుగా అభ్యంతరం చెబుతూనే ఉంది. కొన్నిరోజులు క్రితమే దీనిపై ఏకపక్షంగా నిర్ణయం కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు దీనిపై మద్రాసు హైకోర్టు.. సదరు నిర్మాతల మండలికి షాకిచ్చింది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)రీసెంట్గా తమిళంలో రిలీజైన పెద్ద సినిమా 'కంగువ'. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి తొలి ఆట నుంచే ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. దీనికి రివ్యూలే కారణమని భావించిన నిర్మాతలు.. తొలిరోజు థియేటర్ల దగ్గర రివ్యూలు చెప్పనివ్వకుండా యూట్యూబర్లని నిషేధించాలని తీర్మానించించది. ఇందులో భాగంగా థియేటర్ యజమానులు.. ఈ విషయంలో తమకు సహకరించాలని కోరింది. దీనికి వాళ్లు కూడా ఒప్పుకొన్నారు.ఈ నిర్ణయంపై కొందరు వ్యక్తులు.. మద్రాసు హైకోర్టుని ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగ్గా.. నిర్మాతల మండలి అభ్యర్థులని మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ఉద్దేశపూర్వకంగా రివ్యూలు ఇచ్చి, నష్టం వాటిల్లినట్టు ఆధారాలుంటే చట్టపరంగా ముందుకు వెళ్లాలి తప్పితే.. రివ్యూ ఇవ్వొద్దని స్టే ఇవ్వలేమని మద్రాస్ హైకోర్టు తెలిపింది. రివ్యూల మార్గదర్శకాలపై వివరణ ఇవ్వాలని యూట్యూబ్ ఛానల్స్‌కి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్) -
నయనతార డాక్యుమెంటరీ.. మరింత ముదిరిన వివాదం..!
కోలీవుడ్‌లో వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత మొదలైన వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే రూ.10 కోట్ల పరిహారం కోరుతూ నోటీసులు పంపించిన హీరో ధనుశ్.. తాజాగా కోర్టులో దావా వేశారు. నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌పై తాజాగా దావా వేశారు. గతంలో నయన్, ధనుశ్ జంటగా నటించిన నానుమ్ రౌడీ దాన్ మూవీలోని మూడు సెకన్ల క్లిప్‌ను అనుమతి లేకుండా వినియోగించారంటూ ధనుశ్ టీమ్ ఆరోపించింది. ఈ విషయంపై ఇప్పటికే నయనతారకు నోటీసులు కూడా పంపారు. అయితే తాజాగా ఆ మూవీ నిర్మాణసంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం విచారణకు అనుమతించింది. అయితే ఇటీవల ఓ పెళ్లి వేడుకలో కలిసిన వీరిద్దరు ఒకరిని ఒకరు అస్సలు పట్టించుకోలేదు. అసలేం జరిగిందంటే..ఇటీవల విడుదలైన నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది. కాగా.. నయనతార డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. -
కల్లకురిచ్చి కల్తీసారా కేసు.. మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడులో కల్లకురిచ్చి హుచ్ కల్తీసారా విషయంలో మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కల్లకురిచ్చి కల్తీసారా కేసు సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కల్తీ మద్యం వెనుక మాఫియా ఉందంటూ అన్నాడీఎంకే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం సేవించి దాదాపు 65 మంది చనిపోయారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ దారుణ ఘటన విషయంలో స్టాలిన్ సర్కార్‌ను ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో ప్రభుత్వం సీబీసీఐడీ (క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) చేత విచారణకు ఆదేశించింది. అయినప్పటికీ అసలు వాస్తవాలు బయటకు రాకపోవడంతో ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ డీ. కృష్ణకుమార్, జస్టిస్ పీబీ బాలాజీల ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలను ధర్మాసనం ఏకీభవించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. #BREAKING he Madras High Court has ordered the transfer of the investigation into the case concerning the poisoning incident in Karunapuram, Kallakkurichi district, which resulted in 66 fatalities, to the Central Bureau of Investigation (CBI). The ruling was delivered by… pic.twitter.com/e4CroLK1jH— Mahalingam Ponnusamy (@mahajournalist) November 20, 2024 -
తెలుగువారిపై వివాదాస్పద కామెంట్స్.. కస్తూరికి షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు!
ప్రముఖ నటి కస్తూరి తెలుగు వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో కస్తూరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.ముందస్తు బెయిల్ నిరాకరణ..ఈ కేసులో నటి కస్తూరి ఇప్పటికే మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.క్షమాపణలు చెప్పిన కస్తూరిఅయితే తన వ్యాఖ్యల పట్ల నటి కస్తూరి క్షమాపణలు చెప్పింది. తనకు తెలుగు గడ్డ మెట్టినిల్లు అని, తెలుగు ప్రజలను తాను కించపరిచే విధంగా మాట్లాడలేదని చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలను డిఎంకే పార్టీ నేతలే తప్పుగా ప్రచారం చేశారని వారిపై ఆమె ఫైర్ అయింది. దీంతో ఆ పార్టీ నేతలే తనను టార్గెట్ చేస్తున్నారని కూడా ఆరోపించింది. అయినప్పటికీ కస్తూరి వ్యాఖ్యలపై చెన్నై,మదురై వంటి ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.ఇంటికెళ్లిన పోలీసులు..ఆమె కేసులు నమోదు చేసిన పోలీసులు సమన్లు జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి వెళ్లారు. అయితే, తన ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉందని సమాచారం. కేసుల భయంతో ఆమె పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ కేసుల విషయంలో ఆమె ఒక లాయర్‌ను సంప్రదించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.అసలేం జరిగిందంటే..హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ నటి కస్తూరి తెలుగువారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని ఆమె వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్ చేసింది. అలా అయితే, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించింది. ఇదే వేదికపై ఆమె డిఎంకే పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేయడం వల్ల ఆ పార్టీ నేతలు తనపై కుట్రకు ప్లాన్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. -
కోర్టులో రిలయన్స్ పిటిషన్.. కంగువ విడుదలకు అడ్డంకులు
సౌత్ ఇండియాలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'కంగువ'. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్ కీలకపాత్రలు చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్ రాజా ఈ సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టారు. అయితే, ఈ సినిమా విడుదల విషయంలో పలు అడ్డంకులు వచ్చేలా కనిపిస్తున్నాయి. రిలయన్స్ నిర్మాణ సంస్థ ఫిర్యాదుతో కంగువ సినిమా రిలీజ్ విషయంలో మద్రాస్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.3డీ ఫార్మెట్లో 10 భాషల్లో నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుందని అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, ఈ సినిమా నిర్మాత కేఈ.జ్ఞానవేల్ రాజా, రిలయన్స్ సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీల చిక్కులు ఉన్నాయి. స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ తరపున టెడ్డీ-2, ఎక్స్ మీట్స్ ఓయ్, తంగలాన్ చిత్రాల నిర్మాణం కోసం రిలయన్స్ నుంచి రూ.99 కోట్లు పైగానే జ్ఞానవేల్ రాజా రుణం పొందారు. అయితే, ఇప్పటికే రూ.45 కోట్లు తిరిగి చెల్లించిన జ్ఞానవేల్ రాజా మిగిలిన రూ.55 కోట్లు చెల్లించకుండా కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని రిలయన్స్ తరపున మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలైంది.తమకు చెల్లించాల్సిన డబ్బు అందేవరకు సూర్య నటించిన గంగువ సినిమా విడుదలను ఆపేయాలని రిలయన్స్ నిర్మాణ సంస్థ కోర్టుకెళ్లింది. మరోవైపు తంగళాన్ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయకూడదని ఆ పిటిషన్లో పేర్కొంది. జస్టిస్ కుమారేష్ బాబు ముందు కేసు విచారణకు వచ్చినప్పుడు, స్టూడియో గ్రీన్ ఇలా తెలిపింది. 'నవంబర్ 7 వరకు సమయం కావాలని కోరింది. అప్పటి వరకు 'కంగువ'ను విడుదల చేయబోమని తెలిపింది. ఈ క్రమంలో తంగలాన్ చిత్రాన్ని కూడా నవంబర్ 7వరకు విడుదల చేయబోమని హామీ ఇచ్చింది. దీనిని నమోదు చేసుకున్న న్యాయమూర్తి కేసు విచారణను నవంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు. అయితే, కంగువ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది. ఆ సమయంలోపు ఈ కేసు క్లియర్ కాకపోతే సినిమా విడుదలకు చిక్కులు తప్పవని ఇండస్ట్రీ వర్గాలే పేర్కొంటున్నాయి. -
ఈషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
న్యూఢిల్లీ: తమిళనాడులో కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఇషా ఫౌండేషన్‌పై మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈషా ఫౌండేషన్‌లో తమ కూతుళ్లకు బ్రెయిన్ వాష్‌చేసి సన్యాసం వైపు మళ్లించారని ఆరోపిస్తూ ప్రొఫెసర్ వేసిన కేసు విచారణను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ కేసులో మద్రాస్ హైకోర్టు పూర్తి అనుచితంగా వ్యవహరించిందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇద్దరు మహిళలు గీత(42), లత(39) మేజర్లు కావడం, వారి ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో నివసిస్తున్నందున ఈ పిటిషన్ చట్టవిరుద్దమని, దీనిని తిరస్కరిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.కాగా పిటిషనర్ కూతుళ్లలో ఒకరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను, నా సోదరి స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగానే ఈషా ఫౌండేషన్‌లో నివసిస్తున్నాం. ఇందులో ఎవరి బలవంతం, ఒత్తిడి లేదు. మా తండ్రి ఎనిమిదేళ్లుగా మమ్మల్ని వేధిస్తున్నారు’ అని కోర్టుకు తెలిపారు.కేసు పుర్వాపరాలు..ఈషా ఫౌండేషన్‌పై తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేయడంతో మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇద్దరు కుమార్తెలు గీత, లత ఈషా యోగా కేంద్రంలో యోగా నేర్చుకునేందుకు వెళ్లి అక్కడే ఉండి పోయారని, ఈశా కేంద్రంలో వారికి బ్రెయిన్ వాష్ చేసి సన్యాసంవైపు మళ్లించారని ఆయన ఆరోపించారు. ఇద్దరు కుమార్తెలను తమకు అప్పగించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈషా యోగా కేంద్రంపై ఇప్పటి వరకు ఎన్ని క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి వివరాలు దాఖలు చేయాలని పోలీసులకు ఉత్తర్వులిచ్చింది. ఆశ్రమంలో ఉన్న అందరినీ విచారించాలని ఆదేశించింది. ప్రొఫెసర్ ఆరోపణలను ఈషా యోగా కేంద్రం తోసిపుచ్చింది. తాము ఎవర్నీ పెళ్లి చేసుకోమనిగానీ.. సన్యాసం తీసుకోవాలని గానీ సలహాలు ఇవ్వమని, ఎవరికి వారు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంటారని ఓ ప్రకటన విడుదల చేసింది.దీనిపై ఈషా యోగా కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసులకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ధర్మాసనం స్టే విధించింది. అలాగే స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని తమిళనాడు పోలీసును స్పష్టం చేసింది. తాజాగా ఇద్దరు మహిళలు ఆ శ్రమంలో స్వచ్ఛందంగానే ఉంటున్నారని అత్యున్నత న్యాయస్థానానికి పోలీసులు వివరాలు సమర్పించారు. దీంతో కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. -
సుప్రీం కోర్టులో ఈశా ఫౌండేషన్‌కు ఊరట
ఢిల్లీ: ఈశా ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని ఇటీవల పోలీసులను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం మద్రాసు హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఈశా ఫౌండేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మద్రాసు హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు ధర్మాసనం స్టే ఇచ్చింది. ఆశ్రమంలో పోలీసుల సోదాలు నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు మహిళలతో ఆన్లైన్లో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మాట్లాడారు. ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నామని ఇద్దరు యువతులు తెలిపారు. ఈశా యోగా ఆశ్రమంలో తమిళనాడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పేర్కొంది. ఇక.. ఈ కేసులో పూర్తి స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని తమిళనాడు పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 18కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.ఇక.. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్ యోగా కేంద్రాన్ని మంగళవారం దాదాపు 150 మంది పోలీసు సిబ్బంది ప్రభుత్వ అధికారులతో కూడిన బృందం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.చదవండి: కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. -
కోర్టు ఆదేశాలు.. ఈశా ఫౌండేషన్‌లో పోలీసుల సోదాలు
చెన్నై: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్‌కు చెందిన ఈశా ఫౌండేషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన సొంత కూతురికి పెళ్లి చేసి సంప్రదాయబద్ధంగా స్థిరపడేలా ఏర్పాటు చేసిన వాసుదేవ్.. యువతులను ప్రాపంచిక వృత్తిని త్యజించమని, తల దువ్వుకుని, తన యోగా కేంద్రాల్లో సన్యాసులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించింది.సోమవారం హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు ఎస్ఎం సుబ్రమణ్యం, వి.శివజ్ఞానం ఎదుట విచారణ విచారణకు వచ్చింది. విచారణ జరిగే సమయంలో కీలక కామెంట్స్ చేసింది. ఈశా పౌండేషన్‌కు సంబంధించి సమగ్ర నివేదికను సెప్టెంబర్ 4 (శుక్రవారం) లోపు కోర్టుకు అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే..తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలోని తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.కామరాజ్ (69)హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో తన ఇద్దరు కుమార్తెల్లో శక్తి సామర్ధ్యాలను తగ్గేలా మందులు ఇచ్చారని, జుత్తు కత్తిరించుకుని తన యోగా కేంద్రాల్లో సన్యాసులుగా జీవించమని ప్రోత్సహించినట్లు ఆరోపించారు. ఈశా ఫౌండేషన్‌లో చేరితన పెద్ద కుమార్తె ..ప్రతిష్టాత్మక యూకే యూనివర్శిటీ నుంచి మెకాట్రానిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది. 2008లో విడాకులకు ముందు అత్యధిక వేతనంతో ఉద్యోగం కూడా చేసింది. వైవాహిక జీవితంలో సమస్యలు రావడంతో ఆమె తన భర్త నుంచి విడిపోయారని, ఆ తర్వాత ఆధ్యాత్మిక బాట పట్టినట్లు కామరాజ్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆమె ఈశా ఫౌండేషన్‌లో యోగా తరగతులకు హాజరుకావడం ప్రారంభించింది. కొంత కాలానికి ఐటీ ఉద్యోగం చేసిన నా చిన్న కుమార్తె సైతం ఈశా ఫౌండేషన్‌లో చేరింది. చివరికి శాశ్వతంగా ఆశ్రమంలోనే నివసించాలని నిర్ణయించుకున్నారు.న్యాయం చేయండిఇప్పుడు ఇంటికి రావడం లేదని, తన కుమార్తెల జీవితాన్ని జగ్గీ వాసుదేవ్ నాశనం చేశారని పిటిషనర్ కామరాజ్ తెలిపారు. కుమార్తెల జీవితం నాశనం అవ్వడంతో తన భార్య అనారోగ్యానికి గురయ్యారని, తనకు న్యాయం చేయాలని కోరారు. తన కుమార్తెలతో పాటు ఎందరో తల్లిదండ్రులకు దూరంగా ఈశా ఫౌండేషన్‌లో చేరి వారి జీవితాల్ని నాశనం చేసుకున్నట్లు చెప్పారు.క్రిమినల్ కేసులు నమోదుఇప్పటికే ఈశా ఫౌండేషన్‌లో పనిచేస్తున్న వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదైన విషయాన్ని పిటిషనర్ పిటిషన్లో ప్రస్తావించారు. ఇటీవల అదే సంస్థలో పనిచేస్తున్న ఓ వైద్యుడు ఆదివాసీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 12 మంది బాలికలను వేధించాడని,ఆయనపై పోక్సో కింద క్రిమినల్ కేసు నమోదయ్యాయని, అందుకు గల ఆధారాల్ని కోర్టుకు అందించారు. హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణరిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ప్రతిస్పందనగా విచారణ మొదలైంది. తన ఇద్దరు కుమార్తెలను కేంద్రంలో వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఉంచారని కామరాజ్ పేర్కొన్నారు. ఇషా ఫౌండేషన్ వ్యక్తుల బ్రెయిన్‌వాష్ చేసి, వారిని సన్యాసులుగా మారుస్తోందని, వారి కుటుంబాలతో సంబంధాలు కొనసాగించకుండా అడ్డుకుంటున్నదని కామరాజ్ ఆరోపించారు.ప్రతి స్పందనగా ఇషా ఫౌండేషన్ తరపు న్యాయవాది కె.రాజేంద్ర కుమార్, ఫౌండేషన్‌ను సమర్థించారు. ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించడంతోపాటు వారి జీవితాల గురించి వారి సొంత ఎంపికలు చేసుకునే హక్కు పెద్దలకు ఉందని నొక్కి చెప్పారు. ఈశా ఫౌండేషన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు కామరాజ్ ప్రయత్నించారని, తమ సంస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాదించారు. ఇరు పక్షాల వాదనలు హైకోర్టు ఎస్ఎం సుబ్రమణ్యం,వి.శివజ్ఞానం న్యాయమూర్తులు ఈశా ఫౌండేషన్‌లోని పద్ధతులపై ప్రశ్నలను లేవనెత్తారు. జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు వివాహం చేసి స్థిరపడేలా చేశారని, కానీ యువతులను సన్యాసులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహించారని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు.. ఈశా ఫౌండేషన్‌లో సోదాలుఅనంతరం, జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈశా ఫౌండేషన్‌పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో కోయంబత్తూర్ రూరల్ డిస్ట్రిక్ అసిస్టెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కే. కార్తికేయన్ నేతృత్వంలో ముగ్గురు డిప్యూటీ సూపరింటెండెంట్లు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు 150 మంది పోలీసు అధికారుల బృందం కోయంబత్తూరులోని తొండముత్తూర్లోని మంగళవారం వెల్లియంగిరి పాదాల వద్ద ఉన్న ఈశా ఫౌండేషన్ ఆశ్రమంలో విచారణ చేపట్టారు.ఈ సోదాలపై ఈశా యోగా సెంటర్ ప్రతినిధులు అధికారికంగా స్పందించారు. ‘కోర్టు ఆదేశాల మేరకు..ఎస్పీలు ఇషా యోగా సెంటర్లో సాదారణంగా తనిఖీలు నిర్వహించారు. యోగా సెంటర్లో ఉండే వారిని, వాలంటీర్లను వారి జీవన విధానం ఎలా ఉంటుంది? ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడ ఎలా ఉంటున్నారు?’ అని ప్రశ్నలు వేసినట్లు చెప్పారు. -
బాలలకు సుప్రీమ్ రక్షణ!
భారత సర్వోన్నత న్యాయస్థానం సోమవారం చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. మద్రాస్ హైకోర్ట్ గతంలో చేసిన తప్పును సరిదిద్దింది. బాలలపై లైంగిక అకృత్య, అశ్లీల దృశ్యాల వీడియోలను డౌన్ లోడ్ చేసినా, కలిగివున్నా, చివరకు చూసినా, సదరు అంశాలపై నిర్ణీత అధికారులకు ఫిర్యాదు చేయకున్నా కూడా పోక్సో, ఐటీ చట్టాల కింద నేరమేనని కుండబద్దలు కొట్టింది. దాదాపు 200 పేజీల తాజా తీర్పుతో బాలలపై లైంగిక అత్యాచారాలను నిరోధించేలా ‘లైంగిక అకృత్యాల నుంచి బాలలకు రక్షణ’ (పోక్సో) చట్టానికి పదును పెట్టింది. పసిపాపల నుంచి ఎదిగిన మైనర్ల వరకు బాలలందరి పైనా దేశంలో అంతకంతకూ అఘాయిత్యాలు పెరుగుతున్న వేళ రానున్న రోజుల్లో ఈ తీర్పు బలమైన ప్రభావం చూపనుంది. ఇంటా బయటా ప్రతిచోటా కామాంధుల బెడద పెచ్చరిల్లిన సమయంలో ఈ సుప్రీమ్ తీర్పు భారతదేశంలోని బాలబాలికలకు భారీ ఊరట, బలమైన అండ. తాజా సుప్రీమ్ కోర్ట్ ఆదేశంతో చైల్డ్ పోర్నోగ్రఫీ సమాచారాన్ని ‘కలిగి ఉండడం’ అనే పదం తాలూకు నిర్వచన పరిధి పెరిగింది. అలాంటి దృశ్యాలను డౌన్లోడ్ చేయకున్నా, పరికరంలో పదిలపరుచుకోకపోయినా... కేవలం చూసినా సరే ఇప్పుడది పోక్సోలోని సెక్షన్ 15 కింద నేరమే అవుతుంది. ఇది కేవలం సాంకేతికపరమైన అంశం కానే కాదు... తీవ్రమైన నేరం. నిజానికి, చైల్డ్ పోర్న్ దృశ్యాల తయారీ, పంపిణీయే నేరమనీ, ఎలక్ట్రానిక్ పరికరాల్లో డౌన్లోడ్ చేసి ప్రైవేటుగా చూసినంత మాత్రాన అది నేరం కిందకు రాదనీ ఆ మధ్య మద్రాస్ హైకోర్ట్ తీర్పునిచ్చింది. మొబైల్లో డౌన్లోడ్ చేసి చూసిన ఓ చెన్నై కుర్రాడిపై నేర విచారణను జనవరి 11న రద్దు చేసింది. దీని వల్ల బాలల సంక్షేమంపై దుష్ప్రభావం పడుతుందని తప్పుబడుతూ వివిధ స్వచ్ఛంద సంస్థల సమాహారమైన ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’ సుప్రీమ్ గడప తొక్కింది. సింగిల్ జడ్జి ఇచ్చిన సదరు తీర్పు ‘ఘోరమైనది’ అంటూ మార్చిలోనే సుప్రీమ్ తప్పుబట్టింది. మద్రాస్ హైకోర్ట్ తీర్పు ‘అసాధారణ∙తప్పు’ అని సుప్రీమ్ తన తాజా ఆదేశంలో వ్యాఖ్యానించడం గమనార్హం.సుప్రీమ్ తన తాజా ఆదేశంతో ఆ పాత మద్రాస్ హైకోర్ట్ తీర్పును తోసిపుచ్చినట్టయింది. అదే సమయంలో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ అనే పదం నేరాన్ని తేలిక చేస్తున్నట్టు ఉందని భావించింది. ఆ పదాన్ని పరిహరించి, దాని బదులు ‘బాలలపై లైంగిక అకృత్యాలు, దాడుల సమాచారం’ (సీఎస్ఈ ఏఎమ్) అనే పదాన్ని సంబంధిత చట్టాలన్నిటిలో వాడేలా పార్లమెంట్ ఆర్డినెన్స్ తీసుకురావాలని అభ్యర్థించడం విశేషం. ఇకపై న్యాయస్థానాలన్నీ తమ ఆదేశాలు, తీర్పుల్లో ఈ పదాన్నే వాడాలని కూడా సుప్రీమ్ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, మరో న్యాయమూర్తి జస్టిస్ పార్దీవాలాలతో కూడిన సుప్రీమ్ ధర్మాసనం ఇచ్చిన ఆదేశం, చేసిన అభ్యర్థన ఆలోచించదగినది, స్వాగతించవలసినది. గమనిస్తే, సమస్యంతా చట్టాలలోని అంశాలకు కొన్ని కోర్టులు సంకుచిత అంతరార్థాలు తీయడంతో వస్తోంది. మద్రాస్ హైకోర్ట్‌లోనూ జరిగింది అదే. తద్వారా బాలలపై సైబర్ నేరాలకు పాల్పడినవారిని శిక్షించడానికి ఉద్దేశించిన చట్టాల ప్రయోజనమే దెబ్బతింటోంది. అందుకే, ఈ విషయంలో కోర్టులు జాగరూకతతో ఉండాలని సుప్రీమ్ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. గణాంకాలు గమనిస్తే, దేశంలో బాలలపై అకృత్యాలు అంతకంతకూ అధికమవుతున్నాయి. ఒక్క 2022లోనే వాటి సంఖ్య 8.7 శాతం పెరిగింది. అలాంటి ఘటనలు 1.68 లక్షలకు చేరినట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) మాట. పసివారిపై అఘాయిత్యాలు జరిగినప్పటికీ భయం, సమాజంలో పడే కళంకం, అవగాహన లేమితో ఇంకా అనేక కేసులు వెలుగులోకి రావట్లేదు. పైగా, ఇంట్లో అయినవాళ్ళు, బడిలో ఉద్యోగులు సైతం సాగిస్తున్న ఈ అమానుషాలు పిల్లల మనసులపై జీవితాంతం ప్రభావం చూపుతున్నాయి. పెరిగి పెద్దయినా సరే వారిని ఆ చేదు అనుభవాల నుంచి మానసికంగా బయట పడనీయకుండా చేస్తున్నాయి. వీటన్నిటినీ అరికట్టడానికే 2012లోనే పోక్సో లాంటి కఠినచట్టాలు వచ్చాయి. అయినా, బాలలపై అత్యాచారాలు ఆగక పోవడం విషాదం. సదరు కేసులు పెరుగుతున్నందున ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలంటూ అయిదేళ్ళ క్రితమే సుప్రీమ్ ఆదేశించింది. అయితే, రెగ్యులర్ కోర్ట్లకే జడ్జీలు కరవైన పరిస్థితుల్లో ఇక ఈ ఫాస్ట్ట్రాక్ల కథేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. దానికి తోడు చట్టంలోని కఠిన అంశాలకు ఒక్కో హైకోర్ట్ ఒక్కో రకం అర్థం చెబుతూ, వ్యాఖ్యానం చెప్పడం పెను సమస్యయి కూర్చుంది. తాజా తీర్పుతో ఆ పరిస్థితులు కొంతవరకు మారతాయని ఆశించాలి. చట్టాన్ని అతిక్రమిస్తున్న వారికి మేలుకొలుపు. అదే సమయంలో అది అందరికీ స్పష్టమైన సందేశం ఇస్తోంది. అదేమిటంటే – బాలల భద్రత అతి ముఖ్యమైనది! వారి భద్రత కోసమే కోర్టు చట్టానికి మరింత కఠినమైన, కట్టుదిట్టమైన వ్యాఖ్యానం అందించింది. ఇక యూ ట్యూబ్ – గూగుల్ లాంటి వేదికలు, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలు, నిత్యం ఇంటర్నెట్ వాడేవారు అప్రమత్తంగా ఉండక తప్పదు. అలాంటి కంటెంట్‌ను తక్షణం తొలగించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడమే మార్గం. అదే సమయంలో విద్యాలయాల్లో లైంగిక విజ్ఞానాన్ని సమగ్రంగా బోధించి, పిల్లల్లో అవగాహన కల్పించాలంటూ ప్రభుత్వానికి సుప్రీమ్ చేసిన సూచన విలువైనది. బిడియపడకుండా తల్లితండ్రులు, గురువులు పిల్ల లకు విషయాలను వివరించడం మేలు. శారీరకంగా, సామా జికంగా, చట్టపరంగా అవగాహన పెరి గితే అకృత్యాల్ని అడ్డుకోవడం సులభమవుతుంది. ఇలాంటి కేసులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్న సంకేతం సుప్రీమ్ తాజా తీర్పు అందించడం అన్ని విధాలా ఆహ్వానించదగ్గ పరిణామం. -
బద్లాపూర్ నిందితుడి ఎన్కౌంటర్.. పోలీసులకు హైకోర్టు ప్రశ్నలు
ముంబై: బాద్లాపూర్ లైంగిక వేధింపుల నిందితుడి కస్టడీ మరణంపై బాంబే హైకోర్టు ముంబై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడి ఎన్కౌంటర్ అనుమానాలకు తావిస్తోందని.. ఈ సంఘటనను ఎన్‌కౌంటర్‌గా పేర్కొనలేమని పేర్కొంది. నిందితుడు అక్షయ్ షిండేను జైలు నుంచి బయటకు తీసుకొచ్చినప్పటి నుంచి శివాజీ ఆస్పత్రిలో మరణించినట్లు ప్రకటించే వరకు సీసీటీవీ ఫుటేజీని తమకు సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.కాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన కేసులో నిందితుడు పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. విచారణ సమయంలో నిందితుడు అక్షయ్ శిండేపై.. అతడి మొదటి భార్య వేధింపుల కేసు పెట్టింది.అయితే ఈ కేసులో ప్రశ్నించేందుకు పోలీసులు నిందితుడిని కారులో తీసుకొని తాలోజా జైలు నుంచి బద్లాపూర్ బయల్దేరారు. ఈ క్రమంలో పోలీస్ అధికారి చేతిలో నుంచి తుపాకీ లాక్కొని ఎస్కార్టింగ్ పోలీసు బృందంపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసులు ఎదురుకాల్పులు జరపగా.. అతడు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు.తీవ్రంగా గాయపడిన షిండేను ఛత్రపతి శివాజీ మహరాజ్ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనలో ఏఎస్ఐ నీలేష్ మోరే, ఇన్స్పెక్టర్ సంజయ్ షిండేలు గాయపడ్డారని చెప్పారు. అయితే ఇదంతా అబద్దమని, తన కొడుకునే పథకం ప్రకారమే హతమార్చారని ఆరోపిస్తూ నిందితుడు తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.. ఈ సందర్భంగా పోలీసులకు న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. నిందితుడు కాల్చిన ఆ రెండు బుల్లెట్లు ఎక్కడ..? అంటూ ప్రశ్నించింది. ‘ఇది నమ్మడం కష్టం. ప్రాథమికంగా ఫౌల్ ప్లే కనిపిస్తుంది. ఒక సామాన్యుడు రివాల్వర్ లాగా పిస్టల్‌ను కాల్చలేడు. ఏ టామ్, డిక్, హ్యారీ చేయగలడు, బలహీనమైన వ్యక్తి పిస్టల్‌ను లోడ్ చేయలేడు.’ పోలీసుల కథనాన్ని నమ్మడం కష్టంగా ఉంది. నిందితుడు పోలీసులపైకి మూడు బుల్లెట్లు కాల్చారని మీరు చెప్పారు. ఒక్కటే పోలీసులను తాకింది. మిగతా రెండు బుల్లెట్ల ఏమయ్యాయి. పోలీసు అధికారి సంజయ్ షిండే నిందితుడి తలపై కాకుండా కాళ్లు లేదా చేతులపై గురిపెట్టి ఉండాల్సింది. వాహనంలో ఉన్న నలుగురు అధికారులు ఒక్క వ్యక్తిని అధిగమించలేకపోయారంటే ఎలా నమ్మాలి? అతడేం భారీ మనిషికాదు. మీరు సులభంగానే అతడిని అడ్డుకొని ఉండొచ్చు. దీనిని ఎన్కౌంటర్ అని అనలేం. అలాగే ఇంతవరకు కేసు పత్రాలు సీఐడీకి ఎందుకు అప్పగించలేదు. ఏ దర్యాప్తులో అయినా సమయం కీలకం. ఆలస్యం అవుతుంటే ప్రజల్లో అనుమానాలు వస్తాయి’ అని కోర్టు ప్రశ్నించింది. పోలీసుల చర్యను అనుమానించడం లేదు కానీ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. -
తమిళనాడు ప్రజలకు కేంద్ర మంత్రి క్షమాపణలు
చెన్నై: రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటనను తమిళనాడు ప్రజలతో ముడిపెడుతూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే చేసిన వ్యాఖ్యలు గతంలో వివాదాస్పదం అయ్యాయి. ఈ ఏడాది మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.అయితే.. రామేశ్వరం కెఫే బాంబు పేలుడులో నిందితుడు మల్నాడు వాసి అని, గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుదాల వినియోగంపై శిక్షణ తీసుకున్నాడంటూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే అన్నారు. దీంతో కేంద్ర మంత్రిపై మధురైలో కేసు నమోదు అయింది. తాజగా ఆమె తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతూ మద్రాస్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇక.. గతంలోనూ సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను న్యాయమూర్తి జస్టిస్ జీ. జయచంద్రన్ సెప్టెంబర్ 5 తేదీకి వాయిదా వేశారు. -
స్టార్ కమెడియన్ రూ.5 కోట్ల పరువు నష్టం దావా
ప్రముఖ కమెడియన్, పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో మనకు తెలిసిన వడివేలు.. తోటి నటుడు సింగముత్తపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. ఈ మేరకు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 1991 నుంచి సినిమాల్లో నటిస్తూ ప్రముఖ హాస్య నటుడిగా ఎదిగానని, సింగముత్తుతో కలిసి 2000 నుంచి కొన్ని సినిమాల్లో కలిసి నటించానని.. కానీ తాను అతడి కంటే ఉన్నత స్థాయికి ఎదగడంతో సింగముత్తు తట్టుకోలేకపోతున్నాడని వడివేలు తన పిటిషన్లో పేర్కొన్నారు.(ఇదీ చదవండి: రూ.9 కోట్ల ఇంటిని అమ్మేసిన 'ఫ్యామిలీ మ్యాన్' హీరో)ఆ మధ్య తాంబరంలో వివాదాస్పద స్థలాన్ని సింగముత్తు తనతో కొనిపించాడని, ఆ కేసు స్థానిక ఎగ్మోర్ కోర్ట్‌లో ఉందని వడివేలు చెప్పుకొచ్చారు. గత జనవరి నుంచి మార్చి మధ్యలో పలు యూట్యూబ్ ఛానెళ్లలో కనిపించిన సింగముత్తు.. తనని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నాడని, తన పరువుకు భంగం కలిగించేలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. దీనికోసం ఆయన రూ.5 కోట్ల పరువు నష్టం దావా చెల్లించేలా చేయాలని కోర్టుకి విన్నవించాడు.ఇక వడివేలు పిటిషన్‌ని విచారణకు స్వీకరించిన జడ్జి.. రెండు వారాల్లో బదులివ్వాలని నటుడు సింగముత్తుకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కాస్త తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ) -
వ్యభిచార గృహానికి రక్షణ కల్పించండి!!
చెన్నై: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో తాను నడుపుతున్న వ్యభిచార గృహానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ న్యాయవాది పిటిషన్ వేయడంతో మద్రాస్ హైకోర్టు అవాక్కైంది. వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో సెక్స్ సర్వీసులను, కౌన్సెలింగ్‌ను, ఆయిల్ బాత్‌లను తమ సంస్థ అందిస్తుందని న్యాయవాది రాజా మురుగన్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. పోలీసు తనపై పెట్టిన కేసును కొట్టి వేయాలని, తన వ్యాపార కార్యకలాపాల జోలికి రాకుండా పోలీసులను కట్టడి చేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో జరిగే సెక్స్ నేరం కాదని తన చట్టవిరుద్ధ కార్యకలాపాలను పిటిషనర్ సమర్థించుకోవడాన్ని జస్టిస్ బి.పుగలేంధి తీవ్రంగా ఆక్షేపించారు. పేరున్న లా కాలేజీల నుంచి పట్టభద్రులైన వారిని మాత్రమే న్యాయవాదులుగా నమోదు చేసుకోవాలని బార్ కౌన్సిల్‌కు సూచించారు. మురుగన్‌కు రూ. 10 వేల జరిమానాను విధించడమే కాకుండా.. లా డిగ్రీ సరి్టఫికెట్‌ను, బార్ అసోసియేషన్‌లో నమోదైన పత్రాన్ని సమర్పించాలని ఆదేశించింది. -
‘వ్యభిచార గృహం నడిపేందుకు రక్షణ కావాలి’.. మద్రాస్ హైకోర్టు షాక్
చెన్నై: ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను చూసి మద్రాస్ హైకర్టు షాక్ గురైంది. సదరు పిటిషనర్‌పై దర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను రద్దు చేయడమే కాకుండా అతడికి జరిమానా కూడా విధించింది. ఇంతకీ ఆ పిటిషన్ ఏంటంటే..తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో వ్యభిచార గృహాన్ని నడిపేందుకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రాక్టీస్ చేస్తున్న రాజా మురుగన్ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ చేశారు. ఈ పిటిషన్ గురువారం హైకోర్టులో గురువారం విచారణకు వచ్చింది.ఈ సందర్భంగా మేజర్లు ఏకాభిప్రాయంతో సెక్స్ చేయడం చట్ట విరుద్ధం కాదంటూ పిటిషనర్ వాదించాడు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు. తన వ్యాపార కార్యకలాపాల్లో పోలీసుల జోక్యాన్ని అడ్డుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు తెలిపారు. అయితే వ్యభిచార గృహాన్ని నడుపుతూ తప్పు చేయడమే కాకుండా తన చర్యలను నిసిగ్గుగా సమర్థించినందుకు జస్టిస్ బి పుగలేంధీ ధర్మాసనం పిటిషనర్‌పై మండిపడడింది. తన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. న్యాయవాదిపై 10 వేల జరిమానా కూడా విధించింది.అదే విధంగా ప్రఖ్యాత లా కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ అయిన వారిని మాత్రమే న్యాయవాదులుగా నమోదు చేసుకునేలా చూడాలని బార్ కౌన్సిల్‌ను కోర్టు కోరింది. ఇతర రాష్ట్రాల్లోని సందేహాస్పద సంస్థల నుంచి గ్రాడ్యుయేట్ల నమోదును బార్ కౌన్సిల్ తప్పనిసరిగా పరిమితం చేయాలని సూచించింది.‘సమాజంలో న్యాయవాదుల ప్రతిష్ట తగ్గుతోందని బార్ కౌన్సిల్ గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. కనీసం ఇక నుంచైనా బార్ కౌన్సిల్ సభ్యులు పేరున్న కళాశాలల నుంచి మాత్రమే నమోదు చేసేలా చూసుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి పేరు లేని అనామక సంస్థల నుంచి నమోదును పరిమితం చేయాలి’ అని తెలిపింది. -
మణిపూర్ నుంచి తొలిసారి సుప్రీంకోర్టుకు.. ఎవరీ ఎన్ కోటీశ్వర్?
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు చేరారు. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహాదేవన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం వెల్లడించారు.కాగా ఈ ఇద్దరు న్యాయమూర్తుల పదోన్నతిపై సుప్రీంకోర్టు కోలిజియం గతంలో సిఫార్సు చేసింది. ఈ మేరకు వీరి నియామకంపై రాష్ట్రపతి తాజాగా ఆమోద ముద్ర వేశారు. కాగా కోటీశ్వర్ సింగ్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్, లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా.. ఆర్ మహదేవన్ మద్రాస్ హైకోర్టు చీఫ్ జడ్జీగా ఉన్నారు. ఇక కొత్తగా ఇద్దరు జడ్జీల చేరికతో సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐతో కలిసి న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ఇటీవల హింసాత్మకంగా మారిన ఈ ఈశాన్య రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు ఎన్నికైన తొలి జడ్జిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కడారు.జస్టిస్ కోటీశ్వర్ మణిపూర్ తొలి అడ్వకేట్ జనరల్ ఎన్ ఇబోటోంబి సింగ్ కుమారుడు. ఆయన ఢిల్లీ యూనివర్శిటీలోని కిరోరి మాల్ కాలేజ్ అండ క్యాంపస్ లా సెంటర్లో పూర్వ న్యాయ విద్యను పూర్తి చేశారు. అనంతరం 1986లో న్యాయవాదిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆయన జడ్జి కాకముందు మణిపూర్ అడ్వకేట్ జనరల్‌గా కూడా పనిచేశారు. గతంలో అస్సాంలోని గువాహటి హైకోర్టు, మణిపూర్ హైకోర్టులోనూ విధులు నిర్వర్తించారు.ఇక చెన్నైలో జన్మించిన జస్టిస్ మహదేవన్ ప్రస్తుతం మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. మహదేవన్ మద్రాసు న్యాయ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. న్యాయవాదిగా ఆయన 9,000 కేసులను వాదించారు. తమిళనాడు ప్రభుత్వానికి అదనపు గవర్నమెంట్ ప్లీడర్‌గా(పన్నులు), అదనపు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ న్యాయవాది, మద్రాసు హైకోర్టులో భారత ప్రభుత్వానికి సీనియర్ ప్యానెల్ న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2013లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. -
‘తాగుబోతులేమైనా స్వాతంత్ర్య సమరయోధులా?’
చెన్నై: అరవై మందికిపైగా పొట్టనబెట్టుకుని కళ్లకురిచ్చి కల్తీ సారా ఉదంతం దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. ఒకవైపు తమిళనాట రాజకీయ దుమారం కొనసాగుతుండగా.. మరోవైపు ఈ కేసుపై మద్రాస్ హైకోర్టులో తాజాగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదైంది.కళ్లకురిచ్చి కల్తీసారా ఘటనలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ.10 లక్షలు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిల్ వేశారు. ‘‘కల్తీసారా తాగి చనిపోయినవాళ్లు స్వాతంత్ర్య సమరయోధులేం కాదు. సామాజిక ఉద్యమకారులు అంతకన్నా కాదు. పోనీ సమాజం కోసం.. ప్రజల కోసం ప్రాణాలు వదిలారా? అంటే అదీ కాదు. కల్తీసారా తయారీ చట్టవిరుద్ధమైన చర్య అని, అలాంటప్పుడు అది తాగి చనిపోయిన వాళ్ల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరమే లేదు’’ అని వ్యాజ్యంలో ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: కల్తీసారా ఘటన.. ఆ భార్యాభర్తల మృతి తర్వాతే..!తమ సరదా కోసమే కల్తీసారా తాగిన చనిపోయిన వాళ్లను బాధితులుగా ప్రభుత్వం పరిగణించడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా అగ్ని, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో మరణించిన వాళ్లకు పరిహారం తక్కువగా ఇచ్చిన సందర్భాల్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాలని, లేకుంటే న్యాయస్థానమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారాయన.ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్(తాత్కాలిక) ఆర్ మహదేవన్, జస్టిస్ మహమ్మద్ షాఫిక్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. రెండు వారాలకు విచారణ వాయిదా వేసింది. -
తమిళనాట 50కి చేరిన మద్యం మృతులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం మరో 10 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 50కి చేరాయి. అలాగే, సారా తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న మరో ఇద్దరు కూడా మరణించడంతో ఆ సంఖ్య 50ని దాటింది. అయితే, వీరి మరణంపై అధికారులు విచారణ చేపట్టారు. దీంతోపాటు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కల్తీ సారా మరణాల ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. దద్దరిల్లిన అసెంబ్లీ కళ్లకురిచ్చి ఉదంతంపై శుక్రవారం అసెంబ్లీ దద్దరిల్లింది. విపక్ష ఏఐఏడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. కల్తీ మద్యం తాగి 50 మంది వరకు మృతి చెందడంపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారంటూ స్పీకర్ అప్పావు వారిని మార్షల్స్‌తో బయటకు పంపించి వేశారు. ఈ ఆందోళనల్లో ఏఐఏడీఎంకేలోని మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గం సభ్యులు పాల్గొనక పోవడం గమనార్హం. -
ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
సాక్షి, చెన్నై : గల్లంతైన వారి పేర్లన్నీ మళ్లీ జాబితాలో చేర్పించి ఓటింగ్‌కు అవకాశం కల్పించాలని ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓ ఓటరు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిందని, కౌంటింగ్ నిలుపుదల కోసం స్టే ఇవ్వలేమని పేర్కొంటూ ఓటరు పిటిషన్ విచారణను ముగించారు. వివరాలు.. ఆస్ట్రేలియా నుంచి వచ్చి తన హక్కును వినియోగించుకునేందుకు ప్రయత్నించిన వైద్యుడు స్వతందిర కన్నన్‌కు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో నిరాశే మిగిలిన విషయం తెలిసిందే. ఓటరు జాబితాలో తన పేరు గల్లంతు కావడాన్ని తీవ్రంగా పరిగణించారు.తన లాంటి వారెందరి పేర్లో జాబితాలో గల్లంతు కావడాన్ని పరిగణించి హైకోర్టులో పిటిషన్ వేశాడు. గల్లంతైన వారి పేర్లను మళ్లీ జాబితాలో చేర్చాలని, ఓటుహక్కుకలి ్పంచాలని విన్నవించాడు. ఈ పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్వీ గంగాపూర్వాల, న్యాయమూర్తి చంద్రశేఖరన్ బెంచ్ విచారించింది. ఎన్నికల కమిషన్ తరపున సమగ్ర వివరాలను కోర్టు ముందు ఉంచారు. జనవరిలోనే తుది ఓటరు జాబితాను ప్రకటించడం జరగిందని గుర్తించారు. పిటిషనర్ సంబం«ధిత నియోజకవర్గం లేరని, ఆయన ఆ్రస్టేలియాలో నివాసం ఉన్నారని వివరించారు. 2021లోనే జాబితా నుంచి పిటిషనర్ పేరు తొలగించ బడ్డట్టు, తుది ఓటరు జాబితా ప్రకటించిన సమయంలో ఎందుకు పిటిషనర్ ఆక్షేపన వ్యక్తం చేయలేదన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.తుది ఓటరు జాబితా సమయంలోనే పరిశీలించి ఉండాలని, ఫిర్యాదులు ఉంటే ఎన్నికల కమిషన్ దృష్టికి అప్పుడే తీసుకొచ్చి ఉండాలని వాదించారు. వాదనల అనంతరం న్యాయమూర్తులు స్పందిస్తూ, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిందని, ఇప్పుడు కొత్తగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. పేర్లు మళ్లీ జాబితాలో చేర్పించి ఓటింగ్‌కు అవకాశం కల్పించాలన్న పిటిషనర్ వాదనపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్నారు. అలాగే, కోయంబత్తూరు నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్‌ను నిలుపుదల చేయలేమని పేర్కొంటూ, ఈ పిటిషన్ విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించారు. కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వక పోవడంతో ఓటరుకు మిగిలింది నిరాశే. సర్కారు సినిమాలో తరహా ఏదేని ఉత్తర్వులు వస్తాయన్న ఎదురు చూపులలో ఉన్న వారికి భంగపాటు తప్పలేదు. -
Lok Sabha elections 2024: కోయంబత్తూర్ రోడ్ షోకు హైకోర్టు ఓకే
చెన్నై: ఈ నెల 18వ తేదీన తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో నాలుగు కిలోమీటర్ల మేర సాగాల్సిన ప్రధాని మోదీ రోడ్ షోకు మద్రాస్ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. మతపరంగా సున్నితమైన ప్రాంతం అనే కారణంతో కోయంబత్తూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రోడ్ షోకు అనుమతి నిరాకరించడం సహేతుకంగా లేదని హైకోర్టు పేర్కొంది. ప్రధానమంత్రికి నిరంతరం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత ఉంటుందని గుర్తు చేసింది. ‘ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి ఉన్నత హోదా కలిగిన నాయకులను ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి, తమను ఎన్నుకున్న వారిని కలవకుండా నేతలను ఆపడం సరికాదు’అని అభిప్రాయపడింది. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత రోడ్ షో జరగనున్నందున పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందీ ఉండదన్నారు. రోడ్ షోకు అనుమతి నిరాకరిస్తూ పోలీస్ కమిషనర్ పురమ్ రంగే తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రమేశ్ కుమార్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేశ్ శుక్రవారం విచారణ జరిపారు. రోడ్ షోకు షరతులతో కూడిన అనుమతివ్వాలని కమిషనర్‌ను ఆదేశించారు. -
చైల్డ్ పోర్నోగ్రఫీపై ఆ తీర్పు దుర్మార్గం: సుప్రీం
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేయడం, చూడటం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు దుర్మార్గంగా అభివర్ణించింది. ఆ తీర్పుపై విచారణ జరిపేందుకు అంగీకరించింది. చెన్నైకి చెందిన ఎస్.హరీశ్(28) పిల్లలతో కూడిన పోర్నోగ్రఫీ కంటెంట్‌ను తన సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నాడంటూ పోలీసులు కేసు పెట్టారు. దీనిపై హరీశ్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లాడు. విచారణ చేపట్టిన ఏకసభ్య ధర్మాసనం పోక్సో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను డౌన్లోడ్ చేయడం, చూడటం నేరం కాదని పేర్కొంటూ జనవరి 11వ తేదీన తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ ఫరీబాద్కు చెందిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయెన్, ఢిల్లీకి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఎన్జీవోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పు చట్టాలకు వ్యతిరేకం, దుర్మార్గమని పేర్కొంది. ఏకసభ్య ధర్మాసనం ఇలాంటి తీర్పు ఎలా ఇవ్వగలదని ప్రశ్నించింది. -
ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాకు ఊరట
చెన్నై: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాతోపాటు మరో డీఎంకే నేత చట్టసభ సభ్యులుగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. అయితే, డీఎంకే నాయకులు వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. సనాతన ధర్మాన్ని హెచ్ఐవీ, మలేరియా, డెంగ్యూతో పోల్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా మాట్లాడడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమేనని తేలి్చచెప్పింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ సమాజంలో విభజన తెచ్చేలా వ్యవహరించడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. -
త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మళ్లీ మొదలుపెట్టిన నటుడు!
తప్పు చేసిందే కాకుండా తప్పించుకోవాలని చూశాడు తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్. హీరోయిన్ త్రిషపై ఈయన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిందో అందరికీ తెలిసిందే! 'లియో సినిమాలో హీరోయిన్ త్రిష అని తెలిశాక తనతో బెడ్రూమ్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను, కానీ అది జరగలేదు' అని వ్యాఖ్యానించాడు. ఇందులో అశ్లీల ధ్వనికి హీరోయిన్ త్రిష స్పందించింది. తనతో ఇంకే సినిమాలోనూ నటించేదే లేదని తేల్చి చెప్పింది. చిరంజీవి, ఖుష్బూ వంటి పలువురు తారలు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. తన మాటల్లో తప్పు కనిపించలేదుకానీ అందరూ తనను తప్పుపడుతున్నారని ఫీలయ్యాడు మన్సూర్. కోటి అడిగాడు.. రూ.1 లక్ష కట్టమన్న కోర్టు త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా వేశాడు. ఈ వ్యవహారంలో తాను అమాయకుడినని, తనకు ముగ్గురి నుంచి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని పిటిషన్ వేశాడు. ఇది చూసి బిత్తరపోయిన కోర్టు మన్సూర్‌కు గడ్డిపెట్టింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన నీవు వారిపై పరువు నష్టం దావా వేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా కోర్టు సమయం వృథా చేసినందుకుగానూ చెన్నైలో అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు రూ.1 లక్ష చెల్లించాలంటూ సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజుల్లో కడతానంటూ ట్విస్ట్ ఇది జరిగి నెల రోజుల పైనే అవుతోంది. ఇప్పటివరకు మన్సూర్ ఆ రుసుమును కట్టనేలేదు. వారం రోజుల క్రితం కోర్టు ఇదే విషయాన్ని గుర్తు చేయగా మరో పది రోజుల గడువు కావాలన్నాడు నటుడు. అతడి అవస్థను చూసిన న్యాయస్థానం.. ఎవరి గురించైనా చెప్పేటప్పుడు ఆచితూచి మాట్లాడటం నేర్చుకోమని మొట్టికాయలు వేస్తూనే మరో పది రోజుల గడువు ఇచ్చింది. చివరకు ఆ డబ్బు ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు నటుడు. స్టేకు నిరాకరించిన న్యాయస్థానం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలుకు దరఖాస్తు చేశాడు. మన్సూర్ వైఖరికి విస్తుపోయిన న్యాయస్థానం.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి నిరాకరించింది. డబ్బు కడతానని అంగీకరించాక ఆ తీర్పును ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఎదుటే ఏ విషయమో తేల్చుకుని రావాలని చెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. గొడవ సద్దుమణిగిందనుకుంటే ఈయన మళ్లీ మొదలుపెట్టాడేంట్రా బాబూ అని తల బాదుకుంటున్నారు సినీప్రేక్షకులు. చదవండి: థియేటర్లో హనుమాన్ చూస్తూ మహిళ వింత చేష్టలు.. వీడియో వైరల్ -
ట్రాన్స్ జెండర్‌పై అనుచిత వ్యాఖ్యలు..
చెన్నై: ట్రాన్స్‌జెండర్ వ్యాపారవేత్త, ఏఐఏడీఎంకే అధికారి ప్రతినిధి అప్సరా రెడ్డిని అప్రతిష్టపాలు చేసిన ఓ యూట్యూబర్‌కు మద్రాస్ హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది! ఆమె ప్రొవోగ్ మేగజీన్‌లో పని చేసిన రోజుల్లో మైకేల్ ప్రవీణ్ అనే సహోద్యోగితో విభేదాలొచ్చాయి. దాంతో అతను అప్సరను కించపరుస్తూ 10 వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రవీణ్ నుంచి రూ.1.25 కోట్లు పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ‘‘సోషల్ మీడియాలో పోస్టులతో ఇతరుల గోప్యతకు భంగం కలిగించొద్దు. ఏ హక్కయినా పరిమితులకు లోబడి ఉంటుంది’’ అని పేర్కొంది. -
ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు భారీ ఊరట!
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు భారీ ఊరట దక్కింది. రూ. 4,300 కోట్ల పన్ను బకాయిలకు బదులుగా కంపెనీకి చెందిన రూ. 2,956 కోట్ల బ్యాంక్ డిపాజిట్లను ఆదాయపు పన్ను శాఖ లిక్విడేట్ చేయడంపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. పన్ను బకాయిల కోసం నాలుగు వారాల్లోగా రూ.1,500 కోట్లు చెల్లించాలని, ఆస్తి భద్రతగా పెట్టాలని జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ మహమ్మద్ షఫీక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కాగ్నిజెంట్‌ను ఆదేశించింది. ఈ షరతులను పాటించడంలో విఫలమైతే కంపెనీకి ఇచ్చిన మధ్యంతర స్టే రద్దవుతుందని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు రూ. 1,500 కోట్ల చెల్లించడానికి, ఆస్తిని భద్రతగా పెట్టడం కోసం బ్యాంకు డిపాజిట్లపై పెట్టిన తాత్కాలిక స్తంభనను విడుదల చేయాలని కోర్టు ఐటీ శాఖను ఆదేశించింది. ఈ వ్యవహారం 2017-18లో కాగ్నిజెంట్ చేపట్టిన రూ.19,000 కోట్ల షేర్ బైబ్యాక్‌కు సంబంధించినది. ఇది వాటాదారులకు మూలధన లాభాల పన్నును మాత్రమే ఆకర్షిస్తుందని కంపెనీ వాదించగా ఆదాయపు పన్ను శాఖ.. దీనిని సేకరించిన లాభాల పంపిణీగా పరిగణించి డివిడెండ్‌పై వేసినట్లుగా పన్ను విధించింది. -
అయిదుగురు కలెక్టర్లకు ఈడీ నోటీసులపై హైకోర్టు స్టే
చెన్నై: తమిళనాడులోని అయిదు జిల్లాల కలెక్టర్లకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. తమ అధికార పరిధిలోని ఇసుక అక్రమ తవ్వకాల కేసులో అయిదు జిల్లాల కలెక్టర్లకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన నోటీసులపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. మూడు వారాలపాటు అయిదుగురు కలెక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, విచారణకు పిలవవద్దని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఎస్ఎస్ సుందర్, జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది. అయితే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఈడీ తన విచారణను కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది. కాగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ద్వారా రూ. 4,500 కోట్లు చేతులు మారినట్లు ఈడీ నిర్ధారించింది. హవాలా లావాదేవీలు, షెల్ కంపెనీలతో సహా పలు రహస్య మార్గాల ద్వారా అక్రమ నిధులు దారి మళ్లించినట్లు పేర్కొంది. ఈ కేసులో భాగంగా తమ అధికార పరిధిలో ఇసుక మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించి అరియలూరు, వేలూరు, తంజావూరు, కరూర్, తిరుచిరాపల్లి జిల్లాల కలెక్టర్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద దర్యాప్తు సంస్థ ఈ సమన్లు జారీ చేసింది. చదవండి: Uttarakhand: రెస్క్యూ బృందాలకు 3 మీటర్ల దూరంలో కార్మికులు ఆయా జిల్లాల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన వివరాలతో వివిధ తేదీల్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కలెక్టర్ల తరపున రాష్ట్ర ప్రభుత్వ శాఖ కార్యదర్శి కె. నంతకుమార్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ సమన్లను రద్దు చేయాలని తన పిటిషన్లో కోరారు. దీనిపై తొలుత సోమవారం విచారించిన ధర్మాసనం.. ఈడీ సమన్లపై నేడు మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణను డిసెంబర్ 21కి బెంచ్ వాయిదా వేసింది. కాగా ఈడీ నేరుగా జిల్లా కలెక్టర్లకు నోటీసులు ఇచ్చే అధికారం లేదని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. ఈ విషయంలో సహయం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ఈడీ అభ్యర్థించగలదని పేర్కొంది. ఈడీకి అపరిమిత అధికారం పార్లమెంట్ ఇవ్వలేదని చెబుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటి నేరాలను దర్యాప్తు చేసే అధికారం ఈడీకి లేదని తెలిపింది. ఇదిఫెడరలిజానికి విరుద్దని పేర్కొంది. అయితే ఇసుక అక్రమ రవాణా కేసులో ప్రైవేట్ వ్యక్తులతో ప్రభుత్వ అధికారులను విచారణకు పిలిచినట్లు దర్యాప్తు సంస్థ చేబుతోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) విచారణకు సంబంధించి ఎవరికైనా సమన్లు ఇచ్చే అధికారం తమకు ఉందని పేర్కొంది. -
నేపథ్యం ఆధారంగా జడ్జీలపై ఆ ముద్రలు వేయొద్దు
న్యూఢిల్లీ: అడ్వొకేట్ లక్ష్మణచంద్ర విక్టోరియా గౌరీని మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సమరి్థంచారు. విక్టోరియా గౌరీ గతంలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించారు. ఆమె బీజేపీ అభిమాని అనే పేరుంది. ఆమెను మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఆమె మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకం వివాదానికి దారితీసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు బార్ సభ్యులు కొందరు జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. కొలీజియం సిఫార్సును రద్దు చేయాలని కోరారు. విక్టోరియా గౌరీ గతంలో పలు సందర్భాల్లో క్రైస్తవులకు, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇటీవల హార్వర్డ్ లా కాలేజీ సెంటర్ కార్యక్రమంలో మాట్లాడారు. మద్రాస్ హైకోర్టు బార్ సభ్యుల లేఖపై స్పందించారు. కొలీజియం అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తుందని గుర్తుచేశారు. లాయర్లుగా ఉన్నప్పుడు వారి నేపథ్యాన్ని, వెలిబుచి్చన సొంత అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని జడ్జిలపై ఒక వర్గం వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరైంది కాదని అన్నారు. గొప్ప తీర్పులు వెలువరించిన జస్టిస్ కృష్ణ అయ్యర్‌కు కూడా రాజకీయ నేపథ్యం ఉండేదని అన్నారు. -
మంత్రులూ... అవేం మాటలు?
చెన్నై: అధికారంలో ఉన్నవారిలో సమాజంలో చీలిక తెచ్చే వ్యాఖ్యలు చేసే ధోరణి ప్రబలుతోందంటూ మద్రాస్ హైకోర్టు ఆందోళన వెలిబుచి్చంది. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంపై చూపే ప్రతికూల ప్రభావం తాలూకు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సెపె్టంబర్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే. ‘సనాతన ధర్మ నిర్మూలన’పేరిట జరిగిన ఆ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు అందులో పాల్గొన్న అధికార డీఎంకేకు చెందిన పలువురు ఇతర మంత్రులు కూడా మద్దతు పలికారు. ఈ ధోరణిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలకు దిగే బదులు డ్రగ్స్, అవినీతి, అంటరానితనం తదితర పెడ ధోరణుల నిర్మూలనపై దృష్టి పెడితే మంచిదని వారికి సూచించింది. సదరు మంత్రులపై ఇంకా చర్యలెందుకు తీసుకోలేదంటూ పోలీసులకు తలంటింది. మంత్రుల వ్యాఖ్యలకు పోటీగా ద్రవిడ సిద్ధాంత నిర్మూలన సదస్సుకు అనుమతించేలా పోలీసులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తి స్టవిస్ జి.జయచంద్రన్ కొట్టేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సనాతన ధర్మ నిర్మూలన సభను ఉదాహరిస్తూ, అందుకు పోటీగా సభ పెట్టుకునేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మంత్రులు తదితరులపై అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు కదా! పిటిషనర్ విజ్ఞప్తికి అంగీకరించడమంటే సమాజంలో మరింత చీలిక తేవడమే కాదా?’’అని ప్రశ్నించారు. మంత్రుల తీరుపైనా ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడతామంటూ చేసిన ప్రమాణాలకు విరుద్ధంగా అధికారంలో ఉన్న కొందరు ప్రవర్తిస్తున్న తీరుతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. ఇలాంటి సమావేశాలకు అనుమతినిచ్చి వారికి శాంతిని మరింత కరువు చేయమంటారా?’’అన్నారు. నా వ్యాఖ్యలకు కట్టుబడ్డా: ఉదయనిధి చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తమిళనాడు యువజన సంక్షేమ మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. ఈ అంశంపై న్యాయ వివాదం తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. ‘సనాతన ధర్మం కరోనా, మలేరియా, డెంగీ వంటిది. అది సామాజిక న్యాయానికి వ్యతిరేకం. దాన్ని నిర్మూలించాలి‘ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్త దుమారానికి దారితీయడం తెలిసిందే. అణగారిన, పీడిత వర్గాల తరఫున తనలా మాట్లాడానని ఆయన సోమవారం చెప్పుకొచ్చారు. అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ వంటి గొప్ప నేతలు కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. -
‘అంబేద్కర్ చెప్పినదానికంటే నేనేం ఎక్కువ మాట్లాడలేదు’
చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు ఎప్పటికీ కట్టుబడి ఉంటానని తమిళనాడు నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంలో తమిళనాడు పోలీసులు వ్యవహరించిన తీరుపై మద్రాస్ హైకోర్టు మండిపడింది. ఉదయనిధితో పాటు పీకే శేఖర్ బాబుపై చర్యలు తీసుకోవడంలో పోలీస్ శాఖ తాత్సారం చేసిందంటూ న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పనిలో పనిగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను కోర్టు తప్పుబట్టింది. అయితే.. కోర్టులో ఇవాళ జరిగిన పరిణామాలపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. తాను న్యాయపరంగా ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నానంటూ ప్రకటించారు. అంతేగానీ సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి మాత్రం తీసుకోబోనని స్పష్టం చేశారు. ‘‘నేనేం తప్పుగా మాట్లాడలేదు. మాట్లాడింది సరైందే కాబట్టి న్యాయపరంగా ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. గతంలో నేను ఇచ్చిన ప్రకటనలో ఏమాత్రం మార్పు లేదు. నేను నమ్మే సిద్ధాంతాన్నే బయటకు చెప్పా. అలాగని రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ చెప్పినదానికంటే ఎక్కువ మాట్లాడలేదు. పెరియార్, తిరుమవలవన్‌లు ఏం చెప్పారో.. అంతకంటే కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు. నేను ఎమ్మెల్యే అయినా, మంత్రిని అయినా, యువ విభాగపు నేతను అయినా.. రేపు పదవుల్లో లేకపోయినా ఫర్వాలేదు. కానీ, మనిషిగా ఉండడమే నాకు ముఖ్యం. నీట్ అంశం ఆరేళ్లనాటిది. కానీ, సనాతన ధర్మం వందల ఏళ్లనాటి అంశం. కాబట్టి, సనాతన ధర్మాన్ని ఎప్పటికీ మేం వ్యతిరేకిస్తూనే ఉంటాం అని స్టాలిన్ పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ దానిని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. అది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకమని నాటి ప్రసంగంలో పేర్కొన్నారాయన. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. డీఎంకేపై బీజేపీ అయితే తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇవాళ్టి కోర్టులో.. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల విషయంలో తమిళనాడు పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని.. చర్యలు తీసుకోలేని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. ఆపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘అధికారంలో ఉన్న ఓ వ్యక్తి మతాలు, కులాలు, సిద్ధాంతాల పేరిట అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం సరికాదు. బదులుగా అవినీతి, అంటరానితనం సామాజిక రుత్మతలనో లేదంటే ఆరోగ్యాన్ని పాడు చేసే మాదకద్రవ్యాలు, మత్తుపానీయాలనో నిర్మూలించాలని ప్రకటన చేయడం సరైందని ఈ న్యాయస్థానం అభిప్రాయపడుతుంది. విభజన ఆలోచనలను ప్రోత్సహించడానికి లేదంటే ఏదైనా భావజాలాన్ని రద్దు చేయడానికి ఏ వ్యక్తికి హక్కు ఉండదు. ఉదయనిధిపై చర్యలు తీసుకోకపోవడంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అని జస్టిస్ జీ జయచంద్రన్ వ్యాఖ్యానించారు. -
లియో నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తాజాగా నటించిన చిత్రం లియో. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే ఈ సినిమా బెనిఫిట్ షోలకు తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. కేవలం ఉదయం 9 గంటల తర్వాతే షో వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై లియో మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. (ఇది చదవండి: వివాదంలో ‘లియో’.. మద్దతుగా రజనీకాంత్!) దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. ఉదయం 9 గంటల తర్వాతే స్క్రీనింగ్ మొదలయ్యేలా అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో విజయ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. రిలీజ్ మొదటి రోజు లియో స్క్రీనింగ్ తమిళం కంటే తెలుగులోనే ముందుగా మొదలు కానుంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉదయం ఐదు గంటలు, ఏడు గంటలకు సినిమాను ప్రదర్శించనున్నారు. కాగా.. లియో సినిమాలో సంజయ్‌దత్, అర్జున్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్రిష హీరోయిన్గా నటిస్తోంది. కాగా.. లియో మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. (ఇది చదవండి: 'నీలాంటోళ్లను చాలామందిని చూసినా'.. ప్రియాంకపై భోలె షావలి ఫైర్!) -
రిలీజ్‌కు ముందు హైకోర్టుకు లియో మేకర్స్.. ఎందుకంటే?
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న చిత్రం లియో. ఈ మూవీలో హీరోయిన్గా త్రిష నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదివరకే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మూడు రోజుల్లో సినిమా రిలీజవుతుండగా.. తాజాగా చిత్రబృందం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. (ఇది చదవండి: ఎప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: సాయి పల్లవి) తమిళనాడులో సినిమా విడుదలైన మొదటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సినిమాను ప్రదర్శించేందుకు అనుమతించాలని లియో మేకర్స్ పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 24 వరకు ఉదయం 7 గంటలకు లియో షోలను అనుమతించాలని నిర్మాతలు కోర్టును అభ్యర్థించారు. కాగా.. చిత్ర నిర్మాతల పిటిషన్‌పై అక్టోబర్ 17న విచారణ చేపట్టనున్నట్లు మద్రాస్ హైకోర్టు వెల్లడించింది. అదనపు షోలకు అనుమతి అయితే ఇప్పటికే లియో చిత్రానికి తమిళనాడు ప్రభుత్వం మొదటి ఆరు రోజుల పాటు ఒక అదనపు షో ప్రదర్శనకు అనుమతి మంజూరు చేసింది. ఈ సినిమా మొదటి షోకు ప్రదర్శనకు ఉదయం 9 గంటలకు మాత్రమే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటికే రిలీజైన లియో ట్రైలర్ రికార్డ్ స్థాయి వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో విజయ్ దళపతి మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. 2021లో విడుదలైన మాస్టర్ తర్వాత లోకేశ్ కనగరాజ్, విజయ్‌ల కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం లియో. ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, హెరాల్డ్ దాస్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మాయ ఎస్ కృష్ణన్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: నీచమైన బతుకులు, మానసికంగా చంపుతున్నారు.. ఏడ్చేసిన అమర్ తల్లి) -
ఇన్నేళ్ళకు న్యాయం!
మూడు దశాబ్దాల పైచిలుకు క్రితం కేసులో బాధితులకు ఎట్టకేలకు కాసింత ఊరట దక్కింది. పోలీసుల దమనకాండకు ప్రతిరూపమైన తమిళనాడు వాచాత్తి ఘటనలో సెప్టెంబర్ 29న మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఆ రకంగా చిరకాలం గుర్తుండిపోతుంది. మారుమూల గ్రామంలోని గిరిజనులపై దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన కేసు అది. అటవీ, పోలీసు అధికారులతో సహా మొత్తం 269 మంది దోషులంటూ కింది కోర్టు ఏనాడో తీర్పు ఇచ్చింది. దోషులు పైకోర్టును ఆశ్రయించి, జాగు చేశారు. తాజాగా మద్రాస్ హైకోర్ట్ ఆ అప్పీళ్ళను కొట్టివేసింది. కింది కోర్ట్ తీర్పును హైకోర్ట్ సమర్థించడమే కాక, 215 మందినీ దోషులుగా తీర్మానిస్తూ, ఒక్కొక్కరికీ 1 నుంచి 10 ఏళ్ళ పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితులకు ఇన్నాళ్ళకైనా న్యాయం దక్కిందనే భావన కలుగుతోంది. ప్రజాస్వామ్యం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మిగులుతోంది. నిజానికి, తమిళనాట ధర్మపురి జిల్లాలో తూర్పు కనుమల్లో నెలకొన్న గిరిజన గ్రామం వాచాత్తి గురించి ముప్ఫయ్యేళ్ళ క్రితం ఎవరూ విననైనా విని ఉండరు. కేవలం 655 మంది, అందులోనూ 643 మంది మలయాళీ షెడ్యూల్డ్ తెగల వారున్న 200 గడపల గ్రామం అది. కానీ, ఆ రోజు జరిగిన ఆ దారుణ ఘటనతో ఒక్కసారిగా ఆ గ్రామం వార్తల్లో నిలిచింది. గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసులు, అటవీ అధికారులు గ్రామంపై దాడి చేశారు. అక్కడ గిరిజనులపై సాగించిన అమానుషం, బడికెళ్ళే ఓ చిన్నారి సహా 18 మంది మహిళలపై సామూహిక అత్యాచారం, తాగునీటిలో విషం కలిపిన తీరు, పశువుల్ని ఊచకోత కోసి ఊరి బావిలో పడేసిన వైనం... ఆ గ్రామం రూపురేఖల్నే మార్చేశాయి. ‘గంధపు చెక్కల స్మగ్లింగ్ గ్రామం’ అని ముద్రవేస్తూ అమాయకులపై అధికారులు సాగించిన ఆ దమనకాండ ఓ మాయని మచ్చ. కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లోతుగా విచారించి అధికారుల తప్పు తేల్చినా, ఏళ్ళ తరబడి వాయిదా పడుతూ వచ్చిన న్యాయం ఇన్నాళ్ళకు దక్కింది. బాధితులకు కాస్తయినా ఊరట దక్కింది. 1992 జూన్ 20 నుంచి మూడు రోజులు సాగిన అమానుష ఘటనలో మొత్తం 269 మంది నిందితులు కాగా, వారిలో 54 మంది న్యాయ విచారణ కాలంలోనే కన్నుమూశారు. మిగిలినవారికి ఇప్పుడు శిక్ష పడింది. ఈ కథ ఇక్కడి దాకా రావడం వెనుక న్యాయం కోసం సుదీర్ఘంగా సాగిన పోరాటం ఉంది. అప్పట్లో అధికారులపై కేసులు నమోదు కాకపోగా, గిరిజనులపైనే స్థానిక పోలీసులు ఎదురు కేసులు పెట్టిన పరిస్థితి. గిరిజనులు తమ ఇళ్ళను తామే ధ్వంసం చేసుకున్నారని అధికారులు బుకాయించారు. హైకోర్ట్ ఆదేశిస్తే గానీ చివరకు సీబీఐ దర్యాప్తు జరగలేదు. అంతరాయాలతో విచారణ సుదీర్ఘంగా 19 ఏళ్ళు సాగి, చివరకు 2011లో ధర్మపురి సెషన్స్ కోర్ట్ అధికారులను దోషులుగా తేల్చి, శిక్ష వేసింది. దోషులు మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించడంతో మరో 11 ఏళ్ళ సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ఈ కేసు విచారణ సత్వరమే పూర్తి చేయాలని హైకోర్ట్ న్యాయమూర్తి ఒకరు ఈ ఏడాది మొదట్లో పట్టుబట్టడంతో ఇప్పటికైనా కథ ఓ కొలిక్కి వచ్చింది. చిత్రం ఏమిటంటే – వాచాత్తి దమన కాండపై అప్పట్లోనే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైతే, ప్రభుత్వంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు అలాంటి నేరాలకు పాల్పడరంటూ జడ్జి దాన్ని కొట్టేయడం! జయలలిత సారథ్యంలోని అప్పటి అన్నాడీఎంకె పాలకులు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత అధికారంలో ఉన్న డీఎంకె, అన్నాడీఎంకె సర్కార్లూ తమ బ్యూరోక్రాట్లకు కాపు కాసేందుకే ప్రయత్నించాయి. కొందరు ఉద్యమకారులు, లాయర్లు, నిజాయతీపరులైన అధికారులు, జడ్జీల వల్ల చివరకు న్యాయం జరిగింది. అత్యాచార బాధితులు పట్టువిడవకుండా పోరాడడంతో ఇప్పటికైనా సత్యం గెలిచింది. కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత సాక్షిగా ధర్మం నిలిచింది. కేవలం 655 మంది ఆదివాసీలు బలమైన రాజ్యవ్యవస్థతో తలపడి, విజయం సాధించడం చరిత్రాత్మకం. ఆ రకంగా ఇది బలవంతులపై బలహీనుల గెలుపు. ఆదివాసీల హక్కుల గెలుపు. న్యాయవ్యవస్థ స్వతంత్రమనీ, పాలకుల తప్పులను సైతం సహించదనీ రుజువైంది. ఎస్సీ– ఎస్టీ చట్టం ఇప్పటికీ బలంగానే ఉందని తేలింది. అయితే, నేటికీ కొనసాగుతున్న అనేక దమనకాండ కేసుల్లో ఇంత సుదీర్ఘ పోరాటం, సత్యాన్ని వెలికితీసి దోషులకు శిక్షపడేలా బృహత్ యత్నం సాధ్యమేనా? న్యాయం దక్కడంలో ఆలస్యమైతే, న్యాయం చేయనట్టే! వాచాత్తి ఘటనలో అపరిమిత ఆలస్యమైంది. దోషుల్లో పలువురు బెయిల్‌పై బయట గడిపి, ఉద్యోగ ప్రయోజనాలన్నీ పొంది, హాయిగా రిటైరయ్యారు. ఇప్పటికైనా దోషులను శిక్షించడమే కాక, బాధితులకు తగిన న్యాయం చేయాలి. నష్టపరిహారాలిస్తే సరిపోదు. నలుగురిలో గౌరవంగా బతికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. వలసవాద బ్రిటీషు పాలన లక్షణాలను పోలీసులు, అధికారులు ఇప్పటికైనా వదిలించుకొంటే మేలు. తమిళనాట గిరిజనులపై అమానుషాల నుంచి మిజోరమ్‌లో గ్రామాల దహనం, కశ్మీర్లో నిర సనకారులపై కాల్పుల దాకా దశాబ్దాలుగా చూస్తున్నవే. బ్రిటీషు దౌర్జన్యానికి మన భారతీయ పోలీ సులు వారసులుగా మారిన వైనానికి ఇవి ప్రతీకలు. పదే పదే సాగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు సాక్ష్యాలు. అందుకే, ‘‘దాడుల పేరిట చట్టవ్యతిరేక చర్యలకు’’ పోలీసులు బరి తెగించడం దుస్సహమని కోర్ట్ అన్న మాట కీలకం. నిన్నటికి నిన్న కూడా వార్తల్లో కనిపిస్తున్న ఇళ్ళపై దుర్మార్గ దాడుల ధోరణిని వ్యవస్థ సత్వరమే వదిలించుకోవాలి. వాచాత్తి కేసు గుర్తుచేస్తున్న పాఠం అదే! -
విశాల్‌కు కోర్టు అక్షింతలు
నటుడు విశాల్‌కు చైన్నె ప్రత్యేక న్యాయస్థానం అక్షింతలు వేసింది. కోర్టు ధిక్కార కేసు వేయాలంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు.. సినీ ఫైనాన్షియర్ అన్బుచెలియన్ వద్ద తీసుకున్న అప్పును లైకా ప్రొడక్షన్స్ సంస్థ చెల్లించింది. అందుకుగాను నటుడు విశాల్ నిర్మించే చిత్రాల హక్కులను తమ సంస్థకు చెందిన అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అయితే ఆ మొత్తాన్ని విశాల్ లైకా సంస్థకు తిరిగి చెల్లించకపోగా ఆ మధ్య విశాల్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన వీరమే వాగై చుడుమ్ చిత్రాన్ని నిబంధనలను మీరి వేరే సంస్థకు విక్రయించారు. దీంతో లైకా ప్రొడక్షన్‌న్స్ విశాల్‌పై మద్రాసు హైకోర్టులో దాఖలు చేసింది. ఈ కేసు విచారించిన న్యాయమూర్తి విశాల్ ఆస్తుల వివరాలను బ్యాంక్ ఖాతాల వివరాలను కోర్టులో సమర్పించాలని ఆదేశించారు. దీంతో విశాల్ ఈ కేసుపై రిట్ పిటిషన్ దాఖలు వేశారు. అయితే డివిజన్ బెంచ్ కొట్టేసింది. అంతేకాకుండా విశాల్ కథానాయకుడు నటించిన మార్క్ ఆంటోని చిత్ర విడుదలపై స్టే విధించారు. ఆ తర్వాత లైకా సంస్థ దాఖలు చేసిన పిటిషన్ న్యాయమూర్తి ఆషా సమక్షంలో గతవారం విచారణకు వచ్చింది. అప్పుడు న్యాయమూర్తి విషయాలకు తన ఆస్తులు బ్యాంక్ ఖాతాల వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించి తర్వాత విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా వేశారు. అయితే 19వ విశాల్ తన ఆస్తుల వివరాలు కోర్టుకు సమర్పించకపోవడంతో పాటు ఆయనగానీ ఆయన తరఫు న్యాయవాది గానీ కోర్టుకు హాజరు కాలేదు. కాగా ఈ కేసు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. నటుడు విశాల్ ఆయన తరఫున జూనియర్ న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు. దీంతో విశాల్ తన ఆస్తులను కోర్టులో పెట్టకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ కావాలనే కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ అక్షింతలు వేశారు.ఇది కోర్టు ధిక్కార కేసు కింద వస్తుందని హెచ్చరించారు. దీంతో విశాల్ తరఫున హాజరైన జూనియర్ న్యాయవాది ఆస్తుల వివరాలను గురువారమే కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. అయితే అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అన్న న్యాయమూర్తి ప్రశ్నకు తమ సీనియర్ న్యాయవాది హాజరై ఆ వివరాలను తెలియజేస్తారని బదులిచ్చారు దీంతో న్యాయమూర్తి విచారణను కొద్దిసేపు వాయిదా వేశారు. -
మాటలు జాగ్రత్త.. విద్వేషాలను రెచ్చగొట్టకూడదు
చెన్నై: ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కే కానీ అది ద్వేషపూరితంగా ఉండకూడదని తెలిపింది. బాధ్యతలను తెలియజేసేది.. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు సనాతన ధర్మంపై వ్యతిరేకత గురించి డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఎలాంగోవన్ వేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ శేషసాయి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అనేది మన దేశం, మన పరిపాలకులు, తల్లిదండ్రులు, గురువుల పట్ల మన శాశ్వత బాధ్యతను గుర్తుచేసే ధర్మాల సమూహమని పేదల పట్ల దయ చూపించమని చెబుతుందని అన్నారు. సనాతన ధర్మంపై డిబేట్లా.. ఈ సందర్బంగా ఆయన సనాతన ధర్మంపై డిబేట్లు పెట్టడంపై మరింత తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మం కులవ్యవస్థను ప్రోత్సహించి అంటరానితనాన్ని ప్రేరేపిస్తుందన్న అసత్యాన్ని ప్రజల మనసుల్లో నాటే ప్రయత్నం చేయడాన్ని ఆయన ఖండించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని ఎప్పుడో నిర్మూలించడం జరిగిందని గుర్తుచేశారు. మనుషులంతా ఒక్కటే.. ఈ దేశంలో అందరూ ఒక్కటేనని ఇటువంటి దేశంలో అంటరానితనాన్ని సహించేది లేదని అన్నారు. మతం అనేది సహజమైన కల్మషంలేని స్వచమైన విశ్వాసం అనే పునాది మీద నిర్మితమైందని భావ ప్రకటన స్వేచ్ఛ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండకూడదని అన్నారు. ఇది కూడా చదవండి: ICMR: కరోనా కంటే నిఫాతోనే మరణాల రేటు ఎక్కువ -
స్టార్ హీరో కేసులో హైకోర్టు కీలక తీర్పు.. ఆ డబ్బు!
స్టార్ హీరోకు- నిర్మాతకు మధ్య ఓ వివాదం. ఈ విషయం హైకోర్టు వరకు వెళ్లింది. గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన దీనిపై తాజాగా న్యాయాస్థానం తీర్పు ఇచ్చింది. సదరు హీరో.. దాదాపు కోటి రూపాయల మొత్తాన్ని నిర్మాతకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం జరిగింది? అసలా హీరో ఎవరు? జరిగింది ఇదే తమిళ నటుడు శింబు గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. అప్పట్లో 'వల్లభ, 'మన్మథ' లాంటి డబ్బింగ్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కానీ తర్వాత కేవలం తమిళం వరకే పరిమితయ్యాడు. ఇతడు కొన్నేళ్ల ముందు వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థలో ఓ సినిమా కోసం రూ.9.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానని ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్ కింద రూ.4.5 కోట్ల అందుకున్నాడు. కోటి రూపాయలు బ్యాంక్ ద్వారా చెల్లించగా, మిగిలిన మొత్తం డబ్బుగా ఇచ్చారు. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కూతురు ఉందా?) ఎందుకు గొడవ? అయితే అడ్వాన్స్ తీసుకున్న శింబు.. సినిమా చేసే విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో వేల్స్ నిర్మాణ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఇరువురి వాదనలు విన్న మద్రాసు హైకోర్టు.. బ్యాంక్ ద్వారా చెల్లించిన కోటి రూపాయల్ని నిర్మాణ సంస్థకు తిరిగిచ్చేయాలని ఆదేశించింది. మిగిలిన మూడున్నర కోట్ల రూపాయలకు సరైన ఆధారాలు లేని కారణంగా అవి తిరిగివ్వాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. క్లారిటీ మిస్ ఈ విషయం తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారినప్పటికీ.. శింబు సన్నిహితులు లేదా పీఆర్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి ఏమైనా వెళ్తారా? రాజీ కుదుర్చుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఈ మధ్యే 'పాతు తలా' మూవీతో వచ్చిన శింబు హిట్ కొట్టాడు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?) -
తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే!
తండ్రికీ కావాలి ప్రసూతి సెలవు తల్లికి ప్రసూతి సెలవు ఇస్తున్నట్టే తండ్రికి కూడా ప్రసూతి సెలవు ఇవ్వడం గురించి ఆలోచించే సమయం వచ్చేసిందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య ప్రసవ సమయంలో బాలింతను, నవజాత శిశువును చూసుకోవడానికి తండ్రికి సెలవు ఇవ్వకతప్పదని, ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు శాసనపరమైన చట్టాలు తేవాలని జస్టిస్ విక్టోరియా గౌరి సూచించారు. నిజమే. తండ్రికి సెలవు భార్యభర్తల మధ్య అనేక చికాకులను దూరం చేయగలదు. ఒక పరిశీలన. బిడ్డకు జన్మనివ్వడమంటే సమాజానికి కొత్త సభ్యుణ్ణి ఇవ్వడమే. పుట్టిన బిడ్డ తల్లిదండ్రులకు సంతానం కావచ్చు కాని సమాజానికి ప్రతినిధే. బిడ్డకు సురక్షితంగా జన్మనివ్వడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో, ఆ తల్లిదండ్రులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో సమాజానిదీ అంతే బాధ్యత. కనేందుకు ఆస్పత్రి, పెంచేందుకు తండ్రికి కనీస ఆదాయం లేకపోతే సమాజం తప్పవుతుంది. గతంలో స్త్రీ ఇంటి పట్టునే ఉండేది. ఉమ్మడి సంసారాల్లో కాన్పులకు సులువుగా సాయం దొరికేది. కాని ఇప్పుడు ఇలా తాళి కడితే అలా విడిగా కాపురం పెట్టే పరిస్థితులు వచ్చాయి. దానివల్ల పిల్లల్ని కనడం, పెంచడం చాలా పెద్ద బాధ్యతగా మారింది తల్లిదండ్రులకు. ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ప్రసూతి సెలవులు మంజూరు అవుతున్నా ఆ స్త్రీలకు, పుట్టిన శిశువులకు కాన్పు సమయంలో తోడుగా ఉండాల్సిన పురుషులకు మాత్రం సెలవు గురించి ఇంకా ఆలోచన రావడం లేదు. సమాజం ఇంకా అంత‘నాగరికం’గా ఆలోచించడం లేదు. కాని తాజా ఘటన ఈ అంశాన్ని చర్చకు తెచ్చింది. కోర్టుకెక్కిన తండ్రి తమిళనాడులోని తెన్‌కాశీలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న బి.శరవణన్ తన భార్యకు కాన్పు సమయంలో తోడు ఉండేందుకు 90 రోజుల సెలవు అడిగాడు. దానికి కారణం అతని భార్య ఐ.వి.ఎఫ్. ద్వారా గర్భం దాల్చడమే. ఐ.వి.ఎఫ్.ద్వారా గర్భం దాల్చితే కాన్పు అయ్యేంత వరకూ జాగ్రత్తగా ఉండాలి. అందుకే సెలవు అడిగాడు. పరిస్థితి విన్న అధికారులు శాంక్షన్ చేశారు. కాని ఆ సెలవు ఉపయోగంలోకి రాక ముందే అతను విధుల్లో లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని సెలవు కేన్సిల్ చేశారు. దాంతో శరవణన్ కోర్టుకు వెళ్లాడు. డెలివరీ డేట్ మే 30 కనుక కోర్టు మే 1 నుంచి సెలవు ఇమ్మంది. అధికారులు 30 రోజులు సెలవు మంజూరు చేశారు. కాని డెలివరీ మే 31న జరిగింది. దాంతో మే 31న శరవణన్ విధులకు హాజరు కాలేకపోయాడు. అంతే కాదు సెలవు పొడగింపును కోరాడు. అధికారులు సెలవును పొడిగించకపోగా చెప్పాపెట్టకుండా విధులకు హాజరుకానందున ఎందుకు చర్య తీసుకోకూడదో జూన్ 22న వచ్చి వ్యక్తిగతంగా సంజాయిషీ ఇమ్మని ఆదేశించారు. ఆ ఆదేశాలను శరవణన్ హైకోర్టులో సవాలు చేశాడు. కోర్టు ఆ ఆదేశాలను కొట్టేస్తూ మగవారికి కూడా ప్రసూతి సెలవలు అవసరమని అభిప్రాయపడింది. ఆందోళన లేకుండా కాన్పు సమయంలో భార్యకు ఎంత ఆందోళన ఉంటుందో భర్తకూ అంతే ఆందోళన ఉంటుంది. రెండు ప్రాణాలు పరీక్ష సమయాన్ని ఎదుర్కొనే వేళ సహజంగానే లేబర్ రూమ్ బయట పురుషుడు ఒత్తిడికి లోనవుతాడు. అదొక్కటే కాదు బిడ్డ పుట్టాక భార్యకు శక్తి వచ్చే వరకు, బిడ్డ కుదుట పడేవరకు ఇంట్లో పనులు ఎన్నో ఉంటాయి. ఆస్పత్రుల చుట్టూ తిరుగుళ్లు ఉంటాయి. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంటి నుంచి ఫోన్ రాగానే కంగారు పడుతూ భర్తలు ఆ సమయంలో వేదన అనుభవిస్తారు. మరోవైపు తోడుండాల్సిన భర్త ఇంటి పట్టున లేకపోతే, డబ్బు సంపాదన ఎంత తప్పనిసరి అయినప్పటికీ, భార్యకు నిస్పృహ రావడం సహజం. రాత్రిళ్లు చంటి పిల్లల ఏడ్పు వల్ల ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లాల్సిన భర్త నిద్ర చెడి చిరాకు పడితే ఆ గొడవ కాస్తా విడాకుల వరకు వెళ్లిన కేసులెన్నో. అందువల్ల భార్యతో పాటు భర్తకు సెలవులు ఇవ్వడం ఎంతో అవసరం. ‘కనేది ఆమె అయితే ఇతనికేం నొప్పి’ అని హేళన చేసే రోజులు పోయాయి. ఈ బిజీ రోజుల్లో మనిషి తోడు కష్టమైన రోజుల్లో భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరై సంతానాన్ని సాకాలంటే ఇలాంటి నాగరికమైన ఆలోచనలు తప్పక చేయాల్సిందే. సమయం వచ్చేసింది మద్రాసు హైకోర్టులో ఈ కేసును విన్న జస్టిస్ ఎల్.విక్టోరియా మేరి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో మగవారికి ప్రసూతి సెలవులు తప్పనిసరి చేస్తూ చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమస్యకు స్పందించాల్సిన సమయం వచ్చేసిందని అన్నారు. ‘పిల్లల్ని కని, పెంచడంలో స్త్రీ, పురుషులిరువురికీ సమాన బాధ్యత ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రసూతి సమయంలో తల్లితోపాటు తండ్రికీ సెలవులు ఇస్తున్నాయి. అవి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు సరితూగకపోయినా ఏదో ఒక మేరకు ఇస్తున్నాయి. మన దేశంలో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ (1972) ప్రకారం భార్య ప్రసూతి సమయంలో పురుషులకు లీవ్ పెట్టే వీలు ఉంది. కాని ఆ రూల్స్ చాలా రాష్ట్రాల్లో అమలు కావడం లేదు’. –జస్టిస్ విక్టోరియా గౌరి, మద్రాసు హైకోర్టు (చదవండి: పొల్యూషన్‌కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్! అరటిచెట్టు బెరడుతో బ్యాగ్‌లు, ఆభరణాలు) -
ఐపీఎల్ బ్యాన్ చేయాలి.. కోర్టులో దాఖలైన పిటిషన్
సాక్షి, చైన్నె: ఐపీఎల్ మ్యాచ్‌లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా ఈ విషయంపై బీసీసీఐను ఆశ్రయించాలని పిటిషనర్, ఐపీఎస్ అధికారికి హైకోర్టు సీజే నేతృత్వంలోని బెంచ్ సూచించింది. వివరాలు.. ఐపీఎల్ మ్యాచ్‌ల క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్న విషయం తెలిసిందే. భారత్‌లో జరిగే ఈ మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియాలకు తండో పతండాలుగా అభిమానులు తరలిరావడం జరుగుతోంది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లు అన్ని ఫిక్సింగ్, బెట్టింగ్‌లతో జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ బెట్టింగ్‌లు, ఫిక్సింగ్‌లకు వ్యతిరేకంగా ఐపీఎస్ అధికారి సంపత్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఐపీఎల్ మ్యాచ్‌లను బెట్టింగ్, ఫిక్సింగ్ పూర్తిగా కట్టడి అయ్యే వరకు నిర్వహించకూడదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ గురువారం హైకోర్టు సీజే గంగా పుర్వాల, న్యాయమూర్తి ఆదికేశవులు బెంచ్ ముందు విచారణకు వచ్చింది. వాదనల అనంతం ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. బెట్టింగ్, ఫిక్సింగ్ ఫిర్యాదులను బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. చదవండి సీమా, అంజూ.. ఇప్పుడు జూలీ.. సరిహద్దులు దాటిన ప్రేమలో బిగ్ ట్విస్ట్.. -
తమిళనాట మరో ట్విస్ట్.. అన్నాడీఎంకేకు షాక్!
చెన్నై: తమిళనాడులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అన్నాడీఎంకే ఎంపీ ఓపీ రవీంద్రనాథ్‌కు షాక్ తగిలింది. తేనీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన ఎన్నిక చెల్లదంటూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో ఆయన ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. వివరాల ప్రకారం.. పన్నీరు సెల్వం కుమారుడు రవీంద్రనాథ్‌కు ఎదురుదెబ్బ తగలింది. పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి ఎంపీగా గెలుపొందిన రవీంద్రనాథ్ ఎన్నికను రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే, ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి ఈవీకేఎస్ ఎలంగోవన్‌పై 76,672 ఓట్ల ఆధిక్యతతో రవీంద్రనాథ్ గెలుపొందారు. కాగా, ఆయన ఎన్నికపై మిలానీ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సందర్భంగా రవీంద్రనాథ్ ఆస్తులకు సంబంధించి తప్పుడు పత్రాలు ఇచ్చారని ఆరోపించారు. అలాగే, గెలుపు కోసం అవినీతికి పాల్పడినట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక, ఈ పిటిషన్‌పై కోర్టులో విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆయన ఎన్నికను మద్రాస్ హైకోర్టు రద్దు చేస్తున్నట్టు తీర్పు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే నుంచి రవీంద్రనాథ్ 2022లో పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీపై తిరుగుబాటు చేసిన నేపథ్యంలో అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి నుంచి రవీంద్రనాథ్ మాత్రమే గెలుపొందడం గమనార్హం. డీఎంకే-కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలోని మొత్తం 39 సీట్లలో 38 గెలుచుకుంది. ఇది కూడా చదవండి: ఎన్సీపీ విద్యార్ధి నాయకుల వినూత్న పోస్టర్ -
సుప్రీం కోర్టులో కనిమొళికి భారీ ఊరట
ఢిల్లీ: డీఎంకే నేత కనిమొళి కరుణానిధికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఎంపీగా ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను .. సుప్రీం కోర్టు కొట్టేసింది. ఆమె ఎన్నిక సమర్థనీయమేనని తీర్పు ఇచ్చింది. 2019 ఎన్నికల సమయంలో తూతుక్కుడి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కనిమొళి. అయితే ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ సనాతన కుమార్ అనే ఓటర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. నామినేషన్ సమయంలో.. ఎలక్షన్ అఫిడవిట్లో కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సరిగా పొందుపర్చలేదని, మరీ ముఖ్యంగా భర్త పాన్ నెంబర్‌ను జత చేయలేదని అభ్యంతరం వ్యక్తం చేశాడతను. అయితే.. తన భర్త సింగపూర్ పౌరుడని, ఆయనకు పాన్ నెంబర్ ఉండదని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలని ఆమె అభ్యర్థించారు. కానీ, మద్రాస్ హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ తరుణంలో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. అయితే మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం 2020, జనవరిలో స్టే విధించింది. ఇవాళ(గురువారం) ఆ పిటిషన్ విచారణకు రాగా.. ఎలక్షన్‌కు సంబంధించిన పిటిషన్‌ను కొట్టేస్తూ.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను పరిశీలించాలన్న కనిమొళి అభ్యర్థనను స్వీకరిస్తున్నట్లు జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. ఇదీ చదవండి: ఇలాంటివి చూసేందుకే అంత కష్టపడ్డామా? -
డైరెక్టర్ లింగుస్వామికి ఊరట.. జైలు శిక్షపై స్టే
ప్రముఖ దర్శకుడు లింగుస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. చెక్‌బౌన్స్ కేసులో ఆయనపై కిందికోర్టు విధించిన 6నెలల జైలు శిక్షపై స్టే విధించింది. వివరాల్లోకి వెళితే.. లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ కలిసి కార్తీ, సమంత హీరోహీరోయిన్లుగా ఎన్ని ఇజు నాల్ అనే సినిమా తెరకెక్కించాలని భావించారు. చదవండి: యాంకర్ అనసూయ 'ప్రేమ విమానం'కు మహేశ్‌బాబు సపోర్ట్ ఇందుకోసం 2014లో పీవీపీ కేపిటల్స్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.35 లక్షలు అప్పు తీసుకున్నారు.చివరకు ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న డబ్బునంతటినీ చెక్ రూపంలో తిరిగిచ్చారు. కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టుమెట్లెక్కింది. కేసును విచారించిన అనంతరం కోర్టు లింగుస్వామికి, ఆయన సోదరుడికి 6 నెలల జైలు శిక్షను విధించింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ లింగుస్వామి హైకోర్టును ఆశ్రయించడంతో జైలు శిక్షపై స్టే విధించింది. చదవండి: 'పుష్ప-2' సెట్స్‌లో జూ.ఎన్టీఆర్.. వైరల్‌గా మారిన ఫోటో -
‘రుద్రన్’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తమిళసినిమా: నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం రుద్రన్. ఫైవ్‌స్టార్ కదిరేశన్ నిర్మించిన చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్ర విడుదలను నిషేధించాలని చిత్ర హిందీ డబ్బింగ్ హక్కులను పొందిన రేవంశు గ్లోబల్ వెంచర్స్ సంస్థ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. అందులో రుద్రం చిత్ర నిర్మాత హిందీ అనువాద హక్కుల కోసం మరో రూ.4 కోట్లు అదనంగా డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీజేషన్ విచారించిన న్యాయస్థానం చిత్రాన్ని ఈ నెల 24 వరకు విడుదల చేయాలంటూ తాత్కాలిక స్టే విధించింది. దీంతో చిత్ర నిర్మాత హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం రుద్రన్ చిత్రం విడుదలపై స్టేను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈ చిత్రం ముందుగా ప్రకటించిన విధంగా శుక్రవారం తెరపైకి రానుంది. -
వారియర్ డైరెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష
ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే! తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కాగా కొన్నేళ్ల క్రితం కార్తీ, సమంత హీరోహీరోయిన్లుగా ఎన్ని ఇజు నాల్ అనే సినిమా తెరకెక్కించాలని లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ భావించారు. ఇందుకోసం పీవీపీ క్యాపిటల్ కంపెనీ నుంచి రూ.35 లక్షలు అప్పు తీసుకున్నారు. చివరకు ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న డబ్బునంతటినీ చెక్ రూపంలో తిరిగిచ్చారు. కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టుమెట్లెక్కింది. గతేడాది ఆగస్టులో ఈ కేసును విచారించిన న్యాయస్థానం లింగుస్వామికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ, రిట్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు సమయమిచ్చింది. దీంతో డైరెక్టర్ రూ.10 వేలు కోర్టుకు అపరాధ రుసుం చెల్లించి అనంతరం అప్పీల్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో తాజాగా బుధవారం (ఏప్రిల్ 12న) ఈ కేసును మరోసారి విచారించిన మద్రాస్ హైకోర్టు లింగుస్వామికి విధించిన ఆరు నెలల జైలు శిక్షను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో డైరెక్టర్ జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పును ట్విటర్లో షేర్ చేసిన లింగుస్వామి మరోసారి అప్పీలుకు వెళ్తామని వెల్లడించారు. కాగా లింగుస్వామి చివరిగా రామ్ పోతినేనితో వారియర్ సినిమా చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. pic.twitter.com/aJujcEr01m — Lingusamy (@dirlingusamy) April 13, 2023 -
విశాల్‌కు హైకోర్టు షాక్.. రూ. 15 కోట్లు చెల్లించాలంటూ ఆదేశం
స్టార్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. రూ. 15 కోట్ల రూపాయలు శాశ్వత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ కోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. అలా చేయని పక్షంలో తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీలో తెరకెక్కే సినిమాలు రిలీజ్ కాకుండ నిషేధం విధించింది. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన కేసులో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కాగా గతంలో విశాల్ ఓ తన నిర్మాణ సంస్థ(ఫలిం ఫ్యాక్టరి) కోసం ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బుచెళియన్ వద్ద రూ. 21. 29 కోట్లు అప్పు తీసుకున్నాడు. అయితే ఈ రుణాన్ని లైకా ప్రొడక్షన్స్ ఫైనాన్షియర్‌కు తిరిగి చెల్లించింది. అయితే, తమకు రుణం చెల్లించేంత వరకు విశాల్ నటించే చిత్రాల పంపిణీ హక్కులన్నీ తమకే ఇచ్చేలా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ - లైకా ప్రొడక్షన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. కానీ ఈ ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘిస్తూ తన చిత్రం ‘వీరమే వాగై సూడుం’ చిత్రాన్ని రిలీజ్ చేశారు. దీంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జ్ స్పెషల్ కోర్టు దీంతో లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన సింగిల్ జడ్జి స్పెషల్ కోర్టు రిజిస్ట్రార్ పేరుతో రూ.15 కోట్లను మూడు వారాల్లో శాశ్వత డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ సమయంలో విశాల్ నేరుగా కోర్టుకు హాజరై.. లైకా సంస్థ కోర్టును ఆశ్రయించడం వల్లే రుణం చెల్లించలేకపోయాయని, పైగా తనకు ఒకే రోజున రూ.18 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో విశాల్ ఆస్తుల వివరాలను ప్రమాణ పత్రంలో సమర్పించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ విశాల్ హైకోర్టులో అప్పీల్ చేయగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజా, జస్టిస్ భరత చక్రవర్తిల సారథ్యంలో ధర్మాసనం విచారణ జరిపి.. గతంలో రూ.15 కోట్లను విశాల్ చెల్లించాలంటూ సింగిల్ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. పైగా ప్రత్యేక జడ్జి తుది తీర్పును వెలువరించేంత వరకు విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మించే చిత్రాలు థియేటర్ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీలులేదని ధర్మాసనం ఆదేశించింది. -
ఆ వైభవం తిరిగొస్తుందా?
గత అక్టోబర్‌లో యాభై ఏళ్ళు నిండినప్పుడు అందరూ ఆగిచూసిన దక్షిణాది ప్రాంతీయ పార్టీ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకె)కు మంచి రోజులు రానున్నాయా? అప్పట్లో ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకె)తో సరిపడక హీరో ఎమ్జీఆర్ బయటకొచ్చి స్థాపించిన ఈ పార్టీపై పట్టు కోసం కోర్టులో పోరు కొలిక్కి వచ్చినట్టేనా? పార్టీ నుంచి తనను బహిష్కరించడాన్నీ, తన ప్రత్యర్థి – మాజీ సీఎం ఈడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడాన్నీ సవాలు చేస్తూ మాజీ సమన్వయకర్త ఓ. పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) వేసిన పిటిషన్లను మద్రాస్ హైకోర్ట్ మంగళవారం తోసిపుచ్చింది. కోర్టులో ఓపీఎస్‌కు ఎదురుదెబ్బ ఇది వరుసగా మూడోసారి. తీర్పుపై అప్పీలుకు అవకాశం ఉన్నా, ఆయన రాజకీయ పునరాగమనానికి దారులు మూసుకుపోతున్నట్టే అనిపిస్తోంది. కేడర్‌పై విస్తరించిన పట్టు, కీలక స్థానాల్లో నమ్మినబంట్ల నియామకం, సమర్థ పరిపాల కుడిగా సాధించిన పేరు, తాజా కోర్టు తీర్పుతో... పార్టీ పగ్గాలు ఈపీఎస్ చేతికి దాదాపు వచ్చినట్టే. ఇది పార్టీ పునర్వైభవానికి దోహదమవుతుందా అన్నదే ఇక మిగిలిన ప్రశ్న. అధినేత్రి జయలలిత మరణానంతరం క్రమంగా కష్టాల్లో పడ్డ అన్నాడీఎంకె గత రెండేళ్ళలో తేవర్లు, గౌండర్లు, వగైరా కులాల కుంపట్లతో ఒకటికి నాలుగు (ఈపీఎస్, ఓపీఎస్, పదవీచ్యుత ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె మేనల్లుడు – ఏఎంఎంకె అధినేత టీటీవీ దినకరన్) వర్గాలైంది. సాంప్రదాయికంగా అన్నాడీఎంకెకు పట్టున్న రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో నిరుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకె పాగా వేసింది. మహిళలు, వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణాల ఓటు బ్యాంక్ క్రమంగా చెదిరిపోతోంది. ఈపీఎస్, ఓపీఎస్ శిబిరాల మధ్య పోరుతో పార్టీ దశ, దిశ కోల్పోయి బలహీనపడ్డ సమయంలో కోర్ట్ తీర్పు అయాచిత వరమే. పేరుకు ప్రధాన ప్రతిపక్షమైనా వర్గ విభేదాలు, పార్టీకి సారథి ఎవరో తెలియని అయోమయం, ఎన్నికల చిహ్నం రెండాకులపై పోరాటం సాగుతున్న వేళ ఈ తీర్పు పార్టీ ప్రస్థానానికి దిశానిర్దేశమే. కోర్టు ఆదేశాలు ఈపీఎస్ వర్గానికి నైతికంగా పెద్ద అండ. నిజానికి, దివంగత జయలలితనే పార్టీ శాశ్వత అధినేత్రిగా ప్రకటించాలన్నది ఓపీఎస్ వర్గం దీర్ఘకాలిక డిమాండ్. ఇప్పుడీ తీర్పుతో వారి డిమాండ్‌కు గండిపడింది. ఈపీఎస్ మద్దతుదారులు తమ నేతను శాశ్వత ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొని, పార్టీని మళ్ళీ పట్టాలెక్కించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ ఫిబ్రవరిలో సుప్రీం కోర్ట్ సానుకూలంగా ఇచ్చిన తీర్పూ వారికి కలిసొచ్చే అంశం. ఇప్పటికే పార్టీ జనరల్ కౌన్సిల్లో, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెజారిటీ సభ్యుల మద్దతు ఈపీఎస్‌కే ఉంది గనక ఈపీఎస్ యథేచ్ఛగా ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవచ్చు. సదరు సమావేశాల్లో పార్టీలో ఓపీఎస్ లాంటి ప్రత్యర్థుల్ని ఇంటికి సాగనంపుతూ తీర్మానాలు చేసే వీలు చిక్కుతుంది. అవసరాన్ని బట్టి పార్టీ రాజ్యాంగాన్నీ సవరించుకోవచ్చు. ఇవన్నీ ఈపీఎస్‌కు కలిసొచ్చే అంశాలు. ఇల్లలకగానే పండగ కాదనట్టు ఈపీఎస్‌కు అనేక సవాళ్ళు ముందున్నాయి. దాదాపు 1.5 కోట్ల మంది కార్యకర్తలున్న పార్టీని ఒంటరి దళపతిగా ఆయన ముందుకు నడపాలి. పార్టీకి మునుపు సారథ్యం వహించిన ఎమ్జీఆర్, జయలలిత లాంటి దిగ్గజాలకున్న ఇమేజ్, ప్రాచుర్యం ఈపీఎస్‌కు లేవు. వారిలా జనాకర్షణ, మాటే శాసనంగా పార్టీని నడిపే పట్టు ఆయన నుంచి ఆశించలేం. సొంత గూటి సంగతి పక్కన పెడితే, ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకెతో ఢీ అంటే ఢీ అనాలంటే ముందుగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జనంలో పార్టీపై నమ్మకం పెంపొందించాలి. మరోపక్క 2019 లోక్‌సభ ఎన్నికల్లో, 2021 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో విజయాలతో డీఎంకెను ముందుకు నడిపిన ఘనత స్టాలిన్‌ది. బలమైన ఈ ప్రత్యర్థితో తలపడడం ఈపీఎస్‌కు ఈజీ కాదు. తమిళ రాజకీయాలెప్పుడూ డీఎంకె, అన్నాడీఎంకెల మధ్య... కరుణానిధి, జయలలితల మధ్య ఊగడం రివాజు. ఆ రాజకీయ దృశ్యం ఇప్పుడు గణనీయంగా మారింది. చిరకాలంగా తమిళ రాజకీయాలకు దిక్సూచైన ద్రావిడ సిద్ధాంతం క్రమంగా కుంచించుకుపోతోంది. ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులను (గవర్నర్ రవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై) 2021లో బరిలోకి దింపి, డీఎంకె వ్యతిరేక, హిందూత్వ జాతీయవాద వైఖరితో బీజేపీ కాలు దువ్వుతోంది. అలాగే, జయ మరణానంతరం అన్నాడీఎంకెకు పెద్దన్నగా వ్యవహరించిన బీజేపీ... ఆ పార్టీ బలహీనతల్ని వాటంగా చేసుకొని, జయ వదిలివెళ్ళిన స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా తాను కూర్చోవాలని శతధా ప్రయత్నిస్తోంది. పక్కనే పొంచివున్న ఈ ముప్పు పట్ల ఈపీఎస్ జాగరూకత వహించి, సమర్థంగా ఎదుర్కోవాలి. ఒక్కమాటలో– 39 పార్లమెంటరీ స్థానాలున్న తమిళనాట రానున్న 2024 లోక్‌సభ ఎన్నికలు ఈపీఎస్‌కు తొలి పెద్ద పరీక్ష. దానిలో పార్టీని బలంగా నిలబెట్టి, తర్వాత మరో రెండేళ్ళకు వచ్చే 234 స్థానాల శాసనసభా సమరంలో అధికారం చేజిక్కించుకునేలా పోరాడాలి. నిరుటి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకె కూటమి 159 స్థానాలు సాధిస్తే, 75 సీట్లకే పరిమితమైన అన్నాడీఎంకె కూటమి ఆ లెక్కను తిరగరాయాలి. అదే జరిగితే అధినేతగా ఈపీఎస్‌కు తిరుగుండదు. లేదంటే, అన్నాడీఎంకెలో మరోసారి అసమ్మతి స్వరాలు పైకొస్తాయి. రిటైరయ్యానని ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళను మళ్ళీ తెర పైకి తేవాలనే మాటలు వినిపిస్తాయి. అందుకే, రాగల మూడేళ్ళ కాలం ఈపీఎస్‌కు పరీక్షా సమయం. మంచి మార్కులు తెచ్చుకుంటేనే ఆయనకైనా, అన్నాడీఎంకెకైనా భవిష్యత్తు! -
పన్నీర్ సెల్వంకు భారీ షాక్
తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేలో వర్గ పోరులో.. కోర్టు తీర్పు ద్వారా పళనిస్వామి మళ్లీ పైచేయి సాధించారు. పార్టీ నుంచి తనను బహిష్కరించడంతో పాటు ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పళనిస్వామి చేపట్టడాన్ని సవాల్ చేస్తూ పన్నీర్‌సెల్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఇవాళ(మంగళవారం) ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువడినవెంటనే.. అన్నాడీఎంకే పార్టీ అధికారికంగా ఈపీఎస్(ఎడపాడి కే పళనిస్వామి)ని పార్టీ ప్రదాన కార్యదర్శిగా ప్రకటించింది పార్టీ సీఈసీ. ఈ మేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సంబురాలు జరుగుతున్నాయి. ఇక తాజా తీర్పుతో ఓపీఎస్(ఓ పన్నీర్ సెల్వం).. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌ను ఆశ్రయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక.. అన్నాడీఎంకే పార్టీ కార్యదర్శి (తాత్కాలిక) పదవికి పళనిస్వామి నియామకాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. కిందటి ఏడాది జులైలో పార్టీ జనరల్ కౌన్సిల్ ద్వారా ఈ నియామకం జరగ్గా.. దానిని వ్యతిరేకిస్తూ పన్నీర్ సెల్వం వర్గం న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు అన్నాడీఎంకే సాధారణ కౌన్సిల్‌ను చట్టబద్ధమైనదిగానే సమర్థించింది. అయితే తీర్మానాల చట్టబద్ధతపై నిర్ణయం మాత్రం మద్రాసు హైకోర్టుకు వదిలివేసింది. ఇదిలా ఉంటే.. గత శనివారం పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఎన్నికకు ఈపీఎస్ నామినేషన్ దాఖలు చేయగా.. ఇదంతా దొంగచాటు వ్యవహారమంటూ పన్నీర్‌సెల్వం మండిపడ్డారు. అంతలోనే మద్రాస్ హైకోర్టు ఈపీఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం గమనార్హం. -
తమిళనాడులో ట్విస్ట్.. పొల్లాచ్చి కేసులో పళనిస్వామికి షాక్!
సాక్షి, చెన్నై: పొల్లాచ్చిలో యువతులు, మహిళలపై జరిగిన లైంగికదాడి వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరింది. ఈ కేసులో బాధితుల పేర్లను వెల్లడించిన పోలీసు అధికారి పాండియరాజన్, ఆయనకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం పళని స్వామి, మాజీ సీఎస్‌ను విచారించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. ఇది సోమవారం విచారణకు రానుంది. వివరాల ప్రకారం.. 2019లో కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి కేంద్రంగా కొందరు యువకులు ఫామ్ హౌస్‌లోకి యువతలు, మహిళలను తీసుకెళ్లి లైంగిక దాడి చేసి వీడియో చిత్రీకరించి వేధించిన వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో 9 మందిని మాత్రమే అరెస్టు చేశారు. అయితే బడాబాబులు, రాజకీయ ప్రముఖుల పిల్లలను ఈ కేసు నుంచి తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే విధంగా హైకోర్టులో చెన్నైకు చెందిన బాలచంద్రన్ శనివారం పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో నిందితులను వెనకేసుకు యత్నించిన పోలీసు అధికారి పాండియరాజన్‌ను సస్పెండ్ చేయాలని ఆ పిటిషన్లో కోరారు. అలాగే ఆయనకు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సీఎం, సీఎస్‌లను కూడా ఈ కేసులో విచారించాలని, ఇందుకు సంబంధించిన ఉత్వరులు ఇవ్వాలని కోర్టుకు పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. -
సుప్రీంలో ఊరట.. జడ్జిగా గౌరీ ప్రమాణం
సాక్షి, ఢిల్లీ: మద్రాస్ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా లాయర్ లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరి ప్రమాణ స్వీకారాన్ని ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొలీజియంలో చర్చ జరిగాకే ఆమె పేరు ప్రతిపాదించినట్టు పేర్కొంది. సంబంధిత హైకోర్టు జడ్జిల అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నట్టు తెలిపింది. ఈ పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లు తేలినా లేదా ప్రమాణానికి లోబడి విధులను నిర్వర్తించకున్నా రెండేళ్ల తర్వాత ఆమె పనితీరు సంతృప్తికరమని భావిస్తేనే శాశ్వత జడ్జిగా ప్రతిపాదించే అవకాశం కొలీజియంకు ఉందని గుర్తు చేసింది. గతంలో అడిషనల్ జడ్జిలుగా పనిచేసిన వారు శాశ్వత జడ్జీలు కాలేకపోయిన ఘటనలు అనేకం ఉన్నాయంది. ఒక వ్యక్తి రాజకీయ, వ్యక్తిగత అభిప్రాయాలు ఆ వ్యక్తి పేరును జడ్జిగా సిఫారసు చేయకపోవడానికి కారణం కాదని కొలీజియం భావించిందని పేర్కొంది. గౌరి మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ కొందరు లాయర్లు కేసు వేయడం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే... మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పుకు ముందే మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జిగా గౌరి ప్రమాణం చేశారు! తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాజా మంగళవారం ఉదయం 10.45 గంటల సమయంలో ఆమెతో ప్రమాణం చేయించారు. తనకు గొప్ప అవకాశమిచి్చన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సహా ఇతర న్యాయమూర్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 1973లో జని్మంచిన గౌరి, 1995లో లాయర్‌గా పేరు నమోదు చేయించుకున్నారు. మదురై బెంచ్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా 2022 నుంచి పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం జనవరి 17వ తేదీన గౌరితో కలిపి మొత్తం ఐదు పేర్లను హైకోర్టు జడ్జీలుగా నియమించేందుకు కేంద్రానికి సిఫారసు చేసింది. -
3 హైకోర్టులకు 13 మంది అదనపు న్యాయమూర్తుల నియామకం
అలహాబాద్, కర్నాటక, మద్రాస్ హైకోర్టుల్లో 13 మంది అదనపు జడ్జీలు నియమితులయ్యారు. వీరిలో 11 మంది లాయర్లు కాగా ఇద్దరు న్యాయాధికారులు. వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం జనవరిలో సిఫార్సు చేసింది. వీరిలో మద్రాస్ హైకోర్టు న్యాయవాది లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీకి బీజేపీతో సంబంధాలున్నాయనే ఆరోపణ వివాదం రేపింది. ఈమె పేరును సిఫార్సు చేయడాన్ని మద్రాస్ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది. బార్‌కు చెందిన 21 మంది లాయర్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ‘‘తాను బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శినంటూ గౌరీ అంగీకరించారు. మైనారిటీలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. మత ఛాందస భావాలున్న ఆమె న్యాయమూర్తిగా అనర్హురాలు’’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 10న విచారణ జరగాల్సి ఉంది. దానిపై మంగళవారమే విచారణ చేపడతామని సీజేఐ ధర్మాసనం తెలిపింది. పార్టీలతో సంబంధాలున్న వారూ జడ్జీలు కావచ్చని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు అనడం తెలిసిందే. -
మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం..
న్యూఢిల్లీ: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియమిస్తూ కేంద్రం నోటిఫై చేయడంపై వివాదం చెలరేగింది. ఆమెను జడ్జిగా సిఫారసు చేసిన కొలీజియం నిర్ణయంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విక్టోరియా గౌరి గతంలో బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ముస్లింలు, క్రైస్తువులపై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో గౌరి నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. మొదట వచ్చేవారం విచారణ చేపడతామన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. ఆ తర్వాత ఈ పిటిషన్‌పై ఈనెల 10న(శుక్రవారం) విచారణ జరుపుతామని చెప్పారు. విక్టోరియా గౌరికి హైకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించడాన్ని కొంతమంది మద్రాస్ హైకోర్టు లాయర్లు ఇప్పటికే వ్యతిరేకించారు. ఆమెను జడ్జిగా నియమించవద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు కొలీజియాన్ని కోరారు. ఈమె జడ్జి అయితే ముస్లింలు, క్రైస్తవులకు తమకు న్యాయం దక్కుతుంది అనే నమ్మకం ఉంటుందా? అని ప్రశ్నించారు. న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియానికి కేంద్రానికి మధ్య మాటల యుద్ధం జరిగిన సమయంలో విక్టోరియా గౌరి పదోన్నతి సాఫీగా జరిగిపోయిందని పలువురు విమర్శలు గుప్పించారు. చదవండి: ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు -
స్టాలిన్ సర్కార్ Vs గవర్నర్.. ట్విస్ట్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు
సాక్షి, చెన్నై: రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. వివరాల ప్రకారం.. ద్రవిడ కళగం నేత కన్నదాసన్ మద్రాసు హైకోర్టులో గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆధారాలతో సహా అందులో వివరించారు. బహిరంగ సభలు, వేదికలపై గవర్నర్ బాధ్యతలను విస్మరించి, సనాతన ధర్మానికి అనుకూలంగా, ద్రావిడ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే తమిళనాడు సర్కారు పంపించే నివేదికలు, తీర్మానాలపై సంతకాలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర గవర్నర్‌గా పదవిలో ఉన్న వ్యక్తి ఇతర సంస్థలు, సంఘాలలో పనిచేయడానికి వీలు లేదని ఆ పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే గవర్నర్‌గా ఉన్న ఆర్ఎన్ రవి పుదుచ్చేరిలోని ఆరోవిల్ ఫౌండేషన్‌కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొన్నారు. ఈ పదవి ద్వారా ఆయనకు వేతనం, పదవీ విరమణ పెన్షన్ వంటి సౌకర్యాలు అందుతున్నాయని వివరించారు. ఈ దృష్ట్యా గవర్నర్‌ను రీకాల్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ గురువారం ఇన్చార్జ్ సీజే రాజ, న్యాయమూర్తి భరత చక్రవర్తి బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. విచారించలేం.. న్యాయమూర్తులు స్పందిస్తూ, గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఉన్నత కోర్టుల తీర్పులు, రాజకీయ శాసనాల ఆధారంగా నియమితులైన వారిపై ఎలాంటి చర్యలకు గానీ, వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంటూ ఈ పిటిషన్ విచారణను తోసిపుచ్చారు. టీఆర్ బాలు ఫైర్.. గవర్నర్ తీరుపై మండిపడుతూ డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు ఓ ప్రకటన చేశారు. ఆయన రాష్ట్రానికి గవర్నర్ తరహాలో కాకుండా, బీజేపీకి మరో అధ్యక్షుడి వ్యవహరిస్తున్నట్లుందని మండిపడ్డారు. తన బాధ్యతలను విస్మరించి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. -
ఆలయాల్లోకి సెల్ఫోన్లు నిషేధం!.. మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు
చెన్నై: మద్రాస్ హైకోర్టు చర్చనీయాంశమైన ఆదేశాలు ఇచ్చింది. ఆలయాల్లోకి సెల్ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఆలయాల యొక్క స్వచ్ఛత..పవిత్రతను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తెలిపింది. అయితే.. హిందూ మత & ధర్మాదాయ శాఖ (హెచ్ఆర్ అండ్ సిఇ) డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చే ఆలయాల్లోకి భక్తులెవరూ తమ ఫోన్లను తీసుకెళ్లకుండా చూసుకోవాలని ఆదేశించింది. ప్రజలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఫోన్లను గుడి దగ్గర్లో పెట్టుకునేలా స్టాండులు, డిపాజిట్ లాకర్లు, టోకెన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. ఈ ఆదేశాలను అన్ని ఆలయాల్లో అమలు అయ్యేలా చూడాలని.. భక్తులెవరూ ఫోన్లు లోపలికి తీసుకెళ్లకుండా భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని తెలిపింది. సుబ్రమణ్య స్వామి ఆలయంలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. మొబైల్ ఫోన్లు ప్రజల దృష్టి మరల్చడంతోపాటు దేవతా చిత్రాలను క్లిక్ చేయడం ఆగమా నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్ వాదించారు. అంతేకాదు.. ఫొటోగ్రఫీ వల్ల దేవాలయాల భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని పేర్కొన్నారు. మరోవైపు.. తమ అనుమతి లేకుండా తమ చిత్రాలను క్లిక్ చేయడంపై మహిళల్లో భయాందోళనలు నెలకొంటాయని పిటిషనర్ పేర్కొన్నారు. అంతేకాదు.. ఆలయాల్లోకి అభ్యంతరకర దుస్తుల్లో రాకూడదని, ఇందుకోసం మంచి డ్రెస్ కోడ్‌ను ఏర్పాటు చేయించాలని పిటిషన్ కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. తాజాగా సెల్ఫోన్లను ఆలయాల్లోకి అనుమతించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాలను సందర్శించే భక్తులు దేశ వారసత్వం, సంస్కృతిని కాపాడే వస్త్రాలను ధరించాలని కూడా భక్తులను ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు పేర్కొంది. -
ఫుట్‌బాల్ ప్లేయర్ ప్రియ మృతిపై విచారణ పూర్తి.. నివేదికలో ఏముందంటే!
సాక్షి, చెన్నై: ఫుట్‌బాల్ క్రీడాకారిణి ప్రియ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందినట్లు విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన నివేదిక ఆరోగ్య శాఖకు చేరింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైద్యులు ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. చెన్నై వ్యాసార్పాడికి చెందిన ప్రియ మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. ప్రత్యేక బృందం జరిపిన విచారణలో పెరియార్ నగర్ ఆస్పత్రి వైద్యులతో పాటు నర్సులు, ఇతర సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వెలుగు చూసింది. ఆమెకు సరైన పద్ధతిలో చికిత్స అందించలేదని తేలింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని విచారణలో స్పష్టమైంది. ఇందుకు సంబంధించిన నివేదికను ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్‌కు ప్రత్యేక బృందం సమర్పించింది. బెయిల్ నిరాకరణ ప్రియ మరణానికి కారకులైన వైద్యులు సోమ సుందరం, బలరాం శంకర్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తాము గతంలో అనేక విజయవంతమైన శస్త్ర చికిత్సలు నిర్వహించామని, అందరూ క్షేమంగానే ఉన్నట్లు అందులో వివరించారు. ప్రియ శస్త్ర చికిత్స, మరణం దురదృష్టకరమని, తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. విచారణకు సహకారం అందిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. తాము వైద్య కమిటీ విచారణకు హాజరు కావాల్సి ఉందని, అంతలోపు తమను అరెస్టు చేస్తే వెళ్లలేని పరిస్థితి ఉంటుందని వివరించారు. అయితే, వీరికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దీంతో ఈ ఇద్దరు వైద్యులను అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. -
కరగాట్టంలో అశ్లీలత ఉండకూడదు: హైకోర్టు ఆంక్షలు
సాక్షి, చెన్నై: కరగాట్టంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. తమిళ సంప్రదాయ నృత్యాల్లో ప్రముఖమైనది కరగాట్టం. మదురై జిల్లా మేలపట్టి గ్రామానికి చెందిన మారిచ్చామి మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అందులో తమ గ్రామంలో మారియమ్మన్ ఆలయంలో ఈనెల 8న ఉత్సవాలు నిర్వహించడానికి నిశ్చయించామన్నారు. ఈ సందర్భంగా కరగాట్టం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం భద్రత కల్పించాల్సిందిగా పోలీసులను కోరామన్నారు. పోలీసులు భద్రత ఇవ్వడానికి ముందుకు రావడం లేదని, సంప్రదాయ కళల్లో ప్రధాన మైన కరగాట్టం అంతరించి పోకుండా ఉండేందుకే ఈ వేడుకలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి సుకుమార కురూప్ సమక్షంలో విచారణకు వచ్చింది. ఆలయ ఉత్సవాలలో కరగాట్టం నిర్వహించడంపై కొన్ని నిబంధనలను న్యాయమూర్తి తెలియజేశారు. ఈ రకం నృత్యాలు చేసే సమయంలో అసభ్యకరమైన దుస్తులు, ద్వంద్వ అర్థాల మాటలు, అనాగరిక ప్రవర్తన ఉండకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: గంగ మీద ప్రమాణం చేద్దామని చెరువుకెళ్లి.. నీటిలో మునిగి.. -
ఆ ఆదేశాలు సరికాదు: ఆరెస్సెస్
చెన్నై: తమిళనాడులో ఆరెస్సెస్ నిర్వహించ తలపెట్టిన కవాతుపై సందిగ్ధం నెలకొంది. నవంబర్ 6వ తేదీన(ఆదివారం) తలపెట్టిన కవాతును రద్దు చేయాలని ఆరెస్సెస్ నిర్ణయించుకుంది. మద్రాస్ హైకోర్టు కవాతు నిర్వహణకు అనుమతి ఇచ్చినప్పటికీ.. ప్రత్యేక షరతులు విధించడంపై హిందూ సంఘాల విభాగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను పక్కనపెడుతూ మొత్తం 50 ప్రాంతాలకుగానూ.. 44 ప్రాంతాల్లో కవాతు నిర్వహణకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం అనుమతులు ఇచ్చింది. మతపరమైన సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన ఆరు చోట్ల మాత్రం ఇప్పుడు మార్చ్ నిర్వహించొద్దని.. కావాలనుకుంటే మరో రెండు నెలల తర్వాత కవాతు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే.. ఆ 44 ప్రాంతాల్లో కూడా రోడ్లపై, ఇతర ప్రాంగణాల్లో కాకుండా.. మైదానాలు, స్టేడియం లేదంటే ఆడిటోరియాల్లో మాత్రమే నిర్వహించాలని షరతు విధించింది. కవాతులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని.. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మద్రాస్ హైకోర్టు, ఆరెస్సెస్‌కు స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలపై ఆరెస్సెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కశ్మీర్, వెస్ట్‌బెంగాల్, కేరళ, ఇతర ప్రాంతాల్లో రూట్ మార్చ్‌లను నిర్వహించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తమిళనాడులో మాత్రం ఇలా సమ్మేళన ప్రాంగణంలో నిర్వహించుకోవడం సబబు కాదని భావిస్తోంది. అందుకే కవాతును వాయిదా వేసుకోవడంతోపాటు మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేసేందుకు సిద్ధమైంది. అంతకు ముందు తమిళనాడు ప్రభుత్వం కేవలం మూడు చోట్ల మాత్రమే కవాతులను నిర్వహణకు అనుమతి ఇవ్వగా.. మద్రాస్ హైకోర్టు జోక్యంతో ఆరెస్సెస్‌కు ఊరట లభించింది. ఓ ముస్లిం రాజకీయ సంఘంపై కేంద్రం నిషేధం విధించడం, కొయంబత్తూరు పేలుళ్ల నేపథ్యంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లవచ్చని తమిళనాడు పోలీస్ శాఖ.. ఆరెస్సెస్ కవాతుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇదీ చదవండి: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ -
ఐపీఎస్ ఆఫీసర్‌పై పిటిషన్ దాఖలు చేసిన ధోని
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని.. ఐపీఎస్ ఆఫీసర్ జి. సంపత్ కుమార్‌పై మద్రాస్ హైకోర్టులో క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తి కలిగించింది. క్రికెట్ బెట్టింగ్ సహా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి హైకోర్టుకు సమర్పించిన లిఖితపూర్వక అఫిడవిట్లో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని ధోనీ ఆరోపించాడు. ధోని పిటిషన్ ప్రకారం.. 2014లో హైకోర్టులో సంపత్ కుమార్ దావా వేశారని.. గతంలో ఆయన చేసిన ఆరోపణలు తనకు పరువు నష్టం కలిగించే విధంగా ఉన్నట్లు తెలిసింది. అందుకే ఐపీఎస్ సంపత్ కుమార్ సహా పలువురు అధికారులపై క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేసినట్లు ధోని తెలిపాడు. చదవండి: కోహ్లి కెరీర్లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు.. 'కింగ్' కోహ్లి.. కరగని శిఖరం -
RSS March: ఆరెస్సెస్‌కు భారీ ఊరట
చెన్నై: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తమిళనాడు వ్యాప్తంగా నవంబర్ 6వ తేదీన తలపెట్టిన కవాతులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంతకు ముందు తమిళనాడు ప్రభుత్వం ఈ ఊరేగింపులకు అనుమతి ఇవ్వలేదు. తొలుత మొత్తం 50 ప్రదేశాల్లో కవాతులను నిర్వహించాలని ఆరెస్సెస్ భావించింది. అయితే స్టాలిన్ సర్కార్ మాత్రం కేవలం మూడు ప్రదేశాల్లో మాత్రమే ఊరేగింపులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆరెస్సెస్, హైకోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది హైకోర్టు. సున్నిత ప్రాంతాలుగా పేరున్న కొయంబత్తూర్, పొల్లాచ్చి, నాగర్‌కోయిల్‌తో పాటు మరో మూడు ప్రాంతాల్లో కవాతులకు అనుమతి ఇవ్వలేదు. ఊరేగింపులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని లేనితరుణంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరెస్సెస్‌కు ముందస్తుగా తెలిపింది మద్రాస్ హైకోర్టు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నివేదికలలో మార్చ్ నిర్వహణలకు ప్రతికూలంగా ఏమీ లేదని తేల్చిచెప్పిన కోర్టు.. రెండు నెలల తర్వాత ఆ ఆరు ప్రదేశాల్లోనూ మార్చ్ నిర్వహించుకోవచ్చని ఆర్ఎస్ఎస్కు తెలిపింది. వాస్తవానికి.. అక్టోబరు 2న ఊరేగింపులకు కోర్టు అనుమతించినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. మరోవైపు కొయంబత్తూర్‌లో ఇటీవలె కారు పేలుడు ఘటన.. ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఓ ఇస్లామిక్ రాజకీయ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. వీటికి కారణాలుగా చూపుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చనే ఆందోళన హైకోర్టులో వ్యక్తం చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఇదీ చదవండి: పట్టపగలే శివసేన నేత దారుణ హత్య -
యూట్యూబ్, గూగుల్‌కి కోర్టు నోటీసులు.. ఆ గేమ్‌లు ఎలా వస్తున్నాయ్!
నిషేధించిన పబ్జీ, ఫ్రీ ఫైర్ తదితర గేమ్‌లు మళ్లీ ఆన్‌లైన్‌లోకి ఎలా వస్తున్నాయ్.. అని మద్రాసు హైకోర్టు.. మదురై ధర్మాసనం ప్రశ్నించింది. వివరణ ఇవ్వాలని యూ ట్యూ బ్, గూగుల్, కేంద్ర ప్రభుత్వానికి గురువారం నోటీసులు జారీ చేసింది. వివరాలు.. ఆన్లైన్ గేమింగ్‌పై దాఖలైన పిటిషన్ గురువారం మదురై ధర్మాసనంలో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే నిషేధించిన పబ్జీ, ఫ్రీ ఫైర్ వంటి గేమ్‌లు మళ్లీ అందుబాటులోకి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి గేమ్‌ల కారణంగా యువత, పిల్లల చదువులు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. యువత మానసిక పరిస్థితి మరీ దారుణంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, పదేపదే నిషేధం విధించినా అనేక వెబ్ సైట్లు మళ్లీ పుట్టుకొస్తుండడంతో పెద్దలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని మండిపడ్డారు. ఇలాంటి వాటికి శాశ్వతంగా ముగింపు పలికే వరకు విశ్రమించేది లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. తాము సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని యూట్యూబ్, గూగుల్‌తో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ.. ఉత్తర్వులిచ్చారు. -
తమిళ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. పళణిస్వామికి బిగ్ షాక్!
సాక్షి,చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి బుధవారం మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. రహదారుల టెండర్లలో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి ఏసీబీ చేపట్టిన విచారణపై స్టే విధించేందుకు న్యాయ మూర్తులు నిరాకరించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో సీఎంగా పనిచేసిన పళనిస్వామి పర్యవేక్షణలో రహదారుల శాఖ వ్యవహారాలు సాగిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో రహదారుల శాఖలో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు అరప్పోర్ ఇయక్కం ఆరోపించింది. రూ. 4,800 కోట్లు రహదారుల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా ఏసీబీకి ఫిర్యాదు చేశాయి. అదే సమయంలో ఈ టెండర్ల వ్యవహారం పళనిస్వామి మెడకు చుట్టుకునే విధంగా కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ ఆరోపణలు, ఫిర్యాదులపై ఏసీబీ స్పందించింది. అలాగే, మరోవైపు ఐటీ వర్గాలు సైతం దూకుడు పెంచాయి. పళణి స్వామి సన్నిహితులైన కాంట్రాక్టర్లను టార్గెట్ చేసి సోదాలు నిర్వహించాయి. అదే సమయంలో ఈ అక్రమాలపై దృష్టి పెట్టిన డీఎంకే ప్రభుత్వం తిరుచ్చి డివిజన్ రహదారుల శాఖ పర్యవేక్షణాధికారి, చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న పళణిని సస్పెండ్ చేసింది. కోర్టులో విచారణ ఈ అక్రమాల వ్యవహారం విచారణ సుప్రీంకోర్టు వరకు వెళ్లొచ్చింది. మద్రాసు హైకోర్టు ఈ వ్యవహారంపై త్వరితగతిన విచారణ ముగించే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో ఏసీబీ చర్యలకు సిద్ధం అవుతుండటంతో, ఈ విచారణకు స్టే విధించాలని కోరుతూ పళణి స్వామి హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ అక్రమాలపై ఏసీబీ ప్రాథమిక విచారణ ముగించినట్లు కోర్టుకు ఆ విభాగం తరపు న్యాయవాదులు వివరించారు. విజిలెన్స్ కమిషన్‌కు నివేదిక పంపించినట్లు, అనుమతి రాగానే, తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం ఏసీబీ తదుపరి చర్యలకు స్టే విధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారనను ఈనెల 26వ తేదీకి న్యాయమూర్తులు వాయిదా వేశారు. -
‘దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, సినిమా పాటలకు బ్రేక్’
సాక్షి, చెన్నై: దసరా ఉత్సవాల్లో భాగంగా అశ్లీల నృత్యాలు, సినిమా పాటలతో హంగామా చేయడంపై మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం నిషేధం విధించింది. పవిత్ర ఉత్సవాల్లో భక్తి గీతాలకు పెద్దపీట వేయాలని న్యాయమూర్తులు మహాదేవన్, సత్యనారాయణ ప్రసాద్ బెంచ్ బుధవారం ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో దసర ఉత్సవాలు వేడుకగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకల్లో రోజూ నృత్య ప్రదర్శనలు, సినిమా డాన్సులు, పాటలు హోరెత్తుతాయి. వీటిలో అశ్లీలం శృతి మించడం పరిపాటిగా మారింది. పైగా కొన్నిచోట్ల సినీ తారలను సైతం ఆహా్వనించి వేడుకలను కోలాహలంగా నిర్వహిస్తుంటారు. కులశేఖర పట్నంలో.. తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్నం దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు. ఇక్కడి ముత్తాలమ్మన్ ఆలయంలో తొమ్మిది రోజులు వేడుకలు మిన్నంటుతాయి. ఇక్కడ కూడా సీనీ గీతాలు, డాన్సులకు కొదవ ఉండదు. ఈ పరిస్థితుల్లో రాంకుమార్ ఆదిత్యన్ అనే సామాజిక కార్యకర్త దసరా ఉత్సవాల పేరిట సాగుతున్న అశ్లీల నృత్యాలను నిషేధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనాన్ని ఆశ్రయించారు. బుధవారం న్యాయమూర్తులు మహాదేవన్, సత్యనారాయణ ప్రసాద్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఎంతో భక్తితో వ్రతాలు, నోములు తదితర పూజాది కార్యక్రమాలను భక్తులు ఈ దసరా సందర్భంగా అనుసరిస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇలాంటి సందర్భంలో అశ్లీల కార్యక్రమాల వల్ల భక్తులకు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. వాదనల అనంతరం న్యాయమూర్తులు దసరా ఉత్సవాల్లోనే కాకుండా, ఏ ఆలయ వేడుకల్లోనూ ఇకపై అశ్లీల నృత్యాలు, సినిమా పాటలకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. కులశేఖర పట్నంలో నిర్వహించే వేడుకలను తూత్తుకుడి జిల్లా ఎస్పీ, కలెక్టర్ పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. -
కొరియోగ్రాఫర్ కణల్ కన్నన్ బెయల్‌పై నిబంధనలు రద్దు
తమిళసినిమా: సినీ ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ బెయిల్‌పై మద్రాసు హైకోర్టు సడలింపు ఆదేశాలు జారీ చేసింది. ఆ మధ్య స్థానిక మదురవాయిల్‌లో హిందూ మున్నని పార్టీ నిర్వహించిన సమావేశంలో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఈయన అరెస్టయిన విషయం తెలిసిందే. అనంతరం షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. నాలుగు వారాల పాటు ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు విచారణ అధికారుల ముందు హాజరై సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి పరిస్థితుల్లో కణల్ కన్నన్ షూటింగ్ నిమిత్తం ఇతర రాష్ట్రానికి వెళ్లాల్సి ఉండడంతో తన బెయిల్‌పై నిబంధనలను రద్దు చేయాలని దాఖలు చేశారు. విచారించిన న్యాయమూర్తి జగదీష్ చంద్ర ఒక వారం పాటు కణల్ కన్నన్ బెయిల్‌పై నిబంధనలు రద్దు చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. -
'ఆస్తుల వివరాలు సమర్పించండి'.. హీరో విశాల్‌కు కోర్టు ఆదేశాలు
తమిళసినిమా: లైకా ప్రొడక్షన్స్‌కు అప్పు చెల్లింపుల కేసులో నటుడు విశాల్‌కు మద్రాస్ హైకోర్టు మరింత గడువు ఇస్తూ సరైన పత్రాలు సమర్పించాలని ఆదేశించింది. వివరాలు.. విశాల్ తమకు రూ.21.29 కోట్లు అప్పు చెల్లించాల్సి ఉందంటూ లైకా ప్రొడక్షన్స్ చెన్నై హైకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా విశాల్‌కు సమన్లు జారీ చేసింది. దీంతో ఇటీవల కోర్టుకు హాజరైన విశాల్ తన చిత్ర నిర్మాణ సంస్థ ఒకే రోజు రూ.18 కోట్లు నష్టపోవడంతో లైకా సంస్థకు అప్పు చెల్లించలేకపోయానని తెలిపారు. అయితే తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలన్న ఉద్దేశ్యం లేదా? అని ప్రశ్నించిన న్యాయమూర్తి, సెప్టెంబర్ 9 లోపు ఆస్తుల వివరాలను వెల్లడించాలని విశాల్‌ను ఆదేశించారు. ఈ కేసు విచారణ శుక్రవారం మరోసారి న్యాయమూర్తి ఎం.సుందర్ సమక్షంలో విచారణకు వచ్చింది. విశాల్ కోర్టుకు హాజరు కాలేదు. ఆయన తరఫు న్యాయవాది హాజరై ప్రమాణ పత్రం కోర్టులో సమర్పించడానికి మరింత గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి మరో రెండు వారాలు గడువు ఇస్తూ తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. -
జయలలిత మరణం.. కొడనాడులో ఎన్నో రహస్యాలు..!
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ కేసులో అనేక రహస్యాలు పాతి పెట్టబడ్డాయని, పునర్విచారణతో వెలుగులోకి వస్తున్నాయని పోలీసుల తరఫు న్యాయవాది శుక్రవారం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జయలలిత మరణం తదుపరి పరిణామాలతో ఆమెకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో వాచ్ మెన్ హత్య, దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారు అనుమానాస్పదంగా మరణించడంతో అనేక ఆరోపణలు, అనుమానాలు వచ్చాయి. అయితే, ఈ కేసును గత పాలకులు మమా అనిపించారు. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన డీఎంకే పాలకులు ఈ ఘటనపై పునర్విచారణ చేపట్టారు. ఐపీఎస్ అధికారి సుధాకర్ నేతృత్వంలోని బృందం విచారణను వేగవంతం చేసింది. జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె బంధువు వివేక్‌తోపాటుగా 230 మందిని విచారణ వలయంలోకి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో ఈ కేసులో నిందితుడిగా ఉన్న మనోజ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం న్యాయమూర్తి సతీష్‌కుమార్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. పునర్విచారణను త్వరితగతిన ముగించే విధంగా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదన వినిపించారు. ఈ సందర్భంగా పోలీసుల తరఫున న్యాయవాది హసన్ మహ్మద్ జిన్నా హాజరై కోర్టు దృష్టికి పలు విషయాలు తీసుకొచ్చారు. ఈ కేసులో అనేక రహస్యాలు, సమాచారాలు పాతి పెట్టబడ్డాయని, ఇవన్నీ ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నట్టు వివరించారు. విచారణ సరైన కోణంలో వెళ్తోందని, ఈ సమయంలో ఎలాంటి గడువు విధించవద్దని కోరారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను కోర్టులో సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: పన్నీరుకు షాక్.. పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు -
పన్నీరుకు షాక్.. పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు
అన్నాడీఎంకే బాధ్యతలు పళనిస్వామి గుప్పెట్లోకి చేరాయి. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని ఎంపికకు పరోక్షంగా శుక్రవారం మద్రాసు హైకోర్టు ద్విసభ్య బెంచ్ పచ్చ జెండా ఊపింది. జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని ఆమోదించింది. సింగిల్ బెంచ్ విధించిన స్టేను రద్దు చేసింది. దీంతో పళని మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. కాగా ద్విసభ్య బెంచ్ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీకోర్టులో అప్పీలుకు వెళ్లనున్నామని పన్నీరు సెల్వం ప్రకటించారు. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళనిస్వామి మధ్య రాజకీయ చదరంగం కొనసాగుతోంది. జూలై 11వ తేదీ జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ద్వారా పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. దీనిని వ్యతిరేకిస్తూ పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను గత నెల న్యాయమూర్తి జయచంద్రన్ బెంచ్ విచారించింది. సర్వసభ్య సమావేశానికి సింగిల్ బెంచ్ స్టే విధించింది. జూన్ 23వ తేదీకి ముందు అన్నాడీఎంకేలో ఉన్న పరిస్థితులు కొనసాగే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పళని స్వామి శిబిరానికి చెక్ పెట్టే విధంగా పన్నీరుసెల్వం దూకుడు పెంచారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె ప్రతినిధి దినకరన్‌ను కలుపుకుని ముందుకు సాగేందుకు తగ్గ వ్యూహాలకు పదును పెట్టారు. అడియాసే.. పన్నీరు ఆశలన్నీ ప్రస్తుతం ఆవిరయ్యాయి. సింగిల్ బెంచ్ విధించిన స్టేకు వ్యతిరేకంగా పళనిస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు దురైస్వామి, సుందర మోహన్ బెంచ్ ఈ పిటిషన్‌పై శుక్రవారం తీర్పు వెలువరించింది. పళనిస్వామి తరఫు న్యాయవాది ఇన్బదురై బలమైన వాదనలను కోర్టు ముందు ఉంచారు. అన్నాడీఎంకే నిబంధనలకు అనుగుణంగానే జూలైన 11న సర్వసభ్య సమావేశం జరిగిందని వివరించారు. జూన్ 23వ తేదీ జరిగిన సమావేశంలో జూలై 11న జరిగే సమావేశం గురించి ప్రిసీడియం చైర్మన్ ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఈ సమయంలో పన్నీరుసెల్వం అదే వేదికపై ఉన్నారని, అలాంటప్పుడు ఈ సమావేశం గురించి సమాచారం లేదని చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. వీటిని ద్విసభ్య బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. 128 పేజీలతో కూడిన తీర్పును న్యాయమూర్తులు వెలువరించారు. చదవండి: పొలిటికల్ గేమ్‌లో ప్లాన్ ఛేంజ్.. టీఆర్ఎస్కు షాకిచ్చిన బీజేపీ! తీర్పుతో పళని శిబిరంలో సంబరాలు సింగిల్ బెంచ్ విధించిన స్టేను ద్విసభ్య బెంచ్ రద్దు చేసింది. జూలై 11న జరిగిన సర్వ సభ్య సమావేశానికి ఆమోదం తెలిపింది. దీంతో పళని శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. చెన్నైలో ఎంజీఆర్ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నేతృత్వంలో స్వీట్లు పంచుకుని బాణాసంచాతో హోరెత్తించారు. పళని, దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. పళని మద్దతుదారులు జయకుమార్, ఆర్బీ ఉదయకుమార్, వైగై సెల్వం, ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ తదితరులు మీడియా ముందుకు వచ్చారు. ఇది చారిత్రక తీర్పుగా పేర్కొన్నారు. పన్నీరు సెల్వంను అన్నాడీఎంకే నుంచి ఇప్పటికే తొలగించామని, ఆయనకు పార్టీలో చోటు లేదని స్పష్టం చేశారు. మూడు నెలల్లో మరోమారు పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి పళనిస్వామిని పూర్తి స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటామని ప్రకటించారు. కోర్టు తీర్పు ఏకనాయకత్వానికి ఆమోదముద్ర వేసిందని హర్షం వ్యక్తం చేశారు. తాత్కాలికం ద్విసభ్య బెంచ్ తీర్పుతో పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇది పన్నీరు సెల్వం శిబిరానికి షాక్ గా మారింది. దీంతో సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేయడానికి పన్నీరు సెల్వం నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ద్విసభ్య బెంచ్ తీర్పు తాత్కాలికంగా మారేనా అన్న చర్చ నెలకొంది. ఇందుకు కారణం న్యాయమూర్తి జయచంద్రన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్‌లో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ వ్యవహారం ప్రధాన కేసుగా విచారణలో ఉండటమే. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ రద్దు చేశారా.? కాలం చెల్లిందా..? అన్న వ్యవహారాలపై ఈ బెంచ్‌లో వాదనలు జరగాల్సి ఉంది. కేవలం సింగిల్ బెంచ్ విధించిన స్టేను మాత్రమే ద్విసభ్య బెంచ్ రద్దు చేసింది. అయితే, సింగిల్ బెంచ్‌లో మున్ముందు ప్రధాన కేసు విచారణ ఎలాంటి మలుపులకు దారి తీస్తాయో, తుది వాదనలు ఎలా ఉంటాయో అన్నది వేచి చూడాల్సిందే. దీనిపై పన్నీరు శిబిరం నేత వైద్యలింగం స్పందిస్తూ ఈ తీర్పు తాత్కాలికమేనని.. సుప్రీంకోర్టులో తమ న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తిరువళ్లూరులో.. పట్టణంలో పళనిస్వామి మద్దతుదారులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఎంజీఆర్, అన్నాదురై విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి రమణ, పార్టీ నేతలు వెంకటేషన్, బాబు, ఎయిళరసన్, సుధాకర్, మాధవన్ పాల్గొన్నారు. తిరుత్తణి: హైకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే శ్రేణులు తిరుత్తణిలో సంబరాలు చేసుకున్నారు. పట్టణ కార్యదర్శి సౌందర్‌రాజన్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండు వద్ద బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. పళ్లిపట్టు మండల కార్యదర్శి టీడీ.శ్రీనివాసన్, నాయకులు కుప్పుస్వామి, త్యాగరాజన్, జయశేఖర్‌బాబు పాల్గొన్నారు. -
మద్రాస్ హైకోర్టులో పన్నీరు సెల్వానికి షాక్
-
మద్రాస్ హైకోర్టులో ఈపీఎస్‌కు ఊరట
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం ఈకే పళనిస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. అన్నాడీఎంకే నాయకత్వ వివాదంపై న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. పార్టీకి పళనిస్వామే సుప్రీం నాయకుడని స్పష్టం చేసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నిక చెల్లుతుందని డివిజన్ బెంచ్ పేర్కొంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. జులై 11న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నాడీఎంకే తాత్కాలిక కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నికయ్యారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఓ పన్నీర్‌సెల్వం కోర్టును ఆశ్రయించారు. అప్పటి సింగిల్ బెంచ్ ధర్మాసనం పళనిస్వామి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. అయితే ఈ వ్యవహారంపై పళనిస్వామి మరోసారి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో ఈపీఎస్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు కోర్టు తీర్పు అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఎర్పాటు చేశారు. గతంలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఆపీస్లో విధ్వంసం సృష్టించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈమేరకు చర్యలు తీసుకున్నారు. చదవండి: కేసీఆర్‌కు ఘోర అవమానం.. ఇందుకేనా బిహార్ వెళ్లింది?: బీజేపీ -
పైరసీలో సినిమాలు చూస్తున్నారా? ఇకపై ఆ సైట్లు పనిచేయవు!
తమిళ సినిమా: చట్ట విరోధంగా పైరసీకి పాల్పడుతున్న వెబ్సైట్లపై చెన్నై హైకోర్టు కొరడా ఝుళిపించింది. వివరాలకు వెళ్తే నటుడు విక్రమ్ కథానాయకుడుగా నటించిన కోబ్రా చిత్రం వినాయక చవితి సందర్భంగా సందర్భంగా బుధవారం విడుదల కానుంది. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నాయకిగా నటించిన ఈచిత్రంలో ఇండియన్ క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడిగా నటించారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో సెవెన్ స్క్రీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. కాగా పైరసీ అరాచకం రాజ్యమేలుతున్న పరిస్థితిలో కోబ్రా చిత్ర నిర్మాత తన చిత్రం పైరసీని వ్యతిరేకిస్తూ 1788 వెబ్ సైట్లపై నిషేధం విధించాలని కోరుతూ ప్రభుత్వం, సామాజిక మాధ్యమం సేవా సంస్థల తరఫున చెన్నై హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి చంద్రకుమార్ రామ్మూర్తి సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. దీంతో పిటిషనర్ తరుఫున న్యాయవాది విజయన్ సుబ్రహ్మణియన్ హాజరై వాదించారు. పలు నెలలు శ్రమించి, కోట్లలో ఖర్చు చేసి, ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిర్మాతలు చిత్రాలను విడుదల చేస్తుంటే కొన్ని వెబ్సైట్లు అక్రమంగా పైరసీకి పాల్పడుతున్నాయని, ఫలితంగా భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సినీ కార్మికుల జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. కోబ్రా చిత్రం పైరసీకి గురి కాకుండా వెబ్ సైట్లపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి కోబ్రా చిత్రాన్ని చట్ట విరుద్ధంగా వెబ్సైట్లలో విడుదల చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. మితిమీరి ప్రచారం చేసే వెబ్సైట్లపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. -
Vishal: నటుడు విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్
నటుడు విశాల్‌ను తన ఆస్తుల వివరాలను సమర్పించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్న విశాల్ ఫైనాన్షియర్ అన్బుచెలియన్‌కు చెందిన గోపురం ఫిలిమ్స్ సంస్థ నుంచి రూ.21.29 కోట్లు రుణం తీసుకున్నాడు. తర్వాత ఆ మొత్తాన్ని లైకా ప్రొడక్షన్స్ చెల్లించే విధంగా విశాల్ ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో లైకా సంస్థ తిరిగి చెల్లించే వరకు విశాల్‌కు చెందిన అన్ని చిత్రాల హక్కులను తమ సంస్థకు రాసిచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విశాల్ ఆ సంస్థకు అప్పు చెల్లించకపోవడంతో లైకా ప్రొడక్షన్స్ హైకోర్టులో ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. అందులో విశాల్ తమ అప్పు రూ. 21.29 కోట్లు చెల్లించకుండా ఒప్పందాన్ని అతిక్రమించి చిత్రాన్ని ఇతర సంస్థకు విక్రయించారని ఆరోపించారు. ఈనేపథ్యంలో ఆ చిత్ర తమిళ శాటిలైట్, ఇతర భాషల శాటిలైట్, ఓటీటీ హక్కుల విక్రయంపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు విశాల్‌కు రూ.15 కోట్లను ఏదైనా జాతీయ బ్యాంకు ప్రధాన నిర్వాహకుడి వద్ద డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ కేసుపై శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. నటుడు విశాల్ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశించినట్లుగా డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయకపోవడానికి కారణం ఏమిటని విశాల్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు విశాల్ బదులిస్తూ తాను ఒకే రోజున రూ.18 కోట్లు నష్టపోయానని దీంతో దానికి వడ్డీ చెల్లిస్తూ వస్తున్నానని తెలిపారు. దీంతో కేసు ముగుస్తుందని భావిస్తున్నారా..? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం విశాల్ ఆస్తుల వివరాలను న్యాయస్థానంలో సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెపె్టంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఆరోజు విశాల్ కోర్టుకు హాజరుకావాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. చదవండి: (Dhanush: తమ్ముడికి అన్నయ్యే విలన్ అయ్యాడు) -
మద్రాసు హైకోర్టులో విజయ్‌కు ఊరట
చెన్నై: ఆదాయ పన్ను శాఖ కేసు నుంచి తమిళ నటుడు విజయ్‌కు ఊరట లభించింది. జరిమానా చెల్లింపు నిమిత్తం ఐటీ అధికారులు దాఖలు చేసిన ఉత్తర్వులపై మద్రాసు హైకోర్టు మంగళవారం స్టే విధించింది. నటుడు విజయ్ 2016–17లో తన ఆదాయం రూ. 35.42 కోట్లుగా ఐటీ లెక్కలను చూపించినట్లు సమాచారం. ఆ తదుపరి పరిణామాలతో విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. ఈ లెక్కల్లో విజయ్ తాను నటించిన ‘పులి’ చిత్రం రెమ్యునరేషన్ రూ. 15 కోట్లను చూపించనట్లు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో రూ. 1.50 కోట్లు జరిమానా విధించారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 2017లో ఐటీ సోదాలు జరిగితే 2019లో జరిమానా విధించడాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాను తప్పు చేసి ఉంటే, ముందుగానే నోటీసులు ఇచ్చి ఉండాలన్నారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి అనితా సుమంత్ బెంచ్ మంగళవారం విచారించింది. వాదనల అనంతరం ఆలస్యంగా జరిమానాకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఐటీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. చదవండి: First Day First Show Movie: పవన్ కల్యాణ్‌ని వాడుకున్నాం.. సర్ప్రైజింగ్ ఉంటుంది -
మద్రాస్ హైకోర్టులో పన్నీర్ సెల్వంకు ఊరట
-
బిగ్ రిలీఫ్: మద్రాస్ హైకోర్టులో పన్నీర్ సెల్వంకు ఊరట
చెన్నై: అన్నాడీఎంకే నాయకత్వం వ్యవహారంలో పన్నీర్ సెల్వంకు భారీ ఊరట లభించింది. అన్నాడీఎంకే కేసులో స్టేటస్ కో విధించింది మద్రాస్ హైకోర్టు. జూన్ 23న జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించింది. పార్టీ జనరల్ సెక్రెటరీగా ఈ పళనిస్వామి నియామకం చెల్లదని స్పష్టం చేసింది. దీంతో పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కొత్తగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తాజా ఆదేశాలతో అన్నాడీఎంకేలో సంయుక్త నాయకత్వాన్ని పునరుద్ధరించినట్లయింది. పన్నీరు సెల్వం కోఆర్డినేటర్‌గా, పళనిస్వామి డిప్యూటీ కోఆర్డినేటర్‌గా కొనసాగాల్సి ఉంటుంది. అన్నాడీఎంకే కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జూన్ 23న నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం అక్రమమని వాదించారు పన్నీరు సెల్వం తరఫు న్యాయవాది. పార్టీ నిబంధనలను అతిక్రమించి పళనిస్వామి సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు. అలాంటి సమావేశం సంయుక్తంగా ఇరువురి నేతల సమక్షంగా చేపట్టాలని వెల్లడించారు. ‘పార్టీ మధ్యంతర జనరల్ సెక్రెటరీగా ఈపీఎస్ నియామకం సరైంది కాదు. ఇరువురు నేతలు కలిసి పనిచేయాలి.’ అని పేర్కొన్నారు ఓపీఎస్ తరఫు న్యాయవాది తమిల్‌మారన్. గతంలో ఓపీఎస్‌ను పార్టీ టాప్ పోస్ట్‌కు రెండుసార్లు ఎంపిక చేశారు అన్నాడీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత. ఆమె మరణించేకన్నా ముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగానూ చేశారు. కానీ, జయలలిత నెచ్చెలి శశికల పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఈపీఎస్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. మరోవైపు.. శశికల ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ప్రయత్నాలు చేయగా ఓపీఎస్ తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత ఆమె జైలుకు వెళ్లారు. ఇరువురు నేతలు కలిసి పార్టీని నడిపించారు. ఓపీఎస్‌తో చేతులు కలిపిన ఈపీఎస్ పార్టీ నేత శశికలను బహిష్కరించారు. ఓపీఎస్‌ను ఉపముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు ఈపీఎస్. ఓపీఎస్ కోఆర్డినేటర్‌గా, ఈపీఎస్ డిప్యూటీ జాయింట్ కోఆర్డినేటర్‌గా కొనసాగుతూ వచ్చారు. అయితే, ఇటీవల జరిగిన మూడు ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపాలవటంతో నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. పార్టీని హస్తగతం చేసుకునేందుకు ద్వంద నాయకత్వంతో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని పేర్కొన్నారు ఈపీఎస్. పార్టీకి ఒక్కరే నాయకత్వం వహించాలని సూచించారు. ఆ తర్వాత జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. అయితే, తాజాగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఓపీఎస్‌కు ఊరట లభించినట్లయింది. ఇదీ చదవండి: Tamil Nadu: సుప్రీంకోర్టుకు పళనిస్వామి.. తీర్పుపై ఫుల్ ఉత్కంఠ -
హీరో ధనుష్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, చెన్నై: నటుడు ధనుష్ కథానాయకుడుగా నటించిన చిత్రం వేలై ఇల్లా పట్టాదారి(వీఐపీ). ఆ చిత్రానికి ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ నిర్మాతలుగా వ్యవహరించారు. కాగా, ఈ సినిమాలో పొగతాగే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపై టుబాకో నియంత్రణ కమిటీ 2014లో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. పొగతాగే సన్నివేశాలను ప్రచారం చేయటం చట్ట ప్రకారం నేరమని, ఈ మూవీలో అలాంటి సన్నివేశాలను పొందుపరిచారని ఆరోపించింది. ప్రభుత్వ హెచ్చరికలు పొందుపరిచలేదని ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆరోగ్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ స్థానిక సైదాపేట కోర్టులో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లపై పిటిషన్ దాఖలు చేశారు. సైదాపేట కోర్టు ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్లకు ప్రత్యక్షంగా, హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఐశ్వర్య రజనీకాంత్ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అదేవిధంగా ధనుష్ కూడా హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం న్యాయమూర్తి సతీష్ కుమార్ సమక్షంలో విచారణకు వచ్చింది. ధనుష్ తరపు న్యాయవాది విజయన్ సుబ్రమణియన్ హాజరై ధనుష్ సైదాపేట కోర్టుకు హాజరవడంపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి ధనుష్‌ను సైదాపెట కోర్టులో హాజరవడంపై స్టే విధిస్తూ తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. చదవండి: భూవివాదం కేసు.. కోర్టుకు హాజరైన రానా -
హైకోర్టు సంచలన తీర్పు.. తమిళనాట పాలి‘ట్రిక్స్’లో ట్విస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో నంబర్–1 అనే స్థాయికి పళనిస్వామి చేరుకుంటున్నారు. ఆధిపత్యపోరులో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వస్తున్న ఆయనకు తాజాగా మరో విజయం దక్కింది. పార్టీ ప్రధాన కార్యాలయం సీలును తొలగించాలని, కార్యాలయం తాళాన్ని ఎడపాడికి అప్పగించాలని మద్రాసు హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య గత కొంతకాలంగా నువ్వా..నేనా అంటూ సాగుతున్న పోరు అనేక మలుపులు తిరుగుతోంది. ఈనెల 11వ తేదీన జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఎడపాడి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికై పన్నీర్ దూకుడుకు పగ్గాలు వేశారు. ఇక ఆ తరువాత పన్నీర్, ఆయన ఇద్దరు కుమారులు, అనుచవర్గంలోని కొందరిపై బహిష్కరణ వేటు కూడా పడింది. ఎడపాడిని కట్టడిచేసేందుకు అదేరోజున పన్నీర్, ఆయన అనుచరవర్గం చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడికి దిగింది. ఈ సమాచారం అందుకున్న ఎడపాడి మద్దతుదారులు పన్నీర్ వర్గంతో తలపడ్డారు. పలువురు గాయపడటం, పోలీసుల లాఠీచార్జీతో పార్టీ కార్యాలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. శాంతి భద్రతల సమస్యలు వస్తాయనే అనుమానంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అన్నాడీఎంకే కార్యాలయానికి సీలు వేసింది. సీలు తొలగించాలని ఈపీఎస్, ఓపీఎస్ వేర్వేరుగా మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. ఎడపాడికి అప్పగింత–ఆనందోత్సాహాలు ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం..అన్నాడీఎంకే కార్యాలయానికి వేసిన సీలును తొలగించాలని బుధవారం తీర్పు చెప్పింది. అయితే పార్టీ కార్యకర్తలు నెలరోజులపాటూ కార్యాలయానికి రాకూడదని షరతు విధించింది. కోర్టు తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎడపాడి వర్గీయులకు ఆనందం మిన్నంటింది. అన్నాడీఎంకే ఎంజీఆర్ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నాయకత్వంలో వందలాది కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు చెన్నై అడయార్ గ్రీన్‌వేస్ రోడ్డులో విజయోత్సాహంతో చిందులు వేశారు. ఎంజీఆర్, జయలలిత, ఎడపాడి చిత్రపటాలను చేతబూని ర్యాలీ నిర్వహించారు. క్యాంప్ ఆఫీస్‌కు చేరుకుని ఎడపాడిని అభినందనలతో ముంచెత్తారు. ఇక కోర్టు తీర్పుతో పన్నీర్ మద్దతుదారులు డీలా పడిపోయారు. ఇది కూడా చదవండి: యూపీ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏకంగా మంత్రి రాజీనామా -
తమిళనాడులో ట్విస్ట్.. జయలలిత సోదరుడినంటూ కోర్టులో పిటిషన్
తమిళనాడులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల విషయం మరోసారి కోర్టుకు చేరింది. కర్నాకటకు చెందిన ఓ వ్యక్తి తాను జయలలితకు సోదరుడిని అని చెబుతూ కోర్టును ఆశ్రయించాడు. ఆమె ఆస్తిలో సగం వాటా తనకు ఇవ్వాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వివరాల ప్రకారం.. మైసూరులోని వ్యాసపురానికి చెందిన వాసుదేవన్ (83) తాను దివంగత తమిళనాడు సీఎం జయలతితకు సోదరుడినని చెప్పాడు. ఈ సందర్బంగా వాసుదేవన్ మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత తండ్రి జయరామ్ మొదటి భార్య జయమ్మ కుమారుడిని తానేని పేర్కొన్నాడు. తర్వాత, జయరామ్.. వేదమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారని అన్నారు. వారికి పుట్టిన వారే జయలలిత, జయకుమార్ అని తెలిపాడు. తన తల్లి జయమ్మ.. 1950లో మైసూరు కోర్టులో భరణం కోసం కేసు వేశారని గుర్తు చేశాడు. ఆ కేసులో మా నాన్న రెండో భార్య వేదమ్మ, జయకుమార్, జయలలితను ప్రతివాదులుగా చేర్చామని స్పష్టం చేశాడు. కానీ, జయలలిత కంటే ముందే జయకుమార్ మరణించారని వెల్లడించారు. ఈ క్రమంలో జయలలితకు సోదరుడిగా, వారసుడిగా ఉన్న తనకు కూడా ఆస్తిలో వాటా కావాలని డిమాండ్ చేశాడు. మరోవైపు.. 2020లో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పులో జయలలిత వారసులుగా దీపక్, దీప మాత్రమే అంటూ తీర్పునిచ్చింది. తాజాగా దీపక్, దీప పేరుతో పాటుగా తన పేరును కూడా చేర్చి తీర్పును సవరించాలని వాసుదేవన్ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంలో ప్రస్తుతం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. -
అర్ధరాత్రి హైడ్రామా.. పన్నీర్ సెల్వంకు భారీ ఊరట
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో వర్గ పోరు పంచాయితీ మరోసారి న్యాయస్థానాన్ని చేరింది. అయితేసారి జరిగిన అర్ధరాత్రి హైడ్రామాలో పళనిస్వామికి ఝలక్ తగిలింది. అధికారం ఒక్కరి చేతుల్లోనే ఉండాలన్న తీర్మానంపై చర్చ మాత్రమే జరగొచ్చని అయితే.. ఆ తీర్మానంపై ఆమోదించడం లాంటి నిర్ణయం తీసుకోకూడదని డివిజన్ బెంచ్ ఆదేశించింది. దీంతో పన్నీర్‌సెల్వం వర్గానికి భారీ ఊరట లభించినట్లు అయ్యింది. జూన్ 23న(ఇవాళ) అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీ వెంకటాచలపతి ప్యాలెస్‌లో నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో.. సమావేశంలోనే అధికారం ఒక్కరి చేతిలోనే ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కో-కోఆర్డినేటర్ పళనిస్వామి(EPS) తీర్మానం చేయాలనుకున్నాడు. అయితే.. మాజీ డిప్యూటీ సీఎం.. పార్టీ కోఆర్డినేటర్ పన్నీరుసెల్వం ఆ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ జరపకుండా నిలువరించాలని పోలీసులకు ఫిర్యాదుతో పాటు కోర్టుకు చేరింది ఈ వర్గపోరు పంచాయితీ. అయితే.. మద్రాస్ హైకోర్టు భేటీని, తీర్మానాలు చేయకుండా ఆపేలా పార్టీని ఆదేశించలేమని, అది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే దీనిపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది పన్నీర్ సెల్వం వర్గం. జనరల్ కౌన్సిల్ సభ్యుడు షణ్ముగం అభ్యర్థనతో అర్ధరాత్రిపూట మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తి ఎం దురై స్వామి ఇంట్లో వాదనలు నడిచాయి. ఈ విచారణకు జస్టిస్ సుందర్ మోహన్ సైతం హాజరయ్యారు. వాదనల అనంతరం మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ.. ముందుగా ప్రకటించిన 23 తీర్మానాలపై మాత్రం అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఇతర వ్యవహారాలపై చర్చ మాత్రమే జరగాలని పేర్కొంది. దీంతో ఇవాళ భేటీ జరుగుతుండగా.. ఒక్కరి చేతిలోనే అన్నాడీఎంకే పగ్గాలు ఉండాలన్న పళనిస్వామి తీర్మానానికి ఆమోదం లభించడం కుదరదనే చెప్పాలి. Chennai, Tamil Nadu | AIADMK workers, leaders gather at Shrivaaru Venkatachalapathy Palace, Vanagaram for party's General Council meeting to be held today. pic.twitter.com/9lnaL8OJvD — ANI (@ANI) June 23, 2022 చదవండి: ‘డమ్మీ రాష్ట్రపతి’గా ద్రౌపది ముర్ము.. తీవ్ర ఆరోపణలు -
అన్నాడీఎంకేలో తారాస్థాయికి ముసలం.. జయ సమాధి వద్ద ఉద్రిక్తత
చెన్నై: అన్నాడీఎంకేలో ఆధిపత్య ముసలం ఆగలేదు.. మళ్లీ తారాస్థాయిలో రాజుకుంది. పళనిస్వామి, పన్నీరు సెల్వంలో ఎవరో ఒకరు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు వర్గాల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 14వ తేదీన జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశం నుంచి ఈ ముసలం మరింతగా ముదిరింది. ఈ తరుణంలో.. జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జయలలిత సమాధి వద్ద కిరోసిన్ పోసుకుని ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పళనిస్వామి అన్నాడీఎంకే అధ్యక్షుడిగా ఉండడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించాడు. అన్నాడీఎంకే అధినేతగా జయలలిత పేరే ఉండాలంటూ డిమాండ్ చేశాడు. కార్యకర్తను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీకి ముందు పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కో-కోఆర్డినేటర్ పళనిస్వామి(EPS), మాజీ డిప్యూటీ సీఎం.. పార్టీ కోఆర్డినేటర్ పన్నీరుసెల్వం వర్గీయులు వాళ్ల వాళ్ల డిమాండ్లతో రచ్చకెక్కుతున్నారు. జూన్ 23న(గురువారం) జరగబోయే మీటింగ్‌లో పార్టీ అంతా ఒక్కరి నాయకత్వంలోనే నడవాలని పళనిస్వామి తీర్మానం చేయనున్నాడు. అదే సమయంలో.. తన సంతకం లేకుండా జనరల్ బాడీ ఆ తీర్మానం ఆమోదించడానికి వీల్లేదంటూ పన్నీర్ సెల్వం వాదిస్తున్నాడు. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్‌ను కలిసి తన పాయింట్‌ను వినిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జనరల్ కౌన్సిల్ భేటీ జరగకుండా అడ్డుకునేందుకు పోలీసులను ఆశ్రయించాడు ఆయన. అయితే.. ఈ భేటీ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో మాజీ మంత్రి బెంజిమన్ ఓ పిటిషన్ దాఖలు చేయగా.. మంగళవారం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది హైకోర్టు. నిర్వహణ ఉండాలా? వద్దా? అనేది పార్టీ జనరల్ కౌన్సిల్‌కు సంబంధించిన నిర్ణయమని, దానిని ఆపాలని ఆదేశించలేమని బెంచ్ స్పష్టం చేసింది. అంతేకాదు.. భేటీకి హాజరయ్యే సభ్యులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ఈ తరుణంలో అన్నాడీఎంకే వర్గపోరు వేడి.. అక్కడి రాజకీయాలను హీటెక్కిస్తోంది. -
మదురై దంపతులకు షాక్ ఇచ్చిన ధనుష్.. ‘క్షమాపణ చెప్పాలి.. లేదంటే’
చెన్నై: మదురై మేలూరుకి వృద్ధ దంపతులు కదిరేశన్, మీనాక్షిపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానంటూ నటుడు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా నోటీసులు జారీ చేశారు. ఆ దంపతులు నటుడు ధనుష్ తమ రక్తం పంచుకొని పుట్టిన కొడుకంటూ పదే పదే చెబుతూ వస్తున్నారు. తమ జీవనాధారం కోసం నెలకు రూ.60 వేలు చొప్పున ఇవ్వాలంటూ ధనుష్‌కు నోటీసులు పంపారు. దీంతో ఈ వ్యవహారంలో తమకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేస్తామంటూ కదిరేశన్ దంపతులకు నటుడు ధనుష్ తన లాయర్ ద్వారా నోటీసులు పంపారు. -
ధనుష్‌కు మద్రాస్ హైకోర్టు షాక్.. సమన్లు జారీ
తమిళ స్టార్ ధనుష్‌కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ధనుష్ తమ కొడుకేనంటూ ఓ వృద్ధ దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌పై ధనుష్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. కాగా ధనుష్ తమ కొడుకేనంటూ కతిసేరన్, మీనాక్షి అనే దంపతులు 2016లో మదురై జిల్లాలోని మేలూర్‌లోని మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కొన్ని ఏళ్లుగా కోర్టులో కేసు పెండింగ్‌లోనే ఉంది. ధనుష్ సమర్పించిన జనన ధ్రువీకరణ పత్రాలు ఫేక్ అని ఆరోపిస్తూ కేసు వేశారు. ధనుష్ తమ మూడో కొడుకని, సినిమాల్లో నటించేందుకు చిన్నతనంలోనే ఇంటినుంచి పారిపోయి చెన్నై వచ్చాడని పిటిషన్లో పేర్కొన్నారు. ధనుష్ అసలైన తల్లిదండ్రులమని, అతని నుంచి రూ. 65 వేలు పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు. ఇందుకు సదరు దంపతులు ధనుష్ బర్త్ సర్టిఫికేట్, 10వ తరగతి మెమో, ఫిజికల్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్‌ను కూడా సమర్పించారు. దీంతో కేసును పరిష్కరించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయాలని కోర్టు సూచించగా.. ధనుష్, అతని తరపు న్యాయవాది ఈ అభ్యర్థనను తిరస్కరించారు. అయితే ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ సరిపోతాయో లేదో చెక్ చేసేందుకు ధనుష్‌కు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ వైద్య పరీక్షల ఫలితాలు ధనుష్‌కు అనుకూలంగా రావడంతో దంపతుల ఆరోపణలు రుజువు చేసేందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని 2020లో కోర్టు ఈ కేసును కొట్టి వేసింది. చదవండి: హిందీ భాష వివాదంపై సుహాసిని స్పందన, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు కాగా జ్యూడీషియల్ మెజిస్ట్రేట్‌లో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ కతిసేరన్ దంపతులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు ధనుష్ అందించిన ఆధారాలపై పోలీసులతో విచారణ జరిపించాలని కోరారు. ఈ క్రమంలోనే వివరణ ఇవ్వాలంటూ ధనుష్‌కు హైకోర్టు సమన్లు జారీ చేసింది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ధనుష్ కొట్టిపారేశాడు. తాను తమిళ నిర్మాత కస్తూరి రాజా, విజయలక్ష్మిల కుమారుడినంటూ పేర్కొన్నారు. తన నుంచి డబ్బులు రాబట్టే ఉద్ధ్యేశంతో తప్పుడు కేసు నమోదు చేశారని పేర్కొన్నాడు. చదవండి: Pooja Bhatt: నాన్నను బాత్రూమ్లో ఉంచి గడియ పెట్టడంతో ఫుల్ ఏడ్చేశా: నటి -
సీఎం స్టాలిన్ కుమారుడికి భారీ ఊరట
సాక్షి, చెన్నై: డీఎంకే యువజన విభాగం నేత, ఎమ్మెల్యే ఉదయ నిధి స్టాలిన్‌కు హైకోర్టులో మరోమారు ఊరట లభించింది. ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను గురువారం న్యాయమూర్తి భారతీ దాసన్ బెంచ్ తోసి పుచ్చింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేపాక్కం – ట్రిప్లికేన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఉదయ నిధి స్టాలిన్ గెలిచారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వారసుడిగా, ఆ పార్టీ యువజన ప్రధాన కార్యదర్శిగా ఉదయ నిధి చక్రం తిప్పుతున్నారు. అయితే, ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ తొలుత దేశీయ మక్కల్ కట్చి నేత ఎంఎల్ రవి కోర్టు తలుపులు తట్టారు. అయితే ఆరోపణలకు సంబంధించి.. ఎలాంటి ఆధారాలు సమర్పించక పోవడంతో ఆదిలోనే పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత ఆ నియోజకవర్గానికి చెందిన ఓటరు ప్రేమలత పిటిషన్ వేశారు. తన మీదున్న కేసుల వివరాల్ని నామినేషన్లో ఉదయ నిధి చూపించలేదని, నామినేషన్ పత్రాలలోనూ అనేక అనుమానాలు ఉన్నట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన గెలుపు రద్దుచేయాలని కోరారు. కాగా, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించవద్దు అని ఉదయ నిధి కోర్టులో మరో పిటిషన్ వేశారు. గురువారం న్యాయమూర్తి భారతీ దాసన్ బెంచ్‌లో ఈ పిటిషన్లు విచారణకు వచ్చింది. ఉదయ నిధి తరపున సీనియర్ న్యాయవాది ఎన్ఆర్ ఇళంగో వాదనల్ని వినిపించారు. అయితే, పిటిషనర్ ప్రేమలత తన ఆరోపణలకు తగిన ఆధారాల్ని కోర్టులో సమర్పించలేదు. దీంతో ఉదయ నిధికి ఊరట కల్గిస్తూ, ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ విచారణార్హం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: భారత్‌లో కరోనా వైరస్.. ఇది కచ్చితంగా ఊరట ఇచ్చే విషయమే! -
తీర్పుల్లో మానవీయ కోణం
చెన్నై/సాక్షి ప్రతినిధి, చెన్నై: న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు నిబంధనలు, పద్ధతులను గుడ్డిగా అనుసరించరాదని, మానవీయ కోణాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. తీర్పులిచ్చే ముందు సామాజిక–ఆర్థికాంశాలను, సమాజంపై వాటి ప్రభావాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ‘‘నేటి ఇన్స్టంట్ నూడుల్స్ కాలంలో జనం కూడా ఇన్స్టంట్ జస్టిస్ (తక్షణ న్యాయం) కోరుకుంటున్నారు. దానివల్ల అసలైన న్యాయానికి అన్యాయం జరుగుతుందనే నిజాన్ని అర్థం చేసుకోవడం లేదు’’ అన్నారు. చెన్నైలో మద్రాస్ హైకోర్టు ప్రాంగణంలో పరిపాలనా భవన నిర్మాణానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, కోర్టులతో న్యాయం జరుగుతుందని సామాన్య జనం గట్టిగా నమ్ముతున్నారని పేర్కొన్నారు. అయితే, ‘‘కోర్టుల పద్ధతులు, భాషతో వారు మమేకం కాలేకపోతున్నారు. న్యాయ వ్యవస్థలో సామాన్యులను సైతం భాగస్వాములుగా మార్చాలి. పెళ్లి మంత్రాల్లా కాకుండా కోర్టు వ్యవహారాలను, కేసుల పురోగతిని కక్షిదారులు అర్థం చేసుకోగలగాలి’’ అన్నారు. న్యాయ వ్యవస్థ, సంస్థల బలోపేతానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నానని వివరించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందన్నారు. తీర్పు ఇవ్వడం అనేది కేవలం రాజ్యాంగ ధర్మం కాదు, అదొక సామాజిక బాధ్యత అని వెల్లడించారు. న్యాయమూర్తులు ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. హైకోర్టుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సమీప భవిష్యతులో ఈ సమస్య పరిష్కారమవుతున్న నమ్మకం తనకు ఉందన్నారు. కృత్రిమ మేధ (ఏఐ)తో ఇది సాధ్యం కావొచ్చని అభిప్రాయపడ్డారు. గుర్తింపును, భాషను, సంస్కృతిని కాపాడుకోవడంలో తమిళ ప్రజలు ముందంజలో ఉంటారని ప్రశంసించారు. కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల కోసం సుప్రీంకోర్టు బెంచ్‌ను చెన్నైలో ఏర్పాటు చేయాలని స్టాలిన్ ఈ సందర్భంగా సీజేఐని కోరారు. మాతృభాషను మరవొద్దు మాతృభాష పరిరక్షణ విషయంలో తెలుగువారు తమిళులను ఆదర్శంగా తీసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ ఉద్బోధించారు. చెన్నైలో ప్రపంచ తెలుగు సమాఖ్య (చెన్నై) 29వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘‘తెలుగు వారిని ఒకప్పుడు మదరాసీలు అనేవారు. తెలుగు భాష, సంస్కృతికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్‌ను ఈ సమయంలో స్మరించుకోవాలి. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని ఇటీవల తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసినప్పుడు కోరా. చెన్నైలో ఒకప్పుడు తెలుగు వారు కూడా భాగస్వాములే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయాక కర్నూలు, తర్వాత హైదరాబాద్, ప్రస్తుతం అమరావతిని రాజధానులుగా చేసుకున్నాం. మాతృభాషలో మాట్లాడేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను డిగ్రీ దాకా తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నా’’ అని చెప్పారు. తెలుగు ప్రజలు తమ మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు. ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని, మాతృభాషలో మాట్లాడడం వల్ల ప్రావీణ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.