చెన్నై: మదురై మేలూరుకి వృద్ధ దంపతులు కదిరేశన్, మీనాక్షిపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానంటూ నటుడు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా నోటీసులు జారీ చేశారు. ఆ దంపతులు నటుడు ధనుష్ తమ రక్తం పంచుకొని పుట్టిన కొడుకంటూ పదే పదే చెబుతూ వస్తున్నారు. తమ జీవనాధారం కోసం నెలకు రూ.60 వేలు చొప్పున ఇవ్వాలంటూ ధనుష్‌కు నోటీసులు పంపారు. దీంతో ఈ వ్యవహారంలో తమకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేస్తామంటూ కదిరేశన్ దంపతులకు నటుడు ధనుష్ తన లాయర్ ద్వారా నోటీసులు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment