madurai
-
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎస్కార్ట్‌గా యుద్ధ విమానాలు
భారత విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతోంది.దేశవ్యాప్తంగా మంగళవారం ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు ఎదురయ్యింది. తాజాగా తాజాగా మధురై నుంచి సింగపూర్ వెళ్లిన ఎయిరిండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది.విమానం సింగపూర్‌కు బయలుదేరిన తర్వాత విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు ఈ-మెయిల్ వచ్చింది.ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ ఐఎక్స్ 684కి ఈ బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని చాంగీ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ముందు విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా మళ్లించడానికి సింగపూర్ భద్రతా దళాలకు చెందిన రెండు ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయి. ఎయిరిండియా విమానానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించి విమానాన్ని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లాయి.కాగా, ఈ బెదిరింపుల వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు పౌర విమానయాన భద్రతా సంస్థ భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీల సాయం కోరింది. బాధ్యులను కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎయిరిండియా విమానానికి సింగపూర్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా రావడంపై సింగపూర్ రక్షణ మంత్రి ఎన్జీ ఎంగ్ హెన్ స్పందించారు. ఎయిరిండియా విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లడానికి రెండు ఆర్ఎస్ఏఎఫ్ ఎఫ్-15ఎస్జీలు రంగంలోకి దిగాయని తెలిపారు. విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లాయని, చివరకు విమానం చాంగీ విమానాశ్రయంలో రాత్రి (మంగళవారం) 10:04 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎక్స్ వేదికగా ప్రకటించారు.కాగా దేశవ్యాప్తంగా మంగళవారం 7 విమానాలకు బాంబు బెదిరింపు ఎదురయ్యింది. ఢిల్లీ నుంచి షికాగో వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని కెనడాలోని ఓ విమానాశ్రయానికి మళ్లించి తనిఖీ చేశారు. అలాగే జైపూర్ నుంచి అయోధ్య మీదుగా బెంగళూరు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం, దర్భంగా నుంచి ముంబయి వెళ్లే స్పైస్‌జెట్ విమానం, బాగ్డోగ్రా నుంచి బెంగళూరు వెళ్లే ఆకాశ ఎయిర్ విమానం, దమ్మం(సౌదీ అరేబియా) నుంచి లక్నవూ వెళ్లే ఇండిగో విమానం, అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ అలయన్స్ ఎయిర్ విమానం, మదురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. -
నవరాత్రి ఉత్సవాలు : అమృతవర్షంలో మధుర మీనాక్షి ఆలయ కోనేరు (ఫొటోలు)
-
చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన నమిత.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం రాజకీయాల్లోనూ కాస్త బిజీ. మరోవైపు భర్త, పిల్లలతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లిన ఈమెకు చేదు అనుభవం ఎదురైంది. వీడియో పోస్ట్ చేసి మరీ ఈ విషయాన్ని బయటపెట్టింది. గుడికి వెళ్లిన తనని అడ్డుకున్నారని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: వీళ్లు పెళ్లి వద్దంటున్నారు.. మాకు మాత్రం మరొకటి: నరేశ్)'అందరికీ నమస్కారం. కృష్ణాష్టమి సందర్భంగా మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయానికి.. కుటుంబంతో కలిసి దర్శనం కోసం వెళ్లాను. అయితే నాతో పాటు ఫ్యామిలీని ఆలయ అధికారులు అడ్డుకున్నారు. హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారు. నాతో దురుసుగా, అహంకారంగా మాట్లాడారు. నేను పుట్టుకతోనే హిందువును. అలాంటి నాపై అగౌరవంగా ప్రవర్తించిన సిబ్బందిని శిక్షించాలి' అని నమిత చెప్పుకొచ్చారు.దీనిపై ఆలయ సిబ్బంది వెర్షన్ మరోలా ఉంది. పై అధికారులు చెప్పడం వల్లే అలా చేశామని, కొంత సమయం ఎదురుచూడమని చెప్పామని, దురుసుగా ఏం ప్రవర్తించలేదని మర్యాదగానే మాట్లాడమని చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు. నెటిజన్లు మాత్రం నమితకు మద్ధతుగా నిలుస్తున్నారు. అధికారుల్ని క్షమించమని ఆమెకు రిక్వెస్ట్ పెడుతున్నారు.(ఇదీ చదవండి: 'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ)) View this post on Instagram A post shared by Namitha Vankawala (@namita.official) -
ఘోర ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. అయిదుగురి మృతి
చెన్నై: తమిళనాడులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురై సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. విరుధ్ నగర్-మధురై జాతీయ రహదారిపై అతివేగంతో దూసుకొచ్చిన ఎస్యూవీ కారు తొలుత నెమ్మదిగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి అదుపుతప్పింది. అనంతరం ఎడమ వైపున్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టి గాల్లో పలుమార్లు పల్టీలు కొట్టింది. దెబ్బకు ఏకారు కంగా నాలుగు లేన్ల హైవేకు అవతలి వైపు సర్వీస్ లైన్లో ఎగిరిపడింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రమాదం దాటికి సంఘటనా స్థలంలో భారీగా దుమ్ము పేరుకుపోయింది. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా ముధురైలోని విల్లుపురానికి చెందినవారుగా గుర్తించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. #WATCH | Tamil Nadu: Five people, including four members of the same family from Madurai's Villapuram, were killed when a speeding SUV collided with a moped at Sivarakottai near Tirumangalam on the Virudhunagar-Madurai highway: Madurai district SP Arvind (CCTV footage source:… pic.twitter.com/kFCzEvttJW — ANI (@ANI) April 10, 2024 -
మొదలైన జల్లికట్టు.. తమిళనాట సందడే సందడి!
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల నిర్వహణకు అవనియాపురంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. మదురైలో జల్లికట్టు నిర్వహణకు ముందుగా పోటీలో పాల్గొనే ఎద్దులకు హెల్త్ చెకప్ చేశారు. జల్లికట్టును తమిళనాట ఇరుతఝువుతాల్ అని కూడా పిలుస్తారు. జల్లికట్టు అనేది తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే సంప్రదాయక క్రీడ. దీనిలో ఎద్దులకు మనుషులకు మధ్య పోరాటం జరుగుతుంది. జల్లుకట్టును తమిళనాడు సంస్కృతికి చిహ్నంగా పరిగణిస్తారు. #WATCH | Tamil Nadu: Jallikattu competition begins in Avaniyapuram of Madurai. pic.twitter.com/CqRrInypX9 — ANI (@ANI) January 15, 2024 అయితే జల్లికట్టు పోటీలలో పాల్గొనేవారు ఒక్కోసారి తీవ్రంగా గాయపడుతుంటారు. ఇటువంటి పరిస్థితులను గమనించిన సుప్రీంకోర్టు జల్లికట్టు నిర్వహణకు మార్గదర్శకాలను జారీ చేసింది. స్థానిక అధికారులు కట్టుదిద్దమైన ఏర్పాట్లు చేసినప్పటికీ జల్లికట్టు పోటీల సమయంలో పలువురు గాయపడుతున్నారు. గత ఏడాది సంక్రాంతి సమయంలో అవనియాపురంలో నిర్వహించిన జల్లికట్టుపోటీల సమయంలో 60 మంది గాయపడ్డారు. #WATCH | Tamil Nadu: Health check-up of bulls held in Madurai for the Jallikattu competition. pic.twitter.com/nvfJQVMaIn — ANI (@ANI) January 15, 2024 ఇది కూడా చదవండి: దేశవ్యాపంగా సంక్రాంతి సందడి -
లియో డైరెక్టర్‌కు షాక్.. సినిమాను నిషేధించాలంటూ!
లియో మూవీతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. లియో తర్వాత లోకేశ్ తదుపరి చిత్రాన్ని సూపర్‌స్టార్ తలైవాతో చేయనున్నారు. ప్రస్తుతం ఆ మూవీ స్క్రిప్ట్ తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. (ఇది చదవండి: OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!) ఇదిలా ఉండగా.. తాజాగా లోకేశ్ కనగరాజ్‌పై ఓ విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. ఆయనకు మానసిక పరీక్షలు చేయాలని కోరుతూ మధురై హైకోర్టు బెంచ్‌లో మదురైకి చెందిన రాజు మురుగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్రంలో హింసాత్మక కంటెంట్ ఉన్నందున లియోని నిషేధించాలని.. అంతే కాకుండా కనగరాజ్‌కు మానసికంగా పరీక్షలు నిర్వహించాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. లియో చిత్రంలో హింసను ప్రేరేపించేలా సన్నివేశాలు ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఆయుధాల వినియోగం, మతపరమైన చిహ్నాలు, మాదకద్రవ్యాల వినియోగం, మహిళలు, పిల్లలపై హింస లాంటి సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్ ప్రస్తావించారు. లియో చిత్రంపై పూర్తిగా నిషేధం విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ కేసును కనగరాజ్ న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడంతో వాయిదా వేశారు. (ఇది చదవండి: ఆ నటుడు పిచ్చోడిలా ప్రవర్తించాడు.. అందరూ పారిపోయారు!) -
250 కిలోల అభిమానం
అభిమానులు తమ అభిమాన హీరో, హీరోయిన్లకు గుడి కట్టడం కొత్త కాదు. అయితే ఆ గుడి బయట ఎక్కడో ఉంటుంది. తమిళనాడులోని మదురైకి చెందిన కార్తీక్... రజనీకాంత్‌కు వీరాభిమాని. తన ఇంటిలోని ఒక పోర్షన్‌ను రజనీ గుడిగా మలిచాడు. ఇందులో 250 కిలోల బరువు ఉన్న రజనీ విగ్రహం ఉంది. రోజూ ధూపదీప నైవేద్యాలు ఉంటాయి. ‘రజనీకాంత్‌ను దేవుడి స్థాయిలో ఆరాధిస్తున్నాను’ అంటున్నాడు కార్తీక్. -
రైలు బోగీలో సిలిండర్ పేలి.. 10 మంది మృతి
చెన్నై: తమిళనాడులోని మధురై రైల్వేస్టేషన్లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న రైలు బోగీ (ప్రైవేటు పార్టీ కోచ్)లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బోగీలో భారీగా మంటలు ఎగిసిపడటంతో 10 మంది మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఈ ప్రైవేటు పార్టీ కోచ్ ఆగస్టు 17న ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. శుక్రవారం నాగర్‌కోయిల్ జంక్షన్ వద్ద దీన్ని పునలూరు-మధురై ఎక్స్‌ప్రెస్ రైలుకు అటాచ్ చేశారు. నిన్న రాత్రి మదురై రైల్వే స్టేషన్ వద్ద దీన్ని డిటాచ్ చేసి స్టాబ్లింగ్ లైన్లో నిలిపి ఉంచారు. శనివారం తెల్లవారుజామున 5.15 గంటల ప్రాంతంలో రైల్లోకి అక్రమంగా తీసుకొచ్చిన సిలిండర్‌పై టీ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటలు చేలరేగాయి. చూస్తుండగానే బోగీ అంతా వ్యాపించాయి. మంటలను గుర్తించిన కొంతమంది ప్రయాణికులు వెంటనే బోగీ నుంచి కిందకు దిగారు అని దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బోగీలో 65 మంది ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. மதுரை ரயில் நிலையத்தில் நிறுத்திவைக்கப்பட்டிருந்த ரயிலில் தீ விபத்து; ரயிலில் கேஸ் சிலிண்டர் வைத்து சமைத்தபோது தீப்பற்றியதாக தகவல்#Madurai | #Fire | #Train | #FireAccident | #TrainAccident | #TrainFireAccident pic.twitter.com/Zw8RUdXPMb — PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) August 26, 2023 Fire accident in the train🔥... death toll increases - shocking scenes! All are Rameshwaram Ramanathaswamy Devotees 😢 #Madurai #TrainFire #Fire #FireAccident #Tamilnadu #IndianRailways #accident #Blast # #cylinderblast pic.twitter.com/eZ0DybnzDV — Karthik Artha 𝕏 (@KarthikArtha) August 26, 2023 -
ఆఫర్ అంటే ఇది.. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే టమాటాలు ఫ్రీ!
చెన్నై: సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు చిత్రవిచిత్రమైన ఆఫర్లతో పాటు బోలెడు డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి. ఏదేమైనా మార్కెట్లో పోటీని తట్టుకుని ముందుకు సాగాలనుకుంటున్నాయి. అందుకే మార్కెటింగ్ పరంగా ట్రెండింగ్ అంశాలపై ఫోకస్ పెడుతున్నాయి కొన్ని సంస్థలు. ప్రస్తుతం టమాటా ఊహించని ధర పలుకుతూ అందరికీ షాకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ దేశీయ విమాన సంస్థ తమ వద్ద ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న వారికి టమాటాలు ఫ్రీ అంటూ ఆఫర్‌ను ప్రకటించాయి. మదురైలో దేశీయ విమాన టిక్కెట్ బుకింగ్‌కు కిలో టమాటా, అంతర్జాతీయ విమాన బుకింగ్‌కు 1.5 కిలోల టమాటాలు ఇవ్వనున్నట్లు ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రకటింంది. వివరాలు.. తమిళనాడులో టమాటా ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో తక్కువ ధరకు టమాటాలను పంపిణీ చేస్తోంది. ఈ స్థితిలో మదురైలోని ఓ ట్రావెల్ సంస్థ ఇక్కడ విమాన టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటన విడుదల చేసింది. డొమెస్టిక్ ఫ్లైట్ బుకింగ్‌కు కిలో టమాట, విదేశీ విమానాలకు 1.5 కిలో ఉన్నట్లు పేర్కొంది. కాగా కొత్త ఆఫర్‌కు ప్రయాణికుల నుం మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ ప్రకటించడం గమనార్హం. చదవండి: ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్ విషయాలు -
మాజీ మహిళా ఇన్స్పెక్టర్ వసంతి పిటిషన్ తిరస్కరణ
తమిళనాడు: విధుల నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మహిళా ఇన్స్పెక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ తిరస్కరించింది. శివగంగై జిల్లా ఇలియాన్ కుడిలో బ్యాగ్ తయారు చేసే కంపెనీ నిర్వహిస్తున్న హర్షిత్ వద్ద గత సంవత్సరం రూ.10 లక్షలు నగదును అపహరించినట్లు మదురై నాగమలై ఇన్స్పెక్టర్ వసంతి సహా జిల్లా క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ వసంతిని అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన వసంతి సాక్షులను బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు మదురై బెంచ్ ఆదేశించింది. దీంతో గత మార్చి 31వ తేదీ ఇంటిలో నుంచి కారులో బయటకు వెళ్లడానికి వచ్చిన వసంతిని ప్రత్యేక బృందం పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత వసంతిని విధుల నుంచి తొలగించారు. దీన్ని వ్యతిరేకిస్తూ వసంతి హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జి.ఆర్ స్వామినాథన్ విచారించారు. ఆ సమయంలో ఎస్పీ శివప్రసాద్ హాజరై వివరణ ఇచ్చారు. పిటిషన్ దారుడిపై ఉన్న కేసులు నిలువలో ఉన్నాయని, ప్రస్తుతం విచారణ జరుగుతున్న క్రమంలో డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకున్నందున విధుల నుంచి తొలగించడంపై కోర్టు జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని ఆ పిటిషన్‌ను కొట్టి వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
నకిలీ వీడియో కేసు.. పోలీసుల కస్టడీలో యూట్యూబర్!
చెన్నై: తమిళనాడులోని బీహార్ వలస కార్మికులపై దాడులు చేశారంటూ నకిలీ వీడియోలను పోస్ట్ చేసిన కేసులో యూట్యూబర్ మనీష్ కశ్యప్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని మధురై కోర్టు ముందు హాజరుపరచగా.. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం న్యాయస్థానం కశ్యప్‌కు మూడు రోజుల కస్టడీని విధించింది. మార్చి 18న జగదీష్పూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన తర్వాత బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOU) కశ్యప్‌ను అరెస్టు చేసింది. పోలీసుల ప్రత్యేక బృందం ట్రాన్సిట్ రిమాండ్‌పై బీహార్ నుంచి తమిళనాడుకు తీసుకువచ్చింది. నకిలీ వీడియోలను వ్యాప్తి చేసినందుకు అతనిపై మధురైలో నమోదైన ఫిర్యాదు ఆధారంగా, అతనిపై కేసు నమోదు చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇటీవల, తమిళనాడులో వలస కార్మికులపై దాడికి గురైన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఫ్యాక్ట్ చెక్ కమిటీ, పోలీసు శాఖ ద్వారా ఈ వీడియోలు ఫేక్ అని తేలింది. దీంతో వెంటనే అతనిపై చర్యలు తీసుకున్నారు. వలస కార్మికులపై దాడి జరుగుతున్నట్లు ఫేక్ వీడియోల అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ సీరియస్‌గా తీసుకున్నారు. ఇటువంటి పుకార్లను వ్యాప్తి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో అవసరమైన అన్ని సహాయాన్ని వలస కార్మికులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. -
నువ్వు సల్లగుండాలే.. చిన్న నవ్వు ఒకటి సరిపోదా! వైరల్ వీడియో
స్నేహం ఏం కోరుకుంటుంది? కోట్లు కోరుకోదు. చిన్న నవ్వు ఒకటి సరిపోదా!స్నేహం ‘మా దేశం అయితేనే’ అంటుందా?‘కానే కాదు’ అని చెప్పడానికి ఈ వీడియో క్లిప్ సరిపోదా! బ్రిటన్‌కు చెందిన జర్నలిస్ట్, టీవి ప్రెజెంటర్ తాను చేస్తున్న ‘టైమ్‌లెస్ తమిళనాడు’ టీవీ ప్రొగ్రామ్ కోసం తమిళనాడులోని మదురైలో అడుగుపెట్టింది. మదురై అద్భుత అందాల అనుభూతి నుంచి పూర్తిగా బయటికి రాకముందే మల్లెపూలు అమ్మే మహిళ రూపంలో ఆమెకు అపురూపమైన స్నేహం కలిసింది. ఈవిడ మదురై తమిళ యాస ఆమెకు అర్థం కాకపోవచ్చు.ఆవిడ బ్రిటీష్ ఇంగ్లీష్ ఈవిడకు అర్థం కాకపోవచ్చు... అయితే అదేమీ వారి స్నేహానికి అడ్డుగోడ కాలేదు. పూలమ్మ ఎలెక్స్కు జడ వేసి మల్లెపూలు పెట్టేది.ఆ జడ చూసుకుని ఎలెక్స్ మురిసిపోయేది!తన స్టైల్లో జోకులు చెప్పేది పూలమ్మ. అవి అర్థం కాక ఎలెక్స్ తెల్లముఖం వేసే లోపే దారిన పోయే దానయ్యలు తమకు తెలిసిన ఇంగ్లీష్‌లో ఎలెక్స్కు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మదురై నుంచి వెళ్లే క్రమంలో తన సెలబ్రిటీ పూలమ్మతో ఫొటోలు దిగింది ఎలెక్స్.కథ ఇదే అయితే అది మదురైలో మాత్రమే ఆగిపోయి ఉండేది. అయితే ఎలెక్స్ స్వదేశానికి చేరుకున్న తరువాత పూలమ్మతో తాను ఉన్న చిన్న వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తక్కువ సమయంలోనే ఈ క్లిప్‌కు 4.7 లక్షల వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో క్లిప్‌లో పెద్ద పెద్ద మాటలేవీ లేకపోవచ్చు. అయితే వారి భావోద్వేగాన్ని, అనుబంధాన్ని నెటిజనులు తమదైన శైలిలో వ్యాఖ్యానించారు. ‘మల్లెపూలు అందమైనవి. మీ స్నేహం అంతకంటే అందమైంది’ అన్నారు.‘గ్రేట్ క్రాస్ కల్చరలిజం’ అంటూ వీరి స్నేహాన్ని ఆకాశానికెత్తారు! తమిళనాడులోని సముద్రపు అందాలు, కొండలు, కోవెలల సౌందర్యం, తేయాకు తోటల పచ్చదనం, చల్లని మనసున్న హిల్ స్టేషన్ల గురించి చెబుతూ ‘అద్భుతం’ అన్నది ఎలెక్స్. అయితే వీరి వీడియో క్లిప్ మాత్రం సామాజిక మాధ్యమాల్లో మహా అద్భుతంగా మారింది! View this post on Instagram A post shared by Alex Outhwaite (@alexouthwaite) -
భర్త ఘాతుకం.. 6 నెలల క్రితమే ప్రేమ పెళ్లి.. హెల్మెట్ ధరించి మరీ
చెన్నై: తమిళనాడులోని మధురైలో పట్టపగలు నడురోడ్డుపై యువతి హత్యకు గురైంది. ప్రేమ వివాహం చేసుకున్న భర్తే హెల్మెట్ ధరించి ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. వివరాలు.. మధురైలోని సౌత్‌గేట్ సప్పాని కోవిల్ వీధికి చెందిన మీనాక్షి సుందరం చిన్న కుమార్తె వర్ష (19) కీరైత్తురైకు చెందిన పళని(25)ని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. నెలన్నర క్రితం వర్ష పుట్టింటికి వచ్చింది. పళని రావాలని కోరినా నిరాకరించింది. శుక్రవారం మధ్యాహ్నం వర్ష సప్పాని కోవిల్ వీధిలో ఓ దుకాణానికి వెళ్లి ఇంటికి వెళుతోంది. హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చిన పళని ఆమెతో మాట్లాడేందుకు యతి్నంచాడు. ఆమె వినకపోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. అనంతరం బైక్‌పై పరారయ్యాడు. వర్షను చికిత్స నిమిత్తం మధురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సౌత్ గేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పళనిగా గుర్తించారు. ఈ క్రమంలో పళని కీరైత్తురై పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. చదవండి: అమ్మా, పెళ్లికి వెళ్లొస్తాం.. శుభకార్యం కోసం వెళ్లి మృత్యుఒడిలోకి! -
అక్కడి బిర్యాని తింటే.. కోరికలు నెరవేరుతాయి, పోటేత్తిన జనం!
సాక్షి, చెన్నై: మునియాండి ఆలయ ఉత్సవాల్లో భాగంగా మదురై సమీపంలోని వడకం పట్టిలో శనివారం 50 గ్రామాల ప్రజలకు బిర్యాని విందు ఏర్పాటు చేశారు. ఈ బిర్యాని (ప్రసాదం) తింటే ఎలాంటి కోరికలైనా త్వరితగతిన తీరుతాయని ఇక్కడి భక్తులు భావిస్తుంటారు. వివరాలు.. మదురై జిల్లా తిరుమంగలం సమీపంలో కల్లికుడి వడకంపట్టి గ్రామం ఉంది. ఇక్కడ కొలువై ఉన్న మునియాండి స్వామిని తమ కులదైవంగా రాష్ట్రంలోని వేలాది కుటుంబాలు భావిస్తుంటాయి. రాష్ట్రంలో మునియాండి విలాస్ పేరిట హోటళ్లు నడుపుతున్న వాళ్లందరికీ ఇక్కడి మునీశ్వరరే కులదైవం. ఏటా ఇక్కడ ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించ లేదు. ఈ ఏడాది భారీ స్థాయిలో ఈ ఉత్సవాలను (వారం రోజులుగా) నిర్వహిస్తున్నారు. ఇక శనివారం బిర్యాని విందు అట్టహాసంగా సాగింది. బారులుదీరిన జనం.. ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి.. అభిషేకం కోసం పాల బిందెలతో ఊరేగింపు చేపట్టారు. అతిపెద్ద కత్తులను ఆలయానికి సమర్పించారు. తర్వాత 50 గ్రామాలకు చెందిన భక్తులకు బిర్యాని విందు ఏర్పాటు చేశారు. 74 మేకలను, 200కు పైగా కోళ్లు, 2,500 కేజీల బియ్యంతో బిర్యాని తయారు చేసి, అందరికీ పంచి పెట్టారు. ఇక్కడి బిర్యాని కోసం జనం ఎగబడ్డారు. ఈ బిర్యాని తింటే పెళ్లి కాని వారికి పెళ్లిలు అవుతాయని, బిడ్డలు లేని వారికి పిల్లల భాగ్యం కలుగుతుందని, ఇతర కోరికలన్నీ నెర వేరుతాయని భక్తులు వెల్లడించారు. ఈ ఆలయంలోని స్వామి వారి పేరిట రాష్ట్రవ్యాప్తంగా మునియాండి విలాస్‌లను నడుపుతున్నామని, రోజూ తమ హోటల్లో తొలి బిల్లు రూపంలో వచ్చే మొత్తా న్ని ఆలయం కోసం తాము కేటాయిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆలయం రాష్ట్రంలోని వేలాది కుటుంబాలకు కుల దైవం అని, ఇక్కడికి వచ్చే వారిలో ఎక్కువ శాతం మంది ఆలయం వద్దే బంధురికం కలుపుకోవడం విశేషం. అలా బంధువుల్లోని యువతి, యువకులను ఎంపిక చేసి వివాహాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: తమిళనాడులో విషాదం.. ఆలయ ఉత్సవాల్లో కుప్పకూలిన క్రేన్.. నలుగురి మృతి -
పెద్దనాన్న ఇంటికి ఉదయ నిధి స్టాలిన్.. ఆనందంతో ఆహ్వానించిన..
సాక్షి, చెన్నై: డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరితో సీఎం ఎంకే స్టాలిన్ వారసుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ భేటీ అయ్యారు. మదురైలో తన పెద్దనాన్న అళగిరి ఆశీస్సులను అందుకున్నారు. డీఎంకే దివంగత అధినేత కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి అన్న విషయం తెలిసిందే. దక్షిణ తమిళనాడు డీఎంకే కింగ్ మేకర్‌గా ఒకప్పుడు ఎదిగిన ఆయన ప్రస్తుతం రాజకీయాలకే దూరంగా ఉన్నారు. ఇందుకు కారణం కరుణానిధి చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్‌తో ఏర్పడ్డ వైరమే కారణం అనేది జగమెరిగిన సత్యం. అనేక సందర్భాల్లో స్టాలిన్‌కు వ్యతిరేకంగా అళగిరి వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి రావడంతో అళగిరి మౌనంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో మదురై పర్యటనకు వెళ్లిన మంత్రి ఉదయ నిధి స్టాలిన్ తన పెద్దనాన్నను కలిశారు. అళగిరి, ఆయన సతీమణి కాంతి అళగిరి ఆనందంతో ఉదయనిధిని ఆహ్వానించిచారు. ఈసందర్భంగా పెద్ద నాన్న అళగిరి శాలువతో సత్కరించి ఉదయ నిధికి ఆశీస్సులు అందించారు. అళగిరి మాట్లాడుతూ తాను డీఎంకేలో లేనని, తమ్ముడి కొడుకు తమ ఇంటికి రావడం ఆనందం కలిగించిందన్నారు. తమ్ముడు సీఎంగా ఉండడం, కుమారుడు మంత్రి కావడం మరింత సంతోషం కలిగిస్తోందన్నారు. డీఎంకే లోకి మళ్లీ వస్తారా? అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు సమాధానం అక్కడే అడగండి అని దాట వేశారు. చదవండి: (విక్రమార్కుడు.. రత్న ప్రభాకరన్..104 సార్లు ఫెయిల్..105వ సారి శభాష్ అనిపించుకున్నాడు) -
పొంగల్ పండుగ హుషారు.. కోడెగిత్తలతో జల్లికట్టు షురూ!
-
ప్రయాణికుడి కోసం విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..అయినా దక్కని ప్రాణాలు
ఇండిగో విమానంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినప్పటికీ.. ప్రయాణికుడి ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన ఇండోర్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధురై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం 6E-2088లో ఒక ప్రయాణికుడి కారణంగా ఇండోర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అతుల్ గుప్తా అనే 60 ఏళ్ల వ్యక్తికిఅకస్మాత్తుగా నోటి నుంచి రక్తం వచ్చింది. ఆ తర్వాత కాసేపటికీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. క్రమంగా ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. దీంతో పైలట్ విమానాన్ని ఇండోర్‌లోని దేవి అహల్యబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశాడు. ఆ తర్వాత ఆ ప్రయాణికుడిని హుటాహుటినా ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. వైద్యులు అతడు చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ మేరకు ఇండిగో ఇన్చార్జ్ డైరెక్టర్ ప్రబోధ్ చంద్ర శర్మ మాట్లాడుతూ...మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానే.. విమానాన్ని దారి మళ్లించినట్లు ఇండిగో ఇన్చార్జ్ డైరెక్టర్ ప్రబోధ్ చంద్ర శర్మ చెప్పారు. వాస్తవానికి సదరు ప్రయాణికుడు గుప్తా అప్పటికే మధుమేహం, తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీంతో విమానం సాయంత్రం 6.40 నిమిషలకు న్యూఢిల్లీకి చేరుకున్నట్లు తెలిపారు. ఐతే మృతుడు గుప్తా నోయిడా నివాసి అని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం తదనంతరం బంధువులకు అతని మృతదేహాన్ని అప్పగిస్తామని పోలీసులు చెప్పారు. (చదవండి: ఇండయన్ ఆర్మీ డే! సెల్యూట్..సైనికుడా..!) -
భారీ మెడికల్ స్కాం.. కాలం చెల్లిన మందులతో..
మదురై డివిజన్లోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందుల అక్రమ కొనుగోలు వ్యవహారం వెలుగు చూసింది. నిబంధనలను అతిక్రమించి రూ. 27 కోట్లకు కాలం చెల్లిన మందులు, వైద్య సామగ్రిని కొనుగోలు చేసిన అధికారుల బండారం తాజాగా బయట పడింది. వైద్యవిభాగం మాజీ డైరెక్టర్ సహా నలుగురిపై శనివారం కేసు నమోదైంది. వీరిని ప్రశ్నించేందుకు ఏసీబీ పావులు కదుపుతోంది. సాక్షి, చెన్నై: గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో సాగిన అవినీతి వ్యవహారాలపై ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా శాఖల మంత్రులను టార్గెట్ చేసి.. ఏసీబీ సోదాలు చేస్తోంది. అదే సమయంలో ఆరోగ్య శాఖలో భారీస్థాయిలో అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు, ఆరోపణలు రావడంతో డివిజన్ల వారీగా ఏసీబీ వర్గాలు విచారణను వేగవంతం చేశాయి. ఇందులో మదురై డివిజన్ పరిధిలో కాలం చెల్లిన మందులను కొనుగోలు చేసి ఉండడం వెలుగులోకి వచ్చింది. మాయాజాలం.. ఏసీబీ విచారణలో వెలుగు చూసిన అంశాల మేరకు.. 2017లో మదురై డివిజన్ ఈఎస్‌ఐలకు మందుల కొనుగోలుకు రూ.13.12 కోట్లు కేటాయించారు. అయితే, కొన్ని నెలల వ్యవధిలో ఈ మొత్తం రూ. 40 కోట్ల 29 లక్షలకు చేరింది. అంచనా వ్యయం పెరగడమే కాకుండా, ఆగమేఘాలపై మందులను కొనుగోలు చేయడంలో అక్రమాలు వెలుగు చూసినట్లు తేలింది. 2018లో గణంకాల మేరకు రూ. 27 కోట్లు విలువైన మందులు కాలం చెల్లినవిగా తేలింది. ఉద్దేశపూర్వకంగానే వీటిని కొనుగోలు చేసినట్లు స్పష్టం కావడంతో ఏసీబీ కన్నెర్ర చేసింది. ప్రభుత్వాన్ని మోసం చేసి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ మేరకు అప్పటి తమిళనాడు వైద సేవల విభాగం డైరెకర్ట్(ఈఎస్ఐ) ఇన్భశేఖర్, మదురై డివిజన్ ఈఎస్ఐ నిర్వాహక అధికారి జాన్ఆండ్రూ, పర్యవేక్షణాధికారి అశోక్‌కుమార్‌తో పాటు నలుగురిపై ప్రస్తుతం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ ఐదుగురిని విచారించేందుకు కసరత్తులు చేపట్టారు. అదే సమయంలో పేద కార్మికులు, సిబ్బందికి ఈఎస్ఐ ద్వారా కాలం చెల్లిన మందులు పంపిణీ జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం రూ. 27 కోట్లు విలువైన కాలం చెల్లిన మందులు గోడౌన్లకే పరిమితమై ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా, శివగంగై జిల్లాలో 2020లో కరోనాకాలం వైద్య సామగ్రి కొనుగోలులో రూ. 60 లక్షలు అక్రమాలు జరిగినట్లుగా ఏసీబీకి ఫిర్యాదులందాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. చదవండి: Viral Video: జస్ట్ మిస్....చిన్నారిపై మూకుమ్మడిగా కుక్కలు ఎటాక్! -
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. కుప్పకూలిన భవనాలు.. ఐదుగురు మృతి
సాక్షి, తమిళనాడు: మదురైలోని తిరుమంగళం సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. అగుజైలు గ్రామంలో బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా,15మందికి గాయపడ్డారు. వీపీఎం బాణాసంచా కర్మాగారంలోని మూడు భవనాల్లో వల్లరసు అనే కార్మికుడితో సహా నలుగురు పురుషులు, ఒక మహిళ పనిచేస్తుండగా ఒక్కసారిగా భవనంలో పటాకులు పేలి మూడు భవనాలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో అమ్మాసి, వల్లరసు, గోబి, విక్కీ, ప్రేమ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భార్యాభర్తల మధ్య బిర్యానీ పంచాయితీ.. తనకూ కావాలని అడిగినందుకు -
బ్యూటిఫుల్ సక్సెస్ మంత్ర
సక్సెస్ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఎందుకంటే అది ఆనందాన్నిస్తుంది కాబట్టి. ఆనందాలు మళ్లీ మళ్లీ కావాలి... కొత్త కొత్త రూపాల్లో రావాలి... ఇదీ సంగీతారాజేశ్ ఆకాంక్ష. స్పెషల్ ఎడ్యుకేషన్‌లో నిస్వార్థసేవ. ఫ్యాషన్ ఇండస్ట్రీకి కొత్త నడక. బ్యూటీ ఇండస్ట్రీ అధ్యయనం. మహిళలకు మార్కెట్ పాఠాల బోధన. అన్నింటిలో రాణిస్తున్న... ఆమె ‘సక్సెస్ మంత్ర’ ఏమై ఉంటుంది? ఓ ముప్పై– నలభై ఏళ్ల కిందట... ‘ఇది ఇంపోర్టెడ్ శారీ, మా అన్న సింగపూర్ నుంచి తెచ్చాడు’ అని ఒకరు హోదా ఒలకబోసేవారు. ‘నాది కూడా ఇంపోర్టెడే. ఫలానా నగరంలో స్మగుల్డ్ గూడ్స్ దొరుకుతాయి’ అని మరొకరు... మీకు నేనేమీ తీసిపోను అన్నంత ధీమాగా. అప్పట్లో ఇలా నడిచేవి సగటు మహిళల కబుర్లు. వాళ్లలో ఎవరికీ స్మగుల్డ్ గూడ్స్ కొనడం చట్టరీత్యా నేరమనే విషయం తెలియదు కూడా. సింథటిక్ మోజుతోపాటు ఇలాంటి హోదాల ప్రదర్శనలో మన సంప్రదాయ వస్త్రాలు తెరమరుగయ్యాయి, క్రమంగా వస్త్రాల తయారీదారులు కనుమరుగవడం కూడా మొదలైంది. అలాంటి సమయంలో గ్లోబలైజేషన్ రూపంలో వచ్చింది ఓ పెనుమార్పు. మన చేనేతలకు విదేశాల్లో అందుతున్న గౌరవాలను స్వయంగా చూసిన మన మహిళలే మన సంప్రదాయ చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్లయ్యారు. నిర్లిప్తంగా మిగిలిపోయిన చేనేత, హస్తకళాకారుల వైపు చూసింది భారతీయ ఫ్యాషన్ ఇండస్ట్రీ. అలాంటి సమయంలో పెన్ కలంకారీని పునరుద్ధరించడానికి స్వచ్ఛందంగా సేవ చేశారు సంగీతా రాజేశ్. అంతకంటే ముందు ఆమె పిల్లల చదువు వారి మానసిల్లోసానికి, మే«ధావికాసానికి దోహదం చేయాలి తప్ప బడి అంటే భయపడేలాగ ఉండకూడదని స్పెషల్ కిడ్స్ కోసం ప్రత్యేకమైన కరిక్యులమ్ తయారు చేశారు. పిల్లల్లో మేధావికాసానికి మన తాతమ్మల నుంచి ఇంట్లో ఆడుకున్న బోర్డ్‌గేమ్స్ దోహదం చేస్తాయని ఆచరణ లో చూపించారామె. సోషల్ మీడియా లో లక్షలాది ఫాలోవర్లున్న ఇన్ఫ్లూయెన్సర్ కూడా. ఇప్పుడు తాజాగా ‘మనిషిని సమాజంలో ఆత్మవిశ్వాసం తో ముందుకు నడిపించే సాధనం అందంగా కనిపించడం కూడా’ అని మరో ప్రయోగానికి తెర తీశారు. ♦ స్పెషల్ పాఠాలు ‘‘నేను మధురైలో పుట్టాను, దిండిగల్‌లో పెరిగాను. హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబంలోని అబ్బాయితో పెళ్లయింది. అలా పాతికేళ్ల కిందట హైదరాబాద్‌కి వచ్చాను. నేను స్పెషల్ ఎడ్యుకేటర్ని, స్పెషల్ చిల్డ్రన్‌కి స్పీచ్ థెరపీ, వాళ్లకు కాన్సెప్ట్ అర్థమయ్యేటట్లు టీచింగ్ మెటీరియల్, ప్రత్యేకమైన టీచింగ్ మెథడాలజీతో క్లాసులు చెప్పి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ పరీక్షలు రాయించి మెయిన్ స్ట్రీమ్‌కి పంపించడం నా బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్. అందులో బిజీగా ఉన్నప్పుడు కలంకారీ మీద ఆసక్తి కలిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో నిష్ణాతులు చేసే పెన్ కలంకారీ మీద అధ్యయనం చేశాను. వాళ్ల చేతిలో కళ ఉంది, నా దగ్గర సృజన ఉంది. ఆ రెండింటినీ కలుపుతూ కొత్త ప్యాటర్న్స్ తెచ్చాం. వాటి ఖరీదు ఎక్కువే. కానీ ఒక చీర అమ్మగలిగానంటే దానిని తయారు చేసిన కుటుంబం నెలంతా ఆకలి లేకుండా జీవించగలుగుతుంది. పెన్ కలంకారీని ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాను. వీవర్స్‌కి ప్రయోజనం కల్పించడంలో నా లక్ష్యం నెరవేరింది. ఆ తర్వాత చాలామంది ఇదే పంథాను అనుసరించారు. పెన్ కలంకారీ కళాకారుడికి సూచనలు ఇస్తూ... ♦ పంచడానికే జ్ఞానం! నేను ప్రధానంగా టీచర్ని కావడంతో నాకు తెలిసిన, నేను తెలుసుకున్న విషయాలను నాలో దాచుకోలేను. జ్ఞానం ఉన్నది పలువురికి పంచడానికే అన్నట్లు ఉంటాను. వినడానికి నా ఎదురుగా ఎవరూ లేకపోతే ఫేస్బుక్లో చెబుతాను. అలా తొమ్మిదేళ్ల కిందటే నేను ఎఫ్బీ వేదికగా కాస్ట్యూమ్ ప్రజెంటేషన్ ఇచ్చాను. కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. నాకు అప్పటికే ఎనిమిది లక్షల ఫాలోవర్లున్నారు. ఆ టైమ్‌లో నాకు అసలైన చాలెంజ్ నా వ్యాపారాన్ని కొనసాగించడం కాదు, నా ఉద్యోగులకు జీతాలివ్వడం. రెండు వారాలు మినహా మిగతా కోవిడ్ సమయమంతా పని చేశాను. అప్పుడు షోరూమ్‌లు, మాల్స్‌లో జనం కనిపించలేదు, కానీ ఆన్లైన్లో చాలా ఎక్కువగా కొనుగోళ్లు చేశారు. ♦ అదే నా సక్సెస్ సూత్ర నేను కోవిడ్ టైమ్‌లో సూరత్, జైపూర్‌కు వెళ్లి అక్కడి నుంచి లైవ్‌లో డిస్ప్లే చేశాను. గంటల్లోనే కొనుగోళ్లు జరిగాయి. స్టాక్ అక్కడి నుంచే నేరుగా డెలివరీ ఇచ్చేశాను. ఒక రవాణా ఖర్చు, ఒక స్టేట్ జీఎస్టీ తగ్గిపోతే ఎంత ఆదానో ఆలోచించండి. విదేశాలకు వెళ్లాల్సిన స్టాక్ ఆగింది, మార్కెట్ చేసి పెట్టమని అడిగిన వాళ్ల స్టాక్‌ను ఆన్లైన్లో అమ్మేశాను. దాంతో స్టాక్ కొనుగోలుకు డబ్బు పెట్టాల్సిన అవసరం రాలేదు. అటు ఉత్పత్తిదారులు, నేను– నా ఉద్యోగులు, వినియోగదారులు... అందరికీ ప్రయోజనమే. అందుకే విన్ విన్ డీల్ ఎప్పుడూ సక్సెస్ అవుతుందని నమ్ముతాను. గృహిణులు కొంతమంది ఇంట్లోనే చిన్న స్థాయిలో దుస్తులు, ఇతర ఇంటికి అవసరమైన వస్తువుల వ్యాపారం చేస్తున్నారు. కానీ అదంతా అవ్యవస్థీకృతంగా ఉంది. అలాంటి హోమ్ సెల్లర్స్‌ను ఒక వేదిక మీదకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఔత్సాహిక మహిళలకు బోధన తరగతులలో పాఠాలు చెప్తున్నాను. వ్యాపారం కోసం ఓ సొంత ఫోన్ నంబరు, బ్యాంకు అకౌంట్ నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీలలో శిక్షణ, మార్కెట్ మెళకువలతోపాటు డెడ్స్టాక్ను ఎలా డీల్ చేసే సులువు కూడా నేర్పిస్తున్నాను. హోమ్ సెల్లర్స్ చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే... స్నేహితులు, బంధువులలో కస్టమర్లను వెతుక్కోవడం. ఆ పొరపాటు వల్ల స్నేహితులు, బంధువులు దూరమవుతారు తప్ప, లాంగ్ టర్మ్ కస్టమర్లను ఏర్పరుచుకోవడం సాధ్యం కాదు. ప్రొఫెషన్నీ, కుటుంబ బంధాలను కలపకూడదు’’ అని తాను నేర్చుకున్న, అనుసరించిన సక్సెస్ సూత్రను వివరించారు సంగీతారాజేశ్. స్పెషల్ చాలెంజ్ ఫ్యాషన్ ఇండస్ట్రీని బాగా అధ్యయనం చేశాను, కాబట్టే బ్యూటీకి ఉన్న ఆదరణ, మేకోవర్ అవసరాన్ని కూడా తెలుసుకోగలిగాను. ఫ్యాషన్, బ్యూటీ... ఈ రెండూ ఒకదానితో ఒకటి కలగలిసి ఉంటాయి. అందం అనేది మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే సాధనం. మరి అలాంటప్పుడు అందాన్ని పెంచుకోవడానికి ఎన్నెన్నో అధునాతన సాధనాలు అందుబాటులోకి వచ్చిన నేటి తరుణంలో అందంగా కనిపించడం అనే ఆకాంక్షకు ఎవరైనా ఎందుకు దూరంగా ఉండాలి? నేను వయసులో ఉన్నప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీతో పరుగులు పెట్టాను, రిటైర్మెంట్ లేకుండా ఒకచోట స్థిమితంగా ఉంటూ నిర్వహించుకోవడానికి ఇప్పుడు కొత్త కెరీర్లోకి అడుగుపెట్టాను. ఇందులో కూడా సక్సెస్ అయ్యి, మరో ఐదేళ్లలో కొత్త తరానికి పాఠాలు చెప్పే స్థాయికి చేరుతాను. నేను కెరీర్ రోల్స్ ఎన్ని మార్చినా స్పెషల్ ఎడ్యుకేటర్ రోల్లో కొనసాగుతూనే ఉంటాను. – సంగీతారాజేశ్, స్పెషల్ ఎడ్యుకేటర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
భిక్షగాడిగా మారిన మాజీ వ్యవసాయ అధికారి దీనగాథ.. 26 ఏళ్ల తరువాత న్యాయం
పాతికేళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేసినా.. రిటైర్డ్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు(లోన్ ఉందనే కారణంతో) ఉన్నతాధికారులు నిరాకరించారు. ఇదే సమయంలో కుమారుడి మరణం అతడిని కుంగదీసింది. తన కళ్లెదుటే అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తెలు రోజు కూలీలుగా మారి దుర్భర జీవితాన్ని అనుభవించారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురై పాతికేళ్లుగా జీవచ్ఛవం అయ్యాడు. అయితే ఓ గుడి దగ్గర యాచించే సమయంలో అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడుతుండడంతో ఓ భక్తుడు గుర్తించారు. ఇతని దీనస్థితిని తెలుసుకుని మదురై ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడంతో.. ఎట్టకేలకూ 26 ఏళ్ల తరువాత న్యాయం దక్కింది. సాక్షి, చెన్నై: పదవీ విరమణానంతరం తనకు రావాల్సిన నగదు మొత్తం దక్కక పోవడంతో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ అధికారి ఒకరు భిక్షగాడిగా మారాడు. ఆయన దీనగాథను తన స్నేహితుడి ద్వారా తెలుసు కున్న న్యాయవాది కోర్టు తలుపుతట్టారు. చివరికి ఆ అభాగ్యుడిపై కోర్టు కరుణ చూపించింది. ఆరు వారాల్లోపు ఆయనకు చెల్లించాల్సిన మొత్తాన్ని వడ్డీతో కలిపి అందజేయాలని మదురై ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాలు.. మదురై శివారుల్లోని ఆల యాల వద్ద గత కొన్నేళ్లుగా ఓ వృద్ధుడు భిక్షాటన చేస్తూ వచ్చాడు. ఆయన అనర్గళంగా ఆంగ్లం, తమిళ భాషాలను మాట్లాడటం, వ్యవసాయానికి సంబంధించిన అంశాలను వల్లిస్తుండడంతో ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు ఇటీవల ఆయన వివరాలను ఆరా తీశాడు. అతడి దీనగాథ∙విన్న ఆ భక్తుడు తన మిత్రుడైన న్యాయవాది జిన్నాకు సమాచారం ఇచ్చాడు. చదవండి: (Bengaluru: మాంసం, మద్యం విక్రయాలు బంద్) భిక్షగాడిగా.. విచారణలో తంజావూరు జిల్లా తిరుచ్చిట్రంబలంకు చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ వ్యవసాయ అధికారి గోపాల్‌గా గుర్తించారు. 1996లో ఈయన పదవీ విరమణ చేసిన సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫలం దక్కలేదు. ఇందుకు కారణం ఆయన సహకార బ్యాంక్‌లో రుణం తీసుకుని ఉండడమే. అదే సమయంలో మధ్యలో చదువు ఆపేయాల్సిన పరిస్థితి రావడంతో ఆయన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో గోపాల్ మానసికంగా కుంగిపోయాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లి కూడా చేయలేని పరిస్థితిలో పడ్డాడు. ఆ ఇద్దరు కూలి పనులకు వెళ్తుండడంతో జీవితంపై విరక్తి చెంది ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. భిక్షాటన చేస్తూ కాలం గడుపుతుండడం వెలుగు చూసింది. దీంతో ఆయనకు రావాలసిన పదవీ విరమణ మొత్తం కోసం న్యాయవాది జిన్నా మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్ బెంచ్ మందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. 74 ఏళ్ల వయస్సులో గోపాల్ పడుతున్న వేదనపై కోర్టు స్పందించింది. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సహకారం సంఘంలో ఆయన తీసుకున్న అప్పు ప్రస్తుతం వడ్డీతో రూ. 5.37 లక్షలకు చేరినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. దీంతో ఆయనకు రావాల్సిన నగదును రుణానికి జయచేయాలని, మిగిలిన సొమ్ముకు వడ్డీ లెక్కించి గోపాల్‌కు ఆరు వారాలలోపు చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది. -
ఘోరం.. కళ్ల ముందే మరిగే జావలో పడిన వ్యక్తి
వైరల్: అంతా చూస్తుండగా కళ్ల ముందు ఘోరం జరిగింది. పొయ్యి మీద వేడి వేడి జావ మరుగుతుండగా.. ఓ వ్యక్తి అందులో పడిపోయాడు. అది చూసి చుట్టుపక్కల వాళ్లు రక్షించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ మరిగే జావ నుంచి అతను బయటపడగలిగాడు. కానీ.. కడకు ఈ ఘటన విషాదంగా ముగిసింది. తమిళనాడు మధురైలో జులై 29న ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఇవాళ(మంగళవారం) బాధితుడు మృతి చెందాడు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ ఘటన.. ఇప్పుడు వైరల్ అవుతోంది. తమిళనాడులో ‘ఆడి వెల్లి’ జాతర సందర్భంగా అమ్మవారి గౌరవార్థం జావను వండి.. ప్రజలకు పంచుతారు. గత శుక్రవారం మధురై పలగనాథంలో ముత్తు మారియమ్మ ఆలయం సమీపంలో భక్తులు కొందరు ఇళ్ల ముందరే మీదే పెద్ద పెద్ద వంట పాత్రల్లో జావను మరిగిస్తున్నారు. ఆ సమయంలో ముత్తుకుమార్ అనే ఓ వ్యక్తి మైకంతో అక్కడికి వచ్చాడు(తాగి ఉన్నాడని స్థానికులు చెప్తున్నారు). తూలిపోతూనే ఆ గంజులో పడిపోయాడు. అతను పడిపోయే టైంలోనే చూసి కొందరు అరుస్తూ అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. జావ వేడిగా ఉన్నా.. ముత్తుకుమార్ మైకంలో ఉండిపోయిన ముత్తుకుమార్ కదలకుండా అలాగే ఉండిపోయాడు. చివరికి తమ వల్ల కాకపోవడంతో స్థానికులు జావ గంజునే బోర్లించారు. కాలిన గాయాలతో పైకి లేచిన ముత్తుకుమార్‌ను స్థానికులు రాజాజీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 65 శాతం గాయాలతో చికిత్స పొందుతూ మంగళవారం అతను మృతి చెందాడు. video disclaimer: ఈ వీడియో ఘటనకు సంబంధించింది.. కొందరికి ఇబ్బందికరంగా అనిపించొచ్చు -
మదురై దంపతులకు షాక్ ఇచ్చిన ధనుష్.. ‘క్షమాపణ చెప్పాలి.. లేదంటే’
చెన్నై: మదురై మేలూరుకి వృద్ధ దంపతులు కదిరేశన్, మీనాక్షిపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానంటూ నటుడు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా నోటీసులు జారీ చేశారు. ఆ దంపతులు నటుడు ధనుష్ తమ రక్తం పంచుకొని పుట్టిన కొడుకంటూ పదే పదే చెబుతూ వస్తున్నారు. తమ జీవనాధారం కోసం నెలకు రూ.60 వేలు చొప్పున ఇవ్వాలంటూ ధనుష్‌కు నోటీసులు పంపారు. దీంతో ఈ వ్యవహారంలో తమకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేస్తామంటూ కదిరేశన్ దంపతులకు నటుడు ధనుష్ తన లాయర్ ద్వారా నోటీసులు పంపారు. -
మద్యం బాటిళ్ల లోడ్.. వాహనం బోల్తాకొట్టడంతో పండగ చేసుకున్న జనం
చెన్నై: తమిళనాడులోని మధురై హైవేపై రూ.10 లక్షల విలువైన మద్యం లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. దీంతో మద్యం బాటిళ్లన్ని ఒక్కసారిగా రహదారిపై అడ్డంగా పడిపోయాయి. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదన్నట్లుగా అక్కడ ఉండే స్థానికులు ఎగబడ్డారు. ఆ బాటిళ్లను ఎత్తుకుపోవడం ప్రారంభించారు. దొరికినంత దోచుకుని పండగ చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారడమే కాకుండా ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ఉపక్రమించారు. కేరళలోని మనలూర్‌లో ఉన్న గోదాం నుంచి మద్యం బాటిళ్లను లోడ్ చేసి తీసుకువెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో అదుపుతప్పి బొల్తాపడిందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: క్రేజీ లవ్: గర్ల్ ఫ్రెండ్ కోసం మొత్తం గ్రామానికే కరెంట్ లేకుండా చేశాడు) -
ప్రముఖ నటుడి కుమార్తె భర్త కిడ్నాప్.. అక్కడ డెడ్ బాడీ.. ఏం జరిగింది..?
తిరువొత్తియూరు : మదురైలో కిడ్నాప్‌నకు గురైన ప్రముఖ నటుడి కుమార్తె భర్త చెన్నైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆస్తుల కోసం హత్య జరిగిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. మదురై జిల్లా తల్లాకులం ప్రాంతానికి చెందిన బాల దండాయుధపాణి(50). ఇతని భార్య రాజ్యలక్ష్మి. ఈమె దివంగత ప్రముఖ సినీ నటులు సెందామరైకి ఏకైక కుమార్తె. ఈ క్రమంలో దంపతుల మధ్య ఏర్పడిన విభేదాల వల్ల ఏడేళ్లుగా భార్య నుంచి విడిపోయి బాల దండాయుధపాణి ఒంటరిగా ఉంటున్నారు. మార్చి 13వ తేదీన బాల దండాయుధపాణి అదృశ్యమయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో సోమవారం రాత్రి బాలదండాయుధపాణి చెన్నైలోని మదురవాయిల్ ఎం.జి.శంకర పాణి వీధిలో ఉన్న రాజ్యలక్ష్మి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
మధురై జైల్లో మాయ.. అసలేం జరిగిందంటే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: మధురై సెంట్రల్ జైల్లో చోటుచేసుకున్న భారీ గోల్మాల్ బట్టబయలైంది. ఖైదీల కష్టాన్ని కొందరు అధికారులు కూడబలుక్కుని కాజేశారు. బూటకపు లెక్కలు చూపి, డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి రూ.100 కోట్లను స్వాహా చేసినట్లు తేలడంతో ప్రభుత్వ గణాంకాల విభాగం విచారణ చేపట్టింది. డాక్యుమెంట్ల పునఃపరిశీన మొదలు కావడంతో జైలు అధికారుల్లో గుబులు మొదలైంది. నేపథ్యం ఇదీ.. మధురై సెంట్రల్ జైల్లో వెయ్యిమందికి పైగా శిక్ష, విచారణ ఖైదీలున్నారు. ఖైదీల ప్రయోజనాల కోసం వైద్యపరమైన బ్యాండేజ్, ఫైళ్ల తయారీ సహా పలు వృత్తులకు ఖైదీలతో తయారు చేయిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను కేటాయిస్తున్నాయి. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, న్యాయస్థానాలకు సరఫరా చేసినట్లు తప్పుడు లెక్కలు రాసి రూ.100 కోట్లు కాజేసినట్లు గత ఏడాది ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. 2016–21 మధ్య కాలంలో ఈ కుంభకోణం చోటు చేసుకున్నట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా 2019 జూన్ నుంచి 2021 జూన్ మధ్యకాలంలో మాత్రమే రూ.30 కోట్ల అవినీతి చోటుచేసుకున్నట్లు నిర్ధారించారు. రూ.30 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆడిట్ కూడా జరగడంతో ఈ గోల్‌మాల్‌లో ఉన్నతాధికారులకు కూడా వాటా వెళ్లినట్లు తెలుసుకున్నారు. 2019 జూలైలో జైలు నుంచి రెండు సైజుల్లో పదివేల కాగితపు కవర్లు, 250 ఫైళ్లు పొందినట్లు మ«ధురై జిల్లా కోర్టుల్లో రికార్డుల్లో నమోదై ఉంది. అయితే జైలు రికార్డుల్లో మాత్రం రెండు లక్షల కవర్లు సరఫరా చేసినట్లు ఉంది. ఇలా అనేక ప్రభుత్వ కార్యాలయాలకు భారీఎత్తున ఉత్పత్తులను సరఫరా చేసినట్లు బూటకపు లెక్కలు రాసుకున్నట్లు గణాంకాల విభాగం అధికారులు గత ఏడాది జరిపిన విచారణలో గుర్తించారు. దీంతో కంగారుపడిన జైలు అధికారులు జైల్లోని రికార్డుల్లో లెక్కలను తారుమారు చేస్తూ.. ఫోర్జరీకి పాల్పడ్డారు. ఈ అవినీతి వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించాల్సిందిగా ఖైదీల హక్కుల సంఘం సంచాలకులు పుహళేంది మద్రాసు హైకోర్టులో గత ఏడాది నవంబర్‌లో ప్రజా ప్రయోజనవాజ్యం (పిల్) వేశారు. అయితే తగిన ఆ«ధారాలు లేకుండా పిల్‌ను స్వీకరించలేమని ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ భండారీ, న్యాయమూర్తి ఆదికేశవులతో కూడిన డివిజన్ బెంచ్ తిరస్కరించింది. మధురై సెంట్రల్ జైల్లో భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు సమాచార హక్కుచట్టం కింద డాక్యుమెంట్లు పొందినట్లు పిటిషనర్ కోర్టుకు చెప్పుకున్నారు. పూర్తి ఆధారాలతో కొత్తగా మరో పిల్ దాఖలు చేయాలని డివిజన్ బెంచ్ పిటిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు సవివరమైన ఆధారాలతో పుహళేంది మరోసారి పిల్ వేశారు. ఈ కుంభకోణంలో అప్పటి మధురై జైలు సూపరింటెండెంట్, డీఐజీల పాత్ర ఉన్నందున రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, జైళ్లశాఖ డీజీపీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిల్లో పేర్కొన్నారు. ఈ కారణం చేత ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ భండారీ, న్యాయమూర్తి భరత చక్రవర్తితో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిందిగా కోరుతూ సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేయాల్సిందిగా పిటిషనర్‌కు సూచించింది. తాము జారీ చేసిన ఉత్తర్వులు ఏసీబీ విచారణకు ఎలాంటి అడ్డంకి కాదని కూడా తమ ఉత్తర్వుల్లో న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ముమ్మరంగా పరిశీలన ఫోర్జరీకి గురైన డాక్యుమెంట్లను గణాంకాల విభాగం అధికారులు జవహర్, శ్రీధర్ తదితరులు మధురై జైల్లో తిష్టవేసి పునఃపరిశీలన చేస్తున్నారు. గోల్మాల్ను కప్పిపుచ్చుకునేందుకు డాక్యుమెంట్లలో దిద్దుడుకు పాల్పడిన విషయం పునఃపరిశీలనలో తేలింది. ఏ మూల నుంచి ఎలాంటి ముప్పు మూడుతుందోనని జైలు అధికారులు కంగారుపడుతున్నారు. -
పరువు హత్య కేసు: యువరాజ్, అరుణ్‌కు మరణించే వరకు జైలు
సాక్షి, చెన్నై: సేలం జిల్లా ఓమలూరు ఇంజినీరింగ్ విద్యార్ధి గోకుల్ రాజ్ పరువు హత్య కేసులో మంగళవారం తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో ఓ సామాజిక వర్గానికి చెందిన యువజన నేత యువరాజ్, ఆయన డ్రైవర్ అరుణ్ కుమార్‌కు మరణించే వరకు జైలు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి సంపత్‌కుమార్ తీర్పు చెప్పారు. వివరాలు.. సేలం జిల్లా ఓమలూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి గోకుల్‌రాజ్ 2015లో పరువు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సమయంలో డీఎస్పీ విష్ణు ప్రియ బలన్మరణానికి పాల్పడటం పలు అనుమానాలకు దారి తీసింది. దీంతో ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించారు. ఈకేసులో ప్రధాన నిందితుడిగా అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన యువజన నేత యువరాజ్‌ను గుర్తించారు. అతడి డ్రైవర్ అరుణ్‌కుమార్‌ను రెండో నిందితుడిగా చేర్చారు. దీంతో కేసును నామక్కల్ నుంచి మదురై ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. ఏడేళ్ల పాటు జరిగిన విచారణ గత వారం ముగిసింది. తీర్పుపై ఉత్కంఠ.. ఈ కేసు తీర్పును మంగళవారం మధ్యాహ్నం న్యాయమూర్తి సంపత్‌కుమార్ వెలువరించారు. యువరాజ్‌కు మూడు యావజ్జీవ శిక్షతో పాటుగా మరణించే వరకు జైలు శిక్షను విధించారు. అరుణ్‌కుమార్‌కు రెండు యావజ్జీవాలు, మరణించే వరకు జైలు శిక్ష ఇస్తూ తీర్పు చెప్పారు. అలాగే, ఈ కేసులో నిందితులుగా ఉన్న కుమార్, సతీష్, రఘు, రంజిత్, సెల్వరాజ్ , చంద్రశేఖర్ , ప్రభు, శ్రీథర్, గిరిధర్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. ఇక, శిక్ష పడ్డ వారందరికీ తీర్పు పునః పరిశీలనకు గానీ, క్షమాభిక్షకు గానీ అవకాశం లేకుండా తీర్పులో ప్రత్యేక అంశాలు పేర్కొన్నారు. అలాగే, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా జరిమానా విధించారు. అయితే, అప్పీలుకు వెళ్లే అవకాశం మాత్రం ఉండటం గమనార్హం. అయితే, ఈ కేసులో ఐదుగురు తప్పించుకున్నారని వారికి కూడా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని గోకుల్ రాజ్ తల్లి చిత్ర విజ్ఞప్తి చేశారు. ఈ తీర్పు సమయంలో కోర్టు ఆవరణలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. చదవండి: జయలలిత మరణం మిస్టరీ: పన్నీరుకు సమన్లు.. -
తమిళనాడు: మేయర్లు, డిప్యూటీ మేయర్ల జాబితా
చెన్నై: తమిళనాడు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. రాష్ట్రంలోని 21 కార్పొరేషన్లను డీఎంకే కైవసం చేసుకుంది. అయితే కుంభకోణం నగర మేయర్ పదవిని కాంగ్రెస్‌కు కట్టబెట్టింది. దీంతో 20 నగరాల్లో డీఎంకే అభ్యర్థులు మేయర్లుగా ఎన్నికయ్యారు. ఆరు డిప్యూటీ మేయర్ల స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. మేయర్లు, డిప్యూటీ మేయర్ల పూర్తి జాబితా మీ కోసం... నగరం మేయర్ డిప్యూటీ మేయర్ చెన్నై ప్రియా రాజన్ (డీఎంకే) మహేశ్ కుమార్ (డీఎంకే) కోయంబత్తూర్ కల్పన (డీఎంకే) వెట్రిసెల్వన్ (డీఎంకే) మదురై ఇంద్రాణి (డీఎంకే) నాగరాజన్ (సీపీఎం) తిరుచ్చి అన్బళగన్ (డీఎంకే) రాజు (డీఎంకే) సేలం రామచంద్రన్ (డీఎంకే) శారదా దేవి తిరుపూర్ దినేశ్ కుమార్ (డీఎంకే) బాలసుబ్రమణ్యం(సీపీఐ) ఈరోడ్ నాగరత్నం (డీఎంకే) సెల్వరాజ్(డీఎంకే) తూత్తుకుడి జగన్ (డీఎంకే) జెనిట్టా సెల్వరాజ్(డీఎంకే) ఆవడి ఉదయ్‌కుమార్(డీఎంకే) - తాంబరం వసంతకుమారి(డీఎంకే) కామరాజ్(డీఎంకే) కాంచీపురం మహాలక్ష్మి (డీఎంకే) కుమారగురునాథన్(కాంగ్రెస్) కడళూర్ సుందరి (డీఎంకే) తామరైసెల్వన్ (వీసీకే) తంజావూర్ రామనాథన్ (డీఎంకే) అంజుగమ్ (డీఎంకే) కరూర్ కవితా గణేశన్ (డీఎంకే) తరణి శరవణన్ (డీఎంకే) హోసూర్ ఎస్ఏ సత్య (డీఎంకే) ఆనందయ్య (డీఎంకే) దిందిగల్ ఐలమతి (డీఎంకే) రాజప్ప (డీఎంకే) శివకాశి సంగీత (డీఎంకే) విఘ్నేష్ ప్రియ (డీఎంకే) నాగర్ కోయిల్ మహేశ్ (డీఎంకే) మేరీ ప్రిన్సీ లత (డీఎంకే) వేలూరు సుజాత (డీఎంకే) సునీల్ కుమార్ (డీఎంకే) తిరునల్వేలి పీఎం శరవణన్(డీఎంకే) కె. రాజు (డీఎంకే) కుంభకోణం శరవణన్ (కాంగ్రెస్) తమిళగన్(డీఎంకే) -
మగువల తెగువ.. జల్లికట్టు.. కొత్తరూటు
ఎర్ర తువ్వాలును గాల్లో గిర్రాగిర్రా తిప్పుతూ.. పొగరుతో బుసలు కొట్టే బసవన్నలను కనుసన్నలతో శాసిస్తూ.. క్రీడాకారులకు వాటిని చిక్కకుండా దౌడు తీయించే సాహస క్రీడా చాణక్యాన్ని ప్రదర్శించడంలో మగువలు సైతం తెగువ చూపుతున్నారు. వీరత్వం పురుష పుంగవులకే పరిమితం కాదని.. నారీమణుల ధీరత్వం సైతం మగధీరులకు ఏ మాత్రం తీసిపోదని ఎలుగెత్తి చాటుతున్నారు. సాహస క్రీడ జల్లికట్టు పోటీల్లో తమిళ తంబిలతో తలపడుతూ వారికే సవాల్ విసురుతున్నారు. మధురై పౌరుషానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. సాక్షి, చెన్నై: సంస్కృతి.. సంప్రదాయాలు.. కళలు.. ఆలయాలు.. వారసత్వ సంపదల వంటి విభిన్న విశేషాల సమాహారంతో నిండిన రాష్ట్రం తమిళనాడు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయులపై తిరగబడ్డ వీర నారీమణి వేలునాచ్చియార్, తన భర్తకు జరిగిన అన్యాయంపై తిరగబడి మధురైను తగులబెట్టిన కన్నగి లాంటి వారెందరో తమిళ మంగై (తమిళ నారీమణి)లుగా చరిత్రకెక్కారు. వీరత్వానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన వారే కాకుండా.. దేశ రాజకీయాలతోపాటు ప్రాధాన్యతా రంగాల్లోనూ సత్తా చాటుతున్న మంగైలు ఎందరో ఈ గడ్డపై పుట్టారు. తమిళనాట అత్యంత భయంకరమైన సాహస క్రీడగా పేరొందిన జల్లికట్టులోనూ ప్రవేశిస్తూ ఇక్కడి మహిళలు మధురై వీరత్వాన్ని, పౌరుషాన్ని చాటుతామంటూ తెరపైకి వస్తున్నారు. బరిమే సవాల్ తమిళ గడ్డపై పూర్వం వరుడిని ఎంపిక చేసుకునేందుకు జల్లికట్టు క్రీడను యువతులు వేదికగా చేసుకున్నట్టు చరిత్ర చెబుతోంది. ఆ తరువాత కాలంలో యువతుల్ని మెప్పించేందుకు యువకులు ఈ సాహసాన్ని ప్రదర్శించగా.. రానురాను ఇదో రాక్షస క్రీడగా మారింది. సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున ప్రారంభమయ్యే ఈ క్రీడ ఒకప్పుడు ఆరు నెలలపాటు జిల్లాల వారీగా తమిళనాడు వ్యాప్తంగా జరిగేది. ప్రతి జిల్లాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న యువకులు తమ వీరత్వాన్ని చాటుకునేందుకు జల్లికట్టు బరిలోకి దిగేవారు. ఆకర్షణీయమైన బహుమతుల్ని తన్నుకెళ్లేందుకు రానురాను ఎద్దులను హింసించడం పెరిగింది. పొగరెక్కిన ఎద్దుల దాడిలో ఎన్నో మరణాలు సైతం చోటుచేసుకున్నాయి. బసవన్నలు బుసలు కొట్టేవిధంగా వాటికి మద్యం, సారా వంటివి పట్టిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో జంతు ప్రేమికులు రంగంలోకి దిగడంతో జల్లికట్టుపై ఆరేళ్ల క్రితం సుప్రీంకోర్టు నిషేధించింది. సంప్రదాయ సాహస క్రీడను తిరిగి సాధించుకునేందుకు 2017లో యావత్ తమిళావణి మహోద్యమంతో కదం తొక్కింది. జల్లికట్టును మళ్లీ సాధించుకున్న తర్వాత తమిళ వీర మంగైలు సైతం సత్తా చాటుకునే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎద్దులను మచ్చిక చేసుకుని శిక్షణ ఇవ్వడంతోపాటు వాటిని జల్లికట్టుకు సిద్ధం చేయడం మొదలెట్టారు. అయితే, వీరికి క్రీడా మైదానంలోకి కొన్నేళ్లుగా అవకాశం దక్కలేదు. దీంతో వారంతా వాడివాసల్ (ప్రవేశ మార్గం) వెనుకకే పరిమితమయ్యారు. కాగా, ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా తమిళ మగువలు క్రీడా మైదానంలో అడుగు పెట్టి సత్తా చాటారు. అందుకే తిరస్కరించా.. నాకు ప్రోత్సాహక బహుమతి ఇచ్చారు. వీరత్వాన్ని చాటుకున్న తర్వాతే బహుమతి తీసుకోవాలన్నది నా లక్ష్యం. అందుకే తిరస్కరించాను. ప్రతిరోజు నా తమ్ముడు(ఎద్దు)తో రెండు గంటలపాటు పొలంలో సాధన చేయిస్తాను. వాడికి మంచి పౌష్టికాహారం అందిస్తాను. ఈసారి తమ్ముడు తీవ్రంగానే పోరాటం చేశాడు. వచ్చేసారి గెలిచి తీరుతాడు. – యోగదర్శిని, అవనియాపురం ఆ ఉద్యమం స్ఫూర్తిగా.. 2017లో జరిగిన జల్లికట్టు ఉద్యమమే నాకు స్ఫూర్తి. నాన్నతో పట్టుబట్టి ఓ ఎద్దును కొనిపించి శిక్షణ ఇచ్చాను. చెరువు, నీటి పరీవాహక ప్రదేశాలు, మట్టి దిమ్మెలు అధికంగా ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లి మరీ సాధన చేయిస్తున్నా. అందుకే వాడిద్వారా బంగారు నాణెం బహుమతిగా లభించింది. ఇది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో మరింత ముందుకు దూసుకెళ్తా. – స్నేహ, అలంగానల్లూరు తమిళనాట ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ మధురై జిల్లా అవనియాపురం వేదికగా భోగి రోజున జరిగిన జల్లికట్టులో అదే ప్రాంతానికి చెందిన 9 తరగతి విద్యార్థినులు అన్నలక్ష్మి, నిషా, పదో తరగతి విద్యార్థిని యోగదర్శిని తొలిసారిగా క్రీడా మైదానంలోకి తమ ఎద్దులతో దూసుకొచ్చారు. అన్నలక్ష్మి, నిషా వద్ద శిక్షణ పొందిన ఎద్దులు బుసలు కొడుతూ క్రీడాకారులకు చిక్కకుండా ఆకర్షణీయమైన బహుమతుల్ని తన్నుకెళ్లాయి. యోగదర్శిని ఎద్దు క్రీడాకారులకు చిక్కడంతో ఆ బాలికకు నిర్వాహకులు ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు. అయితే, యోగదర్శిని ఆ బహుమతిని తిరçస్కరించి.. ‘మరోసారి కలుద్దాం.. కచ్చితంగా గెలుద్దాం’ అంటూ వాడివాసల్ వేదికగా ప్రతిజ్ఞ చేసి వెళ్లింది. ప్రస్తుతం తమిళనాట అంతటా ఇదే హాట్ టాపిక్. ఆ మరుసటి రోజున పాలమేడులో కొందరు బాలికలు తమ ఎద్దుల్ని వాడివాసల్ నుంచి బయటకు రప్పించి మెరిశారు. ఇక ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరులో సోమవారం జరిగిన జల్లికట్టులో స్నేహ అనే 16 ఏళ్ల బాలికతో పాటుగా మరో ఇద్దరు బాలికలు తమ ఎద్దులతో వచ్చి బంగారు నాణేలను గెలుచుకెళ్లారు. ఇదే సందర్భంలో తమిళ సంప్రదాయాల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని.. మన సంస్కృతిని భావితరాలకు సైతం అందించాలంటే ప్రతి నారీ జల్లికట్టులో భేరీ మోగించాల్సిందేనని పిలుపునిచ్చారు. దీనినిబట్టి చూస్తే భవిష్యత్‌లో మగధీరులకు జల్లికట్టు పోటీల్లో మరింత పోటీ తప్పదన్న మాట. -
‘తగ్గేదే ల్యా’ అనుకున్నాడు.. చివరికి సాధించాడు!
అనగనగా ఒక పిల్లాడు ఉంటాడు. కుటుంబ పరిస్థితి బాగలేక బాలకార్మికుడిగా మారి ఎన్నో కష్టాలు పడతాడు. పొట్ట నింపుకోవడం కోసం, కుటుంబానికి ఆసరాగా నిలవడం కోసం తిరగని పట్టణం లేదు. చేయని పనిలేదు. ఈ కష్టాల పిల్లాడికి సినిమా అంటే ఇష్టం. ‘సినిమా డైరెక్టర్ అవుతాను’ అనే అతని ఆశయం ఎన్నో అవహేళనలకు గురైంది. కాని అతడు మాత్రం ‘తగ్గేదే ల్యా’ అనుకున్నాడు. చివరికి సాధించాడు. అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్నాడు....ఇది సినిమా కథ కాదు. ‘కూళంగళ్’ సినిమాతో ప్రశంసలు అందుకుంటున్న మదురై కుర్రాడు పీయస్ వినోద్‌రాజ్ నిజజీవితకథ.... వినోద్‌రాజ్ లో బడ్జెట్ డెబ్యూ మూవీ ‘కూళంగళ్’ (గులకరాళ్లు) ఆస్కార్–ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ ఎంట్రీగా ఎంపికైంది. కథ ఐడియాలు ఎలా వస్తాయి? విదేశాల్లో ఫైస్టార్ హోటల్లో కూర్చుంటే రావచ్చు. విదేశీ చిత్రాలు చూస్తే రావచ్చు. కొందరికి మాత్రం విదేశాలు అక్కర్లేదు. విదేశీ చిత్రాలు అక్కర్లేదు. ఏ జీవితం నుంచి అయితే తాము నడిచొచ్చారో ఆ జీవితమే వారికి నిజమైన కథలు ఇస్తుంది. వినోద్‌రాజ్... ఈ కోవకు చెందిన డైరెక్టర్. తాను పుట్టి పెరిగిన జీవితాన్నే కథగా మలుచుకున్నాడు వినోద్. అదే ‘కూళంగళ్’ సినిమా! వినోద్‌రాజ్ తండ్రి తాగుబోతు. తాగి ఎప్పుడు ఏ రోడ్డు మీద పడి ఉంటాడో తెలియదు. నాన్న చనిపోయిన తరువాత కష్టాలు పెరిగాయి. కుటుంబానికి ఆసరాగా ఉండడం కోసం పూలు అమ్మడం నుంచి టెక్ట్స్‌టైల్ కంపెనీలో పనిచేయడం వరకు ఎంతో కష్టపడ్డాడు. టెక్ట్స్ టైల్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు రకరకాల కష్టాలతో అర్ధాంతరంగా జీవితాన్ని చాలేసిన ఎంతోమందిని అక్కడ ప్రత్యక్షంగా చూశాడు. ఈ కన్నీటి కథలు, తన కుటుంబ కష్టాలను గుర్తు చేసుకున్నప్పుడల్లా కడుపులో దుఃఖసముద్రాలు ఘోషించేవి. ఆ అనంతమైన దుఃఖం బయటికి వెళ్లే మార్గం, మాధ్యమంగా అతడికి సినిమా కనిపించింది. (చదవండి: బ్రేక్ ఔట్ యాక్టర్.. తమిళ అమ్మాయి!) సినిమా డైరెక్టర్ కావాలంటే ఏం కావాలి? చెప్పుకోదగ్గ చదువు కావాలి. ఈ ఆలోచనలతోనే ‘మళ్లీ చదువుకుందాం’ అని నిర్ణయించుకున్నాడు. కానీ ‘ఈ వయసులో చదువేమిటి!’ అనే వెక్కిరింపులు క్యూ కట్టాయి. ఇక లాభం లేదనుకొని చెన్నై వెళ్లి ఒక డీవిడి స్టోర్‌లో పనికి కుదిరాడు. అక్కడ ప్రతి సినిమా తనకొక పాఠం నేర్పింది. ఆ ధైర్యంతోనే కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ తన కలలతీరానికి చేరుకున్నాడు. ఎట్టకేలకు డైరెక్టర్ అయ్యాడు. ‘కూళంగళ్’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొందరికి తప్ప ఎవరికీ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. కాని ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రొటెర్డామ్ టైగర్ అవార్డ్(న్యూజిలాండ్) గెలుచుకుంది. ‘సింపుల్ అండ్ హంబుల్’ అని ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఆస్కార్ పరిసరాల్లోకి వెళ్లింది. (చదవండి: ఐటెం సాంగ్ లిరిక్స్‌పై తొలిసారిగా స్పందించిన బన్నీ) ‘ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. పెద్దగా చదువుకోలేదు. జీవితం అనే బడి ఎన్నో పాఠాలు నేర్పింది’ అంటున్న వినోద్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటి? సింపుల్ అండ్ హంబుల్ ప్రాజెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పాలా! -
Tamil Nadu: 30 మంది ప్రాణాలు కాపాడి మృత్యు ఒడిలోకి ఆర్టీసీ డ్రైవర్
చెన్నై: తను చనిపోయే ముందు 30 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు ఓ ఆర్టీసీ డ్రైవర్.. తనకు ప్రమాదం ఎదురవబోతుందని ముందే గమనించి అప్రమత్తమైన డ్రైడర్ బస్సును రోడ్డు పక్కన నిలిపిన అయిదు నిమిషాల్లోనే గుండెపోటుతో మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. ఈ ఈ హృదయవిదారక ఘటన తమిళనాడు రాష్ట్రంలోని మధురైకి సమీపంలో చోటుచేసుకుంది. తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఎమ్ ఆరుముగమ్(44) ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఎప్పటిలాగే కండక్టర్ భాగ్యరాజ్‌తో కలిసి అరప్పాలయం నుంచి కొడైకెనాల్‌కు బస్సు నడుపుతున్నాడు. ఉదయం 6.20 నిమిషాలకు అరప్పాలయం నుంచి బస్సు బయలు దేరింది. బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. బస్సు బయల్దేరిన అయిదు నిమిషాలకు గురు థియేటర్ వద్దరు చేరుకోగానే అరుముగమ్‌కు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి ఏర్పడింది. వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు పార్క్ చేసి కండక్టర్‌ను సమాచారం అందించాడు. అనంతరం బస్సులోని సీట్లో కుప్పకూలిపోయాడు. కండక్టర్ వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించాడు. కానీ అంబులెన్స్ వచ్చేలోపే డ్రైవర్ అరుముగమ్ గుండెపోటుతో మరణించాడు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. చదవండి: సెల్ఫీ పిచ్చి...జాలి పడాలా? మీరే చూడండి! టీఎన్ఎస్టీసీ డిప్యూటీ కమర్షియల్ మేనేజర్ యువరాజ్ మాట్లాడుతూ.. ఆరుముగం ఆర్టీసీలో డ్రైవర్‌గా 12 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. 30 మంది ప్రాణాలను కాపాడిన అతని ఆదర్శప్రాయమైన సాహసం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కరిమేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Tejashwi Yadav: ఘనంగా తేజస్వి యాదవ్ వివాహం -
కుప్పకూలిన ఫ్లై ఓవర్: ఒకరు మృతి
చెన్నై: తమిళనాడులోని మధురైలో ఫ్లై ఓవర్ కూలిన ఘటన విషాదాన్ని నింపింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌లోని ఫ్లైఓవర్ ఒక భాగం కూలిపోయింది శనివారం అకస్మాత్తుగా కూప్పకూలింది ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్నరక్షణ సిబ్బంది సహాయక చర్యల్ని చేపట్టాయి. శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారో తెలుసుకునేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. Tamil Nadu: A portion of an under-construction flyover collapses in Madurai; fire and rescue personnel on the spot pic.twitter.com/QNzXXgDNhb — ANI (@ANI) August 28, 2021 -
మళ్లీ తెరపైకి నిత్యానంద: వివాదంలో మదురై మఠం
సాక్షి, చెన్నై: మదురైలో ప్రసిద్ధి చెందిన శైవ మఠానికి 293వ ఆధీనంగా బాధ్యతలు స్వీకరించినట్లు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద బుధవారం ప్రకటించారు. కైలాస దేశం నుంచే ఆన్లైన్ ద్వారా భక్తులకు ఆశీస్సులు అందించనున్నట్టు పేర్కొన్నారు. అలాగే తన పేరు ‘జగద్గురు మహాసన్నిధానం శ్రీలశ్రీ భగవాన్ నిత్యానంద పరమశివజ్ఞాన సంబంధ దేశిక పరమాచార్య స్వామి’గా మార్చుకున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించడం చర్చకు దారితీసింది. మళ్లీ తెరపైకి.. మదురై శైవ మఠానికి కొన్ని దశాబ్దాల పాటు 292వ మఠాధిపతిగా సేవలందించిన అరుణ గిరినాధర్ గత వారం శివైక్యం పొందిన విషయం తెలిసిందే. ఆయన పార్థివదేహాన్ని మహాసమాధి చేసినానంతరం మఠంలో 500 కేజీలతో కూడిన అరుణ గిరినాధర్ పాలరాతి శిల్పాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. అలాగే 293వ ఆధీనంగా హరిహర జ్ఞాన సంబంధం దేశీయ పరమాచార్య బాధ్యతలు చేపట్టారు. మఠంలోని రహస్య గదిలోని ఆభరణాలు, విలువైన వజ్రాలు , రాష్ట్రవ్యాప్తంగా మదురై మఠానికి ఉన్న ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను ధర్మపురం ఆధీనం సమక్షంలో 293వ ఆధీనానికి అప్పగించారు. అయితే మఠాన్ని కైవశం చేసుకునేందుకు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. చదవండి: ఆయిల్ పామ్ గెలలకు ధర హామీ -
మదురై మఠాధిపతి కన్నుమూత
మదురై: మదురైలో ప్రసిద్ధి చెందిన శైవ మఠం ఆధీనం(మఠాధిపతి) అరుణగిరినాధర్ (77) శుక్రవారం కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కొద్దిరోజుల క్రితం ఆయనను మదురైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారని అధీనం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 1,500 సంవత్సరాల చరిత్ర ఉన్న శైవ మఠానికి ఆయన 292వ పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. అరుణగిరినాధర్ మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామిలు సంతాపం వ్యక్తం చేశారు. శైవ మత సూత్రాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు సీనియర్ పాత్రికేయులుగా పని చేస్తూ ప్రజోపకరమైన పనులలో ఆయన నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. ఆయన మరణం తీరని లోటు అని చెప్పారు. తమిళ ప్రపంచానికి ఆయన మరణం పెద్ద లోటు అంటూ ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
5 పైసలకే నోరూరించే బిర్యానీ.. ఎగబడ్డ జనం
మధురై (తమిళనాడు): బిర్యానీ పేరు చెబితేనే మన నోరూరుతుంది. బిర్యానీ నచ్చని భోజనప్రియులు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి బిర్యానీని కేవలం ఐదంటే ఐదు పైసలకు అందిస్తే ఇంకేం ఎగబడి తింటారు. ఇలాగే ఓ హోటల్ ప్రారంభ ఆఫర్‌గా ప్రకటిస్తే జనాలు ఎగబడి తిన్నారు. ఆ ఆఫర్ కొన్ని షరతులతో విధించినా కూడా అనూహ్య స్పందన రావడంతో ఆ హోటల్ కిటకిటలాడింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. సెల్లూర్‌లో బిర్యానీ కోసం ఎగబడిన ప్రజలు తమిళనాడులోని మధురై జిల్లా సెల్లూర్‌లో సుకన్య బిర్యానీ హోటల్ ప్రారంభమైంది. ప్రారంభ ఆఫర్‌గా 5 పైసల నాణెం తీసుకొస్తే బిర్యానీ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. చెల్లని ఐదు పైసల నాణెం ఎవరి వద్ద ఉంటాయని భావించిన హోటల్ యాజమాన్యానికి ఊహించని రీతిలో స్పందన ఎదురైంది. పెద్ద ఎత్తున జనాలు ఐదు పైసల నాణెం తీసుకుని వచ్చి హోటల్ ముందు వరుస కట్టారు. చిన్నాపెద్దా అందరూ ఎగబడడంతో ఆ హోటల్ తాకిడిని తట్టుకోలేకపోయింది. 300 మందికి ఆ నాణెలు తీసుకొచ్చారు. అయితే బిర్యానీ ధ్యాసలో పడి కరోనా సోకే విషయాన్ని మరిచి ఎగబడ్డారు. అంతమంది తరలిరావడంతో యాజమాన్యం హోటల్ షట్లర్లు మూసేసింది. ఆలస్యంగా వచ్చిన కొందరు నాణెం ఇచ్చి బిర్యానీ అడగ్గా ఇవ్వలేదు. గతంలో దిండిగల్ పట్టణంలో కూడా ఇలాంటి ఆఫర్ ప్రకటించారు. జనాల తాకిడికి దుకాణం మూసివేసిన నిర్వాహకులు -
14 ఏళ్లకే ఇంట్లో నుంచి పరార్.. 2 ఏళ్ల తర్వాత 4 నెలల శిశువుతో!
చెన్నై/తిరువనంతపురం: కేరళలో కనిపించకుండా పోయిన ఓ మైనర్ బాలికను రెండేళ్ల తరువాత తమిళనాడులోని మదురైలో పోలీసులు గుర్తించారు. తప్పిపోయిన సమయంలో బాలిక వయస్సు 14 ఏళ్లు కాగా ప్రస్తుతం ఆమెకు 16 ఏళ్లు. అయితే ఇప్పుడు నాలుగు నెలల శిశువుకు తల్లి. ఆమె తమిళనాడు 22 ఏళ్ల వ్యక్తితో కలిసి జీవిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. కేరళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లాలోని(తమిళనాడుకు సరిహద్దు ప్రాంతం)కోజింజపారాకు చెందిన 14 ఏళ్ల బాలిక రెండేళ్ల క్రితం తప్పిపోయింది. ఓ వ్యక్తితో కలిసి 2019లో ఇంట్లోనుంచి పారిపోయినట్లు తెలిసింది. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించగా.. కోజింజంపారా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఇక తాజాగా రెండేళ్ల తరువాత జూన్ 18న వీరిద్దరూ మదురైలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆమె తన తల్లితో కలిసి క్యాటరింగ్ పనిచేసే వ్యక్తితో మదురైలోని ఇంట్లో కనిపించింది. కాగా ఆ వ్యక్తికి చెందిన దూరపు బంధువులు అతని ఇంటి సమీపంలో నివసిస్తున్నారని, బాలికను అతని భార్యగా వారు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. అయితే బాలిక వయసు గురించి ఖచ్చితంగా తెలియదన్నారు. ప్రస్తుతం ఆమె ఇప్పుడు నాలుగు నెలల శిశువుకు తల్లి అని పాలక్కాడ్ జిల్లా డీఎస్పీ జాన్ సీ తెలిపారు. వీర్దిరూ కలిసి జీవిస్తున్నారన్న ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసి ఉందో లేదో తమకు తెలియదని పోలీసులు అన్నారు. బాలికను, శిశువును తిరిగి కేరళకు పంపించామని, సదరు వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం సెక్షన్ల కింద వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు, ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోసం శిశువు, బాలిక డీఎన్ఏ నమూనాలను సేకరిస్తామని వెల్లడించారు. చదవండి: దారుణం: దెయ్యం పట్టిందని కొడుకును కొట్టి చంపిన తల్లి -
చెన్నై సెంట్రల్, మదురై రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపు
సాక్షి, చెన్నై: చెన్నై సెంట్రల్, మదురై రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు చేసిన రామనాథపురం వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బెంగళూరు రైల్వేస్టేషన్ కంట్రోల్ రూం వాట్సాప్ నెంబరుకు ఒక సమాచారం వచ్చింది. అందులో చెన్నై సెంట్రల్, మదురై రైల్వేస్టేషన్లలో బాంబులు పెట్టామని, మరికొద్ది సేపట్లో పేలనున్నట్లు ఉంది. దీంతో దిగ్భ్రాంతి చెందిన అధికారులు చెన్నై సెంట్రల్, మదురై రైల్వేస్టేషన్ల కంట్రోల్ రూంలకు సమాచారం అందించారు. ఈ రెండు రైల్వేస్టేషన్లలో భద్రతా అధికారులు, బాంబు స్క్వాడ్ నిపుణులు పోలీసు జాగిలాలతో రెండు గంటలపాటు తనిఖీలు జరిపారు. బాంబులేవీ లభించలేదు. విచారణలో బాంబు బెదిరింపు చేసిన వ్యక్తి రామనాథపురానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక దళం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: మద్యం మత్తులో వదినను లైంగికంగా వేధించిన మరిది.. -
ఆకాశవీధిలో పెళ్లి.. వధువరులపై కేసు!
న్యూఢిల్లీ: ఆకాశవీధిలో పెళ్లి చేసుకున్న జంటగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నూతన దంపతులు రాకేశ్‌దక్షిణలకు కొత్త చిక్కు వచ్చి పడింది. పెళ్లి సంబరం ముగియకముందే, శుభాకాంక్షల జడివాన ఆగకముందే కేసులు ఎదుర్కొవాల్సిన విపత్కర పరిస్థితి ఎదురైంది. పెళ్లిపై విచారణ ఛార్టెడ్ ఫ్లైట్‌లో నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసుకున్నారంటూ ఈ పెళ్లిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వధువరులతో పాటు ఇరు కుటుంబాల పెద్దలపై కేసులు పెట్టేందుకు సిద్ధమైంది. అంతేకాదు పెళ్లి సమయంలో విధుల్లో ఉన్న ఫ్లైట్ సిబ్బందిని రోస్టర్ నుంచి తప్పిస్తూ షాక్ ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహరంపై విచారణ చేయాలంటూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఉల్లంఘించారనే కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది ఏవియేషన్ శాఖ. విమానాశ్రయంలో సైతం మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేసింది.ఈ సమయంలో ఎగురుతున్న విమానంలో మాస్కులు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా పెళ్లి వేడుక నిర్వహించడడం డీజీసీఏ ఇబ్బందిగా మారింది. దీంతో ఈ పెళ్లిని తీవ్రంగా పరిగణించింది డీజీసీఏ. వైరల్‌గా మారిన పెళ్లి తమిళనాడులోని మధురైకి చెందిన రాకేశ్, దక్షిణలు పెళ్లి కుదిరింది. పెళ్లి మధుర మీనాక్షి అమ్మవారి సన్నిధిలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. వధువరులతో పాటు ఇరు కుటుంబాలకు చెందిన వారు బెంగళూరు నుంచి మధురైకి చార్టెట్ ఫ్లైట్‌లో బయల్దేరారు. అయితే తమిళనాడు ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేయడంతో ... విమానంలోనే వధువరులకి పెళ్లి జరిపించారు ఇరు కుటుంబాల పెద్దలు.ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దేశం నలుమూలల నుంచి ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. -
వైరల్ వీడియో: పెళ్లితో ఒక్కటైన జంట.. భూమ్మీద కాదండోయ్!
-
వైరల్: పెళ్లితో ఒక్కటైన జంట.. భూమ్మీద కాదండోయ్!
సాక్షి, చెన్నై: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన ఘట్టం. జీవితంలో ఒకసారి జరిగే ఈ వేడుకను కుటంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆరాటపడుతుంటారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా అనేక రాష్ట్రాలు లాక్డౌన్, కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించాయి. దీంతో వివాహాలకు కూడా పరిమిత సంఖ్యలో అతిథులు హాజరు కావాలనే నిబంధనను కూడా అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది జంటలు తమ వివాహాన్ని మమ అంటూ జరిపించేస్తున్నారు. కానీ కోవిడ్‌యే కాదు ఏ మహమ్మారి వచ్చిన తమ పెళ్లిని ఆపలేవంటూ, అందరి సమక్షంలో ఓ జంట ఒకటయ్యింది. అయితే వీరి వివాహం నేల మీద జరగలేదు.. వినూత్నంగా గాల్లో అయ్యింది. వివరాల్లోకి వెళితే.. మధురైకి చెందిన రాకేష్, దక్షిణలు పెళ్లి మదురై అమ్మవారిలో సన్నిధిలో మంగళవారం జరగాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావంతో తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ విషయం తెలియడంతో పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లను రద్దు చేసుకున్నారు. కానీ తమ పెళ్లిని మాత్రం వాయిదా వేసుకోవలనుకోలేదు. ఇరు కుటుంబ సభ్యులు మొత్తం 161 మంది కలిసి రెండు గంటల కోసం ప్రత్యేకంగా విమానం అద్దెకు తీసుకున్నారు. వీరంతా బెంగళూరు నుంచి మదురైకి బయలు దేరి వెళ్లారు. విమానం టేకాఫ్ అయిన తరువాత గాల్లోనే పెళ్లి కొడుకు పెళ్లి వధువుకి తాళి కట్టి ఒకటవ్వగా.. కుటుంబ సభ్యులు వీరిని ఆశీర్వదించారు. తిరిగి మళ్లీ మదురై నుంచి బెంగళూరుకు ప్రయాణమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: కొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్ -
మధురైలో ఎన్ఐఏ సోదాల కలకలం
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేరళ నుంచి వచ్చిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు మధురైలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇద్దరు తీవ్రవాద అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. శ్రీలంక చర్చిలో మూడేళ్ల క్రితం జరిగిన మారణహోమంలో తమిళనాడుకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందని భారత్‌కు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు లోతుగా విచారణ చేపట్టగా తమిళనాడు పాత్రను గుర్తించారు. అనాటి నుంచి తమిళనాడులోని అనుమానితులపై నిఘాపెట్టారు. ఫేస్బుక్లో సందేహాస్పద పోస్టింగ్‌లను గమనించిన మధురై పోలీసులు అదే ప్రాంతానికి చెందిన సెంథిల్‌కుమార్ అలియాస్ మహమ్మద్ ఇక్బాల్‌కు తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉండవచ్చని అనుమానించి గతంలో కేసు పెట్టారు. ఈ కేసు ఏప్రిల్‌లో ఎన్ఐఏకు బదిలీకాగానే ఇక్బాల్‌ను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, కేరళ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందం ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మధురై కాజీమర్ వీధి, కే పుత్తూరు, పెత్తానియాపురం, మగప్పాళయం తదితర ప్రాంతాల్లో ఇక్బాల్ అతని స్నేహితుల ఇళ్లలో మధ్యాహ్నం 1 గంట వరకు తనీఖీలు సాగాయి. ఇక్బాల్ ఇంటి నుంచి పెన్ డ్రైవ్, సిమ్‌కార్డు సహా 16 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక తిరుప్పూరుకు చెందిన ఒక యువకుడు ఇక్బాల్‌తో ఎక్కువసేపు వాట్సాప్‌లో చాటింగ్ చేసిన విషయం బయటపడింది. సుమారు 8 గంటలపాటూ ఆ యువకుడిని విచారించి విడిచిపెట్టారు. (చదవండి: Covid-19: తలైవా విరాళం రూ. 50 లక్షలు) -
సూసైడ్ నోట్: లాయర్ ఆత్మహత్య.. యోగా టీచర్ హత్య
చెన్నై: భార్య దూరమయ్యింది. పదేళ్ల బిడ్డతో ఒంటరిగా ఉంటున్నాడు. బాధితులకు న్యాయం చెప్పాల్సిన లాయర్ అయ్యుండి.. క్షణికావేశంలో ఓ తప్పు చేశాడు. ఆ తర్వాత తనను తాను క్షమించుకోలేక ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు. పదేళ్ల బిడ్డను ఒంటిరి చేసి వెళ్లాడు. ఈ విషాద సంఘటన మధురైలో చోటు చేసుకుంది. సదరు లాయర్ రాసిన సూసైడ్ నోట్ కనిపించకుండా పోయిన ఓ యోగా టీచర్‌కు సంబంధించిన వివరాలు వెలుగులోకి తెచ్చింది. ఆ వివరాలు.. లాయర్‌గా పని చేస్తున్న హరిక్రిష్ణన్ అనే వ్యక్తి తన పదేళ్ల కుమార్తెతో కలిసి మదురైలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమలో మంగళవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. హరిక్రిష్ణన్ ఇంట్లో లభించిన సూసైడ్ నోట్ మరో మిస్సింగ్ కేసు పరిష్కరించడానికి సాయం చేసింది. మిస్సింగ్ కేసు వివరాలు... మదురైకి చెందిన చిత్రదేవి యోగా టీచర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గత నెల 2న ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తిరిగి రాలేదు. దాంతో చిత్రదేవి తండ్రి ఏప్రిల్ 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. యోగా టీచర్ తండ్రి కన్నయ్య మదురైలోని తిరుమంగళంలో పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక దాన్ని సీఎం సెల్‌కు ఫార్వర్డ్ చేసి.. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అంతేకాక తన కుమార్తెకు, లాయర్ హరిక్రిష్ణన్‌కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్స్‌ను పోలీసులకు అందించాడు. చిత్రదేవి తండ్రి వీటిని పోలీసులకు ఇచ్చాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. మంగళవారం హరిక్రిష్ణన్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. సూసైడ్ నోట్లో ఏం ఉంది.. హరిక్రిష్ణన్ ఇంటి దగ్గర లభించిన సూసైడ్ నోట్లో అతడు చిత్రదేవిని హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆమెను చంపి.. తన ఇంటి బాత్రూమ్లో సమాధి చేసినట్లు వెల్లడించాడు. క్షణికావేశంలో ఘాతుకం చేసినప్పటికి ఆ తర్వాత అతడు స్థిమితంగా ఉండలేకపోయాడు. చేసిన తప్పుకు బాధపడుతూ.. తనను తాను క్షమించుకోలేక ఆత్మహత్యచేసుకుంటున్నట్లు సూసైడ్‌నోట్‌లో తెలిపాడు. చదవండి: ‘న్యాయవాద దంపతులది ప్రభుత్వ హత్యే’ -
కాన్పుల వేల్పు.. మదురై తొలి మహిళా డాక్టర్ పద్మావతి
వేల మందికి ఆరోగ్యవంతమైన పుట్టినరోజులను ప్రసాదించిన మదురై కార్పొరేషన్ తొలి మహిళా డాక్టర్ పద్మావతి నేడు తన నూరవ యేటను పూర్తి చేసుకుంటున్నారు. ఆడపిల్లేంటి, మెడిసిన్ చదవడమేంటి అనే ఆ కాలపు అభ్యంతరాలను ఎదుర్కొని, ప్రభుత్వ డాక్టర్ అయి, ప్రసూతి మరణాలను తగ్గించడానికి గర్భిణుల ఇళ్లకే డాక్టర్లు వెళ్లి డెలివరీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు పద్మావతి. మెడికల్ ఆఫీసర్ గా కూడా మహిళల ఆరోగ్యం కోసం వైద్యచికిత్సల వ్యవస్థలో ఇంకా అనేక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఈ ఆబ్స్టెట్రీషియన్ వృత్తిగత, వ్యక్తిగత జీవిత విశేషాలివి. గత ఎనిమిదేళ్లుగా కీళ్లవాతం, గత ఏడాదిన్నరగా కరోనా వైరస్ డాక్టర్ పద్మావతిని అడుగు తీసి అడుగు వేయకుండా చేస్తున్నాయి కానీ.. నూరేళ్లన్నది ఆమెను ఏమాత్రం నిరుత్సాహ పరిచే వయసు కాదు. ఏప్రిల్ 27న ఆమె 100వ పుట్టిన రోజును జరిపేందుకు ఇంటిల్లిపాదీ ఏర్పాట్లు మొదలుపెట్టారు. అయితే అది కేవలం ఆ ఇంటి వేడుక మాత్రమే కాదు. మదురై కార్పోరేషన్‌లోని ప్రతి ఇంటికి సంతోషాన్నిచ్చే సందర్భం. డాక్టర్ పద్మావతి ఆబ్స్టెట్రీషియన్. నార్మల్ డెలివరీలు చేయడంలో నిపుణురాలు. మదురై తొలి మహిళా డాక్టర్! తమిళనాడులోని మదురై 1950 లో మున్సిపాలిటీ అయింది. 1971లో కార్పోరేషన్ అయింది. 1949లో ఆమె మదురైలోని ‘గవర్నమెంట్ ఎర్స్కైన్ హాస్పిటల్’లో హౌస్ సర్జన్‌గా చేరారు. మద్రాస్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసీ చేయగానే అక్కడ ఉద్యోగం వచ్చేసింది. అయితే పద్మావతి ఏనాడూ అదొక ఉద్యోగంలా చేయలేదు. యజ్ఞంలా నిర్వహించారు. సుఖ సాధారణ ప్రసవాలు, మాతాశిశు ఆరోగ్యమే ఆ యజ్ఞఫలాలు. ఆమె చేరేటప్పటికే అక్కడ ఆమె తండ్రి సీనియర్ సివిల్ సర్జన్. ఆయన ఎంత గొప్ప వైద్యుడైనా గానీ, కూతుర్ని మెడిసిన్ చదివించడమే గొప్పతనంగా ఆనాడు ఆయన గుర్తింపు పొందారు! పద్మావతి ఆస్టిన్ కారును తనే డ్రైవ్ చేసుకుంటూ ఆసుపత్రికి రావడం కూడా అప్పట్లో పెద్ద విశేషం అయింది. తండ్రి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడో కదా అన్నారంతా. పెద్ద కుమారుడు గురుసుందర్ పెళ్లిలో పద్మావతి (కుడి చివర) యూఎస్‌లో కొందరు, చెన్నైలో కొందరుగా ఉన్న ముగ్గురు కొడుకులు, కూతురు, వాళ్ల జీవిత భాగస్వాములు, ఎనిమిది మంది మనవలు, నలుగురు మునిమనవలు పద్మావతి నూరవ పుట్టిన రోజు వేడుకలు చేయాలని ఉత్సాహ పడుతున్నారు. అయితే అందుకు ఆమె ఒప్పకోవడం లేదు.‘‘ఒక కేట్ కట్ చేయించి ఆ వీడియోను అందరికీ పంపిస్తే సరిపోతుంది’’ అని నిరంతరం తననే కనిపెట్టుకుని ఉండే పెద్ద కొడుకు డాక్టర్ గురుసుందర్కు ఆమె ఇప్పటికే ఆదేశాలు ఇచ్చేశారు. కరోనా గురించే ఆమె ఆందోళన. 1921 ఏప్రిల్ ఇరవై ఏడున ఆమె పుట్టగానే ఆమె తండ్రి డాక్టర్ ఆర్. సుందరరాజన్ ఆమెను కారణ జన్మురాలు అనేశారు! తొలి బిడ్డ ఆమె. ఆపై అప్పటికప్పుడు చిన్న పాట కూడా రాశారు. ఆ పాటలో ఆమె పేరు ముని ప్రేమ. పద్మావతి తల్లి మునియమ్మాళ్ పేరు మీద ముని అని ముద్దుగా పిలుచుకున్నారు.‘‘పెరిగి పెద్దయి స్త్రీల ఆరోగ్యానికి సంరక్షకురాలివి కావాలి’’ అని దీవించారు. ఆయన దీవెనలు ఫలించాయి. వేల పురుళ్లు పోశారు పద్మావతి. ఆసుపత్రికి రాలేని గర్భిణులు ఉంటే వారి కోసం ఆసుపత్రి సిబ్బందినే వారి ఇళ్లకు పంపించారు. ప్రభుత్వ డాక్టర్ అయి ఉండి కూడా కాన్పు చేయడానికి తనకై తను ఇళ్లకు వెళ్లిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. 1900 లలో మహిళలు ఎలా ఉండేవారో తెలిసే కూతుర్ని డాక్టర్ని చేశారు పద్మావతి తండ్రి. బాధ పడనన్నా పడతాం కానీ, మగ డాక్టరుకు మాత్రం చెప్పుకోము అన్నట్లుండేవారు. అప్పటికి ఆయన మదురైలో పేరున్న ‘లైసెన్స్›్డ మెడికల్ ప్రాక్టీషనర్’. తొమ్మిది మంది సంతానంలో పద్మావతితో పాటు ఐదుగురు ఆడపిల్లల్నీ ఆయన డాక్టర్లను చేశారు. మిగతా పిల్లల్లో ఇద్దరు మగపిల్లలు కూడా వైద్య వృత్తినే ఎంచుకున్నారు. ∙∙ పద్మావతి ఇంట్లో పెద్ద పిల్ల. ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు చూడాలి.. ‘‘మన ఇంటా ఒంటా ఉందా.. ఆడపిల్ల చదువుకోవడం’’ అని బంధువులంతా ముక్కుమీద వేలేసుకున్నారు. ఆమె పుస్తకాల సంచిని భుజంపై నుంచి లాగేసి విసిరికొట్టేసేవారు. తండ్రి వెంటనే ఆమెకు కొత్త పుస్తకాల సెట్ కొని తెచ్చేవారు. ఆయనొక్కరే పద్మావతికి మద్దతు. అలాగే పదిహేనేళ్లు దాటితే ఆడపిల్లలకు పెళ్లి చేసేయాలనే సంప్రదాయం బలంగా ఉండేది. దాన్ని కూడా కూతుర్ని వైద్యురాలిని చేయడం కోసం పక్కన పెట్టేశారాయన. ముదురైలోని అమెరికన్ కాలేజ్ లో ఇంటర్లో చేర్చారు! తర్వాత మెడిసిన్. గవర్నమెంట్ డాక్టర్ అయిన కొన్నాళ్లకే మదురైలోని ‘మున్సిపల్ మెటర్నిటీ హోమ్స్’ అన్నిటికీ పద్మావతి సూరింటిండెంట్ అయ్యారు. ప్రసవాలు సురక్షితంగా జరగడమూ మొదలైంది. ‘‘ఆమె చేతుల్లో పడితే చాలు’’ అనేంతగా మదురై అంతటా ఆమె పేరు తెలిసింది. 1969 లో ఆమె ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పోలెండ్‌లో జరిగిన గర్భిణి, శిశు ఆరోగ్య వైద్య శిక్షణా సదస్సులకు హాజరయ్యారు. ఆ శిక్షణకు భారతదేశం నుంచి ఎంపికైన ముగ్గురు డాక్టర్లలో పద్మావతి ఒకరు. ఆమె సూచనలపై భారత ప్రభుత్వం కూడా ఆ తర్వాత కొన్ని మాతా శిశు సంరక్షణ విధానాలను అమలు పరిచింది. పద్మావతి పెళ్లి ఆమె 30వ యేట జరిగింది. భర్త రామస్వామి స్కూల్ హెడ్మాస్టర్. కొన్నాళ్లకే భర్త సహకారంతో మదురై పెరుమాళ్ కోయిల్ వీధిలో పది పడకల ఆసుపత్రి నిర్మించుకున్నారు. అదే వారి నివాసం కూడా. పద్మాలయ హెల్త్ క్లినిక్ అని ఆ వైద్య నివాసానికి పేరు పెట్టుకున్నారు. సిజేరియన్ సరంజామా లేని ప్రసూతి ఆసుపత్రి మదురై మొత్తంలో అదొక్కటే! కొడుకు, కూతురు చేత కూడా ఆమె ఒక ఆసుపత్రి పెట్టించారు. కొడుకు జనరల్ సర్జన్. కోడలు గైనకాలజిస్ట్. ‘‘మా అత్తగారు తన 90 వ యేట వరకూ కూడా నన్ను గైడ్ చేస్తూ వచ్చారు’’ అని కోడలు సుందరి చెబుతుంటారు. అంత ఉత్సాహం, అంత శక్తి ఆమెలో ఉండేవని. కోడలిగా ఆమె ఆ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే చెప్పారట పద్మావతి.. ‘ఆడమనిషి యజమానిగా ఉండే ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది’ అని. ఈ నూరేళ్ల వయసులోనూ పద్మావతి ఉదయాన్నే లేస్తారు. పూజ చేస్తారు. భక్తి గీతాలు పాడతారు. వార్తా పత్రికలు చదువుతారు. టీవీ చూస్తారు. ఫిజియో థెరపీ చేస్తారు. వేళకు భోంచేస్తారు. కరోనా వెళ్లిపోతే, వీల్ ఛెయిర్లో కాస్త బయటి తిరగాలని ఆమె ఆశపడుతున్నారు. -
‘ఇటుక’ చుట్టూ తమిళ రాజకీయం
చెన్నె: కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని తమిళ యువ నాయకుడు, డీఎంకే అధినేత స్టాలిన్ తనయుడు ఉదయనిధి వ్యంగ్యంగా విమర్శలు చేశాడు. అయితే ఆ విమర్శలు విన్న ప్రజలంతా నవ్వుకుంటుండగా బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ యువ నేత ‘ఇటుక’ దొంగతనం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విచిత్ర సంఘటన తమిళనాడులో జరిగింది. ఈ పరిణామంతో ఇటుక చుట్టూ తమిళ రాజకీయంగా తిరుగుతోంది. గత మంగళవారం ఉదయనిధి స్టాలిన్ సత్తూరులో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీని ప్రస్తావించి ఇరుకున పెట్టాడు. వాస్తవంగా మధురైకి ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి మధురైలోని తొప్పూర్లో 250 ఎకరాలు కేటాయించారు కూడా. ఆ పనులకు 2019 జనవరి 27వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆ పనులేవీ సాగలేదు. దీనిని విమర్శిస్తూ ‘ఇదిగో మధురై ఎయిమ్స్ తీసుకొచ్చా’ అని ప్రచార ర్యాలీలో ఉదయనిధి ఓ ఇటుకను చూయించాడు. దానిపై నిమ్స్ అని రాసి ఉంది. ఇది చూసిన ప్రజలంతా ఫక్కున నవ్వారు. ఇది బీజేపీ తీరు అంటూ ఎయిమ్స్ ఇంకా నిర్మించలేదని ఎద్దేవా చేస్తూ ఇటుకను చూయించాడు. ఈ ఇటుకనే ఎయిమ్స్ అని ఉదయనిధి చెప్పాడు. మూడేళ్లల్లో అన్నాడీఎంకే, బీజేపీ ఏమీ చేసిందని ప్రశ్నించారు. అయితే ఇక్కడితో వివాదం సమసిపోలేదు. ఆ ఇటుకను ఉదయనిధి దొంగతనం చేశాడని ఓ బీజేపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం మరో వింత. ఎయిమ్స్‌లోని ఓ ఇటుకను ఉదయనిధి దొంగతనం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ నిర్మాణాన్ని కాపాడాలని ఆ బీజేపీ నాయకుడు పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ఆ ఇటుకను తిరిగి తీసుకోవాలని కోరాడు. ఈ ఫిర్యాదును చూసి పోలీసులు అవాక్కయ్యారు. -
రంకెలేసిన ఉత్సాహం..
సాక్షి ప్రతినిధి, చెన్నై : రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు జోష్‌గా ప్రారంభమయ్యాయి. రంకెలేస్తూ పరుగులు పెడుతున్న కోడెగిత్తలను పట్టుకునేందుకు జల్లికట్టు వీరులు ఉరకలేసారు. కొందరు విజేతలుగా నిలవగా మరికొందరు తీవ్రగాయాలకు గురై ఆస్పత్రి పాలయ్యారు. అలాగే శుక్రవారం మాట్టు పొంగల్‌ను కోలాహలంగా జరుపుకున్నారు. పొంగల్ పండుగలో భాగంగా మదురై జిల్లా అవనియాపురంలో గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జల్లికట్టు పోటీలు జరిగాయి. 922 కోడెగిత్తలతోపాటు, 430 మంది జల్లికట్టు వీరులో టోకెన్లు పొందారు. మంత్రి సెల్లూరురాజా నేతృత్వంలో జిల్లా కలెక్టర్ అన్బళగన్, ఎమ్మెల్యేలు రాజన్‌సెల్లప్ప, శరవణన్ జెండా ఊపి జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. గంటకు 50 మంది వీరులను జల్లికట్టు చట్రంలోకి అనుమతించారు. విజేతలకు ఖరీదైన గృహోకరణ వస్తువులు, సైకిల్, మొబైల్ఫోన్లను బహూకరించారు. అలాగే మదురై జిల్లా పాలమేడులో శుక్రవారం జల్లికట్టు పోటీలను రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ ప్రారంభించారు. ఒక్కో రౌండ్‌కు 75 మంది చొప్పున 639 మంది వీరులు పాల్గొన్నారు. కరోనా సర్టిఫికెట్ పొందిన వారిని మాత్రమే పోటీలకు అనుమతించారు. మాట్టు పొంగల్‌లో భాగంగా చెన్నైలో శుక్రవారం 120 పశువులు, గొర్రెలకు పూజలు చేశారు. కానుం పొంగల్‌ను పురస్కరించుకుని శనివారం కడలి అంచుల్లో ఆటపాటలపై ప్రభుత్వం నిషేధం విధించింది. చెన్నై మెరీనాబీచ్, కోవలం, నీలాంగరై బీచ్‌లు, మహాబలిపురం పర్యాటక కేంద్రం ప్రాంతాలకు చేరుకోరాదని, ఆంక్షలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పోలీస్‌శాఖ హెచ్చరించింది. చెన్నై మెరీనాబీచ్‌లో శుక్రవారం నుంచి మూడురోజుల పాటూ సందర్శకులకు అనుమతి లేదు. గాయాలు.. కత్తిపోట్లు.. మదురైలో జల్లికట్టు పోటీకి కోడె గిత్తలను తరలించే విషయంలో గొడవ తలెత్తగా అరుణ్‌కుమార్ (29), దేవేంద్రన్ (25) కత్తిపోట్లకు గురయ్యారు. ఈకేసులో కార్తికేయన్ (18), ప్రకాష్ (18) అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వేలూరు జిల్లాలో జల్లికట్టు రిహార్సల్స్‌లో పాల్గొని విజేతగా నిలిచిన కోడె గిత్తలను ఆటో ఢీకొట్టడంతో వాటి వీపు ఎముకలు విరిగిపోయాయి. పశువైద్యులు వాటికి ఏడుగంటలపాటు శస్త్రచికిత్స చేశారు. మదురై జిల్లా పాలమేడు, అవనియాపురంలో గురు, శుక్రవారాల్లో జరిగిన జల్లికట్టు పోటీల్లో కోడెద్దులు కుమ్మడంతో వందమందికి పైగా వీరులు గాయపడ్డారు. సంక్రాంతి పండుగ సందర్బంగా బుధ, గురువారాల్లో రాష్ట్రంలో రూ.416 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. గురువారం ఒక్కరోజు రూ.269 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. రూ.56.39 కోట్ల మద్యం అమ్మకంతో తిరుచ్చిరాపల్లి ప్రథమస్థానంలో నిలిచింది. -
మంటలు ఆర్పుతుండగా బిల్డింగ్ కూలి..
చెన్నై : తమిళనాడులోని మధురైలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విలక్కుతున్ సమీపంలో ఉన్న నవబత్కన వీధిలోని టెక్స్టైల్స్ దుకాణంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి 11 గంటల వరకు టెక్స్టైల్స్ దుకాణం ముసివేయగా.. సుమారు శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని మొదటి అంతస్తులో ముందుగా మంటలు వ్యాపించాయి. అయితే ఈ దుకాణం ఓ పాత బిల్డింగ్‌లో నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వివిధ ప్రాంతాల నుంచి నాలుగు ఫైర్ ఇంజన్లను సంఘటన స్థలానికి పంపించాయి. చదవండి: తాగి నడిపితే తాట తీస్తాం: సజ్జనార్ మంటలను అదుపులోకి తీసుకు వస్తున్న క్రమంలో బిల్డింగ్ తమపై కూలి ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది (క్రిష్ణమూర్తి, శివరాజన్) గాయాలపాలయ్యారు. వీరు పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇది గమనించిన మిగతా సిబ్బంది ఇద్దరిని వెలికి తీసి వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కృష్ణమూర్తి, శివరాజన్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీరితోపాటు మరో ఇద్దరు సిబ్బందికి చిన్న చిన్న గాయాలయ్యాయి. కాగా మధురై జిల్లా ఫైర్ ఆఫీసర్ కే కళ్యాణా కుమార్, పోలీసులు, మున్సిపల్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి సరైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
165 రోజుల తరువాత మధుర మీనాక్షి దర్శనం..
మదురై : కరోనా వైరస్ నేపథ్యంలో మూతపడిన మదురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయం 165 రోజుల తర్వాత మంగళవారం తిరిగి తెరుచుకుంది. ఆన్‌లాక్-4 ప్రక్రియలో భాగంగా కొత్త సడలింపులతో భక్తులను పునఃదర్శనానికి అనుమతిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తొలిరోజే భక్తులు భారీగా తరలి వచ్చారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. పుణ్యక్షేత్ర ప్రాంగణంలోకి భక్తులను అనుమతించేముందు ఆలయ సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి భక్తుల చేతులకు శానిటైజర్ అందింస్తున్నారు. ముఖానికి మాస్కు లేకుంటే ఆలయంలోకి అనుమతిని నిషేధిస్తున్నారు. (వచ్చే నెలలో తిరుమల బ్రహ్మోత్సవాలు) ఉదయం 6 గంటల నుంచి 12.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు భక్తులకు దర్శనాన్ని అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక 10 సంత్సరాలలోపు పిల్లలను, గర్భిణులను, 60 ఏళ్లు పైబడిన వారిని ఆలయ సందర్శనానికి అనుమతించడం లేదన్నారు. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా భక్తులకు ఎలాంటి ఆహార పదార్థాలు అందించడం లేదని తెలిపారు. అలాగే కొబ్బరికాయలు, పండ్లు, దండలు ఆలయంలోకి అనుమతించడం లేదని పేర్కొన్నారు. అయితే కొన్ని నెలల తరువాత అమ్మవారిని దర్శించుకోవడపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. -
మంచి మనసుకు మన్నన
సాక్షి, చెన్నై: సేవాతత్వం, మానవీయత వెరసి మదురై బాలిక నేత్రను అందలం ఎక్కించింది. తన తండ్రి మోహన్‌తో కలిసి లాక్డౌన్ కష్టాల్లో ఉన్న బాధితుల్ని ఆదుకున్న ఆ బాలిక సేవాతత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ బాలికలోని మానవీయతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి తమ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. కరోనా కట్టికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పేదల్ని ఆదుకునే దిశగా ఎన్నో మావనతా హృదయాలు కదిలాయి. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు సేవల్లో మునిగారు. మరెందరో వివిధ పనుల నిమిత్తం తాము దాచుకున్న సొమ్మును విరాళంగా అందించారు. ఈ పరిస్థితుల్లో మదురై మేలమడైకు చెందిన 9వ తరగతి విద్యార్ధిని నేత్ర(14) మంచి మనసు గురించి ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించారు. హెయిర్ కటింగ్ దుకాణం నడుపుతున్న నేత్ర తండ్రి మోహన్, కూతురు చదువుల కోసం దాచుకున్న రూ. 5 లక్షల్ని కష్టాల్లో ఉన్న పేదల సేవకు ఉపయోగించారని ప్రధాని వెల్లడించడంతో దేశ వ్యాప్తంగా నేత్ర కుటుంబానికి అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా నేత్రకు ఐక్యరాజ్యసమితి ఆహ్వానం అందింది. ఐరాస అంబాసిడర్‌గా.. నేత్ర సేవ, మానవీయత ఎల్లలు దాటింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం ఆ బాలికకు వరంగా మారింది. ఆమె సేవ, మానవీయతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి తమ అంబాసిడర్‌గా ప్రకటించింది. “గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్’గా నేత్రను నియమిస్తూ శుక్రవారం ప్రకటన వెలువడింది. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో జెనీవాలో జరగనున్న సమావేశంలో పేదరికం గురించి నేత్ర ప్రత్యేక ప్రసంగం ఇవ్వబోతున్నారు. అలాగే, ఆమె విద్యా ఖర్చులకు లక్ష రూపాయల ‘డిక్సన్ స్కాలర్షిప్’ను మంజూరు చేసింది. అరుదైన ఆహ్వానంసపై నేత్ర ఆనందం వ్యక్తం చేసింది. మోదీ ప్రశంస, తాజాగా తనకు గౌరవం దక్కడం గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎంతో ఆనందంగా ఉందని, పేదరికం గురించి ఐరాస వేదిక మీద ప్రసంగించి అందర్నీ మన్ననలు పొందుతానని తెలిపారు. సేవా రంగంలో ముందుకు సాగాలన్న తన ఆకాంక్షకు ఐరాస ఆహ్వానం మరింత ప్రోత్సాహం ఇచ్చినట్టయిందని వ్యాఖ్యానించారు. ఒక్క భారత దేశంలోని పేదరికం గురించి మాత్రమే కాకుండా, ప్రపంచ దేశాల్లోని పేదరికం గురించి తన ప్రసంగం ఉంటుందన్నారు. రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ మాట్లాడుతూ.. ఇది తమిళనాడుకు ఎంతో గర్వకారణంగా పేర్కొన్నారు. అందరికి నేత్ర ఆదర్శంగా నిలిచిందన్నారు. సేవాతత్వంతో ముందుకు సాగే వారికి ఇలాంటి గుర్తింపు తప్పకుండా లభిస్తుందని నేత్ర చాటిందన్నారు. -
తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. విషాదం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై జిల్లాలో జల్లికట్టు పోటీలు జోరుగా కొనసాగుతున్నాయి. అవనియాపురం, అలంగానల్లూరు, పాలమేడులో పోటీలు జరుగుతున్నాయి. తెల్లవారుజామునే జల్లికట్టు ప్రాంగణానికి ఎద్దులు, ఔత్సాహికులు చేరుకున్నారు. ఈ రోజు పాలమాడులో పోటీల్లో పాల్గొనడానికి 700 ఎద్దులు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని అధికారులు తెలిపారు. పోటీల్లో పాల్గొనే ఎద్దులకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ పోటీలు కొనసాగుతున్నాయి. రాష్ట్రప్రజలంతా ఈ పోటీలను వీక్షించేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గాయపడిన వారి కోసం వెంటనే వైద్య చికిత్స అందజేసేలా అంబులెన్సులు, ప్రాథమిక వైద్య కేంద్రాలు అందుబాటులో ఉంచారు. బుధవారం జరిగిన జల్లికట్టు పోటీల్లో 32 మంది గాయపడ్డారు. విషాదం చెన్నై: తిరుచ్చి సురయూర్లో గురువారం నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో విషాదం చోటుచేసుకుంది. జల్లికట్టు పోటీల్లో భాగంగా ఎద్దులు జనంపైకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో మహాలక్ష్మి అనే మహిళ మృతి చెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. -
79 ఏళ్ల వయసులో ఏడుగురిని..!
చెన్నై: ప్రస్తుత రోజుల్లో ఎన్నికల్లో గెలవాలంటే డబ్బులు కుమ్మరించాల్సిందే. డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవడమంటే పెద్ద వింతే. అది కూడా 79 ఏళ్ల వయసులో గెలవడమంటే మాములు విషయం కాదు. వయసు పైబడింది కదా అని అందరిలా కృష్ణారామా అనుకుంటూ ఇంట్లో కూర్చోలేదా బామ్మ. వివరాల్లోకెళ్తే.. మధురై జిల్లాలోని మెలురు తాలూకా, అరిత్తపట్టి గ్రామానికి చెందిన వీరమ్మల్ అజగప్పన్ అనే 79 ఏళ్ల వృద్ధురాలు ప్రజల సంక్షేమం కోసం పాటు పడాలన్న కోరికతో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసింది. ఆమెకు ప్రత్యర్థులుగా మరో ఏడుగురు పోటీ చేశారు. చదవండి: భర్త వెంటే భార్య ఎందుకు నడవాలంటే..! వారంతా వీరమ్మల్‌ను చూసి ఇంత వయసులో ఆమె గెలుస్తుందా అనుకున్నారు. గెలిచినా ఏ పని చేయలేదంటూ ప్రచారం కూడా చేశారు. అందుకే తమకే ఓటు వేసి గెలిపించాలని ఆ గ్రామ ప్రజలను కోరారు. కానీ.. అందుకు భిన్నంగా ఆ ఊరి ప్రజలు వీరమ్మల్‌ను 190 ఓట్ల మెజారిటీతో గెలిపించి.. ప్రత్యర్థులకు ఊహించని షాక్ ఇచ్చారు. అయితే ఈ వయసులో విజయం ఎలా సాధ్యమైందని బామ్మను ప్రశ్నించగా.. గ్రామంలోని యువకులే తనను గెలిపించారని చెప్పుకొచ్చింది. తన వయస్సును లెక్కచేయకుండా.. గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెల్పింది. తన లక్ష్యం ప్రజలకు సేవ చేయడమేనిని వీరమ్మల్ స్పష్టం చేసింది. చదవండి: ఆ సమస్య పరిష్కరిస్తే.. 35 లక్షలు మీవే..! -
బస్టాండ్‌లో నాలుగేళ్ల చిన్నారిపై..
చెన్నై : అభంశుభం తెలియని నాలున్నరేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డా ఓ కామాంధుడు. బస్టాండ్‌లో కూర్చున చిన్నారి దగ్గరికెళ్లి బుగ్గలపై ముద్దులు పెడుతూ.. అసభ్యకరంగా ప్రవర్తించాడు. చిన్నారి తల్లి అప్రమత్తమై అరవడంతో.. స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసుకు అప్పగించారు. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో గత మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురైకి చెందిన ఓ మహిళ తన నాలున్నరేళ్ల చిన్నారితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లేందుకై అరపాలయం బస్ టెర్మినల్‌లో నిలుచున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆమెకు దాహం వేయడంతో చిన్నారిని అక్కడే కూర్చోబెట్టి పక్కనే ఉన్న కుళాయి దగ్గరు వెళ్లారు. ఈక్రమంలో అక్కడే ఉన్న ఎస్ సెంథిల్ అనే లేబర్.. చిన్నారి దగ్గరికెళ్లి బిత్తిరి చర్యలకు పాల్పడ్డాడు. చిన్నారి బుగ్గలపై ముద్దులు పెడుతూ..అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో చిన్నారి బిగ్గరగా ఏడ్చింది. అప్రమత్తమైన తల్లి పరుగున వచ్చి చిన్నారిని ఒడిలోకి తీసుకుంది. అయినప్పటికీ సెంథిల్ అక్కడి నుంచి వెళ్లకుండా ఆమెతో కూడా అసభ్యకరంగా ప్రర్తించాడు. అసభ్యపదజాలంతో దూషిస్తూ.. ఆమెపై చేయిచేసుకునేందుకు యత్నించాడు. దీంతో స్థానికులు అతన్ని పట్టుకొని దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సెంథిల్‌ను అదుపులోకి తీసుకున్నామని మధురై పోలీసులు పేర్కొన్నారు. -
అమ్మకానికి సర్టిఫికెట్లు
సాక్షి, చెన్నై: పరీక్షలకు హాజరు కాకుండానే, దూరవిద్య కోర్సుల్ని అభ్యసించిన వేలాది మంది విద్యార్థులకు పాస్ సర్టిఫికెట్లు మంజూరు చేసిన మదురై కామరాజ్ వర్సిటీ దూర విద్యా విభాగం అధికారుల గుట్టురట్టు అయింది. సర్టిఫికెట్లను ఈ అధికారులు అమ్ముకున్నట్టు నిర్ధారణ కావడంతో ముగ్గుర్ని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆ వర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న అన్నావర్సిటీలో రీవాల్యుయేషన్లో మార్కుల మాయాజాలం ఇది వరకు వెలుగులోకి వచ్చి పెద్ద కలకలాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మదురైకామరాజ్‌వర్సిటీలో సర్టిఫికెట్ల స్కాం వెలుగులోకి రావడం మరో చర్చకు దారి తీసింది. ఏసీబీకి అందిన సమాచారం మేరకు అధికార వర్గాలు కామరాజర్ వర్సిటీపై నిఘా వేశాయి. ఇందులో ఆ వర్సిటీ దూరవిద్యా విభాగంలో నోట్లు ఉంటే చాలు సర్టిఫికెట్లు చేతికి వచ్చినట్టే అన్నట్టుగా పరిస్థితి ఉండడాన్ని గుర్తించి ఉన్నారు. దూరవిద్యా విభాగం ద్వారా ఏకంగా వేలాది మంది మంది విద్యార్థులు సర్టిఫికెట్లను పొంది ఉన్నట్టుగా విచారణలో తేలింది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్షల మేరకు వసూళ్లు చేసి సర్టిఫికెట్లను అమ్మకానికి పెట్టి ఉండడం తేట తెల్లమైంది. ముగ్గురు సస్పెన్షన్..విద్యార్థులపై గురి తమకు అందిన సమాచారం మేరకు ఓ వైపు ఏసీబీ విచారణను ముమ్మరం చేసింది. మరో వైపు ఆ వర్సిటీ పాలక మండలి రిటైర్డ్ న్యాయమూర్తి అక్బర్ అలీ నేతృత్వంలోని బృందం ద్వారా విచారణ చేపట్టింది. 2014 నుంచి దూర విద్యా విభాగంలో సాగిన వ్యవహారాలపై అక్బర్ అలీ బృందం దృష్టి పెట్టింది. అదే సమయంలో అక్రమాలు జరిగినట్టు, సర్టిఫికెట్లను అమ్ముకున్నట్టుగా ఏసీబీ తేల్చడంతో ఆ వర్సిటీ వర్గాల్లో కలవరం బయలుదేరింది. దూర విద్యా విభాగం అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాజరాజన్, పర్యవేక్షణాధికారి సత్యమూర్తి, మరో అధికారి కార్తిక్‌సెల్వన్‌లను విచారించేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఈ ముగ్గుర్ని ఏసీబీ తమ అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో అక్బర్ అలీ బృందం విచారణలో ఇప్పటివరకు అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చినట్టు పాలక మండలి దృష్టికి చేరింది. విద్యార్థులు పరీక్షలు రాయకుండానే, సర్టిఫికెట్లను పొంది ఉన్నట్టు తేల్చారు. ఐదు వేల మందికి పైగా విద్యార్థులకు సర్టిఫికెట్లను అమ్మకున్నట్టు విచారణలో వెలుగు చూసింది. దీంతో ఏసీబీ విచారణకు మరింత మార్గాన్ని చూపించే రీతిలో ఆ వర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తమ విచారణలో వెలుగుచూసిన అంశాల ఆధారంగా రాజరాజన్, సత్యమూర్తి, కార్తిక్ సెల్వన్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో ఆ ముగ్గుర్ని తమ అదుపులోకి తీసుకుని, సర్టిఫికెట్ల అమ్మకాల వ్యవహారంలో ఉన్న మరికొంత మంది అదృశ్య శక్తులు, వాటిని కొనుగోలు చేసిన విద్యార్థుల భరతం పట్టే దిశగా ఏసీబీ దూకుడు పెంచేందుకు సిద్ధం అవుతోంది. -
‘కరుప్పాయి.. సిగ్గుతో ఉరేసుకోవాలనిపిస్తుంది’
చెన్నై: బహిరంగ మరుగుదొడ్లు ఎంత పరిశుభ్రంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవసరం నిమిత్తం ఓ పది నిమిషాలు వెళ్లాల్సి వస్తేనే.. ఏదో నరకంలోకి అడుగుపెడుతున్నట్లు భావిస్తాం. అలాంటిది ఓ మహిళ ఏకంగా 19 సంవత్సరాల నుంచి ఆ మరుగుదొడ్డిలోనే నివసిస్తుంది. వినడానికే జుగుప్సాకరంగా ఉంటే.. అక్కడే జీవనం సాగిస్తున్న సదరు మహిళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఈ హృదయవిదారక సంఘటన తమిళనాడులోని మధురైలో వెలుగు చూసింది. వివరాలు.. కరుప్పాయి(65) అనే వృద్ధురాలు గత 19 ఏళ్లుగా మదురై రామ్నాద్ ప్రాంతంలో బహిరంగ మరుగుదొడ్లో నివాసం ఉంటుంది. టాయిలెట్ వినియోగించుకోవడానికి వచ్చే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తూ.. మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ అక్కడే జీవనం సాగిస్తుంది. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కరుప్పాయి దీనగాథ గురించి ప్రచురించడంతో ఆమె అవస్థ గురించి జనాలకు తెలిసింది. ఏఎన్ఐ కథనం ప్రకారం.. కరుప్పాయి భర్త మరణించాడు. ఓ కూతురు ఉంది కానీ ఆమె తల్లిని పట్టించుకోవడం మానేసింది. ఈ క్రమంలో ఎవరూ లేని కరుప్పాయి గత 19 ఏళ్లుగా బహిరంగ మరుగుదొడ్లను తన నివాసంగా చేసుకుని దాని మీద వచ్చే అతి తక్కువ ఆదాయంతో రోజులు వెళ్లదీస్తుంది. కరుప్పాయికి కనీసం వృద్ధాప్య పెన్షన్ కూడా లభించడం లేదు. Madurai: 65-year-old Karuppayi has been living in a public toilet in Ramnad for past 19 years, & earning her livelihood by cleaning the toilets & charging a meager amount from public for using it. #TamilNadu pic.twitter.com/UA1Zmo0pNS — ANI (@ANI) August 22, 2019 ఈ విషయం గురించి కరుప్పాయిని ప్రశ్నించగా.. ‘వృద్ధాప్య పెన్షన్‌కు అప్లై చేశాను. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. నాకొక ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా ఎందరో అధికారులను కలిశాను. కానీ ఎవరు నా మొర ఆలకించలేదు. దాంతో ఈ మరుగుదొడ్లోనే ఒక దాన్ని నా నివాసంగా మార్చుకుని ఇక్కడే కాలం వెళ్లదీస్తున్నాను. వీటి మీద రోజుకు నాకు రూ.70-80 ఆదాయం లభిస్తుంది.అదే నా జీవనాధారం. నాకు ఓ కుమార్తె ఉంది కానీ తను నన్ను పట్టించుకోదు’ అంటూ కరుప్పాయి వాపోయింది. ప్రస్తుతం కరుప్పాయి కథనం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొందరు నెటిజన్లు ఈ కథనాన్ని నరేంద్రమోదీకి ట్యాగ్ చేస్తూ.. ఆమెకు ఇంటిని, పెన్షన్‌ను మంజూరు చేసి ఆదుకోమ్మని కోరుతుండగా.. మరి కొందరు ‘నీలాంటి పేదలు, వృద్ధులను సరిగా పట్టించుకోని ఈ సమాజం సిగ్గుతో ఉరి వేసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం ఏం చేస్తుంది’.. ‘ఈ దేశం పేదలకోసం కాదు’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మరి తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దీనురాలి మొర ఆలకిస్తుందో లేదో చూడాలి. -
మదురైలో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మదురైలో ఆదివారం ఎన్ఐఏ బృందాలు సోదాలు చేపట్టాయి. శ్రీలంక ఆత్మాహుతి బాంబర్ జహ్రన్ హషీంకు ఫేస్బుక్ స్నేహితుడైన తమిళనాడుకు చెందిన ఐఎస్ఐఎస్ఐ మాడ్యుల్ సూత్రధారి మహ్మద్ అజారుద్దీన్‌ను కోయంబత్తూరులో ఎన్ఐఏ అధికారులు రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో అజారుద్దీన్ తెలిపిన వివరాల మేరకు ఇదయతుల్లాను అరెస్టు చేయగా, మరో ఐదుగురిని విచారిస్తున్నారు. కోయంబత్తూరుకు చుట్టుపక్కల రెండు రోజుల పాటు సోదాలు చేసిన ఎన్ఐఏ బృందాలు ఆదివారం మదురైకు మకాం మార్చాయి. ఆధ్యాత్మిక నగరం మదురైలో పేలుళ్ల విధ్వంసం సృష్టించేందుకు వ్యూహరచన చేసినట్లుగా లభించిన సమాచారం మేరకు ముగ్గురు యువకుల్ని లక్ష్యంగా చేసుకుని ఎన్ఐఏ వర్గాలు తనిఖీలు, విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా విల్లాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ సోదాలు పొద్దు పోయే వరకు సాగాయి. సదాం కుమారుడు ముర్షిద్ సహా ముగ్గుర్ని రహస్య ప్రదేశంలో ఉంచి అధికారులు విచారిస్తున్నారు. -
వాళ్లు వంట చేస్తే మా పిల్లలు తినరు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచం 21వ సెంచరీని దాటిపోతున్నా సమాజంలో దళితుల పట్ల వివక్ష ఇంకా వీడలేదు. ఇటీవల తమిళనాడులోని ఒక అంగన్వాడీ కేంద్రంలో దళితులు వండిన ఆహారాన్ని తమ పిల్లలు తినరని ఒక సామాజిక వర్గం ప్రకటించిన ఘటన గ్రామాల్లో నేటికీ కొనసాగుతున్న జాత్యాహంకారానికి అద్దం పడుతోంది. ఈ ఘటనపై మానవహక్కుల కమిషన్ గురువారం విచారణకు ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని వలయపట్టి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి దళిత సామాజిక వర్గానికి చెందిన జ్యోతిలక్ష్మి నిర్వాహకురాలిగా, అన్నలక్ష్మి వంటమనిషిగా ఈ నెల 3న నియమితులయ్యారు. ఈ నియామకాలను ఆ ప్రాంతంలోని మరో సామాజికవర్గానికి చెందిన వారు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. వారిని పట్టించుకోకుండా అంగన్వాడీ కార్యకర్తలు విద్యార్థులకు అవసరమైన పౌష్టికాహారాన్ని వండిపెట్టి కేంద్రం వద్ద ప్రతిరోజూ ఎదురుచూడసాగారు. అయితే దళిత మహిళల నియామకం పట్ల అభ్యంతరం లేవనెత్తిన సామాజికవర్గానికి చెందిన వారు తమ పిల్లలను కేంద్రానికి పంపేందుకు నిరాకరించారు. గ్రామస్తులు అదేపనిగా ఆందోళనలు సాగించడంతో ధనలక్ష్మి, అన్నలక్ష్మిలను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. కాగా, మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవడంతో బదిలీ అయిన ఇద్దరు దళిత మహిళలను తిరిగి అదే అంగన్వాడీ కేంద్రంలో అధికారులు నియమించారు. -
మధురై ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదుగురు మృతి
-
మధురై ప్రభుత్వ ఆస్పత్రిలో విషాద ఘటన
సాక్షి, చెన్నై: తమిళనాడు మధురై ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేరట్‌పై చికిత్స పొందుతున్న అయిదుగురు రోగులు ఊపిరి ఆడక మృతి చెందారు. మరో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా మధురైలో కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో జనరేటర్ బ్యాకప్ లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఆస్పత్రి తప్పిదం ఏమీ లేదంటూ డీన్ చేతులు దులుపుకున్నారు. కాగా మృతులు మల్లిక (55). రవిచంద్రన్ (55)గా గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. -
మీకు తెలుసా
సూర్యుడు ఏడాదిలో ప్రతినెలా ఒక్కో రాశిలో సంచరిస్తుంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే.. ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. ఆదిత్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి.. మళ్లీ మకర రాశిలోకి వెళ్లే వరకూ ఉన్న సమయమే ధనుర్మాసం. దక్షిణాయనం దేవతలకు రాత్రి. ఉత్తరాయణం పగలు. ఉత్తరాయణం ముందు వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయం. ∙ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో గోదాదేవి విరచిత తమిళ పాశురాలు వినిపిస్తుంటాయి. శ్రీరంగనాథుడి భక్తురాలైన గోదాదేవి నెల రోజుల పాటు రోజుకో పాశురం చొప్పున కృష్ణలీలల్ని కీర్తిస్తూ శ్రీవ్రతం ఆచరించింది. ఈ 30 పాశురాలు ‘తిరుప్పావై’ పేరుతో ప్రఖ్యాతి గాంచాయి.ధనుర్మాసంలో విష్ణుభక్తులే కాదు, శివభక్తులు కూడా పాశురాలు పాడుకుంటారు. తమిళనాడులోని శివాలయాల్లో తిరువెంబావై పాశురాలు వినిపిస్తాయి. శైవ సిద్ధాంత కర్త మాణిక్య వాచకర్ ఈ పాశురాలను రాశారు. శివ తత్వాన్ని తెలిపే ఈ పాశురాల సంఖ్య కూడా 30. మదురై నగరానికి సమీపంలోని ఓ గ్రామంలో ఉండేవాడు మాణిక్య వాచకర్. చిన్ననాటి నుంచి శివ భక్తుడు. ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారు జామునే మదురైలోని సుందరేశ్వరుడి దర్శనానికి వచ్చేవాడు మాణిక్య వాచకర్. నగర వీధుల్లో నడుస్తూ తిరువెంబావై పాశురాలను రాగయుక్తంగా ఆలపించేవాడు. ఆ అమృతగానం విని మదురై వాసులంతా ఆయనతో గొంతు కలిపే వారు. అలా మొదలైన తిరువెంబావైని నేటికీ ఆచరిస్తూనే ఉన్నారు. తమకు మంచి భర్త రావాలని ఆకాంక్షిస్తూ ఆడపిల్లలు తిరువెంబావై పాశురాలను పాడుకోవడం పరిపాటి. తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో ధనుర్మాసమంతా సుప్రభాత సేవలో గోదాదేవి పాశురాలు ఆలపిస్తారు. గోదాదేవి కృష్ణభక్తికి ప్రతీకగా శ్రీవారి పవళింపు సేవ రజతకృష్ణస్వామి మూర్తికి నిర్వహిస్తారు. మనల్ని నీడలా అనుసరించేది వీరే..! చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత. కానీ.. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి. అవి నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయసంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి. వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు. ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పకపోవచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు. పండుగ పర్వం ఉత్తర ద్వారాన వైకుంఠ వాసుడు మార్గశిర ఏకాదశి ని మోక్షద ఏకాదశి గా చెప్తారు. ఇది శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా ప్రతీతి. దీనికే ముక్కోటి ఏకాదశి అని పేరు. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకొనే ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు. (18, మంగళవారం ముక్కోటి) గీతాజయంతి మార్గశిర శుద్ద ఏకాదశి గీతా జయంతి. ఈవేళ భగవద్గీత పారాయణం, పార్ధసారధిని (కృష్ణుని) ఆరాధన చేయడం మంచిది. హనుమద్వ్రతం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమత్భక్తులు హనుమత్ వ్రతాన్ని ఆచరిస్తారు. సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సంతానం కలుగుతుందని చెబుతారు. (20, గురువారం హనుమద్వ్రతం) దత్త జయంతి మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే త్రిమూర్తి స్వరూపం. ఈ వేళ అనఘావ్రతం ఆచరించి స్వామిని పూజిస్తే.. సకల పాపాలు తొలగుతాయి. కోరల పున్నమి కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రలుగా చెబుతారు. మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కనుక కృతజ్ఞత పూర్వకంగా ఈ దినం.. యమధర్మరాజుని ఆరాధిస్తారు. ఈ పౌర్ణమిని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. (22, శనివారం దత్త జయంతి, కోరల పున్నమి) -
ఫేస్బుక్ ప్రేమతో మోసపోయిన టీచర్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఫేస్బుక్ ప్రేమతో ఓ ఉపాధ్యాయురాలు మోసపోయింది. యువకుడు మత్తుమందిచ్చి ఆమెపై అత్యాచారం చేసి.. ఆమె వద్ద ఉన్న బంగారం, నగదు దోచుకుని పరారయ్యాడు. పోలీసులకు బాధితురాలిచ్చిన ఫిర్యాదులోని వివరాలు.. కోయంబత్తూరుకు చెందిన మహిళ (40) ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. భర్తతో విభేదాలొచ్చి ఒంటరిగా నివసిస్తోంది. మదురై జిల్లాకు చెందిన రాజప్రవీణ్ (30)తో ఏడాది కిందట ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ నెల 7వ తేదీన రాజప్రవీణ్ కోయంబత్తూరుకు వచ్చి ఆమెను చిన్న పాళయంలోని హోటల్‌కు తీసుకెళ్లాడు. మధుమేహం నివారణ కోసం ఆమె వెంటతెచ్చుకున్న మాత్రల్లో అతడు మత్తుమందు కలిపాడు. ఆమె స్పృహ తప్పగానే అత్యాచారం చేసి ఆ దృశ్యాలను వీడియోగా చిత్రీకరించాడు. స్పృహలోకి వచ్చాక ఆమెకు ఆ దృశ్యాలను చూపాడు. దీంతో ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. నిరాకరించడంతో పాటు రూ.2 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేసి.. రూ.10 సవర్ల బంగారు నగలు, చెక్‌బుక్, రూ.లక్ష నగదు తీసుకుని పారిపోయాడు. మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
నెరవేరిన కరుణానిధి చిరకాల కోరిక
సాక్షి, చెన్నై : తమిళనాడు మధురైలోని ఓ ఆలయంలో బ్రాహ్మనేతర పూజారిని నియమించడం ద్వారా ఆలయ అధికారులు కులనిర్మూలన దిశగా ఒక ముందడుగేశారు. దీంతో తమిళ కురువృద్ధుడు, మాజీ సీఎం కరుణానిధి చిరకాల కోరిక నెరవేరినట్లయింది. ఆలయంలో బ్రాహ్మణేతర పూజారులను నియమించడం తమిళనాడులో ఇదే తొలిసారి. 1970లో కరుణానిధి సీఎంగా ఉన్నకాలంలో బీసీ (బ్రాహ్మనేతర) కులాల వారికి కూడా ఆలయ పూజారులుగా అవకాశం కల్పిస్తూ రాష్ట్రంలోని దేవాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆయన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై 2006లో మరోసారి సమీక్ష నిర్వహించిన కరుణానిధి.. అర్చకులుగా శిక్షణ పొందేందుకు ఆరునెలల సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ కోర్సు చేసిన అన్ని కులాల వారికి దేవాలయాల్లో పూజారులుగా అవకాశం కల్పించాలని భావించారు. డీఎంకే ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి సుప్రీంకోర్టు తప్పపట్టింది. కోర్టు తీర్పుపై అప్పట్లో కరుణానిధి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని కులాలకు సామాజిక న్యాయం చేకురాలనే పెరియార్ రామస్వామి ఆశయం మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల డిమాండ్ మేరకు 2015లో ఆలయంలో అర్చకుల నియామకాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకు వదిలేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆగమశాస్త్రం నిబంధనలకు విరుద్ధంగా ఈ నియామకాలు ఉండకూడదని సుప్రీం సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆరు నెలలపాటు అర్చకత్వ కోర్సులో శిక్షణపొందిన వారిని దేవాదాయశాఖ పూజారులుగా నియమించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న కరుణానిధికి ఈ విషయం తెలిస్తే సంతోషిస్తారని డీఎంకే వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. -
నాన్నకు ప్రేమతో..
తమిళసినిమా: కన్నవారిపై ఎవరికైనా ప్రేమ ఉంటుంది. అయితే దాన్ని నిరూపించుకోవడానికి విశేష సందర్భం అందరికీ కలగదు. యువ నటుడు షణ్ముగ పాండియన్‌కు అలాంటి మంచి తరుణం కలిసొచ్చింది. సీనియర్ నటు డు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్ పుత్రరత్నాల్లో ఒకరే ఈ షణ్ముగపాండియన్. ఈయన కథానాయకుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. షణ్ముగ పాండియన్ నటించిన మదురైవీరన్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చిం ది. ఇక విజయకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనది 40 ఏళ్ల గొప్ప నట చరిత్ర. అందులో ఎన్నో సంచలన విజయాలను అందుకున్నారు. ఎందరికో నట జీవితా న్ని ప్రసాదించిన ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి న నటుడు విజయకాంత్. అలాంటి ఆయన 40 సినీ వసంతోత్సవ వేడుకను ఇటీవల కాంచీపురం సమీపంలో ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆ వేడుకలో పాల్గొని ఆశీర్వాదాలు, అభినందనలు అందించారు. అదే వేదికపై విజయకాంత్ కుటుంబసభ్యులు పాల్గొన్నా, ఆయన చిన్న కొడుకు, నటుడు షణ్ముగపాండియన్ హాజరు కాలేదు. కారణం ఆ సమయంలో ఆయన లండన్‌లో ఉన్నారు. నాన్న 40 నట వసంతాల వేడుకలో పాల్గొన లేకపోయానన్న కొరతను ఇటీవల చెన్నైకి తిరిగొచ్చిన తరువాత తీర్చుకున్నారు. అది ఎలాగంటే తన తండ్రి రెండు కళ్లను తన బాహువులపై పచ్చబొట్టు పొడిపించుకుని ఆయన ముందు నిలిచి ఇది నాన్నపై తనకున్న ప్రేమ అని నిరూపించుకున్నారు. అదే సమయంలో తన తండ్రి ఆశీస్సులు అందుకుని ఎనలేని ఆనంద తరుణాన్ని పంచుకున్నారు. తండ్రితో ఫొటో తీసుకుని మధురానుభూతిని పొందారు. -
కమల్ హాసన్‌పై కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : ఈ రోజు రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు తెలంగాణ ఐటీ మంత్రి కే తారకరామారావు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కమల్ రాజకీయ పార్టీని ప్రకటిస్తున్న సందర్భంగా నేటి (బుధవారం) సాయంత్ర మదురైలో నిర్వహించబోతున్న సభకు తనను కూడా ఆహ్వానించారని కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు. ‘రాజకీయాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా మదురైలో నిర్వహిస్తున్న సభకు నన్ను కూడా పిలిచినందుకు కమల్ హాసన్జీకి ధన్యవాదాలు. భౌతికంగా నేను ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నాను. కానీ, నూతన ప్రస్తానం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. నిజజీవితంలోనూ ‘నాయకన్’గా మీరు బాగా రాణించాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. మదురైలో నిర్వహించనున్న భారీ బహిరంగసభకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు పలువురు నేతలను కమల్ హాసన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ సభలో కమల్ తన రాజకీయపార్టీ పేరును ప్రకటించి.. పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పార్టీ లక్ష్యాలను వివరించారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హీరోగా తెరకెక్కిన ‘నాయకన్’(నాయకుడు) సినిమా సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే. -
మధుర మీనాక్షి ఆలయంలో అగ్నిప్రమాదం
-
మధుర మీనాక్షి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం
చెన్నై : ప్రఖ్యాత ఆథ్యాత్మిక క్షేత్రం మధుర మీనాక్షి ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయ తూర్పు రాజగోపురం సమీపంలోని వేయీళ్ల మండపం వద్ద శుక్రవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమీపంలోని 50కి పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని మధురై కలెక్టర్ చెప్పారు. అగ్నిప్రమాదంపై సమాచారం తెలిసిన వెంటనే కలెక్టర్ వీరరాఘవరావు ఆలయం వద్దకు చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. పదుల సంఖ్యలో ఫైర్మన్లు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ప్రమాద సమయంలో భక్తులు, ఆలయసిబ్బంది అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పినట్లైంది. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగింది. ఘటనపై విచారణ జరుపుతున్నామని కలెక్టర్ చెప్పారు. కాగా, విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. -
నైవేద్యంగా మద్యం బాటిళ్లు
అన్నానగర్: వర్షం కురవాలని, కన్నవారు మద్యం సేవించకూడదని మదురై వీరన్‌స్వామికి మద్యం బాటిళ్లను పెట్టి చిన్నారులు ప్రత్యేక పూజలు చేశారు. ఇంకా గ్రామంలో ఎవరూ మద్యం తాగకూడదని కన్నవారి కాళ్లకు నమస్కరించారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. దిండుక్కల్ జిల్లా వేడచందూర్ సమీపంలోని ఇ.చిత్తూర్లో మదురైవీరన్ ఆలయం ఉంది. ఇక్కడ పూర్తిగా కూలీలే నివసిస్తూ వస్తున్నారు. ఇక్కడ కొన్నేళ్లుగా వర్షం కురవడంలేదు. మద్యానికి బానిసలై పలువురు దీనస్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన చిన్నారులు, వర్షం కురవాలని, ఎవరు మద్యం సేవించకూడదని వారి కులదైవం మదురైవీరన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకోసం చిన్నారులు చందాలు సేకరించారు. ఆదివారం మేళ, తాళాలతో మద్యం బాటిళ్లు, పూజా వస్తువులను చిన్నారులు ఊరేగింపుతో ఆలయానికి తీసుకొచ్చారు. మద్యం బాటిళ్లను మదురైవీరన్‌కి నైవేద్యంగా పెట్టారు. పొంగలి పెట్టి పూజలు చేశారు. నైవేద్యంగా పెట్టిన మద్యం బాటిళ్లను ఆలయం ముందు పోసి ఎవరు మద్యం సేవించకూడదని, వర్షం కురవాలని చిన్నారులు ప్రార్థించారు. తరువాత కన్నవారి కాళ్ల మీద పడి నమస్కరించారు. -
తమిళనాడులో జోరుగా సంప్రదాయ క్రీడ
-
పట్టురా.. పట్టు.. జల్లికట్టు..!
సాక్షి, చెన్నై: సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు క్రీడ జోరుగా సాగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తమిళులు జల్లికట్టును జోరుగా నిర్వహించారు. జల్లికట్టు ఎద్దులు హింసకు గురి అవుతున్నాయని జంతుప్రేమికులు గగ్గోలు పెట్టడంతో గతంలో సుప్రీంకోర్టు ఈ క్రీడపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతం ఆంక్షలులేని వాతావరణం ఉండటంతో తమిళులు రెట్టించిన ఉత్సాహంతో జల్లికట్టు ఆటలో పాల్గొన్నారు. కోడెద్దులను మైదానంలోకి వదిలి.. వాటిని అదుపుచేసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. ఈ ఘటనల్లో పలుచోట్ల హింస కూడా చోటుచేసుకుంది. పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం మదురై జిల్లాలోని అలంగనల్లూరులో మంగళవారం జరిగిన జల్లికట్టు క్రీడలో సీఎం ఎడపాటి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొన్నారు. జల్లికట్టు కోసం ముస్తాబు చేసిన ఎద్దులకు మొక్కి వారు వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడ అట్టహాసంగా జరిగిన జల్లికట్టు క్రీడకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. అపశృతి.. తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. మధురై జిల్లా పలమేడులో నిర్వహిస్తున్న జల్లికట్టు వినోదం చూసేందుకు వచ్చిన ఓ యువకుడిని బుల్ కలెక్షన్ పాయింట్ వద్ద ఎద్దు పొడిచింది. దాంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని దిండిగల్ జిల్లాకు చెందిన కాలిముత్తు(19)గా గుర్తించారు. -
జుట్టు రాలిపోతోందని టెకీ ఆత్మహత్య!
సాక్షి, మధురైః ప్రస్తుతం మనిషి ఏ చిన్న సమష్యను అధిగమించలేక పోతున్నాడు. టెక్నాలజీ యుగంలో కూడా జుట్టు రాలిపోతుందని ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ విషాద ఘటన తమిళనాడులోని మధురైలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లో వెళితే.. అతని పేరు ఆర్.మిథున్ రాజ్. బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. చాలా సంవత్సరాలుగా అతడు హేర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. దీంతో అతను కొన్ని రోజులుగా డిప్రెషన్‌కి లోనయ్యాడు. ఈ విషయాన్ని మధురైలోని జైహిందూపురంలో ఉండే తన తల్లి వాసంతికి పదే పదే చెబుతుండేవాడు. కొడుకుకి పెళ్లి చేయాలని ఆమె ఎన్ని సంబంధాలు చూసినా.. ఫలితం లేదు. దీంతో మిథున్ మరింత కుంగిపోయాడు. ఈ మధ్య ఉద్యోగానికి సెలవు పెట్టి మధురైకి వచ్చాడు. వాసంతి ఇంట్లో లేని సమయం చూసి ఉరేసుకున్నాడు. స్థానికుల సాయంతో అతన్ని ఆసుపత్రికి తరలించినా.. అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. -
ఆ సినిమాపై స్టే విధించండి
చెన్నై : తమిళన హీరో కార్తి నటించి ‘ధీరన్’ చిత్రంపై స్టే విధించాలని కోరుతూ మధురై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మధురైకు చెందిన పసుంపొన్ నిన్న ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల విడుదలై ప్రదర్శింపబడుతున్న ధీరన్ చిత్రంలో కథానాయకునిగా కార్తి నటించారని, ఇందులో ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా చిత్రీకరించారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఓ సామాజిక వర్గాన్ని అవమానపరిచేలా ఉన్నందున ఆ చిత్రంపై స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్ గురువారం న్యాయమూర్తి మహాదేవన్ సమక్షంలో విచారణకు వచ్చింది. ఆ సమయంలో ధీరన్ చిత్రం గురించి పిటిషనర్ మాట్లాడుతూ తన ఆరోపణలపై పరిశీలన జరిపేందుకు ఇద్దరు న్యాయవాదులతో కూడిన కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ న్యాయవాదులు సినిమా చూసేందుకు ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాటు చేయాలని, ఇందుకయ్యే ఖర్చు పిటిషనర్ భరిస్తారా? అనే విషయం కోర్టుకు తెలపాలని, అందుకు అంగీకరిస్తే విచారణ చేస్తామని తీర్పునిస్తూ కేసు వాయిదా వేశారు. కాగా ధీరన్ సినిమా...తెలుగులో ఖాకీ పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. -
హత్యా నగరంగా మదురై
కేకే.నగర్: మదురై, కోవై, దిండుకల్, నాగపట్నం జిల్లాల్లో దీపావళి పండుగ రోజు పాఠశాల విద్యార్థి సహా ఎనిమిది మంది దారుణ హత్యకు గురయ్యారు. మదురైలో.. మదురై జిల్లా చోళవందన్ సమీపంలోని కీళనాచ్చికులంకు చెందిన మణికంఠన్(39) కూలీ. ఇతడు బుధవారం రాత్రి ఆ ప్రాంతంలోని ఒక ముఠాతో గొడవ పడ్డాడు. ఆగ్రహించిన ముఠా వ్యక్తులు మణికంఠన్‌పై కస్తులతో దాడి జరిపారు. తలకు బలమైన గాయం తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మణికంఠన్ మృతి చెందాడు. అదేవిధంగా చోళవందన్ సమీపంలోని చెల్లదురై(26) లోడుమేన్. పాత కక్షల కారణంగా చెల్లదురైను బుధవారం దారుణంగా హత్య చేశారు. మదురై మేలవాసల్ ప్రాంతానికి చెందిన మారిముత్తు(34) ఆటో డ్రైవర్. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో అతడు హత్యకు గురయ్యాడు. మదురై ఎల్లీస్ నగర్‌కు చెందిన శేఖర్(17) ప్లస్ వన్ విద్యార్థి కిడ్నాప్‌నకు గురయ్యాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ స్థితిలో శేఖర్ మృతదేహం బుధవారం సాయంత్రం పెరియార్ నగర్‌లోని ముళ్ల పొదల్లో కనిపిచింది. దీనిపై స్వామిదురై, సెల్వకుమార్లను పోలీసులు అరెస్టు చేశారు. మదురై జిల్లా మేలూరు సమీపంలో భరత్ కుమార్(25)తో వాగ్వాదానికి దిగిన నలుగురు వ్యక్తులు బీర్ బాటిల్‌తో అతని తలపై గాయపరిచారు. అన్నకు అడ్డుగా వచ్చిన తమ్ముడు బాలమురుగన్ కడుపులో బీర్ బాటిల్‌తో పొడిచారు. ఈ సంఘటనలో బాలమురుగన్ మృతి చెందాడు. ఇదేవిధంగా మైలాడుదురై సమీపంలో రవి(55), తూత్తుకుడికి చెందిన గురు, కోవై రాశిపురం సమీపంలో చిన్నదురై(38), పొల్లాచ్చిలో ఆర్ముగం (50) దారుణ హత్యలకు గురయ్యారు. అనుమానం పెనుభూతం కేకే.నగర్: నాగపట్నం జిల్లా నాగూర్ వడక్కుడి జీవా వీధికి చెందిన కళై అరసన్(39). ఇతని భార్య ధనలక్ష్మి. భార్య ప్రవర్తనపై అనుమానంతో కళై అరసన్ తరచూ గొడవ పడేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం జరిగిన ఘర్షణలో కళై అరసన్ ఆవేశంతో ఇంట్లో ఉన్న గ్రైండర్ బండరాయితో భార్య ధనలక్ష్మి గుండెపై ఢీకొట్టాడు. దీంతో శ్వాస అందక ధనలక్ష్మి మృతి చెందింది. నాగూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, కళై అరసన్‌ను అరెస్టు చేశారు. -
వరదలో మధురై మీనాక్షి ఆలయం
-
అమ్మాయిలు అర్ధనగ్నంగా ఒకరాత్రంతా..
-
అమ్మాయిలు అర్ధనగ్నంగా ఒక రాత్రంతా..!
సాక్షి, చెన్నై: నేటి ఆధునిక యుగంలో జరుగుతున్న ఆటవిక సాంప్రదాయాన్ని ఓ వెబ్సైట్ వెలుగులోకి తీసుకువచ్చింది. ఆలయంలో బాలికలను అర్ధనగ్నంగా తిప్పే మూఢనమ్మకానికి సంబంధించిన ఓ సంచలన వీడియోని పోస్టు చేసింది. దీంతో స్పందించిన అధికారులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆ ఆలయ పూజారి, ఆయన అనుచరులకు కోపం వచ్చింది. ఈ వీడియోను తన వెబ్సైట్లో పోస్టుచేసిన జర్నలిస్టును చంపేస్తామంటూ ఫోన్లో బెదిరింపులకు దిగారు. వివారాల్లోకి వెళ్తే తమిళనాడు, మదురై జిల్లాలోని వెల్లూర్ గ్రామంలోని ఆటవిక సంప్రదాయం నడుస్తోంది. గ్రామంలోని యజైకథా అమ్మన్ ఆలయంలో తమిళ నెల ఆవానీ ప్రారంభ రోజున బాలికలు ఒకరోజు రాత్రి దేవుడి ఆలయంలో గడపాలి. ఇందుకోసం పది నుంచి పద్నాలుగేళ్ల వయసున్న ఏడుగురు అమ్మాయిలను ఆలయ పూజారి ఎంపిక చేస్తారు. అనంతరం వారిని అర్థనగ్నంగా శరీర పైభాగంపై పూలు, ఆభరణాలు మాత్రమే ధరింపజేసి ఒకరోజు రాత్రంతా వారితోపాటు పూజారి ఆలయంలో గడుపుతారు. ఈ తంతు కోసం గత మంగళవారం నుంచి గ్రామంలో ఆలయ పూజారి, ఆయన అనుచరులు బాలికలను ఎంపిక చేసే పనిలో పడ్డారు. దీంతో గ్రామంలోని 62మంది బాలికలు భయంతో పారిపోయారు. ఈ సంఘటనపై విద్యాశ్రీ ధర్మరాజ్ అనే సంపాదకురాలు తన వెబ్సైట్ 'కోవైపోస్టు'లో వీడియోతో పాటు ప్రత్యేక కథనం ఇచ్చారు. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. దీంతో ఆ కార్యక్రమానికి బ్రేక్ పడింది. దీంతో రెచ్చిపోయిన పూజారి, ఆయన అనుచరులు.. చంపేస్తామంటూ విద్యాశ్రీను ఫోన్లో బెదిరించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వార్తను పోస్టు చేసినప్పటి నుంచి తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, వాటిని భరించలేక ఫోన్ స్విచ్చాఫ్ చేశానని ఆమె తెలిపారు. బెదిరించిన ఫోన్ నెంబర్ల జాబితాను పోలీసులకు అందించినట్లు చెప్పారు. -
మహిళా ప్రొఫెసర్‌కు 15 కత్తిపోట్లు
సాక్షి, చెన్నై: మధురై కామరాజ్ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను, పార్ట్‌టైమ్ ప్రొఫెసర్‌గా పనిచేసిన వ్యక్తి కత్తితో 15 సార్లు పొడిచాడు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మధురై కామరాజర్ విశ్వవిద్యాలయం సాంకేతిక సమాచార విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జెనిఫా (42) పనిచేస్తున్నారు. ఇదే విభాగంలో పార్ట్‌టైం ప్రొఫెసర్‌గా జ్యోతి మురుగన్ పనిచేసేవాడు. అతడు సరిగ్గా పనికి రావటం లేదని జెనిఫా పలుమార్లు మందలించారు. అయినా అతని తీరు మారకపోవటంతో విధుల నుంచి తొలగించారు. దీంతో అతనికి జెనిఫాపై అతను కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం జెనిఫా విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్లో ఉండగా జ్యోతి మురుగన్ వచ్చాడు. తనను మళ్లీ విధుల్లో చేర్చుకోవాలని కోరగా ఆమె నిరాకరించింది. ఆవేశంతో ఊగిపోయిన మురుగన్, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను 15సార్లు పొడిచాడు. ఆమె కేకలను విన్న తోటి ప్రొఫెసర్లు పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెని రక్షించే ప్రయత్నం చేశారు. చికిత్స కోసం పుదుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం ఆమెను ప్రస్తుతం మధురైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. నాగమలై పుదుకోట పోలీసులు మురుగన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నట్లుగా చెప్పి వివాహం చేసుకున్నానని, ఇప్పుడు భార్య తరఫు వారు ఉద్యోగం లేదని అడుగుతున్నారని, అందుకే, మళ్లీ ఉద్యోగం ఇవ్వమని జెనిఫాను తాను కోరగా.. ఆమె తిరస్కరించిందని అందుకే కోపంలో దాడి చేసినట్లు మురుగన్ తెలిపాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని మధురై ఆస్పత్రి వైద్యులు తెలిపారు. -
ఒకే కుటుంబంలో 8మంది ఆత్మహత్యయత్నం
-
ఒకే కుటుంబంలో 8మంది ఆత్మహత్యాయత్నం..
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై యోగప్పనగర్లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ఐదుగురు మృతిచెందగా, ముగ్గురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రాత్రి 7 గంటల సమయంలో ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న వీరిని పక్కింటి వాళ్లు గుర్తించి, మధురై రాజాజీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఐదుగురు మృతిచెందగా, మరో ముగ్గురికి చికిత్స చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, వ్యాపారంలో నష్టాల వల్లే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
మళ్లీ పంజా విసిరిన బ్లూవేల్..!
సాక్షి, చెన్నై: ప్రమాదకరమైన ఆన్లైన్ గేమ్ 'బ్లూవేల్ చాలెంజ్' ఈసారి తమిళనాడులో పంజా విసిరింది. చెన్నై తిరుమంగళానికి చెందిన 19 ఏళ్ల విద్యార్థి విగ్నేష్ బుధవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మదురైలోని మన్నార్ కాలేజీలో ఇంటర్ సెంకడియర్ చదువుతున్న అతని చేతిపై వేల్ (తిమింగళం) గుర్తువేసి ఉంది. దానికింద బ్లూవేల్ అని రాసి ఉందని పోలీసులు ధ్రువీకరించారు. సాయంత్రం 4. 30 గంటల సమయంలో ఉరేసుకొని కనిపించిన విగ్నేష్ రాసిన లేఖ కూడా సంఘటనాస్థలంలో దొరికింది. 'బ్లూ వేల్.. ఇది గేమ్ కాదు ప్రమాదం. ఒక్కసారి ఎంటరైతే.. నువ్విక బయటపడలేవు' అని రాసి ఉంది. విగ్నేష్ తన ఫోన్లో బ్లూవేల్ చాలెంజ్ గేమ్ కోసం ప్రయత్నిస్తూ కనిపించేవాడని అతని స్నేహితులు తెలిపారు. బ్లూవేల్ చాలెంజ్ గేమ్ కోసం యాప్కానీ, వెబ్సైట్ కానీ లేని నేపథ్యంలో మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్ ద్వారా అతను బ్లూవేల్ ఆడేందుకు ప్రయత్నించాడని, క్యూరేటర్ ద్వారా అతని టాస్కులు అందేవని స్నేహితులు అంటున్నారు. ఈ సమాచారాన్ని బట్టి తమిళనాడు తొలి బ్లూవేల్ మరణమని అనుమానిస్తున్నారు. బ్లూవేల్ చాలెంజ్ గేమ్‌పై తమిళనాడు పోలీసులు ఇప్పటికే తల్లిదండ్రులను హెచ్చరించారు. కంప్యూటర్లు, మొబైల్ఫోన్లు వాడే పిల్లలపై ఓ కంట నిఘావేసి ఉంచాలని సూచించారు. ఏమిటీ బ్లూవేల్! బ్లూ వేల్ ఛాలెంజ్ అనేది ఓ ఆన్లైన్ గేమ్. దీన్ని రిజిస్టర్ చేసుకున్నవాళ్లు 50 రోజల పాటు ఏదో ఒక టాస్క్ చేయాల్సి ఉంటుంది. చేసిన ప్రతి టాస్క్‌కు వీడియో సహిత ఆధారాలను చూపించాల్సిఉంటుంది. గేమ్ ప్రారంభంలో చిన్న చిన్న టాస్క్‌లే ఇస్తారు. కానీ, రోజులు గడిచే కొద్దీ వికృతమైన ఆదేశాలు జారీ చేస్తారు. తెల్లవారుజామునే భయానక వీడియోలు చూడమని, చేతులు, చేతిమీద కోసుకోమని.. రకరకాల టాస్క్‌లు ఇస్తారు. అలా ఏదో ఒక రోజు మీరు చనిపోవాలనుకుంటున్న తేదీ చెప్పమంటారు. చివరికి 50వరోజు వచ్చేసరికి చనిపోమని గేమ్ మనల్ని ఆదేశిస్తుంది. అప్పటికే మానసికంగా ఆయా టాస్కులకు అలవాటు పడిన వారు గేమ్‌లో భాగంగా ఆత్మహత్య చేసుకుంటారు. 2013లో రష్యాలో మొదలైన ఈ బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్.. క్రమంగా యూరప్, అమెరికా, ఆసియాలకు విస్తరించింది. ఇప్పటివరకు వందల మంది యువత ఈ గేమ్‌కు బలైపోయారు. ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తినా, ప్రభుత్వాలు నిషేధించినా, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు మాత్రం కొనసాగుతూనే ఉండటం గమనార్హం. చదవండి: ‘బ్లూ వేల్ ఛాలెంజ్’కు బలవుతున్నారా? చదవండి: వామ్మో.. బ్లూ వేల్.! చదవండి: పెను సవాల్: 'బ్లూ వేల్'ను ఆపడం సాధ్యమేనా? -
ప్రేమ వివాహాలకు ప్రత్యేక వింగ్
సాక్షి, చెన్నై: ప్రేమ, కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే వారికి భద్రత కల్పించే విధంగా క్రైం ప్రివెన్షల్ సెల్(సీపీసీ)ను తమిళనాడులోని మదురై జిల్లాల్లో ఏర్పాటు చేశారు. మూడు విభాగాల సమన్వయంతో ఈ వింగ్ ఏర్పాటు కాగా, ప్రేమికుల కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరును ప్రకటించారు. తమిళనాడులో కులాంతర ప్రేమ వివాహాలు పరువు హత్యలకు దారి తీస్తున్నాయి. పరువు కోసం హతమార్చడానికి కూడా వెనుకాడటం లేదు. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న వారిలో అనేకమంది ప్రియులు అతి కిరాతకంగా హత్యకు గురయ్యారు. గత ఏడాది శంకర్ అనే ప్రేమికుడిని పట్టపగలు నడిరోడ్డులో హత్యచేయడాన్ని మద్రాసు హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే వారికి తాము అండగా ఉంటామన్నట్టుగా హైకోర్టు భరోసా ఇచ్చింది. కోర్టు ఆదేశం మేరకు దక్షిణ తమిళనాడులో ప్రధాన కేంద్రంగా ఉన్న మదురై జిల్లాలో ప్రపథమంగా ఈ ప్రత్యేక వింగ్ సోమవారం ఏర్పాటైంది. పోలీసు, సాంఘిక సంక్షేమ శాఖ, ఆది ద్రావిడ సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో క్రైం ప్రివెన్షన్ సెల్(సీపీసీ) పేరుతో ఈ విభాగాన్ని ప్రకటించారు. అలాగే, తమను సంప్రదించాలంటూ 0452–2346302 టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. -
మెగాఫోన్ పట్టిన మరో ఛాయాగ్రాహకుడు
తమిళసినిమా: ఛాయాగ్రాహకులు దర్శకులుగా అవతారమెత్తడం అన్నది చాలా కాలంగానే వస్తోంది. దివంగత ప్రఖ్యాత కెమెరామెన్ బాలుమహేంద్ర దర్శకుడిగానూ పలు కళాఖండాలను తెరపై ఆవిష్కరించిన విషయం తెలిసిందే.అదే విధంగా కేవీ.ఆనంద్, మిజయ్ మిల్టన్ వంటి ఛాయాగ్రాహకులు సక్సెప్‌ఫుల్ దర్శకులుగా రాణిస్తున్నారు.తాజాగా పీజీ.ముత్తయ్య వారి బాటలో పయనానికి రెడీ అయ్యారు.ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి మదురైవీరన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. వి.స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు, డీఎండీకే నేత విజయకాంత్ రెండవ కొడుకు షణ్ముగ పాండియన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు సహాబ్ధం అనే చిత్రం ద్వారా పరిచయమైన విషయం తెలిసిందే. కాగా మదురై వీరన్ చిత్రంలో నవ నటి మీనాక్షి కథానాయకిగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలో సముద్రకని, వేల్.రామమూర్తి, మైమ్‌గోపీ, పీఎల్.తేనప్పన్, మారిముత్తు, నాన్‌కడవుల్ రాజేంద్రన్, బాలసరవణన్ నటిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణను పూర్తి చేసుకున్న మదురై వీరన్ చిత్ర తుది భాగాన్ని ఆగస్టులో మదురైలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు పీజీ.ముత్తయ్య తెలిపారు.ఈయనే ఛాయాగ్రహణం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం గురించి తెలుపుతూ ఇది జల్లికట్టు నేపథ్యంలో రూపొందిస్తున్న కథా చిత్రం అని తెలిపారు.ఇందులో విదేశం నుంచి సొంత ఊరుకు తిరిగొచ్చే యువకుడిగా షణ్ముగపాండియన్ నటిస్తున్నారని చెప్పారు. దీనికి సంతోష్ దయానిధి సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శనివారం నటుడు విజయకాంత్ ఆవిష్కరించారు. -
తండ్రి మృతదేహం పక్కన 5 రోజులు కూర్చుని...
మదురై: చనిపోయిన తండ్రి మృతదేహం పక్కన ఆయన కుమారుడు ఐదు రోజులపాటు అలాగే కూర్చున్న ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. మదురైలోని జీవనగర్‌లో అరుల్ రాజ్(73) కుటుంబం నివాసం ఉంటోంది. ఆయనకు 40 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతడి మానసిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ క్రమంలో వృద్ధుడైన అరుల్ రాజ్ గత వారం చనిపోయాడు. ప్రతిరోజు నీళ్లు పట్టేందుకు వచ్చే అరుల్ రాజ్ ఐదు రోజులుగా కనిపించకపోవడంతో పాటు ఆ ఇంటి నుంచి భరించరాని దుర్వాసన వస్తుండటంతో జీవనగర్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటికి వెళ్లి డోర్ కొట్టగా ఎవరూ డోర్ తెరవకపోవడంతో తలుపులు పగలకొట్టి లోనికి వెళ్లి చూసిన పోలీసులు షాక్ తిన్నారు. కుళ్లిపోతున్న వృద్ధుడి మృతదేహం పక్కన అతడి కుమారుడు ఉండటం చూసి అతడే హత్య చేసి ఉంటాడని భావించారు. అతని ప్రవర్తనను గమనించిన పోలీసులు, స్థానికులను వాకబు చేసి అరుల్ కుమారుడికి మానసికస్థితి బాగాలేదని తెలుసుకున్నారు. తండ్రి అరుల్ రాజ్ చనిపోయాడని గుర్తించలేని ఆయన కుమారుడు గత ఐదు రోజులుగా మృతదేహం వద్ద కూర్చుని ఉన్నాడు. ఎలాంటి ఆహారం తీసుకోలేదని, కనీసం నీళ్లు కూడా తాగకపోవడంతో డీహైడ్రేషన్‌కి లోనయ్యాడని పోలీసులు చెప్పారు. ఆ వృద్ధుడు కనిపించకుండాపోయిన ఏప్రిల్25వ తేదీనే చనిపోయి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. బ్రిట్టోను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.