వైరల్: అంతా చూస్తుండగా కళ్ల ముందు ఘోరం జరిగింది. పొయ్యి మీద వేడి వేడి జావ మరుగుతుండగా.. ఓ వ్యక్తి అందులో పడిపోయాడు. అది చూసి చుట్టుపక్కల వాళ్లు రక్షించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ మరిగే జావ నుంచి అతను బయటపడగలిగాడు. కానీ.. కడకు ఈ ఘటన విషాదంగా ముగిసింది.
తమిళనాడు మధురైలో జులై 29న ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఇవాళ(మంగళవారం) బాధితుడు మృతి చెందాడు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ ఘటన.. ఇప్పుడు వైరల్ అవుతోంది.
తమిళనాడులో ‘ఆడి వెల్లి’ జాతర సందర్భంగా అమ్మవారి గౌరవార్థం జావను వండి.. ప్రజలకు పంచుతారు. గత శుక్రవారం మధురై పలగనాథంలో ముత్తు మారియమ్మ ఆలయం సమీపంలో భక్తులు కొందరు ఇళ్ల ముందరే మీదే పెద్ద పెద్ద వంట పాత్రల్లో జావను మరిగిస్తున్నారు. ఆ సమయంలో ముత్తుకుమార్ అనే ఓ వ్యక్తి మైకంతో అక్కడికి వచ్చాడు(తాగి ఉన్నాడని స్థానికులు చెప్తున్నారు). తూలిపోతూనే ఆ గంజులో పడిపోయాడు.
అతను పడిపోయే టైంలోనే చూసి కొందరు అరుస్తూ అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. జావ వేడిగా ఉన్నా.. ముత్తుకుమార్ మైకంలో ఉండిపోయిన ముత్తుకుమార్ కదలకుండా అలాగే ఉండిపోయాడు. చివరికి తమ వల్ల కాకపోవడంతో స్థానికులు జావ గంజునే బోర్లించారు. కాలిన గాయాలతో పైకి లేచిన ముత్తుకుమార్‌ను స్థానికులు రాజాజీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 65 శాతం గాయాలతో చికిత్స పొందుతూ మంగళవారం అతను మృతి చెందాడు.
video disclaimer: ఈ వీడియో ఘటనకు సంబంధించింది.. కొందరికి ఇబ్బందికరంగా అనిపించొచ్చు
Comments
Please login to add a commentAdd a comment