Porridge
-
జుట్టు మృదువుగా నిగనిగలాడలంటే గంజితో ఇలా చేయండి!
జుట్టు ఆరోగ్యం కోసం ఎన్నో క్రీమ్‌లు, కండిషనర్లు వాడి ఉంటారు. వాటన్నిటికంటే బట్టటకు పెట్టే గంజి బెటర్. ఇదేంటి గంజినా అనుకోకండి. ఎందుకుంటే బియ్యం వార్చిన గంజితో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. అవేంటంటే.. ఈ గంజిని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా ఉంటాయి. ఈ గంజినీరు జుట్టు కుదుళ్లను బలంగా పెరిగేలా చేస్తుంది. అలాగే మృదువుగా మెరిసేలా చేయడంలో గంజినీరుకి మించిది మరొకటి లేదని చెబుతున్నారు నిపుణులు. ఇది మంచి కండిషనింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా పొడి జుట్టువారికి ఈ గంజి నీటిని రోజూ తలపై అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు కూడా స్ట్రాంగ్‌గా మారుతుంది. ఈ గంజి జుట్టుకి సహజమైన షైనింగ్‌ని, మృదుత్వాన్ని అందిస్తుంది. ఈ గంజినీటికి మెంతికూర, అలోవెర జోడించి, పులియబెట్టి అప్లై చేస్తే జుట్ట చివర్ల చిట్లిపోవడం వంటి సమస్యలు ఉండవు. ఇది వెంట్రుకలు నెరసిపోవడాన్ని అరికడుతుంది. ఇందులో ఉండే ఇనోసిటాల్ జుట్టుని మృదువుగా మార్చే గుణం ఉటుంది. ఫలితంగా జుట్టు మృదువుగా నిగనిగలాడుతూ ఉంటుంది. (చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!) -
ఘోరం.. కళ్ల ముందే మరిగే జావలో పడిన వ్యక్తి
వైరల్: అంతా చూస్తుండగా కళ్ల ముందు ఘోరం జరిగింది. పొయ్యి మీద వేడి వేడి జావ మరుగుతుండగా.. ఓ వ్యక్తి అందులో పడిపోయాడు. అది చూసి చుట్టుపక్కల వాళ్లు రక్షించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ మరిగే జావ నుంచి అతను బయటపడగలిగాడు. కానీ.. కడకు ఈ ఘటన విషాదంగా ముగిసింది. తమిళనాడు మధురైలో జులై 29న ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఇవాళ(మంగళవారం) బాధితుడు మృతి చెందాడు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ ఘటన.. ఇప్పుడు వైరల్ అవుతోంది. తమిళనాడులో ‘ఆడి వెల్లి’ జాతర సందర్భంగా అమ్మవారి గౌరవార్థం జావను వండి.. ప్రజలకు పంచుతారు. గత శుక్రవారం మధురై పలగనాథంలో ముత్తు మారియమ్మ ఆలయం సమీపంలో భక్తులు కొందరు ఇళ్ల ముందరే మీదే పెద్ద పెద్ద వంట పాత్రల్లో జావను మరిగిస్తున్నారు. ఆ సమయంలో ముత్తుకుమార్ అనే ఓ వ్యక్తి మైకంతో అక్కడికి వచ్చాడు(తాగి ఉన్నాడని స్థానికులు చెప్తున్నారు). తూలిపోతూనే ఆ గంజులో పడిపోయాడు. అతను పడిపోయే టైంలోనే చూసి కొందరు అరుస్తూ అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. జావ వేడిగా ఉన్నా.. ముత్తుకుమార్ మైకంలో ఉండిపోయిన ముత్తుకుమార్ కదలకుండా అలాగే ఉండిపోయాడు. చివరికి తమ వల్ల కాకపోవడంతో స్థానికులు జావ గంజునే బోర్లించారు. కాలిన గాయాలతో పైకి లేచిన ముత్తుకుమార్‌ను స్థానికులు రాజాజీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 65 శాతం గాయాలతో చికిత్స పొందుతూ మంగళవారం అతను మృతి చెందాడు. video disclaimer: ఈ వీడియో ఘటనకు సంబంధించింది.. కొందరికి ఇబ్బందికరంగా అనిపించొచ్చు -
గంజి అన్నంతోనే గడిపాను...
న్యూఢిల్లీ: పోషక విలువల్లేని ఆహారం వల్లే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ (1984)లో పతకం కోల్పోయానని పరుగుల రాణి పీటీ ఉష చెప్పారు. అక్కడి క్రీడా గ్రామంలోని స్థానిక వంటకాలు రుచించక గంజి అన్నం, పచ్చడి తినాల్సివచ్చిందని... ఇది తన ప్రదర్శనపై, చివరకు పతకంపై ప్రభావం చూపిందని గతానుభవాన్ని దిగ్గజ అథ్లెట్ వివరించింది. అప్పట్లో భారత క్రీడాకారులకు అంతంత మాత్రం క్రీడాపరికరాలు, సదుపాయాలు అందుబాటులో ఉండేవని చెప్పారు. విదేశీ క్రీడాకారులు అన్ని హంగులతో, ఆధునిక కిట్లతో కనిపిస్తుంటే తమకు విచారంగా ఉండేదన్నారు. ‘ఏం చేస్తాం! ఒక్క రోజైన అలాంటి కిట్లతో బరిలోకి దిగితే అదే మహాభాగ్యమనిపించేది అప్పుడు. అక్కడి ఆహారం గురించి మాకెలాంటి సమాచారం లేదు. కేవలం స్థానిక పదార్థాల్నే (లాస్ ఏంజిల్స్) వండి వార్చేవారు. బేక్ చేసిన ఆలుగడ్డలు, సోయా సాస్‌తో సగం ఉడికించిన చికెన్ మాకు ఏమాత్రం రుచించలేదు. దీంతో నేను గంజి అన్నం, పచ్చడితో సరిపెట్టుకున్నా. అది అథ్లెట్లు తీసుకునే భోజనం కానేకాదు. అందులో ఎలాంటి పోషకాలు ఉండవు. కానీ నాకు తప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తిన్నా. అలాగే 400 మీ. హర్డిల్స్ బరిలోకి దిగాను. సెకనులో వందో వంతు తేడాతో కాంస్యాన్ని కోల్పోయాను’ అని ఉష ఆనాటి సంగతుల్ని వివరించారు. -
గంజి అమృతమే!
రంజాన్ మాసంలో ముస్లింలు నియమనిష్టలతో ఉపవాసం ఉంటారు. సాయంత్రం పండ్లు, అల్పాహారంతో దీక్ష విరమిస్తారు. పగలంతా ఎంతో నిష్టతో ఉపవాసం ఉండడం వల్ల శక్తికోసం రాత్రి గంజి సేవిస్తారు. బలవర్థక ఆహారంగా పేరొందిన గంజి వంటకం ఉపవాసదీక్ష చేస్తున్న వారి శరీరాన్ని చల్లబరుస్తుంది. పేద ముస్లింల పాలిట గంజి సంజీవనిగా పేరు గాంచింది. మదనపల్లె సిటీః రంజాన్ నెలలోనే తయారుచేసే గంజికి ఎంతో ప్రాధాన్యం ఉంది. జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లోని మసీదుల వద్ద గంజి పంపిణీ చేస్తున్నారు. ఇఫ్తార్ సమయంలో పండ్లు, అల్పాహారం లేకపోయినా.. ఒక గిన్నె గంజి అయినా తాగేందుకు ఇష్టపడుతారు. రవ్వ, మసాలా దినుసులతో ప్రత్యేకంగా తయారు చేసే గంజిలో బూందీ కలుపుకుంటే రుచిగా ఉంటుంది. సాయంత్రం అసర్ సమాజ్ అయిన తరువాత మసీదుల వద్ద గంజి పంపిణీ చేస్తారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గంజి కోసం బారులు తీరుతారు. మసీదు పరిధిలోని ముస్లిం జనాభాను బట్టి రోజుకు రూ.5,000 నుంచి 15 వేల వరకు గంజి తయారీ కోసం ఖర్చు చేస్తారు. కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆ రోజుకు గంజి తయారీకి అయ్యే ఖర్చు భరిస్తారు. లేదంటే గంజి తయారీ పదార్థాలను ఉచితంగా పంపిణీ చేస్తారు. గంజి తయారీ ఇలా.. బియ్యపు రవ్వ, అల్లం, యాలాకులు, దాల్చినచెక్క, టమటా, కొత్తిమీర, పుదీనా వేసి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ముందుగా మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి, టమటాలను నూనెలో వేయిస్తారు. వంట పాత్రలో నీళ్లు పోసి బాగా మరిగిన నీటిలో బియ్యపు రవ్వను కలుపుతారు. ఇలా గంజిని తయారుచేసి, పూర్తయ్యాక కొద్ది సేపు వంట పాత్రలోకి ఉంచి పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం నుంచి గంజి తయారీని ప్రారంభిస్తే సాయంత్రానికి పూర్తవుతుంది. 30 ఏళ్లుగా గంజి పంపిణీ మదనపల్లె పట్టణం జామియా మసీదు వద్ద కమిటీ నిర్వాహకులు 30 ఏళ్లుగా రంజాన్ మాసంలో ఉపవాసదీక్షపరులకు ఉచితంగా గంజి పంపిణీ చేస్తున్నారు. సాయంత్రం కాగానే మసీదు వద్ద ఘుమఘుమలతో సిద్ధమవుతుంది. దీని తయారీకి ప్రత్యేకంగా వంట వారిని ఏర్పాటుచేశారు. దాతల సహకారంతో ప్రతిరోజూ దాదాపు 10 వేల మందికిపైగా గంజి అందజేస్తున్నారు. ఉపవాసదీక్షపరుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన గంజిని కుల, మతాలకు అతీతంగా ఇష్టపడతారు.