జుట్టు ఆరోగ్యం కోసం ఎన్నో క్రీమ్‌లు, కండిషనర్లు వాడి ఉంటారు. వాటన్నిటికంటే బట్టటకు పెట్టే గంజి బెటర్. ఇదేంటి గంజినా అనుకోకండి. ఎందుకుంటే బియ్యం వార్చిన గంజితో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. అవేంటంటే..
- ఈ గంజిని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా ఉంటాయి. ఈ గంజినీరు జుట్టు కుదుళ్లను బలంగా పెరిగేలా చేస్తుంది.
- అలాగే మృదువుగా మెరిసేలా చేయడంలో గంజినీరుకి మించిది మరొకటి లేదని చెబుతున్నారు నిపుణులు. ఇది మంచి కండిషనింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది.
- ముఖ్యంగా పొడి జుట్టువారికి ఈ గంజి నీటిని రోజూ తలపై అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- జుట్టు కూడా స్ట్రాంగ్‌గా మారుతుంది. ఈ గంజి జుట్టుకి సహజమైన షైనింగ్‌ని, మృదుత్వాన్ని అందిస్తుంది.
- ఈ గంజినీటికి మెంతికూర, అలోవెర జోడించి, పులియబెట్టి అప్లై చేస్తే జుట్ట చివర్ల చిట్లిపోవడం వంటి సమస్యలు ఉండవు.
- ఇది వెంట్రుకలు నెరసిపోవడాన్ని అరికడుతుంది. ఇందులో ఉండే ఇనోసిటాల్ జుట్టుని మృదువుగా మార్చే గుణం ఉటుంది. ఫలితంగా జుట్టు మృదువుగా నిగనిగలాడుతూ ఉంటుంది.
(చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!)
Comments
Please login to add a commentAdd a comment