'బాహుబలి' ధియేటర్ పై పెట్రోల్ బాంబు దాడి | petrol bomb attack on 'bahubali' theater in madurai | Sakshi
Sakshi News home page

'బాహుబలి' ధియేటర్ పై పెట్రోల్ బాంబు దాడి

Jul 22 2015 1:32 PM | Updated on Oct 8 2018 4:05 PM

'బాహుబలి' ధియేటర్ పై పెట్రోల్ బాంబు దాడి - Sakshi

'బాహుబలి' ధియేటర్ పై పెట్రోల్ బాంబు దాడి

'బాహుబలి' సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ పై మధురైలో పెట్రోల్ బాంబు దాడి జరిగింది.

మధురై: 'బాహుబలి' సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ పై మధురైలో బుధవారం పెట్రోల్ బాంబు దాడి జరిగింది. తమిళ పులి సంస్థకు చెందిన కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. 'బాహుబలి' సినిమాలో గిరిజనులను కించపరిచే డైలాగులు ఉన్నాయంటూ వారు ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. ఈ సంభాషణలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'బాహుబలి' భారీ వసూళ్లు రాబడుతూ రికార్డులు తిరగరాసింది.

బాహుబలి చిత్రంలో మాల కులస్తులను అవమానపరిచే సన్నివేశాలను, మాటలు ఉన్నాయని వాటిని తక్షణమే తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ అంతకుముందు డిమాండ్ చేసింది. యూట్యూబ్లో మాలలను కించపరుస్తూ ప్రసారమైన సినిమా క్లిప్పింగ్స్ను పోలీసులకు అందచేసి ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement