petrol bomb
-
బంగ్లాదేశ్: దుర్గాపూజలో చెలరేగిన హింస
ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందువులు దుర్గాపూజలను ఘనంగా చేసుకుంటున్నారు. అయితే ఢాకాలోని ఒక ప్రాంతంలో జరుగుతున్న దుర్గాపూజలో హింస చెలరేగింది. దుర్గాపూజ మండపంపైకి కొంతమంది దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. దీంతో భారీగా తొక్కిసలాట జరిగింది.ఢాకాలోని తాటి బజార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బాంబులు విసిరిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘వాయిస్ ఆఫ్ బంగ్లాదేశ్ హిందూ’ పేరుతో సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో గాయపడిన ఒక వ్యక్తిని ఆస్పత్రికి తరలించడాన్ని చూడవచ్చు.బంగ్లాదేశ్‌లోని హిందువులను అవమానించే ఘటనలు జరుగుతున్నాయి. చిట్టగాంగ్‌లోని దుర్గా పూజ మండపంలోకి ప్రవేశించిన కొందరు మరో మతానికి చెందిన పాటలు పాడారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం చిట్టగాంగ్‌లోని జేఎం సేన్ హాల్లో ఒక బృందం దుర్గాపాటలను పాడేందుకు పూజా కమిటీ సభ్యులు అనుమతి ఇచ్చారు. అయితే అవి వేరే వర్గానికి చెందిన పాటలని, స్థానిక హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. Bomb Blast in Tatibazara Puja Mandap, Dhaka.#DurgaPujaAttack2024 pic.twitter.com/BQqHj5SURo— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) October 11, 2024ఇది కూడా చదవండి: దుర్గాపూజ మండపంలో కలకలం -
'వలిమై' థియేటర్‌పై పెట్రోల్ బాంబ్ దాడి
కోయంబత్తూరు (తమిళనాడు): కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా, టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించిన తాజా చిత్రం వలిమై. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం(ఫిబ్రవరి 24న) థియేటర్లలో రిలీజైంది. అజిత్ సినిమా ఫస్ట్ డే చూసేందుకు థియేటర్‌కు తరలివచ్చిన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుండగా ఈ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. కోయంబత్తూరులోని గంగవల్లి మల్టీప్లెక్స్ థియేటర్ ముందు పెట్రోల్ బాంబ్ దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వలిమై సినిమా నడుస్తున్న థియేటర్ ఎదుట బాంబుతో దాడి చేశారు. అక్కడే ఉన్న అభిమానులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు బైక్‌పై పరారయ్యారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజైన వలిమైకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అజిత్, కార్తికేయల నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. -
సీఎం నివాసంపై పెట్రో బాంబు దాడి
షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ లిబరేషన్ కౌన్సిల్(హెచ్ఎన్ఎల్సీ) మాజీ నేత చెరిష్‌స్టార్ఫీల్డ్ థాంగ్‌కీని పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో.. హింసాత్మక ఘటనలు తలెత్తాయి. థాంగ్‌కీ మద్దతుదారులు.. కొన్ని చోట్ల ప్రభుత్వ వాహనాలపై దాడులు చేశారు. ఓ చోట పోలీస్ వాహనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అంతటితో ఆగక ఏకంగా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై ఆదివారం ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. ప్రస్తుతం తన అధికారిక నివాసంలో ఉంటున్నారు. ఆందోళనకారలు 3 వ మైలు ఎగువ షిల్లాంగ్‌లోని లైమర్‌లోని ముఖ్యమంత్రి వ్యక్తిగత నివాసం వద్ద ఈ దాడికి పాల్పడ్డారు. రెండు మోలోటోవ్ కాక్టైల్ బాటిళ్లను సీఎం నివాసంపై విసిరారు. వీటిలో మొదటి బాటిల్ ఇంటి ముందు భాగంలో పడగా.. రెండవది పెరడు వెనుకకు విసిరివేశారు. ఇది గమనించిన గార్డులు వెంటనే అక్కడకు చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటలనకు బాధ్యత వహిస్తూ.. మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు. తనను హోం శాఖ నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ సీఎం కాన్రాడ్ సంగ్మాకు లేఖ రాశారు. ఇది ఈ కేసు విచారణ పారదర్శక సాగడానికి ప్రభుత్వ తీసుకన్న న్యాయపరమైన చర్యగా నిలుస్తుందని అన్నారు. ఘర్షణలకు కారణం ఏంటంటే.. 2018 లో లొంగిపోయిన చెస్టర్‌ఫీల్డ్ థాంగ్‌కీకి.. ఈ నెల లైతుంఖ్రా వద్ద చోటు చేసుకున్న పేలుడులో ఆయన పాత్రపై ఆధారాలు లభించడంతో ఆగస్టు 13 పోలీసులు అతని ఇంట్లో దాడులు నిర్వహించారు. అక్కడ మరిన్ని ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావించారు. అయితే థాంగ్‌కీ పోలీసులపై కత్తితో దాడి చేయాలని చూశాడని.. ఈ క్రమంలో అతడిని ఎదుర్కొవడానికి జరిపిన కాల్పుల్లో థాంగ్‌కీ మృతిచెందాడని పోలీసులు తెలిపారు. ఇక, ఈ ఘటనపై థాంగ్‌కీ కుటుంబ సభ్యులతో పాటు, మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. థాంగ్‌కీ అంత్యక్రియల్లో వందలాది మంది ఆయన మద్దతుదారులు నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. కొన్నిచోట్ల ఆందోళనకారులు పోలీసుల పైకి రాళ్లు విసిరారు. ఈ హింసాత్మక ఘటన నేపథ్యంలో అధికారులు కర్ఫ్యూ విధించారు. మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో కర్ఫ్యూ విధించారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుందని తెలిపారు. అలాగే నాలుగు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి.. 48 గంటల పాటు నిలిపివేస్తున్నట్టుగా చెప్పారు. ఇక మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. థాంగ్‌కీ మరణంపై విచారణకు ఆదేశించినున్నట్టు చెప్పారు. మరోవైపు ఈ ఘటనను మేఘాలయ మానవ హక్కుల స్పందించింది. సుమోటో కేసుగా విచారణకు స్వీకరించింది. దీనిపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక అందించాల్సిందిగా చీఫ్ సెక్రటరీని కోరింది. -
హాంకాంగ్‌లో భారీ ర్యాలీ
హాంకాంగ్: హాంకాంగ్‌లోని ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులు నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్య ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞచేశారు. గత ఏడు నెలలుగా లక్షలాది హాంకాంగ్‌వాసులు ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరసనలు చేస్తున్నారు. కొత్తే ఏడాది సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో లక్షలాది మంది ఆందోళనకారులు పాల్గొన్నారు. వారి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెప్పర్ స్ప్రే, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ఆందోళనకారులపై ప్రయోగించారు. ప్రతిగా పోలీసులపై పెట్రోల్ బాంబులను ఆందోళనకారులు విసిరారు. వీధుల్లోని చైనా అనుకూల వ్యాపార సముదాయాలను ధ్వంసం చేశారు. కాగా, 100 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. -
బీజేపీ నాయకుడి ఇంటిపై పెట్రోబాంబు దాడి!
సాక్షి, కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో బీజేపీ నాయకుడి ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరగడం కలకలం రేపింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీఆర్ నందకుమార్ ఇంటిపై గుర్తుతెలియని దుండుగులు బుధవారం ఉదయం తెల్లవారుజామున పెట్రోల్ బాంబు విసిరారు. దీంతో ఇంటి బయట ఉన్న ఆయన కారు ధ్వంసమైంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే, ఆ సమయంలో సీఆర్ నందకుమార్ ఇంట్లోనే నిద్రిస్తూ ఉన్నారు. ఈ ఘటన బీజేపీ శ్రేణుల్లో ఆందోళన కలుగజేసింది. ఈ ఘటన నేపథ్యంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళ్‌సాయి సౌందరరాజన్ నందకుమార్‌ను పరామర్శించవచ్చునని తెలుస్తోంది. ఇటీవల ద్రవిడ ఉద్యమ నేత రామస్వామి పెరియార్‌పై తమిళనాడు బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. -
మాజీ మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబు
సేలం: తమ పార్టీలో సభ్యత్వం చేర్పించే కార్యక్రమం డీఎంకేలో చిచ్చుపెట్టింది. సేలం జిల్లాలో ఆ పార్టీ నేతల్లో అంతర్గత సమరం జరుగుతున్న క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి సేలం రామ్‌నగర్‌లోని మాజీ మంత్రి సెల్వగణపతి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రో బాంబులు విసిరారు. దీంతో ఆయన ఇంటి ఆవరణలో ఉన్న ఒక బైకు, ఒక కారుకు మంటలు అంటుకున్నాయి. సేలం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే అవి పూర్తిగా కాలిపోయాయి. ఆ సమయంలో సెల్వగణపతి కుమారుడు అరవింద్గణపతి, ఆయన కుటుంబీకులు మాత్రమే ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అస్తంపట్టి పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సేలంలో డీఎంకే మాజీ మంత్రి సెల్వగణపతి అరిసి పాళయం ప్రాంతంలో శుక్రవారం సభ్యులను చేర్పించే కార్యక్రమం నిర్వహించారు. అయితే అప్పుడు అక్కడికి వచ్చిన సేలం సిటీ డీఎంకే కార్యదర్శి రాజేంద్రన్ మద్దతుదారులు కొందరు సెల్వగణపతితో వాగ్వాదానికి దిగారు. తమను అడగకుండా ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రెండు వర్గాలకు చెందిన ఇద్దరికి గాయాలు కావడంతో సేలం జీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పల్లపట్టి పోలీసులు ఇరు వర్గాలకు చెందిన ఎనిమిదిమందిపై కేసు నమోదు చేశారు. అనంతరం సెల్వగణపతి అక్కడి నుంచి చెన్నైకు వెళ్లారు. -
పోలీస్ స్టేషన్‌పై పెట్రోబాంబులతో దాడి
చెన్నై: చెన్నై తేనాంపేట పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం కలిగించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు తేనాంపేట పోలీసు స్టేషన్‌పై పెట్రోలు బాంబులు విసిరారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సంఘటనా ప్రాంతాన్ని సందర్శించిన పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బందాలను ఏర్పాటుచేశారు. చెన్నై నగర అతి ముఖ్యమైన పోలీసు స్టేషన్లలో ఇది కూడా ఒకటి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివశిస్తున్న పోయెస్ గార్డెన్ నివాసం, అమెరికా రాయబార కార్యాలయం, ముఖ్య ప్రముఖుల నివాసాలు, నక్షత్ర హోటళ్లు ఈ స్టేషన్ పరిధిలోనే ఉన్నాయి. గురువారం తెల్లవారుజామున నిర్మానుష్యంగా ఉన్న సమయంలో రెండు బైక్‌లలో వచ్చిన గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రెండు పెట్రోలు బాంబులను పోలీసు స్టేషన్ వైపు విసిరారు. దీంతో భీకర శబ్ధంతో ఓ బాంబు పేలడంతో అక్కడ మంటలు లేచాయి. ప్రవేశద్వారం వద్ద మరో బాంబు పేలకుండా పడివుంది. తెల్లవారుజాము కావడంతో పోలీసులు గస్తీ తిరిగేందుకు వెళ్లారు. పోలీసు స్టేషన్లో ముగ్గురు మాత్రమే ఉన్నారు. నలుగురు వ్యక్తులు బైక్‌లలో వచ్చి పోలీసు స్టేషన్‌పై పెట్రోలు బాంబులు విసిరినట్లు పోస్టర్ల వ్యక్తి తెలిపాడు. వెంటనే ఈ సంఘటన గురించి పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం తెలిపారు. దీనికి సంబంధించి ప్రత్యేక బందం పోలీసులు తేనాంపేట పోలీసు స్టేషన్లో ఉన్న సీసీ టీవి కెమెరాలను పరిశీలించారు. ఈ పోలీసు స్టేషన్ సమీపాన అమెరికన్ దౌత్యకార్యాలయం ఉన్నందున ఇందులో అంతర్జాతీయ కుట్ర ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గురువారం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ 50 ఏళ్ల ప్రజాజీవిత స్వర్ణోత్సవం జరుగనుంది. ఇందులో కూటమి పార్టీల నేతలు పలువురు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసే దష్టితో ఇలా చేశారా? అనే కోణంలోను విచారణ జరుపుతున్నారు. ఈ సంఘనట చెన్నైలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతో తేనాంపేట పరిసరాలలో తీవ్ర పోలీసు భద్రత కల్పించారు. -
బీజేపీ నాయకుడి ఇంటిపై బాంబు దాడి
శివగంగ: తమిళనాడు బీజేపీ నాయకుడు ముత్తురమన్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. దేవకొట్టైలోని ఆయన ఇంటిపై మంగళవారం ఉదయం దుండగులు పెట్రోల్ బాంబు విసిరినట్లు పోలీసులు చెప్పారు. కాగా, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. బాంబు తీవ్రతకు ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయని వివరించారు. ముత్తురమన్ తమిళ అభివృద్ధి వింగ్‌కు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసుపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
పెట్రోల్ బాంబు దాడులతో కర్ణాటకలో ఉద్రిక్తత
సాక్షి, బెంగళూరు: పెట్రోల్ బాంబు దాడులతో కర్ణాటకలోని మడికెరి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి జిల్లాలోని ఐగూరు గ్రామంలో మడికెరి జిల్లా భజరంగ్‌దళ్ కన్వీనర్ పద్మనాభం కారుపై కొందరు దుండగులు దాడి చేసి అద్దాలను పగలగొట్టి, కారుపై పెట్రోల్ బాంబు వేసి ఉడాయించారు. ఈ సమయంలో పద్మనాభం కారులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అప్పచ్చురంజన్, హిందూ పోరాట సంఘాల కార్యకర్తలు జిల్లాలో సమ్మెలు, రాస్తారోకోలు నిర్వహించారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలోనే భజరంగ్‌దళ్ నేత కారును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం గమనార్హం. -
మంత్రి ఇంటిపై బాంబు దాడి
శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్ విద్యాశాఖ మంత్రి నయీమ్ అక్తర్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి బాంబు దాడి చేశారు. నగరంలోని పర్రాయ్ పోరాలో ప్రాంతంలో ఉన్న మంత్రి నివాసంపై పెట్రోల్ బాంబును విసిరారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొంతమంది దుండగులు మంత్రి నివాసం పెట్రోల్ బాంబు విసిరి పారిపోయారని చెప్పారు. దాడిలో ఇంటి ప్రధానగేటు ధ్వంసమయినట్లు వివరించారు. దాడి జరిగిన సమయంలో మంత్రి ఇంట్లో లేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత ఏడాది పీడీపీ-బీజేపీల సంకీర్ణప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్తర్, ఆయన భార్య గుప్కర్ రోడ్డులోని హై సెక్యూరిటీ ఇంటికి మారారు. రోడ్లు, భవనాల శాఖ కార్యలయంపై కూడా పెట్రోల్ బాంబును విసిరినట్లు చెప్పారు. -
'బాహుబలి' ధియేటర్ పై పెట్రోల్ బాంబు దాడి
మధురై: 'బాహుబలి' సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ పై మధురైలో బుధవారం పెట్రోల్ బాంబు దాడి జరిగింది. తమిళ పులి సంస్థకు చెందిన కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. 'బాహుబలి' సినిమాలో గిరిజనులను కించపరిచే డైలాగులు ఉన్నాయంటూ వారు ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. ఈ సంభాషణలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'బాహుబలి' భారీ వసూళ్లు రాబడుతూ రికార్డులు తిరగరాసింది. బాహుబలి చిత్రంలో మాల కులస్తులను అవమానపరిచే సన్నివేశాలను, మాటలు ఉన్నాయని వాటిని తక్షణమే తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ అంతకుముందు డిమాండ్ చేసింది. యూట్యూబ్‌లో మాలలను కించపరుస్తూ ప్రసారమైన సినిమా క్లిప్పింగ్స్‌ను పోలీసులకు అందచేసి ఫిర్యాదు చేసింది. -
‘పెట్రో’ పెంపుపై భగ్గు..
పెట్రో ధరల పెంపుపై విపక్షాలు భగ్గుమన్నాయి. శనివారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, దళిత సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. పలుచోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సంగారెడ్డిలో తోపుడు బండిపై బైక్‌లను ఉంచి తాళ్లతో లాగారు. రామాయంపేటలో ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. జగదేవ్‌పూర్‌లో కాంగ్రెస్, టీడీపీ నాయకులు రాస్తారోకో చేశారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం వినూత్న నిరసన సంగారెడ్డి మున్సిపాలిటీ : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జయరాజ్ డిమాం డ్ చేశారు. పెంచిన ధరలకు నిరసనగా స్థానిక సుందరయ్య భవన్ నుంచి కొత్త బస్టాండ్ వరకు తోపుడు బండ్లపై బైక్‌లను ఉంచి తాళ్లతో లాగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ధరలను పెంచి పేద, మధ్య తరగ తి వారిపై మోయలేని భారం వేస్తున్నారని విమర్శించారు. తాజా ఇంధన ధరలతో నిత్యావసర సరుకులతోపాటు, రవాణా చార్జీలు పెరిగే అవకాశం ఉందన్నారు. కార్పొరేట్ సంస్థలకు రాయితీని ప్రకటిస్తున్న ప్రభుత్వం పేద, మధ్యతరగతి వారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సాయిలు, అశోక్, యాదగిరి, బాలరాజు, మహబూబ్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో... దుబ్బాక: పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మచ్చ శ్రీని వాస్, తెలంగాణ రాష్ట్ర దళిత బహుజన శక్తి జిల్లా కార్యదర్శి బిట్ల జయాకర్ మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం ఇంధన చార్జీలు పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై పెను భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే బీజేపీ సర్కార్‌కు పడుతోందని వారు హెచ్చరించారు. అనంతరం తహశీల్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు సత్యనారాయణ, భరత్‌కుమార్, ఆస అభినయ్, కిరణ్, అజిద్ పాషా, టీడీబీఎస్ నాయకులు మాడ్గుల రమేశ్, సుధాకర్, కుమార్, విజయ్, నాగరాజు పాల్గొన్నారు. టీడీబీఎస్ ఆధ్వర్యంలో... సిద్దిపేట అర్బన్: తెలంగాణ దళిత బహుజన శక్తి ఆధ్వర్యంలో సిద్దిపేటలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీడీబీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవి రవీందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి ఐరేని రమేష్, సిద్దిపేట మండల అధ్యక్షుడు నర్సయ్య, నాయకులు నర్సింలు, మల్లేశం, రాములు, గణేశ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతల రాస్తారోకో జగదేవ్‌పూర్: ఇంధన ధరల పెంపును నిరసిస్తూ శనివారం సాయంత్రం కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. జగదేవ్‌పూర్‌లోని గణేశ్‌పల్లి చౌరస్తాలో గంటపాటు రాస్తారోకో చేయడంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్‌రావు మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డగోలుగా పెంచడం దారుణమన్నారు. కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు గుడాల శేఖర్, శరత్, శివలింగం, భూపాల్‌రెడ్డి, బాలమల్లు, సీతయ్య తదితరులు పాల్గొన్నారు. ఆటోను తాడుతో లాగి నిరసన.. రామాయంపేట: దళిత సంఘాల ప్రతినిధులు తాడుతో ఆటోను లాగి వినూత్న నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మాసాయిపేట మల్లేశం, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పాతూరి రాజు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బైరం కుమార్, నాయకులు దుబాసి సంజీవు, మేకల భూదయ్య, గావు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రాబ్యాంక్పై బాంబు దాడి
చెన్నై : చెన్నై నగరంలోని ఆంధ్రాబ్యాంక్ బ్రాంచ్‌పై ఆగంతకులు శుక్రవారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఈ దాడిలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. బైక్ వచ్చిన దుండగలు ఆంధ్రాబ్యాంక్పైకి బాంబు విసిరి అనంతరం అక్కడి నుంచి వారు పరారైయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. చిత్తూరు జిల్లాలో శేషాచల కొండలపై జరిగిన ఎన్కౌంటర్లో తమిళనాడుకు చెందిన 20 మంది స్మగ్లర్లు మరణించిన నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా గతనెల 10 వ తేదీన తమిళనాడులోని మూడు ఆంధ్రబ్యాంకులపై తమిళనాడు వాసులు దాడి చేసిన సంగతిని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు. -
‘పెట్రో’ బాదుడు
కర్నూలు : నెల రోజుల వ్యవధిలోనే పెట్రో బాంబు రెండోసారి పేలింది. నిన్నటి వరకు పెట్రోలు లీటరు ధర రూ. 66.33లు ఉండగా.. తాజాగా పెరిగిన ధరతో లీటరు పెట్రోలు రూ. 69.79కి చేరింది. అదేవిధంగా ప్రస్తుతం లీటరు డీజిల్ ధర రూ. 54.92లు ఉండగా.. స్థానిక పన్నులతో కలిపి రూ. 3.34లు పెరిగింది. ఈ లెక్కన ప్రస్తుతం లీటరు ధర రూ. 58.26లకు చేరింది. శనివారం అర్ధరాత్రి నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో డీజిల్, పెట్రో ధరలు పెరగడం గమనార్హం. రోజకు పెట్రో భారం రూ. 28.60 లక్షలు జిల్లాలో రోజుకు 6,66,666 లీటర్లకుపైగా డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే నెలకు 2 కోట్ల లీటర్ల వినియోగం ఉంటుంది. తాజాగా డీజిల్‌పై లీటరుకు రూ. 3.34లు(స్థానిక పన్నులతో కలిపి) అదనపు భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోపింది. ఈ లెక్కన డీజిల్‌పై రోజుకు రూ.22.26 లక్షల చొప్పున నెలకు రూ. 7.56 కోట్లు ప్రజలపై అదనపు భారం పడుతుంది. అలాగే పెట్రోలు ధర కూడా లీటరుపై రూ. 3.46లు పెరిగింది. జిల్లావ్యాప్తంగా పెట్రోలు వినియోగించే వాహనాలు 5 లక్షలకుపైగా ఉన్నాయి. ఈ వాహనాలకు రోజుకి 1,83,333 లీటర్ల పెట్రోలును వినియోగిస్తున్నారు. ఈ లెక్కన రోజుకి భారం రూ. 6.34 లక్షల అవుతోంది. నెలకు రూ. 2.13 కోట్లు అదనపు భారం పడుతోంది. నిత్యావసర సరుకులపై ప్రభావం.. డీజిల్ ధర భారీగా పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలపై ప్రభావం చూపనుంది. సరుకు రవాణాకు డీజిల్ వాహనాలనే వినియోగిస్తారు. నిత్యావసర సరుకులతోపాటు పాలు, కూరగాయలు, పండ్లు ఈ వాహనాల్లోనే రవాణా చేస్తుంటారు. డీజిల్ ధర పెరిగిన నేపథ్యంలో వీటి రవాణాకు అయ్యే వ్యయం కూడా పెరగనుంది. ఫలితంగా కూరగాయలు, పండ్లు, పాలు ఇతర నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆర్టీసీపై భారం.. రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఆర్టీసీ)పై డీజిల్ భారం పడింది. పీకల్లోతు ఇబ్బందుల్లో ఉన్న సంస్థకు పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగా మరింత నష్టాల్లోకి వెళ్లనుందని చెప్పవచ్చు. ఈ నెల ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సుల రూపంలో రూ.4 పెంచిన విషయం తెలిసిందే. నెల రోజులు గడవక ముందే ఇప్పుడు మరోసారి పెంచింది. కర్నూలు రీజియన్ (జిల్లా)లోని 11 డిపోల్లోని 1016 బస్సుల్లో 181 అద్దె, 835 సంస్థ బస్సులున్నాయి. అద్దె బస్సులు మినహా సంస్థ బస్సుల నిర్వహణ, డీజిల్ కొనుగోలు అంతా ఆర్టీసీదే. ఇవి రోజుకు దాదాపు 3.70 లక్షల కిలో మీటర్లు తిరిగి 3.90 లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. వీటికి రోజుకు 76,144 లీటర్ల వరకు డీజిల్ అవసరం. పెరిగిన ధరతో రోజుకు రూ. 2.54 లక్షలకు పైగా అదనపు భారం పడగా నెలకు రూ.76.29 లక్షలు అవుతుంది. ఈక్రమంలో ఏడాదికి 2.78 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తుండడంతో సంస్థపై రూ. 9.15 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఈ భారాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టామని డిప్యూటి చీఫ్ మెకానికల్ ఇంజినీర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. -
బస్సుపై బాంబు దాడి.. ఐదుగురు మృతి
ఢాకా: బాంబు దాడిలో ఐదుగురు మృతిచెందడంతో పాటు 29 మంది గాయపడ్డ సంఘటన బంగ్లాదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్‌లోని గాయ్బంధా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... గాయ్బంధా జిల్లాలో పోలీసుల రక్షణలో ఉన్న నపు పరిబహన్ అనే బస్సుపై గుర్తుతెలియని దుండగులు రాత్రి 11:30 గంటలకు పెట్రోల్ బాంబు దాడి చేశారని చెప్పారు. పెట్రోల్ బాంబు దాడిలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుమంది మృతిచెందడంతో పాటు బస్సులోని ప్రయాణికులు 29 మందికి కాలిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో 11 మందిని రంగపూర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ కు, మరికొందరిని గాయ్ బంధా సదర్ ఆసుపత్రికి తరలించామని పోలీసు అధికారి చెప్పారు. ప్రయాణికులతో పాటు పోలీసులు గాయపడ్డారని, కొందరి పరిస్థితి బాగాలేదన్నారు. రంగపూర్ ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జరీ విభాగం చీఫ్ డాక్టర్ మరుఫల్ ఇస్లామ్ మాట్లాడుతూ... తీవ్ర గాయాలపాలైన తొమ్మిదేళ్ల బాలుడు చికిత్స పొందుతుండగానే మరణించాడని తెలిపారు. -
వణుకు పుట్టించిన పేలుడు
చెన్నై సమీపం పెరంబలూరులో గురువారం రాత్రి బస్సులో సంభవించిన పేలుడు పోలీసు అధికారుల వెన్నులో వణుకు పుట్టించింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకున్నా పెట్రో బాంబు పేలుడు ధాటికి 9 మంది గాయపడ్డారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: తీవ్రవాదులు ఎంతకైనా తెగబడవచ్చు తస్మాత్ జాగ్రత్త అంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు రాష్ట్ర పోలీస్ యంత్రాగాన్ని నెల క్రితమే అప్రమత్తం చేశారు. పంద్రాగస్టు సమీపించే కొద్దీ పోలీసు తనిఖీలు పెరిగిపోయాయి. చీమచిటుక్కుమన్నా అనుమానించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తెల్లారితే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అనగా బస్సులో పెట్రో బాంబు పేలుడుతో అధికారులు బెంబేలెత్తిపోయారు. చెన్నై శివారులోని పెరంబలూరు నుంచి దురైయూరుకు గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో 60 మంది ప్రయాణికులతో ఒక ప్రైవేటు బస్సు బయలుదేరింది. మావిలంగు ప్రాంతానికి చెందిన చంద్రన్ (28) బస్సును నడుపుతుండగా కురుంబలూరుకు చెందిన రాజేష్ డ్రైవర్ విధులను నిర్వర్తిస్తున్నాడు. రాత్రి 8.15 గంటల సమయంలో బస్సు ఈచ్చంపట్టి లాడపురం ప్రాంతంలో వెళుతుండగా డ్రైవరు సీటుకు వెనుక నాలుగో వరుసలోని ప్రయాణికుల సీట్ల కింద నుంచి అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. దీంతో డ్రైవరు బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులు భయంతో కేకలు వే స్తూ కిందకు దూకేశారు. సీటు కింద భాగంలో కాలిన గుర్తులతో పేలుడు జరిగి ఉండటాన్ని గుర్తించారు. ఈ పేలుడులో ప్రయాణికులు రామాయి, రాజేశ్వరి, విజయరాఘవన్, చిన్నదురై, కలియపెరుమాళ్, నాగలాపురం సెల్వరాజ్, నక్కసేలం లోకనాథన్, దినేష్, సతీష్‌కుమార్ గాయపడ్డారు. క్షతగాత్రులను పెరంబలూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. పేలుడు జరిగిన చోట దొరికిన ఆనవాళ్లను బట్టీ పెట్రో బాంబుగా నిర్ధారించారు. అనేక వైర్లతో ఛిద్రమై ఉన్న ప్లాస్టిక్ పెట్టె, బ్యాటరీ, బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈచ్చంపట్టిలో నలుగురు వ్యక్తులు బస్సులో ఎక్కారని కండక్టర్ చెప్పాడు. వారంతా ఆపెట్టెను వదిలి మార్గమధ్యంలో దిగిపోయినట్లు తెలుసుకున్నారు. ఇదే బస్సులో పేలుళ్లు జరపాలని దుండగులు భావించారా లేక మరేదైనా పెద్ద లక్ష్యమా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. తెల్లారితే వేడుకలు ప్రారంభం అవుతుండగా ముందురోజు రాత్రి జరిగిన ఈ సంఘటన అధికారులను కలవరపాటుకు గురిచేసింది. -
రాష్ట్ర ప్రజలపై రూ.682 కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెట్రోబాంబ్ పేల్చాయి. శనివారం అర్ధరాత్రి నుంచి లీటరు పెట్రోలుపై రూ. 2.35, లీటరు డీజిల్‌పై 50పైసలు చొప్పున ధర పెంచాయి. దీనివల్ల రాష్ట్రంలోని వాహన యజమానులపై ఏడాదికి సగటున రూ.682.52 కోట్ల అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో ఏడాదికి సగటున 150 కోట్ల లీటర్ల పెట్రోలును వాహనదారులు వినియోగిస్తున్నారు. లీటరు పెట్రోలు ధర రూ. 2.35 లెక్కన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచడంవల్ల రాష్ట్ర ప్రజలపై ఏటా రూ. 352.52 కోట్ల అదనపు భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడిపోతున్న అల్పాదాయ వర్గాలు, వేతన జీవులకు ఇది పెనుభారమని చెప్పక తప్పదు. రాష్ట్రంలో ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్న 90 లక్షల మందితోపాటు పెట్రోలు వినియోగించే నాలుగు చక్రాల వాహనాల వారిపై కూడా ఈ భారం పడుతుంది. అలాగే రాష్ట్రంలో ఏడాదికి సగటున 660 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. లీటరుకు అర్ధరూపాయి పెరిగినందున వాహనదారులపై ఏటా రూ.330 కోట్ల అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో పెట్రోలుపై 31 శాతం, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల పంట పండుతోంది. పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా వ్యాట్ రూపేణా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ. 8,000 కోట్ల వరకూ రాబడి వస్తోంది. తాజా పెంపుతో ఏడాదికి సగటున పెట్రోలు ద్వారా రూ.109.27 కోట్లు, డీజిల్ ద్వారా రూ. 73.42 కోట్ల అదనపు రాబడి ప్రభుత్వానికి రానుంది. అన్ని వర్గాలపై భారం: డీజిల్ ధరల పెంపు ప్రభావం రైతులతోపాటు అన్ని వర్గాలపై పడుతుంది. ఇప్పటికే వరి దుక్కి దున్నేందుకు (దమ్ముకు) ట్రాక్టరు యజమానులు గంటకు రూ.800 చొప్పున బాడుగ తీసుకుంటున్నారు. ప్రతి 15 రోజులకూ డీజిల్ ధర పెరుగుతున్నందున గిట్టుబాటు కావడంలేదంటూ రేట్లు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇది అసలే వరి సాగు గిట్టుబాటుకాని రైతులకు మరింత భారమని చెప్పక తప్పదు. డీజిల్ ధర పెరగడంవల్ల సరుకుల రవాణా కూడా భారం కానుంది. దీనివల్ల నిత్యావసర సరుకులతోపాటు అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. డీజిల్ ధర పెంపు ఆర్టీసీ, రైల్వేలకు కూడా భారమే. దీనివల్ల ఆర్టీసీ, రైలు ఛార్జీలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. ‘రూపాయి విలువ పడిపోయి డాలర్ బలపడటంవల్ల అంతర్జాతీయ విపణిలో క్రూడ్‌కు మన దేశం ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఈ విషయంలో ప్రజల ప్రమేయం లేకపోయినా ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు తరచూ పెంచుతూ అల్పాదాయ వర్గాలపై మోయలేని భారం మోపడం ఏమాత్రం సమంజసం కాద’ని ఆర్థిక వేత్తలు అంటున్నారు. పెట్రో ధరల పెంపుపై వాహనచోదకులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.