
హాంకాంగ్: హాంకాంగ్‌లోని ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులు నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్య ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞచేశారు. గత ఏడు నెలలుగా లక్షలాది హాంకాంగ్‌వాసులు ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరసనలు చేస్తున్నారు. కొత్తే ఏడాది సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో లక్షలాది మంది ఆందోళనకారులు పాల్గొన్నారు.
వారి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెప్పర్ స్ప్రే, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్‌లను ఆందోళనకారులపై ప్రయోగించారు. ప్రతిగా పోలీసులపై పెట్రోల్ బాంబులను ఆందోళనకారులు విసిరారు. వీధుల్లోని చైనా అనుకూల వ్యాపార సముదాయాలను ధ్వంసం చేశారు. కాగా, 100 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment