huge rally
-
భారీ వర్షంలోనూ జూడాల నిరసన
గాంధీఆస్పత్రి: కోల్‌కతాలో విధినిర్వహణలో ఉన్న వైద్యవిద్యార్థినిపై హత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, ఈ ఘటనలు పునరావృతం కాకుండా కఠినచర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో జూడాలు నిరసన కార్యక్రమాలు ఉధృతం చేశారు. గురువారం సాయంత్రం భారీవర్షాన్ని సైతం లెక్కచేయకుండా వెయ్యి మంది జూడాలు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ ఆస్పత్రి నుంచి ప్రారంభమైన ర్యాలీ సికింద్రాబాద్ ప్రధాన రహదారి, పద్మారావునగర్, ముషీరాబాద్ చౌరస్తా మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా సీనియర్ రెసిడెంట్స్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్, జూడాల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షుడు వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ న్యాయం జరిగే వరకు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో మేలు
పి.గన్నవరం: సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో మేలు జరిగిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆయన అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.36 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని కొనియాడారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏపీజీఈఎఫ్) వైస్ చైర్మన్ విప్పర్తి నిఖిల్ కృష్ణ ఆధ్వర్యాన ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో మూడు రోడ్ల సెంటర్ నుంచి దుర్గమ్మ గుడి వరకూ వివిధ శాఖల ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులకు అండగా నిలిచి, గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసినందుకు ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. కరోనా వంటి కష్టకాలంలో ఆర్థిక శాఖ అధికారులు వద్దన్నా కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేల్ అమలు చేశారన్నారు. అధికారంలోకి వచి్చన మూడు నెలల్లోనే 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి పాటు పడుతున్న ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ‘మన ప్రభుత్వం – మన ప్రగతి’ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. -
సమాన-సమాగ్రాభివృద్ధి అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు
-
ఎన్టీఆర్ జిల్లా YSRCP యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలి
-
జగన్నినాదాలతో ప్రతిధ్వనించిన నెల్లూరు
నెల్లూరు (బారకాసు): విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విద్యార్థులు జేజేలు పలికారు. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు జై జగన్.. జైజై జగన్.. జయహో జగన్ మామ.. అంటూ చేసిన నినాదాలతో నెల్లూరు నగరం ప్రతిధ్వనించింది. విద్యార్థి సాధికారత కోసం సీఎం చేస్తున్న కార్యక్రమాల వివరాలున్న ఫ్లెక్సీలు రెపరెపలాడాయి. బడుగు, బలహీన విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాలు, విద్యార్థులు చదువుకునేందుకు ఇస్తున్న ప్రోత్సాహకాలు వివరిస్తూ విద్యార్థులు, నేతలు కదం తొక్కారు. నగరంలో భారీగా విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ ఆసాంతం అందరినీ ఆకర్షించింది. ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన తదితర పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని వేలనోళ్లు ప్రశంసించడం వినిపించింది. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరులో నిర్వహించిన ‘విద్యార్థి సాధికారత జగనన్నతోనే సాధ్యం’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వీఆర్సీ క్రీడామైదానం నుంచి ట్రంకురోడ్డు గాందీబోమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువతీ యువకులు ఫ్లెక్సీలు పట్టుకుని విద్యారంగాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు. జగనన్న మళ్లీ సీఎం కావాలంటూ ఆకాంక్షించారు. ముఖ్య అతిథి వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత చదువుకు భరోసా ఇస్తున్న వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పేద విద్యార్థుల చదువుకు భరోసా కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ అమ్మఒడి పథకం, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, విదేశీ విద్యాదీవెన తదితర పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ కార్పొరేట్, ప్రైవేట్ విద్యకు ప్రాధాన్యం ఇస్తారని, వారు అధికారంలోకి వస్తే పేద విద్యార్థులు చదువు మానుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో యావత్ విద్యార్థి లోకమంతా జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని బహిరంగంగా ప్రతినబూనుతున్నామని చెప్పారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగ అభివృద్ధికి సీఎం జగన్ విశేష కృషి
సాక్షి, నంద్యాల: విద్యారంగంలో సీఎం జగన్ తీసుకువచ్చిన సంస్కరణలు, పథకాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్ అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యారంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. ‘వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నంద్యాలలో ‘విద్యా సాధికారిత జగనన్నతోనే సాధ్యం’ అని తెలిపేలా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పద్మావతినగర్‌లోని జ్యోతిబా పూలే విగ్రహం నుంచి శ్రీనివాస్ సెంటర్లోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు. చైతన్య, సురేష్ మాట్లాడుతూ ‘నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల డ్రాపౌట్స్ సంఖ్య తగ్గిందన్నారు. ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్యా బోధన, టోఫెల్ శిక్షణ తదితర కార్యక్రమాలతో అంతర్జాతీయ స్థాయి విద్యను పేద విద్యార్థులకు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ చైర్మన్ బి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
జగన్ పాలనతోనే విద్యార్థులకు ‘ఉన్నత’ చదువులు
కడప కార్పొరేషన్: విద్యా రంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన సంస్కరణలు, పథకాలతో విద్యార్థులకు ‘ఉన్నతమైన’ విద్య అందుబాటులోకి వచ్చిందని వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్(వైఎస్సార్‌ఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జిల్లా అధ్యక్షుడు పి.సాయిదత్త అన్నారు. నాలుగున్నరేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం కడపలో వైఎస్సార్‌ఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కోటిరెడ్డి సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ.. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, సంధ్యా సర్కిల్ మీదుగా తిరిగి కోటిరెడ్డి సర్కిల్‌కు చేరింది. ఈ సందర్భంగా చైతన్య, సాయిదత్త మాట్లాడుతూ.. విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారని వివరించారు. ‘నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దారని చెప్పారు. అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన, ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్యా భోధన, టోఫెల్ శిక్షణ తదితర కార్యక్రమాలను ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను చేరువ చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ఎస్‌యూ నగర అధ్యక్షుడు సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగనన్నే మళ్లీ సీఎం కావాలి
పట్నంబజారు (గుంటూరుఈస్ట్): విద్యా సాధికారత జగనన్నతోనే సాధ్యమని గుంటూరు వేదికగా విద్యార్థి లోకం గొంతెత్తి నినదించింది. పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘‘వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన్’’ కార్యక్రమంలో భాగంగా గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం, శంకర్‌విలాస్, ఓవర్‌బ్రిడ్జి, ఏసీ కళాశాల మీదుగా హిందూ కాలేజ్ సెంటర్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘‘మా బతుకులు మారాలంటే.. మా తలరాతలు మేమే రాసుకోవాలంటే.. ఉన్నత విద్య, అత్యున్నత ఉద్యోగ అవకాశాలతో మా జీవన స్థితిగతులలో సమూలమైన మార్పు రావాలంటే.. మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి’’ అంటూ విద్యార్థులు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. విద్యారంగం అభివృద్ధికి జగనన్న ఏమేం చేశారో చెప్పడానికే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అనేక పథకాలతో రాష్ట్రంలో అక్షరకాంతులు పూయిస్తున్నారన్నారు. రాష్ట్రానికి మళ్లీ మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర అవతరణ దినోత్సవాన గుంటూరు వేదికగా విద్యార్థి లోకం గర్వంగా గొంతెత్తి చాటిచెప్పడం శుభపరిణామమని అన్నారు. ర్యాలీలో విద్యార్థి విభాగం రీజనల్ కోఆర్డినేటర్లు విఠల్, మనోహర్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు వినోద్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు సిరాజ్, నాయకులు గంటి, రవి, బాజీ, జగదీష్, వలి, బంటి, మహేష్, అజయ్, కరీమ్, కిరణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు సీఎం నెరవేర్చారు
కుప్పం(చిత్తూరు జిల్లా): రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న పారదర్శక పాలనలో ప్రతి ఉద్యోగి భాగస్వామి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్(ఏపీజీఈఎఫ్) చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. ఏపీజీఈఎఫ్ ఆధ్వర్యాన ఆదివారం కుప్పం పట్టణంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీసీఎన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన సమావేశంలో వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. నాలుగేళ్లలో ఉద్యోగులకు సంబంధించిన 42 సమస్యలను పరిష్కరించారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన 10 హామీల్లో 8 అమలు చేశారని వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వంపై ఏడాదికి రూ.3 వేల కోట్లు అదనపు భారం పడుతుందని తెలిసినా, ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని విలీనం చేసి కారి్మకుల జీవితాల్లో వెలుగులు నింపారని ప్రశంసించారు. కరోనా సమయంలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని, మన దగ్గర నెలనెలా జీతాలు అందజేశారని తెలిపారు. గతంలో ఉద్యోగులు ఇంక్రిమెంట్ కోసం రోడ్లపై ధర్నాలు చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు అలాంటి సమస్య లేదన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో 1.30లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వారిని రెగ్యులరైజ్ చేసిన ఘనత ’ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. రెవెన్యూశాఖలో పనిచేస్తున్న 3,790 మంది వీఆర్వోలకు, పంచాయతీరాజ్‌లో 1,500 మందికి పదోన్నతులు కల్పించారని వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. పదేళ్లుగా ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారికి త్వరలోనే మంచి రోజులు వస్తాయన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ రాకపోవడానికి సీఎం కారణం కాదని, కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులే కారణమని ఆయన స్పష్టంచేశారు. ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు ప్రభుత్వంపై నిందలు మోపేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని వెంకట్రామిరెడ్డి చెప్పారు. ప్రభుత్వంపై బురదజల్లే క్రమంలో ఉద్యోగులను రెచ్చగొట్టి రోడ్లపైకి పంపి నిరసన తెలపాలని, ధర్నాలు చేయాలని ప్రోత్సహిస్తున్నాయని, వారి మాటలు నమ్మొద్దని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు వారధిగా ఫెడరేషన్ పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినందుకు సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని చెప్పారు. అవసరమొచ్చినప్పుడు రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్సీలు భరత్, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగుల సంఘ నేత చల్లా చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో ‘ఇండియా ఆన్ ద మూన్’ భారీ ర్యాలీ
ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): ‘ఇండియా ఆన్ ద మూన్’ పేరుతో విశాఖపట్నంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు 400 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఇండియా మూన్ మిషన్ చంద్రయాన్–3 సక్సెస్ కావడంతో భారత్‌కు అంతర్జాతీయ ఖ్యాతి లభించిందన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత శాస్త్ర విజ్ఞానం వైపు దూసుకెళ్లాలన్నారు. ఈ మిషన్‌లో ఏయూ ఎమ్మెస్సీ ఎల్రక్టానిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థి ప్రాతినిధ్యం వహించడం ఏయూకు గర్వకారణం అన్నారు. -
వైఎస్సార్సీపీ @ 4 ఇయర్స్.. భారీ ర్యాలీ (ఫొటోలు)
-
జగనన్నే మా భవిష్యతుకు మద్దతుగా విద్యార్థుల భారీ ర్యాలి
-
కర్నూలులో న్యాయరాజధానిను కోరుతూ భారీ ర్యాలీ
-
మూడు రాజధానులకు మద్దతుగా నెల్లూరులో విద్యార్థుల భారీ ర్యాలీ
-
వికేంద్రీకరణే విశాఖ వాణి
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణకు మద్దతుగా, కేంద్రీకరణకు వ్యతిరేకంగా విశాఖ ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా గర్జించడానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈ నెల 15న భారీ ర్యాలీ నిర్వహించాలని నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నిర్ణయించింది. అన్ని వర్గాల వారు పాల్గొనే ఈ ర్యాలీని నగరంలోని డాబా గార్డెన్స్ అంబేడ్కర్ జంక్షన్ నుంచి చేపట్టనున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డాక.. శనివారం విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన తొలి రౌండ్ టేబుల్ సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించింది. వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించింది. వికేంద్రీకరణకు మద్దతుగా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావులు ఈ సమావేశంలో ప్రకటించారు. జేఏసీ చైర్మన్ లజపతిరాయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, పారిశ్రామిక, విద్యావేత్తలు, ఉద్యోగ, కార్మిక, న్యాయవాద సంఘాల నేతలు, జర్నలిస్టు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత లజపతిరాయ్ మాట్లాడుతూ.. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు. విశాఖ పాలనా రాజధాని అయ్యేంత వరకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. జేఏసీ కో చైర్మన్ దేవుడు మాట్లాడుతూ అసమానతలతో కూడిన కేంద్రీకరణ వల్ల ఉత్తరాంధ్ర ప్రజలు చాలా నష్టపోయారని, అందుకే ఆర్థిక, సామాజిక వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. ఇందుకు హైదరాబాదే ఉదాహరణ అన్నారు. కేంద్రీకరణతో నష్టాలు, వికేంద్రీకరణ వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించాలన్నారు. సీఎం జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయం అమలు కాకుండా ప్రతిపక్షాలు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నాయని, వాటిని సమైక్యంగా తిప్పికొడదామని పిలుపునిచ్చారు. వికేంద్రీకరణ, విశాఖ పాలనా రాజధాని కోసం స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్ఎస్ శివశంకర్ సూచించారు. అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యే ఎస్కే రెహమాన్, ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధి ఎస్.రవీంద్ర, ఐఎన్టీయూసీ నాయకుడు మంత్రి రాజశేఖర్, వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, మత్స్యకార నేత శాంతారాం, ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్లు సీహెచ్ వెంకట్రావు, విజయ్‌కుమార్, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. తణుకులో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి కారుమూరి, వంక రవీంద్రనాథ్, తదితరులు ఉప్పెనలా తరలిరావాలి ఈనెల 15 విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీకి ప్రజలు ఉప్పెనలా తరలి వచ్చి, తమ ఆకాంక్షను తెలియజేయాలి. ఆదివారం నుంచి మండల, వార్డు, నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహించి విశాఖ పాలనా రాజధాని ఆవశ్యకతను అన్ని వర్గాల ప్రజలకు తెలియజేయాలి. – గుడివాడ అమర్నాథ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అవసరమైతే రాజీనామా చేస్తా విశాఖను పాలనా రాజధానిగా చేయడానికి మద్దతుగా అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. సంపద అంతా అమరావతిలోనే కేంద్రీకృతమైతే భవిష్యత్తులో ప్రత్యేక ఉత్తరాంధ్ర, ప్రత్యేక రాయలసీమ ఉద్యమాలు తలెత్తే ప్రమాదం ఉంది. విశాఖలో రాజధాని ఏర్పాటుకు ప్రైవేటు భూములు అవసరం లేదు. ప్రభుత్వ భూముల్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్ర విభజన సమయంలోనే విశాఖను రాజధానిగా చేయాల్సింది. కానీ చంద్రబాబు స్వార్థంతో చేయలేదు. – అవంతి శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నా.. మూడు రాజధానులకు మద్దతుగా నేను స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ సిద్ధం చేశాను. దానిని జేఏసీ చైర్మన్ లజపతిరాయ్‌కు అందజేస్తున్నా. వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా తన పదవికి రాజీనామా చేయాలి. అప్పుడు ఎన్నికలకు వెళదాం. ఆ ఎన్నికల్లో గెలిచిన వారి నిర్ణయాన్ని ప్రజల మనోభావాలుగా గుర్తించడానికి టీడీపీ సిద్ధమా? – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే హేలన, సవాళ్లతో యాత్రలా? అమరావతి రైతుల పేరిట చేస్తున్న పాదయాత్రలో ఉత్తరాంధ్ర వాసులను హేలన చేస్తున్నారు. సవాళ్లు విసురుతున్నారు. పాదయాత్ర అంటే ఇలా చేస్తారా? టీడీపీ సహా మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాదయాత్రకు నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం. మూడు రాజధానులకు అడ్డంకులు సృష్టిస్తున్న వారికి మన నిరసన తెలపాల్సిందే. – వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ అత్యధికులు వికేంద్రీకరణ వైపే మొగ్గు రాష్ట్రంలో 75 శాతం మంది వికేంద్రీకరణకే మొగ్గు చూపుతున్నారు. కేవలం 5 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. 20 శాతం మంది తటస్థంగా ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 80 శాతం మంది అనుకూలంగా, 15 శాతం మంది తటస్థంగా, 5 శాతం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహించాలి. విశాఖ రాజధాని అయితే రాష్ట్రమంతటికీ మేలు జరుగుతుంది. – బాలమోహన్‌దాస్, ఏఎన్‌యూ పూర్వ వైస్ ఛాన్సలర్ బాబు నేతృత్వంలోనే పాదయాత్ర చంద్రబాబు నేతృత్వంలోనే అమరావతి రైతుల పేరిట పాదయాత్ర జరుగుతోంది. అమరావతే అభివృద్ధి చెందాలని పనిగట్టుకుని ఎల్లో మీడియా అదేపనిగా వారికి మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తోంది. ఏపీకి ఆర్థిక పరిపుష్టి వికేంద్రీకరణతోనే సాధ్యం. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతమైతే ఇతర ప్రాంతాల వారంతా చాలా నష్టపోతారనడంలో సందేహం లేదు. – కేకే రాజు, నెడ్‌క్యాప్ చైర్మన్ -
తగ్గేదేలే! రాకెట్లా మార్కెట్లు రయ్..రయ్..
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. సోమవారం నాటి పతనంనుంచి భారీగా కోలుకున్న మార్కెట్లు మంగళవారం ఆరంభంలోనే 500 పాయింట్లు ఎగిసాయి. రోజంతా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాయి. ఒక దశంలో సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా జంప్ చేసింది. చివరికి సెన్సెక్స్ 1564 మార్కెట్లు ర్యాలీ అయ్యి 59537 వద్ద, నిఫ్టీ 446 పాయింట్ల లాభంతో 17759 వద్ద స్థిరపడ్డాయి. రియల్టీ, ఐటీ, బ్యాంకింగ్ ఇలా అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి. నిఫ్టీలో అసలు నష్టపోయిన షేర్ లేదంటే ఆశ్చర్యం లేదు. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, టెక్ మహీంద్ర, టీసీఎస్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, మారుతి యాక్సిస్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. రేపు (బుధవారం) వినాయక చవితి సందర్భంగా మార్కెట్లు మూత పడతాయి. షార్ట్ కవరింగ్ ప్రభావితం చేసినట్టు ఎనలిస్టులు భావిస్తున్నారు. మరోవైపు రూపీ డాలరు మారకంలో 63పైసలు ఎగిసి 79.45 వద్ద ముగిసింది. -
ఎటుచూసినా సంబరమే
సాక్షి నెట్వర్క్: కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇంకా ర్యాలీలు, క్షీరాభిషేకాలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. విశాఖ ఆర్కే బీచ్‌లో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, ప్రజలు పాల్గొన్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం ఇక సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచినందుకు కృతజ్ఞతగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ‘జగనన్న వరం.. సర్వేపల్లి జననీరాజనం’ పేరిట వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం మనుబోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అన్నమయ్య జిల్లాకు మద్దతుగా ర్యాలీ ప్రస్తుతమున్న చిత్తూరు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాకు మద్దతుగా ‘థాంక్యూ సీఎం సార్’.. అంటూ కలికిరి పట్టణంలో బుధవారం ప్రజలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అందరికీ ఆమోదయోగ్యంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం శుభపరిణామమన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. -
తిరుపతి : మూడు రాజధానులకు మద్దతుగా భారీ ర్యాలీ
-
Andhra Pradesh: 'త్రి'కేంద్రీకరణే కావాలి
మూడు రాజధానులకు మద్దతుగా గురువారం తిరుపతిలో ప్రజలు, విద్యార్థులు కదం తొక్కారు. ‘పరిపాలన వికేంద్రీకరణ జరగాలి.. రాయలసీమను అభివృద్ధి చేయాలి’, ‘అమరావతి ఒక్కటే వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. రాయలసీమ ప్రజల మనోభావాలను గుర్తించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు పరిశ్రమకు భూములిచ్చిన రైతులదే నిజమైన త్యాగమంటూ గొంతెత్తారు. గతంలో రాజధానిని వదులుకున్న కర్నూలు ప్రజలదే గొప్ప త్యాగమని నినాదాలు చేశారు. రాజధాని పేరుతో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారంటూ మండిపడ్డారు. యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): పరిపాలన వికేంద్రీకరణ – మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని డిగ్రీ, పీజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి, ఎస్డీహెచ్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డీవీఎస్ చక్రవర్తిరెడ్డి, అంబేడ్కర్ న్యాయ కళాశాల చైర్మన్ ఆర్.తిప్పారెడ్డిలతో పాటు విద్యార్థి, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. కృష్ణాపురం ఠాణా నుంచి ప్రారంభమైన ర్యాలీ.. నగరపాలక సంస్థ కార్యాలయం వరకూ సాగింది. అమరావతి వద్దు.. 3 రాజధానులు ముద్దు.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి.. రాయలసీమను అభివృద్ధి చేయాలి.. అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, 3 రాజధానులకు మద్దతుగా ఈ నెల 18న నిర్వహించే రాయలసీమ చైతన్య సదస్సును విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు.. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనపెట్టి అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారన్నారు. అమరావతి ఒక వర్గానికే చెందిన రాజధాని అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి ఒక్కటే కాదు.. 13 జిల్లాలని చెప్పారు. రాయలసీమ ప్రాంతం తీవ్రంగా వెనుకబడి ఉందని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు, అవసరాలను గుర్తించాలని కోరారు. సీమలో ఉన్న కొందరు నాయకులు అమరావతిని సమర్థించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చామని చెపుతున్న అమరావతి రైతులు చేసింది త్యాగం కాదని.. అది వ్యాపారమని, శ్రీశైలం ప్రాజెక్ట్, విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన రైతులదే నిజమైన త్యాగమన్నారు. రాజధాని పేరిట చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్‌ను ప్రోత్సహిస్తున్నారని పురుషోత్తంరెడ్డి ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్వీయూ ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి, ఎస్డీహెచ్ఆర్ విద్యా సంస్థల డైరెక్టర్ డి.రామసునీల్‌రెడ్డి, సీకాం విద్యాసంస్థల చైర్మన్ సురేంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎల్.రాజశేఖర్‌రెడ్డి, రచయిత్రి మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రికవరీ కళకళ : సెన్సెక్స్ హై జంప్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. గత వారంలో భారీగా నష్టపోయిన మార్కెట్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో కళకళ లాడుతున్నాయి. షార్ట్ కవరింగ్ కారణంగా కీలక సూచీలు లాభపడుతున్నాయని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అప్రమత్తత అవసరం మని హెచ్చరిస్తున్నారు. సెన్సెక్స్ ఆరంభ లాభాలనుంచి పుంజుకుని ప్రస్తుతం 750 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ డబుల్ సెంచరీ లాభాలతో దూసుకపోతోంది. ప్రధానంగా ఐటీ, మెటల్, బ్యాంకింగ్ షేర్లు లాభాలతో కొనసాగుతున్నాయి. ఐసీఐసీఐబ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్, జీ, ఐవోసీ, వేదాంతా, యూపీఎల్, ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటన్ లాభపడుతుండగా, కోటక్ మహీంద, టెక్ మహీంద్ర నష్టపోతున్నాయి. అటు డాలరుమారకంలో రూపాయి కూడా లాభాలతో పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించింది. 20 పైసలు ఎగిసి 72.04 వద్ద కొనసాగుతోంది. చదవండి: రూ.2 వేల నోటు : ఆర్థికమంత్రి కీలక ప్రకటన కోవిడ్ క్రాష్ : అంబానీకి నష్టం ఎంతంటే? -
హాంకాంగ్‌లో భారీ ర్యాలీ
హాంకాంగ్: హాంకాంగ్‌లోని ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులు నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్య ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞచేశారు. గత ఏడు నెలలుగా లక్షలాది హాంకాంగ్‌వాసులు ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరసనలు చేస్తున్నారు. కొత్తే ఏడాది సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో లక్షలాది మంది ఆందోళనకారులు పాల్గొన్నారు. వారి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెప్పర్ స్ప్రే, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ఆందోళనకారులపై ప్రయోగించారు. ప్రతిగా పోలీసులపై పెట్రోల్ బాంబులను ఆందోళనకారులు విసిరారు. వీధుల్లోని చైనా అనుకూల వ్యాపార సముదాయాలను ధ్వంసం చేశారు. కాగా, 100 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. -
రెండో రోజూ స్టాక్‌మార్కెట్ల దూకుడు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ లాభాలను చివరివరకూ నిలబెట్టుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ మదుపర్ల పెట్టుబడులజోష్, దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో... సెన్సెక్స్ ఒక దశలో 507 పాయింట్లు లాభపడింది. చివరికి సెన్సెక్స్ 481 37535 వద్ద, నిఫ్టీ 133 11301 వద్ద ముగిశాయి. అన్ని సెక్టార్లు లాభాల దౌడు తీశాయి. ముఖ్యంగా బ్యాంకు నిఫ్టీ కొనుగోళ్ల జోరుతో బ్యాంక్ ఆల్ టైం హై రికార్డును నమోదు చేసింది. దాదాపు అన్ని సెక్టార్లు పాజిటివ్‌గానే ముగియడం విశేషం. యాక్సిస బ్యాంకు, ఐసీఐసీఐబ్యాంకు, టైటన్, ఆర్ఐఎల్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి. భారతి ఎయిర్టెల్, ఎల్ అండ్‌టీ, సన్ పార్మ, అదానీ పోర్ట్స్ టాప్ విన్నర్స్‌గా నిలవగా, భారతి ఇన్ఫ్రాటెల్, హిందుస్తాన్ పెట్రోలియం, జెఎస్ డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీటీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. -
కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్ల దూకుడు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు దూకుడు మీద ఉన్నాయి. ఆరంభంనుంచి నిన్నటి జోష్‌ను కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ కూడా 145 పాయింట్లు ఎగిసింది సెన్సెక్స్ 37554 వద్ద, నిఫ్టీ 11310 వద్ద కొనసాగుతున్నాయి. అన్ని సెక్టార్లు లాభాల దౌడు తీస్తున్నాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లు భారీగా లాభపడుతున్నాయి. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ కంపెనీ, ఎల్ అండ్ టీ షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. భారతి ఇన్ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, భారతి ఎయిర్టెల్, యూపీఎల్ షేర్లు టాప్ లూజర్స్‌గా ట్రేడవుతున్నాయి. -
స్టాక్‌మార్కెట్‌కు ఎన్నికల కిక్
సాక్షి, ముంబై : స్టాక్‌మార్కెట్లకు ఎన్నికల కిక్ బాగానే తాకింది. ప్రపంచ మార్కెట్ల బలహీనతల నేపథ్యంలోనూ ఉత్సాహంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు రోజంతా లాభాలతో దౌడు తీశాయి. డబుల్, ట్రిపుల్ సెంచరీ,చివర్లో మరింత ఎగిసి క్వాడ్రపుల్ సెంచరీని ( 400 పాయింట్లు) సైతం సాధించింది. దీంతొ కీలక సూచీలు ఏడాదిలో అత్యంత గరిష్టాన్ని తాకాయి. చివరికి 37,000 పాయింట్ల మైలురాయిని స్థాయికి ఎగువన దృఢంగా ముగిసింది. సెన్సెక్స్ 383 పాయింట్లు జంప్ చేసి 37,054 వద్ద, నిఫ్టీ 133 పాయింట్లు ఎగిసి 11,168 వద్ద ముగిసింది. 2018 సెప్టెంబరు తరువాత (సెన్సెక్స్ 37,121, నిఫ్టీ 11169)ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. లోక్‌సభకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ఉన్నట్టుండి జోష్‌వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాలూ లాభాల్లో ముగిసాయి. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో 2.5 శాతం చొప్పున ఎగియగా, ఈ బాటలో ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రియల్టీ సైతం 1 శాతం చొప్పున బలపడ్డాయి. ఎయిర్టెల్ 8.5 శాతం దూసుకెళ్లగా.. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐషర్, ఇన్ఫ్రాటెల్, పవర్‌గ్రిడ్, కోల్ ఇండియా, ఐవోసీ, ఆర్ఐఎల్, హిందాల్కో 5.6-3 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో ఎన్టీపీసీ, టీసీఎస్, జీ, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా మాత్రమే అదికూడా 1-0.5 శాతం మధ్య నష్టపోయాయి. -
బీసీల మద్దతు వైఎస్ఆర్సీపీకే
-
ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
-
విజయవాడలో కేబుల్ ఆపరేటర్ల భారీ ర్యాలీ
-
మండపేటలో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ
-
నారాయణపేటను జిల్లా చేయాలి
జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన నారాయణపేట: మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేటను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం, వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నారాయణపేట జిల్లా సాధన కోసం ఈ నెల 5 నుంచి నిర్వహించే 48 గంటల బంద్లోను, 6న మరికల్లో జరిగే హైవే దిగ్బంధంలో సకలజనులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా సాధన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రాజీనామా లేఖ నారాయణపేటను జిల్లాగా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి మంగళవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని సీఎం కేసీఆర్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపిస్తున్నట్లు తెలిపారు. మక్తల్‌ను మహబూబ్‌నగర్‌లోనే కొనసాగించాలి మక్తల్: మక్తల్ నియోజకవర్గాన్ని మహబూబ్‌నగర్‌లోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల బంద్ మొదటి రోజు మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. కాగా, మక్తల్‌ను మహబూబ్‌నగర్‌లోనే కొనసాగించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సెల్‌టవరెక్కిన ఇద్దరు యువకులు చేగుంట: మెదక్ జిల్లాలోని నార్సింగిని మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జెట్టి శ్రీనివాస్, మైలారం రాజులు మంగళవారం సెల్‌టవర్ ఎక్కారు. ఇప్పటికే నార్సింగి మండలం కోసం గ్రామానికి చెందిన అంచనూరి రాజేశ్, మల్లాగౌడ్ , సిద్దారెడ్డి నిరాహార దీక్ష చేస్తున్నారు. గ్రామానికి చెందిన సందీప్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండల ఏర్పాటుపై ప్రకటన వచ్చే వరకు టవర్ దిగమని యువకులు తెలిపారు. -
‘హోదా’ దగాపై.. ఆగ్రహోదగ్రం
-
‘హోదా’ దగాపై.. ఆగ్రహోదగ్రం
కాకినాడ: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేటలో భారీ ర్యాలీ జరిగింది. చంద్రబాబు, మోదీల తీరును నిరసిస్తూ ‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ అంటూ నినదించారు. జగ్గంపేట మెయిన్‌రోడ్ నుంచి పంచాయితీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల మాట్లాడుతూ ప్రత్యేక హోదా ప్రకటనపై వేయికళ్లతో ఎదురు చూస్తే ప్రధాని ప్రజల నోట్లో మట్టికొట్టారని, సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో హోదా ప్రస్తావన కూడా తేలేదని విమర్శించారు. జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటీలో.. ప్రధాని మోదీ తెలుగు ప్రజల నోట్లో మట్టికొట్టారని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విమర్శించారు. రాజమండ్రిలో ఆదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుల ఆధ్వర్యంలో నాయకులు చెవిలో పూలతో నిరసన తెలిపారు. స్థానిక జాంపేట గాంధీబొమ్మ సెంటర్లో మానవహారం నిర్వహించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ పుష్కరాలరేవులో జలదీక్ష చేశారు. చంద్రబాబు ప్రజలను నిండా ముంచారని విమర్శించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో.. ఏలేశ్వరంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో మోదీ, చంద్రబాబుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే వరుపుల మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై వెనుకడుగు వేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను హెచ్చరించారు. కొత్తపేటలో.. ప్రధాని మోదీ ప్రత్యేక హోదా ప్రకటించకుండా శంకుస్థాపనకు వచ్చి వెళ్లిపోవడాన్ని నిరసిస్తూ కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేశారు. రావులపాలెంకు చెందిన వ్యాపారి మన్యం గంగయ్య ఇటీవల పుష్కరాలకు వెళ్లి తీసుకొచ్చిన యమునానదీజలాలతో మహాత్మాగాంధీ విగ్రహానికి అభిషేకంచేసి నివాళులర్పించారు. తునిలో.. ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వైఖరికి నిరసనగా పార్టీ కార్యాలయం నుంచి గాంధీ సత్రం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా ప్రకటించాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో మోదీ ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చారని, ఆయనపై ఒత్తిడి తీసుకు రావడంలో చంద్రబాబు విఫలమయ్యూరని విమర్శించారు. రంపచోడవరంలో.. శంకుస్థాపన పేరిట రూ.400కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసిన రాష్ర్ట ప్రభుత్వం ఏపీకి అవసరమైన ప్రత్యేక హోదాపై ప్రధానితో ప్రకటన చేయించలేకపోరుుందని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ధ్వజమెత్తారు. రంపచోడవరంలో ఆమె ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా చేశారు. అమలాపురంలో.. పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో మోదీ, చంద్రబాబుల మనసు మారాలంటూ గాంధీ బొమ్మ సెంటర్లో ధర్నా చేశారు. గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. చిట్టబ్బాయి మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో మోదీ, బాబుల ముసుగు తొలగిపోయిందని, వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రాజమండ్రి రూరల్‌లో.. మాజీ ఎంపీ, రూరల్ కో ఆర్డినేటర్ గిరజాల వెంకట స్వామి నాయుడు ఆధ్వర్యంలో కడియంలో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గిరజాల బాబు తదితరులు పాల్గొన్నారు. కాతేరులో మరో కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన ర్యాలీ చేశారు. రాజానగరంలో.. ప్రధాని రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాకపోయినా ప్రగతికి అవసరమైన వరాలు కురిపిస్తారని ఆశించిన రాష్ట్ర ప్రజలకు పార్లమెంటు మట్టి, యమునానది నీళ్లు తీసుకువచ్చి నిరాశకు గురిచేశారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. రాజానగరంలో ఆమె ఆధ్వర్యంలో ప్రధాని, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను తగలబెట్టేందుకు ప్రదర్శన జరుగుతుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అప్పటికప్పుడు వేరే దిష్టిబొమ్మలను సిద్ధం చేసి సమీపంలో ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు. పిఠాపురంలో.. పిఠాపురంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పార్టీ గాంధీ విగ్రహం వద్ద మట్టి, నీరు పారబోసి వినూత్న నిరసన తెలిపారు. మోదీ ప్రజల నోట్లో మట్టికొట్టాడని నినాదాలు చేశారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల చెవిలో పూలు పెట్టాడంటూ చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. రాష్ర్ట బీసీ సెల్ కార్యదర్శి వెంగళి సుబ్బారావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ముమ్మిడివరంలో.. ముమ్మిడివరంలో కో ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై పార్టీ నాయకులు ధర్నా చేశారు. మోదీ, చంద్రబాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పెద్దాపురంలో.. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి పట్టణంలో ప్రదర్శన చేసి గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనపర్తిలో.. అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీబొమ్మ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. మండపేటలో.. మండపేట కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కళ్లకు గంతలతో నిరసన తెలిపి వైఎస్సార్ మెమోరియల్ పార్కు వద్ద గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రాష్ర్ట రైతు విభాగం కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు, రాష్ర్ట కమిటీ సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మరో కో ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద కళ్లకు గంతలతో నిరసన తెలిపారు. అక్కడి గాంధీ విగ్రహానికివినతిపత్రం సమర్పించారు. రాష్ర్ట కార్యదర్శి కర్రి పాపారాయుడు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో.. నియోజకవర్గంలోని గంగవరంలో పార్టీ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పెట్టా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రధాని, ముఖ్యమంత్రి తీరును ఎండగడుతూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. కాకినాడ సిటీలో.. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మనసు మార్చాలని కోరుతూ కాకినాడ గాంధీబొమ్మ సెంటర్లో మహాత్ముని విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తొలుత భాస్కరా బిల్డింగ్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు బైకు ర్యాలీ చేశారు. రాష్ర్ట ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ర్ట సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణరావు, బీసీ సెల్ రాష్ర్ట కార్యదర్శి మీసాల దుర్గాప్రసాద్, జిల్లామైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌లో.. రూరల్ నియోజకవర్గం కొవ్వాడలో గాంధీ విగ్రహం వద్ద పార్టీ నాయకులు ధర్నా, రాస్తారోకో చేశారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో రాష్ర్ట కార్యదర్శి కాలా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. పి.గన్నవరంలో.. నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో అంబాజీపేట సెంటర్లో నాయకులు రాస్తారోకో చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ రాష్ర్ట నాయకులు ముత్తాబత్తుల మణిరత్నం తదితరులు పాల్గొన్నారు. రాజోలులో.. రాజోలులో కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరాహార దీక్షలు చేశారు. మరో కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు ఆధ్వర్యంలో మలికిపురంలో భారీ నిరసన ర్యాలీ చేశారు. -
‘దేశం’ పాలనలో రక్షణ కరువు
కడప కార్పొరేషన్: రిషితేశ్వరి ఆత్మహత్యను నిరసిస్తూ వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోటిరెడ్డి సర్కిల్లో మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా మాట్లాడుతూ నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతానికి రిషితేశ్వరి బలి కావడం దారుణమన్నారు. రిషితేశ్వరి మరణించి 22 రోజులవుతున్నా నిందితులను ఇప్పటి వరకూ అరెస్ట్ చేయకపోవడాన్ని బట్టి పోలీసు యంత్రాంగం ఉందో లేదో అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ కేసును నీరుగార్చడానికే ప్రభుత్వం కమిటీ వేసిందని ధ్వజమెత్తారు. కేసు విచారణ కోసం నియమించిన కమిటీలో పలు ఆరోపణలు ఉన్న విక్రమపురి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ వీరయ్యను నియమించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. గతంలో విద్యార్థులు ఈయన వ్యవహార శైలిపై ఆందోళనలు నిర్వహించారన్నారు. అలాగే కమిటీలోని మిగతా సభ్యులు కూడా టీడీపీకి అనుకూలమైన వ్యక్తులేనని ఆరోపించారు. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు, విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రిషితేశ్వరి కే సును హైకోర్టు జడ్జిచే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతకుముందు వారు ఆర్టీసీ బస్టాండు నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మహ్మద్ అలీ, నాగార్జున రెడ్డి, నిత్యపూజయ్య, అబ్బాస్, సొైహైల్, షఫీ, పెంచలయ్య, సునీల్‌కుమార్‌రెడ్డి, రాజ, రమణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక హక్కులను హరిస్తే సహించం
వాడవాడలా మేడే వేడుకలు నెల్లూరు(సెంట్రల్): కార్మిక హక్కులను హరిస్తే సహించేది లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్ చెప్పారు. మేడే సందర్బంగా నగరంలోని ఏబీఎం కాంపౌండు నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్టీసీ బస్టాండు వద్ద బహిరంగసభ ఏర్పాటుచేశారు. అజయ్‌కుమార్ మాట్లాడుతూ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం మొసలి కన్నీరు కార్చిన టీడీపీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టారని ఆందోళన చెందారు. బహుళజాతి కంపెనీలకు భూములు అప్పగిస్తూ రైతులు, కూలీలు, కార్మికుల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం నగర, రూరల్ కార్యదర్శులు మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రెపరెపలాడిన ఎర్రజెండాలు.. మేడే సంద ర్భంగా నగరంలో పలు చోట్ల ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. ఆత్మకూరు బస్టాండు ,కనకమహల్, వీఆర్సీ, మద్రాసు బస్టాండు, ఆర్టీసీ, పలు చోట్ల ఎర్రజెండాలతో నగరం నిండిపోయింది. కనకమహల్ సెంటరులో సీపీఎం నాయకులు ఎర్రజెండాలతో ఆ ప్రాంతాన్ని నింపారు. పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కార్మికుల పక్షాన పోరాడిన తీరును గుర్తు చేసుకున్నారు. సీపీఎం సీనియర్ నాయకులు జక్కా వెంకయ్య మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చంద్రారెడ్డి, సూర్యనారాయణ, మస్తాన్‌బీ, గోపాల్, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఏం మాయ రోగమొచ్చిందో..?
కదిరి: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏం మాయరోగమొచ్చిందో తెలీదు గానీ.. ఆయన మాత్రం ఒక కొడుకుతోనే చాలించి, మన ల్ని మాత్రం పిల్లల్ని కనండి..కనండి అంటున్నారు’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ తీవ్ర విమర్శలు చేశారు. సీపీఐ 22వ జిల్లా మహాసభల సందర్బంగా ఆదివారం కదిరి పట్టణంలో చేపట్టిన భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీరు ఆ పార్టీ నాయకులకే నచ్చలేదన్నారు. ఎంపీ దివాకర్‌రెడ్డికి అస్సలు నచ్చడం లేదన్నారు. కేంద్రంపై మెతక వైఖరితో మెలగాలని ఆయన తన పార్టీ ఎంపీలకు చెప్పిన మాటలను చూస్తే చంద్రబాబు ఎంత దిగజారి పోయారో అర్థం చేసుకోవచ్చునన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ చంద్రబాబు వెంట ఇప్పుడు అసలైన తెలుగుదేశం వారెవ్వరూ లేరన్నారు. నారాయణ, మురళీమోహన్, గళ్లా జయదేశ్ లాంటి కుబేరులే ఉన్నారన్నారు. జిల్లాలో 25 లక్షల ఎకరాలు సాగుభూమి ఉందన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే అందులో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా పోరాటం చేద్దామని చెప్పారు. సీపీఐ కదిరి డివిజన్ కార్యదర్శి వేమయ్యయాదవ్ మాట్లాడుతూ వలసల వల్ల గ్రామాల్లో ఇళ్లన్నీ తాళాలతో దర్శనమిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నేతలు రమణ, జాఫర్, మల్లికార్జున, కాటమయ్య, రాజారెడ్డి, అమీనమ్మ, కమలమ్మ, సంజీవప్ప, కేశవరెడ్డి, లింగమయ్య, నారాయణస్వామి, గోవిందు, పద్మావతమ్మ, శ్రీరాములు, రుద్రయ్య, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాన్సన్, నరేష్, కేవై ప్రసాద్, రమణయ్య, స్థానిక నాయకులు ఇషాక్, కదిరప్ప, లియాకత్, రాజేంద్ర, రమేష్, మనోహర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఎరుపెక్కిన పట్టణం : సీపీఐ మహాసభల సందర్భంగా పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణమంతా ఎరుపెక్కింది. బహిరంగ సభకు జనం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పట్టణం హోరెత్తింది. ర్యాలీలో డ ప్పులు, చక్క భజనలు, లంబాడీల సాంప్రదాయ నృత్యాలు పట్టణ ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. జనసేవాదల్ పేరుతో శిక్షణ పొందిన కామ్రేడ్స్ కవాతు నిర్వహించారు. సుమారు కిలీ మీటరుకు పైగా ర్యాలీ కనబడింది. 3 రోజుల పాటు సాగనున్న జిల్లా మహాసభల్లో భాగంగా తొలిరోజు చేపట్టిన ర్యాలీ, బహిరంగ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం కనబడింది. -
కార్మిక శక్తిని దోచుకుంటే ప్రతిఘటనే
కర్నూలు(రాజ్‌విహార్) : సంస్కరణలు, వ్యతిరేక విధానాలతో కార్మిక శక్తిని దోచుకుంటే ప్రతిఘటన తప్పదని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షుడు ఎ.కె. పద్మనాభన్ హెచ్చరించారు. శనివారం కర్నూలులో ప్రారంభమైన సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సుందరయ్య భవన్ నుంచి పాతబస్తీ మీదుగా పాతబస్టాండ్ వరకు పది వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో వెయ్యి మంది ఎర్రచొక్కాలు ధరించి ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పాతబస్టాండ్‌లోని అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చట్టాల సవరణ పేరుతో కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడంతో ప్రభుత్వ రంగ సంస్థలు కుదేలవుతాయని చెప్పారు. రైల్వే, ఇన్సూరెన్స్, విమానయాన, పోస్టల్ వంటి శాఖల్లో ఎఫ్‌డీఐల ప్రవేశం ప్రమాదకరమన్నారు. విదేశీ సంస్థలు, దేశంలోని బడాబాబుల సంస్థలకు దోచిపేట్టేందుకు ఈ సంస్కరణలు తీసుకోస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే విధానాలను అనుసరిస్తోందని గుర్తు చేశారు. దీనిపై ఇప్పటికే కార్మిక సంఘాలు నిరసనలు తెలుపుతూ వస్తున్నాయని చెప్పారు. వచ్చే 2015 సంవత్సరాన్ని చావుబతుకుల పోరాట సంవత్సరంగా పరిగణించి సమరశీల పోరాటాలు నిర్వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. లేనిపక్షంలో కార్మిక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్య పోరాటాలతోనే పెట్టుబడిదారులు వేసిన బానిస సంకెళ్లు తెగుతాయని చెప్పారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన ఆయన అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులను ఇంటికి పంపే పనిపెట్టుకున్నారని పేర్కొన్నారు. ఐకేపీలోని యానిమేటర్లు రెండు నెలలుగా సమ్మె చేస్తూ రోడ్డున పడినా కనీసం చర్చలకు పిలిచిన పాపాన పోలేదన్నారు. ఇటు లక్ష మంది అంగన్వాడీ కార్మికులు వేతనాలు పెంచాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇటు హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లను తొలగించిన చంద్రబాబు సర్కారు ఆశావర్కర్ల, మున్సిపల్, మెడికల్ అండ్ హెల్త్, విద్యుత్ రంగ కార్మికులను ఇంటికి పంపేందుకు కుట్ర పన్నుతున్నారని చెప్పారు. వేతనం పెంచమని అడిగిన ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్న ఘనుడు చంద్రబాబు అన్నారు. రుణ మాఫీ పేరుతో రైతులను మోసం చేశారని, రూ.80 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పిన ఆయన కేవలం రూ.4500 కోట్లతోనే సరిపెట్టారని ఎద్దేవా చేశారు. కురు వృద్ధులు, భర్తలు లేని వితంతువులు, శారీరక వైకల్యం ఉన్న వికలాంగులకు ఇచ్చే పింఛన్లకు వంద కండీషన్లు పెట్టి 70 శాతం అర్హుల పేర్లను తొలగించి పేదల ఉసురు పోసుకున్నారని గుర్తు చేశారు. ఈ పాపం చంద్రబాబుకు అంటకపోదన్నారు. జిల్లాభివృద్ధి కోసం అరచేతిలో వైకంఠం చూపిన ఆయన ఇంకెన్నాళ్లు మోసగిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక రోబో (చంద్రబాబు) ఇతర జీరోల (మంత్రులు) పాలన సాగుతోందని, బాబు మనస్సులేని యంత్రంలా వ్యవహరిస్తే జీరోలుగా మారిన మంత్రులు మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ సభకు జిల్లా అధ్యక్షుడు బి. రామాంజనేయులు అధ్యక్షత వహించగాా ఆ సంఘం అఖిల భాతర కార్యదర్శి డాక్టరు హేమలత, బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడు పి. అశోక్‌బాబు, ఏపీ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఛైర్మన్ ఎం. జనార్దన్ రెడ్డి, ఏపీఎం ఎస్ఆర్యూ రాష్ట్ర కార్యదర్శి రాజామోహన్, పోస్టల్ సీ-3 సర్కిల్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఐసీఈయూ కడప డివిజినల్ కార్యదర్శి సుభశేఖర్, సీఐటీయూ కర్నూలు జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కడుపు కొట్టకండి బాబూ..
కదిరి టౌన్/పెనుకొండ/ కళ్యాణదుర్గం రూరల్/అనంతపురం క్రైం : ‘‘ఇంటికో ఉద్యోగమిస్తామని ఎన్నికలకు ముందు హామీల మీద హామీలిచ్చారు.. తీరా అధికారంలోకి వచ్చాక ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు.. ఇలా ఒక్కొక్కరిని తొలగించుకుంటూ పోతున్నారు. ఇదెక్కడి న్యాయం’ అంటూ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రశ్నించారు. తమను తొలగించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గం, అనంతపురంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన బాట పట్టారు. కదిరిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ధర్నా చేశారు. పెనుకొండలో.. డివిజన్ పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ నాయకులతో కలిసి బస్టాండ్ నుంచి దర్గా సర్కిల్, అంబేద్కర్ నగర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని బైఠాయించారు. కళ్యాణదుర్గంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి టీ సర్కిల్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ‘బాబు వస్తే జాబు అన్నారు.. బాబు వచ్చె.. జాబు పోయె అన్నట్లుంది పరిస్థితి.. సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ఆయా ప్రాంతాల్లో నాయకులు మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమని, ఉద్యోగాల్ని మాత్రం వదులుకునేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్ణయంతో జిల్లాలో 850 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 200 మంది మేట్లు ఉద్యోగాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఉద్యోగ భద్రత కల్పించాలని, సీనియర్ మేట్లను ఫీల్డ్ అసిస్టెంట్లుగా చేయాలన్నారు. నెలసరి వేతనం రూ.13 వేలకు పెంచి బకాయిలు చెల్లించాలన్నారు. ఇప్పటికే తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఏడాది కాంట్రాక్ట్ ఒప్పందాన్ని రద్దు చేయాలని, వికలాంగులైనఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కూలీల వేతన బకాయిలు చెల్లించాలని, కూలి రూ.250కు పెంచడంతో పాటు క్యూబిక్ మీటర్ రేటు పెంచాలన్నారు. అర్హులైన ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఓ, టీఏ, ఏపీఓ, ఈసీ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కదిరిలో ఆర్డీఓ రాజశేఖర్, పెనుకొండలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి, కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరికి వినతిపత్రాలు అందజేశారు. అనంతపురంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు వెంకటేష్, అధ్యక్షుడు నరసింహులు ఆర్డీఓ హుసేన్‌సాహెబ్‌ను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. మంత్రి వర్గం సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని ఓ శాఖ మంత్రి చేస్తున్న ప్రకటనలు వేలాది కుంటుంబాలకు తీరని ఆవేదనను మిగిల్చుతోంద ని వారన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు అవినీతి పరులని, కోట్లకు పడగలెత్తారని మంత్రి మీడియా ముందు లేని పోని ప్రకటనలిస్తున్న తీరు అందరినీ కలచి వేస్తోందన్నారు. ఆందోళన కార్యక్రమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి సరస్వతి, సీఐటీయూ కదిరి డివిజన్ కార్యదర్శి జీఎల్ నరసింహులు, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మినారాయణ, పెనుకొండ డివిజన్ అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలునాయక్, సీఐటీయూ కళ్యాణదుర్గం డివిజన్ కార్యదర్శి రంగనాథ్, రెవెన్యూ డివిజన్ అధ్యక్షుడు మురళి, మండలాధ్యక్షులు సర్వోత్తమకుమార్, పెద్ద సంఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
ఏమిటీ దారుణం
సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరు సాగిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై విభజన బిల్లును రాష్ట్రం దాటించినా.. పార్లమెంట్లో బిల్లును అడ్డుకునేందుకు ప్రజా మద్దతు కూడగడుతోంది. సమైక్య గళం ఢిల్లీకి వినిపిస్తోంది. గురువారం పార్లమెంట్లో ఎంపీల బహిష్కరణను నిరసిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఉద్యోగ.. ఉపాధ్యాయ.. న్యాయవాద సంఘాలతో పాటు వైఎస్ఆర్ విద్యార్థి సంఘం కదంతొక్కాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడగా.. వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. విభజనకు వ్యతిరేకంగా విద్యార్థుల నినాదాలు హోరెత్తాయి. సాక్షి, కర్నూలు: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన బంద్ విజయవంతమైంది. వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ నగర కన్వీనర్ టి. అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సా ర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుంచి ర్యాలీగా బయలు దేరి కొండారెడ్డి బురుజు సర్కిల్ మీదుగా రాజ్‌విహార్ సెంటర్‌కు చేరుకుని రెండు గంటల పాటు అక్కడ రాస్తారోకో జరిపారు. దీంతో నలువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. నారాయణ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున రాస్తారోకోలో పాల్గొని సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. అలాగే న్యాయవాదులు సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. రాజ్‌విహార్ సర్కిల్లో దిష్టిబొమ్మను దహనం చేశారు. డోన్: పార్టీ కార్యాలయం నుంచి జాతీయ రహదారి వరకు వాహనాలలో ర్యాలీగా బయల్దేరి అనంతరం ఐటీఐ కళాశాల వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన రాస్తారోకోతో వాహనాలు బారులు తీరాయి. మండలంలోని చిన్నమల్కాపురం గ్రామంలో.. ప్యాపిలి పట్టణంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించి బంద్ నిర్వహించారు. కోవెలకుంట్ల : వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, మండల క న్వీనర్ గాండ్ల పుల్లయ్య నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తెల్లవారుజామున ఉదయం 5 గంటలకే ఆర్టీసీ డిపోకే చేరుకుని బస్సుల రాకపోకలు అడ్డుకున్నారు. డిపోలోని 62 బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. పట్టణంలో వ్యాపారసంస్థలు, దుకాణాలు మూసివేసి బంద్ కు సహకరించాలని కోరారు. బస్టాండ్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా నిర్వహించారు. బనగానపల్లె : వైఎస్ఆర్సీపీ మైనార్టీనాయకుడు ఫిదాహుస్సేన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలను మూసివేయించారు. నియోజకరవ్గ సమన్వయకర్త ఎర్రబోతుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కొలి మిగుండ్లలో ధర్నా నిర్వహించారు. సమైక్యమే ఎజెండా కావాలి నంద్యాల, న్యూస్‌లైన్: సమైక్యరాష్ట్ర పరిరక్షణే అన్ని పార్టీల ఎజెండా కావాలని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమానాగిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నంద్యాల పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రకు చెందిన అన్ని రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు మూకుమ్మడిగా పోరాడితే తప్ప రాష్ట్రం సమైక్యంగా ఉండబోదని భూమా అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన వ్యవహారం చివరి అంకానికి చేరుకుందని, రాజకీయాలకు అతీతంగా పోరాటం జరపాలని కోరారు. అన్ని పార్టీలు సమైక్యమే ఎజెండాగా కొనసాగాలన్నారు. సమైక్యాంధ్ర కోరితే ఏ జిల్లాలను ఏ ప్రాంతంలో కలిపే అవకాశం లేకుండా పోతుందన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతిపాదన తెస్తే ఉద్యమం నీరుగారిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. సమైక్యాంధ్ర ప్రతిపాదన తప్ప మరొక ప్రతిపాదన ఉండవద్దని పరోక్షంగా కేంద్ర మంత్రి కావురి సాంబశివరావుకు సలహా ఇచ్చారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఆడిన నాటకంతోనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఆ రెండు పార్టీలు ఇప్పటికీ తమ వైఖరి మార్చుకోవడం లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికీ సమన్యాయం అంటూ ఇరు ప్రాంతాలకు చెందిన ఎంపీలతో డ్రామాలు ఆడిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం కూడా ఏకపక్షంగా వ్యవహరించకూడదన్నారు. లోకసభకు ఉన్న మర్యాదను, గౌరవాన్ని మంట కలిపిన ఘనత యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి దక్కిందన్నారు. రాష్ట్రంలో రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రశాంత పరిస్థితులు లేకపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. రాష్ట్ర శ్రేయస్సునే లక్ష్యంగా చేసుకొని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోతూ పోరాటం చేస్తున్నారన్నారు. సమైక్య రాష్ట్రం కోసం చిత్తశుద్ధిగా పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనేనన్నారు. కాంగ్రెస్, టీడీపీలదే విభజన పాపం కల్లూరు, న్యూస్‌లైన్: విభజన పాపం కాంగ్రెస్, టీడీపీలదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రెండో రోజు బంద్ విజయవంతమైంది. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు గుత్తిరోడ్డులోని ఫ్లైఓవర్ వద్దకు చేరుకుని 44వ నంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ నిరసనలో గౌరుదంపతులు పొల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్లో చడీచప్పుడు కాకుండా 10 సెకండ్లలో టీ బిల్లును ప్రవేశపెట్టామని చెప్పడం కాంగ్రెస్ పార్టీ నాయకుల చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు అర్థంకాని రీతిలో బిల్లు ప్రవేశపెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. టీ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కూడా తెలుగుదేశం పార్టీ రెండు నాల్కల ధోరణి అవలంబించిందన్నారు. ఆ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలను ఒకవైపు, సీమాంధ్ర ఎంపీలను మరోవైపు ఎగదోసేందుకే చంద్రబాబు నాయుడు.. ఢిల్లీలో మకాం వేశారన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని గౌరు చరితారెడ్డి అన్నారు. విభజన ఆగిపోయేవరకు ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కేవీసుబ్బారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, గౌరు యువసేన అధ్యక్షుడు ప్రసాద్, పార్టీ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తంరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తోట వెంకటకృష్ణారెడ్డి, బీసీ, యువజన, మహిళా విభాగాల కన్వీనర్లు పాతపాడు శ్రీనాథ్, జరపట అంజి, మంగమ్మ, మైనార్టీ నాయకుడు ఫిరోజ్, పార్టీ నాయకులు సంజన్న, మూర్తిరెడ్డి, గిడ్డయ్య, పుసులూరు పల్లె సుధాకరరెడ్డి, పర్ల దేవస్థానకమిటీ చైర్మన్ నాగభూషణం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జనాగ్రహం
సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై జిల్లాలో జనాగ్రహం పెల్లుబుకుతోంది. యూపీఏ సర్కారు నిరంకుశ వైఖరిపై జిల్లా ప్రజలు ఆగ్రహోదగ్రులవుతున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్సీపీ సాగిస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు బాసటగా నిలుస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. సోనియా డౌన్‌డౌన్.. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియా డౌన్ డౌన్ అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ర్యాలీ టవర్‌క్లాక్ వరకు సాగింది. వీరికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపడంతో నగరం సమైక్య నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ హైదరాబాద్‌పైనే ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు విద్యార్థులు ముందుండి పోరాడాలన్నారు. అనంతరం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని సీమాంధ్ర కేంద్ర మంత్రులు, టీడీపీ, బీజేపీ విస్మరించాయన్నారు. తెలుగు ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఓట్లు సీట్ల కోసం ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఐద్వా మహిళలు, ఎంఐఎం నాయకులు కూడా నగరంలో ర్యాలీలు నిర్వహించారు. సమైక్య ద్రోహి... ఎంపీ ‘అనంత’ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి సమైక్య ద్రోహి అని ఆరోపిస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, ఎస్కేయూ విద్యార్థులు ఆయన ఇంటిని ముట్టడించారు. ఎంపీ డౌన్ డౌన్... సమైక్య ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఈసందర్భంగా వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, ఎస్కేయూ జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ సదాశివరెడ్డి మాట్లాడుతూ.. సమైక్య వాదినని చెప్పుకుంటూ ఎంపీ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అవిశ్వాసానికి మద్దతుగా నిలబడకపోతే చరిత్ర హీనుడుగా నిలిచిపోతారన్నారు. ఎంపీ ఇంటి ఎదుట బైఠాయించడంతో టూటౌన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విభజన బిల్లు రాష్ట్ర ప్రజల పాలిట శాపం అని నినదిస్తూ రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వివిధ కళాశాలల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఉరవకొండ, కదిరి, శెట్టూరు, రొళ్ల, రాప్తాడు, తాడిపత్రిలో ర్యాలీలు చేశారు. కాగా.. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేసి, అనంతరం మంత్రి జైరాం రమేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యాంధ్ర కోసం తాడిపత్రి పోలీసుస్టేషన్ సర్కిల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు మంగళవారానికి వంద రోజులు పూర్తి చేసుకున్నాయి. -
ఉద్యమం
సాక్షి, కడప: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఏకైక డిమాండ్‌తో జిల్లాలో సాగుతున్న సమైక్య ఉద్యమం గురువారంతో వందరోజులు పూర్తి చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉద్యమం మాత్రం చల్లబడలేదు. రోజూ ఏదోఒక పట్టణంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్ వద్ద సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాటసమితి ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ హైస్కూలు విద్యార్థులు గురువారం నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. అప్సరసర్కిల్లో మానవహారంగా ఏర్పడి సమైక్యనినాదాలు చేశారు. భరతమాత, రాణీరుద్రమ, అల్లూరి సీతారామరాజు వేషధారణలతో అలరించారు. కోర్టువద్ద న్యాయవాదుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రొద్దుటూరులో వైఎస్సార్కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో గురువారం కూడా రిలేదీక్షలు కొనసాగాయి. పులివెందులలో విద్యాధరి పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు పోస్టుకార్డులు పంపించారు. రాజంపేటలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కన్వీనర్ ఎస్వీ రమణ ఆధ్వర్యంలో రాజు పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పాతబస్టాండ్‌లో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. జమ్మలమడుగులో వైఎస్సార్‌పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలేదీక్షలలో గురువారం సిరిగేపల్లే గ్రామస్తులు దీక్షలకు కూర్చున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కలసపాడులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. -
కోర్కెల సాధనకు ‘కోలీవుడ్’ ర్యాలీ
సినీరంగ కార్మికుల కోర్కెల సాధనకు కోలీవుడ్ మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించింది. దక్షిణ భారత సినీ కార్మికుల సమ్మేళన్ (ఫెఫ్సీ) ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగింది. పరిశ్రమకు చెందిన పలు సంఘాలు పాల్గొని సంఘీభావం ప్రకటించాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి: సినీ పరిశ్రమలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు. సరైన జీతభత్యాలు లేవు. ఇటువంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఇటీవలే ఫెఫ్సీ ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేపనిలో పడింది. తమ డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మంగళవారం చెన్నైలో భారీ ర్యాలీ నిర్వహించింది. సినీ కార్మికులతో ఎగ్మూరు రాజరత్నం స్టేడియం నుం చి ఉదయం ర్యాలీ ప్రారంభమైంది. ఫెఫ్సీ అధ్యక్షులు అమర్, కార్యదర్శి శివ, కోశాధికారులు అంగముత్తు, షణ్ముగం పాల్గొన్నారు. పముఖ సినీ సంగీత దర్శకు లు ఇళయరాజా ఫెఫ్సీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభిం చారు. సినిమా షూటింగ్‌కు వినియోగించే భారీ కెమెరా లు, ఇతర సామగ్రిని చేతబట్టి కార్మికులు నడిచారు. తమిళ సంప్రదాయ నృత్యమైన గరగాట్టం, నెమలినాట్యం, కీలుగుర్రం వంటి ప్రదర్శనలు నిర్వహిస్తూ మరి కొందరు ర్యాలీలో సాగారు. ఫెఫ్సీ ర్యాలీకి సంఘీభా వం ప్రకటించిన తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షులు విక్రమన్, దర్శకులు ఆర్.కె.సెల్వమణి, వి.శేఖర్, పి.వాసు, ఎస్పీ ముత్తురామన్ కార్మికుల వెంట నడిచారు. పుదుప్పేట్టై సమీపంలో సిద్ధం చేసిన వేదికపై నుంచి దర్శకులు, ఇతర నేతలు ప్రసంగించారు. అనంతరం ర్యాలీగా సచివాలయం చేరుకున్నారు. ముఖ్యమంత్రికి వినతి తమిళ సినిమా అభివృద్ధికి ప్రభుత్వపరంగా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలు పెంచాలని ఇలా 10 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి జయలలితకు సమర్పించారు. నగరంలోని ప్రముఖ ప్రదేశాల్లో, దేవాలయాల్లో సినిమా షూటింగులకు అనుమతించాలని, ఏప్రిల్ 14న చిత్తిరై తిరువిళాను నిర్వహించాలని తదితర కోర్కెలతో కూడిన వినతిపత్రాన్ని దర్శకుల సంఘం అందజేసింది. ఈ సందర్భం గా ఫెఫ్సీ అధ్యక్షులు అమర్ మీడియాతో మాట్లాడారు. తమ కోర్కెలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పం దించారన్నారు. అధికారులతో మాట్లాడారని, న్యా యం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. తమ కోర్కె లు నెరవేరగానే ముఖ్యమంత్రి జయలలితకు భారీ అభినందన సభ నిర్వహిస్తామని వెల్లడించారు. -
సమైక్యమే అభిమతం
సాక్షి, అనంతపురం: పండుగ లేదు. పబ్బమూ లేదు. విశ్రాంతి అంతకంటే లేదు. సమైక్యమే అభిమతమంటూ ఉద్యమకారులు కదంతొక్కుతూనే ఉన్నారు. దీపావళి పండుగ రోజు కూడా వారు విశ్రమించలేదు. ఫలితంగా 96వ రోజైన ఆదివారం కూడా జిల్లా వ్యాప్తంగా ‘సమెక్య’ ఉద్యమం జోరుగా కొనసాగింది. గుంతకల్లులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోనియాగాంధీని నరకాసురుడితో పోలుస్తూ ఫ్లెక్సీ తయారు చేసి... దాన్ని దహనం చేశారు. పాతకొత్తచెరువులో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మౌనదీక్ష కొనసాగింది. సమైక్యాంధ్ర ఉద్యమం 96 రోజులు పూర్తి చేసుకోవడంతో ఎద్దులపల్లి విద్యార్థులు పామిడిలో సమైక్య నినాదాలు చేశారు. చిలమత్తూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్రాల్లో దుష్టపరిపాలన తొలగిపోవాలని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటూ ఓడీ చెరువులో సమైక్యవాదులు నరకాసుర వధ ప్రదర్శన చేశారు. పెనుకొం డలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి.. దహ నం చేశారు. గోరంట్లలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వాన్ని నరకాసురుడితో పోలుస్తూ.. దిష్టిబొమ్మను తగులబెట్టారు. రాబోవు దీపావళి కూడా సమైక్య రాష్ట్రంలోనే జరుపుకోవాలని ఆకాం క్షిస్తూ రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో టపాకాయలతో అమర్చిన విభజనకారు ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. చితాభస్మాన్ని సమీపంలోని డ్రైనేజీలో కలిపారు. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో భారత్ ఐటీఐ, కళ్లిమఠం మునిసిపల్ పాఠశాల విద్యార్థులు నిరసన తెలిపారు. రాజీవ్‌గాం ధీ ఉర్దూ మునిసిపల్ హైస్కూల్ విద్యార్థులు స్థానిక వినాయకసర్కిల్లో రాస్తారోకో చేశారు. తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థుల రిలేదీక్షలు కొనసాగాయి. ఉరవకొండలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నరకాసుర, విభజనకారుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. -
సడలని దీక్ష
సాక్షి, అనంతపురం : సమైక్యమే లక్ష్యమంటూ ఉద్యమకారులు కదం తొక్కుతున్నారు. లక్ష్యాన్ని చేరుకునే దాకా పోరు ఆపబోమని స్పష్టీకరిస్తున్నారు. 81 రోజులైనా అదే ఉత్సాహం, ఊపుతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఉద్యోగులు, ఎన్జీఓలు, ఉపాధ్యాయులు సమ్మె విరమించి విధుల్లో చేరిపోయినా.. ప్రజలు మాత్రం ఉద్యమబాట వీడడం లేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదురొడ్డి పోరాడుతున్నారు. వీరికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుండడంతో మొక్కవోని దీక్షతో సమైక్యాంధ్ర పరిరక్షణకు పాటుపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా శనివారం కూడా సమైక్యవాదులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమాన్ని కొనసాగించారు. అనంతపురం నగరంలో సర్పంచులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీరాజ్, వాణిజ్యపన్నుల శాఖ, వైఎస్సార్సీపీ, ఎంఐఎం, జాక్టో ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. ఎస్కేయూలో విద్యార్థి నాయకుడు పరశురాం నాయక్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు రిజిస్ట్రార్ గోవిందప్ప సంఘీభావం తెలిపారు. ధర్మవరంలో వైఎస్సార్సీపీ, జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బత్తలపల్లిలో రోడ్డుపై చదువుతూ విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. గుంతకల్లులో వైఎస్సార్సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామిడిలో సమైక్యవాదులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ర్యాలీ చేశారు. పెనుకొండలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పెనుకొండ, రొద్దం మండలాల్లో విద్యార్థులు భారీ ర్యాలీలు చేపట్టి.. మానవహారాలు నిర్మిం చారు. రాయదుర్గంలో జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు పలువురు రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు. ‘మహాత్మా.. నీవైనా రాష్ట్రాన్ని కాపాడు’ అంటూ జేఏసీ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రాయదుర్గం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినాయక సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి, గంట పాటు రాస్తారోకో చేశారు. విద్యార్థి జేఏసీ నాయకులు ఫుట్‌పాత్‌పై ఇంటి సామగ్రి అమ్మి నిరసన తెలిపారు. రాప్తాడులో విద్యార్థులు ర్యాలీ చేశారు. తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థుల రిలే దీక్షలు కొనసాగాయి. -
జనోద్యమం
సాక్షి, కడప : జిల్లాలో పండుగలు, పర్వదినాల రోజు కూడా సమైక్య ఆందోళనల పర్వం జోరుగా సాగుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు తమ పోరు ఆగదని అన్నివర్గాల ప్రజలు ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొంటూనే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా అన్నదాతలు రైతు గర్జనల పేరుతో కదం తొక్కుతూనే ఉన్నారు. పోరుమామిళ్ళలో ముస్లింలు భారీ ర్యాలీని నిర్వహించారు. ఎన్జీఓలు రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నుంచి తెలంగాణా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తానని, సమైక్య రాష్ట్ర పరిరక్షణకు కట్టుబడి ఉంటానని హామీపత్రాన్ని తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు సాగుతూనే ఉన్నాయి. కడపలో సమైక్య సాధనే లక్ష్యంగా రిలే దీక్షలు సాగుతూనే ఉన్నాయి. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో డ్వామా, గృహ నిర్మాణ సిబ్బంది, ఉపాధ్యాయులు దీక్షల్లో పాల్గొన్నారు. నగర పాలక సంస్థ, నీటిపారుదల శాఖ ఉద్యోగులు, వాణిజ్య పన్నుల శాఖ, పంచాయతీ రాజ్, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదుల రిలే దీక్షలు సాగుతూనే ఉన్నాయి. జమ్మలమడుగులో మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు మండలాలకు చెందిన వేలాది మంది రైతులు పట్టణంలో ర్యాలీ చేపట్టి కదం తొక్కారు. రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాలను వీరికి అధికారులు, రాజకీయ పార్టీ నేతలు విపులంగా వివరించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఆర్డీఓ రఘునాథరెడ్డి, చిన్నయ్య పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో రిలే దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. మున్సిపల్ ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. రాయచోటిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఎండ్లపల్లె గ్రామస్తులు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సిబ్బంది, న్యాయవాదులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రసూల్ సంఘీభావం తెలిపారు. బద్వేలులో ఉపాధిహామీ సిబ్బందితోపాటు ఆర్టీసీ జేఏసీ, ఎన్జీఓలు, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఉపాధిహామీ సిబ్బంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పోరుమామిళ్ళ పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీని నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మైదుకూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రాజంపేటలో ఉద్యోగ జేఏసీ, రెవె న్యూ, సర్వేయర్ల సంఘం ఆధ్వర్యంలో దీక్షలు సాగాయి. రైల్వేకోడూరు పట్టణంలో జేఏసీ నేత ఓబులేసు ఆధ్వర్యంలో రోడ్డుపై నిలబడి ఉద్యోగులు నిరసనను తెలిపారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నుంచి తెలంగాణా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామనే హామీ పత్రాన్ని తీసుకున్నారు. -
అదే హోరు
సాక్షి, నెల్లూరు : సింహపురివాసులు చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం 62వ రోజైన సోమవారం హోరెత్తింది. నగరంలో విద్యార్థి జేఏసీ, ఉద్యోగ జేఏసీ, ఎన్జీఓ అసోసియేషన్లు నిరసన దీక్షలు కొనసాగించాయి. ఎన్జీఓ, విద్యార్థి జేఏసీ నేతలు నగరంలోని స్వర్ణాల చెరువులో సమైక్యాంధ్ర రొట్టెలు అందజేశారు. పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జలదంకిలో జనగర్జన జరి గింది. జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసన దీక్షలు, మానవహారాలు నిర్వహించారు. వేదాయపాళెం సెంటర్లో ముది రాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. మండు టెండలో చిన్నారులు ముగ్గులేసి నిరసన తెలిపారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు సోమవారం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మహిళలు ఆటలు ఆడి నిరసస వ్యక్తం చేశారు. మనుబోలులో సోమవారం ముస్లిం లు భారీ ప్రదర్శన నిర్వహించి, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పొదలకూరులో వీఆర్వోలు, తలారులు రిలే నిరాహారదీక్షలు చేశారు. ముత్తుకూరులో బీసీ సంక్షేమ సంఘం రెండోరోజు రిలేనిరాహారదీక్షలు చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకిలో సోమవారం జనగర్జన జరిగింది. కావలి ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వెయ్యి మీటర్ల జాతీయజెండా ప్రదర్శించారు. కలిగిరిలో మాంసం విక్రయదారులు రాస్తారోకో, వంటావార్పు నిర్వహించారు. కొండాపురం సాయిపేటలో వంటావార్పు, ర్యాలీ జరిగాయి. దుత్తలూరులో ఆటో యజమానుల ఆధ్వర్యంలో బంద్ పాటించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ప్రతినిధి కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి కావలి నుంచి శ్రీశైలానికి పాదయాత్ర ప్రారంభించారు. కావలి నుంచి రుద్రకోట జాతీయ రహదారి మీదుగా ప్రకాశం జిల్లాకు చేరుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో కావలి నుంచి ముసునూరు వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ, ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీల ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్షలు కొనసాగాయి. వెంకటగిరిలో కాశీపేట సెంటర్లో పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో వీధులను శుభ్రపరిచారు.అనంతరం అక్కడే స్నానాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. సైదాపురంలో యూత్,ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న పోరును సాగించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, శివాజీ వేషధారులు ఆకట్టుకున్నారు. గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరు నుంచి ప్రజలు పలు వాహనాల్లో గూడూరుకు తరలి వచ్చారు. టవర్‌క్లాక్ కూడలి ప్రాంతం వద్ద వినూత్న రీతిలో మగ్గం నేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అలాగే మహిశాశురమర్ధిని తదితర వేషధారణలో పలువురు తమ నిరసన వ్యక్తం చేశారు. కోవూరు ఎన్జీఓ హోంలో యువకుల దీక్ష చేపట్టారు. లేగుంటపాడులో మహిళల దీక్షలో కూర్చున్నారు. కొడవలూరు నార్తురాజుపాళెంలో ఉపాధ్యాయ జేఏసీ నాయకుల దీక్ష కొనసాగుతోంది. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో సమైక్యాంధ్రకు మద్దతుగా క్రైస్తవ సంఘాల సమాక్య రిలే నిరాహార దీక్షలో పాల్గొంది. పట్టణంలో మానవహారంగా ఏర్పడి కేసీఆర్ దిష్టిబొమ్మను టమోటాలతో కొట్టి దహనం చేశారు. ఎన్జీఓలు, జేఏసీ నేతలు వారికి సంఘీభావం తెలిపారు. -
నేడే ప్రజాగర్జన
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో సీమ ముఖద్వారం ప్రముఖ పాత్రపోషిస్తోంది. మొట్టమొదటి సారిగాఈ గడ్డ మీద నుంచే ఢిల్లీ పెద్దలకు వినిపించేలా లక్షగళాలు ఘోషించాయి. ముస్లింలు మేము సైతం అంటూ భారీ ర్యాలీ నిర్వహించి దిక్కులు పిక్కటిల్లేలా సమైక్య నినాదాలు చేశారు. ఇదే స్ఫూర్తితో సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన పేరుతో ఆదివారం భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బహిరంగ సభ జరిగే ఎస్టీబీసీ కళాశాల మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేదికకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు ఖరారుచేశారు. అలాగే సభ ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు పెట్టారు. రెండు ప్రధాన గేట్లకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కర్నూలు నవాబు రసూల్ ఖాన్ ద్వారాలు నామకరణం చేశారు. లైటింగ్, సౌండ్ సిస్టమ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వచ్చే వారందరికీ మంచినీళ్లు, మజ్జిగ, అన్నం ప్యాకెట్లు సరఫరా చేయడానికి 500 మంది వలంటీర్లను నియమించారు. వారికి ప్రత్యేక డ్రస్కోడ్ రూపొందించారు. బహిరంగ సభ వేదిక పక్కన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉదయం పది గంటల నుంచి ప్రముఖ ప్రజాగాయకుడు వంగపండు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి బహిరంగ సభ మొదలవుతుంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్రెడ్డి అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో రాష్ట్ర చైర్మన్ అశోక్‌బాబు ప్రధాన వక్తగా పాల్గొంటారు. ఏపీఎన్జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో పాటు ఆర్టీసీ, విద్యుత్ ఇరిగేషన్ తదితర ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతలు.. విభజనతో కలిగే పరిణామాలు, ఉద్యోగులకు ఏర్పడే నష్టం, కలసి ఉంటే కలిగే ప్రయోజనాలు వివరించడంతో పాటు భవిష్యత్తు వ్యూహాన్ని వివరించనున్నారు. వేదికపైన ఎవరెవరు ఆసీనులవుతారు, ఎంతమంది ప్రసంగిస్తారనేదానిని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ అశోక్‌బాబు నిర్ణయిస్తారని జిల్లా నేతలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా నేతలు వి.సి.హెచ్.వెంగళ్‌రెడ్డి, క్రిష్టఫర్ దేవకుమార్, సంపత్‌కుమార్, శ్రీరాములు, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు శనివారం ఏర్పాట్లను సమీక్షించారు. బహిరంగసభ విజయవంతానికి జిల్లా అధికారుల సంఘం నేతలు సూర్యప్రకాష్, వేణుగోపాల్‌రెడ్డి, హరినాథరెడ్డి, ఆనంద్‌నాయక్ తదితరులు పూర్తిగా సహకరిస్తున్నారు. భారీగా తరలివస్తున్న ఉద్యోగులు, ప్రజలు సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన బహిరంగ సభకు వేలాదిమంది పాదయాత్ర ద్వారా కర్నూలుకు తరలివస్తున్నారు. డోన్ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో దాదాపు రెండువేల మంది పాదయాత్ర ద్వారా శనివారం ఉదయమే కర్నూలుకు బయలుదేరారు. రాత్రికే వారు కర్నూలుకు చేరుకున్నారు. మరిన్ని ప్రాంతాల నుంచి వేలాదిమంది పాదయాత్ర ద్వారా తరలివస్తున్నారు. నగరం మొత్తం సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన ఫ్లెక్సీ బ్యానర్ల పోస్టర్లతో నిండిపోయింది. ప్రజాగర్జన బహిరంగ సభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసి సమైక్యవాదాన్ని బలంగా ఢిల్లీ పీఠానికి చాటిచెప్పాలనే కసి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. -
పట్టు వదలం
సాక్షి, నెల్లూరు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవడమే లక్ష్యంగా సమైక్యవాదులు పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. 58 రోజులుగా దృఢచిత్తంతో పోరాటం చేస్తున్నారు. మొదటి రోజు ఏ స్ఫూర్తితో ఉద్యమంలోకి దిగారో, అదే పోరాటపటిమతో పోరు కొనసాగిస్తున్నారు. గురువారం సమైక్యవాదులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ప్రైవేటు బస్సులు కదల్లేదు. ఉద్యమంలో అసువులు బాసిన ఆర్టీసీ ఉద్యోగి సోమశేఖరరాజు చిత్రపటానికి నెల్లూరు ప్రధాన బస్టాం డ్లో ఘన నివాళులర్పించారు. అనంతరం మానవహారం నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కావలి మండలం తుమ్మలపెంట సముద్రతీ రంలో మత్స్యకారులు జలదీక్ష చేపట్టారు. ముత్తుకూరు మండలం డమ్మాయపాళెం స్కూల్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు, గ్రామస్తులు భారీ ర్యాలీ చేసి, వంటావార్పు నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమ పోరాట సమితి ఆధ్వర్యంలో మనుబోలులో ర్యాలీ జరిగింది. ఆర్టీసీ ఉద్యోగి సోమశేఖరరాజు మృతికి సంతాపంగా ఉదయగిరిలో బంద్ నిర్వహించారు. కలిగిరి మండలంలో గ్రామచైతన్య యాత్రలు నిర్వహించిన జేఏసీ నాయకులు సమైక్య రాష్ట్ర ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. గూడూరులో సోమశేఖరరాజు చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. విద్యార్థులు, ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. చెన్నై వెళుతూ గూడూరు రైల్వేస్టేషన్లో దిగిన సినీనటుడు నారాయణమూర్తికి సమైక్యసెగ తగిలింది. వాకాడులోని అశోక స్తంభం సెంట ర్లో సమైక్యాంధ్ర జెండా ఆవిష్కరించారు. కోవూరు, లేగుంటపాటు ఆత్మకూరులోని బస్టాండ్ సెంటర్లో రిలేదీక్షలు కొనసాగాయి. ఎల్లసిరి, పాశం ఘన నివాళులు గూడూరు, న్యూస్‌లైన్: సమైక్యాంద్ర ఉద్యమంలో పాల్గొని ప్రాణాలర్పించిన ఆర్టీసీ స్క్వాడ్ ఇన్స్పెక్టర్ సోమశేఖరరాజు మృతదేహాన్ని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ సందర్శించి ఘన నివాళులర్పించారు. వారితో పాటు వైఎస్సార్సీపీ నాయకులు నాశిన నాగులు, బొమ్మిడి శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, షణ్ముగం నివాళులర్పించి మృతుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
మహా సంకల్పం
సాక్షి, కడప : జిల్లా వ్యాప్తంగా సమైక్య నినాదాలతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. అన్ని వర్గాల వారికి సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యమైంది. లక్షలాది మంది పోరుబాటతో కదం తొక్కుతున్నారు. వినూత్న నిరసనలు, భారీ సభలు, రిలే నిరాహార దీక్షలు, మానవహారాలు రూపాలు వేరైనా అందరి లక్ష్యం సమైక్యమే. విభజన నిర్ణయంపైమండిపడుతూ, నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా కలిసి రాకుంటే గుణపాఠం తప్పదని కన్నెర్ర చేస్తున్నారు. కడప నగరంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గోవిందమాంబ భక్తులు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ప్రైవేటు వృత్తి కళాశాలల సమాఖ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్, వాణిజ్య పన్నులశాఖ, న్యాయవాదులు, న్యాయశాఖ, పంచాయతీరాజ్ ఉద్యోగులు రిలే దీక్షలను కొనసాగిస్తున్నారు. రాయచోటి పట్టణంలో రణభేరి పేరుతో ఎన్జీఓలు నిర్వహించిన సభ విజయవంతమైంది. పట్టణం సమైక్య నినాదాలతో హోరెత్తింది. సమైక్యవాదులు భారీ సంఖ్యలో తరలి రావడంతో రోడ్లన్నీ కిక్కిరిశాయి. ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు చేసిన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. వంగపండు ఉష ఆటాపాట సమైక్యవాదుల్లో ఉత్తేజాన్ని నింపింది. జమ్మలమడుగులోని కొండాపురం మండలంలో వెయ్యి మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. జమ్మలమడుగులో ఆదర్శ రైతులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎర్రగుంట్ల, ఆర్టీపీపీలో దీక్షలు కొనసాగుతున్నాయి. బద్వేలులో పౌరవేదిక ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్లు భారీ ర్యాలీ నిర్వహించారు. రిలే దీక్షల్లో పాల్గొన్నారు. గౌతమి.సాయి విద్యార్థులు ర్యాలీ నిర్వహించి 58 సంఖ్య ఆకారంలో నాలుగురోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్టీసీ, ఉద్యోగ జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. విద్యార్థులు రోడ్డుపైనే సూర్యనమస్కారాలు చేశారు. రాజంపేటలో కూచివారిపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నేత రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో 60 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సీడబ్ల్యూసీ నేతలు. కేసీఆర్ చిత్రాలను బ్యానర్‌గా ఏర్పాటు చేసి ఊరేగిస్తూ కుళ్లిన కోడిగుడ్లు, టమోటాలతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో మానవహారంగా ఏర్పడ్డారు. సూరపురాజుపల్లె పంచాయతీకి చెందిన వెయ్యి మంది ప్రజలు, మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి డప్పు వాయిద్యాల మధ్య డ్యాన్స్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరులో ప్రైవేటు విద్యా సంస్థలు, వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు, మున్సిపల్ ఉద్యోగులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య సంఘీభావం తెలిపారు. వైఎస్సార్సీపీ నేతృత్వంలో 13వ వార్డుకు చెందిన నన్నేసాహెబ్ ఆధ్వర్యంలో 25 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మైదుకూరులో రైతులు, మహిళలు ఎడ్లబండ్లతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. మాధవరాజస్వామి బలిజ సంఘం మహిళలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. కమలాపురం పట్టణంలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పంచాయతీ కార్యాలయం వద్ద మానవహారంగా ఏర్పడి 58 సంఖ్య ఆకారంలో కూర్చొని ఆందోళన చేపట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. పులివెందులలో ఫొటోగ్రాఫర్లు, మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గొర్రెల కాపర్లు రోడ్డు మధ్యలో గొర్రెలను నిలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. 65 మీటర్ల జాతీయ జెండాపై 88 మంది జాతీయ నాయకుల ఫోటోలను ఏర్పాటు చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు రోడ్లు ఊడ్చి ఆందోళన చేశారు. -
నేడు సంగారెడ్డిలో టీజేఏసీ భారీ ర్యాలీ
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: హైదరాబాద్ నిజాం కళాశాలలో ఈ నెల 29న నిర్వహించనున్న సకలజనుల భేరి విజయవంతానికి జిల్లా టీజేఏసీ, ఉద్యోగ సంఘాలు, టీఆర్ఎస్ జిల్లాలో సన్నాహక కార్యక్రమాలపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా టీ జేఏసీ మంగళవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో భారీ ర్యాలీ, సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సన్నాహక సమావేశానికి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరుకానున్నారు. టీ జేఏసీ చైర్మన్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో నాయకులు సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే మరో బృందం పాత బస్టాండు నుంచి జడ్పీ వరకు ర్యాలీ నిర్వహిస్తుంది. అనంతరం జడ్పీ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు ఉద్యోగసంఘాలు సైతం సకలజనుల భేరి విజయవంతంపై దృష్టి పెట్టాయి. ఈనెల 25వ తేదీన టీఎన్జీవో ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలతో కలిపి సంగారెడ్డి, జహీరాబాద్‌లో ర్యాలీ, సభలు నిర్వహించనుంది. ఈ సభలకు టీఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు దేవీప్రసాద్ హాజరుకానున్నారు. కాగా టీఆర్ఎస్ పార్టీ సైతం 29వ తేదీన నిర్వహించనున్న సకలజనుల భేరికి భారీగా జనాన్ని తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. జిల్లా నుంచి 12వేల మందిని భేరికి తరలించేందకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ తెలిపారు. -
పదండి తోసుకు
సాక్షి, కర్నూలు: సెలవు రోజుల్లోనూ ఉద్యమ తీవ్రత తగ్గకపోవడం ప్రజల్లో సమైక్య ఆకాంక్షకు అద్దం పడుతోంది. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు కదంతొక్కారు. కర్నూలులోని ఎ.క్యాంప్ అపార్ట్మెంట్, కాలనీకి చెందిన సుమారు 2వేల మంది భారీ ర్యాలీ నిర్వహించి, ప్రధాన కూడళ్లలో మానవహారంగా ఏర్పడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినదించారు. తడకనపల్లె స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సర్పంచ్ గంగుల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనం చేశారు. మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల, కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు, కార్మికులు భారీ ర్యాలీ చేపట్టి వంటావార్పు నిర్వహించారు. కల్లూరు రైతు సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై గేదెలతో నిరసన తెలిపారు. వెల్దుర్తిలో దాదాపు 10వేల మందితో సమైక్య సింహగర్జన చేపట్టారు. ఆదోనిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకు పెకైక్కి నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డు జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నడిచారు. ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. రుద్రవరంలో మండల వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీపక్ష చేపట్టారు. ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్ష కొనసాగుతోంది. పట్టణ కన్వీనర్ ఇస్కాల రమేష్ ఆధ్వర్యంలో పలువురు దీక్షలో కూర్చొన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమైక్యవాదులు వివిధ రాజకీయ నేతల చిత్రపటాలతో కూడిన కుండలతో ర్యాలీ నిర్వహించి అనంతరం పగులగొట్టి నిరసన తెలి పారు. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో వీఆర్వో కె.మహబూబ్‌బాషా, ఆవాజ్ కమిటీ సభ్యులు చేపట్టిన నిరాహార దీక్షకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. వెలుగోడులో జేఏసీ ఆధ్వర్యంలో మోతుకూరు గ్రామస్తులు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. -
సమైక్య భేరి @ 50
సాక్షి, అనంతపురం : గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయే గడ్డి పరకలు కూడా ఒక్కటిగా కలిస్తే మదపుటేనుగునైనా బంధించగలవ ని, బలహీనమైన చలి చీమలు బలవంతమైన సర్పాన్ని అంతమొందిస్తాయన్న స్ఫూర్తితో సమైక్యవాదులు ఐకమత్యంతో కదం తొక్కుతున్నారు. చేయి చేయి కలిపి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఫలితంగా 50వ రోజైన బుధవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం జోరుగా కొనసాగింది. అనంతపురం నగరంలో సమైక్య నినాదాలు హోరెత్తాయి. రాష్ట్ర విభజన జరిగితే తమ బతుకులు బుగ్గిపాలవుతాయంటూ జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సప్తగిరి సర్కిల్లో మానవహారం నిర్మించారు. వ్యవసాయాధికారులు జోలె పట్టి భిక్షాటన చేశారు. రైతుమిత్ర, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. నీటి పారుదల, పీఏసీఎస్, పంచాయతీ రాజ్, పశుసంవర్ధక, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ జేఏసీలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విన్సెంట్ డీపాల్, ఎస్వీఐటీ, రైపర్, రాధాస్కూల్ ఆఫ్ లెర్నింగ్ విద్యార్థులు ర్యాలీగా ఎస్కేయూ వద్దకు చేరుకుని... వర్సిటీ విద్యార్థులతో కలసి జాతీయ రహదారిపై బైఠాయించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలకు రహదారిపై సమాధులు కట్టి.. పిండ ప్రదానం చేశారు. వర్సిటీ ఎదుట విద్యార్థులు, ధర్మవరంలో జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇదే పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో రైతు గర్జన నిర్వహించారు. ముదిగుబ్బ, బత్తలపల్లిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ముదిగుబ్బలో మహిళలు జాతీయ రహదారిపై ముగ్గులు వేసి సమైక్య నినాదాన్ని చాటారు. గుంతకల్లులో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. జేఏసీ నాయకులు దున్నపోతులకు సోనియా, చిరంజీవి ఫ్లెక్సీలను తగిలించి ర్యాలీ నిర్వహించారు. గుత్తిలో ఉపాధ్యాయులు వినూత్న నిరసన తెలిపారు. పామిడిలో జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హిందూపురంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, విశాలాంధ్ర పరిరక్షణ సమితి, చిలమత్తూరులో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. కదిరిలో జేఏసీ నాయకులు భిక్షాటన చేశారు. స్పేస్ కళాశాల విద్యార్థులు రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా 205 జాతీయ రహదారిపై ఆట పాటలతో హోరెత్తించారు. నల్లచెరువులో గ్రామస్తులు, తలుపులలో విద్యుత్ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. కళ్యాణదుర్గంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వీరశైవ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో ఉద్యోగులు గుగ్గిళ్లు అమ్ముతూ నిరసన తెలిపారు. జేఏసీ నాయకులు రహదారిపై మొక్కలు నాటారు. అమరాపురంలో ఉపాధ్యాయలు దీక్షలు కొనసాగిస్తూనే... రహదారిపై కప్పగంతులు వేస్తూ నిరసన తెలిపారు. సర్పంచ్‌లందరూ సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. పుట్టపర్తిలో సమైక్య వాదులు గడ్డి తింటూ నిరసన తెలిపారు. కొత్తచెరువు, ఓడీచెరువు, అమడగూరు మండలాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అమడగూరులో అంగన్వాడీ వర్కర్లు, క్రైస్తవులు ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తిలో పంచాయతీ కార్మికులు సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. పెనుకొండలో జేఏసీ ఆధ్వర్యంలో తెలుగుతల్లి, గాంధీజీ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. 50 మంది జేఏసీ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. రొద్దంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపైనే పరీక్షలు రాశారు. సోమందేపల్లిలో వెలిదడకల గ్రామస్తులు నిరసన తెలిపారు. రాయదుర్గంలో ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రక్తంతో సంతకాల సేకరణ చేసి.. బ్యానర్ కట్టారు. సూర్యసేవాసమితి ఆధ్వర్యంలో రోడ్డుపై పొర్లు దండాలు పెట్టారు. పాలిటెక్నిక్ విద్యార్థులు, సిబ్బంది, విద్యుత్ ఉద్యోగులు, అభ్యుదయ పాఠశాల విద్యార్థులు, కమ్మ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. రిలే దీక్షల్లో 500 మంది ఉపాధ్యాయులు పాల్గొని నిరసన తెలిపారు. కణేకల్లులో సమైక్యాంధ్రపై సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. రాప్తాడులో ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులకు సమైక్యాంధ్రపై అవగాహన కల్పించారు. గార్లదిన్నెలో జేఏసీ నాయకులు సోనియా దిష్టి బొమ్మకు సమాధి కట్టి పిండ ప్రదానం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు పూజారి మాధవ ఆమరణ దీక్ష చేపట్టారు. శింగనమల, నార్పలలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. తాడిపత్రిలో ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. ఆర్టీసీ కార్మికులు టోపీలు ధరించి ర్యాలీ చేశారు. పెద్దవడుగూరులో ఎంపీడీఓ, కార్యదర్శులు, సర్పంచుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రైతు సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. పెద్దపప్పూరులో ఉద్యోగ జేఏసీని ఎన్నుకున్నారు. ఉరవకొండ మండలం నింబగల్లులో వైఎస్సార్సీపీ నాయకులు జలదీక్ష చేశారు. ఉరవకొండలోని బ్యాంకులను విద్యార్థి జేఏసీ నాయకులు బంద్ చేయించారు. వజ్రకరూరులో సమైక్యవాదులు బైక్ ర్యాలీ చేశారు. బెళుగుప్ప, విడపనకల్లు మండలాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా సర్పంచ్‌లు తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. -
ఉక్కు సంకల్పం
సాక్షి, కడప: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో సాగుతున్న సమైక్య ఉద్యమం నేటితో 50 రోజులకు చేరింది. కడపలో జిల్లా మేధావి సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియా, కేసీఆర్, చిరంజీవి దిష్టిబొమ్మలను దహనం చేశారు. విభజన విషం కక్కే పాముకు నిప్పంటించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న సమైక్య పరిరక్షణ వేదిక శిబిరంలో మంగళవారం ఉపాధ్యాయులు, నీటిపారుదలశాఖ, గృహ నిర్మాణశాఖ ఉద్యోగులు రిలేదీక్షల్లో కూర్చున్నారు. శిబిరంలో సమైక్యవాదులు పాటలు పాడి నిరసన తెలిపారు. జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వృత్తివిద్యా కళాశాల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో విద్యార్థులు రిలేదీక్షల్లో కూర్చున్నారు. వైద్య సిబ్బంది నిరసనలు సమైక్యవాదులను అలరించాయి. సోనియా, దిగ్విజయ్, కేసీఆర్ వేషధారులకు వైద్య పరీక్షలు నిర్వహించడం, వేర్పాటువాదికి పోస్టుమార్టం నిర్వహించడం తదితర నిరసన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కలెక్టరేట్ గేటు వద్ద తెలుగుతల్లి విగ్రహానికి జేఏసీ కన్వీనర్ సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. పుష్పగిరి విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఏపీ సర్వేయర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సర్వే గొలుసులతో ఉద్యోగులు నిరసన తెలిపారు. న్యాయవాదులు, పంచాయతీరాజ్, డీఆర్డీఏ, ఎస్సీ కార్పొరేషన్, పంచాయతీరాజ్, నీటిపారుదలతో పాటు పలుశాఖల్లో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రొద్దుటూరులో ప్రైవేటు వైద్యులు, ల్యాబ్, స్కానింగ్, మెడికల్ షాపు నిర్వాహకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం అత్యవసరం మినహా తక్కిన వైద్య సేవలు బంద్ చేశారు. పుట్టపర్తి సర్కిల్లో మానవహారం నిర్వహించారు. జీవనజ్యోతి పబ్లిక్ స్కూలు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాజుపాళెం మండలం వాసుదేవపురం సర్పంచ్ వెంకటలక్షుమ్మ ఆధ్వర్యంలో మహిళలు రిలేదీక్షలకు కూర్చున్నారు. ఏపీ ఎన్జీవో శిబిరంలో ఆర్టీసీ ఉద్యోగులు దీక్షకు కూర్చున్నారు. న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో డిగ్రీ కాలేజీ లెక్చరర్లు ర్యాలీ నిర్వహించి, రిలేదీక్షలకు కూర్చున్నారు. పిడతలతో ‘సమైక్యభజన’ నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పార్టీలు ప్రజల మనోభావాలకు అనువుగా నడుచుకోకపోతే భవిష్యత్తు ఉండదని ఇద్దరూ వ్యాఖ్యానించారు. మైలవరం మండలం దొమ్మర నంద్యాలలో గ్రామస్తులు భారీ ర్యాలీ చే పట్టారు. సమైక్యాంధ్ర రచ్చబండ నిర్వహించారు. ఆపై వంటావార్పు చేపట్టారు. మైదుకూరులో వైద్యులు, ఆర్ఎంపీ డాక్టర్లు, మెడికల్ ఉద్యోగులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రిలేదీక్షలు చేపట్టారు. రాయచోటిలో జేఏసీ శిబిరంలో నాయీబ్రాహ్మణ ఉద్యోగులు, సంఘం నేతలు రిలేదీక్షలకు కూర్చున్నారు. ఆర్టీసీ కార్మికులు రోడ్డుపైనే స్నానాలు ఆచరించి నిరసన తెలిపారు. పట్టణంలో ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. బద్వేలులో జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమం సంఘం నేతలు దీక్షలకు కూర్చున్నారు. వీరికి సంఘీభావంగా వెయ్యిమంది విద్యార్థులు మానవహారం చేపట్టారు. 12, 13వ వార్డు యువకులు మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు, ఆర్టీసీ, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు రిలేదీక్షల్లో కూర్చున్నారు. పోరుమామిళ్లలో వైసీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కలసపాడులో జేఏసీ ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు. పోరుమామిళ్లలో పశువైద్యాధికారులు ఎడ్లబండ్లతో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రాజంపేటలో ైవె సీపీ రిలేదీక్షల్లో మంగళవారం 78 మంది కూర్చున్నారు. ఉపాధ్యాయులు రోడ్డుపై పాఠాలు బోధించి నిరసన తెలిపారు. న్యాయవాదుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు మంగళవారం నుంచి మూత వేశారు. రైల్వేకోడూరులో సమైక్యవాదులు 50 మీటర్ల భారీ జాతీయ జెండాను ఎగురవేసి సమైక్యవాణి వినిపించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు. -
అలుపెరుగని పోరాటం
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్ర పరిరక్షణకు జిల్లా ప్రజలు కంకణబద్ధులయ్యారు. 46 రోజులు దాటినా అలుపెరుగని పోరు కొనసాగుతుంది. కర్నూలు నగరంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. వ్యవసాయ శాఖ ఉద్యోగులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని కలెక్టేట్ నుంచి రాజ్‌విహార్ వరకు మౌన ప్రదర్శన చేపట్టారు. సాయి వసంత్ విహార్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల చెక్‌పోస్టు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. విద్యు త్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బ్యాంకులను ముట్టడించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్మించారు. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు కలెక్టరేట్ నుంచి రాజ్‌విహార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓలు, తహశీల్దార్లు, ఈఓఆర్డీలతో జిల్లా పరిషత్ సమావేశ భవనంలో సదస్సు ఏర్పాటైంది. ఈ నెల 16న అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రత్యేక తీర్మానం చేయించి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లకు ప్రతులను నిర్ణయించారు. ఆర్అండ్బీ ఉద్యోగులు ఎస్ఈ కార్యాలయం నుంచి రాజ్‌విహార్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. కర్నూలు మెడికల్ కళాశాల విద్యార్థులు, వైద్యులు కళాశాల నుంచి రాజ్‌విహార్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు. కోడుమూరులో హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. ఆదోనిలో మహిళా గర్జన విజయవంతమైంది. విద్యుత్‌శాఖ జేఏసీ ఆధ్వర్యంలో బీఎస్ఎన్ఎల్, పోస్టాఫీస్, ఎల్ఐసీ కార్యాలయాలు మూయించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రుల మాస్క్‌లు ధరించి ఉపాద్యాయులు సోనియా భజన చేస్తూ నిరసన తెలిపారు. ఆళ్లగడ్డలో వైద్యుల జేఏసీ ఆధ్వర్యంలో 48 గంటల రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. చాగలమర్రిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. నంద్యాలలో ఉద్యోగ జేఏసీ నేతలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులను మూయించారు. ఇంటర్ విద్య జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరులో జేఏసీ ఆధ్వర్యంలో మహిళా జనఘోష కార్యక్రమం నిర్వహించారు. వెల్దుర్తిలో హెల్పింగ్ హ్యాండ్స్, జేఏసీ ఆధ్వర్యంలో 200 అడుగుల జాతీయ పతాకంతో భారీ ప్రదర్శన ఆకట్టుకుంది. పత్తికొండలో మహిళలు ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి నాలుగు స్తంభాల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరులో మున్సిపల్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకులు బుట్టా రంగయ్య చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఎమ్మెల్యే తనయుడు ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు సంఘీభావం తెలిపారు. ఏపీ ఎన్జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి శివ సర్కిల్లో మానవహారం నిర్మించారు. -
కుట్రలు తిప్పికొడతాం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘ఆస్తుల ఆపేక్షతోనే సీమాంధ్ర పెట్టుబడిదారులు సమైక్య ఉద్యమంతో రెచ్చగొడుతున్నారు... తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దాడిని సహించం... పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదమయ్యేవరకు అప్రమత్తంగా ఉండి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే కుట్రలు తిప్పికొడతామని టీజేఏసీ, టీఎన్జీవోస్, టీఆర్ఎస్ నేతలు ఉద్ఘాటించారు. ముల్కీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా టీజేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ జేఏసీల ఆధ్వర్యంలో ఉద్యోగులు, విద్యార్థులు, నాయకులు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ అమరవీరులకు నివాళులర్పించి, శాంతి దీక్ష చేపట్టారు. టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ సకలజనుల సమ్మె సమయంలో తెలంగాణవారిపై అనేక కేసులు పెట్టారని, ప్రస్తుత సీమాంధ్ర ఉద్యమానికి పోలీసులే రక్షణ కల్పిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యోగులపై సీమాంధ్రుల దాడులు అరికట్టాలని, విచారణ నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, ఉమ్మడి రాజధాని ప్రతిపాదనపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. 7న నిర్వహించనున్న ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, అదే రోజు టీజేఏసీ నిర్వహించనున్న ర్యాలీకి ఎందుకు అనుమతివ్వడం లేదని ప్రశ్నించారు. టీజేఏసీ రాష్ట్ర కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మ య్య మాట్లాడుతూ ఉద్యమం ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించాలని, సమైక్యాంధ్ర కోసం అక్కడి నాయకులు అర్థం లేని ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. పది జిల్లాలతోనే కూడిన తెలంగాణనే ప్రజలు అంగీకరిస్తారని, హైదరాబాద్‌ను తాత్కాలిక రాజధానిగానే ఒప్పుకుంటారని తెలిపారు. శాంతిని భగ్నం చేస్తే మరో ఉద్యమం టీజేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్ మాట్లాడుతూ సీఎం కిరణ్ కుట్రలో భాగంగానే ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చారన్నారు. తెలంగాణలో శాంతిని భగ్నం చేయాలని చూస్తే మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. టీడీపీ నేత చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రతో ఆయన నైజం బయటపడిందన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు ఉద్యమంలోకి రావాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకునే కుట్రలు తిప్పికొట్టాలన్నారు. టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆర్టీసీ టీఎంయూ నాయకుడు థామస్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీఎన్జీవోలు తలపెట్టిన సభను బస్సులతో అడ్డుకునేందుకైనా సిద్ధమన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఏపీఎన్జీవోస్ తలపెట్టిన సభ తెలంగాణ గుండెల మీద గుద్దే సభ అని అన్నారు. సీల్డ్ కవర్లో వచ్చిన సీఎం కేవలం సీమాంధ్రకే సీఎంలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇస్తే ఏం జరుగుతుందో చూడాలని హెచ్చరించారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ విభజనతో వచ్చే నష్టాలు చెప్పలేని సీమాంధ్ర పెట్టుబడిదారులు దోపిడీ సాగదనే తెలంగాణను వ్యతిరేకిస్తున్నారన్నారు. ర్యాలీ, దీక్షలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, టీజేఏసీ జిల్లా కన్వీనర్ వెంకటమల్లయ్య, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.ఏ. హమీద్, నర్సింహస్వామి, కేంద్ర సంఘం నాయకులు జగదీశ్వర్, రాష్ట్ర కార్యదర్శి రాజయ్య, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి ఆవునూరి సమ్మయ్య, రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుస్సేన్‌తోపాటు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ బంద్ యోచన తిమ్మాపూర్ : ఈ నెల 6, 7 తేదీల్లో 48 గంటలపాటు తెలంగాణ బంద్ నిర్వహించాలనే యోచన ఉందని టీ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీ ప్రసాద్ వెల్లడించారు. తిమ్మాపూర్‌లోని ఆర్టీవో కార్యాలయంలో ఉద్యోగులను కలిసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. 7న హైదరాబాద్‌లో నిర్వహించనున్న శాంతియాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆయనవెంట రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, ఉద్యోగులు ఉన్నారు. -
నిరసనల జోరు
సాక్షి, నెల్లూరు : జిల్లాలో 31వ రోజు సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగింది. నగరంలో వివిధ శాఖల ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. నాయకులకు కనువిప్పు కలిగేలా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని డీఆర్ఓ రామిరెడ్డి ప్రకటించారు. కోవూరు మండలం ఇనమడుగులో అధికారులు, ఉపాధ్యాయులు తిరిగి సమైక్యాంధ్రతో ప్రయోజనాలను వివరించారు. ఎన్జీఓ హోంలో వికలాంగుల నిరాహార దీక్ష చేపట్టారు. కొడవలూరు మండలంలోని ఎల్లాయపాళెంలో అధికారులు, టీచర్లు సమైక్యాంధ్రపై అవగాహన కల్పించేందుకు గ్రామసభను ఏర్పాటు చేశారు. ఇందుకూరుపేట మండలంలో అధికారులు సమైక్యాం ధ్రపై గ్రామసభ నిర్వహించారు. వెంకటగిరిలో పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి రాజావీధి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. ఉదయగిరిలో సమైక్యాంధ్ర, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు. మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల జేఏసీ ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో మూడో రోజు దీక్ష కొనసాగుతోంది. విద్యార్థులు రోడ్డుపై కళ్లకు గంతలు కట్టుకుని డ్రాయింగ్ వేశారు. పంచాయతీ బస్టాండ్ సెంటర్లో వికలాంగుల ఆధ్వర్యంలో రెండోరోజు దీక్షలు కొనసాగాయి. బస్టాండ్ సెంటర్లో సమైక్యాంధ్ర, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పోరాట సమితి ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సొసైటీ, జన విజ్ఞానవేదిక సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించాయి. ముస్లిం కమ్యూనిటీ డెవలప్మెంట్సొసైటీ ఆధ్వర్యంలో ముస్లింలు పాఠశాలలు, దుకాణాలు మూసివేయించి బంద్ నిర్వహించారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ సెంటర్లో విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష 20వ రోజుకు చేరింది. మనుబోలులో హైవేపై సమైక్యవాదులు ప్రదర్శన జరిపి, రాస్తారోకో చేశారు. పొదలకూరులో ఆటోల ర్యాలీ నిర్వహించారు. వెంకటాచలం మండలంలోని కనుపూరు, కందలపాడు గ్రామాల్లో ఉపాధ్యాయులు గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు. గూడూరులో వైద్యులు టవర్‌క్లాక్ సెంటర్లో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. టీచర్లు ముగ్గులు వేసి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కోటలో డీఈఓ మువ్వా రామలింగం మాట్లాడుతూ రాజీ నామా చేయని వారు చరిత్ర హీనులు గా మిగిలిపోతారన్నారు. కోట, వాకా డు, చిట్టమూరు మండలాల్లో ర్యాలీలు జరిగాయి. గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సర్పంచ్‌లకు మండల పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. కావలిలో జేఏసీ శిబిరంలో కొత్తపల్లి, కొండాపురం పీహెచ్‌సీల సిబ్బంది రిలేనిరాహారదీక్ష చేపట్టారు. తడలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలకు మద్దతుగా మండల రెవెన్యూ ఉద్యోగులు రిలే దీక్షలో కూర్చున్నారు. నాయుడుపేట జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులకు ఆర్డీవో వెంకటరమణ సంఘీభావం తెలిపారు. విద్యార్థులు కేసీఆర్ శవయాత్ర చేసి బస్టాండ్‌లో దిష్టిబొమ్మను దహనం చేశారు. -
తిరుపతి , చిత్తూరు , సర్వం బంద్
సాక్షి, తిరుపతి: జిల్లాలోని తిరుపతి, చిత్తూరు నగరాలను బుధవారం సమైక్యవాదులు దిగ్బంధించారు. ద్విచక్ర వాహనాలు మినహా మరే వాహనాన్ని తిరగనివ్వలేదు. తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్‌లోని ఎల్ఐసీ కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు. సమైక్యవాదుల పిలుపుమేరకు రెండు నగరాల్లో అన్నిరకాల దుకాణాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. చిత్తూరులో వినూత్న తరహాలో నిరసనలు తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం చుట్టూ పాడి ఆవులతో నిరసన తెలిపారు. స్వచ్ఛంద బంద్ తిరుపతిలో స్వచ్ఛంద సంస్థలు, అన్ని ఉద్యోగ సంఘా ల ఐక్యకార్యాచరణ కమిటీ సభ్యులు నగరమంతా పర్యటిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్‌కు సహకరించాలని ప్రజలను కోరారు. చిత్తూరులోనూ వివిధ జేఏసీల ఆధ్వర్యంలో విడివిడిగా వినూత్న తరహాలో ర్యాలీ నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. విద్యార్థులు అతిపెద్ద జాతీయజెండాతో నగరంలో భారీ ప్రదర్శన చేశారు. తెలుగుతల్లి విగ్రహం చుట్టూ నిలబడి వందన సమర్పణ చేశారు. తిరుపతి కార్పొరేషన్ ఉద్యోగులు కేఎల్ వర్మ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. తిరుపతి కూరగాయల మార్కెట్ సంఘం అధ్యక్షుడు ముత్తూజ ఆధ్వర్యంలో కూరగాయలతో ప్రదర్శన చేశారు. తోపుడుబండ్ల వ్యాపారులు నగరంలో పలు వీధుల్లో భారీ ర్యాలీ చేశారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో భారీ ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని కోలాటాలు వేసి నిరసన తెలిపారు. టౌన్‌బ్యాంకు పాలకవర్గం, ఉద్యోగులు సంయుక్తంగా రహదారిని దిగ్బంధించి కళాకారులతో ప్రదర్శన నిర్వహించారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఉద్యోగులు నగరంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఎంఆర్‌పల్లి కూడలిలో ఉట్టి కొట్టి నిరసన తెలిపారు. చిత్తూరులో సమైక్య గర్జన... చిత్తూరులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రోడ్డుపై వలలు విసిరి చేపలు పడుతున్నట్లుగా నిరసన తెలిపారు. సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రోడ్డుపై కబడ్డీ, చమ్మాచక్క ఆటలు ఆడారు. గాంధీ విగ్రహం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వ్యవసాయశాఖ మార్కెట్ యార్డు, ట్రాక్టర్ యజమానులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు రోడ్లు శుభ్రం చేస్తూ నిరసన తెలిపారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పసుపు చీరలు కట్టుకుని రిలే నిరాహారదీక్ష చేశారు. జేఏసీ దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే సీకేబాబు నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో కదంతొక్కిన రైతులు శ్రీకాళహస్తిలో వందలాది మంది రైతులు అరటి చెట్లు, చెరుకు గడలు, వరి కంకులను చేతబట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భిక్షాలగోపురం వద్ద మానవహారం చేపట్టారు. స్కిట్ కళాశాల సిబ్బంది రోడ్డుపై ఆటపాటలతో నిరసన తెలిపారు. చంద్రగిరి మండలం ఐతేపల్ల్లె వద్ద పొలిటికల్, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై గానాబజానా నిర్వహించారు. మదనపల్లెలో సాప్స్ నాయకుడు ఉత్తన్న ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు బస్సులతో ర్యాలీ చేపట్టారు. పీలేరులో ఐసీడీఎస్ సిబ్బంది సుమారు 700 మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జీవీ శ్రీనాథరెడ్డి 48 గంటల దీక్ష కొనసాగింది. పుత్తూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేశారు. నగరిలో న్యాయవాదుల వంటావార్పు, ఉద్యోగ, ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేశారు. పలమనేరులో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ర్యాలీ నిర్వహించారు. తంబళ్లపల్ల్లె నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో రిలేదీక్షలు కొనసాగాయి. పెనుమూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎస్సార్‌పురం, కార్వేటినగరం, వెదురుకుప్పంలో విద్యార్థులు ర్యాలీలు, మానవహారాలు చేశారు. సత్యవేడులో సమైక్యవాదులు ఒక్కరోజు రిలే దీక్ష చేశారు. -
కొనసాగుతున్న అవినాష్ దీక్ష
సాక్షి, కడప: జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన ఆమరణ దీక్షలు ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి, తదితరులు చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. ఉద్యోగులు, విద్యార్థులతోపాటు అన్ని వర్గాల ప్రజలు, అన్ని సంఘాలు వేలాది మందిగా తరలివచ్చి వీరి దీక్షలకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ దీక్షలు ఉద్యమానికి మరింత ఊతమిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు జిల్లాలో అనూహ్య స్పందన లభిస్తోంది. ఈమె దీక్షకు మద్దతుగా పులివెందుల పట్టణంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేత ఈసీ గంగిరెడ్డి రిలే దీక్షలను ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రిలే దీక్షలు సాగుతున్నాయి. ప్రొద్దుటూరులో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో మహిళలు రిలే దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. దీంతోపాటు స్వచ్ఛందంగా పలుచోట్ల విజయమ్మ దీక్షకు సంఘీభావాన్ని తెలుపుతూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్షలు మంగళవారంతో ఏడవరోజు పూర్తయ్యాయి. వీరికి షుగర్, సోడియం లెవెల్స్ తగ్గడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. వీరి దీక్షలకు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి, నేషనల్ టూరిజంశాఖ డెరైక్టర్ సురేంద్రకుమార్‌లు సంఘీభావం తెలిపారు. కాగా మంగళవారం రాత్రి ఆకేపాటి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడువైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్బాష, నాగిరెడ్డిల దీక్ష మంగళవారంతో రెండవరోజు పూర్తి చేసుకుంది. వీరి దీక్షలకు సంఘీభావంగా పెద్ద ఎత్తున యువతతోపాటు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. వీరి దీక్షలకు వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, డీసీఎంఎస్మాజీ వైస్ చైర్మన్ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు సంఘీభావం తెలిపారు. -
సకలం.. సమైక్యం
జిల్లా అంతటా సమైక్య నినాదం మారుమోగుతోంది. ప్రతి ఒక్కరూ జై సమైక్యాంధ్ర అంటూ వీధుల్లోకొస్తున్నారు. ఉద్యమం పల్లెలకూ విస్తరిస్తోంది. ఎవరి నోట విన్నా సమైక్యమాటే వినిపిస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనంటూ ముక్తకంఠంతోనినదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. చేయిచేయి కలిపి సమైక్యతా గీతిక ఆలపిస్తున్నారు. ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఆర్టీసీ కార్మికులు కదన రంగంలో అడుగిడడంతో ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. సాక్షి, కడప : ఊరు, వాడ సమైక్య నినాదంతో మారుమోగుతోంది. రాష్ట్రం ముక్కలు చేసి తీరుతామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే సమైక్య వాదుల గుండెలు రగిలిపోతున్నాయి. రాజకీయ స్వార్థంతో చేస్తున్న విభజనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఉద్యమకారులు నినదిస్తున్నారు. దీంతో రోజురోజుకు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతరూపం దాలుస్తోంది. ఎటుచూసినా జనాలు ఉప్పెనలా రోడ్లపైకి వస్తున్నారు. సమైక్యాంధ్ర నినాదంతో జిల్లా దద్దరిల్లిపోతోంది. రోజురోజుకు ఉద్యమం కెరటంలా ఎగిసి పడుతోంది. జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రం వరకు ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొని భారీ ర్యాలీల ద్వారా తమ నిరసనలు తెలియజేస్తున్నారు. విధులు బహిష్కరించడంతో కార్యాలయాలు బోసిపోయాయి. గెజిటెడ్ ఉద్యోగులు సైతం స్టేట్ గెస్ట్‌హౌస్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి ఏడురోడ్ల కూడలిలో మానవహారం నిర్మించారు. ఆర్అండ్బీ ఎస్ఈ మనోహర్‌రెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. పల్లెల నుంచి భారీగా ప్రజలు తరలి వచ్చి దీక్ష చేస్తున్న వారికి సంఘీభావాన్ని తెలియజేయడం, వివిధ ఉద్యోగ సంఘాలు భారీ ర్యాలీగా రావడంతో కలెక్టరేట్ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. జేఏసీ ఉద్యోగులు, వైఎస్సార్సీపీ నేతల దీక్షలు సాగుతూనే ఉన్నాయి. జిల్లా అధికారుల సంఘం, ఎల్ఐసీ ఏజెంట్లు, కడప నగర పాలక సంస్థ ఉద్యోగులు, ఆటో యూనియన్లు, బాల వికాస్ విద్యార్థులు, దేవాదాయ ధర్మదాయశాఖ, ట్రెజరీ అసోసియేషన్, మార్కెటింగ్‌శాఖ, ఎన్సీసీ 30(ఎ) బెటాలియన్, మెడికల్, పారా మెడికల్ అసోసియేషన్, పోలీసు మినిస్ట్రీరియల్ సిబ్బంది, ఆయుష్, వికలాంగులు, అటవీ, విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీని నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి దీక్షలకు వేల సంఖ్యలో మద్దతు పలికారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, వైఎస్సార్ సీపీ క్రమశిక్షణా సంఘం సభ్యుడు రఘురామిరెడ్డి, కొల్లం బ్రహ్మానందరెడ్డి దీక్షలకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి ఆధ్వర్యంలో సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యమంపై కార్యచరణ రూపొందించారు. జమ్మలమడుగు ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగులు పూర్తిగా విధులను బహిష్కరించారు. ఆర్టీపీపీలో 3800 మంది ఉద్యోగులు రోడ్డుపైన బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. రాయచోటిలో విద్యార్థులు కదం తొక్కారు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. రోడ్లపైనే విద్యాబోధన సాగింది. ఆర్టీసీ, విద్యుత్‌శాఖ ఉద్యోగులు రోడ్డెక్కారు. రైల్వేకోడూరులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, దూదేకుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి తగులబెట్టారు. కమలాపురం సమీపంలోని గోపులాపురంలో చెక్కభజనతో తమ నిరసనను తెలిపారు. టి.చదిపిరాళ్లలో విద్యార్థులు రోడ్డుపైనే క్రికెట్, ఖోఖో ఆడుతూ డ్యాన్స్ చేసి తమ నిరసన తెలియజేశారు. అప్పాయపల్లె దళితవాడ నుంచి కమలాపురం క్రాస్‌రోడ్డు వరకు యువత సోనియాగాంధీ శవయాత్ర నిర్వహించారు. రాజంపేటలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఊటుకూరులో విద్యార్థులు రాస్తారోకో, ర్యాలీ నిర్వహించి సోనియాకు పిండప్రదానం చేశారు. వీరికి ఎమ్మెల్యే అమరనాథరెడ్డి సంఘీభావం తెలిపారు. బద్వేలులో విద్యార్థులు, కోట వీధి మహిళలు, టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బుధవారం బద్వేలు బంద్‌కు పిలుపునిచ్చారు. మైదుకూరులో సమైక్యాంధ్రపై మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. టీడీపీజేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహారాన్ని నిర్వహించారు. టీడీపీ నేత సుధాకర్ యాదవ్ సంఘీభావాన్ని తెలియజేశారు. మైదుకూరులో బంద్‌ను పాటించారు. ప్రొద్దుటూరులో ముస్లింసోదరులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పద్మశాలి అభ్యుదయ సంఘం, వెంకటేశ్వర పశు వైద్య కళాశాల సిబ్బంది, ఎన్జీఓలు భారీ ర్యాలీ నిర్వహించారు. 20 సంఘాల వారు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు పట్టణంలో భారీ ర్యాలీ, మానవహారం చేపట్టారు. చిన్న పిల్లలు, విద్యార్థులు సైతం సమైక్య ఉద్యమంలో పాల్గొనడం విశేషం. పట్టణంలో జరిగిన కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ నేతలు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి పాల్గొన్నారు. -
ఇక యుద్ధమే
కర్నూలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని జిల్లావాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. పదకొండు రోజులుగా ప్రజలు వినూత్న రీతిలో నిరసనలు చేపడుతున్నారు. సమైక్య రాష్ట్రం విడిపోతే భవిష్యత్ ఏమిటనే ఆందోళనతో పలువురు హఠాన్మరణం చెందుతున్నారు. రంజాన్, నాగులచవితి నేపథ్యంలో ఉద్యమానికి విరామం ప్రకటించినా.. ఆవేదనతో పలువురు స్వచ్ఛందంగానే నిరసన తెలియజేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి జేఏసీ నేతృత్వంలో ఆందోళనల తీవ్రరూపం దాల్చనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణను రూపొందించారు. కర్నూలు నగరంలో మాజీ మండలాధ్యక్షుడు డి.విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చిన్న వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలోనూ ర్యాలీ చేపట్టారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్ వద్ద నాల్గో రోజు నిరాహారదీక్ష కొనసాగింది. ప్రైవేట్ విద్యాసంస్థలు, అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో సి.క్యాంప్ సెంటర్లోని లలిత కళాసమితిలో సమైక్యాంధ్ర సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో కట్టమంచి రెసిడెన్షియల్ స్కూల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకున్నారు. 16వ తేదీన 80వేల మంది విద్యార్థులతో మహా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. డీసీసీ, టీడీపీ కార్యాలయాల వద్ద నిరాహారదీక్షలను ఆ పార్టీల కార్యకర్తలు కొనసాగించారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కూడలిలో న్యాయవాదులు దీక్ష కొనసాగిస్తున్నారు. ఆదోనిలో కురువ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప గుడి నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు మోటర్‌సైకిల్, ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. గొరవయ్యలు ఢమరుకం వాయిస్తూ పట్టణంలో ప్రదర్శన చేపట్టారు. బీమా సర్కిల్లో సోనియా దిష్టిబొమ్మ, పాతబస్టాండ్ సర్కిల్లో కేసీఆర్ దిష్టిబొమ్మను సమైక్యవాదులు దహనం చేశారు. ఆళ్లగడ్డలో జేఏసీ ఆధ్వర్యంలో గౌతమ్ మోడల్ స్కూల్లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. చిప్పగిరిలో దళిత విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరులో ఉపాధ్యాయుల రిలే దీక్షలకు వైఎస్సార్సీపీ నాయకులు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. బనగానపల్లెలో జేఏసీ ఆధ్వర్యంలో కొత్తబస్టాండ్ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు మోటర్‌సైకిల్ ర్యాలీ చేపట్టారు. డోన్‌లో పాల వ్యాపారులు సోనియా దిష్టిబొమ్మను గేదెపై ఊరేగించి పాతబస్టాండ్‌లో దహనం చేశారు. మంత్రాలయంలో సీఎస్ఐ చర్చి సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మానవహారం నిర్వహించారు. పత్తికొండలో ఏపీఆర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి నాలుగు స్తంభాల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. జొన్నగిరిలో సర్పంచ్ లక్ష్మి ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. కోడుమూరులో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి దహనం చేశారు. నందికొట్కూరులోని పటేల్ సెంటర్లో వైఎస్సార్సీపీ, జేఏసీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. -
విభజిస్తే ఊరుకోం
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: స్వార్థం కోసం రాష్ట్రాన్ని రెండుగా విభజించేందుకు సోనియాగాంధీ చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని, లేదంటే సీమాంధ్ర సత్తా ఏంటో చూపుతామని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మంగళవారం ఆ పార్టీ నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ మనుగడ కనుమరుగు అవుతోందన్న భయంతోనే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం పాల్పడిందని ఆరోపించారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధిష్టానానికి భయపడి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దొంగ రాజీనామాలతో మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఆనం సోదరులారా బయటకు రండి ‘రాష్ట్ర మంత్రి, రూరల్ ఎమ్మెల్యే ఆనం సోదరులు ఎక్కడ దాక్కున్నారో బాహ్య ప్రపంచంలోకి రండి. మీ ఇంటిముందుకొచ్చాం. దొంగ రాజీనామాలు చేసి బొత్సకు, భానుశ్రీకి ఇవ్వడం కాదు. దమ్ము, ధైర్యం ఉంటే స్పీకర్‌కు ఇచ్చి ఆమోదింప చేసుకుని సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ప్రజా ఉద్యమంలో నేరుగా పాల్గొనండి’ అని కోటంరెడ్డి, అనిల్ సవాల్ విసిరారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏం పాపం చేశారని ఆయన విగ్రహాలపై చెయ్యి వేయాలని అనుకుంటున్నారు?. మూడు పర్యాయాలు నిన్ను ఎమ్మెల్యేగా చేశారనా? మీ తమ్ముడిని మంత్రి చేశారనా? మరో ఇద్దరు తమ్ముళ్లకు కాంట్రాక్టు పనులు కట్టబెట్టారనా? లేక భానుశ్రీని మేయర్ చేసినందుకా? వైఎస్సార్ విగ్రహాలను పగులకొట్టండని పిలుపునిస్తారని ఆనం వివేకానందరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఒక్కసారి వైఎస్సార్ విగ్రహాలపై చెయ్యి వేసి చూడండి.. ఏం జరుగుతుందోనని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు భరోసా కల్పిస్తున్న సమయంలో ఆయన్ను జైల్లో పెట్టించి కాంగ్రెస్ నాయకులు నాటకాలు అడుతున్నారన్నారు. ఈ నాటకాలు మరెంతో కాలం సాగవన్నారు. మహా అయితే మరో నాలుగు నెలల పాటు కొనసాగిస్తారేమో అని అన్నారు. ఆ తర్వాత తమ యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. అప్పుడు నీవు ఏమి మాట్లాడినా, ఏం చేసినా ఎవరూ పట్టించుకునే వారే ఉండరని ఆనం వివేకానుద్దేశించి కోటంరెడ్డి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, ముప్పసాని శ్రీనివాసులు, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, ఎస్కే సుభాన్, షేక్ మాబు, లెక్కల వెంకారెడ్డి, ఆర్.జెస్సీ, సంక్రాంతి కల్యాణ్‌రెడ్డి, మునీర్‌సిద్ధిక్, దార్ల వెంకటేశ్వర్లు, ఎ.బాలకోటేశ్వరరావు, ఎండీ ఖలీల్‌అహ్మద్, ఎస్ఆర్ ఇంతియాజ్, కూకటి ప్రసాద్. జాఫర్మోహిద్దీన్, ఫజల్మన్నడు, దండే లక్ష్మిరెడ్డి, టి.రఘురామిరెడ్డి, ముప్పాల శేషుగౌడ్, కాకుటూరు విజయభాస్కర్‌రెడ్డి, గంధం సుధీర్‌బాబు, రజిని, సుభాషిణి, మీనమ్మ, శ్రావణ్‌కుమార్, హరిప్రసాద్‌నాయుడు, సత్య, అఖిల్, బిరుదవోలు శ్రీకాంత్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, నర్సింహముదిరాజ్, బత్తల వెంకటేశ్వర్లు, పట్రంగి అజయ్, చేజర్ల మహేష్‌బాబు, ప్రశాంత్, కిరణ్, నరేష్, అజీమ్, కారుదుంప దశరథరామయ్యలతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు వేలాది మంది పాల్గొన్నారు.