సాక్షి, అనంతపురం: పండుగ లేదు. పబ్బమూ లేదు. విశ్రాంతి అంతకంటే లేదు. సమైక్యమే అభిమతమంటూ ఉద్యమకారులు కదంతొక్కుతూనే ఉన్నారు. దీపావళి పండుగ రోజు కూడా వారు విశ్రమించలేదు. ఫలితంగా 96వ రోజైన ఆదివారం కూడా జిల్లా వ్యాప్తంగా ‘సమెక్య’ ఉద్యమం జోరుగా కొనసాగింది. గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోనియాగాంధీని నరకాసురుడితో పోలుస్తూ ఫ్లెక్సీ తయారు చేసి... దాన్ని దహనం చేశారు. పాతకొత్తచెరువులో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మౌనదీక్ష కొనసాగింది. సమైక్యాంధ్ర ఉద్యమం 96 రోజులు పూర్తి చేసుకోవడంతో ఎద్దులపల్లి విద్యార్థులు పామిడిలో సమైక్య నినాదాలు చేశారు. చిలమత్తూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్రాల్లో దుష్టపరిపాలన తొలగిపోవాలని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటూ ఓడీ చెరువులో సమైక్యవాదులు నరకాసుర వధ ప్రదర్శన చేశారు. పెనుకొం డలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి.. దహ నం చేశారు. గోరంట్లలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వాన్ని నరకాసురుడితో పోలుస్తూ.. దిష్టిబొమ్మను తగులబెట్టారు. రాబోవు దీపావళి కూడా సమైక్య రాష్ట్రంలోనే జరుపుకోవాలని ఆకాం క్షిస్తూ రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో టపాకాయలతో అమర్చిన విభజనకారు ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. చితాభస్మాన్ని సమీపంలోని డ్రైనేజీలో కలిపారు.
రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో భారత్ ఐటీఐ, కళ్లిమఠం మునిసిపల్ పాఠశాల విద్యార్థులు నిరసన తెలిపారు. రాజీవ్‌గాం ధీ ఉర్దూ మునిసిపల్ హైస్కూల్ విద్యార్థులు స్థానిక వినాయకసర్కిల్‌లో రాస్తారోకో చేశారు. తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థుల రిలేదీక్షలు కొనసాగాయి. ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నరకాసుర, విభజనకారుల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
సమైక్యమే అభిమతం
Published Mon, Nov 4 2013 3:01 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement