అనంతపురం విద్య: జేఎన్‌టీయూ(అనంతపురం) ఇంజినీరింగ్ కళాశాల ఉన్నతాధికారులు ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపారు. జూనియర్లపై వికృత చేష్టలకు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్ వ్యవహారంపై ప్రొఫెసర్ల కమిటీ బాధిత విద్యార్థులను, ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను విచారించింది. అనంతరం నివేదిక తయారు చేసి వర్సిటీ అధికారులకు అందజేసింది.
ఈ క్రమంలో మంగళవారం జేఎన్‌టీయూ (ఏ) ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ బిల్డింగ్‌లో ప్రిన్సిపాల్ పి. సుజాత, వైస్ ప్రిన్సిపాల్ బి.దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశమైన కాలేజ్ అకడమిక్ కమిటీ నివేదికను పరిశీలించింది. ర్యాగింగ్‌కు పాల్పడిన 20 మంది విద్యార్థులను సస్పెండ్ చేయాలన్న ప్రొఫెసర్ల కమిటీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అయితే ర్యాగింగ్ పాల్పడిన వారిని మూడు కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీ వారికి ఒక సెమిస్టర్ కాలం, రెండో కేటగిరీలోని వారిని నాలుగు వారాలు, మూడో కేటగిరీలోని వారిని రెండు వారాల పాటు సస్పెండ్ చేశారు. శిక్ష కాలంలో తరగతులు, హాస్టల్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment