సాక్షి, కర్నూలు: సెలవు రోజుల్లోనూ ఉద్యమ తీవ్రత తగ్గకపోవడం ప్రజల్లో సమైక్య ఆకాంక్షకు అద్దం పడుతోంది. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు కదంతొక్కారు. కర్నూలులోని ఎ.క్యాంప్ అపార్ట్‌మెంట్, కాలనీకి చెందిన సుమారు 2వేల మంది భారీ ర్యాలీ నిర్వహించి, ప్రధాన కూడళ్లలో మానవహారంగా ఏర్పడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినదించారు. తడకనపల్లె స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సర్పంచ్ గంగుల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనం చేశారు. మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల, కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు, కార్మికులు భారీ ర్యాలీ చేపట్టి వంటావార్పు నిర్వహించారు.
కల్లూరు రైతు సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై గేదెలతో నిరసన తెలిపారు. వెల్దుర్తిలో దాదాపు 10వేల మందితో సమైక్య సింహగర్జన చేపట్టారు. ఆదోనిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకు పెకైక్కి నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డు జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నడిచారు. ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. రుద్రవరంలో మండల వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీపక్ష చేపట్టారు. ఆత్మకూరులో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్ష కొనసాగుతోంది.
పట్టణ కన్వీనర్ ఇస్కాల రమేష్ ఆధ్వర్యంలో పలువురు దీక్షలో కూర్చొన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమైక్యవాదులు వివిధ రాజకీయ నేతల చిత్రపటాలతో కూడిన కుండలతో ర్యాలీ నిర్వహించి అనంతరం పగులగొట్టి నిరసన తెలి పారు. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో వీఆర్వో కె.మహబూబ్‌బాషా, ఆవాజ్ కమిటీ సభ్యులు చేపట్టిన నిరాహార దీక్షకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. వెలుగోడులో జేఏసీ ఆధ్వర్యంలో మోతుకూరు గ్రామస్తులు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు.
పదండి తోసుకు
Published Mon, Sep 23 2013 4:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement