breaking news
kurnool
-
కర్నూలు ఘటన: ‘ఈ దుఖం నాతోనే ఉండిపోవాలి’
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు వద్ద అగ్ని ప్రమాదానికి గురైన బస్సులో కరిగి ముద్దగా మారిన మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంట్లో ఏమని చెప్పాలి.. వారికి ఈ శరీరాన్ని ఎలా చూపాలి.. చూపితే వారు తట్టుకోగలరా.. ఇంతటి దుఃఖం మాతోనే ముగిసిపోనీ.. కర్నూలులోనే కుమారునికి అంత్యక్రియలు చేస్తాం’ అని ఆ తండ్రి బోరున విలపిస్తూ భావోద్వేగంతో చెప్పిన మాటలు కంటతడి పెట్టించాయి. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు శివారులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు.వీరిలో తమిళనాడులోని ధర్మపురం జిల్లా పాలక్కాడ్ తాలూకా మాదగేరి గ్రామానికి చెందిన రాజన్ మారప్పన్ కుమారుడు ప్రశాంత్ (29) కూడా ఉన్నాడు. ఇతను హైదరాబాద్‌లో చిప్స్ ఫ్యాక్టరీ నడుపుకుంటున్నాడు. అతడికి ఏడాదిన్నర క్రితమే వివాహం కాగా.. ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. స్వస్థలానికి వెళ్లి భార్యాపిల్లలను చూసేందుకు గురువారం రాత్రి హైదరాబాద్‌లో వి.కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. బస్సు కర్నూలు దాటగానే మంటల్లో కాలిపోయింది. ఇందులో ప్రశాంత్ సజీవదహనయ్యారు. సోమవారం తమిళనాడుకు చెందిన ప్రశాంత్ మృతదేహానికి కూడా కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు అధికారులను కోరారు. కర్నూలు నుంచి 800 కి.మీ. దూరంలో ఉన్న మాదగేరికి వెళ్లాలంటే రెండు రోజుల సమయం పడుతుందని.. మరణించి ఇప్పటికే మూడు రోజుల సమయం దాటిందని, ఇప్పుడు స్వగ్రామానికి వెళ్లేలోపు ఐదు రోజులు పూర్తవుతుందని తండ్రి రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కాలిపోయిన మాంసం ముద్దగా మారిన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు చూపించి వారిని మరింత క్షోభకు గురిచేయలేమని, కేవలం అస్థికలు మాత్రమే తీసుకెళ్తామని, అందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సద్గురుదత్త కృపాలయం గ్యాస్ క్రిమేషన్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించి అస్థికల్ని అందజేశారు. వాటిని ప్రశాంత్ తండ్రి రాజన్ మారప్పన్తో పాటు సోదరుడు మణి, స్నేహితులు తీసుకెళ్లారు. -
భగవంతుడా.. మాకే ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశావయ్యా..
వింజమూరు (ఉదయగిరి): ‘కడసారిది వీడ్కోలు.. కన్నీటితో మా చేవ్రాలు.. కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ.. బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది’ అంటూ కుటుంబ సభ్యులు, బంధువుల రోదనల మధ్య ఊరంతా తరలివచ్చి.. కర్నూలులో జరిగిన బస్సు దగ్ధం ఘటనలో సజీవ దహనమైన గోళ్ల రమేష్, భార్య అనూష, ఇద్దరు పిల్లలు మన్విత, శశాంక్ అంత్యక్రియలు సోమవారం గోళ్లవారిపల్లిలో విషణ్ణ వదనాల మధ్య నిర్వహించారు. భగవంతుడా.. మాకే ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశావయ్యా.. మేము చేసిన పాపం ఏమిటీ? కనికరం లేదా ఆ బిడ్డలైనా బతికించకూడదా అంటూ మృతుల బంధువులు రోదించడం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యమయ్యారు. అగ్ని కీలల్లో చిక్కొని బొగ్గులైన మృతదేహాలను చూసిన ప్రతి ఒక్కరూ పగ వారికి కూడా ఇంత కష్టం రాకూడదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో మృతి చెందిన గోళ్ల రమేష్ , భార్య, బిడ్డలకు డీఏన్ఏ టెస్ట్‌లు నిర్వహించి ఆదివారం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. రాత్రికి గోళ్లవారిపల్లికి ప్రత్యేక అంబులెన్స్‌ల ద్వారా చేర్చారు. సోమవారం ఉదయం అంతమయాత్ర నిర్వహించారు.ఆ కుటుంబాలను ఆదుకుంటాంఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ బాఽధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకొంటామని తెలిపారు. ఇప్పటికే టీడీపీ తరఫున రూ.10 లక్షలు వారి ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి రూ.5 లక్షలు, కాకర్ల ట్రస్టు తరఫున తాను రూ.3 లక్షలు, స్వర్ణభారతి ట్రస్టు వారు రూ.లక్ష, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షలు వంతున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బస్సుకు సంబంధించి బీమాతో పాటు మరికొంత సహాయం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గూడా నర్సారెడ్డి, జూపల్లి రాజారావు, ఎంపీపీ మోహన్‌రెడ్డి, బండారు సత్యనారాయణ, మాజీ ఎంఈఓ జి.ఓబులరెడ్డి, కలిగిరి సీఐ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
24X7 మద్యం.. ఊరూరా సాక్ష్యం!
-
కర్నూలు బస్సు ప్రమాదం.. రమేష్ కుటుంబాన్ని వెంటాడుతున్న ప్రమాదాలు
సాక్షి,అమరావతి: హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయలు దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు(డీడీ 01ఎన్9490) శుక్రవారం తెల్లవారు జామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన గోళ్ల రమేష్(31) కుటుంబాన్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయి.సోమవారం కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన రమేష్ కుటుంబసభ్యుల అంత్యక్రియల్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా వారి కుటుంబసభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో రమేష్ కుటుంబసభ్యుల ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వింజమూరు (మం) గోళ్ళవారి పల్లి నుండి విజయవాడ వెళ్తుండగా కారు టైర్ పంచర్ కావడంతో కల్వర్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
కోలుకుంటున్న బస్సు ప్రమాద బాధితుడు.. ఆస్పత్రిలో చేరిన ఎర్రిస్వామి
సాక్షి, కర్నూలు: కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన గుణసాయి అనే ప్రయాణికుడు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కోలుకుంటున్నాడు. మచిలీపట్నంకు చెందిన ఈయన ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బస్సులో ప్రయాణిస్తుండగా మంటలు రావడంతో ఆ పొగ పీల్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో అతని ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురయ్యాయి. దీంతో అతన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరి్పంచారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్‌ఐసీయులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. శనివారం వరకు విషమంగా ఉన్న అతని ఆరోగ్యం వైద్యుల కృషి ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడింది. ఆస్పత్రిలో చేరిన ఎర్రిస్వామి.. బస్సు ప్రమాదంలో కీలక సాక్షిగా ఉన్న ఎర్రిస్వామి శనివారం రాత్రి ప్రభుత్వాస్పత్రిలో కడుపునొప్పితో చేరాడు. బైక్ నుంచి అతను కింద పడటంతో కడుపు వద్ద గీరుకుపోయింది. దీనికితోడు పలుచోట్ల నొప్పులు ఉండటంతో కుటుంబసభ్యుల కోరిక మేరకు పోలీసులు అతన్ని ఆసుపత్రిలో చేరి్పంచారు. అతనికి అ్రల్టాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేసిన వైద్యులు.. లోపల ఎలాంటి గాయాల్లేవని నిర్ధారించారు. మరికొన్ని పరీక్షలు చేసి కోలుకుంటే డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిసింది.స్వగ్రామానికి చేరిన తల్లీకుమార్తె మృతదేహాలుమరోవైపు.. బస్సు ఘటనలో సజీవ దహనమైన తల్లీకుమార్తె మృతదేహాలు ఆదివారం అర్ధరాత్రి స్వస్థలానికి చేరుకున్నాయి. డీఎన్ఏ పరీక్షల నిమిత్తం శుక్రవారం రాత్రి సంధ్యారాణి తల్లి, చందన తండ్రి నుంచి నమూనాలు సేకరించగా, ఆదివారం ఉదయం ఫలితాలు రావడంతో అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు కర్నూలుకు వెళ్లారు. సాయంత్రం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో మెదక్ మండలం శివాయిపల్లికి తరలించారు. వాటిని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి. -
వేమూరి కావేరి బస్సు ప్రమాదంపై రెండు ఎఫ్ఐఆర్లు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కావేరి బస్సు ప్రమాద ఘటనపై చిక్కుముడి వీడింది. బైక్, బస్సు ప్రమాదం ఒకటి కాదని.. రెండు వేర్వేరు ప్రమాదాలని పోలీసులు తేల్చారు. బైకర్స్ మద్యం సేవించి లక్ష్మీపురం నుంచి బయలుదేరగా చిన్నటేకూరు దాటిన తర్వాత వారి బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శివశంకర్ అక్కడికక్కడే మృతిచెందగా, వెనుక కూర్చున్న ఎర్రిస్వామి కిందపడిపోయాడు. ఈ ఘటన తర్వాత కొన్ని వాహనాలు ఇదే దారిలో వెళ్లాయి. 13 నిమిషాల తర్వాత వచి్చన కావేరి బస్సు డ్రైవర్.. ఆ బైక్‌ను గుర్తించడంలో విఫలమై ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది.నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ నెల 24న బైక్‌ను ఢీకొట్టి ప్రమాదానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుపై సెక్షన్ 12(ఏ), 106(1) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. ఏ1గా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఏ2గా బస్సు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల విచారణలో రెండూ వేర్వేరు ఘటనలని తేలాక ఈ నెల 25న మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చాకలి ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు మృతిచెందిన బైకర్ శివశంకర్‌పై సెక్షన్ 281, 125(ఏ), 106(1) కింద కేసు నమోదు చేశారు. విచారణ ఇంకా కొనసాగుతోందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మృతదేహాలు అప్పగింత డీఎన్ఏ శాంపిల్స్ రిపోర్ట్‌ను ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ) జిల్లా కలెక్టర్‌కు పంపడంతో మృతదేహాలను బాధిత కుటుంబాలకు అందజేశారు. కర్నూలు జనరల్ ఆస్పత్రి మార్చురీ వద్ద భీతావహ వాతావరణంలో ఈ ప్రక్రియ పూర్తయింది. ఆదివారం 17 మృతదేహాలను బంధువులకు అప్పగించగా.. బిహార్ వాసి అమృత్‌కుమార్ మృతదేహాన్ని తాము తీసుకెళ్లలేమని, ఆనవాళ్లు కూడా లేని మాంసపు ముద్దకు ఇక్కడే అంత్యక్రియలు చేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. దీంతో కర్నూలు కార్పొరేషన్ అధికారులు అమృత్‌కుమార్ అంత్యక్రియలు పూర్తిచేశారు. ఇక తమిళనాడు వాసి ప్రశాంత్ మృతదేహాన్ని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఆరాంఘర్‌లో బస్సు ఎక్కింది కుప్పం వాసి త్రిమూర్తి.. హైదరాబాద్‌లోని ఆరాంఘర్‌లో బస్సు ఎక్కిన ప్రయాణికుడిని కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం యామగానిపల్లెకు చెందిన త్రిమూర్తిగా గుర్తించడంతో డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. చెక్కుల పంపిణీ పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం బస్సు ప్రమాదంలో మృతిచెందిన ఆరుగురు ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందజేసింది. గద్వాల ఆర్డీవో అలివేలు చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున హోంమంత్రి అనిత ప్రకటించినట్లుగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని త్వరలో అందజేస్తామని కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు. కోలుకుంటున్న బస్సు ప్రమాద బాధితుడు కర్నూలు (హాస్పిటల్): కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన గుణసాయి అనే ప్రయాణికుడు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కోలుకుంటున్నాడు. మచిలీపట్నంకు చెందిన ఈయన ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బస్సులో ప్రయాణిస్తుండగా మంటలు రావడంతో ఆ పొగ పీల్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో అతని ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురయ్యాయి. దీంతో అతన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్‌ఐసీయులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. శనివారం వరకు విషమంగా ఉన్న అతని ఆరోగ్యం వైద్యుల కృషి ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడింది. ఆస్పత్రిలో చేరిన ఎర్రిస్వామి.. బస్సు ప్రమాదంలో కీలక సాక్షిగా ఉన్న ఎర్రిస్వామి శనివారం రాత్రి ప్రభుత్వాస్పత్రిలో కడుపునొప్పితో చేరాడు. బైక్ నుంచి అతను కింద పడటంతో కడుపు వద్ద గీరుకుపోయింది. దీనికితోడు పలుచోట్ల నొప్పులు ఉండటంతో కుటుంబసభ్యుల కోరిక మేరకు పోలీసులు అతన్ని ఆసుపత్రిలో చేరి్పంచారు. అతనికి అ్రల్టాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేసిన వైద్యులు.. లోపల ఎలాంటి గాయాల్లేవని నిర్ధారించారు. మరికొన్ని పరీక్షలు చేసి కోలుకుంటే డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిసింది. -
అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన కర్నూలు యువకుడు
రాంచీ వేదికగా జరిగిన నాలుగో దక్షిణాసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో (South Asian Athletics Championship 2025) ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన మొగలి వెంకట్రాం రెడ్డి (Mogali Venkatramreddy) సత్తా చాటాడు. 800 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ ఈవెంట్‌ను వెంకట్రాం రెడ్డి 1:52.37 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.ఈ గేమ్స్‌లో భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు.వెంకట్రాం రెడ్డి పతకం సాధించిన అనంతరం హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) అథ్లెటిక్స్ కోచ్ డా. జి.వి. సుబ్బారావు స్పందించారు. "ఇది దేశానికి గర్వకారణం. వెంకట్రాం రెడ్డి అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించాడు. ఇది అతని శ్రమకు ఫలితమని అన్నాడు.వెంకట్రాం రెడ్డి ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 800 మీటర్లు, 1500 మీటర్ల ఈవెంట్లలో స్వర్ణ పతకాలు సాధించి "గోల్డెన్ డబుల్" సాధించాడు. చదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..! -
కర్నూలు బస్సు ప్రమాదం..19 మృత దేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తి
సాక్షి,కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం నింపిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన 19 మృత దేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలు కర్నూలు వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగంలో జరిగాయి. ఇప్పటి వరకు డీఎన్ఏ పరీక్షలు పూర్తయిన మొత్తం మృతదేహాల రిపోర్ట్ వివరాల్ని వైద్యులు ఎస్పీకి అందించారు. వాటి ఆధారంగా అధికారులు భౌతిక కాయల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేలా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 14 మృత దేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో బిహార్ చెందిన ఆర్గా అనే వ్యక్తి మృతదేహానికి వారి కుటుంబ సభ్యులు కర్నూలు జోహరాపురంలో అంత్యక్రియలు చేశారు. బిహార్‌కు తీసుకుని వెళ్లేందుకు సమయం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో అక్కడ అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు బస్సు ప్రమాదంలో ఇంకా రెండు మృతదేహాల డిఎన్ఎ రిపోర్టు అందాల్సి ఉండగా.. ఇప్పటి దాకా 17 మృతదేహాల డీఎన్ఏ రిపోర్ట్‌లను అధికారులు పొందారు. ఈ రోజు రాత్రికి 19 మృతదేహాల్లో 18 మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. తమిళనాడుకు చెందిన మృతుడు ప్రశాంత్ కుటుంబ సభ్యులు రేపు కర్నూలుకి రానున్న నేపద్యంలో ఆ మృత దేహాన్ని రేపు అప్పగించనున్నారని సమాచారం. -
కర్నూలు ప్రమాదం: వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులే.. సజ్జనార్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాదంపై(Kurnool Bus Fire Accident) హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్(VC Sajjanar) స్పందించారు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి!! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ఒక్కరి నిర్లక్ష్యం.. 20 మందిని ప్రాణాలను బలితీసుకుంది. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి!!. వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు!?.సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రతగా ఉండండి. వీరి కదలికలపై వెంటనే డయల్ 100 కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వండి. చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారు. వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది’ అని పోస్టు చేశారు. Drunk drivers are terrorists. Period.Drunk drivers are terrorists and their actions are nothing short of acts of terror on our roads. The horrific #Kurnool bus accident, which claimed the lives of 20 innocent people, was not an accident in the truest sense. It was a preventable… pic.twitter.com/oXTp0uOt2k— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 26, 2025 -
Kurnool: ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమా?
కర్నూలు(సెంట్రల్): ఎగిసిపడుతున్న అగ్ని కీలలు.. మరో వైపు ప్రయాణికుల ఆర్తనాదాలు.. కళ్ల ముందు భయానక వాతావరణం.. ఆ సమయంలో కొందరు వ్యక్తులు మృత్యువును సైతం ఎదిరించి కొందరి ప్రాణాలను కాపాడారు. కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు దుర్ఘటనలో ప్రయాణికులను కాపాడేందుకు వాహనదారులు ఎంతో ధైర్యంగా సాహసం చేసి మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. బస్సులో కళ్లెదుటే మంటల్లో ఆహుతవుతున్నా ప్రయాణికులను కొందరు వాహనదారులు ప్రాణాలకు తెగించి కాపాడే ప్రయత్నం చేశారు. మంటల్లో దగ్ధమవుతున్న బస్సు డోర్లు, కిటికీలు, అద్దాలు పగలగొట్టి కొందరిని బయటకు లాగారు. ఫలితంగా 43 మంది ఉన్న కావేరి ట్రావెల్స్‌లో 24 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఎంత ప్రయతి్నంచినప్పటికీ 19 మందిని కాపాడలేకపోవడంతో అగ్నికి ఆహుతై బస్సులోనే ప్రాణాలను వదిలి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ప్రమాద సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తి సహాయక చర్యల్లో కీలకంగా వ్యవహరించాడు. అతడిని చూసి ప్రేరణ పొందిన మరికొంతమంది తమలో మానవత్వాన్ని నిద్రలేపి ముందుకొచ్చారు. ఈ క్రమంలో మంటలు ఉద్ధృతమవుతున్న సమయంలో బస్సు కిటికీలు, అద్దాలను బద్దలు కొట్టి ఐదుగురును బయటకు లాగినట్లు తెలుస్తోంది. అంతేకాక వెంటనే పోలీసులు, ఫైర్, 108 అంబులెన్స్‌లకు సమచారం ఇచ్చారు. అయితే అప్పటికే అంబుల్సెన్‌లు చేరుకోకపోవడంతో తమ సొంత వాహనాల్లో ప్రమాదం నుంచి బయట పడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరికొంత మందిని కాపాడే ప్రయత్నంలో ఉండగా ఒక్క ధాటిగా మంటలు ఎగిసిపడటంతో మిగతా వారిని కాపాడలేకపోయారు. కళ్ల ముందు కొందరు మంటల్లో ఆహుతి అవుతున్న వారిని చూసి బరువెక్కిన హృదయాలతో చలించిపోయారు. వెనక డోర్‌ను బద్దలు కొట్టి.. బస్సులోని వ్యక్తుల ప్రాణాలను కాపాడడంలో బస్సు రెండో డ్రైవరు, క్లీనరు కూడా కీలకంగా వ్యవహరించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణికులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వెనక డోర్‌ను బద్దలు కొట్టి దాదాపు 10 మంది దాకా బయటకు వెళ్లేలే చేశారని సమాచా రం. అప్పటికే కొంతమంది ప్రయాణికులు డోర్‌ను బద్దలు కొట్టేందుకు ప్రయతి్నస్తున్నా ఓపెన్ కాకపోవడంతో వారు పెద్ద రాడ్డు తీసుకొని బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు. వారు తమకేమి అనుకొని రన్నింగ్ డ్రైవర్ మాదిరిగా పారిపోయి ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగేది. కొందరు సోషల్ మీడియా కోసం తాపత్రయం... బస్సు ప్రమాద సమయంలో కొందరు మాత్రం తమలో మానవత్వం లేదనే విధంగా ఘటన స్థలంలో వ్యవహరించినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. కళ్లముందు మంటల్లో ప్రాణాలు కలిసి పోతుంటే కాపాడే ప్రయత్నం చేయకుండా సోషల్ మీడియా కోసం ఫొటోలు, వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ కనిపించారని చెప్పారు. ఆపదలో ఉన్న వారిని రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయతి్నంచి ఉంటే మరికొంతమంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేది. ఇప్పటికైనా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ప్రయతి్నంచాల్సిన అవసరం ఉంది. పత్తాలేని పెట్రోలింగ్ వాహనం.. 44వ జాతీయ రహదారిలో ఎన్హెచ్ఏఐ(నేషనల్ హై అథారిటీ ఆఫ్ ఇండియా) రోడ్డు భద్రతను గాలికొదిలినట్లు తెలుస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే క్షణాల్లో అక్కడ ఉండాల్సిన పెట్రోలింగ్ వాహనం, అంబులెన్స్‌లు కనిపించలేదు. ఈ ప్రమాద ఘటనన జరిగిన ప్రదేశం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో పుల్లూరు టోల్‌ప్లాజా, 24 కిలోమీటర్ల పరిధిలో అమడగుంట్ల టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఆయా టోల్ ప్లాజాల పరిధిలో పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉండాలి. అయితే ప్రమాద సంఘటనకు రెండు టోల్ ప్లాజాల నుంచి ఎలాంటి పెట్రోలింగ్ వాహనాలు రాలేదు. చివరికి అమడగుంట్ల టోల్ ప్లాజాకు సంబంధించి అంబులెన్స్ కూడా రాకపోవడంతో చిత్తూరు జాతీయ రహదారి 40కు చెందిన నన్నూరు టోల్ ప్లాజా అంబులెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి టోల్ ఫీజులను వసూలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఎన్హెచ్ఏఐ..రోడ్డులో వెళ్లే వాహనాలు, ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవడంలేదని తేటతెల్లమవుతోంది. ఎట్టా కాలిందో సూడు.. ఎంత నరకం చూశారో పాపం దగ్ధమైన బస్సును చూస్తూ వాహనదారుల దిగ్భ్రాంతి ప్రమాదంతో జిల్లా ప్రజల్లో విషాదం వెల్దుర్తి: కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై బస్సు ప్రమాద ఘటన నుంచి జిల్లా ప్రజలు ఇంకా తేరుకోలేక పోతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున చావుకేకతో ఉలిక్కిపడిన జనం శనివారం కూడా అదే ప్రమాద విషయాన్ని చర్చించుకుంటూ కనిపించారు. పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై విశ్లేషిస్తూ కనిపించారు. కాగా జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాద ఘటన స్థలంలో నిలిచి పక్కనే దగ్ధమైన బస్సును పరిశీలిస్తున్నారు. ‘అబ్బా ఎట్టా కాలిపోయిందో సూడు బస్సు.. ఈ బస్సే ఇట్టయిందంటే ఆ మంటలకు బస్సులో చచ్చిపోయిన్నోళ్లు ఎంత నరకం అనుభవించింటారో కదా’ అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కనిపించారు. జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న వివిధ రాష్ట్రాల ప్రయాణికులు, వాహనదారులు బస్సు దుర్ఘటను చూసి అయ్యో పాపం అంటూ వెళ్తున్నారు. బైక్ పడిన ప్రాంతం, చనిపోయిన బైకిస్ట్ గురించి, బస్సు ఈడ్చుకుంటూ వెళ్లిన ఆనవాళ్లు, పూర్తిగా దగ్ధమైన బస్సుపై వివిధ రకాలుగా వి చారు.‘ ఒక వ్యక్తి వల్ల ఇంత ఘోరం జరిగిందా? ప్రమాదానికి మద్యం కారణం’ అంటూ కొందరు ఘటనా స్థలంలో చర్చించుకుంటూ కనిపించారు. వెనుకాల వచ్చిన వాహనదారులు రోడ్డుపై పడిన బైక్‌ను పక్కకు తీసినా సరిపోయేదని.. ప్రైవేటు వాహనాల వేగాన్ని నియంత్రించాలని.. ప్రమాద సమయంలో వాహనదారులు ఇంకా స్పందించి ఉంటే బాగుండేది’ అని మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరో వైపు సంఘటన స్థలంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బైక్ పడిన ప్రాంతం నుంచి బస్సు దగ్ధమైన చోటు వరకు చోటు చేసుకున్న పరిణామాలపై వివరాలు సేకరిస్తూ కనిపించారు. ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమా? కొందరు ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించడం చాలా బాధాకరం. వారిలో మానవత్వం లేదు. మనిషి ప్రాణాలకు విలువ కనిపించలేదు. కళ్ల ముందే ప్రాణ భయంతో కాపాడండి అంటూ మహిళలు, పిల్లలు అరుపులు, కేకలు పెడుతున్నా పట్టించుకోకుండా వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో ప్రొజెక్టు చేసుకున్నారు. అయితే కొందరు మాత్రం వారిలో ఇంకా మానవత్వం చావలేదని నిరూపించారు. ప్రాణాలకు తెగించి కొందరిని కాలే బస్సు నుంచి బయటకు లాగారు. ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఎంత మంచివాడంటే చెప్పలేం. అందరూ అతన్ని ఆదర్శంగా తీసుకొని సహాయక చర్యల్లో పాల్గొని కొందరిని ప్రాణాల నుంచి రక్షించారు. – హైమారెడ్డి, హైదరాబాద్, ప్రమాద ఘటన ప్రత్యక్ష సాక్షి -
అర్హత లేకున్నా హెవీ డ్రైవింగ్ లైసెన్స్!
కారెంపూడి: కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు.మొదట లారీ క్లీనర్‌గా, తర్వాత డ్రైవర్‌గా పని చేశాడు. 2004లో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొనడంతో అప్పట్లో లారీ క్లీనర్ మృతి చెందాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా మానేసి కొన్నాళ్లు ట్రాక్టర్ కొని స్వగ్రామంలో వ్యవసాయం చేశాడు. తర్వాత ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా ఏడెనిమిదేళ్ల నుంచి వెళ్తున్నాడని తెలిసింది. లక్ష్మయ్య తండ్రి రాములు రెండు నెలల కిందట మృతి చెందాడు. ఇతనికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె, ఒక సోదరుడు, ఇద్దరు అక్కలు ఉన్నారు. లక్ష్మయ్యకు అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు ఉందని సమాచారం. -
బస్ ఫైర్ ప్రమాదానికి కారణం అయిన వ్యక్తి
-
కర్నూలు ఘటన: బైకర్ శివశంకర్ వీడియో వైరల్
సాక్షి, కర్నూలు: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో ద్వారా శివశంకర్ మద్యం సేవించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. బస్సు ప్రమాద ఘటనలో పల్నాడు జిల్లాలకు చెందిన డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రమాదానికి ముందు బైక్‌కు పెట్రోల్ కొట్టించినట్టు వీడియోలో కనిపిస్తోంది. అర్ధరాత్రి 2.20 గంటల సమయంలో శివశంకర్‌తో పాటుగా అతడి స్నేహితుడు కలిసి పెట్రోల్ బంక్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత ఒక్కడే బైక్‌పై వెళ్లినట్టు వీడియోలో ఉంది. శివశంకర్ బంక్‌లో ఉన్న సమయంలో స్టంట్ చేయడం, తడబడుతున్నట్టుగా కూడా కనిపించింది. బైక్ స్టార్ట్ చేసి కొద్ది దూరం వెళ్లిన వెంటనే స్కిడ్ అయినట్టుగా వీడియోలో స్పష్టంగా ఉంది. దీంతో, అతడు మద్యం సేవించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండగా.. శివశంకర్ వచ్చిన బైక్ చాలా దారుణంగా ఉంది.. బైక్‌కు హెడ్‌లైట్ లేకపోవడం గమనార్హం. పైగా అతడు ర్యాష్ డ్రైవింగ్ చేసే విధంగా కనిపించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ ప్రమాదానికి సంబంధించి బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యపై ఉలిందకోండా పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసును ప్రయాణికుడు రమేష్ ఫిర్యాదు చేయగా... బస్సు నడిపిస్తున్న ముత్యాల లక్ష్మయ్య, అతని సహచరుడు జి. శివనారాయణని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మయ్యపై సెక్షన్ 125/A, 106 C, సంబంధిత నిబంధనల ఆధారంగా కేసులు నమోదు చేసి, 19 మంది ప్రయాణికుల మరణానికి బాద్యుడుగా పేర్కొన్నారు. అలాగే, బస్సు మేనేజ్మెంట్ కూడా ఈ ఘటనకు బాధ్యులుగా ఉంచారు.ఇది కూడా చదవండి: కర్నూలు బస్సు ప్రమాదంలో కొత్త కోణం.. వందల ఫోన్లు పేలడం వల్లే మంటలు..ఇదిలా ఉండగా.. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో బస్సులో నిద్రిస్తున్నప్పటికీ, అప్రమత్తమై పలువురి ప్రాణాలను కాపాడి హీరోగా ప్రశంసలు అందుకున్న రెండో డ్రైవర్ శివనారాయణ (30) ఇప్పుడు పోలీసుల అనుమానపు నీడలో చిక్కుకున్నాడు. విచారణలో అతడు తన వాంగ్మూలాన్ని మార్చడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే, ప్రమాద సమయంలో బస్సు నడుపుతున్న డ్రైవర్ లక్ష్మయ్య.. నిద్రిస్తున్న రెండో డ్రైవర్ శివనారాయణను నిద్ర లేపాడు. వెంటనే స్పందించిన శివనారాయణ పొగతో నిండిపోయి, డోర్లు తెరుచుకోని స్థితిలో ఉన్న బస్సు కిటికీలను ఒక రాడ్‌తో పగలగొట్టి చాలా మంది ప్రయాణికులను బయటకు లాగాడు. "నన్ను మొదట బయటకు లాగింది ఒక యువకుడే. అతడే రెండో డ్రైవర్ అని నాకు తర్వాత తెలిసింది" అంటూ ప్రాణాలతో బయటపడిన సుబ్రమణ్యం అనే ప్రయాణికుడు చెప్పాడు. అనుమానాలకు కారణమేంటి?ప్రమాదం జరిగిన వెంటనే అసలు డ్రైవర్ లక్ష్మయ్య ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. పోలీసులు శివనారాయణను అదుపులోకి తీసుకుని విచారించగా అతను తన వాంగ్మూలాన్ని మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. మొదట బస్సు ఒక వాహనాన్ని ఢీకొట్టిందని, అది తీవ్రమైన ప్రమాదం కావచ్చని లక్ష్మయ్య తనను నిద్రలేపాడని చెప్పాడు. తర్వాత బస్సు కింద మోటార్ సైకిల్ ఇరుక్కుపోయినట్లు గుర్తించామని తెలిపాడు. అయితే, ఆ తర్వాత మాట మార్చి 'అంతకుముందే జరిగిన వేరే ప్రమాదంలో మోటార్‌సైకిల్, దానిపై ఉన్న వ్యక్తి రోడ్డుపై పడి ఉన్నారని, అది గమనించని లక్ష్మయ్య వారిపై నుంచి బస్సును నడపడంతో మంటలు చెలరేగాయని' చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బస్సు యజమానులు తమ సంస్థపై విచారణ జరగకుండా ఉండేందుకు డ్రైవర్లను తప్పుదారి పట్టించేలా ఇలా చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
కర్నూలు ప్రమాదంలో కొత్త కోణం!.. 400 ఫోన్లు పేలడం వల్లే మంటలు
సాక్షి, అమరావతి: కర్నూలు చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ అగ్నిప్రమాదానికి గురైన ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బస్సు ప్రమాదానికి సంబంధించిన మరో కొత్త కోణాన్ని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. బస్సు లగేజీ క్యాబిన్లో వందల సంఖ్యలో మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ టీమ్స్ తెలిపాయి.వివరాల ప్రకారం.. ఫోరెన్సిక్ బృందాలు శుక్రవారం ఉదయం ఘటనాస్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించాయి. ఈ క్రమంలో బస్సులో మొబైల్ ఫోన్లను తరలించినట్టు గుర్తించాయి. ‘ప్రమాదం సందర్భంగా ట్రావెల్స్ బస్సు.. బైకును ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింది భాగంలో బైక్ ఇరుక్కుపోవడంతో, దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో మంటలు ప్రారంభమయ్యాయి. ఇవి తొలుత లగేజీ క్యాబిన్‌కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడం వల్లే భారీ శబ్దం వచ్చింది. ఆ మంటలు లగేజీ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్‌కు సరిగ్గా పైన ఉండే సీట్లలో, బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే బస్సు దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుంది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు యత్నించినా.. కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు’ అధికారులు తెలిపారు. మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ బస్సును నిలిపి అతని సీటు పక్కన ఉండే కిటికీ డోరు నుంచి దిగి వెనక వైపునకు వెళ్లి చూసి అక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రమాద ఘటనలో తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది. సెల్ఫోన్లు పేలిపోయేందుకు అవకాశం ఉందా?ఛార్జింగ్ చేస్తూండగా సెల్ఫోన్లో మంటలు చెలరేగడం.. కొన్ని సందర్భాల్లో పేలిపోవడం మనం చూస్తూంటాం. అయితే కర్నూలు వద్ద శుక్రవారం తెల్లవారు జరిగిన బస్సు దగ్ధం ఘటనకు కూడా సెల్ఫోన్లు పేలిపోవడం కారణమని తాజాగా అనుమానిస్తున్నారు. మరి.. కేవలం రవాణా చేస్తున్నంత మాత్రన సెల్ఫోన్లు పేలిపోయేందుకు అవకాశం ఉందా? అంటే అవును అంటున్నారు నిపుణులు. చాలా అరుదుగా జరిగేదైనప్పటికీ ప్యాకెట్లలో ఉంచిన సెల్ఫోన్లు పేలిపోయేందుకు చాలా కారణాలే ఉంటాయని విశ్లేషిస్తున్నారు.వీరు చెబుతున్న దాని ప్రకారం.. బ్యాటరీలు డ్యామేజ్ అయినా.. కొంత ఎత్తు నుంచి కిందపడ్డా.. బ్యాటరీలకు చిల్లులు పడ్డా ఫోన్లో షార్క్ సర్క్యూట్ అయ్యేందుకు అవకాశం ఉంది. తద్వారా ఇవి పేలిపోగలవు. విపరీతమైన వేడి కూడా ఫోన్లు పేలిపోయేందుకు కారణం కాగలవు. మండే ఎండలో తలుపులన్నీ బిగించి సెల్‌ఫోన్‌ను కారులో ఉంచినా. విడికి వాటిల్లో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలు కరిగిపోతాయి. ఈ క్రమంలోనే పేలుడు సంభవించవచ్చు. కొన్ని కొత్తఫోన్లలో బ్యాటరీల్లోనే లోపాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ఫ్యాక్టరీల నుంచి బయటకు వచ్చే టప్పుడు అనేక రకాల భద్రత పరీక్షలు నిర్వహిస్తూంటారు కానీ.. కొన్ని సందర్భాల్లో లోపాలున్న బ్యాటరీలు కూడా మార్కెట్లోకి వచ్చేస్తూంటాయి.పార్సెల్ ఆఫీసుల్లో పోలీసులు తనిఖీలు?ఈ ప్రమాదంలో ఫోన్లు పేలడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ పార్సిల్ ఆఫీసుల్లో.. ఆర్టీవో అధికారులు గానీ, పోలీసులు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది. ఇలాంటి పేలుడు పదార్థాలకు ప్రధాన కారణంగా ఉన్నటువంటి మొబైల్ ఫోన్లను, సంబంధిత ఇతర వస్తువులను గాని బస్సులలో పంపించకూడదని ఇప్పటికైనా అధికారులు హెచ్చరించే అవకాశం ఏమైనా వుందా? చూడాల్సి ఉంది. -
ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ
కర్నూలు (హాస్పిటల్)/ రావులపాలెం/ఇంకొల్లు(చినగంజాం): ఒక్కగానొక్క కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. వారి ఆశలను నెరవేర్చి ఆ యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి కుటుంబానికి తోడుగా నిలబడ్డాడు. బస్సు ప్రమాదం ఆ యువకుడిని కబళించింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సీహెచ్.శ్రీనివాసరావు బ్యాంకులో అప్రెంటిస్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, కుమారుడు మేఘనాథ్‌తో పాటు ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. మేఘనాథ్ బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉంటున్నాడు. దీపావళి పండుగకు హైదరాబాద్‌కు వచ్చిన మేఘనాథ్.. తిరిగి గురువారం రాత్రి బెంగళూరు బయలుదేరాడు. బస్సు ఎక్కానని రాత్రి 10.30 గంటలకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. అవే అతని చివరి మాటలయ్యాయి. అదే అతనికి చివరి పుట్టినరోజు ఒడిశా రాష్ట్రం రాయగఢ్ జిల్లా అంబోదల ప్రాంతానికి చెందిన కె.దీపక్‌కుమార్ (24) బెంగళూరులోని కేపీఎంజీ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని తండ్రి కె.శ్రీనివాసరావు, తల్లి కె.లీలారాణి ఉద్యోగ రీత్యా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. దీపక్‌కుమార్ తన పుట్టిన రోజు 16వ తేదీతో పాటు దీపావళి పండుగను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చాడు. పుట్టిన రోజుతో పాటు పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నాడు. ఆ ఆనంద క్షణాలను మూట గట్టుకుని బెంగళూరుకు గురువారం రాత్రి పయనమయ్యాడు. తాను బస్సెక్కానని ఇంటికి మెసేజ్ కూడా పెట్టాడు. బస్సు ప్రమాదం అతనికి ఇదే చివరి పుట్టిన రోజుగా మారుస్తుందని ఊహించలేకపోయాడు. తల్లీ కూతురు మృతి హైదరాబాద్‌కు చెందిన చందన బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. ఆమె ఇటీవల దీపావళి పండుగ కోసం హైదారాబాద్‌కు వచ్చింది. ఎంతో వైభవంగా ఆమె కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను జరుపుకుంది. అయితే తిరిగి బెంగళూరుకు వెళ్లేందుకు తల్లి సంధ్యారాణిని కూడా తన వెంట తీసుకెళ్లింది. దీంతో రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధం కావడంతో ఇద్దరూ విగత జీవులుగా మిగిలారు. మళ్లీ త్వరలో వస్తానంటూ.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభికి చెందిన చిట్టోజు మేఘనాథ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆయన తండ్రి శ్రీనివాసాచారి గ్రామంలోని ఐఓబీలో బంగారం తూకం వేసే ఉద్యోగి. మేఘనాథ్ భార్య, ఇద్దరు పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. వీకెండ్లో మేఘనాథ్ నగరానికి వచ్చి వెళుతుంటాడు. ఇటీవల దీపావళి సెలవులకు వచ్చిన మేఘనాథ్.. బెంగళూరు వెళ్లేందుకు ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కాక ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. మళ్లీ త్వరలో వస్తానని పిల్లలకూ చెప్పాడు. ఇది జరిగిన కొన్ని గంటలకే మేఘనాథ్ మృత్యు ఒడికి చేరాడని తెలిసి ఆ కుటుంబం రోదన వర్ణనాతీతం. మేఘనాథ్ తల్లిదండ్రులు శ్రీనివాసాచారి, విజయలక్ష్మి, చెల్లి యశ్వని ఘటనా స్థలానికి వెళ్లి గుండెలవిసేలా రోదించారు. వల్లభిలో విషాదం అలుముకుంది. -
కాలిపోతున్నాం.. కాపాడండి..
కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో జాతీయ రహదారి–44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు చివరి వరకు ప్రాణాలను కాపాడుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. బైక్‌ను బస్సు ఢీకొట్టి.. అలాగే 300 మీటర్ల మేర బైక్‌ను లాక్కు పోవడంతో తొలుత బస్సు ముందు భాగంలో మంటలు వ్యాపించాయి. దీంతో ముందు ఉన్న వారు బస్సు మధ్యకు వచ్చి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడానికి విఫల యత్నం చేశారు. అంతలో మంటలు అలుము కోవడంతో ఎక్కువ మంది ఒకేచోట గుమికూడి కిందపడి పోయారు. ఈ క్రమంలో ‘కాలిపోతున్నాం.. కాపాడండి.. బయటకు లాగేయండి.. దేవుడా కాపాడు..’ అంటూ ఆర్తనాదాలు చేశారు. వారి అరుపులు బయటకు వినిపిస్తున్నా తాము ఏమీ చేయలేని పరిస్థితి అని అప్పటికే బస్సులోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న వారు తెలిపారు. తొలుత మంటలను అదుపు చేయడానికి నీళ్ల బాటిళ్లతో డ్రైవర్ ప్రయత్నం చేశాడని, అలా కాకుండా ఆయన ఎమర్జెన్సీ డోర్లను బద్దలు కొట్టి ఉంటే మరింత మంది ప్రాణాలతో బయటపడే వారని చెప్పారు.పెద్ద కుదుపు రావడంతో ఒక్కసారిగా లేచాం మాది కర్ణాటకలోని బసవ కల్యాణం. పనిపై హైదరాబాద్ వెళ్లి తిరిగి వెళ్తున్నాను. అర్ధరాత్రి 2.30 – 2.40 గంటల మధ్య ప్రమాదం జరిగింది. అందరూ నిద్రలో ఉన్నారు. అయితే ఒక్కసారిగా పెద్ద కుదుపు రావడంతో చాలా మంది నిద్ర లేచారు. నేనూ అప్పుడే లేచాను. ఏమి జరిగిందోనని చూసుకునేలోపే మంటలు వచ్చాయి. ఎమర్జెన్సీ విండోలు తెరుచుకొని వెళ్లాలని డ్రైవర్ అరిచాడు. వెంటనే నేను ముందుకు వెళ్లి డ్రైవర్ సీటులో నుంచి కిందకు దూకేశాను. – ఆకాష్, బస్సులో నుంచి ప్రాణాలతో బయటపడిన వ్యక్తి కాపాడండని అరుపులు వినిపించాయి ఒక్కసారిగా బాంబు పడ్డట్లు పెద్ద శబ్దం వినిపించడంతో రోడ్డు వైపు చూశాను. కొద్ది దూరంలో బస్సు మంటల్లో తగలబడిపోతూ కనిపించింది. పరుగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లాను. అయితే పెద్ద ఎత్తున మంటలు వస్తుండడంతో ఏమీ చేయలేకపోయాను. బస్సులో నుంచి కాపాడండి.. మంటల్లో కాలిపోతున్నామని కేకలు వినిపించాయి. ఆడోళ్ల గోడు చెవులారా విన్నాను. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. నా జీవితంలో ఇలాంటి ఘటనను చూడలేదు. – మల్లికార్జున, నాయకల్లు (ఘటన స్థలికి సమీపంలోని కేఫ్‌లో సెక్యూరిటీ గార్డు) ఫైర్ ముందు నుంచి వచ్చింది బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో 2.30 గంటలప్పుడు బస్సు ముందు నుంచి ఫైర్ వచ్చింది. దీంతో అందరూ వెనక్కి వెళ్లారు. ఎమర్జెన్సీ డోర్ తెరచుకోకపోవడంతో వెనక డోర్‌ను పగలగొట్టే ప్రయత్నం చేశారు. నేను మధ్యలో ఉన్న గ్లాస్‌ను పగలగొట్టి దూకేశాను. బెంగళూరుకు ఇంటర్వ్యూ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. – అశ్విన్, హైదరాబాద్, కూకట్పల్లికళ్ల ముందే కాలిపోయారు బస్సు కళ్ల ముందే కాలిపోయింది. ఆ సమయంలో నేను మెలకువగా ఉండడంతో డ్రైవర్ సీటు నుంచి కిందకు దూకేశాను. నేను దూకిన తర్వాత ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచి్చంది. ఆ తర్వాత మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఆర్పాలన్నా ఏమి చేయలేని పరిస్థితి. కాపాడాలని కేకలు వినిపించాయి. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదు. – జయంత్ కుశ్వాల్, హైదరాబాద్ -
మృత్యుశకటం
బస్సు డ్రైవర్ చేసిన తప్పు 19 మంది సజీవ దహనానికి కారణమైంది! నిద్రలో ఉన్న వారిని శాశ్వత నిద్రలోకి పంపింది. కొన్ని కుటుంబాలను చిదిమేసి శాశ్వత చీకట్లు నింపింది. ఘటనా స్థలిని చూసిన వారి కంట నీరు తెప్పించింది. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని కలచి వేసింది. నిమిషాల వ్యవధిలో కొన్ని కుటుంబాలు, కొన్ని కుటుంబాల పెద్ద దిక్కులు, భవిష్యత్ ఆశలు అగ్నికీలలకు ఆహుతయ్యాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు,చావు కేకలతో ఎన్హెచ్ృ44 భీతిల్లింది. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా బొగ్గు, మసిగా మారాయి. ఈ భీతావహ ఘటన స్లీపర్ బస్సు ప్రయాణాలపై మరోమారు పెద్ద చర్చనే లేవనెత్తింది.సాక్షి ప్రతినిధి కర్నూలు/ కర్నూలు (హాస్పిటల్): హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయలు దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ (స్కానియా) బస్సు (డీడీ 01ఎన్9490) శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏకంగా 19 మంది సజీవ దహనమయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఘటన వివరాలు ఇలా ఉన్నాయి... మొత్తం 44 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లతో హైదరాబాద్‌లో బయలుదేరిన బస్సు శుక్రవారం తెల్లవారుజామున 2.14 గంటలకు కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్ ప్లాజా దాటింది. 2.30 గంటలకు టాయిలెట్ కోసం కర్నూలులో ఆపారు. కొంత మంది మాత్రమే బస్సు దిగారు. మిగిలిన వారంతా గాఢనిద్రలో ఉన్నారు. ఆ తర్వాత బయలుదేరిన బస్సు చిన్నటేకూరు దాటగానే 2.45 గంటలకు ఓ బైక్‌ను ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న శివశంకర్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ప్రమాదం తర్వాత కూడా ఆపకుండా డ్రైవర్ బస్సును ముందుకు నడిపాడు. ఇదే పెను ప్రమాదానికి కారణమైంది. ఆ సమయంలో బస్సు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత ముందుకు వెళ్లిపోతే ప్రమాదం తమపైకి రాదని భావించిన డ్రైవర్ బస్సును వేగంగా నడిపారు. శివశంకర్ రోడ్డు పక్కన పడిపోయాడు. బైక్ మాత్రం బస్సు కింద ఇరుక్కుపోయింది. దీంతో బస్సు బైక్‌ను 300 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఆ రాపిడికి మంటలు రేగాయి. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ ట్యాంకు పగిలిపోయి మంటలు చెలరేగాయి. బస్సు ఎడమ వైపు డోర్ల భాగంలో మంటలు కనిపించాయి. అప్పుడు డ్రైవర్ బస్సును ఆపాడు. డ్రైవర్ లక్ష్మయ్యతో పాటు మరో డ్రైవర్ వాటర్ బాటిళ్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈలోపు ముందు భాగంతోపాటు బస్సు మధ్య భాగంలో కూడా మంటలు వ్యాపించాయి. బైక్‌ను ఢీకొట్టడంతో బస్సు డోర్‌లోని సెన్సార్ వైర్లు తెగిపోయాయి. దీంతో డోర్ పూర్తిగా లాక్ అయి తెరుచుకోలేదు. దీంతో డ్రైవర్లు భయపడి ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సులోంచి దూకేశారు. మంటల ధాటికి దట్టమైన పొగ బస్సు మొత్తం కమ్ముకుంది. ఒకరి ముఖం మరొకరికి కన్పించని పరిస్థితి. పొగ, మంటల ధాటికి ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరాడక ఆర్తనాదాలు పెట్టారు. క్షణాల్లో మంటలు డోర్ కర్టన్లు, బెడ్షీట్లు, బెడ్లకు అంటుకుని అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. కొందరు మాత్రం బస్సు అద్దాలు పగులగొట్టి కిందకు దూకి గాయాలతో బయటపడ్డారు. తక్కిన వారు ప్రమాదం నుంచి తప్పించుకోలేక అగ్నికి ఆహుతయ్యారు. బస్సు మొత్తం నిమిషాల వ్యవధిలో పూర్తిగా దగ్ధమైంది. జాతీయ రహదారిపై వెళుతున్న వాహనదారులు ప్రమాద ఘటనను వీడియో, ఫొటోలు తీసి పోలీసు అధికారులకు పంపారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్‌తో మంటలను అదుపు చేశారు. డ్రైవర్లు సహా 27 మంది ప్రయాణికులు సురక్షితం హైదరాబాద్‌లో బస్సు ఎక్కడానికి 40 మంది టికెట్ బుక్ చేసుకున్నారు. వీరిలో ఒకరు వ్యక్తిగత కారణాలతో ప్రయాణం రద్దు చేసుకోవడంతో బస్సు ఎక్కలేదు. మిగతా 39 మందితోపాటు నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ లెక్కన 43 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆపై హైదరాబాద్ శివారు ప్రాంతం ఆరంఘర్‌లో టికెట్ ముందుగా బుక్ చేసుకోని ఒకరు బస్సు ఎక్కారు. ఇద్దరు డ్రైవర్లతో కలిపి బస్సులో 46 మంది ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రమే కర్ణాటకలోని బాగేపల్లిలో బస్సు దిగాల్సి ఉంది. మిగతా వారంతా బెంగళూరుకు వెళ్లాల్సిన వారే. వీరిలో ప్రమాదం తర్వాత 27 మంది ప్రాణాలతో బయట పడ్డారు. ప్రమాద సమయంలో అద్దాలు ధ్వంసం చేసి దూకడంతో పాదాలు, కాళ్లకు గాయాలయ్యాయి. కొంత మందికి తలపై కూడా చిన్నచిన్న గాయాలయ్యాయి. వీరిలో 23 మంది పెద్దవాళ్లు, ఇద్దరు పిల్లలు కాగా.. మరో ఇద్దరు డ్రైవర్లు. తక్కిన 19 మంది చనిపోయారు. మృతుల్లో 17 మంది పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులను పోలీసులు 108లో కర్నూలు జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఇంకొందరు కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు కర్నూలు సమీపంలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రయాణికుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు యాజమాన్యంపై 125 (ఎ), 106 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఉలిందకొండ పీఎస్ ఎస్ఐ ధనుంజయ తెలిపారు. బస్సు డ్రైవర్లు శివనారాయణ, మిరియాల లక్ష్మయ్యను అదుపులోకి తీసుకుని ప్రమాద ఘటనకు దారితీసిన కారణాలపై విచారిస్తున్నారు. పనికి వెళ్లొస్తానని అటే వెళ్లిపోయాడు..అమ్మా డోన్ వద్ద పని ఉందంట. మాట్లాడుకుని మళ్లీ వస్తానని రాత్రి పోయినోడు మళ్లీ రాకుండానే పోయినాడు...అంటూ ఆ తల్లి గంటల తరబడి మార్చురీ వద్ద విలపిస్తున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. కర్నూలు జిల్లా కర్నూలు మండలం బి.తాండ్రపాడుకు గ్రామానికి చెందిన నాగన్న కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఆయన భార్య యశోదమ్మ ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసింది. ఇందులో పెద్దవాడైన శ్రీహరి గౌండా పనిచేస్తుండగా చిన్నవాడైన శివశంకర్ గ్రానైట్ పనులకు వెళ్లేవాడు. శివశంకర్ ఎప్పటిలాగే గురువారం రాత్రి కూడా డోన్ వద్ద పని ఉందని మాట్లాడుకుని వస్తానని వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ తల్లికి ఫోన్ చేయలేదు. ఉదయం లేచే సరికి బైక్‌పై వెళుతూ బస్సు కింద పడి శివశంకర్ మృతిచెందాడని పోలీసులు చెప్పడంతో ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. అద్దాలు పగలగొట్టినా బయటకు రాలేని పరిస్థితి స్లీపర్ కోచ్ బస్సులో లోయర్, అప్పర్ బెర్త్‌లు ఉన్నాయి. అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు అద్దాలు పగలగొట్టి సులభంగా బయటకు దూకారు. గాయాలతో బయటపడ్డారు. అప్పర్ బెర్త్ అద్దాలు ధ్వంసం చేస్తే బయటకు దూకేయొచ్చు. కానీ లోయర్ బెర్త్‌లో అద్దాలు ధ్వంసం చేసినా, ఐరన్ యాంగ్లర్లు అడ్డుగా ఉన్నాయి. దీంతో మనిషి దూరలేని పరిస్థితి! అప్పర్ బెర్త్ లాగే, లోయర్ బెర్త్‌లు కూడా ఉండి ఉంటే అద్దాలు ధ్వంసం చేసి ఇంకొందరు కిందకు దూకి ప్రాణాలతో బయట పడే అవకాశం ఉండేది. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఇతర పోలీసులు బస్సును పరిశీలించారు. ఇనుప కడ్డీలు మినహా బస్సులో ఏమీ మిగల్లేదు. నల్లటి మసి దిబ్బలు మాత్రమే కన్పించాయి. తెల్లవారిన తర్వాత కలెక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్లా, డీఐజీ కోయ ప్రవీణ్‌తో పాటు వైద్యాధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు. వీరి సమక్షంలో బూడిదను తొలగించి.. నల్లగా బొగ్గులా మారిన మాంసపు ముద్దలను అతి కష్టం మీద వెలికి తీశారు. మొత్తం 19 మృతదేహాలను ప్రత్యేక టెంట్లో ఉంచారు. వాటి నుంచి ఫోరెన్సిక్ అధికారులు డీఎన్ఏ పరీక్షల కోసం శాంపిల్స్ తీసుకున్నారు. మృతదేహాలకు వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత మృతదేహాలను కర్నూలు జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 14 మంది మృతుల కుటుంబ సభ్యుల డీఎన్ఏ శాంపుల్స్ కూడా వైద్యులు సేకరించారు.బస్సు ఆపి ఉంటే ప్రమాదం తప్పేది బస్సు బైక్‌ను ఢీకొట్టిన వెంటనే నిలిపేసి ఉంటే అసలు ప్రమాదమే జరిగేది కాదు. బైక్‌పై ప్రయాణించే శివశంకర్ మాత్రమే చనిపోయేవాడు. అయితే, ప్రమాదం తమపైకి రాకుండా ఉండేందుకు డ్రైవర్ లక్ష్మయ్య బస్సును అదే వేగంతోనే నడిపాడు. దీంతో బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడం, 300 మీటర్ల మేర రోడ్డుకు రాపిడికి గురై పెట్రోలు ట్యాంకు పగలడం, మంటలు చెలరేగి బస్సుకు వ్యాపించడంతో పెను ప్రమాదం సంభవించింది. కాగా, బస్సు ప్రమాద ఘటన అధికారులతో పాటు అందరినీ తీవ్రంగా కలచి వేసింది. నేషనల్ హైవేపై అటు, ఇటు వెళ్లే వాహనదారులు బస్సును, అందులో బూడిదైన మృతదేహాలను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఫోరెన్సిక్ అధికారులు, పోలీసులు మృతదేహాలను వెలికి తీసి మాంసం ముద్దలను పక్కనే టెంట్‌లోకి తీసుకెళుతున్న దృశ్యాలను చూసి ఘటనాస్థలిలోని వ్యక్తులు చలించిపోయారు. పలువురు కన్నీరు పెట్టుకున్నారు. ఓ మహిళ మృతదేహంపై మంగళసూత్రం దండ కనిపించింది. బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డ వారి వివరాలు 1. అశ్విన్‌రెడ్డి, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 2. ఎం.సత్యనారాయణ, ఖమ్మం– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 3. జి.సుబ్రహ్మణ్యం, కాకినాడ– కర్నూలు అశ్విని హాస్పిటల్లో చికిత్స 4. గుణసాయి, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 5. ఆండోజు నవీన్‌కుమార్, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 6. నేలకుర్తి రమేష్, నెల్లూరు– గాయాలు లేకపోవడంతో బంధువుల ఇంట్లో బస 7. శ్రీలక్ష్మి, నెల్లూరు– గాయాలు లేకపోవడంతో బంధువుల ఇంట్లో బస 8. వేణు గుండ, ప్రకాశం జిల్లా– బెంగళూరు వెళ్లిపోయారు 9. శ్రీహర్ష, నెల్లూరు– కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ 10. శివ, బళ్లారి–బెంగళూరు వెళ్లిపోయారు 11. గ్లోరియా ఎల్సాశామ్ కేరళ– బెంగళూరు వెళ్లిపోయారు 12. ఎంజి. రామరెడ్డి, తూర్పుగోదావరి– హైదరాబాద్ వెళ్లిపోయారు 13. జయసూర్య, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 14. ఉమాపతి, హైదరాబాద్–బెంగళూరు వెళ్లిపోయారు 15. పంకజ్, బీదర్– పోలీస్ స్టేషన్లో ఉన్నారు 16. చరిత్, హైదరాబాద్– బెంగళూరు వెళ్లారు 17. హారిక, బెంగళూరు– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 18. కీర్తి, హైదరాబాద్– హైదరాబాద్ వెళ్లారు 19. వేణుగోపాల్‌రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా– హిందుపురం వెళ్లారు 20. ఆకాష్, బీదర్– కర్నూలులో ఉన్నారు 21. మహమ్మద్ ఖైజర్, బెంగళూరు– బెంగళూరు వెళ్లారు 22. జయంత్ కుశ్వల, హైదరాబాద్– కర్నూలులో ఉన్నారు 23. కె.అశోక్, రంగారెడ్డి జిల్లా– కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ 24. జశ్విత, నెల్లూరు– కర్నూలులో బంధువుల ఇంట్లో బస 25. అఖీర, నెల్లూరు– కర్నూలులో బంధువుల ఇంట్లో బస 26. మిర్యాల లక్ష్మయ్య (డ్రైవర్)– పల్నాడు జిల్లా27. శివనారాయణ (డ్రైవర్)– ప్రకాశం జిల్లాకంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతోపాటు సహాయం కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కర్నూల్ కలెక్టరేట్ 08518277305 కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి 9121101059, 9494609814, 9052951010 ఘటనాస్థలం 9121101061 పోలీసు కంట్రోల్ రూమ్ 9121101075మృతుల వివరాలుపేరు రాష్ట్రం 1. జి.ధాత్రి (27) పూనూరు, బాపట్ల, ఏపీ 2. జి.రమేష్ (31)3. అనూష (28) 4.శశాంక్ (7) 5.మన్విత (4) 6. కె. శ్రీనివాసరెడ్డి (39) రావులపాలెం ,ఆంధ్రప్రదేశ్ 7. చందన (23) తెలంగాణ8.సంధ్యారాణి (43) తెలంగాణ 9. అనూష (22) తెలంగాణ 10. గిరిరావు (48) తెలంగాణ 11.ఆర్గా బండోపాధ్యాయ(32) తెలంగాణ12. మేఘనాథ్ (25) తెలంగాణ13. ఫిలోమన్ బేబీ(64) కర్ణాటక14. కిషోర్‌కుమార్(41) కర్ణాటక15. ప్రశాంత్(32) తమిళనాడు16.యువన్ శంకర్‌రాజ్(22) తమిళనాడు 17. కె.దీపక్‌కుమార్ (24) ఒడిశా 18.అమృత్‌కుమార్ (18) బిహార్ 19.గుర్తు తెలియని వ్యక్తి (50) (ఆరంఘర్ వద్ద బస్ ఎక్కాడు) 20 శివశంకర్ (23, బైక్‌పై వెళ్తున్న వ్యక్తి) బి.తాండ్రపాడు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్రాష్ట్రాల వారీగా మృతుల సంఖ్యఆంధ్రప్రదేశ్ 7 తెలంగాణ 6 కర్ణాటక 2 తమిళనాడు 2 బిహార్ 1 ఒడిశా 1 గుర్తుతెలియని వ్యక్తి 1 -
Kurnool: శభాష్ రమేష్.. మంటల మధ్య ఆరుగురి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో!
సాక్షి,కర్నూలు: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి తర్వాత కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదైపోయింది. అత్యంత విషాదకరంగా 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న రమేష్ అనే వ్యక్తి తన తోటి ఆరుగురు ప్రయాణికుల్ని ప్రాణాలకు తెగించి కాపాడాడు. ప్రమాద సమయంలో బస్సులో మంటలు చెలరేగి, చుట్టూ వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ బస్సులో చిక్కుకుపోయారు. బయట నుంచి సహాయం అందించేందుకు వీలుకాలేదు. అప్పుడే నేనున్నాంటూ బస్సులో రమేష్ అనే ప్రయాణికుడు ప్రాణాలకు తెగించాడు. బస్సు అద్దం పగలగొట్టి తనతో పాటు మరో ఆరుగురిని బయటకు రప్పించాడు. ఈ విషయాన్ని ప్రమాదం జరిగిన సమయంలో హిందూపురం నుంచి నంద్యాలకు వెళ్తున్న ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో నేను హిందూపురం నుంచి నంద్యాలకు నా కారులో వెళ్తున్నా. అద్దలు పగలగొట్టుకుని బయటకు వస్తున్న ఆరుగురు ప్రయాణికుల్ని నా కారులో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా. మంటలు వ్యాపిస్తుంటే బస్సు లోపల రమేష్ అనే వ్యక్తి అద్దాలు పగలగొట్టి ప్రయాణికుల ప్రాణాల్ని కాపాడారు. ఆస్పత్రికి చికిత్స పొందుతున్న రమేష్‌తో పాటు మిగిలిన ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. బస్సు చుట్టూ మంటలు అంటుకున్నాయి. లోపలి నుంచి బయటకు వచ్చేందుకు.. బయట నుంచి బస్సు లోపలికి వెళ్లి ప్రయాణికుల్ని కాపాడేందుకు వీలు లేదు’ అని పేర్కొన్నారు. సదరు హిందూపురం నివాసి సైతం ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికుల్ని సకాలంలో ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందడంతో వారి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వ్యక్తి కూడా ప్రాణదాతగా నిలిచి ప్రశంసలందుకుంటున్నాడు. ఆరుగురి ప్రాణాలను కాపాడిన రమేష్ అనే ప్రయాణికుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Jana Varahi Media | Pawankalyan | Janasena (@jana_varahi_media) -
Kurnool: బస్సును తరలిస్తుండగా తిరగబడ్డ క్రేన్..
-
Kurnool: మరో ప్రమాదం.. బస్సును తొలగిస్తుండగా క్రేన్ బోల్తా
సాక్షి,కర్నూలు: కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ప్రమాదానికి కారణమైన బస్సును రోడ్డుపై నుంచి తొలగిస్తుండగా క్రేన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్‌కు గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్రేన్ ఆపరేటర్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ బస్సు పల్సర్ బైక్‌ను ఢీకొట్టి మంటలు జరిగాయి. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు ఆగకుండా 300 మీటర్లు ముందుకు ఈడ్చుకుని వెళ్లడంతో ఘోరం జరిగింది.బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 19మంది మరణించినట్లు ఏపీ హోంమంత్రి అనిత అధికారికంగా ప్రకటించారు. -
Kurnool Bus Fire Incident: డ్రైవర్ చేసిన పొరపాటు ఇదే..
-
‘స్లీపర్’లోనే ఎందుకీ ప్రమాదాలు?
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదై పోయింది. ఫిట్నెస్ లేని బస్సు, పైగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం సంభవించిందని అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చేశారు. ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడగా, 27 మంది ప్రాణాలతో బతికిబయటపడ్డారు. అయితే బస్సులు అగ్ని ప్రమాదాలకు గురైన సమయంలో అత్యధికంగా ప్రాణానష్టమే కన్పిస్తుంది. ప్రధానంగా ప్లీపర్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైందంటే ప్రాణనష్టం అనేది భారీగా ఉంటుంది. పది రోజుల క్రితం రాజస్థాన్‌లోనూ ఇదేతరహా ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్లుగా స్లీపర్ బస్సుల్లో జరుగుతోన్న ప్రమాద ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరి ఈ ప్రమాదాలకు కారణాలేంటనేది ఒక్కసారి చూస్తే..!డ్రైవర్లకు అలసట.. నిద్రమత్తుసుమారు 250 కిలోమీటర్ల నుంచి 1,000 కి.మీ దాటే వరకూ కూడా ఎక్కువగా ప్రయాణికులు స్లీపర్ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. ఈ బస్సులు రాత్రి వేళల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ డ్రైవర్లకు అలసట అనేది కీలకంగా మారుతుంది. డ్రైవర్లు అలసట బారిన పడి, నిద్ర మత్తులోకి జారుకోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2018లో నిర్వహించిన ఓ సర్వేలో.. తాము డ్రైవింగ్ సమయంలో నిద్రమత్తుకు లోనవుతున్నట్లు 25 శాతం మంది డ్రైవర్లు ఏడేళ్ల నాడు నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడించారు. డిజైన్ సురక్షితమేనా?స్లీపర్ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు డిజైన్ లోపం కూడా భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగడానికి ప్రధాన కారణంగా కనబడుతోంది. బస్సులో పడుకోవడానికి ఏమీ ఇబ్బంది లేకపోయినా, బస్సులో బెర్త్‌లు, సీట్ల మధ్య ఉన్న గ్యాప్ చాలా తక్కువగా ఉంటుంది. కేవలం సింగిల్ మనిషి మాత్రమే వెళ్లేలా ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇది కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఒకర్ని తోసుకుంటూ ఇంకొకరు వెళ్లడం మరింత గందరగోళాన్ని సృష్టించి తొక్కిసలాటకు కూడా కారణమయ్యే చాన్స్‌లు కూడా అత్యధికంగా అనేది నిపుణులు అభిప్రాయం. సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువమంది లోపల చిక్కుకుపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక ఎత్తు కూడా మరొక సమస్య. వీటి ఎత్తు 8-9 అడుగుల వరకు ఉంటుంది. బస్సు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరడం కష్టంగా ఉంటుంది. రెండు-మూడు నిమిషాల్లో బయట పడితేనే..బస్సు ప్రమాదం జరిగినప్పుడు చాలా స్వల్ప సమయంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. రెండు, మూడు నిమిషాల్లో తప్పించుకుంటే ప్రాణాలతో బయటపడుతున్నారు. లేకపోతే అగ్నికి ఆహుతి అయిపోతున్నారు. స్లీపర్ బస్సులు సాధారంగా ఏసీ బస్సులే అధికంగా ఉంటాయి. ఏసీ బస్సుల్లో ప్రమాదం జరిగితే డోర్స్ ఓపెన్ కావడం కూడా కష్టమే. ఏమైనా అద్దాలు బ్రేక్ చేయాలంటే కూడా ఎంతో కొంత సమయం ఉండాలి. అంటే ఇక్కడ మేల్కొని ఉన్న ప్రయాణికులే ఎంతో కొంత ప్రతిఘటించి బయటకు వచ్చే చాన్స్ ఉంటుంది. ఆ కంగారు, తొందరలో మిగతా వారిని నిద్ర లేపే చాన్స్ కూడా తక్కువగానే ఉంటుంది. నిద్ర నుంచి ప్రయాణికులు మేల్కొనే సరికి వారు ప్రమాదంలో చిక్కుకుని కొట్టుమిట్లాడుతున్న ఘటనలే మనకు తరచు కనిపిస్తూ ఉన్నాయి. చైనాలో అందుకే నిషేధించారా?చైనా స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించింది. ఈ నిర్ణయం ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు రక్షణ లేకపోవడం, సురక్షితంగా బయటపడే అవకాశం లేకపోవడం వంటి కారణాల వల్ల తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో ఈ అంశం మరింత చర్చకు వచ్చింది. చైనా, జర్మనీ వంటి దేశాలు స్లీపర్ బస్సులపై నిషేధం విధించగా, భారత్‌లో మాత్రం ఇంకా కఠిన చర్యలు తీసుకోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి:కర్నూలు శివారులో ఘోరం.. -
కర్నూలు బస్సు ప్రమాదం: ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుల వివరాలు
సాక్షి,కర్నూలు : కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు (నంబర్ DD01 N9490) కర్నూలు ప్రజానగర్‌కు చెందిన శంకర్ పల్సర్ బైక్ ఢీకొట్టింది. బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రయాణికులు తేరుకునేలోపే భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన,సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు :బస్సు ప్రమాద ఘటనలో మృతుల వివరాలు:1. జె. ఫిలోమిన్ బేబీ (64)2. కిషోర్ (64)3. ప్రశాంత్ (32)4. ఆర్గా బందోపధ్యాయ (23)5. యువన్ శంకర్ రాజా (22)6. మేఘనాథ్ (25)7. ధాత్రి (27)8. అమృత్ కుమార్ (18)9. చందన మంగ (23)10. అనూష (22)11. గిరి రావు (48)12. కేనుగు దీపక్ కుమార్ (24)13. జి. రమేష్ 14. జి అనూష 15. మనిత16. కేశనాథ్ 17. సంధ్యారాణి 18. కర్రీ శ్రీనివాస రెడ్డి 19. పంచాల శివశంకర్ (ద్విచక్ర వాహనదారుడు) 20. బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన ఒకరి పేరు తెలియాల్సి ఉంది.సురక్షితంగా ఉన్న ప్రయాణికులు:శ్రీలక్ష్మి, జస్విత (8), అభీరా (1.8) కపర్ అశోక్ (27) అశ్విన్ రెడ్డి ఆకాశ్ జయంత్ కుశ్వాల్ – మధ్యప్రదేశ్ (హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు)పంకజ్ ప్రజాపతి శివా గ్లోరియా ఎల్సా సామ్ – బెంగళూరుచారిత్ (21) మొహమ్మద్ ఖిజర్ (51) తరుణ్ (27) – బస్సులో ఎక్కకముందే ప్రయాణం రద్దు చేసుకున్నారుగాయపడిన ప్రయాణికులు:మన్నెంపల్లి సత్యనారాయణ (27), తండ్రి ఎం. రవి – సత్తుపల్లి, ఖమ్మం జిల్లాబడంత్ర జయసూర్య (24), తండ్రి సుబ్బరాయుడు – మియాపూర్, హైదరాబాద్అండోజ్ నవీన్ కుమార్ (26), తండ్రి కృష్ణాచారి – హయత్‌నగర్, హైదరాబాద్సరస్వతి హారిక (30), తండ్రి రంగరాజు – బెంగళూరునెలకుర్తి రమేష్ (36) – దత్తలూరు మండలం, నెల్లూరు జిల్లాముసలూరి శ్రీహర్ష (25) – నెల్లూరు జిల్లాపునుపట్టి కీర్తి (28) – ఎస్.ఆర్. నగర్, హైదరాబాద్వేణుగోపాల్ రెడ్డి (24) – తెలంగాణఎం.జి. రామరెడ్డి – తూర్పు గోదావరి జిల్లాఘంటసాల సుబ్రమణ్యం – కాకినాడ, ఆంధ్రప్రదేశ్గుణ సాయి – తూర్పు గోదావరి జిల్లా డ్రైవర్ల వివరాలు 1.లక్ష్మయ్య, పల్నాడు జిల్లా – ప్రధాన డ్రైవర్. సంఘటన సమయంలో బస్సు నడుపుతున్నారు. ప్రమాదం తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం లక్ష్మయ్య పోలీసుల అదుపులో ఉన్నారు. 2.శివనారాయణ, ప్రకాశం జిల్లా – స్పేర్ డ్రైవర్. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది.ప్రయాణికుల రాష్ట్రాలవారీగా: • తెలంగాణ రాష్ట్రం – 6 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – 11 • మధ్యప్రదేశ్ – 1 • కర్ణాటక రాష్ట్రం – 4మరో ముగ్గురు ఏ రాష్ట్రానికి చెందినవారు తెలియాల్సి ఉంది. -
కర్నూలు బస్సు ప్రమాదం.. మరణాలపై హోంమంత్రి అనిత అధికారిక ప్రకటన
సాక్షి,అమరావతి: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణాలపై ఏపీ హోంమంత్రి అనిత అధికారిక ప్రకటన చేశారు.(Kurnool Bus Fire Accident)కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ..‘వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19మంది మృతి చెందగా.. 27మంది ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడ్డ ఆరుగురిలో ముగ్గురికి ప్రాక్చర్లు అయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయి. మృతదేహాలను గుర్తించేందుకు 16మంది ఫోరెన్సిక్ నిపుణులను ఏర్పాటు చేసినట్లు’ వెల్లడించారు. -
కర్నూలు ప్రమాదం.. ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి
సాక్షి, హైదరాబాద్: కర్నూలులో(Kurnool Bus Fire Accident) జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. బెంగళూరు వెళ్తున్న వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతిచెందారు. వారిని ఏపీకి చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణకు చెందిన అనూషరెడ్డిగా గుర్తించారు.వివరాల ప్రకారం.. ఏపీలోని బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూషరెడ్డి.. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ధాత్రి ఇటీవల హైదరాబాద్‌లోని మేనమామ ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లేందుకు గురువారం రాత్రి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.అదే బస్సులో అనూషరెడ్డి కూడా వెళ్లారు. దీపావళికి స్వగ్రామానికి వచ్చిన ఆమె గురువారం రాత్రి బెంగళూరుకు బయల్దేరారు. ఖైరతాబాద్‌లో అనూషరెడ్డి బస్సు ఎక్కి ఈ దుర్ఘటనలో మృతిచెందారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అనూష మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీమున్నీరవుతున్నారు.ఇదిలా ఉండగా.. వేమురి కావేరి ట్రావెల్స్(vemuri Kaveri Travels) బస్సు ప్రమాదం బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కర్నూల్ బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా.. గాయపడిన క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు ప్రమాదంలో బైకర్ సహా 20 మంది ప్రయాణీకులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
కర్నూలు ప్రమాదం: ప్రయాణికుల వివరాలు ఇవిగో..
సాక్షి, కర్నూలు: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ సహా 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. కాగా, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై అగ్ని ప్రమాదానికి గురైంది. బైక్, బస్సు ఢీకొన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ శివశంకర్ మృతి చెందాడు. ఇక, బస్సులు ప్రయాణించిన వారి జాబితా ఇలా ఉంది. బస్సు ప్రయాణికుల జాబితా ఇదే.. అశ్విన్‌రెడ్డి(36),జి.ధాత్రి(27),కీర్తి(30)పంకజ్(28), యువన్ శంకర్రాజు(22)తరుణ్(27), ఆకాశ్(31),గిరిరావు(48),బున సాయి(33), గణేశ్(30), జయంత్ పుష్వాహా(27)పిల్వామిన్ బేబి(64),కిశోర్ కుమార్(41)రమేష్, అతని ముగ్గురు కుటుంబ సభ్యులురమేష్(30), అనూష(22), మహ్మద్ ఖైజర్(51), దీపక్ కుమార్ 24అన్డోజ్ నవీన్‌కుమార్(26), ప్రశాంత్(32)ఎం.సత్యనారాయణ(28), మేఘనాథ్(25)వేణు గుండ(33), చరిత్(21), చందన మంగ(23)సంధ్యారాణి మంగ(43), గ్లోరియా ఎల్లెస శ్యామ్(28)సూర్య(24)హారిక(30), శ్రీహర్ష(24)శివ(24), శ్రీనివాసరెడ్డి(40), సుబ్రహ్మణ్యం(26)కె.అశోక్(27),ఎం.జి.రామారెడ్డి(50)ఉమాపతి(32), అమృత్ కుమార్(18), వేణుగోపాల్‌రెడ్డి(24).ప్రమాదం నుంచి తప్పించుకున్న 21 మంది వివరాలు.. -
అయ్యో శివుడా!.. గుండెలవిసేలా రోదిస్తున్న యశోదమ్మ
సాక్షి, కర్నూలు: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ సహా 20 మంది మృతి చెందినట్టు సమాచారం. అయితే.. బస్సు, బైక్ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాదం సందర్బంగా బైక్‌ను బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన బైకర్ శంకర్ చనిపోయాడు. శంకర్‌ను కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు.కాగా, శివశంకర్ మరణంతో అతని తల్లి యశోద, కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ బిడ్డ ఇలా మృతి చెందడం పట్ల విలపిస్తోంది. గ్రానైట్, పెయింటింగ్ పనులు చేసే శివశంకర్ నిన్న తెల్లవారుజామున డోన్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. బస్సు ముందుభాగంలోకి బైక్ వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం కారణంగా బస్సులోనే పలువురు సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉండగా.. వారిలో ఇద్దరు చిన్నారులు, పది మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు 20 మంది చనిపోయినట్టు సమాచారం. ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో నల్లగొండకు చెందిన అనూషా రెడ్డి మృతి..ఇదిలా ఉండగా.. ఘటనా స్థలానికి ఫొరెన్సిక్ బృందం చేరుకుంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగిస్తున్నారు. అలాగే, ఘటన స్థలానికి రవాణా శాఖ అధికారులు చేరుకున్నారు. బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయని అధికారులు తెలిపారు. కావేరి ట్రావెల్స్ పేరిట ఒడిశాలో రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నారు. 2018 మే 2న రిజిస్ట్రేషన్ చేశారు. తల్లీకూతుళ్లు మిస్సింగ్.. ఈ బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయ్యింది. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌గా ఉంది. 2027 మార్చి 31 వరకు ఫిట్‌నెట్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది. బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయి. అన్ని కోణాల్లో పూర్థి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
కర్నూలు బస్సు ప్రమాదం.. ప్రయాణికుల షాకింగ్ నిజాలు
-
కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం రియాక్షన్
-
కర్నూలు ఘోర ప్రమాదం.. బస్సుపై డేంజర్ డ్రైవింగ్ చలానాలు
సాక్షి, కర్నూలు: ఘోర ప్రమాదానికి గురైన బస్సుపై భారీగా ట్రాఫిక్ జరిమానాలు పెండింగ్ ఉన్నాయని రవాణా శాఖ వెల్లడించింది. 2024 నుంచి చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జనవరి(2024) నుంచి అక్టోబర్ (2025) వరకు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. రూ.23120 చలానా పెండింగ్‌లో ఉంది. హైస్పీడ్, డేంజర్ డ్రైవింగ్ కారణంగా రెండు చలానాలు బస్సుపై ఉన్నాయి. తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి. బస్సు ఫిట్నెస్, అనుమతులు.. ఒడిశా పరిధిలోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికితీశారు. బస్సు ప్రమాదస్థలిలో ఫోరెన్సిక్ బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. ప్రమాద ఘటన నేపథ్యంలో కూకట్‌పల్లిలోని వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన కార్యాలయం వద్దకు మీడియా చేరుకోగానే సిబ్బంది మూసేస్తూ కనిపించారు. ప్రమాదంపై నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఘటనకు వీ కావేరీ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా కారణం ఉందని అధికారుల మాటలతో స్పష్టవుతోంది. -
Kurnool Bus Incident: 2 నిమిషాలు.. 22 ప్రాణాలు..!
-
బస్సు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన కుటుంబం మృతి
-
పాసెంజర్స్ ని వదిలేసి పారిపోయిన డ్రైవర్, క్లీనర్
-
కర్నూలు బస్సు ప్రమాద ఘటన.. YS జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
-
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం ఆరా
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డిలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తక్షణమే ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు జెన్కో సీఎండీ హరీష్‌ను వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.గద్వాల కలెక్టర్, ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలని, బాధిత కుటుంబాలకు అండదండగా ఉండాలని సూచించారు. మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం హెల్స్ లైన్ ఏర్పాటు చేసిందిఎం.శ్రీరామచంద్ర- అసిస్టెంట్ సెక్రటరీ-991291954ఈ.చిట్టిబాబు-సెక్షన్ ఆఫీసర్-9440854433గద్వాల్ కలెక్టరేట్లోని కంట్రోల్ రూం నంబర్-9502271122కలెక్టరేట్లోని హెల్ప్ డెస్క్ నంబర్ 9100901599- 9100901598కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూం నంబర్ 9100901604గద్వాల్ పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 8712661828బాధిత కుటుంబాలు.. ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. -
నా బిడ్డను చంపేశారు కదరా! గుండెల్ని పిండేసే వీడియో
-
బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ఢిల్లీ: కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఈ ఘటన విచారకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. మృతులకు సంతాపం ప్రకటించారు.The loss of lives in a tragic bus fire accident in Kurnool, Andhra Pradesh is deeply unfortunate. I extend my heartfelt condolences to the bereaved family members and pray for the speedy recovery of those injured.— President of India (@rashtrapatibhvn) October 24, 2025ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్రమంలోనే ప్రధాని కార్యాలయం.. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే, క్షతగాత్రులకు 50వేల తక్షణ సాయం ఇవ్వనున్నట్టు తెలిపింది. Extremely saddened by the loss of lives due to a mishap in Kurnool district of Andhra Pradesh. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be…— PMO India (@PMOIndia) October 24, 2025 -
నిర్లక్ష్యంతో బతుకులు బుగ్గి.. కర్నూలులో ఘోర ప్రమాదం (చిత్రాలు)
-
కర్నూలు ప్రమాదం.. నెల్లూరు రమేష్ కుటుంబ సభ్యులు మృతి
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం సజీవ దహనమైంది. నెల్లూరుకు చెందిన రమేష్ సహా అతడి భార్య, పిల్లలు చనిపోయారు. దీంతో, వారి బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో నలుగురు నెల్లూరు జిల్లా వాసులు చనిపోయారు. వారిని వింజమూరు మండలం గోల్లవారిపాలెంకు చెందిన గోళ్ళ రమేష్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. వీరంతా హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొల్ల రమేష్ (35), అనూష (30), మన్విత (10), మనీశ్ (12) మృతి చెందారు. బంధువులు ఘటనా స్థలికి చేరుకున్నారు.ఇక, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ డీడీ01ఎన్9490 బస్సులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి సమయంలో బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది(Kurnool Bus Accident). క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి. -
కర్నూలు శివారులో ఘోరం..
సాక్షి, కర్నూలు/హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదై పోయింది. ఫిట్నెస్ లేని బస్సు, పైగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం సంభవించిందని అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో మరణాలపై ఏపీ హోమంత్రి అనిత అధికారిక ప్రకటన చేశారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. 27మంది ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. గాయపడ్డ ఆరుగురిలో ముగ్గురికి ప్రాక్చర్లు అయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే.. కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059 అలాగే.. ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061, కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075, ఇక.. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు 9494609814, 9052951010గా కర్నూలు కలెక్టర్ డా. సిరి తెలిపారు. బాధిత కుటుంబాలు పై నంబర్ లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చని సూచించారు. మృత్యు ప్రయాణం ఇలా..వి కావేరి ట్రావెల్స్ మెయిన్ ఆఫీస్ పటాన్ చెరులో ఉంది. కూకట్ పల్లిలో మరో కార్యాలయం ఉంది. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు(డీడీ01ఎన్9490).. రాత్రి 9.30గం. పటాన్చెరు నుంచి ప్రారంభమైంది. బీరంగూడ, గండి మైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, సూరారం, మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్, వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకొని బెంగళూరు వైపు బయల్దేరింది. .. అర్ధరాత్రి 3గం.30ని. ప్రాంతంలో కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్‌ను ఢీ కొట్టింది. బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ను అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లడం.. దాని పెట్రోల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగడంతో మంటలు వ్యాపించాయి. దీంతో.. బస్సును ఆపేసిన డ్రైవర్.. విషయాన్ని హెల్పర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి వాటర్ బబుల్‌తో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బస్సు హఠాత్తుగా ఆగడంతో కొందరు ప్రయాణికులకు మెలుకువ వచ్చి ఏం జరుగుతుందా? అని లేచి చూశారు. ఈలోపే.. మంటలు బస్సుకు అంటుకోవడం ప్రారంభించాయి. అది గమనించి డ్రైవర్ పారిపోగా.. హెల్పర్ ప్రయాణికులను అరుస్తూ బయటకు పిలిచాడు. డోర్ తెరిచి లేకపోవడంతో, ఎమర్జెన్సీ ద్వారం కూడా తెరుచుకోకపోవడంతో.. అద్దాలు పగలకొట్టుకుని కొందరు బయటకు దూకేశారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. గాఢ నిద్రలోఉన్నవాళ్లు, స్లీపర్ బెర్త్‌లో నిద్రిస్తున్నవాళ్లు.. మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేశారు. నిమిషాల్లో బస్సుకు మంటలు వ్యాపించి అందులోనే సజీవ దహనం అయ్యారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న నవీన్ తన కారులో గాయపడ్డ ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. హైమారెడ్డి అనే మరో మహిళ మంటలు చెలరేగడాన్ని చూసి అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో అందరూ వీడియోలు తీస్తున్నారని వాపోతూ ఆమె తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. (Kurnool Travels Bus Fire Accident)డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని.. బైక్‌ను ఢీ కొట్టినప్పుడే డ్రైవర్ బస్సును ఆపి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘‘మంటలు అంటుకోగానే అద్దాలు బద్దలు కొట్టి బయటకు దూకేశాం. అప్పటికే మా సోదరుడి కుటుంబం మంటల్లో చిక్కుకుంది. డ్రైవర్ వాళ్ల రక్షణ వాళ్లు చూసుకున్నారు. ప్రమాణికులను పట్టించుకోలేదు’’ అని గాయపడ్డ ఓ ప్యాసింజర్ వాపోయారు. అలాగే.. ఘటన జరిగిన తర్వాత వాళ్ల రక్షణ చూసుకున్నారే తప్ప.. తమను అప్రమత్తం చేయలేదని, అది జరిగి ఉంటే ప్రయాణికులంతా క్షేమంగా బయటపడేవాళ్లని చికిత్స పొందుతున్న మరో ప్రయాణికుడు తెలిపాడు.మృతుల సంఖ్య పెరగొచ్చు: డీఐజీప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. గాఢ నిద్రలో ఉండడంతో తేరుకునే లోపే ఘోరం జరిగిపోయింది. ఘటన నుంచి 23 మంది బయటపడ్డారు. ప్రమాద తీవ్రతను డ్రైవర్ అంచనా వేయలేదు. ఇప్పటిదాకా 11 మృతదేహాలను వెలికి తీశాం. చికిత్స పొందుతున్నవాళ్ల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరగొచ్చు అని డీఐజీ కోయప్రవీణ్ అన్నారు. అలాగే ప్రమాదానికి కారణమైన బైక్ సైతం బస్సు కిందే కాలిన స్థితిలో ఉండిపోగా.. బైకర్ మృతదేహం రోడ్డు పక్కనే పడి ఉంది. అతని పేరు శివ శంకర్‌గా తెలుస్తోంది. కొడుకు మృతితో యశోదమ్మ బోరున విలపిస్తూ కనిపించింది.ట్రావెల్స్ నిర్లక్ష్యం కూడా..ఘటన నేపథ్యంలో.. కూకట్‌పల్లిలోని వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన కార్యాలయం వద్దకు మీడియా చేరుకోగానే సిబ్బంది మూసేస్తూ కనిపించారు. ప్రమాదంపై నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఘటనకు వీ కావేరీ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా కారణం ఉందని అధికారుల మాటలతో స్పష్టవుతోంది. బస్సు నిర్మాణంలో ప్రికాషన్స్ లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేలా బస్సులో ఎలాంటి ఏర్పాట్లు లేవని డీఐజీ చెబుతున్నారు. అదే సమయంలో.. ట్రావెల్స్ ఓనర్ పేరు వేమూరి వినోద్ అని, బస్సు ఫిట్నెస్ వాలిడిటీ ఈ ఏడాది మార్చితోనే(31-03-2025) ముగిసిందని, అలాగే.. ఇన్సూరెన్స్ వాలిడిటీ, పొల్యూషన్ కాల పరిమితి కిందటి ఏడాది ఏప్రిల్‌తోనే ముగిశాయని ప్రచారం నడుస్తోంది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ప్రయాణికుల జాబితాలో.. 39 మంది, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రయాణికుల్లో చాలామంది హైదరాబాద్‌కు చెందిన వాళ్లే ఉన్నారు. బస్సులో ఎక్కువగా 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు ఉన్నట్లు లిస్ట్‌ను బట్టి అర్థమవుతోంది. ప్రమాదం నుంచి బయటపడ్డవాళ్లు.. రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం.. మరికొందరు. -
ప్రమాదం ఎలా జరిగిందంటే.. విస్తుపోయే నిజాలు
-
కాలిపోయిన బస్సు వద్ద కుటుంబం కోసం వెతుకులాట
-
తగలబడిన బస్సు.. నిద్రలోనే ప్రాణాలు..!
-
ఘోర ప్రమాదం తీవ్రంగా కలచివేస్తోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కర్నూలు ఘోర బస్సు ప్రమాదంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు (YS Jagan On Kurnool Bus Accident). ఘటన ఎంతో కలిచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన ఆయన.. వాళ్లకు ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని, అలాగే.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ‘‘కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు సజీవ దహనమవడం అత్యంత విషాదకరం. ఈ ఘోర ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి’’ అని ట్వీట్ చేశారు. The news of the tragic bus fire accident near Chinna Tekur village in Kurnool district is deeply distressing. I extend my heartfelt condolences to the families who lost their loved ones. I urge the government to ensure all necessary assistance and medical support to the injured…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 24, 2025మరోవైపు.. ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన విచారం వ్యక్తం చేశారని సమాచారం(CM Chandrababu On Kurnool Accident). ఆ వెంటనే సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి.. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.I am shocked to learn about the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district. My heartfelt condolences go out to the families of those who have lost their loved ones. Government authorities will extend all possible support to the injured and…— N Chandrababu Naidu (@ncbn) October 24, 2025ఇటు.. కర్నూలు బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుములు రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు (CM Revanth Reddy On Kurnool Bus Accident). మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ప్యాసింజర్స్ లిస్ట్‌లో అత్యధికం హైదరాబాద్‌కు చెందిన వారే ఉండడం గమనార్హం.కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు.…— Telangana CMO (@TelanganaCMO) October 24, 2025కేటీఆర్ దిగ్భ్రాంతి.. కర్నూలు బస్సు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఎంతో దురదృష్టకరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.స్థానిక అధికారులు అవసరమైన సహాయక చర్యలు వేగంగా చేపట్టి క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలని,ప్రభుత్వo బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నాను అని అన్నారు. మంత్రి నారా లోకేష్.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురి కావడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఘటన ఎంతో బాధించిందని.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారాయన. The news of the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district is heartbreaking. I extend my deepest sympathies to the families who have lost loved ones. Wishing speedy recovery to those injured.— Lokesh Nara (@naralokesh) October 24, 2025ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్..కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుల పరిస్థితిని కర్నూలు జీజీహెచ్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు మంత్రికి వివరించారు. దీంతో.. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు సూచించారు. ‘‘బస్సులోనే ఇంకా భౌతిక కాయాలున్నాయి. పరిస్థితులకనుగుణంగా ఘటనా స్థలం వద్దే భౌతిక కాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఫోరెన్సిక్ వైద్యులను ఘటనా స్థలానికి పంపించాం. భౌతిక కాయాల తరలింపునకు మహాప్రస్థానం వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు కూడా సేకరిస్తున్నాం. స్వల్పగాయాలతో 12 మంది ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రుల్లో ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. బస్సులో (ఎత్తు) నుంచి దిగడంవల్ల ఒకరికి ఎక్కువ దెబ్బలు తగిలాయి. ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది’’ అని ఆయన అన్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న ఓల్వో బస్సు కర్నూల్ వద్ద ప్రమాదానికి గురైందని తెలిసి తీవ్ర ద్రిగ్బాంతి గురి చేసింది. బస్సు ప్రమాద ఘటన పై కర్నూలు జిల్లా అధికారులతో మాట్లాడడం జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధం అయినట్టు తెలిసింది.మృతుల కుటుంబాలకు నా ప్రగడ సంతాపాన్ని తెలియజేస్తున్న. వెంటనే క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్న.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారం.. కర్నూలు జిల్లాలో బస్ ఘోర ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బస్ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం రావడం పట్ల ఆయన ఆందోన వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి..ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు మరణించడం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.ఇదీ చదవండి: బైక్‌ను ఢీ కొట్టడం వల్లే బస్సు కాలిపోయిందా? -
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. పలువురి సజీవ దహనం
కర్నూలు, సాక్షి: జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది(Kurnool Bus Accident). క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి. వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు నెంబర్ డీడీ01ఎన్9490 సుమారు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్‌ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. డ్రైవర్, హెల్పర్‌తో పాటు పలువురు ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరికొందరు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు.. అర్ధరాత్రి 3.30గం. ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ‘‘బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. బైక్‌ను ఢీ కొటటడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ గమనించి మరో డ్రైవర్‌ను నిద్ర లేపాడు. చిన్నపాటి ప్రమాదం అనుకుని వాటర్ బబుల్‌తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అంతలోనే మంటలు ఎక్కువయ్యేసరికి ప్రయాణికులను నిద్ర లేపాడు. ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టి మరికొందరు బయటపడ్డారు. గాయపడ్డవాళ్లు కర్నూలు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఎంత మంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేం’’ అని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. డ్రైవర్ పరారీలో ఉండగా.. స్పేర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. ఐక్యూ పంపారు.. అమెజాన్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
సాక్షి,కర్నూలు: అమెజాన్ సంస్థకు కర్నూలు జిల్లా కన్జ్యూమర్ కోర్టు షాకిచ్చింది. అమెజాన్ సంస్థపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.ఇటీవల ఓ వినియోగదారుడు రూ.80,000 చెల్లించి ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ పెట్టాడు. బుదులుగా అమెజాన్ ఐక్యూ ఫోన్‌ను డెలివరీ చేసింది.దీంతో కంగుతిన్న బాధితుడు బాధితుడు కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. అమెజాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కోపోద్రికుడైన కష్టమర్ కర్నూలు జిల్లా కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించారు.విచారణ చేపట్టిన కోర్టు.. అమెజాన్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్‌కు ఐఫోన్ డెలివరీ చేయాలని, లేదంటే రూ.80వేలు రిఫండ్ చేయాలని సూచించింది. అదనంగా రూ.25,000 నష్టపరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించింది. అయితే, అమెజాన్ సంస్థ ఆ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా వేసింది. -
Kurnool: సెక్యూరిటీ కళ్లుగప్పి.. ప్రధానిని కలిసి !
కర్నూలు: సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పేరుతో ఈనెల 16వ తేదీన కర్నూలు సమీపంలోని నన్నూరు వద్ద ఎన్డీఏ ప్రభుత్వం బహిరంగ సభ నిర్వహించింది. ప్రధాని మోదీ హాజరైన ఈసభలో ఆదోనికి చెందిన ఓ బీజేపీ నాయకుడు ప్రధాని సెక్యూరిటీ కళ్లుగప్పి ఇతరుల ఐడీతో ఆయనను కలిశారు. తర్వాత ఆ ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో చర్చ మొదలైంది. ప్రధానిని కలిసే వారి జాబితాలో సదరు నాయకుడి పేరు లేకపోయినా ఎలా కలిశారని ఆరా తీస్తున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ టీం ఆదోనిలో పర్యటించి ఆ నాయకుడి వివరాలు సేకరించినట్లు సమాచారం. -
Kurnool: ఘోర అగ్ని ప్రమాదం
-
తయారీ కేంద్రంగా భారత్, 2047 నాటికి వికసిత్ భారత్ సాధనే లక్ష్యం... కర్నూలు సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడి
-
కర్నూలులో రూ.2,880 కోట్లతో విద్యుత్ ట్రాన్స్ మిషన్ కు శంకుస్థాపన
-
కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన..
-
కర్నూలు చేరుకున్న మోదీ
సాక్షి, కర్నూలు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi Kurnool tour) కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలు శివారులోని నన్నూరు టోల్గేట్ సమీపంలో ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ పేరుతో భారీ బహిరంగ సభ జరుగనుంది. సభ వేదిక కోసం 450 ఎకరాల్లో ప్రాంగణం సిద్ధం చేశారు. పర్యటన సందర్బంగా ప్రధాని.. కర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.పర్యటన ఇలా.. 7.50 AM: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం10.20 AM: కర్నూలు ఎయిర్పోర్ట్10.25 AM: సున్నిపెంటకు హెలికాఫ్టర్11.10 AM: శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరిక11.45 AM: భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం12.45 PM: భ్రమరాంబ గెస్ట్ హౌస్ తిరిగి చేరిక1.25 PM: సున్నిపెంటకు రోడ్డు మార్గంలో బయల్దేరి1.40 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక2.30 PM: రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు4.00 PM: బహిరంగ సభ4.15 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక4.40 PM: కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి బయల్దేరి7.15 PM: ఢిల్లీకి చేరి పర్యటన ముగింపుకర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులు..రూ.2,880 కోట్లతో కర్నూలు-3 పూలింగ్ స్టేషన్‌ను అనుసంధానించేలా ఏర్పాటుచేసిన ట్రాన్స్మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని.రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులకు ప్రధాని శంకుస్థాపన.రెండు కారిడార్లలో సుమారు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తాయన్న కేంద్రం.రెండు కారిడార్ల ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని ప్రకటించిన కేంద్రం.రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్లు ఆస్కారం కల్పిస్తాయన్న కేంద్రం.రూ.960 కోట్లతో సబ్బవరం-షీలానగర్ రహదారికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని.రూ.1,140 కోట్లతో పీలేరు-కాలురు నాలుగు వరుసల రహదారి విస్తరణకు శంకుస్థాపన.గుడివాడ-నూజెండ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ. -
నేడు కర్నూలుకు వస్తున్నా: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: గురువారం(నేడు) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. ‘ఈనెల 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తా. ఆ తర్వాత కర్నూలులో విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలు, తదితర రంగాలకు సంబంధించిన రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు నిర్వహించే శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాల్లో పాల్గొంటాను’ అని ప్రధాని తెలిపారు. -
సర్పదోషాలను పరిహరించే పంచలింగాల క్షేత్రం గురించి తెలుసా?
దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే పానవట్టం పై అయిదు లింగాలు వెలసిన దివ్యధామం కర్నూలులోని పంచలింగాల క్షేత్రం. పరీక్షిన్మహారాజు కుమారుడు జనమేజయుడి చేతుల మీదుగా ప్రతిష్థిమైన ఈ ఆలయ సందర్శనం సర్పదోషాలను పరిహరించడంలో ప్రసిద్ధి గాంచింది. స్థల పురాణం ఏం చెబుతోందంటే... పూర్వం సర్పయాగాన్ని నిర్వహించిన జనమేజయ మహారాజు సర్పదోష నివారణ కోసం దేశ నలుమూలల కోటి లింగాలను ప్రతిష్టించారు. ఆ కోటి లింగాలలో చిట్టచివర ప్రతిష్టించినదే ఈ పంచలింగాల క్షేత్రం. ఇక్కడ జనమేజయుడు అనేకమంది యోగులు, మంత్ర సిద్ధుల చేత పంచలింగాలను ప్రతిష్టించి సర్పదోషం నుండి విముక్తి పొందినట్టుగా గంగా పురాణంలో ప్రస్తావించబడినది. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ఈ ఆలయం విరూపాక్ష ముఖ ద్వారంగా విలసిల్లింది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయులు దర్శించారని అక్కడి ఆలయం ముందు ఉండే శిలా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ శాసనాలలో విజయ నగర సామ్రాజ్యానికి సంబంధించిన చిహ్నాలు కూడా నేటì కీ కనిపిస్తాయి. రాయల సీమ కూడా ఈ ప్రాంతం నుండే ఆరంభం అయినట్టు ఇక్కడ లభించే శిలాశాసనాల ద్వారా తెలియవస్తుంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ప్రతిష్టించబడిన వీరభద్రుడు, సకల కోరికలు తీర్చేటువంటి చాముండి మాతను కూడా మనం దర్శించుకోవచ్చు. ఇంకా ఈ ఆలయం చుట్టు అనేక శివాలయాలు వెలిశాయి. కానీ కాలక్రమేణా ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడ గదాధరుడు అయినటువంటి గయా నారాయణుడిని కూడా దర్శించుకోవచ్చు. పూర్వం ఈ క్షేత్రాన్ని దక్షిణ గయగా కూడా పిలిచేవారట. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు సర్పదోషం, నవగ్రహ దోషం, మృత్యుదోషం, కుజ దోషం వంటి అనేక దోషాలు కూడా నివృత్తి అవుతాయని ఆలయ అర్చకుడు తెలిపారు. ఆలయానికి తూర్పు ముఖంగా ప్రవహిస్తున్న తుంగాతీరాన్ని ఆనుకుని వెలసిన ఈ క్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ ఆలయాల నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం దేవాదాయ శాఖ వారు చూస్తున్నారు.పంచభూతాల స్వరూపమే పంచలింగాల ఆకాశం, గాలి, నీరు, నిప్పు, వాయువు, భూమి ఈ పంచభూతాల స్వరూపమే ఇక్కడి పరమశివుడి స్వరూపంగా భక్తులు భావిస్తారు. ఇక్కడి ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉండి భక్తుల మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఎంతోమంది ఋషులు ఇక్కడ తపస్సు ఆచరించి పరమశివుడి అనుగ్రహాన్ని పొందినట్టు ఆలయ పండితులు, చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు.ఎలా వెళ్లాలంటే..?కర్నూలు నుంచి కేవలం 5కి.మీ దూరంలో ఈ పంచలింగాల గ్రామం ఉంది. తుంగభద్ర నది తీరాన్ని ఆనుకుని ఈ గ్రామం ఉంది. ఈ ప్రాంతానికి సమీపంలో కాల్వబుగ్గ బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రం ఉంటుంది. అలాగే కర్నూలులో కొండారెడ్డి బురుజు, కొమ్మచెరువు ఆంజనేయ స్వామి ఆలయం, సమీపంలో అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలు చూడదగ్గ సందర్శనీయ ప్రదేశాలు. -
16న కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన
కర్నూలు కల్చరల్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈనెల 16న ప్రధాని మోదీ పర్యటించనున్నారని రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్ తెలిపారు. సోమవారం కర్నూలులోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో జిల్లాలో ప్రధాని పర్యటనపై వీరు సమీక్ష చేపట్టారు.3 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. సభ ఏర్పాటుకు అనుగుణంగా ఉండే ప్రదేశాలను ఈ సందర్భంగా మంత్రులు గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించారు. -
కర్నూలు: రైతులను కంటతడి పెట్టిస్తున్న ఉల్లి పంట
సాక్షి, కర్నూలు: జిల్లాలో ఉల్లి పంట రైతుకు కంటతడి పెట్టిస్తోంది. ఉల్లికి మద్దతు ధర లేకపోవడంతో పంటను రైతులు పొలంలోనే వదిలివేస్తున్నారు. పంట పండించినా ప్రయోజనం లేకపోగా భూమి చదును చేసేందుకు రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉల్లి పంటను గొర్రెలకు, మేకలకు రైతులు వదిలేస్తున్నారు. పత్తికొండ మండలం పెద్దహుల్తి ఉల్లి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి అప్పుల ఊబిలో కూరుకు పోయమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతి కొచ్చిన పంటను వదిలేసి.. రైతు విశ్వనాథ్ ట్రాక్టర్‌తో దున్ని వేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా రైతులను ఆదుకోకపోతే భవిష్యత్తు కష్టమేనని రైతులు అంటున్నారు. -
నువ్వు టీడీపీలోకి రాకపోతే... నీ మనవడిని చంపేస్తాం
సాక్షి టాస్క్ ఫోర్స్: ‘ఆమెకు చెప్పండి... లక్ష్మీదేవమ్మ టీడీపీలో చేరకపోతే ఆమె మనవడిని చంపేస్తాం...’ అని కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి.విష్ణువర్ధన్‌రెడ్డి కర్నూలు రూరల్ మండలం నూతనపల్లె వైఎస్సార్సీపీ మహిళా ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మను హెచ్చరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి 40 కార్లలో లక్ష్మీదేవమ్మ ఇంటికి వెళ్లి పట్టపగలు పోలీసుల సమక్షంలోనే ఆమె మనవడు మహేంద్రను కిడ్నాప్ చేశారు.అడ్డొచ్చిన మహిళలపై విచక్షణారహితంగా టీడీపీ మూకలు దాడి చేశారు. ఈ దౌర్జన్యకాండను వీడియోలు తీసినవారి సెల్ఫోన్లు లాక్కుని ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒక ఎమ్మెల్యేనే దగ్గరుండి కిడ్నాప్ చేయించడం, పోలీసులు చేష్టలుడిగి చూడటం రాష్ట్రంలో అరాచక పాలనకు మరో నిదర్శనమని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామంపైకి దండయాత్ర టీడీపీ నాయకులు కర్నూలు రూరల్ ఎంపీపీ పదవిపై కన్నేశారు. తమకు బలం లేకపోయినా వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను భయపెట్టి టీడీపీలో చేర్చుకోవాలని ఎమ్మెల్యే దస్తగిరి, విష్ణువర్ధన్‌రెడ్డి నిర్ణయించారు. గురువారం వైఎస్సార్సీపీకి చెందిన నూతనపల్లె ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ, నందనపల్లె ఎంపీటీసీ జ్యోతి, రేమట ఎంపీటీసీ సుజాత, దిన్నెదేవరపాడు–1 ఎంపీటీసీ రామనాథ్రెడ్డిలను అభివృద్ధి పనులపై చర్చించాలని పిలిచి వారికి టీడీపీ కండువాలు వేశారు. నూతనపల్లె ఎంపీటీసీ లక్ష్మీదేవి తాను వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని శుక్రవారం ప్రకటించారు.దీనిని జీరి్ణంచుకోలేని టీడీపీ ఎమ్మెల్యే దస్తగిరి, విష్ణువర్ధన్‌రెడ్డి శనివారం ఉదయం 40 వాహనాలతో నూతనపల్లెపై దండయాత్ర చేశారు. ఊరిలో అడ్డువచ్చిన వారిని కొట్టి ఎంపీటీసీ సభ్యురాలి ఇంటిపై దండెత్తారు. ఆ సమయంలో ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ, ఆమె కుమారుడు కృష్ణ ఇంట్లో లేరు. భయంతో ఆడవాళ్లు తలుపులు వేసుకుని లోపల ఉన్నారు. టీడీపీ మూకలు తలుపులు పగలగొట్టి అడ్డువచ్చిన మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసి లక్ష్మీదేవమ్మ మనవడు మహేంద్ర(22)ను లాక్కెళ్లి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.లక్ష్మీదేవమ్మ టీడీపీలోకి రాకపోతే మహేంద్రను చంపేస్తామని కుటుంబ సభ్యులను హెచ్చరించారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ మూకలు ఇష్టానుసారంగా కొట్టడం, యువకుడిని కిడ్నాప్ చేయడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. మరో ఎంపీటీసీ కుటుంబానికీ బెదిరింపులు గురువారం టీడీపీ నేతలు కండువా కప్పిన దిన్నెదేవరపాడు–1 ఎంపీటీసీ రామనాథ్‌రెడ్డి కూడా శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను కూడా టీడీపీ నాయకులు బెదరించారు. రామనాథ్‌రెడ్డి టీడీపీలోకి రాకపోతే ఎంతవరకైనా వెళతామని, అంతు చూస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం ఖూనీ: ఎస్వీ మోహన్‌రెడ్డి నూతనపల్లె ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీదేవమ్మ, దిన్నెదేవరపాడు–1 ఎంపీటీసీ రామనాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులను టీడీపీ నాయకులు బెదిరించడం, కిడ్నాప్ చేయడంపై వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ నాయకులు బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలకడం అన్యాయమన్నారు. మహేంద్ర కిడ్నాప్‌పై వెంటనే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బలం లేకపోయినా బరితెగింపుకర్నూలు రూరల్ మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 12, టీడీపీ 10 స్థానాల్లో విజయం సాధించాయి. ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలుపొందారు. వైఎస్సార్సీపీకి చెందిన జి.సింగవరం ఎంపీటీసీ డి.సవారన్న, పసుపల టీడీపీ ఎంపీటీసీ మురళీకృష్ణ చనిపోయారు. పంచలింగాల ఎంపీటీసీగా ఉన్న బస్తిపాటి నాగరాజు(టీడీపీ) కర్నూలు ఎంపీగా గెలిచారు. ఆర్.కొంతలపాడు ఎంపీటీసీ కె.గిడ్డమ్మ(టీడీపీ) సుంకేసుల సర్పంచ్‌గా గెలిచారు.దీంతో పంచలింగాల, ఆర్.కొంతలపాడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎంపీటీసీ బోయమద్దిలేటి(దిన్నెదేవరపాడు–2)తో కలుపుకొని వైఎస్సార్సీపీకి 12 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీ బలం 7కు తగ్గింది. ఎంపీపీగా ఉల్చాల ఎంపీటీసీ వెంకటేశ్వరమ్మ(వైఎస్సార్సీపీ) కొనసాగుతున్నారు. తగిన బలం లేకపోయినా ఎంపీపీ పదవిని పొందాలని టీడీపీ నాయకులు కుట్రలు పన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను బెదిరించి తమ పార్టీలో చేర్చుకునేందుకు బరితెగించారు. -
చెన్నకేశవ స్వామి రథోత్సవంలో అపశృతి
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో మరో అపశృతి చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు మండలం కందనాతి చెన్నకేశవ స్వామి రథోత్సవం సందర్భంగా ప్రమాదం జరిగింది. రథం పక్కకి ఒరగి మీద పడటంతో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. ఎమ్మిగనూరులో విజయదశమి మరుసటి రోజున రథోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం చెన్నకేశవ స్వామి రథాన్ని కొండపైకి తీసుకెళ్తుండగా రథం ఒక్కసారిగా కిందకు ఒరిగి భక్తుల మీద పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రథోత్సవంలో అపశృతి చోటుచేసుకోవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. -
దేవరగట్టు బన్నీ ఉత్సవంలో అపశృతి.. ఇద్దరు మృతి
సాక్షి, కర్నూలు: కర్నూలు(Kurnool) జిల్లాలో విషాదం నెలకొంది. హొళగుంద మండలం దేవరగట్టు(devaragattu) మాళ మల్లేశ్వరస్వామి బన్నీ(bunny festival) ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. బన్నీ ఉత్సవాల ప్రారంభంలోనే రెండు వర్గాలు కర్రలతో తలపడటంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. దాదాపు వంద మంది తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. దేవరగట్టులో గురువారం అర్ధరాత్రి స్వామి, అమ్మవారి వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది. దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు కర్రలతో దాడులు చేసుకోగా.. ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. దేవరగట్టులో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. -
గోడ కూలి ముగ్గురు దుర్మరణం
ఎమ్మిగనూరు రూరల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్‌లో జరిగింది. వివరాలు.. నందవరానికి చెందిన బలుదూరు లక్ష్మీదేవి మూడేళ్లుగా తన ఇద్దరు కుమారులు నాగరాజు(45), రాజు(39), మనవడు లక్ష్మీనరసింహ(14)తో కలసి గుడేకల్లోని నీలకంఠశ్వేరస్వామి దేవాలయం స్థలంలో ఉన్న గోడకు రేకుల షెడ్డు వేసుకొని జీవిస్తోంది.సోమవారం రాత్రి వారంతా భోజనం చేసి నిద్రపోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తడిసిన రాతి గోడ.. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వారిపై పడింది. కేకలు విన్న స్థానికులు వచ్చి వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ తండ్రి నాగరాజు, కుమారుడు లక్ష్మీనరసింహ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న రాజు మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. లక్ష్మీదేవి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. -
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, కర్నూలు: పత్తికొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తుగ్గలి మండలం ముకెల గ్రామానికి చెందిన భూమిక (26), నితిక (5) తల్లీకూతుళ్లు. వారిద్దరూ శిరీష (30)తో కలిసి పండుగ సరుకుల కోసం పత్తికొండకు వచ్చారు. పండుగ, సరుకులు తీసుకుని తమ గ్రామమైన ముక్కెళ్ల గ్రామానికి వెళ్లడానికి ఆటోలో బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో బియ్యం లోడుతో లారీ బ్రేకులు ఫెయిలై ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తీరం దాటిన వాయుగుండం
సాక్షి, అమరావతి/వాకాడు/కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల(అర్బన్): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఉదయం తీరం దాటింది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దగ్గర తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా బుధవారం నాటికి ఉత్తర, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఎగసి పడుతున్న సముద్రం అలలు వాయుగుండం ప్రభావంతో శనివారం తిరుపతి జిల్లా వాకాడు మండలం, తూపిలిపాళెం సముద్ర తీరంలో అలలు 4 మీటర్లు ఎత్తుకు ఉవ్వెత్తున ఎగసి పడుతూ సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ తరుణంలో సముద్రంపై మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు ఎవ్వరూ వెళ్లరాదని అధికారులు ఆదేశించారు.నంద్యాల జిల్లాలో ఎడతెరపిలేని వర్షం నంద్యాల జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. కుందూ, మద్దిలేరు, పాలేరు వాగులు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.కర్నూలులో కుండపోతకర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో ఒకే రోజు జిల్లాలో 62 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దేవనకొండలో 142.6 మి.మీ., అత్యల్పంగా ఆలూరులో 25.6 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎమ్మిగనూరు మండలం సోగనూరు గ్రామంలో భారీ వర్షం కారణంగా 30 గొర్రెలు మరణించాయి. అధిక వర్షాల వల్ల పత్తి, ఉల్లి, మొక్కజొన్న, కంది, టమాటా సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో సెపె్టంబర్ నెల సాధారణ వర్షపాతం 116.5 మి.మీ. కాగా, 27 రోజుల్లో 199.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
అందుకే టీడీపీ, బీజేపీ ని వదిలి YSRCP లో చేరాం
-
కర్నూలులో హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి (ఫొటోలు)
-
అమ్మ స్ఫూర్తి..
‘మనలో శక్తి ఎంత ఉందో నడిచి వచ్చిన మన మార్గమే చూపుతుంది’ అంటారు డాక్టర్ సాయిలత. కర్ణాటకలోని హోస్పేట్లో డాక్టర్‌గా పని చేస్తున్న సాయిలత కర్నూలు వాసి. ఒంటరిగా తల్లి పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుంటూ, ఆర్థిక స్థోమత లేక పోయినా పెద్ద కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో పట్టుదలతో కృషి చేసి డాక్టర్‌గా ఎదిగారు. సేవామార్గాన్నీ వదలకుండా అమ్మాయిల ఆరోగ్య జీవన విధానానికి, విద్యార్థులకు చెప్పాల్సిన విషయాల్లో బోధకురాలిగా తన జీవన ప్రయాణాన్ని మెరుగ్గా మలుచుకున్నారు. ఆ వివరాలు సాయిలత మాటల్లోనే...‘‘ఈ రోజు గైనకాలజిస్ట్‌గా సేవలందించే స్థాయికి రావడం అంత సులువుగా కాలేదు. నేను పుట్టి పెరిగింది కర్నూలులో. సింగిల్ మదర్‌గా మా అమ్మ నన్నూ చెల్లెలిని పోషించడానికి చాలా కష్టపడేది. రిసెప్షనిస్ట్‌గా, గోడౌన్ ఇన్చార్జిగా.... చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేస్తూ ఉండేది. అమ్మ కష్టం చూస్తుంటే చాలా బాధ అనిపించేది. కానీ, నాకేమో డాక్టర్ అవాలని కల. అమ్మ నా ఆలోచనను నిరుత్సాహపరచలేదు. ‘అభయం’తో...టెన్త్‌లో మంచి మార్కులు వచ్చాయి. మేం పెద్దవుతుంటే ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. కాలేజీ ఫీజులు కట్టే స్థోమత లేదు. ఇప్పుడెలా... అనుకుంటున్నప్పుడు హైదరాబాద్‌లో ఉన్న ‘అభయ’ స్వచ్ఛంద సంస్థ గురించి తెలిసింది. వాళ్లను కలిస్తే, ఫీజులకు సాయం చేశారు. ఆ తర్వాత ఎమ్సెట్ రాస్తే వచ్చిన ర్యాంకుకు రిజర్వేషన్లు లేక పోవడం వల్ల సీటు రాలేదు. దాంతో లాంగ్‌టర్మ్ కోచింగ్‌కి సాయం కోసం వెతుకుతుండగా ఈ విషయం తెలిసి, అభయ ఫౌండేషన్ వాళ్లే పిలిపించి మరీ లాంగ్ టర్మ్ కోచింగ్‌కు సాయం చేశారు. ఆ యేడాది మంచి ర్యాంకు తెచ్చుకున్నాను. అనంతపూర్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఆ తర్వాత పీజీ కోర్సుకు ఏడాది కోచింగ్ తీసుకున్నాను. ఆలిండియా నీట్లో ర్యాంకు వచ్చింది. మహారాష్ట్ర అకోలా మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేశాను. స్కాలర్షిప్స్ వచ్చాయి. సంస్థ నుంచి సాయం అందింది. నా క్లాస్మేట్, పీడియాట్రిషియన్ డాక్టర్ తిరుమలేశ్‌తో నా పెళ్లి జరిగింది. మా అత్తగారిది కర్ణాటకలోని హోస్పేట్. దాంతో మేమిద్దరం కలిసి, అక్కడే క్లినిక్ నడుపుతున్నాం. పండక్కి హైదరాబాద్‌లో ఉంటున్న అమ్మ లక్ష్మి, చెల్లెలు ధరణిల వద్దకు వచ్చాను. మాకోసం ఎంతో కష్టపడిన అమ్మకు విశ్రాంతి కల్పించాను.సేవా మార్గం...ఉంటున్న చోటనే డాక్టర్‌గా వృత్తిని కొనసాగిస్తూ, గర్ల్ సేఫ్టీ గురించి అవగాహనా తరగతులు తీసుకుంటున్నాను. నెలసరి సమయంలో ఎలా ఉండాలి, రక్తహీనత, థైరాయిడ్, అధికబరువు, గర్భధారణ.. ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మహిళల్లో ఉండే ఆరోగ్య సమస్యలు, వాటి పైన సెషన్స్ చెబుతూనే ఆన్లైన్ ద్వారా స్టూడెంట్స్‌కు ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహారం మొదలైన విషయాలపైనా గైడెన్స్ ఇస్తుంటాను. ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి, అమ్మాయిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరిస్తుంటాను. ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి, అమ్మాయిల రక్షణకు సంబంధించిన విషయాలు నృత్య, నాటకాల ద్వారా చెబుతుంటాను ‘అభయ’ వల్ల నా జీవితానికి మార్గం ఏర్పడింది. అందుకు నా వంతుగా తిరిగి ఆ సంస్థకు ఉన్న 30 సెంటర్లలోని టీచర్లకు గైడెన్స్ ఇస్తుంటాను. హెల్త్ క్యాంపుల్లో ఉచిత సేవలు అందిస్తుంటాను.నాలుగు గోడల మధ్య ఏమీ తెలియని ప్రపంచం నుంచి బయల్దేరిన నాకు ఈ రోజు కొన్ని వందలమందికి అవగాహన కలిగించే స్థాయి లభించింది. ఈ ప్రయాణంలో అమ్మ కష్టం, అభయ అందించిన సాయం నన్ను నిలబెట్టాయి. అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడంతో పాటు, వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలన్నది నా జీవన ప్రయాణం నేర్పిన పాఠం. శక్తి మనలో ఉందని గుర్తిస్తే ఎదగడానికి మద్దతు కూడా లభిస్తుంది. ప్రయాణంలో మనకు శక్తిగా నిలిచినవారికి తిరిగి మన శక్తిని అందించినప్పడు ఆ ఆనందం గొప్పగా ఉంటుంది’’ అని వివరించారు ఈ డాక్టర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వలపు వల.. వంచించెనిలా!
కర్నూలు: సులువుగా డబ్బు సంపాదనకు అలవాటు పడిన భార్య, భర్త, ఓ ప్రేమికురాలు ముఠాగా ఏర్పడి మత్తెక్కించే మాటలతో యువకులను ఆకట్టుకొని, ఆ తర్వాత బెదిరించి డబ్బు గుంజుతున్న వ్యవహారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి బలరాం నగర్‌కు చెందిన చిక్కిరి మల్లేష్, భార్య పెరుమాళ్ల మేరీ, మల్లేష్ ప్రేమికురాలు మొల్లం మల్లిక అలియాస్ లిల్లీ ముఠాగా ఏర్పడి డబ్బున్న వారి ఫోన్ నెంబర్లు సేకరిస్తుంటారు. వారికి ఫోన్ చేసి తీయనైన మాటలతో ముగ్గులోకి దింపి నగ్న వీడియోలు పంపి బెదిరించి డబ్బులు దండుకునేవారు. కర్నూలుకు చెందిన వ్యాపారి ప్రదీప్ ఈ ముఠా సభ్యుల మాటలను నమ్మి దాదాపు రూ.3.80 కోట్ల నగదు వారి ఖాతాలకు బదిలీ చేసి మోసపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సాంకేతికత సాయంతో వారు వినియోగించిన కాల్ డేటా ఆధారంగా రెండో పట్టణ పోలీసులు ముఠా సభ్యుల గుట్టు రట్టు చేసి కటకటాలకు పంపారు.తక్కువ ధరకే పొలం ఇస్తామంటూ మోసం.. ముగ్గురు ముఠా సభ్యులు కలసి సంయుక్త రెడ్డి పేరుతో ట్విటర్ ఖాతా ద్వారా నగ్నంగా వీడియో కాల్స్ చేసి మత్తెక్కించే మాటలతో నమ్మించి మోసానికి పాల్పడ్డారు. విజయవాడకు సమీపంలో తమకు ఖరీదైన పొలం ఉందని, డబ్బులు అవసరమున్నందున తక్కువ ధరకే ఇస్తామంటూ రూ.3.80 కోట్లు వసూలు చేశారు. రూ.41.26 లక్షలకు రెండు కార్లు, ఓ మోటర్ సైకిల్, బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. మిగిలిన డబ్బు రూ.3.38 కోట్ల నగదును ముగ్గురూ పంచుకుని జల్సా చేశారు.ప్రదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ముఠా సభ్యులను అరెస్టు చేసి విచారించగా వారి నేరాల చిట్టా బయటపడింది. వారి నుంచి 2 కార్లు, మోటర్ సైకిల్, ల్యాప్‌టాప్, 3 సెల్ఫోన్లు, 5 తులాల బంగారం రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు పేర్కొన్నారు. -
Kurnool: విద్య, వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం పట్ల ఆగ్రహం
-
Kurnool: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన
-
కర్నూలులో 2 వేల 700 కోట్ల రూపాయల విలువైన స్థలంపై గురి...
-
రూ.2,700 కోట్ల స్థలంపై గురి.. క్యాంపు ‘భరతం’ పట్టేస్తా..!
చుట్టూ కాంక్రీట్ కట్టడాల నడుమ ఫొటోలో ఆకుపచ్చగా కనిపిస్తున్న ఈ ప్రాంతం కర్నూలులోని బీ, సీ క్యాంపు క్వార్టర్స్. కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు అధికారులు నివాసం ఉండేందుకు ప్రభుత్వం ఏ, బీ, సీ క్వార్టర్లను నిర్మించింది. బీ, సీ క్యాంపు క్వార్టర్స్‌లో దాదాపు వంద ఏళ్ల నాటి భారీ వృక్షాలు ఉన్నాయి. కిక్కిరిసిన నగరానికి ప్రాణ వాయువు అందించడంలో వీటి పాత్ర చాలా కీలకం. కర్నూలులోనే అత్యధికంగా చెట్లు ఉన్న ఈ ప్రాంతం కూడా ఇదే. అక్కడకు వెళితే ఆ చల్లదనానికి మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. అలాంటి భారీ వృక్షాలను ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా తొలగించేందుకు రంగం సిద్ధమైంది. బీ, సీ క్వార్టర్లను కూలగొట్టి టీడీపీ జిల్లా కార్యాలయానికి స్థలంతోపాటు మినీ క్రికెట్ స్టేడియం, మల్టీప్లెక్స్, స్టార్ హోటల్స్, ఫంక్షన్‌హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించేందుకు కీలక ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో చకచకా మంత్రాంగం జరుగుతోంది. దాదాపు 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపు క్వార్టర్స్ విలువ దాదాపు రూ.2,700 కోట్లు! కర్నూలు చరిత్రలోనే దీన్ని అతి పెద్ద దోపిడీగా అభివర్ణిస్తున్నారు. బీ, సీ క్యాంపు స్థలాలను ఖాళీ చేయాలని అందులో ఉంటున్న వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చిన అధికారులు తాజాగా నీరు, విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు.సాక్షి ప్రతినిధి కర్నూలు: భాషా ప్రయుక్త రాష్ట్రాలలో భాగంగా ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉంది. 1953 అక్టోబర్ 1 నుంచి 1956 అక్టోబరు 31 వరకూ కర్నూలే రాజధాని. అప్పట్లో అధికారులు నివాసం ఉండేందుకు ఏ, బీ, సీ క్వార్టర్లను నాటి ప్రభుత్వం నిర్మించింది. నగరంలో ఆ ప్రాంతాలను ఇప్పటికీ ఏ, బీ, సీ క్యాంపు అని వ్యవహరిస్తుంటారు. మొత్తం 1,090 క్వార్టర్లలో ప్రస్తుతం 953 ఉన్నాయి. ఇందులో 367 క్వార్టర్లలో అధికారికంగా కొందరు, 490 క్వార్టర్లలో అనధికారికంగా మరికొందరు నివాసం ఉంటున్నారు. కొన్ని శిథిలావస్థకు చేరాయి. ఇక్కడ సెంటు రూ.30 లక్షలకుపైగా ఉంది. ప్రధాన రహదారి ప్రాంతంలోనైతే రూ.50 లక్షలుపైనే ఉంది. సగటున రూ.30 లక్షలు అనుకున్నా ఎకరా రూ.30 కోట్లు ఉంటుంది. ఈ లెక్కన మొత్తం 90 ఎకరాల విలువ రూ.2,700 కోట్లపైనే! నగర నడిబొడ్డున అత్యంత విలువైన ఈ ప్రాంతంలో 70 ఏళ్ల కిందట నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. వీటిని తొలగించి ఈ స్థలాన్ని ప్రభుత్వం వినియోగించుకోవాలని, అపార్ట్మెంట్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆలోచించారు. ఆయన హఠాన్మరణంతో ఆ ప్రతిపాదన పట్టాలెక్కలేదు. సర్కారు ఖరీదైన స్థలంపై టీడీపీ ప్రజాప్రతినిధుల కన్ను బీ, సీ క్యాంపులోని క్వార్టర్లను తొలగించి మినీ క్రికెట్ స్టేడియం నిర్మించాలని మంత్రి టీజీ భరత్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తక్కిన స్థలాలను లీజు పేరుతో కూటమి నేతలు గుప్పిట పట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో 33 ఏళ్లు లీజుకు తీసుకుని మల్టీప్లెక్స్, స్టార్ హోటల్స్, ఫంక్షన్‌హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలుత 39 క్వార్టర్లను కూల్చేసేందుకు ఆర్అండ్బీ అధికారులు అందులో నివాసం ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చారు. అనంతరం మిగతావారికి జారీ అయ్యాయి. కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ స్థలం కర్నూలు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వస్తుంది. తొలగించిన స్థలంలో 3–5 ఎకరాల్లో మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేసి మిగతా 85–87 ఎకరాల స్థలాన్ని లీజు పేరుతో 33 ఏళ్లు దక్కించుకునేలా సిద్ధమయ్యారు. ఆ తర్వాత కూడా లీజుదారుడు కొనసాగాలని భావిస్తే మరో రెండు దఫాలు అంటే 66 ఏళ్లు వారి ఆదీనంలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే లీజు పేరుతో 99 ఏళ్లు వారి ఆజమాయిషిలోనే ఉంటుంది. కర్నూలులో అత్యంత విలువైన స్థలం ఇదే కావడం గమనార్హం! స్టేడియం కోసం ఇప్పటికే స్థలం సేకరించిన బీసీసీఐ.. కర్నూలులో భారీ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం బీసీసీఐ ఇప్పటికే నేషనల్ హైవే సమీపంలో బాలసాయి స్కూలు పక్కన 16.40 ఎకరాలను సేకరించింది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మించే వీలుంది. హైదరాబాద్–బెంగళూరు హైవే పక్కనే ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తవు. ఈ స్థలం ఉన్నప్పటికీ మళ్లీ మినీ క్రికెట్ స్టేడియం పేరుతో నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలంపై కూటమి ప్రజాప్రతినిధులు కన్నేయడం గమనార్హం! రెండు నెలలు గడువిద్దామన్నా.. క్వార్టర్లు ఖాళీ చేయించేందుకు కీలక ప్రజాప్రతినిధి ఐదు ప్రభుత్వ శాఖలను పురమాయించారు. పోలీసు, రెవెన్యూ, మునిసిపల్, విద్యుత్తు, ఆర్ అండ్ బీ అధికారులను రంగంలోకి దించారు. ఈ నెల 8వతేదీ నుంచి అధికారులు నీరు, కరెంట్ సరఫరా నిలిపివేశారు. పండుగ వేళ తామంతా ఎక్కడికి వెళ్లాలి? పిల్లల చదువులు ఏం కావాలి? ఉన్నఫళంగా కరెంటు, నీరు ఆపేస్తే తాము ఏం చేయాలని అందులో ఉంటున్న కుటుంబాలు అవస్థ పడుతున్నాయి. ఆర్అండ్బీ, కలెక్టరేట్, ఎన్టీఆర్ విగ్రహం వద్ద మూడు రోజులుగా ఆందోళనకు దిగినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రెండు నెలలు గడువిద్దామని కీలక ప్రజాప్రతినిధికి అధికారులు సర్దిచెప్పే యత్నం చేసినా వినలేదని చర్చించుకుంటున్నారు. రూ.120 కోట్ల స్థలంలో టీడీపీ కార్యాలయం!టీడీపీ జిల్లా కార్యాలయం కోసం రెండెకరాలు 99 ఏళ్ల పాటు లీజుకివ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కలెక్టర్ రంజిత్‌బాషాకు లేఖకు రాశారు. కర్నూలులో ‘బీ’ క్యాంపు మెయిన్ రోడ్డులోని ఖరీదైన స్థలాన్ని టీడీపీ కోరింది. ఇక్కడ సెంటు రూ.60 లక్షలు వరకు ఉంది. ఈ లెక్కన టీడీపీ కోరుతున్న రెండు ఎకరాల విలువ రూ.120 కోట్లకుపైనే ఉంటుంది! -
భూ వివాదం: తహశీల్దారు ఎదుటే తన్నుకున్న రెండు వర్గాలు
కర్నూలు జిల్లా : తమ భూ వివాదానికి సంబంధించి తహశాల్దీర్ ఎదుట హాజరైన రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సమస్యను పరిషక్రించుకోవడానికి తహశీల్దార్ ఎదుట హాజరైన ఆ రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి పెద్దదైంది. దాంతో ఒకరిపై ఒకరరిపై దాడులు చేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన మంత్రాలయం తహశీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. మంత్రాలయం మండలం వగరూరులో ఉన్న 80 సెంట్లు పొలం తగాదా ఘర్షణకు దారి తీసింది. దాంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పీఎస్‌కు తరలించారు. -
‘నాన్నా... నాకు ఊపిరి ఆడటం లేదు’
సాక్షి,కర్నూలు: దేవనకొండలో మానవత్వాన్ని మంటగలిపే దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ తండ్రి తన ఎనిమిది నెలల పసికందును నీటి డ్రమ్ములో ముంచి హత్య చేశాడు. తండ్రి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయిన ఆ చిన్నారి చివరి శ్వాస... ఊహించుకుంటేనే గుండె ద్రవించిపోతుంది. ‘నాన్నా... నాకు ఊపిరి ఆడటం లేదు’ అనే మాటలు చెప్పలేని వయసులో ఉన్నా, ఆ అమాయక బిడ్డ బాధ ప్రతి ఒక్కరి మనసును చివుక్కుమనిపిస్తోంది.పోలీసుల వివరాల మేరకు.. దేవనకొండకు చెందిన నరేష్ గురువారం పొలంలో తన ఎనిమిది నెలల కుమారుడిని నీటిడ్రమ్ములో ముంచి ప్రాణాలు తీశాడు. అనంతరం పోలంలో ఉన్న భార్య శ్రావణిని తీవ్రంగా గాయపరిచాడు. అప్రమత్తమైన బాధితురాలి అత్తమామలు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రావణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నరేష్‌కు నేరచరిత్ర ఉంది. ఇప్పటికే మొదటి భార్య హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. అయితే, నరేష్ తల్లిదండ్రులు అతడికి రెండో వివాహం జరిపించారు. కానీ వివాహం జరిగిన కొద్దికాలానికే నరేష్ తన రెండో భార్య శ్రావణిపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంపై భార్య,భర్తల మధ్య గొడవలు జరిగేవి.ఈ క్రమంలో భార్య శ్రావణిని హతమార్చేందుకు నరేష్ కుట్ర చేశాడు. ఇందులో భాగంగా ఇవాళ కుటుంబసభ్యులతో కలిసి పొలం వెళ్లిన నరేష్ ఘాతుకానికి ఒడిగట్టాడు. నెలల పసికందును నీటి డ్రమ్ములో ముంచి ప్రాణాలు తీశాడు. ఆపై భార్యపై మారణాయుధాలతో తెగబడ్డారు. నిందితుది దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ధర లేక దిగాలు
చంద్రబాబు కూటమి సర్కారు బహిరంగంగానే దళారులకు వత్తాసు పలుకుతోంది. ఫలితంగా అటు ఉల్లి, టమాటా, చీనీ రైతులకు పంట కోత ఖర్చులు సైతం రాని దుస్థితి నెలకొనగా, ఇటు బహిరంగ మార్కెట్లో మాత్రం అధిక ధరల మోత మోగుతోంది. రైతు బజార్లలో సైతం ఉల్లి, టమాటా ధరలు మండిపోతున్నాయి. ఇదేం వైపరీత్యం అంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు రైతులు, ఇటు వినియోగదారులకు ఏమాత్రం మేలు జరగకపోగా మధ్య దళారులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు. అయినా ప్రభుత్వం చోద్యం చూస్తోందంటే.. ఇది దళారి రాజ్యం కాక మరేమవుతుంది?సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, ఇంటర్నేషనల్ కేపిటల్.. ఎయిర్పోర్ట్, ఐకానిక్ బ్రిడ్జ్లంటూ పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెబుతూ డాబుసరి మాటలతో కాలం గడుపుతున్న చంద్రబాబు కూటమి సర్కారు కనీస విషయాలను గాలికొదిలేసి అటు రైతులు, ఇటు ప్రజలను నిలువునా ముంచేస్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా దళారులకు వంత పాడుతోంది. ఫలితంగా గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రైతులు పండించిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కరువైంది.మిరప మొదలుకొని టమాటా వరకు ఏ పంటకూ మద్దతు ధర దక్కక రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షాభావం, అధిక వర్షాలు వంటి ప్రతికూల పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులు ఆదిలోనే ధరలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అదునుకు విత్తనాలతో పాటు యూరియా అందించడంలో విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ధరలు పతనమైనప్పుడు మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోకుండా అసలేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది.సీజన్ ఆరంభంలోనే ఉల్లితో పాటు టమాటా, బత్తాయి (చీనీ) పంటలకు మద్దతు ధర దక్కక రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఉల్లి, టమాటా రైతులకు కిలోకు రూ.5–8 కూడా దక్కని దుస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్లో మాత్రం కిలో ఉల్లి రూ.25–35.. టమాటా రూ.50కి పైగానే పలుకుతోంది. చీనీ రైతుకు కిలోకు రూ.10 లోపే అందుతుండగా.. మార్కెట్లో మాత్రం రూ.50 పలుకుతోంది.పరిస్థితి ఇంత దారుణంగా మారడంతో కష్టాల సుడిగుండం నుంచి ఎలా బయట పడాలో తెలియక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కర్నూలు జిల్లాలో ఇద్దరు ఉల్లి రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. చావు బతుకుల మధ్య కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.మూణ్ణాళ్ల ముచ్చటగా ఉల్లి కొనుగోళ్లుఉల్లి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఆదిలోనే చేతులెత్తేసింది. కర్నూలు మార్కెట్‌కు వస్తున్న ఉల్లిని క్వింటా రూ.400–500కు మించి కొనే పరిస్థితి లేకపోవడంతో పలువురు రైతులు పంటను మేకలు, గొర్రెలకు మేతకు వదిలేశారు. మరికొంత మంది రైతులు మార్కెట్‌కు తెచ్చిన ఉల్లిని మద్దతు ధర లేదని తెలుసుకుని రోడ్ల పక్కన పారబోసిపోతున్నారు. ఉల్లి రైతుల వెతలపై ఇటీవల ‘సాక్షి‘లో ప్రచురితమైన వరుస కథనాల నేపథ్యంలో చంద్రబాబు నేరుగా సమీక్ష చేసి క్వింటా రూ.1200 చొప్పున కొనుగోలు చేస్తామని గొప్పగా ప్రకటించారు.రైతులు గిట్టుబాటు కాదని మొత్తుకున్నా అదే ధర ఇచ్చారు. రైతులు మార్కెట్‌కు తెచ్చే పంటకు ధర పెరిగే వరకు ఇదే ధరతో కొనుగోలు చేయాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ ధరకు కూడా మూడు రోజుల పాటు తూతూ మంత్రంగా కొంత మేర మాత్రమే పంట కొనుగోలు చేసి.. తర్వాత చేతులెత్తేశారు. దీంతో ఉల్లికి కనీస మద్దతు ధర కల్పన మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయింది. రోడ్డునపడ్డ టమాటా మరో వైపు టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. సగటున కిలోకు రూ.8 కూడా రావడం లేదు. మార్కెట్ ధర మాత్రం భగ్గుమంటోంది. రైతు బజార్లలోనే రూ.35–40తో అమ్ముతున్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలిలో టమాటా రైతులు రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రోడ్డు పక్కన పారబోసి పోయారు. డోన్, గుత్తి, అనంతపురం, ప్యాపిలి, పత్తికొండ ప్రాంతాల్లో ఈసారి దిగుబడి పర్వాలేదనిపించినా, ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 30–40 వేల బాక్సులు (ఒక్కో బాక్స్‌లో 25 కిలోలు) ప్యాపిలి మార్కెట్‌కు వస్తుంటాయి.అంటే రోజుకు 500 నుంచి 1,000 టన్నుల వరకు సరుకు వస్తుంది. శుక్రవారం బాక్స్ రూ.150 పలికింది. అంటే కిలో రూ.6కు మించి పలకలేదు. దీంతో రైతులు తెచ్చిన పంటను రోడ్లపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. శనివారం దాదాపు 20 వేల బాక్సులు మార్కెట్‌కు రాగా, రూ.150 చొప్పున ధర లభించింది. అయితే క్వాలిటీని బట్టి నిర్ధారించిన ధరలో తరుగు పేరిట కనీసం 10 శాతం కోత పెట్టి చెల్లిస్తుండడంతో రైతులు వ్యాపారులపై మండిపడుతున్నారు. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లోని టమాటా మార్కెట్లలో శనివారం సగటున కిలోకు రూ.10లోపే ధర లభించింది.బత్తాయి రైతు డీలాబత్తాయి రైతుల పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు. వైఎస్సార్ కడపతో పాటు అనంతపురం జిల్లాల్లో బత్తాయికి కనీస మద్దతు ధర దక్కడం లేదు. వైఎస్సార్ జిల్లాలో ఫస్ట్ క్వాలిటీ బత్తాయికి మాత్రమే క్వింటాకి రూ.1,520 దక్కుతుండగా, రెండో రకానికి రూ.900, థర్డ్ క్వాలిటీకి రూ.600కు మించి ధర లభించడం లేదు. అనంతపురం మార్కెట్లో ఫస్ట్ రకానికి రూ.1,600 దక్కుతుండగా, సెకండ్ క్వాలిటీకి రూ.1,200, థర్డ్ క్వాలిటీకి రూ.600–800 మధ్య ధర పలుకుతోంది.మార్కెట్‌కు వచ్చే బత్తాయిలో మూడింట రెండొంతుల సరుకుకు క్వాలిటీ లేదనే సాకుతో క్వింటా రూ.600–800కు మించి చెల్లించని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఏ పట్టణంలో చూసినా బహిరంగ మార్కెట్లో బత్తాయి కిలో రూ.50కి తక్కువ లేదు. కానీ రైతుకు మాత్రం కిలోకు రూ.6–8 మధ్యే ధర లభించడం ఆందోళన కలిగిస్తోంది. వచ్చింది 20 వేల క్వింటాళ్లు.. కొన్నది 4 వేల క్వింటాళ్లేప్రభుత్వ ఆధ్వర్యంలో ఉల్లి క్రయవిక్రయాలు జరిగే ఏకైక మార్కెట్ కర్నూలు మాత్రమే. రాష్ట్రంలో పండించే ఉల్లిలో 90 శాతం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. ప్రతి లాట్‌కు వ్యాపారులు ఈ–నామ్లో ధరలు కోట్ చేస్తారు. ఎవరు ఎక్కువ ధర వేస్తే వారికి లాట్ ఇస్తారు. ఉదాహరణకు క్వింటాకు రూ.800 ధర లభిస్తే.. మద్దతు ధరతో గ్యాప్ అమౌంటు రూ.400 ప్రభుత్వం రైతుల ఖాతాలకు విడుదల చేయాలి. అయితే ప్రభుత్వమే నేరుగా మార్క్‌ఫెడ్ ద్వారా రూ.1,200 ధరతో కొనుగోలు చేస్తే రైతులకు కమీషన్ భారం తగ్గుతుంది. ప్రభుత్వం చేతులెత్తేయడంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు దిక్కు లేకుండా పోయింది.దీంతో క్వింటా ఉల్లిని దళారులు రూ.400 ధరతో కొనేందుకు ముందుకొచ్చారు. ఈ ధరతో అమ్మితే ఎకరం పంటకు వచ్చే మొత్తం రూ.16 వేలు మాత్రమే. పెట్టుబడి మాత్రం ఎకరాకు రూ.80 వేలు అయ్యింది. ఈ లెక్కన పెట్టుబడిలో 20 శాతం కూడా రావడం లేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. శనివారం 302 మంది రైతులు 20 వేల క్వింటాళ్ల ఉల్లిని మార్కెట్‌కు తెచ్చారు. ప్రభుత్వ అనధికార ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్ ద్వారా ఉల్లి కొనుగోళ్లు ఆపేసింది. దీంతో వ్యాపారులు కేవలం 54 లాట్లకు సంబంధించిన 4,127 క్వింటాళ్లకు మాత్రమే తక్కువ ధరతో టెండర్లు వేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై రైతులు కర్నూలు మార్కెట్ యార్డు ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.అయ్యో ఎంత కష్టం.. ఎంత నష్టం!కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం ఎరుకలచెరువు గ్రామానికి చెందిన మొలక బజారి అనే రైతు రెండు ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశాడు. చీడపీడల నుంచి కంటికి రెప్పలా కాపాడుకుని పంట పండించాడు. పంట కోశాక.. మార్కెట్లో కనీసం కిలోకు రూ.5–6 కూడా రావడం లేదని తెలుసుకుని ఆందోళనకు గురయ్యాడు. రవాణా ఖర్చులు కూడా దండగ అని భావించి పంటను పొలంలోనే వదిలేయడంతో గొర్రెలకు ఆహారంగా మారింది. పంటసాగు కోసం పెట్టిన పెట్టుబడులు మట్టిలో కలిసిపోయాయి. – కృష్ణగిరివైఎస్ జగన్ హయాంలో అన్నదాతకు భరోసా⇒ వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడమే కాకుండా, ధర లేని ప్రతీసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకొని ఆ పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఉల్లికి కనీస మద్దతు ధరను ప్రకటించింది. ⇒ బహిరంగ మార్కెట్లో ధర లేని సమయంలో ప్రభుత్వమే దాదాపు రూ.65 కోట్లు ఖర్చు చేసి దాదాపు 9025 టన్నుల ఉల్లిని సేకరించింది. ఈ ఉల్లిని రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ధరలపై విక్రయించి అటు రైతులకు, ఇటు వినియోగదారులకు అండగా నిలిచింది. మరో వైపు ధరలు పెరిగిన సందర్భాల్లో షోలాపూర్ మార్కెట్ నుంచి ఉల్లి కొనుగోలు చేసి, సబ్సిడీపై రైతు బజార్ల ద్వారా సరఫరా చేసి వినియోగదారులకు ఊరట కలిగించింది.⇒ ఇదే రీతిలో దాదాపు రూ.5.50 కోట్ల విలువైన 4,109 టన్నుల బత్తాయిని కొనుగోలు చేసి డ్వాక్రా సంఘాల సభ్యులకు సబ్సిడీ ధరకు పంపిణీ చేయించింది. రూ.18.02 కోట్ల విలువైన 8,460 టన్నుల టమాటాను సైతం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది.⇒ ఇలా ఐదేళ్లలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796.47 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి అన్నదాతకు భరోసా కల్పించింది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం కొనుగోలు చేసింది.ఉల్లి.. సర్కారు లొల్లి⇒ సీఎం డౌన్ డౌన్ అంటూ అన్నదాతల రాస్తారోకో ⇒ క్వింటాకు రూ.1,200 అని మాట తప్పిన ప్రభుత్వం⇒ మద్దతు ధర కల్పించకపోవడంపై వెల్లువెత్తిన ఆగ్రహం⇒ మద్దతు పలికిన వైఎస్సార్సీపీ నేతలుకర్నూలు (అగ్రికల్చర్) : కూటమి ప్రభుత్వం ఉల్లిని మద్దతు ధరతో కొనుగోలు చేయలేక చేతులెత్తేయడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కర్నూలులో వందలాది మంది రైతులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. మార్కెట్ యార్డు ఎదురుగా ప్రధాన రహదారిలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించడం లేదంటూ రోడ్డుపై ఉల్లిపాయలు పారబోసి బైఠాయించారు. ఇటు ప్రభుత్వం మద్దతు ధరకు కొనక పోవడం, అటు వ్యాపారులు సైతం రేటు పెంచక పోవడంతో అన్నదాతలు తీవ్రంగా మండిపడ్డారు. మద్దతు ధరతో కొనుగోళ్లకు ప్రభుత్వం మంగళం పాడడంతో వ్యాపారులు కొనడానికి ముందుకు రాలేదు.36 మంది వ్యాపారులు ఉండగా.. కేవలం 10 మంది మాత్రమే అదీ క్వింటా రూ.600తో కొనుగోళ్లు చేపట్టారు. దీంతో రైతులు రోడ్డుపై బైఠాయించి సీఎం డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. కూటమి పార్టీలకు ఓట్లు వేసి గెలిపించినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నామని ధ్వజమెత్తారు. రైతుల ఆందోళనకు వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి మద్దతు పలికారు. రైతులతో పాటు రోడ్డుపై బైఠాయించి ఉల్లి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ప్రభుత్వ ప్రకటనతో తీవ్ర వ్యయ ప్రయాసలకు లోనై మార్కెట్‌కు వచ్చిన తర్వాత కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి ఏమిటని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. క్వింటా రూ.2500తో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఉల్లిని ప్రభుత్వం కొనలేదు.. వ్యాపారులతోనే కొనిపించండి’ అంటూ ప్రభుత్వం మార్కెట్ కమిటీకి ఆదేశాలు ఇవ్వడాన్ని బట్టి చూస్తే రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం అవుతోందన్నారు. కాగా, ఆదివారం కొనుగోళ్లు కొనసాగేలా చర్యలు తీసుకుంటామని మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు.చెప్పేదొకటి.. చేస్తోంది మరొకటికర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ఈర్లదిన్నె గ్రామానికి చెందిన జమ్మన్న మూడు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. ఎకరాకు పెట్టుబడి రూ.లక్ష వరకు పెట్టారు. ప్రభుత్వం క్వింటా రూ.1,200 చొప్పున కొంటుందని ప్రకటించడంతో మార్కెట్‌కు 249 ప్యాకెట్ల ఉల్లి తెచ్చారు. ఈ ధరతో కాదు కదా.. ఇందులో సగం ధరతో కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇక్కడికొచ్చిన రైతులందరిదీ ఇదే దుస్థితి. ఎవరిని కదిలించినా ఈ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేస్తోంది మరొకటని కన్నీటిపర్యంతమవుతున్నారు.అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతుల ఆత్మహత్యవెల్దుర్తి/రుద్రవరం: రాష్ట్రంలో అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. శనివారం వేర్వేరు చోట్ల ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎస్.పేరేములకు చెందిన ముంత మద్దిలేటి(50) తన 2 ఎకరాలతో పాటు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకుని కంది పంట సాగు చేస్తున్నాడు. పెట్టుబడుల కోసం మొత్తం రూ.6 లక్షలు అప్పులు చేశాడు. గతేడాది పత్తి, ఆముదాలు వేసి దిగుబడి రాక, గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాడు. ఈ నేపథ్యంలో అప్పులు తీర్చే దారి కానరాకపోవడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.ఇదిలా ఉండగా, నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కోటకొండకు చెందిన జంగిటి నారాయణ(46) తన ఐదెకరాలకు తోడు, మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా దిగుబడులు సరిగా రాక, వచి్చనా ప్రభుత్వం గిట్టబాటు ధర కలి్పంచకపోడంతో రూ.20 లక్షల దాకా అప్పు అయ్యింది. దీంతో తీవ్ర మనోవేదనతో గతనెల 28న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.ఇద్దరు ఉల్లి రైతుల ఆత్మహత్యాయత్నంసి.బెళగల్: ఉల్లి పంటకు కనీస ధర కూడా దక్కని దుస్థితిలో కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్‌లో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు యత్నించారు. గ్రామంలోని బీసీ కాలనీలో నివాసముంటున్న గుండ్లకొండ కృష్ణ (34) తన రెండెకరాల పొలంలో ఉల్లి సాగు చేశాడు. ఒక ఎకరంలో 120 బస్తాల పంట గత వారం చేతికి వచ్చింది. అయితే మార్కెట్లో కనీస మద్దతు ధర లభించడం లేదని తెలిసి ఆవేదన చెందాడు. అప్పటికే పెట్టుబడికి చేసిన అప్పులు అధికమవడంతో మరో ఎకరంలోని పంట కోత చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పొలంలోనే వదిలేశాడు. దాదాపు రూ.8 లక్షల వరకు అప్పులు పెరగడంతో తీవ్ర మనస్తాపం చెందాడు.ఇదే గ్రామానికి చెందిన మరో రైతు వెంకట్‌నాయుడు (25) తనకున్న రెండు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశాడు. ఎకరం పంట కోతకు రావడంతో గత వారం కోతలు చేపట్టి, తన సమీప బంధువు కృష్ణ దిగుబడులు ఉంచిన దగ్గరే నిల్వ చేశాడు. ధరలు లేక మరో ఎకరం పొలంలో కోతకు వచ్చిన పంటను అలానే వదిలేశాడు. ఇప్పటికే దాదాపు రూ.6 లక్షల వరకు అప్పులు ఉండగా, పంట నష్టాలతో రూ.7 లక్షలకు పైగా అప్పులు పెరుగుతున్న నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు.సీఎం చంద్రబాబు ఉల్లి రైతులను ఆదుకోవడం లేదని అందుకే తాము ప్రాణాలు తీసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అనంతరం పురుగుల మందు తాగారు. ఇరు కుటుంబాల వారు బాధితులిద్దరినీ వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి బాధిత రైతులను శనివారం ఆస్పత్రిలో పరామర్శించారు. -
గణేష్ నిమజ్జనాలకు కర్నూల్ ముస్తాబు
-
సుగాలి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించిన వరుదు కల్యాణి
-
ఉల్లి రైతుల గోడు పట్టదా చంద్రబాబూ: ఎస్వీ మోహన్‌రెడ్డి
సాక్షి, కర్నూలు: ఉల్లి పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ తీవ్రంగా విఫలమైందని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కర్నూలు మార్కెట్ యార్డ్‌ను సందర్శించి కనీస ధర లేక అల్లాడుతున్న ఉల్లి రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా పలువురు ఉల్లి రైతులు తమ కష్టాలను ఆయనకు వివరించారు.వారం రోజులుగా మార్కెట్లో పంటను తెచ్చిపెట్టామని, వ్యాపారులు, దళారులు నామమాత్రపు రేటు చెబుతున్నారని, కొనేవారు లేక రోజుల తరబడి మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నామంటూ రైతులు వాపోయారు. రైతులకు వైఎస్సార్సీపీ తరుఫున అండగా ఉంటామని, ఈ ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే ఉల్లి కొనుగోళ్ళు జరిగేలా చూస్తామని ఈ సందర్బంగా ఆయన హామీ ఇచ్చారు. ఉల్లి రైతులతో కలిసి ప్రభుత్వం తక్షణం స్పందించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కర్నూలు మార్కెట్ యార్డ్‌లో ఉల్లి రైతులు తమ పంటను అమ్మకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గతంలో క్వింటా రూ.3 వేల నుంచి రూ.5 వేల రేటు పలికేది. తక్కువ నాణ్యత ఉన్న పంట క్వింటా కనీసం రూ.1800 నుంచి రూ.2000 పలికేది. కానీ ఈ ఏడాది వంద రూపాయలు కూడా పలకడం లేదు. రైతులకు ఒక్కో ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతోంది. ఎకరాకు వంద క్వింటాళ్ళు దిగుబడి వస్తే, క్వింటాకు రూ.100 చొప్పున కనీసం రూ.10 వేలు కూడా వారికి దక్కడం లేదు. ఒక్కో రైతు దాదాపుగా లక్ష రూపాయలు ఎకరానికి నష్టపోతున్నారు...వారం రోజుల నుంచి ఒక్కో రైతు ఉల్లిగడ్డలతో వచ్చి కొనేవారు లేక నిరీక్షిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ ఏ పంటకైనా రేటు లేకపోతే ప్రభుత్వం తరుఫు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కనీసం రైతును పరామర్శించే వారు లేరు. అప్పులు చేసి ఉల్లి సాగు చేసిన రైతులు, అప్పుల తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. దయచేసి రైతులు ఇటువంటి పనులు చేయవద్దని, వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుందని తెలియచేస్తున్నాం...రైతులకు కష్టం వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? గతంలో మిర్చి, మామిడి, పొగాకు ఇలా ఆయా పంటల కోసం రైతుల కోసం వైఎస్ జగన్ నిలబడ్డారు. వైఎస్సార్సీపీ తరుఫున దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్ప వారిలో చలనం రాలేదు. నేడు కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకు రైతుల గోడు పట్టదా? కనీసం మార్కెట్ యార్డ్‌కు వచ్చి రైతు కష్టాన్ని తెలుసుకునే తీరిక కూడా వారికి లేదా? బయట మార్కెట్లో కిలో ఉల్లి రూ.30కి అమ్ముతున్నారు. కానీ రైతుల నుంచి మాత్రం క్వింటా రూ.100కి కొంటామని వ్యాపారులు చెబుతుంటే ఎలా ఉపేక్షిస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. తక్షణం ప్రభుత్వం స్పందించి, మద్దతుధరకు ఉల్లి కొనుగోళ్ళు చేపట్టాలి. లేనిపక్షంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. -
చిన్నారుల మృతి పట్ల YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి విచారం
-
టీడీపీ నేతల ఇసుక దోపిడీ పై ఎమ్మెల్యే విరుపాక్షి ఫైర్
-
బహిరంగంగా క్షమాపణ చెప్పు ఎమ్మెల్యే దగ్గుపాటి పై కర్నూల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్
-
వ్యభిచార ముఠా గుట్టు రట్టు!
కర్నూలు: హైటెక్ పద్ధతిలో వ్యభిచారం నడుపుతున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఆన్లైన్లో యువకులకు యువతుల ఫొటోలు పంపి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. కర్నూలు శివారు గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని ఓ ఇంట్లో కొన్ని నెలలుగా గుట్టుగా వ్యభిచారం సాగుతున్నట్లు సమాచారం అందడంతో నాల్గవ పట్టణ సీఐ విక్రమ సింహా, ఎస్ఐలు చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ కిషోర్ రెడ్డిలు స్థావరంపై దాడి చేసి నిర్వాహకులతో పాటు విటులను అరెస్టు చేసి కటకటాలకు పంపారు. అరెస్టయిన వారిలో 9 మంది నిర్వాహకులు, నలుగురు విటులు ఉన్నారు.విజయవాడ, అనంతపురం, హైదరాబాదు, నంద్యాల ప్రాంతాల నుంచి యువతులు, మహిళలను తీసుకువచ్చి వ్యభిచార రొంపిలోకి దింపి వ్యాపారం సాగించేవారు. అమ్మాయిల ఫొటోలను వాట్సాప్‌లో పంపి విటులను ఆకర్షిస్తూ కొంతకాలంగా వ్యాపారం సాగిస్తూ వారిపై వచ్చే ఆదాయాన్ని నిర్వాహకులు వనరుగా మార్చుకున్నారని విచారణలో బయటపడింది. కల్లూరుకు చెందిన ఆళ్ల మధుసూదన్, నందికొట్కూరులోని మద్దూరు సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ రజాక్, కర్నూలు షరీన్ నగర్‌కు చెందిన ఆరెపోగు శేఖర్, బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురానికి చెందిన అరిగెల శ్రీనివాసులు, కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన సుజాత, కర్నూలు సంతోష్ నగర్‌కు చెందిన గూగుల్రోజ్ సైలు, నంద్యాల జిల్లా బనగానపల్లె ఈద్గా నగర్‌కు చెందిన షేక్ మాబున్ని, విజయవాడ హనుమాన్ నగర్‌కు చెందిన పులిపాక లక్ష్మి, కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన పోలిరెడ్డి భార్య అన్యం నారాయణమ్మ కలసి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిర్వాహకులతో పాటు విటులు కురువ రవిబాబు, బింగి బాల అంకన్న, జయకృష్ణ, మిఠాయి పరుశురాం లాల్ తదితరులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. నిర్మాణుష్య ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఇలాంటి వ్యభిచార గృహాలు నిర్వహిస్తారని, ఇంటి యజమానులు వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఇల్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా వ్యభిచార కార్యకలాపాలు సాగుతుంటే డయల్ 112 లేదా 91211 01062 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. -
టీడీపీ రౌడీల దాడి పై కర్నూల్ DIG వ్యాఖ్యలు ఏకిపారేసిన పేర్ని నాని
-
మేము లేకపోతె తలలు ఎగిరిపోయేవి.. కర్నూల్ DIG వివాదాస్పద వ్యాఖ్యలు
-
మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా కర్నూలులో ధర్నా
-
మంత్రి టీజీ భరత్ ఇలాకాలో కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
సాక్షి,కర్నూలు: మంత్రి టీజీ భరత్ ఇలాకాలో కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలింది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు సత్తా చాటారు. దీంతో ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.నేడు నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి వైఎస్సార్సీపీకి చెందిన ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి పోటీ లేకపోవడంతో వైఎస్సార్సీపీ నేతలే ఏక గ్రీవమయ్యారు. ఓటమి భయంతో టీడీపీ కార్పోరేటర్లు పోటీ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న కాని రెండవసారి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు వర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బీటెక్ చదవొద్దన్నందుకు భర్తపై కేసు
నంద్యాల: బీటెక్ చదవొద్దన్న భర్తపై భార్య పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనపై ఆదోని త్రీటౌన్ ఎస్ఐ రామస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో ఎంఐజీ కాలనీకి చెందిన వర్షితకు మేనత్త కొడుకు అయిన బనగానపల్లికి చెందిన ఓంప్రకాష్‌తో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. దంపతులు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. సంతానం లేదు. వర్షిత హైదరాబాదులో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. వర్షితను చదువు మాన్పించేందుకు భర్త ఒత్తిడి తెచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన వర్షిత ఆదోనిలోని పుట్టింటికి చేరుకుంది. ఘటనపై బుధవారం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె భర్తను పిలిపించి ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చినా కూడా భార్యను చదివించేందుకు ఓంప్రకాష్ ఒప్పుకోలేదు. దీంతో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త ఓంప్రకా‹Ùపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కర్నూలులో చిరుత టెన్షన్
సాక్షి, కర్నూలు: చిరుత సంచారంతో కౌతాళం మండలం తిప్పలదొడ్డి గ్రామ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. దానిని పట్టుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ క్రమంలో..జనసంచారం నుంచి పోలాల్లోకి వెళ్ళే క్రమంలో కోల్మాన్ పేటకు చెందిన లక్ష్మయ్య అనే యువకుడిపై చిరుత దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో గాయపడిన లక్ష్మయ్య ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చిరుతను బంధించేందుకు ప్రత్యేక బోనులు ఏర్పాటు చేసినట్లు ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. -
బ్యాంకు ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం.. చివరికి..!
కర్నూలు: కర్నూలు టీజే మాల్లో ఉన్న కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమలరావు దారుణానికి ఒడిగట్టాడు. గద్వాల రాజవీధిలో ఉంటున్న ప్రైవేటు సర్వేయర్ గంట తేజేశ్వర్ (32)ను వివాహేతర సంబంధంతో హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. తిరుమలరావు అదే బ్యాంకులో పనిచేసే కల్లూరుకు చెందిన చిరుద్యోగితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అలాగే కూతురుతో కూడా వివాహేతర సంబంధం కొనసాగించే ప్రయత్నం చేశాడు. అప్పటికే గద్వాలకు చెందిన తేజేశ్వర్‌ను ఆ యువతి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సర్వేయర్‌ను హత మార్చాలని యువతి తల్లితో కలిసి తిరుమలరావు పథకం పన్నాడు. ల్యాండ్ సర్వే చేయించాలని స్నేహితుల ద్వారా తేజేశ్వరరావును కర్నూలుకు రప్పించి రహస్య ప్రాంతంలో హత్య చేసి పాణ్యం సమీపంలోని పిన్నాపురం రస్తాలో పడేశారు. అయితే సర్వేయర్ తేజేశ్వర్ కనిపించకపోవడంతో అతని సోదరుడు తేజవర్థన్ ఐదు రోజుల క్రితం గద్వాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందం శనివారం కర్నూలుకు వచ్చి విచారించారు. బ్యాంకు మేనేజర్ తిరుమలరావుకు సంబంధించిన స్నేహితులను అదుపులోకి తీసుకొని కర్నూలు మూడో పట్టణ పోలీసుల సహకారంతో దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు వద్ద తేజేశ్వర్ మృతదేహం ఉన్నట్లు గుర్తించి పాణ్యం పోలీసుల సహయంతో మృతదేహాన్ని వెలికి తీసి ఆదివారం పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి గద్వాల పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. హత్య కుట్రకు వెనుక మరి కొందరి హస్తం ఉన్నట్లు గద్వాల పోలీసులు భావించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.గొంతు కోసి.. మృతదేహాన్ని పడేసి పాణ్యం: తేజేశ్వర్‌ను అత్యతం కిరాతకంగా హత్య మార్చారని పాణ్యం ఎస్ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు. కారులోనే తేజేశ్వర్‌ను గొంతు కోసి హత్య చేశారని, నన్నూరు టోల్‌ప్లాజా మీదుగా పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద పిన్నాపురం రస్తాలో పడేశారన్నారు. కారులో వచ్చిన వ్యక్తుల వివరాలు తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. కారు కోసం గద్వాల్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా.. పోలీసులు అదుపులో ముగ్గురు వ్యక్తులు ఉండగా మరో కీలక వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. -
మరో హనీమూన్ మర్డర్?: తెలుగు రాష్ట్రాల్లో కలకలం.. పెళ్లైన నెల రోజులకే భర్త హత్య?
సాక్షి,కర్నూల్: మేఘాలయ హనీమూన్ మర్డర్ (meghalaya honeymoon case) తరహాలో.. తెలుగు రాష్ట్రాల్లో మరో హనీమూన్ మర్డర్ కలకలం రేపుతోంది. పెళ్లైన నెలరోజులకే, కొత్త పెళ్లి కొడుకు దారుణంగా హతమయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది బాధితుడి భార్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.11 రోజులకే హనీమూన్ పేరుతో ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi)తన భర్త రాజా రఘువంశీని (raja raghuvanshi) మేఘాలయాలో హతమార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ హనీమూన్ హత్య ప్రణాళికా హత్యా? లేక పాతకక్షల కారణంగా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాలో అదృశ్యమైన యువకుడు నంద్యాల జిల్లా పాండ్యంలో హత్యకు గురయ్యాడు. మహబూబ్ నగర్ పట్టణం ఘంటవీధికి చెందిన జి.తేజేశ్వర్ లైసెన్స్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17నుంచి తేజేశ్వర్ కనపకడపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేజేశ్వర్ నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురంలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తేజేశ్వర్‌కు కర్నూల్ చెందిన యువతితో వివాహం జరిగింది. నిందితుల్ని గుర్తించిన కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.మే 18న బీచ్పల్లిలో తేజేశ్వర్‌కు కర్నూలు జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన రోజుల వ్యవధిలో భర్త తేజేశ్వర్ హత్యకు గురికావడం కలకలం రేపింది. తేజేశ్వర్ హత్యపై అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
అటు పీడీసీ మందుల దందా ఇటు నకిలీల జోరు!
కర్నూలు(హాస్పిటల్): పీడీసీ(ప్రాపగండ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) మందులను కొన్ని మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నారు. వాటిపై భారీగా ఎంఆర్పీలు ముద్రించి.. డిస్కౌంట్లు సైతం భారీగా ఇస్తున్నట్లు హంగామా చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు వేలకు పైగా రిటైల్, హోల్‌సేల్ మెడికల్ షాపులు ఉన్నాయి. ఇందులో కర్నూలు నగరంలోనే అధికంగా ఉన్నాయి. ఇక్కడి నుంచే హోల్‌సేల్ దుకాణాల ద్వారా జిల్లాలోని నలుమూలల్లో ఉండే రిటైల్ దుకాణాలకు మందులు వెళ్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో సొంతంగా మందులు తయారు చేయించుకుని విక్రయించే విధానం తెరపైకి వచ్చింది. అంటే మార్కెట్లో లభించే బ్రాండెడ్ మందులే గాకుండా మందులు తయారు చేసే కంపెనీలతో మాట్లాడుకుని వారికి అవసరమైన ఔషధాలను తయారు చేయించుకుని విక్రయించుకునే అవకాశం వచ్చింది. నాణ్యత అనుమానమే! పీడీసీ(ప్రాపగండ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) మందులను ఆయా ఫార్మాకంపెనీలతో మాట్లాడుకుని తయారు చేయించుకోవచ్చు. వాటిపై ఎంఆర్పీలు అవి తయారు చేయించుకునే వారి ఇష్టం. వాటిపై ఎంతైనా వేసుకోవచ్చు. ఎంతంటే బ్రాండెడ్ మందుల కంటే అధికంగా ఉండేటంత. ఏదైనా ఔషధాన్ని కనిపెట్టాలంటే సదరు ఫార్మా కంపెనీ ఎన్నో సంవత్సరాలు కష్టపడి తయారు చేస్తుంది. ఈ మేరకు కొన్ని నిర్ణీత సంవత్సరాల పాటు ఆ మందుకు పేటెంట్ తీసుకుంటుంది. ఆ పేటెంట్ కాలం ముగిసిన తర్వాత ఆ మందు ఫార్ములా తీసుకుని ఎవ్వరైనా తయారు చేసుకోవచ్చు. ఇతర బ్రాండెడ్ కంపెనీలతో పాటు ఊరు పేరు తెలియని కంపెనీలు కూడా మందులు తయారు చేసి జనంపైకి వదులుతున్నాయి. ఈ మేరకు భారీగా మందులపై ఎంఆర్పీలు ముద్రించి దోచుకుంటున్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొన్ని ప్రధాన దుకాణాల్లో మందుల కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. కానీ వైద్యులకు అటాచ్డ్గా ఉన్న మందుల దుకాణాల్లో లభించే ఈ పీడీసీ మందులపై ఎలాంటి డిస్కౌంట్స్ ఉండవు. పైగా సదరు డాక్టర్ రాసిన మందులు అక్కడ మాత్రమే లభిస్తాయి. అయితే ఈ మందులు ఎంత మేరకు పనిచేస్తాయి. వాటి నాణ్యత ఎంత అనేది ప్రతి దాన్ని ల్యాబ్‌లో పరీక్షిస్తే గానీ తెలియని పరిస్థితి. అ‘ధన’పు లాభాలు ఉదాహరణకు ఒక బ్రాండెడ్ ఔషధం ధర రూ.300లు ఉందంటే...అందులో కంపెనీకి సంబంధించి తయారీ ఖర్చులు, ప్రచార ఖర్చులు, మార్కెటింగ్ ఖర్చులు అన్నీ కలిపి ఉంటాయి. కానీ పీడీసీ కంపెనీకి ఇలాంటి ఖర్చులేమీ ఉండవు. ఆ మందులపై భారీగా తగ్గింపు ఉండాలి. అంటే ఆ ఔషధం రూ.100లోపు ఉండాలి. కానీ పీడీసీ విషయంలో మాత్రం ఆ మందు ధర రూ.400 నుంచి రూ.600 వరకు ఉంటోంది. దీనిని బట్టి ఈ మందులపై ఎంతమేరకు లాభం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు హోల్‌సేల్ ఏజెన్సీలు ఉన్న వారు ఇలాంటి మందులను వైద్యులున్న మెడికల్ షాపులకు పంపేవారు. ఇప్పుడు నేరుగా వైద్యులే ఏజెన్సీలు ఏర్పాటు చేసుకుని ఆ అదనపు లాభాలు కూడా వారే పొందుతున్నారు. కేసులు నమోదు చేశాం మార్కెట్లో లభించే అన్ని మందుల కంపెనీలు అనుమతి తీసుకునే తయారు చేస్తాయి. వాటిపై ఎంఆర్పీలు ఆయా కంపెనీలు ఇష్టం. ఎంఆర్పీలు, డిస్కౌంట్లను ప్రశ్నించలేం. ఎంఆర్పీ కంటే ఎక్కువ విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం. పీడీసీ మందుల నాణ్యతపై తరచూ శాంపిల్స్ తీసి పంపిస్తున్నాం. ఇందులో ఇటీవల నంద్యాలలో రెండు, ఆదోనిలో ఒక శాంపిల్ సబ్ స్టాండర్డ్(నాణ్యతా ప్రమాణాలు లేనివి) అని నివేదికలు వచ్చాయి. ఈ మేరకు ఆయా దుకాణాలు, కంపెనీలపై కేసులు నమోదు చేశాం. –రమాదేవి, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ, కర్నూలుఇలా చేయాలి.. నకిలీ మందుల మోసాలను అరికట్టేందుకు సదరు కంపెనీలు ఇటీవల మందుల స్ట్రిప్‌పై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తున్నాయి. ఈ క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే అవి నకిలీవా అసలువా అనేది తెలిసిపోతుంది.నకి‘లీలలు’ ఒకవైపు పీడీసీ మందుల దందా జోరుగా సాగుతున్న వేళ ఇమిటేషన్ డ్రగ్స్(నకిలీ) కొత్త వ్యాపారాన్ని ప్రారంభమైంది. మార్కెట్లో బాగా పేరున్న బ్రాండ్ల మందులను అచ్చుగుద్దినట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. గతంలో జాన్సన్ కంపెనీకి చెందిన అ్రల్టాసెట్ మాత్రలను విజయవాడ కేంద్రంగా తయారు చేసి తెలుగు రాష్ట్రాల్లో విక్రయించి పట్టుబడ్డారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఓ వ్యక్తి అబాట్ కంపెనీ తయారు చేసిన థైరోనామ్ అనే థైరాయిడ్ టాబ్లెట్లను నకిలీవి తయారు చేసి విక్రయిస్తూ పట్టుబడ్డాడు.ఇటీవల కర్నూలులో ఓ దుకాణంలో సిస్టోపిక్ కంపెనీ గ్యాస్ట్రబుల్ కోసం తయారు చేసిన సైరా–డి అనే క్యాప్సుల్‌ను నకిలీగా తయారు చేశారు. ఎంఆర్పీ మాత్రం తప్పుగా ముద్రించి పట్టుబడ్డాడు. ఇటీవల కాలంలో నకిలీ మందుల వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. అచ్చుగుద్దినట్లు బ్రాండ్‌ను పోలి ఉండటంతో సామాన్య ప్రజలతో పాటు వ్యాపారులు కూడా గుర్తించలేని విధంగా ఆ మందులు ఉంటున్నాయి.భారీగా ఆఫర్లు పీడీసీ మందుల క్రయ విక్రయాలు ఎక్కువ కావడం, పోటీ పెరగడంతో ప్రస్తుతం వాటిపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు. డాక్టర్ అటాచ్డ్ కౌంటర్లలో ఈ మందులు ఎంఆర్పీకి ఇస్తుండగా, కొన్ని కార్పొరేట్ మందుల దుకాణాలు, స్థానిక ఏజెన్సీలు నేరుగా రిటైల్ దుకాణాలు ఏర్పాటు చేసి భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఈ మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, మెడికల్ కాలేజీ, రాజ్‌విహార్, పాతబస్టాండ్, వెంకటరమణ కాలనీ, కొత్తబస్టాండ్ వంటి ప్రాంతాల్లో షాపు బోర్డుపైనే 25శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. పీడీసీ మందులు విక్రయించే దుకాణాలకు సైతం సదరు ఏజెన్సీలు భారీగా ఆఫర్లు ఇస్తున్నాయి. పది స్ట్రిప్పులు కొంటే పది ఫ్రీ అంటూ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. -
నిర్లక్ష్యం.. బుసలు కొడుతోంది!
నాలుగు రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎన్టిఆర్ వైద్యసేవ కార్యాలయంలో పది అడుగుల నాగుపాము కనిపించింది. గది బయట బుసలుకొడుతున్న పామును చూసి ఓ ఉద్యోగికి గుండె ఆగినంత పనయింది. వెంటనే తేరుకొని కేకలు వేయగా చుట్టుపక్క ఉద్యోగులు వచ్చేసరికి ఓ తొర్రలోకి జారుకుంది. దీంతో మళ్లీ అది బయటకు రాకుండా సిమెంట్‌తో ఆ తొర్రను మూసేశారు. ఆసుపత్రిలోని ఓ అధికారి ఛాంబర్లో ఎలుకలు విపరీతంగా వచ్చి ఫైళ్లు పాడుచేసేవి. ర్యాట్ప్యాడ్లు పెట్టినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన కాస్త తెలివిగా ఆలోచించాడు. ఎక్కడికక్కడ బిస్కెట్లను ఏర్పాటు చేయడంతో వాటిని తిన్న ఎలుకలు ఫైళ్ల జోలికి వెళ్లకపోవడం గుర్తించాడు. ఇదేదో బాగుందని అదే ఉపాయాన్ని కొనసాగించారు. ఆసుపత్రిలో చెట్ల నీడ ఉందని వెళ్లి భోజనానికి కూర్చుంటే చాలు పందులు, కోతులు, కుక్కలతో పాటు ఎలుకలు కూడా వస్తున్నాయి. వీటి వల్ల రోగుల సహాయకులు ప్రశాంతంగా నాలుగు ముద్దలు కూడా తినలేని పరిస్థితి. రాత్రయితే చాలు దోమల దండయాత్ర నిద్రను దూరం చేస్తోంది. రాత్రిపూట అటుంచితే.. పట్టపగలే ఆసుపత్రి ఆవరణలో పాములు తిరుగాడుతుండటంతో రోగుల గుండె జారుతోంది. ఎలుకలు పట్టేందుకు బోధనాసుపత్రిలో ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. సమస్య పరిష్కారం కాకపోవడం గమనార్హం.కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు కర్నూలు మెడికల్ కాలేజీ, ప్రాంతీయ కంటి ప్రభుత్వ ఆసుపత్రిలలో పెస్ట్ కంట్రోల్ నిర్వహణను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. ఈ మేరకు బోధనాసుపత్రిలో సైంటిఫిక్ శానిటేషన్ పాలసీ కింద దోమలు, బల్లులు, బొద్దింకలు, ఈగలు, ఎలుకలు, పాములు, ఇతర విషకీటకాల నివారణకు వాడే పెస్టిసైడ్స్‌ను మధ్యాహ్నం వరకు హెల్త్ సూపర్వైజర్ల ఆధ్వర్యంలో ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది. ఎలుకలు, పాములు ఉంటే వాటిని పట్టుకుని సంహరించాలి. ఈ మేరకు నిర్వహణకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నెలకు రూ.5లక్షలు, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో రూ.30వేలు, మెడికల్ కాలేజిలో మరో రూ.30 వేలు కలిపి నెలకు రూ.5.90 లక్షలు, ఏడాదికి రూ.70,80,000 వెచ్చిస్తున్నారు. నిర్వహణ సంస్థలో పది మంది సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆరుగురితో మమ అనిపిస్తుండటం వల్లే విష పురుగులు యథేచ్ఛగా తిరుగాడుతున్నాయని తెలుస్తోంది. పట్టపగలే ఎలుకలు, పాముల సంచారం ఆసుపత్రి, కళాశాల ఆవరణలో రాత్రేమో గానీ ఖాళీ ప్రదేశాల్లో పట్టపగలే ఎలుకలు, పాములు సంచరిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు అవి బయటకు వచ్చి వార్డులు, కార్యాలయ గదుల్లోకి దూరుతున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ గైనిక్ విభాగం, శక్తిసదన్, కంటి ఆసుపత్రిలోని ఖాళీ ప్రదేశాలు, డైట్ విభాగం, దాని పక్కనున్న ఖాళీ ప్రదేశాలు, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రాంతం, సూపర్‌స్పెషాలిటి విభాగం పక్కనున్న ఖాళీ ప్రదేశం, ఐడీ వార్డు, మానసిక వ్యాధుల విభాగం, యుపీ, పీజీ హాస్టల్స్ పరిసరాలు పాములకు నిలయాలుగా మారాయి. ఆయా పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, మొక్కలు ఏపుగా పెరగడంతో ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయి. వీటిని తినేందుకు పాములు వస్తున్నాయి. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వద్ద ఇటీవల నిరుపయోగంగా ఉన్న ఇనుప సామాను అంతా కుప్పపోసి ఉంచారు. వాటిని టెండర్ పాడిన వారు తీసుకెళ్లకపోవడంతో ఆ ప్రాంతంల్లో పాముల సంచారం అధికంగా ఉంటోందని రోగుల సహాయకు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగుల బంధువులు ఆరుబయట భోజనం చేసి, అక్కడే చేతులు కడుక్కోవడంతో మిగిలిపోయిన ఆహారాన్ని తినేందుకు ఎలుకలు, బొద్దింకలు అధికంగా పుట్టుకొస్తున్నాయి. చీకటి పడితే చాలు దోమల బెడద బోధనాసుపత్రిలో రోజూ సాయంత్రం అయితే చాలు దోమలు విజృంభిస్తున్నాయి. వాటి బారి నుంచి రక్షణ పొందేందుకు రోగులు, వారి సహాయకులు మస్కిటో కాయిల్స్, లిక్విడ్స్ వాడుతున్నారు. అన్ని విభాగాల్లో ఈ పరిస్థితి కొనసాగుతోంది. తూతూ మంత్రంగా పెస్ట్‌కంట్రోల్ నిర్వహణఆసుపత్రిలో పెస్ట్ కంట్రోల్ నిర్వహణ తూతూ మంత్రంగా జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్ర మే సంబంధిత ప్రాంతానికి వెళ్లి విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు పాములు, ఎలుకలు, పందికొక్కులు తిరిగే చోటును గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. వీరి పనితీరును బట్టి అధికారులు మార్కులు వేయాల్సి ఉంటుంది. పనితీరు సరిగ్గా లేకపోవడంతోనే ఇటీవల మూడు నెలలుగా బిల్లులకు ఆసుపత్రి అధికారులు బ్రేక్ వేశారు. టెండర్ కాలపరిమితి ముగియడంతో అధికారుల చర్యలకు సైతం కాంట్రాక్టర్ స్పందించడం లేదని సమాచారం. పగలు ఈగలు, రాత్రి దోమల బాధ మా అక్క కూతురు కాన్పు కోసం 16 రోజుల క్రితం గైనిక్ వార్డులో చేర్చాం. ఆమెకు రక్తస్రావం అవుతుంటే ప్రసవం ఆలస్యం అవుతోంది. ఈ క్రమంలో పగలు, రాత్రి వార్డు బయటే వేచి ఉండాల్సి వస్తోంది. ఇక్కడి కారు షెడ్డులో రాత్రివేళ ఉంటున్నాం. ఇక్కడ పగలు ఈగలు, రాత్రి దోమల బాధ భరించలేకున్నాం. ఏదైనా తిందామంటే కూడా తిప్పలే. అందుకనే నెట్ తెచ్చుకొని అందులో ఉంటున్నాం. – అంజలి, నంద్యాల పట్టణంఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం ఆసుపత్రిలో ఎలుకలు పట్టేందుకు అవసరమైన ప్యాడ్లను ఏజెన్సీ వారు తెప్పించారు. పాములు రాకుండా అవసరమైన రసాయనాలు అక్కడక్కడా ఉంచుతున్నారు. ఎక్కడైనా ఎలుకలు, పాములు సంచరిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు -
కూటమి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని MDUఆపరేటర్ల డిమాండ్
-
టీడీపీలో లుకలుకలు.. మంత్రిపై సీనియర్ నేత బహిరంగ విమర్శలు
సాక్షి, కర్నూలు: టీడీపీ నిర్వహిస్తున్న మినీ మహానాడులో పచ్చనేతల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. గురువారం కర్నూలు జిల్లాలో నిర్వహించిన టీడీపీ మినీ మహా నాడులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌పై ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేఈ ప్రభాకర్ ఫైరయ్యారు. కర్నూలు జిల్లా మినీ మహా నాడు కార్యక్రమంలో సభను ఉద్దేశించి మంత్రి టీజీ భరత్‌పై విమర్శలు గుప్పించారు. మహా నాడు సభకు కూడా హాజరు కాలేనంత బిజీ బిజీగా మంత్రి టీజీ భరత్ ఉన్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను పట్టించుకోవటం లేదు , కార్యకర్తలకు న్యాయం జరగాలి లేదంటే నేను ఊరు కోను ముఖ్యమంత్రే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని ఎందుకు దక్కించులేదనే ప్రశ్నకు మంత్రి దగ్గరే సమాధానం లేదని చురకలంటించారు. ఒకటి, రెండు నెలలు చూసి పార్టీ బలోపేతానికి తాను రంగంలోకి దిగుతాను అంటూ కేఈ ప్రభాకర్ హెచ్చరించారు. -
దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా
-
గుడి సేవకులు.. దేవుడిచ్చిన బంధాలు
పల్లకీలోని అమ్మాయి పేరు హిమబిందు. తండ్రి ఆవులశెట్టి చంద్రశేఖరప్ప వస్త్ర దుకాణం నిర్వహిస్తుండగా, తల్లి లక్ష్మీదేవి గృహిణి. బీసీఏ పూర్తి చేసిన ఈమె ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలు. మూడేళ్లుగా తన వంతు సేవగా ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. ఈ అమ్మాయి ఎదురొచ్చి టెంకాయ కొడితే కానీ ఆ బృందం బయలుదేరుతున్న బస్సు కదలదు. అంతటి సెంటిమెంట్. పల్లకీ మోస్తున్నారంటే వాళ్లు సొంత మేనమామలు అనుకుంటే పొరపాటు. గుడి సేవ బృందంలోని సభ్యులు ఎంచుకున్న తోవ ఇది. తమతో పాటు సేవలో పాల్గొనే అమ్మాయిల పెళ్లి సందర్భంగా ఈ ‘పల్లకీ సేవ’ ఇంటి మనుషులుగా సొంత ఖర్చుతో నిర్వహిస్తుండటం విశేషం. కర్నూలు కల్చరల్: అమ్మాయిని ఓ అయ్య చేతిలో పెట్టాలంటే తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండదు. పెళ్లి చూపులు మొదలు.. అప్పగింతల వరకు ఒకటే హడావుడి. కాంక్రీట్ వనాల్లో ఎవరికి వారుగా బతుకున్న రోజుల్లో బంధాలు, బంధుత్వాలు గుర్తుకు తెచ్చుకున్నా కళ్ల ముందు మెదలని పరిస్థితి. సొంతూళ్లకు దూరంగా, సప్త సముద్రాలకు అవతల ఉద్యోగాలు చేస్తున్న వారికి వరుసలు తెలియవు, ఉన్న ఊళ్లో ఎవరిని ఏమని పిలవాలో దిక్కుతోచదు. అలాంటిది పెళ్లి అనగానే.. తల్లిదండ్రుల గుండెలు బరువెక్కుతాయి. అమ్మో.. ఇంత తక్కువ సమయమా? అనే మాట వినపడటం సర్వ సాధారణం. అయితే ముక్కూమొహం తెలియని వాళ్లు, మేమున్నామని భరోసా కల్పిస్తే.. సొంత మేనమామళ్లా హడావుడి చేస్తే.. కుటుంబ సభ్యుల్లో ఒకరిలా మెలుగుతుంటే.. జీవితంలో అంతకంటే సంతోషం ఏముంటుంది. ఈ కోవకు చెందినదే ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’. కార్యక్రమం చేశామా, వెళ్లిపోయామా అన్నట్లు కాకుండా.. ఈ బృందం ఓ కుటుంబంలా మెలుగుతోంది. కష్టాలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ.. సంతోషాలను కలిసి పంచుకుంటున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. వాట్సాప్ గ్రూపులో 1,500 పైనే సభ్యులు మొదట అరకొరగా మొదలైన మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత వాట్సాప్ గ్రూపు దినదిన ప్రవర్దమానంగా వెలుగొందుతోంది. ప్రస్తుతం ఈ గ్రూపులో 1,500 మందికి పైగానే సభ్యులు. ఎంపిక చేసుకున్న గుడి వివరాలను గ్రూపులో తెలియజేసి కార్యక్రమం నిర్వహణలో పాల్పంచుకునేందుకు ఆసక్తి కలిగిన సభ్యుల వివరాలతో జాబితా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత అవసరమైన మేరకు సభ్యులకు అవకాశం కలి్పస్తున్నారు. మరో కార్యక్రమంలో మిగిలిన వారికి ఆ భాగ్యం లభిస్తోంది. ఇప్పటి 123 దేవాలయాల్లో కార్యక్రమం నంద్యాలలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో మొదలైన కార్యక్రమం ఇప్పటి వరకు 123 దేవాలయాల్లో తమ సేవను విస్తరించడం విశేషం. కాశీలోని విశాలక్ష్మి గుడిలో ఏకంగా 9 రోజుల పాటు ఈ బృందం తమ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లకీలో పెళ్లి కూతురు‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలైన హిమబిందు స్వస్థలం నంద్యాల కాగా.. వివాహం ఆదివారం కర్నూలు నగరంలో నిర్వహించారు. వరుడు వీర నవీన్. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వివాహం సందర్భంగా బృందం సభ్యులు సు మారు 150 మంది హాజరయ్యారు. వీరు పల్లకీని తీసుకొచ్చి పెళ్లి మంటపానికి తీసుకొస్తున్న తీరుకు వివాహానికి హాజరైన అతిథులు ఆశ్చర్యచకితులయ్యారు. ఎవరికి ఎవరో అన్నట్లుగా బతుకుతున్న రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని చర్చించుకోవడం విశేషం. -
ఆడబిడ్డలకు ద్రోహం
కర్నూలు (టౌన్)/ కాకినాడ రూరల్: ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తామని టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని సమాధి చేశారని మహిళలు మండిపడ్డారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్ నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మహిళలు ర్యాలీ నిర్వహించారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్.. డౌన్.. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలను నమ్మించి మోసం చేశారని నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి మాట్లాడుతూ.. ఓట్ల కోసం సూపర్ సిక్స్ హమీలు ఇచ్చి.. తీరా గద్దెనెక్కాక కూటమి పార్టీల పెద్దలు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు ఏటా రూ.18 వేలు ఇస్తామని చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటించారన్నారు. ఆ మేరకు కూటమి మేనిఫెస్టోలోనూ పెట్టారన్నారు. తీరా ఇప్పుడు సీఎం చంద్రబాబు తన కర్నూలు పర్యటనలో.. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించడం దుర్మార్గం అన్నారు.2029 నాటికి కూడా పేదరికం తగ్గకపోతే అప్పుడు పీ–4 పథకానికి ఆడబిడ్డ నిధి పథకాన్ని అనుసంధానం చేస్తానని చెప్పడం మరోసారి మహిళలను దగా చేయడమే అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి భారతి, కర్నూలు నగర మహిళ నాయకులు మంగమ్మ, 43వ వార్డు కార్పొరేటర్ మునెమ్మ, కర్నూలు నియోజకవర్గ ఆంగన్వాడీ మహిళ నాయకురాలు రాధికమ్మ తదితరులు పాల్గొన్నారు.సూపర్ మోసం కూటమి ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలు మహిళలకు శాపంగా మారాయని, ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తామని నమ్మించి.. ఇప్పుడు మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సూపర్ మోసాలు చేస్తోందని ధ్వజమెత్తారు. కాకినాడ 49వ డివిజన్లోని తన నివాసంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని సూపర్ సిక్స్ హామీల కింద పెట్టి.. ఇప్పుడు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారని.. ఆ పథకం అక్కర్లేదని సీఎం చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు మహిళల్లో కనిపించిన పేదరికం.. అధికారం చేపట్టగానే మాయమైందా.. అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెచ్చిన వేల కోట్ల రూపాయలతో ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. -
అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం..!
కర్నూలు: పట్టణంలోని కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారి పక్కన చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేసి న ఫొటోలు, వీడియో లు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఓ వ్యక్తి మీద చేతబడి ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు పట్టణానికి చెందిన వ్యక్తి సూత్రధారిగా ఉండి కొందరి ఫొటోలతో, భయానక చేతబడి చేస్తున్నప్పటి ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. సేకరించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన వ్యక్తి సిఫారసుతో చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న వారు అందులో చేతబడులు చేస్తూ, గుప్తనిధుల వేటగాళ్లకు ఆసరాగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తికి అప్పు ఉండ గా అప్పు ఎగ్గొట్టేందుకు ఏకంగా ఆ వ్యక్తిపై చేతబడి ప్రయోగం చేసినట్లు సమాచారం. ఇందులో పట్టణానికి చెందిన పంచాయతీ కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్నకార్మికుడి ఫొటో ఉంది. ఇటీవల ఉలిందకొండకు చెందిన వ్యక్తిపై కూడా ఇక్కడి నుంచే చేతబడి ప్రయోగం చేసినట్లుగా తెలుసుకున్న ఉలిందకొండ వారు ఈ ఇంటికి చేరుకుని ఇంట్లో ఉన్నవారితో గొడవ పడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఇళ్లు కేంద్రంగా రెండు నెలల పాటు మండలం వ్యాప్తంగా గుప్తనిధుల వేట కొనసాగినట్లుగా సైతం తెలుస్తోంది. పోలీసులకు సైతం సమాచారం అందినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. -
భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
ఉయ్యాలవాడ: విధి ఆటలో ఓ చిన్నారి అనాథగా మారింది. అభంశుభం తెలియని పసిపాప తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ విషాద ఘటన ఆర్. పాంపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొగాకు నారాయణ కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మట్టి మిద్దె పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మిద్దె కూలి శిథిలాలు నారాయణపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య లలిత (40) తీవ్ర మనోవేదనకు గురైంది. మనస్తాపంతో వారం రోజులుగా ఆహారం తీసుకోకుండా భర్త గురించే ఆలోచించింది. తన 45 రోజుల చిన్నారికి కూడా పోతపాలు తాపింది. చివరకు జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం లలిత రసాయన పౌడర్‌ను నీళ్లలో కలుపుకుని అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన బంధువులు, స్థానికులు చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో లలిత మృతి చెందింది. తల్లిదండ్రుల మృతి చెంద డంతో 45 రోజుల చిన్నారి అనాథగా మిగిలింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పసిపాపకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాయనమ్మ శివమ్మ దిక్కైంది. అమ్మపాల కోసం ఏడస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. కాగా నారాయణ మొదటి భార్య విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందింది. రెండేళ్ల క్రితం లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. ఇటీవల జిల్లాలో పలువురు ఆత్మహత్యకు కల్లాపికి ఉపయోగించే పేడ రంగును నీళ్లలో కలుపుకుని తాగి మృతి చెందుతుండటంతో కలెక్టర్ రాజకుమారి నెల క్రితం పేడ రంగు విక్రయాలను నిషేధించారు. అయినా కొందరు కిరాణ దుకాణ వ్యాపారులు విక్రయిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పేడ రంగు విక్రయించకుండా అధికారులు దుకాణాలపై దాడులు చేయా లని గ్రామస్తులు కోరుతున్నారు. -
కర్నూల్ జిల్లా కాంగ్రెస్ నేత హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నట్లు టాక్
-
కర్నూలులో కాలుష్య కాసారం
ఇదో భయంకర కాలుష్య కథ. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నిషేధించిన అత్యంత ప్రమాదకర రసాయనాలను ఉత్పత్తి చేసి.. వాటి వ్యర్థాలను తుంగభద్ర, కృష్ణా నదుల్లో కలిపి.. పరీవాహక ప్రాంతాల్లోని గాలి, నీటిని కలుషితం చేసి.. ప్రజలు, జీవుల ఆరోగ్యాలను గుల్లచేయబోతున్న పరిశ్రమ కథ. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను ప్రలోభపెట్టి, నిజాలు దాచిపెట్టి.. ప్రజారోగ్యం కంటే వ్యాపార సామ్రాజ్య విస్తరణ ద్వారా డబ్బు సంపాదనే పరమావధిగా పెట్టుకున్న టీజీవీ గ్రూప్ కథ!సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు జిల్లా పంచలింగాల సమీపంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కుటుంబానికి చెందిన ఆల్కలీస్ ఫ్యాక్టరీ ఉంది. భరత్ తండ్రి, బీజేపీ సీనియర్ నాయకుడు టీజీ వెంకటేశ్ పర్యవేక్షణలో ఇది నడుస్తోంది. ఈ పరిశ్రమలో కాస్టిక్ సోడా ఉత్పత్తితో క్లోరిన్ వెలువడుతుంది. ఇది విష వాయువు. క్లోరిన్ రసాయనాలతో టెఫ్లాన్ (పీటీఎఫ్ఈ), క్లోరో మీథేన్ వంటి ఉత్పత్తుల యూనిట్‌ను విస్తరించేందుకు టీజీ గ్రూప్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.పీటీఎఫ్ఈ (పారీ టెట్రాక్లోరో ఇథిలిన్) తయారీలో పీఎఫ్‌వోఏ (ఫర్ఫ్లోరో ఆక్టనాయిక్ యాసిడ్), కార్బన్ టెట్రాక్లోరైడ్ వంటి రసాయనాలు వినియోగిస్తారు. ప్రమాదకరమైన పీఎఫ్వోఏను జర్మనీ, డెన్మార్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వేతో పాటు ఎన్నో దేశాలు నిషేధించాయి. ఆరోగ్యం గుల్లవుతోందని.. ఇలాంటి రసాయనాల వాడకాన్ని శాశ్వతంగా మానేయాలని 2019లో స్టాక్‌హోమ్ కన్వెన్షన్ వేదికగా 180 దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.అమెరికాలో డార్క్ వాటర్!అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో పీఎఫ్‌వోఏ, పీఎఫ్ఏఎస్ (ఫర్ అండ్ పాలీ ఆల్కల్ సబ్‌స్టాన్స్) వాడకంతో ఓ గ్రామంలోని ఆవులు చనిపోయాయి. ఫ్యాక్టరీ సమీప గ్రామాలు, నదిలోని నీరు తాగడంతో అనారోగ్యానికి గురై మనుషులు, జీవరాశులు చనిపోవడంతో అమెరికా ప్రభుత్వం సైన్స్ ప్యానల్ ఏర్పాటు చేసింది. ఎమరీ యూనివర్సిటీ, నోటర్‌డామ్, లండన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు.. 70 వేలమంది రక్త నమూనాలు సేకరించారు. పీఎఫ్‌వోఏ, పీఎఫ్ఏఎస్ అత్యంత ప్రమాదకరమని తేల్చారు. ఫ్యాక్టరీని మూసేయడంతో పాటు రసాయనాలను నిషేధించారు. దీనిపై ‘డార్క్ వాటర్’ పేరుతో హాలీవుడ్ సినిమా కూడా తీశారు. ఇప్పుడు అనపర్తి, టీజీ గ్రూప్ ఫ్యాక్టరీలతో మనదగ్గర కూడా అలాంటి ఘోర పరిస్థితి ఉత్పన్నం కానుంది.బుధవారం ప్రజాభిప్రాయ సేకరణఫ్యాక్టరీ ఏర్పాటుపై టీజీ గ్రూప్ ఆల్కలీస్ సమీపంలోని గొందిపర్ల వాసులతో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. కాగా, దీనికి అనుమతులు ఇవ్వొద్దని ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక కన్వినర్ రామకృష్ణారెడ్డి, కో కన్వీనర్ శ్రీనివాసరావు, పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అల్లాబక్ష్, సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక కో కన్వినర్ జీవీ భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.అత్యంత విషపూరిత రసాయనం!ఆల్కలీస్ ఫ్యాక్టరీ తుంగభద్ర ఒడ్డునే ఉంది. దీనికోసం నది ఎగువ భాగంలోని నీటిని వినియోగిస్తారు. వ్యర్థాలను నది దిగువ భాగంలో కలుపుతున్నట్లు తెలుస్తోంది. పీటీఎఫ్ఈ తయారీకి పీఎఫ్‌వోఏ, పీఎఫ్ఏఎస్ రసాయనాలు నీటిలో కలుస్తాయి. ఇవి తుంగభద్ర ద్వారా కృష్ణా నదిలో చేరుతాయి. ⇒ తుంగభద్ర, కృష్ణానీటిని ఏపీ, తెలంగాణకు చెందిన 2 కోట్లమందికి పైగా ప్రజలు తాగుతారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అయితే, రసాయనాలు కలవడంతో ఈ జలాలు విషపూరితం అవుతున్నాయి. క్యాన్సర్, కిడ్నీ, గర్భధారణ ప్రేరిత రక్తపోటు, ఊపిరితిత్తులు, గుండె, రక్త సంబంధిత, పలు ప్రాణాంతక వ్యాధులు వస్తాయని, హైదరాబాద్‌కు చెందిన సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ అనే సంస్థ నుంచి 27 మంది శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. ⇒ డాక్టర్ బాబూరావు, డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ రాంబాబు, డాక్టర్ అహ్మద్‌ఖాన్, ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌లు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ సెక్రటరీ తన్మయ్కుమార్కు ఈ నెల 5న నివేదికను సమర్పించారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ కృష్ణయ్య, కర్నూలు కలెక్టర్ రంజిత్‌బాషాకు కూడా నివేదిక పంపారు.మొన్న బలభద్రపురం.. నేడు కర్నూలు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పరిధిలోని బలభద్రపురంలోని గ్రాసిం కంపెనీ కాస్టిక్ సోడా ప్రాజెక్టు విస్తరణకు 2023 ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. అప్పట్లో మానవ హక్కుల వేదిక ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. 2024 ఫిబ్రవరిలో అనుమతులు వచ్చాయి. కేంద్ర పర్యావరణ, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులను ప్రలోభపెట్టి అనుమతులు తెచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీ అనుమతులను సాకుగా చూపి టీజీ గ్రూప్ కూడా పావులు కదిపేందుకు సిద్ధమైంది. భరత్ టీడీపీ కూటమి ప్రభుత్వంలో మంత్రి.. టీజీ వెంకటేశ్ బీజేపీ సీనియర్ నాయకుడు కావడం, కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో అనుమతులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.నివేదికలో ముప్పును తొక్కిపెట్టి పీటీఎఫ్ఈ ఉత్పత్తికి ఏ రసాయనాలు ముడి పదార్థాలుగా వాడతారు? టెక్నాలజీ ఎవరి నుంచి కొనుగోలు చేస్తారు? ఎలాంటి వ్యర్థాలు వెలువడతాయి..? ప్రమాదకర రసాయనాలను ఏం చేస్తారు? అనే వివరాలను ప్రభుత్వానికి సమర్పించిన ఈఐఏ (పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక)లో టీజీ గ్రూప్ స్పష్టం చేయకపోవడం గమనార్హం.ప్రాణాలు ముఖ్యమా.. ఆదాయం ముఖ్యమా! అత్యంత విషపూరిత రసాయనాలు వెలువడే టీజీ ఫ్యాక్టరీకి అనుమతులివ్వొద్దు. కృష్ణా జలాలు రెండు రాష్ట్రాలకు ప్రాణాధారం. తుంగభద్ర, కృష్ణా జలాలు విషపూరితం అయితే దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో జన జీవనం ఛిన్నాభిన్నం అవుతుంది. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ప్రభుత్వాలకు ముఖ్యం కాకూడదు. కేవలం ఆదాయం కోసం టీజీ భరత్, టీజీ వెంకటేశ్ కాలుష్యకారక ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. – రామకృష్ణారెడ్డి, ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక కన్వినర్ గ్రామసభను కూడా రద్దు చేయాలి ప్రపంచ దేశాలు నిషేధించిన రసాయనాలు ఇక్కడ తయారు చేయడం దుర్మార్గం ఆర్22, ఆర్23, పీటీఎఫ్ఈ తయారీలో సాంకేతిక, ప్రమాద నిర్వహణ వివరాలు, టీఎఫ్ఈ, పీఎఫ్‌ఐబీ లాంటి ప్రమాదకర రసాయనాల ప్రభావం ప్రస్తావనే లేదు. గ్రామసభను కూడా రద్దు చేయాలి. – అల్లాబక్ష్, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ప్రపంచంలో నిషేధం.. మనదగ్గర అనుమతా? ప్రజలు, జీవరాశి పాలిట అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను ప్రపంచ దేశాలు నిషేదిస్తున్నాయి. కానీ, కర్నూలులో వాస్తవాలు దాచి పెట్టి అనుమతులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా జలాలు వినియోగించే ప్రాంతాలతో పాటు గాలి కాలుష్యం ద్వారా ఏపీ, తెలంగాణలో తీవ్ర ప్రభావం ఉంటుంది. గ్రామసభను రద్దు చేయాలి. కంపెనీ ప్రతినిధులతో వాస్తవాలు చెప్పించాలి. నష్టం అంచనా వేసి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. – డాక్టర్ బాబూరావు, శాస్త్రవేత్త, హైదరాబాద్ -
YSRCP శ్రీదేవి భర్త హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు
-
AP: కాంగ్రెస్ నేత దారుణ హత్య
అనంతపురం: జిల్లాలోని గుంతకల్లులో కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణహత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న లక్ష్మీ నారాయణను కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. కాంగ్రెస్ లక్ష్మీనారాయణ కారును టిప్పర్ తో ఢీకొట్టారు దుండగులు. ఆపై లక్ష్మీ నారాయణపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో లక్ష్మీ నారాయణ కుమారుడు వినోద్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. -
కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ లో సమస్యలపై YSRCP నిలదీత
-
తెల్లారితే భార్య ప్రసవం.. పిడుగు పాటుతో భర్త మృతి
ఎమ్మిగనూరురూరల్(కర్నూలు): తెల్లారితే తన రక్తాన్ని పంచుకుని పుట్టే శిశువును ఆ యువకుడు చూడాల్సి ఉంది. అయితే విధి పగపట్టింది. పసికందును చూడకుండానే పిడుగు రూపంలో మృత్యు ఒడికి చేర్చింది. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి ఎమ్మిగనూరు మండలం గుడేకల్ కొండపై చోటుచేసుకుంది. పెద్దకడుబూరు మండలం హనుమాపురం గ్రామానికి చెందిన గొల్ల ఈరన్న(25) ఎమ్మిగనూరు యాక్సిస్ బ్యాంక్‌లో బంగారు నగలపై తీసుకున్న రుణాలు రికవరీ చేసే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ యువకుడు అదే గ్రామానికి చెందిన గొల్ల సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు. సరస్వతి నేడు (సోమవారం) ప్రసవం అవుతుందని వైద్యులు చెప్పారు. గొల్ల ఈరన్న తల్లి లక్ష్మీకి అనారోగ్యంగా ఉండటంతో గుడేకల్ కొండపై ఉండే సుంకాలమ్మకు మొ క్కు తీర్చుకుంటే తగ్గుతుందని పెద్దలు చెప్పారు. దీంతో ఆదివారం సాయంత్రం గొల్ల ఈరన్న, అతని స్నేహితులు, బంధువులైన సహదేవుడు, ఈరన్న, రామాంజనేయులు కలసి కొండపై శ్రీ సుంకాలమ్మ గుడి దగ్గరకు వెళ్లారు. మొక్కుబడి తీర్చుకొని అక్కడే వంట చేసుకొని భోజనం చేశారు. ఆకస్మాత్తుగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో చెట్టు కిందకు నలుగురు వెళ్లారు. చెట్టు కింద కూర్చున్న గొల్ల ఈరన్నపై పిడుగు పడటంతో అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. పక్కనే ఉన్న సహదేవుడు, ఈరన్న, రామాంజనేయులకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామంలో ఉన్న బంధువులకు సమాచారం అందించటంతో అక్కడికి వచ్చి గొల్ల ఈరన్నతో పాటు మరో ముగ్గురిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే గొల్ల ఈరన్న(25) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన భార్య సరస్వతికి సోమవారం ప్రసవం ఉందని బంధువుల దగ్గర గొల్ల ఈరన్న చెప్పారు. భార్య ఒకరికి ప్రాణం పోసేలోపే భర్త ప్రాణం పిడుగు రూపంలో తీసుకుపోవటంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. రూరల్ ఏఎస్ఐ రామేశ్వరావు, కానిస్టేబుల్ బి.గోపాల్ ప్రభుత్వాసుపత్రికి వచ్చి ప్రమాదం జరిగిన తీరును మృతుడి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎమ్మిగనూరు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు చెప్పారు. -
‘టీడీపీ స్వార్థ రాజకీయాలు ముస్లిం సమాజం గమనిస్తోంది’
సాక్షి, కర్నూలు: ‘వక్ఫ్ సవరణ చట్టం-2025’పై సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలను స్వాగతిస్తున్నామని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.హఫీజ్ ఖాన్ అన్నారు. గురువారం ఆయన కర్నూలు రాయల్ ఫంక్షన్ హాల్లో మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టంపై దేశసర్వోన్నత న్యాయస్థానం ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ముస్లిం, మైనార్టీలను అన్యాయం చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇప్పటికైనా ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ముస్లిం, మైనార్టీల పక్షాన నిలబడాలని హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు. హఫీజ్ ఖన్ ఇంకా ఏం మాట్లాడారంటే..వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను సవాల్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై దేశసర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరడం మనం చూశాం. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలపడం, వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. ఇది మా ముస్లిం సమాజానికి గొప్ప రిలీఫ్.రాజ్యాంగం మాకు కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్దంగా కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దశలోనూ అడ్డుకుంది. దీనిపై సుప్రీంలో తప్పకుండా మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని మేం బలంగా నమ్ముతున్నాం. ఈ కేసులో సీజేఐ లేవనెత్తిన అంశాలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. వక్ఫ్ ఆస్తుల విషయంలో సీజేఐ గారు సొలిసిటర్ జనరల్‌ను అడిగిన ప్రశ్నలే మేం ముందు నుంచి అడిగాం. ప్రభుత్వానికి సుప్రిం ఇచ్చిన నిర్ణీత గడువులో వారు సమాధానం ఇవ్వాలి. మా ముస్లింల తరుపున పోరాడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.టీడీపీ మాత్రం స్వార్ధ రాజకీయాలు చేసి తడిగుడ్డతో మా ముస్లిం, మైనార్టీల గొంతు కోసింది. వీరి స్వార్థ రాజకీయాలు ముస్లిం సమాజం గమనిస్తోంది. కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక్క ఏపీలోనే కాదు దేశంలోని ముస్లింలు అంతా కూడా చంద్రబాబు, నితీష్‌కుమార్‌ల వైపు చూశారు, మా హక్కులు అణగదొక్కుతుంటే మా వైపు నిలవకుండా వీరిద్దరూ మైనార్టీల పక్షాన నిలవకుండా బీజేపీ అజెండాను దేశమంతా అమలుచేయడానికి పూర్తిగా సహకరించారు, ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి, మీపై బాధ్యత ఉంది, మీరు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ముస్లిం, మైనార్టీల పక్షాన నిలబడాలని డిమాండ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా వైఎస్సార్సీపీ ప్రతి అడుగులో కూడా ముస్లిం సోదరుల వెంట నడుస్తుంది, వారి తరపున పోరాడుతుందని హఫీజ్ ఖాన్ చెప్పారు. -
కర్నూలులో డీఆర్డీవో లేజర్ ఆయుధ పరీక్ష సక్సెస్.. భారత్ సరికొత్త రికార్డు
కర్నూలు: భారత అమ్ములపొదిలోకి సరికొత్త లేజర్ అస్త్రం చేరనుంది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఇందుకు ఏపీలోని కర్నూలు జిల్లా వేదికైంది. ఈ సందర్బంగా 30 కిలోవాట్ల లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను ఉపయోగించి డ్రోన్లను కూల్చివేసే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష విజయవంతమైంది.వివరాల ప్రకారం.. శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, అస్త్రాలను క్షణాల్లో నేలకూల్చే అద్భుతమైనన లేజర్ వ్యవస్థను డీఆర్డీవో తీసుకువచ్చింది. కర్నూలులోని ఓర్వకల్లులో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో ఆదివారం ప్రయోగం జరిగింది. ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, మిస్సైళ్లు, డ్రోన్లను ఈ లేజర్ ఆయుధంతో కూల్చివేయడం ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో లేజర్ కిరణం తాకగానే, లక్ష్యంగా ఉన్న వస్తువు కాలి బూడిదైంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత రక్షణ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. దీంతో, ఇలాంటి వ్యవస్థ కలిగిన అమెరికా, చైనా, రష్యా దేశాల సరసన భారత్ చేరింది. ఇజ్రాయెల్ సైతం ప్రయోగాలు చేస్తోంది. ఇక, దీనికి సంబంధించిన వీడియోలను డీఆర్డీవో ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.CHESS DRDO conducted a successful field demonstration of the Land version of Vehicle mounted Laser Directed Weapon(DEW) MK-II(A) at Kurnool today. It defeated the fixed wing UAV and Swarm Drones successfully causing structural damage and disable the surveillance sensors. With… pic.twitter.com/U1jaIurZco— DRDO (@DRDO_India) April 13, 2025అయితే, ఈ ఆయుధాన్ని హైదరాబాద్‌లోని డీఆర్డీవో ల్యాబ్ సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (CHESS) అభివృద్ధి చేసింది. దేశంలోని ఇతర ల్యాబ్‌లు, విద్యా సంస్థలు, పరిశ్రమలు సైతం ఇందులో పాలుపంచుకున్నాయి. ఈ ఆయుధానికి MK-2(A) DEW అని పేరు పెట్టారు. తాజా పరీక్షలో ఈ అస్త్రం తన పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చాటినట్లు డీఆర్డీవో ప్రకటించింది. చాలా దూరంలో ఉన్న ఫిక్స్డ్ వింగ్ డ్రోన్లను నేలకూల్చింది. అదే విధంగా డ్రోన్ల దాడిని తిప్పికొట్టింది. ‘శత్రువుల’ నిఘా సెన్సార్లు, యాంటెన్నాలను ధ్వంసం చేసి, మెరుపువేగంతో సెకన్లలోనే లక్ష్యాలపై విరుచుకుపడే సామర్థ్యాన్ని చాటింది. #WATCH | Kurnool, Andhra Pradesh: For the first time, India has showcased its capability to shoot down fixed-wing aircraft, missiles and swarm drones using a 30-kilowatt laser-based weapon system. India has joined list of selected countries, including the US, China, and Russia,… pic.twitter.com/fjGHmqH8N4— ANI (@ANI) April 13, 2025 -
క్యాన్సర్‌ను జయిస్తూ.. చదువులో రాణిస్తూ!
గోనెగండ్ల: ఓ విద్యార్థిని క్యాన్సర్‌ను జయిస్తూ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. గోనెగండ్లకు చెందిన ఉరుకుందు గౌడ్, జానకి దంపతులకు కుమార్తె సృజనామృత, కుమారుడు భగీరథ్ గౌడ్లు ఉన్నారు. ఉరుకుందు ప్రస్తుతం కర్నూలు రెండో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కర్నూలులోనే నివాసం ఉంటున్నారు. గత ఏడాది సృజనామృత పదో తరగతి చదువుతుండగా క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు బయటపడింది. మహమ్మారితో పోరాడుతూనే చదువు కొనసాగిస్తోంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉదయం రాసి మధ్యాహ్నం నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందింది. పరీక్షల్లో ప్రతిభ చాటుతూ 493 మార్కులు సాధించింది. అప్పటి నుంచి క్యాన్సర్‌తో బాధపడుతూనే కర్నూలులో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇంటర్ పరీక్షలు రాసింది. శనివారం విడుదలైన ఫలితాల్లో 420 మార్కులు సాధించింది. ఎంబీబీఎస్ సీటు సాధించి పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని సృజనామృత చెబుతోంది. -
ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ
-
జగన్ కోసం దేనికైనా సిద్ధం.. ఎల్లో మీడియాకి వార్నింగ్
-
YSRCP నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్
-
గార్దభాలను బండ్లకు కట్టుకుని గుడి చుట్టూ బురదలో ప్రదర్శన (ఫొటోలు)
-
నంద్యాల : ప్రేమ కోసం పిడకల యుద్ధం..ప్రేమదే విజయం (ఫొటోలు)
-
అంగరంగ వైభవంగా పిడకల సమరం
కర్నూలు జిల్లా, సాక్షి: ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో పిడకల సమరం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులు రెండువర్గాలుగా ఏర్పడి పిడకలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ పిడకల సమరంలో పాల్గొనేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. యుద్ధ వాతావరణాన్ని తలపించే ఈ పిడకల సమరంలో గాయాలవుతున్నా భక్తులు పిడకల్ని విసిరారు. -
కర్నూల్ హాస్టల్ లో దారుణం.. చిన్న పిల్లలనే కనికరం లేకుండా
కర్నూల్: జిల్లాలోని కోడుమూరు ఎస్సీ హాస్టల్ లో దారుణం చోటు చేసుకుంది. చిన్న పిల్లలు అని చూడకుండా ఏడో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులపై పదో తరగతికి చెందిన ఓ విద్యార్థి విచక్షణా రహితంగా విరుచుకుపడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.తన బెల్టు తీసుకుని ఆ విద్యార్థులను చితకబాదాడు. తన మాట వినలేదని చెప్పి ఏడో తరగతి విద్యార్థులను దారుణంగా కొట్టాడు. దాడికి పాల్పడ్డ పదో తరగతి విద్యార్థి అనధికారంగా హాస్టల్ ఉంటున్నట్లు తెలుస్తోంది. -
World TB Day: క్షయకు కళ్లెం పడేనా!
కర్నూలుకు చెందిన 45 ఏళ్ల మహిళ క్షయ వ్యాధితో కోలుకోలేక కన్నుమూసింది. మందులపై సరైన అవగాహన లేక మొదట్లో కాస్త బాగా అనిపించగానే మందులు మానేసింది. ఆమెకు షుగర్ కూడా ఉండటంతో వ్యాధి తిరగబెట్టి ఎండీఆర్ టీబీగా రూపాంతరం చెందింది. తర్వాత మందులు వాడినా కోలుకోలేక మృతిచెందింది. ఈ మందులు ఎలా వాడాలో వైద్యులు, సిబ్బంది అవగాహన కలి్పంచకపోవడం వల్లే ఆమె కన్నుమూయాల్సి వచ్చింది. – కర్నూలు(హాస్పిటల్)ఎంతో మంది క్షయ వ్యాధికి మందులు వాడుతూ మధ్యలో ఆపేసి, ఆ తర్వాత మొండి టీబీతో మరణిస్తున్నారు. క్షయ బాధితులు మొదటిసారి మందుల వాడకం ప్రారంభించగానే కొందరికి కడుపులో తిప్పుతుంది. ఇందుకోసం కొందరు వైద్యులు గ్యాస్ట్రబుల్ మందులు ఇస్తారు. మరికొందరికి తీవ్ర ఆకలి అవుతుంది. ఇంకొందరికి రెండు నెలలు మందులు వాడగానే ఆరోగ్యం కుదుట పడుతుండటంతో బాగైందని భావించి మందుల ప్రభావానికి భయపడి మానేస్తున్నారు. కానీ మందులు మధ్యలో ఆపకూడదని, కచ్చితంగా 6 నుంచి 8 నెలలు వాడాలని చెప్పేవారు లేరు. గతంలో లాగా డాట్స్ విధానంలో ఇచ్చే మందుల పద్ధతి కూడా ఇప్పుడు లేకపోవడంతో రోగుల్లో తీవ్రత పెరిగిపోతోంది. నేడు వరల్డ్ టీబీ డే (ప్రపంచ క్షయ వ్యాధి అవగాహన దినం) సందర్భంగా ప్రత్యేక కథనం. జిల్లాలో ప్రతి 2 లక్షల నుంచి 2.5 లక్షల జనాభాకు ఒక టీబీ యూనిట్ చొప్పున 9 యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇందులో ఒక సీనియర్ టీబీ సూపర్వైజర్, సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ విధులు నిర్వహిస్తున్నారు. రోగులను పర్యవేక్షించేందుకు ప్రతి సూపర్వైజర్కు ఒక మోటార్ సైకిల్ ఇచ్చారు. దీంతో పాటు ప్రతి పీహెచ్సీలో ఎక్స్‌రే యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా క్షయ నిర్ధారణ చేయవచ్చు. గతేడాది 78,368 మందికి పరీక్షలు చేయగా 3,077 మందికి క్షయ నిర్ధారణ అయ్యింది. గత కేసులతో కలుపుకొని మొత్తం 4,571 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు 6 నుంచి 8 నెలల పాటు ఉచితంగా అందిస్తారు. గతేడాది క్షయ నుంచి కోలుకోలేక 104 మంది మరణించారు. వ్యాధినిర్దారణ ఇలా ! రెండు వారాలకు మించి దగ్గ, సాయంత్రం వేళల్లో జ్వరం, దగ్గితే గళ్ల పడటం, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, ఉమ్మిలో రక్తం పడటం వంటి లక్షణాలుంటే క్షయగా అనుమానించి సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవాలి. రోగి గళ్లను వైద్య సిబ్బంది సేకరించి మైక్రోస్కోప్, ట్రూనాట్, సీబీ నాట్ మిషన్ల ద్వారా నిర్దారిస్తారు. పెరుగుతున్న ఎండీఆర్టీబీ కేసులు క్షయవ్యాధిలో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ (ఎండీఆర్టీబీ) కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. క్షయ మందులపై అవగాహన లేక చాలా మంది కోర్సు మధ్యలోనే మానేస్తున్నారు. దీనివల్ల వ్యాధి తిరగబెట్టి మరింత మొండిగా తయారవుతోంది. అప్పుడు సాధారణ టీబీ మందులు పనిచేయవు. వారికి ఖరీదైన ఎండీఆర్ టీబీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ఖరీదు రూ.2 లక్షల దాకా ఉంటుంది. ఈ మందులకు కూడా లొంగకపోతే బెడాక్విలిన్ అనే రూ.18 లక్షల విలువైన 11 నెలల కోర్సు మందును ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎండీఆర్ టీబీ రోగులు 135 మంది ఉండగా, బెడాక్విలిన్ మందులు వాడే వారు 52 మంది ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత మందులతో పాటు రోగి పోష కాహారం కోసం నెలకు రూ.వెయ్యి అందిస్తున్నారు. నిక్షయ్ మిత్ర ద్వారా సరుకులు నిక్షయ్ మిత్ర ద్వారా కో–ఆపరేటివ్, కార్పొరేట్, ప్రజాప్రతినిధులు, దాతల ద్వారా క్షయ రోగులకు అవసరమైన పోషకాహార కిట్లను అందిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 129 సంస్థలు రిజిస్టర్ కాగా 2,117 మంది క్షయ రోగులను దత్తత తీసు కుని 12,045 పోషకాహార ప్యాకెట్లను అందజేశారు. నేడు అవగాహన సదస్సు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులో ఈ నెల 24వ తేదీన ర్యాలీ నిర్వహించనున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని ఓల్డ్ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. క్షయ వ్యాధిపై వైద్య, ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నారు. క్షయను తగ్గించడమే లక్ష్యం జిల్లాలో ప్రస్తుతం ప్రతి 3 వేల మందికి పరీక్ష చేయగా 170 దాకా కేసులు బయటపడుతు న్నాయి. ఈ సంఖ్యను 50లోపు తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకకుండా చర్యలు తీసుకుంటు న్నాం. వ్యాధిసోకిన వారి ఇంట్లో అందరికీ టీబీ ప్రీవెంటివ్ థెరపీ కింద ఆరు నెలల పాటు మందులు ఉచితంగా ఇస్తున్నాం. ఇటీవల పెద్దవారికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. –డాక్టర్ ఎల్.భాస్కర్, జిల్లా క్షయ నియంత్రణాధికారి, కర్నూలు -
మా వాహనాన్నే ఆపుతావా..
సాక్షి టాస్‌్కఫోర్స్: ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్గేట్ వద్ద ఓ ఎస్ఐ హల్చల్ చేశారు. మా వాహనాన్నే ఆపుతావా అని అక్కడి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు కదిలించడంతో టోల్బూత్లో ఏర్పాటు చేసిన బూమ్ బ్యారియర్ దెబ్బతినింది. ఈ ఘటన బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. సదరు ఎస్ఐ కర్నూలు ఉపకారాగారం నుంచి ఓ ముద్దాయిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. స్వయంగా ఆయనే కారు నడుపుతున్నారు. వాహనం నన్నూరు టోల్‌గేట్‌కు చేరుకోగా ముందున్న మరో వాహనం ఫాస్టాగ్ స్కాన్ కాకపోవడంతో సిబ్బంది మాన్యువల్‌గా టోల్ రుసుము వసూలు చేశారు. ఆ వెంటనే బూమ్ బ్యారియర్ యథాస్థితికి వస్తుండగా ఎస్ఐ నడుపుతున్న వాహనం ఒక్కసారిగా ముందుకు కదిలింది. ఆ సమయంలో బూమ్ బ్యారియర్ దెబ్బతినింది. ఇంతలో టోల్ సిబ్బంది వాహనం చుట్టూ గుమికూడటంతో ఎస్ఐ బూతు పురాణం మొదలుపెట్టారు. తమ వాహనాన్నే ఆపుతారా అంటూ గద్దించారు. అంతటితో ఆగకుండా టోల్ కలెక్టర్ మహబూబ్‌బాషాను బలవంతంగా అదే వాహనంలో ఎక్కించుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు. టోల్ సిబ్బంది బతిమాలినా ఫలితం లేకపోయింది. ఉద్యోగిని తీసుకెళ్లి స్టేషన్లో ఉంచారు. అయితే విషయం ఆనోటా ఈనోటా బయటకు పొక్కడంతో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో టోల్ ఉద్యోగిని విడిచిపెట్టడం గమనార్హం. ఇదిలాఉంటే గతంలోనూ ఈ ఎస్ఐ టోల్గేట్ సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించినట్లు సమాచారం. ఆ సమయంలో ఆయన మఫ్టీలో కారు నడుపుతుండగా సిబ్బంది ఐడీ కార్డు అడిగినట్లు తెలిసింది. నన్నే కార్డు అడుగుతావా అని సిబ్బందిపై విరుచుకుపడినట్లు సమాచారం. -
అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు
కర్నూలు: అదనపు కట్నం కోసం అత్త, మామ, బావ కలిసి వేధిస్తున్నారని పత్తికొండకు చెందిన వి.రమాదేవి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 115 ఫిర్యాదులొచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు పాల్గొన్నారు.వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..⇒ కర్నూలు ఫుడ్ కార్పొరేషన్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బు తీసుకుని మోసం చేసిన కేసులో కర్నూలుకు చెందిన జాకీర్ బాషా, అయేషా బాను, జహీర్ బాషా అరెస్టయి కండీషన్ బెయిల్‌పై విడుదలయ్యారని, ఈ కేసు దర్యాప్తును పకడ్బందీగా చేసి న్యాయం చేయాలని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన సుబ్బయ్య ఫిర్యాదు చేశారు.⇒ తన కుమారుడు పెద్ద మద్దిలేటి, మనవడు మధు కలిసి తన పొలాన్ని వారి పేరు మీద ఆన్లైన్లో అడంగల్‌లో ఎక్కించుకున్నారని, పొలం తప్ప తనకు వేరే జీవనాధారం లేదని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన వెంకన్న ఫిర్యాదు చేశాడు.⇒ డీఆర్డీఏ వెలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వెంకటరత్నం ప్రభుత్వ స్కీముల ద్వారా లబ్ధి పొందేలా చేస్తానని ఆశ పెట్టి డబ్బు తీసుకుని మోసం చేశాడని హాలహర్వికి చెందిన శీలం నాగమ్మ ఫిర్యాదు చేశారు.⇒ పిల్లల చదువుల కోసం చీటీలు వేసి దాచుకున్న డబ్బు ఇవ్వకుండా జొహరాపురం గ్రామానికి చెందిన మహమ్మద్ తప్పించుకుని తిరుగుతున్నాడని ఇందిరమ్మ గృహాలకు చెందిన చాకలి రామచంద్రుడు ఫిర్యాదు చేశారు. -
ఐదు వందల ఏళ్ల నాటి బావి..నిర్మించిన తీరుకి విస్తుపోవాల్సిందే..!
పురాతన శిల్పాలు, ఆనాటి కట్టడాలు గొప్పగొప్ప కథలెన్నో చెబుతుంటాయి. ఆనాటి రాజరికపు దర్పాన్ని, ప్రజా జీవన శైలిని కళ్లకు కడుతుంటాయి. అలాంటిదే కర్నూలు జిల్లా మండల కేంద్రం మద్దికెరలోని భోజరాజు బావి. ఇది సుమారు 5 వందల ఏళ్ల క్రితం పెద్దనగరి యాదవరాజులైన భోజరాజు తవ్వించారు. నాటి నుంచి నేటికీ గ్రామస్థులు, ఆ బావి నీటిని తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. దాదాపు 70 అడుగుల లోతు, 80 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ బావి ఎన్నో ప్రాచీన విగ్రహాలతో ఆకట్టుకుంటుంది. ఈ బావిని ఎలాంటి మట్టి, ఇతర సామగ్రిని వినియోగించకుండా రాతి మీద రాతిని పేర్చి, హెచ్చుతగ్గులు కనిపించకుండా కట్టిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రాతి కట్టడంపై దేవతామూర్తులు, నర్తకుల నృత్యభంగిమలు, జలచర జీవుల రూపాలు, జలకన్యలు ఇలా వందలకొద్ది శిల్పాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. పదేళ్ల క్రితం వరకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ బావి నీటినే వినియోగించేవారు. కాలక్రమేణా నీళ్ల వ్యాపారం మొదలైననాటి నుంచి, ఎవరికి వారు, వాటర్క్యాన్స్ కొనుక్కుంటూ ఈ బావి నీటిని గృహ అవసరాలకు వాడటం మానేశారు. ప్రస్తుతం ఈ నీటిని వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. ‘అప్పట్లో ఈ నీళ్లు తాగితే మోకాళ్ల నొప్పులు ఉండేవి కావు, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తేవి కావు’ అని కొందరు గ్రామస్థులు చెబుతున్నారు.కరువులోనూ ఆదుకుంది..దాదాపు 30 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో కరువు ఏర్పడినప్పుడు మా వంశస్తులు నిర్మించిన భోజరాజు బావి ప్రజల దాహార్తిని తీర్చింది. ప్రస్తుతం 15 ఎకరాల వ్యవసాయ భూమికి ఈ బావి నీరే ఆధారమైంది--విజయ రామరాజు జమేదార్ మద్దికెరపి.ఎస్.శ్రీనివాసులు నాయుడు, కర్నూలు డెస్క్టి.వెంకటేశ్వర్లు, మద్దికెర(చదవండి: ఈ తిను 'బండారం' గురించి తెలుసుకోండి..! హెచ్చరిస్తున్న వైద్యులు) -
కూటమి తెచ్చిన మార్పుకు ఉదాహరణగా నిలుస్తున్న చిన్నారి
-
పోసాని రిలీజ్ అడ్డుకునే కుట్ర.. ఎల్లో మీడియాలో హింట్!
కర్నూలు, సాక్షి: వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం ఫలితంగా.. కూటమి కక్ష సాధింపు చర్యల నుంచి నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట దక్కింది. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్ పడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారంటూ పోసానిపై 5 నెలల కిందట ఏపీ సీఐడీ(AP CID) కేసు నమోదు చేసింది. తాజా కేసుల నుంచి ఊరటతో ఆయన జైలు నుంచి విడుదల కాబోతుండగా.. హఠాత్తుగా ఆ కేసును తెరపైకి తెచ్చారు. ఆఘమేఘాల మీద గుంటూరు కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేయగా.. కోర్టు సీఐడీ విజ్ఞప్తికి అనుమతించింది. దీంతో.. ఈ ఉదయం సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం. జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట ప్రవేశపెడతారని తెలుస్తోంది. పోసానిపై సీఐడీ నమోదు చేసిన కేసు వివరాలు తెలియాల్సి ఉంది. పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) పై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు. అయితే చివరకు.. న్యాయమే గెలిచింది. బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో కేసు.. బెయిల్‌పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు.. బెయిల్‌ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పీఎస్‌లో కేసు.. బెయిల్‌కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు.. బెయిల్ హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు.. క్వాష్ మరోవైపు.. పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం తన అనుకూల మీడియా ద్వారా విషం చిమ్ముతోంది. ఆయన విడుదలపై సందిగ్ధం నెలకొందంటూ ముందుగానే కథనాలు ఇచ్చేసింది. పోసానిపై పలుచోట్ల కేసులున్న నేపథ్యంలో ఆయన విడుదలయ్యే లోపు, ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చంటూ పేర్కొనగా.. ఈలోపే సీఐడీ ఆయన విడుదలను అడ్డుకునేందుకు తెర మీదకు రావడం గమనార్హం. -
మరో కేసులో కోర్టుకు పోసాని
-
అప్పు కట్టలేదని రైతు బైకు స్వాధీనం
కర్నూలు(అగ్రికల్చర్)/చిప్పగిరి: పంటలు పండక, ప్రకృతి సహకరించక.. సరైన గిట్టుబాటు ధర లభించక రైతుల జీవనం దినదిన గండంగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం రైతులను ఏమాత్రం ఆదుకోకపోగా, వ్యవసాయాన్ని కష్టతరం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన బ్యాంకులు సైతం రుణాల రికవరీ పేరిట ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధపడటం విమర్శలకు తావిస్తోంది. జిల్లా సహకార కేంద్రబ్యాంకు రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించింది. బుధవారం ఐదు ప్రత్యేక బృందాలు ఆలూరు, పత్తికొండ, డోన్ ప్రాంతాల్లో రుణాలు రికవరీకి రైతుల ఇళ్లకు వెళ్లారు. ఆరేడేళ్ల క్రితం డీసీసీబీ నుంచి రుణాలు తీసుకొని ఇంతవరకు ఒక్క కంతు కూడా చెల్లించకపోవడంతో వడ్డీ, అపరాధవడ్డీలతో అప్పు పేరుకుపోయిందని, వెంటనే చెల్లించాలని కోరారు. ఆలూరు బ్రాంచ్ పరిధిలోని చిప్పగిరి మండలం కుందనగుర్తి గ్రామానికి చెందిన ఓ రైతు 2016లో రూ.1.08 లక్షల అప్పు తీసుకోగా ఇప్పుడు వడ్డీతో కలిసి రూ.3 లక్షలు దాటింది. డీసీసీబీ జనరల్ మేనేజర్ పి.రామాంజనేయులు ఆధ్వర్యంలో టీమ్ రికవరీకి వెళ్లగా రైతు తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని వాపోయాడు. దీంతో అధికారులు రైతుకు చెందిన బైక్‌ను స్వాధీనం చేసుకుని సంబంధిత సొసైటీకి అప్పగించారు. కూటమి ప్రభుత్వంలో రైతుల దయనీయ స్థితికి ఆ ఘటన అద్దం పడుతోంది. -
పోసాని మురళీకృష్ణపై కూటమి నేతల కుట్రలు
-
కర్నూలు జిల్లా ఆదోని త్రీటౌన్ పీఎస్ లో పోసానిపై కేసు నమోదు
-
కర్నూలు ప్రజల సమస్యలను వినడానికి కూడా ఇష్టపడని మంత్రి టీజీ భరత్
-
‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’
కర్నూలు: మరో రెండు రోజుల్లో పాఠశాలలో వేడుక ఉంది. అందులో నిర్వహించే డ్యాన్స్ కార్యక్రమంలో అందరినీ అలరించాలని ఆ బాలుడు ఎంతో ఎదురు చూశాడు. ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. ‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’ అని ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారుడు విగత జీవిగా తిరిగొచ్చాడు. తండ్రి కళ్లేదుటే ఆ కుమారుడు లారీ చక్రాల కింద నలిగిపోయాడు. ఈ ఘటన ఆదోని పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని లంగర్‌బావి వీధికి చెందిన గురురాజ, ప్రతిభ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సత్యనారాయణ 9వ తరగతి, ద్వితీయ కుమారుడు ఆదిత్యనారాయణ (10) ఐదో తరగతి చదువుతున్నారు. గురురాజ.. మెడికల్ ఏజెన్సీ వృత్తి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎమ్మిగనూరు రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదిత్యనారాయణ విద్యనభ్యసిస్తున్నాడు. అకాడమీ పూర్తి కావడంతో మంగళవారం ఫెర్వెల్ పార్టీ నిర్వహించాలని పాఠశాల యాజమాన్యం నిర్ణయించింది. ఈ సందర్భంగా విద్యార్థులతో నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం కొందరు విద్యార్థులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఆదిత్యనారాయణ ఉదయం తన తండ్రి గురురాజతో బైక్‌పై పాఠశాలకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఎమ్మిగనూరు రోడ్డులోని శ్రీ కృష్ణదేవాలయం సమీపంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ లారీ ఆదోని వైపు వేగంగా దూసుకువస్తుండగా తప్పించబోయి అదుపు తప్పి కింద పడ్డారు. అయితే గురురాజ ఒకవైపు పడిపోయి సురక్షితంగా ఉన్నాడు. మరోవైపు ఆదిత్యనారాయణ లారీ టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడు మృతిచెందినా లారీని నిలబెట్టకుండా డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లి ప్రమాద స్థలానికి చేరుకుని.. కుమారుడి జ్ఞాపకాలను తలుచుకుని రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. తండ్రి గురురాజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తప్పించుకున్న లారీ డ్రైవర్, లారీని సీసీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించారు. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.అమ్మా.. నేనేం పాపం చేశా! -
కర్నూల్ లో జీబీఎస్ కలకలం.. మహిళకు వైరస్ నిర్ధారణ
-
Kurnool Bench: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రభుత్వ ప్రతిపాదన సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. లా సెక్రటరీ హైకోర్టుకి పంపిన లేఖ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరుపున న్యాయవాది పేర్కొన్నారు. విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ... బెంచ్ ఏర్పాటుపై తమదే తుది నిర్ణయం అని తెలిపింది. ఆ లేఖ తమపై ప్రభావం చూపదని పేర్కొంది.‘‘బెంచ్ ఏర్పాటుపై స్వతంత్రంగా మేం నిర్ణయం తీసుకుంటాం. వేర్వేరు రాష్ట్రాల నుంచి బెంచ్‌ల ఏర్పాటుపై వివరాలు తెప్పించుకున్నాం. ఏపీలో బెంచ్ ఏర్పాటు అవసరం ఉందా లేదా అనే ఇతర అంశాల డేటాను తెప్పించుకుంటున్నాం’’ అని న్యాయస్థానం తెలిపింది. బెంచ్ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా?.. అప్పుడే ఎందుకు పిల్ దాఖలు చేశారని హైకోర్టు ప్రశ్నించింది.అసలు లేఖ ఇవ్వటమే న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లు అని.. అది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. మేం నిర్ణయం తీసుకున్న తర్వాత పిల్ అవసరం ఉండవచ్చు ఉండక పోవచ్చు కాబట్టి విత్ డ్రా చేసుకోవాలని పిటిషనర్‌కు కోర్టు చెప్పింది. మళ్లీ పిల్ ఫైల్ చేయటానికి కొత్త అంశాలు లేవని ఈ పిల్‌ను పెండింగ్‌లో పెట్టాలని పిటిషనర్ కోరారు. తదుపరి విచారణను 3 నెలలకు కోర్టు వాయిదా వేసింది. -
ఏపీలో బర్డ్‌ఫ్లూ కేసుల కలకలం.. ఈ సారి ఎక్కడంటే
కర్నూల్,సాక్షి: కర్నూలు నగరంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బర్డ్ ప్లూ సోకి బాతులు మృతి చెందడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కర్నూలు నగరంలోని ఎన్ ఆర్ పేటను రెడ్ అలర్ట్ జోన్‌గా ప్రకటించింది. ఎన్ఆర్ పేటలోని బెస్త రాజుకు చెందిన 15 బాతులు మృతి చెందడం, అందుకు బర్డ్ ఫ్లూ కారణమని ల్యాబ్ నుంచి నివేదిక రావడంతో చుట్టూ కిలోమీటర్ మేర రెడ్ అలర్ట్ జోన్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో చికెన్, గుడ్లు అమ్మకాలు చేపట్టకుండా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.ఆరుగురు పశు సంవర్థక శాఖ అధికారులతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. కోళ్లు, బాతులు, ఇతర పక్షులు అకస్మాత్తుగా మరణిస్తుంటే వెంటనే తగిన సమాచారం ఇవ్వాలని పశుసంవర్థక శాఖ అధికారులు కోళ్లు, బర్డ్స్ పెంపకందారులకు సూచించారు వేగంగా సోకుతున్న బర్డ్ఫ్లూరాష్ట్రంలో కోళ్లకు ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (హెచ్5ఎన్1–బర్డ్ ఫ్లూ) వేగంగా సోకుతోంది. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందనే వార్త కలవరానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు మనుషులకు బర్డ్ ఫ్లూ నమోదైన ఘటనలు చోటు చేసుకోలేదని వైద్య శాఖ స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు.పక్షుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశం అత్యంత అరుదుగా ఉంటుందని స్పష్టం చేశారు. వ్యాధి బారినపడిన పక్షులకు దగ్గరగా ఉండే వ్యక్తులకు అరుదుగా ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుందని, మనుషుల నుంచి మనుషులకు సోకిన సందర్భాలు లేవన్నారు. ఇక మనుషుల్లో బర్డ్ ఫ్లూ ఔట్ బ్రేక్స్ ఇప్పటి వరకూ సంభవించలేదని తెలిపారు. మనుషులకు వ్యాధి సోకినట్లైతే జ్వరం, దగ్గు, గొంతు మంట, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయన్నారు.ఈ వ్యాధి నుంచి రక్షణ కోసం పౌల్ట్రీ ఉత్పత్తులను బాగా ఉడికించిన తర్వాతే ఆహారంగా తీసుకోవాలని, వ్యాధి బారినపడిన కోళ్లు, జంతువులకు దూరంగా ఉండాలని వైద్య శాఖ సూచిస్తోంది. ఈ తరహా కేసులు వ్యక్తుల్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో వెలుగు చూడలేదు. గత పదేళ్లలో దేశ వ్యాప్తంగా రెండు హెచ్5ఎన్1, రెండు హెచ్9ఎన్2 కేసులు వెలుగు చూశాయి. 2019లో మహారాష్ట్రలో ఒకటి, 2021 జూలైలో హర్యానాలో ఒకటి, గతేడాది ఏప్రిల్, మే నెలల్లో పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కటి చొప్పున రెండు కేసులు నమోదయ్యాయి. -
వైఎస్ జగన్ హయాంలోనే ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
-
వైఎస్ జగన్‌తోనే నా ప్రయాణం: మంత్రాలయం ఎమ్మెల్యే
సాక్షి,కర్నూలుజిల్లా: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని మంత్రాలయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు మంగళవారం(ఫిబ్రవరి11)బాలనాగిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే ఉంటానని, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వెంటే నడుస్తానని బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యల వల్ల పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్నానని,అంతేకానీ పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు, మండల నాయకుల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తామని బాలనాగిరెడ్డి తెలిపారు. -
ఒక్కొగానొక్క కుమారుడు..ఆశల దీపం ఆరిపోయింది
చేబ్రోలు/వెల్దుర్తి : ఒక్కొగానొక్క కుమారుడు. బాగా చదివి ప్రయోజకుడై కుటుంబానికి ఆసరాగా ఉంటాడని తల్లిదండ్రులు కలలుగన్నారు. వారి కలలను మృత్యువు పొట్టన పెట్టుకుంది. ఉన్నత విద్య చదువుకునేందుకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామ పరిధిలోని గుంటూరు – తెనాలి రహదారిలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. కర్నూలుకు చెందిన లక్ష్మీరెడ్డి, ఊర్మిల దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సొంతూరు వెల్దుర్తి కాగా ఉపాధి నిమిత్తం కర్నూలుకు చేరుకుని అక్కడే స్థిర పడ్డారు. వీరి కుమారుడు మణికంఠేశ్వరరెడ్డి(25) గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి యూనివర్సిటీ సమీపంలో రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో మణికంఠేశ్వరరెడ్డి దుర్మరణం చెందాడు. మృతుడి తండ్రి లక్ష్మీరెడ్డి కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా ఏరియాలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు మణికంఠేశ్వరరెడ్డి బీఎస్సీ అగ్రికల్చర్ డెహ్రాడూన్‌లో పూర్తి చేశాడు. ఎంబీఏ కోసం చేబ్రోలు వచ్చాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెల్దుర్తి వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బొమ్మన రవిరెడ్డి, పలువురు నేతలు, కుటుంబసభ్యులు చేబ్రోలు చేరుకున్నారు. చేబ్రోలు ఎస్ఐ డి.వెంకట కృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. -
అమరావతికి ‘ఏపీఈఆర్సీ’ తరలింపు!
సాక్షిప్రతినిధి కర్నూలు : ‘‘నాలుగు సందర్భాలు.. నాలుగు రకాల ప్రకటనలు..! నోరు ఒకటి చెబుతుంది.. చేతలు మరొకటి.. దేనిదోవ దానిదే..!’’ అన్నట్లుంది సీఎం చంద్రబాబు సర్కారు తీరు. కర్నూలులో ఇప్పటికే ఏర్పాటు చేసిన సంస్థలను తరలించబోమని, అవి అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా చెప్పిన మూడు నెలలకే ఏపీఈఆర్సీ (రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి)ని అమరావతికి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కు అనుకూల భవనాలను అత్యవసరంగా పరిశీలించి నివేదిక పంపాలంటూ ఈ నెల 29న కలెక్టర్ రంజిత్‌బాషాకు హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) లేఖ రాశారు. ఈ క్రమంలో ఏపీఈఆర్సీ భవనాలతోపాటు జగన్నాథగట్టుపైన నిర్మించిన క్లస్టర్ యూనివర్సిటీ భవనాలు, నన్నూరు టోల్ ప్లాజా సమీపంలోని ఓ ప్రైవేట్ భవనాలను పరిశీలించి అధికార యంత్రాంగం నివేదిక పంపింది. ఈ మూడింటిలో ఏపీఈఆర్సీ భవనంపై హైకోర్టు బృందం సుముఖత చూపినట్లు తెలుస్తోంది. హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీ ఈ నెల 6వతేదీన కర్నూలులోని ఏపీఈఆర్సీ భవనాన్ని పరిశీలించనుంది. కమిటీలో సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ రఘునందన్‌రావు, జస్టిస్ ఎన్.జయసూర్య, జస్టిస్ బి.కృష్ణమోహన్ సభ్యులుగా ఉన్నారు. రూ.25 కోట్లతో అత్యాధునికంగా.. కర్నూలులో ఏపీఈఆర్సీకి సొంత భవనాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.25 కోట్లతో అత్యాధునికంగా నిర్మించింది. ఇందులో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించడంతో పాటు ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిథి గృహాలను ఏర్పాటు చేశారు. గతేడాది మే 23న దీన్ని ప్రారంభించారు. ప్రభుత్వం కొత్తగా నిర్మించిన భవనం కావడం.. అన్ని వసతులు ఉండటం.. సిటీలోనే ఉన్నందున ప్రజల రాకపోకలకు వీలుగా ఉంటుందని దీన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా కోస్తా, ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం 2023 ఆగస్టు 18న ప్రారంభమైంది. నేషనల్ లా వర్సిటీ సంగతి ఏమిటి? వైజాగ్‌లో ఇప్పటికే నేషనల్ లా యూనివర్సిటీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టుబట్టి కర్నూలులో మరో లా వర్సిటీని మంజూరు చేయించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రెండు లా యూనివర్సిటీలు లేవు. కర్నూలులో 273 ఎకరాల్లో నిర్మించాలని భావించిన ‘జ్యుడీషియల్ సిటీ’లో 100 ఎకరాల్లో నేషనల్ లా యూనివర్సిటీని నిర్మించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం భావించింది. దీనికి రూ.వెయ్యి కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది.ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్రెడ్డి దీనికి భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగస్టులో బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులతో సమావేశం సందర్భంగా అమరావతిలో ‘నేషనల్ లా యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించారు. కర్నూలుతో సంబంధం లేకుండా అమరావతిలో మరొకటి నిర్మిస్తున్నారా? లేక కర్నూలు లా యూనివర్సిటీకి మంగళం పాడనున్నారా? అనేది స్పష్టత ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత యూనివర్సిటీ పనుల్లో ఎలాంటి ముందడుగు లేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే న్యాయ సంస్థలను ఒక్కొక్కటిగా అమరావతికి తరలించడంతో పాటు లా వర్సిటీ నిర్మాణాన్ని పక్కనపెట్టనున్నట్లు స్పష్టమవుతోందని న్యాయవాదులు, అధికారవర్గాలు చెబుతున్నాయి. టీడీపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సీమ నుంచి అత్యధికంగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు దక్కాయి. ఇంత మెజార్టీ కూటమికి ఇచ్చినందుకు కర్నూలుకు హైకోర్టును ఎత్తివేసి బెంచ్‌కు పరిమితం చేయడం, న్యాయ సంస్థలను ఒక్కొక్కటిగా తరలించడం ‘సీమ’కు చంద్రబాబు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అని మండిపడుతున్నారు. ఏపీఈఆర్సీ భవనంలోనే హైకోర్టు బెంచ్..! హైకోర్టు బెంచ్‌ను ఏపీఈఆర్సీ భవనంలోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మూడు ప్రతిపాదనల్లో ఇదే ఉత్తమమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కర్నూలు సిటీ (కలెక్టరేట్) నుంచి జగన్నాథగట్టుపై ఉన్న క్లస్టర్ యూనివర్సిటీ 17.5 కిలోమీటర్లు దూరంలో ఉంది. నన్నూరు టోల్‌ప్లాజా సమీపంలోని ప్రైవేట్ భవనం 11 కి.మీ. దూరంలో ఉంది. ఏపీఈఆర్సీ 3.5 కి.మీ. దూరంలో నగరానికి చేరువలో ఉన్నందున దీనివైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.సీఎంగారూ.. ఇప్పుడేమంటారు? కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసి ‘న్యాయ రాజధాని’గా అభివృద్ధి చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంక్షించారు. అందులో భాగంగానే ఏపీఈఆర్సీ, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టులను కర్నూలులో ఏర్పాటు చేశారు. లోకాయుక్త, హెచ్ఆర్సీ ఏర్పాటుపై మద్దిపాటి శైలజ 2021లో హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా ఆ సంస్థలను అమరావతికి తరలించేలా నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం తెలిపింది. దీనిపై విపక్ష పార్టీలు, రాయల సీమ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో కర్నూలులో నెలకొల్పిన సంస్థలను తరలించబోమని, అవి అక్కడే ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గతేడాది నవంబర్‌లో అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా ప్రకటించారు. దీనికి విరుద్ధంగా ఇప్పుడు హైకోర్టు బెంచ్‌ను కర్నూలులోని ఏపీఈఆర్సీ భవనంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధపడటాన్ని బట్టి ఆ సంస్థను అమరావతికి తరలించడం లాంఛనమే అని స్పష్టమవుతోంది. కర్నూలులో బెంచ్ ఏర్పాటైన తర్వాత మిగతా సంస్థలను కూడా అమరావతికి తరలించే అవకాశం ఉన్నట్లు కూటమి ప్రభుత్వం చర్యలు స్పష్టం చేస్తున్నాయి. » లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) కార్యాలయాలను కర్నూలు నుంచి అమరావతికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో దీనికి సంబంధించి చట్ట సవరణ చేస్తాం. ఆపై తరలింపు నోటిఫికేషన్ జారీ చేస్తాం’ – నవంబర్ 13న హైకోర్టుకు స్పష్టం చేసిన కూటమి ప్రభుత్వం. » ‘లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కర్నూలులోనే ఉంటాయి. ఇప్పటికే నెలకొల్పిన సంస్థలను తరలించబోం. ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్‌తో చర్చించాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం’ – నవంబర్ 15న మంత్రి టీజీ భరత్ ప్రకటన » ‘కర్నూలులో ఏర్పాటు చేసిన సంస్థలను అమరావతికి తరలించం. వాటిని అక్కడే ఉంచుతాం. హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం’ – గత నవంబర్‌లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన » ‘ఈ నెల 6న హైకోర్టు న్యాయమూర్తుల బృందం కర్నూలుకు వస్తోంది. దిన్నెదేవరపాడు వద్ద నిర్మించిన ఏపీఈఆర్సీ భవనాన్ని పరిశీలిస్తారు’ – తాజాగా న్యాయశాఖ మంత్రి ఫరూక్ వ్యాఖ్యలు -
ఎమ్మెల్యే అఖిలప్రియకు భూమా కిషోర్‌రెడ్డి సవాల్
సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డలో కూటమి ప్రభుత్వం అరాచకాలపై వైఎస్సార్సీపీ నేత భూమా కిషోర్ రెడ్డి మండిపడ్డారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. చర్చకు సిద్ధంగా ఉన్నామని.. అన్ని ఆధారాలతో నిరూపిస్తామని సవాల్ విసిరారు. వైఎస్ జగన్‌పై అఖిల ప్రియ ఆరోపణలు చేయడం అవివేకం. విజయ పాల డైరీలో బకాయిలు, మేము ఎత్తిచూపించాము. అఖిల ప్రియా, ఆమె సోదరుడు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారు. కొత్తూరు కోట కొండల్లో మైనింగ్ చేసి ఇటుక బట్టిలకు మట్టిని అమ్ముకుంటున్నారు.. ఆళ్లగడ్డలో బెదిరింపులు పాల్పడుతూ.. రాజకీయాలు చేస్తున్నారు. విజయ డెయిరీ చైర్మన్, డైరెక్టర్‌ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడ్డదారులో చైర్మన్ కావాలని చూస్తున్నారు’’ అని కిషోర్ రెడ్డి మండిపడ్డారు.జగత్ విఖ్యాతరెడ్డి విజయ డెయిరీ ఎన్నికలకు అర్హుడు కాదు. ప్రజల కోసం ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం తాము కృషి చేస్తున్నాం. వారి వ్యవహార శైలి నచ్చకపోవడంతో కార్యకర్తల, ప్రజలు వ్యతి రేకిస్తున్నారు’’ అని కిషోర్‌రెడ్డి అన్నారు. -
‘కూటమి సర్కార్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం’
సాక్షి, కర్నూలు: పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్న 46 శాతం ఓటింగ్ వచ్చిందని.. పార్టీ భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు.‘‘అన్ని వర్గాలతో కలిసి ఐక్యంగా ముందుకెళ్లాలి. త్వరలోనే వైఎస్ జగన్ ప్రజల్లోకి వస్తారు. మీ సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావాలి. కూటమి ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించింది. రెండు సంవత్సరాల పాటు తూచ తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్న చెప్పిన మాట ప్రకారం అమలు చేశారు. కరోనా కాలంలో చంద్రబాబు, నారా లోకేష్ హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఏ ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని పెద్దిరెడ్డి చెప్పారు. ఇదీ చదవండి: బడ్జెట్లో ఏపీకి నిల్! -
హైకోర్టు పోయె.. బెంచ్ వచ్చె!
సాక్షి, అమరావతి / సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమవాసుల హైకోర్టు ఆశలకు శాశ్వతంగా గండికొట్టిన టీడీపీ ప్రభుత్వం.. కర్నూలులో బెంచ్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ద్వారా న్యాయ రాజధానిగా చేయాలనే సంకల్పంతో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan mohan Reddy) ప్రభుత్వం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు, ఏపీఈఆర్సీని కర్నూలులో ఏర్పాటు చేసింది. ఇందులో ఏపీఆర్సీకి శాశ్వత భవనాన్ని నిర్మించింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని, కర్నూల్లో బెంచ్ మాత్రమే ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో కర్నూలులో 15 మంది న్యాయమూర్తులకు సరిపడా వసతి, నివాస సదుపాయాలు, కోర్టు రూములు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి ఇతర సౌకర్యాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తమ ముందుంచాలని కలెక్టర్ రంజిత్ బాషాను హైకోర్టు(High Court) ఆదేశించింది.కర్నూలులో బెంచ్ ఏర్పాటు విషయంలో ప్రధాన న్యాయమూర్తి నియమించిన న్యాయమూర్తుల కమిటీ ముందు ఉంచేందుకు వీలుగా ఈ వివరాలను అందచేయాలని పేర్కొంటూ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) శ్రీనివాస శివరామ్ ఈ నెల 29న కలెక్టర్‌కు లేఖ రాశారు. దీన్ని అత్యవసరంగా భావించాలని కోరడంతో కలెక్టర్ తక్షణమే స్పందించి ఆర్ అండ్ బీ ఎస్ఈ, మునిసిపల్ కమిషనర్, ఆర్డీవోలకు ఈ బాధ్యతను అప్పగించగా.. కర్నూలులో మూడు భవనాలను ‘బెంచ్’ కోసం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండేలా..కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు భవనం కోసం ప్రధానంగా ఏపీఈఆర్సీ భవనాన్ని అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. అధికారులు ప్రతిపాదించిన మూడు భవనాల్లో ఇదే కొత్తది కావడం, ప్రజలకు అందుబాటులో ఉన్నందున ఇక్కడే హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తారనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. భవనాల గుర్తింపు కోసం ప్రభుత్వం కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు మొత్తం మూడు భవనాలను సూచించినట్లు చెబుతున్నారు. ఇందులో ఏపీఈఆర్సీ భవనంతోపాటు జగన్నాథగట్టుపై నిర్మిస్తున్న క్లస్టర్ యూనివర్సిటీ భవనం, హైదరాబాద్–చెన్నై సమీపంలోని ఓ ప్రైవేట్ భవనం ఉన్నాయి. వీటి వివరాలను కలెక్టర్ గురువారం రిజిస్ట్రార్‌కు పంపినట్లు సమాచారం. దీనిపై కలెక్టర్‌ను వివరణ కోరగా.. భవనాలను పరిశీలిస్తున్నామని, ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించారు. కాగా, ఒకవేళ జగన్నాథ గట్టుపై ఉన్న భవనాలను హైకోర్టు బెంచ్(High Court Bench) కోసం ప్రతిపాదిస్తే అక్కడున్న క్లస్టర్ యూనివర్సిటీని సిల్వర్ జూబ్లీ కాలేజీ భవనాలకే పరిమితం చేసే అవకాశం ఉంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయంతో ఏపీఈఆర్సీని అమరావతికి తరలించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంత్రివర్గం తీర్మానం కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటును ఆమోదిస్తూ గతేడాది అక్టోబర్‌లో రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. అటు తరువాత అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలియచేసే నిమిత్తం ఫుల్ కోర్టుకు నివేదించాలని కోరుతూ న్యాయశాఖ కార్యదర్శి గత ఏడాది అక్టోబర్ 28న హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్‌కి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బెంచ్ ఏర్పాటుపై నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కమిటీని నియమించారు. జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఇప్పటికే ప్రాథమికంగా సమావేశమైనట్లు తెలిసింది. కమిటీ నివేదికను ప్రధాన న్యాయమూర్తి ఫుల్‌కోర్టు ముందుంచి చర్చించే అవకాశం ఉంది. ఫుల్‌కోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా కర్నూలులో శాశ్వత బెంచ్ ఏర్పాటు ఓ కొలిక్కి వస్తుంది.15 మంది న్యాయమూర్తుల కేటాయింపు?కర్నూలులో శాశ్వత బెంచ్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందుకున్న తరువాత జిల్లాల వారీగా దాఖలైన కేసుల గణాంకాలను హైకోర్టు సిద్ధం చేసినట్లు తెలిసింది. హైకోర్టులో మొత్తం కేసుల్లో 40 శాతం రాయలసీమ జిల్లాల నుంచే దాఖలవుతున్నాయి. దీని ఆధారంగా కర్నూలులో ఏర్పాటయ్యే శాశ్వత బెంచ్ న్యాయమూర్తుల సంఖ్యను ప్రాథమికంగా ఖరారు చేసినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ప్రస్తుతం 30 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 40 శాతం కేసులు రాయలసీమ నుంచి దాఖలవుతున్నందున మొత్తం 37 మంది న్యాయమూర్తుల్లో అందుకు అనుగుణంగా 15 మందిని కర్నూలు(Kurnool) బెంచ్‌కు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన 22 మంది న్యాయమూర్తులు అమరావతిలో ఉన్న హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్‌లో న్యాయమూర్తులుగా కొనసాగే వీలుంది. ఈ క్రమంలోనే కర్నూలులో 15 మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాల గురించి ఆరా తీస్తూ కర్నూలు కలెక్టర్‌కు హైకోర్టు లేఖ రాసినట్లు భావిస్తున్నారు.కర్నూలు బెంచ్ పరిధిలోకి ప్రకాశం, నెల్లూరు?ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి రాయలసీమ జిల్లాలతో కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది. అయితే దీన్ని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన నాయకులు, న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. కర్నూలు వెళ్లాలంటే తమకు నేరుగా రైలు సౌకర్యం లేదని, రోడ్డు ద్వారా వెళ్లాలంటే కనీసం 7 నుంచి 9 గంటల సమయం పడుతుందని ఇరు జిల్లాల వారు ప్రభుత్వానికి నివేదించారు. అయితే వీరి అభ్యంతరాలను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. -
చంద్రబాబు వ్యాఖ్యలపై మహిళలు ఫైర్
-
ఫీల్డ్ అసిస్టెంట్ హత్య టీడీపీ పాపమే!..
సాక్షి ప్రతినిధి కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. లంచాలు తీసుకుంటూ, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉద్యోగులను మార్చడంలో భాగంగానే ఈరన్న హత్య జరిగినట్టు తెలుస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఆశించి నియోజకవర్గ టీడీపీ కీలక నేతకు డబ్బులిచ్చిన వ్యక్తి ఈరన్నను హత్య చేసినట్టు అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విశ్వసనీయ వర్గాలు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హరికెర గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్‌గా 2019 నుంచి ఈరన్న కొనసాగుతున్నాడు.టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరన్నను ఫీల్డ్ అసిస్టెంట్‌గా తప్పించాలని టీడీపీ నేతలు భావించారు. నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత ఒకరు ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ దుకాణాలతో పాటు ఇతర పోస్టుల్లో లంచాలు తీసుకుని నియమింపచేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి నియోజకవర్గ నేతకు రూ.3 లక్షలు లంచమిచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులో తనను నియమించాలని కోరాడు. దీంతో ఆ నేత ఈరన్నను తప్పుకోవాలని రెండు నెలలుగా ఒత్తిడి చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించేలా గ్రామస్తులు, పంచాయతీ తీర్మానం చేసినట్టు సర్పంచ్ లేఖ ఇవ్వాలి.కాగా.. గ్రామ సర్పంచ్ నాగరాజుకు, నియోజకవర్గ టీడీపీ నేత మధ్య విభేదాలున్నాయి. దీంతో సర్పంచ్ లేఖ ఇవ్వలేదు. టీడీపీ కీలక నేత ఈరన్నపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయడంతో పాటు బెదిరించాడు. ఈ పరిస్థితుల్లో డబ్బులిచ్చిన వ్యక్తి ఈరన్నను మట్టుపెడితే తప్ప తనకు పోస్టు రాదని భావించి అతడిని హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. మరోవైపు రాజీనామాకు సిద్ధపడిన ఈరన్నకు ఈ నెలాఖరు వరకూ విధులు నిర్వర్తిస్తేనే జనవరి వేతనం వస్తుందని అధికారులు చెప్పారు.దీంతో నెలాఖరు వరకూ పనిచేసి రాజీనామా చేయాలని ఈరన్న నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉపాధి హామీ పనుల నుంచి వస్తున్న ఈరన్నను కొందరు దారిలో ఆపి కళ్లల్లో కారం చల్లి కిరాతకంగా హత్య చేశారు. ఈరన్నను గ్రామానికి చెందిన గాదె లింగప్ప, గోవర్ధన్, గోపి, రామదాసు మరికొందరు కలిసి హతమార్చారని ఈరన్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.లంచాలు తీసుకుని పోస్టుల్లో నియామకంటీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర పోస్టులకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ లంచాలు తీసుకుంటున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఈ నెల 18న ఆరోపణలు చేశారు. ఇది జరిగిన వారానికే లంచాలతో పోస్టు మార్పునకు సిద్ధపడిన టీడీపీ నేత వల్ల హత్య జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని పి.కోటకొండ ఫీల్డ్ అసిస్టెంట్‌ను మార్చి మరొకరిని నియమించేందుకు నియోజకవర్గ కీలక నేత రూ.6 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో 50 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చేందుకు లేఖలు ఇవ్వగా.. ఇప్పటివరకు 11 మందిని మార్చినట్టు తెలుస్తోంది. -
ఏపీలో ఆగని రెడ్ బుక్ అరాచకాలు
-
ఇంట్లో సాఫ్ట్ వేర్ కొలువు..పొలంలో ప్రకృతి సేద్యం
ఇంటి దగ్గరి నుంచే విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూనే 8.5 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలుకు చెందిన యు. బాల భాస్కర శర్మ. ఎంటెక్ చదివి సింగపూర్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఆయన కరోనా సమయంలో కర్నూలుకు వచ్చారు. ఇప్పటికీ అదే హోదాలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూనే నిబద్ధతతో కూడిన ప్రకృతి వ్యవసాయం లో అద్భుతంగా రాణిస్తున్నారు. సొంత స్టోర్ నిర్వహించటంతో పాటు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలతో పాటు కలెక్టరేట్లో ప్రతి సోమవారం కూరగాయలు విక్రయిస్తూ అందరి చేతా ఔరా అనిపిస్తున్నారు.సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూనే ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న బాల భాస్కర శర్మ కృషి ప్రశంసనీయం. కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు గ్రామం వద్ద‡వారసత్వంగా సంక్రమించిన 8.5 ఎకరాల భూమిలో అంబా గో ఆధారిత వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. 75 సెంట్లలో పాలీహౌస్ ఏర్పాటు చేసుకొని అందులో అనేక కొత్త పంటలు పండిస్తున్నారు. పెనుగాలులు, భారీ వర్షాలకు దెబ్బతింటున్నందున సాధారణంగా ఉద్యాన శాఖ పాలీహౌస్‌లను ప్రోత్సహించటం లేదు. అయితే, శర్మ తన పొలం చుట్టూ గాలులను తట్టుకునేలా నేరేడు, రేగు తదితర పండ్ల చెట్లు పెంచి, మధ్యలో పాలీహౌస్ నిర్మించి, సమర్థవంతంగా నిర్వహించటం విశేషం. జిల్లాకు పరిచయమే లేని వెల్లుల్లి, బ్రకోలి తదితర అనేక రకాల కూరగాయలను పాలీహౌస్లో సాగు చేస్తున్నారు. బ్రకోలిని కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. పాలిహౌస్‌లో వంగ, బీర, టొమాటో, పచ్చి మిరప, కాళీఫ్లవర్, క్యాబేజీ, ఎర్ర క్యాబేజి, ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, బీన్స్, చిక్కుడు, కాకర, క్యాప్సికం, ఎర్రబెండ, సొర, పొట్ల, తంబకాయ, బుడం కాయ, కీరదోసతో పాటు.. ఎర్రతోట కూర, కొత్తిమీర, పుదీన, గోంగూర, తోటకూర, పాలకూర, బచ్చలి, చుక్కకూర, మెంతికూర వంటి 35 పంటలు సాగు చేస్తున్నారు. ఎతై ్తన బోదెలు ఏర్పాటు చేసుకొని మల్చింగ్, వీడ్ మ్యాట్ వేసి మొక్కలు నాటుకున్నారు. ఆరుబయట పొలాల్లో 3 నెలలు దిగుబడినిచ్చే కూరగాయలు పాలీహౌస్లో 5 నెలల వరకు దిగుబడినిస్తున్నాయి.పండ్ల చెట్లు.. ఫైనాపిల్ కూడా..7.75 ఎకరాల్లో చాలా రకాల పండ్ల చెట్లను పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో శర్మ పెంచుతున్నారు. నిమ్మ 250, జామ 200, సీతాఫలం 200, మామిడి 40, అంజూర 100, నేరెడు 200, మునగ 200, అరటి 80 చెట్లతో పాటు కొన్ని సపోటా, కొబ్బరి, ఉసిరి, నేరెడు, రేగు, రామాఫలం చెట్లు పెంచుతున్నారు. రాయలసీమప్రాంతంలో ఇంతవరకూ లేని ఫైనాపిల్ మొక్కలను కూడా పెంచుతున్నారు. మధురై నుంచి ఎర్రబెండ సీడ్ తెప్పించి నాటుకున్నారు.ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెటింగ్కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు దగ్గర ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటు చేయటంతో పాటు బాలబాస్కర శర్మ ఆన్లైన్ మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించారు. తను పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు కెమికల్స్ లేకుండా ఆహార పంటలు పండిస్తున్న రైతుల నుంచి బియ్యం, పప్పులు, పసుపు తదితరాలను సేకరించి విక్రయిస్తున్నారు. 8 దేశీ ఆవులను పోషిస్తూ నాలుగు ట్యాంకుల ద్వారా ద్రవ జీవామృతం పంటలకు ఇస్తున్నారు. వర్మీ కంపోస్టుతో పాటు రోజుకు 40 లీటర్ల వర్మీవాష్ కూడా ఉత్పత్తి చేసి డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. చీడపీడల నివారణకు అవసరాన్ని బట్టి కషాయాలు, వేపనూనె తదితరాలను వాడుతున్నారు. సోలార్ ట్రాప్స్, తెలుపు, పసుపు జిగురు అట్టలను ఏర్పాటు చేశారు. పండ్ల తోటలకు నష్టం కలిగించే పండు ఈగ ట్రాప్‌కు ఏర్పాటు చేశారు. అన్ని పంటలకు డ్రిప్ సదుపాయం కల్పించారు.రసాయనాల్లేకుండా పండించిన పంట కావడం వల్ల కూరగాయలు, ఆకు కూరలకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. శర్మ కృషిని గుర్తించిన కర్నూలు జిల్లా యంత్రాంగం.. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రత్యేకంగా కెమికల్స్ లేకుండా పండించిన కూరగాయలు విక్రయించేందుకు అవకాశం ఇచ్చిప్రోత్సహిస్తుండటం విశేషం. ఇంటి దగ్గరి నుంచే విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూనే 8.5 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలుకు చెందిన యు. బాల భాస్కర శర్మ. ఎంటెక్ చదివి సింగపూర్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఆయన కరోనా సమయంలో కర్నూలుకు వచ్చారు. ఇప్పటికీ అదే హోదాలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూనే నిబద్ధతతో కూడిన ప్రకృతి వ్యవసాయం లో అద్భుతంగా రాణిస్తున్నారు. సొంత స్టోర్ నిర్వహించటంతో పాటు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలతో పాటు కలెక్టరేట్లో ప్రతి సోమవారం కూరగాయలు విక్రయిస్తూ అందరి చేతా ఔరా అనిపిస్తున్నారు.రసాయనాల్లేని ఆహారం అందిస్తున్నా..!సింగ్‌పూర్‌లో 2020 వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశా. కరోనా కారణంగా ఇంటికి వచ్చేశా. ఇంటి నుంచే సాఫ్ట్వేర్ ఉద్యోగం చే స్తూ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకున్నా. 8 ఆవులను పెంచుతూ పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. మా వ్యవసాయ క్షేత్రంలో కెమికల్స్ వాసన అనేది ఉండదు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో కూరగాయల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు జిల్లా కలెక్టర్ అవకాశం ఇచ్చారు. ప్రత్యేక స్టోర్‌తో పాటు వెబ్సైట్ ద్వారా కూడా విక్రయిస్తున్నాం. రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తదితర ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నామనే సంతోషం ఉంది. ఎర్ర బెండకాయకు మంచి ఆదరణ ఉంది. పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర బెండకాయను ప్రజలు ఇష్టంగా తీసుకుంటున్నారు.– యు. బాల భాస్కర శర్మ (62817 00553), సాఫ్ట్వేర్ ఇంజనీర్ కమ్ ప్రకృతి రైతు, కర్నూలు– గవిని శ్రీనివాసులు, సాక్షి కర్నూలు (అగ్రికల్చర్) -
అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు.. CPI నేతలు సీరియస్ వార్నింగ్
-
పట్టు జారి పోతోంది!
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మల్బరీ సాగు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి వ్యయం రెట్టింపు అవుతున్నా రైతులకు సబ్సిడీలు అందడం లేదు. గతంలో కిలో పట్టుగూళ్లకు రూ.400 నుంచి రూ.500 వరకు వస్తుంటే నేడు కూడా అదే ధర పలుకుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పట్టుగూళ్ల మార్కెటింగ్ సదుపాయం లేదు. నష్టాలు ఎక్కువగా ఉండటంతో రైతులు మల్బరీ సాగుకు దూరమవుతున్నారు.కర్నూలు(అగ్రికల్చర్): మల్బరీ తోటల సాగుపై, పట్టు పురుగుల పెంపకంపై రైతులు అనాసక్తి చూపుతున్నారు. ప్రత్యామ్నాయంగా పొగాకు, మినుము వంటి పంటలు సాగు చేస్తున్నారు. గతంలో ఆదోని ప్రాంతంలోని దొడ్డనగేరి, జాలిమంచి, కోసిగి, ఇస్వీ ప్రాంతాల్లో గతంలో ఎటు చూసినా మల్బరీ తోటలు ఉండేవి. ఈ ప్రాంతంలో పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం ఉండేది. అయితే క్రమంగా ఈ ప్రాంతంలో మల్బరీ సాగు తగ్గుతూ వచ్చి నేడు పూర్తిగా కనుమరుగైంది. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న పట్టుపరిశ్రమల శాఖ ఏడీ కార్యాలయాన్ని ప్యాపిలికి మార్చారు. అక్కడ కూడా మల్బరీ సాగు తగ్గడంతో కార్యాలయం కర్నూలుకు వచ్చింది. గతంలో వెల్దుర్తి మండలం బోయినపల్లి, సూదేపల్లి, కోడుమూరు మండలం లద్దగిరి గ్రామాలు మల్బరీ సాగుకు నెలవుగా ఉండేవి. నేడు ఈ ప్రాంతాల్లో మల్బరీ సాగు కనిపించడం లేదు. నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు, ఆత్మకూరు మండలాల్లో 2,000 ఎకరాల్లో మల్బరీ సాగు ఉండేది. ఆత్మకూరులో ప్రత్యేకంగా అసిస్టెంటు డైరెక్టర్కార్యాలయం కూడా ఉంది. అయితే నేడు పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఆత్మకూరు ఏడీ పరిధిలో 50 ఎకరాల్లో కూడా మల్బరీ సాగు కనిపించడం లేదు. ఎందుకు ఇలా? ఉమ్మడి కర్నూలు జిల్లాలో మల్బరీ సాగు 80 శాతంపైగా పడిపోయినా సెరికల్చర్, సహాయ సెరికల్చర్ ఆఫీసర్లు, సాంకేతిక సహాయకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాకాలు లేకపోవడం, పట్టుగూళ్ల ధరల్లో పురోగతి లేకపోవడంతో రైతులు పట్టుకు ప్రత్యామ్నాయంగా పొగాకు, మినుము వంటి పంటలు సాగు చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడి వ్యయం పట్టు సాగులో పెట్టుబడి వ్యయం పెరిగిపోయింది. పట్టు పురుగుల పెంపకానికి షెడ్ అత్యవసరం. ఇందుకు రూ.15 లక్షల వరకు ఖర్చు వస్తోంది. ప్రభుత్వం గతంలో ఇస్తున్న సబ్సిడీ రూ.3 లక్షలే ప్రస్తుతం అందిస్తోంది. రెండుఎకరాల్లో మల్బరీ మొక్కలకు రూ.45 వేలు, వ్యాధి నిరోధకాలకు రూ.5000. సూట్‌కు రూ.40 వేలు, వరండాకు రూ.30 వేలు, నేత్రికలకు రూ.50 వేలు ప్రకారం సబ్సిడీలు ఉన్నాయి. సబ్సిడీలు పోను మొక్కలు నాటుకోవడానికి రైతులకు రూ.20 వేలు, వ్యాధి నిరోధకాలకు రూ.12 వేలు, సూట్‌కు రూ.1.50 లక్షలు, వరండాకు రూ.లక్ష, నేత్రికలకు రూ.10 వేలు, చాకి పురుగులకుఏడాదికి రూ.50 వేల వరకు ఖర్చు వస్తోంది. మొత్తం పెట్టుబడి వ్యయం రూ.20 లక్షల వరకు ఉండగా.. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రూ.4.80 లక్షలు సరిపోవడం లేదు. పట్టుగూళ్లకు హిందూపురం, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో మార్కెటింగ్ సదుపాయం ఉంది. ఉమ్మడి జిల్లాలో మార్కెటింగ్ సదుపాయం లేదు. దీంతో రైతులకు నికరాదాయం రావడం లేదు. పట్టుపురుగులపై పురుగుమందుల ప్రభావంఏడెనిమిదేళ్లుగా కంది, పత్తి, మినుము, మిర్చి, మొక్కజొన్న, వరి తదితర పంటల్లో పురుగు మందుల వాడకం భారీగా పెరిగింది. ఈ ప్రభావం చుట్టుపక్కల ఉన్న పట్టు పురుగులపై పడుతోంది. పట్టు పురుగులు చాలా సున్నితంగా ఉంటాయి. గాలి వాటంగా వస్తున్న పురుగుమందుల ప్రభావానికి లోనై మరణిస్తున్నాయి. డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామం పరిసరాల్లో రెండు, మూడేళ్ల క్రితం ఫెస్టిసైడ్ కంపెనీ ఏర్పాటు అయింది. దీని ప్రభావం వెల్దుర్తి మండలం సూదేపల్లిలో సాగు చేస్తున్న పట్టు పరిశ్రమపై పడుతోంది. ఉమ్మడి జిల్లాలో పట్టు పరిశ్రమ మనుగడ కోల్పోతుండటానికి పురుగు మందుల పిచికారీ ప్రభావం కూడా ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాగుకు స్వస్తి పలికాం పట్టు సాగులో విశేషంగా రాణిస్తున్నందుకు నాకు గతంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రైతు అవార్డు వచ్చింది. బైవోల్టెన్ పట్టు గూళ్ల ఉత్పత్తికి గతంలో కిలోకు రూ.50 ఇంటెన్సివ్ లభించేది. ప్రస్తుతం రైతులకు ఇది లేకుండా పోయింది. పెట్టుబడి వ్యయం ఎక్కువవుతున్నా సబ్సిడీలు పెరగడం లేదు. పట్టు గూళ్ల ధరలు పెరగకపోవడంతో పట్టు సాగుకు స్వస్తి పలికి పొగాకు, మినుము తదితర వాటిపై ఆసక్తి చూపుతున్నాం. – భాస్కరరెడ్డి, ఆత్మకూరునష్టాలు మూట కట్టుకుంటున్నాం పట్టులో ఏడాదికి 5 నుంచి 8 పంటలు తీయవచ్చు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. మూడు, నాలుగు పంటలే గగనం అవుతున్నాయి. ఒక్కోపంటకు రూ.80 వేలకుపైగా ఖర్చు వస్తోంది. పెట్టుబడి వ్యయం రూ.2.50 లక్షలు అయ్యింది. మూడు పంటలపై వచ్చిన పట్టుగూళ్లను అమ్మగా కేవలం రూ.1.90 లక్షలు మాత్రమే వచ్చింది. నష్టాలు మూట గట్టుకున్నాం. – మధుసూదన్, రామసముద్రం, జూపాడుబంగ్లా మండలంఫిర్యాదులు వస్తున్నాయి డోన్ మండలం ఉడుములపాడు సమీపంలో ఉన్న కెమికల్స్ ఫ్యాక్టరీ ప్రభావం సూదేపల్లి సాగు చేస్తున్న మల్బరీపై పడుతున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. మల్బరీ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఏడాదికేడాది పురుగు మందుల వినియోగం పెరుగుతోంది. దీంతో మల్బరీ సాగు నుంచి కొంతమంది రైతులు దూరం అవుతున్నారు. మల్బరీ సాగును ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – విజయకుమార్, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి, కర్నూలు -
వైఎస్ జగన్ తెచ్చిన గ్రీన్కో ప్రాజెక్ట్‌లపై పవన్ ప్రశంసలు
-
వైఎస్ జగన్ తెచ్చిన గ్రీన్ కో ప్రాజెక్ట్‌పై పవన్ కల్యాణ్ ప్రశంసలు
సాక్షి, కర్నూలు: వైఎస్ జగన్ తెచ్చిన గ్రీన్ కో ప్రాజెక్ట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. విమర్శించడానికి వెళ్లిన పవన్‌కి ప్రాజెక్ట్ చూశాక షాక్ అయ్యారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు, ఉల్లంఘనలు ఉన్నాయంటూ తనిఖీకి వెళ్లిన పవన్.. అద్భుతమైన ప్రాజెక్టును చూసి ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ప్రాజెక్ట్‌ను వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చింది. 2022, మే 17న ప్రాజెక్ట్‌ను అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.చంద్రబాబు సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టులో అటవీ భూముల ఆక్రమణ జరిగిందని పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. అటవీ, పర్యావరణ ఉల్లంఘనలు తనిఖీ చేయడానికి వచ్చిన పవన్.. తనిఖీ అనంతరం గ్రీన్ కో ప్రాజెక్ట్‌కు కితాబు నిచ్చారు. ఇన్నాళ్లు వైఎస్ జగన్ హయాంలో పరిశ్రమలు వెళ్లిపోయాయంటూ చంద్రబాబు, పవన్ దుష్ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ జగన్ తెచ్చిన పరిశ్రమనే అద్భుతమని పవన్ కల్యాణ్ అంగీకరించారు.ఇదీ చదవండి: బాబు డ్రామాలో పవన్ బకరా! -
భార్యపై అనుమానం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
ఆదోని అర్బన్: పట్టణంలోని పూలబజార్‌లో నివాసముంటున్న శైలజ (22) అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై మృతురాలి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూడున్నర సంవత్సరాల క్రితం విక్టోరియాపేటకు చెందిన కృష్ణ కుమార్తె శైలజ, శక్తిగుడి ప్రాంతంలో నివాసముంటున్న నాగరాజు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నాగరాజు ఓ ప్రయివేట్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తుండగా, శైలజ లేడీస్ కార్నర్లో పని చేస్తోంది. వీరికి రెండేళ్ల కుమార్తె మౌనిక ఉంది. భర్త ప్రతిరోజూ భార్యపై అనుమానం పడడం, లేడీస్ కార్నర్లో పనిచేయగా వచ్చిన డబ్బు తనకే ఇవ్వాలని వేధించేవాడు. దీంతో శైలజ మనస్తాపానికి గురై సోమవారం రాత్రి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. కాపేపటికి గమనించిన కుటుంబసుభ్యులు కిందకు దింపి ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ తెలిపారు. -
సాక్షి కథనంపై కూటమి కుట్రలు పోలీసులే కిడ్నాపర్లు!
-
‘సాక్షి’పై కేసు నమోదు
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘సాక్షి’పై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించింది. ఓ భూ వివాదానికి సంబంధించి పోలీసులు జోక్యం చేసుకుని ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేశారనే ఉదంతంపై ‘పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి’ శీర్షికన ఈ నెల 23న ‘సాక్షి’ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే దీనివల్ల పోలీసుల ప్రతిష్టకు భంగం వాటిల్లిందంటూ ‘సాక్షి’ కర్నూలు విలేకరి బోయ శ్రీనివాసులుపై ఉలిందకొండ పోలీసు స్టేషన్లో సెక్షన్ 196/2024,యూ, సెక్షన్ 32, 308(3), 353(1)బీ, 356 రెడ్‌విత్ 61(2), బీఎన్ఎస్గా నమోదు చేశారు. కర్నూలు త్రీటౌన్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎస్.వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసు జిల్లా అధికారుల సంఘం పేరుతో ప్రకటన విడుదల చేశారు. ‘సాక్షి’లో ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని, పోలీసుల ప్రతిష్టను దిగజార్చేలా ఉందని పేర్కొన్నారు. భూ వివాదానికి సంబంధించి ఆయన్ను తీసుకురాలేదని, ఈ నెల 17న కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో గ్యాంబ్లింగ్ ఘటనకు సంబంధించిన కేసులో నిందితుల సమాచారాన్ని రాబట్టేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్, ఆయన సోదరుడిని విచారించి పంపించామని తెలిపారు.ఇతర మీడియాలోనూ వచ్చినా ‘సాక్షి’పైనే కేసు..భూ వివాదానికి సంబంధించి మునీర్ అహ్మద్ కిడ్నాప్ అయ్యారనే వ్యవహారంపై ‘సాక్షి’తో పాటు ఇతర పత్రికలు, టీవీలు కూడా కథనాలను ప్రచురించాయి, ప్రసారం చేశాయి. ‘బాస్.. సివిల్ పంచాయతీ’ పేరుతో ఈనాడు కూడా కథనాన్ని ప్రచురించింది. అందులో రాయలసీమ పోలీస్‌బాస్ అని పేర్కొంది. కిడ్నాప్‌నకు గురైన మునీర్ అహ్మద్ ‘సాక్షి’తో పాటు ఇతర మీడియా చానళ్లతోనూ మాట్లాడారు. అందులో పోలీసులు తనను తీసుకెళ్లిన విధానం, భూ వివాదానికి సంబంధించి గతంలో సీఐ, డీఐజీ కోయ ప్రవీణ్ తనను పిలిపించి సెటిల్ చేసుకోవాలని చెప్పిన విషయాన్ని బాహాటంగానే వెల్లడించారు. ఆయన భార్య కూడా భూ వివాదంపై మాట్లాడారు. మునీర్ అహ్మద్ ఆయన భార్య తెలిపిన వివరాల మేరకే ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. సాక్షిలో ప్రచురించిన ప్రతీ అక్షరం బాధితులైన మునీర్ అహ్మద్ దంపతులు చెప్పిన విషయాలే! వీటినే మిగిలిన వారూ ప్రచురించినా, ప్రసారం చేసినా.. ‘సాక్షి’పై మాత్రమే కేసు నమోదు చేయడం గమనార్హం. -
బాబును నమ్మినందుకు బాదుడు గిఫ్ట్
-
భూ వివాదంలో మునీర్ అనే టీచర్ ను కిడ్నాప్ చేసిన పోలీసులు
-
కర్నూలులో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు


