సాక్షి, కర్నూలు: వైఎస్ జగన్ తెచ్చిన గ్రీన్ కో ప్రాజెక్ట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. విమర్శించడానికి వెళ్లిన పవన్‌కి ప్రాజెక్ట్ చూశాక షాక్ అయ్యారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు, ఉల్లంఘనలు ఉన్నాయంటూ తనిఖీకి వెళ్లిన పవన్.. అద్భుతమైన ప్రాజెక్టును చూసి ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ప్రాజెక్ట్‌ను వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చింది. 2022, మే 17న ప్రాజెక్ట్‌ను అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
చంద్రబాబు సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టులో అటవీ భూముల ఆక్రమణ జరిగిందని పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. అటవీ, పర్యావరణ ఉల్లంఘనలు తనిఖీ చేయడానికి వచ్చిన పవన్.. తనిఖీ అనంతరం గ్రీన్ కో ప్రాజెక్ట్‌కు కితాబు నిచ్చారు. ఇన్నాళ్లు వైఎస్ జగన్ హయాంలో పరిశ్రమలు వెళ్లిపోయాయంటూ చంద్రబాబు, పవన్ దుష్ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ జగన్ తెచ్చిన పరిశ్రమనే అద్భుతమని పవన్ కల్యాణ్ అంగీకరించారు.
ఇదీ చదవండి: బాబు డ్రామాలో పవన్ బకరా!
Comments
Please login to add a commentAdd a comment