
సాక్షి, అమరావతి: కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రభుత్వ ప్రతిపాదన సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. లా సెక్రటరీ హైకోర్టుకి పంపిన లేఖ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరుపున న్యాయవాది పేర్కొన్నారు. విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ... బెంచ్ ఏర్పాటుపై తమదే తుది నిర్ణయం అని తెలిపింది. ఆ లేఖ తమపై ప్రభావం చూపదని పేర్కొంది.
‘‘బెంచ్ ఏర్పాటుపై స్వతంత్రంగా మేం నిర్ణయం తీసుకుంటాం. వేర్వేరు రాష్ట్రాల నుంచి బెంచ్‌ల ఏర్పాటుపై వివరాలు తెప్పించుకున్నాం. ఏపీలో బెంచ్ ఏర్పాటు అవసరం ఉందా లేదా అనే ఇతర అంశాల డేటాను తెప్పించుకుంటున్నాం’’ అని న్యాయస్థానం తెలిపింది. బెంచ్ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా?.. అప్పుడే ఎందుకు పిల్ దాఖలు చేశారని హైకోర్టు ప్రశ్నించింది.
అసలు లేఖ ఇవ్వటమే న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లు అని.. అది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. మేం నిర్ణయం తీసుకున్న తర్వాత పిల్ అవసరం ఉండవచ్చు ఉండక పోవచ్చు కాబట్టి విత్ డ్రా చేసుకోవాలని పిటిషనర్‌కు కోర్టు చెప్పింది. మళ్లీ పిల్ ఫైల్ చేయటానికి కొత్త అంశాలు లేవని ఈ పిల్‌ను పెండింగ్‌లో పెట్టాలని పిటిషనర్ కోరారు. తదుపరి విచారణను 3 నెలలకు కోర్టు వాయిదా వేసింది.

Comments
Please login to add a commentAdd a comment