
కర్నూలు(అగ్రికల్చర్)/చిప్పగిరి: పంటలు పండక, ప్రకృతి సహకరించక.. సరైన గిట్టుబాటు ధర లభించక రైతుల జీవనం దినదిన గండంగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం రైతులను ఏమాత్రం ఆదుకోకపోగా, వ్యవసాయాన్ని కష్టతరం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన బ్యాంకులు సైతం రుణాల రికవరీ పేరిట ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధపడటం విమర్శలకు తావిస్తోంది. జిల్లా సహకార కేంద్రబ్యాంకు రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించింది.
బుధవారం ఐదు ప్రత్యేక బృందాలు ఆలూరు, పత్తికొండ, డోన్ ప్రాంతాల్లో రుణాలు రికవరీకి రైతుల ఇళ్లకు వెళ్లారు. ఆరేడేళ్ల క్రితం డీసీసీబీ నుంచి రుణాలు తీసుకొని ఇంతవరకు ఒక్క కంతు కూడా చెల్లించకపోవడంతో వడ్డీ, అపరాధవడ్డీలతో అప్పు పేరుకుపోయిందని, వెంటనే చెల్లించాలని కోరారు.
ఆలూరు బ్రాంచ్ పరిధిలోని చిప్పగిరి మండలం కుందనగుర్తి గ్రామానికి చెందిన ఓ రైతు 2016లో రూ.1.08 లక్షల అప్పు తీసుకోగా ఇప్పుడు వడ్డీతో కలిసి రూ.3 లక్షలు దాటింది. డీసీసీబీ జనరల్ మేనేజర్ పి.రామాంజనేయులు ఆధ్వర్యంలో టీమ్ రికవరీకి వెళ్లగా రైతు తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని వాపోయాడు. దీంతో అధికారులు రైతుకు చెందిన బైక్‌ను స్వాధీనం చేసుకుని సంబంధిత సొసైటీకి అప్పగించారు. కూటమి ప్రభుత్వంలో రైతుల దయనీయ స్థితికి ఆ ఘటన అద్దం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment