Nandyal District Latest News
-
ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్ కళాశా ల్లో చేరాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్మీడియెట్ విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్లు డీఐఈఓ శంకర్‌నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులు హాల్‌టికెట్ ఆధారంగా అడ్మిషన్లు పొందవచ్చన్నారు. టీసీ సమర్పించిన తర్వాత అడ్మిషన్ ఖరారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దరఖాస్తులు పొందాలన్నారు. 6వ తేదీన అడ్మిషన్లు ప్రారంభమవుతాయని, జూన్ 1వ తేదీ వరకు అడ్మిషన్లకు గడువు ఉందన్నారు. మొదటి సంవత్సరం తరగతులు ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీ రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్, బీసీ వెల్ఫేర్ కళాశాలల్లో అన్నింటిలో 1వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు కళాశాలలు ఆఫ్‌డే నిర్వహిస్తారన్నారు. ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల వరకు కళాశాలలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలన్నారు. అన్నదాన పథకానికి రూ.3లక్షల విరాళాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.3 లక్షల విరాళాలు అందించారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన టి.అచ్యుత రామారావు రూ.లక్ష, తెనాలికి చెందిన కేఎన్వీఎస్వీ ప్రసాద్ రూ.లక్ష, అలాగే తెనాలికి చెందిన వై.శంకరబాబు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. విరాళాలను అందించిన దాతలను దేవస్థానం తరుఫున స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. ముగ్గురు డిబార్ కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో మంగళవారం 94 శాతం హాజరు నమోదైంది. 5,311 మందిలో 4990 మంది హాజరు కాగా 318 మంది గైర్హాజరయ్యారని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. డోన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఇద్దరు, కర్నూలు ఉస్మానియా కళాశాల కేంద్రంలో ఒకరు చూచిరాతకు పాల్పడగా వారిని డిబార్ చేశామన్నారు. 1,031 పింఛన్ల కోత కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 1వ తేదీ చేపట్టడానికి డీఆర్డీఏ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాలో 4,47, 648 పింఛన్లకు రూ.196.3 కోట్లు విడుదలయ్యా యి. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో 1,031 పింఛన్లపై కోత పడింది. చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్‌లో ఏర్పాటైంది. దాదాపు రెండేళ్లవుతున్నా ఇప్పటికీ కొత్త పింఛన్ల ఒక్కటంటే ఒక్కటీ ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకు పింఛను ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ఈ హామీని కూడా కొండెక్కించడం గమనార్హం. -
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబు, కూటమి నేతలు ఇప్పుడు అదే విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో మీటర్లు ఏర్పాటు చేస్తే పగులగొట్టాలని పిలుపునిచ్చిన టీడీపీ నేతలు ఇప్పుడు అదే విధానంలో ప్రజలకు షాక్ ఇచ్చేందుకు సిద్ధ
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బకాయిలకు రూపాయి ఇవ్వని ప్రభుత్వం ఏకంగా స్మార్ట్ మిటర్లు బిగించి ప్రీపెయిండ్ విధానాన్ని తీసుకొస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లులకు సంబంధించి రూ.520.37 కోట్ల బకాయిలు ఉండగా.. ఇప్పటి వరకు ఎలాంటి బడ్జెట్ కేటాయించని పరిస్థితి. గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులగొట్టాలని పిలుపునిచ్చారు. నేడు అదే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రజల నడ్డివిరిచే దిశగా స్మార్ట్ మీటర్లకు శ్రీకారం చుడుతుండటం గమనార్హం. ముందుగా స్మార్ట్ మీటర్లు బిగించిన ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీ పెయిడ్ విద్యుత్ విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రీ పెయిడ్ విద్యుత్ కోసం చెల్లించడానికి జిల్లాలోని ఏ ప్రభుత్వ కార్యాలయంలో రూపాయి కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఆయా శాఖల హెచ్వోడీలు రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేక బడ్జెట్ కేటాయించి నెల వారీగా ప్రీ పెయిడ్ విద్యుత్ కోసం విని యోగించాల్సి ఉంది. ఇందుకు అన్ని శాఖలకు ప్రభు త్వం నిధులు వెచ్చించాలి. అప్పుడే ప్రీ పెయిడ్ విద్యుత్ సాధ్యమవుతుంది. అయితే ఉమ్మడి జిల్లా లో 25,060 ప్రభుత్వ కనెక్షన్లు ఉన్నాయి. చంద్ర బాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ విద్యు త్ కనెక్షన్ల బకాయి రూ.520.37 కోట్లు ఉన్నాయి. 2024 జూన్ మాసం నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఈ బకాయిలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. 20,828 స్మార్ట్ మీటర్లకు ప్రీ పెయిడ్ విద్యుత్ విద్యుత్ బిల్లుల చెల్లింపులకు రూపాయి ఇవ్వని ప్రభుత్వం సర్కారు కార్యాలయాలకు ప్రీ పెయిడ్ విద్యుత్ విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెస్తోంది. కర్నూలు జిల్లాలో 10,643, నంద్యాల జిల్లాలో 10,188 ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్ మీటర్లు బిగించారు. ఉమ్మడి జిల్లాలో స్మార్ట్ మీటర్లు బిగించిన ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఇప్పటికే రూ.348.78 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ మొత్తం చెల్లించకుండానే స్మార్ట్ మీటర్లకు ప్రీ పెయిడ్ విద్యుత్ విధానం అమలు చేస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ప్రీ పెయిడ్ విద్యుత్ -
పోగులన్నీ ఒక్కటై..
ఎమ్మిగనూరుటౌన్: తమ జీవనాధారమైన వైడబ్ల్యూ సీఎస్‌ను కాపాడుకునేందుకు చేనేతలు ఒక్క తాటిపై నిలిచారు. కలసికట్టుగా కూటమి కుట్రను ఛేదించారు. చేనేతలు, స్థానిక వైడబ్ల్యూసీ సభ్యులు అధికార పార్టీకి షాకిచ్చారు. కోట్లాది రూపాయల ఆస్తులతో పాటు దేశ వ్యాప్తంగా 16 వైడబ్ల్యూసీఎస్ ఔట్లెట్లు ఉన్న సొసైటీని నష్టాల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడంతో పాటు మరో మూడు అంశాలను మహాజన సభలో ఆమోదింపజేసుకోవాలని అధికార పార్టీ నాయకులు పన్నిన కుట్ర బెడిసికొట్టింది. ఈ మేరకు మంగళవారం స్థానిక వైడబ్ల్యూసీఎస్ కార్యాలయ ఆవరణలో సొసైటీ మహాజన సభను ఆర్డీఓ అజయ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సర అంచనా బడ్జెట్‌తో పాటు హెచ్.మురవణి వద్ద సంఘ సభ్యులకు ఇచ్చిన 18.98 ఎకరాల భూమి గురించి చర్చించడం, 2024–25 ఆర్థిక సంవత్సర అడిట్ రిపోర్ట్‌తో పాటు అజెండాలోని 3వ అంశం చేనేత జౌళీశాఖ కమిషనర్ సూచనల మేరకు వైడబ్ల్యూసీఎస్ ఎంపోరియంలను ఆప్కోలో విలీనం చేసేందుకు అధికారులు సభలో ప్రతిపాదించారు. సభ్యులు ఒక్కసారిగా లేచి మూకుమ్మడిగా వ్యతిరేకించారు. తమ సొసైటీని ఆప్కోలో విలీనం చేయనీయమని, ఈ అంశాన్ని ఒప్పుకునే ప్రశ్నేలేదని మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆర్డీఓ, చేనేత జౌళిశాఖ ఏడీ, స్థానిక వైడబ్ల్యూసీఎస్ ఇన్చార్జ్ కార్యదర్శి అయిన నాగరాజారావుతో సభ్యులు వాగ్వాదానికి దిగారు. లాభాల్లో ఉన్న తమ సొసైటీని నష్టాల్లో వున్న ప్రభుత్వ రంగ సంస్థ ఆప్కోలో ఎలా విలీనం చేస్తారని ధ్వజమెత్తారు. ఈ విలీనం వెనుక కుట్ర దాగుందన్నారు. అయితే వైడబ్ల్యూసీఎస్‌ను ఆప్కోలో విలీనం చేయబోమని, ఆప్కో ఉత్పత్తులతో పాటు సొసైటీ ఉత్పత్తులను విక్రయించేందుకే ఆప్కోలో ఉంచుతామని ఏడీ వివరించే ప్రయత్నం చేసినా.. సభ్యులు ససేమిరా అన్నారు. తామంతా ఈ ప్రతిపాదనకు వ్యతిరేకమని సభ అజెండాలోని మూడవ అంశాన్ని తాము ఆమోదించమని ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఏదో ఒక విధంగా సభ్యులను నచ్చజెప్పి విలీన అంశాన్ని ఆమోదింపజేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. దీంతో మహాజన సభకు హాజరైన 225 మంది సభ్యుల్లో వైడబ్ల్యూసీఎస్‌ను ఆప్కోలో విలీనానికి వ్యతిరేకంగా 210 మంది సభ్యులు సమావేశపు అజెండా పుస్తకంలో సంతకాలు చేశారు. మిగిలిన వారు సంతకాలు చేయకుండానే వెళ్లిపోయారు. దీంతో విలీన ప్రతిపాదనకు వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు సంతకాలు చేశారని ఏడీ ప్రకటించారు. వైడబ్ల్యూసీఎస్‌ను ఆప్కోలో విలీనానికి సభ్యులు వ్యతిరేకించిన అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీఓ అజయ్‌కుమార్, ఏడీ నాగరాజారావు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాసులు బందోబస్తు చేపట్టారు. కార్యదర్శి బదిలీ వెనుక రాజకీయం.. వైడబ్ల్యూసీస్, చేనేతల అభ్యున్నతికి పనిచేస్తూ, నిక్కచ్చిగా విధులు నిర్వర్తిస్తున్న సంఘ కార్యదర్శి అప్పాజీని చేనేత జౌళీ శాఖ కమిషనర్ గత ఆదివారం రాత్రి విధులను తప్పించి రాష్ట్ర కార్యాలయానికి సరెండర్ చేసినట్లు సమాచారం. ఆయన స్థానికంగా ఉంటే వైడబ్ల్యూసీస్ ఆప్కోలో విలీనంతో పాటు సంఘ ఆస్తులను కొల్లగొట్టేందుకు అవకాశం ఉండదనే నెపంతోనే కార్యదర్శి అప్పాజీని మహాజన సభకు రెండు రోజుల ముందు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఆగమేఘాల మీద ఆదేశాలిచ్చినట్లు సభ్యులు విమర్శిస్తున్నా రు. కార్యదర్శి బదిలీపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఏడీ సమాధానమిస్తూ.. ఆప్కోలో విలీన అంశంపై ఆయన తప్పిదం చేశారని, ఈ మేరకు కమిషనర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యేకు చేనేతల ఝలక్.. చేనేతలపై అమితమైన ప్రేమ కురిపిస్తూ వారిని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డికి వైడబ్ల్యూసీఎస్ సభ్యులు మహాజన సభలో ఝలక్ ఇచ్చారు. అధికార పార్టీ నాయకులు వైడబ్ల్యూసీఎస్ ఆస్తులను కొల్లగొట్టేందుకే తమ సంస్థను ఆప్కోలో విలీనం చేసే కుట్ర పన్నారని చేనేతలు పసిగట్టారు. విలీనాన్ని మూకుమ్మడిగా వ్యతిరేకించడంతో చేనేతలు తమవైపే వున్నారని చెప్పుకునే టీడీపీ నాయకులకు ఒక గుణపాఠం చెప్పినట్లు అయ్యిందని సభ వద్ద చేనేతలు బాహాటంగా చర్చించుకోవడం గమనార్హం. -
కాటసాని చొరవతో రైతులకు న్యాయం
కల్లూరు: వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి చొరవతో నే తమకు న్యాయం జరిగిందని ఓర్వకల్లు మండల రైతులు అన్నారు. ఓర్వకల్లు మండల పరిధిలోని పాలకొలను, హుసేనాపురం గ్రామాలకు చెందిన డీఆర్డీఓ భూనిర్వాసితులైన 21 మంది రైతులు మంగళవారం కాటసాని రాంభూపాల్‌రెడ్డిని స్వగృహంలో కలిసి, శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేశారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డి చొరవ తీసుకోవడంతో తమకు న్యాయం జరిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎకరాకు రూ. 4.30 లక్షల చొప్పున మొత్తం రూ. 1.30 కోట్లకు పైగా పరిహారం వచ్చిందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి పాత్ర ప్రశంసనీయమన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తమకు న్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. -
విపత్తుల నివారణకు పకడ్బందీ చర్యలు
నంద్యాల: విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధతతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఏర్పడే కరువు పరిస్థితులు కూడా విపత్తులలో భాగమేనన్నారు. విపత్తు సంభవించిన తర్వా త చర్యలు తీసుకోవడం కంటే, ముందస్తు ప్రణాళిక, సన్నద్ధత అత్యంత కీలకమన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటలను ఎలా రక్షించుకోవాలో రైతులకు తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని, భూగర్భ జలాల లభ్యత తగ్గే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని హార్టికల్చర్ మల్చింగ్ వంటి పద్ధతులను ప్రోత్సహించాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పశువుల నీటి తొట్టెల వద్ద ఎలాంటి లీకేజీలు లేకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. వేసవికాలంలో అగ్నిప్రమాదాలు అధికమయ్యే అవకాశం ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంకతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో హెడ్ కానిస్టేబుల్
ఆళ్లగడ్డ: లంచం తీసుకుంటూ ఓ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన మంగళవారం ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిఽధిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన కమ్మరి రఘునా థాచారి ఓ వ్యక్తిని రాయితో కొట్టారని పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కోటేశ్వర్రావు నిందితుడి రఘునాథాచారితో రిమాండ్‌కు పోకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే రూ. 40 వేలు డిమాండ్ చేశారు. దీంతో గత వారం రోజుల క్రితం రఘునాథాచారి హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వర్రావుకు రూ. 20 వేలు ఇవ్వడం జరిగింది. అయినా మిగతా సొమ్ము ఇవ్వాలని బెదిరించడంతో రఘునాథాచారి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రూ. 15 వేలు ఇస్తానని రఘునాథాచారి ఒప్పందం చేసుకోవడంతో హెడ్ కానిస్టేబుల్ అహోబిలం బైపాస్ రోడ్డుకు వస్తాను అక్కడ ఇమ్మని చెప్పాడు. అక్కడ రఘునాథాచారి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా హెడ్ కానిస్టేబుల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. దీని వెనుక ఎవరై నా ఉన్నారా.. అన్న కోణంలో విచారణ చేస్తామన్నారు. మద్దిలేటయ్య హుండీ ఆదాయం రూ.21.57 లక్షలు బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన మద్దిలేటి నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.21.57 లక్షలు చేకూరింది. స్వామి, అమ్మ వార్లకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలు, ముడుపులు, నిత్యన్నదాన సత్రం హుండీ లెక్కింపు మంగళవారం చేపట్టారు. దేవదాయశాఖ అధికారి రమేష్ పర్యవేక్షణలో 27 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ మేరకు రూ.21,57,817 నగదు, ఐదు గ్రాముల బంగారం, 340 గ్రాముల వెండి వచ్చిందని ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు వివరించారు. కార్యక్రమంలో బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు, డోన్, బేతంచెర్ల మద్దిలేటి సేవా సమితి, వాసవీ సభ్యులు పాల్గొన్నారు. -
తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌గా డాక్టర్ శ్రీనివాసరావు
శ్రీశైలం: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా శ్రీశైలంలో తెలుగు వర్సిటీ పీఠాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ముసుగు శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ ఉపాధ్యక్షులు ఆచార్య డి.మునిరత్నం నాయు డు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. తెలుగు వర్సిటీ నుంచి ఎంఫిల్, పీహెచ్డీ చేసిన ఆయన తన పర్యవేక్షణలో ఎనిమిది మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టాలు పొందగా, 17 మంది విద్యార్థులు తమ పరిశోధనలు పూర్తి చేసుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా నియమితులైన ఆయనను పలువురు అభినందించారు. -
వైడబ్ల్యూసీఎస్ పక్షాన పోరాటం
నేతన్నల అభ్యున్నతికి చేనేత పితామహుడు పద్మశ్రీ మాచాని సోమప్ప పట్టణంలో స్థాపించిన వైడబ్ల్యూసీఎస్ సంస్థను కాపాడేందుకు వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బుట్టారేణుక, నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్‌రెడ్డి వేర్వేరు గా చేనేతలు, పార్టీ శ్రేణులతో భారీగా ర్యాలీ నిర్వహించి స్థానిక వైడబ్ల్యూసీఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మిగనూరు చేనేతకు గుర్తింపు లేకుండా చేసేందుకే కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కుట్రపన్నుతున్నారని బుట్టారేణుక విమర్శించారు. మార్కెటింగ్ పేరుతో ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చేనేతలపై ప్రేమ వుంటే సంస్థను అభివృద్ధి చేయాలన్నారు. చేనేతలకు ఆధారమైన వైడబ్ల్యూసీఎస్‌ను ఆప్కోలో విలీనం చేస్తే వైఎస్సార్సీపీ అడ్డుకుంటుందన్నారు. -
సంస్కరణల పేరుతో సతాయింపు!
కర్నూలు సిటీ: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న పిల్లలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించలేకపోతుండడంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ విద్యాసంస్థలకు దోచి పెట్టేందుకు పూనుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జూన్ మొదలయ్యే అకడమిక్ ఇయర్‌ను మార్పు చేసి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు గతేడాది నుంచి చర్యలు చేపట్టింది. దీనికి సంస్కరణలు అనే సాకు చూపుతుండడం గమనార్హం. విద్యా వ్యవస్థల్లో మార్పుల కంటే అయిన వారి విద్యాసంస్థల కోసమే సెలవుల్లో తరగతులను ప్రారంభిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు 2026–27 అకడమిక్ ఇయర్‌ను ప్రారంభించి సెకండ్ ఇయర్ తరగతులు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను జారీ చేశారు. ఈ ప్రకారం 314 రోజులు, 82 సెలవు దినాలు, 232 పని దినాలు ఉన్నాయి. ఈ నెల ఏప్రిల్ 6వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ థీయరీ పరీక్షల మూల్యాంకనం జరుగనుంది. ఇలాంటి సమయంలో బోర్డు జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచే తరగతులను ప్రారంభించి, డొక్కా సీతమ్మ మధ్యాహ్నా భోజన పథకం సైతం అమలు చేయనున్నారు. అధ్యాపకులు లేకుండా అకడమిక్ ఇయర్‌ను ఎలా ప్రారంభిస్తున్నారు? వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు కాలేజీకి హాజరవుతారో? లేదోనని అధ్యాపకులు వాపోతున్నారు. 6 నుంచి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఏప్రిల్ 6 నుంచి 23వ తేదీ వరకు అడ్మిషన్లు చేసుకునేందుకు షెడ్యుల్ జారీ చేశారు. ఈ నెల 2వ తేదీ పదో తరగతి పరీక్ష జరుగనుంది. మూల్యాంకనం 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి. ఆ తరువాత సుమారుగా 20 రోజుల తరువాత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితాలు రాకముందే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు అనుమతులు ఇవ్వడం బట్టి చూస్తే కార్పొరేట్, సెమీ కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు ఏటా షెడ్యుల్ కంటే ముందుగా అడ్మిషన్లు చేసుకోవడంపై జరిగే ఆందోళనలు లేకుండా వారికి పరోక్షంగా సాయం చేసేందుకే ప్రభుత్వం ముందస్తు అడ్మిషన్లకు అనుమతులు ఇచ్చినట్లు పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పుస్తకాలు లేకుండా తరగతులు? ఇంటర్మీడియెట్ బోర్డు తీసుకొచ్చిన నూతన సంస్కరణల ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుంచి విద్యా సంవత్సరం మొదలు కానుంది. 23వ తేదీ వరకు తరగతులు నిర్వహించి, 24 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు, జూన్ 1వ తేదీ నుంచి కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు, ఆ తరువాత డొక్కా సీతమ్మ మధ్యాహ్నా భోజన పథకం ద్వారా భోజనం అందించేలా ఆదేశాలు ఇచ్చాం. – జి.లాలెప్ప, ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన జూనియర్ కాలేజీలు 161 ఉన్నాయి. ఇంటర్మీడియెట్ విద్యలో కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలలో భాగంగా బుధ వారం నుంచి 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. 23వ తేదీ వరకు తరగతులు నిర్వహించి, 24వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి జూన్ 1న కాలేజీలు తెరవనున్నారు. ఏప్రిల్ 1 నాటికే విద్యార్థుల చేతికి నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఒక్క నోటు బుక్కు కానీ, పాఠ్య పుస్తకం కానీ రాకపోవడం గమనార్హం. -
రూ.2833 కోట్లతో జిల్లా అవుట్‌రీచ్ బడ్జెట్
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో 52 శాఖలకు సంబంధించి రూ.2833 కోట్లతో అవుట్‌రీచ్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఇన్చార్జ్ మంత్రి అధ్యక్షతన 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎమ్మెల్యేలు పార్థసారథి, బొగ్గుల దస్తగిరి, జయ నాగేశ్వరరెడ్డి, కేఈ శ్యామ్‌కుమార్, జేసీ నూరుల్ ఖమర్తోపాటు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, చైర్మన్లు హాజరయ్యారు. ఇన్చార్జ్ మంత్రి మాట్లాడుతూ.. బడ్జెట్ అవుట్ రీచ్‌లో రూరల్ డెవలప్మెంట్, వైద్యం, విద్య, పాఠశాల విద్య, పీఆర్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్లకు ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరిగినట్లు చెప్పారు. ఇవే కాక సూపర్‌సిక్స్‌లో రూ.2394 కోట్లను జిల్లాకు కేటాయించినట్లు చెప్పారు. జిల్లా ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. త్వరలోనే పశ్చిమ ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. బడ్జెట్ అవుట్ రీచ్‌పై ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. వ్యక్తిపై గొడ్డలితో దాడి హొళగుంద: హొళగుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని నెరణికి తండాకు చెందిన రామునాయక్పై అదే గ్రామానికి చెందిన రాఘవేంద్రనాయక్ గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయాలైనట్లు ఎస్ఐ దిలీప్‌కుమార్ మంగళవారం తెలిపారు. రామునాయక్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో రాఘవేంద్రనాయక్ గొడ్డలితో దాడి చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. ప్రస్తుతం రామునాయక్ ఆదోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాఘవేంద్రనాయక్పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ దిలీప్ కుమార్ వెల్లడించారు. వాహనం ఢీకొని జింక మృతి మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని కల్లుదేవకుంట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. ఎమ్మిగనూరు టూ మంత్రాలయం జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. జింక కళేబరానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం ఖననం చేస్తామని ఎఫ్బీఓ నాగేష్ తెలిపారు. మద్యం మత్తులో వీరంగం కేసులో ఏడాది జైలు శిక్ష బేతంచెర్ల: పట్టణంలోని కొత్త బస్టాండులో మద్యం సేవించి మారణాయుధం పట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారని సీఐ వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. వివరాలు.. పట్టణంలోని శేషారెడ్డి నగర్‌కు చెందిన కే.నాగ శేషు 2018లో మద్యం సేవించి కొత్త బస్టాండులో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. అప్పటి ఎస్ఐ తిరుపాలు ఘటనా స్థలానికి చేరుకొని మారణాయుధాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. డోన్ కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడు నాగశేషుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు. ఈ కేసులో సాక్షులను సకాలంలో హాజరు పరచడంలో కృషిచేసిన సీఐ వెంకటేశ్వరరావు, కోర్టు కానిస్టేబుల్ మాధవ్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. -
చౌడేశ్వరీ దేవి హుండీ ఆదాయం లెక్కింపు
బనగానపల్లె రూరల్: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన చౌడేశ్వరీ దేవస్థానంలో హుండీలోని కానుకలను లెక్కించగా రూ.20,35,355 ఆదాయం వచ్చిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. గత ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించినట్లు చెప్పారు. నగదుతో పాటు 11 గ్రాముల బంగారు ఆభరణాలు, 390 గ్రాముల వెండి అభరణాలు వచ్చినట్లు వెల్లడించారు. గ్రూపు ఆలయాల ఈఓ బ్రహ్మనందరెడ్డి, చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి, పాలక మండలి సభ్యులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
ముప్పు తప్పేలా..!
శ్రీశైలం: శ్రీశైలంలోని పాతాళగంగ రోప్ వే వద్ద మంగళవారం ఉదయం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) పదో బెటాలియన్ కమాండర్ ప్రసన్నకుమార్ రోప్ వే మేనేజర్ పెంచల్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ గోపాలకష్ణ ఆధ్వర్యంలో 30 మంది సిబ్బంది మాక్‌డ్రిల్ నిర్వహించారు. ప్రమాద సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను రోప్ వే క్యాబిన్ నుంచి సురక్షితంగా ఎలా కిందకు చేర్చాలి. ఆ తర్వాత వారికి ఎలా ప్రథమ చికిత్స నిర్వహించాలో మాక్ డ్రిల్ ద్వారా ప్రదర్శించి అవగాహన కల్పించారు. కిందకు చేరిన వ్యక్తికి స్ట్రెచర్‌పై ప్రథమ చికిత్స -
వసతి గదిలో ఇద్దరు యువకులు, ఓ యువతి
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం దేవస్థాన వసతి గదిలో అనుమానాస్పదంగా ఇద్దరు యువకులు, ఒక యువతి ఉండడం, వారిని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర ప్రాంతానికి చెందిన ఓ యువతితో దేవస్థానంలో హౌస్‌కీపింగ్ నిర్వహణ చేపడుతున్న పద్మావతి ఏజెన్సీ సూపర్వైజర్, శ్రీశైలానికి చెందిన మరో వ్యక్తి ఉన్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో ఇంచార్జ్ సీఎస్‌వో తన సిబ్బందితో దాడులు నిర్వహించగా రెడ్‌హ్యండెడ్‌గా ఇద్దరు యువకులు, ఒక యువతిని గుర్తించారు. వారిని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో శ్రీశైలం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అసలేం జరిగిందంటే.. శ్రీశైలం దేవస్థానంలోని సిద్దిరామప్ప వాణిజ్య సముదాయంలో భక్తుల సౌకర్యార్థం వసతి గదులను నిర్మించారు. మార్చి 29న నరేంద్రారెడ్డి పేరుతో భార్య, భర్త విడిది చేశారు. వీరు మంగళవారం ఉదయం 10.30గంటలకు వసతి విభాగాన్ని ఖాళీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పద్మావతి ఏజెన్సీ సూపర్వైజర్తో రసీదుపై సంతకం చేయించుకున్నారు. అనంతరం దేవస్థానం సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసులో రసీదు చూపిస్తే వారికి రావాల్సిన అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చి, రూము ఖాళీ అయినట్లు నమోదు చేసుకుంటారు. అయితే వారికి ఇవ్వాల్సిన అడ్వాన్స్ డబ్బులు అక్కడ విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్ ఇచ్చి పంపించేశాడు. అనంతరం ఓ యువతితో ఎ–3 వసతి గదిలో తన సన్నిహితుడైన శ్రీశైలానికి చెందిన మరో వ్యక్తితో కలిసి ఉన్నారు. పెళ్లి సంగతి తేల్చుకోవాలనట! శ్రీశైలం పోలీసు స్టేషన్లో యువతి, యువకులను విచారించారు. పద్మావతి ఏజెన్సీలో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న సాయికృష్ణ, గదిలో ఉన్న యువతి బంధువులు అవుతారని.. వాళ్ళిద్దరూ గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారని తెలిసింది. అయితే సాయికృష్ణ ఇంట్లో వివాహ సంబంధాలు చూస్తుండడంతో విషయం తెలుసుకున్న యువతి సాయికృష్ణతో పెళ్ళి విషయం మాట్లాడి వస్తానని తల్లికి చెప్పి వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని సమాచారం. అర్హత లేని వ్యక్తికి వసతి విభాగం బాధ్యతలు శ్రీశైలం దేవస్థానంలో ఆయా విభాగాలకు అధిపతులుగా (సహాయ కార్యనిర్వహణాధికారి) ఏఈవోలను నియమిస్తారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తన రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని ఎలాంటి అర్హత లేకపోయినా వసతి విభాగం ఏఈవోగా దేవస్థానం పీఆర్వో బాధ్యతలు చేపట్టారు. ఆ విభాగంపై పర్యవేక్షణ లేకపోవడంతో తరచూ వసతి విభాగంలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటోంది. వీరిలో పద్మావతి ఏజెన్సీ సూపర్వైజర్, మరో వ్యక్తి -
భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య
పాణ్యం: భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదని మనస్తాపం చెందిన భర్త రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాణ్యంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఖలీల్ మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. ఆలమూరు గ్రామానికి చెందిన గని గోపాల్‌రెడ్డి (45), భార్య లక్ష్మీదేవి మధ్య గొడవ జరగడంతో మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన గోపాల్‌రెడ్డి సోమవారం రాత్రి 12 గంటల సమయంలో పాణ్యంలోని తాటికాయ చెరువు వద్ద రైలు కింద పడి మృతి చెందాడు. ఉదయం ట్రాక్‌ను పరిశీలించిన సిబ్బంది మృతదేహాన్ని చూసి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాల మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి కుమారుడు భీష్మరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
పట్టపగలే చైన్ స్నాచింగ్
బేతంచెర్ల: పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో మంగళవారం మధ్యా హ్నం దొంగతనం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ తెలిపిన వివరాల మేరకు.. పాతరెడ్డి హోటల్ ఎదురు వీధిలో నివసించే విష్ణుమోహన్ భార్య మద్దాల పరిమళ ఇంట్లో ఉండగా, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక అపరిచిత వ్యక్తి లోపలికి వచ్చాడు. ఆమె మరిది సత్యబాబు అడ్రస్ కావాలంటూ మాటల్లో దించి ఒక్కసారిగా పరిమళ మెడలోని 20 గ్రాముల బంగారు గొలుసును లాక్కున్నాడు. అనంతరం ఆమెను గదిలో వేసి బయట గొళ్లెం పెట్టి పరారయ్యాడు. బాధితురాలి కేకలు విన్న చుట్టుపక్కల వారు వచ్చి గొళ్లెం తీయడంతో విషయం వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జనసంచారం ఉండే ప్రాంతంలోనే ఈ ఘటన జరగడంతో ఒంటరిగా ఉండే మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరేసుకొని మహిళ ఆత్మహత్య నందికొట్కూరు రూరల్: మండల పరిధిలోని 10 బొల్లవరం గ్రామంలో వేదావతి అలియాస్ నీలమ్మ అనే మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై ఎస్ఐ మణికంఠ తెలిపిన వివరాలు.. నీలమ్మకు చిన్నతనంలో తల్లి చనిపోవడంతో కోడుమూరు నియోజకవర్గంలోని ప్యాలకుర్తి గ్రామానికి చెందిన మేనమామ శ్రీనివాసులు పెంచి పెద్ద చేశారు. గత ఫిబ్రవరిలో 10 బొల్లవరం గ్రామానికి చెందిన వెంకటరాముడుకు ఇచ్చి వివాహం చేశారు. ఇదిలాఉండగా నీలమ్మ నానమ్మ లింగమ్మ సోమవారం చనిపోయింది. దీన్ని జీర్ణించుకోలేక ఆమె మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై మేనమామ భార్య సుబ్బలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాళ్ల పారాణి ఆరక ముందే నిండు నూరేళ్లు నిండాయా? అంటూ బంధువులు రోధించిన తీరు అక్కడివారిని కంటితడి పెట్టించింది. డోన్ టౌన్: పట్టణంలోని శ్రీనివాస నగర్లో ఆరుబయట నిద్రిస్తున్న మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన నలుగురు యువకుల్లో ఒకరు స్థానికులకు పట్టుబడ్డారు. సోమ వారం రాత్రి దుండగులు చైన్‌స్నాచింగ్‌కు యత్నించగా మహిళ అప్రమత్తమై కేకలు వేసింది. నిందితులు మోటార్ సైకిల్‌పై పారిపోవడానికి ప్రయత్నించగా కాలనీ ప్రజలు వెంబడించి ఒక యువకుడిని పట్టుకున్నారు. నిందితుడిని పట్టణ పోలీసులకు అప్పజెప్పారు. పట్టుబడిన యువకుడు కర్నూలు పట్టణం బుధవారపేటకు చెందిన అబ్దుల్ కరీంగా పోలీసుల విచారణలో తెలిసింది. పరారైన ముగ్గురు నిందితులపై గతంలో బండిఆత్మకూర్, నంద్యాల, పాణ్యం, నందికోట్కూ రు, కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. పట్టుబడిన అబ్దుల్ కరీంపై తెలంగాణ రాష్ట్రం గద్వాల పోలీసు స్టేషన్లో కేసు నమోదై ఉండటంతో అక్కడి పోలీసులకు అప్పజెప్పి, పరారైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ ఇంతియాజ్‌బాషా వెల్లడించారు. -
చంద్రబాబూ.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేయొద్దు
● ఎమ్మెల్సీ ఇసాక్బాషాబొమ్మలసత్రం: ఆర్ధికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరు తో అప్పులపాలు చేయొ ద్దని సీఎం చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా హితవు పలికారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి నివాసంలో ఎమ్మెల్సీ.. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ అమీర్, ఎస్ఈసీ మెంబర్లు గోపవరం సాయినాథరెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, రాష్ట్ర అగ్రికల్చర్ జాయింట్ సెక్రెటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మాబున్నిసాతో కలసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి కొన సాగుతూ శాసనసభలో అడ్డుకొనే వారు లేక పోయినా అత్యవసర తీర్మానం చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో తిరిగి గెలవలేరేమో అన్న అనుమానం బలంగా ఉండటంతోనే రాజధానిని మార్చకుండా ఇలాంటి తీర్మానాలు చేస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణం మొదటి దశకు రూ. 1 లక్ష కోట్లు, రెండవ దశకు రూ. 50 వేల కోట్లు ఖర్చు చేయటం చూస్తే భవిష్యత్తులో రాష్ట్రం ఎలాంటి దుస్థితికి వెళ్తుందోనని ప్రజలు ఆందోళనకు లోనవుతున్నారన్నారు. భవన నిర్మాణం కోసం పిలిచిన టెండర్లలో ఒక చదరపు అడుగు రూ. 11 వేల ప్రకారం ఖర్చు చూపడం చూస్తే రాజధాని పేరుతో దోపిడికి పాల్పడుతున్నారన్న అనుమానం రాకతప్పదన్నారు. రైతుల నుంచి సేకరించిన వేల ఎకరాలు భూములు సరిపోవని మరోసారి భూసేకరణ చేయటం వెనుక నేతలకు ఆభూములను రియల్ ఎస్టేట్ దందా చేసేందుకేనని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల దిబ్బగా మార్చేందుకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షులు టీవై శివయ్య, అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, లీగల్‌సెల్ అధ్యక్షులు రామసుబ్బయ్య, సెక్రటరీలు దేవనగర్‌బాషా, శివనాగిరెడ్డి, మేధావుల సంఘం అధ్యక్షులు రసూల్ ఆజాద్ పాల్గొన్నారు. -
బెట్టింగ్తో భవిష్యత్ అంధకారం
● జిల్లా ఎస్పీ సునీల్షెరాన్ నంద్యాల: క్రికెట్ అనేది వినోదం కోసం మాత్రమేనని, బెట్టింగ్‌కు ఆశపడి భవిష్యత్తు అంధకారం చేసుకోవద్దని యువతకు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ క్రికెట్ నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామన్నా రు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ నిర్వాహకులపై, ఆన్లైన్ బుకీలపై ప్రత్యేక పోలీస్ బృందాల తో నిరంతర నిఘా ఉంటుందన్నారు. బెట్టింగ్ నిర్వహించినా.. ప్రోత్సహించినా.. పాల్గొనే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో పడవద్దన్నారు. కష్టపడకుండా వచ్చే సొమ్ము శాశ్వతం కాదని, అది భవిష్యత్తును అంధకారం చేస్తుందన్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచి, స్మార్ట్ ఫోన్లలో ఏ యాప్స్ వాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ పనుల కోసం స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు.. అనేది గమ నిస్తూ ఉండాలన్నారు. పరిసరాల్లో ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100, 112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. -
ఆసుపత్రి నుంచి పరీక్షకు..
బేతంచెర్ల: విద్యార్థి జీవితంలో పదో త రగతి ఎంతో కీలకం. ఉన్నత చదువులకు ఇక్కడే మలుపు. అ యితే ఓ విద్యార్థి పరీక్ష వేళ విషమ పరీక్ష ఎదుర్కొన్నా డు. ఓ వైపు పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. మరో వైపు అనారోగ్యం వేధి స్తోంది. తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు అత్యవసర ఆపరేషన్ చేశారు. అయినా మరుసటి రోజు పరీక్ష రాశాడు. ఈ సంఘటన బేతంచెర్లలో చోటు చేసుకుంది. స్థానిక శ్రీనారాయణ స్కూల్ పదో తరగతి చదువుతున్న విద్యార్థి విష్ణువర్ధన్‌రెడ్డికి తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆదివారం అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. సోమవారం సోషల్ పరీక్ష ఉండటంతో విద్యార్థి తల్లిదండ్రులు విషయా న్ని ఎంఈఓ సోమశేఖర్ ద్వారా డీఈఓ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పరీక్ష రాసేందుకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర కు విష్ణువర్ధన్‌రెడ్డి ఆస్పత్రి నుంచి వాహనంలో పరీక్ష కేంద్రానికి చేరుకుని పరీక్ష రాశాడు. ఈ మేరకు విద్యార్థుల తల్లి దండ్రులు విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రూ. 17 కోట్ల ఇంటి పన్నులు వసూళ్లుశిరివెళ్ల: జిల్లాలో రూ. 17 కోట్ల ఇంటి పన్నులు వసూళ్లయ్యాయని డీఎల్పీఓ రాంబాబు అన్నారు. సోమవారం శిరివెళ్ల మేజర్ గ్రామ పంచాయతీలో ఇంటి పన్నుల వసూళ్లపై ఆరా తీశారు. జిల్లాలో రూ.18 కోట్ల మేరకు ఇంటి పన్నులు వసూలు కా వాల్సి ఉండంగా సిబ్బంది కృషితో లక్ష్యాన్ని చేరువ లో ఉన్నామన్నారు. స్థానిక పంచాయతీలో రూ. 40 లక్షలకు గాను రూ. 34 లక్షలు వసూళ్లయ్యాయన్నా రు. ఏప్రియల్ 2 న గ్రామ పంచాయతీలకు స్పెషలాఫీసర్ల నియామకం జాబితా వెలువడుతుందన్నారు. 3వ తేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలవుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ అశ్వనికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. మహానందీశ్వరుడి హుండీ ఆదాయం రూ. 32.29 లక్షలు మహానంది: మహానంది క్షేత్రంలో సోమవారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ. 32,29,396 ఆదాయం లభించినట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక అభిషేక మండపంలో శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారితో పాటు వివిధ ఆలయాల హుండీ కానుకలను లెక్కించారు. ఆలయాల ద్వారా రూ. 31,91,727 రాగా, అన్నప్రసాదం విభాగం ద్వారా రూ. 22,986, గో సంరక్షణ ద్వారా 14,683 వచ్చిందని చెప్పారు. 31 రోజులకు సంబంధించి ఈ ఆదాయం వచ్చినట్లు వివరించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య, ఆలయ సిబ్బందితో పాటు శ్రీ బాలాజీ, తిరుమల బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. -
శేషవాహనంపై శ్రీరంగనాఽథుడు
జూపాడుబంగ్లా: తర్తూరు వెలసిన శ్రీలక్ష్మిరంగనాథస్వామి శేషవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం పట్టువస్త్రాలతో అలంకరించిన స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో తీసుకెళ్లి శేషవాహనంతో అలంకరించిన గ్రామోత్సవ రథంపై స్వామివారిని ఉంచారు. ప్రధాన అర్చకుడు ఈశ్వరరెడ్డి స్వామివారికి సాష్టాంగనమస్కారాలు చేసుకొన్న అనంతరం భక్తులు జయజయ ధ్వానాల మధ్య గోవింద నామాన్ని స్మరిస్తూ స్వామివారి గ్రామోత్సవ రథాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి శేషవాహనోత్సవానికి ప్రత్యేక ఉంది. ప్రజలు, రైతులు పొలంగట్లవెంట తిరిగేటప్పుడు నాగశేషుని నుంచి తమకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా శేషవాహనం రోజున స్వామివారికి మల్లెపూలలను సమర్పించి ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన మల్లెలతో స్వామివారి, అమ్మవారి మూలవిగ్రహాలు నిండిపోయాయి. నేడు హనుమద్వాహనసేవ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం స్వామి వారికి హనుమద్వాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ఈశ్వరరెడ్డి, చైర్మన్ నారాయణరెడ్డి, ఈఓ సాయికుమార్ తెలిపారు. -
ఆప్కోలో వైడబ్ల్యూసీఎస్ విలీన కుట్ర?
ఎమ్మిగనూరుటౌన్: ఎన్నికల ముందు చేనేత రంగాన్ని, దానిపై ఆధారపడిన కార్మికులను ఆదుకుంటానని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నేతన్న నేస్తం కింద ఏటా అందే రూ. 24 వేల సాయాన్ని కూడా అటకెక్కించాడు. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో నేతన్నల సంక్షేమానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం (ఆప్కో) ఆర్థికంగా కుదేలైంది. అలాంటి ఈ సంస్థలోకి ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (వైడబ్ల్యూసీఎస్)ని విలీనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఈ సొసైటీకి సంబంధించిన కోట్లాది రూపాయల ఆస్తులు కొల్లగొట్టేందుకే అధికారపార్టీ నాయకులు ఈ కుట్రకు తెరలేపారని స్థానిక చేనేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైడబ్ల్యూసీఎస్కు దేశంలోనే గుర్తింపు ఎమ్మిగనూరులో చాలా మంది చేనేత కార్మికులు ఉన్నారు. వీరిని ఆదుకునేందుకు పద్మశ్రీ మాచాని సోమప్ప 1938 సంవత్సరంలోనే వైడబ్ల్యూసీఎస్‌ను స్థాపించారు. అప్పట్లో 60కిపైగా చేనేత వస్త్ర దుకాణాలను నడిపి 600 మందికి పైగా సభ్యులతో సొసైటీ నడిపారు. వైడబ్ల్యూసీఎస్ బ్రాండ్‌తోనే దుప్పట్లు, దోమతెరలు, టవళ్లు, చీరలు తదితర జనతా వస్త్రాలను ఉత్పత్తి చేయిస్తూ ఉమ్మడి తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటకలో చేనేత వస్త్ర దుకాణాలు నెలకొల్పి సొసైటీని లాభాల బాటలో నడిపించారు. ఇలా ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు రావడంతో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, దేశ ప్రధానులు, ముఖ్యమంత్రులు సొసైటీని సందర్శించారు. ఇప్పటికీ లాభాల్లో నడుస్తున్న వైడబ్లూసీఎస్కు ఎమ్మిగనూరులో కోట్లాది రూపాయల విలువైన దుకాణాలు, భవనాలు, భూములున్నాయి. అలాంటి సొసైటీని నష్టాల ఆప్కోలో విలీనం చేసేందుకు ప్రతిపాదన చేయడం వెనుక ఏదో పెద్ద మతలబు ఉందని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. జనవరిలోనే ప్రతిపాదనలు ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకి ఎమ్మిగనూరు పరిధిలోని 12 డిపోలు, అవుట్లెట్లు తెలంగాణలోని 1, కర్ణాటకలోని మూడు అవుట్లెట్లను ఆప్కోలో విలీనం చేసేందుకు ప్రతిపాదిస్తున్నట్లు గత జనవరి నెలలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆదేశాలతో ఓ అధికారి హ్యాండ్లూమ్స్ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. చేనేత పరిశ్రమ, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే విలీన ప్రతిపాదనలు అని అధికారులు చెబుతున్నారు. ఇదే వాస్తవమైతే సొసైటీలోని మెజారిటీ సభ్యులతో విలీన అంశంపై ఎందుకు చర్చించలేదని పలువురు చేనేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 31న జరిగే జనరల్ బాడీ సమావేశంలో సొసైటీ విలీన ఆమోదాన్ని వ్యతిరేకించాలని మెజార్టీ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కోట్లాది రూపాయల ఆస్తులను కొట్టేసేందుకే ఈ ఎత్తుగడ 31న సొసైటీ జనరల్ బాడీ సమావేశంలో ఆమోదానికి ప్రతిపాదన విలీనాన్ని వ్యతిరేకించాలని వైడబ్ల్యూసీఎస్ సభ్యులు నిర్ణయం -
వేసవి భగభగలు
జనాభా గణన దేశాభివృద్ధికి కీలకం ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: జనాభా గణన దేశాభివృద్ధికి కీలకమని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని అయ్యలూరు మెట్టలో ఉన్న ఎస్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జనగణన శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి, కుటుంబాల జీవన ప్రమాణా లను మెరుగుపరచడానికి, ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి జనాభా గణన ఎంతో అవసరమన్నారు. జిల్లాలో సుమారు 6 లక్షల కుటుంబాలు, 20 లక్షల జనాభా ఉన్నట్లు అంచనా ఉందన్నారు. జనగణనలో వయస్సు ఆధారంగా జనాభా విభజన, యువత సంఖ్య వంటి ముఖ్యమైన వివరాలు సేకరిస్తామన్నారు. ముందుగా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, ప్రతి గృహానికి ప్రత్యేక సెన్సస్ హౌస్ నంబర్లు కేటాయిస్తారని చెప్పారు. జనగణన కోసం మొత్తం ప్రాంతాన్ని బ్లాకులుగా విభజిస్తారని, ప్రతి బ్లాక్‌లో సుమారు 200 ఇళ్లు, 700 నుంచి 800 మంది జనాభా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తారన్నారు. మొదటిసారిగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ప్రజలు ఆన్లైన్ ద్వారా ఎక్కడి నుంచైనా తమ గృహ వివరాలను జియో ట్యాగ్ చేసి నమోదు చేయవచ్చని, అనంతరం ఫీల్డ్ అధికారులు వాటిని ధ్రువీకరిస్తారని వివరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాము నాయక్, మాస్టర్ ట్రైనర్లు విష్ణు, మాధురి, ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
నంద్యాల: జిల్లాలో గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ ఏజెన్సీ వారు వంట గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ కే. కార్తీక్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో గ్యాస్ వినియోగదారులు సంయమనం పాటించాలన్నారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఆందోళనకు గురికావలసిన అవసరం లేదన్నారు. వచ్చే రోజుల్లో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే అపోహతో గ్యాస్ వినియోగదారులు అధికంగా అదనపు బుకింగ్ చేయడం వలన సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. ఏజెన్సీ నిర్వాహకులు ఎటువంటి అనుమతులు లేకుండా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్‌కు తరలించినా తగిన చర్య తీసుకుంటామన్నారు. ఆస్పత్రులు పాఠశాలలు. హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు ఆటంకం లేకుండా గ్యాస్ ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్యాస్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా డెలివరీ బాయ్స్ వినియోగదారులతో అమర్యాదగా ప్రవర్తించినా లేదా బిల్లులో పేర్కొన్న మొత్తానికి మించి డబ్బులు డిమాండ్ చేసినా వెంటనే సంబంధిత పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దారు, సంబంధిత మండల తహసీల్దారు, జిల్లా పౌరసరఫరాల అధికారి లేదా టోల్ ఫ్రీ నంబర్ 1967, కమాండ్ కంట్రోల్ నంబర్ 08514–293903కు ఫిర్యాదు చేయాలన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
ఎమ్మిగనూరురూరల్: బ్యాంకుల దగ్గర చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగలను ఎమ్మిగనూరు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ వి. శ్రీనివాసులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన ప్రమీల అనే మహిళ కెనరా బ్యాంక్‌లో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకొని స్కూటీలో పెట్టుకుంది. కొద్దిసేపటికే ఆమె కళ్లుగప్పి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకెళ్లారు. తర్వాత చోరీ విషయం తెలుసుకున్న బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ముర్రవాడ భార్గవి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన ప్రాంతంలో సీసీ పుటేజ్‌లను సేకరించి, సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించి దొంగలు కర్ణాటక రాష్ట్రం భద్రావతి ప్రాంతానికి చెందిన శంకర్ బోవి, కార్తీ బోవిగా గుర్తించారు. ఆదివారం మంత్రాలయం రోడ్డులోని అనంతపద్మనాభస్వామి దేవాలయం దగ్గర వారిని అదుపులోకి తీసుకొని 13 గ్రాముల బంగారు చైన్, 17 గ్రాముల బంగారు నెక్లెస్, చోరీలకు ఉపయోగించే బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగలు నకిలీ ఐడీ కార్డులు పెట్టుకొని ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలిందని సీఐ వెల్లడించారు. -
డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్
వెల్దుర్తి: బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్, గంజాయి తరలిస్తూ పోలీసులకు దొరికిపోయాడు అల్లూరి సీతారామరాజు జిల్లా రాళ్లగడ్డ గ్రామం కుర్ర రమేశ్. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. శనివారం హైవే 44పై మండల పరిధిలోని సూదేపల్లె క్రాస్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న కుర్ర రమేశ్‌ను వాహనాల తనిఖీలో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకుని సోదా చేశారు. అతని వద్ద అనుమానాస్పద మత్తుపదార్థాలు లభించడంతో ఎస్ఐ బృందం అప్రమత్తమయ్యారు. అక్కడికక్కడే తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, వ్యవసాయశాఖ, పంచాయతీ రాజ్ శాఖాధికారుల సమన్వయంతో పంచనామా చేశారు. 20గ్రాముల గంజాయి, ఎమ్డీఎమ్ఏ(నిషేధిక మత్తు పదార్థం–పార్టీ డ్రగ్) మత్తు పదార్థాలుగా గుర్తించారు. నిందితుడు కుర్ర రమేశ్‌ను విచారించగా బెంగళూరులోని వంశీ అను వ్యక్తి చెప్పిన మేరకు హైదరాబాద్‌లోని పార్టీ కోసం డ్రగ్స్ తీసుకువెళ్తున్నట్లు తెలుసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. వెలుగోడులో దారుణం ● పదేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం వెలుగోడు: పదేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు.. సీపీ నగర్ ప్రాంతంలో కార్పెంటర్ పని చేసే వృద్ధుడు చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని మాయమాట లు చెప్పి సమీపానికి రప్పించుకున్నాడు. అనంతరం అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. దీంతో వృద్ధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బాలిక తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సురేష్ విచారణ చేపట్టారు. చిన్నారిపై జరిగిన దారుణాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వేధింపులు తాళలేక మహిళ బలవన్మరణం ఎమ్మిగనూరురూరల్: భర్త, మామ వేధింపులు తాళలేక భారతి(30) అనే మహిళ శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బసాపురం గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి కౌతాళం మండలం ఎరిగేరి గ్రామానికి చెందిన భారతి(30)తో తొమ్మిది ఏళ్ల కిత్రం వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం. గ్రామం సమీపంలోని పొలంలో గుడిసెవేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే భర్త నాగరాజు, మామ చిన్నబసప్ప భారతిని వేధింపులకు గురిచేసేవారు. వీరి వేధింపులు తాళలేక జీవితంపై విరక్తి చెంది పొలం దగ్గర ఉన్న గుడిసెలో ఒంటిపై పెట్రోల్పోసుకొని భారతి నిప్పంటించుకున్నారు. మంటలతో బయటకు కేకలు వేస్తు రావటంతో అక్కడ ఉన్న వారు మంటలు ఆర్పి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. తమ కుమార్తెను భర్త, మామలు కాల్చిచంపారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి తండ్రి రామాంజనేయుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసలు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి ఆదోని సెంట్రల్: గుంతకల్–నంచర్ల రైల్వేస్టేషన్ల మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ విషయాన్ని రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శివరాములు వెల్లడించారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదానికి గురైడా అన్నది తెలియరాలేదన్నారు. మృతదేహం దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎవరైనా మృతుడిని గుర్తించినట్లయితే గుంతకల్ రైల్వే పోలీసులకు లేదా సెల్ నంబర్: 9247575606ను సంప్రదించాలన్నారు. జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం నంద్యాల(న్యూటౌన్): స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని జింకా ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో 15 ఏళ్ల బాలబాలికలకు వేర్వేరుగా నిర్వహిస్తున్న ఈ పోటీలను జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెస్ క్రీడ ఏకాగ్రతను ఇనుమడింపజేస్తుందన్నారు. చదువులో కూడా రాణించడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. మొబైల్ ఫోన్లో పిల్లల్లో దుష్ప్రభావం చూపుతుందని, పిల్లల దృష్టి క్రీడలపై ఉండేలా చూడాలన్నారు. విద్యతో పాటు క్రీడల్లో, కళల్లో పాల్గొనడం వ్యక్తిత్వ వికాసానికి దోహదమన్నారు. క్రీడల్లో పాల్గొంటే క్రమశిక్షణ అలవాటు అవుతుందన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన విజేతలు జూన్ నెలలో గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, జనార్దన్, టోర్నమెంట్ కో ఆర్డినేటర్ వెంకటరావు, ఆర్బిటర్ సుజాత, 150 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
కర్నూలు(అర్బన్): మైనార్టీ వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి సబిహా పర్వీన్ హెచ్చరించారు. నగరంలోని పోస్టుమెట్రిక్ మైనార్టీ బాయ్స్ హాస్టల్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పలువురు విద్యార్థులకు ఆమె స్వయంగా భోజనం వడ్డించి హాస్టల్లో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హాస్టల్లో వసతి పొందుతున్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా అవసరమైన మెటీరియల్‌ను సమకూర్చుతామన్నారు. ముఖ్యంగా వసతి గృహంలో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, గదులు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆహారం తయారీలో తాజా కూరగాయలు, ఆకు కూరలు వాడాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించబోమన్నారు. హాస్టల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆప్కోలో విలీనం చేయొద్దు
ఎమ్మిగనూరుటౌన్: అధికారపార్టీ నాయకుల తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరికాదని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి నివాసంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు బుట్టారంగయ్య, డాక్టర్ కేఎస్ రఘు,పార్టీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి మాచాని వెంకటేష్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పద్మశ్రీ మాచాని సోమప్ప ఆశయాలకు తూట్లు పొడిచి సొసైటీని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని వీటిని వెంటనే విరమించుకోవాలని కోరారు. చేనేతలపై ప్రేమ ఉంటే వైడబ్ల్యూసీఎస్‌ను అభివృద్ధి చేయా లే కాని నష్టాల ఊబిలో ఉన్న ఆప్కోలో విలీనం చేయరాదన్నారు. అధికారపార్టీ నాయకులు సొసైటీకి సంబంధించిన విలువైన అస్తులను కొల్లగొట్టేందుకే విలీన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చేనేత కార్మికుల శ్రేయస్సు కోసం పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన వైడబ్ల్యూసీఎస్‌ను కాపాడుకునేందుకు తమ పార్టీ అవసరమైతే పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో చేనేత కార్మిక సంఘ నాయకులు రాము, నాగేంద్ర, గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
దొంగ దొరికాడు
నంద్యాల: జల్సాలకు అలవాటు పడి జిల్లాలో చోరీల కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నంద్యాల పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సునీల్ షెరాన్ ఆధ్వర్యంలో అరెస్ట్ చూపించారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ షెరాన్మాట్లాడుతూ.. బెంగళూరుకు చెందిన సోహెల్ ఖాన్ నంద్యాల జిల్లాలో ఆత్మకూరు, నంద్యాల పోలీసు స్టేషన్ల పరిధిలో పలు చోరీలు చేశారు. చోరీలకు పాల్పడుతూ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న సోహెల్ఖాన్ను ఆదివారం వెలుగోడు ఎస్సార్బీసీ కేసీ కెనాల్ కోట్ల కింద ఉండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇతని వద్ద నుంచి ఆత్మకూరు స్టేషన్ల పరిధిలో చోరీకి పాల్పడిన 40 తులాల బంగారు, నంద్యాల పోలీసు స్టేషన్ల పరిధిలో చోరీ చేసిన రెండు తులాల బంగారు ఆభరణాలను సీజ్ చేశామన్నారు. చోరీలకు పాల్పడిన సొమ్ము ను వెలుగోడు దగ్గర ఉన్న ఎస్సార్బీసీ కెనాల్ దగ్గర దాచి పెట్టేవాడన్నారు. ఇతని గతంలో కుప్పం, పెనుగొండ, కర్ణాటక రాష్ట్రాల్లో పలు కేసులు నమోదు అయ్యాయన్నారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో గాలించి అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో దొంగను అరెస్ట్ చేసిన సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. ● 42 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం -
మట్టి అక్రమ తవ్వకాల అడ్డగింత
కోవెలకుంట్ల: పట్టణ శివారులోని స్వామినగర్ కాలనీ పక్కన జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలను ఆదివారం వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దండు మధుబాబు ఆధ్వర్యంలో కాలనీవాసులు అడ్డుకున్నారు. ఇటుకల బట్టీల కోసం ప్రొక్లెయిన్ల ద్వారా మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తుండటంతో కాలనీవాసులు ఆ పనులను నిలిపి వేయించారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ.. కాలనీ పక్కనే ఉన్న పొలాల్లో గతంలో మట్టిని తవ్వడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వర్షాకాలంలో నీరు నిల్వ చేరి గడిచిన పది సంవత్సరాల కాలంలో దాదాపు ఏడుగురు పిల్లలు నీటి గుంతల్లో పడి మృతి చెందారన్నారు. ఎలాంటి అనుమతి లేకపోయినా కొందరు వ్యక్తులు ఆదివారం మట్టి తవ్వి తరలించుకపోతున్నారన్నారు. పొలాల్లో మట్టి తవ్వగా గుంతలు ఏర్పడి మళ్లీ ప్రమాదాలు చోటు చేసుకోనే ఆస్కారం ఉందన్నారు. సంబంధిత అధికారులు మట్టి తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వార్డు మెంబర్ రఘు, అరదేశి దేవా, కాలనీవాసులు పాల్గొన్నారు. -
ప్రేమతత్వాన్ని మేల్కొల్పిన ఏసు
నంద్యాల(న్యూటౌన్): మానవుల్లో ప్రేమతత్వాన్ని మేల్కొల్పిన మహానీయులు ఏసుక్రీస్తు అని నంద్యాల డయాసిస్ పీఠాధిపతులు బిషప్ ది రైట్ రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావు అన్నారు. మట్టల ఆదివారం సందర్భంగా పట్టణంలోని హోలీక్రాస్ కెథడ్రల్ పాస్టరేట్–2 ఆల్ సెయింట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. డీనరీ చైర్మన్ ఎంఐడీ ప్రసాద్ గురువులు, డేవిడ్ వేణు, రెవరెండ్ మారడోన గురువులతో పాటు పాస్టరేట్–3లో డీనరీ చైర్మన్ సామేలు రత్నరాజు గురువులతో పాటు పాస్టరేట్–4, 5, 6లో రెవరెండ్ విక్టర్ బాబులతో పాటు కమిటీ సభ్యులు, క్రైస్తవ పెద్దలు, చిన్నా, పెద్దలు, మహిళలు పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. మట్టలు చేతపట్టుకొని దేవున్ని స్తుతిస్తూ ప్రత్యేక పాటలు పాడుతూ ఆలయాల చుట్టూ ప్రత్యేక ప్రదక్షిణలు చేశారు. ఈ రోజు నుంచి గుడ్‌ఫ్రైడే వరకు ఏసు అనుభవించిన శ్రమలను ప్రతి రోజూ ధ్యానిస్తూ మంచి మార్గంలో నడవాలని సూచించారు. అందరూ శాంతి సమాధానం కలిగి ఏసు మార్గం జీవించాలని కోరారు. కార్యక్రమంలో పాస్టర్లు విజయ్‌కుమార్, టెక్కె పాస్టరేట్ చైర్మన్ జోయల్బాబు, పాల్రాజారావు, సీయెను ప్రార్థనామందిరం నిర్వాహకులు ఏసుదాసు, ఏసుకృప పాస్టర్ అందం సుధాకర్, జాన్బెన్నిలతో పాటు అన్ని సంఘాల పాస్టర్లు ఆయా సంఘాల్లో మట్టల ఆదివారం సందేశాన్ని వినిపించారు. -
అమరావతి పేరిట హైడ్రామా
● ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మంత్రాలయం రూరల్: అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. రాంపురం గ్రామంలో ఆదివారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక అమరావతి రాజధాని పేరుతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఆ ప్రాంతంలో అభివృద్ధే కనిపించడం లేదని, అవినీతి జరుగుతుందని ప్రశ్నిస్తే బురదజల్లడం చంద్రబాబు అలవాటైపోయిందన్నారు. అమరావతి రాజధానికి ఎవరు అడ్డు పడుతున్నారో, ఎవరు వ్యతిరేకిస్తున్నారో, ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. రైతు సమస్యలను పక్కదారి పట్టించే కుట్రలో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా చేశారని విమర్శించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లు చెరువులో ఉన్నాయన్నాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఘోరంగా విఫలమవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. అమరావతిని టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. 2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాజధానిలో మూడు పంటలు పండే లక్షల ఎకరాలను రైతుల నుంచి సేకరించి కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాలన వైఫల్యాలను నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మభ్యపెడడుతున్నారన్నారు. అదుపు తప్పిన కారు నంద్యాల(అర్బన్): అబాండం తండా గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి కాల్వలో పడింది. హైవే పనుల్లో భాగంగా అబాండం తాండ దాటిన తర్వాత మహానంది రస్తాలో నూతన వంతెన పనులు జరుగుతున్నాయి. పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి పనుల నిమిత్తం మహానందికి బయల్దేరగా వంతెన వద్ద ఎలాంటి ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడంతో కారు కాల్వలో పడింది. ప్రమాదంలో ప్రభాకర్‌రెడ్డి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరొకరిపై జిల్లా బహిష్కరణ వేటు కర్నూలు: శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్న మరొకరిపై జిల్లా బహిష్కరణ వేటు పడింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుధవారపేటలో నివాసముంటున్న పొలిశెట్టి అశోక్‌ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రతిపాదన మేరకు జిల్లా బహిష్కరణ చేస్తూ కలెక్టర్ సిరి ఉత్తర్వులిచ్చారు. పొలిశెట్టి అశోక్‌పై మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. గతంలో తీవ్రమైన నేరాలకు, ముఖ్యంగా హత్యలకు సంబంధించిన కేసుల్లో పాల్గొని పోలీసుల రికార్డులకెక్కాడు. రాబోవు కాలంలో ప్రజల్లో భయాందోళన సృష్టించే అవకాశమున్న నేపథ్యంలో చట్టపరమైన నిబంధనల ప్రకారం జిల్లా బహిష్కరణకు పోలీసు అధికారులు ఉత్తర్వులిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు చెడు నడత కలిగిన తొమ్మిది మందిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
రైతులను మభ్యపెట్టడానికే అసెంబ్లీలో రాజధాని తీర్మానం
● ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షిచిప్పగిరి: అమరావతి ప్రాంత రైతులను రాజధాని పేరుతో మరోసారి మభ్యపెట్టడానికే ముఖ్యమంత్రి చంద్రాబాబు ఆసెంబ్లీలో అమరావతిని శాశ్వత రాజధానిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నారని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి విమర్శించారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో అమరావతి రాజధానిలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. నిర్మాణం పేరుతో రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, అమరావతి నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. అమరావతి కోసం పోరాటాలు చేసిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఏం లాభం చేసిందో ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. ప్లాట్లు ఇచ్చామని గొప్పలు చెబుతున్నా, స్థలాలు ఎక్కడ ఉన్నాయో చాలా మంది రైతులకు తెలియదన్నారు. కూటమి పాలనలో అభివృద్ధి గ్రాఫిక్స్‌లో మాత్రమే కనిపిస్తోందని, ఆచరణలో మాత్రం లేదన్నారు. 2028లో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతూనే తిర్మానం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బుసినే శ్రీరాములు, వెంకటేష్, చంద్రశేఖర్, మహానంది, హనుమంతు పాల్గొన్నారు. -
యువకుడి దారుణహత్య
సి.బెళగల్: పాత కక్షలతో కె.సింగవరం గ్రామంలో ఓ యువడిని శనివారం దారుణంగా హత్య చేశారు. ఎస్ఐ వేణుగోపాల్‌రాజు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బోయ మల్లికార్జున (27)కు అదే గ్రామానికి చెందిన కొందరి వ్యక్తుల మధ్య గొడవలు ఉన్నాయి. వారు శనివారం ఘర్షణ పడి బోయ మల్లికార్జునను చేతులు, కాళ్లతో కొట్టడమే గాక వేటకొడవలితో కుడి కాలును నరికారు. తీవ్ర రక్తస్రావమై బోయ మల్లికార్జున అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఆప్కోలో విలీనం చేస్తే పోరాటం
● వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జి బుట్టా రేణుక కర్నూలు(సెంట్రల్): ఎమ్మిగనూరు వీవర్స్ సొసైటీని ఆప్కోలో విలీనం చేస్తే పోరాటానికి దిగుతామని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జి బుట్టా రేణుక హెచ్చరించారు. నష్టాల్లో ఉన్న ఆప్కోలో లాభాల్లో ఉన్న వీవర్స్ సొసైటీని ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్లను కలిసి శనివారం ఆమె వినతిపత్రాన్ని ఇచ్చారు. ఎమ్మిగనూరు అంటే చేనేతలు..చేనేతలు అంటే ఎమ్మిగనూరు అనేలా పేరు ప్రఖ్యాతులు రావడానికి వీవర్స్ సొసైటీనే కారణమన్నారు. మాచాని సోమప్ప 1938లో ఎమ్మిగనూరు వీవర్ సొసైటీని ఏర్పాటు చేసి దానికి సొంత ఆస్తులను ఇచ్చారన్నారు. దీని ద్వారా సుమారు 200 మంది మగ్గాలు నేసి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఈ సొసైటీకి 16 అవుట్లేట్లు ఉన్నాయని, విలీనం చేస్తే వాటి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మార్చి 31వ తేదీన విలీనానికి సంబంధించిన సమావేశాన్ని రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడు నాగేషప్ప, జిల్లా చేనేత అధ్యక్షుడు ఎంకే శివప్రసాదు, నియోజకవర్గ చేనేత అధ్యక్షుడు మీసాలబండ నీలకంఠ, 3వ వార్డు అధ్యక్షుడ చేనేత మళ్లి పాల్గొన్నారు. -
పంట నష్టం.. పరిహారం కష్టం!
ఎకరా రూ. 35 వేలు వెచ్చించి ఎకరన్నర పొలంతోపాటు నాలుగున్నర ఎకరాల సొంత పొలంలో ఖరీఫ్ సీజన్లో మిరప పంట సాగు చేశాను. నారు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ, తదితర పెట్టుబడుల రూపంలో అక్టోబర్ ఆఖరు నాటికి ఎకరాకు రూ. 40 వేలు వెచ్చించాను. భారీ వర్షాలు కురిసి అధిక తేమతో మొక్కలు చనిపోవడంతో నాలుగు ఎకరాల్లో మిరప పైరును తొలగించాను. మిగిలిన రెండు ఎకరాల్లో మిరప అరకొరగా ఉంది. తుపాన్ కారణంగా మిరప సాగుతో భారీ నష్టాలు వచ్చాయి. – రమణారెడ్డి, రైతు, చిన్నకొప్పెర్ల, కోవెలకుంట్ల మండలం మోంథా తుపాన్ కారణంగా గతేడాది అక్టోబర్ నెలలో కురిసిన వర్షాలకు మినుము, కంది పంటలు దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ. 35 వేలు ఖర్చు చేసి పది ఎకరా ల్లో మినుము సాగు చేశాను. భారీ వర్షాలు తర్వాత పొగమంచుతో పూత, పిందె రాలిపోయి నష్టం వాటిల్లింది. కందిపూత దశలో వర్షాలు కురియడంతో నష్టాలు తప్పలేదు. పంటనష్ట పరిహారం చెల్లించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. – వెంకటేశ్వరరెడ్డి, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం కోవెలకుంట్ల: రైతులకు అడుగడుగునా సాయమందించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మోంథా తుపాన్‌తో గతేడాది అక్టోబర్‌లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందలేదు. అప్పుల బాధతో చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో గతేడాది ఖరీఫ్ సీజన్లో 76,672 హెక్టార్లలో వరి, 76,025 హెక్టార్లలో మొక్కజొన్న, 35,713 హెక్టార్లలో కంది, 12,011 హెక్టార్లలో మిను ము, 7,581 హెక్టార్లలో వేరుశనగ, 6,426 హెక్టార్లలో పత్తి, 6,786 హెక్టార్ల మిరప పంటలు సాగు చేశారు. రబీ సీజన్లో 53,801 హెక్టార్లలో పప్పుశనగ, 29,395 హెక్టార్లలో జొన్న, 29,413 హెక్టార్లలో మొక్కజొన్న 11,643 హెక్టార్లలో మినుము పంటలు సాగయ్యాయి. తుపాన్ ప్రభావంతో వారం రోజులపాటు భారీ వర్షా లు కురవడంతో రైతులకు పంటలు చేతికందలేదు. నష్టం ఇలా.. వరి, మొక్కజొన్న, కంది, మినుము పంటల సాగుకు ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ. 35 వేలు ఖర్చు వచ్చింది. మిరప సాగుకు ఎకరాకు రూ. 70 వేల నుంచి రూ. లక్ష వరకు వెచ్చించారు. పప్పుశనగ, జొన్న, త దితర పంటల్లో ఎకరాకు రూ. 25 వేల వరకు పెట్టుబడి పెట్టారు. వరుస వర్షాలతో కంది, మినుములో పూత, పిందె రాలిపోయి నష్టం చేకూరింది. మిరపలో తేమ శాతం అధికమై వేరుకుళ్లు తెగులు ఆశించి పైరంతా ఎండిపోయింది. చాలాచోట్ల మిరప పైరును తొలగించారు. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి కోత దశలో భారీ వ ర్షాలతో నేలివాలి పనికిరాకుండా పోయింది. కల్లాల్లో ఆరబోసినదిగుబడులు తడిచిపోవడంతో రైతులు నష్టా లు మూటగట్టుకున్నారు.రబీసీజన్‌లో జిల్లాలో రై తులు విస్తారంగా పప్పుశనగ, జొన్న పంటలు సాగు చే శారు. విత్తనం వేసిన నెల రోజులకే భారీ వర్షాలు కు రి యడ ంతోపొలాల్లో నీరునిల్వ చేరి మొక్కలు చనిపోయాయి. రైతులు తిరిగి విత్తనం వేసుకోవాల్సి వచ్చింది. ఐదు నెలలుగా ఎదురు చూపులు మోంథా తుపాన్ ప్రభావంతో జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 22,554 మంది రైతులకు సంబంధించి వివిధ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ధృవీకరించారు. నష్టపరిహారం విడుదలకు ప్రతిపాదనలు పంపారు. భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు వరి, వేరుశనగ పంటలకు హెక్టారుకు రూ. 25 వేలు, మినుము, కంది పంటలకు రూ. 15వేలు, మిరపకు రూ. 35వేల చొప్పున నష్టపరిహారం అందాల్సి ఉంది. పంటనష్ట సంభవించి ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు నష్టపరిహార ఊసే లేకపోవడంతోరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నియోజకవర్గం దెబ్బతిన్న విస్తీర్ణం (హెక్టార్లలో) బనగానపల్లె 1181 శ్రీశైలం 4075 ఆళ్లగడ్డ 2960 నందికొట్కూరు 2015 నంద్యాల 898 పాణ్యం 452 (పాణ్యం, గడివేముల)వైఎస్సార్సీపీ హయాంలో అదే సీజన్లో అందిన పరిహారం ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసిన పంటలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించడంతోపాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటనష్టం సంభవిస్తే అదే సీజన్లో నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకుంది. నంద్యాల జిల్లాలో 2021వ సంవత్సరంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటనష్టం సంభవించగా 89,199 మంది రైతులకు రూ. 84.33కోట్లు, 2022వ సంవత్సరంలో 49,637 మంది రైతులకు దాదాపు రూ. 100 కోట్లను ఇన్సూరెన్స్ రూపంలో అందించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా రైతులకు నిలిచింది. ముంచిన మోంథా తుపాన్ దెబ్బతిన్న మిరప, కంది, మినుము, వరి పంటలు జిల్లాలో నష్టపోయిన రైతులు 22,554 మంది మొత్తం 11,581 హెక్టార్లలో పంటనష్టం ఇప్పటి వరకు పరిహారం ఇవ్వని చంద్రబాబు సర్కార్ -
‘పది’ పరీక్షల తనిఖీ
డోన్ టౌన్: పట్టణంలో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డి తనిఖీ చేశారు. శనివారం డోన్‌కు వచ్చిన ఆయన మొదటగా పట్టణ పోలీసు స్టేషన్లో భద్ర పరిచిన ప్రశ్నా పత్రాలను పరిశీలించి డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం పట్టణంలో పరీక్ష కేంద్రాలైన శ్రీసుధ, నారాయణ, జెడ్పీ గ్లర్స్ హైస్కూల్‌ను తనిఖీ చేసి వసతులను పరిశీలించారు. ఆయన వెంట డోన్ మండల విధ్యాధికారులు ప్రభాకర్, రఘునాయక్ ఉన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు కర్నూలు (టౌన్): జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. అందులో భాగంగానే ఆపరేషన్ వజ్ర ప్రహార్ పేరుతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. శనివారం హొళగుంద, మంత్రాలయం, చిన్న పెండేకల్, కర్నూలులోని వీకర్ సెక్షన్ కాలనీలలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఈగల్ ఐజీ మాట్లాడుతూ.. సరైన పత్రాలు లేని 52 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తనిఖీల్లో పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, ఎమ్మిగనూరు డీస్పీ భార్గవి, కర్నూలు మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. అప్పులు వద్దని.. చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఆలూరు: అప్పులు ఎక్కువ చేస్తున్నారని, రాష్ట్రాన్ని శ్రీలంకగా మర్చారని అధికారంలోకి రాక ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేస్తుందేమిటని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ప్రశ్నించారు. గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో రూ 3.31 లక్షల కోట్ల అప్పులు చేశారని, చంద్రబాబు నేడు ఏకంగా రూ 3.40 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. ఆలూరు పాతబస్టాండు సమీపంలో శనివారం ఏఐటీయూసీ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికి పాల్పడకుండా కేంద్రప్రభుత్వం కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజయ్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావుల పల్లి రవీంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.గిడ్డయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, జిల్లా కార్యదర్శి మునెప్ప పాల్గొన్నారు. పాల శీతలీకరణ కేంద్రాల్లో తనిఖీలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని పాల శీతలీకరణ కేంద్రాల్లో పశుసంవర్ధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల రాజమహేంద్రవరంలో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ కలిసిన పాలు తాగి పలువురు మరణించిన విషయం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇథిలిన్ గ్లైకాల్ అనే కెమికల్స్ కలిసిన పాలు తాగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత పాల నాణ్యత, స్వచ్ఛతపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉత్పన్నమయ్యాయి. దీంతో పశు సంవర్ధక శాఖ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, ఏరి యా హాస్పిటల్స్ ఏడీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల శీతలీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. పైప్లైన్లు ఎలా ఉన్నాయి.. శీతలీకరణకు వాడుతు న్న కెమికల్ ఏది.. తదితర విషయాలను పరిశీలించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ హేమంత్‌కుమార్ కూడా పాల శీతలీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో ఇథిలిన్ గ్లైకాల్ వినియోగించడం లేదని, అమ్మోనియా, ప్రియాన్లను వాడుతున్నారని, ఇవి ప్రమాదకరమైనవి కాదని ఆయన పేర్కొన్నారు. గతేడాది ‘స్పాట్’ రెమ్యునరేషన్ ఇప్పించండి నంద్యాల(న్యూటౌన్): గత ఏడాది పదవ తరగతి మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు రెమ్యునరేషన్ చెల్లించలేదని, వెంటనే ఇప్పించాలని ఏపీటీఎఫ్ 257 జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్య కోరారు. ఈ మేరకు శనివారం డీఈఓ జనార్దన్‌రెడ్డికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్పాట్‌కు సంసిద్ధతను తెలిపిన ఉపాధ్యాయులనే సీనియార్టీ ప్రాతిపదికన నియమించాలన్నారు. స్పాట్ – 2025 రెమ్యునరేషన్ ఇప్పటికీ క్రెడిట్ కాలేదని, అలాగే కస్టోడియన్, పేపర్ కరెక్షన్ సంబంధించి అమౌంట్ చాలా మంది ఉపాధ్యాయులకు జమ కాలేదన్నారు. స్పాట్ కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ నియామకాలకు సందర్భంలో బ్లాక్ చేసిన కేటగిరి–1, 2, 3 పోస్టులను రానున్న బదిలీల్లో భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ 257 నాయకులు జాకీర్‌హుసేన్, వీరేశ్వరరెడ్డి, దస్తగిరిబాషా పాల్గొన్నారు. -
తల్లి హత్య కేసులో కుమారుడు అరెస్ట్
అవుకు(కొలిమిగుండ్ల): ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కేసులో కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథరెడ్డి ఎస్ఐ అశోక్‌తో కలిసి నిందితుడి వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అవుకు పట్టణంలోని కోటవీధికి చెందిన పోతుల శేఖర్, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు రామాంజనేయులు మద్యానికి బానిసయ్యాడు. ఇంటిని తన పేరున రాయించాలని తరచూ తల్లితండ్రులతో గొడవ పడుతుండేవాడు. ఈక్రమంలోనే ఈనెల 19న ఉగాది పండుగ రోజున ఆస్తి విషయంలో గొడవకు దిగాడు. తల్లిదండ్రులను చంపాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న రాయితో తండ్రిపై దాడి చేయడంతో కింద పడగా కట్టెతో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డుకోబోయిన తల్లి లక్ష్మీదేవిని అదే కట్టెతో బలంగా బాదడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఈనెల 22న మృతి చెందింది. ఈ మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు. నిందితుడు రామాంజనేయులు కోసం వెతుకుతుండగా మెట్టుపల్లి రోడ్డులోని చిన్న చెరువు కట్ట సమీపంలో ఉన్న విషయం తెలుసుకొని అరెస్ట్ చేశాని సీఐ తెలిపారు. జల్సాకు అలవాటు పడి.. తల్లిని హత్య చేసిన నిందితుడు రామాంజనేయులు చిన్నప్పటి నుంచి జల్సాలకు అలవాటు పడి ఊర్లో చెడు వ్యక్తులతో సావాసం చేస్తూ మద్యానికి బానిస య్యాడు. జల్సాల కోసం పలువురి దగ్గర డబ్బులు చేశాడు. ఆ అప్పులు తీర్చేందుకు, జల్సాలకు ఇంట్లో డబ్బులు అడిగితే తల్లిదండ్రులు నిరాకరించా రు. ఎలా గైనా అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో కొంత మందితో కలిసి 2023లో రామాపురంలో చోరీకి పాల్పడ్డాడు. ఆ డబ్బులతో కొంత అప్పులు చెల్లించి మిగిలిన డబ్బుల ను జల్సాలకు వాడుకున్నాడు. ఈ దొంగతనం కేసులో అవుకు పోలీస్ స్టేషన్లో అప్ప ట్లో కేసు నమోదైంది. ఆ తర్వాత కూడా అప్పులు చేయడం, జల్సాలు మానుకోలేదు. డబ్బుల కోసం తల్లిదండ్రులను కొన్ని నెలల నుంచి ఇబ్బంది పెడు తున్నా వాళ్లు ఇవ్వలేదు. వారి పేరున ఉన్న ఆస్తి రాసివ్వలేదనే కారణంతో తల్లిని హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. -
ప్రజలకు అందించే సేవలతోనే గుర్తింపు
● జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి కర్నూలు(అర్బన్): ప్రజలకు అందించే ఉత్తమ సేవలతోనే ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గుర్తింపు వస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. శనివారం స్థానిక జెడ్పీలోని తన చాంబర్లో కారుణ్య నియామకాల కింద ముగ్గురికి ఉద్యోగాలు కల్పించి నియామకపు ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ జెడ్పీ యాజమా న్య పరిధిలోని ఆయా కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు ప్రస్తుతం ఉద్యోగాలు పొందిన వారి అభీష్టం మేరకే వారు కోరుకున్న ప్రాంతాల్లో నియమిచామన్నారు. జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్‌లో మృతి చెందితే ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తున్నామన్నారు. ఆఫీసు సబార్డినేట్‌గా ఉద్యోగాలు పొందిన ఎస్ గణేష్ (ఎంపీపీ ఆళ్లగడ్డ), ఆర్ నరేంద్రకుమార్ (ఎంపీపీ కల్లూరు), వీ అభిషేక్ (ఎంపీపీ కౌతాళం)కు పోస్టింగ్స్ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
క్యూ కాంప్లెక్స్‌ల్లో కూలర్లు ఏర్పాటు చేయండి
శ్రీశైలం టెంపుల్: ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం క్యూ కాంపెక్స్ల్లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేసి సక్రమంగా పనిచేసే విధంగా ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుండాలని దేవదాయశాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి డాక్టర్ ఎం హరిజవహర్‌లాల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆకస్మికంగా శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తుల దర్శన ఏర్పాట్లపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా త్వరగా దర్శనమయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైనచోట్ల చలువ పందిర్లు ఏర్పాటు చేయాలన్నారు. క్యూలైన్లలోని నిర్దిష్ట ప్రదేశాల్లోని వాటరు పాయింట్లకు అంతరాయం లేకుండా నీటిసరఫరా ఉండాలన్నారు. క్షేత్రంలో పారిశుద్ధ్యం నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం కార్యదర్శి వారికి స్వామివార్ల ప్రసాదాలు, శేషవస్త్రం, శ్రీస్వామిఅమ్మవార్ల చిత్రపటం అందజేశారు. 30న పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 30వ తేదీన సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు ఉదయం టిడ్కో గృహాల ప్రారంభోత్సవం, మధ్యాహ్నం పీ–4 కార్యక్రమం నిర్వహణ ఉండటంతో పీజీఆర్ఎస్ను రద్దు చేయాల్సి వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి అనవసరంగా జిల్లా కేంద్రం నంద్యాలకు వచ్చి ఇబ్బందులు ఎదుర్కోవద్దని సూచించారు. కాగా డివిజనల్ కార్యాలయాలు, మున్సిపల్ పట్టణాలు, మండల తహసీల్దార్ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు. బీసీ హాస్టళ్లలో మధ్యాహ్న భోజనంపై విచారణ కోవెలకుంట్ల: పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహాల్లో మధ్యాహ్న భోజనం నిలిపి వేయడంపై శనివారం అధికారులు విచారణ చేపట్టారు. బీసీ వసతిగృహాల జిల్లా అధికారి జగ్గయ్య స్థానిక బీసీ బాలుర వసతి గృహాన్ని చేరుకుని హాస్టల్ విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు మండలంలోని గుళ్లదూర్తి బీసీ బాలుర వసతిగృహాన్ని మండల ప్రత్యేకాధికారి కల్యాణి, తహసీల్దార్ పవన్‌కుమార్‌రెడ్డి చేరుకుని శుక్రవారం హాస్టల్లో మధ్యాహ్న భోజనం నిలిపివేయడంపై వివరాలు అడిగి తెలుసుకుని అందుకు సంబంధించిన వివరాలు నమోదు చేశారు. 1,413 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం నంద్యాల(న్యూటౌన్): ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశం పొందేందుకు జిల్లాలో 1,856 మంది దరఖాస్తు చేసుకోగా 1,413 మంది అర్హత సాధించారని జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ నిత్యానందరాజు ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత లాటరీ ఫలితాలు విడుదలైనట్లు తెలిపారు. ఏప్రిల్ 7లోగా పాఠశాలకు వెళ్లి ప్రవేశాలను నిర్ధారించుకోవాలని సూచించారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
నందవరం: ఆర్టీసీ బస్సు అదు పు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. అందులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. నందవరం గ్రామ సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నాగలదిన్నె నుంచి ఆర్టీసీ బస్సు ఎమ్మిగనూరుకు 18 మంది ప్రయాణికులతో బయలుదేరింది. నందవరం గ్రామం దాటిన తరువాత బస్సు స్టీరింగ్ వీల్ పనిచేయకపోవడంతో డ్రై వర్ కాశీం పొలాల్లోకి మళ్లించాడు. ప్రధాన రహదారిలో చింత చెట్టు స్వల్పంగా ఢీకొని బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాలం చెల్లిన బస్సులు నడుపుడుతుడడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు మండిపడ్డారు. ప్రభుత్వం కండిషన్ కలిగిన బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
కుమారుడిని చూసేందుకు వచ్చి..
కర్నూలు: నగర శివారులోని ఓ పాఠశాలలో చదువుతున్న కుమారుడిని చూసేందుకు వచ్చిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామానికి చెందిన షేక్ తపాలా ఖాశీం బాషా (45)కు ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తున్నారు. ఇతనికి ఒక కొడుకు, కూతురు సంతానం. వీరు ప్రస్తుతం కర్నూలు శివారులోని మాంటెస్సోరి ఇండస్ స్కూల్లో చదువుతున్నారు. 8వ తరగతి చదువుతున్న కొడుకు సొహైల్‌కు ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుని ద్విచక్ర వాహనంపై బనగానపల్లె నుంచి శుక్రవారం కర్నూలుకు వచ్చాడు. పాఠశాలలో తన పిల్లలను చూసుకుని తిరిగి ద్విచక్ర వాహనంపై ఎన్‌హెచ్ 44 మీదుగా కర్నూలు నగరంలోకి వస్తుండగా కృష్ణానగర్ రావూరు ఫంక్షన్ హాల్ దగ్గర బ్రిడ్జిపైన వెనుక వైపు నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఖాశీం బాషా ద్విచక్ర వాహనం పైనుంచి కింద పడ్డాడు. హెల్మెట్ ఊడి పక్కనే పడింది. తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలో పడివుండగా చుట్టు పక్కల ఉన్నవారు గుర్తించి ప్రైవేటు అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వార్డులో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ట్రాఫిక్ పోలీసులు మార్చురీకి తరలించారు. మృతుడి భార్య షేక్ రిజ్వానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి
నంద్యాల(అర్బన్): ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం పెద్దకొట్టాల గ్రామంలో చోటు చేసుకుంది. అయ్యలూరు మెట్టకు చెందిన శంకర్(45) ఇటుకల లోడ్‌తో పెద్దకొట్టాల మీదుగా కొత్తపల్లె గ్రామానికి వెళుతున్నాడు. పెద్దకొట్టాల చర్చి వద్ద మట్టి కుప్పపై ట్రాక్టర్ ఎక్కడంతో ప్రమాదవశాత్తు డ్రైవింగ్ సీటులో ఉన్న శంకర్ టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శివమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీసులు తెలిపారు. -
వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం
● దేవుడి మాన్యం భూముల్లో అక్రమ తవ్వకాలు ● మట్టి ట్రాక్టర్ల అతి వేగాన్నిప్రశ్నించినందుకు హత్యకు కుట్ర ● ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాలని ప్రయత్నించారని బాధితుడి ఆరోపణ ఆత్మకూరురూరల్: వడ్ల రామాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు శేషిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గ్రామంలో పల్లెపాడు ఆంజనేయ స్వామి మాన్యం భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు లింగస్వామికి చెందిన ట్రాక్టర్లు ఇందుకోసం వినియోగిస్తున్నారు. ట్రాక్టర్లు మట్టిని తరలిస్తూ గ్రామంలో వేగంగా వెళ్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని డ్రైవర్లకు వేగం తగ్గించాలని చెప్పాలని సింగస్వామికి శేషిరెడ్డి చెప్పాడు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ తమ్మలూ రు ముర్తుజా వెంటనే శేషిరెడ్డికి ఫోన్ చేసి ‘మమ్మల్ని అడిగే వాడివా.. నిన్ను చంపితే దిక్కెవరు’ అంటూ బెదిరించాడు. ఈ విషయంపై పదే పదే ఫోన్ చేసి బెదిరిస్తుండటంతో శేషిరెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అయితే ముర్తుజా నేరుగా ట్రాక్టర్‌తో శేషిరెడ్డి ఇంటివద్దకు వచ్చి బూతులు తిడుతూ ఇంటి ముందు నిలుచున్న ఆయనను ట్రాక్టర్‌తో ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. పక్కనే చంద్రమౌళీశ్వరరెడ్డి ఆయన కుటుంబ సభ్యులను కూడా తగిలేలా వెళ్లింది. వెంటనే వారు తేరుకుని ఇంట్లోకి పరిగెత్తారు. ట్రాక్టర్ శేషిరెడ్డి ఇంటి ప్రహరీని ఢీకొంది. శేషిరెడ్డి, అతని కుటుంబ సభ్యులు ఈ హఠాత్పరిణామానికి బిత్తర పోయి తేరుకునేలోగా ముర్తుజా అక్కడ నుంచి ట్రాక్టర్‌తో పరారయ్యాడు. శేషిరెడి వెంటనే ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు శేశాడు. ఈ మేరకు సీఐ మహేశ్వరరెడ్డి ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించారు. పోలీసులు గాలించి ముర్తుజాను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అక్రమ మైనింగ్‌ను పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు అడ్డుకోవాలని వడ్లరామాపురం గ్రామస్తులు కోరుతున్నారు. చంపాలనే ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు గ్రామంలో ఇష్టారాజ్యంగా వెళ్తున్న ట్రాక్టర్లను కాస్త నెమ్మదిగా వెళ్లాలని చెప్పినందుకే నన్ను చంపాలనే ట్రాక్టర్‌తో ఢీ కొట్టారు. ముర్తుజా నన్ను చంపుతానని అప్పటికి మూడు సార్లు ఫోన్ చేసి బెదిరించాడు. ఇంట్లోకి పరిగెత్తడంతో ప్రాణాలు దక్కాయి. ముర్తుజాపై తగిన చర్యలు తీసుకోవాలి. దేవుని మాన్యంలో అక్రమ తవ్వకాలు ఆపాలి. – శేషిరెడ్డి, బాధితుడు -
సాంకేతిక విద్య.. ఉద్యోగానికి భరోసా
● పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల ● దరఖాస్తుకు ఏప్రిల్ 4వ తేదీతుది గడువు ● పది విద్యార్థులకు చక్కటి అవకాశం ● ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి ఉత్తీర్ణతతో సాంకేతిక విద్యకు పునాది వేసే ‘పాలిసెట్’కు సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు. పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రా రంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ముందుగానే సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు పాలిసెట్–2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు, ఆ కళాశాలల్లో ఉన్న సీట్ల వివరాలు, పరీక్ష తేదీ తదితర వివరాలు ఇలా.. ఉజ్వల భవిష్యత్‌కు బాటలు.. పాలిటెక్నిక్ ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అటువంటి వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలని పలువురు సాంకేతిక విషయ నిపుణులు పేర్కొంటున్నారు. పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందే వీలుంటుంది. పాలిసెట్–2026 కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. ఏప్రిల్ 4వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. పాలిసెట్ ఇలా.. పాలిసెట్ 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400గా నిర్ణయించారు. ప్రయోజనాలెన్నో.. పాలిటెక్నిక్‌లో ఏ కోర్సును పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా లభిస్తుంది. ఈ కళాశాలల్లో ఇటీవ ల తరచూ ఉద్యోగ మేళా నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేలు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ సెకండియర్‌లో చేరవచ్చు. లభించే కోర్సులు... పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచ్‌కు 60 నుంచి 120 వరకూ సీట్లు అందుబాటులో ఉంటాయి. నంద్యాల జిల్లాలో 7 ప్రభుత్వ, 5 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ 60, మెకానికల్ 120, ఈసీఈ 120, ఎలక్ట్రికల్ 120 సీట్లు ఉన్నాయి. ఐదు ప్రైవేట్ కళాశాలల్లో సుమారు 1,500 వరకు సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. ఇందులో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. -
నిప్పుల కొలిమి
● పలు మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు కర్నూలు(అగ్రికల్చర్): ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న నాలుగైదు రోజుల్లో జిల్లా నిప్పుల కుంపటిగా మారే ప్రమా దం ఏర్పడింది. గురువారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వడగాల్పులు, ఎండల తీవ్రత పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు కర్నూలు లో నమోదవుతుండటం గమనార్హం. ఇదిలాఉంటే కర్నూలు నగరం సహా ఎక్కడా చలివేంద్రం కనిపించని పరిస్థితి నెలకొంది. ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి లైన్ డిపార్టుమెంట్లతో వేసవి ఉపశమన చర్యలపై సమావేశం నిర్వహించి సంబందిత శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ కొందరు అధికారులు పట్టించుకోని పరిస్థితి కనిపిస్తోంది. అహోబిలం ప్రధాన పరిపాలనాధికారిగా పార్థసారథి ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం దేవస్థానం ప్రధాన పరిపాలనాధికారిగా పార్థసారథి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంద్ర మహాదేశికన్ ఆదేశానుసారం చైన్నె నుంచి అహోబిలం చేరుకున్న ఆయన గురువారం దేవస్థానం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అహోబిలం దేవస్థానం అభివృద్ధితో పాటు భక్తులకు వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్చకులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ క్షేత్ర అభివృద్ధికి పాటుపడాలన్నారు. గత రెండు సంవత్సరాల్లో ఇప్పటి వరకు సుమారు 12 మంది పరిపాలనాధికారులు మారడంతో పాటు బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకు మించి ఒక్కరు కూడా విధులు నిర్వహించలేక బాధ్యతల నుంచి తప్పుకుని వెళ్లిపోయారు. మొన్నటి దాక బాధ్యతలు నిర్వహించిన మరో వర్గం తమను కాదని చైన్నె నుంచి వచ్చిన ఇతను ఎన్ని రోజులు ఇక్కడ విధులు నిర్వహిస్తారో.. చూస్తాం అంటూ.. తేల్చిచెబుతున్నారు. స్థానిక నేతల ఒత్తిళ్లు, మఠం అసమ్మతి నేతల ఎత్తులను తట్టుకుని పార్థసారథి ఎన్నాళ్లు ఉంటారోననే చర్చ కొనసాగుతోంది. మండలం ఉష్ణోగ్రత జూపాడుబంగ్లా 40.64 రుద్రవరం 40.68 కొత్తపల్లి 40.44 కోడుమూరు 40.4 పెద్దకడుబూరు 40.4 కల్లూరు 40.29 శిరువెళ్ల 40.18 -
వైఎస్సార్సీపీ పాలన ప్రజలకు స్వర్ణయుగం
బొమ్మలసత్రం: గత వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు స్వర్ణయుగాన్ని చూశారని వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. గురువారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు కారు రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, జాన్‌వెస్లీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో క్రిస్టియన్లకు పూర్తిగా న్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం డాక్టర్ బీఅర్ అంబే డ్కర్ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విమర్శించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు పాలకుల చేతిలో కీలు బొమ్మ ల్లా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తూ వైఎస్సార్సీపీ నేతలను జైళ్లకు పంపుతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో కోవిడ్ సంభవించినా సంక్షేమ పథకాలు ఆపలేదని గుర్తు చేశారు. ఇంత ఆదాయ వనరులు ఉన్నా టీడీపీ ప్రభుత్వం అప్పుల దిబ్బలా రాష్ట్రాన్ని ఆధోగతి పాలు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ పాలనలో క్రిస్టియన్లకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సముచిత స్థానం కల్పించారన్నారు. టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించకుండా మోసం చేయటం దుర్మార్గమన్నారు. బనగానపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుందన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఇంటికి పంపి తిరిగి సంక్షేమ ప్రభుత్వాన్ని గెలిపించుకునేందు కు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నార. సమావేశంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనా రిటీ సెల్ సెక్రటరీ విల్సన్‌పాల్, నంద్యాల నియోజకవర్గ అధ్యక్షులు మనో జ్ కుమార్, పట్టణాధ్యక్షులు ఇమ్మానియేలు, రవిప్రకాష్, కరుణాకర్, ప్రేమ్‌కుమార్, కిరణ్ పాల్గొన్నారు. -
రాయల్టీ పేరుతో నిలువుదోపిడీ
● సుధాకర్ ఇన్ఫ్రా సిబ్బందికి మైనింగ్ అధికారుల వత్తాసుపాములపాడు: ఎస్ఆర్ ఎంసీ కెనాల్ వేస్ట్ బిల్‌కు (రాళ్ల మట్టి)ను తరలిస్తున్న వారిని సుధాకర్ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సిబ్బంది దోచుకుంటోంది. ప్రభుత్వం నుంచి టెండర్లు దక్కించుకున్నామని, రోడ్డుపై కంకర, ఇసుక, మట్టి తదితరం తరలించే వాహనాల నుంచి రాయల్టీ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థానికులను నియమించి దందాకు పాల్పడుతున్నారని వాహన యజమానులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే గురువారం మండలంలోని కంబాలపల్లి గ్రామం వద్ద బిల్‌కు లోడుతో వెళ్తున్న ట్రిప్పర్లను అడ్డుకున్నారు. సుధాకర్ ఇన్ఫ్రా చెందిన వ్యక్తుల వెంట మైనింగ్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ రషీద్ అహ్మద్ ఉన్నారు. ట్రిప్పర్ డ్రైవర్ల వద్ద నుంచి సెల్ ఫోన్లు లాక్కుని బెదిరింపులకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న యజమాని వెంకటేష్, కో ఆప్టెడ్ సభ్యుడు ముర్తుజాఅలీ, మరి కొందరు వాహన యజమానులు అక్కడకు చేరుకుని సిబ్బందిని నిలదీశారు. ఇప్పటికే బిల్‌కు తరలించడానికి ఇరిగేషన్ శాఖకు చలానా చెల్లించామని, రాయల్టీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. సుధాకర్ ఇన్ఫ్రా సంస్థకు రాయల్టీ చెల్లించవద్దని జీఓలో కనబరిచిన విషయాన్ని కూడా చూపించారు. అయితే సుమారు నాలుగు నెలలుగా ఇదే తంతు నడుస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా మని వాహన యజమానులు తెలిపారు. స్థానిక రైతు లు శ్రీశైలం ముంపులో భూములు కోల్పోయామని అందులో తమ ఆస్తులు ఉన్నాయని, పరిహారం అప్ప ట్లో అరకొరగా ఇచ్చారని, ఇప్పుడు బిల్‌కు తరలిస్తే వేలల్లో వసూళ్లకు పాల్పడటం సరికాదన్నారు. దీంతో డ్రైవర్ల నుంచి తీసు కున్న సెల్ ఫోన్లు తిరిగి ఇచ్చేసి, అధికారులు, రాయల్టీ వసూలు సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు
● పది మందికి గాయాలు నంద్యాల(అర్బన్): ప్రైవేటు ట్రావెల్ బస్సు ముందు టైర్ పగలడంతో డివైడర్ దాటి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన నంద్యాల మండలం చాబోలు గ్రామ హైవే సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. 35 మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైర్ పగలడంతో డివైజర్‌ను దాటి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని నంద్యాల ప్రభుత్వానికి తరలించారు. అనంతరం బస్టాండ్‌కు తరలించి సొంత ప్రాంతాలకు వెళ్లేలా సౌకర్యం కల్పించారు. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంటులో మంటలు కర్నూలు(సెంట్రల్): ఓర్వకల్ మండల కేంద్రానికి సమీపంలోని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంటులో బుధవారం సాయంత్రం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో గుట్టపాడు ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. దీంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రమాదం సాంకేతిక లోపంతో జరిగిందా, లేదంటే మరే ఇతర కారణంతో సంభవించిందా అనే విషయమై స్పష్టత రాలేదు. మరోవైపు ప్ర మాదం విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు కోరగా.. ఉత్పత్తి ప్రక్రియలో ఇలాంటి ఘటనలు సాధారణమని, ఉత్పత్తి సమయంలో కొంత భాగం పక్కకకు వెళ్లడంతో పొగలు వ్యాపిస్తాయని యాజమాన్యం వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందారు. ఈనేపథ్యంలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. బనగానపల్లె: వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని డోన్‌కు చెందిన మేరీ భర్త విల్సన్ (32)ను ప్రియుడు మధుతో కలిసి ఈ నెల 15న రాత్రి హత్య చేసినట్లు బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు. నిందితులు మేరీ, మధు, వీరికి సహకరించిన నంద్యాలకు చెందిన మహమ్మద్, అశోక్‌ను అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు పంపారు. కేసు వివరాలను బుధవారం స్థానిక కార్యాలయంలో సీఐ వెల్లడించారు. 11 ఏళ్ల క్రితం నంద్యాలకు చెందిన మేరీకి డోన్‌కు చెందిన విల్సన్‌తో వివాహం జరిగింది. కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి పదేళ్ల కూతురు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. మూడేళ్ల క్రితం వీరి కుటుంబం డోన్ నుంచి నంద్యాలలోని బోగ్గులైన్కు మారి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ స్థితిలో మూడు నెలల క్రితం నంద్యాల మండలం బాపూజీ నగర్‌కు చెందిన మధుతో మేరికి వివాహేతర సంబంధం ఏర్పడగా వారు పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకునేందుకు మేరీ ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. ఈ నెల 15న మధు, అతని స్నేహితులు రఫీ, అశోక్ కలిసి విల్సన్‌కు అతిగా మద్యం తాగించారు. ఆటోలో బనగానపల్లె నుంచి కై పకు వెళ్లే రహదారిలో ప్లాట్లలోకి తీసుకెళ్లి బెల్టుతో విల్సన్ మెడకు బిగించి హత్య చేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు హంతకుల గాలిస్తున్నట్లు తెలుసుకున్న నిందితులు ఈ నెల 24న కై ప వీఆర్ఓ ద్వారా లొంగిపోయారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. -
ముగిసిన రాతిదూలం పోటీలు
బనగానపల్లె రూరల్ : మండలంలోని నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి దేవస్థానంలో జ్యోతి మహోత్సవాల సందర్భంగా రైతు సంబరాల్లో భాగంగా నిర్వహించిన న్యూకేటగిరీ విభాగం ఎద్దుల రాతిదూలం లాగుడు పోటీలు బుధవారం ముగిశాయి. పోటీల్లో వరుస స్థానాల్లో బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన ఆర్కే బుల్స్, తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా రాయవరం గ్రామానికి చెందిన అక్షరరెడ్డి వృషభాలు, అదే జిల్లా రాయవరంకు చెందిన అక్షరరెడ్డి వృషభాలు, నంద్యాల జిల్లా బిల్లలాపురం గ్రామానికి చెందిన గోవర్థన్‌రెడ్డి ఎద్దులు, నంద్యాల జిల్లా చిన్నకానల గ్రామానికి చెందిన చెన్నరెడ్డి వృషభాలు, కోటకందుకురుకు చెందిన నరసింహారెడ్డి ఎద్దులు, సోమయాజులపల్లెకు చెందిన సుబ్బారెడ్డి, నరసయ్యయాదవ్ వృషభాలు, రోళ్లపాడుకు చెందిన ప్రభాకర్‌రెడ్డి, గుల్లదుర్తికి చెందిన శశికాంత్ వృషభరాజములు నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలైన వృషభాల యజమానులకు దాతల సహకారంతో వరుసగా రూ.60వేలు, రూ.50వేలు, రూ.40 వేలు, రూ.30వేలు,రూ.20వేలు,రూ.15వేలు, రూ.10వేలు, రూ.8 వేలతో పాటు జ్ఞాపికను అందజేశారు. -
వైభవంగా వసంతోత్సవం
బనగానపల్లెరూరల్: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన చౌడేశ్వరిదేవి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహిస్తున్న చౌడేశ్వరిదేవి రాయబారాది జ్యోతి రథ మహోత్సవాలు బుధవారం వసంతోత్సవ కార్యక్రమంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పీవీ నాగార్జున రెడ్డి, అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం చౌడేశ్వరిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చౌడేశ్వరిదేవి, చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలకు వసంతోత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయం ఎదురుగా ఉన్న కోనేరులో స్వామి వార్ల విగ్రహాలకు వసంతోత్సవ పూజలు నిర్వహించి తిరిగి ఆలయాలకు చేర్చారు. ఆలయ పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. -
మళ్లీ అక్రమాలు!
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో గ్రామ వ్యవసాయ సహాయకుల (వీఏఏ) బదిలీల వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టును ఆశ్రయించిన 106 మందికి న్యాయస్థానం ఆదేశాల మేరకు పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీనియారిటీకి పెద్దపీట వేయాలి. రాజకీయ నేతల సిఫార్సులు, ముడుపులకు అవకాశం ఇవ్వరాదు. కానీ వీఏఏల బదిలీల్లో లోలోపల ముడుపుల పర్వం జోరుగా సాగుతోంది. బదిలీల కౌన్సెలింగ్ ఈ నెల 26వ తేదీ కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఉమ్మడి జిల్లా యూనిట్‌గా జరుగుతుంది. నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి కూడా కౌన్సెలింగ్ నిర్వహించే కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. గతేడాది జూలైలో జరిగిన బదిలీల్లో కర్నూలు, నంద్యాల డీఏఓలు కుమ్మకై ్క సీనియారిటీకి పాతర వేశారు. సిఫార్సు లేఖలు, ముడుపులకు పెద్దపీట వేశారు. సిఫార్సు లేఖ లేకపోతే తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. ఫలితంగా అర్హులు మారుమూల ప్రాంతాలు, కర్ణాటక సరిహద్దు మండలాలకు బదిలీ అయ్యారు. అనర్హులు దగ్గరి మండలాల్లో నియమితులయ్యారు. వీరందరూ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి అక్రమాలు జరిగాయని నిర్ధారించి ఎక్కడ పనిచేసే వారు అక్కడే కొనసాగే విధంగా ఆదేశాలు ఇవ్వడంతో పాటు మళ్లీ కౌన్సెలింగ్ జరిపి బదిలీలు చేపట్టాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు బదిలీలు గురువారం చేపట్టనున్నారు. వీఏఏల బదిలీల్లో మళ్లీ అక్రమాలే.. నిబంధనల మేరకు వీఏఏలను ఖాళీ పోస్టుల్లోనే నియమించాలి. అయితే ముడుపులు దండుకొని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో లీవ్ వేకెన్సీల్లో సైతం పోస్టింగ్‌లు ఇవ్వడానికి రంగం సిద్ధమైందనే విమర్శలు వెల్లువెతుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారులకు.. వీఏఏలకు కర్నూలులో పనిచేసే ఓ ఏఓ మధ్యన ఉండి ముడుపుల బాగోతం నడుపుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కొంత మంది వీఏఏలు మెటర్నటీ లీవ్‌లో ఉన్నారు. మరికొందరు మెడికల్ లీవ్‌లో ఉన్నారు. ఇటువంటి ఖాళీల్లో ఎవరినీ నియమించరాదు. కానీ ముడుపుల మహిమ వల్ల ఇటువంటి లీవ్‌లు భర్తీ కానున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లీవ్ వేకెన్సీలు భర్తీ చేయడం వల్ల కర్ణాటక సరిహద్దు మండలాలైన కౌతాళం, కోసిగి, హొళగుంద, హలహర్వి, మంత్రాలయం తదితర మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో యథావిధిగా ఖాళీలు మిగిలిపోయే పరిస్ధితి ఏర్పడింది. పనిలోపనిగా కొందరు వీఏఏలను మెడికల్ గ్రౌండ్స్ కింద బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. మొత్తంగా 2025 జూలైలో జరిగిన అక్రమాల కంటే తాజాగా జరుపుతున్న బదిలీల్లో అక్రమాలు భారీగా జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్, జేసీలు వీఏఏల బదిలీలపై దృష్టి సారించి అక్రమాలను నిరోధించాల్సిన అవసరం ఎంతో ఉంది. వీఏఏల బదిలీల్లో ముడుపులు, సిఫార్సులకు పెద్దపీట లీవ్ వేకెన్సీలు కూడా భర్తీకి రంగం సిద్ధం కర్ణాటక సరిహద్దు మండలాల్లో ఖాళీల భర్తీ వట్దిదే నేడు వీఏఏల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ అబాసుపాలవుతున్న వ్యవసాయ శాఖ గతేడాది చేపట్టిన మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, డీడీఏల బదిలీల్లో అబాసుపాలైన వ్యవసాయ శాఖ ప్రస్తుతం గ్రామ స్థాయిలో వీఏఏల బదిలీల్లో సైతం పెద్ద ఎత్తున ముడుపులు దండుకొని అపఖ్యాతిని మూట కట్టుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ అధికారులు, ఏడీఏల బదిలీల్లో రూ.లక్షలు ముడుపులు చేతులు మారాయి. కూటమి పార్టీల నేతలకు బదిలీల పర్వం కాసుల పంట పండించింది. తాజా బదిలీల్లోనూ అక్రమాలదే రాజ్యంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జూనియర్ సివిల్ కోర్టుకు తాత్కాలిక భవనం
● పరిశీలించిన జిల్లా జడ్జి కబర్ధిబనగానపల్లె రూరల్: బనగానపల్లె జూనియర్ సివిల్ కోర్టు కోసం తాత్కాలికంగా బుధవారం బనగానపల్లె ప్రభుత్వ పశువైద్యశాల భవాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి, జడ్జి ప్రతిమ పరిశీలించారు. బనగానపల్లెలో కోర్టు భవనం నిర్మించి 120 సంవత్సరాలు కావడంతో శిథిలావస్థకు చేరింది. దీంతో బనగానపల్లెలో అదనంగా మరో కోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.9.15 కోట్లు మంజురయ్యాయి. నూతన కోర్టు నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు తాత్కాలిక భవనం కోసం ప్రభుత్వ పశువైద్యశాల భవనాన్ని పరిశీలించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెంట ఆర్డీఓ నరేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీడీఓ నాగరాజు, ఆర్అండ్బీ ఏఈ హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ మంజులరెడ్డి, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఉన్నారు. -
‘తూడిచెర్ల’ గేట్లు ఎత్తిన రైతులు
పాములపాడు: అధికారులతో పనిలేకుండా బుధవారం రైతులే కేసీ కెనాల్ 120వ కిలోమీటరు లాకీన్స్లా వద్ద తూడిచెర్ల సబ్ చానల్ గేట్లను ఎత్తారు. ఇందుకోసం పాములపాడు మండలంలోని శాంతినిలయం గ్రామ సమీపానికి వందలాది మంది రైతులు వచ్చారు. కేసీ కెనాల్ సిబ్బంది వారిస్తున్నప్పటికీ వినలేదు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి 510 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారని, ఈ నీరు నేరుగా ఆళ్లగడ్డ ప్రాంత పొలాలకు వెళ్తోందన్నారు. యర్రగూడరు, మిట్టకందాల, శాంతినిలయం, మద్దూరు, తూడిచెర్ల గ్రామాల్లో సాగులో ఉన్న మొక్కజొన్న, జొన్న, మినుము పంటలు ఎండాల్సిందేనా అని ప్రశ్నించారు. కేసీ కెనాల్లో నీరున్నందున ఐదు రోజులుగాు నీటి విడుదల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసుకున్నట్లు రైతులు తెలిపారు. -
ప్రభుత్వం విఫలం
మౌలిక వసతుల కల్పనలో నంద్యాల(అర్బన్): వైఎస్సార్‌నగర్ ఏర్పాటుకు మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారని, నేడు చంద్రబాబు ప్రభుత్వం, అధికారులు కాలనీవాసులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కాలనీ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిస్తే ప్రస్తుత పాలకులు కాంట్రాక్టర్లను బెదిరించి పనులు నిలిపివేయడం దుర్మార్గమన్నారు. గత సోమవారం బుడగజంగాల కాలనీలో మిగులు భోజనం ఆరగించి అస్వస్థతకు గురైన కుటుంబాలను బుధవారం శిల్పారవి పరామర్శించారు. దాదాపు 80 మంది బుడగ జంగాల సామాజిక వర్గాలను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా బాధిత కుటుంబాలు సాధారణ స్థితికి రాకపోవడం ఆందోళనకరమన్నారు. వారికి అవసరమైన వైద్యం, ఆహార పదార్థాలు, తాగునీరు అందించడకుండా పరిసరాల పరిశుభ్రత చేపట్టకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, తక్షణమే సంఘటనపై విచారణ జరిపి వారికి న్యాయం చేయాలన్నారు. బుడగజంగాల కాలనీ వాసులకు ఏదైనా తలెత్తితే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వెంట వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, 38వ వార్డు ఇన్చార్జి రమణ, మాజీ కౌన్సిలర్ చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ నాయకులు జయప్రకాష్‌రెడ్డి, సోమశేఖర్, అంకాలయ్య, రామకృష్ణారెడ్డి, అన్వర్‌బాషా, సాయి, కిరణ్, నాయక్, బాబు, చిరు, ప్రసాదరెడ్డి, గీతారాణి, వెంకి, వెంకటస్వామిశెట్టి, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్లను బెదిరించి పనులు నిలిపివేశారు బాధితులకు మెరుగైన వైద్యం అందించలేకపోయారు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి -
ఫేక్ డాక్యుమెంట్‌తో మ్యుటేషన్
కర్నూలు(సెంట్రల్): ఆస్పరి మండలం కై రుప్పలలో ఫేక్ డ్యాకుమెంట్లతో రెవెన్యూ అధికారులు మాయజాలం చేశారు. గ్రామానికి చెందిన విజయమోహన్ అనే వ్యక్తి భూమిని అదే గ్రామానికి చెందిన గుర్రందొడ్డి కురువ లక్ష్మి పేరిట ఆయనకు తెలియకుండానే మ్యుటేషన్ చేశారు. ఆయన తన కుమారులకు భూ మి భాగ పరిష్కారాల సమయంలో జరిగిన మోసా న్ని తెలుసుకున్నారు. న్యాయం కోసం రెండేళ్లుగా కలెక్టరేట్, పత్తికొండ ఆర్డీఓ, ఆస్పరి తహసీల్దార్ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఊరులో లేని విషయాన్ని పసిగట్టి పన్నాగం విజయమోహన్ స్టేట్ బ్యాంకులో పనిచేసి పదవీ విరమణ తరువాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కై రుప్పలలో సర్వే నంబర్ 70లో అతనికి 1.54 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.30లక్షలకు పైగా పలుకుతోంది. ఈ భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని కొందరు పన్నాగం పన్నారు. గ్రామ వీఆర్వోగా పని చేసిన ఎస్టీ వీరన్న ఇందులో కీ లక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన గుర్రందొడ్డి కురువ లక్ష్మి ద్వారా కథ నడిపించి రా త్రికి రాత్రే భూమిని ఆమె పేరిట బదలాయించారు. గుడ్డిగా మ్యుటేషన్ చేసిన తహసీల్దార్ మ్యుటేషన్ చేసే సమయంలో రెవెన్యూ అధికారులు కనీసం నిబంధనలు పాటించలేదు. ఆధారంగా సమర్పించిన డాక్యుమెంట్ ఈసీ చూడలేదు. భూ యజమానులకు నోటీసులు ఇవ్వలేదు. వీఆర్వో, ఆర్ఐ, త హసీల్దార్ గుడ్డిగా సంతకాలు చేశారంటే వారికి భారీ గా ముడుపులు ముట్టినట్లు తెలుస్తోంది. ఈ భూమికి సంబంధించి రెండేళ్లుగా పత్తికొండ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ఓఆర్ కేసు కూడా పెండింగ్‌లో ఉంది. ఎలా మోసం చేశారంటే..! కురువ లక్ష్మి అదే గ్రామానికి చెందిన చిన్న వీర న్న వద్ద నుంచి సర్వే నంబర్ 52లో 1.33 ఎకరాలను కొనుగోలు చేశారు. ఈ డాక్యుమెంట్‌ను సర్వే నంబర్ 70లో విజయమోహన్‌కు చెందిన 1.54 ఎకరాలను కొల్లగొట్టేందుకు వినియోగించారు. డాక్యుమెంట్లో సర్వే నంబర్, విస్తీర్ణం స్థానాల్లో వైట్నర్తో రుద్ది సర్వే నంబర్ 70కి సంబంధించిన సర్వే నంబర్, విస్తీర్ణాలను నమోదు చేశారు.ఆ ఫేక్ డ్యాకుమెంట్తో 2024 జూలై 24న ఆస్పరి తహసీల్దార్‌తో మ్యుటేషన్ చేయించారు. -
ఫుడ్ పాయిజన్ కలకలం
● వాంతులు, విరేచనాలతో 60 మంది ఆసుపత్రిలో చేరిక ● పెళ్లిలో మిగిలిన ఆహారం తినడమే కారణమంటున్న అధికారులు నంద్యాల(అర్బన్): పట్టణ శివారులోని నందమూరినగర్ వద్ద ఉన్న బుడగ జంగాల కాలనీలో సోమవారం అర్ధరాత్రి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. దాదాపు 60 మంది వాంతులు, విరేచనాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పెళ్లిలో మిగిలిన ఆహారాన్ని తెచ్చుకొని తినడం వల్లే ఫుడ్‌పాయిజన్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. వివరాలు.. పట్టణ సమీపంలోని బుడగజంగాల కాలనీలో దాదాపు 210 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరంతా చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి ఓ పెళ్లిలో మిగిలిన ఆ హారాన్ని తెచ్చుకొని పలు కుటుంబాలు తిన్నాయి. తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు తీవ్రం కావడంతో దాదాపు 60 మంది ఆసుపత్రులకు పరుగు లు తీశారు. చిన్న పిల్లలు సైతం ఫుడ్ పాయిజన్‌కు గురి కావడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పందించారు. తక్షణమే కాలనీకి వెళ్లి బాధితులకు సహాయ చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్, డీఎంహెచ్ఓ, ఫుడ్‌సేఫ్టీ అధికారి వెంకటరాముడు, పలు శాఖల అధికారులు కాలనీకి వెళ్లి బాధితులను పరామర్శించారు. గతంలో పలు మార్లు మిగులు అన్నాన్ని తెచ్చుకొని తిన్నామని, ఎప్పుడూ ఇలా జరగలేదని బాధితులు చెప్పారు. అధికారులు మాట్లాడుతూ.. మిగులు ఆహారం తినడం వల్లే ఫుడ్‌పాయిజన్ అయ్యిందని, తాగునీటి శ్యాపింల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపామన్నారు. నివేదికలు వచ్చిన తర్వాత కారణాలు తెలుస్తాయన్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. -
లారీ డ్రైవర్లకు శుద్ధమైన తాగునీరు
నంద్యాల: లారీ డ్రైవర్లకు శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు, నంద్యాల పట్టణంలోని విజయ పాల డెయిరీ సమీపంలో రూ.2.40 లక్షల వ్యయంతో, గంటకు వెయ్యి లీటర్ల సామర్థ్యం గల ఆధునిక ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ అభినందించారు. తమ విజ్ఞప్తిని గౌరవించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన జిల్లా కలెక్టర్‌ను లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆదాయ పెంపులో జిల్లాను ముందంజలో నిలపాలి జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించి, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎకై ్సజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, రవాణా తదితర విభాగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆదాయ వృద్ధి సాధించేందుకు ప్రతి శాఖ స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో రూ.15 వేలకుపైగా వేతనం పొందుతున్న ఉద్యోగుల నుంచి ప్రొఫెషనల్ టాక్స్ వసూలు చేయడానికి అవసరమైన వివరాలను సేకరించి సమర్పించాలన్నారు. అదే విధంగా జిల్లాలో గ్యాస్ కొరత లేదని పేర్కొంటూ ప్రత్యామ్నాయంగా వినియోగించే విద్యుత్ ఉపకరణాలు కూడా సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయన్నారు. -
హామీలు విస్మరిస్తే పుట్టగతులుండవు
నంద్యాల(న్యూటౌన్): అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఎన్నికల హామీలు విస్మరించిన ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేస్తామని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు మురళీధర్ అన్నారు. అర్హులైన పేదలకు ఇల్లు, ఇంటి స్థలం, సాగు భూమి సాధనకై సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నుంచి మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సోమన్న, లక్ష్మిదేవి, ధనుంజయుడు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరురూరల్: మండలంలోని కలుగోట్ల పంచాయతీ పరిధిలో మొక్కజొ న్న పొలంలో మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు దాదాపు చేధించారు. హత్యకు వివాహేతర సంబంధం కారణమని ప్రాథమిక విచారణలో బయటపడినట్లు సమాచారం. మృతుడు గోనె గండ్ల మండలం పెద్దనెలటూరి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మంగళవారం మృతుడి కుటంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడిని గుర్తించి గుండెలు బాధుకుంటూ రోధించారు. హత్యకు గురైన నరేంద్ర అలియాస్ ఏసేబు (30)ను భార్య, అదే గ్రామానికి చెందిన ప్రియుడితో కలిసి ఎమ్మిగనూరులోని ఇంట్లో హత్యచేసి, శవాన్ని పొలం వద్దకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై రూరల్ పోలీసులను వివరణ కోర గా హత్యకు గల కారణాలను విచారిస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు. ముగిసిన ఎద్దుల పోటీలు గోస్పాడు: ఉగాదిని పండుగను పురస్కరించుకొని శ్రీవీరభద్రస్వామి, శ్రీ గుమ్మిత మల్లికార్జునస్వామి తిరుణాల సందర్భంగా మండలంలోని దీబగుంట్ల గ్రామంలో పామిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, శివలక్ష్మమ్మ, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డిల జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు మూడురోజు మంగళవారం ముగిశాయి. రాష్ట్రమార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 9 జతల ఎద్దులు పాల్గొన్నాయి. పాలపండ్ల విభాగంలో పాల్గొన్న ఎద్దులు 15నిమిషాల సమయంలో తమ సత్తా చా టాయి. మొదటి బహుమతి రూ. 50 వేలు నంద్యాల జిల్లా సాంబవరం గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి ఎద్దులు, రెండో బహుమతి రూ.30 వేలు బీఎంకేబుల్స్ కర్నూలు జిల్లా వెంకటగిరికి చెందిన శశాంక్శ్రయ ఎద్దులు, మూడో బహుమతి రూ. 20 వేలు మార్కాపురం జిల్లా కంభం, సాంబవరం చెందిన వెంకటకృష్ణ, ప్రభాకర్‌రెడ్డి ఎద్దులు, నాల్గవ బహుమతి రూ. 10 వేలు ప్రకాశం జిల్లా పొట్లపాడుకు చెందిన హర్షవర్ధన్‌రెడ్డి ఎద్దులు సాధించాయి. వైఎస్సార్సీపీ నాయకులు చిన్ననాగిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, శ్రీశైల నియోజక వర్గ పరిశీలకుడు మదుసూదన్‌రెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
జడ్జి బాధ్యతల స్వీకరణ
చాగలమర్రి: ఆళ్లగడ్డ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణానికి చెందిన గొడుగు రవికుమార్‌ను నియమిస్తూ అమరావతిలోని హైకోర్టు ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్థి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఆళ్లగడ్డ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు స్వీకరించారు. ఒంటిమిట్ట తలంబ్రాల సమర్పణ నంద్యాల(వ్యవసాయం): నంద్యాలకు చెందిన మన ఊరు, మనగుడి, మనబాధ్యత సభ్యులు గోటితో ఒలిచిన తలంబ్రాలను మంగళవారం ఒంటిమిట్ట రామాలయానికి సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శివకుమార్‌రెడ్డి, రఘువీర్ మాట్లాడుతూ శాసీ్త్రయ పద్ధతుల్లో వడ్లను పండించి వాటిని కొన్ని నెలలుగా మహిళలు భక్తిశ్రద్ధలతో గోటితో ఒలిచిన తలంబ్రాల బియ్యాన్ని ఒంటిమిట్ట రామాలయ అధికారులకు అందజేశామన్నారు. అనంతరం ఆలయంలో జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవలో పాల్గొన్నారు. తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం గోస్పాడు: పట్టణంలోని విష్ణు ఆసుపత్రిలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా తలసేమియా చిన్నారుల కోసం మంగళవారం ప్రత్యేకంగా రక్తదానం ఏర్పాటు చేశారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థోఫెడిక్ వైద్యులు డాక్టర్ వికాస్‌తో పాటు పలువురు వైద్యులు, సిబ్బంది రక్తదానం చేశారు. ఆయన మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారులకు సహకారం అందించేందుకు ఈనెల 30న ఫండ్ రైసింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో రూ.5,560 విలువ గల పరీక్షలు, డాక్టర్స్ కన్సల్టేషన్‌ను కేవలం రూ.499కే అందించనున్నట్లు తెలిపారు. రేపు వీఏఏల బదిలీల కౌన్సెలింగ్ కర్నూలు(అగ్రికల్చర్): హైకోర్టు ఆదేశాల మేర కు గ్రామ వ్యవసాయ సహాయకుల (వీఏఏ) బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 26న ఉమ్మడి జిల్లా యూనిట్‌గా వీఏఏల బదిలీల ప్రక్రియను కౌన్సెలింగ్ ద్వారా చేపట్టనున్నారు. గతేడాది జూలైలో జరిగిన వీఏఏల బదిలీల్లో అక్రమాలు జరిగాయని, రాజకీయ సిఫార్సు లు, ముడుపులకు పెద్దపీట వేసి అర్హులకు అన్యాయం చేశారని 106 మంది హైకోర్టును ఆశ్రయించారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన హైకోర్టు 106 మంది వీఏఏ బదిలీలను కౌన్సెలింగ్ ద్వారా చేపట్టాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. ఈ మేరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ వీఏఏల బదిలీలకు వ్యవసాయ శాఖకు అనుమతి ఇస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా హైకోర్టును ఆశ్రయించిన 106 మంది వీఏఏల సీనియారిటీ జాబితాను జిల్లా వ్యవసాయ శాఖ విడుదల చేసింది. జాబితాపై అభ్యంతరాలుంటే బుధవారం సాయంత్రంలోపు రాతపూర్వకంగా తెలియజేయవచ్చు. 26న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. బదిలీలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీలో కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి కన్వీనర్‌గా, నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి సభ్యుడుగా ఉంటారు. ఇప్పటికై న రాజకీయాలు, ముడుపులకు అతీతంగా బదిలీల కౌన్సెలింగ్ జరుగుతుందా అనేది చర్చనీయాంశం అయ్యింది. కళ్లలో కారం చల్లి మారణాయుధాలతో దాడులు కౌతాళం: తెలుగుదేశం నేతలు అక్రమ వ్యాపారాలకు తెరలేపారు. ఇసుక మాఫియా కాడి నుంచి ప్రతి విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమ ఇసుకను తమ గ్రామంలో నుంచి గాకుండా దారి మళ్లించాలని కోరినందుకు మరాణాయుధాలతో దాడి చేసిన ఘటన ఉరుకుంద గ్రామంలో చోటు చేసుకుంది. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రిప్పర్లను ఉరుకుంద గ్రామం మీద నుంచి గాకుండా దారి మళ్లించాలని తెలుగుదేశం పార్టీలోని తిక్కారెడ్డి వర్గం వారు కోరగా దీనికి మంత్రాలయం ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి వర్గం ససేమిరా అనింది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఇరువురుకి గాయాలయ్యాయి. మరాణాయుధాలతో, కళ్లల్లో కారం చల్లి దాడులకు తెగబడ్డారు. ఘటనలో ఇరువర్గాలపై కౌంటర్ కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. -
ఓటర్ల మ్యాపింగ్‌లో పురోగతి సాధించాలి
కర్నూలు(సెంట్రల్): ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలను ఆదేశించారు. ఆమె మంగళవారం కలెక్టరేట్లోని ఈవీఎం గోదామును రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలించి పటిష్ట భద్రతకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతకముందు ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియపై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. ఆదోని, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల్లో ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, వేగవంతం చేయాలని ఆదేశించారు. సంబంధిత నియోజక వర్గాల తహసీల్దార్లు బీఎల్ఓలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని పురోగతి తీసుకురావాలన్నారు. ఆలూరు, కోడుమూరులో ఓటర్ల పురోగతి బాగుందన్నారు. అదేవిధంగా క్లెయిమ్స్, డెమోగ్రాఫిక్ కరెక్షన్కు సంబంధించిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్‌కుమార్, ఆదోని ఇన్చార్జి సబ్ కలెక్టర్ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఇంటి జాగైనా ఇవ్వు.. అద్దైనా చెల్లించు బాబూ!
కర్నూలు(సెంట్రల్): ఇంటి జాగైనా ఇవ్వూ లేదంటే అద్దైనా చెల్లించూ బాబూ అంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట మహిళలు కదం తొక్కారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఇచ్చిన హామీ మేరకు సొంతిల్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇంటి స్థలాల కోసం కలెక్టరేట్, జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలను సీపీఐ శ్రేణులు ముట్టడించారు. కర్నూలులో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడికి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.రామాంజనేయులు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు అధికారంలో లేని సమయంలో అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను నమ్మిస్తారన్నారు. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా కాలయాపన చేస్తుండడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సెంటు స్థలం తమ బాత్రూం అంతా కూడా లేదంటూ వ్యంగ్యం చేశారని, ఆయన అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు. తనకు కావాల్సిన పారిశ్రామిక వేత్తలకు 99 పైసలకే ఎకరం భూమి ఇస్తున్నారని, ఇది అన్యాయమన్నారు. దీనిపై న్యాయ విచారణ జరపాలని కోరారు. రాష్ట్రంలో భూములు తీసుకున్న పారిశ్రామికవేత్తలు ఎన్ని పరిశ్రమలు పెట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు అవుల శేఖర్, కె.జగన్నాథం పాల్గొన్నారు. -
నెలాఖరులోగా స్తంభాలు ఏర్పాటు చేయండి
నంద్యాల: ఆర్డీఎస్ఎస్ పథకం కింద వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ స్తంభాల పనులను వేగవంతం చేసి ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆర్డీఎస్ఎస్ పథకం అమలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అందిస్తూ నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమన్నారు. ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా విద్యుత్ ట్రిప్పులు తగ్గించి, లో వోల్టేజ్ సమస్యలను నివారిస్తూ స్థిరమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు పరిసరాల్లో ఏర్పాటు చేసిన 15 విద్యుత్ స్తంభాల పనులను కూడా పరిశీలించి పూర్తి చేయాలన్నారు. టోల్ గేట్ల పరిసరాల్లో అధిక సాంద్రత తో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో పంటల దిగుబడిపై ప్రభావం పడుతోందని రైతుల నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జేసీ కార్తీక్, శ్రీశైలం సబ్ డీఎఫ్ఓ బబితా కుమారి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక, విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం కసరత్తు
● ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానం పెరిగే అవకాశం ● ఒక్కో అసెంబ్లీలో 1.60లక్షల ఓటర్లు ఉండేలా విభజన ● పునర్విభజనలో మహిళలకు 33 శాతం సీట్లు ● ఎస్సీ, ఎస్టీలకు కూడా పెరగనున్న సీట్లుఎమ్మెల్యే, ఎంపీలు కావాలని ఆశపడుతున్న రాజకీయ ఆశావహులకు శుభవార్త. దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల పునర్విభజన ప్రక్రియకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈమేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుల నేతృత్వంలో సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల పునర్విభజనకు వీలుగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ (పునర్విభజన) చట్టాల బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. – సాక్షి ప్రతినిధి కర్నూలు సాక్షి ప్రతినిధి కర్నూలు: దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై 2026 వరకూ నిషేధం ఉంది. అయితే ఏపీ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ బిల్లు–2014లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేకంగా పార్లమెంట్ వెసులుబాటు కల్పించింది. కొత్తగా రాష్ట్రాలు ఏర్పా టు అవుతున్నాయి కాబట్టి నియోజకవర్గాల పునర్విభజనపై ఆ రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయని బిల్లులో పేర్కొన్నారు. అయితే అనివార్య కారణాలతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై ముందడుగు వేయలేకపోయాయి. ఈ క్రమంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిషేధం పూర్తవడం, కేంద్ర హోంశాఖ దీనిపై నిర్ణయం తీసుకోవడంతో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం, ఆపై పునర్విభజనపై కమిషన్ ఏర్పాటు చేయడమే తరువాయి. 2029 సార్వత్రిక ఎన్నికలు కొత్తగా పెరిగే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలతోనే జరగనున్నాయి. ఉమ్మడి కర్నూలులో పెరగనున్న 6 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానం ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీల చొప్పున ఉమ్మడి జిల్లాలో 4 అసెంబ్లీలు కొత్తగా ఏర్పాటవుతాయని అంతా భావించారు. అయితే 50 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో 88 అసెంబ్లీలు పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్లమెంట్‌కు 3 చొప్పున మొత్తం 6 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ఈ లెక్కన 20 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ చట్టంతో ప్రస్తుతం ఉన్న 2 ఎస్సీ స్థానాలు 3కు పెరిగే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్‌తో మొత్తం నియోజకవర్గాల్లో 33 శాతం మహిళలకు రిజర్వ్ కానున్నాయి. 20 స్థానాల్లో దాదాపు 7 స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. 2027 మార్చికి జనాభా లెక్కల ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో కొత్త జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరగనుంది. 1.60లక్షల ఓట్లతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు కానుంది. 1 లేదా 2 ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం పార్లమెంట్ స్థానాల సంఖ్య 25 నుంచి 38కి పెరిగే అవకాశం ఉంది. దీంతో ఒక స్థానం కచ్చితంగా పెరుగుతుంది. అయితే రాష్ట్రంలోని పెద్ద జిల్లాలో కర్నూలు ఒకటి. ఆ మేరకు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక ఎంపీ స్థానం చొప్పున రెండు జిల్లాల్లో పెరగనున్నాయి. అలాగే రెండు జిల్లాల్లో కలిపి మరో ఎంపీ స్థానం కూడా పెరిగే అవకాశం ఉంది. ఆదోని కేంద్రంగా పార్లమెంట్ స్థానం ఏర్పాటయ్యే అవకాశం ఉండొచ్చు. -
పంటలు ఎండుతున్నాయ్.. కాపాడండి!
● నీటిపారుదల శాఖ డీఈ ప్రసాద్‌కు విన్నవించిన రైతులు పగిడ్యాల: ‘పంటలు ఎండిపోతున్నాయ్.. కాపాడండి’ అంటూ సోమవారం జిల్లపాడు, శాతనకోట, సుల్తానాపురం, మల్యాల గ్రామాల రైతులు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద నీటిపారుదల శాఖ డీఈ ప్రసాద్‌ను ఆశ్రయించి మొరపెట్టారు. ఎత్తిపోతల నీరు తమ పొలాలకు రావాలంటే క్రాస్ రెగ్యులేటర్ గేట్లను మూడు రోజుల పాటు పూర్తిగా బంద్ చేయా లని అభ్యర్థించారు. రెండు రోజులుగా ఇక్కడే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ల ద్వారా ఎత్తిపోసే నీరంతా దిగువకు వెళ్తున్నాయని ఎగువ తూములకు పారడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. సాగునీరు రాకపోతే పంట చేతికి రాదని డీఈకి వివరించారు. డీఈ ప్రసాద్ మాట్లాడుతూ.. 0 నుంచి 120 కి.మీ. వరకు కేసీ కాలువ వెంట తనిఖీ చేస్తున్నామని తప్పనిసరిగా న్యాయం చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఆన్లైన్లోనే వాహన రిజిస్ట్రేషన్ నంద్యాల(న్యూటౌన్): ప్రభుత్వ నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లోనే సాగుతుందని జిల్లా రవాణా అధికారి శివారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..వాహన కొనుగోలు దారులు ప్రభుత్వం ఇచ్చిన రసీదును తీసుకొని, అందులో ఉన్న డబ్బులు మాత్రమే చెల్లించాలన్నారు. టెంపర్వరీ రిజిస్ట్రేషన్ ఫీజు, పర్మినెంట్ ఫీజు, పోస్టల్ ఫీజు, సర్టిఫికెట్ ఫీజు, రోడ్డు సేఫ్టీ, సర్వీస్, నంబర్ ప్లేట్ ఫీజులు వాహనాన్ని బట్టి మారుతాయన్నారు. ఆర్టీఓ కార్యాలయంలో డబ్బులు ఇవ్వాలని షోరూం యజమానులు చెప్పిన మాటలు నమ్మవద్దని సూచించారు. మల్లన్న సేవలో సినీ హీరో శ్రీకాంత్ శ్రీశైలం టెంపుల్: శ్రీశైల శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సోమవారం శ్రీశైలం చేరుకున్న సినీ హీరో శ్రీకాంత్ దంపతులు ఉదయం బ్రేక్ దర్శన సమయంలో మల్లికార్జున స్వామి వారికి అభిషేకం, భ్రమరాంబా దేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మ వారి ఆలయం వద్ద సినీ హీరో శ్రీకాంత్ దంపతులకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన అధికారులు స్వామి వారి శేషావస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. సినీ హీరో శ్రీకాంత్‌తో ఫొటోలు దిగేందుకు పలువురు భక్తులు ఆసక్తి చూపారు. -
సీసీ రోడ్డును రద్దు చేయండి
● నిడ్జూరు టీడీపీ నాయకుడిపై జేసీకి సర్పంచ్ ఫిర్యాదుకర్నూలు(సెంట్రల్): కర్నూలు రూరల్ మండలం నిడ్జూరులో ప్రభుత్వ నిధులతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సూర్యప్రకాష్ తన ఇంటి కంపౌండ్ నుంచి సీసీ రోడ్డు, మురుగు కాల్వ వేయించుకుంటున్నారని, తక్షణమే ఆ పనులను రద్దు చేయాలని ఆ గ్రామ సర్పంచ్ మాధవి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. పంచాయతీ తీర్మానం లేకుండా ఆయనే నేరుగా తన ఇంటి కంపౌండ్ నుంచి మెయిన్ రోడ్డు వరకు రూ.10 లక్షలతో సీసీ రోడ్డు వేయించుకుంటు న్నారని, గ్రామంలో పలు కాలనీల్లో గుంతలమయం అయిన రోడ్లు ఉన్నాయని, వాటిలో సీసీ రోడ్డు వేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. తక్షణమే ఆ పననులను రద్దు చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప్రజల సంతృప్త స్థాయి పెరిగేలా అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుళ్లకు గాయాలు
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– జమ్మలమడుగు ఆర్అండ్బీ రహదారిలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. సంజామల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న మహేశ్వరరెడ్డి, రాంబాబు సోమవారం ఉదయం నొస్సం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల బందోబస్తుకు బైక్‌పై కోవెలకుంట్ల మీదుగా బయలుదేరారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రిటైర్డ్ అధ్యాపకుడు ముదిరెడ్డి సుబ్బారెడ్డి కారును వేగంగా నడుపుతూ మండలంలోని పొట్టిపాడు మెట్ట సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహేశ్వరరెడ్డికి కాలు విరగగా, రాంబాబు తలకు గాయాలయ్యాయి. వాహనదారులు 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన రిటైర్డ్ అధ్యాపకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఇండక్షన్ స్టౌలను ప్రోత్సహించాలి
నంద్యాల: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో ఇండక్షన్ స్టౌల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. ఇందుకు ఇండక్షన్ స్టౌల లభ్యత, ధరలు తదితర వివరాలను సేకరించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సాధారణంగా రోజుకు 5,500 ఎల్పీజీ గ్యాస్ బుకింగ్స్ నమోదవుతుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 10,000 వరకు పెరిగిందన్నారు. జేసీ కొల్లాబత్తుల కార్తీక్, డీఆర్ఓ రాము నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక పాల్గొన్నారు. -
ప్రజ్వలించిన భక్తి
● వైభవంగా శ్రీ చౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవం బనగానపల్లె రూరల్: నందవరం చౌడేశ్వరిదేవి రాయబారాది వసంతోత్సవ కార్య క్రమాల్లో భాగంగా సోమవారం జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆదివారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైన కార్యక్రమం సోమవారం ఉదయం ముగిసింది. ముందుగా శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి భాస్కరయ్య ఆచారితో అమ్మవారికి దిష్టిచుక్క పెట్టు కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చిన తొగట వీర క్షత్రియులు, అమ్మవారి భక్తులు ముందుగానే గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా నెయ్యి, గోధమ పిండి, వివిధ సుగంధ ద్రవ్యాలతో జ్యోతిని తయారు చేసుకొని వెలిగించుకొని తలపై పెట్టుకొని శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి గీతాలు ఆలపిస్తూ, మేళ తాళాలతో చౌడేశ్వరిదేవి ఆలయం వద్దకు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన నిప్పుల గుండంపై మొదట సర్కార్ జ్యోతితో భక్తులు నడిచిన తరువాత మిగిలిన భక్తులు వరుసగా నిప్పులపై నడుస్తూ తమ మొక్కులు చెల్లించారు. పలువురు ప్రముఖులు చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది దాదాపు 545 జ్యోతులతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సాయంత్రం అమ్మ వారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.ఆలయంలో కొలువైన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారు -
సంగమేశ్వరంలో పారిశుద్ధ్య పనులు
కొత్తపల్లి: జలాధివాసం వీడిన సంగమేశ్వరాలయంలో ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు మొదలు పెట్టారు. ట్రాక్టర్ డోజర్ తో బురదను తొలగింపు చేపట్టారు. ఆలయంలోని బురద నీటిని మోటర్ల ద్వారా బయటకు పంపింగ్ చేశారు. గర్భాలంయలో బురద తొలగించి పూర్తిస్థాయిలో సంగమేశ్వరుడిని భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేస్తామని పురోహితుడు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య ఆదోని రూరల్: బైచిగేరి గ్రామానికి చెందిన చాకలి వీర హుసేని(25) ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన చాకలి శాంతితో ఏడేళ్ల క్రితం వీర హుసేనికి వివాహమైంది. కుటుంబ కలహాలతో భర్తతో, మామ తిక్కన్న, అత్త రాములమ్మతో గొడవపడిన శాంతి మూడేళ్లుగా కాపురానికి రాకుండా దూరంగా ఉంది. పెద్దలు పలుమార్లు పంచాయతీ చేయగా కాపురానికి రాకపోవడంతో భర్త చాకలి వీర ఉసేని మనస్తాపం చెంది ఆదివారం ఇంట్లో ఉన్న తీర్లకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదోని అర్బన్: మోసానికి పాల్పడిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, మాజీ అధ్యక్షుడు రామస్వామి, అవని గోల్డ్ ఎండీ వెంకటేశ్వర్లుపై జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రెడీమేడ్ గార్మెంట్స్ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు రాంబట్ల ప్రశాంత్ కోరారు. ఆదివారం స్థానిక ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవని గోల్డ్ ఆస్తులు 200 ఎకరాలు ఉన్నాయని, అందులో 160 ఎకరాలను 2013లోనే అమ్మేశారని తెలిపారు. అవని గోల్డ్ భూములను ఇప్పిస్తానని తన వద్ద ప్రస్తుత, మాజీ బీజేపీ అధ్యక్షులు రూ. 25 లక్షలు తీసుకున్నారని చెప్పారు. ఆయనతో పాటు అవని గోల్డ్ సంస్థకు చెందిన చైర్మన్, ఎండీ, డైరెక్టర్లు తనకు అగ్రిమెంటు రాసిచ్చారని వివరించారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి 50 ఎకరాలు అడిగారని అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో తాను విచారణ చేయగా 2013లోనే అవని గోల్డ్ భూములన్నీ అమ్మేశారని, వారిని నిలదీయడంతో ఈరోజు.. రేపు అని కాలయాపన చేస్తూ తనను మోసం చేశారన్నారు. ఈ మేరకు కేసు పెట్టానని తెలిపారు. ఈనెల 9వ తేదీన త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, ఈనెల 18వ తేదీన ప్రస్తుత, మాజీ బీజేపీ అధ్యక్షులు, అవినీగోల్డ్ సంస్థ చైర్మన్, ఎండీ, డైరెక్టర్లపై కేసు నమోదైందన్నారు. -
అభివృద్ధికి రాజకీయ గ్రహణం
డోన్: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాడ కనిపించడం లేదు. కనీసం గత ప్రభుత్వం నిర్మించిన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు కూడా ముందుకు రావడం లేదు. రాజకీయ కక్షతో పట్టణంలో దాదాపు రూ. 3 కోట్లతో నిర్మించిన అభివృద్ధి పనులు అలంకార ప్రాయంగా మారాయి. టీడీపీ నేతల మధ్య విభేదాలతో అధికారులు చేతులు కట్టుకుని చోద్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చిన్న చిన్న పనులతో పలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా మాకేందుకులే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్రీడలతో పాటు టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేసింది. కోట్లాది రూపాయల వ్యయంతో పార్కులు, రెస్టారెంట్లు, రహదారులను నిర్మించింది. డోన్‌ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్యాపిలి మండలం వెంగలాంపల్లె, డోన్ మండలం వెంకటాపురం తుమ్మలచెరువు ప్రాంతాలను టూరిజం, బోటు షికారు కేంద్రాలుగా, ప్యాపిలి మండలం బోయ వాండ్లపల్లె వాల్మీకి గుహలు, బేతంచెర్ల మండలం ఎర్రజ్వాల గుహలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. వీటితో పాటు పట్టణ శివారులో నగరవనం, నియోజకవర్గంలో పచ్చదనం ఉట్టిపడేట్లు పది పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే డోన్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే బుగ్గన శేషారెడ్డి మార్గ్‌లో రూ.3 కోట్లతో క్లబ్‌హౌస్‌ను నిర్మించారు. అత్యంత ఆధునిక పద్ధతిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ క్లబ్‌హౌస్‌లో మినీ ఫంక్షన్‌హాల్, రెస్టారెంట్, క్యారమ్స్, స్నూకర్, టేబుల్ టెన్నిస్ ఆడేందుకు ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారు. అయితే కేవలం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వివక్ష చూపుతుండటంతో వీటి నిర్మాణం కోసం వెచ్చించిన రూ.3 కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. కాంట్రాక్టు చేజిక్కించుకునేందుకు కుట్ర.. కోట్లాది రూపాయల ప్రజాధనంతో వెచ్చించిన ఈ క్లబ్‌హౌస్ నిర్వహణను టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసమే విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. అధికార పార్టీలోని రెండు వర్గాలు ఈ క్లబ్‌హౌస్ నిర్వహణ కోసం పోటీపడుతుండటంతో అధికారులు కాలం వెల్లదీస్తున్నారు. దీంతో రూ. 3 కోట్ల విలువైన పనులు నిరుపయోగంగా మారాయి. అధికార పార్టీ నేతల తీరును చూసి ప్రజలు మండిపడుతున్నారు. పట్టణంలో నిర్మించిన క్లబ్‌హౌస్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను డోన్ యూనియన్ క్లబ్ సొసైటీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని భావించాం. అయితే కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు పోటీ పడుతుండటం దుర్మార్గమైన చర్య. ప్రజల ఆశయాల మేరకు మాజీ మంత్రి బుగ్గన సహకారంతో నిర్మించిన ఈ భవనాలను త్వరలోనే ప్రారంభించాలి. – సప్తశైల రాజేష్, మున్సిపల్ మాజీ చైర్మన్, డోన్ వైఎస్సార్సీపీ హయాంలో పర్యాటకం, పట్టణాభివృద్ధి పనులు రెస్టారెంట్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, మినీ ఫంక్షన్‌హాల్ నిర్మాణం చిన్న చిన్న పనులతో ప్రారంభోత్సవానికి సిద్ధం టీడీపీ నేతల విభేదాలతో జాప్యం చేస్తున్న అధికారులు రెండేళ్లు గడుస్తున్నా నిరుపయోగం -
గ్యాస్ ‘గోడు’!
చిత్రంలో సిలిండర్లున్నాయి, కానీ జనాలు కనిపించడం లేదని సందేహం వస్తుందా.. గంటల తరబడి క్యూలో నిలబడలేక ఖాళీ సిలిండర్లను క్యూలో పెట్టాల్సి వస్తోంది. గ్యాస్ కొరతతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఈ దృశ్యం మహానంది మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ వద్ద ఆదివారం కనిపించింది. గ్రామంలోని గ్యాస్ ఏజెజేన్సీపై గతంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు వెళ్లడం, విచారణకు వచ్చిన అధికారులు రద్దు చేయడం చేశారు. అయితే మళ్లీ పాతవారే నిర్వహణ బాధ్యతలు తీసుకోవడంతో సమస్యలు మళ్లీ మొదటి కొచ్చాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. – మహానంది -
పొగాకు రైతు మృతి
ఓర్వకల్లు: పండించిన పొగాను కంపెనీలు సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో గుండెపోటుతో రైతు షఫీఖాన్(55) మృతి చెందాడు. ఈ ఘటన నన్నూరు గ్రామంలో ఆది వారం చోటు చేసుకొంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన షఫీఖాన్ అనే వ్యక్తి గ్రామంలో కొందరి రైతుల వద్ద 16 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. అందులో 10 ఎకరాల్లో పొగాకు సాగుచేశాడు. ఈ ఏడాది పొగాకు బాగా అమ్ముడు పోతుందని, అప్పులు తీరిపోతాయని ఆశించాడు. దిగుబడి బాగానే వచ్చినప్పటికీ, పొగాకు కంపెనీలు సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో మనోవేదనకు గురై ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. వ్యవసాయానికి, వివిధ అవసరాలకు రూ.10 లక్షలు అప్పుచేసినట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య నజిమాబీ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కోడుమూరు రూరల్: కోడుమూరు – వెల్దుర్తి రహదారిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన బోయ శ్రీనివాసులు (36) కోడుమూరుకు చెందిన మంజులను వివాహం చేసుకుని ఇక్కడే నివాసముంటున్నాడు. ఆదివారం వ్యక్తిగత పనిమీద శ్రీనివాసులు బైక్‌పై వెంకటగిరి గ్రామానికి వెళ్లి వస్తున్నాడు. అదే సమయంలో అల్లినగరం గ్రామానికి చెందిన బోయ గిరి తన ఆటోలో కోడుమూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా కోడుమూరు శివారులో ప్రమాదవశాత్తూ ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం కర్నూలు తరలిస్తుండగా బోయ శ్రీనివాసులు మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ మేరకు కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిధులు నిలిపివేయడం అన్యాయం
గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం క్లబ్‌హౌస్‌లో ఫర్ని చర్, జిమ్, స్నూకర్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ పరికరాల కొనుగోలుకు రూ.18 లక్షలను మంజూరు చేసింది. అయితే టీడీపీ ప్రభుత్వం ఈ నిధుల కేటాయింపును అన్యాయంగా నిలిపేసింది. దీంతో క్రీడాకారులకు, చిన్నారులకు క్లబ్‌హౌస్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అక్కరకు రాని చుట్టంగా మిగిలిపోయింది. – పోసు్ట్రపసాద్, వైఎస్సార్సీపీ వలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షులు -
ఓర్వకల్లులో 18 బైకులు దగ్ధం
ఓర్వకల్లు: మెకానిక్ వద్దకు తీసుకొచ్చిన 18 బైకులు నిప్పంటుకొని దగ్ధమయ్యాయి. ఓర్వకల్లులోని ఓ మెకానిక్ షెడ్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. తిప్పాయపల్లె గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా ఓర్వకల్లు బస్టాండ్ సమీపాన మెకానిక్ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజు ఉదయం షాపు వద్దకు వచ్చి, రాత్రి ఇంటికి వెళ్లేవాడు. ఆదివారం తెల్లవారు జామున ఓ బైక్ నుంచి మంటలు వ్యాపించి మొత్తం 18 దగ్ధమైనట్లు స్థానికులు చెప్పారు. సమీపంలోని ట్యాంకర్ ద్వారా నీటితో అతికష్టం మీద మంటలను అదుపు చేశారు. ఈ దుర్ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. దుండగుల దుశ్చర్య అనే విషయాలు తెలియరాలేదు. 25న హుండీల లెక్కింపు కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయంలో ఈనెల 25న హుండీల్లో కానుకల లెక్కింపు ఉంటుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో పోలీస్ బందోబస్తు మధ్య హుండీలను తెరిచి లెక్కిస్తామని చెప్పారు. -
శాస్త్రోక్తంగా పల్లకీ సేవ
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్ధానంలో ఆదివారం స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజుల్లో సర్కారీ సేవగా) నిర్వహిస్తారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ చేపట్టారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించారు. -
శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి. -
వైభవంగా రాయబార మహోత్సవం
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి రాయబారాది మహోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథం(తేరుబండి)పై ముస్తాబు చేశారు. అనంతరం అష్టపుర గ్రామానికి చెందిన ప్రజలు ఎండ్ల బండ్ల ప్రదర్శనతో రాయబారాది కార్యక్రమానికి తరలి వెళ్లారు. జిల్లెల గ్రామరస్తాలో ఉన్న అమ్మవారి పొలిమేర కుంట వద్ద అమ్మవారికి రాయబారాది కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్లీ ఆలయం వద్దకు చేరుకోవడంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, అర్చకులు పాల్గొన్నారు. రాయబార మహోత్సవంలో పాల్గొన్న భక్తులు -
పేదలకు కేటాయించిన భూమి పవర్‌గ్రిడ్‌కు!
కొలిమిగుండ్ల: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదలకు భూ పంపిణీ కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని పవర్ గ్రిడ్‌కు అనుసంధానంగా నిర్మించేందుకు బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌కు అప్పగించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల కంటే ముందుగానే తిమ్మనాయినిపేట వద్ద 415, 416 సర్వే నెంబర్లలో సుమారు 43 మందికి ఒక్కొక్కరికి ఎకరం భూమి చొప్పున భూపంపిణీ చేయాలని గత ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి సబ్ డివిజన్ ప్రక్రియ పూర్తయింది. సంబంధిత భూమిలో వేలాది రూపాయలు ఖర్చు చేసి జింగిల్ క్లియర్ పనులు చేపట్టారు. ఎన్నికల సమయంలో భూ పంపిణీ జరిగితే తమకు నష్టం చేకూరుతుందని భావించిన టీడీపీ నాయకులు హైకోర్టుకు వెళ్లి పంపిణీని అడ్డుకున్నారు. దీంతో మండల వ్యాప్తంగా పేదలకు పంచే భూపంపిణీ ఆగిపోయింది. అయితే ఆ భూమిని ప్రస్తుత ప్రభుత్వం ఓ కంపెనీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ భూముల పక్కనే ప్రస్తుతం తిమ్మనాయిని పేట – నందిపాడు మధ్య పవర్ గ్రిడ్ పూర్తయింది. దీనికి అనుసంధానంగా బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు భూములు అవసరం కాగా గతంలో పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన భూములను ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శనివారం కంపెనీ జీఎంతో పాటు సిబ్బంది ఆ భూమిలో సర్వే చేయడంతో పాటు యంత్రాలతో చదును చేయడంతో రైతులు చర్చించారు. తమకు కేటాయించిన భూమిలో ఎలా సర్వే చేస్తారని ప్రశ్నించారు. గ్రామంలో చాలా వరకు రైతులు సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. ఎక్కువ భాగం పసుసు సాగు చేస్తుంటారు. ఉడికించుకోవడం, ఆరబోసుకునేందుకు వసతులు లేక పోవడంతో రైతులందరూ ఈ భూమికి సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో పనులు చేసుకుంటూ ఉంటారని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు బ్యాటరీ స్టోరేజ్‌కు వెళ్లిపోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గతంలో పేదలకు పంపిణీ చేయకుండా అడ్డుకున్న భూమిని మళ్లీ పరిశ్రమకు ఎలా ఇస్తారని అన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులను కలుస్తామని రైతులు తెలిపారు. -
‘తిరుగు’లేని భక్తి!
● శ్రీశైలం నుంచి కన్నడిగులు తిరుగు ప్రయాణం ● 25 అడుగుల నందికోళ్లతో స్వగ్రామానికి పాదయాత్ర నందికోళ్లతో కాలినడకన స్వగ్రామాలకు వెళ్తున్న కన్నడ భక్తులుజూపాడుబంగ్లా: ఉగాది ఉత్సవాలకు వందల కిలోమీటర్లు పాదయాత్రగా శ్రీశైలం వెళ్లిన కన్నడిగుల భక్తి అంచంచలమైనది. మండుటెండలకు వెనుకడగు వేయకుండా.. కొండ కోనలకు భయపడకుండా.. నల్లమల మీదుగా శ్రీశైలం చేరుకుని భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కొందరు తిరుగు ప్రయాణంలో కూడా పాదయాత్రగా వెళ్తూ కనిపించారు. కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లా జమ్ఖండి తాలూకా కొన్నూర్ గ్రామానికి చెందిన భక్తులు 25 అడుగుల నందికోలను ఎత్తుకొని, నూతన నందికోళ్ల తయారీకి నూతన వెదురు బొంగులను భుజాన ఉంచుకొని 600 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి తిరిగి వెళ్తుండటాన్ని చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. వీరితో పాటు మహారాష్ట్రకు చెందిన మరికొంత మంది భక్తులు కాడెద్దులతో పాటు కావడిని భుజాన ఉంచుకొని కాలినడకన స్వగ్రామాలకు తిరిగి వెళ్తుండటం వారి భక్తిని ప్రశంసిస్తున్నారు. -
శ్రీశైలం గర్భగుడిలో వీడియో చిత్రీకరణపై కేసు నమోదు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలో గర్భగుడిలో మల్లికార్జున స్వామి వారి మూలవిరాట్ ను సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరణపై కేసు నమోదు చేశారు. శనివారం దేవస్థాన అధికారుల ఫిర్యాదు మేరకు శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి విధులపై అలసత్వం ప్రదర్శించిన ఆలయ పర్యవేక్షకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్, ముగ్గురు సెక్యూరిటీ గార్డుల విధులను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు సమాచారం. పది గడ్డివాములు దగ్ధం హాలహర్వి: మండల పరిధిలోరి కొక్కరచేడు గ్రామంలో శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తూ చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 10 గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన బోయ గోవిందుకు చెందిన మూడు, మాదిగ హనుమంతుకు చెందిన మూడు గడ్డివాములతో పాటు దేవరాజు, పింజరి అప్పయ్య, చండ్రప్ప, మస్తాన్‌లకు చెందిన గడ్డివాములతో కలిపి మొత్తం పది గడ్డివాములు ఈ ప్రమాదంలో కాలి బూడదయ్యాయి. సాయంత్రం 4.30 గంటల సమయంలో గడ్డివాములకు ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో స్థానికులు ఆలూ రు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. గాలి తీవ్రతతో మంటలు అదుపుకాక పోవడంతో ఫైరింజన్ వచ్చేలోపు గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. పశువు ల కోసం గడ్డి, జొన్నచొప్ప వాములుగా నిల్వ చేసుకుంటే అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. అధికారులు తమ ను ఆదుకోవాలని కోరుతున్నారు. రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదు ల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజ లు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలు సుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekoram. ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చన్నారు. నేడు వీరభద్రస్వామి, కాళికాదేవిల కల్యాణం ఆస్పరి: వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలంలో కైరుప్పల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున వీరభద్రస్వామి, కాళికాదేవిల కల్యాణ మహోత్సవం నిర్వహించునున్నట్లు ఆలయ ఈఓ రాంప్రసాద్ శనివారం తెలిపారు. కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని, ఈ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం భక్తులు పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యం కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం ( ఈ నెల 31వ తేదీ) ముగిసే నాటికి వంద శాతం పన్ను వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు అరియర్స్ కలుపుకొని మొత్తం రూ.19.01 కోట్లను వసూలు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో 3,59,800 అసెస్‌మెంట్స్‌కు ఇప్పటి వరకు 3,14,493 అసెస్‌మెంట్స్‌ను కలిసి రూ.15.78 కోట్లను ( 83.02 శాతం) వసూలు చేశారన్నారు. మిగిలిన రూ. 3.22 కోట్లను ఈ నెలాఖరులోగా వసూలు చేయాల్సి ఉందన్నారు. పన్ను వసూలుకు క్షేత్ర స్థాయిలోని డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఈ వారం రోజులు కష్టపడాలన్నారు. గూడూరు మండలంలో వంద శాతం వసూలు కాగా.. నందవరం, మంత్రాలయం, పెద్దకడుబూరు, కోడుమూరు, ఓర్వకల్, సి.బెళగల్, చిప్పగిరి, తుగ్గలి మండలాలు 90 శాతం దాటాయన్నారు. మిగిలిన మండలాలు కూడా దాదాపు లక్ష్యానికి చేరువలో ఉన్నాయని, అందరూ లక్ష్యాన్ని సాధించాలన్నారు. -
సంగమేశ్వరుడి పూజకు వేళాయె!
ఆలయానికి బురదలోనే వెళ్తున్న భక్తులుకొత్తపల్లి: శ్రీశైల జలాశయంలో నీటిమట్టం 839 అడుగులకు చేరుకోవడంతో సప్తనది సంగమ ప్రాంతంలో వెలిసిన ప్రాచీన సంగమేశ్వరుడు జలాధివాసం వీడారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత పూర్తి స్థాయిలో ఆలయం బయటపడింది. ఆలయంలో చుట్టూ ఒండ్రు బురద పేరుకుపోయింది. గర్భగుడిలో, ఆలయ ముఖమండపంలో బురద నీటితో నిండి ఉంది. అయినా శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రాచీన సంగమేశ్వరుడిని దర్శించుకున్నారు. బురదలోనే ఒకరి వెంట ఒకరు నడుస్తూ ప్రాచీన ఆలయానికి వెళ్లి స్వామికి పూజలు చేశారు. చుట్టూ నీరు మధ్యలో సంగమేశ్వరాలయం సందర్శకులకు కనువిందు చేస్తోంది. పండుగ సెలవులు ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి ఉంది. ఎగువ పుష్కరఘాట్ వద్ద ఉన్న ఉమామహేశ్వరాలయంలోని శివ లింగానికి, లలితాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఆలయం చుట్టూ బురద, రాళ్లు, రప్పలు ఉన్నాయని, ప్రమాదానికి ఆస్కారముందని, అంతా శుభ్రం చేసే వరకు ఆలయం లోపలికి ఎవరూ రావద్దని ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు. -
హోటళ్లు మూతపడటమే చంద్రబాబు విజన్!
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిపాణ్యం: రాష్ట్రంలో గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, వ్యాపార సముదాయాలు మూతపడటం చంద్రబాబు విజన్‌కు అద్దం పడుతుందోని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజావ్యతిరేక విధానాలే అజెండాగా పని చేస్తున్నారని విమర్శించారు. పాణ్యంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. రెండేళ్లగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం చంద్ర బాబు కనీసం స్పందించండం లేదన్నారు. టీడీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి పనులు కనిపించడం లేదన్నారు. ఎక్కడ చూసినా టీడీపీ నాయకులు దోచుకోవడం, వారు అభివృద్ధి చెందడం తప్ప ప్రజల కోసం చేసింది ఏమీ లేదన్నారు. స్థానిక సమస్యలపై ప్రజలతో కలిసి పోరాటం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సమస్యలపై ప్రజలతో కలసి పోరాటం చేయాలని కాటసాని పిలుపునిచ్చారు. గత ఖరీఫ్‌లో ప్రారంభమైన యురియా సమస్య నేటికీ తీర లేదన్నారు. ఇప్పటికీ రైతులు యురియాను బ్లాక్‌లో కొంటున్నారంటే దానికి చంద్రబాబు విజనే కారణమన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చేప్పుకునే చంద్రబాబు ఎక్కడ ఇచ్చారో అధికారికంగా విడుదల చేయాలన్నారు. కేవలం అనుబంధ సంస్థలకు, బినామీలకు ప్రభుత్వ భూములను కట్టబెట్టి రాస్ట్రాలన్ని నిలువునా దోచుకుంటున్నారని విమర్శించారు. కక్ష రాజకీయాలు తప్ప టీడీపీ నేతలు చేసిందేమీ లేదన్నారు. సమావేశంలో మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు, కో–ఆప్షన్ సభ్యులు జాకీర్ ఉసేన్, కృష్ణారెడ్డి, వైఎస్సాపీపీ రాష్ట ప్రచార వింగ్ సెక్రటరీ బాబు, పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వెల్డింగ్ చాంద్, పిన్నాపురం సర్పంచ్ ఎల్లకృష్ణయ్య, నాయకులు బాబి, మున్నా, స్వామి, ఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మద్దిలేటయ్యలో భక్తుల రద్దీ
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివారులో వెలసిన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ చేశారు. ఉపకమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మహ్మద్ ప్రవక్త బోధనలు మార్గదర్శకం కర్నూలు(సెంట్రల్): మహ్మద్ ప్రవక్త బోధనలు సమస్త ప్రజలకు మార్గదర్శకమని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. శనివారం ఆయన రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పాత ఈద్గాలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో అనుసరించిన క్రమశిక్షణ, సోదర భావం, పేదలకు సహాయం చేయడం వంటి అంశాలను మున్ముందు కూడా కొనసాగించాలని సూచించారు. అంతకముందు ఆయన ప్రార్థనలకు వచ్చిన వారిని ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. -
మామిడిని ఆరోగ్యంగా మాగిద్దాం
● కాల్షియం కార్బైడ్ వద్దు ● ఇథిలీన్ వాయువు ఎంతో మేలు ● ఉద్యానశాఖ జిల్లా అధికారి రాజాకృష్ణారెడ్డి సూచనలు కర్నూలు(అగ్రికల్చర్): మామిడి.. ఫలాల్లో రారాజు. వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎదురుచూడని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ ఏడాది మామిడి పంట తక్కువగా ఉంది. మొదట్లో పూతతో ఊరించిన మామిడి తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పులతో 80 శాతంపైగా రాలిపోయింది. మామిడి మార్కెట్లోకి ప్రవేశించే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో మామిడిని ఆరోగ్యకరమైన పద్ధతుల ద్వారా మాగించాల్సిన అవసరం ఉందని కర్నూలు ఉద్యానశాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. ఇవీ సూచనలు.. ● కార్బైడ్‌కు ప్రత్యామ్నాయంగా పండ్లు మాగించే పద్ధతుల గురించి రైతులు, వ్యాపారులు తెలుసుకోవాలి. ● ఆరోగ్యవంతమైన పద్ధతిలో మాగిస్తే అటువంటి పండ్లకు డిమాండ్ వస్తుంది. ● ప్రకృతి సిద్ధంగా పండ్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఇథలీన్‌తో మామిడిని మాగించాలి. ఇది రంగు, రుచి వంటి మార్పులకు ఉపయోగపడుతుంది. ● తప్పని పరిస్థితుల్లో కాయలు మాగబెట్టేందుకు ఎథిలిన్ వాయువు 100 పీపీఎం మాత్రమే ఉపయోగించాలి. ● అవసరమైతే 100 పీపీఎం ఎథిలిన్ వాయువు 24 గంటలు తగిలేటట్లుగా ఉంచితే 5 రోజులలో సహజత్వానికి దగ్గరగా ఎలాంటి హాని లేకుండా మాగుతాయి. ● మాగని కాయలను, కొన్ని మాగిన పండ్లను గాలి చొరబడని డబ్బాల్లో ఉంచాలి. ● పక్వానికి వచ్చిన కాయలను ఒక రూములో వరిగడ్డి లేదా బోదగడ్డిలో ఉంచితే సహజ సిద్ధంగా మాగుతాయి. ● కార్బైడ్ వాడని పండ్లు పసుపు, లేత ఆకుపచ్చ రంగులు కలిగి లోపల పండు మొత్తం పరిపక్వంగా ఉంటుంది. కొంత దూరం వరకు పండ్లు మాగినట్లుగా కమ్మని వాసన వస్తుంది. ● సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ● కృత్రిమంగా మాగిన వాటిలో పండ్ల తొక్క మడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటాయి. పండు త్వరగా పాడైపోతుంది. తొక్కపై నల్లని చుక్కలు ఏర్పడతాయి. ● పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15–20 నిముషాలు ఉంచి, తిరిగి వాటిని మంచినీటిలో కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత తినాలి. ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది. కార్బైడ్‌తో మాగిస్తే శిక్ష ఆహార సురక్షణ ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కార్బైడ్ వాడి పండ్లు మాగబెట్టిన వారికి, అమ్మేవారికి ఒక ఏడాది జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. కార్బైడ్ వాడిన పండ్లను తినడంతో అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ విషయం శాసీ్త్రయంగా నిర్థారణ అయింది. -
కేసీ రైతుల ఆందోళన
● ఈ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలని రైతుల డిమాండ్ నందికొట్కూరు: పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీటి సరఫరా నిలిపేస్తే ఎలా అంటూ కేసీ ఆయకట్టు రైతులు అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం మల్యాల ఎత్తిపోతల పథకం వద్ద మల్యాల, శాతనకోట రైతులు ఆందోళన చేపట్టారు. ఓ వైపు హంద్రీ నీవాకు నీటిని విడుదల చేస్తున్నా అధికారులు కేసీ కెనాల్‌కు ఎందుకు నిలుపుదల చేశారని మండిపడ్డారు. కేసీ కెనాల్ కింద మొక్క జొన్న, మినుము, కంది, వేరుశనగ పంటలు సాగు చేశామని, మొక్కజొన్న కంకులు గింజ పడుతున్న సమయంలో సాగునీరు వెంటనే అందించకపోతే ఎండిపోవడం ఖాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో ఆందోళ న చేపడితే రైతులకు ఇబ్బందులు కలగకుండా పంటలకు నీటిని విడుదల చేస్తా మని ప్రజాప్రతినిధులు, అధికారులు చె ప్పి మోసం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి పంటలకు సాగు నీరు అందించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు గోవిందు, నాగరాజు,షాలు, రషీదు, నరసింహ, అబ్దుల్ రహిమాన్, గోకారి, షేక్షావలి, వెంకటరెడ్డి, చిన్నన్న, మౌలాలి, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, బిచ్చన్న, ఆంజనేయులు, శేఖర్, వెంకటేశ్వర్లు, ఠాగూరు నాయక్, రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. -
పదవ తరగతి విద్యార్థి దుర్మరణం
కోవెలకుంట్ల:కోవెలకుంట్ల – జమ్మలమడుగు ఆర్అండ్బీ రహదారిలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి దుర్మరణం చెందాడు. ఎస్ఐ మల్లి కార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. బనగానపల్లె మండలం రామతీర్థంకు చెందిన లాజరయ్య కు ఇద్దరు కుమారులు సంతానం కాగా పెద్ద కుమారుడు కిషోర్ (16) బనగానపల్లెలో మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతూ ప్రస్తుతం పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. బంధువుల ఇంటి నుంచి బియ్యం ప్యాకెట్ల తీసుకెళ్లేందుకు వచ్చి ట్రాక్టర్ ఇంజిన్‌పై కూ ర్చొని తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోవెలకుంట్ల పట్టణ శివారులోని జ్యోతి స్కూల్ సమీపంలో ప్రమాదశాత్తు ఇంజిన్‌పై నుంచి జారి కింద పడటంతో ట్రాలీ టైర్ ఎక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
కుంభోత్సవానికి కొబ్బరికాయల సమర్పణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీ భ్రమరాంబా దేవి అమ్మ వారికి ఈనెల 7వ తేదీన నిర్వహించే కుంభోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆలయ ఉద్యో గి కొబ్బరి కాయలు సమర్పించారు. అమ్మవారికి సాత్త్వికబలి నిర్వహించేందుకు (కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో వాటికి పూజలు జరిపించారు. తరువాత అమ్మవారికి ఈ కొబ్బరికాయలు సమర్పించారు. -
ఆదర్శ పాఠశాలలు పిలుస్తున్నాయ్..!
నంద్యాల(న్యూటౌన్): కార్పొరేట్ తరహా వసతులతో ఏర్పాటైన మోడల్ స్కూళ్లలో (ఆదర్శ పాఠశాలలు) ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ప్రస్తుతం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు ఈ ఏడాది 2 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. జిల్లాలో 20 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. 6వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులు ఇంటర్ వరకు ఉచితంగా చదువుకోవచ్చు. ఫిబ్రవరి 23వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా ఈనెలాఖరు 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. విద్యార్థులు ఏపీ ఆన్లైన్ ద్వారా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.125 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు సమర్పించేందుకు www.cse.ap.gov.in, www.apms.apcfss.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. ఆరో తరగతిలో ప్రవేశానికి గతేడాది మాదిరిగానే పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూల్లోనే ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ప్రశ్నాపత్రం 5వ తరగతి స్థాయిలో ఆబ్జెక్టివ్ తరహాలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. దరఖాస్తు ఇలా.. దరఖాస్తు చేసుకొనే విద్యార్థులు జిల్లాలో గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదివి ఉండాలి. ఓసీ, బీసీ కులాలకు చెందిన వారు 01–09– 2014 నుంచి 31–08–2016 మధ్య జన్మించి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ తెగల విద్యార్థులు అయితే 01–09–2012 నుంచి 31–08–2016 మధ్య పుట్టిన వారు అర్హులు. మోడల్ స్కూళ్లలో సౌకర్యాలు.. ● నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన ● ఆరో తరగతి నుంచి ఇంటర్మీడిమెట్ వరకు ఇంగ్లిష్ మీడియంలోనే బోధన ● విశాల తరగతి గదులు, సౌకర్యవంతమైన వాతావరణంలో ఉచిత విద్య ● నీట్, జేఈఈ, ఎంసెట్, ఎన్ఎంఎంఎస్, ఐఎంఓ, ఐఏప్వో లాంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ● స్పోకెన్ ఇంగ్లిష్, హ్యాండ్ రైటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ, అన్ని సౌకర్యాలతో కూడిన గ్రంథాలయం, ఆధునిక పరికరాలతో కూడిన సైన్స్ ల్యాబ్‌లు ● ఎల్సీడీ ప్రొజెక్టర్ విద్యా బోధన ● ఇంటర్లో అందుబాటులో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు ● 9వ తరగతి నుంచి అకాడమిక్ విద్యకు సమాంతరంగా కనీసం రెండు ఒకేషనల్ కోర్సులు 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జిల్లాలో 20 ఆదర్శ పాఠశాలలు ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష -
ఇంటర్ వరకూ ఉచితం
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసింది. నూతన భవనాలు, విశాలమైన తరగతి గదులు, మెరుగైన సౌకర్యాలు ఉండటంతో ఈ పాఠశాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ పాఠశాలల్లో ఒక్కసారి సీటు దక్కితే ఇంటర్మీడియెట్ పూర్తయ్యే వరకూ చదువుకోవచ్చు, ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలనే తపన ఉండే గ్రామీణ విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు వరంగా చెప్పవచ్చు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ప్రతిభ కనబరిస్తే సీటు దక్కుతుంది. – జనార్దన్‌రెడ్డి, డీఈఓ, నంద్యాల -
సబ్ జైలు తనిఖీ
డోన్ టౌన్: పట్టణంలోని సబ్ జైలును శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులోని బ్యారక్‌లు, భోజనశాలను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. జైలులో వైద్య సేవలు, భోజన వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఏఏ నేరాలపై జైలుకు వచ్చారు.. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అని ఆరా తీశారు. బెయిల్ కోసం స్వతహాగా న్యాయవాదిని నియమించుకోవడానికి ఆర్ధిక స్థోమత లేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తుందన్నారు. ఆయన వెంట సబ్ జైలు సూపరింటెండెంట్ సురేష్, కోర్టు సిబ్బంది ఇందిరా, సరితా, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
గ్యాస్ కష్టాలు బారులుదీరి
ఇరాన్ యుద్ధం గ్యాస్ కష్టాలు తెచ్చిపెట్టింది. సిలిండర్ల సరఫరాలో జాప్యమవుతుండటంతో వినియోగదారులు సతమతమవుతున్నారు. ఉగాది, రంజాన్ పర్వదినాలు వరుసగా రావడం, ఈ సమయంలో గ్యాస్ కొరత ఏర్పడటంతో సిలిండర్ల కోసం నిరీక్షణ తప్పడం లేదు. కొందరికి బుకింగ్ కాకపోవడం, బుకింగ్ అయినా ఓటీపీ వచ్చిన వారికే సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శిరివెళ్ల గ్యాస్ స్టాక్ పాయింట్ వద్ద వినియోగదారులు సిలిండర్లను క్యూలో ఉంచి తమ వంతు కోసం నిరీక్షిస్తూ కనిపించారు. సంతోషంగా పండుగ చేసుకోవాల్సిన తాము గ్యాస్ సిలిండర్ల కోసం గంటల తరబడి క్యూలో నిలవాల్సి వచ్చిందని వాపోయారు. – శిరివెళ్ల -
గ్యాస్‌కు బదులు విద్యుత్ స్టౌలు మేలు
కర్నూలు(సెంట్రల్): ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రజలు గ్యాస్‌కు బదులుగా ఇండక్షన్ లేదంటే విద్యుత్ స్టౌలను వినియోగించేలా అవగాహన కల్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి ఎల్పీజీ గ్యాస్ అంశంపై డివిజన్, మండల స్థాయి అధికారులతో శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్యాస్ బదులుగా మట్టి, కట్టెల పొయ్యిలువాడొద్దని సూచించారు వాటి ద్వారా మహిళలకు ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకావం ఉంద న్నారు. అడవులు నరికివేతకు గురికాకుండా ఇండక్షన్, విద్యుత్ స్టౌలు వాడాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో వాటిని వాడుకోవడం మంచిదన్నారు. జేసీ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్ కొరత లేదన్నారు. యుద్ధం నేపథ్యంలో ప్రజలు అపోహలకు గురై ఎక్కువ మోతాదులో సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారన్నా రు. గతంలో జిల్లాలో ప్రతిరోజు 9 వేల సిలిండర్లు మాత్రమే అవసరం ఉండేదని, ప్రస్తుతం 11వేల సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారని చెప్పారు. గ్యాస్ ఏజెన్సీ లు సిలిండర్లను దారి మళ్లిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కమర్షియల్ ట్యాక్స్ జేసీ నీరజ, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీపీఓ భాస్కర్, డీఎస్ఓ రాజారఘువీర్, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మీ పాల్గొన్నారు. నంద్యాల(న్యూటౌన్):పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఈనెల 21న శని వారం నిర్వహించాల్సిన ఇంగ్లిష్ పరీక్ష రంజాన్ సందర్భంగా సెలవు ప్రకటి స్తూ ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. అన్ని పరీక్షలు ముగిశాక ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులు,ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు తెలియజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్ష తేదీ మార్పు చేసినట్లు తెలిపారు. -
ఫలించిన ఎస్పీ వ్యూహం
● ట్రాఫిక్ జామ్ లేకుండా కన్నడిగుల తిరుగు ప్రయాణం ● అర్ధరాత్రిలోపే దోర్నాల, మున్ననూరు చెక్‌పోస్టులు దాటిన వేలాది వాహనాలు శ్రీశైలం: ఉగాది మహోత్సవాలకు తరలివచ్చిన భక్తజనం రథోత్సవం అనంతరం ట్రాఫిక్ జామ్ లేకుండా తిరుగు ప్రయాణమయ్యారు. ఎస్పీ సునీల్ షెరాన్ ప్రత్యేక వ్యూహంతో పోలీసులు వాహనాల క్రమబద్ధీకరణలో ఈ ఏడాది పట్టు సాధించారు. ఫిబ్రవరిలో జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కంటే ఉగాదికి అధిక సంఖ్యలో శ్రీశైలంకు వాహనాలు చేరుకున్నాయి. అధికారుల అంచనా ప్రకారం సుమారు 6 వేలకు పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన బస్సులు, టూరిస్ట్ బస్సులు, 15 వేలకు పైగా ఫోర్ వీలర్స్ వచ్చినట్లు అంచనా. ఉత్సవాలు ఈనెల 16 నుంచి ప్రారంభమైనప్పటికీ ఈ నెల 10 నుంచే వాహనాల తాకిడి ప్రారంభమైంది. గతంలో ఉగాది ఉత్సవాల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీ మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారించారు. బందోబస్తుకు పోలీసుల సంఖ్య పెంచడం, క్షేత్రంలో ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రదేశాలను గుర్తించి అక్కడ డీఎస్పీ స్థాయి అధికారులను నియమించడం, డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం, కమాండ్ కంట్రోల్ నుంచి ఆదేశాలు జారీ చేయడం, బ్లూ కోర్టు సిబ్బంది నిరంతరం క్షేత్ర స్థాయిలో ఉండటం వంటి చర్యలు చేపట్టారు. రథోత్సవం రోజు గురువారం ఎస్పీ క్షేత్ర స్థాయిలో బ్లూ కోర్టు వాహనంలో క్షేత్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టారు. అలాగే ఆ సమయంలో అటు మున్ననూరు, ఇటు దోర్నాల చెక్‌పోస్టు నుంచి ఒక్క వాహనం కూడా శ్రీశైలం వైపు రాకుండా అడ్డుకున్నారు. గతంలో శివరాత్రి, ఉగాది ఉత్సవాల్లో నిర్వహించే రథోత్సవం అనంతరం ట్రాఫిక్ క్లియర్ కావాలంటే మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలు అయ్యేది. అలాంటిది ప్రస్తుతం ఎస్పీ ట్రాఫిక్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో శ్రీశైలంలో ఉన్న అన్ని పార్కింగ్ ప్రదేశాలు రాత్రి 9.30 గంటలకే దాదాపు ఖాళీ అయ్యాయి. ఘాట్ రోడ్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా రాత్రి 11.30 గంటలకు అన్ని వాహనాలు దోర్నాల, మన్ననూర్ చెక్ పోస్టులను దాటాయని ఎస్పీ ధ్రువీకరించుకుని గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. ట్రాఫిక్ జామ్ లేకుండా కన్నడిగుల తిరుగు ప్రయాణం కావడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. -
ఉగాది మహోత్సవాలకు పూర్ణాహుతి
శ్రీశైలంటెంపుల్: ఇల కై లాసమైన శ్రీగిరి క్షేత్రంలో నిర్వహిస్తున్న ఉగాది మహోత్సవాలకు శుక్రవారం శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. చివరి రోజు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. యాగశాలలో చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీహోమం జరిపించారు. అనంతరం యాగపూర్ణాహుతి, వసంతోత్సవం, అవభృదం కార్యక్రమాలు నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పూర్ణాహుతి అనంతరం వసంతోత్సవం జరిపించారు. కార్యక్రమంలో స్థానాచార్యులు వసంతాన్ని పసుపు, సున్నం, సుగంద ద్రవ్యాలు కలిపిన మంత్రపూరిత జలాన్ని సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు. అనంతరం చండీశ్వరస్వామికి ఆలయ మల్లికాగుండం వద్ద అవభృదం, త్రిశూల స్నాన కార్యక్రమాలు జరిపించారు. అవభృదంలో రుద్రధ్యాయ మంత్రాలతో చండీశ్వరస్వామికి శుద్ధజలం, పంచామృతాలు, భస్మోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, సుగంధోదకం, బిల్వోదకం, పుష్పోదకం, నారికేళం మొదలైన వాటితో స్నపన కార్యక్రమం నిర్వహించారు. త్రిశూల స్నానం కార్యక్రమంలో భాగంగా మల్లికాగుండం జలాన్ని తలపై ప్రోక్షించడంతో పాపాలన్నీ హరించి శ్రేయస్సు కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆయా పూజా కార్యక్రమాల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సకల శుభాలు ప్రసాదించే భ్రమరాంబా.. ఉగాది మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీభ్రమరాంబాదేవి నిజరూపంలో దర్శనమిచ్చారు. అష్టభుజాలు కలిగిన ఈ దేవి శూలం, బాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిగ మొదలైన ఆయుధాలను ధరించి జగన్మాతగా దర్శనమిచ్చారు. అమ్మవారి నిజాలంకరణ దర్శనం వలన సమస్యలన్ని తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతుంది. అలాగే అశ్వవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను దర్శించడం వలన సమస్యలు తీరిపోతాయని, సంతానార్థులకు సంతానం కలుగుతుందని పండితులు పేర్కొన్నారు. పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా ఉత్సవమూర్తులకు ప్రాకారోత్సవం నిర్వహించారు. మల్లికా గుండంలో చండీశ్వరుడికి త్రిశూల స్నానంఅశ్వవాహనంపై స్వామిఅమ్మవార్ల విహారం ఉగాది మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ నిర్వహించారు. ఉభయ దేవాలయ ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో అశ్వవాహనంపై ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవమూర్తులను ఆశీనులు చేయించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అనంతరం ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. మల్లికాగుండం వద్ద అవభృదం, త్రిశూలస్నానం నిజాలంకరణలో శ్రీభ్రమరాంబాదేవి దర్శనం శ్రీశైలంలో ముగిసిన ఉగాది మహోత్సవాలు -
బ్లాక్‌లో మద్యం.. పట్టుకోండి చూద్దాం
శ్రీశైలం ప్రాజెక్ట్: సున్నిపెంటలో మద్యం దందా ఆగడం లేదు. గత రెండు రోజులుగా బ్లాక్‌లో మద్యం విక్రయాల జోరు సాగుతోంది. బుధవారం తూతూ మంత్రంగా ఎకై ్సజ్ పోలీసులు వైన్‌షాపు పరిసరాల్లో పెట్రోలింగ్ చేశారు కాని బ్లాక్‌లో మద్యం అమ్మే వ్యక్తులను పట్టుకోలేకపోయారు. ఉగాది పండుగ సందర్భంగా బుధ, గురువారాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశాలు జారీచేశారు. అయినప్పటికీ వైన్‌షాప్ పరిసర ప్రాంతాల్లోనే సుమారు 8 మంది వివిధ బ్రాండ్ల క్వార్టర్ బాటిళ్లపై రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా తీసుకొని విక్రయిస్తున్నారు. గురువారం కూడా వైన్‌షాపుల వద్ద బహిరంగంగానే బ్లాక్‌లో విక్రయాలు జోరుగా సాగాయి. -
మొదలైన చౌడేశ్వరి రాయబారాది ఉత్సవం
బనగానపల్లె రూరల్: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి రాయబారాది, జ్యోతి రథ వసంతోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఉదయం శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి గణపతి పూజ, సాయంత్రం అంకుర్పాణ, పంచాగ శ్రవణం కార్యక్రమం జరిగింది. సాయంత్రం పన్నేరపు బండ్లు తిప్పుట, ప్రాకార రథం ఊరేగింపు కార్యక్రమం కనుల పండువగా సాగింది. కార్యక్రమంలో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున్న వచ్చి తిలకించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందివర్గం ఎస్ఐ భూపాలుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వివాహిత ఆత్మహత్య పాములపాడు: మండలంలోని ఇస్కాల గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లీలావతి (30 భర్త మధు మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతున్నాడు. పలుమార్లు భార్య వారించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ విషయంలో రెండురోజుల క్రితం ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన లీలావతి ఈనెల 18న గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆత్మకూరులో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా అక్కడ కోలుకోలేక బుధవారం మృతి చెందింది. మృతురాలి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రమణ తెలిపారు. -
అధికారులా.. మజాకా!
డోన్: ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ.. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. అధికార దుర్వినియోగంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్న ఉదంతాలు డోన్ నియోజకవర్గంలో వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. గత రెండు నెలల్లో ఇద్దరు రెవెన్యూ అధికారులు, ఒక సబ్‌ట్రెజరీ అధికారి లంచాలు తీసుకుంటూ ఏసీబీ అఽధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డోన్ ఎంపీడీఓ, కమిషనర్ ప్రభుత్వ సొమ్మును కాజేసిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల డోన్ మండలం కొత్తబురుజు గ్రామ పర్యటనకు సీఎం చంద్రబాబు వచ్చిన సందర్భంగా మండల అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరెడ్డి కారు అద్దెకు తీసుకోకుండా ఇతరుల కారులో పర్యటించారని ఉన్నతాధికారులు అభియోగం మోపారు. కాసులకు కక్కుర్తి పడి ప్రతి నెల వేలాది రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం నుంచి వాహనాల అద్దె రూపంలో కొల్లగొడుతున్నందున ఎంపీడీఓకు చెల్లించాల్సిన వాహనాల అద్దెను నిలిపివేయాలని డివిజనల్ డెవలప్మెంట్ అధికారి నరసింహారెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓతో పాటు డోన్ ట్రెజరీ అఽధికారికి సిఫారసు చేశారు. అయితే ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో డోన్ ఎంపీడీఓ కంటే మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌గౌడ్ రెండాకులు ఎక్కువే చదివారని చెప్పవచ్చు. ప్రతి నెల తాను పర్యటనలు జరిపేందుకు రూ.35 వేలు తీసుకుంటూ డ్రైవర్ జీతం మిగిల్చుకునేందుకు కక్కుర్తి పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. తాను పర్యటనలు జరిపే కారుకు ఎల్లో బోర్డు పెట్టుకోకుండా, డ్రైవర్‌ను నియమించుకోకుండా ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగి అయిన రూ.50వేల వేతనం తీసుకుంటున్న ఇమామ్ అనే ఉద్యోగిని మున్సిపల్ కమిషనర్ కారు డ్రైవర్‌గా వాడుకుంటున్నారు. అయితే డ్రైవర్ జీతంతో పాటు కారు అద్దె కింద ప్రతి నెల రూ.35 వేలను ఆయన మున్సిపల్ సాధారణ నిధుల నుంచి తన ఖాతాలోకి వేసుకుంటున్నారు. సీఎం సభకు రూ.6 లక్షలు ఖర్చు.. గత వారం డోన్ మండలం కొత్తబురుజు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు సభకు డోన్ మున్సిపల్ సాధారణ నిధుల నుండి రూ.6 లక్షలు ఖర్చు చేసినట్లు కమిషనర్ ప్రసాద్‌గౌడ్ నిధులను కొల్లగొట్టేందుకు సర్వసభ్య అజెండాలో చేర్చినట్లు తెలిసింది. ఈ విషయంపై శుక్రవారం జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు నిలదీయగా, ‘మీలో ఒక్కరైనా ఒక్కపూట తమ వర్కర్లకు భోజనం పెట్టారా’ అంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం సభకు జిల్లా కలెక్టర్ భోజన వసతులు ఏర్పాటు చేస్తే నిబంధనలకు విరుద్ధంగా రూ.6 లక్షలు సభ అనుమతి లేకుండా ఎప్పుడు ఎలా ఖర్చు చేశారని నిలదీశారు. దీంతో కంగుతిన్న కమిషనర్ ‘మీకు ఇష్టమైతే ఆమోదించండం, లేకపోతే లేదు’అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, పాలకవర్గానికి మధ్య విబేధాలు సృష్టించడం, అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాయడం తప్ప ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించాల్సిన ధ్యాస కమిషనర్‌కు లేదు. అతని అక్రమాలు, అవినీతిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి కఠిన చర్యలు చేపట్టాలి. – మల్లికార్జునరెడ్డి, కౌన్సిలర్ ప్రైవేటు వాహనానికి ప్రభుత్వ డ్రైవర్‌తో కమిషనర్ బిల్లులు స్వాహా అద్దె వాహనం లేకుండానే ప్రజా సొమ్ము కొల్లగొట్టిన ఎంపీడీఓ అధికారుల కక్కుర్తిపై ప్రజలు విమర్శలు నిధులు రికవరీ చేయాలని మున్సిపల్ కౌన్సిలర్ల డిమాండ్ -
నాణ్యత బ్యాగోలేదు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ‘జగనన్న విద్యా కానుక’ కిట్లు అందించేవారు. ఇందులో మూడు జతల యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు తదితరవి ఉండేవి. ఇవన్నీ నాణ్యంగా ఉండేవి. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక పేరు మార్చి ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ పేరుతో కిట్లు ఇచ్చింది. అయితే, నాణ్యతను విస్మరించడంతో విద్యా సంవత్సరం పూర్తికాకముందే చంద్రబాబు సర్కారు ఇచ్చిన వస్తువులు చిరిగిపోతున్నాయి. ఇందుకు ఈ చిత్రాలే నిదర్శనం. కొత్త ప్రభుత్వం వచ్చి రెండు విద్యా సంవత్సరాలు గడిచిపోయినా పిల్లల వీపులపై నేటికీ జగనన్న బ్యాగులే కనిపిస్తున్నాయి. దీనిని బట్టి పిల్లల చదువు, వారికి అందించే వస్తువులపై నాటి, నేటి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో ఇట్టే అవగతమవుతుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలుచెదరని నాణ్యత.. జగనన్న బ్యాగులతో బడికి -
ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు
కమిషనర్ ప్రసాద్ గౌడ్ రెండేళ్ల కాలం నుంచి మున్సిపల్ నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. కమిషనర్ వ్యవహార శైలిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకొని ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. – దినేష్‌గౌడ్, కౌన్సిలర్, డోన్ డోన్ మున్సిపల్ చరిత్రలో కమిషనర్ ప్రసాద్‌గౌడ్ అత్యంత అవినీతి పరునిగా పేరుగాంచారు. అనేక మందిని ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచాలు తీసుకొని బహుళ అంతస్తుల నిర్మాణాలను, అక్రమ దుకాణాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. దీనిపై సత్వర విచారణ జరగాల్సిందే. – సుంకయ్య, సీపీఐ కౌన్సిలర్, డోన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ డ్రైవర్‌ను ప్రైవేటు వాహనానికి వినియోగించుకుంటూ ప్రజాధనాన్ని కొల్లగొట్టిన విషయం మామూలు వ్యవహారం కాదు. కమిషనర్ నుంచి డ్రైవర్ వేతనాన్ని మొదటి నుంచి రికవరీ చేయాల్సిన బాధ్యత మున్సిపల్ ఉన్నతాధికారులపై ఉంది. – బుర్రు రమాదేవి, కౌన్సిలర్, డోన్ -
గేట్స్‌లో జొన్నగిరి విద్యార్థికి 5వ ర్యాంక్
తుగ్గలి: జాతీయ స్థాయిలో నిర్వహించిన గేట్–2026 పరీక్ష ఫలితాల్లో తుగ్గలి మండలం జొన్నగిరి షేక్ మునీర్ 5వ ర్యాంక్ సాధించాడు. 933 స్కోర్ తెచ్చుకోగా ఈ ర్యాంకు లభించిందని ఆయన తెలిపారు. మునీర్ తండ్రి అల్లాబకాష్ గ్రామంలో పంచర్షాపు, తల్లి హమీదా టైలరింగ్ చేస్తోంది. మునీర్ 1వరకు స్వగ్రామంలో, 2 నుంచి 10వరకు గుత్తి సెయింట్ మేరీ, ఇంటర్, బీటెక్ ఇడుపులపాయలో చదివాడు. తర్వాత గేట్ పరీక్షలకు ప్రిపేరైన ఈ విద్యార్థి జియో మాటిక్స్ ఇంజినీరింగ్‌లో జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్ సాధించాడు. సివిల్స్ సాధించి ఐపీఎస్ కావడమే తన లక్ష్యమని మునీర్ తెలిపారు. కొడుకు ర్యాంక్ సాధించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం గర్వకారణమని పలువురు అభినందనలు తెలిపారు. -
నేడే పిడకల సమరం
● ప్రేమను గెలిపించేందుకు కై రుప్పలలో కొనసాగుతున్న సంప్రదాయం ● పిడకల సమరానికి పూర్తయిన ఏర్పాట్లు ఆస్పరి: ఉగాది పండుగకు ఆస్పరి మండలంలో ఓ ప్రత్యేకత ఉంది. పండగ మరుసటి రోజు మండలంలోని కై రుప్పల గ్రామంలో ప్రేమికులను గెలిపించేందుకు పిడకల సమరం జరుగుతుంది. వీరభద్రస్వామి, కాళికాదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరుగుననున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి సాయంత్రం ఆలయ కార్యనిర్వహణ అధికారి రాంప్రసాద్, గ్రామపెద్దల ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకను తిలకించేందుకు మండలంలోని ఆస్పరి, కారుమంచి, బిల్లేకల్, చెన్నపల్లి, పుప్పాలదొడ్డి, యాటకల్, కలపరి, దొడగొండ, తురువగల్, అలారుదిన్నె, ముత్తుకూరు తదితర గ్రామాల నుంచే కాక కర్ణాటక, తెలంగాణ, తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరుకానున్నారు. మొక్కుబడిగా భక్తులు పిడకల సమర్పణ కోరిన కోరికలు నెరవేరితే భక్తులు నగలు, పట్టు వస్త్రాలు, కానుకలు సమర్పించడం సర్వసాధారణం. అయితే కై రుప్పల గ్రామంలో అందుకు భిన్నంగా భక్తులు వీరభద్రస్వామికి పిడకలు సమర్పించి మొక్కుబడి తీర్చుకుంటారు. స్వామివారి సన్నిధిలో శుక్రవారం జరిగే పిడకల సమరానికి నుగ్గులు సిద్ధం చేశారు. మొక్కుబడి ఉన్న భక్తులు వారికి తోచిన విధంగా పిడకలను ఆలయ ఆవరణలో రాశులుగా పోసి మొక్కుబడి తీర్చుకుంటారు. నేపథ్యమిది .. విహార యాత్రకు వెళ్లిన వీరభద్రస్వామి తనకు తారస పడిన కాళికాదేవితో ప్రేమలో పడి వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడట. అయితే ఆ తర్వాత స్వామి ఇచ్చిన మాట తప్పడంతో కాళికాదేవి వర్గీయులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. వీరభద్ర స్వామిని అవమాన పరచాలని నిశ్చయించుకొని తమకు అందుబాటులో ఉన్న పిడకలతో స్వామితో పాటు ఆయన వర్గీయులపై దాడి చేస్తారు. స్వామి వర్గీయులు కూడా పిడకలతో ఎదురు దాడికి దిగుతారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఈ దాడి, ప్రతిదాడి రణ రంగాన్ని తలపించింది. తర్వాత గ్రామపెద్దలు పంచాయితీ చేసి నిమ్న కులానికి చెందిన కాళికాదేవిని, అగ్రవర్ణానికి చెందిన వీరభద్రస్వామికి వివాహం చేశారని పెద్దలు చెబుతారు. ప్రాణాలకు తెగించి తమ కోసం పోరాడిన తమ వర్గీయుల కోరికలను వీరభద్రస్వామి, కాళికాదేవి తీర్చారట. ఈ నేపథ్యంలోనే ఏటా ఉగాది పండుగ మరుసటి రోజు స్వామి, అమ్మవారి భక్తులు పిడకల సమరం చేసుకోవడం ఆచారంగా వస్తుంది. కై రుప్పలలో వెలసిన వీరభద్రస్వామి, కాళికాదేవి కై రుప్పల గ్రామంలో వెలసిన వీరభద్రస్వామి గుడిసమరం ఇలా సాగుతుంది పుప్పాలదొడ్డి, చెన్నంపల్లి, అలారుదిన్నె, వెంగళాయదొడ్డి, కారుమంచి, కలపరి తదితర గ్రామాల ప్రజలు తమ కోరికలను తీర్చిన వీరభద్రుడికి మొక్కుబడి సమర్పించేందుకు ఒక నెల నుంచి తమ ఇంటిలో ఉన్న పశువుల పేడతో పిడకలు తయారు చేస్తారు. వాటిని ఉగాది మరుసటి రోజు దేవుడి సన్నిధికి చేరుస్తారు. పిడకల సమరానికి ముందు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. దెబ్బలు తగలకుండా టవాళ్లతో ముసుగు తొడుక్కుంటారు. అరగంట పాటు జరిగే పిడకల సమరంలో చాలా మంది భక్తులు గాయపడతారు. గాయానికి స్వామివారి బండారం రాసుకుని ఇంటి ముఖం పడతారు. -
18 మండలాల్లో అకాల వర్షం
● క్రిష్ణగిరిలో అత్యధికంగా 39.2 మి.మీ వర్షపాతం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు 18 మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. క్రిష్ణగిరిలో 39.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గూడూరు, హాలహర్వి, తుగ్గలి, ఆదోని, కల్లూరు, ఓర్వకల్, కర్నూలు అర్బన్‌లో తేలికపాటి వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద 7.8 మి.మీ వర్షపాతం నమోదైంది. పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం తదితర మండలాల్లో మిర్చి ఇప్పటికీ కళ్లం దొడ్లు, పొలాలు, రోడ్లపై ఆరబెట్టుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో మిర్చి పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. మండలం వర్షపాతం వెల్దుర్తి 28.4 నందవరం 21.8 ఎమ్మిగనూరు 19.2 చిప్పగిరి 15.8 గోనెగండ్ల 14.6 పెద్దకడుబూరు 12.2 మంత్రాలయం 8.8 మద్దికెర 7.8 కోడుమూరు 7.4 -
శ్రీశైలంలో వైభవంగా ఉగాది వేడుకలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం ఉగాది ఉత్సవాలను అధికారులు అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలనతో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి డాక్టర్ బుట్టే వీరభద్ర దైవజ్ఞ ఉగాది పంచాగాన్ని పఠించారు. రాబోయే సంవత్సరంలో ప్రభుత్వానికి ఎదురయ్యే పరిస్థితులు, సమాజానికి సంబంధించిన శుభాశుభ ఫలితాలను విశదీకరిస్తూ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శ్రీశైల దేవస్థానానికి 29 సంవత్సరాలుగా సేవలందిస్తున్న పంచాంగ శ్రవణకర్త డాక్టర్ బుట్టే వీరభద్రను శాలువాతో సత్కరించారు. అలాగే శ్రీశైల దేవస్థాన ప్రధాన అర్చకులు శివప్రసాద్ స్వామి, అమ్మవారి అర్చకులు విజయ్స్వామిని సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంద్యాల జిల్లాకు చెందిన ముగ్గురు అర్చకులు మఠం శివశంకరయ్య, ఇటిక్యాల వెంకటసుబ్బయ్య, ఎం.త్రివేణికుమార్, పండితుడు ఎం.మహేశ్వరయ్యను ఘనంగా సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.10,116 నగదు పురష్కారంతో పాటు సంప్రదాయ దుస్తులైన పంచా, కండువా, శాలువా అందించి సన్మానం చేశారు. -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు గత నెల 23న ప్రారంభమై బుధవారంతో ముగిశాయి. చివరి రోజు జురిగిన కెమిస్ట్రీ–2 పరీక్షకు 9926 మందికి గాను 9754 మంది హాజరు కాగా 172 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన అనంతరం విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేసి లగేజీలతో సొంతూళ్లకు వెళ్లారు. చాలామంది తల్లిదండ్రులు తమ వెంట పిల్లలను పిలుచుకొని వెళ్లారు. శ్రీశైలంలో కనుల పండువగా ప్రభోత్సవం నంది వాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు మహాసరస్వతి అలంకారంలో కటాక్షించిన భ్రామరి నేడు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణం -
ఎక్కడికక్కడ ఖాళీ సిలిండర్లు
శిరివెళ్ల: హిందూ ముస్లింలకు అతి పెద్ద పండుగలు ఉగాది, రంజాన్. సరిగ్గా పండుగల వేళ గ్యాస్‌పై ప్రజల్లో ఆందోళన నెలకొంది. బుక్ చేసిన రెండు, మూడు రోజులకు కానీ గ్యాస్ సిలిండర్ దొరకని పరిస్థితి. మండల కేంద్రంలో ఏ ఇంటి ముందు చూసినా ఖాళీ గ్యాస్ సిలిండర్లే దర్శనమిస్తున్నాయి. బండి రాగానే ఆత్రుతతో సిలిండర్ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఇదిలా ఉంటే చిన్న చిన్న హోటళ్ల నిర్వాహకుల పరిస్థితి మరి ఘోరంగా ఉంది. మొన్నటి వరకు దోసె రూ.30 ఉండగా.. నేడు రూ. 40లకు విక్రయిస్తున్నారు.ఫొటోలు : వడ్డె శ్రీనివాసులుమేము గాయత్రీ ఎస్టేట్‌లో 2023 నుంచి ఫిష్ ఆంధ్ర రెస్టారెంట్ నడుపుతున్నాం. రూ.1000లకు లభించే గ్యాస్ బండ ఇప్పుడు రూ.2వేలు పెట్టినా దొరకడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒకటి రెండు రోజుల్లో హోటల్ మూసేద్దామనుకుంటున్నా. మా హోటల్‌పై పలువురు ఉపాధి పొందుతున్నారు. వీరందరూ ఉపాధి కోల్పోతారు. – రంగ ఫిష్ ఆంధ్ర రెస్టారెంట్ నిర్వాహకుడు, కర్నూలు గ్యాస్ సిలిండర్ దొరకడం లేదు. విధిలేని పరిస్థితుల్లో బ్లాక్‌లో కొనాల్సి వస్తోంది. వంట నూనెల ధర కూడా మండుతోంది. యుద్ధానికి ముందు సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు ప్యాకెట్ రూ.162 ఉండగా నేడు రూ.185లకు చేరింది. ప్రభుత్వం చొరవ తీసుకొని గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలి. వంట నూనెల కృత్రిమ కొరతను అడ్డుకోవాలి. – అరుణ, నంద్యాల చెక్‌పోస్టు ఏరియా, కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్న దృశ్యంఏజెన్సీ నుంచి గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తున్న యువకుడు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వంట గ్యాస్ కొరత బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయం అంతకంతకూ పెరుగుతున్న వంటనూనె ధర అడ్డగోలు ధరలపై నియంత్రణ కరువు పండుగలు, శుభకార్యాల వేళ అవస్థలు -
సంయమనంతో విధులు నిర్వర్తించండి
● ఉత్సవాలకు 1800 మంది సిబ్బందితో బందోబస్తు ● ఎనిమిది సెక్టార్లుగా విభజించి పర్యవేక్షణ ● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ శ్రీశైలం: ఉగాది ఉత్సవాల నేపథ్యంలో శ్రీగిరికి బందోబస్తుపై వచ్చిన పోలీసు సిబ్బంది సంయమనంతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశించారు. సోమ వారం నుంచి ఉగాది ఉత్సవా లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసు అధికార, సిబ్బందికి ఆదివారం సాయంత్రం వన్‌టౌన్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది ఉత్సవాల బందోబస్తుగా వివిధ జిల్లాల నుంచి 1,800 మంది పోలీస్ సిబ్బంది చేరుకున్నారన్నారు. సిబ్బందిని ఎనిమిది సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్‌కు ఒక ఉన్నతాధికారిని నియమించి నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యను అధిగ మించడానికి ఏర్పాటు చేసిన మొబైల్ వాహనాలు 24 గంటలూ క్షేత్రం చుట్టూ తిరుగుతూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు భక్తులు సహకరించాలన్నారు. భక్తుల క్యూలైన్లు సాఫీగా సాగి దర్శనం చేసుకునేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులకు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందజేయాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశంలో ఉండాలని, రిలీవర్ వచ్చేంత వరకు వేచి ఉండాలని సూచించారు, బందోబస్తుపై వచ్చిన పోలీసులకు ఏమైనా సమస్యలు ఉంటే పోలీస్ వాట్సాప్ గ్రూపులో సమాచారం చేరవేయాలని ఆదేశించారు. సమావేశంలో యాక్షన్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు, ఆత్మకూరు డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు. -
దిగుబడులపై ఆశలు
ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ఎకరా రూ. 20 వేలు కౌలు చెల్లించి ఇరవై ఎకరాలు కౌలుకు తీసుకుని రబీలో మొక్కజొన్న సాగు చేశాను. బోరు ఆధారంగా పైరుకు సాగునీటిని మళ్లించాల్సి ఉంది. ఈ సీజన్లో వర్షాలు లేని కారణంగా పైరు చేతికందాలంటే దాదాపు పది నీటి తడులు అందించాలి. రసాయన ఎరువులు, పురుగు మందులు, సాగునీటి తడుల రూపంలో ఎకరాకు రూ. 30 వేలకు పైగా ఖర్చువుతుంది. ఈ ఏడాది మొక్కజొన్నలో మంచి దిగుబడులు వస్తాయని భావిస్తున్నాను. – కొత్తూరు, రైతు, వెలగటూరు, కోవెలకుంట్ల మండలం -
మతసామరస్యానికి ప్రతీక నంద్యాల
నంద్యాల(అర్బన్): నంద్యాల జిల్లాలో ఎప్పటి నుంచో మత సామరస్యం వెల్లివిరుస్తోందని కలెక్టర్ రాజకుమారి అన్నా రు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకు ని ఆదివారం మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం మున్సిపల్ టౌన్హాల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సబిహా పర్వీన్‌తో కలసి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఈ కార్యక్రమంలో పాల్గొని ముస్లింల కు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, ముస్లింలు ఉపవాస దీక్షలు, సేవా భావం సమాజానికి గొప్ప స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. ఈ పవిత్ర మాసం మనుషుల్లో పరస్పర ప్రేమ, దయ, దాతృత్వ భావాలను పెంపొందించే సమయమన్నా రు. అనంతరం ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ముస్లింలతో కలిసి కలెక్టర్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. -
వస్తువుల కొనుగోలులో అప్రమత్తత అవసరం
నంద్యాల(వ్యవసాయం): వివిధ వస్తువుల కొనుగోలు సమయంలో వినియోగదారులకు అప్రమత్తత అవసరమని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రవిబాబు అన్నారు. ఆదివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కలెక్టరేట్లో జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు అమీర్‌బాషా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం సూచించిన ఐఎస్ఐ మార్కు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అగ్మార్క్, హాల్‌మార్క్ వస్తువులనే కొనుగోలు చేయాలని వినియోగదారులకు సూచించారు. ఆహార పదార్థాల విషయంలో నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత ధర ప్రామాణికాన్ని కచ్చితంగా పరిశీలించాలన్నారు. జిల్లా తునికలకొలతల కంట్రోల్ షేక్ జిలానీ బాషా మాట్లాడుతూ.. ప్యాకేజీ, కమాండిటిస్ నిబంధనలు పాటించాలని, తయారీ తేదీ, ఎక్ప్రైరీ తేదీ, కస్టమర్ కేర్ నంబర్లను చూసి కొనుగోలు చేయాలని కోరారు. తినే ఆహార పదార్థాల విషయంలో అప్రమత్తమై ఉండాలన్నారు. కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధి కారి వెంకటరాముడు, వినియోగదారులు పాల్గొన్నారు -
సుబ్రమణ్యేశ్వరుడికి వెండిపడిగెలు వితరణ
పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేవ్వరస్వామి వారికి ఆదివారం భక్తులు రెండు వెండి పడిగెలు బహూకరించారని ఈఓ రామకృష్ణ తెలిపారు. నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన పట్నం వెంకటసుబ్బయ్య వారి కుటుంబ సభ్యులు 500 గ్రామలు నాగమ వెండి పడిగె, బండిఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన బానగిరి వెంకటసుబ్బయ్య వారు 485 గ్రాముల వెండి నాగపడిగెను విరాళంగా సమర్పించారన్నారు. వీటి విలువ సుమారు రూ. 3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 16వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap. gov. in వెబ్సైట్లో సంప్ర దించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారు లందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండ ల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివి జన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కా ర వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. శ్రీశైలం చేరుకున్న పుదుచ్చేరి సీఎం శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ఆదివారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. ఈయనకు భ్రమరాంబా అతిథిగృహం వద్ద దేవస్థాన ఈఓ, అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. సోమవారం ఉదయం మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబాదేవిని పుదుచ్చేరి సీఎం దర్శించుకుంటారని దేవస్థాన అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వైద్యుడి మృతి కర్నూలు: రోడ్డు ప్రమాదంలో డాక్టర్ వి.హరికుమార్(24) అక్కడికక్క డే మృతి చెందాడు. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన ఈయన తండ్రి జయరాముడుతో కలసి కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని ఏపీ ట్రాన్స్‌కో కార్యాలయం ఎదురుగా ఉన్న తిలక్‌నగర్‌లో నివాసం ఉంటు న్నారు. గాయత్రీ ఎస్టేటులోని ఆర్క్ ఆసుపత్రిలో డాక్టరుగా పని చేస్తున్నారు. వెల్దుర్తి గ్రామ శివారులోని తిక్క నరసింహస్వామిని దర్శించుకొని శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై కర్నూలుకు చేరుకున్నారు. బళ్లారి చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఎక్కుతుండగా గుర్తు తెలియని వాహనం వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. దీంతో తలఛిద్రమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని హరికుమార్‌ను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీ కేంద్రానికి తరలించారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి అప్పగించారు. -
నేడు లైలతుల్ ఖదర్
● ముస్లింలకు అత్యంత పవిత్రమైన రాత్రి ● మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు ఆదోని సెంట్రల్: రంజాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమాసం. కఠోర ఉపవాస దీక్షలతో పగలు, రాత్రి తేడా లేకుండా అల్లా స్మరణలో గడుపుతారు. ఈ మాసంలో వచ్చే ప్రత్యేకమైన రాత్రి లైలతుల్ ఖదర్. దీన్నే ’బడీరాత్’ అని కూడా పిలుస్తారు. ఈ రోజునే ముస్లింల ఆరాధ్య దైవ గ్రంథం దివ్యఖురాన్ అవతరించిందని చెబుతారు. అందుకే ఈ రోజు ప్రత్యేక ప్రార్థనలకు, ఖురాన్ పఠనానికి, దానధర్మాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. తెలిసీ తెలియక చేసిన తప్పులను తమ ప్రత్యేక ప్రార్థనలతో అల్లా క్షమిస్తారని నమ్మకం. దీంతో రాత్రంతా పశ్చాత్తాప భావనతో దైవ సన్నిధిలో గడుపుతారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వెయ్యికి పైగా మసీదులున్నాయి. నేడు లైలతుల్ ఖదర్ సందర్భంగా వాటిల్లో రాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇషా నమా జ్ తర్వాత జరిగే ఈ ప్రార్థనల్లో ఆధ్మాతిక వేత్తల ప్రసంగాలు, పవిత్ర ఖురాన్ పఠనం, జికర్, తహజు ద్ నమాజ్ చేస్తూ రాతంత్రా జాగరం చేస్తారు. -
పది పరీక్షలకు సర్వం సిద్ధం
నంద్యాల(న్యూటౌన్): జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక నంద్యాల ఎస్పీజీ, బాలికల ఉన్నత పాఠశాల, చాపిరేవుల జిల్లా పరిషత్ హైస్కూల్, ఎస్డీఆర్ తదితర పరీక్ష కేంద్రంలో పది పరీక్షల ఏర్పాట్లను ఆదివారం డీఈఓ జనార్ధన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యాశాఖ, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. 130 పరీక్షా కేంద్రాల్లో 18,508 మంది రెగ్యులర్, 9,093 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఐదు పరీక్షా కేంద్రాల్లో 576 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. జిల్లాలో 8 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పా టు చేశామన్నారు. సమస్యల పరిష్కారానికి డీఈఓ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారన్నా రు. సమస్యలు ఉంటే 9000313871, 9515185150 నంబర్లను సంప్రదించాలన్నారు. ఆయన వెంట చీఫ్ డిపార్టుమెంట్ ఆఫీసర్లు ఉన్నారు. ముఖ్యమైన విషయాలు.. ● ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 9.30 గంటల వరకు పరీక్ష ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ముగిసే వరకు విద్యార్థులను బయటకు వెళ్లనివ్వరు. ● గుర్తింపు కార్డు కలిగి పరీక్షల విధుల్లో ఉన్న అధికారులు స్క్వాడ్ బృందాలను పరీక్ష కేంద్రాల్లోకి తనిఖీలకు అనుమతిస్తారు. ● విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. పరీక్షల నిర్వహణకు చీఫ్, డిపార్ట్మెంట్, ఇన్విజిలేటర్లను నియమించారు. ● ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. ● జిల్లాలోని పది పరీక్షలకు సంబంధించి జిల్లా స్టోరేజ్ పాయింట్‌గా వెంకటేశ్వరపురం గ్రామ సమీపంలో ఉన్న ఎస్డీఆర్ పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలోనే పరీక్షా పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కస్టోడియన్స్‌ను ఏర్పాటు చేశారు. ● పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు జిల్లా పోలీసు అధికారులు ఒక ప్రకటనలో ఆదివారం పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ పరీక్ష కేంద్రం అయినా చిన్న సంఘటన జరిగినా వెంట నే 100, 112కు సమాచారం అందించాలన్నారు. -
ఉగాది మహోత్సవాలకు వేళాయె!
విద్యుత్ దీపాలంకరణలో భ్రమరాంబ ఆలయంశ్రీశైలంటెంపుల్: శ్రీశైలమహాక్షేత్రంలో ఐదు రోజుల పాటు వైభవంగా జరుగనున్న ఉగాది మహోత్సవాలకు శ్రీగిరి ముస్తాబైంది. సోమవారం ఉగాది మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయ నున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి అధికసంఖ్యలో భక్తులు శ్రీగిరి తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలం కన్నడ భక్తులతో కిక్కిరిసిపోయింది. ఐదు రోజుల పాటు జరుగనున్న మహోత్సవాలకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఉగాది మహోత్సవాలు సోమ వారం ఉదయం 9 గంటలకు దేవస్థాన ఈఓ, ఉభ య దేవాలయాల ప్రధానార్చకు లు, స్థానాచార్యులు స్వామివారి యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉగాది మహోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు భ్రమరాంబాదేవికి ప్రత్యేక అలంకారం, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవ నిర్వహిస్తారు. మహోత్సవాల్లో మొదటిరోజు సోమవారం భ్రమరాంబాదేవికి మహాలక్ష్మీ అలంకారం, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ నిర్వహిస్తారు. ప్రత్యేకంగా అలంకీకృతులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు గ్రామపురవీధుల్లో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. -
‘నైపుణ్యాల అంచనా’ను పకడ్బందీగా నిర్వహించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 15న నిర్వహించే ‘ప్రాథమిక చదువు, సంఖ్యా నైపుణ్యాల అంచనా పరీక్ష’ను జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 1,62,235 మంది అభ్యాసకులను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేశామన్నారు. వీరి కోసం జిల్లాలో 1,368 పరీక్షా కేంద్రాలను గుర్తించామన్నారు. ప్రతి కేంద్రంలో ఇన్విజిలేటర్లుగా అంగన్వాడీ టీచర్లు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను నియమించినట్లు వెల్లడించారు. 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పరీక్షకు అభ్యాసకులు తమకు అనుకూలమైన సమయంలో హాజరు కావాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మంచినీటి సదుపాయం, శానిటేషన్ వంటి మౌలిక వసతులను తప్పనిసరిగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. పొదుపు సంఘాలు, శ్రామిక సంఘాల ద్వారా ప్రతి అభ్యసకునికి పరీక్షపై విస్తృతంగా అవగాహన కల్పించి, అందరూ తప్పనిసరిగా పరీక్షకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఇతర సంబంధిత అధికారులు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పరీక్షను విజయవంతంగా నిర్వహించాలన్నారు. అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి శని వారం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎం.నితీష్ శ్రీనివాస్ రూ.1,11,000 విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్‌కు అందజేశారు. ఈ సందర్భంగా దాతను దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రం, లడ్డూప్రసాదం అందించి సత్కరించారు. అలాగే విరాళానికి సంబంధించిన బాండ్ అందజేశారు. సీపీఆర్, ప్రథమ చికిత్సపై శిక్షణ కర్నూలు: రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడంలో ముందుండే పోలీసు సిబ్బందికి సీపీఆర్ విధానం, గాయాల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు. 200 మంది ఏపీఎస్పీ ట్రైనీ కానిస్టేబుళ్లకు పోలీసు శిక్షణ కేంద్రంలో సీపీఆర్, ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కర్నూ లు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ సునీల్ యాదవ్, పోలీసు వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, డీటీసీ వైస్ ప్రిన్సిపాల్, డీఎస్పీ ప్రసాద్, సీఐలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌లో 41వేల కేసులు పరిష్కారం
కర్నూలు: జాతీయ లోక్ అదాలత్‌లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 40,921 కేసులు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆధ్వర్యంలో శనివారం రెండు జిల్లాల్లో 25 బెంచ్‌లను ఏర్పాటు చేసి 689 సివిల్ కేసులు, 40,232 క్రిమినల్ కేసులను పరిష్కరించినట్లు న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. ఇందులో 186 మోటార్ యాక్సిడెంట్ కేసులలో రూ.12,83,49,000 బాధితులకు నష్టపరిహారంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇప్పించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కమలాదేవి, 6వ అదనపు జిల్లా జడ్జి వాసు, 7వ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీరాజ్యం, కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరినాథ్ చౌదరి, రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీనరసింహారెడ్డి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సరోజినమ్మ, జూనియర్ సివిల్ జడ్జిలు కిరణ్ కుమార్, అనూష, కోర్టు మానిటరింగ్ సీఐ రామయ్య నాయుడు పాల్గొన్నారు. రైతు త్యాగం మరువరానిది తమ వ్యవసాయ భూములను ప్రాజెక్టు నీటి మునకకు అప్పజెప్పి రైతులు చేసిన త్యాగం మరువరానిదని, వారికి ప్రభుత్వం చెల్లించే సొమ్ము ఎంత ఇచ్చినా తక్కువేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి పేర్కొన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన 190 మంది రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని అందించేందుకు గత కొన్ని రోజులుగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి దాదాపు రూ.81 లక్షల పరిహారం చెక్కుల ద్వారా అందించారు. ఈసారి ఆదోని, ఎమ్మిగనూరు కోర్టుల్లో పదేళ్ల నాటి పెండింగ్ కేసుల పరిష్కారమయ్యాయని తెలిపారు. -
రేపటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఉగాది ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో శ్రీగిరి క్షేత్రం కన్నడ భక్తులమయమైంది. ఐదు రోజుల పాటు జరుగనున్న మహోత్సవాల నిర్వహణ ఏర్పా ట్లపై దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు, అన్ని విభాగాల అధికారులతో పలుమార్లు సమావేశాన్ని నిర్వహించి కన్నడ భక్తుల సౌకర్యార్థం క్షేత్రంలో చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసు, అటవీ, వైద్యశాఖ అధికారులు సమన్వయంతో ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉగాది మహోత్సవాలు సోమవారం ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, చండీశ్వరపూజ తదితర పూజలు నిర్వహిస్తారు. అలాగే భ్రమరాంబాదేవి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం, అంకురార్పణ నిర్వహిస్తారు. ఉత్సవాల్లో ముఖ్యంగా 18వ తేదీన వీరాచార విన్యాసాలు గగుర్పాటు కలిగిస్తాయి. 19న ఉగాది రోజు పంచాంగ శ్రవణం, రథోత్సవం, అమ్మవారికి రమావాణిసేవిత రాజరాజేశ్వరి అలంకారం చేపట్టనున్నారు. 20వ తేదీన పూర్ణాహుతి, అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. ఆరోజు భ్రమరాంబాదేవి నిజాలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. కన్నడ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకారం, స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవలు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం -
వివాదాలకు ‘బలి’అవుతూ!
కర్నూలు: కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్ కొంతకాలంగా వివాదాలకు అడ్డాగా మారింది. వరుస పరిణామాలతో స్టేషన్ ఎస్హెచ్ఓకు కంటి మీద కునుకు లేకుండాపోతోంది. అక్రమ కేసుల నమోదు, దర్యాప్తు పేరుతో వేధింపులు, స్టేషన్‌కు వెళ్లిన బాధితుల పట్ల దురుసు ప్రవర్తన తదితర ఘటనలతో బాధితులు స్టేషన్ ఎదుట ఆందోళన చేసే పరిస్థితులు తలెత్తాయి. స్టేషన్లో జరుగుతున్న వ్యవహారాలు ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం తల పట్టుకునేంతగా వివాదమయ్యాయి. ఏపీ రాజధాని అమరావతి వరకు ఫిర్యాదులు వెళ్లాయి. కొందరు న్యాయం కోసం హైకోర్టు మెట్లెక్కడం గమనార్హం. గంజాయి కేసు విషయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన న్యాయవాది పవన్ కుమార్‌ను సీఐ విక్రమసింహ దూషించడమే కాక బౌతికంగా దాడి చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. సీఐ విక్రమసింహపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే మధ్యవర్తుల ద్వారా న్యాయవాది పవన్‌కుమార్‌తో సీఐ విక్రమసింహ రాజీ కుదుర్చుకున్నారు. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి నిర్బంధం తెలంగాణ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు కె.వెంకటరామిరెడ్డి (కేవీఆర్)పై ఫిబ్రవరి 22న నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 41ఏ నోటీసు ఇచ్చి విచారణ నిమిత్తం మార్చి 10న కేవీఆర్‌ను స్టేషన్‌కు పిలిపించి చంద్రబాబు నాయుడుపైనే కథనాలు చేస్తావా.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అభాసుపాలు చేస్తావా అంటూ నిర్బంధించి తీవ్రంగా కొట్టారు. కేవీఆర్ కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేవీఆర్‌ను కర్నూలు అర్బన్ తహసీల్దార్ ఎదుట హాజరుపరచి విడుదల చేశారు. ఈ వివాదం హైకోర్టు వరకు వెళ్లడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీఐ మధ్యవర్తి ద్వారా కేవీఆర్‌తో రాజీ సంప్రదింపులు చేశారు. ముడుపుల విషయంలో క్రైం పార్టీ పోలీసులపై వివాదం ఇదే పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న క్రైం పార్టీ పోలీసుల అవినీతిపై ఏకంగా ఏపీ డీజీపీకి ఫిర్యాదులు చేరి వివాదాస్పదమయ్యాయి. కర్నూలు కొత్తబస్టాండ్‌లో రెండు బంగారు చోరీ కేసులు చోటు చేసుకున్నాయి. వీటి విచారణ కోసం క్రైం పార్టీ పోలీసులు హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యాపారిని అదుపులోకి తీసుకుని బేరం కుదుర్చుకుని రూ.3 లక్షలు మామూళ్లు దండుకుని వదిలేశారు. ఈ ఘటన కూడా వివాదాస్పదంగా మారడమే కాక తెలంగాణలో క్రైం పార్టీ పోలీసులపై కేసు నమోదైంది. దీంతో వారిని వీఆర్‌కు పంపారు. ఆ తర్వాత వేర్వేరు చోట్లకు బదిలీ చేశారు. అలాగే ఇదే స్టేషన్లో సీఐ మధుసూదన్‌గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవి ద్వారా రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి జైలుపాలయ్యారు. శాంతి కోసం పొట్టేలు బలి వరుస ఘటనల నేపథ్యంలో స్టేషన్‌కు దరిద్రం పట్టింది.. శాంతి చేయాలి.. ఏ కేసు దర్యాప్తు ప్రారంభించినా సమస్యలు ఎదురవుతున్నాయని ఎస్హెచ్ఓకు సిబ్బంది సూచించినట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలించేందుకు పొట్టేలును పోలీస్‌స్టేషన్‌కు బలిచ్చి రక్తతర్పణ చేశారు. ప్రధాన గేటు వద్ద పొట్టేలును బలిచ్చి ఓ రెస్టారెంట్లో వంటలు చేయించి స్టేషన్ సిబ్బంది విందు చేసుకున్నారు. ఈ అంశం సిబ్బందిలో హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తు దోషం పట్టిందంటూ పోలీసులే స్వయంగా స్టేషన్‌కు పొట్టేలును బలివ్వడం చర్చనీయాంశమైంది. స్టేషన్ ఎస్హెచ్ఓ పనితీరుపై విమర్శల వెల్లువ పరిస్థితులు అనుకూలించేందుకు శాంతి పేరుతో స్టేషన్‌కు పొట్టేలు బలి రక్త తర్పణం చేసి విందు చేసుకున్న సిబ్బంది పోలీసు శాఖలో హాట్ టాపిక్‌గా మారిన ఘటన -
మద్దిలేటయ్య కిటకిట
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివారులోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. పాల్గుణ మాసం శుభదినాలను పురస్కరించుకొని చిన్నారుల కేశఖండన, వివాహాల మొక్కులు, స్వామి, అమ్మవార్ల దర్శనార్థం తరలి వచ్చిన భక్తులతో క్షేత్రం జనసందోహంగా మారింది. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ నిర్వహించారు. ఉపకమిషనర్ రామాంజనేయులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. -
సీసీఆర్ కార్డులు ఇచ్చి ఏం లాభం?
మాకు ఎలాంటి భూములు లేవు. రైతుల నుంచి భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాం. 2025–26 సంవత్సరానికి సంబంధించి 3.75 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాం. ఇందులో పత్తి సాగు చేసి అధిక వర్షాల నష్టాలు మూట కట్టుకున్నాం. కౌలు భూమికి రైతు అంగీకారంతో ప్రభుత్వం సీసీఆర్ కార్డు కూడా జారీ చేసింది. కార్డుతో సహా ఆధార్, బ్యాంకు ఖాతా తదితర వివరాలతో అన్నదాత సుఖీభవ కింద సాయం కోసం రైతు సేవా కేంద్రంలో సమర్పించాం. అన్నదాత సుఖీభవ సాయం దక్కలేదు. ఉపయోగం లేని సీసీఆర్ కార్డులు ఎందుకు ఇచ్చారో తెలియడం లేదు. – ఉప్పరి లక్ష్మన్న, తులసాపురం, కర్నూలు మండలం -
బాధాకరం
మేం 2023లో పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం రాతనలో 4.80 ఎకరాల భూములు కొనుగోలు చేశాం. అదే ఏడాది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. వెబ్‌ల్యాండ్‌తో పాటు రెవెన్యూ రికార్డుల్లో కూడా మా పేరుమీదనే భూమి ఉంది. 2025 జూలై నెలలోనే రాతనలో గ్రామ వ్యవసాయ సహాయకుడిని కలసి పాసుపుస్తకం తదితర అన్ని వివరాలు ఇచ్చాం. అయితే అన్నదాత సుఖీభవ సాయం దక్కలేదు. నిజమైన రైతులకు సాయం దక్కకపోవడం బాధాకరం. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించలేదు. కనీసం అన్నదాత సుఖీభవ కింద చేయూత కూడా దక్కకపోవడం ఆందోళన కలిగిస్తోంది. – తెలుగు వెంకటస్వామి, జి.సింగవరం, కర్నూలు మండలం అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్నా మూడు విడతలుగా ఆర్థిక సాయం అందలేదు. నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందింది. చంద్రబాబు ప్రభుత్వంలో నాకు ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడ లేదు. ఎందుకు రావడం లేదని అధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు. – బడేసాహెబ్ రైతు, డీ కోటకొండ గ్రామం, ఆస్పరి మండలం అప్పులు పెరిగాయి నాకు సొంత భూమి లేదు. ఐదేళ్లుగా రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. రెండేళ్లుగా ఒక్క రూపాయి సాయం కూడా అందలేదు. అన్నదాత సుఖీభవ అని పేర్లు పెట్టారు. ఎలాంటి ఫలితం లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి అని అడిగితే అధికారులు వస్తుంది... వస్తుంది అంటారు. ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. – రాజశేఖర్, కౌలు రైతు, పచ్చారపల్లి గ్రామం, హాలహర్వి మండలం నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఎన్నికల ముందు రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక పాత పథకం కింద వచ్చే డబ్బులు కూడా ఆగిపోయాయి. ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో సకాలంలో డబ్బులు పడేవి. విత్తనాలు, ఎరువులు కొనుక్కునేవాళ్లం. ఇప్పుడు రెండేళ్లు అవుతున్నా ఒక్క రూపాయి కూడా వేయకపోవడం దారుణం. – మారెప్ప, రైతు, నిట్రవట్టి, హాలహర్వి మండలం -
శ్రీశైలంలో భక్తుల కోసం ఉచిత బస్సులు
శ్రీశైలంటెంపుల్: ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటున్న వేలాది మంది భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సుల సదుపాయం కల్పించినట్లు దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఇవి కై లాసద్వారం నుంచి శ్రీశైలం వరకు నడుస్తాయన్నారు. నందిసర్కిల్ నుంచి ప్రారంభమై గణేశసదన్, సెంట్రల్ పార్కింగ్, విభూతిమఠం జంక్షన్, మల్లమ్మకన్నీరు, శివాజీస్ఫూర్తి కేంద్రం, రుద్రాపార్క్, సిద్ధరామప్పకొలను, పాతాళగంగరోడ్డు, ప్రైవేట్ సత్రాల మీదుగా తిరిగి నందిసర్కిల్కు చేరుకుంటాయని చెప్పారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని శిఖరేశ్వరం నుంచి కూడా ఉచిత బస్సును శ్రీశైలానికి నడుపుతున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీని అనుసరించి శుక్రవారం నుంచి 15వ తేదీ వరకు ఆరు ఉచిత బస్సులు, 16 నుంచి 19వ తేదీ వరకు ఎనిమిది ఉచిత బస్సులను నడుపుతామని తెలిపారు. -
అక్రమాలు.. అధికార దుర్వినియోగం!
డోన్: అక్రమాలతో అధికార దుర్వినియోగం చేస్తున్నారని డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌గౌడ్‌పై చైర్మన్ రాజేష్, కౌన్సిలర్ల ధ్వజమెత్తారు. సమాధానాలు చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తనకు కౌన్సిలర్ల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు మున్సిపల్ కమిషనర్ సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సమావేశం హాలులోకి రావడం, వీడియోలు తీయమని కమిషనర్ ఆదేశించడం చూసి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా పోలీసులు లోపలికి రాకూడదన్నారు. కౌన్సిలర్ల ప్రశ్నలకు స మాధానం చెప్పకుండా బెదిరించే ధోరణిలో కమిషనర్ ప్రవర్తించడం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. డో న్లో మున్సిపల్ చిట్టచివరి సమావేశం శుక్రవారం వాదోపవాదాలు, ఉద్రిక్తతల మధ్య జరిగింది. ముమ్మాటికీ నేరమే! నిబంధనలకు విరుద్ధంగా సాయికీర్తన అనే పేరుగల కమిషనర్ ప్రసాద్‌గౌడ్ కూతురికి మున్సిపాలిటీలో ఉద్యోగం ఇవ్వాలని, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ద్వారా అభ్యర్థించారని అజెండాలోని 63వ అంశంలో చేర్చడంపై మున్సిపల్ చైర్మన్, సీపీఐ కౌన్సిలర్ సుంకయ్య, వైఎస్సార్సీపీ మహిళా కౌన్సిలర్లు సుమలత సురేష్, మిట్టా ఉమామహేశ్వరి తదితరులు నిలదీశారు. ఇది ముమ్మాటికీ కమిషనర్ అధికార దుర్వినియోగం, బంధుప్రీతికి నిదర్శనమని ఆరోపించారు. 45–191 అనే ఇంటి నంబర్ డోన్ మున్సిపల్ పరిధిలోనే లేదని దొంగ ఇంటి నంబర్‌తో ఎమ్మెల్యేను సైతం తప్పుదోవ పట్టించి ఆయన సిఫారసులు లేకున్నా కూడా అజెండాలో ఆయన పేరును చేర్చడం ముమ్మాటికీ కమిషనర్ చేసిన నేరమని ధ్వజమెత్తారు. ప్రజాధనం దుర్వినియోగం విధి నిర్వహణలో భాగంగా ప్రతి నెలా వాహనంలో తిరిగేందుకు రూ.30వేలను ప్రజల సొమ్మును అద్దె రూపంలో కమిషనర్‌కు చెల్లిస్తుండగా, అద్దె కారుకు రూ.50వేల వేతనం తీసుకొని మున్సిపల్ ఉద్యోగులను డ్రైవర్‌గా పెట్టుకోవడం అనైతికమని కౌన్సిలర్లు అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న కమిషనర్ ప్రసాద్‌గౌడ్ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరపాలన్నారు. దుర్వినియోగం చేసిన సొమ్మును రికవరీ చేయాలని కౌన్సిలర్లు మల్లికార్జునరెడ్డి, దినేష్‌గౌడ్, కుమ్మరి రాజు, రైల్వే నాగేంద్ర, మేకల విమల, వెంకటేశ్వరమ్మ, ఆర్ట్ రమణ, మౌలాబీ, ఇమాంబీలు డిమాండ్ చేశారు. ధ్రువ సోలార్ సంస్థతో కుమ్మక్కు ప్రతి ఏటా పది కోట్ల ఆదాయం ఉన్న మున్సిపాలిటీ ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించలేక సతమతమవుతుంటే రూ.8కోట్లతో ధ్రువ సోలార్ పనులను ప్రోత్స హించేందుకు రుణాలు ఇస్తామని తప్పుడు ప్రచారాలు చేస్తూ కమిషనర్ ప్రజలను మభ్యపెడుతున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. పట్టణ పరిధిని అతిక్రమించి మండలంలోని అన్ని గ్రామాలలో ధ్రువ సోలార్ గురించి కమిషనర్ ప్రచారం చేస్తూ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రవర్తిస్తుండటం ఆయన అవినీతికి నిదర్శనమని మున్సిపల్ వైస్‌చైర్మన్ జాకీర్‌హుసేన్, బుర్రు రమాదేవి, ఫాతిమాభీ, స్వర్ణలత, సుకన్య ఆరోపించారు. అనుచిత వ్యాఖ్యలు డోన్‌లో పందులు స్వైర విహారం చేస్తున్నాయని టీడీపీకి చెందిన మున్సిపల్ వైస్‌చైర్మన్ కోట్రికె హరికిషన్ సభ దృష్టికి తీసుకువస్తుండగా కమిషనర్ ప్రసాద్‌గౌడ్ ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పందుల వ్యాపారం చేసే వారు కూడా తనపై ఆరోపణలు చేయడమా అని నోరుజారారు. దీంతో చైర్మన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు ఒక్క ఉదుటన లేచి కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కమిషనర్ ప్రసాద్‌గౌడ్ క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. చైర్మన్ ఆవేదన కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రసాద్‌గౌడ్ వ్యవహరశైలి ప్రజాభీష్టానికి విరుద్ధంగా ఉందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కూడా తప్పుదోవ పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ అవినీతి, అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. డోన్ మున్సిపల్ కమిషనర్‌పై చైర్మన్, కౌన్సిలర్ల ధ్వజం పోలీసులకు కమిషనర్ సమాచారం ఇవ్వడంపై ఆగ్రహం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించిన చైర్మన్ రాజేష్ -
‘కౌలు’కోలేని మోసం!
కర్నూలు(అగ్రికల్చర్): అన్నదాత సుఖీభవతో అర్హులకు న్యాయం చేయడంలో చంద్రబాబు సర్కార్ చేతులెత్తేసింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇది వరకు రెండు విడతల్లో అన్నదాత సుఖీభవ కింద రూ.10 వేలు, పీఎం కిసాన్ కింద రూ.4వేల ప్రకారం రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదలయ్యాయి. రెండు విడతల్లో పట్టా భూములు కలిగిన రైతులకు అన్యాయం జరిగింది. అన్నదాత సుఖీభవ నుంచి కౌలుదారులను పక్కన పెట్టారు. మూడవ విడతలో న్యాయం జరుగుతుందని అధికారులు కౌలుదారులను నమ్మించారు. అయితే ఇప్పుడు కూడా కౌలుదారులతో పాటు అర్హులైన పట్టా రైతులకు నిరాశే మిగిలింది. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025–26 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు ఈ నెల 13న రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల కానున్నాయి. కౌలుదారులను నట్టేట ముంచిన చంద్రబాబు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సీసీఆర్సీ పత్రాలు పొందిన సాగుదారులకు అన్నివిధాల న్యాయం చేసింది. పెట్టుబడి సాయంగా రూ.13,500 రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కౌలుదారులతో పాటు ఆర్వోఎఫ్ఆర్ రైతులు, దేవదాయ భూములు అనుభవిస్తున్న వారికి సీసీఆర్సీ కార్డులు జారీ చేసి పూర్తి మొత్తాన్ని చెల్లించి అండగా నిలిచింది. ఇలా 28,600 మంది సాగుదారులకు వైఎస్ఆర్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందించడం విశేషం. చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సాయాన్ని కౌలుదారులకు ఇవ్వకుండా తీరని అన్యాయం చేస్తోంది. 2025–26 సంవత్సరానికి జిల్లాలో 25వేల సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలనేది లక్ష్యం కాగా 24,793 మంది సాగుదారులకు కార్డులు జారీ అయ్యాయి. అయితే అన్నదాత సుఖీభవ కింద ఒక్క కౌలుదారుకు కూడా పెట్టుబడి సాయం అందించలేకపోవడం గమనార్హం. 21,841 మందికి అన్నదాత సుఖీభవ ఎగనామం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023–24లో వైఎస్ఆర్ రైతుభరోసా కింద 2,94,598 మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. చంద్రబాబు ప్రభుత్వం 2,72,757 మంది రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ అమలు చేస్తోంది. వైఎసార్సీపీ ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు సర్కార్ 21,841 మంది రైతులకు తీరని అన్యాయం చేసింది. కౌలుదారులతో పాటు భూ యజమానులకు అన్యాయం జిల్లాలో 2025–26లో 24,793 సీసీఆర్సీ కార్డులు జారీ ఒక్క కౌలుదారుకూ అందని సాయం చుక్కల భూముల పేరిట అర్హులకు ఎగనామం -
సీసీఆర్సీ కార్డు ఉన్నా ఫలితం లేదు
మాకు సొంతంగా సెంటు భూము లేదు. దేవాలయ భూమిని కౌలుకు సాగు చేసుకుంటున్నాం. 2025–26 సంవత్సరానికి 5.90 ఎకరాలకు సీసీఆర్సీ కార్డును ప్రభు త్వం జారీ చేసింది. అన్నదాత సుఖీభవ కింద సాయం దక్కుతుందని ఆశించాం. మొదటి, రెండవ విడతల్లో రాలేదు. మూడవ విడత లో కౌలుదారులకు న్యాయం జరుగుతుందని ఆశించినా నిరాశే మిగిలింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి కలగనప్పుడు ఇక సీసీఆర్సీ కార్డులు ఎందుకు జారీ చేస్తున్నట్లు. – జంగం జంబులింగయ్య, ఆర్.కొంతలపాడు, కర్నూలు మండలం -
పరీక్షలకు ‘పది’లమైన ఏర్పాట్లు
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గతంలో మాదిరిగానే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారు. బాలురు, బాలికలనే తేడా లేకుండా పరీక్ష సమయంలో విద్యార్థులు తమ గ్రామాల నుంచి పరీక్ష కేంద్రానికి ఆర్టీసీ బస్‌లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్ష హాల్ టికెట్‌ను చూసిస్తే సరిపోతుంది. నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షలు ఈనెల 16 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో 130 కేంద్రాల్లో 25,033 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 81.85 శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రస్తుత విద్యాసం వత్సరంలో 90 శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంగా విద్యాశాఖ నిర్ణయించుకోంది. బాలురే అధికం పబ్లిక్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల్లో బాలికల కంటే బాలురే అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం 25,033 మంది విద్యార్థులు పరీ క్షలకు హాజరుకానుండగా వారిలో 13,039 మంది బాలురు, 11,994 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ల కోసం స్కూళ్లు చుట్టూ తిరగనవసరం లేకుండా వెబ్సైట్ నుంచి పొందువచ్చు. ప్రశ్నపత్రాలు ఈనెల 10, 11వ తేదీల్లో జిల్లా కేంద్రమైన నంద్యాలకు చేరుకున్నాయి. ఇక్కడ నుంచి మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. పరీక్ష కేంద్రాల సీఎస్, డీఓలు, సబ్జెక్టు తేదీల వారీగా విభజించుకొని వాటిని పోలీసుస్టేషన్లో భద్రపరుస్తారు. మెడికల్ కిట్లు సిద్ధం పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన వైద్య సిబ్బందితో పాటు మందులను వైద్యశాఖ ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రంలో ఏఎన్ఎంతో పాటు ఆశా వర్కర్‌ను నియమించి ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాం. పరీక్షల నిర్వహణకు దాదాపు 1,300 మంది ఇన్విజిలేటర్లు, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, రాష్ట్ర, జిల్లా స్థాయి అబ్జర్వర్స్ పనిచేస్తున్నారు. ఉదయం 8.45 గంటల నుంచి 9.30 గంటలకు మాత్రమే విద్యార్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత గేట్లు మూసివేస్తారు. పరీక్ష రాసే విద్యార్థులంతా 8.30 గంటలలోపే కేంద్రాలకు చేరుకోవాలి. –జనార్ధన్‌రెడ్డి, డీఈఓ, నంద్యాల 16 ఫస్ట్ లాంగ్వేజ్ 18 సెకండ్ లాంగ్వేజ్ 21 ఇంగ్లిష్ 23 మ్యాథ్స్ 25 ఫిజికల్ సైన్స్ 28 బయాజికల్ సైన్స్ 30 సాంఘిక శాస్త్రం 31 సెకండ్ లాంగ్వేజ్ పేపర్–2 ఏప్రిల్ 1 ఆప్షనల్/ఇతర సబ్జెక్టు ఈనెల 16 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పోలీసుస్టేషన్‌కు చేరుకున్న ప్రశ్నపత్రాలు జిల్లాలో 25,033 మంది విద్యార్థులు విధులు నిర్వర్తించనున్న 1300 మంది ఇన్విజిలేటర్లు -
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నంద్యాల(వ్యవసాయం): వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఉమ్మడి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. బుధవారం పట్టణంలోని స్పెషల్ సబ్ జైలును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం జైల్లోని పరిసరాలను పరిశీలించి ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సుపై అవగాహన కల్పించారు. 60 సంవత్సరాలు పైబడిన వారు ఖైదీలు ఉంటే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. సబ్‌జైలు సూపరింటెండెంట్ గురుప్రసాద్‌రెడ్డి, లోక్‌అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను బుధవారం ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఐఈఓ శంకర్‌నాయక్ తెలిపారు. గురువారం జరిగిన కామర్స్ పేపర్–2, వొకేషనల్–2 పరీక్షలకు 3,330 మందికి గాను 3,190 మంది విద్యార్థులు హాజరు కాగా 145 మంది గైర్హాజరయ్యారన్నారు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీ చేసినట్లు తెలిపారు. ● సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని 5 పరీక్ష కేంద్రాల్లో బుధవారం 305 మంది విద్యార్థులకు గాను 271 మంది హాజరు కాగా 34మంది గైర్హాజరైనట్లు చెప్పారు. నిలిచిపోయిన విద్యార్థి బస్సు బనగానపల్లె: బనగానపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ విద్యార్థి బస్సు బుధవారం ఉదయం 8 గంటల సమయంలో రాళ్లకొత్తూరు వద్ద నిలిచిపోయింది. అవుకు మండలం వేములపాడు నుంచి ఈ బస్సు బనగానపల్లెకు వస్తుండగా సమస్య తలెత్తింది. అందులోని విద్యార్థులు సుమారు ఆరగంట వరకు అక్కడే వేచి ఉండాల్సివచ్చింది. అర్ధగంట తర్వాత తాడిపత్రి నుంచి బనగానపల్లెకు వెళ్లే ఆర్టీసీ బస్సు రావడంతో దానిలో విద్యార్థులు బనగానపల్లెకు చేరుకున్నారు. టైర్ పంక్చర్ కావడంతో సమస్య వ చ్చిందని డిపో మేనేజర్ శశిభూషణ్ తెలిపారు. డోన్ ఎంపీడీఓపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు డోన్: ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ ముఖ్య అధికారికి డీఎల్పీవో నరసింహారెడ్డి సిఫార్సు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కొత్తబురుజు గ్రామంలో మధు అనే ఉద్యోగిని వదిలి మరొకరి వాహనంలో వెెళ్లిపోయినందున ఈ ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన వివరించారు. విధి నిర్వహణలో వాహనాన్ని వినియోగించకుండా వినియోగించుకుంటున్నట్లు ప్రభుత్వం నుంచి అద్దె రూపంలో లబ్ధి పొందుతున్నట్లు నిర్ధారించామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రైవేట్ వాహనాల బిల్లులను చెల్లించకుండా ఆపివేయాలని కోరారు. -
43 చేనేత సహకార సంఘాల్లో మిగిలింది ఏడు
● కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆప్కో షోరూము మూత ● చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తెరుచుకోని రెండు షోరూములు ● చేనేత వస్త్రాల ఉత్పత్తి లేక అంధకారంలో ఆప్కో ● ఉగాది ముంగిట వెలవెలబోతున్న ఆప్కో షోరూములు ● రెండేళ్లుగా కొత్త స్టాక్ సరఫరాలో చేతులెత్తేసిన వైనం ● కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో మూతపడిన ఆప్కో గోదాము ● ఐదు నెలలుగా వేతనాలు అందక సిబ్బంది ఇక్కట్లు ● చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణలోనూ వైఫల్యంకర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆప్కో పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆప్కో దివాళా దిశగా పయనిస్తోంది. ఏడాదికొకటి చొప్పున ఆప్కో షోరూములు మూతపడుతున్నాయి. చేనేత వస్త్రాల ఉత్పత్తికి ప్రోత్సాహం కరువైంది. చేనేత సహకార సంఘాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేసే ఆప్కోలో చీకటి రాజ్యమేలుతోంది. దసరా, ఉగాది హిందువులకు అతి పెద్ద పండగలు. ఈ సారి ఉగాదితో పాటే రంజాన్ కలసి వచ్చింది. అయితే ఆప్కో షోరూములు మాత్రం వెలవెలబోతున్నాయి. హుందాతనానికి, మన్నికకు చేనేత వస్త్రాలు పెట్టింది పేరు. వ్యవసాయ రంగం తర్వాత చేనేతకు అంతటి ప్రాధాన్యత ఉంది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నేడు చేనేత, ఆప్కో మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేనేత వస్త్రాల మార్కెటింగ్‌కు అనేక చర్యలు చేపట్టింది. కొత్త షోరూములను ఏర్పాటు చేయడంతో పాటు ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పించింది. ప్రత్యేక స్కీమ్‌ల ద్వారా ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంది. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల వ్యాపారం పెంచేందుకు ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడం విశేషం. ప్రతి నెలా ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను కొని షోరూములకు సరఫరా చేయడం జరిగింది. పండుగలకు నెల రోజుల ముందే కొత్త డిజైన్లతో ఆప్కో షోరూములు కళకళలాడేవి. అయితే ప్రస్తుతం రెండేళ్లుగా ఇటు చేనేత, అటు ఆప్కోలో నిస్తేజం నెలకొంది. మూతపడుతున్న షోరూమ్‌లు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆప్కో షోరూములు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల్లోనే కర్నూలు పాత బస్టాండులోని శ్రీనివాస క్లాత్ మార్కెట్లో ఉన్న ఆప్కో షోరూము మూత పడింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నేతలే ఆప్కోపై ఒత్తిడి తెచ్చి ఖాళీ చేయించినట్లు సమాచారం. తాజాగా కలెక్టరేట్ ప్రాంగణంలోని చేనేత బజారులో ఉన్న ఆప్కో షోరూము మూతపడటం ఆందోళన కలిగించే విషయం. కలెక్టరేట్‌కు నిత్యం వందలాది మంది సందర్శకులు వస్తుంటారు. కలెక్టరేట్ ప్రాంగణంలో 35 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఇంతటి కీలకమైన ప్రాంతంలోని ఆప్కో షోరూము మూతపడటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. -
విస్తృతంగా రుణాలు మంజూరు చేయాలి
● జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్నంద్యాల: ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకులు విస్తృతంగా రుణాలు మంజూరు చేస్తూ ఆర్థిక సహకారం అందించాలని జిల్లా రెవె న్యూ అధికారి రాము నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ(డీఎల్ఆర్సీ) సమావేశం జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ముఖ్యంగా రైతులు, స్వయం ఉపాధి పొందే యువత, మహిళా సంఘాలకు రుణాల మంజూరులో బ్యాంకులు మరింత చురుకుగా వ్యవహరించాలన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన, స్టాండప్ ఇండియా, పీఎంఎఫ్‌బీవై వంటి పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాలను సకాలంలో మంజూరు చేయాలన్నారు. అలాగే వ్యవసాయ, పంట రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో ప్రాధాన్యత రంగ రుణాల పంపిణీ లక్ష్యాలను బ్యాంకులు తప్పనిసరిగా చేరుకోవాలన్నారు. నాబార్డ్ డీడీఎం కార్తీక్ మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలకు ఎగుమతి అవకాశాలు ఉన్నప్పటికీ, స్థానిక బ్యాంకుల నుంచి ఎగుమతి క్రెడిట్ పొందడంలో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతులు, యువతలో అవగాహన పెంచేందుకు బ్యాంకుల్లో బ్రోచర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పథకంలో ప్రాజెక్టు ఖర్చుపై 40 శాతం వరకు సబ్సిడీ లభిస్తుందన్నారు. ఆర్బీఐ ఎల్డీఓ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలోని 43 బ్యాంకుల్లో 15 బ్యాంకుల్లో మాత్రమే కేవైసీ 99.68 శాతం నమోదైందన్నారు. ఈ విషయంలో ఆయా బ్యాంకులు తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు ఎల్డీఎం రవీంద్ర కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద కేటాయించిన లక్ష్యాల సాధనలో బ్యాంకులు సాధించిన ప్రగతిని కమిటీకి వివరించారు. అనంతరం డిజిటల్ పేమెంట్స్, నాబార్డ్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ నరసింహారావు, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. -
వెలుగోడు రిజర్వాయర్‌లో చేప పిల్లల విడుదల
వెలుగోడు: ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద వెలుగోడు రిజర్వాయర్‌లో మంగళవారం చేప పిల్లలను విడుదల చేశారు. రిజర్వాయర్ ర్యాంప్ వద్ద ప్రజా ప్రతినిధులు, సీడ్ స్టాకింగ్ కమిటీ సభ్యులు అధికారుల సమక్షంలో చేప పిల్లలను విడుదల చేశారు. నంద్యాల జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ జి. హిరా నాయక్ , కర్నూలు జిల్లా డిప్యూటీ డైరెక్టర్, అబ్జర్వర్ డాక్టర్ రంగనాథ్ బాబు, ఉమ్మడి కర్నూలు జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ.. మత్స్యకారుల అభి వృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. మత్స్యకారులకు వలలు, పుట్టీలు, ఐస్ బాక్స్‌లతో కూడిన రెండు చక్రాల వాహనాలు అందించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మత్స్య శాఖ అధికారులను కోరారు. కార్యక్రమంలో ఫిష్ సీడ్ స్టాకింగ్ పాయింట్ అధికారి, ఫిషరీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ కె.బి. భరత్ లాల్ నాయక్ తెలుగు సంఘం అధ్యక్షుడు మద్దయ్య, వెంకట సుబ్బన్న, మాజీ సర్పంచ్ ఎంఏ అబ్దుల్ కలాం, రమణ, వీఆర్వో సురేష్ నాథ్ రెడ్డి, మత్స్య సహాయకులు చంద్ర, లోకేష్, ఆనంద్ గౌడ్, శిరోమణి, శివ, అనోక్, నరేంద్ర, విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
వెలవెలబోతున్న ఆప్కో
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 43 చేనేత సహకార సంఘాలు ఉండగా.. నేడు ఏడు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో కూడా ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం మినహా మిగిలిన వాటి పనితీరు అంతంతమాత్రమే. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను ఆ సంఘమే మార్కెటింగ్ చేసుకుంటోంది. మిగిలిన సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాల మార్కెటింగ్‌కు ఆప్కోనే ఆధారం. రెండేళ్లుగా జిల్లాలోని చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే సంఘాలు యాక్టివ్‌గా పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే ఎన్నికలకు ప్రభుత్వం ఆసక్తి చూపని పరిస్థితి. రెండేళ్లుగా మంగళగిరిలోని ఆప్కో గోదాము నుంచి కొత్త సరుకు రాకపోవడంతో కర్నూలు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఆప్కో గోదాము మూతపడింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, శ్రీశైలంలలో ఆప్కో షోరూములు ఉన్నాయి. కొత్త సరుకు రాకపోగా ఉన్నది పాతబడిపోయింది. పాత సరుకు కొనేందుకు వినియోగదారులు ముందుకు రాకపోవడంతో మూటకట్టి మంగళగిరి గోదాముకు పంపుతున్నారు. -
నంద్యాలకు చేరుకున్న పది ప్రశ్నాపత్రాలు
నంద్యాల(న్యూటౌన్): ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రాలు జిల్లాకు స్టాక్ పాయింట్ కేంద్రానికి చేరుకున్నట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని స్టాక్ పాయింట్‌గా ఉన్న శ్రీచైతన్య పాఠశాల నుంచి జిల్లాలోని 12 రూట్లు ఏర్పాటు చేసి పేపర్–1 ప్రశ్నాపత్రాన్ని తరలించారు. ఈ రూట్లలోని పోలీస్టేషన్లలో భద్రత పరిచేందుకు డీఈఓ పర్యవేక్షణలో రూట్ ఆఫీసర్లతో పోలీసు స్టేషన్లకు పంపించినట్లు తెలిపారు. అలాగే బుధవారం పేపర్–2 ప్రశ్నాపత్రాన్ని కూడా ఏర్పాటు చేసిన రూట్లలో పోలీసు స్టేషన్లో భద్రపరిచేందుకు పంపడం జరుగుతుందన్నారు. వీరి వెంట విద్యాశాఖ అధికారులు రఘురామిరెడ్డి, జగన్మోహన్రెడ్డి, ఎంఈఓ–2 శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం నందికొట్కూరు: పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం కల్పిస్తామని కర్నూలు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. మంగళవారం పట్టణంలోని సబ్‌జైల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి పలు సూచనలు చేశారు. 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైన ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. సదుపాయలు, భోజనాలు గురించి ఆరా తీశారు. అనంతరం కోర్టులో పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈయన వెంట జూనియర్ సివిల్ జడ్జి దివ్య, సబ్‌జైల్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, న్యాయవాది వెంకటేశ్వర్లు, వైద్యు లు ప్రవీణ్‌కుమార్, స్థానిక మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు, తదితరులు ఉన్నారు. ముస్లిం సామూహిక వివాహాలకు దరఖాస్తులునంద్యాల (వ్యవసాయం): పట్టణంలోని అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పేద ముస్లిం ఉచిత సామూహిక వివాహాలకు దర ఖాస్తు చేసుకోవాలని సంస్థ అధ్యక్షుడు నష్యం మహమ్మద్ ఖుదూస్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 19వ తేదీన ముస్లిం యువతీ యువకులకు అంజుమన్ షాదీ ఖానాలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ఏప్రిల్ 12 తేదీలోపు అంజుమన్ షాదీఖానాలో ఉచిత దరఖాస్తులు పొంది ఆధార్ కార్డు, పాస్ ఫొటోలు రెండు, యువతి బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ అందజేయాలన్నారు. ఏప్రిల్ 19వ తేదీ జరిగే వివాహ వేడుకల్లో నిఖా ఖర్చులతో పాటు వధువుకు రూ.50 వేల చెక్కును అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని పేద ముస్లిం తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 14న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి నోట్ ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో నిర్వహిస్తామన్నారు. సమావేశాల్లో షెడ్యూల్ ప్రకారం గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య మరియు వైద్యం, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, పను లు – ఆర్థిక ప్రణాళిక అంశాలపై సమీక్ష కొనసాగుతుందన్నారు. సమావేశాలకు కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన సంబంధిత స్థాయీ సంఘాల సభ్యులు, అధికారులు తమకు కేటాయించిన సమయానికి హాజరు కావాలన్నారు. -
జీతాలు చెల్లించండి మహాప్రభో..!
శ్రీశైలంటెంపుల్: అసలే అరకొర జీతం.. ఆపై మూడు నెలలు అవుతున్నా అందని వేతనంతో శ్రీశైల దేవస్థానం పారిశుద్ధ్య, హౌస్‌కీపింగ్ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. దేవస్థానం కార్మికులందరికీ ఫేస్ రికగ్నైజేషన్ హాజరు నమోదు ఏర్పాటు చేయడంతో కాంట్రాక్టర్ పప్పులు ఉడకడం లేదు. దీంతో ఏజెన్సీ టెండర్ ప్రకారం పూర్తిస్థాయిలో కార్మికులను సరఫరా చేయక పోవడం, కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య, హౌస్‌కీపింగ్ నిర్వహణను తిరుపతికి చెందిన పద్మావతి హస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సంస్థ దక్కించుకుంది. శ్రీశైల దేవస్థానంతో పాటు రాష్ట్రంలోని ఆరు ప్రముఖ దేవాలయాలకు కలిపి సెంట్రలేజేషన్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వానికి అత్యంత అప్తుడైన వ్యక్తికి చెందిన సంస్థకు పారిశుద్ధ్య నిర్వహణను కట్టబెట్టారు. గతేడాది అక్టోబరు 1వ తేదీ నుంచి పద్మావతి సంస్థ శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతుంది. చంద్రబాబు ప్రభుత్వంలో నూతనంగా ఏర్పాటైన పద్మావతి ఏజెన్సీకి సూపర్వైజర్స్–4, శానిటరీ మేసీ్త్ర–52, హౌస్‌కీపింగ్ వర్కర్స్–506, స్కావెంజర్స్–58, మెషిన్ ఆపరేటర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్–4, ఎలక్ట్రిషియన్స్–5, ఏసీ మెకానిక్–3, ప్లంబర్స్–5, కార్పెంటర్స్–4 ఇలా (వీక్లి ఆఫ్ రిలీవర్స్తో) మొత్తం కలిపి సుమారు 641 మందికి కేటాయించారు. వీరికి కార్మిక చట్టం ప్రకారం రూ.12,253 నెలకు వేతనంగా చెల్లిస్తామని టెండర్లో పొందుపర్చారు. ఇందులో ఈపీఎఫ్, ఈఎస్ఐకి పోను బేసిక్ వేతనంగా ఒక్కొక్కరికి నెలకు 10,690 ఇవ్వనున్నారు. అయితే పద్మావతి సంస్థ రెండు నెలలు గడుస్తున్నా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. అయితే పారిశుద్ధ్య, హౌస్‌కీపింగ్ కార్మికులకు జనవరి, ఫిబ్రవరి వేతనాలు ఇప్పటి వరకు చెల్లించలేదు. ఫేస్ రికగ్నైజేషన్ హాజరుతో ఏజెన్సీకి తిప్పలు పద్మావతి ఏజెన్సీ పూర్తిస్థాయిలో కార్మికులను పనుల్లో పెట్టరనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా పద్మావతి ఏజెన్సీ శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ద్య, హౌస్‌కీపింగ్ పనులు చేపట్టినప్పటి నుంచి పారిశుద్ద్యంలో భక్తుల సంతృప్తి స్థాయి కిందిస్థాయికి దిగజారిపోయి చివరి స్థానంలో శ్రీశైల దేవస్థానం నిలిచింది. పద్మావతి ఏజెన్సీపై నమ్మకం సన్నగిల్లి కార్మికులకు ఫేస్ రికగ్నైజేషన్ హాజరుతోనే వేతనం నమోదు అయ్యేటట్లు దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పద్మావతి ఏజెన్సీకి ఫేస్ రికగ్నైజేషన్ హాజరు కంట్లో నలకలా మారింది. ఈ క్రమంలో హౌస్ కీపింగ్ కింద పనిచేస్తున్న కార్మికులను పారిశుద్ధ్య నిర్వహణ పనులకు వినియోగించుకుంటున్నారు. అయినా కానీ ఇంకా సిబ్బంది తక్కువగా ఉన్నారు. 30 మంది కార్మికులను సరఫరా చేయలేం పద్మావతి ఏజెన్సీకి టెండర్లో పారిశుద్ద్య, హౌస్‌కీపింగ్‌కు కలిపి మొత్తం 641 మంది కార్మికులను సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ సంస్థపై నమ్మకం లేకపోవడంతో చాలా మంది ఆ సంస్థలో పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇప్పటికి 30 మంది కార్మికులను తాము సరఫరా చేయలేమని, ఉన్న కార్మికులతో ఓటీ (ఓవర్ టైం) పనిచేయించుకునేందుకు అనుమతించాలని పద్మావతి ఏజెన్సీ దేవస్థానానికి లేఖ రాశారు. ఏజెన్సీ లేఖపై కమిషనర్ అనుమతులకు పంపారు. ప్రత్యేక కమిటీ రద్దుకు ఏజెన్సీ యత్నం పద్మావతి ఏజెన్సీ ద్వారా పారిశుద్ద్యం, హౌస్‌కీపింగ్, మెటీరియల్, మిషనరీల నిర్వహణపై దేవస్థానం నుంచి బిల్లు చెల్లింపులకు పూర్తి పారదర్శకత కోసం దేవస్థాన ఈఓ నలుగురు అధికారుల బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పూర్తిస్థాయిలో పరిశీలించి బిల్లుకు ఆమోదం తెలిపితేనే బిల్లు చెల్లిస్తారు. దేవస్థానం ఏజెన్సీ నిర్వహణపై కమిటీ వేయడం పద్మావతి ఏజెన్సీకి మింగుడు పడ డం లేదు. ఏదో అరకొర మనుషులను, మెటీరియల్‌ను తీసుకువచ్చి మల్లన్న సొమ్మును కాజేద్దామనుకుంటే దేవస్థాన ఈఓ అడ్డుకట్ట వేయడంపై ఆ సంస్థ ఎండీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఏజెన్సీ నిర్వహణపై వేసిన కమిటీని తొలగించేందుకు ప్రభుత్వ పెద్దలతో ఈఓపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది. శ్రీశైల దేవస్థానంలో పద్మావతి ఏజెన్సీ ఇష్టారాజ్యం మూడో నెల గడుస్తున్నా చెల్లించని జీతాలు పారిశుద్ధ్య, హౌస్‌కీపింగ్ కార్మికుల అవస్థలు కార్మికులకు ఫేస్ రికగ్నైజేషన్ హాజరు నమోదుకు దేవస్థాన నిర్ణయం కార్మికులను సర్దుబాటు చేయలేని ఏజెన్సీ -
సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం
కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా డిమాండ్ చేశారు. సోమవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ కోసం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా హామీని అమలు చేయకపోవడంతో ఎంతో మంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. మరోవైపు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడంతోపాటు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయని నేపథ్యంలో ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. లేకపోతే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
హంస వాహనంపై రంగనాథస్వామి
మద్దికెర: పెరవలి గ్రామంలో శ్రీరంగనాథస్వామి సోమవారం హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఉత్సవమూర్తులను పల్లకీలో కొలువుంచి ఊరేగింపుగా స్థానిక బావి వద్దకు తీసుకెళ్లి వసంతోత్సవం జరిపారు. ఈ సందర్భంగా యువకులు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పూజలు నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి హంసవాహనంపై కొలువుంచారు. దేవాలయ ఆవరణలో పల్లకీ సేవ చేశారు. అనంతరం గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు చేశారు. ఆలయ ఈఓ రెబ్బావీరయ్య, ఆలయ చైర్మన్ రవికుమార్, సభ్యులు రామయ్య, నరసింహులు, రంగస్వామి, భక్తులు పాల్గొన్నారు. -
ఆస్తి కోసం భర్త వేధిస్తున్నాడు.. న్యాయం చేయండి
● ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదుకర్నూలు: ‘మేమిద్దరం పదేళ్లుగా దూరంగా ఉంటున్నాం... నా పేరు మీద గూడూరులో ఉన్న ప్రైవేటు స్కూల్‌ను భర్త రమేష్ ఆక్రమించుకోవాలని నా సంతకాలు ఫోర్జరీ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. పిల్లలను కూడా పట్టించుకోకుండా ఆస్తి, చెక్‌బౌన్స్ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నాడు’ అని కర్నూలుకు చెందిన రాధిక ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలులోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 65 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్టపరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారమయ్యేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డీఎస్పీ బాబుప్రసాద్, సీఐ శివశంకర్, తదితరులు కూడా పీజీఆర్ఎస్లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పీజీఆర్ఎస్కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ● విద్యాంజలి పథకం కింద ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి హైదరాబాద్‌కు చెందిన సుజాత ఠాకూర్ రూ.40 లక్షలు డబ్బులు తీసుకుని మోసం చేసిందని కర్నూలు బీక్యాంప్కు చెందిన అహ్మదున్నీసా ఫిర్యాదు చేశారు. ● బెంగళూరులోని డెలాయిట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పామిడికి చెందిన చింతల సోమశేఖర్ రూ.లక్ష తీసుకుని మోసం చేశాడని ఆదోని పట్టణానికి చెందిన నరేంద్రకుమార్ ఫిర్యాదు చేశారు. ● పెద్ద కుమారుడు తన బాగోగులు పట్టించుకోకుండా ఆరోగ్యపరిస్థితి బాగలేకపోయినప్పటికీ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సి.బెళగల్ మండలం కంపాడు గ్రామానికి చెందిన యశోదమ్మ ఫిర్యాదు చేశారు. ● భర్త గుండెపోటుతో మృతిచెందారని, ఆయన పేరు మీద వచ్చిన జీవిత బీమా (ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, విచారణ జరిపించి న్యాయం చేయాలని ఆస్పరి మండలానికి చెందిన సుగుణమ్మ ఫిర్యాదు చేశారు. -
ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయాలి
● జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కర్నూలు (సెంట్రల్): ప్రభుత్వ పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను కచ్చితంగా తనిఖీ చేయాలని ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓలను జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, హౌసింగ్, రెవెన్యూ తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మధ్యాహ్నం విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, రుచి ఏ విధంగా ఉందనే విషయాలను తనిఖీ చేయాలన్నారు. హౌసింగ్‌కి సంబంధించి ఆప్షన్–3 కింద కాంట్రాక్టర్లు నిర్మించిన ఇళ్లలో 2,522 ఇళ్లలో నిర్మాణ లోపాలను గుర్తించారన్నారు. ఇప్పటివరకు 1,521 ఇళ్ల నిర్మాణాల లోపాలను సరిచేయడం జరిగిందని, మిగిలిన 1001 వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఉగాది నాటికి పూర్తి చేయాల్సిన ఇళ్ల నిర్మాణాలలో పురోగతి లేకపోవడంపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ క్లినిక్‌కి సంబంధించి పరిష్కరించాల్సిన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అందులో ప్రధానంగా వర్గీకరణ మార్పు (క్లాసిఫికేషన్ ఛేంజ్), నిషేధిత జాబితా (ప్రొహిబిటెడ్ లిస్ట్) అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇనామ్ భూములకు సంబంధించి వాటివి కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మ్యూటేషన్కి సంబంధించి వచ్చిన అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, డీఈఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలం ఘాట్‌లో త్రుటిలో తప్పిన ప్రమాదం
శ్రీశైలం: సున్నిపెంట – శ్రీశైలం ఘాట్ మార్గంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. రహదారిలో మలుపు వద్ద భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బందితో అక్కడికి చేరుకుని చెట్టును తొలగించే వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చేశారు. ఘాటు మార్గంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ వారు వాహన చోదకులకు సూచించారు. కర్నూలు(సెంట్రల్): తాను ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, డోన్, నంద్యాల ప్రాంతాల్లో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్ హనుమదాసు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తాను రూ.3 కోట్లతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు, మంచినీటి పనులకు సంబంధించిన పనులు చేశానని, అయితే ఇంత వరకు ఒక్క రూపాయి బిల్లు చెల్లించలేదన్నారు. అప్పుల తెచ్చి పనులు చేయించానని, ప్రభుత్వం చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగి అప్పులపాలయ్యాయని, వెంటనే చెల్లించకపోతే ఇబ్బందికరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో పాము కల్లూరు: స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సోమవారం పాము కలకలం రేపింది. కార్యాలయంలో పని చేసి సిబ్బంది బైక్‌లోకి పాము దూరింది. గుర్తించిన స్థానికులు, కార్యాలయం సిబ్బంది చాలా సేపు దానిని బయటకు రప్పించడానికి ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో పాములు పట్టే వ్యక్తి వచ్చి బయటకు తీశారు. దీంతో కార్యాలయ సిబ్బంది, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పాముకాటుతో వ్యక్తి మృతి కొత్తపల్లి: పాముకాటుకు గురై చికిత్స పొందుతూ కోలుకోలేక ఎర్రమఠం గ్రామానికి చెందిన టేకులనాగరాజు(50)అనే వ్యక్తి మృతి చెందాడు. మొక్కజొన్న పంటనుకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లి ఫిబ్రవరి 28న ఈయన పాముకాటుకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా అక్కడ ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి టేకుల పెద్ద పుల్లయ్య ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రవీంద్రబాబు తెలిపారు. వైద్య విద్యార్థిని మృతికి కారణాలు తేల్చండి డోన్ రూరల్: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వర్తిస్తూ తన కుమార్తె బత్తుల దీపిక గత నెల 5న అనుమానాస్పద స్థితిలో మరణించిందని, ఇందుకు గల కారణాలను ఇప్పటివరకు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోందని బాలిక తండ్రి, ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆధ్యక్షుడు బత్తుల కోదండ రామిరెడ్డి వాపోయారు. సోమవారం డోన్ మండలం కొత్తబురుజు గ్రామ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మృతిపై అనుమానాలను నివృత్తి చేయాలని మంత్రులతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను నెల రోజుల నుంచి కోరుతున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, వైద్యాధికారులు అనేక కోణాల్లో విచారించినా సరైన కారణాలు తెలపకపోవడం తమ కుటుంబ సభ్యులను మరింత ఆందోళనకు గురి చేస్తోందన్నారు. పోస్టుమార్టం నివేదికను తక్షణమే వెవెల్లడించాలని కోరారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు సైతం వినతి పత్రం సమర్పించారు. -
ఆర్యూ విద్యార్థుల భిక్షాటన
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్ఏ, పీడీఎస్‌యూ, ఆర్పీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. విద్యార్థి సంఘాల నేతలు వర్సిటీలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, ఆర్పీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఏఐఎస్ఏఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.శరత్‌కుమార్ మాట్లాడుతూ.. వర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఖజానాకు కన్నం వేస్తున్న రిజిస్ట్రార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలన్నారు. రిజిస్ట్రార్‌పై పలుమార్లు వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేసినా విచారణకు స్పందించకపోవడం, తొలగించకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. వర్సిటీలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు హరిష్, రాజు, ఏఐఎస్ఏ నాయకులు రాము, ఆర్పీఎస్ నాయకులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా శివపార్వతులకు పల్లకీ సేవ
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలోని శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారికి పల్లకీ సేవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో ఏకశిలా రూపంలో కొలువైన శ్రీ ఉమామహేశ్వరస్వామికి అభిషేకం, అర్చన తదితర ప్రత్యేక పూజలు చేపట్టారు. సాయంత్రం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు పల్లకీ సేవా కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పాండురంగారెడ్డి, చైర్మన్ బండి మౌలిశ్వరరెడ్డి, పాతపాడు సర్పంచ్ మహేశ్వరరెడ్డి తదితర భక్తులు ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు. హాస్టల్ లైబ్రరీకి పుస్తకాల వితరణ కర్నూలు (అర్బన్): నగరంలోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల నెం.1 వసతి గృహంలోని లైబ్రరీకి పంచాయతీరాజ్ డీఈఈ, ఏపీఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు పి.మల్లికార్జున, నీట్, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను ఇచ్చినట్లు వసతి గృహ సంక్షేమాధికారిణి బి.బెన్నమ్మ తెలిపారు. సోమవారం స్థానిక హాస్టల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యులుగా కూడా ఆయన పేద, మధ్య తరగతి విద్యార్థుల విద్యకు సంబంధించి పలు సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నారని తెలిపారు. దాతల నుంచి కళాశాల విద్యార్థినులకు అవసరమైన పుస్తకాలను సేకరించి హాస్టల్ లైబ్రరీలో నిక్షిప్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ లైబ్రరీని హాస్టల్లోని విద్యార్థినులందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని బెన్నమ్మ తెలిపారు. -
కదలని ఆర్టీసీ బస్సు
కదలని ఆర్టీసీ బస్సును డ్రైవర్లు, కండక్టర్లు నెట్టుతున్న ఈ దృశ్యం సోమవారం కోసిగి ఆర్టీసీ బస్టాండ్‌లో కనిపించింది. కోసిగి నుంచి ఆదోనికి వెళ్లేందుకు ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ఎక్కి కూర్చున్నారు. అయితే బస్సు ఎంతసేపటికీ స్టార్ట్ కాకపోవడంతో కండక్టర్, మరో బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు వెనుక నుంచి తోయాల్సి వచ్చింది. ఇలాంటి బస్సులు కొన్ని సందర్భాల్లో మార్గమధ్యలో కూడా నిలిచి పోతున్నాయని, కండీషన్లో ఉండేవి నడపాలని ప్రయాణికులు కోరారు. – కోసిగి -
హెల్త్ సెక్రటరీలకు పనిభారం తగ్గించాలి
కర్నూలు(హాస్పిటల్): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే హెల్త్ సెక్రటరీలకు పనిభారం తగ్గించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్(సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి సంధ్యారాణి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, జిల్లా ప్రధాన కార్యదర్శులు పీఎస్. రాధాకృష్ణ, ఎండీ అంజిబాబు, శ్రామిక మహిళా రాష్ట్ర నాయకులు పి.నిర్మల డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద హెల్త్ సెక్రటరీలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాప్‌ల పనిభారం తగ్గించాలని, ప్రమోషన్లు కల్పించాలని, జీవో నెం.124ను అమలు చేయాలని కోరారు. మదర్ డిపార్ట్మెంట్ అయిన మెడికల్ అండ్ హెల్త్‌కు హెల్త్ సెక్రటరీలను బదలాయించాలని డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో హెల్త్ సెక్రటరీలకు ఇంక్రిమెంట్ అమలు జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పీ–4 సర్వే, మున్సిపల్ తదితర సర్వేలపై సర్వే పేరుతో సతమతమవుతున్నారని, వారిని మారుమూల గ్రామాలకు రాత్రి 10 గంటల వరకు తిప్పుతున్నారని మండిపడ్డారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఏఓ అరుణకు వారు వినతి పత్రం సమర్పించారు. సీఐటీయూ న్యూసిటీ కమిటీ అధ్యక్షులు వై.నాగేష్, హెల్త్ సెక్రటరి యూనియన్ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి, నంద్యాల జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరమ్మ, మాధవి, శంషాద్, సుజాత, రాధాబాయి, నాగమణి, రజని, వరలక్ష్మిదేవి పాల్గొన్నారు. -
అగ్నిపూలు విరబూసి.. అందాలు వికసించి!
శిశిర రుతువు రాకతో మరో వసంతానికి స్వాగతం పలుకుతూ ఆకుల వలువలను నేలరాల్చి నిలుచున్న వృక్షాలు నల్లమలలో పసిపిల్లలను తలపిస్తుంటాయి. అలాంటి చెట్ల సమూహంలో మోదుగ చెట్లు మరింత విశిష్టంగా కనిపిస్తాయి. ఆకులన్నీ రాలిన మోదుగ చెట్లు ఆకుల స్థానంలో ఎర్రటి మొగ్గలు పూస్తాయి. అవి విచ్చుకుని అడవి తల్లికి కొత్త అందాలను అద్దుతాయి. అందుకే వీటిని అగ్ని పూలు అని, మంకెన పూలు అని పిలుస్తూ కవితలు రాస్తుంటారు. ఆంగ్లంలో ఈ పూలను ఫ్లేమ్ ఆఫ్‌ది ఫారెస్ట్‌గా పిలుస్తారు. జనవరి చివరి వారం నుంచి మోదుగ పూలు పూస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. నల్లమల వ్యాప్తంగా మోదుగ పూలు విస్తారంగా కనపడుతున్నాయి. తొలకరి పలకరించే వేల మోదుగ మోడులు చిగురులు తొడుగుతాయి. – ఆత్మకూరు రూరల్ -
జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు
కొత్తపల్లి: సప్తనదీ సంగమ ప్రాంతంలో వెలసిన ప్రాచీన సంగమేశ్వరాలయం జలాధివాసం వీడుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా సోమవారం 850 అడుగులకు చేరుకుంది. దీంతో ఆలయం మండపం కిందిభాగం వరకు నీరు తగ్గింది. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రాచీన సంగమేశ్వరాలయం బయటపడనుంది. మల్లన్న సేవలో.. శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యు లు చిట్టిబోట్ల భరద్వాజశర్మ, అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో భారతీ మహాస్వామి వారి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించారు. తరువాత గురువందన కార్యక్రమం జరిపారు. అనంతరం మహాస్వామి వారు అనుగ్రహ భాషణం చేశారు. 13న పీఎం కిసాన్ సాయం విడుదల కర్నూలు(అగ్రికల్చర్): పీఎం కిసాన్ 22వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 13న విడుదల చేయనుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6వేల ప్రకారం ఆర్థిక సహాయాన్ని మూడు విడతలుగా విడుదల చేస్తోందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. ఇప్పటికే రెండు విడతలుగా రూ.4వేలు రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేసిందని, మూడవ విడత సాయం ఈ నెల 13న విడుదలవుతుందన్నారు. -
నిబంధనలకు ‘మట్టి’కొట్టి!
మహానంది: నల్లమల అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. పట్టపగలే జేసీబీలు పెట్టి పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నా అడ్డుకునే వారు కరువయ్యారు. అధికార పార్టీకి చెందిన నేతలే కావడంతో అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహానంది, శిరివెళ్ల మండలాల పరిధిలోని అంకిరెడ్డి చెరువు, వజ్రాల వంక వాగు పరిసరాల్లో ఎర్రమట్టి అధికంగా లభిస్తుండటంతో అక్రమార్కులు ప్రకృతి సంపదను కొల్లకొడుతున్నారు. విలువైన ఎర్రమట్టిని ఇటుకల బట్టీలకు, గ్రావెల్‌ను వెంచర్లకు తరలిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. మహానందితో పాటు సమీపంలోని పెద్దకొట్టాల, నంద్యాల పట్టణాల్లోని పలు వెంచర్లకు మట్టి, గ్రావెల్ తరలిపోతుంది. అనుమతులు లేని కొందరు రాత్రి వేళల్లో మట్టిని తరలిస్తూ కొల్లగొడుతున్నారు. ఇంటి నిర్మాణాలు, పొలాల చదును కోసం ఓ ట్రాక్టర్ మట్టిని తీసుకెళ్తే పట్టుకుని కేసులు పెట్టి జరిమానాలు విధించే రెవెన్యూ, భూగర్భ గనులశాఖ అఽధికారులకు ఇవేమి కనిపించకపోవడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎర్రమట్టి, గ్రావెల్‌ను టిప్పర్ల ద్వారా తరలిస్తుండటంతో నంద్యాల – గిద్దలూరు మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. నిండుగా మట్టిని, గ్రావెల్‌ను నింపుకుని వెళ్తుడటంతో వెనుకగా వెళ్లే వారి కళ్లల్లో మట్టి కొట్టుకుని పోతుంది. గతంలో టిప్పర్ల వలన రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. దీంతో పాటు గాజులపల్లె మెట్ట వద్ద నిత్యం రద్దీ ఉంటుంది. వీటికి తోడు టిప్పర్లు వేగంగా తిరుగుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అధికారులు స్పందించి మట్టి, గ్రావెల్ అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని సమీప పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు రూ. కోట్లు ఆర్జిస్తున్న అక్రమార్కులు రోడ్లపై హడలెత్తిస్తున్న మట్టి టిప్పర్లు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు -
అన్నదాన యజ్ఞానికి అంతా సిద్ధం
● సరంజామాతో తరలివచ్చిన మహారాష్ట్ర బృందంఆత్మకూరురూరల్: ఏ చిన్న వస్తువు కావాలన్నా రోడ్డు పాయింట్‌కు రావాలంటే ఆరేడు కి.మీ అడవిలో నడవాల్సిందే. అలాంటి చోట 16 ఏళ్లుగా ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం వెళ్లే కన్నడ పాదయాత్రికుల కోసం అన్నదానం కొనసాగించడం అంటే ఒక యజ్ఞంతో సమానమే. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని ఇచ్చలకరంజికి చెందిన శ్రీశైల మల్లికార్జున మల్టీపర్పస్ ట్రస్ట్‌కు చెందిన వలంటీర్లు అన్నదాన యజ్ఞం చేపట్టేందుకు సిద్ధమై సోమవారం నల్లమలకు చేరుకున్నారు. ఆత్మకూరు అటవీ డివిజన్ నాగలూటిలో ఉన్న వీరభద్రాలయం వద్ద వారు ఏటా ఉగాది ఉత్సవాల సందర్భంగా 10 రోజుల పాటు 24 గంటలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ట్రస్ట్ అధ్యక్షులు మాలగొండ్ల పాటిల్, కార్యదర్శి పాండుతో పాటు 200 మంది స్వచ్ఛంద సేవకులు ఈ అన్నదాన క్రతువుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది భక్తుల కోసం చపాతీలు కూడా అందివ్వనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇందుకోసం రోజుకు 50 వేల చపాతీలు తయారు చేసే మిషన్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఐదు భారీ లారీల్లో కావలసిన కిరాణ సరుకు కూడా ఇందుకోసం వినియోగిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాదయాత్రతో శ్రీశైలం వెళ్లే భక్తులు అటవీశాఖ నియమ నిబంధనల మేరకు నడుచుకోవాలని వారు ఈ సందర్భంగా సూచించారు. -
కన్నడ భక్తులకు మెరుగైన వసతులు
శ్రీశైలంటెంపుల్: భ్రమరాంబ, మల్లన్న దర్శనానికి శ్రీశైలానికి తరలివస్తున్న భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అన్నారు. దేవస్థాన పరిపాలన భవనంలోన సమీక్షా సమావేశ మందిరంలో ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా దేవస్థాన ఈఓ మాట్లాడుతూ.. ఉగాది మహోత్సవాల్లో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు. 16వ తేదీ వరకు విడతల వారీగా మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తున్నామన్నారు. క్యూ కాంప్లెక్స్, ఆలయ విభాగాలు పరస్పరం సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా విడతల వారీగా దర్శనాలను కల్పించాలన్నారు. క్యూకాంప్లెక్స్‌లో, క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారాన్ని అందించాలని ఆదేశించారు. సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉంటు విధులు నిర్వర్తించాలని అన్నారు. క్యూలైన్ల నిర్వహణలో పోలీసు శాఖ సహకారాలు పొందాలన్నారు. అటవీమార్గంలో కాలినడక వచ్చే భక్తులకు అటవీశాఖ సహకారంతో ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అంతరాయం లేకుండా నీటిసరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. సోమ వారం రెండో సంవత్సరం విద్యార్థులకు మ్యాథమ్యాటిక్స్–2, వొకేషనల్–2 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు 7,263 మంది విద్యార్థులకు గాను 7,112 మంది హాజరు కాగా 151 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ శంకర్‌నాయక్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 97.92 శాతం హాజరైనట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారన్నారు. -
హామీలు విస్మరించి.. విమర్శలతో ముగించి!
● బాబు పర్యటన అలా ముగిసింది..డోన్: మండల పరిధిలోని కొత్తబురుజు గ్రామంలో సోమవారం సీఎం చంద్రబాబు ‘రైతన్నా మీ కోసం’లో భాగంగా చేపట్టిన పర్యటన ఆద్యంతం రాజకీయ విమర్శలు, ఆరోపణలకే పరిమితమైంది. రైతులకు కొత్త పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇచ్చానని పేర్కొంటూనే రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంటుందనేది మాత్రం చంద్రబాబు చెప్పలేకపోయారు. నిత్యం కరువు కాటకాలతో అల్లాడిపోయే డోన్ నియోజకవర్గ ప్రాంత రైతులకు సాగునీటి సౌకర్యం కోసం తీసుకుంటున్న ప్రణాళికా బద్ధమైన చర్యలను చెప్పడంలో కూడా విఫలమయ్యారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం, గత ప్రభుత్వం వ్యవస్థల్లో విధ్వంసం సృష్టించిందని ప్రజలను నమ్మించే ప్రయత్నమే తప్పితే ఆయన గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటిలో నెరవేర్చిన వాటి సంఖ్యను చెప్పకపోవడం గమనార్హం. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చివేయడం, జంతు చర్మాలతో చేసిన చెప్పులతో వేంకటేశ్వర స్వామి దర్శనానికి చంద్రబాబు వెళ్లడాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తుచేసుకున్నారు. టైటిల్ డీడ్ యాక్ట్‌ను రద్దుచేస్తానని, భూ రీసర్వేను ఆపివేస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అదేవిధానాన్ని కొనసాగించడాన్ని కూడా రైతులు గుర్తుచేసుకుంటున్నారు. హామీలు తూచ్! సభ ప్రారంభం కాగానే ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్‌ను తిరిగి కర్నూలు జిల్లాలో విలీనం చేయాలని, అవుకు రిజర్వాయర్ నుంచి ప్యాపిలి మండలం కొండ మీది పల్లెలకు సాగునీరు అందజేయాలని, నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాల వద్ద భూగర్భ జలాల పెంపునకు అధిక నిధులు విడుదల చేయాలని కోరినా సీఎం చంద్రబాబు స్పందించలేదు. అన్నీ పరిశీలిస్తామని ముక్తసరిగా చెప్పి దాటవేయడం గమనార్హం. జలదుర్గం మండల కేంద్రం ఏర్పాటు అంశాన్ని ఎత్తకపోవడం ప్రజల్లో చర్చకు తావిచ్చింది. బీసీ సర్పంచ్‌కు అవమానం సభ ప్రారంభమై అరగంట గడిచినా స్థానిక గ్రామ సర్పంచ్ అయిన బీసీ మహిళ ప్రమీలను వేదికపైకి పిలవకపోవడం పట్ల రైతుల్లో ఆగ్రహం కనిపించింది. ఉడుములపాడు సర్పంచ్ ఉప్పరి రాధమ్మ భర్త సర్పంచ్ లేకుండా గ్రామసభ ఎలా జరుపుతారంటూ కేకలు వేస్తూ సర్పంచ్‌ను పిలవండి అంటూ గట్టిగా అరిచారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తమ తప్పు తెలుసుకొని సర్పంచ్ ప్రమీలను వేదికపైకి ఆహ్వానించారు. -
అబద్ధపు హామీలతో నిలువునా మోసం
బేతంచెర్ల: ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అబద్ధ్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేశారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. సోమవారం పట్టణంలోని కోటపేట కాలనీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులను మాజీ మంత్రి బుగ్గన ఆప్యాయంగా పలకరించి, వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలను పలువురు మహిళలు బుగ్గనకు వివరించారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం వారానికి ఒక్కసారి కుళాయిలకు నీరు వదులుతున్నారని, డ్రైనేజీ కాల్వలు శుభ్రం చేయడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో జగనన్న సీఎం అయ్యింటే డోన్ నియోజకవర్గం రూపురేఖలు మారేవన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బేతంచెర్ల పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 351 కోట్లతో గోరుకల్లు రిజర్వాయర్ నుంచి పైపులైన్ వేయించి తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపామన్నారు. మన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే పట్టణంలో సంపులు, పైపులైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తయి 24 గంటలు నీరు అందుబాటులో ఉండేదన్నారు. బేతంచెర్ల నగర పంచాయతీలో పాలక మండలి పనులకు అధికార పార్టీ అడ్డు పడుతుందని మాజీ మంత్రి బుగ్గన విమర్శించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి సీఎం చంద్రబాబుకు పట్టదన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులను కూడా పూర్తి చేయలేని స్థితిలో ఉన్నారన్నారు. ప్రజా సమస్యలను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయా గ్రామాలు, పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఆర్యవైశ్యులు, రజక సంఘం నాయకులు మాజీ మంత్రి బుగ్గనను మర్యాద పూర్వకంగా కలిశారు. రజక సంఘం నాయకులు బుగ్గనను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, వివిధ కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు బాబురెడ్డి, మూర్తుజావలి, ఖాజ హుసేన్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు, అధికార ప్రతినిధి మురళీ కృష్ణ, టౌన్ కన్వీనర్ జాకీర్ హుసేన్, బ్రహ్మనాయుడు, తిరుమలేష్ , రామ చంద్రుడు, మహేష్, సలీం, ఖాజా పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి సీఎంకు పట్టదు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధంకండి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి -
మంజూరైన పనులు రద్దు
ఓబులాపురం వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.32 కోట్లతో నిర్మించతలపెట్టిన అంబేడ్కర్ గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనుల టెండర్‌ను టీడీపీ నేతలు రద్దు చేయించారు. అలాగే ప్యాపిలి శివారులో 100 ఎకరాల విస్తీర్ణంలో మంజూరైన ఇంటిగ్రెటెడ్ మార్కెట్ పనులను నిలిపివేశారు. మెట్టుపల్లి వద్ద నిర్మించతలపెట్టిన టమాట జ్యూస్ ఫ్యాక్టరీని పట్టించుకోలేదు. వెంగళాంపల్లె, అబ్బిరెడ్డి పల్లె చెరువుల వద్ద టూరిస్ట్ బోటు కలగా మిగిలింది. డోన్ నియోజకవర్గంలో ఏడు పార్కుల అభివృద్ధి పనులను నిలిపివేశారు. హార్టికల్చర్, అగ్రికల్చర్ కళాశాల నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. రూ.4 లక్షల లీటర్ల నీటి కేపాసిటి గల ఓవర్ హెడ్ ట్యాంక్ పనులను నిలిపివేశారు. -
అభివృద్ధి నిరోధకులు
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో రాజకీయ వివక్ష చూపించరాదు. దురదృష్టవశాత్తు టీడీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను రద్దు చేయించారు. టీడీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారు. – శ్రీరాములు, రాష్ట్ర మీట్ కార్పొరెషన్ మాజీ చైర్మన్ చంద్రబాబు ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారు. అబివృద్ధి పనులను అడ్డుకోవడం అర్థరహితం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్నాం. – మల్యాల విజయ భాస్కర్‌రెడ్డి, రైతు, మల్యాల గ్రామం -
మహిళా హామీలు గాలికొదిలేశారు
● చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు మొండిచేయి ● రెండేళ్లు గడుస్తున్నా ఆడబిడ్డ నిధి లేదు ● వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు కర్నూలు (టౌన్): ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత గాలికి వదిలేశారని వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు విమర్శించారు. ఆదివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి సతీమణి కాటసాని ఉమా మహేశ్వరమ్మ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు ఎస్వీ విజయ మనోహరి తదితరులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేసిందన్నారు. జగనన్న మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి వారికి అండగా నిలిచారన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జగన్ ప్రభుత్వం కన్నా రెండింతలు సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రతి సమావేశంలో చెప్పి ఇప్పుడు మొహం చాటేశారన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ల నిండిన మహిళలకు ప్రతి నెల రూ.1,500 ఇస్తామని చెప్పి రెండేళ్లు పూర్తయిందన్నారు. కనీసం బడ్జెట్లో ఆ ఊసే లేదన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అరకొరగా ఇస్తున్నారని, బస్సుల్లేని ఉచిత బస్సు పథకంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సిద్దారెడ్డి రేణుకా, జిల్లా మాజీ అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, మహిళా కార్పొరేటర్లు మునెమ్మ, పల్లవి, అరుణ, ఆర్షియా ఫర్హీన్, చిట్టెమ్మ, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు మంగమ్మ, పార్టీ విభాగం నాయకురాళ్లు పాల్గొన్నారు.


