Nandyal District News
-
బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంటెంపుల్: జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేది వరకు క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. శుక్రవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవస్థాన అన్ని యూనిట్ విభాగాల అధికారులు, ఇంజినీరింగ్, పర్యవేక్షకులు, వైదిక కమిటీతో దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులు, పర్యవేక్షకులు విభాగాల వారీగా చేపట్టాల్సిన పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలోగా పనులన్నీ పూర్తికావాలన్నారు. గత ఏడాది కంటే ఈసారి 20శాతం నుంచి 30శాతం దాకా అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉత్సవాల్లో స్వామికి చేసే కై ంకర్యాల న్నీ సంప్రదాయబద్ధంగా, సమయపాలనకు ని ర్వహించాలని సూచించారు. అటవీశాఖ సహకారంతో నడకదారిలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శివదీక్షా భక్తులకు ప్ర త్యేక క్యూలు ఏర్పాటు చేయాలన్నారు. క్షేత్ర పరిధిని జోన్లుగా, సెక్టార్లుగా విభజించి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులరద్దీకి అనుగుణంగా అన్నప్రసాద వితరణ చేయాలన్నారు. శ్రీశైలంలో పండుగ వాతావరణం కనిపించేలా పరిసరాల్లో విద్యుద్దీపాలంకరణ చేయాలన్నారు. భక్తులను అలరించేందుకు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, వేదసంస్కృతి, సనాతన ధర్మంపై అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో మండల తహసీల్దార్ కె.వి.శ్రీనివాసులు, అటవీశాఖ రేంజ్ అధికారి సుభాష్‌రెడ్డి, అపోలో వైద్యులు డా.టి.శశిధర్, పీహెచ్సీ వైద్యులు ఆర్.శ్రీవాణి, ఏఎస్ఐ గురవయ్య, దేవస్థాన అన్ని యూనిట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. కై ంకర్యాల్లో సమయపాలన పాటించాలి శ్రీశైలంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో ఈఓ శ్రీనివాసరావు -
నాడు–నేడుకు నిధులు లేవంట
జిల్లాలో మన బడి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీల రూపురేఖలు మారాయి. మొదటి విడతలో 486 పాఠశాలల్లో రూ.117 కోట్లతో 9 రకాల మౌలిక సదుపాయాలు కల్పించారు. రెండో విడతలో 973 స్కూళ్లలో రూ.366 కోట్లతో పనులు చేపట్టారు. చిన్నారులను ఆకర్షించేలా వివిధ రంగులతో బొమ్మలు, స్కూల్ వాతావరణాన్ని తీర్చిదిద్దారు. అలాంటి స్కూళ్లలో నాడు–నేడు పెండింగ్ పనులను కూటమి సర్కారు నిధులులేవంటూ నిలిపివేసింది. అంతేకాకుండా జిల్లాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 27,577మంది విద్యార్థులకు ఇప్పటి వరకు రూ. 44.74 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయలేదు. దీంతో ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ ఫీజులు ఎలా చెల్లించాలని ఆందోళన చెందుతున్నారు. -
నల్లమలలో పులుల గణనకు అధునాతన కెమెరాలు
మహానంది: నల్లమలలో పులుల గణనకు అధునాతనమైన కెమెరాలు వినియోగించనున్నట్లు అటవీశాఖ బయోడైవర్సిటీ ల్యాబ్ ఏసీఎఫ్ ధనరాజ్ తెలిపారు. మహానందిలోని పర్యావరణ కేంద్రంలో శుక్రవారం ఎఫ్ఆర్ఓలు, డీఆర్ఓలు, ఎఫ్ఎస్ఓ, ఎఫ్బీఓ, ఏబీఓలకు పులుల గణనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ప్రతినిధులు దూపాడు శ్రీధర్, శంకర్ ప్రత్యేక టెక్నాలజీతో కూడిన యాప్‌లో ఎలా నమోదు చేయాలన్న అంశాలపై క్షేత్రస్థాయిలో శిక్ష ణ ఇచ్చారు. అనంతరం ఏసీఎఫ్ ధనరాజ్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్‌లో బ్లాక్–1 సెక్టారులో పులుల సంఖ్య, ఇతర వన్యప్రాణుల గుర్తింపు కోసం జనవరి 1వ తేదీ నుంచి 2400 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పులుల చారలను బట్టి ఎన్ని ఉన్నాయో గుర్తిస్తామన్నారు. అలాగే వాటికి సరిపడ ఆహారం ఉందా లేదా అన్నది కూడా పరిశీలిస్తామని, ఒక పులికి ఆహారంగా ఏడాదికి 52 జింకలు ఉండాలన్నారు. అంటే పులి సంచరించే ప్రాంతంలో సుమారు ఐదు వందల జింకలు ఉండాల్సి ఉంటుందని చెప్పారు. గణనలో పులులు, చిరుతలతో పాటు జింకలు, నక్కలు, రేసు కుక్కలు, ఇతర వన్యప్రాణులను గుర్తిస్తామన్నారు. ఎఫ్ఆర్ఓలు ఉదయ్‌దీప్, దినేష్‌కుమార్‌రెడ్డి, డీఆర్ఓలు హైమావతి, ముర్తుజావలి పాల్గొన్నారు. అటవీశాఖ బయోడైవర్సిటీ ల్యాబ్ ఏసీఎఫ్ ధనరాజ్ -
విత్తన స్టాక్ నిల్వల వివరాలు అందజేయాలి
నంద్యాల(అర్బన్): పత్తి విత్తన శుద్ధి కేంద్రాల్లో ప్రతి నెల శుద్ధి చేసిన విత్తన స్టాక్ నిల్వల రిపోర్టును కంపెనీల వారీగా మండల వ్యవసాయాధికారులకు అందజేయాలని డీఏఓ మురళీకృష్ణ తెలిపారు. విత్తన శుద్ధి కేంద్రాల ద్వారా వచ్చే వ్యర్థాలను ఈటీపీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేయకపోతే చర్యలు తప్పవన్నారు. శుక్రవారం ఏఓ ప్రసాదరావుతో కలిసి డీఏఓ పట్టణ శివారులోని భవ్య సీడ్స్, బబ్బూరి ఆగ్రో సీడ్లలో రిజిస్టర్లు, కంపెనీల వారీగా స్టాక్ వివరాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అనుమతులు పొందిన కంపెనీల విత్తనాలను మాత్రమే ప్రాసెసింగ్ చేయాలన్నారు. తేడాలు వస్తే సీడ్ ప్లాంట్ల యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఏపీ మోడల్ స్కూల్‌కు జాతీయ అవార్డు
మహానంది: పర్యావరణం, జీవవైవిధ్యం పట్ల సున్నితమైన ఆలోచనలను సమాజంలో పెంపొందించే లక్ష్యంతో విప్రో సంస్థ ప్రతి ఏటా విప్రో ఎర్తియన్ పేరుతో అందించే జాతీయ అవార్డుకు తిమ్మాపురం ఏపీ మోడల్ పాఠశాల ఎంపికై ందని ప్రిన్సిపాల్ లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి 1550 ప్రాజెక్టులు రాగా మహానంది ఆదర్శ పాఠశాల నుంచి పంపిన జీవవైవిధ్య ప్రాజెక్టుకు జాతీయ అవార్డు వరించిందన్నారు. వృక్షశాస్త్రం అధ్యాపకురాలు శైలజ పర్యవేక్షణలో విద్యార్థుల కృషికి ఈ అవార్డు దక్కిందన్నారు. ఫిబ్రవరిలో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని, అప్పడు మెమెంటో, సర్టిఫికెట్తో పాటు రూ. 50వేలు నగదు బహుమతి ఇస్తారన్నారు. -
పిల్లలకు చదువే ఆస్తి..దీనిని మనస్ఫూర్తిగా నమ్మిన వైఎస్ జగన్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు. కార్పొరేట్‌కు దీటుగా సకల సౌకర్యాలు కల్పించారు. అత్యుత్తమ ప్రమాణాలతో డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టారు. సీబీఎ
గోస్పాడు మోడల్ స్కూల్లో డిజిటల్ విద్యాబోధన దృశ్యంసాక్షి, నంద్యాల: వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో చదువుల వెలుగులతో సర్కారు బడులు ప్రకాశించాయి. సరికొత్త చదువులు అందుబాటులోకి రావడంతో విద్యార్థులతో కళకళలాడాయి. చాక్ పీసులతో బోర్డుపై పాఠాలు బోధించే స్థాయి నుంచి డిజిటల్ విద్య వైపుగా అడుగులు పడ్డాయి. జిల్లాలో రెండు విడతల్లో నాటి ప్రభుత్వం 1,323 పాఠశాలల్లో 3,498 ఐఎఫ్‌పీ ప్యానళ్లను ఏర్పాటు చేసింది. విద్యార్థులు స్మార్ట్ మార్గంలో చదువులు కొనసాగించేలా ట్యాబ్‌లను అందజేసింది. 2022–23 విద్యాసంవత్సరంలో 20,730 ట్యాబ్‌లను, 2023–24 విద్యా సంవత్సరానికి 20,913 ట్యాబ్‌లను విద్యార్థులకు అందజేసింది. సీబీఎస్ఈకి మంగళం... కార్పొరేట్ పాఠశాలల్లో మాత్రమే అమలయ్యే సెంట్రల్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)ను నాటి ప్రభుత్వం సర్కారు బడుల్లోకి తీసుకొచ్చింది. ఈ విద్యాబోధన వల్ల జాతీయ స్థాయి పోటీపరీక్షల్లో పేదల పిల్లలు రాణించేందుకు అవకాశం ఉంటుంది.ఈ ఉద్దేశంతో జిల్లాలో 69 పాఠశాలల్లో సీబీఎస్ఈని అమలు చేశారు. వీటి పరిధిలో సుమారు 6,300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం తీసుకున్న సీబీఎస్ఈ రద్దు నిర్ణయంతో పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఫీజు బకాయిలపై కొరవడిన స్పష్టత కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులతో చెలగాటమాడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా సతాయిస్తోంది. అసలు ఇస్తుందో లేదో చెప్పడం లేదు. దీంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని స్ఫష్టం చేస్తున్నాయి. 2017–18, 18–19లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల చేసింది. ఆ తర్వాత ఐదేళ్లు ఉన్నత విద్య అభ్యసించే పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంది. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు వసతి దీవెన కింద చెల్లించాల్సిన డబ్బులను కూడా జమ చేయడం లేదు. కుటుంబ వార్షికాదాయం టీడీపీ ప్రభుత్వంలో రూ. లక్ష ఉండగా దాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.2.50 లక్షలకు పెంచింది. వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.23 వేల ప్రకారం అందించింది. ప్రస్తుత సర్కారు దీనిని పెండింగ్‌లో ఉంచింది. వైఎస్ జగన్ హయాంలో పేదింటి బిడ్డ కోసం.. రూ. 151.92 కోట్టు విడుదలైన వసతిదీవెన మొత్తం రూ. 345.28 కోట్లు విడుదలైన ఫీజురీయింబర్స్‌మెంట్ మొత్తం రూ. 483కోట్లు నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికికి చేసిన ఖర్చు రూ. 800 కోట్లు అమ్మఒడి పథకం కింద విడుదలైన మొత్తం -
జగనన్న జన్మదిన వేడుకలు విజయవంతం చేద్దాం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి సాక్షి: జననేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని శనివారం జిల్లా వ్యాప్తంగా వేడుకలను విజయవంతంగా నిర్వహిద్దామని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు బాసటగా నిలిచిన జగనన్న జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేసేందుకు అభిమానులు, పార్టీ నేతలు సిద్ధమయ్యారన్నారు. శనివారం ఉదయం 7 గంటలకు కల్లూరులోని తమ నివాసంలో ముందుగా కేక్ కటింగ్ ఉంటుందన్నారు. జిల్లాలో జరిగే వేడుకల్లో అభిమానులు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. పరీక్ష పే చర్చలో నమోదు చేసుకోండి నంద్యాల(న్యూటౌన్): పరీక్ష పే చర్చ –2025 కార్యక్రమం వచ్చే నెల 14వ తేదీ వరకు జరుగుతున్నందున, అందులో పాల్గొనే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు https://innovativeindia.mygov.in లో వివరాలు నమోదు చేసుకోవాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా నోడల్ అధికారిగా డైట్ లెక్చరర్ ఎండీ అష్పాక్‌ను నియమించినట్లు తెలిపారు. ఈయన ప్రతి రోజు నమోదును పర్యవేక్షిస్తారన్నారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఇందులో పాల్గొనుటకు అర్హులన్నారు. జిల్లాలోని ప్రిన్సిపాళ్లు, ఎంఈఓలు, హెచ్ఎంలు, సమగ్ర శిక్ష సిబ్బంది తగిన శ్రద్ధ తీసుకొని విద్యార్థుల వివరాలను పరీక్షపై చర్చ పోర్టల్‌లో నమోదు చేయించాలని డీఈఓ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారితో నేరుగా మాట్లాడి పరీక్షలకు సమర్థవంతంగా ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడంపై సలహాలు సూచనలు ఇస్తారన్నారు. 8,240 క్యూసెక్కుల నీరు మళ్లింపు శ్రీశైలం ప్రాజెక్ట్: ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో గురువారం నుంచి శుక్రవారం వరకు పంప్‌మోడ్ ఆపరేషన్‌తో 8,240 క్యూసెక్కుల నీటిని జలాశయంలోకి మళ్లించారు. 7,419 క్యూసెక్కుల నీరు వినియోగించుకొని 3.462 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. జలాశయ పరిసర ప్రాంతంలో 1.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దిగువ నాగార్జున సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల, హంద్రీనీవా సుజలస్రవంతి, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీకి 13,010 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 115.2484 టీఎంసీల నీరు నిల్వ ఉండగా డ్యాం నీటిమట్టం 862.90 అడుగులకు చేరుకుంది. ఇంటి వద్దకే కార్గో సేవలు నంద్యాల(న్యూటౌన్): కార్గో సేవలను విస్తృతం చేశామని, ఇంటి వద్దకే సరుకు రవాణా చేస్తున్నామని నంద్యాల ప్రజా రవాణా అధికారి రజియా సుల్తానా పేర్కొన్నారు. శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని కార్గో కార్యాలయంలో డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీ పార్శిల్, కొరియర్ సేవల్లో ముందుందన్నారు. తాజాగా డోర్ డెలివరీ సేవలను కూడా ప్రారంభించినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు, వినియోగదారులు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిపోమేనేజర్ గంగాధర్‌రావు, అసిస్టెంట్ మేనేజర్ మద్దిలేటినాయుడు తదితరులు పాల్గొన్నారు. పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం బొమ్మలసత్రం: జిల్లా పోలీస్‌శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. పలువురు పోలీసులు ఎస్పీని కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మ్యూచువల్ ట్రాన్స్ఫర్, మెడికల్ గ్రౌండ్స్, రిక్వెస్ట్ బదిలీల కోసం వినతులు వచ్చాయన్నారు. వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
గత ప్రభుత్వంలో ప్రశాంతంగా చదువులు
కూటమి ప్రభుత్వంలో విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా చదువుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటినా ఇంత వరకు ఫీజులు ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్మెంట్, తల్లికి వందనం, మెస్ చార్జీలు రాలేదు. దీంతో విద్యార్థులు అప్పు చేసి కళాశాల ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. –ధనుంజయుడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీ, నంద్యాల -
వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు
● నాడు – నేడు కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖల మార్పు ● కార్పొరేట్‌కు దీటుగా సర్కారు స్కూళ్లలో సౌకర్యాలు, డిజిటల్ తరగతులు ● 69 పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలు ● ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యావ్యవస్థ ● తిరోగమనంలో ప్రభుత్వ పాఠశాలలు ● ఇప్పటికే సీబీఎస్ఈ, ఐబీ రద్దు ● నేటికీ విడుదల కాని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ● నేడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనంప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా కానుకను ప్రవేశపెట్టారు. బడి తెరిచిన రోజే తొమ్మిది రకాల వస్తువులతో కూడిన కిట్‌ను విద్యార్థులకు అందజేసేవారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,347 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న సుమారు 1,62,348 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగ్, బెల్ట్, బూట్లు, సాక్స్‌లు, మూడు జతల యూనిఫాం, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇచ్చే వారు. బయట మార్కెట్లో వీటి విలువ సుమారు రూ.5 వేల పైనే ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే నాటి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తుండటంతో వచ్చే ఏడాది నుంచి తమ పిల్లలకు విద్యా కానుక కిట్‌ను ఇస్తారో లేదోనని భయం పట్టుకుంది. విద్యార్థులకు జగనన్న ‘కానుక’ -
పెంపు కసరత్తు ఇలా..
● కర్నూలు నగరంలోని విద్యానగర్, మేడం కంపౌండ్ తదితర ప్రాంతాల్లో గజం భూమి విలువ సుమారు రూ.45 వేల వరకు ఉంది. ప్రస్తుతం అక్కడ 15 శాతం పెంచితే రూ.6,750 వరకు పెరుగుతుంది. పెంచిన తరువాత ఆ భూమి విలువ గజానికి 52,750కు చేరుతుంది. ● కర్నూలులో మండలంలో కనీస ఎకరా భూమి విలువ రూ.4.70 లక్షలుగా.. గరిష్టంగా రూ. 12 లక్షల వరకు ఉంది. దీనిని కనిష్టంగా రూ.5.50 లక్షల వరకు, గరిష్టంగా రూ.13.80 లక్షల వరకు పెంచనున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో కనీసంగా మార్కెట్ విలువ ఎకరానికి రూ.2 లక్షలు ఉంది. ఇక్కడ 30 శాతం వరకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడే రోడ్డు సైడు ఉన్న పొలాలు, దేవాలయాలు, విద్యాలయాలు, పరిశ్రమలు, టూరిజం పాయింట్లకు దగ్గర ఉన్న పొలాల విలు వను 45 శాతం వరకు పెంచుతారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో భారీగా భూముల విలువ పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ● కర్నూలులోని వీకర్ సెక్షన్ కాలనీ, ఉల్చాలరోడ్డు, పెద్దపాడు సమీపాల్లో గజం ధర రూ.4,400 ఉంది. ఇక్కడ 25 శాతం వరకు పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. అంటే గజానికి రూ.1,100 పెరిగితే మొత్తంగా గజం విలువ రూ.5,500 అవుతుంది. ● ప్రస్తుతం దిన్నెదేవరపాడులో గజం ధర రూ.2,500, పెద్దపాడులో 3,500గా ఉంది. ఇక్కడ 15 నుంచి 25 శాతం వరకు పెంచేందుకు కసరత్తు జరుగుతుంది. ● నంద్యాల పట్టణంలోని నూనెపల్లె ప్రాంతంలో గజం రూ.4,800 ఉంది. దాని విలువ 15 శాతం పెరిగి అవకాశం ఉంది. అంటే గజం స్థలం రూ.5,600 అవుతుంది. ఇలా అన్ని చోట్ల స్థలాల విలువలను బట్టి రేట్లు భారీగా పెరగనున్నాయి. ● నంద్యాల పట్టణంలోని కల్పనాసెంటర్, షరాఫ్ బజార్, బైర్మల్‌వీధి, శ్రీనివాసనగర్‌లలో ప్రస్తుతం గజం విలువ రూ.25వేలు ఉండగా 10 నుంచి 20 శాతం విలువ పెంచితే అదనంగా రూ.5 వేల పెరుగనుంది. అంటే గజం విలువ రూ.30 వేలకు చేరుకుంటుంది. ● నందికొట్కూరు పట్టణం మిడుతూరు రహదారిలో కమర్షియల్ కింద గజం విలువ రూ.4వేలు ఉండగా 15 శాతం పెంపుదలతో రూ.600 పెరుగుతుంది. దీంతో గజం స్థలం విలువ రూ.4,600కు చేరుకుంటుంది. ● క్రయ,విక్రయాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో భూమి, స్థలాల విలువలు తప్పనిసరిగా పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు
ప్యాపిలి: గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ గణియా రాజకుమారి అన్నారు. మండల పరిధిలోని బూరుగల గ్రామంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రీవెన్స్‌కు భూ సమస్యలకు సంబంధించిన అర్జీలే ఎక్కువగా వస్తున్నాయన్నారు. కుటుంబ ఆస్తుల పంపకం సమయంలో అన్యాయం జరిగినట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఇటువంటి సమస్యలను కుటుంబ పెద్దల సమక్షంలో సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా ప్రజలు ఆలోచించాలన్నారు. ఆన్లైన్లో తమ పేర్లు లేవని వస్తున్న రైతుల అర్జీల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఆమె రెవెన్యూ అధికారులకు సూచించారు. రైతుల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించాలన్నారు. జిల్లాలో 850 గోకులం షెడ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని ఇచ్చిందన్నారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకుంటే అర్హత ఉన్నవారిని ఎంపిక చేసి గోకులం షెడ్డు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహులు, స్పెషల్ ఆఫీసర్ హరినాథ్ రెడ్డి, తహసీల్దార్ భారతి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సర్పంచ్ భువనేశ్వరి దేవి, ఎంపీటీసీ శివకుమారి పాల్గొన్నారు. వాల్మీకి గుహలను సందర్శించిన కలెక్టర్ మండల పరిధిలోని బోయవాండ్లపల్లి సమీపంలో సహజ సిద్ధంగా వెలసిన వాల్మీకి గుహలను జిల్లా కలెక్టర్ గణియా రాజకుమారి సందర్శించారు. గుహల ప్రాముఖ్యతను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గుహల్లో ఏడు బావుల వద్దకు వెళ్లడానికి అవసరమైన మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కలెక్టర్‌ను కోరారు. బోయవాండ్లపల్లి గ్రామంలో సెల్‌ఫోన్ నెట్వర్క్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. కలెక్టర్‌తోపాటు ఏపీ టూరిజం డివిజనల్ మేనేజర్ చంద్రమౌలీశ్వర్ రెడ్డి, డిప్యూటీ డివిజనల్ మేనేజర్ సరిత ఉన్నారు. జిల్లా కలెక్టర్ గణియా రాజకుమారి -
నిలిచిపోయిన నాపరాతి రవాణా
● రాయల్టీలు లేకపోవడంతో నాపరాళ్ల ట్రాక్టర్లను అడ్డుకున్న అధికారులు ● పోలీసుల రంగప్రవేశంతో తాత్కాలిక పరిష్కారంబేతంచెర్ల: నాపరాళ్లను రవాణా చేసే ట్రాక్టర్లకు తప్పనిసరిగా రాయల్టీలు ఉండాలని భూగర్భ గనుల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురువారం బనగానపల్లె మండలంలోని వివిధ గ్రామాల నుంచి ట్రాక్టర్లలో నాపరాళ్లను లోడు చేసుకొని బేతంచెర్లకు రాగానే రైల్వే గేటు వద్ద ఏర్పాటు చేసిన రాయల్టీ చెక్ పోస్టు వద్ద అధికారులు అడ్డుకున్నారు. రాయల్టీ ఉంటేనే పంపుతామని తేల్చి చెప్పడంతో 100కు పైగా నాపరాళ్ల ట్రాక్టర్లు రోడ్డుపై నిలిచిపోయాయి. ఫలితంగా రహదారికి ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయింది. కర్నూలు, బనగానపల్లె ప్రధాన రహదారి కావడంతో వివిధ డిపోల ఆర్టీసీ బస్సులు, కార్లు, ద్విచక్రవాహనాలు 2 గంటల పాటు నిలిచిపోయాయి. ఎస్ఐ రమేష్‌బాబు తన సిబ్బందితో అక్కడికి చేరుకుని సమస్యను మైనింగ్ ఏడీ రాజగోపాల్ దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని ఏడీ సమాధానంతో స్థానిక అధికారులు ట్రాక్టర్లకు అనుమతించారు. దీంతో ట్రాఫిక్‌కు సమస్య పరిష్కారమైంది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని పలువురు మైనింగ్ యజమానులు ఆరోపించారు. నాపరాళ్ల పరిశ్రమలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో అండగా ఉండాల్సిన ప్రభుత్వం రాయల్టీ ధరలు పెంచడం తగదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.నిలిచిపోయిన నాపరాతి ట్రాక్టర్లు, వాహనాలు -
ధరల పెంపుపై పునరాలోచన చేయాలి
రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు వల్ల సామాన్యుడిపై భారం పడుతుంది. వెలుగోడు పట్టణంలోని ప్రస్తుతం మార్కెట్ భూముల విలువ ఎకరా రూ.2,75,000 ఉంది. జనవరి ఒకటి నుంచి భూముల విలువ 40 శాతం పెంచితే ఒక ఎకరా రూ.3,85,000 మార్కెట్ విలువ అవుతుంది. దీంతో సామాన్యుడికి రిజిస్టర్ ఆఫీస్‌లో రెట్టింపు ఖర్చవుతుంది. చిన్న, సన్నకారు రైతులకు రిజిస్ట్రేషన్ చార్జీలు భారంగా మారనున్నాయి. కూటమి ప్రభుత్వం మార్కెట్ విలువను పెంపును ఉపసంహరించుకోవాలి. – గద్వాల వెంకటేశ్వర్లు, వెలుగోడు ప్రజలను పీడించడం మంచి పద్ధతి కాదు టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి రాక మునుపు ప్రజలపై భారం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా భారాలు మోపుతున్నారు. ఇప్పటికే రూ.17వలే కోట్ల విద్యుత్ చార్జీలను పెంచారు. జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని చూస్తున్నారు. ఇది ప్రజలను మోసం చేయడం అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చడం లేదు. పైగా ప్రజలను పన్నుల కోసం పీడించడం మంచిపద్ధతి కాదు. – పి.రామకృష్ణారెడ్డి, నగర కార్యదర్శి, సీపీఐ, కర్నూలు 27లోపే భూముల విలువ పెంపు ప్రక్రియ పూర్తి జనవరి 1 నుంచి పెరిగిన భూముల విలువలు రిజిస్ట్రేషన్ కోసం అమల్లో ఉంటాయి. ఈనెల 27వ తేదీలోపు భూముల విలువ పెంపు ప్రక్రియను పూర్తి చేసేలా సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇచ్చాం. కనీసం 15 శాతం పెంచేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. భూముల విలువ తక్కువగా ఉన్న చోట ఎక్కువ కూడా పెంచేందుకు పరిశీలన చేస్తున్నాం. – చెన్నకేశవరెడ్డి, జిల్లా రిజిస్ట్రార్, కర్నూలు ● -
భార్య సీమంతం.. అంతలోనే విషాదం
ఆదోని అర్బన్: వివాహమైన ఐదేళ్ల తర్వాత భార్య గర్భం దాల్చడంతో ఆ కుటుంబంలో సంతోషం నిండింది. ఐదో నెల గర్భం కావడంతో ఘనంగా సీమంతం వేడుక నిర్వహించారు. వారి సంతోషాన్ని చూసి విధికి కన్నుకుట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో భర్తను కబళించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. వివరాలు.. ఆస్పరి మండలం చిగిళి గ్రామానికి చెందిన వీరేష్ (33) ఆటో డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆరేళ్ల క్రితం ఆదోని మండలం హాన్వాల్ గ్రామానికి చెందిన రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. వివాహమైన ఐదేళ్లకు వీరేష్ భార్య గర్భం దాల్చింది. ఐదు నెలలు నిండడంతో సీమంతం కార్యక్రమాన్ని బుధవారం బంధువుల మధ్య ఘనంగా నిర్వహించారు. వేడుక అనంతరం ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. భార్య హాన్వాల్కు వెళ్లింది. హైదరాబాద్ నుంచి వచ్చిన చిన్నమ్మను గురువారం మధ్యాహ్నం వీరేష్ ఆటోలో బస్టాండుకు తీసుకెళ్లి బస్సు ఎక్కించారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా విరుపాపురం సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రక్ ఢీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న వీరేష్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేరు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు వీరేష్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు కావడం, ఐదేళ్ల తర్వాత భార్య గర్భం దాల్చడంతో బిడ్డను చూడకుండానే ప్రమాదంలో మృత్యువాత పడడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అలాగే రాజేశ్వరి స్వగృహంలో బంధువులు శోకసంద్రంలో మునిగారు. హుటాహుటిన ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ వారు రోధిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఐదేళ్ల తర్వాత భార్య గర్భం దాల్చడంతో ఘనంగా సీమంతం వేడుకకు వచ్చిన బంధువును బస్సు ఎక్కించి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షుల నియామకం
కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. విభాగం అధ్యక్షులు మహిళా విభాగం ఆర్.సుజాతమ్మ (శ్రీశైలం) వాణిజ్య విభాగం ఎం.రామచంద్రయ్య (శ్రీశైలం) రైతు విభాగం వంగాల మహేశ్వర రెడ్డి (పాణ్యం) పంచాయతీరాజ్ విభాగం బోనిగిని రామలక్ష్మయ్య (పాణ్యం) వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ షేక్ చాంద్ బాషా (పాణ్యం) సోషల్ మీడియా విభాగం ఎరసీ రాఘవేంద్రకుమార్ (పాణ్యం) ఎస్టీ విభాగం నాసారి వెంకటేశ్వర్లు (ఆళ్లగడ్డ) యువత విభాగం గుండం నాగేశ్వరరెడ్డి (బనగానపల్లె) గ్రీవెన్స్ విభాగం బచ్చం మహేశ్వర్ రెడ్డి (బనగానపల్లె) చేనేత విభాగం మెటికల నారాయణ (బనగానపల్లె) దివ్యాంగుల విభాగం పేర నాగార్జునరెడ్డి (బనగానపల్లె) వలంటీర్ విభాగం వి.మాధవ్ వెంకటక్రిష్ణ ప్రసాద్ (డోన్) విద్యార్థి విభాగం ఎం.సురేష్‌బాబు (నందికొట్కూర్) ఐటీ విభాగం జగన్మోహన్ రెడ్డి (నందికొట్కూర్) ప్రచార విభాగం కోకిల రమణ రెడ్డి (నందికొట్కూర్) -
రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో మే/జూన్ నెలల్లో నిర్వహించిన డిగ్రీ ఆరవ సెమిస్టర్ సప్లిమెంటరీ రీ వాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు. వర్సిటీ ఇన్చార్జ్ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలను https://rayalaseemauniversity.ac.in వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపారు. 571 మంది రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే 122 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కొత్త బాదుడు
కర్నూలు(సెంట్రల్): ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు, పెరిగిన విద్యుత్ చార్జీలతో సతమతమవుతున్న ప్రజలపై కూటమి ప్రభుత్వం మరో బాదుడుకు రంగం సిద్ధం చేసింది. భూముల మార్కెట్ విలువ అమాంతం పెంచి దోచుకునేందుకు కసరత్తు చేస్తోంది. 2025 నూతన సంవత్సరం ఆరంభం నుంచే పెంచిన భూముల విలువను అమలు చేయనుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేయడంతో వారు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల విలువలు అమాంతంగా పెంచేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే భూముల విలువ ఎక్కువగా ఉందనుకునే ఏరియాల్లో 15 శాతానికి తక్కువ కాకుండా పెంచాలని, భూముల విలువ తక్కువగా ఉందనుకునే ఏరియాల్లో 45 శాతం వరకు పెంచాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ మేరకు పెంపుపై రిజిస్ట్రేషన్, రెవెన్యూ అఽధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఎక్కడ ఏ విధంగా భూముల విలువను పెంచాలనే దానిపై నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారు. కొత్త నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లోని భూముల విలువను అమాంతంగా 45 శాతం వరకు పెంచుతారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల వారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలు విలువనూ పెంచనుంది. పట్టణాల్లోని అపార్టుమెంట్లలోని ఫ్లాట్లు, నివాస భవనాలకు చదరపు అడుగు విలువ రూ. 900 నుంచి రూ.1,400 వరకు పెరగనుంది. ప్రాంతాల వారీగా స్థలం విలువలను బట్టి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.జనవరి 1 నుంచే కొత్త మార్కెట్ విలువలు అమలుపెంచిన మార్కెట్ విలువలు నూతన సంవత్సరం కానుకగా ప్రజలపై భారం వేయనున్నాయి. పెంచిన విలువలను ఈనెల 20వ తేదీ లోపు సబ్ రిజిస్ట్రార్లు డేటా ఎంట్రీ చేయాలి. వాటిపై 24వ తేదీ వరకు ప్రజల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. వచ్చిన అభ్యంతరాలను 26వ తేదీలోపు పరిష్కరించాలి. ఫైనల్‌గా 27లోపు నూతన భూముల విలువలను మార్పు చేసే ప్రక్రియ మొత్తంగా ముగియాలి. 2025 జనవరి 1 నుంచి పెంచిన విలువల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరగాలి.రియల్ ఎస్టేట్‌కు గొడ్డలిపెట్టు...ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపు గొడ్డలి పెట్టుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల మార్కెట్ విలువతో వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. ఈ సమయంలో భూముల విలువను పెంచితే ఆ రంగం కోలుకోలేదని వ్యాపారులు భావిస్తున్నారు. ఏదైనా ప్రోత్సాహం అందించాల్సిన ప్రభుత్వం ఆదాయం కోసం మార్కెట్ విలువను పెంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ చర్యలతో మరో నాలుగైదేళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోలుకోలేని పరిస్థితి ఎదుర్కొంటుందని ఆందోళన చెందుతున్నారు. -
75 లక్షల పని దినాలు కల్పించాం
● డ్వామా పీడీ జనార్దన్‌రావు చాగలమర్రి: జిల్లాలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ పథకం ద్వారా రూ.192 కోట్ల నిధులతో కూలీలకు 75 లక్షల పని దినాలు కల్పించామని డ్వామా పీడీ జనార్దన్‌రావు తెలిపారు. గురువారం ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో మాట్లాడతూ రూ.136 కోట్ల నిధులు పని చేసిన కూలీలకు, రూ.56 కోట్లు వస్తు సామగ్రికి కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,023 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.85.85 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. జిల్లాలో 657 గోకులం షెడ్లు మంజూరు కాగా 36 పూర్తయ్యాయన్నారు. పశువుల పెంపకం దారులకు 10 నుంచి 50 సెంట్ల విస్తీర్ణంలో గడ్డి సాగు చేసుకునేందుకు నిధులు మంజూరు చేస్తామని, లబ్ధిదారులు ఏపీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా గ్రామాల్లోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించటానికి నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్, ఈఓపీఆర్డీ తాహీర్హుసేన్ పాల్గొన్నారు. -
వైద్యుల సూచన లేకుండా మందులు వాడొద్దు
తెలిసిన వారు, స్నేహితులు చెప్పారని ఎక్కడ పడితే అక్కడ మందులు కొని వాడే వారి సంఖ్య ఇటీవల అధికమైంది. ఇందులో చాలా వరకు నకిలీ మందులు ఉంటున్నాయి. ఇలాంటి మందులు వాడితే కిడ్నీ, కాలేయం పాడవుతాయి. బ్యాచ్‌లర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ (బీఏఎంఎస్) కోర్సు చేసిన నిపుణులైన వైద్యులు మాత్రమే ఆయుర్వేద చికిత్స చేయాలి. వంశపారం పర్యంగా వచ్చిందని, ఫలానా గురువు వద్ద నేర్చుకున్నామని, మాది గిరిజన ప్రాంతమని చెప్పి ఎవరుపడితే వారు వైద్యం చేయడానికి వీల్లేదు. ఆయుర్వేద మూలికలను నేరుగా వాడకూడదు. వాటిని నిర్ణీత పద్ధతిలో శుద్ధి చేసి మాత్రమే వాడాలి. శుద్ధిచేయని ఆయుర్వేద మందులు, స్టిరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ కలిపి తయారు చేసిన మందులు వాడటం వల్ల ఉన్న రోగాలు తగ్గకపోగా ప్రాణాంతకం అవుతుంది. – డాక్టర్ పీవీ.నాగరాజ, సీనియర్ ఆయుర్వేద వైద్యులు, కర్నూలు నకిలీ మందులతో ప్రాణం మీదకు వచ్చింది దీర్ఘకాలంగా కీళ్ల వ్యాధులు, కడుపులో మంట వంటి సమస్యలతో బాధపడుతున్న మా స్నేహితుడు ఒకరు పాతబస్తీలోని ఓ మందుల దుకాణంలో మందులు కొని వాడారు. ఊరు, పేరులేని మందులు వాడటం వల్ల నొప్పులు తాత్కాలికంగా తగ్గాయి. ఆ తర్వాత రెండు వారాలకు కడుపులో నొప్పి ప్రారంభమై తీవ్ర గాస్ట్రిక్ సమస్యకు దారి తీసింది. క్రమంగా అతని రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. అతన్ని అల్లోపతి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తే కొద్దిగా కోలుకున్నాడు. మొండివ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిస్తామని చాలా మంది ప్రజలను మోసగిస్తూ వైద్యం చేస్తున్నారు. ఇలాంటి వారి ప్రకటనలు నమ్మి మోసపోవద్దు. – ప్రతాపరెడ్డి, కర్నూలు -
హత్యకేసులో నిందితుడి అరెస్ట్
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం చెంచుగూడెం సమీపంలో గొర్రెలను నిలిపిఉన్న షేక్ అష్రత్ వలీ (32)ని గొడ్డలితో నరికి చంపాడని భావిస్తున్న నిందితుడు షేక్ షఫీని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసుపై గురువారం ఆత్మకూరు అర్బన్ పీఎస్‌లో సీఐ రాము వివరాలు వెల్లడించారు. ఈ నెల 16న ఇందిరేశ్వరం చెంచుగూడెం సమీపంలో గొర్రెల మందలను నిలుపుకుని ఉన్న హర్షత్ వలీ, షేక్ షఫీ మధ్య గొర్రెలను మేపే విషయంలో ఘర్షణ ఏర్పడింది. అర్షత్ వలీ మండుతున్న కర్రతో షఫీ వీపుపై కొట్టాడు. ఆగ్రహించిన షఫీ చేతిలో ఉన్న గొడ్డలితో హర్షత్ వలీ తలపై నరకడంతో రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. భయభ్రాంతులకు గురైన షఫీ అక్కడినుంచి పారిపోయాడు. అక్కడున్న మరో కాపరి రాజ్‌కుమార్ గాయపడిన హర్షత్ వలీని ఆటోలో ఆత్మకూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య షేక్ నసిమూన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ రాము కేసు నమోదు చేశారు. నిందితుడు షఫీ స్థానిక నంద్యాల టర్నింగ్ వద్ద ఉన్నాడన్న సమాచారం మేరకు అదుపులోనికి తీసుకుని కోర్టులో హాజరుపరచగా జడ్జి 15 రోజుల రిమాండ్ విధించినట్లు చెప్పారు. సమావేశంలో ఎస్ఐలు నారాయణ రెడ్డి, హుసేన్ బాషా, ఏఎస్ఐ శంకరరెడ్డి, సంజీవుడు తదితరులు ఉన్నారు. -
అడ్డు తొలగించుకునేందుకే హత్యాయత్నం
గోనెగండ్ల: రెండు రోజుల క్రితం గాజులదిన్నె ప్రాజెక్టు సమీపం ఎల్లెల్సీ కాలువ వద్ద వడ్డె అరవిందస్వామిపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రియురాలు బుట్టా ప్రియాంక, మరో నాలుగురిని పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ గంగాధర్ వెల్లడించారు. ఎమ్మిగనూరుకు చెందిన వడ్డె అరవింద స్వామి, బుట్టా ప్రియాంక ప్రేమించుకున్నారు. వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో దూరంగా ఉన్నారు. ప్రియాంక ప్రస్తుతం ఎర్రకోట ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అదే కళాశాలలో చదివే ఈడిగ భరత్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. అతని సాయంతో అరవింద స్వామిని చంపాలని పథకం వేసింది. గాజులదిన్నె ప్రాజెక్టు ఎల్లెల్సీ వద్దకు వెళ్లి రెక్కీ కూడా నిర్వహించింది. అనుకున్న ప్రకారం మంగళవారం ఉదయం ప్రియాంక, అరవింద స్వామిని ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చి భరత్‌కు సమాచారం ఇచ్చింది. భరత్ దేవబెట్ట గ్రామానికి చెందిన తన స్నేహితులు వడ్ల కుమారస్వామి, గంధాల ప్రశాంత్‌కుమార్, కోడుమూరుకు చెందిన ఎరుకలి రామాంజనేయులుతో కలిసి వెళ్లి అరవింద స్వామిపై వేట కొడవళ్లతో దాడి చేశారు. బాధితుడు కేకలు వేయడంతో సమీప పొలంలో ఉన్న రైతులు దాడి అడ్డుకుని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గురువారం సాయంత్రం బి.అగ్రహారం గ్రామం మల్లెల వాగు వంక వద్ద ప్రియాంక, భరత్, కుమారస్వామి, ప్రశాంత్‌కుమార్, రామాంజనేయులు దాక్కున్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి నిందితులను అరెస్టు చేసి ఐదు సెల్ఫోన్లు, నేరానికి ఉపయోగించిన వేట కొడవలి, పల్సర్ బైక్, హోండా ఆక్టివా మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు పంపుతున్నట్లు సీఐ గంగాధర్ వెల్లడించారు. ఈడిగ భరత్, ప్రియాంక బీటెక్ సీఈసీ మూడో సంవత్సరం, ఎరుకలి రామాంజనేయులు, వడ్ల కుమారస్వామి అదే కళాశాలలో బీఫార్మసీ చదువుతున్నారు. గంధాల ప్రశాంత్‌కుమార్ పదో తరగతి వరకు చదివి ప్రస్తుతం నాపరాతి పనిచేస్తున్నాడు. ప్రియురాలితో పాటు మరో నలుగురి అరెస్ట్ దాడికి పాల్పడిన వారంతా ఇంజినీరింగ్ విద్యార్థులు -
నేడు మునిసిపల్ టీచర్ల పదోన్నతుల కౌన్సెలింగ్
కర్నూలు(సెంట్రల్): ఉమ్మడి జిల్లాలోని కర్నూలు నగర పాలక సంస్థ, నంద్యాల, ఆదోనిలలో మునిసిపల్ పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించేందుకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఈఓ శామ్యూల్‌పాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు డీఈఓ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన, అనంతరం మధ్యాహ్నం 3గంటల నుంచి కౌన్సెలింగ్ చేపట్టనున్నట్లు వివరించారు. కాగా, పదోన్నతులకు అర్హత ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్ల జాబితాను కర్నూలు డీఈఓ వెబ్సైట్లో ఉంచామని, రెండు సెట్ల ధ్రువ పత్రాల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంగ్లీషు, ఫిజికల్ సైన్స్ 1, బయలాజికల్ సైన్స్ 2, సోషల్ స్టడీస్ 1, ఆదోని, నంద్యాల మునిసిపాలిటీల్లో మ్యాథ్స్ 2, ఫిజికల్ సైన్స్ 3, బయలాజికల్ సైన్స్ 1, సోషల్ స్టడీస్ 1, సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం 1, ఫిజికల్ డైరెక్టర్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. డైరెక్టర్లపై బెదిరింపులు తగదు బొమ్మలసత్రం: విజయ డెయిరీ సొసైటీ డైరెక్టర్లపై కొందరు బెదిరింపులకు పాల్పడటం సరికాదని చైర్మన్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన జిల్లా ఎస్పీ అదిరాజ్సింగ్రాణాను కలిశారు. అనంతరం జగన్మోహన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ డెయిరీకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. ఇది రైతుల కోసం రైతులతో ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ అని, ఎవరి రాజకీయ ఒత్తిళ్లు అవసరం లేదన్నారు. డెయిరీ సమావేశాలకు రాజకీయ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని, సమావేశాలు సజావుగా సాగేందుకు భద్రత కల్పించాలని ఎస్పీని కోరామన్నారు. కొందరు అధికారపార్టీ నేతలు విజయడెయిరీని ఎలాగైనా కై వసం చేసుకోవాలనే ఉద్దేశంతో డైరెక్టర్లపై పరోక్షంగా బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చామన్నారు. డెయిరీ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా భద్రత కల్పించాలని కోరామన్నారు. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ నేర్పాలి ● జిల్లా విద్యా శాఖ అధికారి జనార్దన్‌రెడ్డి నంద్యాల(న్యూటౌన్): విద్యార్థులకు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ నేర్పాలని జిల్లా విద్యా శాఖ అధికారి జనార్దన్‌రెడ్డి సూచించారు. గురువారం బస్టాండ్ సమీపంలోని బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రీసోర్స్ పర్సన్ల శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యాదశలు కీలకమన్నారు. ఈ దశల్లో తల్లిదండ్రుల కన్నా గురువులు చెప్పే మాటలనే విద్యార్థులు ఎక్కువగా నమ్ముతారన్నారు. అందుకే విలువలు నేర్చించాలన్నారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ లాలావతి మాట్లాడుతూ మనిషి జీవించాలంటే గాలి, నీరు, ఆహారంతోపాటు సరైన వ్యాయామం అవసరమన్నారు. విద్యార్థి దశలోనే పిల్లలను వ్యాయామం పట్ల ఆకర్షితులయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ పర్యవేక్షణ అధికారి లలితకుమారి, ఉపాధ్యాయులు, సీడీపీఓలు పాల్గొన్నారు. పక్కాగా పశుగణన చేయండి ● జేడీ గోవిందనాయక్జూపాడుబంగ్లా: పశుగణన పక్కాగా చేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గోవిందనాయక్ సిబ్బందికి సూచించారు. ఉమ్మడి జిల్లాలో తప్పుల తడకగా చేపడుతున్న పశుగణనపై ‘పశుగణన అంతా బోగస్’ శీర్షికన గురువారం సాక్షి ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. జేడీ గోవింద్ నాయక్ తూడిచెర్ల, పారుమంచాల, పోతులపాడు, జూపాడుబంగ్లా, తంగడంచ, మండ్లెం గ్రామాల్లో జరుగుతున్న పశుగణన, మినీగోకులం షెడ్ల నిర్మాణం, పశుగ్రాసం సాగులను పరిశీలించారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లతో మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి నిబంధనల ప్రకారం బర్రెలు, గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులున్నాయో తెలుసుకొని పక్కాగా ఆన్లైన్లో నమోదు చేయటంతోపాటు ఇంటికి స్టిక్కర్ అతికించాలని సూచించారు. ఎన్యుమరేటర్లు చేసిన సర్వేను సూపర్వైజర్లు పర్యవేక్షించి తప్పొప్పులేమైనా ఉంటే సరిచేయించాలన్నారు. -
రైలు నుంచి పడి వ్యక్తి మృతి
మద్దికెర: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మద్దికెర– గుంతకల్లు స్టేషన్ల మధ్య గురువారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మద్దికెర నుంచి గుంతకల్లు వైపు వెళ్లే రైల్ ట్రాక్ 355 –11 కి.మీ. వద్ద సుమారు 60 ఏళ్ల వయసు కలిగిన ఓ వ్యక్తి రైలు నుంచి కింద పడి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రైల్వే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సెల్ నంబర్ 98661 44616 ను సంప్రదించాలని రైల్వే ఎస్ఐ మహేంద్ర సూచించారు. 54 గొర్రెల మృత్యువాత తుగ్గలి: నీటి కోసం వెళ్లి గొర్రెలు మృత్యువాత పడిన ఘటన గురువారం సాయంత్రం బొందిమడుగుల వద్ద చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు వలిబాషా, ఖాజా, అంకాలప్ప, రాయల్, నాగేష్, సుంకన్న గొర్రెలు మేపుకుని చీకటి పడే సమయంలో ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో రోడ్డు పక్కనున్న గుంతలో నీరు తాగేందుకు వెళ్లి జీవాలు ఒకదానిపై ఒకటి పడ్డాయి. ఈ తొక్కిసలాటలో మొత్తం 54 గొర్రెలు మృత్యువాత పడినట్లు కాపరులు తెలిపారు. దాదాపు రూ.7 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. అన్నదమ్ముళ్లకు జైలు శిక్ష బండిఆత్మకూరు: మండల పరిధిలోని యర్రగుంట్ల గ్రామానికి చెందిన అన్నదమ్ముళ్లకు నంద్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రామిరెడ్డి గారి రాంభూపాల్ రెడ్డి 10 రోజులు జైలు శిక్ష విధించినట్లు బండి ఆత్మకూరు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. వివరాల్లోకెళితే.. లక్కిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, లక్కిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గ్రామంలో అసభ్యంగా తిట్టుకుంటూ, గొడవ పడుతూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నారని గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి నంద్యాల సెకండ్ క్లాస్ కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి 10 రోజుల జైలు శిక్ష విధించారు. 27 కేజీల గంజాయి స్వాధీనం కర్నూలు: పేకాట కేసులో నిందితులను పట్టుకునే క్రమంలో 27 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. స్థానిక బుధవారపేటలో టీడీపీ నాయకుడికి చెందిన గోడౌన్లో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ నేతృత్వంలో మూడు రోజుల క్రితం పోలీసులు దాడి చేసి తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. మొత్తం 37 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేయగా ఆర్గనైజర్ కొమ్ము రవి పారిపోయాడు. ఈ కేసులో మట్కా నిర్వాహకులు సయ్యద్, షబ్బీర్, అక్బర్‌తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదైంది. వీరంతా జొహరాపురం శివారు కేసీ కెనాల్ కుడివైపున ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ గుడిసెలో దాగి ఉన్నట్లు సమాచారం అందడంతో గురువారం నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద 27 కేజీల గంజాయి పట్టుబడినట్లు మూడవ పట్టణ సీఐ శేషయ్య తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపినట్లు సీఐ వెల్లడించారు. -
ఆయుర్వేదానికి నకిలీ చేటు
● నాటు వైద్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు ● ఆకు పసర్లు, వాతలతోనూ వైద్యం ● నకిలీ మందులతో దెబ్బతింటున్న అవయవాలు ● పట్టించుకునే అధికారులు కరువుఎన్నో దీర్ఘకాలిక, మొండి వ్యాధులను ఆయుర్వేదం తగ్గిస్తుందన్నది ప్రజల్లో ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు అక్రమ మార్గాల్లో పయనిస్తున్నారు. రోగికి త్వరగా ఫలితం రావాలని చెప్పి ఆయుర్వేద పొడుల్లో అల్లోపతి మందులు కలిపి మాత్రల రూపంలో తయారు చేసి రోగులకు అంటగడుతున్నారు. వాటిని మింగిన రోగులకు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినా దీర్ఘకాలంలో కిడ్నీలు, కాలేయం పాడై ఆసుపత్రి పాలవుతున్నారు. వైద్యులను సంప్రదించకుండా నేరుగా మందుల దుకాణాలు, రోడ్డుపై విక్రయించే వారి వద్ద నాటు మందులు కొనుగోలు చేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ, ఆలూరు ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాల్లో నాటు వైద్యులు అధికమయ్యారు. వారు చేసేది నకిలీ వైద్యం. కానీ ప్రసార, సామాజిక మాద్యమాల్లో పలురకాల వ్యాధులకు నమ్మకమైన, మెరుగైన వైద్యం అందిస్తామని, అల్లోపతిలో తగ్గని వ్యాధులు తగ్గిస్తామని, దీర్ఘకాలిక వ్యాధులు సైతం నయం చేస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మేరకు కొందరు పట్టణాల్లోని లాడ్జిల్లో, మరికొందరు అపార్ట్మెంట్లు, అద్దె ఇళ్లల్లో, ఇంకొందరు రోడ్డు పక్కనే వ్యాపారం చేస్తున్నారు. ప్రధానంగా సంతలు, మార్కెట్ల వద్ద ఇలాంటి వారి హడావుడి అధికంగా ఉంటోంది. కర్నూలు వంటి నగరాల్లో అయితే నడిరోడ్డుపైనే వందలాది రకాల మందులను రోడ్డుపై పోసి మొండి వ్యాధులను సైతం తగ్గిస్తామని ప్రకటనలు చేస్తూ వైద్యం చేస్తున్నారు. ఇలాంటి వారి వద్దకు మొలలు, ఫిస్టులా, ఫిషర్, వరిబీజం, కీళ్ల నొప్పులు, చర్మవ్యాధులు, సుఖవ్యాధులు, శృంగార సమస్యలు, ఎయిడ్స్, కామెర్లు, పక్షవాతం వంటి వ్యాధులకు గురైన వారు ఆకర్షితులవుతున్నారు. రోడ్డుపైనే బాహాటంగా మందులు విక్రయిస్తున్నా ఇదేమిటని ఏ ఒక్క అధికారి కూడా వారిని ప్రశ్నించడం లేదు. ఆయుర్వేదం పట్ల రోగులకు ఉన్న నమ్మకం, వారి బలహీనతను ఆసరా చేసుకుని వైద్యం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అల్లోపతి మందులతో ఆయుర్వేదం తయార్ కొన్ని రకాల వ్యాధులకు అల్లోపతి మందులు త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. పలు రకాల నొప్పులు, జ్వరాలు, ఇన్ఫెక్షన్లకు ఇవి వెంటనే పనిచేస్తాయి. దీనికి కారణం వాటిలో వాడే స్టెరాయిడ్స్, నొప్పి నివారణ, యాంటీబయాటిక్స్ మాత్రలే. అదే ఆయుర్వేద వైద్యంలో దీర్ఘకాలిక వ్యాధులకు ఇచ్చే మందులు కొంతకాలం తర్వాత శరీరంలో మెరుగైన ఫలితాలు చూపిస్తాయని చెబుతారు. ఈ క్రమంలో దీర్ఘకాలిక మొండి వ్యాధులను తగ్గించుకునేందుకు రోగులు ఆయుర్వేద మందుల కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో వైద్యులను సంప్రదించకుండా స్నేహితులు, తెలిసిన వారు చెప్పారని కల్తీ, నకిలీ మందులు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొన్ని రకాల మందుల్లో ఆయుర్వేద పొడులు, అల్లోపతిలో లభించే యాంటిబయాటిక్స్, నొప్పి నివారణ, స్టెరాయిడ్స్ కలిపి వాటిని ప్రత్యేక యంత్రాల ద్వారా మాత్రలు తయారు చేసి ప్యాకింగ్ చేసి రోగులకు అంటగడుతున్నారు. వాస్తవంగా అల్లోపతి మందులు వైద్యులు సూచించిన మేరకు నిర్ణీత రోజులు మాత్రమే వాడాల్సి ఉంటుంది. కానీ అల్లోపతి మందులు కలిపిన ఆయుర్వేద మందులు వాడుతూ రోగులు ప్రాణం మీదకు తెస్తున్నారు. గతంలో కర్నూలులోని వీకర్‌సెక్షన్ కాలనీ, శిల్పాటౌన్షిప్ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు నకిలీ ఆయుర్వేద మందులు తయారు చేస్తూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ అధికారులకు పట్టుపడ్డారు. వీరు తయారు చేసిన మందులను గ్రామాలు, పట్టణాలు తిరిగి అమాయకులైన వారికి అంటగట్టి సొమ్ము సంపాదించారు. ఇలాంటి వారు ఇప్పటికీ సమాజంలో ఇళ్లలో వ్యాపారాలు చేస్తున్నా అడిగే నాథుడు కరువయ్యారు. అల్లోపతి మాదిరిగా ఆయుర్వేద మందులకు డ్రగ్ ఇన్స్పెక్టర్లు లేకపోవడంతో జిల్లాలో నకిలీ మందుల తయారీ అధికమైంది. ఎప్పుడైనా విజిలెన్స్ అధికారులు నిర్వహించే దాడుల్లో మాత్రమే నకిలీ మందులు బయటపడుతున్నాయి. దాడుల్లో పట్టుబడిన నకిలీ మందులు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో గత నెల 23 నుంచి 27వ తేదీ వరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్లులు, ఆయుష్ విభాగం మెడికల్ ఆఫీసర్లు సంయుక్తంగా పలు ఔషధ దుకాణాల్లో దాడులు నిర్వహించారు. పలు దుకాణాల్లో విస్తృతంగా నకిలీ మందులు విక్రయిస్తున్నట్లు వారి తనిఖీల్లో బయటపడింది. స్థానిక పాతబస్టాండ్‌లోని శ్రీ సంజీవిని ఆయుర్వేదిక్ దుకాణంలో జీఎంపీ సర్టిఫికెట్ లేని మూడు ఆయుర్వేద మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కొత్తబస్టాండ్ సమీపంలోని సిరిగిరి వెంకప్ప ఆయుర్వేదిక్ స్టోర్‌లో అనుమతిలేని కంపెనీల మందులను విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. పాతబస్టాండ్‌లోని మహావీర్ మెడికల్ ఏజెన్సీలో ఆయుష్ విభాగం అనుమతి లేకుండా పలు రకాల ఆయుర్వేద మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నంద్యాలలో వెంకప్ప ఆయుర్వేదిక్ ఏజెన్సీని సందర్శించి బిల్లులు సరిగా లేని మందులను సేకరించారు. ఈ మేరకు సంబంధిత వ్యాపారులపై అధికారులు కేసులు నమోదు చేసి చర్యలకు సిఫారసు చేశారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్‌కు సిద్దేశ్వర్ కొంతకాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. స్నేహితుడు చెప్పడంతో స్థానిక ఓల్డ్‌టౌన్‌లోని ఓ ఆయుర్వేద మందుల దుకాణానికి వెళ్లి మందులు కొన్నాడు. ఆ మందులు వాడిన కొద్దిసేపటికే అతని కడుపులో మంట మొదలైంది. ఒళ్లంతా చెమటలు పట్టసాగాయి. కడుపులో ఆరాటం, తీవ్ర ఆకలి వంటి లక్షణాలు కనిపించాయి. ఉపశమనం కోసం వెంటనే రెండు గ్లాసుల మజ్జిగ తాగి ఆ మందులు పడేసి ఊరుకున్నాడు. విషయాన్ని ప్రభుత్వ వైద్యుడికి చెబితే అవి నకిలీ మందులని, వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా వాడొద్దని హెచ్చరించారు. కల్లూరుకు చెందిన అనిల్‌కుమార్ నెలరోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితులు చెప్పడంతో అల్లోపతి వైద్యుల వద్దకు గాకుండా కోడుమూరులో నాటు మందులు ఇచ్చే వైద్యుని వద్దకు వెళ్లాడు. రెండుసార్లు నాటు కట్టు వేయించుకున్నా ఫలితం లేకపోగా నొప్పి మరింత అధికమైంది. దీంతో వెంటనే అల్లోపతి వైద్యుడిని సంప్రదించి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఎమ్మిగనూరుకు చెందిన పెద్ద ఈరన్న లైంగిక శక్తి కోసం కర్నూలులోని ఓ లాడ్జిలో మందులు ఇస్తారని స్నేహితులు చెప్పడంతో గత నెలలో వచ్చి మందులు తీసుకున్నాడు. అవి వాడిన కొద్దిసేపు ఫలితం కనిపిస్తున్నా రానురాను పరిస్థితి మరింత దిగజారింది. దీంతో భయపడి పెద్దాసుపత్రికి వచ్చి యురాలజిస్టును కలిసి తన పరిస్థితిని వివరించి మందులు వాడటంతో బాగయ్యింది. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
కర్నూలు: నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేష్ బాబు (35) ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణానికి చెందిన ఇతను పదేళ్లుగా కర్నూలులోని గణేష్ నగర్లో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. గురువారం ఉదయం కృష్ణానగర్ సమీపంలో డోన్ వైపు వెళ్తున్న గూడ్స్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కో పైలట్ సతీష్ ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు రైల్వే పీఎస్ ఎస్ఐ కిరణ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.