
అనంతపురం: జిల్లాలోని గుంతకల్లులో కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణహత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న లక్ష్మీ నారాయణను కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు.
కాంగ్రెస్ లక్ష్మీనారాయణ కారును టిప్పర్ తో ఢీకొట్టారు దుండగులు. ఆపై లక్ష్మీ నారాయణపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో లక్ష్మీ నారాయణ కుమారుడు వినోద్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
