DHMO Notification 2021 : AP DHMO Various Vacancies Eligibility Details - Sakshi
Sakshi News home page

AP: మెడికల్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. అప్లై చేయండి

Published Sat, Sep 11 2021 1:06 PM | Last Updated on Sat, Sep 11 2021 3:38 PM

DMHO Recruitment 2021 Andhra Pradesh: Vacancies, Eligibility Details - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు జరగనున్న ఈ పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు  ఆహ్వానిస్తున్నారు.

డీఎంహెచ్‌వో, అనంతపురంలో 60 మెడికల్‌ స్టాఫ్‌ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► మొత్తం పోస్టుల సంఖ్య: 60
► పోస్టుల వివరాలు: ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌–01,జన రల్‌ ఫిజిషియన్‌–01, కార్డియాలజిస్ట్‌–01, మెడికల్‌ ఆఫీసర్‌–19, స్టాఫ్‌ నర్సులు–25, సైకియాట్రిక్‌ నర్స్‌–01, ల్యాబ్‌ టెక్నీషియన్‌–01, ఫిజియోథెరపిస్ట్‌–02, ఆడియోమెట్రీషియన్‌– 02, సోషల్‌వర్కర్‌–02, కన్సల్టెంట్‌–01, హాస్పిటల్‌ అటెండెంట్‌–02,శానిటరీ అటెండెంట్‌–02.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్‌ఎం /బీఎస్సీ, బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్‌ పీజీ డిగ్రీ/డిప్లొమా, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

► వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, పని అనుభవం, ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెయిటేజీ కేటాయించి తుది జాబితా విడుదలచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

► వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in

డీఎంహెచ్‌వో, కర్నూలులో 62 మెడికల్‌ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 62

► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్‌–01, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌–01, జనరల్‌ ఫిజిషియన్‌–01, కార్డియాలజిస్ట్‌–01, మెడికల్‌ ఆఫీసర్‌–28, స్టాఫ్‌ నర్స్‌లు–22, ల్యాబ్‌ టెక్నీషియన్‌–01, ఫిజియోథెరపిస్ట్‌–01, ఆడియోమెట్రీషియన్‌–01, సోషల్‌ వర్కర్‌–02, కన్సల్టెంట్‌–01, హాస్పిటల్‌ అటెండెంట్‌–01, శానిటరీ అటెండెంట్‌–01.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), డీఎంఎల్‌/టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ(సోషల్‌ వర్క్‌), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

► వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి.

► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వయసు, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు. 

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

► వెబ్‌సైట్‌: https://kurnool.ap.gov.in

డీఎంహెచ్‌వో, నెల్లూరులో 57 మెడికల్‌ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన నెల్లూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 57

► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్‌–01, ఫోర్సెనిక్‌ స్పెషలిస్ట్‌–01, జనరల్‌ ఫిజిషియన్‌–01, కార్డియాలజిస్ట్‌–01, మెడికల్‌ ఆఫీసర్‌–23, ఫిజియోథెరపిస్ట్‌–02, స్టాఫ్‌ నర్సు–17, సైకియాట్రిక్‌ నర్స్‌–02, ఆడియోమెట్రీషియన్‌–02, సోషల్‌ వర్కర్‌–02, కన్సల్టెంట్‌–01, హాస్పిటల్‌ అటెండెంట్‌–02, శానిటరీ అటెండెంట్‌–02.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి,జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), డీఎంఎల్‌ /టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ /ఎంఏ(సోషల్‌ వర్క్‌), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

► వయసు: 31.07.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి.

► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 12,000నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వయసు, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు. 

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యాశాఖాధికారి కార్యాలయం, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

► వెబ్‌సైట్‌: https://spsnellore.ap.gov.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement