dhmo
-
AP: మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. అప్లై చేయండి
ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు జరగనున్న ఈ పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డీఎంహెచ్‌వో, అనంతపురంలో 60 మెడికల్ స్టాఫ్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► మొత్తం పోస్టుల సంఖ్య: 60 ► పోస్టుల వివరాలు: ఫోరెన్సిక్ స్పెషలిస్ట్–01,జన రల్ ఫిజిషియన్–01, కార్డియాలజిస్ట్–01, మెడికల్ ఆఫీసర్–19, స్టాఫ్ నర్సులు–25, సైకియాట్రిక్ నర్స్–01, ల్యాబ్ టెక్నీషియన్–01, ఫిజియోథెరపిస్ట్–02, ఆడియోమెట్రీషియన్– 02, సోషల్‌వర్కర్–02, కన్సల్టెంట్–01, హాస్పిటల్ అటెండెంట్–02,శానిటరీ అటెండెంట్–02. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్ఎం /బీఎస్సీ, బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ/డిప్లొమా, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెయిటేజీ కేటాయించి తుది జాబితా విడుదలచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021 ► వెబ్సైట్: https://ananthapuramu.ap.gov.in డీఎంహెచ్‌వో, కర్నూలులో 62 మెడికల్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 62 ► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్–01, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్–01, జనరల్ ఫిజిషియన్–01, కార్డియాలజిస్ట్–01, మెడికల్ ఆఫీసర్–28, స్టాఫ్ నర్స్‌లు–22, ల్యాబ్ టెక్నీషియన్–01, ఫిజియోథెరపిస్ట్–01, ఆడియోమెట్రీషియన్–01, సోషల్ వర్కర్–02, కన్సల్టెంట్–01, హాస్పిటల్ అటెండెంట్–01, శానిటరీ అటెండెంట్–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్), డీఎంఎల్/టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ(సోషల్ వర్క్), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వయసు, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021 ► వెబ్సైట్: https://kurnool.ap.gov.in డీఎంహెచ్‌వో, నెల్లూరులో 57 మెడికల్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన నెల్లూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 57 ► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్–01, ఫోర్సెనిక్ స్పెషలిస్ట్–01, జనరల్ ఫిజిషియన్–01, కార్డియాలజిస్ట్–01, మెడికల్ ఆఫీసర్–23, ఫిజియోథెరపిస్ట్–02, స్టాఫ్ నర్సు–17, సైకియాట్రిక్ నర్స్–02, ఆడియోమెట్రీషియన్–02, సోషల్ వర్కర్–02, కన్సల్టెంట్–01, హాస్పిటల్ అటెండెంట్–02, శానిటరీ అటెండెంట్–02. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి,జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్), డీఎంఎల్ /టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్టీ), సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ /ఎంఏ(సోషల్ వర్క్), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: 31.07.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 12,000నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వయసు, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యాశాఖాధికారి కార్యాలయం, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021 ► వెబ్సైట్: https://spsnellore.ap.gov.in -
AP: డీఎంహెచ్‌వో జాబ్స్.. వెంటనే అప్లై చేయండి
ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు జరగనున్న ఈ పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. డీఎంహెచ్‌వో, విశాఖపట్నంలో 67 మెడికల్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విశాఖ పట్నం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్ హెచ్ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 67 ► పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌లు–05, మెడికల్ ఆఫీసర్లు–19, స్టాఫ్ నర్సు–25, ల్యాబ్ టెక్నీషియన్–02, పారామెడికల్ స్టాఫ్–09, సపోర్ట్ స్టాఫ్–06. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్), డీఎంఎల్ /టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ /ఎంఏ(సోషల్ వర్క్), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021 ► వెబ్సైట్: http://visakhapatnam.ap.gov.in డీఎంహెచ్‌వో, గుంటూరులో 86 మెడికల్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 86 ► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్స్–02, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్–01, జనరల్ ఫిజిషియన్–01, కార్డియాలజిస్ట్–01, మెడికల్ ఆఫీసర్లు–27, స్టాఫ్ నర్సులు–35, సైకియాట్రిక్ నర్స్–05, ఫిజియోథెరపిస్ట్–02, ఆడియోమెట్రీషియన్–03, సోషల్ వర్కర్–04, కన్సల్టెంట్–క్వాలిటీ మానిటర్–01, హాస్పిటల్ అటెండెంట్–02, శానిటరీ అటెండెంట్–02. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్ఎం /బీఎస్సీ(నర్సింగ్), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 చెల్లించాలి. ► ఎంపిక విధానం: అర్హత పరీక్ష లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021 ► వెబ్సైట్: https://guntur.ap.gov.in డీఎంహెచ్‌వో, కడప జిల్లాలో 43 పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్ ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 43 ► పోస్టుల వివరాలు: ఫోరెన్సిక్ స్పెషలిస్ట్–01, జనరల్ ఫిజిషియన్–01, కార్డియాలజిస్ట్–01, మెడికల్ ఆఫీసర్లు–20, స్టాఫ్ నర్స్–13, ల్యాబ్ టెక్నీషియన్–01, ఫిజియోథెరపిస్ట్–01, ఆడియోమెట్రీషియన్–01, సోషల్ వర్కర్–01, కన్సల్టెంట్–01, హాస్పిటల్ అటెండెంట్–01, శానిటరీ అటెండెంట్–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 చెల్లించాలి. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, కడప, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021 ► వెబ్సైట్: https://www.kadapa.nic.in డీఎంహెచ్‌వో, విజయనగరంలో 36 మెడికల్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయన గరం జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్ ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 36 ► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్–01, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్–01, జనరల్ ఫిజిషియన్–01, కార్డియాలజిస్ట్–01, వైద్యాధికారులు–13, స్టాఫ్ నర్సులు–07, నర్స్‌లు–04, ల్యాబ్ టెక్నీషియన్లు–01, ఆక్యుపేషిన్ థెరపిస్ట్–01, ఆడియో మెట్రీషియన్–01, సోషల్ వర్కర్–02, కన్సల్టెంట్ క్వాలిటీ మానిటర్–01, హాస్పిటల్ అటెండెంట్–01, శానిటరీ అటెండెంట్–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021 ► వెబ్సైట్: https://vizianagaram.ap.gov.in -
సూర్యాపేట జిల్లా డీఎంహెచ్‌ఓపై వేటు
సాక్షి, సూర్యాపేట: జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ నిరంజన్‌పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో నూతన డీఎంహెచ్‌ఓగా డాక్టర్ బి.సాంబశివరావు నియమితులయ్యారు. కాగా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో నియంత్రణ చర్యలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కరోనా నియంత్రణకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించింది. (మార్కెట్ బజార్లో సీఎస్, డీజీపీ పర్యటన) మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు బుధవారం సూర్యాపేటలో పర్యటించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడానికి కారణమైన మార్కెట్ బజార్లో వీరు పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా జిల్లాలోని 80 కేసుల్లో.. మార్కెట్ బజార్‌లోని వ్యాపారులు, వారి కాంటాక్టుల నుంచి నమోదైనవి 65 కేసులు ఉన్నాయి. (‘మార్కెట్ బజార్’ అంటే హడల్) ప్రత్యేకాధికారిగా సర్పరాజ్‌అహ్మద్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో నియంత్రణ చర్యలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఈ మేరకు జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారి సర్పరాజ్‌అహ్మద్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన కరీంనగర్ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎక్త్సెజ్ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. అలాగే సూర్యాపేట మున్సిపాలిటీకి కూడా ప్రత్యేక అధికారిని పెట్టారు. మున్సిపల్ పరిపాలనశాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన గతంలో నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా పని చేశారు. మున్సిపాలిటీలో కరోనా నియంత్రణ బాధ్యతలను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. (క్వారంటైన్లో ఉన్నా గైర్హాజరట!) ‘పేట’ డీఎస్పీ బదిలీ, కొత్త డీఎస్పీగా మోహన్‌కుమార్ సూర్యాపేట డీఎస్పీ ఎం.నాగేశ్వర్రావును మంగళవారం రాత్రి బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా పనిచేస్తున్న ఎస్.మోహన్‌కుమార్‌ను నియమించారు. ఈయన బుధవారం విధుల్లో చేరనున్నారు. సూర్యాపేట డీఎస్పీగా నాగేశ్వర్రావు రెండున్నర సంవత్సరాల పాటు పనిచేశారు. కాగా ఈయన హైదరాబాద్ డీజీపీ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. (కరోనా: ఉప్పు తెచ్చిన ముప్పు! ) -
కన్నీరు పెట్టిన డీఎంహెచ్‌వో
కర్నూలు:కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ వై.నరసింహులు కన్నీరు పెట్టుకున్నారు.కార్యాలయ ఉద్యోగులు తమ సమస్యలపై ఆందోళన తీవ్రతరం చేయడంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.తాను ఉద్యోగం చేయలేనని విలపిస్తూ వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. వివరాలివీ..డీఐవోగా పనిచేసిన డాక్టర్ వెంకటరమణ, పలువురు ఉద్యోగులు శనివారం ఉదయం డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వారిని తన చాంబర్లోకి డీఎంహెచ్‌వో పిలిపించుకుని మాట్లాడుతుండగా..పలు డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లిన ఉద్యోగులు మూకుమ్మడిగా నిలదీయడంతో డీఎంహెచ్‌వో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.దీంతో ఉద్యోగులు ఆయనపై విరుచుకుపడుతూ..ఎస్సీ ఉద్యోగులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.తాను బీసీని కాబట్టే మూకుమ్మడిగా నిలదీస్తున్నారంటూ డీఎంహెచ్‌వో సైతం ఆగ్రహించారు.తాను వైఎస్సార్ కంటి వెలుగు, సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కలెక్టరేట్లో బిజీగా ఉన్నానని, ఈ సమయంలో తనను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. ఒక దశలో తీవ్రస్థాయిలో విలపిస్తూ తాను రాజీనామా చేస్తానని, ఈ ఉద్యోగం అక్కర్లేదని వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పలువురు ఉద్యోగులు ఆయన్ను సముదాయించి సీట్లో కూర్చోబెట్టారు. కాగా, కార్యాలయ ఏవోగా లద్దగిరి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కొరేషిరాజును నియమిస్తున్నామని, ఇకపై ఉద్యోగుల సమస్యలు ఆయనే పరిష్కరిస్తారని డీఎంహెచ్‌వో చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
తప్పని తెలిసినా చేశారు.. సస్పెండ్ అయ్యారు
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిని డీఎంహెచ్ఓ రాంమనోహర్‌రావు శనివారం సస్పెండ్ చేశారు. ‘వైరల్ అయిన ఉద్యోగుల టిక్‌టాక్ ’ అని శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించారు. సీనియర్ అసిస్టెంట్లు సమత, దివ్య, ల్యాబ్ అటెండర్ విజయలక్ష్మికి శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టిక్‌టాక్ వీడియో విషయంపై తీవ్రంగా స్పందిం చిన కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాల మేరకు వారిని డీఎంహెచ్ఓ సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్‌పై అధికారులు విచారణ చేపట్టి నివేదిక అందించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. -
జిల్లాలో 10 డెంగీ కేసుల నమోదు
తెర్లాం: జిల్లాలో ఇంతవరకు 10 డెంగీ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి(డీఎంహెచ్ఓ) డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం తెర్లాం పీహెచ్‌సీకి వచ్చిన ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం డివిజన్లలో రెండు మొబైల్ మలేరియా, డెంగీ క్లినిక్ (ఎంఎండీసీ) వాహనాలు తిరుగుతున్నాయన్నారు. ఈ వాహనాల్లో దోమల నివారణకు అవసరమైన మందులు వీధి కాలువల్లో పిచికారీ చేయడం, వైద్య సేవలు అందిస్తామన్నారు. జూలై 1 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు జిల్లాలో ఎంఎండీసీ వాహనాలు తిరుగుతాయన్నారు. డెంగీ కేసుల నిర్ధారించడం కేవలం జిల్లా కేంద్రాస్పత్రిలోనే జరగుతుందన్నారు. జ్వరంతో బాధపడేవారికి ఫ్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిపోయిన వెంటనే డెంగీగా భావించొద్దని, జ్వరంతో బాధపడేవారికి ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతే, తిరిగి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఫ్లేట్‌లెట్స్ కౌంట్ పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. నెల్లిమర్ల మండలం కొండవెలగాడ పీహెచ్‌సీకి మాత్రమే సొంత భవనం లేదని, మిగతా అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. 431 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా, వీటిలో 135 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయని, మిగతావి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. సొంత భవనాల నిర్మాణానికి తహసీల్దార్లు స్థలాలు మంజూరు చేస్తే, భవన నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపిస్తానన్నారు. 21 వైద్యాధికారుల పోస్టులు ఖాళీ జిల్లాలో 21 వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీఎంహెచ్ఓ తెలిపారు. 44 సెకండ్ ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో సిరంజ్ల కొరత ఉన్నట్లయితే ఆస్పత్రి అభివృద్ధి నిధుల నుంచి కొనుగోలు చేసుకోవచ్చునన్నారు. ప్రస్తుతానికి మందుల కొరతలేదన్నారు. బీపీ మాత్రలు కావాలని పీహెచ్సీ, సీహెచ్‌సీల వైద్యాధికారుల నుంచి ఇండెంట్ వచ్చిన వెంటనే సరఫరా చేస్తామన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రెడ్డి రవికుమార్‌ను ఆదేశించారు. తెర్లాంకు 108 వాహనం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
కర్నూలు డీఎంహెచ్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు
కర్నూలు: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో కర్నూలు డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని ఆమె ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న ఆమె ఇళ్లపై ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు రూ. 6 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కలెక్టర్, డీఎంహెచ్ఓలకు హెచ్ఆర్సీ నోటీసులు
శృంగవరపుకోట: రాష్ట్ర న్యాయసేవల అథారిటీ ఆదేశాల అమలులో కలెక్టర్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ చేసిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సి) కలెక్టర్, డీఎంహెచ్ఓలకు నోటీసులు జారీ చేసిందని స్థానిక న్యాయవాది చిక్కాల ఈశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఈమేరకు ఆయన హెచ్ఆర్సి జారీ చేసిన నోటీసు ప్రతిని మీడియాకు విడుదల చేశారు. జిల్లాలో దోమల నివారణకు సివిక్ ఎక్స్‌నోరా ప్రాజెక్టు అమలు చేయాలని రాష్ట్ర న్యాయసేవల అథారిటీ గతంలో ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాల అమలులో కలెక్టర్ చొరవ చూపకపోవడంతో హెచ్ఆర్సీని ఆశ్రయించినట్టు ఈశ్వరరావు చెప్పారు. దీంతో ఈ కార్యక్రమం అమలుకు తీసుకున్న చర్యలను వివరించే తగిన వివరాలతో ఆగస్టు 16వ తేదీన ఉదయం 10.30గంటలకు కమిషన్ ఎదుట హాజరు కావాలని హెచ్ఆర్సి ఆదేశించిందని న్యాయవాది ఈశ్వరరావు చెప్పారు.