కర్నూలు డీఎంహెచ్‌ఓ ఇంటిపై ఏసీబీ దాడులు
Published Thu, Dec 15 2016 3:52 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
కర్నూలు: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో కర్నూలు డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని ఆమె ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న ఆమె ఇళ్లపై ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు రూ. 6 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement