swarajya lakshmi
-
కర్నూలు డీఎంహెచ్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు
కర్నూలు: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో కర్నూలు డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని ఆమె ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న ఆమె ఇళ్లపై ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు రూ. 6 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పరువు పోతోంది
ఆరోగ్య విషయాల్లో అట్టడుగున ఉన్నాం కర్నూలు పేరు చెబితేనే తిడుతున్నారు డీఎంహెచ్ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి కర్నూలు : ‘జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎక్కడ వైద్య ఆరోగ్యశాఖ సమావేశం జరిగినా కర్నూలు పేరు చెబితేనే తిడుతున్నారు.. ఆ తర్వాతే మాట్లాడుతున్నారు. కుటుంబసంక్షేమ కార్యక్రమాల అమలులో మన జిల్లా అంతలా దిగజారి పోయింది. పనితీరు మార్చుకుని అభివృద్ధిలో ముందడుగు వేయకపోతే తిప్పలు తప్పవు’ అని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎం.స్వరాజ్యలక్ష్మి హెచ్చరించారు. స్థానిక ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల మెడికల్ ఆఫీసర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 11 నుంచి 23 వరకు అతిసార వ్యాధి నివారణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైనా అతిసార కేసు నమోదైతే అందుకు మెడికల్ ఆఫీసరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 80వేల మంది గర్భిణీలకు పరీక్షలు జరిగితే చివరగా 60వేల మంది మాత్రమే ప్రసవిస్తున్నారని, మిగిలిన 20వేల మంది ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. మాతృత్వ మరణాలు తగ్గించాలన్న ఉద్దేశ్యంతో ఈ నెల 9వ తేదీన ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇకపై ప్రతి నెలా 9వతేదీన ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2వ క్వార్టర్లో గర్భిణీలకు 4 నుంచి 6 నెలలవరకు, 3వ క్వార్టర్లో 7 నుంచి 9 నెలలున్న వారికి వైద్యులచే పరీక్ష చేయించాలన్నారు. ఈ పరీక్షల ద్వారా హైరిస్క్ గర్భిణీలను గుర్తించి, రెఫరల్ ఆసుపత్రులకు పంపించే అవకాశం ఉందన్నారు. అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ యు.రాజాసుబ్బారావు మాట్లాడుతూ ప్రయివేటు ప్రాక్టీస్ చేసే వైద్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇంకా ఎవరైనా ప్రాక్టీస్ చేస్తుంటే మానుకోవాలన్నారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, డీఐఓ డాక్టర్ వెంకటరమణ, పీఓడీటీ డాక్టర్ సరస్వతీదేవి, ఐసీడీఎస్ పీడీ అరుణ, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిది ప్రగత్ పాల్గొన్నారు. -
ఆడపిల్ల భారమా..?
అమ్మగా ప్రేమ పంచే ఆమెకు జన్మనెత్తే అదృష్టం లేదా..? చెల్లిగా అనురాగం పంచే ఆడది కడుపులోనే కన్ను మూయాలా..? దేవతగా పూజలందుకుంటున్న స్త్రీ కన్న కూతురిగా మాత్రం పనికి రాదా..? జిల్లాపై దండెత్తుతున్న ప్రశ్నలివి. అవును తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో ఆడపిల్లల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కంటే విజయనగరం జిల్లాలోనే ఈ క్షీణత ఎక్కువగా కనిపిస్తోంది. విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: ‘మా ఇంటిలో మహాలక్ష్మి పుట్టింది’ అన్న మాటలు ఇప్పుడు జిల్లాలో వినిపించకుండాపోతున్నా యి. ఈ కాలంలో కూడా ఆడపిల్లలను చాలా మంది భారంగానే చూస్తున్నారు. తాజా గణాంకాలు ఈ విషయాలను తేటతెల్లం చేస్తున్నాయి. వీటి ప్రకా రం జిల్లాలో సగటున వెయ్యి మంది పురుషులు ఉంటే ఆడ పిల్లల సంఖ్య మాత్రం 955కి పరిమితమైంది. 2011లో జిల్లాలో 1000 మంది పురుషులకు 961 మంది ఆడపిల్లలు ఉండేవారు. ఇప్పుడు ఈ సంఖ్య మరింత తగ్గిపోయింది. స్కానింగ్ సెంటర్లపై పర్యవేక్షణ కరువు ఆడ పిల్లలు భూమిపైకి రాకముందే కన్ను మూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులైతే, స్కానింగ్ సెంటర్లు కూడా ఈ పాపంలో భాగస్వాములే. జిల్లాలో నమోదిత స్కానింగ్ సెంటర్లు 42 ఉన్నాయి. వీటిలో అధికశాతం సెంటర్లు ప్రభుత్వ వైద్యులకు సంబంధించినవే కావడం గమనార్హం. ప్రతి స్కానింగ్ సెంటర్‌ను ఎప్పుటికప్పడు సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులు పరిశీలించాలి. కానీ ఈ పరిశీలనలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. కారణం అంతా ‘మనం మనం బరంపురం’ అన్నట్లు ప్రవర్తించడమే. స్కానింగ్ సెంటర్లు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి స్కానింగ్ సెంటర్ల వైపు చాలా మంది అధికారులు కన్నెత్తి చూడడం లేదు. రెండు రోజులు క్రితం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ వైవీ అనురాధ కూడా ఇదే విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏడాది కాలంలో ఒక్క స్కానింగ్ సెంటర్‌పై కూడా కేసు నమోదు చేయకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఇతర జిల్లాల కంటే... ఇతర జిల్లాల కంటే మన జిల్లాలోనే ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది. దీనికి అధికారుల ఉదాసీనతే కారణం. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ ఈ సంఖ్య మెరుగ్గా ఉంది. కరీంనగర్, ఖమ్మం, చిత్తూరు జిల్లాలో పురుషులు కంటే ఆడపిల్లలే అధికంగా ఉన్నారు. చట్టం అమలవుతోందా..? లింగ నిర్ధారణ వెల్లడించే వారిని శిక్షించే చట్టాలు కఠి నంగా ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడం లేదు. లింగ నిర్ధారణ వెల్లడిస్తే మూడేళ్ల జైలు, రూ.10వేలు జరిమానా విధిస్తారు. రెండోసారి పట్టుబడితే ఐదేళ్ల జైలు, రూ.50వేలు జరిమానా విధిస్తారు. చట్టాలు కఠినంగానే కనిపిస్తున్నా అవి కాగితాలకే పరిమితమైపోతున్నాయి. దీంతో ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది. తనిఖీలు చేస్తున్నాం... స్కానింగ్ సెంటర్లపై ఎప్పుటికప్పుడు సీనియర్ పబ్లిక్ అధికారులతో ఆకస్మిక తనిఖీలు చేయిస్తున్నాం. నేను కూడ స్వయంగా తనిఖీలకు వెళుతున్నాం. లింగ నిర్ధారణ వెల్లడించినట్టు తెలిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం - యు.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్ఓ -
పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
విజయనగరం ఆరోగ్యం,న్యూస్‌లైన్: పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి మంగళవారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దరఖాస్తు చేసిన వారిలో ఎక్కువ మంది కౌన్సెలింగ్ గైర్హాజరయ్యారు. దీంతో వచ్చిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి అధికారులు మామ అనిపించేశారు. సీట్ల సంఖ్య మేరకు దరఖాస్తులు అందలేదు. దరఖాస్తు చేసిన వారిలో కూడా ఎక్కువ మంది కౌన్సెలింగ్‌కు హాజరు కాకపోవడం అధికారులకు కూడా విస్మయం కల్గించింది. డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, కేంద్రాస్పత్రి ఆర్ఎంఓ గౌరీశంకర్ కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎంఎల్టీ కోర్సుకు 100 సీట్లకు 31 మంది దరఖాస్తు చేయగా 9 మంది మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 22 మంది గైర్హజరయ్యారు. ఎనస్తీయా టెక్సిషియన్ కోర్సు 10 సీట్లుకు 8 మంది దరఖాస్తు చేయగా వారిలో ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. రెడియోగ్రాఫిక్ అసిస్టెంట్స్ 36 సీట్లకు 10 మంది దరఖాస్తు చేయగా ముగ్గరు మాత్రమే హాజరయ్యారు. డార్క్ రూం అసిస్టెంట్ కోర్సు 12 సీట్లకు ఒకరు దరఖాస్తు చేసినా కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదు. ఈసీజీ టెక్నిషియన్ 10 సీట్లకు ఒక్కరు దరఖాస్తు చేసినా హాజరు కాలేదు. ఆఫ్తాలిమిక్ అసిస్టెంట్స్ 14 సీట్లకు ఏడుగురు దరఖాస్తు చేసినా నలుగురు మాత్రమే హాజరయ్యారు. ఆడియోమెట్రిక్ 30 సీట్లకు ముగ్గురు దరఖాస్తు చేసి ఒక్కరూ హాజరు కాలేదు. అప్టోమెట్రిక్ 6 సీట్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని కౌన్సెలింగ్ కమిటీ సభ్యులు తెలిపారు.