పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ | counselling to phara medical courses | Sakshi
Sakshi News home page

పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్

Published Wed, Oct 30 2013 5:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM

counselling to phara medical courses

విజయనగరం ఆరోగ్యం,న్యూస్‌లైన్:  పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి మంగళవారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దరఖాస్తు చేసిన వారిలో ఎక్కువ మంది  కౌన్సెలింగ్ గైర్హాజరయ్యారు. దీంతో వచ్చిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి అధికారులు మామ అనిపించేశారు. సీట్ల సంఖ్య మేరకు దరఖాస్తులు అందలేదు. దరఖాస్తు చేసిన వారిలో కూడా ఎక్కువ మంది కౌన్సెలింగ్‌కు హాజరు కాకపోవడం అధికారులకు కూడా విస్మయం కల్గించింది.  డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, కేంద్రాస్పత్రి ఆర్‌ఎంఓ గౌరీశంకర్  కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎంఎల్‌టీ కోర్సుకు 100 సీట్లకు  31 మంది దరఖాస్తు చేయగా 9 మంది మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు.  22 మంది గైర్హజరయ్యారు. ఎనస్తీయా టెక్సిషియన్ కోర్సు  10 సీట్లుకు 8 మంది దరఖాస్తు చేయగా వారిలో ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. రెడియోగ్రాఫిక్ అసిస్టెంట్స్  36 సీట్లకు 10 మంది  దరఖాస్తు చేయగా ముగ్గరు మాత్రమే హాజరయ్యారు.

డార్క్ రూం అసిస్టెంట్ కోర్సు 12 సీట్లకు ఒకరు దరఖాస్తు చేసినా కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదు.   ఈసీజీ టెక్నిషియన్ 10 సీట్లకు ఒక్కరు దరఖాస్తు చేసినా హాజరు కాలేదు.  ఆఫ్తాలిమిక్ అసిస్టెంట్స్ 14 సీట్లకు ఏడుగురు దరఖాస్తు చేసినా  నలుగురు మాత్రమే హాజరయ్యారు. ఆడియోమెట్రిక్ 30 సీట్లకు ముగ్గురు దరఖాస్తు చేసి ఒక్కరూ హాజరు కాలేదు.  అప్టోమెట్రిక్ 6 సీట్లకు  ఒక్క దరఖాస్తు కూడా రాలేదని కౌన్సెలింగ్ కమిటీ సభ్యులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement