ఏసీబీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా.. | Police Investigate Blackmail Phone Call | Sakshi
Sakshi News home page

ఏసీబీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా..

Published Thu, Aug 13 2020 9:40 AM | Last Updated on Thu, Aug 13 2020 9:42 AM

Police Investigate Blackmail Phone Call - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): ‘విజయవాడ ఏసీబీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాను. మీపై తీవ్రమైన అవినీతి ఆరోపణలతో  మాకు ఫిర్యాదులు అందాయి. రూ.5 లక్షలు ముట్టచెబితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఈ జయరామిరెడ్డికి హర్షవర్ధన్‌రెడ్డి అనే వ్యక్తి ఫోన్‌లో బెదిరించాడు. సదరు వ్యక్తి బ్లాక్‌ మెయిలింగ్‌పై   ఎస్‌ఈ   బుధవారం టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీఐ మహేశ్వరరెడ్డి   మాట్లాడుతూ  గతంలో కూడా విజయవాడ ఏసీబీ ఆఫీసు పేరుతో పలువురు వీఆర్‌ఓలు, తహసీల్దార్లకు ఫోన్లు చేశారని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బ్లాక్‌ మెయిలర్‌ను కటకటాల్లోకి పంపుతామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement