blackmail
-
సత్యవర్ధన్‌పై కేసు పెట్టి.. లొంగదీసుకుని
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు, అరెస్టు వెనుక పోలీసుల చేత ప్రభుత్వ పెద్దలు ఆడించిన నాటకం బట్టబయలైంది. వంశీ అరెస్టుకు రెండు రోజుల ముందే సత్యవర్ధన్‌పై టీడీపీ నేతలతో ఫిర్యాదు చేయించి, దాని ఆధారంగా కేసు పెట్టి, దాన్నే బూచిగా చూపించి సత్యవర్ధన్‌ను, అతని కుటుంబ సభ్యులను దాదాపుగా బ్లాక్మెయిల్ చేసినట్లు వెల్లడైంది. దీంతో భయపడిన సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు పోలీసులు చెప్పినట్లుగా వంశీపై కేసు పెట్టినట్లు, సత్యవర్ధన్ మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలానికి భిన్నంగా స్టేట్మెంట్ ఇచ్చినట్లు బయటపడింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే.. ఒకవేళ నిజంగా వంశీనే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి, బెదిరించి ఉంటే అదే పెద్ద కేసు అయి ఉండేది. టీడీపీ వర్గీయులు సత్యవర్ధన్‌పై కేసు పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. వంశీపై అక్రమ కేసు, అరెస్టు వెనుక కుతంత్రం ఇదీ.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిపై పెట్టిన కేసుతో తనకు సంబంధం లేదని, ఆ ఫిర్యాదు తానివ్వలేదంటూ అప్పటివరకు ఫిర్యాదుదారుగా భావించిన సత్యవర్ధన్ 10న మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడం చంద్రబాబు కూటమికి శరాఘాతంలా తగిలింది. వంశీని అక్రమ కేసులో ఇరికించి, అరెస్టు చేయించాలన్న దుగ్ధతో ఉన్న చంద్రబాబు కూటమి ఓ కుతంత్రానికి తెరలేపింది. ఆ మరుసటి రోజునే కొందరు టీడీపీ కార్యకర్తలతో ఆయనపైన ఓ తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. సత్యవర్థన్ రూ.5 లక్షలు డిమాండ్ చేశాడని, లేకపోతే వంశీకి అనుకూలంగా వాంగ్మూలం ఇస్తానంటూ బెదిరించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాని ఆధారంగా 11వ తేదీనే క్రైం నంబరు 84/2025తో కేసు పెట్టారు. వెంటనే సత్యవర్ధన్, ఆయన కుటుంబ సభ్యులను పోలీసుల ద్వారా బెదిరించారు. సత్యవర్ధన్‌పై కేసు నమోదైందని, తాము చెప్పినట్లుగా వంశీకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇస్తే ఆ కేసులో రాజీ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారు. లేకపోతే సత్యవర్ధన్తోపాటు కుటంబ సభ్యులనూ నిందితులుగా చేర్చి అరెస్టు చేసి, ఐదారు నెలలు బయటకు రాకుండా చేస్తామంటూ భయపెట్టారు. దీంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు సత్యవర్ధన్ మాట మార్చినట్లు తెలుస్తోంది. సత్యవర్ధన్, కుటుంబ సభ్యులను బెదిరించి, వారితో వంశీపై ఫిర్యాదు చేయించారు. వంశీని హైదరాబాద్‌లో 13వ తేదీ తెల్లవారుజామునే అదుపులోకి తీసుకొన్నారు. అదే రోజు ఉదయం 7 గంటల తర్వాత సత్యవర్ధన్‌ను విశాఖలో ఆదుపులోకి తీసుకున్నారు. అంటే సత్యవర్ధన్‌ను విచారించి, స్టేట్మెంట్ తీసుకోకుండానే వంశీని అరెస్టు చేసినట్లు తేటతెల్లమైంది. ఆరోజు సాయంత్రం వంశీకి వ్యతిరేకంగా సత్యవర్ధన్‌తో వాంగ్మూలం నమోదు చేయించారు. ఇలా సత్యవర్ధన్‌పై ముందే కేసు పెట్టి, బ్లాక్మెయిల్ చేసి కిడ్నాప్ కేసు పెట్టించడం, అతన్ని విచారించకుండానే వంశీని అరెస్టు చేయడం ద్వారా ఇదంతా ప్రభుత్వ పెద్దల కుతంత్రమన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోందన్న వాదన వినిపిస్తోంది. -
ఆన్లైన్ గేమ్‌లో పరిచయం.. ఆపై అత్యాచారం..
ఫిలింనగర్: ఆన్లైన్ గేమ్ నగరానికి చెందిన ఓ బాలిక పాలిట శాపంగా మారింది. ఆన్లైన్ గేమ్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలతో ఆ చిన్నారిని లొంగదీసుకున్నాడు. ఆన్లైన్ చాటింగ్‌లో తియ్యటి కబుర్లతో ఆమెను ఆకట్టుకుని ఫొటోలు షేర్ చేయించుకున్నాడు. అందులో బాలిక నగ్న ఫొటోలు కూడా ఉండడంతో తల్లిదండ్రులతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి పూణే నుంచి హైదరాబాద్ వచ్చి తన వాంఛను తీర్చుకుని వెళ్లేవాడు. ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ ప్రాంతానికి చెందిన బాలిక 2021లో ఏడో తరగతి చదివే సమయంలో ప్రతిరోజూ సాయంత్రం ‘ఎమాంగ్ అజ్’ యాప్‌లో ఆన్లైన్ గేమ్ ఆడుతుండేది. ఈ క్రమంలోనే ‘రూథ్‌లెస్’ పేరిట ప్రొఫైల్ ఉన్న ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అతని ద్వారా పూణె ఎంఐటీ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చివరి సంవత్సరం చదువుతున్న ఖుష్ డేవ్ (21) సదరు బాలికకు పరిచయం అయ్యాడు. వారు యాప్ ద్వారా చాట్ చేయడం ప్రారంభించారు. మొదట్లో ఒకరికొకరు స్నేహితుల్లా ఉండేవారు. ఆ తర్వాత 2023లో ఆమెకు టెలిగ్రామ్ లింక్ షేర్ చేసి ఆ యాప్ ద్వారా చాట్ చేయమని అడిగాడు. దీంతో టెలిగ్రామ్ ద్వారా చాట్ చేసుకునేవారు. చాట్ చేసే క్రమంలో బాలిక ఫొటోలను షేర్ చేయాల్సిందిగా ఖుష్‌డేవ్ అడగ్గా ఆమె నిరాకరించింది. రోజంతా ఆమెను బలవంతం చేయడంతో ఆమె తన ఫొటోలను, వీడియోలను పంపింది. నగ్న ఫొటోలతో బెదిరింపులు.. వాటిలో నగ్న ఫొటోలు కూడా ఉండటంతో అప్పటి నుంచి ఆ ఫొటోలను ఆమె తల్లిదండ్రులు, బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. తనను కలవాల్సిందిగా బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో గత ఏడాది అక్టోబర్ 6న టోలిచౌకీలోని ఓ పార్కులో కలిసింది. అప్పటి నుంచి ప్రతిరోజూ తనను కలవాల్సిందిగా డిమాండ్ చేస్తూ వచ్చాడు. తల్లిదండ్రులు తనను బయటకు పంపడం లేదని చెప్పినా రాత్రిపూట అందరూ నిద్రపోయిన తర్వాత ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పాడు. అర్ధరాత్రి అత్యాచారం.. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 24న బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా, 25న తెల్లవారుజామున అక్కడికి వచ్చిన ఖుష్‌డేవ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో కలుసుకున్నారు. ఇదే అదునుగా మరుసటి రోజు అర్ధరాత్రి సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడానికి బాలిక భయపడింది. ఈ విషయాన్ని ఆమె తన స్నేహితురాలికి చెప్పడంతో ఆమె టీచర్ దృష్టికి తీసుకెళ్లింది. టీచర్ ద్వారా ప్రిన్సిపాల్‌కు, ఆమె ద్వారా తల్లిదండ్రులకు విషయం తెలియగా వారు ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడు ఖుష్‌డేవ్‌పై బీఎన్ఎస్ సెక్షన్ 65(1), 351 (2), సెక్షన్ 5 రెడత్ విత్ 6, పోక్సో చట్టం–2012, సెక్షన్ 67 ఐటీ చట్టం–2008 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైద్యురాలికి ఎస్ఐ వేధింపులు
దొడ్డబళ్లాపురం: యువ వైద్యురాలిని ప్రేమ పేరుతో లైంగికంగా వేధించిన పోలీస్ సబ్ఇన్స్పెక్టర్పై బెంగళూరు బసవనగుడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడు ఇదే ఠాణాలో ఎస్సై రాజ్‌కుమార్. వివరాలు.. ఫేస్బుక్ ద్వారా 2020లో ఎస్సైకి ఒక వైద్యురాలు పరిచయమయింది. అప్పుడు ఆమె ఎంబీబీఎస్ చదువుతుండగా రాజ్‌కుమార్ పోలీస్ అకాడెమిలో ఎస్సై శిక్షణలో ఉన్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులు తరువాత ప్రేమికులు అయ్యారు.ఈ క్రమంలో వైద్యురాలి నుంచి రాజ్‌కుమార్ రూ.1.71 లక్షలు నగదు తీసుకున్నాడు. ఆమె డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు దిగాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి నగ్నవీడియోలు, ఫోటోలు పంపించాలని బెదిరించేవాడు. కాల్ రికార్డ్స్ చేసుకుని బ్లాక్మెయిల్ చేసేవాడు. దీంతో విసిగిపోయిన వైద్యురాలు అతని దురాగతాలపై బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్‌కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ ఆదేశాల మేరకు ఘరానా ఎస్సైపై కేసు నమోదు చేశారు. -
Congress MLA: న్యూడ్ కాల్స్.. అత్యాచారం
మాజీ ఎంపీ హెచ్డీ ప్రజ్వల్, తరువాత ఎమ్మెల్సీ హెచ్డీ సూరజ్‌లు లైంగిక దాడుల కేసుల్లో అరెస్టయ్యారు. ఆపై బెంగళూరులో సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న కూడా అత్యాచారం, హనీ ట్రాప్ కేసుల్లో కటకటాలు లెక్కిస్తున్నారు. ఈ జాబితా ఇంతటితో ఆగలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి కూడా చేరారు. న్యూడ్ కాల్స్, అత్యాచారం ఆరోపణలతో ఓ మహిళ ఆయనపై ఫిర్యాదు చేయడం రాజకీయాల్లో కుదుపు ఏర్పడింది. ప్రజాప్రతినిధులు అంటే ఇలా కూడా ఉంటారా? అని ప్రజలు ముక్కున వేలేసుకునేలా కేసుల గోల సాగుతోంది.దొడ్డబళ్లాపురం: ఇప్పటికే ముడా ఆరోపణలతో సతమతమవుతున్న రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుకు మరో తలనొప్పి ఎదురైంది. పార్టీ ఎమ్మెల్యేపై అత్యాచారం ఆరోపణలు గుప్పుమన్నాయి. ధార్వాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకరి్ణపై బెంగళూరు సంజయ్ నగర పోలీస్‌స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదయింది. కులకర్ణి పీఏ అర్జున్‌పై కూడా ఐటీ చట్టం, ఇతర అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. మహిళ ఫిర్యాదులో ఏముంది.. ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి తనపై అత్యాచారం చేయడంతోపాటు హింసించారని ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు పోలీసులు. 2022లో కులకరి్ణని తాను ఒక రైతు ద్వారా కలిసానని, ఎమ్మెల్యే రాత్రిపూట వీడియో కాల్ చేసి నగ్నంగా మారాలని ఒత్తిడి చేసేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తరువాత బెంగళూరు హెబ్బాళలోని ఇంటికి రావాలని బెదిరించేవాడని, రాకపోతే రౌడీలను పంపించేవాడని, ఏప్రిల్ నెలలో తనను బెళగావికి పిలిపించుకుని అక్కడే తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఆగస్టు 24న పని నిమిత్తం బెంగళూరుకు వచ్చినప్పుడు తనను ఎయిర్‌పోర్టు సమీపంలోని నిర్జన ప్రదేశంలో కారులో అత్యాచారం చేసినట్టు పేర్కొంది. అక్టోబర్ 2న కూడా తనను ధర్మస్థలం తీసుకువెళ్లి అక్కడా అత్యాచారం చేశాడని తెలిపింది. ఈ తతంగంపై కొన్ని వీడియో కాల్స్ మంగళవారమే లీక్ కావడంతో కలకలం ఏర్పడింది.బ్లాక్మెయిల్ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఈ ఆరోపణలపై వినయ్ కులకర్ణి స్పందిస్తూ మహిళ తనను బ్లాక్మెయిల్ చేస్తోందని, ప్రైవేటు టీవీ చానెల్ ఎండీ ఒకరు తనను రూ.2కోట్లు ఇవ్వాలని బెదిరించాడని సంజయ్‌నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బాబు గారూ.. మీ ఎమ్మెల్యే నుంచి కాపాడండి!
సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వ్యాపారం చేయాలంటే ఎమ్మెల్యే బొజ్జలకు కప్పం కట్టాలి. లేదంటే ఊరు విడిచి అయినా పోవాలి. ఈ రెండింట్లో దేనికో ఒక దానికి సిద్ధపడకపోతే మాత్రం ఎమ్మెల్యే అనుచరుల చేతిలో చావు దెబ్బలు తప్పవు. ఇప్పటికే అన్ని రకాలుగా వసూళ్ల పర్వానికి తెరలేపిన ఆ ఎమ్మెల్యే దాదాగిరి గురించి వేధింపులకు గురైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాజీపూర్ జిల్లాకు చెందిన సుశీల్ చౌదరి అనే స్క్రాప్ వ్యాపారి బయట పెట్టారు. ఈ మేరకు బాధితుడు తిరుపతిలోని ఓ ప్రైవేటు నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.ఆ వివరాలు అతని మాటల్లోనే..‘ఎనిమిదేళ్లుగా నేను తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని వివిధ కర్మాగారాల్లో స్క్రాప్‌ను సేకరించి ఇతర ప్రాంతాల్లో విక్రయించి వ్యాపారం చేస్తున్నా. జూన్‌లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి నాకు ఫోన్ చేసి, నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా ఎలాంటి వ్యాపారం చేయకూడదని ఆదేశించారు. వ్యాపారం చేసుకోవాలంటే తనకు ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించాలని బెదిరించాడు. కొద్ది రోజుల తర్వాత నన్ను హైదరాబాద్‌కు పిలిపించి మాట్లాడారు. ప్రతి నెలా రూ.50 లక్షల నుంచి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు.అయితే నా వ్యాపారం అంతంత మాత్రమేనని, అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేనని ప్రాధేయపడ్డాను. దీంతో నియోజకవర్గంలో ఎక్కడా స్క్రాప్ తీసుకోవద్దని హెచ్చరించారు. నాకు స్క్రాప్ అమ్మకూడదని ఫ్యాక్టరీల యజమానులను కూడా బెదిరించారు. అప్పటి నుంచి నేను వ్యాపారం మానేసి ఖాళీగా ఉన్నాను. అయితే ఎమ్మెల్యే అనుచరుడు వికృతమాలకు చెందిన పూల హేమాక్షి తరచూ నాను ఫోన్ చేసి, ఎమ్మెల్యేకు డబ్బులు కట్టాలని డిమాండ్ చేసేవాడు. తిరుపతి వదిలిపెట్టి వెళ్లిపోవాలని.. లేదంటే చంపేస్తామని బెదిరించాడు.రెండు రోజుల కిందట హేమాక్షి నా వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వాలని దారుణంగా కొట్టాడు. నా సెల్ ఫోను లాక్కుని, ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయాడు. ఈ విషయమై నేను రేణిగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. అయితే వారు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే వల్ల నాకు ప్రాణహాని ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, జిల్లా ఎస్పీ స్పందించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి చెర నుంచి నన్ను రక్షించాలి’ అని వేడుకున్నారు. ఇది కూడా చదవండి: మాతో పెట్టుకుంటే కాల్చిపారేస్తాం!.. అనంతలో మళ్లీ రక్త చరిత్ర -
పోలీసులనే బ్లాక్మెయిల్ చేస్తున్న జత్వానీ
-
సహజీవనానికి సాక్ష్యంగా... కోర్టుకు ‘ఎంవోయూ’ సమర్పించాడు!
ముంబై: పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ముంబైకి చెందిన వ్యక్తిపై ఓ 30 ఏళ్ల మహిళ కేసు పెట్టింది. నిందితుడు మాత్రం తాము పరస్పర అంగీకారం మేరకే సహజీవనం చేశామని వాదించాడు. ‘‘ఆ మేరకు మేం ఒప్పందం కూడా చేసుకున్నాం. దాని ప్రకారం ఈ కేసు చెల్లదు’’అంటూ రుజువుగా సదరు అవగాహన ఒప్పందాన్నే (ఎంవోయూ) కోర్టుకు సమర్పించాడు. దాంతో వారు పరస్పర అంగీకారంతోనే కలిసి బతికారని కోర్టు తేల్చింది. అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది! ముంబైకి చెందిన వీరిద్దరూ 2023 అక్టోబర్ 6న కలిశారు. 2024 ఆగస్టు 1 నుంచి 2025 జూన్ 30 దాకా 11 నెలల పాటు సహజీవనం కోసం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) రాసుకున్నారు. అప్పటికే విడాకులు తీసుకున్న ఆమెను పెళ్లి చేసుకుంటానని అతను చెప్పాడు. కానీ అతనికి మరో మహిళతో సంబంధమున్నట్టు కలిసి బతకడం మొ దలుపెట్టాక ఆమె గుర్తించింది. దాంతో, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేసింది. ‘‘నేను గర్భవతినయ్యా. అబార్షన్ మాత్రలు వేసుకోమంటూ బలవంతం చేశాడు. అతనికి అప్పటికే పెళ్లయిందని తర్వాత తెలిసింది. ఇదేమిటని నిలదీస్తే అశ్లీల వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడు. తనతో సంబంధం కొనసాగించాలంటూ పట్టుబట్టాడు. నేను లొకేషన్లు మారినా వేధిస్తున్నాడు. నా కొడుకును తీసుకెళ్తానని బెదిరించాడు’’అని ఆరోపించింది. అత్యాచార ఆరోపణలు నిరాధారమని నిందితుడు వాదించాడు. తమ అగ్రిమెంట్‌ను రుజువుగా సమర్పించాడు. దానిపై తాను సంతకం చేయలేదని సదరు మహిళ వాదించింది. ఒప్పంద పత్రం ప్రామాణికతను నిర్ధారించే ఆధారాల్లేవన్న జడ్జి శయనా పాటిల్, ‘ఇది పరస్పర అంగీకారంతో మొదలై చివరికి వికటించిన సంబంధంగా కనిస్తోంది’అని అభిప్రాయపడ్డారు. కస్టడీ విచారణ అవసరం లేదని తేల్చారు. వైరలవుతున్న ఒప్పందం వారి ఒప్పంద పత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో పలు నిబంధనలున్నాయి. ‘ఏడాది పాటు అతనింట్లో కలిసుండాలి. ఆ సమయంలో పరస్పరం లైంగిక వేధింపుల కేసులు పెట్టుకోకూడదు. ఎవరికి నచ్చకపోయినా నెల ముందు నోటీసిచ్చి విడిపోవచ్చు’అని రాసుకున్నారు! -
Big Question: కోటీశ్వరులే ఈమె టార్గెట్
-
నమ్మించి.. మత్తులో ముంచి..
తిరుపతి రూరల్ : ఫ్రెండ్ అని నమ్మించింది.. ప్రాణం కన్నా ఎక్కువ అని నమ్మబలికింది.. ఇంటికి తీసుకెళ్లి భర్తకు పరిచయం చేసింది.. నమ్మి వచ్చిన ఫ్రెండ్‌కు భర్తతో కలిసి గంజాయి మత్తును అలవాటు చేసింది. మత్తులో ఉన్న ఫ్రెండ్‌పై భర్తతో లైంగిక దాడి చేయించింది.. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసింది. ఆపై బ్లాక్ మెయిల్‌కు పాల్పడటం మొదలెట్టింది. శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్న సమయంలో అమ్మకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.. తిరుపతిలో జరిగిన దారుణానికి సంబంధించిన వివరాలు.. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన విద్యార్థి (22) తిరుపతి శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో ఎల్ఎల్బీ మూడో సంవత్సరం చదువుతోంది. తిరుపతి రూరల్ మండలం పుదిపట్లకు చెందిన కృష్ణకిషోర్‌రెడ్డి భార్య ప్రణవకృష్ణ కూడా ఆమె చదువుతున్న క్లాస్‌లోనే సహ విద్యార్థి నిగా ఉంది. తన తోటి విద్యార్థి ని నమ్మించి పుదిపట్లలోని తన ఇంటికి తీసుకెళ్లి భర్త కృష్ణకిషోర్‌రెడ్డికి పరిచయం చేసింది ప్రణవకృష్ణ. అనంతరం ఇద్దరు కలిసి విద్యార్థి కి గంజాయిని అలవాటు చేశారు. మత్తులో ఉన్న విద్యార్థి నిపై కృష్ణకిషోర్‌రెడ్డి లైంగికదాడి చేసేవాడు. దీనిని ప్రణవకృష్ణ ఫొటోలు, వీడియోలు తీసింది. ఇదంతా గతేడాది జూన్ 13 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు కొనసాగింది. ఇటీవల కర్నూలు విద్యార్థి కి తమ కుటుంబ సభ్యులు చూసిన వ్యక్తితో నిశి్చతార్థం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్‌రెడ్డి విద్యార్థి ని బ్లాక్మెయిల్ చేయసాగారు. నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి డబ్బు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థి వద్ద బంగారు గొలుసు, నిశ్చితార్థం ఉంగరం, నగదును సైతం లాక్కున్నారు. మరిన్ని డబ్బులతో తిరుపతికి వచ్చి సెటిల్ చేసుకోకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఆలస్యం అవుతుందని శారీరకంగా, మానసికంగా దాడులు చేస్తూ వేధించారు. ఇంట్లో చెప్పుకోలేక, వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్యే శరణ్యం అని భావించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన విద్యార్థిని తల్లి పద్మావతి సొంతూరు నుంచి తిరుపతిలోని వర్సిటీకి వచ్చి 0ది. బిడ్డ దుస్థితి చూసి లోతుగా ఆరా తీసింది. దీంతో జరిగిన ఘటన, బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యవహారంపై తల్లి వద్ద వాపోయింది. దీంతో ఈ నెల 25న తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తల్లితో కలిసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు రూరల్ సీఐ తమీమ్ అహ్మద్ తెలిపారు. కేసులో నిందితులైన ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా, ప్రణవకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు వర్సిటీ అధికారులు ప్రకటించారు. -
ట్యాపింగ్ మాటున లైంగిక వేధింపులు.. వసూళ్లు!
నల్లగొండ క్రైం: ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం నల్లగొండలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే జిల్లాలోని టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ముగ్గురు పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకున్న ప్రత్యేక అధికారుల బృందం ఆదివారం వారిని మరోసారి విచారించినట్టు చర్చ జరుగుతోంది. అప్పటి జిల్లా ఉన్నతాధికారితో నమ్మకంగా ఉన్న కానిస్టేబుల్‌తో మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు పంపిణీతో పాటు వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలున్నాయి. పోలీసు ఉన్నతాధికారితో ఉన్న నమ్మకాన్ని టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన పలువురు కిందిస్థాయి పోలీసుఅధికారులు దందాలు, సెటిల్మెంట్లకు తెర లేపారని ఆరోపణలు వచ్చాయి. మిర్యాలగూడలో రౌడీషీటర్లతో సెటిల్మెంట్లు, నార్కట్‌పల్లి వద్ద దొరికిన గంజాయి కేసులో వసూళ్లకు పాల్పడ్డట్టు సమాచారం. పేకాట, బియ్యం దందా చేసేవారిని ఫోన్ ట్యాపింగ్ ద్వారా పట్టుకొని బ్లాక్మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. పార్కులో తిరిగే ప్రేమ జంటలను, ఏదేని కేసులో ఉన్న వారిని కలవడానికి వచ్చే కుటుంబ సభ్యులైన మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సమాచారం. పోలీసు అధికారులు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో అక్రమ సంపాదనతో ఒక పోలీస్ అధికారి గుర్రంపోడు మండల కేంద్ర సమీపంలోని 9ఎకరాల తోటను కొనుగోలు చేసినట్టు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఈ విషయమై దర్యాప్తు అధికారులు కీలకమైన సమాచారం సేకరించినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. దర్యాప్తు అధికారుల విచారణలో మరిన్ని విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. -
‘పుష్ప’ నటుడు కేశవ అరెస్ట్
పంజగుట్ట:‘పుష్ప’సినిమాలో హీరో స్నేహితునిగా నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నటుడు జగదీశ్ అలియాస్ కేశవ (మచ్చా) ఓ యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడు. పంజగుట్ట పోలీసులు బుధవారం అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు పూర్వాపరాలిలా.. కాకినాడకు చెందిన యువ తి ఓ సంస్థలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే, సినిమాల్లో జూనియర్ ఆరి్టస్టుగా నటిస్తుండేది. పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంగీత్‌నగర్‌లో అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్‌లో నివసిస్తుండేది. తల్లి దండ్రులు కాకినాడలోనే ఉండగా, ఆమెకు భర్తతో విడాకులు అయ్యాయి. కొంతకాలం కిందట ఆ యువతికి మణికొండలో నివసించే నటుడు జగదీశ్ పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారి కొద్దిరోజులు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. జగదీశ్ ఆ యువతిని కాదని మరో యువతిని వివాహం చేసుకోవడంతో ఆమె జగదీశ్‌ను దూరం పెట్టసాగింది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది కాదు. రహస్యంగా ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి ఈ క్రమంలో గత నెల 27న మహిళ నివసించే ఫ్లాట్ వద్దకు వచ్చిన జగదీశ్.. సదరు మహిళ మరో యువకునితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను కిటికీలోనుంచి తీశాడు. ఆ తర్వాత డోర్‌కొట్టి లోనికి వెళ్లి మీ బాగోతం మొత్తం రికార్డ్ చేశానంటూ వారిని బెదిరించాడు. ఫొటోలు డిలీట్ చెయ్యా లని ఎంత బతిమిలాడినా వినలేదు. దీంతో ఆ యువతి, యువకుడు పోలీసులకు ఫోన్ చేస్తామనడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు కూడా ఫోన్లో వేధించాడు. 29వ తేదీ ఉదయం ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫొటో పంపించి.. ఇలాంటి ఫొటోలుఇంకా చాలా ఉన్నాయనీ, అవన్నీ బయటపెడతానని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురైన యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడంతో ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరుసటిరోజు యువతి బంధువులు జగదీశ్ వేధింపులను పోలీసులకు వివరించగా ఆ మేరకు కేసు పెట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు జగదీశ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
రిప్లై ఇవ్వకపోతే చేయి చేసుకుంటా..హీరో కార్తికేయకు యువతి బెదిరింపు!
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఖాతాలోకి ఎట్టకేలకు ఓ హిట్ పడింది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం బెదురులంక 2012 ఈ శుక్రవారం విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తుంది. ముందు నుంచి ఈ చిత్రంపై గట్టి నమ్మకంతో ఉన్నాడు కార్తికేయ. ప్రమోషన్స్‌లో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. మీడియా ఇంటర్వ్యూలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. (చదవండి: బెదురులంక 2012’మూవీ రివ్యూ) ఎట్టకేలకు ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు కార్తికేయ. నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు బదులు ఇచ్చాడు. రామ్ చరణ్ గురించి చెప్పమని ఓ నెటిజన్ అడగ్గా.. లక్కీ ఛార్మ్ బదులిచ్చాడు. చరణ్ సినిమాలో విలన్‌గా నటించే అవకాశం వస్తే.. చేస్తారా? అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. మంచి స్కోప్ ఉన్న పాత్ర అయితే కచ్చితంగా చేస్తానన్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతి ట్విటర్ వేదికగా కార్తికేయను బెదిరించింది. రిప్లై ఇవ్వకపోతే చేయి కోసుకుంటాను అంటూ బ్లాక్ మెయిల్ చేసింది. ఇది చూసి భయపడిన కార్తికేయ వెంటనే రిప్లై ఇచ్చాడు. అమ్మో వద్దు వద్దు అంటూ రిప్లై ఇవ్వగా.. థాంక్యూ అంటూ సదరు యువతి రిప్లై ఇచ్చింది. అయితే ఈ బ్లాక్ మెయిల్ అంతా సరదాగానే సాగినట్లు యువతి షేర్ చేసిన ఫోటో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కామెడీ బ్లాక్ మెయిల్ నెట్టింట వైరల్ అవుతోంది. Ammo odhu odhu https://t.co/umctBM3q0v — Kartikeya (@ActorKartikeya) August 25, 2023 -
మహిళా ప్రయాణికురాలికి బ్లాక్మెయిల్
కృష్ణరాజపురం: ఉద్యాన నగరిలో క్యాబ్ కార్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలు జాగ్రత్తగా ఉండాలనేందుకు ఇదొక ఉదాహరణ. క్యాబ్‌లో మహిళ స్నేహితునితో మాట్లాడిన మాటలను ఆయుధంగా మార్చుకుని బ్లాక్మెయిల్ చేసిన డ్రైవర్ ఆమె వద్ద నుంచి లక్షలాది రూపాయలను, బంగారాన్ని దోచుకున్నాడు. ఈ ఘటనలో హెసరఘట్ట నివాసి అయిన క్యాబ్ డ్రైవర్ కిరణ్ కుమార్ (35)ని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బాల్య స్నేహితుడినంటూ.. వివరాలు.. కొంతకాలం కిందట ఇందిరా నగర నుంచి బాణసవాడికి వెళ్లాలని ఒక మహిళ క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా తన క్లాస్‌మేట్‌తో వ్యక్తిగత సమస్యలపై మాట్లాడింది. ఆ మాటలను విన్న డ్రైవర్ కిరణ్ కొన్ని రోజుల తర్వాత మహిళ మొబైల్‌కు మెసేజ్ చేశాడు. నీ బాల్య స్నేహితుడినని చెప్పుకోగా ఆమె నిజమేననుకుంది. ఆ తర్వాత ఫోన్లో పరిచయం పెంచుకుని తనకు ఆర్థిక సమస్య ఉందని, సాయం చేయాలని కోరాడు. బాల్య స్నేహితుడు అని భావించి జాలితో కొంత డబ్బు పంపింది. ఇలా రూ. 22 లక్షల వరకు అతడు వసూలు చేసి జల్సాలు చేశాడు. కొన్నిరోజులకు డ్రైవర్ తన స్నేహితుడు కాదని ఆమె తెలుసుకుని మాట్లాడడం మానేసింది. భర్తకు చెబుతానని కొన్నిరోజులు ఊరికే ఉన్న క్యాబ్ డ్రైవర్ మళ్లీ తిరిగి బెదిరించడం ప్రారంభించాడు. నీకు, నీ స్నేహితునికి మధ్య ఉన్న విషయాలను నీ భర్తకు చెబుతానని బెదిరించాడు. నీ భర్తకు తెలిస్తే సంసారం నాశనం అవుతుందని భయపెట్టాడు. దీంతో భీతిల్లిన మహిళ.. తన వద్ద ఉన్న సుమారు 750 గ్రాముల బంగారు ఆభరణాలను ఇచ్చింది. కొన్నాళ్లకు బంగారం లేదని తెలుసుకున్న భర్త భార్యను ప్రశ్నించగా జరిగిన ఉదంతం మొత్తం చెప్పింది. వెంటనే భార్యను తీసుకుని రామ్మూర్తినగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘరానా క్యాబ్ డ్రైవర్ కిరణ్‌ను అరెస్టు చేసి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. -
రాత్రి 12 గంటలకు టెక్కీకి న్యూడ్ వీడియో కాల్.. రూ.1 కోటికి పైగా వసూలు
కృష్ణరాజపురం అన్నసంద్ర కు చెందిన 41 ఏళ్ల ఐటీ ఇంజనీర్ ఇంగ్లండ్‌లో పనిచేసి ఇటీవల బెంగళూరుకు వెనక్కి వచ్చారు. పెళ్లి చేసుకోవాలని మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో వివరాలు పోస్ట్ చేశాడు. ఈ నెల 2వ తేదీన ఒక యువతి అతనికి ఫోన్ చేసి మాటలు కలిపింది. 4వ తేదీన ఫోన్ చేసి అమ్మకు మందుల కోసం రూ.1,500 కావాలని ఆన్లైన్లో తన అకౌంట్ కు జమచేయించుకుంది. అదేరోజు రాత్రి 12 గంటలకు టెక్కీకి న్యూడ్ వీడియో కాల్ చేసి మాట్లాడి రికార్డు చేసుకుంది. కొంతసేపటికి ఆ వీడియోను టెక్కీ వాట్సాప్‌కు పంపించి.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీ తల్లిదండ్రులకు, బంధువులకు పంపిస్తానని బ్లాక్మెయిల్ చేసింది. భయపడిన టెక్కీ ఆమె చెప్పిన రెండు ఖాతాల్లోకి లక్షలాది రూపాయలను పంపాడు. ఇలా అతన్ని దఫదఫాలుగా బెదిరించి రూ.1.14 కోట్లు వసూలు చేసింది. మరింత డబ్బు కావాలనడంతో బాధితుడు వైట్‌ఫీల్డ్ సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శాన్వి అరోరా అనే మహిళ ఈ కథ నడిపిందని గుర్తించారు. ఈ డబ్బులో రూ.80 లక్షలను జప్తు చేశామని, మిగిలిన నగదును ఆ మహిళ డ్రా చేసిందని, ఆమెను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. -
బ్లాక్మెయిల్ చేస్తున్న నలుగురు విలేకరులపై కేసు నమోదు
హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న భవనాల వద్దకు వెళ్లి యజమానులను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు విలేకరులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాలివీ... శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారిలోని కమలాపురి కాలనీలో మనీష్ జైన్ అనే వ్యాపారి ప్లాట్ నెంబర్ 117లో ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ నెల 4వ తేదీన తాము విలేకరులమంటూ నలుగురు వ్యక్తులు ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ చేశారు. తాము లోకల్ మీడియా రిపోర్టర్లమని పేర్కొంటూ తీవ్రంగా వేధింపులకు గురి చేశారు. ఆకుల కిరణ్ గౌడ్, సోపాల శ్రీనివాస్, తడక విజయ్‌కుమార్, కుళ్ల రవీందర్ తదితరులు రోజూ 20 నుంచి 30 సార్లు ఫోన్లు చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వీరిపై బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కేసులో చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను నిర్మిస్తున్న భవనంలోకి అక్రమంగా ప్రవేశిస్తూ తన ఇంటి ఫొటోలు తీస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బిల్డింగ్ కూలి్చవేయిస్తామని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. అయిదు సంవత్సరాల క్రితం కూడా ఈ నలుగురు విలేకరులు తమను డబ్బుల కోసం డిమాండ్ చేయడం జరిగిందని వీరి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డట్లు ఆరోపించారు. బిల్డింగ్ కూలి్చవేయిస్తామని అప్పట్లోనే బెదిరించగా రూ. 12 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. తాజాగా మళ్లీ తనను డబ్బు ల కోసం బెదిరిస్తున్నాడని తనకు ఆత్మహత్య ఒక్కటే శరణ్యంగా మారిందని వీరి బారి నుంచి రక్షించాల్సిందిగా కోరారు. బంజారాహిల్స్ పోలీసులు కిరణ్‌గౌడ్, సోపాల శ్రీనివాస్, విజయ్‌కుమార్, కుళ్ల రవీందర్‌లపై ఐపీసీ సెక్షన్ 447, 385, 386, 506 రెడ్‌విత్ 120(బి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు..
బెంగళూరు: కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సమయంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బాధ్యతయుతంగా ఉంటానని స్పష్టం చేశారు. తాము 135 సీట్లు గెలిచామని, ఎవరినీ విడగొట్టాలని అనుకోవడం లేదని చెప్పారు. సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు తాను కట్టుబడి ఉంటానని డీకే స్పష్టం చేశారు. వెన్నుపోటు పొడవనని, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయనని గాంధీ కుటుంబం పట్ల తన విధేయతను చాటుకున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌కు 20 సీట్లు తేవడమే తము ముందున్న సవాల్ అని డీకే తెలిపారు. చరిత్రలో తన గురించి తప్పుగా ఉండాలని కోరుకోవడం లేదని, చెడ్డపేరుతో వెళ్లాలనుకోట్లేదని చెప్పుకొచ్చారు. సీఎం ఎంపికపై చర్చించేందుకు అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లడానికి ముందు ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. తిరుగుబాటు ఉండదనే సంకేతాలు ఇచ్చారు. రెండున్నరేళ్లు వద్దు..! కాగా.. కర్ణాటక సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్యీ తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అంతిమ నిర్ణయం ఏఐసీసీ అధ్యక్షుడిదేనని సీఎల్పీ ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే సీఎంగా ఇద్దరికీ చెరో రెండేళ్లు ఇస్తామని హైకమండ్ చేసిన ప్రతిపాదనకు డికే ససేమిరా అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఢిల్లీలో రెండు రోజులుగా ఈ విషయంపై అదిష్ఠానం మంతనాలు జరుపుతోంది. సిద్ధరామయ్య కూడా ఢిల్లీలోనే ఉన్నారు. డీకే శివకుమార్‌ను కూడా సోమవారమే ఢిల్లీకి పిలిచినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల ఆయన వెళ్లలేదు. ఒక రోజు ఆలస్యంగా మంగళవారం వెళ్తున్నారు. సాయంత్రంలోగా కర్ణాటక సీఎం ఎవరనే విషయంపై స్పష్టత అవకాశం ఉంది. నూతన సీఎం ప్రమాణస్వీకారం గురువారం జరగనుంది. మంత్రులు కూడా ఆరోజే ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. మే 10 జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 135 సీట్లు కైవసం చేసుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. అధికార బీజేపీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ 19 సీట్లతో సరిపెట్టకుంది. ఇతరులు నాలుగు చోట్ల గెలిచారు. చదవండి: గహ్లోత్‌కు సచిన్ పైలట్ అల్టిమేటం -
కాంగ్రెస్‌లో చేరిక పంచాయితీ.. డీఎస్ తనయుల వార్! తండ్రిని బ్లాక్ మెయిల్ చేశారా?
డీ శ్రీనివాస్ ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్ తెలిపారు. తన తండ్రికి ఫిట్స్ వస్తే ఇంట్లోనే ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. తన తమ్ముడు ధర్మపురి అరవిందే తండ్రిని బ్లాక్మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అరవింద్ దిగజారి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి చుట్టూ ఉన్నవాళ్లపై తనకు అనుమానం ఉందని సంజయ్ చెప్పారు. డీఎస్ రాజీనామా లేఖలు బీజేపీ చేస్తున్న డర్టీ పాలిటిక్స్ అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే అరవింద్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. డీఎస్, ఆయన కుమారుడు సంజయ్ ఆదివారమే కాంగ్రెస్ గూటికి తిరిగివెళ్లారు. అయితే 24 గంటల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేస్తునట్లు డీఎస్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. డీఎస్ లేఖ రాస్తున్న వీడియోను కూడా విడుదల చేశారు. రాజీనామా లేఖను ఆయన సతీమణి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు. డీఎస్ ఆరోగ్యం సహకరించట్లేదని, కాంగ్రెస్ వాళ్లు తమ ఇంటి వైపు రావొద్దని డీఎస్ భార్య విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సోదరుడు అరవింద్‌పై సంజయ్ తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. డీఎస్ రాజీనామానా వ్యవహారం కాస్తా ఆయన కుమారుల పంచాయితీగా మారింది. అన్న సంజయ్ ఆరోపణలపై తమ్ముడు అరవింద్ ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్‌లోకి తిరిగి చేరిన సందర్బంగానే గాంధీభవన్ వెళ్లానని, కానీ తానూ పార్టీలో చేరినట్లు ప్రచారం చేశారని డీఎస్ లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు భావిస్తే ఈ లేఖను రాజీనామాగా భావించి ఆమోదించాలని కోరుతున్నట్లు తెలిపారు. చదవండి: చేరికల చిచ్చు.. ఒక్క రోజుకే కాంగ్రెస్‌కు డీఎస్ రాజీనామా.. అసలేమైంది? -
ప్రేమికుడితో దిగిన ఫొటోలు వైరల్.. యువతి ఆత్మహత్య
భూపాలపల్లి అర్బన్/రామన్నపేట/నర్సంపేట రూరల్: ప్రేమికుడితో దిగిన ఫొటోలను అతను మరో యువకుడికి పంపడం, ఇద్దరూ కలిసి బ్లాక్మెయిల్ చేయడం, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మనస్తాపానికి గురైన యువతి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ముగ్ధుంపురం శివారులో ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) మూడో సంవత్సరం చదువుతోంది. అయితే తన కుమార్తె కన్పించడం లేదంటూ రక్షిత తండ్రి శంకరాచారి ఈ నెల 22న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా 24న రక్షిత ఆచూకీ లభించింది. విచారణ సందర్భంగా..తన ప్రేమికుడితో దిగిన ఫొటోలను అతను వేరొకరికి పంపిన విషయం, ఇతర వివరాలు ఆమె వెల్లడించింది. దీంతో పోలీసులు ఇద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించి పంపేశారు. ఈ ఇద్దరు యువకులూ భూపాలపల్లికి చెందిన వారేనని మట్టెవాడ పోలీసులు తెలిపారు. కాగా సరదాగా తీసుకున్న ఫొటోలు కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మనస్తాపానికి గురైన రక్షిత ఆదివారం వరంగల్‌లోని తమ బంధువుల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. ర్యాగింగ్ ఆరోపణలపై కాలేజీ యాజమాన్యం ఖండన ‘పబ్బోజు రక్షిత అనే విద్యార్థిని మా కళాశాలలోనే ఈసీఈ విభాగంలో అడ్మిషన్ పొందింది. రెండేళ్లు కళాశాలలోనే చదివింది. కానీ బ్యాక్‌లాగ్‌లు ఎక్కువగా ఉండడంతో మూడో సంవత్సరంలో డిటెండ్ అయింది. దీంతో ఆరు నెలలుగా కళాశాలకు రావడం లేదు. కళాశాలకు రాని విద్యార్థినిని ఎవరు ర్యాగింగ్ చేస్తారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వైరల్ అవుతోంది..’ అని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. -
ఘట్కేసర్: బీటెక్ స్టూడెంట్స్ మార్ఫింగ్ న్యూడ్ ఫోటోల కలకలం
సాక్షి, హైదరాబాద్: ఘట్కేసర్లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినుల మార్పింగ్ న్యూడ్ ఫొటోల కలకలం చెలరేగింది. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి కొందరు ఆకతాయి.. వాటిని వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేశారు. అంతేకాదు వాటి ఆధారంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో విద్యార్థినిలు బుధవారం అర్ధరాత్రి కాలేజ్ ముందుకు చేరి ధర్నా చేపట్టారు. ఈ ఉదయం వీళ్లకు విద్యార్థి సంఘాలు కూడా తోడు కావడంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. ఘట్కేసర్ వీబీఐటీ( విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజీ) దగ్గర గురువారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు ఆకతాయిలు ఆ కాలేజీలో చదువుతున్న అమ్మాయిల ఫొటోలను సేకరించి.. వాటిని న్యూడ్ ఫొటోలుగా మార్ఫింగ్ చేశారు. అంతటితో ఆగకుండా వాటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. వాటిని చూపిస్తూ.. వాట్సాప్ గ్రూపుల్లో చేరి వీడియో కాల్స్ చేయాలని యువతులను బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ పరిణామం వెనుక ఎవరున్నారేది తేల్చే పనిలో ఉన్నారు. అయితే.. ఈ లోపే విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఈ పరిణామంపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కూతుర్ల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. ఇదిలా ఉండగా.. విద్యార్థినుల ధర్నా చేపట్టిన సమయంలో ఆగంతకుల నుంచి వార్నింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించినట్లు విద్యార్థినులు చెప్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు చెప్తున్నారు. -
పెళ్లి రద్దు.. రూ.50 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసిన అమ్మాయి..
ముంబై: అతనో ఐటీ ఇంజినీర్. వయసు 28 ఏళ్లు. తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఇంతలో ఓ మేట్రీమోని ద్వారా అమ్మాయి దొరికింది. ఇద్దరి జాతకాలు కూడా బాగా కలిశాయి. దీంతో ఇరుకుటుంబాలు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాయి. జులైలో అమ్మాయి పుట్టినరోజున ఇంటికి వెళ్లి సెలబ్రేట్ చేశారు అబ్బాయి కుటుంబసభ్యులు. ఎంగేజ్మెంట్ కోసం అబ్బాయి ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేశాడు. పెళ్లి కోసం సూరత్ వెళ్లి నగలు కొనుగోలు చేశారు. అక్టోబర్‌లో వివాహం చేసుకోవాలనుకున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో అమ్మాయి తరచూ ఫోన్లో మాట్లాడటం గమనించాడు అబ్బాయి. ఎవరు అని అడిగితే.. తన మాజీ బాయ్ ఫ్రెండ్ అని ఆమె బదులిచ్చింది. క్యాజువల్‌గా మాట్లాడుతుందేమో అనుకుని పట్టించుకోలేదు. అయితే అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ను బయట కలవడం చూశాడు అబ్బాయి. అతను ఇచ్చే గిఫ్ట్‌లు కూడా ఆమె తీసుకోవడం గమనించాడు. ఓ రోజు ఇద్దరూ రోడ్డుపై హగ్ చేసుకోవడం చూసి షాక్ అయ్యాడు. ఇక లాభం లేదని తెలిసి పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తనకు ఈ పెళ్లి వద్దని ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పాడు. అబ్బాయి పెళ్లి వద్దన్నాడని తెలిసి అమ్మాయి అతడ్ని ఒప్పించేందుకు ప్రత్నించింది. కానీ అతను మాత్రం ససేమిరా అన్నాడు. దీంతో పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని అమ్మాయి బెదిరించింది. విషం తీసుకుంటానని చెప్పి వీడియో కాల్లో ఓ పౌడర్‌ను కూడా చూపించింది. కానీ అబ్బాయి మాత్రం పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. దీంతో తల్లిదండ్రులతో కలిసి అమ్మాయి అతడ్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. పెళ్లి రద్దు చేసుకున్నందుకు రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే తప్పుడు కేసులు పెడతానని బెదిరించింది. ఏం చేయాలో తెలియక అబ్బాయి పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం వాళ్లకు వివరించాడు. దీంతో వారు అమ్మాయి, ఆమె తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర ముంబైలోని చార్కోప్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. చదవండి: భర్తకు తెలియకుండా అబార్షన్ మాత్ర తీసుకున్న మహిళ.. చివరకు.. -
Hyderabad: మెకానిక్‌తో వచ్చి.. రహస్య కెమెరా అమర్చి!
సాక్షి, హైదరాబాద్: అల్వాల్‌కు చెందిన ఓ మహిళ మొబైల్ షాప్‌ను నిర్వహిస్తుంది. అక్కడికి వివో మొబైల్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్న గాజులరామారానికి చెందిన సయ్యద్ రియాజ్ సెల్‌ఫోన్ విక్రయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తరుచు వచ్చేవాడు. ఈ క్రమంలో సదరు మహిళతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. ఓ రోజు మహిళ షాపులో ఉన్న సమయంలో తన భర్తతో సెల్ఫోన్లో గీజర్, ఏసీ రిపేర్ విషయమై మాట్లాడుతుండగా.. అదే సమయంలో అక్కడికి వచ్చిన రియాజ్ మెకానిక్‌ను ఏర్పాటు చేస్తానని మహిళను ఒప్పించాడు. మర్నాడు మెకానిక్‌ను తీసుకుని మహిళ ఇంటికెళ్లిన రియాజ్.. ఆమెకు తెలియకుండా ఇంట్లో రహస్య కెమెరాను అమర్చాడు. ఈ క్రమంలో ఆమె ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తన వద్ద నగ్న వీడియోలు, ఫొటోలు ఉన్నాయని, ఇంటికి పిలవకపోతే వీటిని వైరల్ చేస్తానని బెదిరించసాగాడు. తాను చెప్పినట్లు నడుచుకోకపోతే ఫొటోలు ప్రింట్ తీసి ఆమె ఇంటి పరిసరాల్లో గోడల మీద అతికిస్తానని బెదిరించాడు. ఓ రోజు మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. భయంతో ఆమె కేకలు పెట్టడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితురాలు పేట్ బషీరాబాద్ షీ టీమ్స్‌ను సంప్రదించింది. వారి సూచన మేరకు అల్వాల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ►ఈ ఒక్క కేసే కాదు.. పార్క్‌లో వాకింగ్ చేస్తున్న మహిళపై ఫ్లాష్ లైట్లు కొట్టిన ఆకతాయి, లిఫ్ట్‌లో మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరీ, పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి పరారైన వ్యక్తి తదితరులకు షీటీమ్స్ చెక్ పెట్టింది. 126 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్.. గత నెలలో సైబరాబాద్ షీ టీమ్స్‌కు 98 ఫిర్యాదులు అందాయి. వీటిల్లో 29 కేసులు నమోదు చేయగా.. 4 క్రిమినల్ కేసులు, 25 పెట్టీ కేసులున్నాయి. అత్యధికంగా 74 ఫిర్యాదులు వాట్సాప్ ద్వారా అందాయి. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్‌లో 126 మంది ఆకతాయిలకు గురువారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇందులో 20 మంది మైనర్లున్నారు. అర్ధరాత్రి డెకాయ్.. ఐటీ కంపెనీలకు నిలయమైన సైబరాబాద్‌లో రాత్రి వేళల్లో కూడా పలు కంపెనీలు పనిచేస్తుంటాయి. దీంతో మహిళా ఉద్యోగుల భద్రత, రక్షణ కోసం సైబరాబాద్ షీ టీమ్స్ అర్ధరాత్రి డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఫుడ్ కోర్ట్లు, వసతి గృహాలు, మెట్రో స్టేషన్లు, మాదాపూర్‌లోని 100 ఫీట్ల రోడ్, కూకట్పల్లి ఏరియా బస్ స్టాప్‌లు తదితర ప్రాంతాల్లో మఫ్టీలో సంచరిస్తున్న షీ టీమ్స్ బృందాలు గత నెలలో మహిళలను వేధిస్తున్న 60 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత నెల రోజుల్లో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో 477 డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించగా 31 మంది ఆకతాయిలు పట్టుబడ్డారు. -
వలపు వల విసిరి బ్లాక్మెయిల్.. రూ.80 లక్షలు వసూలు చేసిన జంట
న్యూఢిల్లీ: వ్యాపారవేత్తకు వలపు విసిరి బ్లాక్మెయిల్ చేసింది ఓ జంట. ప్రైవేటు ఫొటోలు, వీడియోలు లీక్ చేస్తామని బెదిరించి రూ.80లక్షలు వసూలు చేసింది. ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేస్తుండటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు ఆ జంటపై కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. వివారాల్లోకి వెలితే.. గురుగ్రాం బాద్‌షాపుర్‌కు చెందిన వ్యాపారవేత్త ఓ అడ్వర్టైస్మెంట్ ఏజెన్సీని నడుపుతున్నాడు. ఢిల్లీ షాలిమర్ బాగ్‌కు చెందిన నామ్రా ఖాదిర్ అనే మహిళను బిజినెస్ విషయాలు మాట్లాడేందుకు కొద్ది నెలల క్రితం ఓ హోటల్లో కలిశాడు. ఆమెతో పాటు విరాట్ అలియాస్ మనీశ్ బనీవాల్ కూడా ఉన్నాడు. పెళ్లి చేసుకుంటానని.. తన వ్యాపార పనుల కోసం నామ్రా ఖాదిర్‌కు రూ.2.50లక్షలు ఇచ్చాడు బాధితుడు. అయితే డబ్బు తీసుకున్నప్పటికీ ఆమె దానికి తగినట్లు పనిచేయలేదు. దీంతో ఆమెను అతడు ప్రశ్నించాడు. ఆ సమయంలోనే ఆమె అతడ్ని ఇష్టపడ్డానని, పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ క్లోజ్ అయ్యారు. పెళ్లి ప్రపోజల్ తర్వాత నమ్రా ఖాదిర్‌తో వ్యాపారవేత్త చాలా రోజలు కలిసితిరిగాడు. ఇద్దరూ పలుమార్లు హోటల్లో గడిపారు. ఈ క్రమంలోనే వీరిద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు విరాట్ ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత వాటిని లీక్ చేస్తామని, రేప్ కేసు పెడతామని బెదిరించి వ్యాపారవేత్త నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఇలా మొత్తం రూ.80లక్షలు కాజేశారు. అయినా ఇంకా బ్లాక్మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇక చివరకు పోలీస్ స్టేషన్ వెళ్లాడు ఆ బిజినెస్‌మేన్. ఖాదిర్, విరాట్‌పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్టోబర్ 10న ఈ జంటకు నోటీసులు పంపారు. అయితే వాళ్లు బెయిల్ కోసం గురుగ్రామ్ కోర్టును ఆశ్రయించారు. కానీ న్యాయస్థానం నవంబర్ 18న వారి పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో వాళ్లిద్దరిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ జంటను అదుపులోకి తీసుకుంటామన్నారు. చదవండి: ప్రియుడు మాట్లాడలేదని విషం తాగుతూ వీడియో తీసి.. -
కర్ణాటకలో మరో మఠాధిపతి ఆత్మహత్య.. బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మరో మఠాధిపతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. రామనగర జిల్లా మగాడి తాలుకా కెంపుపురా గ్రామంలోని శ్రీ కంచుగల్ మఠానికి చెందిన 45 ఏళ్ల బసవలింగ స్వామి సోమవారం ఉదయం శవమై కనిపించారు. ఆశ్రమం ఆవరణంలోని పూజా గది కిటికీ గ్రిల్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేచే స్వామి 6 గంటల వరకు లేవకపోవడం, పూజ గది తలుపులు మూసి ఉండటంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా.. సాధువు మరణం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా బసవలింగ స్వామి 400 ఏళ్ల చరిత్ర కలిగిన కంచుగల్ మఠానికి 1997లో ప్రధానపీఠాధిపతిగా నియామకయ్యారు. అప్పటి నుంచి (25 సంవత్సరాల పాటు) ఈ మఠానికి ఆయనే అధిపతిగా కొనసాగుతున్నారు. కొన్ని నెలల క్రితం రజతోత్సవాన్ని సైతం జరుపుకున్నారు. స్వామిజీ వద్ద రెండు పేజీల సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనను మఠాధిపతి నుంచి తొలగించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిత్వాన్ని తప్పుబడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని.. బెదిరింపులకు పాల్పడుతున్న వారి పేర్లు కూడా ఆ నోట్లో స్వామీజీ రాసినట్లు సమాచారం. అయితే బ్లాక్మెయిల్ కారణంగానే మఠాధిపతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇదిలా ఉండగారెండు నెలల క్రితం బెల్గాంలోని శ్రీ గరు మడివళేశ్వర మఠంలోని బసవ సిద్ధలింగ స్వామి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. లింగాయత్ మఠంలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఆడియోలో తన పేరు రావడంతో స్వామీజీ కలత చెంది ఉంటాడని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. చదవండి: మరదలిపై పోలీసు అత్యాచారం.. అయిదుసార్లు అబార్షన్.. -
అమెరికాలో భారత సంతతి విద్యార్థి హత్య
వాషింగ్టన్: భారత్ సంతతికి చెందిన విద్యార్థి అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. ప్రసిద్ధ పుర్డ్యూ యూనివర్సిటీ హాస్టల్లో ఈ ఘటన జరిగింది. హత్యకు పాల్పడింది రూమ్ మేటే. కొరియాకు చెందిన అతడు.. తనను మృతుడు బ్లాక్మెయిల్ చేయడం వల్లే ఈ చర్యకు పాల్పడినట్లు అంగీకరించాడు. మృతుడు వరుణ్ మనీశ్ ఛెడా(20) ఇండియానా పోలీస్‌కు చెందినవాడు. గత బుధవారం యూనివర్సిటీ మెక్కుచియాన్ హాల్లో ఉన్నప్పుడు హత్యకు గురయ్యాడు. నిందితుడు జిన్ మిన్ జిమ్మీ షా(22).. సెబైర్ సెక్యూరీటీ కోర్సు చేస్తున్నాడు. షాను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా నేరం అంగీకరించాడు. మృతుడి తల్లిదండ్రలకు క్షమాపణలు చెప్పాడు. తనను బ్లాక్మెయిల్ చేసినందుకే హత్య చేసినట్లు పేర్కొన్నాడు. అయితే ఏ విషయం గురించి అని మాత్రం వెల్లడించలేదు. వరుణ్‌ను రూంలోనే పదునైన కత్తితో జిమ్మీ పొడిచినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతడే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. హత్య అనంతరం ఆ గది రక్తపుమరకలతో నిండిపోయింది. అక్కడే ఉన్న కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రం డిప్యూటీ చీఫ్‌ను కిడ్నాప్ చేసిన రష్యా! -
లోన్‌యాప్స్ లోగుట్టు: తొందర పడ్డారో.. ఇక అంతే సంగతులు
అప్పులు ఇచ్చేటపుడు చాలా మర్యాదగా మాట్లాడతారు. ఇచ్చిన తర్వాత బాకీల వసూలు సమయంలో బండబూతులు తిడుతున్నారు. బంధుమిత్రుల్లో పరువు తీసేలా అప్పులు తీసుకున్న వారి ఫోటోలను అసభ్యంగా మార్చి వైరల్ చేస్తున్నారు. ఈ అవమానాలు భరించలేక అమాయక ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయిన వాళ్లకి విషాదాన్ని మిగులుస్తున్నారు. ఇంతటి దారుణ మారణ కాండలకు తెగబడుతోన్న యాప్ లో వెనక చైనా మూలాలు ఉన్నాయని అంటున్నారు. ఇటువంటి యాప్ లపై ఉక్కుపాదం మోపకపోతే పరిస్థితి మరింతగా విషమించే ప్రమాదం ఉంది. లోన్‌యాప్స్.. లోగుట్టు వాటి కథా కమామిష్షు ఏంటో చూద్దాం!! అవసరానికి అప్పులు ఇస్తాం.. పేపర్స్.. ప్రాసెస్ ఏమీ అవసరంలేదు ..గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌లో తరచుగా వినిపించే మాటలివి. ఆప్యాయంగా మాటలు కలిపి అప్పులు అంటకడుతోన్న యాప్‌లో ఆ తర్వాత బాకీల వసూలులో రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. లోన్ రికవరీ ఏజెంట్లను పంపి రక రకాలుగా అవమానిస్తున్నారు. వేధిస్తున్నారు. కాల్చుకు తినేస్తున్నారు. బంధుమిత్రుల్లో పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఎంతో మంది అప్పులు తీసుకున్న వాళ్లు ఆత్మహత్యలతో తమ జీవితాలకు సెలవు ప్రకటిస్తున్నారు. అయిన వాళ్లకి గుండెల నిండా విషాదాన్ని మిగిల్చి పోతున్నారు. అప్పుల వసూళ్ల ముసుగులో లోన్ యాప్ సిబ్బంది చేస్తోన్న దుర్మార్గాలకు అడ్డుకట్ట లేకపోతోంది. చాలా మంది ఈ వేధింపులను తమలో తామే దిగమింగు కుంటున్నారు. ఎవరికైనా చెబితే పరువు పోతుందేమోనని మౌనంగా నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇక భరించలేని స్థితికి రాగానే ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. పాపం ప్రత్యూష కృష్ణాజిల్లా మచిలీ పట్నం శారదానగర్ కు చెందిన జూనపూడి ప్రత్యూష డబ్బు అవసరమై ఇండియన్ బుల్స్ అనే లోన్ యాప్‌లో అప్పు కోసం ప్రయత్నించింది. లోన్ ఇవ్వాలంటే ముందుగా పదివేల రూపాయలు డిపాజిట్ చేయాలని షరతు విధించారు. ఆ పదివేల కోసం రూపెక్స్ అనే మరో లోన్ యాప్ ను ఆశ్రయించింది ప్రత్యూష. ఆ డబ్బును ఇండియన్ బుల్స్ కు చెల్లించింది. అయితే ఆ తర్వాత నుంచి ఈ యాప్ ఏజెంట్లు ప్రత్యూషను వేధించడం మొదలు పెట్టారు. ఈ బాధలు భరించలేక తన తల్లి నుండి 90వేలు తీసుకుని రెండు యాప్ లకూ చెల్లించింది. అయినా ఇంకా బాకీ ఉందంటూ ఫోన్లలో వేధించడంతో ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటువంటి ఘటనలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. అసలు నిబంధనలేం చెబుతున్నాయి? సామాన్య, మధ్యతరగతి వర్గాలే టార్గెట్ గా లోన్ యాప్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇలా అప్పులు ఇవ్వాలంటే ఈ యాప్ లకు NBFC లైసెన్స్ తప్పని సరిగా ఉండాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఈ లైసెన్సులు మంజూరు చేస్తుంది. ఈ లైసెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే లోన్ యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లో అప్ లోడ్ అవుతాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎవరికైనా అప్పులు ఇస్తే అది తీర్చడానికి కనీసం 60 రోజుల గడువు ఇవ్వాలి. ఆ నిబంధన పాటించే యాప్ లే గూగుల్ ప్లే స్టోర్ లో రిజిస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడా లోన్ యాప్ కంపెనీలు చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకుంటున్నాయి. పైకి ఒకరకమైన షరతులను పేర్కొంటూ డబ్బులు వసూలు చేసేటప్పుడు మరో పద్ధతి ఫాలో అవుతున్నాయి. లోన్లు ఇచ్చే సంస్థలెన్ని.? ఆర్బీఐ డేటా ప్రకారం.. ఫిబ్రవరి 29, 2020 నాటికి 10వేల వరకు NBFC లైసెన్స్ లు ఉన్నాయి. వారిలో 803 మాత్రమే 100 కోట్ల విలువ కలిగిన సంస్థలు ఉన్నాయి. 60 రోజుల కంటే తక్కువ కాల పరిమితి లోన్లు ఇచ్చే యాప్స్‌కు గూగుల్ ప్లే స్టోర్ అనుమతి ఇవ్వదు.పుడు మరో రకమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఇలా దేశంలో పదివేలకు పైగా లోన్ యాప్స్ ఉన్నాయి. వీటిలో మెజారిటీ యాప్ ల మూలాలు చైనాలో ఉన్నాయి. గతంలో లోన్ యాప్‌లతో మన నిబంధనలను చట్టాలను అడ్డగోలుగా ఉల్లంఘించిన చైనా కంపెనీలను అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీలు మూసివేసినా.. చైనా కంపెనీలు కొత్త కంపెనీలతో మళ్లీ ఆ దందా సాగిస్తున్నారు. లోన్ వెనక లోగుట్టు ఏంటీ? మామూలుగా బ్యాంకుల్లో పర్సనల్ లోన్ లు కావాలంటే బోలెడు డాక్యుమెంట్లు సమర్పించాలి. అదే లోన్ యాప్‌లో అయితే ఎలాంటి డాక్యుమెంట్లూ అవసరం ఉండదు. కేవలం ఆధార్ నంబర్ ఇస్తే చాలు. ఒక్కసారి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే మన ఫోనులోని సమస్త సమాచారం యాప్ నిర్వాహకులకు వెళ్లిపోతుంది. ఇక ఆ సమాచారాన్ని పట్టుకుని వారు ఇష్టారాజ్యంగా వేధింపులకు తెగబడుతున్నారు. వేధింపుల పర్వం అప్పులు తీసుకున్న వాళ్లు అనుకున్న సమయానికి బాకీ తీర్చకపోతే వారి ఫోటోలను న్యూడ్ గా మార్చేసి బంధుమిత్రుల ఫోన్లకు పంపుతున్నారు. ఫోన్లు చేసి మీకు సిగ్గులేదా? తీసుకున్న అప్పు తీర్చరా? అంటూ బూతులు తిడుతున్నారు. పరువు తీసేలా మెసేజీలు పెడుతున్నారు. ఇవి తట్టుకోలేకనే సున్నిత మనస్కులైన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తీసుకున్న అప్పుమీద లోన్ యాప్ నిర్వాహకులు వడ్డీలు, చక్రవడ్డీలు ఆపై భూచక్ర వడ్డీలూ వేసేసి పాపం పెంచినట్లు వడ్డీలు పెంచేసుకు పోతున్నారు. తీసుకున్న అప్పులకు వందల రెట్లు వడ్డీ కట్టినా ఇంకా అసలు అలానే ఉంటోంది. అదే ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఫోటో, ఆధార్ కార్డ్, కాంటాక్ట్ నెంబర్లే ష్యూరిటీగా మూడు వేల నుంచి 2 లక్షల వరకు రుణాలను అందిస్తున్నాయి ఈ యాప్స్. ఈ అప్పును పది నుంచి 15 రోజుల్లోనే తీర్చేయాలి. అప్పు సరైన సమయంలో చెల్లిస్తే సరి.. లేదంటే అప్పటి నుంచి మొదలవుతాయి వేధింపులు. తల్లిదండ్రులు, బంధువులు, ఫ్రెండ్స్‌కు ఫోన్లు చేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ.. యువతీ, యువకుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇంకా కొంత మందికైతే లోన్ కట్టడం చేతకాని నువ్వు బతకడం ఎందుకంటూ వాయిస్ మేసెజ్‌లు కూడా వస్తున్నాయి. అందుకే అసలు ఇటువంటి యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ లో లేకుండా చేయాలన్న డిమాండ్లూ వినపడుతున్నాయి. లోన్ యాప్ ల దుర్మార్గాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. ఎన్.బి.ఎఫ్.సి. లైసెన్సులు పొందిన లోన్ యాప్ లకు అనుబంధంగా పనిచేసే యాప్ లపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. ఇప్పటికే చైనాకు 4వేల 430కోట్ల రూపాయల మేరకు నిధులను తరలించిన లోన్ యాప్ లను గుర్తించిన ఈడీ ఆ యాప్ లకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ఈ అక్రమ దందాలకు పాల్పడుతోన్న వారికోసం వేట మొదలు పెట్టింది. అప్పులు లేకుండా ఎవరూ బతుకులు వెళ్లదీయలేరు. అయితే అప్పులు తీసుకునే ముందు చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. అప్పులు మనల్ని నిండా ముంచేసేలా ఉంటే మన అవసరాలను వాయిదా వేసుకున్నా ఫరవాలేదు కానీ తొందరపడి అప్పులు తీసుకుని ఊబిలో కూరుకు పోరాదు. అన్నింటినీ మించి అప్పులు ఇస్తానన్నాడు కదా అని మన సమస్త సమాచారాన్ని లోన్ యాప్ లకు తాకట్టు పెట్టేయడంలోనే అతి పెద్ద ముప్పు ఉంది. -
Hyderabad: వ్యభిచారం అంటూ హిజ్రాకు బెదిరింపులు.. తోటి హిజ్రాలతో కలిసి..
బంజారాహిల్స్: ఆన్లైన్ వ్యభిచారం నడిపిస్తున్నారంటూ ఓ హిజ్రా ఇంటికి వెళ్లిన నలుగురు విలేకరులకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... భారత్ తెలుగు న్యూస్‌లో న్యూస్ రిపోర్టర్ పి.సాయికిరణ్ రాజు, టీజీ 24/7 న్యూస్ రిపోర్టర్ కె.సంపత్ విజయ్ కుమార్, యాకుబ్‌పాషా, ప్రీలాన్స్ రిపోర్టర్ కె.ప్రశాంతి తదితరులు ఆదివారం అర్ధరాత్రి వెంకటగిరి సమీపంలోని హైలం కాలనీలో నివసించే హిజ్రా(26) ఇంటికి వెళ్లారు. ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ ఆమెతో చెప్పగా అందుకు సదరు హిజ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి వాగ్వాదానికి దిగింది. రూ. 2 లక్షలు డిమాండ్ చేయడమే కాకుండా తన సెల్ఫోన్లు ధ్వంసం చేశారని బాధిత హిజ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు విధాలా బెదిరించడంతో బాధితురాలు సహచర హిజ్రాలతో కలిసి ఈ నలుగురు విలేకరులను చితకబాది పోలీసులకు అప్పగించారు. (చదవండి: భయమేస్తోంది! చార్జింగ్ పెట్టిన గంటకే పేలిన ఎలక్ట్రికల్ బైకులు) -
తహసీల్దార్ కంత్రీ వేషాల్.. అమ్మాయిలను లోబరుచుకుని.. వీడియోలు తీసి..
►ఏదో పనిమీద కార్యాలయానికి వెళ్లిన మహిళపై కన్నేశాడు. అసైన్డ్ భూములు రాసిస్తానంటూ ఆశపెట్టాడు. నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ తన అవసరం తీర్చుకున్నాడు. ఆ తర్వాత తన కింది స్థాయి సిబ్బందికీ ఆమెను అప్పగించాడు. మొత్తంగా 8 ఎకరాల ప్రభుత్వ భూమికి ఆ మహిళ పేరుపై పట్టా చేసిచ్చాడు. ►చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయిన ఓ మహిళను చేరదీశాడు. మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఆమె ద్వారా అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి లోబరుచుకున్నాడు. ►దాదాపు 50 ఏళ్లున్న ఆ అధికారి వైద్య ఆరోగ్యశాఖతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ.. తన బిడ్డల వయస్సున్న కొందరు విద్యార్థుల జీవితాలను బలిచేశాడు. పైగా వారి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ నరకం చూపుతున్నాడు. ►ఇలా...ఎందరో మహిళల జీవితాలను నాశనం చేసిన ఆ తహసీల్దార్ అక్రమార్జనలోనూ ఆరితేరిపోయారు. అనంతపురం శ్రీకంఠంసర్కిల్: మండలానికి మెజిస్ట్రేట్.. జవాబుదారీగా ఉండాల్సిన అధికారి దారి తప్పారు. మద్యం, మగువ, మనీ కోసమే ఉద్యోగమంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. వారానికి పాతిక లక్షలు అక్రమంగా ఆర్జిస్తున్నాడు..వీకెండ్లో అమ్మాయిలతో బెంగళూరుకు వెళ్లి సేదదీరుతున్నాడు. ఇటీవల ఈ అధికారి అవినీతి అక్రమాలపై ఓ వృద్ధురాలు కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేయగా.. ఆమె ఆర్డీఓను విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన ఆర్డీఓకు కళ్లుబైర్లుకమ్మే నిజాలు తెలియడంతో ఆయన సమగ్ర నివేదిక సిద్ధం చేసి కలెక్టర్‌కు సమర్పించారు. ఆమె దాన్ని సీసీఎల్ఏకు పంపనున్నట్లు తెలుస్తోంది. చదవండి: బయటపడ్డ బండారం: అత్యాశకు పోయి.. ఆస్తి మొత్తం పోగొట్టుకుని.. చేయి తడపందే పని జరగదు గతంలో ధర్మవరం రెవెన్యూ డివిజన్లో పనిచేసిన సదరు తహసీల్దార్‌పై అవినీతి అరోపణలు వెల్లువెత్తాయి. భారీగా ముట్టజెప్పనిదే ఆయన పనిచేయరని బాధితులు గగ్గోలు పెట్టారు. పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే సొంత శాఖ ఉద్యోగిపై ప్రేమ చూపిన అధికారులు ఆ తహసీల్దార్‌ను అక్కడి నుంచి ఉరవకొండ నియోజకవర్గానికి బదిలీ చేశారు. అక్కడ కూడా ఆయన పనితీరు మార్చుకోలేదు. పాత రూటులోనే వెళ్తూ భారీగా వెనకేసుకున్నారు. సంవత్సరం వ్యవధిలోనే 350 మ్యుటేషన్లు చేశారు. ఇందులో 23 అనధికారికంగా చేసినట్లు విచారణలో తేలింది. ఏకంగా రూ.6 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ♦అనంతపురం అశోక్‌నగర్‌లో రూ.1.50 కోట్లు విలువైన భవనంలో ఉంటున్న సదరు అధికారి...సమీపంలో ఉన్న రూ.2 కోట్ల బిల్డింగ్ కొనుగోలుకు రూ.50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలిసింది. మరో అపార్టుమెంట్ కూడా బినామీల పేరుతో కొనుగోలు చేసి ఆధునికీకరణ పనులు చేయిస్తున్న సమాచారం. ♦బెంగళూరులో ఆరు అంతస్తుల అధునాతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ♦ఇటీవలే కాలువపల్లి సమీపంలో 30 ఎకరాల దానిమ్మతోట కొనుగోలు చేసినట్లు అధికారులే గుర్తించారు. అందరినీ ఏకం చేసి... తాను పనిచేసే మండల కేంద్రంలో బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులను చేరదీసి దందాలకు దిగాడు. ఒక ఆర్ఎస్ఐ, వీఆర్ఓ, ఆర్ఐలతో జట్టుకట్టి భూ వివాదాలకు తెరతీశారు. రైతులు తమకు జరిగిన అన్యాయంపై నోరు మెదపాలని చూస్తే ఓ వైపు పోలీసులను, మరో వైపు రెవెన్యూ సిబ్బందిని అడ్డు పెట్టుకుని దారికి తెచ్చుకుంటున్నారు. వీడియో కాల్స్‌తో... భారీగా ఆర్జిస్తున్న సదరు తహసీల్దార్‌కు అమ్మాయిలపై వ్యామోహం ఎక్కువ. పైగా ఉదయం 11 గంటల నుంచి మద్యం మత్తులో ఉంటాడని అధికారులే చెబుతున్నారు. కార్యాలయంలో గంట కూడా ఉండని ఆయన...ఆ తర్వాత తన మండల పరిధిలోనే ఓ గదిలో మహిళలతో కలిసి రాచకార్యాలు వెలగబెడుతుంటారని చెబుతున్నారు. యువతులకు డబ్బు ఎరవేసి బలితీసుకునే సదరు అధికారి తనకు నచ్చిన యువతి... ముందుగా వీడియో కాల్లో నగ్నంగా చూడాలని షరతు పెడతాడు. ఆ తర్వాతే ఆమెతో గడుపుతాడు. నచ్చితే తనతో పాటు కారులో తీసుకెళతాడు. అనంతపురం నగరంలోని మూడ నక్షత్రాల హోటల్లో ఆయన బస చేస్తారని తెలుస్తోంది. ఇలా కొందరితో సదరు తహసీల్దార్ చేసిన వీడియో చాట్లు ఇప్పుడు బహిర్గతం కాగా, ఉన్నతాధికారులు వాటిని కూడా నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. -
ప్రేమ పేరుతో లైంగికంగా దగ్గరై.. ఆ దృశ్యాలను వీడియో తీసి
మైసూరు: యువతులను ప్రేమించినట్లు నటించి లైంగికంగా దగ్గరై నగ్న దృశ్యాలను వీడియో తీసి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్న వంచకుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా బసవటిక గ్రామానికి చెందిన గురుసిద్దప్ప కుమారుడు బీ.జీ. శివప్రకాశ్.. గూగుల్ మీట్, ఫేస్‌బుక్‌ద్వారా యువతులకు రిక్వెస్ట్ పెట్టి పరిచయం పెంచుకొని ప్రేమిస్తున్నట్లు నటించేవాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాంఛలు తీర్చుకునేవాడు. ఆ సమయంలో యువతులకు తెలియకుండా వీడియోలు తీసేవాడు. డబ్బు ఇవ్వకపోతే నగ్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బెదిరించేవాడు. బాధిత యువతులు ఇచ్చిన ఫిర్యాదుతో మైసూరు నగర మహిళా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: (ప్రియురాలికి హాయ్ చెప్పాడని.. మరోసారి వీడు నీ జోలికి రాడంటూ) -
‘నీకు పెళ్లయింది కదా’.. ‘నా భార్య మూడేళ్లకన్నా ఎక్కువ కాలం బతకదు’
పంజగుట్ట: ‘నారాయణపేట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి తన భార్య త్వరలో చనిపోతుందని నన్ను నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాకు తెలియకుండా ఫొటోలు తీసి వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు’అని బాధిత కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఆవేదన చెందింది. శివకుమార్‌రెడ్డి అకృత్యాలపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి👉🏼 ప్రేమపేరుతో బాలికను మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివకుమార్ రెడ్డికి అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు 2020లో పరిచయమైంది. పార్టీ కార్యకలాపాల కోసం ఆయన్ను కలిసేందుకు తరచూ సదరు మహిళ రాగా ఆమెపై కన్నేశాడు. కల్లబొల్లి మాటలు చెప్పి ప్రేమిస్తున్నానన్నాడు. ‘నీకు పెళ్లయింది కదా’ అని ఆమె ప్రశ్నించగా ‘నా భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. మూడేళ్లకన్నా ఎక్కువ కాలం బతకదు’అని నమ్మబలికాడు. తనకో తోడు కావాలంటూ ఆమె మెడలో పసుపు తాడు కట్టి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అయిపోయిందని చెప్పాడు. మాట్లాడుకుందామని పంజగుట్టలోని ఓ హోటల్‌కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని నెట్లో పెడతానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇప్పుడు దూరంగా ఉండటమే కాకుండా అనుచరులతో బెదిరింపులకు దిగుతున్నాడని ఆ మహిళ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి👉🏾 వంట విషయంలో తల్లి, కూతురు గొడవ.. ఖాళీ బీరు సీసా తీసుకుని.. -
కాబోయే భర్తే కదా అని దగ్గరైంది.. ఆ తర్వాత సీక్రెట్ ఫొటోలు..
శృంగవరపుకోట రూరల్: ప్రేమ పేరుతో సహోద్యోగినిని లోబరుచుకుని.. పెళ్లికి నిరాకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విజయనగరం ఏఎస్పీ అనిల్ పులిపాటి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్.కోట మండలం వేములాపల్లి గ్రామానికి చెందిన శీరెడ్డి నవీన్ మండలంలోని ముషిడిపల్లి గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిని ప్రేమిస్తున్నానంటూ చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కూడా నవీన్ చెప్పాడు. కొన్నాళ్ల తర్వాత ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని బాధిత యువతి అడిగితే, ఇంటి నిర్మాణం జరుగుతోందని.. పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి తప్పించుకున్నాడు. అలాగే ఇంటి నిర్మాణానికి నగదు అవసరమని, కట్నం కావాలని యువతిని వేధించడం మొదలు పెట్టాడు. యువతి తండ్రి గట్టిగా నిలదీస్తే మొదట్లో మహిళా ఉద్యోగినితో తీసుకున్న అభ్యంతరకర ఫోటోలను అతని ఫోన్‌కు పంపించాడు. దీంతో నవీన్‌పై బాధిత యువతి ఎస్.కోట పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు నవీన్‌ను అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. సీఐ ఎస్. సింహాద్రినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో ఎస్సైలు జె.తారకేశ్వరరావు, జి.లోవరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: విందు కోసం ఆహ్వానిస్తే.. ఆమె లవర్ ఎంత పని చేశాడు.. -
రష్యా మెలిక.. ‘ఇది దారుణం.. అస్సలు బాలేదు’
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులని పశ్చిమ దేశాలు తప్పుబట్టింది. ఈ దాడులను ఆపాలని ఎంత చెప్పినా ఫలితం లేకపోడంతో పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే తానేమి తక్కువ కాదని రష్యా కూడా కొన్ని దేశాలపై ఆంక్షలు విధించింది. అందులో భాగంగానే పశ్చిమ దేశాల ఆంక్షల నుంచి తమ దేశ ఆర్ధిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఓ నిర్ణయం తీసుకుంది. ఇకపై రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయాలనుకునే దేశాలు.. ముఖ్యంగా అవి తమ మిత్రదేశాలు కాకపోతే రష్యా కరెన్సీ (రూబెల్స్)లోనే చెల్లింపులు ఉండాలని లేదంటే సరఫరా చేయబోమని రష్యా మెలికపెట్టింది. తాజాగా ఈ నిబంధనల ప్రకారం.. రూబెల్స్లో చెల్లింపులు చేయడంలో విఫలమైన పోలాండ్, బల్గేరియాకు గ్యాస్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. కాగా యూరోపియన్ దేశాలకు అత్యధికంగా గ్యాస్, చమురు సరఫరా చేసేది రష్యానే. ప్రస్తుతం ఈ నిర్ణయంతో ఆ దేశాల మార్కెట్లో హోల్‌సేల్ గ్యాస్ ధర 20% పెరిగింది. ఇది గత సంవత్సరం క్రితం కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ చర్యను ఖండించారు. ఆమె దీనిపై స్పందిస్తూ.. యూరోప్‌లోని వినియోగదారులకు గ్యాస్ డెలివరీని నిలిపివేస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. రష్యా చేస్తోంది బ్లాక్‌మెయిలింగ్ అని దుయ్యబట్టారు. తాము అన్ని సభ్య దేశాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నామని, గ్యాస్ సమస్యను తీర్చేందుకు ఓ కమిషన్ ఏర్పాటు చేశామని అది యూరప్ వెలుపల ఉన్న దేశాలతో చర్చలు జరుపుతోందని ఆమె తెలిపారు. చదవండి: Karachi University Blast: ఇద్దరు పిల్లల తల్లి, సైన్స్ టీచర్.. మహిళా సుసైడ్ బాంబర్ గురించి షాకింగ్ విషయాలు -
ఫేస్బుక్ చాటింగ్.. మార్ఫింగ్ చేసిన వీడియోలతో..
సాక్షి,బంజారాహిల్స్: ఫేస్బుక్ చాటింగ్ ద్వారా టచ్‌లోకి వచ్చిన ఓ అపరిచితుడు మార్పింగ్ చేసిన వీడియోలు పంపిస్తూ బ్లాక్‌మెయిన్ చేస్తున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న రాజీవ్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. దీంతో పాటు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అతడి ఫేస్బుక్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు. ఫోన్ నెంబర్ ఇవ్వాలని కోరాడు. దాంతో అతడికి రాజీవ్ తన నెంబర్ ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత రాజీవ్ ఫేస్బుక్లో ఉన్న కొన్ని ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటిని వేరొకరి శరీరాలతో కలిసి వీడియోలు తయారు చేసిన దుండగులు అతడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. తమకు డబ్బులు ఇవ్వాలని లేకుంటే ఫేస్‌బుక్‌లోని స్నేహితుల గ్రూపులకు షేర్ చేస్తామని బెదిరించారు. దీంతో రూ. 3469 చొప్పున మూడుసార్లు పంపించినా ఇదే తీరులో బ్లాక్మెయిల్ చేస్తుండటంతో బాధితుడు రాజీవ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి👉🏻 కొత్త సినిమా లింకులని కక్కుర్తిపడితే.. ఖేల్ ఖతం -
సైబర్ నేరస్తుల సెక్స్టార్షన్
ప్రభుత్వ విభాగంలో జాయింట్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న ఓ అధికారి కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఓ రోజు రాత్రి 10 గంటలకు ఫేస్‌బుక్‌లోని మెసెంజర్ ద్వారా వీడియో కాల్ వచ్చింది. ఆన్లైన్లోనే ఉన్న ఆ విద్యార్థి ఆన్సర్ చేశాడు. ఎదురుగా ఓ అమ్మాయి న్యూడ్ పొజిషనల్లో ఉండి మాట్లాడింది. ఓ 30 సెకన్లు కాల్‌లోనే ఉన్న ఆ అబ్బాయి తర్వాత కట్ చేశాడు. అంతలోనే అదే పేరుతో ఉన్న ఐడీ నుంచి అతడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా యాక్సెప్ట్ చేశాడు. అంతే.. అమ్మాయితో న్యూడ్‌గా చాట్ చేశావని అతడి కాంటాక్ట్ లిస్టులో ఉన్న కుటుంబీకులు, సన్నిహితులకు వీడియో షేర్ చేస్తానని బెదిరింపులు మొదలయ్యాయి. సమస్య నుంచి బయటపడేందుకు అవతలి వ్యక్తి అడిగిన రూ.10 వేలను ఫోన్ పే ద్వారా ఆ అబ్బాయి బదిలీ చేశాడు. పది వేలతో మొదలైన వ్యవహారం రూ.1.50 లక్షల వరకు వెళ్లింది. అయినా వేధింపులు ఆగలేదు. స్నేహితుడి తండ్రి పోలీస్ అధికారి కావడంతో సంప్రదించాడు. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసి సమస్య నుంచి బయటపడ్డాడు. ఇది కేవలం ఒకరకమైన బెదిరింపు వ్యవహారమే. ఇలాంటి మూడు, నాలుగు రకాల పద్ధతుల్లో బ్లాక్ మెయిల్ చేస్తూ యువతతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు, ప్రొఫెషనల్ ఉద్యోగాల్లో ఉన్న వారి నుంచి సైబర్ నేరగాళ్లు భారీగా దండుకుంటున్నారు. ఫేస్బుక్, టిండర్, వాట్సాప్.. ఇలా మూడు వేదికల ద్వారా ఎదుటి వ్యక్తులను మానసికంగా హింసించి దోపిడీకి పాల్పడుతున్నారు. అశ్లీల వీడియోల లైవ్ లింక్‌ను వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ల ద్వారా షేర్ చేసి అవతలి వ్యక్తికి వీడియో కాల్ చేస్తారు. కాల్ ఆన్సర్ చేయగానే లైవ్ లింక్‌లో అశ్లీలత మొదలవుతుంది. దీనికి కొంత మంది యుక్త వయస్కులు ఆక్షరణకు గురై సైబర్ నేరస్థుడి చేతికి దొరికిపోతున్నారు. అవతలి వ్యక్తులు వీడియో కాల్‌ను ఆటోమేటిక్ రికార్డు చేసి బెదిరిస్తున్నారని సైబర్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. ఎలా టార్గెట్ చేస్తారు? ఎవరైనా అమ్మాయి పేరు, నకిలీ ఫొటోతో నకిలీ ఫేస్బుక్ ఐడీని సైబర్ నేరగాళ్లు రూపొందిస్తారు. లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తికి ఫేస్బుక్లో ఆ ఐడీ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. అవతలి వ్యక్తి యాక్సెప్ట్ చేయగానే మెల్లెగా చాట్‌లోకి లాగుతారు. అలా మొదలైన చాట్ కాస్తా మొబైల్ నంబర్లు ఇచ్చి పుచ్చుకునే వరకూ వెళ్తుంది. ఆ తర్వాత వాట్సాప్ చాట్‌లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం.. అడల్డ్ కంటెంట్, న్యూడ్ చాట్ చేసుకునే వరకు తీసుకొస్తారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. చాట్ నుంచి వీడియో కాల్స్‌లోకి లాగుతారు. అవతలి వైపు నుంచి రికార్డు చేసిన ఓ న్యూడ్ వీడియోను వాట్సాప్ కాల్లో లైవ్లాగా చిత్రీకరించి ఎదుటి వ్యక్తిని న్యూడ్ చాట్‌లోకి తీసుకొస్తారు. ఈ మొత్తం కాల్‌ను రికార్డు చేసి తర్వాత అదే వ్యక్తి వాట్సాప్‌కు వీడియో షేర్ చేస్తారు. ఇలా షేర్ చేసిన వీడియోతో డబ్బులివ్వకపోతే యూట్యూబ్‌లో పెడతామని బెదిరిస్తారు. యువతులను బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి అమ్ముకుంటున్నారని ప్రచారం చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇలాంటి ఎక్స్టార్షన్ కాల్స్ దాదాపు 90 శాతం.. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట మధ్యే జరుగుతున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ దేశంలో ఒక్క ఏడాదే 2.5లక్షల కేసులు వాట్సాప్, ఫేస్బుక్, టిండర్ ద్వారా సెక్స్ ఎక్స్టార్షన్ వ్యవహారంలో 2020లో (కరోనా సమయం) దేశవ్యాప్తంగా 2.5 లక్షల కేసులు నమోదయ్యాయని కేంద్ర హోం శాఖ లెక్కల్లో స్పష్టమైంది. రాజస్థాన్, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఇలాంటి నెట్‌వర్క్‌ను సైబర్ మాఫియా నడిపిస్తోందని దర్యాప్తు విభాగాల ద్వారా బయటపడింది. ఇలాంటి కేసులకు సంబంధించి 2021లో ఢిల్లీ పోలీసులు 70 మంది గ్యాంగ్‌ను అరెస్టు చేశా రు. రాష్ట్రంలోనూ సైబరాబాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లలో ఇలాంటి కేసులు భారీగా నమోదవుతున్నాయి. సెక్స్ ఎక్స్టార్షన్ కు సంబంధించి గతేడాది 650కి పైగా కేసులు నమోదైనట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. భయపడొద్దు.. అశ్లీల వీడియో కాల్స్ వస్తే వెంటనే సంబంధిత అకౌంట్‌ను బ్లాక్ చేయడంతో పాటు బాధిత వ్యక్తి వారి ఫేస్బుక్ అకౌంట్‌ను తాత్కాలికంగా డీ యాక్టివ్ చేసుకుంటే మంచిది. ఆ వీడియో ద్వారా వాట్సాప్ కాంటాక్ట్ నుంచి ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. బయపడి సైబర్ నేరస్థుడికి డబ్బులు పంపితే వేధింపులు పెరుగుతాయని గుర్తించాలి. – ప్రసాద్ పాటిబండ్ల, డైరెక్టర్, సీఆర్‌సీఐడీఎఫ్ -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్వాకం.. మహిళ కాల్ రికార్డింగ్, వీడియోలు, ఫోటోలతో..
సాక్షి, హైదరాబాద్: రహస్యంగా ఓ మహిళ సెల్ఫోన్లో కాల్ రికార్డింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసి.. ఓ మహిళను వేధించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి..ఓ వివాహితకు ఏడాది క్రితం ఫేస్బుక్లో రామచంద్రాపురం బీడీఎల్ కాలనీకి చెందిన తాళ్ల అనుప్ గౌడ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి తరచూ మాట్లాడుకోవటం, కలుసుకోవటం చేసేవాళ్లు. గత అక్టోబర్‌లో బాధితురాలిని బయట కలిసిన నిందితుడు ఆమెకు తెలియకుండా సెల్ఫోన్లో ‘సర్బ్యూస్’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేశాడు. దీంతో సెల్‌ఫోన్ హ్యాక్ చేసి.. ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఫోన్ సంభాషణలు సేకరించాడు. అప్పటినుంచి ఆమెను శారీరక సంబంధం కొనసాగించాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. లేని పక్షంలో ఫొటోలు, వీడియోలు భర్త, కుటుంబ సభ్యులకు పంపిస్తామనని బెదిరించాడు. దీంతో ఆమె అనుప్ నంబర్‌ను బ్లాక్ చేసింది. దీంతో అతను వేరే ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేసి దుర్భాషలాడాడు. దీంతో బాధితురాలు హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. సెక్షన్ 354 (డీ), 506 కింద కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: పండగ వేళ విషాదం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసి.. తల్లి ఆత్యహత్య 64 మంది పోకిరీల ఆటకట్టు.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత ఆరు వారాల్లో రాచకొండ షీ టీమ్స్‌కు 64 మంది ఆకతాయిలు చిక్కారు. ఇందులో 23 మంది మైనర్లు కావడం గమనార్హం. 57 కేసు లు నమోదు కాగా.. వీటిలో 24 ఎఫ్ఐఆర్లు, 23 ఈ–పెట్టీ కేసులు, 10 కౌన్సెలింగ్ కేసులున్నాయి. భూమిక ఉమెన్స్ కలెక్టివ్, రాచకొండ షీ టీమ్స్ సంయుక్తంగా ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ ఆఫీస్‌లో వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించాయి. అలాగే షీ టీమ్స్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి.. మెట్రో రైల్ లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కిన 16 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్టేషన్ మాస్టర్‌కు జరిమానా విధించారు. గత 45 రోజుల్లో చౌటుప్పల్, ఇబ్రహీంపట్నంలో రెండు బాల్య వివాహాలను అడ్డుకున్నారు. ఇప్పటివరకు రాచకొండ షీ టీమ్స్ 136 చైల్డ్ మ్యారేజ్‌లను అడ్డుకున్నాయి. -
ఏ ‘క్లిక్’లో ఏ ‘కీడు’ దాగుందో!
అంతర్జాలం (ఇంటర్నెట్)లో ఉన్న విచిత్రం ఏమిటంటే... ‘మాకేమీ తెలియదు’ అనేవాళ్లే కాదు... ‘మాకంతా తెలుసు’ అనుకునేవాళ్లు కూడా బోల్తా పడుతుంటారు. ఎందుకంటే కొత్త ప్రమాదాలు సరికొత్త రూపాల్లో వస్తుంటాయి. అందుకే అంతర్జాలం అంటే ఆసక్తి మాత్రమే కాదు అనేక రకాలుగా అప్రమత్తంగా ఉండాలి... బెంగళూరుకు చెందిన ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల దర్యాప్తులో తేలిన విషయమేమిటంటే కొందరు ఆకతాయిలు ఆన్లైన్లో ఆమెను వేధించడం మొదలు పెట్టారు. ఆమె ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడంతో ఆమె తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ముంబైకి చెందిన శ్వేత పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపోమాపో పెళ్లి. ఈలోపు అబ్బాయి తండ్రి నుంచి కబురు వచ్చింది. ‘పెళ్లి క్యాన్సిల్’ అని! అమ్మాయి తరపు వాళ్లు ఆవేశంతో అతడిని నిలదీయబోతే కొన్ని ఫొటోలు చూపించాడు. శ్వేత ఎవరో అబ్బాయితో ఉన్న ఫోటోలు అవి. అంతే! ఆవేశంగా వచ్చిన వారు సైలెంటైపోయారు. వచ్చిన దారినే తిరిగి వెనక్కి వెళ్లారు. ‘మా పరువంతా తీశావు’ అని కూతురిని తిట్టడం మొదలు పెట్టారు తల్లిదండ్రులు. ‘ఈ బతుకు వృథా. ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదు’ అనుకుంది శ్వేత. కాని అలా చేస్తే నిందను నిజం చేసినట్లవుతుంది కాబట్టి తనకు జరిగిన అన్యాయంపై పోలీసులతో మాట్లాడింది. వాళ్లు దర్యాప్తు చేయగా తెలిసిన విషయం ఏమిటంటే, అవి మార్ఫింగ్ ఫోటోలని. తామంటే గిట్టని బంధువులే ఈ పని చేశారు! ఒక్క మార్ఫింగ్ అనేకాదు... ఆర్థిక మోసాలు, సైబర్ బుల్లింగ్... మొదలైనవి అంతర్జాలం అంటే అంతులేని భయాన్ని సృష్టిస్తున్నాయి. అందుకే కొందరు మహిళలు అంతర్జాలానికి అందనంత దూరంలో ఉంటున్నారు. కాని ఇది సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకంటే మన జీవితంలో ఇప్పుడు ప్రతిదీ ఇంటర్నెట్తోనే అనుసంధానమై ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దిల్లీకి చెందిన ‘సోషల్‌మీడియా మ్యాటర్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ‘మోసం జరిగాక అయ్యో! అని నిట్టూర్చడం కంటే మోసం జరిగే అవకాశమే ఇవ్వకుంటే బాగుంటుంది కదా!’ అనే విధానంతో రంగంలోకి దిగింది. పన్నెండుమంది యువతీ యువకులు ఉన్న బృందం సోషల్ మీడియా మ్యాటర్స్. సేఫ్ ఇంటర్నెట్ గురించి అవగాహన తరగతులు నిర్వహిస్తున్న ‘సోషల్ మీడియా మ్యాటర్’ సంస్థ సభ్యులు స్కూల్, కాలేజీ, యూనివర్శిటీ, కార్పొరేట్, ప్రభుత్వ కార్యాలయాలు... మొదలైన వాటిలో ఇంటర్నెట్ సెక్యూరిటీ గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ క్లాసులు బోర్ కొట్టకుండా ఉండటానికి ఎమోజీకేషన్ టెక్నిక్ ఉపయోగించడంతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన విషయాలను సందర్భోచితంగా ఉదహరిస్తారు, పిట్టకథలు చెబుతారు. ఆకట్టుకునే చిత్రాలను ప్రదర్శిస్తారు. ‘రూల్స్ అండ్ టూల్స్ వితిన్ సైబర్‌స్పేస్’లో భాగంగా డాటా ప్రొటెక్షన్, ప్రైవసీ కాపాడుకోవడం, సెక్యూరిటీ ఆఫ్ కనెక్షన్స్... మొదలైన వాటిపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది సోషల్ మీడియా మ్యాటర్స్. వర్క్‌షాప్‌కు వెళ్లడానికి మొదట్లో ఆసక్తిగా అనిపించలేదు. ఫ్రెండ్‌తో కలిసి వెళ్లా. ఇంటర్నెట్ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే ఎంత ప్రమాదమో తెలుసుకున్నాను. అక్కడ తెలుసుకున్న విషయాలు ఇప్పుడు నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. – ఆనంది, నాగ్‌పూర్ -
ఫొటో మార్ఫింగ్ మోసాలు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది!
సాక్షి, శ్రీకాకుళం: వందలాదిగా ఫొటోలను చాలా మంది సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ప్రొఫైల్ పిక్స్‌కు లాక్ కూడా పెట్టుకోరు. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది అంత మంచి పని కాదని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందని సైబర్ అవేర్నెస్ వీక్‌లో వారు అవగాహన కల్పిస్తున్నారు. మోసం జరిగే విధానాలు సెక్స్ టార్షన్ సంబంధిత నేరాలు అనేక రకాలుగా జరుగుతాయి. ఇంటర్నెట్లో ఉన్న డేటింగ్ వెబ్సైట్/యాప్స్‌లలో సైబర్ నేరస్తులు ఆకర్షణీయమైన ఫేక్ ప్రొఫైల్ పెడతారు. మొదట్లో తియ్యటి మోటలతో బాధితులను నమ్మించి, వారి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను తీసుకుని తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెడతారు. సైబర్ నేరస్తులు ఇంటర్నెట్లో ఫేక్ మాట్రిమోనియల్ వెబ్సైట్లు కూడా రిజిస్టర్ చేసి ఆకర్షణీయమైన ఫేక్ ప్రొఫైల్స్‌ను ఉంచుతారు. ఎవరైనా వీరి ఉచ్చులో పడితే పై మాదిరిగా బ్లాక్మెయిల్ చేసి దోచుకుంటారు. కొన్నిసార్లు బాధితునికి నేరస్తునిపై పూర్తి నమ్మకం కుదరగానే వారితో నీ పేరు మీద ప్లాట్/హౌస్ కొంటున్నానని, కానీ వారి డబ్బులు స్టాక్ మార్కెట్లో ఇరుక్కున్నాయని, డౌన్ పేమెంట్ కోసం వారి అకౌంట్‌కు మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కోరి అందిన కాడికి దోచుకుంటారు. పిక్చర్ మార్ఫింగ్ సైబర్ నేరస్తులు ఐడెంటిటీ థెఫ్ట్› ద్వారా బాధితుని ఫొటోలు దొంగిలించి వాటిని మార్ఫింగ్ చేస్తారు. ఇంటర్నెట్/సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్లోడ్ చేస్తామని, బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బును దోచుకోవడం లేదా లైంగికంగా వేధించడం చేస్తారు. వాట్సాప్‌లు, ఫేస్ బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సైబర్ నేరస్తులు బాధితులను ఆకర్షించి వారితో సెక్స్ చాట్స్, న్యూడ్ వీడియో కాల్స్‌కు ప్రేరేపించి వాటిని రికార్డు చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని, ఫ్యామిలీ/ఫ్రెండ్స్‌కు పంపిస్తామని బ్లాక్ మెయిల్ చేసి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. హనీ ట్రాప్‌లో ఇది ఒక కొత్త తరహా నేరం. ఈ సైబర్ నేరాల్లో స్త్రీలే ఎక్కువగా బాధితులైనప్పటికీ చాలాచోట్ల మగవారు కూడా బాధితులైన ఘటనలు ఉన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► ఇంటర్నెట్లో ఉండే డేటింగ్ వెబ్సైట్/యాప్స్, ఫేక్ మాట్రిమోనియల్ సైట్లలో ఉండే ఫేక్ ప్రొఫైల్స్‌పై అప్రమత్తంగా వ్యవహరించాలి. ► అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ చాటింగ్ లేదా వీడియో కాల్స్ వంటివి చేయకూడదు. ► మన పర్సనల్ ఫొటోలు/వీడియోలు ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. చాలాసార్లు మనకు బాగా తెలిసిన వ్యక్తే ఇలాంటి నేరాలకు పాల్పడుతుంటారు. ► సైబర్ నేరస్తుల నుంచి మన డేటా లేదా ఐడెంటిటీ థెఫ్ట్ కాకుండా సోషల్ మీడియా అకౌంట్స్‌కు స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఉంచుకోవాలి. ► టీనేజ్ పిల్లలు ఇలాంటి సైబర్ మోసాలకు తొందరగా ఆకర్షితులవుతారు. వారికి ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా వివరించాలి. -
వారం రోజుల్లో పెళ్లి.. ఇదేంటే.. అసలు విషయం తెలిసి
‘‘కావ్యా (పేరుమార్చడమైనది) ఒక్కసారి కళ్లు తెరువమ్మా! ఏమైందే. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడిలా చేశావ్, నీకీ పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెబితే సరిపోయేది కదా!’’ సుభద్రమ్మ ఏడుస్తునే ఉంది. ‘‘నువ్వు కాసేపు మౌనంగా ఉండు’’ అంటూ భర్త రాఘవరావు సుభద్ర మీద కేకలేశాడు. కాసేపటికి కావ్య లేచి తల్లిదండ్రులని చూసి, తలదించుకుంది. ‘‘ఏమైందమ్మా! కాస్త ఆలస్యమైతే ఎంత దారుణం జరిగేది. ఉరివేసుకునే పరిస్థితి ఎందుకొచ్చింది తల్లీ’’ అనునయంగా అడిగాడు రాఘరావు. ఆ మాటలతో కావ్య తండ్రిని పట్టుకుని ఏడుస్తూనే ఉండిపోయింది. ‘‘నీకు ఇష్టమని చెప్పాకనే కదా, పెళ్లి పెట్టుకున్నది..’ సందేహంగా అడిగాడు కూతుర్ని. ‘‘నిజమే నాన్నా!’’ అంటూ ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయిన కూతుర్ని చూసి, భయమేమీ లేదమ్మా ఇప్పటికైనా చెప్పు. ‘‘పెళ్లి ఆపేద్దామంటే వాళ్లకు చెప్పేస్తే. నీ చావు చూసే పెళ్లి వద్దమ్మా!’ అన్నాడు రాఘరావు. ‘‘అది కాదు నాన్న నేను ఎంతగానో నమ్మిన వంశీ (పేరుమార్చడమైనది) నన్ను టార్గెట్ చేశాడు’’ ఏడుస్తూనే చెప్పింది కావ్య. అర్థం కాక ‘‘వంశీ నీ బెస్ట్ ఫ్రెండ్ కదమ్మా, ఏమైంది’’ కంగారుగా అడిగాడు. కూతురు చెప్పిన విషయం వినడంతోనే రాఘవరావు కోపంతో ఉగిపోయాడు. ∙∙ కావ్య తన క్లాస్మేట్ వరుణ్(పేరు మార్చడమైనది)తో స్నేహంగా ఉండేది. బీటెక్ నాలుగేళ్లూ ఇద్దరూ చాలా క్లోజ్‌గా తిరిగారు. పెద్దలకు చెప్పి, పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ, ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. ఇద్దరూ ఒక అవగాహనతో తాము క్లోజ్‌గా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలు డిలీట్ చేసుకున్నారు. రెండుమూడు నెలల వరకు ఎవరి పనుల్లో వారుండిపోయారు. ఓ రోజు ఫ్రెండ్ ఫోన్ చేసి, డేటింగ్ సైట్స్‌లో కావ్య వరుణ్ క్లోజ్‌గా ఉన్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయని చెప్పింది. వాటిని కావ్య చూసింది. వరుణ్‌కి ఫోన్ చేసి తిట్టింది కావ్య. తనేమీ వాటిని షేర్ చేయలేదని రివర్స్ అయ్యాడు వరుణ్. ఈ విషయాన్ని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన వంశీకి చెప్పింది. ఎలాగైనా ఆ సైట్స్ నుంచి తన ఫొటోలు డిలీట్ చేయించమని వేడుకుంది. కావ్య చెప్పినట్టు వంశీ వాటిని వివిధ సైట్స్ నుంచి తొలగించేశాడు. ‘హమ్మయ్య’ అనుకుని వంశీకి ‘థాంక్స్’ చెప్పింది. ఆరు నెలల తర్వాత ఇంట్లో పెద్దలు చూసిన సంబంధానికి ఓకే చెప్పింది. త్వరలో పెళ్లి అనుకున్నారు. భవిష్యత్తు సంతోషంగా ఉండబోతుందనుకున్న కావ్యకు పాత వీడియోలు, ఫొటోలు మళ్లీ వివిధ రకాల సైట్లలో అప్లోడ్ అయి ఉండటంతో షాకైంది. వంశీని అడిగితే పెళ్లికి ముందు తనతో గడిపితేనే, అవన్నీ తీసేస్తానని, లేదంటే సమాచారం అంతా పెళ్లికొడుక్కి చేరుతుందని బెదిరించడం మొదలుపెట్టాడు వంశీ. షాకైంది కావ్య. ‘సైట్స్ నుంచి తొలగించినట్టే తొలగించి, అవన్నీ దాచిపెట్టుకొని, పెళ్లి కుదిరే సమయానికి పాత వీడియోలను, ఫొటోలను అడ్డుపెట్టుకొని తన జీవితంతో ఆడుకుంటున్నాడ’ని అర్ధమైంది కావ్యకు. పెళ్లి ఆగిపోతుందని, పరువు పోతుందని భయపడి చావే శరణ్యం అనుకుంది. విషయమంతా తెలుసుకున్న రాఘరావు కూతురుని తీసుకొని పోలీసులను ఆశ్రయించాడు. కావ్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వంశీ ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. వ్యక్తిగత వివరాలు గోప్యం కొందరు సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసుకుంటుంటారు. చాలాసార్లు సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలు తీస్తుంటారు. ఇద్దరి మధ్య సంబంధం చెడినప్పుడు వీటిని అడ్డుగా పెట్టుకొని ముఖ్యంగా అమ్మాయిలను రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. వివిధ రకాల యాప్‌ల ద్వారా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి పోర్న్సైట్లలో పెట్టడం ఎక్కువగా జరుగుతోంది. అందుకని ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండటం అవసరం. పరువు పోతుందని పొలీసులను సంప్రదించకుండా మూడోమనిషి సాయం తీసుకుంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే ముందు కేసు ఫైల్ చేయాలి. వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతాం. సమస్యకూ సత్వరమే పరిష్కారం అందుతుంది. సైబర్ క్రైమ్ సమస్యలకు htps://4s4u.appolice.gov.in/ ఫోన్ నెంబర్: 90716 66667 సంప్రదించవచ్చు. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ బ్లాక్ చేయకూడదు.. బ్లాక్మెయిల్ చేస్తున్నారనగానే వెంటనే భయపడిపోతారు. వేధింపులు భరించలేక సదరు వ్యక్తి నెంబర్ బ్లాక్ చేస్తుంటారు. ఒకసారి వేధించాలనుకున్న వ్యక్తి రకరకాల మార్గాల ద్వారా బెదిరింపులకు దిగుతాడు. డబ్బులు ఇస్తామనో, మరో విధంగానో కాంప్రమైజ్ అవుతాను అనే ధోరణి నుంచి బయపడాలి. బ్లాక్మెయిల్ చేస్తున్నాడనగానే వారి డేటా, కాల్ రికార్డ్ చేసుకోవాలి. అన్ని మెసేజ్‌లను స్క్రీన్ షాట్స్ చేసి పెట్టుకోవాలి. వెంటనే http://www.cybercrime.gov.in/ నేషనల్ పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలి. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
అత్తతో తగాదా.. అశ్లీల ఫొటోలు పంపి బ్లాక్మెయిల్
సాక్షి, బంజారాహిల్స్: అత్తింటి వాళ్లు తన ప్రమేయం లేకుండా భార్యను తీసుకెళ్లారనే కోపంతో అత్తతో గొడవపడి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డ అల్లుడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రహమత్‌నగర్‌లో నివసించే మహ్మద్ అక్రం పాషా పాన్‌షాప్ నిర్వహిస్తుంటాడు. కార్మికనగర్‌కు చెందిన యువతితో ఏడు నెలల క్రితం పెళ్లైంది. భార్య గర్భిణి కావడంతో రెండు రోజుల క్రితం అతడి మామ వచ్చి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లాడు. అయితే తన ప్రమేయం లేకుండానే భార్యను తీసుకెళ్లాడనే కోపంతో అక్రంపాష ఆగ్రహంతో అత్తతో గొడవపడ్డాడు. తన భార్యను పంపించకపోతే అంతు చూస్తానని, మీ అశ్లీల ఫొటోలు నెట్లో పెట్టి పరువు తీస్తానంటూ బెదిరించాడు. నెట్లో నుంచి ఒక అశ్లీల ఫొటో అత్తకు వాట్సాప్ చేసి ఇదే మాదిరిగా మీ ఫొటోలను ఎడిట్ చేసి నెట్లో పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో అత్త జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై ఐపీసీ 506, 509, 292 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భూవివాదం.. యువకుడిని కొట్టి చంపిన దుండగులు -
యువతి ఒంటరిగా ఉన్నప్పుడు సీక్రెట్‌గా వీడియో తీసి..
సాక్షి, హిమాయత్‌నగర్: తనను సీక్రెట్‌గా వీడియో తీసి తన స్నేహితులు కొద్దిరోజులుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నగరానికి చెందిన ఓ యువతి శుక్రవారం సైబర్ క్రైం పోలీసులకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసింది. యువతి ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు (అసభ్యకర రీతిలో) సీక్రెట్‌గా వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియా పోస్ట్ చేశారు. అనంతరం తనను బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని యువతి ఆరోపించింది. -
ఐఏఎస్ కలని చిదిమేసిన నగ్న వీడియో
బెంగళూరు: ఎంబీఏ పూర్తి చేశాడు. మంచి ప్యాకేజితో ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు ముందుకు వచ్చాయి. కానీ అతడి దృష్టి మాత్రం కలెక్టర్ జాబ్ మీదనే. ఐఏఎస్ సాధించి ప్రజలకు సేవ చేయాలని భావించాడు. దీక్షగా చదవడం ప్రారంభించాడు. ఇలానే మరికొంత కాలం చదువు కొనసాగిస్తే.. అతడి కల సాకారమయ్యేది. కానీ ఫేస్బుక్ అతడి జీవితాన్ని, కలని చిదిమేసింది. ఓ యువతి పేరుతో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ అతడి జీవితానికి ఎండ్ కార్డ్ వేసింది. ‘ఆమె’ మాయలో పడి నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాడు. దాన్ని రికార్డు చేసిన సైబర్ నేరగాళ్లు డబ్బుల కోసం అతడిని బెదిరించడం ప్రారంభించారు. అప్పటికే బాధితుడు వారికి కొంత డబ్బు ఇచ్చాడు. కానీ వేధింపులు ఆగకపోవడంతో.. ధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించాడు. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిల్చాడు. ఆ వివరాలు.. బాధితుడు భట్టరహళ్లి సమీపంలోని కేఆర్ పురంలో నివాసం ఉంటున్నాడు. ఎంబీఏ పూర్తి చేసి.. ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో రెండు వారాల క్రితం అతడు తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదు. అయితే బాధితుడి ఫేస్‌బుక్‌కి వచ్చిన సందేశాలను బట్టి అతడి సోదరి.. సైబర్ నేరగాళ్ల బెదిరింపులు తట్టుకోలేకనే తన సోదరుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని గ్రహించింది. అసలు సైబర్ సైకోగాళ్లు తన అన్నను ఏ విషయంలో బెదిరిస్తున్నారో తెలుసుకోవాలనుకుంది. ఈ నేపథ్యంలో బాధితుడు మరణించిన రెండు రోజుల తర్వాత నేహా శర్మ అనే అకౌంట్ నుంచి ‘‘నీ ఫోన్ నంబర్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది’’ అంటూ హెచ్చరిస్తూ ఓ సందేశం వచ్చింది. దాంతో బాధితుడి సోదరి సైబర్ నేరగాళ్లకు తన బంధువు నంబర్ సెండ్ చేసింది. ఆ తర్వాత తేజాస్ మరేష్ భాయ్ అనే వ్యక్తి నుంచి తన బంధువు నంబర్‌కి మెసేజ్ వచ్చింది. తేజాస్ తమకు డబ్బులు ఇవ్వాలని బెదిరించడం ప్రారంభించాడు. దాంతో మృతుడి సోదరి దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితం బాధితుడికి నేహా శర్మ అనే ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. యాక్సెప్ట్ చేశాడు. మెసేజ్‌లతో ప్రారంభం అయిన వారి పరిచయం నగ్నంగా వీడియో కాల్ చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఓ రోజు యువతి బాధితుడికి కాల్ చేసి.. తన దుస్తులు తొలగించి పూర్తి నగ్నంగా మారింది. ఆ తర్వాత అతడిని కూడా దుస్తులు తొలగించాల్సిందిగా కోరింది. ఆమె కోరిక మేరకు బాధితుడు నగ్నంగా మారి ఫోన్ మాట్లాడటం ప్రారంభించాడు. దాంతో సైబర్ నేరగాళ్లు బాధితుడి వీడియో రికార్డ్ చేశారు. ఆ తర్వాత అతడికి ఫేస్బుక్ ద్వారా ఈ నగ్న వీడియో పంపారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే.. ఈ వీడియోని అతడి స్నేహితులకు సెండ్ చేస్తానని బెదిరించారు సైబర్ నేరగాళ్లు. దాంతో బాధితుడు తన ఫ్రెండ్స్ వద్ద అప్పు చేసి మరి 36 వేల రూపాయలు వారికి పంపించాడు. ఆ తర్వాత కూడా బెదిరింపులు ఆగకపోవడంతో.. బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: నేను పక్కా పల్లెటూరి వాడిని: ఐఏఎస్ ‘ఆమె’గా వల.. న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్ -
‘ఆమె’గా వల.. న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్
సాక్షి, సిటీబ్యూరో: ఫేస్‌బుక్‌తో వల వేసి.. వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేసి.. స్క్రీన్ రికార్డింగ్‌తో న్యూడ్ వీడియోలు రికార్డు చేసి.. అందినకాడికి దండుకునే ముఠాలు నానాటికీ రెచ్చిపోతున్నా యి. సెక్స్‌టార్షన్‌గా పిలిచే ఈ నేరాలకు సంబంధి చి నగర సైబర్ క్రైమ్ ఠాణాకు దాదాపు ప్రతి రెండు రోజులకు ఓ ఫిర్యాదు వస్తోంది. తాజాగా ఇలాంటి గ్యాంగ్ వల్లో పడి రూ.10 లక్షలు నష్టపోయిన తార్నాకకు చెందిన ఈవెంట్ మేనేజర్ శుక్ర వారం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తార్నాక ప్రాంతానికి చెందిన ఈవెంట్ మేనేజర్‌కు కొన్నాళ్ల క్రితం ఓ యువతి పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీన్ని ఆయన యాక్సెప్ట్ చేయడంతో ‘ఆమె’ ఫ్రెండ్‌గా మారిపోయింది. కొన్నాళ్ల పాటు సదరు ‘యువతి’ మెసెంజర్లో చాటింగ్ చేసింది. ఆ తర్వాత సెక్స్ చాటింగ్ మొదలు పెట్టి వాట్సాప్ నెంబర్ తీసుకుంది. ఇంటర్నెట్ సంగ్రహించిన అర్ధనగ్న, నగ్న వీడియోలను సైబర్ నేరగాళ్లు ప్రత్యేక యాప్స్ ద్వారా తమ ఫోన్లో ఉంచి నగరవాసికి ప్లే చేసి చూపా రు. దీంతో ఇతగాడికి ఆ ‘యువతి’ తనతో మాట్లాడుతూ నగ్నంగా మారిన భావన కలిగింది. దీంతో అతను పూర్తిగా సైబర్ నేరగాళ్ల వల్లో పడిపోయాడు. ఇలా ఒకటిరెండు సార్లు వీడియోలు చూపించిన సైబర్ నేరగాళ్లు ఆపై మాటల్లో దింపి నగర ఈవెంట్ మేనేజర్ సైతం అలానే చేసేలా చేశారు. ఈ దృశ్యాలను స్క్రీన్ రికార్డింగ్ యాప్స్ ద్వారా రికా ర్డు చేశారు. వీటిని యూట్యూబ్ చానల్లో ఉంచిన లింకుల్ని బాధితుడికి పంపారు. ఇవి చూసి కంగుతిన్న అతగాడు తొలగించాలంటూ కోరాడు. దీనికి రూ.10 లక్షలు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు షరతు విధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన నేరగాళ్లు చెప్పిన ఖాతాల్లోకి ఆ మొత్తం బదిలీ చేశారు. ఆపై కొన్ని రోజులకు మరికొంత మొత్తం కావాలంటూ వేధింపులు మొదలయ్యాయి. దీంతో బాధితుడు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. చదవండి: మీటింగ్...డేటింగ్.. చీటింగ్ -
కి‘లేడీ’: ఎస్సైలనే బ్లాక్మెయిల్ చేస్తూ..
సాక్షి, హైదరాబాద్: ఎస్సైలను బ్లాక్మెయిల్ చేసి.. డబ్బులు వసూలు చేసిన కిలాడి లేడీ లతా రెడ్డిని బుధవారం రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేసిన లతా రెడ్డి పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడించింది. పోలీసు అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేసేదాన్నని తెలిపింది. వివరాలు.. టైలర్‌గా పని చేస్తోన్న లతా రెడ్డి.. తరచుగా ఏదో ఒక సాకుతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. ఎస్సైలతో పరిచయం పెంచుకునేది. కొద్ది రోజుల పాటు వారితో చనువుగా మెలిగేది. ఆ తర్వాత సమయం చూసుకుని వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసేది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సదరు ఎస్సైల మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించేది. ఎస్సైలు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బ్లాక్ మెయిల్ చేసేది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు ఎస్సైలను బెదిరించి డబ్బు వసూలు చేసింది. అయితే నిందితురాలు ఇంతా జరిగినా ఒక్క ఎస్సై కూడా ఆమె మీద ఫిర్యాదు చేయకపోవడం విశేషం. చివరకు ఓ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వనస్థలిపురం పోలీసులు లతా రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: నిత్య పెళ్లికూతురు.. నలుగురికి టోపీ ఏసీబీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా.. -
మార్ఫ్డ్ చిత్రాలతో.. 100 మంది మహిళలను
న్యూఢిల్లీ: మహిళల సోషల్ మీడియా అకౌంట్ ప్రొఫైల్ ఫోటోలను డౌన్లోడ్ చేసి.. వాటిని మార్ఫ్ చేసి.. ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తోన్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. నోయిడాకు చెందిన సుమిత్ ఝా(26) అనే వ్యక్తి మహిళల సోషల్ మీడియా అకౌంట్ నుంచి వారి ప్రొఫైల్ పిక్చర్స్ డౌన్లోడ్ చేసి వాటిని మార్ఫ్ చేసేవాడు. తర్వాత సేమ్ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. ఆ ఫోటోలను సదరు మహిళలకి పంపి.. అడిగినంత డబ్బు ఇవ్వాలని.. లేదంటే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగేవాడు. ఇలా దాదాపు 100 మహిళలను బ్లాక్మెయిల్ చేశాడు. ఈ క్రమంలో బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న ఓ మహిళను కూడా బెదిరించేందుకు ప్రయత్నించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడంతో మిగతా బాధితుల గురించి తెలిసింది. (చదవండి: ఉరితాడు కోసి.. ఊపిరి పోసి) ఈ సందర్భంగా ఓ పోలీసాఫీసర్ మాట్లాడుతూ.. ‘నిందితుడు పోలీసులకు దొరకకుండా ఉండటం కోసం వాట్సాప్ ద్వారా వీఓఐపీ కాల్స్, వేరే యాప్స్ ద్వారా బెదిరింపులకు దిగేవాడు. ఇక సదరు బ్యాంక్ ఎంప్లాయ్ ఫిర్యాదుతో సర్వీస్ ప్రొవైడర్ రిపోర్ట్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ సేకరించి నిందితుడిని గుర్తించగలిగాము. మంగళవారం అతడిని అరెస్ట్ చేశాం ’ అని తెలిపారు. ఇక నిందితుడిని గతంలో ఇదే నేరం కింద చత్తీస్‌గఢ్, నోయిడాలో రెండు సార్లు అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
ఏసీబీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా..
కర్నూలు(అగ్రికల్చర్): ‘విజయవాడ ఏసీబీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాను. మీపై తీవ్రమైన అవినీతి ఆరోపణలతో మాకు ఫిర్యాదులు అందాయి. రూ.5 లక్షలు ముట్టచెబితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రోడ్లు భవనాల శాఖ ఎస్ఈ జయరామిరెడ్డికి హర్షవర్ధన్‌రెడ్డి అనే వ్యక్తి ఫోన్లో బెదిరించాడు. సదరు వ్యక్తి బ్లాక్ మెయిలింగ్‌పై ఎస్ఈ బుధవారం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీఐ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ గతంలో కూడా విజయవాడ ఏసీబీ ఆఫీసు పేరుతో పలువురు వీఆర్ఓలు, తహసీల్దార్లకు ఫోన్లు చేశారని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బ్లాక్ మెయిలర్‌ను కటకటాల్లోకి పంపుతామన్నారు. -
నగ్నచిత్రాలు పంపించాలని బ్లాక్మెయిల్
సాక్షి, నాగోలు: ఫేస్బుక్ ఖాతాలతో మహిళల మొబైల్ నంబర్లు సేకరించి నగ్నచిత్రాలు పంపించాలంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో నివసించే మోటా దుర్గాప్రసాద్ (23) ప్రైవేట్ ఉద్యోగి. ఇంటర్నెట్లో నీలి చిత్రాలు చూస్తుంటాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం నుంచి అమ్మాయిల ఫోన్ నంబర్లను సేకరించి వాట్సాప్ ద్వారా అసభ్యకర దృశ్యాలను పంపించేవాడు. మహిళలకు వీడియో కాల్స్ చేసి వారి నగ్న చిత్రాలను పంపించాలంటూ బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇందుకు నిరాకరించిన మహిళల మొబైల్ నంబర్లను పోర్న్ వెబ్సైట్లో, ఇంటర్నెట్లో పెడతానంటూ బెదిరించేవాడు. ఈ క్రమంలో నగరానికి చెందిన ఓ మహిళా న్యాయవాదిని వాట్సాప్ చాటింగ్‌తో వేధింపులతో గురి చేయడంతో ఆమె రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. (పోర్న్సైట్లలో విద్యార్థినులు, లెక్చరర్ల ఫోటోలు) ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. విశ్వసనీయం సమాచారం, సాంకేతిక ఆధారాలతో నిందితుడు దుర్గా ప్రసాద్‌ను శనివారం అరెస్టు చేశారు. ఇతనిపై నల్లగొండ, సైబరాబాద్ పరిధిలో పలు కేసులు ఉన్నాయని, గతంలో జైలుకు వెళ్లివచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయినా తన ప్రవర్తన మార్చుకోకుండా మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. బాలికలు, మహిళలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో జాగ్రత్త వహించాలని, తెలియని స్నేహితుల అభర్యర్థనలను అంగీకరించవద్దని, వ్యక్తిగత వివరాలు కొత్తవారితో పంచుకోవద్దని సూచించారు. (ఇద్దరు మైనర్లపై 11 మంది గ్యాంగ్ రేప్..) -
ముచ్చటగా మూడుపెళ్లిళ్లు
-
నిత్య పెళ్లికూతురు.. నలుగురికి టోపీ
దొనకొండ: పేర్లు, హోదాలు మార్చుకుని మ్యాట్రిమోనీ సైట్లలో వలవేయడం.. యువకులను ఆకర్షించి పెళ్లాడటం.. వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడమే వృత్తిగా పెట్టుకున్న ఓ యువతి బాగోతమిది. ప్రకాశం జిల్లా దొనకొండలో నాలుగో పెళ్లి చేసుకున్నాక ఈ నిత్య పెళ్లి కూతురి వ్యవహారం బట్టబయలైంది. ఎస్ఐ ఫణిభూషణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ► తిరుపతిలో ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసిన స్వప్నకు తొలుత తన మేనమామతో వివాహం జరిగింది. ► కొద్ది రోజులకే అతన్ని వదిలేసి తిరుపతికే చెందిన పృథ్వీరాజ్‌ను పెళ్లాడింది. కొద్ది రోజుల తర్వాత అతడిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి రూ. 25 లక్షలు డిమాండ్ చేసింది. ► తర్వాత జర్మనీలో పని చేసే ఆత్మకూరుకు చెందిన సుధాకర్‌ను మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం చేసుకుని, పెళ్లికి సిద్ధమైంది. పెళ్లిలోగా అతడి నుంచి రూ. 5 లక్షలు డబ్బు లాగింది. ► ఆ తర్వాత దొనకొండకు చెందిన విప్పర్ల రామాంజనేయులకు గేలం వేసింది. డెన్మార్క్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న అతనికి తాను ఐపీఎస్ అధికారినంటూ పరిచయం చేసుకుంది. 2019 డిసెంబర్ 12న వివాహం చేసుకుంది. ► ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన రామాంజనేయులు ఈ ఏడాది మార్చిలో భార్యకు చెప్పకుండా డెన్మార్క్ వెళ్లిపోయాడు. ► దీంతో ఆమె సోమవారం పోలీసులను ఆశ్రయించింది. ► పోలీసుల విచారణలో ఈ మాయలేడి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. -
విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో మరో మలుపు
పట్నంబజారు (గుంటూరు): గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కేసులో మరో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి నగ్నచిత్రాలు తీసిన వరుణ్, వాటిని పోర్న్ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన కౌశిక్‌లను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు ఇన్‌స్ట్రాగామ్‌లో అప్లోడ్ చేసిన యువకుడి కోసం గాలిస్తున్న విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు.. “మై నేమ్ ఈజ్ 420’ అనే ఇన్‌స్ట్రాగామ్ ఐడీపై విద్యార్థిని నగ్న చిత్రాలను అప్లోడ్ చేసిన యువకుడిని పోలీసులు గుర్తించారు. విద్యార్థిని చదివిన కళాశాలలోనే చదివిన విద్యారి్థకి ఈ వీడియోలు, చిత్రాలు అందాయి. (మరో ఇద్దరు యువతుల ప్రమేయం!) అయితే ఇవి ఎక్కడ నుంచి అతడికి వచ్చాయి అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీడియోలు సంపాదించిన విద్యార్థి వాటిని ఇన్‌స్ట్రాగామ్‌లో అప్లోడ్ చేయటంతో పాటు మరో నలుగురికి పంపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో డెల్టా ప్రాంతానికి చెందిన విద్యార్థితో పాటు అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. వీడియో తీసుకున్న విద్యార్థి సదురు విద్యార్థినిని బెదిరించి నగదు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. -
అలాంటి వారితో జాగ్రత్త : పూర్ణ
‘అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి’ అని నటి పూర్ణ హెచ్చరించింది. ఆమె మాట్లాడుతూ పెళ్లి పేరుతో మోసం చేస్తారని, అలాంటి వారితో కొత్తగా అవకాశాల కోసం వచ్చే నటీమణులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. తాను కూడా అలా ఒక వ్యక్తి నుంచి మోసపోయానని చెప్పింది. దక్షిణాదిలో నటిగా మంచి పేరు సంపాదించుకున్న నటి పూర్ణ. ఈమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నా విషయం తెలిసిందే. ఒక వ్యక్తి ఆమెను పెళ్లి పేరుతో ఇటీవల మోసం చేసే ప్రయత్నం చేయగా ఆమె మేల్కొని పోలీసులకు పట్టించింది. దీని గురించి నటి పూర్ణ తనట్విట్టర్లో పేర్కొంటూ తన బంధువుల స్నేహితుల ద్వారా అన్వర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడని చెప్పింది. (చదవండి : పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ పూర్ణ) ఆ తర్వాత అతను తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తమ కుటుంబానికి పరిచయం చేసినట్లు తెలిపింది. అలా వారు ఇటీవల తమ ఇంటికి వచ్చారని చెప్పింది. వారిని ప్రత్యక్షంగా చూడడంతో తమకు అనుమానం కలిగిందని తెలిపింది. వారి వివరాలను అడగ్గా బదులు చెప్పకుండా వెళ్లిపోయారని తెలిపింది. ఆ తర్వాత ఫోన్ చేసి డిమాండ్ చేశారని చెప్పింది.తాము వారు అడిగిన డబ్బు ఇవ్వనడంతో బెదిరించారని, ఇంటి నుంచి బయటికి వస్తావుగా అప్పుడు చెప్తా నీ పని అని బెదిరించారని తెలిపింది. రంగస్థలం వేదికపై పాల్గొనడానికి వస్తావుగా అంటూ బెదిరించారని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఇలాంటి వారితో పలువురు అమ్మాయిలు మోసపోయినట్లు తెలిసిందని, ఇప్పటికీ వారి బండారం బయటపడిందని చెప్పింది. రంగుల ప్రపంచమైన సినిమా రంగంలోకి అవకాశాల కోసం పలువురు యువతులు వస్తున్నారని, వారంతా హోటల్లో బస చేస్తూ అవకాశాల వేటలో పడుతున్నారని చెప్పింది. అలాంటి వారు అవకాశాల పేరుతో మోసాలకు దిగే వారితో జాగ్రత్తగా ఉండాలని పూర్ణ హెచ్చరించింది. అవకాశాలను కల్పిస్తామని వచ్చే వారి గురించి తమకు తెలిసిన వారితోగానీ, స్నేహితులతోగానీ చర్చించి మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించింది. -
కాలేజ్‌లో కీచకులు
-
గుంటూరులో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల కీచకపర్వం
-
మరో ఇద్దరు యువతుల ప్రమేయం!
సాక్షి, గుంటూరు: ఇంజనీరింగ్ విద్యార్థుల కీచక పర్వం గుంటూరు పట్టణంలో శనివారం వెలుగు చూసింది. తోటి విద్యార్థినితో సన్నిహితంగా ఉంటూ వీడియోలు చిత్రీకరించిన ఇద్దరు యువకులు.. వాటిని అడ్డుపెట్టుకుని కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేశారు. తాము చెప్పినట్టు వినకుంటే ఆ వీడియోలను వెబ్సైట్లో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. మూడేళ్లుగా ఆమెపై వేధింపుల పరంపర సాగుతోంది. ఈక్రమంలో బాధితురాలు దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు వరుణ్, కౌశిక్‌లను 24 గంటల్లోనే అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. (చదవండి: చంద్రదండు అధ్యక్షుడిపై వేధింపుల కేసు) ఇద్దరు యువతుల ప్రమేయం వీడియోలతో యువతిని వేధించిన కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితులు వరుణ్, కౌశిక్‌తో పాటు మరో ఇద్దరు యువతులకు ఈ కేసులో ప్రమేయమున్నట్టు వెల్లడైండి. వరుణ్ స్నేహితురాలి ద్వారా కౌశిక్ చెల్లెలికి బాధితురాలి వీడియోలు అందినట్టు పోలీసులు గుర్తించారు. కౌశిక్ ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయించాడు. వీడియోలు చూపిస్తూ కోరిక తీర్చాలని బాధితురాలిని వేధింపులకు గురిచేశాడు. కాగా, వీడియోలు బయటకు రావడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు యువతులపై కూడా పోలీసులు కేసులు పెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. -
పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ పూర్ణ
కొచ్చి : ప్రముఖ హీరోయిన్ పూర్ణ పోలీసులను ఆశ్రయించారు. పూర్ణను నలుగురు యువకులు బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన కేరళ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను త్రిసూర్‌కు చెందిన శరత్, అష్రఫ్, రఫీక్, రమేశ్‌లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. అరెస్ట్ చేసిన నలుగురిని ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉంచినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. పూర్ణకు పెళ్లి సంబంధం తీసుకొచ్చామనే నెపంతో నిందితులు ఆమె ఇంటికి వచ్చినట్టుగా సమాచారం. వారిది కోజికోడ్ అని, పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులమని నిందితులు పూర్ణ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ తర్వాత వారు పూర్ణకు ఫోన్ చేసి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. లేకపోతే ఆమె కేరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించారు. దీంతో పూర్ణ తల్లి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు తమ ఇంటి పరిసరాల్లో తిరుగుతూ.. పూర్ణ ఫొటోలు తీస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, తొలుత డ్యాన్సర్‌గా, మోడల్‌గా కేరీర్ ప్రారంభించిన పూర్ణ.. ఆ తర్వాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. దక్షిణాదిన పలు చిత్రాల్లో నటించిన పూర్ణ హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక, తెలుగులో అవును, అవును 2, సీమటపాకాయ్, జయమ్ము నిశ్చయమ్మురా.. వంటి చిత్రాల్లో నటించారు. పూర్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు పలు రియాల్టి షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. (చదవండి : పెళ్లికి నేను సిద్ధం : పూర్ణ) -
నగ్నంగా వీడియో కాల్ చేయాలంటూ..
అహ్మాదాబాద్ : పబ్జీ గేమ్ ఓ 22 ఏళ్ల యువతికి తంటాలు తెచ్చిపెట్టింది. ఈ ఆన్లైన్ గేమ్ ద్వారా పరిచమైన యువకుడు.. తన ఫేస్బుక్, మెయిల్లను హ్యాక్ చేసి.. పాస్వర్డ్ రీసెట్ చేయాలంటే నగ్నంగా వీడియో కాల్ చేయాలని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ సంఘటన గుజరాత్లో ఓగ్నాజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌కు చెందిన 22 ఏళ్ల యువతి గత కొంత కాలంగా తన స్నేహితురాలితో కలిసి పబ్జీ గేమ్ ఆడుతోంది. (చదవండి : ‘పిల్ల’ దొరికిందని 1.55లక్షలు అప్పు ఇస్తే..) ఈ క్రమంలో తన స్నేహితురాలి ద్వారా జితేంద్ర అనే యువకుడు బాధితురాలికి పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడంతో ఫోన్ కాల్ ద్వారా తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. కొద్ది రోజుల తర్వాత జితేంద్ర అసభ్యకర డిమాండ్ల చేయడం ప్రారంభించడంతో, యువతి అతని ఫోన్‌కాల్‌కు స్పందించడం ఆపేసింది. దీంతో కోపం పెంచుకున్న యువకుడు.. యువతి ఫేస్బుక్, మెయిల్ పాస్వర్డలను హ్యాక్ చేశాడు. విషయం తెలుసుకున్న యువతి.. తన పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయాలని కోరగా.. రూ. 50 వేలు డిమాండ్ చేశాడు. జూన్ 2వ తేదీన అమ్మాయికి ఫోన్ చేసి.. నగ్నంగా వీడియో కాల్ చేయాలని జితేంద్ర బ్లాక్ మెయిల్‌కు దిగారు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన యువతి. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ప్రేమ పేరుతో ఎన్ఆర్ఐ వేధింపులు
సాక్షి, సిటీబ్యూరో: క్లాస్‌మేట్‌ను ప్రేమ పేరుతో వేధిస్తూ, ఫొటోలు పంపి బ్లాక్మెయిల్ చేస్తున్న ఎన్ఆర్ఐపై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. సిక్ విలేజ్‌కు చెందిన ఓ యువతి, నగరానికి చెందిన మరో యువకుడు ఆస్ట్రేలియాలో ఎంఎస్ పూర్తి చేశారు. అప్పట్లో వీరిద్దరూ స్నేహపూర్వకంగా మెలిగారు. విద్యాభ్యాసం తర్వాత యువతి సిటీకి తిరిగి వచ్చేయగా.. సదరు యువకుడు అక్కడే ఉద్యోగంలో చేరాడు. గడిచిన కొన్నాళ్లుగా ఆ యువతిని అతను ప్రేమ పేరుతో వేధించడం ప్రారంభించాడు. ఆమె నిరాకరించడంతో కక్షగట్టిన అతగాడు విచక్షణ కోల్పోయాడు. వివాహం చేసుకుంటే తననే చేసుకోవాలని, లేదంటే అసలు పెళ్లే కాకుండా చేస్తానంటూ బెదిరించడం ప్రారంభించాడు. ఆమెపై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో గతంలో ఆమెతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా ఆమె కుటుంబీకులు, బంధువులు, స్పేహితులకు పంపడం చేస్తుండేవాడు. అతడి వ్యవహారం శ్రుతి మించడంతో బాధితురాలు గురువారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎన్నారై ఆస్ట్రేలియాలో ఉండడంతో అతడిపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేయాలని నిర్ణయించారు. దీన్ని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులకు పంపనున్నారు. తద్వారా అతగాడు ఏ సమయంలో అయినా దేశంలోకి అడుగుపెడితే ఎల్ఓసీ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులకు వాంటెడ్ అని గుర్తించే ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుంటారు. ఆ విషయం సైబర్ క్రైమ్ అధికారులకు తెలపడం ద్వారా అరెస్టు చేసేలా చేస్తారు. -
యానం మాయగాడు అరెస్ట్..!
సాక్షి, సూర్యాపేట క్రైం : మాయ మాటలతో సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలకు చేరువై అనంతరం బ్లాక్ మెయిల్ చేసి అందిన కాడికి దండుకునే యానం మాయగాడిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్రావు కేసు వివరాలు వెల్లడించారు. యానం పట్టణానికి చెందిన కర్రీ సతీష్ (25) అక్కడే నత్త గుల్లల, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా అమాయకులైన అమ్మాయిలను ప్రేమవలలో దించి వారి నుంచి డబ్బులు లాగడం ప్రవృత్తి. దీనిలో భాగంగా సతీష్ హైదరాబాద్ ఇన్‌స్ట్రాగాం యాప్‌లో సూర్యాపేట పట్టణం తాళ్లగడ్డకు చెందిన ఓ యువతిలో పరిచయం పెంచుకున్నాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడు. వ్యాపార అవసరాలను డబ్బులు కావాలని యువతికి మాయమాటలు చెప్పి డబ్బు ఏర్పాటు చేయవలసిందిగా ఒత్తిడి తెచ్చాడు. ప్రియుడి మాటలు నమ్మిన ఆ యువతి తాత చిదుముల్లి భిక్షంరెడ్డి ఇంట్లోలేని సమయంలో అతనితో కలిసి బీరువాలో ఉన్న 24 తులాల బంగారు నగదు చోరీ చేసి ప్రియుడికి ఇచ్చింది. విషయం తెలియని భిక్షంరెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తరువాత యువతి ప్రియుడిని నగలు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరగా, సతీష్ బంగారము అడిగితే వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడు. యవతి తాతతో కలిసి పోలీసులకు విషయం వివరించగా ఆ సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ కె.శివశంకర్, కానిస్టేబ్‌లు గొర్ల కృష్ణ, గోదేశి కరుణాకర్, చామకూరి శ్రీనివాస్‌లు యానం వెళ్లి సతీష్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. సతీష్ నుంచి సుమారు 4లక్షల విలువగల బంగారు నగలను రికవరీ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్టు డీఎస్పీ తెలిపారు. -
నమ్మి ఫోన్ ఇస్తే.. నట్టేట ముంచుతారు..!
న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ యుగంలో చేతిలో ఉన్న ఫోన్ స్మార్ట్‌గా పనిచేయకపోతే వెనకబడిపోతాం. దానిలో ఏ చిన్న లోపం తలెత్తిన ఆగమేఘాలపై రిపేర్ సెంటర్లకు పరుగెడతాం. అయితే, తగు జాగ్రత్తలు తీసుకోకుండా రిపేరర్ చెప్పే కస్టమర్ ఫ్రెండ్లీ మాటల్లో పడి గోప్యంగా ఉంచాల్సిన ఫోన్ పాస్వర్డ్ చెప్తే నట్టేట మునిగినట్టేనని అంటున్నారు కొందరు బాధితులు. ఫోన్ రిపేర్ కోసం వెళ్తే తన వ్యక్తిగత ఫోటోలను లూటీ చేసి ఎలా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారో శ్వేతా దీక్షిత్(27) అనే యువతి పోలీసులకు చెప్పుకుని వాపోయారు. ‘నా స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే పగిలిపోవడంతో రిపేర్‌కోసం కరోల్‌బాగ్‌లోని గఫార్ మార్కెట్‌కి గత నెలలో వెళ్లాను. రిపేర్ నిమిత్తం ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని షాప్ అతను అడిగాడు. రిపేర్ చేయాలంటే పాస్వర్డ్ తప్పనిసరిగా కావాలన్నాడు. అతని మాటలు నమ్మి పాస్వర్డ్ చెప్పాను. ఎలాగైతేనేం ఫోన్ బాగయితే చాలు అనుకున్నాను. మూడు గంటల అనంతరం ఫోన్ బాగుచేసి తిరిగిచ్చాడు. కానీ, మూడు రోజుల అనంతరం అసలు కథ మొదలైంది. అపరిచిత నెంబర్ల నుంచి బ్లాక్‌మెయిలింగ్ కాల్స్ వచ్చాయి. నీ వ్యక్తిగత ఫొటోలు మావద్ద ఉన్నాయి. లక్ష రూపాయల్వికుంటే వాటిని యూట్యూబ్‌లో, పోర్న్ సైట్లలో పెడతామని బెదిరింపులకు గురిచేశారు. ఊహించని పరిణామం ఎదురవడంతో బిత్తరపోయాను. ఘటనపై ఈమెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని చెప్పారు. ‘శ్వేత ఫిర్యాదుపై విచారణ చేపట్టాం. మొబైల్ రిపేర్ చేసిన వ్యక్తే ఫోటోలు దొంగిలించాడని తేలింది. అయితే, ఫోన్ నెంబర్లు నకిలీ చిరునామాలతో ఉండటంతో నిందితులను గుర్తించడం కష్టమవుతోంది. దర్యాప్తు కొనసాగుతోంది. కస్టమర్ల వ్యక్తిగత ఫొటోలు, సమాచారం దొంగిలించి బ్లాక్మెయిర్లకు షాప్ వాళ్లు అమ్ముకుంటున్నట్టు మా విచారణలో తేలింది. అందుకే ఫోన్ రిపేర్‌కు ఇచ్చేటప్పుడు అందులో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని డిలీట్ చేసి ఇవ్వాలి. యువతులే టార్గెట్‌గా బ్లాక్‌మెయిలర్లు పంజా విసురుతారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు యువతులు చిత్రవధ అనుభవిస్తారు. బయటికి చెప్పుకోలేక ఆత్మహత్యకు యత్నించిన వారూ ఉన్నారు. ప్రైవేటు వ్యవహారాలు పబ్లిక్ అవుతాయేమోనని ఫిర్యాదు చేయడం కూడా అరుదే. ఒకవేళ ఫిర్యాదు చేయాల్సివస్తే ఆన్లైన్నే ఆశ్రయిస్తున్నారు’ అని ఢిల్లీ సైబర్‌క్రైం డిప్యూటీ కమిషనర్ అనీష్రాయ్ చెప్పారు. ఇక డిలీట్ చేసిన సమాచారాన్ని కూడా తిరిగి రిట్రైవ్ చేసే కేటుగాళ్లు ఉండటం కలవరపెట్టే అంశం. -
విద్యార్థినిలకు బ్లాక్మెయిల్..స్పందించిన సీఎం
‘సరస్వతీ నిలయాన్ని జైలుగా మార్చారు. అక్కడ చదువు చెప్పకపోగా.. విద్యార్థినులు చేసే చిన్న తప్పులతో బ్లాక్మెయిల్ చేస్తారు. వారిని తమ కళాశాల అనుమతుల కోసం, అధికారుల అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఇంటి నుంచి వంట పనివరకు అన్నీ చేయిస్తారు. అర్ధరాత్రుల్లో హాస్టల్‌కు వచ్చే ప్రైవేటు వ్యక్తులకు సైతం అన్ని రకాల సేవలు చేయాలి. లేకుంటే వేధింపులు తప్పవు. ‘మాకు న్యాయం చేయండి’ అంటూ శ్రీ వెంకట విజయ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ–మెయిల్ ద్వారా ఆధారాలు అందజేశారు. దీనిపై ఆయన స్పందించారు. ఆ కళాశాలపై చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. అదే కళాశాలకు చెందిన మరికొందరు విద్యార్థులు తిరుపతి సబ్‌కలెక్టర్ ముందు కన్నీరు మున్నీరయ్యారు. తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సాక్షి, తిరుపతి : పవిత్రమైన వృత్తి కోసం నర్సింగ్ కోర్సులో చేరిన విద్యార్థినుల జీవితాలతో ఆ కళాశాల యాజమాన్యం ఆడుకుంటోంది. చదువుల నిలయాన్ని నరకకూపంగా మార్చింది. ఈ దారుణాల వేదిక ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల పంచాయతీ పరిధిలోని శ్రీవెంకట విజయ నర్సింగ్ కళాశాల. విద్యార్థులు సోమవారం తిరుపతి సబ్‌కలెక్టర్, తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివరాలు.. ‘వందలాదిమంది ఉన్న శ్రీవెంకట విజయ నర్సింగ్ కళాశాల నాలుగేళ్ల కోర్సుకు ఇద్దరు అధ్యాపకులు బోధన చేస్తారు. కోర్సు పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇప్పిస్తారు. ఇలాంటి సర్టిఫికెట్లతోనే ప్రైవేటు ఆస్పత్రుల్లో విధులకు పంపుతారు. వచ్చే జీతం సైతం కళాశాల యాజమాన్యమే బలవంతంగా లాక్కుంటుంది. కళాశాలతో పాటు హాస్టల్ భవనాలకు సైతం అనుమతులు ఉండవు. కళాశాల నిర్వాహకురాలు విజయ పెడుతున్న బాధలను భరించలేకపోతున్నాం. వంటతో పాటు పొలంలో పనులు సైతం విద్యార్థినులతో చేయిస్తున్నారు. కళాశాల నిర్వాహకురాలు నుంచి మాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి’ అని విద్యార్థినులు వేడుకున్నారు. ముఖ్యమంత్రికి ఫిర్యాదు ఎస్వీవీ నర్సింగ్ కళాశాల నిర్వాహకురాలు విజయ పెడుతున్న వేధింపులు, గృహహింసపై విద్యార్థినులు కలెక్టర్, అర్బన్ ఎస్పీ, సబ్‌కలెక్టర్, తహసీల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అధికారులు, పోలీసులు సైతం కళాశాలకు వచ్చి విద్యార్థినులను విచారించకుండానే యాజమాన్యంతో చర్చలు జరుపుకుని, కాసుల మోజులో అన్యాయం చేశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా న్యాయం జరగకపోవడంతో ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. గృహహింస, వేధింపులు, కళాశాల అక్రమాలకు సంబంధించి ఆధారాలతో వీడియోలను, ఫిర్యాదును పంపించారు. స్పందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో విద్యార్థినుల ఆవేదనను, వారి బాధలతో కూడిన లేఖను చూపించారు. అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. విద్య, విద్యార్థుల సౌకర్యాలు, భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని స్పష్టం చేశారు. కళాశాల మూసివేస్తున్నట్లు ప్రకటన విద్యార్థినుల ఫిర్యాదుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేగంగా స్పందించారని తెలుసుకున్న ఎస్వీవీ నర్సింగ్ కళాశాల యాజమాన్యం తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలను మొదలుపెట్టింది. అధికారులు ఎక్కడ దాడులు చేస్తారోనని అప్రమత్తం అయ్యింది. కళాశాల సూచిక బోర్డును తీసివేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కళాశాలను మూసివేసినట్లు నిర్వాహకురాలు విజయ ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కావాలనే కొందరు తమ కళాశాలపై అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని, కళాశాలకు అన్ని రకాల అనుమతులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి తిరుపతి మంగళం: శ్రీవేంకటేశ్వర నర్సింగ్ కళాశాల గుర్తింపును రద్దుచేసి, కరస్పాం డెంట్ బండి విజయపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తిరుపతి సబ్ కలెక్టర్‌కు సోమవారం పలువురు విద్యార్థినులు విజ్ఞప్తి చేశారు. స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బాధిత నర్సింగ్ విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. కళాశాల కరస్పాండెంట్ అన్ని పనులు చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వమంటూ, ప్రాక్టికల్స్‌లో మార్కులు తగ్గిస్తామంటూ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. 150 మంది విద్యార్థినులకు కనీస విద్యార్హత లేని ఒకే ఉపాధ్యాయుడు బోధించడం ఏంటని ప్రశ్నించారు. విజయ వేధింపులు తాళలేక పది మంది హాస్టల్ నుంచి బయటకు వచ్చి హ్యూమన్ రైట్స్ ప్రతినిధుల సంరక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు. తాము అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్లు విజయ తల్లిదండ్రులకు ఫోన్‌చేసి అసత్య ప్రచారాలు చేస్తున్నట్టు వాపోయారు. ఆమెపై పోలీసు ఉన్నతాధికారులు లోతైన విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కళాశాలపై ప్రభుత్వ విచారణ తిరుపతిక్రైం: తిరుపతి రూరల్ పరిధిలోని పుదిపట్ల గ్రామంలోని శ్రీ వెంకట విజయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరస్పాండెంట్ బండి విజయపై కళాశాల విద్యార్థినులు చేస్తున్న ఆరోపణలు ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. ఈ కళాశాలలో జరిగే అవినీతి, అక్రమాలు, సౌకర్యాలు లేమిపై పలు వివాదాలు రావడంతో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్పందించారు. దీనిపై విచారించాల్సిందిగా కలెక్టర్ భరత్‌నారాయణ గుప్తను ఆదేశించడంతో శ్రీపద్మావతమ్మ గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలలోని ఇద్దరు అధ్యాపకులతో ఈ విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీతో పాటు ముత్యాలరెడ్డి పల్లె పోలీసుల పర్యవేక్షణలో బాధితుల నుంచి ఫిర్యాదులను వీడియో ద్వారా చిత్రీకరించారు. సోమవారం తిరుపతి అర్బన్ జిల్లా కార్యాలయంలో అదనపు ఎస్పీ కలిసిన ఆ కళాశాల నర్సింగ్ విద్యార్థుల నుంచి పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు. వారితో పాటు విచారణ బృందం విద్యార్థులు సమావేశమైంది. వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. దీనిపై దర్యాప్తును కౌనసాగిస్తున్నామని ఎమ్మార్‌పల్లి సీఐ మసూరుద్దీన్ వెల్లడించారు. -
ఓ ఆకతాయి చేష్టలతో యువతి ఆత్మహత్య
సాక్షి, పాములపాడు(కర్నూలు): ఓ ఆకతాయి బ్లాక్‌మెయిలింగ్ యువతి ప్రాణాలు తీసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మండలపరిధిలోని లింగాల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లింగాల గ్రామానికి చెందిన గోవర్దన్, ఆకుతోట సోమేశ్వరమ్మ దంపతుల కుమార్తె విజయనిర్మల (17)కు గడివేముల మండలం గని గ్రామానికి చెందిన కురువ నవీన్ అనే యువకుడితో పరిచయం ఉంది. ఈ నెల 1న ఆ యువతి తన తండ్రితో కలిసి ఆత్మకూరుకు వెళ్లింది. అక్కడ తండ్రి మోటారు సైకిల్ రిపేరి చేయించుకుంటుండగా కొంత దూరంలో నవీన్, ఆ బాలిక కలిసి మాట్లాడుకుంటున్నారు. సిద్దాపురం గ్రామానికి చెందిన వడ్డె ఇరుగదిండ్ల అశోక్ వారి ఫొటోలు తీసి వాటిని వారికి చూపించి రూ.5వేలు నగదు, ఒక సెల్ ఫొన్ తీసుకుని పోయాడు. అంతటితో ఆగకుండా బాలిక తల్లి దండ్రులకు ఫోన్ చేసి రూ.5వేలు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే కుమార్తె ఫొటోలు ఫేస్బుక్లో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. అడిగిన మేర డబ్బు ఇచ్చేందుకు వారు అంగీకరించినా వాట్సప్‌లో యువతి ఫొటోలు పంపించాడు. దీంతో తీవ్రంగా కుంగిపోయిన యువతి ఈనెల 5న ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని బంధువులకు చెప్పకుండా ఖననం చేశారు. అయితే, తన బిడ్డ ఆత్మహత్మకు కారణమైన నిందితుడు వడ్డె ఇరుగదిండ్ల అశోక్‌కు వదిలిపెట్టకూడదని భావించి యువతి తల్లి సోమేశ్వరమ్మ సోమవారం పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో మంగళవారం ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, తహసీల్దార్ శివయ్య, ఎస్ఐ వరప్రసాద్ శ్మశాన వాటికలో పూడ్చిన శవాన్ని వెలికితీసి డాక్టర్ వెంకటరమణతో పంచనామా నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అదో ‘బ్లాక్మెయిల్’ యాప్
సాక్షి, అమరావతి: ‘సేవా మిత్ర’ టీడీపీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌ను ఒక్కసారి మొబైల్ ఫోన్ లేదా డెస్క్టాప్పై డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. ఇక దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లేనని సాఫ్ట్వేర్ నిపుణులు చెబుతున్నారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న మరుక్షణం నుంచి ఫోన్ కంట్రోల్ యాప్ అభివృద్ధి చేసిన ఐటి గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేతిలోకి వెళ్లిపోతుంది. ఫోన్ ఎక్కడ ఉందన్న విషయంతో పాటు ఫోన్లో మాట్లాడిన మాటలను రికార్డు చేస్తారు. చివరకు ఫోన్లోని ఫోటోలు, వీడియోలు, బ్యాంకు ఖాతాల వివరాలను అన్నీ వారు యధేచ్ఛగా చూడటమే కాకుండా, అవసరమైతే మీకు తెలియకుండానే వారు డిలీట్ చేస్తారు. ఫోన్ కాల్స్‌ను రికార్డు చేసి, ఎస్డీ కార్డులో ఉన్న డేటాను వినియోగించి యజమానుల్ని బ్లాక్ మెయిల్ చేయొచ్చని నిపుణులతో పాటు పోలీసులుకూడా హెచ్చరిస్తున్నారు. (డేటా స్కామ్ డొంక కదులుతోంది!) సేవామిత్ర యాప్ తీసుకునే అనుమతులు, వాటి పర్యవసానాలు.. అప్రాక్సిమేట్, ప్రిసైజ్ లోకేషన్: ఈ అనుమతి ద్వారా ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకుంటారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకోగానే లోకేషన్ సర్వీస్ ఆన్ అయిపోతుంది. దీనివల్ల బ్యాటరీ చార్జింగ్ కూడా త్వరగా అయిపోతుంది. ఫోన్ కాల్స్: ఇది అత్యంత ప్రమాదకరమైన అనుమతి. మీతో సంబంధం లేకుండానే కాల్ లిస్ట్‌లో ఉన్న ఫోన్ నంబర్లకు నేరుగా ఫోన్ చేసి వాళ్లే మాట్లాడతారు. దీనివల్ల కాల్ చార్జీలు యజమానికి పడతాయి. అంతేకాదు ఈ యాప్ ఫోన్ నంబర్‌తో పాటు డివైస్ ఐడీని తెలుసుకోచ్చు. స్టోరేజ్ సిస్టమ్: యూఎస్బీ ద్వారా కూడా మెమరీలో ఉన్న సమాచారాన్ని మార్చవచ్చు, లేదా తొలగించవచ్చు. ఫోన్ స్టోరేజ్‌లో ఉన్న డేటాను స్వేచ్ఛగా వినియోగించుకుంటారు. యజమానికి సంబంధం లేకుండానే ఫోన్లో ఫోటోలు, వీడియోలు వంటి వాటిని మార్చవచ్చు, లేదా పూర్తిగా తొలిగించవచ్చు. యజమానికి తెలియకుండా సంబంధం లేని కంటెంట్ వచ్చి చేరిపోవచ్చు. మైక్రోఫోన్: మైక్రోఫోన్ ద్వారా యజమాని అనుమతి లేకుండానే కాల్స్‌ను రికార్డ్ చేసుకుంటారు. అంటే యజమాని ఎవరితో ఏమి మాట్లాడారో వారికి తెలిసిపోతుంది. ఆడియో సెట్టింగ్స్: స్పీకర్‌కు సంబంధించిన ఆడియో సెట్టింగ్స్ మారిపోతుంటాయి. కాల్ మాట్లాడుతున్నప్పుడు సౌండ్ పెంచడం తగ్గించడం చేస్తుంటారు. -
అమ్మాయిలకు వల.. ఆపై బ్లాక్మెయిల్
కర్నూలు: ఫేస్బుక్ ఆసరాగా అమ్మాయిలకు గాలం వేసి బ్లాక్మెయిల్ చేస్తూ నగదు, నగలు కొల్లగొడుతున్న ఓ మాయ గాడిని పత్తికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 36 తులాల బంగారం, రూ.3 లక్షల నగదు, 5 సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకుని ఎస్పీ గోపీనాథ్ జట్టి ఎదుట హాజరుపరిచారు. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని పగిడ్యాలకు చెందిన రాజకుమార్ అలియాస్ తేజర్ష అలియాస్ తేజ డిగ్రీ వరకు చదువుకొని వెలుగోడులో కొంతకాలం ఆర్ఎంపీ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాడు. తర్వాత దొర్నిపాడు అమ్మిరెడ్డి నగర్లో ఆర్ఎంపీగా పనిచేస్తూ తన బట్టతలకు విగ్గు పెట్టుకుని తీసుకున్న కలర్ ఫొటోను ఫేస్బుక్లో అప్లోడ్ చేసి తాను డాక్టర్‌నని పరిచయం చేసుకుని ఆకర్షణీయమైన మెసేజ్‌లు పెట్టేవాడు. వాటికి కామెంట్ చేసిన అమ్మాయిల ఫోన్ నంబర్లు తెలుసుకుని చాటింగ్ చేస్తూ తన ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి వారి ఫ్యామిలీ ఫొటోలు తెప్పించుకుని మార్ఫింగ్ చేసి బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లు లాక్కునేవాడు. పొరుగు రాష్ట్రాల అమ్మాయిలూ బాధితులే.. రాజకుమార్ మాయలో పడి మోసపాయిన వారిలో నంద్యాల, నల్లగొండ, కావలి, మదనపల్లె, కంబం, హైదరాబాదు, బెంగుళూరు, కర్నూలు, పత్తికొండతో పాటు మరికొన్ని ప్రాంతాల అమ్మాయిలు ఉన్నారు. వీరి వద్ద నుంచి సుమారు 36 తులాల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షల నగదు దండుకున్నాడు. మాయగాడిని ఇలా పట్టుకున్నారు.. ఇతడి చేతిలో మోసపోయిన పత్తికొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో భాగంగా బాధిత యువతి మెయిల్ నుంచే ఓ అందమైన అమ్మాయి ఫొటోను రాజకుమార్ మెయిల్‌కు పంపి దాని ద్వారా అతని సెల్‌ఫోన్ నంబర్ కనుక్కుని నేరాన్ని ఛేదించారు. డోన్ డీఎస్పీ ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో పత్తికొండ రూరల్ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్ఐ మారుతీశంకర్, తన సిబ్బందితో కలసి ఫేస్బుక్ ద్వారా రాజకుమార్ పేరు, అడ్రస్ తెలుసుకుని పక్కా సమాచారంతో వల పన్ని పత్తికొండ పట్టణం లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను ఆకర్షించేలా కొటేషన్లు.. రాజకుమార్ నాలుగేళ్ల క్రితం నంద్యాలలో రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరగడంతో కొన్ని నెలల పాటు మంచం పట్టాడు. ఈ సమయంలో కాలక్షేపం కోసం సెల్ఫోన్లో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి బట్ట తలకు విగ్గు పెట్టుకుని ఉన్న ఫొటోను అప్లోడ్ చేసి అమ్మాయిలను ఆకర్షించేలా కొటేషన్లు పెట్టేవాడు. ఫోన్ నంబర్లు తెలుసుకొని తన ఆసుపత్రిలో ఉద్యోగాల పేరుతో వల వేసి లాడ్జీలకు పిలిపించి, నగ్న ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ నగదు, బంగారు ఆభరణాలు లాక్కునేవాడు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఇతడిపై కేసులు నమోదయ్యాయి. గతంలో సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతి, గుంటూరుకు చెందిన ఓ వివాహిత నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు లాక్కున్నాడు. వారిచ్చిన ఫిర్యాదులో భాగంగా 2016 ఫిబ్రవరి 4న కర్నూలు మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. అప్పుడు కూడా ఈ కేసును ఎస్ఐ మారుతి శంకరే ఛేదించారు. మాయగాడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి భారీ మొత్తంలో నగలు, నగదు రికవరీ చేసినందుకు డోన్ డీఎస్పీ ఖాదర్ బాషా, పత్తికొండ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్ఐ మారుతీశంకర్, ఏఎస్ఐలు జమీర్, ఆనంద్, పీసీలు మహేష్, చిన్నశివయ్య తదితరులను ఎస్పీ అభినందించారు. జైలు జీవితం గడిపినా మారని వైనం.. రాజకుమార్ ఈ తరహా నేరాలకు పాల్పడి రెండుసార్లు జైలు జీవితం గడిపినప్పటికీ అతనిలో మార్పు రాకపోగా అదే తరహా నేరానికి పాల్పడి మరోసారి పత్తికొండ పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలో కావలి, నెల్లూరు, కర్నూలు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇదే తరహాలో అమ్మాయిలను మోసం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. -
పోర్న్సైట్లో అప్లోడ్ చేస్తానని.. పోలీసులకు చిక్కాడు
సాక్షి, హైదరాబాద్ : ప్రేమ పేరుతో మూడేళ్లుగా నమ్మించి యువతిని మోసం చేయడమే కాకుండా.. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మార్ఫింగ్ ఫోటోలను అశ్లీల వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తానని బెరించిన యువకుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాలు.. హైద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురుని వినీష్ ప్రేమించానని నమ్మించాడు. మూడేళ్లుగా ప్రేమపేరుతో సన్నిహితంగా ఉన్నట్టు నటించాడు. అదే సమయంలో ఆమె తనతో ఉన్న కొన్ని ఫోటోలను తన వద్దే భద్రపరుచుకున్నాడు. యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్లో ఫోటోలు పెడతానని ఆమెను బెదిరించాడు. అంతటితో ఆగకుండా ప్రియురాలి తండ్రి పెద్ద వ్యాపారవేత్తకావడంతో అతడికి ఫోన్ చేసి రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే నీ కూతురు ఫోటోలను పోర్న్సైట్లలో అప్లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై వీనీష్‌తో ప్రియురాలి తండ్రి రూ. కోటి ఒప్పందం కుదుర్చుకొన్నాడు. కోటి రూపాయాలను ప్రియురాలి తండ్రి నుండి వసూలు చేసుకోవాలని వీనీష్ ప్లాన్ చేసుకొన్నాడు. అయితే ఈ విషయాన్ని ప్రియురాలి తండ్రి పోలీసులకు చెప్పడంతో, పోలీసులు సినిమా సన్నివేశాలను తలపించేలా పక్కా ప్లాన్‌తో నిందితుల కోసం స్కెచ్ గీశారు. దీనిలో భాగంగానే ప్రియురాలి తండ్రి ఒప్పందంలో భాగంగా కోటి రూపాయాల్లో తొలుత రూ.25 లక్షలు చెల్లిస్తానని వీనీష్‌ను నమ్మించారు. ఈ రూ.25 లక్షలను తీసుకొనేందుకు వీనీష్ అతని ఇద్దరు స్నేహితులు వచ్చారు. అయితే వీనీష్ అతని ఇద్దరు స్నేహితులు వ్యాపారవేత్త నుండి రూ. 25 లక్షలు తీసుకొన్న తర్వాత సీసీఎస్ పోలీసులు వారిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. దీంతో అలర్ట్ అయిన వారు వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ హైవే వరకు వెంటాడి వారిని పట్టుకుని, రూ. 25 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. తన కూతురు ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్లో పెడతామని బెదిరింపుల వస్తున్నాయని, తమకు ఆత్మహత్యే శరణ్యమని యువతి తండ్రి ఆగష్టు 9న తమకు ఫిర్యాదు చేశారని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. ముందుగా టవర్ లొకేషన్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేస్తే వారు ఒక్కో ప్రాంతాల్లో ఉన్నట్టు తెలిసిందన్నారు. దీంతో ఓ పథకం ప్రకారం యువతి తండ్రి సహకారంతో నిందితులను పట్టుకోగలిగామని తెలిపారు. 3 సెల్ ఫోన్లు, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పర్సనల్ ఫోటోలు, డేటా విషయంలో జాగ్రత్త వహించాలని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. -
ఆ మహిళ బ్లాక్ మెయిల్ చేస్తోంది
హైదరాబాద్: తనపై అసత్య ఆరోపణలు చేసిన మదర్ థెరిసా ఫౌండేషన్ ప్రతినిధి కొమురెల్లి విజయలక్ష్మీరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ చీఫ్ విప్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను సదరు మహిళను లైంగికంగా వేధించానంటూ దుష్ప్రచారం చేసిందని, తన అపార్ట్మెంట్ వద్దకు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 8 నెలలుగా తప్పుడు ప్రచారం చేస్తూ తనను సమాజంలో కించపరిచేలా ప్రవర్తిస్తోందని, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని తెలిపారు. తన కుటుంబ సభ్యులపై అసత్య ప్రచారం చేస్తోందన్నారు. 2016లో తన సోదరుడికి ఉద్యోగం ఇప్పించాల ంటూ విజయలక్ష్మి తొలిసారిగా తనను కలిసిందని అవకాశం ఉంటే కల్పిస్తానని హామీ ఇచ్చానన్నారు. ఆ తర్వాత మదర్‌థెరిసా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ పేరుతో తనను కలసి ఆర్థిక సాయం కోరిందన్నారు. తాను కొంత ఆర్థిక సహాయం సంస్థకు అందించానని, ఆ తర్వాత పలుమార్లు ఫోన్ చేసి తనను ఆఫీస్‌లో కలసిందని చెప్పారు. లైంగికంగా కలుద్దామంటూ పలుమార్లు తనపై ఒత్తిడి తేగా అందుకు తాను ఒప్పుకోలేదని అప్పటి నుంచి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టిందన్నారు. ఓ పత్రికలో ఇటీవల మాయలేడి పేరుతో ఓ కథనం రాగా అది ఈ మహిళ గురించేనని తెలుసుకున్నట్లు చెప్పారు. కొందరు నేతలు ఆమెకు అండగా నిలుస్తూ తనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. డబ్బుల కోసమే ఆమె ఇదంతా చేస్తోందన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్ 384, 506 కింద కేసు నమోదు చేశారు. -
నగ్నచిత్రాలతో యువతిని బ్లాక్మెయిల్
నెల్లూరు(క్రైమ్): ప్రేమిస్తున్నానని నమ్మించి ఓ యువతికి బాదంపాలులో మత్తుమందు కలిపించి నగ్నచిత్రాలను తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన ఓ యువతి ఇంటర్మీడియట్ చదువుతుండగా అదే ప్రాంతానికి చెందిన పి.మోహన్కుమర్తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుందామని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో సుమారు ఏడాదిన్నిర క్రితం మోహన్ ఆమెను కారులో ఎక్కించుకుని నగరానికి దూరంగా తీసుకెళ్లాడు. తమ వెంట తెచ్చుకున్న తినుబండారాలు, బాదంపాలును ఇద్దరూ కలిసి తిన్నారు. ఈ క్రమంలో మోహన్‌కుమార్ బాదంపాలులో ఆమెకు మత్తుమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన ఆ యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లగానే ఆమెను వివస్త్రను చేసి నగ్నచిత్రాలను సెల్ఫోన్లో తీశాడు. కొద్దిసేపటికి ఆమె లేవడంతో ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్లాడు. అప్పటినుంచి ఆ చిత్రాలను చూపించి యువతి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నాడు. ఇటీవల లైంగికవాంచ తీర్చాలని లేకుంటే ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని ఆమెను బెదిరించసాగాడు. అతని వేధింపులు తాళలేని బా«ధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. వారి సహకారంతో ఆదివారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాల్క సుమన్ భార్య ఫొటో మార్ఫింగ్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఫేస్బుక్లో ఉన్న ఎంపీ బాల్కసుమన్ భార్య ఫొటోను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన బోయిని సంధ్య, బోయిని విజేత అక్కాచెల్లెళ్లు. వీరు కొంతకాలంగా ఎంపీ సుమన్‌కు ఫోన్‌కాల్స్, మెసేజ్‌ల ద్వారా ఇబ్బంది పెడుతున్నారు. ఇవి కాస్త శృతిమించడంతో జనవరి 27న ఎంపీ మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు.. ఫిబ్రవరి 6న అక్కాచెల్లెళ్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత కూడా వారి వైఖరిలో మార్పు రాలేదు. పైగా సుమన్ తనను పెళ్లి చేసుకున్నారని సంధ్య అసత్య ప్రచారం ప్రారంభించింది. ఈ క్రమంలో మే 31న హైదరాబాద్ నందీనగర్ లోని ఎంపీ ఇంటికి తన ఇద్దరు సోదరులు, సోదరితో కలసి వెళ్లి దౌర్జన్యం చేశారు. ఎంపీ సహాయకుడు సునీల్ ఫిర్యాదు మేరకు జూన్ 7న బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో నలుగురిపై కేసు నమోదు చేశారు. అయినా పద్ధతి మార్చుకోని సంధ్య.. ఫేస్బుక్లో సుమన్ తన భార్యాపిల్లలతో దిగిన ఫొటోను మార్ఫింగ్ చేసి, ఆయన భార్య స్థానంలో తన ఫొటోను పెట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ‘బాల్క సుమన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ, ప్రధానికి ఇద్దరు జర్నలిస్టుల ఫిర్యాదు, బాధితులపై తప్పుడు కేసు నమోదు’ అంటూ ప్రచారం జరిగింది. ఎంపీపై అసత్య ప్రచారం: సీఐ ఎంపీ సుమన్ మహిళలను లైంగికంగా వేధించారని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని సీఐ మహేశ్ తెలిపారు. జనవరి 18న కేసు నమోదు చేసుకొని విచారించగా ఎంపీ సుమన్ తన ఫేస్బుక్లో పెట్టిన ఫొటోలను సంధ్య, విజేత కాపీ చేశారని, ఆయన భార్య స్థానంలో సంధ్య ఫొటోలతో మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారని తెలిపారు. ఈ మేరకు వారిద్దరిపై 420, 292ఎ, 419, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్కాచెల్లెళ్లు మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్, చంద్రాపూర్‌కు చెందిన పలువురు వ్యాపారులు, వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని, డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసినట్లు తేలిందని సీఐ వివరించారు. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాల్లో పెట్టి ప్రచారం చేసే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. -
అత్యాచారం చేస్తూ సెల్ఫీ వీడియో!
నిజామాబాద్ క్రైం: ఇద్దరూ మైనర్లే.. బాలిక పదో తరగతి.. బాలుడు ఇంటర్ చదువుతున్నారు. బాలికతో ఉన్న చనువును ఆసరాగా చేసుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతూ సెల్ఫీ వీడియోలు తీశాడు. వాటిని వాట్సాప్‌లలో స్నేహితులకు షేర్ చేశాడు. ఇదే వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తూ ఆరు నెలల పాటు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రికి అనుమానం వచ్చి నిలదీయడంతో శుక్రవారం రాత్రి ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కోటగల్లికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక (15)తో ఆమె సమీప బంధువైన ఇంటర్ విద్యార్థి (17)కి స్నేహం ఏర్పడింది. ఆరు నెలల క్రితం ఆమె పుట్టిన రోజు సందర్భంగా బాలుడు తన ముగ్గురు స్నేహితులతో కలసి నగర శివారులోని నాగారం ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికతో కేక్ కట్ చేయించాడు. ఈ క్రమంలో వారి మధ్య చనువు ఏర్పడింది. రెండు నెలల క్రితం బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్ప డుతూ సెల్ఫీ వీడి యోలు తీశాడు. అప్పటి నుంచి తన వద్దకు రావాలని, లేకుంటే వీడియోను బయ ట పెడతానని బెదిరిస్తూ పలుమార్లు లొంగదీసుకున్నాడు. బాలిక భయపడి ఇంట్లో చెప్పకుండా ఉండిపోయింది. ఇటీవల బాలిక తండ్రి ఫోన్ రిపేరుకు రావడంతో అమ్మాయి సెల్‌ఫోన్ తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం బాలుడి నుంచి ఫోన్‌కాల్స్ రావడం.. అప్పటికే కూతురి ప్రవర్తనపై అనుమానం ఉండటంతో నిలదీయగా.. అసలు విషయం బయటపడింది. బాలుడిని పిలిపించి గ్రామ పెద్దమనుషుల సమక్షంలో నిలదీశాడు. అతను నేరాన్ని అంగీకరించాడు. అయితే.. సెల్‌ఫోన్, వీడియోలలో ఉన్న చిత్రాలు తొలగించాలని చెప్పగా అందుకు నిరాకరించాడు. వెంటనే అతని చేతిలో ఉన్న సెల్‌ఫోన్ లాక్కొని అన్‌లాక్ చేయించగా.. వాటిలో ఉన్న అశ్లీల చిత్రాలు చూసి నివ్వెరపోయారు. ఘోరం జరిగిపోయిందని తెలుసుకొని బోరున విలపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. -
మిడిల్ క్లాస్ మేల్ బ్లాక్‌మేల్
ఒకరి బలహీనత ఇంకొకరికి ఆసరా. అవసరాన్ని తీర్చే మార్గం. మరీ మధ్యతరగతి వర్గన్ని బతికిస్తున్నవి ఇలాంటి బలహీనతలే! ఇదే బ్లాక్‌మేల్ సినిమా! చాలా సీరియస్ విషయాన్ని హాస్యాన్ని జోడించి ఎంతో చతురంగా చెప్పిన చిత్రం! కథ... దేవ్ (ఇర్ఫాన్ ఖాన్) టిష్యూ పేపర్స్ తయారు చేసే కంపెనీలో సేల్స్ మ్యాన్. బాధ్యతలు తప్ప సుఖం, సంతోషం లేని మిడిల్‌క్లాస్ హజ్బెండ్. ముద్దుముచ్చటా లేని కాపురం. ఆఫీస్‌లో అందరూ వెళ్లిపోయే వరకు ఉండి, వీడియో గేమ్ ఆడి, భార్య నిద్రపోయాక ఇంటికెళ్తాడు. డైనింగ్ టేబుల్ మీద చల్లారిన భోజనాన్ని ఓవెన్లో పెట్టి, డైనింగ్ హాల్కీ బెడ్రూమ్కీ మధ్య ఉన్న తలుపు కన్నంలోంచి... ఆదమరిచి నిద్రపోతున్న భార్య అందాన్ని ఆస్వాదిస్తాడు. ఈలోపు ఓవెన్లో భోజనం వేడి అయిపోయినట్టు అలారమ్ వస్తుంది. నిట్టూర్చి భోజనం అయిందనిపించి వెళ్లి పడుకుంటాడు. ఇంచుమించు ఇదే దిన చర్య దేవ్ది. గులాబీపూలు... నిజాల ముళ్లు దేవ్ ఉదాసీనతను చూసి అతని కొలీగ్ ఆనంద్.. ‘‘కొన్నాళ్లుగా చూస్తున్నా. ఎందుకింత ఉదాసీనంగా ఉంటున్నావ్? అసలు కొత్త కాపురంలోని మొగుడులాగా ఉన్నావా? ఎందుకు ఏమైంది? కలహాలా?’’ అంటూ స్నేహితుడిని అడుగుతాడు. ముభావంగా ఉంటాడు దేవ్. ‘‘పువ్వులు ఇష్టపడని భార్య ఉండదు. సో.. ఈ రోజు పువ్వులు తీసుకొని త్వరగా ఇంటికెళ్లి నీ భార్యకు సర్ప్రయిజ్ ఇవ్వు’’ అని దేవ్‌ను ఉత్సాహపరుస్తాడు ఆనంద్. అన్నట్టుగానే పువ్వులు తీసుకొని త్వరగా ఇంటికొస్తాడు దేవ్. ఎప్పటిలాగే డైనింగ్ హాల్, బెడ్రూమ్కి మధ్యనున్న కన్నంలోంచి చూస్తాడు. షాక్... రీనా (కీర్తి కుల్హరి) ఇంకో వ్యక్తితో కనిపిస్తుంది. ఆవేశం పొంగుతుంది. వెళ్లి భార్య పక్కనున్న అతణ్ణి చంపేయాలనుకుంటాడు. ఏమీ చేయలేక.. భార్యనూ నిలదీయలేక నిస్సహాయంగా వెనుదిరుగుతాడు. తన ఇంట్లోంచి ఆ వ్యక్తి బయటకు వచ్చే వరకు అపార్ట్మెంట్ కాంపౌండ్‌లో నిరీక్షించి ఆ వ్యక్తి బయటకు వచ్చాక అతణ్ణి ఫాలో అవుతాడు. బ్లాక్‌మెయిల్స్... భార్య స్నేహితుడి పేరు రంజిత్ అని, ఓ బడా వ్యాపారి అల్లుడని తెలుసుకుంటాడు ఆ ఇంటి వాచ్‌మన్ ద్వారా. నిజానికి రంజిత్ (అరుణోదయ్ సింగ్), రీనా (దేవ్ భార్య)పెళ్లికి ముందే ప్రేమికులు. కాని డబ్బు కోసం డాలీ (దివ్య దత్తా)ను పెళ్లిచేసుకుంటాడు. జిమ్ ట్రైనర్ అయిన రంజిత్ వేరే పనేమీ లేకుండా అత్తింటి సొమ్ము మీద బతుకుతుంటాడు. దాంతో భర్తంటే చాలా చులకన డాలీకి. ఇంచుమించు పెంపుడు కుక్కలా ట్రీట్ చేస్తుంటుంది అతనిని. దాంతో ఆత్మాభిమానం దెబ్బతిని మళ్లీ పాత స్నేహితురాలు రీనాతో సంబంధం పెట్టుకుంటాడు రంజిత్. అలా వాళ్లిద్దరి స్నేహం కొనసాగుతుంది. ఈలోపు దేవ్‌కు నెల తిరిగేసరికల్లా ఇంటి ఈఎమ్ఐ, కార్ ఈఎమ్ఐ, కేబుల్ పేమెంట్.. ఎట్సెట్రా తడిసిమోపెడవుతాయి. ఆఫీస్‌లో ఆ నెల ఇంక్రిమెంట్ ఉంటుంది కదా.. అన్నీ తీర్చేయొచ్చు అనుకుంటే.. ‘‘కంపెనీ సేల్స్ మందగించాయి, పైగా కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం ఇన్వెస్ట్ చేస్తోంది. అందుకే ఇంక్రిమెంట్స్ లేవు’’ అంటూ చావు కబురు చల్లగా చెప్తారు. టెన్షన్లో పడ్తాడు దేవ్. అప్పుడు ఒక బేసిక్ మోడల్ ఫోన్ కొని, దాన్లో ప్రీపెయిడ్ సిమ్ వేసి, రాత్రి దొంగతనంగా భార్య ఫోన్లోంచి రంజిత్ ఫోన్ నంబర్ తస్కరించి ‘‘పెళ్లయిన మహిళతో అఫైరా?’’ అంటూ బ్లాక్ మెయిల్ మెస్సేజ్ పంపిస్తాడు రంజిత్‌కు. భయపడ్డ రంజిత్.. ‘‘ఏం కావాలి?’’ అని అడుగుతాడు. ఈఎమ్ఐల లెక్కలు వేసుకొని లక్ష రూపాయలు డిమాండ్ చేస్తాడు. క్రాస్‌బ్రీడ్ డాగ్స్ బిజినెస్ చేస్తున్నాను, ఒక లక్ష రూపాయలివ్వమని అబద్ధం చెప్పి భార్య దగ్గర డబ్బులు తీసుకొని దేవ్కిస్తాడు రంజిత్. అలా భార్య ఎఫైర్‌ను మనీ సంపాదన వనరుగా మార్చుకుంటాడు దేవ్. మధ్యతరగతి విలువలు అతనిని కుళ్లబొడుస్తుంటాయి. ఆ అపరాధ భావనను ఓ రోజు బార్లో కొలీగ్ ఆనంద్‌తో పంచుకుంటాడు. ఆనంద్ ఆ విషయాన్ని తన ఆఫీస్‌లోని కొత్త ఫీమేల్ కొలీగ్ ప్రభకు చెప్తాడు. ఆ విషయాన్ని అడ్డం పెట్టుకొని ప్రభ మళ్లీ దేవ్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంది. అయితే బిజినెస్ పేరుతో కూతురు దగ్గర అల్లుడు డబ్బు తీసుకున్నాడని తెలిసి డాలీ తండ్రి రంజిత్‌ను బెదిరిస్తాడు రెండు రోజుల్లో లక్ష రూపాయలు తిరిగి ఇవ్వమని. ఏం చేయాలో పాలుపోక ఒక డూప్లికేట్ మెయిల్ ఐడీ క్రియేట్ చేసి గర్ల్ ఫ్రెండ్ రీనాకు బ్లాక్ మెయిల్ మెస్సేజ్ పంపిస్తాడు రంజిత్– ‘‘పెళ్లయిన వాడితో ఎఫైరా?’’అంటూ. ఈ విషయం నీ భర్తకు తెలియకుండా ఉండాలంటే లక్షా 30 వేల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. రీనా తండ్రి కిడ్నీ జబ్బుతో బాధపడ్తుంటాడు. డబ్బు కోసం తల్లి దగ్గరకు వెళ్తుంది రీనా. ఉన్న డబ్బంతా మీ నాన్న కోసం హాస్పిటల్ చుట్టూ తిరగడానికే అయిపోయిందంటుంది తల్లి. దాంతో రీనా తన భర్తనే అడుగుతుంది తండ్రి వైద్య పరీక్షల కోసమని. రంజిత్ దగ్గర తీసుకున్న సొమ్మును తిరిగి భార్యకు ఇచ్చేస్తాడు. మళ్లీ రంజిత్‌ను బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇలా ఈ సైకిల్ అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ల, ఆ విషయం తెలిసిన వాళ్ల చుట్టూ తిరుగుతుంటుంది. ప్రైవేట్ డిటెక్టివ్.. ఈ బ్లాక్మెయిల్ బెడద తొలగించుకోవాలని రంజిత్ ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ను మాట్లాడుకుంటాడు. ఆ డిటెక్టెవ్ రంజిత్‌కు ఫోన్ చేస్తున్న నంబర్ రీనా భర్తదేనని తెలుసుకుంటాడు. రంజిత్‌కు చెప్పకుండా పరిశోధన పేరుతో డ్రాగ్ చేస్తూ దేవ్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంటాడు.. ‘‘నీ బాయ్‌ఫ్రెండ్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంది నీ భర్తనేని నీ భార్యతో చెప్తాన’’ంటూ. ఖంగు తింటాడు దేవ్. ఈలోపు ప్రభ ఒత్తిడి ఎక్కువవుతుంది దేవ్‌కి. ఆమెను కన్విన్స్ చేయడానికి వాళ్లింటికి వెళ్దామనుకొని ఆమె ఇంటి అడ్రస్ కోసం ఆనంద్‌ను అడుగుతాడు. ఆ రాత్రి ప్రభ వాళ్లింటికి వెళ్తాడు దేవ్. వాదోపవాదాలు జరిగి దేవ్ వెళ్లిపోతుంటే ఆయనను ఆపడానికి వెళ్లి బాటిల్ మీద కాలు పడి జారి వెనకాల అల్మారాకు కొట్టుకుంటే అల్మారా మీద పడి ప్రభ చనిపోతుంది. భయపడి పారిపోతాడు దేవ్. కాలనీ వాసులు ఆయనని తరుముతాడు. అయినా తన అనవాలు చిక్కనివ్వకుండా తప్పించుకుంటాడు. మర్నాడు ఆఫీస్‌కు పోలీస్‌లు వస్తారు ఎంక్వియిరీ కోసం. ఆనంద్‌కు దేవ్ మీద డౌట్ వస్తుంది. ప్రభ అంటే ఆనంద్ ఇష్టపడుతున్నాడని పోలీసులకు చెప్పి డౌట్ ఆనంద్ మీదకు మళ్లేట్టు చేస్తాడు దేవ్. ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్చేస్తారు. అప్పుడు తన భార్య ఎఫైర్ విషయం తెలిసి ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఆ విషయం ప్రభకు తెలిసి... దేవ్‌ను ప్రభ బ్లాక్మెయిల్ చేసిందని అందుకే దేవే ఆమెను చంపి ఉంటాడని పోలీసులకు చెప్తాడు ఆనంద్. ఇన్స్పెక్టర్ దేవ్‌ను బెదిరిస్తాడు. ఈ లోపు ప్రైవేట్ డిటెక్టివ్ పోరు ఎక్కువవుతుంది దేవ్‌కి. అటు రంజిత్‌కు మామ పోరూ ఎక్కువవుతుంది. డాలీకి భర్త ఎఫైర్ విషయం తెలిసి, భర్తను చంపేయాలనుకుంటుంది. కాని అంతకుముందే రంజిత్ ప్రైవేట్ డిటెక్టివ్ చెప్పిన వ్యక్తి దగ్గర ఒక నాటు తుపాకీ కొనుక్కుంటాడు. కత్తితో తన వెనకాల పొడిచిన భార్యను తుపాకితో కాల్చి చంపేస్తాడు. డబ్బు కోసం మళ్లీ రీనాను బ్లాక్మెయిల్ చేస్తాడు రంజిత్ అపరిచిత మెయిల్ ద్వారా. రీనా మళ్లీ దేవ్‌ను డబ్బులు అడుగుతుంది తండ్రి వైద్యం కోసం. ఇవ్వనంటాడు. అపాలజీ చెప్పడానికి రీనా తల్లికి ఫోన్ చేస్తే రీనా అబద్ధం చెప్పిందని అర్థమవుతుంది దేవ్‌కి. అప్పుడు మొత్తం విషయం తెలుస్తుంది. తను డబ్బు కోసం రంజిత్‌ను బ్లాక్మెయిల్ చేయడం, రంజిత్ రీనాను బ్లాక్ మెయిల్ చేయడం. ఆ నిజాన్ని సాక్ష్యాలతో సహా రీనాకు పంపిస్తాడు దేవ్. రియౖలైజై రంజిత్ స్నేహానికి స్వస్తి చెప్పి అతని నంబర్ డిలీట్ చేస్తుంది రీనా. ఆనంద్‌కూడా దేవ్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. ఆలోచించి ఓ ప్లాన్ వేస్తాడు దేవ్. ‘‘నువ్వు అడిగినంత డబ్బిస్తాను. కాని నిన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది ఆనంద్ అని రంజిత్‌తో చెప్పు’’అంటాడు దేవ్.. ప్రైవేట్ డిటెక్టివ్‌తో. అలాగే చెప్తాడు ప్రైవేట్ డిటెక్టివ్. ఈ బ్లాక్‌మెయిలర్‌కు గుణపాఠం చెప్పాలనే ఆవేశంతో ఉన్న రంజిత్... ప్రైవేట్ డిటెక్టివ్ ఇచ్చిన సమాచారంతో ఆనందే అసలు బ్లాక్‌మెయిలర్ అనుకొని అతనిని చంపేస్తాడు. ఈ క్రమంలో తన కూతురిని చంపింది అల్లుడే అన్న నిజమూ తెలుస్తుంది రంజిత్ మామకు. అలా రంజిత్ దోషిగా దొరికిపోతాడు. దేవ్ కోసం రీనా ఆ రాత్రి భోజనం వండి టేబుల్ మీద సర్ది ఎదురు చూస్తుంటుంది. ఎప్పుడొస్తావ్ ఇంటికి అని మెస్సేజ్ పెట్టి. ఆ మెస్సేజ్ వచ్చేటప్పటికీ దేవ్ ఎప్పటిలా రాత్రి ఆఫీస్‌లో వీడియో గేమ్ ఆడ్తుంటాడు. చిత్రంగా విన్ అవుతాడు. భార్య మెస్సేజ్ చూసి ఆమె నంబర్ డిలిట్ చేసేస్తాడు. సామాన్యుడు తనే సమస్యలను సృష్టించుకుని ఆ సుడిగుండంలో కొట్టుకుపోతాడు అనే సారాంశం ఈ బ్లాక్మెయిల్. దేవ్‌గా ఇర్ఫాన్ అద్భుతం. రంజిత్‌గా అరుణోదయ్ కూడా సూపర్బ్. ఇక కీర్తి కుల్హరి గురించి వేరేగా చెప్పక్కర్లేదు. సున్నితమైన హాస్యంతో గొప్ప సమస్యను చిత్రీకరించిన తీరు అద్భుతం. మల్టీప్లెక్స్‌ల్లో ఆడుతోంది. తప్పక చూడండి. – శరాది -
నగ్న ఫోటోలతో గృహిణికి బెదిరింపులు.. ఆత్మహత్య
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని తూరు మిడ్నాపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ గృహిణి మొబైల్ నుంచి ఆమె వ్యక్తిగత ఫోటోలను స్వాధీనం చేసుకున్న కొందరు విద్యార్థులు.. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బ్లాక్ మెయిల్‌కు దిగారు. ఆ వేధింపులను తట్టుకోలేక చివరకు గృహిణి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త ఉద్యోగరిత్యా ఒడిషాలో పని చేస్తుండగా.. సదరు మహిళ(35) తన కూతురితో చండీపూర్‌లో నివసిస్తోంది. కొద్దిరోజుల క్రితం తన కూతురిని డాన్స్ స్కూల్‌కు తీసుకెళ్తున్న క్రమంలో ఆమె తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివే ఓ విద్యార్థి(17)కి అది దొరికింది. అయితే అందులో ఉన్న ఆమె ఫోటోలన్నీంటిని తన మొబైల్‌కు పంపించుకున్నాడు. తిరిగి మొబైల్‌ను ఆ మహిళకు ఇచ్చేశాడు. వాటిలో కొన్ని అభ్యంతరకరంగా ఉండగా.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ ఆమెను బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థికి మరో ఇద్దరు స్నేహితులు కూడా సహకరించారు. వేధింపులు ఎక్కువ కావటంతో ఆమె శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. లైంగికంగా వేధించారు... విద్యార్థులు తన సోదరిని లైంగికంగా వేధించారని బాధితురాలి సోదరుడు చెబుతున్నాడు. చనిపోయే ముందు ఆమె విషయాన్ని తనకు చెప్పుకుని రోదించిందని.. సోదరిని ఓదార్చి తాను తిరిగి ఇంటికెళ్లే సరికి అఘాయిత్యానికి పాల్పడిందని అతను అంటున్నాడు. ఇక నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. కాగా, ఈ కేసులో ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
నా వ్యాధి గురించి నేనే చెప్తా : బాలీవుడ్ నటుడు
నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్య సమస్యల కారణంగా విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వాయిదా పడిన వార్త వచ్చిన దగ్గర నుంచి ఇర్ఫాన్ ఆరోగ్య సమస్యలపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై స్పందించిన ఇర్ఫాన్ తన ఆరోగ్య పరిస్థితి సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ‘గత పదిహేను రోజులుగా నా జీవితం సస్పెన్స్ స్టోరిని తలపిస్తోంది. ఎప్పుడూ అరుదైన కథల కోసం అన్వేషించే నాకు ఓ అరుదైన వ్యాధి ఉన్నట్టుగా తెలిసింది. నేను ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోలేదు. నా ఇష్టాల కోసం పోరాడుతూనే ఉన్నాను. అలాగే ఉంటాను. నా కుటుంబ సభ్యులు, మిత్రలు నాతో ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. ఈ సమయంలో మీరు వదంతులు సృష్టించకండి. నా కథను నేను మరో వారం పది రోజుల్లో వెల్లడిస్తాను’ అంటూ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశాడు ఇర్ఫాన్ ఖాన్. జాతీయ ఉత్తమనటుడిగా అవార్డు అందుకున్న ఇర్ఫాన్ ఖాన్, సినీ రంగానికి చేసిన సేవలకు గానే పద్మశ్రీ అవార్డను సైతం అందుకున్నారు. పలు భారతీయ భాషలతో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ఇర్ఫాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న బ్లాక్మెయిల్, పజిల్, కర్వాన్, రైతా చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఇర్ఫాన్ ట్వీటర్ పోస్ట్‌పై బ్లాక్మెయిల్ చిత్ర దర్శకుడు అభినయ్ డియో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘తనతో నేను చాలా సమయం గడిపాను. ఆయన అనారోగ్యంతో ఉన్నట్టు ఎప్పుడూ అనిపించలేద’న్నారు. 🙏🏻 pic.twitter.com/JXD8NKwH3D — Irrfan (@irrfank) 5 March 2018 -
అమెరికా బ్లాక్మెయిల్ చేసినంత కాలం..
సియోల్: అమెరికా, దాని మిత్ర దేశాలు తమను భయపెడుతూ సైనిక విన్యాసాలు నిర్వహించినంత కాలం అణు కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. ఈ ఏడాది ఉత్తర కొరియా జరిపిన అణు, క్షిపణి పరీక్షలను సమీక్షించిన ఆ దేశ అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికా, దాని మిత్ర పక్షాల బ్లాక్మెయిల్, సైనిక విన్యాసాల నేపథ్యంలోనే నార్త్ కొరియా స్వీయ రక్షణకు అణు సామర్థ్యాలను పెంచుకుందని పేర్కొంది. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్వేషపూరిత విధానాలను అవలంబిస్తూ, దాడులకు పాల్పడతామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. ‘ఉత్తర కొరియా కొత్త వ్యూహాత్మక, అణుశక్తిగా ఎదిగిందనడంలో సందేహం అక్కర్లేదు. మా విధానాల్లో ఎలాంటి మార్పు ఉండదు. అజేయ శక్తిగా మారిన ఉత్తర కొరియాను బలహీనపరచలేరు, అణగదొక్కలేర’ ని కేసీఎన్ఏ వ్యాఖ్యానించింది. -
ఆ.. తండ్రీకూతుళ్లు.. మానవత్వానికి మచ్చ
సాక్షి, యమునా నగర్ : మానవత్వానికి, విలువలకు మచ్చ తెచ్చేలా హర్యానాలోని తండ్రీకూతుళ్లు ప్రవర్తించారు. కుటుంబ విలువలు, బంధాల పతనానికి పరాకాష్టకు సాక్ష్యంలా వాళ్లు నిలిచారు. స్థానిక యమునా నగర్లో ఉంటున్న తండ్రీకూతుళ్ల వికృతత్వం తాజాగా బయటపడింది. ఆడ స్నేహితులను కుమార్తె ఇంటికి తీసుకురాగా తండ్రి వారిపై అత్యాచారం చేసేవాడు. ఈ ఘటననంతా కుమార్తె దగ్గరుండీ వీడియో తీసి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం వారికి పరిపాటిగా మారింది. హర్యానా పోలీసు విచారణలో దిమ్మ తిరిగే నిజాలు వెలుగు చూశాయి. కుమార్తె.. బాగా డబ్బున్న వారితోనూ, అందంగా ఉండే పేద మహిళలతోనే స్నేహాలు చేస్తుండేది. వారికి బాగా నమ్మకం కుదిరాకా.. ఇంటికి ఆహ్వానించేది. ఇంట్లో కాఫీ, టీ, కూల్ డ్రిక్స్‌లో మత్తు మందు కలిపి వారికి ఇచ్చేవారు. తరువాత తండ్రి సీన్లోకి ఎంటరయి.. వారిపై అత్యాచారానికి దిగేవాడు. ఈ మొత్తం వ్యవహరాన్ని కుమార్తె దగ్గరుండి మరీ వీడియో తీసేది. తరువాత వీడియోను అడ్డం పెట్టుకుని వారిన డబ్బుకోసం బ్లాక్మెయిల్ చేసేవారు. ఇక్కడ మరో దారుణ విషయం ఏమిటంటే అందంగా ఉండే పేద మహిళలను బలవంతంగా వ్యభిరాకూపంలోకి దించారు. వారు వ్యభిచారం చేసి సంపాదించే మొత్తంలో వీరికి కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. డబ్బులు ఇవ్వకపోతే.. వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించేవారు. తండ్రీకూతుళ్ల ఉచ్చులో పడి.. అత్యాచారానికి గురయిన మహిళ ధైర్యంగా యమునానగర్ పోలీసులను ఆశ్రయించడంతో వీరి బాగోతం బయటపడింది. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తండ్రీకూతుళ్లపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బాధిత మహిళ మాట్లాడుతూ.. నన్ను కూడా రూప10 వేలు డిమాండ్ చేస్తే.. ఇచ్చానని చెప్పారు. మళ్లీమళ్లీ డబ్బుల కోసం డిమాండ్ చేస్తుండడంతో.. పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు. -
ప్రాణాలు తీసుకోబోయారు
-
తుపాకీ ఘటనలో..చీకటి కోణాలెన్నో!
♦ నిందితులు, ఫిర్యాదు దారులంతా గతంలో ఒకే ముఠా ♦ పొలిటికల్, పోలీస్ అధికారులకు అమ్మాయిల ఎర ♦ కొందరి రాసలీలలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తున్న వైనం ♦ భర్త లేని ఒంటరి మహిళలే లక్ష్యంగా దందాలు ♦ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న చీకటి బాగోతాలు ♦ శంకర్‌రెడ్డి, విజయభాస్కర్రెడ్డిలను కోర్టులో హాజరుపరచిన పోలీసులు రాజధాని ప్రాంతమైన గుంటూరులో వెలుగుచూసిన తుపాకీ చిక్కుముడి ఇంకా వీడలేదు. రెండు రోజులైనా తుపాకీ ఎవరిది.. ఎక్కడ నుంచి వచ్చింది.. అసలు దాని వెనుక ఉన్న కథ ఏమిటి.. అనే విషయాన్ని పోలీసులు నిగ్గుతేల్చలేకపోయారు. అయితే నిందితులతో పాటు ఫిర్యాదు దారులంతా గతంలో ఒకే ముఠా అని తేలింది. పోలీసుల విచారణలో కళ్లు చెదిరే వాస్తవాలు బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. సాక్షి, గుంటూరు : గుంటూరులో రెండు రోజుల క్రితం తుపాకీ సహా లొంగిపోయిన విజయభాస్కరరెడ్డి ఘటన వెనుక చాలా పెద్ద వ్యవహారమే ఉందని తెలుస్తోంది. దీని వెనుక రాజకీయ నేతలు, పోలీసు అధికారులు కూడా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికార పార్టీ నేతలు, పోలీస్ అధికారులకు అమ్మాయిలను ఎరగా వేసి వారి రాసలీలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వాటిని బూచిగా చూపి ఈ ముఠా తమ పనులు చక్కబెట్టుకున్నట్టు సమాచారం. అయితే పదేళ్ల క్రితం జరిగిన సంఘటనను హఠాత్తుగా తెరపైకి తేవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఠా సభ్యుల మధ్య కొన్నేళ్లుగా నడుస్తున్న వివాదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అన్నీ చిక్కుముడులే... చలసాని ఝాన్సీ అనే మహిళను చంపమని తనకు శనగా సోమశంకర్‌రెడ్డి తుపాకీ ఇచ్చాడని, ఆమెను చంపకపోతే తనను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని మోదుగుల విజయ భాస్కరరెడ్డి అనే వ్యక్తి ఈ నెల 15వ తేదీ రాత్రి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. దీన్ని పూర్తి స్థాయిలో విచారించి వాస్తవాలు వెలికితీయాలని న్యాయమూర్తి తేజోవతి పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో 16న సోమశంకర్‌రెడ్డి కూడా పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. దీంతో మోదుగుల విజయభాస్కరరెడ్డితో పాటు సోమశంకర్రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే రెండు రోజులు గడిచినా తుపాకీ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం మాత్రం తేలలేదు. ఝాన్సీని సైతం పోలీస్ స్టేషన్‌కు పిలిచి ఆమె స్టేట్మెంట్ నమోదు చేసుకుని పంపివేశారు. అయితే మోదుగుల విజయభాస్కరరెడ్డి చెప్పే మాటలకు పొంతన లేకుండా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జూన్‌లో తుపాకీ ఇస్తే ఇప్పటి వరకు ఎందుకు దాచి ఉంచారు.. పదేళ్ల క్రితం ముగిసిన ఝాన్సీ వివాదం ఇప్పుడు మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చింది అనే అనుమానాలూ కలుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా తమ మధ్య వివాదాలు నడుస్తున్న తరుణంలో శత్రువైన విజయభాస్కరరెడ్డికి సోమశంకర్‌రెడ్డి తుపాకీ ఎందుకు ఇస్తాడనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. తుపాకీ తీసుకున్న వెంటనే లొంగిపోకుండా విజయభాస్కరరెడ్డి మూడు నెలల తరువాత లొంగిపోవడంలో ఆంతర్యం ఏమిటి అనే అనుమానాలూ కలుగుతున్నాయి. ఇద్దరిపైనా కేసులు నమోదు... తుపాకీ ఎవరిది అనే విషయంపై శంకర్‌రెడ్డి, విజయభాస్కరరెడ్డి ఒకరిపై ఒకరు చెప్పుకొంటుండటంతో పోలీసులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. మూడు నెలలుగా అక్రమంగా తుపాకీ కలిగి ఉన్నందుకు విజయభాస్కరరెడ్డిపై కేసు నమోదు చేశారు. మరోవైపు 2004 నుంచి ఆయుధం కలిగి ఉన్నాడని ఝాన్సీ చెప్పడం, ఆమెను హత్య చేయాలని విజయభాస్కరరెడ్డిని పురమాయించడంతో శంకర్‌రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేసి ఆదివారం కోర్టులో హాజరుపరిచారు. భర్త లేని ఒంటరి మహిళలే టార్గెట్... భూములు, భవనాలు, ఇతర ఆస్తులు ఉండి భర్త చనిపోయిన ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని పదేళ్లుగా ఈ ముఠా దందాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా వారి కష్టాలు, సమస్యలు తెలుసుకుని మంచిగా వారికి దగ్గర కావడం, కొంత డబ్బు ఇచ్చి ఆస్తులు రాయించుకోవడం వీరికి పరిపాటిగా మారింది. అనంతరం వారిని శారీరకంగా లొంగదీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం వీరికి అలవాటుగా మారింది. జిల్లాకు చెందిన అనేక మంది రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులకు అమ్మాయిలను ఎరగా వేసి వారిని బుట్టలో వేసుకుంటున్నట్లు సమాచారం. కొందరు రాజకీయ నేతలు, పోలీస్ అధికారుల రాసలీలలను చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ తమ పనులు చక్కబెట్టుకున్నట్టు తెలిసింది. ఇలా అనేక మంది మహిళలను మోసగించి నగరంలో ఇప్పటికే కోట్ల రూపాయల ఆస్తులను కాజేసినట్లు సమాచారం. ఇందులో అధికార పార్టీ నేతలు, పోలీస్ అధికారుల పాత్ర కూడా ఉండటంతో అసలు విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుపాకీ సైతం పోలీస్ అధికారుల అండతోనే వీరి వద్దకు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో చీకటి బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్లు సమాచారం. తుపాకీ విషయం తేలకపోవటంతో.. పోలీసులు మరోసారి శంకర్‌రెడ్డి, విజయభాస్కరెడ్డిలను అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి సారించి లోతుగా విచారణ జరిపితే పెద్దల చీకటి బాగోతాలు బయటపడే అవకాశాలున్నాయి. -
ఖర్చు పెట్టించి కాదంటావా?
► మాజీ ప్రియురాలితో గొడవకు దిగిన భగ్న ప్రేమికుడు ► డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు బయటపడతానని బెదిరింపు ► అతడికి కౌన్సెలింగ్, ఆమెకు భరోసా కల్పించిన సిటీ షీ–టీమ్స్ ► ఓ ఇల్లాలికి ఇక్కట్లు తెచ్చిపెట్టిన సినీ హీరోపై అభిమానం సాక్షి, సిటీబ్యూరో: ‘మనం కలిసి ఉన్నప్పుడు అంతా నేనే ఖర్చు పెట్టాను. ఆ మొత్తం దాదాపు రూ.5 లక్షల వరకు ఉంటుంది. డబ్బులు చెల్లించకపోతే నిన్ను అల్లరి పాలు చేస్తా’... తన మాజీ ప్రియురాలికి ఓ భగ్న ప్రేమికుడు ఇచ్చిన వార్నింగ్ ఇది. బాధితురాలు వాట్సాప్ ద్వారా ‘షీ–టీమ్స్’ను ఆశ్రయించడంతో అతడి బ్లాక్ మెయిలింగ్‌కు చెక్ పడింది. ఈ వ్యవహారంలో బాధ్యుడి అరెస్టు సాధ్యం కాకపోవడంతో బాధితురాలి వివాహం నేపథ్యంలో పోలీసులు అతనిపై మఫ్టీలో నిఘా ఉంచారు. రెండు వారాల క్రితం చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ఓ యువతి, సికింద్రాబాద్‌కు చెందిన యువకుడు ఇంజినీరింగ్ కలిసి చదువుకున్నారు. ఈ నేపథ్యంలో వీరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి సన్నిహితంగా మెలిగారు. చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఖర్చంతా అతనే భరించాడు. అప్పట్లో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు కొన్ని అతడి వద్ద ఉన్నాయి. అనివార్య కారణాలతో వీరిద్దరూ దూరం కాగా, సదరు యువతికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుకున్న యువకుడు ఆమెపై కక్షకట్టి ‘బ్లాక్ మెయిలింగ్’కు దిగాడు. తామిద్దరం కలిసి తిరిగిన రోజుల్లో ఖర్చంతా తానే భరించానని, దాంతో పాటు బహుమతులూ ఇచ్చినందుకు దాదాపు రూ.5 లక్షలు ఖర్చయిందని లెక్కచెప్పాడు. ఆ మొత్తం తనకు చెల్లించకపోతే తామిద్దరం కలిసి దిగిన ఫొటోలు బయటపెట్టి పెళ్లి చెడగొడతానని బెదిరించాడు. అతగాడిని వదిలించుకోవాలని భావించిన యువతి ఓ సారి రూ.లక్ష ఖరీదు చేసే తన బంగారు గొలుసు, మరోసారి రూ.50 వేల నగదు ఇచ్చింది. రెండు రోజుల్లో ఆమె వివాహం ఉందనగా అతగాడి బ్లాక్ మెయిలింగ్ తీవ్రం చేయడంతో బాధితురాలు వాట్సాప్ ద్వారా ‘షీ–టీమ్స్’కు ఫిర్యాదు చేసింది. ఫోన్ నెంబర్ ఆధారంగా సికింద్రాబాద్‌లో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం తన ఇంట్లో తెలియదని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయిస్తే తనకు ఇబ్బందని ఆ యువతి పోలీసులకు చెప్పడంతో అతగాడికి కౌన్సిలింగ్ ఇచ్చిన ‘షీ–టీమ్స్’ విడిచిపెట్టాలని భావించాయి. అయితే బయటకు వెళ్లిన తర్వాత అతను వివాహం చెడగొట్టే ప్రమాదం ఉందని అధికారులు అనుమానించారు. అయితే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు లేకుండా అరెస్టు చేయడానికి, తమ అదుపులో ఉంచుకోవడానికి ఆస్కారం లేకపోవడంతో యువతి వివాహమయ్యే వరకు అతడిపై నిఘా ఉంచాలని నిర్ణయించారు. కొందరు సిబ్బందిని మఫ్టీల్లో అతడి వెంటే ఉంచి కదలికలను నిశితంగా పర్యవేక్షించారు. ‘అభిమానం’...అవస్థలు బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న ఓ వివాహితకు ఓ సినీ నటుడంటే ఎంతో అభిమానం. దీంతో ఫేస్బుక్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న ఆమె సదరు హీరోను ‘ఫాలో’ అవుతుండేది. కొన్ని రోజులకు ఓ యువకుడి నుంచి ఆమెకు ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో ఆమోదించింది. తనకూ సదరు హీరో అంటే అభిమానమంటూ చాటింగ్ ప్రారంభించిన అతను ఆమెకు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో వివాహిత తన ఫొటోలు కొన్నింటికి అతడికి పంపింది. వీటి ఆధారంగా అతడు బ్లాక్ మెయిలింగ్‌కు దిగాడు. రెండు దఫాల్లో ఆమె నుంచి రూ.లక్ష వసూలు చేయడంతో పాటు అభ్యంతరకర ప్రతిపాదనలు చేశాడు. ఎట్టకేలకు విషయం ఆమె భర్తకు తెలిసింది. ఆయన ప్రొద్భలంతో బాధితురాలు వాట్సాప్ ద్వారా షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడానికి ఆమె నిరాకరిచడంతో యువకుడినికి కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి.. గోదావరిఖనిలోని స్వతంత్ర చౌక్ ప్రాంతానికి చెందిన ఎ.సందీప్ ప్రైవేట్ ఉద్యోగిగా పని చేసేవాడు. ఇతడికి గతంలో బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఉండేది. కొన్నాళ్ళకు ఆ యువతి సందీప్‌తో తెగతెంపులు చేసుకుంది. దీంతో ఆమెపై కక్షకట్టిన సందీప్ ఆమెను వేధించడం ప్రారంభించాడు. అతడు పంపిస్తున్న సందేశాలకు ఆమె స్పందించకపోవడంతో విచక్షణ కోల్పోయిన అతను స్నేహితుల దినోత్సవం రోజు ఆ యువతి పని చేస్తున్న కార్యాలయానికి వెళ్లి దురుసుగా ప్రవర్తించాడు. ఈ అవమాన భారంతో ఆమె ఉద్యోగం మానుకుంది. యువతి కుటుంబీకులు సైతం సందీప్‌ను మందలించారు. అయినా తన వైఖఉరి మార్చుకోని అతగాడు ఫేస్బుక్లో ఆ యువతి వివరాలతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి కాల్‌గర్ల్‌గా పొందుపరిచాడు. దీంతో బాధితురాలు ‘షీ–టీమ్స్’ను ఆశ్రయించింది. నిందితుడిని పట్టుకున్న పోలీసులు బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదు చేయించి గురువారం అరెస్టు చేశారు. -
ఫొటోలు నెట్లో అప్లోడ్ చేస్తానని బ్లాక్మెయిల్
►రూ.6 లక్షలు ఇవ్వాలంటూ యువతికి బెదిరింపులు ►రూ.4 లక్షలు నగదు, రూ.30 వేలు విలువ చేసే సెల్‌ఫోన్ ఇచ్చిన బాధితురాలు ►కుటుంబసభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు నెల్లూరు సిటీ : ఓ యువతితో మూడేళ్లుగా పరిచయం పెంచుకున్న యువకుడు సన్నిహితంగా ఉండే ఫొటోలు తీసి, చివరికి తనకు డబ్బులు కావాలంటూ యువతిని బ్లాక్మెయిల్ చేసి నగదు తీసుకున్న ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు కుటుంబసభ్యుల సాయంతో మంగళవారం ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వివరాలు మేరకు నెల్లూరు నగరంలోని మహాత్మాగాంధీనగర్‌లో నివాసం ఉండే గపూర్బాషా కుమార్తె(22) బీటెక్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో మూడు సంవత్సరాల క్రితం జ్యోతినగర్ మసీదువీధిలో ఉంటున్న షేక్ అల్లాభక్షుతో పరిచయం ఏర్పడింది. అల్లాభక్షుతో యువతితో సన్నిహితంగా ఉండే ఫొటోలు ఆమెకు తెలియకుండా తీశారు. అనంతరం ఇటీవల తనకు రూ.6 లక్షలు డబ్బులు కావాలని యువతిని కోరాడు. తన వద్ద అంత నగదు లేదని చెప్పడంతో అల్లాభక్షు తన వద్ద ఉన్న ఫొటోలు నెట్లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. వారం రోజుల్లో నగదు ఇవ్వకుంటే రోజుకు రూ.50 వేలు లెక్కన అధికంగా ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించాడు. దీంతో భయభ్రాంతురాలైన యువతి ఇంట్లో తెలియకుండా రూ.5,72 లక్షల నగదును బీరువాలో నుంచి తీసింది. సోమవారం యువతిని ఫోన్ ద్వారా తాను చెప్పినట్లు నడుచుకోవాలని సూచించాడు. నిప్పో సెంటర్ వద్ద స్కూటీని నిలిపి అక్కడి నుంచి ఆటోలో గాంధీబొమ్మ వద్దకు రావాలన్నాడు. ఓ మొబైల్ దుకాణంలో రూ.30 వేలు విలువ చేసే శ్యామ్‌సంగ్ ఫోను కొని ఆత్మకూరు బస్టాండు వద్ద ఉండే రైల్వేబ్రిడ్జ్ వద్దకు చేరుకుంది. అక్కడికి చేరుకుని అల్లాభక్షుకు సెల్‌ఫోన్, రూ.4 లక్షలు నగదు ఇచ్చింది. ఫొటోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను అల్లాభక్షు యువతికి ఇచ్చి వెళ్లిపోయాడు. యువతి కుటుంబసభ్యులు ఇంట్లో కనిపించని నగదు విషయమై ఆమె ప్రశ్నించగా జరిగిన విషయం వివరించింది. కుటుంబసభ్యుల సహకారంతో యువతి ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ మంగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అశ్లీల దృశ్యాలను సెల్‌ఫోన్ లో రికార్డు చేసి..
బొమ్మనహళ్లి: బాలికను చెరపట్టిన ఇంజినీరింగ్ విద్యార్థి ఆపై దృశ్యాలను వీడియో తీసి బ్లాక్మెయిలకు పాల్పడ్డాడు. ఈఘటన శుక్రవారం బెల్గాం నగరంలో వెలుగుచూసింది. బెల్గాం నగరంలోని బాళెకుంద్రి ఇంజినీరింగ్ కళాశాల్లో రెండవ సంవత్సరం చదువుతున్న శివకుమార్ బాళెకుంద్రి (22) ఇదే నగరంలోని ఏడవ తరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు. బాలికను బెదిరించి కామవాంఛ తీర్చుకున్నాడు. అనంతరం ఆ దృశ్యాలను సెల్‌ఫోన్ లో రికార్డు చేశాడు. తర్వాత ఆ దృశ్యాలను బయట పెడతానని బ్లాక్‌మెయిల్‌చేస్తూ అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఓ పర్యాయం తన కోర్కె తీర్చేందుకు బాలిక అంగీకరించకపోవడంతో సెల్‌ఫోన్ లోని దృశ్యాలను పాఠశాలలోని కొందరు బాలికలకు చూపించాడు. దీంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకురాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు..నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. -
ఆ బ్లాక్‌మెయిల్‌పై అశ్వినీ ఏం చేసిందంటే
కేవలం 12 గంటల సమయంలోనే 26 ఏళ్ల తరుణ అశ్వనీ జీవితం ఊహించని మలుపులు తిరిగింది. అనేక కుదుపులకు లోనుచేసింది. తరుణ బలహీనురాలైతే లొంగిపోయేదేమో! నిస్సహాయ స్థితిలో ఏదైనా అఘాయిత్యం చేసుకొనేదేమో.. కానీ తరుణ లొంగిపోలేదు. ఎదురుతిరిగింది. పోరాటానికి సిద్ధపడింది. ఇప్పుడు తరుణ సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. అసలు ఏం జరిగిందంటే.. గత శుక్రవారం రాత్రి 8.59 గంటలకు ముంబైకి చెందిన తరుణ అశ్వనీకి ఓ ఈమెయిల్ వచ్చింది. ‘నా దగ్గర నీ నగ్న ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. వీటిని బయటపెట్టకుండా ఉండాలంటే నువ్వు నన్ను తృప్తి పరచాలి. నేను చెప్పినట్టు నగ్నంగా ఫొటోలు, వీడియోలు పంపించాలి’ అని బ్లాక్మెయిల్ చేస్తూ అతను అశ్వినికి మెయిల్ పంపాడు. ఆ తర్వాత కాసేపటికే తనవి ఉత్త బెదిరింపులు కాదని హెచ్చరించడానికి ఆమె నగ్నఫొటోలను కూడా పంపి మరింత భయపెట్టాలని చూశాడు. ఆ వికృత వ్యక్తి బెదిరింపులకు ఆమె లొంగలేదు. అతనికి భయపడి బిక్కుబిక్కుమంటూ గడపలేదు. వెంటనే ఈ బెదిరింపులను బహిరంగపరచాలని ఆమె నిర్ణయించింది. అతని రెండు ఈయిళ్లను స్ర్కీన్‌షాట్స్ తీసి ఆమె తన ఫేస్బుక్ పేజీలో పెట్టింది. తన గూగుల్ అకౌంట్‌ను హ్యాక్ చేసి అందులో తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు దొంగలించి.. వాటితో బెదిరించాలని చూస్తున్నాడని, కానీ, అతని బెదిరింపులకు లొంగకుండా.. ఈ విషయాన్ని బయటపెట్టాలని నిర్ణయించినట్టు ఆమె తన పోస్టులో పెట్టారు. తాను ఇలా చేయడం వల్ల ఇలాంటి బెదిరింపుల బారిన పడిన మహిళల భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చేందుకు ప్రేరణగా ఉంటుందని భావిస్తున్నట్టు ఆమె చెప్పారు. సైబర్ నేరగాడి బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా.. కొంతమంది అలాంటి ఫొటోలను ఎందుకు నీ బాయ్‌ఫ్రెండ్‌కు పంపావని ప్రశ్నిస్తున్నారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తరుణ ఈ విమర్శలను కొట్టిపారేసింది. ఆమె ప్రియుడు, పోలాండ్ జాతీయుడైన స్టాస్ ఈస్ట్కో కూడా ఈ విమర్శలను తప్పుబట్టారు. ’భారతీయ సంప్రదాయవాదులు తరుణను తప్పుబడుతున్నారు. తమ భాగస్వామికి అలాంటి ఫొటోలు తీసి పంపడాన్ని తప్పుబడుతున్నారు. కానీ పాశ్చాత్య దేశాల్లో ఇలాంటివి అసహజం ఏమీ కాదు. ఇద్దరు యుక్త వయస్కులు పరస్పర సమ్మతితో చేసుకొనే ఇలాంటివి వ్యక్తిగత ప్రైవసీలోభాగంగా చూడాలి’ అని ఆయన చెప్పారు. ఇక ముంబైకి చెందిన తరుణ గత ఐదు నెలలుగా అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉంటూ.. ఫిజికల్ థెరపీ నిపుణురాలిగా కొనసాగుతోంది. తనకు ఆన్లైన్ బెదిరింపులు రావడంపై అమెరికాలోని మేరీల్యాండ్ పోలీసులు, ఎఫ్‌బీఐ దృష్టికి తీసుకెళ్లినా.. వారు స్పందించలేదు. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ సెల్ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బ్లాక్‘మెయిల్స్’పై తొలి వేటు
సాక్షి, గుంటూరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కొన్నేళ్లుగా ‘మెయిల్స్’ ద్వారా అధికారులను ఇబ్బందులకు గురిచేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న వైద్య సిబ్బందిపై చర్యలకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. ముందుగా ఓ వైద్యాధికారిపై చర్యలు తీసుకుని కిందిస్థాయి సిబ్బందికి హెచ్చరిక జారీ చేశారు. అందులో భాగంగా సోమవారం నుదురుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అల్లాడి రాజేష్‌ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేశారు. అతడి స్థానంలో యడ్లపాడు మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మానాయక్‌ను ఇన్చార్జిగా నియమించారు. గతంలోనే బ్లాక్‌మెయిల్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ డాక్టర్... జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎస్పీకి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో తనపై వేటు పడుతుందని ముందస్తుగా భావించి ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు. వైద్య అధికారులకు హెల్త్ ప్రోగ్రామ్స్ నివేదికలు ఉన్నతాధికారులకు పంపించేందుకు ప్రత్యేకంగా ఇచ్చిన మెయిల్స్ నుంచి కొందరు బయటి వ్యక్తులకు సమాచారం పంపించి వైద్యాధికారులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తూ కరపత్రాలను సైతం ముద్రించారు. ఆరేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతుండటంతో గత నెలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులంతా మూకుమ్మడిగా కలెక్టర్, ఎస్పీలను కలిసి.. సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ మెయిల్స్ ద్వారా తమను ఇబ్బందులకు గురిచేస్తూ మనస్తాపం చెందేలా ప్రవర్తిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఒకేసారి ఏడుగురు జిల్లా స్థాయి వైద్య అధికారులు, ఒక జోనల్ అధికారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ విషయంపై ప్రత్యేక దష్టి సారించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై విచారణ జరిపి జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు తెలిసింది. ఆ నివేదిక ఆధారంగా తొలి విడతగా ఓ డాక్టర్‌ను సరెండర్ చేసిన ఉన్నతాధికారులు తదుపరి మిగతా వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. -
బయటకు చెబితే నీ భర్తను చంపేస్తా..
బెదిరించి నీచుడి అత్యాచారం.. బ్లాక్మెయిల్ చేసి మరొకడి లైంగికదాడి కారేపల్లి: ఎవరికైనా చెబితే నీ భర్తను చంపుతానని బెదిరించి ఓ కీచకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఊరుకోకుండా ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు. అతడు కూడా అదే తరహాలో బెదిరించడంతో పాటు బ్లాక్ మెయిల్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె విషయాన్ని భర్తకు చెప్పింది. ఈ మేరకు బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడులో సంచారజాతికి చెందిన ఓ మహిళ భర్తతో కలిసి బతుకుదెరువుకు 4 నెలల క్రితం మహారాష్ట్రకు వెళ్లింది. ఏన్కూర్ మండలం రాజలింగాలకు చెందిన వీరి బంధువు నెరసుల నరేశ్ అక్కడే స్థిరపడి ఉన్నాడు. కాగా, నరేశ్ భర్త లేని సమయంలో ఆ మహిళపై అత్యాచారం చేశాడు. ఎవరికై నా చెప్పితే.. నిన్ను, నీ భర్తను చంపుతానని బెదిరించడంతో ఎవరికీ చెప్పలేదు. నెల తర్వాత భర్తతో కలిసి స్వగ్రామానికి చేరుకుంది. భర్తకూలీ పనులు చేస్తుండగా, భార్య మేకలు కాస్తోంది. ఈ క్రమంలోనే నరేశ్.. వరుసకు సోదరుడయ్యే ముదిగొండకు చెందిన నెరసుల బాబుకు జరిగిన విషయాన్ని చెప్పాడు. 4 రోజుల క్రితం చీమలపాడుకు వచ్చిన బాబు మేకలు కాయడానికి అటవీ ప్రాంతానికి వెళ్లిన బాధితురాలిని అటకాయించాడు. ఆమెను బ్లాక్మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. నరేశ్ తరహాలోనే మరోసారి బెదిరించాడు. ఇంటికి వచ్చిన ఆమె మహారాష్ట్రలో, ఇక్కడ జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. దీంతో కులపెద్దలను ఆశ్రరుుంచారు. తర్వాత కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
'అమెరికా బ్లాక్‌మెయిల్‌కు లొంగేది లేదు'
సియోల్: శక్తివంతమైన అణుపరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా తన చర్యలను సమర్థించుకుంది. అమెరికా న్యూక్లియర్ 'బ్లాక్మెయిల్'కు తలొగ్గేది లేదని శనివారం స్పష్టం చేసింది. తమ దేశం చేపడుతున్న బలమైన సైనిక చర్యలు అమెరికాకు ఆగ్రహం తెప్పిస్తున్నాయని.. అయితే దానిని లెక్కచేసేది లేదని ఉత్తరకొరియా అధికార పార్టీ మీడియా సంస్థ వెల్లడించింది. ఉత్తర కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ దక్షిణ కొరయా అధ్యక్షురాలు పార్క్ గిన్ హై పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉత్తరకొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని వ్యతిరేకించినందుకు గాను పార్క్‌పై కేసీఎన్ఏ విరుచుకుపడింది. విదేశీ సైన్యపు 'డర్టీ ప్రాస్టిట్యూట్' పార్క్ అని తీవ్రంగా మండిపడింది. పార్క్ అధారరహిత ఆరోపణలు చేశారని, ఇలాంటి అమెరికా తొత్తుల విమర్శలతో ఉత్తర కొరియా తన విధానాన్ని మార్చకోదని వెల్లడించింది. తాజా అణుపరీక్షల నేపథ్యంలో ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ఐక్యరాజ్య సమితి సమాయత్తమౌతోంది. -
కేంద్రమంత్రి భార్యకు బెదిరింపులు!
-
కేంద్రమంత్రి భార్యకు బెదిరింపులు!
న్యూఢిల్లీ: తన సంభాషణలను రహస్యంగా రికార్డు చేసి ఓ వ్యక్తి.. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ భార్య భారతీ సింగ్ ఆరోపించారు. ఢిల్లీకి చెందిన ప్రదీప్ చౌహాన్ తమ కుటుంబానికి తెలిసినవాడని, ఆగస్టు 6న అతనితో తాను మాట్లాడిన మాటల్ని రహస్యంగా రికార్డు చేశాడని, ఆ తర్వాత తనకు రూ. 2 కోట్లు ఇవ్వకుంటే ఆ సంభాషణల్ని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని భారతీ సింగ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు చౌహాన్ వద్ద లైసెన్స్డ్ రివాల్వర్ ఉందని, దానితో తమ కుటుంబానికి హాని చేస్తానని అతడు బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. తనకు సంబంధించిన మార్ఫింగ్ చేసిన ఆడియో, వీడియో రికార్డులను బయటపెడతానని చౌహాన్ ఆమె పేర్కొన్నారు. అతని దగ్గర ఉన్న క్లిప్పుల్లో ఏముందో తనకు తెలియదని, కానీ వాటిని బయటపెట్టి తన భర్త పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తానని అతడు ఫోన్లో బెదిరిస్తున్నాడని ఆమె తెలిపారు. నిందితుడు ఆమె సంభాషణల్ని రికార్డు చేసి.. వాటిని వేరే వాటితో మిక్స్ చేసి బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తున్నదని పోలీసు వర్గాలు తెలిపాయి. -
బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తికి రిమాండ్
హుక్కాసెంటర్లు, కాఫీ షాపుల యజమానులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న మొఘల్‌పురాకు చెందిన సొహైల్ ముబారక్ అల్ ఖసేరి(25) అనే జిమ్ ట్రైనర్‌ను బంజారాహిల్స్ పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌పరిధిలో పీడీ యాక్ట్ నమోదై ఉన్న సొహైల్ ఆరు నెలల క్రితం బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ఖిల్లా అనే హుక్కా సెంటర్‌యజమానిని బెదిరించి ’ 2 లక్షలు ఇవ్వకపోతే కత్తితోపొడిచి చంపేస్తానంటూ భయబ్రాంతులకుగ ఉరి చేశాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ చాలా వరకు హుక్కాసెంటర్ల యజమానులను డబ్బుల కోసం బెదిరించి అంతం చేస్తానంటూ హెచ్చరిస్తుండటంతో గడగడలాడారు. ఈ నేపథ్యంలోనే ఖిల్లా హుక్కాసెంటర్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు సొహైల్‌పై ఐపీసీ సెక్షన్ 385,511, 507 కింద కేసులు నమోదు చేశారు. మరింత సమాచారం సేకరించేందుకు విచారణ కోసం రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఫలక్నామా, భవానీనగర్, మీర్‌చౌక్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌పరిధిలో నిందితులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. -
స్నేహితుడికి కాబోయే భార్యను బెదిరించి..
అతడు బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన కుర్రాడు. ముంబైలో ఓ బడా వ్యాపారవేత్త కొడుకు. ఎంబీఏ చదువుతున్నాడు.. తన స్నేహితుడికి కాబోయే భార్యను ఆమె సెల్ఫీలతో బ్లాక్ మెయిల్ చేసినందుకు అతడిని అరెస్టు చేశారు. ఆమె ఫోన్ నుంచి దొంగిలించిన ఆమె వ్యక్తిగత ఫొటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి రూ. 5 లక్షలు డిమాండ్ చేసినందుకు పోలీసులు అతగాడిని పట్టుకున్నారు. అతడిపేరు వివేక్ అగర్వాల్. ఓ బ్యాంకులో చార్టర్డ్ అకౌంటెంటుగా పనిచేస్తున్న యువతి (23)ను అతడు బెదిరించాడు. తనకున్న అప్పులను తీర్చేందుకు అతడు ఇలా చేసినట్లు తెలుస్తోంది. ముందు డబ్బులు ఇస్తానని చెప్పిన ఆ అమ్మాయి.. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేయడంతో కుర్రాడి బండారం బయటపడింది. ఆ అమ్మాయికి కొన్నిరోజుల క్రితం ఆఫీసుకు ఒక సీల్ చేసిన ఎన్వలప్ వచ్చిందని, అందులో ఓ పెన్ డ్రైవ్ ఉందని డీసీపీ అభిషేక్ త్రిముఖి తెలిపారు. అందులో ఆమె తీసుకున్న రకరకాల సెల్ఫీలు ఉన్నాయి. తర్వాత ఓ పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ వచ్చిందని, రూ. 5 లక్షలు ఇవ్వకపోతే ఆ ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడని చెప్పారు. తన ఫోన్ ఇటీవల రిపేరుకు ఇచ్చానని, అక్కడివాళ్లే ఈ పనిచేసి ఉంటారని ఆమె అనుమానించినా, అది తప్పని తేలింది. అసలు అలాంటి ఫొటోలు ఎందుకు తీసుకున్నారని పోలీసులు అడిగితే.. అవి తనకు కాబోయే భర్త కోసం అని చెప్పి, అతడికి తాను ఫార్వర్డ్ చేశానంది. దాంతో కాబోయే పెళ్లికొడుకు, అతడి స్నేహితులను పోలీసులు అనుమానించారు. అంతలో వివేక్ అగర్వాల్ ఆమెను డబ్బు ఇవ్వడానికి కుర్లాకు రమ్మన్నాడు. దాంతో అతడిని అక్కడే పట్టుకోడానికి పోలీసులు మఫ్టీలో వెళ్లారు. అది పనిచేసి, అతడు దొరికేశాడు. పెళ్లికొడుకు, తాను కలిసి థాయ్‌లాండ్ వెళ్లినపుడు అతడి ఫోన్లోంచి ఈ ఫొటోలు తీసుకున్నానని, తనకు రూ. 10-15 లక్షల వరకు అప్పులు ఉండటంతో ఇలా చేశానని అతడు చెప్పాడని పోలీసులు తెలిపారు. -
ఫొటోలతో బ్లాక్ మెయిల్.. ఆపై లైంగిక దాడి!
బిగ్ బాస్ సెలబ్రిటీ షో మాజీ కంటెస్టెంట్ పూజా మిశ్రా ఆందోళన చెందుతోంది. ముగ్గురు వ్యక్తులు తనను బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ రాజస్థాన్, జైపూర్ లో ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గతవారం పూజా మిశ్రా ఫొటో షూట్ కోసం జైపూర్ వచ్చింది. అక్కడ ఓ హోటల్ లో స్టే చేసింది. ఆ సందర్భంగా తన వద్ద ఉన్న రూ.2 లక్షల నగదు చోరీ అయ్యాయని, అందుకు కారణం సెలూన్ ఓనర్ రితూ దేశ్వాల్ అని పేర్కొంది. ఫొటో షూట్ కోసం ప్రిపేర్ అవ్వాలని ఓ సెలూన్ కు వెళ్లగా దేశ్వాల్, ఈవెంట్ ఆర్గనైజర్ తన బిల్లు డబ్బులు మరింత ఎక్కువ చేయాలన్న ఉద్దేశంతో రెండు గంటల పాటు ఈవెంట్ ఆలస్యం చేశారని ఆరోపించింది. హరీష్, మోసిన్, సుహాన్ అనే ముగ్గురు వ్యక్తులు ఫొటో షూట్ చేసిన ఫుటేజీ ఇవ్వడానికి చాలా ఎక్కువ మోతాదులో నగదు డిమాండ్ చేశారని, అందుకు తాను అంగీకరించలేదని చెప్పింది. ఈ క్రమంలో జూన్ 13న తాను తీసుకున్న ఆహారంలో డ్రగ్స్ కలిపారని, ఆ తర్వాత లైంగికదాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొంది. ఐపీసీ సెక్షన్లు 376(రేప్), 384(బ్లాక్ మెయిల్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై సెలూన్ ఓనర్ రితూ దేశ్వాల్ ను సంప్రదించగా.. ఫొటో షూట్ కోసం ఇక్కడికి వచ్చిన పూజా మిశ్రా, పద్ధితిగా నడుచుకోలేదని.. స్టాఫ్ తో తన ఇష్టరీతిన ప్రవర్తించిందని చెప్పాడు. తన పర్మిషన్ లేకుండానే సెలూన్ నుంచి కొన్ని విలువైన వస్తువులు చోరీ చేసిందని ఆరోపించాడు. ఇదిలాఉండగా 2015 ఏప్రిల్ లో ఉదయ్ పూర్ లో కూడా లైంగిక దాడికి యత్నించారంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫైవ్ స్టార్ హోటల్లో తాను తాగిన డ్రింక్ లో మత్తుమందు కలిపారని, ఆ తర్వాత ఓ గుర్తుతెలియని వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించి హత్యాచారయత్నం జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. పూజా మిశ్రాపై బెదిరింపులకు పాల్పడటంతో పాటు లైంగిక దాడికి యత్నించిన వారిపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నట్లు బాబు లాల్ బిష్నోయ్ వివరించారు. -
మతం మారాలంటూ..పోర్న్ వీడియో
పాట్నా: మతాంతర వివాహం చేసుకున్న ఓ మహిళకు అత్తింటివారి వేధింపులు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఓ మతానికి చెందిన ఆమెను తమ మతంలోకి మారాలని భర్త, అతని కుటుంబ సభ్యులు ఏకంగా పోర్న్ వీడియో తీసి బెరింపులకు పాల్పడ్డారు. ఈ సంఘటన పాట్నాలోని పుల్వారీలో చోటు చేసుకుంది. వివరాలు..కోల్ కతాకు చెందిన ఓ మహిళ పాట్నాలో పుల్వారీలో నివాసం ఉంటున్న వ్యక్తిని మతాంతర వివాహం చేసుకుంది. భర్త, అతని కుటుంబసభ్యులు తనను ఒక నెల పాటూ వారి మతానికి చెందిన ప్రాంతంలో ఉండి.. వారి మతాచారాలను పాటించడం నేర్చుకొని, ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలని ఒత్తిడి చేసేవారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి ఒప్పుకోకపోవడంతో పోర్న్ వీడియోతీసి, మతం మారాలంటూ తనను టార్చర్ చేసేవారని పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
రేప్ చేయడానికి వెయ్యి మైళ్లు ప్రయాణం..!
వార్విక్ షైర్: సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మైనర్ బాలికపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. న్యూడ్ ఫొటోలను వెబ్ సైట్ లో పెడతాను, స్నేహితులకు ఇస్తానంటూ బాలికను బ్లాక్ మెయిల్ చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. చివరికి కటకటాల పాలయ్యాడు. ఆ వివరాలిలా ఉన్నాయి... నిందితుడు మార్క్ గ్రీనల్(26) లివర్ పూల్ లో ఉండేవాడు. అతడికి ఫేస్ బుక్ ద్వారా నూనిటాన్ లో ఉండే స్కూలు విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు ఆపై రెగ్యూలర్ గా చాటింగ్ చేసేవారు. తన మాయమాటలతో నమ్మించి టాప్ లెస్ ఫొటోలు, న్యూడ్ ఫోటోలను మెయిల్ ద్వారా సంపాదించాడు. బాలిక పంపిన న్యూడ్ ఫొటోలను ఆయుధంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. తనతో సెక్స్ చేయాలని బాలికను చాటింగ్ లో అడిగితే అందుకు మైనర్ బాలిక నిరాకరించింది. బాలిక పంపిన న్యూడ్ ఫొటోలను ఓ వెబ్ సైట్ లో పోస్ట్ చేసి, స్క్రీన్ షాట్లు తీసి బాలికకు పంపించాడు. దీంతో కంగారు పడిన బాలిక అతడు చెప్పిన పనికి ఒప్పుకుంది. నూనిటాన్ లోని బెర్ముడా పార్కు హోటల్ లో రూమ్ లో కలుస్తానని చెప్పాడు. లివర్ పూల్ ఉన్న గ్రీనల్ దాదాపు 1000 మైళ్లకు పైగా ప్రయాణించి నూనిటాన్ చేరుకున్నాడు. హోటల్ రూములో బాలికపై బలవంతంగా రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తనకేం తెలియందన్నట్లుగా తాను ఉంటున్న లివర్ పూల్ కు వెళ్లిపోయాడు. మైనర్ బాలికకు ఫేస్ బుక్ లో గ్రీనల్ పంపించిన సందేశాలను ఆమె తల్లి చూసింది. కూతుర్ని ఆ దుర్మార్గుడు బ్లాక్ మెయిల్ చేసి రేప్ చేశాడని తెలుసుకుని ఆవేశానికి లోనైంది. గ్రీనల్ పై ఫిర్యాదుచేయగా, పోలీసులు కేసు నమోదుచేశారు. తాజాగా గ్రీనల్ తాను తప్పుచేసినట్లు ప్రాధేయపడ్డాడు. బెయిల్ పై తనను విడుదల చేయాలని ప్రార్థించగా అతడి పిటీషన్ ను కోర్టు కొట్టిపారేసింది. ఇంగ్లండ్ లోని వార్విక్ క్రౌన్ కోర్టులో కేసు విచారణను నెలాఖరుకు వాయిదా వేశారు. -
అమ్మాయిలూ.. సెల్ఫీలతో జరభద్రం!
► అర్ధనగ్న సెల్ఫీలు సేకరించి బ్లాక్మెయిల్ ► అమ్మాయిలపై వల వేస్తున్న సైబర్ నేరగాళ్లు ► కేసులు పెట్టేందుకు ముందుకురాని తల్లిదండ్రులు ► తెలిసిన వారి చేతుల్లోనే ఎక్కువ మోసాలు ► ఎవరికీ ఫొటోలు ఇవ్వద్దని సైబర్ క్రైం పోలీసుల సూచన హైదరాబాద్ అమ్మాయిలను బుట్టలో వేసుకుని.. వాళ్లతో అర్ధనగ్నంగా సెల్ఫీలు తీసుకుని.. ఆ తర్వాత ఆ ఫొటోలతో వాళ్లను బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యవహారాలు హైదరాబాద్‌లో ఎక్కువయ్యాయి. సఫిల్‌గూడకు చెందిన నిజాముద్దీన్ హైదర్ (32) 2011లో హైదరాబాద్‌కు ఇంటర్వ్యూకు వచ్చిన ఎంబీఏ విద్యార్థినితో పరిచయం పెంచుకుని, తాను అనాథనని చెప్పి స్నేహం చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. రెండేళ్ల పాటు వారి స్నేహం కొనసాగింది. ఈ మధ్యలో ఆమెతో సన్నిహితంగా ఉంటూ సెల్ఫీలు తీసుకున్నా, ఆమెకు అనుమానం రాలేదు. తర్వాత అతడికి అప్పటికే పెళ్లయిన విషయం ఆమెకు తెలిసింది. అప్పట్నుంచి ఆ సెల్ఫీలతో ఆమెను బ్లాక్మెయిల్ చేయడంతో ఆమె సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఎట్టకేలకు మొన్న ఏప్రిల్ నెలలో నిజాముద్దీన్‌ను అరెస్టు చేశారు. మరోకేసులో, భోలానగర్‌కు చెందిన అబ్దుల్ మాజిద్ (21) కొందరు టీనేజి అమ్మాయిల నుంచి వందలాదిగా అర్ధనగ్న సెల్ఫీలు సేకరించాడు. ఫేస్బుక్లో వాళ్లతో అమ్మాయిలా చాట్ చేస్తూ ఇవి తీసుకున్నాడు. అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు కూడా తెలియని చాలా విషయాలు అతడితో చెప్పేవారు. మందుకొట్టడం, సిగరెట్లు తాగడం, బోయ్‌ఫ్రెండ్లు, సెక్స్ అనుభవాలు.. అన్నింటినీ వెల్లడించేవారు. ఆ ఫొటోలు, వివరాలు తీసుకున్న తర్వాత.. వాటిని ఇంటర్నెట్లో పెడతానంటూ అతడు వాళ్లను బ్లాక్మెయిల్ చేశాడు. ఏడు నెలల్లోనే రెండుసార్లు అరెస్టయిన అతడిపై పోలీసులు పీడీ యాక్ట్ కూడా పెట్టారు. మహిళలు ఎ్టటి పరిస్థితుల్లోనూ సెల్ఫీలను ఇతరులకు షేర్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రైం విభాగానికి వచ్చే కేసుల్లో చాలావరకు తమకు తెలిసినవారి చేతుల్లో మోసపోయేవారే ఉంటున్నారన్నారు. చాలా కేసుల్లో అమ్మాయిల తల్లిదండ్రులు కేసు పెట్టడానికి ఇష్టపడకపోవడంతో పోలీసులు నిందితులను పట్టుకున్నా, ఫొటోలు డిలీట్ చేసి.. వాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చి పంపేయాల్సి వస్తోంది. -
'లక్షలు ఇవ్వకుంటే వ్యతిరేక ప్రసారాలు చేస్తాం'
బీజింగ్: చైనాలో ఓ వార్తా పత్రికకు సంబంధించిన ఐదుగురు జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అక్కడి కోర్టు పన్నేండేళ్లపాటు శిక్షను విధిస్తూ వారిని కటకటాల్లోకి పంపించింది. ప్రభుత్వ ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లు చేసే ప్రయత్నాలు చేసినందుకు వారికి ఈ శిక్ష వేశారు. సెంట్రల్ హునాన్ ప్రావిన్స్ లోని మోడరలన్ కంజ్యూమర్ న్యూస్ చానెల్ లో జాంగ్ హునిరి అనే ఉపాధ్యక్షుడు, మరో నలుగురు సహ ఉద్యోగులు ఉన్నారు. వారు ఓ పన్నెండు మంది ప్రభుత్వ ఉద్యోగులను దాదాపు లక్షా పాతికవేల డాలర్లు ఇవ్వాలని లేదంటే వారికి సంబంధించి వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ ఆరోపణల కిందట అరెస్టు చేసిన పోలీసులు వారని కోర్టులో ప్రవేశ పెట్టగా పన్నేండేళ్ల జైలు శిక్ష పడింది. -
డబ్బులు ఇవ్వాలంటూ క్రికెటర్‌కు బెదిరింపులు
కరాచీ: డబ్బు కోసం తనను గుర్తు తెలియని వ్యక్తులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ పాకిస్తాన్ క్రికెటర్ షర్జీల్ ఖాన్ చెప్పాడు. తనకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని, లేకుంటే తన నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించినట్టు తెలిపాడు. షర్జీల్ ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించాడు. 'కొందరు గుర్తుతెలియని నెంబర్ల నుంచి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. లేకుంటే నా భవిష్యత్‌కు భంగం కలిగించేలా వీడియోలను పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఎవరైనా అలాంటి వీడియోలను పోస్ట్ చేస్తే దయచేసి నమ్మకండి. అవన్నీ నకిలీ వీడియోలు. కొందరు నా ట్విట్టర్, ఫేస్బుక్ ఎకౌంట్లను కూడా హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారు' అని అభిమానులు, స్నేహితులను ఉద్దేశించి షర్జీల్ ట్వీట్ చేశాడు. బెదిరింపుల కేసులో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పోలీసులు షర్జీల్‌కు అండగా నిలిచారు. ఆసియా కప్, ప్రపంచ టి-20 కప్‌లో పాక్‌కు షర్జీల్ ప్రాతినిధ్యం వహించాడు. -
బీజేపీ బ్లాక్ మొయిల్ రాజకీయాలకు పాల్పడుతోంది
డెహ్రాడూన్: కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, బ్లాక్ మోయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఆరో్పించారు. హరీష్ తమతో లావాదేవీలు చేసిన వీడియోలను కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు టీవీ ఛానళ్లకు విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలో మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. డెహ్రాడూన్ లోని ప్రెస్ కాన్ఫరెన్స్ లో హరీష్ మాట్లాడుతూ.. నేను ఇప్పటి వరకు ఆవీడియోలు చూడలేదన్నారు. స్నేహంగా ఉంటూ ఎవరినైనా ఈజీగా మోసం చేయవచ్చునని తెలిపారు. ఇందంతా ముందస్తు ప్లానింగ్ ప్రకారం జరిగిందని ఆయన ఆరోపించారు. అవి నఖిలీ వీడియోలని మమ్మల్ని చులకన చేయడానికి బీజేపీ చేస్తున్న కుట్రగా ఆయన పేర్కొన్నారు. మేమేమన్నా దేశ ద్రోహులమా రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో ఇదంతా భాగమని హరీష్ ఆరో్పించారు. -
మంత్రికి ఇంజనీరింగ్ విద్యార్థి బెదిరింపు
చిత్తూరు: జల్సాలకు అలవాటు పడిన ఇంజనీరింగ్ విద్యార్థి అవి తీర్చుకునేందుకు... డబ్బుల కోసం నేరుగా ప్రజా ప్రతినిధులనే బెదిరిస్తూ పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న జగన్ అనే యువకుడు ఇంటర్నెట్ ద్వారా పలువురు మంత్రులతోపాటు రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు సంపాదించారు. ఆ క్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి కర్నూలు, హైదరాబాద్‌లో ఆస్తులున్నాయని .. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు బయటపెడతానని బెదిరించాడు. అలా చేయకుండా ఉండేలంటే... పద్మావతి మహిళ బ్యాంకులలోని ఓ ఖాతాలో రూ. 30 వేలు వేయ్యాలని ఫోన్లో సందేవం పంపాడు. దీంతో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో చిత్తూరుకు చెందిన జగన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, ఆళ్లగడ్డ, శ్రీశైలం ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్లు కూడా సంపాదించినట్లు తమ విచారణలో వెల్లడించాడని పోలీసులు చెప్పారు. -
ప్రియురాలిని వీడియో తీసి బ్లాక్ మెయిల్
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని ఆమె ప్రియుడు అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాన్ని వీడియా తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఏడాదిన్నర క్రితం దీపేంద్ర నిరంజన్ అనే యువకుడు.. నిందితురాలికి మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వీడియో తీసి, ఈ విషయం బయటకు చెప్పవద్దంటూ ఆమెను బెదిరించాడు. అంతేగాక అతని బంధువు కల్లు పటేల్‌తో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడని, తరచూ ఫోన్లో వేధిస్తున్నాడని చెప్పింది. -
విద్యార్థులను వీడియో తీసిన మహిళా టీచర్
హైదరాబాద్: కాసుల కక్కుర్తితో విలువలకు పాతర వేస్తున్న కార్పొరేట్ స్కూళ్లలో మరో బాగోతం వెలుగుచూసింది. తమ స్వలాభం కోసం విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టేందుకు కార్పొరేట్ స్కూళ్లు వెనుకాడడం లేదు. బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఘటన కార్పొరేట్ స్కూళ్ల మధ్య జరుగుతున్న అనారోగ్యకర, అనైతిక పోటీకి అద్దం పడుతోంది. 9వ తరగతి చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ స్కూల్ టెరాస్ పై సన్నిహితంగా ఉండగా పక్కనే ఉన్న మరో పాఠశాలకు చెందిన మహిళా టీచర్ ఈ దృశ్యాన్ని తన మొబైల్ తో వీడియో తీసింది. దాన్ని ప్రిన్సిపాల్ కు చూపించింది. తమకు పోటీగా ఉన్న సదరు స్కూల్ కు చెడ్డపేరు తేవాలన్న ఆలోచనతో ఆయన ఈ వీడియోను వాట్సాప్ లో షేర్ చేశాడు. ఈ వీడియో విపరీతంగా సర్క్యూలేట్ అయి కొంతమంది మీడియా రిపోర్టర్లకు చేరింది. ఈ విషయాన్ని బయటకు రాకుండా చూడాలంటే తమకు డబ్బు ఇవ్వాలని వీడియోకు సంబంధించిన పాఠశాల యాజమాన్యాన్ని వారు బెదిరించారు. చివరకు విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బాలికతో సన్నిహితంగా మెలగిన బాలుడు, వీడియో తీసిన టీచర్, దాన్ని షేర్ చేసిన ప్రిన్సిపాల్ పై కేసు నమోదు చేశారు. పాఠశాల యాజమ్యాన్ని బెదరించిన మీడియా రిపోర్టర్లపైనా దర్యాప్తు చేపట్టామని బాలానగర్ పోలీసు ఇన్స్ పెక్టర్ భిక్షపతి తెలిపారు. -
బ్లాక్మెయిలర్లకు ఆస్తులమ్మి డబ్బిచ్చాడు
విజయవాడ: చర్చి ఫాదర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలో మొత్తం తొమ్మిది మంది నిందితులు ఉన్నట్లు కమిషనర్ గౌతం కుమార్ వెల్లడించారు. ఇందులో ఓ మాజీ పాత్రికేయుడి ప్రమేయం సైతం ఉన్నట్లు గుర్తించామన్నారు. నిందితులు ఫాదర్‌ను బెదిరించి సుమారు రూ. 1.32 కోట్లను వసూలు చేశారని, బాధితుడు ఆస్తులు విక్రయించి మరీ ఈ ముఠాకు డబ్బులు ఇచ్చాడని ఆయన వెల్లడించారు. కేసు ఇంకా దర్యాప్తులోనే ఉందని, మీడియా పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని కమిషనర్ స్పష్టం చేశారు. మత బోధకుడికి సంబంధించిన అశ్లీల చిత్రాలతో కూడిన పెన్‌డ్రైవ్ తమ వద్ద ఉందని నిందితులు బ్లాక్ బెయిల్ చేసినట్లు సమాచారం. -
ఫేస్బుక్ చాటింగ్... ఆపై చీటింగ్!
► సోషల్‌మీడియా ద్వారా ఉద్యోగాలంటూ ఎర ► దరఖాస్తుల్లోని వివరాల ఆధారంగా చాటింగ్స్ ► బ్లాక్మెయిల్ చేస్తూ యువతులకు బెదిరింపులు ► నిందితుడిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ కాప్స్ సిటీబ్యూరో: సోషల్ మీడియాలోని వివిధ సైట్లలో ఉద్యోగాలంటూ ప్రకటనలు ఇచ్చి, దరఖాస్తు చేసిన మహిళలతో చాటింగ్స్ చేసి, చివరకు బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మరో కేసులో ఓ యువతిని ఫేస్బుక్ ద్వారా వేధిస్తున్న ఆమె క్లాస్‌మేట్‌ను కటకటాల్లోకి పంపారు. నిందితులిద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. చిలకలూరిపేటకు చెందిన బాబూరావు (52) ఫేస్బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాలైన ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇస్తాడు. అందులో తన ఈ-మెయిల్ ఐడీతో పాటు ఫోన్ నెంబర్ పొందుపరుస్తాడు. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన యువతులు, మహిళల ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీల ఆధారంగా వారితో చాటింగ్ చేస్తాడు. తర్వాత అభ్యంతరకర, అశ్లీల సందేశాలు పంపిస్తాడు. కొన్నాళ్లు గడిచాక సదరు యువతి/మహిళకు ఫోన్లు చేసి.. ‘చాటింగ్’ వివరాలను వారి కుటుంబ సభ్యులకు, సంబంధీకులకు చెప్పకుండా ఉండాలంటే తనకు డబ్బు డబ్బు ఇవ్వాలని బ్లాక్‌మెయిలింగ్ చేసి తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటాడు. బాబూరావు చేతిలో మోసపోయిన ఓ నగర విద్యార్థిని సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ రఘువీర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ పి.రాజు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని గుర్తించారు. సోమవారం చిలకలూరిపేటలో బాబూరావును అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. గతంలో వెలుగులోకి వచ్చిన ‘మధు’ వ్యవహారం మాదిరిగానే ఇతడి కేసూ ఉండటంతో చాటింగ్ హిస్టరీని అధ్యయనం చేస్తున్నారు. అసూయతో కటకటాల్లోకి... తన క్లాస్‌మేట్‌పై ఉన్న అసూయ ఓ వివాహితుడిని కటకటాల పాల్జేసింది. గుంటూరుకు చెందిన సాయికృష్ణ, నగరానికి చెందిన యువతి కలిసి చదువుకున్నారు. ఇద్దరూ స్నేహితులే అయినప్పటికీ అనేక అంశాల్లో పోటీ నేపథ్యంలో వీరి మధ్య స్పర్థలు వచ్చాయి. యువతిపై సాయి అసూయ పెంచుకున్నాడు. కొన్నాళ్ల క్రితం సాయి ఆ యువతి స్నేహితురాలినే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కూతురికీ ఆ యువతి స్నేహితురా లు కావడంతో తన క్లాస్‌మేట్‌కు బహుమతి అంటూ ఓ లేఖను పంపింది. అందులో ఆమె తనను తిట్టడంతో సాయి జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆమెపై కక్షకట్టి వేధింపులు ప్రారంభించాడు. ఫేస్బుక్ చాటింగ్ ద్వారా పరుషపదజాలంతో సందేశా లు పెట్టడంతో పాటు అభ్యంతరకరమైన వ్యాఖ్యలూ చేశాడు. ఇటీవల ఈ ధోరణి మరీ పెరిగిపోవడంతో విసుగు చెందిన యువతి సీసీఎస్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ పి.రాజు సోమవారం సాయిని గుంటూరులో అరెస్టు చేసి సిటీకి తీసుకువచ్చి జైలుకు పంపారు. సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీ సులు వీరిద్దరితో పాటు క్రెడిట్‌కార్డ్, డెబిట్‌కార్డ్ డేటాలను సంగ్రహించి, మోసాలకు పాల్పడుతున్న మరో తొమ్మిది మంది నిందితుల్నీ అరెస్టు చేశారు. -
టీవీ నటిని బ్లాక్ మెయిల్ చేసి దొరికిపోయాడు..
ముంబై: వర్ధమాన టీవీ నటి అశ్లీల ఫోటోలను చేజిక్కించుకొని, బ్లాక్మెయిల్ చేసిన ఆకతాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో ఓ టీవీ నటిపై వేధింపులకు పాల్పడిన బాలుడిని బంగూర్ నగర్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం బుల్లితెరపై ఇప్పుడిప్పుడే రాణిస్తున్న ఓ నటిపై ముంబైలోని దహిసర్ ప్రాంతానికి చెందిన ఓ పదహారేళ్ల బాలుడు వేధింపులకు పాల్పడ్డాడు. పలు టెలివిజన్ సీరియల్స్, సినిమాల్లో నటించిన సదరు నటి అశ్లీల ఫొటోలను చేజిక్కించుకున్న అతడిలో దుర్బుద్ధి మొదలైంది. వాటిని ఆమె వాట్సప్‌కు పంపి బెదిరించం మొదలు పెట్టాడు. ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయకుండా ఉండాలంటే మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ బ్యాంక్ అకౌంట్లో రూ. 5 లక్షలు జమ చేయాలని బెదిరించాడు. దీంతో భయపడిన సదరు నటి బంగూర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా దహిసర్ తూర్పు ప్రాంతంలో నిన్న ఉదయం అతడి ఆట కట్టించారు. గతంలో కూడా ఇదే తరహాలోనే మరో ముగ్గురు నటీమణులను కూడా ఇతగాడు వేధించాడని పోలీసుల విచారణలో తేలింది. కాగా జార్ఖండ్‌కు చెందిన ఈ మైనర్ మధ్యలోనే చదువు ఆపేసి ఉద్యోగ నిమిత్తం ముంబైకు వచ్చాడని పోలీసులు తెలిపారు. గత ఆరు నెలలుగా తన స్నేహితునితో కలిసి నల్లాసోపారా ప్రాంతంలో నివసిస్తున్నాడని, సదరు నటి ఫోటోలను ఈ మెయిల్, ఇతర సోషల్ మీడియా సైట్ల నుంచే హ్యాకింగ్ చేసినట్లు తెలుస్తోంది. -
ప్రేమించకపోతే చంపేస్తా....
బాలికకు యువకుడి హెచ్చరిక నిందితుడి అరెస్టు బంజారాహిల్స్: ‘‘నన్ను ప్రేమించు...లేకపోతే చంపేస్తా’ అంటూ తొమ్మిదో తరగతి విద్యార్థినిని ఓ యువకుడు వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీ సుల కథనం ప్రకారం.. ఇందిరానగర్ నివాసి వల్లాల శేఖర్(19) తండ్రితో కలిసి స్థానికంగా స్క్రాప్ దుకా ణం నిర్వహిస్తున్నాడు. ఇదే బస్తీకి చెందిన విద్యార్థిని(14) జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్ స్కూల్లో చదువుతోంది. ఆమెను శేఖర్ కొంతకాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. బాలిక తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు. వారికంటే ముందుగానే వి ద్యార్థిని పాఠశాల నుంచి ఇంటికి చేరుకుం టుంది. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన శేఖర్ ఒకరోజు బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఆమె ఫొటోలు తీశాడు. ప్రేమించకపోతే ఆ ఫొటోలు ఫేస్బుక్లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతడి వేధింపు లు తాళలేక కొద్ది రోజులుగా కుమిలిపోతున్న బాలిక ఎట్టకేలకు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు శుక్రవారం కుమార్తెతో బంజారాహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేయించ గా.. నిందితుడు శేఖర్‌ను అరెస్టు చేశారు. -
సినిమాకి వెళ్తేనే చెడిపోతానా?!
నేను, ఒకబ్బాయి ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నాం. కానీ అతనికి సిగరెట్ తాగే అలవాటుందని ఈ మధ్యే తెలిసింది. నాకు స్మోక్ చేసేవాళ్లంటే అసహ్యం. అందుకే అతనికి ‘నో’ చెప్పాను. కానీ అతను మేమిద్దరం కలిసి దిగిన ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నన్ను నేను రక్షించు కోవడానికి మార్గం చూపించండి. - ఓ సోదరి, వీరవాసరం మీరిద్దరూ దిగిన ఫొటోలు ఎలాం టివి? బ్లాక్మెయిల్ చేసే భంగిమలతో ఫొటోలు దిగేవరకూ తనకి సిగరెట్ తాగే అలవాటు ఉందన్న విషయం మీకు తెలియకుండా మేనేజ్ చేసినందుకు అతణ్ని అభినందించాలి. అయితే అతడు ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో మీరు వివరించలేదు. సాధారణంగా ఇలాంటి పనులు చేసేవాళ్లు ముఖంపై యాసిడ్ పోస్తామనో, దారి కాచి కత్తులతో పొడుస్తామనో భయపెడతారు. మీలాంటి అమ్మాయిలు భయపడుతూంటారు. కానీ మీరు ఎదురు తిరిగితే... మీరెంత భయ పడుతున్నారో అవతలివాళ్లూ అంతే భయ పడతారు. కాబట్టి వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. ఆ ధైర్యం లేకపోతే మీ ఇంట్లోని పెద్దవాళ్లతో ఉన్నదున్నట్టు చెప్పండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని రక్షించే ప్రయత్నం చేస్తారు. మీరిప్పుడు అన్నీ దాచి మరొకరిని పెళ్లి చేసుకుంటే, ఆ తర్వాత ఇలాంటి విషయాలు బయటకు పొక్కితే... మీరు మీ జీవితాన్నే కోల్పో వలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వెంటనే ఇంట్లో వాళ్లకి చెప్పండి. మీ పెద్ద వాళ్లకి విషయం తెలిసిందని గ్రహిస్తే, మీ మాజీ స్నేహితుడు భయపడతాడు. మళ్లీ చెప్తున్నాను... మనం భయపడినంతవరకే బ్లాక్ మెయిలర్స్ భయపెడతారు. అయితే మీరు ఎదురు తిరగడం వల్ల మిమ్మల్నొది లేసి బలహీన వ్యక్తిత్వం ఉన్న మరోవ్యక్తిని లోబర్చుకోడానికి ప్రయత్నించొచ్చు. కాబట్టి ధైర్యం చేసి పోలీసు రిపోర్ట్ ఇస్తే మీలాంటి చాలా మంది అమ్మాయిల్ని రక్షించినవారవుతారు. నేను పీజీ చేస్తున్నాను. చదువులో ఎప్పుడూ ఫస్టే. కానీ ఈ మధ్య మనసు వేరే విషయాల మీదకు పోతోంది. నా ఫ్రెండ్స్ అంతా వారాంతాల్లో సినిమాలకి, షికార్లకి వెళ్తుంటారు. నాకది ఎప్పుడూ అలవాటు లేదు. వీకెండ్స్ నా ఫ్యామిలీతోనే గడుపుతాను. కానీ ఈ మధ్య నాక్కూడా ఫ్రెండ్స్‌తో వెళ్లాలనిపిస్తోంది. ఆ విషయం అమ్మతో చెబితే ఎప్పుడూ లేనిది ఇదేం అలవాటు అంటోంది. నాన్నయితే- అలాంటివన్నీ చేస్తే చదువు అటకెక్కుతుంది అని సీరియస్ అవుతున్నారు. సరదాగా సినిమాకి వెళ్తేనే నేను చెడిపోతానా సర్? - సాగర్, రాజమండ్రి పీజీ చేస్తున్న మీరు... స్నేహితులతో కలిసి ఆదివారం సినిమాకి వెళ్లడంలో తప్పేమీ లేదు. మీ అమ్మగారు భావించినట్టు అదేమీ దుర్మార్గమైన అలవాటు కాదు. జీవితం కొంచెం విస్తృతమవ్వాలంటే ఇలాంటి ఆకర్షణలు కొద్దిగానైనా ఉండాలి. అయితే ఇవే ఆలోచనలు మిమ్మల్ని సదా వెంటాడుతూ ఉంటే మాత్రం, అది మీ చదువు మీద నెగిటివ్ ప్రభావం చూపుతుంది. అలా జరుగుతుంటే కనుక ఈ కొత్త అలవాట్లు చేసుకోవద్దు. మీరిప్పటికే పీజీ చేస్తున్నారు. ఒకట్రెండు సంవత్సరాల్లో చదువు పూర్తయిపోతుంది. ఆ తర్వాత స్నేహితులతో ఎలా గడిపినా భవిష్యత్తుకి అడ్డు రాదు. అయినా వారాంత సినిమాలు కూడా మానేసి మీరు పీజీ వరకూ ఫస్ట్ క్లాస్‌లో పాసవుతూ వచ్చారు అంటే మీ మనస్తత్వం కొద్దిగా అర్థమవుతోంది. కాబట్టి చదువు ఆఖరి దశలో కొత్త ప్రయోగాలు చేయకండి. ఒకవేళ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలను అని నమ్మకం ఉంటే, అప్పుడు మీకు నచ్చినట్టుగా స్నేహితులతో తిరగండి. నాకు ఈ మధ్యనే పెళ్లయ్యింది. నా భార్యతో నాకే సమస్యా లేదు. కానీ మా అత్తమామలు మాత్రం ప్రతి దానిలోనూ కల్పించు కుంటున్నారు. నేనేం మాట్లాడినా అందులో తప్పులు వెతుకుతారు. నా ఉద్దేశం మంచిదేనా కాదా అని పరీక్షిస్తూ ఉంటారు. ప్రతిదాన్నీ అపార్థమే చేసుకుంటారు. పైగా వాళ్ల అభిప్రాయాల్ని నా భార్యమీద రుద్దే ప్రయత్నం చేస్తుంటారు. నేను నా మాట తీరుతో నా ఆఫీసులో వాళ్లని, బయటివాళ్లని అందరినీ ఆకట్టుకున్నాను. కానీ మా అత్తమామల ఉద్దేశంలో నాకసలు మాట్లాడమే రాదు. వాళ్లిలా కామెంట్లు చేయడం వల్ల నా కాన్ఫిడెన్స్ పోతోంది. నన్నేం చేయమంటారు? - రవికుమార్, విజయనగరం మీ జీవితంలో మీ అత్తమామల చొరబాటు అంతగా ఎందుకు ఉంటోంది? మీరు ఇల్లరికం ఉంటున్నారా? సాధారణంగా కూతురి మీద తల్లి తన అభిప్రాయాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. దానివల్ల అల్లుళ్ల కంప్లయింట్లు ఈ విధంగానే ఉంటాయి. మీ ఉత్తరాన్ని బట్టి మీ వ్యక్తిత్వంలోనే కొద్దిగా లోపం ఉన్నట్లు అనిపిస్తోంది. ముందు మీరు ఇండివిడ్యువాలిటీని పెంచుకోండి. ముఖ్యంగా ‘అవతలివాళ్ల కామెంట్ల వల్ల మీ మీద మీకు నమ్మకం తగ్గిపోవడం’ అంత మంచి పరిణామం కాదు. కాబట్టి మీ అత్తమామల పట్ల మీ ఫిర్యాదులన్నిటి గురించీ మీ భార్యతో విపులంగా మాట్లాడండి. ఆమెను తన తల్లితో మాట్లాడమని చెప్పండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
ఏకంగా రాజునే బ్లాక్ మెయిల్..
ప్యారిస్: రాజుపై ఓ పుస్తకం రాస్తున్నామని, దానిని ప్రచురించకుండా ఉండేందుకు తమకు భారీ మొత్తం సొమ్ము చెల్లించాలని ఏకంగా మొరాకో రాజును డిమాండ్ చేసిన ఇద్దరు జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మొరాకో రాజు మహ్మద్ 6 న్యాయవాది ఎరిక్ డుపాంట్ మొరెట్టి తెలియజేశారు. ఎరిక్ లారెంట్, కేథరిన్ గ్రాసియెట్ అనే ఇద్దరు విలేకరులు రాజు కార్యకలాపాలు, పాలనతో కూడిన వివరాలతో పుస్తకాన్ని రాస్తున్నామని, దానిని ప్రచురించకుండా ఉండేందుకు తమకు దాదాపు 3.4 మిలియన్ డాలర్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే, వీరిద్దరిపై నాటకీయ పద్ధతిలో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన రాజు సంస్థాన కార్యాలయ అధికారులు తొలుస కేసు ఫైల్ చేసి అనంతరం అరెస్టు చేశారు. -
యువతిపై లైంగిక దాడి
- వీడియో తీసి బ్లాక్ మెయిల్ పటమట : యువతిపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం రామవరప్పాడులోని మల్లెమూడివారి వీధి లో మోహనరావు ఇంట్లో అద్దెకు ఉం టున్న యువతి(24) పటమటలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంది. 2014 నవంబరు నెలలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి యజమాని మూడవ కుమారుడు రాఘవేంద్రరావు ఇంట్లో అద్దెకు ఉంటున్న యువతిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే తన స్నేహితుడు వెంకటేష్ వీడియో తీసాడని, తాను చెప్పిన విధంగా చేయకపోతే ఆ వీడియో నెట్ లో పెడతానని బెదిరించి డిసెంబరు నుంచి తరచూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో రాఘవేంద్రరావు ఆ వీడియోను తన స్నేహితుల యిన నాని, హరికృష్ణ, రాజశేఖర్, సురేష్‌లకు పంపించాడు. అప్పటి నుంచి యువతికి రాఘవేంద్రరావు స్నేహితులు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు, లేకపోతే వారి కోరిక తీర్చాలని బెదిరించారు. దీంతో ఒకసారి కొంత నగదు ఇచ్చింది. మరలా ఫోన్లు చేసి డబ్బులు అడగడం ప్రా రంభించారు ఆ వేధింపులు భరించలేక యువతి రెండు రోజుల కిందట తన చెల్లెలకు జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె తన స్నేహితులకు జరిగిన విషయం చెప్పడంతో వారు రాఘవేంద్రరావు సూర్యారావుపేటలో నిర్వహిస్తున్న షాపు వద్దకు వెళ్లి ప్రశ్నిం చారు. వారిపై అతను ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు తండ్రి మోహనరావుకు షాపుపై యువకులను పంపించారని వివరించాడు. దీంతో తండ్రి మో హనరావు, కుటుంబ సభ్యులు కృష్ణకుమారి, వర, దుర్గలు యువతి ఇంటిపై గురువారం దాడి చేసి బాధితురాలి చెల్లెలిని, కుటుంబ సభ్యులను కొట్టా రు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన రాఘవేంద్రరావు, వీడియో తీసిన వెంకటేష్, స్నేహితులు నాని, హరికృష్ణ, రాజశేఖర్, సురేష్, ఇంటిపై దాడి చేసిన మోహనరావు, కృష్ణకుమారి, వర, దుర్గలపై కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరించారు. -
యువతిని మోసగించిన కానిస్టేబుల్ అరెస్టు
- ఏడు సంవత్సరాలుగా సహజీవనం - ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ - మరో యువతిని పెళ్లాడిన నిందితుడు పటమట : ప్రేమించానన్నాడు... పెళ్లి చేసుకుందామంటూ సహజీవనం చేశాడు. కొంతకాలం గడిచాక నువ్వు నాకు నచ్చలేదన్నాడు... తనతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు.. చివరికి కటకటాలపాలయ్యాడు. ఇదీ ఓ కానిస్టేబుల్ వ్యవహారం. పోలీసుల కథనం మేరకు.. కృష్ణలంకలోని సత్యనారాయణ నగర్లో నివసిస్తున్న ఎ.శ్రీరామ్‌కుమార్(31) మాచవరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సమయంలో మొగల్రాజ పురంలోని ఒక కంటి ఆస్పత్రిలో నర్సుగా పనిచేసే యువతితో చనువు ఏర్పడింది. గతంలోనే ఒక ప్రయివేట్ పాఠశాలలో ఆ యువతికి కానిస్టేబుల్‌తో ముఖపరిచయం ఉంది. ఆ యువతితో మాటలు కలిపి ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానంటూ ఆమెతో సహజీవనం ప్రారంభించాడు. తొలుత హెచ్‌బీ కాలనీలో కాపురం పెట్టాటు. ఆ తరువాత హైదరాబాద్ తీసుకెళ్లి ప్రయివేటు ఆస్పత్రిలో ఉద్యోగంలో చేర్పించాడు. హైదరాబాద్‌లో ఉండగానే ఒకసారి గోవా తీసుకెళ్లాడు. అక్కడ తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తరువాత తిరిగి విజయవాడ పటమటలంక లంబాడీపేటకు మకాం మార్చాడు. ఏడేళ్లు సహజీవనం చేసిన తరువాత ‘నువ్వంటే ఇష్టం లేదు, నేను మరొకరిని పెళ్లి చేసుకున్నా’నని ఆ యువతితో చెప్పాడు. ఈ విషయం బయటకు చెబితే గోవాలో తీసిన వీడియోలు నెట్లో పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు జూలై 31వ తేదీన ఫైర్ కంట్రోల్ రూమ్ వద్ద బందరుకాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఫైర్ సిబ్బంది గమనించి ఆమెను రక్షించారు. అనంతరం కానిస్టేబుల్ శ్రీరామ్‌కుమార్ మోసం చేశాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి నివసిస్తున్న పరిధి పటమట పోలీస్ స్టేషన్లో ఉండటంతో ఆ కేసును పటమట సీఎస్‌కు బదిలీ చేశారు. కేసు విచారణ ప్రారంభించిన సీఐ దామోదర్ నిందితుడు శ్రీరామ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. -
అలక పాన్పులు ... సిద్ధం చేయండి !
తెలంగాణ టీడీపీకి కాలం కలసి వస్తున్నట్లు లేదు. చివరకు సంస్థాగతంగా కూడా ఆ పార్టీ నేతలకు తలబొప్పి కడుతోంది. మహానాడు ముగిసినా, ఇప్పటికీ పార్టీ పదవులకు దిక్కూమొక్కూ లేదు. వారంలోగా కొత్త అధ్యక్షుడు, కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించాలని అధినేత ‘చంద్రం’ తేల్చారు. ఇంకేం, ఎవరికి వారు ఊహల ఊయలల్లో తేలిపోవడం మొదలు పెట్టారు. ఏ పదవి ఎవరికి ఖరారైపోయిందన్న సమాచారం అందుకున్న టీ టీడీపీలోని ఓ కీలక నేత అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తెలంగాణ అధ్యక్ష పదవి ఎలాగూ రాదని గట్టిగా నమ్ముతున్న ఆ నాయకుడు కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టన్నా దక్కక పోతుందా అని ఆశపడ్డారు. సదరు నేతపై ఇప్పటికే ‘టీఆర్ఎస్ కోవర్టు’ అన్న ముద్ర ఉందాయే. దీంతో ఆయనకు ఆ పదవీ రాదని అంతా చెవులు కొరుక్కోక ముందే.. వర్కింగ్ ప్రెసిడెంట్ మంచివాళ్లకు ఇస్తే నాకే అభ్యంతరం లేదంటూ ముందు నుంచే నసగడం మొదలుపెట్టారు. అలా అంటున్నారంటే, అధినేత వద్ద మళ్లీ ఏదో టెండరు పెడతారని, లేదంటే అలక పాన్పు ఎక్కుతారని ‘తమ్ముళ్లు’ గుసగుసలు పోతున్నారు. అలక బూని సొంత పార్టీ అధ్యక్షుడ్ని బ్లాక్మెయిల్ చేసే నేతల సంఖ్య ఎక్కువగానే ఉందని, వీరందరికీ ఓ పది అలక పాన్పులు సిద్ధం చేయాల్సిందేనని చమత్కరిస్తున్నారు...!! -
మిస్డ్ కాల్ ఇచ్చి ముగ్గులోకి దించుతారు
వరంగల్ : మీడియా ముసుగులో నలుగురు వ్యక్తులు బృందంగా ఏర్పడి పలువురిని బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిన సంఘటన వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగింది. ఎప్పుడూ వినని టీవీ చానళ్ల పేర్లు చెబుతూ ఈ ముఠా సమాజంలో పేరున్న వ్యక్తులను టార్గెట్ చేస్తుంది. ముఠా వ్యక్తి ఒకరు సదరు టార్గెట్ వ్యక్తి సెల్‌ఫోన్‌కు ఒక మిస్డ్ కాల్ ఇస్తారు. తిరిగి వారు ఫోన్ చేయగానే.. ఇటు వైపు నుంచి ఓ యువతి మాట్లాడుతుంది. ఒకసారి పరిచయం అయిన తర్వాత వారికి పదే పదే ఆమె ఫోన్ చేస్తుంటుంది. మాటలతో సదరు వ్యక్తులను ట్రాప్ చేయడం ఆమె పని. అయితే ఆమె వెనుక సిండికేట్ సభ్యులు ఉండి ఈ తతంగం నడిపిస్తారు. మొదట బేకరీలు, స్టార్ హోటళ్లలో పరిచయం పెంచుకోవడం.. చివరకు సదరు వ్యక్తి యువతిని సీక్రెట్‌గా కలిసే విధంగా రంగం సిద్ధం చేస్తారు. ఇద్దరు కలిసి ఇల్లు లేదా లాడ్జికి వెళ్లగానే క్షణాల్లో ఈ నలుగురు రంగంలోకి దిగుతారు. ఆ ఇద్దరు లోపలికి వెళ్లి గడియ వేసుకోగానే.. వీరు బయటి నుంచి తలుపు కొడతారు. వారు తలుపులు తీయగానే ఇద్దరినీ కెమెరాలో చిత్రీకరిస్తారు. ఇక్కడ కెమెరాలు రెండు విధాలుగా పనిచేస్తాయి. ముందుగా తాము ఎంచుకున్న గదికి సదరు వ్యక్తి వచ్చేందుకు సిద్ధంగా ఉంటే.. గదిలోనే సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి, ఇద్దరు లోనికి వెళ్లగానే తలుపు కొడతారు. కెమెరాల్లో రికార్డు అయిన అంశాన్ని చూపెట్టి భయపెడతారు. ఇక రెండవ విధానంలో.. సదరు వ్యక్తి చెప్పిన చోటికి యువతి రావాల్సి వస్తే మాత్రం కెమెరాలతో సిద్ధంగా ఉండి వారు గదిలోకి వెళ్లిన కొద్ది సమయంలోనే వీరు ఎంట్రీ ఇస్తారు. ఇలా చిత్రీకరించిన తర్వాత తమ చానళ్లలో ప్రసారం చేస్తామని బెదిరిస్తారు. బేరసారాలకు దిగుతారు. లక్షలాది రూపాయలు డిమాండ్ చేసి గుంజుతారు. గతంలో వీరి చేతికి కేయూకు చెందిన ఓ ప్రొఫెసర్ చిక్కి రూ. లక్షలు పొగొట్టుకున్నట్లు సమాచారం. ఇలా సమాజంలో మహిళల వ్యసనం ఉన్న కొందరు ప్రొఫెషనల్స్‌ను, పెద్ద మనుషులను కూడా మభ్యపెట్టి అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తారు. బయటపడిందిలా... తాజాగా వీరు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ట్రాప్ చేశారు. యధాతథంగా ఫోన్‌కాల్ వెళ్లడం.. మిగిలిన తతంగమంతా పూర్తై... చివరకు ఆ ఉపాధ్యాయుడు వారి కెమెరాలకు చిక్కాడు. దీంతో ఈ బృందంలోని వారు రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు ఒప్పందానికి వచ్చినా.. ఒక చానల్లో స్క్రోలింగ్ వచ్చింది. అయితే వీరు తనతో మాట్లాడిన మాటలను సదరు ఉపాధ్యాయుడు ముందుగా రికార్డు చేసి పెట్టుకున్నాడు. స్క్రోలింగ్ రావడంతో పోలీసులను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తులను శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. -
మాయగాడితో జర జాగ్రత్త!
కడప అర్బన్ : మూడు పదుల వయసు కలిగి ‘చంద్రు’డివలె చక్కగా ఉన్న ఓ కార్పొరేట్ కళాశాల అధ్యాపకుడు తన వాక్చాతుర్యంతో విద్యార్థినులను లోబరుచుకుంటున్న వైనం వెలుగు చూసింది. ఇతగాడి స్వస్థలం ప్రకాశం జిల్లా పెద్ద పలని. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువతితో 2009లో వివాహమైంది. ఆమె నెల్లూరులోని ఓ కార్పొరేట్ కళాశాలలో అధ్యాపకురాలు. ఇతనూ అక్కడే ఫిజిక్స్ అధ్యాపకుడిగా పని చేస్తూ ఇటీవల తిరుపతిలోని ఓ కార్పొరేట్ కళాశాలకు మారాడు. కడప నగరానికి చెందిన ఓ యువతి ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం రెండు సంవత్సరాల క్రితం నెల్లూరు నగరంలోని ఓ కళాశాలలో చేరింది. ఇతగాని మాయలో పడి 20 రోజుల క్రితం అతనితో వెళ్లింది. ఆ యువతి తల్లిదండ్రుల నుంచి తనకు ఇబ్బంది ఎదురవ్వచ్చని ఊహించి తిరుపతిలోని అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు. మరో వైపు తన తల్లిదండ్రుల నుంచి తనకు హాని ఉందని ఆ యువతి హైకోర్టులో కేసు వేసింది. ఈ నేపథ్యంలో ఈ అధ్యాపకుడిని, ఆ యువతిని కడప మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ వాసుదేవన్ పిలిపించారు. ఆ విషయం తెలుసుకున్న అధ్యాపకుడి భార్య బుధవారం నెల్లూరు నుంచి హుటాహుటిన కడప చేరుకుంది. తన భర్త వల్ల తాను చాలా ఇక్కట్లు ఎదుర్కొన్నానని కన్నీటి పర్యంతమైంది. తమకు ఐదేళ్ల బాబు, ఐదు నెలల పాప ఉన్నారని, తన భర్త తీరును మార్చి తనతో పంపాలని వేడుకుంది. ఇతగాడిపై ఫిర్యాదు చేయడానికి భార్య, అటు ఆ యువతి ఇద్దరూ ఇష్టపడలేదు. దీంతో పోలీసులు చేసేదేమీ లేక అధ్యాపక దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. భవిష్యత్ పాడు చేసుకోవద్దని ఆ యువతిని హెచ్చరించి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, సూటు.. బూటుతో చక్కగా ఉన్న ఈ అధ్యాపకుడిపై ఫిర్యాదు లేని కారణంగా ఎలాంటి చర్య తీసుకోలేకపోయామని పోలీసులు తెలిపారు. ఇలాంటి వారి మాయలో పడకుండా విద్యార్థినుల తల్లిదండ్రులు గమనిస్తుండాలన్నారు. విద్యార్థినులకు ఖరీదైన బహుమతులు ఇస్తూ విలాసవంతమైన జీవితం రుచి చూపిస్తూ లోబరుచుకునేవాడని, తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి బంగారు ఆభరణాలు కాజేసేవాడని కూడా పోలీసుల విచారణలో తేలింది. మరోమారు తప్పిదానికి పాల్పడితే సుమోటోగా కేసు నమోదు చేస్తామని పోలీసులు అతగాడికి గట్టిగా హెచ్చరించి పంపారు. -
రూ.వందకే ఇంటర్నెట్, టీవీ కనెక్షన్
-
రూ.వందకే ఇంటర్నెట్, టీవీ కనెక్షన్
♦ రోజుకు రెండు సినిమాలు చూడొచ్చు ♦ సంగం జన్మభూమి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘మీ ఇంటికి ఫైబర్ తీసుకొస్తా. కేవలం వందరూపాయలకే ఇంటర్నెట్, టీవీ కనెక్షన్ వస్తుంది. అప్పుడు మీరు రోజుకు రెండు సినిమాలు చూడొచ్చు. ఏ సినిమా కావాలన్నా చూడొచ్చు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అందుకు రూ.5 వేల కోట్లతో అండర్‌గ్రౌండ్ పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ప్రకాశం జిల్లా నుంచి సాయంత్రం 3.30కు సంగం చేరుకున్న సీఎం నేరుగా తహశీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట్లో గ్రామసర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో, ఆ తర్వాత డ్వాక్రా లీడర్‌తో మాట్లాడించారు. వ్యవసాయ రుణమాఫీ గురించి సుబ్బానాయుడు అనే రైతు తాను రూ.2లక్షలు రుణం తీసుకుంటే.. రూ.30 వేలే మాఫీ అయ్యిందనటంతో.. సీఎం ‘కూర్చో కూర్చో’మని ఆదేశించారు. సుబ్బానాయుడు లేదు సార్.. మీరు చేసింది నాకు మేలు జరిగిందనటంతో మాట్లాడనిచ్చారు. రూ.50కే కిలో కందిపప్పు ఈ నెల నుంచే రూ.50కే కిలో కందిపప్పు సరఫరా చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. అసంఘటిత కార్మికులకు రూ.5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు బీమా వర్తింప చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఎంఆర్పీఎస్ నిరసన..మీడియాపై దౌర్జన్యం సంగం: ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం పర్యటనలో మీడియాపై పోలీసులు దౌర్జన్యం చేశారు. ఎంఆర్పీఎస్ నాయకులు సంగం చెక్‌పోస్ట్ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి వాహనశ్రేణిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని పక్కకు లాగి లాఠీలతో చితకబాదారు. ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ విలేకరి టీవీఆర్ ప్రసాద్, జెమినీ విలేకరి ఎస్కె రఫీ, ఈటీవీ విలేకరి కరీముల్లా, టీవీ-9 చాంద్‌బాషాపై పోలీసులు విరుచుకుపడ్డారు. సాక్షి టీవీ రిపోర్టర్ ప్రసాద్‌పై దాడి చేసి అతని చేతిలో ఉన్న కెమెరాను పనికి రాకుండా చేశారు. దీంతో మీడియా ప్రతినిధులు సంగం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణలకు సైతం ఫిర్యాదు చేశారు. త్రుటిలో తప్పిన ప్రమాదం ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా సంగం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పెనుప్రమాదం త్రుటిలో తప్పింది. చంద్రబాబు వేదికపైకి వచ్చిన వెంటనే ఒక్కసారిగా పెనుగాలులకు వేదిక కుడివైపున ఉన్న షామియానా పడిపోయింది. దీంతో కొందరు కానిస్టేబుళ్లు షామియానాను పట్టుకోవడంతో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. సభ ముగిసిన ఐదు నిమిషాల్లో మరోసారి పెనుగాలులు రావడంతో మొత్తం షామియానాలు ఒక్కసారిగా పడిపోయాయి. బ్లాక్మెయిల్ చేస్తే ఖబడ్దార్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సీఎం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘రాష్ట్రం విడిపోయినప్పటికీ రెండు ప్రాంతాల తెలుగువారందరూ ఐక్యంగా ఉండాలని, అందరినీ కలుపుకునిపోవాలని ప్రయత్నిస్తున్నా. కానీ, అక్కడి వారు నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారు. నేను ఎవరికీ భయపడను.. ఖబడ్దార్... అంటూ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం శీలంవారిపల్లెలో శుక్రవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో ఆయన మాట్లాడారు. -
'బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..భయపడేది లేదు'
నెల్లూరు/ప్రకాశం : ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలం శీలంవారిపల్లిలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గ్రామంలో పనులేమీ జరగలేదని సీఎంకు గ్రామస్తులు ఫిర్యాదుచేశారు. అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరించారు. కేసులు పెడతామంటూ కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. అయినా భయపడేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు చేపట్టిన జన్మభూమి సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈదురుగాలులు వీచడంతో కార్యక్రమానికి ఏర్పాటుచేసిన టెంట్లు కూలిపోయాయి. దీంతో అక్కడే విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. సీఎం చంద్రబాబు కాన్వాయ్ అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. లాఠీఛార్జ్ చిత్రీకరించిన మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మీడియా నుంచి పోలీసులు కెమెరాలు లాక్కుని విజువల్స్ తొలగించారు. -
రెండు పెళ్లిళ్లు.. పలువురితో రాసలీలలు
భర్త బాగోతం బయటపెట్టిన భార్య అడ్డగుట్ట(సికింద్రాబాద్): ఇంతకు ముందే రెండుసార్లు పెళ్లరుు్యంది.. కానీ వైవాహిక జీవి తంలో సరిపడా ఆనందం లేదని అడ్డదారులు తొక్కుతూ అమ్మాయిలతో రాసలీలలకు దిగా డు. ఆ దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చూస్తూ ఆనందిస్తున్నా డు. తన రాసలీలకు భార్య అడ్డుగా ఉంటుందని తరచూ పుట్టింటికి పంపించేవాడు. భర్తపై అనుమానం వచ్చిన భార్య తన అన్నతో నిఘా పెట్టగా ఆదివారం రాత్రి ఓ అమ్మాయితో కులుకుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు ఆ కామాం ధుడు. తుకారాంగేట్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన జి. శ్రీకాంత్‌కు గౌలిగూడకు చెందిన మాధవితో 2012లో పెళ్లరుు్యంది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. వారికి ఇద్దరు కవలలు పుట్టారు. వారు ప్రస్తుతం ఈస్ట్‌మారేడుపల్లిలోని నవీన్ సూపర్ మార్కెట్ వద్ద ఉంటున్నారు. శ్రీకాంత్ తుర్కపల్లిలోని సాయి లైఫ్ సెన్సైస్‌లో రీసెర్చ్ కెమిస్ట్‌గా పని చేస్తున్నాడు. పెళ్లైనప్పటి నుంచి శ్రీకాంత్ భార్యను తరచూ వేధింపులకు గురిచేస్తుండేవాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి కొందరు అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో భార్యను నిర్లక్ష ్యం చేస్తున్నాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య అతడిపై తన అన్నతో నిఘా పెట్టించింది. ఆదివారం శ్రీకాంత్ వేరే అమ్మాయితో ఓ ప్రైవేటు గదిలో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీకాంత్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని చూడగా అందులో పలువురు అమ్మాయిలతో శ్రీకాంత్ కలిసి దిగిన నగ్న చిత్రాలు కనిపించా యి. శ్రీకాంత్‌పై కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
డ్రగ్స్ ఇచ్చి.. అశ్లీల సీడీలతో బెదిరింపు!!
బాగా డబ్బున్న ఆసాములను చూసుకోవడం, వాళ్లను డ్రగ్స్‌తో మత్తులో ముంచి అశ్లీల సీడీలు రూపొందించి వాటితో బెదిరించడం.. ఇదే పనిగా పెట్టుకున్న ఓ మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఉదయ్‌పూర్‌లోని వర్మ కాలనీ ప్రాంతానికి చెందిన రుబినా హరూన్ ఖాన్ (28) అనే మహిళ ఆటోమొబైల్ ఏజెన్సీలో పనిచేసేది. అక్కడకు వచ్చే కస్టమర్లలో బాగా డబ్బున్నవాళ్లను గుర్తించి, వాళ్లను తన అందంతో ఆకర్షించేదని, గోవర్ధన్ విలాస్ ప్రాంతంలోని తన అపార్టుమెంటుకు రప్పించేదని పోలీసులు తెలిపారు. అక్కడకు వెళ్లిన తర్వాత వాళ్లకు బీరులో డ్రగ్స్ కలిపి ఇచ్చేదని, తర్వాత వాళ్లతో అశ్లీల వీడియోలు రూపొందించి, వాటిని సీడీలుగా మార్చి వాటితో బెదిరించేదని చెప్పారు. ఎట్టకేలకు రఫీక్ మహ్మద్ అనే వ్యక్తి ఆమె ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు రంగంలోకి దిగి ఆమెను అరెస్టు చేశారు. -
ప్రాణం పోస్తే.. బ్లాక్మెయిల్ చేశారు
చెన్నై : ఆపరేషన్ చేసి ప్రాణంపోస్తే నిరాధార ఆరోపణలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని భారతిరాజా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నటేశన్, డాక్టర్ మారన్, సీఈవో కేవీ శ్రీనివాసన్ ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు అంకితభావంతో సేవలందించే వైద్యులను రచ్చకీడ్చడం తగదని వారు హితవు పలికారు. నుంగంబాక్కంకు చెందిన గౌరీశంకర్ భార్య అముద (35) గత ఏడాది ఆగస్టులో ఒబేసిటీ ఆపరేషన్‌ను చేయించుకున్నారు. ఆ కుటుంబం తమ ఆసుపత్రికి బాగా పరిచయస్తులు, కుటుంబ మిత్రులు వంటివారు కావడం తో అదనపు శ్రద్ధతీసుకున్నాం. డిశ్చార్జి అయిన కొన్ని నెలలకు ఆమెకు కొన్ని రుగ్మతలు తలెత్తగా ఒబేసిటీ ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ మారన్ ఇందుకు కారకులని ఆమె, ఆమె భర్త ఆరోపిస్తూ మెడికల్ కౌన్సిల్‌కు, పోలీసుకు ఫిర్యాదులు చేశారు. డాక్టర్‌కు వ్యతిరేకంగా నగరంలో పోస్టర్లు అంటించడం, ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించడం వంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అముదకు ఆపరేష న్ నిర్వహించిన డాక్టర్ మారన్ శుక్రవారం మీడియాకు వివరణ ఇచ్చారు. ఆయన మాటల్లోనే గత ఏడాది ఆగస్టు 11వ తేదీన అముదకు లాప్రోస్కోపిక్ ఆపరేషన్ నిర్వహించాం. ఆరోగ్యకరమైన స్థితిలో 14వ తేదీన ఆమె డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల తరువాత కుట్లు విప్పించుకునేందుకు వచ్చినపుడు ఆమె ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లు గుర్తించాము. తా ము సూచించిన జాగ్రత్తలను పాటించకుండా తీవ్రస్థాయిలో నిర్లక్ష్యం చేశారు. అంతేగాక జిమ్ కు వెళ్లి కఠినమైన వ్యాయామం చేయడంతో మరింతనొప్పి ఏర్పడడంతో వైద్యుల సలహా తీసుకోకుండా ఆమె ఏదో టానిక్ సేవించారు. ఒబేసిటీ చికిత్స చేసినచోట ఎటువంటి సమస్య లేకున్నా ఆమె కడుపులో ఏదో ద్రవం ఉన్నట్లు వైద్య పరీక్షలో గుర్తించి సెప్టంబర్ 19వ తేదీన శస్త్రచికిత్స చేసి తొలగించగా 22వ తేదీన ఆమె ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. భార్య అముదకు వరుస ఆపరేషన్ల వల్ల తాను ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాను, సాయం చేయండని వేడుకోవడంతో తిరిగి చెల్లించే షరతుపై *5లక్షల నగదు అందజేశాను. ‘మీరు అన్నవంటి వారని అముద సైతం కన్నీళ్లు పెట్టి వేడుకోవడంతో వైద్య ఖర్చుల నిమిత్తం వారిపై నమ్మకంతో మరోసారి బ్లాంక్ చెక్ ఇచ్చాను. ఆపరేషన్ చేసుకున్న వ్యక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మళ్లీ నిర్లక్ష్యం చేయడం వల్ల మరోసారి ఆరోగ్యం విషమించగా తన ఆర్థిక సహాయంతో మరో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఆమె మళ్లీ శస్త్రచికిత్స చేసుకున్నారు. వైద్యపరిభాషలోని పదాలకు వక్రభాష్యం చెబుతూ కడుపులో స్పాంజ్, చెత్త ఉంచిన ందునే ఇన్ని శస్త్రచికిత్సలు అవసరం ఏర్పడిందని ఆ దంపతులు తనను ఆరోపిస్తున్నారు. మానవతా దృక్పథంతో తానిచ్చిన బ్లాంక్ చెక్‌ను అడ్డంపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడడంతో తేనాంపేట పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశానని మారన్ అన్నారు. తాను చేసిన ఆపరేషన్‌లో తప్పుజరగలేదని ఖచ్చితంగా చెబుతున్నానని, చట్టపరంగా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. గౌరీశంకర్ దంపతుల వద్ద సాక్ష్యాధారాలు ఉంటే తనపై కోర్టుకు ఎక్కవచ్చు, వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చని ఆయన సవాల్ చేశారు. అయితే ఇవేమీ చేయకుండా ఆసుపత్రి ముందు ధర్నాకు దిగడం, తనపై పోస్టర్లు అంటించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. పేదలనే సానుభూతితో ఆ దంపతులకు తానుచేసిన ఆర్థిక సహాయమే తన మెడకు చుట్టుకున్నందుకు చింతిస్తున్నానని అన్నారు. -
తండ్రినే బ్లాక్మెయిల్ చేసి...
హైదరాబాద్ : జల్సాలకు అలవాటుపడి ఓ యువకుడు దుండగులు తనను కిడ్నాప్ చేశారని తండ్రిని బెదిరించి, డబ్బు గుంజాడు. సదరు ప్రబుద్ధుడ్ని పంజాగుట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. పోలీసుల కథనం ప్రకారం... ముంబైకి చెందిన విజయ్ రోహన్ (23) బంజారాహిల్స్ రోడ్ నెం-2లో హాస్టల్లో ఉంటూ సోమాజిగూడలోని ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. కార్లలో తిరగడం, ఖరీదైన హోటళ్లలో బస చేసి జల్సాలు చేయడం ఇతని హాబీ జల్సాలకు జీతం డబ్బు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు కిడ్నాప్ డ్రామాకు స్కెచ్ వేశాడు. ఈ నెల 16న తన ఫోన్ నుంచే ముంబైలో ఉండే తండ్రికి ఫోన్ చేసి... డబ్బు కోసం కొందరు తనను కిడ్నాప్ చేశారని, వెంటనే తన బ్యాంక్ అకౌంట్లో డబ్బు వేయాలని ఒత్తిడి చేశాడు. ఎవరికైనా చెప్తే కిడ్నాపర్లు తనను చంపేస్తారని, ఎవరికీ చెప్పవద్దని తండ్రితో తెలిపాడు. 16వ తేదీ నుంచి శుక్రవారం వరకూ తన అకౌంట్లో తండ్రితో రూ.లక్షా 93 వేలు వేయించుకుని జల్సా చేశాడు. కిడ్నాపర్లు మళ్లీ డబ్బు అడుగుతున్నారని మళ్లీ తండ్రికి ఫోన్ చేశాడు. దీంతో ఆయనకు అనుమానం వచ్చి నేరుగా నగరానికి వచ్చాడు. విజయ్‌కు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగితే పొంతనలేని సమాధానం చెప్పడంతో అతను పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి కొడుకే డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా ఆడాడని నిర్థారించారు. నిందితుడు విజయ్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
పాస్టర్ కుటుంబాన్ని వేధిస్తున్నారు
మాల మహాసభ గాంధీనగర్ ప్రజాసంఘాలు, కులసంఘాల పేరుతో సంఘంలో పరువు ప్రతిష్టలతో బతికే వారిని కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మట్టా ఉష కేసులో మాదిగ హక్కుల సేన, యాదవసేన సమితి , జై ఆంధ్ర జేఏసీల అసత్య ప్రకటనలను ఖండిస్తున్నామన్నారు. క్రీస్తురాజుపురానికి చెందిన పాస్టర్ రత్నజ్యోతి తనయుడు డేవిడ్ రత్నజ్యోతిని కావాలనే మట్టా ఉష కేసులో కుల సంఘాల వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. డేవిడ్ రత్నజ్యోతికి 2012లోనే వివాహం అయిందన్నారు. కొందరు స్వార్థంతో డేవిడ్ రత్నజ్యోతికి మట్టా ఉషతో యనమలకుదురు చర్చిలో బలవంతంగా వివాహం జరిపించారన్నారు. చర్చికి వెళుతున్న తనను డేవిడ్ రత్నజ్యోతి తనను గర్భవతిని చేశారడని ఆరోపిస్తున్న ఉష.. ఏ హాస్పిటల్లో బిడ్డకు జన్మనిచ్చిందో చెప్పాలన్నారు. ఉష బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి నిజానిజాలను తేల్చి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. తన భర్తను వేధిస్తూ, తనపై దౌర్జన్యం చేశారని డేవిడ్ రత్నజ్యోతి భార్య హారిక జనవరి మూడో తేదీన మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు, ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా 27 రోజుల తర్వాత మట్టా ఉష ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి వేధించడం సరికాదన్నారు. సంఘంలో ఎంతో హుందాగా జీవిస్తున్న పాస్టర్ రత్నజ్యోతిని, అతని కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకే కొన్ని సంఘాల వారు తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి దోషులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాల మహాసభ నాయకులు బండి బాలయోగి, లింగతోటి సుధాకర్, జయప్రసాద్, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దందా సంఘాలు..
నెల్లూరు(విద్య): విద్యార్థుల సమస్యల పరిష్కరించేందుకు ఏర్పాటైన విద్యార్థిసంఘాలు కొన్ని హద్దుమీరుతున్నాయి. కాలం చెల్లినా, బోగస్ విద్యార్థి సంఘాల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. ఎవరికి వాళ్లు ఇష్టారీతిన విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. జేఏసీ అంటూ అందరూ కలసి ఏళ్ల తరబడి విద్యార్థిసంఘ నాయకులుగా వ్యవహరిస్తూ దందాలు చేస్తున్నారు. ఏ కళాశాలలోనూ విద్యనభ్యసించకుండా విద్యార్థి నాయకులుగా చలామణి అవుతున్నారు. సమస్యలను సృష్టించి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడమే వారి ధ్యేయంగా మారుతోంది. అసలు లక్ష్యాన్ని విడిచిన సంఘాల కారణంగా విద్యాసంస్థల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో జిల్లాలో ప్రముఖ రాజకీయ పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్ జిల్లా అధినేతలు తమ పార్టీ విద్యార్థి సంఘ నాయకుల ఆగడాలను తట్టుకోలేక వారిని ఆ పదవుల నుంచి తొలగించిన సందర్భాలున్నాయి. ఇలా బయటికొచ్చిన వారు నాయకులుగా సొంత సంఘాలను స్థాపించి జేఏసీలుగా అవతారాలు ఎత్తుతున్నారు. అటు ప్రైవేటు విద్యాసంస్థలను బెదిరిస్తూ ఇటు ప్రభుత్వ అధికారులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. నాయకుడు పేరుతో ఒకరు నలుగురు యువకులను వెంటేసుకొని కూడళ్లలో ధర్నాలు నిర్వహించడం దిష్టిబొమ్మలను దహనం చేయడం వీరి దందాలో భాగమైపోతుంది. కౌన్సెలింగ్, పరీక్షల సమయాల్లో వీరి ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది. జిల్లాలో గుర్తింపు పొందిన విద్యార్థి సంఘాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. వాళ్లు తమ పని తాము చేసుకుంటున్నారు. ఒక విద్యార్థి సంఘం నుంచి వెలివేయబడి సొంతగా విద్యార్థి సంఘాలను జేఏసీలను ఏర్పాటు చేసుకున్న వారితోనే సమస్యలు అధికమవుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కార్యాలయం, లెటర్‌హెడ్ లేకుండానే వీరి దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. వారి మీద చర్యలు తీసుకోవాలంటే ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న విద్యార్థిసంఘాలను సైతం వీరు తప్పుదోవ పట్టించిన సందర్భాలు జిల్లాలో అనేకం. ప్రోత్సహిస్తున్న విద్యాసంస్థలు... విద్యాసంస్థల మధ్య నెలకొన్న అనారోగ్య పోటీ నకిలీ సంఘాల నాయకులను ప్రోత్సహిస్తుంది. కొన్ని విద్యార్థి సంఘాలను కొన్ని విద్యాసంస్థలు దత్తత తీసుకొని ప్రత్యర్థి విద్యార్థి సంస్థలపైకి ఉసిగొల్పుతున్నారు. దీంతో రెచ్చిపోయిన విద్యార్థి నాయకులు విద్యాసంస్థల మధ్య తగాదాలను పెంచి పోషిస్తున్నారు. నిబంధనల పేరుతో విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నామనే ముసుగులో తమను ప్రోత్సహిస్తున్న వారికి దండుగా నిలుస్తున్నారు. దీంతో అధికారులు అటు విద్యాసంస్థలపై, ఇటు గుర్తింపులేని, దందాలు చేస్తున్న కొన్ని విద్యార్థి సంఘాలపై చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బోగస్ విద్యార్థి సంఘాల ఆగడాలకు అడ్డుకట్టవేయాల్సి అవసరం ఉంది. బోగస్ లీలలు కొన్ని.. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సందర్భంలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన ఏపీఓ వద్ద విద్యార్థి నాయకుడు ల్యాప్‌టాప్ లాక్కొని అతనిపై దాడి చేశాడు. బీఈడీ కౌన్సెలింగ్ నేపథ్యంలో వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద రెండు విద్యార్థి సంఘాల మధ్య వాగ్వివాదం, తోపులాటలు జరిగాయి. పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఓ కార్పొరేట్ స్కూల్ తమ బెదిరింపులకు లొంగలేదని ఆ పాఠశాలకు చెందిన వ్యాన్ అద్దాలను పగలగొట్టడం నగరంలో చర్చనీయాంశమైంది. వీఎస్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ సందర్భంలో వీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకులపై విద్యార్థి సంఘ నాయకులమని చెప్పుకొనే కొందరు దాడిచేసి గాయపరిచారు. కేసు నడుస్తోంది. తాజాగా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, ఆర్ఐఓ విధులకు అంతరాయం కలిగిస్తున్నారని ఆర్ఐఓనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోగస్ విద్యార్థి సంఘాల ఆగడాలు అనేకం. -
టీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్తున్నట్టు ఉంది: రేవంత్
హైదరాబాద్: శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు కనుసన్నల్లో తెలంగాణ అసెంబ్లీ నడుస్తోందని టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలోకి వచ్చినట్టు లేదని, టీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్తున్నట్టు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఒక సంస్థకు లబ్ది చేకూర్చారని ఆధారాలతో మీడియా ముందు పెట్టానన్నారు. మైహోం రామేశ్వరరావుకు స్వయంగా కేసీఆర్ ఐఎస్ఐ సర్టిఫికెట్ ఇస్తున్నారన్నారు. దీనిపై సభలో చర్చించాలనే తమను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారని ఆరోపించారు. రాజకీయంగా తమను లొంగదీసుకోవాలని చూస్తున్నారని అన్నారు. బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే పారిపోతున్న ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలన్నీ కలిసి పట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ బ్లూస్టార్ అంటూ సభలో తనను బెదిరించారని వాపోయారు. తాను నోరు తెరిస్తే బండారం బయటపడుతుందని క్షమాపణ చెప్పాలంటూ అడ్డుకుంటున్నారని వాపోయారు. శాసనసభలో ఎథిక్స్ కమిటీ ఆదేశాలకు నడుచుకుంటానని, టీఆర్ఎస్ సన్నాసులు చెబితే వినేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. -
స్నానం చేస్తుండగా బాలికను వీడియో తీసిన యువకుడు
-
ఇంటర్ విద్యార్థిని స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌తో చిత్రీకరణ
ఓ ఇంటర్ విద్యార్థిని తన ఇంట్లో స్నానం చేస్తుండగా దొంగచాటున సెల్‌ఫోన్‌తో చిత్రీకరించిన ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. బ్లాక్మెయిల్ చేస్తూ తాము చెప్పిన రూమ్‌కు రప్పించుకుని కొద్ది రోజులుగా అత్యాచారం చేస్తున్నారు. యువకుల వేధింపులు భరించలేని విద్యార్థిని ఇల్లు విడిచి పారిపోయింది. విద్యార్థిని తల్లి కుటుంబ సభ్యులు సాయంతో ఆమె ఆచూకీ ఆదివారం కనుగొంది. జరిగిన సంఘటన తెలుసుకొంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ యువకుల బండారం బయటపడింది. నిందితులపై నిర్భయ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... గజపతినగరం : పట్టణంలోని డ్రీమ్స్ మొబైల్ షాపులో పని చేస్తున్న ఐదుగురు యువకులు ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పురిటిపెంట న్యూకాలనీకి చెందిన ఓ విద్యార్థిని ఇంట్లో స్నానం చేస్తుండగా వీడియోను సెల్ఫోన్లో చిత్రీకరించిన యువకులు తమ కోర్కెను తీర్చకుంటే వీడియోను నెట్లో పెడతామని బెదిరించి మరీ అత్యాచారానికి పాల్పడినట్టు విద్యార్థిని తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. తన ఇంటి పక్కనే ఉన్న శివాజినాయక్ తన కుమార్తె స్నానం చేస్తుండగా వీడియోను తీసి బ్లాక్మెయిల్ చేసి తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొంది. శివాజినాయక్తో స్నేహితులు ప్రసన్నకుమార్, శ్రీకాంత్, భానుప్రసాద్, జితేంద్ర తన కుమార్తెను కొద్ది రోజులు పాటు వారు చెప్పిన చోటుకు రప్పించుకుని అత్యాచారం చేయడమే కాకుండా లైంగిక వేధింపులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. వీరి బాధలు భరించలేక పది రోజుల కిందట తన కుమార్తె ఇల్లు విడిచి వెళ్లిపోయయిందని తెలిపింది. కుటుంబ సభ్యుల సహాయంతో తీసుకువ చ్చి ప్రశ్నించగా జరిగిన సంఘటనను వివరించిందని తెలిపింది. విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ అహ్మద్ నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సీఐ వి.చంద్రశేఖర్ తెలిపారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి పది గంటల సమయంలో ఎస్పీ గ్రేవెల్ ఇక్కడకు వచ్చి నిందితులను విచారించి వెళ్లారు. నిందితులపై నిర్భయ కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేఏ నాయుడు కోరారు. బాధిత విద్యార్థినికి అండగా ఉంటామని తెలిపారు. -
రేవంత్‌రెడ్డిది బ్లాక్మెయిల్ నైజం: బాల్క సుమన్
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిది బ్లాక్ మెయిల్ చేసే నైజమని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులతో కూడా రేవంత్ రెడ్డి టచ్‌లో ఉన్నారని ఆయన చెప్పారు. ఆయన పదే పదే విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి పారిశ్రామికవేత్తలను బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. మెట్రోరైలు కోసం కేటాయించిన భూములను 'మైహోం' రామేశ్వర్ రావుకు కేటాయించారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించడం, దానిపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగడం తెలిసిందే. తాజాగా తెలంగాణ టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారన్న కథనాలు రావడం తెలిసిందే. -
యాంకర్ హర్షవర్దన్ ముఠా అరాచకాలు
-
‘క్రైం’ కిలాడీ
* ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న యాంకర్ హర్షవర్దన్ ముఠా అరాచకాలు * రైల్వే ఇంజినీర్, యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెరుుల్ * రూ.13 లక్షలు వసూలు * మరింత సొమ్ము కోసం బెదిరింపులు ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా) : సూటు.. బూటు వేసుకుని బుల్లి తెరపై ప్రత్యక్షమవుతాడు. ‘మహానగరంలో మాయగాళ్లు.. ఫొటోలు మార్ఫింగ్ చేస్తారు.. ఫోన్ చేసి బెదిరిస్తారు.. లక్షలకు లక్షలు ఇమ్మంటారు.. ప్రజలూ బహుపరాక్’ అంటూ గంభీరమైన మాటలు చెబుతాడు. ‘టిప్‌టాప్‌గా వస్తారు.. తప్పు చేయకపోయినా తప్పులున్నాయంటారు.. డబ్బు ఇవ్వకపోతే మిమ్మల్ని వీధిలోకి లాగుతామంటారు.. ఇలాంటి వాళ్ల విషయంలో బెదిరిపోకండి.. పోలీసుల్ని ఆశ్రయించండి..’ అంటూ గొప్పోడిలా సలహాలు ఇస్తాడు. తెరవెనుక మాత్రం అతడే కిలాడీ కేటుగాడని.. తానే అలాంటి పనులు చేస్తూ డబ్బు గుంజుతుంటాడని తెలిసి విస్తుపోవడం పోలీసుల వంతయియంది. నేర వార్తలను విభిన్నంగా చదువుతూ.. తెరవెనుక జనాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసులకు చిక్కిన టీవీ యూంకర్ హర్షవర్దన్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బాలను బ్లాక్మెయిల్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేసి కటకటాల పాలైన హర్షవర్దన్ ముఠా సభ్యులు తననూ బెదిరించారని.. రూ.13 లక్షలు వసూలు చేశారంటూ ఓ రైల్వే ఇంజినీర్ తాజాగా టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. రైల్వే ఇంజినీర్ నుంచి రూ.13 లక్షలు వసూలు హర్షవర్దన్ తన నుంచి రూ.13 లక్షలు వసూలు చేశాడంటూ విజయవాడకు చెందిన రైల్వే ఇంజినీర్ నాతా హరినాథ్‌బాబు ఏలూరు టూటౌన్ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ రైల్వే స్టేషన్లో సెక్షన్ సీనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హరినాథ్‌బాబు అదే నగరంలో ఉంటున్నారు. అతని ఫొటోను ఓ యువతి ఫొటోతో కంప్యూటర్ సాయంతో మార్ఫింగ్ చేసి దానిని ఇంటర్నెట్లో పెడతామంటూ హర్షవర్దన్, నల్లజర్లకు చెందిన ఓ టీవీ ఛానల్ నిర్వాహుకుడు లూక్‌బాబు, హేలాపురి దినపత్రిక తరఫున ఏలూరు, తాడేపల్లిగూడెంలలో పనిచేస్తున్న బోడ విజయకుమార్, దిరిశిపాముల విజయరత్నం బ్లాక్మెయిల్ చేశారు. ఆ ఫొటోను నెట్లో పెట్టకుండా ఉండాలంటే తమకు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయపడిన హరినాథ్‌బాబు వారిని ఈ నెల 2న విజయవాడ రైల్వేస్టేషన్‌కు రమ్మని చెప్పారు. వారికి అక్కడ రూ.13 లక్షలు ఇచ్చారు. అయినా హర్షవర్దన్, అతని ముఠా సభ్యులు ఫొటోను హరినాథ్‌బాబుకు ఇవ్వలేదు. మరికొంత సొమ్ము ఇస్తేనే ఫొటోను తిరిగి ఇస్తామన్నారు. ఆ తరువాత ఫాదర్ బాలను బ్లాక్మెయిల్ చేసిన కేసులో హర్షవర్దన్, అతని అనుచరులను ఏలూరులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న హరినాథ్ బాబు మంగళవారం అర్ధరాత్రి ఏలూరు చేరుకున్నారు. తనను బ్లాక్మెయిల్ చేసి రూ.13 లక్షలు వసూలు చేసిన విషయమై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సత్యకిషోర్ తెలిపారు. ముఠా సభ్యుల ఇళ్లల్లో తనిఖీలు హర్షవర్దన్ అనుచరులైన నల్లజర్లకు చెందిన లూక్‌బాబు, ఏలూరుకు చెందిన విజయకుమార్, తాడేపల్లిగూడేనికి చెందిన విజయరత్నం, ఏలూరు కార్ల విడిభాగాల షోరూం నిర్వాహకుడు వీరంకి చిరంజీవి ఇళ్లల్లో పోలీసులు మంగళ, బుధవారాల్లో సోదాలు నిర్వహించారు. బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగిస్తున్న సీడీలు, ఇతర రికార్డుల కోసం పోలీసులు వారి గృహాలతోపాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. -
‘క్రైం’ కిలాడీ
►ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న యాంకర్ హర్షవర్దన్ ముఠా అరాచకాలు ►రైల్వే ఇంజినీర్, యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ ►రూ.13 లక్షలు వసూలు ►మరింత సొమ్ముకోసం బెదిరింపులు ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్): సూటు.. బూటు వేసుకుని బుల్లి తెరపై ప్రత్యక్షమవుతాడు. ‘మహానగరంలో మాయగాళ్లు.. ఫొటోలు మార్ఫింగ్ చేస్తారు.. ఫోన్‌చేసి బెదిరిస్తారు.. లక్షలకు లక్షలు ఇమ్మంటారు.. ప్రజలూ బహుపరాక్’ అం టూ గంభీరమైన మాటలు చెబుతాడు. ‘టిప్పుటాపుగా వస్తారు.. తప్పు చేయకపోయినా తప్పులున్నాయంటారు.. డబ్బు ఇవ్వకపోతే మిమ్మల్ని వీధిలోకి లాగుతామంటారు.. ఇలాంటి వాళ్ల మాటలకు బెదిరిపోకండి.. పోలీసుల్ని ఆశ్రయించండి’ అంటూ గొప్పోడిలా సలహాలు ఇస్తాడు. తెరవెనుక మాత్రం అతడే కిలాడీ కేటుగాడని.. తానే అలాంటి పనులు చేస్తూ డబ్బులు గుంజుతుంటాడని తెలిసి విస్తుపోవడం పోలీసుల వంతయియంది. నేర వార్తలను విభిన్నంగా చదువుతూ.. తెరవెనుక జనాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసులకు చిక్కిన టీవీ యూంకర్ హర్షవర్దన్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బాలను రూ.5 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసి కటకటాల పాలైన హర్షవర్దన్ ముఠా సభ్యులు తననూ బెదిరించారని.. రూ.13 లక్షలు వసూ లు చేశారని ఓ రైల్వే ఇంజినీర్ తాజాగా టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఫొటో మార్ఫింగ్ చేసి రూ.20 లక్షలు అడిగారు హర్షవర్దన్ తననుంచి రూ.13 లక్షలు వసూలు చేశాడంటూ విజయవాడకు చెందిన రైల్వే ఇంజినీర్ నాతా హరినాథ్‌బాబు ఏలూరు టూటౌన్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ రైల్వే స్టేషన్లో సెక్షన్ సీని యర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హరినాథ్‌బాబు అదే నగరంలో నివాసం ఉంటున్నారు. అతని ఫొటోను ఓ యువతి ఫొటోతో కంప్యూటర్ సాయంతో మార్ఫింగ్ చేసి దానిని ఇంటర్నెట్లో పెడతామంటూ హర్షవర్దన్, నల్లజర్లకు చెందిన ఓ టీవీ ఛానల్ నిర్వాహకుడు లూక్‌బాబు, హేలాపురి దినపత్రిక తరఫున ఏలూరు, తాడేపల్లిగూడెంలలో పనిచేస్తున్న బోడ విజయకుమార్, దరిశిపాముల విజయరత్నం బ్లాక్మెయిల్ చేశారు. ఆ ఫొటోను నెట్లో పెట్టకుండా ఉండాలంటే తమకు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయపడిన హరినాథ్‌బాబు వారిని ఈ నెల 2న విజయవాడ రైల్వేస్టేషన్‌కు రమ్మని చెప్పారు. వారికి అక్కడ రూ.13 లక్షలు ఇచ్చారు. అయినా హర్షవర్దన్, అతని ముఠా సభ్యులు మార్ఫింగ్ చేసిన ఫొటోను హరినాథ్‌బాబుకు ఇవ్వలేదు. మరి కొంత సొమ్ము ముట్టచెబితేనే ఫొటోను తిరిగి ఇస్తామన్నారు. ఆ తరువాత ఫాదర్ బాలను బ్లాక్మెయిల్ చేసిన కేసులో హర్షవర్దన్, అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న హరినాథ్‌బాబు మంగళవారం అర్ధరాత్రి ఏలూరు చేరుకున్నారు. తనను బ్లాక్మెయిల్ చేసి రూ.13 లక్షలు వసూలు చేసిన విషయమై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సత్యకిషోర్ తెలిపారు. -
తెలుగు తముళ్ల నయా దండా!
-
తెలుగు తమ్ముళ్ల బ్లాక్మెయిల్.. అరెస్టు
తెలుగునాడు, తెలుగు యువత విద్యార్థి సంఘాలు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరులో కళాశాలలు, పాఠశాలలను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు వాళ్లపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెలుగునాడు, తెలుగుయువత జిల్లా అధ్యక్షులను కర్నూలు జిల్లా పోలీసుల అరెస్టు చేశారు. వారిని రిమాండుకు తరలించారు. -
గన్‌తో బెదిరించిన కాంగ్రెస్ నేత
-
ఫేస్బుక్ పరిచయంతో.. టెకీపై అత్యాచారం
ఫేస్బుక్లో పరిచయం అయిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ (23)పై అత్యాచారం చేసి, ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్న కేసులో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని భావ్‌నగర్ ప్రాంతానికి చెందిన రిషభ్ కటోడియా (25) ఇండోర్‌లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతడు తనపై అత్యాచారం చేయడమే కాక, కొన్ని నెలలుగా తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. రిషభ్ తనకు ఫేస్బుక్లో పరిచయం అయ్యాడని, ఈ సంవత్సరం జనవరి 4వ తేదీన ఇండోర్ వచ్చి తనను సైట్ సీయింగ్‌కు తీసుకెళ్లాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అప్పుడు తనకు మత్తుమందు కలిపిన కాఫీ ఇచ్చి.. మొబైల్ఫోన్లో తనను అసభ్యంగా వీడియో తీశాడని తెలిపింది. రెండు నెలల తర్వాత తనకు ఫోన్ చేసి, వడోదరకు రాకపోతే ఆ వీడియోను ఇంటర్నెట్లో పెడతానంటూ బెదిరించాడని, అక్కడ తనపై మూడు రోజుల పాటు అత్యాచారం చేశాడని వాపోయింది. కొంతకాలం తర్వాత మళ్లీ కొన్ని అసభ్య చిత్రాలు తనకే పంపి, పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చాడని తెలిపింది. తాను నిరాకరించడంతో తనను చంపేస్తానని, ఆ ఫొటోలు తల్లిదండ్రులకు పంపుతానని కూడా బెదిరించాడంది. దాంతో భరించలేని బాధితురాలు.. ఇండోర్ పోలీసు స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు చెప్పడంతో, ఓసారి కలవాలి ఇండోర్ రమ్మని పిలిచింది. అతడు రాగానే పోలీసులు అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. -
స్నేహం పేరిట యువతిని ట్రాప్ చేసి ...
స్నేహం పేరిట యువతిని ట్రాప్ చేసి...సెల్‌ఫోన్‌తో చిత్రీకరించిన అసభ్యకర వీడియో క్లిప్పింగ్స్‌ను చూపించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఓ యువకుడిని నల్లకుంట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... రాంనగర్ గుండు సమీపంలో ఉంటున్న యువతి (19) వెంకటాపురంలోని కళాశాలలో చదువుకుంటోంది. గోల్నాకకు చెందిన అచ్యుతరామ్ 2011 నుంచి స్నేహం పేరుతో ఆమె వెంటపడుతున్నాడు. కొంతకాలానికి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి మాట్లాడుకుంటున్నారు. దీని ఆసరా చేసుకొని ఆమె నివాసానికి వెళ్లిన ఇతను.. స్నానం చేస్తున్నప్పుడు, దుస్తులు మార్చుకుంటున్నప్పుడు ఆమెకు తెలియకుండా సెల్‌ఫోన్‌తో ఆ దృశ్యాలు చిత్రీకరించాడు. తర్వాత ఆ క్లిప్పింగ్స్ చూపించి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. విషయం తెలిసిన అచ్యుతరామ్ తండ్రి యువతి కుటుంబ సభ్యులను పిలిపించి రాజీ కుదిర్చారు. అయినా ఆ యువకుడి ప్రవర్తనలో మార్పురాలేదు. పైగా ఆమె ఎక్కడ కనిపించినా నీ అంతుచూస్తానని బెదిరిస్తున్నాడు. ఈనెల 3న కాలేజీలో పరీక్ష రాసి.. స్నేహితురాలి తండ్రి బైక్‌పై ఇంటికి వస్తుండగా.. అచ్యుతరామ్ ఆ యువతిపై చేయిచేసుకున్నాడు. విషయాన్ని ఆమె తన కుటుంబసభ్యులకు చెప్పగా...ఈనెల 5న నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అచ్యుతరామ్ను సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుడు మెడిసిన్ పూర్తి చేసినట్లు తెలిసింది. -
లైంగిక క్రీడల వీడియోతో బ్లాక్ మెయిల్
నటి నయనా కృష్ణపై మరో బాధితుడి కేసు వైద్యుడి ఫిర్యాదుతో వెలుగులోకి వస్తున్న బాధితులు దర్యాప్తు చేస్తున్న సీసీబీ 12 రోజులుగా నటి కోసం గాలింపు బెంగళూరు: లైంగిక క్రీడలో ఉన్న సమయంలో వీడియో తీసి.. వాటితో బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ కన్నడ నటి నయనా కృష్ణపై తాజాగా మరో బాధితుడు స్థానిక విల్సన్ గార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీ సులు తెలిపిన సమాచారం మేరకు.. నగరంలో నివాసముంటున్న కృష్ణప్ప 2010లో లైంగిక క్రీడలో ఉన్న సమయంలో నటి నయనా కృష్ణ, ఆమె స్నేహితులు వీడియో తీశారు. అనంతరం ఆ క్లిప్పింగులు చూపి నటి నయనా బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. భారీగా డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు విల్సన్ గార్డెన్ పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేశాడు. వైద్యుడి ధైర్యంతో ముందుకొస్తున్న బాధితులు చాళుక్య సర్కిల్లో ఉన్న ఒక వైద్యుడు కొన్ని రోజుల క్రితం లైంగిక క్రీడలో ఉన్న సమయంలో నటి నయనా కృష్ణ, ఆమె స్నేహితులు మేఘనా, రిహానా తదితరులు వీడియో తీశారు. తర్వాత వీరితో పాటు కానిస్టేబుల్ మల్లేష్, ప్రైవేటు టీవీ చానెల్లో పని చేస్తున్న హేమంత్ కుమార్, సునీల్, జిమ్ సెంటర్ నిర్వహకుడు రఘు ఆ క్లిప్పింగ్‌లు చూపి వైద్యుడ్ని బ్లాక్ మెయిల్ చేశారు. రూ. లక్షను వసూలు చేసి.. మరో రూ. 15 లక్షలను సిద్ధం చేసుకోవాలని డిమాండ్ చేసి వెళ్లిపోయారు. దీంతో ఆ వైద్యుడు రెండు వారాల క్రితం సీసీబీ పోలీసులను ఆశ్రయించాడు. 12 రోజుల క్రితం నగదు తీసుకోడానికి ఆ వైద్యుడి వద్దకు వచ్చిన హేమంత్ కుమార్, సునీల్‌ను ఆ పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి మిగి లిన నిందితుల కోసం గాలిస్తున్నారు. నటి నయనా కృష్ణ కోసం గాలిస్తున్నాం.. : పోలీసులు నటి నయనా కృష్ణ కోసం తాము 12 రోజులుగా గాలిస్తున్నామని సీసీబీ పోలీసులు తెలిపారు. నగర పోలీసు అధికారులు ఆదేశాల మేరకు తామీ కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసు విషయమై వారు బుధవారం మాట్లాడుతూ.. ‘ నటి నయనా కృష్ణ ఇలా చాలా మందిని బ్లాక్మెయిల్ చేస్తోంది. బెదిరించి లక్షలాది రూపాయలను వసూలు చేస్తోంది. అయితే పరువు పోతుందని, సినీ రంగానికి చెందిన ఆమెకు ప్రముఖులతో పరిచయాలు ఉండటంతో ఆమెపై ఫిర్యాదుకు ఎవరూ ముందుకు రాలేకపోయారు. అయితే రెండు వారాల క్రితం వైద్యుడు ధైర్యంగా ముందుకు వచ్చి.. ఫిర్యాదు చేశాడు. దీంతో మేం మొట్టమొదటి సారిగా ఆమెపై కేసు నమోదైంది. దీంతో అప్పటి నుంచి మేం ఆమె, ఆమె స్నేహితుల కోసం గాలిస్తున్నాం. ఈ విషయం తెలుసుకొని తాజా మరో బాధితుడు ముందుకు రావడం విశేషం. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తాం ’ అని ధీమా వ్యక్తం చేశారు. -
ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం
ఒకమ్మాయి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'నా ప్రియుడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నాపై యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడు. నన్ను రేప్ చేశాడు,' అని పోలీసులకు చెప్పుకుని భోరుమంది. దాంతో పోలీసులు హుటాహుటిన రంగప్రవేశం చేశారు. దర్యాప్తు చేయడం మొదలుపెట్టే సరికి కథలో ట్విస్టులే ట్విస్టులు! దాంతో ఆశ్చర్యపడిపోవడం పోలీసుల వంతైంది. అమ్మాయి లక్నోలోని తేలీబాగ్ లో ఒక షాపింగ్ మాల్ లో పనిచేస్తుంది. ఆమెకి ఆలమ్ బాగ్ లో ఉండే ఒక అబ్బాయితో దోస్తీ. అతను లా విద్యార్థి. ఇద్దరి మధ్య గత ఆరేళ్లుగా లవ్ నడుస్తోంది... కాదు కాదు పరుగులు తీస్తోంది. ఆదివారం అబ్బాయి అమ్మాయి కలుసుకోవాలనుకున్నారు. అబ్బాయి అమ్మాయి పనిచేసే షాపింగ్ మాల్ కివచ్చాడు. రావద్దు గాక రావద్దంది అమ్మాయి. కానీ అబ్బాయి వచ్చేశాడు. అతనికి అమ్మాయి ఇంకొకరితో సినిమా చూస్తున్నట్టు తెలిసింది. ఈ విషయమై లా పాయింట్లు లేవదీశాడు అబ్బాయి. *దాంతో అమ్మాయి నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసింది. అసలు సంగతి అర్థమయ్యాక ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి కలిసి జీవించండి అని శాంతి సందేశమిచ్చి పంపించేశారుపోలీసులు. *మొగుడిని కొట్టి మొగసాలకెక్కడాన్ని చూశాం. మొగుడు కాకుండానే కొట్టి మొగసాలకెక్కడమంటే ఇదేనేమో? -
శృంగార తార బ్లాక్ మెయిలింగ్
ఒకప్పుడు శృంగార నటిగా ప్రకాశించి, అవకాశాలు ముఖం చాటేయడంతో ప్రముఖులకు వల వేసి బ్లాక్మెయిల్ చేస్తూ కోట్లు దండుకునే వ్యాపారం మొదలెట్టింది. విషయం పోలీసులకు తెలియడంతో చెన్నైలో ముఖం దాచుకుందని సమాచారం. వివరాల్లోకెళితే కన్నడ చిత్ర పరిశ్రమలో శృంగార నటిగా పేరొందిన నయన కృష్ణకు తరువాత అవకాశం లేకపోవడంతో వేశ్య వృత్తిలోకి దిగిందని సమాచారం. ప్రముఖ వ్యక్తులతో సన్నిహితంగా మెలిగి తన సహచర బృందంతో దాన్ని వీడియో తీయించి వాటిని చూపించి కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతోందట. అలా ఒక బెంగళూర్‌కు చెందిన డాక్టర్ నయన కృష్ణ మాయలోపడ్డారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వీడియో క్లిప్పింగ్‌లను చూపి కోటి రూపాయలు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడిందట. దీంతో దిమ్మ తిరిగి ఆ డాక్టర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న బెంగళూర్ పోలీసులు ఈ బ్లాక్‌మెయిలింగ్ ముఠా కోసం వలపన్నారు. నయన కృష్ణ మోసానికి గురైన డాక్టర్ పోలీసుల సూచన ప్రకారం ఆమెకు ఫోన్ చేసి మొదట ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెప్పారు. దీంతో ఆ డబ్బు తీసుకోవడానికి వచ్చిన నయన కృష్ణ ముఠాకు చెందిన ముగ్గురులో ఇద్దరిని పోలీసులు పట్టుకోగా మరొకడు తప్పించుకొని పారిపోయాడు. అతనితోపాటు నయన కృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నయన కృష్ణ చెన్నైలో తలదాచుకుంటున్నట్లు పోలీసులకు సమచారం అందడంతో చైన్నై పోలీసుల సహాయంతో ఆమెను పట్టుకోవడానికి బెంగళూర్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసు వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. -
నాడు హీరో ... నేడు విలన్
రాసలీలల సీడీలు చూపించి డాక్టర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన రఘు తాజాగా కానిస్టేబుల్ అరెస్ట్ పరారీలోనే నటి నయాన కృష్ణ అండ్ కో బెంగళూరు : ప్రియురాలిని దక్కించుకోవాలని ప్రయత్నించి రెండు కళ్లు పోగొట్టుకుని కర్ణాటకలో హీరో అయిన రఘు అనే యువకుడు ఇప్పుడు విలన్ అయ్యాడు. రఘు అతని స్నేహితురాలు, కన్నడ నటి నయన కృష్ణ తదితరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. డాక్టర్ రాసలీలల కేసులో తాజాగా కెంపేగౌడ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మల్లేష్, ప్రైవేటు చానల్ వీడియో ఎడిటర్ హేమంత్ కుమార్, టీవీ చానల్ ట్రాన్స్పోర్ట్ విభాగం నిర్వాహకుడు సునీల్‌ను అరెస్టు చేశామని శనివారం బెంగళూరు నగర సీసీబీ పోలీసులు తెలిపారు. ఇదీ జరిగిన విషయం .. మండ్యకు చెందిన రఘు అనే యువకుడు బెంగళూరు నగరానికి చెందిన యువతిని ప్రేమించాడు. 2011లో రఘు ప్రియురాలికి బెంగళూరులో వివాహం జరిగింది. వివాహం జరుగుతున్న సమయంలో రఘు కల్యాణ మంటపంలోకి వెళ్లాడు. ఆ సమయంలో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు రఘుపై దాడి చేసి రెండు కళ్లు పీకేశారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆప్పట్లో రఘు రాష్ట్రంలో హీరో అయ్యాడు. ప్రేమ కోసం రెండు కళ్లు పోగొట్టుకున్నాడని పలు స్వచ్ఛంద సంస్థలు అతనికి మద్దతు తెలిపాయి. ప్రస్తుతం ఆ హీరో రఘు చామరాజపేటలో జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే రఘుకు ఒక వైద్యుడితో పరిచయం ఉంది. అతని బలహీనతలు రఘుకు పూర్తిగా తెలుసు. కొన్ని రోజుల క్రితం రఘు, సినీనటి నయనా కృష్ణ, కానిస్టేబుల్ మల్లేష్, హేమంత్ కుమార్, సునీల్ కలిసి ఒక పథకం వేశారు. ఒక యువతిని వైద్యుడి ఇంటికి పంపించారు. వైద్యుడు, యువతితో రాసలీలలో ఉన్న సమయంలో సినీ నటి నయనా కృష్ణ, ఆమె స్నేహితురాళ్లు రిహనా, మేఘనా కలిసి గుట్టు చప్పుడు కాకుండ వీడియో చిత్రీకరించారు. అనంతరం ఆ వైద్యుడిని బ్లాక్ మొయిల్ చేయడం ప్రారంభించారు. రూ. 25 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము మీడియా వాళ్లమని, డబ్బులు ఇవ్వకపోతే రాత్రికి రాత్రే చానళ్లలో ప్రసారం చేయిస్తామని బెదిరించారు. డాక్టర్ వద్ద రూ. లక్ష నగదు అడ్వాన్స్ తీసుకుని మిగతా సొమ్ము వెంటనే ఇవ్వాలని అక్కడి నుంచి జారుకున్నారు. గురువారం వైద్యుడు బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో కమిషనర్ ఔరాద్కర్ కేసు దర్యాప్తు చేయాలని సీసీబీ పోలీసులను ఆదేశించారు. వైద్యుడు శుక్రవారం నిందితులకు ఫోన్ చేసి తన అపార్టుమెంట్‌కు వచ్చి నగదు తీసుకోవాలని చెప్పాడు. రఘు, కానిస్టేబుల్ మల్లేష్ చాళుక్య సర్కిల్లో కారులో ఉండగా హేమంత్ కుమార్, సునీల్ వైద్యుడి ఇంటిలోకి ప్రవేశించారు. అప్పటికే అక్కడ మఫ్టీలో ఉన్న సీసీబీ పోలీసులు నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బయట ఉన్న రఘు, మల్లేష్ అక్కడి నుంచి జారుకున్నారు. శనివారం అమాయకుడిగా విధులకు హాజరైన మల్లేష్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘు, సినీ నటి నయనా కృష్ణ, ఆమె స్నేహితురాళ్లు రిహనా, మేఘనాల కోసం గాలిస్తున్నామని శనివారం బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు. Follow @sakshinews -
రాసలీలల కేసులో దేవిశ్రీకి బెయిల్
ఆమె తన రెండవ భార్యగా పేర్కొన్న స్వామీజీ తన అనుమతితోనే రెండవ పెళ్లి చేసుకున్నారన్న తొలి భార్య బెంగళూరు, న్యూస్‌లైన్ : రాసలీలల కేసులో అరెస్టైన దేవిశ్రీ గురూజీ కి బెయిల్ మంజూరైంది. బుధవారం ఉదయం స్థానిక ఆరవ ఏసీఎంఎం న్యాయస్థానంలో దేవిశ్రీని పోలీసులు హాజరుపరిచారు. కేసు వివరాలు తెలుసుకున్న అనంతరం న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. తమకు గురూజీ నుంచి ప్రాణహాని ఉందంటూ ఆయన కారు డ్రైవర్ వసంత్, మేనేజర్ ఉదయ్ ఫిర్యాదు మేరకు హెచ్ఎస్ఆర్ లే ఔట్ పోలీసులు కేసు నమోదు చేసిన వైనం విదితమే. అంతకు ముందే రాసలీలలపై ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కావడంతో దేవిశ్రీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమిళనాడులోని ధర్మపురిలో తలదాచుకున్న దేవిశ్రీని మంగళవారం రాత్రి హెచ్ఎస్ఆర్ లే ఔట్ పోలీసులు అదుపులోకి తీసుకుని బెంగళూరుకు పిలుచుకొచ్చారు. కాగా, బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే దేవిశ్రీ ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను రాసలీలలు సాగించినట్లు ప్రసారం అయిన క్లిప్పింగ్‌లలో ఉన్న మహిళ తన రెండవ భార్య అని పేర్కొన్నారు. మొదటి భార్య అనుమతితోనే ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నట్లు వివరించారు. ఇందుకు ఎలాంటి సాక్ష్యాలు ఉండవని తెలిపారు. ఏనాడు తాను సన్యాసినని చెప్పుకోలేదని స్పష్టం చేశారు. గత ఆగస్టు 15 నుంచి తనను బ్లాక్మెయిల్ చేశారని, తన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి రూ. 2.50 లక్షలు డ్రైవర్ వసంత్‌కు ఇచ్చి, మరో ప్రాంతానికి వెళ్లి సుఖంగా జీవించాలని సూచించానని అన్నారు. గత ఏడాది మే నుంచి తన రెండవ భార్య దూరమైందని, ప్రస్తుతం ఆమె ఎక్కడుందో తనకు తెలియదని పేర్కొన్నారు. తన అనుమతితోనే తన భర్త రెండవ పెళ్లి చేసుకున్నారని దేవిశ్రీ భార్య కౌసల్య స్పష్టం చేశారు. దేవిశ్రీతో కలిసి టీవీ చానెల్లో ఆమె మాట్లాడారు. వివాహమైన తర్వాత ఆమె తనతో పాటు ఒకే ఇంటిలోనే కలిసి ఉందని, వేరు కాపురానికి అంగీకరించలేదని చెప్పారు. -
బ్లాక్మెయిల్ కానిస్టేబుల్ సస్పెన్షన్
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్ విద్యార్థినీని బెదిరించి ఆమె వద్ద నుంచి బంగారు గొలుసు స్వాహా చేసిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ జె.ప్రభాకరరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను కానిస్టేబుల్ సీహెచ్.శ్రీకాంత్ (పీసీ నెంబరు 1395)కు అందజేశారు. సంఘటనపై సాక్షి దినపత్రిలో ఈ నెల 11వ తేదీన ‘బ్లాక్మెయిల్ కానిస్టేబుల్’ అన్న శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కానిస్టేబుల్ శ్రీనివాస్ నిర్వాకంపై విచారణ చేపట్టారు. డీఎస్పీ కేవీ శ్రీనివాసులు విచారణ చేసి నివేదికను ఎస్పీకి సమర్పించారు. కానిస్టేబుల్ శ్రీకాంత్ విద్యార్థినీని బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు దిగటం, తన కోరిక తీర్చమని డిమాండ్ చేయటం, బంగారు గొలుసును స్వాహా చేసిన సంఘటనలు నిజమేనని రుజు వైంది. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. బ్లాక్మెయిల్ చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు గురికావటం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది -
మామూళ్లపైనే నజర్
హుజూరాబాద్, న్యూస్‌లైన్ : ‘నా మిల్లులో ఉన్న తాలు బియ్యాన్ని చూసి ఇవి రేషన్ బియ్యమని, సీజైన మిల్లులో బియ్యమెలా ఉంటాయని బ్లాక్మెయిల్ చేస్తే రూ.36 వేలు ఇచ్చా. మళ్లీ అవే బియ్యాన్ని కారణంగా చూపిస్తూ ప్రతీసారి మామూళ్లు అడిగితే కాదన్నా... అందుకే నా మిల్లులో తనిఖీలు చేయించారు.’ - హుజూరాబాద్‌లోని శోభ రైస్‌మిల్లు యజమాని శీల శ్రీనివాస్ ఆవేదన ఇది. హుజూరాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేందర్ తనను ప్రతీసారి బ్లాక్మెయిల్ చేస్తూ మిల్లులో సోదాలు జరిపిస్తామని బెదిరిస్తూ వేధిస్తున్నాడని మిల్లులో మంగళవారం తనిఖీల సమయంలో బహిరంగంగానే ఆరోపించారు. జిల్లాలో అంతటా ఇదే పరిస్థితి ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మిల్లర్లు గుట్టుచప్పుడు కాకుండా అక్రమాలు చేస్తుండగా పసిగడుతున్న అధికారులు ములాఖత్ అవుతున్నారే తప్ప వాటి గుట్టు విప్పడం లేదు. మామూళ్లు ఇచ్చినప్పుడు చూసీ చూడనట్లు వ్యవహరించడం... ఇవ్వకపోతే తనిఖీలు చేసి కేసులు పెట్టడం సాధారణమైపోయిందని పలువురు మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు ఈ పనిని చక్కగా నెరవేరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాను డబ్బులు ఇవ్వనందుకే తహశీల్దార్‌ను పిలిపించి తనిఖీలు చేయించారని, ఈ వ్యవహారం వెనక ఆర్ఐ సురేందర్ ఉన్నారని, న్యాయం తనవైపే ఉందని, ఏ విచారణకైనా సిద్ధమని, కలెక్టర్, జేసీ, ఏసీబీ డీఎస్పీలకు ఫిర్యాదు చేస్తానని శోభ మిల్లు యజమాని శ్రీనివాస్ అందరిముందే చెబుతున్నాడంటే అధికారుల తీరు ఎలా ఉందో తెలుస్తోంది. కొందరు మిల్లర్లు మాత్రం తమకొందుకొచ్చిన గొడవలే అన్నట్లు అధికారులను మచ్చిక చేసుకుంటున్నారు. ఇలాంటి అధికారులపై ఫిర్యాదు చేస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించి వారికి ఆమ్యామ్యాలు ముట్టజెప్పి తమ అక్రమాలు సాగిస్తున్నారు. అందుకే తనిఖీలు... కేసుల నమోదు నామమాత్రంగా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీజైన బియ్యం తరలింపు హుజూరాబాద్ మండలం బోర్నపల్లి శివారులోని శోభ ఇండస్ట్రీస్‌లో మంగళవారం రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి పట్టుకున్న 116.5 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు శ్రీరామ రైస్‌మిల్లుకు తరలించారు. మిల్లు యజమాని శ్రీనివాస్‌పై 6ఏ కేసు నమోదు చేశారు. బుధవారం తహశీల్దార్ సురేశ్, సివిల్ సప్లయ్ డెప్యూటీ తహశీల్దార్ ఎలమంద, ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పంచనామా నిర్వహించి ఈ బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించి మరో మిల్లుకు తరలించారు.