స్నేహం పేరిట యువతిని ట్రాప్ చేసి ... | Blackmailer arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

స్నేహం పేరిట యువతిని ట్రాప్ చేసి ...

Published Wed, Jul 9 2014 8:00 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

స్నేహం పేరిట యువతిని ట్రాప్ చేసి ... - Sakshi

స్నేహం పేరిట యువతిని ట్రాప్ చేసి ...

స్నేహం పేరిట యువతిని ట్రాప్ చేసి...సెల్‌ఫోన్‌తో చిత్రీకరించిన అసభ్యకర వీడియో క్లిప్పింగ్స్‌ను చూపించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఓ యువకుడిని నల్లకుంట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... రాంనగర్ గుండు సమీపంలో ఉంటున్న యువతి (19) వెంకటాపురంలోని  కళాశాలలో చదువుకుంటోంది. గోల్నాకకు చెందిన అచ్యుతరామ్ 2011 నుంచి స్నేహం పేరుతో ఆమె వెంటపడుతున్నాడు. కొంతకాలానికి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి మాట్లాడుకుంటున్నారు. దీని ఆసరా చేసుకొని ఆమె నివాసానికి వెళ్లిన ఇతను.. స్నానం చేస్తున్నప్పుడు, దుస్తులు మార్చుకుంటున్నప్పుడు ఆమెకు తెలియకుండా సెల్‌ఫోన్‌తో ఆ దృశ్యాలు చిత్రీకరించాడు.  

తర్వాత ఆ క్లిప్పింగ్స్ చూపించి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. విషయం తెలిసిన అచ్యుతరామ్ తండ్రి యువతి కుటుంబ సభ్యులను పిలిపించి రాజీ కుదిర్చారు. అయినా ఆ యువకుడి ప్రవర్తనలో మార్పురాలేదు.  పైగా ఆమె ఎక్కడ కనిపించినా నీ అంతుచూస్తానని బెదిరిస్తున్నాడు. ఈనెల 3న కాలేజీలో పరీక్ష రాసి.. స్నేహితురాలి తండ్రి బైక్‌పై ఇంటికి వస్తుండగా.. అచ్యుతరామ్ ఆ యువతిపై చేయిచేసుకున్నాడు. విషయాన్ని ఆమె తన కుటుంబసభ్యులకు చెప్పగా...ఈనెల 5న నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అచ్యుతరామ్‌ను సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుడు మెడిసిన్ పూర్తి చేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement