Blackmailer
-
ఆ ఐపీఎస్ ఓ క్రిమినల్.. బ్లాక్‌మెయిలర్
శివాజీనగర: ఏడీజీపీ చంద్రశేఖర్ ఒక బ్లాక్ మెయిలర్, క్రిమినల్, అతడు తోటి ఉద్యోగులకు రాసిన లేఖను చక్కగా తయారు చేశారు. సరైన సమయంలో దీనికి సమాధానం ఇస్తానని జేడీఎస్ నేత, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్.డీ.కుమారస్వామి ధ్వజమెత్తారు. ఆదివారం జేపీ నగర నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఏడీజీపీ తన తోటి ఉద్యోగులకు రాసిన లేఖ గురించి స్పందిస్తూ, ఆయన చెప్పినట్లుగా నేను కేసుల్లో నిందితున్ని కావచ్చు, అయితే అతను అధికారి అనే హోదాలో ఉన్న క్రిమినల్. వరుస నేరాలకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. ఆయన చేతికింద పనిచేసే ఇన్స్పెక్టర్కు రూ. 20 కోట్లు డిమాండ్ పెట్టి చిక్కుకొన్నాడు. ఆ ఇన్స్పెక్టర్ ఈ అధికారి మీద ఫిర్యాదు చేశారు. తక్షణమే రూ.2 కోట్లు తీసుకురావాలని బ్లాక్మెయిల్ చేసింది ఇతను కాదా? అని దుయ్యబట్టారు. లోకాయుక్తకు గవర్నర్ రాసిన లేఖ ప్రభుత్వ సహకారమున్న ఒక టీవీ చానెల్‌కు లీక్ అయ్యింది, దానిని లీక్ చేసింది ఎవరు? అనేది అందరికి తెలుసునన్నారు. అయితే అది రాజ్‌భవన్ నుండే లీకేజీ అయ్యిందని, అక్కడి అధికారులను విచారించాలని చంద్రశేఖర్ పై అధికారులకు లేఖ రాశారు, అందుకే అతని దర్పం, నేపథ్యంపై తాను ఆధారాల సమేతంగా మాట్లాడుతున్నానని చెప్పారు. నా ప్రశ్నలకు సమాధానమివ్వాలి తాను అడిగిన ప్రశ్నలకు ఐపీఎస్ చంద్రశేఖర్ సమాధానమివ్వాలి, అలా కాకుండా క్రిమినల్ మనస్తత్వంతో కూడిన అసభ్యకరమైన భాషను ఉపయోగించి ఒక కేంద్ర మంత్రి గురించి చెడుగా లేఖను విడుదల చేశారు, ఇందుకు ఏమి చేయాలి, ఆధారాలు, విషయం లేనిదే నేను మాట్లాడను. తాను శనివారం ఉదయం మీడియాతో మాట్లాడగానే, సాయంత్రం ఆ అధికారి ఎక్కడకి వెళ్లాడనేది తెలుసు. ఆయన లేఖను ఎవరు తయారు చేసిచ్చారు అనేది తెలుసని పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. చంద్రశేఖర్ ఉపయోగించిన భాష అతని సంస్కృతికి నిదర్శనం. అతడు ఏం మాట్లాడారు అనేది అందరికీ తెలుసు అని మండిపడ్డారు. కుమార ఆధారాలివ్వాలి: డీసీఎం కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి, ఏడీజీపీ చంద్రశేఖర్ మాటల యుద్ధం తారాస్థాయికి చేరగా, ఇందులో ఆధారాలు ఏమున్నాయో కుమారస్వామి విడుదల చేయాలని డీసీఎం డీ.కే.శివకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నెలమంగలలో మాట్లాడుతూ కుమారస్వామికి విరుద్ధంగా కేపీసీసీ కార్యాలయంలో లెటర్‌ను తయారుచేసి లీక్ చేశారని ఆరోపించడం సబబు కాదన్నారు. కుమారస్వామి ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. కేపీసీసీకి, ఏడీజీపీ చంద్రశేఖర్‌కు ఏమి సంబంధమని ప్రశ్నించారు. చంద్రశేఖర్ నన్ను కలిసింది, మాట్లాడిందీ లేనే లేదన్నారు. -
నటుడి కుమార్తెకు బెదిరింపులు, అరెస్ట్
ముంబై: బాలీవుడ్ నటుడి కుమార్తెను బెదిరించిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి ప్రైవేట్ ఫోటోలు తన దగ్గర ఉన్నాయంటూ బ్లాక్ మెయిల్ దిగడంతో పాటు పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేశాడు. మొదట డబ్బులు ఇచ్చిన యువతి తరువాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని ముంబైలోని మలాద్ నివాసి కుమైల్ హనీఫ్ పఠానిగా గుర్తించారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) లోని వివిధ సెక్షన్ల కింద, సమాచార సాంకేతిక చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాధితురాలు చదువుకుంటున్నకాలేజీలోనే నిందితుడి సోదరి కూడా చదువుతున్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు పర్సనల్ ఫోటోలు పెట్టి బెదిరించినట్లు నటుడి కుమార్తె తెలిపింది. ఇంకా తన దగ్గర ఫోటోలు ఉన్నట్లు చెప్పి ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడంతో తల్లిదండ్రులకు విషయాన్నిచెప్పినట్లు బాధితురాలు తెలిపింది. నిందితుడికి రూ.20 వేల వరకు ఇచ్చినట్లు బాధితురాలు చెప్పింది. చదవండి: జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్ -
అశ్లీల వీడియోల పేరుతో నమితకు బెదిరింపు
సోషల్ మీడియాలో అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై నటి నమిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్లీల వీడియోలు బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డ అతనికి నమిత గట్టి కౌంటర్ ఇచ్చారు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పారు. అంతేకాకుండా తనను బ్లాక్మెయిల్ చేసేందుకే యత్నించిన వ్యక్తి ఫొటోను బహిర్గతం చేశారు. అందుకు సంబంధించిన వివరాలను కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ‘సెంటమిజ్ అనే నెటిజన్ సోషల్ మీడియాలో నాకు డైరెక్ట్ మెసేజ్‌లు చేస్తూ.. అసభ్యకరంగా పిలవడం ప్రారంభించాడు. హాయ్ ఐటమ్ అంటూ నీచంగా ప్రవర్తించాడు. దీనిపై నేను ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. తన అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పాడు. అతని మాటలు నమ్మని నేను గట్టిగా నిలదీశాను. దీంతో అతని వద్ద నా అశ్లీల వీడియోలు ఉన్నాయని, వాటిని ఆన్లైన్లో పెడతానని బెదిరింపులకు దిగాడు. నాకు అందులో నిజమెంతో తెలుసు కాబట్టి.. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పాను. ఇది ఒక నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ప్రవర్తన. అతను స్త్రీలను ఇష్టమొచ్చిన పేర్లతో పిలువవచ్చని భావించేవాడు. కానీ వాటిని నేనుందుకు భరించాలి. నేను కేవలం మీడియాలో, గ్లామర్ ప్రపంచంలో ఉన్నందున్న నా గురించి మొత్తం తెలుసని మీరు అనుకుంటున్నారా?. ఓ వ్యక్తిగా నా గురించి మీకేం తెలుసు?. నా నిశ్శబ్దాన్ని బలహీనత అనుకోకండి. ఒక నిజమైన మనిషికి స్త్రీని ఎలా గౌరవించాలో తెలుసు. ఎవరైనా తన సొంత తల్లిని అవమానపరిస్తే కలిగే బాధ అతనికి తెలుసు. నవరాత్రుల సందర్భంగా 9 రోజులు దుర్గా మాతను పూజించే బదులు సమాజంలో మహిళలను ఎలా గౌరవించాలో నేర్చుకోండి. ఎందుకంటే జీవితంలో ఇది అతి ముఖ్యమైనది’ అని నమిత పేర్కొన్నారు. కాగా, తెలుగు, తమిళంలో హీరోయిన్గా నమిత ఓ వెలుగువెలిగారు. కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరించిన తమిళ బిగ్‌బాస్ తొలి సీజన్-1లో కూడా ఆమె పాల్గొన్నారు. 2017లో ఆమె తన బాయ్‌ఫ్రెండ్ వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఆమె నటనను కొనసాగిస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ఆమె బీజేపీలో చేరారు. ముఖ్యంగా తమిళనాట నమితకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Hi all, this one cheap minded, free loser has been calling me names in DM. As you can read he is @i_am_thamizh_senthamizh . He started with name calling like 'Hi Item' . Hence , when I confronted him , he said his account got hacked !!! And when I pursued him, he said he has seen my so called 'PORN' and he's going to publish it online now !!! Knowing the facts, I said pls 'Go ahead '.. See this face people ! This is the face of a Loser, a Cheap minded , Filthy person, who thinks he has Right to call any Woman, with any cheap and dirty names,just because he thinks He Can !!!! Why should I listen to this ?! Just because I'm in Media ?! Just because I'm in a Glamour Industry?! You think you know me ?! You think you know who I'm as a person ??! DO NOT MISTAKE MY SILENCE FOR MY WEAKNESS !! A Real Man knows how to Respect a Woman, Any Woman from Any path of Life, for he knows how it feels if someone will Disrespect his own Mother! Instead of Celebrating Navratri where you pray to Godess Durga for 9 days and instead of Celebrating Women's Day, learn to respect women in your General Life. Because that's what matters at the End of the Day!! A post shared by Namitha Vankawala Chowdhary (@namita.official) on Mar 16, 2020 at 9:06pm PDT -
యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి..ఐదు కోట్లు డిమాండ్
-
మాయావతి బ్లాక్‌మెయిలర్
రూ. 50 కోట్లు డిమాండ్ చేశారు: సిద్దిఖీ లక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతి రూ.50 కోట్లు డిమాండ్ చేశారని ఆ పార్టీ బహిష్కృత నేత నసీముద్దీన్ సిద్దిఖీ ఆరోపించారు. మాయావతి ‘బ్లాక్‌మెయిలర్’ అని విమర్శించారు. తగినన్ని ఆధారాలున్నాయని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోపణలకు ఆధారంగా.. మాయవతితో జరిపిన సంభాషణల ఆడియోను విలేకరుల సమావేశంలో వినిపించారు. తన వద్ద ఇంకా 150 ఆడియో సంభాషణలు ఉన్నాయని చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో ముస్లింలు బీఎస్పీకి ఓటేయనందుకు వారు నమ్మకద్రోహులంటూ మాయవతి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సిద్దిఖీ బ్లాక్ మెయిలింగ్తో కోట్లు సంపాదించారని తర్వాత మీడియా సమావేశంలో మాయావతి ఆరోపించారు. -
స్నేహం పేరిట యువతిని ట్రాప్ చేసి ...
స్నేహం పేరిట యువతిని ట్రాప్ చేసి...సెల్‌ఫోన్‌తో చిత్రీకరించిన అసభ్యకర వీడియో క్లిప్పింగ్స్‌ను చూపించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఓ యువకుడిని నల్లకుంట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... రాంనగర్ గుండు సమీపంలో ఉంటున్న యువతి (19) వెంకటాపురంలోని కళాశాలలో చదువుకుంటోంది. గోల్నాకకు చెందిన అచ్యుతరామ్ 2011 నుంచి స్నేహం పేరుతో ఆమె వెంటపడుతున్నాడు. కొంతకాలానికి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి మాట్లాడుకుంటున్నారు. దీని ఆసరా చేసుకొని ఆమె నివాసానికి వెళ్లిన ఇతను.. స్నానం చేస్తున్నప్పుడు, దుస్తులు మార్చుకుంటున్నప్పుడు ఆమెకు తెలియకుండా సెల్‌ఫోన్‌తో ఆ దృశ్యాలు చిత్రీకరించాడు. తర్వాత ఆ క్లిప్పింగ్స్ చూపించి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. విషయం తెలిసిన అచ్యుతరామ్ తండ్రి యువతి కుటుంబ సభ్యులను పిలిపించి రాజీ కుదిర్చారు. అయినా ఆ యువకుడి ప్రవర్తనలో మార్పురాలేదు. పైగా ఆమె ఎక్కడ కనిపించినా నీ అంతుచూస్తానని బెదిరిస్తున్నాడు. ఈనెల 3న కాలేజీలో పరీక్ష రాసి.. స్నేహితురాలి తండ్రి బైక్‌పై ఇంటికి వస్తుండగా.. అచ్యుతరామ్ ఆ యువతిపై చేయిచేసుకున్నాడు. విషయాన్ని ఆమె తన కుటుంబసభ్యులకు చెప్పగా...ఈనెల 5న నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అచ్యుతరామ్ను సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుడు మెడిసిన్ పూర్తి చేసినట్లు తెలిసింది.