అశ్లీల వీడియోల పేరుతో నమితకు బెదిరింపు | Namitha Strong Counter To Netizen Who Blackmails Her | Sakshi
Sakshi News home page

అశ్లీల వీడియోల పేరుతో నమితకు బెదిరింపు

Published Tue, Mar 17 2020 8:35 PM | Last Updated on Tue, Mar 17 2020 8:55 PM

Namitha Strong Counter To Netizen Who Blackmails Her - Sakshi

సోషల్‌ మీడియాలో అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై నటి నమిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్లీల వీడియోలు బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డ అతనికి నమిత గట్టి కౌంటర్‌ ఇచ్చారు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పారు. అంతేకాకుండా తనను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకే యత్నించిన వ్యక్తి ఫొటోను బహిర్గతం చేశారు.  అందుకు సంబంధించిన వివరాలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. 

‘సెంటమిజ్‌ అనే నెటిజన్‌ సోషల్‌ మీడియాలో నాకు డైరెక్ట్‌ మెసేజ్‌లు చేస్తూ.. అసభ్యకరంగా పిలవడం ప్రారంభించాడు. హాయ్‌ ఐటమ్‌ అంటూ నీచంగా ప్రవర్తించాడు. దీనిపై నేను ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. తన అకౌంట్‌ హ్యాక్‌ అయిందని చెప్పాడు. అతని మాటలు నమ్మని నేను గట్టిగా నిలదీశాను. దీంతో అతని వద్ద నా అశ్లీల వీడియోలు ఉన్నాయని, వాటిని ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరింపులకు దిగాడు. నాకు అందులో నిజమెంతో తెలుసు కాబట్టి.. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పాను. ఇది ఒక నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ప్రవర్తన. అతను స్త్రీలను ఇష్టమొచ్చిన పేర్లతో పిలువవచ్చని భావించేవాడు. కానీ వాటిని నేనుందుకు భరించాలి. నేను కేవలం మీడియాలో, గ్లామర్‌ ప్రపంచంలో ఉన్నందున్న నా గురించి మొత్తం తెలుసని మీరు అనుకుంటున్నారా?. ఓ వ్యక్తిగా నా గురించి మీకేం తెలుసు?. నా నిశ్శబ్దాన్ని బలహీనత అనుకోకండి. ఒక నిజమైన మనిషికి స్త్రీని ఎలా గౌరవించాలో తెలుసు. ఎవరైనా తన సొంత తల్లిని అవమానపరిస్తే కలిగే బాధ అతనికి తెలుసు. నవరాత్రుల సందర్భంగా 9 రోజులు దుర్గా మాతను పూజించే బదులు సమాజంలో మహిళలను ఎలా గౌరవించాలో నేర్చుకోండి. ఎందుకంటే జీవితంలో ఇది అతి ముఖ్యమైనది’ అని నమిత పేర్కొన్నారు. 

కాగా, తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా నమిత ఓ వెలుగువెలిగారు. కమల్‌హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరించిన తమిళ బిగ్‌బాస్‌ తొలి సీజన్‌-1లో కూడా ఆమె పాల్గొన్నారు. 2017లో ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి  తర్వాత కూడా ఆమె నటనను కొనసాగిస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ఆమె బీజేపీలో చేరారు. ముఖ్యంగా తమిళనాట నమితకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. 

Hi all, this one cheap minded, free loser has been calling me names in DM. As you can read he is @i_am_thamizh_senthamizh . He started with name calling like 'Hi Item' . Hence , when I confronted him , he said his account got hacked !!! And when I pursued him, he said he has seen my so called 'PORN' and he's going to publish it online now !!! Knowing the facts, I said pls 'Go ahead '.. See this face people ! This is the face of a Loser, a Cheap minded , Filthy person, who thinks he has Right to call any Woman, with any cheap and dirty names,just because he thinks He Can !!!! Why should I listen to this ?! Just because I'm in Media ?! Just because I'm in a Glamour Industry?! You think you know me ?! You think you know who I'm as a person ??! DO NOT MISTAKE MY SILENCE FOR MY WEAKNESS !! A Real Man knows how to Respect a Woman, Any Woman from Any path of Life, for he knows how it feels if someone will Disrespect his own Mother! Instead of Celebrating Navratri where you pray to Godess Durga for 9 days and instead of Celebrating Women's Day, learn to respect women in your General Life. Because that's what matters at the End of the Day!!

A post shared by Namitha Vankawala Chowdhary (@namita.official) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement