HBD Namitha: బొద్దుగుమ్మ కోసం గుడి, ఎక్కడుందంటే? | Namitha Birthday: Interesting Details To Know About Actress | Sakshi
Sakshi News home page

HBD Namitha: బొద్దుగుమ్మ కిడ్నాప్‌! అలా తప్పించుకుంది!

Published Mon, May 10 2021 12:56 PM | Last Updated on Mon, May 10 2021 1:38 PM

Namitha Birthday: Interesting Details To Know About Actress - Sakshi

'సింహం అంటి చిన్నోడే వేటకొచ్చాడే..' అంటూ బాలకృష్ణతో సమానంగా స్టెప్పులేసింది నమిత. ఒక్క బాలయ్యతోనేనా విక్టరీ వెంకటేష్‌, మాస్‌ మహారాజ రవితేజతో సహా పలు హీరోలతోనూ నటించి మెప్పించింది. కానీ తెలుగులో కన్నా కూడా తమిళంలోనే ఆమెకు ఎక్కువ గుర్తింపు లభించింది. అక్కడ నమితను ఎంతలా ఆరాధిస్తారు అంటే ఏకంగా గుడి కట్టి పూజించేస్తున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.. నేడు(మే 10) నమిత పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

నమిత 1980 మే 10న గుజరాత్‌లోని సూరత్‌ పట్టణంలో జన్మించింది. 1998లో మిస్‌ సూరత్‌ కిరీటాన్ని దక్కించుకున్న ఆమె 2001లో మిస్‌ ఇండియా పోటీల్లో నాల్గవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 'సొంతం' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. విక్టరీ వెంకటేష్‌ సరసన 'జెమినీ' మూవీలో నటించి మరింత పాపులర్‌ అయ్యింది. 'ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి', 'నాయకుడు' వంటి పలు చిత్రాల్లో నటించింది నమిత. కానీ ఆ తర్వాత ఆఫర్లు రాకపోవడంతో సినిమాల్లో కనిపించనేలేదు. అయితే సడన్‌గా బొద్దుగా మారిపోవడం వల్లే సినిమాల్లో కనిపించకుండా పోయిందన్న వార్తలు వినిపించాయి.


కొంతకాలం బ్రేక్‌ తర్వాత నమిత ప్రభాస్‌ 'బిల్లా' సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించి సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ పేరు ప్రఖ్యాతులు గడించింది. ఇక్కడ సక్సెస్‌కు దూరమైన నమిత తమిళనాట మాత్రం నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా సత్తా చాటింది. దీంతో నమిత కోసం ఆమె అభిమానులు ఏకంగా గుడి కూడా కట్టేశారు. ఇది తమిళనాడులోని తిరునల్వేలిలో ఉంది.

ఓసారి తమిళనాడులో నమితను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాడో అభిమాని. ఆమెను ఫంక్షన్‌కు తీసుకువెళ్లాల్సిన కారు డ్రైవర్‌ను తానే అని చెప్పడంతో గుడ్డిగా నమ్మేసిన నమిత అతడి కారెక్కింది. కానీ నిజమైన కారు డ్రైవర్‌ ఈ విషయాన్ని ఫంక్షన్‌ నిర్వాహకులకు చెప్పడంతో అతడి కారును చేజ్‌ చేసి పట్టుకున్నారు. తీరా పోలీసులు నిలదీస్తే తాను నమిత అభిమానినంటూ పొంతన లేని సమాధానాలు చెప్పాడు.

2017లో వీరేంద్ర చౌదరిని లవ్‌ మ్యారేజ్‌ చేసుకుని వైవాహిక జీవితానికి ఆరంభం పలికింది నమిత. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇటీవలే కొత్తగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భౌవౌ అనే సినిమా చేస్తోంది. మరోవైపు 2019 నుంచి ఆమె బీజేపీలో కొనసాగుతోంది.

చదవండి: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభిస్తున్న నటి నమిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement