పెళ్లయ్యాక ఫస్ట్‌ ప్రెగ్నెన్సీ.. సంతోషం ఎంతోకాలం నిలవలేదు: నమిత | Namitha About Miscarriage | Sakshi
Sakshi News home page

Namitha: నాలుగు నెలలకే గర్భస్రావం.. మానసికంగా కుంగిపోయా..

Published Wed, Jun 12 2024 3:34 PM | Last Updated on Thu, Jun 13 2024 1:32 PM

Namitha About Miscarriage

సొంతం సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ ఆరంభించింది నమిత. జెమిని, నాయకుడు, బిల్లా.. ఇలా పలుగు తెలుగు చిత్రాలతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. 2020లో మాయ అనే తమిళ సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైవాహిక జీవితంలోని విషయాలను పంచుకుంది.

ప్రెగ్నెన్సీ..
2021లో తొలిసారి ప్రెగ్నెంట్‌ అయ్యాను. అప్పుడు నేను సూరత్‌లో ఉన్నాను. ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకుంటే పాజిటివ్‌ అని వచ్చింది. నాతో పాటు అమ్మానాన్న ఉన్నారు. వెంటనే నాన్న దగ్గరకు వెళ్లి నువ్వు తాత కాబోతున్నావని చెప్పాను. తర్వాత నా భర్తతో సంతోషాన్ని పంచుకున్నాను. ‍​కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. నాలుగునెలలకే గర్భస్రావం అయింది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత మళ్లీ ప్రెగ్నెంట్‌ అయ్యాను. 

ఏడు నెలలదాకా టెన్షన్‌
మూడు నెలలకే ట్విన్స్‌ అని తెలిసింది. ఎప్పుడూ బెడ్‌ మీదే ఉండేదాన్ని. ఎక్కువగా నడవకూడదని, మెట్లు ఎక్కకూడదని మా ఆయన ఆంక్షలు పెట్టేవారు. ఏడు నెలల వరకు పొట్ట కనిపించలేదు. అప్పుడు చాలా భయమేసింది. కానీ ఏడో నెల తర్వాత పొట్ట పెరగడంతో ఊపిరి పీల్చుకున్నాను అని చెప్పుకొచ్చింది. కాగా నమిత.. బిజినెస్‌మెన్‌ వీరేంద్ర చౌదరిని 2017లో పెళ్లాడింది.  వీరికి 2022లో ట్విన్స్‌ జన్మించారు.

చదవండి: సిగరెట్‌, మందు.. అమ్మో.. మా నాన్న చాలా స్ట్రిక్టు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement